
నమ్మండి.. బాయ్‌ఫ్రెండ్స్ లేరండి
‘నా తాజా చిత్రం ‘నాన్న.. నేను.. నా బాయ్‌ఫ్రెండ్స్’ త్వరలో విడుదల కానుంది. ఇది అన్ని వర్గాల ప్రేక్షకులనూ అలరిస్తుంది. కానీ నాకు నిజజీవితంలో బాయ్‌ఫ్రెండ్స్ లేరండి’ అని చెప్పింది హీరోయిన్ హెబ్బా పటేల్. ఎస్‌వీఎం బౌలింగ్ అండ్ గేమింగ్ సెంటర్స్ ఆధ్వర్యంలో బంజారాహిల్స్‌లోని సిటీ సెంటర్‌లో శనివారం చాలెంజ్ పోటీలు నిర్వహించారు. హెబ్బా పటేల్ ఈ కార్యక్రమంలో పాల్గొని విజేతలకు బహుమతులు అందజేశారు. సినీ నటుడు నోయల్, గేమింగ్ సెంటర్స్ ఎండీ తూళ్ల విజయేందర్‌గౌడ్, పార్వతీశం పాల్గొన్నారు.