ప్రముఖ ఓటీటీ ఆహాలో సూపర్ హిట్ అయిన షోలలో తెలుగు ఇండియన్ ఐడల్ ఒకటి. . యంగ్ సింగర్స్‌కు తమ ట్యాలెంట్ నిరూపించుకోవడానికి ఈ సింగింగ్ షో మంచి వేదికగా నిలిచింది.ఈ షోకి సింగర్ శ్రీరామచంద్ర హోస్ట్ గా.. మ్యూజిక్ డైరెక్టర్ తమన్, హీరోయిన్ నిత్యామీనన్.. సింగర్ కార్తీక్ జడ్జీలుగా వ్యవహరించి సందడి చేశారు. అంతేకాదు గ్రాండ్ ఫినాలేకి మెగాస్టార్ చిరంజీవి గెస్ట్‌గా వచ్చి అలరించారు. త్వరలోనే ఈ సింగింగ్ షో రెండో సీజన్ రాబోతుంది.
తాజాగా ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 2 కర్టెన్ రైజర్ ప్రోగ్రాం వేడుకగా జరిగింది. ఈ కార్యక్రమానికి సీఈవో అజిత్ ఠాకూర్, ప్రముఖ సింగర్లు, ఎస్.ఎస్. తమన్, కార్తీక్, గీతామాధురి, హేమచంద్ర తదితరలు హాజరయ్యారు. ఇక సీజన్ 1కి శ్రీరామచంద్ర వ్యాఖ్యాతగా వ్యవహరిస్తే.. రెండో సీజన్‌ని హేమచంద్ర హోస్ట్ చేయనున్నారు. ఇక జడ్జీల విషయానికొస్తే… సింగర్ నిత్యామీనన్ ప్లేస్‌లో ట్యాలెంటెడ్ సింగర్ గీతా మాధురి రానుంది.
Comments
Please login to add a commentAdd a comment