ss thaman
-
‘అఖండ 2’ నుంచే కారు గిఫ్ట్.. బాలయ్య రెమ్యునరేషన్ ఎంతంటే?
ఇటీవల సంగీత దర్శకుడు తమన్‌కి హీరో బాలకృష్ణ(Balakrishna ) ఓ కారు గిఫ్ట్‌గా ఇచ్చిన సంగతి తెలిసిందే. దాని ధర దాదాపు కోటీన్నర వరకు ఉంటుంది. బాలయ్య నుంచి అంతపెద్ద బహుమతి రావడం తమన్‌తో పాటు టాలీవుడ్ మొత్తాన్ని ఆశ్చర్యానికి గురి చేసింది. నిజంగా బహుమతిగానే ఇచ్చాడా? లేదంటే దీని వెనుక ఏదైనా మతలబు ఉందా? అని నెటిజన్స్ చర్చిస్తున్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ కోసం తమన్ ఫ్రీగా ఫండ్ రైజింగ్ ప్రొగ్రాం చేశాడు. దానికి ప్రతిఫలంగా బాలయ్య ఈ గిఫ్ట్ ఇచ్చాడనే వార్తలు కూడా నెట్టింట వినిపించాయి. (చదవండి: సినీతారలకు ముద్దులూ, రొమాన్స్ నేర్పేది వీరే...)అయితే ఇక్కడ వాస్తవం ఏంటనేది ఎవరికీ తెలియదు. గిఫ్ట్‌గా ఇచ్చానని బాలయ్య చెప్పడం..అభిమానంతో ఇచ్చాడని తమన్ మురిసిపోవడం మాత్రమే అందరికి తెలుసు. అయితే టాలీవుడ్లో ఇలా ఒకరు మరొకరి గిఫ్ట్ ఇచ్చారంటే.. ఏదో ఆశించి ఇచ్చినట్టేననే టాక్ అయితే ఉంది. అది సినమాల పరంగానా లేదా పర్సనల్గానా అనేది తెలియదు కానీ బహుమతి వెనుక బహుళ ప్రయోజనాలే ఉంటాయి.ఇటీవల బాలయ్య నటించిన చిత్రాలన్నింటికి తమనే సంగీతం అందిస్తున్నాడు. ‘డిక్టేటర్’, ‘అఖండ’, ‘వీరసింహారెడ్డి’, ‘భగవంత్ కేసరి’ ‘డాకు మహారాజ్’ ఇవన్నీ మ్యూజిక్ పరంగా మంచి విజయం సాధించాయి. అందుకే తమన్ బాలయ్యకు క్లోజ్ అయ్యాడు. ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో బాలయ్య హీరోగా నటిస్తున్న ‘అఖండ 2’(Akhanda 2 Movie) కి కూడా తమనే సంగీతం అందిస్తున్నాడు. అయితే బాలయ్య కెరీర్‌కి బిగ్గెస్ట్ విజయాలు అందించిన బోయపాటిని కాదని తమన్‌కు బహుమతి ఇవ్వడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ గిఫ్ట్‌కి అఖండ 2 నిర్మాతలు రామ్ ఆచంట, గోపీ ఆచంట డబ్బులు ఇచ్చారట. తన రెమ్యునరేషన్లో డబ్బులు కట్ చేసి కారు కొనివ్వమని బాలయ్య చెప్పడంతో నిర్మాతలు ఆ పని చేశారట. ఇక్కడ మరో విషయం ఏంటంటే.. ఆఖండ 2కి బాలయ్య అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్నారట. రూ.35 కోట్ల వరకు పారితోషికంగా అందుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఇదంతా వాయిదాల ప్రకారం బాలయ్య చేతికి చేరుతుంది. డాకు మహారాజ్‌కి రూ.28 కోట్లు తీసుకున్న బాలయ్య..తదుపరి చిత్రానికి ఏకంగా 7 కోట్లను పెంచేశాడు. అయితే ఇతర స్టార్ హీరోలతో పోలిస్తే మాత్రం బాలయ్య తీసుకునేది తక్కువే అని ఇండస్ట్రీ టాక్. -
కొందరిని నమ్మితే మోసం చేశారు: ఎస్ఎస్ తమన్
టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ తమన్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన తమన్ తన కెరీర్ గురించి మాట్లాడారు. కొందరిని నమ్మి తాను కూడా మోసపోయానని వెల్లడించారు. తన సినీ కెరీర్లో ఇప్పటి వరకు చాలా విషయాలు నేర్చుకున్నానని వెల్లడించారు. మన జీవితంలో చాలామందిని నమ్ముతామని.. కానీ ఏదో ఒక సమయంలో మోసపోతామని తెలిపారు. నా జీవితంలో కూడా అలాంటి అనుభవం ఎదురైందని అన్నారు. చాలావరకు డబ్బులు పోగొట్టుకున్నానని తమన్ వెల్లడించారు.తమన్ మాట్లాడుతూ.. ' నా కెరీర్ నాకు జీవిత పాఠాలు చాలా నేర్పింది. కొందరిని నమ్మి చాలా డబ్బులు కూజా పొగొట్టుకున్నా. నేను నమ్మడం వల్లే నన్ను మోసం చేశారు. మనలో చాలామందికి ఇలాంటి అనుభవం ఎదురై ఉంటుంది. చిన్నప్పటి నుంచి నాకు క్రికెట్ అంటే చాలా ఇష్టం. పనిలో ఒత్తిడికి గురైనప్పుడు వెంటనే గ్రౌండ్లోకి అడుగుపెడతా. మాకంటూ ఒక స్పెషల్ టీమ్ ఉండాలని భావించేవాడిని. స్టార్ క్రికెటర్లు ఆడిన మైదానంలో ఆడాలనేది నా కోరిక. సెలబ్రిటీ క్రికెట్ లీగ్‌లో భాగం కావడంతో ఆ బాధ కూడా తీరిపోయింది' అని అన్నారు. కాగా.. రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్‌కు ఎస్ఎస్ తమన్ సంగీతమందించారు. -
హీరోగా నటించనున్న తమన్? 22 ఏళ్ల తర్వాత..!
టాప్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ (Thaman S) మళ్లీ కెమెరా ముందుకు రానున్నాడు. ఈయన తొలిసారి నటుడిగా యాక్ట్ చేసిన చిత్రం బాయ్స్. సిద్దార్థ్, జెనీలియా హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం 2003లో రిలీజై సక్సెస్ సాధించింది. ఈ మూవీలో తమన్.. మ్యూజికల్ బ్యాండ్‌లో ఒకరిగా నటించాడు. తర్వాత మాత్రం అతడు నటనపై కాకుండా సంగీతంపైనే దృష్టి పెట్టాడు. మిస్టర్ మజ్ను, బేబీ జాన్ సినిమాల్లో కేవలం ఏదో ఒక సీన్/పాటలో అలా కనిపించి ఇలా వెళ్లిపోయాడు. అయితే ఈసారి పూర్తి స్థాయిలో హీరోగా కనిపించేందుకు సిద్ధమవుతున్నాడట! హీరో అధర్వతో కలిసి తమిళంలో ఓ మూవీ చేయబోతున్నాడని ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రాన్ని మల్టీస్టారర్‌గా తెరకెక్కించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుస్తోంది. మరి ఇదెంతవరకు నిజమనేది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేవరకు ఆగాల్సిందే!(చదవండి: కుటుంబంలో విషాదం.. పాడె మోసిన హీరో రానా)సంగీత దర్శకుడిగా..తమన్ తండ్రి అశోక్ డ్రమ్మర్, తల్లి సావిత్రి సింగర్. ఇంట్లో సంగీత నేపథ్యం వల్ల చిన్న వయసులోనే డ్రమ్స్ వాయించేవాడు. మ్యూజిక్ డైరెక్టర్‌గా మారడానికి ముందు దాదాపు 900 సినిమాలకు డ్రమ్మర్‌గా పని చేశాడు. బాయ్స్ మూవీలోనూ డ్రమ్స్ వాయించే కుర్రాడిగా కనిపించాడు. మళ్లీ మళ్లీ చిత్రంతో టాలీవుడ్‌కు సంగీత దర్శకుడిగా పరిచయమయ్యాడు తమన్. కిక్ సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించాడు. అలా తెలుగు, తమిళంలో టాప్ మ్యూజిక్ డైరెక్టర్‌గా రాణిస్తున్నాడు. హిందీలోనూ రెండు చిత్రాలకు పని చేశాడు. వివిధ భాషల్లో కలుపుకుని వందకు పైగా చిత్రాలకు సంగీతం అందించాడు. తెలుగు, తమిళంలో పలు పాటలు ఆలపించాడు. అల వైకుంఠపురములో సినిమాకుగానూ ఉత్తమ సంగీత దర్శకుడిగా జాతీయ అవార్డు అందుకున్నాడు. ఇటీవల డాకు మహారాజ్, గేమ్ ఛేంజర్ చిత్రాలకు పని చేశాడు.చదవండి: చివరి కోరిక తీరకుండానే ప్రాణాలు వదిలేసిన నటుడు సాక్షి రంగారావు -
మానసిక ఉల్లాసానికి క్రీడలు దోహదం చేస్తాయి
హైదరాబాద్: క్రీడలు శారీరక దేహ దారుడ్యానికే కాకుండా మానసికంగా ఉల్లాసంగా ఉండటానికి కూడా ఎంతో దోహదం చేస్తాయని సంగీత దర్శకుడు ఎస్ఎస్ తమన్ అన్నారు. ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ 2025 జాతీయ సదస్సు హెచ్ఐసీసీలో నిర్వహించిన సందర్భంగా నిర్వహించిన క్రీడా పోటీలను ఆయన బ్రిటిష్ ఇండియన్ సైకియాట్రిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ శ్రీదేవి మహాలింగప్పతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మన నిత్యం జీవితంలోని ఎన్నో టెన్షన్స్ను, పని ఒత్తిడిని తగ్గించుకోవాలంటే ఖచ్చితంగా క్రీడలు ఆడాల్సిందేనని అన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన క్రీడా పోటీల్లో సౌత్ జోన్ సభ్యులు విజేతలుగా నిలిచారు. వారికి థమన్ ట్రోఫీని అందజేశారు. ఈ కార్యక్రమంలో నటుడు అశ్విన్ బాబు, ఆర్గనైజింగ్ చైర్మన్ డాక్టర్ పి. కిషన్, సెక్రటరీ డాక్టర్ ఉమా శంకర్, కోశాధికారి డాక్టర్ జార్జ్ రెడ్డి, డాక్టర్ విశాల్ ఆకుల, న్యూరో సైకియాట్రిస్ట్ డాక్టర్ హరిశ్చంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
తొమ్మిదేళ్లకే ఇండస్ట్రీలోకి.. ఆరో తరగతిలోనే చదువుకి పుల్‌స్టాప్.. తమన్ గురించి ఇవి తెలుసా? (ఫొటోలు)
-
ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్వీట్.. స్పందించిన మ్యూజిక్ డైరెక్టర్ తమన్!
ఇటీవల ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తూ పాటపాడిన అంధగాయకుడిపై తమన్ ప్రశంసలు కురిపించారు. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక టాలెంట్ ఉంటుందని ఆయన అన్నారు. అతని ప్రతిభకు ఫిదా అయిన టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ తెలుగు ఇండియన్ ఐడల్‌లో పాడే అవకాశం కల్పిస్తానంటూ హామీ ఇచ్చారు. ఈ మేరకు ఆయన ట్విటర్ వేదికగా స్పందించారు. అతడితో కలిసి తానూ పాడుతానంటూ పోస్ట్ చేశారు.అంతకుముందు తెలంగాణ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ఆ బాలుడి వీడియోను ఎక్స్‌లో పోస్ట్ చేశారు. మనం చూడాలే కానీ.. ఇలాంటి మట్టిలో మాణిక్యాలు ఎన్నో..! ఈ అంధ యువకుడు అద్భుతంగా పాడారు కదా..! ఒక అవకాశం ఇచ్చి చూడండి అంటూ సోషల్ మీడియా వేదికగా కోరారు. దీనిపై స్పందించిన ఎస్ఎస్ తమన్ ఆ బాలుడికి తెలుగు ఇండియన్ ఐడల్‌లో పాడే అవకాశమిస్తానని తమన్ ట్వీట్ చేశారు.తమన్‌కు సజ్జనార్ కృతజ్ఞతలుఆర్టీసీ బస్సులో పాటపాడిన బాలుడికి అవకాశమిచ్చినందుకు తమన్‌కు ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు ట్విటర్ వేదికగా పోస్ట్ చేశారు. అద్భుతమైన కంఠంతో పాటలు ఆలపిస్తోన్న ఈ అంధ యువకుడికి తెలుగు ఇండియన్ ఐడల్‌లో అవకాశం ఇచ్చేలా చూస్తానని ప్రకటించిన ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు అంటూ పోస్ట్ చేశారు. అలాగే ఈ అవకాశంతో అద్భుతమైన తన టాలెంట్‌కు మరింతగా గుర్తింపు దక్కుతుందని అన్నారు. భవిష్యత్‌లో తన మధురమైన గాత్రంతో ఎంతో మందిని మంత్ర ముగ్దులను చేస్తూ ఈ యువకుడు ఉన్నతంగా ఎదుగుతారని ఆశిస్తున్నట్లు రాసుకొచ్చారు. అద్భుతమైన కంఠంతో పాటలు ఆలపిస్తోన్న ఈ అంధ యువకుడికి @ahavideoIN నిర్వహిస్తోన్న తెలుగు ఇండియన్ ఐడల్ లో అవకాశం ఇచ్చేలా చూస్తానని ప్రకటించిన ప్రముఖ సంగీత దర్శకుడు @MusicThaman గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ అవకాశంతో అద్భుతమైన తన టాలెంట్‌కు మరింతగా గుర్తింపు ద… https://t.co/9Z4HR44QFF— V.C. Sajjanar, IPS (@SajjanarVC) November 14, 2024 I will make sure he Performs in #TeluguIndianIdolS4@ahavideoIN pls consider as my request and order 📢❤️🎧⭐️▶️💥Will have his Special Performance and I will perform along with him ❤️✨🙌🏿What a Talent what perfect pitching 🖤God is sometimes harsh But we humans are there… https://t.co/CqjEU0QHfc— thaman S (@MusicThaman) November 13, 2024 -
Children Eye Care Week బాల్య శుక్లాలపై నిర్లక్ష్యం వద్దు..
బంజారాహిల్స్: ఎల్వీప్రసాద్ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 7 నుంచి 14వ తేదీ వరకూ నిర్వహించే బాలల నేత్ర సంరక్షణ వారోత్సవాల్లో భాగంగా ఆదివారం అవగాహనా వాక్‌ను నిర్వహించారు. ‘బాల్య శుక్లాలు–పిల్లల చూపుపై వాటి ప్రభావం–త్వరిత గుర్తింపు–చికిత్స ప్రాధాన్యత’ థీమ్‌తో ఈ వారోత్సవాలను నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో కల్లం అంజిరెడ్డి ప్రాంగణంలో ఆదివారం నిర్వహించిన వాక్‌ను సినీ సంగీత దర్శకుడు తమన్ ఎస్, నటుడు విశ్వ కార్తికేయలు ప్రారంభించారు. దాదాపు 300 మంది చిన్నారులు, వారి తల్లిదండ్రులు ఫ్లకార్డులు చేతబూని బాల్యశుక్లాలపై అవగాహన క్పలించే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా తమన్ మాట్లాడుతూ ఈ వాక్‌లో పాల్గొనడం తనకెంతో సంతోషాన్ని ఇచ్చిందన్నారు. అయితే పిల్లల కంటి సమస్యలను త్వరితగతిన గుర్తించగలిగితే వారి సమస్యలను దూరం చేయవచ్చని, ఆ దిశగా తల్లిదండ్రులు అవగాహన పొందాలని కోరారు. ఎల్వీ ప్రసాద్ చైల్డ్ సైట్ ఇన్స్టిట్యూట్ అధిపతి డాక్టర్ రమేష్ కెకున్నయ్య మాట్లాడుతూ రోగ నిర్ధారణను త్వరితగతిన గుర్తించి చికిత్స అందించడం ద్వారా అత్యుత్తమ ఫలితాలు ఉంటాయన్నారు. బాల్య కంటి శుక్లం చికిత్స చేయకుండా వదిలేస్తే, చివరకు పునరుద్ధరించలేని విధంగా హాని చేయవచ్చన్నారు. ఈ నెల 14 వరకూ ఎల్వీప్రసాద్ ఆస్పత్రి ఆవరణలో చిత్రలేఖనం, ఫ్యాన్సీ డ్రెస్, వక్తృత్వ, క్లే మౌల్డింగ్, బ్రెయిలీ చదవడం, పోటరీ సెషన్లు నిర్వహించి బాలల దినోత్సవం రోజున బహుమతులు ప్రదానం చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. -
రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్'.. ఆ డేట్ ఫిక్స్ అయినట్టే!
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న చిత్రం గేమ్ ఛేంజర్. ఆర్ఆర్ఆర్ తర్వాత మెగా హీరో నటిస్తోన్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. శంకర్ డైరెక్షన్లో ఈ మూవీని పొలిటికల్ యాక్షన్ డ్రామా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ భామ కియారా అద్వానీ హీరోయిన్గా కనిపించనుంది.అయితే మెగా ఫ్యాన్స్ గేమ్ ఛేంజర్ అప్డేట్స్ కోసం తెగ ఆరా తీస్తున్నారు. ఈ ఏడాది క్రిస్మస్కు రిలీజవుతుందని నిర్మాత దిల్ రాజు ప్రకటించారు. కానీ విడుదల తేదీపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. తాజాగా మ్యూజిక్ డైరెక్టర్ గేమ్ ఛేంజర్ విడుదలపై హింట్ ఇచ్చాడు. వచ్చే వారం నుంచే గేమ్ ఛేంజర్‌కు సంబంధించిన అన్‌స్టాపబుల్ ఈవెంట్స్ డిసెంబర్ 20 వరకు జరుగుతాయని పోస్ట్ చేశారు. దీంతో గేమ్ ఛేంజర్ డిసెంబర్ 20న రిలీజ్ కానుందని అభిమానులు భావిస్తున్నారు. దాదాపు ఈ తేదీ ఖరారు అయినట్లే. కాగా.. ఈ చిత్రం శ్రీకాంత్, ఎస్జే సూర్య, అంజలి, నవీన్ చంద్ర కీలక పాత్రల్లో నటించారు.రామ్ చరణ్ బిజీ..గేమ్ ఛేంజర్ షూటింగ్ పూర్తి కావడంతో రామ్ చరణ్ నెక్స్ట్ మూవీకి రెడీ అవుతున్నారు. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సనా డైరెక్షన్లో చెర్రీ నటిస్తున్నారు. ఇందులో గ్లోబల్ స్టార్ సరసన బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్గా కనిపించనుంది. ఇటీవల ఈ మూవీ కోసం ఫిట్నెస్ ట్రైనర్ శివోహంతో కలిసి కసరత్తులు చేస్తున్నట్లు ట్విటర్లో పోస్ట్ చేశారు. From next week it will be an unstoppable Events forand releases for #GAMECHANGER till DEC 20 th 2024 ❤️🧨✨Get ready guys !!— thaman S (@MusicThaman) September 18, 2024 -
తమన్ చిలిపి పనులను బయటపెట్టిన తల్లి
తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 రసవత్తరంగా జరుగుతోంది. ప్రతి వారం ఎపిసోడ్ అభిమానులకు థ్రిల్ పంచుకున్నాయి. ఇప్పుడీ మెగా మ్యూజిక్ షోలో మరో స్పెషల్ మూమెంట్. ఈ షోకి జడ్జ్ గా ఉంటున్న సెన్సేషనల్ కంపోజర్ తమన్ అమ్మ గారు కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. దీనికి సంబధించిన ప్రోమో ఇప్పుడు వైరల్ గా మారింది. తమన్ గురించి చాలా ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. ఘంటసాల సాయి శ్రీనివాస్ అలియాస్ తమన్ చిన్నప్పటి ముచ్చట్లు చెప్పారు. తమన్ చిన్నప్పుడు క్లాస్ రూమ్ లో కన్నా మైదానంలోనే ఎక్కువగా ఉండేవాడని, తనకి అస్సలు భయం లేదని, స్కూళ్లలో గొడవలు వచ్చేవని చెప్పారు. తొటి పిల్లల టిఫిన్ బాక్స్ లు ఓపెన్ చేసి తినేసేవాడని కంప్లయింట్ లు ఉండేవని అలనాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు. ఐతే తను హార్డ్ వర్క్ చేస్తాడని, వర్క్ అయ్యే వరకు తిండి కూడా పట్టించుకోడని, సంగీతం క్రికెట్ తనకి మరో ప్రపంచం లేదని .. ఇలా చాలా సంగతులు చెప్పారు. -
కన్నీళ్లు తెప్పిస్తున్న విద్యార్థి కష్టాలు.. విజయ్, తమన్ సాయం
తమిళనాడులోని కోవిల్పట్టికి చెందిన ఓ విద్యార్థి కుటుంబానికి దళపతి విజయ్ సాయం చేశారు. ఓ టీవీ ఛానల్ చర్చా కార్యక్రమంలో పాల్గొన్న ఆ విద్యార్థి తన కుటుంబ పరిస్థితుల కారణంగా కాలేజీకి వెళ్తూనే.. కూలి పని కూడా చేస్తున్నట్లు చెప్పాడు. ఆ వీడియో కాస్త హీరో విజయ్ వరకు చేరింది. దీంతో ఆ విద్యార్థి చదువుకు అయ్యే ఖర్చుల కోసం వెంటనే రూ. 25వేలు అందించారు. ఆ విద్యార్థి చదువు విషయంలో పూర్తి బాధ్యత తనే తీసుకుంటున్నట్లు తెలిపారు.టీవీ ఛానల్లో ప్రసారమైన చర్చా కార్యక్రమంలో ఓ విద్యార్థి మాట్లాడుతూ.. మార్కెట్ యార్డ్‌లో మూటలు మోస్తూ చదువుకుంటున్నట్లు చెప్పాడు. కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగానే తాను చదవుకుంటూ ఈ పని చేస్తున్నట్లు చెప్పాడు. మూటలు మోయడం వల్ల తన భుజం నొప్పిగా ఉంటుందని వాపోయాడు. అయినా, తన అమ్మకు ఆసరా కల్పించేందుకే ఆ నొప్పిని భరిస్తూ మూటలు మోస్తున్నానని చెప్పాడు. కానీ తాను నొప్పితో ఇబ్బంది పడుతున్నట్లు ఆమ్మతో చెప్పలేదని తెలిపాడు. అలా రోజుకు కనీసం 5 గంటలు పని చేస్తానని చెప్పిన ఆ విద్యార్థి కొన్ని సార్లు రాత్రి బస్సు లేకుంటే సుమారు 3 కీ.మీ నడుస్తానని తెలిపాడు.విజయ్ ఈ విద్యార్థి కుటుంబానికి తవేక ఆలయ నిర్వాహకుల ద్వారా సహాయం చేశారు. ఈ వీడియోలో విద్యార్థి తల్లి మాట్లాడుతూ.. ' నా కుమారుడి మాటలకు చలించిపోయిన విజయ్ సాయం చేసేందుకు ముందుకొచ్చారు. మా అబ్బాయి కాలేజీ చదువుకు అయ్యే పూర్తి ఖర్చును ఆయన భరిస్తానని చెప్పారు. ప్రస్తుతం కాలేజీలో చెల్లించమని రూ. 25 వేలు ఇచ్చారు. అంతేకాకుండా మా కుటుంబానికి ఒక నెల సరిపడ ఇంటి వస్తువులను కూడా విజయ్ అందించారు. అతనికి ఎలా కృతజ్ఞతలు చెప్పాలో నాకు తెలియదు.' అని విద్యార్థి తల్లి పేర్కొంది. అదేవిధంగా స్కూల్ విద్యార్థి వీడియో చూసిన ప్రముఖ సంగీత దర్శకులు థమన్ కూడా సాయం చేసేందుకు ముందుకొచ్చారు. ఆ విద్యార్థికి మోటార్ బైక్ కొనిస్తానని తన సోషల్ మీడియా పేజీలో పోస్ట్ చేశాడు.Well done @tvkvijayhq @actorvijay . That was very quick 👏💐pic.twitter.com/cSIsNJqY4m— Rajasekar (@sekartweets) August 26, 2024I want to help with a Two Wheeler 🛵 which will make him reach his Beloved Mother fast as possible as this guy wants his mother to be happy and prosperous in life ❤️🥹Get me details guys let’s help this boy 🛵❤️ https://t.co/TgbC2q98AU— thaman S (@MusicThaman) August 25, 2024 -
‘‘ఫస్ట్ లవ్’ పాటలోనే కథ చూపించారు – ఎస్ఎస్ తమన్
‘‘ఫస్ట్ లవ్’ టైటిల్ సాంగ్ మ్యూజిక్ వీడియో చాలా అందంగా ఉంది. ఈ పాటలోనే ఒక అద్భుతమైన కథ చూపించారు. మంచి సినిమా చూసిన అనుభూతి కలిగింది’’ అని సంగీత దర్శకుడు ఎస్ఎస్ తమన్ అన్నారు. దీపు జాను హీరోగా బాలరాజు ఎం దర్శకత్వం వహించిన చిత్రం ‘ఫస్ట్ లవ్’. వైశాలీ రాజ్ హీరోయిన్గా నటించి, నిర్మించారు. సంజీవ్ .టి సంగీతం అందించిన ఈ మూవీ టైటిల్ సాంగ్ (‘ఫస్ట్ లవ్’) లాంచ్ ఈవెంట్‌కి ముఖ్య అతిథిగా హాజరైన ఎస్ఎస్ తమన్ మాట్లాడుతూ– ‘‘ఫస్ట్ లవ్’ పాటలు వినగానే ‘వైశాలి, ఖుషి’ సినిమాలు గుర్తుకు వచ్చాయి. మధు పొన్నాస్ అద్భుతమైన నేపథ్య సంగీతం ఇచ్చారు’’ అన్నారు. ‘‘చాలా కష్టపడి ప్రేమతో ‘ఫస్ట్ లవ్..’ పాట చేశాం’’ అన్నారు. ‘‘అందరూ సెలబ్రేట్ చేసుకునే స్పెషల్ ఆల్బమ్ ఇది’’ అన్నారు బాలరాజు ఎం. -
ఎమోషన్ అంతా క్రికెట్ గ్రౌండ్‌లోనే.. .. తమన్ హార్ట్ టచ్చింగ్ స్టోరీ
తమన్..ఇప్పుడు ఇటు తెలుగు అటు తమిళ సినీ పరిశ్రమలో మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్. చాలా తక్కువ వయసులోనే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి..వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మ్యూజిక్ సెన్సేషన్‌గా మారిపోయాడు. టాలీవుడ్, కోలీవుడ్ స్టార్ హీరోలందరికి హుషారెత్తే మ్యూజిక్ అందించాడు.డ్రమ్మర్‌గా కెరీర్ ప్రారంభించి.. ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్‌గా ఎదిగాడు. అయితే తమన్ ఈ స్థాయికి రావడానికి చాలా కష్టపడ్డాడు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా తట్టుకుని నిలబడ్డాడు. ఇంట్లో వాళ్లకి తెలియకుండా ఏడ్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయట. తన ఎమోషన్ అంతా దాచుకొని క్రికెట్ గ్రౌండ్లో చూపించేవాడట. ఇండియన్ ఐడడ్ సీజన్ 3 లాంచింగ్ ఎపిసోడ్స్‌లో ఈ విషయాన్ని వెల్లడించాడు. ఆహాలో స్క్రీమ్ అవుతున్న ఈ మ్యూజికల్ రియాలిటీ షోకి తమన్‌తో పాటు కార్తిక్, గీతా మాధురి జడ్జిగా వ్యవహరిస్తున్నారు. షో మధ్యలో ఓ సందర్భంలో ‘మీ జీవితంలో ఏడ్చిన సందర్భాలు ఉన్నాయా?’అని గీతా మాధురి అడిగిన ప్రశ్నకు బదులుగా ''జీవితంలో తాను ఎన్నోసార్లు ఏడిచాను. నా ఎమోషన్ అంతా క్రికెట్ గ్రౌండ్ లో ఉంటుంది'అని తన ఎమోషన్ ని దాచుకునే ప్రయత్నం చేశారు. తర్వాత గీతా మాధురి తమన్ అమ్మగారిని గురించి ప్రస్థావించినపుడు.. గతాన్ని బాల్యన్ని తలచుకొని చాలా ఎమోషనల్ అయ్యారు తమన్.తమన్ లోని ఎమోషన్ కోణాన్ని టచ్ చేసిన ఈ వీడియో నెటిజన్స్‌ని కదిలిస్తుంది. -
తిరుమలలో ఓంకార్ సోదరుడు అశ్విన్, తమన్ సందడి (ఫోటోలు)
-
'గుంటూరు కారం' సాంగ్.. సోషల్ మీడియాలో మళ్లీ మొదలైన ట్రోల్స్!
ప్రస్తుతం సినీ ప్రియులను ఓ ఊపు ఊపేస్తోన్న సాంగ్ ఒకటే. అదేనండి సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా నటిస్తోన్న గుంటూరు కారం చిత్రంలోని పాట. ఇటీవలే ఈ మూవీ నుంచి విడుదలైన 'కుర్చినీ మడతబెట్టి' అనే మాస్ సాంగ్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ప్రస్తుతం ఈ సాంగ్ ప్రిన్స్ అభిమానులతో పాటు సినీ ప్రియులను ఊపేస్తోంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిస్తోన్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది. అయితే ఆడియన్స్ నుంచి ఈ సాంగ్‌కు విశేషణమైన ఆదరణ లభిస్తోంది. ఈ పాటకు తమన్ బాణీలు అందించారు. టాలీవుడ్లో ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్లలో తమన్ ఒకరు. తాజాగా మరోసారి తమన్‌పై సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలయ్యాయి. ఈ పాటలోని ఓ ట్యూన్‌ను కాపీ కొట్టారంటూ తెగ వైరల్ చేస్తున్నారు. అత్తారింటికి దారేది చిత్రంలోని 'పేట్రాయి సామీదేవుడా' అనే సాంగ్ ట్యూన్ కాపీ చేశారంటూ పెద్దఎత్తున వైరలవుతోంది. మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో పెళ్లిసందడి భామ శ్రీలీల హీరోయిన్గా నటిస్తోంది.మీనాక్షీ చౌదరి, ప్రకాశ్, రమ్యకృష్ణ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సుర్యదేవర రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రం జనవరి 12న ప్రేక్షకులు ముందుకు రాబోతుంది. Blockbuster re-mix 🧐pic.twitter.com/WwN97I4SDc#GunturuKaaram — BiggBossTelugu7 (@TeluguBigg) December 30, 2023 Blockbuster re-mix 🧐pic.twitter.com/WwN97I4SDc#GunturuKaaram — BiggBossTelugu7 (@TeluguBigg) December 30, 2023 -
Happy Birthday S Thaman: హ్యాపీ బర్త్‌డే సంగీత దర్శకుడు ఎస్ తమన్ (ఫోటోలు)
-
గుంటూరు కారం ఫస్ట్ సాంగ్.. మహేశ్ ఫ్యాన్స్‌కు మసాల బిర్యానీ రెడీ
టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు అభిమానుల జాతర నేటి నుంచి మొదలైంది. తాజాగా గుంటూరు కారం సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ ప్రోమో వచ్చింది. నిజానికి ఈ ప్రోమో ముందే లీక్ అయింది. కొన్ని సెకెండ్ల బిట్ బయటకు వచ్చేసింది. అఫీషియల్‌గా విడుదలైన సాంగ్ ప్రోమోను వింటే మహేశ్ ఫ్యాన్స్‌కు డబుల్ మసాలా బిర్యానీనే అనేలా ఉంది. తమన్-త్రివిక్రమ్ కాంబోలో మ్యూజిక్ ఎలా ఉటుందో ప్రత్యేక చెప్పాల్సిన అవసరం లేదు. వారిద్దిరి కాంబినేషన్లో వచ్చిన ప్రతి సినిమా మ్యూజికల్ సెన్సేషన్ అని తెలిసిందే. (ఇదీ చదవండి: బిగ్ బాస్ ఎలిమినేషన్.. టేస్టీ తేజకు రిటర్న్ గిఫ్ట్.. సందీప్ పోస్ట్ వైరల్) 'ఎదురొచ్చేగాలి..ఎగరేస్తున్నా చొక్కాపై గుండీ..' అంటూ మొదలైన సాంగ్‌లో.. బిరియానీ, మసాలా లాంటి మాస్ పదాలు ఉన్నాయి. అయితే ఇది జస్ట్ ట్రాక్ బీట్ మాత్రమే.. రామజోగయ్య శాస్త్రి రాసిన ఈ సాంగ్ నవంబర్ 7న విడుదల కానుంది. ప్రోమో కొన్ని సెకన్లు మాత్రమే ఉన్నా తమన్ మ్యూజిక్ దుమ్ములేపాడు అని చెప్పవచ్చు. మంచి మసాలా బిర్యానీ తింటూ సాంగ్‌ను ఎంజాయ్ చేయవచ్చని నెటిజన్ల నుంచి కామెంట్లు వస్తున్నాయి. సంక్రాంతి కానుకగా జనవరి 12న గుంటూరు కారం విడుదల కానుంది. ఇటీవల చాలా సినిమాల నుంచి థమన్ అందిస్తున్న బ్యాక్ గ్రౌండ్ స్కోర్, పాటలు తరచు విమర్శలతో పాటు ట్రోలింగ్‌కు గురవుతున్నాయి. ఇలాంటివి ఏమీ తమన్ లెక్కచేయడు. నిజానికి తన వ్యవహారధోరణి, తత్వాన్ని బట్టి ఆలోచిస్తే తన మీద సోషల్ మీడియాలో ఏదో ప్రచారం జరిగితే డిస్టర్బ్ అయ్యే కేరక్టర్ కాదు… సోషల్ మీడియా తీరూతెన్నూ మొత్తం తెలిసినవాడే… అవసరమైతే సోవాట్ అని తేలికగా తీసుకోగలడు. గుంటూరు కారంతో ట్రోలర్స్‌కు ఎలాంటి ఛాన్స్ ఇవ్వలేదని తెలుస్తోంది. -
పవన్ 'బ్రో' విషయంలో సీరియస్ అయిన థమన్..!
టాలీవుడ్లో టాప్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఈ మధ్యకాలంలో భారీగానే నెటిజన్ల నుంచి నెగెటివిటీని ఎదుర్కొంటున్నారు. ఒక్కోసారి ఆయన నుంచి వస్తున్న మ్యూజిక్‌ను తక్కువ చేస్తూ పలువురు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. పవన్‌కల్యాణ్- సాయిధరమ్ తేజ్ కాంబోలో వస్తున్న 'బ్రో' సినిమాలోని 'మార్కేండయ' పాట విషయంలో కూడా ఆయనకు మాటల పడటం తప్పలేదు. ఈ సాంగ్‌లో మ్యూజిక్ అంతగా ఆకట్టుకోలేదని థమన్పై ఫ్యాన్స్ నెగటివ్ కామెంట్లు చేశారు. (ఇదీ చదవండి: ప్రాజెక్ట్- కే యూనిట్ చీప్ ట్రిక్స్.. ఫైర్ అవుతున్న ప్రభాస్ ఫ్యాన్స్) ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన ఇలా స్పందించారు. ''బ్రో ' సినిమా కథ చాలా ప్రత్యేకమైనది. అన్ని సినిమాల్లా కాదు. అందుకే పరిధి మేరకు సంగీతం అందించాను. కానీ అది కొందరికి నచ్చింది.. మరికొందరికి నచ్చలేదు. అంతగా భారీ అంచనాలు ఫ్యాన్స్ పెట్టుకుంటే ఎలా? పెద్ద పాటలు చేయాలని నాకూ ఉంటుంది. కానీ కథలో ఆ అవకాశం ఉండాలి కదా?' అని తమన్ అసహనాన్ని వ్యక్తపరిచారు. (ఇదీ చదవండి: ఆ హీరోయిన్ వల్లే నాకు విడాకులు.. ఇప్పటికీ తనను క్షమించను: సింగర్) కొన్ని సినిమాలకు కథకు తగ్గట్టే పాటలు ఇవ్వాలని ఆయన చెప్పారు. అన్ని సినిమాల్లోనూ మాస్ పాటలను పెట్టలేమని చెప్పుకొచ్చారు. 'మార్కండేయ' పాటను ఒక ప్రొవెర్బ్ రూపంలోనే చెప్పాలి. ఇవన్నీ భారీగా అంచనాలు పెట్టుకోవడం వల్ల వచ్చే సమస్యలు.. దానిని ఒక ఐటెమ్ సాంగ్లా చేయలేమన్నారు. కథ ఏం కోరుకుందో సినిమాలో కూడా అదే ఇచ్చానని థమన్ చెప్పుకొచ్చారు. పి.సముద్రఖని దర్శకత్వం వహిస్తున్న బ్రో సినిమా జులై 28న విడదల కానుంది. -
గుంటూరు కారం నుంచి తమన్ ఔట్...నిర్మాత క్లారిటీ ?
-
ట్రోల్స్‌పై ఎమోషనల్ అయిన తమన్ భార్య
సౌత్ ఇండియాలో సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ గురించి పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇండస్ట్రీలో ప్రతి హీరోకు మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్‌గా మారిపోయాడు. సినిమాలకు సంగీతం అందిస్తూనే.. ఇండియన్ తెలుగు ఐడల్ షోకు జడ్జిగా వ్వవహరిస్తున్నాడు. తన వ్యక్తిగత విషయాలు ఎక్కడా చర్చించని తమన్. 'సర్కారు వారి పాట' సినిమా ప్రమోషనల్ ఇంటర్వ్యూలో భాగంగా తన భార్య పేరు వర్దిని అని, ఆమె ఒక ప్లే బ్యాక్ సింగర్ అని చెప్పుకొచ్చిన విషయం తెలిసిందే. (ఇదీ చదవండి: కూతురి అన్నప్రాసన ఫోటో.. అభిమానులతో షేర్ చేసుకున్న హీరోయిన్) తాజాగా వర్దిని ఓ ఇంటర్వ్యూలో తమన్‌పై వస్తున్న ట్రోల్స్‌పై స్పందించింది. 'ఇంట్లో మా ఇద్దరి మధ్య ట్రోల్స్ గురించి చర్చ రాదు. ఆయన కూడా ఆలోచించడు. తమన్ ఇంటర్వ్యూలు నేనూ చూస్తాను.. కానీ వీడియో కింద వచ్చిన కామెంట్స్ మాత్రం చదవను.. ఎందుకంటే చాలా సెన్సిటివ్‌గా ఆలోచిస్తూ ఉంటాను. అందువల్ల వాటిని చదివితే ఒక భార్యగా బాధగానే ఉంటుంది. వాటి వల్ల మూడ్ ఆఫ్ అవుతాను కూడా.. అందువల్ల వాటిపై మా ఇంట్లో నో కామెంట్ అని అనుకుంటాం. తమన్‌ను అభిమానించే వారందరికి థ్యాంక్స్' అంటూ ఎమోషనల్ అయింది. తెలుగులో 'స్వరాభిషేకం' షో వల్ల సింగర్‌గా వర్దిని చాలా పాపులర్ అయింది. తర్వాత తెలుగు, తమిళంలో పలు పాటలు కూడా పాడింది. (ఇదీ చదవండి: అన్నా.. నేను అలాంటి దాన్ని కాదు: అనుపమ) -
తమన్‌పై మళ్లీ కాపీ మరకలు..‘గుంటూరు కారం’ బీజీఎం అక్కడిదేగా!
టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో తమన్ ముందు వరుసలో ఉంటారు. కోటి, మణిశర్మ లాంటి సీనియర్ సంగీత దర్శకుల తర్వాత టాలీవుడ్‌ని దేవిశ్రీ ప్రసాద్ కొన్నాళ్లపాటు ఏలాడు. దేవిని మించిన మ్యూజిక్ డైరెక్టర్ లేరు అనుకుంటున్న సమయంలో తమన్ పుంజుకున్నాడు. ముఖ్యంగా అల..వైకుంఠపురములో’ తర్వాత తమన్ రేంజ్ మారిపోయింది. డీఎస్పీతో పోటీ పడడమే కాదు అతనిపై పై చేయి సాధిస్తూ వస్తున్నాడు. అయినప్పటికీ తమన్‌పై మాత్రం కాపీ ముద్ర చెదరడం లేదు. తన సినిమాలతో పాటు పక్కవాళ్ల సినిమాల్లోని పాటలను, బీజీఎంను కాపీ చేస్తాడని తమన్‌పై ఆరోపణలు ఉన్నాయి. (చదవండి: పవిత్రతో పరీక్షలు రాయించిన నరేశ్.. నెటిజన్స్ ప్రశంసలు) ఆ మధ్య రవితేజ క్రాక్‌కి సినిమాకు అదిరిపోయే సంగీతం అందించాడు తమన్. అయితే అందులో ‘బంగారం’సాంగ్‌ని ఓ యూట్యూబ్ సాంగ్‌ని నుంచి కాపీ కొట్టాడని ఆరోపణలు వినిపించాయి. ఇక ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన ‘వీరసింహారెడ్డి’కి కూడా తమన్ అద్భుతమైన బీజీఎంని అందించాడు. కానీ అందులో జై బాలయ్య సాంగ్ ‘ఒసేయ్ రాములమ్మ’ టైటిల్ సాంగ్‌ని పోలి ఉందని నెటిజన్స్ విమర్శించారు. ఇక ఇప్పుడు మహేశ్ బాబు ‘గుంటూరు కారం’ విషయంలో కూడా తమన్ కాపీ ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. (చదవండి: గుంటూరు కారం ఘాటు చూపిస్తానంటున్న మహేశ్‌బాబు) సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా నిన్న(మే 31)మహేశ్- త్రివిక్రమ్‌ల కాంబోల తెరకెక్కుతున్న హ్యాట్రిక్ మూవీ టైటిల్‌తో పాటు ఫస్ట్ గ్లిమ్ప్స్ విడుదల చేశారు. అయితే ఈ వీడియోకి తమన్ ఇచ్చిన బీజీఎం కాపీ అని నెటిజన్స్ ట్రోల్స్ చేస్తున్నారు. ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘నాన్నకు ప్రేమతో’ సినిమాలోని ఓ ట్యూన్‌ని బీజీఎంగా వాడేశాడని ఆరోపిస్తున్నారు. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఆ చిత్రంలో అరబిక్ స్టయిల్ లో ఓ సాంగ్ ఉంటుంది. అందులో దేవీ ఇచ్చిన ట్యూన్స్‌ని కాపీ చేసి ‘గుంటూరు కారం’కి బీజీఎంగా మలిచాడని ట్రోల్ చేస్తున్నారు. అంతేకాదు విజయ్ సేతుపతి, నయనతార, సమంత ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ‘కాతువాకుల రెండు కాదల్’ సినిమాలో అనిరుధ్ ఇచ్చిన ఒక ట్యూన్ అచ్చం ఇలానే ఉందంటూ వీడియోలను షేర్ చేస్తున్నారు. మరి దీనిపై తమన్ ఎలా స్పందిస్తాడో చూడాలి. Rey teddy https://t.co/G7wOSqMy93 pic.twitter.com/qQkcVEOnHw — Ponile Mowa (@ponilemova) May 31, 2023 Ennada teddy idhi 🚶🏻🫠?#SSMB28MassStrike #ssthaman #MRtollywoodmahesharrival #MaheshBabu𓃵 pic.twitter.com/bxrc1mLLF7 — chandu kandregula (@Chandu_CS12) May 31, 2023 -
‘తెలుగు ఇండియన్ ఐడల్ 2’ పై బాలీవుడ్ మ్యూజిక్ ఐకాన్స్ ప్రశంసలు
ప్రముఖ ఓటీటీ ఆహాలో స్ట్రీమ్ అవుతోన్న ‘తెలుగు ఇండియన్ ఐడల్ 2’కు విశేష ఆదరణ లభిస్తోంది. షో లో ప్రస్తుతం ఉన్న టాప్ 11 కంటెస్టెంట్స్ తమ మధురగానంతో ప్రేక్షకుల మదిని దోచుకుంటున్నారు. సామన్య ప్రేక్షుకులే కాక ఎంతో మంది సినీ సంగీత ప్రముఖులు వీరి గానానికి మంత్రముగ్ధులవుతున్నారు. పోటీలో భాగంగా నిర్వహించిన గాలా విత్ బాలా ఎపిసోడ్ లో సౌజన్య భాగవతుల అనే కంటెస్టెంట్ ఆలపించిన గౌతమీపుత్ర శాతకర్ణి చిత్రంలోని 'ఎంకిమీడ నా జతవిడి...' మంచి స్పందన లభించింది. ఆ షోలో జడ్జిగా వ్యవహరిస్తున్న తమన్ ఈ పాట విని.. దీని ఒరిజినల్ వెర్షన్ పాడిన శ్రేయా ఘోషల్‌కు ఇది వినిపిస్తానని మాట ఇచ్చారు. తాజాగా ఈ సాంగ్ చూసిన శ్రేయా ఓ వీడియోను పంపించారు. దీన్ని స్టేజిపై తమన్ చూపించి సౌజన్యకు సర్ప్రైజ్ ఇచ్చారు. సాంగ్ విన్న ప్రముఖ నేపధ్య గాయని శ్రేయాఘోషల్ సంతోషం వ్యక్తం చేశారు. సౌజన్య గాత్రం అత్యంత మధురంగా ఉందంటూ కితాబిచ్చారు. అలాగే ప్రముఖ బాలీవుడ్ సంగీతకారులు విశాల్ దద్లాని మరియు హిమేష్ రేషిమియా షో కు వస్తున్న ఆదరణను ప్రశంసించారు. తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 2 కార్యక్రమం ప్రతి శక్ర, శని వారాల్లో రెండు ఎపిసోడ్లుగా రాత్రి 7 గంటల నుంచి ఆహాలో ప్రసారం అవుతుంది. View this post on Instagram A post shared by ahavideoin (@ahavideoin) -
విశాఖలో రికార్డింగ్ స్టూడియో నిర్మిస్తా..
ఏయూక్యాంపస్: సినిమా సంగీతం రూపకల్పనకు వీలుగా విశాఖలోని భీమిలిలో రికార్డింగ్ స్టూడియోను నిర్మిస్తానని ప్రముఖ సినీ సంగీత దర్శకుడు ఎస్ఎస్ థమన్ అన్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో సెయింట్ లూక్స్ సంస్థ సహకారంతో నూతనంగా నిర్మించిన ఆడియో రికార్డింగ్ స్టూడియో, తరగతి గదులను ఆదివారం ఏయూ వీసీ ఆచార్య పీవీజీడీ ప్రసాదరెడ్డితో కలిసి థమన్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌ను మ్యూజిక్ ల్యాండ్‌గా భావిస్తున్నానని, విశాఖ కేంద్రంగా సినీ సంగీత ప్రయాణానికి ఇదో మంచి ఆరంభంగా నిలుస్తుందన్నారు. తనకు దేశ, విదేశాల్లో స్టూడియోలున్నాయని, త్వరలో విశాఖలోనూ స్టూడియో నిర్మిస్తానన్నారు. తన విశ్రాంత జీవితాన్ని ప్రశాంత నగరమైన విశాఖలో గడిపేందుకే తాను ఇష్టపడతానని తెలిపారు. ఎంతో సుదీర్ఘ అనుభవం కలిగిన సంగీత దర్శకుడు ఆశీర్వాద్ లూక్స్ మార్గదర్శకంలో ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఆడియో ఇంజినీరింగ్, మ్యూజిక్ ప్రొడక్షన్ అకాడమీని ప్రారంభించడం మంచి పరిణామమని, రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఏయూను తాను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నట్టు చెప్పారు. సంగీత దర్శకుడు ఆశీర్వాద్ లూక్స్, సెయింట్ లూక్స్ సంస్థల అధినేత ప్రీతం లూక్స్ తదితరులు పాల్గొన్నారు. -
Telugu Indian Idol 2: నిత్యా ప్లేస్‌లో గీతా.. హోస్ట్ కూడా మారాడు!
ప్రముఖ ఓటీటీ ఆహాలో సూపర్ హిట్ అయిన షోలలో తెలుగు ఇండియన్ ఐడల్ ఒకటి. . యంగ్ సింగర్స్‌కు తమ ట్యాలెంట్ నిరూపించుకోవడానికి ఈ సింగింగ్ షో మంచి వేదికగా నిలిచింది.ఈ షోకి సింగర్ శ్రీరామచంద్ర హోస్ట్ గా.. మ్యూజిక్ డైరెక్టర్ తమన్, హీరోయిన్ నిత్యామీనన్.. సింగర్ కార్తీక్ జడ్జీలుగా వ్యవహరించి సందడి చేశారు. అంతేకాదు గ్రాండ్ ఫినాలేకి మెగాస్టార్ చిరంజీవి గెస్ట్‌గా వచ్చి అలరించారు. త్వరలోనే ఈ సింగింగ్ షో రెండో సీజన్ రాబోతుంది. తాజాగా ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 2 కర్టెన్ రైజర్ ప్రోగ్రాం వేడుకగా జరిగింది. ఈ కార్యక్రమానికి సీఈవో అజిత్ ఠాకూర్, ప్రముఖ సింగర్లు, ఎస్.ఎస్. తమన్, కార్తీక్, గీతామాధురి, హేమచంద్ర తదితరలు హాజరయ్యారు. ఇక సీజన్ 1కి శ్రీరామచంద్ర వ్యాఖ్యాతగా వ్యవహరిస్తే.. రెండో సీజన్‌ని హేమచంద్ర హోస్ట్ చేయనున్నారు. ఇక జడ్జీల విషయానికొస్తే… సింగర్ నిత్యామీనన్ ప్లేస్‌లో ట్యాలెంటెడ్ సింగర్ గీతా మాధురి రానుంది. View this post on Instagram A post shared by ahavideoin (@ahavideoin) -
తమన్ మ్యూజిక్ బాగాలేదు.. వారికి స్ట్రాంగ్ కౌంటర్
బీజీఎం కింగ్ ఎస్ఎస్ తమన్ నెటిజన్లకు స్ట్రాంగ్ కౌంటరిచ్చారు. ఇటీవల సోషల్ మీడియాలో ఆయనపై వస్తున్న ట్రోల్స్‌కు గట్టిగానే స్పందించారు. ఈ మేరకు తన ట్విటర్లో ఓ వీడియోను పోస్ట్ చేశారు. నెగెటివ్ కామెంట్స్ చేసే వారికి తనదైన స్టెల్లో సమాధానమిచ్చారు. తనను కామెంట్ చేసే వాళ్లందరూ చిన్నపిల్లలు అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. దీంతో ఎప్పుడు సరదాగా, కూల్‌గా ఉండే తమన్ ఆగ్రహానికి కారణం ఏంటా అని పలువురు ఆరా తీస్తున్నారు. గిటారు వాయిస్తున్న ఓ వీడియోను షేర్ చేస్తూ.. ‘‘ప్రియమైన నెగెటివిటీ.. నీ ఆత్మకు శాంతి చేకూరాలి. నీలాంటి చిన్నపిల్లలందరి కోసం ఈ వీడియో అంకితం' అంటూ పోస్ట్ చేశారు తమన్. కారణం అదేనా? సంగీత దర్శకుడు తమని ఇటీవలే ‘వీర సింహారెడ్డి’ సినిమాతో మంచి సక్సెస్‌ను అందుకున్నారు. అంతకుముందు అల్లు అర్జున్ అల వైకుంఠపురములో, బాలకృష్ణ అఖండ చిత్రాలు సూపర్‌హిట్ కావడంలో తమన్ మ్యూజిక్ ఓ రేంజ్లో ఫేమస్ అయింది. తమన్ ప్రస్తుతం ఇద్దరు టాలీవుడ్ స్టార్ హీరోల చిత్రాల్లో పనిచేస్తున్నారు. ఈ క్రమంలో తమన్ మ్యూజిక్ బాగలేదని.. ఏమాత్రం వినాలనిపించలేదని పలువురు నెటిజన్లు సోషల్‌మీడియాలో నెగెటివ్ కామెంట్స్ చేశారు. ఇదే తమన్ ఆగ్రహానికి కారణమైంది. Rest In Peace Dear #Negativity !! To all the kids out there 🤣 pic.twitter.com/pjt7ThMCkn — thaman S (@MusicThaman) February 4, 2023 -
Varisu Movie: థియేటర్లో కాలర్ ఎగరేసిన దిల్ రాజు, ఏడ్చేసిన తమన్
-
థియేటర్లో కాలర్ ఎగరేసిన దిల్ రాజు, ఏడ్చేసిన తమన్
దళపతి విజయ్ హీరోగా నటించిన చిత్రం వారీసు. తెలుగులో వారసుడు పేరిట రిలీజ్ అవుతున్న ఈ సినిమా ఈ నెల 14న విడుదల కానుంది. కానీ తమిళంలో మాత్రం ఎలాంటి వాయిదా లేకుండా అనుకున్న సమయానికి అంటే నేడే(జనవరి 11న) రిలీజైంది. ప్రజల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో తెలుసుకుందామని డైరెక్టర్ వంశీ పైడిపల్లి, నిర్మాత దిల్ రాజు, సంగీత దర్శకుడు తమన్.. చెన్నైలోని ఓ థియేటర్‌కు వెళ్లి సినిమా చూశారు. అక్కడ అభిమానుల స్పందన చూసి ఎమోషనలైన థమన్ కంటతడి పెట్టుకున్నాడు. ఇక దిల్ రాజు అయితే కాలర్ ఎగరేసి మరీ సంతోషం వ్యక్తం చేశాడు. మరోవైపు హీరోయిన్ త్రిష సైతం తన ఫ్రెండ్స్‌తో కలిసి సినిమా చూసినట్లు తెలుస్తుండగా రష్మిక కూడా వారిసు మూవీని ఎంజాయ్ చేసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఇకపోతే వారీసు తొలిరోజు అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా రూ.12 కోట్ల మేర డబ్బులు వచ్చినట్లు తెలుస్తోంది. @MusicThaman Thaman Give His Soul For #Varisu ! 💯🥺❤️ His BGM & SONGs Is Another Level ! 🔥pic.twitter.com/BFI9deNjcp — SubashMV (@SubashMV5) January 11, 2023 చదవండి: కారు ప్రమాదం.. నటి బతకడం కష్టమన్న డాక్టర్స్ రామ్‌చరణ్ వీరసింహారెడ్డి చూస్తాడేమో: చిరంజీవి -
‘అఖండ’ లాగే వీర సింహారెడ్డికి కూడా స్పీకర్లు పగులుతాయి: తమన్
‘‘పోటీ అనేది సినిమాల్లోనే కాదు.. ప్రతి చోటా ఉంటుంది. పోటీ ఉన్నప్పుడే మంచి కంటెంట్ వస్తుంది. ఆరోగ్యకరమైన సోటీ మంచిదే. అన్ని సినిమాలూ గొప్పగా ఆడాలి.. అందరూ బాగుండాలి’’ అని సంగీత దర్శకుడు ఎస్ఎస్ తమన్ అన్నారు. బాలకష్ణ, శ్రుతీహాన్ జంటగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘వీరసింహారెడ్డి’. నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మించిన ఈ సినిమా రేపు (గురువారం) రిలీజవుతోంది. ఈ చిత్రానికి సంగీతం అందించిన తమన్ మీడియాతో ముచ్చటించాడు. ఈ సందర్భంగా ఆయన చెప్పిన చిత్ర విశేషాలు. ⇔ బాలకృష్ణగారితో నేను చేసిన ‘అఖండ’ సినిమాతో ‘వీరసింహారెడ్డి’కి పోలికే లేదు. ఇది కల్ట్ మూవీ. ఎమోషనల్, సిస్టర్ సెంటిమెంట్, బాలకృష్ణగారి మాస్.. ఇలా అన్ని అంశాలతో అదిరిపోతుంది. ⇔ దర్శకుడు మంచి సినిమా తీస్తేనే నేను మంచి మ్యూజిక్ ఇవ్వగలను. ఒక సినిమాకి పునాది దర్శకుడే. బాలకృష్ణగారి అభిమానిగా గోపీచంద్ చాలా గొప్పగా తీశారు.. దాని వల్లే నాకూ మంచి మ్యూజిక్, నేపథ్య సంగీతం ఇచ్చే అవకాశం వచ్చింది. సినిమా ఏం కోరుకుంటుందో అది ఇవ్వడమే మన పని. ఇందులో ‘జై బాలయ్య, సుగుణ సుందరి, మాస్ మొగుడు..’ వంటి పాటలన్నీ చక్కగా కుదిరాయి. మాస్ సినిమాలో కూడా కథ నుండే ట్యూన్ పుడుతుంది. ⇔ ‘అఖండ’లో మ్యూజిక్‌కి స్పీకర్లు పగిలిపోయాయి. ‘వీరసింహారెడ్డి’లోనూ స్పీకర్లు పగులుతాయి జాగ్రత్త అని ముందే చెప్పాను. బాలకృష్ణగారిని చూస్తేనే ఎక్కువ వాయించేయాలనిపిస్తుంది (నవ్వుతూ). చాలా రోజుల తర్వాత సెకండ్ హాఫ్‌లో నాలుగు పాటలు, నాలుగు ఫైట్లతో అదరగొట్టే సినిమా ఇది. పాప్ కార్న్ తినే టైమ్ కూడా ఉండదు.. సినిమాని చూస్తూనే ఉంటారు. ⇔ ఈ సంక్రాంతికి విడుదలవుతున్న చిరంజీవిగారి ‘వాల్తేరు వీరయ్య’, బాలకష్ణగారి ‘వీరసింహారెడ్డి’ రెండూ గొప్పగా ఆడాలని కోరుకుంటున్నాను. -
మహేశ్ బాబు SSMB28 లేటెస్ట్ అప్డేట్ వచ్చేసింది..
సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్లో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.ఇప్పటికే ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్ ఫస్ట్ షెడ్యూల్‌ను కూడా పూర్తి చేసుకుంది. త్వరలోనే రెండో షెడ్యూల్ ప్రారంభం కానుంది. ఇదే విషయంపై మూవీ టీం సైతం క్లారిటీ ఇచ్చింది. జనవరిలో ‘ఎస్ఎస్ఎంబీ28’(SSMB28) రెండో షెడ్యూల్ ప్రారంభించనున్నట్లు మేకర్స్ తెలిపారు. ఇక మూవీ టీంతో కలిసి మహేశ్ క్రిస్మస్ సెలబ్రేషన్స్‌లో పాల్గొన్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలున్నాయి. తమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తుంది. All set to shoot! With heightened spirit and great energy #SSMB28 will go on sets from January, non-stop! Stay-Tuned, More SUPER-EXCITING updates coming your way soon! 🌟✨ SUPERSTAR @urstrulyMahesh #Trivikram @hegdepooja @MusicThaman #PSVinod #ASPrakash @NavinNooli @vamsi84 pic.twitter.com/cEjRFVsz64 — Haarika & Hassine Creations (@haarikahassine) December 10, 2022 -
ముంబయిలో బిజీగా మహేశ్ బాబు.. నమ్రత పోస్ట్ వైరల్
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రస్తుతం షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఇటీవల కృష్ణ మరణం తర్వాత తొలిసారి త్రివిక్రమ్ సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి తాత్కాలికంగా ఎస్ఎస్ఎంబీ28 టైటిల్ ఖరారు చేశారు. ప్రస్తుతం ఈ చిత్రం ముంబైలో చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ సందర్భంగా మహేశ్ సతీమణి నమ్రత ముంబయిలో ఆమె స్నేహితురాలు సాజియాను కలుసుకున్నారు. వారి ఇంట్లోనే మహేశ్ బాబు, సంగీత దర్శకుడు ఎస్ఎస్ తమన్, డైరెక్టర్ త్రివిక్రమ్‌తో కలిసి రుచికరమైన ఇంటి వంటకాలను ఆస్వాదించారు. ఈ విషయాన్ని నమ్రత తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో పంచుకున్నారు. తన స్నేహితురాలు ఇంట్లో భోజనం చేస్తున్న ఫోటోలను నమ్రత తన ఇన్‌స్టాలో షేర్ చేశారు. ఇన్‌స్టాలో ఆమె రాస్తూ..' నా కలల జీవితంలో కొన్ని మధుర క్షణాలు.. ఇంటి భోజనాన్ని రుచి చూపించిన సాజియాకు నా ధన్యవాదాలు.' అంటూ పోస్ట్ చేసింది. ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన పూజా హెగ్డే కనిపించనుంది. గతంలో ఆమె మహర్షి చిత్రంలో కలిసి పనిచేశారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు. మహేష్ బాబు, దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి చిత్రంలో నటించనున్నారు. ఆ చిత్రానికి ఎస్ఎస్ఎంబీ29 టైటిల్ ఖరారు చేశారు. దీనిపై మహేష్ బాబు మాట్లాడుతూ..'ఈ చిత్రం గురించి మాట్లాడటం చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు నా కల నిజమైంది. రాజమౌళితో నేను చాలా కాలంగా కలిసి పనిచేయడానికి ప్రయత్నిస్తున్నా. చివరకు అది నెరవేరబోతోంది. ఈ సినిమా గురించి చాలా ఎగ్జైట్‌గా ఉన్నా' అని అన్నారు. View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) -
చిరంజీవి ‘గాడ్ ఫాదర్’ టైటిల్ వెనుక ఇంత కథ ఉందా?
ఒక సినిమా జనాల్లోకి వెళ్లడానికి టైటిల్ చాలా ఉపయోగపడుతుంది. కొన్ని టైటిల్స్ సినిమాపై అంచనాలను పెంచేస్తాయి. అలాంటి వాటిల్లో ‘గాడ్ ఫాదర్’ ఒకటి. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ఈ చిత్రం..మలయాళ సూపర్ హిట్ లూసీపర్కి తెలుగు రీమేక్. దసరా సందర్భంగా అక్టోబర్ 5న విడుదదలైన ఈ చిత్రం.. సూపర్ హిట్ టాక్‌తో దూసుకెళ్తోంది. ఈ సినిమా టైటిల్ చిరంజీవి స్టార్‌డమ్‌కి చక్కగా సరిపోయింది. అయితే మొదట ఈ సినిమాకు వేరే టైటిల్ అనుకున్నారట. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఈ టైటిల్‌ని సూచించారట. తాజాగా ఈ విషయాన్ని తమన్ ఓ ఇంటర్వూలో తెలిపారు. (చదవండి: సినిమా ఛాన్స్.. ఇంటికి పిలిచాడు.. దర్శకుడి బాగోతం బయటపెట్టిన నటి) ‘గాడ్ ఫాదర్’ షూటింగ్ అంతా సర్వాంతర్యామి వర్కింగ్ టైటిల్‌తో పూర్తయింది. ఈ సినిమా కథని హీరో డార్క్‌లో నుంచి జరుపుతున్నాడు. అది మనకు తెలియదు. అన్ని సీన్స్‌లో బ్రహ్మా(చిరంజీవి) ఉండరు. కానీ ఆయన గురించే మాట్లాడుకుంటారు. అందుకే నాకు దేవుడిలా అనిపించాడు. ఇంగ్లీష్ టైటిల్ పెడితే బాగుంటుదనిపించి ‘గాడ్ ఫాదర్’ సూచించాను. సెంటిమెంట్ పరంగా కూడా కలిసిసొస్తుందని చిరంజీవికి ఊరికే చెప్పాను. గతంలో మీరు నటించిన గ్యాంగ్ లీడర్, ఘరానా మొగుడు టైటిల్స్ లెటర్ జీ(G )తో మొదలయ్యాయి. బ్లాక్ బస్టర్ విజయం సాధించాయి అని చిరంజీవితో అనడంతో.. ఆయన కూడా ఓకే చెప్పేశాడు’అని తమన్ చెప్పుకొచ్చాడు. అయితే గాడ్ ఫాదర్ టైటిల్ విషయంలో హాలీవుడ్ నుంచి అభ్యంతరం వ్యక్తం అయిందట. దీంతో నిర్మాతలకు వారి నుంచి అనుమతి తీసుకున్నారట. సినిమా విడుదలక వారం ముందు ఓన్ఓసీ లభించినట్లు నిర్మాత ఎన్వీ ప్రసాద్ చెప్పారు. -
ఆయనతో తొలి హిట్ సాధించా!
‘‘గాడ్ ఫాదర్’ ప్రీమియర్ తర్వాత చిరంజీవిగారు ప్రేమగా హత్తుకున్నారు.. సినిమా రిలీజ్ తర్వాత ఆయన ప్రశంసించడం మర్చిపోలేను. దర్శకుడు శంకర్‌గారు, సంగీతదర్శకులు మణిశర్మ, కోటిగార్లు ఫోన్ చేసి కంగ్రాట్స్ చెప్పారు. చాలామంది మెగా ఫ్యాన్స్ ఫోన్ చేసి, భావోద్వేగంగా మాట్లాడటం హ్యాపీ’’ అని సంగీత దర్శకుడు ఎస్ఎస్ తమన్ అన్నారు. చిరంజీవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘గాడ్ ఫాదర్’. సల్మాన్ ఖాన్, నయన తార, సత్యదేవ్ కీలక పాత్రలు చేశారు. కొణిదెల సురేఖ సమర్పణలో ఆర్బీ చౌదరి, ఎన్వీ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 5న విడుదలైంది. ఈ సందర్భంగా సంగీత దర్శకుడు తమన్ మాట్లాడుతూ – ‘‘నేను తొలిసారి పని చేసిన హీరోలందరి సినిమాలు హిట్టయ్యాయి. ఇప్పుడు చిరంజీవిగారితో చేసిన తొలి సినిమా ‘గాడ్ ఫాదర్’ హిట్ అయి, నా సెంటిమెంట్‌నిæకొనసాగించింది. నా ఆరేళ్ల వయసులో మా అమ్మగారితో కలిసి కోటిగారి రికార్డింగ్ స్టూడియోకి వెళ్లాను. ‘అందం హిందోళం..’ పాట రికార్డింగ్ జరుగుతోంది. ఆ పాట విని చిరంజీవిగారికి ఫ్యాన్ అయ్యాను. అప్పటి నుండి ఇంట్లో ఎప్పుడూ చిరంజీవిగారి పాటలే వాయిస్తూ ఉండేవాణ్ణి. చిరంజీవిగారు మహా వృక్షం. ఒక ఫ్యాన్‌గా నేను ‘గాడ్ ఫాదర్’ సినిమా చేశాను. ఆయన సినిమాకి మ్యూజిక్ చేయడం తేలికైన విషయం కాదు. పైగా మ్యూజిక్‌కి స్కోప్ లేని సినిమాలో మ్యూజికల్‌గా హై తీసుకురావడం చాలెంజ్. లండన్‌లోని అబేయ్ రోడ్ స్టూడియోలో రికార్డ్ చేసిన తొలి భారతీయ చిత్రం ‘గాడ్ ఫాదర్’. మనం ఓ కమర్షియల్ సినిమా చేద్దామని చిరంజీవిగారిని అడిగితే, చేద్దామన్నారు’’ అన్నారు. -
రామ్- బోయపాటి మూవీ దసరా సర్ప్రైజ్.. హీరోయిన్ ఎవరంటే?
రామ్ పోతినేని- బోయపాటి కాంబినేషన్లో వస్తున్న తాజా చిత్రంపై క్రేజీ అప్డేట్ వచ్చింది. దసరా కానుకగా చిత్రానికి సంబంధించిన కీలక అప్డేట్స్ ఇచ్చింది చిత్రబృందం. ఈ చిత్రం షూటింగ్ రేపటి నుంచే ప్రారంభిస్తున్నట్లు ట్విటర్ వేదికగా ప్రకటించింది. ఈ సినిమాలో హీరోయిన్గా పెళ్లిసందడి కథానాయిక శ్రీ లీలను ఎంపిక చేసినట్లు వెల్లడించింది. ఈ సినిమాకు బీజీఎం మాస్టర్ ఎస్ఎస్ తమన్ సంగీతమందించనున్నారు. (చదవండి: రామ్ - బోయపాటి కాంబినేషన్.. క్రేజీ అప్ డేట్ ఆరోజే..!) శ్రీనివాస సిల్వర్ స్కీన్ పతాకంపై శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే ఇప్పటివరకు ఎలాంటి అప్డేట్ చిత్రబృందం ఏకంగా సినిమా షూటింగ్ ప్రారంభిస్తున్నట్లు ప్రకటించి అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది. ఇక సినిమా కథ విషయానికి వస్తే.. ఇదొక పొలిటికల్ అండ్ ఫ్యామిలీ యాక్షన్ డ్రామా అని తెలుస్తోంది. ఈ సినిమాలో రామ్ ద్విపాత్రాభినయం చేయబోతున్నాడని సమాచారం. ముఖ్యంగా రామ్ మాస్ యాక్షన్‌కు సరిపోయే స్టోరీతో బోయపాటి ఈ సినిమా కథని ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. Excited to share this good news on this auspicious day.A big thank you to the entire team!! Wishing #HappyDussehra to you all 🔱#BoyapatiRAPO@ramsayz #BoyapatiSreenu @SS_Screens @srinivasaaoffl https://t.co/HeHL8FZdci — sreeleela (@sreeleela14) October 5, 2022 The Master of Chartbusters 🎹🎶 Welcoming the Sensational Musician and dear @Musicthaman Onboard for #BoyapatiRAPO 🥁🔥 We are so happy to have you as a part of our team ❤️@ramsayz #BoyapatiSreenu @sreeleela14 @SS_Screens @srinivasaaoffl pic.twitter.com/E57iMyDBxi — Srinivasaa Silver Screen (@SS_Screens) October 5, 2022 On this auspicious day of Dussehra, We are super excited to announce 📢 The Massive Energetic Combo of Ustaad @ramsayz and Mass Director #BoyapatiSreenu on sets from Tomorrow 🔥⚡#BoyapatiRAPO starts rolling with High Adrenaline Action Sequence 🎥🎬 pic.twitter.com/ooQk3ICmYv — Srinivasaa Silver Screen (@SS_Screens) October 5, 2022 -
పుట్టినరోజుకి ముందు అవార్డు అందుకున్నాను: నటి ఆశా పారేఖ్
68వ జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రదానోత్సవం శుక్రవారం ఢిల్లీలో జరిగింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ అవార్డులను ప్రదానం చేశారు. 2020కి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును నటి ఆశా పారేఖ్ అందుకున్నారు. ‘‘నా 80వ పుట్టినరోజుకు ముందు ఈ అవార్డు అందుకోవడం సంతోషంగా ఉంది’’ అన్నారు ఆశా పారేఖ్. జాతీయ ఉత్తమ నటులుగా సూర్య (‘సూరరై పోట్రు’), అజయ్ దేవగన్ (తన్హాజీ) అవార్డులు అందుకున్నారు. తమిళ ‘సూరరై పోట్రు’ ఉత్తమ సినిమా అవార్డుతో పాటు ఐదు అవార్డులు గెలుచుకుంది. ఉత్తమ స్క్రీన్‌ప్లే అవార్డును ఈ చిత్రదర్శకురాలు సుధ కొంగర, బెస్ట్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అవార్డును జీవీ ప్రకాష్ కుమార్, ఉత్తమ నటిగా అపర్ణా బాలమురళి అవార్డులు అందుకున్నారు. ‘అల వైకుంఠపురములో..’కి గాను జాతీయ ఉత్తమ సంగీతదర్శకుడిగా ఎస్ఎస్ తమన్, బెస్ట్ తెలుగు ఫిలిం ‘కలర్ ఫొటో’కు దర్శకుడు అంగిరేకుల సందీప్ రాజు, నిర్మాత సాయి రాజేశ్ అవార్డులు అందుకున్నారు. ‘నాట్యం’ సినిమాకు బెస్ట్ కొరియోగ్రాఫర్ అవార్డును నటి సంధ్యారాజు, బెస్ట్ మేకప్ ఆరి్టస్ట్ అవార్డును రాంబాబు అందుకున్నారు. ⇔ సినీ రంగంలో ప్రస్తుతం సృజనాత్మకతకు స్వేచ్ఛ ఉంది. సినీ నిర్మాణం, కథా రచయితలు సినిమాను చూసే విధానానికి ఇది స్వర్ణ యుగంలాంటిది -సుధ కొంగర ⇔ ‘అల వైకుంఠపురములో..’ అనుకున్న మొదటి రోజు నుంచి త్రివిక్రమ్, బన్నీ (అల్లు అర్జున్) ఇచి్చన ఎనర్జీ వల్లే ఈ అవార్డు సాధ్యమైంది. ఈరోజు ఇక్కడ అవార్డు అందుకోవడం గ్రేట్‌గా అనిపిస్తోంది. ఇదంతా దేవుడి దయ- ఎస్.ఎస్. తమన్ ⇔ వర్ణ వివక్ష గురించి తీసిన మా ‘కలర్ ఫొటో’కు అవార్డు రావడం ఆనందంగా ఉంది. కోవిడ్ వల్ల థియేటర్లలో సినిమా విడుదల చేయలేదు. ఆ బాధ ఈ జాతీయ అవార్డు రావడంతో పోయింది -నీలం సాయి రాజేష్ ⇔ ప్రతీ మూడు నెలలకోసారి మా సినిమాకు ఏదో ఒక రూపంలో అవార్డులు రావడం హ్యాపీగా ఉంది. – సందీప్ రాజు ⇔ లాక్డౌన్ కారణంగా రెండేళ్లు సినిమా కోసం కష్టపడ్డాం. మా కష్టానికి తగ్గ ఫలితం దక్కింది. – రాంబాబు -
మళ్లీ బుక్కైన తమన్.. ‘ఏంటమ్మా.. ఇది’ అంటూ మెగా ఫ్యాన్స్ ఫైర్
మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ మూవీ గాడ్‌ఫాదర్ నుంచి నిన్న విడుదలైన ఫస్ట్ సింగిల్ ప్రోమోకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ ప్రోమో చిరుతో కలిసి సల్మాన్ స్టెప్పులేశాడు. టార్ మార్ టక్కర్ మార్ అంటూ ఫాస్ట్ బీట్తో ప్రొమో అదిరిపోయిందంటూ కామెంట్స్ వచ్చాయి. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రొమో సాంగ్ విన్న కొందరు తమన్‌ను సోషల్ మీడియా వేదికగా ఆటాడేసుకుంటున్నారు. మళ్లీ దొరికిపోయాడంటూ అతడిని ట్రోల్ చేస్తున్నారు. ఇంతకి అసలు సంగతేంటంటే.. తమన్ కంపోజ్ చేసిన ఈ ‘తార్ మార్ టక్కర్ మార్’ పాట అచ్చం రవితేజ క్రాక్ చిత్రంలోని ‘డండనకర నకర.. నకర’ పాటలాగే ఉందని అంటున్నారు. చదవండి: రణ్వీర్ చెంప చెల్లుమనిపించిన బాడిగార్డ్! అసలేం జరిగిందంటే.. అయితే ఈ పాటను కంపోజ్ చేసింది కూడా తమనే. దీంతో ‘ఏంటి.. తమన్ నువ్వు ఇక మరావా?.. రెండు పాటలకు ఒకే బీట్ వాడావంటూ’ అతడిని ట్రోల్ చేస్తున్నారు. ‘మెగాస్టార్ లాంటి పెద్ద హీరో చిత్రానికి పని చేస్తున్నప్పుడు కొంచం డిఫరేంట్ ఉండాలి కదా’ అని తమన్‌పై మెగా ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ఇక ఈ రెండు పాటలను పోలుస్తూ నెటిజన్లు ‘ఏంటమ్మా.. తమన్ ఇది చూసుకోవాలి కదా’ అంటూ అతడిని ఏకిపారేస్తున్నారు. కాగా ఇలా కాపీ కొట్టి దొరికపోవడం తమన్‌కు ఇదేం మొదటిసారి కాదు. గతంలో కూడా పలు పాటలకు కాపీ కొట్టి తమన్ దొరికిపోవడం.. అతడిని నెటిజన్లు ట్రోల్ చేయడం సాధారణమైంది. చదవండి: నేను సినిమాలు మానేయాలని కోరుకున్నారు, అది బాధించింది: దుల్కర్ -
మళ్లీ అడ్డంగా దొరికిపోయిన తమన్.. ట్రోలింగ్‌తో ఆడేసుకుంటున్నారు
మెగాస్టార్ చిరంజీవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా గాడ్‌ఫాదర్. నిన్న(సోమవారం)చిరంజీవి బర్త్‌డే సందర్భంగా ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. ప్రస్తుతం ఈ టీజర్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుండగా మ్యూజిక్‌పై ట్రోలింగ్ నడుస్తుంది. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా బీజీఎమ్ అచ్చం వరుణ్ తేజ్ గని టైటిల్ సాంగ్లా ఉందని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. తీరు మార్చుకోకుండా మక్కీకి మక్కీ దించేశాడంటూ తమన్‌ను తెగ ట్రోల్ చేస్తున్నారు. మెగాస్టార్ సినిమాకు కూడా ఇలా కాపీ కొడతావా అంటూ నెటిజన్లు తమన్‌పై మండిపుతున్నారు. దీనికి సంబంధించిన వీడియోలను నెట్టింట వైరల్ చేస్తూ తమన్ తీరును ఎండగడుతున్నారు. కాగా గని సినిమాకు కూడా మ్యూజిక్ ఇచ్చింది తమనే కావడం విశేషం. Super @MusicThaman 👏 pic.twitter.com/AJeoHAyGDl — ʌınɐʎ (@CooIestVinaay) August 21, 2022 #GodFatherTeaser lone dorikipoyav ga ra #Thaman 🙄 pic.twitter.com/ND61touLV5 — ❄sesh💥 (@syam__SVS) August 21, 2022 -
తమన్ స్పీడ్‌కు అనిరుథ్ బ్రేక్.. ఖాతాలోకి మరో స్టార్ హీరో మూవీ!
టాలీవుడ్ లో వరుస విజయాలతో దూసుకెళ్తున్నాడు తమన్. ఆయన ట్యూన్ కడితే ఆ మూవీ హిట్టే అనే విధంగా సెంటిమెంట్ స్టార్ట్ అయిపోయింది. తనదైన కంపోజీషన్స్ తో భీమ్లానాయక్, సర్కారు వారి పాట లాంటి చిత్రాలకు బంపర్ ఓపెనింగ్స్ అందించాడు. మూవీ సక్సెస్ లో తన మ్యూజిక్ కు స్పెసిఫిక్ రోల్ ఉందంటూ ప్రూవ్ చేశాడు. సేమ్ టు సేమ్ సీన్‌ను కోలీవుడ్ లో రిపీట్ చేసాడు అనిరుథ్. అక్కడ ఈ ఏడాది విడుదలైన ఘన విజయాలను అందుకున్న చిత్రాల్లో అనిరుథ్ సంగీత దర్శకత్వం వహించినవే ఎక్కువ. ఏప్రిల్ 13న రిలీజైన బీస్ట్ తో అనిరుథ్ హంగామా మొదలైంది. ఆ తర్వాత కన్మణి రాంబో కతీజా, రీసెంట్ గా డాన్, ఇప్పుడు విక్రమ్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే టాలీవుడ్ లో ఫుల్ స్వింగ్ లో ఉన్న తమన్ స్పీడ్ కు అనిరుథ్ బ్రేక్స్ వేస్తున్నాడు. ఇప్పటికే ఆర్ ఆర్ ఆర్ తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న కొత్త చిత్రానికి మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు అనిరుథ్. ఇప్పుడు మరో ఆర్ ఆర్ ఆర్ హీరో రామ్ చరణ్ నటించబోయే న్యూ ఫిల్మ్ కు సంగీతం అందించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడట. జెర్సీ దర్శకుడు గౌతమ్ తిన్ననూరి మేకింగ్ లో చరణ్ ఒక చిత్రం చేయాల్సి ఉంది. శంకర్ తో మూవీ తర్వాత మెగా పవర్ స్టార్ నటించబోయే మూవీ ఇది. ఈ సినిమాకు అనిరుథ్ని మ్యూజిక్ డైరెక్టర్ సెలెక్ట్ చేశారట. గౌతమ్, అనిరుథ్ గతంలో జెర్సీ కోసం కలసి పని చేశారు. ఆ రిలేషన్‌తోనే ఇప్పుడు చరణ్ మూవీకి సంగీతం అందించే అవకాశం వచ్చిందట. ఇదే నిజమైతే.. టాలీవుడ్‌లోనూ అనిరుథ్ హంగామా మొదలైనట్లే. -
'సర్కారు వారి పాట' డబ్బింగ్ పూర్తి చేసిన కీర్తి సురేష్
సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన తాజా చిత్రం సర్కారు వారి పాట. కీర్తి సురేష్ ఈ చిత్రంలో హీరోయిన్గా నటించింది. పరుశురామ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మే12న విడుదల కానుంది. మైత్రి మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్ టైన్మెంట్స్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నారు. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో హీరోయిన్ కీర్తి సురేష్ కూడా డబ్బింగ్ పూర్తి చేసింది. దర్శకుడు పరుశురాం, మ్యూజిక్ డైరెక్టర్ థమన్ దగ్గరుండి కీర్తి సురేష్ చేత డైలాగ్స్ చెప్పించారు. దీనికి సంబంధించిన ఫోటోలను షేర్ చేసిన కీర్తి సర్కారు వారి పాట సినిమా కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నట్లు పేర్కొంది. చదవండి: 'ప్రేమ'పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన కృతిశెట్టి Final touches for dubbing is done! Cant wait for everyone to see Super⭐@urstrulymahesh in this one. A treat for all his fans! ❤️ Love, Kalaavathi #SarkaruVaariPaata #SVPOnMay12 pic.twitter.com/KsKub6MiG0 — Keerthy Suresh (@KeerthyOfficial) May 1, 2022 -
మహేశ్‌బాబు పెన్నీ సాంగ్ కోసం సితార ఎందుకన్నారు: తమన్
‘‘నిర్మాతలు, దర్శకులు మనల్ని నమ్మి డబ్బు ఖర్చుపెడుతున్నారు. వారి నమ్మకాన్ని కాపాడుకున్నంత సేపే మన గోల్డెన్ పీరియడ్ ఉంటుంది. ఇప్పుడు ప్రతి సినిమాకు ప్రూవ్ చేసుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి’’ అన్నారు సంగీతదర్శకుడు తమన్. మహేశ్‌బాబు, కీర్తీ సురేశ్ జంటగా పరశురాం దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘సర్కారువారి పాట’. నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్, గోపీ ఆచంట, రామ్ ఆచంట నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 12న థియేటర్స్‌లో రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ఈ చిత్రం మ్యూజిక్ డైరెక్టర్ తమన్ చెప్పిన విశేషాలు. స్టార్ హీరోలతో సినిమాలంటే విపరీతమైన అంచనాలు ఉంటాయి. ఆ అంచాలను ఎలా అందుకోవాలా? అని ఆలోచిస్తున్నప్పుడు ఏదైనా స్కూల్‌కు వెళ్లాలనిపిస్తుంటుంది (నవ్వుతూ). ఇప్పుడు మ్యూజిక్ ఇవ్వడమే కాదు.. దాన్ని ప్రజల్లోకి తీసుకుని వెళ్లడం కూడా ముఖ్యమైన విషయంగా మారిపోయింది. ఆడియో కంపెనీలు ఊరికే డబ్బులు ఇన్వెస్ట్ చేయవు. ఆదాయం వస్తుందా? లేదా అనే అంశాలను ఆలోచించుకుంటారు. ఒక పాట (‘సర్కారువారి..’లోని ‘కళావతి..’ని ఉద్దేశించి) 150 మిలియన్ల వ్యూస్‌ను దాటడమనేది చిన్న విషయం కాదు. పాన్ ఇండియా అనేది సినిమాల విషయంలోనే కాదు.. పాట విషయంలో కూడా జరుగుతోంది. పాట ఎలా ఉండాలి? లిరికల్ వీడియోను ఎలా డిజైన్ చేయాలి? అనే అంశాలను కూడా ముందే డిజైన్ చేసుకోవాల్సిన బాధ్యత మాపై ఉంటుంది. అప్పుడు.. అదో టెన్షన్ ఓ మ్యూజిక్ డైరెక్టర్ మంచి మ్యూజిక్ చేయడమనేది పాయింట్ నెంబర్ వన్ మాత్రమే. అంచనాలను అందుకోగలడా? ఒత్తిడిని అధిగమించగలడా? అనే అంశాలనూ పరిగణనలోకి తీసుకుంటున్నారు. ఫ్యాన్స్, హీరోలు, డైరెక్షన్ డిపార్ట్మెంట్.. ఇలా ఎవరైనా సరే మ్యూజిక్‌లో కరెక్షన్స్ చెప్పగలుగుతున్న రోజులివి. ఇవి కాక మా లిరికల్ వీడియోలు, ఇతర భాషల్లోని లిరికల్ వీడియోలు ఒకే రోజు రిలీజైతే అదో టెన్షన్. ఉదాహరణకు ‘సర్కారు వారి పాట’లోని ‘కళావతి..’, విజయ్ ‘బీస్ట్’ చిత్రంలోని ‘అరబిక్..’ ఒకే రోజు రిలీజ్ అయ్యాయి. హెల్దీ కాంపిటీషన్ ఉండాలి. అలాగే ప్రతి సినిమాకు ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అవి రీచ్ కావడం కష్టం అయినా రీచ్ కావాల్సిందే. లవ్‌స్టోరీకి చేయాలని ఉంది ఒకప్పుడు ఎక్కువగా కమర్షియల్ సినిమాలే ఉండేవి. ఇప్పుడు స్టోరీ డ్రివెన్ సినిమాలను చేస్తున్నాం. దాంతో మ్యూజిక్‌లోని డిఫరెంట్ యాంగిల్స్‌ను చూపించే అవకాశం ఉంటుంది. సక్సెస్‌ను హెడ్‌కు లోడ్ చేసుకుంటే అప్పుడు మనం ఫెయిల్యూర్స్‌ను తట్టుకోలేం.. పెద్ద సినిమాలే కాదు.. చిన్న సినిమాలకూ సంగీతం అందించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. లవ్‌స్టోరీ చిత్రాలకు మ్యూజిక్ అందించాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. అప్పుడు ‘కళావతి..’ ఉండేది కాదు ‘సర్కారువారి పాట’లో టైటిల్ సాంగ్ నాకు చాలెంజింగ్‌గా అనిపించింది. ఈ పాటకు ఓ పదీ పదిహేను ఆప్షన్స్ చేశాం. ఆ తర్వాత ఫైనల్ ట్యూన్ వచ్చింది. మ్యూజిక్ అంటే మ్యూజికల్ వెర్షన్ ఆఫ్ డైలాగ్సే. సినిమాలో ఉన్న డైలాగ్స్‌ను మ్యూజికల్‌గా చెప్పడం అన్నమాట. నాలుగు నిమిషాలు డైలాగ్స్ వదిలేసి దర్శకుడు మాకు ఆ టైమ్ ఇస్తున్నాడు. మేం కథను సంగీతంతో చెప్పాలి. అది పెద్ద బాధ్యత. ఇప్పుడు కథలో నుంచి వచ్చే పాటలు ఎక్కువయ్యాయి. లేకపోతే ‘కళావతి’ అనే పాట రాదు. జనరల్‌గా మాస్ సాంగ్‌కు డాన్స్ చేసే ఆడియన్స్ రివర్స్‌లో ‘కళావతి..’ పాటకు స్టెప్పులు వేస్తారు. సినిమాలో మహేశ్‌బాబుగారి లవ్‌ని ప్యూర్‌గా చూపించాలని ‘కళావతి..’ పాట రాశాం. ఈ పాట లిరికల్ వీడియో కోసం అదనంగా 30 లక్షలు ఖర్చుపెట్టాం. మా సినిమా నిర్మాతలు మ్యూజిక్‌ను ప్రేమించేవారు కాబట్టి అంత ఖర్చు పెట్టారు. అయితే పాట లీక్ కావడం చాలా బాధ అనిపించింది. కరోనా పరిస్థితుల్లో మా నిర్మాతలు సమస్యలు ఎదుర్కొన్నారు. ఆ కష్టాల గురించి ఆలోచించకుండా అలా లీక్ చేయడం బాధాకరం. లీక్ చేసిన వ్యక్తిని పిలిచి ‘నీ కెరీర్ గురించి ఆలోచించుకున్నావా? లీక్ చేయడం పెద్ద తప్పు’ అని మందలించి పంపాం. ఎందుకంటే అతనికి ఓ కుటుంబం ఉంది. సితార రాక్‌స్టార్ ‘పెన్నీ’ సాంగ్‌లో సితారను తీసుకోవాలనిపించి నమ్రతగారిని అడిగాను. మీ హీరోను అడగండి అన్నారు. మహేశ్‌గారిని అడిగాను. ఈ సాంగ్‌లో సితార ఎందుకు? అన్నారు. అప్పుడు సోషల్ మీడియాలో సితార డాన్సింగ్ వీడియోలు కొన్ని మహేశ్‌గారికి మళ్లీ చూపించి సితార బాడీలో మంచి రిథమ్ ఉందని చెప్పాను. ఆ తర్వాత ఓసారి నమ్రతగారితో మాట్లాడుతున్నప్పుడు సితార వచ్చింది. ‘పెన్నీ’ సాంగ్‌లో యాక్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ ఉన్నట్లు చెప్పింది. సితార జస్ట్ మూడు గంటల్లో పాట పూర్తి చేసింది. సితార రాక్‌స్టార్. ‘పెన్నీ’ సాంగ్ ఫైనల్ వెర్షన్లో సితారను చూసి హ్యాపీ ఫీలయ్యారు మహేశ్‌గారు. ఓ తండ్రిగా ఆయనకు అది ఓ గ్రేట్ ఫీలింగ్. సితార లిరికల్ వీడియోలోనే ఉంటుంది. ఆడియో సైజ్ మారింది మన సినిమాలు పాన్ ఇండియా కాదు.. పాన్ వరల్డ్ అయ్యాయి. ‘బాహుబలి, పుష్ప, ఆర్ఆర్ఆర్’ చిత్రాల తర్వాత గ్లోబల్ ఆడియన్స్ కూడా తెలుగు సినిమా వైపు చూస్తున్నారు. ‘అల వైకుంఠపురములో..’ తర్వాత ఆడియో సైజే మారిపోయింది. సినిమాలో మేటర్ ఉంటేనే ఏమైనా చేయగలం. ‘అఖండ’లో బాలయ్యగారిలో శివుణ్ణి ఊహించుకుని ఆ స్థాయిలో బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఇవ్వగలిగాను. నెక్ట్స్ ప్రాజెక్ట్స్ శంకర్‌గారి దర్శకత్వంలో రామ్‌చరణ్ హీరోగా నటిస్తున్న సినిమా, చిరంజీవిగారి ‘గాడ్ ఫాదర్’ చిత్రం, బాలకృష్ణగారి సినిమా, తమిళ హీరో విజయ్‌తో సినిమా చేస్తున్నాను. హిందీ సినిమాలకు సంగీతం అందించే అవకాశం ఉంది. చదవండి: ‘సలాం రాఖీ భాయ్’ అంటూ ఐరా ఎంత క్యూట్‌గా పాడిందో! -
నాకు తెలియదు, నన్ను నమ్మండి : పాపులర్ సింగర్
సూపర్ స్టార్ మహేశ్ బాబు నటిస్తున్న తాజా చిత్రం సర్కారు వారి పాట. పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీఎంబి ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కీర్తి సురేష్ ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తుంది. మే 12న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమా కోసం మహేశ్ ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన కళావతి, పెన్నీ సాంగ్స్‌కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. మూడవ పాటను బాలీవుడ్ పాపులర్ సింగర్ అర్మాన్ మాలిక్ పాడాడు. దీంతో ఈ సాంగ్ ఎప్పుడు రిలీజ్ అవుతుందంటూ మహేష్ ఫ్యాన్స్ ఆయనపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా ఇదే విషయంపై అర్మాన్ సోషల్ మీడియా వేదికగా స్పందించాడు. నాకు సందేశాలు పంపుతున్న మహేశ్ బాబు అభిమానులందరికి, నిజంగా సర్కారు వారి పాట నుంచి నెక్ట్స్ సాంగ్ ఎప్పుడు వస్తుందనేదానిపై నా వద్ద ఎలాంటి క్లూ లేదు. నన్ను నమ్మండి. నాకు కూడా తెలియదు.ప్రతీ దానికి ఒక ఇంటర్నల్ ప్రాసెస్ ఉంటుంది. మేమంతా ఓపికగా పనిచేస్తున్నాం. అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేదాకా వేచి చూడండి అంటూ ట్వీట్ చేశారు. To all SSMB fans messaging me, I genuinely have no clue when the song from #SarkaruVaariPaata is dropping. I know how eager y’all are to hear it. Trust me, I am too! But there’s an internal process to everything & all we can do is patiently wait for an official announcement ❤️🙏🏻 — ARMAAN MALIK (@ArmaanMalik22) April 17, 2022 -
రాధేశ్యామ్‌పై ట్రోలింగ్: మీమ్‌తో కౌంటరిచ్చిన తమన్
ప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రాధేశ్యామ్ ఎట్టకేలకు శుక్రవారం (మార్చి 11) రిలీజైంది. రాధాకృష్ణకుమార్ దర్శకత్వంలో ప్రభాస్ నటించిన ఈ పీరియాడికల్ మూవీకి మిశ్రమ స్పందన లభిస్తోంది. ఈ ప్రేమకథ అజరామరం అని కొందరు పొగుడుతుంటే మరికొందరు మాత్రం చాలా స్లోగా సాగుతూ బోర్ కొట్టిందని అంటున్నారు. ఈ సినిమా ప్రభాస్ చేయాల్సింది కాదని కొందరు నెగెటివ్ కామెంట్లు పెడుతుంటారు. తాజాగా ఈ నెగెటివిటీపై సంగీత దర్శకుడు తమన్ పరోక్షంగా స్పందించాడు. చదవండి: ‘రాధేశ్యామ్’మూవీ రివ్యూ సినిమా స్లోగా ఉందన్నవాళ్లకు కౌంటరిచ్చేలా ఉన్న మీమ్‌ను ట్విటర్లో షేర్ చేశాడు. ఇంతకీ ఆ మీమ్‌లో ఏముందంటే.. 'సినిమా ఎలా ఉంది?' అన్న ప్రశ్నకు బాగా స్లోగా ఉందని చెప్పగా.. 'నేను అడిగింది బాగుందా? బాలేదా? అని!, లవ్ స్టోరీ స్లోగా కాకుండా ఫస్ట్ హాఫ్‌లో ఫస్ట్ నైట్, సెకండాఫ్‌లో సెకండ్ సెటప్ పెట్టాలా ఏంటి?' అని చిర్రుబుర్రులాడుతున్నట్లుగా ఉంది. దీన్ని షేర్ చేసిన తమన్.. 'మీమ్ అదిరింది.. స్లో అంట, నువ్వు పరిగెత్తాల్సింది' అంటూ ట్రోలర్స్‌పై సెటైర్ వేశాడు. ఈ ట్వీట్‌కు బ్లాక్‌బస్టర్ రాధేశ్యామ్ అన్న హ్యాష్‌ట్యాగ్‌ను జత చేశాడు. మరి ఈ సినిమా నిజంగానే బ్లాక్‌బస్టర్ హిట్ అవుతుందో లేదో చూడాలి! #BlockBusterRadheShyam 💥💥💥💥💥💥 Slowwwww antaaaaa … Nuvvvvuuu parrigethaaaalsindhiiiii 🤣🤣🤣🤣 Adhirindhiiiii memmeee !! 🍭🍭🍭🍭🎭🤪 pic.twitter.com/SGW10l5w5h — thaman S (@MusicThaman) March 11, 2022 -
'రాధేశ్యామ్'పై క్రేజీ అప్డేట్ ఇచ్చిన తమన్
ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటించిన చిత్రం రాధేశ్యామ్. మోస్ట్ అవైటెడ్‌గా నిలిచిన ఈ సినిమా ఈనెల11న రిలీజ్ కానుంది. రాధాకృష్ణ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. రీసెంట్గా విడుదలైన మేకింగ్ వీడియోలో మ్యూజిక్ ఎంతలా ఆకట్టుకుందో తెలిసిందే. తాజాగా ఈ సినిమాకి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ఇచ్చిన థమన్ ఈ సినిమాకి సంబంధించి క్రేజీ అప్డేట్ ఇచ్చాడు. చదవండి: పూజా హెగ్డేతో విబేధాలపై తొలిసారి స్పందించిన ప్రభాస్ మా నుంచి ఒక క్రేజియెస్ట్ స్కోర్‌ను మీరంతా వినబోతున్నారు. మున్ముందు మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ రానున్నాయి అంటూ ట్వీట్ చేశాడు. మరి ఆ అప్డేట్ ఏంటో తెలియాలంటే కాస్త సమయం ఆగాల్సిందే. చదవండి: ఆ ముగ్గురు హీరోలతో నటించాలనుంది : పూజా హెగ్డే Hope u loved our #TheSagaOfRadheShyam Ur goona Witness A Craziest Score Ever from Us 💥🦋 it’s all tat #Butterflies running in my Stomach a longgggg wait 🎧🎛🎛 More updates coming from us let’s make this big guys #RadheShyamOnMarch11th 🦋🦋🦋🦋🦋 pic.twitter.com/qXXOPWkZb4 — thaman S (@MusicThaman) March 6, 2022 -
యూట్యూబ్‌లో దుమ్మురేపుతున్న 'కళావతి' సాంగ్
సూపర్‌స్టార్ మహేశ్‌బాబు, కీర్తి సురేశ్ జంటగా నటిస్తున్న చిత్రం 'సర్కారు వారి పాట'. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని జిఎంబి ప్రొడక్షన్స్, మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక వాలెంటైన్స్‌డేకు ఒకరోజు ముందుగా ఈ సినిమాలోని తొలి లిరికల్ సాంగ్ కళావతి సాంగ్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. 'వందో, ఒక వెయ్యో, ఒకలక్షో మెరుపులు దూకినాయా.. ఏందే ఈ మాయ, కమా కమాన్ కళావతి.. నువ్వే లేకుంటే అదోగతి' అంటూ సాగే లిరిక్స్ ఆకట్టుకుంటున్నాయి. ఇప్పటివరకు ఈ పాట 20మిలియన్స్‌కి పైగా వ్యూస్‌ని సాధించి ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. సోషల్‌మీడియాలో సైతం ఈ సాంగ్‌కు భారీ రెస్పాన్స్ వస్తుంది. సిద్ శ్రీరామ్ పాడిన ఈ పాటకు అప్పుడే 943kకి పైగా లైక్స్ రావడం విశేషం. -
లీక్ ఎఫెక్ట్.. 'సర్కారు వారి పాట' ఒరిజినల్ సాంగ్ అవుట్
మహేశ్‌బాబు, కీర్తి సురేశ్ జంటగా పరశురామ్ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం ‘సర్కారువారి పాట’. జిఎంబి ప్రొడక్షన్స్, మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ సినిమాలోని ఫస్ట్ లిరికల్ సాంగ్ కళావతి పాట విడుదల చేయాల్సి ఉండగా, ఒకరోజు ముందుగానే ఆన్లైన్లో లీకైన సంగతి తెలిసిందే. దీంతో ఈ పాటను షెడ్యూల్‌కి ఒకరోజు ముందే మేకర్స్ అధికారికంగా విడుదల చేశారు. 'వందో, ఒక వెయ్యో, ఒకలక్షో మెరుపులు దూకినాయా.. ఏందే ఈ మాయ, కమా కమాన్ కళావతి.. నువ్వే లేకుంటే అదోగతి' అంటూ సాగే లిరిక్స్ ఆకట్టుకుంటాయి. మ్యూజిక్ సెన్సెషన్ తమన్ స్వరాలు అందించిన ఈ పాటను సింగర్ సిద్ శ్రీరామ్ ఆలపించాడు. మే 12వ తేదీన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. #Kalaavathi is here!! Definitely one of my favourites! 👌https://t.co/t7fWq2UyUa@KeerthyOfficial @ParasuramPetla @MusicThaman @sidsriram @GMBents @MythriOfficial @14ReelsPlus — Mahesh Babu (@urstrulyMahesh) February 13, 2022 -
హీరోయిన్ అదితి శంకర్ పాడిన పాట విన్నారా?
వరుణ్ తేజ్, సయీ మంజ్రేకర్ జంటగా నటించిన చిత్రం ‘గని’. కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహించారు. అల్లు అరవింద్ సమర్పణలో అల్లు బాబీ, సిద్ధు ముద్ద నిర్మించిన ఈ చిత్రాన్ని ఈ నెల 25న విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ చిత్రంలోని ‘రోమియో జూలియట్’ పాటను విజయవాడలో విడుదల చేశారు. దర్శకుడు శంకర్ కూతురు, నటి అదితీ శంకర్ ఈ పాటతో గాయనిగా మారారు. అల్లు బాబీ మాట్లాడుతూ– ‘‘గని’ సినిమా అనుకున్న దానికంటే అద్భుతంగా వచ్చింది. తమన్ మంచి సంగీతం ఇచ్చాడు’’ అన్నారు. ‘‘ఈ పాటను నేనెప్పుడో ట్యూన్ చేసి పెట్టుకున్నాను.. అనుకోకుండా ‘గని’ కి కుదిరింది. అదితీ శంకర్‌తోనే ఈ పాట పాడించాలని ముందునుంచే అనుకున్నాను’’ అన్నారు తమన్. -
సర్కారు వారి పాట లేటెస్ట్ అప్డేట్
Sarkaru Vaari Paata Movie First Love Song Release Date Confirmed: సూపర్ స్టార్ మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సర్కారువారి పాట’. పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కీర్తి సురేశ్ హీరోయిన్గా నటిస్తుంది. తాజాగా ఈ సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్ని విడుదల చేసింది చిత్ర బృందం. ఈ చిత్రంలోని తొలి పాటను ఫిబ్రవరి14, వాలెంటైన్స్ డే రోజున రిలీజ్ చేయనున్నట్లు అఫీషియల్‌గా ప్రకటించింది. ఈ మేరకు పోస్టర్ని విడుదల చేసింది. ఇక ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. This Valentines Day, let us fall in love with the Melody Of The Year 💕#SVPFirstSingle on February 14.#SarkaruVaariPaata Super 🌟 @urstrulyMahesh @KeerthyOfficial @ParasuramPetla @MusicThaman @MythriOfficial @GMBents @14ReelsPlus @saregamasouth pic.twitter.com/AdexC9sZu6 — SarkaruVaariPaata (@SVPTheFilm) January 26, 2022 -
సంక్రాంతికి ‘సర్కారు వారి పాట’సర్ప్రైజ్!
సరిలేరు నీకెవ్వరు తర్వాత మహేశ్ బాబు మళ్లీ స్క్రీన్ పై కనిపించలేదు. సంక్రాంతికి బరిలోకి దిగాల్సిన ‘సర్కారు వారి పాట’ పోస్ట్ పోన్ అయింది. దీంతో ప్రిన్స్ ఫ్యాన్స్ కాస్త డీలా పడ్డారు.అయితే మరో నాలుగు రోజులు ఒపిక పట్టమంటోంది ఈ సినిమా యూనిట్. సంక్రాంతి నుంచి సర్కారు వారి అప్ డేట్స్ తో ఫ్యాన్స్ ఉక్కిరిబిక్కికి కావడం అంటోంది యూనిట్. సంక్రాంతి పండగ కానుకగా సినిమాను రిలీజ్ చేయలేకపోయింది యూనిట్. అందుకే పండక్కి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేయాలనుకుంటోంది. ఇప్పటికే సినిమాకు సంబంధించిన సాంగ్స్ కంపోజీషన్ కంప్లీట్ చేసాడు తమన్. సాంగ్స్ అన్ని నెక్ట్స్ లెవల్లో ఉంటాయని, సర్కారు వారి ఫ్యాన్స్ ను ఉర్రూతలూగించడం ఖాయమని గతంలోనే ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు తమన్.గీత గోవిందం దర్శకుడు పరశురామ్ తెరకెక్కిస్తున్న సినిమా ఇది. మూవీ షూటింగ్ కు సంబంధించిన మరో షెడ్యూల్ మాత్రమే బ్యాలెన్స్ ఉంది. త్వరలో లాస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసి,మూవీని ఏప్రిల్ 1కి రిలీజ్ కు రెడీ చేయనుంది యూనిట్. మహేశ్‌కు జోడిగా కీర్తి సురేష్ కనిపిస్తోంది. సముద్రఖని విలన్ రోల్ చేస్తున్నాడు. -
టాలీవుడ్లో కరోనా కలకలం.. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్‌కు కోవిడ్
SS Thaman Tests Covid 19 Positive, He Is Under Isolation: టాలీవుడ్లో కరోనా కలకలం సృష్టిస్తుంది. దేశ వ్యాప్తంగా కరోనా కేసులు తీవ్రమవుతున్న సమయంలో సెలబ్రిటీలు ఒక్కొక్కరుగా కోవిడ్ బారిన పడుతున్నారు. ఇప్పటికే మంచు మనోజ్, మంచు లక్ష్మి, విష్వక్సేన్, మహేష్ బాబు కోవిడ్ బారిన పడగా తాజాగా ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్. తమన్‌కు సైతం కరోనా పాజిటివ్ అని తేలింది. ప్రస్తుతం ఆయన హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. గత కొన్ని రోజులుగా తనను కలిసిన వారంతా కరోనా పరీక్షలు చేయించుకోవాలని తమన్ సూచించారు. Wishing you a speedy recovery darling @MusicThaman, Can't wait to see you in energetic mode defeating #Covid19. — Bobby (@dirbobby) January 7, 2022 -
నానికి కౌంటర్‌గా తమన్ వరుస ట్వీట్లు! నెట్టింట వైరల్
యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్ తమన్ హిట్ మ్యూజిక్‌తో ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తున్నాడు. ఎప్పుడూ మిస్టర్ కూల్‌గా కనిపించే తమన్ తాజాగా చేసిన వరుస ట్వీట్లు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి. అయితే ఈ ట్వీట్స్ నానిని ఉద్దేశించే చేసినవని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. శ్యామ్ సింగరాయ్ ప్రమోషన్స్‌లో భాగంగా నాని మాట్లాడుతూ.. 'తన సినిమాలో అన్ని క్రాఫ్ట్స్ లాగానే మ్యూజిక్‌కి సమానంగా ప్రాధాన్యత ఉంటుందని.. సంగీతం లేదా బీజీఎం సినిమాను ఎలివేట్ చేయాలే తప్పా.. డామినేట్ చేయకూడదని, లేదంటే శృతి తప్పుతుంది' అని పేర్కొన్నాడు. దీనికి కౌంటర్‌గా తమన్.. అన్ని క్రాఫ్ట్‌లు కలిసి పనిచేస్తేనే సినిమా విజయవంతం అవుతుందని, ఏ ఒక్క క్రాఫ్ట్ దేనిని డామినేట్ చేయదని వరుస ట్వీట్లు చేశాడు. దీంతో ఈ వ్యాఖ్యలు నానిని ఉద్దేశించినవేనని నెటిజన్లు చర్చించుకుంటున్నార. కాగా అఖండ సినిమాకు బీజీఎం మెయిన్ హైలెట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. We call it a Complete FILM when all the crafts Together Excel in all formats 🥁It’s never so called Dominated Crafts .. lol it’s the Deeper UNDERSTANDING of a Film Knowing it’s depth in dialogues it’s Narration & making It dive in Smooth to the Next Sequences 🎥🎵🥁 1/2 — thaman S (@MusicThaman) December 29, 2021 -
దుబాయ్‌లో మహేశ్‌ను కలిసిన త్రివిక్రమ్
Mahesh Babu And Trivikram Srinivas Are Chilling At Dubai: వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నట్లు వర్క్ ఫ్రమ్ వెకేషన్ అంటున్నారు హీరో మహేశ్‌బాబు. ‘సర్కారువారి పాట’ సినిమా షూటింగ్‌కు చిన్న బ్రేక్ ఇచ్చి కొన్ని రోజులుగా ఫ్యామిలీతో కలిసి మహేశ్‌బాబు దుబాయ్ వెకేషన్లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ వెకేషన్‌లోనే త్రివిక్రమ్ దర్శకత్వంలో తాను చేయనున్న సినిమాకి సంబంధించిన చర్చల్లో పాల్గొన్నారు మహేశ్. హారికా అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థ నిర్మించనున్న ఈ చిత్రం గురించిన చర్చల కోసం త్రివిక్రమ్ దుబాయ్ వెళ్లారు. ఈ చర్చల్లో సంగీత దర్శకుడు తమన్, నిర్మాత సూర్యదేవర నాగవంశీ కూడా పాల్గొన్నారు. ‘‘వర్క్ అండ్ చిల్. ఉపయోగకరమైన చర్చలతో సోమవారం మధ్యాహ్నం సాగింది’’ అంటూ ఓ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు మహేశ్‌బాబు. ఈ సినిమాకు సంబంధించిన మ్యూజిక్ సిట్టింగ్స్‌లో భాగంగా మహేశ్, త్రివిక్రమ్, తమన్ దుబాయ్‌లో కలుసుకున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్. వచ్చే ఏడాది ఈ సినిమా షూటింగ్ ఆరంభం కానుంది. Work and chill... productive afternoon with the team!! #TrivikramSrinivas @vamsi84 @MusicThaman #Dubai pic.twitter.com/F11xtEM0GW — Mahesh Babu (@urstrulyMahesh) December 27, 2021 -
ఈసారి లవర్స్ డేను ముందుగా సెలబ్రేట్ చేసుకుంటారు: తమన్
Thaman On Board For Radhe Shyam: ప్రభాస్, పూజాహెగ్డే జంటగా కేకే రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రాధేశ్యామ్’. కృష్ణంరాజు సమర్పణలో వంశీ, ప్రమోద్, ప్రసీద, భూషణ్ కుమార్ నిర్మించిన ఈ చిత్రం జనవరి 14న విడుదల కానుంది. యూరప్ బ్యాక్‌డ్రాప్‌లో పీరియాడికల్ లవ్‌స్టోరీగా రూపొందిన ఈ చిత్రానికి దక్షిణాది భాషల్లో (తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం) జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందించగా, హిందీలో మిథున్, అనూ మాలిక్, మనన్ భరద్వాజ్‌ల బృందం అందించారు. తాజాగా ‘రాధే శ్యామ్’ సౌత్ వెర్షన్స్‌కు తమన్ రీ రికార్డింగ్ అందిస్తున్నట్లు చిత్రబృందం వెల్లడించింది. ‘‘రాధేశ్యామ్’ సినిమా అంతా ప్రేమతో నిండిపోయింది.. అందుకే ఈ సినిమాకు ప్రేమతో వర్క్ చేస్తున్నాను. ప్రేమికుల దినోత్సవాన్ని ప్రపంచం కాస్త ముందుగానే సెలబ్రేట్ చేసుకుంటుంది’’ అని ట్వీట్ చేశారు తమన్. -
తమన్ తొలి సంపాదన ఎంతో తెలుసా?
సంగీత దర్శకుడు తమన్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్‌గా తమన్ తనదైన ప్రత్యేకతను చాటుకుంటున్నాడు. ఏ స్టార్ హీరో సినిమా అయిన దానికి సంగీత దర్శకుడు ఎవరు అంటూ తమన్ పేరే వినిపిస్తోంది. అంతేకాదు హీరోలు, డైరెక్టర్లు కూడా తమన్‌తోనే పని చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇంతగా ప్రాముఖ్యతను సంతరించుకున్న ఈ మ్యూజిక్ సన్సెషన్ ఈ స్థాయికి ఊరికే రాలేదని, దాని వెనక ఎంతో కష్టం ఉందని చెప్పాడు. ఇటీవల ఓ టీవీ షోకు ఇచ్చిన ఇంటర్య్వూలో తమన్ మాట్లాడుతూ ఆయనకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. చదవండి: సుకుమార్‌పై నెటిజన్లు ఫైర్, ఆ వెబ్ సిరీస్‌ను కాపీ కొట్టాడా? ఈ క్రమంలో తన తొలి సంపాదన 30 రూపాయలని చెప్పాడు. ఈ మేరకు తమన్.. ‘మా నాన్న డ్రమ్స్ చాలా బాగా వాయించేవారు.. ఆయన చాలా సినిమాలకి పనిచేశారు. అందువలన సహజంగానే నాకు డ్రమ్స్ వాయించడం పట్ల ఆసక్తి పెరుగుతూ పోయింది. ఒకసారి మేమంతా ఢిల్లీలోని మా అత్తయ్య ఇంటికి వెళ్లి ట్రైన్ లో వస్తుండగా, మా నాన్నకి హార్ట్ ఎటాక్ వచ్చింది. ట్రీట్మెంట్ ఆలస్యం కావడంతో ఆయన చనిపోయారు. నాన్న చనిపోవడంతో ఆయన ఎల్ఐసి పాలసీకి సంబంధించి 60 వేల రూపాయలు వచ్చాయి. ఆ డబ్బును ఇంట్లో వాడకుండా మా అమ్మ నాకు డ్రమ్స్ కొనిపెట్టింది. ఆ డ్రమ్స్‌తో నేను సాధన చేస్తూ డ్రమ్మర్‌గా ముందుకు వెళ్లాను. చదవండి: Pushpa Movie: అల్లు అర్జున్‌పై రష్మిక ఆసక్తికర వ్యాఖ్యలు ఈ క్రమంలో నేను డ్రమ్మర్‌గా పనిచేసిన తొలి చిత్రం ‘భైరవద్వీపం’. ఆ సినిమాకి పని చేసినందుకు నాకు 30 రూపాయలు పారితోషికంగా ఇచ్చారు. అలా డ్రమ్మర్‌గా నా తొలి సంపాదనగా 30 రూపాయలు సంపాదించాను’ అని చెప్పుకొచ్చాడు. కాగా అఖండ సినిమాకు తమన్ అందించిన మ్యూజిక్ ఎంత సన్సెషన్ అయ్యిందో తెలిసిందే. తమన్ ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ మాస్ బీజీయంకు ఆమెరిక బాక్సాఫీసు సైతం దద్దరిల్లింది. కాగా ప్రస్తుతం తమన్ ‘భీమ్లా నాయక్’ మహేశ్ బాబు నటించిన ‘సర్కారు వారి పాట’, వరుణ్ తేజ్ ‘గని’, అఖిల్ ‘ఏజెంట్’తో పాటు శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ నటిస్తున్న సినిమాకు కూడా తమన్ స్వరాలు అందిస్తున్నాడు. -
డైరెక్టర్ లారెన్స్ వల్లే ప్రభాస్ సినిమా నుంచి తప్పుకున్నా: తమన్
Thaman Said He Walked Out of Prabhas Movie Due to Director Raghava Lawrence: ఇటీవల ప్రకటించిన భారీ బడ్జెట్ చిత్రాల నుంచి సాధారణ చిత్రాల వరకు సింగీత దర్శకుడిగా మ్యూజిక్ సెన్సె షన్ ఎస్ఎస్ తమన్ పేరు వినిపిస్తోంది. సెకండ్ వేవ్ తర్వాత స్టార్ హీరో సినిమాలు వరసగా క్యూ కడుతున్నాయి. దీంతో తమన్ ఫుల్ బిజీగా మారాడు. అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఒకటుంది. అందేంటంటే చిరంజీవి, బాలకృష్ణ, పవన్ కల్యాణ్, మహేశ్ బాబు వంటి అగ్ర హీరోల సినిమాలకు పని చేసిన తమన్ ఇంత వరకుకు ప్రభాస్ ఒక్కసినిమాకు కూడా స్వరాలు అందించకపోవడం విచిత్రం. చదవండి: మరో వివాదాస్పద పాత్రతో సమంత హాలీవుడ్ ఎంట్రీ.. ప్రస్తుతం ప్రభాస్ దేశ వ్యాప్తంగా ఎంతో క్రేజ్ సంపాదించుకున్నాడు. బాహుబలితో పాన్ ఇండియా స్టార్ ఎదిగిన ప్రభాస్ చేతిలో భారీ ప్రాజెక్టులు ఉన్నాయి. ఇక స్పిరిట్ మూవీతో ఇంటర్నేషనల్ స్థాయి ఎదగనున్నాడు. ఈ నేపథ్యంలో ప్రభాస్ సినిమాలో తమన్ ఇంతవరకూ సంగీతాన్ని అందించకపోవడం ఎవరికైనా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అయితే ప్రభాస్‌తో కలిసి పనిచేయకపోవడానికి కారణమేదైనా ఉందా అనే సందేహం కూడా కలుగుతుంది. చదవండి: ఎట్టకేలకు విడాకులపై స్పందించిన ప్రియాంక-నిక్ జోనస్ ఈ క్రమంతో ఇటీవలో ఓ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తమన్ ఈ విషయంపై స్పందించాడు. ఈ సందర్భంగా ప్రభాస్ ‘రెబల్’ సినిమాకి పనిచేసే అవకాశం వచ్చిందన్నాడు. చివరకు ఆ సినిమాకి సంగీతం కూడా తానే చేయాలని లారెన్స్ అనుకన్నాడు. దీంతో నేను ఆ సినిమా నుంచి తప్పుకోవాల్సి వచ్చిందన్నాడు. అప్పటి నుంచి ఆయనతో ఏ ప్రాజెక్ట్ సెట్ కాలేదన్నాడు. త్వరలో ప్రభాస్ సినిమాకి పనిచేసే అవకాశం వస్తుందని ఆశిస్తున్నానంటూ చెప్పుకొచ్చాడు. -
అఘోర పాత్రల మీద రీసెర్చ్ చేశా, ఆ పాటకు నెల రోజులు పట్టింది: తమన్
సినిమాకు ఏం కావాలో అది చేస్తాను. ఎక్కువ ఖర్చు అనేది నేను అంగీకరించను. ఒక్కో పాటకు ఒక్కోలా చేయాల్సి ఉంటుంది. శంకర్ మహదేవన్ పాడితే బాగుంటుందని అనుకుంటే.. ఆయనతోనే పాడిస్తాం. అంతే కానీ ఖర్చు తక్కువ అవుతుందని వేరే వాళ్లతో పాడించను’అన్నారు ప్రముఖ సంగీత దర్శకుడు తమన్. నందమూరి బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో రాబోతున్న హ్యాట్రిక్ మూవీ `అఖండ( Akhanda)`కు సంగీతం అందించాడు తమన్. ఈ మూవీ డిసెంబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ద్వారకా క్రియేషన్స్‌పై అఖండ చిత్రాన్ని మిర్యాల రవిందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. బాలకృష్ణ సరసన ప్రగ్యా జైస్వాల్ నటిస్తున్నారు. అఖండ ప్రమోషన్స్‌లో భాగంగా మ్యూజిక్ డైరక్టర్ తమన్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు.. ►కరోనా వల్ల సినిమాలో మార్పులు వచ్చాయి. కాలానికి తగ్గట్టుగా మార్చుకుంటూ వచ్చాను. విడుదలయ్యే టైంకు తగ్గట్టు మ్యూజిక్ ఉండాలి. అందుకే మళ్లీ రీరికార్డింగ్ చేశాను. అఖండ సినిమాలో పని చేసిన ప్రతీ ఒక్కరికీ మంచి పేరు వస్తుంది. మంచి రేసుగుర్రంలా బోయపాటి గారు పరిగెత్తారు. మా అందరినీ పరిగెత్తించారు. ►ఈ సినిమాలో ఫైర్ ఉంది. ఇందులో ఎమోషన్ బాగుంటుంది. ఎమోషన్ బాగుంటే సినిమాలు ఎప్పుడూ హిట్ అవుతాయి. బాలయ్య గారు అదరగొట్టేశారు. ఇది పర్ఫెక్ట్ మీల్లాంటి సినిమా. ►అఘోర పాత్రల మీద రీసెర్చ్ చేశాను. ఆ పాత్రలకు తగ్గట్టుగానే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కొట్టాం. చాలా బాగా వచ్చింది. ఈ కథ నెవ్వర్ బిఫోర్ అని.. నెవ్వర్ అగైన్ అని కూడా చెప్పొచ్చు. టైటిల్ సాంగ్ విని బాలయ్య గారు మెచ్చుకున్నారు. కమర్షియల్ సినిమాలకు త్వరగా ఏజ్ అవుతుంది. కానీ బోయపాటి గారు ఈ చిత్రాన్ని అద్భుతంగా మలిచారు. ►మా మ్యూజిక్‌ను జనాల్లోకి తీసుకెళ్లేదే హీరోలు. వారి వల్లే అందరికీ రీచ్ అవుతుంది. ఈ చిత్రంలో బోర్ కొట్టే సీన్స్ ఉండవు. థియేటర్లో అందరూ ఎంజాయ్ చేస్తారు. ఇప్పటి వరకు నేను చేసిన పనిలో ఇదే బెస్ట్ అని అనిపిస్తుంది. ఈ ఇద్దరి కాంబినేషన్లో చేయడం చాలా కొత్త. సపరేట్గా ఇద్దరికి పని చేయడం వేరే.. ఇలా ఈ ఇద్దరికి కలిపి చేయడం వేరు. ఇది వేరే ఫైర్. ►ఈ సినిమాకు దాదాపు ఐదారు వందల మంది పని చేశారు. చాలా ప్రయోగాలు చేశాం. కేవలం సింగర్లే 120 మంది వరకు ఉంటారు. అఘోరాల గురించి చాలా రీసెర్చ్ చేశాం. సినిమాలో అఘోర పాత్ర ఎంట్రీ ఇవ్వడంతో రేంజ్ మారిపోతోంది. వేరే జోన్లో ఉంటుంది. ► అఘోర అంటేనే సైన్స్. వాళ్లు అలా ఎందుకు మారుతారు? అనే విషయాలపై సినిమా ద్వారా క్లారిటీ వస్తుంది. దేవుడిని ఎందుకు నమ్మాలి అనే దాన్ని క్లారిటీగా చూపిస్తారు. సినిమా చూసి మా టీం అంతా కూడా చాలా హైలో ఉన్నాం. ►నిర్మాత చాలా మంచివారు. ఆయన సినిమాలకు చెందిన వ్యక్తి కాదు. ఎక్కడ ఎంత ఖర్చు పెట్టాలో తెలిసిన వారు. ద్వారక క్రియేషన్స్‌లో పని చేయడం చాలా ఆనందంగా ఉంటుంది. ►ఇలాంటి జానర్లో ఇదే నా బెస్ట్ వర్క్ అవుతుంది. కమర్షియల్ సినిమా అంటే అన్నీ స్పైసీగా ఉండాలి. కానీ ఇలాంటి చిత్రాలకు అది కుదరదు. టైటిల్ సాంగ్‌ను కంపోజ్ చేసేందుకు దాదాపు ఓ నెల రోజులు పట్టింది. గొప్ప సన్నివేశం తరువాత ఆ పాట వస్తుంది. ►డైరెక్టర్ కథ చెప్పేటప్పుడే మాకు ఇన్ స్పైరింగ్‌గా ఉంటుంది. పెద్ద పెద్ద ఆర్టిస్ట్‌లుంటే మాకు కూడా ఊపు వస్తుంది. ఇందులో శ్రీకాంత్ , జగపతి బాబు అద్భుతంగా కనిపిస్తారు. ►మ్యూజిక్ అనేది చాలా ముందుకు వచ్చింది. పెళ్లికి ముందు గ్రీటింగ్ కార్డ్‌లా మ్యూజిక్ మారింది. ఇప్పుడు ఈ ట్రెండ్ నడుస్తోంది. ఇంకో పది, ఇరవై ఏళ్లు ఉంటుంది. ఈ ట్రెండ్ మంచిది. పాట హిట్ అయితే సింగర్ల గురించి వెతుకుతారు. కానీ ఇప్పుడు సింగర్లు ఎంత కష్టపడుతున్నారో అందరికీ తెలుస్తోంది. వారి ఫ్యాన్స్, ఫ్యామిలీ మెంబర్స్ చూసి సంతోషిస్తారు. ఆ విషయంలో హీరోలకు ముందుగా థ్యాంక్స్ చెప్పాలి. డైరెక్టర్, హీరోలు అందరూ ఒప్పుకుని ప్రోత్సహిస్తున్నారు. ఇలా పాటలను విడుదల చేయడం వల్ల ఆడియో కంపెనీలకు రెవెన్యూ కూడా వస్తోంది. -
మ్యూజిక్ సెన్సేషన్ తమన్ బర్త్‌డే స్పెషల్
సాక్షి, హైదరాబాద్: టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్‌లలో ఒకరు ఎస్ఎస్ తమన్. ట్రెండీ మ్యూజిక్‌తో శ్రోతలను మెస్మరైజ్ చేస్తూ స్టయలిష్ కంపోజర్‌గా నిలుస్తున్నాడు. బ్యాక్ అండ్ బ్యాక్ హిట్ సాంగ్స్‌తో ప్రస్తుతం తమన్ హవా నడుస్తోంది. బుట్టబొమ్మ సృష్టించిన బ్లాక్ బస్టర్ రికార్డులతో తమన్ పాపులారీటీ రేంజ్ నెక్ట్స్ లెవల్ని కూడా దాటేసింది. నవంబరు 16 తమన్ పుట్టిన రోజు సందర్భంగా హ్యాపీ బర్త్‌డే అంటోంది సాక్షి. కామ్. సంగీత దర్శకుడిగా తమన్ జీవన ప్రస్థానంపై ఆసక్తికర వీడియో మీ కోసం.. -
Happy Birthday S Thaman: డ్రమ్మర్ కాదు.. విన్నర్
-
మెగాస్టార్‌తో స్టెప్పులేయనున్న సల్మాన్‌ఖాన్
Salman KhanChiranjeevi Dance Number In God Farther: టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ‘గాడ్ ఫాదర్’లో బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ నటించనున్నారనే వార్త కొన్నాళ్లుగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. అలాగే హాలీవుడ్ స్టార్ సింగర్ బ్రిట్నీ స్పియర్స్ ఓ పాట పాడతారనే వార్త కూడా వచ్చింది. సల్మాన్ నటించనున్న వార్త నిజమేనని ఈ చిత్ర సంగీతదర్శకుడు తమన్ పేర్కొన్నారు. అలాగే బ్రిట్నీ పాడతారా? లేదా అనే విషయం గురించి కూడా స్పష్టం చేశారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తమన్ మాట్లాడుతూ – ‘‘చిరంజీవి సార్, సల్మాన్ సార్ కలసి డ్యాన్స్ చేయడం అనేది నిజంగా మాకు పెద్ద విషయం. అందుకే ఈ పాట స్థాయి కూడా పెద్దగా ఉండాలి. ఓ పెద్ద ఆర్టిస్ట్ (సింగర్, ఆర్టిస్ట్) కూడా ఉంటే బాగుంటుందనుకుంటున్నాం. కొన్ని ప్రముఖ ఆడియో కంపెనీలతో మాట్లాడుతున్నాం. వాళ్లు అంతర్జాతీయ స్థాయి ఆడియో కంపెనీలతో మాట్లాడాలి. ఎందుకంటే విదేశీ ఆర్టిస్ట్‌లకు ఈ ఆడియో కంపెనీలతో మంచి అనుబంధం ఉంటుంది.. ఒప్పందాలు కూడా కుదుర్చుకుంటారు. బ్రిట్నీని సంప్రదించే ముందు పక్కా ప్రణాళిక సిద్ధం చేసుకుంటాం. ఆమెతో తెలుగు పాట పాడించాలా? లేక ఇంగ్లిష్ ట్రాక్ పాడించాలా? అనేది ఇంకా నిర్ణయించుకోలేదు’’ అన్నారు. మోహన్ రాజా దర్శకత్వంలో రూపొందుతున్న ‘గాడ్ ఫాదర్’ మలయాళ ‘లూసిఫర్’కి రీమేక్ అనే విషయం తెలిసిందే. -
సర్కారువారి పాట: క్రేజీ అప్డేట్ ఇచ్చిన తమన్
సూపర్‌స్టార్ మహేశ్ బాబు పరశురాం దర్శకత్వంలో నటిస్తున్న సినిమా ‘సర్కారు వారి పాట’. మహేశ్ సరసన కీర్తి సురేశ్ హీరోయిన్గా నటిస్తున్న సంగతి తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీ మహేష్ బాబు ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు. కాగా ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ స్పెయిన్‌లో జరుగుతుంది. ఆ సినిమాకు సంబంధించి ఎస్.ఎస్ తమన్ అభిమానులకు క్రేజీ అప్డేట్ ఇచ్చాడు. రీసెంట్గా ఈ మూవీ మ్యూజిక్ కంపోజిషన్ పూర్తి అయినట్లు తమన్ పేర్కొన్నాడు. ఈ మేరకు మహేశ్‌తో తీసుకున్న ఫోటోను ట్విట్టర్లో షేర్ చేశారు. ఇందులో సూపర్ స్టైలిష్‌గా మహేష్ ఉన్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 13న ప్రేక్షకుల ఈ సినిమా ముందుకు రానుంది. చదవండి: 'మా' అధ్యక్షుడిగా మంచు విష్ణు తొలి నిర్ణయం 'నాట్యం' ఫేమ్ సంధ్యారాజు బ్యాక్‌గ్రౌండ్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.. Here We Complete the Compositions of Our Very Own #Superstar’s #SarkaruVaariPaata Here is Our #Superstar Shining @urstrulyMahesh gaaru 💥❤️ #SarkaruVaariPaataMusic 🎵🎧 pic.twitter.com/C6Tp63P2uC — thaman S (@MusicThaman) October 22, 2021 #Rhythmisgod 💥🎵 Just getting into the groove warming up and creating templates before our sessions start for #SarkaruVaariPaataMusic #SarkaruVaariPaata 🎵🎧💪🏼❤️🇪🇸 pic.twitter.com/StrHGVKp7x — thaman S (@MusicThaman) October 21, 2021 -
సాయిధరమ్ తేజ్ ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన తమన్
Sai Dharam Tej Is Recovering Reveals SS Thaman: సాయి ధరమ్ తేజ్ నటించిన రిపబ్లిక్ మూవీ అక్టోబర్1న విడుదల కానుంది. దేవాకట్టా ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ సినిమా రిలీజ్‌కు సిద్ధం అవుతున్న సమయంలో సెప్టెంబర్ 10న యాక్సిడెంట్ సాయితేజ్‌కు యాక్సిడెంట్ అయిన విషయం తెలిసిందే. అప్పటినుంచి అపోలో ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతున్నాడు. కొన్ని రోజుల క్రితం సాయి తేజ్ ఆరోగ్యంపై హెల్త్ బులిటెన్ రిలీజ్ అయ్యింది. అయితే ఆ తర్వాత ఎలాంటి అప్డేట్ లేదు. రిపబ్లిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో సాయితేజ్ ఆరోగ్యంపై పవన్ కల్యాణ్ అన్న మాటలు ఫ్యాన్స్‌లో ఆందోళన కలిగిస్తున్నాయి. దీంతో సాయితేజ్ ఆరోగ్యంపై అప్డేట్ ఇవ్వాల్సిందిగా అభిమానులు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున రిక్వెస్టులు చేస్తున్నారు. తాజాగా సాయి ధరమ్ తేజ్ ఆరోగ్యంపై ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్.తమన్ స్పందించారు. 'నా నన్భన్(స్నేహితుడు) కోలుకుంటున్నాడు. అప్డేట్ ఇచ్చినందుకు తేజ్ మ్యానెజర్ బి.కే.ఆర్. సతీశ్‌కు ధన్యవాదాలు. త్వరలోనే నా స్నేహితుడ్ని కలుస్తున్నందుకు ఎగ్జైటెడ్‌గా ఉన్నాను అంటూ' తమన్ ట్వీట్ చేశారు. All your prayers are working ❤️ My nanban @IamSaiDharamTej is recovering ❤️🩹 So well thanks @bkrsatish for the update . I am so excited to meet mY dear nanban in couple of days ⭐️#GetWellSoonSDT love u Nanba😍 — thaman S (@MusicThaman) September 30, 2021 -
‘అల వైకుంఠపురములో’కు అవార్డు వస్తదనుకోలేదు: అల్లు అర్జున్
ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతున్న సినీ తారలకు సాక్షి’ మీడియా గ్రూప్ 2019, 2020 సంవత్సరాలకు గాను ‘సాక్షి ఎక్స్‌లెన్స్’ అవార్డులను ప్రకటించింది. ఇందులో భాగంగా ‘అల వైకుంఠపురములో’గాను బెస్ట్ యాక్టర్ అవార్డు(2020) అల్లు అర్జున్ అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాకు అవార్డులంటే చాలా ఇష్టం. ‘అల వైకుంఠపురములో’ సినిమాకు బెస్ట్ యాక్టర్ అవార్డు వస్తుందని కలలో కూడా అనుకోలేదు. మా డైరెక్టర్ త్రివిక్రమ్ గారి వల్లే నాకు ఈ అవార్డు వచ్చింది. మా బ్రదర్ తమన్‌ని నాకు వన్ బిలియన్ ప్లే అవుట్స్ కావాలని ఏ ముహూర్తాన అడిగానో..! అంటే.. వందల కోట్ల సార్లు పాట ప్లే అవ్వాలని.. ఇప్పటికి దాదాపు 300 కోట్ల సార్లు ప్లే అయింది... ఆల్బమ్ ఆఫ్ ది ఇయర్ ఇవ్వడమే కాదు.. 2020 లాస్ట్‌లో ఎవడు సిక్సర్ కొడతాడో ఆడే మొత్తం డికేడ్ అంతా కొట్టినట్టు. ఆల్బమ్ ఆఫ్ ద డికేడ్... థ్యాంక్యూ తమన్. ఆల్బమ్‌లో ‘మల్లెల మాసమా...’ రాసిన సీతారామ శాస్త్రిగారికి, ‘రాజుల కాలం కాదు.. రథము, గుర్రము లేదు’ అని రాసిన రామజోగయ్య శాస్త్రిగారికి , ‘రాములో రాముల..’ పాట రాసిన కాసర్ల శ్యామ్‌గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ప్రత్యేకంగా కృతజ్ఞతలు ఎందుకు చెబుతున్నానంటే నాకు లాంగ్వేజ్ అంతగా రాదు.. కానీ లిటరేచర్ వేల్యూ బాగా తెలుసు. వచ్చే జనరేషన్ నాలా తెలుగు మాట్లాడకూడదు... చాలా బాగా మాట్లాడాలి (నవ్వు..). త్రివిక్రమ్గారిలా మాట్లాడాలనుకోండి. మా ప్రొడ్యూసర్ చినబాబుగారికి, వంశీగారికి, మా నాన్న అల్లు అరవింద్, బన్నీ వాసుకి థ్యాంక్యూ సో మచ్. ఈ సినిమాలో నేను నేర్చుకున్న విషయం ఏంటంటే... నాలుగైదేళ్లుగా ఇలాంటి ఒక పెద్ద హిట్టు పడాలి, ఇండస్ట్రీ రికార్డో లేదా ఆల్ టైమ్ రికార్డో పడాలి.. అనుకుంటూ ప్రతిసారీ సినిమా చేసేవాణ్ణి. అయితే రాలేదు. ప్రతిసారీ అలాగే అనుకుంటాం.. ఈసారి అన్నీ వదిలేసి సరదాగా ఒక సినిమా చేద్దాం అనుకుని చేస్తే.. ఆ సినిమానే ఆల్‌టైమ్ రికార్డ్, బ్లాక్ బస్టర్ అయ్యింది. ఇది సినిమాకే కాదు.. లైఫ్‌కి కూడా మంచి పాఠం. అదేంటంటే మన లైఫ్‌లో అద్భుతం రావాలంటే కొన్నిసార్లు పట్టుకోవడం కాదు.. వదిలేయాలి, వదిలేసినప్పుడే అద్భుతం వస్తుంది. మీ లైఫ్‌లో కూడా ఏదైనా అద్భుతం రావాలంటే వదిలేయండి. అదొస్తదంతే. – అల్లు అర్జున్, మోస్ట్ పాపులర్ యాక్టర్ (అల వైకుంఠపురములో...) అవార్డులు మాకు చాక్లెట్స్లాగా.. చిన్నపిల్లలకు చాక్లెట్లు అంటే ఎంత ఇష్టమో బేసిగ్గా సినిమావాళ్లకు అవార్డులు కూడా అంతే ఇష్టం. మీరు ఎన్ని చాక్లెట్లు ఇస్తామన్నా పిల్లలు వద్దనరు.. మేము అవార్డులు వద్దనం. ‘అల వైకుంఠపురములో..’ తాలూకు అవార్డు మొట్టమొదటగా ‘సాక్షి’తో స్టార్ట్ అయింది. ‘సాక్షి’ యాజమాన్యానికి, భారతీగారికి మా ‘అల వైకుంఠపురములో..’ టీమ్ తరఫున ధన్యవాదాలు. నిర్మాతలు రాధాకృష్ణ, అరవింద్గార్లకు, సినిమా రిలీజ్ అవక ముందే అత్యద్భుతంగా జనాల్లోకి తీసుకెళ్లిన నా మిత్రుడు తమన్‌కి, ఈ సినిమాని మా అందరితో కలిసి నటుడిగానే కాదు తోటి టెక్నీషియన్‌గానూ చేసిన మా హీరో అల్లు అర్జున్‌గారికి.. నాగవంశీ, పీడీవీ ప్రసాద్, పూజా హెగ్డే, టబులతో పాటు మిగతా అందరికీ నా కృతజ్ఞతలు. – త్రివిక్రమ్ శ్రీనివాస్, మోస్ట్ పాపులర్ డైరెక్టర్ (అల వైకుంఠపురములో...) 2020 తర్వాత మొదటిసారి.. 2020లో వైజాగ్‌లో చేసిన సక్సెస్ సెలబ్రేషన్స్ (‘అల వైకుంఠపురములో’)లో అంతమందిని జనాలను చూసిన తర్వాత.. మళ్లీ అంతమందిని చూడటం, ఓ ఫంక్షన్‌కి అటెండ్ కావడం కరువైపోయింది. ఓ ఏడాదిన్నర అటువంటి కరువులో ప్రయాణించిన మాకు ఒక చల్లటి గాలిలా మా ఇండస్ట్రీకి ఫస్ట్ వేడుకగా. ప్రప్రథమంగా ‘సాక్షి’ వారు ముందుకొచ్చి ఈ ఫంక్షన్ చేయడాన్ని ఎంతో అభినందిస్తున్నాను. ఇక ‘థర్డ్ వేవ్’ లేదనుకుంటూ ముందుకు సాగాలి. ‘సాక్షి’ వారు మా సినిమాని ఎన్నుకుని నాకు ,రాధాకృష్ణగారికి అవార్డు ఇచ్చినందుకు ధన్యవాదాలు. – అల్లు అరవింద్, మోస్ట్ పాపులర్ మూవీ (అల వైకుంఠపురములో...) క్రెడిట్ అంతా త్రివిక్రమ్, బన్నీదే.. ‘అల వైకుంఠపురములో..’ చిత్రానికి అవార్డు అందుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమా మాకు మ్యాజికల్ ఫిల్మ్. ఈ క్రెడిట్ అంతా త్రివిక్రమ్, బన్నీదే. ఈ సినిమాని ఇంత పెద్ద స్థాయిలో తీసిన రాధాకృష్ణ, అల్లు అరవింద్‌కు థ్యాంక్స్. ఓ సినిమాలో ఒక పాట హిట్ అయితే ఆ క్రెడిట్ మ్యూజిక్ డైరెక్టర్‌ది. ఆరు పాటలూ హిట్ కావడం అంత సులభం కాదు. త్రివిక్రమ్‌గారు చాలా తెలివైనవారు.. రియల్లీ జీనియస్. ఈ సినిమాకి మంచి లిరిక్స్ ఇచ్చిన ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి, రామజోగయ్య శాస్త్రి, కల్యాణ్ చక్రవర్తి, కృష్ణ చైతన్య, కాసర్ల శ్యామ్, విజయ్ కుమార్‌గార్లకు థ్యాంక్స్. ఈ సినిమాకి చాలా అవార్డులు రావడంతో నాకు చాలా సంతోషంగా ఉంది.. ‘సాక్షి’ యాజమాన్యానికి థ్యాంక్స్. – సంగీత దర్శకుడు తమన్, మోస్ట్ పాపులర్ మ్యూజిక్ డైరెక్టర్ (అల వైకుంఠపురములో...) ఇది నా రెండో సాక్షి అవార్డు.. ‘సాక్షి’ అవార్డు వచ్చినందుకు చాలా గౌరవంగా ఉంది. ఇది నా రెండో సాక్షి అవార్డు. మొదటిసారి ‘అరవింద సమేత వీరరాఘవ’ చిత్రానికి అందుకున్నాను.. ఇప్పుడు ‘అల వైకుంఠపురములో..’ చిత్రానికి తీసుకున్నాను. ఈ సినిమాలో నాకు అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్ టు మై డైరెక్టర్ త్రివిక్రమ్ సార్. ఈ సినిమా నా కెరీర్లో చాలా ప్రత్యేకం. అల్లు అర్జున్, నిర్మాత చినబాబుగారు, వంశీ, గీతా ఆర్ట్స్‌కి థ్యాంక్స్. ఈ అవార్డును నా అభిమానులకు అంకితం ఇస్తున్నా. ఎందుకంటే వారు మళ్లీ మళ్లీ నా సినిమా చూసి నన్ను ఆశీర్వదించడంతో పాటు అభినందించారు.. అందుకు వారందరికీ థ్యాంక్స్. – పూజా హెగ్డే, మోస్ట్ పాపులర్ యాక్ట్రస్ (అల వైకుంఠపురములో...) గర్వంగా ఉంది.. చిన్మయి ఇంతమంది ఫ్యాన్స్‌ని సంపాదించుకున్నందుకు గర్వంగా ఉంది. ఇంత అద్భుతమైన పాట (మోస్ట్ పాపులర్ సింగర్–‘ఊహలే...’ (జాను) కోసం ‘సాక్షి’ తనను గౌరవించడం చాలా సంతోషం. డైరెక్టర్ ప్రేమ్గారికి, నిర్మాతలు ‘దిల్’రాజు గారు, శిరీష్ గారు, మ్యూజిక్ డైరెక్టర్ గోవింద్ వసంత, లిరిక్ రైటర్ శ్రీమణి గారు... అలాగే తెరపైన ఈ పాటకి ప్రాణం పోసిన సమంత, శర్వా.. అందరికీ చిన్మయి తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాను. థ్యాంక్యూ ‘సాక్షి’ టీవీ. – రాహుల్, నటుడు–దర్శకుడు, చిన్మయి భర్త -
త్రివిక్రమ్ వల్లే... శంకర్ సినిమా వచ్చింది
‘సామజ వరగమన...’ అన్నారు తమన్.. అన్ని వర్గాల పాటల ప్రేమికులు... ‘ఏం ట్యూన్ అన్నా’ అన్నారు. ఇదొక్కటేనా? అంతకుముందు ఎన్నో ట్యూన్స్ ఇచ్చారు. అయితే ‘సామజ..’ వేరే లెవెల్‌కి తీసుకెళ్లింది. శంకర్ ‘బాయ్స్’లో నటించిన తమన్ ఇప్పుడు రామ్‌చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రానికి సంగీతదర్శకుడు. ‘సాక్షి’కి తమన్ ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలోని కొన్ని ముఖ్యాంశాలు. ► శంకర్ డైరెక్షన్లో నటించిన ‘బాయ్స్’ తర్వాత ఇన్నేళ్లకు ఆయన సినిమాకి సంగీతం అందిస్తున్నారు... ఈ స్థాయికి రావడానికి ఇరవయ్యేళ్లు పట్టింది. నిజానికి సంగీతం అంటేనే నాకు ఆసక్తి. ‘బాయ్స్’ అçప్పుడే శంకర్ సార్‌తో మ్యూజిక్ గురించి మాట్లాడేవాణ్ణి. నా ట్యూన్స్‌ని ఫస్ట్ విన్నది ఆయనే. నిజానికి ‘బాయ్స్’ సినిమాలో హయ్యస్ట్ పెయిడ్ యాక్టర్‌ను నేనే. అయినప్పటికీ మ్యూజికల్‌గానే నా లైఫ్‌ను మేనేజ్ చేయాలని నిర్ణయించుకున్నాను. అయితే ముందు గా నేను సినిమాల నుంచి నేర్చుకోవాలనుకున్నాను. శంకర్‌గారు పాటలు ఎలా తీయిస్తున్నారు? కెమెరామేన్ రవిచంద్రన్‌గారు ఎలా పిక్చరైజ్ చేస్తున్నారనే విషయాలను తెలుసుకున్నా. అలా నా కెరీర్లో ఓ ఏడాది శంకర్ సార్‌కు కేటాయించాను. ‘బాయ్స్’లో మాత్రమే యాక్ట్ చేశాను. యాక్టింగ్ నా స్పేస్ కాదనిపించింది. ► శంకర్‌ని తరచూ కలుస్తుంటారా? నటుడిగా ఎందుకు కొనసాగలేదు? చాన్స్ రాలేదా? ‘బాయ్స్’ చిత్రయూనిట్‌లోని యాక్టర్స్‌లో ఇప్పటికీ ఆయన్ను తరచూ కలుస్తుండేది నేనే. ఆ సినిమా విడుదలైన ఓ రెండు, మూడేళ్ల తర్వాత .. ‘నువ్వు యాక్ట్ చేయనన్నావని దర్శకుడు లింగుస్వామి చెప్పారు. అజిత్, విజయ్ సినిమాల్లో యాక్ట్ చేయనన్నావట? ఏడాది పాటు కష్టపడ్డావు? నువ్వు ఇండస్ట్రీకి వచ్చింది ఎందుకు?’ అని శంకర్‌గారు అడిగారు. ‘‘వారికి ఏదో ఒక రోజు మ్యూజిక్ చేస్తాను కానీ వారి సినిమాల్లో యాక్ట్ చేయాలనుకోవడంలేదు’’ అని ఆయనకు చెప్పాను. ‘సరే.. మ్యూజిక్కే చేస్తావా?’ అన్నారు. అవునన్నాను. ‘నా ప్రొడక్షన్లో రూపొందుతున్న ‘ఈరమ్’ (2009) (తెలుగులో ‘వైశాలి’) సినిమాకు సంగీతం ఇస్తావా?’ అని అడిగారు.. చేశాను. ఆ తర్వాత ‘మాస్కోవిన్ కావేరి’ సినిమాకు సంగీతం అందించే చాన్స్ వచ్చింది. ఎస్ పిక్చర్స్ (ఈరమ్), ఆస్కార్ ఫిలింస్ (మాస్కోవిన్ కావేరి) చెన్నైలో అప్పటికే పెద్ద బ్యానర్స్. నేను మ్యూజిక్ అందించిన సినిమా ఒక్కటి కూడా విడుదల కాకుండానే.. రెండు సినిమాలకు మ్యూజిక్ ఇవ్వడం స్టార్ట్ చేశాను. మ్యూజిక్ డైరెక్టర్‌గా నా ఫస్ట్ ఫిల్మ్ శంకర్గారిదే. ► ఇప్పుడు హీరో రామ్‌చరణ్, దర్శకుడు శంకర్ కాంబినేషన్లోని సినిమాకు చాన్స్ ఎలా వచ్చింది? శంకర్‌గారి దర్శకత్వంలో రామ్‌చరణ్ హీరోగా ‘దిల్’ రాజు నిర్మాణంలో సినిమా ఓకే అయ్యిందని తెలియగానే ... ‘దిల్’ రాజుగారితో ‘శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లో ఏఆర్ రెహమాన్‌గారు తొలిసారి మ్యూజిక్ చేయనున్నారు.. అదీ శంకర్‌సార్ దర్శకత్వంలో.. కంగ్రాట్స్ సార్’ అన్నాను. కానీ ఆయనేమో ‘ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ విషయంలో నాకు శంకర్ వేరే ఆప్షన్ ఇవ్వడం లేదు. నిన్నే కావాలంటున్నారు, మార్చి 1న ఆయన్ను వెళ్లి కలువు’ అన్నారు. షాకయ్యాను. ► మరి.. ఏఆర్ రెహమాన్ మీ సినిమాకు సంగీతం చేయడం లేదా అని శంకర్‌ను అడిగారా? అడగలేదు. ఆయనకు ఫోన్ చేస్తే, ‘15 రోజుల్లో ఓ సాంగ్ చేయాలి.. నువ్వు ఎప్పుడొస్తావ్?’ అని అడిగారు. ‘ఒక వారం టైమ్ ఇవ్వండి.. వస్తాను’ అన్నాను. ఇప్పటివరకు మూడు పాటలు పూర్తి చేశాను. ఈ సినిమాలో ఏడు పాటలు ఉంటాయి. ► ఏఆర్ రెహమాన్ వంటి సంగీత దర్శకులతో వర్క్ చేసిన శంకర్ టేస్ట్‌కు తగ్గట్లు మ్యూజిక్ అందించగలనా అనే ఆందోళన లేదా? భయం ఉంటే మనం ముందుకు వెళ్లలేం. చాలెంజింగ్‌గా తీసుకున్నాను. దర్శకులు శంకర్, త్రివిక్రమ్ ఒకేలా ఆలోచిస్తారని నా అభిప్రాయం. ఇద్దరూ పదేళ్లు ముందుగా ఆలోచిస్తారు. వారిద్దరినీ పట్టుకోవాలి. దాని కోసం కొంచెం ఎక్కువగా పరిగెడతాను అంతే. ► త్రివిక్రమ్‌తో ఆల్రెడీ వర్క్ చేయడం వల్ల మీ పని ఈజీ అయ్యిందనుకోవచ్చా? త్రివిక్రమ్ నాకో ప్రొఫెసర్లాంటి వారు. ఆయన దర్శకత్వంలో ‘అరవిందసమేత వీరరాఘవ’ చేశాక మ్యూజిక్ పట్ల నా దృష్టి కోణం మారింది. శంకర్‌గారి సినిమాకు మ్యూజిక్ చేసే చాన్స్ త్రివిక్రమ్‌గారి వల్లే వచ్చిందను కుంటున్నాను. ‘అల.. వైకుంఠపురములో..’ సక్సెస్ వల్లే శంకర్‌గారితో సినిమా చేసే చాన్స్ వచ్చిందని నమ్ముతున్నాను. ► నా హార్ట్‌కు, బ్రెయిన్‌కు మధ్య త్రివిక్రమ్ ఓ కొత్త నర్వ్ వేశారని అన్నారు ఓ సందర్భంలో.. వివరిస్తారా? అది నిజమే. కొంతమందిని కలిసినప్పుడు మనం మారిపోతుంటాం... కనీసం ఒక శాతం అయినా. అది పెళ్లైన తర్వాత భార్య వల్ల కావొచ్చు, కొత్త ఉద్యోగంలో జాయిన్ అయ్యాక బాస్ వల్ల కావొచ్చు.. మనం మారవచ్చు. త్రివిక్రమ్‌గారి వల్ల నేను మారిపోయాను. సినిమాకు ఉన్న వేరే కోణాలు ఏంటో ఆయన చెప్పారు. ఇదివరకు నేను సినిమా ముందు ఉండేవాణ్ణి. ఆయనతో వర్క్ చేసిన తర్వాత సినిమా వెనక్కి వెళ్లాను. ఇప్పుడు స్క్రీన్ వెనకాల నుంచి వర్క్ చేస్తున్నాను. ► త్రివిక్రమ్ ఒక నర్వ్ వేశారు. మరి.. శంకర్? ఆ నరాన్ని స్ట్రాంగ్ చేసుకుంటాను. ► మీ అమ్మగారితో పాడించాలని ఎప్పుడూ అనుకోలేదా? నాన్న చనిపోయాక 27 ఏళ్లుగా అమ్మ బాధ్యత అంతా నాదే. పాడతానని అమ్మ అడుగుతుంటారు. అయితే ఫ్యామిలీ చేత ఎక్కువ పాడిస్తున్నానంటారేమో అని ఆగాను. నా భార్య శ్రీవర్ధిని ‘కిక్’ , ‘ఆంజనేయులు’ వంటి సినిమాల్లో పాడారు. అలాగే విశాల్ సినిమాకీ పాడుతున్నారు. ► మ్యూజిక్ పరంగా చెన్నైతో పోలిస్తే హైదరాబాద్..? హైదరాబాద్ చాలా ఫాస్ట్‌గా డెవలప్ అవుతోంది. మ్యూజిక్‌కి పెద్ద బేస్ ఇది. చెన్నై ముంబై నుంచి కూడా తరచుగా రాకపోకలు సాగించే మ్యుజిషియన్స్ ఉన్నారు. లోకల్‌గా ఎక్కువ సింగర్స్ ఉన్నారు. కీరవాణి, మణిశర్మ, కోటి వంటివారు చాలా ట్రైన్ చేసేశారు. అలాగే ఇక్కడ బ్యాండ్ కల్చర్ బాగా ఉండడం వల్ల చాలామంది ఇతర వాద్య కళాకారులు కూడా బాగా వచ్చేశారు. ► రీ– రికార్డింగ్ అంటే ఒకప్పుడు చెన్నై కేరాఫ్? అవును.. అయితే ఇప్పుడు అన్నీ హైదరాబాద్‌లోనే జరుగుతున్నాయి. ► క్రికెట్ బాగా ఆడతారు కదా? అవును శని, ఆదివారాల్లో పూర్తిగా క్రికెట్ ఆడుతూ ఉంటా. అయితే అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారులో మరొకరో ఉండరు. అక్కడా సింగర్స్, ఇతర మ్యుజిషియన్స్ ఉంటారు. హైదరాబాద్, చెన్నైలలో 2 టీమ్స్ ఏర్పాటు చేశాం. ► డైరెక్టర్ శంకర్ ‘బాయ్స్’ చిత్రంతో నటుడిగా తెరంగేట్రం.. ఇప్పుడు శంకర్ సినిమాకే మ్యూజిక్ డైరెక్టర్... శంకర ప్రియతమన మ్యూజిక్ డైరెక్టర్... తమన్ ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ ఈరోజు ఉదయం 9:30 గంటలకు, తిరిగి రాత్రి 9:30 గంటలకు ‘సాక్షి’ టీవీలో – రెంటాల జయదేవ -
రాంచరణ్ శంకర్ #RC15 సినిమా ప్రారంభం ఫోటోలు
-
RC15: సూటుబూటు వేసుకొని స్టయిలిష్‌గా పోస్టర్
Ram Charan-Shankars RC 15 Launch: మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ హీరోగా, క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి హైదరాబాద్‌లో బుధవారం ఉదయం పూజా కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా చిత్రయూనిట్ ఓ పోస్టర్నుఎ రిలీజ్ చేసింది. ఇందులో రామ్‌చరణ్,కియారాలతో పాటు డైరెక్టర్శంకర్, దిల్ రాజు, సునీల్ సహా ఇతర టెక్నీషియన్లు అందరూ సూటుబూటు వేసుకొని ఫైల్స్ పట్టుకొని దర్శనమిచ్చారు. ఈ క్రేజీ పోస్టర్‌కు వీ ఆర్ కమింగ్ అంటూ క్యాప్షన్‌ను జోడించారు. రామ్‌చరణ్ 15వ చిత్రంగా పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమాను శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్నారు. శిరీష్ దీనికి సహ నిర్మాత.అంజలి, సునీల్, జయరామ్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. కాగా ఈ సినిమా ప్రారంభోత్సవానికి మెగాస్టార్ చిరంజీవి, దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి, బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి : డ్రగ్స్ కేసులో ఈడీ ముందుకు రానా దగ్గుబాటి బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ ఇంట తీవ్ర విషాదం -
తమన్‌కు చేదు అనుభవం.. ఎన్నిసార్లు మోసం చేస్తావు..!
ప్రముఖ సంగీత దర్శకుడు తమన్‌కు మరోసారి చేదు అనుభవం ఎదురైంది. తాజాగా పవన్ కల్యాణ్-రానా దగ్గుబాటిల మల్టిస్టార్ సినిమాకు ‘భీమ్లా నాయక్’గా టైటిల్ ఖారారు చేసి ఫస్ట్ గ్లింప్స్ వీడియోను విడుదల చేశారు మేకర్స్. ఈ వీడియోకు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వస్తోంది. ఈ ఫస్ట్ గ్లింప్స్‌లో పవన్ లుక్, ఆయన డైలాగ్స్‌కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. పవన్ రౌడీలను కొడుతుంటే బ్యాగ్రౌండ్లో వస్తున్న మ్యూజిక్ హైలెట్‌గా నిలిచింది. ఇక అంతబాగానే ఉందనుకుంటే ఫస్ట్ గ్లింప్స్ విడుదలైన కాసేపటికే నెటిజన్లు మ్యూజిక్ డైరెక్టర్ తమన్‌ను ట్రోల్ చేయడం ప్రారంభించారు. మరోసారి తమన్ మ్యూజిక్‌ను కాపీ కొట్టాడంటూ నెటిజన్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇందులోని ఓ బిట్ దగ్గర ‘పెట్టా’ మూవీలోని ఓ పాట మ్యూజిక్‌ను పోలి ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు. అంటే ‘ఈ సారి కూడా తమన్ కాపీ కొట్టాడు.. ఇలా ఎన్నిసార్లు మోసం చేస్తావు తమన్’ అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. తమన్ ఇలా ట్రోల్స్ బారిన పడటం ఇదేం తొలిసారి కాదు. గతంలో కూడా ‘వి’ మూవీ సమయంలో మ్యూజిక్ కాపీ కొట్టాడంటూ విమర్శలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. అయితే వాటిపై తమన్ స్పందించకపోవడం గమనార్హం. కాగా, ఈ సినిమాలో పవన్ కల్యాణ్ భీమ్లానాయక్ అనే పోలీస్ పాత్రలో కనిపించనున్నాడు. ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ అనే మలయాళ మూవీకి రీమేక్‌గా ఈ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అక్కడ సూపర్ హిట్ సాధించిన ఈ మూవీలో పృథ్వీరాజ్ సుకుమారన్, బీజుమేనన్లు ప్రధాన పాత్రల్లో నటించారు. బీజుమేనన్ పోషించిన పాత్రను తెలుగులో పవన్, పృథ్వీరాజ్‌కుమార్ పోషించిన పాత్రలో రానా కనిపించనున్నాడు. ఇక నిత్యామీనన్, ఐశ్వర్యా రాజేశ్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
చిరంజీవి 153వ మూవీ: ఫైట్‌తో ఎంట్రీ ఇచ్చిన చిరు
కొత్త సినిమాలోకి అడుగుపెట్టడం పెట్టడమే ఫైట్ చిత్రీకరణలో పాల్గొన్నారు చిరంజీవి. మోహన్‌రాజా దర్శకత్వంలో చిరంజీవి హీరోగా రూపొందుతున్న తాజా సినిమా తొలి షెడ్యూల్ చిత్రీకరణ శుక్రవారం హైదరాబాద్‌లో మొదలైంది. తొలుత యాక్షన్ సీన్స్‌ను తెరకెక్కిస్తున్నారు. ఆర్ట్ డైరెక్టర్ సురేశ్ సెల్వరాజన్ రూపొందించిన సెట్లో జరుగుతున్న ఈ సినిమా యాక్షన్ సీక్వెన్సెస్‌ను శిల్వ స్టంట్ సమకూర్చుతున్నారు. ఈ సినిమాకు ‘గాడ్‌ఫాదర్’, ‘కింగ్‌మేకర్’ అనే టైటిల్స్‌ను చిత్రయూనిట్ పరిశీలిస్తున్నట్లు ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి నిరవ్ షా ఛాయాగ్రాహకులు. ఆర్బీ చౌదరి, ఎన్వీ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి వాకాడ అప్పారావు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. -
‘లూసిఫర్’ షూటింగ్ స్టార్ట్ చేసిన చిరు
మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించనున్న 153వ చిత్రం షూటింగ్ ఈ రోజు ప్రారంభం కానుంది. మలయాళంలో ఘన విజయం సాధించిన ‘లూసిఫర్’ చిత్రానికి రీమేక్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, సూపర్ గుడ్ ఫిలింస్ సంస్థలపై ఆర్బీ చౌదరి, ఎన్వీ ప్రసాద్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు. With #BOSS 🎵 #MegastarChiranjeevi gaaru ❤️@KChiruTweets #Chiru153 🔈🎬🎵 Wishing the our dear director @jayam_mohanraja all the very best for the shoot starting tomorrow 🎥🎵❤️ #niravshah 🎥 God bless team 📢 @KonidelaPro 🎬 pic.twitter.com/NwuUkVNfa8 — thaman S (@MusicThaman) August 12, 2021 కాగా ఈ చిత్రంలోని మొదటి పాట రికార్డింగ్ కూడా ఇటీవల పూర్తయింది. ఈ విషయాన్ని తమన్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఈ మేరకు చిరంజీవి, మోహన్ రాజాలతో దిగిన ఫొటోను తమన్ ట్విట్టర్లో షేర్ చేస్తూ.. ‘జీవితంలో గుర్తుంచుకోదగిని రోజు ఇది. చిరు 153 సినిమా కోసం పాట పూర్తి చేశాం. ఓ వీరాభిమానిగా చిరంజీవిగారి అభినందనలు అందుకోవడం చాలా ప్రత్యేకంగా ఉంది’ అంటూ రాసుకొచ్చారు. కాగా చిరంజీవి ఇటీవల ఆచార్య షూటింగ్ పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. A day to Remember for life ❤️ We Completed Our Song for #Chiru153 that warm wishes from our dear #MEGASTAR @KChiruTweets gaaru himself 🎵♥️ Was Something Very Very Special to me As a biggest FAN boy 😍 thanks to @jayam_mohanraja Shoot starts TOM 🎬 📢 @KonidelaPro Godbless 😊 pic.twitter.com/DRVdp93f7V — thaman S (@MusicThaman) August 12, 2021 -
చిరు టూ సాయి తేజ్... తమన్ జోరు మాములుగా లేదుగా
టాలీవుడ్ ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ గా మారాడు తమన్. ముఖ్యంగా మెగా హీరోస్ తమన్ కు చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. స్టైలిష్ స్టార్ కు అల వైకుంఠపురము లాంటి బ్లాక్ బస్టర్ ఆల్బమ్ అందించాడు.అదే స్పీడ్ లో వకీల్ సాబ్, అయ్యప్పనుమ్ కోషియుమ్ తెలుగు రీమేక్ వర్క్ చేస్తున్నాడు. రామ్ చరణ్ నటించిన నాయక్, బ్రూస్ లీ లాంటి సినిమాలకు సూపర్ హిట్ ట్రాక్స్ అందించాడు తమన్. ఇప్పుడు ఆరేళ్ల తర్వాత మరోసారి చరణ్ సినిమాకు వర్క్ చేస్తున్నాడు తమన్. పైగా ఈసారి పాన్ ఇండియా ప్రాజెక్ట్ ఆఫర్. శంకర్-చెర్రీ కాంబోలో రాబోతున్న మూవీకి తమనే సంగీతం అందిస్తున్నాడు. అలాగే లూసిఫర్ తెలుగు రీమేక్ కోసం కూడా తమన్ వర్క్ చేయబోతున్నాడు.కెరీర్ లో ఫస్ట్ టైమ్ చిరు నటిస్తున్న సినిమాకు సంగీతాన్ని అందించబోతున్నాడు. ఈ మూవీకి సంబంధించి ఇప్పటికే దర్శకుడు మోహన్ రాజా తమన్ తో చర్చలు ప్రారంభించాడు. సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ కు ఇప్పటికే ప్రతి రోజూ పండగే మూవీతో సూపర్ హిట్ ఆల్బమ్ అందించాడు. ఇఫ్పుడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటిస్తున్న బిగ్ బడ్జెట్ స్పోర్ట్స్ డ్రామా గని కి సాంగ్స్ కంపోజ్ చేస్తున్నాడు. మొత్తంగా మెగా హీరోస్ మూవీస్ కు మ్యూజిక్ అందిస్తూ మెగా మ్యూజిక్ డైరెక్టర్ గా మారాడు తమన్. -
లూసీఫర్ రీమేక్: చిరు కోసం తమన్ అదిరిపోయే బ్యాక్‌గ్రౌండ్ థీమ్
మోహన్ రాజా డైరెక్షన్లో మెగాస్టార్ చిరంజీవి 153వ చిత్రం తెరకెక్కబోతోన్న సంగతి తెలిసిందే. మలయాళ సూపర్ హిట్ మూవీ లూసిఫర్‌ను మోహన్ రాజా తెలుగులో చిరుతో రీమేక్ చేస్తున్నట్లు ఈ ఏడాది ప్రారంభంలో అధికారిక ప్రకటన వెలువడిన సంగతి తెలిసిందే. ఇదిలాఉండగా తాజాగా ఈ లూసిఫర్ నుంచి ఓ అప్డేట్ వచ్చింది. కాగా ఈ మూవీకి తమన్ మ్యూజిక్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ రీమేక్ మ్యూజిక్ సిట్టింగ్స్ జరుగుతున్నట్లు తమన్ సోషల్ మీడియాలో వెల్లడించాడు. ఇందులో ఎలివేషన్స్ మలయాళం కంటే ఎక్కువగానే ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు తమన్ చిరు కోసం మంచి బ్యాక్‌గ్రౌండ్ థీమ్ సిద్దమైనందని పేర్కొన్నాడు. ఈ క్రమంలో సోమవారం డైరెక్టర్ మోహన్ రాజా, తమన్‌లు చర్చించుకున్న ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ‘చిరు 153వ మూవీ మ్యూజికల్ సిట్టింగ్‌పై వర్క్ జరుగుతుంది. త్వరలోనే షూటింగ్ కూడా ప్రారంభం కానుంది’ అంటూ ట్వీట్ చేసింది. కాగా ప్రస్తుతం చిరు కొరటాల శివతో ఆచార్య మూవీ చేస్తున్నాడు. దాదాపు చివరి దశకు చేరుకున్న ఈ మూవీ క్లైమాక్స్ సన్నివేశాల చిత్రీకరణ జరపుకుంటోంది. దీంతో చిరు ఆచార్య షూటింగ్లో ఫుల్ బీజీగా ఉన్నాడు. ఈ మూవీ పూర్తైయిన వెంటనే మెగాస్టార్ లూసిఫర్ షూటింగ్‌ను ప్రారంభించనున్నాడని సమాచారం. And Here We Start #Chiru153 ❤️ with @jayam_mohanraja It’s time to show love to Our beloved #Megastar #chiranjeevi @KChiruTweets gaaru ⭐️⭐️⭐️⭐️⭐️ And guys this is goona be super high stuff for sure !! ❤️#godbless pic.twitter.com/RHim4ggd7o — thaman S (@MusicThaman) June 28, 2021 -
Thaman:అల అమెరికాపురములో..తమన్ లైవ్ కాన్సర్ట్
ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ అమెరికాలో జరగనున్న మ్యూజికల్ కార్నివాల్ ‘అల అమెరికాపురములో..’లో పాల్గొననున్నారు. హంసిని ఎంటర్టైన్మెంట్ ఈ మ్యూజికల్ కార్నివాల్‌ని ఆగస్ట్, సెప్టెంబర్ నెలల్లో ఏర్పాటు చేయనుంది. వాషింగ్టన్ డి.సి., చికాగో, న్యూజెర్సీ, శాన్ జోస్ మరియు డల్లాస్‌లో తమన్ తన బృందంతో కలిసి ప్రత్యక్ష ప్రదర్శనలు ఇవ్వనున్నారు. ఈ కాన్సర్ట్‌కు టాలీవుడ్‌కి చెందిన ఓ టాప్ డైరెక్టర్‌తో పాటు ఓ స్టార్ హీరో ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. హంసిని ఎంటర్టైన్మెంట్ వారు గతంలో ఏఆర్ రెహమాన్‌తో ‘ఏఆర్ఆర్ లైవ్ ఇన్ కాన్సర్ట్ 2017 లండన్’, అనిరుద్‌తో ‘అనిరుధ్ లైవ్ ఇన్ కాన్సర్ట్ లండన్ అండ్ ప్యారిస్ 2018’ వంటి భారీ సంగీత కార్యక్రమాలను నిర్వహించారు. చదవండి: హన్సిక సినిమా విడుదలపై నిషేధం విధించలేం రూ.26 కోట్ల మోసం! సంగీత దర్శకుడిపై కేసు కొట్టివేత -
పనికిమాలినోడిని చేసుకున్నందుకు గర్వపడుతుంది: థమన్
చెడు చెవిలో చెప్పాలి, మంచి మాత్రం నలుగురికీ వినబడేలా చెప్పాలి అంటుంటారు. కానీ సోషల్ మీడియా పుణ్యాన మంచి కన్నా చెడునే ఎక్కువగా చాటింపు వేసి చెప్తున్నారు. తప్పున్నా లేకపోయినా ఎదుటివాడిని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారు. ముఖ్యంగా సెలబ్రిటీల మీద సెటైర్లు వేయడం చాలామందికి అదో వినోదంగా మారింది. అయితే ఇలాంటి వాటిని చూసీచూడనట్లుండే సంగీత దర్శకుడు థమన్ ఈ మధ్య మాత్రం తన మీద కామెంట్లు చేసేవారిని ఎన్కౌంటర్ చేసి పడేస్తున్నాడు. Meanwhile PLS tell ur wife tat U Wr busy doing this memes bro she will proud of You tat she married a useless memmer !! In LIFE 🤣🙋🏽♂️ https://t.co/rOmbVtSIJr — thaman S (@MusicThaman) May 9, 2021 తాజాగా ఓ నెటిజన్ థమన్‌ను అవమానించేలా మీమ్ పెట్టాడు. ఇందులో కింగ్ సినిమాలో బ్రహ్మానందం చేసిన కాపీ మ్యూజిక్ డైరెక్టర్ పాత్ర తాలూకు స్టిల్స్ ఉన్నాయి. రేప్పొద్దున తన పిల్లలకు ఇతనే థమన్ అని చూపిస్తా.. అంటూ సదరు నెటిజన్ వ్యంగ్యంగా వ్యాఖ్యానించాడు. అతడి ఉద్దేశ్యమేంటో అర్థమైన థమన్.. కౌంటర్ ఇచ్చిపడేశాడు. 'దయచేసి నీ భార్యకు ఇలా మీమ్స్ చేసుకుంటూ ఉన్నానని చెప్పు బ్రో.. అప్పుడామె ఇలాంటి పనికి మాలిన మీమర్‌ను పెళ్లి చేసుకున్నానేంటా? అని చాలా గర్వపడుతుంది' అని రిప్లై ఇచ్చాడు. ఈ దెబ్బకు ఆ నెటిజన్ మారు మాట్లాడకుండా గమ్మునుండిపోయాడు. ఎప్పుడూ పక్కవాళ్ల మీద పడి ఏడ్చే ఇలాంటి వాళ్లకు బాగా బుద్ధి చెప్పావంటూ థమన్‌ను అతడి ఫ్యాన్స్ ప్రశంసిస్తున్నారు. చదవండి: రెమ్యునరేషన్ పెంచిన తమన్.. ఒక్కో మూవీకి ఎంతంటే.. -
గొప్ప మనసు చాటుకున్న మ్యూజిక్ డైరెక్టర్ తమన్
ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో నెంబర్ వన్‌గా మ్యూజిక్ డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు ఎస్ఎస్ తమన్. ఎడాదికి 10పైగా సినిమాలకు సంగీతం అందిస్తూ ఆయన ఫుల్ బిజీ అయిపోతున్నారు. దాదాపు తమన్ పని చేసిన సినిమాలన్ని సంగీతం పరంగా సూపర్ హిట్ అవుతున్నాయి. ప్రతి సినిమాలోని పాటలకు ఆయన సంగీతంతో ప్రాణం పోస్తున్నారు. అలా టాప్ మ్యూజిక్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న తమన్ తాజాగా గొప్ప మనసును చాటుకున్నారు. ఓ కీ బోర్టు ప్లేయర్ కుటుంబానికి ఆర్థికంగా అండగా ఉంటానంటూ ముందుకు వచ్చి ఉదారతను చాటుకుని అందరి చేత ప్రశంసలు అందుకుంటున్నారు. అయితే ఇటీవల కరోనాతో పలువురు సినీ ప్రముఖులు వరుసగా మృత్యువాత పడుతున్న సంగతి తెలిసిందే. రెండు రోజుల క్రితం కమల్ కూమార్ అనే కీ బోర్డ్ ప్లేయర్ కూడా మహమ్మారికి బలైపోయాడు. తమన్‌తో పాటు చాలా మంది సంగీత దర్శకుల దగ్గర కీ బోర్డ్ ప్లేయర్‌గా పని చేసిన కమల్‌కు కొన్ని రోజుల కిందట కరోనా పాజిటివ్‌గా తేలింది. ఈ క్రమంలో అతడి ఆరోగ్యం క్షిణించడంతో రెండు రోజుల క్రితం అతడు మృతి చెందాడు. కమల్‌ది పేద కటుంబం కావడంలో ఇప్పటికే అతడి కుటుంబానికి పలువురు ఆర్థిక సాయం అందించారు. ఈ నేపథ్యంలో తమన్ సైతం స్పందిస్తూ అతడి కుటుంబానికి అండగా నిలిచారు. ఆర్థికంగా ఆ కుటుంబాన్ని చూసుకుంటూనే.. కమల్ కుమారుడిని చదివించే బాధ్యత కూడా తీసుకున్నారట. ఈ విషయం తెలిసి తమన్ అభిమానులు మురిసిపోతూ ఆయన్ని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. మరోవైపు సోషల్ మీడియాలో సైతం నువ్వు దేవుడి అన్నా అంటూ మీమ్స్ కూడా క్రియేట్ చేసి షేర్ చేస్తున్నారు. అంతేగాక మరికొందరూ ‘మీరునువ్వు తీసుకున్న నిర్ణయానికి మీ తల్లిదండ్రులు నిన్ను చూసి గర్వపడతారన్నా, మీ అమ్మ ఈ విషయం తెలిస్తే మీకు కడుపు నిండా అన్నం పెడుతుందన్నా’ అంటూ కామెంట్ చేస్తున్నారు. చదవండి: దయచేసి మొక్కుతున్నా.. ఆలోచించండి: ఆర్పీ కంటతడి క్రిష్ తన భార్యతో విడిపోవడానికి ఆ హీరోయినే కారణమట! -
రెమ్యునరేషన్ పెంచిన తమన్.. ఒక్కో మూవీకి ఎంతంటే..
మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మంచి ఊపు మీద ఉన్నాడు. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా వరస సినిమాలకు సంగీతం అందిస్తూ టాలీవుడ్లో టాప్ మ్యూజిక్ డైరెక్టర్‌గా దూసుకెళ్తున్నాడు. ‘అల వైకుంఠపురము’లో తర్వాత ఆయన సంగీతంలో మరింత కొత్తదనం కనిపిస్తోంది. రొటీన్‌గా కాకుండా ఢిపరెంట్ స్టైల్లో సంగీతం అందించి ఆకట్టుకుంటున్నాడు. ఆయన ఈ ఏడాది ‘క్రాక్’, ‘వకీల్‌సాబ్’, ‘వైల్డ్ డాగ్’ లాంటి పెద్ద సినిమాలకు సంగీతం అందించాడు. వాటిలో ‘వకీల్‌సాబ్’లోని పాటలు జనాన్ని విపరీతంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ‘మగువా’ సాంగ్ సూపర్ హిట్ అయింది. ఇలా మెలోడీలతో పాటు మాస్ సాంగ్స్‌ని కూడా ఆకట్టుకునేలా కంపోజ్ చేస్తూ.. రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్‌కు సరైన పోటీగా నిలుస్తున్నాడు. ప్రస్తుతం తమన్ బాలకృష్ణ ‘అఖండ’, మహేశ్ బాబు ‘సర్కారువారి పాట’, పవన్ కల్యాణ్ ‘అయ్యప్పనుమ్ కొషియుమ్’ రీమేక్, నాని ‘టక్ జగదీశ్’ అఖిల్ ‘ఏజెంట్’, శంకర్- రామ్‌చరణ్ మూవీ సినిమాలకు సంగీతం అందిస్తున్నాడు. ఇదిలా ఉంటే.. వరుస విజయాలతో దూసుకెళ్తున్న తమన్.. తాజాగా తన రెమ్యునరేషన్‌ని కూడా పెంచేశాడట. ‘అల వైకుంఠపురములో’ వరకు రూ. కోటి కంటే తక్కువ తీసుకునే తమన్.. ఆ తర్వాత తన పారితోషికాన్ని కోటిన్నర వరకు పెంచేశాడట. ఇక ఈ ఏడాది క్రాక్, వకీల్‌సాబ్ కూడా సూపర్ హిట్ కావడంతో మరో 50 లక్షలు పెంచినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం తమన్ ఒక్కో సినిమాకు రూ.2 కోట్ల వరకు పుచ్చుకుంటున్నాడట. కొన్ని సినిమాలకు బడ్జెట్‌ని బట్టి తీసుకుంటాడని టాక్. కథ నచ్చితే తక్కువ తీసుకోనైనా సంగీతం అందిస్తాడని తమన్‌కు పేరుంది. ఇక రాక్‌స్టార్ దేవీశ్రీ ప్రసాద్ ఒక్కో సినిమాకు రూ.3కోట్లు తీసుకుంటారని సమాచారం. చదవండి : త్రివిక్రమ్ సినిమా : మరోసారి మహేశ్‌కు జోడిగా ఆ హీరోయిన్ బెడ్ సీన్.. వెక్కి వెక్కి ఏడ్చిన రాశీ ఖన్నా -
డ్రగ్స్ అవసరం లేదు, అవి మాత్రమే చాలు: థమన్
ఈ ఏడాది సంగీత దర్శకుడు థమన్ మాంచి స్పీడు మీదున్నాడు. తను అందించే సంగీతం ఒకెత్తు అయితే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మరో లెవల్లో ఉంటోంది. మాస్ మహారాజ రవితేజ నటించిన క్రాక్ సినిమాకు థమన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ మరింత బలాన్నిచ్చింది. దీంతో ఈ సినిమానే కాదు, మ్యూజిక్ కూడా జనాలకు బాగా కిక్కిచ్చింది. ఇది చూసి టాలీవుడ్ కింగ్ నాగార్జున కూడా తన వైల్డ్‌డాగ్ సినిమాకు థమన్ కావాలని కోరాడట. అలా నాగ్ సినిమాలో కూడా అదిరిపోయే బ్యాక్‌గ్రౌండ్ ఇచ్చి అందరినీ ఫిదా చేశాడు. ఇక మూడేళ్ల తర్వాత 'వకీల్‌సాబ్'తో రీ ఎంట్రీ ఇచ్చిన పవన్ కల్యాణ్ సినిమాకు కూడా మంచి నేపథ్య సంగీతాన్ని అందించి అందరి చేత ప్రశంసలు అందించుకున్నాడు. ఏప్రిల్ 30న ఈ సినిమా ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైన విషయం తెలిసిందే. తాజాగా ఓటీటీలో ఈ సినిమాను వీక్షించిన ఓ నెటిజన్ థమన్‌ను మెచ్చుకోకుండా ఉండలేకపోయాడు. 'ఇది కంపోజ్ చేసేటప్పుడు ఏమైనా తాగావా ఏంటి? నీ కెరీర్లో ఇప్పటివరకు చేసినవాటిలో ఇదే హైలైట్. అసలు మామూలుగా లేదు..' అని ట్వీట్ చేశాడు. ఇది చూసిన థమన్.. 'అలాంటిదేమీ లేదు, కాకపోతే పవన్ కల్యాణ్ గారిని స్క్రీన్ మీద చూడటంతో అలా అనిపిస్తుంది అంతే. మాకు డ్రగ్స్ అవసరం లేదు, కేవలం హగ్స్, థగ్స్ ఇస్తే చాలు.. రెచ్చిపోతాం..' అని రిప్లై ఇచ్చాడు. Not exactly ⚠️ but the truth is the MAN on the screen @PawanKalyan gaaru ⚡️❤️ it will automatically make us feel high we don’t need drugs jus hugs 🤗 and some thugs 😎 @Karthika28_ ⚡️ #VakeelSaabBGM ♥️ https://t.co/d7J5kLQKMG — thaman S (@MusicThaman) May 2, 2021 సూపర్ స్టార్ మహేశ్‌బాబు 'సర్కారు వారి పాట'కు కూడా అందరూ ఆశ్చర్చపోయే రీతిలో సంగీతాన్నివ్వాలని మరో నెటిజన్ కోరగా.. తప్పకుండా ఇస్తానని మాటిచ్చాడు. మరోవైపు ఆయన సంగీతం అందించిన అల వైకుంఠపురములోని బుట్టబొమ్మ పాట యూట్యూబ్‌లో రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తోంది. తాజాగా ఈ సాంగ్ 600 మిలియన్ల వ్యూస్‌ను దాటేసింది. Sure o sure ❤️👩@imManaswinidhfm 💫☀️ https://t.co/TBujiOhdsm — thaman S (@MusicThaman) May 2, 2021 చదవండి: ‘వకీల్ సాబ్’తో నా కల నెరవేరింది: తమన్ -
నా హృదయం ముక్కలైంది: థమన్ కంటతడి
"ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న" అంటారు. ఈ సామెతను నిజం చేశాడో వ్యక్తి. కడుపు నిండా తిని ఎన్ని రోజులైందో ఓ పండు ముసలావిడ తన ఆకలి ఎవరైనా తీర్చకపోతారా? అని రోడ్డు మీద ఆశగా నిరీక్షిస్తోంది. ఆమె ఆకలిని పసిగట్టిన ఓ వ్యక్తి ఆహారం పొట్లంతోపాటు ఓ వాటర్ బాటిల్‌ను తీసుకెళ్లి ఆమెకు అందించాడు. హమ్మయ్య.. ఈ పూటకు పస్తులుండక్కర్లేదు అని సంబరపడిపోయిందా పెద్దావిడ. దీనికి డబ్బులేమైనా తీసుకుంటారునుకుందో ఏమో కానీ చీర కొంగులో దాచుకున్న డబ్బును ఇవ్వబోగా అతడు సున్నితంగా తిరస్కరించాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అవ్వ కళ్లలో ఆనందం చూసి నెటిజన్లు భావోద్వేగానికి లోనవుతున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు థమన్ కూడా ఈ వీడియో చూసి ఎమోషనల్ అయ్యాడు. ఈ దృశ్యం చూసి నా గుండె పగిలింది అని ఆవేదన చెందాడు. ఓల్డ్ ఏజ్ హోమ్ కట్టాలన్న కొత్త ఆశయం తన మనసులో నాటుకుందని చెప్పాడు. త్వరలోనే దీన్ని నిజం చేస్తానని, ఇందుకుగానూ ఆ భగవంతుడు తనకు బలాన్ని ఇస్తాడని ఆశిస్తున్నానన్నాడు. 'కళ్లలో నీళ్లు తిరుగుతున్నాయి. దయచేసి ఆహారాన్ని వృధా చేయకండి. వీలైతే అవసరమైనవారికి ఆహారాన్ని అందించండి' అని కోరాడు. My heart jus broke into pieces A new dream started in me to build a old age home 🏡 will make it soon I wish god gives me the strength and support to make it ... I was typing this with tears rolling Don’t waste food Serve food for the needy 🥺 Let’s be HUMANS ✊♥️ https://t.co/gxHSF1ML2w — thaman S (@MusicThaman) April 25, 2021 చదవండి: టాలీవుడ్లో మరో విషాదం.. పూజా హెగ్డే ఎమోషనల్ ట్వీట్ -
టాలీవుడ్లో మరో విషాదం.. పూజా హెగ్డే ఎమోషనల్ ట్వీట్
టాలీవుడ్లో మరో విషాద ఘటన చోటు చేసుకుంది.ప్రముఖ కో డైరెక్టర్ సత్యం కన్నుమూశారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోకి ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం ఉదయం తుది శ్వాస విడిచారు. సత్యం మరణ వార్తతో టాలీవుడ్‌లోని ప్రముఖులంతా షాక్‌కు గురవుతున్నారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నారు. సత్యం మరణవార్త విని పూజా హెగ్డె భావోద్వేగానికి గురైంది. ‘మా కోడైరెక్టర్ సత్యం గారి మరణ వార్త విని షాక్‌కు గురయ్యాను. ఆయనతో అరవింద సమేత వీర రాఘవ, సాక్ష్యం, అల.. వైకుంఠపురములో చిత్రాలు చేశాను. ఆయన కుటుంబానికి సానుభూతి తెలుపుతున్నా' అంటూ ట్వీట్ చేసింది. కాగా, సుధీర్ఘ సీనీ కెరీర్లో కోడైరెక్టర్ సత్యం ఎన్నో సినిమాలకు పనిచేశాడు. కృష్ణవంశీ, రాజమౌళి, త్రివిక్రమ్ లాంటి స్టార్ డైరెక్టర్ల వద్ద కో డైరెక్టర్‌గా పనిచేశాడు. రాజమౌళి-నితిన్ కాంబోలో వచ్చిన సూపర్ హిట్ మూవీ ‘సై’కి చీఫ్ కో డైరెక్టర్‌గా వ్యవహరించాడు. అలాగే మగధీర, మర్యాద రామన్న లాంటి సినిమాలకు అసిస్టెంట్ దర్శకుడిగా పనిచేశాడు. త్రివిక్రమ్ తెరకెరక్కించిన ‘అల..వైకుంఠపురంలో’కి కో డైరెక్టర్‌గా పనిచేశాడు. విటితో పాటు శ్రీరామదాసు, చందమామ, సాక్ష్యం సినిమాలకు కో డైరెక్టర్‌గా సేవలందించారు. Sad to hear about the passing of one of my Co directors Satyam Garu, worked with him in 3 films Aravindha, Sakshyam and Ala Vaikunta. Sending his family loads of love and light in these tough times 😞🙏🏻 pic.twitter.com/gCOse1rXAg — Pooja Hegde (@hegdepooja) April 17, 2021 Shell Shocked to Hear This ... #Sathyamgaaru A Very fine Gentleman A Great Human. He is a Man of Trust & loyalty Very Aggressive Person on the Sets follows up Artists and Technical team on Time 🥺 Sir We Really Miss u Sir . Strength to the family May his soul rest in Peace #Rip pic.twitter.com/flbsmZNEZp — thaman S (@MusicThaman) April 17, 2021 చదవండి: ప్రముఖ హాస్యనటుడు వివేక్ కన్నుమూత హాస్యనటుడు వివేక్ మృతి.. తమిళనాట దిగ్భ్రాంతి -
చరణ్-శంకర్ కొత్త సినిమా.. తాజా అప్డేట్
సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ హీరోగా ఓ మూవీ రూపొందనున్నట్లు అధికారిక ప్రకటన వెలువడిన సంగతి తెలిసిందే. పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కుతున్న ఈ మూవీని దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ కోసం దిల్ రాజు ఇప్పటికే రూ. 100 కోట్ల బడ్జెట్‌ను కేటాయించినట్టు సమాచారం. ఇక ఈ సినిమా షూటింగ్ ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులకు తాజా అప్డేట్ మరింత ఆసక్తిని పెంచుతోంది. మొదట ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ అనిరుథ్ రవిచంద్రన్‌ను ఎంపిక చేసినట్టు గతంలో ప్రచారం జరగగా.. ఆ తర్వాత లెజెండ్రీ మ్యూజిక్ డైరెక్టర్ రెహమాన్ పేరు వినిపినించిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా సంగీత తరంగం ఎస్ఎస్ తమన్ పేరు తెరపైకి వచ్చింది. ఈ మూవీకి సంగీత దర్శకుడిగా ఆయనను ఎంపిక చేశారని, ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయంటు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే పొలిటికల్ నేపథ్యంలో రూపొందనున్న ఈ మూవీ స్ర్కీప్ట్ కూడా రెడీ అయిపోయింది. దీంతో ఈ ప్రాజెక్ట్‌ను వీలైనంత త్వరలో పట్టాలెక్కించేందుకు ప్లాన్ చేస్తున్న మూవీ యూనిట్‌కు ‘ఇండియన్ 2’ నిర్మాతలు షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. శంకర్ తమ సినిమాను పూర్తి చేయకుండానే చరణ్‌తో మరో సినిమాకు రెడీ అయ్యారంటూ లైకా ప్రొడక్షన్ కోర్టును ఆశ్రయించింది. అయితే మద్రాసు హైకోర్టు శంకర్‌కు ఊరటనిచ్చింది. ఇతర చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించకుండా స్టే విధించడం కుదరదని న్యాయమూర్తి పేర్కొన్నారు. ఈ తాజా అప్డేట్ను చూసి తన డ్యాన్స్‌తో ఇరగదీసే చరణ్.. తమన్ పాటలకు స్టెప్పులేస్తే ఇంకా అదిరిపోతుంది అంటూ అభిమానులు చర్చించుకుంటున్నారు. చదవండి: ఇండియన్ 2: దర్శకుడు శంకర్‌కు ఊరట రామ్ చరణ్-శంకర్ సినిమాకు ‘లైకా’ బ్రేక్.. -
‘అల వైకుంఠపురములో’ సక్సెస్ ఎంజాయ్ చేయలేదు :తమన్
‘‘ఒక సినిమాలో పాటలన్నీ హిట్ అయ్యాయంటే ఆ క్రెడిట్ సంగీత దర్శకుడు ఒక్కడిదే కాదు.. పాటల రచయిత, సింగర్స్, డైరెక్టర్స్, నిర్మాత.. ఇలా అందరికీ ఆ క్రెడిట్ దక్కుతుంది. ఓ సినిమా బ్లాక్ బస్టర్ అయిందంటే ఆ క్రెడిట్ కూడా 24 క్రాఫ్ట్స్ వారిది.. ఎవరి పని వారు బాగా చేస్తేనే సినిమా హిట్ అవుతుంది’’ అని సంగీత దర్శకుడు తమన్ అన్నారు. పవన్ కల్యాణ్ హీరోగా, శ్రుతీహాసన్, నివేదా థామస్, అంజలి, అనన్య నాగళ్ల ఇతర పాత్రల్లో నటించిన చిత్రం ‘వకీల్ సాబ్’. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించారు. బోనీ కపూర్ సమర్పణలో ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మించిన ఈ సినిమా ఏప్రిల్ 9న విడుదలకానుంది. ఈ సందర్భంగా చిత్ర సంగీత దర్శకుడు తమన్ హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడుతూ–‘‘మ్యూజికల్ సక్సెస్ అనేది చాలా రేర్‌గా వస్తుంది. ‘అల వైకుంఠపురములో’ పాటలన్నీ బాగా పాపులర్ అయ్యాయి.. కరోనా కారణంగా ఆ సినిమా సక్సెస్‌ను ఎంజాయ్ చేయలేకపోయాను. లాక్డౌన్ తర్వాత వచ్చిన ‘సోలో బతుకే సో బెటర్, క్రాక్’ సినిమాలు అటు మ్యూజికల్‌గానూ, ఇటు సినిమాపరంగానూ మంచి హిట్టయ్యాయి. పవన్ కల్యాణ్‌గారి ‘గబ్బర్ సింగ్’ సినిమాకి నేను సంగీతం అందించాల్సింది.. కానీ కొన్ని కారణాల వల్ల కుదరలేదు. ఇప్పుడు ‘వకీల్ సాబ్’కి కుదిరింది. ‘దిల్’ రాజుగారికి త్రివిక్రమ్‌గారు చెప్పడంతో ‘వకీల్ సాబ్’ అవకాశం వచ్చింది. ఈ సినిమాలోని ‘మగువా మగువా, సత్యమేవ జయతే, కంటిపాప’ పాటలకు మంచి స్పందన రావడం సంతోషంగా ఉంది. ‘మగువా మగువా..’ పాటని చిరంజీవిగారు కూడా వాళ్ల అమ్మతో షేర్ చేసుకోవడం హ్యాపీ. నేపథ్య సంగీతం ఇంకా హైలెట్ అవుతుంది. నేను చేసిన ‘టక్ జగదీష్’, బాలకృష్ణ–బోయపాటి శ్రీను సినిమాలు విడుదలకు రెడీగా ఉన్నాయి. ప్రస్తుతం చిరంజీవి ‘లూసిఫర్’ రీమేక్, పవన్ కల్యాణ్ ‘అయ్యప్పనుమ్ కోషియుం’ రీమేక్, మహేశ్‌బాబు ‘సర్కారువారి పాట’ సినిమాలకు సంగీతం అందిస్తున్నాను’’ అన్నారు. చదవండి: నువ్వు చూస్తున్నావని తెలుసు: నవీన్ పొలిశెట్టి ఎమోషనల్ సర్కారు వారిపాట: మహేశ్‌కి తండ్రిగా సీనియర్ హీరో -
‘వకీల్ సాబ్’తో నా కల నెరవేరింది: తమన్
‘‘వకీల్ సాబ్ ’ సినిమా చేస్తున్నప్పుడు ఎంతో ఎంజాయ్ చేశాం.. సినిమా చూసేటప్పుడు ప్రేక్షకులకూ అదే అనుభూతి కలుగుతుంది’’ అని దర్శకుడు వేణు శ్రీరామ్ అన్నారు. పవన్‌కల్యాణ్ హీరోగా నటించిన చిత్రం ‘వకీల్ సాబ్’. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రుతీహాసన్, నివేదా థామస్, అంజలి, అనన్య నాగళ్ల కీలక పాత్రల్లో నటించారు. బోనీ కపూర్ సమర్పణలో ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మించిన ఈ సినిమా ఏప్రిల్ 9న విడుదలకానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో వకీల్ సాబ్ మ్యూజికల్ ఫెస్ట్‌ను నిర్వహించారు. వేణు శ్రీరామ్ మాట్లాడుతూ– ‘‘పవన్ కల్యాణ్‌తో పనిచేయడం సంతోషంగా ఉంది. ‘వకీల్ సాబ్’కు మంచి సంగీతం ఇచ్చిన తమన్‌కు, అద్భుతమైన లిరిక్స్ ఇచ్చిన రామజోగయ్య శాస్త్రికి థ్యాంక్స్. ఈ సినిమా మీ అందరి అంచనాలు అందుకునేలా ఉంటుంది’’ అన్నారు. సంగీత దర్శకుడు ఎస్.ఎస్. తమన్ మాట్లాడుతూ– ‘‘పవన్ కల్యాణ్‌కి నేను పెద్ద అభిమానిని. మణిశర్మగారి దగ్గర అసిస్టెంట్‌గా ఉన్నప్పుడు ‘ఖుషి’, ‘గుడుంబా శంకర్’, ‘బాలు’ చిత్రాలకు పనిచేశాను. ఆయన సినిమాకు సంగీతం అందించడం నా కల. అది ‘వకీల్ సాబ్’తో నెరవేరినందుకు సంతోషంగా ఉంది’’ అన్నారు. ఈ కార్యక్రమంలో సింగర్స్ హారిక నారాయణ, పృథ్వీ, దీపు, శ్రీ కృష్ణ, సాహితీ, సుభ తదితరులు పాల్గొన్నారు. చదవండి: హీరోయిన్ కనబడుట లేదు: డోంట్ వర్రీ అంటున్న పోలీసులు కొత్త డైరెక్టర్‌తో మహేశ్ మూవీ.. కానీ, ఓ షరతు! -
మెగాస్టార్‌తో అవకాశం.. తమన్ భావోద్వేగం
ఆచార్య అనంతరం మలయాళ చిత్రం 'లూసిఫర్' రీమేక్‌లో మెగాస్టార్ చిరంజీవి నటించనున్న సంగతి తెలిసిందే. దర్శకుడు మోహన్‌రాజా తెరకెక్కించనున్న ఈ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది. సత్యదేవ్ కీలక పాత్రలో నటిస్తుండగా.. త్వరలోనే షూటింగ్ లాంఛనంగా ప్రారంభం కానుంది. ఇక ఈ సినిమాకు ఇప్పటి వరకు మ్యూజిక్ డైరెక్టర్ ఎవరనే విషయం ఫైనల్ కాలేదు. అయితే తాజాగా మెగాస్టార్ సినిమాకు సంగీతం అందించే అవకాశాన్ని తమన్ కొట్టేశాడు. లూసిఫర్‌కు స్వరాలు సమకూర్చే ఛాన్స్ దక్కించుకున్నట్లు సోషల్ మీడియాలో వెల్లడించాడు. చిరంజీవి సినిమాకు మ్యూజిక్ అందించే అవకాశం దక్కడం గొప్ప అదృష్టంగా తమన్ పేర్కొన్నాడు. ఈ మేరకు ట్విటర్ వేదికగా చిరంజీవిపై తనకున్న ప్రేమను చాటుకున్నాడు. చదవండి: ఆచార్య: చెర్రీ 'సిద్ధ'మయ్యాడుగా.. ‘ప్రతి కంపోజర్‌కు ఇది అతి పెద్ద కల. ఇప్పుడు నా వంతు వచ్చింది. మెగాస్టార్ చిరంజీవిపై ఉన్న అభిమానాన్ని చాటుకునేందుకు సమయం వచ్చింది. లూసిఫర్ మ్యూజికల్ జర్నీ ఇప్పుడు మొదలవుతోంది. మోహన్ రాజాకి కృతజ్ఞతలు’ అంటూ తమన్ ట్వీట్ చేశారు. ఇదిలా ఉండగా లూసిఫర్ సినిమా ప్రకటించినప్పటి నుంచి చిరు అభిమానుల్లో హైప్ క్రియేట్ అవుతోంది. ఈ చిత్రానికి తెలుగులో బైరెడ్డి అనే పేరు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. మరోవైపు మెగాస్టార్ చిరంజీవి 'ఆచార్య' మూవీ షూటింగ్ వేగంగా జరుపుకోంటుంది. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో చందమామ కాజల్ అగర్వాల్ హీరోయన్‌గా నటిస్తోంది. బాలీవుడ్ నటుడు సోనూసూద్ విలన్‌గా కనిపంచనుండగా.. రామ్ చరణ్ కీలక పాత్రలో అలరించనన్నాడు. ప్రస్తుతం కోకాపేటలోని 20 ఎకరాల స్థలంలో వేసిన టెంపుల్ సెట్లో చిరంజీవిపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ మూవీ అనంతరం లూసిఫర్ షూటింగ్లో చిరు జాయిన్ కానున్నాడు. చదవండి: పవన్, క్రిష్ సినిమాకు మళ్లీ బ్రేక్.. A biggest dream for Any Composer 🎧 It’s My Turn to Show My love towards Our #BOSS 🖤 Shri #MEGASTAR ✊@KChiruTweets gaaru & My dear brother @jayam_mohanraja Here we begin our musical journey for #lucifer ( TEL ) !! 🏆🎧💪🏼 Godbless ♥️ pic.twitter.com/Sktc0auRsi — thaman S (@MusicThaman) January 20, 2021 -
వైరల్ అవుతున్న అల్లు అర్జున్ జర్నీ సాంగ్
సినీ బ్యాగ్రౌండ్ ఉన్నప్పటికీ.. సొంత టాలెంట్‌తో కష్టపడి పైకి వచ్చిన హీరో అల్లు అర్జున్. లక్కు, క్రేజ్ ఉండాలి కానీ.. బ్యాగ్రౌండ్ ఉంటేనే హీరో అవరనని నిరూపిస్తూ, లక్షలాది అభిమానులను సంపాధించుకున్నాడు. మామయ్య మెగాస్టార్ చిరంజీవి స్పూర్తితో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన బన్నీ.. గంగోత్రితో హీరోగా మారాడు. ఆ తర్వాత వైవిధ్యమైన చిత్రాలు ఎంచుకుంటూ.. ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక ముద్ర వేసుకున్నాడు. ఇక గత ఏడాది వచ్చిన అల వైకుంఠపురములో చిత్రం బన్నీ కెరియర్లో చాలా ప్రత్యేకంగా నిలిచింది. ఈ సినిమా ఎన్నో రికార్డులను బద్దలు కొట్టింది. (చదవండి : ప్రామిస్.. ఇకపై నేనేంటో చూపిస్తా: అల్లు అర్జున్) ఈ చిత్రం విడుదలై ఏడాది పూర్తైన సందర్భంగా సోమవారం రాత్రి రీయూనియన్ పార్టీ ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమానికి చిత్ర నిర్మాతలు అల్లు అరవింద్, సూర్యదేవర నాగవంశీ, దర్శకుడు త్రివిక్రమ్, హీరో అల్లు అర్జున్, హీరోయిన్ పూజా హెగ్డేతో పాటు ఇతర నటీ నటులు హాజరై, విజయోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ సందర్భంగా బన్నీ మాట్లాడుతూ.. సంగీత దర్శకుడు తమన్‌పై ప్రశంసల జల్లు కురిపించాడు.తాను వన్ బిలియన్ ఆల్బమ్ అడిగితే.. తమన్ టు బిలియన్ల కంటే ఎక్కువ అల్బమ్ ఇచ్చాడంటూ పొగడ్తలతో ముంచేశాడు. ఇక తమన్ కూడా స్టైలిష్స్టార్పై ఉన్న ప్రేమను పాట రూపంలో చూపించాడు. జర్నీ ఆఫ్ అల్లు అర్జున్ పేరుతో ఒక వీడియో రూపొందించి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అల్లు అర్జున్ మొదటి సినిమా గంగోత్రి మొదలు.. అల వైకుంఠపురములో వరకు అన్ని మూవీలను, అందులోని బన్నీ పాత్రలను గుర్తు చేస్తూ పాడిన ఈ ర్యాప్ సాంగ్ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఇక ఈ పాటను బన్నీ తన ట్విటర్ ఖాతాలో షేర్ చేస్తూ.. తమన్‌కు థాంక్యూ చెప్పారు. -
దాదాసాహెబ్ ఫాల్కే(సౌత్).. విన్నర్స్ జాబితా
నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని తాజాగా 2020 ఏడాదికిగాను దాదా సాహెబ్ ఫాల్కే సౌత్ అవార్డుల జాబితాను ప్రకటించారు. సౌత్‌లోని నాలుగు సినీ (తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ) పరిశ్రమ రంగాలు అవార్డులు అందుకున్నాయ. ఈ క్రమంలో టాలీవుడ్‌కు సంబంధించిన ఆరు కెటగిరిల్లో అవార్డులు వరించాయి. యువ నటుడు నవీన్ పోలిశెట్టి సౌత్ కేటగిరీలో ఉత్తమ నటుడి అవార్డు దక్కించుకున్నాడు. ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ సినిమా సూపర్ హిట్ విజయాన్ని అందుకున్నందుకు గానూ నవీన్‌కు ఈ అవార్డు వరించింది. ఇక బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించిన నాని ‘జెర్సీ’ ఉత్తమ చిత్రంగా ఎంపికైంది. ‘డియర్ కామ్రేడ్’లో అద్భుతమైన నటన ప్రదర్శించిన రష్మిక మందన్న ఉత్తమ నటి అవార్డును దక్కించుకుంది. ప్రభాస్ నటించిన భారీ బడ్జెట్ యాక్షన్ థ్రిల్లర్ ‘సాహో’కు దర్శకత్వం వహించిన యువ దర్శకుడు సుజీత్ ఉత్తమ డైరెక్టర్ అవార్డును అందుకున్నారు. అలాగే ‘అల వైకుంఠపురములో’ వంటి మ్యూజికల్ హిట్‌తో సంగీత ప్రియులను ఆకట్టుకున్న ఎస్ఎస్ తమన్ ఉత్తమ సంగీత దర్శకుడు అవార్డును సొంతం చేసుకున్నారు. టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జునకు ఈ ఏడాది మోస్ట్ వర్సటైల్ యాక్టర్ అవార్డు దక్కింది. ఇదిలా ఉండగా హిందీకి సంబంధించిన దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డ్స్ 2020 ప్రదానోత్సవాన్ని ఫిబ్రవరి 20 ముంబైలోని తాజ్ లాండ్స్ ఎండ్‌లో జరుపుబోతున్నారు. సౌతిండియా అవార్డుల ప్రదానోత్సవం తేదీని అతి త్వరలో తెలుపనున్నారు. కోలీవుడ్ నుంచి.. మోస్ట్ వర్సిటైల్ ఆర్టిస్ట్- అజిత్ కుమార్ ఉత్తమ నటుడు- ధనుష్ ఉత్తమ నటి- జ్యోతిక ఉత్తమ దర్శకుడు- పార్థిబాన్ ఉత్తమ మ్యూజిక్ డైరెక్టర్- అనురుద్ద్ రవిచంద్రన్ మాలీవుడ్ నుంచి మోస్ట్ వర్సిటైల్ ఆర్టిస్ట్-మోహన్ లాల్ ఉత్తమ నటుడు -సూరజ్ వెంజరమూడు ఉత్తమ నటి- పార్వతీ తిరువోతు ఉత్తమ దర్శకుడు- మధు కె. నారాయణ్ ఉత్తమ మ్యూజిక్ డైరెక్టర్- దీపక్ దేవ్ శాండల్‌వుడ్ నుంచి మోస్ట్ వర్సిటైల్ ఆర్టిస్ట్-శివరాజ్‌కుమార్ ఉత్తమ నటుడు - రక్షిత్ శెట్టి ఉత్తమ నటి- తాన్య హోప్ ఉత్తమ దర్శకుడు- రమేష్ ఇందిరా ఉత్తమ చిత్రం- మూకాజ్జియ కనసుగలు ఉత్తమ సంగీత దర్శకుడు- వి. హరికృష్ణ