
నంందు, నోయల్, పునర్నవీ భూపాలం హీరో, హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం ‘ఎందుకో ఏమో’. కోటి వద్దినేని దర్శకత్వంలో మహేశ్వర క్రియేషన్స్ పతాకంపై మాలతి వద్దినేని నిర్మించిన ఈ చిత్రం నేడు విడుదలవుతోంది. కోటి వద్దినేని మాట్లాడుతూ– ‘‘మాది గుంటూరు జిల్లా కర్లపూడి గ్రామం. పోసాని కృష్ణమురళీ గారు నాకు దగ్గరి బంధువు. ఆయన ఇ¯Œ స్పిరేషన్‌తో ఇండస్ట్రీకి వచ్చాను. వచ్చీ రాగానే డైరెక్టర్ కావాలనుకున్నాను. వచ్చిన రెండేళ్లలో ఇండస్ట్రీ అంటే ఏంటో తెలిసింది. పోసానిగారు శ్రీహరి గారి సినిమాలకు పనిచేస్తున్న సమయంలో రైటింగ్ డిపార్ట్‌మెంట్‌లోను, ఒకట్రెండు సినిమాలకు దర్శకత్వ శాఖలోను పనిచేశాను.
ఇప్పుడు ‘ఎందుకో ఏమో’కి నేను దర్శకునిగా, నా భార్య నిర్మాతగా మారటానికి కారణం ఏంటంటే, ‘శ్రావణమాసం’ చిత్రం తర్వాత పోసానిగారు దర్శకునిగా, నిర్మాతగా సినిమాలను చేయటం మానేశారు. ఇక డైరెక్టర్ అవ్వాలని నిర్ణయించుకుని కథలను తయారు చేసుకుని తిరిగేవాడిని. ‘ఎందుకో ఏమో’ కథను చాలామందికి చెప్పాను. కానీ ఎవరూ ఆసక్తి చూపలేదు. ఆ సమయంలో మా భూములు మంచి ధర పలకడంతో నిర్మాణ రంగంలోకి దిగాం. ఇది ట్రయాంగిల్ లవ్ స్టోరీ. ఓ కొత్త పాయింట్‌తో తీశాం. సెకండాఫ్ సినిమాకి ఎస్సెట్ అవుతుంది. కథపై నమ్మకంతోనే ఎన్నో పెద్ద సినిమాలు విడుదలవుతున్నా మా సినిమా విడుదలకు సిద్ధమయ్యాం’’ అని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment