Telugu Indian IDOL 2: Shreya Ghoshal Praises Singer Soujanya - Sakshi
Sakshi News home page

Telugu Indian Idol 2: సింగర్‌ సౌజన్య గాత్రానికి శ్రేయాఘోషల్ ఫిదా!

Apr 1 2023 1:57 PM | Updated on Apr 1 2023 2:34 PM

Telugu Indian Idol 2: Shreya Ghoshal Praises To Singer Soujanya - Sakshi

ప్రముఖ ఓటీటీ ఆహాలో స్ట్రీమ్ అవుతోన్న ‘తెలుగు ఇండియ‌న్ ఐడ‌ల్ 2’కు విశేష ఆదరణ లభిస్తోంది.  షో లో ప్రస్తుతం ఉన్న టాప్ 11 కంటెస్టెంట్స్ తమ మధురగానంతో ప్రేక్షకుల మదిని దోచుకుంటున్నారు. సామన్య ప్రేక్షుకులే కాక ఎంతో మంది సినీ సంగీత ప్రముఖులు వీరి గానానికి మంత్రముగ్ధులవుతున్నారు. 

పోటీలో భాగంగా నిర్వహించిన గాలా విత్ బాలా ఎపిసోడ్ లో సౌజన్య భాగవతుల అనే కంటెస్టెంట్ ఆలపించిన  గౌతమీపుత్ర శాతకర్ణి చిత్రంలోని 'ఎంకిమీడ నా జతవిడి...' మంచి స్పందన లభించింది.  ఆ షోలో జడ్జిగా వ్యవహరిస్తున్న తమన్ ఈ పాట విని.. దీని ఒరిజినల్ వెర్షన్ పాడిన శ్రేయా ఘోషల్‌కు ఇది వినిపిస్తానని మాట ఇచ్చారు. తాజాగా ఈ సాంగ్ చూసిన శ్రేయా ఓ వీడియోను పంపించారు. దీన్ని స్టేజిపై తమన్ చూపించి సౌజన్యకు సర్‌ప్రైజ్ ఇచ్చారు.

 సాంగ్ విన్న ప్రముఖ నేపధ్య గాయని శ్రేయాఘోషల్ సంతోషం వ్యక్తం చేశారు.  సౌజన్య గాత్రం అత్యంత మధురంగా ఉందంటూ కితాబిచ్చారు. అలాగే ప్రముఖ బాలీవుడ్ సంగీతకారులు విశాల్ దద్లాని మరియు హిమేష్ రేషిమియా షో కు వస్తున్న ఆదరణను ప్రశంసించారు. తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 2 కార్యక్రమం ప్రతి శక్ర, శని వారాల్లో రెండు ఎపిసోడ్లుగా రాత్రి 7 గంటల నుంచి ఆహాలో ప్రసారం అవుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement