
ఓర్వలేకే ఎమ్మెల్యేపై ఆరోపణలు
రామాయంపేట(మెదక్): మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్‌పై బీఆర్‌ఎస్ నాయకులు అవనసర ఆరోపణలు చేస్తే ఊరుకోమని కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి సుప్రభాతరావు హెచ్చరించారు. సోమవారం కాంగ్రెస్ నాయకులతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. అభివృద్ధిని చూసి ఓర్వలేకే వారు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని ఎస్పీకి ఫిర్యాదు చేయడం సిగ్గుచేటన్నారు. గత పదేళ్లలో జరగని అభివృద్ధిని 15 నెలల కాలంలో చేసినందుకు వారు జీర్ణించుకోలేకపోతున్నారని విమర్శించారు. రామాయంపేట వెనకబడటానికి ప్రధాన కారణం బీఆర్‌ఎస్ నాయకులేనని ఆరోపించారు. మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావుపై బీఆర్‌ఎస్ కార్యకర్త సోషల్ మీడియాలో ఆరోపణలు చేసినందుకు పోలీసులు కేసు నమోదు చేశారని, ఇందులో తమ ప్రమేయం లేదని స్పష్టం చేశారు. ఎమ్మెల్యేపై అవనసర ఆరోపణలు చేసినా, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సమావేశంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రమేశ్‌రెడ్డి, పట్టణశాఖ అధ్యక్షుడు అల్లాడి వెంకటి, నా యకులు సరాపు యాదగిరి, నాగరాజు, యాదగిరి, చింతల యాదగిరి, డాకి స్వామి నాయకులు తదితరులు పాల్గొన్నారు.
పీసీసీ కార్యదర్శి సుప్రభాతరావు