Geetha Madhuri
-
సింగర్ గీతామాధురి తనయుడి ఫస్ట్ బర్త్‌డే (ఫోటోలు)
-
సింగర్ గీతామాధురి కుమారుడి అన్నప్రాసన వేడుక (ఫోటోలు)
-
సింగర్ గీతామాధురి కొడుకుని చూశారా.. క్యూట్ ఫ్యామిలీ (ఫొటోలు)
-
Geetha Madhuri: ఐటం సాంగ్స్‌తో అదరగొట్టే సింగర్ (ఫోటోలు)
-
కొడుకు ఫేస్ రివీల్ చేసిన సింగర్ గీతామాధురి.. ఎంత ముద్దొచ్చేస్తున్నాడో! (ఫొటోలు)
-
పబ్‌లో.. ఫస్ట్ టైమ్!
సాధారణంగా సిటీలో పబ్స్, క్లబ్స్‌లో కని/వినపడే డీజేలు, బ్యాండ్స్, సింగర్స్... ఎక్కువగా పాశ్చాత్య పోకడలకు ప్రతీకగా ఉంటారు. వెస్ట్రన్ మ్యూజిక్‌ని ఇష్టపడే యువతను మెప్పించడం వీరి వల్లే సాధ్యమని ఈవెంట్ మేనేజర్లు భావిస్తుండడం వల్ల ఈ ట్రెండ్ కంటిన్యూ అవుతోంది. ఇటీవలే వీరి స్థానంలో హిందీ, తెలుగు సంగీతాన్ని అందించే బ్యాండ్స్‌కు ప్రాధాన్యత పెరుగుతోంది.ఆ థోరణి మరింత బలపడి ఇప్పుడు ఏకంగా తెలుగు గాయనీ గాయకులకు కూడా పబ్స్ రెడ్ కార్పెట్ పరుస్తుండడం విశేషం. ఈ నేపథ్యంలో వియ్ కేర్ సంస్థ ఆధ్వర్యంలో తెలుగు ప్రేక్షకులకు చిరపరిచితురాలైన ప్రముఖ గాయని గీతా మాధురి తన సొంతంగా సమకూర్చుకున్న బ్యాండ్‌తో కలిసి తొలిసారి నగరంలోని ప్రిజ్మ్ పబ్‌లో శుక్రవారం సాయంత్రం సోలో ప్రదర్శన ఇవ్వనున్నారు. – సాక్షి, సిటీబ్యూరోప్రపంచాన్నే మన పాట పాలిస్తోంది.. ఇక పబ్స్‌లో తెలుగు పాట వినిపించడంలో ఆశ్చర్యమేముంది? అంటున్నారు ప్రముఖ నేపథ్యగాయని గీతా మాధురి. ‘సాక్షి’తో పంచుకున్న ఆ విశేషాలు ఆమె మాటల్లోనే...సోలోగా...ఇదే తొలిసారి.. నగరంలో లైవ్ పెర్ఫార్మెన్స్ ఇవ్వడం అనేది పెళ్లిళ్ల నుంచి పార్టీల వరకూ చాలా రకాల కార్యక్రమాల్లో నాకు అనుభవమే. అయితే మోడ్రన్ కల్చర్‌కు కేరాఫ్‌గా ఉండే యూత్ సమక్షంలో ఒక పబ్‌లో సోలోగా పాడడం ఇదే తొలిసారి. అదీ సొంతంగా ఒక బ్యాండ్‌ను సమకూర్చుకుని, వారితో కలిసి రిహార్సిల్స్ చేసి పబ్ షోలో పాడడం కొత్త అనుభవమే. అభిమానుల స్పందన తెలుస్తుంది... అలాగే కార్పొరేట్, కాలేజ్ షోస్ వంటివి కొందరికి మాత్రమే పరిమితమయ్యేవి, అలా కాకుండా ఈ తరహా పబ్లిక్ ఈవెంట్స్ వల్ల ప్రయోజనం ఏమిటంటే.. అభిమాన గాయనీ గాయకుల పాటలు వినాలనుకునే ఎవరైనా షోకి హాజరుకావ్వొచ్చు. అలా మాకు కూడా మా అభిమానుల స్పందనను దగ్గరగా తెలుసుకునే అవకాశం లభిస్తుంది. బ్యాండ్ స్టైల్ అంటే ఇదే... సాధారణంగా లైవ్ పెర్ఫార్మెన్స్లో పూర్తి స్థాయి వాద్య బృందంతో కలిసి పాడతాం. అయితే పబ్‌లో మాత్రం ఇద్దరు గిటారిస్ట్, డ్రమ్మర్, కీబోర్డ్ ప్లేయర్.. ఇలా ఓ ముగ్గురు నలుగురు మాత్రమే ఉంటారు. ఆర్కె్రస్టాతో పాడేటప్పుడు ఉన్నది ఉన్నట్టుగా పాడతాం.. అయితే ఇందులో 3, 4 పాటలు కలిపి బ్యాకింగ్ కొంచెం మార్చి.. ఇలా ఎక్స్‌పిరిమెంటల్ టైప్‌లో ఉంటుంది. ఓ రకంగా పాపులర్ సాంగ్‌ని కొత్త ఫ్లేవర్‌లో వినిపించడమే బ్యాండ్ స్టైల్ అనొచ్చు. మన పాట ప్రపంచవ్యాప్తం... మన తెలుగు పాటలు ప్రపంచం అంతా ఒక ఊపు ఊపుతున్నాయి. కాబట్టి సిటీలో కూడా పబ్ క్లబ్ అని తేడా లేకుండా అన్ని చోట్లా యూత్ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ ఈవెంట్లో తెలుగు, హిందీ పాటలు పాడడానికి సిద్ధమవుతున్నా..అయితే అక్కడకు వచ్చే క్రౌడ్‌ని బట్టి వారి టేస్ట్‌ని బట్టి అప్పటికప్పుడు పాడాల్సి ఉంటుంది.భవిష్యత్తులో ఇలాంటి ఈవెంట్స్‌లో పూర్తి స్థాయిలో ఒక పాటల జాబితా ఇచ్చి, దాని ప్రకారం పాడాలనే ఆలోచన ఉంది. ఇక పర్సనల్ లైఫ్‌కి వస్తే..అడపాదడపా సినిమా పాటలు, రెగ్యులర్‌గా కొన్ని ప్రైవేట్ ఈవెంట్స్, ఇవి కాక... ఓటీటీ వేదికగా ఇండియన్ ఐడల్ కు వర్క్ చేస్తున్నాను.ఇవి చదవండి: ఫుల్కారీ ఎంబ్రాయిడరీలో విభిన్న డిజైన్లు.. -
ఎమోషన్ అంతా క్రికెట్ గ్రౌండ్‌లోనే.. .. తమన్ హార్ట్ టచ్చింగ్ స్టోరీ
తమన్..ఇప్పుడు ఇటు తెలుగు అటు తమిళ సినీ పరిశ్రమలో మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్. చాలా తక్కువ వయసులోనే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి..వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మ్యూజిక్ సెన్సేషన్‌గా మారిపోయాడు. టాలీవుడ్, కోలీవుడ్ స్టార్ హీరోలందరికి హుషారెత్తే మ్యూజిక్ అందించాడు.డ్రమ్మర్‌గా కెరీర్ ప్రారంభించి.. ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్‌గా ఎదిగాడు. అయితే తమన్ ఈ స్థాయికి రావడానికి చాలా కష్టపడ్డాడు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా తట్టుకుని నిలబడ్డాడు. ఇంట్లో వాళ్లకి తెలియకుండా ఏడ్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయట. తన ఎమోషన్ అంతా దాచుకొని క్రికెట్ గ్రౌండ్లో చూపించేవాడట. ఇండియన్ ఐడడ్ సీజన్ 3 లాంచింగ్ ఎపిసోడ్స్‌లో ఈ విషయాన్ని వెల్లడించాడు. ఆహాలో స్క్రీమ్ అవుతున్న ఈ మ్యూజికల్ రియాలిటీ షోకి తమన్‌తో పాటు కార్తిక్, గీతా మాధురి జడ్జిగా వ్యవహరిస్తున్నారు. షో మధ్యలో ఓ సందర్భంలో ‘మీ జీవితంలో ఏడ్చిన సందర్భాలు ఉన్నాయా?’అని గీతా మాధురి అడిగిన ప్రశ్నకు బదులుగా ''జీవితంలో తాను ఎన్నోసార్లు ఏడిచాను. నా ఎమోషన్ అంతా క్రికెట్ గ్రౌండ్ లో ఉంటుంది'అని తన ఎమోషన్ ని దాచుకునే ప్రయత్నం చేశారు. తర్వాత గీతా మాధురి తమన్ అమ్మగారిని గురించి ప్రస్థావించినపుడు.. గతాన్ని బాల్యన్ని తలచుకొని చాలా ఎమోషనల్ అయ్యారు తమన్.తమన్ లోని ఎమోషన్ కోణాన్ని టచ్ చేసిన ఈ వీడియో నెటిజన్స్‌ని కదిలిస్తుంది. -
సీజన్ 2 కి, సీజన్ 3 కి డిఫరెన్స్ ఏంటంటే..
-
మదర్స్ కి ఇచ్చే ఇంపార్టెన్స్ ఫాదర్స్ కి ఇవ్వట్లేదు ఈ సొసైటీ
-
చూసే కళ్ళు బాగుంటే అందరూ బాగుంటారు.. జడ్జ్ గా చేయడం అంటే
-
సంగీత ప్రియులను అలరించే షో.. ప్రోమో అదుర్స్!
టాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన హిట్షో ఇండియన్ ఐడల్. తెలుగులో ఇప్పటికే రెండు సీజన్స్ విజయవంతంగా పూర్తి చేసుకుంది. గత రెండు సీజన్లకు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా మరోసారి సంగీత ప్రియులను అలరించేందుకు వస్తోంది. ఇండియన్ ఐడల్ మరో సీజన్ ఈనెల 14 నుంచి ప్రారంభ కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ప్రోమోను రిలీజ్ చేశారు.తాజాగా తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్- 3 లాంఛ్ ప్రోమో వచ్చేసింది. ఈసారి జడ్జీలుగా మ్యూజిక్ డైరెక్టర్ తమన్, సింగర్స్ గీతామాధురి, శ్రీరామచంద్ర, కార్తీక్ వ్యవహరించనున్నారు. కొత్త సీజన్లో కంటెస్టెంట్ల ఎమోషన్స్ ఫుల్‌గా ఉండబోతున్నట్లు ప్రోమో చూస్తే స్పష్టమవుతోంది. ఈ షో మూడోసారి ఆహా ఓటీటీలోనే స్ట్రీమింగ్ కానుంది. ప్రతి శుక్ర, శనివారాల్లో రాత్రి 7 గంటలకు ఈ షో స్ట్రీమింగ్ కానుంది. దీంతో వారం ముందుగానే ప్రోమోను ఆడియన్స్‌కు పరిచయం చేశారు మేకర్స్. Ultimate musical journey ki muhurtham set ayindi 🎙️🗓️.Kotha swarala madya competition, Judges iche entertainment tho Indian Idol resound India antha vinapadutundi.✨.Telugu Indian Idol Season 3 Launch Promo Out▶️https://t.co/6b5B1VURT9🎤🎶 Catch #TeluguIndianIdolS3 starting… pic.twitter.com/Pl33SKG5No— ahavideoin (@ahavideoIN) June 6, 2024 -
Geetha Madhuri: సింగర్ గీతామాధురి కూతురు... ఎంత పెద్దదైంది, దిష్టితగిలేను! (ఫోటోలు)
-
Speed220: ఆకట్టుకుంటున్న గీతామాధురి మాస్ సాంగ్
హేమంత్, గణేష్ ,ప్రీతి సుందర్, జాహ్నవి శర్మ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం స్పీడ్ 220. విజయలక్ష్మి ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఫణి కొండమూరి సమర్పణలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి హర్ష బెజగం దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా ఈ మూవీ నుంచి ఓ స్పెషల్ సాంగ్‌ని విడుదల చేశారు. ‘బెజవాడలో బాలాకుమారి, మిర్యాలగూడలో మీనా కుమారి..’ అంటూ సాగే ఈ మాస్ పాటకి సంతోష్ కుమార్ బి లిరిక్స్ అందించగా.. ప్రముఖ గాయని గీతామాధురి అద్భుతంగా ఆలపించింది. యంగ్ టాలెంటెడ్ డాన్సర్ స్నేహ గుప్తా తనదైన స్టెప్పులతో అదరగొట్టింది. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా చిత్రాన్ని తెరకెకికస్తున్నామని దర్శకుడు హర్ష తెలిపారు. ప్రొడక్షన్ విషయంలో ఎక్కడా తగ్గకుండా భారీ బడ్జెట్‌తో చిత్రాన్ని నిర్మిస్తున్నామని చెప్పారు. -
సింగర్ గీతామాధురి కుమారుడి బారసాల (ఫొటోలు)
-
గీతామాధురి ఇంట సెలబ్రేషన్స్.. కుమారుడికి ఏం పేరు పెట్టిందంటే?
ఒకరు కమ్మగా ఆలపిస్తారు.. మరొకరు కట్టిపడేసేలా నటిస్తారు.. ఇద్దరూ జత కడితే ఎలా ఉంటుంది? బొమ్మ బ్లాక్‌బస్టర్ కదూ! ఆ జంటే గీతామాధురి - నందు. టాలీవుడ్లో చూడముచ్చటైన జంటగా రాణిస్తున్న ఈ దంపతుల ఇంట ఆనందాలు వెల్లివెరిశాయి. వీరికి ఇదివరకే దాక్షాయని అనే కూతురు ఉండగా ఇటీవల ఓ బాబు పుట్టాడు. ఫిబ్రవరి 10న బాబు జన్మించాడంటూ కొద్దిరోజుల క్రితమే అభిమానులతో గుడ్‌న్యూస్ షేర్ చేసుకుంది సింగర్. మీ బుడ్డోడే కాదు.. పేరు కూడా క్యూట్.. తాజాగా వీరు బాబు బారసాల వేడుకను ఘనంగా నిర్వహించారు. బుడ్డోడికి ధృవధీర్ తారక్ అని నామకరణం చేశారు. ఈ ఫంక్షన్‌కు బంధువులతో పాటు ఇండస్ట్రీ మిత్రులు కూడా హాజరయ్యారు. మీ బుడ్డోడే కాదు, అతడి పేరు కూడా భలే క్యూట్‌గా ఉందంటూ వేడుకకు హాజరైన సెలబ్రిటీలు అభిప్రాయపడుతున్నారు. ఈ బారసాల ఫంక్షన్‌కు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఒకరు సింగర్.. ఒకరు హీరో గీతామాధురి సింగర్ రాణిస్తుండగా నందు ఓపక్క హీరోగా, మరోవైపు స్పోర్ట్స్ యాంకర్, టెలివిజన్ హోస్ట్‌గా ఫుల్ బిజీగా ఉంటున్నాడు. 2014లో వీరి పెళ్లి జరగ్గా 2019లో ఓ పాప పుట్టింది. ఐదేళ్ల తర్వాత బాబు పుట్టాడు. కొడుకు పుట్టడానికి ముందు వీరు ఉదకశాంతి పూజ చేయించడం విశేషం. చదవండి: అదే రాళ్లపల్లి వీక్నెస్! జీవితంలో అత్యంత విషాదకర సంఘటన ఇదే! -
పండంటి బిడ్డకు జన్మనిచ్చిన సింగర్ గీతామాధురి
తెలుగు సింగర్ గీతామాధురి గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. మాస్, రొమాంటిక్ గీతాల పాడటంలో స్పెషలిస్ట్ అయిన ఈమె.. గత కొన్నాళ్ల నుంచి మాత్రం కెరీర్ పరంగా బ్రేక్ ఇచ్చింది. ప్రెగ్నెన్సీతో ఉండటమే దీనికి కారణమని జనవరిలో తెలిసింది. ఎందుకంటే అప్పుడు ఈమెకు సీమంతం జరగ్గా.. ఇప్పుడు తనకు కొడుకు పుట్టిన విషయాన్ని గీతామాధురి బయటపెట్టింది. (ఇదీ చదవండి: సీక్రెట్‌గా రెండోసారి నిశ్చితార్థం చేసుకున్న స్టార్ హీరోయిన్) అయితే ఫిబ్రవరి 10నే తనకు బాబు పుట్టాడని.. దాదాపు వారం తర్వాత అంటే ఫిబ్రవరి 17న ఇన్ స్టా స్టోరీలో పోస్ట్ చేసింది. ఇకపోతే తెలుగు నటుడు నందుని ప్రేమించిన గీతామాధురి.. 2014లో అతడిని పెళ్లి చేసుకుంది. వీళ్ల సంసారానికి గుర్తుగా 2019లో ఓ పాప పుట్టింది. ఇప్పుడు బాబు పుట్టాడు. గీతామాధురి ప్రస్తుతం సింగర్‌గా కాస్త గ్యాప్ తీసుకున్నప్పటికీ.. నందు మాత్రం హీరో, స్పోర్ట్స్ యాంకర్, టెలివిజన్ హోస్ట్, ఓటీటీ యాక్టర్‌గా చాలా బిజీగా ఉంటున్నాడు. ప్రస్తుతం వీళ్లిద్దరు కూడా కొడుకుతో సమయాన్ని గడుపుతున్నారు. (ఇదీ చదవండి: ఓటీటీలోకి 'హనుమాన్' సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?) -
12 రోజులు నరకం చూశానంటూ.. కన్నీళ్లు పెట్టుకున్న గీతా మాధురి భర్త
టాలీవుడ్లో గీతా మాధురి- నందు బ్యూటిఫుల్ కపుల్స్‌గా గుర్తింపు ఉంది. గీతా మాధురి సింగర్‌గా సత్తా చాటితే నందు యాక్టర్‌గా మెప్పిస్తున్నాడు. టాలీవుడ్లో టాప్ సింగర్‌గా రాణిస్తున్న గీతా త్వరలో తల్లి కాబోతోంది. రెండోసారి పండంటి బిడ్డకు జన్మనివ్వనుంది. ఈ నెలలోనే ఆమె డెలివరీ డేట్ ఉంది. ఈ విషయాన్ని గీతా మాధురియే స్వయంగా వెల్లడించింది. ఇంతటి సంతోష సమయంలో తాజాగా నందు పాతరోజులను గుర్తుచేసుకుని కన్నీళ్లు పెట్టుకున్నాడు. తాజాగా ఒక టీవీ ప్రోగ్రామ్‌లో పాల్గొన్న నందుకు హైపర్ ఆది ఒక ప్రశ్న వేస్తాడు.. గీతామాధురిని ఉద్దేశించి మీ ఇద్దరి మధ్య జరిగిన ఎమోషనల్ మూమెంట్ చెప్పమని అడుగుతాడు. ఆ సమయంలో నందు చాలా ఎమోషనల్‌గా ఇలా చెప్పాడు. ' గతంలో నా మీద ఒక రూమర్ వచ్చింది. దానితో నాకు ఎలాంటి సంబంధం లేదు. ఆ విషయంలో నా పేరును లాగి న్యూస్‌లలో పదేపదే రిపీట్ చేస్తూ చూపించారు. పలు యూట్యూబ్ ఛానల్స్ వారు కూడా ప్రచారం చేశారు. అలా ఏకంగా 12 రోజుల పాటు నన్ను నెగిటివ్ చేశారు. తర్వాత ఆ విషయంలో నాకు ఎలాంటి సంబంధం లేదని తెలిశాక సింపుల్‌గా ఒక స్క్రోలింగ్‌లో వేశారు. దానివల్ల నేను చాలా బాధపడ్డాను.' అంటూ నందు స్టేజిపై వెక్కి వెక్కి కన్నీళ్లు పెట్టుకున్నాడు. తాజాగా ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నందు కన్నీళ్లకు కారణం ఇదేనా సుమారు ఐదేళ్ల క్రితం టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణ కొనసాగిన విషయం అందరికీ తెలిసిందే. అందులో నందు పాత్ర ఉన్నట్లు ఈడీ అనుమానించింది. అందుకు ఆయన్ను ఈడీ విచారించింది. ఆ సమయంలో నందును కేవలం అనుమానితుడిగానే ఈడీ విచారించింది.ఆపై ఆయనకు క్లీన్ చిట్ కూడా రావడం జరిగింది. దీని గురించే తాజాగా నందు కన్నీళ్లు పెట్టికుని ఉండవచ్చని తెలుస్తోంది. -
ఉదకశాంతి పూజలో గీతామాధురి.. ఎందుకు చేస్తారంటే?
ఒకరు అద్భుతంగా ఆలపిస్తారు.. మరొకరు అంతే అద్భుతంగా నటిస్తారు. వీరిద్దరి జోడీ చూడచక్కగా ఉంటుంది. ఆ జంట మరెవరో కాదు గీతా మాధురి- నందు. టాలీవుడ్లో టాప్ సింగర్‌గా రాణిస్తున్న గీతా త్వరలో తల్లి కాబోతోంది. రెండోసారి పండంటి బిడ్డకు జన్మనివ్వనుంది. ఈ నెలలోనే ఆమె డెలివరీ డేట్ ఉంది. ఈ విషయాన్ని గీతా మాధురియే స్వయంగా వెల్లడించింది. ఉదకశాంతి పూజ చేసిన సింగర్ ఇకపోతే నిండు గర్భిణి అయిన గీతా సీమంతం రెండు రోజుల క్రితం ఎంతో ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే! తాజాగా ఆమె ఉదకశాంతి పూజ చేసింది. భర్తతో కలిసి ఈ పూజ ఆచరించింది. ఇందుకు సంబంధించిన ఫోటోలను ఆమె సోషల్ మీడియాలో రిలీజ్ చేయగా వైరల్‌గా మారాయి. ఇంతకీ ఉదక పూజ అంటే ఏంటి? ఎందుకు చేస్తారని చాలామంది ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ఎందుకు చేస్తారంటే? ఉదకశాంతి అనేది వేదమంత్రాలతో ఆచరించే ఓ ప్రక్రియ. మంత్రజలంతో చేస్తారు కాబట్టి దీన్ని ఉదకశాంతి అంటారు. గృహ సంబంధ దోషాలను తొలగించడానికి మంత్రంతో నీటిని పవిత్రం చేసి దాన్ని ఇల్లంతా చల్లుతారు. ముఖ్యమైన సందర్భాల్లో ఈ పూజ చేస్తారు. దీని వల్ల ఇల్లంతా పవిత్రమవుతుంది. అలాగే ఆయుష్షు, ఆరోగ్యం, ఐశ్వర్యం కోరుకునేవారు ఈ పూజ చేస్తారట! View this post on Instagram A post shared by Geetha Madhuri (@singergeethamadhuri) చదవండి: 'మీ భర్త సినిమాలో జరిగింది చూశారా?'.. స్టార్ హీరో మాజీ భార్యకు కౌంటర్! -
నందు ఇంట సెలబ్రేషన్స్ మొదలు.. సీమంతం వేడుక చూశారా?
టాలీవుడ్ టాప్ సింగర్, బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్ గీతా మాధురి మాతృత్వపు మధురిమను మరోసారి అనుభవించేందుకు తహతహలాడుతోంది. నందు- గీతా దంపతులకు ఇదివరకే దాక్షాయని అనే కూతురు ఉంది. ఫిబ్రవరిలో దాక్షాయనికి తోడుగా ఓ బుజ్జాయి రానుంది. ఈ విషయాన్ని గత డిసెంబర్లో వెల్లడించింది గీతా మాధురి. ప్రస్తుతం ఆమె నిండు గర్భిణి. (గీతా మాధురి సీమంతం వేడుక ఫోటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) తాజాగా ఆమెకు సీమంతం జరిగింది. కుటుంబ సభ్యుల మధ్య ఈ వేడుక ఎంతో ఘనంగా జరిగినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ సీమంతం ఫంక్షన్లో గీతా.. ఆకుపచ్చ- నారింజ కాంబినేషన్లో ఉన్న చీరలో మెరిసిపోయింది. బ్యాగ్రౌండ్లో కూడా అంతా సహజంగా కనిపించేలా పూలతో డెకరేషన్ చేశారు. చదవండి: స్టార్ కమెడియన్ సంపాదించిందెంత? కొత్త ప్రియుడితో కలిసి మాజీ లవర్‌కు చుక్కలు చూపించిన నటి.. బ్రేకప్‌తో శని వదిలిందంటూ.. -
Geetha Madhuri Latest Photos: ‘లాఫ్లోర్’ క్లినిక్‌ని ప్రారంభించిన గీతా మాధురి (ఫొటోలు)
-
రెండోసారి తల్లి కాబోతున్న సింగర్ గీతా మాధురి
టాలీవుడ్ సింగర్, బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్ గీతా మాధురి గుడ్‌న్యూస్ చెప్పింది. మరోసారి తల్లి కాబోతున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు తన ఫ్యామిలీ ఫోటోను షేర్ చేసింది. ఇందులో నందు, గీతా మాధురితో పాటు వీరి కూతురు దాక్షాయని ఉంది. వచ్చే ఫిబ్రవరిలో దాక్షాయని అక్క కాబోతుందంటూ క్యాప్షన్‌లో రాసుకొచ్చింది. అంటే తాను మళ్లీ గర్భం దాల్చానని చెప్పకనే చెప్పింది. ఈ పోస్ట్ చూసిన పలువురు సెలబ్రిటీలు.. నందు-గీతా మాధురి జంటకు శుభాకాంక్షలు చెప్తున్నారు. కాగా నందు- గీతా 2014లో పెళ్లి చేసుకున్నారు. వీరికి 2019లో దాక్షాయని ప్రకృతి అనే కూతురు పుట్టింది. గీతా మాధురి సింగర్‌గా, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా రాణిస్తోంది. బెస్ట్ సింగర్‌గా ఎన్నో అవార్డులు సైతం అందుకుంది. ఇక నందు విషయానికి వస్తే అతడు హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా సినిమాలు చేస్తున్నాడు. క్రికెట్ సీజన్లోనూ యాంకర్‌గానూ అవతారమెత్తుతున్నాడు. ఓటీటీల పుణ్యమాని వెబ్ సిరీస్‌లు చేస్తూ ప్రేక్షకులకు టచ్‌లో ఉంటున్నాడు. ఇక నందు, గీతా విడిపోతున్నారంటూ గతంలో అనేక పుకార్లు రాగా అందులో ఏమాత్రం నిజం లేదని క్లారిటీ ఇచ్చారీ దంపతులు. తాజాగా ఓ ఇంటర్వ్యూలోనూ ఈ విడాకుల వార్తలు చూసి నవ్వుకున్నామని చెప్పాడు నందు. అలాగే రెండో బిడ్డకు ప్లానింగ్ చేస్తున్నామని హింట్ ఇచ్చాడు. ఇంతలోనే గీతా మాధురి తాను ప్రెగ్నెంట్ అని చెప్పడంతో అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. View this post on Instagram A post shared by Geetha Madhuri (@singergeethamadhuri) చదవండి: దుర్గమ్మను దర్శించుకుని బాబాయ్ హోటల్లో టిఫిన్ చేసిన వెంకీ మామ -
క్యాసినో ఆడి గీతా మాధురి డబ్బులు పోగొట్టింది: నందు
టాలీవుడ్ హీరో నందు ఓ పక్క సినిమాలు చేస్తూ మరోపక్క వెబ్ సిరీస్‌లు చేస్తున్నాడు. ఇటీవల మ్యాన్షన్ 24లో ఓ ముఖ్యపాత్రలో నటించిన ఇతడు తాజాగా హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతున్న వధువు వెబ్‌సిరీస్‌లో హీరోగా నటించాడు. ఈ సిరీస్ ప్రమోషన్లలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నందు తన జీవితంలో జరిగిన ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. క్యాసినో ఆడి డబ్బులు పోగొట్టుకున్నాం.. 'నేను, గీత ఓసారి లండన్‌కు వెళ్లాం. అక్కడ క్యాసినో గేమ్ చూసి గీతా మాధురి ఇష్టపడింది, అప్పటికప్పుడు నేర్చేసుకుంది. తను తెలివైన అమ్మాయే.. కానీ తను అక్కడ క్యాసినో ఆడి డబ్బులు పోగొట్టుకుంది. ఈసారి వస్తుందేమో చూద్దామంటూ న్యూజిలాండ్, కాలిఫోర్నియాలో ఆడింది. ఇలా మూడు, నాలుగుసార్లు ఓడిపోయింది.. డబ్బులు పోయాయి. ఇలా ఓ చోట సమయం తెలియకుండా ఆడుతూనే ఉంది. నాకు విసుగొచ్చి డబ్బులు విసిరేసి నేను వెళ్లిపోతానంటూ బయటకు వెళ్లిపోయా.. సారీ బుజ్జి అంటూ తను కూడా బయటకు వచ్చింది. పోలీసులు చుట్టుముట్టారు క్యాసినో బయట నేను తనను తిడుతుంటే.. అమ్మాయిని వేధిస్తున్నాననుకుని పోలీసులు వచ్చేశారు. మేమిద్దరం భార్యాభర్తలమే అని వారికి అర్థమయ్యేలా చెప్పి అక్కడి నుంచి తప్పించుకున్నాం. ఆ తర్వాత నుంచి క్యాసినో ఆడటం తగ్గించేసింది. ఒకవేళ ఆడినా.. రూ.5-10 వేలు మాత్రమే పెడుతోంది. మేమిద్దరం విడిపోతున్నామంటూ ఆ మధ్య పుకార్లు వచ్చాయి. మేము కలిసి ఉన్న ఫోటోలు, వీడియోలు షేర్ చేయకపోవడంతో ఈ రూమర్స్ మొదలయ్యాయి. అందుకే విడాకుల రూమర్స్ బయట కూడా కలిసి కనిపించకపోవడంతో అదే నిజమనుకున్నారు. కానీ అందులో ఏమాత్రం నిజం లేదు' అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం నందు అగ్లీ స్టోరీ అనే సినిమా చేస్తున్నాడు. నూతన దర్శకుడు ప్రణవ స్వరూప్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఫిబ్రవరిలో రిలీజయ్యే అవకాశం ఉంది. దీనితో పాటు స్టార్ హీరోల సినిమాలోనూ ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. చదవండి: గాఢంగా ప్రేమించా.. మోసం చేశాడు.. తప్పుడు వ్యక్తితో లవ్‌లో పడ్డా.. -
గీతా మాధురితో విడాకులు.. ఎట్టకేలకు నోరు విప్పిన నందు!
సింగర్ గీతా మాధురి, నటుడు నందూలది ప్రేమ వివాహం. 2014లో పెళ్లి చేసుకున్న వీరు ఎంతో అన్యోన్యంగా కలిసిమెలిసి ఉంటారు. వారి సరదా గొడవలను, అల్లరి పనులను ఈ జంట సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. అయితే రెండేళ్ల క్రితం నందూ, గీతా మాధురి విడాకులు తీసుకోనున్నారంటూ ప్రచారం జరిగింది. మస్పర్థల కారణంగా విడిపోతున్నారని టాక్ నడిచింది. దీనిపై అటు గీతా మాధురి, ఇటు నందు స్పందించకుండా లైట్ తీసుకున్నారు. తాజాగా నందు మాన్షన్ 24 వెబ్ సిరీస్ ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా గతంలో వచ్చిన విడాకుల రూమర్స్ గురించి స్పందించాడు. తనకు, గీతా మాధురికి గొడవలవుతున్నాయని, విడిపోతున్నామంటూ వచ్చిన వార్తల్లో ఏమాత్రం నిజం లేదని క్లారిటీ ఇచ్చాడు. ఈ వార్తలను చూసి తామిద్దరం నవ్వుకున్నామని చెప్పాడు. ఇలాంటి వార్తలను తాము పెద్దగా పట్టించుకోమన్నాడు. ఇకపోతే మాన్షన్ 24 వెబ్ సిరీస్‌లో నందు నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించాడు. ఇందులో వరలక్ష్మి శరత్ కుమార్ ప్రధాన పాత్రలో నటించింది. సత్యరాజ్, రావు రమేశ్, అవికా గోర్, రాజీవ్ కనకాల కీలక పాత్రలు పోషించారు. ఓంకార్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్ అక్టోబర్ 17 నుంచి హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. View this post on Instagram A post shared by @that_actor_nandu చదవండి: ఈ హీరోయిన్ల చేతిలో ఒక్క సినిమా కూడా లేదు -
ఎమోషనల్ లవ్‌స్టోరీ
యామిన్ రాజ్, విరాట్ కార్తీక్, ప్రియాంకా రేవ్రి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఎమోషనల్ లవ్‌స్టోరీ ‘ప్రేమదేశపు యువరాణి’. సాయి సునీల్ నిమ్మల దర్శకత్వంలో ఆనంద్ వేమూరి, హరిప్రసాద్ సీహెచ్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలోని ప్రత్యేక గీతం ‘మసక తడి..’ని ఆవిష్కరించారు. అజయ్ పట్నాయక్ స్వరపరచిన ఈ పాటకు కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించగా, గీతామాధురి పాడారు. -
షాపింగ్‌లో బిజీగా అను ఇమ్మాన్యుయేల్.. మిహికా బజాజ్ స్టన్నింగ్ లుక్స్!
►షాపింగ్ ఎంజాయ్ చేస్తోన్న అను ఇమ్మాన్యుయేల్ ►ఒళ్లంతా డ్రెస్‌తో కప్పేసుకున్న శృతిహాసన్ ►రానా సతీమణి మిహికా బజాజ్ స్టన్నింగ్ లుక్స్ ►కలర్ ఫుల్ గౌనులో రష్మీ గౌతమ్ హోయలు ►ట్రెండింగ్ లుక్‌లో సింగర్ గీతామాధురి ►యోగాసనాలు చేస్తున్న శ్రియా శరణ్ View this post on Instagram A post shared by Anu Emmanuel (@anuemmanuel) View this post on Instagram A post shared by Shruti Haasan (@shrutzhaasan) View this post on Instagram A post shared by Miheeka Daggubati (@miheeka) View this post on Instagram A post shared by Shriya Saran (@shriya_saran1109) View this post on Instagram A post shared by Geetha Madhuri (@singergeethamadhuri) View this post on Instagram A post shared by Rashmi Gautam (@rashmigautam) -
నాటు పాటలే కాదు నాటీ పోజులతో కవ్విస్తున్న గీతా మాధురి (ఫోటోలు)
-
సింగర్ గీతా మాధురి ఫోటో షూట్
-
కదల్లేని స్థితిలో సింగర్ భర్త.. అయినా కూడా..!
టాలీవుడ్ హీరో నందు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. గతేడాది బొమ్మ బ్లాక్ బస్టర్ సినిమాతో ప్రేక్షకులను అలరించాడు. యాంకర్ రష్మీ హీరోయిన్గా.. రాజ్ విరాట్ డైరెక్ట్ చేసిన ఈ మూవీకి ప్రశాంత్ విహారి సంగీతం అందించాడు. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోయింది. 2006లో వచ్చిన ఫోటో సినిమా ద్వారా సినీరంగంలోకి ఎంట్రీ ఇచ్చిన నందు.. ఆ తర్వాత 100% లవ్, ఆటోనగర్ సూర్యలో పలు పాత్రల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. సవారీ మూవీతో సక్సెస్ అందుకున్నారు యంగ్ హీరో. కాగా.. 2014లో గాయని గీతామాధురిని వివాహాం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా నందు తన ఇన్‌స్టాలో షేర్ చేసిన ఓ ఫోటో వైరలవుతోంది. కాలికి గాయమైన ఓ ఫోటోను పంచుకున్నారు. అయితే ఆ ఫోటోలో ఆయన డబ్బింగ్ చెబుతున్నట్లు కనిపిస్తోంది. నడవలేని స్థితిలో ఉన్నప్పటికీ స్డూడియోకి వచ్చి డబ్బింగ్ చెబుతూ కనిపించారు. అయితే ఆయన కాలికి ప్రమాదం ఎలా జరిగిందన్న విషయం మాత్రం వెల్లడించలేదు. అయితే ప్రస్తుతం నందు సినిమాలు, క్రికెట్ కామెంటరీలతో ఫుల్ బిజీ అయిపోయారు. జిమ్‌లోనూ శ్రమిస్తూ ఫోటోలు కూడా షేర్ చేస్తుంటారు. కాగా.. నందు ప్రస్తుతం మహేశ్ బాబు మూవీ ఎస్ఎస్ఎంబి 28తో పాటు ఆర్సీ15,డిజే టిల్లు 2, హరిహరమల్లు, ధాస్ కా ధమ్కీ సినిమాల్లో కనిపించనున్నారు. View this post on Instagram A post shared by @that_actor_nandu -
ఒకే ఒక్క లైఫ్.. నచ్చినవన్నీ చేసెయ్యాలి: సింగర్ గీతా మాధురి
-
Telugu Indian Idol 2: నిత్యా ప్లేస్‌లో గీతా.. హోస్ట్ కూడా మారాడు!
ప్రముఖ ఓటీటీ ఆహాలో సూపర్ హిట్ అయిన షోలలో తెలుగు ఇండియన్ ఐడల్ ఒకటి. . యంగ్ సింగర్స్‌కు తమ ట్యాలెంట్ నిరూపించుకోవడానికి ఈ సింగింగ్ షో మంచి వేదికగా నిలిచింది.ఈ షోకి సింగర్ శ్రీరామచంద్ర హోస్ట్ గా.. మ్యూజిక్ డైరెక్టర్ తమన్, హీరోయిన్ నిత్యామీనన్.. సింగర్ కార్తీక్ జడ్జీలుగా వ్యవహరించి సందడి చేశారు. అంతేకాదు గ్రాండ్ ఫినాలేకి మెగాస్టార్ చిరంజీవి గెస్ట్‌గా వచ్చి అలరించారు. త్వరలోనే ఈ సింగింగ్ షో రెండో సీజన్ రాబోతుంది. తాజాగా ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 2 కర్టెన్ రైజర్ ప్రోగ్రాం వేడుకగా జరిగింది. ఈ కార్యక్రమానికి సీఈవో అజిత్ ఠాకూర్, ప్రముఖ సింగర్లు, ఎస్.ఎస్. తమన్, కార్తీక్, గీతామాధురి, హేమచంద్ర తదితరలు హాజరయ్యారు. ఇక సీజన్ 1కి శ్రీరామచంద్ర వ్యాఖ్యాతగా వ్యవహరిస్తే.. రెండో సీజన్‌ని హేమచంద్ర హోస్ట్ చేయనున్నారు. ఇక జడ్జీల విషయానికొస్తే… సింగర్ నిత్యామీనన్ ప్లేస్‌లో ట్యాలెంటెడ్ సింగర్ గీతా మాధురి రానుంది. View this post on Instagram A post shared by ahavideoin (@ahavideoin) -
బ్లాక్ శారీలో వసంతి క్యూట్ లుక్స్.. హాట్ లుక్స్‌లో పావని
► ట్రెడిషినల్ డ్రెస్‌లో కృతిశెట్టి స్టన్నింగ్ లుక్స్ ► రెడ్ శారీలో పరువాలు ఒలకబోస్తున్న ఇన్‌స్టా ఫేమ్ పావని ► త్రిషకు..వయసుతో పాటు అందం కూడా పెరుగుతున్నట్లుంది ► హీరోయిన్లా స్టిల్స్ ఇచ్చిన డిజైనర్ శ్రావ్య వర్మ ► క్యూట్ లుక్స్‌తో ఫిదా చేస్తున్న గీతూ మాధురి View this post on Instagram A post shared by Krithi Shetty (@krithi.shetty_official) View this post on Instagram A post shared by Sai Pavani Raju (@nayani_pavani) View this post on Instagram A post shared by Vasanthi Krishnan (@vasanthi__krishnan) View this post on Instagram A post shared by Nithyashree (@_nithyashree) View this post on Instagram A post shared by Trish (@trishakrishnan) View this post on Instagram A post shared by Shravya Varma (@shravyavarma) View this post on Instagram A post shared by Geetha Madhuri (@singergeethamadhuri) View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) View this post on Instagram A post shared by Sadaa (@sadaa17) View this post on Instagram A post shared by Arohi Rao (@arohi_rao) -
పొట్టి దుస్తుల్లో ఆరోహి హొయలు.. బ్లాక్ అండ్ వైట్‌లో శివాత్మిక
► సితార క్యూట్ లుక్స్.. నయా ఫోటోషూట్ అదుర్స్ ► ఒంటినిండా నగలతో మెరిసిపోతున్న గీతా మాధురి ► మన్మథుడికి నేహా చౌదరి ఆహ్వానం ► పొట్టి బట్టల్లో బిగ్‌బాస్ బ్యూటీ ఆరోహి రావ్ ► బ్లాక్ అండ్ వైట్ అందాలతో శివాత్మిక ► కింద కూర్చొని ఫోటోకి ఫోజుచ్చిన చాందిని View this post on Instagram A post shared by SitaraGhattamaneni (@sitaraghattamaneni) View this post on Instagram A post shared by EmraanArtistry🧿 (@emraanartistry) View this post on Instagram A post shared by Anchor Neha (@chowdaryneha) View this post on Instagram A post shared by Himaja💫 (@itshimaja) View this post on Instagram A post shared by KUSHI🐰#petlover (@kushithakallapu) View this post on Instagram A post shared by Swetha (@swethapvs) View this post on Instagram A post shared by Arohi Rao (@arohi_rao) View this post on Instagram A post shared by Shivathmika Rajashekar (@shivathmikar) View this post on Instagram A post shared by Chandini Chowdary (@chandini.chowdary) View this post on Instagram A post shared by Ileana D'Cruz (@ileana_official) View this post on Instagram A post shared by Hina Khan (@realhinakhan) View this post on Instagram A post shared by Jahnavi Dasetty (@mahathalli) -
సైమా అవార్డ్స్ లో మెరిసిన సినీ తారలు (ఫొటోలు)
-
సింగర్ గీతా మాధురి కూతుర్ని చూశారా? ఎంత క్యూట్‌గా ఉందో..
సింగర్ గీతామాధురి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. తన పాటలతో ఎంతోమంది అభిమానుల్ని సంపాదించుకున్న గీతా ప్రస్తుతం కెరీర్లోనూ బిజీగా మారిపోయింది. ప్రస్తుతం బుల్లితెరపై ప్రసారమవుతున్న ఓ షోకు మెంటర్‌గానూ అలరిస్తున్న గీతా సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటుంది. తాజాగా తన కూతురు దాక్షాయణి ప్రకృతి మూడవ బర్త్‌డే సెలబ్రేషన్స్ ఫోటోలను అభిమానులతో పంచుకుంది. ఈ క్రమంలో పలువురు నెటిజన్లు ఆ పాపకు బర్త్‌డే విషెస్‌ను తెలియజేస్తున్నారు. కాగా 2014 ఫిబ్రవరి 9న నటుడు నందుతో గీతా మాధురి వివాహం జరిగిన సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Geetha Madhuri (@singergeethamadhuri) View this post on Instagram A post shared by Geetha Madhuri (@singergeethamadhuri) -
'లైఫ్ అంటే ఇట్టా ఉండాలా'.. పూజాతో వెంకీ, వరుణ్ స్టెప్పులు..
F3: Pooja Hegde Life Ante Itta Vundaala Lyrical Song Released: విక్టరీ వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా త్రిబుల్ ఫన్‌తో సందడి చేయనున్న చిత్రం 'ఎఫ్ 3'. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ మూవీ 'ఎఫ్ 2' చిత్రానికి సీక్వెల్ అని తెలిసిన విషయమే. మిల్క్ బ్యూటీ తమన్నా, మెహ్రీన్, సోనాల్ చౌహన్ హీరోయిన్లుగా నటించిన 'ఎఫ్ 3' మే 27న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల విడుదలైన టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇదేకాకుండా అంతకుముందు రిలీజైన రెండు సింగిల్స్ ప్రేక్షకాదరణ పొందాయి. ఇప్పుడు తాజాగా మూడో సింగిల్‌ను వదిలారు. లైఫ్ అంటే ఇట్టా ఉండాలా అంటూ సాగే లిరికల్ సాంగ్‌ను మంగళవారం (మే 17) విడుదల చేశారు. ఈ పాటలో బుట్టబొమ్మ పూజా హెగ్డే స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. పూజాతోపాటు వెంకటేశ్, వరుణ్ తేజ్, రాజేంద్ర ప్రసాద్ కలిసి చిందేసారు. ఈ పాటను కాసర్ల శ్యామ్ రచించగా, రాహుల్ సిప్లిగంజ్, గీతా మాధురి ఆలపించారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. పార్టీ నంబర్‌గా పేర్కొన్న ఈ పాట పార్టీల్లో, వేడుకల్లో మారుమోగనుంది. చదవండి: ఎఫ్ 3లో సోనాలి చౌహాన్ రోల్‌పై స్పందించిన అనిల్ రావిపూడి -
బిగ్‌బాస్ హౌస్‌లోకి నలుగురు మాజీ కంటెస్టెంట్లు
Bigg Boss Telugu 5: బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్లో మాజీ కంటెస్టెంట్లు సందడి చేయబోతున్నారు. ప్రతి సీజన్‌లాగే ఈ సారి కూడా సీనియర్లు హౌస్‌లోని ఫైనలిస్టులతో ముచ్చటించనున్నారు. అందులో భాగంగా గీతా మాధురి, అఖిల్ సార్థక్, రోల్ రైడా, హరితేజలు హౌస్‌లో ఎంట్రీ ఇవ్వనున్నట్లు సమాచారం. కాకపోతే కరోనాను దృష్టిలో పెట్టుకుని రూమ్‌లో నుంచే మాట్లాడనున్నారట. మరి వీళ్ల రాకతో బిగ్‌బాస్ ఎపిసోడ్ వెలిగిపోవడం ఖాయం! వీరు ఎవరెవరికి బూస్ట్ ఇస్తారో, ఎవర్ని ఆడేసుకుంటారో చూడాలి! ఇదిలా ఉంటే మరో రెండు రోజుల్లో బిగ్‌బాస్ విన్నర్ ఎవరనేది తేలనుంది. సన్నీ, శ్రీరామ్, షణ్ముఖ్ టైటిల్ కోసం పోటీపడుతున్నారు. వీరిలో ఎవరు ట్రోఫీ ఎగరేసుకుపోతారనేది ఆసక్తికరంగా మారింది! -
కొత్త ప్యాకేజీతో ముందుకొచ్చిన ఆర్.వి టూర్స్ అండ్ ట్రావెల్స్
-
నందు యాక్టింగ్‌పై భార్య గీతా మాధురి కౌంటర్!
టాలీవుడ్ సింగర్ గీతా మాధురి, ఆమె భర్త హీరో నందు సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్‌గా ఉంటారు. సోషల్ మీడియాలో తనపై వచ్చే ట్రోల్స్‌పై నందు స్పందిస్తూ తనదైన శైలిలో వేసే సటైర్లకు నెటిజన్లు ఫిదా అవుతుంటారు. అలాగే మీమ్స్, థంబ్ నెయిల్స్ మీద నందు వేసే సెటైర్లు అందరినీ ఆకట్టుకుంటాయి. ఈ క్రమంలో నందుకు ఫాలోయింగ్ కూడా పెరిగిపోయింది. అదే విధంగా తన భార్య గీతా మాధురి, తనపై వచ్చే మీమ్స్, ట్రోల్స్‌ను ఎంతో స్పోర్టీవ్‌గా తీసుకునే అతడు ఇటీవల సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ‘సవారి’ సినిమాతో నందు హీరోగా హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. దీంతో తన సినిమాపై నెటిజన్లు నెగెటివ్ కామెంట్స్, చేయడం, తన స్టార్డం మీద సెటైర్లు వేయడంతో అతడు ఫైర్ అయ్యాడు. కాగా ప్రస్తుతం ‘బొమ్మ బ్లాక్ బస్టర్’ అనే మూవీలో నటిస్తున్నాడు. అయితే మీమర్స్‌ను ఎంకరేజ్ చేసేందుకు నందు తన మీద, తన చిత్రం మీద వెరైటీ మీమ్స్ వేసిన వారికి ఇటీవల ఓ స్పెషల్ గిఫ్ట్సను కూడా ఆఫర్ చేశాడు. ఈ నేపథ్యంలో ఇటీవల ఆయన భార్య గీతాపై వచ్చిన ఓ మీమ్‌పై స్పందించాడు. ‘మీరు ఒక వేళ నటి అయ్యుంటే మా పరిస్థితి ఏంటి’అని తెలుగు హీరోయిన్స్ అనుకుంటున్నట్టుగా గీతాను ఉద్దేశిస్తూ ఓ మీమ్ ఇటీవల వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఆ మీమ్ కాస్తా నందు దృష్టికి వచ్చింది. అది చూసిన నందు ‘మరి కలిసి ఒక స్క్రిప్ట్ చేద్దామా’ అంటూ ఫన్నిగా కౌంటర్ వేశాడు. ఇక నందు కామెంట్‌పై గీతా స్పందిస్తూ.. ‘అబ్బో నువ్వు చాలా చేశావ్‌గా.. నాకు అంత లేదు నీకు తెలుసుగా?’ అంటూ భర్త కామెంట్‌కు కౌంటర్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ జంట కామెంట్లు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. కాగా గీతా మాధురి బిగ్ బాస్ రెండో సీజన్లో రన్నర్‌గా నిలిచి అందరిని మనసులను గెలుచుకున్న సంగతి తెలిసిందే. నందు కూడా బిగ్ బాస్ ఇంట్లోకి రాబోతోన్నాడనే వార్తలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. అయితే బీబీ అంటూ తన ‘బొమ్మ బ్లాక్ బస్టర్’ మూవీని బిగ్ బాస్ పేరిట ప్రమోట్ చేసుకుని అందరి దృష్టిలో పడ్డాడు. చదవండి: అలాంటి సినిమాల్లో నటించాలని ఉంది: ఇలియానా ‘అసలు ఈ ఏడాది బిగ్‌బాస్ ఉందా లేదా?!’ -
బిగ్‌బాస్‌లో స్వయంవరం: విచ్చేసిన హీరో అఖిల్
అటు సినిమాను, ఇటు బిగ్‌బాస్‌ను సమానంగా బ్యాలెన్స్ చేస్తానన్న నాగార్జునకు ఇప్పుడు అది వీలు కావడం లేదు. 21 రోజులు హిమాలయాల్లో వరుసగా షూటింగ్ జరుపుకోనున్నారు. దీంతో బిగ్‌బాస్ షోలో హోస్ట్‌గా మామ స్థానాన్ని భర్తీ చేసేందుకు సమంత రంగంలోకి దిగారు. తెలుగులో ఆకట్టుకునేలా మాట్లాడుతూ కంటెస్టెంట్లకే కౌంటర్లు విసురుతున్నారు. ఇక దసరా పండ సంబరాలను రెట్టింపు చేసేందుకు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ హీరో అఖిల్ కూడా వచ్చేశారు. వీరిద్దరినీ బుట్టలో పడేసేందుకు ఇంటిసభ్యులు నానాతంటాలు పడుతున్నారు. (చదవండి: బిగ్‌బాస్ : ‘ఆ విషయంలో మోనాల్‌దే తప్పు’) డిటెక్టివ్‌గా హైపర్ ఆది తాజాగా రిలీజైన ప్రోమో ప్రకారం సమంత చేతుల మీదుగా హౌస్‌లో స్వయంవరం జరగనుంది. హారిక, అరియానా, దివి, మోనాల్లను మెప్పించేందుకు మేల్ కంటెస్టెంట్లు డ్యాన్సులతో రఫ్ఫాడిస్తూ కండల ప్రదర్శన కూడా చేస్తున్నారు. ఇక అఖిల్ మాత్రం తన సింగింగ్ ట్యాలెంట్ ప్రదర్శించాడు. వీరి పర్ఫామెన్స్‌ల గురించి హీరో అఖిల్ స్పందిస్తూ అందరూ బాగా చేశారని మెచ్చుకున్నారు. వీరిద్దరితో పాటు హీరోహీరోయిన్లు కార్తికేయ, పాయల్ రాజ్‌పుత్ కూడా షోకి విచ్చేశారు. ఇక డిటెక్టివ్‌గా హైపర్ ఆది వచ్చి పంచులు వేశాడు. సింగర్ గీతామాధురి కూడా షోలో తన గాత్రమాధుర్యాన్ని వినిపించారు. (చదవండి: మనాలిలో నాగ్: బిగ్‌బాస్‌కు సమంత?) నోయల్ గురువుగా మారాలి: సమంత ఇక అంతకు ముందు రిలీజైన మరో ప్రోమోలో హీరోయిన్ సామ్ ఒక్కొక్కరికి బాగానే పంచులు విసురుతున్నారు. కోపమొచ్చినప్పుడు సోఫా మీద రాసుకోండి అంటూ అవినాష్ మీద సెటైర్ వేశారు. అఖిల్‌ను డ్రెస్ బాగుందంటూనే గుజరాతీ డ్రెస్సా అని అడిగేశారు. ఇక ఎప్పుడూ నాలుగు మంచి మాటలు చెప్తూ ఉండే నోయల్‌ను ఉద్దేశిస్తూ మీరు గురువు అయిపోవాలనుకుంటున్నానని కోరుకున్నారు. అనంతరం కంటెస్టెంట్లకు వారి కుటుంబ సభ్యులు మాట్లాడుతున్న వీడియో క్లిప్పింగులను చూపించడంతో హౌస్మేట్స్ ఎమోషనల్ అయ్యారు. ఎందరో సెలబ్రిటీలను ఒకే స్టేజీ మీదకు తీసకువచ్చి దసరా వినోదాన్ని రెట్టింపు చేస్తూ కన్నుల పండగ చేయనున్న ఈ ఎపిసోడ్ చూడాలంటే సాయంత్రం ఆరు గంటల వరకు ఓపిక పట్టాల్సిందే. (చదవండి: అఖిల్-మోనాల్ లవ్ ట్రాక్‌కు అభిజిత్ డైరెక్షన్) -
బిగ్‌బాస్: శ్రీముఖి కొంపముంచిన ‘టాటూ’
బిగ్‌బాస్ తెలుగు 3 విజేతగా పాతబస్తీ పోరడు రాహుల్ సిప్లిగంజ్ నిలిచాడు. మొదటి నుంచి టైటిల్ ఫేవరెట్‌గా ఉన్న శ్రీముఖి చివరి నిమిషంలో తడబడి రెండో స్థానానికి పరిమితమైంది. రాహుల్ నిజాయితీ, ముక్కుసూటితనం, నిరాడంబరత అన్నీ ప్రేక్షకులు జై కొట్టేలా చేశాయి. ఇక మొదటి నుంచి టాస్క్‌ల్లో, ఎంటర్టైన్మెంట్లో శ్రీముఖి దూకుడు ప్రదర్శించినప్పటికీ ఆమె ఓటమిని ముందే పసిగట్టామని కొందరు కామెంట్లు చేస్తున్నారు. శ్రీముఖి వేసుకున్న పచ్చబొట్టే ఆమె ఓటమికి నాంది పలికిందని పలువురు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. పచ్చబొట్టు సెంటిమెంట్ కథేంటి? బిగ్‌బాస్ రెండో సీజన్లో కంటెస్టెంట్ గీతా మాధురి పచ్చబొట్టు వేయించుకుంది. చిచ్చుబుడ్డిలా ఇంట్లో సందడి చేసే గీతామాధురే టైటిల్ విజేతగా నిలుస్తుందని చాలామంది ధీమా వ్యక్తం చేశారు. విజయపుటంచులదాకా వచ్చిన గీత.. కౌశల్ ఆర్మీ దెబ్బతో రన్నరప్‌తో సరిపెట్టుకుంది. ఇక హౌస్‌లోని కంటెస్టెంట్ బాబు గోగినేనిని ఎలిమినేషన్ నుంచి తప్పించడానికి గీతామాధురి టాటూ వేసుకోవాల్సి వచ్చింది. అతన్ని కేవలం ఒక్కవారం ఎలిమినేషన్ నుంచి తప్పించడానికి మాత్రమే ఆ పచ్చబొట్టు ఉపయోగపడుతుంది. దీనికోసం శరీరంపై జీవితాంతం గుర్తుండిపోయేలా టాటూ వేసుకోడానికి గీత సిద్ధపడుతుందా? అని అందరూ అనుమానపడ్డారు. కానీ గీతామాధురి వెంటనే ఒప్పేసుకోవడం కాస్త ఆశ్చర్యాన్ని కలిగించింది. ఈ సీజన్లో శ్రీముఖికి కూడా బిగ్‌బాస్ అలాంటి టాస్కే ఇచ్చాడు. సేమ్ టు సేమ్.. వరుణ్‌ను నామినేషన్ నుంచి ఒకవారంపాటు సేవ్ చేయడానికి టాటూ వేసుకుంటావో, లేదో నిర్ణయాన్ని చెప్పాల్సిందిగా బిగ్‌బాస్ శ్రీముఖిని ఆదేశించాడు. అయితే శ్రీముఖి.. తనకు కాబోయే భర్త పేరు మాత్రమే టాటూ వేయించుకోవాలనుకున్నాను అని చెబుతూనే.. ఇష్టం లేకపోయినా వరుణ్ కోసం పచ్చబొట్టు వేయించుకుంది. అయితే గత సీజన్లో గీతా మాధురి పచ్చబొట్టు వేయించుకోవడం.. రన్నరప్‌గా నిలివటాన్ని ప్రస్తుత సీజన్‌తో పోల్చి చూస్తున్నారు నెటిజన్లు. సేమ్ టు సేమ్.. ఈ సీజన్లోనూ శ్రీముఖి పచ్చబొట్టు వేయించుకుందని.. అందువల్లే ఆమె ఓటమిపాలైందని కొందరు వాదనలు వినిపిస్తున్నారు. ఎంతో స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనుకున్న శ్రీముఖి టైటిల్ పోరులో వెనకబడటానికి పచ్చబొట్టే కారణమని చెప్తున్నారు. పచ్చబొట్టు శ్రీముఖి కొంపముంచిందంటూ సానుభూతి ప్రకటిస్తున్నారు. -
ఆ ఇద్దరికే సపోర్ట్ చేస్తున్న బిగ్‌బాస్ కంటెస్టెంట్లు
టైటిల్ గెలవడానికి ఇంటి సభ్యులు చేయాల్సిందంతా చేసేశారు. ఇప్పుడు అంతిమ తీర్పు ప్రజల చేతుల్లో ఉంది. అయితే వారి తీర్పును తమకు అనుకూలంగా మలుచుకునేందుకు హౌస్‌మేట్స్‌తో పాటు ఆయా ఇంటి సభ్యుల అభిమానులు కూడా తీవ్రంగా కష్టపడుతున్నారు. వీరికి సపోర్ట్ చేస్తూ కొంతమంది సెలబ్రిటీలు సైతం ప్రచారం బాట పట్టారు. శ్రీముఖికి బుల్లితెర యాంకర్ రష్మీ మద్దతు తెలుపగా.. రాహుల్‌కు పాప్ సింగర్ నోయెల్ ప్రచారం చేస్తున్నాడు. అలీ రెజాకు పటాస్ పంచ్‌ల యాంకర్ రవి తోడుగా నిలిచాడు. ఈ క్రమంలో సింగర్ గీతా మాధురి, నటి హరితేజ బిగ్‌బాస్ 3పై స్పందించారు. బిగ్‌బాస్ హౌస్‌లో టాప్ 5కు చేరుకున్న ఇంటి సభ్యులందరికీ గీతా మాధురి ఆల్ ద బెస్ట్ తెలిపింది. అయితే శ్రీముఖి, రాహుల్ సిప్లిగంజ్‌లతో దిగిన ఫొటోను మాత్రమే పంచుకుంది. అంటే గీతామాధురికి వాళ్లిద్దరిలో ఎవరు టైటిల్ గెలిచినా ఓకే అని స్పష్టమవుతోంది. View this post on Instagram All the best to my friends @sreemukhi @sipligunjrahul @itsvarunsandesh @baba_bhasker @i.ali.reza Show choosi meeku nachina vaallaki vote cheyandi A post shared by Geetha Madhuri (@singergeethamadhuri) on Oct 27, 2019 at 12:17pm PDT అయితే.. ఇప్పుడు ఎవరికి ఓట్లు వేయాలనేదానిపై అభిమానులు తలలు పట్టుకుంటున్నారు. దీంతో గీతా మాధురి ఫ్యాన్స్ రెండు టీంలుగా విడిపోయి రాహుల్, శ్రీముఖికి మద్దతు తెలుపుతూ ఓట్లు చీల్చుతున్నారు. ఇక వాళ్లిద్దరిలోనే ఎవరో ఒకరు గెలవాలని కోరుకుంటున్నప్పుడు అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్పడం ఎందుకని కొంతమంది నెటిజన్లు విమర్శిస్తున్నారు. గత సీజన్లో రన్నరప్‌గా నిలిచిన గీతా మాధురి బిగ్‌బాస్ ఐ లోగోను పచ్చబొట్టు వేయించుకుంది. ఈ సీజన్లో శ్రీముఖి ‘బిగ్‌బాస్ కన్ను’ను పచ్చబొట్టు వేయించుకోవటంతో ఆమె కూడా రన్నరప్‌గా నిలుస్తుందని కొంతమంది నెటిజన్లు జోస్యం చెబుతున్నారు. మరి శ్రీముఖి టైటిల్ సాధిస్తుందా? తడబడుతుందా అనేది చూడాలి. మరోవైపు మొదటి సీజన్లో టాప్ 3లో చోటు దక్కించుకున్న హరితేజ.. తన ఫేవరెట్ కంటెస్టెంట్లు శ్రీముఖి, రాహుల్ అని చెప్తూ.. ఆ ఇద్దరికీ టైటిల్ గెలిచేందుకు ఆల్ ద బెస్ట్ తెలియజేసింది. View this post on Instagram Two very close friends of mine are in finals And it’s time for us to show them our love. Do vote for the person you love. #biggboss3 @sipligunjrahul @sreemukhi All the best to u guys ❤️❤️ Much love❤️ A post shared by hariteja (@actress_hariteja) on Oct 30, 2019 at 10:36am PDT -
గీతామాధురి సీరియస్ వార్నింగ్
సాక్షి, హైదరాబాద్ : సినీ సంగీత ప్రపంచంలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుని, బిగ్ బాస్ సీజన్ 2లో రన్నరప్‌గా నిలిచిన గీతామాధురి కొన్ని యూట్యూబ్ చానెళ్లపై ఆగ్రహంగా ఉన్నారు. తప్పుడు వార్తలు ప్రెజెంట్ చేస్తున్న యూట్యూబ్ ఛానెళ్లకి గీతామాధురి తన ఇన్‌స్టాగ్రామ్‌లో సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఫేక్ వీడియోలు, తప్పుడు వార్తలు పెట్టినందుకు కొన్ని యూట్యూబ్ చానెళ్ల మీద కొద్ది రోజుల్లో చట్టపరమైన చర్యలు తీసుకోవాలనుకుంటున్నానని తెలిపారు. చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి ముందు ఆ వీడియోలను తీసివేయడానికి, సదరు యూట్యూబ్ ఛానెళ్లకి కొంత సమయం ఇస్తున్నానని పేర్కొన్నారు. ‘మహా అయితే ఓ రోజు బాధపడతానేమో తర్వాత సంతోషం, ప్రశాంతత నాదే’ అంటూ పోస్ట్ పెట్టారు. -
బిగ్‌బాస్ : ప్రేక్షకుల సహనానికి పరీక్ష
బిగ్‌బాస్ ఏదైనా జరుగొచ్చు. అంటే ఇలా జరుగుతుందని మాత్రం ఎవరూ ఊహించరు. ఈవారం అంతా ప్రేక్షకులకు అసహనం కలిగించేలా షోను నడిపించారు నిర్వాహకులు. మళ్లీ ఆ ప(స)ని లేని పెళ్లి టాస్క్‌లో ఇచ్చిన సీక్రెట్స్ విరక్తి పుట్టించేలా ఉన్నాయి. ఈ వారం జరిగిన సంగతులేంటో ఓ సారి చూద్దాం. బిగ్‌బాస్‌లో ఈ వారం ఓ బొమ్మల పెళ్లి జరిగింది. కాదు కాదు బిగ్‌బాస్ ఆదేశాల మేరకు హౌస్మేట్స్ జరిపించారు. మెహందీ, సంగీత్, పెళ్లి, శోభనం అంటూ ప్రేక్షకులకు చిర్రెత్తించేలా చేశారు హౌస్మేట్స్. ఏ ఒక్కరూ తగ్గకుండా అందరూ తమ అతితో నటించేశారు. ఈ వారం గీతా మాధురిపై పెరిగనంత వ్యతిరేకత మిగతా ఏ కంటెస్టెంట్‌పై పెరిగి ఉండకపోవచ్చు. వీరు చేసే ఈ అతిలో కాస్త ఉపశమనంగా హౌస్‌లో అనసూయ, నీవెవరో టీమ్ కనిపించి కనువిందు చేశారు. మెహింది కార్యక్రమానికి హాజరైన అనసూయ హౌస్మేట్స్ అందరికీ మెహిందిని పెట్టారు. ఒక్కొక్కరు తమకిష్టమైన పేర్లను చేతిపై వేయించుకున్నారు. అనసూయ ఉన్నంత సేపు హౌస్ కాస్త కలర్ఫుల్గా ఉంది. అటు తరువాత సంగీత్ కార్యక్రమం అంటూ హౌస్ మేట్స్ డ్యాన్సులతో చిందేశారు. గీతా మాధురిని ముద్దు పెట్టుకోవాలంటూ రోల్ రైడాకు సీక్రెట్ టాస్క్ ఇవ్వగా.. సామ్రాట్ కూడా పనిలో పనిగా ముద్దు పెట్టేశాడు. ఇక దీనిపై సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రోలింగ్ గురించి చెప్పనక్కర్లేదు. గత కొన్ని రోజులుగా గీతపై నెటిజన్లలో వ్యతిరేకత తీవ్రస్థాయి కి చేరుకున్నట్టు కనిపిస్తోంది. సామ్రాట్, రోల్, తనీష్‌లో నందు కనిసిస్తున్నాడని చెప్పిన గీతపై నెటిజన్లు ఘాటు కామెంట్లు చేస్తున్నారు. సందులో సడేమియా అన్నట్లు ఈ టాస్క్‌లో గణేష్ కూడా రెచ్చిపోయాడు. పెళ్లి పంతులు క్యారెక్టర్లో లీనమయ్యాడు. మాట తీరు, బాడీ లాంగ్వేజ్ అన్ని మార్చేసి కంటెస్టెంట్లతోనే కాదు ఏకంగా బిగ్‌బాస్‌తో మాట్లాడే తీరే మారిపోయింది. ఈ విషయంపై తనీష్ కూడా ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీనిపై కౌశల్, తనీష్ ఇద్దరు చర్చించుకున్నారు. గణేష్ డల్‌గా ఉండటం చూసి మిగతా కంటెస్టెంట్లు జాలి పడటం.. ఏం జరిగిందో అడగటం... తనీష్ దగ్గరికి వెళ్లి సారీ చెప్పడం ఇలా జరిగిపోయింది. ఈ పెళ్లి టాస్క్ ముగిసిన తరువాత నీవెవరో టీమ్ బిగ్‌బాస్‌లో ఆర్జేలుగా మారి అల్లరి చేశారు. గణేష్-అమిత్-దీప్తిలు చేసిన గుడ్డు టాస్క్, కౌశల్-గీత చేసిన టాస్క్‌లు బాగానే వర్కౌట్ అయ్యాయి. ముఖ్యంగా బిగ్‌బాస్ పాత్రలో కౌశల్, అతని ప్రేయసిగా గీత చేసిన ఫన్ బాగుంది. ఇక్కడ కూడా రోల్ తన ర్యాప్‌ను ప్రదర్శించేశాడు. రోల్ ర్యాప్‌లపై సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రోలింగ్ సంగతి తెలిసిందే. ఇక ఈ సారి కెప్టెన్ టాస్కులో భాగంగా.. కన్ఫెషన్ రూమ్‌లోకి ముందుగా వెళ్లిన ఇద్దరు సభ్యులను అర్హులని బిగ్‌బాస్ ప్రకటించారు. ఎప్పటినుంచో కెప్టెన్సీ పోటీదారుగా పాల్గొని వెనుదిరిగిన దీప్తి ఈ సారి కెప్టెన్ అవ్వాలని పట్టుదలగా ఉంది. దీప్తి మొదట వెళ్లి కూర్చోగా.. కౌశల్, పూజల మధ్య వాగ్వాదం జరిగింది. చివరగా పూజ లేచి వెళ్లిపోగా.. దీప్తి, కౌశల్ కెప్టెన్సీ టాస్క్‌కు అర్హత సాధించారు. తమకు కెప్టెన్సీ టాస్క్‌లో సపోర్ట్ చేయాలని మిగతా హౌస్‌మేట్స్‌ను అడగడం మొదలెట్టారు. ప్రేక్షకులందరికి తెలిసిందే ఎవరు ఎవరికి సపోర్ట్ చేస్తారని.. కౌశల్‌కు అమిత్ తప్ప ఎవరూ సపోర్ట్ చేయలేదు. ఈ టాస్క్‌పై తనీష్ సహాయాన్ని కోరగా.. దీప్తికి తాను మాటిచ్చానని, తనకే సపోర్ట్ చేస్తానని చెప్పాడు. అందరూ తననే సపోర్ట్ చేస్తే ఇక టాస్క్ ఎందుకు ఏకగ్రీవంగా ప్రకటించొచ్చుకదా అని కౌశల్ తనీష్‌తో చెప్పుకొచ్చాడు. తాను ముందు నుంచీ అదే చెబుతున్నానని, హౌస్‌లో అందరితో కలిసి ఉండటం ముఖ్యమని ఎన్నో సార్లు చెప్పానని కౌశల్‌తో తనీష్ అన్నాడు. కౌశల్‌కు బయట సపోర్ట్ ఉంది గానీ, ఇంటి లోపల ఏ ఒక్క కంటెస్టెంట్ కూడా సపోర్ట్ చేయడం లేదు. ఒక రకంగా ఇదే ప్రేక్షకుల్లో కౌశల్‌పై సానుభూతిని కలిగేలా చేసింది. అయినా ఇంటి సభ్యుల మద్దతు లేకుండా ఇంట్లో నెగ్గుకురావడం చాలా కష్టమే. ఇద్దరు కెప్టన్సీదారులకి మద్దతుగా.. హౌస్మేట్స్ తమ వస్తువులు, వాటి బరువుతో కెప్టెన్‌ను కొనుక్కోవాలని బిగ్‌బాస్ తెలిపాడు. కౌశల్‌కు సపోర్ట్‌గా ఎవరూ ఏ వస్తువును వేయలేదు. ఈ విషయంలో కౌశల్‌కు మద్దతుగా అమిత్ ఒంటరిపోరాటం చేశాడు. చివరికి ఈ టాస్క్‌లో దీప్తి గెలిచింది. బిగ్‌బాస్‌లో తన చిరకాల కోరిక నెరవేరినందుకు చాలా సంతోషంగా కనిపించింది. అనూహ్యంగా నూతన్ నాయుడు మళ్లీ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు.. నూతన్ ఎంట్రీతో ముందు సంబరపడినా.. మళ్లీ అతనిపై చర్చ జరిగింది. గత వారం ఎలిమినేషన్లో లేడు, ఈ వారం నామినేషన్లో లేడు అంటూ ఏవెవో లెక్కలు వేసేసి మిగతా వారికి వివరిస్తున్నాడు తనీష్. ఈ వారం కష్టపడిందంతా వృథానేనా అంటూ తనీష్ చెప్పుకొచ్చాడు. ఏదేమైనా ఈవారం షో మాత్రం ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించలేకపోయింది. ఇప్పటి వరకు షో ఎలా జరిగినా.. ఎలిమినేషన్లో మాత్రం ఈ సారి దీప్తి వెళ్లిపోతుందని అనుకున్నా.. కెప్టెన్‌గా మారడంతో ఈ సారి పూజ వెళ్లే అవకాశమే ఎక్కువగా ఉంది. అయినా ఈ సస్పెన్స్ కూడా ఎక్కువసేపు ఉండదు కదా.. ఎందుకంటే శనివారం రాత్రికల్లా ఎవరూ ఎలిమినేట్ కానున్నారో లీకుల ద్వారా బయటకు వస్తుంది. మరి చూద్దాం.. ఎవరు బయటకు వెళ్లనున్నారో.. ఎందుకంటే ఇది బిగ్‌బాస్.. ఏదైనా జరుగొచ్చు!. -
బిగ్‌బాస్ : అసలు మజా ఈ వారమే!
బిగ్‌బాస్ అంటేనే ఏదైనా జరుగొచ్చు. అది హౌజ్‌మేట్స్ పిచ్చితనం వల్ల కావచ్చు. బిగ్‌బాస్ ఇచ్చే టాస్కుల వల్ల కావచ్చు. ఎందుకంటే సోమవారం కార్యక్రమంలో ఏదో అనుకుంటే ఇంకెదో జరిగింది. కెప్టెన్ అయినందుకు తనీష్, కమల్ హాసన్ ఇచ్చిన స్పెషల్ పవర్ దృష్ట్యా అమిత్ ఈసారి కూడా ఎలిమినేషన్ పక్రియలో చోటు లేదు. మిగతా ఇంటి సభ్యులందరిని ఇద్దరి చొప్పున ఓ జట్టు కట్టారు. ‘వారిలోంచి ఒకరు సేవ్ అవుతారు. మరొకరు డేంజర్‌జోన్‌లోకి వెళ్లి ఈ వారం ఎలిమినేషన్‌కు నామినేట్ అవుతారు. అయితే ఇందులో ఎవరి కారణాలు వారు విన్నవించుకోవచ్చు. ఆ కారణాలను పరిగణలోకి తీసుకుని తనీష్, అమిత్‌లు ఎవరిని సేవ్ చేయాలో, ఎవరిని డేంజర్ జోన్లో ఉంచాలో తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఇదీ ఈ వారం నామినేషన్ ప్రక్రియ’ అంటూ బిగ్‌బాస్ తెలిపాడు. అయితే బిగ్‌బాస్ ఇచ్చింది ఒకటి. అక్కడ జరిగిందొకటి. ఎలిమినేషన్‌లోంచి సేవ్ అయి బయటకు వచ్చిన వారు కూడా తనీష్, అమిత్‌లతో పాటుగా నిర్ణయం తీసుకున్నారు. సరే అదంతా వదిలేద్దాం.. వారంతా ఏం చేసినా అంతిమ నిర్ణయం ప్రేక్షకుల చేతుల్లోనే ఉంటుందన్న విషయం తెలిసిందే కదా. సేవ్ అయి బయటకు వచ్చిన వారు, డేంజర్ జోన్లోకి వెళ్లి నామినేట్ అయిన వారి కథ ఓ సారి చూద్దాం. బిగ్‌బాస్ గార్డెన్ ఏరియాలో ఉన్న ఐదు డేంజర్ ప్లేసుల్లో ఐదు జంటలు నిలబడ్డాయి. సామ్రాట్-పూజ, గీతామాధురి-కౌశల్, నూతన్ నాయుడు-దీప్తి, శ్యామల-దీప్తి సునయన, రోల్ రైడా-గణేష్‌లు ఐదు జంటలుగా నిలబడ్డారు. మొదటి బెల్ మోగగానే సామ్రాట్, పూజలు వచ్చి వారు హౌజ్‌లో ఎందుకు ఉండాలనే కారణాలను చెప్పుకొచ్చారు. మొదట్నుంచీ నెగెటివ్‌గా ఉంటూ ఈ మధ్యే కొంచెం మారుతు.. పాజిటివ్ వైపు వస్తున్నానని, నా మీద ఉన్న అభిప్రాయాన్ని మార్చుకోవడానికి ఇంకాస్త సమయం కావాలంటూ.. సామ్రాట్ తన కారణాలను వెల్లడించాడు. నేను వచ్చింది మధ్యలోనే ఇంకాస్త సమయం కావాలి అందరిని అర్థం చేసుకోవడానికి,అందరితో కలిసిపోవడానికి అంటూ పూజ చెప్పుకొచ్చింది. ఇక తనీష్, అమిత్‌లు కలిసి ఓ నిర్ణయానికి వచ్చి.. పడుతూ, లేస్తూ.. ఎత్తు పల్లాలు చూసి .. ఇప్పుడిప్పుడే తనేంటో ప్రూవ్ చేసుకుంటున్నాడని.. సామ్రాట్‌ను సేవ్ చేసి పూజను డేంజర్ జోన్లోకి పంపాడు. ఇక బయటకు వచ్చిన సామ్రాట్ వారిద్దరు కలిసి తీసుకునే నిర్ణయాల్లో తలదూర్చాడు. రెండో జంటగా.. కౌశల్, గీతా మాధురిలు వచ్చారు. తాను హౌజ్‌లో మొదటునుంచీ, ఒంటరి పోరాటం చేస్తున్నానని, బిగ్‌బాస్ ఇచ్చే ఏ టాస్క్లోనైనా.. మానసికంగా, శారీరకంగా తన వంతు కృషి చేస్తున్నాని, ఇంతవరకు తనకు న్యాయం జరగలేదని, ఇప్పుడైనా న్యాయం జరుగుతుందని అనుకుంటున్నానని కౌశల్ తన కారణాలను తెలిపాడు. హౌజ్‌లో తాను ఉండటం వల్ల ఎవరికి ఇబ్బంది కలగదని, ప్రశాంత వాతావరణం ఉంటుందని, అందరితో కలిసి బాగుంటాను కాబట్టి నేను ఇంట్లో ఉండాలనుకుంటున్నాని గీత తన కారణాలను తెలిపింది. తనీష్, సామ్రాట్, అమిత్‌లు చర్చించుకుని.. గత వారం ఎలిమినేషన్ తనను డిస్సాప్పాయింట్ చేసిందని గీత అన్నారని.. హౌజ్‌లో ఇక ముందు టాస్క్‌లు అలానే ఉంటాయని తనీష్ చెప్పి.. కౌశల్‌ను సేవ్ చేశాడు. గతంలో తన కోసం సెల్ఫ్ నామినేషన్ చేసుకున్నాడని.. ఇప్పుడు గణేష్ కోసం రోల్ రైడా తాను సెల్ఫ్ నామినేట్ చేసుకుంటానని చెప్పి గణేష్‌ను సేవ్ చేశాడు. ఇక నూతన్ నాయుడు, దీప్తిలది మరో విచిత్రం. దీప్తి తాను హౌజ్‌లో ఉండడానికి గల కారణాలను తనేదో తన భాషలో చెప్పుకొచ్చింది. ఇక నూతన్ నాయుడు మాత్రం మిత్ర ధర్మం అంటూ ఏదేదో చెప్పుకొచ్చాడు. కానీ, తాను ఉండటానికి గల కారణాలను చెప్పలేకపోయాడు. ఇక అంతిమ నిర్ణయం తీసుకోవడానికి అమిత్, తనీష్, సామ్రాట్ , కౌశల్‌లు చర్చించుకుని.. గత కొన్ని వారాలుగా టాస్కుల్లో బాగా చేస్తుందని, ఎంతో కష్టపడుతోందని దీప్తిని సేవ్ చేశారు. ఇక శ్యామల, దీప్తి సునయనలది మరో గాథ. తాను మొదట్నుంచీ అందరితో బాగున్నాని, మొదటి వారంలో కెప్టెన్ లేకపోయినా అందరి బాగోగులు చూసుకున్నానని, తానుంటే ఎవరికి ఇబ్బంది ఉండదని, అందరిని ఎంటర్టైన్ చేస్తుంటానని శ్యామల తన కారణాలను చెప్పుకొచ్చింది. మొదట్లో గేమ్‌ను సీరియస్‌గా తీసుకోలేదనీ, ఇప్పుడిప్పుడే బాగా ఆడుతున్నానని, హౌజ్‌లో ఉంటే ఇంక ఎంతో నేర్చుకుంటానని తన కారణాలను వివరించింది. అయితే ఈ అంతిమ నిర్ణయంలో.. తనీష్ రాకుండా.. అమిత్, సామ్రాట్, కౌశల్‌ను ముందుకు పంపాడు. తాను కూడా ఉంటే నిర్ణయం వేరే లాగా ఉండొచ్చని అభిప్రాయపడ్డాడు. ఇక్కడే తనెంత బలహీనుడో తెలిసేలా చేశాడు. ఈ నిర్ణయంలో కూడా పాల్గొని ఇద్దరి కారణాలను, వారి ప్రతిభను బేరీజు వేసుకుని నిర్ణయం తీసుకుంటే.. ప్రేక్షకుల దృష్టిలో ఇంకాస్త స్ట్రాంగ్ అయ్యేవాడు. కానీ అవకాశాన్ని మిస్ చేసుకున్నాడు. దీప్తి సునయన హౌజ్‌లో ఉండేందుకు గల కారణాలను చెబుతుండగా.. కౌశల్ మధ్యలో కలగజేసుకుని శ్యామల కంటే స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని అనుకుంటున్నావా? అని అడిగితే.. కాదని ఒప్పుకుంది. అయితే వీరిద్దరిలో ఎవరిని సేవ్ చేయాలని అమిత్, కౌశల్, సామ్రాట్లు చర్చించుకుని.. తనే స్ట్రాంగ్ కంటెస్టెంట్ కాదని ఒప్పుకోవడం వల్ల.. అందరం ఓ ఏకాభిప్రాయానికి వచ్చి.. శ్యామలను సేవ్ చేయాలనుకుంటున్నామని కౌశల్ తెలిపాడు. అయితే ఇలా ఐదు గురు డేంజర్ జోన్లోకి వెళ్లాక.. కెప్టెన్ అయిన కారణంగా స్పెషల్ పవర్‌తో.. ఇప్పటిదాకా సేవ్ అయిన కంటెస్టెంట్లోంచి ఒకరిని నామినేట్ చేయాలని తనీష్‌పై పిడుగును పడేశాడు బిగ్‌బాస్. ఇక్కడైనా తను సరైన నిర్ణయం తీసుకుంటాడని భావిస్తే... సేవ్ అయిన ఐదుగురిలో వీక్ కంటెస్టెంట్ ఎవరా? అని ఆలోచించకుండా.. అరవై మూడు రోజులు మాతో కలిసి ఆ నలుగురు ప్రయాణించారు.. శ్యామల వెళ్లిపోయి మధ్యలో వచ్చింది.. తనను నామినేట్ చేస్తున్నానని బిగ్‌బాస్‌కు తెలిపాడు. గీతా మాధురి, శ్యామల, నూతన్ నాయుడు, రోల్ రైడా, పూజా రామచంద్రన్, దీప్తి సునయనలు ఈ వారం నామినేషన్లో ఉన్నారు. అయితే ఇక్కడే అసలు మజా మొదలైంది. బిగ్‌బాస్‌లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ అయిన గీత ఎలాగూ ఎలిమినేట్ కాదని మెజారిటీ అభిప్రాయం. ఇటీవలె శ్యామల, నూతన్ నాయుడు ఇద్దరు గ్రాండ్‌గా రీఎంట్రీ ఇచ్చారు. కాబట్టి వీరు కూడా వెళ్లే అవకాశం లేదనే చెప్పవచ్చు. పూజ వచ్చికొద్ది రోజులే అయినా... మంచి పేరే తెచ్చుకుంది. తనకు చాలానే ఫాలోయింగ్ ఏర్పడింది. ఇక మిగిలిన వారిలో దీప్తి కంటే రోల్ రైడా కాస్త స్ట్రాంగ్ కంటెస్టెంట్ అయినా.. సోషల్ మీడియాలో దీప్తి సునయన హవానే ఉంటోంది. మరి వీరందరిలోంచి ఎవరు వెళ్తారో చూడాలి. ఆట మొదలైంది ఇప్పుడే కాబట్టి ఏదీ చెప్పలేం... ఈ వారం టాస్క్‌లు ఏముంటాయో.. వాటిని ఎలా నెట్టుకొస్తారో... చూద్దాం.. బిగ్‌బాస్ అంటే.. ఏదైనా జరుగొచ్చుగా! చదవండి... బిగ్‌బాస్: బాబు గోగినేని ఔట్ -
బిగ్‌బాస్ : తారాస్థాయికి చేరిన రచ్చ
ఏదైనా జరగొచ్చు అంటే ఇదేనేమో. చిన్న మాట పెద్ద చర్చకు దారి తీసి రచ్చ రచ్చ అయింది. అసలేం జరిగిందో ఓసారి చూద్దాం. ఈ వారం లగ్జరి బడ్జెట్ టాస్క్‌లో భాగంగా హౌజ్‌మేట్స్‌ను మూడు టీమ్స్‌గా విడిపోయి ఆడాలని బిగ్‌బాస్ ఆదేశించాడు. ఈ టాస్క్‌లో కౌశల్, దీప్తి, నందిని టీమ్ గెలిచారు. అయితే ఈ విజయానికి కానుకగా కొన్ని ఫుడ్ ఐటమ్స్ ఈ సభ్యులకు వచ్చాయి... వీటిని మిగతా ఇంటి సభ్యులకు కూడా ఇవ్వొచ్చా అంటూ బిగ్‌బాస్‌ను అడుగుతుండగా విన్నానని అది తనకు నచ్చలేదని కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్న గీతా మాధురికి తనీష్ చెప్పాడు. ఇదే విషయాన్ని ఇంటి సభ్యులందరిని కూర్చోబెట్టి సభాముఖంగా కౌశల్, దీప్తి, నందినిలను అడిగారు గీతా మాధురి. దీప్తి, నందినిలు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పగా.. కౌశల్ మాత్రం అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పకుండా.. మా టీమ్ గెలిస్తే... ఇంటిలోని ఓ ఇద్దరు సభ్యులు మా టీమ్‌కు కంగ్రాట్స్ చెప్పలేదంటూ వింత సమాధానం చెబుతూ.. ఇంటిలోని అందరు సభ్యులు మంచిగా ఉండాలని అందరం కలిసే లగ్జరి బడ్జెట్ పంచుకుందాం అంటూ చెప్పుకొచ్చాడు. మధ్యలో గీత కలగజేసుకుంటూ ఆ ఇద్దరి సభ్యులెవరో చెప్పండి అనగా .. ఒకరు బాబు గోగినేని అని కౌశల్ చెప్పగా.. రెండో వ్యక్తి నేనేనంటూ తనీష్ చెప్పాడు. ఈ తతంగం అంతా జరుగుతుంటే ... బాబు గోగినేని స్టాప్ దిస్ నాన్సెన్స్ అంటూ.. నేను కంగ్రాట్స్ చెప్పలేదు కాబట్టి.. నాకు లగ్జరీ బడ్జెట్ వచ్చిన ఐటమ్స్ వద్దు అని చెబుతుండగా.. నాకు కూడా వద్దంటూ తనీష్, సామ్రాట్లు తెలిపారు. బాబు గోగినేని నాన్ సెన్స్ పదం వాడటంతో గీత హర్ట్ అయ్యారు. కెప్టెన్ పదవిపై గౌరవం ఉంటే.. కెప్టెన్ మాట్లాడుతుంటే మధ్యలో ఎవరూ మాట్లాడకూడదంటూ ఇంటి సభ్యులందరికి గీత సూచించారు. ఇక్కడ మాట్లాడేది నాన్ సెన్స్ కాదంటూ.. ఏదో ఎమోషనల్‌గా ఇష్టమొచ్చినట్లు ఒక మాట అనేసి జరిగే చర్చను పాడు చేయొద్దంటూ బాబు గోగినేనిని గీత కోరారు. తనకు నాన్సెన్స్ అనిపిస్తే మాట్లాడుతానని, తన పేరు వచ్చిన తరువాతే తాను మాట్లాడనంటూ బాబు ఫైర్ అయ్యారు. తనకు కంగ్రాట్స్ చేయలేదంటూ కౌశల్ అనడంతో మొదలైంది ఈ గొడవ. అయితే తన ఉద్దేశ్యం మాత్రం అందరూ కలిసి ఉండాలని, ఒకరు గెలిచినప్పుడు అందరూ వచ్చి కంగ్రాట్స్ చెబితే బాగుంటుందని ఇంటి సభ్యులతో చెప్పుకొచ్చాడు. కంగ్రాట్స్ చెప్పలేదు.. కాబట్టి వారికివ్వను.. అని అన్నట్లు ఉందంటూ... ఏదో గీతా మాధురి బలవంతంగా ఒప్పించినట్లు ఉందని అందుకే తనకు లగ్జరి బడ్జెట్‌ను తీసుకోవాలని లేదంటూ.. తనీష్ ఇంటి సభ్యులతో చెప్పుకొచ్చాడు. టాస్క్ గెలిచిన తరువాత తన వద్దకు వచ్చి నేషనల్ స్విమ్మర్ కదా అంటూ ఎగతాళిగా మాట్లాడాడని అందుకు తనకు కూడా లగ్జరి బడ్జెట్ వద్దని సామ్రాట్ తెలిపాడు. ఈ విషయంపై క్లారిటీ ఇస్తూ.. నేను క్యాజువల్‌గానే అన్నానని తప్పుంటే క్షమించమని కౌశల్ కోరాడు. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ.. అందరూ నెగిటివ్‌గా ఆలోచించడం వల్లే అలా అనిపిస్తోందని, పాజిటివ్‌గా ఆలోచిస్తే అంతా మంచి గానే కనిపిస్తుందని, అందరూ అలా ఆలోచించాలని సూచించగా.. బాబు గోగినేని, తనీష్ ఫైర్ అయ్యారు. మాటా మాటా పెరిగి మంచిగా మాట్లాడలంటూ కౌశల్ కూడా ఫైర్ అవుతుండగా... బెదిరిస్తున్నావా అంటూ బాబు కూడా రివర్స్ అటాక్ చేశాడు. ఇలా గొడవంతా తారాస్థాయికి చేరుతుండగా.. కెప్టెన్‌గా గీతా మాధురి అందరిని కంట్రోల్ చేసి గొడవను సద్దుమణిగేలా చేశారు. తనే చేజేతులా చేసుకుంటున్నాడని, అడిగి మరి కంగ్రాట్స్ చెప్పించుకోవడం బాలేదని దీప్తి, గీతా మాధురి మాట్లాడుకున్నారు. ఇక కౌశల్ మాత్రం ఈ విషయంపై క్లారిటీ ఇవ్వడానికి గీతా మాధురి, దీప్తి, రోల్ రైడా, నందిని, పూజలతో మాట్లాడారు. ఇదిలా వుండగా.. ఈ వారం నామినేషన్లో ఉన్న బాబు గోగినేనిపై సోషల్ మీడియాలో నెగెటివ్ కామెంట్స్ వస్తున్నాయి. కౌశల్, గీతా మాధురిలను ఎలాగైనా బయటకు పంపించడమే తన ధ్యేయమంటూ ఇంటి సభ్యులతో అంటున్నాడు. ఈ వారం నేను వెళతానేమో.. వెళ్లాక చేసే మొదటి పని కౌశల్‌ను బయటకు పంపడమే, ఆ తరువాత గీతా మాధురిని అంటూ చెప్పుకొచ్చాడు. గత ఎపిసోడ్స్‌లో తనతో పెట్టుకుంటే హౌజ్‌లోంచి బయటకు వెళతారని కౌశల్ అన్నాడని.. అది నిజం కాదంటూ దాన్ని బ్రేక్ చేయడానికి కౌశల్‌తో పెట్టుకుంటానని చెప్పిన విషయం తెలిసిందే. -
బిగ్‌బాస్: నెక్ట్స్ బాబేనా!
సాక్షి, హైదరాబాద్ : బిగ్‌బాస్ సీజన్-2 ఏదైనా జరగొచ్చు.. అన్నట్లే ప్రేక్షకులకు కావాల్సిన అసలు సిసలు మజా లభిస్తోంది. తొలుత కొంత డల్‌గా సాగిన ఈ రియాల్టీ షో సోషల్ మీడియా ట్రోల్స్‌తో వేడెక్కింది. ప్రేక్షకులు కంటెస్టెంట్స్ అభిమానులుగా విడిపోవడంతో నెట్టింట్లో ఈ రియాల్టీ షో గురించి తీవ్ర చర్చ నడుస్తోంది. దీంతో హౌస్‌లో ఏం జరుగుతుందా అని ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు ప్రేక్షకులు. ఇక రసవత్తరంగా సాగిన గురువారం ఎపిసోడ్ ఆకట్టుకుంది. చివర్లో గీతా మాధురి Vs బాబు గోగినేని మధ్య సాగిన చర్చ హైలైట్‌గా నిలిచింది. కుటుంబ సభ్యులతో మాట్లాడే అవకాశం కోల్పోయిన గణేశ్, నందిని, దీప్తి సునయనలకు బిగ్‌బాస్ మరో అవకాశమిచ్చాడు. కానీ దానికి ఓ మెలిక పెట్టడంతో వారు ఒప్పుకోలేదు. అనంతరం ఈ వారం కెప్టెన్సీ కోసం బిగ్‌బాస్ టాస్క్ నిర్వహించాడు. ఓ పాన్ షాప్ సెట్‌ను వేసి దానికి యజమానిగా ఇటీవల హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన పూర్ణా రామంచంద్రన్‌ను నియమించాడు. హౌస్ మేట్స్ తమ ఆటపాటలతో ఆమెను మెప్పించి కిల్లీలు తీసుకోవాలని సూచించాడు. ఈ టాస్క్‌లో అపరిచితుడు రాము వేశంలో అమిత్ ఆకట్టుకున్నాడు. ఇక పూజా.. అమిత్, సామ్రాట్, గీతా మాధురి, దీప్తిలు తనను ఆకట్టుకున్నారని బిగ్‌బాస్‌కు సూచించింది. ఈ నలుగురు తదుపరి కెప్టెన్ పోటీదారులుగా ప్రకటిస్తూ.. పెయింట్ వేసుకోని పెడెస్టెల్స్ మీద విగ్రహంలా నిలబడాలని బిగ్‌బాస్ ఆదేశించాడు. అంతేకాకుండా నచ్చని పోటీదారున్ని కిందికి దిగేలా ఏమైనా చేయవచ్చని మిగతా సభ్యులుకు సూచించాడు. కౌశల్ Vs తనీష్.. కెప్టెన్ పోటీదారులను ఇతర సభ్యులు తమ తోచిని రీతిలో ఇబ్బంది పెట్టసాగారు. ఈ సందర్భంగా కౌశల్, తనీష్ మధ్య తీవ్ర చర్చ జరిగింది. కౌశల్ కొబ్బరి నూనేను వారిపై పోస్తుండగా నందిని రాయ్, తనీష్‌లు అభ్యంతరం వ్యక్తం చేశారు. గతంలో తన ఒక్కడిపైనే పసుపు కొట్టారని, తాను కేవలం కొబ్బరి నూనెను ఎవరికి మద్దతివ్వకుండా అందరిపై పోస్తున్నానని, కౌశల్ పేర్కొన్నాడు. దీంతో తనీష్ అసహనం వ్యక్తం చేశాడు. ఇక అనంతరం అమిత్, సామ్రాట్‌లను నెట్టేద్దామని పూజా, కౌశల్ చర్చించుకున్నారు. కానీ అప్పటికే బాబుగోగినేని బకెట్‌తో దీప్తిని దించేశాడు. ఆ వెంటనే కౌశల్ స్టిక్‌తో అమిత్, సామ్రాట్‌లను నెట్టేయడంతో గీతా మాధురి ఒక్కరు మిగిలిపోయారు. దీంతో గీతా మాధురినే తదుపరి కెప్టెన్‌గా బిగ్‌బాస్ ప్రకటించాడు. గేమ్ ఆడిన కౌశల్.. తన సహజ శైలితో హౌస్‌లో ఒంటరి వాడైన కౌశల్ అసలు సిసలు గేమ్ ఆడాడు. ముఖ్యంగా పీకలదాక తన మీద కోపం పెంచుకున్న బాబుగోగినేని వ్యూహంపై దెబ్బకొట్టాడు. అంతో ఇంతో హౌజ్‌లో చనువుగా ఉండే గీతా మాధురి, దీప్తిలను కెప్టెన్ కాకుండా అడ్డుకోవాలనే బాబు, తనీష్, సామ్రాట్ల ప్లాన్‌ను విజయవంతంగా అడ్డుకున్నాడు. అప్పటి వరకు సైలెంట్‌గా ఉన్న బాబు దీప్తిని కిందపడేసి.. అనంతరం గీతా మాధురిని తోసేయాలనుకున్నాడు. దీంతో అమిత్, సామ్రాట్‌లో ఎవరు కెప్టెన్ అయినా తన మాట చెల్లుతుందని భావించాడు. కానీ కౌశల్ ఈ వ్యూహాన్ని అడ్డుకున్నాడు. బాబు VS గీతా మాధురి.. తన ప్లాన్ విఫలమవడంతో బాబు గోగినేని ఒకింత అసహనానికి గురయ్యాడు. దీంతో కొత్త కెప్టెన్ గీతా మాధురితో తగువు పెట్టుకున్నాడు. దీప్తి, సామ్రాట్‌లలో ఒకరిని కెప్టెన్ చేద్దామనుకున్నాం.. అంత గొడవ జరుగుతున్నా మీరెందుకు సైలెంట్‌గా ఉన్నారని గీతాను ప్రశ్నించాడు. దీప్తిని కెప్టెన్ చేయాలనుకున్నప్పుడు ఎందుకు కిందపడేశారని ఆమె ప్రశ్నించడంతో ఆయనకు ఎక్కడ లేని కోపం వచ్చింది. ‘మీరు కెప్టెన్‌గా హౌస్‌కు నాయకత్వం వహించాలి. కూర్చొని గ్రూప్‌లు చేయకండి’ అంటూ ఫైర్ అయ్యాడు. ‘డిస్కషన్లో నిజాయితీ లేని మీతో నేను చర్చ జరపను. ఆకతాయి మాటలతో ఎదుటి వారి ఉద్దేశాలు మాట్లాడటానికి వీల్లేదు’ అని మండిపడ్డాడు. ‘నాకు మాట్లాడాలని లేకపోయిన మీ వయస్సుకు విలువ ఇచ్చి మాట్లాడుతున్నానంటూ’ గీతా కౌంటర్ ఇచ్చింది. కెప్టెన్సీ మొదట్లోనే గ్రూప్‌తో మొదలు పెట్టారని.. ఎలా కొనసాగిస్తారో చూస్తానని, మీ ఉద్యోగం మీరు చేసుకుంటే మంచిదని సూచించాడు. దీనికి గీతా సైతం తన బాధ్యతను పర్ఫెక్ట్గా నిర్వహిస్తున్నాని, మీకు నచ్చకపోతే నామినేట్ చేయండి అంటూ బదులిచ్చింది. వీరి సంభాషణలో కౌశల్ తల దూర్చగా.. సామ్రాట్, తనీష్‌లు వాళ్లిద్దరిని మాట్లాడుకోనివ్వండి అంటూ సూచనలిచ్చారు. బాబుపై నెటిజన్ల ఫైర్.. ఎలిమినేషన్లో నామినేట్ అయినప్పటి నుంచి.. ముఖ్యంగా కౌశల్ రాజమౌళి విషయం ప్రస్తావించడంతో బాబు గోగినేని తీవ్ర ఒత్తిడికి లోనైనట్లు కనపడుతోంది. తనే బిగ్గర్ బాస్‌నని చెప్పుకునే బాబు.. హుందాగా వ్యవహరించడం లేదని, ఇగోయిస్ట్‌గా ప్రవర్తిస్తున్నాడని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఈ వారం ఎలిమినేషన్ తప్పించుకున్నా.. వచ్చే వారం బాబు హౌస్ వీడక తప్పదని అభిప్రాయపడుతున్నారు. ‘ఇన్ని రోజులు బాబుపై ఎంతో గౌరవం ఉండేది.. కానీ ఈ చర్యతో అది పోయింది’ అని ఓ నెటిజన్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఇక నేటి ఎపిసోడ్ ప్రోమోలో గీతా మాధురి కన్నీటి పర్యంతమైంది. ఆమెను తనీష్ ఓదార్చాడు.. మరో వైపు బాబు గోగినేని మాత్రం ఈ వారం తాను ఎలిమినేట్ అయితే.. కౌశల్, గీతా మాధురిలను బయటకు వచ్చేలా చేయడం తన పనిగా పెట్టుకుంటానని తెలిపాడు. దీంతో నేటి ఎపిసోడ్లో ఎం జరుగుతుందో అని ఉత్కంఠ నెలకొంది. చదవండి: బాబు గోగినేనిపై చర్యలకు రంగం సిద్ధం -
సెంటిమెంట్ స్వామి
సాక్షి, ద్వారకాతిరుమల: కలియుగ ప్రత్యక్ష దైవం.. కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారం.. ద్వారకాతిరుమల చినవెంకన్నను దర్శించడం భక్తులకు సెంటిమెంట్‌గా మారింది. చిన్నతిరుపతిగా పేరొంది, పురాణ ప్రాశస్త్యం గల ఈ మహిమాన్విత క్షేత్రం రాష్ట్రంలోని అన్ని ప్రముఖ ఆలయాలకంటే శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. నిత్యం వేలాది మంది భక్తులతోపాటు, ప్రముఖులు క్షేత్రాన్ని సందర్శిస్తున్నారు. చినవెంకన్నను ఏదైనా కోరుకుంటే అది వెంటనే నెరవేరుతుందన్నది భక్తుల నమ్మకం. స్వామికి ప్రీతికరమైన శనివారం రోజు దాదాపు 25 వేల నుంచి 40 వేల మంది వరకు భక్తులు ఆలయాన్ని సందర్శిస్తున్నారు. ఆదివారం, ఇతర పర్వదినాల్లో సైతం భక్తుల రాక ఇదే విధంగా ఉంటోంది. క్షేత్ర పరిసరాలు ఆహ్లాదభరిత వాతావరణాన్ని కలిగి ఉండటంతో భక్తులు అధిక సమయం ఇక్కడే గడుపుతున్నారు. ఆలయ అభివృద్ధి ఏవిధంగా పరవళ్లు తొక్కుతుందో.. అదే విధంగా ఆదాయం కూడా పెరుగుతోంది. ప్రస్తుతం శ్రీవారి వార్షిక ఆదాయం రూ.100 కోట్లకు చేరింది. పలువురు దాతలు ఆలయ అభివృద్ధికి విరివిగా విరాళాలు అందిస్తున్నారు. ఎంతటి వారైనా.. చెంతకు రావాల్సిందే తరచూ క్షేత్రాన్ని సినీ, రాజకీయ ప్రముఖులు, న్యా యమూర్తులు, రాష్ట్ర, జిల్లాస్థాయి అధికారులు, అలాగే విదేశీయులు, సినీ గాయకులు, పీఠాధిపతులు, స్వామీజీలు సందర్శిస్తున్నారు. కొత్తగా ఉద్యోగ బాధ్యతలు చేపట్టే అధికారులు ముందుగా శ్రీవారిని దర్శించడం పరిపాటిగా మారింది. విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమాలు ఘన విజయం సాధించాలని దర్శక, నిర్మాతలు, హీరో, హీరోయిన్లు, ఇతర నటులు ఇక్కడికి వచ్చి ప్రత్యేక పూజలు జరిపిస్తున్నారు. ఇది వారికి ఒక సెంటిమెంట్‌గా మారింది. ఆ వెంకన్న దయవల్లే తన సినిమాలు వరుస విజయాలు సాధిస్తున్నాయని ఇక్కడకు వచ్చిన ప్రముఖ నిర్మాత దిల్ రాజు చెప్పారు. సంప్రదాయం ఏదైనా.. వేలాది మంది భక్తులు వారివారి సంప్రదాయాలకు అనుగుణంగా క్షేత్ర పరిసరాల్లో వివాహాలు జరుపుకుంటున్నారు. అలాగే వివిధ ప్రాంతాల్లో పెళ్లిళ్లు చేసుకున్న వారు సైతం ముందుగా ఆ చినవెంకన్న దర్శనానికి వచ్చి మొక్కుబడులను చెల్లిం చుకుంటున్నారు. సంప్రదాయం మాటెలా ఉన్నా తమ ఇష్టదైవం చినవెంకన్నను దర్శించడమే ముఖ్యమంటున్నారు భక్తులు. ఆలయంలో పూజలు చేస్తున్న హీరో వరుణ్‌తేజ్, నిర్మాత దిల్ రాజు, దర్శకుడు శేఖర్ కమ్ముల -
బిగ్‌బాస్-2 ఫైనల్ లిస్ట్!
మొదటి సీజన్ బంపర్ హిట్ కావటంతో బిగ్ బాస్ రియాల్టీ షో రెండో సీజన్‌పై తెలుగు ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. నేచురల్ స్టార్ నాని వ్యాఖ్యాతగా నేటి సాయంత్రం(ఆదివారం) రెండో సీజన్ ప్రారంభం కానుంది. అయితే గత కొంత కాలంగా ఇదే జాబితా అంటూ కొందరి పేర్లు వార్తల్లో ప్రముఖంగా వినిపించాయి. అయితే అవేం నిజం కాదని మొన్నామధ్య నిర్వహించిన ప్రెస్ మీట్లో నిర్వాహకులు, హోస్ట్ నాని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో షో ప్రారంభానికి కొద్ది గంటల ముందు కొందరి పేర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. వాటిని పరిశీలిస్తే... 1. సింగర్ గీతా మాధురి.. టాలీవుడ్ పాపులర్ సింగర్ 2. తేజస్వి మదివాడ... టాలీవుడ్లో చాలా చిత్రాల్లో నటించిన నటి. 3. నటుడు అమిత్ తివారీ.. విక్రమార్కుడు, ఖలేజా, అత్తారింటికి దారేది, టెంపర్ , సన్నాఫ్ సత్యమూర్తి, తదితర చిత్రాల్లో నటించాడు. 4. నటుడు తనీష్.. బాల నటుడిగా కెరీర్‌ను ప్రారంభించి, తర్వాత టాలీవుడ్లో పలు చిత్రాల్లో హీరోగా కనిపించిన యువనటుడు. 5. నటుడు సామ్రాట్... అహనా పెళ్లంట, పంచాక్షరి లాంటి చిత్రాల్లో కనిపించారు. కొన్నాళ్ల క్రితం భార్యతో విబేధాల కారణంగా వార్తల్లో నిలిచారు. 6. యాంకర్ దీప్తి... ఓ ప్రముఖ ఛానెల్లో యాంకర్‌గా పని చేస్తున్న దీప్తి నల్లమోతు. భద్ర, శంకర్‌దాదా ఎంబీబీఎస్ లాంటి పలు చిత్రాల్లో కూడా ఆమె నటించారు. 7. బాబు గోగినేని... హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్. 8. రోల్ రిడా... రాహుల్ కుమార్ అలియాస్ రోల్ రిడా. రాప్ సింగర్. 9. శ్యామల... యాంకర్ శ్యామల. పలు చిత్రాల్లో కూడా నటించారు. 10. కిరీటి ధర్మరాజు... పలు షార్ట్ ఫిలింస్. టాలీవుడ్ చిత్రాల్లో నటించిన క్యారెక్టర్ ఆర్టిస్ట్. 11. దీప్తీ సునయన... సోషల్ మీడియా సెన్సేషన్. డబ్ స్మాష్ వీడియోలతో బాగా పాపులర్. ఆ మధ్య నిఖిల్ కిర్రాక్ పార్టీలో కూడా ఓ పాత్రలో కనిపించారు. 12. సీరియల్ నటుడు కౌశల్ 13. భాను... ???. ఈ 13 మంది సెలబ్రిటీలు కాకుండా గణేశ్, సంజన, నూతన్ నాయుడు అనే ముగ్గురు కూడా హౌజ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారనే సమాచారం. ఏది ఏమైనా మరికొద్ది గంటల్లో ఆ సస్పెన్స్‌కు తెర దించుతూ షో ప్రారంభం కాబోతోంది. సెకండ్ సీజన్ వంద రోజులపాటు సాగనుంది. ‘ఏదైనా జరగొచ్చు’ అంటూ ఈ సీజన్ ఎలాంటి ఎంటర్టైన్మెంట్ను అందించబోతుందో చూడాలి. -
100 పర్సంట్ లవ్లా...
‘‘నిశ్చితార్థం నుంచి పెళ్లి లోపు జరిగే సంఘటనలతో తెరకెక్కిన చిత్రం ‘ఇంతలో ఎన్నెన్ని వింతలో’. ‘100 పర్సంట్ లవ్’ సినిమాలా ఎంటర్టైన్మెంట్ ఎక్కువగా ఉంటుంది. ఈ సినిమా చూశాక నందూతో కమర్షియల్ సినిమాలు చేయొచ్చని చాలామందికి నమ్మకం కలుగుతుంది’’ అని నందు అన్నారు. నందు హీరోగా, సౌమ్య వేణుగోపాల్, పూజ రామచంద్రన్ హీరోయిన్లుగా వరప్రసాద్ వరికూటి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఇంతలో ఎన్నెన్ని వింతలో’. హరహర చలన చిత్ర సమర్పణలో ఎస్. శ్రీకాంత్ రెడ్డి, రామమోహనరావు ఇప్పిలి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 6న విడుదలవుతోంది. ఈ సందర్భంగా నందు మాట్లాడుతూ– ‘‘అదుర్స్, కృష్ణ, వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ చిత్రాలకు వరప్రసాద్ పని చేశారు. ఆ పంథా కథల్లా ఉండే పక్కా కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న సినిమా ఇది. ఆయనతో సినిమా చేస్తే ఒక లైఫ్ ఇస్తాడనే నమ్మకం కలిగింది. స్నేహితులు, బంధువులు సినిమా బాగుందనడంతో మంచి సినిమా అనే నమ్మకం బలంగా ఉంది. నా భార్య గీతామాధురి (సింగర్) సినిమా చూసి, ‘మంచి సినిమా చేసావ్. ఇలాంటి కథలే చేయండి’ అంటూ సలహా ఇచ్చింది. మా చిత్రం చూసిన ప్రేక్షకులు ఎక్కడా నిరాశ పడరు. యాజమాన్య మంచి సంగీతం ఇచ్చారు’’ అన్నారు. -
గంగరాజు పాలకోవా ఇష్టం: గీతామాధురి
రాజమహేంద్రవరం సిటీ: సినీ నేపథ్య గాయకులు గీతామాధురి, అనుదీప్‌దేవ్ శనివారం రాత్రి రాజమహేంద్రవరం నగర ప్రజలను ఉర్రూతలూగించారు. ఆఫీసర్స్ ఛాయిస్ టైటిల్ స్పాన్సర్‌గా వ్యవహరిస్తూ రేడియోమిర్చి 98.3 ఆధ్వర్యంలో నిర్వహించిన ‘‘లైవ్ ఇన్ కన్సర్ట్ ’’ కార్యక్రమంలో పాల్గొన్నారు. హుషారైన సినిమా పాటలతో ఆలరించారు. కార్యక్రమానికి అసోసియేట్ స్పాన్సర్‌గా కరూర్ వైశ్యాబ్యాంక్ వ్యవహరించగా మీడియా పార్టనర్‌గా ‘సాక్షి మీడియా’ వ్యవహరించింది. రోజ్మిల్క్, గంగరాజు పాలకోవా ఇష్టం : గీతామాధురి రాజమహేంద్రవరం తనకు ఇష్టమైన ఊరు. ఇక్కడ రోజ్మిల్క్, గంగరాజు పాలకోవాలంటే చాలా ఇష్టం. మాది పశ్చిమగోదావరి జిల్లా కావడంతో పక్కనే ఉన్న రాజమహేంద్రవరంతో ప్రత్యేక అనుబంధం ఉంది. అందరు సంగీత దర్శకుల వద్ద పనిచేసి గాయనిగా మరింత పేరు తెచ్చుకోవాలని ఉంది. 70 పాటలు పాడా : అనుదీప్ దేవ్ ఉయ్యాలజంపాల, సినిమా చూపిస్తా మావా, పిల్లా నువ్వులేని జీవితం, ఇటీవల విడుదలైన ఖాకీ చిత్రాల్లో నేను పాడిన పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. 2013లో గాయకుడిగా అవతారమెత్తి ఇప్పటివరకూ 70 చిత్రాల్లో 70 పాటలు పాడాను. రాజమహేంద్రవరం ఇప్పటికి చాలాసార్లు వచ్చాను. హైదరాబాద్ నా సొంతూరు. ఏవిధమైన సంగీత వాయిద్య పరికరాలు వినియోగించకుండా గొంతుతో ‘‘ఆకపెల్లా’’ పక్రియలో ఇప్పటి వరకూ అనేక పాటలు పాడాను. -
చిరంజీవి అందరికీ ఆదర్శం: గీతామాధురి
నగరంపాలెం(గుంటూరు) : డాక్టరు చిరంజీవి జీవిత ప్రస్థానాన్ని ఆదర్శంగా తీసుకొని సినీ పరిశ్రమలో ఎంతో మంది వర్థమాన నటులు రాణిస్తున్నారని ప్రముఖ గాయని గీతమాధురి అన్నారు. జిల్లా చిరంజీవి యువత ఆధ్యక్షుడు ఆళ్ల హరి ఆధ్వర్యంలో మంగళవారం ఓ ప్రైవేటు కార్యక్రమానికి హాజరైన ఆమెను నగరంలోని శ్రీనివాసరావుతోట కల్యాణ మండపంలో సన్మానించారు. చిరంజీవి అభిమానులు ప్రజలకు సేవలందించడంలో ఎప్పుడూ ముందుటారన్నారు. రక్తదానం వంటి మహోన్నతమైన సేవలో ఎంతో మంది ప్రాణాలు కాపాడిన ఘనత చిరంజీవి అభిమానులదే అన్నారు. అనంతరం ఆమెను శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో చందు, షంషేర్, కామేష్, సాయి, లోకేష్, ఉదయ్, పసుపులేటి నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. -
మెట్రోలో గీత మెలోడీ!
‘నిన్నే నిన్నే కోరా...’ (‘నచ్చావులే’ చిత్రం) అంటూ మెలోడీ సాంగ్ మాత్రమే కాదు.. ‘డార్లింగే ఓసి నా డార్లింగే...’ (ప్రభాస్ ‘మిర్చి’) అంటూ మాస్ సాంగ్‌ని కూడా అద్భుతంగా పాడగల నైపుణ్యం గాయని గీతామాధురిది. తెలుగులో దూసుకెళుతున్న టాప్ సింగ ర్స్‌లో ఒకరిగా పేరు తెచ్చుకున్న గీత గతంలో వెంకటేశ్ ‘షాడో’ చిత్రంలో ‘ఐయామ్ నాటీ నాటీ గర్ల్ గర్ల్ గర్ల్’ సాంగ్ మేకింగ్ వీడియోలో కనిపించారు. ఈ క్రేజీ సింగర్ తాజాగా ‘మెట్రో’ చిత్రంలో ఓ మెలోడి సాంగ్ పాడటంతో పాటు ఆ పాటలో నటిం చారు. ఆనంద కృష్ణన్ దర్శకత్వంలో తమిళంలో తెరకెక్కిన ‘మెట్రో’ మూవీని సురేశ్ కొండేటి సమర్పణలో రజని తాళ్లూరి అదే పేరుతో తెలుగులో విడుదల చేస్తున్నారు. ‘‘గీతా మాధురి పాడిన పాట హైలైట్. డబ్బింగ్ పనులు పూర్తయ్యాయి. త్వరలో సినిమాను రిలీజ్ చేయాలనుకుంటున్నాం’’ అని సురేశ్ కొండేటి చెప్పారు. -
‘గీతా’ మాధుర్యం
బాచుపల్లిలోని వీఎన్ఆర్ మేనేజ్మెంట్ కళాశాలలో శనివారం నిర్వహించిన కల్చరల్ ఫెస్ట్ సందడిగా సాగింది. గాయని గీతామాధురి పాటకు విద్యార్థుల ఆట తోడై ప్రాంగణం మార్మోగింది. ‘పెళ్లిచూపులు’ ఫేం విజయ్ దేవరకొండ పాల్గొన్నారు. – జగద్గిరిగుట్ట -
వెండితెరపై గీతామాధురి..
వియ్ లవ్ బ్యాడ్ బోయ్స్.. మగాళ్లు వట్టి మాయగాళ్లు..! అంటూ తన గాత్రం ఆకట్టుకున్న నవతరం గాయని గీతామాధురి. ట్రెడిషనల్ సాంగ్స్, మెలోడీస్, ఫాస్ట్ బీట్ వెస్ట్రన్ సాంగ్స్, హస్కీ ఐటెమ్ నంబర్లతో తనదైన స్పీడ్ చూపించిన ఈ యువ గాయని లుక్స్ స్టైల్స్ తోను మెప్పిస్తోంది. ఇటీవలే `అతిథి` అనే షార్ట్ ఫిలింలో లీడ్ రోల్ పోషించిన గీతామాధురి త్వరలోనే వెండితెర మీద కూడా సందడి చేయనుందట. అయితే త్వరలో రిలీజ్ కు రెడీ అవుతున్న ఈ సినిమాలో గీతామాధురి హీరోయిన్ గా నటిస్తుందా..? లేక అతిథి పాత్రలోనే కనిపించనుందా అన్న విషయం తెలియాల్సి ఉంది. ఇప్పటికే సింగర్ మంచి క్రేజ్ సొంతం చేసుకున్న గీతా, ఈసినిమా రిలీజ్ అయిన తరువాత నటిగానూ బిజీ అవుతుందన్న టాక్ వినిపిస్తోంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి అఫీషియల్ ఎనౌన్స్మెంట్ రానుంది. -
రాశీ అందం.. గీతా గీతం
సినీనటి రాశీఖన్నా అందాల మెరుపులు.. సింగర్ గీతామాధురి మధురమైన గీతాలతో కండ్లకోయలోని సీఎంఆర్ ఇంజినీరింగ్ కళాశాల ప్రాంగణం మారుమోగింది. కళాశాల వార్షికోత్సవం మంగళవారం ఘనంగా జరిగింది. కార్యక్రమంలో కళాశాల చైర్మన్ నర్సింహారెడ్డి, వైస్ చైర్మన్ భూపాల్‌రెడ్డి, సెక్రటరీ, కరస్పాండెంట్ శ్రీశైలంరెడ్డి, సీఎంఆర్ టెక్నికల్ క్యాంపస్ చైర్మన్ సీహెచ్ గోపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. - సాక్షి, హైదరాబాద్ -
సంగీతమంటే ప్రాణం
♦ సరదాగా మా ఆయనతో షార్ట్ ఫిలింలో నటించా.. ♦ వరంగల్‌కు రావడమంటే ఇష్టం ♦ సినీ నేపథ్య గాయని గీతామాధురి ‘ఒకప్పుడు అందరు పాటలు పాడుతుంటే వినేదాన్ని.. ఇప్పుడు స్వయంగా సినిమాల్లో పాటలు పాడడం కొత్త అనుభూతిని ఇస్తోంది. చిన్నప్పటి నుంచి సంగీతంపై ఉన్న ఇష్టంతోనే ఈ రంగంలోకి వచ్చాను. ఇక వరంగల్ అంటే నాకు చాలా ఇష్టం. ఇక్కడకు వచ్చినప్పుడల్లా వేయిస్తంభాల దేవాలయాన్ని తప్పక దర్శిస్తాను..’ అంటూ చెప్పుకొచ్చారు సినీ నేపథ్య గాయని గీతామాధురి. వరంగల్ నిట్‌లో జరుగుతున్న స్ప్రింగ్ స్ప్రీకి శనివారం వచ్చిన ఆమె మధ్యాహ్నం విరామ సమయంలో ‘సాక్షి’తో మాట్లాడారు. ఈ సందర్భంగా గీతామాధురి చెప్పిన విశేషాలు ఆమె మాటల్లోనే... - పోచమ్మమైదాన్ వరంగల్‌కు చాలా కార్యక్రమాలకు హాజరయ్యాను. వరంగల్‌లోని ప్రజలు నా పాటలు వినేందుకు ఎంతగానో ఇష్టపడుతారు. వరంగల్ అంటే నాకు చాలా ఇష్టం. వరంగల్‌లో ఏదైన కార్యక్రమానికి ఆహ్వానిస్తే తప్పక వస్తున్నా. ఇక్కడి అభిమానులు నేను సినిమాలలో పాడిన పాటలను మళ్లీమళ్లీ పాడాలని కోరుతుంటారు. వరంగల్‌కు వస్తే హన్మకొండలోని వేయిస్తంభాల గుడిని తప్పక ద ర్శిస్తారు. అలాగే, భద్రకాళి అమ్మ వారిని దర్శించుకుంటే చాలు ఒత్తిళ్లు అన్నీ తీసేసినట్లవుతుంది. ఇంకా ఖిలా వరంగల్, రామప్ప, లక్నవరం వంటి ఎన్నో అందమైన ప్రదేశాలు ఇక్కడ ఉన్నాయి. చిన్నవయస్సులోనే హైదరాబాద్‌కు.. చిన్నప్పటి నుంచి సంగీతం అంటే నాకు చాలా ఇష్టం. ఆ ఇష్టంతోనే లిటిల్ మ్యుజీషియన్స్ కచ్చర్తకోట పద్మావతి, రామాచారి వద్ద శాస్త్రీయ, సినీ, లలిత సంగీతాలలో శిక్షణ పొందాను. ఆ తర్వాత టీవీ చానల్లో ప్రసారమైన పోటీల్లో ఫైనలిస్ట్‌గా నిలవడం.. ఆ తర్వాత నా ప్రతిభ అవకాశాలు వస్తుండడంతో ఈ రంగంలోనే స్థిరపడిపోయా. మా నాన్న ఎస్బీహెచ్లో పని చేయడం వలన చాలా చిన్న వయస్సులోనే హైదరాబాద్‌కు మారిపోయాము. నేను వనస్థలిపురంలోని లయోలా పాఠశాలలో చదివాను. ‘ప్రేమలేఖ రాశా’తో.. ఇప్పటి వరకు 350 పాటలకు పైగా పాడాను. కులశేఖర్ దర్శకత్వం వహించిన ప్రేమలేఖ రాశా సినిమాలో పాటతో సినీ రంగ ప్రవేశం చేశాను. అయితే, మా ఆయన నందు, నేను సరదాగా ‘అదితి’ షార్ట్ ఫిలింలో నటించాను. భవిష్యత్‌లో గాయకురాలిగా స్థిరపడతానే తప్ప నటనపై ఆసక్తి లేదు. నాకు ఇళయరాజా, కిర వాణి, ఏఆర్.రహమాన్ సంగీతం ఇష్టం. నేను పాడిన పాటలు ఎఫ్ఎంలో లేదా ఎక్కడైనా వింటే మనస్సుకు సంతోషంగా ఉంటుంది. కాగా.. సినీ రంగంలో ప్రతిభ ఉన్న గాయకులకు ఎన్నో అవకాశాలు ఉన్నాయి. అయితే, పట్టుదలతో ముందుకు సాగితే అవకాశలు అవే లభిస్తాయి. అవార్డులు .. 2008 సంవత్సరంలో నచ్చావులే చిత్రంలోని నిన్నే నిన్నే.. పాటకు గాను ఫిలింఫేర్ ఉత్తమ తెలుగు నేపథ్య గాయని పురస్కారానికి నామినేట్ అయింది. అదే పాటకు నంది అవార్డు వచ్చింది. చిరుతలోని చమ్కా చమ్కా పాటకు మా టీవీ ఉత్తమ గాయని పురస్కారం లభించింది. సంతోషం అవార్డు సైతం వచ్చింది. ఏక్ నిరంజన్లోని గుండెల్లో గిటార్ పాటకు గానూ సౌత్ స్కోప్ పురస్కారం అందుకున్నా. అలాగే, తమిళంలో బాహుబలి చిత్రంకు ఫిలింఫేర్ అవార్డు వచ్చింది. -
ముగిసిన యానాం ప్రజా ఉత్సవాలు
యానాం టౌన్ :స్థానిక జీఎంసీ బాలయోగి క్రీడామైదానంలో పుదుచ్చేరి పర్యాటక శాఖ ఆధ్వర్యంలో మూడురోజుల నుంచి జరుగుతున్న యానాం ప్రజా ఉత్సవాలు గురువారం రాత్రితో ముగిశాయి. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన 16వ ఫల పుష్ప ప్రదర్శన కూడా ముగిసింది. ముగింపు సభలో స్థానిక ఎమ్మెల్యే మల్లాడి కృష్ణారావు ముఖ్యఅతిథిగా మాట్లాడుతూ కళాకారులను ప్రోత్సహించడానికి ఈ ఉత్సవాలను నిర్వహించినట్టు స్పష్టం చేశారు. ఈ ఉత్సవాలను విజయవంతం చేసిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. సభలో యానాం పరిపాలనాధికారిఎస్.గణేశన్, ఎస్పీ దాట్ల వంశీధరరెడ్డి, మున్సిపల్ కమిషనర్ లంక రామారావు, వ్యవసాయ శాఖ కార్యదర్శి కామిశెట్టి వేణుగోపాలరావు, మార్కెట్ కమిటీ చైర్మన్ సత్యభాస్కర్ పాల్గొన్నారు. అనంతరం ఉత్సవాల్లో నిర్వహించిన వివిధ పోటీల్లోని విజేతలకు ఎమ్మెల్యే బహుమతులు ప్రదానం చేశారు. అలరించిన సినీ ఆర్కెస్ట్రా ముగింపు కార్యక్రమంలో సినీ సంగీత దర్శకురాలు ఎం.ఎం.శ్రీలేఖ బృందం నిర్వహించిన సినీ ఆర్కెస్ట్రా, జబర్దస్త్ బృందం ప్రదర్శించిన వివిధ స్కిట్లు అందరినీ ఆకట్టుకున్నాయి. ఆర్కెస్ట్రాలో శ్రీలేఖ, గీతామాధురి, శ్రీకృష్ణ, దీపు, అంజనా సౌమ్య, సాయిశిల్ప తదితరులు హుషారైన సినిమా పాటలు పాడి సందడి చేశారు. అలాగే జబర్దస్త్ బృంద సభ్యులు షేకింగ్ శేషుకుమార్, అవతార్ చిట్టిబాబు, ఫణి, రాకేష్, కార్తీక్, ఆర్పీ వివిధ హాస్య స్కిట్లు ప్రదర్శించి అందరినీ నవ్వించారు. స్థానిక కళాకారులు ప్రదర్శించిన నృత్యాలూ ఆకట్టుకున్నాయి. కార్యక్రమాలను యానాం ఎమ్మెల్యే మల్లాడి కృష్ణారావు పర్యవేక్షించారు. వేలాది మంది ప్రదర్శనలను తిలకించారు. -
బుజ్జితో నా జీవితం సప్తవర్ణాల ఇంద్రధనుస్సులా ఉంది!
గీతామాధురి... ఎంత ట్రెండీగా కనిపిస్తారో, అంత ట్రెడిషనల్. ఆమె పాడే పాటలు కూడా అంతే. క్లాస్‌గానూ పాడగలరు, మాస్‌గానూ మురిపించగలరు. చాలా షార్ట్‌టైమ్‌లోనే స్వీట్ సింగర్ అనిపించుకున్నారామె. నటుడు నందూని ఇటీవల పెళ్లాడిన గీతామాధురి కెరీర్ కబుర్లు... ఫ్యామిలీ ముచ్చట్లు... బిజీగా ఉన్నట్లున్నారు? ఓ వైపు పాటల్నీ, మరో వైపు మా వారినీ చూసుకోవాలి. మరి బిజీ గాక ఏముంటుంది చెప్పండి? ఎలా ఉందండీ వైవాహిక జీవితం? ఇంత ఆనందంగా ఉంటుందని మాత్రం ఊహించలేదు. నిజంగా బుజ్జి(నందు)తో నా జీవితం సప్తవర్ణాల ఇంద్రధనుస్సులా ఉంది. తను సినిమా వ్యక్తే అవ్వడం, ఇంట్లో మా అత్తగారికి కూడా ప్రోత్సహించే తత్వమే ఉండటంతో వ్యక్తిగతంగానే కాక, వృత్తిపరంగా కూడా సంతోషంగా ఉన్నాను. మీ ఇద్దరిలో ముందు ప్రపోజ్ చేసింది ఎవరు? ప్రేమ ప్రపోజల్ ఆయన తెచ్చారు. పెళ్లి ప్రపోజల్ నేను తెచ్చాను(నవ్వుతూ). మీ ఇద్దరూ కలిసి ఓ లఘుచిత్రంలో కూడా నటించినట్లున్నారు? ఇక ముందు కూడా నటిస్తారా? లేదండీ... అసలు అలాంటి ఉద్దేశమే నాకు లేదు. నందుతోనే నా జీవితం అనుకున్నప్పుడు ఏదో చిన్న చిన్న కోరికలుంటాయి కదా! అందుకే... తనతో కలిసి ఆ షార్ట్ఫిలిమ్ చేశాను. నటించాలంటే దానికి కొన్ని అర్హతలుండాలి. నాలో ఆ అర్హతలు లేవని నా అభిప్రాయం. నా వరకు నాకు పాటలే లోకం. అంతే.. సరేకానీ... మీ ఆయన్ను మీరు ‘బుజ్జి’ అని పిలుస్తారా? అవునండీ... అంతకుముందు లేదు. ఎందుకోగానీ ఉన్నట్లుండి ‘బుజ్జీ...’ అని పిలవడం మొదలుపెట్టాను. అందరిముందు అలా పిలవడం మాత్రం ఇబ్బందిగానే ఉంది. తనకెలా ఉందో మరి! ఇంట్లో మీ ఇద్దరిలో పై చేయి ఎవరిది? నన్నడిగితే... ఆయనదే అని చెబుతాను. ఆయన్నడిగితే నా పేరు చెబుతారు. నిజానికి ఇద్దరిదీ. ఎందుకంటే... ఏ విషయం అయినా... ఇద్దరం కలిసి కూర్చుని డిస్కస్ చేసుకున్న తర్వాతే ఓ నిర్ణయానికొస్తాం. ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాత పై చేయి, కింద చేయి అనే సమస్యలే ఉండవు! గాత్రంతో ప్రయోగాలు భలే చేస్తారే. ఎక్కడ నేర్చుకున్నారు? అవసరాలే నేర్పాయండీ. అలాంటి పాటలొచ్చాయి నాకు. తాగినట్లు పాడాల్సి వచ్చింది... పాడాను. ఏ మాత్రం ఎక్స్ప్రెషన్ లేకుండా పాడాల్సి వచ్చింది... పాడాను. రొమాంటిక్ ఎక్స్ప్రెషన్తో పాడాను. రొమాంటిక్ ఎక్స్ప్రెషన్తో హై పిచ్‌లో పాడాల్సి వచ్చింది... పాడాను. ఇలా... రకరకాలుగా పాడే అవకాశాలొచ్చాయి. అది నా అదృష్టమే కదా! క్లాసికల్ నేర్చుకున్నారా? మూడో తరగతి నుంచి టెన్త్ క్లాస్‌కు వచ్చేంత వరకూ కొచ్చర్లకోట పద్మావతిగారి వద్ద క్లాసికల్ నేర్చుకున్నాను. తర్వాత రామాచారిగారి దగ్గర కొన్నాళ్లు. ఆయన దగ్గర నేర్చుకున్నప్పుడే నాకు సంగీతంతో పాటు ఆత్మవిశ్వాసం కూడా వచ్చింది. నన్ను గాయనిగా సినిమాకు పరిచయం చేసింది రామాచారిగారే. ఆయన ‘ప్రేమలేఖ రాశా’ అనే సినిమాకు సంగీత దర్శకత్వం వహించారు. ఆ సినిమాలో ఓ పాటను నాతో పాడించారు. అదే టైమ్‌లో కీరవాణిగారికి పరిచయం చేశారు. అలా ‘ఖతర్నాక్’లో పాడే అవకాశం వచ్చింది. మీకు బాగా పేరు తెచ్చిన పాటలు? ‘వీడొక్కడే’లో ‘అబ్బో వీడేంటో...’ పాట నాకు తొలి బ్రేక్. ఇక ‘చిరుత’లోని ‘చమ్కా చమ్కా చమ్కీరే...’ పాట అయితే నాకు ఎక్కడలేని గుర్తింపు తెచ్చింది. ‘నచ్చావులే’ టైటిల్సాంగ్ పాడినందుకు నాకు అవార్డు వచ్చింది. ‘గోలీమార్’లోని ‘మగాళ్లు వట్టి మాయగాళ్లు’, ‘మిర్చి’లోని ‘డార్లింగే... ఓసి నా డార్లింగే’, ‘ఇద్దరమ్మాయిలతో’లో ‘టాపు లేచిపోద్ది’... ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. గాయనిగా మంచి పేరు తెచ్చుకున్నారు కదా! ‘నంబర్‌వన్’ స్థానంపై మీ అభిప్రాయం? వేరే రంగాల గురించి నాకు తెలీదు. నా రంగం విషయానికొస్తే... ఇక్కడ అందరం నంబర్వన్లమే. ఎవరి అవకాశాలు వాళ్లకున్నాయి. నేను ఎక్కువ సినిమాలకు పాడుతున్నానంతే! అది నా అదృష్టం! మీ తోటి సింగర్స్‌లో ఎవరు బెస్ట్ అంటే ఏం చెబుతారు? ఎవరి ప్రత్యేకతలు వారికున్నాయండీ. సునీతగారు, ఉషగారు, కౌసల్యగారు, మాళవిక, శ్రావణభార్గవి, రీసెంట్గా పాడుతున్న సాహితి, లిప్సిక, రమ్య... ఇలా అందరూ బాగానే పాడుతున్నారు. సంగీత దర్శకత్వం చేసే ఉద్దేశం ఏమైనా ఉందా? అంత టాలెంట్ నాలో లేదు. అది మోర్ క్రియేటివ్ జాబ్. పాటలను ఎంజాయ్ చేయడం మాత్రమే నాకు తెలుసు! దట్సాల్! - బుర్రా నరసింహ -
గంగరాజు పాలు గరిటెడైనను...
తెల్లవారగానే పాలకార్డు పుచ్చుకుని పాల బూత్‌కి వెళ్తే పాలు దొరుకుతాయి! కాని ఆ ఇంటికి ఏ కార్డూ తీసుకువెళ్లక్కర్లేదు... అర్ధరాత్రి ఒంటి గంటకైనా సరే ఆ ఇంటికి వెళ్లి తలుపు త డితే చాలు.. పాల వంటి స్వచ్ఛమైన చిరునవ్వుతో తలుపులు తెరుచుకుంటాయి... మనకు కావలసిన కల్తీ లేని పాలు దొరుకుతాయి... మూడు తరాలుగా పాల వ్యాపారాన్ని సేవా దృక్పథంతో నడుపుతూ పాల గంగరాజుగా పేరు పొందారు ఆయన... తరవాతి తరం కూడా అదే పేరుతో అ వ్యాపారాన్ని అందిపుచ్చుకున్నారు. రాజమండ్రి టి.నగర్‌లోని ఆ వీధిలోకి అడుగు పెడుతుండగానే ఆమడ దూరం నుంచే కమ్మటి వాసనలు కమ్ముకు వస్తుంటే... అప్రయత్నంగానే మన కాళ్లు అటువైపు దారి తీస్తాయి. ఆ ఇంటి ముందు బారులు తీరిన జనం కనిపిస్తారు. ఒకరు నెయ్యి కావాలంటే, ఒకరు పాలు కావాలంటారు. ఒకరు పెరుగు కావాలంటే మరొకరు పాలకోవా కావాలంటారు. ఇంతలోనే ఇంకొకరు వచ్చి పూతరేకులు రెడీయేనా అని అడుగుతారు. అడిగిన వాటన్నింటినీ ఆలస్యం చేయకుండా అందజేస్తారు ఆ ఇంటిలోని వాళ్లు. మూడు తరాలుగా అక్కడి ప్రజలకు రుచికరమైన పాలు, పాల పదార్థాలు అందిస్తోంది పాల గంగరాజు డైరీ. తెలుగువారి అభిమాన నటుడు అక్కినేని, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎం.జి.రామచంద్రన్ కూడా గంగరాజు పాలకోవా తిన్నవారే. ఇలా మొదలైంది...: పశ్చిమగోదావరి జిల్లా పశివేదల గ్రామం (1950) లో నిమ్మలపూడి వీరన్న అనే రైతు ఇతర ప్రాంతాల నుంచి పాలు సేకరించి విక్రయించేవారు. కుమారుడు గంగరాజు తన 24వ ఏట వీరన్న ప్రారంభించిన పాల వ్యాపారాన్ని రాజమండ్రి దాకా తీసుకువచ్చారు. అక్కడ అప్పుడప్పుడే విస్తరిస్తున్న హోటళ్లకు... పశివేదల, ఉంగుటూరు పరిసర గ్రామాల నుంచి పాలను సేకరించి రాజమండ్రిలో విక్రయించేవారు. ఆయన పాలు తేకపోతే ఆ రోజు అక్కడి హోటళ్లు ఇంక బందే. ‘‘మా నాన్నగారు అలా పాలు సరఫరా చేస్తుండటంతో ఆయన పేరు పాల గంగరాజుగా మారిపోయింది’’ అంటారు ఆయన తదనంతరం ‘గంగరాజు పాల ఖ్యాతి’ ని దేశ విదేశాలకు వ్యాపింపచేసిన ఆయన కుమారుడు గోవిందు. పాల బండి వచ్చిందంటే...: విజయవాడ నుంచి రాజమండ్రికి ఉదయం పూట ప్యాసింజరు రైలు నడిచేది. ‘‘మా నాన్నగారు రోజూ ఇదే రైలులో పాలను బిందెలతో రాజమండ్రికి తెచ్చేవారు. పశ్చిమగోదావరి నుంచి పాలు అమ్మేందుకుగాను ఇదే రైల్లో మరికొందరు రాజమండ్రి వచ్చేవారు. అందరూ ఆ రైలును పాల బండి అని పిలిచేవారు. మా నాన్నగారు అందులో వుండేవారు. మిగులు పాలతో మొదలైంది వ్యాపారం: పాల సేకరణ పరిమాణం పెంచుతూ పోవడంతో పాలు మిగిలిపోయేవి. దీంతో రాజమండ్రిలో కూడా పాలు అమ్మేవారు గంగరాజు. అలా మా తాతగారు పశివేదలలో ఉండగానే నాన్నగారు రాజమండ్రి ఇన్నీసుపేటలోని త్యాగరాజనగర్‌కు మకాం మార్చారు. తాతగారు పంపిన పాలు హోటళ్లకు పోయగా మిగిలిన పాలను ఇంటి దగ్గర కొన్ని అమ్మి, మరికొన్ని పాలను పెరుగుగా మార్చి విక్రయించేవారు. ’’ అంటూ గతాన్ని జ్ఞాపకం తెచ్చుకుంటారు గోవిందు. స్వచ్ఛతకు కేరాఫ్ అడ్రస్...: గంగరాజు డైరీలో... పాలు, పెరుగుతోపాటు పాలకోవాకు మంచి డిమాండ్ ఉంది. ఇవే కాకుండా నెయ్యి, వెన్న, పనీరు, పచ్చి కోవా, పూతరేకులు కూడా తయారు చేస్తారు. గంగరాజు పాలకోవా అమెరికా, లండన్, గల్ఫ్ దేశాల్లోని తెలుగు వారికి సుపరిచితం. ఫోన్లో ఆర్డర్ ఇచ్చి ఆన్లైన్లో డబ్బులు పంపితే వాళ్లు సూచించిన వారికి డెలివరీ ఇస్తారు. ఇదో కుటుంబ పరిశ్రమ: మూడు తరాల ఆ కుటుంబ పరిశ్రమ నేడు గంగరాజు డైరీ అనే వ్యవస్థకు బలమైన పునాదిగా నిలిచింది. ‘‘లీటరు 30 పైసల రేటుతో ప్రారంభమైన మా పాల సేకరణ ఇప్పుడు 52 రూపాయల ధరలో కొనసాగుతోంది’’ అంటూ తమ వ్యాపారం ఎలా అభివృద్ధి చెందిందో చెబుతారు గోవిందు.వీరు తయారుచేసే పాలకోవా విదేశాలలో ఉన్నవారిని సైతం ఆకర్షిస్తోంది. అమ్మ చేతి పాలకోవా... ‘‘ఎన్ని పాలు విక్రయించినా ఇంకా పదిహేను లీటర్ల పాలు మిగిలిపోయేవి. మా అమ్మ సత్యవతి అలా మిగిలిన పాలతో కోవా చేసేవారు. ఇంటి ముందే వాటిని అమ్మేవారు. అమ్మ చేతి ఆ స్వచ్ఛమైన పాలకోవా గంగరాజు డైరీకి మంచి పేరు తెచ్చిపెట్టింది. ఇప్పటికీ విదేశాల్లో ఉండే భారతీయులు కోవాను పోస్టు ద్వారా తెప్పించుకుంటున్నారంటే అది అమ్మ చేసిన కమ్మని పాలకోవా మహిమే!’’ - గోవిందు - దేవళ్ల సూర్యనారాయణమూర్తి, సాక్షి ప్రతినిధి, రాజమండ్రి ఫొటోలు: వీరభగవాన్ తెలగరెడ్డి -
నందును ఇంట్లోకి రానివ్వని గీతామాధురి
ప్రేమపక్షులు నందు.. గీతామాధురి ఇప్పుడు కలిసి ఉండట్లేదా? తాను ఎంతగానో ప్రేమించి పెళ్లి చేసుకున్న నందును ఇప్పుడు గాయని గీతామాధురి అసలు ఇంట్లోకి రానివ్వడం లేదా? అవునట. ఈ విషయాన్ని స్వయంగా గీతామాధురే తన ఫేస్బుక్ పేజీ ద్వారా తెలిపింది. 'ఇంట్లోకి నాట్ ఎలోవ్డ్' అంటూ తన స్టేటస్ అప్డేట్ చేసింది. ఖంగారు పడకండి.. వాళ్లిద్దరు ఏమీ విడిపోలేదు, ఇద్దరి మధ్య ఎలాంటి జగడాలు కూడా జరగలేదు. (చదవండి: నందుతో గీతామాధురి నిశ్చితార్థం) అయితే.. ఇప్పుడు ఉన్నది ఆషాఢ మాసం కాబట్టి, ఆ వంక పెట్టి పుట్టింటికి వెళ్లిన గీతా మాధురి.. ఎటూ ఆషాఢ మాసంలో అల్లుడు అత్తగారిని చూడకూడదు, ఆ ఇంటి గడప తొక్కకూడదు కాబట్టి ఆషాఢం అల్లుడిని ఇంట్లోకి రానిచ్చేది లేదని ఆట పట్టిస్తోంది. అందుకే గీతామాధురి పుట్టింట్లోకి నందు వెళ్లలేకపోతున్నాడు. దాదాపు మూడున్నరేళ్ల పాటు ప్రేమించుకున్న నందు, గీతామాధురి ఇటీవలే పెళ్లి చేసుకున్నారు. ఆటోనగర్ సూర్య సినిమాలో అతడి నటనను సమంత కూడా ట్విట్టర్ వేదికగా చాలా మెచ్చుకుంది. -
గాయని గీతా మాధురి వివాహం
-
గాయని గీతా మాధురి నటుడు నందుల వివాహం
-
పాలమూరులో గీతా గాన మాధుర్యం
స్టేషన్ మహబూబ్‌నగర్, న్యూస్‌లైన్: చల్లటి వాతావరణంలో శనివారం సాయంత్రం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం అటు సినీగాయకుల హుషారైన పాటలు, ఇటు ప్రేక్షకుల చపట్లతో మారుమోగింది. ఓ ప్రైవేట్ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ప్రముఖ సినీ నేపథ్య గాయకులు గీతామాధురి, హేమచంద్ర తమ పాటలతో అలరించారు. గీతామాధురి పాడిన ‘ఓసినా డార్లింగే’, ‘మగాళ్లు ఒట్టి మాయగాళ్లు’, ‘కెవ్వుకేక’ పాటలతో హుషారెత్తించారు. అదేవిధంగా హేమచంద్ర పాడిన ‘ైవె దిస్ కొలవెరి’, ‘దమ్ములాంటి కన్నులు ఉన్న’, ‘సక్కుబాయి’ తదితర పాటలు ఆకట్టుకున్నాయి. ఇద్దరు గాయకులు పాటలు పాడుతూ మధ్యలో డాన్స్‌చేస్తూ హోరెత్తించారు. కార్యక్రమానికి నిర్వహకులు తగిన ఏర్పాట్లుచేశారు. మైదానం జనంతో నిండిపోయింది. పలువురు ప్రముఖులు కూడా హాజరయ్యారు. -
నందుతో గీతామాధురి నిశ్చితార్థం
గాయని గీతామాధురి, నటుడు నందు వివాహ నిశ్చితార్థం సోమవారం(11-11-13) హైదరాబాద్‌లో జరిగింది. చాలా కొద్దిమంది బంధుమిత్రులు ఈ నిశ్చితార్థ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఫిబ్రవరిలో వీరి పెళ్లి జరగనుంది. వీరిద్దరూ గత రెండేళ్లుగా ప్రేమించుకుంటున్న విషయం తెలిసిందే. ఓ లఘుచిత్రంలో కలిసి నటించిన సందర్భంలో వీరిరువురి మధ్య ప్రేమ చిగురించింది. ఇరువైపుల పెద్దలు ఈ ప్రేమకు అంగీకారం తెలిపారు. -
నందుతో గీతామాధురి నిశ్చితార్థం
గాయని గీతామాధురి, నటుడు నందు వివాహ నిశ్చితార్థం సోమవారం హైదరాబాద్‌లో జరిగింది. చాలా కొద్దిమంది బంధుమిత్రులను ఈ వేడుకకు ఆహ్వానించారు. వీరిద్దరూ గత రెండేళ్లుగా ప్రేమించుకుంటున్న విషయం తెలిసిందే. గీతామాధురి ఇటీవల కాలంలో ఎన్నో హిట్ సాంగ్స్ ఆలపించారు. ‘ఫొటో’ సినిమాతో హీరోగా పరిచయమైన నందు ‘100% లవ్’లో కీలకపాత్ర పోషించారు. ఓ లఘుచిత్రంలో కలిసి నటించిన సందర్భంలో వీరిరువురి మధ్య ప్రేమ చిగురించింది. ఇరువైపుల పెద్దలు ఈ ప్రేమకు అంగీకారం తెలిపారు. ఫిబ్రవరిలో వీరి పెళ్లి జరగనుంది.