సంగారెడ్డి: అత్తామామల హత్యకు అల్లుడి షాకింగ్‌ స్కెచ్‌ | Sangareddy Man Arrest Over Try To Kill Wife Parents With Shock | Sakshi
Sakshi News home page

సంగారెడ్డి: అత్తామామల హత్యకు అల్లుడి స్కెచ్‌, కారణం తెలిసి అంతా షాక్‌!

Published Tue, Apr 25 2023 1:27 PM | Last Updated on Tue, Apr 25 2023 1:46 PM

Sangareddy Man Arrest Over Try To Kill Wife Parents With Shock - Sakshi

సాక్షి, సంగారెడ్డి: చిన్న చిన్న విషయాలే.. ఒక్కోసారి తీవ్ర నిర్ణయాలు తీసుకునేలా ఉసిగొల్పుతాయి. అలా ఓ అల్లుడు ఏకంగా తనకు పిల్లనిచ్చిన అత్తామామల్ని చంపేయాలని ప్లాన్‌ వేశాడు. అది మామూలు స్కెచ్‌తో కాదు.. షాకింగ్‌ స్కెచ్‌తో!. చివరకు ఆ కుట్ర బయటపడడం, అందుకు కారణం ఏంటో తెలిసి పోలీసులతో పాటు స్థానికులు షాక్‌ తినడం ఒకదాని వెంట మరొకటి జరిగాయి. 

అత్తమామల హత్యకు షాకింగ్‌ స్కెచ్‌ వేసిన ఓ అల్లుడు కటకటాల పాలయ్యాడు. రమేష్‌ అనే వ్యక్తి తన భార్య తల్లిదండ్రుల్ని చంపడానికి ప్లాన్‌ వేశాడు. ఇందులో భాగంగా.. ఈ నెల 12వ తేదీన ఇంటి తలుపులకు కరెంట్‌ షాక్‌ పెట్టాడు. అయితే రమేష్‌ అనుకున్నట్లు జరగలేదు. అత్తామామలకు బదులుగా.. తల్లీకూతుళ్లు ఆ తలుపును తాకడంతో షాక్‌కి గురయ్యారు. కరెంట్‌ షాక్‌తో విలవిలలాడుతూ.. వాళ్లు వేసిన కేకలకు స్థానికులు అప్రమత్తం అయ్యారు. వెంటనే కరెంట్‌ ఆఫ్‌ చేయడంతో ప్రాణాపాయం తప్పింది. ఇక ఈ ఘటనపై బాధిత కుటుంబం పోలీసులను ఆశ్రయించగా.. విచారణలో తాజాగా అల్లుడు రమేష్‌ కుట్రదారుడని తేలింది. 

ఇంతకీ ఎందుకు చంపాలని ప్రయత్నించాడో తెలుసా?.. గతంలో ఓసారి ఇంటికి వెళ్లినప్పుడు ఆ అత్తామామలు, అల్లుడు రమేష్‌ను మందలించలేదనట. పలకరించలేదన్న ఆ కోపంతో అప్పటి నుంచి రగిలిపోతున్న రమేష్‌.. ఎలాగైనా వాళ్లను చంపేయాలని అనుకున్నాడట. చివరకు కరెంట్‌షాక్‌తో యత్నిస్తే తన మీదకు రాదని అలా చేశానని రమేష్‌ వెల్లడించడం గమనార్హం. ప్రస్తుతం ఆ అల్లుడిని అరెస్ట్‌ చేసి స్టేషన్‌కు తరలించారు పోలీసులు.

ఇదీ చదవండి: మంచిర్యాలలో దారుణం.. ఊరంతా చూస్తుండగానే..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement