
ప్రతి గింజనూ కొనుగోలు చేయాలి
కౌడిపల్లి(నర్సాపూర్): ప్రతి ధాన్యం గింజనూ ప్రభుత్వం కొనుగోలు చేయాలని ఎమ్మెల్యే సునీతారెడ్డి అన్నారు. మంగళవారం ఐకేపీ, ీపీఏసీఎస్, డీసీఎంఎస్ ఆధ్వర్యంలో మండలంలోని వెంకట్రావ్‌పేట, రాజీపేట, రాయిలాపూర్, నాగ్సాన్‌పల్లి, తిమ్మాపూర్, మహమ్మద్‌నగర్, కౌడిపల్లి, దేవులపల్లి గ్రామాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సన్నవడ్లకు ప్రభుత్వం ఇస్తామన్నా బోనస్‌ను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. అలాగే గత ఏడాది జిల్లాలో పేరుకుపోయిన రూ.7కోట్లకు పైగా ఉన్న బోనస్ బకాయిలను త్వరగా రైతులకు చెల్లించాలన్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు సౌకర్యాలు కల్పించాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఓ స్వప్న, ఏపీఎం సంగమేశ్వర్, ఏఈఓలు సౌజన్య, సృజన, మండల బీఆర్‌ఎస్ అధ్యక్షుడు రామాగౌడ్, సొసైటీ చైర్మన్ గోవర్ధన్‌రెడ్డి, వైస్‌చైర్మన్ చిన్నంరెడ్డి, మాజీ ఎంపీపీ రాజు, ఉపాధ్యక్షుడు నవీన్‌గుప్త, మండల మాజీ ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు ప్రవీణ్‌కుమార్, నాయకులు మహిపాల్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, కాంతారావ్, పురుషోత్తం, శ్యాంసుందర్‌రావ్, అమర్‌సింగ్, శివ, లింగం, సంజీవ్, రాజిరెడ్డి, రమేశ్ గుప్త, సందీప్, ప్రతాప్‌గౌడ్, రవిసాగర్ పాల్గొన్నారు.
సన్నాల బోనస్ బకాయిలు చెల్లించాలి
ఎమ్మెల్యే సునీతారెడ్డి