
సరైనోడు టీజర్ వచ్చేస్తోంది!
సన్నాఫ్ సత్యమూర్తి సినిమా తరువాత లాంగ్ గ్యాప్ తీసుకున్న బన్నీ ఇప్పుడు చేస్తున్న సరైనోడు సినిమా ప్రమోషన్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. మొన్నామధ్య ఈ సినిమా కోసం ఓ పాట పాడిన అల్లు అర్జున్.. ఇప్పుడు తాజాగా సినిమా టీజర్ తేదీని ప్రకటించాడు. ఈనెల 18వ తేదీ.. అంటే గురువారం నాడు 'సరైనోడు' టీజర్ వస్తుందని ట్విట్టర్ ద్వారా ప్రకటించాడు.
గీతా ఆర్ట్స్ పతాకంపై బోయపాటి శ్రీను దర్శకత్వంలో వస్తున్న సరైనోడు సినిమాను అల్లు అరవింద్ భారీ బడ్జెట్తో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఎస్ఎస్ థమన్ స్వరాలు అందించాడు.
SARRAINODU Teaser on 18th Feb ! pic.twitter.com/MWBnEMTAyK
— Allu Arjun (@alluarjun) February 15, 2016