హీరోగా నటించనున్న తమన్‌? 22 ఏళ్ల తర్వాత..! | Buzz: Music Director Thaman to Star in a Tamil Film | Sakshi
Sakshi News home page

Thaman: వెండితెరపై హీరోగా కనిపించనున్న తమన్‌.. ఆ కథానాయకుడితో కలిసి..!

Jan 30 2025 1:00 PM | Updated on Jan 30 2025 3:19 PM

Buzz: Music Director Thaman to Star in a Tamil Film

టాప్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ తమన్‌ (Thaman S) మళ్లీ కెమెరా ముందుకు రానున్నాడు. ఈయన తొలిసారి నటుడిగా యాక్ట్‌ చేసిన చిత్రం బాయ్స్‌. సిద్దార్థ్‌, జెనీలియా హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం 2003లో రిలీజై సక్సెస్‌ సాధించింది. ఈ మూవీలో తమన్‌.. మ్యూజికల్‌ బ్యాండ్‌లో ఒకరిగా నటించాడు. తర్వాత మాత్రం అతడు నటనపై కాకుండా సంగీతంపైనే దృష్టి పెట్టాడు. మిస్టర్‌ మజ్ను, బేబీ జాన్‌ సినిమాల్లో కేవలం ఏదో ఒక సీన్‌/పాటలో అలా కనిపించి ఇలా వెళ్లిపోయాడు. 

అయితే ఈసారి పూర్తి స్థాయిలో హీరోగా కనిపించేందుకు సిద్ధమవుతున్నాడట! హీరో అధర్వతో కలిసి తమిళంలో ఓ మూవీ చేయబోతున్నాడని ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రాన్ని మల్టీస్టారర్‌గా తెరకెక్కించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుస్తోంది. మరి ఇదెంతవరకు నిజమనేది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేవరకు ఆగాల్సిందే!

(చదవండి: కుటుంబంలో విషాదం.. పాడె మోసిన హీరో రానా)

సంగీత దర్శకుడిగా..
తమన్‌ తండ్రి అశోక్‌ డ్రమ్మర్‌, తల్లి సావిత్రి సింగర్‌. ఇంట్లో సంగీత నేపథ్యం వల్ల చిన్న వయసులోనే డ్రమ్స్‌ వాయించేవాడు. మ్యూజిక్‌ డైరెక్టర్‌గా మారడానికి ముందు దాదాపు 900 సినిమాలకు డ్రమ్మర్‌గా పని చేశాడు. బాయ్స్‌ మూవీలోనూ డ్రమ్స్‌ వాయించే కుర్రాడిగా కనిపించాడు. మళ్లీ మళ్లీ చిత్రంతో టాలీవుడ్‌కు సంగీత దర్శకుడిగా పరిచయమయ్యాడు తమన్‌. కిక్‌ సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించాడు. అలా తెలుగు, తమిళంలో టాప్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌గా రాణిస్తున్నాడు. హిందీలోనూ రెండు చిత్రాలకు పని చేశాడు. వివిధ భాషల్లో కలుపుకుని వందకు పైగా చిత్రాలకు సంగీతం అందించాడు. తెలుగు, తమిళంలో పలు పాటలు ఆలపించాడు. అల వైకుంఠపురములో సినిమాకుగానూ ఉత్తమ సంగీత దర్శకుడిగా జాతీయ అవార్డు అందుకున్నాడు. ఇటీవల డాకు మహారాజ్‌, గేమ్‌ ఛేంజర్‌ చిత్రాలకు పని చేశాడు.

చదవండి: చివరి కోరిక తీరకుండానే ప్రాణాలు వదిలేసిన నటుడు సాక్షి రంగారావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement