Noel
-
‘పోటెల్’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
బిగ్‌బాస్-7లో విడాకులు తీసుకున్న జంట? మళ్లీ కలుస్తారా?
బుల్లితెరపై బిగ్‌బాస్ రియాలిటీ షోకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికే తెలుగులో ఆరు సీజన్లు పూర్తికాగా, త్వరలోనే బిగ్‌బాస్-7 ప్రారంభం కానుంది. అయితే గత సీజన్లతో పోలిస్తే ఈసారి చాలా క్రేజీగా ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. గత సీజన్ అనుకున్నంత సక్సెస్ కాకపోవడంతో ఈసారి ఎలాగైనా సీజన్-7ను సూపర్ హిట్ చేయాలని గట్టిగా డిసైడ్ అయ్యారట. ఇందులో భాగంగా ఇప్పటికే యాంకర్ రష్మీని సంప్రదించినట్లు టాక్ వినిపిస్తున్న సంగతి తెలిసిందే.తాజాగా నెట్టింట వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం.. ఈసారి విడాకులు తీసుకున్న ఓ సెలబ్రిటీ జంటను హౌస్‌లోకి పంపించే ఏర్పాట్లు చేస్తున్నారట. ర్యాప్ సింగర్‌గా పాపులర్ అయిన నోయెల్, నటి ఎస్తేర్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కానీ మనస్పర్థల కారణంగా విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ జంటను బిగ్‌బాస్‌లోకి పంపేందకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. మరి ఇందులో ఎంత వరకు నిజం ఉంది? ఒకవేళ బిగ్‌బాస్ టీం వాళ్లని సంప్రదించినా నోయెల్-ఎస్తేర్‌లో ఒప్పుకుంటారా అన్నది సస్పెన్స్‌గా మారింది. -
సింగర్ నోయెల్ ఇంట తీవ్ర విషాదం..
ర్యాప్ సింగర్ నోయెల్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ర్యాపర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నోయెల్ సింగర్‌గానే కాకుండా నటుడిగానూ పలు సినిమాల్లో నటించాడు. బిగ్‌బాస్ తెలుగు సీజన్-3లో కంటెస్టెంట్‌గానూ పాల్గొని అలరించాడు. అయితే నోయెల్ ఇంట ఇప్పుడు తీవ్ర విషాదం చోటుచేసుకుంది. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న నోయెల్ తండ్రి శనివారం రాత్రి కన్నుమూశారు. ఈ విషయం తెలిసి సింగర్ రాహుల్ సిప్లిగంజ్ సహా పలువురు టాలీవుడ్ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. కాగా నోయెల్‌కు తండ్రితో ఎంతో అనుబంధం ఉంది. ఆయనతో కలిసి పంచుకున్న పలు సరదా వీడియోలను నోయెల్ సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. తండ్రి మరణంతో నోయెల్ కుంగిపోయినట్లు తెలుస్తోంది. -
బిగ్‌బాస్: ఈ వారం ఎలిమినేషన్లో ఉన్నది వీళ్లే
కరోనా కారణంగా కాస్తా ఆలస్యంగా ప్రారంభమైనా బిగ్‌బాస్ జనాల్లో మెల్లమెల్లగా పుంజుకుంటుంది. వారం రోజులుగా చప్పగా సాగిన కంటెస్టెంట్ల ప్రదర్శనలో మెరుగు కన్పిస్తోంది. తొటి సభ్యులతో పరిచయాలు పెంచుకుంటూ ప్రస్తుతం హుషారుగా ఉన్నట్లు కొట్టొచ్చినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా రెండో వారం రానే వచ్చింది. అర్థరాత్రి బిగ్‌బాస్‌లోకి ప్రవేశించిన కుమార్ సాయి దొంగలా దాక్కొని.. అక్కడ ఉన్న దేవితో మాట్లాడేందుకు ప్రయత్నించాడు. ఇంట్లోకి ఎవరో వచ్చారని గమనించిన దేవి అతని ముఖం చూసేందుకు సాహసించింది. అయితే తనను చూడొద్దని దేవిని భయపెడుతూ సభ్యులను పిలుచుకు రావాలని కుమార్ కోరాడు. అనంతరం ఒక్కొక్కరిగా వచ్చి సాయి కుమార్‌తో మాట్లాడి ఇంట్లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చారని పసిగట్టారు. (బిగ్‌బాస్: నువ్వు హీరోయిన్, నేను హీరో) అంతేగాక అభిజిత్, మోనాల్ అర్థరాత్రి ఏకాంతంగా గుసగుసలు పెట్టుకున్నారు. ఇక ఉదయం కూడా మళ్లీ మోనాల్, అభిజిత్ రహస్యంగా మాట్లాడుకోవడంతో వీరి మధ్య ఎదో ఉందని ప్రజలకు సందేహిస్తున్నారు. అదే విధంగా అఖిల్ మోనాల్ గురించి లాస్యతో చాడీలు చెప్పేందుకు ప్రయత్నించి వెంటనే మళ్లీ మోనాల్‌ను పిలిచి తనతో కాస్తా కొంటెగా ముచ్చటించాడు. అఖిల్ వద్దకు వచ్చిన మోనాల్ ఎదో చెప్పే ప్రయత్నం చేయబోతుంటే యదవ యాక్టింగ్‌లు చేయకు అంటూ అఖిల్ నోరు పారేసుకున్నాడు. నీకేం చేయాలో తెలియదా అని అఖిల్ అనగానే. మంచిగా మాట్లాడు అంటూ మోనాల్ కూడా కొంచెం సీరియస్ అయ్యింది. ఇక ఈ వాదన అయిపోగానే ఇద్దరి మధ్య ఏర్పడిన చిరు గొడవను డైవర్ట్ చేస్తూ మోనాల్‌ను కూల్ అయ్యేలా మస్కా కొట్టాడు. మరోలా ఆలోచిస్తే ఈ రోజు చర్చంతా మోనాల్‌పై జరిగినట్లు కన్నిస్తోంది. (బిగ్‌బాస్: సూర్యకిరణ్ అవుట్, ఆమెపై బిగ్‌బాంబ్!) ఇదిలా ఉండగా ఈ రోజు నుంచి రేషన్ ప్రక్రియ ప్రారంభం అయ్యింది. ఇంటి సభ్యులకు కావాల్సిన రేషన్‌ను దక్కించుకునేందుకు ఒకిరిని రేషన్ మేనేజర్‌గా ఎన్నుకోవాలి. వారికి రూమ్ తాళం ఇచ్చి అందులోని సమన్లు తెచ్చుకోవాలి. అ క్రమంలో ఈ పోస్టును అమ్మ రాజశేఖర్‌కు కెప్టెన్ లాస్య అప్పగించడంతో మాస్టర్, కెప్టెన్ లాస్య స్టోర్ రూమ్‌కు వెళ్లి కావాల్సిన వస్తువులను తీసుకొచ్చారు. (బిగ్‌బాస్: ముందు తనే వెళ్లిపోతానన్న గంగవ్వ) ఇక రెండో వారం నామినేషన్ ప్రక్రియ మొదలైంది. ఈ నేపథ్యంలో ఇంట్లోని 16 మంది గార్డెన్ ఏరియాలో ఉన్న పడవలోకి ఎక్కాలి. పడవ ప్రతి తీరం మధ్య ఆగినప్పుడు ఒక్కో సభ్యుడు దాని నుంచి ఖచ్చితంతగా దిగిపోవాల్సి ఉంటుంది. ఇలా తొమ్మిది తీరాల మధ్య పడవ ఆగుతుంది. అంటే 9 మంది నామినేషన్ అవుతారు. ఇక పడవలోకి కూర్చొని సభ్యులంతా సరదాగా పాటలతో హోరెత్తించారు. ఇక మొదటి తీరం రాకముందే పడవ నుంచి నేను పోత అంటే నేను దిగపోతా అంటూ ముందుకు వచ్చారు. ఇంతలోనే దిగేందుకు సరైన కారణం చెబితే తాను దిగిపోతానని కుమార్ సాయి తెలిపాడు. దీంతో ఎవరిని పడవ నుంచి దింపేయాలన్న చర్చ సభ్యుల్లో సాగింది. ఇంతోనే అభిజిత్ కలగజేసుకొని అవ్వ ఎక్కవ సేపు కూర్చోలేదని చెబుతూ మొదట పడవ దిగమని చెబుతామా అని సలహా ఇచ్చాడు. దానికి అవ్వ సరే చెప్పి తొలి రౌండ్లోనే దిగిపోయింది. అయితే ఊహించని విధంగా నోయల్ రెండో హారన్‌కు దిగిపోయాడు. మోనాల్ మూడో హారన్‌కు పడవ నుంచి దిగేసింది. (మైండ్ బ్లాక్ చేసిన దివి, దేవి) ఇంట్లోకి వచ్చిన కుమార్ మొదటి రోజే ఇంటి సభ్యులతో మైండ్ గేమ్ ఆడుతున్నట్లు తెలుస్తోంది. మనసులో దిగాలని లేకపోయిన మీరు చేస్తే దిగుతా అంటూ ప్రతి రౌండ్లో తెలివి ప్రదర్శిస్తూ వచ్చాడు. నాలుగో రౌండ్ మోగగానే పోహైల్, అయిదో బజర్‌కు కరాటే కళ్యాణి దిగిపోయింది. ఆరో హారన్‌కు అమ్మ రాజశేఖర్ పడవ నుంచి దిగేసి ఇంట్లోకి వచ్చేశారు. ఏడవ రౌండ్లో కుమార్, ఎనిమిది హారిక, తొమ్మిది అభిజిత్ దిగిపోయాడు. అయితే నామినేషన్లోకి వెళ్లినా తిరిగి సేఫ్ అవ్వగలం అన్న నమ్మకం ఉన్న వారు పడవ నుంచి దిగేసినట్లు తెలస్తోంది. నామినేట్ అయితే ఎలిమినేట్ అవుతామన్న భయంతో సుజాత, మెహబూబ్, దివి, అఖిల్ గుట్టు చప్పుడు కాకుండా చివరి దాకా పడవలోనే ఉన్నారు. చివరికి ఈ వారం నామినేషన్ ప్రక్రియ ముగిసింది. గంగవ్వ, నోయల్, మోనాల్, సోహైల్, కరాటే కళ్యాణి, అమ్మ రాజశేఖర్, కుమార్ సాయి, హారిక, అభిజిత్ నామినేట్ అయ్యారు. మరి ఈ వారం సేఫ్ అయ్యేది ఎవరో, ఎలిమినేట్ అయ్యేది ఎవరో తెలియాలంటే ఈ వారమంతా బిగ్బాస్సై ఓ కన్ను వేయాల్సిందే. -
విడాకులు తీసుకున్నాం: నోయల్
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ ర్యాపర్, టాలీవుడ్ నటుడు నోయల్ మంగళవారం అభిమానులకు షాకింగ్ న్యూస్ చెప్పాడు. భార్య ఎస్తర్ నుంచి తాను విడాకులు తీసుకున్నట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. ఇప్పటికే డివోర్స్ కోసం దరఖాస్తు చేశామని, ఇన్నాళ్లు కోర్టు నిర్ణయం కోసం ఎదురు చూసినట్లు తెలిపాడు. అభిప్రాయ భేదాల కారణంగా తాము విడిపోతున్నామని, తమ మధ్య ఉన్న అందమైన బంధాన్ని, దాని విలువను కాపాడుకునేందుకు ఇదే సరైన నిర్ణయమని భావిస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. ఎస్తర్ భవిష్యత్ బాగుండాలని, తనకు అంతా మంచే జరగాలని, తను కన్న కలలు నిజం కావాలని ఆకాంక్షించాడు. విడాకుల విషయంలో తన కుటుంబాన్ని గానీ, ఎస్తర్‌ను గానీ ఇబ్బంది పెట్టేలా వ్యవహరించవద్దని విజ్ఞప్తి చేశాడు. అలాగే కష్ట సమయాల్లో తనకు తోడుగా నిలిచిన ప్రతీ ఒక్కరికి నోయల్ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపాడు. సరికొత్త ఆశలతో కొత్త జీవితానికి స్వాగతం పలికేందుకు సిద్ధమైనట్లు పేర్కొన్నాడు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ నోట్‌ను షేర్ చేశాడు. ఇక ఎస్తర్ సైతం విడాకుల విషయాన్ని ధ్రువీకరిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఫొటో షేర్ చేసి సుదీర్ఘ క్యాప్షన్ జతచేశారు.(చదవండి: నోయల్‌కు కరోనా: 'దీని గురించి తర్వాత మాట్లాడతా!') కాగా ప్రముఖ డైరెక్టర్ తేజ దర్శకత్వం వహించిన 'వెయ్యి అబద్ధాలు' సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఎస్తర్- నోయెల్ గతేడాది వివాహ బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. ప్రేమపెళ్లి చేసుకున్న ఈ జంట మధ్య గత కొంతకాలంగా సఖ్యత చెడిందని రూమర్లు వినిపించాయి. ఇక ఈ రోజు నోయల్ తమ వైవాహిక బంధానికి ముగింపు పలుకుతున్నట్లు అధికారికంగా ప్రకటించడంతో వదంతులు నిజమేనని నిరూపితమైంది. ఇక కెరీర్ విషయానికొస్తే ఎస్తర్ తెలుగు, తమిళ్, మరాఠీతో పాటు హిందీ సినిమాలతో బిజీగా ఉన్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా.. అట్టహాసంగా ప్రారంభం కానున్న తెలుగు బిగ్‌బాస్ సీజన్ 4లో నోయెల్ పాల్గొనున్నట్లు ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అంతేగాక షో కోసం క్వారంటైన్లో ఉన్న అతడికి ఇటీవల కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు వార్తలు వినిపించాయి. అయితే నోయెల్ వాటన్నింటినీ కొట్టిపడేశాడు. View this post on Instagram I am Officially Divorced! After a long hard silence, today I officially announce my divorce with Ester. We were waiting for courts decision to make it public. We had our differences which led to this & finally we decided to end this only to save the grace of this beautiful relationship. God bless you Ester & may all your dreams come true, wishing you nothing but the best. I request everyone to be supportive of this at this point of time & help us to heal from it. It will always be a beautiful phase of my life & I thank God for each & every day in it. I request everyone not to bother her or my family in any ways & I want to thank my family,friends & everyone who stood by me in my dark days. But Yes God Is Good All The Time & I Believe This Is A Great New Beginning! God Bless! A post shared by Noel (@mr.noelsean) on Aug 31, 2020 at 9:27pm PDT -
కరోనా వార్తలను కొట్టిపారేసిన నోయల్
నిజానికి ఈపాటికి బిగ్‌బాస్ తెలుగు నాల్గవ సీజన్ ప్రారంభమై ఎలిమినేషన్ కూడా మొదలవాలి. కానీ కరోనా వల్ల పరిస్థితులు తారుమారయ్యాయి. షో ప్రారంభం సరికదా, కనీసం పార్టిసిపెంట్ల ప్రోమోలు కూడా వదలలేదు. ఆగస్టు 30 కల్లా షో ప్రారంభిద్దాం అనుకుంటే అది కూడా సెప్టెంబర్ మొదటి వారానికి వాయిదా పడింది. మరోవైపు ఎంపిక చేసిన కంటెస్టెంట్లను హైదరాబాద్‌లో క్వారంటైన్లో ఉంచిన విషయం తెలిసిందే కదా! అయితే ఇందులో గాయకుడు నోయల్‌కు కరోనా పాజిటివ్ వచ్చిందంటూ వార్తలు ప్రచారమయ్యాయి. దీంతో షో వాయిదా వేస్తారేమో? లేదా కొత్త కంటెస్టెంట్‌ను తీసుకుంటారేమో? అదీ కాకపోతే ఇప్పుడు తాజాగా చేసే పరీక్షలో నెగెటివ్ వస్తే తిరిగి నోయల్‌నే తీసుకుంటారు కావచ్చు అంటూ ఊహాగానాలు కూడా మొదలయ్యాయి. (చదవండి: బిగ్‌బాస్: సురేఖవాణి ఎంట్రీ పై క్లారిటీ!) ఇంతకీ నోయల్ నిజంగానే కరోనాతో బాధపడుతున్నాడా లేదా తెలుసుకునేందుకు ఓ ఆంగ్ల మీడియా అతడిని సంప్రదించింది. అయితే అవన్నీ పుకార్లేనని నోయల్ ఆ వార్తలను కొట్టిపారేశాడు. కానీ, దీని గురించి తర్వాతే మాట్లాడతానని చెప్పుకొచ్చాడు. అంటే బిగ్‌బాస్ ఎంట్రీ గురించే నోయల్ మౌనం పాటిస్తున్నాడని అభిమానులు అంటున్నారు. మరోవైపు బిగ్‌బాస్ యాజమాన్యం గత సీజన్ విజేత రాహుల్ సిప్లిగంజ్‌తో ప్రత్యేక చాట్ షోను కూడా నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఇందులో షో నుంచి ఎలిమినేట్ అయ్యేవారితో రాహుల్ సంభాషించనున్నాడు. (చదవండి: బిగ్‌బాస్ 4 కంటెస్టెంట్‌కి కరోనా పాజిటివ్!) -
బిగ్‌బాస్ 4: ఆ డ్యాన్సర్, సింగర్ కూడా!
లవ్ సాంగ్స్‌తో పాటు ఐటమ్ పాటలకు కూడా అదిరిపోయే స్టెప్పులుండాలంటే జానీ మాస్టర్ ఉండాల్సిందే. ఆయన కొరియోగ్రఫీ చేసే ఏ పాటైనా హిట్ అందుకోవాల్సిందే. ఆ రేంజ్లో అతనికి గుర్తింపు, మార్కెట్ ఏకకాలంలో లభించాయి. అయితే త్వరలో ప్రారంభం కానున్న బిగ్‌బాస్ 4 తెలుగు సీజన్లో నృత్య దర్శకుడు జానీ మాస్టర్ పాల్గొననున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఆయన ఇప్పటికే 'ఢీ' షోలో జడ్జ్‌గా వ్యవహరిస్తున్నారు. వినాయక చవితి సందర్భంగా "బాపు బొమ్మకి పెళ్లంట" అనే ప్రత్యేక కార్యక్రమంలోనూ పాల్గొని సందడి చేశారు. మరి ఆయన బిగ్‌బాస్ ఇంట్లో అడుగు పెడితే ఏమేరకు సందడి ఉంటుందో చెప్పనక్కర్లేదు. జానీ మాస్టర్‌తో పాటు కొరియోగ్రాఫర్ రఘు మాస్టర్‌కు కూడా బిగ్‌బాస్ హౌస్‌లోకి తీసుకునే అవకాశాలున్నాయి. (బిగ్‌బాస్-4 ఎంట్రీపై తరుణ్ క్లారిటీ) కాగా గత సీజన్లో కొరియోగ్రాఫర్ బాబా భాస్కర్ పాల్గొన్న విషయం తెలిసిందే. ఆయన డ్యాన్స్ కన్నా ఎక్కువగా కామెడీని పండిస్తూ ప్రేక్షకుకులను కడుపుబ్బా నవ్వించారు. ఈ క్రమంలో ఈసారి కూడా కొరియోగ్రాఫర్‌ను తీసుకు వస్తే షోకు అదనపు హంగు వస్తుందన్న ఆలోచనలో ఉంది బిగ్‌బాస్ టీం. అలాగే గత సీజన్ విన్నర్‌గా నిలిచిన రాహుల్ క్లోజ్ ఫ్రెండ్, సింగర్ నోయల్‌ను కూడా షోలోకి తీసుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీంతో అన్ని రంగాల నుంచి ఒక్కొక్కరిని తీసునేందుకు ఇదివరకే ప్లాన్ రెడీ చేసినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ఎలాంటి సమాచారం బయటకు పొక్కకుండా జాగ్రత్త పడుతున్న బిగ్‌బాస్ యాజమాన్యం అధికారిక కంటెస్టెంట్ల లిస్టును వెల్లడించేవరకు వేచి చూడాల్సిందే. (బిగ్‌బాస్: ఒక్క వారానికి రూ.16 కోట్లు?) -
సమయం లేదు
‘గౌతమీపుత్ర శాతకర్ణి’ చిత్రంలోని ‘సమయం లేదు మిత్రమా..’ డైలాగ్ ఎంత పాపులర్ అయిందో తెలిసిందే. ఇప్పుడు ఆ ప్రస్తావన ఎందుకంటే ‘సమయం లేదు మిత్రమా’ పేరుతో ఓ సినిమా తెరకెక్కుతోంది. నోయల్ హీరో. ట్వింకిల్ సౌజ్ హీరోయిన్గా పరిచయం అవుతున్నారు. ఎమ్. వరప్రసాద్ దర్శకత్వంలో కె.వి.ప్రొడక్షన్ బ్యానర్లో జీఎమ్ మురళీధర్ నిర్మిస్తున్న ఈ సినిమా హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఎమ్. వరప్రసాద్ మాట్లాడుతూ– ‘‘కామెడీ, యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కనున్న చిత్రమిది. ఈ చిత్రానికి చాలా మంచి టెక్నీషియన్లు కుదిరారు’’ అన్నారు. ‘‘ఇది నా మొదటి చిత్రం. వరప్రసాద్ చెప్పిన కథ, కథనం నచ్చడంతో సినిమా నిర్మించడానికి ముందుకొచ్చాం’’ అని జీఎమ్ మురళీధర్ అన్నారు. ‘‘ఇందులో చాలా మంచి పాత్ర చేస్తున్నాను. ఈ సినిమా నాకు చాలా ప్లస్ అవుతుంది’’ అన్నారు నోయల్. ‘‘స్టోరీ బాగా కుదిరింది. తప్పకుండా అందరికీ నచ్చేలా ఈ చిత్రం నిర్మిస్తాం’’ అన్నారు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మాంచాల కిషన్. నటుడు నగేష్ పాల్గొన్నారు. ఈ చిత్రానికి సహ నిర్మాతలు: చల్లా మహేష్, అశోక్‌గౌడ్, సంగీతం: అజయ్‌పట్నాయక్, కెమెరా: ప్రవీణ్ కె.కావళి. -
అందుకే పెద్ద సినిమాల మధ్య వస్తున్నాం
నంందు, నోయల్, పునర్నవీ భూపాలం హీరో, హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం ‘ఎందుకో ఏమో’. కోటి వద్దినేని దర్శకత్వంలో మహేశ్వర క్రియేషన్స్ పతాకంపై మాలతి వద్దినేని నిర్మించిన ఈ చిత్రం నేడు విడుదలవుతోంది. కోటి వద్దినేని మాట్లాడుతూ– ‘‘మాది గుంటూరు జిల్లా కర్లపూడి గ్రామం. పోసాని కృష్ణమురళీ గారు నాకు దగ్గరి బంధువు. ఆయన ఇ¯Œ స్పిరేషన్‌తో ఇండస్ట్రీకి వచ్చాను. వచ్చీ రాగానే డైరెక్టర్ కావాలనుకున్నాను. వచ్చిన రెండేళ్లలో ఇండస్ట్రీ అంటే ఏంటో తెలిసింది. పోసానిగారు శ్రీహరి గారి సినిమాలకు పనిచేస్తున్న సమయంలో రైటింగ్ డిపార్ట్మెంట్లోను, ఒకట్రెండు సినిమాలకు దర్శకత్వ శాఖలోను పనిచేశాను. ఇప్పుడు ‘ఎందుకో ఏమో’కి నేను దర్శకునిగా, నా భార్య నిర్మాతగా మారటానికి కారణం ఏంటంటే, ‘శ్రావణమాసం’ చిత్రం తర్వాత పోసానిగారు దర్శకునిగా, నిర్మాతగా సినిమాలను చేయటం మానేశారు. ఇక డైరెక్టర్ అవ్వాలని నిర్ణయించుకుని కథలను తయారు చేసుకుని తిరిగేవాడిని. ‘ఎందుకో ఏమో’ కథను చాలామందికి చెప్పాను. కానీ ఎవరూ ఆసక్తి చూపలేదు. ఆ సమయంలో మా భూములు మంచి ధర పలకడంతో నిర్మాణ రంగంలోకి దిగాం. ఇది ట్రయాంగిల్ లవ్ స్టోరీ. ఓ కొత్త పాయింట్‌తో తీశాం. సెకండాఫ్ సినిమాకి ఎస్సెట్ అవుతుంది. కథపై నమ్మకంతోనే ఎన్నో పెద్ద సినిమాలు విడుదలవుతున్నా మా సినిమా విడుదలకు సిద్ధమయ్యాం’’ అని చెప్పారు. -
వినాయక్ చేతుల మీదుగా ‘ఎందుకో ఏమో’ టీజర్ లాంచ్
మహేశ్వర క్రియేషన్స్ పతాకంపై నందు,నోయల్, పునర్నవి హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న సినిమా ఎందుకో ఏమో. కోటి వద్దినేని దర్శకత్వంలో మాలతి వద్దినేని ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా టీజర్‌ను ఈ రోజు స్టార్ డైరక్టర్ వి.వి.వినాయక్ చేతుల మీదుగా విడుదలైంది. ఈ సందర్భంగా వి.వి.వినాయక్ మాట్లాడుతూ...‘‘ ఎందుకో ఎమో’ టైటిల్ లాగే టీజర్ కూడా చాలా ట్రెండీగా, ఇంట్రస్టింగ్ గా ఉంది. ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్న కోటికి మంచి పేరు, నిర్మాతకు లాభాలు రావాలనీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇందులో నటించిన నటీనటులకు, సాంకేతిక నిపుణులకు నా శుభాకాంక్షలు’’ అన్నారు. దర్శకుడు కోటి వద్దినేని మాట్లాడుతూ...‘‘ ఎందుకో ఎమో’ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నా. ఎంతో బిజీ షెడ్యూల్ లో కూడా మా చిత్రం టీజర్ ఆవిష్కరించిన వి.వి.వినాయక్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. నందు, నోయల్, పునర్నవి హీరో హీరోయిన్లుగా నటించారు. ఇదొక ట్రయాంగిల్ లవ్ స్టోరి. మా నిర్మాత ఎక్కడా రాజీ పడకుండా, పూర్తి స్వేచ్ఛ నివ్వడంతో అనుకున్నట్టుగా సినిమా తీయగలిగాం. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన సెన్సార్ పనులు జరుగుతున్నాయి. ఫిబ్రవరి మొదటి వారంలో ఆడియో విడుదల చేసి, అదే నెలలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. నిర్మాత మాలతి వద్దినేని మాట్లాడుతూ...‘‘ మహేశ్వర క్ర్రియేషన్స్ పతాకంపై ఇది మా తొలి సినిమా. వినాయక్ గారి చేతుల మీదుగా మా చిత్రం టీజర్ విడుదల కావడం శుభసూచకంగా భావిస్తున్నాం. దర్శకుడు చెప్పిన కథ నచ్చడంతో సినిమాను ఏ విషయంలో రాజీ పడకుండా నిర్మించాం. మంచి లవ్ స్టోరీ తో పాటు కమర్షియల్ హంగులు కూడా సినిమాలో ఉన్నాయి. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే సినిమా అవుతుంది. మా యూనిట్ అంతా పూర్తి సహాయ సహకారాలు అందించడంతో సినిమాను అనుకున్నవిధంగా పూర్తి చేయగలిగాం. ఫిబ్రవరి మొదటి వారంలో ఆడియో విడుదల చేసి సినిమాను కూడా అదే నెలలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. -
'నయనం' లోగో లాంచ్
లావోస్ మోషన్ పిక్చర్స్ పతాకంపై రూపొందుతున్న మొదటి చిత్రం 'నయనం'. ఎస్తేర్ నొరోన్హా,నోయెల్ సీన్ , శ్రీ మంగం , అర్జున్ ఆనంద్ ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. దర్శకధీరుడు రాజమౌళి వద్ద ఈగ, మర్యాద రామన్న , మగధీర చిత్రాలకు అసిస్టెంట్ గా పని చేసిన క్రాంతి కుమార్ వడ్లమూడి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్ర టైటిల్ లోగో లాంచ్ హైదరాబాద్ లోని ఇనార్బిట్ మాల్ లో 'పెళ్లి చూపులు' చిత్ర నిర్మాత రాజ్ కందుకూరి చేతుల మీదుగా జరిగింది. ఈ సందర్భంగా రాజ్ కందుకూరి మాట్లాడుతూ...''నయనం' టైటిల్ తో పాటు లోగో కూడా చాలా బావుంది. స్ర్కిప్ట్ కూడా కొంచెం విన్నాను ఇంట్రస్టింగ్ గా ఉంది. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు రాజమౌళి గారి శిష్యుడి డైరక్షన లో సినిమా వస్తుందంటే ఎలా ఉండబోతుందో మనం ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. నిర్మాత కూడా ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అందరికీ నా శుభాకాంక్షలు' అన్నారు. దర్శకుడు క్రాంతి కుమార్ వడ్లమూడి మాట్లాడుతూ... '' నయనం' టైటిల్ లోగో ఆవిష్కరణకు విచ్చేసిన రాజ్ కందుకూరి గారికి ధన్యవాదాలు. టైటిల్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో వస్తోన్న సినిమా కూడా కచ్చితంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని' అన్నారు. నిర్మాతల్లో ఒకరైన శ్రీ రామ్ కందుకూరి మాట్లాడుతూ....'మా తొలి చిత్రం 'నయనం' లోగో లాంచ్ అభిరుచి గల నిర్మాత రాజ్ కందుకూరి గారి చేతుల మీదుగా చేయడం చాలా సంతోషంగా ఉంది. ఇటీవల ఎనౌన్స్ చేసిన నయనం టైటిల్ కు, థీమ్ ఏంటో గెస్ చేయండంటూ మేము నిర్వహించిన వినూత్నమైన కాంటెస్ట్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. దీపావళి రోజున మా చిత్రానికి సంబంధించిన టీజర్ ను గ్రాండ్ గా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. పోస్ట్ పొడక్షన్ పనులు చివరి దశలో ఉన్నాయి. నవంబర్ లో సినిమాను విడుదల చేయాలన్న ప్లాన్ లో ఉన్నాం' అన్నారు. -
రాజా మీరు... హిట్టవ్వాలి
– డి. సురేశ్‌బాబు తారకరత్న, రేవంత్, నోయెల్, హేమంత్, లాస్య, శోభిత ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘రాజా మీరు కేక’. కృష్ణ కిశోర్‌ను దర్శకునిగా పరిచయం చేస్తూ, ఆర్.కె. స్టూడియోస్ పతాకంపై రాజ్‌కుమార్ నిర్మించారు. ఈ చిత్రం ట్రైలర్‌ను నిర్మాత డి.సురేశ్ బాబు విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ– ‘‘మా సంస్థలో పలు విజయవంతమై చిత్రాలకు కృష్ణ కిశోర్ కో–డైరెక్టర్‌గా పనిచేశాడు. ఇప్పుడు దర్శకునిగా ‘రాజా మీరు కేక’ సినిమా తెరకెక్కించారు. ఈ చిత్రం హిట్ అయి తనకు, యూనిట్‌కు మంచి పేరు రావాలి’’ అన్నారు. ‘‘మా బ్యానర్లో నిర్మించిన మొదటి చిత్రం ‘గుంటూరు టాకీస్’ హిట్ అయింది. మలి ప్రయత్నంగా నిర్మించిన ‘రాజా మీరు కేక’ సినిమా కూడా మా సంస్థకు మరో హిట్‌ను అందిస్తుందనే నమ్మకం ఉంది. నటీనటులందరూ తమ పాత్రలకు న్యాయం చేశారు. యువతరంతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే అంశాలు ఉంటాయి’’ అని చిత్రనిర్మాత తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: రామ్ ప్రసాద్ రెడ్డి, సంగీతం: శ్రీ చరణ్. -
సవాల్‌లాంటి పాత్ర
నోయల్, ఎస్తేర్, శ్రీ, అర్జున్ మీనన్ ప్రధాన పాత్రల్లో సస్పెన్స్ థ్రిల్లర్ కథాంశంతో ఓ నూతన చిత్రం తెరకెక్కుతోంది. క్రాంతి వడ్లమూడి దర్శకత్వంలో లావోస్ మోషన్ పిక్చర్స్ పతాకంపై కృష్ణమోహన్, నరేన్, శ్రీరామ్ కందుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రం తొలి షెడ్యూల్ పూర్తి చేసుకుంది. హీరో శ్రీ బర్త్ డేని షెడ్యూల్ చివరి రోజున యూనిట్ సభ్యులు నిర్వహించారు. ‘‘త్వరలో రెండో షెడ్యూల్ ప్రారంభిస్తాం’’ అని నిర్మాతలు అన్నారు. ‘‘ క్రాంతి నా కోసం ఈ చిత్రంలో సవాల్ అనిపించే పాత్ర డిజైన్ చేశారు. ఈ పాత్రలో నన్ను కొత్తగా ఆవిష్కరిస్తు న్నారు’’ అని శ్రీ చెప్పారు. ఈ చిత్రానికి కెమెరా: చేతన్ మధురాంతకం, సంగీతం: గీతా పూనిక్. -
దర్శకుడు చెప్పినట్టే చేస్తా
‘‘నా కూతురు 6వ తరగతి చదువుతోంది. ముద్దుగా ‘మా అమ్మ ఎక్కడ’ అంటుంటాను. ఏ తండ్రికైనా కూతురుతో ప్రత్యేక అనుబంధం ఉంటుంది. ఈ చిత్రంలో నాది అటువంటి పాత్ర కావడంతో తల్లిదండ్రులు అందరూ తమను తాము చూసుకుంటు న్నారు’’ అన్నారు రావు రమేశ్. బండి భాస్కర్ దర్శకత్వంలో బెక్కం వేణుగోపాల్ నిర్మించిన ‘నాన్న నేను నా బాయ్‌ఫ్రెండ్స్’లో హీరోయిన్ హెబ్బా పటేల్ తండ్రిగా రావు రమేశ్ నటించారు. ఈ 16న రిలీజైన ఈ సినిమా గురించి ఆయన మాట్లాడుతూ – ‘‘ఐదేళ్ల వరకూ ఇలాంటి తండ్రి పాత్ర రాదంటుంటే హ్యాపీగా ఉంది. హెబ్బా, తేజస్వి, అశ్విన్, పార్వతీశం, నోయెల్ బాగా నటించారు. ‘దిల్’ రాజు సలహాలు వెలకట్టలేనివి. సమష్టి కృషి ఫలితమే ఈ చిత్ర విజయం. ప్రతి సినిమాలోనూ దర్శకుడు చెప్పినట్టు నటిస్తా. మా నాన్నగారి (రావు గోపాలరావు)తో సహా ఎవర్నీ ఇమిటేట్ చేయడానికి ప్రయత్నించను. ప్రస్తుతం ‘ఓం నమో వేంకటేశాయ’, ‘కాటమ రాయుడు’, ‘దువ్వాడ జగన్నాథమ్’ తదితర చిత్రాల్లో నటిస్తున్నా’’ అన్నారు. -
నమ్మండి.. బాయ్‌ఫ్రెండ్స్ లేరండి
‘నా తాజా చిత్రం ‘నాన్న.. నేను.. నా బాయ్‌ఫ్రెండ్స్’ త్వరలో విడుదల కానుంది. ఇది అన్ని వర్గాల ప్రేక్షకులనూ అలరిస్తుంది. కానీ నాకు నిజజీవితంలో బాయ్‌ఫ్రెండ్స్ లేరండి’ అని చెప్పింది హీరోయిన్ హెబ్బా పటేల్. ఎస్వీఎం బౌలింగ్ అండ్ గేమింగ్ సెంటర్స్ ఆధ్వర్యంలో బంజారాహిల్స్‌లోని సిటీ సెంటర్లో శనివారం చాలెంజ్ పోటీలు నిర్వహించారు. హెబ్బా పటేల్ ఈ కార్యక్రమంలో పాల్గొని విజేతలకు బహుమతులు అందజేశారు. సినీ నటుడు నోయల్, గేమింగ్ సెంటర్స్ ఎండీ తూళ్ల విజయేందర్‌గౌడ్, పార్వతీశం పాల్గొన్నారు. -
బాయ్‌ఫ్రెండ్స్‌తో.... ఆ అమ్మాయి!
‘కుమారి’గా కుర్రకారు హృదయాలకు మంచి కిక్ ఇచ్చిన కథానాయిక హెబ్బా పటేల్ నాయికగా మరో సినిమా షురూ అయింది. లక్కీ మీడియా బ్యానర్‌పై మహాలక్ష్మి, మానస సమర్పణలో భాస్కర్ బండి దర్శకత్వంలో బెక్కెం వేణుగోపాల్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఉగాది నాడు ప్రారంభ మైంది. ‘నేను... నా బాయ్‌ఫ్రెండ్స్’ పేరుతో హెబ్బా పటేల్, పునర్నవి, పార్వతీశం, నోయెల్ ముఖ్యతారలు. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత ‘దిల్’ రాజు కెమెరా స్విచ్చాన్ చేయగా, ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు క్లాప్ ఇచ్చారు. నిర్మాత డి. సురేశ్ బాబు గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా బెక్కెం వేణుగోపాల్ మాట్లాడుతూ- ‘‘ఉగాది పర్వదినం నాడు మా సినిమా ప్రారంభం కావడం ఆనందంగా ఉంది. ‘సినిమా చూపిస్త మావ’ తర్వాత చాలా కథలు విన్నాం. ఏవీ నచ్చలేదు. కానీ నూతన దర్శకుడు భాస్కర్ చెప్పిన కథ నచ్చడంతో అంగీకరించాం’’ అని చెప్పారు. ‘‘దర్శకుడు వి.వి. వినాయక్ గారి దగ్గర పనిచేశాను. యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌కు కూడా కనెక్ట్ అయ్యేలా ఈ చిత్రాన్ని రూపొందిస్తాం’’అని దర్శకుడు భాస్కర్ తెలిపారు. ఈ చిత్రానికి రచన: సాయి కృష్ణ, కెమెరా: విశ్వ డి.బి, సంగీతం: శేఖర్ చంద్ర, అసోసియేట్ ప్రొడ్యూసర్: గంజి రమేశ్‌కుమార్.