nandu
-
సింగర్ గీతామాధురి కుమారుడి అన్నప్రాసన వేడుక (ఫోటోలు)
-
‘వాగు’లో గల్లంతైన నలుగురి మృతి
బాపట్లటౌన్: విహారయాత్రలో భాగంగా హైదరాబాద్ నుంచి బాపట్ల ప్రాంతానికి వచ్చిన 12 మందిలో బుధవారం నల్లమడవాగులో నలుగురు గల్లంతైన విషయం తెలిసిందే. వీరిలో సునీల్‌కుమార్ (36), అతని కొడుకు అనురాజ్ (13) మృతదేహాలు బుధవారం రాత్రి ఏరియా వైద్యశాలకు తరలించారు. మరో ఇద్దరు ఆచూకీ లభించకపోవడంతో జిల్లా కలెక్టర్ పి.రంజిత్‌బాషా, ఎస్పీ వకుల్‌జిందాల్ ఆదేశాల మేరకు రంగంలోకి ఎన్డీఆర్ఎఫ్, సూర్యలంక తీరంలోని గజ ఈతగాళ్లు, అగ్నిమాపక అధికారులు టీమ్‌లుగా ఏర్పడి నల్లమడ వాగులో సుమారు 3 కిలోమీటర్ల మేర గాలింపు చర్యలు చేపట్టారు. గాలింపులో భాగంగా వడ్లకొండ కిరణ్‌గౌడ్ (35) మృతదేహాన్ని గురువారం ఉదయం 6.30 గంటల సమయంలో గుర్తించి వెలికి తీశారు. అదే సమయంలో బండా నందు (35) మృతదేహం మూలపాలెం గ్రామశివారులోని తుమ్మచెట్ల మధ్యలో ఉన్నట్లు గుర్తించి వెలికి తీశారు. నలుగురు మృతదేహాలకు గురువారం బాపట్ల ఏరియా వైద్యశాలలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతుల కుటుంబసభ్యులు మృతదేహాలను చూసి కన్నీరుమున్నీరుగా విలపించారు. రూరల్ సీఐ శ్రీహరి కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
Geetha Madhuri: సింగర్ గీతామాధురి కూతురు... ఎంత పెద్దదైంది, దిష్టితగిలేను! (ఫోటోలు)
-
సింగర్ గీతామాధురి కుమారుడి బారసాల (ఫొటోలు)
-
గీతామాధురి ఇంట సెలబ్రేషన్స్.. కుమారుడికి ఏం పేరు పెట్టిందంటే?
ఒకరు కమ్మగా ఆలపిస్తారు.. మరొకరు కట్టిపడేసేలా నటిస్తారు.. ఇద్దరూ జత కడితే ఎలా ఉంటుంది? బొమ్మ బ్లాక్‌బస్టర్ కదూ! ఆ జంటే గీతామాధురి - నందు. టాలీవుడ్లో చూడముచ్చటైన జంటగా రాణిస్తున్న ఈ దంపతుల ఇంట ఆనందాలు వెల్లివెరిశాయి. వీరికి ఇదివరకే దాక్షాయని అనే కూతురు ఉండగా ఇటీవల ఓ బాబు పుట్టాడు. ఫిబ్రవరి 10న బాబు జన్మించాడంటూ కొద్దిరోజుల క్రితమే అభిమానులతో గుడ్‌న్యూస్ షేర్ చేసుకుంది సింగర్. మీ బుడ్డోడే కాదు.. పేరు కూడా క్యూట్.. తాజాగా వీరు బాబు బారసాల వేడుకను ఘనంగా నిర్వహించారు. బుడ్డోడికి ధృవధీర్ తారక్ అని నామకరణం చేశారు. ఈ ఫంక్షన్‌కు బంధువులతో పాటు ఇండస్ట్రీ మిత్రులు కూడా హాజరయ్యారు. మీ బుడ్డోడే కాదు, అతడి పేరు కూడా భలే క్యూట్‌గా ఉందంటూ వేడుకకు హాజరైన సెలబ్రిటీలు అభిప్రాయపడుతున్నారు. ఈ బారసాల ఫంక్షన్‌కు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఒకరు సింగర్.. ఒకరు హీరో గీతామాధురి సింగర్ రాణిస్తుండగా నందు ఓపక్క హీరోగా, మరోవైపు స్పోర్ట్స్ యాంకర్, టెలివిజన్ హోస్ట్‌గా ఫుల్ బిజీగా ఉంటున్నాడు. 2014లో వీరి పెళ్లి జరగ్గా 2019లో ఓ పాప పుట్టింది. ఐదేళ్ల తర్వాత బాబు పుట్టాడు. కొడుకు పుట్టడానికి ముందు వీరు ఉదకశాంతి పూజ చేయించడం విశేషం. చదవండి: అదే రాళ్లపల్లి వీక్నెస్! జీవితంలో అత్యంత విషాదకర సంఘటన ఇదే! -
పండంటి బిడ్డకు జన్మనిచ్చిన సింగర్ గీతామాధురి
తెలుగు సింగర్ గీతామాధురి గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. మాస్, రొమాంటిక్ గీతాల పాడటంలో స్పెషలిస్ట్ అయిన ఈమె.. గత కొన్నాళ్ల నుంచి మాత్రం కెరీర్ పరంగా బ్రేక్ ఇచ్చింది. ప్రెగ్నెన్సీతో ఉండటమే దీనికి కారణమని జనవరిలో తెలిసింది. ఎందుకంటే అప్పుడు ఈమెకు సీమంతం జరగ్గా.. ఇప్పుడు తనకు కొడుకు పుట్టిన విషయాన్ని గీతామాధురి బయటపెట్టింది. (ఇదీ చదవండి: సీక్రెట్‌గా రెండోసారి నిశ్చితార్థం చేసుకున్న స్టార్ హీరోయిన్) అయితే ఫిబ్రవరి 10నే తనకు బాబు పుట్టాడని.. దాదాపు వారం తర్వాత అంటే ఫిబ్రవరి 17న ఇన్ స్టా స్టోరీలో పోస్ట్ చేసింది. ఇకపోతే తెలుగు నటుడు నందుని ప్రేమించిన గీతామాధురి.. 2014లో అతడిని పెళ్లి చేసుకుంది. వీళ్ల సంసారానికి గుర్తుగా 2019లో ఓ పాప పుట్టింది. ఇప్పుడు బాబు పుట్టాడు. గీతామాధురి ప్రస్తుతం సింగర్‌గా కాస్త గ్యాప్ తీసుకున్నప్పటికీ.. నందు మాత్రం హీరో, స్పోర్ట్స్ యాంకర్, టెలివిజన్ హోస్ట్, ఓటీటీ యాక్టర్‌గా చాలా బిజీగా ఉంటున్నాడు. ప్రస్తుతం వీళ్లిద్దరు కూడా కొడుకుతో సమయాన్ని గడుపుతున్నారు. (ఇదీ చదవండి: ఓటీటీలోకి 'హనుమాన్' సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?) -
12 రోజులు నరకం చూశానంటూ.. కన్నీళ్లు పెట్టుకున్న గీతా మాధురి భర్త
టాలీవుడ్లో గీతా మాధురి- నందు బ్యూటిఫుల్ కపుల్స్‌గా గుర్తింపు ఉంది. గీతా మాధురి సింగర్‌గా సత్తా చాటితే నందు యాక్టర్‌గా మెప్పిస్తున్నాడు. టాలీవుడ్లో టాప్ సింగర్‌గా రాణిస్తున్న గీతా త్వరలో తల్లి కాబోతోంది. రెండోసారి పండంటి బిడ్డకు జన్మనివ్వనుంది. ఈ నెలలోనే ఆమె డెలివరీ డేట్ ఉంది. ఈ విషయాన్ని గీతా మాధురియే స్వయంగా వెల్లడించింది. ఇంతటి సంతోష సమయంలో తాజాగా నందు పాతరోజులను గుర్తుచేసుకుని కన్నీళ్లు పెట్టుకున్నాడు. తాజాగా ఒక టీవీ ప్రోగ్రామ్‌లో పాల్గొన్న నందుకు హైపర్ ఆది ఒక ప్రశ్న వేస్తాడు.. గీతామాధురిని ఉద్దేశించి మీ ఇద్దరి మధ్య జరిగిన ఎమోషనల్ మూమెంట్ చెప్పమని అడుగుతాడు. ఆ సమయంలో నందు చాలా ఎమోషనల్‌గా ఇలా చెప్పాడు. ' గతంలో నా మీద ఒక రూమర్ వచ్చింది. దానితో నాకు ఎలాంటి సంబంధం లేదు. ఆ విషయంలో నా పేరును లాగి న్యూస్‌లలో పదేపదే రిపీట్ చేస్తూ చూపించారు. పలు యూట్యూబ్ ఛానల్స్ వారు కూడా ప్రచారం చేశారు. అలా ఏకంగా 12 రోజుల పాటు నన్ను నెగిటివ్ చేశారు. తర్వాత ఆ విషయంలో నాకు ఎలాంటి సంబంధం లేదని తెలిశాక సింపుల్‌గా ఒక స్క్రోలింగ్‌లో వేశారు. దానివల్ల నేను చాలా బాధపడ్డాను.' అంటూ నందు స్టేజిపై వెక్కి వెక్కి కన్నీళ్లు పెట్టుకున్నాడు. తాజాగా ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నందు కన్నీళ్లకు కారణం ఇదేనా సుమారు ఐదేళ్ల క్రితం టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణ కొనసాగిన విషయం అందరికీ తెలిసిందే. అందులో నందు పాత్ర ఉన్నట్లు ఈడీ అనుమానించింది. అందుకు ఆయన్ను ఈడీ విచారించింది. ఆ సమయంలో నందును కేవలం అనుమానితుడిగానే ఈడీ విచారించింది.ఆపై ఆయనకు క్లీన్ చిట్ కూడా రావడం జరిగింది. దీని గురించే తాజాగా నందు కన్నీళ్లు పెట్టికుని ఉండవచ్చని తెలుస్తోంది. -
ఉదకశాంతి పూజలో గీతామాధురి.. ఎందుకు చేస్తారంటే?
ఒకరు అద్భుతంగా ఆలపిస్తారు.. మరొకరు అంతే అద్భుతంగా నటిస్తారు. వీరిద్దరి జోడీ చూడచక్కగా ఉంటుంది. ఆ జంట మరెవరో కాదు గీతా మాధురి- నందు. టాలీవుడ్లో టాప్ సింగర్‌గా రాణిస్తున్న గీతా త్వరలో తల్లి కాబోతోంది. రెండోసారి పండంటి బిడ్డకు జన్మనివ్వనుంది. ఈ నెలలోనే ఆమె డెలివరీ డేట్ ఉంది. ఈ విషయాన్ని గీతా మాధురియే స్వయంగా వెల్లడించింది. ఉదకశాంతి పూజ చేసిన సింగర్ ఇకపోతే నిండు గర్భిణి అయిన గీతా సీమంతం రెండు రోజుల క్రితం ఎంతో ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే! తాజాగా ఆమె ఉదకశాంతి పూజ చేసింది. భర్తతో కలిసి ఈ పూజ ఆచరించింది. ఇందుకు సంబంధించిన ఫోటోలను ఆమె సోషల్ మీడియాలో రిలీజ్ చేయగా వైరల్‌గా మారాయి. ఇంతకీ ఉదక పూజ అంటే ఏంటి? ఎందుకు చేస్తారని చాలామంది ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ఎందుకు చేస్తారంటే? ఉదకశాంతి అనేది వేదమంత్రాలతో ఆచరించే ఓ ప్రక్రియ. మంత్రజలంతో చేస్తారు కాబట్టి దీన్ని ఉదకశాంతి అంటారు. గృహ సంబంధ దోషాలను తొలగించడానికి మంత్రంతో నీటిని పవిత్రం చేసి దాన్ని ఇల్లంతా చల్లుతారు. ముఖ్యమైన సందర్భాల్లో ఈ పూజ చేస్తారు. దీని వల్ల ఇల్లంతా పవిత్రమవుతుంది. అలాగే ఆయుష్షు, ఆరోగ్యం, ఐశ్వర్యం కోరుకునేవారు ఈ పూజ చేస్తారట! View this post on Instagram A post shared by Geetha Madhuri (@singergeethamadhuri) చదవండి: 'మీ భర్త సినిమాలో జరిగింది చూశారా?'.. స్టార్ హీరో మాజీ భార్యకు కౌంటర్! -
నందు ఇంట సెలబ్రేషన్స్ మొదలు.. సీమంతం వేడుక చూశారా?
టాలీవుడ్ టాప్ సింగర్, బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్ గీతా మాధురి మాతృత్వపు మధురిమను మరోసారి అనుభవించేందుకు తహతహలాడుతోంది. నందు- గీతా దంపతులకు ఇదివరకే దాక్షాయని అనే కూతురు ఉంది. ఫిబ్రవరిలో దాక్షాయనికి తోడుగా ఓ బుజ్జాయి రానుంది. ఈ విషయాన్ని గత డిసెంబర్లో వెల్లడించింది గీతా మాధురి. ప్రస్తుతం ఆమె నిండు గర్భిణి. (గీతా మాధురి సీమంతం వేడుక ఫోటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) తాజాగా ఆమెకు సీమంతం జరిగింది. కుటుంబ సభ్యుల మధ్య ఈ వేడుక ఎంతో ఘనంగా జరిగినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ సీమంతం ఫంక్షన్లో గీతా.. ఆకుపచ్చ- నారింజ కాంబినేషన్లో ఉన్న చీరలో మెరిసిపోయింది. బ్యాగ్రౌండ్లో కూడా అంతా సహజంగా కనిపించేలా పూలతో డెకరేషన్ చేశారు. చదవండి: స్టార్ కమెడియన్ సంపాదించిందెంత? కొత్త ప్రియుడితో కలిసి మాజీ లవర్‌కు చుక్కలు చూపించిన నటి.. బ్రేకప్‌తో శని వదిలిందంటూ.. -
డిఫరెంట్ ప్రేమకథతో 'అగ్లీ స్టోరీ'.. గ్లింప్స్ రిలీజ్
లక్కీ మీడియా, రియా జియా సంస్థ సంయుక్తంగా నిర్మిస్తున్న మూవీ 'అగ్లీ స్టోరీ'. నందు, అవికా గోర్ హీరోహీరోయిన్లు నటించారు. ప్రణవ స్వరూప్ దర్శకత్వం వహించారు. తాజాగా ఈ చిత్ర గ్లింప్స్ వీడియోని రిలీజ్ చేశారు. గ్లింప్స్ చివరలో హీరో నందు చెప్పిన.. ఇమేజినేషన్లో ఉన్న ప్రేమ.. రియల్ లైఫ్‌లో ఉండదు అనే డైలాగ్ ఆసక్తి రేపుతోంది. (ఇదీ చదవండి: Bigg Boss 7 విన్నర్ పల్లవి ప్రశాంత్ షాకింగ్ డెసిషన్.. వాళ్లపై రివేంజ్!?) అయితే ఈ గ్లింప్స్ మంచి స్పందన వస్తుండటంతో.. ముందు ముందు టీజర్, ట్రైలర్ మరియు సినిమాని మరింత కొత్తగా, ఆకట్టుకునే విధంగా రిలీజ్ ప్లాన్ చేస్తున్నామని డైరెక్టర్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ చేస్తున్నామని చెప్పారు. త్వరలో టీజర్, ట్రైలర్ విడుదల చేస్తామని క్లారిటీ ఇచ్చాడు. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 27 సినిమాలు రిలీజ్) -
రెండోసారి తల్లి కాబోతున్న సింగర్ గీతా మాధురి
టాలీవుడ్ సింగర్, బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్ గీతా మాధురి గుడ్‌న్యూస్ చెప్పింది. మరోసారి తల్లి కాబోతున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు తన ఫ్యామిలీ ఫోటోను షేర్ చేసింది. ఇందులో నందు, గీతా మాధురితో పాటు వీరి కూతురు దాక్షాయని ఉంది. వచ్చే ఫిబ్రవరిలో దాక్షాయని అక్క కాబోతుందంటూ క్యాప్షన్‌లో రాసుకొచ్చింది. అంటే తాను మళ్లీ గర్భం దాల్చానని చెప్పకనే చెప్పింది. ఈ పోస్ట్ చూసిన పలువురు సెలబ్రిటీలు.. నందు-గీతా మాధురి జంటకు శుభాకాంక్షలు చెప్తున్నారు. కాగా నందు- గీతా 2014లో పెళ్లి చేసుకున్నారు. వీరికి 2019లో దాక్షాయని ప్రకృతి అనే కూతురు పుట్టింది. గీతా మాధురి సింగర్‌గా, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా రాణిస్తోంది. బెస్ట్ సింగర్‌గా ఎన్నో అవార్డులు సైతం అందుకుంది. ఇక నందు విషయానికి వస్తే అతడు హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా సినిమాలు చేస్తున్నాడు. క్రికెట్ సీజన్లోనూ యాంకర్‌గానూ అవతారమెత్తుతున్నాడు. ఓటీటీల పుణ్యమాని వెబ్ సిరీస్‌లు చేస్తూ ప్రేక్షకులకు టచ్‌లో ఉంటున్నాడు. ఇక నందు, గీతా విడిపోతున్నారంటూ గతంలో అనేక పుకార్లు రాగా అందులో ఏమాత్రం నిజం లేదని క్లారిటీ ఇచ్చారీ దంపతులు. తాజాగా ఓ ఇంటర్వ్యూలోనూ ఈ విడాకుల వార్తలు చూసి నవ్వుకున్నామని చెప్పాడు నందు. అలాగే రెండో బిడ్డకు ప్లానింగ్ చేస్తున్నామని హింట్ ఇచ్చాడు. ఇంతలోనే గీతా మాధురి తాను ప్రెగ్నెంట్ అని చెప్పడంతో అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. View this post on Instagram A post shared by Geetha Madhuri (@singergeethamadhuri) చదవండి: దుర్గమ్మను దర్శించుకుని బాబాయ్ హోటల్లో టిఫిన్ చేసిన వెంకీ మామ -
క్యాసినో ఆడి గీతా మాధురి డబ్బులు పోగొట్టింది: నందు
టాలీవుడ్ హీరో నందు ఓ పక్క సినిమాలు చేస్తూ మరోపక్క వెబ్ సిరీస్‌లు చేస్తున్నాడు. ఇటీవల మ్యాన్షన్ 24లో ఓ ముఖ్యపాత్రలో నటించిన ఇతడు తాజాగా హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతున్న వధువు వెబ్‌సిరీస్‌లో హీరోగా నటించాడు. ఈ సిరీస్ ప్రమోషన్లలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నందు తన జీవితంలో జరిగిన ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. క్యాసినో ఆడి డబ్బులు పోగొట్టుకున్నాం.. 'నేను, గీత ఓసారి లండన్‌కు వెళ్లాం. అక్కడ క్యాసినో గేమ్ చూసి గీతా మాధురి ఇష్టపడింది, అప్పటికప్పుడు నేర్చేసుకుంది. తను తెలివైన అమ్మాయే.. కానీ తను అక్కడ క్యాసినో ఆడి డబ్బులు పోగొట్టుకుంది. ఈసారి వస్తుందేమో చూద్దామంటూ న్యూజిలాండ్, కాలిఫోర్నియాలో ఆడింది. ఇలా మూడు, నాలుగుసార్లు ఓడిపోయింది.. డబ్బులు పోయాయి. ఇలా ఓ చోట సమయం తెలియకుండా ఆడుతూనే ఉంది. నాకు విసుగొచ్చి డబ్బులు విసిరేసి నేను వెళ్లిపోతానంటూ బయటకు వెళ్లిపోయా.. సారీ బుజ్జి అంటూ తను కూడా బయటకు వచ్చింది. పోలీసులు చుట్టుముట్టారు క్యాసినో బయట నేను తనను తిడుతుంటే.. అమ్మాయిని వేధిస్తున్నాననుకుని పోలీసులు వచ్చేశారు. మేమిద్దరం భార్యాభర్తలమే అని వారికి అర్థమయ్యేలా చెప్పి అక్కడి నుంచి తప్పించుకున్నాం. ఆ తర్వాత నుంచి క్యాసినో ఆడటం తగ్గించేసింది. ఒకవేళ ఆడినా.. రూ.5-10 వేలు మాత్రమే పెడుతోంది. మేమిద్దరం విడిపోతున్నామంటూ ఆ మధ్య పుకార్లు వచ్చాయి. మేము కలిసి ఉన్న ఫోటోలు, వీడియోలు షేర్ చేయకపోవడంతో ఈ రూమర్స్ మొదలయ్యాయి. అందుకే విడాకుల రూమర్స్ బయట కూడా కలిసి కనిపించకపోవడంతో అదే నిజమనుకున్నారు. కానీ అందులో ఏమాత్రం నిజం లేదు' అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం నందు అగ్లీ స్టోరీ అనే సినిమా చేస్తున్నాడు. నూతన దర్శకుడు ప్రణవ స్వరూప్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఫిబ్రవరిలో రిలీజయ్యే అవకాశం ఉంది. దీనితో పాటు స్టార్ హీరోల సినిమాలోనూ ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. చదవండి: గాఢంగా ప్రేమించా.. మోసం చేశాడు.. తప్పుడు వ్యక్తితో లవ్‌లో పడ్డా.. -
Avika Gor: అవికా గోర్ ‘అగ్లీ స్టోరీ’
వరుస సినిమాలతో దూసుకెళ్తోంది ‘చిన్నారి పెళ్లి కూతురు’ ఫేమ్ అవికా గోర్. అయితే ఈ మధ్య కాలంలో ఈ ఉత్తరాది భామ నటించిన చిత్రాలన్నీ బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. దీంతో ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో ఉంది. అందుకే తన కెరీర్లో ‘సినిమా చూపిస్త మావ’లాంటి భారీ హిట్ అందించిన లక్కీ మీడియా సంస్థ అధినేత బెక్కం వేణుగోపాల్ నిర్మాణంలో కొత్త సినిమాను ప్రకటించింది. సినిమా చూపిస్త మామ, మేము వయసుకు వచ్చాం, హుషారు లాంటి యూత్ ఫుల్ ఎంటర్ టెయినర్స్ ని నిర్మించిన బెక్కెం వేణుగోపాల్..రియా జియా ప్రొడక్షన్స్ అనే కొత్త బ్యానర్‌తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. దీనికి 'అగ్లీ స్టోరీ'అనే టైటిల్‌ని ఖరారు చేశారు. ఈ రొమాంటిక్ థ్రిల్లర్‌లో నందు హీరోగా నటిస్తున్నాడు. నూతన దర్శకుడు ప్రణవ స్వరూప్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ కథ గురించి బెక్కెం వేణుగోపాల్ గారు మాట్లాడుతూ ఈ కథ విభిన్నమైన పాత్రలతో ఆద్యంతం ప్రేక్షకులని కట్టిపడేసేలా ఉంటుందని చెప్పుకొచ్చారు. ఈ రోజు టైటిల్ లాంచ్ జరగగా ఈ చిత్రానికి "అగ్లీ స్టోరీ" అని టైటిల్ ని నిర్ణయించారు. 2024 ఫిబ్రవరి లో ప్రేక్షకుల ముందుకి తీసుకొస్తామని ఈ సందర్భంగా మీడియాకి తెలిపారు -
నిజంగానే ఆత్మహత్య చేసుకున్నాడా.. ఎవరైనా చంపి ఉంటారా..!?
సాక్షి, నిజామాబాద్: మాక్లూర్ మండలంలోని గుంజలి గ్రామానికి చెందిన జింక నందు(24) అనే విద్యార్థి చదువుతున్న హాస్టల్ గదిలో అనుమానాస్పదంగా మృతి చెంది ఉన్నట్టు మృతుడి కుటుంబ సభ్యుల ద్వారా తెలిసింది. సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు ఆదివారం ఉదయం ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన నందు ఢిల్లీలో హాస్టల్లో ఉంటూ బీటెక్ ఆర్కిటెక్చర్ విద్యను అభ్యసిస్తున్నాడు. మొదటగా చేయి కోసుకొని ఆత్మహత్య చేసుకున్నట్టు ఆదివారం తెల్లవారు జామున హాస్టల్ నుంచి సమాచారం అందిందని కుటుంబీకులు తెలిపారు. కానీ మెడ భాగం బలంగా కోసి ఉందని, శరీరమంతా రక్తమడుగులో ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు. నిజంగానే ఆత్మహత్య చేసుకున్నాడా ఎవరైనా చంపి ఉంటారా అనేది తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతి చెందిన నందు శవం ఇంకా స్వగ్రామానికి చేరుకోలేదు. అందరితో కలుపుగోలుగా ఉండే నందు మృతిపై గ్రామంలో విషాదచాయలు ఆలుముకున్నాయి. ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
గీతా మాధురితో విడాకులు.. ఎట్టకేలకు నోరు విప్పిన నందు!
సింగర్ గీతా మాధురి, నటుడు నందూలది ప్రేమ వివాహం. 2014లో పెళ్లి చేసుకున్న వీరు ఎంతో అన్యోన్యంగా కలిసిమెలిసి ఉంటారు. వారి సరదా గొడవలను, అల్లరి పనులను ఈ జంట సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. అయితే రెండేళ్ల క్రితం నందూ, గీతా మాధురి విడాకులు తీసుకోనున్నారంటూ ప్రచారం జరిగింది. మస్పర్థల కారణంగా విడిపోతున్నారని టాక్ నడిచింది. దీనిపై అటు గీతా మాధురి, ఇటు నందు స్పందించకుండా లైట్ తీసుకున్నారు. తాజాగా నందు మాన్షన్ 24 వెబ్ సిరీస్ ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా గతంలో వచ్చిన విడాకుల రూమర్స్ గురించి స్పందించాడు. తనకు, గీతా మాధురికి గొడవలవుతున్నాయని, విడిపోతున్నామంటూ వచ్చిన వార్తల్లో ఏమాత్రం నిజం లేదని క్లారిటీ ఇచ్చాడు. ఈ వార్తలను చూసి తామిద్దరం నవ్వుకున్నామని చెప్పాడు. ఇలాంటి వార్తలను తాము పెద్దగా పట్టించుకోమన్నాడు. ఇకపోతే మాన్షన్ 24 వెబ్ సిరీస్‌లో నందు నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించాడు. ఇందులో వరలక్ష్మి శరత్ కుమార్ ప్రధాన పాత్రలో నటించింది. సత్యరాజ్, రావు రమేశ్, అవికా గోర్, రాజీవ్ కనకాల కీలక పాత్రలు పోషించారు. ఓంకార్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్ అక్టోబర్ 17 నుంచి హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. View this post on Instagram A post shared by @that_actor_nandu చదవండి: ఈ హీరోయిన్ల చేతిలో ఒక్క సినిమా కూడా లేదు -
కదల్లేని స్థితిలో సింగర్ భర్త.. అయినా కూడా..!
టాలీవుడ్ హీరో నందు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. గతేడాది బొమ్మ బ్లాక్ బస్టర్ సినిమాతో ప్రేక్షకులను అలరించాడు. యాంకర్ రష్మీ హీరోయిన్గా.. రాజ్ విరాట్ డైరెక్ట్ చేసిన ఈ మూవీకి ప్రశాంత్ విహారి సంగీతం అందించాడు. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోయింది. 2006లో వచ్చిన ఫోటో సినిమా ద్వారా సినీరంగంలోకి ఎంట్రీ ఇచ్చిన నందు.. ఆ తర్వాత 100% లవ్, ఆటోనగర్ సూర్యలో పలు పాత్రల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. సవారీ మూవీతో సక్సెస్ అందుకున్నారు యంగ్ హీరో. కాగా.. 2014లో గాయని గీతామాధురిని వివాహాం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా నందు తన ఇన్‌స్టాలో షేర్ చేసిన ఓ ఫోటో వైరలవుతోంది. కాలికి గాయమైన ఓ ఫోటోను పంచుకున్నారు. అయితే ఆ ఫోటోలో ఆయన డబ్బింగ్ చెబుతున్నట్లు కనిపిస్తోంది. నడవలేని స్థితిలో ఉన్నప్పటికీ స్డూడియోకి వచ్చి డబ్బింగ్ చెబుతూ కనిపించారు. అయితే ఆయన కాలికి ప్రమాదం ఎలా జరిగిందన్న విషయం మాత్రం వెల్లడించలేదు. అయితే ప్రస్తుతం నందు సినిమాలు, క్రికెట్ కామెంటరీలతో ఫుల్ బిజీ అయిపోయారు. జిమ్‌లోనూ శ్రమిస్తూ ఫోటోలు కూడా షేర్ చేస్తుంటారు. కాగా.. నందు ప్రస్తుతం మహేశ్ బాబు మూవీ ఎస్ఎస్ఎంబి 28తో పాటు ఆర్సీ15,డిజే టిల్లు 2, హరిహరమల్లు, ధాస్ కా ధమ్కీ సినిమాల్లో కనిపించనున్నారు. View this post on Instagram A post shared by @that_actor_nandu -
ఎమ్మెల్యేలకు ఎర కేసు నిందితుడు నందుపై మరో చీటింగ్ కేసు
బంజారాహిల్స్: ఇంటీరియర్ వర్క్ చేయించుకొని తనకు డబ్బులు ఇవ్వకుండా మోసం చేశాడంటూ ఎమ్మెల్యేల ఎర కేసు నిందితుడు కోరె నందుకుమార్‌పై బంజారాహిల్స్ పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు. సికింద్రాబాద్‌కు చెందిన డాగా శ్రీనివాస్ కుమార్.. ఇంటీరియర్, ఫ్యాబ్రికేషన్ కాంట్రాక్టర్‌గా పని చేస్తున్నారు. ఫిలింనగర్లో ఫిల్మీ జంక్షన్‌లోని డక్కన్ కిచెన్‌లో ఇంటీరియర్ వర్క్ కోసం శ్రీనివాస్‌తో నందు ఒప్పందం కుదుర్చుకున్నాడు. గతేడాది మేలో ఫ్యాబ్రికేషన్, సివిల్ వర్క్ పూర్తి చేసి రూ.27 లక్షల బిల్లు అందజేశారు. ఇందులో రూ.10 లక్షలు మాత్రమే ఇచ్చిన నందు మిగతా మొత్తాన్ని త్వరలో ఇస్తానని చెప్పాడు. తర్వాత మిగతా రూ.17 లక్షలు ఇవ్వడంలో నిర్లక్ష్యం చూపడమే కాకుండా ఫోన్ చేస్తే స్పందించడం లేదని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదీ చదవండి: ‘ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్’ కేసులో తీర్పు రిజర్వు -
ఎమ్మెల్యేల కేసులో తుషార్‌ను టార్గెట్ చేసిన సిట్.. ఆయన ఎవరో తెలుసా?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు ఎపిసోడ్లో పలు ట్విస్ట్‌లు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే నందుపై పోలీసులు మరో రెండు కేసులు నమోదు చేయగా.. ఈ వ్యవహారంతో లింకులు ఉన్న ఇద్దరు వ్యక్తులను ఢిల్లీలో అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా.. ఫౌంహాస్ కేసులో సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. కాగా, ఇందులో భాగంగా ఈనెల 21వ తేదీన విచారణకు హాజరుకావాలని తుషార్‌కు పోలీసులు నోటీసులు ఇచ్చారు. రామచంద్రభారతి, రోహిత్‌రెడ్డితో తుషార్ ఫోన్లో మాట్లాడారు. తుషార్‌కు బీజేపీ కీలక నేతలు సన్నిహితులు అంటూ ఫోన్ సంభాషణ కొనసాగింది. ఇక, గత లోక్‌సభ ఎన్నికల్లో కేరళలోని వయనాడులో రాహుల్‌పై తుషార్ పోటీ చేశారు. మరోవైపు.. రెమా రాజేశ్వరి నేతృత్వంలో సిట్ బృందం కేరళలో దర్యాప్తు ప్రారంభించింది. ఈ క్రమంలోనే రామచంద్రభారతి ప్రధాన అనుచరుడు జగ్గుస్వామి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఇక, తుషార్‌ను రామచంద్రభారతికి పరిచయం చేసింది జగ్గుస్వామినే కావడం విశేషం. -
ఎమ్మెల్యేలకు ఎర కేసు.. ఢిల్లీలో హైటెన్షన్!
సాక్షి, న్యూఢిల్లీ: ఎమ్మెల్యేలకు ఎర కేసులో పోలీసులు మరో ఇద్దరిని ఢిల్లీలో అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో అరెస్టయి విచారణ ఎదుర్కొంటున్న నిందితులు ఇచ్చిన సమాచారం మేరకు వీరిద్దరిని ఫరీదాబాద్ ప్రాంతంలో అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నట్లు ఢిల్లీ పోలీసు వర్గాల సమాచారం. వీరిద్దరూ కేసులో ప్రథమ ముద్దాయిగా ఉన్న రామచంద్రభారతికి అత్యంత సన్నిహితులుగా చెబుతున్నారు. ఈ ఇద్దరికీ కేసులో సహ నిందితుడిగా ఉన్న నందుకుమార్‌తోనూ సాన్నిహిత్యం ఉన్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేల ఎర కేసును తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక విచారణ బృందం (సిట్)కు అప్పగించిన మరుసటి రోజునే సైబరాబాద్‌కు చెందిన ప్రత్యేక బృందం ఒకటి ఢిల్లీకి చేరుకొని విచారణ చేపట్టింది. నిందితులు ఇచ్చిన ప్రాథమిక సమాచారం, కాల్‌డేటా ఆధారంగా ఫరీదాబాద్‌లో వీరిని అదుపులోకి తీసుకుంది. వీరికి ముగ్గురు ముద్దాయిలతో ఉన్న సాన్నిహిత్యం, ఎమ్మెల్యేల కొనుగోళ్లలో వీరి ప్రమేయం తదితర వివరాలపై ఆరా తీస్తోంది. ఇప్పటికే అదుపులో ఉన్న నిందితులకు సంబంధించిన వీడియోల్లో రాజస్తాన్, ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాల్లోనూ ఎమ్మెల్యేల కొనుగోళ్లకు సిద్ధంచేసిన ప్రణాళిక, దీనికి తామందించిన సహకారం వంటి అంశాల ప్రస్తావన ఉండటంతో ఈ వ్యవహారంలో వీరికి ఉన్న సంబంధాలపై కూపీ లాగుతున్నట్లు చెబుతున్నారు. అదుపులోకి తీసుకున్న ఇద్దరినీ రెండు, మూడు రోజుల్లో హైదరాబాద్‌లో అరెస్ట్ చూపించే అవకాశాలున్నట్లు సమాచారం. ఈ ఇద్దరి అరెస్ట్‌తో కేసు విచారణ మరింత వేగవంతం అవుతుందని భావిస్తున్నారు. -
నందుకు బిగుస్తున్న ఉచ్చు.. తెరపైకి హీరో రానా ప్లాట్ వ్యవహారం
బంజారాహిల్స్: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నిందితుడు నందుకుమార్‌పై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో మరో మూడు చీటింగ్ కేసులు నమోదయ్యాయి. ఫిలింనగర్ రోడ్ నం.1 లోని ప్లాట్ నం. 2లో సినీ హీరో దగ్గుబాటి రానా ప్లాట్‌ను నందు లీజుకు తీసుకొని జీహెచ్ఎంసీ అనుమతులు లేకుండా అక్రమంగా నిర్మాణాలు చేపట్టి అద్దెకిచ్చాడు. అయితే, చట్టపరమైన హక్కులు లేకుండా ఈ ప్లాట్‌లో నిర్మించిన అక్రమ కట్టడాలను అధికారులు గత ఆదివారం కూల్చివేశారు. ఇక్కడ ఐస్‌క్రీం పార్లర్ ఏర్పాటు కోసం రూ.8 లక్షలు అడ్వాన్స్‌గా చెల్లించానని, రూ.40 లక్షలతో మరమ్మతులు, ఇంటీరియర్ చేయించుకున్నానని, ఇప్పుడు ఈ కట్టడాన్ని అధికారులు కూల్చివేశారని, డబ్బులు వసూలు చేసి మోసగించిన నందుపై చర్యలు తీసుకోవాలని సంజయ్‌రెడ్డి పోలీసులకు ఫిర్యాదుచేశా రు. అలాగే బాంబే గార్మెంట్ స్టోర్ పేరుతో తనకు ఓ అక్రమ కట్టడాన్ని అంటగట్టి పెద్ద ఎత్తున అడ్వాన్స్ తీసుకున్నాడని ఇంటీ రియర్ కోసం తాను లక్షలాది రూపాయలు ఖర్చు చేశానని మియాపూర్‌కు చెందిన ఇందిర పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ప్లాట్‌లో అక్రమంగా నిర్మించిన ఓ షాపును బరిస్టా స్టోర్ పేరుతో తాను ఏర్పాటు చేశానని.. ఇది అక్రమ నిర్మాణం కావడంతో అధికారులు కూల్చివేతకు యత్నించడమే కాకుండా నోటీసులు జారీ చేశారని తనను మోసగించిన నందుపై చర్యలు తీసుకోవాలంటూ బంజారాహిల్స్‌కు చెందిన అశిజ్‌రెడ్డి ఫిర్యాదు చేశా రు. వీరి ఫిర్యాదు మేరకు పోలీసులు నందుపై ఐపీసీ సెక్షన్ 406, 420, 506 కింద కేసులు నమో దుచేశారు. ఇదిలా ఉండగా ఆరు రోజుల క్రితం దక్కన్ కిచెన్ హోటల్స్ యజమాని సయ్యద్ అయాజ్, మొబైల్ యాక్ససెరీస్ గాడ్జెట్ స్టూడియో యజమాని సందీప్ కుమార్ కూడా బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీంతో మొత్తంగా నందుపై పోలీసులు అయిదు చీటింగ్ కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
సుధీర్‌ను పిలవాల్సిన అవసరం నాకు లేదు : రష్మి గౌతమ్
బుల్లితెరపై సుడిగాలి సుధీర్-యాంకర్ రష్మీ జోడికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వీరిద్దరి కెమిస్ట్రీకి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. రీల్ కపుల్‌గానే కాకుండా సుధీర్-రష్మి రియల్ కపుల్ అయితే బావుండు అని అనుకోని ప్రేక్షకులు ఉండరు. అంతలా స్క్రీన్‌మీద మెస్మరైజ్ చేస్తారు ఈ జంట. ఈ క్రమంలో వీరిద్దరు లవ్‌లో ఉన్నారని, త్వరలోనే పెళ్లి కూడా చేసుకుంటారనే రూమర్స్ ఇప్పటికీ వినిపిస్తున్నాయి. తాజాగా ఓ యూట్యూబ్ చానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయంపై రష్మి గౌతమ్ స్పందించింది. సుధీర్‌కి, నాకు మధ్య ఏం ఉందన్నది నా పర్సనల్ విషయం. ప్రతి విషయాన్ని బయటకు చెప్పుకుంటూ పోతే ఇంక పర్సనల్ ఏమీ ఉండదన్నది నా అభిప్రాయం అని తెలిపింది. ఇక తాను నటించిన బొమ్మ బ్లాక్ బస్టర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు సుధీర్‌ను మీరే గెస్ట్‌గా పిలిచారా అన్న ప్రశ్నకు స్పందిస్తూ.. నేను సుధీర్‌ను పిలవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నేను పిలవకపోయినా అతడు వస్తాడు. మా మధ్య అలాంటి స్నేహం ఉంది. ఈవెంట్ ఉందని తనకి తెలుసు. నేను పిలవకపోయినా సుధీర్ వస్తాడన్న నమ్మకం నాకుంది. అందుకే నేను పిలవలేదు, నందు గెస్టుగా పిలిచాడు అంటూ చెప్పుకొచ్చింది. -
‘బొమ్మ బ్లాక్ బస్టర్’ రివ్యూ
టైటిల్ : బొమ్మ బ్లాక్‌బస్టర్ నటీనటులు: నందు, రష్మీ గౌతమ్, కిరీటి, దామరాజు, రఘు కుంచె తదితరులు నిర్మాణ సంస్థ: విజయీభవ ఆర్ట్స్ నిర్మాతలు: ప్రవీణ్ పగడాల, బోసుబాబు నిడుమోలు, ఆనంద్ రెడ్డి మద్ది, మనోహర్ రెడ్డి యెడ దర్శకత్వం : రాజ్ విరాట్ సంగీతం: ప్రశాంత్ ఆర్. విహారి సినిమాటోగ్రఫీ : సుజాతా సిద్ధార్థ్ ఎడిటర్ : బి. సుభాష్కర్ కథేంటంటే... పోతురాజు(నందు) ఒక మత్స్యకారుడు. పూరీ జగన్నాథ్‌కి వీరాభిమాని. తాను కూడా పూరీ లాగా పెద్ద దర్శకుడు కావాలని కలలు కంటాడు. తన జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలతో సినిమా తీసి హిట్ కొట్టాలనుకుంటాడు. సినిమాలపై పిచ్చితో ఏ పని చేయకుండా ఊర్లో అల్లర చిల్లరగా తిరుగుతూ.. వాణి(రష్మీ గౌతమ్)తో ప్రేమలో పడతాడు. ఆమె కోసం అందరితో గొడవలు కూడా పడుతుంటాడు. కట్ చేస్తే.. అనూహ్యంగా పోతురాజు తండ్రి హత్య చేయబడతాడు. ఆ తర్వాత పోతురాజ్ జీవితంలో ఎలాంటి మార్పులు వచ్చాయి? పోతురాజు తండ్రిని హత్య చేసిందెవరు? వాణితో లవ్ స్టోరీ ఏమైంది? చివరికి తన సినిమా లక్ష్యాన్ని చేరుకున్నాడా లేదా?అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. షార్ట్ ఫిలిమ్స్ ద్వారా వెలుగులోకి వచ్చిన దర్శకుడు రాజ్ విరాట్. గతంలో తాను చేసిన షార్ట్ఫిలిమ్స్ హిట్ కావడంతో.. ‘బొమ్మ బ్లాక్ బస్టర్’ ఆఫర్ వచ్చింది. ఎక్కువగా యాక్షన్ జానర్ లో షార్ట్ ఫిలిమ్స్ చేయడంతో ఇప్పుడు బొమ్మ బ్లాక్ బస్టర్ మూవీని కూడా అదే జానర్ లో చేశాడు. దర్శకుడు ఎంచుకున్న పాయింట్ కొత్తగా ఉన్నప్పటికీ.. తెరపై చూపించడంతో కాస్త తడబడ్డాడు. పోతరాజు పాత్ర నేపథ్యం, ఫ్యామిలీ.. సినిమాల పిచ్చి తదితర విషయాలను పరిచయం చేస్తూ సినిమా ప్రారంభం అవుతుంది. కాసేపటికే కథలోకి వాణి పాత్ర వచ్చేస్తుంది. ఆమెతో పోతురాజు ప్రేమలో పడటం..వాణిని ఇంప్రెస్ చేయడానికి గొడవలు చేయడం..ఇలా సింపుల్‌గా ఫస్టాఫ్ ముగుస్తుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ ఆసక్తిని పెంచుతుంది. పోతరాజు ఫ్యామిలీ గురించి కొన్ని నిజాలు తెలియడంతో సెకండాఫ్‌పై ఆసక్తి పెరుగుతుంది. అయితే సెకండాఫ్‌లో కూడా కథ ఆసక్తికరంగా సాగదు. కొన్ని సీన్స్ మాత్రం ఆకట్టుకుంటాయి. పలు ట్విస్టులు, టర్నింగ్ పాయింట్స్ తో దర్శకుడు మంచి కథనే రాసుకున్నాడు. స్క్రీన్ ప్లేని ఇంకా బిగువుగా రాసుకోని ఉంటే.. సినిమా ఫలితం మరోలా ఉండేది. ఎవరెలా చేశారంటే.. గతంలో అనేక సినిమాల్లో సైడ్ క్యారెక్టర్స్ చేసి మెప్పించాడు నందు. హీరోగా మారి ‘సవారీ’ చేశాడు. ఆ సినిమాలో నందు నటనకు అంతా ఫిదా అయ్యారు. హీరో పీస్ అని మెచ్చుకున్నారు. ‘బొమ్మ బ్లాకబస్టర్’లో కూడా నందు మంచి నటనను కనబరిచాడు. పోతురాజు పాత్రలో ఒదిగిపోయాడు. యాక్షన్ సీన్స్ లో కూడా బాగానే నటించాడు. వాణి పాత్రకి రష్మీ గౌతమ్ న్యాయం చేసింది. కీరీటీతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ప్రశాంత్ విహారి పాటలు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. సిద్ధార్థ్ సినిమాటోగ్రఫీ తో మంచి విజువల్స్ చూపించాడు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లు ఉన్నతంగా ఉన్నాయి. -
‘బొమ్మ బ్లాక్‌బస్టర్’ ప్రీ రిలీజ్ వేడుక (ఫొటోలు)
-
నా మీద నమ్మకంతో రష్మి ఆ పని చేసింది: నందు
‘‘మంచి కథతో తీసిన ‘బొమ్మ బ్లాక్‌బస్టర్’ ట్రైలర్, పాటలు చూస్తుంటే ఈ సినిమా చూడాలనిపిస్తోంది. నందు, రష్మీ బాగా నటించారు. ఈ సినిమా టైటిల్‌లాగానే బ్లాక్ బస్టర్ కావాలి’’ అని హీరో నాగశౌర్య అన్నారు. నందు విజయ్‌కృష్ణ, రష్మి గౌతమ్ జంటగా రాజ్ విరాట్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘బొమ్మ బ్లాక్‌బస్టర్’. ప్రవీణ్ పగడాల, బోసుబాబు నిడుమోలు, ఆనంద్ రెడ్డి మద్ది, మనోహర్ రెడ్డి యెడ నిర్మించిన ఈ సినిమా నేడు విడుదలకానుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకి హీరో నాగశౌర్య, డైరెక్టర్ విమల్ కృష్ణ, నిర్మాత ‘సెవెన్ హిల్స్’ సతీష్ అతిథులుగా హాజరయ్యారు. నందు విజయ్‌కృష్ణ మాట్లాడుతూ– ‘‘నాపై నమ్మకంతో ఈ చిత్రకథ వినకుండా నటించారు రష్మి. ఈ చిత్రాన్ని నెక్ట్స్ లెవల్‌కి తీసుకెళ్లిన నిర్మాతలకు థ్యాంక్స్’’ అన్నారు. ‘‘మా సినిమాను ప్రేక్షకులు ఆశీర్వదించాలి’’ అన్నారు నిర్మాతలు. ‘‘నాది, నందూది 14 ఏళ్ల జర్నీ. రాజ్ విరాట్ కథను నందు నమ్మితే, నేను నందును నమ్మి ఈ సినిమా చేశా’’ అన్నారు రష్మి. ‘‘మంచి కంటెంట్‌తో వస్తున్న ఈ సినిమా అందరికీ నచ్చుతుంది’’ అన్నారు రాజ్ విరాట్. చదవండి: కెరీర్లో మొదటిసారి అలాంటి పాత్ర చేశాను : సంతోష్ శోభన్ -
Bomma Blockbuster: నందు కోసం రష్మీ ఆటోలో తిరిగింది.. మూవీ హిట్ కొట్టాలి
నందు, యాంకర్ రష్మీ హీరోహీరోయిన్లు నటించిన తాజా చిత్రం బొమ్మ బ్లాక్‌బస్టర్. రాజ్ విరాట్ డైరెక్ట్ చేసిన ఈ మూవీకి ప్రశాంత్ విహారి సంగీతం అందించాడు. ఈ సినిమా వచ్చే నెల 4న విడుదలవుతోంది. తాజాగా హైదరాబాద్‌లో ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించింది చిత్ర యూనిట్. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన నాగశౌర్య మాట్లాడుతూ.. మంచి కథతో తీసిన ఈ సినిమా ట్రైలర్, పాటలు చూస్తుంటే ఈ సినిమా చూడాలనిపిస్తుంది. హీరో, హీరోయిన్ లిద్దరూ చాలా బాగా నటించారు . రష్మీ గురించి తెలియని వారంటూ ఎవరూ ఉండరు. అలాంటి మంచి పేరున్న తను హీరో నందుకు సపోర్ట్ చేయడానికి ఈ సినిమాకు డబ్బులు తీసుకోకుండా ఆటోలో తిరిగింది అని విన్నాను. తనకు సినిమా పై ఎంత ప్యాషన్ ఉందో అర్థమవుతుంది. నందు ఈ సినిమా కొరకు చాలా కష్టపడ్డాడు. మంచి కంటెంట్ ను నమ్ముకొని తీసిన ఈ సినిమా టైటిల్ మాదిరే బిగ్ బ్లాక్ బస్టర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను’ అన్నారు. సుడిగాలి సుధీర్ మాట్లాడుతూ.. రష్మీ ని చూసి ఇస్పైర్ అయిన చాలా మందిలో నేను ఒకణ్ణి, ఆలా అందరూ బాగుండాలని కొరుకొనే తనకు, నందుకు, దర్శక, నిర్మాతలకు చిత్ర యూనిట్ సభ్యులు అందరికీ ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’అన్నారు. చిత్ర హీరో నందు మాట్లాడుతూ.. నన్ను నమ్మి కథ కూడా వినకుండా ఈ సినిమా చేయడానికి ముందుకు వచ్చింది రష్మీ .తనకు ఈ సినిమా షూట్ చేస్తున్న టైమ్ లో తనకు మేము సరైన సదుపాయాలు కల్పించలేక పోయినా తను మాకు ఫుల్ సపోర్ట్ చేసింది. తనకు ఒక్క థ్యాంక్స్ చెపితే సరిపోదు. ప్రతి ఒక్కరు కష్టపడి పని చేసిన మా సినిమా కచ్చితంగా ప్రేక్షకులను నచ్చుతుందని భావిస్తున్నాం’అన్నారు. -
ఆ వీడియోపై రష్మీ షాకింగ్ కామెంట్స్, అది ప్రాంక్ కాదు.. నిజమే!
యాంకర్ రష్మీ ఫోన్ ఎత్తదు, మూవీ ప్రమోషన్లకు రాదంటూ ఇటీవల నటుడు నందు ఆమెపై ఫైర్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఇది చివరకు ప్రాంక్ వీడియో అని తేలింది. నందు హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘బొమ్మ బ్లాక్‌బస్టర్’. ఈ మూవీ ప్రమోషన్లో భాగంగా ఈ వీడియోను తీసినట్లు చివరిలో నందు పేర్కొన్నాడు. తాజాగా ఈ మూవీ ప్రమోషన్లో భాగంగా యాంకర్ రష్మి, నందులు సాక్షి టీవీతో ముచ్చటించారు. ఈ సందర్భంగా మూవీ ప్రమోషన్స్‌కు రష్మి రాదని, కాల్స్ కూడా ఎత్తదు అంటూ ప్రాంక్ వీడియో తీశారు కదా.. అది ముందుగానే ప్లాన్ చేసుకుని తీశారా? లేదా అప్పటికప్పుడు తీశారా? అని యాంకర్ ప్రశ్నించారు. చదవండి: ‘కాంతార’ మూవీపై కంగనా రనౌత్ ఆసక్తికర వ్యాఖ్యలు దీనికి రష్మి స్పందిస్తూ అది నిజమే కానీ దానికి ప్రాంక్ వీడియో అని పేరు పెట్టారంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. అయితే ఈ వీడియోలో రష్మీ ‘నేను రాను.. నాకు ఈ ప్రెజర్ తీసుకోవడం ఇష్టం లేదు’అని మొహం మీదే చెప్పేసింది. అది తాను నిజంగానే అన్నానని చెప్పింది. ‘ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను రెండేళ్ల తర్వాత విడుదల చేస్తున్నారు. నేను టీవీకి పని చేస్తాను. అప్పటికే నేను కమిట్ అయిన ప్రాజెక్ట్స్ ఉంటాయి. రెండు రోజులు బిజీ షెడ్యూల్ ఉంది. నాకు ఒక 2 లేదా 3 రోజులు టైం ఇవ్వమని చెప్పాను. చదవండి: ఓటీటీకి వచ్చేసిన బింబిసార, అర్థరాత్రి నుంచి స్ట్రీమింగ్ అయిన వారు వినకుండా ప్రమోషన్స్ ఉన్నాయి రా అంటూ పదే పదే కాల్, మెసేజ్‌లు చేస్తున్నారు. అందుకే చిరాకు వచ్చి కాల్స్‌కి సమాధానం ఇవ్వలేదు. దీంతో నేను చేస్తున్న షూటింగ్ స్పాట్‌కే వచ్చి నన్ను డిస్టర్బ్ చేశారు. అప్పుడు నాకు చాలా కోపం వచ్చింది. అందుకే అలా అనేశాను’ అని తెలిపింది. కాగా ప్రమోషన్స్ ఎందుకు రావని నందే ప్రశ్నించగా.. అక్కడ నాకు రకరకాల ప్రశ్నలు ఎదురువుతాయిని, వాటికి తాను సమాధానాలు చెప్పలేనని.. అందుకే నేను ప్రమోషన్స్ కు రానంటూ రష్మీ ప్రాంక్ వీడియోలో ఘాటు వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. -
ఫోన్ ఎత్తవు..ప్రమోషన్స్‌కి రావు..యాంకర్ రష్మీపై నందు ఫైర్!
ఎన్నిసార్లు ఫోన్ చేసిన ఎత్తగం లేదని, సినిమా ప్రమోషన్స్‌కి రావట్లేదంటూ యాంకర్ రష్మీగౌతమ్పై హీరో నందు ఫైర్ అయ్యాడు. అంతేకాదు యాంకర్ రష్మీ షూటింగ్ చేస్తున్న స్థలానికి వెళ్లి నానా హంగామా చేశాడు. రష్మీ కూడా నందుపై ఫైర్ అయింది. ‘నేను రాను.. నాకు ఈ ప్రెజర్ తీసుకోవడం ఇష్టం లేదు’అని మొహం మీదే చెప్పేసింది. ఇదంతా చదివి నిజంగానే రష్మీ, గౌతమ్ గొడవ పడ్డారని అనుకోకండి. ఓ సినిమా ప్రమోషన్స్ కోసం వీరిద్దరు ఈ ఫ్రాంక్ వీడియో చేశారు. వివరాల్లోకి వెళితే.. నందు, రష్మీ గౌతమ్ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ‘బొమ్మ బ్లాక్‌బస్టర్’. కుటుంబ కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రానికి రాజ్ విరాఠ్ దర్శకత్వం వహించారు. గత రెండేళ్ల క్రితమే ఈ సినిమా షూటింగ్‌ని పూర్తి చేశారు. కానీ ఇప్పటి వరకు విడుదల చేయలేదు. ఆ సినిమా ఉందనే విషయాన్ని కూడా ప్రేక్షకులు మరచిపోయారు. (చదవండి: కులం పేరుతో దూషించారు.. ప్రాణహాని ఉంది: నిర్మాత ఫిర్యాదు) ఎట్టకేలకు రెండేళ్ల తర్వాత.. ఆ సినిమాను విడుదల చేసేందుకు రెడీ అయ్యారు మేకర్స్. నవంబర్ 4న ఈ చిత్రం విడుదల కాబోతుంది. ఈ విషయాన్ని ప్రేక్షకుల్లోకి త్వరగా తీసుకెళ్లేందుకు ఈ ఫ్రాంక్ వీడియో ప్లాన్ చేశారు మేకర్స్. సినిమా టైటిల్ అనౌన్స్మెంట్ సమయంలో కూడా నందు ఇలానే చేశాడు. బీబీ అంటూ బిగ్ బాస్ అర్థం వచ్చేలా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. దీంతో బిగ్‌బాస్‌లోకి వెళ్తాడని అంతా భావించారు. కానీ చివరకు తన కొత్త సినిమా టైటిల్ ‘బొమ్మ బ్లాక్‌బస్టర్’ అని సెలవించాడు. -
సింగర్ గీతా మాధురి కూతుర్ని చూశారా? ఎంత క్యూట్‌గా ఉందో..
సింగర్ గీతామాధురి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. తన పాటలతో ఎంతోమంది అభిమానుల్ని సంపాదించుకున్న గీతా ప్రస్తుతం కెరీర్లోనూ బిజీగా మారిపోయింది. ప్రస్తుతం బుల్లితెరపై ప్రసారమవుతున్న ఓ షోకు మెంటర్‌గానూ అలరిస్తున్న గీతా సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటుంది. తాజాగా తన కూతురు దాక్షాయణి ప్రకృతి మూడవ బర్త్‌డే సెలబ్రేషన్స్ ఫోటోలను అభిమానులతో పంచుకుంది. ఈ క్రమంలో పలువురు నెటిజన్లు ఆ పాపకు బర్త్‌డే విషెస్‌ను తెలియజేస్తున్నారు. కాగా 2014 ఫిబ్రవరి 9న నటుడు నందుతో గీతా మాధురి వివాహం జరిగిన సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Geetha Madhuri (@singergeethamadhuri) View this post on Instagram A post shared by Geetha Madhuri (@singergeethamadhuri) -
కెల్విన్‌తో కలిపి నందు విచారణ
సాక్షి, హైదరాబాద్: టాలీవుడ్ ప్రముఖులతో ముడిపడి ఉన్న డ్రగ్స్ కేసులో కొత్త ట్విస్ట్. ఈ కేసుకు సంబంధించిన మనీల్యాండరింగ్ వ్యవహారాలపై దర్యాప్తు చేస్తున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఇప్పటివరకు ముగ్గురిని ప్రశ్నించగా... మంగళవారం సినీ నటుడు నందు విచారణ సమయంలో క్రాస్ ఎగ్జామినేషన్‌కు తెర తీశారు. డ్రగ్స్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న కెల్విన్‌ను సైతం ఈడీ కార్యాలయానికి తీసుకొచ్చిన అధికారులు ఇద్దరినీ విడివిడిగా, ఆ తర్వాత కలిపి విచారించారు. దాదాపు ఏడు గంటల విచారణ తర్వాత నందును పంపించగా, కెల్విన్ విచారణను కొనసాగించారు. ఆయనను రాత్రి 10 గంటలకు పంపించారు. కెల్విన్ ప్రస్తుతం బెయిల్‌పై ఉన్నాడు. ఈడీ ముందుకు ముందే... షెడ్యూల్ ప్రకారం నందు ఈడీ అధికారుల ఎదుట ఈ నెల 20న హాజరుకావాల్సి ఉంది. అయితే అనివార్య కారణాలతో నందు మంగళవారమే ఈడీ ముందు హాజరయ్యారు. కెల్విన్‌తో నందుకు కొన్ని ఆర్థిక లావాదేవీలు ఉన్నట్లు ఈడీ అనుమానిస్తోంది. ఈ నేపథ్యంలోనే డ్రగ్స్ కొనుగోలుకు నగదు వెచ్చించారా? లేక కెల్విన్‌కు బదిలీ చేశారా? అన్న కోణంలో నందు విచారణ సాగింది. ఈ ఆరోపణలు నిరాధారమంటూ కొట్టేసిన నందు తన బ్యాంకు ఖాతాల స్టేట్మెంట్ను అధికారులకు ఇచ్చినట్లు తెలిసింది. అధికారులు నందు సమగ్ర వాంగ్మూలం నమోదు చేశారు. దర్శకుడు పూరీ జగన్నాథ్, నటీమణులు చార్మీ, రకుల్‌ప్రీత్‌సింగ్‌ల విచారణ సమయంలో కెల్విన్‌ను ఈడీ కార్యాలయానికి తీసుకురాని అధికారులు నందు విచారణ సమయంలో మాత్రం ఆయనను తీసుకురావడం గమనార్హం. నందు ఉదయం ఈడీ ఎదుటకు రాగా... మధ్యాహ్నం కేంద్ర బలగాలతో కూడిన ప్రత్యేక బృందం కెల్విన్‌ను తీసుకొచ్చింది. అతడి ఇంటి నుంచి కొన్ని పత్రాలు, ల్యాప్‌టాప్, ఫోన్లనూ అధికారులు తెచ్చారు. ఎదురెదురుగా ఉంచి ప్రశ్నలు కెల్విన్ కాల్ డేటాలో నందు నంబర్ ఉన్నట్లు గతంలో ఎక్సైజ్ అధికారులూ గుర్తించారు. వాట్సాప్‌లోనూ వీరి మధ్య జరిగిన చాటింగ్స్‌నూ ఆరా తీశారు. ఇప్పుడు ఈడీ అధికారులు సైతం ప్రధానంగా ఈ అంశాలపైనే ఇద్దరినీ విచారించారు. కెల్విన్ ఈవెంట్ మేనేజర్ కావడం వల్ల సంప్రదింపులు జరిపానని, అంతకుమించి తనకు డ్రగ్స్ వ్యవహారంతో సంబంధం లేదని నందు చెప్పినట్టు తెలిసింది. సినిమా రంగంలో ఎవరైనా డ్రగ్ వాడతారా? అని ఈడీ అధికారులు ప్రశ్నించగా.. తన వద్ద ఎలాంటి సమాచారం లేదని నందు చెప్పినట్లు తెలిసింది. రెండు గంటలపాటు నందు, కెల్విన్‌లను విడివిడిగా విచారించిన అధికారులు.. ఆపై ఇద్దరినీ కలిపి విచారిస్తూ కొన్ని సందేహాలు లేవనెత్తినట్లు తెలుస్తోంది. తాజా పరిణామాల నేపథ్యంలో ఈడీ నందుతోపాటు మరికొందరిని మరోసారి విచారించే అవకాశం ఉంది. రానాకు అనూహ్యంగా.. ఈడీ జారీ చేసిన సమన్ల ఆధారంగా బుధవారం సినీ నటుడు దగ్గుబాటి రానా విచారణకు హాజరుకావాలి. 2017లో సిట్ విచారణలో ఆయన పేరు రాలేదు. అయితే అనూహ్యంగా ఈడీ అధికారులు ఆయనకు సమన్లు జారీ చేశారు. మరోపక్క కెల్విన్‌ను ఎక్సైజ్ అధికారులు అరెస్టు చేయడానికి ముందే 2016లో హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. దీనికి సంబంధించి నమోదైన కేసులో దర్యాప్తు పూర్తి చేసిన అధికారులు అభియోగపత్రాలు దాఖలు చేశారు. ఈ కేసుకు సంబంధించి నాంపల్లి న్యాయస్థానం కెల్విన్‌కు సమన్లు జారీ చేసింది. వచ్చే నెల 11న విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. -
టాలీవుడ్ డ్రగ్స్ కేసు: ఈడీ విచారణకు హాజరైన నందు
-
డ్రగ్స్ కేసులో విచారణకు హాజరైన నందు
Actor Nandu Appears At Enforcement Directorate: టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణ కొనసాగుతుంది. ఇప్పటికే ఈ కేసులో డైరెక్టర్ పూరి జగన్నాథ్, హీరోయిన్స్ చార్మీ, రకుల్ ఈడీ విచారణను ఎదుర్కున్నారు. తాజాగా నటుడు, సింగర్ గీతా మాధురి భర్త నందు నేడు (సెప్టెంబర్7)న ఈడీ ఎదుట హాజరయ్యారు. నిజానికి ఈనెల 20న నందు ఈడీ ఎదుట విచారణకు హాజరు కావాల్సి ఉండగా, వ్యక్తిగత కారణాలతో నేడు ఈడీ ఆఫీసుకు చేరుకున్నారు. కాగా గతంలో హీరోయిన్ రకుల్ సైతం నోటీసులో పేర్కొన్న దాని కంటే ముందుగానే ఈడీ ఎదుట హాజరయ్యారు. ఇప్పుడు నందు సైతం 13రోజుల ముందుగానే విచారణను ఎదుర్కోవాల్సిన అవసరం ఏంటి అన్న ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. ముఖ్యంగా మనీలాండరింగ్, ఫెమా నిబంధనల ఉల్లంఘన నేపథ్యంలో నందును విచారిస్తున్నట్లు తెలుస్తుంది. డ్రగ్ పెడ్లర్ కెల్విన్ ఇచ్చిన సమాచారంతో ఈడీ అధికారులు నందును విచారిస్తున్నారు. ఈ క్రమంలో చార్మీ, రకుల్‌తో పరిచయాలు, ఎఫ్ క్లబ్‌తో ఉన్న సంబంధాలపై నందుపై ప్రశ్నల వర్షం కురిపించనుంది. గతంలోనూ 2017లో జరిపిన ఎక్సైజ్ విచారణను సైతం నందు ఎదుర్కున్న సంగతి తెలిసిందే. చదవండి: టాలీవుడ్ డ్రగ్స్ కేసుపై పూనమ్ కౌర్ సంచలన వ్యాఖ్యలు రియా చక్రవర్తితో సంబంధమేంటి? -
నందు యాక్టింగ్‌పై భార్య గీతా మాధురి కౌంటర్!
టాలీవుడ్ సింగర్ గీతా మాధురి, ఆమె భర్త హీరో నందు సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్‌గా ఉంటారు. సోషల్ మీడియాలో తనపై వచ్చే ట్రోల్స్‌పై నందు స్పందిస్తూ తనదైన శైలిలో వేసే సటైర్లకు నెటిజన్లు ఫిదా అవుతుంటారు. అలాగే మీమ్స్, థంబ్ నెయిల్స్ మీద నందు వేసే సెటైర్లు అందరినీ ఆకట్టుకుంటాయి. ఈ క్రమంలో నందుకు ఫాలోయింగ్ కూడా పెరిగిపోయింది. అదే విధంగా తన భార్య గీతా మాధురి, తనపై వచ్చే మీమ్స్, ట్రోల్స్‌ను ఎంతో స్పోర్టీవ్‌గా తీసుకునే అతడు ఇటీవల సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ‘సవారి’ సినిమాతో నందు హీరోగా హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. దీంతో తన సినిమాపై నెటిజన్లు నెగెటివ్ కామెంట్స్, చేయడం, తన స్టార్డం మీద సెటైర్లు వేయడంతో అతడు ఫైర్ అయ్యాడు. కాగా ప్రస్తుతం ‘బొమ్మ బ్లాక్ బస్టర్’ అనే మూవీలో నటిస్తున్నాడు. అయితే మీమర్స్‌ను ఎంకరేజ్ చేసేందుకు నందు తన మీద, తన చిత్రం మీద వెరైటీ మీమ్స్ వేసిన వారికి ఇటీవల ఓ స్పెషల్ గిఫ్ట్సను కూడా ఆఫర్ చేశాడు. ఈ నేపథ్యంలో ఇటీవల ఆయన భార్య గీతాపై వచ్చిన ఓ మీమ్‌పై స్పందించాడు. ‘మీరు ఒక వేళ నటి అయ్యుంటే మా పరిస్థితి ఏంటి’అని తెలుగు హీరోయిన్స్ అనుకుంటున్నట్టుగా గీతాను ఉద్దేశిస్తూ ఓ మీమ్ ఇటీవల వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఆ మీమ్ కాస్తా నందు దృష్టికి వచ్చింది. అది చూసిన నందు ‘మరి కలిసి ఒక స్క్రిప్ట్ చేద్దామా’ అంటూ ఫన్నిగా కౌంటర్ వేశాడు. ఇక నందు కామెంట్‌పై గీతా స్పందిస్తూ.. ‘అబ్బో నువ్వు చాలా చేశావ్‌గా.. నాకు అంత లేదు నీకు తెలుసుగా?’ అంటూ భర్త కామెంట్‌కు కౌంటర్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ జంట కామెంట్లు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. కాగా గీతా మాధురి బిగ్ బాస్ రెండో సీజన్లో రన్నర్‌గా నిలిచి అందరిని మనసులను గెలుచుకున్న సంగతి తెలిసిందే. నందు కూడా బిగ్ బాస్ ఇంట్లోకి రాబోతోన్నాడనే వార్తలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. అయితే బీబీ అంటూ తన ‘బొమ్మ బ్లాక్ బస్టర్’ మూవీని బిగ్ బాస్ పేరిట ప్రమోట్ చేసుకుని అందరి దృష్టిలో పడ్డాడు. చదవండి: అలాంటి సినిమాల్లో నటించాలని ఉంది: ఇలియానా ‘అసలు ఈ ఏడాది బిగ్‌బాస్ ఉందా లేదా?!’ -
బిగ్‌బాస్‌లో నందు వాయిస్
ఆ మధ్య బీబీ అంటూ పోస్టులూ పెడుతూ నటుడు నందు రచ్చ రచ్చ చేశాడు. దీంతో అతడు బిగ్‌బాస్‌లో అడుగు పెట్టబోతున్నాడని అంతా అనుకున్నారు. కానీ అందరి ఊహాగానాలను చిన్నాభిన్నం చేస్తూ బీబీ అంటే "బొమ్మ బ్లాక్‌బస్టర్" అని తన తర్వాతి సినిమా టైటిల్‌ను వెల్లడించాడు. దీంతో అతడు బిగ్‌బాస్‌లోకి వెళ్తున్నాడనుకున్న అభిమానులు నిరుత్సాహపడ్డారు. కానీ నిన్న బిగ్‌బాస్ ఎపిసోడ్లో నందు వినిపించాడు. (చదవండి: బిగ్‌బాస్: సూర్యకిరణ్ అవుట్, ఆమెపై బిగ్‌బాంబ్!) అతడు రాకపోయినా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన ముక్కు అవినాష్ ఏవీకి వాయిస్ ఓవర్ ఇచ్చాడు. అవినాష్ లైఫ్ జర్నీకి సంబంధించిన ఈ ప్రోమోలో అతడు బాల్యం నుంచి యవ్వనం వరకు పడ్డ కష్టనష్టాలను గురించి వివరంగా చెప్పుకొచ్చాడు. ఈ విషయాన్ని నందు ఇన్‌స్టాగ్రామ్‌లో తెలియజేశాడు. "నేను చాలా ఇష్టపడే డైరెక్టర్, నా స్నేహితుడు అవినాష్ కోసం వాయిస్ ఓవర్ చెప్పాను. బీబీ, బీబీ అని చెప్పినందుకు చివరికి ఇలానైనా నా వాయిస్ బిగ్‌బాస్‌లో వినపడినందుకు సంతోషం" అని తెలిపాడు. కాగా అవినాష్ ఇంట్లోకి వచ్చిన తొలిరోజే అందరితో కలిసిపోయాడు. గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన అవినాష్‌ను ఇంటి సభ్యులు కూడా బాగానే ఆడకున్నారు. మరి నేడు కామెడీ స్కిట్లో అవినాష్ గెలుస్తాడో లేదో చూడాలి! (చదవండి: గంగవ్వకు మరోసారి కరోనా పరీక్ష) View this post on Instagram Nenu chaala ishtapadey Director and naa friend Avinash kosam Voice over cheppananu . . BB BB ani cheppinandhuku finally ila atleast naa voice through meeku ee BB lo vinapadinandhuku santosham :) A post shared by @ that_actor_nandu on Sep 17, 2020 at 9:23am PDT -
పోతురాజు ప్రేయసిగా రష్మీ గౌతమ్
బుల్లితెర యాంకర్ రష్మీ గౌతమ్ పేరు తెలియని వాళ్లు ఉండరు. అటు టీవీ షోలు చేస్తూనే అప్పుడప్పుడు సినిమాల్లోనూ కనిపిస్తున్నారు. ఆ మధ్య వచ్చిన "గుంటూరు టాకీస్" చిత్రంలో అందాల ఆరోబోతకే ప్రాధాన్యం ఇచ్చిన రష్మీ ఇప్పుడు అభినయానికి స్కోప్ ఉన్న పాత్రలో నటిస్తున్నారు. ప్రస్తుతం "బొమ్మ బ్లాక్ బస్టర్" అనే చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో హీరో నందు పోతురాజు పాత్రను పోషిస్తున్నారు. అతని ప్రేయసి వాణిగా రష్మీ అలరించనున్నారు. వాణి ఫస్ట్ లుక్‌ను చిత్రయూనిట్ బుధవారం విడుదల చేసింది. (చదవండి: ప్లీజ్.. అలా రాయొద్దు!) కిరీటం ధరించి, ఏడు కొండల నామం పెట్టుకుని, మెడలో పూల మాల వేసుకున్న రష్మీ చిరునవ్వులు చిందుస్తున్నారు. ఈ గెటప్‌లో రష్మీ చాలా బాగుందంటూ ఆమె అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ సినిమాలో నందు పూరీ జగన్నాథ్ అభిమానిగా కన్పిస్తారు. విజయూభవ బ్యానర్‌పై ప్రవీణ్ పగడాల, బోసుబాబు, ఆనంద్ రెడ్డి, మనోహర్ రెడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రశాంత్ విహారి సంగీతమందిస్తున్నారు. ఇక ఈ చిత్రం నుంచి ఇటీవలే విడుదలైన మోషన్ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఇదిలా వుంటే ఆ మధ్య నందు బీబీ గురించి బిగ్ అనౌన్స్ మెంట్.. ఇక రచ్చ రచ్చే అని వరుస పోస్టులతో తన అభిమానులను తెగ ఊరించారు. బీబీ అనగానే అందరూ బిగ్‌బాస్ అనుకున్నారు కానీ, అనూహ్యంగా "బొమ్మ బ్లాక్‌బస్టర్" అంటూ టైటిల్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఎలాగైతేనేం, తన సినిమాకు కావాల్సినంత పబ్లిసిటీ చేసుకున్నారు. (చదవండి: టిక్‌టాక్ వీడియోపై రష్మి ఆగ్రహం) -
'బిగ్‌బాస్'లో నందు: అది ఇది కాదు
నటుడు నందు బిగ్‌బాస్ ఇంట్లో అడుగు పెట్టనున్నాడంటూ గత కొంత కాలంగా వార్తలు ఊపందుకున్నాయి. వీటికి మరింత బలాన్ని చేకూరుస్తూ బిగ్ అనౌన్స్మెంట్ చేయబోతున్నానని నందు ప్రకటించాడు. అన్నట్లుగానే బిగ్‌బాస్ 4 సీజన్లో పాల్గొంటున్నట్లు ఇన్‌డైరెక్ట్‌గా వెల్లడించాడు. "డార్లింగ్స్ నేను బీబీలో ఉండబోతున్నా... బీబీలో మన రచ్చ మామూలుగా ఉండదు. మరింత ఎంటర్టైన్మెంట్ ఇచ్చేందుకు మీ సపోర్ట్ కావాలి" అంటూ ఊదరగొట్టాడు. తాజాగా 'అది ఇది కాదు' అంటూ అభిమానులను తికమక పెడుతూ మరో వీడియో రిలీజ్ చేశాడు. (చదవండి: బిగ్‌బాస్ 4 కంటెస్టెంట్‌కి కరోనా పాజిటివ్!) బిగ్‌బాస్ నిర్వాహకులు ఒప్పుకోరు కదా! ఈ వీడియోలో ఫోన్ ఎత్తిన నందు.. "బీబీ అంటే అది కాదు సర్, అప్పుడు మనం డిస్కస్ చేశామే అది. కానీ ఇది కానే కాదు.. అది మాత్రమే. అదే నేనివాళ చెప్దాం అనుకున్నాను. కానీ వాళ్లేమో రేపు చెప్పమంటున్నారు. నేనేమో ఇప్పుడు చెప్తా అని కమిట్ అయిపోయాను. కానీ, రేపు పక్కా చెప్తాను" అని ముగించాడు. దీనికి 'ఇస్మార్ట్ శంకర్' సినిమాలోని అది ఇది కాదు.. అదే ఇది పాటను జోడించాడు. దీంతో నందు అభిమానులు మరింత అయోమయంలో పడ్డారు. అసలు నందు బిగ్‌బాస్‌లో ఉన్నాడా? లేదా? అన్న సందిగ్ధంలో పడిపోయారు. ఒకవేళ ఉంటే, ఇలా ముందే ప్రకటించేందుకు బిగ్‌బాస్ వాళ్లు ఒప్పుకోరు కదా అంటూ ప్రశ్నలు కురిపిస్తున్నారు. మరికొందరేమో నందు బీబీలో కంటెస్టెంట్‌గా రావట్లేదు అనుకుంట అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. (చదవండి: బిగ్‌బాస్-4: భారీ ఆఫర్.. నో చెప్పిన హీరోయిన్?) నందు పబ్లిసిటీ స్టంట్ 'అన్నా.. నువ్వు అలా చెప్పేస్తే బిగ్‌బాస్ నుంచి నిన్ను తీసేస్తారు' అంటూ మరికొందరు టెన్షన్ పడుతున్నారు. నందు అభిమానులు మాత్రం 'మా ఓటు నీకే..' అంటూ ఆయన ఎంట్రీ గ్యారెంటీ అని నమ్ముతున్నారు. అయితే బీబీ అంటే బిగ్‌బాస్ కాకుండా మరేదైనా అయ్యే అవకాశమే ఎక్కువగా ఉంది. అతని భార్య, సింగర్ గీతామాధురి కూడా ఇదివరకే బిగ్‌బాస్‌లో పాల్గొంది. కాబట్టి ఈ ప్రోగ్రాం విధివిధానాలు కూడా ఆయనకు ఎంతోకొంత తెలిసే ఉండాలి. అందులోనూ హౌస్‌లో అడుగుపెట్టే విషయాన్ని కంటెస్టెంట్లు ముందే వెల్లడించడం పూర్తిగా నిషేధం. కాబట్టి నందు చేసే ఈ పబ్లిసిటీ స్టంట్ దేనికో తెలియాలంటే ఆయనే మరో అప్డేట్ ఇచ్చేవరకు వేచి చూడాల్సిందే. (చదవండి: సువర్ణా.. ఇన్నావా) View this post on Instagram Update !!! A post shared by Actor Nandu (@that_actor_nandu) on Aug 25, 2020 at 8:15am PDT -
ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నా
‘‘నేను ఇండస్ట్రీకి వచ్చి 13 ఏళ్లవుతోంది. ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నా. యూట్యూబ్ వచ్చిన తర్వాత అయితే ఇష్టం వచ్చినట్లు.... ఆత్మగౌరవాన్ని అహంలా భావించేవాడు నా స్థానంలో ఉండి ఉంటే సూసైడ్ చేసుకోవాలేమో. నాకు డబ్బు కన్నా.. గౌరవం ముఖ్యం. ఫలితంతో సంబంధం లేకుండా ఇండస్ట్రీలో నా పదమూడేళ్ల స్ట్రగుల్‌కు ‘సవారి’ చిత్రం నాకు గౌరవాన్ని తెచ్చిపెడుతుందని అనుకుంటున్నాను (చెమర్చిన కళ్లతో)’’ అన్నారు నందు. సాహిత్ మోత్కూరి దర్శకత్వంలో నందు, ప్రియాంకా శర్మ జంటగా నిషాంక్ రెడ్డి కుడితి, సంతోష్ మోత్కూరి నిర్మించిన ‘సవారి’ నేడు విడుదవుతోంది. ఈ సందర్భంగా నందు మాట్లాడుతూ – ‘‘సాహిత్ మోత్కూరి ‘సవారి’ కథ చెప్పారు. బాగా నచ్చింది. కానీ సినిమాలో నాది సెకండ్ లీడ్ రోల్ అన్నారు. అసలు నన్నెందుకు హీరోగా ఊహించుకోలేకపోతున్నారనే బాధ కలిగింది. హీరోగా నటిస్తానని చెబితే సరే అన్నారు. ప్రాణం పెట్టి సినిమా చేశాం. యూఎస్‌లో మూడు ప్రీమియర్ షోలు సోల్డ్ అవుట్ అయ్యాయి’’ అన్నారు. పాత్రను చంపను! కెరీర్ మొదట్లో సర్వైవల్ కోసం కొన్ని సినిమాలు చేశాను. ఒక్కో మెట్టు ఎక్కుతూ ఇంత దూరం వచ్చాను. నందు ఏ పాత్ర అయినా చేయగలడు అంటున్నారు కానీ నా కోసం పాత్ర రాయడం లేదు. నాకు ఇచ్చిన పాత్రను నా యాక్టింగ్‌తో చంపను. వీలైనంత బాగా చేయడానికే ట్రై చేస్తా. -
వేసవిలో సవారి
నందు, ప్రియాంకా శర్మ జంటగా సాహిత్ మోత్కూరి దర్శకత్వంలో సంతోష్ మోత్కూరి, నిషాంక్ రెడ్డి నిర్మించిన చిత్రం ‘సవారి’. ఫిబ్రవరి 7న విడుదల కానున్న ఈ సినిమా ట్రైలర్ విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. హీరో శ్రీ విష్ణుతో కలిసి ట్రైలర్‌ను విడుదల చేసిన సుధీర్‌బాబు మాట్లాడుతూ– ‘‘నేను హీరోగా నటించిన ‘సమ్మోహనం’ చిత్రంలో నందు నటించాడు. మొదట అతని పాత్రకు వేరొకరని తీసుకుందామని దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణను అడిగాను. కానీ ఆ పాత్రను నందూయే చేయాలన్నారు. నందు బాగా నటించాడు. నేను, తను దాదాపు ఒకేసారి ఇండస్ట్రీలోకి వచ్చాం. నందు ఎలాంటి క్యారెక్టర్లో అయినా ఒదిగిపోగలడు. ఈ చిత్రదర్శకుడు సాహిత్ నాకో కథ చెప్పాడు. ఆ కథ నచ్చినప్పటికీ సినిమా చేయలేకపోయాం. ‘సవారి’ కంటెంట్ ఉన్న సినిమాలా కనిపిస్తోంది. సాహిత్ భవిష్యత్‌లో పెద్ద దర్శకుడు అవుతాడు’’ అన్నారు. ‘‘ఈ సినిమా కోసం నందు పడ్డ కష్టం ఎక్కడికీ పోదు. విడుదల తర్వాత ‘సవారి’ చిత్రం పెద్ద సినిమాగా నిలవాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా పాటలు నాకు బాగా నచ్చాయి’’ అన్నారు శ్రీ విష్ణు. ‘‘డబ్బుల కోసం నేను చాలా సినిమాలు చేశాను. నటుడిగా అవి నాకు మంచి అనుభవాన్ని ఇచ్చాయి. ‘సమ్మోహనం’ తర్వాత మంచి సినిమా చేయాలనే ఉద్దేశంతో ఏడాది గ్యాప్ తీసుకుని ‘సవారి’ చిత్రం చేశాను. తొలి పోస్టర్ రిలీజ్ నుంచే ఈ సినిమాకు మంచి బజ్ వస్తుండటం చాలా సంతోషంగా ఉంది. ఇక నుంచి మంచి సినిమాలే చేస్తాను’’ అన్నారు నందు. ‘‘ఈ సినిమా కోసం అందరం చాలా కష్టపడ్డాం. ఈ సినిమాను మా అన్నయ్య, స్నేహితుడు కలిసి నిర్మిస్తున్నారు. ఇందులోని రెండు పాటలకు 10 మిలియన్ (కోటి) వ్యూస్ రావడం చిన్న విషయం కాదు’’ అన్నారు సాహిత్ మోత్కూరి. ఈ కార్యక్రమంలో శివ, జీవన్, మ్యాడీ, శ్రీకాంత్ రెడ్డి, బల్వీందర్, పూర్ణాచారి, కరిముల్లా, ఎడిటర్ సంతోష్ మేనం పాల్గొన్నారు. -
సవారీ మూవీ ట్రైలర్ లాంచ్
-
వాలి స్ఫూర్తితో...
ముగ్గురు అబ్బాయిలు ఒకే అమ్మాయిని ప్రేమిస్తారు. అయితే ఆ ముగ్గురిలో ఆ అమ్మాయి ఎవరిని ప్రేమించింది? అనే సస్పెన్స్ కథాంశంతో రూపొందిన చిత్రం ‘శివరంజని’. రశ్మి, నందు, అఖిల్ కార్తీక్, ఇంద్ర ప్రధాన పాత్రల్లో నాగప్రభాకర్ దర్శకత్వంలో తెరకెక్కింది. యూ అండ్ ఐ ఎంటరై్టన్మెంట్ పతాకంపై ఎ. పద్మనాభ రెడ్డి నిర్మించిన ఈ సినిమా ఆగస్టు 2న విడుదలకానుంది. ఈ సందర్భంగా ఎ.పద్మనాభరెడ్డి మాట్లాడుతూ– ‘‘రంగు’ సినిమా తర్వాత మా బ్యానర్లో వస్తోన్న సినిమా ఇది. లవ్, సస్పెన్స్, హారర్‌తో పాటు థ్రిల్లర్ అంశాలున్నాయి. ప్రేక్షకులు థ్రిల్‌ను బాగా ఎంజాయ్ చేస్తారు. శివరంజని ఎవరు? అనేది తెలుసుకోవడమే సినిమా. ధన్‌రాజ్ కామెడీ, శేఖర్ చంద్ర మ్యూజిక్ హైలైట్‌గా నిలుస్తాయి’’ అన్నారు. ‘‘కె. రాఘవేంద్రరావు, చంద్రమహేష్, వినాయక్ గార్ల వద్ద అసిస్టెంట్‌గా పనిచేశాను. ‘వాలి’ సినిమా నుంచి స్ఫూర్తి పొంది రాసుకున్న కథ ఇది. ముందు క్లయిమాక్స్ రాసుకుని ఆ తర్వాత కథ రెడీ చేశా. అనుకున్నదాని కంటే సినిమా బాగా వచ్చింది’’ అన్నారు నాగప్రభాకర్. నందినీరాయ్, అఖిల్ కార్తీక్, ధన్‌రాజ్, ఢిల్లీ రాజేశ్వరి నటించిన ఈ సినిమాకి కెమెరా: సురేందర్ రెడ్డి, సమర్పణ: నల్లా స్వామి, సహ నిర్మాత: కటకం వాసు. -
నా కెరీర్ బెస్ట్ ఫిల్మ్ సవారి
‘‘తెలుగు తెరపై కొత్త కథలు వస్తున్నాయి. సాహిత్ ఎంచుకొన్న కథ డిఫరెంట్‌గా ఉంది. దాన్ని తెరపై బాగా చూపించి ఉంటారనే నమ్మకం ఉంది. నందుకు ఈ సినిమా చక్కటి బ్రేక్ ఇస్తుంది అనుకుంటున్నాను’ అన్నారు దర్శకుడు తరుణ్ భాస్కర్. ‘బంధం రేగడ్’ అనే ఇండిపెండెంట్ ఫిల్మ్‌తో గుర్తింపు పొందిన సాహిత్ మోత్కూరి దర్శకత్వం వహించిన చిత్రం ‘సవారి’. సంతోశ్ మోత్కూరి, నిశాంక్ కుడితి నిర్మించారు. నందు, ప్రియాంకా శర్మలు జంటగా నటించిన ఈ చిత్రం టీజర్‌ను హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా దర్శకుడు తరుణ్ భాస్కర్, ప్రణయ్‌రెడ్డి వంగా, టి.ఎన్.ఆర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నందు మాట్లాడుతూ– ‘‘ఇదివరకు నేను చాలా సినిమాల్లో నటించాను. ‘సవారి’ నా కెరీర్ బెస్ట్ ఫిల్మ్. సాహిత్ ఓ కొత్త కథను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. నా బాడీ లాంగ్వేజ్, క్యారెక్టర్ ఈ సినిమాకు కరెక్ట్‌గా సెట్ అయ్యాయి’’ అన్నారు. సాహిత్ మాట్లాడుతూ– ‘‘టీజర్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. హీరో పాత్ర విభిన్నంగా ఉంటుంది. నందు ఈ పాత్రకు బాగా సెట్ అయ్యాడు’’ అన్నారు. ‘‘ఈ చిత్రం షూటింగ్ సమయంలో నందు నన్ను ఎంతగానో సపోర్ట్ చేశాడు. ఈ సినిమాలో నేను చాలెంజింగ్ రోల్ చేశాను. ఇంత మంచి పాత్ర ఇచ్చిన సాహిత్‌కు థ్యాంక్స్’’ అన్నారు ప్రియాంకా శర్మ. -
కామెడీ ‘సవారి’కి రెడీ
బంధం రేగడ్ అనే ఇండిపెండెంట్ మూవీతో గుర్తింపు తెచ్చుకున్న సాహిత్ మోత్ కూరి ‘సవారి’ చిత్రంతో దర్శకుడిగా మారారు. నందు, ప్రియాంక శర్మ జంటగా నటించిన ఈ చిత్ర టీజర్ విడుదల కార్యక్రమం ప్రసాద్ ల్యాబ్‌లో జరిగింది. ఈ సమావేశంలో చిత్ర యూనిట్‌తో పాటు పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా హీరో నందు మాట్లాడుతూ.. ‘ఇదివరకు నేను చాలా సినిమాల్లో నటించాను. సవారీ చిత్రం నా కెరీర్లో బెస్ట్ అని భావిస్తున్నా. ఈ చిత్రం మిమ్మల్ని అలరిస్తుందని నమ్ముతున్నాను. డైరెక్టర్ సాహిత్ కొత్త కథను మీముందుకు తీసుకొని వస్తున్నారు. నిర్మాతలు సంతోష్ మోత్కురి, నిశాంక్ రెడ్డి ఈ సినిమాను రాజీ పడకుండా నిర్మించారు. నా బాడీ ల్యాంగేజ్ ఈ సినిమాకు కరెక్ట్ గా సెట్ అయ్యింది. త్వరలో ట్రైలర్ విడుదల చేసి విడుదల తేదీని ప్రకటిస్తాము’ అన్నారు. డైరెక్టర్ తరుణ్ భాస్కర్ మాట్లాడుతూ... ‘తెలుగు సినిమాల్లో కొత్త కథలు వస్తున్నాయి. ఈ చిత్ర దర్శకుడు సాహిత్ ఎంచుకున్న కథ డిఫరెంట్‌గా ఉంది, దాన్ని తెరమీద బాగా చూపిస్తాడన్న నమ్మకం ఉంది. నందుకు ఈ సినిమాతో మంచి బ్రేక్ వస్తుందని నమ్ముతున్న. ఈ చిత్రానికి పనిచేసిన అందరూ టెక్నీషియన్స్‌కు నిర్మాతలకు బెస్ట్ విషెస్ తెలుపుతున్నా’ అన్నారు. ప్రణయ్ రెడ్డి వంగా మాట్లాడుతూ.. ‘కొత్త చిత్రాలను యూత్ ఎప్పుడూ ఆదరిస్తున్నారు. సవారీ సినిమా టీజర్ కొత్తగా ఉంది. ఈ మూవీ ప్రేక్షకాదరణ పొందుతుందని నమ్ముతున్నాను. నందుకు, డైరెక్టర్ సాహిత్‌కు ఈ సినిమా పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నా’ అన్నారు. డైరెక్టర్ సాహిత్ మాట్లాడుతూ... ‘మీడియా వారికి, మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన పెద్దలందరికి ధన్యవాదాలు. టీజర్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమాకు వర్క్ చేసిన అందరు టెక్నీషియన్స్‌కు థాంక్స్, నందు ఈ పాత్రకు బాగా సెట్ అయ్యాడు. సినిమా విడుదల తరువాత మళ్ళీ మాట్లాడుతాను’ అన్నారు. హీరోయిన్ ప్రియాంక శర్మ మాట్లాడుతూ... ‘నందు మంచి నటుడు, ఈ చిత్ర షూటింగ్ సమయంలో నన్ను ఎంతగానో సపోర్ట్ చేశారు. ఈ సినిమాలో నేను ఛాలెంగింగ్ రోల్ చేసాను, నా మీద నమ్మకంతో నాకు ఈ పాత్ర ఇచ్చిన డైరెక్టర్ సాహిత్‌కు థాంక్స్. టీజర్ బాగుందని ఫ్రెండ్స్ చెబుతున్నారు. సినిమా కూడా అందరికి నచ్చుతుందని భావిస్తున్నాను’ అన్నారు. -
రొమాంటిక్ ఎంటర్టైనర్
నందు, ప్రియాంకా శర్మ జంటగా నటించిన చిత్రం ‘సవారి’. ‘బంధం రేగడ్’ అనే ఇండిపెండెంట్ మూవీతో అందరి దృష్టిని ఆకర్షించిన సాహిత్ మోతుకూరి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. కాల్వ నరసింహ స్వామి ప్రొడక్షన్స్, నిషా ఫిలింస్ పతాకాలపై సంతోశ్ మోతుకూరి, నిషాంక్ రెడ్డి కుడితి నిర్మించిన ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదలైంది. దర్శక–నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘ఔట్ అండ్ ఔట్ న్యూ ఏజ్ రొమాంటిక్ ఎంటర్టైనర్గా రూపొందిన చిత్రమిది. జంతు నేపథ్యంలో యూనిక్ కాన్సెప్ట్‌తో తెరకెక్కింది. ఈ సినిమాలో గుర్రం పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. ఫ్రెష్ స్టోరీతో నిర్మించిన మా సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు చివరి దశలో ఉన్నాయి’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: శేఖర్ చంద్ర, కెమెరా: మోనిశ్ భూపతిరాజు. -
అలాంటి నిర్మాతలు అవసరం
‘‘శివరంజని’ టైటిల్ ఆకట్టుకునేలా ఉంది. ట్రైలర్ చాలా బాగుంది. ఇప్పుడు వస్తోన్న హారర్ చిత్రాలకు భిన్నమైన కంటెంట్ ఈ సినిమాలో కనిపిస్తోంది. ఈ మూవీ మంచి విజయం సాధించాలి’’ అని దర్శకుడు వీవీ వినాయక్ అన్నారు. రష్మి గౌతమ్, నందు జంటగా నందినీరాయ్ కీలక పాత్రలో నటించిన చిత్రం ‘శివరంజని’. నాగ ప్రభాకరన్ దర్శకత్వంలో యూ అండ్ ఐ ఎంటరై్టన్మెంట్స్ బ్యానర్లో ఎ. పద్మనాభరెడ్డి, నల్లా అయ్యన్ననాయుడు నిర్మించారు. ఈ చిత్రం ట్రైలర్‌ను విడుదల చేసిన వినాయక్ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా నిర్మాతల్లో ఒకరైన పద్మనాభరెడ్డి చిన్న చిత్రాలకు అండగా నిలుస్తున్నారు. ఇలాంటి నిర్మాతలు పరిశ్రమకు చాలా అవసరం. వీరికి మంచి విజయాలు వస్తే ఇలాంటి కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలు ఇంకా ఎక్కువగా షైన్ అవుతాయి’’ అన్నారు. నాగ ప్రభాకరన్ మాట్లాడుతూ–‘‘హారర్ చిత్రాలు అనగానే మనకు గుర్తొచ్చే అంశాలకు భిన్నంగా మా సినిమా ఉంటుంది. ట్రయాంగిల్ లవ్‌స్టోరీ మధ్య నడిచే హారర్ ఎపిసోడ్స్ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తాయి. ఊహించని కథ, కథనాలు ఆశ్చర్యపరుస్తాయి. ఈ చిత్రాన్ని జూన్ మొదటి వారంలో విడుదల చేస్తున్నాం’’ అన్నారు. పద్మనాభరెడ్డి మాట్లాడుతూ– ‘‘శివరంజని’ తప్పకుండా నేటి ట్రెండ్ లో వస్తోన్న హారర్ చిత్రాల్లో భిన్నమైన సినిమాగా నిలుస్తుందని నమ్ముతున్నాను. మా బ్యానర్ లో మంచి కాన్సెప్ట్స్ ఉన్న చిత్రాలు ఈ యేడాది మరిన్ని రాబోతున్నాయి’’ అని చెప్పారు. -
మౌన ప్రేమ
రాయలసీమ అంటే కేవలం ఫ్యాక్షన్ కాదు.. ప్రేమ కూడా ఉంటుందని తెలిపే ఫ్రెష్ లవ్ స్టోరీ నేపథ్యంలో రూపొందనున్న చిత్రం ‘మనసు పలికే మౌన ప్రేమ’. నందు, ప్రియ, బాబా కల్లూరి, మేరిగ వీరబాబు, అజిత్ బాబు ముఖ్య తారలుగా బాబీ వేంపల్లి దర్శకత్వంలో తెరకెక్కనుంది. ఏఎస్పీ ప్రొడక్షన్స్ పతాకంపై బొట్రేపల్లి ఆవులకుంట్ల సూర్యప్రకాశ్ నిర్మిస్తున్న ఈ సినిమా హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి తుమ్మలపల్లి రామసత్యనారాయణ క్లాప్ ఇవ్వగా, కె.ఎస్. నాగేశ్వరరావు గౌరవ దర్శకత్వం వహించారు. సూర్యప్రకాశ్ మాట్లాడుతూ– ‘‘1980లో రాయలసీమ నేపథ్యంలో తెరకెక్కనున్న చిత్రమిది. ఈ సినిమాకి కథ నేనే అందించా. స్టోరీ చెప్పినప్పుడు నా స్నేహితుడు బాబీ ఎగ్జయిట్ అయ్యి దర్శకత్వ బాధ్యత తీసుకున్నాడు. ఈ చిత్రానికి ఇంకా ఆడిషన్స్ జరుగుతున్నాయి. జనవరి 18న రెగ్యులర్ షూట్ ప్రారంభించి, మూడు నెలల్లో పూర్తి చేస్తాం’’ అన్నారు. ‘‘ఫ్రెష్ లవ్ స్టోరీతో గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కుతోన్న చిత్రమిది. సూర్యగారు స్టోరీ బాగా రాశారు. నాపై తను పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయను’’ అన్నారు బాబీ. ‘‘టైటిల్ ఎంత బాగుందో స్టోరీ కూడా అంతే బాగుంటుంది’’ అని హీరో నందు అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: కుమారన్. -
అందుకే పెద్ద సినిమాల మధ్య వస్తున్నాం
నంందు, నోయల్, పునర్నవీ భూపాలం హీరో, హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం ‘ఎందుకో ఏమో’. కోటి వద్దినేని దర్శకత్వంలో మహేశ్వర క్రియేషన్స్ పతాకంపై మాలతి వద్దినేని నిర్మించిన ఈ చిత్రం నేడు విడుదలవుతోంది. కోటి వద్దినేని మాట్లాడుతూ– ‘‘మాది గుంటూరు జిల్లా కర్లపూడి గ్రామం. పోసాని కృష్ణమురళీ గారు నాకు దగ్గరి బంధువు. ఆయన ఇ¯Œ స్పిరేషన్‌తో ఇండస్ట్రీకి వచ్చాను. వచ్చీ రాగానే డైరెక్టర్ కావాలనుకున్నాను. వచ్చిన రెండేళ్లలో ఇండస్ట్రీ అంటే ఏంటో తెలిసింది. పోసానిగారు శ్రీహరి గారి సినిమాలకు పనిచేస్తున్న సమయంలో రైటింగ్ డిపార్ట్మెంట్లోను, ఒకట్రెండు సినిమాలకు దర్శకత్వ శాఖలోను పనిచేశాను. ఇప్పుడు ‘ఎందుకో ఏమో’కి నేను దర్శకునిగా, నా భార్య నిర్మాతగా మారటానికి కారణం ఏంటంటే, ‘శ్రావణమాసం’ చిత్రం తర్వాత పోసానిగారు దర్శకునిగా, నిర్మాతగా సినిమాలను చేయటం మానేశారు. ఇక డైరెక్టర్ అవ్వాలని నిర్ణయించుకుని కథలను తయారు చేసుకుని తిరిగేవాడిని. ‘ఎందుకో ఏమో’ కథను చాలామందికి చెప్పాను. కానీ ఎవరూ ఆసక్తి చూపలేదు. ఆ సమయంలో మా భూములు మంచి ధర పలకడంతో నిర్మాణ రంగంలోకి దిగాం. ఇది ట్రయాంగిల్ లవ్ స్టోరీ. ఓ కొత్త పాయింట్‌తో తీశాం. సెకండాఫ్ సినిమాకి ఎస్సెట్ అవుతుంది. కథపై నమ్మకంతోనే ఎన్నో పెద్ద సినిమాలు విడుదలవుతున్నా మా సినిమా విడుదలకు సిద్ధమయ్యాం’’ అని చెప్పారు. -
ట్రయాంగిల్ లవ్‌స్టోరీ!
నందు, నోయల్, పునర్నవి ముఖ్య తారలుగా కోటి వద్దినేని దర్శకత్వంలో మహేశ్వర క్రియేషన్స్పతాకంపై మాలతి వద్దినేని నిర్మించిన సినిమా ‘ఎందుకో ఏమో’. వినాయక చవితి పండగ సందర్భంగా ఈ సినిమాను ఈ నెల 12న విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ సందర్భంగా కోటి వద్దినేని మాట్లాడుతూ–‘‘ఇదొక ట్రయాంగిల్ లవ్‌స్టోరీ. కథా, కథనాలు కొత్తగా ఉంటాయి. ఈ చిత్రం అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటుంది’’అన్నారు. ‘‘మా బ్యానర్లో తొలి చిత్రమిది. దర్శకుడు చెప్పిన కథ నచ్చడంతో రాజీ పడకుండా నిర్మించాం. మంచి లవ్‌స్టోరీకి కమర్షియల్ హంగులు జోడించాం’’ అన్నారు మాలతి. పోసాని కృష్ణ మురళి, ‘సుడిగాలి’ సుధీర్, నవీన్, ‘రాకెట్’ రాఘవ తదితరులు నటించిన ఈ సినిమాకు ప్రవీణ్ సంగీతం అందించారు. -
హత్యలు చేసిందెవరు?
‘‘పెద్ద హీరోలు ప్రచారానికి వస్తున్నారు. కానీ, చిన్న హీరోలు ఈ విషయంలో సహకరించడం లేదు. నందు తన సినిమాల ప్రచారంలో పాల్గొనడం లేదు. నిర్మాత తన డబ్బును, దర్శకుడు కెరీర్‌ని పణంగా పెట్టి సినిమా చేస్తారు. అలాంటి దర్శక, నిర్మాతలకు హీరోలు సహకరించాలి’’ అని దర్శక–నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ అన్నారు. నందు, అనురాధ జంటగా ఫణిరామ్ తుఫాన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఐందవి’. సన్నీ అండ్ విన్నీ సినిమాస్ పతాకంపై శ్రీధర్ లింగం నిర్మించిన ఈ చిత్రం టీజర్‌ని తమ్మారెడ్డి భరద్వాజ విడుదల చేశారు. ఫణి రామ్ మాట్లాడుతూ– ‘‘జనసంచారం లేని ప్రాంతంలో సరదాగా కొన్ని రోజులు గడుపుదామని ఆరుగురు వ్యక్తులు వెళ్తారు. ఒక్కొక్కరుగా హత్య చేయబడతారు. ఆ హత్యలు చేసిందెవరు? ఈ హత్యలకు, ఐందవికి సంబంధం ఏంటి? అన్నదే కథాంశం’’ అన్నారు. ‘‘ఆగస్టు మూడో వారంలో చిత్రాన్ని రిలీజ్ చేస్తాం’’ అన్నారు శ్రీధర్లింగం. దిలీప్, అవంతిక, ‘ఛత్రపతి’ శేఖర్ కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రానికి సంగీతం: ఎస్ఏ ఆర్మాన్, కెమెరా: భరత్ సి. కుమార్, సమర్పణ: రాజేశ్వరి తుమ్మల. -
చిన్న సినిమాల విడుదల కష్టం
నందు, తేజస్విని ప్రకాశ్ జంటగా రూపొందిన చిత్రం ‘కన్నుల్లో నీ రూపమే’. బిక్స్ ఇరుసడ్ల దర్శకత్వంలో ఇరుసడ్ల రాజమౌళి సమర్పణలో భాస్కర్ భాసాని నిర్మించిన ఈ సినిమా రేపు విడుదలవుతోంది. సాకేత్ స్వరపరచిన పాటలకి మంచి స్పందన రావటంతో హైదరాబాద్‌లో ఆడియో సక్సెస్ మీట్ నిర్వహించారు. ముఖ్య అతిథి నిర్మాత ‘సింధూరపువ్వు’ కృష్ణారెడ్డి మాట్లాడుతూ– ‘‘ఈ రోజుల్లో చిన్న చిత్రాలను విడుదల చేయటం చాలా కష్టం. బిక్స్గారు ఈ చిత్రం కోసం ఎంత కష్టపడ్డారో నాకు బాగా తెలుసు. ఈ సినిమా మంచి విజయం సాధించి నటీనటులకు, సాంకేతిక నిపుణులకు మంచి పేరు తీసుకురావాలి’’ అన్నారు. ‘‘బిక్స్గారు నాకు ఫేస్బుక్ ద్వారా పరిచయం. తొలి సినిమా అయినా చాలా అనుభవం ఉన్న దర్శకునిలా తెరకెక్కించారు. నా మొదటి సినిమా ‘కన్నుల్లో నీ రూపమే’ ఆడియో సక్సెస్ మీట్ జరుపుకోవటం చాలా ఆనందంగా ఉంది’’ అన్నారు సాకేత్. ‘‘మా సినిమా విడుదలకు సహాయం చేస్తున్న ఇప్పిలి రామమోహన్‌రావు, ఎస్. శ్రీకాంత్రెడ్డిగార్లకు ధన్యవాదాలు. మా సినిమాని ప్రేక్షకులు ఆదరిస్తారని కోరుకుంటున్నా’’ అన్నారు బిక్స్. చిత్ర నిర్మాత భాస్కర్ భాసాని, హరిహర చలనచిత్ర నిర్మాత ఇప్పిలి రామమోహన్ రావు పాల్గొన్నారు. -
పరిచయాలు లేకుండా పరిచయం అవుతున్నా
‘‘సినిమాల మీద ఉన్న ఆసక్తి, ఇష్టమే నన్ను యూకే నుంచి ఇక్కడికి తీసుకు వచ్చాయి. బిక్షపతి అనే పేరుని యూకేలో వాళ్లకు పలకడానికి రాకపోవడంతో బిక్స్గా మార్చుకున్నాను. అదే నా స్క్రీన్ నేమ్ అయింది’’ అన్నారు బిక్స్ ఇరుసడ్ల. నందు, తేజస్విని జంటగా బిక్స్ దర్శకత్వంలో భాస్కర్ భాసాని నిర్మించిన చిత్రం ‘కన్నుల్లో నీ రూపమే’. ఈ చిత్రం ఈ నెల 29న విడుదల కానుంది. ఈ సందర్భంగా బిక్స్ మాట్లాడుతూ – ‘‘ఓ అందమైన ప్రేమ కథను హృదయానికి హత్తుకునేలా చెప్పాం. ఎటువంటి కష్టంలో ఉన్నా లైఫ్ ముందుకు సాగాలి అనే సందేశాన్ని అంతర్లీనంగా చెప్పాం. నందు బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. తేజస్విని నటనలో పర్ణిపూర్ణత కనిపిస్తుంది. సంగీత దర్శకుడు సాకేత్ ఫస్ట్ సినిమా అయినా బెస్ట్ మ్యూజిక్ ఇచ్చారు. మా సినిమా చూసి విడుదల చేయడానికి ముందుకు వచ్చిన రామమోహనరావు ఇప్పిలి, శ్రీకాంత్‌రెడ్డికి కృతజ్ఞతలు. సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుండేవాణ్ణి. ఇండస్ట్రీలో పరిచయాలు లేకుండానే డైరెక్టర్‌గా తొలి అడుగు వేసి, ప్రేక్షకులకు పరిచయం కాబోతున్నా. ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. -
మనసుకు హత్తుకునేలా...
నందు, తేజస్వినీ ప్రకాష్ జంటగా బిక్స్ ఇరుసడ్ల దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘కన్నుల్లో నీ రూపమే’. ఏఎస్పీ క్రియేటివ్ పతాకంపై భాస్కర్ భాసాని నిర్మించిన ఈ సినిమా ఈ నెల 29న విడుదల కానుంది. హరి హర చలనచిత్రం నిర్మాతలు ఇప్పిలి రామ్మోహన్రావు, ఎస్. శ్రీకాంత్‌రెడ్డి ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో నిర్మాత భాస్కర్ భాసాని మాట్లాడుతూ – ‘‘ఆడియోకి మంచి స్పందన లభించింది. సినిమా కూడా మనసుకు హత్తుకునేలా ఉంటుంది. నిర్మాతలు ఇప్పిలి రామ్మోహన్రావు, ఎస్. శ్రీకాంత్‌రెడ్డి మా చిత్రం చూసిన తర్వాత, వారి హరిహర చలన చిత్రం బ్యానర్లో విడుదల చేస్తాం అని మాకు ధైర్యాన్ని ఇచ్చారు. వారికి థ్యాంక్స్’’ అన్నారు. ‘‘నేను, శ్రీకాంత్‌రెడ్డి సినిమా చూసిన వెంటనే చిరుసాయం చేయాలని నిర్ణయించుకున్నాం. స్టోరీ తగ్గట్లుగా కాంప్రమైజ్ కాకుండా తీశారు. డైరెక్టర్‌గా బిక్స్ సక్సెస్ సాధించారనిపిస్తోంది’’ అన్నారు రామ్మోహన్రావు. ‘‘నందు, తేజస్వినీ బాగా నటించారు. టీమ్ అందరూ బాగా సపోర్ట్ చేశారు. హరిహర చలనచిత్రం నిర్మాతలు మా చిత్రాన్ని రిలీజ్ చేయడం ఆనందంగా ఉంది’’ అన్నారు డైరెక్టర్ బిక్స్. ఈ చిత్రానికి సంగీతం: సాకేత్ కోమండురి. -
సినిమాపై మరింత ఇష్టం పెరిగింది
‘‘సినిమాలంటే ప్యాషన్‌తో ‘ఇంతలో ఎన్నెన్ని వింతలో’ రూపొందించా. ఈ చిత్రం విజయంతో సినిమా పట్ల ఉన్న ఇష్టం మరింత పెరిగింది. ప్రేక్షకులు, ఫ్రెండ్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తున్నందుకు సంతోషంగా ఉంది. ఈ ఆనందాన్ని మాటల్లో చెప్పలేను’’ అని నిర్మాత రామ్మోహన్రావు ఇప్పిలి అన్నారు. నందు, సౌమ్య వేణుగోపాల్, పూజారామచంద్రన్ ముఖ్య తారలుగా వరప్రసాద్ వరికూటి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఇంతలో ఎన్నెన్ని వింతలో’. హరహర చలన చిత్ర సమర్పణలో ఎస్. శ్రీకాంత్ రెడ్డి, రామ్మోహన్రావు ఇప్పిలి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 6న విడుదలైంది. ఈ సందర్భంగా రామ్మోహన్రావు ఇప్పిలి మాట్లాడుతూ– ‘‘మా చిత్రానికి ఇప్పటికీ థియేటర్స్ పెరుగుతున్నాయి. త్వరలోనే గ్రాండ్ సక్సెస్ మీట్ నిర్వహిస్తాం. మా హరిహర చలనచిత్ర బ్యానర్లో 2వ ప్రాజెక్ట్‌ని త్వరలో అనౌన్స్ చేస్తాం’’ అన్నారు. -
‘ఇంతలో ఎన్నెన్ని వింతలో’ మూవీ రివ్యూ
టైటిల్ : ఇంతలో ఎన్నెన్ని వింతలో జానర్ : కామెడీ ఎంటర్టైనర్ తారాగణం : నందు, పూజ రామచంద్రన్, సౌమ్య వేణుగోపాల్ సంగీతం : యాజమాన్య దర్శకత్వం : వరప్రసాద్ వరికోటి నిర్మాత : ఎస్. శ్రీకాంత్ రెడ్డి, ఇప్పిలి రామ్మోహన్ రావు యువ నటుడు నందు హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం ఇంతలో ఎన్నెన్ని వింతలో. హీరోగా నిలదొక్కుకునేందుకు చాలా కాలంగా కష్టపడుతున్న నందు ఈ సినిమాతో ఎలాగైనా సక్సెస్ సాధించాలని భావిస్తున్నాడు. అందుకే డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన కామెడీ ఎంటర్టైనర్తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. యూత్‌ఫుల్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమా నందుకు ఆశించిన విజయాన్ని అందించిందా..? ఘన విజయాలుసాధిస్తున్న చిన్న సినిమాల సరసన ఇంతలో ఎన్నెన్ని వింతలు చేరిందా..? కథ : విష్ణు (నందు).. మోడ్రన్ శ్రీరామ చంద్రుడు లాంటి కుర్రాడు. వ్యవహారశైలిలో గాని వ్యక్తిత్వంలో గాని ఎలాంటి మచ్చలేని మంచి కుర్రాడు. విష్ణులోని ఆ మంచితనం చూసే వందన (సౌమ్య వేణుగోపాల్) ప్రేమలో పడుతుంది. ఓలెక్స్ ద్వారా పరిచయం అయిన విష్ణు, వందనలు ఒకరికొకరు నచ్చటంతో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటారు. పెద్దలు కూడా అంగీకరించటంతో వీరి పెళ్లికి ముహూర్తం ఫిక్స్ చేస్తారు. పెళ్లిపనులన్ని పూర్తి చేసిన విష్ణు తెల్లవారితే పెళ్లి అనగా ఫ్రెండ్స్ కలిసి బ్యాచిలర్స్ పార్టీ చేసుకోవడానికి ఓ రెస్టారెంట్‌కి వెళతాడు. అక్కడ తార (పూజ రామచంద్రన్) విష్ణు గ్యాంగ్‌కు కలుస్తుంది. తార పరిచయం కారణంగా విష్ణు అతని స్నేహితులు ఇబ్బందుల్లో పడతారు. ఈ ఇబ్బందులను దాటుకొని విష్ణు ముహూర్తం సమయానికి పెళ్లి మండపానికి చేరుకున్నాడా..? అసలు తార వల్ల ఎదురైన ఇబ్బందులు ఏంటి..? వాటిని విష్ణు ఎలా ఎదుర్కొన్నాడు అన్నదే మిగతా కథ. విశ్లేషణ : హీరోగా ప్రూవ్ చేసుకునేందుకు చాలా కాలంగా ప్రయత్నిస్తున్న నందు అన్నీ మంచి లక్షణాలే ఉన్న అబ్బాయి పాత్రలో ఆకట్టుకున్నాడు. కామెడీ టైమింగ్‌తోనూ మెప్పించాడు. హీరోయిన్ సౌమ్య వేణుగోపాల్ కు పెద్దగా నటనకు ఆస్కారం ఉన్న పాత్ర దక్కక పోయినా ఉన్నంతలో మంచి నటన కనబరిచింది. తారా పాత్రలో పూజా రామచంద్రన్ మెప్పించింది. ఫస్ట్ హాఫ్‌లో హాట్ లుక్స్ ఆకట్టుకున్న పూజా క్లైమాక్స్ లో వచ్చే ఎమోషనల్ డైలాగ్స్ లో పరవాలేదనిపించింది. ఇతర పాత్రల్లో పెద్దగా గుర్తింపు ఉన్న నటులు కనిపించలేదు. కాస్టింగ్ ఇంకాస్త బాగుండి ఉంటే సినిమా స్థాయి పెరిగేది. తనకున్న బడ్జెట్ పరిదిలో ఓ మంచి ఎంటర్టైనర్ తీయాలనుకున్న దర్శకుడు వర ప్రసాద్ విజయం సాధించాడనే చెప్పాలి. అనుకున్న కథను ఎక్కడా గాడి తప్పకుండా ఆడియన్స్ ను కదలకుండా కూర్చో బెట్టేలా కథా కథనాలను నడిపించాడు. టైటిల్‌కు తగ్గట్టుగా సినిమాలో ఎన్నో ట్విస్ట్ లు చూపించి మెప్పించాడు. కథా కథనాలకు అవసరం లేకపోయినా పాటలను ఇరికించకుండా కథలో భాగంగా వచ్చే బ్యాక్ గ్రౌండ్ సాంగ్స్ తో సినిమా వేగం తగ్గకుండా జాగ్రత్త పడ్డాడు. యాజమాన్య అందించిన బ్యాక్ గ్రౌండ్ సాంగ్స్‌తో పాటు నేపథ్య సంగీతం కూడా సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉంది. అక్కడక్కడా తడబడినా ఓవరాల్‌గా సినిమాను ఎంటర్టైనింగ్ తెరకెక్కించటంలో చిత్రయూనిట్ విజయం సాధించిందనే చెప్పాలి. ప్లస్ పాయింట్స్ : కథా కథనం నందు నటన మైనస్ పాయింట్స్ : సహాయ పాత్రల్లోని నటులు అక్కడక్కడా నెమ్మదించిన కథనం - సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్ -
పెళ్లికి 36 గంటల ముందు...
‘‘నేను మలయాళీ అమ్మాయిని. పుట్టింది మాత్రం బెంగళూరులో. నాన్న ఆర్మీ ఆఫీసర్. సౌత్, నార్త్‌తో పాటు ఇండియాలోని మొత్తం అన్ని రాష్ట్రాలూ ట్రావెల్ చేశా. సౌత్‌లో అన్ని భాషల్లోనూ నటించా. తెలుగులో నా తొలి చిత్రం ‘లవ్ ఫెయిల్యూర్’’ అన్నారు పూజ రామచంద్రన్. నందు కథానాయకునిగా, పూజ రామచంద్రన్, సౌమ్య వేణుగోపాల్ కథానాయికలుగా వరప్రసాద్ వరికూటి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఇంతలో ఎన్నెన్ని వింతలో’. హరహర చలన చిత్ర సమర్పణలో ఎస్. శ్రీకాంత్ రెడ్డి, రామమోహనరావు ఇప్పిలి నిర్మించిన ఈ చిత్రం రేపు విడుదలవుతోంది. ఈ సందర్భంగా పూజ మాట్లాడుతూ –‘‘ఇందులో నా పాత్ర పేరు తార. డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్ర. పెళ్లికి 36 గంటల ముందు ఎటువంటి సన్నివేశాలు చోటు చేసుకున్నాయనే నేపథ్యంలో కథ సాగుతుంది. ఎమోషన్స్, పాటలు, ఫైట్స్, వినోదం ఉన్న ఈ సినిమా కుటుంబ ప్రేక్షకులతో పాటు అన్ని వర్గాల ఆడియన్స్‌ని కచ్చితంగా ఆకట్టుకుంటుంది. వరప్రసాద్సార్గారు చాలా క్లారిటీగా 38 రోజుల్లో ఈ చిత్రం పూర్తి చేశారు. తనకు ఏం కావాలో మా నుంచి రాబట్టుకున్నారు. ప్రేక్షకులు మా సినిమాని ఆదరిస్తారనే నమ్మకం ఉంది’’ అన్నారు. -
నలుగురి కథ
నందు, సౌమ్య వేణుగోపాల్, పూజ రామచంద్రన్ ముఖ్య పాత్రల్లో రూపొందిన చిత్రం ‘ఇంతలో ఎన్నెన్ని వింతలో’. వరప్రసాద్ వరికూటి దర్శకత్వంలో హరహర చలన చిత్ర సమర్పణలో ఎస్. శ్రీకాంత్ రెడ్డి, రామమోహన రావు ఇప్పిలి నిర్మించిన ఈ సినిమా ఏప్రిల్ 6న విడుదలకానుంది. ఈ సందర్భంగా వరప్రసాద్ వరికూటి మాట్లాడుతూ– ‘‘ఇది నా మొదటి సినిమా. ఈ చిత్రం మొదలుపెట్టినప్పుడు ఎలాంటి కాన్ఫిడెన్స్ ఉందో ఇప్పటికీ అదే కాన్ఫిడెన్స్‌తో ఉన్నాం. కథ, స్క్రీన్‌ప్లే హైలైట్. ఆరోగ్యకరమైన గార్డెన్ నుంచి ఒక ఫ్రూట్ బయటకు వస్తే ఎలా ఫీల్ అవుతారో ఆ ఫ్రెష్ ఫీల్‌ను మా సినిమా చూసిన ప్రేక్షకులకు కలుగుతుంది’’ అన్నారు. ‘‘నలుగురి మధ్య ఉత్కంఠభరితంగా సాగే కథ ఇది. సినిమా చాలా బాగా వచ్చింది. ఇటీవల పాటలు విడుదల చేశాం. 3 పాటలు చాలా బాగున్నాయని అందరూ అభినందిస్తున్నారు’’ అని రామమోహన రావు అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: ఎస్. మోహన్‌రెడ్డి, సంగీతం: యాజమాన్య, సహనిర్మాత: డి. శ్రీనివాస్ ఓంకార్. -
సాయంత్రం నుంచి ఉదయం వరకూ..
నందు, సౌమ్యవేణుగోపాల్, పూజ రామచంద్రన్ ముఖ్య తారలుగా రూపొందిన చిత్రం ‘ఇంతలో ఎన్నెన్ని వింతలో’. వరప్రసాద్ వరికూటి దర్శకత్వంలో హరహర చలనచిత్ర సమర్పణలో ఎస్. శ్రీకాంత్ రెడ్డి, రామ్మోహన్రావు ఇప్పిలి నిర్మించిన ఈ సినిమా విడుదలకు సిద్ధమైంది. నందు మాట్లాడుతూ– ‘‘ఈ రోజు సాయంకాలం మొదలై రేపు ఉదయం వరకు ఏం జరుగుతుందనేదే ఈ సినిమా కథ. నా గత సినిమాల కంటే ఈ చిత్రవిజయంపై ఎక్కువ నమ్మకంగా ఉన్నా. ఈ సినిమాలో నాతో పాటు నటించిన ముగ్గురు కూడా హీరోలే. మార్చి నుంచి థియేటర్స్ బంద్ అంటున్నారు. అది లేకుంటే మార్చి 2న సినిమా విడుదల చేస్తాం’’ అన్నారు. ‘‘అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే చిత్రమిది. రషెస్ చూసినవాళ్లు ప్రశంసించారు. విడుదలకు రెండు రోజుల ముందే ప్రెస్ వారికి ప్రివ్యూ వేయాలనుకుంటున్నామంటే ఎంత కాన్ఫిడెంట్‌గా ఉన్నామో అర్థం చేసుకోవచ్చు’’ అన్నారు దర్శక–నిర్మాతలు. మంచి చిత్రంలో నటించామని సౌమ్యవేణుగోపాల్, పూజరామచంద్రన్ అన్నారు. -
టైటిల్ క్యాచీగా ఉంది – బోయపాటి శీను
నందు, నోయల్, పునర్నవి ముఖ్య తారలుగా రూపొందిన చిత్రం ‘ఎందుకో ఏమో’. కోటి వద్దినేని దర్శకత్వంలో మాలతి వద్దినేని నిర్మించిన ఈ చిత్రంలోని మొదటి పాటను దర్శకుడు బోయపాటి శీను విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ– ‘‘టైటిల్ క్యాచీగా ఉంది. పాట చాలా బాగుంది. సినిమా కూడా బావుంటుందని అర ్థమవుతోంది. నందు హార్డ్ వర్కర్. ఈ సినిమా తనకు హీరోగా మంచి పేరు తేవాలి’’ అన్నారు. కోటి వద్దినేని మాట్లాడుతూ– ‘‘మొత్తం నాలుగు పాటలున్నాయి. ప్రవీణ్ ఒక్కో పాటను ఒక్కో విధంగా చాలా బాగా కంపోజ్ చేశారు. ఇటీవల వినాయక్‌గారు విడుదల చేసిన టీజర్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. మార్చిలో సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. ‘‘బోయపాటిగారు లాంచ్ చేసిన పాట నా ఫేవరేట్. దర్శక–నిర్మాతలు ఎక్కడా రాజీ పడకుండా సినిమా చేశారు’’ అన్నారు నందు. సంగీత దర్శకుడు ప్రవీణ్ పాల్గొన్నారు. -
'ఎందుకో ఏమో' ఫస్ట్ సాంగ్ లాంచ్
-
'ఎందుకో ఏమో' మూవీ స్టిల్స్
-
వినాయక్ చేతుల మీదుగా ‘ఎందుకో ఏమో’ టీజర్ లాంచ్
మహేశ్వర క్రియేషన్స్ పతాకంపై నందు,నోయల్, పునర్నవి హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న సినిమా ఎందుకో ఏమో. కోటి వద్దినేని దర్శకత్వంలో మాలతి వద్దినేని ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా టీజర్‌ను ఈ రోజు స్టార్ డైరక్టర్ వి.వి.వినాయక్ చేతుల మీదుగా విడుదలైంది. ఈ సందర్భంగా వి.వి.వినాయక్ మాట్లాడుతూ...‘‘ ఎందుకో ఎమో’ టైటిల్ లాగే టీజర్ కూడా చాలా ట్రెండీగా, ఇంట్రస్టింగ్ గా ఉంది. ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్న కోటికి మంచి పేరు, నిర్మాతకు లాభాలు రావాలనీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇందులో నటించిన నటీనటులకు, సాంకేతిక నిపుణులకు నా శుభాకాంక్షలు’’ అన్నారు. దర్శకుడు కోటి వద్దినేని మాట్లాడుతూ...‘‘ ఎందుకో ఎమో’ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నా. ఎంతో బిజీ షెడ్యూల్ లో కూడా మా చిత్రం టీజర్ ఆవిష్కరించిన వి.వి.వినాయక్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. నందు, నోయల్, పునర్నవి హీరో హీరోయిన్లుగా నటించారు. ఇదొక ట్రయాంగిల్ లవ్ స్టోరి. మా నిర్మాత ఎక్కడా రాజీ పడకుండా, పూర్తి స్వేచ్ఛ నివ్వడంతో అనుకున్నట్టుగా సినిమా తీయగలిగాం. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన సెన్సార్ పనులు జరుగుతున్నాయి. ఫిబ్రవరి మొదటి వారంలో ఆడియో విడుదల చేసి, అదే నెలలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. నిర్మాత మాలతి వద్దినేని మాట్లాడుతూ...‘‘ మహేశ్వర క్ర్రియేషన్స్ పతాకంపై ఇది మా తొలి సినిమా. వినాయక్ గారి చేతుల మీదుగా మా చిత్రం టీజర్ విడుదల కావడం శుభసూచకంగా భావిస్తున్నాం. దర్శకుడు చెప్పిన కథ నచ్చడంతో సినిమాను ఏ విషయంలో రాజీ పడకుండా నిర్మించాం. మంచి లవ్ స్టోరీ తో పాటు కమర్షియల్ హంగులు కూడా సినిమాలో ఉన్నాయి. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే సినిమా అవుతుంది. మా యూనిట్ అంతా పూర్తి సహాయ సహకారాలు అందించడంతో సినిమాను అనుకున్నవిధంగా పూర్తి చేయగలిగాం. ఫిబ్రవరి మొదటి వారంలో ఆడియో విడుదల చేసి సినిమాను కూడా అదే నెలలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. -
ఎన్ని వింతలో...
దర్శకుడు వీవీ వినాయక్ శిష్యుడు వరప్రసాద్ వరికూటి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘ఇంతలో ఎన్నెన్ని వింతలో’. నందు, సౌమ్య వేణుగోపాల్ జంటగా పూజా రామచంద్రన్ కీలక పాత్రలో ఎస్. శ్రీకాంత్ రెడ్డి, ఇప్పిలి రామమోహనరావు నిర్మిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్‌ని వినాయక్ విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ– ‘‘వరప్రసాద్ దర్శకుడిగా మారి, ఓ సినిమా చేస్తున్నాడని తెలిసి హ్యాపీగా ఫీల్ అయ్యా. ట్రైలర్ చాలా బాగుంది. ఈ సినిమా వరప్రసాద్‌కి మంచి హిట్ ఇచ్చి, పెద్ద హీరోలతో సినిమా తీసే రేంజ్‌కి ఎదగాలని కోరుకుంటున్నా’’ అన్నారు. ‘‘ఉత్కంఠభరితమైన కథనంతో విభిన్నంగా ఉండే చిత్రమిది. ఫిబ్రవరిలో రిలీజ్ చేయాలనుకుంటున్నాం. వినాయక్‌గారు ట్రైలర్ రిలీజ్ చేయడం హ్యాపీగా ఉంది’’ అని ఇప్పిలి రామమోహనరావు అన్నారు. నల్లవేణు, దువ్వాసి మోహన్, కౌశిక్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సహ నిర్మాత: డి.శ్రీనివాస్ ఓంకార్, కెమెరా: ఎస్. మురళీమోహన్ రెడ్డి, సంగీతం: యాజమాన్య. -
ఐదే పాత్రలు
నందు, శ్రీముఖి, కమల్ కామరాజు ముఖ్య తారలుగా వి.ఎస్. వాసు దర్శక త్వంలో తెరకెక్కిన సినిమా ‘కుటుంబ కథా చిత్రమ్’. భాస్కర గ్రూప్ ఆఫ్ మీడియా సమర్పణలో దాసరి భాస్కర్ యాదవ్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 15న విడుదల కానుంది. ఈ సందర్భంగా నందు మాట్లాడుతూ– ‘‘ఇందులో సాఫ్ట్వేర్ కుర్రాడి పాత్ర చేశా. భార్యాభర్తల మధ్య జరిగే గొడవ వల్ల సినిమా థ్రిల్లర్ స్టైల్లో నడుస్తుంది. సోలో హీరోగానూ అవకాశాలొస్తున్నాయి. నటుడిగా నేను చాలా సంతృప్తిగా ఉన్నా. కథలో నా పాత్రకు ప్రాధాన్యం ఉంటేనే ఒప్పుకుంటున్నా. ఓ టీమ్ ఏర్పాటు చేసుకుని ఫీచర్ ఫిలిం ప్లాన్ చేసుకుంటున్నా. ఆ ప్రాసెస్‌లో ‘వై నాట్ ఎ గర్ల్’ అనే షార్ట్ ఫిలిం చేశా. వెబ్ సిరీస్‌లు చేయమని అవకాశాలొస్తున్నాయి. టేకప్ చేయాలి’’ అన్నారు. కమల్ కామరాజు మాట్లాడుతూ–‘‘కాటమరాయుడు, అర్జున్‌రెడ్డి’ చిత్రాల తర్వాత నేను చేసిన సినిమా ఇది. నిర్మాత రాజ్ కందుకూరిగారు కథ వినమంటూ దర్శకుడు వాసుని నావద్దకు పంపించారు. వాసుని చూడగానే ఇతను సినిమా తీయగలడా? అని భయమేసింది. కానీ, తను కథ చెబుతున్నప్పుడు నేను ఎంజాయ్ చేశా. స్క్రీన్‌ప్లే చూసి హాలీవుడ్ సినిమా నుంచి కాపీ కొట్టాడా? అనిపించింది. అంత బాగా ఉంటుంది. ఐదు పాత్రలతో నడిచే సినిమా ఇది. ఇప్పటి పరిస్థితుల్లో కుటుంబంలోని అనుబంధాలను ఎలా మిస్ అవుతున్నామని చూపించాం. కథకి థ్రిల్లింగ్ అంశాలు జోడించటం వల్ల ప్రేక్షకులకు ఎక్కడా బోర్ అనిపించదు. నాది నెగటివ్ క్యారెక్టర్. ప్రస్తుతం రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చా’’ అన్నారు. -
కన్నుల్లో నీరూపమే ట్రైలర్ రిలీజ్ చేసిన సుకుమార్
-
తక్కువగా మాత్రం చూసుకోను
‘మీ అమ్మానాన్నలకంటే ఎక్కువగా చూసుకుంటానో లేదో తెలీదు కానీ.. తక్కువగా మాత్రం చూసుకోను’ అంటూ ప్రారంభమయ్యే ‘కన్నుల్లో నీ రూపమే’ ట్రైలర్ ఆకట్టుకుంటోంది. నందు, తేజస్వీ ప్రకాశ్ జంటగా బిక్స్ ఇరుసడ్లను దర్శకునిగా పరిచయం చేస్తూ భాస్కర్ భాసాని నిర్మించిన చిత్రం ‘కన్నుల్లో నీ రూపమే’. ఈ చిత్రం ట్రైలర్‌ని ప్రముఖ దర్శకుడు సుకుమార్ రిలీజ్ చేశారు. అనంతరం బిక్స్ మాట్లాడుతూ– ‘‘చక్కని ప్రేమకథా చిత్రమిది. యువతకే కాకుండా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే అంశాలన్నీ ఉన్నాయి. ‘రంగస్థలం’ మూవీ షూటింగ్ బిజీలో ఉన్నా మాకు టైమ్ కేటాయించి మా సినిమా ట్రైలర్‌ను విడుదల చేసిన సుకుమార్‌గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఆయన ట్రైలర్ చూసి మమ్మల్ని ఆశీర్వదించడం మా టీమ్‌కు మరింత ఆనందంగా ఉంది. సాకేత్ సంగీతం సినిమాకి ప్లస్. డిసెంబర్లో సినిమాను విడుదల చేస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: సాకేత్ కొమండూరి, కెమెరా: ఎన్.బి. విశ్వకాంత్, సుభాష్ దొంతి, పాటలు: అనంత శ్రీరామ్, శ్రీమణి, కాసర్ల శ్యామ్. -
ఈ తరానికి తగ్గట్టు...
‘‘ప్రతి ప్రేక్షకునికి రీచ్ అయ్యే టైటిల్ పెట్టడంలోనే సగం సక్సెస్ అయ్యారు. ఈ చిత్రం టీజర్ చూసినప్పుడే అండగా ఉండాలని నిర్ణయించుకున్నా’’ అన్నారు నిర్మాత మల్కాపురం శివకుమార్. నందు, శ్రీముఖి, కమల్ కామరాజు ముఖ్య తారలుగా వి.ఎస్. వాసు దర్శకత్వంలో భాస్కర గ్రూప్ ఆఫ్ మీడియా సమర్పణలో దాసరి భాస్కర్ యాదవ్ నిర్మించిన సినిమా ‘కుటుంబ కథా చిత్రమ్’. ఈ సినిమా మోషన్ పోస్టర్‌ను నందు, కమల్ కామరాజు, సినీ విశ్లేషకుడు కత్తి మహేష్ విడుదల చేయగా, టీజర్‌ని మల్కాపురం శివకుమార్ రిలీజ్ చేశారు. ‘‘చక్కని కుటుంబ కథా చిత్రమిది. అనుకున్న బడ్జెట్లోనే సినిమా పూర్తి చేసాం’’ అన్నారు భాస్కర్‌యాదవ్. ‘‘1980లో కుటుంబం అంటే అందరూ కలసి ఉండేవారు. 2017లో కుటుంబం అంటే ముగ్గురు లేక నలుగురే ఉంటున్నారు. ఈ చిత్రంలో 2017 జనరేషన్‌కు తగ్గట్టు కాన్సెప్ట్ ఉంటుంది’’ అన్నారు. నందు, కమల్ కామరాజు, కెమెరామెన్ మల్హర్ భట్ జోషి పాల్గొన్నారు. -
షూటింగ్ నుంచి వెళ్లిపోయిన హీరోయిన్..
తిరువొత్తియూరు(తమిళనాడు): సినిమా షూటింగ్ జరుగుతుండగా నటి పూనంకపూర్ ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోవటంతో షూటింగ్ అర్ధాంతరంగా ఆగిపోయింది. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు నిర్మాత తెలిపారు. నెంజి ఇరుక్కుంవరై, పయనం, ఉన్నైపోల్ ఒరువన్, వెడి, నాయకి వంటి తదితర చిత్రాలలో నటించిన పూనం నండు అనే చిత్రంలో నటించేందుకు ఒప్పందం చేసుకున్నారు. శనివారం చిత్ర షూటింగ్ జరుగుతున్న సమయంలో ఎవరికీ చెప్పకుండా వెళ్లి పోవడంతో షూటింగ్ ఆగిపోయినట్లు డైరక్టర్ తెలిపారు. దీనిపై చిత్ర తయారీ డైరక్టర్ ఆండాల్రమేష్ మాట్లాడుతూ... రమేష్ హీరోగా, ఇద్దరు హీరోయిన్లతో నిర్మితమవుతున్న నండు చిత్రంలో పూనం కపూర్ ఒకరు. 'తన కాస్ట్యూమ్స్‌ను తానే డిజైన్ చేసుకుంటానని చెప్పి నిర్మాతకు ఖర్చు భారం పెంచారు. షూటింగ్ సమయంలో ఆమె బస చేసేందుకు స్టార్ హోటల్లో గది ఇప్పించాం. తొలిరోజు చిత్ర షూటింగ్లో హఠాత్తుగా తన వద్ద (డైరెక్టర్) తక్కిన వారి వద్ద గొడవ చేశారు. తరువాత ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయారు. దీంతో నిర్మాతకు లక్షల రూపాయలు నష్టం ఏర్పడింది. ఈ విషయంపై పూనంతో సెల్ఫోన్లో సంప్రదించేందుకు ప్రయత్నించగా ఆమె తిరస్కరించారు. ఆమెపై సంఘంలో ఫిర్యాదు చేయడానికి నిర్ణయించుకున్నాం' ఆండాల్ రమేష్ తెలిపారు. -
ముగిసిన ‘డ్రగ్స్’ విచారణ
చివరి రోజు నందును ప్రశ్నించిన సిట్ కెల్విన్‌తో సంబంధాలపై ప్రశ్నలు ఈవెంట్ మేనేజర్‌గానే తెలుసునన్న నటుడు చార్జిషీట్ వేసే యత్నాల్లో అధికారులు సాక్షి, హైదరాబాద్ డ్రగ్స్ కేసులో తొలి జాబితాలో ఉన్న సినీ ప్రముఖుల విచారణ ఎట్టకేలకు ముగిసింది. మంగళవారం వర్ధమాన నటుడు ఆనంద్ కృష్ణ అలియాస్ నందు సిట్ ఎదుట విచారణకు హాజరయ్యారు. దిల్‌సుఖ్‌నగర్‌లోని తన ఇంటి నుంచి తండ్రి, మేనమామతో కలసి బయలుదేరిన నందు.. అక్కడి సాయిబాబా ఆలయంలో పూజలు చేసి ఉదయం 10 గంటల సమయంలో ఎక్సైజ్ కార్యాలయానికి చేరుకున్నారు. కార్యాలయం ఆవరణలో ఉన్న బాలాత్రిపుర సుందరి ఆలయంలో అమ్మవారికి మొక్కుకొని విచారణ కోసం లోనికి వెళ్లారు. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన విచారణ మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ముగిసింది. కెల్విన్‌తో సంబంధమేంటి? కెల్విన్ ఫోన్ కాల్‌డేటాలో నందు నంబర్ ఉండటంపై సిట్ అధికారులు ఆయన్ను ప్రశ్నించినట్టు తెలిసింది. వీకెండ్ పార్టీలకు ఎక్కువగా వెళ్తుంటారా? అని సిట్ ప్రశ్నించగా తనకు అలవాటు లేదని, కెల్విన్ కాల్‌డేటాలో నంబర్ ఎలా వచ్చిందో కూడా తెలియదని అధికారులకు వివరించినట్టు సమాచారం. వాట్సాప్‌లో కెల్విన్‌తో చాటింగ్‌పై ప్రశ్నించగా.. ఈవెంట్ మేనేజర్ కావడం వల్ల తన నంబర్ ఇచ్చి ఉంటానని, అంతకు మించి డ్రగ్స్ వ్యవహారంలో అతడితో ఎలాంటి సంబంధం లేదని చెప్పినట్టు తెలిసింది. కావాలంటే తన రక్త నమూనాలు, వెంట్రుకలు, గోర్ల శాంపిల్స్ తీసుకొని పరీక్షలు చేయాలని నందు కోరినట్టు సిట్ వర్గాలు తెలిపాయి. అయితే ప్రస్తుతం శాంపిల్స్ అవసరం లేదని అధికారులు పేర్కొన్నట్టు తెలిసింది. సినీ ఇండస్ట్రీలో ఎవరెవరు డ్రగ్స్ వాడతారో తెలుసా అని అడగ్గా.. ‘నేను ఇప్పుడిప్పుడే పెద్దపెద్ద బ్యానర్లలో నటిస్తున్నా. అలాంటి వివరాలేవీ నాకు తెలియదు’ అని నందు చెప్పినట్టు సమాచారం. తదుపరి చర్యలేంటి? డ్రగ్స్ కేసులో 12 మంది సినీ ప్రముఖుల విచారణను సిట్ మంగళవారంతో ముగించింది. తర్వాత చర్యలేంటి? ఇంకెవరికైనా నోటీసులిస్తారా? సాఫ్ట్వేర్ ఇంజనీర్లను విచారిస్తారా అన్న ప్రశ్నలకు సిట్ అధికారులు సమాధానం చెప్పడం లేదు. ప్రస్తుతానికి ఇంతటితో విచారణ ముగిసిందని, చార్జిషీట్ దాఖలు చేసే సన్నాహాల్లో ఉన్నామని సిట్ అధికారి ఒకరు అభిప్రాయపడ్డారు. మీడియా పాయింట్ ఎత్తివేత డ్రగ్స్ కేసు ప్రారంభమైన నాటి నుంచి ఉదయం 8 నుంచి రాత్రి 12 గంటల వరకు ఎక్సైజ్ కార్యాలయం వద్ద మీడియా హడావుడి ఉండేది. మంగళవారం చివరిరోజు విచారణ ముగిసిన వెంటనే ఎక్సైజ్ అధికారులు మీడియా పాయింట్‌ను ఎత్తేశారు. మీడియా ఎంట్రీ ఉన్న గేటుకు తాళం వేశారు. -
నందు ఎవరు?
♦ శిరీష కేసులో రాజీవ్, శ్రవణ్‌ను ప్రశ్నిస్తున్న పోలీసులు ♦ నిందితులకు రెండు రోజుల పోలీసు కస్టడీ హైదరాబాద్: మేకప్ ఆర్టిస్ట్ శిరీష అనుమానాస్పద మృతి కేసులో నిందితులుగా ఉన్న బోదాసు శ్రావణ్‌కుమార్ అలియాస్ శ్రవణ్, వల్లభనేని రాజీవ్త్రివిక్రమ్ అలియాస్ రాజీవ్‌లను విచారణ నిమిత్తం బంజారాహిల్స్ పోలీసులు సోమవారం తమ కస్టడీలోకి తీసుకున్నారు. చంచల్‌గూడ జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్న ఇరువురినీ బంజారాహిల్స్ పోలీసు స్టేషన్‌కు తరలించారు. వీరిద్దరినీ రెండు రోజుల పోలీసు కస్టడీకి అప్పగిస్తూ న్యాయస్థానం ఉత్తర్వులిచ్చిన నేపథ్యంలో... అడ్వొకేట్ సమక్షంలో పోలీసులు విచారిస్తున్నారు. పది కోణాల్లో ప్రశ్నావళి... ఈ నెల 13 తెల్లవారుజామున షేక్‌పేట్‌లోని రాజీ వ్‌కు సంబంధించిన ఆర్జే ఫొటోగ్రఫీ కార్యాలయం గదిలో శిరీష ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి రాజీవ్, శ్రవణ్‌ల నుంచి మరింత సమాచారం రాబట్టేందుకు పోలీసులు విచారణ ప్రారంభించారు. వీరి అరెస్టు తర్వాత శిరీష–నందు–నవీన్ మధ్య జరిగిన సంభాషణలంటూ కొన్ని ఆడియోలు బయటకు వచ్చాయి. వీటిపైనా పోలీసులు రాజీవ్, శ్రవణ్‌లను ప్రశ్నిస్తున్నారు. నందు ఎవరనే దానిపై రాజీవ్, శ్రవణ్ నుంచి వివరాలు రాబడుతున్నారు. అయితే తమకు నందు, అతడి స్నేహితుడైన నవీన్ ఎవరో తెలియదని, బహుశా శిరీష స్నేహితులై ఉండవచ్చని చెప్పినట్లు తెలిసింది. మొత్తమ్మీద పది కోణాల్లో వివిధ ప్రశ్నలతో కూడిన ప్రశ్నావళి తయారు చేసుకున్న పోలీసులు దాని ఆధారంగా ప్రశ్నిస్తున్నారు. రాజీవ్–శిరీష గొడవలపై ఆరా శిరీషపై అత్యాచారం జరిగిందని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో మరింత లోతుగా నిందితుల్ని విచారిస్తున్నారు. తాము కాస్త తెరిచి ఉన్న తలుపు సందులోంచి చూసినప్పుడు ఎస్సై.. శిరీషపై అత్యాచారయత్నం చేస్తున్నట్లు కనిపించిందని, వెంటనే తాము లోపలకు వెళ్లగా కోపంతో అతను తమను బయటకు పంపించాడని నిందితులు వెల్లడించారు. ఎస్సై ప్రభాకర్‌రెడ్డి అనుచిత ప్రవర్తన శిరీషను బాగా కుంగదీసిందని... కారులో తను పలుమార్లు లెంపలేసుకుందని చెప్పుకొచ్చారు. ఆమె అవమాన భారంతోనే ఆత్మహత్య చేసుకుని ఉంటుందని రాజీవ్, శ్రవణ్ వివరించారు. ప్రయాణ సమయంలో రెండు, మూడు సార్లు తాను ఆమెను కొట్టిన విషయం నిజమేనని రాజీవ్ చెప్పాడు. మంగళవారం కూడా పోలీసులు వీరిని విచారించనున్నారు. రాజీవ్‌కు తెలియకుండా తాను, శిరీష తరచుగా కలుస్తుండేవారమని శ్రవణ్ తెలిపాడు. శిరీష కేసుకు, ఎస్సై ప్రభాకర్‌రెడ్డి కేసుకు లింకులున్న నేపథ్యంలో ఆ కేసు విచారణాధికారిగా ఉన్న సంగారెడ్డి డీఎస్పీ తిరుపతన్న సైతం బంజారాహిల్స్ పోలీసుస్టేషన్‌కు వచ్చి నిందితుల్ని విచారిస్తున్నారు. ఎస్సై క్వార్టర్స్‌లో ఏం జరిగింది..! ఈ నెల 12 ఉదయం 8 గంటల సమయంలో శిరీష ఆర్జే ఫొటోగ్రఫీ కార్యాలయానికి రాగా, గంట తర్వాత రాజీవ్.. మరో గంటకు శ్రవణ్ వచ్చినట్లు విచారణలో వెల్లడైంది. గత నెల 30న రాజీవ్ ప్రియురాలు తేజస్విని వచ్చి గొడవ చేయడమే కాకుండా, పోలీసులకు ఫిర్యాదు చేస్తానని, శిరీష అంతుచూస్తానని హెచ్చరించిందని నిందితులు చెప్పారు. ఈ నేపథ్యంలో ఆమెను అడ్డు తొలగించుకోవడానికి ఏం చేయాలన్న దానిపై చర్చించేందుకు ముగ్గురం కలసి బంజారాహిల్స్ రోడ్ నం.10లోని కప్పా కాఫీ షాప్‌నకు వెళ్లి, అక్కడ మూడు గంటల పాటు సమాలోచనలు జరిపామన్నారు. శ్రవణ్ సూచించిన మేరకే ముగ్గురం కలసి కుకునూర్‌పల్లి ఎస్సై ప్రభాకర్‌రెడ్డి వద్దకు వెళ్లామని రాజీవ్ అంగీకరించాడు. బంజారాహిల్స్ రోడ్ నెం. 3లోని మండల కార్యాలయం ఎదురుగా ఉన్న వైన్‌షాప్‌లో మద్యం కొనుగోలు చేసి రాయదుర్గం ప్రాంతంలో కబాబ్‌లు తీసుకొని కుకునూర్‌పల్లికి బయల్దేరామని నిందితులు పోలీసులకు చెప్పారు. ఆ రోజు రాత్రి ఎస్సై ప్రభాకర్‌రెడ్డి క్వార్టర్స్‌లో ఏం జరిగిందనే దానిపై అధికారులు కూపీ లాగుతున్నారు. -
'కన్నుల్లో నీ రూపమే..' మూవీ స్టిల్స్
-
ఆ తప్పు మళ్లీ చేయను!
హీరోగా చేయడంతో పాటు సపోర్టింగ్ రోల్స్, నెగటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్స్ చేస్తున్నారు నందు. ఈ రోజు ఈ యువ నటుడి పుట్టిన రోజు. ఈ సందర్భంగా పత్రికల వారితో నందు మాట్లాడుతూ - ‘‘నేను అభిమానించే అమితాబ్ బచ్చన్, సూర్య వంటి హీరోలతో సినిమాలు చేసిన రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వంలో ‘365 డేస్’ చేయడం ఓ గొప్ప అనుభూతి. అయితే, ‘సన్నాఫ్ సత్యమూర్తి’, ‘శ్రీమంతుడు’లోని కీలక పాత్రలు, ‘కుందనపు బొమ్మ’లో హీరో పాత్రను వదులుకోవడం బాధ అనిపించింది. ఇక నుంచి అలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదనుకుంటున్నా’’ అని చెప్పారు. తెలుగు, హిందీ భాషల్లో నవనీత్ దర్శకత్వం వహిస్తున్న చిత్రంలో నెగటివ్ టచ్ ఉన్న హీరో క్యారెక్టర్ చేస్తున్నాననీ, ఓ తెలుగు చిత్రంలో విలన్‌గా లేడీ డెరైక్టర్ శరణ్య దర్శకత్వం వహిస్తున్న కన్నడ చిత్రం ‘మధువన’లో హీరోగా నటిస్తున్నాననీ నందు తెలిపారు. -
మే22న విడుదలవుతున్న ‘365 డేస్’
నందు, అనైక సోఠి హీరో హీరోయిన్లుగా డీవీ క్రియేషన్స్ బ్యానర్ పై సంచలన దర్శకుడు రామ్ గోపాల్ దర్శకత్వంలో డి.వెంకటేష్ నిర్మించిన చిత్రం ‘365 డేస్’. పెళ్లైన ప్రేమికులకు తర్వాత ఎలాంటి సమస్యలు వచ్చాయనే కాన్సెప్ట్ పై ఈ చిత్రం రూపొందింది. సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈచిత్రం క్లీన్ ‘యు’ సర్టిఫికేట్ ను పొందింది. ఈ చిత్రం ఈ నెల 22న విడుదల అవుతుంది. ఈ సందర్భంగా... చిత్ర నిర్మాత డి.వెంకటేష్ మాట్లాడుతూ ‘’ప్రేమించుకుని ఒకటైన ఒక జంట పెళ్లి తరవాత ఎలాంటి పరిణామాలు చూశారు. పెళ్లికి ముందు ఒకరంటే ఒకరు ఇష్టపడ్డవారికి పెళ్లి తర్వాత ఒకరంటే ఒకరకి పడకుండా పోవడానికి కారణాలేంటి అనే పాయింట్ మీద మా ‘365డేస్’ చిత్రం ఉంటుంది. ఇప్పటి వరకు రామ్ గోపాల్ వర్మగారు చేయని జోనర్ మూవీ ఇది. ఇటీవల విడుదలైన ఆడియో మంచి రెస్పాన్ ను సంపాదించుకుంది. ట్రైలర్, ఫస్ట్ లుక్, పోస్టర్ ఇలా అన్నింటికి ఆడియెన్స్ నుండి మంచి స్పందన వచ్చింది. సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని క్లీన్ ‘యు’ సర్టిఫికేట్ ను పొందింది, ఈ చిత్రాన్ని ఈ నెల22న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ లెవల్ లో విడుదల చేస్తున్నాం’’ అన్నారు. -
‘క్లోజ్ ఫ్రెండ్స్’ మూవీ స్టిల్స్
-
నేను డ్రగ్స్ సేవించడం అబద్ధం
-
'పెసరట్టు' మూవీ స్టిల్స్
-
బుజ్జితో నా జీవితం సప్తవర్ణాల ఇంద్రధనుస్సులా ఉంది!
గీతామాధురి... ఎంత ట్రెండీగా కనిపిస్తారో, అంత ట్రెడిషనల్. ఆమె పాడే పాటలు కూడా అంతే. క్లాస్‌గానూ పాడగలరు, మాస్‌గానూ మురిపించగలరు. చాలా షార్ట్‌టైమ్‌లోనే స్వీట్ సింగర్ అనిపించుకున్నారామె. నటుడు నందూని ఇటీవల పెళ్లాడిన గీతామాధురి కెరీర్ కబుర్లు... ఫ్యామిలీ ముచ్చట్లు... బిజీగా ఉన్నట్లున్నారు? ఓ వైపు పాటల్నీ, మరో వైపు మా వారినీ చూసుకోవాలి. మరి బిజీ గాక ఏముంటుంది చెప్పండి? ఎలా ఉందండీ వైవాహిక జీవితం? ఇంత ఆనందంగా ఉంటుందని మాత్రం ఊహించలేదు. నిజంగా బుజ్జి(నందు)తో నా జీవితం సప్తవర్ణాల ఇంద్రధనుస్సులా ఉంది. తను సినిమా వ్యక్తే అవ్వడం, ఇంట్లో మా అత్తగారికి కూడా ప్రోత్సహించే తత్వమే ఉండటంతో వ్యక్తిగతంగానే కాక, వృత్తిపరంగా కూడా సంతోషంగా ఉన్నాను. మీ ఇద్దరిలో ముందు ప్రపోజ్ చేసింది ఎవరు? ప్రేమ ప్రపోజల్ ఆయన తెచ్చారు. పెళ్లి ప్రపోజల్ నేను తెచ్చాను(నవ్వుతూ). మీ ఇద్దరూ కలిసి ఓ లఘుచిత్రంలో కూడా నటించినట్లున్నారు? ఇక ముందు కూడా నటిస్తారా? లేదండీ... అసలు అలాంటి ఉద్దేశమే నాకు లేదు. నందుతోనే నా జీవితం అనుకున్నప్పుడు ఏదో చిన్న చిన్న కోరికలుంటాయి కదా! అందుకే... తనతో కలిసి ఆ షార్ట్ఫిలిమ్ చేశాను. నటించాలంటే దానికి కొన్ని అర్హతలుండాలి. నాలో ఆ అర్హతలు లేవని నా అభిప్రాయం. నా వరకు నాకు పాటలే లోకం. అంతే.. సరేకానీ... మీ ఆయన్ను మీరు ‘బుజ్జి’ అని పిలుస్తారా? అవునండీ... అంతకుముందు లేదు. ఎందుకోగానీ ఉన్నట్లుండి ‘బుజ్జీ...’ అని పిలవడం మొదలుపెట్టాను. అందరిముందు అలా పిలవడం మాత్రం ఇబ్బందిగానే ఉంది. తనకెలా ఉందో మరి! ఇంట్లో మీ ఇద్దరిలో పై చేయి ఎవరిది? నన్నడిగితే... ఆయనదే అని చెబుతాను. ఆయన్నడిగితే నా పేరు చెబుతారు. నిజానికి ఇద్దరిదీ. ఎందుకంటే... ఏ విషయం అయినా... ఇద్దరం కలిసి కూర్చుని డిస్కస్ చేసుకున్న తర్వాతే ఓ నిర్ణయానికొస్తాం. ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాత పై చేయి, కింద చేయి అనే సమస్యలే ఉండవు! గాత్రంతో ప్రయోగాలు భలే చేస్తారే. ఎక్కడ నేర్చుకున్నారు? అవసరాలే నేర్పాయండీ. అలాంటి పాటలొచ్చాయి నాకు. తాగినట్లు పాడాల్సి వచ్చింది... పాడాను. ఏ మాత్రం ఎక్స్ప్రెషన్ లేకుండా పాడాల్సి వచ్చింది... పాడాను. రొమాంటిక్ ఎక్స్ప్రెషన్తో పాడాను. రొమాంటిక్ ఎక్స్ప్రెషన్తో హై పిచ్‌లో పాడాల్సి వచ్చింది... పాడాను. ఇలా... రకరకాలుగా పాడే అవకాశాలొచ్చాయి. అది నా అదృష్టమే కదా! క్లాసికల్ నేర్చుకున్నారా? మూడో తరగతి నుంచి టెన్త్ క్లాస్‌కు వచ్చేంత వరకూ కొచ్చర్లకోట పద్మావతిగారి వద్ద క్లాసికల్ నేర్చుకున్నాను. తర్వాత రామాచారిగారి దగ్గర కొన్నాళ్లు. ఆయన దగ్గర నేర్చుకున్నప్పుడే నాకు సంగీతంతో పాటు ఆత్మవిశ్వాసం కూడా వచ్చింది. నన్ను గాయనిగా సినిమాకు పరిచయం చేసింది రామాచారిగారే. ఆయన ‘ప్రేమలేఖ రాశా’ అనే సినిమాకు సంగీత దర్శకత్వం వహించారు. ఆ సినిమాలో ఓ పాటను నాతో పాడించారు. అదే టైమ్‌లో కీరవాణిగారికి పరిచయం చేశారు. అలా ‘ఖతర్నాక్’లో పాడే అవకాశం వచ్చింది. మీకు బాగా పేరు తెచ్చిన పాటలు? ‘వీడొక్కడే’లో ‘అబ్బో వీడేంటో...’ పాట నాకు తొలి బ్రేక్. ఇక ‘చిరుత’లోని ‘చమ్కా చమ్కా చమ్కీరే...’ పాట అయితే నాకు ఎక్కడలేని గుర్తింపు తెచ్చింది. ‘నచ్చావులే’ టైటిల్సాంగ్ పాడినందుకు నాకు అవార్డు వచ్చింది. ‘గోలీమార్’లోని ‘మగాళ్లు వట్టి మాయగాళ్లు’, ‘మిర్చి’లోని ‘డార్లింగే... ఓసి నా డార్లింగే’, ‘ఇద్దరమ్మాయిలతో’లో ‘టాపు లేచిపోద్ది’... ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. గాయనిగా మంచి పేరు తెచ్చుకున్నారు కదా! ‘నంబర్‌వన్’ స్థానంపై మీ అభిప్రాయం? వేరే రంగాల గురించి నాకు తెలీదు. నా రంగం విషయానికొస్తే... ఇక్కడ అందరం నంబర్వన్లమే. ఎవరి అవకాశాలు వాళ్లకున్నాయి. నేను ఎక్కువ సినిమాలకు పాడుతున్నానంతే! అది నా అదృష్టం! మీ తోటి సింగర్స్‌లో ఎవరు బెస్ట్ అంటే ఏం చెబుతారు? ఎవరి ప్రత్యేకతలు వారికున్నాయండీ. సునీతగారు, ఉషగారు, కౌసల్యగారు, మాళవిక, శ్రావణభార్గవి, రీసెంట్గా పాడుతున్న సాహితి, లిప్సిక, రమ్య... ఇలా అందరూ బాగానే పాడుతున్నారు. సంగీత దర్శకత్వం చేసే ఉద్దేశం ఏమైనా ఉందా? అంత టాలెంట్ నాలో లేదు. అది మోర్ క్రియేటివ్ జాబ్. పాటలను ఎంజాయ్ చేయడం మాత్రమే నాకు తెలుసు! దట్సాల్! - బుర్రా నరసింహ -
పెసరట్టు మూవీ ప్రారంభం..!
-
పెసరట్టు టీమ్‌తో చిట్‌ఛాట్
-
పెసరట్టు మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్స్
-
'పాఠశాల' ఆడియో ఆవిష్కరణ
-
నందును ఇంట్లోకి రానివ్వని గీతామాధురి
ప్రేమపక్షులు నందు.. గీతామాధురి ఇప్పుడు కలిసి ఉండట్లేదా? తాను ఎంతగానో ప్రేమించి పెళ్లి చేసుకున్న నందును ఇప్పుడు గాయని గీతామాధురి అసలు ఇంట్లోకి రానివ్వడం లేదా? అవునట. ఈ విషయాన్ని స్వయంగా గీతామాధురే తన ఫేస్బుక్ పేజీ ద్వారా తెలిపింది. 'ఇంట్లోకి నాట్ ఎలోవ్డ్' అంటూ తన స్టేటస్ అప్డేట్ చేసింది. ఖంగారు పడకండి.. వాళ్లిద్దరు ఏమీ విడిపోలేదు, ఇద్దరి మధ్య ఎలాంటి జగడాలు కూడా జరగలేదు. (చదవండి: నందుతో గీతామాధురి నిశ్చితార్థం) అయితే.. ఇప్పుడు ఉన్నది ఆషాఢ మాసం కాబట్టి, ఆ వంక పెట్టి పుట్టింటికి వెళ్లిన గీతా మాధురి.. ఎటూ ఆషాఢ మాసంలో అల్లుడు అత్తగారిని చూడకూడదు, ఆ ఇంటి గడప తొక్కకూడదు కాబట్టి ఆషాఢం అల్లుడిని ఇంట్లోకి రానిచ్చేది లేదని ఆట పట్టిస్తోంది. అందుకే గీతామాధురి పుట్టింట్లోకి నందు వెళ్లలేకపోతున్నాడు. దాదాపు మూడున్నరేళ్ల పాటు ప్రేమించుకున్న నందు, గీతామాధురి ఇటీవలే పెళ్లి చేసుకున్నారు. ఆటోనగర్ సూర్య సినిమాలో అతడి నటనను సమంత కూడా ట్విట్టర్ వేదికగా చాలా మెచ్చుకుంది. -
పాఠశాల మూవీ స్టిల్స్