
డ్రగ్స్ నిర్మూలన అందరి బాధ్యత
మెదక్ మున్సిపాలిటీ: మత్తుతో జీవితం నాశనం అవుతుందని, డ్రగ్స్ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని ఎస్పీ ఉదయ్‌కుమార్‌రెడ్డి సూచించారు. ఇందుకు సంబంధించి శనివారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించి మాట్లాడారు. డ్రగ్స్ మత్తులో దాడులు, నేరాలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. పోలీస్‌శాఖ డ్రగ్స్ నిర్మూలన కోసం నిరంతరం నిఘా నేత్రాలతో పర్యవేక్షిస్తుందన్నారు. పౌరులు, ప్రజలు బాధ్యతగా సహకరించాలని కో రారు. ముఖ్యంగా విద్యార్థులు, యువతలో మార్పు రావాలని అన్నారు. డ్రగ్స్ వినియోగం వల్ల శరీరంలో శక్తి తగ్గుతుందని, భవిష్యత్ అంధకారం అవు తుందని వివరించారు. ఇది దేశ యువశక్తిని నిర్వీ ర్యం చేస్తుందన్నారు. డ్రగ్స్ వినియోగం, సరఫరా చేయడం తీవ్రమైన నేరమన్నారు. డ్రగ్స్‌కు అలవాటుపడిన వారి గురించి సమాచారం ఇస్తే వారికి కౌన్సిలింగ్ ఇస్తామని తెలిపారు. కార్యక్రమంలో మెదక్ డీఎస్పీ ప్రసన్నకుమార్, మెదక్ రూరల్ సీఐ రాజశేఖర్‌రెడ్డి, పాపన్నపేట ఎస్సై శ్రీనివాస్‌గౌడ్ పాల్గొన్నారు.
ఎస్పీ ఉదయ్‌కుమార్‌రెడ్డి