sangareddy
-
పీఈటీ కొట్టారని విద్యార్థి ఆత్మహత్య
ఉప్పల్ (హైదరాబాద్): నగరంలోని ఓ పాఠశాలలో విషాద ఘటన చోటుచేసుకుంది. స్కూల్ పీఈటీ కొట్టడమే కాకుండా తోటి విద్యార్థుల ముందు అవమానించాడంటూ ఎనిమిదో తరగతి విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్కూల్ భవనం నాల్గో అంతస్తు నుంచి కిందికి దూకి బలవన్మరణం పొందిన ఘటన శనివారం ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు, బాధిత కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలంలోని సిద్ద హంగిర్గా గ్రామానికి చెందిన ముంగ ధర్మారెడ్డి, సంగీత దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు లింగారెడ్డి, చిన్న కుమారుడు సంగారెడ్డి(14). వీరి కుటుంబం 15 ఏళ్ల క్రితం నగరానికి వచ్చి బోడుప్పల్ పరిధిలోని ద్వారకా నగర్లో నివాసముంటోంది. తోపుడు బండిపై వ్యాపారం చేసుకుంటూ జీవనం గడుపుతున్నారు. సంగారెడ్డి.. ఉప్పల్‌లోని న్యూ భరత్‌నగర్‌లోని సాగర్ గ్రామర్ స్కూల్లో 8వ తరగతి చదువుతున్నాడు. శుక్రవారం సాయంత్రం స్టడీ అవర్ సమయంలో సంగారెడ్డి స్కూల్లో సీసీ కెమెరాలను కదిలించాడంటూ క్లాస్ టీచర్.. పీఈటీ ఆంజనేయులుకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆంజనేయులు కొట్టడంతోపాటు మందలించారు. శనివారం ఉదయాన్నే స్కూల్‌కు వచి్చన సంగారెడ్డిని పీఈటీ పనిష్మెంట్ పేరిట మరోసారి తరగతి గదిలో కొట్టడంతోపాటు అరగంటపాటు నిలబెట్టారు. తల్లిదండ్రులను పిలిపిస్తానని, టీసీ ఇచ్చి పంపిస్తానని బెదిరించారు. తోటి విద్యార్థుల ముందు దీన్ని అవమానంగా భావించిన సంగారెడ్డి.. ఆత్మహత్య చేసుకుందామని నిర్ణయించుకున్నాడు. ముందుగా తన నోట్ బుక్‌లో ‘సారీ మదర్– ఐ విల్ డై టుడే’అని రాసి వాష్‌రూంకు వెళ్తున్నానని చెప్పి తరగతి బయటకు వచ్చాడు. వస్తూ వస్తూ స్నేహితులకు బైబై అని చెప్పాడు. మూడవ అంతస్తులో ఉన్న తరగతి గది నుంచి నాల్గో అంతస్తుకు చేరుకుని అక్కడినుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న మల్కాజిగిరి ఏసీపీ చక్రపాణి, ఉప్పల్ సీఐ ఎలక్షన్ రెడ్డి, మేడిపల్లి సీఐ గోవింద్ రెడ్డి హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. పంచనామా నిర్వహించి సంగారెడ్డి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ అసుపత్రికి తరలించారు. స్కూల్ యాజమాన్యం, పీఈటీ ఆంజనేయులు, క్లాస్ టీచర్‌పై కేసు నమోదు చేశారు. ఆత్మహత్యకు యాజమాన్యం నిర్లక్ష్యమే కారణమంటూ డీఈవో పాఠశాలను సీజ్ చేశారు. కన్నీరు మున్నీరైన తల్లి ‘ప్రయోజకుడు కావాలని రెక్కలు ముక్కలు చేసుకుని పిల్లలను ప్రైవేట్ బడిలో చదివిస్తున్నా. ఎంతకష్టమొచి్చనా ఫీజును ఆపే వాళ్లం కాదు. నా కొడుకు ఏ పాపం చేశాడని చంపేశారు? అంటూ సంగారెడ్డి తల్లి కన్నీరు మున్నీరైంది. బాధ్యులను కఠినంగా శిక్షించాలని పోలీసులను వేడుకుంది. ఆమె ఉదయం నుంచి సాయంత్రం వరకు స్కూల్ ఆవరణలో కూర్చుని రోదించడం స్థానికులను కలచివేసింది. -
తన కూతురిని ప్రేమిస్తున్నాడని తండ్రి ఘాతుకం
-
పటాన్చెరులో హైడ్రా కూల్చివేతలు.. బోర్డులు ఏర్పాటు!
సాక్షి, సంగారెడ్డి: తెలంగాణలో హైడ్రా(HYDRA) కూల్చివేతల పర్వం కొనసాగుతోంది. అక్రమ నిర్మాణాలపై హైడ్రా మరోసారి కొరడా ఝలిపించింది. తాజాగా ముత్తంగిలో అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చివేసింది. పార్క్ స్థలంలో ఆక్రమణలను హైడ్రా అధికారులు కూల్చివేశారు. శుక్రవారం ఉదయమే అక్కడికి చేరుకున్న హైడ్రా అధికారులు, పోలీసులు.. అక్రమ నిర్మాణాలను తొలగించారు. పోలీసుల బందోబస్తు మధ్య అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు.తెలంగాణలో అక్రమ నిర్మాణాలపై హైడ్రా ఫోకస్ చేసిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే శుక్రవారం ఉదయం సంగారెడ్డి(Sanga Reddy) జిల్లా పటాన్చెరు(Patancheru) మండలం ముత్తంగి గ్రామంలో 296 సర్వే నంబర్లలో ఉన్న గాయత్రి వెంచర్ పార్క్ స్థలంలో నిర్మించిన షెడ్డును హైడ్రా అధికారులు కూల్చివేశారు. ముందుస్తు సమాచారం మేరకు రంగంలోకి దిగిన అధికారులు పూర్తి ఆధారాలతో కూల్చివేతలు కొనసాగిస్తున్నారు. అక్కడ అధికారులు, పోలీసుల పర్యవేక్షణలో కూల్చివేతలు జరుగుతున్నాయి.ఇదిలా ఉండగా.. తెలంగాణలో చెరువు భూములు, ప్రభుత్వ భూముల్లో ఆక్రమణలు చేపట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు తీసుకొచ్చిన హైడ్రా ఇప్పటికే కొన్ని వందల ఎకరాల ప్రభుత్వ భూములను రక్షించింది. ఈ క్రమంలో పలు అక్రమ నిర్మాణాలను కూల్చివేసింది. మూడు రోజుల క్రితమే సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో హైడ్రా మరోసారి పంజా విసిరింది. అమీన్పూర్ చెరువులో ఏపీకి చెందిన నేత అక్రమ నిర్మాణాన్ని హైడ్రా సిబ్బంది కూల్చివేశారు. చెరువును కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు చేసినట్లు హైడ్రాకు ఫిర్యాదులు అందాయి. దీనిపై విచారణ జరిపిన హైడ్రా అక్రమాలు జరిగింది నిజమేనని నిర్ధారించుకుని కూల్చివేతలకు దిగింది. గతంలోనూ అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలో హైడ్రా పలు అక్రమ నిర్మాణాలను కూల్చివేసింది. అయితే ఇక్కడ ఉన్న అక్రమ నిర్మాణాలపై హైడ్రాకు ఫిర్యాదులు వెల్లువెత్తుతుండటంతో కూల్చివేతలు కొనసాగించాలని నిర్ణయించింది.స్వాధీన స్థలాల్లో హైడ్రా బోర్డులుప్రభుత్వ స్థలాలు, చెరువులు, కుంటలు, పార్కుల స్థలాల ఆక్రమణలను తేల్చి కూల్చేసిన స్థలాల్లో ‘ప్రొటెక్టెడ్ బై హైడ్రా’ అని బోర్డులు పెట్టాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ అధికారులను ఆదేశించారు. ఇప్పటివరకు స్వాధీనం చేసుకున్న స్థలాల్లో ప్రభుత్వ స్థలం అని ఏర్పాటుచేసిన బోర్డులను తొలగించి ఆక్రమిస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందని, దీంతో హైడ్రా ప్రొటెక్షన్‌లో ఉన్నట్టుగా బోర్డులు పెట్టాలని సూచించారు. -
వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని..
హత్నూర(సంగారెడ్డి): వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రియుడితో కలిసి భర్తనే హత్య చేసింది భార్య. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం రెడ్డి ఖానాపూర్‌లో చోటు చేసుకుంది. సోమవారం ఎస్ఐ సుభాష్ తెలిపిన వివరాల ప్రకారం.. కామారెడ్డి జిల్లా బిక్నూర్ మండలం మల్లుపల్లి గ్రామానికి చెందిన మల్లె నారాయణ(42) మూడేళ్ల కిందట ఉపాధి నిమిత్తం హత్నూర మండలం రెడ్డి ఖానాపూర్ గ్రామానికొచ్చి అద్దె ఇంట్లో ఉంటున్నాడు. గ్రామంలోనే ఎఫ్‌పీఓ (ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్) కార్యాలయంలో సీఈవోగా పని చేస్తున్నాడు. భార్య లక్ష్మీ సొంత మల్లుపల్లి గ్రామంలోనే ఉండేది. నాలుగు రోజుల కిందట భర్త వద్దకు రెడ్డి ఖానాపూర్ గ్రామానికి వచ్చింది . లక్ష్మీకి బిక్నూర్ మండలం రామేశ్వరపల్లి గ్రామానికి చెందిన బీజేపీ ఎస్సీ మోర్చా మండల అధ్యక్షుడు కడారి రాకేశ్‌తో వివాహేత సంబంధం కొనసాగిస్తుంది. ఈ విషయం తెలిసి భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని ఎలాగైన భర్తను అడ్డు తొలగించుకోవాలని పథకం వేసింది. పథకం ప్రకారం శుక్రవారం రాత్రి ప్రియుడు రాకేశ్, బిక్నూర్ గ్రామానికి చెందిన సాగర్ రమేశ్, డప్పు శ్రీకాంత్, కడారి శ్రీకాంత్‌తో కలిసి భర్త నారాయణను రెడ్డి ఖానాపూర్ గ్రామ శివారులోని సొసైటీ కార్యాలయం వద్ద హత్య చేసి మృతదేహాన్ని పల్పనూరు గ్రామ శివారులో పడి వేశారు. మరుసటి రోజు (శనివారం) ఏమీ తెలియనట్లు భర్త కనిపించడం లేదని హత్నూర పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సోమవారం గ్రామ ఉదయం శివారులో మృతదేహం ఉందనే సమాచారం మేరకు ఘటన స్థలాన్ని పటాన్ చెరువు డీఎస్పీ రవీందర్ రెడ్డి, సీఐ నదిముద్దీన్ పరిశీలించారు. అనుమానితురాలుగా ఉన్న భార్యను అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారించగా నేరం ఒప్పుకుంది. లక్ష్మీ, రాకేశ్‌తోపాటు వీరికి సహకరించిన మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు ఎస్ఐ సుభాష్ తెలిపారు. లక్ష్మీ సైతం బీజేపీ బీసీ మహిళా మండలాధ్యక్షురాలు పని చేస్తున్నట్లు పేర్కొన్నారు.హత్య కేసులో నిందితుల రిమాండ్హత్నూర(సంగారెడ్డి): భర్తను హత్య చేయించిన భార్యతోపాటు ఇందుకు సహకరించిన నలుగురిని మంగళవారం రిమాండ్‌కు తరలించినట్లు జిన్నారం సీఐ ఎండీ నయీముద్దీన్ తెలిపారు. హత్నూర పోలీస్ స్టేషన్లో ఎస్ఐ సుభాష్‌తో కలిసి వివరాలు వెల్లడించారు. కామారెడ్డి జిల్లా బిక్నూరు మండలం మల్లుపల్లి గ్రామానికి చెందిన మల్లె నారాయణ (42) వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని భార్య లక్ష్మీనర్సవ్వ, ప్రియుడు కడారి రాకేష్, చెట్లపల్లి సాగర్, కడారి శ్రీకాంత్, డప్పు శ్రీకాంత్ కలిసి హత్య చేయించిన విషయం తెలిసిందే. పథకం ప్రకారం తన ప్రియుడైన రాకేశ్‌కు రూ.40 వేలు సుపారీ ఇచ్చింది. లక్ష్మీ నర్సవ్వ ఖానాపూర్‌లో ఉండే భర్త దగ్గరకు మూడు రోజుల కిందట వచ్చింది. అతడు ఆఫీసులో ఉండగానే తాగడానికి కల్లు తెమ్మని చెప్పింది. అతడు వచ్చే లోపు పథకం ప్రకారం నలుగురు నిందితులు వచ్చి ఆఫీసులోని ఓ గదిలో దాక్కున్నారు. నారాయణ కల్లు తీసుకొని రాగానే వారి వెంట తెచ్చుకున్న కత్తి, కట్టే ఇనుప రాడుతో ఒక్కసారిగా దాడి చేసి నరికి చంపేశారు. ఈ హత్యపై ఎస్సై సుభాష్ తనదైన శైలిలో విచారణ చేయగా భార్య లక్ష్మీతోపాటు మరో నలుగురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. హత్యకు ఉపయోగించిన కారు, కత్తి కట్టే ఇనుప రాడును స్వాధీనం చేసుకున్నట్లు సీఐ వెల్లడించారు. -
పెళ్లికి పెద్దలు ఒప్పుకోవడం లేదనే...
మునిపల్లి(అందోల్)/నారాయణఖేడ్: పెళ్లికి పెద్దలు అంగీకరించడం లేదంటూ ఓ ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన శుక్రవారం సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం సింగూరు ప్రాజెక్టు హరిత రిసార్ట్‌లో వెలుగుచూసింది. పోలీసుల కథనం ప్రకారం..నిజాంపేటకు చెందిన కరిపే ఉదయ్‌కుమార్ (21), మంగలి రోహిత(19) కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమకు ఇరు కుటుంబాలకు చెందినవారు అంగీకరించలేదు.ఈ క్రమంలో గురువారం ఉదయ్, రోహితలు సింగూరు ప్రాజెక్టు సమీపంలోని హరిత రిసార్ట్‌లో ఓ గదిని అద్దెకు తీసుకున్నారు. ఒకే ఫ్యాన్‌కు ఇద్దరూ ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. అయితే ఈ ప్రేమజంట ఆత్మహత్య విషయం రిసార్ట్ నిర్వాహకులకు శుక్రవారం తెలిసింది. దీంతో వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అక్కడ రాసి ఉంచిన సూసైడ్‌నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తమ ప్రేమకు తల్లిదండ్రులు అంగీకరించకపోవడంతో ఆత్మహత్య చేసుకున్నట్టు అందులో పేర్కొన్నట్టు తెలిసింది. ఉదయ్‌కుమార్‌ది మిర్చి వ్యాపారం కాగా, రోహిత నారాయణఖేడ్‌లోని మోడల్ డిగ్రీ కళాశాలలో బీఎస్సీ (బీజెడ్సీ) ఫైనలియర్ చదువుతోంది. గురువారం ఆమె క్లాసులకు హాజరు కాలేదు. శుక్రవారం ఉదయం రోహిత తండ్రి దుర్గేష్ కళాశాలకు ఫోన్ చేసి కూతురు ఆచూకీ గురించి ఆరా తీసినట్టు తెలిసింది. ఇంతలోనే ఈ విషాదం చోటుచేసుకుంది. కాగా ఉదయ్‌కుమార్ తండ్రి బాల్కిషన్ కొంతకాలం క్రితం రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. హరిత రిసార్ట్ మేనేజర్ సాంబశివరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్టు ఎస్ఐ రాజేశ్‌నాయక్ తెలిపారు. -
గురుకుల పాఠశాల విద్యార్థుల నిరసన
-
నెలకు 5,000 ఖర్చు చేయలేక.. మొసళ్ల నదిలో వదిలేశారు
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ఒక మొసలికి ఆహారంగా రోజుకు సుమారు అర కిలో మాంసం వరకు సరిపోతుంది. వీటికి రోజువిడిచిరోజు ఓ కిలో వర కు బీఫ్ ఆహారంగా వేస్తారని అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. ఇందుకోసం నెలకు ఎక్కు వలో ఎక్కువ రూ.ఐదు వేల వరకు.. ఏడాదికి రూ.60 వేలకు మించి ఖర్చు కావు. ఈ మాత్రం నిధులు లేవనే సాకుతో అటవీశాఖ అధికారులు మంజీరా అభయారణ్యం వద్ద ఉన్న మొసళ్ల పునరావాస కేంద్రాన్నే మూసివేశారు. ఈ కేంద్రంలో ఉన్న మొసళ్లను నదిలో వదిలేయడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది.మూడింటిని కూడా మేపలేక..సంగారెడ్డికి సమీపంలో ఉన్న మంజీరా అభయార ణ్యం విభిన్న పక్షి జాతులకు నిలయం. మంజీరా డ్యాం వద్ద ఉన్న చిత్తడి నేలల్లో ఏటా వివిధ దేశాల నుంచి వలస పక్షులు కూడా వచ్చి సందడి చేస్తుంటాయి. ఈ డ్యాంవద్ద అటవీశాఖకు సంబంధించి మొసళ్ల పునరావాస కేంద్రం ఉంది. ఇందులో రెండు ఆడ, ఒక మగ మొసలి ఉండేవి. వీటికి మేతకు నిధులు రావడం లేదని ఆ మొసళ్లను నదిలో వది లేసి ఈ కేంద్రాన్ని మూసివేశారు. వన్యప్రాణుల సంరక్షణ కోసం ప్రభుత్వం రూ.కోట్లలో నిధులు ఖర్చు చేస్తుంటే, ఈ నామమాత్ర నిధులు రావడం లేదంటూ మొసళ్లను నదిలో వదిలేసి చేతులు దులుపుకోవడం విమర్శలకు దారితీస్తోంది.పెదవి విరుస్తున్న వన్యప్రాణుల ప్రేమికులుమొసళ్ల పునరావాస కేంద్రాన్ని మూసివేయడం పట్ల వన్యప్రాణుల ప్రేమికులు, సందర్శకులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఈ డ్యాం వద్దకు నిత్యం వందల సంఖ్యలో సందర్శకులు వస్తుంటారు. హైదరాబాద్‌తో పాటు వివిధ ప్రాంతాల నుంచి పక్షి ప్రేమికులు కూడా ఈ అభయారణ్యానికి వస్తుంటారు. ఈ కేంద్రం మూసి ఉండటంతో వీరంతా తీవ్ర నిరుత్సాహానికి గురవుతున్నారు. కాంపా నిధులూ కేటాయించలేరా?వన్యప్రాణుల సంరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం కాంపా (కాంపెన్సేటరీ అఫారెస్టేషన్ ఫండ్ మేనేజ్మెంట్, ప్లానింగ్ అథారిటీ) నిధులు మంజూరు చేస్తుంది. ఈ పథకం కింద ఏటా రూ.కోట్లలో నిధులు వస్తున్నప్పటికీ., ఈ మొసళ్ల సంరక్షణ కేంద్రానికి మాత్రం నిధులు కేటాయించడం లేదని అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. -
అరోరా లైఫ్ సైన్స్ పరిశ్రమలో అగ్నిప్రమాదం.. ఎగిసిపడుతున్న మంటలు
సాక్షి, సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లాలోని పారిశ్రామిక వాడలో ఘోర అగ్ని ప్రమాద ఘటన చోటుచేసుకుంది. అరోరా లైఫ్ సైన్స్ పరిశ్రమలో అగ్నిప్రమాదం కారణంగా మంటలు ఎగిసిపడుతున్నాయి. సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటలను అదుపు చేశారు.వివరాల ప్రకారం.. జిన్నారం మండలం కాజిపల్లి పారిశ్రామికవాడలో అరోరా లైఫ్ సైన్స్ పరిశ్రమలో గురువారం తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం జరిగింది. పరిశ్రమలోని ఎంబీ-2 బ్లాక్ లో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. అయితే, రియాక్టర్లలో సాల్వెంట్ మిక్సింగ్ చేస్తుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగినట్టు తెలుస్తోంది. అగ్ని ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి ఫైర్ సిబ్బంది చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువస్తున్నారు. ఇక, రియాక్టర్ పేలిన ఘటన కారణంగా పారిశ్రామికవాడ ఉలిక్కిపడింది. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. -
లగచర్ల ఘటనలో అరెస్టైన వారితో ములాఖత్ అయిన ఈటల, డీకే అరుణ
-
రేవంత్ సోదరుడి అరాచకాలు ఎక్కువయ్యాయి: ఎంపీ ఈటల
సాక్షి, సంగారెడ్డి: వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం లగచర్ల గ్రామ బాధితులకు కాంగ్రెస్ ప్రభుత్వం బేషరతుగా క్షమాపణలు చెప్పి, వారిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్. రైతులపై దుర్మార్గంగా ప్రవర్తించి, థర్డ్ డిగ్రి ప్రయోగించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఈ మేరకు లగచర్లలో అధికారులపై దాడి చేసిన ఘటనలో అరెస్ట్ చేసిన బాధిత రైతులను సెంట్రల్ జైలులో సోమవారం ఎంపీలు ఈటల రాజేందర్, డీకే అరుణ, కొండా విశ్వేశ్వర్‌రెడ్డిలు కలిసి పరామర్శించారు.ఈ ఘటనకు స్కెచ్ వేసింది కాంగ్రెస్ వాళ్లే..ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ.. ప్రభుత్వం అవసరాల కోసం భూములు తీసుకోవడం వేరు కానీ, బడా కంపెనీలకు అప్పజెప్పడం వెనుక మతలబు ఏంటని ప్రశ్నించారు. కొండ నాలుకకి మందు వేస్తే ఉన్న నాలుక ఉడినట్టు కొడంగల్ నియోజకవర్గ రైతుల పరిస్థితి ఉందన్నారు. కాంగ్రెస్ వాళ్లే ఈ ఘటనకు స్కెచ్ వేసుకుని రైతులపై దాడులు చేయించారని ఆరోపించారు. 144 సెక్షన్ పెట్టి ప్రజాప్రతినిధులను అక్కడికి వెళ్లకుండా ఆపుతున్నారని.. దీనిపై పార్లమెంట్లో ప్రివిలేజ్ మోషన్ వేస్తామని చెప్పారు.రైతులకు సంకెళ్లు వేయడం కరెక్ట్ కాదు..‘సీఎం రేవంత్ సోదరుడు అరాచకాలు నియోజకవర్గంలో ఎక్కువ అయ్యాయి. నియంతలకు సందర్భం వచ్చినప్పుడు తెలంగాణ సమాజం బుద్ధి చెబుతుంది. రైతులకు సంకెళ్లు, తర్డ్ డిగ్రీ చేయడం కరెక్ట్ కాదు. ప్రజల కన్నీళ్లు చూసినవాడు ఎప్పుడు బాగుపడడు. నీకు అక్కడ ఏముందని పెత్తనం చేలాయిస్తున్నావ్. గతంలో ఖమ్మం రైతులకు సంకెళ్లు వేసిన వారికి పట్టిన గతే మీకు పడుతుంది. అధికారులు చట్టాన్ని పక్కన పెట్టి ఇలా చేయడం కరెక్ట్ కాదు. రియల్ ఎస్టేట్ బ్రోకర్ల కోసం భూములు ఇస్తే ఉరుకోం’ అని ఈటల హెచ్చరించారు.కలెక్టర్ ఒక్కరే ఎందుకు వెళ్లారు: ఎంపీ డీకే అరుణలగచర్ల గ్రామంలో ఫార్మా కంపెనీకి భూమి ఇవ్వబోమని రైతులు 8 నెలలుగా ఆందోళన చేస్తున్నారని అన్నారు బీజేపీ ఎంపీ డీకే అరుణ. బలవంతంగా భూములు లాక్కుంటామని అధికారులు చెప్పడంతో రైతులు ఆగ్రహానికి గురయ్యారని, ప్రజాభిప్రాయ సేకరణను బహిష్కరించారని తెలిపారు. వాస్తవంగా ప్రజాభిప్రాయ సేకరణకి రాకపోతే కలెక్టర్ ఒక్కరే ఎందుకు వెళ్లారని ఆమె ప్రశ్నించారు.పోలీసుల వైఫల్యంతోనే ఈ ఘటన జరిగిందన్నారు. సీఎం రేవంత్ సోదరుడు అక్కడ ఉన్న రైతులను బయపెట్టారని, భూములు ఎలాగైనా గుంజుకుంటామని చెప్పారని ఆరోపించారు.ఘటన తర్వాత రాత్రి గ్రామాల్లోకి వచ్చి పోలీసులు ఇష్టం వచ్చినట్టు దాడి చేశారని.. గొడవ జరిగిన ఘటనలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళని వదిలేసి మిగతా వాళ్ళని అరెస్ట్ చేశారని తెలిపారు.సీఎం సోదరుడు వెళ్లొచ్చు గానీ మేము వెళ్లొద్దా?భూములు ఇవ్వమని చెబితే సీఎం రేవంత్ స్వయంగా వెళ్లి వాళ్ళని కలిసి మాట్లాడితే బాగుండు. కానీ ఇవన్నీ చేయకుండా భయపెట్టి దాడులు చేపించి ఇలా చేయడం కరెక్టు కాదు. సీఎం సోదరుడు అక్కడికి వెళ్ళవచ్చు కానీ నన్ను అక్కడికి వెళ్లకుండా అడ్డుకున్నారు. రైతులతో దౌర్జన్యంగా బెదిరించి సంతకాలు పెట్టించుకుంటున్నారు. మీరు సీఎం అయితే మా నియోజకవర్గం బాగుంటుంది అనుకుంటే మీరు జనాలపై కక్ష కట్టారు. జనాల కంటే ఫార్మా కంపెనీ ముఖ్యమా?సీఎంకు ఫార్మా కంపెనీలపై అంత ప్రేమ ఎందుకు..? ఓటేసి గెలిపించిన జనాల కంటే మీకు ఫార్మా కంపెనీ ముఖ్యమా సీఎం రేవంత్? కొడంగల్ వాసులు కాదు.. సీఎం వలస వచ్చారు. మీకు నచ్చిన వారికి కంపెనీలు అప్పజెప్పడానికే ఫార్మా కంపెనీలు పెడుతున్నారు. వెంటనే లగచర్ల బాధితులను విడుదల చేయాలి. పంథాలు వద్దు నియోజకవర్గ ప్రజల ఆకాంక్ష ముఖ్యం.పేదల ఉసురు పోసుకున్న కేసీఆర్ ఇంటికి పోయిండు. మీరు 11 నెలలకే పేదల ఉసురు పోసుకుంటున్నారు. మూసి ప్రజల ఉసురు కూడా పోసుకోవడం కరెక్ట్ కాదు. గర్భిణీ స్త్రీ అని చూడకుండా ఇలా చేయడం దారుణం. సీఎం రేవంత్ అహంకారం వీడాలి.. ఒప్పించి భూములు తీసుకోండి’ అని డీకే అరుణ పేర్కొన్నారు. -
లగచర్ల దాడిలో అరెస్టైన వారిని పరామర్శించనున్న బీజేపీ ఎంపీలు
-
హైవేపై కంటైనర్‌లో అగ్నిప్రమాదం.. ఎనిమిది కార్లు దగ్ధం
సాక్షి, సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్ బైపాస్ వద్ద అగ్నిప్రమాద ఘటన చోటుచేసుకుంది. కార్లు తరలిస్తున్న కంటైనర్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఎనిమిది నెక్సాన్ కార్లు దగ్ధమైనట్టు సమాచారం.వివరాల ప్రకారం.. జహీరాబాద్ బైపాస్ వద్ద కార్లను తరలిస్తున్న కంటైనర్ లారీలో మంటలు చెలరేగాయి. ఈ అగ్నిప్రమాదంలో నాలుగు నెక్సాన్ కార్లు దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలను అదుపులోకి తెస్తున్నారు. కంటైనర్ ముంబై నుంచి హైదరాబాద్ వస్తున్న సమయంలో ఈ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ అగ్నిప్రమాదం కారణంగా రహదారిపై భారీ సంఖ్యలో వాహనాలు నిలిచిపోవడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. -
గీతం యూనివర్సిటీలో విద్యార్థిని ఆత్మహత్య
సాక్షి,సంగారెడ్డి: గీతం యూనివర్సిటీ సంగారెడ్డి క్యాంపస్ హాస్టల్లో ఇంజినీరింగ్ విద్యార్థిని వర్ష (19) ఆత్మహత్య చేసుకుంది.వర్ష గీతం ఇంజినీరింగ్ కాలేజీలో బీ.టెక్(సీఎస్ఈ) 3వ సంవత్సరం చదువుతోంది.వర్ష స్వస్థలం అనంతపురంగా పోలీసులు గుర్తించారు.ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. విద్యార్థిని మృతికి గల కారణాలపై కాలేజీ సిబ్బంది, తోటి విద్యార్థులను ఆరా తీస్తున్నారు.ఇదీ చదవండి: విద్యార్థిని మృతిపై అనుమానాలు నివృత్తి చేయండి -
స్కూల్లో ‘హైడ్రా’ కూల్చివేతలు
సాక్షి,సంగారెడ్డిజిల్లా: హెచ్ఎండీఏ పరిధిలో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. తాజాగా మంగళవారం(సెప్టెంబర్3) సంగారెడ్డిజిల్లా అమీన్పూర్ మండలంలో అక్రమ నిర్మాణాల కూల్చివేతలు చేపట్టింది. ఐలాపూర్ తండా, అమీన్పూర్లో ఆక్రమణలను హైడ్రా అధికారులు కూల్చివేశారు. ఐలాపూర్ తండాలో సుమారు 20 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించేందుకే అక్రమ నిర్మాణాలు కూల్చివేసినట్లు అధికారులు తెలిపారు. సర్వే నంబర్ 119లో గుర్తుతెలియని వ్యక్తులు ప్లాట్లు వేశారని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీంతో హైడ్రా, రెవెన్యూ అధికారులు సంయుక్తంగా రంగంలోకి దిగి అక్రమ కట్టడాలు, సరిహద్దు రాళ్లను తొలగించారు. అనంతరం సర్వే నెంబర్ 462లోని అక్కడి ఫ్యూజన్ ఇంటర్నేషనల్ స్కూల్ ఆవరణలో ఆక్రమణలు కూల్చివేశారు. 15 గుంటల భూమి ఆక్రమించి స్కూల్ గదులు, ప్రహరీని హైడ్రా కూల్చివేసింది. -
సంగారెడ్డి పెద్దపూర్‌లో టెన్షన్.. టెన్షన్
సాక్షి, సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లా పెద్దాపూర్‌లో టెన్షన్ వాతావరణం చోటుచేసుకుంది. రీజనల్ రింగ్ రోడ్డు కోసం అధికారులు భూ సేకరణ సర్వే చేస్తున్నారు. రైతులు సర్వేను ఆడుకున్నారు. సర్వేను అడ్డు కోవడంతో అక్కడి ఉదిక్తత వాతావరణ నెలకొంది. దీంతో పోలీసులు భారీగా మోహరించారు. భూ సర్వే ఆడుకున్న రైతులను పోలీసులు అరెస్ట్ చేసి. డీసీఎంలో తరలించారు. రెండ్రోజుల క్రితం రీజినల్ రింగ్ రోడ్డు(ఆర్ఆర్ఆర్) కోసం ప్రజాభిప్రాయ సేకరణలోను భూములు ఇవ్వబోమని రైతుల ఆందోళన చేశారు. -
చౌటుప్పల్–సంగారెడ్డిలో ఇంటర్చేంజ్ కూడళ్లు!
సాక్షి, హైదరాబాద్: రీజనల్ రింగ్ రోడ్డుపై రెండు ప్రాంతాల్లో భారీ ఇంటర్ చేంజ్ కూడళ్లను నిర్మించబోతున్నారు. హైదరాబాద్–పుణె జాతీయ రహదారిని క్రాస్ చేసే సంగారెడ్డి సమీపంలోని గిర్మాపూర్ వద్ద.. హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిని క్రాస్ చేసే చౌటుప్పల్ వద్ద ఈ కూడళ్లు ఉంటాయి. వీటికోసం ఢిల్లీ ఔటర్ రింగురోడ్డుపై నిర్మించిన ‘ఎక్స్టెండెడ్ డంబెల్’డిజైన్‌ను ఎంపిక చేశారు. ఎనిమిది వరసల (తొలి దశలో నాలుగు వరసలు)తో రీజనల్ రింగు రోడ్డును నిర్మిస్తున్న నేపథ్యంలో ఇంటర్‌చేంజ్‌లను విశాలంగా రూపొందిస్తున్నారు. ఆ డిజైనే ఎందుకు? ఇప్పటికే ఉన్న భారీ రహదారులను ఎక్స్‌ప్రెస్ వేలు క్రాస్ ప్రాంతాల్లో.. వాహనాలు ఆ రోడ్ల నుంచి రింగ్‌రోడ్డు మీదకు, రింగురోడ్డు నుంచి ఆ రోడ్ల మీదకు సులువుగా మారేందుకు వీలుగా ఇంటర్ చేంజ్ కూడళ్లను నిర్మిస్తారు. ఆ ప్రాంతాల్లో అందుబాటులో ఉన్న భూమి ఆధారంగా లూప్ డిజైన్లను ఎంపిక చేస్తారు. ఉత్తర–దక్షిణ భాగాలు కలిసే సంగారెడ్డి, చౌటుప్పల్ ప్రాంతాల్లో రోడ్ల పక్కనే చాలా నిర్మాణాలున్నా యి. అలాంటి చోట కూడళ్ల వద్ద భారీ లూప్‌లు నిర్మిస్తే భూసేకరణ పెద్ద సమస్యగా ఉంటుంది. ఈ క్రమంలో ‘ఎక్స్టెండెడ్ డంబెల్’నమూనాను ఎంపిక చేశారు. ఈ డిజైన్‌లో వాహనాలు రోడ్లను మారే లూప్‌లు ఎక్కువశాతం రింగురోడ్డును అనుకునే ఉంటాయి. వీటి నిర్మాణానికి అవసరమైన భూమిలో 70% వరకు రింగురోడ్ భూమినే వినియోగిస్తారు. మిగతా 30 శాతం భూమిని సేకరిస్తే సరిపోతుంది. ఒక్కోటి 150 ఎకరాల్లో.. 3 కిలోమీటర్ల నిడివితో.. ‘ఎక్స్టెండెడ్ డంబెల్’నమూనాలో నిర్మించే ఇంటర్ చేంజ్‌లలో.. లూప్ రోడ్లు చాలా దూరం నుంచే మొదలవుతాయి. ప్రస్తుతం రీజనల్ రోడ్డులో కూడా.. ప్రధాన కూడలికి ఇరువైపులా ఒకటిన్నర కిలోమీటర్ల దూరం చొప్పున మూడు కిలోమీటర్ల నిడివితో ఈ లూప్ రోడ్లు ఉండనున్నాయి. హైదరాబాద్ ఔటర్ రింగురోడ్డుపై నిర్మించిన ఇంటర్ చేంజ్ల కంటే ఇది దాదాపు రెట్టింపు సైజు కావడం విశేషం.మొత్తంగా పదకొండు కూడళ్లు.. రీజనల్ రింగురోడ్డుకు సంబంధించి భూసేకరణ ప్రక్రియ వేగంగా సాగుతుండటంతో.. జాతీయ రహదారుల సంస్థ (ఎన్హెచ్ఐఏ) రోడ్డు నిర్మాణంపై దృష్టి సారించింది. మరో మూడు నెలల్లో టెండర్ల ప్రక్రియ మొదలయ్యే చాన్స్ ఉంది. ఈ మేరకు అధికారులు రోడ్డు డిజైన్‌ను పూర్తి చేసే పనిలో నిమగ్నమయ్యారు. ప్రస్తుతానికి ఉత్తర భాగం (162 కిలోమీటర్లు.. సంగారెడ్డి నుంచి గజ్వేల్ మీదుగా చౌటు ప్పల్ వరకు) నిర్మాణం చేపట్టనున్నారు. ఈ రోడ్డు దక్షిణభాగంతో కలిసే చోట్ల ఉండే రెండు ఇంటర్ చేంజ్‌లు సహా ఉత్తరభాగంలో మొత్తం 11 కూడళ్లు ఉంటాయి. వాటి డిజైన్లు సిద్ధమయ్యాయి. » సంగారెడ్డి వద్ద భారీ ‘ఎక్స్టెండెడ్ డంబెల్’డిజైన్‌తో కూడలి నిర్మిస్తారు. ళీ సంగారెడ్డి తర్వాత వచ్చే రెండో కూడలి 161 నంబర్ జాతీయ రహదారిని క్రాస్చేసే శివంపేట వద్ద ఉంది. ఇక్కడ డబుల్ డంబెల్ డిజైన్‌లో ఉంటుంది. » మూడో కూడలి నర్సాపూర్–మెదక్ రోడ్డుపై నర్సాపూర్ వద్ద నిర్మిస్తారు. అక్కడ డంబెల్ మోడల్ ఎంపిక చేశారు. ళీ నాలుగో కూడలి హైదరాబాద్–నాగ్‌పూర్ రహదారిపై తూప్రాన్ వద్ద. ఇక్కడ క్లోవర్ లీఫ్ డిజైన్ ఎంపిక చేశారు. » ఐదో కూడలి తూప్రాన్–గజ్వేల్ దారిలో మజీద్‌పల్లి వద్ద ఉంటుంది. ఇక్కడ రోటరీ డిజైన్ ఖరారు చేశారు. » ఆరో కూడలి రాజీవ్ రహదారిపై ప్రజ్ఞాపూర్ సమీపంలో వస్తుంది. ఇక్కడ పాక్షిక క్లోవర్ లీఫ్ (మూడు లూప్‌లు మాత్రమే) డిజైన్ ఎంపిక చేశారు. » ఏడో కూడలి జగదేవ్‌పూర్–తుర్కపల్లి మధ్య పీర్లపల్లి వద్ద ఉంటుంది. ఇక్కడ రోటరీ డిజైన్ ఎంపిక చేశారు. » ఎనిమిదో కూడలి తుర్కపల్లి–యాదగిరిగుట్ట రోడ్డుపై తుర్కపల్లి వద్ద వస్తుంది. ఇక్కడ కూడా రోటరీ డిజైన్‌లో నిర్మిస్తారు. » తొమ్మిదో కూడలి హైదరాబాద్–వరంగల్ హైవేపై రాయగిరి వద్ద ఉంటుంది. ఇక్కడ డబుల్ ట్రంపెట్ డిజైన్‌లో ఉంటుంది. » పదో కూడలి భువనగిరి–వలిగొండ రోడ్డుపై వలిగొండ వద్ద వస్తుంది. ఇక్కడ రోటరీ డిజైన్ ఖరారు చేశారు. » పదకొండో కూడలిని చౌటుప్పల్ వద్ద భారీ ‘ఎక్స్టెండెడ్ డంబెల్’డిజైన్‌తో నిర్మిస్తారు. -
సంగారెడ్డి జిల్లా నందిగామలో దొంగల బీభత్సం
-
‘చట్నీలో చిట్టెలుక’.. సాక్షి కథనంపై స్పందించిన అధికారులు
సంగారెడ్డి, సాక్షి: సుల్తాన్ పూర్ జేఎన్టీయూ ఇంజనీరింగ్ కాలేజీ హాస్టల్ క్యాంటీన్ చట్నీలో చిట్టెలుక ఉరుకులు పెట్టడంపై సాక్షి ఇచ్చిన కథనం.. ప్రభుత్వం దృష్టికి వెల్లింది. ఘటనపై ఆగ్రహం వ్యక్తి చేసిన రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖల మంత్రి దామోదర్ రాజనర్సింహ.. కారకులపై తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారుల్ని ఆదేశించారు. దీంతో అధికార యంత్రాంగం కదిలింది. నాణ్యతలేని అల్పాహారం, భోజనంతో హాస్టల్ విద్యార్థులు వారం రోజులుగా ఆందోళన చేస్తున్నారు. అయినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఈలోపు.. తాజాగా హాస్టల్ క్యాంటీన్ చట్నీలో చిట్టెలుక చక్కర్లు కొట్టడాన్ని కొందరు విద్యార్థులు వీడియో తీసి వైరల్ చేశారు. సాక్షిలో ఈ కథనం ప్రముఖంగా ప్రసారమైంది. దీంతో ప్రభుత్వం స్పందించింది. ఆ వెంటనే మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశాలతో సంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ మాధురి రంగంలోకి దిగారు. జిల్లా అడిషనల్ కలెక్టర్ మాధురి, అందోల్ జోగిపేట డివిజన్ ఆర్డీవో పాండు మంగళవారం మధ్యాహ్నాం క్యాంపస్ హాస్టల్ చేరుకొని జరిగిన సంఘటనపై విద్యార్థులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. కొంతకాలంగా మెస్‌లో నాణ్యత లేని భోజనం అందిస్తున్నారన్న విద్యార్థుల ఫిర్యాదుల్ని.. అలాగే ఇవాళ్టి ఎలుక వీడియోను ఆమె పరిశీలించారు. కాంట్రాక్టర్‌ను తొలగించడంతో పాటు కేర్ టేకర్ పైనా లీగల్‌యాక్షన్ తీసుకుంటామని, నాణ్యమైన భోజనం అందేలా చూస్తామని ఆమె హామీ ఇచ్చారు. దీంతో విద్యార్థులు ఆందోళన విరమించారు. ఘటనతో అలర్ట్.. ఇలాంటి ఘటనలు పునరావృత్తం కాకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులకు మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలో, కళాశాలలో ఉన్న బోర్డింగ్, హాస్టలను , క్యాంటీన్లను తనిఖీలు నిర్వహించాలన్నారాయన. ఫుడ్ సేఫ్టీ నిబంధనలు పాటించని వారిపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశిస్తూనే.. ఆహార పదార్థాలను తయారు చేసే నిర్వాహాకులు తప్పనిసరిగా FSSAI లైసెన్స్ ను తీసుకోవాలని మంత్రి సూచించారు. ఫుడ్ సేఫ్టీ నిబంధనలు పాటించని సంస్థల లైసెన్సులను వెంటనే రద్దు చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. మరోవైపు.. హోటల్స్, రెస్టారెంట్స్ తో పాటు బేకరీలు, బోర్డింగ్, హాస్టల్స్, క్యాంటీన్లు, ఆహార పదార్థాలు తయారు చేసే నిర్వాహకుల పై నిఘా ఉంచాలని ఫుడ్ సేఫ్టీ అధికారుల్ని మంత్రి ఆదేశించారు. -
లీడర్ల గుండెల్లో.. విలీన గుబులు
జీహెచ్ఎంసీ పరిధిలోకి తెల్లాపూర్ మున్సిపాలిటీ? ● కలవరపడుతున్న రాజకీయ నాయకులు ● పదవులు కోల్పోతామని ఆవేదన రామచంద్రాపురం(పటాన్చెరు): తెల్లాపూర్ మున్సిపాలిటీ జీహెచ్ఎంసీలో విలీనం అవుతుందని ప్రచారం జరుగుతోంది. ఈ విషయం స్థానిక నేతలు, ప్రజలను కలవరానికి గురిచేస్తోంది. కౌన్సిలర్లు తమ పదవులు ఎక్కడ కోల్పోతామోనని గుబులు పడుతున్నారు. అలాగే అభివృద్ధి, సమస్యల పరిష్కారానికి దూరమవుతామని ప్రజలు ఆవేదన చెందుతున్నారు.రామచంద్రాపురం మండలంలో తెల్లాపూర్ గ్రామపంచాయతీగా ఉండేది. ఈ ప్రాంతంలో రియల్ వ్యాపారం జోరుగా సాగుతుండటంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం తెల్లాపూర్, ఉస్మాన్‌నగర్, కొల్లూర్, ఈదులనాగులపల్లి, వెలిమెల గ్రామాలను కలిపి తెల్లాపూర్ మున్సిపాలిటీగా ప్రకటించింది. 17 వార్డులను కూడా ఏర్పాటు చేసింది. మున్సిపల్ ఎన్నికల్లో ఆశావహులందరూ కౌన్సిలర్లుగా పోటీ చేశారు. ఇదంతా జరిగి సుమారు ఐదేళ్లవుతోంది. ప్రజాప్రతినిధులకు మరో మూడు నాలుగు నెలల పదవీకాలం ఉంది. ఈసారి జరిగే ఎన్నికల్లో కౌన్సిలర్లుగా పోటీ చేసేందుకు కొందరు లీడర్లు సిద్ధమవుతున్నారు. అయితే తెల్లాపూర్‌ను జీహెచ్ఎంసీలో విలీనం చేస్తారనే వార్త నాయకులను కలవరపాటుకు గురిచేస్తున్నాయి. జీహెచ్ఎంసీ విలీనమైతే రాజకీయ పదవులు పొందలేమన్న భావనలో కార్యకర్తలున్నారు.10 ఏళ్ల క్రితమే ప్రతిపాదనలుతెల్లాపూర్ను జీహెచ్ఎంసీలో విలీనం చేయాలని పదేళ్ల క్రితమే ప్రతిపాదించారు. నాటి కలెక్టర్ స్థాయి అధికారులు తెల్లాపూర్‌ను జీహెచ్ఎంసీలో విలీనం చేయొచ్చని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. కానీ ఆ సమయంలో స్థానిక ప్రజాప్రతినిధులు అందుకు నిరాకరించారు. దాంతో కొంత కాలం తరువాత పంచాయతీ కాస్త మున్సిపాలిటీగా ఏర్పడింది.తెల్లాపూర్ మున్సిపాలిటీగా..రామచంద్రాపురం మండలంలోని ఐదు గ్రామాలను కలిపి తెల్లాపూర్ మున్సిపాలిటీగా ఏర్పాటు చేశారు. తెల్లాపూర్, ఉస్మాన్‌నగర్, కొల్లూర్, ఈదులనాగులపల్లి, వెలిమెల గ్రామపంచాయతీలను కలిపారు. అయినా గానీ హైదరాబాద్‌ను ఆనుకుని ఉన్న తెల్లాపూర్‌ను సెమీ అర్బన్‌గా చెప్పుకుంటున్నప్పటికీ ఇక్కడి ఇంకా గ్రామీణ వాతావరణమే ఉంటుంది. ఇక ఈ ప్రాంతాన్ని జీహెచ్ఎంసీలో విలీనం చేస్తే ఇబ్బందులు తప్పవని స్థానికులు అంటున్నారు.ఆశ.. నిరాశఐదేళ్లుగా తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డుల్లో అన్ని పార్టీలకు చెందిన కార్యకర్తలు, నాయకులు ముందు చూపుతో వారి పార్టీల కోసం కష్టపడుతూ వస్తున్నారు. భవిష్యత్‌లో తాము కూడా కౌన్సిలర్లుగా పోటీ చేస్తామనే ధీమాలో ఉన్నారు. ప్రధానంగా 10 ఏళ్లు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధికారంలో ఉండటం కూడా ఇందుకు కారణం. తెల్లాపూర్‌ను జీహెచ్ఎంసీలో విలీనం వార్తలు వెలువడటంతో వారు నిరాశకు లోనవుతున్నారు. తాము రాజకీయ పదవులకు దూరం కావాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే, మున్సిపల్ కార్యాలయంలో అన్ని శాఖల అధికారులు ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటారు. నేరుగా కలిసి వారి సమస్యలను నివేదించేవారు. అవసరమైతే కౌన్సిలర్లను నిలదీసే అవకాశం ఉంటుంది. కానీ జీహెచ్ఎంసీలో విలీనమైతే సమస్యలు చెప్పుకోవడం కష్టం అవుతుందనే అభిప్రాయం స్థానికులు వ్యక్తం చేస్తున్నారు. -
వాట్ ఏ టాలెంట్..
-
అత్యంత ప్రమాదకరమైన అల్ఫాజోలం డ్రగ్ స్వాధీనం
-
5 జిల్లాల్లో 43 డిగ్రీల పైనే..
సాక్షి ప్రతినిధి, నల్లగొండ/ సాక్షి నెట్వర్క్: రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. శుక్రవారం నల్లగొండ జిల్లాలో రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నల్లగొండ జిల్లాలో 43.5 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదు కాగా, జోగుళాంబ గద్వాల, కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాల్లో 43.3 డిగ్రీల సెల్సియస్, సంగారెడ్డిలో 43.2 డిగ్రీలు, ఆదిలాబాద్‌లో 43 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నల్లగొండ జిల్లాలోని 18 మండలాలకు చెందిన 20 గ్రామాల్లో 43 డిగ్రీలు దాటిపోయింది. ఈ జిల్లాలోని మాడుగులపల్లి మండల కేంద్రంతోపాటు మునుగోడు మండలం గూడాపూర్‌లో 43.5 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దామరచర్ల మండల కేంద్రం, అనుముల మండలం ఇబ్రహీంపేట, కనగల్ మండల కేంద్రం, మిర్యాలగూడ మండలం తడకమళ్ల గ్రామాల్లో 43.4 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరోవైపు ఎండలు తీవ్రం కావడంతో వడదెబ్బ కారణంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో నలుగురు మృతిచెందారు. జనగామ జిల్లా చిల్పూరు మండలం వెంకటాద్రిపేట గ్రామానికి చెందిన గాదె జయపాల్‌రెడ్డి (55) గురువారం వడదెబ్బకు గురికాగా హనుమకొండలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం సాయంత్రం మృతిచెందాడు. మహబూబాబాద్ జిల్లాలో సికింద్రాబాద్ తండా గ్రామానికి చెందిన ధరావత్ మంచ్యా (55) వడదెబ్బకు గురై శుక్రవారం మృతిచెందాడు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని జీఎన్ఆర్ కాలనీకి చెందిన స్వర్ణలత (45) రెండ్రోజుల క్రితం నిజామాబాద్‌లో పెళ్లికి హాజరైంది. ఎండల తీవ్రతతో అస్వస్థతకు గురైంది. నిర్మల్‌కు వచి్చన తర్వాత గురువారం రాత్రి ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందింది. అలాగే నాగర్‌కర్నూల్ జిల్లా లింగాల మండలం శ్రీరంగాపూర్ గ్రామానికి చెందిన రైతు మర్రిపల్లి ఈరయ్య (70) పొలం పనులకు వెళ్లి ఎండ దెబ్బతగలడంతో గురువారం మృతి చెందాడు. -
ఎస్ బి ఆర్గానిక్స్ రియాక్టర్ పేలుడులో తప్పెవరిది..
-
సంగారెడ్డి ఫ్యాక్టరీలో పేలిన రియాక్టర్.. ఏడుగురు కార్మికుల మృతి
సంగారెడ్డి : సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం.. చందాపూర్ గ్రామంలో ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఎస్బీ ఆర్గానిక్ ఫ్యాక్టరీలో భారీ శబ్దంతో రియాక్టర్ పేలింది. పేలుడు ధాటికి కంపెనీలో పనిచేసే మేనేజర్ రవితోపాటు ఆరుగురు కార్మికులు దుర్మరణం పాలయ్యారు. మరో 10 మంది కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను సంగారెడ్డి ప్రభుత్వ ఆసుప్రతికి తరలించారు. రియాక్టర్ పేలుడుతో కార్మికులు వందల మీటర్ల దూరం ఎగిరిపడ్డారు మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాక సిబ్బంది ఫైరింజన్లతో మంటల్ని ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. దుర్ఘటన జరిగిన సమయంలో కంపెనీలో 50 మంది కార్మికులు పని చేస్తున్నారు. మంటల్లో చిక్కుకున్న బాధితులు కాపాడాలంటూ ఆర్తనాదాలు చేస్తున్నారు. అయితే ఒక రియాక్టర్ నుంచి మరో రియాక్టర్‌కు మంటలు వ్యాపించాయి.దీంతో ఇంకో రియాక్టర్ పేలితే ప్రమాదం మరింత త్రీవతరం అయ్యే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు పరిశ్రమ పరిసరాల నుంచి ప్రజల్ని ఖాళీ చేయిస్తున్నారు. గాయపడిన క్షతగాత్రుల్ని సిబ్బంది అత్యవసర చికిత్స కోసం సంగారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి ఎస్బీ ఆర్గానిక్ ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. వెంటనే ఘటన స్థలానికి వెళ్ళి సహాయక చర్యలను పర్యవేక్షించల్సిందిగా ఫైర్ సర్వీసెస్ డి.జి. నాగిరెడ్డిని ఆదేశించారు. బాధితులకు మెరుగైన వైద్య చికిత్స అందించడానికి అన్ని చర్యలు తీసుకోవాల్సిందిగా జిల్లా కలెక్టర్, ఎస్పీని కోరారు. పరిశ్రమ ప్రమాదంపై సమీక్షించిన సీఎం రేవంత్ రెడ్డి ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్య సహాయం అందజేయాలని జిల్లా అధికారులకు సూచించారు. ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు. మృతుల కుటుంబాలకు ఎమ్మెల్యే హరీష్ రావు సానుభూతి సంగారెడ్డి పరిశ్రమలో రియాక్టర్ పేలి కార్మికులు మృతి చెందిన ఘటనపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రభుత్వం వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని కోరారు. -
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ లో భారీ అగ్నిప్రమాదం
-
PM Modi: సంగారెడ్డి జిల్లాలో ప్రధాని మోదీ పర్యటన
-
సికింద్రాబాద్, సంగారెడ్డి జిల్లాలో ప్రధానిమోదీ పర్యటన
-
బీఆర్ఎస్, కాంగ్రెస్‌ల స్కాముల బంధం గట్టిది: ప్రధాని
Updates: 12:36PM, Mar 5th, 2024 ముగిసిన ప్రధాని మోదీ తెలంగాణ పర్యటన.. బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకున్న గవర్నర్ తమిళిసై, సీఎం రేవంత్‌రెడ్డి ప్రధానికి వీడ్కోలు పలికిన గవర్నర్, సీఎం రెండురోజుల తెలంగాణ పర్యటన ముగించుకున్న ప్రధాని మోదీ 12:26PM, Mar 5th, 2024 బీఆర్ఎస్, కాంగ్రెస్‌ల మధ్య స్కాముల బంధం గట్టిది: ప్రధాని తెలంగాణలో బీఆర్ఎస్ కుంభకోణాలు చూసి ప్రజలు కాంగ్రెస్‌కు అవకాశమిచ్చారు అయితే బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండూ ఒకటే బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య కుంభకోణాల బంధం బలంగా ఉంది కాళేశ్వరంలో బీఆర్ఎస్ దోచుకుంటే విచారణ పేరుతో కాంగ్రెస్ దోచుకుంది. కాంగ్రెస్ తెలంగాణను కొత్త ఏటీఎంగా మార్చుకుంది కాంగ్రెస్ సర్కారు ఆటలు ఎక్కువ కాలం సాగవు మోదీ సర్కారులో ఎయిర్ దాడులు కూడా ఉంటాయి 12:10PM, Mar 5th, 2024 కుటుంబవాదులకు వ్యతిరేకంగా పోరాడుతున్నా : ప్రధాని మోదీ జమ్మూకాశ్మీర్ నుంచి తమిళనాడు దాకా కుటుంబ పార్టీలున్న చోట కుటుంబాలు బాగుపడ్డాయి. కుటుంబవాద పార్టీలు ప్రజాస్వామ్యానికి శత్రువులు పరివార వాదులకు చోరీ చేసేందుకు లైసెన్స్ ఉందా వాళ్లకు కుటుంబం ఫస్ట్... నాకు దేశం ఫస్ట్ కాంగ్రెస్ బయటివారికి ఎవరికీ అవకాశం ఇవ్వదు కుటుంబవాదులు సొంత ఖజానా నింపుకున్నారు. మోదీ దేశఖజానా నింపాడు నేను ఎవరిపైనా వ్యక్తిగత విమర్శలు చేయలేదు. కుటుంబవాదులు మోదీపైనే దాడి చేస్తున్నారు దేశంలో ప్రతి తల్లి, సోదరి, యువకులు, పిల్లలందరూ మోదీ కుటుంబమే ఇందుకు అందరూ మోదీకా పరివార్ అని అంటున్నారు నేను మోదీ కుటుంబం అని తెలంగాణ ప్రజలంటున్నారు తెలంగాణప్రజల కలలు.. నా సంకల్పం ఈ పదేళ్లలో జరిగిన అభివృద్ధి దేశంలో గత 70 ఏళ్లలో జరగలేదు నేను గ్యారెంటీ వ్యక్తిని.. గ్యారెంటీ పూర్తి చేయడం నాకు తెలుసుఘె ఎస్సీ వర్గీకరణపై ఉన్నతస్థాయి కమిటీ వేశాం తెలంగాణ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉంది ఇవాళ రెండోరోజు తెలంగాణ ప్రజలతో ఉండటం సంతోషం సంగారెడ్డి నుంచి రూ. 7వేల కోట్ల అభివృద్ది పనులు ప్రారంభిస్తున్నాం ఎవియేషన్ రంగంలో తెలంగాణకు లబ్ధి చేకూరుతోంది పదేళ్లలో దేశంలో ఎయిర్‌పోర్టుల సంఖ్య రెట్టింపు అయింది వికసిత్ భారత్ దిశగా మా ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది దేశంలో తొలి ఎవియేషన్ సెంటర్‌ను బేగంపేటలో ఏర్పాటు చేశాం ఘట్కేసర్- లింగంపల్లి మధ్య ఎంఎంటీఎస్ ప్రారంభించాం పటాన్చెరులో ప్రధాని మోదీ వర్చువల్‌గా ప్రారంభించిన కార్యక్రమాలు NH-65 లోని పుణే - హైదరాబాద్ రహదారిలో సంగారెడ్డి X రోడ్ నుంచి మదీనాగూడ మధ్యన 31 కి.మీ.ల 6 లేన్ హైవే విస్తరణ (1,298 కోట్లు) NH-765Dలో 399 కోట్లతో మెదక్ - ఎల్లారెడ్డి మధ్యన 2 లైన్ హైవే విస్తరణ NH-765Dలో 500 కోట్లతో ఏల్లారెడ్డి - రుద్రూర్ మధ్యన 2 లైన్ హైవే విస్తరణ పనులు జాతికి అంకితం చేసిన ప్రాజెక్టులు (b) పారాదీప్ - హైదరాబాద్ గ్యాస్ పైప్ లైన్ 3,338 కోట్లు NH-161 లోని కంది - రామసానిపల్లె సెక్షన్ లో 4 వరుసల జాతీయ రహదారి (1,409 కోట్లు) NH-167 లోని మిర్యాలగూడ - కోదాడ సెక్షన్ 2 వరుసల జాతీయ రహదారి విస్తరణ (323 కోట్లు) హైదరాబాద్, సికింద్రాబాద్‌ల్లో 103 కి.మీ.ల పొడవున చేపట్టిన MMTS ఫేజ్ - II ప్రాజెక్ట్ (1,165 కోట్లు) ఘట్ కేసర్ - లింగంపల్లి మధ్యన కొత్త MMTS రైలు ప్రారంభం తక్కువ చార్జీలకే హైదరాబాద్ ప్రయాణ సౌకర్యం: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్ని వర్గాల సంక్షేమం కోసం మోదీ ప్రభుత్వం కృషి చేస్తోంది ఘట్కేసర్-లింగంపల్లి మధ్య అందుబాటులోకి కొత్త ఎంఎంటీఎస్ ఇవాళ రూ.9 వేల కోట్ల ప్రాజెక్టులను ప్రధాని ప్రారంభింస్తారు గత పదేళ్లుగా తెలంగాణ అభివృద్ధి కోసం నరేంద్ర మోదీ ప్రభుత్వం అంకితభావంతో పనిచేసింది. తెలంగాణలో నరేంద్ర మోదీ ప్రభుత్వం అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టింది. జాతీయ రహదారుల కోసం రూ. 1.20 లక్షల కోట్లు ఎరువుల సబ్సిడీ కోసం రూ. 33 వేల కోట్లు రైల్వేల అభివృద్ధి కోసం రూ. 35 వేల కోట్లు. రేషన్ సబ్సిడీపై రూ. 30 వేల కోట్లు, ఉపాధి హామీ పథకం కింద రూ. 26,728 కోట్లు. రామగుండం ఎన్టీపీసీ ఆధ్వర్యంలో 1600 మెగావాట్ల పవర్ ప్రాజెక్టు కోసం రూ. 10,998 కోట్లు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద రూ. 10 వేల కోట్లు. సర్వశిక్షా అభియాన్ కింద రూ. 7,500 కోట్లు. గ్రామపంచాయతీల అభివృద్ధి కోసం రూ. 7,200 కోట్లు రామగుండంలో యూరియా పరిశ్రమ కోసం రూ. 6,338 కోట్లు. ఎల్పీజీ సబ్సిడీ కింద రూ. 5,859 కోట్లు హెల్త్ మిషన్ కింద రూ. 5,550 కోట్లు. ప్రధానమంత్రి కేంద్రీయ విశ్వవిద్యాలయాల కోసం రూ. 4,500 కోట్లు స్వచ్ఛ భారత్ కింద రూ. 3,745 కోట్లు.. ఈఎస్ఐ మెడికల్ కాలేజ్, హాస్పిటల్, ఎయిమ్స్.. ఇలా అనేక రకాలుగా తెలంగాణ అభివృద్ధి కోసం కేంద్రం కృషి చేసింది. బీఆర్ఎస్ పార్టీ కేంద్రం తెలంగాణకు ఏం ఇవ్వడం లేదంటూ బురదజల్లుతోంది. కేసీఆర్ కుటుంబ పాలనతో తెలంగాణ సంపద దోచుకున్నారు. 11:00AM, Mar 5th, 2024 పటేల్‌గూడలోని ఎస్ఆర్ ఇన్ఫినిటీ బహిరంగ సభలో పాల్గొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 10:40AM, Mar 5th, 2024 బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ప్రధాని మోదీ కాసేపట్లో సంగారెడ్డికి వెళ్లనున్న మోదీ పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించనున్న మోదీ 10:30AM, Mar 5th, 2024 ఉజ్జయిని మహంకాళి ఆలయం నుంచి బేగంపేట ఎయిర్‌పోర్టుకు బయలుదేరిన ప్రధాని మోదీ 10:20AM, Mar 5th, 2024 సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దర్శించుకున్నారు మహంకాళి అమ్మవారి ఆలయంలో ప్రధాని మోదీ ప్రత్యేక పూజలు ప్రధాని మోదీ పూజలు చేసే సమయంలో ఆలయం లోపలికి ఇద్దరికి మాత్రమే అనుమతి దేవాలయం చుట్టూ వెయ్యిమంది పోలీసులతో సెక్యూరిటీ అమ్మవారి దర్శనం అనంతరం బేగంపేట ఎయిర్‌పోర్టుకు ప్రధాని #WATCH | Telangana: Prime Minister Narendra Modi visits and offers prayers at Ujjaini Mahankali temple in Secunderabad. pic.twitter.com/zijxd4LYAX — ANI (@ANI) March 5, 2024 10:06AM, Mar 5th, 2024 సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారి ఆలయానికి చేరుకున్న ప్రధాని 9:50AM, Mar 5th, 2024 కాసేపట్లో సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారి ఆలయానికి ప్రధాని మోదీ ప్రధాని నరేంద్రమోదీ రెండో రోజు తెలంగాణ పర్యటన షెడ్యూల్ రాజ్ భవన్ నుంచి బయలుదేరనున్న ప్రధాని సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో పూజలు బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి పఠాన్ చెరువు బయలుదేరనున్న ప్రధాని పఠాన్ చెరువులో ఉదయం పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్న ప్రధాని పఠాన్ చెరువు బహిరంగ సభలో మాట్లాడనున్న ప్రధాని సభకు ఏర్పాట్లు పూర్తి.. భారీగా బందోబస్తు ప్రధాని సభ కోసం పటాన్‌చెరులోని పటేల్‌గూడ సభా వేదిక వద్ద 23 ఎకరాల్లో భారీగా ఏర్పాట్లు చేశారు. సభా ప్రాంగణం, పరిసర ప్రాంతాలను ఫ్లెక్సీలు, కటౌట్లు, కాషాయ జెండాలతో నింపేశారు. అధికారిక కార్యక్రమాల కోసం ఒకటి, రాజకీయ ప్రసంగం కోసం మరొకటి.. రెండు వేదికలను ఏర్పాటు చేశారు. ప్రధాని ముందుగా అధికారిక కార్యక్రమాలు నిర్వహించి, తర్వాత బహిరంగ సభా వేదికపై ప్రసంగిస్తారు. ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలోని మెదక్, జహీరాబాద్ లోక్‌సభ సీట్లతోపాటు సమీపంలోని నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థులకు మద్దతు కూడగట్టేలా ప్రధాని సభను నిర్వహిస్తున్నారు. కాగా ప్రధాని పర్యటన సందర్భంగా మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. మంగళవారం ఉదయం ఉజ్జయని మహంకాళి అమ్మవారి ఆలయం, అక్కడి నుంచి బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకునే మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలను అమలు చేయనున్నారు. వర్చువల్‌గా శంకుస్థాపన చేయనున్న కార్యక్రమాలివీ.. ► రూ.1,298 కోట్లతో ఎన్‌హెచ్–65పై సంగారెడ్డి చౌరస్తా నుంచి మదీనాగూడ వరకు 31 కిలోమీటర్ల మేర ఆరు లేన్లుగా విస్తరణ ► రూ.399 కోట్లతో ఎన్‌హెచ్–765డిపై మెదక్–ఎల్లారెడ్డి మధ్య 2 లైన్ల హైవే విస్తరణ. జాతికి అంకితం చేయనున్న ప్రాజెక్టులివీ.. ► రూ.3,338 కోట్లతో నిర్మించిన పారాదీప్– హైదరాబాద్ గ్యాస్ పైప్‌లైన్ ► రూ.400 కోట్లతో చేపట్టిన సివిల్ ఏవియేషన్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ► రూ.1,409 కోట్లతో నిర్మించిన ఎన్‌హెచ్–161లోని కంది–రామసానిపల్లె సెక్షన్లో 4 వరుసల జాతీయ రహదారి ► రూ.323 కోట్ల ఖర్చుతో చేసిన ఎన్‌హెచ్–167 మిర్యాలగూడ–కోదాడ సెక్షన్ జాతీయ రహదారి విస్తరణ ► రూ.1,165 కోట్లతో హైదరాబాద్–సికింద్రాబాద్‌లలో 103 కిలోమీటర్ల పొడవున చేపట్టిన ఎంఎంటీఎస్ ఫేజ్–2 ప్రాజెక్టు. ► ఘట్కేసర్– లింగంపల్లి మధ్య కొత్త ఎంఎంటీఎస్ రైలు ప్రారంభం -
మెడికో రచనా కేసులో ఏం జరిగింది?
సంగారెడ్డి, సాక్షి: మెడికో రచనా రెడ్డి ఆత్మహత్య కేసులో కొత్త అనుమానాలు బయటకు వస్తున్నాయి. ఇటీవల ఆమె పెళ్లి నిశ్చయం కాగా.. ఆ వ్యవహారంలో ఏర్పడిన మనస్పర్థల వల్ల ఆమె డిప్రెషన్‌కు వెళ్లినట్టు.. దాని వల్లే ఆమె ఆత్మహత్యకు పాల్పడ్డారని సన్నిహితులు భావిస్తున్నారు. అమీన్ పూర్ సీఐ వెల్లడించిన వివరాల ప్రకారం.. "రచనారెడ్డి ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని ప్రాథమికంగా అంచనాకు వచ్చాం. ఆమె కారులో కొన్ని ఇంజెక్షన్లు స్వాధీనం చేసుకున్నాం. ఆమెకు ఎంగేజ్మెంట్ జరిగింది. ఈ మార్చిలో వివాహానికి పెద్దలు నిర్ణయించారు. ఎంగేజ్మెంట్ జరిగిన యువకుడితో ఆమెకు మనస్పర్థలు వచ్చినట్లు కొందరు చెబుతున్నారు. అయితే ఆత్మహత్యకు గల కచ్చితమైన కారణం ఎఫ్ఎస్ఎల్(FSL)లోనే తేలుతుంది" అని చెప్పారు. మరోవైపు ఆమె సోదరుడు మీడియాతో మాట్లాడుతూ.. ‘‘మా చెల్లి గత కొంతకాలంగా డిప్రెషన్లో ఉంది. చాలాసార్లు నచ్చజెప్పాం. మా పేరెంట్స్ కూడా కౌన్సిలింగ్ ఇచ్చారని" తెలిపారు. జరిగింది ఇది.. ఖమ్మం మమతా కాలేజీలో పీజీ చదువుతున్న రచనా రెడ్డి (25).. ప్రస్తుతం బాచుపల్లిలోని మమతా కాలేజీలో ఇంటర్న్‌షిప్ చేస్తోంది. ఆమె కుటుంబ సభ్యులు హైదరాబాద్ BHELలోని HIGలో ఉంటున్నారు. అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కిష్టారెడ్డిపేట్ ORR రింగ్ రోడ్డుపై కారులో రచనా అపస్మారక స్థితిలో ఉండటాన్ని సోమవారం స్థానికులు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించగా.... ఘటనా స్థలికి చేరుకుని ఆమెను ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మెడికో రచనా రెడ్డి తుది శ్వాస విడిచింది. పాయిజన్ ఇంజక్షన్ తీసుకొని ఆమె సూసైడ్‌కు పాల్పడిందని అక్కడ లభించిన ఆధారాలను బట్టి ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. -
సంగారెడ్డిలో మెడికో అనుమానాస్పద మృతి
సాక్షి, సంగారెడ్డి: మెడికో అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. కృష్ణారెడ్డి పేట్ ఓఆర్ఆర్ దగ్గర కారులో ఆపస్మారక స్థితిలో ఉన్న మెడికో రచనా రెడ్డి(25)ని పోలీసులు ఆసుపత్రికి తరలించేలోగా మృతిచెందింది. మత్తు ఇంజక్షన్ తీసుకుని ఆపస్మారక స్థితిలోకి వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. ఖమ్మం మమతా కాలేజీలో పీజీ చదువుతున్న రచనా రెడ్డి.. ప్రస్తుతం బాచుపల్లి మమతా కాలేజీలో ఇంటర్న్‌షిప్ చేస్తోంది. ఆమె మృతిపై అమీన్పూర్ పోలీసులు విచారణ చేపట్టారు -
TS: గద్దర్ విగ్రహ ఏర్పాటుకు లైన్ క్లియర్
సాక్షి, సంగారెడ్డి: తెలంగాణ ఉద్యమ గొంతుక.. ప్రజాయుద్ధ నౌక గద్దర్ విగ్రహ ఏర్పాటుకు లైన్ క్లియర్ అయ్యింది. తెల్లపూర్ మున్సిపాలిటీ పరిధిలో విగ్రహ ఏర్పాటు కోసం జాగా కేటాయిస్తూ మంగళవారం ఉత్తర్వులు వెలువడ్డాయి. గత కొన్ని రోజుల క్రితం సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్‌లో గద్దర్ విగ్రహం ఏర్పాటు చేయాలని అఖిలపక్ష నాయకులు డిమాండ్ చేశారు. ఆ వెంటనే గద్దర్ విగ్రహం ఏర్పాటు కోసం తెల్లాపూర్ మున్సిపాలిటీ ఒక తీర్మానాన్ని చేసింది. దానికి హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథార్టీ(HMDA) ఆమోదించింది. ఈ క్రమంలోనే అవసరమైన స్థలాన్ని కేటాయించింది తెలంగాణ ప్రభుత్వం. విగ్రహ ఏర్పాటు కావల్సిన స్థలం హెచ్ఎండీఏ పరిధిలోకి రావటంతో అనుమతులకు కొంత జాప్యం జరిగినట్లు తెలుస్తోంది. అయితే ఎట్టకేలకు గద్దర్ విగ్రహ ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం స్థలం కేటాయించటం పట్ల గద్దర్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. -
కూలిన చర్చి స్లాబ్.. నలుగురి పరిస్థితి విషమం
సాక్షి, సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లాలో ప్రమాదం చోటు చేసుకుందంది. కోహీర్‌లో నిర్మాణంలో ఉన్న ఓ చర్చి కూలిపోయింది. మెథడిస్ట్ చర్చికి స్లాబ్ వేస్తుండగా ఒక్కసారిగా స్లాబ్ చెక్కలు కూలి పోయాయి. ఈ ఘటనలో ఎనిమిది మంది కూలీలకు తీవ్ర గాయాలు అయ్యాయి. శిధిలల్లో మరో నలుగురు కూలీలు చిక్కుకున్నారు. ఘటన స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. నలుగురు కూలీల పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. గాయపడిన క్షతగాత్రులను సంగారెడ్డిజిల్లా ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులు ఉత్తరప్రదేశ్‌కు చెందిన వారిగా సమాచారం. చదవండి: సురేందర్ కిడ్నాప్ కేసు డీసీపి శ్రీనివాస్ రావు కీలక వ్యాఖ్యలు -
రేణుశ్రీ ఆత్మహత్యకు ముందు ఎవరితో ఫోన్లో మాట్లాడింది..
సంగారెడ్డి: రుద్రారంలోని గీతం వర్సిటీలో బీటెక్ విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడటం కలకలం రేపింది. శుక్రవారం సాయంత్రం వర్సిటీ ఐదో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడటం విద్యార్థిలోకాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. నగరంలోని కూకట్పల్లి– శంషీగూడలోని శిల్పా బృందావన్ కాలనీకి చెందిన రాహుల్, లక్ష్మీసరస్వతీల కూతురు రేణుశ్రీ గీతం విశ్వవిద్యాలయంలో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతోంది. మధ్యాహ్నం మూడున్నర గంటల సమయంలో వర్సిటీ ఐదో అంతస్తుపైకి వెళ్లి ఫోన్లో మాట్లాడి అనంతరం ఆత్మహత్యకు పాల్పడింది. మూడు నెలల క్రితమే ఇంజనీరింగ్ కళాశాలలో చేరిన ఆమె గురించి వివరాలు ఎవరికీ సరిగ్గా తెలియవు. కళాశాలకు సక్రమంగా వెళ్లేదికాదని తోటి విద్యార్థులు చెబుతున్నారు. ఇటీవల రేణుశ్రీని తండ్రి రాహుల్ కలిశారని, క్లాస్‌లకు రెగ్యులర్‌గా వెళ్లాలని మందలించినట్లు సమాచారం. విద్యార్థి ఆత్మహత్యకు తండ్రి మందలింపా.. ప్రేమ వ్యవహారం కారణమా అనే కోణంలో పోలీసుల దర్యాప్తు చేస్తున్నారు. ఆమె మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులు బోరున విలపించారు. ఆమె బలవన్మరణానికి గల కారణాలను పోలీసులు అనేక కోణాల నుంచి దర్యాప్తు చేస్తున్నారు. తన సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఆత్మహత్యకు ముందు ఎవరితో ఫోన్లో మాట్లాడిందోనని ఆరా తీస్తున్నారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని, త్వరలో వివరాలు వెల్లడిస్తామని డీఎస్పీ పురుషోత్తం రెడ్డి చెప్పారు. కాగా, రేణుశ్రీ ఆత్మహత్యపై తల్లిదండ్రులు కాకుండా ఆమె బంధువు పోలీసులకు ఫిర్యాదు చేయడం గమనార్హం. కేసు దర్యాప్తులోఉంది. -
గీతం యూనివర్సిటీలో బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య
-
సంగారెడ్డి: గీతం యూనివర్సిటీలో బీటెక్ విద్యార్థి ఆత్మహత్య
సాక్షి, సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. పటాన్చెరు మండలం రుద్రారంలోని గీతం విశ్వవిద్యాలయంలో బీటెక్ విద్యార్ధిని ఆత్మహత్య చేసుకుంది. యూనివర్సిటీ భవనం అయిదవ అంతస్తు నుంచి దూకి రేణు శ్రీ(18) అనే యువతి శుక్రవారం బలవన్మరణానికి పాల్పడింది. యూనివర్సిటీలో చేరిన మూడు నెలల్లోనే విద్యార్థిని ఆత్మ హత్య చేసుకోడానికి గల కారణాలు తెలియల్సి ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పటాన్చెరు ఏరియా ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కాగా రేణు శ్రీ కుటుంబం మాదాపూర్‌లో నివసిస్తోంది. కూతురు ఆత్మహత్య విషయం తెలుసుకొని హుటాహుటిన ఆసుపత్రికి చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపించారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. విద్యార్ధిని ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణల విచారిస్తున్నారు. యువతి ఆత్మహత్య చేసుకుంటుండగా తోటి విద్యార్ధులు వీడియో తీయగా.. వారిని కూడా పోలీసులు విచారిస్తున్నారు. గీతం యూనివర్సిటీ విద్యార్థిని ఆత్మహత్య సంగారెడ్డి జిల్లా రుద్రారంలోని గీతం యూనివర్సిటీలో బీటెక్ ఫస్టియర్ చదువుతున్న రేణుశ్రీ అనే యువతి బిల్డింగ్ 6వ అంతస్తు పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. pic.twitter.com/mqA7ChvkBn— Telugu Scribe (@TeluguScribe) January 5, 2024 Video Credits: Telugu Scribe చదవండి: TS: గుండెపోటుతో టెన్త్ విద్యార్థి మృతి -
అత్తను హత్య చేసి... అడ్డువచ్చిన భార్యపై..
సాక్షి, సంగారెడ్డి: సంగారెడ్డిలో దారుణం చోటుచేసుకుంది. ఓ వ్యక్తి అత్తను హత్య చేసి అడ్డుపడ్డ భార్య గొంతు కోశాడు. ఈ ఘటన సంగారెడ్డిలోని పటాన్చెరు మండలం ఇస్నాపూర్ పద్మారావు కాలనీలోని ఓ ఇంట్లో జరిగింది. రుద్రారంకు చెందిన సాయిబాబా.. తన భార్య సత్యవతిని సంసారానికి రాకుండా అత్త శాంతమ్మ అడ్డుపడుతోందని కోపం పెంచుకున్నాడు. ఈ క్రమంలో బుధవారం అత్త శాంతమ్మ(40) ఇంటికి వచ్చి ఆమెను కత్తితో పొడిచి హత్య చేశాడు. శాంతమ్మపై దాడి చేస్తున్న సమయంలో సాయబాబాను భార్య సత్యవతి అడ్డుకుంది. మరింత కోపంతో సాయిబాబా తన భార్య గొంతు కోసి అక్కడి నుంచి పరారయ్యాడు. భార్య గొంతు కోయడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిన సత్యవతిని చికిత్స కోసం స్థానికులు సంగారెడ్డి ఆసుపత్రికి తరలించారు. పటాన్చెరు పోలీస్‌స్టేషన్‌కు వచ్చి నిందితుడు సాయిబాబా లొంగిపోయియాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. చదవండి: జూబ్లీహిల్స్‌లో కి‘లేడీ’: లిఫ్ట్ అడిగి, బట్టలు చించుకుని కేకలేస్తూ.. -
దురదృష్టవశాత్తు అధికారం కోల్పోయాం: హరీశ్ రావు
సంగారెడ్డి: దురదృష్టవశాత్తు మనం అధికారం కోల్పోయాం.. బీఆర్ఎస్ ఒడిదొడుకులు కొత్త కాదని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. సంగారెడ్డిలో నిర్వహించిన బీఆర్ఎస్ కృతజ్ఞత సభలో హరీశ్‌రావు మాట్లాడారు. పరీక్ష ఫెయిల్ అయిన తర్వాత విద్యార్థి కుంగిపోతే ఇంకో పరీక్ష పాస్ కాలేడని అన్నారు. రానున్న రోజుల్లో స్థానిక, పార్లమెంట్ ఎన్నికల రూపంలో పరీక్షలు రాబోతున్నాయని తెలిపారు. వచ్చే ఎన్నికలు ఎదుర్కోవడానికి పకడ్భంధీ కార్యాచరణతో ముందుకు పోదామని చెప్పారు. కేసీఆర్ పాలనలో తెలంగాణ ఎన్నో విజయాలు సాధించిందని అన్నారు. వాళ్లు మనకన్నా బాగా పాలిస్తారని ప్రజలు అవకాశమిచ్చారని తెలిపారు. దుష్ప్రచారం కూడా కొంతపై చేయి సాధించిందని తెలిపారు. కేవలం 2 శాతం ఓట్లతో అధికారం కోల్పోయామని, బీఆర్ఎస్ ఎపుడూ తెలంగాణ ప్రజల పక్షమేమని స్పష్టం చేశారు. తెలంగాణ తెచ్చిన పార్టీ బీఆర్ఎస్ అని గెలిచినప్పుడు పొంగి పోలేదు.. ఓటమితో కుంగి పోలేదని తెలిపారు. కొత్త ప్రభుత్వానికి కొంత టైం ఇద్దామని, వాళ్ళిచ్చిన హామీల అమలులో విఫలం అయితే ప్రజా గొంతుక అవుదామని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మన నైతిక స్థైర్యాన్ని దెబ్బ తీసేందుకు కొందరు ప్రయత్నిస్తుంటారని, మనం ధైర్యం కోల్పోవద్దని ఏమైనా లోపాలు ఉంటే సమీక్షించుకుందామని అన్నారు. మనకు పోరాటాలు కొత్త కాదని,భవిష్యత్ మనదేనని అన్నారు. కేసీఆర్ దమ్మున్న నాయకుడు కనుకే తెలంగాణ వచ్చిందని తెలిపారు.సంగారెడ్డి కార్యకర్తల గురించి ఎంత చెప్పినా తక్కువేనని, కార్యకర్తలకే సంగారెడ్డి విజయం అంకితం చేస్తున్నానని తెలిపారు. -
అనుమానాస్పద స్థితిలో భార్య మృతి! భర్తే ఇలా చేశాడని..
సాక్షి, మెదక్: అనుమానాస్పద స్థితిలో భార్య మృతి చెందగా భర్తే ఆమెను హత్య చేశాడని ఆరోపిస్తూ బాధితురాలి బంధువులు ఆందోళనకు దిగారు. ఈ ఘటన మిరుదొడ్డిలో శనివారం జరిగింది. మహిళ బంధువులు గ్రామస్తులు తెలిపిన కథనం ప్రకారం.. మిరుదొడ్డికి చెందిన కమలాకర్‌తో వర్గల్ మండలం గుంటి పల్లి గ్రామానికి చెందిన పద్మ(22)కు రెండేళ్ల క్రితం వివాహం జరిగింది. కొన్నాళ్లకు వారి మధ్య కలహాలు నెలకొనడంతో రెండు, మూడు సార్లు పెద్దలు నచ్చజెప్పారు. ఇటీవల అదనపు కట్నం తీసుకురావాలని భార్య పద్మను కమలాకర్ వేదించడంతో రెండు రోజులుగా వారి మధ్య గొడవలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. ఈ క్రమంలో శనివారం తెల్లవారు జామున పద్మ ఇంట్లోనే అనుమానాస్పదంగా మృతి చెందింది. దీంతో ఆమె భర్తతో పాటు అత్తమాములు ఇంటి నుంచి పరారయ్యారు. విషయం తెలుసుకున్న పద్మ తల్లిదండ్రులు, బంధువులు ఆందోళనకు దిగారు. కమలాకర్ని శిక్షించాలని డిమాండ్ చేశారు. సమాచారం తెలుసుకున్న గజ్వేల్ ఏసీపీ ఎం.రమేశ్, సిద్దిపేట రూరల్ సీఐ చేరాల్ తమ సిబ్బందితో అక్కడికి చేరుకుని క్లూస్ టీంతో పరిశీలించారు. ఆందోళనకు దిగిన పద్మ బంధువులకు పోలీసులు నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులకు వారికి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. నిందితులను కఠినంగా శిక్షిస్తామని పోలీసులు హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు. పద్మ తండ్రి దుల్లయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు గజ్వేల్ ఏసీపీ ఎం. రమేశ్ తెలిపారు. ఇవి కూడా చదవండి: లిఫ్ట్ లేదన్నది గమనించకుండా అడుగుపెట్టడంతో.. తీవ్ర విషాదం! -
సంగారెడ్డి జిల్లాలో అగ్ని ప్రమాదం
-
సంగారెడ్డి బీజేపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత
-
సంగారెడ్డి: పటాన్చెరు నామినేషన్ కేంద్రం వద్ద ఉద్రిక్తత
-
బీజేపీలో ‘బీఫామ్’ మంటలు.. సంగారెడ్డిలో ఉద్రిక్తత
-
బీజేపీలో ‘బీఫామ్’ మంటలు.. సంగారెడ్డిలో ఉద్రిక్తత
సాక్షి, సంగారెడ్డి: సంగారెడ్డి బీజేపీలో ఆగ్రహ జ్వాలలు ఎగసిపడుతున్నాయి. బీఫామ్‌లు మంటలు రేపుతున్నాయి. అభ్యర్థుల జాబితాలో పేర్లు ఉండి బీఫామ్ మరొకరికి ఇవ్వడంతో తీవ్రస్థాయిలో ఆగ్రహం, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బీజేపీ నేతలు. సంగారెడ్డి రిటర్నింగ్ కార్యాలయం దగ్గర ఉద్రిక్తత చోటుచేసుకుంది. టికెట్ ఇచ్చి బీఫామ్ ఇవ్వలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆర్వో కార్యాలయం ముందు బీజేపీ నేత రాజేశ్వర్‌రావు దేశ్‌పాండే నిరసన తెలిపారు. బీఫామ్ ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటానంటూ దేశ్‌పాండే ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, సంగారెడ్డి బీఫామ్‌ను పులిమామిడి రాజుకు బీజేపీ అధిష్టానం బీఫామ్ అందించింది. కాగా, వేములవాడ బీజేపీ అభ్యర్థిగా చెన్నమనేని వికాస్‌రావుకు చివరి క్షణంలో బీజేపీ అధిష్టానం బీఫామ్ అందించింది. ఇప్పటికే తుల ఉమ నామినేషన్ దాఖలు చేయగా, వికాష్‌రావు తరపున ఆయన అనుచరులు నామినేషన్ వేశారు. -
సంగారెడ్డిలోని గంజి మైదానంలో జరిగిన కాంగ్రెస్ విజయభేరి బహిరంగ సభ (ఫొటోలు)
-
సంగారెడ్డి: గుండెపోటుతో 12 ఏళ్ల బాలుడి మృతి
సాక్షి, సంగారెడ్డి: చిన్నవయసులోనే గుండెపోటుతో కన్నుమూస్తున్న వరుస ఘటనలు చూస్తున్నాం. తాజాగా సంగారెడ్డిలోనూ అలాంటి విషాద ఘటనే నెలకొంది. 12 ఏళ్ల బాలుడు నిద్రలోనే గుండెపోటుతో కన్నుమూసిన ఘటన స్థానికులతో కంటతడి పెట్టిస్తోంది. కంగ్టి మండలం తడ్కల్‌కు చెందిన ఖలీల్(12) ఒంట్లో బాగోలేదని తల్లిదండ్రులకు చెప్పాడు. గతరాత్రి నిద్రలో అపస్మారక స్థితికి గురయ్యాడు. వెంటనే కుటుంబ సభ్యులు అతన్ని ఆస్పత్రికి తరలించారు. అయితే మార్గం మధ్యలోనే అతను కన్నుమూశాడు. ఖలీల్‌ను పరిశీలించిన వైద్యులు గుండెపోటుతోనే కన్నుమూసినట్లు ధృవీకరించారు. దీంతో ఆ తల్లిదండ్రులు గుండెలు పగిలేలా రోదిస్తున్నారు. నిన్నటిదాకా తమ కళ్ల ముందు ఆడిపాడిన చిన్నారి లేడనే విషయాన్ని వాడ ప్రజలు తట్టుకోలేక కంటతడి పెడుతున్నారు. -
టెట్ పరీక్షలో విషాదం.. గర్భిణి మృతి
సాక్షి, సంగారెడ్డి: టెట్ పరీక్ష రాసేందుకు వెళ్లి గర్భిణి ఎగ్జామ్ సెంటర్లో మృతి చెందిన పటాన్చెరు మండలం పరిధిలో జరిగింది. నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించరనే భయంతో.. రాధిక అనే అభ్యర్థిని పరీక్షకు త్వరగా చేరుకోవాలని ప్రయత్నించింది. గచ్చిబౌలిలో రాధిక, అరుణ్ దంపతులు నివాసముంటున్నారు. రాధిక 8 నెలల గర్భంతో ఉంది. ఇస్నాపూర్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఆమెకు సెంటర్ పడింది. బైక్ పై ప్రయాణమై ఇస్నాపూర్ కు చేరుకున్నారు. ఈ క్రమంలో పరీక్షకు ఆలస్యం అవుతుందనే ఉద్దేశంతో.. ఎగ్జామ్ సెంటర్ వద్ద ఆమె వేగంగా పరిగెత్తింది. సెంటర్‌కు చేరుకున్న వెంటనే ఆమెకు బీపీ ఎక్కువై చెమట్లు పట్టేశాయి. పరీక్ష సెంటర్లోనే కుప్పకూలి పడిపోయింది. హుటాహుటిన రాధికను పటాన్చెరు ప్రభుత్వ ఆస్పత్రికి ఆమె భర్త అరుణ్ తీసుకెళ్లారు. అయితే అప్పటికే రాధిక మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. దీంతో ఇరు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. వీరిద్దిరికి ఇదివరకే ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. -
SFI,ABVP విద్యార్థి సంఘాల మధ్య ఘర్షణ
-
సంగారెడ్డిలో అర్ధరాత్రి ఉద్రిక్తత..
సాక్షి, సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లాలో గురువారం అర్ధరాత్రి ఉద్రిక్తత చోటుచేసుకుంది. విద్యార్థి సంఘాలైన ఏబీవీపీ, ఎస్ఎఫ్ఐ సంఘాల నేతలు మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో పలువురు తీవ్రంగా గాయపడటంతో వారిని ఆసుపత్రికి తరలించారు. వివరాల ప్రకారం.. సంగారెడ్డి జిల్లాలో అర్ధరాత్రి ఉద్రిక్తత నెలకొంది. ఏబీవీపీ, ఎస్ఎఫ్ఐ సంఘాల నేతల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. అయితే, ప్లీనరీ సమావేశాలు ఉండటంతో ఎస్ఎఫ్ఐ నేతలు ఫ్లెక్సీలు కట్టారు. కాగా, ఫ్లెక్సీల విషయంలో వీరి మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. గాయపడిన వారిని ఆసుపత్రిలో చేర్పించినట్టు తెలుస్తోంది. ఇది కూడా చదవండి: విద్యార్థినుల మృతితో రెండు గ్రామాల్లో విషాదం -
‘వాళ్ల మాటలు కోటలు దాటితే, చేతలు పకోడిలా ఉంటాయి’
సాక్షి, సంగారెడ్డి: బీజేపీ వాళ్ళకు మాటలు ఎక్కువ.. చేతలు తక్కువ అని హరీష్ రావు మండిపడ్డారు. మాటలు కోటలు దాటుతాయి.. చేతలు పకోడిలా ఉంటాయని సెటైర్లు వేశారు. తెల్లపూర్ మున్సిపాలిటి పరిధిలోని కొల్లూరులో డబుల్ బెడ్ రూమ్‌ల ఇళ్ల పంపిణి కార్యక్రమం శనివారం జరిగింది. జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న నియోజకవర్గ లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను మంత్రి హరీష్ రావు, జిల్లా కలెక్టర్ శరత్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. డబుల్ బెడ్రూం ఇండ్లు తీసుకున్న వారిలో సంతోషం కనపడుతుందన్నారు. ఒక్క రూపాయి ఖర్చు లేకుండా 60 లక్షల విలువైన ఇల్లు పేదల సొంతమయ్యాయని పేర్కొన్నారు. విలువైన స్థలంలో ధనవంతులు ఉండే ప్రాంతంలో పేద ప్రజలకు ఇండ్లు ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని ప్రశంసించారు. కాంగ్రెస్, బీజేపీలు ఎప్పుడు ధర్నాలే చేస్తాయని, పనిచేయవని విమర్శించారు. హైదరాబాద్ నలుమూలలా లక్ష డబుల్ బెడ్ రూమ్‌లు ఇస్తున్నామన్నారు. ఇక్కడ ఇండ్ల వద్ద అన్ని వసతులు కల్పిస్తామని, ఆసుపత్రి, రేషన్ షాపుతో పాటు అన్ని సౌకర్యాలు అందిస్తామని తెలిపారు. ఎమ్మెల్యే రాజాసింగ్ సూచించినట్టు ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేస్తామని చెప్పారు. హిందూ, ముస్లిం, క్రిస్టియన్ ఇలా అన్ని మతాలను గౌరవించే వ్యక్తి సీఎం కేసీఆర్ అని అన్నారు. ఆలయం, చర్చ్, మసీదు కూడా ఏర్పాటు చేస్తామని, ఫంక్షన్ హాల్లు నిర్మిస్తామని పేర్కొన్నారు. చదవండి: మేడ్చల్ జిల్లాలో రాజకీయ సంద‘ఢీ’.. ప్రత్యర్థులెవరు? ‘బీఆర్ఎస్ సర్కార్ అంటే మాటలు తక్కువ పనులు ఎక్కువ. ఇప్పుడు మంచినీళ్లకు ధర్నాలు లేవు. తాగు నీరు సరఫరా మంచిగా జరుగుతుంది. బీజేపీ వాళ్ళు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎన్నో చెప్పారు. ఇల్లు పోతే ఇల్లు, బండి పొతే బండి ఇస్తామన్నారు. బండి పోతే బండి.. గుండు పోతే గుండు అన్నారు. బండి లేదు గుండు లేదు. డబుల్ ఇంజిన్ సర్కార్‌లో ఎక్కడైనా డబుల్ బెడ్ రూమ్‌లు ఇచ్చారా ? వీరిది డబుల్ ఇంజన్ కాదు ట్రబుల్ ఇంజన్ సర్కార్. విలువైన ఇంటిని జాగ్రత్తగా కాపాడుకోండి. ఇల్లు ఇచ్చిన, ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న కేసీఆర్‌ను ఆశీర్వదించండి. ఆసియా ఖండంలోనే అతిపెద్ద గేటెడ్ కమ్యునిటీగా మారనుంది’ అంటూ హరీష్ రావు వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు రాజాసింగ్, దానం నాగేందర్, ప్రకాష్ గౌడ్, మాగంటి గోపీనాథ్, మహిపాల్ రెడ్డి పాల్గొన్నారు. బీజేపీ డబుల్ ఇంజిన్ సర్కార్ రాష్ట్రాల్లో.. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఎందుకు లేవు? - మంత్రి శ్రీ @BRSHarish.#DignityHousing pic.twitter.com/Uddlkvy64E — BRS Party (@BRSparty) September 2, 2023 -
సంగారెడ్డి: బీఆర్ఎస్లో అయోమయ పరిస్థితి!
మెదక్ జిల్లాలోని 10 శాసనసభ స్థానాలలో సంగారెడ్డి శాసనసభ నియోజకవర్గం ఒకటి. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఉమ్మడి మెదక్ జిల్లాలో అత్యంత ఆసక్తిని రేపే నియోజకవర్గం ఇది. ఇక్కడి ప్రజాతీర్పు భిన్నంగా ఉంటుంది. ఇప్పటి వరకు 14 సార్లు ఎన్నికలు జరిగితే.. ఆరు సార్లు కాంగ్రెస్, నాలుగుసార్లు ఇండిపెండెంట్లు గెలిచారు. ఇక.. బీఆర్ఎస్ రెండు సార్లు, బీజేపీ, టీడీపీ ఒక్కోసారి అధికారంలోకి వచ్చాయి. మళ్లీ కాంగ్రెస్ పట్టు సాధించేనా? కాంగ్రెస్‌లో స్ట్రాంగ్ లీడర్‌గా ఉన్న తూర్పు జయప్రకాశ్ రెడ్డి(అలియాస్ జగ్గారెడ్డి) 3 సార్లు ఎమ్మెల్యేగా గెలవడం విశేషం. తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేకుండ తన సొంత క్యాడర్‌తో దూసుకుపోయాడు. 2004లో ఆయన తొలిసారి బీఆర్ఎస్ అభ్యర్థిగా విజయం పొందారు. ఆ తర్వాత 2009, 2018లో మాత్రం కాంగ్రెస్ తరఫున గెలిచారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే ముందు వరకు కాంగ్రెస్ సంగారెడ్డి అడ్డాగా ఉండేది. కానీ 2014 ఎన్నికల తర్వాత సీన్ మొత్తం మారింది. అక్కడ గులాబీ జెండ ఎగరింది. దాంతో సంగారెడ్డిలో కాంగ్రెస్ వీక్ అయ్యి బీఆర్ఎస్ బలపడినట్లు అనిపించింది. కానీ గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి జగ్గారెడ్డి గెలుపొందడంతో సంగారెడ్డిపై మళ్లీ హస్తం పట్టు సాధించింది. ఇక తాజా పరిణామాలు ప్రకారం.. ఇప్పుడు జగ్గారెడ్డి బీఆర్ఎస్లో చేరే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తుండటంతో రాబోయే సంగారెడ్డి అసెంబ్లీ ఎన్నికలు ఆసక్తిగా మారాయి. ఎప్పుడు ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో తెలిక సంగారెడ్డిలో ఉత్కంఠత నెలకొంది. నియోజకవర్గంలోని ఆసక్తికర అంశాలు : మహబూబ్ చెరువు, మంజీర డ్యామ్ రాజకీయానికి అంశాలు బీఆర్ఎస్లో అయోమయం కార్ ఓవర్ లోడ్ అధిక పోటీలో బిఆర్ఎస్ నాయకులు MLA జగ్గారెడ్డి బిఆర్ఎస్లోఇక వెళ్ళే సూచనలు ఎన్నికలను ప్రభావితం చేసే కీలక అంశాలు: రియల్ వ్యాపారం హైదరాబాద్‌కి దగ్గర ఉన్నా నియోజక వర్గంలో మౌలిక వసతుల విషయంలో పెద్దగా అభివృద్ధి లేకపోవడం రాజకీయ పార్టీల వారీగా ప్రధాన పార్టీల టికెట్ల ఆశిస్తున్నవారు బీఆర్ఎస్ చింతా ప్రభాకర్ (మాజీ ఎమ్మెల్యే) కాంగ్రెస్ జగ్గారెడ్డి బిజేపి రాజేశ్వర్ రావు దేశ్ పాండే (బిజేపి నియోజక వర్గ ఇంచార్జ్) శివరాజ్ పాటిల్ నియోజకవర్గంలో భౌగోళిక పరిస్థితులు : నదులు : మంజీర నది ఆలయాలు : వైకుంట పురం ఆలయం / ఇస్మాయిల్ ఖాన్ పేట భవానీ మాత ఆలయం -
కాంగ్రెస్‌కు షాక్.. బీఆర్ఎస్లోకి జగ్గారెడ్డి?
సాక్షి, సంగారెడ్డి: కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపుతో తెలంగాణలో కూడా హస్తం నేతలు స్పీడ్ పెంచారు. రాబోయే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ ప్లాన్ చేస్తోంది. ఈ క్రమంలో కొందరు సీనియర్లను కూడా పార్టీలోకి ఆహ్వానించింది. మరోవైపు.. కొంత మంది హస్తం నేతలు కాంగ్రెస్‌ను వీడుతున్నారు. తాజాగా కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి.. బీఆర్ఎస్లో చేరునున్నట్టు తెలుస్తోంది. కేసీఆర్ సర్కార్ వైపు జగ్గారెడ్డి మొగ్గుచూపుతున్నట్టు సమాచారం. ఇక, కొంతకాలంగా జగ్గారెడ్డి.. బీఆర్ఎస్ నేతలతో సఖ్యతగా ఉండటం విశేషం. ఇదే సమయంలో వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి జగ్గారెడ్డి సంగారెడ్డి బరిలోకి దిగే అవకాశం ఉన్నట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కాగా, పార్టీ మార్పు వార్తలు రాజకీయ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నా.. వాటిని జగ్గారెడ్డి ఖండించకపోవడం ఆసక్తికరంగా మారింది. ఇదే, పార్టీ మార్పు అంశానికి మరింత బలాన్ని చేకూర్చుతోంది. ఇదిలా ఉండగా.. కాంగ్రెస్ అధిష్టానం రేవంత్ రెడ్డిని టీపీసీసీ చీఫ్‌గా నియమించినప్పటి నుంచే జగ్గారెడ్డి సీరియస్‌గా ఉన్నారు. ఈ క్రమంలో బహిరంగంగానే తీవ్ర విమర్శలు చేశారు. ఇక, కాంగ్రెస్ హైకమాండ్‌కు కూడా పలు సందర్భాల్లో జగ్గారెడ్డి లేఖలు రాశారు. రేవంత్‌ను టీపీసీసీ చీఫ్‌గా నియమించడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇక, ఇటీవల కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న పలు కార్యక్రమాల్లో కూడా జగ్గారెడ్డి యాక్టివ్‌గా కనిపించకపోవడం గమనార్హం. ఒకానొక సమయంలో కేసీఆర్ సర్కార్ అమలు చేస్తున్న పథకాలపై కూడా జగ్గారెడ్డి సానుకూలంగా స్పందించి.. గులాబీ సర్కార్‌ను అభినందించడం విశేషం. ఇది కూడా చదవండి: కేసీఆర్ సార్ ‘మదిలో’ ఎవరు..? అందరిలోనూ హై టెన్షన్..! -
విషాదం.. కొడుకు మరణ వార్త విని తండ్రి మృతి
సాక్షి, సంగారెడ్డి: కన్న కొడుకు మరణ వార్త విన్న తండ్రి గుండెపోటుతో మృతిచెందాడు. ఈ విషాదకర ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. వీరిద్దరి మరణంతో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలోని గోంగ్లూర్ తండాకూ చెందిన బానోత్ భీమ్లా శుక్రవారం బైక్‌పై జోగిపేట్ పట్టణానికి మోటర్ రిపేర్ కోసం వెళ్లాడు. అనంతరం, ఇంటికి తిరిగి వెళ్తున్న క్రమంలో అల్మాయిపేట సబ్‌స్టేషన్ సమీపంలోకి రాగానే రోడ్డు పక్కకు బైక్ పార్క్ చేశాడు. అనంతరం 161 నాందేడ్ జాతీయ రహదారి దాటుతుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో, ఘటనా స్థలంలోనే భీమ్లా మృతిచెందాడు. ఈ ఘటన సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని జోగిపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అయితే, కొడుకు బానోత్ భీమ్లా మరణ వార్త విని అతడి తండ్రి ధర్మ నాయక్ గుండెపోటుతో మరణించాడు. ఇక, ఇద్దరి మరణంలో తండాలో విషాదం నెలకొంది. ఇది కూడా చదవండి: బైక్‌పై చోరీ కోసం వచ్చి.. ఉన్న బైక్ వదిలి పరార్.. -
తల్లిదండ్రుల కష్టం ఏమిటో అర్థం చేసుకోలేని స్థితిలోనూ! శెభాష్ బిడ్డా..
Special Olympics 2023: ‘‘కష్టాలురానీ కన్నీళ్లురానీ.. ఏమైనాగానీ ఎదురేదీరానీ.. ఓడీపోవద్దు రాజీపడొద్దు.. నిద్రే నీకొద్దు నింగే నీ హద్దు.. గెలుపు పొందె వరకు.. అలుపు లేదు మనకు’’.. కష్టాల కడలిలో కొట్టుకుపోతున్నా సానుకూల దృక్పథం వీడొద్దని, సంకల్ప బలం ఉంటే మనిషి సాధించలేనిది ఏదీ ఉండదంటూ స్ఫూర్తిని రగిల్చాడో సినీకవి. నిరాశలో కూరుకుపోయిన వారిని తట్టిలేపి గమ్యం వైపు పరుగులు తీయమని చాటిచెప్పే ఈ పాటలోని ప్రతీ వాక్యం రిషితకు సరిగ్గా సరిపోతుంది. వైకల్యం కేవలం శరీరానికి మాత్రమే కానీ ఆత్మవిశ్వాసానికి కాదని నిరూపించిన ఈ బంగారు తల్లిది సంగారెడ్డి. అమ్మ కడుపులో ఉండగానే అమ్మ కడుపులో ఉండగానే కవల సోదరుడిని పోగొట్టుకుని.. డౌన్ సిండ్రోమ్ బారిన పడ్డ రిషితను కంటికి రెప్పలా కాపాడుకున్నారు తల్లిదండ్రులు. గుండెకు రంధ్రంతో పాటు వైకల్యంతో జన్మించిన తమ చిన్నారిని చూసి జాలి పడ్డవారే.. శెభాష్ బిడ్డా అని అభినందించే స్థాయికి తీసుకువచ్చారు. అమ్మానాన్నలు తనకోసం పడుతున్న కష్టాన్ని పూర్తిగా అర్థం చేసుకోలేని స్థితిలో ఉన్నప్పటికీ వారితో పాటు దేశం మొత్తం గర్వపడేలా చేసింది రిషిత. బెర్లిన్‌లో జరిగిన స్పెషల్ ఒలంపిక్స్‌లో రజత పతకాలు సాధించి దేశ ఖ్యాతిని ఇనుమడింపజేసింది. అసాధారణ ప్రతిభతో రోలర్ స్కేటింగ్‌లో సత్తా చాటి మెడల్స్‌తో తిరిగి వచ్చింది. ఇబ్బందులు ఉన్నా బీహెచ్ఈఎల్కు చెందిన ప్రశాంత్‌రెడ్డి- మాధవి దంపతులు తమకు కవలలు పుట్టబోతున్నారన్న వైద్యుల మాట విని ఎంతగానో మురిసిపోయారు. ఇద్దరు పిల్లల ఆలనాపాలనా, బంగారు భవిష్యత్తు గురించి ఎన్నెన్నో కలలు కన్నారు. కానీ విధిరాత మరోలా ఉంది. గర్భంలో ఉండగానే పిల్లాడు చనిపోయాడు.. ఆ ప్రభావం అతడి కవల సోదరి రిషితపై కూడా పడింది. డౌన్‌సిండ్రోమ్ బారిన పడిందామె. పైగా పుట్టిన తొమ్మిది నెలల తర్వాత రిషిత గుండెలో రంధ్రం ఉందన్న భయంకర నిజం తల్లిదండ్రులకు తెలిసింది. గుండె నిబ్బరంతో కడుపులో ఉండగానే ఓ బిడ్డను పోగొట్టుకుని.. భూమ్మీదకు వచ్చిన పాపాయి కూడా ఎంతకాలం బతుకుందో తెలియని పరిస్థితిలోనూ ప్రశాంత్‌రెడ్డి- మాధవి గుండె నిబ్బరం కోల్పోలేదు. తాము ఊపిరి పోసిన ప్రాణాన్ని నిలబెట్టుకునేందుకు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సరే వెనుకడుగు వేయలేదు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే కావడంతో స్వచ్ఛంద సంస్థను ఆశ్రయించి.. వారి సాయంతో పాపకు చికిత్స చేయించారు. అందరిలా కాకుండా మరింత ప్రత్యేకంగా ఉన్న తమ బుజ్జాయిని స్పెషల్ కేర్ స్కూళ్లో చేర్పించారు. ఆత్మవిశ్వాసం సడలనివ్వకుండా అక్కడే రిషిత జీవితం మలుపు తిరిగింది. ఆమెలో నిగూఢంగా దాగి ఉన్న ప్రతిభను ట్రైనర్ గుర్తించాడు. దీంతో రోలర్ స్కేటింగ్‌లో ఆమెకు ప్రత్యేక శిక్షణ ఇప్పించారు తల్లిదండ్రులు. అంతేకాదు రిషితలో ఆత్మవిశ్వాసం పెంపొందేలా వివిధ నగరాల్లో జరిగిన పోటీలకు సైతం తీసుకువెళ్లేవారు. అలా ఒక్కో అడుగు వేస్తూ రిషిత స్పెషల్ ఒలంపిక్స్‌కు అర్హత సాధించింది. ఆమె టాలెంట్‌ను గుర్తించిన స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కూడా మద్దతుగా నిలిచింది. తల్లిదండ్రులు, కోచ్ ఇచ్చిన ప్రోత్సాహంతో రిషిత అంచెలంచెలుగా ఎదిగింది. తప్పకుండా ఒలంపిక్స్‌లో మెడల్ సాధిస్తుందన్న వారి నమ్మకాన్ని నిలబెడుతూ స్పెషల్ ఒలంపిక్స్‌లో భారత్‌కు పతకాలు అందించింది. నిజంగా స్ఫూర్తిదాయకం చిన్న చిన్న మనస్పర్థలు, గొడవలకే విడిపోయే దంపతులు ఉన్న ఈ సమాజంలో సంతానం విషయంలో ఎంతటి కష్టం వచ్చినా తట్టుకుని నిలబడ్డ ప్రశాంత్‌రెడ్డి- మాధవి నిజంగా ఈతరం జంటలకు ఆదర్శనీయం. పదహారేళ్లుగా బిడ్డను పసిపాపలా సాకుతూ ఆమెను ఈ స్థాయికి చేర్చిన వారిద్దరికీ హ్యాట్సాఫ్! అదే విధంగా.. వైకల్యాన్ని జయించి తల్లిదండ్రులను సగర్వంగా తలెత్తుకునేలా చేసిన రిషితకు అభినందనలు!! 190 దేశాల నుంచి వచ్చిన అథ్లెట్ల నుంచి పోటీని తట్టుకుని గెలుపొందిన ఆమెకు జేజేలు!! ప్రభుత్వం రిషిత లాంటి స్పెషల్ కిడ్స్‌కు చిన్నప్పటి నుంచే అండగా నిలిస్తే అమ్మానాన్నలతో పాటు ఆ పిల్లలకు కూడా ఎంతో ప్రోత్సాహకరంగా ఉంటుందని రిషిత తల్లిదండ్రులు అంటున్నారు. నిజమే కదా!! ఏమిటీ స్పెషల్ ఒలంపిక్స్? శారీరక, మానసిక వైకల్యంతో బాధపడుతున్న అథ్లెట్ల కోసం ప్రత్యేకంగా 1968లో స్పెషల్ ఒలంపిక్స్ ఆరంభించారు. ఇందులో ప్రపంచవ్యాప్తంగా ఉన్న అథ్లెట్లు 32 క్రీడా విభాగాల్లో పోటీపడతారు. అథ్లెటిక్స్, సైక్లింగ్, పవర్‌లిఫ్టింగ్, రోలర్‌స్కేటింగ్, స్విమ్మింగ్ ఇలా వివిధ క్రీడల్లో పోటీలు నిర్వహిస్తారు. -సుష్మారెడ్డి యాళ్ల చదవండి: సిక్సర్ల రింకూ.. ఎక్కడా తగ్గేదేలే! వీడియోతో సెలక్టర్లకు దిమ్మతిరిగేలా! -
జోగిపేట ఆక్స్ఫర్డ్ స్కూల్‌పై కేసు నమోదు.. కారణం ఇదే..
సాక్షి, సంగారెడ్డి: జోగిపేటలోని ఆక్స్ఫర్డ్ స్కూల్‌పై కేసు నమోదు అయ్యింది. ఆక్స్ఫర్డ్ పాఠశాలలో అధిక ఫీజులు, బుక్స్ విక్రయిస్తున్నారని డీఈవోకు ఫిర్యాదు అందింది. ఈ మేరకు విద్యార్థి సంఘాలు డీఈవోకు ఫిర్యాదు చేశాయి. ఈ నేపథ్యంలో డీఈవో ఆదేశాలలో ఎంఈవో కృష్ణ ఆక్స్ఫర్డ్ స్కూల్లో తనిఖీలు చేపట్టారు. అయితే, స్కూల్‌ను తనిఖీ చేయడానికి వచ్చిన ఎంఈవోతో పాఠశాల సిబ్బంది దురుసుగా ప్రవర్తించారు. ఈ క్రమంలో స్కూల్ నిర్వాహకుడు వేణుపై ఎంఈవో జోగిపేట పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో, పోలీసులు కేసు నమోదు చేసినట్టు తెలిపారు. ఇది కూడా చదవండి: బీఆర్ఎస్లో సీట్ల కేటాయింపుపై సస్పెన్స్.. ఆ 70 మంది పరిస్థితేంటి? -
డబుల్ బెడ్రూమ్ టౌన్షిప్ ప్రారంభించిన కేసీఆర్.. స్పెషల్ ఇదే..
సాక్షి, సంగారెడ్డి: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సంగారెడ్డి జిల్లా పర్యటనలో ఉన్నారు. ఈ పర్యటనలో భాగంగా కొల్లూరులో కేసీఆర్ నగర్ పేరుతో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ టౌన్‌షిప్‌ను సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆరుగురు లబ్ధిదారులకు ఇండ్ల పట్టాలను అందజేశారు. అంతకుముందు డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణానికి సంబంధించిన ఫొటో ఎగ్జిబిషన్‌ను సందర్శించారు. కాగా, సుమారు 60 వేల మంది ఆవాసం ఉండేలా ఒకేచోట ఏకంగా 15,660 ఇండ్ల నిర్మాణాన్ని తెలంగాణ సర్కారు చేపట్టింది. నిరుపేదల కోసం సకల సౌకర్యాలతో కొల్లూరులో ఈ ఆదర్శ టౌన్‌షిప్‌ను నిర్మించింది. నాణ్యతలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా కార్పొరేట్ హంగులతో పేదల కోసం కలల సౌధాలను నిర్మించింది. రూ.1,489.29 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ భారీ ప్రాజెక్టులో కార్పొరేట్ అపార్ట్మెంట్లకు తీసిపోకుండా సకల హంగులతో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మించారు. ఈ టౌన్షిప్లో 145 ఎకరాల విస్తీర్ణంలో 1432.50 కోట్ల రూపాయల వ్యయంతో ఒకే చోట 15,600 ఇళ్ల నిర్మాణం జరిగింది. సుమారు 60 వేల మంది ఆవాసం ఉండేలా డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మించారు. G+9 నుంచి G+10, G+11 అంతస్తుల వరకు టౌన్షిప్ నిర్మాణం జరిగింది. మొత్తం 117 బ్లాక్‌లు, బ్లాక్‌కి 2 లిఫ్ట్‌ల చొప్పున మొత్తం 234 లిఫ్ట్‌లను ఏర్పాటు చేశారు. టౌన్షిప్లో మురుగునీటి శుద్ధి ప్లాంట్, స్కూల్స్, 118 వాణిజ్య దుకాణాల నిర్మాణం జరిగింది. ఇది కూడా చదవండి: తెలంగాణ బీజేపీలో ఏం జరుగుతోంది.. వారి మౌనం వెనుక కారణం? -
సంగారెడ్డి జిల్లా కొల్లూరు డబుల్ బెడ్ రూం ఇండ్ల విశేషాలు
-
సంగారెడ్డి జిల్లా అమిన్ పురలో భారీ సైబర్ మోసం
-
సంగారెడ్డి: అత్తామామల హత్యకు అల్లుడి షాకింగ్ స్కెచ్
సాక్షి, సంగారెడ్డి: చిన్న చిన్న విషయాలే.. ఒక్కోసారి తీవ్ర నిర్ణయాలు తీసుకునేలా ఉసిగొల్పుతాయి. అలా ఓ అల్లుడు ఏకంగా తనకు పిల్లనిచ్చిన అత్తామామల్ని చంపేయాలని ప్లాన్ వేశాడు. అది మామూలు స్కెచ్‌తో కాదు.. షాకింగ్ స్కెచ్‌తో!. చివరకు ఆ కుట్ర బయటపడడం, అందుకు కారణం ఏంటో తెలిసి పోలీసులతో పాటు స్థానికులు షాక్ తినడం ఒకదాని వెంట మరొకటి జరిగాయి. అత్తమామల హత్యకు షాకింగ్ స్కెచ్ వేసిన ఓ అల్లుడు కటకటాల పాలయ్యాడు. రమేష్ అనే వ్యక్తి తన భార్య తల్లిదండ్రుల్ని చంపడానికి ప్లాన్ వేశాడు. ఇందులో భాగంగా.. ఈ నెల 12వ తేదీన ఇంటి తలుపులకు కరెంట్ షాక్ పెట్టాడు. అయితే రమేష్ అనుకున్నట్లు జరగలేదు. అత్తామామలకు బదులుగా.. తల్లీకూతుళ్లు ఆ తలుపును తాకడంతో షాక్‌కి గురయ్యారు. కరెంట్ షాక్‌తో విలవిలలాడుతూ.. వాళ్లు వేసిన కేకలకు స్థానికులు అప్రమత్తం అయ్యారు. వెంటనే కరెంట్ ఆఫ్ చేయడంతో ప్రాణాపాయం తప్పింది. ఇక ఈ ఘటనపై బాధిత కుటుంబం పోలీసులను ఆశ్రయించగా.. విచారణలో తాజాగా అల్లుడు రమేష్ కుట్రదారుడని తేలింది. ఇంతకీ ఎందుకు చంపాలని ప్రయత్నించాడో తెలుసా?.. గతంలో ఓసారి ఇంటికి వెళ్లినప్పుడు ఆ అత్తామామలు, అల్లుడు రమేష్‌ను మందలించలేదనట. పలకరించలేదన్న ఆ కోపంతో అప్పటి నుంచి రగిలిపోతున్న రమేష్.. ఎలాగైనా వాళ్లను చంపేయాలని అనుకున్నాడట. చివరకు కరెంట్‌షాక్‌తో యత్నిస్తే తన మీదకు రాదని అలా చేశానని రమేష్ వెల్లడించడం గమనార్హం. ప్రస్తుతం ఆ అల్లుడిని అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు పోలీసులు. ఇదీ చదవండి: మంచిర్యాలలో దారుణం.. ఊరంతా చూస్తుండగానే.. -
‘అల్లం’ రైతుల్లో ఆనందం.. ఐదు రెట్లు పెరిగిన ధర..
సాక్షి, సంగారెడ్డి: గత ఏడాదితో పోలిస్తే అల్లం ధర ఒక్కసారిగా ఐదు రెట్లు పెరిగింది. దీంతో రైతులు సంతోషం వ్యక్తంచేస్తున్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ప్రాంతంలో రైతులు ఏటా అల్లం పంటను సంప్రదాయక పంటగా సాగుచేస్తూ వస్తున్నారు. ఐదేళ్లుగా క్వింటాలు అల్లం ధర రూ.2 వేల నుంచి రూ.2,500 మాత్రమే పలుకుతూ వచి్చంది. కానీ ప్రస్తుతం మార్కెట్లో రూ.8 వేలకు పైగా ధర పలుకుతోంది. దీంతో పంటను సాగు చేస్తున్న రైతులు ఆనందంగా ఉన్నారు. ఐదేళ్లుగా మార్కెట్లో అల్లం పంటకు సరైన ధర లేక పోవడంతో దేశవ్యాప్తంగా సాగువిస్తీర్ణం భారీగా పడిపోయింది. అంతే కాకుండా గత ఏడాది అధికంగా వర్షాలు పడటంతో సాగులో ఉన్న పంట సగానికి పైగా దెబ్బతిన్నది. ఈ నేపథ్యంలో పంటను కాపాడుకున్న రైతులకు కాసుల వర్షం కురుస్తోంది. అనేక మంది రైతులు గత ఏడాది క్రితమే ధర లేని కారణంగా అల్లం సాగుకు స్వస్తి చెప్పారు. సంగారెడ్డి జిల్లాలో ప్రస్తుతం 1,500 ఎకరాల్లో పంట సాగులో ఉన్నట్టు అంచనా. ఇందులో జహీరాబాద్ ప్రాంతంలోనే 90 శాతం సాగవుతోందని రైతులు చెపుతున్నారు. ఈ ఏడాది మళ్లీ పంట సాగుపై ఆసక్తి ప్రస్తుతం అల్లం పంటకు మార్కెట్లో మంచి ధర లభిస్తుండటంతో ఈ ఏడాది అల్లం పంటను సాగు చేసేందుకు రైతులు ఆసక్తి చూపుతున్నారు. మే నెల నుంచి జూన్ చివరి వరకు రైతులు అల్లం పంటను సాగు చేస్తారు. ఎకరం పంట సాగుకు సుమారు 1.50 లక్షల మేర పెట్టుబడి వ్యయం అవుతుంది. మార్కెట్లో ధర ఉంటేనే గిట్టుబాటవుతుంది. లేకపోతే పెట్టుబడులు కూడా రాని పరిస్థితి ఏర్పడుతుంది. కాగా, అల్లం పంట సాగుకు కేరళ రాష్ట్రం ప్రతీతి. ఈ ఏడాది అక్కడ కూడా భారీగానే పంట సాగుకు రైతులు సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది. సంగారెడ్డి జిల్లాలో మాత్రం ఈ ఏడాది 3 వేల ఎకరాలకు పైగా పంట సాగయ్యే అవకాశం ఉందని వ్యవసాయరంగ నిపుణులు చెపుతున్నారు. పంట ఉన్న రైతులకు లబ్ధి అల్లం పంట ఉన్న రైతులకు మంచి ధర వస్తోంది. దీంతో లబ్ధి పొందుతున్నారు. గతంలో ధర లేక రైతులు నష్టపోయిన సందర్భాలున్నాయి. పంట సాగు తక్కువగా ఉన్నందున రైతులకు మార్కెట్లో గిట్టుబాటు ధర లభిస్తోంది. క్వింటాల్ ధర రూ.8 వేలు పలుకుతోంది. ఈ ఏడాది పంట సాగు పెరిగే అవకాశం ఉంది. –అనూష, ఉద్యానవన అధికారి, జహీరాబాద్ బాగా గిట్టుబాటు అయింది ఎకరం పొలంలో గత ఏడాది అల్లం పంట సాగు చేసుకున్నా. ఇటీవల పంటను తీసి విక్రయించా. 60 క్వింటాళ్ల మేర పంట దిగుబడి వచి్చంది. పంట సాగు కోసం సుమారు రూ.1.50 లక్షలు ఖర్చు పెట్టాను. క్వింటాలు అల్లం రూ.9 వేల ధరకు అమ్మాను. మంచి ధర రావడంతో బాగా గిట్టుబాటు అయింది. – నర్సింహారెడ్డి, రైతు–చిరాగ్పల్లి ఇంకా ధర పెరుగుతుందనే ఆశతో ఉన్న అల్లం పంట తక్కువ విస్తీర్ణంలో సాగులో ఉంది. దీంతో మరింత ధర పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఈ నేప థ్యంలో పంటను ఇంకా భూమిలోనే నిల్వ పెట్టాను. ప్రస్తుతం 4ఎక రాల్లో పంట ఉంది. ఈ ఏడాది మరో 6 ఎకరాల్లో సాగు చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నా. క్వింటాలు ధర రూ.10 వేలకు పైగా పలికే అవకాశం ఉంది. –వెంకట్‌రెడ్డి, రైతు, హోతి (కె) చదవండి: ‘బాక్స్ సాగు’ భలేభలే..! -
విషాదం.. స్కూల్లో గుండెపోటుతో టీచర్ అకాల మరణం
సాక్షి, సంగారెడ్డి : ఇటీవలి కాలంలో గుండెపోటుతో మరణిస్తున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఈ క్రమంలో సంగారెడ్డి జిల్లాలో మరో విషాద ఘటన చోటుచేసుకుంది. ప్రభుత్వ ఉపాధ్యాయురాలు స్కూల్లోనే గుండెపోటుతో మృతిచెందింది. దీంతో, స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి. వివరాల ప్రకారం.. సంగారెడ్డి జిల్లాలోని చౌటకూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తున్న పద్మలత బుధవారం పాఠాలు చెబుతోంది. ఈ క్రమంలో మధ్యలో తరగతి గది నుంచి బయటకు వచ్చి నీళ్లు తాగింది. అనంతరం, ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. వెంటనే ఆమెను సహచర ఉపాధ్యాయులు 108 అంబులెన్స్‌లో సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందింది. సంగారెడ్డి స్వస్థలమైన ఆమె మృతిపట్ల ఉపాధ్యాయులు, సిబ్బంది విచారం వ్యక్తం చేశారు. -
31 కిలోమీటర్ల రోడ్డుకు రూ.1,297 కోట్లా..!
సాక్షి, హైదరాబాద్: ఆరు వరుసలకు విస్తరిస్తున్న రోడ్డది.. నిడివి 31 కి.మీ. మాత్రమే. కానీ దాని నిర్మాణానికి మాత్రం ఏకంగా రూ. 1,297 కోట్లు ఖర్చు కానుంది! అంటే ఒక కిలోమీటర్‌కు దాదాపు రూ. 42 కోట్ల వ్యయం అన్నమాట. దీన్ని మరోలా చెప్పాలంటే ఎనిమిది వరుసలు, 158 కి.మీ. నిడివితో రూపుదిద్దుకున్న ఔటర్ రింగురోడ్డు నిర్మాణంలో ప్రతి కిలోమీటర్‌కు అయిన ఖర్చు స్థాయికి దాదాపు సమానమన్నమాట! ఈ కాస్త దూరానికే అంత ఖర్చు ఎందుకు అనుకుంటున్నారా? ఇందులో నిర్మించేది ప్రధాన రోడ్డొక్కటే కాదు.. సరీ్వసు రోడ్లు, క్రాష్ బ్యారియర్లు, ఎలివేటెడ్ కారిడార్లు, జంక్షన్ల వద్ద వంతెనలు, అండర్‌పాస్‌లు, కల్వర్టులు.. ఒకటేమిటి ఎక్స్‌ప్రెస్ వే అంటే ఇలా ఉండాలనే రీతిలో ఇది రూపుదిద్దుకోబోతోంది. ఓ రకంగా చెప్పాలంటే మోడల్ ఎక్స్‌ప్రెస్ వేగా నిలవబోతోంది. హైదరాబాద్–పుణే జాతీయ రహదారిపై మియాపూర్–సంగారెడ్డి మధ్య ఉన్న ఈ మార్గం ఎక్స్‌ప్రెస్ వే తరహాలో ముస్తాబుకానుంది. అందుకే ఖర్చు సైతం భారీగా ఉంది. ట్రాఫిక్ చిక్కులకు తెరదించేలా... తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రల్లో విస్తరించి ఉన్న 65వ నంబర్ జాతీయ రహదారిపై కొన్నేళ్లుగా ట్రాఫిక్ విపరీతంగా పెరిగిపోయింది. దీంతో దాన్ని విస్తరించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా హైదరాబాద్ శివార్లలో ఆ మార్గాన్ని యుద్ధప్రాతిపదికన 6 వరుసలకు విస్తరించనుంది. ఇందులో హయత్‌నగర్ దాటాక విజయవాడ రోడ్డులో జాతీయ రహదారుల అభివృద్ధి ప్రాథికార సంస్థ (ఎన్హెచ్ఏఐ) రోడ్డు విస్తరణను చేపట్టనుండగా ముంబై రహదారిలో మియాపూర్ సమీపంలోని మదీనాగూడ నుంచి సంగారెడ్డి వరకు రాష్ట్ర పీడబ్ల్యూడీ విభాగం అభివృద్ధి చేయనుంది. తాజాగా మదీనాగూడ–సంగారెడ్డి మధ్య 6 వరుసల విస్తరణ పనులకు సంబంధించిన డీపీఆర్‌కు కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ అ«దీనంలోని స్టాండింగ్ ఫైనాన్స్ కమిటీ ఆమోదించింది. దీంతో ఇక టెండర్లు పిలిచేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అవి ఖరారయ్యాక రెండున్నరేళ్లలో ప్రాజెక్టును పూర్తి చేయనున్నారు. రోజుకు సగటున లక్ష వాహనాలు.. నగరం నుంచి సంగారెడ్డి రోడ్డు అత్యంత బిజీగా మారిపోయింది. డీపీఆర్ తయారీలో భాగంగా గత ఆగస్టులో ఇస్నాపూర్, పటాన్చెరు మధ్య వెళ్తున్న వాహనాల సంఖ్యపై జాతీయ రహదారుల విభాగం సర్వే నిర్వహించగా ఒక రోజులో సగటున లక్ష వాహనాలు ప్రయాణిస్తున్నట్లు తేలింది. పటాన్చెరు వద్ద రోజుకు 30,683 కార్లు, 12,353 త్రిచక్ర వాహనాలు, 34,437 ద్విచక్ర వాహనాలు, 5,551 బస్సులు, 9 వేల ట్రక్కులు... ఇలా అన్నీ కలిపి రోజుకు లక్ష వరకు తిరుగుతున్నాయి. ఇక మదీనాగూడ ప్రాంతంలో ఆ సంఖ్య అంతకు రెట్టింపుగా ఉంటోంది. ఈ రోడ్డును విస్తరిస్తే ట్రాఫిక్ సమస్య పరిష్కారమవుతుందని అధికారులు పేర్కొంటున్నారు. ఇప్పుడేం చేస్తారు..? మదీనాగూడ నుంచి సంగారెడ్డి వరకు 31 కి.మీ.మేర రోడ్డును 6 వరుసలకు విస్తరించనున్నారు. మూడు వరుసల సరీ్వసు రోడ్డు, ఫుట్‌పాత్, వరద నీటి డ్రెయిన్‌తో 11.66 కి.మీ., మిగతా నిడివిలో రెండు వరుసల సరీ్వసు రోడ్డు ఉండేలా నిర్మించనున్నారు. రుద్రారం వద్ద 1,020 మీటర్ల మేర, గంగారం వద్ద 840 మీటర్ల మేర రెండు ఎలివేటెడ్ కారిడార్లతోపాటు కొత్తగా 11 చిన్న వంతెనలు నిర్మించనున్నారు. ఏడు మేజర్, 19 మైనర్ జంక్షన్లను విస్తరించనున్నారు. ఏడు ప్రాంతాల్లో అండర్‌పాస్‌లు, ఆరు చోట్ల కల్వర్టులను కట్టనున్నారు. ఐదు ప్రాంతాల్లో లిఫ్టు వసతి ఉండే ఫుట్ ఓవర్ బ్రిడ్జీలు, రోడ్డుకు రెండు వైపులా క్రాష్ బ్యారియర్లను ఏర్పాటు చేయనున్నారు. వెరసి ప్రధాన క్యారేజ్ వే మీదకు చుట్టుపక్కల నుంచి ఇతర వాహనాలు, మనుషులు, జంతువులు వచ్చే వీలుండదు. ప్రధాన క్యారేజ్ వే మీదుగా వెళ్లే వాహనాలకు, దీన్ని దాటుతూ అటూఇటూ పోయే వాహనాలకు పరస్పరం ఆటంకం లేని విధంగా డిజైన్ చేశారు. ఇందుకు వీలుగా అదనంగా కావాల్సిన భూమి కోసం రూ. 166 కోట్లు వెచి్చస్తున్నారు. అన్నీ కలిపి నిర్మాణానికి రూ. 1,297 కోట్లు ఖర్చు కానున్నట్టు డీపీఆర్‌లో పేర్కొనగా దానికి తాజాగా కేంద్రం ఆమోదముద్ర వేసింది. బీహెచ్ఈఎల్ వంతెన కాకుండా.. ఈ రోడ్డు విస్తరణలో భాగంగా బీహెచ్ఈఎల్ కూడలి వద్ద 131 కోట్లతో భారీ వంతెన నిర్మిస్తున్నారు. 60 మీటర్ల వెడల్పుతో అది ఉండనుంది. దాన్ని ఈ రోడ్డు విస్తరణ ప్రాజెక్టులో కాకుండా విడిగా చూపారు. దానికి సంబంధించి ఎన్హెచ్ఏఐ రూపొందించిన నమూనా ప్రకారం పనులు సాధ్యం కాదంటూ రాష్ట్ర ప్రభుత్వ అ«దీనంలోని ఎన్‌హెచ్ విభాగం ఇటీవల ప్రతిపాదించింది. దీనిపై ఇరు విభాగాల మధ్య విభేదాలు తలెత్తడంతో పనుల్లో జాప్యం జరుగుతోంది. ఇందుకు కారణం మీరంటే మీరంటూ ఇరు విభాగాలు లేఖలు రాసుకోవడం వివాదాస్పదంగా మారింది. చదవండి: డేటా దేశం దాటిందా? -
ట్విట్టర్ టిల్లు, లిక్కర్ క్వీన్, హ్యాపీ రావు.. .. బండి సంజయ్ సెటైర్లు
సాక్షి, హైదరాబాద్: బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రాష్ట్ర పర్యటన రద్దవడం పట్ల తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ వివరణ ఇచ్చారు. కొన్ని కారణాల వల్ల నడ్డా గారు రాలేక పోయారని, మరోసారి వస్తానని చెప్పారని తెలిపారు. జేపీ నడ్డా, ప్రధాని మోదీ నాయకత్వంలో దేశంలోనే బీజేపీ అతి శక్తి వంతమైన పార్టీగా అవతరించిందని బండి సంజయ్ చెప్పుకొచ్చారు. శుక్రవారం సంగారెడ్డిలో జిల్లా పార్టీ కార్యాలయాల ప్రారంభోత్సవం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘తెలంగాణలో కాషాయపు రాజ్యం రావాలి. గతంలో బీజేపీని ఉత్తరాది పార్టీ అని విమర్శించారు. ఇక్కడ ఏ ఉప ఎన్నిక జరిగినా బీజేపీ గెలుస్తోంది. ముఖ్యమంత్రి కుటుంబాన్ని ఎక్కడికక్కడ ప్రజలు అడ్డుకుంటున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఈ సర్కార్ నెరవేర్చలేదు. మోదీని తిడుతూ టైం పాస్ పాలిటిల్స్ చేస్తున్నారు. కేసీఆర్ కొడుకు, ట్విటర్ టిల్లును ఉరికించి కొడుతారు. మోదీని బ్రోకర్ అంటవా..! నువ్వు బ్రోకర్, నీ అయ్య పాస్ పోర్ట్ బ్రోకర్. తెలంగాణలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమే. మునుగొడులో పోలింగ్ ఏజెంట్లు దొరకని పార్టీ బీఆర్ఎస్. టీఎస్పీఎస్సీ నిర్వాకం వల్ల 30 లక్షల మంది భవిష్యత్ నాశనం అయితే మీ అయ్యా ఎందుకు మాట్లాడలేదు. టీఎస్పీఎస్సీ బోర్డును రద్దు చేయాలి. నీ కుటుంబం ప్రమేయం లేకపోతే సిట్టింగ్ విచారణతో జరిపించాలి. నా పైన పరువు నష్టం దావా వేశారు. ట్విట్టర్ టిల్లు, లిక్కర్ క్వీన్, హ్యాపీ రావు, అగ్గిపెట్టే రావు వీళ్లే తెలంగాణను ఏలుతున్నారు. రాబోయే రోజుల్లో యుద్ధం కొనసాగిస్తాం. కచ్చితంగా బీజేపీ ప్రభుత్వం తెలంగాణలో ఏర్పాటు చేస్తాం’ అని పేర్కొన్నారు. (చదవండి: Tspsc Paper Leak: రేవంత్ ఆరోపణలపై సిట్ రియాక్షన్) -
31న తెలంగాణకు జేపీ నడ్డా..
సాక్షి, హైదరాబాద్: బీజేపీ జాతీయ అధ్యక్షుడు జగత్‌ప్రకాష్ నడ్డా ఈ నెల 31న రాష్ట్రానికి రానున్నారు. ఈ పర్యటనలో భాగంగా నడ్డా సంగారెడ్డిలో బీజేపీ కార్యాలయ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొంటారని పార్టీవర్గాలు వెల్లడించాయి. అదేరోజు తెలంగాణలోని జనగామ, వరంగల్, భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాలతోపాటు ఏపీలోని మరో రెండు జిల్లాల కార్యాలయాలను ఆయన వర్చువల్‌గా ప్రారంభిస్తారు. సంగారెడ్డిలో జరిగే బహి రంగ సభలో నడ్డా ప్రసంగిస్తారు. ఆ తర్వాత రాష్ట్ర పార్టీ నేతలు, కార్యకర్తలతో ఆయన విడిగా సమావేశం కానున్నట్టు సమాచారం. అనంతరం శంషాబాద్ నుంచి ఢిల్లీకి తిరుగు ప్రయాణమవుతారని పార్టీవర్గాలు తెలిపాయి. -
సంగారెడ్డి మెడికల్ కాలేజీ విద్యార్థులు మంత్రి హరీష్ రావు ముఖాముఖీ
-
ఐఐటీహెచ్‌లో డార్క్ స్కై అబ్జర్వేటరీ
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: ఖగోళశాస్త్రంలో ఉన్నతస్థాయి పరిశోధనలకు ఉపయోగపడే అడ్వాన్స్డ్ డార్క్ స్కై అబ్జర్వేటరీని హైదరాబాద్ ఐఐటీలో ఏర్పాటు చేశారు. నేషనల్ సైన్స్ డే మంగళవారం ఐఐటీలో నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరైన ఇస్రో మాజీ చైర్మన్, పద్మభూషణ్ అవార్డు గ్రహీత డాక్టర్ కె.రాధాకృష్ణన్ ఈ అబ్జర్వేటరీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఖగోళ శాస్త్ర పరిశోధనలకు ఈ అబ్జర్వేటరీ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో ఐఐటీహెచ్ డైరెక్టర్ ప్రొఫెసర్ బీఎస్.మూర్తి, ఫిజిక్స్ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎం పహారి, విద్యార్థులు పాల్గొన్నారు. -
ఉగాది తర్వాత గొర్రెల పంపిణీ
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: రెండో విడత గొర్రెల పంపిణీ ఉగాది, శ్రీరామనవమి పండగల తర్వాత చేపడతామని ఆర్థిక, వైద్యారోగ్య శాఖమంత్రి టి.హరీశ్‌రావు ప్రకటించారు. గొర్రెల ధరలు పెరిగిన నేపథ్యంలో ఈ పథకం యూనిట్ వ్యయాన్ని కూడా పెంచుతామన్నారు. ఆదివారం సంగారెడ్డిలో దొడ్డి కొమురయ్య విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం, కురుమ సంఘం భవన నిర్మాణానికి శుంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగసభలో హరీశ్‌రావు మాట్లాడుతూ రూ.300 కోట్లతో హైదరాబాద్‌లో గొల్ల, కురుమల ఆత్మగౌరవ భవనం నిర్మిస్తున్నామన్నారు. టీడీపీ ప్రభుత్వం గొల్ల, కురుమలను వాడుకుందని ఆరోపించారు. కేంద్రంలోని బీజేపీ సర్కారు బడ్జెట్లో బీసీల సంక్షేమానికి రూ.2 వేల కోట్లతో సరిపెట్టి, బీసీలకు అన్యాయం చేస్తోందని హరీశ్ విమర్శించారు. కురుమ సామాజిక వర్గంలో బాల్యవివాహాలు ఎక్కువగా జరిగేవని, కల్యాణలక్ష్మి పథకం అమలు చేసిన తర్వాత ఈ బాల్యవివాహాలు బంద్ అయ్యాయన్నారు. రాష్ట్రంలో గొల్ల, కురమలకు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీకి చెందిన కర్ణాటక మాజీ మంత్రి రేవన్న సీఎం కేసీఆర్‌ను కలిసి గొంగడి కప్పి అభినందించారని హరీశ్‌రావు గుర్తుచేశారు. ఈ విషయంలో రేవన్నకు ఏఐసీసీ నోటీసులు కూడా జారీ చేసిందన్నారు. సభలో ఎంపీలు బీబీపాటిల్, ఎమ్మెల్సీ ఎగ్గె మల్లేశం, కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు చంటి క్రాంతికిరణ్, మాణిక్‌రావు, హెచ్‌డీసీ రాష్ట్ర చైర్మన్ చింతప్రభాకర్, డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్, డీసీసీబీ వైస్ చైర్మన్ పట్నం మాణిక్యం, గొల్ల కుర్మ సంఘం నేతలు నగేశ్, శ్రీహరి, పాండు తదితరులు పాల్గొన్నారు. -
ఉపాధి హామీ పనుల పరిశీలన
హుస్నాబాద్‌రూరల్: హుస్నాబాద్ మండలం జిల్లెలగడ్డ, మహ్మదాపూర్ గ్రామాల్లో చేపట్టిన ఉపాధి హామీ పనులను శుక్రవారం సీఆర్డీ టెక్నికల్ బృందం పరిశీలించింది. జిల్లెలగడ్డలో ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన అవెన్యూ ప్లాంటేషన్, గ్రామ పంచాయతీ భవన నిర్మాణం, వైకుంఠధామాలు, మొక్కల పెంపకం పనుల నాణ్యతను క్వాలిటీ కంట్రోల్ అధికారులు సంతోష్‌కుమార్, మమత తనిఖీ చేశారు. అలాగే మహ్మదాపూర్లో చెరువు పనులను పరిశీలించారు. అధికారుల వెంట ఏపీడీ ఓబులేశ్, ఎంపీడీఓ కుమారస్వామి, ఏపీఓ పద్మ, ఈసీ శ్రీనివాస్, సర్పంచ్‌లు లావుడ్య స్వరూప ఉన్నారు. -
ప్రమాదవశాత్తు ట్రాక్టర్ దగ్ధం
దుబ్బాకటౌన్: సెల్ఫ్ మోటర్లో షార్ట్‌సర్క్యూట్ సంభవించి ప్రమాదవశాత్తు ట్రాక్టర్ దగ్ధమైంది. ఈ సంఘటన రాయపోల్ మండలం వీరారెడ్డిపల్లిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన రైతు కాసరాజు మూడేళ్ల క్రితం పొలం పనుల నిమిత్తం ట్రాక్టర్ కొనుగోలు చేశాడు. గురువారం సాయంత్రం పొలం దున్ని చెట్టు క్రింద ట్రాక్టర్ నిలిపి పశువుల వద్దకు వెళ్లాడు. తిరిగి వచ్చి ట్రాక్టర్‌ను ఇంటికి తీసుకెళ్దామని స్టార్ట్ చేయగా సెల్ఫ్ మోటర్లో ఒక్కసారిగా షార్ట్ సర్క్యూట్‌తో మంటలు చెలరేగాయి. మంటలు వ్యాపించడంతో వాటిని ఆర్పేందుకు రాజు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. రాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ షేక్ మహబూబ్ తెలిపారు -
బీడీఎల్ ఉద్యోగికి లండన్ రికార్డ్స్‌లో చోటు
పటాన్చెరు: లండన్‌కి చెందిన వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇంటర్నేషనల్‌లో ప్రముఖ సామాజిక కార్యకర్త, బీడీఎల్ విన్నర్స్ ఫౌండేషన్ అధ్యక్షుడు డాక్టర్ రఘు అరికపూడినకు చోటు లభించింది. శుక్రవారం మినిస్టర్స్ కాలనీలో తెలంగాణ రాష్ట్ర ఇంధనశాఖ మంత్రి జగదీశ్వర్‌రెడ్డి చేతుల మీదుగా వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రశంస పత్రాన్ని, అవార్డ్‌ను అందుకున్నారు. 35 ఏళ్లుగా ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా ఆ అవార్డు లభించింది. ఈ సందర్భంగా రఘు మాట్లాడారు. బీడీఎల్‌లో ఓ సామాన్య కార్మికుడిగా సేవలందిస్తూ దేశంలోని ఎన్నో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో సామాజిక కార్యక్రమాలను నిర్వహించానన్నారు. ఇప్పటి వరకు 18 వేల మంది నిరుపేదలకు సాయం అందించినట్లు తెలిపారు. తన సేవలను గుర్తించి అంతర్జాతీయ అవార్డు ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. ఇది మరింత బాధ్యత పెంచిందన్నారు. తనకు సహాయ సహకారాలను అందించిన బీడీఎల్ ఉద్యోగులు, హోప్ ఫర్ స్పందన అభిష్టికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇండియా సమన్వయకర్త డాక్టర్ బింగి నరేంద్రగౌడ్ పాల్గొన్నారని తెలిపారు. -
పాత కక్షల నేపథ్యంలో యువకుడి హత్య
అపటాన్చెరుటౌన్: తన తమ్ముడిని చంపాడనే అనుమానంతో ఓ యువకుడిని హత్య చేసిన సంఘటన పటాన్చెరు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. పటాన్చెరు మండలం లకడారం గ్రామానికి చెందిన మ్యాగని రాజు(24) కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన మానసను వివాహం చేసుకున్నాడు. అయితే ఇటీవలే మానస పుట్టింటికి వెళ్లి తిరిగి రాలేదు. దీంతో మృతుడు రాజు తండ్రి కిష్టయ్య సంగారెడ్డి రాజంపేట ఇందిరా కాలనీకి చెందిన తన బావమరిది మల్లేశం కు ఫోన్ చేసి కోడలు మానసను తీసుకురమ్మని చెప్పాడు. దీంతో మల్లేశం తన బైక్‌పై మానస ఇంటికి గురువారం వెళ్లాడు. అప్పటికే అక్కడ మాచర్ల శంకర్ తో పాటు మరికొంతమంది నీవు ఎందుకు వచ్చావని అతని పై దాడి చేశారు. ఈ ఏడాది జనవరి సంక్రాంతి పండగ సమయంలో తన సోదరుడు జగన్ అలియాస్ జోగన్నను రాజు తీసుకెళ్లి తాగించి చంపేశాడని శంకర్ అనుమానం పెంచుకొన్నాడు. మల్లేశంకు ఫోన్ చేసి రాజును పిలవాలని లేదంటే చంపేస్తానని శంకర్ బెదిరించాడు. దీంతో మల్లేశం రాజుకు ఫోన్ చేయించి శుక్రవారం తెల్లవారుజామున పిలిపించారు. అయితే రాజు రాగానే శంకర్‌తోపాటు మరి కొంతమంది చంపి శవాన్ని కుంటలో పడేశారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పటాన్చెరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడి మామ మల్లేశం ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
మద్యం మత్తులో విద్యుత్ స్తంభం ఎక్కి..
వెల్దుర్తి (తూప్రాన్): మద్యం మత్తులో ఓ యువకుడు విద్యుత్ స్తంభం ఎక్కాడు. వివిద్యుదాఘాతంతో తీవ్రగాయాలై కిందపడ్డాడు. ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. ఎస్ఐ మధుసూదన్‌గౌడ్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మెదక్ జిల్లా చిన్న శంకరంపేట మండలం శంకరాజ్ కొండాపూర్ గ్రామానికి చెందిన యాట సాయిరాం (24) శుక్రవారం సాయంత్రం వెల్దుర్తి నుంచి తన స్వగ్రామానికి వెళ్తున్నాడు. ఈ క్రమంలోనే ఉప్పులింగాపూర్ గ్రామ శివారులో పోలీసులు వాహన తనిఖీలతోపాటు డ్రంకెన్ డ్రైవ్ టెస్ట్ చేస్తున్నారు. ఆ సమయంలో అక్కడకు చేరుకున్న సాయిరాం మద్యం మత్తులో హల్చల్ చేస్తూ పక్కనే ఉన్న విద్యుత్ స్తంభం ఎక్కాడు. గమనించిన పోలీసులు కిందకు దించి అక్కడి నుంచి పంపించారు. అనంతరం యథావిధిగా తనిఖీలు చేస్తున్నారు. కొద్దిసేపటి తర్వాత సాయిరాం మళ్లీ తిరిగొచ్చి పక్కనే ఉన్న విద్యుత్ స్తంభంపైకి ఎక్కి తీగలు పట్టుకోవడతో విద్యుదాఘాతంతో కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతడిని తూప్రాన్ ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. అయితే వాహనతనిఖీల సమయంలో సాయిరాం స్కూటీపై వచ్చాడా లేక రోడ్డు పక్కన నిలిపి పోలీసుల దగ్గరకు వచ్చాడా అన్నదానిపై స్పష్టత లేదు. టవరెక్కడం..భయపెట్టడం చిన్నశంకరంపేట(మెదక్): గత ఏడాది కూడా సాయిరాం ఇదే తరహాలో హల్చల్ చేశాడు. 2022 ఆగస్టు 27వ తేదీన సాయిరాం చిన్నశంకరంపేట మండల కేంద్రంలో ట్రిపుల్రైడ్ వెళుతున్నాడు. వాహన తనిఖీలో భాగంగా అతడి వాహనాన్ని ఆపినా, ఆగకుండా వెళ్లాడు. పోలీసులు వెంబడించడంతో బైక్ వదిలి విద్యుత్ టవర్ ఎక్కి హంగామా చేశాడు. వెంటనే పోలీసులు విద్యుత్ అధికారులను అప్రమత్తం చేసి కరెంట్ సరఫరా నిలిపివేశారు. ఆ తర్వాత సముదాయించి ఇంటికి పంపించారు. విద్యుదాఘాతంతో యువకుడికి తీవ్రగాయాలు ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి పోలీసుల వాహన తనిఖీ నేపథ్యంలో హల్చల్ -
వ్యక్తి అనుమానాస్పద మృతి
రామాయంపేట(మెదక్): నార్సింగి మండలం శేరిపల్లిలో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతిచెందగా, ఇది హత్యేనని ఆరోపిస్తూ మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళనకు దిగారు. వివరాలు ఇలా ఉన్నాయి. శేరిపల్లి గ్రామానికి చెందిన ములుకల కిష్టయ్య (45) అదే గ్రామంలో నూతనంగా నిర్మించిన ఒక ఇంటికి గురువారం రాత్రి జరిగిన విందుకు వెళ్లాడు. రాత్రి 12 గంటల సమయంలో కొందరు కిష్టయ్యను ఆటోలో తెచ్చారు. మాట్లాడేస్థితిలో లేకపోవడంతో అతడిని ఇంటిలో పడుకోబెట్టి వెళ్లిపోయారు. కుటుంబ సభ్యులు ఉదయం లేచిచూసే సరికి విగతజీవిగా కనిపించాడు. కిష్టయ్య ముక్కు నుంచి రక్తంకారుతుండటం గమనించారు. ఈవిషయం తెలిసి గ్రామస్తులు మృతుడి ఇంటి వద్దకు తరలివచ్చారు. చనిపోయిన కిష్టయ్య మృతదేహాన్ని ఆటోలో తెచ్చారని కుటుంబ సభ్యులు విలపించారు. మృతదేహాన్ని తీసుకెళ్లి రాత్రి విందు జరిగిన ఇంటికి తీసుకెళ్లేందుకు సిద్ధపడగా, సమాచారం అందుకున్న నార్సింగి ఎస్ఐ నర్సింలు గ్రామానికి వచ్చి వారిని సముదాయించారు. న్యాయం చేస్తామని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రామాయంపేట ఆసుపత్రికి తరలించాలని సూచించారు. మృతుడి కుటుంబ సభ్యులతోపాటు గ్రామస్తులు నార్సింగి వచ్చి పోలీస్‌స్టేషన్ వద్ద నిరసన వ్యక్తంచేశారు. ఎస్ఐ వారిని సముదాయించి రామాయంపేటకు తీసుకురాగా, వారు సీఐ చంద్రశేఖర్‌రెడ్డితో మాట్లాడారు. సీఐ మృతదేహాన్ని పరిశీలించారు. కిష్టయ్యకు భార్య తిరుపతమ్మ, ఇద్దరు కుమారులున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ నర్సింలు తెలిపారు. -
పట్టుబడిన వాహనదారులకు జరిమానా
పటాన్చెరు టౌన్: డ్రైంకెన్ డ్రైవ్‌లో పట్టుబడిన వాహనదారులకు కోర్టు జరిమానా విధించింది. మద్యం తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని పటాన్చెరు ట్రాఫిక్ సీఐ ప్రవీణ్ రెడ్డి అన్నారు. బుధ, గురువారాల్లో నిర్వహించిన డ్రంకెన్ డ్రైవ్‌లో 25 మంది పట్టుబడ్డారు. వారిని శుక్రవారం సంగారెడ్డి కోర్టులో హాజరుపర్చగా జడ్జి 24 మందికి ఒక్కొక్కరికి రూ.2 వేలు, మరో వ్యక్తికి రూ.3 వేల జరిమాన విధించినట్లు పోలీసులు తెలిపారు. తనిఖీల్లో పట్టుబడిన 13 మందికి.. సిద్దిపేటకమాన్: మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడిన వాహనదారులకు సిద్దిపేట కోర్టు జరిమానా విధించింది. సిద్దిపేట పట్టణంలోని నర్సాపూర్ చౌరస్తా, ఎంపీడీఓ కార్యాలయ చౌరస్తా, రాజీవ్ రహదారిపై సిద్దిపేట ట్రాఫిక్ సీఐ రామకృష్ణ తమ సిబ్బందితో నిర్వహించిన వాహనాల తనిఖీల్లో 13 మంది పట్టుబడ్డారు. వారిని సిద్దిపేట కోర్టులో హాజరుపర్చగా జడ్జి రమేశ్‌బాబు రూ.29,500 జరిమానా విధించారు. నగల తయారీ దుకాణంలో అగ్నిప్రమాదం కోహెడరూరల్(హుస్నాబాద్): నగల తయారీ దుకాణంలో అగ్నిప్రమాదం సంభవించింది. వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని బస్వాపూర్ గ్రామంలో నగలతయారీ దుకాణంలో గ్యాస్ సిలిండర్ లీకై మంటలు చెలరేగాయి. షాపు యాజమాని లక్ష్మీనారాయణ శుక్రవారం బంగారు ఆభరణాలు తయారు చేస్తుండగా దుకాణంలోని గ్యాస్ సిలిండర్ లీకై మంటలు చెలారేగాయి. దీంతో స్థానికుల సహకారంతో మంటలను ఆర్పివేశారు. ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో స్థానికులు ఊపిరి పిలుచ్చుకున్నారు. బైక్ చోరీ జహీరాబాద్ టౌన్: పట్టణంలోని సాయిరాం నగర్లో కాలనీలో మోటారు బైక్‌ను చోరీ చేశారు. సాయిరాం నగర్ కాలనీలో నివాసం ఉంటున్న సుదర్శన్ ఏపీ28 డీఆర్8838 నంబర్ గల హీరో గ్లామర్ మోటారు బైక్ ఇంటి ముందు పార్క్ చేశాడు. శుక్రవారం లేచి చూసేసరికి బైక్ కనిపించలేదు. దీంతో బాధితుడు సుదర్శన్ జహీరాబాద్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. చోరీకి యత్నించిన వ్యక్తి అరెస్ట్ నర్సాపూర్: నర్సాపూర్‌లోని ఓ ఏటీఎంలో చోరీ చేసేందుకు యత్నించిన వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్ఐ శివకుమార్ తెలిపారు. పట్టణంలోని బస్టాండ్‌లోని ఏటీఎంలో గురువారం రాత్రి చోరీ చేసేందుకు ప్రయత్నించాడని ఫిర్యాదు రావడంతో కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. సీసీ కెమెరా పుటేజీ ఆధారంగా విచారణ చేయగా మండలంలోని పెద్దమ్మ తండాకు చెందిన భాస్కర్ ఏటీఎంలో చోరీకి యత్నించినట్లు రుజువుకావడంతో శుక్రవారం అతడిని అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపర్చినట్లు చెప్పారు. -
ఇంటి నుంచి వెళ్లి చెరువులో శవమై..
మెదక్ మున్సిపాలిటీ: ఇంటి నుంచి వెళ్లిన యువకుడు చెరువులో చెరువులై శవమై కనిపించాడు. వివరాలు ఇలా ఉన్నాయి. మెదక్ పట్టణంలోని అజంపురా వీధికి చెందిన మహ్మద్ మోహిన్(24) ఈనెల 20వ తేదీన ఇంటి నుండి వెళ్లిపోయాడు. దీంతో అతడి కుటుంబీకులు పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో శుక్రవారం పట్టణ శివారులోని గోసముద్రం చెరువులో ఓ గుర్తు తెలియని శవం తేలింది. గొర్రెల కాపరుల ద్వారా విషయం తెలుసుకున్న పట్టణ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. మహమ్మద్ మోహిన్ కుటుంబీకులకు సమాచారం ఇవ్వగా వారు అక్కడికి చేరుకుని మృతుడు ధరించిన దుస్తుల ఆధారంగా మహ్మద్ మోహిన్‌గా గుర్తించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
డైరెక్టర్ పదవి పోతుందనే భయంతోనే ఆరోపణలు
రామాయంపేట సహకార సంఘం చైర్మన్ బాదె చంద్రం రామాయంపేట(మెదక్): డైరెక్టర్ పదవి పోతుందనే భయంతోనే రామాయంపేట సహకార సంఘం డైరెక్టర్ దేవుని నర్సింహులు తమపై అవనసర ఆరోపణలు చేస్తున్నారని సంఘం చైర్మన్ బాదె చంద్రం ఆరోపించారు. శుక్రవారం సంఘం వైస్ చైర్మన్ సులోచన, డైరెక్టర్లు సుధాకర్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, రమావత్ లక్ష్మి, లద్ద నిర్మల, భాగ్యలక్ష్మితో కలిసి కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. దేవుని నర్సింహులుకు ముగ్గురు సంతానం ఉండటంతో బచ్చురాజ్‌పల్లి నరేందర్ డీసీఓకు ఫిర్యాదు చేశారని, అధికారుల విచారణలో అది వాస్తవమేనని తేలిందన్నారు. తన డైరెక్టర్ పదవి పోతుందనే భయంతోనే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలకు సంబంధించి రూ.20 లక్షలు దుర్వినియోగమైనట్లు నర్సింహులు చేసిన ఆరోపణలు తప్పని, గోనె సంచులు కొనుగోలు చేసే అధికారం తమకు లేదని స్పష్టంచేశారు. ఏటా గోనె సంచులు సవిల్ సప్లయి కార్యాలయం నుంచి తమకు వస్తాయని, మిగిలిన సంచులు తాము అధికారులకు అప్పగించామన్నారు. నిధులు దుర్వినియోగానికి పాల్పడితే ఏశిక్షకై నా సిద్ధమేనని బాదె చంద్రం ప్రకటించారు. -
వాహనం అడుగు భాగంలో మంటలు
అప్రమత్తమైన పెట్రోల్ బంక్ సిబ్బంది ఫైర్ గ్యాస్‌తో మంటలు ఆర్పిన వైనం మద్దూరు(హుస్నాబాద్): మండల కేంద్రంలోని హెచ్‌పి పెట్రొల్ బంక్‌లో డిజిల్ పోసుకుంటున్న టాటా ఏస్ వాహనం నుంచి మంటలు చెలరేగాయి. గమనించిన పెట్రోల్ బంక్ నిర్వాహకులు ఫైర్గ్యాస్తో మంటలను ఆర్పివేశారు. ఈ సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. రేబర్తి గ్రామానికి చెందిన టాటా ఏస్ ట్రాలీ వాహనం పత్తి లోడ్‌తో వచ్చింది. డీజిల్ నింపుతున్న క్రమంలో వాహనం కింది నుంచి మంటలు చెలరేగాయి. గమనించిన నిర్వాహకులు వెంటనే మంటలు ఆర్పారు. మంటలను చూసినవారంతా పరుగులు తీశారు. అనంతరం బంక్ నిర్వాహకులు మాట్లాడుతూ పెట్రోల్ నింపే సమయంలో సెల్‌ఫోన్ మాట్లాడకూడదని, ఆ క్రమంలోనే ప్రమాదం సంభవించిందన్నారు. -
యువకుడి హత్య
తమ్ముడిని చంపాడనే అనుమానంతో ఓ యువకుడిని హత్య చేసిన సంఘటన పటాన్చెరు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. 8లో బైక్‌పై వెళ్లే పరిస్థితి లేదు బైక్‌మీద రోడ్డుపైకి రావాలంటే భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. వీధుల్లో కుక్కలు వాహనాల వెంట పడుతున్నాయి. దీంతో ప్రమా దాలు జరుగుతున్నాయి. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలి. – గోపి, రామచంద్రాపురం పిల్లలను పంపాలంటే అంబర్‌పేట ఘటన తర్వాత చిన్నారులను బయటకు పంపాలంటే భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. ఏ వీధిలోకి వెళ్లినా వీధి కుక్కల బాధ తప్పడం లేదు. – మురళీకృష్ణ, రామచంద్రాపురం వీధి కుక్కలను నివారించాలి వీధి కుక్కల నివారణకు అధికారులు చర్యలు తీసుకోవాలి. గతంలో కన్నా ప్రస్తు తం వీధి కుక్కల సంఖ్య విపరీతంగా పెరిగింది. వాటిని పూర్తిస్థాయిలో నియంత్రించారు. – నాగరాజు గౌడ్, బీడీఎల్ కాలనీ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం వీధి కుక్కల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. సంబంధిత శాఖకు సంబంధించినవారు కుక్కలను ఎప్పటికప్పుడు తీసుకొని వెళుతున్నారు. – బాలయ్య, జీహెచ్ఎంసీ ఉపకమిషనర్ -
కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి
సంగారెడ్డిటౌన్: జిల్లాలో యాసంగి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రూపొందించాలని సంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ వీరారెడ్డి అధికారులకు ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లోని తనచాంబర్లో సివిల్ సప్లై అధికారులు, కాంట్రాక్టర్లు, రైస్‌మిల్లర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వీరారెడ్డి మాట్లాడుతూ యాసంగిలో 2,07,000 మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని అంచనా వేశామన్నారు. అందుకు అనుగుణంగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. క్షేత్రస్థాయి శిక్షణ, గన్నీల ముందస్తు ఏర్పాట్లు, మిల్లులకు ధాన్యం కేటాయింపు, ధాన్యం నిల్వ ఏర్పాటుపై మిల్లర్లకు ఆదేశాలు జారీ చేశారు. యాసంగి ధాన్యంపై అదనపు కలెక్టర్ వీరారెడ్డి -
ప్రభుత్వాస్పత్రుల్లోనే ప్రసవాలు జరగాలి
సంగారెడ్డి టౌన్: ప్రభుత్వ ఆస్పత్రుల్లో 95 శాతం ప్రసవాలు జరిగేలా ప్రణాళిక సిద్ధం చేయాలని కలెక్టర్ శరత్ అన్నారు. శుక్రవారం జిల్లావైద్య,ఆరోగ్య శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి గర్భిణీని ఏఎన్ఎం తప్పనిసరిగా 12 వారాల లోపు నమోదు చేయించి, క్రమం తప్పకుండా నిర్ణీత వ్యవధిలో పరీక్షలు చేయించాలన్నారు. ప్రభుత్వాస్పత్రిలోనే ప్రసవాలు జరిగేటట్టు ప్రోత్సహించాలన్నారు. పుట్టిన ప్రతి శిశువుకు వారి వయసు ఆధారంగా సకాలంలో టీకాలు వేయించాలని ఆదేశాలు జారీ చేశారు. కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి టీం రోజు 250 మందిని పరీక్షించాలన్నారు. దగ్గరచూపు.. దూరపుచూపు వారికి అద్దాలను అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఎంహెచ్ఓ గాయత్రీదేవి, ప్రోగ్రాంఆఫీసర్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. 95శాతం చేరేలా ప్రణాళిక సిద్ధం చేయాలి: కలెక్టర్ -
పాల ఉత్పత్తి పెంచాలి
నారాయణఖేడ్: పాల ఉత్పత్తిని పెంచాలని విజయ డెయిరీ క్వాలిటీ కంట్రోల్ అధికారి ప్రవీణ్‌కుమార్ సూచించారు. మండలపరిధిలోని జూకల్ పాల శీతలీకరణ కేంద్రంలో శుక్రవారం ఖేడ్ డివిజన్ పరిధిలోని పశుపోషకులు, రైతులతో అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథి హాజరైన ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ పశుపోషణ, అధికపాల ఉత్పత్తికి తీసుకోవాల్సిన చర్యలు, సొసైటీల ఏర్పాటు, నిర్వహణ, జిల్లాలో అమలవుతున్న డెయిరీ పథకాలు, గేదెల కొనుగోలుకు రుణాల మంజూరు విధానం తదితర అంశాలపై అవగాహన కల్పించారు. నాణ్యమైన పాలు పోస్తున్న పశుపోషకులను సన్మానించారు. పశువైద్యాధికారి నేతాజీ, పాలశీతలీకరణ కేంద్రం మేనేజర్ రాములు, ఖేడ్ ఎస్బీఐ మేనేజర్ నవీన్ తదితరులు పాల్గొన్నారు. ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి కృషి రామచంద్రాపురం(పటాన్చెరు): ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి టీఎస్ యూటీఎఫ్ ఎంతో కృషి చేస్తుందని ఆ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి లక్ష్మారెడ్డి అన్నారు. శుక్రవారం హైదరాబాద్–రంగారెడ్డి– మహబూబ్ నగర్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి మాణిక్‌రెడ్డిని గెలిపించాలని కోరుతూ రామచంద్రాపురం, తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయ సమస్యలపై నిరంతరం ఉద్యమించే మాణిక్‌రెడ్డిని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి సాయిలు, కోశాధికారి శ్రీనివాసరావు, నాయకులు ప్రభాకర్, ఏసు పాదం తదితరులు పాల్గొన్నారు. మార్చి 12 వరకు ఆ రోడ్డు మూసివేత జహీరాబాద్ టౌన్: పట్టణంలోని ఈద్గా వద్ద ఫ్లైఓవర్ బ్రిడ్జి, రోడ్డు నిర్మాణం పనులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మార్చి 12వ తేదీ వరకు ఆ రోడ్డు మూసివేస్తున్నామని ఆర్అండ్బీ డీఈఈ నర్సింలు తెలిపారు. వాస్తవానికి శనివారంతో పనులు పూర్తి కావాల్సి ఉన్నా, ఇంకా క్యూరింగ్ పెండింగ్‌లోనే ఉంది. మిగిలిన పనులు పూర్తికావడానికి పదిహేనురోజుల వరకు పడుతుందన్నారు. అప్పటి వరకు జహీరాబాద్ పట్టణం నుంచి బీదర్ చౌరస్తా వైపు వెళ్లే ఫోర్‌వీలర్ వాహనాలను అల్గోల్ రోడ్డు గుండా రాకపోకలు సాగించాలన్నారు. -
ఎస్డీఎఫ్.. స్లో..!
నిధులున్నా.. ముందుకుసాగని పనులు.. కాంట్రాకర్లకు కలిసొచ్చేపనులే ఎంపిక.. సీఎం కేసీఆర్ ప్రత్యేకంగామంజూరు చేసిన నిధుల తీరిది సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: జిల్లాలో గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల అభివృద్ధికి సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా మంజూరు చేసిన స్పెషల్ డవలప్మెంట్ ఫండ్స్ (ఎస్డీఎఫ్) వినియోగం అస్తవ్యస్తంగా సాగుతోందనే ఆరోపణలున్నాయి. ఈ నిధులతో చేపట్టిన పనులు ఆశించిన మేరకు ముందుకు సాగడం లేదు. పరిపాలన అనుమతులు మంజూరు చేసి ఆరు నెలలు దాటింది. అయినా ఇంకా చాలా చోట్ల పనులు అసలు ప్రారంభానికే నోచుకోలేదు. రూ.371.40 కోట్లతో పనులు ఎస్డీఎఫ్ కింద ప్రభుత్వం ఒక్కో గ్రామ పంచాయతీకి రూ.20 లక్షల చొప్పున, మున్సిపాలిటీలకు రూ.20 కోట్లు మంజూరు చేసింది. సంగారెడ్డి, జహీరాబాద్ మున్సిపాలిటీలకు రూ.50 కోట్ల చొప్పున మంజూరయ్యాయి. జిల్లావ్యాప్తంగా మొత్తం రూ.371.40 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టాలని నిర్ణయించారు. ఈ మేరకు గత ఏడాది జూలైలో ఈ పనులకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఆయా వార్డుల్లో తిరిగి క్షేత్ర స్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి పనులను ఎంపిక చేయాల్సి ఉండగా, ఆయా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు మొక్కుబడిగా తిరిగి పనులను ఎంపిక చేశారు. ఆ మూడు పనులకే ప్రాధాన్యం ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు సంబందించిన పనులను ఎంపిక చేయాల్సి ఉండగా, చాలా చోట్ల కాంట్రాక్టర్లకు కలిసొచ్చే పనులు సీసీ రోడ్లు, డ్రైనేజీలు, కమ్యూనిటీ హాళ్ల నిర్మాణం వంటి వాటికే ప్రాధాన్యం ఇచ్చారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎక్కువమంది బీఆర్ఎస్కు చెందిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులే ఈ పనులను పంచుకున్నారు. సంగారెడ్డి మున్సిపాలిటీలో కౌన్సిలర్లు ఈ పనుల కోసం ఏకంగా వాగ్వావాదాలకు దిగిన ఘటనలు కూడా ఉన్నాయి. ఇదీ పనుల ప్రగతి.. అన్ని గ్రామ పంచాయతీల్లో రూ.121.40 కోట్ల అంచనా వ్యయంతో 2,478 పనులు చేపట్టారు. ఇప్పటి వరకు కేవలం 189 పనులకు సంబంధించి రూ.8.88 కోట్ల మేరకు మాత్రమే పనులు జరిగాయి. అన్ని మున్సిపాలిటీల్లో కలిపి రూ.250 కోట్లతో 939 పనులు చేపట్టాలని నిర్ణయించారు. ఇందులో ఇప్పటి వరకు కేవలం రెండే పనులకు రూ.94 లక్షలు మాత్రమే వినియోగించుకోగలిగారు. పనులు జరుగుతున్నాయి..: జగదీశ్వర్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, పీఆర్ ఎస్డీఎఫ్లో చేపట్టిన పనులు కొనసాగుతున్నాయి. ఆయా స్థానిక సంస్థల తీర్మానాల మేరకు నామినేషన్‌పై పనులు అప్పగించాం. పలు గ్రామాల్లో పనులు చేసేది ఒకరిద్దరే కావడంతో ఆయా చోట్ల కొన్ని పనులు ప్రారంభించాల్సి ఉంది. ‘‘ప్రతి గ్రామ పంచాయతీకి రూ.20 లక్షలు, మున్సిపాలిటీలకు రూ.20 కోట్ల చొప్పున నిధులు మంజూరు చేస్తున్నా.. ఈ భారీ మొత్తంలో మంజూరు చేస్తున్న ఈ ప్రత్యేక నిధులను సద్వినియోగం చేసుకోండి. ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసి క్షేత్రస్థాయిలో తిరిగి ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి ఖర్చు చేయండి.’’ – గత ఏడాది నారాయణఖేడ్‌లో జరిగిన బహిరంగసభలో సీఎం కేసీఆర్ చెప్పిన మాటలివి. -
కుక్కలే.. కుక్కలు
ఏ వీధిలో చూసినా గుంపులు గుంపులుగా స్వైరవిహారం 14 నెలల్లో 453 మంది బాధితులు రామచంద్రాపురం(పటాన్చెరు): రామచంద్రాపురం, భారతీనగర్, బీహెచ్ఈఎల్ పరిధిలోని ఏ కాలనీ.. ఏ వీధి చూసినా కుక్కలు గుంపులుగుంపులుగా కనిపిస్తున్నాయి. సగటున నెలకు 30మంది దాకా కుక్కకాటు బారిన పడుతున్నారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. గతంతో పోల్చుకుంటే రాత్రివేళ కుక్కల స్వైరవిహారం మరీ ఎక్కువైంది. రాత్రయిందంటే బయటకు వెళ్లాలంటే ప్రజలు భయపడిపోతున్నారు. ఒక్క రామచంద్రాపురం ప్రైమరీ హెల్త్ సెంటర్ పరిధిలో జనవరి 2022 నుంచి ఫిబ్రవరి 24వ తేదీ వరకు 453 మంది కుక్కకాటుకు సంబంధించిన ఇంజెక్షన్లు వేయించుకున్నారు. వీరేకాకుండా ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయించినవారూ ఉంటారు. పలు మాంసం దుకాణాల వద్ద మటన్‌కు సంబంధించిన వ్యర్థాలను వీధి కుక్కలకు వేస్తున్నారు. దీంతో ఆ పరిసరాల్లో కుక్కల సంఖ్య విపరీతంగా పెరిగింది. నగరంలోని వివిధ ప్రాంతాల్లో పట్టుకున్న కుక్కలను రాత్రివేళ తీసుకొచ్చి ఇక్కడ వదిలేస్తున్నారు. దీంతో ఆర్సీపురం పరిధిలో కుక్కల సంఖ్య పెరిగింది. గతంలో బీహెచ్ఈఎల్ కాలనీలో కొంతమంది వీధి కుక్కలను వదిలేసే ప్రయత్నం చేయగా, స్థానికులు నిలదీశారు. దీంతో వారు వెనక్కి వెళ్లారు. పలు కాలనీల్లో కుక్కలు ఇళ్లలోకి చొరబడిపోతున్నాయి. కనిపించిన వస్తువులను లాక్కెళ్లిపోతున్నాయి. డోర్ తీయాలంటేనే పలువురు హడలిపోతున్నారు. బైక్‌పై రోడ్డు మీదకు రావాలంటేనే భయపడుతున్నారు. బైక్‌ల వెంట కుక్కలు పడుతున్న కారణంగా పలువురు ప్రమాదాల బారిన పడుతున్నారు. వీధి కుక్కల నియంత్రణలో భాగంగా వాటిని పట్టుకొని కుటుంబనియంత్రణ ఆపరేషన్లు చేస్తున్నామని జీహెచ్ఎంసీ అధికారులు చెబుతున్నారు. అయినా రోజురోజుకు కుక్కల సంఖ్య పెరుగతుందేకానీ తగ్గడం లేదు. చిన్నారులను తల్లిదండ్రులు బయటకు పంపలేని పరిస్థితి నెలకొంది. ఒకవేళ వారు బయటకు వెళ్లినా తిరిగొచ్చే వరకు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుంటున్నారు. జనవరి– 22 48 ఫిబ్రవరి 42 మార్చి 29 ఏప్రిల్ 37 మే 39 జూన్ 26 జూలై 41 ఆగస్టు 27 సెప్టెంబర్ 30 అక్టోబర్ 23 నవంబర్ 27 డిసెంబర్ 22 జనవరి– 23 32 ఫిబ్రవరి–23 30 (రామచంద్రాపురం ప్రైమరీ హెల్త్ సెంటర్ పరిధిలో కుక్కకాటు చికిత్స తీసుకున్నవారు) -
వీధికుక్కల దాడిలో జింకకు గాయాలు
కంది(సంగారెడ్డి): వీధికుక్కల దాడిలో ఓ జింక తీవ్రంగా గాయపడింది. ఇంద్రకరణ్ ఎస్ఐ రాజేష్‌నాయక్ కథనం ప్రకారం...మండల పరిధిలోని తోపుగొండ సమీపంలో శుక్రవారం నీరు తాగేందుకు ఓ జింక వచ్చింది. వీధికుక్కలు ఒక్కసారి దాడి చేయడంతో తీవ్రగాయాలయ్యాయి. గమనించిన గ్రామస్తులు కుక్కలను తరిమి అటవీఅధికారులతోపాటు పోలీసులకు సమాచారం ఇచ్చారు. గాయపడిన జింకను పశువైద్యశాలకు తరలించి అటవీఅధికారులు చికిత్స చేయించారు. గ్రామాల్లో వీధుల్లో కుక్కల బెడద ఎక్కువగా ఉందని ఆయా గ్రామాల ప్రజలు వాపోతున్నారు. వీధుల్లో చిన్నపిల్లలు తిరగడానికి ఇబ్బంది పడుతున్నారని, కుక్కల బెడదను అరికట్టాలని కోరారు. -
తొమ్మిదేళ్లుగా చెప్పులు వేసుకోని యువకుడు.. కారణమిదే!
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: చాలా మంది దేవుళ్ల పేరిట నియమ నిష్టలతో దీక్షలు చేస్తుండటం చూస్తూనే ఉంటాం.. కానీ 21 ఏళ్ల యువకుడు పాలడుగు జ్ఞానేశ్వర్ పర్యావరణాన్ని కాపాడాలనే సంకల్పంతో ‘పుడమి’దీక్ష తీసుకున్నారు. పర్యావరణ పరిరక్షించేందుకు నడుం బిగించిన ఆయన.. భూమాతతో అనుబంధం విడిపోకూడదనే ఉద్దేశంతో తొమ్మిదేళ్లుగా చెప్పులు కూడా వేసుకోవడం లేదు. సంగారెడ్డి జిల్లా నాగల్గిద్ద మండలం ముక్టాపూర్ గ్రామానికి చెందిన పాలడుగు జ్ఞానేశ్వర్ జువాలజీలో పీజీ చేశారు. జ్ఞానేశ్వర్ కుటుంబానికి మంజీరా తీరానికి సమీపంలో నాలుగు ఎకరాల భూమి ఉంది. కొన్నేళ్లుగా నదిలో నీరు లేక పొలాలన్నీ బీడువారాయి. దీంతో చలించిపోయిన జ్ఞానేశ్వర్ పర్యావరణ పరిరక్షణ కోసం పోరాటం మొదలుపెట్టారు. ధరణి బాగుంటేనే మనం బాగుంటామని, మొక్కలు నాటడంతోనే సరిపోదని, ఉన్న చెట్లను నరకకుండా కాపాడుకుంటేనే పర్యావరణ పరిరక్షణ సాధ్యమని చాటి చెబుతున్నారు. గ్రీన్ సోల్జర్లను ఏర్పాటు చేసుకుని.. పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంచేందుకు జ్ఞానేశ్వర్ తమ చుట్టుపక్కల ఉన్న సుమారు 35 గ్రామాల్లో హరిత సైన్యాన్ని (గ్రీన్ సోల్జర్స్)ను ఏర్పాటు చేసుకున్నారు. ఆయా గ్రామాల్లో పాఠశాల విద్యార్థులను హరిత సైనికులుగా ఏర్పాటు చేసుకున్నాడు. పర్యావరణ పరిపరక్షణ, మొక్కలు నాటడంపై వారికి అవగాహన కల్పించారు. గ్రామాల్లో ఎవరైనా చెట్లు నరికేందుకు ప్రయత్నిస్తే ఆపాలని, వెంటనే తనకు ఫోన్ చేయాలని వారికి చెప్పారు. అలా ఫోన్ చేస్తే ఆ గ్రామానికి వెళ్లి విద్యార్థులతో కలిసి చెట్లను కౌగిలించుకుంటారు. చెట్లు నరకవద్దని కోరుతారు. అటవీ అధికారులకు సమాచారం ఇచ్చి చెట్లు నరికి వేయకుండా కట్టడి చేస్తున్నాడు. ఏడాది క్రితం నాగల్గిద్దలో కొందరు పెద్ద చెట్టును నరికివేశారు. ఈ విషయం తెలిసిన జ్ఞానేశ్వర్.. అక్కడికి వెళ్లి మోడువారి వృక్షాన్ని తిరిగి భూమిలో పాతించాడు. కొద్దిరోజుల తర్వాత ఆ చెట్టు మళ్లీ చిగురించడం ఎంతో సంతోషం కలిగించిందని జ్ఞానేశ్వర్ చెబుతున్నారు. ప్రకృతిని కాపాడితేనే మనిషికి మనుగడ పర్యావరణ పరిరక్షణ ఆవశ్యకతను ప్రతి ఒక్కరికి చాటి చెప్పేందుకే నేను చెప్పులు వేసుకోకుండా దీక్ష చేస్తున్నాను. భూమిపై ఉన్న ఏ ప్రాణి కూడా చెప్పుల్లాంటివి ధరించదు. పర్యావరణానికి విఘాతం కలిగిస్తున్న మనిషి మాత్రమే చెప్పులు ధరిస్తున్నాడు. భూమికి మనిషికి ఉన్న అనుబంధం ఎన్నటికీ విడదీయలేనిది. పర్యావరణ సమత్యులతను కాపాడితేనే మానవ మనుగడ ఉంటుంది. దీనిని ఆచరణలో చూపేందుకు దీక్ష చేపట్టాను. –జ్ఞానేశ్వర్, పర్యావరణ ఉద్యమకారుడు యాత్రలతో అవగాహన పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు జ్ఞానేశ్వర్ తరచూ గ్రామాల్లో హరిత సైనికులతో కలిసి పాదయాత్రలు, సైకిల్ యాత్రలు చేస్తుంటారు. నాగల్గిద్ద, కంగ్టి, మనూర్, నారాయణఖేడ్, న్యాల్కల్ తదితర మండలాల పరిధిలోని గ్రామాల్లో ఇలా యాత్రలు చేశారు. పర్యావరణ పరిరక్షణకు కృషిచేస్తున్న జ్ఞానేశ్వర్‌కు ప్రతిష్టాత్మకమైన ‘సాక్షి’ఎక్స్‌లెన్స్ అవార్డు కూడా దక్కింది. చదవండి: అపార్థం చేసుకున్నాం.. గుంజీలు శిక్ష కాదు.. సూపర్ బ్రెయిన్ యోగా..! -
Maha Shivratri 2023: సైకత శివయ్య
సంగారెడ్డి టౌన్: మహాశివరాత్రిని పురస్కరించుకుని సంగారెడ్డిలోని ఫసల్వాది జ్యోతిర్వాస్తు విద్యాపీఠంలో 19.5 అడుగుల సైకత మహా లింగాన్ని బుధవారం రాత్రి ఆవిష్కరించారు. విద్యాపీఠం వ్యవస్థాపకుడు డాక్టర్ మహేశ్వర శర్మ సిద్ధాంతి ఆధ్వర్యంలో జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, గానుగాపూర్ పీఠాధిపతి వల్లభానంద సరస్వతి, కూడలి శృంగేరి శంకరాచార్య పీఠాధిపతి అభినవ విద్యారణ్య భారతి స్వామి ముఖ్య అతిథులుగా సైకత శివలింగాన్ని ఆవిష్కరించారు. 360 టన్నుల ఇసుకతో ప్రపంచంలోనే అతి పెద్దదైన సైకత శివలింగాన్ని రూపొందించినట్టు విద్యాపీఠం వ్యవస్థాపకుడు మహేశ్వర శర్మ సిద్ధాంతి తెలిపారు. -
సంగారెడ్డి జిల్లాలో తప్పిన ప్రమాదం
-
సంగారెడ్డికి మెట్రో వేయండి..
సాక్షి, హైదరాబాద్: మియాపూర్ నుంచి సంగారెడ్డి రాంమందిర్ మీదుగా సదాశివపేట వరకు మెట్రో రైలును మంజూరు చేయాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సీఎం కేసీఆర్‌ను కోరారు. ఈ మేరకు ఆయన ఆదివారం శాసనసభలో కేసీఆర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. తన వినతి పట్ల సీఎం సానుకూలంగా స్పందించారని, ఈ మెట్రోలైన్ సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించారని జగ్గారెడ్డి విలేకరులకు తెలిపారు. అదే విధంగా గ్రూప్–1 మెయిన్స్‌కు 1:50 కాకుండా 1:100 నిష్పత్తిలో అభ్యర్థులకు అవకాశం ఇవ్వాలని సీఎంను కోరగా, ఇందుకు కూడా ఆయన సానుకూలంగా స్పందించారని ఆయన వెల్లడించారు. సంగారెడ్డి నియోజకవర్గంలో బాలురు, బాలికల ఉన్నత పాఠశాలలు, కళాశాలలు, హాస్టల్ భవనాల నిర్మాణానికి నిధులు కేటాయించాలని ఎమ్మెల్యే జగ్గారెడ్డి కోరారు. ఈ మేరకు అసెంబ్లీ లాబీల్లోని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి చాంబర్లో ఆదివారం ఆమెను కలిసి వినతిపత్రం అందజేశారు. -
సంగారెడ్డి: ఫార్మా కంపెనీలో అగ్ని ప్రమాదం.. కార్మికులకు గాయాలు!
సాక్షి, సంగారెడ్డి: జిల్లాలోని గడ్డిపోతారం పారిశ్రామికవాడలో అగ్ని ప్రమాద ఘటన చోటుచేసుకుంది. లీ ఫార్మా కంపెనీలో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. కార్మికులు, స్థానికులు మంటలను ఆర్పేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. వివరాల ప్రకారం.. గడ్డిపోతారం ఇండస్ట్రీయల్ ప్రాంతంలో ఉన్న లీ ఫార్మా కంపెనీలో బుధవారం అగ్ని ప్రమాదం జరిగింది. కంపెనీలో రియాక్టర్ల వద్ద మంటలు చెలరేగాయి. దీంతో, పరిశ్రమలో ఉన్న కార్మికులు భయంతో బయటకు పరుగులు తీశారు. ఈ ప్రమాదంలో ఇద్దరు కార్మికులకు గాయాలు కావడంతో వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. మంటలు ఎగిసిపడటంతో అదుపు చేసేందుకు స్థానికులు, కార్మికులు ప్రయత్నాలు చేస్తున్నారు. -
అందోల్, జోగిపేట చైర్మన్‌ను దింపేద్దాం..
సాక్షి, జోగిపేట(అందోల్): సంగారెడ్డి జిల్లాలోని అందోల్–జోగిపేట మున్సిపాలిటీ రాజకీయాలు ఊహించని విధంగా రోజుకో మలుపు తిరుగుతున్నాయి. మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్లపై సొంత పార్టీ (బీఆర్ఎస్)కి చెందిన కౌన్సిలర్లు అవిశ్వాసం పెట్టేందుకు సిద్ధమయ్యారు. దీనిపై శనివారం కలెక్టరేట్ కార్యాలయంలో నోటీసును అందజేయడం స్థానికంగా చర్చనీయాంశమైంది. శనివారం ఉదయం 11 మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లు తమ కుటుంబ సభ్యులతో కలసి చిట్కుల్లోని చాముండేశ్వరీ అమ్మవారి ఆలయం ఆవరణలో సమావేశమయ్యారు. చైర్మన్, వైస్చైర్మన్ల వ్యవహారశైలిపై అసంతృప్తిని వ్యక్తం చేస్తూ, వారిని పదవిలో నుంచి దింపేయాలని తీర్మానించారు. అక్కడ నుంచి నేరుగా సంగారెడ్డి కలెక్టరేట్‌కు వెళ్లారు. అక్కడ కలెక్టర్ లేకపోవడంతో అదనపు కలెక్టర్ వీరారెడ్డిని కలిశారు. ఆయన సూచన మేరకు ఇన్‌వార్డులో అవిశ్వాస తీర్మానం నోటీసును అందించారు. అక్కడి ఉద్యోగులు సోమవారం వచ్చి కలెక్టర్‌ను కలవాలని సూచించడంతో నోటీసు అందించి వెనుదిరిగారు. మెజారిటీ కౌన్సిలర్ల వ్యతిరేకత అందోల్ – జోగిపేట మున్సిపాలిటీలో మొత్తం 20 వార్డులున్నాయి. ఇందులో 14 మంది బీఆర్ఎస్, ఆరుగులు కాంగ్రెస్ కౌన్సిలర్లు ఉన్నారు. ప్రస్తుతం వీరిలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన 11 మంది కౌన్సిలర్లు చైర్మన్‌ను వ్యతిరేకిస్తున్నారు. రోజూ చైర్మన్ వెంట ఉండే కౌన్సిలర్లు సైతం బహిరంగంగా చైర్మన్ తీరుపై విమర్శలు చేయడం విశేషం. కాగా, ఈ పరిణామంపై ఎమ్మెల్యే క్రాంతికిరణ్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు పార్టీ నాయకులు తెలిపారు. -
మేఘం నుంచి భూమి వరకు..
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా మరింత కచ్చితత్వంతో వర్షపాతాన్ని అంచనా వేసేందుకు వీలుగా వర్షపు చినుకు (నీటి బిందువుల)ల పరిణామక్రమంపై పరిశోధనలకు హైదరాబాద్ ఐఐటీ శ్రీకారం చుట్టింది. మేఘం నుంచి భూమికి చేరే వరకు వివిధ ఎత్తుల్లో వర్షపు చినుకు ఆకారం, మారుతున్న తీరునుబట్టి వర్షపాతం అంచనాకు ఐఐటీలోని కెమికల్ ఇంజనీరింగ్ విభాగం రెయిన్‌డ్రాప్ రీసెర్చ్ ఫెసిలిటీ (ఆర్ఆర్ఎఫ్)ని ఏర్పాటు చేసింది. ఇందుకోసం మెషీన్ లెర్నింగ్ ఆధారిత డిజిటల్ ఇన్లైన్ హోలోగ్రఫీ పరిజ్ఞానాన్ని వినియోగించనుంది. ఈ కేంద్రాన్ని నీతి ఆయో సభ్యుడు ప్రొఫెసర్ వీకే సారస్వత్ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షపు చినుకులు ఏర్పడటం వెనకున్న ప్రక్రియలను అర్థం చేసుకోవడంతోపాటు పర్యావరణం, వాతావరణ మార్పులపై దాని ప్రభావాన్ని అధ్యయనం చేసేందుకు ఈ కేంద్రం ఎంతగానో దోహదపడుతుందన్నారు. అలాగే వర్షాలు కురవడంలో తేమ, ఉష్ణోగ్రతల పాత్ర, మబ్బుల నిర్మాణం, ఒక ప్రాంతంలో కురవబోయే వర్షం పరిమాణం వంటి అంశాలను తెలుసుకొనేందుకు వీలవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఐఐటీహెచ్ ఫ్రొఫెసర్ బీఎస్ మూర్తి, ప్రొఫెసర్ కీర్తి సాహు, మెకానికల్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్ అసోసియేట్ ప్రొఫెసర్ లక్ష్మణ దొర చంద్రాల, పరిశోధన విభాగం సభ్యులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
సంగారెడ్డి : మైలాన్ పరిశ్రమలో అగ్ని ప్రమాదం
-
మైలాన్ పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం.. ముగ్గురు మృతి
సాక్షి, జిన్నారం(పటాన్చెరు): మైలాన్ రసాయన పరిశ్రమ యూనిట్–1లో రసాయనాలను వేరు చేస్తున్న క్రమంలో జరిగిన ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు సజీవ దహనమయ్యారు. ఈ దుర్ఘటన సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం గడ్డపోతారం పారిశ్రామికవాడలో ఆదివారం జరిగింది. కార్మికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రసాయనాలను వేరు చేస్తున్న క్రమంలో ఒక్కసారిగా ఒత్తిడి ఎక్కువై మెరుపులు వచ్చాయి. యాసిడ్ మాదిరి కాలే గుణం ఉన్న రసాయనాలు ఒక్కసారిగా బయటకు ఎగజిమ్మాయి. అవి వంటి మీద పడటంతో చర్మం కాలి ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళానికి చెందిన వేర్‌హౌస్ అసిస్టెంట్ మేనేజర్ లోకేశ్వర్‌రావు (38), కార్మికులు వెస్ట్ బెంగాల్‌కు చెందిన పరితోష్ మెహతా (40), బిహార్‌కు చెందిన రంజిత్‌కుమార్ (27) అక్కడికక్కడే కాలిపోయారు. మంటలు కూడా చెలరేగినప్పటికీ సిబ్బంది వెంటనే స్పందించి ఆర్పివేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. చదవండి: (Hyderabad: వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠా అరెస్ట్) -
ఉపాధి కెళ్లినా డబ్బులు రావడంలే
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: గ్రామీణ ప్రాంతాల నుంచి వలసలను నివారించి కూలీలకు స్థానికంగా పని కల్పించడమే లక్ష్యంగా అమలు చేస్తున్న జాతీయ గ్రామీణ ఉపాధి పథకం రాష్ట్రంలో నీరుగారి పోతోంది. ఈ పథకం పనులకు వచ్చే కూలీల సంఖ్య భారీగా తగ్గుతుండటమే ఇందుకు నిదర్శనం. గతేడాదితో పోల్చితే ఈ పనులకు వెళ్తున్న కూలీల సంఖ్య 25 శాతానికి పడిపోవడం గమనార్హం. గతేడాది 2022 జనవరి 3న రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధి హామీ పనులకు వెళ్లిన కూలీల సంఖ్య 3,23,028 మంది కాగా, మంగళవారం (2023 జనవరి 3న) రోజు పనులకు హాజరైన కూలీల సంఖ్య కేవలం 72,371 అంటేనే వాస్తవ పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. ఈ పనులు చేసేందుకు కూలీల్లో ఆసక్తి తగ్గుతోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రోజు వారీ కూలీ సగటున రూ.211 ఉపాధి హామీ పనులు చేసిన వారికి సకాలంలో కూలీ డబ్బులు అందకపోవడమే ఇందుకు ప్రధాన కారణమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సాధారణంగా కూలీలకు 15 రోజుల్లో కూలీ డబ్బులు చెల్లించాలి. కానీ నెలల తరబడి చెల్లింపుల్లో జాప్యం జరుగుతోంది. ►కొందరు కూలీలకు గతేడాది ఆగస్టు నుంచి డబ్బులు రాలేదు. ఈ డబ్బుల కోసం అధికారుల చుట్టూ తిరగాల్సి వస్తోంది. ►ఉపాధి పనులకు వెళితే కూలీ గిట్టుబాటు కాకపోవడము కూడా కారణమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఉపాధి కూలీలకు రోజుకు సగటున రూ.211లు వస్తోంది. ప్రస్తుతం వ్యవసాయ కూలీలకు డిమాండ్ అధికంగా ఉంది. రబీ పంటలు.. వరి నాట్లు, పత్తి తీయడం వంటి పనులకు వెళితే ఇంతకు రెండింతలు కూలీ గిట్టుబాటు అవుతోంది. ►మారుతున్న నిబంధనలు కూడా ఓ కారణమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రస్తుతం పనులకు వెళుతున్న కూలీలు ప్రత్యేక యాప్‌లో రెండు పూటలా ఫొటోలు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అయితే సెల్‌ఫోన్ నెట్వర్క్ లేని చోట్ల ఈ ప్రక్రియ వీలు కావడం లేదు. 66 లక్షల మంది కూలీలు.. రూ.2,841 కోట్ల పనులు.. రాష్ట్ర వ్యాప్తంగా 56.74 లక్షల జాబ్‌కార్డులుండగా, మొత్తం 1.18 కోట్ల మంది కూలీలు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. ఇందులో 37.09 లక్షలు యాక్టివ్ జాబ్‌కార్డులు కార్డుదారులు కాగా, 66.44 మంది కూలీలు ఉపాధి హామీ పనులకు వెళుతున్నారు. ఈ ఆర్థిక సంవత్సరం 2022–23లో ఇప్పటి వరకు రూ. 2,841.17 కోట్ల మేరకు ఉపాధి హామీ పనులు జరిగాయి. ఇందులో కూలీలకు చెల్లించిన వేతనం రూ.1,791.10 కోట్లు కాగా, మెటీరియల్ కాంపోనెంట్ కింద రూ.875.35 కోట్లు ఖర్చు చేశారు. సెప్టెంబర్‌లో చేసిన పనికి ఇంకా డబ్బులు రాలే.. గతేడాది సెప్టెంబర్‌లో గ్రామంలో ఉపాధి పనులకు వెళ్లాను. ఇప్పటికీ కూలీ డబ్బులు రాలేదు. ఎప్పుడు ఇస్తారోనని ఎదురు చూస్తున్నాను. అధికారులను ఎన్నిమార్లు అడిగినా ప్రయోజనం లేకుండా పోయింది. – భూమయ్య, ఉపాధి కూలీ, జంబిగి, సంగారెడ్డి జిల్లా ఇతర పనులకు వెళ్తున్నాం.. సరిగ్గా డబ్బులు రాకపోవడంతో ఉపాధి పనులకు వెళ్లడం లేదు. ఇతర వ్యవసాయ పనులకు వెళుతున్నాం. సెప్టెంబర్‌లో చేసిన పనులకే ఇంకా కూలీ డబ్బులు రాలేదు. పనులు చేసుకుంటేనే పూట గడిచే మాకు వెంటనే కూలీ డబ్బులు చెల్లించాలి. – మణెమ్మ, ఉపాధి కూలీ,జంబిగి, సంగారెడ్డి జిల్లా -
సంగారెడ్డి ఆస్పత్రిలో దారుణం.. పోలీసుల నిర్లక్ష్యం, 15 రోజులు మార్చురీలోనే
సాక్షి, సంగారెడ్డి: పోలీసులు.. డాక్టర్ల నిర్లక్ష్యంతో 15 రోజులు మార్చురీలోనే ఓ మృతదేహం కుళ్లిపోయింది. చివరకు సమాచారం తెలుసుకున్న కుటుంబీకులు, బంధువులు.. పోలీసులు, అధికారుల నిర్లక్ష్యం వల్లనే ఇలా జరిగిందంటూ పెద్దఎత్తున సంగారెడ్డి జిల్లా కేంద్ర ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. దాంతో పోలీసులు లాఠీలకు పనిచెప్పారు. శుక్రవారం చోటుచేసుకున్న ఈ ఉదంతం పూర్వాపరాలిలా.. గత నెల 18వ తేదీన సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం సుల్తాన్పూర్ జేఎన్టీయూ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో చిన్న శ్రీనివాస్(28)కు తీవ్ర గాయాలయ్యాయి. 108లో సంగారెడ్డి ప్రభుత్వాస్పత్రికి తరలించగా.. వైద్యులు చికిత్స చేసినా ప్రయోజనం లేకపోయింది. డిసెంబర్ 23న మృతి చెందాడు. వాస్తవానికి 108 సిబ్బంది 18వ తేదీనే పుల్కల్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయినా వారు స్పందించకపోవడం.. మృతుడికి సంబంధించిన వారు ఎవరూ రాకపోవడంతో గుర్తుతెలియని వ్యక్తిగా భావించి మార్చురీకి తరలించారు. దాదాపు పదిహేనురోజులు కావడంతో శవం పూర్తిగా కుళ్లిపోయి దుర్వాసన రావడాన్ని గమనించిన అక్కడి ఉద్యోగులు మున్సిపల్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. శవాన్ని తరలించే క్రమంలో మృతుడి జేబులో ఉన్న ఆధార్‌కార్డును పరిశీలించారు. అందులో ఉన్న వివరాల మేరకు మృతుడు ఝరాసంఘం మండలం కృష్ణాపూర్ గ్రామానికి చెందిన శ్రీనివాస్‌గా గుర్తించారు. పోలీసులు, కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు. ఒక్కసారిగా షాక్‌కు గురైన కుటుంబసభ్యులు పోలీసుల నిర్లక్ష్యంపై నిరసన వ్యక్తం చేస్తూ ప్రభుత్వాస్పత్రి ఎదుట పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. అదే సమయంలో జిల్లా పరిషత్ జనరల్‌బాడీ సమావేశానికి వచ్చిన మంత్రి హరీశ్‌రావును కలిసేందుకు నినాదాలు చేసుకుంటూ ఆస్పత్రి నుంచి జెడ్పీ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. జెడ్పీ కార్యాలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా, పోలీసులు అడ్డుకొని లాఠీచార్జ్ చేసి, పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. చదవండి: గంగాధర మిస్టరీ మరణాల్లో కొత్తకోణం.. మమత శరీరంలో ఆర్సెనిక్! బాధ్యులపై చర్యలకు మంత్రి ఆదేశం విషయం తెలుసుకున్న మంత్రి హరీశ్‌రావు మృతుడి కుటుంబసభ్యులు, బంధువులను సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయానికి పిలిపించారు. శ్రీనివాస్ మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనలో పోలీసులు, డాక్టర్ల వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోందన్నారు. జరిగిన ఘటనపై సమగ్ర విచారణ జరపాలని సంగారెడ్డి కలెక్టర్ శరత్‌ను మంత్రి ఆదేశించారు. విచారణ తర్వాత బాధ్యులపై కఠినంగా చర్యలు తీసుకుంటామని మంత్రి బాధితులకు హామీ ఇచ్చారు. కాగా, భర్త మృతిపై మంత్రికి విన్నవించుకుందామని వెళుతుంటే అడ్డుకొని కర్కశంగా తన కడుపులో కాలుతో తన్నిందని మృతుడు శ్రీనివాస్ భార్య సంగీత ఓ మహిళా కానిస్టేబుల్, పోలీసుల తీరుపై మండిపడుతూ రోడ్డుపై రోదించిన తీరు కలచివేసింది. శ్రీనివాస్ సినీ ఇండస్ట్రీలో సీరియల్ ఆర్టిస్టుగా పనిచేస్తూ జీవనం సాగించేవాడని, వారం, పదిహేనురోజులకోసారి షూటింగ్‌ల నుంచి ఇంటికి వచ్చి వెళ్తారని ఆ నమ్మకంతోనే కుటుంబసభ్యులు శ్రీనివాస్ గురించి ఆరా తీయలేదని చెబుతున్నారు. -
మియాపూర్ టు సంగారెడ్డి ట్రాఫిక్ రద్దీకి చెక్.. ఆరు వరుసలుగా రోడ్డు
సాక్షి, హైదరాబాద్: మియాపూర్–సంగారెడ్డి మార్గంలో నిత్యం నరకప్రాయంగా ఉన్న ట్రాఫిక్ రద్దీకి తెరపడనుంది. ట్రాఫిక్ చిక్కులు తొలగిపోనున్నాయి. ఈ మేరకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. మియాపూర్ నుంచి సంగారెడ్డి కూడలి (పోత్రెడ్డిపల్లి చౌరస్తా) వరకు ప్రస్తుతం నాలుగు వరుసలుగా ఉన్న రోడ్డును ఆరు వరుసలుగా 60 మీటర్లకు విస్తరించనున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి డీపీఆర్ సిద్ధమైంది. వారం రోజుల్లో ఇది కేంద్ర ఉపరితల రవాణాశాఖ మంత్రిత్వ కార్యాలయ అనుమతి కోసం ఢిల్లీ చేరనుంది. అక్కడి నుంచి అనుమతులు రాగానే టెండర్లు పిలిచేందుకు జాతీయ రహదారుల విభాగం ఏర్పాట్లు చేస్తోంది. 31 కి.మీ. నిడివి ఉన్న ఈ రోడ్డు విస్తరణకు రూ.1,400 కోట్ల వ్యయం కానుంది. ఇందులో రోడ్డునిర్మాణ పనులకు రూ.వేయి కోట్లు, భూసేకరణ పరిహారానికి రూ.400 కోట్లు ఖర్చు కానుంది. నగరంలోనే పెద్ద రోడ్డుగా.. ఈ మార్గంలోనే ఉన్న కూకట్పల్లి వద్ద అత్యంత రద్దీ ట్రాఫిక్ వాహనదారులను బెంబేలెత్తిస్తోంది. మెట్రోరైలు ప్రాజెక్టులో భాగంగా జీహెచ్ఎంసీ ఇప్పటికే మియాపూర్ వరకు రోడ్డును విస్తరించింది. అక్కడి నుంచి రోడ్డు విస్తరణ బాధ్యతను జాతీయ రహదారుల విభాగం తీసుకుంది. ఈ రోడ్డు 60 మీటర్లకు వెడల్పు కానుంది. ప్రధాన క్యారేజ్ వే, దాని పక్కన సర్వీస్ రోడ్లు కలిపి 200 అడుగుల విశాలంతో రోడ్డు ఏర్పడుతుంది. నగరంలో విశాలంగా ఉన్న ప్రధాన రోడ్డు ఇదే కానుంది. ప్రస్తుతం రోడ్డు నాలుగు వరుసలుగా ఉన్నా.. 60 మీటర్ల స్థలం మాత్రం అందుబాటులో ఉంది. ఇప్పుడు ఆ మొత్తం రోడ్డుగా మారబోతోంది. అవసరమైన చోట్ల ఫ్లైఓవర్లు ఈ రోడ్డులో వాహనాలకు క్రాసింగ్ రోడ్లతో ఇబ్బంది లేకుండా ఫ్లైఓవర్లను నిర్మిస్తారు. ఇందులో బీహెచ్ఈఎల్ వద్ద ఫ్లైఓవర్ రానుంది. దీనిని ఈ రోడ్డులో భాగంగానే నిర్మించాల్సి ఉంది. అక్కడ ట్రాఫిక్ చిక్కుల దృష్ట్యా ఆ పనులను విడదీశారు. త్వరలో అక్కడ నిర్మాణ పనులు జరగబోతున్నాయి. ఇక పటాన్చెరు, ఇస్నాపూర్, ముత్తంగి, రుద్రారం,కంది ప్రాంతాల్లో ఫ్లైఓవర్లను నిర్మించనున్నారు. నగరంలో ప్రస్తుతం రోడ్డు విస్తరణకు వీలుగా 60 మీటర్ల స్థలం అందుబాటులో ఉంది. కొన్ని ప్రాంతాల్లో తప్ప పెద్దగా నిర్మాణాలు అడ్డుగా లేవు. బీహెచ్ఈఎల్ దాటిన తర్వాత చాలా ప్రాంతాల్లో నిర్మాణాలను తొలగించాల్సి ఉంది. ఏప్రిల్ నాటికి టెండర్లు పూర్తి చేసి జూలై నాటికి పనులు ప్రారంభించేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. పనులు ప్రారంభమైన రెండేళ్లలో పూర్తి చేయాలన్నది లక్ష్యం. కానీ, రెండున్నరేళ్లలో పూర్తవుతుందని అంచనా వేస్తున్నారు. -
సంగారెడ్డి: రామచంద్రాపురంలో రోడ్డు పక్కనే మహిళ ప్రసవం
-
సంగారెడ్డి: నరకయాతన.. నడిరోడ్డుపైనే ప్రసవం
సాక్షి, సంగారెడ్డి: బిజీ లైఫ్.. మనిషి కళ్లకు గంతలు కట్టేసింది. సాయానికి ప్రయత్నిస్తే.. లేనిపోని సమస్యలు మెడకు చుట్టుకుంటాయేమోనని వెనుకంజ వేస్తున్నారు కొందరు. ఈ క్రమంలో కనీస సాయాన్ని కూడా బాధ్యతగా స్వీకరించడం లేదు. తాజాగా.. జిల్లాలోని రామచంద్రాపురం అశోక్‌నగర్ జరిగిన ఓ ఘటన చర్చనీయాంశంగా మారింది. నడిరోడ్డుపైనే బిడ్డకు జన్మనిచ్చింది ఓ యువతి. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా హఠాత్తుగా ఆమెకు పురిటి నొప్పులు వచ్చాయి. రోడ్డు మీద పడిపోయి విలవిలలాడిందామె. అటుగా వెళ్తున్న కొందరు పట్టించుకోకుండా ముందుకు వెళ్లిపోయారు. కాసేపటికి ఆమె అవస్థను గమనించిన కొందరు షాపుల వాళ్లు.. అట్టముక్కలు అడ్డుపెట్టి అక్కడే ఆమెకు ప్రసవం చేశారు. ప్రసవం అనంతరం తల్లీబిడ్డలకు కొంత డబ్బుసాయం అందించి పఠాన్‌చెరువు ఏరియా ఆసుపత్రికి ఆటోలో తరలించారు. ఆ యువతిని ఇస్నాపూర్‌కు చెందిన బబితగా గుర్తించారు. స్థానికులు సకాలంలో స్పందించడంతోనే ఆ తల్లీబిడ్డకు గండం తప్పిందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. -
సంగారెడ్డి : చిరుత చిక్కింది
-
సంగారెడ్డిలో రెస్క్యూ ఆపరేషన్ విజయవంతం.. చిరుత చిక్కిందిలా!
సంగారెడ్డి జిల్లాలో చిరుత రెస్క్యూ ఆపరేషన్ విజయవంతంగా ముగిసింది. చిరుతను బంధించేందుకు ఫారెస్ట్ అధికారులు మత్తు ఇంజెక్షన్ ఇచ్చారు. అనంతరం దానిని బోన్లోకి ఎక్కించి జూకి తరలించారు. కాగా చిరుత సంచారం దృష్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఇవి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. జిన్నారం మండలం గడ్డపోతారం పారిశ్రామిక వాడలో ఉన్న రసాయన పరిశ్రమలో చిరుత కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. హెటిరో పరిశ్రమలోని హెచ్ బ్లాక్‌లో ఉదయం నాలుగు గంటల సమయంలో చిరుత ప్రవేశించింది. చిరుత రాకను గమనించిన ఉద్యోగులు భయాందోళనలకు గురయ్యారు. వెంటనే అక్కడి నుంచి బయటకు వచ్చి తలుపులు మూసివేశారు. అనంతరం పోలీసులు, అటవీశాఖ సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో నెహ్రూ జూపార్కు నుంచి ప్రత్యేక బృందం హెటిరో పరిశ్రమకు చేరుకుని గాలింపు చేపట్టింది. కాజీపల్లి అటవీప్రాంతం నుంచి చిరుత వచ్చిన్నట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. -
ధర ఎంతైనా తగ్గేదేలే..హైదరాబాద్‌లో మాకు ఆ ఏరియా ఇళ్లే కావాలి!
రియల్ ఎస్టేట్‌లో హైదరాబాద్ జెట్ స్పీడులో దూసుకెళ్తోంది. దేశంలోని మెట్రో సిటీస్‌ను వెనక్కి నెట్టి ముందుకెళుతోంది. అక్కడ ఇక్కడా అని కాకుండా హైదరాబాద్ నలువైపులా వందలాది రియల్ఎస్టేట్ ప్రాజెక్ట్‌లతో తన మార్క్‌ను చూపుతోంది. నిర్మాణ రంగంలో సరికొత్త ట్రెండ్ సెట్ చేస్తోంది. కరోనా తర్వాత బాగా పంజుకున్న రియల్ ఎస్టేట్ మార్కెట్ స్థిరంగా కొనసాగుతోంది. సొంతింటి కలను నిజం చేసుకునేందుకు ఇదే అనువైన సమయంగా కొనుగోలు దారులు భావిస్తున్నారు. దీంతో హైదరాబాద్‌లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ , ఐటీ ఆధారిత కంపెనీలు కేంద్రీకృతమైన ప్రాంతాలలో గృహాలకు భారీ డిమాండ్ ఏర్పడింది. ఫలితంగా నగర శివారు ప్రాంతమైన తెల్లాపూర్ ఇప్పుడు రెసిడెన్షియల్ హబ్‌గా అవతరిస్తోంది. ఈ ప్రాంతంలో ఇళ్లను సొంతం చేసుకునేందుకు కొనుగోలు దారులు ఉత్సాహాం చూపిస్తున్నారు. సంగారెడ్డి జిల్లా ,రామచంద్రాపురం మండల పరిధిలోని తెల్లాపూర్ ఏరియా శాటిలైట్ టౌన్‌గా ఉండేది. అయితే ఐటీ రంగం అభివృద్ధి చెందడం, నగరంలోని ఐటీ హబ్, ఔటర్ రింగ్ రోడ్‌కు సమీపంలో ఉండటంతో అనేక మంది టెక్ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులు ఇక్కడ స్థిరపడేందుకు మక్కువ చూపుతున్నారు. దీనికి తోడు ఫేస్బుక్, డెలాయిట్, హెచ్ఎస్బీసీ, ఆప్టమ్, క్వాల్కామ్, విప్రో, ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్, నోవార్టిస్ల కార్యాలయాలు తెల్లాపూర్, సమీప ప్రాంతాలలో ఉండడం రియల్ ఎస్టేట్ బూమ్‌కు మరింత ఊతం ఇస్తున్నట్లు నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకుముందు లింగం పల్లి ఇప్పుడు తెల్లాపూర్ గృహ కొనుగోలుదారుల దృష్టిని ఆకర్షిస్తోందని, ముఖ్యంగా ఐటీ ఉద్యోగులు ఈ ప్రాంతంలో ప్లాట్లు, ఫ్లాట్లు, ఇళ్లు కొనుగోలు చేసేలా ఆకర్షిస్తున్నట్లు రియల్టర్లు చెబుతున్నారు. ఇంతకుముందు రియల్టీ బూమ్ 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న లింగంపల్లి వంటి ప్రాంతాలకు మాత్రమే పరిమితమైందని, అయితే నగరంలో ఐటీ రంగం వృద్ధితో ఇది విస్తరించిందని, భవిష్యత్‌లో ఈ ప్రాంతంలో మరింత రియాల్టీ అభివృద్ధి జరుగుతుందని అంటున్నారు. చదరపు అడుగు ఎంతంటే ఈ తరుణంలో క్రెడాయ్ ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ రెడ్డి తెల్లాపూర్‌లో రియల్ బూమ్‌పై మాట్లాడుతూ... ప్రస్తుతం ఆ ప్రాంతంలో ఇళ్లు చదరపు అడుగుకు సగటున రూ. 7,000 నుండి రూ. 8,000 వరకు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. 1,000 చదరపు అడుగుల నుంచి 1,200 చదరపు అడుగుల విస్తీర్ణంలో 2బీహెచ్‌కే ఇళ్ల ధర దాదాపు రూ. 1.2 కోట్లు ఖర్చవుతుండగా, 3బీహెచ్‌కే రూ. 1.5 కోట్లకు పైగా ధరలకు అమ్ముతున్నట్లు అంచనా వెలసిన ప్రాజెక్ట్‌లు తెల్లాపూర్ ఐటీ పరిసర ప్రాంతాల్లో ఐటీ బూమ్‌తో మై హోమ్, రాజపుష్ప, హానర్ హోమ్స్, రామ్కీ, వెర్టెక్స్ హోమ్స్ వంటి రియాల్టీ డెవలపర్లు ఇప్పటికే అక్కడ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్‌లను ప్రారంభించాయి. అపర్ణా కన్స్ట్రక్షన్స్ ఈ ప్రాంతంలో మాల్‌ను ఏర్పాటు చేస్తుండగా..మల్టీప్లెక్స్‌లు, వాణిజ్య సముదాయాలను నిర్మించేందుకు బిల్డర్లు ముందుకు వస్తున్నారు. కనెక్టివిటీ బాగుంది తెల్లా పూర్ సమీపంలో మియాపూర్ మెట్రో స్టేషన్, టీఎస్ఆర్టీసీ బస్సు సదుపాయం ఉంది. ఆ ప్రాంత నివాసితులు తక్కువ సమయంలో నగరంలోని ఏ ప్రాంతానికైనా చేరుకోవచ్చు. మాదాపూర్ నుండి 15 కి.మీ, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి దాదాపు 30 కి.మీ, రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి కేవలం 30 నిమిషాల దూరంలో ఉన్న తెల్లాపూర్ నగరంలోని అన్ని ప్రాంతాలకు మంచి రహదారి కనెక్టివిటీని కలిగి ఉంది. ఎంఎంటీఎస్ సౌకర్యం పెరుగుతున్న డిమాండ్ల మధ్య, దక్షిణ మధ్య రైల్వే (SCR) ఈ ప్రాంతానికి ఎంఎంటీఎస్ కనెక్టివిటీని అందించాలని యోచిస్తోంది. 10 కి.మీ దూరంలో ఉన్న మియాపూర్ వంటి ప్రాంతాలకు లింగంపల్లి ద్వారా చేరుకోవచ్చు, కొల్లూరు ఓఆర్ఆర్ ద్వారా చేరుకోవచ్చు. ప్రభుత్వం రోడ్ల నిర్మాణంతో పాటు ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు (FoBs) నిర్మించేందుకు ప్రణాళికల్ని సిద్ధం చేసింది. -
ఆన్లైన్లో రూ.10 లక్షలు పెట్టుబడి.. సాఫ్ట్వేర్ ఉద్యోగి అదృశ్యం
సాక్షి, మెదక్: ఆన్లైన్లో పెట్టుబడి పెట్టి నష్టపోవడంతో కుటుంబ సభ్యులు మందలించారు. దీంతో మనస్తాపం చెంది ఓ సాఫ్ట్వేర్ అదృశ్యమైన సంఘటన అమీన్పూర్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్ఐ కిష్టారెడ్డి కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. అమీన్పూర్ పరిధి కేఎస్ఆర్ కాలనీకి చెందిన సాయిపవన్ సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. కాగా ఇటీవల ఆన్లైన్లో రూ.10 లక్షలు పెట్టుబడి పెట్టి నష్టపోయాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు మందలించారు. దీంతో 14వ తేదీన ఇంట్లో ఎవరికి చెప్పకుండా వెళ్లిపోయాడు. కుటుంబ సభ్యులు తెలిసిన వారిని, బంధువులను విచారించినా అతడి ఆచూకీ లభించలేదు. తమ్ముడి అదృశ్యంపై అన్న మహేశ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: చెత్తను శుభ్రం చేస్తుండగా కదలికలు.. తీరా చూస్తే! -
సంగారెడ్డి: టీఆర్ఎస్ బైక్ ర్యాలీలో అపశ్రుతి
సాక్షి, సంగారెడ్డి: జిల్లా కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ చేపట్టిన బైక్ ర్యాలీలో అపశ్రుతి చోటు చేసుకుంది. మంగళవారం తెలంగాణలో ఎనిమిది కొత్త మెడికల్ కాలేజీల ప్రారంభోత్సవం జరిగిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా.. సంగారెడ్డి కాలేజీ ప్రారంభోత్సవ ర్యాలీలో బాణాసంచా పేల్చారు టీఆర్ఎస్ కార్యకర్తలు. అయితే బాణాసంచా ఉన్న ఆటోకి మంటలు అంటుకుని.. భారీ శబ్ధాలతో పేలిపోయాయి. ఈ ప్రమాదంలో పలువురికి గాయాలు కాగా, మంటలు అంటుకుని ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌కు ప్రాణాపాయం తప్పింది. స్వల్ఫ గాయంతో ఆయన బయటపడ్డారు. ప్రస్తుతం గాయపడిన వాళ్లకు చికిత్స అందుతోంది. ఇదీ చదవండి: అలా కాదు.. ఇలా ఉంటాడు.. -
నిత్యం పొడవాటి గడ్డంతోనే..! ఈ ఫొటోలో ఉన్న వ్యక్తిని గుర్తు పట్టారా?
తెలంగాణకు చెందిన ఆ కాంగ్రెస్ నేత స్టైలే వేరు. రాజకీయాలపై మాట్లాడితే మాటల తూటాలే. చూడటానికి కూడా గంభీరంగా ఉంటారు. ఆయనకంటూ ప్రత్యేక హెయిర్ స్టైల్, గడ్డం, నడక తీరు ఉంటుంది. ఎప్పుడూ బారెడు గడ్డం, పొడవాటి మీసంతో జనాల్లో కనిపించే ఆ కాంగ్రెస్ నేత ఒక్కసారిగా మారిపోయారు. నిత్యం గడ్డం, మీసాలు పెంచుతూ ఉండే ఆయన ఉన్నట్టుండి క్లీన్‌షేవ్‌తో దర్శనమిచ్చారు .దీంతో ఆయనను గుర్తుపట్టడం కొందరికి కష్టమైపోయింది. తిరుపతి వెంకన్న భక్తుడైన ఆ కాంగ్రెస్ నేత ఎవరో కాదు.. మన సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్‌రెడ్డి అలియాస్ జగ్గారెడ్డి. ఆయన తిరుమల శ్రీవారిని సతీసమేతంగా దర్శించుకున్నారు. తలనీలాలు సమర్పించి మొక్కుతీర్చుకున్నారు. దీంతో జగ్గారెడ్డిని గడ్డం మీసాలు లేకుండా గుర్తుపట్టలేకపోతున్నారు కొందరు. అసలు ఆయనేనా అని పరీక్షించి చూస్తున్నారు. ప్రస్తుతం జగ్గారెడ్డి కొత్త లుక్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా, జగ్గారెడ్డికి దైవ భక్తి ఎక్కువ. తరుచూ పూజల్లో పాల్గొంటారు. పండుగల సందర్భంగా చందాల కోసం వచ్చిన భక్తులకు తనకు తోచిన సాయాన్ని చేస్తూనే ఉంటారు.. ఇటీవల రాహుల్ భారత్ జోడో యాత్ర ఆయన నియోజకవర్గంలో (సంగారెడ్డి) ప్రవేశించిన సందర్భంగా జగ్గారెడ్డి కొరడాలతో కొట్టుకుంటూ పోతురాజులను అనుకరించిన విషయం తెలిసిందే. చదవండి: ED Raids Telangana: గ్రానైట్ కంపెనీల్లో సోదాలపై ఈడీ కీలక ప్రకటన -
నారాయణఖేడ్ కస్తూర్బా బాలికల హాస్టల్ లో ఫుడ్ పాయిజన్
-
పోతరాజు అవతారమెత్తిన రాహుల్
-
ప్రాణం తీసిన నిద్రమత్తు.. ఔటర్‌పై ఘోర రోడ్డు ప్రమాదం.. కంటైనర్‌ను ఢీ కొట్టిన వింగర్
మేడ్చల్‌రూరల్: శ్రీశైలంలో వెళ్లి వస్తున్న భక్తులు మరో అరగంటలో తమ ఇళ్లకు చేరుకుంటామనుకునేలోపు డ్రైవర్ నిద్ర మత్తు ఘోర రోడ్డు ప్రమాదానికి దారితీసింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. వివరాల్లోకి వెళితే సంగారెడ్డి జిల్లా గుమ్మడిదలకు చెందిన శంకర్‌గుప్త, చిట్కూల్ గ్రామానికి చెందిన సురేశ్ గుప్త కుటుంబసమేతంగా ఆదివారం తెల్లవారుజామున గుమ్మడిదల నుంచి వింగర్ వాహనంలో డ్రైవర్ నర్సింహారెడ్డితో కలిసి మొత్తం 12 మంది శ్రీశైలం బయలుదేరారు. స్వామి వారి దర్శనం అనంతరం సాయంత్రం తిరుగు ప్రయాణమయ్యారు. మరో అరగంటలో తమ ఇళ్లకు చేరకుంటామనుకునేలోగా వారు ప్రయాణిస్తున్న వింగర్ వాహనం డ్రైవర్ నర్సింహారెడ్డి నిద్రమత్తులో ఔటర్ రింగురోడ్డుపై మేడ్చల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో కండ్లకోయ వద్ద ముందు వెళ్తున్న కంటైనర్ వాహనాన్ని వెనుక నుంచి వేగంగా ఢీకొట్టాడు. కంటైనర్‌ను ఢీకొట్టిన వాహనం డివైడర్‌పైకి దూసుకెళ్లింది. (చదవండి: 'నాన్నా అమ్మను రోజూ ఎందుకు కొడతావు.. మాతో ఎందుకు సంతోషంగా ఉండవు') ఈ ఘటనలో డ్రైవర్ నర్సింహారెడ్డి(28), శంకర్‌గుప్త(46), సురేశ్‌గుప్త(45) అక్కడికక్కడే మృతి చెందారు. వాహనంలో ఉన్న 9 మందిలో 8 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులు సికింద్రాబాద్ య శోద ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా వీరిలో ఇద ్దరి పరిస్థితి విషమంగా ఉంది. మృతుడు శంకర్ గుప్త భార్య కాలు విరగ్గా, కుమార్తె ఊపిరితిత్తుల్లోకి నీరు చేరినట్లు సమాచారం. మేడ్చల్ సీఐ రాజశేఖర్‌రెడ్డి, సిబ్బంది సంఘటనా స్థలికి చేరుకుని ప్రమాద తీరును పరిశీలించారు. మృతదేహాలను గాంధీ మార్చురీకి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. డ్రైవర్ విశ్రాంతి లేకుండా వాహనం నడపడంతో నిద్రమత్తుకు గురికావడం, అతివేగం ప్రమాదానికి కారణమని ప్రాథమిక దర్యాప్తులో తెలిసిందని సీఐ తెలిపారు. (చదవండి: పెళ్లైన విషయం దాచి.. ఒకేసారి ఇద్దరు విద్యార్థినిలను కిడ్నాప్‌చేసి సహజీవనం) -
60వేల మందితో రాహుల్‌కు స్వాగతం
కొండాపూర్(సంగారెడ్డి): నవంబర్ 3న సంగారెడ్డిలో ప్రారంభమయ్యే రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు 60వేల మందితో స్వాగతం పలుకు తామని సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జగ్గారెడ్డి తెలిపారు. సోమవారం మల్కాపూర్‌లో కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. నెహ్రూ ప్రధాని అయ్యాక రాంచంద్రాపూర్‌లో బీహెచ్ఈఎల్, ఇందిరా గాంధీ మెదక్ నుంచి ఎంపీగా గెలిచి ప్రధాని అయ్యాక బీడీఎల్, ఓడీఎఫ్ వంటి పరిశ్రమలు, సోనియాగాంధీ హయాంలో సంగారెడ్డిలో ఐఐఐటీ ఏర్పాటయ్యాయని గుర్తుచేశారు. సంగారెడ్డి నియోజకవర్గంలో 25 కి.మీ మేర రాహుల్ గాంధీ పాదయాత్ర కొనసాగతుందని, యాత్రను విజయవంతం చేయాలని కోరారు. మండలాల అధ్యక్షులు ప్రభు, బుచ్చిరాములు, రాంరెడ్డి, ప్రకాష్ చెర్యాల ఆంజనేయులు, ప్రభుదాసు, రఘు గౌడ్, వెంకటేశం గౌడ్, సునీల్ పాల్గొన్నారు. -
అపరిచితుడితో ఫోన్లో మాట్లాడి వివాహిత అదృశ్యం.. మరోచోట విద్యార్థిని..
సాక్షి, సంగారెడ్డి: వివాహిత అదృశ్యమైన సంఘటన శనివారం జరిగింది. నారాయణఖేడ్ ఎస్ఐ వెంకట్‌రెడ్డి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నాగల్గిద్ద మండలం ఇరక్‌పల్లికి చెందిన జంగెదొడ్డి సునీల్ (30), జంగెదొడ్డి సునీత (25) దంపతులు కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. సెప్టెంబర్ 27వ తేదీ సాయంత్రం 7 గంటల సమయంలో నారాయణఖేడ్‌లోని సువర్ణ షెట్కార్ టాకీసు సమీపంలో అపరిచితుడితో ఫోన్లో మాట్లాడి అక్కడి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. దీంతో భర్త బందువులు, తెలిసిన వారిని విచారించినా ఆమె ఆచూకీ తెలియరాలేదు. సునీల్ ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. నర్సాపూర్‌రూరల్: విద్యార్థిని అదృశ్యమైన సంఘటన శనివారం జరిగింది. నర్సాపూర్ పట్టణ పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. నర్సాపూర్‌కు చెందిన నర్సింలు కూతురు పూజిత (19) శనివారం అమ్మమ్మ ఇంటికి వెళ్తున్నట్లు చెప్పి వెళ్లింది. కాని అక్కడికి రాకపోవడంతో ఆందోళనకు గురైన పూజిత అన్న మల్లికార్జున్‌తోపాటు కుటుంబ సభ్యులు బంధువులు, స్నేహితులను విచారించినా ఆచూకీ లభించలేదు. దీంతో మల్లికార్జున్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. చదవండి: (రెండుసార్లు ప్రేమలో విఫలం.. విధానసౌధలో బాంబు.. త్వరలో పేలిపోతుందని..) -
అమ్మానాన్న సరైన పేరు పెట్టలేదని.. డయల్ 100కు ఫిర్యాదు
నారాయణఖేడ్: అమ్మా.. నాన్న వీళ్ళిద్దరూ లేకుంటే మనకి ఈ జీవితం లేదు . ఈ పంచభూతాలను పరిచయం చేసిన దైవాలు వారు.. మనం ఈరోజు ఇంత స్వేచ్ఛగా జీవిస్తున్నామంటే దానికి ప్రధాన కారణం తల్లిదండ్రులే.. వారు తిన్నా.. తినకపోయినా పిల్లల కడుపును మాత్రం ఎప్పుడు నింపేందుకు తీవ్రంగా శ్రమిస్తారు.పిల్లలు పుట్టిన తర్వాత వారి బాగోగుల గురించి ఆలోచిస్తూ వారికి ఏ రకమైన బట్టలు కొనాలి? ఎం పేరు పెట్టాలి? ఏ స్కూల్లో చదివించాలి? అలా ఉన్నతమైన ఉత్తమమైనది ఎంపిక చేసి పిల్లలకి తల్లిదండ్రులు ఎప్పుడూ ది బెస్ట్ ఇస్తుంటారు.. ఇంత చేస్తున్నా ఆ తల్లిదండ్రులని నేడు యువత అర్థం చేసుకోవడంలో పూర్తిగా విఫలమవుతున్నారని చెప్పవచ్చు.. నిత్యం ఎక్కడో ఒకచోట తల్లిదండ్రుల మీద ఆకృత్యాలకు పాల్పడుతున్న పిల్లల వార్తలను మనం గమనిస్తూనే ఉన్నామ్. ఇందులో ముఖ్యంగా ఒక చోట ఏం సంపాదించి ఇచ్చారని వారిపైకి గొడవకు వెళుతున్న పిల్లలైతే.. మరో చోట అడిగింది కొనిపెట్టలేదని కక్ష పెంచుకొని ఇష్టారీతిగా ప్రవర్తిస్తున్న వారు మరికొందరు. తల్లిదండ్రులు ఎంత శ్రమిస్తే మన జీవితం ఇలా ఆనందమయంగా సాగుతుందన్న విషయాన్ని మరిచి వారిపైనే దాడికి పాల్పడుతున్న సంఘటనలు అనేకం. ఇప్పుడు మనం చర్చించుకునే ఈ వార్త ఇంకాస్త చిత్రంగా కొత్తగా అనిపించక మానదు. ఓ ప్రబుద్ధుడు తనకు మంచి పేరు పెట్టలేదని కని, పెంచిన తల్లిదండ్రులపైనే కోపం పెంచుకున్నాడు. నిత్యం వారిని ఈ విషయంలో వేధిస్తూ వాదనకు దిగేవాడు. ఈ ఆలోచన తారా స్థాయికి చేరిన ఆ యువకుడు మంచి పేరు పెట్టలేదని ఏకంగా 100 నంబర్ కు ఫోన్ చేసి తల్లిదండ్రులపైనే పోలీసులకు ఫిర్యాదు చేయడం గమనార్హం.ఈ ఫిర్యాదు అందుకున్న పోలీసులు అవాక్కయ్యారు. ఇదేంటిది.. కొత్తగా.. వింతగా అని ఆలోచించడం వారివంతయింది. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం లోని కిషన్ నాయక్ తండాలో ఇటీవల చోటు చేసుకుంది. ఇంతకీ ఆ యువకుడి పేరు ఏంటో తెలుసా.. కర్ర సురేష్. అతడి వయసు 23 సంవత్సరాలు. కాగా పోలీసులు ఈ విషయంపై మాట్లాడుతూ ఇలాంటి అంశాలపై ఫిర్యాదు చేసి విలువైన సమయాన్ని వృథా చేయవద్దని, ఇలా చేయడం వల్ల అత్యవసరంలో ఉన్న వారికి ఫోన్ లైన్ దొరక్క ఇబ్బందులు పడే అవకాశం ఉందని పోలీసులు హెచ్చరించారు. -
‘బోగస్ ప్రాజెక్టుకు కేంద్రం అవార్డులా?’
జోగిపేట (ఆంధోల్): మిషన్ భగీరథ బోగస్ ప్రాజెక్టు అని, ఈ పథకానికి కేంద్రం అవార్డు ఇవ్వడం సిగ్గుచేటని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. శుక్రవారం సంగారెడ్డి జిల్లా జోగిపేటలో నిర్వహించిన బహిరంగసభలో ఆమె మాట్లాడారు. ఈ ప్రాజెక్టును రూ.40 వేల కోట్లతో చేపట్టగా పెద్దమొత్తంలో కమీషన్లు తిన్నారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం సీఎం కేసీఆర్‌కు ఎందుకు అవార్డులిస్తోందని ఆమె ప్రశ్నించారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన రూ.100 కోట్ల సంక్షేమ నిధి ఏమైందని షర్మిల ప్రశ్నించారు. రాష్ట్రంలో దళితులపై దాడులు జరుగుతున్నా.. దళిత ఎమ్మెల్యేగా ఉన్న క్రాంతికిరణ్ ఏనాడూ ప్రశ్నించలేదని షర్మిల విమర్శించారు. నేరెళ్ల, మరియమ్మ ఘటనలపై ఈ ఎమ్మెల్యే నోరు మెదపలేదని మండిపడ్డారు. ఆయన చంటి క్రాంతికిరణ్ కాదని, కంత్రీ కిరణ్ అని షరి్మల ఎద్దేవాచేశారు. చదవండి: సాగరహారంపై ‘పిట్ట పోరు’.. కేటీఆర్–రేవంత్‌ల మాటల యుద్ధం -
నీట మునిగి ఐదుగురు విద్యార్థుల మృతి
షాద్‌నగర్/ హత్నూర (సంగారెడ్డి): రెండు వేర్వేరు ఘటనల్లో నీట మునిగి ఐదుగురు విద్యార్థులు మృత్యువాతపడ్డారు. ఇందులో ముగ్గురు చిన్నారులు సరదాగా ఆడుకోవడానికి వెళ్లి నీటి గుంతలోపడి ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరు బాలురు చెరువులో స్నానానికి వెళ్లి ప్రాణాలు పోగొట్టుకున్నారు. వివరాలిలా ఉన్నాయి.. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ మున్సిపాలిటీ పరిధిలోని సోలీపూర్ గ్రామానికి చెందిన సలీం, ఫిర్దోస్ దంపతుల కుమారుడు సైఫ్ (7), నయీమ్, ఖతీజా దంపతుల కొడుకు ఫరీద్ (13), భిక్షపతి, శివలీల దంపతుల కుమారుడు అక్షిత్‌గౌడ్ (8), సంజయ్‌కుమార్‌లు స్నేహితులు. స్థానిక ప్రభుత్వ పాఠశాలలో వీరు చదువుకుంటున్నారు. స్కూలుకు దసరా పండుగ సెలవులు ఇవ్వడంతో సోమవారం ఉదయం గ్రామ శివారులో ఏర్పాటు చేసిన ఓ రియల్ ఎస్టేట్ వెంచర్ వద్ద ఆడుకునేందుకు వెళ్లారు. కొద్దిసేపటి తర్వాత అక్కడ పనులకోసం తీసిన నీటి గుంతలోకి దిగారు. అయితే గుంత దాదాపు పది అడుగుల లోతు ఉండటంతో సైఫ్, ఫరీద్, అక్షిత్‌గౌడ్ నీటిలో మునిగి చనిపోయారు. ఈ ఘటనలో సంజయ్ త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. తమ పిల్లలను విగతజీవులుగా చూసి వారి తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. షాద్‌నగర్‌లో ధర్నా ఈ సమాచారం అందుకున్న ఏసీపీ కుషాల్కర్, సీఐ నవీన్‌కుమార్ చిన్నారుల మృతదేహాలను బయటకు తీయించి పోస్టుమార్టం నిమిత్తం షాద్‌నగర్ ప్రభుత్వ కమ్యూనిటీ ఆస్పత్రికి తరలించారు. రోడ్డు కోసం మట్టి వేసేందుకు తీసిన గుంతల్లో పడి చిన్నారులు మృతి చెందారని, తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ మృతుల కుటుంబ సభ్యులు ఆస్పత్రి వద్ద ఆందోళన చేపట్టారు. అక్షిత్‌గౌడ్ మృతదేహాన్ని గ్రామానికి తీసుకెళుతున్న క్రమంలో కుటుంబ సభ్యులు చౌరస్తాలో ఒక్కసారిగా మెరుపు ధర్నా నిర్వహించారు. మృతదేహంతో అక్కడ బైఠాయించారు. దీంతో పోలీసులు వారిని చెదరగొట్టి మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించారు. చెరువులో స్నానానికి వెళ్లి.. సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం కొత్తగూడెం గ్రామానికి చెందిన చిరుమని చెన్నయ్య అనే వ్యక్తి అనారోగ్యంతో మృతి చెందగా, సోమవారం అంత్యక్రియలు జరిగాయి. అనంతరం చెన్నయ్య బంధువులైన చిలువరి మహేశ్ (17), చిలువరి అరవింద్ (16)లు బంధువులతో కలసి గ్రామ సమీపంలోని చెరువులోకి స్నానానికి వెళ్లారు. అయితే చెరువులో లోతైన ప్రదేశంలోకి వెళ్లిన వీరు నీటిలో మునుగుతూ తేలుతూ అరుస్తుండగా, అక్కడే ఉన్న బంధువులు రక్షించే ప్రయత్నం చేశారు. కానీ ఫలితం లేకుండా పోయింది. అరగంట తర్వాత మహేశ్, అరవింద్‌లు విగతజీవులుగా కనిపించారు. మహేశ్ ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతుండగా, అరవింద్ ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. దీనిపై పోలీసులను సంప్రదించగా తమకు ఎలాంటి ఫిర్యాదు రాలేదని తెలిపారు. -
ప్రజా ప్రస్థాన యాత్రను విజయవంతం చేయాలి
కొండాపూర్(సంగారెడ్డి): వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు చేపట్టిన ప్రజా ప్రస్థాన పాదయాత్ర శనివారం జిల్లాలోకి ప్రవేశించనుందని పార్టీ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు గౌరిరెడ్డి శ్రీధర్‌రెడ్డి అన్నారు. ఈ మేరకు శుక్రవారం సంగారెడ్డిలోని పోతిరెడ్డిపల్లి చౌరస్తాలో విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు 160 రోజులుగా షర్మిల పాదయాత్ర చేస్తోందన్నారు. శనివారం జిల్లాలోని కంబాలపల్లి గ్రామంలో యాత్ర ప్రారంభం అవుతుందని, అక్కడి నుంచి సదాశివపేట పట్టణం, పెద్దాపూర్, నందికంది, తొగర్పల్లి, మల్కాపూర్, సంగారెడ్డి, చిద్రుప్ప, బేగంపేట మీదుగా కొనసాగనుందన్నారు. ఈ నెల 25వ తేదీన సంగారెడ్డిలో బహిరంగ సభ ఉంటుందని తెలిపారు. తెలంగాణలో రాజన్న పాలన రావాలంటే షర్మిలమ్మ ముఖ్యమంత్రి కావాలన్నారు. సంగారెడ్డిలో నిర్వహించే సభకు వైఎస్ అభిమానులు పెద్ద ఎత్తున తరలిరావాలని కోరారు. ఈ కార్యక్రమంలో పటాన్చెరు కోఆర్డినేటర్ చంద్రశేఖర్, సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు రామలింగారెడ్డి, సంగారెడ్డి జిల్లా పరిశీలకులు శాంతికుమార్, నాయకులు తుకారాం గౌడ్, తులపీదాస్ గౌడ్, భీంరెడ్డి, అందోల్ నాయకులు ఆమోస్, సంజీవరావు తదితరులు పాల్గొన్నారు. -
బతికుండగానే చనిపోయినట్లు చూపి..
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి/రాయికోడ్: బతికుండగానే మరణించినట్లు చూపి 27.34 ఎకరాల భూమిని వేరొకరి పేర పట్టా చేసిన వ్యవహారంలో రాయికోడ్ తహసీల్దార్ రాజయ్య సస్పెండ్ అయ్యారు. ఈ భూమిపై క్రయవిక్రయాలు అసలైన పట్టాదారులకు కనిపించకుండా ధరణి వెబ్సైట్లో ప్రత్యేక సౌకర్యం ఉన్న ప్రైవసీ మోడ్‌లో పెట్టినట్లు అధికారుల విచారణలో తేలింది. ఇలా ప్రైవసీ మోడ్‌లో పెడితే సదరు భూమిపై ఎలాంటి క్రయవిక్రయాలు, ఇతర లావాదేవీలు జరిగినా ధరణిలో కనిపించవు. అసలు ఉదంతమిదీ.. రాయికోడ్ మండలం నాగన్‌పల్లికి చెందిన పట్లోళ్ల హన్మంత్‌రెడ్డికి గ్రామంలో సర్వే నంబర్ 198లో 27.34 ఎకరాల భూమి ఉంది. హన్మంత్‌రెడ్డి గతేడాది మరణించడంతో ఆ భూమిని ఆయన భార్య శివమ్మ సక్సేషన్ (వారసత్వం కింద) పట్టా చేయించుకున్నారు. ప్రస్తుతం ఆమె హైదరాబాద్‌లో కుమారుల వద్ద ఉంటున్నారు. అయితే శివమ్మ కూడా మరణించిందని రికార్డుల్లో చూపిన తహసీల్దార్ రాజ య్య ఆ భూమిని ఈనెల 19న అంజమ్మ పేర మార్చారు. లావాదేవీలు ధరణి వెబ్సైట్లో కనిపించకుండా ప్రైవసీ మోడ్‌లో పెట్టారు. అనుమానం వచ్చిన శివమ్మ కుమారుడు శ్రీనివాస్‌రెడ్డి ఆరాతీయగా తన తల్లి పేరుతో ఉన్న భూమిని మరొకరి పేర మార్చారని చేసిన ట్లు తేలింది. దీంతో ఆయన కలెక్టర్ శరత్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై కలెక్టర్ ఆదేశాల మేరకు జహీరాబాద్ ఆర్డీవో రమేశ్‌బాబు గురువారం విచారణ చేపట్టగా రాజయ్య బాగోతం బయటపడింది. ఆర్డీవో నివేదిక మేరకు కలెక్టర్.. తహసీల్దార్ రాజయ్యతోపాటు, ఆర్ఐ శ్రీకాంత్‌ను సస్పెండ్‌చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. మూడు నెలల క్రితం స్లాట్ బుకింగ్... పట్టా మార్పిడికి 3 నెలల క్రితమే స్లాట్ బుక్‌చేయడం గమనార్హం. సాధారణంగా స్లాట్ బుక్‌చేసిన నిర్ణీత వ్యవధిలోనే పట్టా మార్పిడి చేయాలి. అయితే తహసీల్దార్ మూడు నెలల అనంతరం పట్టా మార్పిడి చేశారు. ఈ వ్యవహారంలో రూ.40 లక్షల వరకు చేతులు మారినట్లు ఆరోపణలున్నాయి. గతంలో ఇక్కడ ఆర్ఐగా పనిచేసిన శ్రీకాంత్.. అసలైన పట్టాదారు శివమ్మకు వారసురాలు అంజమ్మనే అంటూ తప్పుడు నివేదిక ఇచ్చినట్లు తెలిసింది. ప్రస్తుతం మెదక్ జిల్లాలో పనిచేస్తున్న శ్రీకాంత్‌పై కూడా క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. భూమి పౌతీమార్పు వ్యవహారంలో నకిలీ ధ్రువపత్రాలను వినియోగించిన ఐదుగురిపై కేసు నమోదు చేసినట్లు రాయికోడ్ ఎస్ఐ ఏడుకొండలు తెలిపారు. శివమ్మ ఫిర్యాదు మేరకు.. ఆమె వియ్యంకురాలు అంజమ్మ, ఆమె కుమారుడు అమృత్‌రెడ్డి, మనవడు రాజశేఖర్‌రెడ్డి, భూ బదలాయింపులో సాక్షులుగా ఉన్న టి.మల్లేశం, బి.నర్సింలుపై కేసు నమోదు చేశారు. -
బియ్యం ఎగుమతులపై నిషేధం.. రైతులకు శాపం
సాక్షి, ప్రతినిధి, సంగారెడ్డి: బియ్యం ఎగుమతులపై సుంకాన్ని, నూకల ఎగుమతులపై నిషేధాన్ని విధిస్తూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రైతుల పాలిట శాపంగా మారుతోందని ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న తలాతోక లేని నిర్ణయాలు రైతులను ముంచి కార్పొరేట్లకు పంచేలా ఉన్నాయని మండిపడ్డారు. శనివారం సంగారెడ్డి జిల్లాలో పర్యటించిన మంత్రి పటాన్చెరులో జరిగిన సభలో మాట్లాడారు. దేశంలో ఆహార నిల్వలు తగ్గినప్పుడు మాత్రమే ఆహార ఉత్పత్తులపై నిషేధం విధిస్తారని, ఇప్పుడు కేంద్రం ఎందుకు నిషేధం విధిస్తోందో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని ప్రకటించిన బీజేపీ.. ఎరువులు, విత్తనాల ధరలను పెంచి రైతుల పెట్టుబడులను రెట్టింపు చేసిందని ఎద్దేవా చేశారు. దేశంలో నాలుగేళ్లకు సరిపడా బియ్యం నిల్వలున్నాయని, వడ్లు కొనేదిలేదని చెప్పిన కేంద్రమంత్రి ఇప్పుడు బియ్యం ఎగుమతులపై సుంకాలను విధించడం ఏంటని ప్రశ్నించారు. దేశంలోని పలు రాష్ట్రాలతోపాటు, చైనా, పాకిస్తాన్ వంటి దేశాల్లో కరువు ఏర్పడిందని, కాళేశ్వరం వంటి ప్రాజెక్టులతో తెలంగాణ మాత్రం దక్షిణ భారతదేశానికే అన్నంపెట్టే ధాన్యాగారంగా మారిందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 75 లక్షల ఎకరాల్లో వరి సాగయ్యేదని, ఇప్పుడు ఒక్క తెలంగాణలోనే 65 లక్షల ఎకరాల వరి సాగవుతోందని హరీశ్ వివరించారు. కార్యక్రమంలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
హైదరాబాద్ ఐఐటీ విద్యార్థి ఆత్మహత్య
-
లక్షలు పోసి కొన్న బుల్లెట్ బండి.. చూస్తుండగానే కాలిపోయింది
సాక్షి, సంగారెడ్డి: రాయల్ ఎన్ఫీల్డ్ బైక్‌ల గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. మార్కెట్లో ఎన్ని కొత్త మోడల్ బైక్‌లు వచ్చినప్పటికీ బుల్లెట్‌పై యువతకు ఉన్న క్రేజ్ మామూలుగా ఉండదు.. లక్షలకు లక్షలు పోసి మరి కొనుక్కొని తమ సొంతం చేసుకుంటారు. డుగ్గు డుగ్గు సౌండ్లతో రోడ్లపై రయ్ రయ్‌మంటూ దూసుకెళ్తుంటారు. అయితే ఈ మధ్య కాలంలో కొన్ని వాహనాల్లో ఉన్నట్టుండి మంటల్లో కాలిపోతున్నాయి. తాజాగా ఓ బుల్లెట్ బండిని స్టార్ట్ చేసే క్రమంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ ఘటన పటాన్చెరు పట్టణంలో చోటు చేసుకుంది. ఫైర్‌స్టేషన్ ఆఫీసర్ జన్యానాయక్, స్థానికుల వివరాల ప్రకారం.. రామచంద్రాపురానికి చెందిన జావిద్ తన బుల్లెట్ బండిని పటాన్చెరు పట్టణంలో ని బ్లాక్ ఆఫీసు దుకాణాల ఎదుట పార్క్ చేశాడు. పని ముగించుకొని తిరిగి బండిని స్టార్ట్ చేసే క్రమంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పివేశారు. -
ఇంపార్టెంట్ టెక్ట్స్, ప్లీజ్ సీ ల్యాప్‌టాప్.. పుట్టినరోజు జరుపుకున్న రెండు రోజులకే
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: హైదరాబాద్ ఐఐటీలో ఎంటెక్ (స్మార్ట్ మొబిలిటీ) చదువుతున్న బింగుమల్ల రాహుల్ (25) ఆత్మహత్య చేసుకున్నా రు. ఐఐటీహెచ్‌లోని కౌటిల్య బ్లాక్ హాస్టల్లో ఉంటున్న రాహుల్.. తన గదిలోని మంచం రాడ్‌కు నైలాన్ తాడుతో ఉరివేసుకుని బలవన్మరణం పొందారు. ‘ఇంపార్టెంట్ టెక్ట్స్.. ప్లీజ్ సీ ల్యాప్‌టాప్..’అని రాహుల్ రాసిన సూసైడ్ నోట్ కలకలం రేపుతోంది. ‘థీసిస్ పర్పస్‌లెస్’అని రాసి కొట్టేసిన మరో నోట్‌ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆయన ల్యాప్‌టాప్, సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకుని సైబర్ నిపుణుల బృందానికి పంపారు. రాహుల్ కాల్ లిస్ట్, చాటింగ్ వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. ల్యాప్‌టాప్, సెల్‌ఫోన్ ఓపెన్ అయితే ఆత్మహత్యకు గల కారణాలు తెలిసే అవకాశాలున్నట్టు పోలీసులు భావిస్తున్నారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్నట్లు డీఎస్పీ రవీందర్ రెడ్డి చెప్పారు. రాహుల్ స్వస్థలం కర్నూల్ జిల్లా నంద్యాల. అక్కడే పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ పూర్తి చేశారు. పుట్టినరోజు జరుపుకున్న రెండు రోజులకే.. ఆగస్టు 27 (శనివారం)న పుట్టినరోజు జరుపుకు న్న రాహుల్ సోమవారం రాత్రి నుంచి తమకు కనిపించలేదని తోటి విద్యార్థులు పేర్కొంటున్నారు. రాహుల్‌కు ఫోన్ చేసినా స్పందనలేకపోవడంతో అనుమానం వచ్చి విద్యార్థులు తలుపు సందులోంచి హాస్టల్ గదిలోకి చూడగా కాళ్లు వేలాడుతూ కనిపించాయి. లోపల గడియ పెట్టి ఉండటంతో తలుపులు బద్దలు కొట్టి చూడగా, మంచానికి ఉరి వేసుకుని కనిపించినట్లు పోలీసులు పేర్కొన్నారు. వెంటనే ఘటనాస్థలాన్ని వీడియో తీసి రాహుల్ తండ్రి మధుసూదన్‌రావుకు సమాచారం ఇచ్చారు. ఆయన వచ్చిన వెంటనే రాహుల్ మృతదేహానికి సంగారెడ్డి ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. ఉరి వేసుకోవడంతో కంఠానికి ఉన్న థైరాయిడ్ బోన్ ఫ్రాక్చర్ అయినట్లు పోస్టుమార్టంలో తేలినట్లు తెలిసింది. చేతికి గాయమై రక్తం కారినట్లు సమాచారం. పుట్టినరోజు జరుపుకున్న 48 గంటల్లోపే ఆత్మహత్య చోటుచేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. కాగా, 2008లో ఐఐటీహెచ్ స్థాపించినప్పటి నుంచి ఇప్పటివరకు మొత్తం ఐదుగురు విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. మానసిక ఒత్తిడి, తోటి విద్యార్థులకు పోటీగా నిలవాలనే తాపత్రయంతో ఒత్తిడికి గురికావడం వంటి కారణాలతో ఉజ్వల భవిష్యత్తు ఉన్న విద్యార్థు లు బలవన్మరణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. అంతర్గత విచారణ చేశాం ‘రాహుల్ ఆత్మహత్యపై అంతర్గత విచారణ చేశాం. దీనికి విద్యాసంబంధ కారణాలేమీ ఉండకపోవచ్చని భావిస్తున్నాం. వ్యక్తిగత సమస్యలతోనే ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చు’అని ఫ్రొఫెసర్ బీఎస్ మూర్తి ‘సాక్షి’తో పేర్కొన్నారు. అనుమానంగా ఉంది: మధుసూదన్‌రావు, రాహుల్ తండ్రి తన కుమారుడి మృతి పట్ల రాహుల్ తండ్రి మధుసూదన్‌రావు అనుమానం వ్యక్తం చేశారు. ఎవరైనా ఫ్యాన్‌కు ఉరివేసుకుంటారని, మంచానికి ఉరివేసుకోవడమేంటని పేర్కొన్నారు. పోస్టుమార్టం నిర్వహించక ముందే తన కుమారుడి ముఖం చూడాలని ప్రాధేయపడినా వైద్యాధికారులు అంగీకరించకపోవడం తీవ్ర ఆవేదనకు గురి చేసిందన్నారు. పోస్టుమార్టం అనంతరం రాహుల్ మృతదేహాన్ని నంద్యాలకు తీసుకెళ్లి అంతిమ సంస్కారాలు నిర్వహించారు. -
విషాదం: ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య
సంగారెడ్డి జిల్లా: పటాన్చెరు మండలం భానుర్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. మృతులు మధ్యప్రదేశ్‌కు చెందిన వలస కూలీలుగా పోలీసులు గుర్తించారు. వివాహిత తన చిన్నారితో పాటు వరసకు మరిది అయిన వ్యక్తితో కలిసి ముగ్గురు అనుమానాస్పదంగా ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఘటనపై హత్యా? ఆత్మహత్యా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: వీడిన మిస్టరీ.. బావే హంతకుడు.. అత్త ఆస్తి కోసం.. -
111 రోజులు చికిత్స.. ప్రభుత్వాసుపత్రి ప్రాణం పోసింది
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ఆ పాప ఆరు నెలలకే తల్లి గర్భం నుంచి బయటకు వచ్చింది.. అదీ కేవలం 600 గ్రాముల బరువుతో! పుట్టగానే కదలిక లేదు. దాదాపు ఆశలు వదులుకున్న శిశువుకు మెరుగైన వైద్య చికిత్స అందిస్తున్నారు సంగారెడ్డిలోని ప్రభుత్వాస్పత్రి వైద్యులు. ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా 111 రోజులపాటు చికిత్స అందిస్తూ శిశువు ఆరోగ్యాన్ని మెరుగుపరచగలిగారు. ప్రస్తుతం ఈ శిశువు బరువు 1.30 కిలోలకు పెరిగి ఆరోగ్యం మెరుగుపడింది. ప్రైవేటు ఆస్పత్రి వైద్యులే చేతులెత్తేస్తే.. ప్రభుత్వాస్పత్రి వైద్యులు ప్రతిష్టాత్మకంగా చికిత్స అందించి శిశువును కాపాడారు. వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు మంగళవారం ఆ ఆస్పత్రికి వెళ్లి వైద్యులను అభినందించారు. పాప తల్లిదండ్రులను పలకరించి ధైర్యం చెప్పారు. నిలోఫర్ వైద్యులూ కష్టమేనన్నారు.. సంగారెడ్డి పట్టణానికి చెందిన అరుంధతి గర్భం దాల్చిన ఆరు నెలలకే ఉమ్మనీరు బయటకు వచ్చింది. పట్టణంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి వెళ్తే.. తక్షణం ఆపరేషన్ చేయాలని నిర్ణయించిన వైద్యులు సిజేరియన్ చేసి పాపను బయటకు తీశారు. ఆరు నెలలకే పుట్టడంతో పరిపక్వత లేని అవయవాలతో ఉన్న శిశువుకు ఊపిరి పీల్చడమే ఇబ్బందిగా ఉంది. బతకడం కష్టమని వైద్యులు తేల్చేయడంతో తల్లీబిడ్డను సంగారెడ్డి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. క్రిటికల్ కేసు కావడంతో హైదరాబాద్‌లోని నిలోఫర్ ఆస్పత్రికి రిఫర్ చేశారు. అంబులెన్స్‌లో అక్కడికి తరలించి చికిత్స చేయించగా పాప బతకడం కష్టమని అక్కడి వైద్యులు తేల్చిచెప్పారు. అప్పుడప్పుడు కాళ్లు, చేతులు మాత్రమే ఆడిస్తున్న పాపను తిరిగి తల్లి చికిత్స పొందుతున్న సంగారెడ్డి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. డా.అశోక్, డా.షబ్బీర్, డా.శశికళ, డా.సతీశ్‌లతో కూడిన చిన్న పిల్లల ప్రత్యేక వైద్య నిపుణుల బృందం పాపను నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఉంచి చికిత్స అందించారు. తీవ్ర రక్తహీనతతో ఉండటంతో శిశువుకు ఆరుసార్లు రక్తం ఎక్కించారు. శిశువు అవయవాలు అపరిపక్వతతో ఉండటంతో ఇన్ఫెక్షన్ సోకే పరిస్థితి ఏర్పడింది. ఫిట్స్ కూడా వచ్చే పరిస్థితి ఉన్న ఈ శిశువుకు ప్రత్యేక వైద్య చికిత్స అందించారు. బరువు పెరిగేందుకు స్పెషల్ న్యూట్రిషిన్ సప్లిమెంటరీలు ఇచ్చారు. 111 రోజుల తర్వాత శిశువు ఆరోగ్యం కుదుటపడింది. ప్రస్తుతం 1.30 కిలోలకు చేరిన శిశువుతోపాటు, తల్లిని కూడా కొద్దిరోజుల్లోనే ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేయాలని వైద్యులు భావిస్తున్నారు. ఇలాంటి క్రిటికల్ కేసు ఈ మధ్యకాలంలో జిల్లాలో మొదటిసారని డా.సతీష్ ‘సాక్షి’తో పేర్కొన్నారు. మెరుగైన చికిత్స అందించిన వైద్యులకు, వైద్య సిబ్బందికి తల్లి అరుంధతి కృతజ్ఞతలు తెలిపారు. -
గాడిద పాలకు డిమాండ్.. లీటరెంతో తెలుసా?
సాక్షి, కోహీర్(జహీరాబాద్): అవును మీరు విన్నది నిజ మే. ‘గంగిగోవు పాలు గరిటెడైనను చాలు కడివెడైనను నేమి ఖరము పాలు’ అనే వేమన పద్యంలో మార్పు చేయాల్సిన పరిస్థితి వచ్చినట్లు అనిపిస్తుంది. మహారాష్ట్రలోని నాందేడ్ పట్టణానికి చెందిన బాలాజీ ఆదివారం సంగారెడ్డి జిల్లా కోహీర్ పట్టణంలో గాడిద పాలు అమ్ముతూ కనిపించాడు. ఒక చిన్న అమృతాంజనం సీసా పాలు (సుమారు 10ఎంఎల్) రూ.100కు విక్రయిస్తున్నట్టు చెప్పాడు. ధర వింటే మీకు మూర్ఛ వచ్చినట్టయ్యిందా! కానీ గాడిద పాలలో దగ్గు, దమ్ము, మూర్ఛ వంటి వ్యాధులను తగ్గించే శక్తి ఉందని ప్రచారం ఉంది. అందుకే.. లీటరు రూ.10 వేలకు అమ్ముతున్నాడు. ఒకప్పుడు గాడిదను కొనాలంటే రూ.10 నుంచి 15 వేలు పెట్టాల్సి వస్తే, పాలకు డిమాండ్ పెరగడంతో ప్రస్తుతం రూ.45 నుంచి రూ.50 వేల ధర పలుకుతోందని కూడా తెలిపాడు. -
పందెం కోడి రూ.30 వేలు.. 31 కోళ్లకు రూ.4.46 లక్షల ఆదాయం
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ స్థావరంలో స్వాధీనం చేసుకున్న పందెం కోళ్లకు శనివారం సంగారెడ్డిలోని ఎక్సైజ్ కోర్టు వేలం పాట నిర్వహించింది. ఇందులో అత్యధికంగా ఓ పందెం కోడి రూ.30 వేలు పలికింది. మొత్తం 31 కోళ్లకు రూ.4.46 లక్షల ఆదాయం లభించింది. 46 మంది వేలంపాటలో పాల్గొన్నారు. చింతమనేని ప్రభాకర్ సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం చిన్న కంజర్ల గ్రామ శివారులో ఓ ఫాంహౌస్‌లో పెద్ద ఎత్తున కోడి పందేలు నిర్వహిస్తున్నారు. ఈ మేరకు సమాచారం అందుకున్న పోలీసులు ఈనెల 7వ తేదీ రాత్రి కోళ్ల పందేల స్థావరంపై దాడి చేశారు. అక్కడ 22 మందిని అదుపులోకి తీసుకోగా, వారి వద్ద రూ.13.12 లక్షల నగదు, 24 సెల్ఫోన్లు, 31 చిన్న కత్తులు స్వాధీనం చేసుకున్నారు. కాగా, ఈ కేసులో ఏ1గా ఉన్న చింతమనేని ప్రభాకర్ పోలీసుల కళ్లు గప్పి తప్పించుకున్నారు. తాను కోడిపందేల స్థావరం వద్ద లేనని, ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని చింతమనేని సోషల్ మీడియాలో బుకాయించారు. అయితే పోలీసులకు లభించిన వీడియోలను పరిశీలించగా చింతమనేని అక్కడే ఉన్నట్టు స్పష్టమైంది. పోలీసులు రావడం చూసి ఆయన అక్కడి నుంచి తప్పించుకుని వెళ్లిపోవడం స్పష్టంగా కనిపించింది. పరారీలో ఉన్న ఏ1 చింతమనేనిని పట్టుకోవడం కోసం సంగారెడ్డి జిల్లా పోలీసు అధికారులు మూడు బృందాలను నియమించారు. కాగా వేలం పాటలో వచ్చిన రూ.4.46 లక్షలను ప్రభుత్వ ఖాతాలో జమ చేసినట్లు ఎక్సైజ్ కోర్టు మేజిస్ట్రేట్ హన్మంతరావు పేర్కొన్నారు. -
Hyderabad: ప్రాణం తీసిన ప్రేమ పెళ్లి!
జిన్నారం/పటాన్చెరు టౌన్/కేపీహెచ్‌బీ (హైదరాబాద్): హైదరాబాద్ కేపీహెచ్‌బీ పోలీస్‌స్టేషన్ పరిధిలో అదృశ్యమైన యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. దుండగులు అతనిపై పెట్రోల్ పోసి తగులబెట్టారు. సగానికి పైగా కాలిన స్థితిలో ఉన్న శవాన్ని పోలీసులు ఆదివారం కనుగొన్నారు. ప్రేమ వివాహమే ఈ ఘోరానికి కారణంగా తెలుస్తోంది. మాట్లాడుకుందాం రమ్మంటూ యువకుడిని పిలిచిన యువతి బంధువు ఫుల్లుగా మద్యం తాగించి, మరొకరి సహకారంతో గొంతు నులిమి హత్య చేసి శివారు అటవీ ప్రాంతంలో పెట్రోల్ పోసి దహనం చేసినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ మేరకు ఒకరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు మొత్తం నలుగురిపై కేసులు నమోదు చేశారు. కారు డ్రైవర్ ఇచ్చిన సమాచారంతో.. కేపీహెచ్‌బీ, జిన్నారం సీఐలు కిషన్‌కుమార్, వేణు కుమార్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఏపీలోని ప్రకాశం జిల్లా పొదల కొండపల్లికి చెందిన శనివారపు బాలిరెడ్డి కుమారుడు నారాయణ రెడ్డి (25) ఓ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేస్తూ కేపీహెచ్‌బీ కాలనీ రోడ్డు నంబర్ ఒకటిలోని ఓ ఇంట్లో స్నేహితులతో కలిసి ఉంటున్నాడు. గత నెల 27న రాత్రి 9 గంటల సమయంలో తాను శ్రీనివాస్‌రెడ్డి అనే వ్యక్తిని కలిసేందుకు వెళుతున్నట్లు చెప్పి బయటకు వెళ్లిన నారాయణరెడ్డి తిరిగిరాలేదు. ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అయ్యింది. దీంతో అతని స్నేహితులు నారాయణరెడ్డి బావ వెంకటేశ్వరరెడ్డికి సమాచారం అందించారు. ఆయన గత నెల 30న కేపీహెచ్‌బీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అదృశ్యం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు మొదలు పెట్టిన పోలీసులు శ్రీనివాస్‌రెడ్డితో పాటు అతని గ్రామానికే చెందిన కారు డ్రైవర్ షేక్ ఆషిక్‌లపై నిఘా పెట్టారు. తర్వాత ఆషిక్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. అతను ఇచ్చిన సమాచారం ఆధారంగా నారాయణ రెడ్డిని హత్య చేసి సంగారెడ్డి జిల్లా జిన్నారం అటవీ ప్రాంతంలో పెట్రోల్ పోసి దహనం చేసినట్లుగా గుర్తించారు. వెంటనే 80 శాతం దహనమైన స్థితిలో ఉన్న నారాయణ రెడ్డి శవాన్ని స్వాధీనం చేసుకున్నారు. శవ పంచనామా అనంతరం పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించి హత్య కేసుగా నమోదు చేసుకొని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. పెళ్లిని అంగీకరించని యువతి కుటుంబీకులు నారాయణరెడ్డి ఏడాది కిందట తన స్వగ్రామానికే చెందిన ఓ యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అయితే యువతి కుటుంబీకులు వారి వివాహాన్ని అంగీకరించకపోగా యువతిని ఇంటికి తీసుకెళ్లిపోయారు. అప్పటి నుంచి ఆమె తల్లిదండ్రుల వద్దనే ఉంటోంది. అయినా ఇద్దరూ మాట్లాడుకుంటున్నారనే అనుమానంతో యువతి కుటుంబీకులు నారాయణ రెడ్డిని అంతమొందించేందుకు కుట్ర పన్నినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో నారాయణ రెడ్డిని అతని గది నుంచి బయటకు రప్పించిన పొదల కొండపల్లికే చెందిన యువతి బంధువు శ్రీనివాస్ రెడ్డి.. ఆషిక్ కారులో రాయదుర్గం తీసుకెళ్లాడు. అక్కడ అతనికి మద్యం తాగించి గొంతు నులిమి హత్య చేశారు. అనంతరం శవాన్ని మాయం చేసేందుకు జిన్నారం ప్రాంతంలో పెట్రోల్ పోసి తగలబెట్టినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఆషిక్, శ్రీనివాస్‌రెడ్డితో పాటు హత్యోదంతంలో పాల్గొన్న మరో ఇద్దరిపై కేసు నమోదు చేశారు. యువతి కుటుంబసభ్యులు మరికొందరి ప్రమేయం పైనా, సుపారీ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఇది కూడా చదవండి: బీజేపీ సభ: సోమవారం ఉదయం వరకు ఆ రోడ్డు మూసివేత -
హృదయ విదారకం: ఓ వైపు వివాహ తంతు, మరో వైపు అంత్యక్రియలు
పుల్కల్(సంగారెడ్డి): మరో గంటలో కూతురు పెళ్లి. బంధువులు, కుటుంబ సభ్యులు ముస్తాబవుతున్నారు. కూతురు పెళ్లిని అంగరంగ వైభవంగా చేయాలనుకున్న ఆ నాన్న కల నెరవేరకుండానే కన్నుమూసాడు. ఫాదర్స్ డే రోజు తండ్రిని పోగొట్టుకుని ఆ కూతురు శోకసంద్రంలో మునిగిపోయింది. బంధువులు ఓవైపు అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తునే నిఖా తంతు ముగించారు. ఈ హృదయ విదారకర సంఘటన సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలోని ముద్దాయిపేటలో ఆదివారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. ముద్దాయిపేటకు చెందిన మక్బుల్ అహ్మద్(గూడు పటేల్)కూతురికి సంగారెడ్డికి చెందిన యువకుడితో పెళ్లి నిశ్చయించారు. మూడు నెలల క్రితం ఎంగేజ్మెంట్ ఘనంగా చేశారు. ఆదివారం సంగారెడ్డిలో వివాహ ఏర్పాట్లు చేశారు. బంధువులందరు పెళ్లి మండపానికి చేరుకున్నారు. మహ్మద్ మక్బుల్ అహ్మద్ అస్వస్థతకు గురవడంతో ఇంట్లోనే ఉంచారు. పెళ్లి మరో గంట ఉందనగా పెళ్లి పెద్ద మృతిచెందాడు. బంధువులు కొందరు కూతురు పెళ్లి తంతు ముగించగా,మరికొందరు తండ్రి అంత్యక్రియలు పూర్తిచేశారు. చదవండి👉🏻 మరణించి ఉంటారులే.. బతికి ఉన్న మహిళ పోస్టుమార్టానికి.. -
పంటల నమోదుకు ఉపగ్రహబలం
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: శాటిలైట్ ద్వారా పంటల నమోదు (క్రాప్ బుకింగ్) ప్రక్రియకు వ్యవసాయ శాఖ శ్రీకారం చుట్టింది. వ్యవసాయ క్షేత్రాల భావన–నిర్ధారణ (ఫ్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ ప్రాజెక్ట్ ఆన్ ఫీల్డ్ సెగ్మెంటేషన్) పేరుతో ప్రభుత్వం ప్రత్యేక ప్రాజెక్టును ప్రారంభించింది. పైలెట్ ప్రాజెక్టు కింద అధికారులు రాష్ట్రవ్యాప్తంగా 16 గ్రామాలను ఎంపిక చేశారు. ఇందులో భాగంగా సంగారెడ్డి జిల్లాలో ఎనిమిది గ్రామాలు, మెదక్ జిల్లాలో ఐదు, మహబూబాబాద్ జిల్లాలో మూడు గ్రామాల్లో ఈ ప్రాజెక్టును అమలు చేస్తున్నారు. రైతులు తమ భూముల్లో ఏయే పంటలు సాగు చేస్తున్నారనే వివరాలను ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో శాటిలైట్ ద్వారా నమోదు చేస్తారు. సంగారెడ్డి జిల్లాలోని అంకేపల్లి, ఎల్లారం, చందాపూర్, నాగులపల్లి, ఇసోజీపేట, కోడూరు, మంతూరు, పోచారం గ్రామాలలో పంటల నమోదు ప్రక్రియ ప్రారంభమైంది. మెదక్, మహబూబాబాద్ జిల్లాల్లోనూ ఈ ప్రక్రియ చేపట్టినట్టు ప్రాజెక్టు అధికారులు పేర్కొంటున్నారు. ఈ తరహాలో దేశంలోనే ఇది తొలి ప్రాజెక్టు అని వారు చెబుతున్నారు. గ్రౌండ్ యాప్‌లో వివరాలు నమోదు వ్యవసాయ శాఖ వినూత్నంగా చేపట్టిన ఫీల్డ్ సెగ్మెంటేషన్ ప్రాజెక్టును గూగుల్ ఎర్త్ సంస్థ సహకారంతో ప్రారంభించారు. ఇందుకోసం ఆ సంస్థ ప్రత్యేకంగా ‘గ్రౌండ్’యాప్‌ను రూపొందించింది. గూగుల్ ఎర్త్ సంస్థకు చెందిన ప్రత్యేక బృందంతో పాటు, ఏఓలు, మండల వ్యవసాయ శాఖ అధికారులు కలసి పంటల నమోదు ప్రక్రియ చేపట్టారు. ప్రస్తుతం ఉపగ్రహం ద్వారా రైతుల పొలాల మ్యాప్ (పాలిగాన్)లను రూపొంది స్తున్నట్లు ప్రాజెక్టు అధికారులు తెలిపారు. సర్వేనంబర్లతో సంబంధం లేకుండా.. క్రాప్ బుకింగ్ ప్రక్రియలో సర్వే నంబర్లతో సంబంధం ఉండదని ప్రాజెక్టు అధికారులు వెల్లడించారు. తొలుత రైతుల భూమికి సంబంధించి మ్యాప్‌లను రూపొందిస్తారు. ఈ పాలిగాన్ ఎంత విస్తీర్ణం ఉంటుంది, అందులో ఎలాంటి పంట వేశారు. రైతు ఎవరు.. వంటి వివరాలు నమోదు చేస్తారు. పైలెట్ ప్రాజెక్టులో లోటుపాట్లను పరిశీలించాక ఇక్కడ విజయవంతమైతే దేశ వ్యాప్తంగా ఈ నూతన విధానాన్ని అమలు చేసే యోచనలో ఉన్నట్లు ప్రాజెక్టు అధికారులు చెబుతున్నారు. ప్రస్తుత విధానంలో కచ్చితత్వం లేదు ప్రస్తుతం రైతులు తమ భూముల్లో ఏయే పంటలు సాగు చేశారు. ఏ సర్వే నంబర్లో ఎన్ని ఎకరాల విస్తీర్ణంలో విత్తుకున్నారు.. వంటి వివరాలను వ్యవసాయ శాఖ ఏఈఓలు గ్రామాలకు వెళ్లి పంటల నమోదు (క్రాప్‌బుకింగ్) చేస్తున్నారు. అయితే ఈ విధానంలో కచ్చితత్వం ఉండటం లేదు. వాస్తవంగా సాగైన పంటలకు, రికార్డులకు పొంతన ఉండటం లేదు. దీంతో పలు సమస్యలు ఎదురవుతున్నాయి. ప్రధానంగా ఏ పంట ఎంత మేర మార్కెట్లోకి వస్తుంది, వాటి కొనుగోళ్లకు ఎలాంటి ప్రణాళిక రూపొందించాలన్న అంశాలపై ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అలాగే ఆయా పంటల సాగుకు అవసరమైన ఎరువులు, విత్తనాల సరఫరా వంటి ఏర్పాట్లు చేయడంలో కూడా సమస్యలు తలెత్తుతున్నాయి. కొన్ని చోట్ల మొక్కుబడిగా.. పంటల నమోదు ప్రక్రియ చాలా చోట్ల మొక్కుబడిగా సాగుతోందన్న విమర్శలున్నాయి. కొందరు సిబ్బంది క్షేత్ర స్థాయికి వెళ్లడం లేదని, గ్రామంలో ఒక చోట కూర్చుని రైతుల పేర్లు, ఏ పంట వేశారు.. అనే వివరాలను రికార్డుల్లో రాసుకుని వస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. దీంతో ఇలాంటి సమస్యలను అధిగమించేందుకు వ్యవసాయ శాఖ శాటిలైట్ ద్వారా పంటల నమోదు ప్రక్రియను చేపట్టిందని చెబుతున్నారు. పంట రంగు, ఎత్తు కూడా గుర్తించే వెసులుబాటు.. ఈ అధునాత క్రాప్‌బుకింగ్ విధానంలో పంట ఏ రంగులో ఉంది, ఎంత ఎత్తు పెరిగింది, ఎక్కడైనా చీడ, పీడలు ఆశించాయా, భూమి స్వభావం ఎలాంటిది.. ఇలా సుమారు 18 నుంచి 20 రకాల అంశాలను గుర్తించవచ్చని ప్రాజెక్టు నిపుణులు వెల్లడించారు. -
Sagubadi: ఒక్కసారి మొక్క నాటితే 20-30 ఏళ్లు పంట.. ఎకరాకు 14 లక్షల ఆదాయం!
Dragon Fruit Farming: సంప్రదాయ పంటలకు సస్తి చెప్పి తమకు లాభాలను, ప్రజలకు ఆరోగ్యాన్ని తెచ్చిపెట్టే డ్రాగన్ ఫ్రూట్ వంటి పంటల సాగుపై రైతులు ఆసక్తి చూపుతున్నారు. సరికొత్త ఆలోచనలతో వినూత్న పద్ధతుల్లో పంటలను సాగు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో డ్రాగన్ ఫ్రూట్ సాగు వేగంగా విస్తరిస్తుండగా, ప్రస్తుతం తెలంగాణలో డ్రాగన్ ఫ్రూట్ సుమారు 700 ఎకరాల్లో సాగవుతున్నట్లు అంచనా. సంగారెడ్డి జిల్లా రంజోల్ గ్రామానికి చెందిన యువరైతు బి.రమేశ్‌రెడ్డి తన తండ్రి నర్సింహ్మరెడ్డి ప్రోత్సహంతో డ్రాగన్ ఫూట్‌ను రెండెకరాల్లో సాగు చేస్తున్నారు. తొలి ఏడాది ఎకరానికి రూ. 6 లక్షల పెట్టుబడి అవసరమవుతుంది. అయినప్పటికీ, సుమారు 30 ఏళ్లపాటు అధిక లాభాలనిస్తుంది కాబట్టి డ్రాగన్ ఫ్రూట్‌ను సాగు చేస్తున్నానని రమేశ్‌రెడ్డి తెలిపారు. రెండో ఏడాది నుంచి ఎకరానికి ఏడాదికి రూ. లక్షకు మించి ఖర్చు అవ్వదన్నారు. ప్రేరణ ఇచ్చిన పండ్ల రసం రమేశ్‌రెడ్డి న్యూజిలాండ్‌లో ఎంబీఏ (మార్కెటింగ్) చదివి హైదరాబాద్‌లో కొంతకాలం ఉద్యోగం చేశారు. ఆ సమయంలో ఆరేళ్ల క్రితం స్నేహితులతో కలిసి రమేశ్‌రెడ్డి మణికొండలోని పండ్ల రసం సెంటర్‌కు వెళ్లినప్పుడు, గ్లాస్ డ్రాగన్ పండు రసం ధర రూ.120 అని తెలుసుకొని ఆశ్చర్యపోయాడు. అప్పటి నుంచి ఈ పండు గురించి ఆరా తీయడం మొదలు పెట్టారు. 2016లో మహారాష్ట్రకు ని ఔరంగ్‌బాద్‌కు వెళ్లి 8 మొక్కలు తెచ్చి ప్రయోగాత్మకంగా నాటారు. మొక్కలు ఏపుగా పెరిగి మంచి కాపు వచ్చింది. ఈ అనుభవంతో మూడేళ్ల క్రితం రెండు ఎకరాల్లో పంట వేశారు. మెరోగన్ రెడ్ రకానికి చెందిన ఒక్కో మొక్క రూ. 70 చొప్పున 2 వేల మొక్కలు నాటారు. తండ్రి సాగుచేస్తున్న అల్లం, అరటి, చెరకు పంటల వల్ల లాభాలు అంతగా రావటం లేదని భావించి డ్రాగన్ ఫ్రూట్ సాగు వైపు రమేశ్‌రెడ్డి అడుగులు వేశారు. ఆఫ్ సీజన్లో ఎల్ఈడీ వెలుగుతో అదనపు పంట పంట సాగు చేసిన మొదటి సంవత్సరంలోనే ఎకరాకు ఒకటిన్నర టన్నుల దిగుబడి వచ్చింది. రెండో సంవత్సరం 5 టన్నులు వచ్చింది. మొదటి సంవత్సరం టన్నుకు రూ. 1.5 లక్షల ధర పలికింది. పెట్టుబడులు పోగా మొదటి ఏడాదిలోనే ఎకరానికి రూ. 10 లక్షల ఆదాయం వచ్చిందని రైతు రమేశ్‌రెడ్డి తెలిపారు. పంట సాగు కోసం ఎకరానికి రూ. 50 వేలు పెట్టుబడి సరిపోతుందన్నారు. ఒకసారి మొక్క నాటితే 20 నుంచి 30 సంవత్సరాల వరకు క్రాప్ వస్తుందన్నారు. సాధారణంగా జూన్ నుంచి నవంబర్ వరకు 45 రోజులకో దఫా డ్రాగన్ పండ్ల దిగుబడి వస్తుంది. ఆర్నెల్లకోసారి పశువుల ఎరువు, ఎన్‌పికె, సూక్ష్మపోషకాలు అందిస్తున్నారు. రెండు ఎకరాల్లో డ్రాగన్ ఫ్రూట్ తోటలో 100 ఎల్ఈడీ బల్పులను ఏర్పాటు చేశారు. ఇందుకోసం రూ. 2 లక్షలు వెచ్చించారు. పంటకు 12 గంటల పాటు వెలుతురు ఉన్నప్పుడే పంట నాణ్యతతో వస్తుంది. పగలు తక్కువగా ఉండే నవంబర్ తర్వాత కాలంలో ప్రతి నిత్యం 4 గంటల పాటు ఎల్ఈడీ బల్పులను వెలిగించారు. ఎకరానికి నెలకు విద్యుత్ ఖర్చు రూ. 4 వేల వరకు అదనంగా ఖర్చు వచ్చిందని రమేశ్‌రెడ్డి చెప్పారు. ఎకరానికి 16 టన్నులు.. రూ. 14 లక్షలు.. మొక్కలు నాటి మూడేళ్లకు గత సంవత్సరంలో జూన్–నవంబర్ వరకు సీజన్లో మూడో ఏడాది ఎకరానికి 12 టన్నుల దిగుబడి వచ్చిందని రమేశ్ రెడ్డి చెప్పారు. ఎల్ఈడీ బల్పులు ఏర్పాటు చేయటంతో ఆఫ్ సీజన్లో నవంబర్ నుంచి మార్చి వరకు కూడా ఎకరానికి 4 టన్నుల వరకు అదనపు దిగుబడి వచ్చిందన్నారు. జూన్–మార్చి వరకు మొత్తం కలిపి ఎకరానికి 16 టన్నుల డ్రాగన్ పంట దిగుబడి వచ్చిందన్నారు. ఎకరానికి రూ. లక్ష వరకు ఖర్చు పోగా.. ఎకరానికి రూ. 14 లక్షల నికరాదాయం వచ్చిందని వివరించారు. ఇప్పుడు నాలుగో సీజన్ ప్రారంభం కావటంతో కాపు మొదలైంది. 80 రకాల డ్రాగన్ మొక్కలు పొలంలో 80 రకాల డ్రాగన్ మొక్కలను ప్రయోగాత్మకంగా నాటించానని, ఏ రకం బాగా దిగుబడి వస్తే అదే రకం పంట పండించాలన్న ఆలోచన వచ్చిందన్నారు. రెడ్ అండ్ రెడ్, రెడ్ అండ్ వైట్, ఎల్లో అండ్ వైట్ బేసిక్ కలర్లన్నారు. ఎల్లోవైట్ తీపిగా ఉంటుందని, ఇదే ఖరీదైన పండన్నారు. నాలుగు నెలకు ఒకసారి పండ్ల దిగుబడి వస్తుందని, కిలో ధర రూ. 1000 నుంచి రూ. 1200 వరకు పలుకుతుందన్నారు. ఆమెరికా, వియత్నాం దేశాల్లో పర్యటించి డ్రాగన్ ఫ్రూట్ సాగు గురించి తెలుసుకున్నట్లు ఆయన చెప్పారు. ముదురు డ్రాగన్ మొక్కల నుంచి కాండాన్ని కత్తిరించి మొక్కల్ని తయారు చేస్తున్నారు. ఇప్పటి వరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో రైతులకు సుమారు 300 ఎకరాలకు సరిపడా డ్రాగన్ మొక్కల్ని సరఫరా చేశానన్నారు. భవిష్యత్తులో డ్రాగన్ ఫ్రూట్ జ్యూస్, సౌందర్య సాధన ఉత్పత్తులను తయారు చేసి ఆదాయం పెంచుకోవాలని రమేశ్ రెడ్డి ఆశిస్తున్నారు. – వై.శ్రీనివాస్‌రెడ్డి, సాక్షి, జహీరాబాద్ యాజమాన్యం ముఖ్యం! రోజూ పంటను గమనించుకుంటూ రైతువారీగా తగిన శ్రద్ధ తీసుకుంటూ ఉత్తమ యాజమాన్య పద్ధతులు పాటిస్తే డ్రాగన్ ఫ్రూట్ పంటలో మొదటి ఏడాది నుంచే మంచి దిగుబడులు వస్తాయి. అయితే, రైతు స్వయంగా కాకుండా పూర్తిగా పనివారిపై ఆధారపడి సరిగ్గా యాజమాన్య పద్ధతులు పాటించకపోతే రెండేళ్లయినా సరైన దిగుబడి తియ్యలేని పరిస్థితులు కూడా ఎదురవుతాయి. వ్యక్తిగత శ్రద్ధతో సరైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే డ్రాగన్ ఫ్రూట్ రైతుకు ఆశ్చర్యకరమైన దిగుబడితోపాటు అదే స్థాయిలో ఆదాయమూ వస్తుంది. – బి.రమేశ్‌రెడ్డి (96666 66357), రంజోల్, సంగారెడ్డి జిల్లా చదవండి: ఒక్కసారి వేస్తే 30 ఏళ్ల పాటు పంట: ఎకరాకు ఏడాదికి రూ.3 లక్షల ఆదాయం -
అరువుపై ఎరువులు ఇవ్వం
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: వ్యవసాయ సహకార సంఘాల (సొసైటీ)లకు అరువుపై ఎరువులు ఇచ్చేది లేదని మార్క్‌ఫెడ్ (తెలంగాణ రాష్ట్ర సహకార మార్కెటింగ్ ఫెడరేషన్) కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త విధానం ప్రకారం ఈ వానాకాలం సీజన్ నుంచి ముందు నగదు చెల్లించిన సొసైటీలకే ఎరువులు పంపుతామని తేల్చిచెబుతోంది. ఏటా సహకార సంఘాలు అరువుపై ఎరువులు తీసుకుని వాటిని రైతులకు విక్రయించి.. వచ్చిన డబ్బును మార్క్‌ఫెడ్‌కు చెల్లిస్తుంటాయి. ఇకమీదట ఉద్దెరపై ఎరువులు అమ్మరాదని మార్క్‌ఫెడ్ తీసుకున్న నిర్ణయంతో ఆర్థికంగా చితికిన సహకార సంఘాల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది. ఎరువులు కొనేందుకు డబ్బు ఎక్కడి నుంచి తేవాలని సొసైటీల చైర్మన్లు తర్జనభర్జన పడుతున్నారు. బ్యాంకు గ్యారెంటీతోనైనా ఇవ్వాలని వినతి ఎరువుల కోసం ముందుగా నగదు చెల్లించలేని పరిస్థితిలో ఉన్నామని, కనీసం బ్యాంకు గ్యారెంటీలతోనైనా సొసైటీలకు ఎరువులు పంపాలని సొసైటీల పాలకవర్గాలు మార్క్‌ఫెడ్ అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నాయి. దీనికోసం ఆయా జిల్లాల్లో కీలక ప్రజాప్రతినిధులు, మంత్రుల సిఫార్సు లేఖలను కూడా పంపుతున్నారు. సంగారెడ్డి జిల్లాలో ఇలా ఐదు సొసైటీలు బ్యాంకు గ్యారెంటీ కోసం ప్రయత్నాలు చేస్తున్నాయి. కాగా, సొసైటీలకు గ్యారెంటీ ఇచ్చేందుకు బ్యాంకులు కూడా అనేక మెలికలు పెడుతున్నాయి. మార్క్‌ఫెడ్ వద్ద పాత బకాయిలన్నీ చెల్లించినట్లు నోడ్యూ సర్టిఫికెట్ తీసుకురావాలని బ్యాంకులు తేల్చి చెబుతున్నాయి. దీంతో సొసైటీల పాలకవర్గాలు నో డ్యూ సర్టిఫికెట్లకోసం మార్క్‌ఫెడ్ డీఎంలకు దరఖాస్తులు చేసుకుంటున్నాయి. ఆర్థిక ఇబ్బందుల్లో 40 శాతం సొసైటీలు రాష్ట్రంలో మొత్తం 818 సహకార సంఘాలుండగా, ఇందులో సుమారు 40 శాతం సంఘాలు ఆర్థికంగా చితికిపోయాయి. కొన్ని సొసైటీలైతే కనీసం సిబ్బందికి వేతనాలు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాయి. ధాన్యం కొనుగోళ్లు చేపట్టిన సొసైటీల ఆర్థిక పరిస్థితి మాత్రమే కొంత మెరుగ్గా ఉంది. ఈ కొనుగోళ్లపై వచ్చిన కమీషన్‌తోనే చాలా వరకు సొసైటీలు నిలదొక్కుకుంటున్నాయి. ధాన్యం సేకరణ లేని ప్రాంతాల్లో సొసైటీలు ఆర్థికంగా కొట్టుమిట్టాడుతున్నాయి. ఎరువుల పంపిణీలో కీలక పాత్ర.. ఎరువుల పంపిణీలో సొసైటీలది కీలక పాత్ర. రాష్ట్రంలో సుమారు 60 శాతం ఎరువులు సొసైటీల ద్వారానే రైతులకు పంపిణీ అవుతున్నాయి. మిగతా 40 శాతం ప్రైవేటు డీలర్ల ద్వారా విక్రయిస్తుంటారు. రైతులకు సొసైటీల్లో ఎరువులు అందుబాటులో ఉంటే ప్రైవేటు వ్యాపారుల దోపిడీకి చెక్ పడు తుంది. సొసైటీల్లో ఎరువులు అందుబాటులో లేని పక్షంలో వ్యాపారులు అధిక ధరలకు విక్రయించి రైతులను నిలువు దోపిడీ చేస్తారు. మరో పక్షం రోజుల్లో వానాకాలం సాగు పనులు ఊపందు కుంటాయి. ఈ నేపథ్యంలో ఇప్పటి నుంచే ఎరువులు సరఫరా కావాల్సి ఉంది. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా సగానికిపైగా సొసైటీల్లో ఈ వానాకాలం సీజన్లో ఎరువులు అందించే అవకాశం కనిపించడం లేదు. -
Sakshi Cartoon: అవున్సార్! ..తిడితేనే తప్పు!
అవున్సార్! ..తిడితేనే తప్పు! -
కేసీఆర్‌పై జగ్గారెడ్డి ప్రశంసలు.. తప్పుగా అనుకోవద్దని వ్యాఖ్యలు
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. తన నియోజ కవర్గానికి మెడికల్ కాలేజీని మంజూరు చేసిన సీఎం కేసీఆర్‌ను పొగడక తప్పదని, దాన్ని తప్పుగా అనుకోవద్దని పేర్కొన్నారు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో నిర్మిస్తున్న మెడికల్ కాలేజీ భవన నిర్మాణ పనులను బుధవారం జగ్గారెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘సంగారెడ్డికి నేను ఎమ్మెల్యేను. కాంగ్రెస్ ఎమ్మెల్యేను. అలా అని నేను ఎందుకు చెబుతున్నానంటే.. ఎమ్మెల్యేకు కొంత బాధ్యత ఉంటుంది. పార్టీ అంటే పోరాటం. ఎమ్మెల్యే అంటే ఆరాటం. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే ఓ రకంగా ఉంటుంది. ప్రభుత్వం లేకుంటే రిక్వెస్ట్ చేసి పనులు చేసుకోవాల్సి వస్తుంది. ఎమ్మెల్యే బాధ్యతాయుత పదవి కావడంతో స్థానిక ప్రజల డిమాండ్‌ను నెరవేర్చాల్సిన బాధ్యత నాపై ఉంది. ఇందుకోసం సంగారెడ్డి మెడికల్ కాలేజీ ఆవశ్యకతను అసెంబ్లీలో పలుమార్లు ప్రస్తావించా. కాలేజీ పనులను వెంటనే పూర్తి చేసి సీఎం చేతుల మీద ప్రారంభించాలని మంత్రి హరీశ్‌ను కోరాను’అని చెప్పారు. చదవండి👇 పంజగుట్ట: మేనేజర్ ఏటీఎం కార్డు నుంచి డబ్బులు డ్రా చేసుకొని.. ప్రగతిభవన్‌కు తిమ్మక్క.. సమీక్ష సమావేశానికి తీసుకెళ్లి సత్కరించిన సీఎం కేసీఆర్ సమయం లేదు గణేశా!.. జీహెచ్ఎంసీ యాక్షన్ ప్లాన్ ఏమిటో? -
నిశ్చితార్థం రోజునే విద్యుత్ స్తంభంపై శవమై
జోగిపేట(అందోల్): నిశ్చితార్థం జరగాల్సిన రోజునే ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. ఆదివారం ఉదయం విధులకు వెళ్లిన ఆ యువకుడు డ్యూటీ ముగించుకుని ఇంటికెళ్లాల్సిన వ్యక్తి విద్యుత్ స్తంభంపై నిర్జీవంగా వేలాడుతూ కన్పించాడు. సంగారెడ్డి జిల్లా అందోలు మండలం దానంపల్లి శివారులో సోమవారం జరిగిన ఘటన వివరాలిలా ఉన్నాయి. మెదక్ జిల్లా టేక్మాల్ గ్రామానికి చెందిన బాలరాజు (25) పాల్వంచలోని సోలార్ కేంద్రంలో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఆదివారం యథావిధిగా విధులకు హాజరైన బాలరాజు సోమవారం దానంపల్లి గ్రామ సమీపంలోని శివారులో విద్యుత్ స్తంభానికి వేలాడుతూ కనిపించడంతో గ్రామస్తులు పోలీసులకు సమాచారమిచ్చారు. మృతుడి వివరాలు తెలియక పోవడంతో పోలీసులు వాట్సాప్ గ్రూపుల్లో ఫొటోలు పెట్టడంతో బాలరాజు కుటుంబ సభ్యులు గుర్తించారు. దీంతో జోగిపేట పోలీస్ స్టేషన్‌కు చేరుకున్న కుటుంబ సభ్యులు బాలరాజు మృతిపై తమకు అనుమానాలు న్నాయని, కంపెనీలో పనిచేసే వారే చంపి ఉంటారని మృతుడి సోదరుడు పొట్టి శంకరయ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాలరాజుకు కరెంట్ స్తంభాలు ఎక్కడం కూడా రాదని కుటుంబ సభ్యులు అంటు న్నారు. డ్రైవింగ్ పనులే చేస్తాడని చెబుతున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై సామ్యా నాయక్ తెలిపారు. కాగా, బాల రాజుకు ఇటీవలే పాపన్నపేట మం డలానికి చెందిన యువతితో పెళ్లి సంబంధం కుదిరింది. సోమవారం నిశ్చితార్థం జరగాల్సి ఉంది. -
వారంలోగా కానిస్టేబుల్ పోస్టులకు నోటిఫికేషన్
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: రాష్ట్రంలో పోలీస్, ఫైర్, ఫారెస్టు, ఎక్సైజ్ శాఖలకు సంబంధించి 20 వేల ఉద్యోగాలకు వారంరోజుల్లో నోటిఫికేషన్ వస్తుందని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు. సోమవారం సంగారెడ్డి జిల్లాలో మంత్రి సుడిగాలి పర్యటన చేశారు. ఒకే రోజు 16 అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రారంభించారు. పలు సమీక్షల్లో పాల్గొన్నారు. పోలీస్ శాఖ ఇక్కడ ఏర్పాటు చేసిన కానిస్టేబుల్ శిక్షణ తరగతులను ఆయన ప్రారంభించారు. ఆయా కార్యక్రమాల్లో మంత్రి మాట్లాడుతూ వచ్చే ఏడాది నుంచి జాబ్ కేలండర్ సిద్ధం చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. ‘‘దళితుల ఆర్థిక అభ్యున్నతికి దళితబంధు వంటి సంక్షేమ పథకాలు అమలు చేస్తుంటే.. ఇది అమలైతదంటవా? రూ.పది లక్షలు ఇస్తరంటవా? అనే కాంగ్రెస్, బీజేపీ అపశకునం గాళ్లకు ప్రజలే గుణపాఠం చెప్పాలి. ప్రభుత్వం చేసే ప్రతి పనిని విమర్శిస్తున్నారు. మీ విమర్శలను దీవెనలనుకుంటాం. మరింత చిత్తశుద్ధితో ముందుకెళ్తాం’’అంటూ మంత్రి ప్రతిపక్షాలపై నిప్పులు చెరిగారు. ‘బండి సంజయ్.. నీ తొండి మాటలు బంద్ చెయ్యి’అని అక్కాచెల్లెల్లు అడ్డం తిరిగారటా.. సిలిండర్ ధర రూ.1,050 చేసినవు.. ఆ ధర ఎప్పుడు తగ్గిస్తావో చెప్పు అని గట్టిగా అడిగారట.. నిరుద్యోగ యువత దేశంలో ఉన్న 15.60 లక్షల ఉద్యోగాలెప్పుడిస్తరో చెప్పు అని నిలదీశారట’’అని పేర్కొన్నారు. కేంద్రంలోని బీజేపీ సర్కారు పెట్రోల్, సిలిండర్ ధరలను పెంచి తొండి పనులు చేస్తూ రాష్ట్రంలో పాదయాత్రలు చేస్తుంటే ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. ‘కాంగ్రెసోళ్లది దింపుడుగల్లం ఆశ. వాళ్లది వాళ్లకే సుతిలేదు. రాష్ట్రంలో అధికారంలోకి వస్తామంటున్నారు’అని ఎద్దేవా చేశారు. -
పంచేటోళ్లు కావాలా? పెంచేటోళ్లు కావాలా?
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: ‘కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ధరలన్నీ పెంచుకుంటూ పోతోంది. గ్యాస్ సిలిండర్ ధరలు పెంచింది. పెట్రోల్, మంచినూనె ధరలు పెంచింది. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం అన్నీ పంచుకుంటూ పోతోంది. రైతుబంధు కింద ఎకరానికి రూ.పది వేలు ఇస్తోంది. కల్యాణలక్ష్మి కింద రూ.లక్ష ఇస్తోంది. స్త్రీనిధి కింద మహిళలకు రుణాలిస్తోంది. మరి పంచెటోళ్లు కావాలా? పెంచెటోళ్లు కావాలా? అని ప్రజలు ఆలోచన చేయాలి. పార్లమెంట్ ఎన్నికలు వచ్చినప్పుడు బీజేపీని గుద్దుడు గుద్ది.. గద్దెదించాలి..’అని మంత్రి హరీశ్‌రావు బీజేపీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆదివారం సంగారెడ్డి అంబేడ్కర్ స్టేడియంలో జరిగిన బహిరంగ సభలో హరీశ్‌రావు అభయహస్తం పథకంలో ఎస్‌హెచ్‌జీ మహిళలు తమ వాటా కింద చెల్లించిన మొత్తాన్ని తిరిగి వారి ఖాతాల్లో జమ చేసేందుకు చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు బీజేపీ, కాంగ్రెస్ తీరుపై మండిపడ్డారు. ‘ఒకడు పాదయాత్ర.. ఇంకోడు సైకిల్‌యాత్ర.. ఇంకోడు మోకాళ్లయాత్ర.. బయలెల్లిండ్రు.. ఏం యాత్రలు.. తిట్టుడు తప్ప ఏమీలేదు. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలో అమలవుతయా? చెప్పాలి.. కాంగ్రెస్, బీజేపీ పాలనల్లో ఏం జరిగింది?.. ఈ ఆరేండ్ల టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఏం జరిగిందో ప్రజలు ఆలోచన చేయాలి’ అని హరీశ్‌రావు అన్నారు. దేశంలో పేదరికం పెరగడానికి కాంగ్రెస్, బీజేపీలే కారణమన్నారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మాట్లాడుతూ, 57 ఏళ్లు దాటిన వారికి ఆసరా పింఛన్ల మంజూరు ఈనెల నుంచే ప్రారంభిస్తామని ప్రకటించారు. -
‘ఆర్ఆర్ఆర్’ పరిహారం లెక్క చదరపు మీటర్లలో..!
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: రీజినల్ రింగ్ రోడ్డులో భూసేకరణ పరిహారం చదరపు మీటర్లలో లెక్కించి ఇవ్వాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. సాధారణంగా సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, ఇతర ప్రజాప్రయోజనాల కోసం సేకరించి భూములకు సంబంధించిన పరిహారాన్ని ఎకరాల్లో లెక్కించి చెల్లిస్తారు. ఆయా గ్రామాల్లో ఇటీవల జరిగిన భూక్రయవిక్రయాలకు సంబంధించి రిజిస్ట్రేషన్ రేటుకు నెగోషియేషన్ చేసి ధర నిర్ణయిస్తారు. కానీ ఈ రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణంతో భూములు కోల్పోతున్న రైతులకు ఇందుకు భిన్నంగా చదరపు మీటర్లలో లెక్కించి పరిహారం చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రెవెన్యూ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఎకరానికి 4,046.85 చదరపు మీటర్లుగా లెక్కించి పరిహారం ఇవ్వనున్నారు. రెండు రోజుల్లో నోటిఫికేషన్... ఈ రహదారి భూసేకరణకు సంబంధించి రెవెన్యూ అధికారులు రెండు రోజుల్లో నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. అలైన్‌మెంట్‌పై ప్రైవేట్ ఏజెన్సీ చేసిన సర్వే నివేదికను ఆ సంస్థ ఇటీవలే రెవెన్యూ అధికారులకు అప్పగించింది. ఏజెన్సీ ఇచ్చిన సర్వేనంబర్లను జిల్లా రెవెన్యూ అధికారులు మరోసారి క్రాస్ చెక్ చేస్తున్నారు. భూమికి సంబంధించిన పట్టాదారు పేరు, సర్వే నంబరు, గ్రామం, మండలం, జిల్లా, విస్తీర్ణం వంటి వివరాలను ప్రత్యేక ప్రొఫార్మాలో పొందుపరుస్తున్నారు. ఈ ప్రక్రియను రెండు రోజుల్లో ముగించి, వెంటనే స్థానిక భూసేకరణ నోటిఫికేషన్ విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగం 158.64కి.మీ.ల నిర్మాణానికి అవసరమైన భూసేకరణ కోసం సంగారెడ్డి, జోగిపేట్, నర్సాపూర్, తూప్రాన్, గజ్వేల్, భువనగిరి, చౌటుప్పల్ ఆర్డీఓలు, యాదాద్రి భువనగిరి అదనపు కలెక్టర్‌ను భూసేకరణ అథారిటీగా నియమించిన విషయం విదితమే. నేషనల్ హైవే అథారిటీ అధికారులు విడుదల చేసిన అలైన్మెంట్ ప్రకారం ఆర్డీఓలు 113 గ్రామాల్లో భూసేకరణ ప్రక్రియ ప్రారంభించారు. -
ఉగాది వేడుకల్లో జగ్గారెడ్డి సందడి
సంగారెడ్డి టౌన్: సంగారెడ్డి పట్టణంలోని రామ మందిరంలో శనివారం జరిగిన ఉగాది ఉత్సవాల్లో ఎమ్మెల్యే జగ్గారెడ్డి సందడి చేశారు. ఉగాది సందర్భంగా ఈ మందిరంలో వినూత్న ఆచారం కొనసాగుతోంది. భక్తుల పైకి ప్యాలాల లడ్డూలు (ప్రసాదం) విసురుతూ వందలాది మంది భక్తులకు అందిస్తారు. 40 ఏళ్లుగా జగ్గారెడ్డి ఆధ్వర్యంలో ప్యాలాల లడ్డూలు విసిరే కార్యక్రమం కొనసాగుతోంది. మొదట లడ్డూలకు పూజ చేసిన అనంతరం భజన చేస్తూ లడ్డూలను ఊరేగించారు. ఈ ఊరేగింపులో ఎమ్మెల్యే డోలక్ వాయిస్తూ పాటలు పాడుతూ భక్తులను ఉత్సాహపరిచారు. అనంతరం ఆలయంపై నుంచి ఆయన భక్తులపైకి లడ్డూలు విసిరారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ భద్రాచలంలో శ్రీరాముని కల్యాణం, తలంబ్రాలు అయ్యాక ఇక్కడ శ్రీరామనవమి వేడుకలు ప్రారంభమవుతాయని తెలిపారు. -
బలవర్థక ఆహారమే లక్ష్యం
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: కేంద్ర, రాష్ట్ర పభుత్వాల మధ్య బాయిల్డ్ రైస్‌పై వివాదం ఒకవైపు కొనసాగుతుండగానే ఇప్పుడు ఫోర్టిఫైడ్ రైస్ (బలవర్ధకమైన బియ్యం) అంశం తెరపైకి వచ్చింది. గతేడాది రబీకి సంబంధించి సీఎంఆర్ బియ్యం ఇవ్వాల్సిన రైస్ మిల్లర్లు ఇకపై బలవర్థకమైన బియ్యాన్ని కలిపి ఇవ్వాలని పౌరసరఫరాల శాఖ రైస్ మిల్లులకు ఆదేశాలు జారీ చేసింది. ఎఫ్‌సీఐ (భారత ఆహార సంస్థ) నిర్ణయం మేరకే ఆదేశాలిచ్చినట్లు పౌరసరఫరాల సంస్థ అధికారులు పేర్కొంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1.89లక్షల మెట్రిక్ టన్నుల ఫోర్టిఫైడ్‌తో కూడిన బియ్యాన్ని సేకరించాలని నిర్ణయించారు. క్వింటాల్‌కు ఒక కిలో.. గత రబీ సీజన్(2020–21)లో ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యాన్ని మర ఆడించేందుకు రైస్ మిల్లులకు ఇచ్చిన విషయం విధితమే. ఈ బియ్యంలో బలవర్థకమైన బియ్యాన్ని మిలితం చేసి ఇవ్వాలని ఎఫ్‌సీఐ ఆదేశించింది. ఒక్కో క్వింటాల్ బియ్యంలో కిలో బలవర్థక బియ్యాన్ని కలపాలని ఆదేశించింది. కేంద్ర ప్రభుత్వం సరఫరా చేసిన బలవర్ధక బియ్యాన్ని సీఎంఆర్ బియ్యంలో మిళితం చేసి ఇవ్వాల్సి ఉంటుంది. ఇందుకోసం వెంటనే మిల్లులు ఈ మిక్చర్ ప్లాంట్లను అమర్చుకోవాలని ఆదేశించింది. బలవర్థక బియ్యంలో వివిధ రకాల విటమిన్లు ఉంటాయి. అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలల్లో మధ్యాహ్న భోజనానికి ఈ ఫోర్టిఫైడ్‌రైస్‌ను సరఫరా చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. -
మహిళా పారిశ్రామికవేత్తల కోసం ‘ఉద్యమిక’
దినదినాభివృద్ధి చెందుతున్న ఏరోస్పేస్, డిఫెన్స్, ఇతర నూతన రంగాల్లో ఉన్న అవకాశాలను మహిళా పారిశ్రామికవేత్తలు అందిపుచ్చుకోవాలి. సంప్రదాయ, చిన్నచిన్న ఉత్పత్తి రంగాలకే పరిమితం కాకుండా నూతన రంగాలపైనా దృష్టి సారించాలి. మహిళా పారిశ్రామికవేత్తల కోసం పార్క్ ఏర్పాటు చేయడం దేశంలోనే మొట్టమొదటిసారి. – కేటీఆర్ సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: మహిళా పారిశ్రామిక వేత్తల సమస్యలను పరిష్కరించేందుకు ‘ఉద్యమిక ’ పేరుతో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేస్తామని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ ప్రకటించారు. సింగిల్ విండో విధానంలో పనిచేసే ఈ విభాగం మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రభు త్వం అందించే ప్రోత్సాహకాలను, ఇతర అంశా లను ఎప్పటికప్పుడు సమీక్షించి వారికి అండగా నిలుస్తుందన్నారు. పరిశ్రమల ఏర్పాటుకు ముందుకొచ్చే మహిళా పారిశ్రామికవేత్తలకు 10 శాతం రాయితీ ఇవ్వనున్నట్లు ప్రకటించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సంగారెడ్డి, పటాన్చెరులో మంగళవారం నిర్వహిం చిన పలు కార్యక్రమాలకు ఆయన హాజరయ్యారు. సంగారెడ్డి పరిధిలోని సుల్తాన్‌పూర్‌లో ఫ్లో(ఫిక్కి లేడీస్ ఆర్గనైజేషన్) ఇండస్ట్రియల్ పార్క్‌ను ఆయన ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లా డుతూ.. మహిళా పారిశ్రామికవేత్తల పారిశ్రామికో త్పత్తిని సులభతరం చేసేందుకు కార్పస్‌ఫండ్ సైతం ఏర్పాటు చేస్తామని చెప్పారు. మహిళల కోసమే ఏర్పాటు చేసిన ఈ ఫ్లో ఇండస్ట్రియల్ పార్కులో 50 ఎకరాలను 25 మంది మహిళా పారిశ్రామికవేత్తల కోసం ప్రభుత్వం కేటాయించిం దన్నారు. మహిళా పారిశ్రామికవేత్తల కోసం పార్క్ ఏర్పాటు చేయడం దేశంలోనే మొట్టమొదటిసారని చెప్పారు. వ్యాక్సిన్ ఉత్పత్తిలో మూడో వంతు... కోవిడ్ మహమ్మారిని ఎదుర్కొనేందుకు ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న వ్యాక్సిన్ ఉత్పత్తిలో 66 శాతం హైదరాబాద్‌లోనే జరిగిందని, హైదరాబాద్ దేశానికి ఫార్మా క్యాపిటల్‌గా అవతరిస్తోందని అన్నారు. నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించేం దుకు ఏర్పాటు చేసిన ‘వీ హబ్ ఇంక్యుబేషన్ సెంటర్’ సేవలను వినియోగించుకోవాలని మహి ళా పారిశ్రామికవేత్తలకు సూచించారు. రాష్ట్ర ఆవిర్భావానికి ముందు రూ.4.90 లక్షల కోట్లు ఉన్న రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ) ఇప్పుడు రూ.11.50 లక్షల కోట్లకు పెరిగిందని వివరించారు. రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో 130 శాతం వృద్ధి సా«ధించిందని పేర్కొన్నారు. ఆ అగ్ని ప్రమాదంతోనే ‘కల్యాణలక్ష్మి’కి శ్రీకారం పటాన్చెరు టౌన్: రాష్ట్రంలో ప్రతిష్టాత్మకమైన ‘కల్యాణలక్ష్మి’ పథకానికి పునాది ఓ అగ్ని ప్రమా దమని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. మంగళ వారం పటాన్చెరు పట్టణంలోని పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిం చిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ఒకసారి పల్లెనిద్రలో భాగంగా మహబూ బాబాద్‌లోని ఓ తండాకు వెళ్లగా అక్కడ ఓ వ్యక్తి కేసీఆర్ వద్దకు వచ్చి తన కూతురు వివాహం కోసం దాచుకున్న డబ్బు, ఇల్లు అగ్ని ప్రమాదం లో కాలిపోయాయని తన బాధను చెప్పుకున్నా డని కేటీఆర్ వివరించారు. ఆ తండ్రి వేదన, ఆ అగ్నిప్రమాదం బాధ నుంచి కేసీఆర్‌కు వచ్చిన ఆలోచనే కల్యాణలక్ష్మి పథకమని వెల్లడించారు. రూ.9వేల కోట్లతో పథకాన్ని ప్రారంభించి ఇప్పటివరకు పది లక్షల మంది ఆడపిల్లలకు ఆర్థికసాయం అందజేసి సీఎం కేసీఆర్ ఓ మేనమామలా నిలిచారని మంత్రి తెలిపారు. -
ప్రగతి భవన్.. కేసీఆర్ జైలుఖానా
సంగారెడ్డి అర్బన్: ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చని సీఎం కేసీఆర్‌కు ప్రగతి భవన్ జైలు ఖానా అయ్యిందని తెలంగాణ జనసమితి వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. ఆదివారం సంగారెడ్డిలో టీజేఎస్ ద్వితీయ ప్లీనరీని జిల్లా అధ్యక్షుడు తుల్జారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కోదండరాం మాట్లాడుతూ ప్రగతి భవన్ పాలన కొనసాగడం విడ్డూరంగా ఉందన్నారు. పేదల భూములు దోచి పెద్దలకు అప్పగించడం సరికాదన్నారు. పరిశ్రమల ముసుగులో ప్రభుత్వం భూముల అక్రమ దందా చేస్తోందని, నిమ్జ్ భూసేకరణను ఆపాలని డిమాండ్ చేశారు. నీళ్లు, నిధులు, నియామకాలు ఏమయ్యా యని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో ఎత్తిపోతల కంటే 10 వేల ఎకరాలు నీట మునగడం బాధాకరమన్నారు. సింగరేణి, ఎన్టీపీసీ కాలుష్యం, బూడిదతో నీళ్లు కలుషితం కావడంతో ఆ ప్రాంత ప్రజలు కిడ్నీ, ఉదరకోశ వ్యాధులతో బాధపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాజెక్టుల రీడిజైన్ పేరుతో వేల కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు అప్పగించడం సరికాదన్నారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో పరాయివాళ్లమయ్యామని ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యాంగ పరిరక్షణ కోసం మందకృష్ణ మాదిగ, ప్రొఫెసర్ హరగోపాల్‌తో కలిసి కార్యక్రమాలు చేపట్టబోతున్నట్లు చెప్పారు. -
రాజీనామా నిర్ణయాన్ని మార్చుకున్న జగ్గారెడ్డి.. ‘అప్పటి దాకా ఆగుతా’
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తానని ప్రకటించిన ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను కలిసే వరకు తాను రాజీనామా చేసే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. రాజీనామా చేయాలా? సొంత పార్టీ పెట్టాలా..? అని జగ్గారెడ్డి కార్యకర్తలను అడగ్గా, కాంగ్రెస్ పార్టీలోనే ఉండాలని వారు సూచించడం గమనార్హం. అయితే రానున్న రోజుల్లో తప్పనిసరి పరిస్థితుల్లో తాను తీసుకునే నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉండాలని కోరుకోవడం లేదని జగ్గారెడ్డి కార్యకర్తలు, అనుచరులనుద్దేశించి వ్యాఖ్యానించారు. సంబంధిత వార్త: తొందరపడి నిర్ణయం తీసుకోవద్దు శుక్రవారం సంగారెడ్డిలోని ఓ ఫంక్షన్‌హాలులో ఆయన నియోజకవర్గ కార్యకర్తలతో విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ తాను టీఆర్ఎస్ పార్టీలో చేరుతానని కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. అలాగే బీజేపీలోకి వెళ్లే ప్రసక్తేలేదని స్పష్టం చేశారు. బయటవారి కంటే కాంగ్రెస్ పార్టీ నేతలే ఈ అసత్య ప్రచారం చేస్తు న్నారని ఆరోపిం చారు. కాగా, తన నియోజ కవర్గంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని జగ్గారెడ్డి నిర్ణయించారు. డిజిటల్ సభ్యత్వ నమోదు తన నియోజకవర్గంలో తక్కువగా ఉందని, ఈసారి 75 వేల కాంగ్రెస్ పార్టీ సభ్యత్వాలను నమోదు చేయించాలని అనుచరులు, కార్యకర్తలను కోరారు. వచ్చేనెల 10న సభ్యత్వ నమోదుపై సమీక్ష ఉంటుందని, కార్యకర్తలు 75 వేల కంటే తక్కువ సభ్యత్వం నమోదు చేస్తే తనను అవమానించినట్లే అవుతుందని, ఈ సభ్యత్వ నమో దును బట్టి తన రాజకీయ భవిష్యత్ ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు. 21న సోనియా, రాహుల్‌లతో బహిరంగ సభ కాగా, మార్చి 21న సోనియా గాంధీ, రాహుల్ గాంధీలతో సంగారెడ్డిలో భారీ బహిరంగసభ నిర్వహిస్తానని జగ్గారెడ్డి ప్రకటించారు. తన భవిష్యత్ ఏంటో ఆ సభలో వెల్లడిస్తానన్నారు. యూపీ ఎన్నికల తర్వాతే! సాక్షి, హైదరాబాద్: సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డికి కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ అపాయింట్మెంట్ లభించాలంటే మరో 10 రోజుల సమయం పడుతుందని గాంధీభవన్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ప్రస్తుతం ఢిల్లీ పెద్దలు ఐదు రాష్ట్రాల ఎన్నికలు, ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ ఎన్నికల హడావుడిలో ఉన్నందున అవి ముగిసిన తర్వాతే జగ్గారెడ్డికి 10 జన్‌పథ్ నుంచి పిలుపు రావచ్చని తెలుస్తోంది. ఇదిలా ఉండగా, జగ్గారెడ్డికి అపాయింట్మెంట్ కోసం ఇప్పటికే రాహుల్ కార్యాలయానికి సమాచారం వెళ్లగా, నేడో రేపో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కూడా హైకమాండ్‌కు లేఖ రాయనున్నారు. పార్టీ ఎమ్మెల్యేకు సోనియా, రాహుల్, ప్రియాంకలతో భేటీ అయ్యేందుకు అవకాశం ఇప్పించాలని కోరు తూ సీఎల్పీ పక్షాన ఆయన లేఖ రాయనున్నట్టు సమాచారం. అయితే, 15 రోజుల పాటు వేచి చూస్తానని చెప్పిన జగ్గారెడ్డి.. తన మనసు మార్చుకున్నారని ఆయన వ్యాఖ్యలు చెపుతున్నాయి. శుక్రవారం సంగారెడ్డిలో జరిగిన కార్యకర్తల సమావేశంలో జగ్గారెడ్డి మాట్లాడుతూ సోనియా, రాహుల్, ప్రియాంకాగాంధీలను కలిసేంతవరకు రాజీనామా చేసే ప్రసక్తే లేదని వెల్లడించారు. అయితే, సమావేశం ముగిసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆసక్తిని కలిగిస్తున్నాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత కొందరికి అనుకున్న పదవులు రాకపోతే, మళ్లీ పార్టీని చీల్చే కార్యక్రమం చేస్తారని, అప్పుడు కాంగ్రెస్‌నే నమ్ముకున్న తనలాంటి వారి పరిస్థితి ఏంటని ప్రశ్నించడం ఆసక్తిని కలిగిస్తోంది. ఎవరిని ఉద్దేశించి జగ్గారెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారన్నది ఇప్పుడు పార్టీలో చర్చనీయాంశంగా మారింది. -
దేశంలోనే తొలిసారిగా 5జీ డేటా కాల్ అభివృద్ధి
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: దేశంలో 5జీ సాంకేతి కత పరిశోధనలో కీలక ముందడుగు పడింది. తొలిసారిగా స్వదేశీ పరిజ్ఞానంతో కూడిన 5జీ వైర్లెస్ బ్రాడ్‌బ్యాండ్ టెక్నాలజీని వైసిగ్ నెట్వ ర్క్స్ (డబ్ల్యూఐఎస్‌ఐజీ) అనే స్టార్టప్ కంపెనీతో కలసి ఐఐటీ హైదరాబాద్ సంయుక్తంగా అభివృ ద్ధి చేసింది. దేశీయంగా అభివృద్ధి చేసిన 5జీ ఒరాన్ (ఓపెన్ రేడియో యాక్సెస్ నెట్వర్క్) టెక్నాలజీ సాయంతో తొలి డేటా కాల్‌ను చేసినట్లు ప్రకటించింది. ఈ మేరకు మంగళవా రం ఇక్కడ ప్రకటన విడుదల చేసింది. 3.3–3.5 జీహెచ్‌జెడ్ (గిగాహెర్ట్జ్) ఫ్రీక్వెన్సీ (పౌనఃపు న్యం) బ్యాండ్‌లో 100 ఎంహెచ్‌జెడ్ (మెగా హెర్ట్జ్) బ్యాండ్‌విడ్త్‌కు సపోర్ట్ చేసే మల్టిపుల్ ఇన్పుట్–మల్టిపుల్ అవుట్‌పుట్ (మిమో) సామర్థ్యంగల బేస్‌స్టేషన్‌ను ఉపయోగించి డేటా కాల్‌ను అభివృద్ధి చేసినట్లు ఐఐటీ వర్గాలు వెల్లడించాయి. లైసెన్సింగ్ ప్రాతిపదికన ఈ సాంకేతికతను భారతీయ వైర్లెస్ పరికరాల తయారీదారులకు అందుబాటులో ఉంచుతు న్నట్లు వైసిగ్ నెట్వర్క్స్ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ సాయిధీరాజ్ చెప్పారు. 5జీ స్వదేశీ పరిజ్ఞానం అభివృద్ధిలో ఇదో కీలక ఘట్టమని ఐఐటీహెచ్ పరిశోధన–అభివృద్ధి విభాగం డీన్ ప్రొఫెసర్ కిరణ్ కుచి తెలిపారు. తమ పరిశోధన ద్వారా 5జీ, భావి సాంకేతికతల అభివృద్ధిలో భారత్‌ను మరింత ముందుకు తీసుకొచ్చినట్లు చెప్పారు. 5జీ రంగంలో తమ టెక్నాలజీ దేశాన్ని ఆత్మ నిర్భర్‌గా మార్చగలదని ఆశిస్తున్నట్లు ఐఐటీహెచ్ డైరెక్టర్ బీఎస్ మూర్తి పేర్కొన్నారు. -
LIVE: కేసీఆర్ బహిరంగ సభ @ నారాయణఖేడ్
-
కాంగ్రెస్‌కు జగ్గారెడ్డి గుడ్‌బై?
సాక్షి, హైదరాబాద్: టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్‌రెడ్డి అలియాస్ జగ్గారెడ్డి కాంగ్రెస్‌ను వీడాలని నిర్ణయించుకున్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవితోపాటు ప్రాథమిక సభ్యత్వానికి కూడా ఆయన రాజీనామా చేయనున్నారు. దీనిపై శనివారం అధికారిక ప్రకటన విడుదల చేయనున్నారు. ఈ మేరకు సంగారెడ్డి నియోజకవర్గ ముఖ్య నాయకులు, తన అనుచరులకు జగ్గారెడ్డి సమాచారం ఇచ్చారని.. అయితే ఇప్పటికిప్పుడు వేరే పార్టీలో చేరే ఆలోచనలో లేరని ఆయన సన్నిహితులు చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీని వీడనున్న అంశాన్ని జగ్గారెడ్డి కూడా ధ్రువీకరించారు. శనివారం వివరాలను వెల్లడిస్తామన్నారు. రేవంత్‌రెడ్డితో పొసగకనే..! టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డితో పొసగకపోవడం తోపాటు.. ముక్కుసూటిగా మాట్లాడే తనను కోవర్టుగా చిత్రీకరించారనే మనస్తాపంతోనే జగ్గారెడ్డి రాజీనామా నిర్ణయం తీసుకున్నారని కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ నియామకాన్ని వ్యతిరేకించిన జగ్గారెడ్డి.. అధిష్టానం తనకు వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు అప్పగించడంతో సర్దుకుపోవాలని భావించారు. కానీ హుజూరాబాద్ ఉప ఎన్నిక సహా పలు అంశాలపై రేవంత్ వైఖరిని బహిరంగంగానే తప్పుపట్టారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలో తనకు సమాచారం ఇవ్వకుండా రేవంత్ పర్యటించడంపై తీవ్రంగా నిరసన వ్యక్తం చేశారు. రేవంత్‌ను తప్పించాలంటూ పార్టీ అధిష్టానానికి లేఖలు రాశారు. ఈ విషయం మీడియాలో రావ డంతో పార్టీ అధిష్టానం జగ్గారెడ్డిని మందలించింది. దీనికితోడు రాష్ట్ర నేతలు కూడా జోక్యం చేసుకుని సర్దిచెప్పడంతో.. తాను రేవంత్ గురించి మాట్లాడబోనని జగ్గారెడ్డి ప్రకటించారు. అయితే.. రేవంత్‌ను వ్యతిరేకిస్తుండటం, పలు అంశాల్లో టీఆర్ఎస్ ప్రభుత్వ నిర్ణయాలకు అనుకూలంగా మాట్లాడటం తో.. సోషల్ మీడియాలో జగ్గారెడ్డిపై విమర్శలు వ్యక్తమయ్యాయి. ఆయన టీఆర్ఎస్ కోవర్టు అన్నట్టుగా ప్రచారం జరిగింది. ఆ ప్రచారాన్ని జగ్గారెడ్డి ఖండించారు. ఇలా చాలా అంశాల్లో రేవంత్ వర్గంతో ఆయనకు విభేదాలు కొనసాగుతూ వచ్చాయి. భార్య చెప్పిన విషయంతో.. రేవంత్‌రెడ్డితో మనస్పర్థలు, ఇతర విభేదాలు ముందునుంచే ఉన్నా.. గురువారం సాయంత్రం జగ్గారెడ్డికి ఆయన సతీమణి నిర్మలారెడ్డి చేసిన ఫోన్‌కాల్ తాజా నిర్ణయానికి కారణమైనట్టు వారి సన్నిహితులు చెప్తున్నారు. గురువారం నిర్మలారెడ్డి దగ్గరి బంధువు వివాహం జరిగింది. సాయంత్రం 4 గంటల సమయంలో హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన జగ్గారెడ్డి.. తర్వాత సంగారెడ్డికి వెళ్లి.. స్థానికంగా పలు కార్యక్రమాల్లో పాల్గొ న్నారు. నిర్మలారెడ్డి బంధువు వివాహానికి మాత్రం వెళ్లలేకపోయారు. ఆ సమయంలో జగ్గారెడ్డికి నిర్మలారెడ్డి ఫోన్ చేశారు. ఈ సందర్భంగా ఆమె చెప్పిన విషయమే.. కాంగ్రెస్‌కు జగ్గారెడ్డి రాజీనామా నిర్ణయానికి కారణమైందని సన్నిహితులు చెప్తున్నారు. సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా కాంగ్రెస్ చేపట్టిన నిరసనలను జగ్గారెడ్డి తప్పుపట్టిన నేపథ్యంలో.. నియోజకవర్గంలోని ఇద్దరు కీలక అనుచరులు నిర్మలారెడ్డికి ఫోన్‌చేసి మాట్లాడారని, జగ్గారెడ్డి తీరు సరికాదన్నట్టుగా మాట్లాడారని అంటున్నారు. ‘‘మేడమ్.. మన సార్ మాట్లాడుతున్నది వాస్తవమే. అయినా కొన్ని విషయాలు ప్రచారంలోకి వస్తున్నాయి. జగ్గారెడ్డి టీఆర్ఎస్ కోవర్టు అనే ప్రచారం ఎక్కువ అవుతోంది. ఇది మంచిది కాదు. పార్టీ కోసం మాట్లాడి నిందల పాలవుతున్నారు. కష్టకాలంలోనూ జగ్గారెడ్డి పార్టీ కోసం ఉన్నారు. ఏదైనా మాట్లాడాలనుకుంటే ఆయన్ను పార్టీ నుంచి బయటకు వచ్చి మాట్లాడాలని చెప్పండి’’ అని అనుచరులు పేర్కొ న్నట్టు చెప్తున్నారు. నిర్మలారెడ్డి ఈ విషయాన్ని జగ్గారెడ్డికి వివరించారని ఆయన సన్నిహితులు అంటున్నారు. తన నియోజకవర్గంలోనే ఇలాంటి అభిప్రాయం ఉన్నందున.. తాను కాంగ్రెస్‌లో కొనసాగి పార్టీకి నష్టం చేయడం మంచిది కాదని జగ్గారెడ్డి అభిప్రాయానికి వచ్చారని చెప్తున్నారు. -
ఆస్తి కోసం కొడుకు రాక్షసత్వం.. భార్యను పుట్టింటికి పంపించి..
Son Killed Mother in Sangareddy: నవమాసాలు మోసిన కన్న తల్లినే పొట్టన పెట్టుకున్నాడొక కసాయి కొడుకు. ఈ దారుణం సంగారెడ్డి జిల్లాలోని వట్పల్లి మండలం పోతులబోగుడా గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది. ఎస్ఐ దశరథ్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన మొండి మల్లమ్మ (55) పేరునున్న నాలుగెకరాల భూమిని తన పేరున రాయాలని, బంగారు ఆభరణాలు కూడా ఇవ్వాలని కుమారుడు మురళి తాగివచ్చి రోజూ గొడవ పడేవాడు. తల్లిని ఎలాగైనా చంపి బంగారు ఆభరణాలు తీసుకోవాలని పథకం రచించాడు. ఈ క్రమంలో మురళి తన భార్యను ఆమె తల్లి ఇంటికి పంపించాడు. బుధవారం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో తల్లి గొంతు నులిమి హతమార్చాడు. తర్వాత ఏమీ తెలియనట్టు చుట్టు పక్కల వారికి తల్లి అనారోగ్యంతో మరణించిందని నమ్మబలికాడు. గ్రామస్తులకు అనుమానం రావడంతో పోలీసులకు సమాచారం అందించారు. జోగిపేట సీఐ శ్రీనివాస్, స్థానిక పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని హత్య జరిగిన తీరును పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని జోగిపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతురాలి అల్లుడు జనార్దన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు. -
ఆ మాటే అల్లుడి చేతిలో అత్త ప్రాణం తీసింది..
సాక్షి, సంగారెడ్డి: అత్తను గొంతునులిమి అల్లుడు హత్య చేసిన సంఘటన మండలంలోని నాగపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. రూరల్ సీఐ శివలింగం తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన బాలమ్మ (60)కు ఇద్దరు కూతుర్లు కాగా పెద్ద కూతురు లక్ష్మిని పుల్కల్ మండలం మంతూరు గ్రామానికి చెందిన నేనా బాగయ్యకు ఇచ్చి వివాహం చేశారు. చిట్టి గ్రూపు డబ్బులు కట్టడానికి మంగళవారం బాగయ్య నాగపూర్‌కు వచ్చాడు. ఈ క్రమంలో ఏ పని చేయకుండా తిరుగుతున్నావని అత్త అనడంతో ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగింది. కోపంలో బాగయ్య అత్త గొంతు నులిమి హత్య చేశాడు. మృతురాలి బంధువుల ఫిర్యాదు మేరకు బుధవారం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు. చదవండి: (యూకే నుంచి వచ్చి.. రోడ్డు ప్రమాదంలో విద్యార్థి దుర్మరణం) -
వైకుంఠ ఏకాదశికు సర్వం సిద్ధం
-
అబ్బాయి కన్నా అమ్మాయి పెద్ద.. చివరికి ఏమైందంటే?
సాక్షి, మెదక్: కలిసి జీవించాలని భావించిన వారికి సామాజిక వర్గాలు, వయసులో ఉన్న వ్యత్యాసం అడ్డుపడ్డాయి. దీంతో కలిసి జీవించలేని జీవితంపై విరక్తి పుట్టి బలన్మరణానికి పాల్పడ్డారు. ఈ నెల 5వ తేదీన కనిపించకుండా పోయిన ప్రేమజంట మంజీర నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో ఇరు కుటుంబాలు శోకసంద్రలో మునిగిపోయాయి. పోలీసుల కథనం మేరకు.. నాగిలిగిద్ద మండలం మాయినెళ్లి గ్రామానికి చెందిన అనిల్ (25)సంగారెడ్డిలోని భగత్‌సింగ్ కాలనీకి చెందిన కష్ణవేణి (28)లు గత ఏడాదిన్నర నుంచి ప్రేమించుకుంటున్నారు. వివాహం చేసుకుందామని ప్రేమ విషయం ఇంట్లో చెప్పారు. అయితే వీరి సామాజిక వర్గాలు, వయసులో వ్యత్యాసం ఉండడంతో ఇరు కటుంబాల పెద్దలు వివాహానికి నిరాకరించారు. ఈ క్రమంలో జనవరి 5న కష్ణవేణి, అనిల్ ఇంట్లో చెప్పకుండా వెళ్లిపోయారు. దీంతో వారి ఆచూకీ కోసం తల్లిదండ్రులు సంగారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. చదవండి: (నర్సింగ్ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం.. తల్లికి వీడియో కాల్ చేసి..) ఈ నేపథ్యంలో రాయికోడ్ మండలంలోని సిరూర్ గ్రామ సమీపంలో మంజీర నదిపై వంతెన వద్ద ఓ బైక్ అనుమానాస్పదంగా నిలిచి ఉండటాన్ని పలువురు గుర్తించి రాయికోడ్ పోలీసులకు సమాచారం అందించారు. బైక్ నెంబర్ ఆధారంగా సంగారెడ్డిలో తప్పిపోయిన వారు వినియోగించిన బైక్‌గా గుర్తించి నీటిలో గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో శుక్రవారం సాయంత్రం ఓ మృతదేహం ఒడ్డుకు కొట్టుకొచ్చింది. ఆ మృతదేహాన్ని కుటుంబీకుల సాయంతో కృష్ణవేణిదిగా గుర్తించారు. శనివారం ఉదయం మరో మృతదేహం కొట్టుకురాగా అనిల్‌గా గుర్తించారు. మృతదేహాలను సంగారెడ్డి పోలీసులు ఆస్పత్రికి తరలించారు. ఘటనపైకేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు. -
ఆ వార్తల్లో ఏది నిజం, ఏది అబద్దమో నేను చెప్పను: ఎమ్మెల్యే జగ్గారెడ్డి
సాక్షి, హైదరాబాద్: పార్టీలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయంటూ కొన్ని రోజులుగా పార్టీ నేతలపై అసంతృప్తిని వ్యక్తం చేస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి గురువారం మీడియా ముందుకొచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'మీడియాకు ఎవరు ఏం చెప్తున్నారో నాకు తెలియదు. పీఏసీ మీటింగ్‌లో ఏం జరిగిందో నేను చెప్పను. నా ఆవేదనను ఇంఛార్జ్ ఠాగూర్‌కు తెలియజేశా. నాపై వస్తున్న వార్తల్లో ఏది నిజం, ఏది అబద్దమో నేను చెప్పను. సోనియా, రాహుల్ గాంధీలను కలవడానికి అపాయింట్మెంట్ అడుగుతా. సోనియా, రాహుల్ గాంధీల నాయకత్వంలో జీవితాంతం పనిచేస్తా. నా వల్ల పార్టీలో ఎవరైనా ఇబ్బందులు పడితే.. ఇండిపెండెంట్‌గా ఉంటా తప్పితే.. మరో పార్టీలోకి వెళ్ళను. పార్టీని డ్యామేజ్ చేయాలనే ఆలోచన నాకు లేదు. నన్ను ఎవరు డ్యామేజ్ చేయాలని చూసినా కాంగ్రెస్‌ను వీడాలని నాకు లేదు. నా రాజీనామాపై వస్తున్న వార్తలను సమర్థించను, ఖండించను. నాతో వీహెచ్, భట్టి, శ్రీధర్ బాబు, మహేశ్వర్ రెడ్డి మాట్లాడారు.. కానీ ఆ విషయాలు బయటకు చెప్పను. కాంగ్రెస్నా జాగిరి కాదు. రేవంత్ రెడ్డి జాగిరి కాదు. సోనియా జాగిరి. ఈ నెల 20 తర్వాత భవిష్యత్ కార్యచరణ ఉంటుంది. గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న ప్లాట్లను, పర్మిషన్లేని ఇళ్లను రెగ్యులరైజ్ చేయాలని గతంలో సీఎంకు లేఖ రాశా. పాత లే అవుట్లను రెగ్యులరైజ్ చేయండి.. కొత్త లేఅవుట్ లు చేయకుండా చర్యలు తీసుకోండి అని కోరా. ప్రభుత్వం నుంచి ఎటువంటి నిర్ణయం రాలేదు. ఈ నెల 8న ఉదయం 10 నుంచి 4 గంటల వరకు ఇందిరాపార్కులో దీక్ష చేస్తా. కోవిడ్ నిబంధనలకు లోబడి దీక్ష చేస్తా. పర్మిషన్ ఇచ్చినా ఇవ్వకున్నా దీక్ష చేస్తాను' అని ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. -
ప్రేమ జంటల విషాదాంతం..
పెళ్లికి పెద్దలు అంగీకరించారు.. ఉగాది తర్వాత పెళ్లి చేస్తామని చెప్పారు.. ఏం జరిగిందో ఏమో గానీ ప్రేమికులిద్దరూ ‘చేయరాని తప్పుచేశాం, సరిదిద్దుకోలేని స్థితిలో ఉన్నాం’అంటూ చెట్టుకు ఉరివేసుకుని తనువు చాలించారు. ఇదీ సంగారెడ్డి జిల్లాలో ప్రేమికుల ఆత్మహత్య ఘటన తీరు. మరోచోట తొలుత పెద్దలు ప్రేమను అంగీకరించలేదు.. కులం ఒకటే అయినా ఆస్తుల అంతరం అడ్డువచ్చింది.. తర్వాత ఇరు కుటుంబాలు పెళ్లికి ఓకే చెప్పాయి. అయితే విషయం ప్రేమికులకు తెలియక బలవన్మరణం చెందారు. ఇదీ కుమురం భీం జిల్లాలో చోటుచేసుకుంది. – మునిపల్లి(అందోల్)/వాంకిడి(ఆసిఫాబాద్) తెలియక.. పోలీసులు, కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. వాంకిడిలోని రాంపూర్ కాలనీకి చెందిన నాగడే శ్రీకాంత్(22), అదే కాలనీకి చెందిన ఎల్ములె గీత(20) కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. 3 నెలల క్రితం ప్రేమ విషయాన్ని గీత ఇంట్లో తెలిపింది. కులాలు ఒకటైనా, శ్రీకాంత్ కుటుంబానికి పెద్దగా ఆస్తులు లేకపోవడంతో గీత ఇంట్లో అడ్డుచెప్పారు. దీంతో ప్రేమికులు ఇద్దరు డిసెంబర్ 27న ఇంట్లో నుంచి వెళ్లిపోయారు. వాంకిడి మండలం అక్నీ గ్రామ శివారులో శ్రీకాంత్ తండ్రి పాండు పత్తి పంట కౌలుకు సాగుచేస్తున్నారు. చేనులో మోదుగ చెట్టుకు శ్రీకాంత్ ఉరేసుకుని ఉండటం, గీత మృతదేహం చెట్టు పక్కనే ఉండటం సమీప రైతులు గమనించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాల నుంచి దుర్గంధం వెలువడుతుండటంతో మూడు రోజుల క్రితమే ఆత్మహత్య చేసుకుని ఉంటారని ప్రాథమికంగా నిర్ధారించారు. ఇదిలాఉండగా, ప్రేమికులు ఇంటి నుంచి వెళ్లిపోయిన రెండో రోజే పెళ్లి చేసేందుకు ఇరువురి కుటుంబ సభ్యులు పెద్దల సమక్షంలో నిర్ణయించారు. కానీ ప్రేమికులిద్దరి సెల్ఫోన్లు స్విచాఫ్ రావడంతో సమాచారం చేరలేదు. ఇదేక్రమంలో క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయంతో ఇరు కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రమేశ్ వెల్లడించారు. తప్పు చేశామని.. కుటుంబ సభ్యులు, పోలీసుల కథనం ప్రకారం.. కోహీర్ గ్రామానికి చెందిన బుగ్గుల అమృత(20) సం గారెడ్డి అంబేడ్కర్ స్టడీ సెంటర్లో ల్యాబ్ టెక్నీషియన్‌గా శిక్షణ తీసుకుంటోంది. మర్పల్లి మండలం సిర్పూర్ గ్రామానికి చెందిన శివ(22) సంగారెడ్డిలోని సిద్ధార్థ పారామెడికల్ కాలేజీ ల్యాబ్‌లో పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమకు దారితీసింది. ఇద్దరూ ఇళ్లలో తెలుపగా.. పెద్దలు అంగీకరించారు. ఉగాది తర్వాత పెళ్లి చేస్తామని చెప్పారు. క్రిస్మస్ సెలవుల సందర్భంగా అమృత కోహీర్‌లోని ఇంటికి వచ్చింది. డిసెంబర్ 31న సంగారెడ్డికి వెళ్తున్నానని ఇంట్లో చెప్పి వెళ్లింది. ఏం జరిగిందోగానీ.. జనవరి 2న రాత్రి 7.30 గంటల సమయంలో శివ తన కుటుంబ సభ్యులు, స్నేహితులకు ఫోన్ చేసి మునిపల్లి మండలం బుదేరా గ్రామ శివారులో సూసైడ్ చేసు కుంటున్నామని తెలిపాడు. కుటుంబ సభ్యులు రాత్రి బుదేరా శివారులో వెతికినా ఆచూకీ లభించలేదు. సోమవారం ఉదయం గ్రామ శివారులో ఓ చెట్టుకు ఇద్దరూ వేలాడుతూ కనిపించారు. అమృత తండ్రి అశోక్‌బాబు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ‘చేయరాని తప్పు చేశాం, ఆ తప్పును సరిదిద్దుకోలేని స్థితిలో ఉన్నాం.. అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నాం’ అని శివ రాసిన సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
‘నన్ను క్షమించు... మిస్ యూ సో మచ్ లవ్ యూ..’
సాక్షి, సదాశివపేట రూరల్ (సంగారెడ్డి): పెళ్లయిన ఆరునెలల నుంచే భర్త అనుమానంతో వేధించడంతో ఓ వివాహిత అర్ధంతరంగా తనువు చాలించింది. ఫోన్లో ఎవరితో మాట్లాడుతున్నావంటూ నిత్యం అనుమానిస్తుండడంతో భరించలేక ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన మండల పరిధిలోని పెద్దాపూర్‌లో చోటు చేసుకుంది. సదాశివపేట సీఐ గూడూరి సంతోష్ కుమార్ వివరాల ప్రకారం... వికారాబాద్ జిల్లా పులిమద్ది గ్రామానికి చెందిన భాగ్యలక్ష్మి(22)ని పెద్దాపూర్ గ్రామానికి చెందిన ఎర్ర రమేష్(24)తో ఆరు నెలల క్రితం వివాహం జరిపించారు. కొద్ది రోజులు వీరి దాంపత్య జీవితం సాఫీగానే సాగింది. తర్వాత రోజూ భర్త అనుమానిస్తుండడంతో తట్టుకోలేక తల్లిదండ్రులకు ఫోన్ చేసి తన గోడు చెప్పుకునేది. భర్త నుంచి వేధింపులు ఎక్కవ కావడంతో గురువారం సాయంత్రం ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. విషయం తెలిసిన భాగ్యలక్ష్మి తల్లిదండ్రులు పెద్దాపూర్‌కు చేరుకొని బోరున విలపించారు. చదవండి: క్వారీలో టిప్పర్ బోల్తా.. ముగ్గురి మృతి సూసైడ్ లెటర్ కలకలం... ‘‘అమ్మ, నాన్న, తమ్ముడు నన్ను క్షమించండి. నా భర్త రమేష్... నాపై అనుమానంతో రోజు నరకం చూపుతున్నాడు. తట్టుకోలేక చనిపోతున్నా. రోజు నా ఫోన్ చెక్ చేయడం చేస్తున్నాడు. అందుకే చనిపోతున్న. అమ్మ, నాన్న, తమ్ముడు నన్ను క్షమించు. మిస్ యూ సో మచ్ లవ్ యూ. మీ బుజ్జీ’’. అంటూ లెటర్ ముగించింది. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. చదవండి: ఆస్తి కోసం పేగు బంధాన్ని మరిచిన కూతురు.. కన్న తల్లిని కిరాతకంగా చంపి.. -
సైనిక వాహనాల ఎగ్జిబిషన్ అదుర్స్
-
టైరు పేలి కారు బావిలోకి.. తల్లీతనయుడి సహా మరొకరి మృతి
దుబ్బాక టౌన్: కారులో ఊరికి బయలుదేరిన తల్లీతనయుడిని విధి వక్రించింది. టైరు పేలడంతో కారు వెళ్లి నిండుగా నీళ్లున్న బావిలో పడిపోయి మృతిచెందారు. వాళ్లను ప్రాణాలతో బయటకు తీయడానికి వెళ్లిన ఓ గజ ఈతగాడు కూడా ఆ కారులోనే నీళ్లలో ఇరుక్కుపోయాడు. విగతజీవిగా మిగిలాడు. ఒకే ప్రమాదం రెండు ఇళ్లల్లో తీవ్ర విషాదం నింపింది. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండంలో బుధవారం ఈ ప్రమాదం జరిగింది. కారు పల్టీలు కొడుతూ.. మెదక్ జిల్లా నిజాంపేట మండలం నందిగామకు చెందిన తల్లీకొడుకు ఆకుల లక్ష్మి (45), ప్రశాంత్ (26) బుధవారం కారులో హుస్నాబాద్ బయల్దేరారు. చిట్టాపూర్ శివారుకు రాగానే మధ్యాహ్నం 1.13కి కారు టైరు పేలి రోడ్డు పక్కన 20 మీటర్ల దూరంలో ఉన్న బావిలో పడిపోయింది. పెద్ద శబ్దం రావడంతో బైక్‌పై అటుగా వెళ్తున్న వాహనదారుడు వెనక్కి చూసేసరికి కారు పల్టీలు కొడుతూ బావిలో పడింది. అతనితో పాటు మరికొందరు వాహనదారులు వెంటనే భూంపల్లి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలం భూంపల్లి పోలీస్ స్టేషన్‌కు కిలోమీటరు దూరంలోని కూడవెల్లి పెద్ద వాగు దాటాక చిట్టాపూర్ శివారులో ఉంది. మధ్యాహ్నం 2 గంటల్లోపే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. నీళ్లు ఎక్కువగా ఉండటంతో..: పోలీసులు ఫైర్, రెవెన్యూ, విద్యుత్ సిబ్బంది సహాయక చర్యలు ముమ్మరం చేశారు. ఎమ్మెల్యే రఘునందన్‌రావు, ఏసీపీ చల్లా దేవారెడ్డి కూడా అక్కడకు చేరుకున్నారు. అధికారులు, చిట్టాపూర్ సర్పంచ్ పోతనక రాజయ్య, ఎంపీటీసీ సభ్యుడు కనకయ్య, సమీప రైతులతో బావి వివరాలు సేకరించారు. సుమారు 16 గజాల లోతు బావి పూర్తిగా నీటితో నిండి ఉండటంతో ఫైర్ సిబ్బంది, పోలీసులు ముందు గజ ఈతగాళ్లతో కలిసి పాతాల గరిగెల (హ్యాంగర్స్)తో గాలింపు చేపట్టారు. కానీ ఫలితం లేదు. నీరు ఎక్కువగా ఉండటంతో రెండు పెద్ద జనరేటర్లు పెట్టి ఎత్తిపోయడం మొదలుపెట్టారు. సాయంత్రం 4 గంటల కల్లా 2 గజాల వరకు నీటినే తోడేయగలిగారు. దీంతో చేగుంట, సిద్దిపేటల నుంచి రెండు భారీ క్రేన్లు తెప్పించారు. వాటి సాయంతో గజ ఈతగాళ్లు మళ్లీ గాలింపు మొదలుపెట్టారు. క్రేన్ల కొండి బావి లోపల ఉన్న కారుకు చిక్కుకున్నా నీరు ఎక్కువగా ఉండటంతో పైకి లేస్తున్న క్రమంలో కొండ్లు జారుతూ ఇబ్బందిగా తయారైంది. నీటిని తోడుతూ.. గాలిస్తూ..: మరో 4 మోటార్లు పెట్టి బావిలోని నీటిని తొలగిస్తూ క్రేన్లతో కారు వెలికితీతను అధికారులు కొనసాగించారు. సుమారు 7 గంటలు శ్రమించి రాత్రి 8.20కి కారును పైకి తీశారు. కారు నుంచి రెండు మృతదేహాలను వెలికి తీశారు. మెదక్ జిల్లా నిజాంపేట మండలం నందిగామకు చెందిన తల్లీకొడుకు ఆకుల లక్ష్మి, ప్రశాంత్‌గా గుర్తించారు. రాములు లారీ డ్రైవర్ కాగా భార్య లక్ష్మి రోజువారీ పనులకు వెళ్లేది. ప్రశాంత్ ఐటీఐ పూర్తి చేసి రామాయంపేట మండలంలో ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్నాడు. కూతురు రేవతి డైట్ సెట్‌కు ప్రిపేర్ అవుతోంది. కారులో ఇరుక్కుపోయిన గజ ఈతగాడు బావిలోంచి కారు తీసే క్రమంలో దుబ్బాక మండలం ఎనగుర్తికి చెందిన గజ ఈతగాడు బండకాడి నర్సింహులు (40) మృతి చెందాడు. బుధవారం సాయంత్రం 3 గంటలకు తోటి గజ ఈతగాళ్లతో కలిసి నర్సింహులు గాలింపు చర్యల్లో పాల్గొన్నాడు. బావిలో నీరు ఎక్కువగా ఉండటంతో చాలాసార్లు క్రేన్ కొండిని తగిలించేందుకు ప్రయత్నించినా కుదరలేదు. మోటార్లతో రాత్రి 8 గంటల వరకు 5 గజాలకు పైగా నీటిని తోడారు. తర్వాత క్రేన్ కొండిని కారుకు తగిలించేందుకు బావి లోపలికి వెళ్లాడు. కారుకు కొండిని తగిలించి అందులోనే ఇరుక్కుపోయా డు. క్రేన్ సాయంతో కారును పైకి తీస్తుండగా కారుకు, తాళ్లకు మధ్య చిక్కుకొని అపస్మారక స్థితిలో కనిపించాడు. తాళ్లను కొంత పైకి లాగాక ఒక్కసారిగా నీటిలో పడిపోయాడు. అతడి మృతదేహాన్ని బయటకు తీసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. అప్పటివరకు సహాయక చర్యలో ఉన్న గజ ఈతగాళ్లు కూడా వెళ్లిపోయారు. పోలీసుల నిర్లక్ష్యం వల్లే: పోలీసులు, ఫైర్ సిబ్బంది నిర్లక్ష్యం వల్లే నర్సింహులు మృతి చెందాడంటూ అతని కుటుంబీకులు, బంధువులు రామాయంపేట–సిద్దిపేట రహదారిపై బైఠాయించి ధర్నా చేశారు. పోలీసులు బావిలో దిగకుండా ప్రైవేట్ వ్యక్తులను బావిలోకి దింపి చంపేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
మొదట తల్లి.. కర్మ చేస్తుండగా రక్తం కక్కుకుని తండ్రి..
సాక్షి,న్యాల్కల్(సంగారెడ్డి): తల్లి దశదిన కర్మ రోజే తండ్రి చనిపోవడంతో ఇద్దరు చిన్నారులు అనాథలుగా మిగిలారు. పది రోజుల వ్యవధిలో ఇద్దరూ అనారోగ్యంతోనే మరణించారు. కళ్ల ముందే తల్లిదండ్రుల మరణాన్ని చూసిన చిన్నారులు ఏం చేయాలో తెలియక అంత్యక్రియలకు వచ్చిన వారిని చూస్తుండటంతో అందరూ కన్నీటిపర్యంతమయ్యారు. వివరాల్లోకి వెళ్తే.. మండల పరిధిలోని అమీరాబాద్ గ్రామానికి చెందిన మా రుతి రావు, భార్య స్వప్నకుమారి దంపతులకు ఇద్దరు సంతానం. ఇద్దరూ కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్నారు. ఈ క్రమంలో స్వప్నకుమారి ఈనెల 26న మృతి చెందింది. ఆదివారం మృతిరాలి దశదిన కర్మ చేస్తున్న క్రమంలో భర్త మారుతిరావు రక్తం కక్కుకొని మృతి చెందాడు. ఇద్దరి మరణంతో వారి కుమారుడు విగ్నేష్(8), కూతురు రమ్య(4) అనాథలుగా మారారు. అంత్యక్రియలకు వచ్చిన వారు చిన్నారులను చూసి కంటతడి పెట్టారు. అనాథలుగా మారిన చిన్నరులను మనసున్న మహారాజులు, ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. ప్రస్తుతం చిన్నారులు వారి బాబాయి వద్ద ఉన్నారు. చదవండి: వివాహేతర సంబంధం: ఇంట్లో భర్త నిద్రపోతుంటే ప్రియుడితో కలిసి..