Mother-in-law
-
ఆషాఢంలో అత్తాకోడళ్లు ఒక గడప దాటకూడదా?
ఆషాఢంలో అత్తాకోడళ్ళు ఒక గడప దాట కూడదని, అత్తా అల్లుళ్లు ఒకరికొకరు ఎదురు పడకూడదని, కొత్త దంపతులు కలవకూడదనీ అంటారు. ఎందుకంటే..?సాధారణంగా వ్యవసాయ పనులన్నీ ఈ మాసంలోనే రైతులుప్రారంభిస్తారు. పూర్వం రోజుల్లో కొత్తగా పెళ్లయిన అబ్బాయి ఆరు నెలల కాలం అత్తగారింట్లో ఉండే సంప్రదాయం ఉండేది. వ్యవసాయపు పనులు చేయవలసిన యువకులు అత్తవారింట్లో ఉంటే, సకాలంలో పనులు జరగవు.వర్షాలకు తగినట్లుగా విత్తనాలు చల్లుకొనే రోజులు అవి. ఇప్పటిలా కాల్వల ద్వారా నీరు లభించేది కాదు. సరైన సమయంలో విత్తనాలు చల్లకపోతే కష్టం కదా... అందుకే కొత్త కోడలు పుట్టింట్లోనే ఉండాలి. అల్లుడు అత్తవారింటికి వెళ్ళకూడదు అనే నియమం విధించారు. అంతేకాకుండా, కొత్త నీరు వచ్చే ఆషాఢంలో ఆ నీరు తాగటం వల్ల రకరకాల రుగ్మతలకు లోను కావచ్చు.అంతేకాదు, ఈ కాలంలో గర్భధారణ జరిగితే పిల్లలు కలిగే నాటికి మంచి ఎండాకాలం... శిశువు పెరగటానికి అంత మంచి వాతావరణం కాదు అని ఆలోచించారు. అందుకే ఈ నియమాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఇప్పటి రోజులకు అన్వయించుకుంటే... వ్యవసాయదారుల కుటుంబాలు కాకుండా ఇతరుల విషయంలో ఈ ఇబ్బంది లేదు.ఇవి చదవండి: పబ్‌లో.. ఫస్ట్ టైమ్! -
సంగారెడ్డి: అత్తామామల హత్యకు అల్లుడి షాకింగ్ స్కెచ్
సాక్షి, సంగారెడ్డి: చిన్న చిన్న విషయాలే.. ఒక్కోసారి తీవ్ర నిర్ణయాలు తీసుకునేలా ఉసిగొల్పుతాయి. అలా ఓ అల్లుడు ఏకంగా తనకు పిల్లనిచ్చిన అత్తామామల్ని చంపేయాలని ప్లాన్ వేశాడు. అది మామూలు స్కెచ్‌తో కాదు.. షాకింగ్ స్కెచ్‌తో!. చివరకు ఆ కుట్ర బయటపడడం, అందుకు కారణం ఏంటో తెలిసి పోలీసులతో పాటు స్థానికులు షాక్ తినడం ఒకదాని వెంట మరొకటి జరిగాయి. అత్తమామల హత్యకు షాకింగ్ స్కెచ్ వేసిన ఓ అల్లుడు కటకటాల పాలయ్యాడు. రమేష్ అనే వ్యక్తి తన భార్య తల్లిదండ్రుల్ని చంపడానికి ప్లాన్ వేశాడు. ఇందులో భాగంగా.. ఈ నెల 12వ తేదీన ఇంటి తలుపులకు కరెంట్ షాక్ పెట్టాడు. అయితే రమేష్ అనుకున్నట్లు జరగలేదు. అత్తామామలకు బదులుగా.. తల్లీకూతుళ్లు ఆ తలుపును తాకడంతో షాక్‌కి గురయ్యారు. కరెంట్ షాక్‌తో విలవిలలాడుతూ.. వాళ్లు వేసిన కేకలకు స్థానికులు అప్రమత్తం అయ్యారు. వెంటనే కరెంట్ ఆఫ్ చేయడంతో ప్రాణాపాయం తప్పింది. ఇక ఈ ఘటనపై బాధిత కుటుంబం పోలీసులను ఆశ్రయించగా.. విచారణలో తాజాగా అల్లుడు రమేష్ కుట్రదారుడని తేలింది. ఇంతకీ ఎందుకు చంపాలని ప్రయత్నించాడో తెలుసా?.. గతంలో ఓసారి ఇంటికి వెళ్లినప్పుడు ఆ అత్తామామలు, అల్లుడు రమేష్‌ను మందలించలేదనట. పలకరించలేదన్న ఆ కోపంతో అప్పటి నుంచి రగిలిపోతున్న రమేష్.. ఎలాగైనా వాళ్లను చంపేయాలని అనుకున్నాడట. చివరకు కరెంట్‌షాక్‌తో యత్నిస్తే తన మీదకు రాదని అలా చేశానని రమేష్ వెల్లడించడం గమనార్హం. ప్రస్తుతం ఆ అల్లుడిని అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు పోలీసులు. ఇదీ చదవండి: మంచిర్యాలలో దారుణం.. ఊరంతా చూస్తుండగానే.. -
సోల్ ట్రేడ్..: ఉత్తమ అత్తాకోడళ్లు
చెన్నైలోని ఎస్ఆర్యం యూనివర్శిటీలో ఇంజినీరింగ్ చేస్తున్న రోజుల్లో సురభి సొంత వ్యాపారం గురించి కల కనేది. నిజానికి ఆమెది వ్యాపారనేపథ్యం ఉన్న కుటుంబం అయినప్పటికీ, తన ఆలోచనకు కుటుంబసభ్యులు పెద్దగా మద్దతు ప్రకటించలేదు. ‘ఉద్యోగం చేస్తే ఎలాంటి సమస్యా ఉండదు. కాలం కలిసొస్తే అమెరికా వెళ్లి స్థిరపడిపోవచ్చు. వ్యాపారం చేయడమనేది పెద్ద రిస్క్. అందరికీ అది సాధ్యం కాదు’ అంటుండేవారు. అంతమాత్రాన తన నిర్ణయాన్ని మార్చుకోలేదు సురభి. నిర్మాణ్ షాతో వివాహం అయిన తరువాత ఆమె ఇండోర్ (మధ్యప్రదేశ్)కు వెళ్లింది. అక్కడ అత్త రూపంలో తనకొక ‘అదృష్టం’ పరిచయం అయింది. అత్త చేత్న షా తనతో ఒక స్నేహితురాలిలా ఉండేది. అత్తగారితో తన ఆలోచన పంచుకుంది సురభి. ‘ఎందుకమ్మా రిస్క్’ అని అత్తగారు అనలేదు. కోడలి ఉత్సాహానికి మరింత ప్రోత్సాహం ఇచ్చింది. అలా ‘కారాగ్రీన్’స్టార్టప్‌కు అంకురార్పణ జరిగింది. ప్లాస్టిక్ వ్యర్థాల వల్ల జరిగే నష్టాల గురించి పుస్తకాల్లో చదవడమే కాదు, ఆ విషాదాన్ని కళ్లతో చూసింది సురభి. ‘ఎవరికి వారు ఇది నా సమస్య కాదు. ఎవరో వస్తారు. ఏదో చేస్తారు అనుకుంటే సమస్య మరింత పెరుగుతుంది తప్ప తగ్గదు. అందుకే నా వంతుగా ఏదైనా చేయాలనే ఆలోచనలో నుంచి వచ్చిందే కారాగ్రీన్’ అంటుంది సురభి. ‘కారాగ్రీన్’ అనేది బయోడిగ్రేడబుల్ అంకుర సంస్థ. పర్యావరణహితమైన పెన్నులు, పెన్సిల్స్, సీడ్ పేపర్ డైరీలు, క్యాలెండర్లతో పాటు ప్యాకింగ్ సామాగ్రిని తయారు చేస్తారు. ఊహల్లో ఉన్న ప్రాజెక్ట్ కాగితం మీదికి రావడానికి, అక్కడి నుంచి వాస్తవరూపం దాల్చడానికి మధ్యలో సందేహాలు, సమస్యలు, అవాంతరాలు ఎదురవుతుంటాయి. అలాంటి సమయంలో కోడలికి అండగా నిలిచి ముందుకు నడిపించింది చేత్న షా. ‘వ్యాపారంలో మన కుటుంబసభ్యుల అండ అనేది ఎంతో ధైర్యాన్ని ఇస్తుంది’ అంటుంది సురభి. కట్ చేస్తే... షార్క్ ట్యాంక్ ఇండియా (బిజినెస్ రియాలిటీ టెలివిజన్ సిరీస్)లో ‘కారాగ్రీన్’ 50 లక్షల ఫండింగ్ ఆఫర్‌ను గెలుచుకుంది. -
కూరగాయలు కోయమన్న అత్త.. చేతకాక కత్తితో కోడలు దాడి
జైపూర్: అత్తాకోడళ్ల మధ్య ఎప్పుడూ పొసగదు. భర్త, కుమారుడితో బాగానే ఉండే వీరు వారిద్దరూ ఎదురుపడ్డప్పుడు ఏం జరుగుతుందో ఏమో అగ్గిమీద గుగ్గిలమవుతారు. గుంటూరు జిల్లాలో చపాతీ కర్రతో అత్తపై దాడి చేసిన ఘటన మరువకముందే మరో దారుణ సంఘటన వెలుగులోకి వచ్చింది. కూరగాయలు కోయమని చెప్పడంతో ఆ కోడలు అత్తపై కత్తితో దాడి చేసింది. సరిగ్గా తరగకపోవడంతో దుర్భాషలాడడంతో కోడలు క్షణికావేశంలో అదే కత్తితో పొడిచింది. 26 పోట్లు పొడవడంతో అత్త ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసింది. దాడి చేసిన అనంతరం కోడలు తట్టాబుట్టా సర్దేసుకుని పరారైంది. ఈ దారుణ సంఘటన రాజస్థాన్‌లోని జైపూర్‌లో జరిగింది. (చదవండి: 8 మంది భర్తలను మోసగించి, తొమ్మిదో పెళ్లికి రెడీ.. ట్విస్ట్ ఏంటంటే!) జైపూర్‌లోని భంక్రోటాకు చెందిన అత్తాకోడళ్లు మోహినీ దేవి (62) తన కుమారుడికి పద్నాలుగేళ్ల కిందట మమతాదేవీ (35)తో వివాహం జరిపించింది. అయితే కొన్నాళ్లుగా వీరిద్దరి మధ్య ఎప్పుడూ గొడవలు జరుగుతున్నాయి. మంగళవారం వంట కోసం కోడలు కూరగాయలు తరుగుతోంది. అయితే సక్రమంగా కోయడం లేదని అత్త మోహిని తిట్టింది. ఈ సమయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఇక తట్టుకోలేని కోడలు క్షణికావేశంలో కూరగాయలు కోస్తున్న కత్తితోనే అత్తపై దాడికి పాల్పడింది. ఏకంగా 26 చోట్ల పొడవడంతో మోహినీకి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే కోడలు తన సామగ్రి, పిల్లలను తీసుకుని పరారైపోయింది. స్థానికుల సమాచారంతో ఇంటికి వచ్చిన కుమారుడు రక్తస్రావంతో కొట్టుమిట్టాడుతున్న తన తల్లిని ఎస్ఎంఎస్ ఆస్పత్రికి తరలించాడు. ఆమె చికిత్స పొందుతూ రాత్రి కన్నుమూసింది. తన తల్లిని హతమార్చిన భార్యపై భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పరారైన కోడలు మమతను పోలీసులు గాలించి ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. మమతకు ఇద్దరు అబ్బాయిలు, ఓ కుమార్తె ఉంది. చదవండి: సినిమాను మించిన మర్డర్.. మూడు హత్యలతో వరంగల్ ఉలిక్కి -
ఏడ దాగున్నాడో బావ?
వీడనిబంధం అనుకుంటాం. ముందు వెనుకలుగా వీడి వచ్చేస్తాం! మొదట ఆమె అయ్యారు. తర్వాత ఆయన అయ్యారు. ఆ సంగతి ఆమెకు తెలీదు. ‘ఏడ దాగున్నాడో బావ?’ అని నింగి నుంచి వెతుక్కుంటోంటే.. ఆ ఇంటి కోడలు.. మనసుకు హత్తుకునేలా అక్షరీకరించిన అత్తగారి అంతరంగ ఆవిష్కరణ ఇది. అగ్నిహోత్రావధాని గారి కాఫీ మగ్గు, హిందూ పేపరు, ఏష్ ట్రే, కళ్లజోడు, డెంచరు, మందులు, దువ్వెన, చెప్పులు అన్ని అక్కడే ఉన్నాయి. ‘మరి నా బావ కానరాడే?’ అని నలు దిశలా ఆత్రంగా వెదుకుతున్నాయి శేషమ్మ కళ్లు.ఏవండీ ఎక్కడున్నారు? సత్యశ్రీతో కూర్చుని టీవీ గానీ చూస్తున్నారా? మీరిద్దరి మాటలూ పొద్దుటి నుండీ వినబడలేదు. సడీ చప్పుడూ లేదు. వంటింట్లో కుక్కర్ మోతా లేదు. నానయ్య ‘హలో డాడ్, గుడ్‌మార్నింగ్’ అంటూ మెట్లు ఎక్కిన చప్పుడు కానీ, కాఫీ తాగండి నాన్గారు అన్నట్టుగా కూడా వినపడలేదు. ఏమిటీ భయంకర నిశబ్దం? ఎక్కడికి వెళ్లి వుంటారందరూ?మొన్నామధ్యన కాలిలో రాడ్ వేసినప్పటి నుంచీ ఏదో వొక నలత. అన్నం సహించట్లేదని మారాము చేస్తున్నారు. ‘తినకపోతే ఎలా బాబూ? వేళపట్టున గుప్పెడు మెతుకులు తినక పోతే ఎలా? అంటూ మీ పక్కన నేనుంటే మందలించి పెట్టేదాన్ని. మరి నన్ను ఈ ఫొటో ఫ్రేమ్‌లో రెండేళ్ల నాడే బంధింప చేసాడు ఆ పైవాడు. ఊర మిరపకాయలు, ఆవ పచ్చడి, పెరుగ్గారెలు, పండుమిరపకాయ పచ్చడి, సున్ని పొడి, పేరునెయ్యి అన్ని వేసి గోరుముద్దలు చేసిపెడ్దును. హుం. అనారు గింజలూ, కమలా పళ్లు, బత్తాయి రసం తేనెలో కలిపి ఇస్తే ఇష్టంగా తాగుతారని సత్యశ్రీకి తెలుసు. మరి మీరు తాగుతున్నారా? తమరికి ఇష్టమైన ద్రవంతో సరిపెట్టుకోకుండా పళ్ల రసం తాగండి అని ఎప్పుడూ చెప్పేదాన్ని. ‘అబ్బా తినండి, తాగండీ అని ఒకటే నస పెట్టబాకమ్మడూ’ అని మీరు కసిరినా పట్టువదలని విక్రమార్కురాలిలా పంతం గెలిచేదాన్ని! మీకు ఫుడ్ పెట్టేదాన్ని! పేంపర్ చేసేదాన్ని! మరి నేను వెళ్లిపోతే ఎలా మేనేజ్ చేస్తారో అన్న ఆలోచన గుబులు రేకెత్తించేది. మీకు భోజనం పెడ్తున్నప్పుడూ, ఆ పనీ ఈ పనీ చేసుకుంటున్నప్పుడూ, క్షీరసాగర శయన, వినరో భాగ్యము, శివశివ అనరాదా, శ్రీరామ నీనామ, నారాయణతే, సీతమ్మ మా అమ్మ అంటూ మిమ్మల్ని, ఆ దేవుడుని నా తోబుట్టువుల్నీ తల్చుకుంటూ హాపీగా కాలక్షేపం చేసిన ఎన్నెన్నో సందర్భాలు నెమరేసుకుంటూ ఉంటానండి. ఆ మధుర జ్ఞాపకాలే నాకు బోలెడంత సంతోషాన్ని ఇస్తాయి. ఒక్క క్షణం మీరు కళ్లెదురుగుండా లేకపోతే ఓ.. ఒకటే టెన్షను వస్తుంది బాబూ. శారీరకంగా అంతులేని అనంతలోకాలకి నేవెళ్లినా నా మనస్సెన్నడూ మీ గురించే ఆలోచిస్తుందండీ. ‘అమ్మడూ, నన్ను వదిలేసి వెళ్లిపోయావు, అరవై ఏళ్ల పైన కలసి కాపురం చేసాం’ అని మీరు అంటుంటే బాధగా ఉంటుంది. అయినా తప్పదు. విధిరాతకి అందరం తలవంచాల్సిందే! నా టైము అయిపోయింది. దట్సాల్!మీరు ఆఫీసుకి వెళ్లే రోజుల్లో ప్రొద్దుట బైబై , సాయంత్రం హాయ్ చెబుతూ హాయిగా కాఫీ తాగుతూ కబుర్లు చెప్పుకునేవాళ్లం. ఎన్నో ఏళ్ల హాయి బాయిలకు ద ఎండ్ కూడా కచ్చితంగా ఉంటుందని ఊహించలేదప్పుడు. కానీ రెండేళ్ల క్రితం నేను చెప్పింది పర్మినెంట్ గా బైబై! కళ్ల నీరొద్దండీ!అవును కానీ, నా మాట మీకు గుర్తుందా? ‘ముందొకరు వెనకొకరు, అంతే లైఫ్ అంటుండేదాన్ని. చూడండి నేనే ఫస్ట్! ‘ఆల్వేస్ స్మైలింగ్, మై గర్ల్‌ఫ్రెండ్ అని నన్ను మీ ఆఫీస్ వారికి పరిచయం చేయడం నేను మర్చిపోలేను. ఫొటోలో ఎలాఉన్నానో చెప్పనే లేదు మీరు. అలానే స్మైల్ చేస్తున్నానా? నన్ను రెప్పార్పకుండా ప్రేమతో మీరు చూసే చూపే దానికి సమాధానం. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి. మీరు నాలా కాకుండా వందేళ్లు హాపీగా ఉండాలి. బోరు కొడితే నాతో కబుర్లు చెప్పండి. అయినా రెండింటి వరకూ పేపరు చదవటం తెమలదాయె! సరే కానీ, ఆ కళ్లజోడుని మీరు బద్ధకించకుండా లేచి టేబుల్ మీద పెట్టండి. దిండు పక్కన పెడితే కిందపడుతుంది.ఏంటీ ఏమై ఉంటుంది? ఏమిటీ ఎవ్వరూ లేరు.. ఎవరూ మాట్లాడరూ?ఓహ్! నేను ఇప్పుడు కవరేజ్ ఏరియాలో లేను కదా! ప్రపంచంలోని జైంట్ టెలికాం కంపెనీ వారు కూడా నన్ను నెట్వర్క్ లోకి తీసుకురాలేరు. గగనాంతర తరంగాలలో నెట్వర్కింగ్ ఉంటుంది కానీ గగనంలో కలిసి పోయిన ప్రాణులు అవుటాఫ్ నెట్వర్క్! ఊపిరితోనే బంధాలు, అనుబంధాలు. ఏడ దాగున్నావొ బావా? – సత్యశ్రీ నండూరి -
ఒడిశాలో మంటగలిసిన మానవత్వం
-
వృద్ధురాలి ఇంట్లో చోరీ చేసింది అల్లుడే!
సాక్షి, ఎస్సార్‌నగర్(హైదరాబాద్): తిన్న ఇంటి వాసాలు లెక్కపెట్టడమంటే ఇదే కాబోలు. అత్తింటికే ఓ అల్లుడు కన్నం వేశాడు. పాపం పండి కటకటాల వెనక్కి వెళ్లాల్సి వచ్చింది. సంచలనం సృష్టించిన ఈ కేసు పూర్వాపరాలిలా ఉన్నాయి. గత నెల 31వ తేదీన ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తులసీ నగర్లో ఆంటోనమ్మ అనే వృద్ధురాలి ఇంట్లో చోరీ జరిగింది. ఆమెను గాయపరిచి ఇంట్లో కారం చల్లి 20 తులాల బంగారు ఆభరణాలు, నగదును దుండగులు చోరీ చేశారు. ఈ కేసును పోలీసులు పదిహేను రోజుల్లోనే ఛేదించారు. ఆమె అల్లుడే చోరీ చేసినట్లు దర్యాప్తులో తేల్చారు. దీంతో హ్యాపీ అనే అతడిని పోలీసులు అరెస్టు చేశారు. -
అత్తను టెర్రస్ మీద నుంచి తోసేసింది..
ఇటాహ్: ఉత్తరప్రదేశ్‌లో ఆస్తి కోసం ఓ కోడలు దాష్టికానికి ఒడిగట్టింది. బంధుత్వాన్ని మరవడమే కాకుండా, వృద్ధురాలు (85) అని కూడా కనికరం లేకుండా కోడలు దారుణంగా ప్రవర్తించింది. ఇంటిని తన పేరు మీద రిజిస్ట్రర్ చేయలేదన్న అక్కసుతో ...అత్తగారిని టెర్రర్ మీద నుంచి బయటకు తోసేసింది. ఈ ఘటనలో గాయపడ్డ బాధితురాలని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. గత కొంతకాలంగా ఇంటిని తమ పేరు మీద రాయాలని అత్తను వేధింపులకు గురి చేస్తున్నప్పటికీ, ఆమె ఒప్పుకోకపోవడంతో ఈ ఘటనకు పాల్పడినట్లు ఇటాహ్ పోలీసులు వెల్లడించారు. కోడలుపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
భార్య, అత్త, మరదలి పై రోకలిబండతో దాడి
-
అత్తను తుపాకీతో కాల్చి చంపిన అల్లుడు
-
తన చీర కట్టుకోబోయిన కోడలి గొంతు కోసి చంపిన అత్త
బెంగళూరు : చీరకు సంబంధించిన వివాదం ఓ నిండు ప్రాణం తీసింది. చీర కట్టుకునే దగ్గర మాటా మాటా పెరిగి ఓ అత్త కోడలి గొంతు కోసి హత్య చేసింది. ఈ దారుణ ఘటన ఉడిపి జిల్లాలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం కుందాపుర తాలూకా బైందూరు సమీపంలోని మొగలి గ్రామంలో అత్తా కోడళ్లు చంద్రావతి (55), నాగరత్న (30) నివాసముంటున్నారు. ఈ రోజు ఉదయం నాగరత్న భర్త పని మీద బయటకు వెళ్లాడు. ఆ సమయంలో నాగరత్న చంద్రావతి చీరను కట్టుకోడానికి యత్నించింది. అందుకు అత్త అభ్యంతరం చెప్పింది. నాగరత్న వినలేదు. దీంతో వారి మధ్య వాగ్వాదం జరిగింది. సహనం కోల్పోయిన చంద్రావతి కోడలిని కిందకు పడేసి, ఆమెపై కూర్చొని కత్తితో గొంతు కోసేసింది. తీవ్రంగా రక్తస్రావం కావడంతో నాగరత్న క్షణాల్లో మరణిచింది. అనంతరం చంద్రావతి పారిపోయింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని పరారీలో ఉన్న చంద్రావతి కోసం గాలిస్తున్నారు. -
భర్త వద్దకు పంపాలంటూ పోరాటం
-
ఎందుకిలా..?!
మొన్నటిదాకా అత్తగారు, ఆడపడచుల చేతిలో నానా ఆరళ్లకూ గురైన స్త్రీ కూడా, తాను అత్తగారిగా మారినప్పుడు మరికాసిన్ని హంగులు కలిపి మరీ అత్తగారి హోదానే ప్రదర్శిస్తుంది కానీ, కొత్తకోడలిని ఆదరించి అక్కున చేర్చుకోవాలనుకోదు! ‘‘అత్తయ్యగారూ... మా అమ్మకి బొత్తిగా ఒంట్లో బాగోలేదట. ఒక్కసారి చూసివస్తాను’’ సూటిగా అత్తగారి ముఖంలోకి చూడటానికి కూడా భయపడుతూనే కాలిబొటనవేలిని నేలకు రాస్తూ అడిగింది అమల. ‘‘ఇదిగో అమ్మాయ్! మా అమ్మకి బాగోలేదు, మా అక్క పురిటికి పుట్టింటికొచ్చింది, చెల్లాయికి పెళ్లిచూపులు, నాన్నకి యాక్సిడెంటయింది, తమ్ముడికి పరీక్షలు... అంటూ రెండు మూడు నెలలకోసారి పుట్టింటికెళ్లి పదేసి రోజులు అక్కడ కూచుంటుంటే ఇంటిల్లిపాదికీ వండిపెట్టడం నా వల్ల కాదమ్మా...’’ అంటూ ముఖం చిట్లించింది కనకమ్మ. చేసేదేమీ లేక గుడ్లల్లో నీళ్లు గుడ్లలోనే కుక్కుకుని అర్జంటుగా ఏదో పనున్నట్టు వంటింట్లోకి దూరింది అమల. కోడలు పుట్టింటికెళ్లిన సమయంలో బాత్రూమ్లో తను పడిపోయినప్పుడు చిన్న కూతురు వచ్చి పది రోజులుండి మరీ సపర్యలు చేయటం, తన భర్తకు సుస్తీ చేసినప్పుడు పెద్దకూతురికి బదులు అల్లుడే ఉద్యోగానికి లీవ్ పెట్టి వచ్చి హాస్పిటల్లో ఆయనతోబాటే ఉండి సేవలు చేయడం కనకమ్మకి ఎందుకో గుర్తులేదు! బస్సులో స్త్రీలకు రిజర్వ్ చేసిన సీటులో దర్జాగా కూర్చుని ఉంటాం... చంటిపిల్ల తల్లి వచ్చి మనవైపు నిస్సహాయంగా చూసినప్పుడు ‘అన్నింటిలోనూ సమాన హక్కులుండాలని బ్యానర్లు పట్టుకుంటారు, ఇందులో మాత్రం రిజర్వేషనుండాలని కొట్లాడతారు’ అంటూ చీప్‌గా కామెంట్ చేసి, ఉదారంగా సీటిచ్చినట్టు పోజుకొడతారు కొందరు ప్రబుద్ధులు. అలాంటివారికి అంతకు మునుపు తను భార్యతో, తల్లితో కలిసి బస్సెక్కినప్పుడు లేడీస్ సీటులో కూర్చున్న వాళ్లని లేపి మరీ తన వాళ్లని కూర్చోబెట్టిన విషయం గుర్తురాదెందుకో! కొందరింతే! తమకో న్యాయం... తమ పొరుగువారికో న్యాయం అన్నట్టు ప్రవర్తిస్తారు. వీళ్లనేమనాలో అర్థం కాదు... అక్కడిదాకా ఎందుకు... మొన్నటిదాకా అత్తగారు, ఆడపడచుల చేతిలో నానా ఆరళ్లకూ గురైన కోడలు కూడా, తాను అత్తగారిగా మారినప్పుడు మరికాసిన్ని హంగులు కలిపి మరీ అత్తగారి హోదానే ప్రదర్శిస్తుంది కానీ, కొత్తకోడలిని ఆదరించి అక్కున చేర్చుకోవాలనుకోదు. కూతురిని కట్టుకోబోయే వాడికి కట్నం ఇచ్చేటప్పుడు వియ్యాలవారిని కాళ్లావేళ్లా పడి బతిమాలిన ఆడపిల్ల తల్లిదండ్రులు రేపు తమ ఇంటికి కోడలిగా రాబోయే పిల్ల ఉత్తచేతులతో రావడాన్ని హర్షించరు. కట్నకానుకలు ఇవ్వలేని వియ్యాలవారిని అస్తమానం ఆడిపోసుకోవడం మానుకోరు. అల్లుడేమో అత్తమామలకు విధేయంగా ఉండాలి, కొడుకు అలా ఉంటే మాత్రం వాళ్ల దృష్టిలో వాజమ్మగా మిగిలిపోతాడు. రెండు నాలుకల ధోరణి అంటే ఇదేనేమో... -
పోలీస్ స్టేషన్లో లొంగిపోయిన శర్వానంద్