అత్తను టెర్రస్‌ మీద నుంచి తోసేసింది.. | Woman allegedly thrashed her 85-yr-old mother-in-law, pushed her from terrace | Sakshi
Sakshi News home page

ఆస్తి కోసం కోడలు దారుణం..

Published Mon, Jun 26 2017 9:29 AM | Last Updated on Fri, Oct 5 2018 9:09 PM

అత్తను టెర్రస్‌ మీద నుంచి తోసేసింది.. - Sakshi

అత్తను టెర్రస్‌ మీద నుంచి తోసేసింది..

ఇటాహ్‌‌: ఉత్తరప్రదేశ్‌లో ఆస్తి కోసం ఓ కోడలు దాష్టికానికి ఒడిగట్టింది. బంధుత్వాన్ని మరవడమే కాకుండా, వృద్ధురాలు (85) అని కూడా కనికరం లేకుండా కోడలు దారుణంగా ప్రవర్తించింది. ఇంటిని తన పేరు మీద రిజిస్ట్రర్‌ చేయలేదన్న అక్కసుతో ...అత్తగారిని టెర్రర్‌ మీద నుంచి బయటకు తోసేసింది. ఈ ఘటనలో గాయపడ్డ బాధితురాలని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
 
గత కొంతకాలంగా ఇంటిని తమ పేరు మీద రాయాలని అత్తను వేధింపులకు గురి చేస్తున్నప్పటికీ, ఆమె ఒప్పుకోకపోవడంతో ఈ ఘటనకు పాల్పడినట్లు ఇటాహ్ పోలీసులు వెల్లడించారు. కోడలుపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement