Saif Ali Khan Has Revealed That He Got Scammed in Property Deal in Mumbai - Sakshi
Sakshi News home page

Saif Ali Khan: 'మూడేళ్లలో డబ్బు రెట్టింపు అవుతుందని మోసం చేశారు'

Published Fri, Nov 19 2021 12:03 PM | Last Updated on Fri, Nov 19 2021 3:08 PM

Saif Ali Khan Has Revealed That He Got Scammed in Property Deal in Mumbai - Sakshi

Saif Ali Khan Has Revealed That He Got Scammed in Property Deal: ఓ ప్రాపర్టీ డీల్‌లో తాను తీవ్రంగా మోసపోయానని బాలీవుడ్‌ స్టార్‌ సైఫ్‌ అలీఖాన్‌ అ‍న్నారు. దీని వల్ల తన సంపాదనలో దాదాపు 70శాతం మేరకు ​కోల్పోయినట్లు చెప్పి షాకిచ్చాడు. తాజాగా ఆయన నటించిన ‘బంటీ ఔర్‌ బబ్లీ-2’చిత్రం త్వరలోనే విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌లో భాగంగా స్టార్‌ హీరోయిన్‌ రాణీముఖర్జీ చేసిన ఇంటర్వ్యూలో ఈ మేరకు వెల్లడించాడు.

'ముంబైలో ఓ స్థలం కొనుగోలు కోసం ఓ రియట్‌ ఎస్టేట్‌ సంస్థలో పెట్టుబడి పెట్టాను. ఆ డబ్బు మూడేళ్లలో రెట్టింపు అవుతుందని నన్మ నమ్మబలికి ఆ కంపెనీ వాళ్లు మోసం చేశారు. ఆ స్కామ్‌లో నేను సంపాదించిందంతా పోగొట్టుకున్నా. ఆ డీల్‌ కోసం దాదాపు 70 శాతం పెట్టుబడి పెట్టాను. తర్వాత నేను మోసపోయానని అర్థమైంది. అయినా అధైర్యపడకుండా కెరీర్‌పై దృష్టి పెట్టి తిరిగి సంపాదించుకున్నా.

ఆ స్కామ్‌ నుంచి కోలుకోవడానికి చాలా కాలం పట్టింది' అని సైఫ్‌ అలీఖాన్‌ తెలిపారు. ప్రముఖ నిర్మాణ సంస్థ యష్‌రాజ్‌ ఫిల్మ్స్‌ యూట్యూబ్‌లో షేర్‌చేసిన ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది. 


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement