తెలుగు సింగర్ గీతామాధురి గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. మాస్, రొమాంటిక్ గీతాల పాడటంలో స్పెషలిస్ట్ అయిన ఈమె.. గత కొన్నాళ్ల నుంచి మాత్రం కెరీర్ పరంగా బ్రేక్ ఇచ్చింది. ప్రెగ్నెన్సీతో ఉండటమే దీనికి కారణమని జనవరిలో తెలిసింది. ఎందుకంటే అప్పుడు ఈమెకు సీమంతం జరగ్గా.. ఇప్పుడు తనకు కొడుకు పుట్టిన విషయాన్ని గీతామాధురి బయటపెట్టింది.
(ఇదీ చదవండి: సీక్రెట్‌గా రెండోసారి నిశ్చితార్థం చేసుకున్న స్టార్ హీరోయిన్)
అయితే ఫిబ్రవరి 10నే తనకు బాబు పుట్టాడని.. దాదాపు వారం తర్వాత అంటే ఫిబ్రవరి 17న ఇన్ స్టా స్టోరీలో పోస్ట్ చేసింది. ఇకపోతే తెలుగు నటుడు నందుని ప్రేమించిన గీతామాధురి.. 2014లో అతడిని పెళ్లి చేసుకుంది. వీళ్ల సంసారానికి గుర్తుగా 2019లో ఓ పాప పుట్టింది. ఇప్పుడు బాబు పుట్టాడు.
గీతామాధురి ప్రస్తుతం సింగర్‌గా కాస్త గ్యాప్ తీసుకున్నప్పటికీ.. నందు మాత్రం హీరో, స్పోర్ట్స్ యాంకర్, టెలివిజన్ హోస్ట్, ఓటీటీ యాక్టర్‌గా చాలా బిజీగా ఉంటున్నాడు. ప్రస్తుతం వీళ్లిద్దరు కూడా కొడుకుతో సమయాన్ని గడుపుతున్నారు.
(ఇదీ చదవండి: ఓటీటీలోకి 'హనుమాన్' సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?)
Comments
Please login to add a commentAdd a comment