property
-
చెన్నైలో ప్రధాన కార్యాలయం అమ్మిన కాగ్నిజెంట్.. ధర ఎంతంటే..
అమెరికాకు చెందిన ప్రముఖ ఐటీ సేవల సంస్థ కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్ చెన్నైలోని ఓల్డ్ మహాబలిపురం రోడ్ (ఓఎంఆర్) ఒక్కియం తొరైపాక్కంలో ఉన్న 13.68 ఎకరాల ప్రైమ్ ప్రాపర్టీని రూ.612 కోట్లకు విక్రయించింది. నీలాంకరై సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఈ వారం ప్రారంభంలో ఈ అమ్మకం లావాదేవీలు నమోదయ్యాయి. తొరైపాక్కం కాంప్లెక్స్‌లో సుమారు రెండు దశాబ్దాలకు పైగా ఉన్న కాగ్నిజెంట్ ఇండియా ప్రధాన కార్యాలయం లెగసీ ఇక ముగిసినట్లు తెలుస్తుంది.చెన్నైలో కాగ్నిజెంట్ మొదటి పూర్తి యాజమాన్యంలోని క్యాంపస్‌గా ఉన్న ఈ ప్రాపర్టీకి గణమైన చరిత్ర ఉంది. కంపెనీ సహ వ్యవస్థాపకులు లక్ష్మీ నారాయణన్, చంద్రశేఖరన్‌లకు గతంలో ఈ ఆఫీస్ ఆపరేషనల్ బేస్‌గా పనిచేసింది. ఒకప్పుడు కాగ్నిజెంట్ రిమోట్ కార్యకలాపాలకు ఇది ఎంతో తోడ్పడింది. అయితే ప్రస్తుతం అమ్మిన దాదాపు 15 ఎకరాల్లోని నాలుగు లక్షల చదరపు అడుగుల కార్యాలయ స్థలంతో కూడిన ఈ కార్యాలయానికి సుమారు రూ.750 కోట్ల నుంచి రూ.800 కోట్ల వరకు ఆదాయం సమకూరుతుందని గత ఏడాది సెప్టెంబరులో ఒక నివేదిక తెలిపింది.ఎంఈపీజెడ్, షోలింగనల్లూరు, సిరుసేరిలోని మూడు సొంత భవనాల్లో కాగ్నిజెంట్ తన కార్యకలాపాలను పటిష్టం చేసుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలకు అనుగుణంగా ఈ విక్రయం జరిగింది. ఈ లావాదేవీని సులభతరం చేయడానికి అంతర్జాతీయ ప్రాపర్టీ అడ్వైజరీ సంస్థ జేఎల్‌ఎల్‌ను నియమించి గత ఏడాది ఆగస్టులో కంపెనీ ఈ ప్రాపర్టీని మార్కెట్లోకి తెచ్చింది. స్థానిక డెవలపర్లు బాశ్యామ్ గ్రూప్, కాసాగ్రాండ్ సహా పలువురు కొనుగోలుదారులతో చర్చించిన తర్వాత బెంగళూరుకు చెందిన రియల్ ఎస్టేట్ డెవలపర్ బగామానే గ్రూప్ విజయవంతమైన బిడ్డర్‌గా లిస్ట్ అయింది.ఇదీ చదవండి: శామ్సంగ్ కో-సీఈఓ కన్నుమూతఈ ప్రాపర్టీ విక్రయం ద్వారా స్టాంప్ డ్యూటీతోపాటు రిజిస్ట్రేషన్ ఫీజుల కోసం తమిళనాడు ప్రభుత్వానికి రూ.55.08 కోట్లు సమకూరాయి. ఈ లావాదేవీని 2024 డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని తొలుత లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రాపర్టీ అప్పగింతకు ముందుగా అంచనా వేసిన దానికంటే అదనంగా దాదాపు మూడు నెలల సమయం పట్టినప్పటికీ కాగ్నిజెంట్ డిసెంబర్ చివరి నాటికే క్యాంపస్‌ను ఖాళీ చేసింది. ఇదిలాఉండగా, రామానుజన్ ఐటీ పార్క్, డీఎల్ఎఫ్, ఆర్ఏ పురంలోని సెయింట్ మేరీస్ రోడ్డులోని కార్యాలయం వంటి ప్రముఖ ప్రదేశాలతో సహా చెన్నై అంతటా లీజుకు తీసుకున్న స్థలాలను కూడా కంపెనీ ఖాళీ చేస్తోంది. -
అపార్ట్మెంట్లు విక్రయించిన అక్షయ్ కుమార్
బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ముంబయిలోని బోరివాలిలో తనకున్న రెండు రెసిడెన్షియల్ అపార్ట్మెంట్లను మొత్తం రూ.6.6 కోట్లకు విక్రయించారు. అందులో ఒక యూనిట్ రూ.5.35 కోట్లకు అమ్ముడుపోగా, మరొకటి రూ.1.25 కోట్లకు అమ్ముడైంది. కన్సల్టెన్సీ, హౌసింగ్ ట్రాన్సాక్షన్స్, మార్టగేజ్ అడ్వైజరీ.. వంటి వంటి పలు రకాల సేవలను అందిస్తున్న రియల్ ఎస్టేట్ సంస్థ స్క్వేర్ యార్డ్స్ ఈమేరకు వివరాలు వెల్లడించింది.స్క్వేర్ యార్డ్స్ తెలిపిన వివరాల ప్రకారం ముంబయిలోని ఒబెరాయ్ స్కై సిటీలోని ఈ రెసిడెన్షియల్ యూనిట్లకు సంబంధించి 2025 మార్చిలో లావాదేవీలు నమోదయ్యాయి. ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ రిజిస్ట్రేషన్ (ఐజీఆర్) వెబ్‌సైట్‌లోని వివరాల ప్రకారం రూ.5.35 కోట్లకు విక్రయించిన అపార్ట్మెంట్ వాస్తవానికి నవంబర్ 2017లో రూ.2.82 కోట్లకు కొనుగోలు చేశారు. దాంతో 89 శాతం విలువ జోడించినట్లయింది. ఈ అపార్ట్మెంట్ కార్పెట్ ఏరియా 100.34 చదరపు మీటర్లు (1,080 చదరపు అడుగులు). రూ.32.1 లక్షల స్టాంప్ డ్యూటీతో పాటు రిజిస్ట్రేషన్ ఫీజు రూ.30 వేలు చెల్లించాల్సి వచ్చింది.ఇదీ చదవండి: కేర్ హెల్త్ ఇన్సూరెన్స్‌కు రూ.104.77 కోట్ల నోటీసులు2017లో రూ.67.19 లక్షలకు కొనుగోలు చేసిన మరో అపార్ట్‌మెంట్‌ను అక్షయ్‌కుమార్ రూ.1.25 కోట్లకు విక్రయించారు. 23.45 చదరపు మీటర్ల (252 చదరపు అడుగులు) కార్పెట్ ఏరియా ఉన్న ఈ అపార్ట్మెంట్ లావాదేవీకి రూ.7.5 లక్షల స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు రూ.30,000గా ఉంది. స్కై సిటీలో ఉన్న ఈ ప్రాపర్టీని ఒబెరాయ్ రియాల్టీ 25 ఎకరాల్లో అభివృద్ధి చేసింది. ఇది 3 బీహెచ్‌కే, 3 బీహెచ్‌కే+స్టూడియో, డూప్లెక్స్ అపార్ట్మెంట్లను అందించే రెడీ-టు-మూవ్-ఇన్ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్‌గా ప్రసిద్ధి చెందింది. బాలీవుడ్ నటులు అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్ కూడా 2024 మేలో ఒబెరాయ్ స్కై సిటీలో కొన్ని ఆస్తులను కొనుగోలు చేశారు. -
ఇల్లే బంగారమాయె..
బంగారం, గృహం, స్టాక్ మార్కెట్.. ఈ మూడింట్లో ఎందులో పెట్టుబడులకు ఆసక్తి చూపుతున్నారని మహిళలను అడిగితే.. ఠక్కున చెప్పే సమాధానం బంగారమే! కానీ, నేటి మహిళల పెట్టుబడి ఆలోచనల్లో ఎన్నో మార్పులు వచ్చాయి. మొదట సొంతిల్లు.. ఆ తర్వాతే బంగారం, స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్స్ అంటున్నారు. 69 శాతం మంది మహిళలు సొంత ఇంటిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తుండగా.. 31 శాతం మంది పెట్టుబడి కోసం ప్రాపర్టీలను కొనుగోలు చేస్తున్నారని అనరాక్ కన్జ్యూమర్ సెంటిమెంట్ సర్వే వెల్లడించింది. – సాక్షి, సిటీబ్యూరో మన దేశంలో గృహ కొనుగోలు ప్రక్రియలో మహిళలు ఎల్లప్పుడూ కీలక నిర్ణయాధికారులే. మహిళలు స్వతంత్ర, వ్యక్తిగత ఆస్తుల కొనుగోళ్లకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రాపర్టీ కొనుగోళ్లలో మెజారిటీ మహిళలు తుది వినియోగదారులే. పెట్టుబడి రీత్యా ఆస్తుల కొనుగోళ్లూ ఆశించిన స్థాయిలోనే ఉండటం గమనార్హం. పెరుగుతున్న స్వాతంత్య్రం, వ్యక్తిగత స్వేచ్ఛ, నిర్ణయాధికారం, మెరుగైన ఆదాయ వనరులు కారణంగా గృహ విభాగంలో మహిళా పెట్టుబడిదారులు ఎక్కువగా వస్తున్నారు. 2022 హెచ్2 (జులై–డిసెంబర్)లో మహిళా గృహ కొనుగోలుదారుల్లో తుది వినియోగం: పెట్టుబడి నిష్పత్తి 79:21గా ఉండగా.. 2024 హెచ్2 నాటికి 69:31గా ఉందని తెలిపింది.లాంచింగ్ ప్రాజెక్టుల్లోనే.. సర్వేలో పాల్గొన్న 69 శాతం మహిళలకు రియల్ ఎస్టేట్ అత్యంత ప్రాధాన్యత కలిగిన ఆస్తి తరగతిగా భావిస్తున్నారు. 2022 హెచ్2లో ఇది 65 శాతంగా ఉండగా.. కోవిడ్ కంటే ముందు 2019 హెచ్2లో 57 శాతంగా ఉంది. గతంలో కొత్తగా ప్రారంభించిన ప్రాజెక్ట్‌లలో కొనుగోళ్లకు 10 శాతం మంది మహిళలు మొగ్గుచూపగా.. ఇప్పుడది 18 శాతానికి పెరిగింది. నిర్మాణం పూర్తయి, గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్న ఇళ్లు (రెడీ టు మూవ్) కొనుగోళ్ల ప్రాధాన్యత 29 శాతం మేర తగ్గింది.లగ్జరీకే మొగ్గు.. లగ్జరీ ప్రాపర్టీలకు మహిళలూ ఆసక్తి చూపిస్తున్నారు. రూ.90 లక్షల కంటే ఎక్కువ ధర ఉండే ప్రీమియం ఇళ్ల కొనుగోళ్లకు 52 శాతం ఉమెన్స్ మొగ్గు చూపిస్తున్నారు. వీటిలో 33 శాతం మంది రూ.90 లక్షల నుంచి రూ.1.5 కోట్ల ధర ఉండే ప్రాపర్టీలను ఇష్టపడుతుండగా.. 11 శాతం మంది రూ.1.5 కోట్ల నుంచి రూ.2.5 కోట్ల ధర ఉండే గృహాలను, 8 శాతం మంది రూ.2.5 కోట్ల కంటే ఎక్కువ ధర ఉండే అల్ట్రా లగ్జరీ ప్రాపర్టీల కొనుగోళ్లకు ఆసక్తి చూపిస్తున్నారు. దేశంలో మహిళా హై నెట్‌వర్త్ ఇండివిడ్యువల్స్ (హెచ్ఎన్ఐ) పెరుగుదలకు ఇదే నిదర్శనం.గోల్డ్, స్టాక్ మార్కెట్.. ప్రాపర్టీ తర్వాత మగువలకు అమితాసక్తి బంగారమే. అందుకే రియల్ ఎస్టేట్ తర్వాత గోల్డ్‌లో ఇన్వెస్ట్‌మెంట్స్‌కే మహిళలు జై కొడుతున్నారు. 2022 హెచ్2లో బంగారంలో పెట్టుబడులకు 8 శాతం మంది మహిళలు ఆసక్తి చూపించగా.. 2024 హెచ్2 నాటికి 12 శాతానికి పెరిగింది. ఇక, ఏటేటా స్టాక్ మార్కెట్ ఆకర్షణ కోల్పోతుంది. రెండేళ్ల క్రితం మార్కెట్లో పెట్టుబడులకు 20 శాతం మంది మహిళలు ఆసక్తి చూపిస్తే.. ఇప్పుడది ఏకంగా 2 శాతానికి పడిపోయింది. -
ప్రభుత్వ స్వాధీనమైన జయలలిత ఆస్తులు.. ఎన్ని వేల కోట్లో తెలుసా?
-
లోన్ల మంజూరులో జాగ్రత్త.. సుప్రీంకోర్టు కీలక సూచనలు
చట్టపరమైన వివాదాలను నివారించడంలో, ఆస్తి లావాదేవీలు సజావుగా జరిగేలా చూడడంలో అసలైన యజమానులు ఎవరో తెలిపే సమగ్ర టైటిట్ సెర్చ్ రిపోర్ట్‌ల ప్రాముఖ్యతను సుప్రీంకోర్టు ఇటీవల నొక్కి చెప్పింది.బ్యాంకులు రుణం మంజూరు చేసే ముందు టైటిల్ సెర్చ్ రిపోర్టులను సిద్ధం చేయడానికి ప్రామాణికమైన, ఆచరణాత్మక ఫ్రేమ్‌వర్క్‌ను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI), ఇతర వాటాదారులు అభివృద్ధి చేయవలసిన అవసరాన్ని కోర్టు నొక్కి చెప్పింది. తప్పుడు టైటిల్ సెర్చ్ రిపోర్టు ఆధారంగా రుణాన్ని మంజూరు చేసిన బ్యాంకు అధికారిపై ఎలాంటి చర్యలు ఉండాలన్నది కూడా ఫ్రేమ్‌వర్క్‌లో చేర్చాలని కోర్టు పేర్కొంది.బ్యాంకులు జాగ్రత్తగా ఉండాలి"అస్పష్ట టైటిల్ క్లియరెన్స్ రిపోర్ట్‌ల విషయంలో బ్యాంకులు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని మేము భావిస్తున్నాం. ఇది ప్రజా ధన రక్షణకు, పెద్ద ప్రజా ప్రయోజనానికి సంబంధించినది. అందువల్ల, రుణాలను మంజూరు చేసే ముందు టైటిల్ సెర్చ్ రిపోర్టును సిద్ధం చేయడానికి, ఆమోదించే అధికారి బాధ్యతను (క్రిమినల్ చర్యతో సహా) నిర్ణయించే ఉద్దేశంతో ఒక ప్రామాణిక, ఆచరణాత్మక విధానాన్ని అభివృద్ధి చేయడంలో భారతీయ రిజర్వ్ బ్యాంక్, ఇతర వాటాదారులు సహకరించడం చాలా అవసరం. అంతే కాకుండా టైటిల్ సెర్చ్ రిపోర్ట్‌లకు సంబంధించిన ఫీజులు, ఖర్చుల కోసం ప్రామాణిక మార్గదర్శకాలు ఉండాలి” అని కోర్టు పేర్కొంది.వివాదాస్పద తనఖా ఆస్తిపై ఆధారపడి బ్యాంకు మంజూరు చేసిన రుణం, టైటిల్ వివాదాలు ఉన్నట్లు గుర్తించిన సందర్భంలో, అటువంటి ప్రామాణిక ఫ్రేమ్‌వర్క్‌ను అభివృద్ధి చేయవలసిన అవసరాన్ని జస్టిస్ జెబి పార్దివాలా, జస్టిస్ ఆర్ మహదేవన్‌లతో కూడిన ధర్మాసనం నొక్కి చెప్పింది. యాజమాన్యాన్ని ధ్రువీకరించడం, ప్రతికూల క్లెయిమ్‌లు లేవని నిర్ధారించడం, ఆస్తికి సంబంధించిన స్పష్టమైన చట్టపరమైన స్థితిని నిర్ధారించడం ద్వారా బలమైన టైటిల్ సెర్చ్ మోసపూరిత లావాదేవీలను నిరోధించవచ్చని కోర్టు అభిప్రాయపడింది.బ్యాంకులు రుణం మంజూరు చేసే ముందు టైటిల్ సెర్చ్ రిపోర్ట్‌ను నియంత్రించే స్టాండర్డ్ మెకానిజం అంటూ ఏదీ ఇప్పటి వరకు ఆర్బీఐ అభివృద్ధి చేయలేదు. ఎంప్యానెల్ చేసిన న్యాయవాదులు తయారుచేసిన టైటిల్ సెర్చ్ రిపోర్ట్‌పై బ్యాంకులు ఆధారపడుతున్నాయి. టైటిల్ సెర్చ్ రిపోర్ట్ తయారీకి ఎటువంటి ప్రామాణీకరణ లేదు. -
చట్టబద్ధ స్వామిత్రతో ఆర్థికాభివృద్ధి
న్యూఢిల్లీ: చట్టబద్ధంగా జారీచేస్తున్న స్వామిత్ర ఆస్తి కార్డులతో దేశంలో ఆర్థిక కార్యకలాపాలు ఊపందుకుని ఆర్థికాభివృద్ధికి దోహదం చేస్తుందని ప్రధాని మోదీ ఆశాభావం వ్యక్తంచేశారు. శనివారం 65 లక్షల మందికి నూతనంగా స్వామిత్ర ప్రాపర్టీ కార్డ్‌లను జారీచేసిన సందర్భంగా ప్రధాని మోదీ వర్చువల్‌గా ప్రసంగించారు. పెరిగిన ఆర్థిక కార్యకలాపాలతో పేదరికాన్ని తరిమికొట్టొచ్చని ఆయన చెప్పారు. ఛత్తీస్‌గఢ్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, మధ్య ప్రదేశ్, మహారాష్ట్ర, మిజోరం, ఒడిశా, పంజాబ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ మొత్తంగా 10 రాష్ట్రాలతోపాటు జమ్మూకశీ్మర్, లద్దాఖ్ కేంద్రపాలిత ప్రాంతాల్లోని 50,000 గ్రామాలకు చెందిన 65 లక్షల మందికి శనివారం ఈ కార్డులను అందజేశారు. కార్డులు అందుకున్న వారిలో కొందరు లబ్ధిదారులతో ప్రధాని మోదీ మాట్లాడారు. ‘‘గ్రామీణ ప్రాంతాల్లో భూముల డిజిటలైజేషన్‌తో మరింత సమర్థవంతమైన సాంకేతికత, సుపరిపాలన సాధ్యమవుతుంది. ఇది గ్రామాల సాధికారతకు బాటలువేస్తుంది. కార్డులున్న లబ్ధిదారులు రుణాలు పొందేందుకు, ఇతర ప్రభుత్వ పథకాలు పొందేందుకు అర్హులవుతారు. కొత్తగా తీసుకున్న వారితో కలుపుకుని ఇప్పుడు దేశవ్యాప్తంగా దాదాపు 2.24 కోట్ల మంది స్వామిత్ర ప్రాపర్టీ కార్డుదారులున్నారు. ఆస్తి హక్కు అనేది ప్రపంచవ్యాప్తంగా ప్రధాన సవాల్‌గా తయారైంది. చాలా దేశాల్లో ప్రజలకు తమ సొంత ఆస్తులకు సంబంధించిన చట్టబద్ధమైన పత్రాలు లేవని స్వయంగా ఐక్యరాజ్యసమితి చేపట్టిన ఒక అధ్యయనంలో తేలింది. పేదరిక నిర్మూలనలో ఆస్తి హక్కు కీలకమైనది ఐరాస ఆనాడే పేర్కొంది’’అని మోదీ గుర్తుచేశారు. మృత మూలధనం కాదు ‘‘గతంలో ఒక ప్రముఖ ఆర్థికవేత్త చెప్పినట్లు భారతీయ గ్రామాల్లోని భూమి పెట్టుబడికి పనికిరాని మృత మూలధనం కాదు. సరైన పత్రాలు లేకపోవడంతో చాలా మంది వాటిని విక్రయించలేకపోతున్నారు. కొనేందుకు ఎవరూ ముందుకు రావట్లేదు. ఆక్రమణలు, భూవివాదాలతో గ్రామీణులు ఇబ్బందులు పడుతున్నారు. సరైన భూమి డాక్యుమెంట్లు లేని కారణంగా వీళ్లకు బ్యాంకులు కూడా రుణాలు ఇవ్వవు. మనసున్న ఏ ప్రభుత్వమూ గ్రామీణులను ఇలా కష్టాల కడలిలో వదిలేయదు. గత ప్రభుత్వాలు ఈ సమస్యకు ఎలాంటి పరిష్కారం చూపే ప్రయత్నంకూడా చేయలేదు. దీంతో దళితులు, వెనుకబడిన వర్గాలు, గిరిజనులు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. ఈ సమస్య పోగొట్టేందుకే గ్రామాల్లో వ్యక్తులకు నివాస, భూములకు సంబంధించిన ప్రాపర్టీ కార్డులను జారీచేస్తున్నాం. స్వామిత్ర (సర్వే ఆఫ్ విలేజెస్ అండ్ మ్యాపింగ్ విత్ ఇంప్రూవైజ్డ్ టెక్నాలజీ ఇన్ విలేజ్ ఏరియాస్) యోజన పథకం ద్వారా డ్రోన్ సాంకేతికత సాయంతో మ్యాపింగ్ చేసి వారి వారి ఇళ్లు, భూములను ఖచి్చతమైన సరిహద్దులతో చట్టబద్ధమైన ఆస్తికార్డులను అందజేస్తున్నాం. వీటితో వ్యక్తులకు తమ భూములపై సర్వాధికారాలు ధారాదత్తమవుతాయి. ఈ పథకం ఫలితాలు ఇప్పుడు కనిపిస్తున్నాయి. భారత్‌లో 6,00,000 గ్రామాలుంటే వాటిల్లో సగం గ్రామాల్లో డ్రోన్ సర్వే పూర్తయింది’’అని ప్రధాని మోదీ అన్నారు. శనివారం దాదాపు 230 జిల్లాల్లో రైతులకు అధికారులు స్వయంగా ప్రాపర్టీ కార్డులను అందజేశారు. స్వామిత్ర యోజన పథకాన్ని మోదీ సర్కార్ 2020లో ప్రారంభించింది. ఆస్తులను నగదుగా మార్చుకునే వెసులుబాటు, ఆయా భూములకు బ్యాంక్ రుణాలు వచ్చేలా చేయడం, ఆస్తి తగాదాలను సాధ్యమైనంత మేరకు తగ్గించడం, ఆస్తులు, ఆస్తిపన్నుల మదింపు, గ్రామస్థాయిలో సమగ్ర విధాన నిర్ణయాలకు దోహదపడటమే స్వామిత్ర యోజన ముఖ్యోద్దేశం. -
పిల్లలకు రాసిన ఆస్తిని వెనక్కి తీసుకోవచ్చు..
సాక్షి, అమరావతి: వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను పిల్లలు పట్టించుకోకుంటే వారికి ఇచ్చిన ఆస్తిని వెనక్కి తీసుకోవడానికి ప్రభుత్వం అవకాశం కల్పించింది. తమ పిల్లలకు ఆస్తిని రాసిస్తూ చేసిన గిఫ్ట్, సెటిల్మెంట్ డీడ్లను నిబంధనల ప్రకారం రద్దు చేసుకునే వెసులుబాటునిచ్చింది. నిబంధనల ప్రకారం ట్రిబ్యునల్ అధికారిగా ఉన్న ఆర్డీవో నుంచి వీటికి సంబంధించి వచ్చిన ఆదేశాలను పాటించి సంబంధిత డాక్యుమెంట్లను రద్దు చేయాలని సబ్ రిజిస్ట్రార్లకు ఆదేశాలిస్తూ స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్ అండ్ ఐజీ శేషగిరిబాబు మంగళవారం ఒక సర్క్యులర్ జారీ చేశారు.తల్లితండ్రుల నుంచి ఆస్తిని రాయించుకున్నాక వారి పిల్లలు పట్టించుకోకపోవడం, వారి రోజువారీ జీవనం, నిర్వహణ బాధ్యత కూడా తీసుకోకపోవడంతో చాలామంది ఇబ్బందులు పడుతున్న ఘటనలు అనేక చోట్ల జరుగుతున్నాయి. అలాంటి వారికి రక్షణ ఇచ్చేందుకు 2007 సీనియర్ సిటిజన్ చట్టం వచ్చింది. దీని ప్రకారం తల్లితండ్రులు తమను పిల్లలు పట్టించుకోవడంలేదని సీనియర్ సిటిజన్ ట్రిబ్యునల్ అధికారిగా ఉన్న ఆర్డీవోకు ఫిర్యాదు చేయొచ్చు. విచారణలో తల్లితండ్రులను వారి పిల్లలు చూడడం లేదని ఆర్డీవో నిర్ధారించి ఆర్డర్ ఇవ్వడానికి అవకాశం ఉంది. అలా ఆర్డర్ ఇస్తూ వారి ఆస్తిని వెనక్కి ఇవ్వాలని సూచించినా రిజిస్ట్రేషన్ల చట్టంలో ఉన్న అస్పష్టత కారణంగా అది అమలయ్యేది కాదు. ఇప్పుడు దానిపై రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ సర్క్యులర్‌లో స్పష్టత ఇచ్చారు. ట్రిబ్యునల్ ఆర్డర్ ప్రకారం ఆ ఆస్తిని గతంలో పిల్లలకు రాసిస్తూ తల్లితండ్రులు చేసిన సెటిల్మెంట్, గిఫ్ట్ డీడ్లను రద్దు చేయాలని స్పష్టం చేశారు. ఒకవేళ అలాంటి ఆర్డర్‌ను నేరుగా తల్లితండ్రులు తీసుకువచ్చినా తీసుకుని తదనుగుణంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. తల్లితండ్రులు ఆస్తిని వెనక్కి తీసుకునే నిమిత్తం ట్రిబ్యునల్ ఇచ్చిన ఎలాంటి ఆదేశాలనైనా రిజిస్ట్రేషన్ అధికారులు పాటించాలని ఆదేశించారు. -
ఒరిజినల్ దస్తావేజులు పోతే ప్రాపర్టీని అమ్మడం కష్టమా..?
మేము 15 సంవత్సరాల క్రితం ఒక అపార్ట్మెంట్లో ఫ్లాటు కొన్నాము. ఇప్పుడు అమ్మాలి అనుకుంటున్నాము. అయితే కొన్ని సంవత్సరాల క్రితం మా ఒరిజినల్ దస్తావేజులు పోయాయి. మేము రెవెన్యూ ఆఫీసు నుంచి సర్టిఫైడ్ కాపీలను తీసుకున్నాము. ఆ కాపీల ఆధారంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అని కొనుక్కునే వారికి చెప్పగా వారు వెనుకడుగు వేస్తున్నారు. కొందరేమో ‘కాగితాల పని మేము చూసుకుంటాము కానీ పాతిక లక్షలు తక్కువ ఇస్తాం..’ అంటున్నారు. నాకు ఏం చేయాలో పాలుపోవడం లేదు. దయచేసి పరిష్కారం చూపగలరు. – విజయ్ వర్ధన్, వరంగల్ఇంటి రిజిస్ట్రేషన్ / పూర్వ ఒరిజినల్ పత్రాలు లేనప్పుడు కొనేవారు కొంత సంకోచించడం సమంజసమే. ఒరిజినల్ దస్తావేజులని ప్రైవేటు వ్యక్తుల దగ్గర తాకట్టుపెట్టి తర్వాత అదే ఆస్తిని మరొకరికి అమ్మడం తరచుగా జరుగుతూ ఉంటుంది. ప్రైవేట్ తాకట్టు ఈ.సీ లో కూడా కనపడదు కాబట్టి కొనుక్కునేవారు అమాయకంగా మోసపోతూ తర్వాత కోర్టుల చుట్టూ తిరగడం సర్వసాధారణం అయిపోయింది. టైటిల్ డీడ్ డిపాజిట్ చేస్తే తప్పనిసరిగా రిజిస్టర్ చేసుకోవాలి అనే నిబంధన లేకపోవడం ఇందుకు కారణం. ఒరిజినల్ దస్తావేజులు లేని కారణం చూపించి మార్కెట్ విలువ కన్నా తక్కువ ధరకు మాత్రమే కొంటాము అని చాలామంది అంటారు. ఒరిజినల్ పత్రాలు లేనంత మాత్రాన ఆ స్థలం కానీ, ఇల్లు కానీ మీది కాకుండా పోదు, మీకు మీ ఆస్తిని అమ్మే హక్కు లేకుండా పోదు! మీరు తక్షణమే మీ ఇంటి పత్రాలు పోయాయి అని పోలీసులకి ఫిర్యాదు ఇవ్వండి. అదేవిధంగా మీరు ఒక లాయర్ ద్వారా పేపర్ ప్రకటన కూడా ఇవ్వవలసి ఉంటుంది. అలా ఇచ్చిన ప్రకటన కాపీలను మరలా పోలీసు వారికి అందించాలి. పోలీసు వారు ‘ఫలానా వారి దస్తావేజులు పోయాయి, తిరిగి వెతికినా దొరకడం లేదు’ అని ధ్రువీకరిస్తూ ఒక సర్టిఫికెట్ (నాన్ ట్రేసబుల్ సర్టిఫికెట్) జారీ చేస్తారు. ఆ సర్టిఫికెట్‌ను తీసుకొని మీరు రెవెన్యూ అధికారుల దగ్గర దరఖాస్తు చేసుకుంటే మీకు డూప్లికేట్ కాపీలు ఇస్తారు. అలా పొందిన పత్రాలు ఒరిజినల్ దస్తావేజులతో సమానం. మీరు వివరించిన పరిస్థితులలో అమ్మే వారికి –కొనేవారికి కూడా ఇది సురక్షితమైన పరిష్కారం.– శ్రీకాంత్ చింతల, హైకోర్టు న్యాయవాది(న్యాయపరమైన సమస్యలు, సందేహాలకోసం sakshifamily3@gmail.comకు మెయిల్ చేయవచ్చు. )(చదవండి: ప్రతిష్ఠాత్మక పదవిలో భారత సంతతి విద్యార్థి అనౌష్క కాలే!) -
ప్రాపర్టీ సందర్శన సేవలు ప్రారంభం
రియల్టీ రంగంలో ఆన్లైన్ సేవలందిస్తున్న టైమ్స్ గ్రూప్ ఆధ్వర్యంలోని మ్యాజిక్‌బ్రిక్స్ సంస్థ తన వినియోగదారులకు మెరుగైన సర్వీసు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపింది. ప్రాపర్టీ కొనుగోలు, అమ్మకాలకు సంబంధించిన వినియోగదారులు మరింత సమర్థంగా నిర్ణయం తీసుకునేందుకు వీలుగా హైదరాబాద్‌లో ప్రాపర్టీ సందర్శనను ప్రారంభించింది. ఆన్లైన్ ప్లాట్‌ఫామ్ ద్వారా ప్రాపర్టీ కొనుగోలు చేయాలంటే చాలామందికి అనుమానాలుంటాయి. కాబట్టి నేరుగా ప్రాపర్టీ సందర్శించి నిర్ణయం తీసుకునేందుకు మ్యాజిక్స్బ్రిక్స్ తన ప్లాట్‌ఫామ్ ద్వారా అవకాశం కల్పిస్తుంది.మ్యాజిక్ బ్రిక్స్ 100కుపైగా బిల్డర్లతో కలిసి హైదరాబాద్‌లో సైట్ విజట్ ప్రోడక్ట్లను అందుబాటులో ఉంచుతున్నట్లు తెలిపింది. ఇప్పటికే బెంగళూరులో ఉన్న ఈ సర్వీసును విస్తరించినట్లు ప్రకటించింది. ఔరా రియల్టీ, విజన్ ఇన్ఫ్రా డెవలపర్స్, ఎలిగెంట్ ఇన్ఫ్రా, అపర్ణ కన్స్ట్రక్షన్స్ వంటి ప్రముఖ సంస్థలతో సహా 100కు పైగా డెవలపర్లతో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు పేర్కొంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఆరునెలల్లో 120కి పైగా ప్రాజెక్టుల్లో 8,200 కంటే ఎక్కువ సైట్ సందర్శనలను అందించినట్లు తెలిపింది. వినియోగదారులు సగటున రూ.1.25 కోట్లతో 450 కంటే ఎక్కువ విలువైన ఇళ్లు బుక్ చేసుకున్నట్లు వివరించింది.ఇదీ చదవండి: పది పాసైన మహిళలకు ఎల్ఐసీ ఉపాధి అవకాశంఈ కార్యక్రమానికి సంబంధించి మ్యాజిక్ బ్రిక్స్ సీఈఓ సుధీర్ పాయ్ మాట్లాడుతూ..‘సాధారణంగా పండగ సీజన్ తరువాత డిసెంబరులో నివాస కొనుగోళ్లు తగ్గుతాయి. అయితే గత 2-3 సంవత్సరాలుగా ఇంటి యజమానుల ఆకాంక్ష మేరకు డిమాండ్ బలంగానే ఉంటుంది. ఇళ్లు కొనాలని ఆసక్తి ఉన్నవారు పండగలు, ప్రత్యేక రోజులకు అతీతంగా కొనుగోలుకు ఆసక్తి చూపిస్తున్నారు. దేశవ్యాప్తంగా కంపెనీ అందుబాటులోకి తీసుకొచ్చిన ప్రాపర్టీ విజిట్ ఫెస్ట్‌కు మంచి స్పందన ఉంది. కొంతమంది కొనుగోలుదారులతో ఒకే రోజులో 4-5 ప్రాపర్టీలను సందర్శించడం వల్ల నిర్ణయాలు తీసుకునే సమయాన్ని దాదాపు 50% తగ్గించేందుకు వీలవుతుంది. రియల్టీ రంగంలో టెక్నాలజీ ఆధారిత పరిష్కారాలకు అందిస్తూ మెరుగైన సేవలు అందుబాటులో ఉంచుతున్నాం’ అన్నారు. -
ప్రాపర్టీ ధరల పెరుగుదలలో కోకాపేట అదుర్స్
సాక్షి, హైదరాబాద్: కోకాపేట బంగారం కంటే ఖరీదైపోయింది. ఇక్కడ ప్రాజెక్ట్ నిర్మించడం, నివాసం ఉండటం డెవలపర్లకు, కొనుగోలుదారులకు ఇద్దరికీ స్టేటస్ సింబల్‌గా మారిపోయింది. గత ఐదేళ్లలో ప్రాపర్టీ ధరల పెరుగుదలలో దేశంలోనే కోకాపేట రెండో స్థానంలో నిలిచింది. ఇక్కడ 89 శాతం మేర పెరుగుదల నమోదు కాగా.. బాచుపల్లిలో 57 శాతం, తెల్లాపూర్‌లో 53 శాతం ధరలు పెరిగాయని అనరాక్ రీసెర్చ్ రిపోర్ట్ వెల్లడించింది. 2019లో ఈ ప్రాంతంలో ధర చదరపు అడుగుకు రూ.4,750గా ఉండగా.. 2024 నాటికి రూ.9 వేలకు పెరిగింది. ఈ ప్రాంతంలో భూముల ధరలు ఖరీదు కావడంతో విల్లాల కంటే ఎక్కువగా హైరైజ్ భవనాలనే ఎక్కువగా నిర్మిస్తున్నారు. మూడేళ్ల క్రితం వరకూ కోకాపేట బడ్జెట్ హోమ్స్ దొరికేవి కానీ, ఇప్పుడు 40 అంతస్తుల స్కై స్క్రాపర్లే ఎక్కువగా కనిపిస్తున్నాయి. కనిష్టంగా 8 వేల చదరపు అడుగు నుంచి గరిష్టంగా 16 వేల చదరపు అడుగు విస్తీర్ణం ఉన్న అపార్ట్మెంట్లు సైతం నిర్మిస్తున్నారు.ధర రూ.2.5 కోట్లకు పైమాటే.. గత ఐదేళ్లలో కోకాపేటలో దాదాపు 12,920 యూనిట్లు లాంచింగ్ అయ్యాయి. ఇందులో అల్ట్రా లగ్జరీ గృహాలే ఎక్కువగా ఉన్నాయి. రూ.2.5 కోట్ల కంటే ఎక్కువ ధర కలిగిన యూనిట్ల వాటా 52 శాతంగా ఉందంటే డిమాండ్‌ను అర్థం చేసుకోవచ్చు. 30 శాతం మధ్య, ప్రీమియం విభాగం యూనిట్లు, రూ.1.5–2.5 కోట్ల మధ్య ఉన్న లగ్జరీ గృహాల వాటా 19 శాతంగా ఉంది.బాచుపల్లిలో బూమ్.. బాచుపల్లిలో కూడా రియల్టీ మార్కెట్ బూమ్‌లో ఉంది. ఇక్కడ గత ఐదేళ్లలో ధరలు 57 శాతం పెరిగాయి. 2019లో ఇక్కడ సగటు ధర చదరపు అడుగుకు రూ.3,690 ఉండగా.. 2024 నాటికి రూ.5,800లకు పెరిగాయి. మిడ్, ప్రీమియం విభాగానికి బాచుపల్లి కేంద్రంగా మారింది. 2019లో తెల్లాపూర్‌లో ధర చదరపు అడుగుకు రూ.4,819గా ఉండగా.. 2024 నాటికి 53 శాతం వృద్ధి రేటుతో రూ.7,350కు పెరిగాయి. తెల్లాపూర్‌లో గత ఐదేళ్లలో 18,960 యూనిట్లు లాంచింగ్ కాగా.. ఇందులో 66 శాతం ప్రీమియం, 34 శాతం లగ్జరీ విభాగం గృహాలే.చదవండి: మాట మార్చిన నిఖిల్ కామత్!.. అప్పుడు అద్దె ఇల్లే బెస్ట్ అని.. సంపన్న వర్గాల ఆసక్తి.. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ప్రాంతాలలో రద్దీ పెరగడంతో ఇక్కడి వారు కోకాపేటకు మారుతున్నారు. ఈ ప్రాంతం హై ప్రొఫైల్, ప్రీమియం ప్రాజెక్ట్‌లకు డెస్టినేషన్‌గా మారింది. – ప్రశాంత్ రావు, డైరెక్టర్, పౌలోమీ ఎస్టేట్స్మౌలిక వసతులే మెయిన్ ఐటీ కారిడార్లకు చేరువగా ఉండటమే బాచుపల్లి హైలైట్. అంతర్జాతీయ స్థాయి మౌలిక వసతులతో పాటు ఇంటర్నేషనల్ స్కూల్స్, హాస్పిటల్స్, మాల్స్‌తో ఈ ప్రాంతానికి డిమాండ్ పెరిగింది. ప్రవాసులు, ఉన్నత హోదా ఉద్యోగులు ఇక్కడ నివాసం ఉండేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. – నరేంద్ర కుమార్, డైరెక్టర్, ప్రణీత్ గ్రూప్ -
ప్రాపర్టీ కొనుగోలుకు ఏ డాక్యుమెంట్లు అవసరం..?
-
ఇలాంటి ల్యాండ్స్ కొంటే మీరు సమస్యలు కొని తెచ్చుకున్నట్టే..
-
ఖరీదైన అపార్ట్మెంట్ కొన్న దీపికా పదుకొణె కంపెనీ
బాలివుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణెకు చెందిన సంస్థ కేఏ ఎంటర్ప్రైజెస్ లగ్జరీ అపార్ట్మెంట్ కొనుగోలు చేసింది. ముంబైలోని బాంద్రా వెస్ట్ ప్రాంతంలో రూ.17.8 కోట్లకు 1845 చదరపు అడుగుల అపార్ట్‌మెంట్‌ను కొనుగోలు చేసినట్లు తెలిసింది.ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ల సమాచారాన్ని సేకరించే జాప్కీ సంస్థకు లభించిన పత్రాలు ఈ కొనుగోలు వివరాలను వెల్లడించాయి. ఈ సేల్ డీల్ సెప్టెంబర్ 12న నమోదైంది. ఎనార్మ్ నాగ్‌పాల్ రియాల్టీ సంస్థ విక్రేత కాగా దీపికా పదుకొణె కంపెనీ కేఏ ఎంటర్ప్రైజెస్ కొనుగోలుదారుగా పత్రాలు చూపించాయి.పికా పదుకొణె కంపెనీ అపార్ట్మెంట్ కొనుగోలు చేసిన సాగర్ రేషమ్ కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీని ఎనార్మ్ నాగ్‌పాల్ రియాల్టీ సంస్థ అభివృద్ధి చేసింది. ఇందులో 4బీహెచ్‌కే, 5 బీహెచ్‌కే అపార్ట్మెంట్లు ఉన్నాయి. కంపెనీ కొనుగోలు చేసిన ఫ్లాట్ 15వ అంతస్తులో ఉంది. బిల్ట్-అప్ ఏరియా రేటు చదరపు అడుగుకు రూ. 96,400. ఈ డీల్‌కు స్టాంప్ డ్యూటీ దాదాపు రూ. 1.07 కోట్లు, రిజిస్ట్రేషన్ ఛార్జీలు రూ. 30,000 చెల్లించినట్లు తెలుస్తోంది.బాలివుడ్ స్టార్ కపుల్ దీపికా పదుకొణె, రణవీర్ సింగ్ ఇటీవలే తమ మొదటి బిడ్డకు జన్మనిచ్చారు. కాగా ఈ దంపతులు కొనుగోలు చేసిన మరొక ప్రాపర్టీ షారూఖ్ ఖాన్ రాజభవనం మన్నత్‌కు సమీపంలోని బాంద్రా బ్యాండ్స్టాండ్లో సముద్రానికి ఎదురుగా ఉన్న క్వాడ్రప్లెక్స్. దీని విలువ రూ.100 కోట్లకు పైగా ఉంటుందని సమాచారం. ఈ జంట 2021లో అలీబాగ్‌లో రూ. 22 కోట్ల విలువైన బంగ్లాను కూడా కొనుగోలు చేశారు. -
ఆస్తి కోసం బావమరిదిని చంపించాడు
గచ్చిబౌలి: అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఓ వ్యక్తి మామ ఆస్తిపై కన్నేసి బావమరిదిని హత్య చేయించిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. శనివారం గచ్చిబౌలి పీఎస్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసు వివరాలను మాదాపూర్ ఏసీపీ శ్రీకాంత్ వెల్లడించారు. ఏపీలోని నెల్లూరు జిల్లా కావలి పట్టణం జనతాపేటకు చెందిన మద్దసాని ప్రకాశం జ్యువెలరీ బిజినెస్ చేస్తుంటారు. ఆయనకు కుమారుడు యశ్వంత్, కూతురు అమూల్య ఉన్నారు. కూతురు అమూల్యతో ఇదే జిల్లాలోని సత్యవోలు అగ్రహారం కొండాపురం మండలానికి చెందిన గోగుల శ్రీకాంత్ (34)తో 2017 ఆగస్టులో వివాహం జరిపించారు. శ్రీకాంత్ గచి్చ»ౌలి జయభేరి ఎన్‌క్లేవ్‌లో బాలాజీ మెన్స్ హాస్టల్ నిర్వహిస్తున్నాడు. మల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ పూర్తి చేసిన శ్రీకాంత్ బావమరిది యశ్వంత్ తన అక్కా, బావతోనే ఉండేవాడు. అయిదు నెలల క్రితం శ్రీకాంత్ భార్య అమూల్య డెలివరీ కోసం తల్లిగారింటికి వెళ్లింది. అప్పటినుంచి యశ్వంత్ గచి్చ»ౌలిలో బావకు చెందిన హాస్టల్లోనే ఉంటున్నాడు. నమ్మించి.. దహన సంస్కరాలు చేయించి.. ఈ నెల 2వ తేదీ అర్ధరాత్రి 1.30 గంటల సమయంలో శ్రీకాంత్ మామ ప్రకాశంకు ఫోన్ చేసి యశ్వంత్ ఉరి వేసుకున్నాడని ఫోన్ చేసి చెప్పాడు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేస్తారని, హాస్టల్ సీజ్ చేస్తారని నమ్మించి యశ్వంత్ మృతదేహాన్ని కారులో తీసుకొని బయలుదేరాడు. ఏపీలోని వాడపల్లి సరిహద్దు వరకు అంబులెన్స్ తెప్పించుకొని మృతదేహన్ని అందులోకి మార్చి కావలికి వెళ్లాడు. కాగా.. ఆచారం ప్రకారం యశ్వంత్ మృతదేహాన్ని పూడ్చి వేయాలి. కానీ అలా చేస్తే జ్ఞాపకాలు ఉంటాయని, దహనం చేస్తే అలా జరగదని మామ ప్రకాశంను నమ్మించాడు. 3వ తేదీన దహన సంస్కారాలు చేయించాడు. ఆత్మహత్య చేసుకుంటే కేసు ఎందుకు నమోదు చేయలేదని బంధువులు పోలీసుల వద్ద అనుమానాలు లేవనెత్తారు. తన భర్త శ్రీకాంత్ ప్రవర్తనపై అనుమానం ఉందని అమూల్య తండ్రి దృష్టికి తీసుకెళ్లింది. ప్రకాశం తన స్నేహితులతో కలిసి నగరంలోని గచి్చబౌలి లోని హాస్టల్‌కు వచ్చి యశ్వంత్ గదిని పరిశీలించాడు. అనంతరం హాస్టల్లో సీసీ కెమెరాలు పని చేయడం లేదని తెలుసుకున్నాడు. ఎదురుగా ఉన్న ఓ షాపులోనూ సీసీ ఫుటేజీని శ్రీకాంత్ డిలీట్ చేసినట్లు గుర్తించాడు. తన అనుమానాలకు బలం చేకూరడంతో 10న రాత్రి గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. సీసీ పుటేజీల ఆధారంగా మృతదేహం తరలించిన వారిని గుర్తించి విచారించగా హత్య విషయం వెలుగు చూసింది. పక్కా వ్యూహంతోనే..ఆన్లైన్లో కాక్ ఫైట్ చేసిన శ్రీకాంత్ దాదాపు రూ.4 కోట్లు నష్టపోయాడు. భారీగా అప్పులు చేయడంతో అతనిపై ఒత్తిడి పెరిగింది. దీంతో బావ మరిదిని హతమార్చితే మామ ఆస్తి మొత్తం తనకే దక్కుతుందని పక్కా స్కెచ్ వేశాడు. బావమరిది యశ్వంత్‌ను హత్య చేయాలని ఆగస్టు 29న కుక్‌గా పని చేసే కర్ణాటకకు చెందిన పి.ఆనంద్ (35)కు రూ.10 లక్షలు సుపారీ ఇచ్చాడు. ఆనంద్ ఏపీలోని కడప జిల్లా కాస్లపాడుకు చెందిన అంబటి వెంకటేష్ సహాయం కోరాడు. ఈ నెల 2వ తేదీ అర్ధరాత్రి దాటిన తర్వాత హాస్టల్ గదిలో నిద్రిస్తున్న యశ్వంత్ మెడకు చున్నీ బిగించి హత్య చేశారు. నిందితులు శ్రీకాంత్, ఆనంద్, వెంకటేషిలను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి రూ.90 వేల నగదు, 4 సెల్ఫోన్లు, బ్రీజా కారు, స్కూటీని స్వా«దీనం చేసుకున్నారు. సమావేశంలో గచ్చిబౌలిఇన్స్పెక్టర్ ఆంజనేయులు, డీఐ శ్రీనివాస్ గౌడ్, ఎస్ఐ శోభన్ బాబు పాల్గొన్నారు. -
విడాకుల తరువాత పిల్లలకు తండ్రి ఆస్తిలో వాటా వస్తుందా?
పెళ్లయినప్పటినుంచి భర్త వేధింపులు తప్పడం లేదు. పిల్లలు పుట్టి వాళ్లు కాస్త పెద్దవాళ్లయినా మారలేదు సరి కదా, ఇంకా ఎక్కువైంది. ఇంక భరించలేక విడిపోతున్నాను. నాకు, నా పిల్లలకు ఆస్తిలో వాటా వస్తుందా? – పి. అనిత, నెల్లూరుసాధారణంగా స్థిరాస్తులు ఎవరి పేరుతో అయితే ఉంటాయో వారికి మాత్రమే చెందుతాయి వారి స్వార్జితం కిందనే పరిగణించ బడతాయి. కానీ అన్నివేళలా అదే నియమం వర్తించదు. భార్యకు భర్త ఆస్తిలో హక్కు ఉందా లేదా అనే అంశం భర్త మతాచారంపై ఆధారపడి ఉంటుంది. హిందువులకు వర్తించే చట్టాల ప్రకారం మీ భర్త పేరిట ఉన్న ఆస్తి వారసత్వం ద్వారా సంక్రమించింది అయితే గనక అందులో మీ పిల్లలకు పూర్తి హక్కు ఉంటుంది. మీ పిల్లలు మైనర్లు అయితే వారి తరఫున మీరు సివిల్ కోర్టును ఆశ్రయించవచ్చు. మీ పిల్లలకి వారి వాటా వారికి దక్కుతుంది. అదే మీ భర్త స్వార్జితం అయితే మాత్రం తన తదనంతరం వీలునామా ప్రకారం, వీలునామా లేని పక్షంలో హిందూ వారసత్వ చట్టం ప్రకారం లేదా భర్త జీవితకాలంలో స్వయంగా ఇవ్వాలి అని తలిస్తే మాత్రమే భార్యకి హక్కులు ఉంటాయి.మరో విషయం... భార్యకు తన జీవితకాలం మొత్తం భర్త ఇంట్లో ఉండే హక్కు ఉంటుంది. అలాగే మెయింటెనెన్స్ లేదా విడాకులు తీసుకునే సమయంలో భర్త ఆస్తిలో భార్యకు వాటా వచ్చే అవకాశం ఉంది. ఎంత శాతం వాటా ఇవ్వాలి అనేది అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. హిందూ లా, ముస్లిం లా, క్రిష్టియన్ లా, ఇలా వేర్వేరు మతస్తులకు వేరే విధమైన హక్కులు ఉంటాయి.మీరు భర్త వేధింపులు తట్టుకోలేక విడి΄ోతున్నాను అని చె΄్పారు కాబట్టి, డీ.వీ.సీ. చట్టం (గృహ హింస నుంచి మహిళల రక్షణ చట్టం, 2005) కింద కేసు వేసినట్లయితే, అందులో అనేక రకాల హక్కులను, ఉపశమనాలను పొందవచ్చు. కేసు తేలేంతవరకు మీ భర్త ఆస్తులను అమ్మకుండా కోర్టు వారు స్టే విధించే అవకాశం కూడా ఉంది. డీ.వీ.సీ. చట్టం సెక్షన్ 22 ప్రకారం అదనపు దరఖాస్తు చేసుకుంటే, మీరు కోరిన ఉపశమనాలతో పాటు మానసిక హింస, మానసిక క్షోభతో సహా మీకు కలిగిన గాయాలకు కూడా నష్టపరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశించవచ్చు. డీ.వీ.సీ. చట్టం ప్రకారం భర్త ఆస్తి పై కేసు వేసే వీలుందా లేదా అన్నది ప్రతి కేసులోనూ విభిన్నంగా ఉంటుంది. కాబట్టి మీ దగ్గరలో ఉన్న లాయర్ని సంప్రదిస్తే మంచిది.– శ్రీకాంత్ చింతల , హైకోర్టు న్యాయవాది -
రెండవ భార్యకు, పిల్లలకు ఆస్తి వస్తుందా?
భార్య లేదా భర్త బతికి ఉండగా, చట్టరీత్యా విడాకులు తీసుకోకుండా చేసుకున్న రెండవ పెళ్లి చెల్లదు. ప్రస్తుతం ఉన్న చట్టాలలో, (ముస్లింలకు, కొన్ని ప్రత్యేక మతాచారాలు వున్నవారికి తప్ప) అది నేరం కూడా. అందుకనే రెండవ భార్యకి భర్త ఆస్తిలో ఎటువంటి హక్కు ఉండదు. మొదటి భార్య సంతానానికి, రెండవ భార్య సంతానానికి మాత్రం ఆస్తిలో సమాన హక్కు ఉంటుంది. అయితే మొదటి భార్య చనిపోయిన తర్వాత లేదా విడాకులు తీసుకున్న తర్వాత రెండో పెళ్లి చేసుకుంటే, ఆ రెండవ భార్యకి కూడా మొదటి భార్య సంతానం – రెండవ భార్య సంతానంతో పాటు ఆస్తిలో సమాన హక్కు ఉంటుంది.ఉదాహరణకు: చనిపోయిన మొదటి భార్యకి భర్తకి కలిపి ఇద్దరు సంతానం ఉన్నారు. అలాగే రెండవ భార్యకి ఇద్దరు సంతానం ఉన్నారు. ఎటువంటి వీలునామా రాయకుండా చనిపోయిన భర్త స్వార్జితంలో – పూర్వీకుల ద్వారా సంక్రమించిన ఆస్తిలో 5 భాగాలు అవుతాయి. అందులో నాలుగు భాగాలు మొదటి – రెండవ భార్య సంతానానికి, ఒక భాగం రెండవ భార్యకి చెందుతుంది.ప్రభుత్వ ఉద్యోగి పెన్షన్ – పదోన్నతి తర్వాత సంక్రమించే సర్వీస్ బెనిఫిట్స్‌కి సంబంధించి మాత్రం చట్టం కొంత వేరుగా ఉంటుంది. సాధారణ పరిస్థితులలో, పైన తెలిపిన విధంగా చెల్లుబాటు కాని పెళ్లి చేసుకున్న రెండవ భార్యకి పెన్షన్, సర్వీస్ బెనిఫిట్స్ లో ఎటువంటి హక్కు ఉండదు. కానీ అన్నివేళలా అలా వుండదు. ఇటీవలే 2023లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన ఒక తీర్పులో మొదటి భార్య బతికి ఉన్నప్పటికీ, చట్టరీత్యా విడాకులు తీసుకోనప్పటికీ రెండవ భార్యకి కూడా పెన్షన్ – సర్వీస్ బెనిఫిట్స్‌లో సమాన హక్కు కల్పించింది. మొదటి భార్య నుంచి విడాకులు కావాలి అంటూ చనిపోయిన ప్రభుత్వ ఉద్యోగి డైవర్స్ కేసు ఫైల్ చేసి ఉండడం ఆ కేసులో గమనించదగ్గ అంశం.అంతేకాక ఫ్యామిలీ పెన్షన్ ఉద్దేశానికి, మెయింటెనెన్స్ చట్టం వెనుక ఉన్న ఉద్దేశానికి తేడా ఏమీ లేదు అని అంటూ, మొదటి భార్యకి, రెండవ భార్యకి పెన్షన్ సమానంగా రెండు భాగాలుగా పంచాలి అని కోర్టు తన తీర్పు వెలువరించింది. రైల్వే విభాగంలో మాత్రం, పెన్షన్ రూల్స్ లోని సెక్షన్ 75 ప్రకారం, మొదటి భార్యకి – రెండవ భార్యకి కూడా పెన్షన్‌లో సమాన హక్కు ఉంటుంది అని గతంలో పలు హైకోర్టులు పేర్కొన్నాయి. కొన్ని హక్కులు రెండవ భార్యకి వర్తిస్తాయా లేదా అన్నది కేసు పూర్వాపరాలను బట్టి, ఆయా కేసులోని ప్రత్యేక అంశాలపైనా ఆధారపడి ఉంటుంది.– శ్రీకాంత్ చింతల, హైకోర్ట్ అడ్వకేట్ -
స్టార్ హీరో కుమారుడి సెంటిమెంట్.. పాత భవనానికి రూ. 37 కోట్లు!
బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ చలనచిత్ర పరిశ్రమలో స్టార్ కిడ్‌గా గుర్తింపు ఉంది. తాజాగా ఢిల్లీలో భారీ మొత్తంలో ఆస్తులను ఆర్యన్ కొనుగోలు చేశాడని తెలుస్తోంది. కొద్దిరోజుల క్రితం సొంతంగా దుస్తుల బిజినెస్ ప్రారంభించిన ఆర్యన్ త్వరలో దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. ఇలా సంపాదన వేటను ఆయన ఎప్పుడో ప్రారంభించాడు. ఈ క్రమంలోనే దేశ రాజధాని ఢిల్లీలో రెండు అంతస్తుల భవనాన్ని కొనుగోలు చేశారని తెలుస్తోంది.బాలీవుడ్లో వస్తున్న వార్తల ప్రకారం దక్షిణ ఢిల్లీలోని పంచశీల్ పార్క్‌లో రెండు అంతస్తుల భవనాన్ని రూ. 37 కోట్లు చెల్లించి ఆర్యన్ కొనుగోలు చేశాడు. అందుకు సంబంధించిన లావాదేవీలు మే 2024లో జరిగాయి. ఆ బంగ్లా ఆయన పేరుతో రిజిస్టర్ కూడా అయినట్లు నివేదించబడింది.ముంబైలో ఉన్న ఆర్యన్ ఖాన్ ఢిల్లీలోని ఫ్లాట్‌ను ఎందుకు కొనుగోలు చేశాడో కూడా తెలిపారు. ఆయన అమ్మ గౌరీఖాన్ చిన్నతనంలో ఇక్కడే ఉండేవారని తెలుస్తోంది. షారుక్, గౌరీఖాన్ ముంబైకి షిఫ్ట్ కాక ముందు ఆ ఫ్లాట్‌లోనే జీవనం సాగించారని, అందుకే ఆ సెంటిమెంట్‌తో ఇప్పుడు ఆర్యన్ దానిని కొనుగోలు చేశాడు. అయితే, ఇప్పటికే ఈ బిల్డింగ్‌లో వారి కుటుంబానికి చెందిన ఆస్తులున్నాయి. చాలా ఏళ్ల క్రితమే ఆ భవనంలో బేస్మెంట్, మొదటి ఫ్లోర్‌ను ఆ కుటుంబం కొనుగోలు చేసింది. ఆ బిల్డింగ్ నుంచే తన తండ్రి జీవితం ప్రారంభం కావడంతో తాజాగా అక్కడ రెండు ఫ్లోర్లను ఆర్యన్ కొనుగోలు చేశాడు. అందుకోసం రూ. 37 కోట్లు ఆయన చెల్లించాడు. -
పెంపుడు కొడుకును ఇంటి నుంచి తరిమేసిన తండ్రి
అనుబంధం, ఆత్మీయత అంతా ఒక బూటకం.. ఆత్మ తృప్తికై మనుషులు ఆడుకునే నాటకం...అంటూ ఓ సినీ కవి మానవీయత లేని కుటుంబ సంబంధాల్లోని డొల్లతనాన్ని ఏనాడో ఎండగట్టాడు. కన్నప్రేమ కన్నా పెంచిన ప్రేమ గొప్పది అంటారు. కానీ డబ్బు ముందు అన్ని ప్రేమలూ దిగదుడుపే అనడానికి ఇక్కడో తండ్రి నిదర్శనగా నిలిచాడు. ఆస్తి ఇవ్వాల్సి వస్తుందని 35 ఏళ్లుగా పెంచుకున్న కొడుకును ఇంట్లో నుంచి బయటకు గెంటేశాడు.. బుచ్చెయ్యపేట: కొడుకులు లేరని అన్న కొడుకును 35 ఏళ్ల కిందట దత్తత తీసుకున్నాడు. అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేసి పెళ్లి చేశాడు. తీరా ఆస్తి ఇవ్వాల్సి వస్తుందని పెంచిన ప్రేమను పక్కన పెట్టి పెంపుడు కొడుకును, కోడలు, మనవరాళ్ల సహా ఇంట్లోంచి బయటకు గెంటేసిన ఘటన బుచ్చెయ్యపేట మండలం మల్లాంలో జరిగింది. వివరాల్లోకి వెళితే గ్రామానికి చెందిన బొట్టా పోతురాజు, దేముడమ్మకు ఆరుగురు ఆడపిల్లలు. పోతురాజు అన్న రామునాయుడుకు ముగ్గురు మగ సంతానం. మగ సంతానం లేని పోతురాజు అన్న కుమారుల్లో ఆఖరివాడైన రమణను 35 ఏళ్ల కిందట దత్తత తీసుకున్నాడు. రమణ నాలుగో ఏడాది నుంచి పోతురాజు, దేముడమ్మ వద్దే పెరిగాడు. వీరి రేషన్ కార్డులోను, ఆధార్ కార్డులోను రమణ పేరు కూడా నమోదు చేశారు. 15 ఏళ్ల కిందట పోతురాజు, దేముడమ్మల పెద్ద కూతురు వరహాలమ్మ కుమార్తెను రమణకిచ్చి వివాహం చేశారు. వీరికి ముగ్గురు ఆడపిల్లలు పుట్టారు. ఇప్పటి వరకు ఒకే ఇంట్లో నివాసం ఉంటూ జీవించారు. ఇటీవల పోతురాజు అల్లుడొకరు రమణను ఇంట్లో నుంచి బయటకు పంపేయాలని, లేకపోతే ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వస్తుందని అత్తమామలకు నూరిపోయడంతో రమణ, దేవిలను రెండేళ్లుగా వేరే గదిలో ఉంచారని గ్రామస్తులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో తక్షణం ఇంట్లోంచి వెళ్లిపోవాలంటూ బుధవారం తన పెంపుడు కొడుకు రమణను, అతని భార్య దేవిలను పోతురాజు ఇంట్లో నుంచి బయటకు గెంటి వేశాడు. వారి వంట సామాన్లు, బట్టలను బయటకు విసిరేశారు. దీంతో దిక్కుతోచని స్థితిలో రమణ, దేవి ఉదయం నుంచి రాత్రి వరకు ఆరు బయటే అర్ధాకలితో ఉండిపోయారు. రమణ ఇద్దరు కుమార్తెలు కశింకోట హాస్టల్లో చదువుతుండగా చిన్న కుమార్తెతో కలిసి భార్తభర్తలిద్దరూ వర్షం కురుస్తున్నా ఇంటి బయటే ఉండిపోయారు. తనను అన్యాయంగా ఇంటి నుంచి గెంటివేయడంపై బాధితుడు రమణ బుచ్చెయ్యపేట పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. పోతురాజుకు ఎకరా 20 సెంట్లు జిరాయితీ భూమి, 5 ఎకరాలు డి పట్టా భూమి, ఇల్లు ఉంది. ఈ ఆస్తిలో వాటా ఇవ్వబడుతుందని చిన్నప్పటి నుంచి పెంచిన రమణను అతని భార్య, పిల్లలను ఇలా అర్ధంతరంగా ఇంటి నుంచి వెళ్లగొట్టడంపై గ్రామస్తులు కూడా మండిపడుతున్నారు. అమాయకుడైన రమణకు న్యాయం చేయాలని పలువురు కోరుతున్నారు. -
గ్యాంగ్‌స్ట్‌ర్ అతిక్ అహ్మద్ ఆస్తి యూపీ ప్రభుత్వానికి బదిలీ
లక్నో: గ్యాంగ్‌స్ట్‌ర్, పొలిటికల్ లీడర్ అతిక్ అహ్మద్ గతేడాది హత్యకు గురయ్యారు. తాజాగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అతిక్ సంబంధించి ప్రయాగ్‌రాజ్‌లో ఉన్న రూ. 50 కోట్ల విలువైన ఆస్తిని స్వాధీనం చేసుకుంది. ప్రయాగ్‌రాజ్ కోర్టు అతిక్ ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని ఆదేశించినట్లు ప్రయాగ్‌రాజ్ జిల్లా ప్రభుత్వ న్యాయవాది( క్రిమినల్) గులాబ్ చంద్రఅగ్రహారి తెలిపారు.2.377 హెక్టార్ల భూమిని అతిక్ నేరకార్యకలాపాల ద్వారా సంపాధించినట్లు తెలిపారు. అయితే ఈ భూమి హుబాలాల్ అనే వ్యక్తి పేరు మీద ఉందని చెప్పారు. ఈ భూమిని పోలీసులు 2023 నవంబర్‌లో సీజ్ చేశారు. గ్యాంగ్‌స్టర్ చట్టంలోని సెక్షన్ 14(1)కింద పోలీసులు ఈ భూమిని సీజ్ చేసినట్లు పేర్కొన్నారు. అయితే ఈ భూమికి సంబంధించి యజమాని ఎవరనేదానిపై ఎటువంటి ఆధారాలు లేవని తెలిపారు. దీంతో పోలీసు కమిషనర్ కోర్టు ఈ కేసు ప్రయాగ్‌రాజ్ కోర్టుకు బదిలీ చేసింది. దీంతో బుధవారం జడ్జి వినోద్ చౌరాసియా పోలీసు కమిషనర్ కోర్టు తీర్పును సమర్థిస్తూ.. అతిక్ ఆస్తులను ఉత్తరపదేశ్ ప్రభుత్వం స్వాధీనం చేసుకోలని ఆదేశించారు.అతిక్, అతని సోదరుడు అష్రాఫ్ సుమారు వందకుపైగా క్రిమినల్ కేసులు ఉన్నాయి. అదీకాక ఉమేష్ పాల్ హత్యకేసుతో ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో గతేడాది ఏప్రిల్ అతిక్, అతని సోదరుడు అష్రాఫ్ హత్యకు గురయ్యారు. జర్నలిస్టులుగా నటిస్తూ దుండగులు అత్యంత సమీపంగా జరిపిన కాల్పుల్లో మృతిచెందారు. -
ప్రత్యామ్నాయాలపై రియల్టీ ఇన్వెస్టర్ల దృష్టి
ప్రధాన నగరాల్లో స్థిరాస్తి ధరలు భారీగా పెరగడంతో రియల్ఎస్టేట్ పెట్టుబడిదారులు ప్రత్యామ్నాయాల కోసం ఇతర పట్టణాలపై ఆసక్తి చూపుతున్నారని ప్రాపర్టీ రీసెర్చ్ సంస్థ కొలియర్స్ ఇండియా ఒక నివేదికలో తెలిపింది. ముంబై, దిల్లీ, బెంగళూరు వంటి నగరాల్లో ప్రాపర్టీ ధరలు పెరగడంతో వేగంగా అభివృద్ధి చెందుతున్న 17 నగరాలను ప్రతిపాదించింది.రిపోర్ట్‌లోని వివరాల ప్రకారం..దేశవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ మార్కెట్ 2030 నాటికి 1 ట్రిలియన్ డాలర్లు(రూ.83 లక్షల కోట్లు), 2050 నాటికి 5 ట్రిలియన్ డాలర్ల(రూ.410 లక్షల కోట్లు)కు చేరుతుందని అంచనా. 2050 నాటికి దేశంలో ఎనిమిది మెగాసిటీలు ఏర్పడుతాయి. నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్‌లైన్ (ఎన్ఐపీ), పీఎం గతిశక్తి ప్రాజెక్టులు టైర్ 1 నగరాల్లో కీలకమార్పులు తీసుకొస్తాయి. మెరుగైన కనెక్టివిటీ, తయారీ కార్యకలాపాల వృద్ధి ఊపందుకుంటుంది. ఉద్యోగులు హైబ్రిడ్ వర్క్ మోడల్స్ వైపు మారడంతో చిన్న నగరాల్లో ఆఫీస్ స్పేస్‌కు డిమాండ్ పెరుగుతోంది. ఇప్పటికే వృద్ధి చెందిన దిల్లీ, ముంబయి, బెంగళూరులో ప్రాపర్టీ ధరలు భారీగా పెరిగాయి. దాంతో రియల్టీ పెట్టుబడిదారులు ఇతర నగరాలపై దృష్టి పెడుతున్నారు. అందులో ప్రధానంగా ఉత్తరాన అమృత్సర్, అయోధ్య, జైపుర్, కాన్పూర్, లఖ్‌నపూ, వారణాసి; తూర్పున పట్నా, పూరీ; పశ్చిమాన ద్వారక, నాగ్‌పుర్, షిర్డీ, సూరత్; దక్షిణాన కోయంబత్తూర్, కొచ్చి, తిరుపతి, విశాఖపట్నం, ఇందోర్ నగరాలున్నాయి. ఈ నగరాల్లో కార్యాలయాలు, గిడ్డంగులు, టూరిజం..వంటి వాటికి ప్రాధాన్యత పెరుగుతోంది.ఇదీ చదవండి: యాపిల్ ఉత్పత్తుల్లో మెటా ఏఐ.. క్లారిటీ ఇచ్చిన దిగ్గజ సంస్థఈ సందర్భంగా కొలియర్స్ ఇండియా సీఈఓ, బాదల్ యాగ్నిక్ మాట్లాడుతూ..‘టైర్1, టైర్ 2 నగరాల్లో పనిప్రదేశాలకు డిమాండ్ పెరుగుతోంది. మౌలిక సదుపాయాలు మెరుగవుతున్నాయి. పర్యాటకం (ముఖ్యంగా ఆధ్యాత్మిక పర్యాటకం), ఇంటర్నెట్ వ్యాప్తి అధికమవుతోంది. కోయంబత్తూర్, ఇందోర్, కొచ్చి శాటిలైట్ ఆఫీస్ మార్కెట్లుగా ఎదుగుతున్నాయి. జైపుర్, కాన్పూర్, లఖ్‌నవూ, నాగ్‌పుర్, పట్నా, సూరత్‌లు డిజిటలైజేషన్‌కు ప్రాధాన్యత ఇస్తున్నాయి. అమృత్సర్, అయోధ్య, ద్వారక, పూరీ, షిర్డీ, తిరుపతి, వారణాసి వంటి నగరాలు ఆధ్యాత్మిక పర్యాటకంలో వృద్ధి చెందుతున్నాయి’ అన్నారు. -
హైదరాబాద్: టైమ్స్ హోమ్ హంట్ ప్రాపర్టీ ఎక్స్ పో ప్రారంభించిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (ఫొటోలు)
-
ఆగని టీడీపీ ఉన్మాదం
సాక్షి నెట్వర్క్: ఎన్నికల్లో కూటమి విజయం తర్వాత టీడీపీ శ్రేణుల్లో చెలరేగిన ఉన్మాదం రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులపై దాడుల రూపంలో కొనసాగుతూనే ఉంది. ఎన్నికల ఫలితాలు వెల్లడైన వెంటనే మొదలైన ఈ దాడుల నియంత్రణకు ప్రభుత్వం కనీస ప్రయత్నం చేయడంలేదు. దీన్ని ఆసరా చేసుకొని టీడీపీ శ్రేణులు మరింతగా రెచ్చిపోతున్నాయి. గురువారమూ టీడీపీ శ్రేణులు పలు సచివాలయాలు, ప్రభుత్వ స్థలాలపై దాడులు చేశాయి. శిలాఫలకాలు ధ్వంసం చేశాయి. బోర్డులు విరగ్గొట్టాయి.» చిత్తూరు జిల్లా పుంగనూరు మండలంలో బైరెడ్డిపల్లె, నగరి మండలాల్లోని పలు సచివాలయాల్లో ఉద్యోగులు విధి నిర్వహణలో ఉండగానే టీడీపీ నాయకులు శిలాఫలకాలను ధ్వంసం చేశారు. పుంగనూరు మండలంలోని పాలెంపల్లి, భీమగానిపల్లి, బోడేవారిపల్లె సచివాలయాలకు, వెల్నెస్ సెంటర్లకు, ఆర్బీకెలకు, ఆర్వో ప్లాంటుకు, నాడు–నేడు స్కూల్ ప్రారంభించేందుకు వేసిన శిలాఫలకాలను ధ్వంసం చేశారు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఫోటోలు ఉన్న శిలాఫలాకాలను గునపాలతో ధ్వంసం చేశారు. దీంతో సచివాలయ కార్యదర్శులు భయంతో పరుగులు తీశారు.» బైరెడ్డిపల్లె మండలం లక్కనపల్లెలో సచివాలయంలోని శిలాఫలకాలు, సంక్షేమ పథకాల బోర్డులను టీడీపీ నేతలు ధ్వంసం చేశారు. శిలాఫలకాలు తొలగించాలని ప్రభుత్వం నుండి ఎలాంటి ఆదేశాలు లేవని ఎంపీడీవో రాజేష్ చెప్పారు. కొంతమంది గ్రామీణ ప్రాంతాల్లో రెచ్చగొడుతూ శిలాఫలకాలను ధ్వంసం చేస్తున్నారన్నారు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.» నగరి మండలం తెరణి గ్రామంలో సచివాలయ భవనంపై ఉన్న నవరత్నాల ఫలకాన్ని గురువారం టీటీడీ నాయకులు, కార్యకర్తలు తొలగించారు. భవనం ముందు ఉన్న ప్రారంభోత్సవ శిలాఫలకంపై పెయింట్ పూశారు. ఈ ఘటనపై స్థానిక వైఎస్సార్సీపీ నాయకులు పోలీసులకు సమాచారం అందించారు.» శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా రామాయపట్నం గ్రామ సచివాలయం భవనంపై ఉన్న నవరత్నాల బోర్డును టీడీపీ కార్యకర్తలు బుధవారం అర్ధరాత్రి ధ్వంసం చేశారు. » నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలంలోని కల్వటాలలో టీడీపీ నాయకులు మినరల్ వాటర్ ప్లాంట్ శిలాఫలకాన్ని ధ్వంసం చేశారు. అంతటితో ఆగకుండా ఎస్సీ కాలనీకి చెందిన వైఎస్సార్సీపీ సానుభూతిపరులు పెసల ఏసోబు, యాడికి ఏబులపై కర్రలతో దాడి చేశారు.» బాపట్ల జిల్లా బల్లికురవ మండలం వలాపల్లి గ్రామంలో 2017–2018లో ఉపాధి హామీ నిధులు రూ.10 లక్షలతో గ్రామ పంచాయతీ భవనాన్ని నిర్మించారు. 2019లో దానిపై మొదటి అంతస్తు నిర్మించి, సచివాలయం ఏర్పాటు చేశారు. ఈ సచివాలయం శిలాఫలకాన్ని టీడీపీ నాయకులు ధ్వంసం చేశారు. గ్రామస్తులందరూ గ్రామాభివృద్ధికి బాటలు వేసుకోవాలే తప్ప శిలాఫలకాలు ధ్వంసం చేయడం సరికాదని గ్రామ సర్పంచ్ మందా మోహన్‌రావు అన్నారు. -
FM Nirmala Sitharaman: దేశ ఆర్థికమంత్రికి అప్పులు.. మరి ఆస్తులెంతో తెలుసా?
కేంద్ర ఆర్థిక మంత్రి 'నిర్మలా సీతారామన్' రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి కావలసినంత డబ్బు తన దగ్గర లేదని ఇప్పటికే పేర్కొన్నారు. ఎన్నికల్లో పోటీ చేయనని, ప్రచారంలో మాత్రం పాల్గొంటానని స్పష్టం చేశారు. ఒక ఆర్థిక మంత్రి దగ్గర డబ్బు లేదు అన్న మాటలు కొందరికి ఆశ్చర్యాన్ని కలిగించినప్పటికీ.. అది నిజమే అని తాజాగా వెల్లడైన కొన్ని విషయాల ద్వారా తెలుస్తోంది. కేంద్ర ఆర్థిక మంత్రికి కొంతవరకు ఆస్తులు ఉన్నప్పటికీ.. అప్పులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. 2022లో రాజ్యసభ సభ్యురాలిగా నామినేషన్ వేసిన సమయంలో ఆమె దాఖలు చేసిన అఫిడవిట్లలో ఆమె ఆస్తులు, అప్పులకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. దీని ప్రకారం ఈమె మొత్తం ఆస్తుల విలువ రూ. 2.53 కోట్లుగా ఉంది. నిర్మలా సీతారామన్‌కు ఉన్న మొత్తం ఆస్తిలో రూ. 1.87 కోట్ల స్థిరాస్థులు, రూ.65.55 లక్షల విలువైన చరాస్తులు ఉన్నట్లు సమాచారం. అప్పు రూ.26.91 లక్షలు ఉన్నట్లు తెలుస్తోంది. 2016లో సీతారామన్ ఆస్తి విలువ రూ. 99.36 లక్షలు కాగా, 2022 నాటికి రూ. 1.7 కోట్లకు పెరిగింది. 2024 నాటికి ఈ ఆస్తి విలువ కొంత వరకు పెరిగి ఉండవచ్చు. 2016, 2022 డిక్లరేషన్ల ప్రకారం నిర్మలా సీతారామన్‌కు ఒక 'బజాజ్ చేతక్' స్కూటర్ ఉన్నట్లు సమాచారం. 2016లో రూ.7.87 లక్షల విలువైన 315 గ్రాముల బంగారం ఉన్నట్లు పేర్కొన్నారు. 2022 నాటికి బంగారం పరిమాణం పెరగలేదు, కానీ పెరిగిన ధరల కారణంగా ఆ బంగారం విలువ దాదాపు రెండింతలు పెరిగి రూ.14.49 లక్షలకు చేరుకుంది. ఇప్పటి ధరల ప్రకారం బంగారం విలువ రూ. 19.4 లక్షల నుంచి రూ. 21.18 లక్షల వరకు ఉంటుంది. -
మూలధన లాభం రూ. 2 కోట్ల లోపు ఉంటే..
మీరు స్థిరాస్తి అమ్మే విషయంలో లాభం .. అంటే దీర్ఘకాలిక మూలధన లాభాలు రూ. 2 కోట్ల లోపల ఉంటే ఏం చేయాలి .. ఎలా చేయాలి అనేది ఈ వారం తెలుసుకుందాం. 1. ఇల్లు అమ్మినప్పుడు ఈ లాభం ఏర్పడాలి. 2. మినహాయింపు జీవితంలో ఒకసారే ఇస్తారు. 3. ఇల్లు ఇండియాలోనే కొనాలి. 4. ఒక ఇంటికి బదులుగా రెండు ఇళ్లు కొనుక్కోవచ్చు. 5. ఇల్లు కొనడం .. కట్టించడం, ఒక ఇల్లు కొని మరో ఇల్లు కట్టించడం.. రెండూ కొనడం లేదా రెండూ కట్టించుకోవడం చేయొచ్చు. 6. 2019 ఏప్రిల్ 1 తర్వాతనే ఈ నియమం వర్తిస్తుంది. మిగతా షరతులు గతంలో చెప్పినట్లే వర్తిస్తాయి. కొన్ని ఉదాహరణలు గమనించండి.. 1. ముత్యాలరావుగారికి ముచ్చటగా రూ. 3 కోట్లు లాభం వచి్చంది. విశాఖపట్నంలో రెండు ఇళ్లు కొన్నారు. లాభం రూ. 2 కోట్లు దాటింది కాబట్టి ఒక ఇంటి మీదే మినహాయింపు. 2. ఇదే ముత్యాలరావుగారికి లాభం ఒక కోటి తొంభై లక్షలు వచి్చందనుకోండి.. లాభం రూ. 2 కోట్లు దాటలేదు రెండింటి మీద మినహాయింపు ఇస్తారు. 3. నారాయణరావుగారికి లాభాలు రూ. ఒక కోటి తొంభై ఐదు లక్షలు వచి్చంది. ముగ్గురు పిల్లలకని మూడు ఫ్లాట్లు.. ఒక్కొక్కటి రూ. 65,00,000 చొప్పున కొన్నారు. కానీ, రెండు ఫ్లాట్లకు మాత్రమే మినహాయింపు లభిస్తుంది. 4. సుందరరావుగారికి అంతే లాభం వచ్చింది. ఒకోటి రూ. 80 లక్షలు చొప్పున రెండు ఫ్లాట్లు కొని, మిగతా మొత్తంతో బాండ్లు కొన్నారు. వీరికి రెండు ఫ్లాట్లు కొన్నందుకు మినహాయింపు, అలాగే బాండ్లలో ఇన్వెస్ట్ చేసినందుకు కూడా మినహాయింపు వస్తుంది. 5. సత్యమూర్తిగారికి వచి్చన లాభం రూ. 2.60 కోట్లు. రెండు ఇళ్లు కొన్నారు. ఒకటి రూ. 1.50 కోట్లు, మరొకటి రూ. 90 లక్షలు. మిగతా రూ. 20 లక్షలు పెట్టి బాండ్లు కొన్నారు. మొదటి ఇంటికి, బాండ్లకు మాత్రమే మినహాయింపు ఉంటుంది. 6. సీతయ్యగారికి లాభం కోటి అరవై లక్షలు వచి్చంది. కానీ ఆయన కొన్న రెండు ఇళ్ల విలువ రెండు కోట్లు దాటింది. అతనికి మినహాయింపు ఉంటుంది. అదనంగా వెచి్చంచిన మొత్తానికి ‘సోర్స్’ ఉండాలి. 7. కాంతారావుగారికి కూడా కోటి అరవై లక్షల లాభం వచి్చంది. కానీ, తాను కొన్న రెండు ఇళ్ళ విలువ కోటి యాభై లక్షలు దాటలేదు. రూ. 10 లక్షలు పన్నుకి గురి అవుతుంది. సత్యమూర్తిగారిలాగా బాండ్లు కొనుక్కోవచ్చు లేదా పన్ను చెల్లించాలి. ఇలా ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. అయితే, జాగ్రత్తలు ఏమిటంటే .. 1. గత వారం చెప్పిన నియమాలు వర్తిస్తాయి. 2. అన్ని కాగితాలు జాగ్రత్త. 3. బ్లాక్ వ్యవహారాలు వద్దు. 4. మీ బ్యాంకు అకౌంట్లలోనే వ్యవహారాలు చేయండి. 5. మీ కుటుంబసభ్యులను ఇన్వాల్వ్ చేసి ఎటువంటి మినహాయింపు కోసం ప్రయత్నించకండి. ఉదాహరణకు రూ. 2 కోట్ల లాభం మీకు చూపించటానికి ప్రతిఫలం వేరే సభ్యుల అకౌంట్లలోనో జమ చేయించకండి. 6. టీడీఎస్ విషయం ఫాలో అవ్వండి. 7. రిటర్నులు సక్రమంగా వేయండి. 8. రెండు ఇళ్లు మీరు కొంటే.. మీరు ఉంటారా లేక అద్దెకిస్తారా ఆలోచించుకోండి. 9. అవసరం అయితే వృత్తి నిపుణులను సంప్రదించండి. పన్నుకు సంబంధించిన సందేహాలు ఏవైనా ఉంటే పాఠకులు business@sakshi.comకు ఈ–మెయిల్ పంపించగలరు. -
ఆస్తి ఆడపడుచులకు.. మరి నాకు, ముగ్గురు పిల్లలకు మిగిలేదేంటి?
హైదరాబాద్: మమ్మల్ని అల్లారు ముద్దుగా చూసుకునే భర్త అనారోగ్యంతో చనిపోయాడు... మాకు రావలసిన ఆస్తిని తన పిల్లలకు కాకుండా ఆడపడుచులకు ఇచ్చి అత్త అన్యాయం చేస్తుందని, తనకు, తన పిల్లలకు న్యాయం చేయాలని ఓ మహిళ మౌన దీక్షకు దిగింది. మణికొండ మున్సిపాలిటీ కేంద్రంలోని శివాజీనగర్ కాలనీలో ఈ సంఘటన మంగళవారం జరిగింది. పూర్తి వివరాల్లోకి వెలితే... మణికొండ గ్రామ పంచాయతీకి వార్డు సభ్యునిగా పనిచేసిన ధన్‌రాజ్ అనారోగ్యంతో మూడు సంవత్సరాల క్రితం మరణించాడు. దాంతో ఇద్దరు కూతుర్లు, ఓ కుమారుని భారం భార్య సుధారాణిపై పడింది. మున్సిపాలిటీ కార్యాలయంలో ఔట్సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తూ వారిని చదివిస్తుంది. తన భర్త సంపాదించిన ఆస్తిని తన పిల్లలకు చెందనివ్వకుండా అత్త యాదమ్మ ఇటీవల ఆడపడుచులు సావిత్రి, రేణుకల పేరుపైకి మార్చింది. అది తెలిసి తనకు న్యాయం చేయాలని కాలనీ, గ్రామ పెద్దలకు మొరపెట్టుకున్నా స్పందన లేకపోయింది.దీంతో పిల్లలతో కలిసి తనకు న్యాయం చేయాలని శివాజీనగర్ కమ్యూనిటీ హాల్ వద్ద మౌన దీక్షకు దిగింది. వారంలో న్యాయం చేస్తాం... ఆమె పరిస్థితిని తెలుసుకుని కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు రమేష్, వార్డు కౌన్సిలర్ యాలాల లావణ్య నరేష్, రాయదుర్గం పోలీసులు స్పందించి వారం రోజుల్లో చర్చించి న్యాయం చేస్తామని హామి ఇచ్చారు. దాంతో ఆమె ఆందోళనను విరమించింది. -
అమీర్ ఖాన్ మాస్టర్ ప్లాన్.. రూ. 500 కోట్లు టార్గెట్!
బాలీవుడ్ స్టార్ హీరో, మిస్టర్ ఫర్ఫెక్ట్గా పిలిచే అమీర్ ఖాన్ (Bollywood hero Aamir Khan) మాస్టర్ ప్లాన్ వేశారు. ముంబైలో తనకు చెందిన ఓ ప్రాపర్టీని రీడెవలప్‌మెంట్‌కు ఇచ్చారు. దీని టార్గెట్ రూ. 500 కోట్లు అని తెలుస్తోంది. ముంబైలో అమీర్ ఖాన్ నివాసం ఉంటున్న ప్రాపర్టీ రీడెవలప్‌మెంట్‌ను చేపట్టనున్నట్లు ప్రాపర్టీ డెవలపర్ మ్యాన్ ఇన్ఫ్రా కన్స్ట్రక్షన్ (MICL) తాజాగా తెలిపింది. ఈ ఆస్తి ముంబైలోని బాంద్రా (పశ్చిమ) ప్రాంతంలోని పాలి హిల్‌లో ఉన్న విర్గో కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీకి చెందినది. ఇందులో 24 ఫ్లాట్లు ఉన్నాయి. వీటిలో అమిర్ ఖాన్‌కు తొమ్మిది ఫ్లాట్లు ఉన్నాయి. రూ. 500 కోట్లు టార్గెట్ అమీర్ ఖాన్ ప్రాపర్టీ రీడెవలప్మెంట్ ఒప్పందం నిబంధనలను మాత్రం మ్యాన్ ఇన్ఫ్రా కన్స్ట్రక్షన్ వెల్లడించలేదు. ప్రాపర్టీలో 50,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మాణాలు చేపట్టి విక్రయించడానికి ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ ప్రాజెక్ట్ నుంచి రూ. 500 కోట్ల టాప్‌లైన్‌ను లక్ష్యంగా చేసుకుంది. ప్రాజెక్ట్‌లో లగ్జరీ 4బీహెచ్‌కే, 5 బీహెచ్‌కే అపార్ట్‌మెంట్‌ను అభివృద్ధి చేయాలని కంపెనీ యోచిస్తోంది. ఇది 2024 మధ్యలో ప్రారంభం కానుంది. -
జీఎస్టీ ఎవరు కట్టాలి? బిల్డరా? ఓనరా?
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో గృహాలకు డిమాండ్ పెరుగుతుంది. మెరుగైన మౌలిక వసతులు, పారిశ్రామిక ప్రగతి కారణంగా కొత్త ప్రాంతాలలో అభివృద్ధి పరుగులు పెడుతుంది. మరోవైపు ప్రధాన నగరంలో స్థలం కొరత కారణంగా గృహ నిర్మాణానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పాత ఇళ్లను కూలి్చవేసి వాటి స్థానంలో కొత్తవి నిర్మించడం మినహా నిర్మాణదారులకు ప్రత్యామ్నాయం లేదు. ఖైరతాబాద్, అబిడ్స్, బేగంపేట, సనత్‌నగర్, ఈఎస్ఐ, బంజారాహిల్స్ వంటి ప్రాంతాలలో ఇలాంటి రీ-డెవలప్మెంట్ ప్రాజెక్ట్‌లు ఎక్కువగా జరుగుతున్నాయి. ఇండిపెండెంట్ హౌస్‌లు, నాలుగైదు అంతస్తుల అపార్ట్మెంట్లను కూల్చేసి ఆ స్థలంలో హైరైజ్ భవనాలను నిర్మిస్తున్నారు. ఇందుకోసం భూ యజమానులు, ఫ్లాట్ ఓనర్లతో బిల్డర్లు డెవలప్మెంట్ అగ్రిమెంట్ చేసుకుంటారు. ఖాళీ స్థలాలను అభివృద్ధికి తీసుకుంటే 50 నుంచి 40 శాతం, ప్రాంతాన్ని బట్టి 60 శాతం ఫ్లాట్లను భూ యజమానికి ఇస్తామని ఒప్పందం చేసుకుంటారు. మిగిలిన వాటినే డెవలపర్ అమ్ముకుంటాడు. (డ్రీమ్ హౌస్ కొనేముందు...వీటి కోసమే వెదుకుతున్నారట!) కూల్చి కట్టినా, ఖాళీ ప్రదేశంలో కొత్త భవనాలు కట్టినా పూర్తయిన ఇళ్లకు వస్తు సేవల పన్ను (జీఎస్టీ) చెల్లించాల్సి ఉంటుంది. భూ యజమాని వాటా కింద వచ్చిన జీఎస్టీ ఎవరు చెల్లించాలనే అంశంపై ల్యాండ్ ఓనర్లకు, బిలర్లకు మధ్య వాగ్వాదం నెలకొంటుంది. డెవలపరే చెల్లించాలని భూ యజమాని, ల్యాండ్ ఓనరే కట్టాలని బిల్డర్ల మధ్య సందిగ్ధం నెలకొంది. భవనం కట్టడంతో స్థలం విలువ పెరిగిందని, దీంతో 5 శాతం జీఎస్టీ చెల్లించాలని ప్రభుత్వం బిల్డర్‌కు నోటీసులు పంపిస్తుంది. వాస్తవానికి కొత్తవైనా, పాతవైనా భవనానికి జీఎస్టీ చెల్లించాల్సిన బాధ్యత బిల్డర్‌దే. కాకపోతే భూ యజమాని, కస్టమర్ల నుంచి బిల్డర్ జీఎస్టీ వసూలు చేసి కట్టాల్సింది డెవలపరే. (రూ. 2.18 లక్షల కోట్లు: విదేశీ ఇన్వెస్టర్లు తెగ కొనేస్తున్నారు) -
రుణగ్రహీతలకు భారీ ఊరట: ఆర్బీఐ కీలక ఆదేశాలు
రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా కీలక ఆదేశాలు జారీ చేసింది. రుణ వినియోగదారులకు భారీ ఊరట నిచ్చేలా బుధవారం ఉత్తర్వులిచ్చింది. రుణగ్రహీత రుణం పూర్తిగా తిరిగి చెల్లించిన తర్వాత 30 రోజుల్లోగా ఏదైనా రిజిస్ట్రీలో నమోదైన ఛార్జీలను తొలగించాలని, అన్ని స్థిరాస్తి, చర ఆస్థి ఒరిజినల్ పత్రాలను విడుదల చేయాలని బ్యాంకులు , ఆర్థిక సంస్థలను బుధవారం ఆర్బీఐ ఆదేశించింది. అంతేకాదు జాప్యం జరిగిన పక్షంలో జరిమానా చెల్లించాల్సి ఉంటుందని కూడా హెచ్చరించింది. ప్రభుత్వ ప్రైవేటు బ్యాంకులతో పాటు స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్, రూరల్ బ్యాంక్స్, సహకార బ్యాంకులకు సైతం ఈ ఆదేశాలు వర్తిస్తాయిని ఒక నోటిఫికేషన్లో స్పష్టం చేసింది. (యాపిల్ ఐఫోన్ 15 సిరీస్ : ప్రత్యర్థుల దారుణమైన ట్రోలింగ్ ) ఆర్బీఐ తాజా ఆదేశాల ప్రకారం ఆయా బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు లేదా హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు లోన్ చెల్లింపులు పూర్తయ్యాక ఫెయిర్ ప్రాక్టీస్ ప్రకారం 30 రోజుల్లోపు కస్టమర్లకు ఒరిజినల్ డాక్యుమెంట్లను తిరిగి అందించాల్సి ఉంటుంది. లేని పక్షంలో ప్రతిరోజుకూ రూ.5,000 పరిహారంగా చెల్లించాల్సిందేనని తాజా ఉత్తర్వుల్లో వెల్లడించింది. డిసెంబరు 1, 2023 తర్వాత చరాస్తులు/ స్థిరాస్తి పత్రాలను విడుదల చేసే అన్ని కేసులకు ఈ ఆదేశాలు వర్తిస్తాయని తెలిపింది.(గోల్డ్ లవర్స్‌కి తీపి కబురు: బంగారం, వెండి ధరలు పతనం) రుణ చెల్లింపులు పూర్తయ్యాక డాక్యుమెంట్లను ఫైనాన్స్ సంస్థలు, బ్యాంకులు తిరిగి అందించటంలో నిర్లక్ష్యం వహిస్తున్నాయన్న ఫిర్యాదుల మేరకు ఆర్బీఐ తాజా ఆదేశాలిచ్చింది. అలాగే చరాస్తులు/స్థిర ఆస్తి ఒరిజినల్ పత్రాల నష్టం/నష్టానికి సంబంధించి,ఆయా సంస్థలు, అటువంటి పత్రాల నకిలీ/సర్టిఫైడ్ కాపీలను పొందడంలో రుణ గ్రహీతకు సాయపడతాయని,, పరిహారం చెల్లించడంతో పాటు సంబంధిత ఖర్చులను భరిస్తాయని నోటిఫికేషన్ పేర్కొంది. అంతేకాదు ఇలాంటి సందర్బాల్లో ఈ విధానాన్ని పూర్తి చేయడానికి RE లకు 30 రోజుల అదనపు సమయం అందుబాటులో ఉంటుంది (అంటే, మొత్తం 60 రోజుల వ్యవధి తర్వాత) లెక్కించబడుతుందని కూడా తెలిపింది. -
ఖరీదైనా.. రెండు గజాలు!
అదొక మెట్రోపాలిటన్ సిటీ. ప్రముఖ వాణిజ్య ప్రాంతం. అక్కడ ప్రాపర్టీ కొనాలంటే కనీసం రూ.20 కోట్లు అయినా ఉండాల్సిందే. కానీ అంత ఖరీదైన ప్రాపర్టీని సొంతం చేసుకోవాలంటే ఎగువ మధ్య తరగతి వారి వల్ల కూడా అయ్యే పని కాదు. అయినా సరే ఆ ప్రాపర్టీకి యజమాని కావాలనే కోరిక బలంగా ఉంది. ఇందుకు ఉన్న మార్గం ఏంటి..? నిజమే అంత భారీ పెట్టుబడి లేకపోవచ్చు. చేతిలో కొద్ది మొత్తమే ఉన్నా, అదే ప్రాపర్టీకి యజమానిగా మారిపోగల అవకాశం ఉంది. అదే ఫ్రాక్షనల్ రియల్ ఎస్టేట్. తమకు బాగా నచ్చిన ప్రాపర్టీలో ఒక శాతం వాటాను తక్కువకే సొంతం చేసుకోవచ్చు. మధ్యతరగతి వాసులను సైతం ప్రాపర్టీ యజమానులను మార్చేదే ఫ్రాక్షనల్ రియల్ ఎస్టేట్. ఈ సాధనం గురించి తెలియజేసే కథనమే ఇది. అసలు ఏంటి ఇది..? పాక్షిక అని పేరులోనే ఉంది. రియల్ ఎస్టేట్‌లో స్వల్ప వాటా. ఈ విధానంలో మీరు పెట్టుబడి పెట్టే మొత్తానికి తగ్గ వాటా మీ సొంతం అవుతుంది. అంటే ఒక ప్రాపర్టీకి అచ్చమైన యజమాని కాలేరు. ఆ ప్రాపర్టీకి ఎంతో మంది యజమానుల్లో మీరు కూడా ఒకరు అవుతారు. ఈక్విటీల గురించి తెలిసే ఉంటుంది. లిస్టెడ్ కంపెనీ మూలధనంలో ప్రమోటర్ల వాటా గరిష్టంగా 75 శాతమే ఉంటుంది. మిగిలినది పబ్లిక్ షేర్ హోల్డర్ల చేతుల్లో ఉంటుంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ విలువ రూ.17 లక్షల కోట్లు. ఒక్క షేరు ధర సుమారు రూ.2,500. కేవలం రూ.2,500 పెట్టి ఒక్క షేరు కొనుగోలు చేసినా ఆ కంపెనీ వాటాదారుగా మారతారు. ఫ్రాక్షనల్ రియల్ ఎస్టేట్ కూడా ఇదే మాదిరి ఉంటుంది. పాక్షిక రియల్ ఎస్టేట్‌కు ఇప్పుడు డిమాండ్ క్రమంగా పెరుగుతోంది. స్వల్ప వాటాలు తీసుకునేందుకు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపిస్తున్నారు. దీనికి ప్రధాన ప్రేరణ టికెట్ సైజు (పెట్టుబడి పరిమాణం) చిన్నగా ఉండడమే అని చెప్పుకోవాలి. పైగా కొద్ది మొత్తానికే నాణ్యమైన రియల్ ఎస్టేట్ వాటా వస్తుండడం ఇన్వెస్టర్లను ఆకర్షిస్తోంది. గడిచిన కొన్ని సంవత్సరాలుగా ఫ్రాక్షనల్ రియల్ ఎస్టేట్ ఆదరణ పెరుగుతుండటం గమనార్హం. ఎలా పనిచేస్తుంది..? సాంకేతికంగా చెప్పుకోవాలంటే.. మీరు, మీ స్నేహితులతో కలసి 5–10 మంది ఒక గ్రూప్‌గా ఏర్పడి ప్రాపర్టీని కొనుగోలు చేసుకోవచ్చు. కానీ ఆచరణలో ఇది అందరికీ సాధ్యం కాదు. అందరి మధ్య సఖ్యత లేదా ఏకాభిప్రాయం ఉండకపోవచ్చు. న్యాయపరమైన చిక్కులు ఏర్పడితే ప్రాపర్టీ సంగతేమో కానీ, తమ హక్కుల కోసం కోర్టు చుట్టూ తిరగాల్సి రావచ్చు. అందుకే ఈ పాక్షిక రియల్ ఎస్టేట్‌ను సాకారం చేసేందుకు పలు ఆన్లైన్ ప్లాట్‌ఫామ్‌లు అందుబాటులోకి వచ్చాయి. ఇన్వెస్టర్లు స్వల్ప పెట్టుబడితో ప్రాపర్టీలో పాక్షిక వాటా కొనుగోలుకు ఇవి అవకాశం కలి్పస్తాయి. ఇలా ఒకరితో ఒకరు పొత్తు లేకపోయినా, అందరూ కలసి ఒక ప్రాపర్టీకి ఉమ్మడి యజమానులుగా మారిపోయేందుకు పలు ప్లాట్‌ఫామ్‌లు వేదికగా నిలుస్తున్నాయి. ఈ తరహా సేవలు అందించే పోర్టళ్లను ‘ఎఫ్వోపీ’ లేదా ఫ్రాక్షనల్ ఓనర్షిప్ ప్లాట్‌ఫామ్ అని పిలుస్తారు. గడిచిన కొన్నేళ్ల కాలంలో ఇలాంటివి పదుల సంఖ్యలో ఏర్పాటయ్యాయి. ఇన్వెస్టర్ల తరఫున క్లిష్టమైన ప్రాపర్టీ కొనుగోలు, దానికి సంబంధించిన ఇతర పనులను ఇవి చక్కబెడతాయి. దాంతో కొనుగోలు, విక్రయం ఎంతో సులభంగా, సౌకర్యంగా ఉంటుంది. ప్రాపర్టీ పరిశోధన, కొనుగోలు, అమ్మకం, డాక్యుమెంటేషన్, న్యాయపరమైన అంశాలు, అద్దె వసూలు, ఆ అద్దెను యజమానులకు పంపిణీ చేయడం తదితర సేవలను ఈ ప్లాట్‌ఫామ్‌లు అందిస్తాయి. వీటి సాయం లేకుండా ఇన్వెస్టర్లు ఒక సమూహంగా ఏర్పడి ఇలాంటి కార్యకలాపాలు అన్నింటినీ సొంతంగా నిర్వహించుకోవడం సులభం కాదు. అందుకే ఈ ప్లాట్‌ఫామ్ సేవలకు ఆదరణ పెరుగుతోంది. హైదరాబాద్‌లో ఎక్కడ..? దేశవ్యాప్తంగా ఎన్నో పట్టణాలకు సంబంధించి ఫ్రాక్షనల్ ప్రాపర్టీ లావాదేవీలు అందుబాటులో ఉన్నాయి. హైదరాబాద్ మార్కెట్లో గచ్చి»ౌలిలోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ పరిధిలో ఓ ప్రాపర్టీ ఆఫర్ విలువ రూ.46,60,00,000. దీని ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్/ఐఆర్ఆర్ (యాజమాన్య నిర్వహణ సమయంలో అంతర్గత రాబడి రేటు) 13.5 శాతంగా ఉంది. స్థూల ఈల్డ్ (వార్షిక అద్దె రాబడి) 8.9 శాతంగా ఉంది. అలాగే మహారాష్ట్రలోని గోరేగావ్‌లో (ఈజోన్ అపార్చునిటీ) రూ.33,60,00,000 విలువ చేసే ప్రాపర్టీకి సంబంధించి డీల్‌లో.. ఐఆర్ఆర్ 13.4 శాతంగా ఉంటే, గ్రాస్ ఎంట్రీ ఈల్డ్ 9.6 శాతంగా ఉంది. సాధారణంగా రియల్ ఎస్టేట్‌లో 10 శాతానికి పైన ఐఆర్ఆర్ ఉంటే దాన్ని మెరుగైనదిగా పరిగణిస్తారు. 18–20 శాతంగా ఉంటే అత్యుత్తమంగా భావిస్తారు. ఐఆర్ఆర్ 5% కంటే తక్కువ ఉంటే అది లాభసాటి కాదు. నిర్వహణ సులభతరం ఫ్రాక్షనల్ రియల్ ఎస్టేట్‌లో ఉన్న సౌలభ్యం నిర్వహణ అని చెప్పుకోవాలి. అద్దె వసూలు, ప్రాపర్టీ నిర్మాణం, విక్రయం, పన్నుల చెల్లింపుల ఇవన్నీ ఫ్రాక్షనల్ ఓనర్íÙప్ ప్లాట్‌ఫామ్‌లే చూస్తాయి. దీంతో ఇన్వెస్టర్‌పై నిర్వహణ భారం పడదు. ప్రాపర్టీ డాక్యుమెంట్లు పట్టుకుని ఎవరి చుట్టూ తిరగాల్సిన అవసరం ఏర్పడదు. సెబీ నియంత్రణ లేదు గత కొన్నేళ్లలో ఫ్రాక్షనల్ రియల్ ఎస్టేట్ పరిశ్రమలోకి ఎన్నో ప్లాట్‌ఫామ్‌లు వచ్చాయి. ఈ ప్లాట్‌ఫామ్‌ల లావాదేవీల పరంగా ఓ ప్రామాణిక విధానం, ప్రక్రియ, మార్గదర్శకాలు, నియంత్రణలు అంటూ లేవు. ఇన్వెస్టర్లకు సమగ్రంగా అన్ని వివరాలు వెల్లడిస్తున్నాయా? లావాదేవీల నిర్వహణ చట్టబద్ధంగానే ఉందా? అని చూసే వారు లేరు. అందుకే ఫ్రాక్షనల్ ఓనర్íÙప్ ప్లాట్‌ఫామ్‌ల నియంత్రణకు సంబంధించి చర్చా పత్రాన్ని సెబీ విడుదల చేసింది. రానున్న రోజుల్లో రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ (రీట్) నియంత్రణల పరిధిలోకి తీసుకువచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ అదే జరిగితే ఈ మార్కెట్లో లావాదేవీలకు రక్షణలు ఏర్పడతాయి. ఇన్వెస్టర్ల హక్కులు, ప్రయోజనాలకు భరోసా ఉంటుంది. అయితే ఇందుకు ఎంత కాలం పడుతుంది? అన్నది ఇప్పటికైతే స్పష్టత లేదు. ఎలాంటి ప్రాపర్టీలు..? ఫ్రాక్షనల్ రియల్ ఎస్టేట్‌లో అధిక శాతం లావాదేవీలు వాణిజ్య రియల్ ఎస్టేట్‌లోనే ఉన్నాయి. ఎందుకంటే వాణిజ్య రియల్ ఎస్టేట్‌లో వృద్ధి ఎక్కువగా ఉంటుంది. పైగా పెట్టుబడి వృద్ధికి తోడు, వాణిజ్య రియల్ ఎస్టేట్ నుంచి రెంటల్ రూపంలో ఆదాయం క్రమం తప్పకుండా వస్తుండడం మరో ఆకర్షణగా చెప్పుకోవచ్చు. అందుకే వాణిజ్య ప్రాపర్టీల ధరలు చాలా ఖరీదుగా ఉంటాయి. వీటి విలువ సాధారణంగా రూ.20 కోట్ల నుంచి రూ.500 కోట్ల మధ్య ఉంటుంది. అందుకే ఫ్రాక్షనల్ రియల్ ఎస్టేట్‌కు ఎక్కువ డిమాండ్ ఉంటుంది. పైగా వాణిజ్య ప్రాపర్టీల్లో రిటైల్ ఇన్వెస్టర్ నేరుగా పెట్టుబడి పెట్టడం సాధ్యపడదు. ఈ ప్లాట్‌ఫామ్‌లు దీన్ని సాధ్యం చేస్తున్నాయి. ఫ్రాక్షనల్ రియల్ ఎస్టేట్‌లో కనీసంగా ఒక టికెట్ సైజు (పెట్టుబడి పరిమాణం) విలువ రూ.10–25 లక్షల మధ్య ఉంటుంది. అందుకే రిటైల్ ఇన్వెస్టర్లు సైతం ఇందులో పెట్టుబడులకు ముందుకు వస్తున్నారు. ఫ్రాక్షనల్ ఓనర్షిప్ ప్లాట్‌ఫామ్‌లపై ప్రాపర్టీ వారీగా రాబడి రేటు, ధర తదితర వివరాలు అన్నీ ఉంటాయి. లిక్విడిటీ మాటేమిటి? రియల్ ఎస్టేట్‌లో ఉండే ప్రధాన సమస్య లిక్విడిటీయే. అవసరం వచ్చినప్పుడు విక్రయిద్దామంటే ఎక్కువ సందర్భాల్లో వెంటనే సాధ్యపడదు. విక్రయించే ప్రాపర్టీ, దాని ధర ఇతర అంశాలన్నింటినీ కొనుగోలుదారులు లోతుగా చూస్తారు. బేరసారాలు, విచారణలు అన్నీ అంగీకారం అయితేనే ప్రాపర్టీ లావాదేవీ పూర్తవుతుంది. కనుక కావాల్సినప్పుడు వెంటనే నగదుగా మార్చుకునే సౌలభ్యం సహజంగా రియలీ్టలో తక్కువ. మీరు ఆశించే ధరకే విక్రయించాలని అనుకుంటే నెలల నుంచి సంవత్సరాల పాటు వేచి చూడాల్సి వస్తుంది. ఫ్రాక్షనల్ రియల్ ఎస్టేట్‌లోనూ ఇదే అమలవుతుంది. కాకపోతే విడిగా ఓ ప్రాపర్టీ లావాదేవీతో పోలిస్తే ఫ్రాక్షనల్ రియల్ ఎస్టేట్ టికెట్ సైజు తక్కువగా ఉంటుంది. కనుక లిక్విడిటీ కాస్తంత మెరుగు అని భావించొచ్చు. పాక్షిక ప్రాపర్టీ అయినా సరే, దాని అద్దె రాబడి ఏ మేరకు? ప్రాపర్టీ నాణ్యత మాటేమిటి? అనేది కొనుగోలు దారులు చూస్తారు. నాణ్యమైన ప్రాపర్టీ, అద్దె రాబడి మెరుగ్గా ఉంటే వేగంగా అమ్ముడుపోతుంది. లేదంటే చాలా కాలం పాటు అందులో పెట్టుబడి చిక్కుకుపోవచ్చు. పైగా ఇందులో కొనుగోలు చేసే ప్రాపర్టీ పెట్టుబడి దృష్ట్యానే తప్ప వినియోగం కోణంలో ఉండదు. అందుకని విక్రయించుకునేందుకు కొంత సమయం పట్టొచ్చు. టికెట్ సైజు తక్కువగా ఉండడం ఇందులో కాస్త అనుకూలతగా చెప్పుకోవచ్చు. -
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఊపు! భారీగా పెరిగిన రిజిస్ట్రేషన్లు
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఊపందుకుంది. ఆస్తుల రిజిస్ట్రేషన్లు భారీగా పెరిగాయి. నైట్ ఫ్రాంక్ ఇండియా నివేదిక ప్రకారం, హైదరాబాద్ 2023 జులైలో 5,557 రెసిడెన్షియల్ ప్రాపర్టీల రిజిస్ట్రేషన్లను నమోదు చేసింది. వీటి మొత్తం విలువ రూ. 2,878 కోట్లు. గతేడాది ఇదే నెలతో పోల్చితే రిజిస్ట్రేషన్ల సంఖ్య 26 శాతం, ఆస్తుల విలువ 35 శాతం పెరిగింది. గ్రేటర్ హైదరాబాద్ రెసిడెన్షియల్ మార్కెట్ పరిధిలో హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాలు ఉన్నాయి. ఈ నాలుగు జిల్లాల్లో 2023 జూలైలో 5,557 రెసిడెన్షియల్ ప్రాపర్టీల రిజిస్ట్రేషన్లను నమోదయ్యాయి. “హైదరాబాద్‌లోని రెసిడెన్షియల్ మార్కెట్ ఊపు కొనసాగుతోంది. 1,000, 2,000 చదరపు అడుగుల పరిమాణంలో ఉన్న ఇళ్లకు ఎక్కువ డిమాండ్ ఉంది. 2023 ఏప్రిల్ నుంచి ఉన్న వడ్డీ రేట్లనే కొనసాగించాలన్న ఆర్బీఐ నిర్ణయం కూడా కొనుగోలుదారుల సెంటిమెంట్‌ను పెంచింది. హైదరాబాద్ రెసిడెన్షియల్ మార్కెట్లో మరింత విస్తీర్ణం, ఆధునిక సౌకర్యాలతో అపార్ట్మెంట్లను అప్‌గ్రేడ్ చేయాల్సిన అవసరం ఉంది" అని నైట్ ఫ్రాంక్ ఇండియా సీనియర్ బ్రాంచ్ డైరెక్టర్ శాంసన్ ఆర్థర్ అన్నారు. అత్యధిక వాటా వాటిదే.. హైదరాబాద్‌లో 2023 జులైలో జరిగిన ఆస్తుల రిజిస్ట్రేషన్లలో అత్యధికం రూ. 25 లక్షలు నుంచి రూ. 50 లక్షల విలువున్నవే. మొత్తం రిజిస్ట్రేషన్లలో వీటి వాటా 52 శాతం. ఇక రూ. 25 లక్షల కంటే తక్కువ విలువున్న ఆస్తులు మొత్తం రిజిస్ట్రేషన్లలో 18 శాతం ఉన్నాయి. రూ. 1 కోటి, అంతకంటే ఎక్కువ విలువైన ఆస్తుల రిజిస్ట్రేషన్ల వాటా 2023 జులైలో 9 శాతం. 2022 జులైతో పోలిస్తే ఇది కూడా కొంచెం ఎక్కువ. ఇక విస్తీర్ణం పరంగా చూసుకుంటే 2023 జులైలో 1,000 నుంచి 2,000 చదరపు అడుగుల విస్తీర్ణం ఉన్న ఆస్తుల రిజిస్ట్రేషన్లే అత్యధికంగా నమోదయ్యాయి. మొత్తం రిజిస్ట్రేషన్లలో ఇవి 67 శాతంగా ఉన్నాయి. ఇదీ చదవండి: అలాంటి ఇళ్లు కొనేవారికి ఎస్బీఐ ఆఫర్.. తక్కువ వడ్డీ రేటుకు లోన్ -
ప్రాప్‌టెక్ కంపెనీల్లోకి తగ్గిన నిధులు, రియల్టిలో పెట్టుబడులు ఢమాల్
న్యూఢిల్లీ: ప్రాపర్టీటెక్నాలజీ (ప్రాప్‌టెక్) సంస్థల్లోకి గతేడాది పెట్టుబడుల ప్రవాహం స్వల్పంగా తగ్గింది. 3 శాతం క్షీణించి 719 మిలియన్ డాలర్లకు పరిమితమైంది. 2021లో ప్రాప్‌టెక్ సంస్థలు 742 మిలియన్ డాలర్ల నిధులను సమీకరించాయి. హౌసింగ్‌డాట్‌కామ్ రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. అంతర్జాతీయంగా ఆర్థిక అనిశి్చతులు నెలకొన్నప్పటికీ ప్రాప్‌టెక్ సంస్థల్లోకి పెట్టుబడుల రాక స్వల్పంగానే తగ్గినట్లు హౌసింగ్‌డాట్‌కామ్ గ్రూప్ సీఈవో ధృవ్ అగర్వాలా తెలిపారు. గడిచిన దశాబ్ద కాలంలో, ముఖ్యంగా గత మూడేళ్లలో వినూత్న టెక్నాలజీలను అందిపుచ్చుకోవడంలో రియల్ ఎస్టేట్ రంగం గణనీయంగా పురోగమించిందని ఆయన పేర్కొన్నారు. కో-వర్కింగ్ విభాగం భారీగా విస్తరించిందని తెలిపారు. కోవిడ్-19 సమయంలో స్కూళ్లు, కాలేజీలు మూతబడటంతో తాత్కాలికంగా సవాళ్లు ఎదుర్కొన్నప్పటికీ విద్యా సంస్థలు, ఆఫీసులు తెరుచుకున్నా కో-లివింగ్ విభాగం చెప్పుకోతగ్గ స్థాయిలో కోలుకుందని అగర్వాలా పేర్కొన్నారు. నివేదిక ప్రకారం 2009లో ప్రాప్‌టెక్‌లో 0.2 మిలియన్ డాలర్లు రాగా.. 2020లో 551 మిలియన్ డాలర్లు వచ్చాయి. (భారీ లాభాల్లోకి ఇండిగో: ఆదాయంలోనూ కొత్త రికార్డ్) వృద్ధికి మరింత అవకాశం.. దేశీయంగా ప్రాప్‌టెక్ ప్రస్తుతం తొలి దశల్లోనే ఉందని కానీ వృద్ధి చెందడానికి గణనీయంగా అవకాశాలు ఉన్నాయని కో-లివింగ్ సంస్థ సెటిల్ సహ వ్యవస్థాపకుడు అభిõÙక్ త్రిపాఠి చెప్పారు. రియల్ ఎస్టేట్‌కి సంబంధించి ప్రస్తుతం అన్ని దశల్లోనూ టెక్నాలజీ వినియోగం పెరిగిందని హౌసింగ్‌డాట్‌కామ్ రీసెర్చ్ విభాగం హెడ్ అంకిత సూద్ తెలిపారు. మరోవైపు అంతర్జాతీయంగా ఎకానమీల్లో అస్తవ్యస్త పరిస్థితులు నెలకొనడంతో ఇన్వెస్టర్లు గత అనుభవాల రీత్యా కొంత కాలంగా డీల్స్ విషయంలో మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారని స్టార్టప్ సంస్థ రిలాయ్ వ్యవస్థాపకుడు అఖిల్ సరాఫ్ తెలిపారు. వ్యయాల భారం భారీగా ఉన్న స్టార్టప్‌లు సవాళ్లు ఎదుర్కొంటున్నాయని పేర్కొన్నారు. (ఆన్లైన్ గేమింగ్: జీఎస్టీ కౌన్సిల్ కీలక నిర్ణయం) రియల్టిలో సంస్థాగత ఇన్వెస్టర్ల పెట్టుబడులు డౌన్ రియల్ ఎస్టేట్‌లో సంస్థాగత ఇన్వెస్టర్ల పెట్టుబడులు జూన్ త్రైమాసికంలో గణనీయంగా తగ్గాయి. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంతో పోలి్చనప్పుడు 41 శాతం క్షీణించి 1.6 బిలియన్ డాలర్లకు (రూ.13,120 కోట్లు) పరిమితమయ్యాయి. కానీ, ఈ ఏడాది మార్చి త్రైమాసికంతో పోలి్చచూసినప్పుడు 33 శాతం పెరిగినట్టు తెలుస్తోంది. ఈ వివరాలను ప్రాపర్టీ కన్సల్టెంట్ ‘వెస్టియన్’ విడుదల చేసింది. జూన్ త్రైమాసికంలో వచ్చిన పెట్టుబడుల్లో ఎక్కువ శాతం విదేశీ ఇనిస్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల నుంచే ఉన్నాయి. 92 శాతం పెట్టుబడులు విదేశీ ఇన్వెస్టర్లే సమకూర్చడం గమనార్హం. భారత వృద్ధి పట్ల విదేశీ ఇన్వెస్టర్లలో ఉన్న విశ్వాసానికి ఇది నిదర్శమని వెస్టియన్ పేర్కొంది. క్రితం ఏడాది జూన్ త్రైమాసికంలో రియల్ ఎస్టేట్‌లోకి వచ్చిన ఇనిస్టిట్యూషనల్ పెట్టుబడులు 2.7 బిలియన్ డాలర్లుగా ఉండడం గమనార్హం. ఈ ఏడాది జనవరి-మార్చి త్రైమాసికంలో ఇవి 1.2 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. అనిశి్చత పరిస్థితుల్లోనూ భారత రియల్ ఎస్టేట్ మార్కెట్ బలమైన పనితీరు చూపించినట్టు, మార్చి త్రైమాసికంతో పోలి్చనప్పుడు జూన్ క్వార్టర్లో సంస్థాగత ఇన్వెస్టర్ల పెట్టుబడులు పెరగడమే ఇందుకు నిదర్శమని వెస్టియన్ పేర్కొంది. (నితిన్ దేశాయ్ అకాల మరణం: అదే కొంప ముంచింది!) రానున్న త్రైమాసికాల్లో బలమైన పనితీరు జీడీపీ స్థిరమైన పనితీరు, పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ప్రభుత్వం ఇస్తున్న మద్దతుతో రానున్న త్రైమాసికాల్లో రియల్ ఎస్టేట్ రంగంలో మరింత బలమైన పనితీరు సాధ్యపడుతుందని వెస్టియన్ సీఈవో శ్రీనివాస్‌రావు అభిప్రాయపడ్డారు. ఆఫీస్ స్పేస్, కోవర్కింగ్, రిటైల్, హోటల్స్ ప్రాజెక్టులు జూన్ త్రైమాసికంలో 88 శాతం పెట్టుబడులను ఆకర్షించాయి. ముఖ్యంగా క్రితం ఏడాది ఇదే కాలంలో పోలి్చనప్పుడు జూన్ క్వార్టర్లో వాణిజ్య రియల్ ఎసేŠట్ట్ ఆస్తుల్లోకి వచ్చిన సంస్థాగత పెట్టుబడులు 1.4 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ఇండ్రస్టియల్, వేర్ హౌసింగ్‌లో పెట్టుబడులు గణనీయంగా తగ్గి 134 మిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. కానీ, క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో ఈ విభాగంలోకి వచి్చన పెట్టుబడులు బిలియన్ డాలర్లుగా ఉండడం గమనార్హం. -
జప్తు చేసిన అగ్రిగోల్డ్ ఆస్తులపై మొదటి హక్కు రాష్ట్రానికే
సాక్షి, అమరావతి : జప్తు చేసిన అగ్రిగోల్డ్ ఆస్తులపై రాష్ట్ర ప్రభుత్వానికే మొదటి హక్కు అని అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్. శ్రీరామ్ హైకోర్టుకు నివేదించారు. డిపాజిటర్ల హక్కుల పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఒకే ఆస్తులపై రెండు దర్యాప్తు సంస్థల జప్తు ఉత్తర్వుల వల్ల డిపాజిటర్ల ప్రయోజనాలకు విఘాతం కలుగుతుందన్నారు. ఆస్తులను విక్రయించి డిపాజిటర్లకు ప్రయోజనం చేకూర్చాలన్న ప్రభుత్వ ప్రయత్నాల్లో తీవ్ర జాప్యం జరిగి బాధితులు నష్టపోతారని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం జప్తు చేసిన ఆస్తులను తిరిగి మనీలాండరింగ్ చట్టం కింద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేయడం ఎంత వరకు సమంజసమో తేల్చాలని కోర్టును అభ్యర్థించారు.మనీలాండరింగ్, దివాలా చట్టాల కింద చేసిన జప్తులకు, రాష్ట్ర ప్రభుత్వం చేసిన జప్తునకు మధ్య వైరుద్ధ్యం లేదని తెలిపారు.డిపాజిటర్ల ప్రయోజనాల పరిరక్షణకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని, అగ్రిగోల్డ్ ఎగవేసిన మొత్తాలను తిరిగి చెల్లిస్తోందని నివేదించారు. రూ.20 వేలు, అంతకన్నా తక్కువ డిపాజిట్లు చేసిన వారికి ఇప్పటికే రూ.900 కోట్ల మేర తిరిగి చెల్లించినట్లు చెప్పారు. మనీలాండరింగ్, దివాలా చట్టాలు డిపాజిటర్ల పరిరక్షణకు ఉద్దేశించినవి కావని చెప్పారు. డిపాజిటర్ల పరిరక్షణ చట్టం కింద డిపాజిటర్ల ప్రయోజనాల పరిరక్షణకు ప్రభుత్వం చేపట్టిన చర్యలను ఈడీ గానీ, బ్యాంకులు గానీ నీరుగార్చలేవని అన్నారు. అగ్రిగోల్డ్ డిపాజిట్ల కుంభకోణంలో నిందితులు వారిని వారు రక్షించుకొనేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు.ఇలాంటి పరిస్థితుల్లో జప్తు చేసిన ఆస్తులను వేలం వేసి డిపాజిటర్లకు తిరిగి చెల్లించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వ అధికారాన్ని ఇతర ఏ దర్యాప్తు సంస్థా నిరోధించలేదని తేల్చి చెప్పారు. ఏపీ డిపాజిటర్ల పరిరక్షణ చట్టానికి రాష్ట్రపతి ఆమోదముద్ర ఉందని చెప్పారు.అగ్రిగోల్డ్ యాజమాన్యం నుంచి కొన్న తమ ఆస్తులను ఈడీ జప్తు చేయడాన్ని సవాలు చేస్తూ ఆల్ ఇండియా అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఇటీవల హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అలాగే బ్యాంకులు నిర్వహించిన వేలంలో కొన్న అగ్రిగోల్డ్ ఆస్తులను కూడా ఈడీ జప్తు చేయడాన్ని సవాలు చేస్తూ మరికొన్ని కంపెనీలు, వ్యక్తులు, కుంభకోణానికి ముందే అగ్రిగోల్డ్ నుంచి కొన్న భూముల్లో నిర్మించుకున్న అపార్ట్మెంట్లను సైతం సీఐడీ జప్తు చేయడాన్ని సవాలు చేస్తూ ప్లాట్ల యజమానులు వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలన్నింటిపై న్యాయమూర్తి జస్టిస్ చీమలపాటి రవి కొద్ది రోజులుగా విచారణ జరుపుతున్నారు. గురువారం జరిగిన విచారణలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్ వాదనలు వినిపించారు. అనంతరం న్యాయమూర్తి విచారణను ఈ నెల 31కి వాయిదా వేశారు. -
హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌కు షాకిచ్చిన జూన్! ఎలాగంటే..
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ స్థిరాస్తి రంగం ఎన్నికల మూడ్‌లోకి వెళ్లిపోయింది. సార్వత్రిక ఎన్నికలకు ఇంకా ఆరు నెలలు సమయం ఉండగా.. రియల్టీ రంగంలో స్తబ్దత నెలకొంది. ఏ ప్రభుత్వం వస్తుందో, అభివృద్ధి పనులు ఎలా ఉంటాయో, ధరలు తగ్గుతాయేమో అనే రకరకాల కారణాలతో స్థిరాస్తి విక్రయాలు తగ్గుముఖం పట్టాయి. మే నెలతో పోలిస్తే జూన్‌లో గ్రేటర్లో రిజిస్ట్రేషన్లు, వాటి విలువలు క్షీణించడమే ఇందుకు ఉదాహరణ. మేలో రూ.2,994 కోట్ల విలువ చేసే 5,877 అపార్ట్మెంట్ల రిజిస్ట్రేషన్స్ జరగగా.. జూన్ నాటికి రూ.2,898 కోట్ల విలువైన 5,566 యూనిట్ల రిజిస్ట్రేషన్స్ జరిగాయని నైట్‌ఫ్రాంక్ ఇండియా నివేదిక వెల్లడించింది. గతేడాది జూన్‌లో జరిగిన 5,411 యూనిట్లతో పోలిస్తే గత నెలలో రిజిస్ట్రేషన్స్‌లో 3 శాతం వృద్ధి నమోదయింది. అలాగే విలువల పరంగా చూస్తే 2022 జూన్‌లో రూ.2,842 కోట్లతో పోలిస్తే గత నెలలో 2 శాతం పెరుగుదల కనిపించింది. గత నెలలోని రిజిస్ట్రేషన్స్‌లో 52 శాతం యూనిట్లు రూ.25 లక్షల నుంచి రూ.50 లక్షల మధ్య ధర ఉన్న గృహాలే. అలాగే రూ.కోటి కంటే ఎక్కువ ధర ఉన్న లగ్జరీ గృహాల వాటా 9 శాతంగా ఉంది. 68 శాతం ఫ్లాట్లు 1,000 చ.అ. నుంచి 2,000 చ.అ. మధ్య విస్తీర్ణం ఉన్న యూనిట్లే. 2 వేల చ.అ. కంటే విస్తీర్ణమైన ఇళ్ల వాటా 11 శాతంగా ఉంది. రిజిస్ట్రేషన్స్‌లో మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లా హవా కొనసాగుతుంది. జూన్‌లో జరిగిన రిజిస్ట్రేషన్స్‌లో ఈ జిల్లా వాటా 46 శాతం కాగా.. రంగారెడ్డి 38 శాతం, హైదరాబాద్ 16 శాతం వాటాను కలిగి ఉన్నాయి. ఈ ఏడాది నెల వారీగా రిజిస్ట్రేషన్స్ (రూ.కోట్లలో) నెల రిజిస్ట్రేషన్లు విలువ జనవరి 5,454 2,650 ఫిబ్రవరి 5,725 2,987 మార్చి 6,959 3,602 ఏప్రిల్ 4,494 2,286 మే 5,877 2,994 జూన్ 5,566 2,898 సోమాజిగూడలో రూ.5.09 కోట్లు సోమాజిగూడ ఖరీదైన నివాసాలకు కేంద్రంగా మారింది. గత నెలలో జరిగిన రిజిస్ట్రేషన్లలో టాప్–5 లావాదేవీలలో నాలుగు ఈ ప్రాంతంలోనే జరగడం గమనార్హం. రూ.5.09 కోట్ల మార్కెట్ విలువ గల 3,500 చ.అ.ల లోపు ఉన్న రెండు అపార్ట్మెంట్లు, రూ.4.22 కోట్ల వ్యాల్యూ ఉండే మరొక రెండు యూనిట్ల రిజిస్ట్రేషన్స్ జరిగాయి. అలాగే నార్సింగిలో రూ.5 కోట్ల మార్కెట్ విలువ గల ఓ ఫ్లాట్ రిజిస్ట్రేషన్ జరిగిందని నైట్‌ఫ్రాంక్ రిపోర్ట్ వెల్లడించింది. ఇదీ చదవండి: ఇల్లు అద్దెకివ్వడానికి ఇంటర్వ్యూ.. దిమ్మతిరిగిపోయే ప్రశ్నలతో చుక్కలు చూపించిన ఓనర్! -
నయనతార ఆస్తులు వందల కోట్లు..
సంచలనానికి మారుపేరు నయనతార అనవచ్చునేమో. తాజాగా ఆస్తుల విషయంలో నయనతార జంటపై విఘ్నేశ్ శివన్ బాబాయ్ కేసు పెట్టడం. ఇలా గత రెండు దశాబ్దాలుగా ఈమె వార్తల్లో ఉంటూనే ఉంది. 2003లో కోలీవుడ్‌లో అయ్యా చిత్రం ద్వారా కథానాయికగా పరిచయం అయ్యింది. ఆ చిత్రం విజయంతో తెలుగు, కన్నడం, మలయాళం భాషల్లో నటిస్తూ బహూభాషా నటిగా పేరు తెచ్చుకుంది. ఒకప్పుడు దక్షిణాదిలోనే అత్యధిక పారితోషికం తీసుకుంటున్న లేడీ సూపర్‌స్టార్ స్థాయికి ఎదిగిపోయింది. ఇప్పటి వరకు ఆమె తమిళం, మలయాళం, తెలుగు, కన్నడం, హిందీ భాషల్లో 75 చిత్రాలకు పైగానే చేసింది. ఇప్పటికి కూడా ఒక్కో సినిమాకు రూ.10 కోట్లు పారితోషికం డిమాండ్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం తొలిసారిగా షారూఖ్ సరసన జవాన్ సినిమాతో బాలీవుడ్లో నయన్ అడుగుపెట్టబోతోంది. దీంతో ఆమె మళ్లీ వార్తల్లో నిలుస్తోంది. (ఇదీ చదవండి: గుండుతో ఢీ కొట్టేందుకు రెడీ అయిన స్టార్స్) ఈ సినిమా కోసం భారీగానే నయన్‌కు రెమ్యునరేషన్ ఇచ్చారని టాక్.. దీంతో ఒక్కసారిగా ఆమె ఆస్తుల వివరాలపై పలువురు ఆసక్తి కనబరుస్తున్నారు. ఆమె కూడబెట్టిన ఆస్తి విలువ సుమారు రూ.200 కోట్లు. ఇది నయనతార ఆదాయశాఖకు దాఖలు చేసిన లెక్కల వివరాల ప్రకారం జరుగుతున్న ప్రచారం. హైదరాబాదులో రెండు ఖరీదైన బంగ్లాలు, చెన్నైలో అధునాతర వసతులతో కూడిన ఖరీదైన ఇల్లు ఉంది. కేరళలో తన తల్లిదండ్రుల కోసం అని మరో ఇల్లు ఉంది. ఇలా దేశవ్యాప్తంగా పలు సొంత నివాసాలను ఏర్పరచుకుంది. (ఇదీ చదవండి: Vignesh And Nayanthara: నయనతార జంటపై కేసు పెట్టిన విఘ్నేశ్ బాబాయ్) హైదరాబాదులోని ఒక్కో ప్లాట్ సుమారు రూ.20 కోట్లు విలువ చేస్తుందని సమాచారం. అక్కడ అత్యంత విలువైన బంజారాహిల్స్ ప్రాంతంలో నయనతార ప్లాట్లు కొనుగోలు చేసింది. అదే విధంగా ఇటీవల ఈమె ఒక జెట్ విమానాన్ని కూడా కొనుగోలు చేశారు. ఇప్పుడు సెలెక్టెడ్ సినిమాలు మాత్రమే చేస్తూ.. పలు యాడ్స్ రూపంలో కూడా నయనతార కోట్ల రూపాయలు సంపాదిస్తుంది. మొదట కష్టపడ్డా ఇప్పుడు పిల్లలు, భర్తతో రాయల్ లైఫ్ లీడ్ చేస్తోంది. తాజాగా చెన్నైలో మూతపడిన 53ఏళ్లనాటి థియేటర్‌ను ఆమె కొనుగోలు చేసిందని ప్రచారం జరుగుతుంది. దాని ప్లేస్‌లో మల్టీఫ్లెక్స్ నిర్మించే ప్లాన్‌లో ఆమె ఉన్నారట. -
దత్తపుత్రుడికి ఆస్తి హక్కులుండవ్: హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: దత్తత వెళ్లక ముందు సొంత (పుట్టిన) తల్లిదండ్రులు ఏదైనా ఆస్తిని కేటాయించి ఉంటే దానిపై దత్తత వెళ్లిన వ్యక్తికి హక్కులు ఉంటాయి తప్ప.. దత్తత వెళ్లిన అనంతరం ఎలాంటి హక్కులు ఉండవని హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం తేల్చిచెప్పింది. దత్తత తీసుకున్న తల్లిదండ్రుల ఆస్తికి మాత్రమే వారసుడవుతారని వ్యాఖ్యానించింది. దత్తత వెళ్లిన తర్వాత సొంత తల్లిదండ్రులతో ఎలాంటి సంబంధం ఉండదని చెప్పింది. అలాంటప్పుడు వారి ఆస్తికి వారసులు కాలేరని స్పష్టం చేసింది. దత్తతకు సంబంధించి దాఖలైన ఓ పిటిషన్ విచారణ సందర్భంగా హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. దత్తత వెళ్లినప్పటికీ తనకు సొంత తల్లిదండ్రుల కుటుంబ ఆస్తిలో వాటా ఉంటుందంటూ ఖమ్మం జిల్లా కొణిజెర్ల మండలానికి చెందిన ఏవీఆర్‌ఎల్ నరసింహారావు కింది కోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన కోర్టు సొంత తల్లిదండ్రుల ఆస్తిలో వాటా ఉంటుందని తీర్పునిచ్చింది. దీన్ని సవాల్ చేస్తూ అతని సోదరుడు ఎ.నాగేశ్వరరావు హైకోర్టులో లెటర్స్ పేటెంట్ అప్పీల్ దాఖలు చేశారు. దీని విచారణకు ప్రధాన న్యాయమూర్తి ఫుల్ బెంచ్ ఏర్పాటు చేశారు. విచారణ చేపట్టిన జస్టిస్ పి.నవీన్‌రావు, జస్టిస్ బి.విజయ్‌సేన్‌రెడ్డి, జస్టిస్ నగేశ్ భీమపాక ధర్మాసనం ఇటీవల తీర్పునిచ్చింది. చదవండి: డ్రైవింగ్‌లో ‘భ్రాంతి’ ముప్పు!.. 50% రోడ్డు ప్రమాదాలకు కారణమిదే! -
రూ. 13 కోట్ల ఆస్తులను కొనుగోలు చేసిన సుహానా ఖాన్
సాక్షి,ముంబై: బాలీవుడ్ సూపర్ స్టార్ షారూఖ్ ఖాన్ కుమార్తె సుహానా ఖాన మహారాష్ట్రలోని అలీబాగ్‌లో భారీ విలువైన ప్రాపర్టీలను కొనుగోలు చేసింది. అరంగేట్రంలో రూ. 12.91 కోట్లతో ఆస్తులను కొనుగోలు చేయడం విశేషంగా నిలిచింది. సుహానా ఖాన్ తన తొలి సంపాదనతో ఈ ఆస్తులను కొన్నట్టు సమాచారం. మూడు ఇళ్లతోపాటు, ఒక ప్లాట్‌ను కొనుగోలు చేసినట్టు మీడియా నివేదికల ద్వారా తెలుస్తోంది అంతేకాదు రిజిస్ట్రేషన్ లో సుహానా పేరును రైతుగా నమోదు చేశారట. సుహానా అమ్మమ్మ సవితా ఛిబ్బర్, ఆమె సోదరి నమితా చిబ్బర్ డైరెక్టర్లుగా ఉన్న డెజా వు ఫార్మ్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఆస్తిని జూన్ 1న రిజిస్ట్రేషన్ చేసినట్లు హిందుస్థాన్ టైమ్స్ నివేదించింది. (అపుడు కరోడ్‌పతి షో సెన్సేషన్: మరి ఇపుడు) భూమి విస్తీర్ణం 1.5 ఎకరాలు, 2,218 చదరపు అడుగుల్లోఉన్న ఇళ్లు ఉన్నాయి. దీనికోసం 77.46 స్టాంప్ డ్యూటీ చెల్లించారు. పఠాన్‌తో భారీ హిట్ కొట్టిన షారూఖ్ ఖాన్‌కు ఇప్పటికే అలీబాగ్ లో సీ ఫేస్డ్ లగ్జరీ బంగ్లా ఉన్న సంగతి తెలిసిందే. మరోవైపు సునైనా కొనుగోలు చేసిన అలీబాగ్ లో దీపికా పదుకొనే-రణ్వీర్ సింగ్, అనుష్క శర్మ-విరాట్ కోహ్లీ, పారిశ్రామికవేత్త గౌతమ్ సింఘానియాకు ఇళ్లు కూడా ఉన్నాయి. (టీసీఎస్‌లో భారీ కుంభకోణం: రూ.100 కోట్ల కమిషన్లు మింగేశారు!) కాగా జోయా అక్తర్ దర్శకత్వంలో ది ఆర్చీస్ అనే మూవీలో సుహానా తొలిసారిగా నటిస్తోంది. ది ఆర్చీస్ అనేది 1960ల నాటి భారతదేశంలోని లైవ్-యాక్షన్ మ్యూజికల్ సెట్. ఈ సినిమాలో బోనీ కపూర్ కుమార్తె ఖుషీ కపూర్ అమితాబ్ బచ్చన్ మనవడు అగస్త్య నందా కూడా నటిస్తున్నారు. ఇప్పటికే టీజర్‌తో అదరగొట్టిన ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో వచ్చే ఏడాది విడుదల కానుంది. ఇక సుహానా ఖాన్ స్టడీ విషయానికి వస్తే యూకేలోని సస్సెక్స్‌లోని ఆర్డింగ్లీ కాలేజ్ నుంచి గ్రాడ్యుయేషన్, 2022లో న్యూయార్క్ యూనివర్శిటీ టిస్చ్ స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ నుంచి నటనలో పట్టా పొందడం గమనార్హం. You’ve seen the gang in the comics, in books, and even in Riverdale — but this time around, you’ll see them closer to home! Set in the 60's, The Archies builds a world that’s both familiar and new. Here's your first look #TUDUM! pic.twitter.com/uxpS1A3JeX — Netflix India (@NetflixIndia) June 17, 2023 -
తండ్రి ఆస్తిలో కుమార్తెలకూ సమాన హక్కు.. తేల్చి చెప్పిన హైకోర్టు
సాక్షి, అమరావతి : హిందూ వారసత్వ సవరణ చట్టం ప్రకారం కూతురు పుట్టుకతోనే తండ్రి ఆస్తిలో సమాన వారసత్వ హక్కుదారు అవుతుందని హైకోర్టు స్పష్టం చేసింది. సవరణ చట్టం అమల్లోకి వచ్చిన 2005 సెప్టెంబర్ 9వ తేదీ నాటికి తండ్రి మరణించారా? లేదా? అన్న దాంతో సంబంధం లేకుండా హిందూ అవిభాజ్య కుటుంబం (హెచ్‌యూఎఫ్) ఆస్తుల విషయంలో కుమార్తెలకు సైతం సమాన హక్కు ఉంటుందని తేల్చి చెప్పింది. ఇదే విషయాన్ని సుప్రీం కోర్టు వినీత శర్మ కేసులో స్పష్టంగా చెప్పిందని, సవరణ చట్టం అమల్లోకి వచ్చే నాటికి తండ్రి బతికి ఉండాల్సిన అవసరం లేదని తెలిపిందని వివరించింది. తండ్రి ఉమ్మడి ఆస్తిలో కుమార్తెలకు సమాన వాటా హక్కును సవరణ చట్టం అమల్లోకి వచ్చిన తరువాత నుంచి మాత్రమే పరిమితం చేయలేమని తేల్చి చెప్పింది. ఆ చట్టం నిబంధనలు పూర్వం (రెట్రోస్పెక్టివ్) నుంచే వర్తిస్తాయని చెప్పడంలో ఎలాంటి సంశయం లేదంది. హిందూ వారసత్వ సవరణ చట్టం ప్రకారం తుది తీర్పునివ్వాలని అభ్యర్థి స్తూ తెనాలి కోర్టును ఆశ్రయించాలని ఓ కేసులో పిటిషనర్లుగా ఉన్న ముగ్గురు మహిళలకు హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బీవీఎల్ఎన్ చక్రవర్తి ఈ నెల 13న తీర్పు వెలువరించారు. తండ్రి ఆస్తిలో వాటా కోసం కుమార్తెల పోరాటం తమ తండ్రి తురగా రామమూర్తికి చెందిన ఉమ్మడి ఆస్తిలో వాటా ఇచ్చేందుకు సోదరులు, సోదరీమణులు తిరస్కరిస్తున్నారంటూ ఆనందరావు అనే వ్యక్తి 1986లో తెనాలి అదనపు సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో దావా వేశారు. ఇదే సమయంలో హిందూ వారసత్వ సవరణ చట్టం ప్రకారం తమ తండ్రి ఆస్తిలో తమకు సమాన వాటా ఉందని, ఆ మేర తీర్పునివ్వాలని కోరుతూ రామమూర్తి కుమార్తెలు సీతారావమ్మ మరో ఇద్దరు ఓ అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు. విచారణ జరిపిన కోర్టు 2009లో వీరికి అనుకూలంగా తీర్పునిచ్చింది. ఈ ఉత్తర్వులను సమీక్షించాలంటూ రామమూర్తి కుమారుల్లో కొందరు, వారి వారసులు తెనాలి కోర్టులో అనుబంధ పిటిషన్ వేశారు. విచారణ జరిపిన కోర్టు 2010లో కుమారులకు అనుకూలంగా తీర్పునిచ్చింది. వారసత్వ సవరణ చట్టం ఆస్తి వాటాల విషయంలో కుమార్తెలకు వర్తించదని కోర్టు చెప్పింది. సవరణ చట్టాన్ని పూర్వం నుంచి వర్తింపజేయడానికి వీల్లేదని చెప్పింది. ఈ తీర్పును సవాలు చేస్తూ ముగ్గురు కుమార్తెలు అదే ఏడాది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై ఇటీవల న్యాయమూర్తి జస్టిస్ బీవీఎల్ఎన్ చక్రవర్తి తుది విచారణ జరిపారు. పిటిషనర్ల తరపున చింతలపాటి పాణినీ సోమయాజి వాదనలు వినిపించారు. -
భారతదేశంలోని టాప్-10 సంపన్న నటులు
-
పెద్దల ముందే నరికి చంపాడు..
ఎల్కతుర్తి: తోడబుట్టిన అన్న ఇటీవలే రోడ్డు ప్రమాదంలో మృతిచెందగా, ఆస్తిని వదిన తీసుకుంటే తనకు ఏమీ దక్కదని కక్ష పెంచుకున్న మరిది.. పంచాయితీ పెద్దమనుషుల సమక్షంలోనే ఆమెపై కత్తితో దాడి చేసి దారుణంగా హత్యచేశాడు. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూర్ గ్రామంలో ఈ ఘటన జరిగింది. సీఐ ప్రవీణ్‌కుమార్ కథనం ప్రకారం.. ముల్కనూర్‌కు చెందిన పురాణం స్వరూప (35) భర్త జంపయ్య గత ఫిబ్రవరిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఆస్తి విషయంలో భర్త తమ్ముడు సమ్మయ్యతో గొడువలు జరుగుతున్నాయి. ఆస్తిలో వాటాల విషయమై మాట్లాడటానికి స్వరూప తన తమ్ముడు మౌటం గురువయ్య, అతడి భార్య తిరుపతమ్మతో కలసి ఆదివారం పెద్దమనుషుల సమక్షంలో కూర్చుని మరిది సమ్మయ్యను పిలిపించింది. ఇరుపక్షాల మధ్య చర్చలు జరుగుతుండగానే సమ్మయ్య వెంట తెచ్చుకున్న కొబ్బరి బొండాలు కొట్టే కత్తితో వదిన స్వరూపపై విచక్షణా రహితంగా దాడి చేశాడు. పెద్దమనుషులు ఆపే ప్రయత్నంచేసినా వినకుండా స్వరూప మెడ, ఇతర శరీర భాగాలపై నరకడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. దీంతో అక్కడున్నవారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. -
ఈ ఇల్లు చాలా ప్రత్యేకం: అమ్మకానికి బ్రిడ్జ్ హౌస్.. ధర ఎన్ని కోట్లో తెలుసా?
మీరు ఇప్పటివరకూ ఇన్నో రకాల ఇళ్లు చూసి ఉంటారు. ఖరీదైన భవంతుల గురించి విని ఉంటారు. కొండలపై రూ.కోట్లు పెట్టి కట్టిన , విలాసవంతమైన నివాసాల గురించి చదివి ఉంటారు. కానీ ఓ కాలువ బ్రిడ్జిపై నిర్మించిన ఈ ప్రత్యేకమైన ఇంటి గురించి తెలుసా? యునైటెడ్ స్టేట్స్‌లోని లాస్ ఏంజెల్స్‌లోని అల్హంబ్రా వాష్ కాలువకు అడ్డంగా బ్రిడ్జ్‌పై నిర్మించిన ఇల్లు తాజాగా అమ్మకానికి వచ్చింది. దీని విలువ దాదాపు రూ. 2 కోట్లు. ఒక పడకగది, ఒక బాత్రూమ్ ఉన్న ఈ ప్రత్యేకమైన ఇంటిని కంపాస్ రియల్ ఎస్టేట్ పోర్టల్ వెబ్సైట్లో విక్రయానికి ఉంచారు. 450 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ ఇంటిని కొనుక్కునే వారు అందమైన రూఫ్ టాప్ డాబాను ఆనందించవచ్చని, రిటైల్ దుకాణాలు, ఎల్ఏ ఫిట్నెస్, 99 రాంచ్, మెయిన్ స్ట్రీట్‌లో మంచి ఫుడ్‌స్టాల్స్‌కు సమీపంలో ఉండవచ్చని, ఇది నిజంగా గొప్ప ఆస్తి అని ఇంటిని అమ్మకానికి ఉంచిన పోర్టల్ పేర్కొంది. Welcome to the L.A. Troll Apartment. You can live under a bridge for only $250,000 https://t.co/6crQ2gvOls pic.twitter.com/l5M7Yjpbjk — Mighty AP (@themightyap) June 6, 2023 లాస్ ఏంజిల్స్ టైమ్స్ కథనం ప్రకారం.. ఆహ్లాదకరమైన కాలువ నీటి ప్రవాహానికి ఎదురుగా, రోడ్డు వంతెన పక్కన ఈ ఇల్లు ఉంటుంది. ఇంటి డాబా మీదకు వెళ్తే సుందరమైన పరిసరాలను వీక్షించవచ్చు. ఈ ఇల్లు ఒకప్పటి తన హైస్కూల్ స్నేహితుని తల్లిదండ్రులకు చెందినదని దీన్ని అమ్మకానికి ఉంచిన కంపాస్ ఏజెంట్ డౌగ్ లీ చెప్పారు. ఇదీ చదవండి: Oldest Real Estate Agent: 74 ఏళ్ల వయసులో రియల్ఎస్టేట్ ఏజెంట్! పరీక్ష రాసి మరీ.. -
ఇవేం‘రక్త’ సంబంధాలు..ఆస్తి కోసం అయిన వారినే తుదముట్టిస్తున్న వైనం
ఆస్తి కోసం ఒకనాడు అన్నను, ఇప్పుడు తమ్ముడిని హత్య చేశాడో వ్యక్తి. కన్న తండ్రినే చంపేందుకు ప్రయత్నించాడో యువకుడు. వివాహేతర సంబంధం కోసం ఓ భార్య.. భర్తపై హత్యా యత్నం చేస్తే.. ఆవేశంలో అన్నీ మరిచి కన్న తల్లినే చంపిందో కూతురు. బంధాలు, అనుబంధా లన్నీ మాటలకే.. మనిషిలోని మానవత్వం మాయమైపోతోంది. కన్నవారి మీద, తోబుట్టువుల పట్ల కూడా కనీస ప్రేమ కరువైంది. క్షణికావేశమో.. పగ, ప్రతీకారమో.. కుటుంబ సభ్యులను చంపేందుకు వెనుకాడటం లేదు మనిషి. అందుకు ఈ ఘటనలు ఓ ఉదాహరణ మాత్రమే! భర్తపై డీజిల్ పోసి.. నిప్పంటించి.. ♦ ఓ భార్య ఘాతుకం ♦ దాదిగూడ రాంనగర్ కాలనీలో ఘటన జిన్నారం(పటాన్చెరు): వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని భర్తపై డీజిల్ పోసి హత్య చేసేందుకు ఓ భార్య యత్నించింది. ఈ ఘటన జిన్నారం మండలం ఊట్ల గ్రామ పంచాయతీ పరిధిలోని రాంనగర్ కాలనీలో ఆదివారం జరిగింది. పోలీసులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. ఊట్ల గ్రామ పంచాయితీ పరిధిలోని దాదిగూడ గ్రామానికి చెందిన సంకు నర్సింహులు(32)కి దుండిగల్‌కు చెందిన యాదమ్మతో 15 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరు దాదిగూడ సమీపంలోని రాంనగర్ కాలనీ లో ఉంటున్నారు. వీరికి ముగ్గురు సంతానం. భార్యాభర్తలు కూలి పని చేసుకుంటూ బతుకుతున్నారు. యాదమ్మ కొంత కాలంగా వివాహేతర సంబం«ధం పెట్టుకుంది. ఈ విషయం తెలిసిన భర్త తర చూ కుటుంబ సభ్యులకు చెప్పి బాధపడేవాడు. ఇదే విషయమై 27వ తేదీ రాత్రి భార్యాభర్తల మధ్య గొ డవ జరిగింది. భర్త తనకు అడ్డంకిగా మారాడని భావించిన యాదమ్మ అత డిని చంపాలని నిర్ణయించుకుంది. గొడవ జరిగాక ఇంటి పక్కనే ఉన్న ఆటో నుంచి డీజిల్ తీసి పెట్టుకుంది. భర్త నర్సింహులు గాఢ నిద్రలోకి వెళ్లాక, రాత్రి 12 గంటల తర్వాత అతడిపై డీజిల్ పోసి నిప్పంటించింది. నర్సింహులు అరుపులతో చుట్టు పక్కల వారు వచ్చి మంటలను ఆర్పేందుకు ప్రయ త్నించారు. అప్పటికే 60 శాతం గాయాలయ్యాయి. అంబులెన్స్‌లో హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం నర్సింహులు పరిస్థితి విషమంగా ఉంది. నర్సింహు లు తమ్ముడు పోచయ్య ఫిర్యాదు మేరకు కేసు ద ర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ విజయరావు తెలిపారు. యాదమ్మ పోలీసుల అదుపులో ఉంది. తల్లిని రోకలితో బాది.. ♦ ఓ కుమార్తె దుర్మార్గం నందిపేట్(ఆర్మూర్): తల్లీకూతుళ్ల మధ్య జరిగిన చిన్నపాటి గొడవ హత్యకు దారితీసింది. కూతురు ఆవేశంలో తల్లిని రోకలితో బాది చంపిన ఘటన నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం ఉమ్మెడ గ్రామంలో వెలుగు చూసింది. ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. ఉమ్మెడకు చెందిన నాగం నర్సు(52) భర్త చనిపోవడంతో ఉమ్మెడలో ఒంటరిగా నివసిస్తోంది. ఆమెకు ఇద్దరు కూతుర్లు హరిత, అరుణ. పెద్ద కూతురు హరిత.. తల్లి ఉండే ఇంట్లోని పక్కగదిలోనే వేరుగా నివసిస్తోంది. కాగా తల్లీకూతుళ్ల మధ్య కొన్నేళ్ల నుంచి గొడవలు జరుగుతున్నాయి. మృతురాలి రెండో కూతురు అరుణ ఇంట్లో ఈ నెల 26న తొట్లె ఫంక్షన్ జరిగింది. తల్లి నర్సు, పెద్ద కూతురు హరిత వెళ్లారు. అక్కడ నర్సు.. రెండో కూతురు అరుణ బంధువులతో గొడవపడి వారిని దూషించింది. ఇంటికి తిరిగొచ్చాక శుక్రవారం రాత్రి పెద్ద కూతురు హరితకు, మృతురాలికి మధ్య ఈ విషయంలో గొడవ జరిగింది. హరిత ఆవేశంలో తల్లి తల, ముఖంపై రోకలితో ఇష్టం వచ్చినట్లు కొట్టి వెళ్లిపోయింది. శనివారం రాత్రి తన చెల్లిలికి, బంధువులకు ఫోన్‌చేసి జరిగిన విషయాన్ని తెలిపింది. వారు వచ్చి చూడగా నర్సు చనిపోయి ఉంది. విషయం తెలుసుకున్న పోలీసులు శనివారం రాత్రి ఘటనా స్థలానికి చేరుకుని పంచనామా నిర్వహించారు. మృతురాలి మేనల్లుడు గణపురం రవి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీకాంత్ తెలిపారు. ఆస్తి కోసం తండ్రిపై తనయుడి దాడి ♦ కత్తితో ఇష్టారీతిన పొడిచిన వైనం తొర్రూరు: వృద్ధాప్యంలో ఉన్న తండ్రిని కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన కొడుకు.. ఆస్తి కోసం హత్యాయత్నానికి ఒడిగట్టాడు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండల కేంద్రంలో ఆదివారం జరిగింది. ఎస్సై లింగారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... వరంగల్ జిల్లా నెక్కొండ మండలం అమీనాపురం గ్రామ శివారు టీక్యా తండాకు చెందిన మాలోతు రాములు అనే 70 ఏళ్ల వృద్ధుడికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అందరికీ పెళ్లిళ్లు చేసి, తనకున్న మూడెకరాల భూమిని కుమారులిద్దరికి సమానంగా పంచాడు. భూ పంపకాల్లో అన్నకు ఎక్కువ భూమి పంచాడని, కుమార్తెలకు డబ్బులు పంపుతున్నాడని తండ్రితో చిన్న కుమారుడు స్వామి కొంత కాలంగా గొడవపడుతున్నాడు. పలుమార్లు పెద్దమనుషుల్లో పంచాయితీ పెట్టి నచ్చజెప్పినా అతని తీరులో మార్పు రాలేదు. రాములు ఈ నెల 26న దంతాలపల్లి పడమటిగూడెం శివారు చారి తండాలోని బంధువుల ఇంటికి వెళ్లాడు. తిరిగి ఇంటికివ వెళ్లేందుకు ఆదివారం తొర్రూరు బస్టాండుకు వచ్చాడు. బస్సు కోసం ఎదురుచూస్తున్న తండ్రిని చాటుగా ఫాలో అవుతున్న స్వామి.. హెల్మెట్ ధరించి వెంట తెచ్చుకున్న కత్తితో తండ్రిపై దాడి చేశాడు. ఏం జరుగుతుందో తెలుసుకునేలోపే తల, పొట్ట, చేతులపై పదునైన కత్తి గాట్లు పడ్డాయి. బస్టాండ్‌లోని ప్రయాణికులు అడ్డుకోవడంతో అక్కడినుంచి పరారయ్యాడు. తీవ్ర రక్త స్రావంతో అల్లాడుతున్న వృద్ధుడి గురించి పోలీసులకు అక్కడున్న ప్రయాణికులు సమాచారం అందించారు. పోలీసులు 108లో వరంగల్‌లోని ఎంజీఎంకు తరలించారు. క్షతగాత్రుడి పెద్ద కుమారుడు శంకర్‌నాయక్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. నాడు అన్నను.. నేడు తమ్ముడిని.. ♦ ఆస్తి కోసం హత్య చేసిన సోదరుడు మద్నూర్(జుక్కల్): ఆస్తి తగాదాలు నిండు ప్రా ణాన్ని బలితీసుకున్నాయి. రక్త సంబంధాన్ని మరిచి తోబుట్టువును దారుణంగా హత్య చేశాడో అన్న. కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం సోనాలలో ఈ దారుణం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. సోనాలకు చెందిన గంగాధర్, గినాన్బాయికి ముగ్గురు కొడుకులు సంజయ్ పాటిల్, రాజు పా టిల్, విజయ్ పాటిల్(32). వీరికి 18 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఆస్తి విషయంలో గొడవలతో.. గంగాధర్ పెద్ద కొడుకు సంజయ్ పాటిల్‌ను తమ్ముడు రాజు పాటిల్ 2011లోనే హత్య చేసి, శిక్ష అనుభవించాడు. జైలు నుంచి బయటకు వచ్చిన రాజు అప్పటి నుంచి పెద్దపల్లి, హైదరాబాద్‌లలో ఇంగ్లిష్ టీచర్‌గా ప్రైవేటు స్కూళ్లలో పనిచేసేవాడు. కరోనా సమయంలో సొంతూరుకు తిరిగి వచ్చాడు. అయితే గంగాధర్ పేరున ఉన్న 18 ఎకరాల భూమిలోంచి ఐదు ఎకరాల భూమిని అప్పట్లో హత్యకు గురైన సంజయ్ భార్య పేరున చేశారు. 13 ఎకరాల్లోంచి మూడెకరాల భూమిని తమ్ముడు విజయ్ పాటిల్ అమ్మేశాడు. మిగిలిన పదెకరాల భూమిని తాకట్టు పెట్టడంతో రాజుపాటిల్ తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. ఆస్తి పంపకాలు జరగక ముందే ఇష్టారాజ్యంగా ఎట్లా అమ్మారని? భూమి తాకట్టు పెట్టి అప్పు చేయడం ఏమిటని? ఇద్దరు అన్నదమ్ముళ్ల మధ్య తరచూ గొడవలు జరిగేవి. ఒడిశా రాష్ట్రానికి వెళ్లి అక్కడే ఏదైనా ప్రైవేటు స్కూల్లో టీచర్‌గా చేరాలని రాజు పాటిల్ అతడి భార్య సీతిక్ష నిర్ణయించుకున్నారు. అయితే ఆదివారం వేకువజామున నాలుగు గంటల ప్రాంతంలో రాజుపాటిల్ లేచి అదే ఇంట్లో వేరే గదిలో నిద్రిస్తున్న విజయ్పాటిల్ను విచక్షణ రహితంగా పొడిచాడు. మెడ, కాళ్లు, కడుపులో పలుమార్లు పొడవడంతో కడుపులోని పేగులు బయటకు వచ్చి విజయ్ వెంటనే మృతిచెందాడు. అక్కడి నుంచి నేరుగా మద్నూర్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయిన రాజు పాటిల్ జరిగిన విషయాన్ని పోలీసులకు వివరించాడు. బాన్సువాడ డీఎస్పీ జగన్నాథ్‌రెడ్డి, బిచ్కుంద సీఐ కృష్ణ, మద్నూర్ ఎస్సై కృష్ణారెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని మద్నూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. మృతుడు విజయ్ పాటిల్‌కు ఏడాది క్రితమే పెళ్లి జరిగిందని, భార్యాభర్తల మధ్య గొడవలతో భార్య ఇటీవలే పుట్టింటికి వెళ్లిపోయిందని చెప్పారు. -
మీరు ఇల్లు కొంటున్నారా? ఇవీ తెలుసుకోకపోతే భారీ నష్టం!
స్థిరాస్థులైన ఇళ్లు, అపార్ట్మెంట్లు, వ్యవసాయ క్షేత్రాల్ని కొనుగోలు చేస్తుంటాం. ఆ కొనుగోళ్ల సమయంలో తక్కువ రేటు, మంచి ప్రాంతం, అన్నీ వసతులు ఉన్నాయా? లేవా?.. ఇప్పుడు పెట్టిన పెట్టుబడులు భవిష్యత్‌లో ఎంత పెరుగుతాయి’ అనే తదితర విషయాల గురించి ఆరా తీస్తుంటాం. అన్నీ బాగుంటే మన బడ్జెట్‌కు తగ్గట్లు సొంతం చేసుకుంటాం. అదే సమయంలో మీరో విషయాన్ని పరిగణలోకి తీసుకోవాలి. లేదంటే భారీగా నష్టపోతారని ఆర్ధిక నిపుణులు సూచిస్తున్నారు. స్థిరాస్థులపై ప్రభుత్వ పథకాలైన ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై), బ్యాంకులు ప్రత్యేక ఆఫర్లు అందిస్తుంటాయి. ముఖ్యంగా ఏదైనా ప్రాపర్టీని తల్లి లేదా భార్య, కుమార్తె పేరు మీద కొనుగోలు చేస్తే ట్యాక్స్ బెన్ఫిట్స్, స్టాంప్ డ్యూటీ, డిస్కౌంట్‌కే వడ్డీ రేట్లను పొందవచ్చు. ఒకవేళ ప్రాపర్టీని కొనుగోలు చేస్తే భార్య, కుమార్తె పేరుమీద కొనుగోలు చేయాలని ఆర్ధిక నిపుణులు సలహా ఇస్తున్నారు. ఆయా రాష్ట్రాల వారీగా ప్రాపర్టీ కొనుగోళ్లతో స్టాంప్ డ్యూటీ ఉంటుంది. ఉదాహరణకు హర్యానాలో స్థిరాస్థులు మహిళలపై కొంటే స్టాంప్ డ్యూటీ 2శాతం చెల్లించాలి. అదే పురుషుడి పేరుమీద ఉంటే 7 శాతం కట్టాలి. మిగిలిన రాష్ట్రాల్లో 5శాతం చెల్లించాలి. ఇద్దరి (భార్య - భర్త) పొత్తులో ఓ ప్రాపర్టీపై పెట్టుబడులు పెడితే.. స్టాంప్ డ్యూటీ 1శాతం తగ్గుతుంది. లక్షల్లో ఆదా ఢిల్లీలో రూ.50 లక్షల విలువైన ఆస్తిని కొనుగోలు చేశారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆ ఆస్తిని మీ పేరు మీద రిజిస్టర్ చేసుకుంటే ఏడు శాతం రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అయితే, మీ భార్య లేదా తల్లి పేరు మీద ఆస్తిని రిజిస్టర్ చేస్తే ఐదు శాతం రిజిస్ట్రేషన్ ఫీజు మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. ఈ విధంగా, లక్షల్లో రిజిస్ట్రేషన్ ఖర్చుల్ని ఆదా చేసుకోవచ్చు. అదే ఆస్తిని భార్య పేరు మీద మాత్రమే కాకుండా భర్త పేరుమీద జాయింట్‌గా కొనుగోలు చేస్తే రిజిస్ట్రేషన్ ప్రాసెస్‌లో ఒక శాతం రాయితీ పొందవచ్చు. దీనివల్ల రూ.50,000 ఆదా అవుతుంది. త్వరగా బ్యాంక్ లోన్లు అంతేకాదు మహిళల పేరుమీద ఆస్తిని కొనుగోలు చేస్తే ఇంటి రుణాలు త్వరగా వస్తాయి. బ్యాంకులు సాధారణంగా గృహ రుణాల కోసం దరఖాస్తు చేసుకునే మహిళలకు ప్రత్యేక డిస్కౌంట్లు, ప్రోత్సాహకాలు అందిస్తాయి. పనిచేసే మహిళ లేదా మహిళా వ్యాపారవేత్తలు గృహ రుణం కోసం దరఖాస్తు చేస్తే, ఆమె ఆదాయాన్ని తన భర్త ఆదాయంతో కలిపి రుణాన్ని ఎక్కువగా ఇస్తారు. కలపవచ్చు, ఫలితంగా అధిక రుణ మొత్తం వస్తుంది. చివరిగా : కాబట్టి స్థిరాస్థుల కొనుగోలు చేసే సమయాల్లో సంబంధిత నిపుణులు సలహాలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఇందుకోసం జాతీయ, అంతర్జాతీయ సంస్థల నిపుణులు సలహాలు ఇస్తుంటారు. అందుకు ప్రతిఫలంగా కొద్ది మొత్తంలో ఫీజు రూపంలో చెల్లించాలి. చదవండి👉 హైదరాబాద్‌లో ఆ ఏరియా ఇళ్లే కావాలి.. కొనుక్కునేందుకు ఎగబడుతున్న జనం? -
శరత్ బాబు ఆస్తులు.. అంతా వారికే రాసిచ్చాడా?
సీనియర్ శరత్ బాబు ఇటీవలే అనారోగ్య కారణాలతో మరణించిన సంగతి తెలిసిందే. హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రిలో కన్నుమూసిన ఆయనకు టాలీవుడ్ సినీ ప్రముఖులు నివాళులర్పించారు. అనంతరం చెన్నైలో అభిమానులు, కుటుంబసభ్యుల అశ్రనయనాల అంత్యక్రియలు నిర్వహించారు. దాదాపు 300కు పైగా సినిమాల్లో నటించిన శరత్ బాబు.. టాలీవుడ్, కోలీవుడ్‌లోని స్టార్ హీరోలందరితో నటించారు. (ఇది చదవండి: ఆ విషయం అందరికీ తెలుసు.. అర్థం కాకపోతే అంతే: మంచు విష్ణు) నటి రమాప్రభను పెళ్లి చేసుకున్న శరత్ బాబు ఆ తర్వాత మనస్పర్థలతో విడిపోయారు. ఏకంగా మూడు పెళ్లిళ్లు చేసుకున్న శరత్ బాబు సంతానం లేదు. దీంతో శరత్ బాబు ఆనారోగ్యానికి గురి కావడంతో ఆస్తి గొడవలు స్టార్ట్ అయ్యాయని విశ్వసనీయ వర్గాల సమాచారం. దీంతో శరత్ బాబు మరణం తర్వాత ఆయన ఆస్తుల గురించే పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ఇంతకీ శరత్ బాబు ఆస్తులు ఎన్ని కోట్లు ఉన్నాయి? వాటిని ఎవరి పేరు మీదనైనా రాశారా? అనే అనుమానాలు మొదలయ్యాయి. వారి పేరు మీదే వీలునామా! అయితే దీనికి ఆస్తులకు సంబంధించి ఓ ఆసక్తికర విషయం బయటకొచ్చింది. అయితే ఆయన బతికుండగానే ఓ వీలునామా రాశారని తెలిసింది. హైదరాబాద్, చెన్నై , బెంగళూరులో ఆయనకు ఇళ్లు, స్థలాలూ, షాపింగ్ మాల్స్ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే తన ఆస్తిని అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ల పిల్లల పేర్ల మీద వీలునామా రాశారట శరత్ బాబు. ఆయన మరణం తర్వాత ఈ విషయం బయటపడింది. సోదరి కన్నీటి పర్యంతం శరత్ బాబు మరణం తర్వాత ఆయన సోదరి సరిత స్పందిస్తూ కన్నీటి పర్యంతమయ్యారు. తన అన్న మరణాన్ని తలచుకుని ఎంతో బాధపడిన ఆమె.. తనకు తల్లి, తండ్రి మొత్తం శరత్ బాబు అన్నయ్యే అంటూ బోరున విలపించారు. తన కొడుకును చదివించి.. తన కుమార్తె పెళ్లి కూడా చేశారని చెప్పారు. చివరగా తన కుమార్తె సోనియా డెలివరీ కోసం బెంగుళూరు వచ్చారని.. సోనియాని దత్తత తీసుకుంటానని అన్నయ్య చాలా సార్లు అన్నారని శరత్ బాబు సోదరి తెలిపారు. (ఇది చదవండి: కంగ్రాట్స్.. కొంచెమైనా సిగ్గుండాలి.. ఆశిష్ విద్యార్థిపై కేఆర్కే ట్వీట్ వైరల్) శరత్ బాబు ప్రస్థానం 1951 జులై 31న శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలసలో శరత్ బాబు జన్మించారు. ఆయన అసలు పేరు సత్యం బాబు దీక్షితులు. శరత్ బాబుకు ఏడుగురు అన్నదమ్ములు, ఆరుగురు అక్క చెల్లెలు ఉన్నారు. అన్నదమ్ముల్లో శరత్ బాబు మూడో వారు. కాగా.. 1973లో రామరాజ్యం సినిమాతో సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన శరత్ బాబు.. నటుడిగా అంచెలంచెలుగా ఎదిగారు. మూడుముళ్ల బంధం, సీతాకోక చిలుక, సంసారం ఒక చదరంగం, అన్నయ్య, ఆపద్భాందవుడు లాంటి ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాల్లో ఆయన నటించారు. చివరిసారిగా నరేశ్-పవిత్ర నటించిన మళ్లీ పెళ్లి చిత్రంలో కనిపించారు. -
ప్రాపర్టీ కొంటున్నారా? ఈ జాగ్రత్తలు లేకుంటే రిస్కే!
ప్రస్తుతం భూమి.. బంగారం కంటే విలువైనదిగా మారిపోయింది. దీంతో భూమిపై పెట్టుబడి పెట్టేవారు ఇటీవల కాలంలో బాగా పెరిగారు. అధికంగా పెట్టుబడులు పెట్టే స్థోమత ఉన్నవారు షేర్స్, మ్యూచువల్ ఫండ్స్, ఫిక్స్డ్ డిపాజిట్లు, బంగారం కన్నా కూడా స్థిరాస్తి మీదే ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. కరోనా సంక్షోభ సమయంలో డీలా పడిన రియల్ ఎస్టేట్ రంగం తర్వాత పుంజుకుంది. (త్వరలోనే యాపిల్ స్టోర్ గ్రాండ్ ఓపెనింగ్.. భారత్ రానున్న టిమ్‌కుక్!) కొనుగోలుదారులను ప్రోత్సహించేందుకు బ్యాంకులు కూడా ప్రస్తుతం తక్కువ వడ్డీకి హోంలోన్లు ఇస్తున్నాయి. దీంతో ఇల్లు లేదా స్థలం కొనడానికి ఇదే అనువైన సమయమని కొనుగోలుదారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇల్లు లేదా స్థలం కొనుగోలు చేసేవారు ముందుగా కొన్ని జాగ్రత్తలు తప్పక తీసుకోవాలి. ఎలాంటివి కొనాలి.. ఎక్కడ కొనాలి.. భవిష్యత్తు ఎలా ఉంటుంది.. వంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. (జీతం నుంచి టీడీఎస్ మినహాయింపు.. ఐటీ శాఖ కీలక ఆదేశాలు) అనుమతులన్నీ ఉన్నాయా? స్థిరాస్తి కొనుగోలు అన్నది అధిక పెట్టుబడులతో కూడుకున్నది. కాబట్టి జాగ్రత్తలు కూడా ఎక్కువే తీసుకోవాలి. ఆస్తిని కొనుగోలు చేయాలనుకుంటున్న చోటు అంటే ఆ నగరం లేదా పట్టణంలో రియల్ ఎస్టేట్ మార్కెట్ గురించి పరిశోధన చేయాలి. రహదారులు, హైవేలు, కనెక్టివిటీ వంటివి తెలుసుకోవాలి. ఏవైనా వెంచర్లలో స్థలాలు కొనుగోలు చేసేవారు వాటికి అన్ని అనుమతులు ఉన్నాయో లేదో చూసుకోవాలి. లేకపోతే ఇల్లు కట్టుకునేటప్పుడు చిక్కులు తప్పవు. ఇక ఇదివరకే నిర్మించిన ఇంటిని కొనుగోలు చేస్తున్నట్లయితే యాజమాన్య ధ్రువీకరణ పత్రం, బిల్డింగ్ లే అవుట్ ఆమోదం, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్, వ్యవసాయేతర అనుమతి, నీరు, అగ్నిమాపక విభాగం ఆమోదం వంటివి ఉన్నాయో లేదో తనిఖీ చేసుకోవాలి. నివాసం మార్గదర్శకాలకు అనుగుణంగా ఉందో లేదో నిర్ధారించడానికి రెరా (రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ) రిజిస్ట్రేషన్ కూడా పరిశీలించాలి. అలాగే కొత్తగా ఏమైనా నిబంధనలు వచ్చాయేమో తెలుసుకోవాలి. ఆస్తి కొంటున్న ప్రాంతం ఏ అధీకృత సంస్థ పరిధిలోకి వస్తుందో దాని ఆమోదం తప్పనిసరిగా ఉండాలి. అలాగే ఆయా ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లన్నీ అసలైనవేనా అని చూసుకోవడం కూడా చాలా ముఖ్యం. ఎలాంటివి కొనాలి? సాధారణంగా ఇల్లు లేదా స్థలాలను కొనేవారిలో చాలా మంది సొంత వినియోగం కోసమే తీసుకుంటున్నారు. మరికొంత మంది కేవలం పెట్టుబడి కోణంలోనే ఆస్తులు కొంటున్నారు. అయితే సొంత వినియోగం కోసం ఆస్తులు కొనేవారు నాణ్యమైనవి కొనుగోలు చేయాలి. ఇందు కోసం మార్కెట్లో నమ్మకమైన బ్రాండెడ్ డెవలపర్ల దగ్గర కొనుగోలు చేస్తే మంచిది. గుర్తింపు లేని, ప్రైవేటు వ్యక్తుల నుంచి ఆస్తులు కొనుగోలు చేసేటప్పుడు వాటి నాణ్యతపై జాగ్రత్తలు తీసుకోవాలి. ఎక్కడ కొనాలి? ప్రధాన రహదారులు, మెట్రో స్టేషన్లు, బస్సులు, ఆటోలు వంటి ప్రజా రవాణాకు అందుబాటులో ఉన్న ప్రదేశాలలో ఆస్తులను కొనుగోలు చేస్తే భవిష్యత్తులో మంచిది. అంతేకాకుండా స్థిరాస్తికి సమీపంలో పాఠశాలలు, వాణిజ్య భవన సముదాయాలు, ఆసుపత్రులు ఉన్నాయో లేదో కూడా నిర్ధారించుకోవాలి. ఈ సౌకర్యాలన్ని ప్రాథమిక అవసరాలు తీర్చడమే కాకుండా ఆస్తి విలువ పెంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. బిల్డర్ గురించి తెలుసుకున్నారా? ఏదైనా ప్రాజెక్ట్‌లో పెట్టుబడి పెట్టడానికి ముందు, బిల్డర్ గత రికార్డు, అతను ఎన్ని ప్రాజెక్ట్‌లను పూర్తి చేశాడు, నిర్మాణం పూర్తి చేసే సమయం, నిర్మాణ నాణ్యతను పరిశీలించాలి. కొనుగోలుదారులు అజాగ్రత్తగా ఉంటే మోసపోయే అవకాశం లేకపోలేదు. కాబట్టి స్థిరాస్తి కొనుగోలు చేసేవారు ముందుగా తగిన జాగ్రత్తలన్నీ తీసుకోవడం చాలా అవసరం. -
రియల్ ఎస్టేట్‌కు తగ్గని డిమాండ్.. హైదరాబాద్‌లో భారీగా పెరిగిన అమ్మకాలు
న్యూఢిల్లీ: భారత్‌లో జనవరి–మార్చిలో ఎనమిది ప్రధాన నగరాల్లో స్థిరాస్తి రంగం స్థిర డిమాండ్‌ను నమోదు చేసిందని రియల్టీ కన్సల్టెంట్ నైట్ ఫ్రాంక్ ఇండియా తెలిపింది. ‘2022 తొలి త్రైమాసికంతో పోలిస్తే 2023 జనవరి–మార్చిలో గృహాల విక్రయాలు 1 శాతం ఎగసి 79,126 యూనిట్లు నమోదయ్యాయి. గృహాల అమ్మకాలు హైదరాబాద్‌లో 19 శాతం పెరిగి 8,300 యూనిట్లు, చెన్నై 8 శాతం వృద్ధితో 3,650 యూనిట్లుగా ఉంది. (రిలయన్స్ డిజిటల్ డిస్కౌంట్ డేస్: ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై భారీ ఆఫర్లు) కార్యాలయాల స్థూల లీజింగ్ 5 శాతం దూసుకెళ్లి 1.13 కోట్ల చదరపు అడుగులుగా ఉంది. హైదరాబాద్‌లో ఆఫీస్ లీజింగ్ 46 శాతం క్షీణించి 8 లక్షల చదరపు అడుగులకు చేరుకుంది. ఎనమిది నగరాల్లో గృహాల ధరలు 1–7 శాతం అధికం అయ్యాయి. బెంగళూరులో 7 శాతం, ముంబై 6, హైదరాబాద్, చెన్నైలో 5 శాతం ధరలు పెరిగాయి. ఆఫీసుల అద్దె 2–9 శాతం హెచ్చింది. కోల్‌కతలో 9 శాతం, హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలో 5 శాతం దూసుకెళ్లాయి. (అప్పుడు కొనలేకపోయారా..? ఇప్పుడు కొనండి..) బలమైన ఆర్థిక వాతావరణం కారణంగా 2023లో ఆఫీస్ మార్కెట్ సానుకూలంగా అడుగు పెట్టడానికి సహాయపడింది. 2023 మొదటి త్రైమాసికంలో అమ్మకాల స్థాయి నిలకడగా ఉన్నందున పెరుగుతున్న వడ్డీ రేట్లు, ధరల నేపథ్యంలో గృహాల మార్కెట్ స్థితిస్థాపకంగా ఉంది. కొన్ని నెలలుగా గృహ కొనుగోలుదార్ల కొనుగోలు సామర్థ్యం ఒత్తిడికి లోనవుతున్నప్పటికీ సొంత ఇంటి ఆవశ్యకత డిమాండ్‌ను పెంచుతూనే ఉంది. మధ్య, ప్రీమియం గృహ విభాగాలు ఈ నగరాల్లో అత్యుత్తమ పనితీరును కనబరిచాయి. ఈ ఏడాది కూడా పరిమాణం పెంచుతాయని ఆశించవచ్చు’ అని వివరించింది. (అంచనాలకు మించి పన్ను వసూళ్లు.. ఏకంగా రూ.16.61 లక్షల కోట్లు) -
ఏనుగుకి రూ. 5 కోట్ల ఆస్తి.. కట్ చేస్తే కుటుంబం చేతిలోనే..
ఏనుగుకి మనిషికి మధ్యన ఏర్పడిన బాంధవ్యం గురించి చక్కగా వివరించే ది ఎలిఫెంట్ విస్పరస్ డాక్యుమెంటరీ ఇటీవల ఆస్కార్ అవార్డు గెలుచుకున్న సంగతి తెలిసిందే . అచ్చం అలాంటి కథే ఉత్తరాఖండ్‌కి చెందిన రెండు ఏనుగులకు ఓ మనిషికి మధ్య జరిగింది. ఆ ప్రేమ ఎంత వరకు వెళ్లిందంటే తాను లేకపోతే ఏనుగులు ఎలా అని తన కుటుంబ సభ్యులు మాదిరిగా ఆస్తి రాసిచ్చేంత వరకు దారితీసింది. కానీ ఆ హద్దులు లేని ప్రేమే అతని హత్యకు కారణమైంది కూడా. అసలేం జరిగిందంటే..బిహార్‌లోని జన్‌పూర్‌కి చెందిన అక్తర్ ఇమామ్ తాను పెంచుకుకంటున్న రాణి, మోతీ అనే ఏనుగులకు తన కుటుంబ సభ్యలు మాదిరిగానే వాటికి కూడా ఆస్థిలో వాటా ఇచ్చాడు. ఎందుకంటే తాను చనిపోతే వాటి ఆలనాపాలనా ఎవరు చూసుకుంటారనే ఉద్దేశ్యంతో ఇలా చేశాడు. తన ఆస్తిలో సగం తన భార్య, పిల్లలకు పంచి మిగతా రూ. 5 కోట్ల ఆస్తిని తన ఏనుగుల పేర రాశాడు. ఏనుగుల యజమానులు చనిపోతే వాటి సంరక్షణ ఎవరూ పట్టించుకోని పలు ఘటనలు చూశానని అందుకే ఇలా చేశానని చెప్పుకొచ్చాడు. ఇలా ఏనుగుల కోసం తన ఆస్తిని కేటాయించిన తొలి వ్యక్తి ఇమామ్ అని వన్య ప్రాణుల సంరక్షణాధికారి ఇమ్రాన్ ఖాన్ అన్నారు. ఇమామ్ ఆధ్వర్యంలోని ఏషియన్ ఎలిఫెంట్ రిహాబిలేషన్ అండ్ వైల్డ్ లైఫ్ యానిమల్ ట్రస్ట్‌ని ప్రస్తుతం ఇమ్రాన్ ఖాన్ సంరక్షిస్తున్నారు. ఇమామ్ ఈ ట్రస్ట్‌ని తన ఏనుగుల కోసమే ఏర్పాటు చేసినట్లు ఖాన్ తెలిపారు. అప్పట్లో ఈ విషయం హాట్ టాపిక్‌గా మారి పలు ఛానెల్స్‌లో అక్తర్ ఇమామ్ పేరు మారు మ్రోగినట్లు కూడా చెబుతున్నారు. ప్రస్తుతం ఇమామ్ లేడు. ఆయన ఇలా ఏనుగులకు ఆస్తి ఇవ్వడం అతని కుటుంబానికి నచ్చలేదు. ఈ విషయమై ఇమామ్‌కి తన కుటుంబ సభ్యుల మధ్య పలు మార్లు గొడవలు జరిగాయి కూడా. అదీగాక తన కుటుంబం నుంచి ప్రమాదం పొంచి ఉందని 2020లో కోవిడ్ సమయంలో మొదటి లాక్‌డౌన్‌ని ఎత్తివేయగానే బిహార్‌న నుంచి హుటాహుటినా తన రెండు ఏనుగులను తీసుకుని ఉత్తరాఖండ్‌లోని రామ్‌నగర్‌కు వచ్చేశాడు. అక్కడే ఏనుగులకు సంరక్షణకు సంబంధించిన ట్రస్ట్‌ని ఏర్పాటు చేసి ఈ ఏనుగులను ప్రేమగా చూసుకుంటుండేవాడు. ఐతే ఇమామ్ ఊహించినట్లుగానే జరిగేంది. 2021లో ఇమామ్ తన కుటుంబం చేతిలోనే అనూహ్యంగా హత్యకు గురయ్యాడు. దీంతో ఆ ట్రస్ట్‌ని, ఇమామ్ పెంచుకుంటున్న ఏనుగులను వన్యప్రాణుల సంరక్షణాధికారి ఇమ్రాన్ ఖాన్ చూసుకుంటున్నారు. అయితే ఇటీవలే ఇమామ్ పెంచుకున్న ఏనుగుల్లో మోతీ అనే ఏనుగు చనిపోయింది. దీంతో రాణి అనే ఏనుగు ఒక్కత్తే ఆ రూ. 5 కోట్ల ఆస్తికి వారసురాలు. కానీ ఆస్తి మాత్రం బిహార్‌లోని పాట్నాలో ఉంది. నిధుల కొరతతో సతమతమవుతున్న అక్తర్ ఫౌండేషన్‌కి ఆ ఆస్తి చెందితేనే ఇమామ్ కోరిక కూడా నెరవేరుతుందని సంరక్షణాధికారి ఇమ్రాన్ ఖాన్ చెబుతున్నారు. (చదవండి: భార్యకు అస్వస్థత, కొడుకు విదేశాల్లో ఉన్నాడు!ఐనా సిసోడియాకు నో బెయిల్) -
కోట్ల ఆస్తిని ప్రభుత్వ పరం చేసిన వృద్ధుడు! ఎందుకంటే..
ఒక వ్యక్తి తన కోట్ల ఆస్తిని ప్రభుత్వానికి ధారాదత్తం చేశాడు. ఆఖరికి తన మృతదేహాన్ని సైతం వైద్య పరిశోధనలకు ఉపయోగించమని అధికారులును కోరాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే.. ముజఫర్ నగర్లో 85 ఏళ్ల నాథూ సింగ్ అనే వ్యక్తికి సొంత ఇల్లు, కొంత భూమి ఉంది. వాటి విలువ సుమారు రూ. 1.5 కోట్లు. అతనికి ఒక కొడుకు, నలుగురు కూతుళ్లు ఉన్నారు. కొడుకు సహరాన్‌పూర్‌లో స్కూల్ టీచర్‌గా పనిచేసేవాడు. ఐతే ఇటీవలే అతడి భార్య మరణించడంతో ఒంటరివాడైనా ఆ పెద్ద మనిషి ఓల్డేజ్ హోంకి వెళ్లిపోయాడు. గత ఏడు నెలలుగా అక్కడే ఉంటున్నాడు. తనను చూసేందుకు తన కుటుంబ సభ్యులు ఎవరూ రాకపోవడంతో ఆయన తన ఆస్తి మొత్తం ప్రభుత్వానికి రాసిస్తూ.. వాటిని ఆస్పత్రి, పాఠశాల నిర్మించేందుకు వినియోగించమని కోరాడు. ఈ వయసులో తన బాగోగులు చూసుకోవాల్సిన కొడుకు, కోడలు తనను సరిగా పట్టించుకోకపోవడంతో తన ఆస్తిని ఇలా ప్రభుత్వానికి ఇచ్చేస్తున్నట్లు ఆవేదనగా చెప్పుకొచ్చాడు. ఆఖరికి తను చనిపోయాక తన మృతదేహాన్ని వైద్య పరిశోధనల కోసం ఇచ్చేయాలని చెప్పాడు. ఎందుకంటే తన అంత్యక్రియల సమయం అప్పుడూ కూడా తన కొడుకు, కూతుళ్లు తనను చూసేందుకు రాకూడదని చెప్పాడు. ఈ మేరకు ఆ ఓల్డేజ్ హోం మేనేజర్ రేఖా సింగ్ మాట్లాడుతూ.. గత ఏడు నెలలుగా ఇక్కడే ఉంటున్నాడని, కానీ తన కుటుంబ సభ్యుల్లో ఏ ఒక్కరూ తనను చూసేందుకు రాలేదని చెప్పారు. దీంతో నాథూ సింగ్ బాగా కలత చెంది ఇలా చేసినట్లు వివరించారు. కాగా, నాథూ సింగ్ వీలునామా మాకు అందిందని, ఆయన మరణాంతరం అది అమలులోకి వస్తుందని సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయం పేర్కొంది. (చదవండి: చైనా బెదిరింపులు విదేశాంగ మంత్రికి అర్థం కావడం లేదు:: రాహుల్) -
లంచం ఇవ్వలేను... కనికరించండి!
దుగ్గొండి/ఖైరతాబాద్: తనకు రావాల్సిన ఆస్తి విషయమై న్యాయం చేయాల ని కోరుతూ ఓ రైతు వినూత్నంగా నిరసన బాటపట్టాడు. లంచాలు ఇవ్వక పోవడంతో తనకెవరూ న్యాయం చేయడంలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. తన మొర వినిపించేందుకు నాగలి ఎత్తుకొని అర్ధనగ్నంగా డీజీపీ కార్యాలయానికి వెళ్లాడు. వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం పొనకల్‌కి చెందిన గట్ల సురేందర్ అన్నదమ్ముల మధ్య కొన్నేళ్లుగా ఆస్తి గొడవలు ఉన్నాయి. ఊరి పెద్దమనుషుల సమక్షంలో పంచాయితీ కూడా జరిగింది. అయితే పెద్ద మనుషులు లంచాలు తీసుకుని ఫోర్జరీ పత్రాలు సృష్టించి తనకు అన్యాయం చేశారని ఆరోపించారు. ఈ మేరకు రాసి ఉన్న ఫ్లెక్సీని నాగలికి కట్టాడు. ఆ నాగలిని ఎత్తుకుని హైదరాబాద్ ఇందిరాపార్కు నుంచి డీజీపీ కార్యాలయం వరకు నడుచుకుంటూ బయలుదేరాడు. డీజీపీ కార్యాలయం వద్ద పోలీసులు ఆయనను అడ్డుకున్నారు. జిల్లా కార్యాలయాల్లో మూడేళ్లుగా తన సమస్య పరిష్కారం కాకపోవడంతో హైదరాబాద్ వచ్చానని సురేందర్ అన్నారు. -
అప్పుడు కొడుకును.. ఇప్పుడు భార్యను..
పెగడపల్లి(ధర్మపురి): డబ్బు కోసం, పొలంలో వాటా కోసం కట్టుకున్న భార్యను కత్తితో పొడిచి చంపాడు... కూతురిపై కూడా దాడి చేసేందుకు యత్నించేలోగా ఆమె పారిపోయి ప్రాణాలు దక్కించుకుంది. గతంలో కొడుకును హత్య చేసి ఆ కేసులో జైలుకెళ్లి వచ్చి ఇప్పుడు భార్యను పొట్టనబెట్టుకున్న ఓ కర్కోటకుడి నిర్వాకం జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం దోమలకుంట గ్రామంలో ఆదివారం కలకలం రేపింది. సీఐ వెంకట రమణమూర్తి కథనం మేరకు.. గ్రామానికి చెందిన నక్క రమేశ్–గంగవ్వ(45) దంపతులు. వీరికి కుమారుడు జలేందర్, కూతురు స్నేహ ఉన్నారు. రమేశ్ ఉపాధి కోసం గతంలో దుబాయి వెళ్లివచ్చాడు. అక్కడ సంపాదించిన డబ్బు విషయంలో రమేశ్, గంగవ్వ మధ్య తరచూ గొడవలు జరిగేవి. ఈ క్రమంలో 2019 నవంబర్‌లో ఇద్దరి మధ్య గొడవ జరగడంతో మధ్యలో వారించిన కొడుకు జలేందర్‌ను గొడ్డలితో నరికి హత్య చేశాడు రమేశ్. ఈ కేసులో జైలుకు వెళ్లి ఇటీవల విడుదలయ్యాడు. అప్పట్నుంచి భార్య, భర్త వేర్వేరుగానే ఉంటున్నారు. తమకు ఉన్న వ్యవసాయ భూమిని ఇద్దరూ వేర్వేరుగా సాగు చేసుకుంటున్నారు. అయితే, గంగవ్వ సాగు చేసుకుంటున్న భూమి తనకే ఇవ్వాలని రమేశ్ కొంతకాలంగా వేధిస్తున్నాడు. ఆమె నిరాకరించడంతో హత్య చేయాలని పథకం పన్నాడు. ఆదివారం గంగవ్వ, ఆమె కూతురు స్నేహ పొలంలో వరి నాటు వేసేందుకు వెళ్లారు. విషయం తెలిసి రమేశ్.. పొలం వద్దకు వెళ్లి.. కత్తితో భార్య గంగవ్వపై దాడి చేశాడు. కూతురు స్నేహ అడ్డుకునేందుకు యత్నించగా ఆమెపైనా దాడికి యత్నించాడు. కూతురు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని అక్కడినుంచి తప్పించుకుని పారిపోయింది. భార్య గంగవ్వను కత్తితో కడుపు, వీపు భాగంలో గట్టిగా పొడవడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. రమేశ్ పరారీలో ఉన్నాడనీ మృతురాలి కూతురు ఫిర్యాదు మేరకు నిందితుడిపై హత్యా నేరం కింద కేసు నమోదు చేసినట్లు సీఐ వివరించారు. -
భూమి కోసం ప్రాణం తీశాడు
యాచారం: భూమి కోసం ఓ కసాయి కొడుకు కన్న తండ్రినే కడతేర్చాడు. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం తమ్మలోనిగూడలో చోటుచేసుకున్న ఈ ఘటన వివరాలు పోలీసుల కథనం ప్రకారం.. తమ్మలోనిగూడకి చెందిన కర్రె మల్లయ్య(75)కు గ్రామంలో రెండెకరాల పొలం ఉంది. కొన్నేళ్ల క్రితం ఎకరా భూమిని విక్రయించి కొడుకు వెంకటయ్యకు రూ.30 లక్షలు, కూతురు సుగుణమ్మకు రూ.30 లక్షలు ఇచ్చాడు. మిగిలిన ఎకరా పొలాన్ని తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేయాలని వెంకటయ్య, భార్య మంగమ్మతో కలిసి తండ్రిపై తీవ్ర ఒత్తిడి తెచ్చాడు. భౌతిక దాడులకు సైతం పాల్పడ్డారు. తన ప్రాణం పోయేంత వరకు భూమిని ఇచ్చేది లేదని మల్లయ్య తేల్చి చెప్పాడు. దీంతో తండ్రిని మట్టుబెట్టాలని పథకం వేశాడు. ఈ క్రమంలో శనివారం అర్ధరాత్రి భార్యాభర్తలు కలిసి మల్లయ్య మొహంపై దిండు పెట్టి శ్వాస ఆడకుండా చంపేశారు. ఆదివారం తెల్లవారుజామున ఏమీ తెలియనట్టు ‘అయ్యో.. మా నాన్న చనిపోయాడు’అంటూ విలపించాడు. తండ్రీకొడుకుల మధ్య భూవివాదం నడుస్తున్న సంగతి తెలిసిన గ్రామస్తులకు అనుమానం వచ్చి వెంకటయ్యను చితకబాదారు. పోలీసులు విచారించగా భూమి కోసం తండ్రిని హత్య చేసినట్టు అంగీకరించాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ లింగయ్య తెలిపారు. -
ఫామ్ హౌస్ కేసు నిందితుడు నందకుమార్ ప్రాపర్టీ కూల్చివేత
-
గ్లోబల్ వెల్త్ రిపోర్ట్–2022: ‘సంపాదన’లో సగం వారిదే
లేచింది మొదలు పడుకొనే వరకు ప్రపంచంలో ప్రతి మనిషీ జపించే కామన్ జపం ‘డబ్బు’. గుండె కూడా లబ్ ‘డబ్బు’.. లబ్ ‘డబ్బు’ అని కొట్టుకుంటుందని కొందరు చమత్కరిస్తుంటారు. ఏ పని చేసినా దాని వెనుక ఉండేది ‘సంపాదన’. ‘ఎంత సంపాదించావన్నది కాదు.. ఎలా బతికావన్నది ముఖ్యం’ అన్న సూత్రం రివర్సయింది. సంపాదనే ముఖ్యమైంది. ఇందులో అమెరికా, చైనా పౌరులు ఆరితేరారు. వ్యక్తిగత సంపాదనలో వారిదే సగం. మిగతా ప్రపంచానిది సగం. క్రెడిట్ సూయిస్ నివేదిక గణాంకాలతో ప్రత్యేక కథనం.. (ఎం.విశ్వనాథరెడ్డి, సాక్షి ప్రతినిధి): ఒక దేశం ఆర్థిక స్థితిగతులను తెలుసుకోవడానికి జీడీపీ (జాతీయ స్థూల ఉత్పత్తి) గణాంకాలు చూస్తాం. ఆర్థిక పరిస్థితులను అంచనా వేయడంలో మరో కొలమానం వ్యక్తిగత సంపద విలువ. ప్రపంచవ్యాప్తంగా వ్యక్తిగత సంపదను లెక్కగట్టి ఏ దేశ పౌరులు ఎక్కువ సంపాదిస్తున్నారో, ఎవరు విలువైన ఆస్తులు కూడగడుతున్నారో తెలుసుకోవచ్చు. ‘క్రెడిట్ సూయిస్’ సంస్థ ఏటా గ్లోబల్ వెల్త్ రిపోర్ట్ విడుదల చేస్తుంది. ఇటీవల ‘గ్లోబల్ వెల్త్ రిపోర్ట్–2022’ విడుదల చేసింది. ఇందులో 2021 సంవత్సరం గణాంకాలను పేర్కొంది. 2021 ఆఖరునాటికి ప్రపంచంలోని మొత్తం వ్యక్తిగత సంపద 463.6 లక్షల కోట్ల డాలర్లుగా అంచనా వేశారు. అందులో సగం అమెరికా, చైనా పౌరుల సొంతమని, మిగతా సగం అన్ని దేశాల పౌరుల వ్యక్తిగత సంపదగా నివేదిక పేర్కొంది. మొత్తం వ్యక్తిగత సంపదలో అమెరికా పౌరులకు 31.5 శాతం వాటా కాగా, తర్వాత స్థానంలో ఉన్న చైనా పౌరుల వాటా 18.4 శాతం. 3.1 శాతం వాటాతో మనదేశం ఏడో స్థానంలో నిలిచింది. టాప్–10లో అమెరికా, చైనా, జపాన్, జర్మనీ, యూకే, ఫ్రాన్స్, ఇండియా, కెనడా, ఇటలీ, ఆస్ట్రేలియా ఉన్నాయి. సంపద పంచాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే క్రెడిట్ సూయిస్ గ్లోబల్ వెల్త్ రిపోర్ట్‌ను పరిశీలిస్తే.. ప్రపంచంలోని 40 శాతం సంపద ఒక శాతం వ్యక్తుల చేతుల్లో కేంద్రీకృతమైంది. 10 శాతం ధనికుల వద్ద 82 శాతం సంపద పోగుబడి ఉంది. ఎవరి దగ్గర సంపద ఉందని చెప్పడంకంటే.. ఎవరి దగ్గర లేదో చెప్పడం కూడా ముఖ్యమని నివేదిక రూపకర్త ‘ఆంతోనీ షోరాక్’ అభిప్రాయపడ్డారు. ప్రపంచంలోని 50 శాతం వ్యక్తులకు 1 శాతం సందప మాత్రమే ఉందనే విషయాన్ని నొక్కి చెప్పారు. సంపద అందరికీ సమానంగా ఉండటం ఊహకు అందని విషయం. కానీ నిరుపేదలకు వేగంగా సందప పంపిణీ జరిగితేనే అసలు సంపదకు అర్థం చేకూరుతుంది. అభివృద్ధి దిశగా సమాజం వేగంగా అడుగులు వేస్తుందని ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ప్రజా ప్రభుత్వాలకు నిజమైన అర్థం ఏదో రూపంలో సంపదను నిరుపేద వర్గాలకు అందించడమేననే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. నివేదికలో ముఖ్యాంశాలు.. ► భారీ ఆర్థిక శక్తుల వద్దే వ్యక్తిగత సంపద కూడా కూడుతోంది. అమెరికా, చైనా కలిసి ప్రపంచంలోని వ్యక్తిగత సంపదలో సగం ఉండగా, ఆయా దేశాల జీడీపీ ప్రపంచ దేశాల జీడీపీతో పోలిస్తే కొంత వ్యత్యాసం కనిపిస్తుంది. ప్రపంచంలోని అన్ని దేశాల జీడీపీలో అమెరికా వాటా 24 శాతం కాగా, వ్యక్తిగత సంపదలో 31.5 శాతం ఉండటం గమనార్హం. చైనా అలా లేదు. ప్రపంచ జీడీపీలో చైనా వాటా 19 శాతం, వ్యక్తిగత సంపదలో ఆ దేశం వాటా 18.4 శాతం. అంటే.. అమెరికాలో జీడీపీకంటే వ్యక్తిగత సంపాదన వాటా ఎక్కువ ఉంటే.., చైనాలో ఇది తక్కువ. ► ప్రపంచంలోని వ్యక్తిగత సంపదలో 75 శాతం కేవలం 10 దేశాల్లోనే ఉంది. ► దశాబ్దం క్రితం ప్రపంచ వ్యక్తిగత సంపదలో చైనా వాటా 9 శాతం ఉండగా, ఇప్పుడు రెట్టింపు అయింది. ► 10 లక్షల డాలర్లు, అంతకంటే ఎక్కువ సంపద ఉన్న వ్యక్తుల (మిలయనీర్ల) సంఖ్య 2021లో 7.9 లక్షలు. 2026 నాటికి ఈ సంఖ్య రెట్టింపై 16.23 లక్షలకు చేరుతుందని అంచనా. ► ప్రపంచ వ్యక్తిగత సంపద వాటాలో మన దేశం వాటా అంతగా పెరగలేదు. అయితే దేశంలో వ్యక్తిగత సంపదలో వృద్ధి నమోదవుతోంది. 2020తో పోలిస్తే 2021లో 12 శాతం వృద్ధి నమోదు చేసి 14.2 లక్షల కోట్ల డాలర్లకు చేరింది. మన దేశంలో ఒక్కో వ్యక్తికి ఉన్న సరాసరి సంపద విలువ 2000 సంవత్సరం నుంచి ఏటా 8.8 శాతం పెరుగుతోంది. 2021 ఆఖరుకు అది 15,535 డాలర్లకు చేరింది. అది ప్రపంచ సరాసరి వ్యక్తిగత సంపద (87,489 డాలర్లు)తో పోలిస్తే బాగా తక్కువ. ► ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం 6.2 కోట్ల మంది మిలియనీర్లు ఉండగా, 2026 నాటికి వీరి సంఖ్య 8.75 కోట్లకు చేరుతుందని అంచనా. ► ప్రపంచంలోని డాలర్ మిలియనీర్లు మన దేశంలో ఒక శాతం ఉండగా, అమెరికాలో 39 శాతం మంది ఉన్నారు. చైనాలో 10 శాతం మంది, జపాన్, యూకే, ఫ్రాన్స్‌లో 5 శాతం చొప్పున, జర్మనీ, కెనడా, ఆస్ట్రేలియాలో 4 శాతం చొప్పున, ఇటలీ, దక్షిణ కొరియా, స్విట్జర్లాండ్, నెదర్లాండ్స్, స్పెయిన్‌లో 2 శాతం చొప్పున ఉన్నారు. తైవాన్, హాంకాంగ్, స్వీడన్లో ఒక శాతం చొప్పున ఉన్నారు. మిగతా 10 శాతం మంది ప్రపంచంలోని మిగిలిన దేశాల్లో ఉన్నారు. -
లక్కీ లాటరీలో మూడు కోట్ల ఇల్లు.. రూ. 280కే!!
‘మంచి తరుణం మించిన దొరకదు..ఆలోచించిన ఆశా భంగం...రండి బాబు రండి..రూ.3.7కోట్ల ఖరీదైన ఇల్లును రూ.280కే అందిస్తాం’ అంటూ ప్రచారం జోరుగా కొనసాగుతుంది. ఇంతకీ ఆ ఖరీదైన ఇల్లు ఎక్కడ ఉంది? రూ.280కే.. రూ. 3 కోట్ల విలువైన ఆ ఇల్లును కొనుగోలు చేయొచ్చా? ఇంతకీ ఆ ఇంటి కథాకమామిషు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇంటి ధర రూ.3.7 కోట్లు. అందులో మూడు స్టేర్లు. స్టైలిష్ ఫర్నీచర్. నాలుగు పెద్ద పెద్ద బెడ్రూంలు. తినేందుకు విశాలమైన కిచెన్‌లో డైనింగ్ ఏరియా. కుటుంబ సభ్యులతో, స్నేహితులతో సేదతీరేందుకు లివింగ్ రూమ్. పైగా ఇంటి నిర్వహణ ఖర్చు చాలా తక్కువ. సాధారణంగా ఇటువంటి విలాసవంతమైన భవనంలో ఉండేందుకు నెల అద్దె సుమారు రూ.188,000 చెల్లించాల్సి ఉంటుంది. కానీ ఈ ముగ్గురు అన్నదమ్ములు మాత్రం కొనుగోలు దారులకు కేవలం రూ.280కే ఇస్తామని ప్రకటించారు. ముగురు సోదరులు బ్రిటన్‌కు చెందిన డానియల్, జాన్సన్,ట్వెన్‌ఫోర్ ముగ్గురు అన్నదమ్ములు. ఈ అన్నదమ్ములు కోవిడ్ -19 సమయంలో రియల్ ఎస్టేట్ బిజినెస్‌లోకి అడుగు పెట్టారు. బిజినెస్ ప్రారంభంలో వాళ్లకు తట్టిన ఓ చిన్న ఐడియా కోటీశ్వరుల్ని చేసింది. ఇప్పుడు అదే స్ట్రాటజీతో రూ. 280కే కోట్ల విలువైన బంగ్లాను అప్పనంగా ఇచ్చేస్తామని చెబుతున్నారు. అయితే ఇందుకోసం ఓ షరతు విధించారు. ఏంటా షరతు! ఐడియా..కనెక్టింగ్ పీపుల్ ముగ్గురు సోదరులు ఈ ఖరీదైన ఇంటిని అమ్మేందుకు ఓ మాస్టర్ ప్లాన్ వేశారు. రూ. 280తో లాటరీ కొంటే ఆ విల్లా మీ సొంతమయ్యే అవకాశాన్ని కల్పిస్తున్నారు. కేంబ్రిడ్జ్ న్యూస్ ప్రకారం..ఇంటిని అమ్మేందుకు అవసరమైన స్టాంప్ డ్యూటీ, చట్టపరమైన రుసుము వంటి బదిలీ ఖర్చులను కవర్ చేయడానికి ట్వెన్‌ఫోర్ బ్రదర్స్ లాటరీ తరహాలో సుమారు 155,000 టిక్కెట్లను విక్రయించాల్సి ఉంటుంది. కానీ 155,000 టిక్కెట్లు అమ్ముడుపోకపోతే..లాటరీ తీసి అందులో గెలిచిన విజేతకు ఇంటికి బదులుగా లాటరీ మొత్తం నగదులో 70 శాతం అందిస్తారు. బావుంది కదా బిజినెస్. ట్రామ్వే పాత్ పేరుతో నిర్వహిస్తున్న ఈ బిజినెస్‌లో ఇప్పటి వరకు ఈ ముగ్గురు సోదరులు నష్టపోలేదు. ట్రామ్వే పాత్ ట్రామ్వే పాత్ వెబ్సైట్ ప్రకారం..బ్రిటన్ కెంట్లోని మెడ్వేలో ఉన్న ఈ అద్భుతమైన 4 బెడ్ రూమ్‌ల ఇల్లు చారిత్రాత్మక సంస్కృతి, కళలు సమృద్ధిగా ఉన్న ప్రాంతంలో ఉంది. లండన్ విక్టోరియా నుంచి లండన్ సెయింట్ పాన్క్రాస్ల నాలుగు కిలోమీటర్ల దూరాన్ని గంటలోపు చేరుకునే ప్రయాణ సౌకర్యం ఉంది’ అని పేర్కొంది. -
హైదరాబాద్‌లో తగ్గిన రిజిస్ట్రేషన్లు!
హైదరాబాద్‌లో ప్రతి నెలా స్థిరాస్తి రిజిస్ట్రేషన్లు తగ్గిపోతున్నాయి. ఆగస్టులో 5,656 ప్రాపర్టీలు రిజిస్ట్రేషన్ జరగగా.. గత నెలలో 24 శాతం మేర క్షీణించి 4,307లకు పడిపోయాయి. విలువల పరంగానూ తగ్గుదలే నమోదయింది. ఆగస్టులో రిజిస్ట్రేషన్ల విలువ రూ.28,453 కోట్లు కాగా.. సెప్టెంబర్ నాటికి 16 శాతం 23 శాతం మేర తగ్గి రూ.21,978 కోట్లకు తగ్గాయని నైట్‌ఫ్రాంక్ ఇండియా నివేదిక వెల్లడించింది. గత నెలలో జరిగిన రిజిస్ట్రేషన్లలో 55 శాతం ప్రాపర్టీలు రూ.25 లక్షల నుంచి రూ.50 లక్షలు మధ్య విలువ ఉన్నవే. అలాగే 75 శాతం గృహాలు వెయ్యి చ.అ. నుంచి 2 వేల చ.అ. మధ్య విస్తీర్ణం ఉన్నవే జరిగాయి. గ్రేటర్లో ఈ ఏడాది జనవరి నుంచి సెప్టెంబర్ వరకు రూ.25,094 కోట్ల విలువ చేసే 50,953 ప్రాపర్టీలు రిజిస్ట్రేషన్లు జరిగాయి. గతేడాది తొలి తొమ్మిది నెలల కాలంలో రూ.27,640 కోట్ల విలువ చేసే 62,052 యూనిట్లుగా ఉన్నాయి. చదవండి: ఎంబీబీఎస్ విద్యార్థులు ఇకపై ఫ్యామిలీ డాక్టర్లుగా.. -
బతికుండగానే చంపేశారు!
అనంతపురం శ్రీకంఠంసర్కిల్: ఆస్తిపై కన్నేసిన దుర్మార్గులు ఓ వ్యక్తి బతికుండాగానే చనిపోయినట్లు రికార్డులు సృష్టించారు. ఘటనకు సంబంధించి ఎప్పీ డాక్టర్ ఫక్కీరప్ప ఆదేశాల మేరకు అనంతపురం రెండో పట్టణ సీఐ శివరాముడు కేసు నమోదు చేశారు. వివరాలను మంగళవారం ఆయన వెల్లడించారు. అనంతపురం రెండో పట్టణ పోలీస్‌స్టేషన్ పరిధిలోని శ్రీరామ్‌నాయక్... మృతి చెందినట్లు నకిలీ ధ్రువీకరణ పత్రాలు సృష్టించి ఆయన ఇంటిని కాజేశారు. ఈ విషయాన్ని తెలుసుకున్న శ్రీరామ్‌నాయక్ ఇటీవల ఎస్పీకి ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా, ఈ కేసులో ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేట్ వ్యక్తుల పాత్రపై విచారణ చేస్తున్నట్లు తెలిపారు. (చదవండి: ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’లో మూడేళ్లుగా అగ్రస్థానంలో ఏపీ) -
సొంతంగా కారు కూడా లేదు.. ములాయం సింగ్ ఆస్తుల విలువెంతో తెలుసా?
లక్నో: రాజకీయ దిగ్గజం, సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు, ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్(82) కన్నుమూసిన విషయం తెలిసింది. వయసు సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ములాయం.. గురుగ్రామ్‌లోని మేదాంత ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆనారోగ్య సమస్యల రీత్యా ఆగస్టు 22 నుంచి ములాయం ఆసుపత్రిలోనే ఉన్నారు. ములాయం సింగ్ మరణాన్ని ఆయన కుమారుడు ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ ట్విటర్ ద్వారా వెల్లడించారు. ‘మా తండ్రి, మీ ‘నేతాజీ’ ఇక లేరు. ములాయం సింగ్ యాదవ్ అంత్యక్రియలు అక్టోబర్ 11(మంగళవారం) సౌఫయ్ గ్రామంలో జరుగుతాయి’. అని తెలిపారు. ములాయం సింగ్ ఆస్తులు జాతీయ స్థాయిలో చక్రం తిప్పిన ప్రాంతీయ నేతగా గుర్తింపు పొందిన ములాయం సింగ్ ఆస్తి వివరాలు ఇలా ఉన్నాయి. 2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో ఎలక్షన్ కమిషన్‌కు సమర్పించిన అఫిడవిట్లో ములాయం సింగ్ నికర ఆస్తులు విలువ రూ. 20.56 కోట్లు. ఈ అఫిడవిట్ ప్రకారం తన మొత్తం చర, స్థిరాస్తులు దాదాపు రూ.16.5 కోట్లు.(16,52,44,300). 2014 లోక్‌సభ ఎన్నికల సమయంలో దాఖలు చేసిన అఫిడవిట్‌తో పోలిస్తే ఇది రూ. 3.20 కోట్లు తక్కువ. వీటితోపాటు ములాయం ఏటా రూ.32.02 లక్షలు సంపాదిస్తుండగా.. ఆయన భార్య సాధనా యాదవ్ వార్షికాదాయాన్ని రూ. 25.61 లక్షలుగా పేర్కొన్నారు. చదవండి: ప్చ్.. ములాయంకు ఆ కోరిక మాత్రం తీరలేదు బ్యాంక్ డిపాజిట్లు, బంగారం ములాయం సింగ్ యాదవ్ వద్ద రూ.16,75,416 నగదు ఉండగా, బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, ఎన్బీఎఫ్సీల్లో రూ.40,13,928 డిపాజిట్లు ఉన్నాయి. మొత్తం రూ. 9,52,298 విలువైన ఎల్ఐసీ ఇతర బీమా పాలసీలను కలిగి ఉన్నాడు. అంతేగాక ఆభరణాల విషయానికొస్తే.. ఆయన వద్ద 7.50 కిలోల బంగారం ఉంది. దీని విలువ రూ.2,41,52,365. తదితర ప్రాంతాల్లో ఆయనకు రూ.7,89,88,000 విలువైన వ్యవసాయ భూమి కూడా ఉంది. వ్యవసాయేతర భూమిపరంగా రూ.1,44,60,000 విలువైన ఆస్తులు ఉన్నాయి. యూపీలో అతని నివాస ప్రాపర్టీ ధర రూ.6,83,84,566. చదవండి: రక్షణ మంత్రిగా, సీఎంగా ఎనలేని సేవలందించారు! కారు లేదు, కొడుకు నుంచి అప్పు ములాయం సింగ్ యాదవ్ తన వద్ద కారు లేదని అఫిడవిట్లో వెల్లడించారు. అలాగే కుమారుడు అఖిలేష్ యాదవ్ నుంచి రూ.2,13,80,000(2.13 కోట్లు) అప్పు కూడా తీసుకున్నారని పేర్కొన్నారు. ఇక ములాయం చదువు విషయానికొస్తే 1968లో ఆగ్రా యూనివర్శిటీ నుంచి పొలిటికల్ సైన్స్‌లో ఎంఏ పూర్తి చేశారు. 1964లో ఆగ్రా యూనివర్శిటీ నుంచి బీటీ పట్టా పొందారు. ఎస్పీలో విషాదఛాయలు ములాయం మృతితో ఎస్పీ పార్టీలో విషాద చాయలు అలుముకున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ సహా ప్రముఖులు ఆయన మృతికి సంతాపం వ్యక్తం చేశారు. ములాయం అంత్యక్రియలు ఆయన స్వగ్రామమైన సైఫయిలో అధికారిక లాంఛనాలతో జరగనున్నాయి, రాష్ట్రంలో మూడు రోజులు సంతాప దినాలు ప్రకటించారు. కాగా 22 నవంబర్ 1939న యూపీలోని ఇటావా జిల్లాసైఫయ్ గ్రామంలో సాధారణ కుటుంబంలో జన్మించిన ములాయం రాజకీయాల్లోకి రాకముందు టీచర్‌గా సేవలు అందించారు. అనంతరం ఉపాధ్యాయ వృత్తిని విడిచిపెట్టి రాజకీయాల్లోకి వచ్చి సమాజ్ వాదీ పార్టీని స్థాపించారు. ఇది కూడా చదవండి: ఎస్పీకి ఆయనో నేతాజీ.. కుస్తీల వీరుడు కూడా! ములాయం సింగ్ ఉత్తర ప్రదేశ్‌కు మూడుసార్లు సీఎంగా పనిచేశారు. యూపీ రాజకీయాల్లో చక్రం తిప్పడంతోపాటు జాతీయ స్థాయిలోనూ ఆయన ప్రముఖపాత్ర పోషించారు.పదిసార్లు ఎమ్మెల్యే, ఏడుసార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వంలో(1996-98) రక్షణశాఖ మంత్రిగానూ సేవలందించారు. సుధీర్ఘకాలంపాటు పార్లమెంటేరియన్‌గా కొనసాగారు. పార్టీ నేతలు, అభిమానులు ఆయన్ను ముద్దుగా నేతాజీ అని పిలుచుకుంటారు. ఆయన తుదిశ్వాస వరకు మెయిన్‌పూరి లోక్‌సభ స్థానానికి ఎంపీగా ఉన్నారు. -
హైదరాబాద్ మార్కెట్లో అధికంగా ఇళ్ల విక్రయాలు
న్యూఢిల్లీ: హైదరాబాద్ రియల్టీ మార్కెట్ మురిసింది. జూలై–సెప్టెంబర్ త్రైమాసికంలో 35 శాతం అధికంగా ఇళ్ల విక్రయాలు నమోదయ్యాయి. 10,570 ఇళ్ల యూనిట్లు అమ్ముడయ్యాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో 7,810 ఇళ్ల యూనిట్లు అమ్ముడు కావడం గమనార్హం. బెంగళూరు కంటే కూడా హైదరాబాద్ మార్కెట్ తన సత్తా చాటింది. బెంగళూరులో ఇళ్ల విక్రయాలు 20 శాతం వృద్ధితో 7,890 యూనిట్లుగా ఉన్నాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో అమ్మకాలు 6,550 యూనిట్లు మాత్రమే. దేశవ్యాప్తంగా ఎనిమిది ప్రధాన పట్టణాల్లో సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో ఇళ్ల అమ్మకాలు 49 శాతం వృద్ధిని చూశాయి. మొత్తం 83,220 యూనిట్లు విక్రయమైనట్టు ప్రాపర్‌టైగర్ పోర్టల్ ఈ ఏడాది మూడో త్రైమాసికానికి సంబంధించిన నివేదికలో వెల్లడించింది. ఇళ్ల ధరలు పెరిగినా, వడ్డీ రేట్లు పెరిగినా కానీ, గతంలో నిలిచిన డిమాండ్ తోడు కావడంతో ఇళ్ల అమ్మకాలు జోరుగా సాగినట్టు ప్రాప్ టైగర్ నివేదిక వివరించింది. 2021 సెప్టెంబర్ క్వార్టర్లో దేశవ్యాప్తంగా ఎనిమిది పట్టణాల్లో అమ్ముడుపోయిన ఇళ్ల యూనిట్లు 55,910గా ఉన్నాయి. అంతేకాదు ఈ పట్టణాల్లో ఇళ్ల అమ్మకాలు కరోనా ముందు నాటి గణాంకాలను మించి నమోదు కావడం డిమాండ్ బలంగా ఉన్నట్టు తెలియజేస్తోంది. ప్రతికూలతలను అధిగమించి.. రియల్ ఎస్టేట్ పరిశ్రమ కరోనా మహమ్మారి, తదనంతర అవరోధాలను అధిగమించినట్టు ప్రాప్ టైగర్ డాట్ కామ్ గ్రూపు సీఎఫ్‌వో వికాస్ వాధ్వాన్ తెలిపారు. గృహ రుణాల రేట్లు పెరిగినప్పటికీ ఇళ్లకు డిమాండ్ తగ్గలేదన్నారు. సొంతిల్లు కలిగి ఉండాలన్న ఆకాంక్షే డిమాండ్ పుంజుకోవడానికి కారణంగా పేర్కొన్నారు. మార్కెట్ ధోరణులను పరిశీలిస్తే రానున్న త్రైమాసికాల్లో నివాసిత గృహాలకు సానుకూల డిమాండ్ ఉంటుందని తెలుస్తోందని ప్రాప్ టైగర్ డాట్ కామ్ రీసెర్చ్ హెడ్ అంకితా సూద్ తెలిపారు. పండుగల తగ్గింపులు, సులభతర చెల్లింపుల ప్లాన్లు ఇవన్నీ కలసి డిమాండ్‌ను బలంగా నిలబెడతాయని అంచనా వేశారు. పట్టణాల వారీగా.. ► ముంబైలో ఇళ్ల విక్రయాలు సెప్టెంబర్ క్వార్టర్లో 28,800 యూనిట్లుగా ఉన్నాయి. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో విక్రయాలు 14,160 యూనిట్లతో పోలిస్తే రెట్టింపయ్యాయి. ► పుణెలో 55 శాతం పెరిగి 15,700 యూనిట్లు అమ్ముడుపోయాయి. ► అహ్మదాబాద్ మార్కెట్లోనూ 44 శాతం అధికంగా ఇళ్ల విక్రయాలు నమోదయ్యాయి. ఇక్కడ 7,880 యూనిట్ల విక్రయాలు జరిగాయి. ► చెన్నై, కోల్‌కతా మార్కెట్లో అమ్మకాలు క్షీణించాయి. చెన్నై మార్కెట్లో 6 శాతం తగ్గి 4,420 యూనిట్లు, కోల్‌కతా మార్కెట్లో 4 శాతం తగ్గి 2,530 యూనిట్ల అమ్మకాలకు పరిమితమయ్యాయి. -
ఆస్తి కోసం అంధురాలిపై హత్యాయత్నం
పెద్దపప్పూరు: ఆస్తి కోసం అంధురాలిపై సొంత తమ్ముడి భార్యే హత్యాయత్నం చేసింది. పోలీసులు తెలిపిన మేరకు... పెద్దపప్పూరు మండలం ముచ్చుకోటకు చెందిన పెద్దక్క, నాగార్జున అక్కాతమ్ముడు. పెద్దక్కకు కళ్లు కనిపించవు. ఆమె ఆస్తిపై కన్నేసిన తమ్ముడు నాగార్జున, అతని భార్య స్వాతి.. సోమవారం ఉదయం పెద్దక్కను గ్రామ శివారులోని అక్కమ్మ గుడి వద్దకు పిలుచుకెళ్లారు. ఆమె పేరున ఉన్న ఆస్తిని తన పేరున రాయాలని ఆ సమయంలో పెద్దక్కతో నాగార్జున గొడవపడ్డాడు. ఇందుకు అంగీకరించకపోవడంతో పక్కనే ఉన్న పెద్ద బండరాయిని స్వాతి తీసుకుని పెద్దక్క తలపై దాడి చేసింది. ఆ సమయంలో ఆమె కేకలు వేయడంతో చుట్టు పక్కల వారు అప్రమత్తమై అక్కడకు చేరుకున్నారు. అప్పటికే నాగార్జున, స్వాతి పారిపోయారు. తలకు తీవ్రగాయమైన పెద్దక్కను స్థానికులు వెంటనే తాడిపత్రి ఏరియా ఆస్పత్రికి తరలించారు. కాగా, పెద్దక్క తండ్రికి ఐదుగురు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. అంధురాలైన పెద్దక్కకు పెళ్లి కాలేదు. తనకున్న నాలుగు ఎకరాల భూమిని కుమార్తెలతో పాటు కుమారుడికీ తండ్రి భాగ పరిష్కారాలు చేసిచ్చాడు. అయితే ఒంటరిగా ఉన్న పెద్దక్క ఆస్తిని ఎలాగైనా తమ పేరున రాయించుకోవాలని నాగార్జున భార్య స్వాతి ప్రయత్నించి విఫలం కావడంతో హతమార్చేందుకు ప్రయత్నించినట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. (చదవండి: కందికుంట మా అమ్మను తిట్టినా నేను భరించా: సీఐ మధు) -
మీ ప్రాపర్టీస్‌పై ఎక్కువ ఆదాయం రావాలంటే గుర్తుంచుకోవలసిన విషయాలు!
దేశంలో స్థిరాస్థి మార్కెట్ పరుగులు తీస్తోంది. వరుసగా రెండేళ్ల పాటు మధ్యలో కోవిడ్-19 ఒడిదొడుకులు ఎదురైనా మళ్లీ పుంజుకుంది. వైరస్ తగ్గుముఖం పట్టి భవిష్యత్తుపై భరోసా కనిపిస్తుండటంతో క్రయ విక్రయాలు జోరుగా కొనసాగుతున్నాయి. దీంతో మదుపర్లు హైదరాబాద్, బెంగళూరు వంటి మహా నగరాల్లో స్థిరాస్థులైన ఇళ్లు, ప్లాట్లు, అపార్ట్మెంట్ల మీద పెట్టుబడులు పెడుతున్నారు. ఆ పెట్టుబడులే సురక్షితమైనవని, సమీప భవిష్యత్‌లో అవి పెరిగే అవకాశం ఉందని ఆశిస్తున్నారు. అందుకే స్థిరాస్థి రేట్లు పెరుగుతున్నా పెట్టుబడులు పెట్టేందుకు మొగ్గు చూపుతున్నారు. ఒక వేళ మీరూ ప్రాపర్టీస్ మీద పెట్టుబడి పెట్టాలని అనుకుంటున్నారా? ఆ ప్రాపర్టీస్ మీద పెట్టిన పెట్టుబడి కంటే ఎక్కువ రిటర్న్ పొందాలని అనుకుంటున్నారా? అయితే పెట్టుబడి పెట్టే ముందు ఈ విషయాల్ని పరిగణలోకి తీసుకోండి. తద్వారా భవిష్యత్‌లో ఊహించని దానికంటే ఎక్కువ రిటర్న్ పొందవచ్చని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. లొకేషన్ మీరు ఏ ప్రాంతంలో పెట్టుబుడులు పెడుతున్నారో.. ఆ పెట్టుబడుల నుంచి ఎంత రిటర్న్స్ రావాలో నిర్ణయించేది లొకేషన్ మాత్రమే. అందుకే ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఉండి, ఆదాయం పొందాలనుకుంటే అభివృద్ధి అవుతున్న ప్రాంతాల్లో మాత్రమే పెట్టుబడి పెట్టండి. ఈ పెట్టుబడి ఇప్పటికే అభివృద్ధి చెందిన ప్రాంతాల్లో పెట్టే పెట్టుబడికంటే తక్కువగా ఉంటుంది. సౌకర్యం కొనుగోలు దారులు షాపింగ్ క్లాంప్లెక్స్, పార్క్స్,స్కూల్స్, హాస్పిటల్స్ ఎక్కువగా ఉన్న ఏరియాకు చెందిన ప్రాపర్టీల మీద పెట్టుబడులు పెట్టాలని అనుకుంటారు. అందుకే మీరు ప్రాపర్టీస్మీద పెట్టుబడులు పెట్టే ప్రాంతాల్లో ఈ సౌకర్యాలు ఉన్నాయా? లేవా అని చూసుకోండి. ఇప్పటికే ఈ సౌకర్యాలు ఉంటే ఇన్వెస్ట్ చేయండి. లేదంటే భవిష్యత్‌లో పైన పేర్కొన్న సదుపాయాలు అందుబాటులోకి వస్తాయని తెలిసినా పెట్టుబడి పెట్టొచ్చు. ట్రాన్స్ పోర్ట్ ప్రాపర్టీని కొనుగోలు చేసే బయ్యర్స్ పరిగణలోకి తీసుకునే అంశం ట్రాన్స్పోర్ట్. ట్రాన్స్ పోర్ట్ సౌకర్యం ఉందా? కనెక్టివిటీ ఆప్షన్ ఉందా? అని చూసుకుంటారు. అదే ఆస్తిపై కొనుగోలుదారుడి ఆసక్తి, దాని విలువ పెరగడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. మీరు ప్రాపర్టీస్ మీద పెట్టుబడి పెట్టాలనుకుంటున్నట్లైతే రైల్వే స్టేషన్, విమానాశ్రయాలు, బస్టాండ్ సౌకర్యం ఉన్న ప్రాంతాల్లో ఇన్వెస్ట్ చేయండి. కమర్షియల్ ఏరియాలు మీ పెట్టుబడులు పెట్టాలనుకుంటున్న ప్రాపర్టీస్ కమర్షియల్ ఏరియాల్లో ఉంటే మంచిది. ముఖ్యంగా కార్పొరేట్ ఆఫీస్‌లు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో పెట్టే పెట్టుబడులతో అధిక ఆదాయం పొందవచ్చు. ప్రాపర్టీస్‌ను లీజ్‌గా ఇవ్వొచ్చు. ఇళ్లైతే రెంట్‌కు ఇవ్వొచ్చు. ఇలా ప్రాపర్టీస్ మీద ఎక్కువ ఆదాయం గడించవచ్చని ఆర్ధిక నిపుణులు చెబుతున్నారు. -
ఆధార్ మార్చి.. ఆస్తులు కాజేయాలని..
సాక్షి, అనంతపురం: ఆధార్ కార్డులో ఫొటో, ఇతర వివరాలు మార్పు చేసి స్థిరాస్తులను కాజేయాలనుకున్న ఓ‘ ముఠాను అనంతపురం పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి ప్రింటర్, స్కానర్ తదితర 12 రకాల పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఆదివారం అనంతపురం డీఎస్పీ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో త్రీటౌన్ సీఐ కత్తి శ్రీనివాసులు వెల్లడించారు. ప్రస్తుతం అరెస్టు అయిన బత్తల శేఖర్ (ఆర్కేనగర్, అనంతపురం), అచ్చుకట్ల ఇంతియాజ్ (అనంతపురం తహసీల్దార్ కార్యాలయ ఔట్సోర్సింగ్ ఉద్యోగి, కళ్యాణదుర్గం రోడ్డులో నివాసం), కర్తనపర్తి సురేష్ (ఆధార్ సెంటర్ నిర్వాహకుడు, రామకృష్ణ కాలనీ, అనంతపురం) ముఠాలో సభ్యులు. ఈ ముఠాకు సూత్రధారి నగరంలోని ఆర్కే నగర్‌కు చెందిన అంపగాని శ్రీనివాసులు. ఇతను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాడు. విలువైన భూములు, స్థలాలున్న వృద్ధులను లక్ష్యంగా చేసుకుని మోసాలకు పాల్పడేవాడు. నాల్గవ పట్టణ పీఎస్ పరిధిలో ఓ వ్యక్తికి సంబంధించిన 14 ఎకరాల స్థిరాస్తి కాజేయాలనుకున్న కేసులో ఈ నెల 12న పోలీసులు రిమాండ్‌కు పంపారు. ఇలా వెలుగులోకి.. ఈ ముఠా సభ్యులు అనంతపురంలోని సైఫుల్లా బ్రిడ్జి సమీపంలోని కామన్ సర్వీస్ పాయింట్లో ఆధార్‌లో మార్పులు చేసి అమాయకుల ఆస్తులు కొల్లగొట్టేందుకు యతి్నంచేవారు. ఇదే క్రమంలో త్రీటౌన్ పీఎస్ పరిధిలో ఉండే వృద్ధుడు వెంకటసుబ్బయ్య ఆస్తులపై కన్నుపడింది. వన్‌టౌన్, తదితర ప్రాంతాల్లో ఇతని పేరు మీద విలువైన స్థలాలు ఉన్నాయి. దీంతో శేఖర్ అనే టీ స్టాల్ నిర్వాహకుడి ద్వారా హకీం అబ్దుల్ మసూద్‌ను పావుగా వాడుకున్నారు. వెంకట సుబ్బయ్య ఆధార్ కార్డులో హకీం అబ్దుల్ మసూద్ ఫొటోను మార్చి, అదే అడ్రెస్సుతో కొత్త ఆధార్ కార్డుకు ఎన్రోల్ చేశారు. ఆధార్‌లో వెంకటసుబ్బయ్య అడ్రెస్సు ఉండడంతో అతని ఇంటికి ఆధార్ వెళ్లింది. అప్రమత్తమైన వెంకటసుబ్బయ్య విషయాన్ని త్రీటౌన్ సీఐ కత్తి శ్రీనివాసులు దృష్టికి తీసుకెళ్లారు. ఆయన కేసు నమోదు చేసి లోతుగా విచారణ చేపట్టగా అసలు బాగోతం వెలుగు చూసింది. ఆదివారం నాల్గవ రోడ్డు ఎక్స్‌టెన్షన్‌లోని శాంతినగర్ బోర్డు వద్ద ముఠాలోని ముగ్గురు నిందితులను సీఐ కత్తి శ్రీనివాసులు, ఎస్ఐ వలిబాషు అరెస్టు చేశారు. అనంతరం కామన్ సరీ్వసు పాయింట్లో ఉన్న 12 రకాల వస్తువులను పోలీసులు స్వా«దీనం చేసుకున్నారు. నిందితులను న్యాయమూర్తి ముందు హాజరుపర్చగా రిమాండ్‌కు ఆదేశించారు. ఆధార్ కార్డులో పేరు మార్పు.. వ్యక్తికి రిమాండ్ ఆధార్ కార్డులో పేరు మార్పు చేసిన కేసులో ఓ వ్యక్తిని వన్‌టౌన్ పోలీసులు రిమాండ్‌కు పంపారు. సీఐ రవిశంకర్ రెడ్డి తెలిపిన మేరకు... బుక్కరాయ సముద్రం మండలం చెన్నంపల్లికి చెందిన తాతిరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఎలాంటి పనులు చేయకుండా తిరిగేవాడు. ఈ క్రమంలో తన ఆధార్ కార్డును మార్చి పింఛన్ తీసుకునేందుకు కుట్ర పన్నాడు. ఆధార్‌లో తన పేరు, తండ్రి పేరు, ఇంటి అడ్రస్సుకు బదులుగా నగరంలోని పాతూరుకు చెందిన వెంకటరమణ అనే వృద్ధుడు పేరుతో ఆధార్ సెంటర్లో దాఖలు చేయించాడు. కొత్త ఆధార్ కార్డు సంబంధిత వెంకటరమణ ఇంటికి వెళ్లగా అతను వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు చీటింగ్‌కు పాల్పడ్డ తాతిరెడ్డి శ్రీధర్‌రెడ్డిని ఆదివారం కలెక్టరేట్ సమీపంలో అరెస్టు చేసి, న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్‌కు పంపారు. (చదవండి: తాత అంతిమయాత్రను అడ్డుకున్న మనవడు.. ‘లెక్క తేలేవరకు శవాన్ని ఎత్తనిచ్చేది లేదు’) -
వీడిన మిస్టరీ.. బావే హంతకుడు.. అత్త ఆస్తి కోసం..
కంబదూరు(అనంతపురం జిల్లా): అన్నదమ్ములు కీడెంచితే.. బావ మంచి కోరతాడనేది నానుడి. కానీ ఇక్కడ అందుకు భిన్నంగా జరిగింది. ఆస్తి కోసం బావమరిదిని బావే హత్య చేసి, ఎవరికీ తెలియకుండా పూడ్చిపెట్టాడు. రెండున్నర నెలల తర్వాత అసలు విషయం వెలుగు చూసింది. కంబదూరు మండలం ములకనూరు గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సీఐ శ్రీనివాసులు, ఎస్ఐ రాజేష్ తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. ములకనూరు గ్రామానికి చెందిన దండా శారదమ్మకు అఖిల్(15) అనే కుమారుడితో పాటు వర్షిత, త్రిష అనే ఇద్దరు కుమారై లు ఉన్నారు. అఖిల్ గ్రామంలోని జెడ్పీ హైస్కూల్లో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. పెద్ద కుమార్తె వర్షితకు ఎనిమిది నెలల క్రితం గుద్దెళ్ల గ్రామానికి చెందిన అనిల్‌తో వివాహమైంది. చదవండి: కామంతో కళ్లు మూసుకుపోయి.. వావి వరసలు మరిచిపోయి.. అనిల్ తన భార్యతో కలసి అత్తారింట్లోనే ఉంటున్నాడు. గ్రామంలో శారదమ్మకు 13 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. అనిల్‌కు ఆ భూమిపై కన్ను పడింది. శారదమ్మ ఏకైక కుమారుడైన అఖిల్‌ను అడ్డు తొలగించుకొంటే భూమి తన సొంతమవుతుందని భావించాడు. ఈ క్రమంలోనే ఈ ఏడాది మే 21న ములకనూరులో జరిగిన తిమ్మప్ప జాతర సందర్భంగా అఖిల్‌కు సెల్ ఫోన్ తీసిస్తానని నమ్మించి బైక్‌లో ఎక్కించుకుని గుద్దెళ్ల సమీపంలోని తన వ్యవసాయ తోటలోకి తీసుకెళ్లాడు. అక్కడ కొడవలి, కర్రతో దాడి చేసి చంపేసి, తర్వాత డ్రిప్ వైర్‌తో శరీరాన్ని బిగించి సమీపంలోని వంకలో పూడ్చిపెట్టాడు. రోదిస్తున్న అఖిల్ తల్లి, బంధువులు మరుసటి రోజు తన కుమారుడు కన్పించలేదని అఖిల్ తల్లి శారదమ్మ కంబదూరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు ఎస్ఐ రాజేష్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అనిల్ నెల రోజులుగా కన్పించకుండా పోవడంతో పాటు ఆ రోజు అఖిల్‌ను బైక్‌పై ఎక్కించుకుని వెళ్లిన విషయం తెలిసి శారదమ్మకు అల్లుడిపై అనుమానం వచ్చింది. ఇదే విషయాన్ని పోలీసులకు చెప్పింది. పోలీసులు ఆ కోణంలో దర్యాప్తు చేపట్టారు. బుధవారం కదిరిదేవరపల్లి రైల్వే స్టేషన్లో అనిల్‌ను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారణ చేశారు. అత్త భూమి కోసం తానే బావమరిదిని చంపి పూడ్చివేశానని అంగీకరించాడు. దీంతో సీఐ శ్రీనివాసులు, ఎస్ఐ రాజేష్ అతన్ని తీసుకొని అఖిల్‌ను పూడ్చిపెట్టిన స్థలానికి వెళ్లి తహసీల్దార్ నయాజ్ అహ్మద్ సమక్షంలో మృతదేహాన్ని వెలికితీయించారు. మృతదేహం పూర్తిగా కుళ్లిపోయి ఉండడంతో అక్కడే డాక్టర్లు శ్రీనివాసునాయక్, రా«ధ పోస్టుమార్టం నిర్వహించారు. తర్వాత నిందితున్ని అరెస్టు చేసి.. రిమాండ్‌కు తరలించారు. కన్నీరుమున్నీరైన తల్లి.. ‘నా వద్దే కూతురు, అల్లుడిని పెట్టుకుని సంసారమంతా చూసుకుంటిని. ఉన్న ఒక్కగానొక్క నా కొడుకును ఇంతా దారుణంగా చంపడానికి చేతులెలా వచ్చాయిరా? ఇన్ని రోజులు చెప్పకుండా ఎంత బాగా నటించావురా!’ అంటూ అఖిల్ తల్లి శారదమ్మ గుండెలవిసేలా రోదించింది. ‘ఇలాంటి వాడిని వదలొద్దండి సార్.. చంపేయండి’ అంటూ పోలీసులను వేడుకోవడం అక్కడున్న వారందరినీ కలచి వేసింది. -
ఆ బిలియనీర్ ఆస్తి అమాంతం కరిగిపోయింది
ఆమె ఒక బడా వ్యాపారవేత్త. నాలుగు రోజుల్లో రెండు బిలియన్ల సంపద ఆర్జించి.. యుక్తవయసులోనే ప్రపంచం దృష్టిని ఆకట్టుకుంది.. ఆసియాలోనే అత్యంత సంపద ఉన్న మహిళగా ఖ్యాతికెక్కింది. ప్చ్.. కానీ, అది ఏడాది కిందటి మాట. ఇప్పుడామె ఆస్తి సగం కరిగిపోయింది. అలా ఇలా కాదు. మన కర్సెనీలో చెప్పాలంటే.. లక్షల కోట్ల రూపాయలు మాయమయ్యాయి. ఇదంతా చైనాలో తలెత్తిన రియల్ ఎస్టేట్ రంగపు సంక్షోభ ప్రభావమే. ► యాంగ్ హుయియాన్(41).. చైనా రియల్టి దిగ్గజ సంస్థ కంట్రీ గార్డెన్లో అత్యధిక వాటాలున్న వ్యక్తి. నిరుడు ఆమె సంపద అక్షరాల 23.7 బిలియన్ డాలర్లు(ఆ ఏడాది మొదట్లో 27 బిలియన్డాలర్లుగా ఉంది). కానీ, ► అందులో సుమారు 52 శాతం సంపద ఐస్‌లా కరిగిపోయింది. ఇప్పుడు ఆమె మొత్తం ఆస్తి విలువ 11.3 బిలియన్ డాలర్లకు చేరుకుందని బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ పేర్కొంది. ► చైనా ప్రావిన్స్ అయిన గువాంగ్‌డాంగ్‌కు చెందిన కంట్రీ గార్డెన్ షేర్లు.. హాంకాంగ్ ట్రేడింగ్‌లో బుధవారం దారుణంగా దెబ్బ తిన్నాయి. ఈ ప్రభావంతోనే ఆమె దారుణంగా నష్టపోయింది. ► Yang Huiyan తండ్రి యాంగ్ గువోక్వియాంగ్.. కంట్రీ గార్డెన్ వ్యవస్థాపకుడు. ► 2005లో ఆయన తన వాటాలను కూతురి పేరు మీద రాయడంతో .. ఆమె రిచ్చెస్ట్ వుమెన్ లిస్ట్‌లో చేరిపోయారు. ► రెండేళ్లకు.. అంటే 2007లో కంట్రీ గార్డెన్ ఐపీవోకు వెళ్లింది. ఆ ప్రభావంతో.. ఆమె ఆసియాలో ధనిక మహిళగా గుర్తింపు పొందారు. ► అయితే సైప్రస్ పేపర్ల లీకేజీతో ఆమె ఒక్కసారిగా హాట్‌టాపిక్‌గా మారింది. ► చైనాలో ద్వంద్వ పౌరసత్వానికి వీల్లేదు. కానీ, ఆమె సైప్రస్ పౌరసత్వం 2018లో తీసుకున్నారన్న విషయం సైప్రస్ పేపర్ల ద్వారా వెలుగు చూసింది. ► ప్రస్తుతం యాంగ్ సంపద తరిగిపోవడంతో.. ఆమె ఈ లిస్ట్‌లో గట్టి పోటీనే ఎదుర్కొంటున్నారు. ► ఫైబర్స్ టైకూన్ అయిన ఫ్యాన్ హోంగ్‌వెయి సుమారు 11.2 బిలియన్ డాలర్లతో.. యాంగ్‌కు గట్టిపోటీనే ఇస్తోంది. ► కరోనా టైం నుంచి చైనాలో రియల్ ఎస్టేట్ రంగం ఒడిదుడుకులు ఎదుర్కొంటోంది. ► రియల్టి రంగంలో పెనుసంక్షోభంతో ప్రపంచంలోనే రెండో పెద్ద అర్థిక వ్యవస్థ మొత్తం చైనా పతనం దిశగా దూసుకుపోతోంది. ► ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త నిబంధనలను తట్టుకునేందుకు అడ్డగోలుగా డిస్కౌంట్లను ప్రకటించి.. ఇప్పుడు నగదు కొరతతో రియల్టి రంగంలోని దిగ్గజ కంపెనీలు ఇబ్బందుల పాలవుతున్నాయి. ► దేశంలోని ప్రైవేట్ రంగ కంపెనీలపై పట్టు సాధించడం కోసం డ్రాగన్ అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ "సాధారణ శ్రేయస్సు" (కామన్ ప్రాస్సరటీ) పేరుతో తీసుకువచ్చిన విధానం వల్ల చైనా బిలియనీర్ క్లాస్‌లో భారీ ఆటుపోట్లు సంభవిస్తున్నాయి. -
రూ.600 కోట్ల ఆస్తిని ప్రభుత్వానికి రాసిచ్చిన డాక్టర్.. ఎందుకో తెలుసా?
ఇతరులకు సాయం చేయాలి అనిపించినా చేసే స్థోమత అందరికీ లేకపోవచ్చు. కొంతమంది ఆ సామర్థ్యం ఉన్నా సాయం చేసేందుకు మనసు ఒప్పదు. కానీ ఇందుకు భిన్నంగా కొందరు తమ స్థాయి గురించి ఆలోచించకుండా ప్రజాసేవే పరమావధి జీవిస్తుంటారు. ఉత్తర ప్రదేశ్‌కు చెందిన అర్వింద్ గోయల్ అనే డాక్టర్ కూడా అచ్చం ఇలాంటి వాడే. ఏకంగా తన యావదాస్తిని రాష్ట్ర ప్రభుత్వానికి రాసిచ్చారు. అయితే ఆస్తి అనేగానే ఏదో 10, 20 లక్షలు, మహా అయితే కోటి రూపాయలు అనుకునేరు.. అక్షరాల 600 కోట్ల విలువైన ఆస్తిని పేదల సంక్షేమం,అభివృద్ధి కోసం యూపీ ప్రభుత్వానికి విరాళంగా ఇచ్చేశారు. దాదాపు 50 ఏళ్లుగా వైద్య వృత్తి ద్వారా ప్రజలకు సేవ చేస్తున్న అర్వింద్ గోయల్ కేవలం తన ఇంటిని మాత్రమే ఉంచుకొని మిగతా ఆస్తినంతా ఇచ్చేశారు. ఆస్తిని ఇచ్చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఈ నిర్ణయం 25 ఏళ్ల క్రితమే తీసుకున్నట్లు తెలిపారు. కాగా రోనా లాక్డౌన్ సమయంలో వేల మందిని కష్టాల నుంచి ఆదుకున్నారు. మోరదాబాద్‌లోని 50 గ్రామాలను దత్తత తీసుకొని అన్ని రకాల వసతులను ఉచితంగా కల్పించారు. పేదలకు ఉచిత విద్య, వైద్యం వంటి సదుపాయాలను అందించారు. చదవండి: ముగిసిన సోనియా గాంధీ ఈడీ విచారణ.. గోయల్ 100కు పైగా విద్యాసంస్థలు, వృద్ధాశ్రమాలు, ఆస్పత్రులకు ట్రస్టీగా ఉన్నారు. తన సేవలకుగాను రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ సహా నలుగురు రాష్ట్రపతుల చేతులమీదుగా పలు పురస్కారాలు అందుకున్నారు. అరవింద్‌కు భార్య రేణు గోయల్‌తో పాటు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ఆస్తిని విరాళంగా ఇస్తానని చెప్పగానే కుటుంబసభ్యులు కూడా మద్దతు ఇచ్చారు. -
రీసేల్ ప్రాపర్టీలను కొంటున్నారా? అయితే ఇది మీకోసమే!
సాక్షి, హైదరాబాద్: రీసేల్ ప్రాపర్టీలను కొనేవారైతే వర్షాకాంలో ఆయా ప్రాపర్టీలను స్వయంగా పరిశీలించడం ఉత్తమం. ఎందుకంటే వానల్లోనే ప్రాపర్టీ నిర్వహణ ఎలా ఉందో అవగతమవుతుంది. గోడల ధృడత్వం, డ్రైనేజీ, పంబ్లింగ్ లీకేజీలు వంటివి తెలుసుకునే వీలుంటుంది. ప్రాపర్టీ లోతట్టు ప్రాంతంలో ఉందా? వరదలు ఎక్కువగా వచ్చే అవకాశముందా అనేది తెలుస్తుంది. వరద నీరు భూమిలోకి ఇంకిపోయే ఏర్పాట్లు ఉన్నాయా? లేక అపార్ట్మెంట్ సెల్లార్ నీటిలో మునిగిపోతుందా? అనేది తెలుస్తుంది. వర్షాకాలంలో గృహ కొనుగోళ్లు అంతగా జరగవు. కాబట్టి ఇలాంటి సమయంలో నిజమైన గృహ కస్టమర్లు వచ్చినప్పుడు వారిని డెవలపర్లు స్వాగతిస్తారు. -
ఆస్తి పంచలేదని తల్లినే చంపేశాడు!
మహమ్మదాబాద్: ఆస్తి పంచివ్వలేదనే కోపంతో కన్నతల్లినే కడతేర్చాడు ఓ దుర్మార్గుడు. బండరాయితో తల్లి తలపై మోది హత్య చేసిన ఘటన మహబూబ్‌నగర్ జిల్లాలో చోటుచేసుకుంది. మహమ్మదాబాద్ మండలం కంచన్‌పల్లి గ్రామానికి చెందిన గుట్ట కర్రెమ్మ(68), వెంకటయ్య దంపతులకు నలుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. వీరందరికీ వివాహాలు చేశారు. కాగా, కర్రెమ్మ, వెంకటయ్యల పేరు మీద ఉన్న నాలున్నర ఎకరాల భూమిని తమకు పంచి ఇవ్వాలని కుమారులు కొంతకాలంగా గొడవపడుతున్నారు. ఈ క్రమంలో శుక్రవారం కూడా మరోసారి ఇంట్లో ఘర్షణ జరిగింది. ఈ విషయమై పెద్ద కుమారుడు పండరయ్య గట్టిగా నిలదీయగా మాటామాట పెరిగిపోయింది. కోపంతో ఊగిపోయిన పండరయ్య ఇంటి ముందు కూర్చున్న తల్లి తలపై బండరాయితో గట్టిగా కొట్టాడు. ఆమె తలకు తీవ్ర గాయం కావడంతో వెంటనే మహబూబ్‌నగర్ ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ ఆమె శనివారం తెల్లవారుజామున మృతి చెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. పోలీసులు పండరయ్యను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
‘మెట్రో ఇండియా’ రేసులో రిలయన్స్, ప్రేమ్‌జీ
న్యూఢిల్లీ: మెట్రో ఇండియా ఆస్తుల కొనుగోలు రేసు ఆసక్తికరమైన మలుపులు తీసుకుంటోంది. థాయిలాండ్‌కు చెందిన చరోన్ పోక్పాండ్ (సీపీ) గ్రూపు సైతం రంగంలోకి వచ్చింది. అలాగే, ప్రేమ్‌జీ ఇన్వెస్ట్ (విప్రో ప్రేమ్‌జీ సొంత పెట్టుబడుల సంస్థ), ఫుడ్ డెలివరీ ప్లాట్ ఫామ్ స్విగ్గీ కూడా రేసులో ఉన్నాయి. ప్రముఖ రిటైల్ సంస్థ, రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన రిలయన్స్ రిటైల్ కూడా పోటీ పడుతున్నట్టు ఈ వ్యవహారం తెలిసిన వర్గాలు పేర్కొన్నాయి. జర్మనీకి చెందిన రిటైలర్ మెట్రో ఏజీ.. భారత్‌లోని తన ఆస్తులను విక్రయానికి పెట్టడం తెలిసిందే. ఇక 1–1.5 బిలియన్ డాలర్లతో మెట్రో ఇండియా ఆస్తుల కొనుగోలు అవకాశాలను టాటా గ్రూపు, ప్రైవేటు ఈక్విటీ ఫండ్ బెయిన్ క్యాపిటల్ మదింపు వేస్తున్నట్టు సమాచారం. ఫ్లిప్‌కార్ట్–వాల్‌మార్ట్, డీమార్ట్, అమెజాన్ ఈ రేసు నుంచి దాదాపు తప్పుకున్నట్టేనని తాజా సమాచారం. ఈ వారంలోనే నాన్‌బైండింగ్ ఆఫర్లను సమర్పించాల్సి ఉంటుంది. నాన్ బైండింగ్ ఆఫర్లు వచ్చిన తర్వాత ఆయా సంస్థలతో మెట్రో ఏజీ చర్చలు నిర్వహించనుంది. ఇందుకు రెండు నెలల సమయం పడుతుందని తెలుస్తోంది. భారత్‌లో కార్యకలాపాలు అనుకున్నంత ఆశావహంగా లేకపోవడంతో మెట్రో ఏజీ తన ఆస్తులను విక్రయించి వెళ్లిపోవాలని అనుకుంటుండడం తెలిసిందే. పదికి పైగా సంస్థలు తొలుత ఆసక్తి చూపించగా.. అధిక పోటీ కారణంగా కొన్ని సంస్థలు ముందే తప్పుకుంటున్నట్టు కనిపిస్తోంది. ఖతార్ ఇన్వెస్ట్మెంట్ అథారిటీ సహా సుమారు పది సంస్థలు పోటీ పడుతున్నట్టు తొలుత పేర్లు వినిపించడం గమనార్హం. ‘‘మా విధానం ప్రకారం మీడియాలో వచ్చే ఊహాజనిత వార్తలపై స్పందించం. కంపెనీ ఎప్పటికప్పుడు కొత్త అవకాశాలను మదింపు వేస్తూనే ఉంటుంది’’అని రిలయన్స్ రిటైల్ అధికార ప్రతినిధి స్పష్టం చేశారు. -
రియల్టీలో టెక్నాలజీకి డిమాండ్
న్యూఢిల్లీ: ప్రాపర్టీ టెక్నాలజీ (ప్రాప్‌టెక్) సంస్థల్లో పెట్టుబడులకు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపిస్తున్నారు. రియల్ ఎస్టేట్ రంగంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాల వినియోగం ఇటీవలి కాలంలో పెరుగుతోంది. ఇది ప్రాప్‌టెక్ సంస్థలకు అవకాశాలను విస్తృతం చేయనుంది. ఈ దృష్యా పెట్టుబడులకు ఇవి ఆకర్షణీయంగా మారాయి. 2025 నాటికి ఈ కంపెనీల్లో వార్షిక పెట్టుబడులు బిలియన్ డాలర్లకు (రూ.7,700 కోట్లు) చేరుకోవచ్చని సీఐఐ, కొలియర్స్ సంస్థలు అంచనా వేశాయి. 2020లో ప్రాప్ టెక్నాలజీ సంస్థల్లోకి వచ్చిన పెట్టుబడులు 551 మిలియన్ డాలర్లు(రూ.4,242 కోట్లు)గా ఉన్నాయి. సీఐఐ, కొలియర్స సంయుక్తంగా ‘రియల్ ఎస్టేట్ 3.0: టెక్నాలజీ లెడ్ గ్రోత్’ పేరుతో ఓ నివేదికను విడుదల చేశాయి. కరోనా మహమ్మారి రియల్ ఎస్టేట్ రంగంలో టెక్నాలజీ వినియోగాన్ని పెంచేందుకు దారితీసినట్టు తెలిపింది. ఈ టెక్నాలజీ సాయంతోనే ఉన్న చోట నుంచే రిమోట్‌గా పనిచేసేందుకు వీలు పడిందని పేర్కొంది. టెక్నాలజీ వినియోగం ఎన్నో రెట్లు.. ‘‘ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐవోటీ), వర్చువల్ రియాలిటీ (వీఆర్), ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)ను కరోనాకు పూర్వం వినియోగించారు. అయితే ఈ తరహా టెక్నాలజీల వినియోగం గడిచిన రెండు సంవత్సరాల్లో ఎన్నో రెట్లు పెరిగింది’’ అని ఈ నివేదిక వెల్లడించింది. ఆరోగ్యంపై దృష్టితో స్మార్ట్ బిల్డింగ్ మెటీరియల్స్, వాయు నాణ్యతను ఆటోమేటెడ్‌గా ఉంచే సిస్టమ్స్ వినియోగం పెరిగినట్టు తెలిపింది. ఏఐ, వీఆర్, ఐవోటీ, బ్లాక్ చైన్ రియల్ ఎస్టేట్ వ్యాపార ముఖచిత్రాన్ని మార్చడంలో కీలక పాత్ర పోషిస్తాయని అంచనా వేసింది. 5జీ టెక్నాలజీ అమల్లోకి వస్తే బిల్డింగ్ మేనేజ్మెంట్ మరింత సమర్థవంతగా మారుతుందని పేర్కొంది. భారత రియల్ ఎస్టేట్ రంగాన్ని టెక్నాలజీ మరింత పారదర్శకంగా మారుస్తుందని అంచనా వేసింది. ఆవిష్కరణలు ఘనం.. ప్రాపర్టీ రంగంలో టెక్నాలజీ ఆవిష్కరణలు ఇంతకుముందు ఎన్నడూ లేనంత స్థాయిలో ఉన్నట్టు ఈ నివేదిక తెలియజేసింది. ప్రణాళిక దగ్గర్నుంచి, డిజైన్, నిర్మాణంగ టెక్నిక్‌లు, వసతుల నిర్వహణ, పాపర్టీ నిర్వహణ వరకు అన్ని విభాగాల్లోకి టెక్నాలజీ ప్రవేశించినట్టు తెలిపింది. ఈ మార్పుల నేపథ్యంలో వచ్చే కొన్నేళ్లలో ప్రాప్‌టెక్ బాగా వృద్ధిని చూస్తుందని అంచనా వేసింది. కాకపోతే గోప్యత, డేటా భద్రత, కొనుగోలుదారులు, నిర్మాణదారులపై పడే వ్యయాలు, విద్యుత్ సరఫరాపై ఎక్కువగా ఆధారపడాల్సి రావడం ఇవన్నీ కూడా రియల్ ఎస్టేట్ రంగంలో టెక్నాలజీల అమలుకు ఉన్న సవాళ్లుగా పేర్కొంది. ‘‘మాన్యువల్‌గా కార్మికులకు డిమాండ్ తగ్గడంతో కొందరికి ఉపాధి నష్టం కలగొచ్చు. అదే సమయంలో ప్రత్యేకమైన కార్మికులకు డిమాండ్ పెరుగుతుంది’’అని తెలిపింది. రియల్ ఎస్టేట్‌లో టెక్నాలజీ వినియోగం వల్ల వ్యయాలు తగ్గుతాయని, ఆస్తి విలువ పెరుగుతుందని రెలోయ్ వ్యవస్థాపకుడు అఖిల్ సరాఫ్ అన్నారు. -
ముక్కలు ముక్కలుగా తండ్రిని నరికి..
సాక్షి, చెన్నై: ఆస్తి కోసం కన్న కొడుకే తండ్రిని దారుణంగా హతమార్చాడు. మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికి ఓ డ్రమ్ములో పడేశాడు. కొత్త పరిశ్రమకు భూమిపూజ చేస్తున్నట్లు బిల్డప్ ఇచ్చి, అందరూ చూస్తుండగానే ఆ డ్రమ్మును పాతేశాడు. ఒళ్లు గగుర్పొడిచే ఈ ఘటన శుక్రవారం వెలుగు చూసింది. చెన్నైలోని వలసరవాక్కం ఆర్కాడుసాలైకు చెందిన కుమరేశన్ (80) కేంద్ర రిటైర్డ్ ఉద్యోగి. ఆయన భార్య దాక్షాయిణి ఇటీవల మరణించింది. ఆయనకు కుమారుడు గుణశేఖరన్ (50)తోపాటు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. వీరికి వివాహాలయ్యాయి. కుమారుడు గుణశేఖరన్ ఇంట్లో కుమరేశన్ ఉంటున్నాడు. అదే ఇంటి పైఅంతస్తులో కుమార్తె కాంచనమాల ఉంటోంది. రెండు రోజులుగా తండ్రి కనిపించకపోవడంతో కాంచనమాల.. గుణశేఖరన్ భార్య, పిల్లల్ని నిలదీసింది. వారు పొంతనలేని సమాధానాలు ఇవ్వడంతో అనుమానం వచ్చి పోలీసుల్ని ఆశ్రయించింది. విచారణలో ఈ దారుణ ఘటన వెలుగుచూసింది. గుణశేఖరన్ చెప్పిన కట్టుకథ కుమరేశన్ పేరిట ఉన్న ఇళ్లు, స్థలాలు తన పేరున రాయాలని గుణశేఖరన్ పదే పదే తండ్రిపై ఒత్తిడి తెచ్చినట్లు పోలీసుల విచారణలో బయటపడింది. అదే సమయంలో గుణశేఖరన్ అజ్ఞాతంలోకి వెళ్లడంతో అనుమానాలకు బలం చేకూరింది. విచారణలో కుమరేశన్‌ను గుణశేఖరన్ హతమార్చినట్టు తేలింది. కావేరి పాక్కంలో గుణశేఖరన్ చేపట్టిన టైల్స్ కట్టింగ్ పరిశ్రమ నిర్మాణంజరుగుతున్న ప్రదేశంలో శుక్రవారం పోలీసులు గాలించారు. నిర్మాణ పనులకు భూమి పూజ చేసిన సమయంలో గుణశేఖరన్ ఓ డ్రమ్మును పాతి పెట్టాడని అక్కడి వారు చెప్పారు. వ్యాపారం బాగా సాగేందుకు మంత్రగాడు ఇచ్చిన కొన్ని వస్తువులు డ్రమ్ములో పెట్టి పూడ్చుతున్నట్లుగా కట్టు కథ చెప్పి నమ్మించాడని తేలింది. పోలీసులు డ్రమ్మును వెలికితీసి అందులోని మృతదేహం భాగాలను పోస్టుమార్టంకు తరలించారు. -
స్థిరాస్తుల లావాదేవీలపై కేంద్రం భారీ షాక్!
న్యూఢిల్లీ: స్థిరాస్తి లావాదేవీల విలువ రూ.50 లక్షలు మించితే ఒక శాతం టీడీఎస్ మినహాయింపు నిబంధన శుక్రవారం (ఏప్రిల్ 1) నుంచి అమల్లోకి రానుంది. స్టాంప్ డ్యూటీ విలువ లేదా ఒప్పందం విలువ ఏది ఎక్కువైతే దానిపైనే ఇది అమలవుతుంది. అలాగే, వర్చువల్ డిజిటల్ అసెట్స్ (క్రిప్టోలు, ఎన్ఎఫ్టీలు) బదిలీలు, ట్రేడింగ్ లావాదేవీలపై 30 శాతం మూలధన లాభాల పన్ను అమల్లోకి రానుంది. ఈ మేరకు బడ్జెట్లో కేంద్రం ప్రతిపాదనలు చేర్చడం తెలిసిందే. -
తరచూ గొడవ.. ప్లాన్ ప్రకారం మద్యం తాగి కత్తి తీసుకుని ఇంటికెళ్లి..
సాక్షి,ఎర్రవల్లిచౌరస్తా (అలంపూర్): తమ్ముడి చేతిలో అన్న దారుణ హత్యకు గురైన సంఘటన ఇది. పోలీసుల కథనం ప్రకారం.. జోగుళాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలంలోని చాగాపురానికి చెందిన పెద్ద నర్సింహులు (32) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అతని తమ్ముడు చిన్న నర్సింహులు ఇంటర్ ఫెయిల్ కావడంతో మద్యానికి బానిసై గ్రామంలోనే జులాయిగా తిరగసాగాడు. కొంతకాలంగా తమ ఇంటి విషయంలో వాటా ఇవ్వాలంటూ తరచూ అన్నతో వాగ్వాదానికి దిగేవాడు. ఈ క్రమంలోనే పథకం ప్రకారం మంగళవారం అర్ధరాత్రి మద్యం తాగొచ్చి అన్నపై కత్తితో దాడి చేసి పారిపోయాడు. ఇది గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే జిల్లా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందాడు. కాగా, పెద్ద నర్సింహులుకు భార్య జయంతితో పాటు ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈ విషయమై బుధవారం ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం సంఘటన స్థలాన్ని అలంపూర్ సీఐ సూర్యానాయక్, ఇటిక్యాల ఎస్ఐ గోకారి పరిశీలించి కేసు దర్యాప్తు జరుపుతున్నారు. (చదవండి: రియల్ వ్యాపారి దారుణ హత్య: కళ్లల్లో కారం కొట్టి.. రాళ్లతో కొట్టి చంపి ) -
స్థిరాస్తులపై కొత్త నిబంధనలు..అమ్మకాలు, కొనుగోలు చేసేటప్పుడు..
స్థిరాస్తి వ్యవహారాల మీద టీడీఎస్ (ట్యాక్స్ డిడక్టెడ్ ఎట్ సోర్స్)కి సంబంధించి కొత్త నిబంధనలు రాబోతున్నాయి. మొన్నటి బడ్జెట్లో తాజా ప్రతిపాదనల సారాంశం మీకోసం.. ప్రస్తుతం స్థిరాస్తులకు సంబంధించి అమ్మకపు విలువపై టీడీఎస్ వర్తిస్తుంది. ఇక నుం చి స్థిరాస్తి కొనుగోలు చేసేటప్పుడు (వ్యవసాయ భూమిని మినహాయించి) ఆ విలువ రూ. 50,00,000 దాటితే అమ్మకపు విలువ లేదా స్టాంపు డ్యూటీ విలువ.. ఈ రెండింటిలో ఏది ఎక్కువైతే ఆ మొత్తం మీద 1 శాతం టీడీఎస్ చేయాలి. క్యాపిటల్ గెయిన్స్ లెక్కించడానికి ప్రతి ఫలం విషయంలో ఇదే రూలు ఉంది.. అమ్మకపు విలువ ఎక్కువ? స్టాంపు డ్యూటీ విలువ ఎక్కు వ? ఈ రెండింటిలో ఏది ఎక్కువైతే దాన్ని ప్రతిఫలంగా పరిగణిస్తారు. ఇప్పుడు టీడీఎస్‌కి ఈ నిబంధన తెచ్చారు. సాధారణంగా బయట మన కు కనిపించేది.. స్టాంప్ డ్యూటీ విలువ తక్కువ ఉంటుంది. నిజంగా ఇచ్చే ప్రతిఫలం ఎక్కువ ఉంటుంది. అంతే కాకుండా బ్లాక్, వైట్ వ్యవహారం ఉంటుంది. ఈ నేపథ్యంలో కొత్త విధానం ద్వారా పన్ను ఎగవేతను అరికట్టవచ్చని ప్రభుత్వం అంచనా. ఉదాహరణగా చెప్పాలంటే ఒక వ్యక్తి ఇల్లు రూ. 60,00,000కు కొన్నారనుకుందాం. కానీ ఇంటిని రిజిస్ట్రేషన్ చేయించాలంటే స్టాంపు డ్యూటీ రూ. 72,00,000 అనుకోండి.. పాత రూల్స్ ప్రకారం రూ. 60,00,000 మీద టీడీఎస్ చేయాలి. కానీ తాజా ప్రతిపాదనల ప్రకారం రూ. 72,00,000 మీద 1 శాతం చొప్పున టీడీఎస్ చేయాలి. దీనివల్ల టీడీఎస్ మొత్తం పెరుగుతుంది. అంతే కాకుండా, క్యాపిటల్ గెయిన్స్ లెక్కించడానికి ఎక్కువ మొత్తాన్నే పరిగణిస్తారు. ప్రతిఫలం ఎక్కువ, మూలధన లాభం .. ఫలితంగా పన్ను ఎక్కువ వసూలు చేయవచ్చు. ఇది రెసిడెంట్లకు మాత్రమే వర్తిస్తుంది. విలువ రూ. 50,00,000 దాటితేనే వర్తిస్తుంది. అమ్మకపు విలువ, స్టాంపు డ్యూటీ విలువ.. ఈ రెండూ రూ. 50,00,000 కన్నా తక్కువ ఉంటే టీడీఎస్ ప్రశ్న ఉండదు. విలువ రూ. 50,00,000 దాటితేనే టీడీఎస్ రూల్స్ వర్తిస్తాయి. దీని వల్ల ఎక్కువ పన్ను ఖజానాలోకి వచ్చి పడుతుంది. కొన్న వ్యక్తి ఎక్కువ మొత్తం పన్నుని రికవరీ చేసి టీడీఎస్ ఖాతాలోకి జమ చేస్తారు. అయితే, ఈ జమ .. అమ్మే వ్యక్తి స్వంత ఖాతాలో పన్ను చెల్లించినట్లుగా పడుతుంది. అమ్మే వ్యక్తి పన్ను చెల్లించాల్సి ఉంటే టీడీఎస్‌ను పరిగణనలోకి తీసుకుని మిగతా మొత్తాన్ని చెల్లిస్తారు. కానీ పూర్తిగా మినహాయింపు పొందే వ్యక్తికి ఈ టీడీఎస్ మొత్తం రిఫండ్ రూపంలో వస్తుంది. అలా వచ్చే వరకు, గవర్నమెంటు ఖజానాలో ఉంటుంది. రిఫండు వచ్చాక సరే సరి. అంటే, ప్రభుత్వం ముందుగానే ఎక్కువ టీడీఎస్ వసూలు చేసి అసెస్మెంట్ తర్వాత వెనక్కు ఇస్తుంది. మొదటి నుంచి ఇదే పాలసీ.. పన్ను వసూళ్లను టీడీఎస్ రూపంలో ఆదిలోనే వసూలు చేయటం ఆనవాయితీ. కె.సీహెచ్.ఎ.వి.ఎస్.ఎన్ మూర్తి; కె.వి.ఎన్‌లావణ్య ట్యాక్సేషన్ నిపుణులు -
రిజిస్ట్రేషన్ చార్జీల పెంపుతో భారం
సాక్షి, హైదరాబాద్: ఏడు నెలల క్రితమే రాష్ట్రంలో ప్రాపర్టీ విలువలను 30 శాతం నుంచి 100 శాతం కంటే ఎక్కువ పెంచారు. స్టాంప్ డ్యూటీని 37.5 శాతం, నాలా చార్జీలను 50 శాతం నుంచి 67 శాతం వరకు సవరించారు. దీంతో గృహ కొనుగోలుదారులపై తీవ్రమైన ప్రభావం పడింది. తాజాగా మరోసారి విలువ పెంపు నిర్ణయం తీసుకోవటం సరైంది కాదని క్రెడాయ్, ట్రెడా డెవలపర్ల సంఘాలు తెలిపాయి. మార్కెట్ విలువ సవరణ ప్రక్రియలో రియల్ ఎస్టేట్ డెవలపర్ల అసోసియేషన్లు, వాటాదారులతో చర్చించకుండా పెంచడం హేతుబద్ధం కాదని ఆరోపించాయి. ఇప్పటికే పెంచిన చార్జీల ప్రభావం మార్కెట్‌పై, కొనుగోలుదారులపై ఎంత మేర ప్రభావం చూపించిందో అధ్యయనం చేపట్టకుండా మరోసారి సవరణ నిర్ణయాన్ని తీసుకోవటం పరిశ్రమకు మంచిది కాదని హెచ్చరించింది. రిజిస్ట్రేషన్ చార్జీల పెంపు నిర్ణయాన్ని వాయిదా వేయాలని కోరాయి. ఇటీవలే 3 లక్షలకు పైగా ప్రాపర్టీలను నిషేదిత జాబితా నుంచి తొలగించారని.. ఇంకా చాలా విడుదల చేయాల్సి ఉందని తెలిపాయి. కార్డ్ సిస్టమ్ నుంచి లక్షలాది ప్రాపర్టీలు విడుదల కావాల్సి ఉందని.. దీంతో ఈ ఖాతాలో లక్షల లావాదేవీలు పెండింగ్‌లో ఉన్నాయని పేర్కొన్నాయి. రోజుకు 3 లక్షలకు పైగా కోవిడ్ వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రజలు రిజిస్ట్రేషన్ కార్యాలయాలను సందర్శించడానికి భయపడుతున్నారని, కరోనా సమయంలోనూ సిమెంట్, స్టీల్ వంటి నిర్మాణ సామగ్రి ధరలు గణనీయంగా పెరిగాయని తెలిపారు. మార్కెట్ సెంటిమెంట్, రియల్ ఎస్టేట్ ధరలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్న యూడీఎస్, ప్రీలాంచ్ విక్రయాలను నియంత్రించడానికి ప్రభుత్వం ప్రత్యేక యంత్రాంగాన్ని రూపొందించలేదని ఆరోపించాయి. -
కట్టే వాళ్లకే ఇవ్వండి.. కళ్లబొల్లి మాటలు చెప్పేటోళ్లకు కాదు!
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో నెలకొంటున్న రియల్టీ హైప్‌ను క్యాష్ చేసుకునేందుకు కొందరు భూ యజమానులు అత్యాశకు పోతున్నారు. సాధారణంగా డెవలపర్‌కు, భూమి యజమానికి మధ్య 40:50 లేదా 50:50 నిష్పత్తితో డెవలప్మెంట్ అగ్రిమెంట్ చేసుకుంటారు. ఎక్కువ అడ్వాన్స్, నిర్మాణ స్థలం ఇచ్చే డెవలపర్లకే డెవలప్మెంట్ అగ్రిమెంట్‌కు అప్పగిస్తున్నారు. మరి, నిజంగానే సదరు డెవలపర్ ప్రాజెక్ట్‌ను పూర్తి చేయగలడా? అనే అంశాన్ని అంచనా వేయడంలో విఫలమవుతున్నారు. కేవలం డెవలపర్ ఇచ్చే అడ్వాన్స్ మీదే దృష్టిపెడుతున్నాడు. ఎవరైనా డెవలపర్ స్థలం కోసం వస్తే చాలు 30 అంతస్తులు, 40 అంతస్తులు కడతావా? అంటూ ప్రశ్నిస్తున్నారు. ఫలానా డెవలపర్ అంత అడ్వాన్స్ ఇస్తానన్నాడు? మరో డెవలపర్ ఇంత పర్సంటేజ్ ఇస్తానన్నాడంటూ వచ్చిన డెవలపర్‌తో బేరమాడుతున్నారు. దీంతో అసలైన డెవలపర్‌కు స్థలాన్ని అప్పగించే బదులు ఫ్యాన్సీ నంబర్లు చెప్పే మోసపూరిత డెవలపర్లకు స్థలాన్ని అగ్రిమెంట్ చేస్తున్నారు. ఈ బిల్డర్లు ఏం చేస్తున్నారంటే.. అగ్రిమెంట్ చేసుకొని.. ఆ స్థలాన్ని యూడీఎస్ కింద కొనుగోలుదారులకు ముందే విక్రయించేస్తున్నారు. వాళ్లు ఇచ్చే సొమ్మును స్థల యజమానికి ఇచ్చేస్తున్నారు. తీరా నిర్మాణ పనులు వద్దకొచ్చేసరికి.. దిక్కులు చూసే పరిస్థితి నెలకొంటుంది. నిర్మాణం ఆరంభమై ఒక స్థాయికి వస్తే తప్ప మిగిలిన ఫ్లాట్లను అమ్మలేని పరిస్థితి. అమ్మడానికి ప్రయత్నించినా.. ఈ లోపు మరో డెవలపర్ యూడీఎస్లో ఫ్లాట్లను అమ్మడం ఆరంభిస్తాడు. ఫలితంగా అమ్మకాల్లేక ప్రాజెక్ట్ నిలిచిపోతుంది. డెవలప్మెంట్కు ఇచ్చే ముందు.. - స్థల యజమానులు అధిక అంతస్తులు, ఎక్కువ అడ్వాన్స్‌లు తీసుకొని మురిసిపోవటం మానేసి.. అసలు డెవలపర్ ప్రాజెక్ట్‌ను సకాలంలో పూర్తి చేయగలడా? లేదా అనే అంశాన్ని ఆలోచించాలి. - అమ్మకాల మీదే ఆధారపడి ప్రాజెక్ట్‌ను పూర్తి చేయాలని భావించే డెవలపర్లకు స్థలాన్ని ఇవ్వకపోవటమే మంచిది. - ఎవరైనా స్థలం ఇవ్వమని చర్చలకు వచ్చినప్పుడు ఆయా డెవలపర్ క్రెడిబులిటీని పరిశీలించడంతో పాటు నిర్మాణాన్ని పూర్తి చేసే ప్రణాళికల గురించి చర్చించాలి. - ఒకసారి ఒప్పందం కుదుర్చుకున్నాక డెవలపర్ తోక జాడించే అవకాశం ఉందా? అనవసరంగా ఇబ్బందుల్ని సృష్టిస్తాడా? అనే అంశాన్ని బేరీజు వేయాలి. - స్థలాన్ని అప్పగించాక సకాలంలో ఫ్లాట్లను అందించక కొనుగోలుదారులకు తలనొప్పు లు తెస్తాడా? వంటి అంశాన్ని విశ్లేషించాలి. - ఫ్లాట్లను విక్రయించడానికి ఏజెంట్ల మీద ఎక్కువ ఆధారపడతాడా? లేక సొంత సిబ్బంది ఎంతమేర ఉన్నారనేది తెలుసుకోవాలి. - కొనుగోలుదారుల నుంచి తీసుకున్న సొమ్ము తీసుకొని వేరే ప్రాజెక్ట్‌లోకి మళ్లిస్తున్నాడా? లేక ఆ ప్రాజెక్ట్ నిర్మాణం కోసమే ఖర్చు చేస్తున్నాడా? వంటి అంశాన్ని ఆరా తీయాలి. - ఆర్ధిక నష్టాల్లో ఉన్న డెవలపర్లకు జాయింట్ డెవలప్మెంట్ అగ్రిమెంట్ చేయకపోవటమే మంచిది. చదవండి:JLL: ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్ట్‌మెంట్స్‌లో హైదరాబాద్ టాప్ -
వికారాబాద్: ఆస్తి కోసం తమ్ముడిని చంపిన అన్న
సాక్షి, అనంతగిరి: వారసత్వంగా వస్తున్న ఆస్తికోసం తన సొంత తమ్ముడిని హత్య చేసిన ఘటన శనివారం తెల్లవారుజామున వికారాబాద్ పట్టణంలో చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. వికారాబాద్ పట్టణం ఆలంపల్లికి చెందిన బండ అడివిరెడ్డికి ముగ్గురు కుమారులు అంజిరెడ్డి, రఘుపతిరెడ్డి, గోవర్ధన్ రెడ్డిలు ఉన్నారు. వీరిలో అంజిరెడ్డికి వివాహమై భార్యతో కలిసి విడిగా ఉంటున్నారు. రఘుపతిరెడ్డికి సైతం వివాహమైంది. చిన్నవాడైన గోవర్ధన్‌రెడ్డి(34)కి ఇంకా వివాహం కాలేదు. వీరంతా వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరికి వారసత్వంగా వస్తున్న ఆరు ఎకరాల వ్యవసాయ పొలం ఉంది. ఆస్తి పంపకాల విషయంలో పలుమార్లు గొడవ జరిగింది. శనివారం తెల్లవారుజామున అంజిరెడ్డి తన పక్క గదిలోనే నిద్రిస్తున్న చిన్న తమ్ముడు గోవర్ధన్‌రెడ్డి(34) నిద్రిస్తున్న రూంలోకి వెళ్లాడు. తమ్మునితో గొడవ పడి దారుణంగా హత్య చేశాడు. పెద్ద అరుపులు విన్న రఘుపతిరెడ్డి రూంలోకి వెళ్లి చూడగా అతనిపై సైతం దాడికి యత్నించాడు. దీంతో పెద్దగా అరవడంతో చుట్టు పక్కల వాళ్లు రావడంతో అక్కడి నుంచి అంజిరెడ్డి పారిపోయాడు. ఈ మేరకు రఘుపతిరెడ్డి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రాజశేఖర్ తెలిపారు. -
ఆస్తి కోసం బిడ్డలు ఇబ్బంది పెడుతున్నారయ్యా..
కోనేరు సెంటర్: జిల్లా పోలీసు కార్యాలయంలో శనివారం జరిగిన ప్రతి రోజు స్పందనలో ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ పాల్గొన్నారు. జిల్లా నలుమూలల నుంచి వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ వచ్చిన బాధితుల నుంచి అర్జీలు అందుకున్నారు. సమస్య ఎలాటిదైనా చట్టపరిధిలో పరిష్కరించి బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. ప్రతి రోజు స్పందనలో ప్రజా సమస్యలకు పరిష్కారం దొరుకుతుండటంతో బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. చదవండి: దేవుడిలా ఆదుకున్న పోలీస్.. ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ ప్రశంసలు ఆస్తి కోసం బిడ్డలు ఇబ్బంది పెడుతున్నారంటూ వృద్ధులు, అధికకట్నం కోసం అత్తింటి వేధింపులు అధికం అయ్యాయంటూ వివాహితులు, ఉద్యోగం పేరిట మోసం చేశారంటూ నిరుద్యోగులు, ప్రేమ పేరుతో వంచన చేశారంటూ అమాయపు ఆడపిల్లలు ఇలా అనేక మంది ఫిర్యాదులు చేసేందుకు ఎస్పీ కార్యాలయంలో బారులు తీరుతున్నారు. ఫిర్యాదులు స్వీకరించిన ఎస్పీ అదే స్థాయిలో స్పందిస్తూ సమస్యలు పరిష్కరిస్తుండటంతో బాధితులు సైతం సంతోషం వ్యక్తం చేస్తున్నారు. శనివారం జరిగిన ప్రతి రోజు స్పందనలో దాదాపు 25 మందికిపై బాధితులు ఎస్పీని కలిసి తమ తమ సమస్యలు చెప్పుకుని న్యాయం కోరారు. స్పందించిన ఎస్పీ బాధతులకు తప్పకుండా న్యాయం చేస్తానని భరోసా ఇచ్చారు. గూడూరు మండలం పోలవరం గ్రామానికి చెందిన ఓ వృద్ధురాలు ఎస్పీని కలిసి తన ఇద్దరు కుమారులు ఆస్తి కోసం తనను అనేక అవస్థలు పెడుతున్నారని వారిపై చర్యలు తీసుకుని తనకు రక్షణ కల్పించాలని వేడుకుంది. అలాగే కోడూరు గ్రామానికి చెందిన ఓ వ్యక్తి తాను వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తుంటానని సరిహద్దుదారుడు తన పొలంలో పురుగుమందు పిచికారీ చేసే క్రమంలో తన పంట మొత్తం నాశనం అయిందని అదేమని అడిగితే తనపై దాడి చేసి కొట్టాడని అతనిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశాడు. స్పందించిన ఎస్పీ ఫిర్యాదులన్నింటినీ ప్రాధాన్యత క్రమంలో పరిశీలించి పరిష్కరిస్తానని బాధితులకు హామీ ఇచ్చారు. -
ఆ స్కామ్ వల్ల సంపాదించిన డబ్బంతా పోగొట్టుకున్నా: స్టార్ హీరో
Saif Ali Khan Has Revealed That He Got Scammed in Property Deal: ఓ ప్రాపర్టీ డీల్‌లో తాను తీవ్రంగా మోసపోయానని బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ అన్నారు. దీని వల్ల తన సంపాదనలో దాదాపు 70శాతం మేరకు కోల్పోయినట్లు చెప్పి షాకిచ్చాడు. తాజాగా ఆయన నటించిన ‘బంటీ ఔర్ బబ్లీ-2’చిత్రం త్వరలోనే విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌లో భాగంగా స్టార్ హీరోయిన్ రాణీముఖర్జీ చేసిన ఇంటర్వ్యూలో ఈ మేరకు వెల్లడించాడు. 'ముంబైలో ఓ స్థలం కొనుగోలు కోసం ఓ రియట్ ఎస్టేట్ సంస్థలో పెట్టుబడి పెట్టాను. ఆ డబ్బు మూడేళ్లలో రెట్టింపు అవుతుందని నన్మ నమ్మబలికి ఆ కంపెనీ వాళ్లు మోసం చేశారు. ఆ స్కామ్‌లో నేను సంపాదించిందంతా పోగొట్టుకున్నా. ఆ డీల్ కోసం దాదాపు 70 శాతం పెట్టుబడి పెట్టాను. తర్వాత నేను మోసపోయానని అర్థమైంది. అయినా అధైర్యపడకుండా కెరీర్‌పై దృష్టి పెట్టి తిరిగి సంపాదించుకున్నా. ఆ స్కామ్ నుంచి కోలుకోవడానికి చాలా కాలం పట్టింది' అని సైఫ్ అలీఖాన్ తెలిపారు. ప్రముఖ నిర్మాణ సంస్థ యష్‌రాజ్ ఫిల్మ్స్ యూట్యూబ్‌లో షేర్చేసిన ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది. -
భర్త, కూతురు మృతి.. తోడు నిలిచిన ‘రిక్షా’ కుటుంబం.. బహుమతిగా రూ.కోటి ఆస్తి
భువనేశ్వర్: ఏ ప్రతిఫలం ఆశించకుండా రిక్షా కార్మికుడు చేసిన సేవకు ఓ వృద్ద మహిళ కోటి రుపాయలకుపైగా ఆస్తిని దానం చేసింది. ఈ మేరకు ఆస్తిని అతని పేరు మీద రాసిన పత్రాలను రిక్షా కార్మికుడికి అందించింది. ఈ ఘటన ఒరిస్సాలోని సంబల్పూర్లో చోటు చేసుకుంది. అయితే అంత ఆస్తిని కుటుంబ సభ్యులకో, లేక బంధువులకో కాకుండా రిక్షా కార్మికుడికి దానం చేయడానికి పెద్ద కారణమే ఉందండోయ్! వివరాల్లోకి వెళితే.. సబల్పూర్కు చెందిన మినాతి పట్నాయక్(63) భర్త 2020లో మరణించగా, తన కుమార్తె 2021లో మరణించింది. అప్పటి నుంచి తనని ఎవరూ పట్టించుకోలేదు. పైగా ఆమె బంధువులు ఇటీవల తన ఆస్తి కోసం ఒక్కసారిగా ఆమెతో దగ్గరయ్యేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో గత 25 ఏళ్లుగా ఆమె కుటుంబానికి నమ్మకంగా పని చేస్తున్న వచ్చిన రిక్షా కార్మికుడికి తన ఆస్తి మొత్తాన్ని దానం చేసింది. అందులో రూ.కోటి విలువైన భవనం, ఇతర సామగ్రిని అతని పేరుపై రిజిస్ట్రేషన్ చేయించింది. దీనిపై వృద్దురాలు మాట్లాడుతూ.. తన భర్త, కూతురు చనిపోయి కృంగిపోయి, దుఃఖంలో బతుకుతున్నప్పుడు, తన బంధువులెవరూ కూడా అండగా నిలబడలేదని ఆ సమయంలో తాను ఒంటరిగా కాలాన్ని గడిపినట్లు చెప్పుకొచ్చింది. అయితే ఆ రిక్షా కార్మికుడు, అతని కుటుంబం మాత్రం ఎటువంటి ప్రతిఫలం ఆశించకుండా తన ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకుంటున్నట్లు పేర్కొంది. అందుకే ఆస్తి కోసం ఎదురుచూసే వారికంటే ఏ లాభం ఆశించకుండా తన కుటుంబం కోసం నిశ్వార్ధంగా పని చేసిన బుధాకు( రిక్షా కార్మికుడు) తన ఆస్తిని విరాళంగా ఇస్తున్నట్లు తెలిపింది. చదవండి: రాంగ్ కాల్.. ఆ దివ్యాంగురాలి జీవితాన్నే మార్చేసింది.. -
వారంలో వెయ్యి కోట్ల విక్రయాలు
సాక్షి, హైదరాబాద్: ప్రాజెక్ట్‌ను ప్రారంభించిన వారం రోజుల్లోనే రూ.1,000 కోట్ల విక్రయాలను పూర్తి చేసినట్లు గుర్గావ్కు చెందిన ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీ ఎం3ఎం ఇండియా ప్రకటించింది. ఎన్సీఆర్లోని నేషనల్ పెరిఫెరల్ రోడ్ సెక్టార్ 89లో నిర్మిస్తున్న ఎం3ఎం సౌలిట్యూడ్ ప్రాజెక్ట్‌లు ఈ అమ్మకాలు చేసినట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. వెయ్యి యూనిట్ల ఈ ప్రాజెక్ట్‌ను 2023 నాటికి పూర్తి చేస్తామని ప్రకటించింది. 1,100 చ.అ. నుంచి 1,400 చ.అ. మధ్య 2, 3 బీహెచ్‌కే యూనిట్లను నిర్మిస్తోంది. ధరలు రూ.70–90 లక్షల మధ్య ఉన్నాయని కంపెనీ డైరెక్టర్ పంకజ్ భన్సాల్ తెలిపారు. ఈ ఏడాది ఏప్రిల్–సెప్టెంబర్ మధ్య కాలంలో రూ.3,034 కోట్ల విక్రయాలను చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఇందులో నిర్మాణంలో ఉన్న నివాస ప్రాజెక్ట్‌లలో రూ.1,450 కోట్లు, కమర్షియల్‌లో రూ.835 కోట్లు, పూర్తయిన ప్రాజెక్ట్‌లలో రూ.749 కోట్ల అమ్మకాలు చేశామన్నారు. -
వింతైన ఇల్లు దీని ధర ఎంత తెలుసా?
మసాచుసెట్స్: ఎంత పెద్ద స్థలం అయినా మంచిగా అమ్ముడవ్వాలంటే చాలా కష్టంగా ఉంటుంది. బాగా భూములు విలువ తెలిసిన వాళ్లు, రియల్ ఎస్టేట్ వాళ్లు మంచి రేటుకు క్రయ విక్రయాలు జరిపించగలరు. అయితే మసాచుసెట్స్‌లోని న్యూటన్ హైలాండ్స్‌లో ఉన్న అతి చిన్న ఇల్లు ఏకంగా రూ.2.3 కోట్లకు అమ్ముడైంది. అయితే ఈ ఇల్లు అంత ఎక్కువ రేటుకు ఎలా అమ్ముడైంది దీని ప్రత్యేకత ఏంటి అబ్బా అని ఆలోచిస్తూ తలలు పట్టుకోవద్దు చూద్దాం రండి! (చదవండి: అమ్మో ఎంత ధైర్యం.. సింహం తోక పట్టుకుని నడుస్తున్నావ్!) ఈ ఇల్లు కేవలం 250 చదరపు అడుగుల స్థలంలో స్టోర్ రూంలా ఉండే ఒక చిన్న అవుట్‌హౌస్. పైగా చుట్టూ గార్డెన్‌లా మొక్కలతో అందంగా కనిపిస్తుంది. అయితే ఇలాంటి ఇళ్లను ఎక్కువగా వ్యాయమశాల గానూ లేదా అవుట్ హౌస్లా వాడతారు. ఈ మేరకు ఈ ఇల్లు ఇంత అత్యధిక ధరకు అమ్ముడవ్వడానికీ గల కారణం అత్యధునిక టెక్నాలజీ అతి తక్కువ స్థలంలో నిర్మితమైన గృహం కావడం. అంతేకాదు గ్రానైట్ కౌంటర్టాప్తో కూడిన వంటగది, మంచి లైటింగ్ వచ్చేలా ఎలక్ట్రిక్ అప్గ్రేడ్లు ఉన్నాయి. పైగా అంత తక్కువ స్థలంలోనే అమరిపోయిలే చుట్టూరా గార్డెన్‌ని ఏర్పాటుచేసుకోనేంతా స్థలం ఉంది. అదీ కాక ఈ ఇల్లు బటన్స్ బోస్టన్లోని సంపన్న శివారు ప్రాంతంలో ఉంది. అయితే ఈ ప్రాంతాల్లో ఉన్న స్థలాలు ఎప్పుడూ అత్యధిక రేటులో ఉండటం వల్లే ఈ ఇల్లు అత్యధిక దరకు అ్మముడైంది. (చదవండి: మీది గొప్ప మనసు ..ఇష్టంగా వీడ్కోలు చెప్పేలా చేశారు!) -
ఆన్లైన్ సేల్స్ అదరహో!
సాక్షి, హైదరాబాద్: కరోనా మహమ్మారి నేపథ్యంలో అన్ని రంగాల్లో లాగే రియల్ ఎస్టేట్ రంగంలోనూ ఆన్లైన్ వినియోగం పెరిగింది. ప్రాపర్టీలను వెతకడం నుంచి మొదలుపెడితే డాక్యుమెంటేషన్, న్యాయ సలహా, చెల్లింపుల వరకు ప్రతీ దశలోనూ కొనుగోలుదారులు డిజిటల్ మాధ్యమాన్ని వినియోగిస్తున్నారు. కరోనా కంటే ముందు ప్రాపర్టీ కొనుగోలు ప్రక్రియలో ఆన్లైన్ వాటా 39 శాతంగా ఉండగా.. ఇప్పుడది 60 శాతానికి పెరిగిందని సీఐఐ–అనరాక్ కన్జ్యూమర్ సర్వే వెల్లడించింది. పటిష్టమైన ఆన్లైన్ మార్కెటింగ్ బృందం, సోషల్ మీడియా వేదికలు ఉన్న డెవలపర్లు మాత్రమే ప్రస్తుత పరిస్థితుల్లో నిలబడగలుగుతారని పేర్కొంది. కరోనా ఫస్ట్ వేవ్‌లో రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడిదారులు విశ్వాసం 48 శాతంగా ఉండగా.. సెకండ్ వేవ్ నాటికి 58 శాతానికి పెరిగింది. అలాగే గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్న వాటిల్లో కొనుగోళ్లకు 32 శాతం మంది ఆసక్తిని చూపించగా.. ఫస్ట్ వేవ్‌తో పోలిస్తే ఇది 14 శాతం క్షీణత. బ్రాండెడ్ డెవలపర్ల ప్రాజెక్ట్‌లలో కొనేందుకు కస్టమర్లు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. బెంగళూరు, పుణే, చెన్నై నగరాల్లోని రూ.1.5–2.5 కోట్ల మధ్య ధర ఉండే గృహాలను కొనుగోలు చేసేందుకు ప్రవాసులు ఆసక్తి చూపిస్తుండగా.. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో అయితే చంఢీఘడ్, కోచి, సూరత్ వంటి పట్టణాలపై మక్కువ చూపి స్తున్నారు. 41% మంది రెండో ఇంటిని తాము ఉండేందుకు కొనుగోలు చేస్తుండగా.. 53% మంది ఎత్తయిన ప్రాంతాలలో ఇళ్ల కోసం వెతు కుతున్నారు. 65% మంది వర్క్ ఫ్రం హోమ్, ఆన్లైన్ క్లాస్‌ల నేపథ్యంలో పెద్ద సైజు ఇళ్లపై మక్కువ చూపిస్తుం టే.. 68% మంది శివారు ప్రాంతాలలో కొనుగోళ్లకు ఇష్టపడుతున్నారు. వాకింగ్ ట్రాక్, గ్రీనరీలే అధిక ప్రాధాన్యత.. గృహ కొనుగోలు ఎంపికలో తొలి ప్రాధాన్యం ఆకర్షణీయమైన ధర కాగా.. 77% మంది రెండవ ప్రియారిటీ డెవలపర్ విశ్వసనీయత. ఆ తర్వాతే ప్రాజెక్ట్ డిజైన్, లొకేషన్ ఎంపికల ప్రాధ మ్యా లుగా ఉన్నాయి. కరోనా తర్వాత అందరికీ ఆరో గ్యంపై శ్రద్ద పెరిగింది. దీంతో 72% మంది కస్ట మర్లు ఇంటిని ఎంపిక చేసేముందు ప్రాజెక్ట్‌లో వాకింగ్ ట్రాక్స్ ఉండాలని, 68% మంది గ్రీనరీ ఎక్కువగా ఉండాలని కోరుకుంటున్నారు. స్వి మ్మింగ్ పూల్ వసతులపై పెద్దగా ఆసక్తిని కన బర్చలేదు. 64% మంది ఆన్లైన్లో సెర్చ్ చేసే సమయంలో ఆఫర్లు, రాయితీల కోసం వెతికారు. -
డబ్బులు ఇవ్వకపోతే బిల్డింగ్ పై నుంచి దూకేస్తా..
సాక్షి,కొత్తగూడెంటౌన్( ఖమ్మం): తమ వద్ద బిల్డింగ్ కొనుగోలు చేసి, దానికి సంబంధించిన డబ్బులు ఇవ్వకుండా పట్టణానికి చెందిన ఓ ప్రముఖ వైద్యుడు ఇబ్బందులకు గురిచేస్తున్నాడని చెబుతూ ఓ కుటుంబం నిర్మాణంలో ఉన్న భవనం ఎక్కి ఆత్మహత్య చేసుకుంటామని బెదిరించింది. ఈ ఘటన మంగళవారం పట్టణంలో చోటుచేసుకుంది. ఈ సందర్భంగా బాధితులు మదన్‌లాల్ తుర్కిల్, బబ్లూ, మనోహర్, శివలాల్, మహేందర్‌లాల్, దేవేందర్లాల్ తుర్కిల్, చౌహాన్లాల్ తుర్కిల్ మాట్లాడారు. 2015లో తమకు చెందిన స్థలం ఓ ప్రముఖ వైద్యుడు కొనుగోలు చేశాడని తెలిపారు. దానికి సంబంధించిన నగదును పూర్తిగా చెల్లించలేదని, కానీ, ఆ స్థలంలో ప్రస్తుతం పెద్ద భవనం కడుతున్నాడని చెప్పారు. డబ్బుల గురించి అడిగితే ఇవ్వాల.. రేపు.. అంటూ దాటేస్తున్నాడని, ఆరేళ్లుగా ఆయన చుట్టూ తిరుగుతున్నామని వాపోయారు. ఇక తిరగడం తమ వల్ల కాదని చెబుతూ గణేశ్ టెంపుల్ లైన్లో ఉన్న బిల్డింగ్ ఎక్కారు. తమకు డబ్బులు చెల్లించేవరకు దిగమని భీష్మించారు. విషయం పోలీసులకు తెలియడంతో ఘటనా స్థలానికి త్రీటౌన్ ఎస్ఐ శ్రీనివాస్ సిబ్బందితో చేరుకున్నారు. బాధితులతో మాట్లాడారు. వారు ఎంతకీ వినకపోవడంతో నచ్చజెప్పేందుకు యత్నించారు. తప్పకుండా న్యాయం జరిగేలా చూస్తామని, నగదు చెల్లించేలా చర్యలు తీసుకుంటామని వైద్యుడి తరఫున పోలీసులు హామీ ఇవ్వడంతో వారు కిందకు దిగారు. సుమారు మూడు గంటల పాటు వారు బిల్డింగ్ పైనే ఉండటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. చివరకు వారు కిందకు దిగడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. చదవండి: 8,208 మంది.. 17,449 ఎకరాల భూమి ఆక్రమణ -
మాజీ మంత్రి ఆస్తులపై ఏసీబీ దాడులు
సాక్షి, చెన్నై(తమిళనాడు): ఇటీవల కాలంలో మాజీ మంత్రుల ఆస్తులపై పంజా విసురుతూ వస్తున్న అవినీతి నిరోధకశాఖ మరోసారి జూలు విదిల్చింది. మాజీ మంత్రి సి.విజయభాస్కర్ ఆస్తులపై సోమవారం ఏకకాలంలో ఆరు జిల్లాల్లో (44 చోట్ల) మెరుపుదాడులు చేసింది. 2011–16, 2016–21 హయాంనాటి అన్నాడీఎంకే ప్రభుత్వంలోని మంత్రులు తమ పదవిని అడ్డుపెట్టుకుని అక్రమంగా ఆస్తులను కూడబెట్టినట్లు అప్పటి ప్రధాన ప్రతిపక్షమైన డీఎంకే ఆరోపణలు చేయడంతోపాటూ విచారణకు ఆదేశించాల్సిందిగా గవర్నర్‌కు ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం డీఎంకే అధికారం చేపట్టిన నేపథ్యంలో అవినీతి ఆరోపణల్లో చిక్కుకున్న మాజీ మంత్రుల ఆస్తులపై ఏసీబీ దాడులు చేస్తూ వస్తోంది. మాజీ మంత్రులు ఎంఆర్ విజయభాస్కర్, ఎస్పీ వేలుమణి, కేసీ వీరమణి ఆస్తులపై ఏసీబీ వరుసగా దాడులు చేసి కేసులు పెట్టింది. ఇందుకు కొనసాగింపుగా రాష్ట్రంలోని ఆరు జిల్లాల్లో ఉన్న మాజీ మంత్రి సి. విజయభాస్కర్ ఇళ్లు, కార్యాలయాలు, కాలేజీలు వంటి 44 చోట్ల సోమవారం ఉదయం మెరుపుదాడులు ప్రారంభించారు. మాజీ మంత్రి సొంతూరైన పుదుక్కోట్టై జిల్లా వీరాలిమలై సమీపం ఇలుపూరులోని ఇంటిలోకి సోమవారం ఉదయం 6 గంటలకు సుమారు సుమారు 50 మందికిపైగా ఏసీబీ అధికారులు ప్రవేశించి తనిఖీలు ప్రారంభించారు. ఆ తరువాత పలు బృందాలుగా విడిపోయి 6.30 గంటలకు ఏకకాలంలో పుదుక్కోట్టై జిల్లాలో 30 ప్రాంతాల్లో తనిఖీలు ప్రారంభించారు. విజయభాస్కర్ సోదరుల, స్నేహితుల ఇళ్లు, కార్యాలయాలు, కాలేజీలపై దాడులు జరిపారు. మదర్ థెరిసా విద్యా చారిటబుల్ ట్రస్ట్ పేరున స్థాపించిన 14 విద్యాసంస్థల్లోనూ తనిఖీలు చేపట్టారు. కరోనా కాలంలో భారీగా అక్రమాలు కరోనా కాలంలో వైద్య చికిత్సకు సంబంధించి మందులు, ఉపకరణాల కొనుగోలులో భారీస్థాయిలో అక్రమాలకు పాల్పడినట్లు ఏసీబీ అధికారులు చెబుతున్నారు. ఆదాయానికి మించి రూ.27.22 కోట్లు కూడబెట్టినట్లు, చెన్నైలో రూ.14 కోట్లతో లగ్జరీ నివాసం, విదేశీ మోడల్ కారు కొనుగోలు చేసినట్లుగా ఏసీబీ అధికారులు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. ఈ ఎఫ్ఐఆర్లో విజయభాస్కర్ భార్య రమ్య పేరును కూడా చేర్చారు. పుదుకోట్టైతో పాటూ చెన్నై, కోయంబత్తూరు, తిరుచ్చిరాపల్లి, కాంచీపురం, చెంగల్పట్టు..మొత్తం ఆరుజిల్లాల్లో జరిగిన తనిఖీల్లో సుమారు వందమందికి పైగా ఏసీబీ అధికారులు పాల్గొన్నారు. పీపీఈ దుస్తులతో తనిఖీలు చెన్నై కీల్పాక్కంలోని విజయభాస్కర్ ఇంటిపై ఏసీబీ అధికారులు దాడులు చేసిన సమయంలో అతని భార్య రమ్య, పెద్ద కుమార్తె కరోనాకు గురై హోం క్వారంటైన్లో ఉన్నారు. దాడుల్లో భాగంగా ఇంట్లోకి ప్రవేశించిన తరువాత ఏసీబీ అధికారులకు ఈ విషయం తెలిసింది. దీంతో పీపీఈ దుస్తులు, చేతికి గ్లౌజులు ధరించి భార్య, కుమార్తె ఉన్న గదితో సహా ఇల్లంతా తనిఖీలు సాగించారు. కాగా ఏసీబీ దాడులను నిరసిస్తూ అన్నాడీఎంకే శ్రేణులు మాజీ మంత్రి ఇంటి ముందు ఆందోళనకు దిగారు. కాగా ఈ సోదాల్లో రూ. 23 లక్షల నగదు, 4.87 కేజీల బంగారం, 136 భారీ వాహనాలకు సంబంధించి రికార్డులు బయటపడ్డాయి. అలాగే 19 హార్డ్ డిస్‌్కలను స్వాధీనం చేసుకున్నారు. చదవండి: ప్రియురాలు మరో యువకుడిని ప్రేమిస్తుందని తెలిసి.. -
రెండో పెళ్లి చేసుకున్నాడని తండ్రిని చంపేశాడు
మహారాష్ట్ర: మానవ సంబంధాలు ఏమైపోతున్నాయో అనిపిస్తుంది కొన్ని సంఘటనలు చూస్తుంటే. ఆస్తి కోసం లేక తనకు ఇష్టం లేని పని చేశారనో చంపడం వరకు వెళ్లి వాళ్ల జీవితాలను కటకటాలపాలు చేసుకుంటున్నారు. ప్రస్తుతం అలాంటి ఘటనే మహారాష్ట్రలోని థానేలో చోటుచేసుకుంది. (చదవండి: వెలుగులోకి 1,500 ఏళ్ల నాటి పురాతన వైన్ కాంప్లెక్స్) వివరాల్లోకెళ్లితే.....మహారాష్ట్రలోని థానేలోని ముర్బాద్ తాలూకాలోని దొంగర్ నవ్లే గ్రామంలో 35 ఏళ్ల వ్యక్తి తన తండ్రితో గత ఐదేళ్లుగా ఆస్తి కోసం గొడవ పడుతూ ఉన్నాడు. పైగా తన తండ్రి రెండో పెళ్లి చేసుకోవడం కూడా అతనికి నచ్చలేదు. ఈ క్రమంలో అతను తన తండ్రిపై కక్ష పెంచుకుని ఒక రోజు రాత్రి తన తండ్రి నిద్రపోతున్నసయంలో వెళ్లి మళ్లీ ఆస్తి కోసం గొడవ చేసి అతి కిరాతంగా పొడిచి చంపేశాడు. ఆ తర్వాత అతను అక్కడి నుంచి పారిపోయాడు. దీంతో థానే పోలీసులు అతనిపై కేసు నమోదు చేసి దర్యాపు చేస్తున్నారు. (చదవండి: ఆ కెమికల్ వల్లే అమెరికాలో ఏటా లక్ష మంది మృతి) -
లగ్జరీ అపార్ట్మెంట్స్ కేరాఫ్ హైదరాబాద్
ముత్యాల నగరం హైదరాబాద్ ఇప్పుడు లగ్జరీ అపార్ట్మెంట్లు, ఇండిపెండెంట్ ఇళ్లకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. బడ్జెట్ ఇళ్ల నిర్మాణం కంటే లగ్జరీ అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలు కట్టేందుకు డెవలపర్లు ఆసక్తి చూపిస్తున్నారు. ప్రముఖ రియల్టీ రీసెర్చ్ సంస్థ 99 ఎకర్స్ తాజా సర్వేలో ఇదే విషయం వెల్లడైంది. నివాస యోగ్యం ఫార్మా, ఐటీ రంగాల్లో ఇప్పటికే మేటీగా ఉన్న హైదరాబాద్ నగరం కరోనా తర్వాత వైద్య సేవల విభాగంలోనూ సత్తా చాటుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాలకు చెందిన వారు సైతం ఇక్కడ ఉపాధి లభిస్తోంది. దీంతో నగరంలో జనాభా పెరగడంతో పాటు నివాసం ఉండే ఇళ్లకు డిమాండ్ పెరుగుతోంది. బడ్జెట్ ఇళ్లకే డిమాండ్ ప్రస్తుతం నగరంలో ఇళ్లు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్న వారిలో 39 శాతం మంది బడ్జెట్ ధరలో ఇండిపెండెంట్ ఇళ్లు లేదా అపార్ట్మెంట్ సొంతం చేసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. కానీ ప్రస్తుతం ఈ ధరలో నగరంలో నిర్మాణం అవుతున్న ఇళ్ల సంఖ్య తక్కువగా ఉంది. ఈ సెగ్మెంట్లో డిమాండ్ 39 శాతం ఉండగా సప్లై మాత్రం కేవలం 26 శాతానికే పరిమితమైంది. రూ.కోటి దగ్గరే నగరంలో ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న అపార్ట్మెంట్లు, ఇండిపెండెంట్ హౌజ్‌లు, గేటెడ్ కమ్యూనిటీస్‌లో ఇళ్ల ధర కోటి రూపాయలకు అటు ఇటుగానే ఉంటోంది. ఈ బడ్జెట్ సెగ్మెంట్లోనే బిల్డర్లు, డెవలపర్లు తమ ప్రాజెక్టుల విస్తరణ చేస్తున్నారు. బిగ్ ప్లేయర్లు ఎవరూ కూడా రూ. 40 లక్షలలోపు ఇళ్లు నిర్మించి ఇచ్చేందుకు రెడీగా లేరు. చిన్న ప్లేయర్లు మాత్రమే నగర శివార్లలో రూ. 40 లక్షలలోపు ఇళ్ల నిర్మాణం చేస్తున్నారు. డిమాండ్‌ని మించి నలభై లక్షల నుంచి కోటి రూపాయలు, అంత కంటే ఎక్కువ ధర ఉన్న ఇళ్లు, అపార్ట్మెంట్లు నగరం నలుమూలల శరవేగంగా నిర్మాణం జరుపుకుంటున్నాయి. సెమీ లగ్జరీ, లగ్జరీ కేటగిరిలో డిమాండ్ 61 శాతమే ఉండగా ఇళ్ల నిర్మాణాలు మాత్రం 74 శాతంగా ఉన్నాయి. మార్కెట్లో ఉన్న డిమాండ్ కంటే ఎక్కువ ఇళ్లు అందుబాటులో ఉన్నాయి. నమ్మకం కరోనా క్లిష్ట పరిస్థితుల నుంచి హైదరాబాద్ నగరం వేగంగా కోలుకుంటుంది. ఇక్కడ జనజీవనం గాడిన పడటంతో పాటు ఆర్థిక రంగం వేగంగా పుంజుకుంటోంది. మరిన్ని అంతర్జాతీయ సంస్థలు హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టేందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో రాబోయే డిమాండ్‌కి తగ్గట్టుగా సెమీ లగ్జరీ, లగ్జరీ సెగ్మెంట్లో ఇళ్ల నిర్మాణం భారీగా చేపడుతున్నట్టు బిల్డర్లు చెబుతున్నారు. చదవండి : మౌలిక రంగానికి రుణ లభ్యత అంతంతే! -
రిచెస్ట్ జాబితాలో కుక్క: రూ.15 కోట్ల ఆస్తిని రాసిచ్చిన మోడల్
అత్యంత ధనవంతుల జాబితాలో మనుషులే కాదండోయ్..కుక్కలు కూడా చేరిపోతున్నాయి. ఇటీవల కాలంలో యజమానులు తాము పెంచుకున్న పెంపుడు కుక్కలకు కోట్ల ఆస్తిని తృణప్రాయంగా రాసిస్తున్న ఘటనలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.ఇప్పటికే రిచెస్ట్ బిలియనీర్ డాగ్స్ జాబితాలో 'లులూ' అనే కుక్క ఉండగా.. ఇప్పుడు రిచెస్ట్ 'ఫ్రాన్సిస్కో' అనే మరో కుక్క చేరిపోయింది. భవిష్యత్‌లో వరల్డ్ రిచెస్ట్ బిలినియర్స్ జాబితా తరహాలో వరల్డ్ రిచెస్ట్ డాగ్స్ జాబితాను ఫోర్బ్స్ విడుదల చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు.ఎందుకంటే మనుషులకి సమానంగా కుక్కలు సైతం ఆస్తుల్ని పోగేసుకుంటున్నాయి. తాజాగా బ్రెజీలియన్కు చెందిన ప్లే బాయ్ మోడల్ జు ఐసెన్ (35) తాను సంపాదించిన ఆస్తి మొత్తం సుమారు రూ.15కోట్ల ప్రాపర్టీని ఫ్రాన్సిస్కో అనే కుక్కకు రాసిచ్చేసింది. ప్రస్తుతం అమెరికా పూస్ ఫ్రాన్సిస్కోలో నివాసం ఉంటుంన్న జు ఐసెస్ తన అపార్టమెంట్లతో పాటు రెండు కార్లను కూడా కుక్కకే రాసిస్తానని ప్రకటించింది. ఇలా చేయడం ఎందుకు' అని అడిగిన లాయర్లకు ఆశ్చర్యపోయేలా రిప్లయ్ ఇచ్చింది. నాకు పిల్లలు లేరు. ఇప్పుడు బాగాన్నా..భవిష్యత్‌లో ఏదైనా అనార్ధం జరిగితే పరిస్థితి ఏంటీ? ముందు చూపు లేకపోతే ఎలా? అందుకే ఆస్తిని ఫ్రాన్సిస్కోకు రాసిస్తున్నా. ఒకవేళ నాకు ఏదైనా జరిగితే..దాని కేర్ టేకర్ శ్రద్ధగా చూసుకుంటాడు' అని రిప్లయి ఇచ్చింది. ఇప్పుడే కాదు..గతంలో గతంలో అమెరికాలోని టెన్నెసీ రాష్ట్రం నాష్‌విల్లేకు చెందిన బిల్ డోరిస్ ప్రముఖ వ్యాపార వేత్త. బిజినెస్ చేసిన బిల్ డోరిస్ కోట్లు గడించాడు. పెళ్లి చేసుకోలేదు. పిల్లలు లేరు. కోట్లలో ఆస్తులు ఉన్నాయి. అందుకే తన ఆస్తి పాస్తులన్నీ (సుమారు 36కోట్లుకు పైమాటే) తన కుక్క లులూకి చెందేలా రాసిచ్చాడు. దీంతో ఎనిమిదేళ్ల వయసున్న ఆ కుక్క ప్రపంచంలోనే రిచెస్ట్ డాగ్ గా పేరు సంపాదించుకుంది. వీలునామా రాసి కుక్క కోసం ఓ ట్రస్ట్‌ను ఏర్పాటు చేశాడు. ఆ ట్రస్ట్‌కు ఛైర్మన్‌గా తన స్నేహితుడు మార్తా బర్టన్ను నియమించాడు. అప్పట్లో ఈ ఇన్సిడెంట్ సోషల్ మీడియాలో హాట్ టాపిగ్గా మారింది. చదవండి: వారెన్ బఫెట్ తరువాత మనోడే, ధనవంతుల జాబితాలో ముఖేష్ అంబానీ -
వందేళ్ల తర్వాత న్యాయం.. తిరిగి వచ్చిన రూ.555 కోట్ల ఆస్తి
వాషింగ్టన్: ప్రస్తుత పరిస్థితుల్లో ఆస్తులు, డబ్బులు ఒకసారి మన చేయి జారిపోతే.. తిరిగి దక్కించుకోవడం చాలా కష్టం. మనకు ఎంతోకొంత అదృష్టం ఉండి.. ఎదుటివారి నిజాయతీపరులైతే తప్ప మన సొమ్ము మనకు దక్కదు. ఇప్పుడు మనం చదవబోయే వార్తలో బాధితులు అదృష్టంతులనే చెప్పవచ్చు. శతాబ్దం తర్వాత వారికి న్యాయం జరిగింది. వందేళ్ల క్రితం కొందరు అమెరికా అధికారులు.. నల్లజాతీయుల కుటుంబానికి చెందిన భూమిని ఆక్రమించుకున్నారు. ఇన్నేళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత ఆ నల్ల జాతీయుల కుటుంబానికి న్యాయం జరిగింది. అమెరికా అధికారులు ఆక్రమించిన భూమిని తిరిగి వారికి అప్పగించారు. ఇప్పుడు దాని విలువ 555 కోట్ల రూపాయలకు పైనే ఉంది. వందేళ్ల తర్వాత ఇంత విలువైన న్యాయం జరగడంతో ఆ కుటుంబం తెగ సంతోషపడుతుంది. ఆ వివరాలు.. సుమారు వందేళ్ల క్రితం అనగా 1900 సంవత్సరం ప్రారంభంలో తెల్ల జాతీయులకు, నల్ల జాతీయులకు మధ్య తీవ్ర ఘర్షణలు చెలరేగాయి. జాత్యాంకార విద్వేషం రగులుతున్న సమయం. ఈ క్రమంలో దక్షిణ కాలిఫోర్నియాలో ఉంటున్న బ్రూస్ కుటుంబం మొదటి సారి నల్ల జాతీయుల కోసం ఆ ప్రాంతంలోని బీచ్‌లో 1912లో వెస్ట్‌కోస్ట్ రిసార్ట్ స్థాపించారు. దీనిలో లాడ్జ్, కేఫ్, డ్యాన్స్ హాల్, డ్రెస్సింగ్ టెంట్లు ఉన్నాయి. ఇక ఇది దక్షిణ కాలిఫోర్నియా ట్రేడ్‌మార్క్ బీచ్‌లలో ఒకటిగా ఉంది. ప్రస్తుతం ఈ రిసార్ట్ మల్టీ మిలియన్ డాలర్ల విలువ చేసే ఇళ్ల సముదాయల మధ్యన ఉంది. (చదవండి: డార్నెల్లా ఫ్రెజర్.. నిప్పులా ఉద్యమాన్ని రాజేసింది!) బ్రూస్ కుటుంబం ఇలా నల్ల జాతీయుల కోసం రిసార్ట్ స్థాపించడం నచ్చని శత్రువర్గీయులు.. దానికి నిప్పు పెట్టడానికి కూడా ప్రయత్నించారు. అంతేకాక 1920వ ప్రాంతంలో బ్రూస్ కుటుంబం నుంచి రిసార్ట్, అది ఉన్న స్థలాన్ని ఆక్రమించడం కోసం అక్కడ ఓ పార్క్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. అనంతరం మాన్హాటన్ బీచ్ సిటీ కౌన్సిల్ బ్రూస్ కుటుంబం నుంచి భూమిని సేకరించేందుకు ప్రముఖ డొమైన్‌ని ఆహ్వానించింది. (చదవండి: జాత్యహంకారం.. కెమెరాకు చిక్కిన ప్లేయర్) అలా 1924 ప్రాంతంలో అక్రమంగా ఆక్రమించిన ఈ స్థలాన్ని ప్రస్తుతం అనగా సుమారు వందేళ్ల తర్వాత 2021లో తిరిగి బ్రూస్ వారసులకు తిరిగి అప్పగించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ సందర్భంగా గతంలో జరిగిన తప్పును సరిదిద్దే ప్రయత్నం ఇది అంటూ కాలిఫోర్నియా గవర్నర్ గావిన్ న్యూసమ్ ట్వీట్ చేశారు. బ్రూస్ వారసులు, ఆ దంపతుల మునిమనడికి భూమిని పునరుద్ధరించడానికి అనుమతించే బిల్లుపై గవర్నర్ గావిన్ న్యూసమ్ సంతకం చేశారు. ప్రస్తుతం ఈ భూమి విలువ 75 మిలియన్ డాలర్లు(5,55,84,64,125 రూపాయలు). ఈ విషయం తెలిసిన నెటిజనులు.. ఇనేళ్ల తర్వాత అయినా న్యాయం జరిగింది.. అది కూడా చాలా ఖరీదైన న్యాయం అంటూ కామెంట్ చేస్తున్నారు. The Bruce family was stripped of their property in 1924 because of hatred and racism. It’s past time to right that wrong. Today, by returning the property CA took another step toward addressing systemic racism and set a path forward for other states & our nation to do the same. pic.twitter.com/Dz9GXze5bL — Gavin Newsom (@GavinNewsom) September 30, 2021 చదవండి: జాత్యహంకారానికి టీకా లేదా? -
కన్నతండ్రే కాలయముడు.. ఆస్తిలో వాటా..
కేవీపల్లె: ఆస్తిలో వాటా అడగాడని కుమారుడిని కన్నతండ్రే హత్య చేయించినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఈ నెల 16వ తేదీన మండలంలోని రెడ్డివారిపల్లెలో జరిగిన యువకుడి హత్య కేసులో నలుగురు నిందితులను సోమవారం పోలీసులు అరెస్ట్ చేశారు. మదనపల్లె డీఎస్పీ రవిమనోహరాచారి వివరాలను తెలిపారు. ఆయన కథనం మేరకు.. కేవీపల్లె మండలం తువ్వపల్లె పంచాయతీ రెడ్డివారిపల్లెకు చెందిన చిన్నకోట్ల జయరామ్ మొదటి భార్య కుమారుడు గిరిబాబు అలియాస్ రవి(21) మదనపల్లె మండలం కోళ్లబైలు పంచాయతీ వెంకటేశ్వపురంలో నివసిస్తున్నాడు. ఆస్తిలో వాటా కోసం తండ్రి జయరామ్‌తో రవి తరచూ గొడవపడేవాడు. ఈ క్రమంలో రవి అడ్డుతొలగించుకోవాలని భావించిన జయరామ్ రూ.9లక్షలకు కిరాయి హంతకులతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. వారు పథకం ప్రకారం రవిని హత్య చేశారు. చదవండి: డూప్లి ‘కేటు’ హోంగార్డులు! దీనిపై జయరామ్ అమాయకంగా నటిస్తూ పోలీసులకు సైతం ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన వాల్మీకిపురం సీఐ నాగార్జునరెడ్డి, కేవీపల్లె ఎస్ బాలకృష్ణ ఆధ్వర్యంలో బృందాలుగా విడిపోయి దర్యాప్తు చేపట్టారు. పోలీసుల దర్యాప్తులో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. కన్న కొడుకును తండ్రే హత్య చేయించినట్లు వెల్లడైంది. ఈ క్రమంలో ప్రధాన నిందితుడు జయరామ్‌తోపాటు రెడ్డివారిపల్లెకు చెందిన కొరముట్ల మల్లికార్జున, మదనపల్లెలోని రామిరెడ్డి లేఅవుట్‌కు చెందిన గదేముతక చంద్రశేఖర్, పుంగనూరు మండలం మేళందొడ్డికి చెందిన వడ్డీ సురేష్‌ను అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రెండు సెల్ఫోన్లు, ఒక బైక్, రూ.2వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. కేసు ఛేదించిన సీఐ నాగార్జునరెడ్డి, ఎస్ఐ బాలకృష్ణ, వెంకటేశ్వర్లు, రవిప్రకాష్‌రెడ్డి, హెడ్‌కానిస్టేబుల్ అన్వర్, కానిస్టేబుళ్లు రాజేష్‌రెడ్డి, మోహన్‌కుమార్, సురేష్, నాగార్జున, రాఘవేంద్రరెడ్డి, దొరబాబుకు డీఎస్పీ రివార్డు అందించారు. చదవండి: 'నిన్ను మనసారా ప్రేమించా'.. సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆత్మహత్య -
స్థిరాస్తి కొనేటప్పుడు పాటించాల్సిన జాగ్రత్తలు ఇవే
కరోనా ఉధృతి కాస్త తగ్గడంతో ఇప్పుడిప్పుడే దేశంలో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. వ్యాపారాలు మొదలయ్యాయి. స్థిరాస్తుల క్రయవిక్రయాలు కూడా క్రమంగా జుకుంటున్నాయనే చెప్పాలి. ఆదాయపు పన్నుకి సంబంధించి స్థిరాస్తుల క్రయవిక్రయ లావాదేవీల్లో ఎంతో జాగ్రత్త వహించాలి. ఈ వారం కొనే వారికి సంబంధించిన అంశాలు పరిశీలిద్దాం. దానికన్నా ముందు రెండు పక్షాలూ తీసుకోవలసిన జాగ్రత్తలు తెలుసుకుందాం. - అటు అమ్మేవారు, ఇటు కొనేవారు ప్రతిఫలం విషయంలో సరైన అవగాహనకి రావాలి. హెచ్చుతగ్గులు పనికి రావు. భేదాభిప్రాయాలు ఉండకూడదు. ఈ మేరకు ఒప్పందం .. అగ్రిమెంటు రాసుకోవాలి. - మొత్తం వ్యవహారం.. ప్రతిఫలం అంతా వైట్‌లోనే ఉండాలి. బ్లాక్ వ్యవహారం వద్దే వద్దు. మామూలు వస్తువులు, సేవల్లో నగదు లావాదేవీలు ఉండకూడదు. అలాగే, స్థిరాస్తి క్రయవిక్రయాలలో కూడా నిషేధం. - విక్రయించేటప్పుడు నగదు పుచ్చుకోకూడదు. ఇవ్వనూ కూడదు. - నగదు పుచ్చుకునే వ్యక్తికి, ఎంత మొత్తం నగదుగా పుచ్చుకుంటే అంత పెనాల్టీ ఉంటుంది. మిగతా అన్ని వ్యవహారాలనూ ఆరా తీస్తారు. అప్పుడు పాతవి, కొత్తవి బైటపడతాయి. కొండనాలుకకు మందు వేస్తే అసలు నాలుక బైటపడినట్లవుతుంది. కొనే వ్యక్తి తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. - ఒప్పందంలో రాసుకున్న ప్రతిఫలాన్ని పూర్తిగా వైట్‌లోనే చెల్లించాలి. - చెల్లింపులన్నీ బ్యాంకు ద్వారా .. అంటే చెక్కు ద్వారా RTGS లేదా NEFT ద్వారా లేదా డీడీల ద్వారా చేయాలి. - నగదు ప్రశ్న తలెత్తకూడదు. - చెల్లించే ప్రతి రూపాయికి ‘సోర్స్‘ ఉండాలి. దీని గురించి మనం గత వారం తెలుసుకున్నాం. ‘సోర్స్‘ అంటే ఆదాయమే అయి ఉండాలనేమీ లేదు. ఆదాయమే అయితే లెక్కల్లో చూపించి, డిక్లేర్ చేయండి. - పన్నుకు గురికాని ఆదాయమే అయితే, సంబంధించిన కాగితాలు భద్రపర్చుకోండి. రిటర్నులలో డిక్లేర్ చేయండి. ఇటువంటి సమాచారం కోసం ఒక ‘కాలం‘ ఉంటుంది. అందులో రాయండి. - గత సంవత్సరానికి సంబంధించి పన్నుకి గురి కాని వాటి వివరాలు ఉంచుకోండి. మినహాయింపు పొందిన ఆదాయాలు, పీఎఫ్ విత్‌డ్రాయల్స్, ఎన్ఎస్సీ (నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్)ల మెచ్యూరిటీలు, జీవిత బీమా గడువు తీరాక వచ్చే చెల్లింపులు, గ్రాట్యుటీలు, రిటైర్మెంట్ బెనిఫిట్లు వంటివెన్నో పన్ను భారం పడని వాటిల్లో ఉంటాయి. - మీ అబ్బాయి/అమ్మాయి విదేశాల నుంచి పంపే నిధులేమైనా ఉంటే వాటికి సంబంధించిన కాగితాలన్నీ భద్రపర్చండి. - బ్యాంకు అప్పులు,, ఇతర సంస్థల నుంచి తీసుకున్న అప్పులు, మిత్రులు ఇచ్చిన రుణాలు .. ఇలా ఎన్నో ఉంటాయి. ఏదైనా సరే ప్రతీ దానికి ఒక కాగితం .. ఓ రాత.. ఓ కోత.. రుజువులు ఉండాలి. - ముందుగా ‘సోర్స్‘ మీ అకౌంటులో జమగా ఉండాలి. ఆ తర్వాతే ‘ఖర్చు‘ డెబిట్ జరగాలి. ఈ ‘సీక్వెన్స్‘లో రెండోది ముందు, మొదటిది తర్వాత జరగకూడదు. ‘షార్ట్‌ఫాల్‘ ఉండకూడదు. ఒకవేళ ‘షార్ట్‌ఫాల్‘ ఉంటే దాన్ని ఆదాయంగా భావిస్తారు. కాబట్టి జాగ్రత్త. చెల్లించే ప్రతిఫలం రూ. 50,00,000 దాటితే టీడీఎస్‌కి సంబంధించిన నియమాలు వర్తిస్తాయని గుర్తుంచుకోవాలి. - కేసీహెచ్ ఏవీఎస్‌ఎన్ మూర్తి, కేవీఎన్ లావణ్య ట్యాక్సేషన్ నిఫుణులు చదవండి : రిటైర్మెంట్ తర్వాత స్థిర ఆదాయం కోసం ఇలా చేయండి -
సర్వేకు అదనంగా డ్రోన్లు
సాక్షి, అమరావతి: వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు– భూ రక్ష కార్యక్రమంలో భాగంగా గ్రామ కంఠాల్లో ఇళ్లు, ఇతర ఖాళీ స్థలాలకు కొత్తగా ఆస్తి సర్టిఫికెట్ల జారీకి సర్వే ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో డ్రోన్ల ద్వారా సర్వే కొనసాగుతోంది. రాష్ట్రంలో ఆరు డ్రోన్లు అందుబాటులో ఉండగా, తాజాగా జిల్లాకొకటి చొప్పున మొత్తం 13 డ్రోన్లను కేంద్రం సమిత్వ పథకంలో భాగంగా సమకూర్చేందుకు అంగీకరించింది. ఈ మేరకు కేంద్ర పంచాయతీరాజ్ శాఖ జాయింట్ సెక్రటరీ అలోక్ ప్రేమ్ నగరతో పాటు సర్వే ఆఫ్ ఇండియా మాజీ చీఫ్, ప్రస్తుత కేంద్ర పంచాయతీరాజ్‌శాఖ అడ్వయిజర్ కల్నల్ గిరీష్ బుధవారం రాష్ట్రంలో పర్యటించారు. కృష్ణా జిల్లాలో పలు గ్రామాల్లో జరుగుతున్న సర్వే ప్రక్రియను పరిశీలించారు. అనంతరం తాడేపల్లిలోని పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ కార్యాలయంలో అధికారులతో సమావేశమయ్యారు. అక్టోబర్ 2 నాటికి దాదాపు 2,500 గ్రామాల్లో డ్రోన్ల ద్వారా సర్వే పూర్తి చేసి మ్యాప్‌లను రాష్ట్రానికి అందజేసేందుకు చర్యలు చేపడతామని కేంద్ర అధికారులు హామీ ఇచ్చారు. గ్రామాల్లో డ్రోన్ల ద్వారా సర్వే సమయంలో చెట్లు వంటివి అడ్డం వచ్చినప్పుడు, ఇంటి సరిహద్దుల మధ్య విస్తీర్ణాన్ని నిర్ధారించడంలో ఏర్పడుతున్న ఇబ్బందులను పలు జిల్లాల కలెక్టర్లు సర్వే ఆఫ్ ఇండియా ఉన్నతాధికారుల వద్ద ప్రస్తావించారు. ఆ సమయంలో అనుసరించాల్సిన వ్యూహాలను సర్వే ఆఫ్ ఇండియా ప్రతినిధులు వివరించారు. సీసీఎల్ఏ నీరబ్‌కుమార్ ప్రసాద్, పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ గిరిజా శంకర్, సర్వే ఆఫ్ ఇండియా ప్రాంతీయ డైరెక్టర్ మాలిక్, వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు– భూరక్ష కార్యక్రమం ఓఎస్డీ ఏకే నాయక్, వర్చువల్ విధానంలో పలు జిల్లాల కలెక్టర్లు పాల్గొన్నారు. -
అభిషేక్ బచ్చన్ లగ్జరీ అపార్ట్మెంట్ అమ్మకం.. ధర ఎంతంటే?
ముంబై: అభిషేక్ బచ్చన్ ముంబైలోని ఒబెరాయ్ 360 పడమరలో ఉన్న తన లగ్జరీ అపార్ట్‌మెంట్‌ను విక్రయించాడు. దీని అమ్మకం ద్వారా ఆయనకు రూ. 45.75 కోట్లు వచ్చాయి. మనీ కంట్రోల్ నివేదిక ప్రకారం.. ముంబైలోని వర్లి ప్రాంతంలో ఒబెరాయ్ 360 అపార్టుమెంట్ పడమరలో ఉన్న 37వ అంతస్తులో 7,527 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగి ఉంది. అభిషేక్ బచ్చన్ ఈ ఇంటిని 2014లో రూ. 41 కోట్లకు కొనుగోలు చేసినట్లు సమాచారం. కాగా అదే బిల్డింగ్‌లో షాహిద్ తన అపార్ట్మెంట్ కోసం రూ. 56 కోట్లు చెల్లించగా, అక్షయ్ రూ.52.5 కోట్లు పెట్టి కొనుగోలు చేశారు. అంతే కాకుండా రాణి ముఖర్జీ, దిశా పటానీ ఖార్ వెస్ట్ పరిసరాల్లో సముద్ర ముఖంగా ఉన్న గృహాలను కొనుగోలు చేశారు. రాణి ముఖర్జీ దీనికోసం రూ.7.12 కోట్లు ఖర్చు చేయగా.. దిశా పటానీ రూ.5.95 కోట్లకు కొనుగోలు చేసింది. ఇక అభిషేక్ చివరిసారిగా ది బిగ్ బుల్లో కనిపించాడు. ఇది వివాదాస్పద స్టాక్ బ్రోకర్ హర్షద్ మెహతా జీవితం ఆధారంగా తెరకెక్కిన సినిమా. అయితే ఈ సినిమా హన్సల్ మెహతా హిట్ సిరీస్‌తో పోల్చితే బాగా ఆడలేదనే చెప్పాలి. ఆయన తదుపరి రెండు చిత్రాలు నిమ్రత్ కౌర్‌తో దాస్వి, చిత్రాంగద సేన్‌తో బాబ్ బిశ్వాస్ సిమాలు విడుదల కావాల్సి ఉంది. అంతేకాకుండా ఐశ్వర్య చివరిసారిగా అనిల్ కపూర్, రాజ్‌కుమార్ రావుతో కలిసి ఫన్నీ ఖాన్ సినిమాలో కనిపించింది. ఆమె తదుపరి ప్రాజెక్ట్ మణిరత్నం పొన్నియిన్ సెల్వన్ సినిమాలో కనిపించనుంది. ఈ చిత్రం కల్కి కృష్ణమూర్తి తమిళ నవల ఆధారంగా తెరకెక్కనున్న పీరియడ్ ఇతిహాసం. -
మీరు అప్పులు చేస్తున్నారా? అవసరాల కోసం కాకుంటే మంచిదే!
అవసరాలు గట్టెక్కేందుకేనా అప్పు.. ఇలానే ఎందుకు ఆలోచించాలి..? కొంచెం భిన్నంగా ‘రుణంతో ఆస్తులను కూడబెట్టుకుందాం’ అని సంకల్పం చెప్పుకోవచ్చుగా..! ఇలా ఆలోచించే వారు రుణంతో నిజంగానే సంపదను సృష్టించుకోవచ్చు. అందుకు మార్గాలు కూడా ఉన్నాయి. అవసరాలు ఎదురై అప్పును ఆశ్రయించే వారే మన సమాజంలో ఎక్కువ. కానీ, కొందరు తెలివిగా అదే అప్పుతో ఆస్తులను సమకూర్చుకునే విధానాలను అనుసరిస్తుంటారు. ఇటువంటి వారు మిగిలిన వారికి భిన్నం. వడ్డీ రేట్లు కనిష్టాల్లో ఉన్నాయి. తక్కువ వడ్డీ వ్యయాలను అనుకూలంగా చేసుకుని రుణంతో ఇంటిని కొనుగోలు చేసుకోవడం ఒక మంచి మార్గం. కరోనా కారణంగా ఆర్థిక వృద్ధి కనిష్టాలకు చేరిన తరుణంలో ఆర్బీఐ వడ్డీ రేట్లను సాధ్యమైనంత కనిష్టాలకు తీసుకొచ్చింది. దీనికితోడు ప్రాపర్టీల ధరలు కూడా దిగివచ్చాయి. పన్ను ప్రయోజనాల కోణం నుంచి చూసినా రుణంతో ఆస్తి ఏర్పాటుకు అనుకూల సమయం ఇదేనంటున్నారు నిపుణులు. రుణంతో ఆస్తిని సమకూర్చుకోవాలన్నా.. సంపద సృష్టికి అడ్డుగా ఉన్న రుణాల భారాన్ని దింపుకోవాలన్నా.. అందుకు ఏం చేయాలన్నది ప్రాఫిట్ ప్లస్ కథనంతో తెలుసుకుందాం.. వడ్డీ రేట్ల పరంగా చూస్తే రుణానికి ఇదే మంచి తరుణం. కానీ, ఆర్థిక పరిస్థితులు, ఉద్యోగ అస్థిరతలను పరిశీలిస్తే రుణం తీసుకునే విషయంలో ఆచితూచి వ్యవహరించక తప్పదు. ఖరీదైన ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల కొనుగోలుకు లేదా గృహ నవీకరణ తదితర వినియోగ రుణాల విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిందే. ఎందుకంటే ఇవి ఆస్తులను తెచ్చి పెట్టేవి కావు. దీనికి బదులు ఇల్లు సమకూర్చుకునేందుకు లేదా వాణిజ్య సముదాయం లేదా వాణిజ్య భవనాన్ని కొనుగోలు చేసేందుకు రుణం బాట పట్టడం అనుకూలమైనదే. ‘‘ఆదాయం విషయమై అనిశ్చిత పరిస్థితులు ఏర్పడిన ప్రస్తుత పరిస్థితుల్లో ఆస్తుల ఆధారిత రుణాలు మరింత ఆర్థవంతమైనవి’’ అని మైలోన్‌కేర్ సీఈవో గౌరవ్ గుప్తా అభిప్రాయపడ్డారు. వ్యక్తిగత రుణాలు, క్రెడిట్ కార్డు రుణాలపై వడ్డీ వ్యయాలు వార్షికంగా 11–36 శాతం వరకు ఉన్నాయి. కానీ, గృహ రుణాలపై వడ్డీ రేట్లు 6.63 శాతం నుంచే అందుబాటులో ఉన్నాయి. ‘‘మొదటిసారి ఇంటిని సమకూర్చుకునే వారికి ఇది మంచి తరుణం. ఎందుకంటే ప్రాపర్టీల ధరలు, వడ్డీ రేట్లు ఇంత తక్కువ ఎప్పుడూ లేవు’’ అని మైమనీ మంత్ర ఎండీ రాజ్‌ఖోస్లా పేర్కొన్నారు. నాణేనికి మరో కోణం అన్నట్టు.. ఇతర అవసరాలకు కూడా రుణం తీసుకోవాల్సి రావచ్చు. ప్రమాదాల వంటి అత్యవసర పరిస్థితులు, అనారోగ్యం, ఉద్యోగం కోల్పోవడం వంటి అంశాలు రుణం తీసుకునేందుకు దారితీయవచ్చు. ఒకవేళ ఇవే పరిస్థితులు ఎదురైతే వ్యక్తిగత రుణాలకు బదులు బంగారంపై రుణాన్ని పరిశీలించొచ్చు. ఎందుకంటే రుణం పొందేందుకు ఇది సులభమార్గం. ‘‘బ్యాంకులు బంగారం విలువ లో 90% వరకు రుణంగా ఇస్తున్నాయి. అయితే బంగారం ఆభరణాల విలువలో 60–70 శాతానికి మించి రుణం తీసుకోకపోవడమే మంచిది’’ అని ఖోస్లా సూచించారు. మిగులు నిధులు ఉంటే..? అందుబాటులో ఉన్న మార్గాల్లో ఏది మెరుగైనదన్న పరిశీలన చేసుకోవాలి. ఇప్పటికే గృహ రుణం తీసుకున్న వారు.. తమ వద్ద మిగులు నిధులు ఉన్నాయని చెప్పి గృహ రుణాన్ని తీర్చేద్దామనుకుంటున్నారా..? దీనికంటే కూడా మెరుగైన రాబడులను ఇచ్చే సాధనంలో ఇన్వెస్ట్ చేసుకోవడం మంచి ఆలోచన అవుతుంది. ఎందుకంటే గృహ రుణంపై వడ్డీ రేటు 7 శాతం స్థాయిలో ఉన్నప్పుడు.. దీన్ని తీర్చేయడానికి బదులు దీర్ఘకాలం కోసం ఈక్విటీలు లేదంటే మరో ప్రాపర్టీని సమకూర్చుకునే ఆలోచన చేయవచ్చు. పైగా గృహ రుణం వల్ల ఎంతో పన్ను ఆదా చేసుకునే చక్కని మార్గం కూడా ఉంది. తమవద్ద మిగులు నిల్వలతో గృహ రుణాన్ని తీర్చేద్దామని అనుకునేవారు దీనికి బదులు అధిక వడ్డీ భారంతో ఉన్న ఇతర రుణాలను తీర్చేసే ఆలోచన కూడా చేయవచ్చు. అధిక వడ్డీతో కూడిన రుణాలను వదిలించుకోవడం కూడా సంపద సృష్టించుకునే మార్గాల్లో ఒకటి. ‘‘రుణ గ్రహీత వద్ద మిగులు నిల్వలు ఉంటే వాటితో అధిక వడ్డీ పడే క్రెడిట్‌కార్డు, వ్యక్తిగత, ఆటో రుణాలను వదిలించుకోవడాన్ని పరిశీలించొచ్చు’’ అని ఖోస్లా సూచించారు. చెప్పడానికి, ఆచరించడానికి మధ్య ఎంతో అంతరం ఉంది. కనుక మిగులు నిధులు ఉన్న వారు దీర్ఘకాలంలో మెరుగైన విలువను తెచ్చిపెట్టే ఆస్తులపై ఇన్వెస్ట్ చేయలేక.. తీసుకెళ్లి ఫిక్స్డ్ డిపాజిట్ చేసే అవకాశం లేకపోలేదు. ఎఫ్డీపై వడ్డీ రేటు 6 శాతం వస్తుంది. దీనిపై ఆదాయపన్ను కూడా పడుతుంది. ద్రవ్యోల్బణ ప్రభావం తీసివేసి చూస్తే మిగిలేదేమీ ఉండదు. అందుకుని ఇటువంటి వారు ప్రస్తుత రుణాలను (గృహ రుణం అయినా సరే) తీర్చేయడానికి మిగులు నిధులను వినియోగించుకోవచ్చు. సంపద సృష్టికి రుణంతో ఆస్తిని సమకూర్చుకోవడం ఎంత ముఖ్యమో.. అధిక వడ్డీ భారంతో ఆదాయాన్ని మింగేస్తున్న రుణాలను వదిలించుకోవడం కూడా అంతే ముఖ్యమని గుర్తించాలి. తమ వద్దనున్న నిధులపై కనీసం 10 శాతం పైన రాబడులు సమకూర్చుకునే మార్గం ఉంటే గృహ రుణాన్ని ముందుగా తీర్చివేయడానికి దూరంగా ఉండొచ్చని మైలోన్‌కేర్ గుప్తా సూచించారు. ఇక్కడ ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన అంశం ఏమిటంటే.. రుణాలకు చేసే చెల్లింపులు ఆదాయంలో 50 శాతాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మించకూడదు. పన్ను ప్రయోజనాలు.. రుణంతో ఇల్లు సమకూర్చుకోవడమే కాదు.. పన్నును ఆదా చేసుకోవచ్చు. ఇంటి రుణ ఈఎంఐలో (నెలవారీ వాయిదా) వడ్డీ భాగంతోపాటు అసలు కూడా కొంత కలసి ఉంటుంది. ఇలా ఒక ఆర్థిక సంవత్సరంలో గృహ రుణానికి చేసే అసలు చెల్లింపులు గరిష్టంగా రూ.1.5 లక్షల మొత్తంపై సెక్షన్ 80సీ కింద పన్ను చెల్లించక్కర్లేదు. అదే విధంగా ఒక ఆర్థిక సంవత్సరంలో గృహ రుణానికి చేసే వడ్డీ చెల్లింపులు రూ.2లక్షల మొత్తంపైనా సెక్షన్ 24(బి) కింద పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. అదే విధంగా సెక్షన్ 80ఈఈఏ కింద అందుబాటు ధరల ఇంటికి తీసుకున్న రుణం అయితే మరో రూ.1.50లక్షల వడ్డీ చెల్లింపులపైనా పన్ను మినహాయింపును కోరొచ్చు. కాకపోతే రుణాన్ని ముందుగానే తీర్చివేస్తే ఈ పన్ను ప్రయోజనాలపై ప్రభావం పడుతుంది. పన్ను ప్రయోజనం కోసమే ఇంటి గురించి ఆలోచిస్తున్నట్టు అయితే రూ.20 లక్షల గృహ రుణం తీసుకుంటే సరిపోతుందంటున్నారు ఖోస్లా. 7.5 శాతం వడ్డీ రేటు ప్రకారం రూ.2 లక్షల వడ్డీ చెల్లింపులపై పన్ను ప్రయోజనాన్ని పొందేందుకు రూ.20 లక్షల రుణం చాలంటున్నారు. ఈ మొత్తంపై వార్షికంగా రూ.50,000–60,000 మేర పన్ను ఆదా చేసుకోవచ్చు. అధిక పన్ను పరిధిలో ఉన్న వారు అందుబాటు ధరల్లోని ఇంటిని రూ.20 లక్షల రుణంతో కొనుగోలు చేసుకోవచ్చని రిటైల్ లెండింగ్ సంస్థ వ్యవస్థాపకురాలు సుకన్యకుమార్ సైతం సూచించారు. టాపప్ లోన్ ఇప్పటికే గృహ రుణం తీసుకుని కొంత తీర్చేశారనుకుందాం. దీనిపై టాపప్ రుణాన్ని పొందే అర్హత పొందినట్టే. అంటే అదనంగా మరికొంత రుణాన్ని తీసుకోవచ్చు. అప్పటికే కొనసాగుతున్న గృహ రుణంపై రేటుతో పోలిస్తే కొంచెం ఎక్కువ రేటు టాపప్ లోన్‌పై అమలవుతుంది. అయినప్పటికీ వ్యక్తిగత, క్రెడిట్ కార్డు రుణాలతో పోలిస్తే చాలా తక్కువే ఉంటుంది. అందుకుని టాపప్ లోన్ తీసుకుని ప్లాట్ కొనుగోలును పరిశీలించొచ్చు. కాకపోతే టాపప్ లోన్ విషయంలో బ్యాంకులు ప్రస్తుతం కొంచెం కఠినంగానే వ్యవహరిస్తున్నాయి. ‘‘ప్రాపర్టీల ధరలు తగ్గాయి. గతంలో రూ.కోటి విలువైన ఇంటి ధర ప్రస్తుతం రూ.80 లక్షలకు తగ్గిపోయింది. కనుక విలువ పరంగా చూస్తే ఇంటి రుణంపై టాపప్ లోన్‌ను ఇచ్చేందుకు క్రెడిట్ మేనేజర్లు సౌకర్యంగా భావించడం లేదు’’ అని సుకన్య కుమార్ వివరించారు. అయితే వ్యక్తిగత రుణ చరిత్ర, ఆదాయం ప్రకారం తగిన అర్హతలు ఉంటే టాపప్ లోన్‌ను సులభంగానే పొందొచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. రుణంతో ఇంటిని కొనుగోలు చేసిన ఆ ఇంటి వ్యాల్యూషన్ పెరిగిపోయినట్టయితే మరింత అధికంగా టాపప్లోన్ను అర్హత లభించినట్టే. ఒక వేళ గతంలో రుణ చెల్లింపుల్లో విఫలమైన చరిత్ర ఉండి, రుణ మారటోరియాన్ని వినియోగించుకుని ఉంటే అప్పుడు బ్యాంకులు టాపప్‌లోన్ మంజూరు విషయంలో కఠినంగా వ్యవహరించే అవకాశం లేకపోలేదు. పాత రుణంపై అధిక రేట్లు లోగడ ఎప్పుడో గృహ రుణం తీసుకున్నవారు ఇప్పటికీ అధిక వడ్డీ రేటే చెల్లిస్తుంటారు. ‘‘బేస్ రేటుతో అనుసంధానమైన గృహ రుణాలు తీసుకున్న వారికి ఇప్పటికీ అధిక వడ్డీ రేటే అమలవుతోంది. కస్టమర్లు అడగకుండా బ్యాంకులు సొంతంగా పాత రుణాలను కొత్త విధానంలోకి మార్చే చర్యలు తీసుకోవు’’ అని సుకన్య కుమార్ పేర్కొన్నారు. కనుక పాత విధానాల్లో గృహ రుణం తీసుకున్న వారు రెపో రేటు లేదా ట్రెజరీ బిల్లు ఆధారిత రేట్ల విధానానికి మారిపోవచ్చు. ఆర్బీఐ వడ్డీ రేట్లు తగ్గించినప్పుడు నూతన విధానంలో బ్యాంకులు సైతం వేగంగా ఆ మేరకు రుణ రేట్లను సవరిస్తున్నాయి. ‘‘గృహ రుణ సంస్థ నుంచి రుణం తీసుకుని ఉన్నట్టయితే అది ప్రైమ్ లెండింగ్ రేటు అయి ఉంటుంది. అటువంటి సందర్భంలో రెపో రేటుకు ఆ రుణాన్ని మార్చుకోవా లనుకుంటే అందుకు బ్యాలన్స్ ట్రాన్స్ఫర్ ఒక మార్గం’’ అని మైలోన్ కేర్‌కు చెందిన గుప్తా సూచించారు. రుణం బదిలీ ప్రస్తుతం గృహ రుణాలపై రేట్లు 6.63–7.25% మధ్య ఉన్నాయి. ‘‘ప్రస్తుత మీ గృహ రుణ రేటు ఈ రేట్ల కంటే 0.35 శాతం లేదా అంతకు మించిన వ్యత్యాసంతో ఉంటే తగ్గించాలని రుణదాతను కోరాలి. అది ఫలించకపోతే అప్పుడు మీ గృహ రుణం బ్యాలన్స్‌ను తక్కువ వడ్డీ రేటుతో ఆఫర్ చేస్తున్న సంస్థకు బదిలీ చేసుకోవాలి’’ అని మార్ట్గేజ్ వరల్డ్ వ్యవస్థాపకుడు విపుల్ పటేల్ సూచించారు. అయితే రుణాన్ని బదిలీ చేసుకోవడం ఎంత మేర ప్రయోజనం ఉంటుందన్నది ముందే అంచనాకు రావాలి. ఎందుకంటే రుణాన్ని బదిలీ చేసుకునే సమయంలో ప్రాసెసింగ్ ఫీజు, ఇతర చార్జీలను భరించాల్సి రావచ్చు. మార్ట్గేజ్ ఒప్పందాలపై స్టాంప్ డ్యూటీ చార్జీలు మిగిలే ప్రయోజాన్ని హరించొచ్చు. ఈ చార్జీలు రూ.10,000–20,000 మధ్యన ఉండొచ్చు. న్యాయ, సాంకేతిక చార్జీల రూపంలో మరో రూ.2,500–10,000 వరకు చెల్లించుకోవాల్సి రావచ్చు. ఇటువంటి చార్జీలన్నీ మినహాయించిన తర్వాత తగిన మిగులుంటుందని భావిస్తే నిస్సంకోచంగా రుణాన్ని బదిలీ చేసుకోవచ్చు. -
ఆస్తి తగాదాలు.. సొంత అక్కను కిచెన్‌లోకి తీసుకెళ్లి..
సాక్షి, గోల్కొండ( హైదరాబాద్): ఆస్తి తగాదాలతో సొంత అక్కను అంతమొందించిన నలుగురు సోదరులు, ఒక మహిళను పోలీసులు అరెస్టు చేశారు. గోల్కొండ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం...టోలిచౌకి ఆడమ్స్ కాలనీకి చెందిన రైసా బేగం హైకోర్టులో న్యాయవాది. ఆమె తండ్రి ఇంట్లోనే ఉంటోంది. కాగా సోదరులు మహ్మద్ ఆరిఫ్ అలీ (38), మహ్మద్ రవూఫ్‌అలీ (40), మహ్మద్‌ఆసిఫ్ అలీ (37), మహ్మద్ అసన్ అలీ (36)తో రైసా బేగంకు తండ్రి ఆస్తుల విషయమై వివాదాలు ఉన్నాయి. ఇదిలా ఉండగా ఈ నలుగురు మహ్మద్ ఆరిఫ్ అలీ భార్య సనీనా బేగం (37) తో కలిసి రైసా బేగంను హతమార్చి అడ్డుతొలగించుకోవాలనుకున్నారు. ఇందులో భాగంగా మహ్మద్ ఆరిఫ్ అలీ గత నెల 29వ తేదీ మధ్యాహ్నం ఒంటి గంటకు రైసా బేగం వద్దకు వచ్చారు. ఆస్తుల విషయం పై ఇరువురిమధ్య వాగ్వాదం జరిగింది. కాగా ముందుగా వేసుకున్న పథకం ప్రకారం ...మహ్మద్ ఆరిఫ్ అలీ సోదరి రైసా బేగంను కిచెన్ లోకి తీసుకెళ్లి కిందకపడుకోబెట్టి వంట కత్తితో గొంతుకోశాడు. తీవ్ర రక్తస్రావమై ఆమె అక్కడి మృతి చెందింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా గోల్కొండ అదనపు ఇన్స్పెక్టర్ ఎస్ మట్టంరాజు నిందితులను శనివారం రాత్రి అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. -
మళ్లీ పెళ్లి చేసుకున్న మహిళకు ఆస్తి దక్కదు!
బిలాస్పూర్: చనిపోయిన భర్త తరఫు ఆస్తిపై మళ్లీ పెళ్లి చేసుకున్న మహిళ తన హక్కును కోల్పోతుందని చత్తీస్‌గఢ్ హైకోర్టు పేర్కొంది. అయితే, ఆ మహిళ మరో పెళ్లి చేసుకున్నట్లు చట్టప్రకారం నిరూపితం కావాలని స్పష్టం చేసింది. వరుసకు తనకు అన్న అయిన ఘాసీ భార్య కియబాయి.. ఘాసీ మరణానంతరం స్థానిక సంప్రదాయం ప్రకారం మరో పెళ్లి చేసుకుందని, అందువల్ల చనిపోయిన తన అన్న ఆస్తి ఆమెకు చెందకూడదని ఆదేశాలివ్వాలని కోరుతూ లోక్‌నాథ్ అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ సంజయ్ కే అగర్వాల్ తాజాగా పై ఆదేశాలిచ్చారు. ‘హిందూ విడో రీమ్యారేజ్ యాక్ట్, 1856లోని సెక్షన్ 6 ప్రకారం పునర్వివాహానికి సంబంధించిన అన్ని ప్రక్రియలు నిరూపితం కావాల్సి ఉంటుంది. పునర్వివాహం చట్టప్రకారం నిరూపితమైతే.. ఆ మహిళకు తొలి భర్త ద్వారా లభించిన ఆస్తిపై హక్కు ఇకపై ఉండదు’ అని ఆ ఆదేశాల్లో పేర్కొన్నారు. స్థానిక చుడి సంప్రదాయం(గాజులు ఇవ్వడం ద్వారా ఒక మహిళను పెళ్లి చేసుకోవడం) ప్రకారం కియాబాయి పునర్వివాహం చేసుకుందని లోక్‌నాథ్ వాదించారు. కియాబాయి మళ్లీ పెళ్లి చేసుకున్నట్లు ఎలాంటి చట్టబద్ధ ఆధారాలు లేవని ఈ సందర్భంగా హైకోర్టు స్పష్టం చేసింది. -
ఇళ్ల కొనుగోలులో జాగ్రత్తలు, హైదరాబాద్‌లో ధరలు ఎలా ఉన్నాయ్
రంగం ఏదైనా సరే ప్రొఫెషనలిజం తప్పనిసరి. జీవితకాల కలను సాకారం చేసే గృహ నిర్మాణ రంగంలో అయితే మరీనూ. కొనుగోలు విషయంలో కొనుగోలుదారులు, నిర్మాణం విషయంలో బిల్డర్లు.. ఇద్దరూ ప్రొఫెషనల్‌గా బిహేవ్ చేస్తేనే పరిశ్రమకు గుర్తింపు, గౌరవం దక్కుతాయి. మారుతున్న సామాజిక అవసరాలు, కస్టమర్ల అభిరుచులు, నగర అభివృద్ధికి సూచికలాంటి వినూత్న డిజైన్స్ మీద బిల్డర్లు ఫోకస్ చేస్తే.. భౌతిక, సామాజిక వసతుల అభివృద్ధి, బడ్జెట్, అఫర్డబులిటీ మీద కస్టమర్లు దృష్టి పెడితేనే ఇద్దరికీ సమాన విజయావకాశాలు వస్తాయి. తక్కువ ధరకు వస్తుందని కొనుగోలుదారులు.. అమ్మేసి చేతులుదులుపుకుందామని బిల్డర్లు ఏమాత్రం తొందరపడినా ఇబ్బందులు తప్పవు! సాక్షి, హైదరాబాద్: కోవిడ్ నేపథ్యంలో సాధ్యమైనంత తక్కువ భారం నుంచి బయటపడేందుకు డెవలపర్లు ఆచితూచి ప్రాజెక్ట్‌లను ప్లానింగ్ చేస్తున్నారు. కరోనాతో విక్రయాలు సరిగా లేకపోయినా ఆర్థికంగా చాలా తక్కువ మంది డెవలపర్లు తట్టుకునే స్థాయిలో ఉన్నారు. ఇలాంటి తరుణంలో గృహ కొనుగోళ్లలో కొనుగోలుదారులు తెలివైన నిర్ణయం తీసుకోవాలి. గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్న వాటిల్లో లేదా కనీసం 30–40 శాతం నిర్మాణం పూర్తయిన వాటిల్లో కొనడం ఉత్తమం. లేకపోతే ఆర్థికంగా బిల్డర్‌కు ప్రతికూల పరిస్థితులు తలెత్తి చేతులెత్తేస్తే అంతే సంగతులు. ఇన్వెస్టర్లు, స్పెక్యులేటర్ల మాటలు నమ్మి తొందరపడి కొనుగోలు నిర్ణయం తీసుకోవద్దు. ప్రస్తుతం కరోనా విపత్కర పరిస్థితులు ఇంకా కొన్నాళ్లు కొనసాగే సూచనలు కనిపిస్తున్నాయి. ఇలాంటి సమయంలో ఆర్థిక అవసరాలు తలెత్తితే ఇబ్బందులకు గురవుతారు. అందుకే ఆలోచించి పెట్టుబడి నిర్ణయం తీసుకోవాలి. రిస్క్ తీసుకోవద్దని ఎస్ఎంఆర్ హోల్డింగ్స్ సీఎండీ ఎస్ రాంరెడ్డి సూచించారు. యూడీఎస్లో కొని ఇబ్బందులు పడొద్దు! కోటి రూపాయల ప్రాపర్టీ రూ.40 లక్షలకే వస్తుందంటే ఎవరైనా ఆశపడతారు. దీన్నే ఆసరాగా చేసుకొని కొందరు డెవలపర్లు అన్‌డివైడెడ్ షేర్ (యూడీఎస్) ప్రాజెక్ట్‌లను చేస్తున్నారు. బిల్డర్ ట్రాక్ రికార్డ్, ఆర్థిక స్థోమత ఇవేవీ గమనించకుండా కొనుగోలుదారులు గుడ్డిగా నమ్మి ముందుకెళితే.. అనుకోని విపత్కర పరిస్థితులొస్తే పరిస్థితేంటి? యూడీఎస్ స్కీమ్‌లో బిల్డర్‌కు, కస్టమర్‌కు మధ్యలో జరిగే అగ్రిమెంట్ విలువ రూ.2–5 లక్షలకు మించి ఉండదు. సగానికి పైగా సొమ్ము నగదు రూపంలో జరుగుతుంది. అగ్రిమెంట్లో ఇవేవీ పేర్కొనరు. ఒకవేళ బిల్డర్ చేతులెత్తేస్తే.. ఏ కోర్ట్‌కు వెళ్లినా లాభం ఉండదు.. మహా అయితే అగ్రిమెంట్లో రాసుకున్న సొమ్ముకు వడ్డీ కట్టమంటుంది కోర్ట్. మరి, బిల్డర్‌కు నగదు రూపంలో అప్పజెప్పిన సొమ్ము పరిస్థితేంటి? నిజమైన గృహ కొనుగోలుదారులు యూడీఎస్ ప్రాజెక్ట్‌లలో కొనుగోలు చేయరు. ఇన్వెస్టర్లు, స్పెక్యులేటర్స్ ఎక్కువగా కొంటుంటారు. నగరంలో యూడీఎస్ స్కీమ్ కింద సుమారు 15–20 వేల యూనిట్లు అమ్ముడుపోయాయని.. వీటి విలువ రూ.20–25 వేల కోట్లుగా ఉంటుందని అంచనా. 10–15 కంపెనీలు శంకర్పల్లి, అమీన్పూర్, పటాన్చెరు, కోకాపేట ప్రాంతాలలో యూడీఎస్ ప్రాజెక్ట్‌లు చేస్తున్నాయి. నిర్మాణ వ్యయం పెరిగింది.. సిమెంట్, స్టీల్ వంటి నిర్మాణ సామగ్రి ధరలు 60 శాతానికి పైగా పెరిగిపోయాయి. నైపుణ్యమున్న నిర్మాణ కార్మికుల వ్యయం 30–40 శాతం వరకు పెరిగాయి. మొత్తంగా నిర్మాణ వ్యయం 25–30 శాతం వరకు పెరిగింది. గృహాల ధరలు మాత్రం గతేడాది మార్చిలో ఉన్నవే ఇప్పటికీ ఉన్నాయి. కొత్త ప్రాజెక్ట్‌లలో, ఇన్వెంటరీ గృహాలు, స్టాక్స్‌లలో ధరలు చ.అ.కు రూ.500–700లు పెరిగాయి. ప్రొఫెషనల్ బిల్డర్లకు నిర్మాణ సామగ్రి ఆరు నెలల స్టాక్ ఉంటుంది. యూడీఎస్ బిల్డర్లకు మెటీరియల్ సప్లయి ప్రాబ్లం ఉంటుంది. రోజురోజుకూ పెరుగుతున్న నిర్మాణ సామగ్రి ధరలను యూడీఎస్ బిల్డర్లు నిర్వహణ చేయలేక.. ఆ భారాన్ని కస్టమర్ల మీదకి నెట్టేస్తారు. దీంతో ఇబ్బందులు తలెత్తుతాయి. కొనేముందు గమనించాల్సినవివే... ♦బిల్డర్ ట్రాక్ రికార్డ్ ఏంటి? గతంలో ఎన్ని ప్రాజెక్ట్‌లు పూర్తి చేశాడో తెలుసుకోవాలి. ♦నిర్మాణ సంస్థ విలువలేంటి? సాంకేతిక అనుభవం ఉందో లేదో చూడాలి. ♦బిల్డర్, కంపెనీ ఆర్థిక పరిస్థితులేంటో ఆరా తీయాలి. ♦ప్రాజెక్ట్‌లో సేల్స్ ఎలా ఉన్నాయి.. క్యాష్‌ఫ్లో ఎలా ఉంది కనుక్కోవాలి. బ్యాంక్ రుణాలు, కన్స్ట్రక్షన్ ఫండింగ్ వివరాలు అడగాలి. ♦నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు పాటిస్తున్నాడా? భవన నిర్మాణ నిబంధనలు తు.^è. తప్పకుండా ఫాలో అవుతున్నాడో లేదో పరిశీలించాలి. ♦ప్రాజెక్ట్ ఉన్న ప్రాంతంలో సోషల్ ఇన్ఫ్రా ఎలా ఉందో భౌతికంగా చూడాలి. ♦ఎంపిక చేసిన ప్రాజెక్ట్ గురించి న్యాయ నిపుణుల సలహా తీసుకోవాలి. ఎక్కడ కొంటే బెటర్? రూ.50 లక్షల లోపు ధర ఉండే గృహాల కోసం ఉప్పల్, హయత్‌నగర్, నాగార్జునసాగర్ హైవే, ఆదిభట్ల వంటి ప్రాంతాలలో తీసుకోవచ్చు. రూ.50 లక్షల నుంచి కోటి రూపాయల మధ్య అయితే మియాపూర్, బాచుపల్లి, కూకట్పల్లి, శంషాబాద్, శంకర్పల్లి, పటాన్చెరు ప్రాంతాలలో చూడొచ్చు. రూ.కోటి పైన అయితే కొండాపూర్, మాదాపూర్, గచ్చిబౌలి, కోకాపేట, నార్సింగి, మంచిరేవుల, అప్పా జంక్షన్ వంటి ప్రాంతాలలో కొనుగోలు చేయడం ఉత్తమం. స్టాండలోన్ టవర్స్‌లో కొనొద్దు.. కరోనా తర్వాతి నుంచి విశాలమైన గృహాలకు డిమాండ్ పెరిగింది. పరిమిత వసతులతో, తక్కువ విస్తీర్ణంలో నిట్టనిలువుగా నిర్మించే స్టాండలోన్ టవర్లలో కొనుగోలు చేయవద్దు. ఎందుకంటే ఓపెన్ ప్లేస్ ఉండదు. కోవిడ్ థర్డ్ వేవ్, ఇతరత్రా కారణాలతో లాక్డౌన్ చేస్తే.. నాలుగు గోడల మధ్య నిర్బంధమవుతారు. మానసికంగా ఒత్తిడి పెరుగుతుంది. అందుకే వాకింగ్, జాగింగ్ ట్రాక్స్, ఇతరత్రా వసతులతో గ్రీనరీ ఎక్కువగా ఉండే గేటెడ్ కమ్యూనిటీలలోనే కొనుగోలు చేయాలి. గాలి, వెలుతురు విశాలంగా వస్తుంది. అన్ని రకాల వసతులతో పాటు నిర్వహణ బాగుంటుంది. -
దేశంలో ఇళ్ల ధరలు పెరిగాయ్
ముంబై: దేశంలోని పది ప్రధాన నగరాల్లో గృహాల ధరలు 2020–21 జనవరి–మార్చి త్రైమాసికంలో సగటున స్వల్పంగా పెరిగాయి. అఖిల భారత గృహ ధరల సూచీ (హెచ్పీఐ) గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో 2.7 శాతం పెరిగినట్లు (2019–20 ఇదే త్రైమాసికంతో పోల్చి) సోమ వారం విడుదలైన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గణాంకాలు వెల్లడించాయి. పది ప్రధాన నగరాల హౌసింగ్ రిజిస్ట్రేషన్ అథారిటీల నుంచి అందిన గణాంకాల ప్రాతిపదికన ఆర్బీఐ ఈ త్రైమాసిక హెచ్‌పీఐని విడుదల చేస్తుంది. ఈ నగరాల్లో అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, జైపూర్, కాన్పూర్, కోచ్చి, కోల్‌కతా, లక్నో, ముంబై ఉన్నాయి. నగరాలను వేర్వేరుగా చూస్తే, 15.7 శాతం పెరుగుదలతో బెంగళూరు టాప్‌లో ఉంది. అయితే జైపూర్‌లో ధరలు 3.6 శాతం తగ్గాయి. కాగా 2020–21 ఇదే త్రైమాసికంలో ఆల్ ఇండియా హెచ్పీఐ 3.9 శాతంగా ఉంది. ఇదిలావుండగా, 2020–21 క్యూ3తో పోల్చితే (అక్టోబర్, నవంబర్, డిసెంబర్) క్యూ4లో ఆల్ ఇండియా హెచ్పీఐ వృద్ధి రేటు స్వల్పంగా 0.2 శాతం పెరిగింది. త్రైమాసికపరంగా ఢిల్లీ, బెంగళూరు, కోల్‌కతా, జైపూర్లలో ధరలు తగ్గితే, మిగిలిన ఆరు పట్టణాల్లో పెరిగాయి. -
వామ్మో.. బంధువులని చేరదీస్తే ఎంత పనిచేశారు..
సాక్షి, కోనరావుపేట(రాజన్న సిరిసిల్ల): దగ్గరి బంధువని చేరదీస్తే ఉన్న ఆస్తి రాయించుకున్నాడు. ఇప్పుడు ఆ వృద్ధురాలినే ఇంట్లోంచి వెళ్లిపొమ్మంటున్నాడు. బాధితురాలి వివరాల ప్రకారం.. మండలంలోని నిమ్మపల్లికి చెందిన మానుక రాజయ్య–నర్సవ్వ దంపతులకు పిల్లలు లేరు. కొన్నేళ్ల క్రితం నుంచి దగ్గరి బంధువు మానుక శంకర్ వారింట్లోనే ఉంటున్నాడు. రాజయ్యకు ఫించన్ ఇప్పిస్తానని చెప్పి ఆస్తి కాగితాలపై సంతకాలు చేయించుకుని ఇల్లు, 30 గుంటల భూమిని తనపేరిట చేయించుకున్నాడు. రాజయ్య నాలుగేళ్ల క్రితం మృతిచెందాడు. ఈక్రమంలో ఒంటరి అయిన నర్సవ్వకు తిండి పెట్టకపోవడంతో శంకర్‌ను నిలదీయగా ఇది తనదని, వెళ్లిపొమ్మంటూ కొడుతున్నాడని బాధితురాలు రోదిస్తూ చెప్పింది. శంకర్ వేధింపులు భరించలేక పోలీసులను ఆశ్రయించి గోడు వెల్లబోసుకుంది. గ్రామానికి వచ్చి విచారణ జరిపి న్యాయం చేస్తానని వృద్ధురాలికి ఎస్సై రాజశేఖర్ హామీ ఇచ్చారు. కన్న కొడుకులు కూడు పెడ్తలేరు వేములవాడ: కనీ పెంచి పెద్దచేసిన కొడుకులు మలిసంధ్యలో తమను నిర్లక్ష్యం చేస్తున్నారంటూ మండలంలోని నిజామాబాద్‌కు చెందిన వృద్ధ దంపతులు పోలీసులను ఆశ్రయించారు. తమ బాధను చెప్పుకుని న్యాయం చేయాలని వేడుకున్నారు. నిజామాబాద్‌కు చెందిన శ్రీరాముల రామయ్య–సత్తవ్వ దంపతులకు ముగ్గురు కుమారులు దేవయ్య, లచ్చయ్య, చంద్రయ్య. వృద్ధులు కావడంతో ఒక్కో కొడుకు దగ్గర 3 నెలలు ఉండాలని నిర్ణయించారు. కానీ గత కొన్ని నెలలుగా దేవయ్య, లచ్చయ్య తల్లిదండ్రులను పోషించడంలేదు. ఇంట్లోకి రానివ్వకపోవడంతో చిన్న కుమారుడు చంద్రయ్య వద్దే ఆరునెలల నుంచి ఉంటున్నారు. సోమవారం ఎస్సై రాజశేఖర్‌ను కలిసి తన ఇద్దరు కుమారులు పోషించడంలేదని ఫిర్యాదు చేశారు. కుమారులను పిలిపించి మాట్లాడుతానని బాధితులకు ఎస్సై హామీ ఇచ్చారు. చదవండి: భార్యను తిట్టాడని ఆవేశంతో.. కన్న తండ్రినే -
బిల్‌గేట్స్‌కు షాక్ ఇవ్వడానికి సిద్ధమవుతున్న మెలిందా
వాషింగ్టన్: మైక్రో సాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ భార్య మెలిందా నుంచి విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయం వెనుక గల కారణాలను వారు వివరించలేదు.. కానీ 27 ఏళ్ల వైవాహిక జీవితానికి ముగింపు పలుకుతున్నట్లు ప్రకటించారు. విడాకుల తర్వాత తాము సంపాదించిన ఆస్తిలో ఎక్కువ భాగం తమ ఫౌండేషన్‌కే చెందుతుందని పిల్లలకు కేవలం 10 మిలియన్ డాలర్ల చొప్పున ఇస్తామని గేట్స్ బహిరంగంగానే ప్రకటించారు. అయితే తాజాగా ఈ నిర్ణయాన్ని మెలిందా వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం. తన బిడ్డలకు వారసత్వంగా ఎక్కువ ఆస్తిని ఇప్పించాలని మెలిందా భావిస్తున్నారట. ఈ క్రమంలో ఆమె తమ ఇద్దరి సమిష్టి సంపద 130 బిలియన్ డాలర్ల ఆస్తిని విభజించడానికి సిద్ధమవుతున్నారట. ఇందుకు గాను మెలిందా ఒక న్యాయ బృందాన్ని నియమించుకుందని.. దీనిలో టాప్ ట్రస్ట్, ఎస్టెట్ లాయర్ ఉన్నారని డెయిలీ మెయిల్ కోట్ చేసింది. మెలిందా తాజా నిర్ణయంతో వారి కూతుళ్లు జెన్నిఫర్ కేథరీన్ (25), ఫేబీ అడేల్ (18), కొడుకు రోనీ జాన్ (21) వారసత్వంగా ఎక్కువ ఆస్తి లభించేందుకు దోహదపడుతుందని భావిస్తున్నారు. చదవండి: గేట్స్ దంపతులు విడిపోవడానికి కారణం ‘అతడేనట’.. -
ఎంత ఆస్తి ఉందో లైవ్‌లో చెప్పేసిన నాగబాబు
మెగా బ్రదర్ నాగబాబు సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉంటారన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం సినిమాల్లో పెద్దగా నటించకపోయినా సోషల్ మీడియాలో ద్వారా నిత్యం అభిమానులతో టచ్‌లో ఉంటారు. అంతేకాకుండా నెటిజన్లు అడిగే పలు ప్రశ్నలకు తనదైన స్టైల్లో ధీటుగా బదులిస్తారు. ఇటీవలి కాలంలో ఆయన చేస్తున్న కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆస్క్ మి ఏ క్వశ్చన్ పేరుతో ఇన్‌స్టాగ్రామ్‌లో లైవ్ చాట్‌లో అభిమానులతో ముచ్చటించారు. ఇందులో భాగంగా నాగబాబును ఉద్దేశించి ఓ నెటిజన్..'ఎంత ఆస్తి ఉంది నీకు'? అంటూ ప్రశ్నించాడు. దీంతో అసహనానికి లోనైన నాగబాబు..అతడికి అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు. 'నన్ను నువ్వు అని సంబోధించావు..రెస్పెక్ట్ తగ్గిపోయింది సో నీ ప్రశ్నకు సమాధానం చెప్పను. మీకు మీకు ఎంత ఆస్తి ఉంది? అని అడిగి ఉంటే, ఎంత ఉందో చెప్పి నా ఆస్తిలో సగం ఇచ్చేవాడిని .. బ్యాడ్ లక్' అంటూ తనదైన స్టైల్లో చురకలంటించారు. ఇక మరో నెటిజన్.. 'సర్ మీరు ఉండే ఇల్లు ఖరీదు రూ. 50 కోట్లు ఉంటుందా' అని ప్రశ్నించాడు. దీనికి సమాధానంగా 'ముకేష్ అంబానీ ఇంటి కంటే పది రూపాయలు తక్కువ అంతే. మిగిలినదంతా సేమ్ టూ సేమ్' అని వ్యంగ్యంగా బుదలిచ్చారు. ప్రస్తుతం నాగబాబు చేసిన ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. చదవండి : అవి చూస్తారు కానీ ఆ పని మాత్రం చేయరు : నాగబాబు అల్లుడికి సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన నాగబాబు.. ఏంటో తెలుసా! -
మెట్రో కారిడార్లలో ప్రాపర్టీ ధరల పెరుగుదల
సాక్షి, హైదరాబాద్: దేశంలో మూడు దశాబ్ధాల క్రితం ప్రత్యామ్నాయ రవాణా మార్గంగా మెట్రో రైలు ప్రారంభమైంది. ప్రధాన నగరాన్ని, శివారు ప్రాంతాలతో అనుసంధానం చేయడంతో దీని వినియోగం బాగా పెరిగింది. జనాభాకు, పర్యావరణానికి మెట్రో రైలు ప్రయోజనాలు ఎంత మేరకు ఉన్నాయో.. అంతే స్థాయిలో డెవలపర్లకూ ఉన్నాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లో మియాపూర్- ఎల్బీనగర్ (కారిడార్-1), జేబీఎస్-ఫలక్‌నుమా (కారిడార్-2), నాగోల్-రాయదుర్గం/హైటెక్‌సిటీ (కారిడార్-3) ప్రాంతాలలో మెట్రో రైలు పరుగులు పెడుతుంది. 2018 నుంచి 2021 మార్చి మధ్య కాలంలో ఆయా మెట్రో ప్రాంతాలలో ప్రాపర్టీల ధరలు 15-20 శాతం పెరిగాయని జేఎల్ఎల్ తెలిపింది. ఇతర ప్రాంతాలలోని వాణిజ్య స్థలాలతో పోలిస్తే కారిడార్-3 ప్రాంతాలలో ఏటా 20-25 శాతం, కారిడార్-1, 2 ప్రాంతాలలో 20 శాతం ధరలు వృద్ధి చెందుతున్నాయని జేఎల్ఎల్ వాల్యూవేషన్ అడ్వైజరీ హెడ్ శంకర్ తెలిపారు. గత ఐదేళ్లలో మెట్రో కారిడార్లలో 500 మీటర్ల లోపు భూమి విలువ 15-20 శాతం పెరిగింది. మెట్రో రైలు ప్రారంభం తర్వాత ఆయా ప్రాంతం, భూమి వినియోగం, మైక్రో మార్కెట్స్ సామర్థ్యాలన్ని బట్టి ఆస్తుల మార్కెట్ విలువలు 10-15 శాతం వరకు పెరిగాయి. ఇతర ప్రాంతాలతో పోలిస్తే మెట్రో ప్రాంతాలలో ఏటా 2-5 శాతం ధరలు ఎక్కువగా పెరుగుతున్నాయి. ప్రయాణ ఖర్చుల తగ్గింపు, ఉద్యోగ అవకాశాల కారణంగా రిటైల్, వాణిజ్య ధరలలో 20-25 శాతం మేర వృద్ధి నమోదయింది. రాబోయే మెట్రో కారిడార్లలో 500 మీటర్ల లోపు భూమి విలువ 10-15 శాతం వరకు పెరుగుతాయని జేఎల్ఎల్ అంచనా వేసింది. ప్రస్తుతం హైదరాబాద్, బెంగళూరు, ముంబై, చెన్నై, ఢిల్లీ వంటి నగరాల్లో 578.34 కి.మీ. వరకు మెట్రో రైల్ ఉంది. మరొక 760.62 కి.మీ. విస్తీర్ణంలో వివిధ దశలలో నిర్మాణంలో ఉన్నాయి. కోచి, చెన్నై, బెంగళూరు, నాగ్‌పూర్, నాశిక్ నగరాల్లో కొత్త మెట్రో రైల్ లైన్లు నిర్మాణంలో ఉన్నాయి. చదవండి: రియల్ ఎస్టేట్ రంగంలోకి 1,000 కోట్ల పెట్టుబడులు -
Hyderabad Real Estate: ఎవరు రియల్ డెవలపర్
ఒకవైపు రోజువారీ నిత్యావసర ఖర్చులు మోస్తూనే.. మరోవైపు జీఎస్టీ, స్టాంప్ డ్యూటీ, ఆదాయ పన్నులను భరించి ఇంటి కొనుగోలు నిర్ణయం తీసుకోవటం కొనుగోలుదారులకు కష్టమే. ఆకాశాన్నంటిన భూముల ధరలు, నిర్మాణ అనుమతులు, బ్యాంక్ వడ్డీలు, ఆఫీస్ నిర్వహణ ఖర్చులు, రోజురోజుకూ పెరుగుతున్న నిర్మాణ సామగ్రి ధరలు, స్థానిక నాయకుల ఒత్తిళ్లు.. వీటన్నింటినీ దాటుకొని ప్రాజెక్ట్‌ను పూర్తి చేయడం డెవలపర్‌కు సవాలే... ఇలా నిజమైన కొనుగోలుదారులు, డెవలపర్లకు మధ్యలో రాత్రికి రాత్రే ప్రాజెక్ట్‌లను ప్రారంభించేసి.. అడ్డదారిలో విక్రయాలు చేస్తూ రియల్టీ మార్కెట్లో కృత్రిమ డిమాండ్‌ను సృష్టిస్తున్నారు కొందరు తాత్కాలిక బిల్డర్లు. సాక్షి, హైదరాబాద్: బూమ్ ఉందంటే చాలు ఇన్వెస్టర్లే కాదు డాక్టర్లు, యాక్టర్లు, లాయర్లు, బ్యూరోక్రాట్స్, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు అందరూ పెట్టుబడులు పెట్టి మార్కెట్లో డిమాండ్‌ను సృష్టిస్తుంటారు. ప్రతి ఏటా 15–20 శాతం ధరలు పెరగడం ఆరోగ్యకరమైన వృద్ధి. అలాకాకుండా అబ్నార్మల్గా పెరిగితే మాత్రం అది బూమ్. ఇది ప్రభుత్వ అభివృద్ధి ప్రకటనలు, భవిష్యత్తు ప్రాజెక్ట్‌లను, ప్రాంతాలను బట్టి పెరుగుతుంటుంది. రియల్టీ బూమ్ ఇన్వెస్టర్లు ఉన్నంత కాలమే ఉంటుంది.. ఒక్కసారి ఇన్వెస్టర్లు పక్కకు తప్పుకోగానే బద్దలైపోతుంది. ఇదేమీ కొత్తకాదు. 2008లో వచ్చిన రియల్టీ బూమ్ ఇలాంటిదే. 2015–16 వరకు కోలుకోలేదు. ఇలాంటి సంక్షోభ సమయంలోనూ హైదరాబాద్ డెవలపర్లు ధైర్యంగా, బలంగా నిలబడటానికి కారణం నిజమైన కొనుగోలుదారులు తోడుగా నిలవటమే. ప్రతి సంవత్సరం నగరంలో 25 వేల గృహాలు విక్రయం అవుతుంటాయి. ఇదే స్థాయిలో లాంచింగ్స్ కూడా ఉంటాయి. కొనేవాళ్లు ఏ స్థాయిలో ఉన్నారో.. గృహాల సప్లయి కూడా అదే స్థాయిలో ఉంటుంది. పొలిప్రెన్యూర్ అయితేనే.. పొలిటికల్, ఎకనామికల్, సోషల్, టెక్నలాజికల్, ఎన్విరాన్మెంటల్, లీగల్... ఈ వ్యాపారం చేయాలన్నా ఉండాల్సిన ప్రధాన అంశాలివే. ఆయా అంశాలలో తెలంగాణ బలంగా ఉండటం వల్లే కొనుగోలుదారులు, పెట్టుబడిదారులు హైదరాబాద్‌లో పెట్టుబడులకు ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎంటర్‌ప్రెన్యూర్‌లా కాకుండా పొలిప్రెన్యూర్‌గా ఉంటేనే రాణించగలమని కిస్మత్‌పూర్‌కు చెందిన ఓ డెవలపర్ తెలిపారు. పొలిటికల్ కనెక్షన్స్ బాగా ఉన్న ఎంటర్‌ప్రెన్యూర్‌ను పొలిప్రెన్యూర్స్ అంటారు. సాధారణ డెవలపర్లు చెప్పులు అరిగేలా తిరిగినా పరిష్కారంకాని సమస్యలన్నీ పొలిప్రెన్యూర్స్కు మాత్రం కూర్చున్న చోటే పరిష్కారమవుతాయని పేర్కొన్నారు. భూమి అగ్రిమెంట్ చేసుకున్న రోజు నుంచి ప్రాజెక్ట్‌ను మార్కెట్లోకి తెచ్చే వరకు సుమారు మూడేళ్ల సమయం పడుతుంది. ఈ కాలంలో వడ్డీ భారం డెవలపర్లదే. తీరా లాంచింగ్ చేశాక మార్కెట్ ప్రతికూలంలో ఉంటే మరింత భారమే. డెవలపర్లలో పోటీ భయం నెలకొంది.. రోజురోజుకూ పెరుగుతున్న ధరలతో ఇప్పుడు కొనకపోతే ముందుముందు కొనలేమనే భయం ఎలాగైతే కొనుగోలుదారుల్లో ఉందో.. అలాగే కొత్త డెవలపర్లే పెద్ద ప్రాజెక్ట్‌లు చేసి మార్కెట్‌ను క్యాష్ చేసుకుంటుంటే మనం వదలుకుంటున్నామనే భయం సీనియర్ డెవలపర్లలో నెలకొంది. ప్రీలాంచ్లో విక్రయాలు, యూడీఎస్ బుకింగ్స్ చేస్తూ అడ్డదారులలో కొందరు డెవలపర్లు మార్కెట్‌ను పాడు చేస్తుంటే.. న్యాయబద్ధంగా వ్యాపారం చేస్తూ, కొనుగోలుదారులు సొంతిల్లు కలను నిజం చేస్తున్న డెవలపర్లకు సమస్యలు వస్తున్నాయి. దీంతో డెవలపర్లు మానసికంగా నలిగిపోతున్నారని గిరిధారి కన్స్ట్రక్షన్స్ ఎండీ ఇంద్రసేనారెడ్డి తెలిపారు. కొనేముందు ఇవి చూడాలి.. ► ఎంపిక చేసిన ప్రాజెక్ట్ గురించి న్యాయ నిపుణుల సలహా తీసుకోవాలి. ► ఎన్ని బ్యాంక్‌ల నుంచి ప్రాజెక్ట్లోన్ తీసుకున్నారు. ► హెచ్ఎండీఏ, లోకల్ బాడీ, ఫైర్, ఎన్విరాన్మెంటల్, ఎయిర్పోర్ట్ వంటి ప్రభుత్వ విభాగాల అనుమతులున్నాయా? లేవా? రెరాలో నమోదు చేశారా లేదా చూసుకోవాలి. ► ప్రాజెక్ట్‌ను కట్టే ఆర్థిక స్తోమత నిర్మాణ సంస్థకు ఉందా? లేదా? ► బిల్డర్‌కు నిర్మాణ రంగంలో సాంకేతిక అనుభవం ఉందా లేదా చూసుకోవాలి. ► నిర్మాణ సంస్థ విలువలు, డెవలపర్ గత చరిత్ర గురించి ఆరా తీయాలి. ► ప్రాజెక్ట్ నాణ్యత, గడువులోగా పూర్తవుతుందా లేదా పరిశీలించాలి. ► ప్రాజెక్ట్ ఉన్న ప్రాంతంలో అభివృద్ధి పనులు ఎలా ఉన్నాయి? సోషల్ ఇన్ఫ్రా ఎలా ఉందో గమనించాలి. -
రూ.1000 కోట్లు పెట్టి ఇల్లు కొన్న డీమార్ట్ ఓనర్
సాక్షి, ముంబై: వ్యాపారవేత్త, బిలియనీర్, డీమార్ట్ సంస్థ యజమాని రాధాకిషన్ దమాని సుమారు 1,000 కోట్ల రూపాయలకు పైగా వెచ్చించి ఇంటిని కొనుగోలు చేశారు. దక్షిణ ముంబైలోని సంపన్న ప్రాంతాల్లో ఒకటైన మలబార్ హిల్‌లో ఆయన ఈ ఇంటిని తన సోదరుడు గోపీకిషన్ దమానితో కలిసి కొనుగోలు చేశారు. 5,752.22 చదరపు అడుగుల విస్తీర్ణం గల ఈ ఇంటి ఖరీదు1,001 కోట్ల రూపాయలు. దీని కొనుగోలు నిమిత్తం స్టాంప్ డ్యూటీ కోసం దమాని మహారాష్ట్ర రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖకు ఇప్పటికే రూ.30 కోట్లు చెల్లించారు. ఇక దీని మార్కెట్ విలువ 724 కోట్ల రూపాయలుగా అంచాన వేస్తున్నారు. ఈ ఇంటిని దమాని సౌరభ్ మెహతా, వర్షా మెహతా, జయేశ షా వద్ద నుంచి కొనుగోలు చేస్తున్నారు. ప్రస్తుతం దమాని ముంబైలోని ఆల్టమౌంట్ రోడ్‌లోని పృథ్వి అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్నారు. ఈ ఇంటిని దమాని పురచంద్ రాయ్‌చంద్ అండ్ సన్స్ ఎల్ఎల్పీ, పరేష్‌చంద్ రాయ్‌చంద్ అండ్ సన్స్ ఎల్ఎల్పీ, ప్రేమ్‌చంద్ రాయ్‌చంద్ అండ్ సన్స్ ఎల్ఎల్పీ భాగస్వాముల నుంచి కొనుగోలు చేశారు. హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2021 ప్రకారం, రాధాకిషన్ దమాని 14.5 బిలియన్ డాలర్ల ఆస్తితో భారతీయ సంపన్నుల జాబితాలో ఎనిమిదవ స్థానంలో ఉన్నారు. భారతదేశంలో 209 మంది బిలియనీర్లు ఉండగా, వారిలో 177 మంది ప్రస్తుతం దేశంలో నివసిస్తున్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన ముకేష్ అంబానీ 85 బిలియన్ డాలర్ల ఆస్తులతో భారతీయ సంపన్నుల జాబితాలో ప్రథమ స్థానంలో నిలిచారు. చదవండి: కరోనా వల్ల లాభపడింది ఆ ఒక్కరే -
వీలునామా రాయడం మరువకుమా..!
‘వీలునామా రాయండి‘ అని ఎవరైనా అంటే మనస్సు చివుక్కుమంటుంది. కానీ సకాలంలో వీలునామా రాయకపోతే కుటుంబసభ్యులు చిక్కుల్లో పడతారు.. ఇబ్బందుల పారవుతారు. తగువులాడుకుంటారు.. కోర్టుకు వెళ్తారు.. మనశ్శాంతి కరువవుతుంది. బంధుత్వం మరుగునపడుతుంది. అప్పుడప్పుడు ఆస్తి అన్యాక్రాంతం కూడా అవుతుంది. అందుకే వీలునామా రాయాలి. ఆదాయపు పన్ను చట్టం ప్రకారం వీలునామా ద్వారా వచ్చిన ఆస్తి మీద ఎటువంటి పన్ను భారం ఉండదు. తీసుకోవాల్సిన జాగ్రత్తలు .. తెల్లకాగితం మీద స్పష్టంగా మీ మాతృభాషలో రాయవచ్చు. భాష ముఖ్యం. భావం మరీ ముఖ్యం. ఆరోగ్యంగా ఉన్నప్పుడు, మనస్సు స్థిరంగా ఉన్నప్పుడే రాయాలి స్వంతంగానే ఆలోచించినట్లు, ఎవరి ప్రోద్బలం లేదని రాయాలి చేతివ్రాత ఎవరిదయినా ఫరవాలేదు. తాను సంపాదించిన ఆస్తిని లేదా తనకు ఇదివరకు సంక్రమించిన ఆస్తినైనా వీలునామా ద్వారా ఇవ్వవచ్చు. ఆస్తిని స్థిరాస్తిగా, చరాస్తిగా విభజించాలి. స్థిరాస్తి విషయంలో జాబితా చూసుకుని .. ప్రతి ఆస్తి పూర్తి వివరాలు రాయాలి. సర్వే నంబరు, ఇంటి నంబరు, హద్దులు, కొలతలు,కొన్న డాక్యుమెంటు వివరాలు,రిజి్రస్టేషన్ వివరాలు.. ఇలా అన్నీ పొందుపర్చాలి. చరాస్తుల జాబితా తయారు చేసి వివరంగా ఎవరికి ఏది చెందాలనుకుంటున్నారో రాయాలి. గోప్యత ఉండకూడదు. స్పష్టత ముఖ్యం. లబ్ధిదారుల పేర్లు, వివరాలు రాయాలి. ఈ రోజుల్లో ఆధార్ కార్డ్ అన్నింటికీ ఆధారం. కార్డులో ఉన్నట్లే వివరాలు రాయాలి. రిజిస్ట్రేషన్ తప్పనిసరి కాదు. కానీ వీలుంటే చేయించడం మంచిది. లబ్ధిదారులు సాక్షి సంతకాలు చేయకూడదు. లబ్ధిదారులు ఏ వయస్సు వారైనా సరే సాక్షిదార్లని మాత్రం 21 సం. దాటిన వారినే ఎంచుకోవాలి. లబ్ధిదారులు మైనర్ అయితే సంరక్షకులను నియమించాలి. ఇలా ఎన్నో జాగ్రత్తలు, అవసరం అయితే వృత్తి నిపుణుల సలహా తీసుకోండి. ఇక వీలునామాతో ప్రయోజనాలు ఎన్నో.. వీలునామా రాసేందుకు రూపాయి ఖర్చు లేదు. ఇల్లు కదలక్కర్లేదు. ఆస్తి సజావుగా చేతులు మారుతుంది. సంక్రమించిన ఆస్తి మీద ఎలాంటి పన్ను భారం ఉండదు. కుటుంబ సభ్యుల మధ్య సయోధ్య ఉంటుంది. కలహాలకు తావుండదు. రాసిన వ్యక్తికి ఎంతో విలువైన మనశ్శాంతి లభిస్తుంది. - కె.సీహెచ్. ఎ.వి.ఎస్.ఎన్ మూర్తి, కె.వి.ఎన్ లావణ్య -
లగ్జరీ గృహాల అద్దెల్లో హైదరాబాద్ టాప్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: లగ్జరీ గృహాల అద్దెల వృద్ధిలో హైదరాబాద్ టాప్ ప్లేస్‌లో నిలిచింది. బెంగళూరు, ముంబై, పుణే, ఢిల్లీ–ఎన్సీఆర్ వంటి దేశంలోని ఏ ప్రధాన మెట్రో నగరాలతో పోల్చినా సరే.. 2014 నుంచి 2020 మధ్య నగరంలో లగ్జరీ రెసిడెన్షియల్ ప్రాపర్టీ రెంట్లు 26 శాతం పెరిగాయి. ఇదే సమయంలో లగ్జరీ గృహాల ధరలు 12 శాతం వృద్ధి చెందాయని అనరాక్ ప్రాపర్టీ కన్సలెంట్ తెలిపింది. 2014లో హైటెక్ సిటీలో రూ.42 వేలుగా ఉన్న అద్దెలు.. 2020 నాటికి 26 శాతం వృద్ధితో రూ.53 వేలకు పెరిగింది. జూబ్లిహిల్స్‌లో రూ.47 వేల నుంచి 15 శాతం పెరిగి రూ.54 వేలకు చేరింది. ఇక క్యాపిటల్ ప్రైస్‌లు చూస్తే.. 2014లో హైటెక్‌సిటీలో చదరపు అడుగు (చ.అ) ధర రూ.5,088గా ఉండగా.. 2020 నాటికి 12 శాతం పెరిగి రూ.5,675కి చేరింది. జూబ్లిహిల్స్‌లో రూ.6,300 నుంచి 10 శాతం వృద్ధితో రూ.6,950కి పెరిగింది. ఏడు నగరాల్లో ఏటా 3-6 శాతం వృద్ధి.. దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో 2 వేల చదరపు అడుగుల విస్తీర్ణం ఉండే లగ్జరీ హోమ్స్ సగటు నెలవారీ అద్దె గత ఆరేళ్లలో 17–26 శాతం, మూలధన విలువ గరిష్టంగా 15 శాతం మేర పెరిగాయని అనరాక్ ప్రాపర్టీ కన్సల్టెంట్ చైర్మన్ అనుజ్ పూరీ తెలిపారు. టాప్ లగ్జరీ మార్కెట్లలో ప్రతి ఏటా అద్దెలు 3–6 శాతం పెరుగుదలతో స్థిరమైన వృద్ధిని నమోదు చేస్తున్నాయని పేర్కొన్నారు. క్యాపిటల్ ప్రైస్లలో మాత్రం మిశ్రమ ఫలితాలను నమోదు చేశాయన్నారు. కొన్ని సంవత్సరాలలో వార్షిక పెరుగుదల 7 శాతంగా ఉంటే.. 2017లో మాత్రం 5 శాతం ధరలు క్షీణించాయని తెలిపారు. ఎందుకంటే ఆ సంవత్సరంలో రెరా, జీఎస్టీ వంటి వివిధ నిర్మాణాత్మక సంస్కరణలను అమలు చేశారు. దీంతో చాలా ప్రాంతాల్లో సగటు మూలధన ధరలలో 1–3 శాతం పెరుగుదల మాత్రమే నమోదయింది. నగరాల వారీగా చూస్తే.. 2014తో పోలిస్తే 2020లో గుర్గావ్లోని గోల్ఫ్‌కోర్స్ రోడ్లో లగ్జరీ గృహాల అద్దెలు 18 శాతం, ఇదే కాలంలో ఈ ప్రాంతంలో గృహాల ధరలు 8 శాతం వృద్ధి చెందాయి. బెంగళూరులోని జేపీ నగర్లో అద్దెలు 24 శాతం, ధరలు 8 శాతం, చెన్నైలోని అన్నానగర్‌లో రెంట్స్ 17 శాతం, ప్రాపర్టీ ప్రైస్‌లు 10 శాతం, కోల్‌కత్తాలోని అలీపోర్లో రెంట్స్ 20 శాతం, ధరలు 13 శాతం, ఎంఎంఆర్‌లోని టార్డియోలో కిరాయిలు 23 శాతం, ధరలు 8 శాతం, పుణేలోని ప్రభాత్రోడ్లో అద్దెలు 23 శాతం, లగ్జరీ ప్రాపర్టీ ధరలు 5 శాతం పెరిగాయి. సంస్కరణలు, ఆర్థిక సహాయంతో రియల్టీలో పునరుత్తేజం ప్రస్తుతం స్తబ్ధుగా ఉన్న దేశీయ రియల్టీ రంగానికి పునరుత్తేజం తీసుకొచ్చేందుకు విధానపరమైన సంస్కరణలు, దీర్ఘకాలిక ఆర్థిక సహాయం అవసరమని నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ (నరెడ్కో) ఆధ్వర్యంలో జరిగిన ‘రియాలిటీ ఆఫ్ రియల్టీ ఇన్వెస్ట్మెంట్స్’ అనే అంశం మీద జరిగిన వెబినార్‌లో వక్తలు అభిప్రాయపడ్డారు. కోవిడ్–19 మహమ్మారి నుంచి రియల్టీ రంగాన్ని కాపాడుకోవటంలో ప్రతి ఒక్క డెవలపర్, వాటాదారులు భాగస్వామ్యమయ్యారని అయితే ఈ మహమ్మారి ప్రభావం ఇంకా ముగియలేదని.. సవాళ్లను అధిగమించడానికి రియల్ ఎస్టేట్ డెవలపర్లు ఇంకా కలిసి పనిచేస్తున్నారని తెలిపారు. రాబోయే కాలంలో ఈ రంగం పూర్తిగా కోలుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నరెడ్కో జాతీయ అధ్యక్షుడు డాక్టర్ నిరంజన్ హిర్నందాని మాట్లాడుతూ.. లాక్డౌన్ తర్వాత రియల్టీ రంగంలో పెరిగిన లావాదేవీలు, సానుకూల వినియోగదారుల డిమాండ్ నమోదవుతుందని తెలిపారు. దేశీయ ఆర్ధిక వ్యవస్థలో సానుకూల వాతావరణం కనిపిస్తుందన్నారు. ఒకవైపు జీడీపీ ‘వీ’ ఆకారపు రికవరీ అవుతుంటే.. మరోవైపు వాణిజ్య రియల్టీ రంగం ఆందోళన కలిగిస్తుందని పేర్కొన్నారు. వర్క్ ఫ్రం హోమ్, వర్క్ ఫ్రం రిమోట్ లొకేషన్ వంటి విధానాలతో ఆఫీస్ స్పేస్ రియల్టీ రికవరీ ఆశించిన స్థాయిలో లేదని తెలిపారు. ఆగిపోయిన, ఆలస్యమైన ప్రాజెక్ట్‌లను పూర్తి చేసేందుకు కేటాయించిన స్పెషల్ విండో ఫర్ కంప్లీషన్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ అఫర్డబుల్ అండ్ మిడ్–ఇన్‌కం హౌసింగ్ ప్రాజెక్ట్స్ (ఎస్‌డబ్ల్యూఏఎంఐహెచ్) నిధుల పరిమాణాన్ని మరింత పెంచాలని కోరారు. ఈ విధానంలో ఆర్థిక సంస్థలను కూడా భాగస్వామ్యం చేయాల్సిన అవసరం ఉందని సూచించారు. ఆర్థిక పరిస్థితుల్లో మెరుగుదలతో గృహ కొనుగోళ్లకు డిమాండ్ పెరిగిందన్నారు. చరిత్రాత్మక స్థాయిలో గృహ రుణ వడ్డీ రేట్లు తగ్గడం, కొన్ని రాష్ట్రాల్లో స్టాంప్ డ్యూటీలను తగ్గించడం వంటి వాటితో గృహ కొనుగోళ్లకు డిమాండ్ పెరిగిందని హెచ్డీఎఫ్సీ ఎండీ రేణుసుద్ కర్నాడ్ అన్నారు. ప్రాపర్టీ ధరలు పెరగకుండా డెవలపర్లు తమ వంతు కృషి చేయాలని.. దీంతో గృహ విభాగానికి మరిన్ని అవకాశాలుంటాయని సూచించారు. రియల్టీ రంగానికి ప్రభుత్వ అవసరం అయిన ప్రతీ చోట నరెడ్కో తమ వంతు పాత్రని పోషిస్తుందని.. ఇదే సమయంలో డిజిటల్ వైపు కూడా రియల్టీ రంగానికి ప్రోత్సహిస్తే వృద్ధి మరింత సులభతరం అవుతుందని పేర్కొన్నారు. ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందాలంటే రిటైల్ రియల్ ఎస్టేట్ వృద్ధి చెందాలని ఎస్బీఐ రిటైల్ బిజినెస్ డిప్యూటీ ఎండీ సలోని నారాయణ్ అన్నారు. -
అదృష్టం అంటే ఈ కుక్కదే.. రూ.36 కోట్ల ఆస్తి
వాషింగ్టన్/టేన్నసీ: సాధారణంగా మనుషుల కన్నా జంతువులకు విశ్వాసం, ప్రేమాభిమానాలు ఎక్కువగా ఉంటాయి. వాటి పట్ల కాస్త ఆదరణ చూపిస్తే చాలు.. జీవితాంతం మనల్ని అంటి పెట్టుకుని ఉంటాయి. కుక్కల్లో ఈ విశ్వాసం పాలు ఇంకాస్త ఎక్కువగా ఉంటుంది. అందుకే చాలా మంది పెంపుడు జంతువుగా కుక్కలను పెంచుకోవడానికి ఆసక్తి చూపుతారు. ఎందుకంటే అవి మన నుంచి ప్రేమను తప్ప ఇంకేం ఆశించవు. మరి కొందరైతే కుటుంబ సభ్యులతో సమానంగా వీటిని చూసుకోవడమే కాక.. ఏకంగా వాటికి ఆస్తిలో వాటా కూడా ఇస్తారు. తాజాగా ఇలాంటి సంఘటన అమెరికాలోని టేన్నసీలో చోటు చేసుకుంది. ఓ వ్యక్తి తన వీలునామాలో పెంపుడు కుక్క పేర మీద 5 మిలియన్ డాలర్ల ఆస్తి రాశాడు. మన కరెన్సీలో చెప్పాలంటే 36,29,55,250 రూపాయలు. వివరాలు.. టేన్నసీకి చెందిన బిల్ డోరిస్(84) అనే వ్యక్తి గత ఎనిమిదేళ్లుగా లులు అనే ఓ కుక్కను పెంచుకుంటున్నాడు. ట్రావేలింగ్ హాబీ కల డోరీస్ తరచుగా ప్రయాణాలు చేసేవాడు. ఆ సమయంలో పెంపుడు కుక్క లులుని తన స్నేహితుడు మార్ట్ బర్టన్ వద్ద వదిలేసి వెళ్లేవాడు. ఈ క్రమంలో గతేడాది డోరిస్ మరణించాడు. అప్పటి నుంచి లులు బాధ్యతని మార్టనే తీసుకున్నాడు. ఇలా ఉండగా కొద్ది రోజుల క్రితం డోరిస్ లాయర్ ఆయన చనిపోవడానికి ముందు రాసిన వీలునామాను మార్ట్‌కి అందించాడు. దానిలో డోరిస్ తన పెంపుడు కుక్క లులు పేరిట 5 మిలియన్ డాలర్ల ఆస్తి రాశాడు. ఈ మొత్తాన్ని లులు సంరక్షణకు, దాని అవసరాలు తీర్చడం కోసం వాడాలని కోరాడు. ఇక లులు బాధ్యతని తన స్నేహితుడు మార్ట్ తీసుకోవాల్సిందిగా వీల్లులో అభ్యర్థించాడు డోరిస్. లులు పేరు మీద ఉన్న ఆస్తికి అతను ట్రస్టీగా ఉంటాడని పేర్కొన్నాడు. ఈ సందర్భంగా మార్ట్ మాట్లాడుతూ.. ‘‘డోరిస్ రాసిన వీలునామా చూసి నేను ఆశ్చర్యపోయాను. ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదు. డోరిస్, లులు ఎంతో క్లోజ్‌గా ఉండేవాళ్లు. తన బిడ్డలానే చూసేవాడు’’ అని తెలిపారు. చదవండి: రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన కుక్క! వాలెంటైన్స్ డే: ఫ్రీగా విడాకులు ఇప్పిస్తాం -
బౌన్స్ బ్యాక్.. దక్షిణాది నగరాలే టాప్
సాక్షి, హైదరాబాద్: కరోనా మహమ్మారి నుంచి దేశీయ రియల్ ఎస్టేట్ రంగం క్రమంగా కోలుకుంటోంది. దక్షిణాది నగరాలైన హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలు ఈ రంగం రికవరీలో బ్యాక్‌బోన్‌గా నిలబడుతున్నాయని మ్యాజిక్‌బ్రిక్స్ ఓనర్స్ సర్వీసెస్ సర్వే తెలిపింది. ఈ నగరాల్లోని గృహ యజమానులు సీరియస్ విక్రయదారులుగా ఉన్నారని సర్వేలో వెల్లడైంది. ► గృహాల విక్రయాల్లో బెంగళూరు ప్రథమ స్థానంలో నిలవగా.. హైదరాబాద్ రెండో స్థానంలో నిలిచింది. ఆ తర్వాత చెన్నై, పుణే, ముంబై నగరాలు ఉన్నాయి. సులభమైన రవాణా, మెట్రో కనెక్టివిటీ మెరుగ్గా ఉండటమే దక్షిణాది రాష్ట్రాల్లో ప్రాపరీ్టల విక్రయాల పెరుగుదలకు ప్రధాన కారణాలని తెలిపింది. సరసమైన గృహాలతో పాటు కనెక్టివిటీ ఉన్న ప్రాంతాల్లోని ప్రాపర్టీల మీదే కొనుగోలుదారులు ఆసక్తి చూపిస్తున్నారు. ► 500ల కంటే ఎక్కువ నగరాల్లో ఓనర్ సర్వీసెస్ సేవలను వినియోగించుకుంటున్నారు. జనాభా పరంగా చూస్తే.. మ్యాజిక్‌బ్రిక్స్ ఓనర్ సర్వీస్ వినియోగదారుల్లో 80 శాతం పురుషులు, 20 శాతం మహిళలు కస్టమర్లుగా ఉన్నారు. 50 శాతం మంది కస్టమర్లు 40–45 ఏళ్ల పైబడిన వాళ్లే ఉన్నారు. 60 శాతం మంది యూజర్లు వేతనజీవులు కాగా.. 30 శాతం మంది స్వయం ఉపాధి పొందుతున్నవాళ్లని రిపోర్ట్ తెలిపింది. 55 శాతం ఓనర్ సరీ్వసెస్ వినియోగదారులు ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై నగరాల వాళ్లేనట. ► తక్కువ ధరలు, రాష్ట్ర ప్రభుత్వాలు, డెవలపర్ల వివిధ పథకాల ప్రయోజనాలతో కొనుగోలుదారులు తమ చిన్న ఇళ్లను విక్రయించేసి.. వాటి స్థానంలో పెద్ద సైజు గృహాలను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. వడ్డీ రేట్లు తక్కువగా ఉండటం కూడా కస్టమర్లకు కలిసొచ్చే అంశం. విక్రయదారులు అధిక లిక్విడిటీ కోసం ప్రాపర్టీలను దీర్ఘకాలం పాటు హోల్డింగ్‌లో పెట్టినా పెద్దగా ప్రయోజనం ఉండకపోవచ్చు. కరోనా మహమ్మారితో చాలా మంది గృహ యజమానులు తమ ప్రాపరీ్టల విక్రయానికి డిజిటల్ రూపంలో విక్రయించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ► గృహ యజమానులకు తమ ప్రాపర్టీల కోసం అద్దెదారులను వెతకటంతో పాటు ఆయా ప్రాపరీ్టలను విక్రయించే సేవలను కూడా అందిస్తుంది. గృహ యజమానులకు సులభంగా ప్రాపరీ్టలను విక్రయించేందుకు ఓనర్ సరీ్వసెస్ విభాగాన్ని మరింత బలోపేతం చేసింది. ప్రొఫెషనల్ ఫొటో షూట్, ప్రాపర్టీ కంటెంట్ వివరణ, ఆన్లైన్ జాబితాలు, కస్టమర్ల ఆకర్షణ, రిలేషన్షిప్ మేనేజర్స్‌తో డీల్స్‌ను క్లోజ్ చేయడం వంటి ఎండ్ టు ఎండ్ సేవలను అందిస్తుంది. ఆయా సేవల ప్యాకేజీల ధరలు రూ.2,599–5,999 మధ్య ఉన్నాయి. చదవండి: అందుబాటు గృహాలపై ఎన్నారైల ఆసక్తి బెంగళూరు కంటే హైదరాబాదే చాలా కాస్ట్లీ -
పది పెళ్లిళ్లు చేసుకున్నాడు.. ఆస్తి కోసం..
లక్నో : పది పెళ్లిళ్లు చేసుకున్న ఓ వ్యక్తి ఆస్తి కోసం దారుణ హత్యకు గురయ్యాడు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో బుధవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. బరేలీ జిల్లాకు చెందిన 52 ఏళ్ల జగన్‌లాల్ యాదవ్ అనే రైతు 1990నుంచి మొదలుకుని ఇప్పటివరకు మొత్తం 10 సార్లు పెళ్లి చేసుకున్నాడు. భార్యల్లో ఐదుగురు చనిపోగా.. ముగ్గురు వేరే వారితో లేచిపోయారు. ప్రస్తుతం ఇద్దరు భార్యలతో ఉంటున్నాడు. బుధవారం ఊరికి దగ్గరలోని పంట పొలంలో జగన్‌లాల్ శవమై కనిపించాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఆస్తి కోసమే అతడ్ని చంపేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. (యజమాని భార్యతో సంబంధం.. అది తెలిసి..) భోజిపుర స్టేషన్ హౌస్ అధికారి ఈ కేసు గురించి మాట్లాడుతూ.. ‘‘ హతుడికి మేయిన్ రోడ్డు పక్కన స్థలం ఉంది. దానికి మార్కెట్లో చాలా విలువ ఉంది. దాని కోసమే అతడ్ని హత్య చేసి ఉంటారు. ఓ పెళ్లి తర్వాత మరో పెళ్లి ఇలా చాలా సార్లు పెళ్లి చేసుకున్నాడు. కానీ, అతడికి పిల్లలు లేరు. భార్య మొదటి భర్తకు పుట్టిన కుమారుడితో ఉంటున్నాడు. పలుమార్లు పెళ్లి చేసుకున్న కారణంగా జగన్‌లాల్ తండ్రి.. ఆస్తిని అతడి అన్నకు రాశాడు. జగన్‌లాల్ పంచాయితీలో గెలిచి కొంత భూమిని దక్కించుకున్నాడు. బంధువులందరి స్టేట్మెంట్లను రికార్డు చేశాం. బంధువులే ఈ హత్య చేసి ఉండే అవకాశం ఎక్కువగా ఉంది’’ అని అన్నారు. -
గృహ కొనుగోలుదారులకు ఖతార్ రెడ్ కార్పెట్
దోహా: ప్రధానంగా ఇంధన అమ్మకాలపై ఆధారపడిన ఆర్థిక వ్యవస్థకు ఇతర మార్గాలలోనూ మద్దతివ్వాలని భావిస్తున్న ఖతార్ ప్రభుత్వం తాజాగా విదేశీయులకు ప్రాపర్టీ మార్కెట్ ద్వారా ఆహ్వానం పలుకుతోంది. నిజానికి సెప్టెంబర్‌లోనే ఈ పథకానికి తెర తీసినప్పటికీ.. తాజాగా మరిన్ని సంస్కరణలు చేపట్టింది. 2022లో నిర్వహించనున్న వరల్డ్ కప్ కంటే ముందుగానే భారీగా విదేశీ పెట్టుబడులను ఆకట్టుకునే ప్రణాళికల్లో భాగంగా రియల్టీ ఆస్తుల విక్రయానికి సన్నాహాలు చేస్తోంది. అర్హతగల కొనుగోలుదారులకు సముద్రపు ఒడ్డునగల ఆకర్షణీయ పెరల్ ఐలాండ్ లేదా కొత్తగా ఏర్పాటు చేసిన లుజైల్ సిటీ ప్రాజెక్టును ఇందుకు కేటాయించింది. ఇక్కడ వరల్డ్ కప్ స్టేడియాన్ని నిర్మించింది. సీసైడ్ టవర్లలో బ్లాకులతోపాటు.. రిటైల్ యూనిట్లను సైతం కొనుగోలుదారులకు ఆఫర్ చేయనుంది. తద్వారా పెట్రో డాలర్లకు ప్రాపర్టీ విక్రయాల ఆదాయాన్ని జత చేయడం ద్వారా ఆర్థికంగా మరింత బలపడాలని చూస్తోంది. ధరలకు దన్నుగా సరఫరాకు తగిన డిమాండ్ లేకపోవడంతో టవర్లలో సగంవరకూ ఖాళీగానే ఉన్నట్లు రెసిడెన్షియల్ ఆస్తులకు సంబంధించిన వలుస్ట్రాట్స్ ధరల ఇండెక్స్ పేర్కొంది. దీంతో 2016 నుంచి ప్రాపర్టీ ధరలు మూడోవంతు క్షీణించినట్లు తెలియజేసింది. తాజా సంస్కరణల కారణంగా విదేశీయులు ఖతార్‌లోని 25 ప్రాంతాలలో కొత్తగా గృహాలను సొంతం చేసుకునేందుకు వీలుంటుంది. ప్రధానంగా రాజధాని దోహాలో ఇందుకు అధిక అవకాశాలున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. 9 ప్రాంతాలను మినహాయిస్తే మిగిలిన ప్రాంతాలలో 99 ఏళ్ల కాలానికి లీజ్‌ను ఆఫర్ చేస్తున్నట్లు తెలుస్తోంది. 10 లక్షల డాలర్లు.. గతంలో రెసిడెన్సీ కోసం ఖతార్ బిజినెస్ లేదా వ్యక్తుల నుంచి భాగస్వామ్యం(స్పాన్సర్షిప్) తీసుకోవలసి వచ్చేది. ప్రస్తుతం 2 లక్షల డాలర్ల విలువైన ప్రాపర్టీ కొనుగోలు ద్వారా తాత్కాలికంగా యాజమాన్య హక్కులు పొందేందుకు వీలుంటుంది. 10 లక్షల డాలర్లు వెచ్చించగలిగితే.. శాశ్వత నివాసానికి వీలు కల్పించనుంది. దీనిలో భాగంగా విద్య(స్కూళ్లు), ఆరోగ్యం(హెల్త్‌కేర్) ఉచితంగా అందించనుంది. గత 15ఏళ్లుగా ఇక్కడే ఉంటున్నప్పటికీ అనధికార మార్కెట్ వల్ల సొంత ఇల్లు సమకూర్చుకోలేకపోయినట్లు కెన్యన్ మహిళ టీనా చడ్డా ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. అయితే ప్రస్తుతం శాశ్వత నివాసానికి వీలు కల్పించడంతో ఖతార్‌లో సొంత ఇంటి కలను నెరవేర్చుకోనున్నట్లు సంతోషాన్ని వ్యక్తం చేశారు. చడ్డాకుగల వీసా ద్వారా కుటుంబ సభ్యులతోపాటు తల్లిదండ్రులనూ నైరోబీ నుంచి ఖతార్‌కు తీసుకురానున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం దుబాయ్ 2.7 మిలియన్ డాలర్ల పెట్టుబడికి 10ఏళ్ల రెసిడెన్సీ వీసాను ఆఫర్ చేస్తోంది. ఈ నిధుల్లో 40 శాతంవరకూ ప్రాపర్టీకే వినియోగించవలసి ఉంటుంది. కాగా.. గోల్డెన్ వీసాలుగా పేర్కొనే ఇలాంటి పథకాల ద్వారా అవినీతిపరులకు అవకాశం కలుగుతున్నదని, అంతేకాకుండా మనీలాండరింగ్‌కూ వీలు చిక్కుతున్నదని ఆరోపణలు వెలువడుతున్న విషయం విదితమే. -
కొడుకుతో సమానంగా కూతుళ్లకూ వాటా..
చెన్నై: ఆడపిల్ల పెళ్లి చేశాక ఎన్నటికీ ఈడ పిల్ల కానే కాదు అనేది మన సనాతన సంప్రదాయం. అందుకే, వారసత్వంగా వచ్చే ఆస్తులేవైనా మగపిల్లలకే తప్ప ఆడపిల్లలకు ఇవ్వాలనుకోరు. కానీ, తమిళనాడులోని శతాధిక వృద్ధురాలు కృష్ణవేణి అమ్మాళ్ మాత్రం కొడుకుతో పాటు సమానంగా తన ముగ్గురు కూతుళ్లకూ వారసత్వ ఇంటి ఆస్తి దక్కాల్సిందే అని పట్టుబట్టి పోలీసు స్టేషన్ గడప తొక్కింది. అనుకున్నది సాధించింది. విల్లుపురంలోని సిరువాంధాడు గ్రామానికి చెందిన కృష్ణవేణి అమ్మాళ్ పండు ముదుసలి. వయసు 108 ఏళ్లు. ఆమెకు ముగ్గురు కూతుళ్లు, ఒక కొడుకు ఉన్నారు. కృష్ణవేణి అమ్మాళ్ కూతుళ్లతో పాటు ఉండగా కొడుకు గణేశన్ అదే ఊళ్లో విడిగా తన కుటుంబంతో నివసిస్తున్నాడు. వారసత్వంగా వస్తున్న ఇంటిని కొడుకుతో పాటు కూతుళ్లకూ సమాన వాటా ఇవ్వాలని నిర్ణయించుకున్న ఆ అవ్వ సదరు అధికారులను కలిసింది. కొడుకు తనకు తెలియకుండా ఆస్తి పత్రాన్ని మార్చుకొని, మోసం చేశాడని తెలిసింది. (చదవండి: ఇంత అవమానమా.. ఆలస్యంగా వెలుగులోకి..) నేరుగా కొడుకును అడిగింది. ‘చెప్పకుండా ఆస్తి నీ పేరున మార్చుకున్నావు. ఇప్పటికైనా అక్కచెల్లెళ్లకూ ఆ ఆస్తిలో సమానవాటా ఇవ్వమ’ని అడిగితే కాదు పొమ్మన్నాడు. కృష్ణవేణి అమ్మాళ్ ఊరుకోలేదు. జిల్లా పోలీసు అధికారులను కలిసి, కొడుకు చేసిన మోసాన్ని వివరించింది. సహాయం చేయమని కోరింది. జిల్లా ఎస్పీ ఎస్.రాధాకృష్ణన్ సిరువాంధాడు గ్రామానికి వెళ్లి కృష్ణవేణి అమ్మాళ్ ఫిర్యాదుపై ఆరా తీశారు. గణేశన్‌ని పిలిచి విషయం పై నిలదీశారు. ఎస్పీ మాట్లాడిన తర్వాత గణేశన్ తన అక్కచెల్లెళ్లకూ ఇంట్లో వాటా ఇవ్వడానికి అంగీకరించాడు. ఆ వెంటనే, ఆస్తిని గణేశన్‌తోపాటు ముగ్గురు అక్కచెల్లెళ్లకూ సమాన వాటా చెందేలా పత్రం రాసి, రిజిస్టర్ చేయించారు. డీఎస్పీ రాధాకృష్ణన్, ఇతర పోలీసు సిబ్బంది సమక్షంలో కొత్త భూ పత్రాన్ని కృష్ణవేణి అమ్మాళ్కు అందజేశారు. కొడుకుతో పాటు కూతుళ్లకూ వారసత్వ ఇంటిలో వాటా దక్కాల్సిందే అని పోరాడిన కృష్ణవేణి అమ్మాళ్ ఈ తరానికి సిసలైన ప్రతినిధిగా నిలిచారు. -
ప్రాపర్టీ కార్డుల పంపిణీ ప్రారంభించిన మోదీ
-
‘గ్రామీణ భారతంలో చారిత్రక ఘట్టం’
సాక్షి, న్యూఢిల్లీ : ప్రజలకు ప్రాపర్టీ కార్డులను అందించే స్వమిత్వ పథకం గ్రామీణ భారతాన్ని సమూలంగా మార్చే చారిత్రక ఘట్టం కానుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. స్వమిత్ర పథకాన్ని ప్రధాని మోదీ ఆదివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించి లబ్ధిదారులతో ముచ్చటించారు. ప్రాపర్టీ కార్డుల ద్వారా లబ్ధిదారులకు తమ ఆస్తులపై బ్యాంకు రుణాలు పొందే వెసులుబాటు కలుగుతుంది. ఈ సందర్బంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ తమ ప్రభుత్వం సాధించిన విజయాలను వివరించారు. దశాబ్దాలుగా గ్రామాల్లో నిరుపేదలు సొంతిల్లు లేక ఇబ్బందులు పడుతున్నారని, తమ ప్రభుత్వం రెండు కోట్ల పక్కా ఇళ్లను నిర్మించి లబ్ధిదారులకు అందచేసిందని చెప్పుకొచ్చారు. కాగా స్వమిత్వ పథకం ద్వారా లక్ష మంది ఆస్తిదారులు తమ మొబైల్ నెంబర్‌కు వచ్చే ఎస్ఎంఎస్ లింక్ ద్వారా తమ ప్రాపర్టీ కార్డులను డౌన్లోడ్ చేసుకోవచ్చని ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంఓ) వెల్లడించింది. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రాపర్టీ కార్డులను లబ్ధిదారులకు అందచేస్తాయని పేర్కొంది. చదవండి : అసెంబ్లీ ఎన్నికలు : మోదీ, షా కీలక భేటీ -
యజమాని ఫొటో, ఆధార్, ఫోన్ నంబర్ తప్పనిసరి..
సాక్షి, హైదరాబాద్: ఆస్తుల నమోదు ప్రక్రియ శరవేగంగా జరుగుతోంది. వ్యవసాయేతర ఆస్తులకు కూడా పాస్ పుస్తకాలు (మెరూన్ రంగు) ఇవ్వాలని నిర్ణయించిన ప్రభుత్వం.. ప్రతి ఇంటి సమాచారాన్ని ఆన్లైన్లో నమోదు చేస్తోంది. కేవలం ఇళ్లే కాకుండా.. వ్యవసాయ పొలాల వద్ద ఉన్న కట్టడాల వివరాలను సేకరిస్తోంది. వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తుల లావాదేవీలకు వేర్వేరుగా ధరణి పోర్టళ్లను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో కొత్త రెవెన్యూ చట్టాన్ని తెచ్చిన సర్కారు.. ఈ దసరా నాడు ఈ పోర్టళ్లను ప్రారంభించాలని ముహూర్తం కూడా ఖరారు చేసింది. ఆ రోజు నుంచి సాగు భూముల రిజిస్ట్రేషన్లను తహసీళ్లలో.. వ్యవసాయేతర ఆస్తులను సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో చేయనుంది. ఈ క్రమంలోనే వ్యవసాయేతర ఆస్తుల వివరాలను పకడ్బందీగా సేకరించడమే కాకుండా ధరణి పోర్టల్‌లో అనుసంధానం చేయాలని నిర్ణయించింది. 60 లక్షల కట్టడాలు..! రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 12,751 గ్రామ పంచాయతీల్లో సుమారు 60 లక్షల కట్టడాలుంటాయని పంచాయతీరాజ్ శాఖ అంచనా వేసింది. ఈ ఆస్తుల వివరాలన్నింటినీ ఇప్పటికే అందుబాటులో ఉన్న ఈ–పంచాయతీ వెబ్సైట్లో పొందుపరిచింది. ఆస్తుల నమోదుకు ముందు.. రివిజన్ రిజిష్టర్‌లో 53.23 లక్షల కట్టడాలున్నట్లు లెక్క తేలగా.. కొత్త కట్టడాలతో కలుపుకొని ఈ సంఖ్య 60 లక్షలకు చేరింది. ఈ మేరకు ఈ–పంచాయతీ పోర్టల్‌లో నిక్షిప్తం చేసిన సమాచారాన్ని మ్యాపింగ్ చేయడంలో భాగంగా పంచాయతీ కార్యదర్శులు ఇంటింటికీ వెళ్తున్నారు. ఈ వివరాలను ప్రత్యేకంగా రూపొందించిన యాప్ న్యాప్ (నాన్ అగ్రికల్చర్ ప్రాపర్టీస్)లో నమోదు చేస్తున్నారు. అయితే, వివరాల నమోదుకు సాంకేతిక సమస్యలు ప్రతిబంధకంగా మారాయి. ఫోన్ సిగ్నల్స్ లేకపోవడం.. ఇంటర్నెట్ సమస్య.. సర్వర్ డౌన్‌తో యాప్‌లో సమాచారం నమోదు చేయడం కార్యదర్శులకు పెద్ద సవాల్‌గా మారింది. దీనికి తోడు గ్రామాల్లోని ప్రజానీకం వ్యవసాయ పనులకు వెళ్లిపోతుండటంతో సమాచార సేకరణపై ప్రభావం చూపుతోంది. కుటుంబ యజమాని ఫొటో, ఆధార్, ఫోన్ నంబర్ తప్పనిసరి చేయడం కూడా తలనొప్పిగా తయారైంది. దీంతో సమాచారాన్ని యాప్‌లో అప్లోడ్ చేయడంలో జాప్యం జరుగుతోంది. రోజుకు 70 ఇళ్ల సమాచారాన్ని అప్డేట్ చేయాలని లక్ష్యంగా నిర్దేశించిన 30 ఇళ్లు కూడా దాటడం లేదు. ఈ క్రమంలోనే సోమవారం నాటికి 10 లక్షల ఇళ్ల సమాచారాన్ని యాప్‌లో నిక్షిప్తం చేసినట్లు పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ రఘునందన్‌రావు ‘సాక్షి’కి తెలిపారు. వారం పది రోజుల్లో మొత్తం ఇళ్ల సమాచార సేకరణ ప్రక్రియ పూర్తవుతుందని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. తొలుత ఆస్తుల నమోదులో కొంత ఇబ్బందులు ఎదురైనా.. వాటిని అధిగమించామని, నమోదు ప్రక్రియ గాడిలో పడిందని అభిప్రాయపడ్డారు. (చదవండి: ఆస్తుల గణనకు సాంకేతిక సమస్యలు) -
స్థిరాస్తుల వివరాల నమోదులో చిక్కులెన్నో..
సాక్షి, హైదరాబాద్ : స్థిరాస్తుల వివరాలన్నీ ఆన్లైన్లో నమోదు చేయా లన్న ప్రభుత్వ లక్ష్యానికి... క్షేత్రస్థాయిలో తలెత్తుతున్న సమ స్యలు అడ్డంకిగా మారుతున్నాయి. దసరా నాటికి ధరణి వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం నిర్ణయిం చింది. వ్యవసాయేతర కేటగిరీలో ఉన్న ఇళ్లు, ఇతర నిర్మాణా లను డిజిటలైజేషన్ చేస్తూ వెబ్సైట్లో అప్లోడ్ చేస్తోంది. ఈ సమయంలో పలురకాల సమస్యలు ఎదురవుతున్నాయి. వీటిని అధిగమించి వివరాలను ఎంట్రీ చేయడం యంత్రాం గానికి తలనొప్పిగా మారుతోంది. ఈ క్రమంలో ఆస్తుల నమోదు ప్రక్రియ నిర్దేశించిన గడువులోగా (ఈనెల 11వ తేదీలోగా) సాధ్యమయ్యే అవకాశాలు కనిపించడం లేదు. అడుగడుగునా అడ్డంకులు ధరణి వెబ్సైట్లో ఆస్తుల నమోదుకు సంబంధించి 40 రకాల అంశాలను పొందుపర్చాల్సి ఉంది. ప్రతి ఆస్తికి సం బంధించి యజమాని ఆధార్ కార్డు నంబర్, ఫోన్ నంబర్, భార్య/భర్త వివరాలు, వారి వారసుల పేర్లు, ఇళ్లు లేదా నిర్మాణం ముందు యజమాని లైవ్ ఫొటో దిగి ఆ వివరా లను వెబ్సైట్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. నిర్దేశించిన అంశాలన్నీ కుదిరితే ఒక ఆస్తిని అప్లోడ్ చేయడానికి కనిష్టంగా 10 నిమిషాలు పడుతుంది. ఏ సమాచారం లోపించినా ఆన్లైన్ నమోదు నిలిచిపోతోంది. మరోవైపు ఈ నమోదు ప్రక్రియ గ్రామాల్లో మరింత అలస్యమవుతోంది. యజమాని అందుబాటులో ఉన్నప్పుడు ఇంటికెళ్లి వివరాలు ఎంట్రీ చేయడం ఇబ్బందిగా మారుతోంది. అంతేకాకుండా గ్రామాల్లో చాలా చోట్ల యజమానులు ఉపాధి కోసం పట్ట ణానికి వలస వెళ్లడంతో ఆయా ఇళ్లకు రోజుల తరబడి తాళాలే కనిపిస్తు న్నాయి. మరోవైపు ఒంటరి వ్యక్తికి సంబం ధించిన ఆస్తి నమోదు కఠినతర మవుతోంది. ఎందుకంటే ఆ వ్యక్తి సహచరి పేరు లేదా వారసుల పేర్లను తప్పకుండా ఎంట్రీ చేయాల్సి ఉం టుంది. కానీ ఒంటరి వ్యక్తి కావడంతో సదరు దరఖాస్తు అర్ధాంతరంగా నిలిచిపోతోంది. ప్రతి ఆస్తికి యజమాని లైవ్ ఫొటోను జత చేయాల్సి ఉంటుంది. కానీ యజమాని అందుబాటులో లేకపోవ డంతో దరఖాస్తు ముందుకు సాగడం లేదు. చాలాచోట్ల లైవ్ ఎంట్రీకి సాంకేతిక సమస్యలు ఎదురవు తున్నాయి. వివరాలను అప్లోడ్ చేసే సమయంలో సర్వర్ కనెక్ట్ కాకపోవడంతో వివరాల నమోదు తీవ్ర జాప్యమవుతోంది. యజమాని వారసుల పేర్లతో పాటు వారి ఆధార్ వివరాలు కూడా ఎంట్రీ చేయాలి. అయితే కుటుంబ సమస్యలు, ఇతరత్రా కలహాలతో వారసుల పేర్లు, ఆధార్ వివరాలు సేకరించడం కష్టంగా మారుతోంది. గ్రామాల్లో చాలాచోట్ల శిథిలావస్థకు చేరిన ఆస్తులు పెద్ద సంఖ్యలోనే ఉన్నాయి. యజమానులు వలస వెళ్లడంతో వారి వివరాలు తెలుసుకోవడం కష్టంగా మారింది. కొన్నిచోట్ల అటవీ భూముల్లో ఇళ్లు ఉండగా.. ధరణి యాప్‌లో అటవీ భూముల ఆప్షన్ లేదు. దీంతో ప్రభుత్వ భూమిలోనిర్మాణమున్నట్లు నమోదు చేయాల్సి వస్తోంది. ఒక ఎన్యుమరేటర్‌కు రోజుకు 70 ఎంట్రీలే ధరణి వెబ్సైట్లో ఆస్తుల వివరాల ఎంట్రీ కోసం నిర్దేశించిన ఎన్యుమరేటర్లకు ప్రభుత్వం ప్రత్యేక బడ్జెట్ కేటాయించింది. 30 ఆస్తులలోపు ఎంట్రీలు చేసే ఎన్యుమరేటర్‌కు ఒక్కో ఎంట్రీకి రూ.5 చొప్పున చెల్లింపులు చేస్తారు. 30 ఆస్తులకు మించి ఎంట్రీ చేస్తే ఒక్కో ఆస్తికి రూ.10 చొప్పున ఇస్తారు. ఒక ఎన్యుమరేటర్ ఒక రోజులో గరిష్టంగా 70 ఆస్తులను మాత్రమే ఎంట్రీ చేయాలి. -
శశికళకు షాక్ ఇచ్చిన ఐటీ?
సాక్షి, చెన్నై : తమిళనాడు దివంగత సీఎం జయలలిత నెచ్చెలి శశికళకు చెందిన రూ.300 కోట్ల ఆస్తులను ఆదాయ పన్ను శాఖ బినామి నిరోధక విభాగం జప్తు చేసినట్టు సమాచారం. అక్రమాస్తుల కేసులో శశికళ బెంగళూరు పరప్పన అగ్రహార జైలులో ఉన్న విషయం తెలిసిందే. ఆమె మీద అనేక కేసులు విచారణలో ఉన్నాయి. గతంలో శశికళ, కుటుంబం సభ్యుల మీద ఐటీ దాడులు సైతం హోరెత్తాయి. ఇందులో లభించిన ఆధారాల మేరకు 2003–2005లో ఓ సెల్ ఫోన్ సంస్థ ద్వారా బినామీ పేర్లతో అక్రమాస్తులను శశికళ గడించినట్టు ఆదాయ పన్ను విచారణలో తేలింది. ( శశికళ చేతిలోకే అన్నాడీఎంకే! ) చెన్నై శివార్లలో 200 ఎకరాల భూమితోపాటు 65 రకాల ఆస్తులను కొనుగోలు చేసినట్టు వెలుగు చూసినట్టుంది. వాటిని జప్తు చేస్తూ నిర్ణయం తీసుకున్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. ఇందులో జైలు జీవితం అనంతరం చిన్నమ్మ బస చేయడం కోసం పోయెస్ గార్డెన్ వేద నిలయంకు ఎదురుగా నిర్మిస్తున్న భవనం స్థలం కూడా ఉండడం గమనార్హం. ఈ ఆస్తుల విలువ ప్రస్తుతం రూ.300 కోట్లుగా తేల్చారు. ఈ జప్తుపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. -
ఆస్తిలో కూతుళ్లకు సమాన వాటా
న్యూఢిల్లీ: ఉమ్మడి హిందూ కుటుంబ ఆస్తిలో కొడుకులతో పాటు, కూతుళ్లకు సమాన హక్కులుంటాయని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. హిందూ వారసత్వ సవరణ చట్టం 2005కి ముందు తండ్రి మరణించినప్పటికీ కూతురుకి ఆ హక్కులు దక్కుతాయని స్పష్టం చేసింది. సమానత్వ హక్కుని కూతుళ్ళకి నిరాకరించతగదని కూడా స్పష్టం చేసింది. హిందూ వారసత్వ చట్టం–1956లోని సెక్షన్ 6ప్రకారం, చట్టంలో సవరణలకి ముందు లేదా తరువాత పుట్టిన కూతుళ్ళకు కూడా కొడుకులకు మాదిరిగానే హక్కులు, బాధ్యతలు సమానంగా ఉంటాయని జస్టిస్ ఆరుణ్ మిశ్రా, జస్టిస్ ఎస్.నజీర్, జస్టిస్ ఎంఆర్ షాల ధర్మాసనం తీర్పునిచ్చింది. హిందూ వారసత్వ చట్టం 1956కి చేసిన సవరణ ద్వారా కూతుళ్ళకు కూడా పూర్వీకుల ఆస్తిలో సమాన వాటా ఉంటుందని ఈ తీర్పు స్పష్టం చేసింది. సెప్టెంబర్ 9, 2005 నాటికి జీవించి ఉన్నవారి కూతుళ్ళకు మాత్రమే ఈ చట్టం వర్తిస్తుందంటూ 2015లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని తోసిరాజని ‘‘కూతురు ఎప్పటికీ ప్రియమైన కూతురే’’అని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. ‘‘ఒక కొడుకు భార్య వచ్చినంత వరకే కొడుకుగా ఉంటాడు. అదే కూతురు జీవితాంతం కూతురుగానే ఉంటుంది’’అని తన తీర్పులో పేర్కొంది. ఇప్పటికే వివిధ కోర్టులలో పెద్ద సంఖ్యలో పెండింగ్‌లో అప్పీళ్ళు ఉన్నాయని, విభిన్నమైన తీర్పులివ్వడంతో తీర్పు ఆలస్యం అవుతోందని వ్యాఖ్యానించింది. ఈ అప్పీళ్ళను 6 నెలల్లోగా పూర్తి చేయాలని ఆదేశించింది. -
ఆ వారసులకు రూ.20 వేల కోట్లు
చండీగఢ్: ఫరీద్ కోట్ మహారాజు హరీందర్ సింగ్ బ్రార్‌కు చెందిన రూ. 20 వేల కోట్ల విలువైన ఆస్తికి వారసులెవరనే విషయంలో పంజాబ్ అండ్ హరియాణా హైకోర్టు సోమవారం కీలక తీర్పును వెలువరించింది. మహారాజు కూతుళ్లు అమృత్ కౌర్, దీపిందర్ కౌర్‌లకు 75%, తల్లి దివంగత మొహిందర్ కౌర్‌కు మిగతా 25% వాటా చెందుతుందని స్పష్టం చేసింది. మొహిందర్ కౌర్ వాటాపై హరీందర్ సింగ్ సోదరుడైన మంజిత్ ఇందర్ సింగ్ వారసులకు హక్కు ఉంటుందని పేర్కొంది. మూడేళ్ల వయసులో హరీందర్ సింగ్ ఫరీద్కోట్ ఎస్టేట్‌కు రాజయ్యారు. ఆ సంస్థానం చివరి రాజు ఆయన నరీందర్ కౌర్‌ను వివాహం చేసుకున్నారు. వారికి ముగ్గురు కూతుళ్లు. ఒక కుమారుడు. కూతుళ్లు అమృత్ కౌర్, దీపిందర్ కౌర్, మహీపిందర్ కౌర్. కుమారుడు హర్మొహిందర్ సింగ్ 1981లో ఒక రోడ్డు ప్రమాదంలో మరణించారు. కూతురు మహీపిందర్ కౌర్ పెళ్లి కాకముందే మరణించారు. మహారాజు హరీందర్ సింగ్ 1989లో చనిపోయారు. అనంతరం ఆయన ఎస్టేట్ ఆస్తులపై వివాదం మొదలైంది. మహారాజు హరీందర్‌కు వంశపారంపర్యంగా వచ్చిన విలువైన ఆస్తులు హిమాచల్‌ప్రదేశ్, ఢిల్లీ, చండీగఢ్, హరియాణాల్లో ఉన్నాయి. వాటి విలువ రూ. 20 వేల కోట్లకు పైనే. కోర్టు కేసు నడుస్తుండగా దీపిందర్ కౌర్ మరణించారు. మహారాజు హరీందర్ సింగ్ మరణం తరువాత ఆయన రాసినట్లుగా చెబుతున్న వీలునామా ఒకటి వెలుగులోకి వచ్చింది. అందులో దీపిందర్ సింగ్ నిర్వహిస్తున్న ‘మహర్వాల్ కేవాజీ ట్రస్ట్’కు ఆస్తి చెందాలని ఉంది. అయితే, ఆ వీలునామా చెల్లదని ముందుగా చండీగఢ్ కోర్టు, ఆ తరువాత తాజాగా హైకోర్టు తేల్చిచెప్పాయి. హిందూ వారసత్వ చట్టం ప్రకారం ఆస్తి పంపకం జరగాలని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రాజ్‌మోహన్ సింగ్ తీర్పునిచ్చారు. ఆ ప్రకారం, ఇద్దరు కూతుళ్లకు, మహారాజు చనిపోయిన సమయంలో జీవించి ఉంది కనుక ఆయన తల్లి మొహిందర్ కౌర్‌కు ఆస్తి చెందుతుందని పేర్కొన్నారు. మొహిందర్ కౌర్ రాసిన వీలునామా ప్రకారం తనకు సంక్రమించే ఆస్తి ఆమె మరో కుమారుడు మంజిత్ ఇందర్ సింగ్ కుటుంబానికి చెందుతుంది. ఎస్టేట్స్ యాక్ట్, 1948 ప్రకారం ఆస్తి అంతా తనకే చెందుతుందని అమృత్ కౌర్ వాదించారు. జేష్టస్వామ్య సంప్రదాయం ప్రకారం.. పెద్ద కుమారుడికి కానీ, లేదా జీవించి ఉన్న పెద్ద సోదరుడి కుటుంబానికి కానీ ఆస్తిపై హక్కు ఉంటుందని మంజిత్ ఇందర్ సింగ్ కుమారుడు భరత్ ఇందర్‌సింగ్ వాదించారు. వీలునామా ప్రకారం ఆస్తి అంతా తాను నిర్వహిస్తున్న ట్రస్ట్‌కు చెందాలని దీపిందర్ సింగ్ కోరారు. వీరి వాదనలను హైకోర్టు తోసిపుచ్చింది. ఆస్తిపై హక్కు కోసం కుట్రపూరితంగా రూపొందించారని పేర్కొంటూ వీలునామాను కొట్టివేసింది. ఫరీద్ కోట్ రాజమహల్ -
‘ఆ భవనం ఖరీదు రూ. 1150 కోట్లు’
న్యూయార్క్ : ఈకామర్స్ దిగ్గజం, ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడు జెఫ్ బెజోస్ బెవర్లీ హిల్స్‌లో అత్యంత విలాసవంతమైన ఇంటిని కొనుగోలు చేశారు. ఈ భవనం కోసం ఏకంగా 165 మిలియన్ డాలర్లు (దాదాపు రూ. 1150 కోట్లు) చెల్లించేందుకు సిద్ధమయ్యారు. లాస్ఏంజెల్స్ ప్రాంతంలో ఓ ఇంటిపై ఇంత ధర పలకడం ఇదే రికార్డని ఈ వ్యవహారం గురించి అవగాహన ఉన్న వ్యక్తి వెల్లడించారు. 1930ల్లో హాలీవుడ్ ఫిల్మ్ టైటాన్ జాక్ వార్నర్ కోసం రూపొందించిన ఈ ప్రాపర్టీని ఆర్కిటెక్చరల్ డైజెస్ట్ 1992 లో "ఆర్కిటిపాల్ స్టూడియో మొగల్ ఎస్టేట్"గా అభివర్ణించింది. ఈ భవనంలో జార్జియన్ శైలిలో విస్తారమైన టెర్రేస్‌లతో పాటు భారీ గోల్ప్ కోర్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. వాల్‌స్ర్టీట్ జర్నల్‌లో ప్రచురితమైన కథనం ప్రకారం జెఫ్ బెజోస్ ఎంచుకున్న వార్నర్ ఎస్టేట్ 1990 నుంచి డేవిడ్ జెఫెన్ ఆధీనంలో ఉందని, దీన్ని ఆయన రూ. 280 కోట్లు వెచ్చించి సొంతం చేసుకున్నట్టు తెలుస్తోంది. బెజోస్ ఇటీవల అమెజాన్‌లో 400 కోట్ల డాలర్ల విలువైన షేర్లను నగదుగా మార్చుకున్న క్రమంలో ఆయన విపరీతంగా షాపింగ్‌పై వెచ్చిస్తున్న వార్తలు వెలువడటం గమనార్హం. 2019లో భార్య మెకంజీ బెజోస్‌తో విడాకులు పొందిన అనంతరం గర్ల్‌ఫ్రెండ్ లౌరెన్ సాంచెజ్‌తో విలాసవంతంగా గడుపుతున్న ఫోటోలు సోషల్ మీడియాలోనూ హల్చల్ చేస్తున్నాయి. గర్ల్‌ఫ్రెండ్‌తో కలిసి కొత్త జీవితాన్ని ఆస్వాదించేందుకే ఆయన భారీ కొనుగోళ్లకు మొగ్గుచూపుతున్నారు. ఆర్ట్ మార్కెట్లోకూ ఎంటరైన జెఫ్ బెజోస్ ఆర్టిస్ట్ ఎడ్ రుసా వర్క్‌ను క్రిస్టీ ఆక్షన్‌లో హర్టింగ్ ది వర్డ్ రేడియో కోసం 52.5 మిలియన్ డాలర్లు వెచ్చించి కొనుగోలు చేశారు. కెర్రీ జేమ్స్ మార్షల్ విగ్నెట్ 19ను ఏకంగా 18.5 మిలియన్ డాలర్లతో సొంతం చేసుకున్నారు. ఇక బెజోస్‌కు ఇప్పటికే వాష్టింగ్టన్ డీసీ వంటి అమెరికన్ తీర ప్రాంతాల్లో విలాసవంతమైన భవనాలున్నాయి. ఇవాంక ట్రంప్, జేర్డ్ కుష్నర్ వంటి సెలబ్రిటీలకు ఆయన ఇటీవల వాషింగ్టన్ డీసీ మాన్షన్‌లో భారీ విందు ఇచ్చారు. చదవండి : నగ్న ఫోటోల లీకేజీ వివాదంలో ప్రపంచ కుబేరుడు -
తిరిగి వచ్చినవాడు
మనం కూడా ధనానికి ప్రాముఖ్యతనిస్తున్నామా? ఆలోచించుకోవాలి. వస్తు, సంపదలకు ఇచ్చే ప్రాముఖ్యం మనం మనుషులకు ఇవ్వడం లేదు. ఇక్కడ ఆ తండ్రి ఆస్తికి ప్రాముఖ్యతను ఇవ్వడం లేదు. కుమారుడు ప్రాణాలతో తిరిగి రావడమే చాలా గొప్ప అనే ఆ తండ్రి ప్రేమ ఈ రోజు మనకు అనేక పాఠాలు నేర్పుతుంది. ఒక తండ్రికి ఇద్దరు కుమారులున్నారు. వారిలో చిన్నవాడు ఆస్తిలో తనకు వచ్చే భాగాన్ని తనకు ఇవ్వమని తండ్రిని అడిగాడు. తండ్రికి ఆస్తిని పంచడం ఇష్టం లేకున్నా పంచాడు. అయితే చిన్నవాడు కావడం వల్ల ఆ ఆస్తిని ఎలా వాడాలో తెలియని ఆ కుమారుడు తనకున్న సంపదని తీసుకుని ఆ ప్రాంతం నుండి వెళ్లిపోయి తన ఆస్తినంతటినీ చెడ్డ పనులు చేసి పోగొట్టుకున్నాడు. దాంతో చేసేదేం లేక ఆ దేశంలో పందులను మేపే పనిని చేస్తూ పందులు తినే పొట్టుతో కడుపు నింపుకుంటూ ఎంతో వేదననుభవించాడు. చాలా బాధ పడ్డాక ఆ కుమారుడికి తన తండ్రి, తన ఇల్లు అన్నీ గుర్తుకొచ్చాయి. మళ్లీ తను అక్కడకు వెళితే బాగుంటుందనే ఆలోచన రావడంతోనే తిరిగి తన తండ్రి వద్దకు వెళ్లిపోయాడు. ఆ కుమారుడిని దూరం నుంచే చూసిన తండ్రి.. కుమారునికి ఎదురు వెళ్లి అతడిని ముద్దు పెట్టుకుని, తన దాసులతో కుమారుడు వచ్చాడని చెప్పి విందు చేయించాడు. అయితే ఆ తండ్రి వద్దనే ఉన్న పెద్ద కుమారుడికి తండ్రి చేస్తున్న ఆ పని నచ్చలేదు. ఆస్తి మొత్తాన్ని పోగొట్టి వచ్చిన వాడికోసం విందు చేసినందుకు అలిగాడు. అదే మాట తండ్రిని అడిగాడు. అందుకు ఆ తండ్రి ఇలా చెప్పాడు. (లూకా 15:32) ‘‘నీ తమ్ముడు చనిపోయి బతికాడు, తప్పిపోయి దొరికాడు. కనుక మనం ఆనందించాలి’’ అన్నాడు. తన పెద్ద కుమారుడికి దేనిని ప్రేమించాలో నేర్పాడు. – బెల్లంకొండ రవికాంత్ -
మీ భూమి చరిత్ర!!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రాపర్టీ కొనాలన్నా, విక్రయించాలన్నా అంత తేలికేమీ కాదు. సవాలక్ష సందేహాలుంటాయి. మెట్రో నగరాల్లో అయితే మరీ ఎక్కువ!!. ఎంపిక చేసిన ప్రాపర్టీకి ఎలాంటి లీగల్ చిక్కులున్నాయో? వాస్తవానికి ఆయా ప్రాంతంలో ధర ఎంత ఉందో? ఒకవేళ కొన్నాక నిర్మాణానికి ప్రభుత్వం నుంచి అనుమతులు వస్తాయో రావో..? బ్యాంక్ గృహ రుణం ఎంతవరకు ఇస్తుందో? .. ఇలా ప్రతి దశలోనూ సందేహాలే. వీటన్నింటికీ ముందే... అది కూడా చిటికెలో పరిష్కారం చూపిస్తే? అదే ‘మై ఓఎస్ ప్రాపర్టీ.కామ్’ (మేక్ యువర్ ఓన్ స్పేస్ ప్రాపర్టీ.కామ్) ఘనత. ఈ యాప్‌ను హైదరాబాద్ స్టార్టప్ కంపెనీ ‘ఓల్యూబిల్లీస్ ప్రాపర్టీ’ అభివృద్ధి చేసింది. మైఓఎస్ ప్రాపర్టీ యాప్‌కు మెంటార్‌గా ఉన్న జేఎన్టీయూ స్కూల్ ఆఫ్ ఫైన్ ఆర్డ్స్ సీనియర్ ఫ్యాకల్టీ మెంబర్ డాక్టర్ డి. విజయ్ కిశోర్ ఈ యాప్ గురించి ‘స్టార్టప్ డైరీ’కి వివరించారు. ఇప్పటివరకు యాప్ డెవలప్మెంట్ కోసం రూ.2 కోట్ల వరకు ఖర్చు చేశామని, ఆండ్రాయిడ్, ఐఓఎస్ యాప్స్, వెబ్ అప్లికేషన్స్ మూడూ అందుబాటులో ఉన్నాయన్నా రు. మరిన్ని వివరాలు ఆయన మాటల్లోనే... 12 నగరాల్లో జియో ట్యాగ్.. ప్రస్తుతం హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, ఢిల్లీ, కాన్పూర్, చెన్నై, బెంగళూరు, పుణే, ముంబై, అహ్మదాబాద్, సూరత్, జైపూర్ నగరాల్లో సేవలందిస్తున్నాం. హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ, మెట్రోపాలిటన్స్, కార్పొరేషన్లు, స్పెషల్ అథారిటీ తాలూకు బిల్డింగ్ రూల్స్, మాస్టర్ప్లాన్స్ను డెవలప్మెంట్ కంట్రోల్ రెగ్యులేషన్స్(డీసీఆర్) సాంకేతికతతో డీ–కోడింగ్ చేశాం. ఆయా ప్రాపర్టీలకు జియో ట్యాగింగ్ చేశాం. దీంతో ప్రాపర్టీ రెసిడెన్షియల్ జోన్లో ఉందా? కమర్షియల్ జోన్లో ఉందా? ధర ఎం త? వంటివన్నీ సెలక్ట్ చేయగానే వచ్చేస్తాయి. ఎలా పనిచేస్తుందంటే... స్మార్ట్‌ఫోన్‌లో మైఓఎస్ ప్రాపర్టీ.కామ్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలి. గూగుల్ లొకేషన్స్‌లో మన ప్రాపర్టీ తాలూకు లొకేషన్, హద్దులను, రోడ్లను మ్యాపింగ్ చేయాలి. అంతే!! క్షణాల్లో ప్రాపర్టీ త్రీడీ రూపంలో ప్రత్యక్షమవుతుంది. అంతేకాదు... ఆయా ప్రాంతంలో ప్రభుత్వం నుంచి ఎన్ని అంతస్తులకు పర్మిషన్ ఉంది? ప్రాపర్టీ విలువ ఎంత? వంటి అన్ని వివరాలు వచ్చేస్తాయి. వీటితో పాటూ ఆర్కిటెక్ట్, ప్లానర్స్, ఇంజనీర్ల వివరాలు, న్యాయపరమైన సలహాల కోసం లీగల్ నిపుణులు, రుణాల కోసం ఆర్ధిక సంస్థలు, బ్యాంక్‌ల వివరాలు, అనుమతులకు సంబంధించిన ప్రభుత్వ విభాగాలు, ఏజెన్సీలు... ఇలా అన్ని వివరాలూ వచ్చేస్తాయి. ప్రవాసుల కోసం ల్యాండ్‌గార్డ్.. ప్రత్యేకంగా ప్రవాసులు(ఎన్నారైల) కోసం ల్యాండ్‌గార్డ్ అనే మరో ఫీచర్‌ను అభివృద్ధి చేశాం. ఇదేంటంటే... ప్రవాసులు మెట్రో నగరాల్లో స్థలాలు, ప్రాపర్టీలను కొంటుంటారు. ఆయా ప్రాపర్టీల్లో ఏం జరుగుతోంది? చుట్టుపక్కల ప్రాంతంలో ఎలాంటి అభివృద్ధి జరుగుతోంది? ఎవరైనా కబ్జా చేశారా? వంటి రకరకాల టెన్షన్స్ ఉంటాయి. ఇందుకోసం ల్యాండ్‌గార్డ్ ఫీచర్లో ప్రతి నెలా ప్రాపర్టీల ప్రత్యక్ష ఫొటోలు తీసి.. వాటిని జియో ట్యాగింగ్ చేసి సదరు ప్రాపర్టీ యజమానులకు పంపిస్తుంటాం. 1100 మంది ఎన్ఆర్ఐలు ఈ సేవలను వినియోగిస్తున్నారు. 100 కోట్ల వ్యాపారం లక్ష్యం.. మైఓఎస్ ప్రాపర్టీ యాప్ మీద సుమారు 50 మంది నిపుణులు పనిచేస్తున్నారు. ఈ ఏడాది చివరికి సుమారు 10 లక్షల డౌన్‌లోడ్స్‌కు చేరుతాం. వచ్చే ఏడాది కాలంలో 100 నగరాలకు, రూ.100 కోట్ల టర్నోవర్‌కు చేరుకోవాలన్నది మా లక్ష్యం. అద్భుతమైన స్టార్టప్‌ల గురించి అందరికీతెలియజేయాలనుకుంటే startups@sakshi.com కు మెయిల్ చేయండి... -
ఏ నగరంలో ఎంత స్టాంప్ డ్యూటీ?
సాక్షి, హైదరాబాద్: కొనుగోలు చేసిన స్థిరాస్తి మన పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే స్థానిక ప్రభుత్వానికి స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ చార్జీలను చెల్లించాల్సి ఉంటుంది. సాధారణంగా బ్యాంక్‌లు స్థిరాస్తి విలువలో 90 శాతం వరకు గృహ రుణాన్ని మంజూరు చేస్తుంటాయి. మిగిలిన మొత్తంతో పాటూ స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ చార్జీలను కూడా కొనుగోలుదారులే వెచ్చించాల్సి ఉంటుంది. స్టాంప్ డ్యూటీ అంటే? ప్రాపర్టీ లావాదేవీలకు చెల్లించే రుసుము. ఒకరి పేరు నుంచి మరొకరి పేరు మీదుకు ప్రాపర్టీని తర్జుమా చేసేందుకు స్థానిక ప్రభుత్వానికి చెల్లించే పన్ను. ఇది ప్రాపర్టీ విలువ మీద ఆధారడి ఉంటుంది. ఇండియన్ స్టాంప్ డ్యూటీ యాక్ట్, 1899 ప్రకారం స్టాంప్ డ్యూటీ 4–10 శాతం వరకుంటాయి. కొన్ని రాష్ట్రాల్లో పట్టణ, గ్రామీణ ప్రాంతాలు, మహిళలు, పురుషులకు వేర్వేరుగా స్టాంప్ డ్యూటీలుంటాయి. రిజిస్ట్రేషన్ చార్జీలనేవి ప్రభుత్వ రికార్డుల్లో ప్రాపర్టీ లావాదేవీల నమోదుకు ఒకసారి చెల్లించే రుసుము ఇది. ప్రాపర్టీ విలువలో 1 శాతం. ఏ నగరాల్లో ఎంత స్టాంప్ డ్యూటీ? (శాతాల్లో) హైదరాబాద్ – 7.5; అహ్మదాబాద్–4.90; బెంగళూరు–5; చెన్నై–7; ఢిల్లీ–6; గుర్గావ్ : 6–8; కోల్కత్తా: 5–7; ముంబై–6; నోయిడా–5; పుణె–5. -
బంగారం వద్దు ప్రాపర్టీలే ముద్దు
మహిళలకు బంగారానికి మించిన ఇన్వెస్ట్మెంట్ లేదు. కానీ, ఇది గతం! కొన్నేళ్లుగా మహిళలు ట్రెండ్ మార్చేశారు. ప్రాపర్టీల కొనుగోళ్లలో స్త్రీలు రాజ్యమేలుతున్నారు. దేశంలోని 42 శాతం మంది మహిళలు రియల్టీలో పెట్టుబడులకు ఆసక్తిగా ఉన్నారని అనరాక్ కన్జ్యూమర్ సెంటిమెంట్ సర్వే తెలిపింది. 30 శాతం మంది ఫిక్స్డ్ డిపాజిట్లు, 17 శాతం మంది బంగారం బెస్ట్ ఆప్షన్‌గా ఎంచుకుంటున్నారని నివేదించింది. మహిళలకు స్టాంప్ డ్యూటీ, గృహ రుణ వడ్డీ రేట్లలో తగ్గింపులు, పన్ను ప్రయోజనాలుండటం అదనపు కారణాలని పేర్కొంది. సాక్షి, హైదరాబాద్: మారుతున్న ప్రపంచంలో ఇల్లు తన పేరు మీద ఉండటం అత్యంత భద్రంగా భావిస్తుంది నేటి మహిళ. అందుకే ఇంటి యజమానిగా లేదా సహ–యజమానిగా ఉండేందుకు ఇష్టపడుతున్నారు. గతంలో ఇంటి వసతుల విషయంలో మాడ్యులర్ కిచెన్, పూజ గది, గార్డెన్ వంటి వాటికి ప్రాధాన్యమిచ్చే స్త్రీలు.. నేడు పురుషులతో సమానమైన వసతులను కోరుకుంటున్నారు. విస్తీర్ణం విషయంలోనూ నేటి మహిళలు రాజీ పడట్లేదని అనరాక్ ప్రాపర్టీ కన్సల్టెన్సీ చైర్మన్ అనూజ్ పురీ తెలిపారు. 80 శాతం మంది మహిళలు పెద్ద సైజు గృహాలనే కోరుకుంటున్నారని పేర్కొన్నారు. 1000–1250 చ.అ. 2 బీహెచ్‌కే, 1250–2000 చ.అ. 3 బీహెచ్‌కే నిర్మాణాలనే ఎంపిక చేస్తున్నారన్నారు. 60 శాతం మహిళలు రూ.80 లక్షల లోపు ఇళ్ల కొనుగోళ్లకు, 52 శాతం మహిళలు గృహ ప్రవేశానికి సిద్దంగా ఉన్న గృహాల కోసం ఆసక్తిగా ఉన్నారని తెలిపారు. మహిళలకు స్టాంప్ డ్యూటీలో తగ్గింపులు.. మన దేశంలోని కొన్ని రాష్ట్రాలు గృహ కొనుగోళ్ల వైపు మహిళలను ఆకర్షించేందుకు స్టాంప్ డ్యూటీలోనూ మినహాయింపులు ఇస్తున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో అయితే పట్టణ, గ్రామీణ వేర్వేరు ప్రాంతాలను బట్టి స్టాంప్ డ్యూటీలో తగ్గింపులున్నాయి. ఆయా రాష్ట్రాలను బట్టి ఇది 1–2 శాతంగా ఉంది. ఢిల్లీ, ఉత్తర్‌ప్రదేశ్, రాజస్థాన్, పంజాబ్, హర్యానా వంటి రాష్ట్రాల్లో మహిళలకు స్టాంప్ డ్యూటీలో సడలింపులున్నాయి. ఉత్తర్‌ప్రదేశ్‌లో 7 శాతం స్టాంప్ డ్యూటీ ఉండగా.. మహిళలకు మాత్రం మొత్తం చార్జీల మీద రూ.10 వేలు తగ్గింపు ఉంది. కొందరు పురుషులు ఏం చేస్తున్నారంటే? స్టాంప్ డ్యూటీ చార్జీలను తగ్గించుకునేందుకు ముందుగా మహిళల పేరు మీద రిజిస్ట్రేషన్ చేసి.. కొంత కాలం తర్వాత ఇంట్లోని పురుషుల పేరు మీద తిరిగి రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. గోవా వంటి కొన్ని రాష్ట్రాలు కనీసం ఏడాది లోపు గృహాల రీ–రిజిస్ట్రేషన్స్ మీద నిషేధం విధించాయి. అందుబాటు గృహాలు ఓన్లీ లేడీస్.. ప్రభుత్వం కూడా మహిళ గృహ కొనుగోలుదారులకు అదనపు పన్ను రాయితీలు, ప్రయోజనాలను అందిస్తుంది. దీంతో ప్రాపర్టీ కొనుగోళ్ల మీద మహిళల ఆసక్తి మరింత పెరిగింది. అందుబాటు గృహాలను కేవలం మహిళా యజమాని లేదా సహ–యజమానిగా ఉండాలన్న నిబంధనను కేంద్రం తప్పనిసరి చేసింది. ఇల్లు మహిళ పేరు మీద లేదా కో–ఓనర్‌గానైనా ఉన్నట్లయితే... అందులోనూ సంపాదించే మహిళ అయితే భార్యభర్తలిద్దరూ పన్ను తగ్గింపులు పొందే వీలుంది. బ్యాంక్ వడ్డీ రేట్లూ తక్కువే.. పురుషులతో పోలిస్తే మహిళలకు గృహ రుణాల్లోనూ సడలింపులున్నాయి. ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ వంటి బ్యాంక్‌లు మహిళలకు తక్కువ వడ్డీ రేట్లకు రుణాలను అందిస్తున్నాయి. బ్యాంక్‌ను బట్టి ఇది 1 శాతం వరకుంటుంది. ఉదాహరణకు ఎస్బీఐలో రూ.30 లక్షల వరకు గృహ రుణానికి మహిళలకు 8.75 – 8.85 శాతం, ఇతరులకు 8.80 నుంచి 8.90 శాతం వడ్డీ రేట్లున్నాయి. హెచ్‌డీఎఫ్‌సీలో మహిళలకు 8.90, ఇతరులకు 8.95 శాతంగా రేట్లున్నాయి. కనికరం లేని తెలుగు రాష్ట్రాలు.. దేశంలోని చాలా రాష్ట్రాలు గృహ కొనుగోళ్లలో మహిళలను ప్రోత్సహించేందుకు స్టాంప్ డ్యూటీలో మినహాయింపులిస్తుంటే.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు మాత్రం కనికరించట్లేదు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో సంయుక్త ఆంధ్రప్రదేశ్‌లో మహిళల పేరు మీద ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ చేపిస్తే స్టాంప్ డ్యూటీలో 2 శాతం తగ్గింపు ఉండేది. కానీ, ఆయన అనంతరం దీన్ని ప్రభుత్వాలు అటకెక్కించాయి. అందుబాటు గృహాల మీద కేంద్రం జీఎస్టీని 8 శాతం నుంచి 1 శాతానికి తగ్గించినట్లే.. రాష్ట్ర ప్రభుత్వం కూడా స్టాంప్ డ్యూటీని 6.1 శాతం నుంచి 3 శాతానికి తగ్గించాలని తెలంగాణ బిల్డర్స్ ఫెడరేషన్ (టీబీఎఫ్) జనరల్ సెక్రటరీ జక్కా వెంకట్ రెడ్డి కోరారు. ఏపీలో వినతిపత్రం అందజేత ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో స్టాంప్ డ్యూటీ 7.5 శాతంగా ఉంది. అఫడబుల్ హౌజింగ్ వైపు మహిళలను ఆకర్షించాలంటే 1000 చ.అ.లోపు ఉన్న గృహాల స్టాంప్ డ్యూటీని 1– 2 శాతానికి చేర్చాలి. ఈ విషయమై ఇటీవలే క్రెడాయ్ ఏపీ చాప్టర్ తరుఫున ప్రభుత్వానికి వినతిపత్రం సమర్పించాం. – ఎ. శివారెడ్డి, ప్రెసిడెంట్, క్రెడాయ్ ఏపీ వైఎస్ఆర్ హయాంలో 2% తగ్గింపు ప్రస్తుతం తెలంగాణలో స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ చార్జీలు 6.1 శాతంగా ఉన్నాయి. వైఎస్ఆర్ హయాంలో అందుబాటు గృహా లను ప్రోత్సహించేందుకు రెండేళ్ల పాటు స్టాంప్ డ్యూటీని తగ్గించినట్లే.. తెలంగాణ ప్రభుత్వం కూడా చార్జీలను 2 శాతానికి పరిమితం చేయాలి. – జీ రాంరెడ్డి, ప్రెసిడెంట్, క్రెడాయ్ తెలంగాణ -
రూ.147 కోట్ల నీరవ్ మోదీ ఆస్తులు జప్తు
న్యూఢిల్లీ: పరారీలో ఉన్న వజ్రాల వ్యాపారి నీరవ్‌మోదీ, ఆయన కంపెనీలకు సంబంధించి రూ.147 కోట్ల విలువ చేసే ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. ముంబై, సూరత్‌లో ఈ స్థిర, చరాస్తులు (కార్లు, ప్లాంట్ మెషినరీ, పెయింటింగ్స్, భవనాలు) ఉన్నట్టు ఈడీ వర్గాలు తెలిపాయి. పంజాబ్ నేషనల్ బ్యాంకును రూ.13,000 కోట్ల మేర మోసం చేసి నీరవ్ మోదీ విదేశాలకు పారిపోవడం తెలిసిందే. నల్లధన చలామణి నియంత్రణ చట్టం(పీఎంఎల్ఏ) 2002 కింద ఆస్తులను జప్తు చేసింది. సీబీఐ ఎఫ్ఐఆర్ ఆధారంగానే ఈడీ ఈ నెల 15న నీరవ్‌మోదీ, పలువురు ఇతరులకు వ్యతిరేకంగా మనీలాండరింగ్ కేసును నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది. దేశ, విదేశాల్లోని రూ.1,725 కోట్ల విలువైన ఆస్తులను గతంలోనూ జప్తు చేసిన విషయం గమనార్హం. -
ఇళ్ల క్రయవిక్రయాల్లోకి ‘ఎస్సెక్స్’
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇల్లు కొనుక్కోవటం అంత ఈజీ కాదు. అనువైన ప్రాంతంలో కావాలంటే కాళ్లరిగేలా తిరగాలి. మరోవంక సదరు ఇంటిని అన్ని అనుమతులు తీసుకున్నాకే బిల్డర్ నిర్మించారా? లోన్ వస్తుందా అన్న సందేహాలూ ఉంటాయి. ఇవన్నీ లేకుండా.. ఒక్క క్లిక్‌తో సులువుగా ఇల్లు కొనుక్కునే సేవల్ని అందుబాటులోకి తెచ్చింది ‘ఎస్సెక్స్’ దేశంలో అతిపెద్ద మార్కెటింగ్ టెక్నాలజీ కంపెనీ వే2ఆన్లైన్ ఇంటెరాక్టివ్ ప్రమోట్ చేస్తున్న ‘ఎస్సెక్స్ ఇండియా’... టెక్నాలజీని ఆసరాగా కస్టమర్‌ను, బిల్డర్‌ను అనుసంధానిస్తోంది. న్యాయ సహకారంతో పాటు గృహ రుణానికీ తగిన సాయం చేస్తుంది. ఎలా పనిచేస్తుందంటే.. ఎస్సెక్స్ ఇండియా వెబ్సైట్లోకి వెళ్లి పేరు, మొబైల్ నంబరు, నగరం పేరు నమోదు చేస్తే చాలు. కంపెనీ ప్రతినిధి 30 నిముషాల్లో కస్టమర్‌కు కాల్ చేస్తారు. ఏ ప్రాంతంలో ఫ్లాట్/విల్లా కావాలి, ఎంతలో కావాలి? ఎప్పట్లోగా కావాలి? వంటివి అడిగి తెలుసుకుంటా రు. ఈ సమాచారం ఆధారంగా బిల్డర్‌తో కస్టమర్‌ను అనుసంధానించి సైట్ విజిట్స్ ఏర్పాటు చేస్తారు. ధరపై కొనుగోలుదారే విక్రేతతో మాట్లాడుకోవచ్చు. కస్టమర్ నుంచి ఎలాంటి ఫీజూ వసూలు చేయరు. బ్యాంకు రుణం సైతం.. కస్టమర్‌కు బ్యాంకు నుంచి రుణం అందేలా సహకరిస్తామని ఎస్సెక్స్ కో–ఫౌండర్ నిర్భయ్ తనేజా సోమవారమిక్కడ మీడియాకు వెల్లడించారు. ‘భవనాలకు అనుమతులన్నీ ఉన్నాయా లేదా చూస్తాం. కస్టమర్ల క్రెడిట్ స్కోరింగ్‌ను సైతం ట్రాక్ చేస్తాం. భారత్‌లో ఏటా రూ.18,000 కోట్లుగా ఉన్న రెసిడెన్షియల్ మార్కెటింగ్, సేల్స్ రంగంలో 5% వాటాను లక్ష్యంగా చేసుకున్నాం’ అని వివరించారు. ఇప్పటి వరకు కంపెనీ రూ.3 కోట్లు వెచ్చించింది. ఆరు నెలల్లో రూ.20 కోట్ల నిధులు సమీకరించనుంది. అందరికీ ఒకే ప్లాట్‌ఫామ్.. ‘‘ఇళ్ల విక్రయానికి సంబంధించి పెద్ద పెద్ద రియల్టీ బ్రాండ్లకు సమస్యలు ఉండవు. కానీ చిన్నచిన్న బిల్డర్లకు తమ భవనాన్ని మార్కెట్ చేసుకోవడంలో చాలా పరిమితులున్నాయి. ఇదంతా ఖర్చుతో కూడుకున్నపని. దేశవ్యాప్తంగా అమ్ముడుపోని గృహాలు లక్షల్లో ఉంటాయి. చిన్న బిల్డర్ల గృహాలనూ మేం బ్రాండింగ్ చేస్తాం‘‘ అని కంపెనీ కో–ఫౌండర్ చైతన్య రెడ్డి వెల్లడించారు. కంపెనీ ప్రస్తుతం హైదరాబాద్‌లో మార్కెటింగ్, సేల్స్ సేవలు అందిస్తోంది. దశలవారీగా అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, కోల్‌కత, ముంబై, పుణే నగరాల్లో అడుగుపెడతామని చెప్పారు. -
ప్రాపర్టీలకు అడ్డా హనీగ్రూప్!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: అపార్ట్మెంట్స్, ప్లాట్లు, విల్లాలు, వ్యక్తిగత గృహాలు ఏవైనా కానివ్వండి.. ఒక్కో దానికి ఒక్కో నిర్మాణ సంస్థను సంప్రదించాల్సిన అవసరం లేదు. జస్ట్! హనీగ్రూప్‌లో లాగిన్ అయితే చాలు. ఒకే చోట అన్ని రకాల ప్రాపర్టీలు దొరికిపోతాయి. అంతేకాదండోయ్.. సైట్ విజిట్ నుంచి మొదలుపెడితే లీగల్, వేల్యువేషన్, రిజిస్ట్రేషన్, బ్యాంక్ లోన్స్ అన్ని రకాల సేవల నిర్వహణ బాధ్యత కూడా హనీగ్రూప్దే. మరిన్ని వివరాలను సంస్థ సీఎండీ ఎం. ఓబుల్ రెడ్డి ‘స్టార్టప్ డైరీ’తో పంచుకున్నారు. 3 రాష్ట్రాలు; 6 బ్రాంచీలు.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక మూడు రాష్ట్రాల్లో రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (రెరా) గుర్తింపు పొందిన కంపెనీ హనీగ్రూప్. ఫ్లాట్లను, ప్లాట్లను ప్రొఫెషనల్‌గా విక్రయించడం మా పని. ప్రస్తుతం విశాఖపట్నం, కూకట్పల్లి, ఉప్పల్, గాజువాక, శ్రీకాకుళం, బెంగళూరుల్లో బ్రాంచీలున్నాయి. వచ్చే 6 నెలల్లో గచ్చిబౌలి, సికింద్రాబాద్, విజయనగరం, అనకాపల్లి, రాజమండ్రి, కాకినాడ, విజయవాడ, గుంటూరు, తిరుపతి, భువనేశ్వర్, చెన్నై, బెంగళూరు సౌత్, ఈస్ట్, సెంట్రల్ ప్రాంతాల్లో కొత్త బ్రాంచీలను ప్రారంభించనున్నాం. 230 మంది డెవలపర్లు; 360 ప్రాజెక్ట్‌లు.. ప్రస్తుతం పూర్వాంకర, ప్రెస్టిజ్, ఎల్అండ్టీ, బిగ్రేడ్, లెగసీ, ప్రావిడెంట్, సెంచురీ, గోద్రెజ్ వంటి 230 నిర్మాణ సంస్థలతో ఒప్పందం చేసుకున్నాం. వీటిల్లో సుమారు 360 ప్రాజెక్టŠస్ ఉంటాయి. లక్ష చ..అ. ఫ్లాట్స్, 10 వేల వరకు ఓపెన్ ప్లాట్లుంటాయి. హైదరాబాద్‌లో సుమారు 50 మంది డెవలపర్లు, 120 ప్రాజక్ట్స్ ఉంటాయి. హనీగ్రూప్తో డెవలపర్లకు లాభమేంటంటే? త్వరగా ఫ్లాట్లను విక్రయించి పెడుతుంది. దీంతో నిర్మాణ సంస్థలకు ఆదాయం త్వరగా వస్తుంది. కొనుగోలుదారులకు ఏం లాభమంటే? హనీ గ్రూప్‌లో ఏజెంట్లుండరు. అందరూ కంపెనీ సొంత ఉద్యోగులే. దీంతో ధర తగ్గుతుంది. ఏడాదిలో వెయ్యి మంది ఉద్యోగులు.. విశాఖపట్నం కేంద్రంగా 9 మంది ఉద్యోగులతో ప్రారంభమైన హనీగ్రూప్‌లో ప్రస్తుతం 304 మంది ఉద్యోగులున్నారు. వచ్చే ఏడాది నాటికి 1,000 మంది ఉద్యోగులను చేర్చాలన్నది లక్ష్యం. పెద్ద నోట్ల రద్దు తర్వాత చాలా వరకు నిర్మాణ సంస్థలు ఉద్యోగుల్ని తొలగిస్తే.. హనీగ్రూప్‌లో మాత్రం 5 బ్రాంచీల్లో కలిపి 240 మంది ఉద్యోగులను నియమించుకున్నాం. హనీగ్రూప్‌లో సుమారు 2 వేల మంది కస్టమర్లున్నారు. 95 శాతం కస్టమర్లు తొలిసారి గృహ కొనుగోలుదారులే. ఇంటీరియర్ ప్లాంట్.. ప్రస్తుతం అచ్యుతాపురంలో సొంతంగా రెండు ప్రాజెక్ట్‌లను నిర్మిస్తున్నాం. 800 గజాల్లోని శ్రీనివాసం ప్రాజెక్ట్‌లో 15 ఫ్లాట్లుంటాయి. 4 వేల గజాల్లోని మరో ప్రాజెక్ట్‌లో 80 ఫ్లాట్లుంటాయి. గతేడాది హనీగ్రూప్ రూ.3.5 కోట్ల టర్నోవర్‌కు చేరుకుంది. ఈ ఏడాది రూ.5 కోట్ల వ్యాపారాన్ని లకి‡్ష్యంచాం. ఇటీవలే యాపిల్ పేరిట ఇంటీరియర్ కంపెనీని ప్రారంభించా. విశాఖపట్నంలోని గంభీరంలో ఫ్యాక్టరీని నిర్మిస్తున్నాం. 1,200 గజాల్లోని ఈ ప్లాంట్‌లో వార్డ్ రోబ్స్, మాడ్యులర్ కిచెన్స్, టీవీ యూనిట్స్ వంటి ఇంటీరియర్‌ను తయారు చేస్తాం. -
ఆస్తి కోసం తల్లిదండ్రులపై గొడ్డలితో దాడి
-
ఆస్తి కోసం భార్యను హత్య చేసిన భర్త
-
'ఈ- ఆక్షన్' ...మీ కోసమే!!
సాక్షి, పర్సనల్ ఫైనాన్స్ విభాగం:శ్రీకృష్ణ, నీలిమ అందినంత రుణం దొరుకుతోంది కదా అని తాహతుకు మించి అప్పు చేసి ఇల్లు కొన్నారు. కానీ తరవాత పరిస్థితులు తిరగబడి ఆ ఇంటి రుణానికి ఈఎంఐలు చెల్లించలేని పరిస్థితిలో పడిపోయారు!!. రామరాజుకు సొంత కంపెనీ ఉంది. ఆదాయం బాగా వస్తున్నపుడు కంపెనీ విస్తరణ కోసం రుణాలు తీసుకున్నాడు. తను అప్పటికే కొనుగోలు చేసిన నాలుగైదు ఫ్లాట్లను కూడా సెక్యూరిటీగా తనఖా పెట్టాడు. కాకపోతే ఆ వ్యాపారంలో పోటీ పెరిగి లాభాలు పడిపోయాయి. ఈఎంఐలు చెల్లించలేని పరిస్థితిలో పడ్డాడు!!. ఇలా... కారణాలు ఏవైనా కావచ్చు. వ్యక్తులు ఎవరైనా కావచ్చు. ఈ మధ్య రుణాలు తీసుకున్న వారు డిఫాల్ట్ అవుతున్న సందర్భాలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. పైపెచ్చు బ్యాంకులు ఇంతకుముందు చూసీ చూడనట్లు వ్యవహరించేవి. ఏడాది రెండేళ్లపాటు రుణాల వాయిదాలు చెల్లించకపోయినా పెద్దగా పట్టించుకునేవి కావు. కానీ మారిన నిబంధనలు, పెరిగిన నిఘా, ప్రభుత్వ చర్యల నేపథ్యంలో ఇపుడవి చాలా కఠినంగా వ్యవహరిస్తున్నాయి. వాయిదాలు చెల్లించటంలో విఫలమైన డిఫాల్టర్లకు నోటీసులిస్తూ... వారు తనఖా పెట్టిన ఇళ్లను, ఇతర ఆస్తులను వేలానికి పెడుతున్నాయి. ఈ మధ్య పత్రికల్లో ఇలాంటి వేలాలకు సంబంధించిన ప్రకటనలు కూడా పెరిగాయి. ఇలా ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు, అస్సెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీలు, ఆర్థిక సంస్థలు వేలానికి పెడుతున్న ఆస్తుల సంఖ్య పెరుగుతోంది. దీనికి కారణాలు ఏమైనా... కాస్త తక్కువలో ఇళ్లు కొనుక్కుని సెటిల్ అవుదామనుకునే ఈ డిస్ట్రెస్డ్ సేల్ ఒక మంచి అవకాశమనే చెప్పాలి. ఈ వేలానికి సంబంధించిన ప్రక్రియ అంతా ఆన్లైన్లోనే పూర్తవుతోంది. ఔత్సాహిక కొనుగోలుదారులకు ఇది మరింత కలసివచ్చే అంశం. ఈ నేపథ్యంలో అసలు ఇలాంటి ఇళ్లను కొనొచ్చా? కొంటే లాభమా... నష్టమా? కొనేముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? ఇవన్నీ తెలియజేసేదే ఈ ‘ప్రాఫిట్ ప్లస్’ ప్రత్యేక కథనం... అన్ని రకాల ఆస్తుల వేలం బ్యాంకులు వేలం వేసే వాటిలో అన్ని రకాల ఆస్తులూ ఉంటున్నాయి. ఎస్బీఐ ఇటీవలే అతిపెద్ద ఎలక్ట్రానిక్(ఈ) వేలాన్ని నిర్వహించింది. ఇందులో ఒకేసారి 1,000 ఆస్తులను వేలానికి పెట్టింది. ఇందులో ఇళ్లు, వాణిజ్య భవనాలు (ఆఫీసులు, షాపులు) ఫ్యాక్టరీ బిల్డింగులు ఉన్నాయి. వేలం వేసింది ఏ ప్రాంతం, ఎంత విస్తీర్ణంలో ఉన్నది తదితర అంశాలను బట్టి ధర ఉంటుంది. ఉదాహరణకు ముంబై శాంతాక్రజ్ ఈస్ట్‌లో రెండు పడకగదుల ఇళ్లను రూ.2 కోట్ల రిజర్వ్ ధరకు వేలానికి పెట్టింది. నవీ ముంబైలో ఫ్లాట్ లేదా షాపు ధర రూ.8.5 కోట్లు. పాతవి, తక్కువ విస్తీర్ణంతో ఉన్న ఫ్లాట్లు లేదా షాపులు, చిన్న పట్టణాల్లో ఆస్తులు రూ.50 లక్షల్లోపే ఉంటున్నాయి. ధరలూ ఆకర్షణీయమే! కొన్ని సందర్భాల్లో వేలంలోకి వచ్చేవి ఆకర్షణీయ ధరల్లోనే ఉంటున్నాయి. ఎందుకంటే తమకున్న బకాయిలను వసూలు చేసుకుంటే చాలనుకుని బ్యాంకులు ధర తగ్గించి అమ్మకానికి పెడుతుంటాయి. వేలానికి ఉంచే అన్ని ఆస్తులపై బ్యాంకులు లాభాలను ఆశించలేని పరిస్థితి ఉంటుంది. పైగా ఇది బ్యాంకు, కొనుగోలుదారుల మధ్య నేరుగా జరిగే లావాదేవీ. మధ్యలో బ్రోకర్లు ఉండరు. తమ వద్ద నమోదైన వ్యాల్యూయర్ల సిఫారసుల మేరకు బ్యాంకులు వేలం ధరను ఖరారు చేస్తుంటాయి. సాధారణంగా మార్కెట్ ధర కంటే 10–15 శాతం తక్కువే ఉంటుంది. ఇందులో రిజర్వ్ ధర ఉంటుంది. బ్యాంకులు ఇంత కంటే తక్కువ ధరకు విక్రయించవని అర్థం. ఆ ధరకు అదనంగా కొంత కోట్ చేస్తూ వేలంలో పాల్గొనవచ్చు. చివరికి ఎక్కువ కోట్ చేసినవారు విజేతగా నిలుస్తారు. బిడ్డింగ్ ప్రక్రియ ఎలా...? వేలం ప్రక్రియలో పాల్గొని బిడ్డింగ్ వేయడం చాలా సులభం. ఆక్షన్ సైట్లు, స్థానిక వార్తా పత్రికల ద్వారా ఈ–వేలం గురించి తెలుసుకోవచ్చు. బ్యాంక్ ఈ ఆక్షన్స్, ఫోర్క్లోజర్ ఇండియా, ఈఆక్షన్.ఎన్పాసోర్స్ తదితర పోర్టల్స్ పలు బ్యాంకుల తరఫున వేలం ప్రక్రియను నిర్వహిస్తుంటాయి. కెనరా బ్యాంకు అయితే ‘కెనరాబ్యాంకు. ఆక్షన్టైగర్.నెట్’లో వేలం వేస్తుంటుంది. ప్రతి ప్రాపర్టీ సమాచారం అక్కడే అందుబాటులో ఉంటుంది. బిడ్డింగ్‌ను కూడా అక్కడే సమర్పించొచ్చు. బిడ్ డాక్యుమెంట్‌లోనే ప్రాపర్టీకి సంబంధించి రుణ బకాయిలు తదితర సమాచారం తెలుసుకోవచ్చు. ఈ పోర్టల్స్‌లో తమ పేరు, ఇతర కేవైసీ వివరాలతో నమోదు చేసుకున్న తర్వాతే బిడ్‌కు అర్హత లభిస్తుంది. పైగా వేలంలో పాల్గొని బిడ్ వేసే వారు ప్రాపర్టీ రిజర్వ్ ధరలో 10% చెల్లించాల్సి ఉంటుంది. ఏ తేదీన, ఏ సమయంలో ఆస్తిని వేలం వేస్తున్నదీ బ్యాంకు తెలియజేస్తుంది. అలాగే, ప్రత్యక్షంగా ఆ ప్రాపర్టీని చూసుకునేందుకూ ఒక తేదీని నిర్ణయిస్తుంది. ఆ రోజున వెళ్లి ప్రాపర్టీని చూసుకోవచ్చు. వేలం గెలుచుకున్న వారు విక్రయ ధరలో 25 శాతాన్ని అదే రోజు చెల్లించాల్సి ఉంటుంది. మిగిలిన మొత్తాన్ని తదుపరి 15 రోజుల్లో చెల్లించేయాలి. దీనికి కావాలనుకుంటే రుణం తీసుకోవచ్చు. దీంతో ఆస్తిపై హక్కులను కొనుగోలుదారులకు బ్యాంకులు బదలాయిస్తాయి. సొసైటీ నిరంభ్యంతర పత్రాన్ని (ఎన్వోసీ) కూడా అందిస్తాయి. పరిశీలించాల్సినవి ఇవీ... బ్యాంకుల ఈ వేలంలో పాల్గొని ఆస్తిని సొంతం చేసుకునే వారు ఓ న్యాయవాది సహకారం తీసుకోవడం ద్వారా టైటిల్ పరంగా సమస్యలు ఎదురు కాకుండా జాగ్రత్తపడొచ్చు. ఆ ఆస్తిపై ఏవైనా పెండింగ్‌లో వివాదాలున్నాయా అన్నది తెలుసుకోవచ్చు. ఇక కొనుగోలు చేస్తున్న ఆస్తికి సంబంధించి నీటి పన్ను, ఆస్తి పన్ను బకాయిలు ఏవైనా ఉన్నదీ తెలుసుకోవాలి. బ్యాంకులు పేర్కొన్న నిర్ణీత గడువులోపే చెల్లింపులన్నీ జరిగేలా చూసుకోవాలి. ఇక వేలాన్ని రద్దు చేసే సందర్భాలు కూడా ఉంటాయి. నోటీసు ఇచ్చిన తేదీ నుంచి 30 రోజుల తర్వాత బ్యాంకులు వేలం వేస్తాయి. ఈలోపు బకాయిదారుడు తాను తీసుకున్న రుణాన్ని చెల్లించేస్తే బ్యాంకులు రద్దు నిర్ణయం తీసుకుంటాయి. కొన్ని సొసైటీలు అయితే తొలి తిరస్కరణ హక్కు కింద తామే ఆస్తిని కొనుగోలు చేయవచ్చు. ప్రతికూలతలూ ఉంటాయి! ఆస్తిని ‘ఉన్నది ఉన్నట్టుగా’ అనే స్థితిలో బ్యాంకు అమ్మకానికి పెడుతుంది. అంటే ఆ ప్రాపర్టీకి సంబంధించిన టైటిల్ విషయంలోనూ, ఇతరత్రా న్యాయపరమైన వివాదాలు ఏమైనా ఉంటే వాటికి బ్యాంకులు బాధ్యత వహించవు. పైపెచ్చు సదరు ఆస్తికి సంబంధించి పన్నులు, ఇతరత్రా అంశాల్లో స్థానిక సొసైటీలకు, మున్సిపాలిటీలకు ఏవైనా బకాయిలున్నా సరే వాటిని బ్యాంకు చెల్లించదు. వేలానికి పెట్టే ఇళ్లు కొత్తవి కావు కనక మరమ్మతులు వంటివేవైనా చేయించాల్సి ఉంటే వాటిని కొనుగోలుదారే చేయించుకోవాల్సి ఉంటుంది. మొత్తంగా చూస్తే ఆ ఇంటికి సంబంధించి వివాదాలు, మరమ్మతులు, బకాయిల వంటి అన్నిటికీ కొనుగోలు చేసిన వారే బాధ్యులవుతారు. వారే పరిష్కరించుకోవాల్సి ఉంటుంది. -
కొత్త ఇల్లు కొందామా? రీసేల్ చూద్దామా?
సొంతిల్లు.. ప్రతి ఒక్కరి జీవితంలో ప్రధాన లక్ష్యం. గృహ కొనుగోలు నిర్ణయం అంత తేలికైందేమీ కాదు. ప్రాంతం ఎంపిక నుంచి మొదలు పెడితే బడ్జెట్, నిర్మాణ నాణ్యత, నిర్మాణ సంస్థ నేపథ్యం, కొనుగోలుదారుని అవసరాల వరకూ ప్రతి ఒక్కటీ ప్రధానమైందే. సమాజంలో గుర్తింపు కోసం కొందరు ఇల్లు కొంటే.. మరికొందరేమో పెట్టుబడి కోసం, ట్యాక్స్ నుంచి మినహాయింపుల కోసం కొంటుంటారు. కారణాలేవైనా ఇల్లు కొనడమనేది ఓ నిరంతర ప్రక్రియ. మరి, ఈ ప్రక్రియలో ఎలాంటి ఇల్లు కొంటే సొంతింటి యోగం మరింత తేలికవుతుంది? అంటే కొత్త ఇల్లు కొనడమా? లేక సెకండ్ హ్యాండ్ ఇల్లు బెటరా? అని! సాక్షి, హైదరాబాద్: దేశంలో కొత్త గృహాలకు డిమాండ్ ఎంత ఉందో రీసేల్ లేక సెకండ్ హ్యాండ్ ఇళ్లకూ అంతే ఉంది. కొత్త ఇల్లు నేరుగా డెవలపర్ నుంచి కొనుగోలు చేస్తే.. రీసేల్ ప్రాపర్టీలను పాత యజమాని నుంచి కొనుగోలు చేస్తాం. కొత్త లేక పాత ప్రాపర్టీ ఏదైనా కానీ ఎంపికలో ప్రధానమైంది బడ్జెట్. దీంతో పాటూ మన జీవన శైలి, అవసరాలు, అభిరుచులు, ఇంటీరియర్, ఇంధన సామర్థ్యాలు వంటివి కూడా ప్రాపర్టీ ఎంపికలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. ప్రధాన నగరంలో సెకండ్సే బెటర్.. ఉండేందుకు ఇల్లు కొనుగోలు చేసినవారెవరైనా సరే ఎప్పటికీ ఒకే ఇంట్లో ఉండాలనుకుంటారు. ఫ్యామిలీ పెరిగినప్పుడు లేదా తగ్గినప్పుడు గానీ ఉద్యోగ రీత్యా, కుటుంబ అవసరాల రీత్యా ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చినప్పుడు గానీ ఆర్ధిక అవసరాల కోసం ఇంటిని విక్రయించాలనుకుంటారు. విద్యా, వైద్యం, వినోదం ఇతరత్రా అవసరాలకు రోజూ ప్రధాన నగరంతో అనుబంధం ఉంటుంది. ఇలాంటి ప్రాంతాల్లో కొత్త గృహాలు దొరకడం కొంత కష్టం. ఒకవేళ దొరికినా ధర ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి ఏరియాల్లో సెకండ్ హ్యాండ్ ఇల్లును కొనుగోలు చేయడం బెటర్. అవసరమైతే దాన్ని కూల్చేసి మన అవసరాలు, బడ్జెట్‌కు తగ్గట్టుగా మళ్లీ కొత్త గృహాన్ని నిర్మించుకోవచ్చు. అయితే ఇది కొంత డబ్బు, సమయంతో ముడిపడి ఉన్న అంశం. అందుకే ప్రధాన నగరంలో, అభివృద్ధి చెందిన ప్రాంతంలో రీసెల్ ప్రాపర్టీలను ఎంచుకోవటమే ఉత్తమమనేది నిపుణుల సూచన. నిర్వహణ భారం అనుకుంటే కొత్తవే ఉత్తమం.. కొత్త గృహాలతో పోలిస్తే రీసేల్ ప్రాపర్టీలు కొంత తక్కువ ధరకే లభ్యమవుతాయి. కానీ, రిజిస్ట్రేషన్ ఫీజు, ప్రాపర్టీ బదిలీ రుసుము, వినియోగ చార్జీలు వంటివి చెల్లించాల్సి ఉంటుంది. పైగా సెకండ్ హ్యాండ్ హోమ్స్ నిర్వహణ భారం ఎక్కువగా ఉంటుంది. పైగా మన అవసరాలు, అభిరుచులకు తగ్గట్టుగా ఇంటిని రిపేర్ చేయించాల్సి ఉంటుంది. ఆయా ఖర్చులన్నింటిని కలిపి చూస్తే మాత్రం రీసేల్ ప్రాపర్టీ కంటే అభివృద్ధి చెందే ప్రాంతంలో, శివారు ప్రాంతంలోని కొత్త గృహాల ధరలే తక్కువగా ఉంటాయి. ♦ పర్యావరణ స్పృహ, ఇంధన నిర్వహణ సామర్థ్యాలు, కరెంట్ బిల్లుల మీద అవగాహన ఉంటే మాత్రం కొత్త ఇల్లు కొనడమే ఉత్తమం. ఎందుకంటే కొత్త గృహాలు ఎనర్జీ ఎఫీషియన్సీ నిబంధనలకు అనుగుణంగా ఉంటాయి. ఇంట్లోనే ఉపకరణాలతో పాటూ గోడలు, పైకప్పులు, కిటికీలు, తలుపులు కూడా ఇంధన ప్రమాణాలకు అనుగుణంగా ఉంటాయి. దీంతో విద్యుత్ బిల్లు తక్కువగా రావటంతో పాటూ నిర్వహణ వ్యయం కూడా తక్కువ అవుతుంది. రీసేల్ ప్రాపర్టీలను కూడా ఎనర్జీ ఎఫీషియన్సీ ప్రమాణాలకు అనుగుణంగా మార్చవచ్చు. కానీ, ఆయా పాత గృహాలు దశాబ్ధాల క్రితంనాటి ప్రమాణాలకు అనుగుణంగా నిర్మితమైనవి. వాటిని ఇప్పటి ప్రమాణాలను అనుగుణంగా మార్చాలంటే ఖర్చు ఎక్కువవుతుంది. కొత్త ఇళ్లలో గాలి, వెలుతురు బాగా వస్తాయి. దీంతో నివాసితులు ఆరోగ్యంగా ఉంటారు. రీసేల్ కొనేముందు.. రీసేల్ ప్రాపర్టీ కొనుగోలు చేసేటప్పుడు పాత యజమాని నేపథ్యం, స్థలానికి సంబంధించిన డాక్యుమెంట్లు, టైటిల్, అనుమతి పత్రాలు, గృహ రుణానికి సంబంధించిన పత్రాలు వంటి వాటిని స్వయంగా పరిశీలించుకోవాలి. ఏమాత్రం అవగాహన లేకపోయినా లేక తప్పిందం జరిగినా సరే మొదటికే మోసం వస్తుంది. అదే కొత్త ఇల్లు కొనుగోలు చేస్తే ఈ ప్రక్రియంతా డెవలపరే పూర్తి చేసేస్తాడు. ♦ పాత ఇళ్లల్లో ఎలక్ట్రిక్ వైర్లు, ఉపకరణాలు, బాత్రూమ్ ఫిట్టింగ్స్ వంటి వాటిల్లో సమస్య వస్తుంటుంది. అదే కొత్త గృహాల్లో బ్రాండెండ్, నాణ్యమైన ఉత్పత్తుల వినియోగంతో ఎక్కువకాలం మన్నికగా ఉంటాయి. పైగా పాత ఇళ్లలో వాస్తు మార్పులు, గదుల్లో చిన్న చిన్న మార్పులు చేయాలంటే ఇబ్బందులుంటాయి. అదే కొత్త గృహాల్లో నిర్మాణంలో ఉన్నప్పటి నుంచే డెవలపర్‌కు మన అవసరాలకు తగ్గట్టుగా నిర్మాణంలో మార్పులు చేసుకునే వీలుంటుంది. -
సచివాలయం వద్ద వృద్ధురాలి బైఠాయింపు
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రికి గోడు చెప్పుకోవడానికి వస్తే అధికారులు అవకాశం కల్పించలేదని ఓ వృద్ధురాలు సోమవారం సచివాలయం ఐదో బ్లాక్ ముందు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేసింది. తాను జీవించి ఉండగానే చనిపోయినట్టు కాగితాలు సృష్టించి తన కుమారులు ఆస్తి రాయించుకున్నారని తుళ్లూరు మండలం పెదపరిమికి చెందిన బత్తినేని నరసమ్మ అనే వృద్ధురాలు ఆవేదన వ్యక్తం చేసింది. దీనికి స్థానిక రెవెన్యూ అధికారులు, ముఖ్యంగా వీఆర్వో సహకరించాడని కన్నీటిపర్యంతమైంది. వీఆర్వో, తన కుమారులు చేసిన మోసంపై ఆర్డీవోకు ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేకుండా పోయిందని, తన పాస్‌బుస్ కూడా ఇవ్వడం లేదని విలపించింది. తహసీల్దార్ కూడా తన కుమారులకే మద్దతు తెలుపుతున్నారని, పోలీసులను ఆశ్రయించినా నిరాశే ఎదురైందని ఆవేదన చెందింది. ఈ వయసులో తనకు కనీసం ఉండటానికి ఇల్లు, తినడానికి తిండి కూడా లేదని, తన కుమారులు రాయించుకున్న 71 సెంట్ల భూమే ఆధారమంటూ వెల్లడించింది. ముఖ్యమంత్రిని కలిసి తన గోడు చెప్పుకోవడానికి వస్తే అధికారులు అవకాశం కల్పించలేదని తెలిపింది. సచివాలయం ముందు వృద్ధురాలు బైఠాయించడంతో భద్రతా సిబ్బంది వెంటనే ఆమెను పంపించి వేశారు. -
కూతురు కోసం ఉన్నదంతా ఇచ్చేశారు
కోజికోడ్, కేరళ : కడుపున పుట్టిన బిడ్డలు వారి కాళ్ల మీద వారు నిలబడి...స్వతంత్రంగా బతికితే చాలనుకుంటారు ఏ తల్లిదండ్రులైన. ఏ లోపాలు లేకుండా ఉన్న పిల్లల గురించే ఇంతలా ఆలోచిస్తే...మరి శారీరకంగా, మానసికంగా సరిగా ఎదగని పిల్లల పరిస్థితి ఏంటి...? కన్నవారు బతికున్నంతకాలం వారికి ఎలాంటి ఢోకా లేదు...మరి తల్లిదండ్రుల తదనంతరం వారి పరిస్థితి...? ఇదే ప్రశ్నకేరళకు చెందిన విశ్రాంత ఉపాధ్యాయ దంపతులు ఎన్ కమలాసన్(77), సరోజిని(71) దంపతులను చాలాకాలం నుంచి వేధిస్తుంది. ఎందుకంటే వారి ఏకైక కుమార్తె ప్రియ(37) కూడా బుద్ధిమాంద్యంతో బాధపడుతుంది. తల్లి సాయం లేకుండా ఏ పని చేసుకోలేదు ప్రియ. అలాంటిది రేపు మేము మరణిస్తే మా కూతురు ప్రియ పరిస్థితి ఏంటనే ప్రశ్నకమలాసన్ దంపతులను ప్రశాంతంగా ఉండనివ్వడం లేదు. పోని బంధువులకు ప్రియ బాధ్యత అప్పగిద్దామంటే...ఆస్తి కోసం బంధువులు ఇలాంటి మానసిక వికలాంగులను కనికరం లేకుండా చంపేసిన సంఘటనలు తమ పరిసరాల్లో జరగడంతో ఆ నిర్ణయాన్ని తీసుకోలేకపోయారు. మరి దారేంటి అని ఆలోచిస్తున్న తరుణంలో వారికో ఉపాయం తట్టింది. ఆలోచన వచ్చిందే తడవుగా తన నిర్ణయాన్ని ప్రభుత్వానికి తెలియజేసారు. ప్రభుత్వం కూడా వారి నిర్ణయానికి ఆమోదం తెలపడంతో కొండంత భారం తీరినట్లయిందంటున్నారు కమలాసన్. ఇంతకు ఈ 77 ఏళ్ల వృద్ధుడు తీసుకున్న నిర్ణయం ఏంటంటే తన కూతుర్ని సంరంక్షించాలనే షరతుతో తనకున్న ఇళ్లలో ఒక ఇంటిని ప్రభుత్వం వారికి ఇచ్చేశాడు. ప్రభుత్వం ఆ ఇంటిని మానసిక వికలాంగుల సంరక్షణా కేంద్రంగా మార్చాలని కోరాడు. అప్పుడు తన కూతురుతో పాటు మరికొందరు మానసిక వికలాంగులు ఆ ఇంట్లో ఉంటారు. వారి బాధ్యతను ప్రభుత్వమే తీసుకుంటుందని భావించి ఈ నిర్ణయాన్ని తీసుకున్నాడు కమలాసన్. వెంటనే తన నిర్ణయాన్ని కేరళ ప్రభుత్వానికి తెలియజేసాడు. కేరళ సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ కే కే శైలజ వారి నిర్ణయానికి మద్దతు ఇవ్వడమే కాక...మెచ్చుకున్నాడు కూడా. మంత్రి ఆదేశం మేరకు సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వారు కొల్లమ్ జిల్లాలోని కాయిలి గ్రామంలో 83 సెంట్ల విస్తీర్ణంలో ఉన్న కమలాసన్ ఇంటిని స్వాధీనపర్చుకుని దాన్ని మానసిక వికలాంగుల సంరక్షణా కేంద్రంగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు. ప్రసుత్తం ఈ ఇంటి మార్కెట్ విలువ 3 కోట్ల రూపాయలు. పది మందికి సరిపోయేలా ఉన్న ఈ ఇంటిని 50 మందికి సరిపోయేలా మారుస్తున్నారు. అంతేకాక ఈ ఇంటికి ‘ప్రియా మానసిక వికలాంగుల సంరక్షణా కేంద్రం’గా నామకరణం చేసారు. ప్రభుత్వం తన కోరికను మన్నిచండంతో కృతజ్ఞతగా కోజికోడ్‌లో ఉన్న 4 కోట్ల రూపాయల విలువచేసే 15 సెంట్ల స్థలంతో పాటు మరో రెండు ఇళ్లను కూడా గవర్నమెంట్‌కు చెందెటట్లు విల్లు రాసాడు కమలాసన్. ఈ విషయం గురించి కమలాసన్ ‘ప్రభుత్వం నా షరతుకు అంగీకారం తెలపడంతో పెద్ద సమస్య తీరినట్లుగా ఉంది. ధనవంతులకు నేను చేసే విన్నపం ఏంటంటే మీ ఇళ్లలో కూడా బుద్ధిమాంద్యం ఉన్న పిల్లలు ఉంటే మీరు కూడా మీ ఇంటిని మానసిక వికలాంగుల సంరక్షణ కేంద్రాలుగా మార్చండి. ఇలా చేయడం వల్ల చాలామంది పేదవారికి కూడా సహాయం చేసినవారవుతార’న్నాడు. 2015లో కేరళ సెక్యూరిటీ మిషన్‌లో భాగంగా చేపట్టిన సర్వేలో రాష్ట్ర జనాభాలో దాదాపు 2.21శాతం మంతి మానసిక, శారీరక వికలాంగులు ఉన్నట్లు తెలిసింది. కేరళ మెంటల్ హెల్త్ అథారిటి సెక్రటరీ డా. జయప్రకాశ్ కమలాసన్ చేసిన పనిని మెచ్చుకోవడమే కాక కమలాసన్ ఎందరికో ఆదర్శంగా నిలిచాడని పొగిడాడు. -
మాంసం కూర వండలేదని తల్లిని చంపాడు
బడేపురం(తాడికొండ): మాంసం కూర వండలేదని మద్యానికి బానిసైన ఓ కొడుకు కన్నతల్లిని కత్తితో పొడిచి చంపిన ఘటన గుంటూరు జిల్లా తాడికొండ శివారు బడేపురం గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బడేపురం గ్రామానికి చెందిన బెజ్జం కిషోర్ గత కొంత కాలం నుంచి మద్యానికి బానిసై ఇంటి వద్దే ఉంటున్నాడు. అతని ప్రవర్తన సరిగా లేకపోవడంతో భార్య అతన్ని వదిలేసి ఇద్దరు పిల్లలను తీసుకుని వెళ్లిపోయింది. దీంతో తల్లిదండ్రుల ఆసరాతో జీవిస్తున్నాడు. వృద్ధుడైన తండ్రి వెంకటేశ్వరరావు తాడికొండలో ఆర్ఎంపీగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఆదివారం ఉదయం బయటికెళ్లిన కిషోర్ మద్యం తాగి 11 గంటల సమయంలో ఇంటికి వచ్చాడు. మాంసం కూర వండలేదనే కారణంతో తల్లి బెజ్జం మరియమ్మ (70)తో వాగ్వాదానికి దిగాడు. ఆమె వంటకు ఏర్పాట్లు చేసుకుంటుండగా వెనుక నుంచి కూరలు తరిగే కత్తితో వీపుపై పొడిచాడు. దీంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలొదిలింది. విధి నిర్వహణలో భాగంగా బయటికి వెళ్లి వచ్చిన తండ్రి వెంకటేశ్వరరావు.. కుమారుడే ఈ ఘాతుకానికి పాల్పడటంతో నిశ్చేష్టుడయ్యాడు. ఘటనా స్థలాన్ని మంగళగిరి రూరల్ సీఐ మధుసూదనరావు పరిశీలించి వివరాలు నమోదు చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. తండ్రి వెంకటేశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. ఆస్తి ఇవ్వలేదనే చంపేశాడు.. ఆస్తి కోసమే తన కుమారుడు తల్లిని చంపేశాడని నిందితుడు బెజ్జం కిషోర్ తండ్రి వెంకటేశ్వరరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆస్తి కోసం నిత్యం వేధిస్తుండటంతో గతంలోనే పిల్లలకు పంపకాలు చేసి ఆస్తిని రాసిచ్చినట్టు చెప్పారు. అయితే మద్యానికి బానిసైన కొడుకు ఆస్తిని దుర్వినియోగం చేస్తాడనే ఉద్దేశంతో మనుమలు, మనుమరాళ్ల పేరిట ఆస్తిని రాసినట్టు వివరించారు. ఇంతలోనే తల్లిని ఇలా హత్యచేస్తాడని ఊహించలేదని ఆయన కన్నీరుమున్నీరయ్యారు. -
ఇషా అంబానీ సంపదెంతో తెలుసా..!
ముంబై : దేశ కార్పొరేట్ దిగ్గజం ముఖేశ్ అంబానీ ఏకైక కుమార్తె ఇషా అంబానీ వివాహం ప్రముఖ ఫార్మా ఇండస్ట్రియలిస్ట్ అజయ్ పిరమల్ కుమారుడు ఆనంద్ పిరమల్‌తో జరగనున్న సంగతి తెలిసిందే. ఈ డిసెంబర్లోనే వీరి పెళ్లి ఉంటుందని సన్నిహిత వర్గాల సమాచారం. దేశంలోనే అపర కుబేరుడిగా పేరున్న ముఖేశ్ అంబానీ కూతురి పెళ్లి కావడంతో.. ఇప్పుడు అంశంపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో ఇషా అంబానీ ఏం చేస్తుంటారు? ఆమె ఎక్కడ చదివారు వంటి వివరాల కోసం నెటిజన్లు వెతుకుతున్నారు. ముఖ్యంగా ఆమె పేరిట ఎంత ఆస్తి ఉందని ఆరా తీస్తున్నారు. ముఖేశ్, నీతా అంబానీలకు ముగ్గురు పిల్లలు. వారిలో ఇషా, ఆకాశ్ కవలలు కాగా అనంత్ చిన్నవాడు. మార్చిలో ఆకాశ్ నిశ్చితార్థం శ్లోకా మెహతాతో జరిగిన విషయం తెలిసిందే. ఇక, ఇషా విషయానికొస్తే.. 1990లో జన్మించిన ఇషా.. ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుకున్నారు. ఆ తర్వాత ప్రఖ్యాత యేల్ యూనివర్సిటీ నుంచి డిగ్రీ పొందారు. ప్రస్తుతం స్టాన్ఫోర్డ్ బిజినెస్ స్కూల్లో ఎంబీఏ చేస్తున్నారు. 2008లో ఫోర్బ్స్ ప్రకటించిన యువ బిలియనీర్ల జాబితాలో ఇషా రెండో స్థానంలో నిలవడంతో.. అప్పటినుంచి ఆమె పేరు ప్రముఖంగా వార్తల్లో నిలుస్తూ వస్తోంది. దేశీ టెలికాం రంగంలో సంచలనం సృష్టించిన రిలయన్స్ జియో ఆలోచన ఇషాదే. రిటైల్ రంగంలోనూ రిలయన్స్ సేవలను విస్తరించేందుకు ‘ఎజియో’ ప్రారంభించడంలో ఇషా కీలక భూమిక పోషించారు. 26 ఏళ్ల ఇషా ప్రస్తుతం ఆసియాలోనే శక్తివంతమైన మహిళా వ్యాపారవేత్తల్లో 12వ స్థానంలో ఉన్నారు. ఇక, ఇషా నికర సంపద విలువ రూ. 4,710 కోట్లు అని 2008లో ఫోర్బ్స్ మ్యాగజీన్ వెల్లడించింది. అప్పటినుంచి అధికారికంగా ఇషా ఆస్తి వివరాలు ఏవీ బహిర్గతం కాలేదు. ఆ జాబితా విడుదలై పది సంవత్సరాలు గడుస్తుండటంతో.. మారిన మార్కెట్ విలువ ఆధారంగా ఆమె ఆస్తి మరింత భారీగా పెరిగి ఉంటుందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. -
ఆస్తి ఇవ్వకపోతే అంతం చేస్తామంటున్నారు..
సాక్షి, అమరావతిబ్యూరో/ గాంధీనగర్: ‘మచిలీపట్నం ఎంపీ కొనకళ్ల నారాయణ, ఆయన బంధువు పామర్తి అనిల్‌కుమార్ నుంచి నా కుమారుడు రాంకుమార్ కుటుంబానికి ప్రాణహాని ఉంది. నా భర్త పేరుతో ఉన్న 9 ఎకరాలు, పెద్ద కుమారుడి పేరుతో ఉన్న 22 ఎకరాలను తక్కువ ధరకు అమ్మాలన్న వారి ఒత్తిడికి మేం తలొంచకపోవడంతో ఐదు రోజుల కిందట పోలీసులు నా కుమారుడు, కోడలు రజనీతో పాటు ఇద్దరు మనవళ్లనూ తీసుకెళ్లారు.. మాకు మీరే దిక్కు’ అంటూ ఎన్టీఆర్ మొదటి భార్య బసవతారకం సమీప బంధువు అయిన కాట్రగడ్డ శివలీల ప్రజా సంకల్ప యాత్రలో వైఎస్ జగన్‌కు మొరపెట్టుకున్నారు. ‘నేను పోలీస్‌స్టేషన్‌కెళ్లగా అనిల్‌కుమార్‌కు నా కుమారుడు బాకీ ఉన్నాడని, ఆ బాకీ తీర్చి వారిని తీసుకెళ్లండని పోలీసులు ఒత్తిడి చేసి.. మా వద్ద నుంచి రూ.50 లక్షలకు, రూ.25 లక్షలకు వేర్వేరుగా చెక్కులు తీసుకోవడంతో పాటు ఖాళీ బాండ్ పేపర్లపై సంతకాలు చేయించుకుని కూడా వారిని విడిచి పెట్టలేదు.. దీనిపై ఎస్పీకి మొరపెట్టుకుంటే.. వివాదాన్ని పరిష్కరించుకోకుంటే రాంకుమార్ ప్రాణాలకు ప్రమాదం ఉందని హెచ్చరించారు’ అంటూ కన్నీటిపర్యంతమయ్యారు. ఆమె కష్టాన్ని చూసి చలించిపోయిన జననేత.. ఆమె విషయంపై జిల్లా ఎస్పీతో మాట్లాడాలని, వారికి న్యాయం జరిగేలా చూడాలని పార్టీ నేతలకు సూచించారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌కు శివలీల ఫిర్యాదు విషయం సాక్షి టీవీలో ప్రసారమవడంతో రాంకుమార్ కుటుంబ సభ్యులను పోలీసులు విడిచిపెట్టారు. -
ఆస్తి రాసివ్వలేదని..అక్కపై అమానుష ఘటన
-
అవ్వా క్షమించు..
మాయమవుతున్నాడమ్మో... మనిషన్నవాడు... అవును..మానవత మాయమైపోతుంది. ముసలితనంలో కాళ్లు చచ్చుబడిపోయి.. మంచానికే పరిమితమైన ఆ ముదుసలిని చిత్ర హింసలు పెట్టడానికి అసలు మనసెలా వచ్చింది. కర్రతో కొడుతున్నా... బాధను పైకి వ్యక్త పరిస్తే.. మరలా కొట్టడం... రాక్షసత్వానికి నిదర్శనం. ఆస్తి తన కుమారుడి పేరున రాయాలని వృద్ధురాలిని హింసించడం పలువురిని కంటతడిపెట్టించింది. స్థానికులు స్పందించారు. ఈ హింసను చూసి తట్టుకోలేక.. వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో వారి బండారం బయటపడింది. రాజమహేంద్రవరం క్రైం : రాజానగరం మండలం, నరేంద్రపురం గ్రామానికి చెందిన పంతం పుష్పవతి భర్త దొరయ్య మృతి చెందాడు. పుష్పవతికి వారసులు లేరు. దీంతో తన చిన్నమ్మ కుమార్తె చెల్లెలయ్యే రాజమహేంద్రవరం హౌసింగ్ బోర్డు కాలనీలో నివసిస్తున్న ప్రగడ మంగాదేవి ఇంట్లో కొంత కాలంగా ఉంటోంది. పుష్పవతి పేరున రాజానగరం మండలం తోకాడ వద్ద ఒక ఇల్లు, స్థలం ఉండడంతో మంగాదేవి ఆమెను నరేంద్రపురం నుంచి తీసుకువచ్చి మూడు నెలలుగా తన కుమారుడి పేరున స్థలం, ఇల్లు రాయాలని చిత్రహింసలకు గురి చేస్తోందని స్థానికులు చెబుతున్నారు. కాళ్లు చేతులు చచ్చుబడిపోయి మంచానికే పరిమితమైన పుష్పవతిని సంతకం చేయాలంటూ నిత్యం జుట్టుపట్టుకొని కర్రతో కొడుతూ చిత్రహింసలకు గురి చేస్తున్న దృశ్యాలు హృదయ విదారకంగా ఉన్నాయి. కదలలేని స్థితిలో ఉండి కొట్టినప్పుడు బాధతో అరిస్తే మరలా ఆ ఆరుపులు ఆపేవరకూ కొట్టేదని స్థానికులు చెబుతున్నారు. ఈ సంఘటనను చుట్టుపక్కల వారు గమనించి వీడియో తీసి సోషల్ మిడియాలో పెట్టడంతో కలకలం మొదలైంది. స్థానికుల సహాయంలో వృద్ధురాలిని రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చారు. మహిళా సంఘాల నాయకులు మంగాదేవిని నిలదీసినప్పుడు ఆమె ఎవరో తెలియదని, అనాదను చేరదీసి చూస్తున్నామంటూ ఆమె బుకాయించేందుకు ప్రయత్నించింది. నిందితురాలు ప్రగడ మంగాదేవిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రాణాపాయ స్థితిలో పుష్పవతి ప్రస్తుతం ప్రభుత్వ ఆస్పత్రిలో పుష్పవతి ప్రాణాపాయ స్థితిలో ఉందని వైద్యులు తెలిపారు. మంచానికే పరిమితమైన ఆమెను కర్రతో కాళ్లమీద, డొక్కలలోను, కడుపు పైన కొట్టడంతో లోపల అవయవాలు కూడా దెబ్బతిన్నాయని వైద్యులు పేర్కొంటున్నారు. వృద్ధురాలి వంటి పై ఉన్న గాయాల ఆధారంగా చాలా కాలంగా చిత్రహింసలకు గురి చేస్తోందని వైద్యులు ధ్రువీకరించారు. ప్రస్తుతం పుష్పవతి పరిస్థితి ఆందోళన కరంగా ఉన్నట్లు వైద్యులు పేర్కొంటున్నారు. -
ఆస్తి కోసం మహిళ దారుణ హత్య
మెదక్ మున్సిపాలిటీ : ఆస్తి కోసం అన్న భార్యను తమ్ముడు కిరాతకంగా హతమార్చిన సంఘటన మెదక్ పట్టణంలో మంగళవారం సాయంత్రం చోటు చేసుకుంది. మెదక్ డీఎస్పీ వెంకటేశ్వర్లు, స్థానికుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణంలోని నవాబుపేట వీధికి చెందిన నంగి బీరమ్మ(44) భర్త ప్రకాశ్ గతంలో మరణించాడు. అయితే వీరికి సంతానం లేకపోవడంతో బీరమ్మ ఓ చిన్నారిని దత్తత తీసుకొని పెంచుకుంటోంది. కాగా బీరమ్మ భర్త ప్రకాష్ తమ్ముడు రాంసురేందర్కు ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. బీరమ్మ పేరున ఒక ఎకరంన్నర పొలం ఉంది. ఈ క్రమంలో తన పిల్లలను దత్తత తీసుకోకుండా ఎక్కడి నుండో పిల్లను తెచ్చుకొని సాకడం ఏంటని రాంసురేందర్ బీరమ్మతో తరచూ గొడవ పడేవాడు. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం ఇంటి ముందు బీరమ్మ తను దత్తత తీసుకున్న కూతురు తేజకు అన్నం తినిపిస్తోంది. ఇదే సమయంలో రాంసురేందర్ అక్కడికి కత్తితో వచ్చి బీరమ్మను నరికాడు. దీంతో బీరమ్మ రక్తం మడుగులో కొట్టుకొని అక్కడికక్కడే దుర్మరణం పాలైంది. వెంటనే రాంసురేందర్ అక్కడి నుండి పారిపోయాడు. విషయం తెలుసుకున్న స్థానికులు పట్టణ పోలీసులకు సమాచారం అందించారు. దీంతో మెదక్ డీఎస్పీ వెంకటేశ్వర్లు, పట్టణ సీఐ భాస్కర్, క్లూస్‌టీం సహాయంతో వివరాలు సేకరించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం మెదక్ ఏరియా ఆస్పత్రికి తరలించి, కేసు దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. తీవ్ర ఉద్రిక్తత: ఆస్తి కోసం అన్న భార్యను చంపేయడంతో నవాబుపేట వీధిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. రాంసురేందర్ తన పిల్లలను బీరమ్మ దత్తత తీసుకుంటే ఆమె ఆస్తి కూడా తనకే వచ్చేదని ఆశపడేవాడని స్థానికులు ఆరోపించారు. బీరమ్మ మృతి పట్ల స్థానికులు విచారం వ్యక్తం చేశారు. బీరమ్మ దుర్మరణంతో దత్తత తెచ్చుకున్న చిన్నారి అనా«థగా మారింది. ఆ చిన్నారిని చూసి స్థానికులు కంటతడిపెట్టారు. -
ఆస్తి కోసం కడతేర్చాడు
ఆస్తి కోసం దత్తపుత్రుడు ఉన్మాదిగా మారాడు. తనను పెంచి పెద్ద వాడ్ని చేసిన కుటుంబంలో విషాదాన్ని నింపాడు. వృద్ధులు అన్న కనికరం కూడా చూపించకుండా ఇద్దరు వృద్ధురాళ్లను అతి కిరాతకంగా గొంతు కోసి హతమార్చాడు. తిరువేర్కాడు సమీపంలో వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా ఆదివారం కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. సాక్షి, చెన్నై: చెన్నై శివారులోని తిరువేర్కాడు, పాదిరివేడు, మేట్టడు వీధిలో చెందిన ఏలుమలై (58) కుటుంబం నివాసం ఉంటోంది. వ్యాపార వేత్తగా ఉన్న ఆయనకు భార్య సబినా, ఇద్దరు పిల్లలు ఉన్నారు. వీరితోపాటు ఆ ఇంట్లో ఏలుమలై తల్లి రంగనాయకి (85), ఆమె సోదరి కృష్ణవేణి (70) కూడా ఉంటున్నారు. అప్పట్లో రంగనాయకి బాలకృష్ణన్‌ను దత్తతకు తీసుకుని పెంచి పెద్దవాడ్ని చేసింది. చెడు వ్యసనాల బారిన పడ్డ బాలకృష్ణన్ ప్రస్తుతం డ్రైవర్‌గా ఉన్నాడు. ఏలుమలై ఇంటికి సమీపంలోని తన కుటుంబంతో బాలకృష్ణన్ నివాసం ఉంటున్నాడు. తరచూ ఏలుమలై ఇంటి వద్దకు వచ్చి ఆస్తి కోసం రంగనాయకి, కృష్ణవేణి వద్ద బాలకృష్ణన్ గొడవ పడే వాడు. ఆస్తికోసం కోర్టులో కేసు సైతం వేశాడు. ఈ నేపథ్యంలో శుక్రవారం తన కుటుంబంతో ఏలుమలై హొసూర్కు వెళ్లాడు. దీంతో ఇంట్లో రంగనాయకి, కృష్ణవేణి మాత్రమే ఉన్నారు. ఈ ఇద్దరికి బంధువు శరవణన్ ఇంటి నుంచి టీ, కాఫీ, టిఫిన్ వచ్చేది. శనివారం కూడా శరవణన్ ఆ ఇంటికి వచ్చి వెళ్లాడు. ఆదివారం ఉదయాన్నే అక్కడికి రాగా, తలుపులు తెరిచే ఉండడంతో శరవణన్ ఆందోళనలో పడ్డాడు. లోనికి వెళ్లి చూడగా హాలులో రంగనాయకి రక్తపు మడుగులో గొంతు కోసిన స్థితిలో విగత జీవిగా పడి ఉండడాన్ని గుర్తించారు. అలాగే, బాత్రూంలో కృష్ణవేణి గొంతు కోసిన స్థితిలో మృతదేహంగా పడి ఉండడంతో ఆందోళనతో కేకలు పెట్టాడు. దీంతో ఇరుగుపొరుగు వారు అక్కడికి పరుగులు తీశారు. సమాచారం అందుకున్న తిరువేర్కాడు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. రంగనాయకి, కృష్ణవేణి మృతదేహాలను శవపంచనామాకు తరలించారు. పోలీసు శునకాలు ఆ ఇంటికి సమీపంలోని ఓ ప్రాంతం వద్దకు వెళ్లి ఆగాయి. దత్త పుత్రుడి కిరాతకం తొలుత ఈ హత్యలు ఉత్తరాది దొంగల ముఠా పనిగా పోలీసులు భావించారు. అయితే, ఆ ఇంటికి సమీపంలో ఉన్న సీసీ కెమెరాల వైర్లు తెంచి పడేసి ఉండడం, అక్కడున్న పరిస్థితిని బట్టి బాగా తెలిసిన వాళ్లెవరో పథకం ప్రకారం హతమార్చి ఉండవచ్చన్న నిర్ధారణకు పోలీసులు వచ్చారు. దీంతో విచారణను వేగవంతం చేశారు. అదే సమయంలో రంగనాయకి దత్తపుత్రుడు బాలకృష్ణన్ మీద అనుమానాలు బయలుదేరాయి. ఆస్తిలో తనకు పూర్తి స్థాయిలో న్యాయం చేయలేదని పదేపదే అతగాడు సాగించిన రాద్ధాంతం, కోర్టు కేసులు పోలీసుల దృష్టికి చేరాయి. దీంతో అతడి మీద అనుమానాలు బలపడ్డాయి. ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. తిరువేర్కాడు సమీపంలోని ఓ ప్రాంతంలో నక్కి ఉన్న బాలకృష్ణన్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతడి మోటార్‌సైకిల్‌లో రక్తపు మరకలతో దుస్తులు ఉండడంతో తమ దైన స్టైల్లో విచారించారు. ఆస్తిలో భాగం ఇవ్వలేదన్న ఆగ్రహంతో శనివారం అక్కడకు వచ్చినట్టు, గొడవ ముదరడంతో తానే హతమార్చినట్టుగా బాలకృష్ణన్ విచారణలో అంగీకరించాడు. నగల కోసం వచ్చిన దొంగలు ఈ హత్య చేసినట్టుగా చిత్రీకరించే యత్నం చేసి ఉండడం గమనార్హం. అతగాడి వద్ద నుంచి నగలను సైతం పోలీసులు స్వా«ధీనం చేసుకున్నారు. ఇతడికి ఉత్తరాదికి చెందిన ముగ్గురు వ్యక్తులు సహకరించినట్టు సమాచారం రావడంతో వారి కోసం గాలింపు సాగుతోంది. కాగా, పెంచి పెద్దవాడ్ని చేసిన కుటుంబంలోనే విషాదాన్ని నింపే విధంగా దత్త పుత్రుడు ఉన్మాదిగా మారి కిరాతకానికి పాల్పడడం ఆ పరిసరాల్లో కలకలం రేపింది. ఆ ఇంటి వద్ద పెద్ద ఎత్తున జనం తరలి రావడంతో వారిని కట్టడి చేయడం పోలీసులకు శ్రమగా మారింది. -
మోదీ తర్వాతి టార్గెట్ : ఇక వారికి దడదడే
నల్లధనంపై ఉక్కుపాదం మోపుతూ పెద్ద నోట్లను రద్దు చేసిన అనంతరం ప్రధాని నరేంద్రమోదీ మరో కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు. ప్రధాని తర్వాతి టార్గెట్‌గా స్థిరాస్తులపై ఎక్కువగా టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది. ఈ మేరకు ప్రాపర్టీ లావాదేవీలన్నింటిన్నీ తప్పనిసరిగా ఆధార్‌తో లింక్ చేసేలా నిర్ణయం తీసుకోబోతున్నారని కేంద్ర మంత్రి ఒకరు సంకేతాలు ఇచ్చారు. ఈ నిర్ణయం రియల్ ఎస్టేట్ వ్యాపారులు గుండెల్లో గుబేలు రేపుతోంది. ప్రాపర్టీ లావాదేవీలను ఆధార్‌తో లింక్ చేయడం తప్పనిసరి, అందులో ఎలాంటి సందేహం లేదంటూ కేంద్ర హౌజింగ్ మంత్రి హర్దీప్ పురి, ఈటీ నౌ ప్రతినిధితో చెప్పారు. దీంతో రియల్ ఎస్టేట్ రంగంలో కూరుకుపోయిన బ్లాక్‌మనీని బయటికి తీయవచ్చని, బినామి ప్రాపర్టీలపై కూడా ఉక్కుపాదం మోపవచ్చని పేర్కొన్నారు. ఆధార్‌తో ప్రాపర్టీ లావాదేవీలు జరుపడం ఎంతో ఉన్నతమైన ఆలోచని, కానీ తాను ఆ ప్రకటన చేయకూడదంటూ పేర్కొన్నారు. ఇప్పటికే బ్లాక్‌మనీని నిరోధించడానికి ఆధార్ లింక్‌ను ప్రతిదానికి తప్పనిసరి చేస్తూ వెళ్తోంది కేంద్ర ప్రభుత్వం. బ్యాంకు అకౌంట్లు, పాన్ కార్డులకు వంటి వాటికి ఆధార్ లింక్‌ను తప్పనిసరి చేసింది. ప్రాపర్టీ మార్కెట్‌ను కూడా ఇక ఆధార్ గూటి కిందకు తెచ్చేస్తుంది. బినామీ ప్రాపర్టీలపై తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని పలు మార్లు ప్రధాని నరేంద్రమోదీ హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఈ హెచ్చరికల్లో భాగమే ఆధార్ లింకేజీలో అని తెలుస్తోంది. అయితే ఏ ఆర్థిక వ్యవస్థ కూడా పూర్తిగా నగదు రహిత ఆర్థిక వ్యవస్థగా మారలేదని పురి చెప్పారు. ప్రతి దానికి ఆధార్ లింక్ చేస్తుండటంతో, దీనిపై ఇప్పటికే పలు పిటిషన్లు కోర్టులో విచారణలో ఉన్నాయి. -
ఆస్తి పంచమన్నాడని కుమారుడి హత్య
అడ్డాకుల: తనకు ఆస్తి పంచాలంటూ వేధిస్తున్న పెద్ద కుమారుడిని చిన్న కుమారుడితో కలసి హత్య చేశాడో తండ్రి. ఇద్దరూ కలసి మృతదేహాన్ని నదిలో పడేసేం దుకు వెళుతుండగా పోలీసులకు పట్టుబ డ్డారు. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లోని పరిగి రోడ్డులో నివాస ముండే రంగవల్లి రామస్వామి గౌడ్‌కు యాద గిరి (35), చిన్న కుమారుడు శ్రీని వాస్ సంతానం. ఇద్దరూ ఆటోలు నడుపుతున్నారు. అయితే, మద్యా నికి బానిసైన యాదగిరి.. తనకు ఆస్తి పంచివ్వాలని కొంతకాలంగా వేధిస్తున్నాడు. ఇంట్లో తరచూ గొడవలు జరుగుతుండటంతో రామస్వామి ఇద్దరు కోడళ్లు పుట్టింటికి వెళ్లిపో యారు. ఈ క్రమంలో బుధవారం ఉదయం ఇంటిని తన పేరిట రిజిస్ట్రేషన్ చేయాలని యాదగిరి తండ్రి తో గొడవకు దిగాడు. అందుకు ఆయన నిరాకరిం చడంతో తండ్రిని చితక బాదాడు. ఈ విషయాన్ని ఆయన చిన్నకుమారుడికి చెప్పాడు. దీంతో వారిద్దరూ కలసి యాదగిరిని హత్య చేయాలని నిర్ణయించుకున్నారు. రాత్రి పక్క గదిలో ఉన్న యాదగిరి తలపై తండ్రి రామస్వామి బలంగా కొట్టడంతో కింద పడిపోయాడు. వెంటనే చిన్న కొడుకు పెట్రోల్ పోయగా తండ్రి నిప్పంటించాడు. మంటలకు తాళలేక యాదగిరి అక్కడే చనిపోయాడు. అయితే, మృతదేహాన్ని కృష్ణానదిలో పడేయడానికి శ్రీనివాసులు నడిపే ట్రాలీ ఆటోలో బయలుదేరారు. మార్గమధ్యలో తెల్లవారుజామున మహబూబ్‌నగర్ జిల్లా అడ్డాకుల మండలం కందూరు వద్ద పెట్రో లింగ్‌కు వచ్చిన హెడ్‌కానిస్టేబుల్ అమర్నాథ్ వారిని ఆపి పరిశీలించగా విషయం బయటపడింది. గాయా లపాలైన తండ్రి రామస్వామిని జిల్లా ఆస్పత్రికి తరలించడంతోపాటు శ్రీనివాస్‌ను అదుపులోకి తీసుకున్నట్లు సీఐ బాలరాజు, ఎస్ఐ ఆర్.మధుసూదన్ తెలిపారు. -
ఆస్తి కోసం అక్కను హతమార్చిన తమ్ముడు
సాక్షి, బళ్లారి రూరల్: నగరంలోని సత్యనారాయణపేటలో ఆస్తి కోసం తమ్ముడు తన సొంత అక్కనే హతమార్చిన సంఘటన శుక్రవారం రాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. సత్యనారాయణపేటకు చెందిన సునంద పూజార్(40) న్యాయవాదిగా జీవనం సాగిస్తుండేది. తండ్రి ఆస్తికి సంబంధించి సునంద పూజార్‌కు సోదరుడు వేణుగోపాల్‌కు మధ్య కొంతకాలంగా వివాదం నెలకొంది. ఈనేపథ్యంలో శుక్రవారం రాత్రి సుమారు 7.30 గంటల సమయంలో అక్కా తమ్ముళ్లు సునంద పూజార్, వేణుగోపాల్ మధ్య వాగ్వాదం తీవ్రమైంది. దీంతో ఆవేశంతో వేణుగోపాల్ ఇంట్లో ఉన్న మచ్చు కత్తితో సునందపై దాడి చేశాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన బాధితురాలు తీవ్ర రక్తస్రావంతో అక్కడే కుప్పకూలింది. తల్లి పరిస్థితి చూసి సునంద కూతురు చుట్టు పక్కల వారిని పిలవగా, వెంటనే వారు విమ్స్‌కు తరలించారు. అయితే చికిత్స పొందుతూ సునంద శుక్రవారం రాత్రి మృతి చెందింది. ఈ ఘటనపై నగరంలోని మహిళా పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. నిందితుడు పరారీలో ఉన్నాడు. -
దుబాయ్‌లోనూ మనోళ్లే టాప్
సాక్షి, ముంబయి: దుబాయ్‌లో విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లలో భారతీయులు ముందువరుసలో ఉన్నారు. 2016 జనవరి నుంచి జూన్ 2017 వరకూ మనోళ్లు దుబాయ్‌లో రూ. 42 వేల కోట్ల విలువైన ఆస్తులను సొంతం చేసుకున్నారు. ఈ మొత్తం అంతకుముందు ఏడాది కంటే రూ. 12,000 కోట్లు అధికం. దుబాయ్‌లో మనోళ్లు ఎక్కువగా అపార్ట్మెంట్లను కొనుగోలు చేస్తుండగా, మరికొందరు విల్లాలను కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. దుబాయ్ రియల్ ఎస్టేట్‌పై భారతీయులకున్న క్రేజ్ ఏపాటిదో దుబాయ్ ల్యాండ్ డిపార్ట్మెంట్ వెల్లడించిన గణాంకాలతో స్పష్టమవుతోంది. ముంబయి, పుణే, అహ్మదాబాద్‌కు చెందిన వారు ఎక్కువగా దుబాయ్ ఆస్తులపై ఆసక్తి కనబరుస్తున్నారు. వీరిలో అత్యధికులు దుబాయ్‌లో అపార్ట్మెంట్, విల్లా కొనుగోలుకు రూ. 6.5 కోట్లు వెచ్చించేందుకు సిద్ధమవుతున్నారు. ఎనిమిది శాతం మంది రూ. 65 లక్షల నుంచి రూ. 3.24 కోట్లలో ఆస్తి కొనుగోలుకు మొగ్గుచూపుతున్నారని దుబాయ్ ప్రాపర్టీ షో నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది. ఇక 9 శాతం మంది భారతీయులు దుబాయ్‌లో కమర్షియల్ ప్రాపర్టీని, ఆరు శాతం మంది స్థలాలను సొంతం చేసుకోవాలని ఉవ్విళ్లూరుతున్నారు. దుబాయ్ ఇన్వెస్టర్లకు అందుబాటు ధరల్లో ప్రాపర్టీలను అందిస్తోందని, రూపాయి బలోపేతమవడం కూడా ప్రాపర్టీ మార్కెట్‌కు ఊతం ఇస్తోందని అధ్యయనం తేల్చింది. -
ఆస్తి కోసం టీడీపీ నేత కూతురినే..
-
పండక్కి ఊరెళ్తున్నారా..!?
సాక్షి, మహబూబ్‌నగర్ క్రైం: దసరా సెలవులు ప్రారంభమయ్యాయి. పట్టణాల్లో నివాసముంటున్న ఉద్యోగులు, ఉపాధ్యాయులు, వ్యాపారులు పండగకు బంధువుల ఇళ్లకో.. విహార యాత్రలకో.. సొంత గ్రామాలకో వెళ్తుంటారు. ఇళ్లకు తాళాలువేసి రెండ్రోజులైతే చాలు అలాంటి ఇళ్లను టార్గెట్ చేసే దొంగలు పెట్రేగిపోయే అవకాశం ఉంటుంది. చుట్టాల్లా వచ్చి దర్జాగా దోచుకెళ్తుంటారు. మరికొందరు ఎవరికి వినపడకుండా అనుమానం రాకుండా తాళాలు పగులగొట్టి అందినకాడికి ఎత్తుకెళ్తుంటారు. అప్రమత్తత అవసరం.. దొంగతనాలే వృత్తిగా ఎంచుకున్న కొందరు సెలవుల రోజు ల్లోనే విజృంభిస్తుంటారు. గతంలో దసరా సెలవుల్లో పట్టణంలో పలు ప్రాంతాల్లో చోరీలు జరిగాయి. ముఖ్యంగా భగిరథకాలనీ, లక్ష్మీనగర్ కాలనీ, శ్రీనివాసకాలనీ, ఏనుగొండ, వన్‌టౌన్ ఏరియాలో చోరీలు ఎక్కువగా జరుగుతున్నాయి. వరుసగా నాలుగు ఐదు ఇళ్లలో జరిగిన సందర్భాలున్నాయి. పాత దొంగలు చోరీలకు పాల్పడకుండా పోలీసులు ముంద స్తు చర్యలు తీసుకుంటున్నా ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన దొంగలు చోరీలు చేసి వెళ్లిపోయే ఆస్కారం ఉంటుంది. ప్రజలు అప్రమత్తంగా ఉండటంతోపాటు ఊరికి వెళ్లిన సమయంలో పోలీసులు ఇచ్చిన సలహాలు, సూచనాలను పాటిస్తే మన సొమ్ములు భద్రంగా ఉంటాయి. గతంలో జరిగిన చోరీలు.. గతేడాది దసరా సెలవుల్లో జిల్లా కేంద్రంలోని లక్ష్మినగర్కాలనీలో వందన అపార్టుమెంట్లో శివయ్య గౌడు, మాధురి దంపతుల నివాసంలో 23 తులాల బంగా రం, రూ.1.40నగదు మాయం చేశారు. అదేవిధంగా వెంకటేశ్వర కాలనీలో నివాసం ఉంటున్న వేణుగోపాల్ నివాసంలో 8 తులాల బంగారం, రూ.50వేల నగదు చోరికి గురైంది. అదేవిధంగా ఏనుగొండలో భీంరెడ్డి, సుజాత ఇంట్లో 8 తులాల బంగారం, రూ.50వేల నగదు ఎత్తుకెళ్లారు. దాంతో పాటు శ్రీనివాసకాలనీకి చెందిన భరత్ అనే వ్యక్తి ఇంట్లో 5తులాల బంగారం, రూ.80వేల నగదు చోరీకి గురైంది. సమాచారమిస్తే గస్తీ పెంచుతాం సెలవుల్లో వెళ్తున్న వారు సమీప పోలీస్‌స్టేషన్‌లో సమాచారం అందిస్తే ఆ ప్రాంతంలో తమ సిబ్బందిచే గస్తీ పెంచుతాం. ప్రజలను అప్రమత్తం చేయడానికి కరపత్రాలను, పోస్టర్లను ఆవిష్కరించి పట్టణాల్లో అంటిస్తున్నాం. – భాస్కర్, డీఎస్పీ మహబూబ్‌నగర్ -
ఆస్తి కోసం ఆలిని నరికేశాడు
మోమిన్‌పేట (వికారాబాద్): ఆస్తి కోసం కట్టుకున్న ఇల్లాలినే అంతం చేశాడు. పొలంలో పనిచేస్తుండగా గొడ్డలితో మెడపై నరికి దారుణంగా హత్య చేశాడు. వికారాబాద్ జిల్లా మోమిన్‌పేటలో మంగళవారం ఈ ఘటన చోటుచేసుకుంది. మండల కేంద్రానికి చెందిన బేగరి అనంతయ్య కొన్నేళ్ల క్రితం మర్పల్లి మండలం సిరిపురానికి చెందిన పద్మమ్మ (35)ను వివాహం చేసుకున్నాడు. వీరికి ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. తొమ్మిదేళ్ల క్రితం దంపతుల మధ్య మనస్పర్థలు రావడంతో గొడవలు జరిగి విడిగా ఉంటున్నారు. అయితే ఆస్తి కావాలని పద్మమ్మ కొంత కాలం క్రితం కోర్టును ఆశ్రయించింది. అనంతయ్య ఎనిమిదేళ్ల క్రితం నవనీతను రెండో వివాహం చేసుకున్నాడు. అనంతయ్య తనకున్న ఎనిమిది ఎకరాల్లోంచి కొంత భూమిని విక్రయించాడు. ఈ నేపథ్యంలో కూతుళ్ల పోషణ భారం కావడంతో పద్మమ్మ మూడు నెలల క్రితం గ్రామంలో పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టింది. దీంతో అనంతయ్య అయిష్టంగానే రెండెకరాల పొలాన్ని ఆమెకు ఇచ్చాడు. అయితే పొలం తన వశం కావాలంటే.. ఆమెను ఎలాగైనా చంపేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో మంగళవారం స్వగ్రామానికి వచ్చి పద్మమ్మ పొలంలో పనిచేస్తుండగా.. గొడ్డలితో ఆమె మెడపై నరికేసి పారిపోయాడు. -
వృద్ధురాలి దారుణహత్య
ఆస్తి కోసం సొంత తమ్ముళ్ల ఘాతుకం! కర్నూలు : కర్నూలు నగరం పాలకొట్టాలలో నివాసముంటున్న అంచల లక్ష్మమ్మ అలియాస్ సరోజమ్మ (70) దారుణహత్యకు గురైంది. పోలీసుల వివరాల మేరకు..సరోజమ్మ భర్త చిన్ననాగయ్య మూడేళ్ల క్రితం చనిపోయాడు. సంతానం లేదు. తల్లిదండ్రుల నుంచి సంక్రమించిన ఇల్లు, పొలం ఉంది. వడ్డీ వ్యాపారం చేస్తూ జీవనం సాగించేది. తమ్ముడు శంకరయ్య పైఅంతస్తులో నివాసముండగా ఈమె గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటోంది. మరో సోదరుడు నారాయణ పక్క వీధిలో ఉంటున్నాడు. నందికొట్కూరు రోడ్డులో 50 సెంట్ల స్థలం ఉంది. భర్త బతికున్నప్పుడు తమకు రాసిచ్చాడని బావమరదులు శంకరయ్య, నారాయణ చెబుతుండగా, తమ భర్తను మోసం చేసి రూ.కోటి విలువ చేసే స్థలాన్ని కాజేశారని లక్ష్మమ్మ గతేడాది సొంత తమ్ముళ్లపైనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆస్తి అనాథ శరణాలయానికి రాసిస్తోందేమోనని.. తన ఆస్తిని అనాథ శరణాలయానికి రాసిస్తానని చెబుతుండటంతో అన్నదమ్ములు ఇద్దరూ కలసి లక్ష్మమ్మను ఇంట్లో గొంతు నులిమి హత్య చేసినట్లు అనుమానిస్తున్నారు. నోటి నుంచి రక్తం కారడంతోపాటు తల వెనుక భాగంలో కూడా గాయం ఉంది. హత్య అనంతరం మృతదేహం చుట్టూ కారం పొడి చల్లినట్లు తెలుస్తోంది. బుధవారం ఉదయం స్థానికులు కనుగొని పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కర్నూలు డీఎస్పీ రమణమూర్తి, మూడవ పట్టణ సీఐ శ్రీనివాసరావు, ఎస్ఐలు నాగేంద్ర, శరత్‌కుమార్‌రెడ్డి, ఏఎస్ఐ ప్రకాష్ తదితరులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఇరుగుపొరుగు వారిని విచారించారు. పోలీస్ జాగిలాన్ని రప్పించి ఆధారాలను సేకరించారు. మృతదేహం పడి ఉన్న స్థలం నుంచి పైఅంతస్తులో ఉన్న శంకరయ్య దగ్గర ఇంటికి వెళ్లి చుట్టూ తిరిగి కిందికి వచ్చింది. దీంతో హత్యలో అతని పాత్ర ఉన్నట్లు పోలీసులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
ఆస్తి కోసం భర్తను చంపిన భార్య
♦ సహకరించిన పిల్లలు ♦ పదమూడేళ్లుగా వేరుగా ఉంటున్న దంపతులు బచ్చన్నపేట(జనగామ): ఆస్తి కోసం కట్టుకున్న భర్తనే చంపింది భార్య. ఈ హత్యకు పిల్లలు కూడా సహకరించడం అమానుషం. ఈ ఘటన జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం దబ్బగుంటపల్లి గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. ఎస్సై భరత్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం దబ్బగుంటపల్లి గ్రామానికి చెందిన పంతం శ్రీనివాస్(43), బాలమణికి 25 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి నలుగురు సంతానం ఉన్నారు. కాగా వీరికి మనస్పర్ధలు వచ్చి పదమూడేళ్లుగా వేరుగా ఉంటున్నారు. గ్రామంలో శ్రీనివాస్ పేరు మీద 4 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. కాగా ఆ భూమిని తన పేరున మార్పిడి చేయాలని భార్య బాలమణి పలుమార్లు పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేసింది. శ్రీనివాస్ అందుకు అంగీకరించకపోవడంతో ఆ విషయంలో గొడవలు జరిగి శ్రీనివాస్ పలుమార్లు జైలుకు కూడా వెళ్లాడు. ఇటీవలే జైలు నుంచి బయటకు వచ్చాడు. భార్యా, పిల్లలు కూలీ..నాలీ.. చేసుకుంటూ జనగామలో జీవనం కొనసాగిస్తున్నారు. గురువారం వారు జనగామ నుంచి గ్రామానికి వచ్చి ఇంటి వద్ద ఉన్న భర్త శ్రీనివాస్‌ను వారి పిల్లలు భవాని, పూజ, ప్రవీణ్, నవీన్ వ్యవసాయ బావి వద్దకు పోదామని తీసుకొని వెళ్లారు. అక్కడే ఉన్న భార్య బాలమణి పథకం ప్రకారం కళ్లల్లో కారంపొడి చల్లింది. వెంటనే అతడి పిల్లలు తోసేసి నెత్తిపై రాళ్ళతో కొట్టి చంపేశారు. చనిపోయాడని నిర్ధారణకు వచ్చాక మృతదేహాన్ని అక్కడే వదిలేశారు. గమనించిన చుట్టు పక్కల బావుల వద్ద గల రైతులు అక్కడకి వెళ్లే సరికి వారు అక్కడి నుంచి పారిపోయారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి ఎస్సై వచ్చి ఆటోలో వెళ్తున్న నిందితులను కొన్నె గ్రామం వద్ద పట్టుకున్నట్లు తెలిపారు. శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం జనగామ ఏరియా ఆస్పత్రికి తరలించారు. సంఘటనా స్థలాన్ని ఏసీపీ పద్మనాభరెడ్డి, సీఐ కరీముల్లాఖాన్ పరిశీలించారు. -
ఆస్తి ఇవ్వలేదని అఘాయిత్యం
- కుటుంబ సభ్యులను చంపి.. తానూ ఆత్మహత్య చేసుకునేందుకు ఓ మహిళ యత్నం – అన్నంలో పురుగు మందు కలిపిన వైనం - దాన్ని తినడంతో అస్వస్థతకు గురైన ఇద్దరు పిల్లలు, సదరు మహిళ – వారిలో ఒకరి పరిస్థితి విషమం ఆలూరు రూరల్ : అత్తా మామ తమకు ఆస్తి పంచివ్వలేదన్న కోపంతో ఓ మహిళ అఘాయిత్యానికి ఒడిగట్టింది. తనతో పాటు భర్త, నలుగురు పిల్లలు చనిపోవాలన్న ఉద్దేశంతో అన్నంలో పురుగు మందు కలిపింది. ఆ అన్నం తిన్న తను, ఇద్దరు పిల్లలు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. భర్త, మరో ఇద్దరు పిల్లలు సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటన గురువారం హొళగుంద మండలం సుళువాయి గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసుల తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన పెద్ద ఉసేన్‌షా, ఫాతిమా దంపతులకు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు. పెద్ద ఉసేన్షాకు 20 ఎకరాల పొలం ఉంది. ముగ్గురు కుమార్తెలకు పెళ్లి చేశాడు. కుమారుడు వన్నూరుసాబ్కు కూడా 13 ఏళ్ల క్రితం కర్ణాటకలోని బండరాళ్ల గ్రామానికి చెందిన షాషాబీతో వివాహం చేశాడు. వివాహం తర్వాత రెండేళ్లకు కుమారుడితో వేరుకాపురం పెట్టించారు. కొడుకు, కోడలు అదే ఇంట్లోనే ఒక భాగంలో వేరు కాపురం ఉంటున్నారు. వారికి కూడా ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె కలిగారు. కాగా..పెద్ద ఉసేన్‌షా తన భూమిలో ఎకరా చొప్పున ముగ్గురు కుమార్తెలకు మూడెకరాలు రాసిచ్చాడు. హొళగుందలో ఉన్న విలువైన స్థలాన్ని కూడా అమ్మేసి.. వచ్చిన మొత్తాన్ని కుమార్తెలకు ఇచ్చేశాడు. వారి పిల్లలను కూడా మంచి చదువులు చదివించేలా ప్రోత్సహించాడు. దీన్ని జీర్ణించుకోలేని వన్నూరుసాబ్ తన తండ్రితో ఆస్తి విషయమై గొడవ పడుతూ వచ్చాడు. కనీసం పది ఎకరాల భూమినైనా తన పేరుమీద చేసివ్వాలని కోరాడు. ఇందుకు తండ్రి తిరస్కరించాడు. తనకు ఆస్తి ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తున్నాడన్న బాధతో వారం క్రితం తండ్రితో వన్నూరుసాబ్ గొడవపడ్డాడు. దీంతో పెద్ద ఉసేన్‌షా హొళగుంద పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి కుమారుడిపై కేసు నమోదు చేయించాడు. ఈ కేసు విషయంలో రెండు రోజులక్రితం వన్నూరుసాబ్, అతని భార్య షాషాబి, పిల్లలు హొళగుంద స్టేషన్‌కు వెళ్లారు. జరిగిన విషయాన్ని పోలీసులకు తెలిపారు. పోలీసులు కూడా కుమారునికి ఎంతోకొంత ఆస్తి ఇస్తే పిల్లలు, భార్యను పోషించే అవకాశం ఉంటుందని ఉసేన్షాకు సూచించారు. అయినా అతను వినలేదు. ఆస్తి ఇచ్చేది లేదని తెగేసి చెప్పాడు. ఈ నేపథ్యంలో మనస్తాపానికి గురైన షాషాబి గురువారం ఉదయం అన్నంలో పత్తి పైరుకు వేసే రిజైంట్ అనే పురుగుమందును కలిపింది. పొలానికి బయలుదేరిన భర్త, మూడో కుమారుడు సుభాన్, కుమార్తె మున్నీకి ఆ అన్నం క్యారియర్‌ను ఇచ్చి పంపింది. తాను ఆలస్యంగా వస్తానని చెప్పింది. ఇంటిలో ఉన్న పెద్దకుమారుడు ఉసేన్‌పీరా, చిన్నకుమారుడు ఉసేన్‌సాబ్‌కు ఆ అన్నాన్నే పెట్టింది. కాసేపటికి వారు అస్వస్థతకు గురి కాగా.. ఆ వెంటనే తను కూడా తినింది. కడుపులో మంటగా ఉండడం, పిల్లలు అస్వస్థతకు గురై కళ్ల ముందే బాధ పడుతుంటే చూడలేక విషయాన్ని ఇరుగూపొరుగు వారికి చెప్పింది. వారు పొలంలోకి వెళ్లి ఆమె భర్త, ఇద్దరు పిల్లలు పురుగు మందు కలిపిన అన్నం తినకుండా చూశారు. మరి కొందరు షాషాబీని, మిగిలిన ఇద్దరు కుమారులను చికిత్స కోసం ఆలూరు ఆస్పత్రికి తీసుకెళ్లారు. వీరిలో పెద్దకుమారుడు ఉసేన్‌పీరా పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి పంపారు. షాషాబి, చిన్న కుమారుడు ఉసేన్‌సాబ్ ఆరోగ్యం కుదుట పడిందని ఆలూరు ఆస్పత్రి వైద్యసిబ్బంది తెలిపారు. -
ఆస్తి కోసం తల్లిని వేధిస్తున్న కొడుకు
-
మానవత్వం కుమిలి కుమిలి ఏడుస్తోంది..
► మంగళవారం అక్కాబావను నరికి చంపిన వైనం ► గతంలో ఇదే తరహా ఘటనలు ► జిల్లాలో తెగిపోతున్న మానవ సంబంధాలు పేగు బంధం శోకిస్తోంది.. కనిపెంచుకున్న బిడ్డలే కడతేరుస్తున్నారని.. తోబుట్టువు రోదిస్తోంది.. రక్తం పంచుకున్న వాడే నెత్తుటి గాయం చేస్తున్నాడని.. బంధుత్వం బావురమంటోంది.. నా అన్నవాళ్లను నిలువునా చిదిమేస్తున్నారని.. మానవత్వం కుమిలి కుమిలి ఏడుస్తోంది..నా జాడ ఎక్కడో కాస్త చూపించండయ్యా అని.. ఇవన్నీ చూసి పైసా నవ్వుతోంది.. నా పేరాశలో పడితే బంధాలన్నీ రక్తపుటేరులు కావాల్సిందేనని.. సాక్షి, గుంటూరు: బంధాలు, బంధుత్వాలను మరిచిపోతున్నారు. ఆస్తుల కోసం పేగు బంధాన్నే తెంచేస్తున్నారు. డబ్బు కోసం అన్నదమ్ములు కుమ్ములాటకు దిగుతున్నారు. అక్కాతమ్ముళ్లు అనే రక్త సంబంధాన్ని మరిచి గొంతులు కోసుకుంటున్నారు. తల్లిదండ్రులపై సైతం దాడులకు తెగబడుతున్నారు. ధనకాంక్షతో హత్యలకు పాల్పడుతున్నారు. తల్లిదండ్రులు, అక్కాచెల్లెళ్లు, అన్నాదమ్ముళ్లు, బావామరుదులు, భార్యాభర్తలనే సంబంధాలేవీ డబ్బుకంటే ఎక్కువ కాదంటూ ఒకరిపై ఒకరు కత్తులు దూసుకుంటున్నారు. నిండు ప్రాణాలను తృణప్రాయంగా తెంచేస్తున్నారు. ఇలా జిల్లాలో నిత్యం మనీ మాయలో పడి మానవత్వం మాయమైపోతోంది. మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో పట్నం గాలి పల్లెలకూ సోకుతున్నట్లు కనిపిస్తోంది. ఇరుగు పొరుగు వారితోనే సోదరభావంతో కలిసి మెలిసి ఉండే పల్లెల్లో సైతం రూపాయి చిచ్చురేపుతోంది. జిల్లాలో కొన్ని అమానుష ఘటనలు జిల్లాలో నెల వ్యవధిలో ఆస్తి వివాదాల నేపథ్యంలో రెండు జంట హత్యలు జరిగాయి. రెంటచింతల మండలం జెట్టిపాలెంలో ఆస్తి కోసం సొంత అన్నా, వదినలను హతమార్చిన దుర్ఘటన జిల్లాలో సంచలనం కలిగించింది. ఒకే రక్తం పంచుకు పుట్టిన అన్నదమ్ములు మేకపోతుల వెంకటేశ్వరరెడ్డి, పిచ్చిరెడ్డిల మధ్య కొంతకాలంగా రెండెకరాల పొలం విషయంలో గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో పొలంలో పనులు చేస్తున్న వెంకటేశ్వరరెడ్డి (53), పద్మావతి (48) దంపతులపై పిచ్చిరెడ్డి, అతని కొడుకులు కత్తులతో దాడి చేసి కిరాతకంగా నరికేశారు. ఈ దుర్ఘటన మరువక ముందే మంగళవారం రొంపిచర్ల మండలం వీరవట్నంలో ఆస్తి వివాదం నేపథ్యంలో సొంత తమ్ముడే అక్కా బావలను గొంతు కోసి హతమార్చాడు. కొల్లి రమేష్ రెడ్డి (55), సుబ్బమ్మ (50) దంపతులను సుబ్బమ్మ తమ్ముడు సింహాద్రి కృష్ణారెడ్డి కళ్లలో కారం కొట్టి గొంతు కోశాడు. ఈ పాశవిక ఘటనతో జిల్లా ఉలిక్కిపడింది. చిన్నతనం నుంచి కన్న కొడుకులా సాకిన అక్కాబావలనే ఆస్తి కోసం మట్టుబెట్టడంతో గ్రామస్తులు నివ్వెరపోయారు. పదేళ్లుగా వీరి మధ్య ఆస్తి వివాదం నడుస్తున్నట్లు సమాచారం. గతేడాది తల్లిదండ్రులను మట్టుబెట్టిన కూతురు చేబ్రోలు మండల కేంద్రంలో గతేడాది ఆస్తి కోసం నవమాసాలు మోసిన కన్న తల్లిని, అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేసిన తండ్రిని భర్తతో కలిసి హత మార్చిందో కసాయి కూతురు. ఈ ఘటనలో వృద్ధ దంపతులు షేక్ ఖాసిం(80), మీరాబీ(75)లు కన్న కూతురు మస్తాన్‌బీ, అల్లుడు ఖాజామొహిద్దీన్ చేతులతో బలయ్యారు. ఈ సంఘటన మనసునూ కదిలించింది. అవగాహన అవసరం మాయమవుతున్న మానవత్వాన్ని బతికించేందుకు స్వచ్ఛం సంస్థలు, పోలీసులు సీరియస్‌గా స్పందించి గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ప్రజలు కోరుతున్నారు. రక్త సంబంధాలు, బంధుత్వాలపై చైతన్యం కలిగించాలంటున్నారు. లేదంటే ఈ దారుణాలు నిత్యకృత్యమై రానున్న తరాలనూ నాశనం చేస్తాయి. -
అత్తను టెర్రస్ మీద నుంచి తోసేసింది..
ఇటాహ్: ఉత్తరప్రదేశ్‌లో ఆస్తి కోసం ఓ కోడలు దాష్టికానికి ఒడిగట్టింది. బంధుత్వాన్ని మరవడమే కాకుండా, వృద్ధురాలు (85) అని కూడా కనికరం లేకుండా కోడలు దారుణంగా ప్రవర్తించింది. ఇంటిని తన పేరు మీద రిజిస్ట్రర్ చేయలేదన్న అక్కసుతో ...అత్తగారిని టెర్రర్ మీద నుంచి బయటకు తోసేసింది. ఈ ఘటనలో గాయపడ్డ బాధితురాలని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. గత కొంతకాలంగా ఇంటిని తమ పేరు మీద రాయాలని అత్తను వేధింపులకు గురి చేస్తున్నప్పటికీ, ఆమె ఒప్పుకోకపోవడంతో ఈ ఘటనకు పాల్పడినట్లు ఇటాహ్ పోలీసులు వెల్లడించారు. కోడలుపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ఆస్తి కోసం దారుణ హత్య
నడిరోడ్డుపై వదినను చంపిన మరిది అమ్మను చంపొద్దని వేడుకున్నా కనికరించని బాబాయ్ విచక్షణ కోల్పోయి చెంప చెళ్లుమనిపించి.. జుట్టుపట్టి, పీకపై కాలు వేసి ప్రాణం తీసినవైనం కిర్లంపూడి (జగ్గంపేట) : అతను మానవ మృగాడు. చదువుకున్నానన్న జ్ఞానం లేనివాడు. బీటెక్ చదువుకున్నాడు. హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తూ ఆరు నెలల క్రితం సొంత ఊరు కిర్లంపూడి మండలం గోనాడ వచ్చాడు. వివాహం కాకపోవడంతో తల్లిదండ్రుల దగ్గర ఉంటున్నాడు. గ్రామంలో ఉంటూ రెండు పాడిగేదెలను కొని ఇంటి వద్దే పాడిపరిశ్రమ పెట్టుకున్నాడు. హైదరాబాద్ నుంచి వచ్చినప్పటి నుండి సొంత వదినతో ఆస్తి, కుటుంబ కలహాలతో రోజూ తగవుపడుతుండేవాడు. ఎప్పటి లాగే బుధవారం ఉదయం ఇరువురి మధ్యా చిన్న తగాదా మొదలై తీవ్ర వాగ్వాదానికి దారి తీసింది. దీంతో విచక్షణ కోల్పోయిన అతను వదిన అని కూడా చూడకుండా నడిరోడ్డుపై చెంప చెళ్లుమనిపించాడు. అంతటితో ఆగకుండా జుట్టు పట్టుకుని సిమెంటు రోడ్డుపై పడేసి కొట్టాడు. పీకపై అడుగేసి తొక్కాడు. మృతురాలి కూతురు జ్ఞానేశ్వరి వద్దు బాబాయ్.. వద్దు అమ్మను ఏమీ చేమొద్దు అని బతిమాలినా వినిపించుకోలేదు. జాలి, కరుణ వంటివి లేకుండా విచక్షణ రహితంగా ఇరుగు పొరుగు వారు చూస్తుండగా హత్యకు పాల్పడ్డాడు. హత్య జరిగిన తీరు గ్రామంలో సంచలనం రేకెత్తించింది. విషయం తెలుసుకున్న కిర్లంపూడి ఎస్సై ఎ.బాలాజీ తన సిబ్బందితో వెళ్లి సంఘటన స్థలాన్ని పరిశీలించాడు. విషయాన్ని జగ్గంపేట సీఐ పి.కాశీవిశ్వనాథంకు వివరించగా, ఆయన అక్కడకు చేరుకుని హత్యకు గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక విలేకరులతో సీఐ మాట్లాడుతూ మృతురాలి భర్త సతీష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కిర్లంపూడి ఎస్సై ఎ.బాలాజీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారన్నారు. అలాగే మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రత్తిపాడు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బీసీ కాలనీలో విషాదఛాయలు మరిది చేతిలో వదిన భవాని హత్యకు గురికావడంతో బీసీ కాలనీలో విషాదఛాయలు అలుముకున్నాయి. భవానికి 12 యేళ్ల కుమార్తె జ్ఞానేశ్వరి ఉంది. తల్లి మృతదేహం వద్ద కూతరు విలపించిన తీరు చూపరులను కలచివేసింది.