విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు | - | Sakshi
Sakshi News home page

విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు

Published Wed, Apr 9 2025 7:31 AM | Last Updated on Wed, Apr 9 2025 7:31 AM

విధుల

విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు

జిల్లాపరిషత్‌ సీఈఓ ఎల్లయ్య

టేక్మాల్‌(మెదక్‌): క్షేత్రస్థాయి అధికారులు బాధ్యతగా పని చేయాలని, విధుల్లో నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని జిల్లా పరిషత్‌ సీఈఓ ఎల్లయ్య హెచ్చరించారు. మంగళవారం టేక్మాల్‌ మండల పరిషత్‌ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా రికార్డులను పరిశీలించి, నిర్వహణ సక్రమంగా లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ అందరికీ అందేలా చూడాలన్నారు. రికార్డులు ఎప్పటికప్పుడూ పూర్తి చేస్తూ ఆన్‌లైన్‌ చేయాలన్నారు. ఆయన వెంట జిల్లాపరిషత్‌ డిప్యూటీ సీఈఓ రంగాచారి, ఎంపీడీఓ విఠల్‌ తదితరులు ఉన్నారు.

వైద్య సేవలు

అందుతున్నాయా?

రామాయంపేట(మెదక్‌): ఆసుపత్రిలో వైద్య సేవలు ఎలా అందుతున్నాయని జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ శ్రీరాం రోగులను ఆరా తీశారు. మంగళవారం మండలంలోని ప్రగతి ధర్మారంలో ప్రాధమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన సందర్శించి రోగులతో మాట్లాడారు. రోజూ ఎంతమంది రోగులు వస్తున్నారని, రక్త నమూనాలు సేకరించి మెదక్‌ ఆసుపత్రికి పంపుతున్నారా? అని సిబ్బందిని ప్రశ్నించారు. సక్రమంగా విధు లు నిర్వర్తించకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అంతకుముందు రికార్డులు పరిశీలించి, సిబ్బందితో మాట్లాడారు. ప్రతి మంగళవారం ప్రత్యేకంగా మహిళలకు వైద్యసేవలు అందిస్తున్నామని తెలిపారు. ఆసుపత్రి మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ హరిప్రియ, సూపర్‌వైజర్లు, ఇతర సిబ్బంది ఆయన వెంట ఉన్నారు.

నిరంతర సాధన చేయాలి

చేగుంట(తూప్రాన్‌): విద్యార్థులు అనుకున్న లక్ష్యం చేరే వరకు నిరంతర సాధన చేయాలని గ్రూప్‌ 1 రాష్ట్ర స్థాయి ఎనిమిదో ర్యాంకు సాధించిన నిఖిత అన్నారు. చేగుంట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మంగళవారం ఆమెకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రోజుకు ఎనిమిది గంటలకు పైగా చదువుకోవడంతో ర్యాంకు సాధించానని చెప్పారు. నిఖితను ఆదర్శంగా తీసుకొని విద్యార్థులు బాగా చదువుకోవాలని ఎంఈఓ నీరజ సూచించారు. ఈ కార్యక్రమంలో వాలీబాల్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు పరంజ్యోతి, ఉపాధ్యాయులు రాజేశ్వర్‌, సుధాకర్‌రెడ్డి, రాధా, రమ, లక్ష్మణ్‌, నరేందర్‌, శారద, వెంకటేశ్‌, భవానీ, రేఖ, శ్రీవాణి, సరస్వతి, ఉమామహేశ్వరి, రమేశ్‌, విద్యార్థులు పాల్గొన్నారు.

ప్రజలకు మెరుగైన సేవలు

హవేళిఘణాపూర్‌(మెదక్‌): గ్రామాల్లో పంచాయతీ సెక్రటరీలు ప్రజలకు మెరుగైన సేవలందించాలని డీపీవో ఎల్లయ్య అన్నారు. మంగళవారం మండల పరిధిలోని తొగిట గ్రామాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పంచాయతీ రికార్డులను, డంపింగ్‌యార్డు, మురుగునీటి కాలువలు, తాగునీటి సరఫరా గురించి అడిగి తెలుసుకొని సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గ్రామాల్లో ఎక్కడ కూడా తాగునీటి సమస్య తలెత్తకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. ప్రజలు చెత్తను బయట వేయకుండా ఇంటి వద్దకు వచ్చే చెత్తబండిలోనే వేయాలని ఆయన సూచించారు. డీపీవో వెంట పంచాయతీ సెక్రటరీ శారద, సిబ్బంది ఉన్నారు.

విధుల్లో నిర్లక్ష్యం  వహిస్తే చర్యలు   
1
1/3

విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు

విధుల్లో నిర్లక్ష్యం  వహిస్తే చర్యలు   
2
2/3

విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు

విధుల్లో నిర్లక్ష్యం  వహిస్తే చర్యలు   
3
3/3

విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement