
సంగారెడ్డి(తూప్రాన్): యువతి అదృశ్యమైన ఘటన మనోహరాబాద్ పోలీస్‌స్టేషన్‌లో చోటు చేసుకుంది. సోమవారం ఎస్‌ఐ సుభాష్‌గౌడ్ కథనం మేరకు.. మండలంలోని కాళ్లకల్ గ్రామంలో నివాసముంటున్న చామంతుల గణేశ్, మంజులకు కూతురు నాగలక్ష్మీ(19), కుమారుడు ఉన్నారు. వీరు కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. నాగలక్ష్మీ 10 రోజుల నుంచి మేడ్చల్ మండలంలోని అత్వెల్లి గ్రామ పరిధిలోని నేషనల్ మార్ట్‌లో పనికి వెళ్తుంది. 12న ఉదయం పనికి వెళ్లిన యువతి సాయంత్రం వరకు ఇంటికి రాలేదు. ఫోన్ చేస్తే స్విచ్ఛాఫ్ వచ్చింది. చుట్టు పక్కల వెతికినా ఆచూకీ లభ్యం కాలేదు. యువతి తల్లి మంజుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
సికింద్లాపూర్‌లో గృహిణి
శివ్వంపేట(నర్సాపూర్): గృహిణి అదృశ్యమైన ఘటన మండల పరిధి సికింద్లాపూర్ పంచాయతీ పిట్టల వాడలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ మధుకర్‌రెడ్డి కథనం మేరకు.. పిట్టలవాడకు చెందిన సునీత 6న ఇంట్లో చెప్పకుండా వెళ్లిపోయింది. కుటుంబ సభ్యులు గ్రామ పరిసరాలు, బంధువుల వద్ద వెతికినా ఆచూకీ లభించలేదు. సోమవారం సునీత భర్త సురేశ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
– సంగారెడ్డిలో యువకుడు, గృహిణి
సంగారెడ్డి క్రైమ్: ఇంటి నుంచి వెళ్లి వ్యక్తి అదృశ్యమైన ఘటన పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పట్టణ సీఐ రమేశ్ కథనం మేరకు.. మెదక్ జిల్లా రంగంపేట మండలానికి చెందిన ఎరుపుల వెంకట్ (37) బతుకుదెరువు కోసం కుటుంబంతో కలిసి ఏడాది కిందట పట్టణంలోని శాంతినగర్‌కి వచ్చి మేస్త్రీగా పని చేస్తూ జీవిస్తున్నారు. గత నెల 28న దంపతులు గొడవ పడటంతో తీవ్ర మనస్తాపానికి గురైన వ్యక్తి అదే రోజు ఇంట్లోంచి వెళ్లిపోయాడు.
చుట్టుపక్కల వెతికినా ఆచూకీ లభ్యం కాలేదు. ఆదివారం సాయంత్రం భార్య కవిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. గృహిణి అదృశ్యమైన ఘటన సంగారెడ్డి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పుల్‌కల్ మండలం బస్వాపూర్ గ్రామానికి చెందిన బేగరి ప్రసన్న కుమార్, సరళ భార్యాభర్తలు. సరళ (30) భర్తతో గొడవపడి 11న నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. చుట్టుపక్కల వెతికినా ఆచూకీ లభించలేదు. భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.