విలక్షణ నటుడు కమల్‌హాసన్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన పీరియాడికల్ డ్రామా చిత్రం 'హే రామ్'. ఇందులో షారుఖ్‌ఖాన్, రాణి ముఖర్జీ కీలక పాత్రలు పోషించారు. ఎన్నో వివాదాల మధ్య 2000 సంవత్సరంలో విడుదలైంది ఈ చిత్రం. అప్పట్లో మంచి టాక్‌ను తెచ్చుకోవడంతో పాటు కమల్ కెరీర్‌లో విభిన్న చిత్రంగా నిలిచింది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా తాజాగ ఈ చిత్రాన్ని నేరుగా యూట్యూబ్ ఛానెల్‌లో నేడు సాయంత్రం 6 గంటలకు విడుదల చేయనున్నారు. ఈమేరకు కమల్ హాసన్ సొంత నిర్మాణ సంస్థ రాజ్ కమల్ ఫిలింస్ ఇంటర్నేషనల్ సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది.
షారుఖ్ ఖాన్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
ఇక ఈ సినిమాలో షారుఖ్ ఖాన్ కీలక పాత్ర పోషించారు. అయితే, ఇందులో షారుఖ్‌చేసిన పాత్ర కోసం ఆయన రెమ్యునరేషన్‌గా ఒక్క రూపాయి కూడా తీసుకోలేదట. ఈ విషయాన్ని కమల్‌హాసన్ గతంలో స్వయంగా చెప్పారు. ఇలాంటి కథను, చిత్రాన్ని భవిష్యత్‌లో మళ్లీ చేసే అవకాశం రాదని షారుఖ్ భావించారట. కానీ ఈ సినిమాకు గుర్తుగా తన చేతి గడియారాన్ని ఆయనకు కమల్ ఇచ్చారట. ఈ సినిమాలో భారత్- పాకిస్థాన్ విభజన, మహాత్మ గాంధీని నాథూరాం గాడ్సే హత్య చేయడం వంటి అంశాలను చూపించారు. ఈ సినిమాను ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో ప్రదర్శించారు.
మూడు జాతీయ అవార్డులు
అప్పట్లో 'హే రామ్' విమర్శకుల ప్రశంసలు అందుకుంది. మూడు జాతీయ అవార్డులను సొంతం చేసుకుంది. ఉత్తమ సహాయ నటుడిగా అతుల్ కుల్‌కర్ణి, ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్‌గా సారిక, ఉత్తమ విజువల్ ఎఫెక్ట్ విభాగంలో మంత్రకు అవార్డులు వచ్చాయి. అంతే కాదు అంతర్జాతీయ స్థాయిలోనూ సత్తా చాటింది. 25వ టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్, 2000 లోకార్నో ఫెస్టివల్‌లో ఈ సినిమాను ప్రదర్శించారు. స్వాతంత్య్ర దినోత్సవం రోజున ఈ సినిమాతో నాటి అనుభూతి పొందాలంటే 'హే రామ్' చూడాల్సిందే.
Experience the brilliance of #Ulaganayagan #KamalHaasan in the Cult Classic #HeyRam
— Raaj Kamal Films International (@RKFI) August 14, 2023
Streaming Tomorrow at 6 PM ➡️ https://t.co/n9afe1tmUq
@ikamalhaasan @ilaiyaraaja @iamsrk pic.twitter.com/ZU3agwYqvA
Comments
Please login to add a commentAdd a comment