విక్రమ్‌, జైలర్‌ సినిమాలను మించిపోయేలా పాన్‌ ఇండియా రేంజ్‌లో.. | Shah Rukh Khan, Mammootty and Chiyaan Vikram in Kamal Haasan's Next Movie - Sakshi
Sakshi News home page

జైలర్‌ ఫార్ములా ఫాలో అవుతున్న కమల్‌ హాసన్‌! ఆ ముగ్గురు స్టార్‌ హీరోలతో..

Published Thu, Sep 7 2023 12:21 PM | Last Updated on Thu, Sep 7 2023 12:33 PM

Shah Rukh Khan, Mammootty and Chiyaan Vikram in Kamal Haasan Movie - Sakshi

లోకనాయకుడు కమల్‌ హాసన్‌, ప్రఖ్యాత దర్శకుడు మణిరత్నం కాంబో అంటే మామూలుగా ఉండదు. ఇంతకు ముందు వీరి కాంబినేషన్‌లో వచ్చిన నాయకన్‌ చిత్రం ఎంతటి సంచలన విజయం సాధించిందో తెలిసిందే. కాగా చాలా గ్యాప్‌ తరువాత మరోసారి ఈ కాంబోలో సినిమా తెరకెక్కనున్నట్లు అధికారికంగా ప్రకటన చేశారు కూడా! కమల్‌ హాసన్‌ 234వ చిత్రంగా తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని లైకా సంస్థ, మణిరత్నం మద్రాస్‌ టాకీస్‌ కలిసి నిర్మించనున్నట్లు సమాచారం.

జైలర్‌ను మించిపోయేలా..
త్వరలో సెట్‌ పైకి వెళ్లడానికి రెడీ అవుతున్న ఈ చిత్రం గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ చిత్రం కమల్‌ హాసన్‌ నటించిన విక్రమ్‌, రజనీకాంత్‌ నటించిన జైలర్‌ చిత్రాల తరహాలో.. అంతకు మించిన స్థాయిలో రూపొందించడానికి మణిరత్నం సిద్ధం అయినట్లు తెలిసింది. ఇందులో ప్రముఖ హీరోలు నటించనున్నట్లు టాక్‌. బాలీవుడ్‌ బాద్‌షా  షారుక్‌ ఖాన్‌, మలయాళ సూపర్‌స్టార్‌ మమ్ముట్టి నటించనున్నట్లు సమాచారం. 

కమల్‌ సినిమాలో ఆ స్టార్‌ హీరోలు
మరో ముఖ్య పాత్రలో హీరో శింబును నటింపజేయాలని ప్రయత్నించినా, కొన్ని కారణాల వల్ల ఆయన సెట్‌ కాకపోవడంతో తనను పక్కన పెట్టేశారు. ఆ పాత్రలో హీరో సూర్యను ఎంపిక చేసే ప్రయత్నాలు జరిగాయనీ, అయితే ఆయన నటించే పరిస్థితి లేకపోవడంతో ఇప్పుడు హీరో విక్రమ్‌ను తీసుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. ఇదే కాంబో సెట్‌ అయితే చిత్రం స్థాయి మరింత పెరిగిపోతుందని చెప్పనక్కర్లేదు.

చదవండి: ముద్దు కావాలంటూ గోల చేసిన తేజ.. మొత్తానికి సాధించాడు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement