Rani mukharji
-
Rani Mukerji-Kajol: అక్కా-చెల్లెలు ఇద్దరు స్టార్ హీరోయిన్లే..కొన్నేళ్లుగా మాటల్లేవు, కారణం ఇదేనట!
రాణీ ముఖర్జీ, కాజోల్ బాలీవుడ్ ఇద్దరి మధ్య బంధుత్వం ఉన్న సంగతి తెలిసిందే. వరుసకు వీరిద్దరు అక్కా-చెల్లెలు అవుతారు. ఇప్పుడంటే కాజోల్, రాణీముఖర్జీ చాలా క్లోజ్‌గా ఉంటున్నారు కానీ.. కొన్నాళ్ల క్రితం వీరిద్దరి మధ్య మాటల్లేవు. కలిసి ఒకే సినిమాలో(కరణ్ జోహార్ మొదటి చిత్రం 'కుచ్ కుచ్ హోతా హై') నటించినా మాట్లాడుకోలేదట. దానికి గల కారణాన్ని తాజాగా రాణీ ముఖర్జీ వెల్లడించింది. అపార్దం చేసుకోవడం వల్లే తాము కొన్నాళ్ల పాటు దూరంగా ఉన్నామని చెప్పింది. ‘ప్రతి ఫ్యామిలీలోనూ గొడవలు సహజం. విభేదాలకు ఏదో ఒక కారణం ఉంటుంది. కానీ కొన్ని సందర్భాల్లో ఎలాంటి కారణం లేకుండానే విడిపోతారు. అలాంటిదే మా(కాజోల్, రాణీ ముఖర్జీ) ఫ్యామిలీలో జరిగింది. మా ఇరు కుటుంబాలు విడిపోవడానికి కారణమే లేదు. అపార్దం చేసుకోవడం వల్లే మేము కొన్నాళ్ల పాటు దూరంగా ఉండాల్సి వచ్చింది. ఇప్పుడు మా రెండు కుటుంబాలు కలిశాయి. ఏదో ఒక సందర్భంలో అందరం కలుస్తూనే ఉంటాం’ అని రాణీ ముఖర్జీ చెప్పుకొచ్చింది. కాజోల్ కంటే ఆమె చెల్లి తనిషా ముఖర్జీ తనకు బాగా క్లోజ్ అని రాణీ ముఖర్జీ గతంలో చెప్పింది. ’చిన్నప్పుడు అందరం కలిసే ఆడుకునేవాళ్లం. తనిషా, నేను ఒక జట్టు అయితే.. మా సోదరుడు, కాజోల్ మరో గ్యాంగ్. మా సీక్రెట్స్ ఏవి వారితో షేర్ చేసుకునే వాళ్లం కాదు. కాజోల్ మాత్రం ఎక్కువగా మా సోదరులతోనే ఉండేది. చిన్నప్పుడు ఆమెతో ఎక్కువగా మాట్లాడేదాన్ని కాదు’ అని రాణీ ముఖర్జీ చెప్పుకొచ్చింది. -
నేడు యూట్యూబ్‌లోకి వచ్చేస్తున్న బ్లాక్ బస్టర్ సినిమా
విలక్షణ నటుడు కమల్‌హాసన్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన పీరియాడికల్ డ్రామా చిత్రం 'హే రామ్'. ఇందులో షారుఖ్‌ఖాన్, రాణి ముఖర్జీ కీలక పాత్రలు పోషించారు. ఎన్నో వివాదాల మధ్య 2000 సంవత్సరంలో విడుదలైంది ఈ చిత్రం. అప్పట్లో మంచి టాక్‌ను తెచ్చుకోవడంతో పాటు కమల్ కెరీర్లో విభిన్న చిత్రంగా నిలిచింది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా తాజాగ ఈ చిత్రాన్ని నేరుగా యూట్యూబ్ ఛానెల్లో నేడు సాయంత్రం 6 గంటలకు విడుదల చేయనున్నారు. ఈమేరకు కమల్ హాసన్ సొంత నిర్మాణ సంస్థ రాజ్ కమల్ ఫిలింస్ ఇంటర్నేషనల్ సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. షారుఖ్ ఖాన్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా? ఇక ఈ సినిమాలో షారుఖ్ ఖాన్ కీలక పాత్ర పోషించారు. అయితే, ఇందులో షారుఖ్చేసిన పాత్ర కోసం ఆయన రెమ్యునరేషన్‌గా ఒక్క రూపాయి కూడా తీసుకోలేదట. ఈ విషయాన్ని కమల్‌హాసన్ గతంలో స్వయంగా చెప్పారు. ఇలాంటి కథను, చిత్రాన్ని భవిష్యత్‌లో మళ్లీ చేసే అవకాశం రాదని షారుఖ్ భావించారట. కానీ ఈ సినిమాకు గుర్తుగా తన చేతి గడియారాన్ని ఆయనకు కమల్ ఇచ్చారట. ఈ సినిమాలో భారత్- పాకిస్థాన్ విభజన, మహాత్మ గాంధీని నాథూరాం గాడ్సే హత్య చేయడం వంటి అంశాలను చూపించారు. ఈ సినిమాను ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో ప్రదర్శించారు. మూడు జాతీయ అవార్డులు అప్పట్లో 'హే రామ్' విమర్శకుల ప్రశంసలు అందుకుంది. మూడు జాతీయ అవార్డులను సొంతం చేసుకుంది. ఉత్తమ సహాయ నటుడిగా అతుల్ కుల్కర్ణి, ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్‌గా సారిక, ఉత్తమ విజువల్ ఎఫెక్ట్ విభాగంలో మంత్రకు అవార్డులు వచ్చాయి. అంతే కాదు అంతర్జాతీయ స్థాయిలోనూ సత్తా చాటింది. 25వ టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్, 2000 లోకార్నో ఫెస్టివల్లో ఈ సినిమాను ప్రదర్శించారు. స్వాతంత్య్ర దినోత్సవం రోజున ఈ సినిమాతో నాటి అనుభూతి పొందాలంటే 'హే రామ్' చూడాల్సిందే. Experience the brilliance of #Ulaganayagan #KamalHaasan in the Cult Classic #HeyRam Streaming Tomorrow at 6 PM ➡️ https://t.co/n9afe1tmUq @ikamalhaasan @ilaiyaraaja @iamsrk pic.twitter.com/ZU3agwYqvA — Raaj Kamal Films International (@RKFI) August 14, 2023 -
ఆ స్కామ్ వల్ల సంపాదించిన డబ్బంతా పోగొట్టుకున్నా: స్టార్ హీరో
Saif Ali Khan Has Revealed That He Got Scammed in Property Deal: ఓ ప్రాపర్టీ డీల్‌లో తాను తీవ్రంగా మోసపోయానని బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ అన్నారు. దీని వల్ల తన సంపాదనలో దాదాపు 70శాతం మేరకు కోల్పోయినట్లు చెప్పి షాకిచ్చాడు. తాజాగా ఆయన నటించిన ‘బంటీ ఔర్ బబ్లీ-2’చిత్రం త్వరలోనే విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌లో భాగంగా స్టార్ హీరోయిన్ రాణీముఖర్జీ చేసిన ఇంటర్వ్యూలో ఈ మేరకు వెల్లడించాడు. 'ముంబైలో ఓ స్థలం కొనుగోలు కోసం ఓ రియట్ ఎస్టేట్ సంస్థలో పెట్టుబడి పెట్టాను. ఆ డబ్బు మూడేళ్లలో రెట్టింపు అవుతుందని నన్మ నమ్మబలికి ఆ కంపెనీ వాళ్లు మోసం చేశారు. ఆ స్కామ్‌లో నేను సంపాదించిందంతా పోగొట్టుకున్నా. ఆ డీల్ కోసం దాదాపు 70 శాతం పెట్టుబడి పెట్టాను. తర్వాత నేను మోసపోయానని అర్థమైంది. అయినా అధైర్యపడకుండా కెరీర్‌పై దృష్టి పెట్టి తిరిగి సంపాదించుకున్నా. ఆ స్కామ్ నుంచి కోలుకోవడానికి చాలా కాలం పట్టింది' అని సైఫ్ అలీఖాన్ తెలిపారు. ప్రముఖ నిర్మాణ సంస్థ యష్‌రాజ్ ఫిల్మ్స్ యూట్యూబ్‌లో షేర్చేసిన ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది. -
స్క్రీన్ టెస్ట్
1. ‘ఈ జెండా పసిబోసి చిరునవ్వురా, దాస్య సంకెళ్లు తెంచిందిరా..’ అనే పాట మహేశ్‌బాబు నటించిన ఓ చిత్రంలోనిది. ఈ పాటలో ఓ పసిబాబు చేతిలో నుండి జాతీయ జెండా ఓ కొండపై నుండి కింద పడుతుంది. ఆ జెండా కింద పడకుండా హీరో పట్టుకునే ఈ సీన్ ఏ సినిమాలోనిది? ఎ) బాబీ బి) అతడు సి) ఖలేజా డి) ఒక్కడు 2. అక్కినేని, సావిత్రి జంటగా నటించిన చిత్రం ‘వెలుగు నీడలు’. ఈ చిత్రంలోని ‘పాడవోయి భారతీయుడా’ పాట రచయితెవరో కనుక్కోండి? ఎ) కొసరాజు బి) ఆత్రేయ సి) శ్రీశ్రీ డి) సినారె 3. ‘తెలుగు వీర లేవరా, దీక్ష బూని సాగరా...’ అనే పాటలో నటించిన నటుడెవరో తెలుసా? ఎ) శోభన్‌బాబు బి) యన్టీఆర్ సి) అక్కినేని డి) కృష్ణ 4. ‘జననీ జన్మ భూమిశ్చ, స్వర్గాదపీ గరీయశీ...’ అనే పాట రచించింది, దర్వకత్వం వహించింది ఒక్కరే. ఎవరా దర్శకుడు? ఎ) ముత్యాల సుబ్బయ్య బి) దాసరి నారాయణరావు సి) రవిరాజా పినిశెట్టి డి) కోడి రామకృష్ణ 5. ‘దేశం మనదే.. తేజం మనదే.. ఎగురుతున్న జెండా మనదే...’ అనే పాటలో నటించిన నటుడెవరో తెలుసా? (చిన్న క్లూ: ఈ చిత్రానికి తేజ దర్శకుడు) ఎ) ఉదయ్‌కిరణ్ బి) నవదీప్ సి) ప్రిన్స్ డి) దిలీప్ రెడ్డి 6. ‘కొంతమంది సొంత పేరు కాదుర గాంధీ, ఊరుకొక్క వీధి పేరు కాదురా గాంధీ...’ పాట శ్రీకాంత్ నటించిన 100వ చిత్రం ‘మహాత్మ’ లోనిది. కృష్ణవంశీ దర్శకత్వం వహించారు. ఈ దేశభక్తి గీతం సూపర్‌హిట్. ఈ పాటలో నటించిన క్యారెక్టర్ నటుని పేరేంటి ? ఎ) రామ్‌జగన్ బి) తనికెళ్ల భరణి సి) పరుచూరి గోపాలకృష్ణ డి) అజయ్ ఘోష్ 7. ‘మేజర్ చంద్రకాంత్’ చిత్రంలోని ‘పుణ్యభూమి నా దేశం నమో నమామి... జన్మ భూమి నాదేశం సదా స్మరామి...’ అనే పాటలో యన్టీఆర్ నటించారు. ఆ పాటను రచించింది జాలాది. సంగీత దర్శకుడెవరో తెలుసా? ఎ) మణిశర్మ బి) యంయం కీరవాణి సి) రాజ్–కోటి డి) చక్రవర్తి 8. ‘వినరా వినరా దేశం మనదేరా, అనరా అనరా రేపిక మనదేరా’ పాట ఏ చిత్రంలోనిది? (మణిరత్నం దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీత దర్శకుడు). ఎ) బొంబాయి బి) రోజా సి) దిల్సే డి) దళపతి 9. ‘వందేమాతరం’ చిత్రంలోని ‘వందేమాతరం, వందేమాతరం... వందేమాతర గీతం వరస మారుతున్నది... తరం మారుతున్నది, ఆ స్వరం మారుతున్నది..’ అనే పాటతో శ్రీనివాస్ ఇంటి పేరు ‘వందేమాతరం’ అయింది. ఈ పాటలో నటించింది హీరో రాజశేఖర్, హీరోయిన్గా నటించింది ఎవరో తెలుసా? ఎ) విజయశాంతి బి) భానుప్రియ సి) సుమలత డి) జీవిత 10. ‘భారత మాతకు జేజేలు... బంగరు భూమికి జేజేలు’ పాట యన్టీఆర్ నటించిన ‘బడిపంతులు’ చిత్రంలోనిది. పీసీ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో యన్టీఆర్ మనవరాలిగా నటించిన బాల నటి ఎవరో కనుక్కోండి? (తర్వాత కాలంలో ఆమె యన్టీఆర్ సరసన హీరోయిన్గా నటించారు) ఎ) విజయనిర్మల బి) జయసుధ సి) శ్రీదేవి డి) జయంతి 11. ‘ఏ దేశమేగినా ఎందు కాలిడినా, ఏ పీఠమెక్కినా, ఎవ్వరెదురైనా... పొగడరా నీ తల్లి భూమి భారతిని.. నిలపరా నీ జాతి నిండు గౌరవమూ...’ పాట ‘అమెరికా అబ్బాయి’ సినిమాలోనిది. అమెరికాలో షూటింగ్ చేసుకున్న ఈ క్రాస్ ఓవర్ సినిమాకు దర్శకుడెవరు? ఎ) బాలచందర్ బి) కె. విశ్వనాథ్ సి) సింగీతం శ్రీనివాసరావు డి) భారతీరాజ 12. ‘ఓ బాపు నువ్వే రావాలి, నీ సాయం మళ్లీ కావాలి...’ అనే పాట చిరంజీవి నటించిన ‘శంకర్‌దాదా జిందాబాద్’ చిత్రంలోనిది. ఈ దేశభక్తి గీతాన్ని సుద్దాల అశోక్‌తేజ రచించగా దేవీశ్రీ ప్రసాద్ స్వరపరిచారు. ఈ చిత్రానికి దర్శకుడెవరు? ఎ) బి. గోపాల్ బి) ప్రభుదేవా సి) జయంత్.సి. పరాన్జీ డి) వీవీ వినాయక్ 13. 1982లో విడుదలైన ‘గాంధీ’ చిత్రానికి రిచర్డ్ అటెన్‌బరో స్వీయదర్శకత్వం వహించారు. బెన్ కింగ్స్లే ‘గాంధీ’ పాత్రధారి. బ్రిటిష్ ఇండియన్ ఫిల్మ్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో కస్తూర్బా గాంధీ పాత్రలో నటించిన ప్రముఖ బాలీవుడ్ నటి ఎవరో కనుక్కోండి? ఎ) బి) రేఖ సి) రోహిణి హట్టంగడి డి) హేమమాలిని 14. ఆంగ్లేయుల వద్ద సిపాయిగా పనిచేసిన ‘మంగల్ పాండే’ పాత్రలో నటించారు ఆమిర్‌ఖాన్. ఆ చిత్రంలో ఆయన సరసన హీరా పాత్రలో నటించిన నటి ఎవరో తెలుసుకుందామా? ఎ) రాణీ ముఖర్జీ బి) కరిష్మా కపూర్ సి) కరీనా కపూర్ డి) అమీషా పటేల్ 15. ‘మేమే ఇండియన్స్ మేమే ఇండియన్స్...’ పాట ‘ఖడ్గం’ చిత్రంలోనిది. కృష్ణవంశీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ముస్లిం పాత్రలో నటించి, మెప్పించిన నటుడెవరు? ఎ) శ్రీకాంత్ బి) రవితేజ సి) ప్రకాశ్‌రాజ్ డి) బ్రహ్మాజీ 16. ‘ఏ మేరా ఇండియా, ఐ లవ్ మై ఇండియా...’ పాట సుభాష్ ఘాయ్ దర్శకత్వం వహించిన ‘పరదేశ్’ చిత్రంలోనిది. ఆ చిత్రంలో షారుఖ్ ఖాన్ సరసన నటించిన నటి ఎవరు? ఎ) మహిమా చౌదరి బి) ప్రీతి జింటా సి) కాజోల్ డి) కత్రినాకైఫ్ 17. సంజయ్‌దత్, అజయ్ దేవ్గన్, సైఫ్ అలీఖాన్, అర్మాన్ కోహ్లి, సునీల్ శెట్టి, సంజయ్ కపూర్, అభిషేక్ బచ్చన్, అక్షయ్ఖన్నా.. ఇంతమంది బాలీవుడ్ హీరోలు నటించిన చిత్రం ‘ఎల్ఓసి కార్గిల్’. వారితో పాటు ఆ చిత్రంలో నటించిన తెలుగు హీరో ఎవరో తెలుసా? ఎ) ప్రభాస్ బి) నాగార్జున సి) రానా డి) వెంకటేశ్ 18. శంకర్ దర్శకత్వం వహించిన ‘భారతీయుడు’ చిత్రంలో స్వాతంత్య్ర సమర యోధుడు సేనాపతి పాత్రలో నటించారు కమల్‌హాసన్. మళ్లీ సేమ్ కాంబినేషన్లో ‘భారతీయుడు–2’ తెరకెక్కుతోంది. ఎన్ని సంవత్సరాల తర్వాత ఈ సీక్వెల్ ప్రారంభించారో కనుక్కోండి? ఎ) 22 బి) 18 సి) 20 డి) 25 19. తెల్లదొరలపై తిరగబడ్డ తెలుగుబిడ్డ ‘ఆంధ్రకేసరి’ టంగుటూరి ప్రకాశం పంతులు. ఆయన చరిత్రను సినిమా గా రూపుదిద్దిన నటుడెవరో తెలుసా? (అతనే నిర్మాత, దర్శకుడు, నటుడు) ఎ) చంద్రమోహన్ బి) విజయ్ చందర్ సి) మురళీమోహన్ డి) నరేశ్ 20. చిరంజీవి నటిస్తున్న చిత్రం ‘సైరా’. ఆంగ్లేయులను ఎదిరించిన తెలుగువాడు ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ జీవిత చరిత్ర ఇది. ఈ చిత్రంలోని ‘మైరారెడ్డి’ పాత్రను పోషిస్తున్న నటుడెవరో తెలుసా? ఎ) జగపతిబాబు బి) సుదీప్ సి) అమితాబ్ డి) విజయ్ సేతుపతి మీరు 6 సమాధానాల కంటే తక్కువ చెబితే... మీకు సినిమా అంటే ఇష్టం 10 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే ఇంట్రెస్ట్ 15 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే పిచ్చి 20 సమాధానాలూ చెప్పగలిగితే... ఇంకోసారి ఈ క్విజ్ చదవకండి! సమాధానాలు 1) (ఎ) 2) (సి) 3) (డి) 4) (బి) 5) (బి) 6) (ఎ) 7) (బి) 8) (బి) 9) (ఎ) 10) (సి) 11) (సి) 12) (బి) 13) (సి) 14) (ఎ) 15) (సి) 16) (ఎ) 17) (బి) 18) (ఎ) 19) (బి) 20) (ఎ) నిర్వహణ: శివ మల్లాల -
పెళ్లైతే హీరోయిన్గా పనికి రామా?
.... అంటున్నారు రాణీ ముఖర్జీ. దర్శక–నిర్మాత ఆదిత్యా చోప్రాను పెళ్లాడిన తర్వాత రాణీ సినిమాలకు దూరమైపోతారని అనుకున్నారంతా. కానీ ‘మర్దానీ’ సినిమాతో కమ్‌బ్యాక్ ఇచ్చి అందరి అంచనాలను తారుమారు చేశారు. ఇప్పుడు తన లేటెస్ట్ సినిమా ‘హిచ్కీ’తో సూపర్ హిట్ అందుకున్నారు రాణీ. ఈ సినిమా హిట్ చాలా ప్రత్యేకమైంది అంటున్నారామె. ‘‘సాధారణంగా పెళ్లైతే హీరోయిన్గా పనికి రారు అనే ఒకలాంటి అపోహ మన ఇండస్ట్రీలో ఉంది. ఈ అపోహ కచ్చితంగా తొలగిపోవాలి. పెళ్లయినవారు హీరోయిన్లుగా సేల్ అవ్వరు, ఎవ్వరూ చూడరు అనే అభిప్రాయం తప్పని ఈ సినిమా హిట్‌తో ప్రేక్షకులు నిరూపించారు. పెళ్లై పిల్లలు పుడితే మాలో ఏం మారుతుంది? మేం ఎప్పుడూ యాక్టర్స్మే కదా. అప్పుడు ఉన్నంత ప్రొఫెషనల్‌గానే ఇప్పుడూ ఉంటాం. మాకంటూ సెపరేట్ లైఫ్ ఉండకుడదా? మా పర్సనల్ లైఫ్‌ని కెరీర్ కోసం త్యాగం చేయాలా? మేల్ యాక్టర్స్‌కి ఇలాంటివి ఏమీ ఉండవు. కేవలం హీరోయిన్స్ మాత్రమే కెరీర్ కోసం మ్యారేజ్‌ని ఆలస్యం చేసుకోవాలి. ఎందుకంటే పెళ్లైతే హీరో యిన్స్‌కు మార్కెట్లో సెల్లింగ్ ఫ్యాక్టర్ పోతుంది కాబట్టి. ఈ సినిమాపై అభిమానులు చూపించిన ప్రేమ చూస్తే అర్థం అవుతోంది. హీరోయిన్‌కి పెళ్లి అయిందా? తల్లయిందా? అని కాదు. స్క్రీన్ మీద ఆ హీరోయిన్ ఎలా కనిపించారన్నదే వాళ్లకు ముఖ్యం’’ అని పేర్కొన్నారు రాణీ ముఖర్జీ. -
సీబీఎస్ఈ నిర్ణయాన్ని స్వాగతించిన హీరోయిన్
సీబీఎస్ఈ 12వ తరగతి ఎకనామిక్స్, 10వ తరగతి మ్యాథ్స్ పరీక్షకు సంబంధించిన ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంపై దేశవ్యాప్తంగా సీబీఎస్ఈపై నిరసనలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై బాలీవుడ్ నటి రాణి ముఖర్జీ స్పందించారు. పరీక్షలను మళ్లీ నిర్వహిస్తామన్న సీబీఎస్ఈ నిర్ణయాన్ని ఆమె స్వాగతించారు. స్టూడెంట్స్ పరీక్షలకు బాగా సిధ్దమై ఉంటే సమస్యే ఉండదన్నారు. అటాంటప్పుడు సీబీఎస్ఈ పరీక్షల్ని మళ్లీ నిర్వహించడం పట్ల విద్యార్థులు కలత చెందాల్సిన పనిలేదని సూచించారు. రీ-టెస్ట్‌తో సిలబస్‌లో మార్పులేమీ ఉండవు గనుక పరీక్షలకు చక్కగా ప్రిపేర్ అయిన స్టూడెంట్స్‌కు సమస్య లేదన్నారు. అయితే ఆదరాబాదరాగా పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులకు సమస్యలు తప్పవని అభిప్రాయపడ్డారు. మొదటినుంచీ ప్రిపరేషన్ మొదలుపెడితే పరీక్షల్లో మంచి మార్కులు పొందొచ్చని విద్యార్థులకు ఆమె సూచించారు. రాణీ ప్రధాన పాత్రలో నటించిన ‘హిచ్కీ’ సినిమా సక్సెస్ మీట్లో ఆమె ఈ విషయాలు వెల్లడించారు. ఈ సినిమాలో ఆమె ‘టురేట్ సిండ్రోమ్’ అనే వ్యాధితో బాధపడే స్కూల్ టీచర్ పాత్రలో నటించారు. కాగా 12వ తరగతి ఎకనామిక్స్ పరీక్షను ఏప్రిల్ 25న తిరిగి నిర్వహించనున్నారు. అలాగే పదో తరగతి మ్యాథ్స్ పరీక్షను కేవలం ఢిల్లీ, హర్యానాలో మాత్రమే నిర్వహించాలని కేంద్ర విద్యాశాఖ యోచిస్తోంది. ఇందుకు సంబంధించి 15 రోజుల్లో నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపింది. -
ఆ సినిమాను మిస్ కాకండి: ఆమిర్‌ఖాన్
బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ఆమిర్‌ఖాన్‌కు ఏదైనా నచ్చితే వెంటనే స్పందిస్తాడు. తాజాగా రాణిముఖర్జీ ప్రధాన పాత్రలో నటించిన ‘హిచ్కి’ చిత్రంపై ట్వీట్ చేశాడు. సినిమాను మిస్ కాకండి ఇలాంటి చిత్రాలు అప్పుడప్పుడు మాత్రమే వస్తాయి అని పోస్ట్ చేశాడు. సిద్దార్థ్ మల్హోత్రా దర్శకత్వం వహించిగా, యశ్‌రాజ్ ఫిలిమ్స్ నిర్మించిన ఈ చిత్రం శుక్రవారం (మార్చి 23) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమాను వీక్షించిన ఆమిర్ ట్విటర్లో స్పందిస్తూ..‘చాలా కాలం తర్వాత ఒక మంచి సినిమా చూశాను. గొప్ప కథ, అద్భుత నటన, సూపర్ సినిమా, ఆద్యంతం ఆసక్తిని కలిగించేలా ఉంది. అదే హిచ్కి సినిమా. దయచేసి ఈ సినిమాను మిస్ కాకండి. రాణీ, సిద్దార్థ్, నీరజ్ కబి, చిత్ర బృందానికి ధన్యవాదాలు’ అని ట్వీట్ చేశాడు. pic.twitter.com/2oBbHjg2cS — Aamir Khan (@aamir_khan) March 22, 2018 -
పరీక్ష వాయిదా
‘‘పిల్లలూ... మీ ఎగ్జామ్స్ పూర్తి అయ్యాకే మా సినిమాను విడుదల చేస్తాం’’ అంటున్నారు ‘హిచ్కీ’ చిత్రబృందం. నాలుగేళ్ల తర్వాత రాణీ ముఖర్జీ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా ‘హిచ్కీ’. టురెట్స్ సిండ్రోమ్ (పదే పదే కళ్లార్పడం, రాని దగ్గు దగ్గడం, నత్తిగా మాట్లాడటం, పదే పదే వెక్కిళ్లు రావడం వంటి లక్షణాలు) తో బాధపడుతున్న టీచర్ పాత్రలో కనిపించనున్నారు రాణీ ముఖర్జీ. మన గోల్స్ నెరవేర్చుకోవటానికి మన బలహీనతలను బలంగా మార్చుకొని ఎలా ముందుకు సాగాలి? అని స్టూడెంట్స్‌ను మోటివేట్ చేసే కథాంశంతో సిద్ధార్ధ్ పి. మల్హోత్రా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ముందు ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 23న రిలీజ్ చేద్దాం అనుకున్నారు కానీ ఇప్పుడు ఒక నెల ఆలస్యంగా మార్చి 23న విడుదల చేయనున్నారు. ‘‘మార్చి నెలతో అందరి బోర్డ్ ఎగ్జామ్స్ కంప్లీట్ అవుతాయి. ఈ సినిమా కథ టీచర్, స్టూడెంట్స్ చుట్టూ తిరుగుతుంది. సో.. ఫిబ్రవరి కంటే మార్చిలో విడుదల చేస్తే ఇంకా బాగుంటుందని ఈ డేట్‌కు షిప్ట్ చేసుకున్నాం. అంతే కానీ ఎటువంటి క్లాష్ వల్ల, ఫెస్టివల్స్ కారణంగా కాదు’’ అని రిలీజ్ డేట్ మార్పు గురించి నిర్మాత మనీష్ శర్మ పేర్కొన్నారు. సో... స్టూడెంట్స్ ఎగ్జామ్స్ కోసం వీరి ఎగ్జామ్ (‘హిచ్కీ’)ను పోస్ట్‌పోన్ చేసుకున్నారన్నమాట. అంతే కదండీ.. ప్రతి సినిమా ఓ పరీక్షే. ఎంత మంచి సినిమా తీసినా యూనిట్‌కి ఆడియన్స్ చెప్పే రిజల్టే ముఖ్యం కదా. అందుకే మంచి టైమ్‌లో రిలీజ్ చేయాలనుకుంటారు. -
బాలీవుడ్ నటికి పితృవియోగం
ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ రాణీ ముఖర్జీ తండ్రి రామ్ ముఖర్జీ (84) అనారోగ్యంతో కన్నుమూశారు. ఈరోజు తెల్లవారు జామున నాలుగు గంటల సమయంలో రామ్ ముఖర్జీ తుదిశ్వాస విడిచారు. దాదాపు ఆరేళ్లుగా ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. గతంలో రాణీ ముఖర్జీ సినిమాలు వదులుకొని మరి తండ్రి వద్దే ఉన్నారు. అంతేకాదు తండ్రికోసమే రాణీ ముఖర్జీ 2012లో నిర్మాత ఆదిత్య చోప్రాను హడావిడిగా వివాహం చేసుకున్నారన్న వార్తలు కూడా వినిపించాయి. సినీ రంగానికి సుపరిచితుడైన రామ్ ముఖర్జీ హిందీ, బెంగాలీ చిత్రాలకు దర్శకుడిగా, నిర్మాతగా, రచయితగా పనిచేశారు. ఆయన మృతి పట్ల పలువురు బాలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలిపారు. -
అజరామర ప్రేమకావ్యం
* పాకిస్తానీ అమ్మాయి * హిందుస్తానీ అబ్బాయి * ఇరువురినీ ఒక్కటి చేసిందెవరు? తన తల్లితో ఒక కూతురు ‘‘అతను నన్ను కనీసం ముట్టుకోలేదమ్మా - కానీ, నేను నా సర్వస్వం అతనికి ఇచ్చేసి వచ్చాను’’ అంటుంది. ఆ కూతురి పాత్రని ప్రేమించ కుండా ఉండలేడు ఏ ప్రేక్షకుడూ! ప్రేమించిన అమ్మాయితో ఓ యువకుడు, ‘‘నీకోసం నవ్వుతూ ప్రాణాలు ఇవ్వగలిగిన వాడే నీకు సరైన భర్త’’ అంటాడు. ఆ యువకుణ్ని ఆ అమ్మాయితో సహా ప్రేమిం చకుండా ఉండలేడు ఏ ప్రేక్షకుడూ! ఇలాంటి పరిణతి చెందిన, పదునైన, నిజా యితీ కలిగిన పాత్రలున్న ప్రేమకథా చిత్రాన్ని ప్రతి ప్రేక్షకుడూ ప్రేమిస్తాడు. అందుకే ‘వీర్ - జారా’ని అందరూ ప్రేమించారు. కాసుల వర్షం కురిపించారు. ‘దిల్ తో పాగల్ హై’ వంటి సూర్హిట్ చిత్రం తీసిన యశ్‌చోప్రా ఏడేళ్ల తర్వాత మళ్లీ అదే షారుక్ ఖాన్ హీరోగా తెరకెక్కించిన అజరామర ప్రేమకావ్యం ‘వీర్-జారా’. జారాఖాన్ అనే పాకిస్తాన్ అమ్మాయికీ, వీర్ ప్రతాప్‌సింగ్ అనే భారతీయ అబ్బాయికీ మధ్య నడిచే హృద్యమైన ప్రేమకథ ‘వీర్-జారా’. చాలామంది అనుకుంటారు మొదటి చిత్రం తీసే యువకులే మంచి ప్రేమ కథలు తీయగలరని. నిజ జీవితం ఛాయలు వాళ్ల సీన్లలో, పాత్రల స్వభావాల్లో ఎక్కువ ఉంటాయి కాబట్టి, ప్రేక్షకులు ఐడెంటిఫై అవుతారని. అది కొంతవరకే నిజం. పాతబడినకొద్దీ వైన్‌లో కిక్ ఎక్కువ అయినట్టు, పరిణతి చెందిన కొద్దీ నిజమైన దర్శకుడు ప్రేమకథా చిత్రాల్ని అత్యద్భుతంగా మలచగలడు. అందుకు యశ్‌చోప్రా ఒక ఉదాహరణ. ‘ప్రేమన్నది పుస్తకాల్లో ఉంటుంది, పాటల్లో, కవితల్లో ఉంటుంది, జీవితంలో ఉండదు పిచ్చిదానా’... ఇలాంటి మాటలు రాయాలంటే, వాటిని తెరమీద సరైన సందర్భంలో, సరైన పాత్ర ద్వారా చెప్పించాలంటే దర్శకుడికి చాలా పరిణతి, అనుభవం ఉండాలి. ఒక మంచి ప్రేమకథ మనిషి మనసులో అంతర్లీనంగా నిక్షిప్తమై ఉన్న భావోద్వేగాలని పైకి తెస్తుంది. అలా పొంగిన అనుభూతుల వెల్లువలో మనసు తడుస్తుంది. తెలియకుండానే ఆ తడి కంటి నుంచి బైటకొస్తుంది. అది ఆ కథలోని గొప్పదనం కావచ్చు. అందులోని పాత్రల స్వభావాలు ఎక్కడో మనకి తెలుసున్నవో లేదా మనమో కావచ్చు. ఏదో ఒక సంభాషణో, సంఘటనో, అభినయమో, ఆ కథ క్రియేట్ చేసిన ఆరానో, మనని ఆ కథకుడో, దర్శకుడో పెట్టిన మూడో - కారణం ఏదైనా కానీ, రియాక్షన్ మాత్రం కళ్లు చెమ్మగిల్లడమే. అలా కళ్లు చెమర్చేలా చేసే అతికొన్ని మంచి ప్రేమకథల్లో ‘వీర్-జారా’ ఒకటి. ‘బ్యూటీ లైస్ ఇన్ ది బిహోల్డర్స్ ఐస్’ అన్నారు. అలా అని నాకు నచ్చే ప్రతి సినిమానీ నా కళ్లతో చూడమని కాదు. ఎవరి కళ్లతో వారే చూడాలి, ఎవరి మనసు తడిని వారి కళ్లల్లో వారే చూడాలి. ఎవరి బుర్రతో వారే ఆలోచించాలి. పోస్టర్ చూడగానే గొప్ప అభిప్రాయం ఏమీ కలగని సినిమా ‘వీర్-జారా’. యశ్‌చోప్రా పేరొక్కటే నాకు పర్సనల్‌గా ఎగ్జయిట్ మెంట్. దానికో కారణం ఉంది. హీరో హీరోయిన్ల ప్రేమ సన్నివేశాలలో ఎప్పుడూ గాలి వాడతారు. జుత్తు ఎగురుతూ ఆర్టిస్టులు చాలా రొమాంటిక్‌గా ఉంటారు ఈ దర్శకుడి సినిమాలలో. వైడ్ షాట్స్‌లో స్లో మోషన్లో పరుగెత్తే ప్రతి సన్నివేశంలోనూ హీరోయిన్ల డ్రెస్‌లో పెద్ద పల్లూ ఉండేట్టు చూసుకుంటారు. ఆ పల్లూ ఎగరడం చాలా అందంగా ఉంటుంది. హీరోలని ఫుల్ ఫిగర్లో బోల్డ్‌గా చూపిస్తారు సరైన టైమింగ్‌లో. ఆ షాట్ చూడ్డానికి చాలా బావుంటుంది. ఇది 35 ఎం.ఎం.లో మాత్రమే కుదురుతుందని అనుకునే వాడిని. కానీ, యశ్‌చోప్రా మాత్రమే సినిమా స్కోప్‌లో కూడా కుదిరించారు. అన్నిటికన్నా భారతీయ సినిమాలలో ప్రేమకథలకి, కుటుంబ బంధాల నేపథ్యమున్న కథలకి సంగీతం ఎంత ఆయువుపట్టో, సంగీతాన్ని పాటగానో, బ్యాక్గ్రౌండ్గానో ఎప్పుడెలా వాడు కోవాలో యశ్‌చోప్రా సినిమాలు చూసి నేర్చుకోవాలి. వీటన్నిటినీ మించి ప్రపంచంలో ఏ దేశంలో షూటింగ్ చేసినా, ఈయన సినిమాల్లో భారతదేశం పట్ల, భారతీయత పట్ల విపరీతమైన గౌరవం, అభిమానం కనపడతాయి. అందులోనూ తన సొంత రాష్ట్రం పంజాబ్‌ని, అక్కడి జీవన విధానాన్ని, పాత్రల్ని చాలా ఇష్టంగా, ఎక్కువ మమకారంతో, అందంగా చూపి స్తారు. అందుకే యశ్‌చోప్రా సినిమా అన గానే ఒక్కసారైనా ఆ సినిమా చూస్తాను. ఆయన ఆలోచనల్ని, రొమాంటిసిజమ్ని ఆస్వాదిస్తాను. 2004లో వస్తున్న చిత్రాల కథాంశాల స్పీడుని బట్టి చూస్తే ‘వీర్- జారా’ చాలా స్లోగా కనపడు తుంది. కానీ, 1950ల నుంచి 2015 దాకా వచ్చిన అజరా మరమైన చిత్రాలన్నింటిలో ‘వీర్-జారా’ ఒకటిగా నిలుస్తుంది. 25 కోట్లు ఖర్చు పెడితే, 95 కోట్ల వరకూ వసూలు చేసిన చిత్రాన్ని స్లో అని ఎలా అంటాం? ‘సోల్’ ఉన్న చిత్రం అంటాం గానీ. వీర్ ప్రతాప్‌సింగ్ భారత ఆర్మీ ఆఫీసర్. ఆపదలో చిక్కుకున్నవారిని రెస్క్యూ ఆపరేషన్లు చేసి కాపాడటంలో దిట్ట. జారాఖాన్ గారాబంగా పెరిగిన పాకిస్తానీ ధన వంతుల పిల్ల. లాహోర్‌లో ఉంటుంది. తన నానమ్మ ఆఖరి కోరికగా ఆమె అస్థికలు పంజాబ్‌లోని సట్లెజ్ కాలువలో కలపాలని, ఇంట్లో చెప్పకుండా బస్సెక్కి బోర్డర్ దాటేస్తుంది. ఆ బస్సుకి యాక్సిడెంట్ అవుతుంది. వీర్ ఆమెని కాపాడతాడు. అతని సహకారంతో నానమ్మ చివరి కోరిక తీరుస్తుంది. తనకు సాయపడినందుకుగాను వీర్ని ఏదైనా ఒక కోరిక కోరుకోమంటుంది. దాంతో అతడు తనతో ఒకరోజు సరదాగా ఉండమంటాడు. మొదట తటపటా యించినా, మాట ఇచ్చింది కాబట్టి సరే అంటుంది. వీర్‌తో అతని ఊరెళ్తుంది. అతన్ని పెంచిన మామ సుమీర్ చౌదరి, అత్త సరస్వతీ కౌర్‌ల ఆప్యాయత, ఆతిథ్యం అన్నీ చూసి మురిసి పోతుంది. ఆ ఊళ్లో బాలుర పాఠశాల మాత్రమే పెట్టి బాలికలని చదువుకోకుండా వివక్ష చూపు తున్నారని, అది తప్పు అని క్లాస్ తీసు కుంటుంది. ఆ సలహా నచ్చడంతో సుమీర్ జారా పేరుమీదే బాలికల ఉన్నత పాఠ శాలకి శంకుస్థాపన చేస్తాడు. ఇవన్నీ జరిగే క్రమంలో జారా పట్ల ఆకర్షితుడవుతాడు వీర్. కానీ ఆ విషయం బయటపెట్టడు. అంతలో జారా వెళ్లాల్సిన సమయం దగ్గర పడుతుంది. ఆమెను తీసుకుని స్టేషన్‌కి వెళ్తాడు వీర్. జారా రైలు ఎక్కబోతుండగా ఒక యువకుడు రావడం, అతడు తనకు కాబోయే భర్త అని జారా వీర్‌కి పరిచయం చేయడం, వీర్‌ను వదిలి అతడితో ఆమె పాకిస్తాన్ వెళ్లిపోవడం జరుగుతుంది. తీరా పాకిస్తాన్ వెళ్ళాక వీర్ జ్ఞాపకాలు జారాని వెంటాడతాయి. తాను వీర్ని ప్రేమిస్తున్న విషయం ఆమెకు అర్థమవుతుంది. అతడి కోసం పరితపిస్తుంది. దాంతో జారా స్నేహితురాలు వీర్ని పిలి పించడం, జారా తల్లిదండ్రులు ఒప్పుకోక పోవడంతో వీర్ త్యాగం చేయడానికి సిద్ధపడి భారతదేశానికి తిరిగి ప్రయాణ మవుతాడు. సరిగ్గా అప్పుడే జారాకి కాబోయే భర్త వీర్ని అరెస్ట్ చేయిస్తాడు. వేరే పేరుతో అస్తిత్వం క్రియేట్ చేసి అతనిపై భారతదేశ గూఢచారిగా ముద్ర వేసి, శిక్ష పడేలా చేస్తాడు. దాంతో 22 సంవత్సరాలు వీర్ జైల్లోనే ఉండిపోతాడు. ఆ తర్వాత పాకిస్తాన్ లాయరు, మానవ హక్కుల సంఘం సభ్యురాలు అయిన సామియా సిద్ధిఖీ... వీర్ కేసును వాదించ డానికి సిద్ధపడుతుంది. చివరికి తనే వీర్, జారాలను కలుపుతుంది. ఈ చిత్రంలో ప్రతి మాటా ఒక రసగుళిక. ప్రతి పాటా ఒక ఆణిముత్యం. ప్రతి ఫ్రేమూ కన్నులపండుగ. ప్రేమించిన యువతి కోసం తన సర్వస్వాన్నీ త్యాగం చేసిన ప్రేమికుడిగా షారుఖ్ కంటతడి పెట్టించాడు. అతడిని కాపాడేందుకు తపించే న్యాయవాదిగా రాణీ ముఖర్జీ నటన అమోఘం. మొత్తంగా అవార్డుల్ని సాధించి, ప్రేక్షకుల కన్నుల్ని తడిపేసిన ‘వీర్-జారా’ ఓ గొప్ప ప్రేమకథగా బాలీవుడ్ చరిత్రలో మిగిలిపోయింది! - వి.ఎన్.ఆదిత్య, సినీ దర్శకుడు హీరో హీరోయిన్ల ప్రేమ సన్నివేశాలలో ఎప్పుడూ గాలి వాడతారు. జుత్తు ఎగురుతూ ఆర్టిస్టులు చాలా రొమాంటిక్‌గా ఉంటారు ఈ దర్శకుడి సినిమాలలో. వైడ్ షాట్స్‌లో స్లో మోషన్లో పరుగెత్తే ప్రతి సన్నివేశంలోనూ హీరోయిన్ల డ్రెస్‌లో పెద్ద పల్లూ ఉండేట్టు చూసుకుంటారు. ఆ పల్లూ ఎగరడం చాలా అందంగా ఉంటుంది. - రాణీముఖర్జీ