hebba Patel
-
కో కో రెస్టారెంట్ : డింపుల్ హయతీ, హెబ్బా పటేల్ సందడి
ఫుడ్ హబ్‌గా పేరుగాంచిన భాగ్యనగరానికి మరో హాట్‌స్పాట్ వచ్చింది. ముంబైకి చెందిన ప్రఖ్యాత లగ్జరీ ఆసియా డైనింగ్ రెస్టారెంట్ ‘కోకో’ మన నగరంలో ప్రారంభమైంది. వినూత్న కాంటోనీస్, జపనీస్ వంటకాలు నగరవాసులను నోరూరించేందుకు సిద్ధమైంది. #KoKo Restaurant Launch in #Hyderabad #dimplehayati pic.twitter.com/XUyCPnmWMt— Dimple Hayathi (Parody) (@hayathidimple) November 11, 2024ప్రారంభోత్సవంలో డింపుల్ హయాతీ, హెబ్బా పటేల్, సిద్దు జొన్నలగడ్డ, ఆదర్శ్ బాలకృష్ణ తదితరులు హాజరై సరికొత్త రుచులను ఆస్వాదించారు. -
ఓటీటీలో రికార్డులు క్రియేట్ చేస్తున్న ‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్’
మంచి కంటెంట్ ఉన్న చిత్రాలకు థియేటర్స్, ఓటీటీ ఎక్కడైనా మంచి ఆదరణ దక్కుతుంది. ఇలాంటి సినిమాలు ఒక్కోసారి థియేటర్స్‌లో చూడటం మిస్ అయిన వారు ఓటీటీలో తప్పకుండా చూస్తారు. ఈ క్రమంలోనే ఓటీటీలో ఈ చిత్రాలకు విపరీతమైన క్రేజ్ వచ్చేస్తుంటుంది. ' చైతన్య రావ్, హెబ్బా పటేల్ జంటగా నటించిన చిత్రం 'హనీమూన్ ఎక్స్‌ప్రెస్' ఓటీటీలో దూసుకెళ్తోంది. చైతన్య రావ్ ఎప్పుడూ డిఫరెంట్ కాన్సెప్ట్‌లతో ఆడియెన్స్ ముందుకు వస్తుంటారు. ఈ క్రమంలో రీసెంట్గా వచ్చిన హనీమూన్ ఎక్స్‌ప్రెస్‌కి థియేటర్లోనూ మంచి రెస్పాన్స్‌ను దక్కించుకుంది. చైతన్య రావ్, హెబ్బా పటేల్ జోడీ నటన, కెమిస్ట్రీకి మంచి మార్కులు పడ్డాయి.‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్’ను కేకేఆర్, బాల రాజ్ నిర్మించగా.. బాల రాజశేఖరుని దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి కళ్యాణీ మాలిక్ అందించిన సంగీతం స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. సిస్ట్లా వీఎంకే కెమెరా పనితనానికి మంచి మార్కులు పడ్డాయి. ఈ మూవీకి థియేటర్స్‌లో ఎలాంటి రెస్పాన్స్ అయితే వచ్చిందో.. ఓటీటీలో అంతకు మించిన రెస్పాన్స్ వస్తోంది. బిగ్ ఫిష్ సినిమాస్ ద్వారా ఈ మూవీ నేటి (ఆగస్ట్ 27) నుంచి అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులోకి వచ్చేసింది.అమెజాన్‌లో ఈ మూవీ ఇప్పుడు విపరీతంగా ట్రెండ్ అవుతోంది. హనీమూన్ ఎక్స్‌ప్రెస్ మూవీ ఓటీటీ ఆడియెన్స్‌ని సైతం ఆకట్టుకుంటోంది. ప్రస్తుత తరం ఎదుర్కొంటోన్న ప్రేమ, పెళ్లి, విడాకులు అనే కాన్సెప్టుల మీద అందరినీ ఆకట్టుకునేలా, అందరినీ మెప్పించేలా తీసిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీ ఆడియెన్స్‌ను సైతం కట్టి పడేస్తోంది. ఇక ఇప్పటికే ఈ చిత్రానికి 40 మిలియన్ల మినిట్స్ వ్యూస్ వచ్చాయి. మున్ముందు ఈ చిత్రం ఇంకెంత మందిని ఆకట్టుకుని రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి. -
ధూం ధాం పాటలు బాగున్నాయి
‘‘ధూం ధాం’ టీజర్ ఆకట్టుకునేలా ఉంది.. పాటలు బాగున్నాయి. రామ్ కుమార్ మంచి నిర్మాత. డైరెక్టర్ సాయి అంకితభావం ఉన్న వ్యక్తి. ఈ సినిమాకు స్టోరీ, స్క్రీన్ ప్లే అందించిన గోపీమోహన్ ‘లౌక్యం’ సినిమా నుంచి నాతో పని చేస్తున్నారు. ఈ చిత్రం విజయం సాధించాలి’’ అని హీరో గోపీచంద్ అన్నారు. హెబ్బా పటేల్, చేతన్ కృష్ణ జంటగా సాయికిశోర్ మచ్చ దర్శకత్వం వహించిన చిత్రం ‘ధూం ధాం’. ఎంఎస్ రామ్ కుమార్ నిర్మించిన ఈ సినిమా సెప్టెంబర్ 13న రిలీజ్ అవుతోంది. ఈ చిత్రం టీజర్‌ను గోపీచంద్, డైరెక్టర్ శ్రీను వైట్ల విడుదల చేశారు. శ్రీను వైట్ల మాట్లాడుతూ– ‘‘టీజర్ చాలా బాగుంది. ‘దుబాయ్ శీను’ నుంచి ‘బాద్షా’ వరకు నా దగ్గర డైరెక్షన్ డిపార్ట్మెంట్లో చేశాడు సాయికిశోర్. రామ్ కుమార్‌గారు సినిమా మీద ప్యాషన్‌తో విదేశాల నుంచి ఇండస్ట్రీకి వచ్చారు. ఈ సినిమా మంచి సక్సెస్ కావాలి’’ అన్నారు. ‘‘లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందిన చిత్రమిది’’ అని సాయికిశోర్ మచ్చా తెలిపారు. ‘‘ఈ సినిమాని ప్రేక్షకులు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం’’ అని ఎంఎస్ రామ్ కుమార్ చెప్పారు. -
ఇది కనులు కల గన సాధ్యమా...
‘నిజమా.. ఇది కనులు కల గన సాధ్యమా..’ అంటూ ప్రేమ పాట పాడుకున్నారు చైతన్యా రావు, హెబ్బా పటేల్. ఈ ఇద్దరూ జంటగా నటించిన ‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్’ చిత్రంలోని పాట ఇది. ఎన్ఆర్ఐ ఎంటర్టైన్మెంట్స్ (యుఎస్ఎ) సమర్పణలో న్యూ రీల్ ఇండియా ఎంటర్టైన్మెంట్స్పై కేకేఆర్, బాలరాజ్ నిర్మించారు. బాల రాజశేఖరుని దర్శకుడు. ఈ చిత్ర సంగీతదర్శకుడు కల్యాణీ మాలిక్ స్వరపరచి, సునీతతో కలిసి పాడినన ‘నిజమా...’ పాటను దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ విడుదల చేశారు. ఈ సందర్భంగా రామ్‌గోపాల్ వర్మ మాట్లాడుతూ– ‘‘నిజమా..’ పాట చాలా మెలోడియస్గా ఉంది. లొకేషన్స్ బాగున్నాయి. కొత్త కాన్సెప్ట్‌తో వస్తున్న ఈ చిత్రం మంచి విజయం సాధించాలి’’ అన్నారు. ‘‘రామ్‌గోపాల్ వర్మగారితో ‘బ్యూటీ ఆఫ్ ఫ్యాషన్, ఆట’ అనే రెండు హాలీవుడ్ చిత్రాలకు పనిచేశాను. నేను దర్శకుడు కావడానికి ‘శివ’ చిత్రం స్ఫూర్తి. త్వరలో చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అన్నారు బాల రాజశేఖరుని. -
కామెడీ ఎక్స్‌ప్రెస్
చైతన్యారావు, హెబ్బా పటేల్ జంటగా నటిస్తున్న రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్’. ఎన్ఆర్ఐ ఎంటర్టైన్మెంట్స్, న్యూ రీల్ ఇండియా ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై బాల రాజశేఖరుని దర్శకత్వంలో కేకేఆర్, బాల రాజ్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను హీరో నాగార్జున విడుదల చేసి, మాట్లాడుతూ–‘‘వినోదాత్మకంగా సందేశంతో కూడిన ఈ చిత్రం విజయం సాధించాలి’’ అన్నారు. ‘‘లాస్ ఏంజెల్స్‌లో ఉంటూ ఎన్నో హాలీవుడ్ చిత్రాలకు పని చేశాను. కానీ తెలుగు సినిమా చేయాలనేది నా కల. నాగార్జున, అమలగార్ల ్రపోత్సాహంతో టాలీవుడ్లో అరంగేట్రం చేశాను. మా సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేసిన నాగార్జునగారికి ధన్యవాదాలు’’ అన్నారు బాల రాజశేఖరుని. తనికెళ్ల భరణి, సుహాసిని కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు సంగీతం: కళ్యాణీ మాలిక్, నేపథ్యసంగీతం: ఆర్పీ పట్నాయక్. -
మంచి సినిమా అంటున్నారు
‘‘అలా నిన్ను చేరి’ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. మరీ ముఖ్యంగా గ్రామీణప్రాంతాల ప్రేక్షకుల నుంచి ఎక్కువగా స్పందన వస్తోంది. వారంతా ఫస్ట్ హాఫ్‌కి ఎక్కువగా కనెక్ట్ అవుతున్నారు’’ అని కొమ్మాలపాటి సాయి సుధాకర్ అన్నారు. దినేష్ తేజ్, హెబ్బా పటేల్, పాయల్ రాధాకృష్ణ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘అలా నిన్ను చేరి’. మారేష్ శివన్ దర్శకత్వం వహించారు. కొమ్మాలపాటి శ్రీధర్ సమర్పణలో కొమ్మాలపాటి సాయి సుధాకర్ నిర్మించిన ఈ సినిమా శుక్రవారం విడుదలైంది. ఈ సందర్భంగా కొమ్మాలపాటి సాయి సుధాకర్ మాట్లాడుతూ–‘‘మా సినిమా చూసిన చాలామంది తమ జీవితాన్ని చూసుకున్నట్టుగా ఉందనడం సంతోషం. ‘అలా నిన్ను చేరి’ నిర్మాతగా మొదటి సినిమా అయినా కథకి అవసరం మేరకు ఖర్చు పెట్టా. సినిమా చూసిన మా నాన్నగారు బాగా తీశారని మెచ్చుకున్నారు. నా తర్వాతి సినిమా కోసం ప్రస్తుతం థ్రిల్లర్ జానర్లో ఓ కథ విన్నాను’’ అన్నారు. -
కథే హీరో
దినేష్ తేజ్, హెబ్బా పటేల్, పాయల్ రాధాకృష్ణ హీరోహీరోయిన్లుగా నటించిన లవ్‌స్టోరీ ఫిల్మ్ ‘అలా నిన్ను చేరి..’. మారేష్ శివన్ దర్శకత్వంలో కొమ్మాలపాటి శ్రీధర్ సమర్పణలో కొమ్మాలపాటి సాయి సుధాకర్ నిర్మించిన ఈ చిత్రం నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా గురువారం జరిగిన విలేకర్ల సమావేశంలో దినేష్ తేజ్ మాట్లాడుతూ– ‘‘జీవితంలోని ఓ దశలో ప్రేమ ముఖ్యమా? లక్ష్యం ముఖ్యమా? అంటూ ప్రతి మధ్యతరగతి అబ్బాయి గురయ్యే సంఘర్షణను ఇందులో చూపించాం. ఈ సినిమాలో నేను కొత్తగా కాస్త కమర్షియల్ రోల్లో నటించాను. ఓ మంచి సినిమా చూశామనే ఫీలింగ్‌తో ప్రేక్షకులు థియేటర్స్ నుంచి బయటకి వస్తారని చెప్పగలను. కథ ఉంటేనే ఏమైనా చేయగలం. అందుకే కథే హీరో అని నమ్మే వ్యక్తిని నేను. ప్రేక్షకులు మెచ్చుకునే కథల్లో భాగం కావాలనుకుంటాను’’ అన్నారు. -
లవ్ అండ్ ఎమోషన్
దినేష్ తేజ్ హీరోగా, హెబ్బా పటేల్, పాయల్ రాధాకృష్ణ హీరోయిన్లుగా నటించిన ఫీల్ గుడ్ లవ్‌స్టోరీ ఫిల్మ్ ‘అలా నిన్ను చేరి’. మారేష్ శివన్ దర్శకత్వంలో కొమ్మాలపాటి శ్రీధర్ సమర్పణలో కొమ్మాలపాటి సాయి సుధాకర్ నిర్మించిన ఈ చిత్రం నవంబరు 10న విడుదల కానుంది. ‘‘కుటుంబ సమేతంగా చూడదగ్గ లవ్ అండ్ ఎమోషనల్ ఫిల్మ్ ఇది. చంద్రబోస్‌గారి సాహిత్యం, సుభాస్ ఆనంద్ సంగీతం అదనపు ఆకర్షణలు’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. -
కోడిబాయె లచ్చమ్మది
దినేష్ తేజ్, హెబ్బా పటేల్ జంటగా నటించిన చిత్రం ‘అలా నిన్ను చేరి’. కొమ్మాల పాటి శ్రీధర్ సమర్పణలో మారేష్ శివన్ దర్శకత్వంలో కొమ్మాలపాటి సాయి సుధాకర్ నిర్మించిన ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. ఈ సినిమాలోని మాస్ సాంగ్ ‘కోడిబాయె లచ్చమ్మది..’ని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విడుదల చేసి, మాట్లాడుతూ – ‘‘యంగ్ టాలెంట్ తీసే చిత్రాలను ప్రేక్షకులు ఆదరిస్తుంటారు. ఈ చిత్రాన్ని కూడా ఆదరించాలి. సినిమా పెద్ద హిట్టవ్వాలి’’ అన్నారు. సుభాష్ ఆనంద్ స్వరపరచిన ‘కోడిబాయె..’ పాటను మంగ్లీ పాడగా, భాను నృత్యరీతులు సమకూర్చారు. ‘‘ఈ పాటలో దినేష్ తేజ్, హెబ్బా పటేల్‌ల మాస్ స్టెప్స్ ఆకట్టుకునే విధంగా ఉంటాయి. తెలంగాణ నుంచి మరో జానపదం చార్ట్ బస్టర్‌గా నిలవనుంది. సినిమాలోని అన్ని పాటలనూ చంద్రబోస్ గారు రాశారు ’’ అని యూనిట్ పేర్కొంది. -
చావని ప్రేమిది...
హెబ్బా పటేల్ ప్రధాన పా త్రలో నటించిన చిత్రం ‘సందేహం’. సతీష్ పరమవేద దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సుమన్ ఊటుకూరు హీరో. సత్యనారాయణ పర్చా నిర్మించిన ఈ చిత్రం నుంచి సంగీతదర్శకుడు సుభాష్ ఆనంద్ స్వరపరచిన ‘చచ్చినా చావని ప్రేమిది..’ పాటను దర్శకుడు దశరథ్ విడుదల చేశారు. ‘‘ఈ చిత్రంలో హెబ్బా పటేల్ డిఫరెంట్ క్యారెక్టర్ చేశారు. త్వరలో రిలీజ్ డేట్ ప్రకటిస్తాం’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. -
అలా నిన్ను చేరి ఫ్యామిలీ ఎంటర్టైనర్
దినేష్ తేజ్ హీరోగా, హెబ్బా పటేల్, పాయల్ రాధాకృష్ణ హీరోయిన్లుగా నూతన దర్శకుడు మారేష్ శివన్ తెరకెక్కించిన చిత్రం ‘అలా నిన్ను చేరి’. కొమ్మాలపాటి శ్రీధర్ సమర్పణలో విజన్ మూవీ మేకర్స్‌పై కొమ్మాలపాటి సాయి సుధాకర్ నిర్మించిన ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటోంది. ‘‘కుటుంబ సమేతంగా చూడదగ్గ లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రమిది. త్వరలోనే మూవీ విడుదల తేదీ ప్రకటిస్తాం’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: సుభాష్ ఆనంద్, కెమెరా: ఐ ఆండ్రూ. -
150 మిలియన్ వ్యూయింగ్ మినిట్స్‌తో వ్యవస్థ రికార్డు
ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జీ5లో విజయవంతంగా దూసుకుపోతున్న వెబ్ సిరీస్ ‘వ్యవస్థ’. ఈ థ్రిల్లింగ్ కోర్టు రూమ్ డ్రామా ఆడియెన్స్‌ను తెగ ఆకట్టుకుంటోంది. ఆనంద్ రంగ దర్శకత్వం వహించటంతో పాటు పట్టాభి చిలుకూరితో కలిసి రూపొందించారు. ఈ సిరీస్ 150 మిలియన్ వ్యూయింగ్ మినిట్స్‌ను సాధించింది. ఈ సందర్బంగా వ్యవస్థ టీమ్ సక్సెస్ మీట్‌ను నిర్వహించింది. ఈ కార్యక్రమానికి హీరో సందీప్ కిషన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘‘వ్యవస్థలో వర్క్ చేసిన వారందరూ చాలా కావాల్సిన వారే. సంపత్‌గారితో కలిసి సినిమా చేయాలని ఎదురు చూస్తున్నాను. అలాగే కామ్నా జెఠ్మలానీతో నేను అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఉన్నప్పటి నుంచి పరిచయం ఉంది. హెబ్బా పటేల్‌కి కంగ్రాట్స్. కార్తీక్ రత్నం అంటే చాలా ఇష్టం. తను వ్యవస్థలో పోషించిన తీరు అద్భుతం. దర్శకుడు ఆనంద్ రంగగారితో డీకే బోస్ చిత్రం నుంచి పరిచయం ఉంది. వ్యవస్థ సినిమాను ఎలా తెరకెక్కించారా? అని వెయిట్ చేసి చూశాను. ఎంటైర్ టీమ్‌కి కంగ్రాట్స్’’ అన్నారు సందీప్ కిషన్. కార్తీక్ రత్నం మాట్లాడుతూ ‘‘సందీప్ కిషనన్నను కలిసిన తర్వాత ఆయన నాకు ఎప్పుడూ తిరుగులేని సపోర్ట్‌ను అందిస్తూనే ఉన్నారు. ఆనంద్ రంగగారితో కలిసి పని చేయటం ఎంతో ఆనందంగా ఉంది. అదృష్టంగా భావిస్తున్నాను. పట్టాభిగారు చాలా ధైర్యం చేసి తీశారు. సంపత్ రాజ్, అనిల్ సార్ అందరికీ థాంక్స్. హెబ్బా పటేల్, కామ్నా జెఠ్మలానీతో కలిసి వర్క్ చేయటం చాలా ఆనందంగా ఉంది. జీ 5వారు చేస్తోన్న సపోర్ట్ మరచిపోలేం’’ అన్నారు. కామ్నా జెఠ్మలానీ మాట్లాడుతూ ‘‘ఎగ్జయిటెడ్‌గా, నెర్వస్‌గా ఉన్నాను. ఎందుకంటే ఆరేళ్ల తర్వాత మళ్లీ ఈ సిరీస్‌తో ప్రేక్షకులను పలకరించాను. చిన్న రోల్ అయినా చాలా ఇంపార్టెంట్ ఉండటంతో యాక్సెప్ట్ చేశాను’’ అన్నారు. సంపత్ రాజ్ మాట్లాడుతూ ‘‘నాపై నమ్మకంతో నాకీ అవకాశాన్ని ఇచ్చిన ఆనంద్ రంగాగారికి థాంక్స్. వ్యవస్థ చేసే ముందు చాలా మంది ఎందుకు చేస్తున్నావని అడిగారు. అయితే నాకు స్క్రిప్ట్‌పై నమ్మకం ఉందని చెప్పాను. ఇదొక స్లో బర్నర్‌లా ఆడియెన్స్‌కి కనెక్ట్ అయ్యింది. కంటెంట్ బావుంటే ఆడియెన్స్ ఆదరిస్తారని మరోసారి వ్యవస్థ ప్రూవ్ చేసింది’’ అన్నారు. -
రాఘవేంద్ర రావు చేతుల మీదుగా అలా నిన్ను చేరి ఫస్ట్‌లుక్
ఫీల్ గుడ్ ఎంటర్టైనర్ సినిమాలకు మంచి ఆదరణ లభిస్తోంది. ఇలాంటి కథలకు అటు యూత్‌తో పాటు ఇటు ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. అదే బాటలో రాబోతున్న కొత్త సినిమా ‘అలా నిన్ను చేరి’. విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై కొమ్మాలపాటి శ్రీధర్ సమర్పణలో ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాతో మారేష్ శివన్ దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. చిత్రంలో దినేష్ తేజ్, హెబ్బా పటేల్, పాయల్ రాధాకృష్ణ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. కొమ్మాలపాటి సాయి సుధాకర్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఓ వైపు షూటింగ్ చేస్తూనే మరోవైపు ప్రమోషన్స్ చేపడుతున్న చిత్రబృందం.. తాజాగా సంక్రాంతి కానుకగా ఈ మూవీ ఫస్ట్‌లుక్ గ్లింప్స్‌ను విడుదల చేసింది. దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు చేతుల మీదుగా ఈ సినిమా ఫస్ట్‌లుక్ గ్లింప్స్ రిలీజ్ చేశారు. అనంతరం రాఘవేంద్రరావు మాట్లాడుతూ.. ఈ సినిమా మంచి విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ మూవీ టీంకు ఆల్ ది బెస్ట్ చెప్పారు. కాగా ఈ సినిమాలో శివకుమార్ రామచంద్రవరపు, శత్రు, కల్పలత, ‘రంగస్థలం’ మహేష్, ఝాన్సీ, కేదర్ శంకర్ తదితరులు నటిస్తున్నారు. -
సొట్టబుగ్గలున్న అగ్గిపెట్టే నేను..
‘నన్ను పట్టుకుంటే జారిపోతుంటాను... ఒంపుసొంపులున్న పాదరసమే నేను.. నన్ను ముట్టుకుంటే నిప్పునవుతుంటాను.. సొట్టబుగ్గలున్న అగ్గిపెట్టే నేను..’ అంటూ అదిరిపోయే స్టెప్పులు వేశారు హెబ్బా పటేల్. ఇంద్రసేన హీరోగా నటిస్తున్న పొలిటికల్ థ్రిల్లర్ ‘శాసనసభ’. ఇందులో ఐశ్వర్యారాజ్ భకుని, రాజేంద్ర ప్రసాద్, సోనియా అగర్వాల్ ప్రధాన పాత్రలు పోషించారు. తులసీరామ్ సప్పని, షణ్ముగం సప్పని నిర్మాతలు. రవి బసూర్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని ‘నన్ను పట్టుకుంటే..’పాట లిరికల్ వీడియోను విడుదల చేశారు. ఈ స్పెషల్ సాంగ్‌లో హెబ్బాపటేల్ మంచి స్టెప్పులు వేశారు. కాసర్లశ్యామ్ సాహిత్యం అందించగా, మంగ్లీ, సంతోష్ వెంకీ, ‘కేజీఎఫ్’ ఫేమ్ రవి బసూర్ పాడారు. ప్రేమ్‌రక్షిత్ నృత్యరీతులు సమకూర్చారు. -
కథ విని ఆశ్చర్యపోయాను
హెబ్బా పటేల్, వశిష్ఠ సింహ, సాయి రోనక్, పూజిత పొన్నాడ ప్రధాన పాత్రల్లో అశోక్ తేజ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఓదెల రైల్వేస్టేషన్’. దర్శకుడు సంపత్ నంది అందించిన కథ, స్క్రీన్ ప్లేతో కేకే రాధామోహన్ నిర్మించిన ఈ మూవీ ఈ నెల 26 నుంచి ఆహా ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా బుధవారం విలేకర్ల సమావేశంలో హెబ్బా పటేల్ మాట్లాడుతూ – ‘‘సంపత్ నందిగారు చెప్పిన కథ విని ఆశ్చర్యపోయాను. నా కెరీర్లో నేను చాలా కష్టపడి చేసిన సినిమా ఇది. సవాల్‌గా తీసుకుని చేశాను. నటిగా ఈ సినిమాతో చాలా నేర్చుకున్నాను’’ అన్నారు. ‘‘ఓదెల రైల్వేస్టేషన్’ క్రైమ్ థ్రిల్లర్. 50 రోజుల్లో సినిమా షూటింగ్‌ను పూర్తి చేసినా కోవిడ్ వల్ల రిలీజ్ కాస్త ఆలస్యమైంది’’ అన్నారు రాధామోహన్. ‘‘నాకు దర్శకుడిగా చాన్స్ ఇచ్చిన సంపత్ నందిగారికి రుణపడి ఉంటాను. ఈ సినిమాలో నటించిన అందరికీ మంచి పేరు వస్తుంది’’ అన్నారు అశోక్ తేజ్. ‘‘ఈ సినిమా కథ విన్నపుడు థ్రిల్ అయ్యాను. ప్రతి సన్నివేశం ఉత్కంఠగా సాగుతుంది’’ అన్నారు వశిష్ఠ సింహ. ‘‘ఇప్పటివరకు ఎక్కువగా సాఫ్ట్ పాత్రలు చేసిన నేను ఇందులో సీరియస్ పోలీస్ ఆఫీసర్‌గా చేశాను’’ అన్నారు సాయి రోనక్. ఈ కార్యక్రమంలో ‘ఆహా’ ప్రతినిధి శ్రీనివాస్ పాల్గొన్నారు. -
సునీల్-హెబ్బా పటేల్‌ల ‘గీత’ వచ్చేస్తుంది
హెబ్బా పటేల్, సునీల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘గీత’. ‘మ్యూట్ విట్నెస్’ అన్నది ఉప శీర్షిక. ‘గ్రాండ్ మూవీస్’పతాకంపై ఆర్.రాచయ్య నిర్మిస్తున్న ఈ చిత్రానికి వి.వి వినాయక్ శిష్యుడు విశ్వా.ఆర్.రావు దర్శకత్వం వహిస్తున్నాడు. ‘నువ్వే కావాలి’, ‘ప్రేమించు’చిత్రాల ఫేమ్ సాయి కిరణ్ ప్రతి నాయకుడిగా పరిచయమవుతున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆగస్ట్ 26న విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు విశ్వ మాట్లాడుతూ.. ‘ఈ సినిమా అవకాశం నా గురువు, దైవం అయిన వినాయక్ గారే ఇప్పించారు. నిర్మాత రాచయ్యగారికి నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను" అన్నారు. నిర్మాత ఆర్.రాచయ్య మాట్లాడుతూ... "గురువుకు తగ్గ శిష్యుడు అనిపించుకునేలా మా డైరెక్టర్ విశ్వ... ‘గీత’చిత్రాన్ని చాలా అద్భుతంగా తెరకెక్కించాడు. ఈనెల 26న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాం’ అన్నారు. రామ్ కార్తిక్, సప్తగిరి, రాజీవ్ కనకాల, పృథ్వి , తనికెళ్ళ భరణి, సంధ్యా జనక్ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రంలో సూపర్ గ్లామర్ హీరోయిన్ హెబ్బా పటేల్ అనాథల కోసం పోరాడే మూగ యువతిగా... ఓ చాలెంజింగ్ రోల్ చేస్తుండడం విశేషం. సూర్య, లలిత, ప్రియ, మీనాకుమారి, జబర్దస్త్ అప్పారావు, జబర్దస్త్ దుర్గారావు తదితరులు ఇతర పాత్రలు ప్లే చేస్తున్న ఈ చిత్రానికి సుభాష్ ఆనంద్ సంగీతం అందిస్తున్నాడు. -
'గీత' ఫస్ట్ లుక్ విడుదల.. గురువుకు తగ్గ శిష్యుడని ప్రశంస
Geetha Movie First Look Poster Released By VV Vinayak: ‘‘గీత’ సినిమా ఫస్ట్ లుక్ బాగుంది. నా శిష్యుడు విశ్వ దర్శకుడిగా, నా మిత్రుడు రాచయ్య నిర్మాతగా పరిచయమవుతున్న ఈ సినిమా విజయం సాధించాలి. యూనిట్‌కి మంచి పేరు రావాలి’’ అని డైరెక్టర్ వీవీ వినాయక్ అన్నారు. కుమారి 21F ఫేమ్ హెబ్బా పటేల్ టైటిల్ రోల్, సునీల్ ముఖ్యపాత్ర చేసిన చిత్రం ‘గీత’. ‘మ్యూట్ విట్నెస్’ (మూగ సాక్ష్యం) అన్నది ఉప శీర్షిక. ‘నువ్వే కావాలి, ప్రేమించు’ సినిమాల ఫేమ్ సాయికిరణ్ ఈ చిత్రంలో ప్రతి నాయకుడిగా నటించారు. డైరెక్టర్ వీవీ వినాయక్ శిష్యుడు విశ్వని దర్శకుడిగా పరిచయం చేస్తూ ఆర్. రాచయ్య నిర్మించిన ఈ సినిమా ఫస్ట్ లుక్‌ని వినాయక్ విడుదల చేశారు. రాచయ్య మాట్లాడుతూ ‘‘గురువుకు తగ్గ శిష్యుడు అనిపించుకునేలా విశ్వ ‘గీత’ చిత్రాన్ని తెరకెక్కించాడు. మా సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి కావొచ్చాయి’’ అన్నారు. ‘‘గీత’ సినిమా అవకాశం మా గురువు వినాయక్‌గారే ఇప్పించారు. రాచయ్యగారికి ఎప్పటికీ రుణపడి ఉంటాను’’ అన్నారు విశ్వ. ఈ చిత్రానికి సంగీతం: సుభాష్ ఆనంద్ అందించగా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్: ఎస్. చిన్నా, కెమెరా: క్రాంతికుమార్.కె. -
నా శిష్యుడు 'విశ్వ' విజేత కావాలి: వి.వి.వినాయక్
మాస్ డైరెక్టర్ వివి వినాయక్ ప్రియ శిష్యుడు విశ్వ దర్శకత్వంతో తెరకెక్కుతున్న తొలి చిత్రం ‘గీత’.‘మ్యూట్ విట్నెస్’ అన్నది ఉప శీర్షిక. ‘గ్రాండ్ మూవీస్’ పతాకంపై ఆర్.రాచయ్య నిర్మిస్తున్న ఈ చిత్రంలో హెబ్బా పటేల్ టైటిల్ పాత్ర పోషిస్తుండగా, ప్రముఖ నటుడు సనీల్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ‘నువ్వే కావాలి’, ‘ప్రేమించు’వంటి పలు చిత్రాల్లో హీరోగా నటించిన సాయి కిరణ్ విలన్‌గా పరిచయం అవుతున్నాడు. పోస్ట్ ప్రొడక్షన్ దాదాపుగా పూర్తి చేసుకుని తుది మెరుగులు దిద్దుకుంటున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ని వి.వి.వినాయక్ విడుదల చేశారు. ఈ సందర్భంగా వినాయక్ మాట్లాడుతూ.. తన శిష్యుడు విశ్వ దర్శకుడిగా పరిచయమవుతున్న "గీత' ఘన విజయం సాధించాలని, తన మిత్రుడు రాచయ్య నిర్మాతగా రాణించాలని అభిలాషించాడు. . ఈ చిత్రంలో పని చేసిన నటీనటులకు, సాంకేతిక నిపుణులకు మంచి పేరు తీసుకురావాలని కోరుకున్నారు. ఈ సినిమా అవకాశం తన గురువు, దైవం అయిన వినాయక్ గారే ఇప్పించారని, నిర్మాత రాచయ్యగారికి ఎప్పటికీ రుణపడి ఉంటానని చిత్ర దర్శకుడు విశ్వ పేర్కొన్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న హిందీ "ఛత్రపతి" పనులతో తలమునకలుగా ఉన్నప్పటికీ... తమ మీద ప్రత్యేకమైన అభిమానంతో "గీత" చిత్రం ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన వినాయక్ గారికి నిర్మాత ఆర్.రాచయ్య కృతజ్ఞతలు తెలిపారు. గురువుకు తగ్గ శిష్యుడు అనిపించుకునేలా డైరెక్టర్ విశ్వ... "గీత" చిత్రాన్ని అత్యద్భుత ప్రణాళికతో రూపొందించారని పేర్కొన్నారు. రామ్ కార్తిక్, సప్తగిరి, రాజీవ్ కనకాల, పృథ్వి, తనికెళ్ళ భరణి, సంధ్యా జనక్ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: సుభాష్ ఆనంద్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్: ఎస్.చిన్నా. -
హల్చల్ : మసాజ్‌తో సారా..చీరలో దీప్తి సునయన..రీల్స్‌తో వర్షిణి
♦ రాజీ స్కెచ్‌లో సమంత ♦ చీరకట్టులో మెరిసిపోతున్న దీప్తి సునయన ♦ నీకు నేనున్నానని ధైర్యం చెప్తున్న కౌశల్ ♦ బుక్ రీడింగ్‌లో మునిగిపోయిన తాప్సీ ♦ రీల్స్‌తో అలా సరదాగా అంటున్న వర్షిని ♦ గుర్రపు స్వారీ చేస్తోన్న అభిజీత్ ♦ అమ్మతో ఆయిల్ మసాజ్ అంటోన్న సారా అలీఖాన్ ♦ నిన్నే చూస్తానంటున్న అషూ View this post on Instagram A post shared by Ashu Reddy❤️ (@ashu_uuu) View this post on Instagram A post shared by Samantha Akkineni (@samantharuthprabhuoffl) View this post on Instagram A post shared by D E E P T H I R E D D Y 🇮🇳 (@deepthi_sunaina) View this post on Instagram A post shared by k a u s h a l M a n d a (@kaushalmanda) View this post on Instagram A post shared by Taapsee Pannu (@taapsee) View this post on Instagram A post shared by Varshini (@varshini_sounderajan) View this post on Instagram A post shared by Abijeet (@abijeet11) View this post on Instagram A post shared by Rubina Dilaik (@rubinadilaik) View this post on Instagram A post shared by Divyanka Tripathi Dahiya (@divyankatripathidahiya) View this post on Instagram A post shared by Sara Ali Khan (@saraalikhan95) View this post on Instagram A post shared by Hebah Patel (@ihebahp) View this post on Instagram A post shared by Neha Kakkar (Mrs. Singh) (@nehakakkar) View this post on Instagram A post shared by Shraddha Das (@shraddhadas43) -
నవ్వులతో స్వాగతం
రాజ్ తరుణ్ హీరోగా, మాళవికా నాయర్, హెబ్బా పటేల్ హీరోయిన్లుగా కొండా విజయ్‌కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఒరేయ్ బుజ్జిగా..’. లక్ష్మీ రాధామోహన్ సమర్పణలో శ్రీసత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కేకే రాధామోహన్ నిర్మించిన ఈ సినిమాని నూతన సంవత్సరం కానుకగా జనవరి 1న థియేటర్స్‌లో విడుదల చేస్తున్నారు. కేకే రాధామోహన్ మాట్లాడుతూ – ‘‘ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన చిత్రమిది. మా సినిమా చూసిన ప్రేక్షకులు కడుపుబ్బా నవ్వుకుంటారు. 2021కి స్వాగతం పలుకుతూ మా చిత్రం విడుదల చేస్తున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: అనూప్ రూబెన్స్, కెమెరా: ఐ. ఆండ్రూ. -
ఐపీఎస్ ఆఫీసర్
వశిష్టసింహ, హెబ్బా పటేల్, సాయిరోనక్, పూజితా పొన్నాడ ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘ఓదెల రైల్వేస్టేషన్’. డైరెక్టర్ సంపత్ నంది కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ అందించిన ఈ చిత్రం ద్వారా అశోక్ తేజ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. లక్ష్మీ రాధామోహన్ సమర్పణలో శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కేకే రాధామోహన్ నిర్మించారు. ఈ చిత్రం నుండి ఇప్పటికే విడుదలైన వశిష్ట సింహ లుక్‌కి, హెబ్బా పటేల్ లుక్‌కి మంచి స్పందన వస్తోంది. తాజాగా ఈ సినిమాలో పవర్ఫుల్ ఐపీఎస్ ఆఫీసర్ అనుదీప్ పాత్ర చేస్తున్న సాయిరోనక్ లుక్‌ని విడుదలచేశారు. ‘‘డిఫరెంట్ క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న చిత్రమిది. సహజత్వానికి దగ్గరగా ఉంటుంది. ఈ సినిమా తప్పకుండా పెద్ద హిట్ అవుతుంది’’ అన్నారు. కేకే రాధామోహన్ మాట్లాడుతూ– ‘‘ఓదెల’ అనే గ్రామంలో జరిగిన సంఘటనల ఆధారంగా ఈ చిత్రం రూపొందుతోంది. షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి’’ అన్నారు. -
ఓదెలలో ఏం జరిగింది?
ఓదెల అనే గ్రామంలో జరిగిన సంఘటనల ఆధారంగా రూపొందుతోన్న క్రైమ్ థ్రిల్లర్ ‘ఓదెల రైల్వేస్టేషన్’. ప్రముఖ దర్శకుడు సంపత్ నంది ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తున్నారు. ఇందులో వశిష్ట సింహ హీరోగా, హెబ్బా పటేల్ హీరోయిన్గా నటిస్తున్నారు. అశోక్ తేజ దర్శకత్వంలో లక్ష్మీ రాధామోహన్ సమర్పణలో కేకే రాధామోహన్ నిర్మిస్తున్న ఈ సినిమా రెండో షెడ్యూల్ శుక్రవారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా కె.కె. రాధామోహన్ మాట్లాడుతూ– ‘‘డిఫరెంట్ క్రైమ్ థ్రిల్లర్ చిత్రమిది. మేకప్, డ్రీమ్ సీక్వెన్సెస్, పాటలు లేకుండా సినిమాను ఎంతో వాస్తవికంగా తెరకెక్కిస్తున్నాం. ఓదెలలో మొదటి షెడ్యూల్ పూర్తిచేశాం. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే హైదరాబాద్‌లో డబ్బింగ్ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. రెండో షెడ్యూల్లో చిత్రంలోని కొన్ని కీలకమైన సన్నివేశాలతో పాటు క్లయిమాక్స్‌ను చిత్రీకరిస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: ఎస్. సౌందర్ రాజ¯Œ , సంగీతం: అనూప్ రూబెన్స్. -
నిజామాబాద్‌లో హెబ్బా, పాయల్ సందడి
సాక్షి, నిజామాబాద్: పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన చెన్నై షాపింగ్ మాల్‌ను హీరోయిన్లు హెబ్బా పటేల్, పాయల్ రాజ్‌పుత్ కలిసి శుక్రవారం ప్రారంభించారు. వారిని చూసేందుకు జనాలు భారీగా తరలి వచ్చారు. క్లాత్ సెక్షన్‌తో పాటు జ్యూవెలరీ విభాగంలో కూడా మహిళలతో కలిసి ఈ ఇద్దరు ముద్దుగుమ్మలు హల్చల్ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు కూడా పాల్గొన్నారు. చదవండి: నా కల నెరవేరింది: పాయల్ రాజ్‌పుత్ -
థ్రిల్లింగ్ స్టేషన్
కన్నడంలో దాదాపు 25 సినిమాల్లో పలు ప్రముఖ పాత్రల్లో నటించారు వశిష్ట సింహా. తెలుగులో ఆయన హీరోగా చేస్తున్న తొలి చిత్రం ‘ఓదెల రైల్వేస్టేషన్’. వశిష్ట సరసన పల్లెటూరి అమ్మాయి పాత్రలో హెబ్బా పటేల్ నటిస్తున్నారు. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై శ్రీమతి లక్ష్మీ రాధామోహన్ సమర్పణలో ఈ చిత్రాన్ని కేకే రాధామోహన్ నిర్మిస్తున్నారు. ఆయన బ్యానర్లో ‘బెంగాల్ టైగర్’ చిత్రానికి దర్శకత్వం వహించిన సంపత్ నంది ఈ సినిమాకి కథ, మాటలు, స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా అశోక్‌తేజ దర్శకునిగా పరిచయం అవుతున్నారు. మేకప్, డిఫరెంట్ కాస్ట్యూమ్స్, డ్రీమ్ సీక్వెన్సెస్, పాటలు లేకుండా సహజత్వానికి దగ్గరగా తెరకెక్కుతున్న చిత్రమిది. ఓదెల అనే గ్రామంలో జరిగిన వాస్తవ ఘటనతో క్రైమ్ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సాయిరోనక్, పూజితా పొన్నాడ, నాగమహేశ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: సౌందర్ రాజన్, సంగీతం: అనూప్ రూబెన్స్. -
వెబ్ సిరీస్‌లో హెబ్బా
డిజిటల్ మీడియమ్‌లో షోలు, సిరీస్‌లకు ఆదరణ విపరీతంగా పెరుగుతోంది. ఆడియన్స్‌ను ఎంటర్టైన్ చేయడానికి స్టార్స్ కూడా వెబ్ వరల్డ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారు. తాజాగా హెబ్బా పటేల్ కూడా ఓ వెబ్ సిరీస్‌లో కనిపించనున్నారు. నవదీప్, హెబ్బా పటేల్ ముఖ్య పాత్రల్లో దర్శకుడు అజయ్ భూయాన్ ఓ వెబ్ సిరీస్ తెరకెక్కిస్తున్నారు. ఈ వెబ్ సిరీస్ షూటింగ్ ఇటీవల ప్రారంభం అయింది. ఈ వెబ్ సిరీస్ జానర్, మిగతా నటీనటుల వివరాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం నితిన్ ‘భీష్మ’, రాజ్ తరుణ్ ‘ఒరేయ్ బుజ్జిగా’ సినిమాల్లో కీలక పాత్రల్లో నటిస్తున్నారు హెబ్బా పటేల్. -
లేడీ విలన్?
ఇప్పటివరకూ గ్లామర్ రోల్స్‌తో అలరించిన హెబ్బా పటేల్ తనలోని నెగటివ్ షేడ్ చూపించబోతున్నారని సమాచారం. వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘భీష్మ’. నాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రంలో రష్మికా మందన్నా కథానాయికగా నటిస్తున్నారు. ఈ సినిమాలో హెబ్బా పటేల్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఆమె పాత్రలో నెగటివ్ షేడ్స్ ఉంటాయని, తనే ఈ సినిమాలో లేడీ విలన్ అని టాక్. క్రిస్మస్ సందర్భంగా ఈ ఏడాది డిసెంబర్ చివరి వారంలో ఈ సినిమా విడుదల కానుంది. -
మార్పులు చేశాం – అయోధ్యకుమార్
‘‘సినిమా ప్రమోషన్, పబ్లిసిటీ కోసం తప్పుదోవ పట్టలేదు. అసభ్యకరమైన సినిమాలు తీసి లబ్ధి పొందాలనుకునే ఫిల్మ్‌మేకర్‌ని కాను. ‘24 కిస్సెస్’ సినిమాను మా మదర్‌తో కలిసి చూశాను. కొందరు మహిళా మండలి సభ్యులు కూడా చూశారు. ఈ చిత్రం నా జీవితం ఆధారంగా తీసింది కాదు’’ అన్నారు దర్శకుడు అయోధ్య కుమార్ కృష్ణంశెట్టి. అరుణ్ అదిత్, హెబ్బా పటేల్ జంటగా సీనియర్ నరేశ్, రావు రమేష్ కీలక పాత్రలు చేసిన చిత్రం ‘24 కిస్సెస్’. అయోధ్యకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఈ నెల 23న విడుదలైంది. మంగళవారం జరిగిన ఈ సినిమా థ్యాంక్స్ మీట్లో అయోధ్యకుమార్ మాట్లాడుతూ– ‘‘ఆడియన్స్ రిపోర్ట్స్, కలెక్షన్స్ బాగున్నాయి. సినిమా అందరికీ నచ్చిందని చెప్పడం లేదు. రివ్యూస్ చదివాను. మల్టీఫుల్ లేయర్స్, స్లో నెరేషన్ ఉంది అంటున్నారు. నేనింతే మారను అనుకునేవాడినికాదు. పాజిటివ్ విషయాలను తీసుకున్నాను. ఈ సినిమాలో కొన్ని మార్పులు చేసి క్యూబ్‌లో పెట్టాం. చైల్డ్ యాక్టివిస్ట్‌కి చెందిన అందమైన ప్రేమకథా చిత్రం ఇది. ‘24కిస్సెస్’ కాన్సెప్ట్ ఏంటో సినిమా చూసినవారికి అర్థం అయ్యుంటుంది’’ అన్నారు. ‘‘ప్రేమ, పెళ్లి, సహజీవనం వంటి విషయాల్లో నేటి యువతరం కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఓ మంచి పాయింట్‌తో అయోధ్య కుమార్ మంచి లవ్‌స్టోరీ తీశారు. ఒక సినిమా రెవెన్యూనే సక్సెస్ అనుకుంటే ఈ సినిమా సక్సెస్ అయినట్లే. ఓ చైల్డ్ యాక్టివిస్ట్ ట్రావెలింగ్ లవ్‌స్టోరీని కిస్సెస్ల రూపంలో చూపించారు దర్శకులు’’ అన్నారు నరేశ్. ఈ సినిమాలో నటించిన శ్రీనివాస్ మాట్లాడారు. -
ఇది బూతు సినిమా కాదు
‘‘24 కిస్సెస్ అనగానే చాలా మంది బూతు సినిమా అనుకుంటున్నారు. కానే కాదు. అన్ని రకాల ఎమోషన్స్ ఉన్న అందమైన ప్రేమకథ’’ అన్నారు దర్శకుడు అయోధ్యకుమార్ కృష్ణంశెట్టి. అరుణ్ అదిత్, హెబ్బా పటేల్ జంటగా అయోధ్యకుమార్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘24 కిస్సెస్’. సంజయ్‌రెడ్డి, అనిల్ పల్లాల నిర్మించిన ఈ సినిమా నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా అయోధ్యకుమార్ మాట్లాడుతూ– ‘‘మిణుగురులు’ లాంటి మంచి సినిమా తీసిన నా నుండి వల్గర్ మూవీ రాదు. ‘మిణుగురులు’ టీమ్ నుంచి వస్తోన్న మరో అద్భుతమైన చిత్రమిది. కమర్షియల్ ఎలిమెంట్స్‌తో తెరకెక్కించిన క్లాసికల్ లవ్‌స్టోరీ 24 కిస్సెస్. ఇందులో ఒక్క డబుల్ మీనింగ్ డైలాగ్ కూడా ఉండదు. అందరూ కలిసి చూడదగ్గ సినిమా ఇది’’ అన్నారు. ‘‘సినిమా రిలీజ్ కోసం చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నాను. ఎగై్జట్‌మెంట్‌తో పాటు నెర్వస్‌గా ఉంది. మంచి రిజల్ట్ వస్తుందన్న నమ్మకం ఉంది’’అన్నారు హెబ్బా పటేల్. ‘‘రిలీజైన ట్రైలర్‌కి, సాంగ్స్‌కి మంచి స్పందన లభిస్తోంది. మర్చిపోలేని ప్రేమకథా చిత్రమిది. ప్రేక్షకులకు మంచి సినిమా చూసిన అనుభూతి కలుగుతుంది’’ అన్నారు అరుణ్. -
విజువల్స్ చాలా బాగున్నాయి
‘‘24 కిస్సెస్’ సినిమా ఆడియో లాంచ్‌కి నేను వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. విజువల్స్ చాలా బాగున్నాయి. చిత్రదర్శకుడు అయోధ్యకుమార్‌గారికి ఇప్పటికే చాలా అవార్డులు వచ్చాయి. ఈ సినిమాతో మరిన్ని అవార్డులు రావాలి’’ అని నటి మంచు లక్ష్మి అన్నారు. అరుణ్ అదిత్, హెబ్బా పటేల్ జంటగా అయోధ్యకుమార్ కృష్ణంశెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘24 కిస్సెస్’. ‘నీకో సగం.. నాకో సగం.. ఈ ఉత్సవం’ అన్నది టాగ్ లైన్.సంజయ్ రెడ్డి, అనిల్ పల్లెల, అయోధ్యకుమార్ కృష్ణంశెట్టి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 23న విడుదలవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ప్రీ–రిలీజ్ ఫంక్షన్ నిర్వహించారు. ఈ చిత్రం పాటలను మంచు లక్ష్మి విడుదల చేశారు. అయోధ్య కుమార్ మాట్లాడుతూ– ‘‘24 కిస్సెస్’ జర్నీ 2016లో స్టార్ట్ అయ్యింది. ఈ చిత్రాన్ని బోల్డ్ సినిమాగా కాకుండా మంచి కంటెంట్ ఉన్న సినిమాగా గుర్తిస్తున్నారు’’ అన్నారు. ‘‘24 కిస్సెస్’ వెనుక 24 కారణాలుంటాయని, 24 క్రాఫ్ట్స్‌ని వాడుకుని సినిమాని చాలా కళాత్మకంగా తీశారని నమ్ముతున్నాను’’ అని డైరెక్టర్ చంద్రసిద్ధార్థ్ అన్నారు. ‘‘నా కెరీర్‌కి ఈ సినిమా చాలా బాగా ఉపయోగపడుతుంది’’ అని హెబ్బా పటేల్ అన్నారు. ‘‘ఇది ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లా లేదు.. సక్సెస్ మీట్‌లా ఉంది’’ అన్నారు అరుణ్ అదిత్. ఈ వేడుకలో నిర్మాత కిషోర్, నటుడు నరేష్, హీరోలు నవీన్ చంద్ర, నవదీప్, సిద్ధు జొన్నలగడ్డ, సందీప్ కిషన్, డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు, నిర్మాత ‘మధుర’ శ్రీధర్, నటుడు శశాంక్ తదితరులు పాల్గొన్నారు. -
కథ బాగుంటేనే ఆదరిస్తారు
‘‘24 కిస్సెస్’ సినిమా గురించి నరేష్‌గారు చెప్పేశారు. రావురమేష్‌గారు కానీ, సీనియర్ నరేష్‌గారు కానీ ఏదన్నా సినిమా ఒప్పుకుని చేశారంటే అవి విషయం లేని సినిమాలు మాత్రం కాదు’’ అని దర్శకుడు అయోధ్య కుమార్ అన్నారు. అదిత్ అరుణ్, హెబ్బాపటేల్ జంటగా సిల్లీ మాంక్స్ ఎంటర్టైన్మెంట్స్ సమర్పణలో అనీల్, సంజయ్ నిర్మించిన చిత్రం ‘24 కిస్సెస్’. ఈ సినిమా ట్రైలర్‌ను గురువారం విడుదల చేశారు. అయోధ్య కుమార్ మాట్లాడుతూ–‘‘ముద్దు ఇవ్వడమనేది గొప్పకాదు.. ముద్దుకు ముందు, తర్వాత ఇవ్వాల్సిన ఎమోషన్స్ పండటం చాలా అవసరం. ఈ సినిమాలో ముద్దులు ఉన్నాయని ప్రేక్షకులు సినిమాకి రారు. కథ బాగుంటే తప్పకుండా ఆదరిస్తారు’’ అన్నారు. ‘‘ముద్దు అనగానే ప్రతిఒక్కరూ తప్పుగానే ఆలోచిస్తారు. రొమాన్స్ అన్నది పూర్వకాలం నుంచే మొదలైంది. అందమైన ప్రేమ కావ్యం ‘24 కిస్సెస్’. యూత్, ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ చూడాల్సిన సినిమా ఇది’’ అన్నారు నటుడు నరేష్. ‘‘బ్యానర్‌కి తగ్గట్టుగా మా సినిమా ఉంటుంది. ఈ చిత్రానికి నరేష్‌గారు, రావు రమేష్‌గారు రెండు పిల్లర్లు. వీరిద్దరికీ నా ప్రత్యేక కృతజ్ఞతలు’’ అన్నారు అదిత్ అరుణ్. ‘‘నాకు ఈ అవకాశం ఇచ్చిన వారందరికీ థ్యాంక్స్’’ అన్నారు హెబ్బాపటేల్. నటి కీర్తన పాల్గొన్నారు. -
కెమిస్ట్రీ కుదిరింది
‘మిణుగురులు’ చిత్రంతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు దర్శకుడు అయోధ్య కుమార్ కృష్ణంశెట్టి. తాజాగా ఆయన దర్శకత్వం వహించిన చిత్రం ‘24 కిస్సెస్’. అదిత్ అరుణ్, హెబ్బా పటేల్ జంటగా సంజయ్ రెడ్డి, అనిల్ పల్లాల, అయోధ్యకుమార్ కృష్టంశెట్టి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 26న విడుదల కానుంది. నిర్మాతలు మాట్లాడుతూ – ‘‘బోల్డ్ కంటెంట్‌కు తోడు అద్భుతమైన కథతో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు అయోధ్యకుమార్. అదిత్, హెబ్బా మధ్య కెమిస్ట్రీ ఈ చిత్రానికి హైలైట్. ఇప్పటికే విడుదలైన మా సినిమా ట్రైలర్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. అన్ని వర్గాల ప్రేక్షకులను మా చిత్రం అలరిస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. నరేష్, రావు రమేష్, అదితి మైఖెల్, శ్రీని కాపా, మధు నెక్కంటి తదితరులు నటించిన ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: గిరిధర్ మామిడిపల్లి, లైన్ ప్రొడ్యూసర్: చందా గోవింద రెడ్డి, కెమెరా: ఉదయ్ గుర్రాల, సంగీతం: జోయ్ బరువా, నేపథ్య సంగీతం: వివేక్ ఫిలిప్. -
నా స్థాయిని మరచి కిందకి దిగను
‘మిణుగురులు’ వంటి చిత్రం తర్వాత అయోధ్యకుమార్ కృష్ణంశెట్టి దర్శకత్వం వహించిన చిత్రం ‘24 కిస్సెస్’. అదిత్ అరుణ్, హెబ్బా పటేల్ జంటగా రెస్పెక్ట్ క్రియేషన్స్, సిల్లీ మాంక్స్ కంబైన్స్ పతాకంపై సంజయ్ రెడ్డి, అనిల్ పల్లాల, అయోధ్యకుమార్ నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబర్ 13న విడుదల కానుంది. హైదరాబాద్‌లో ట్రైలర్ లాంచ్ చేశారు. డైరెక్టర్ అయోధ్యకుమార్ మాట్లాడుతూ– ‘‘24 కిస్సెస్’ సినిమాని గతంలో వేరే నిర్మాతలతో స్టార్ట్ చేశా. అయితే.. నా క్రియేటివిటీ విషయంలో వారి వద్ద నాకు అంత ఫ్రీడమ్ దొరకలేదు. అందుకే సంజయ్ రెడ్డి, అనిల్ పల్లాలగార్లతో ఈ చిత్రం తీశా. వీరు ఎక్కడా కల్పించుకోకుండా పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. ‘మిణుగురులు’ వంటి సినిమా తీసిన అయోధ్యకుమార్ ‘24 కిస్సెస్’ లాంటి సినిమా తీయడమేంటి? అంటున్నారు. నేనెప్పుడూ నా స్థాయిని మరచి కిందకి దిగను. అలా అనుకుని ఉంటే ‘మిణుగురులు’ తర్వాత చాలా సినిమాలు చేసేవాణ్ణి. ఇదొక అందమైన ప్రేమకథ. చక్కని భావోద్వేగాలు ఉంటాయి’’ అన్నారు. ‘‘తుంగభద్ర’ పాటల వేడుకలో నువ్వు లవ్‌స్టోరీస్ చేయొచ్చుకదా? అని నానిగారు అన్నారు. రెగ్యులర్ ప్రేమకథలకి భిన్నంగా ఓ చిత్రం చేయాలనుకున్నా. అది ‘24 కిస్సెస్’తో తీరింది’’ అన్నారు అదిత్ అరుణ్. ‘‘సింపుల్ ప్రేమకథా చిత్రమిది. మంచి చిత్రంలో అవకాశమిచ్చిన అయోధ్యకుమార్ సార్‌కి థ్యాంక్స్’’ అన్నారు హెబ్బా పటేల్. ‘‘అయోధ్యగారు రెండేళ్లుగా ఈ ప్రాజెక్టుపై పనిచేస్తున్నారు. కథ నచ్చడంతో ఈ చిత్రంతో నిర్మాతగా మారాను’’ అన్నారు సంజయ్‌రెడ్డి. మరో నిర్మాత అనిల్ పల్లాల, నటీనటులు అదితీ మ్యాకల్, అన్షు, మధు, కీర్తన పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: ఉదయ్ గురల్లా, లైన్ ప్రొడ్యూసర్: చందా గోవింద్‌రెడ్డి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: గిరిధర్ మామిడిపల్లి. -
ఫస్ట్‌లుక్ 12th July 2018
-
నాలుగోసారి వస్తున్నాం
కొన్ని సినిమాలకు కాంబినేషన్ వల్ల క్రేజ్ ఏర్పడుతుంది. రాజ్‌తరుణ్–హెబ్బా పటేల్ లది అలాంటి కాంబినేషనే. ‘కుమారి 21 ఎఫ్, ఈడోరకం ఆడోరకం, అంధగాడు’ సినిమాల్లో కలసి నటించిన రాజ్ తరుణ్, హెబ్బా పటేల్ నాలుగోసారి జత కట్టనున్నారని సమాచారం. తమిళ సూపర్ హిట్ చిత్రం ‘నానుమ్ రౌడీదాన్’ తెలుగు రీమేక్‌లో ఈ యువ జంట కలసి నటించబోతోందట. విజయ్ సేతుపతి పాత్రను రాజ్ తరుణ్, నయనతార క్యారెక్టర్‌ను హెబ్బా పోషించనున్నారని సమాచారం. తమిళంలో ఈ చిత్రం పెద్ద హిట్. పెట్టిన బడ్జెట్‌కి మూడింతలు ఎక్కువ లాభాలు తెచ్చిన సినిమా. మరి.. తెలుగు రీమేక్ ఉందా? అనేది వెయిట్ అండ్ సీ. ∙హెబ్బా పటేల్, రాజ్‌తరుణ్ -
స్క్రీన్ టెస్ట్
► భూమిక చావ్లాతో నటించిన మొదటి తెలుగు హీరో ఎవరో తెలుసా? ఎ) యన్టీఆర్ బి) మహేశ్ బాబు సి) సుమంత్ డి) వెంకటేశ్ ► ‘మిస్టర్’ సినిమా హీరో వరుణ్ తేజ్. ఆ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు నటించారు. ఒక హీరోయిన్ లావణ్య త్రిపాఠి, మరో హీరోయిన్ ఎవరు? ఎ) హెబ్బా పటేల్ బి) ప్రణీత సి) అమలాపాల్ డి) ఆండ్రియా ► నాగార్జున నటించిన ‘శివ’ సినిమాకు మాటల రచయిత ఎవరో తెలుసా? ఎ) యం.వీ.యస్.హరనాథరావు బి) శివనాగేశ్వరరావు సి) తనికెళ్ల భరణి డి) సుద్దాల అశోక్‌తేజ ► బాలీవుడ్ నటి విద్యాబాలన్‌కి ఈ సౌత్ హీరోయిన్ దగ్గరి బంధువు. ఎవరామె? ఎ) ప్రియమణి బి) లక్ష్మీరాయ్ సి) అంజలి డి) గౌతమి ► వెంకటేశ్ నటించిన ‘నువ్వు నాకు నచ్చావు’ చిత్రానికి దర్శకుడెవరు? ఎ) త్రివిక్రమ్ శ్రీనివాస్ బి) కె. విజయభాస్కర్ సి) పి.వాసు డి) సురేశ్‌కృష్ణ ► నటి చార్మి ప్రస్తుతం హీరోయిన్గా కాకుండా ఓ ప్రముఖ దర్శకునితో కలిసి సినిమా ప్రొడక్షన్ కంపెనీని ప్రారంభించారు. ఆ కంపెనీ పేరేంటి? ఎ) పూరిచార్మి క్రియేటివ్స్ బి) పూరి కనెక్ట్స్ సి) పీసీ కనెక్ట్స్ డి) పీసీ క్రియేట్స్ ► ‘మామ మంచు అల్లుడు కంచు’ అనే సినిమా 2015 డిసెంబర్లో రిలీజైంది. మోహన్‌బాబు 23 సంవత్సరాల క్రితం నటించిన ఓ సినిమాకు సీక్వెల్‌గా ఈ చిత్రం రూపొందింది. ఏ చిత్రానికి ఈ సినిమా సీక్వెలో చెప్పగలరా ? ఎ) అల్లుడుగారు బి) అసెంబ్లీ రౌడి సి) అల్లరి మొగుడు డి) రౌడీగారి పెళ్లాం ► ప్రముఖ యాంకర్ సుమ గతంలో ఓ ప్రముఖ దర్శకుని చిత్రంలో హీరోయిన్గా నటించింది. ఎవరా దర్శకుడు? ఎ) కె.రాఘవేంద్రరావు బి) దాసరి నారాయణరావు సి) కోడి రామకృష్ణ డి) ఎ. కోదండరామిరెడ్డి ► శ్రీదేవి, కమల్‌హాసన్ కలిసి ఎన్ని సినిమాల్లో నటించారో తెలుసా? ఎ) 15 బి) 19 సి) 23 డి) 27 ► ప్రభాస్–అనుష్కల కాంబినేషన్లో ఇప్పటివరకు ఎన్ని సినిమాలు వచ్చాయో తెలుసా? ఎ) 7 బి) 3 సి) 5 డి) 4 ► హృదయం ఎక్కడున్నది.. హృదయం ఎక్కడున్నది నీ చుట్టునే తిరుగుతున్నది... అనే పాటను కంపోజ్ చేసిన సంగీత దర్శకుడెవరో తెలుసా? ఎ) దేవా బి) హారిస్ జయరాజ్ సి) యువన్ శంకర్ రాజా డి) విశాల్ శేఖర్ ► హీరోలు రానా, శర్వానంద్‌లకు ఈ ప్రముఖ హీరో స్కూల్‌మేట్. ఎవరా హీరో? కనుక్కోండి చూద్దాం? ఎ) యన్టీఆర్ బి) రామ్‌చరణ్ సి) విజయ్ దేవరకొండ డి) అల్లరి నరేశ్ ► అంతకుముందు చాలా సినిమాల్లో క్యారెక్టర్స్ చేసినప్పటికీ రామ్‌గోపాల్ వర్మ ‘ఐస్‌క్రీమ్’ సినిమా ద్వారా పేరు తెచ్చుకున్న నటి ఎవరు? ఎ) అవికా గోర్ బి) తేజస్విని మడివాడ సి) శ్రీముఖి డి) ఈషా రెబ్బా ► అక్కినేని నాగేశ్వరరావు నటించిన ‘దసరాబుల్లోడు’ చిత్రానికి దర్శకత్వం వహించిందెవరు? ఎ) వి.మధుసూదనరావు బి) కె.వి.రెడ్డి సి) వి.బి.రాజేంద్రప్రసాద్ డి) కె.విశ్వనాథ్ ► నాగార్జున ట్విట్టర్ ఐడీ ఏంటో కనుక్కోండి ? ఎ) ఐయామ్ నాగార్జున బి) నాగార్జున సి) దిస్ ఈజ్ నాగార్జున డి) ఐయామ్ నాగ్ ► ఈ నటి అసలు పేరు సుజాత. అప్పటికే ఆ పేరుతో ఓ నటి ఉండటం వల్ల ఆమె స్క్రీన్ నేమ్ మారిపోయింది . ఆ నటి ఎవరో తెలుసా? ఎ) జయసుధ బి) జయప్రద సి) దివ్యవాణి డి) రంభ ► తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించినంత వరకు ‘నంది’ అనేది చాలా ప్రతిష్టాత్మకమైన అవార్డు. ఈ అవార్డులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ సంవత్సరం నుంyì ప్రారంభించిందో తెలుసా? ఎ) 1975 బి) 1964 సి) 1979 డి) 1993 ► చిరంజీవి నటించిన ‘పసివాడిప్రాణం’ చిత్రంలో ‘పదహారేళ్ల వయసు పడిపడిలేచె మనసు’ అనే పాట ఉంటుంది. ఇప్పుడు ‘పడిపడి లేచె మనసు’ అనే టైటిల్‌తో ఓ సినిమా రాబోతోంది. ఆ సినిమా హీరో ఎవరు? ఎ) నాని బి) నిఖిల్ సి) నాగచైతన్య డి) శర్వానంద్ ► ఈ ఫోటోలోని ఇప్పటి హీరో ఎవరో కనుక్కోండి? ఎ) శర్వానంద్ బి) కల్యాణ్‌రామ్ సి) అజిత్ డి) మాధవన్ ► అక్కినేని, సావిత్రి నటించిన ఈ ఫోటో ఏ సినిమాలోనిదో కనుక్కోండి? ఎ) మనుషులు మమతలు బి) మిస్సమ్మ సి) గుండమ్మకథ డి) డాక్టర్ చక్రవర్తి మీరు 6 సమాధానాల కంటే తక్కువ చెబితే... మీకు సినిమా అంటే ఇష్టం 10 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే ఇంట్రెస్ట్ 15 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే పిచ్చి 20 సమాధానాలూ చెప్పగలిగితే... ఇంకోసారి ఈ క్విజ్ చదవకండి! సమాధానాలు 1) సి 2) ఎ 3) సి 4) ఎ 5) బి 6) సి 7) సి 8) బి 9) డి 10) డి 11) బి 12) బి 13) బి 14) సి 15) ఎ 16) ఎ) 17) బి 18) డి) 19) ఎ 20) ఎ నిర్వహణ శివ మల్లాల -
కన్నడంలో కుమారి
‘‘నా పేరు కుమారి, నా ఏజ్ 21, ఐయామ్ ఎ ఫీమేల్. ఏం.. నన్ను లవ్ చేయటానికి నేను సరిపోనా. నా బ్యాక్‌గ్రౌండ్ మొత్తం కావాలా...’’ అంటూ ‘కుమారి 21ఎఫ్’ సినిమాలో హెబ్బా పటేల్ పలికిన సంభాషణలను ఎవరూ మర్చిపోలేరు. రాజ్ తరుణ్, హెబ్బా పటేల్ జంటగా సుకుమార్ రైటింగ్స్ నిర్మాణంలో సూర్యప్రతాప్ పల్నాటి దర్శకత్వం వహించిన ‘కుమారి 21ఎఫ్’ మంచి సక్సెస్ సాధించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమా కన్నడంలో అదే టైటిల్‌తో రీమేక్ అయింది. హెబ్బా పటేల్ పోషించిన కుమారి పాత్రను నిధి కుశలప్ప పోషించారు. కుమారి బాయ్ ఫ్రెండ్ రాజ్ తరుణ్ పాత్రలో ప్రణామ్ దేవరాజ్ నటించారు. అవినాష్, మనోజ్, అక్షయ్, రితేష్ కీలక పాత్రల్లో కనిపిస్తారు. ఈ యూత్‌ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ను సంపత్ కుమార్, శ్రీధర్ సంయుక్తంగా నిర్మించగా శ్రీమన్ వేముల దర్శకత్వం వహించారు. మణిశర్మ తనయుడు సాగర్ మహతి సంగీతం అందించిన ఈ సినిమా ఈ నెల 12న విడుదల కానుంది. -
కుమారి హెబ్బా
సింగిల్ సినిమాతో కుమారి అనిపించుకుంది. ఆ సినిమా తర్వాత హెబ్బా పటెల్ అంటే ‘ఎవరూ? కుమారి 21ఎఫ్ అమ్మాయా ?’ అని ఇప్పటికీ అడుగుతున్నారు. పోనీ పెళ్లి అయినా చేసుకుంటే ఈ గొడవ తప్పుతుంది అంటే.. సినిమాలకి, ఫ్యామిలీకి తప్ప మనస్సులో ఇంకెవరికీ చోటు లేదని ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పింది. హెబ్బా అంటే ‘గాడ్స్ గిఫ్ట్’ అని అర్థం. మూవీస్‌కి ఆ దేవుడు ఇచ్చిన గిఫ్ట్ మీరని అనుకోవచ్చా? (నవ్వేస్తూ). మా అమ్మానాన్నలకు ఆ దేవుడు ఇచ్చిన గిఫ్ట్ నేను. సినిమాలకు నేను గిఫ్ట్ కాదు.. ఆ దేవుడు నాకిచ్చిన గిఫ్ట్ సినిమాలు. ఇంకా దేవుడు మీకేమేం బహుమతులు ఇచ్చాడు? నేను అనుకోకపోయినా హీరోయిన్ని చేశాడు. ఫేమస్ అవ్వాలనుకున్నాను. అది తీర్చేసేశాడు. ఏదో వచ్చాం.. సో..సోగా సినిమాలు చేసేసి వెళ్లిపోదామనుకోలేదు. నేను అనుకున్నట్లుగానే నాకు పేరు తెచ్చే సినిమాలే ఇస్తున్నాడు. ఇంతకు మించి దేవుణ్ణి ఏమైనా కోరుకుంటే బాగుండ దేమో. అయినా ఓ పెద్ద కల ఉంది. అది ఇప్పుడు చెప్పను. జర్నలిస్ట్ అవ్వాలనుకుని మాస్ కమ్యూనికేషన్ చేశాను. చదువుకుంటూనే పాకెట్ మనీ కోసం మోడల్స్‌కి స్టేజ్ హెల్పర్‌గా చేసేదాన్ని. అప్పుడెవరో మోడల్‌గా ట్రై చేయొచ్చు కదా అంటే, చేశాను. అవి చూసి, సినిమాలకు అవకాశం ఇచ్చారు. ముందు తమిళ సినిమా ‘తిరుమణమ్ ఎన్నుమ్ నిక్కా’, ఆ తర్వాత తెలుగులో ‘అలా ఎలా’కి చాన్స్ వచ్చింది. మధ్యలో ‘అధ్యక్ష’తో కన్నడకు పరిచయమయ్యా. ‘కుమారి 21ఎఫ్’ నా కెరీర్‌కి మంచి టర్నింగ్ అయింది. పెద్ద హీరోల పక్కన నటిస్తే కెరీర్ ఇంకా పుంజుకుంటుంది కదా.. ట్రై చేయడంలేదా? మీరన్నది కరెక్టే. కానీ అవకాశాలు వాటంతట అవి రావాలి. ఏదేమైనా ఇప్పుడు చేస్తున్న, చేసిన సినిమాలవైజ్గా నాకెలాంటి రిగ్రెట్స్ లేవు. ‘ఐయామ్ హ్యాపీ’. ఆ విషయం చెప్పి, మీ ఫ్యాన్స్‌కి మీరు కూడా గిఫ్ట్ ఇవ్వొచ్చు కదా? ఫ్యాన్స్ అంటున్నారు కాబట్టి, చెప్పేస్తున్నా. మరేం లేదు. పెద్ద ఇల్లు కొనాలనే కల ఉంది. అదీ నెరవేరుతుందనే నమ్మకం ఉంది. తెలుగు, తమిళ, కన్నడంతో కలిపి పది సినిమాల దాకా చేసేశారు. ఇల్లు కొనడం మీకు పెద్ద కల అవుతుందా? లెక్క చెప్పుకోవడానికి పది సినిమాలున్నాయి. కానీ, ఇంకా సెటిలవ్వడానికి చాలా టైమ్ పడుతుందండి. ‘ఇల్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడు’ అంటారు కదా. సో.. ఇల్లు కట్టాక పెళ్లన్న మాట? అయ్య బాబోయ్. ఏదో మాట వరసకి అన్నాను. అప్పుడే పెళ్లి అంటూ పెద్ద పెద్ద మాటలు మాట్లాడను. ఇంకా చాలా సినిమాలు చేయాలి కదా. హైదరాబాద్‌లో ఇల్లు ఎక్కడ కట్టుకోవాలనుకుంటున్నారు? ఇక్కడ కాదు. ముంబైలో మంచి ఏరియాలో కొనుక్కోవాలనుకుంటున్నా. ఆ బాధ్యత మా ఇంట్లోవాళ్లకి అప్పగించేస్తాను. క్యాష్ ఇక్కడ... ఇల్లు అక్కడా? హైదరాబాద్ అంటే ఇష్టం లేక కాదు. కానీ, మావాళ్లంతా ముంబైలోనే ఉంటారు. హైదరాబాద్ షిఫ్ట్ కావడం వాళ్లకు ఇష్టంలేదు. ఇంట్లోవాళ్ల కంఫర్ట్ కోసం ముంబైలో ప్లాన్ చేశా. నా వరకు మాత్రమే అయితే ఇక్కడే ప్లాన్ చేసుకునేదాన్ని. ఓకే.. బర్త్‌డే (06.01.) ఎలా జరుపుకున్నారు? షూటింగ్ స్పాట్లోనే. నాకన్నా నా ఫ్యామిలీ, నా ఫ్రెండ్స్ నా బర్త్‌డేని స్పెషల్‌గా ఫీలవుతారు. అది నాకు హ్యాపీగా ఉంటుంది. హీరోయిన్ అయిన ఈ నాలుగేళ్లల్లో ఖాళీగా ఉన్న బర్త్‌డే ఏదైనా ఉందా? లేదు. అమ్మో దిష్టి తగులుగుతుందేమో.. టచ్ ఉడ్ (దిష్టి తగలకుండా అలా అనుకుంటారు). యాక్చువల్లీ ఒక్క బర్త్‌డేకి ఖాళీగా ఉన్నా నేను బాధపడేదాన్ని. షూటింగ్ స్పాట్లో ఉండి, ‘ఓకే.. మనం బిజీగా ఉన్నాం’ అనే ఫీలింగ్ కన్నా వేరే ఆనందం ఏముంటుంది? 2017 ఎలా గడిచింది? అప్ అండ్ డౌన్స్‌తో సాగింది. కొన్ని పాఠాలు నేర్పింది. ఆ లెసన్స్ 2018కి ఉపయోగపడతాయి. అందుకే గతేడాది కన్నా ఈ ఇయర్ బాగుంటుంద నుకుంటున్నా. బర్త్‌డే సందర్భంగా కొత్త నిర్ణయాలేమైనా? ఎక్కువ ఆశించకూడదు. సిన్సియర్‌గా పని చేయాలి. ఇంకా స్ట్రాంగ్‌గా ఉండాలను కుంటున్నాను. తక్కువ ఆశిస్తే ఏ బాధా ఉండదని అనుభవం నేర్పింది. సిన్సియర్‌గా పని చేయాలనుకుంటున్నా అన్నారు. ఇప్పటివరకూ అలా చేయలేదా? నిజానికి నన్ను నేనెప్పుడూ సీరియస్‌గా తీసుకోలేదు. సినిమాలు ఒప్పుకోవడం, చేయడం అంతే. సినిమాల సెలక్షన్ విషయంలో కూడా పెద్దగా జాగ్రత్త తీసుకోలేదు. ఇకనుంచి కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండాలనుకుంటున్నా. ‘కుమారి 21ఎఫ్’ రిలీజై రెండేళ్లకు పైనే అయినా మిమ్మల్ని కుమారి అంటున్నారు.. (నవ్వేస్తూ). అవునండి. ఎక్కడికెళ్లినా ‘కుమారి’ అంటున్నారు. ఇలా అయితే నా అసలు పేరుని మరచి పోతారేమో అనిపిస్తుంది. కానీ, ఒక పాత్ర అంత ఇంపాక్ట్ చూపించినందు కు హ్యాపీగా ఉంది. సేమ్ టైమ్ ‘కుమారి’ని మరిపించే పాత్ర చేయాలనుకుంటున్నా. మీరేమో ‘సింపుల్ హోమ్లీ గర్ల్’లా కనిపి స్తారు. ‘కుమారి 21 ఎఫ్’లో అంత హాట్‌గా ఎలా యాక్ట్ చేశారా? అనిపిస్తుంటుంది.. నాకూ ఆశ్చర్యంగానే ఉంటుంది. నన్ను నేను హాట్ అనుకోలేదు. చూసేవాళ్లు కూడా అనుకోరు. అయితే సుకుమార్‌గారు, సూర్యప్రతాప్‌గారు కుమారి పాత్రకు నేను ఫిట్ అవుతాననుకున్నారు. వాళ్లేం చెబితే అది చేసేశా. అంత బోల్డ్ క్యారెక్టర్ చేస్తే ‘బ్యాడ్ ఇమేజ్’ వస్తుందని భయపడలేదా? ఫ్రాంక్‌గా చెప్పాలంటే ఆ టైమ్‌లో నా చేతిలో సినిమాలు లేవు. అది ఒప్పుకోవడం మినహా వేరే ఛాయిస్ లేదు. సుకుమార్‌గారి ప్రొడక్షన్ అంటే ఆలోచించడానికి ఏముంటుంది? పైగా టైటిల్ రోల్. ఇమేజ్ గురించి ఆలోచించకుండా ఒప్పుకున్నాను. నన్నింత ఫేమస్ చేస్తుంద నుకోలేదు. ‘కుమారి 21ఎఫ్’ నా జీవితాన్ని మార్చేసింది. ‘మిణుగురులు’ ఫేమ్ అయోధ్యకుమార్ డైరెక్షన్లో ‘శ్రీలక్ష్మి అండ్ 24 కిస్సెస్’ అనే సినిమా చేస్తున్నారట? అవును. కానీ ఆ సినిమా గురించి ఇప్పుడేమీ చెప్పను. ఒక్కటి చెబుతాను. ‘కుమారి 21ఎఫ్’కన్నా ఇది ఫుల్ డిఫరెంట్‌గా ఉంటుంది. అప్పుడప్పుడూ ఇద్దరు కథానాయికలున్న సినిమాలు చేస్తున్నారు. ప్రాబ్లమ్ అనిపించదా? నో ప్రాబ్లమ్. మన బలం ఏంటో మనం తెలుసుకుంటే అభద్రతాభావం ఉండదు. నేను గొప్ప ఆర్టిస్ట్‌ని అని చెప్పడంలేదు కానీ ఏ క్యారెక్టర్ ఒప్పుకున్నా, దాన్ని అర్థం చేసుకుని యాక్ట్ చేయగల కెపాసిటీ ఉంది. ప్లస్ ఇద్దరు ముగ్గురు హీరోయిన్ల కాంబినేషన్లో సినిమాలు చేసినా నా క్యారెక్టర్‌కీ కథలో ఇంపార్టెన్స్ ఉంటుంది. ఫైనల్లీ.. మీ మనసులో ఎవరో ఉన్నారట.. అవును. మా అమ్మానాన్న, ఇంకా నా ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు. కాదు.. ఎవరో కుర్ర హీరో ఉన్నారట కదా? ఎవరి కోసమూ మనసు ఖాళీ లేదు (నవ్వుతూ). ఐయామ్ సింగిల్. – డి.జి. భవాని -
చీరాలలో సందడి చేసిన హెబ్బా
-
సరికొత్త స్వర్గం చూపించాం!
‘పూలు అమ్మలకి నాన్నలు పెడతారు.. ఐ నో ఇట్. మరి, ఈ అమ్మాయికి ఎందుకు పెట్టినట్టు.. అంత భయపడేవాడివి ఎందుకు పెట్టావ్? తల్లో మల్లెపూలు పెట్టాలి’ అంటూ ముద్దు ముద్దు మాటలతో ‘ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు’లో వెంకటేశ్‌ని బ్లాక్మెయిల్ చేసిన బాలనటుడు నాగ అన్వేష్ ‘వినవయ్యా రామయ్యా’తో హీరోగా పరిచయమైన విషయం తెలిసిందే. ఈ యువహీరో నటించిన చిత్రం ‘ఏంజెల్’. హెబ్బాపటేల్ కథానాయిక. ‘బాహుబలి’ పళని దర్శకత్వం వహించారు. ముప్పా వెంకయ్య చౌదరి సమర్పణలో ‘సింధూరపువ్వు’ కృష్ణారెడ్డి పర్యవేక్షణలో భువన్ సాగర్ నిర్మించిన ఈ సినిమా ఈరోజు విడుదలవుతోంది. ఈ సందర్భంగా నాగ అన్వేష్ మీడియాతో ముచ్చటించారు. ► రెండో సినిమా సోషియో ఫాంటసీ ఎంచుకోవడానికి ప్రత్యేక కారణాలేవీ లేవు. కథ నచ్చింది. అందుకే చేశా. ‘ఏంజెల్’ సినిమాకు ఒకటిన్నర సంవత్సరం స్క్రిప్ట్ వర్క్ జరిగింది. 4 నెలలు షూటింగ్ చేశాం. కంప్యూటర్ గ్రాఫిక్స్‌కి ఆర్నెల్లు పట్టింది. నేను, సప్తగిరి ఒక విగ్రహాన్ని స్మగ్లింగ్ చేస్తుంటాం. ఆ సమయంలోనే హెబ్బా పటేల్ స్వర్గం నుంచి భూమికి వస్తుంది. ఆమె మమ్మల్ని ఎందుకు కలిసింది? మా జర్నీ ఎలా సాగింది? అన్నదే కథ. ► ఈ సినిమాలో నాది ఫన్‌తో కూడుకున్న కొంచెం మాస్ క్యారెక్టర్. వినోద ప్రధానంగా ఉంటుంది. కథ కొత్తగా ఉంటుంది. ప్రేక్షకులకు మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ► నా మొదటి సినిమాకంటే ఈ సినిమాకి కాస్త ఫిజిక్ పెంచా. నటన పరంగా కూడా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. ఔట్పుట్ చాలా బాగా వచ్చింది. శాటిలైట్ రైట్స్ కూడా బాగానే అమ్ముడయ్యాయి. తెలుగులో రిలీజ్ చేశాక తమిళం, హిందీలోనూ ‘ఏంజెల్’ ని విడుదల చేయాలనే ఆలోచన ఉంది. ► సినిమాలో ముందు 12 నిముషాల గ్రాఫిక్స్ అనుకున్నాం. కానీ, అవి కాస్తా 40 నిముషాలకు పెరిగాయి. అందుకే సినిమా విడుదల కాస్త ఆలస్యమైంది. స్వర్గాన్ని సరికొత్త తరహాలో చూపిస్తున్నాం. క్లైమాక్స్ ఫైట్ కూడా గ్రాఫిక్స్‌తోనే తీశాం. సినిమా పట్ల మా అమ్మ, నాన్న చాలా సంతోషంగా ఉన్నారు. -
దేవుణ్ణి చూడాలనుకుంటే షోకి రండి! – సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్
‘‘ఇళయరాజా ఉన్న కాలంలో మనం ఉండడం అదృష్టం. అదీ మనందరి ముందు ఆయన లైవ్ పర్ఫార్మెన్స్ ఇవ్వడం మరింత అదృష్టం. (‘మ్యూజిక్’) దేవుణ్ణి ప్రత్యక్షంగా చూడాలనుకుంటే రాజా (ఇళయరాజా) గారి షోకి రండి. ఆయన సంగీత దర్శకత్వంలో ‘చిరుగాలి వీచెనే’ పాట పాడే చాన్స్, ఆయన్ని కలసే చాన్స్ ఇచ్చిన దేవుడికి థ్యాంక్స్’’ అన్నారు సంగీత దర్శకులు–నటుడు–దర్శక–రచయిత ఆర్పీ పట్నాయక్. ఈ ఆదివారం (నవంబర్ 5న) హైదరాబాద్‌లో మొట్టమొదటిసారిగా ‘స్వరజ్ఞాని’ ఇళయరాజా లైవ్ మ్యూజిక్ కన్సర్ట్ జరగనున్న సంగతి తెలిసిందే. ‘‘ఇళయరాజా లైవ్ షోకి ఫ్రీ పాసులు కావాలా? అయితే... ‘రాజా కాలింగ్ ఆజా’ పోటీలో పాల్గొనండి’’ అని ‘సాక్షి’ పాఠకులకు ‘షో క్విజ్’ పెట్టిన సంగతి తెలిసిందే. ఈ పోటీకి అనూహ్య స్పందన లభించింది. వాళ్లలో సరైన సమాధానాలు రాసి పంపిన 600 మందిని ఎంపిక చేశారు. 600 మందిలోంచి 200 మంది లక్కీ మెంబర్స్‌ను ఆర్పీ పట్నాయక్, హీరో నాగ అన్వేష్, హీరోయిన్ హెబ్బా పటేల్ ఎంపిక చేశారు. ‘ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు’ సినిమాలో బాలనటుడిగా, ‘వినవయ్యా రామయ్యా’, ఈ శుక్రవారం విడుదలవుతోన్న ‘ఏంజెల్’లో హీరోగా నటించిన నాగ అన్వేష్ మాట్లాడుతూ– ‘‘రాజాగారి పాటల్లో ‘రుద్రవీణ’లోని ‘తరలిరాద తనే వసంతం..’ పాటంటే నాకెంతో ఇష్టం. టీవీలో ఆ పాట ఎప్పుడొచ్చినా... పనులన్నీ పక్కన పెట్టేసి టీవీ ముందు కూర్చుంటా. లక్కీ డ్రాలో పాసులు పొందిన 200 మందికి కంగ్రాట్స్. నా ఫ్రెండ్స్, స్టాఫ్ కూడా పాసులు అడుగుతున్నారు. ఒక్క ఎక్స్రా›్ట పాస్ ఉంటే నాకు ఇవ్వండి’’ అన్నారు. ‘మీ దగ్గర ఒక్క పాస్ ఉంటే... ఇంట్లో ఇల్లాలిని తీసుకువెళతారా? వంటింట్లో ప్రియురాలిని తీసుకువెళతారా?’ అని నాగ అన్వేష్ని అడగ్గా... ‘‘నేను ఇంట్లో కూర్చుని ఇద్దరినీ రాజాగారి లైవ్ కన్సర్ట్కి పంపిస్తా’’ అని నవ్వేశారు. ఈ లక్కీ డ్రాలో పాల్గొనడం హ్యపీగా ఉందని హెబ్బా పటేల్ చెప్పారు. విజేతలు (200 మంది)... తమ వివరాలను ‘సాక్షి’ వెబ్సైట్లో చూడొచ్చు. అలాగే, వాళ్ల మొబైల్ నంబర్లకు ఎసెమ్మెస్‌ల ద్వారా సమాచారం అందుతుంది. నవంబర్ 2, 3, 4వ తేదీల్లో హైదరాబాద్‌లోని ‘సాక్షి’ ఆఫీసులో ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల వరకూ విజేతలు తమ మొబైల్‌కు వచ్చిన మెసేజ్ చూపించి పాసులు పొందవచ్చు. సుదూర ప్రాంతాల వాళ్లు 5వ తేదీ మధ్యహ్నం 2 గంటలలోపు వచ్చి పాసులు పొందవచ్చు. ఫార్వార్డ్ మెసేజ్‌లకు పాసులు ఇవ్వబడవు. ఏ నంబర్‌కి మెసేజ్ వస్తే.. ఆ నంబర్‌కే పాస్ ఇవ్వబడును. -
ఖుషీ కుమారి
కుమారి ఫుల్ ఖుషీగా ఉన్నారు. కుమారి అంటే ‘కుమారి 21ఎఫ్’ ఫేమ్ హెబ్బా పటేల్ అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందులో హాట్ హాట్‌గా నటించిన ఈ బ్యూటీ ఆ తర్వాత తెలుగులో వరుసగా సినిమాలు చేస్తున్నారు. ఇప్పుడు తమిళ పరిశ్రమ నుంచి కుమారీకి ఓ కబురొచ్చిందట. ఆమె ఆనందానికి కారణం అదే. ఎందుకంత ఆనందం అంటే.. ఏకంగా స్టార్ హీరో విజయ్ సినిమాలో అవకాశం వచ్చిందని ఖబర్. విజయ్ హీరోగా మురగదాస్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు నటించే అవకాశం ఉందట. అందులో ఒక ఛాన్స్‌ను హెబ్బా పటేల్ దక్కించుకున్నారన్న ఖబర్ ఫిల్మ్‌నగర్‌లో వినిపిస్తోంది. -
సంతోషంలో ఓ స్పెషాల్టీ ఉంటుంది
– సురేశ్ కొండేటి ‘సంతోషం’ సౌత్ ఇండియన్ ఫిల్మ్ 16వ వార్షికోత్సవ అవార్డుల వేడుక ఈ నెల 12న హైదరాబాద్‌లో జరుగనుంది. ఈ అవార్డులకు సంబంధించిన లోగోను ‘మా’ అధ్యక్షుడు శివాజీ రాజా, హీరోయిన్ రెజీనా లాంచ్ చేశారు. తొలి ఆహ్వాన పత్రికను శివాజీరాజా రెజీనాకు అందించారు. శివాజీరాజా మాట్లాడుతూ –‘‘సంతోషం అవార్డ్స్ వేడుక 16వ వసంతంలోకి అడుగుపెట్టడం ఆనందంగా ఉంది. ‘మా’ అసోసియేషన్‌లోని పేద కళాకారులందరికీ ఆర్థికంగా ఆయన సహాయం చేస్తున్నందుకు థ్యాంక్స్’’ అన్నారు. ‘‘ఎప్పటిలానే సంతోషం వేడుకల్లో ఓ స్పెషాలిటీ ఫ్లాన్ చేశాం’’ అన్నారు ‘సంతోషం’ అధినేత సురేశ్ కొండేటి. ‘‘సంతోషం అవార్డు తీసుకోవాలన్న నా కల ‘ప్రేమకావాలి’తో తీరింది’’ అన్నారు హీరో ఆది. సురేశ్ కొండేటికి రెజీనా, హెబ్బా పటేల్ శుభాకాంక్షలు తెలియజేశారు. -
గ్రాఫిక్స్ హైలెట్
‘ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు’, ‘సాహస బాలుడు విచిత్ర కోతి’ చిత్రాల్లో బాలనటుడిగా అలరించిన నాగ అన్వేష్ ‘వినవయ్యా రామయ్యా’ సినిమాతో హీరోగా పరిచయమయ్యారు. నటన, డ్యాన్స్, ఫైట్స్‌లో మంచి మార్కులు కొట్టేసిన అన్వేష్ తాజాగా ‘ఏంజెల్’ చిత్రంలో హీరోగా నటించారు. ‘బాహుబలి’ పళని దర్శకత్వంలో శ్రీ సరస్వతి ఫిలిమ్స్ పతాకంపై నిర్మాత ‘సింధూరపువ్వు’ కృష్ణారెడ్డి పర్యవేక్షణలో భువన్ సాగర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. హెబ్బా పటేల్ కథానాయిక. భువన్ సాగర్ మాట్లాడుతూ– ‘‘సోషియో ఫాంటసీ నేపథ్యంలో తెరకెక్కించిన చిత్రమిది. సినిమా షూటింగ్, రీ–రికార్డింగ్ పనులు ముగిశాయి. హాలీవుడ్ చిత్రాలకి గ్రాఫిక్స్ అందించిన విజువల్ ఎఫెక్ట్స్ నిపుణుల సమక్షంలో ‘ఏంజెల్’ సీజీ వర్క్స్ జరుగుతున్నాయి. 40 నిమిషాలకి పైగా గ్రాఫిక్స్ సన్నివేశాలు ఉండటంతో జాగ్రత్తలు తీసుకొంటున్నాం. తెలుగుతో పాటు హిందీ, తమిళ భాషల్లో ఈ సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం. అన్ని వర్గాలవారికీ నచ్చే విధంగా ఉంటుంది’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: భీమ్స్ సిసిరోలియో, కెమెరా: గుణ. -
కుమారి కాదల్!
హెబ్బా పటేల్ ఇప్పుడు కాదల్ చేయబోతున్నారు. అదేనండి.. లవ్ చేయనున్నారు. ఎవర్ని అని అడుగుతున్నారా? సంగీతదర్శకుడు జీవీ ప్రకాశ్కుమార్ని. అయితే ఇది సినిమా ప్రేమ. ‘అలా ఎలా’ చిత్రంతో తెలుగులోకి పరిచయమై, ‘కుమారి 21ఎఫ్’తో బోలెడంత పాపులార్టీ తెచ్చుకున్నారు హెబ్బా. ఇప్పుడీ కుమారి తెలుగులో హిట్ అయిన ‘100% లవ్’ తమిళ రీమేక్‌లో నటించబోతున్నారు. ముందు తెలుగులో చేసిన తమన్నానే తీసుకోవాలనుకున్నారట. ఆ తర్వాత సడన్‌గా లావణ్యా త్రిపాఠి తెరపైకొచ్చారు. అయితే ఫైనల్‌గా హాట్ గాళ్ హెబ్బా పటేల్‌కు ఆ ఛాన్స్ దక్కిందట. అధికారికంగా సైన్ చేయడమే ఆలస్యం. తమిళ సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్‌కుమార్ హీరోగా చంద్రమౌళి దర్శకత్వంలో తెలుగు ‘100% లవ్’కి దర్శకత్వం వహించిన సుకుమార్ ఈ రీమేక్‌ను నిర్మించనుండటం విశేషం. అన్నట్లు.. మూడేళ్ల క్రితమే హెబ్బా తమిళ పరిశ్రమకు పరిచయమయ్యారు. 2014లో వచ్చిన ‘తిరుమణమ్ ఎన్నుమ్ నిక్కా’లో స్మాల్ రోల్ చేశారు. -
హెబ్బాతో 30 సినిమాలు చేయాలనుంది!
– రాజ్‌తరుణ్ ‘‘టైటిల్ విని ‘అందగాడు’ ఏంటి? అనుకున్నా. తర్వాత ‘అంధగాడు’ అని తెలిసింది. కళ్లు లేని వ్యక్తిగా రాజ్ తరుణ్ బాగా చేయగలడనిపించింది. ట్రైలర్ బాగుంది’’ అన్నారు హీరో నిఖిల్. రాజ్‌తరుణ్, హెబ్బా పటేల్ జంటగా, రాజేంద్రప్రసాద్ కీలక పాత్రలో వెలిగొండ శ్రీనివాస్ దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర నిర్మించిన ‘అంధగాడు’ టీజర్‌ను నిఖిల్ రిలీజ్ చేశారు. రాజ్‌తరుణ్ మాట్లాడుతూ – ‘‘ఆర్ట్ ఫిల్మ్ కాదిది. వెలిగొండగారు ప్రతి పావు గంటకు కథను ఒక్కో జోనర్లోకి తీసుకువెళ్లారు. నేను, హెబ్బా జంటగా నటించిన మూడో చిత్రమిది. తనతో మరో 30 సినిమాలు చేయాలనుంది’’ అన్నారు. ‘‘చాలా ట్విస్టులున్న కథ. నిర్మాతలకు వినిపించిన తర్వాత మీరే దర్శకత్వం వహించండన్నారు’’ అన్నారు వెలిగొండ శ్రీనివాస్. సంగీత దర్శకుడు శేఖర్ చంద్ర, నటుడు రాజా రవీంద్ర పాల్గొన్నారు. -
దేవకన్య ప్రేమకథ కొత్తగా ఉంటుంది! – వీవీ వినాయక్
‘‘దేవలోకం నుంచి వచ్చిన ఓ అమ్మాయి సాధారణ యువకుడితో ప్రేమలో ఎలా పడింది? అనేది ఈ చిత్రకథ. ‘ఠాగూర్’ నుంచి నిర్మాత కృష్ణారెడ్డిగారితో పరిచయ ముంది. దర్శకుడు కథ చెప్పారు. కొన్ని సీన్స్ చూశా. చాలా కొత్తగా ఉంటుందీ సినిమా. నాగ అన్వేష్ బాగా హార్డ్‌వర్క్ చేస్తున్నాడు. తనకు హీరోగా మంచి భవిష్యత్ ఉంటుంది’’ అన్నారు దర్శకుడు వీవీ వినాయక్. నాగ అన్వేష్, హెబ్బా పటేల్ జంటగా ‘బాహుబలి’ పళని దర్శకత్వంలో సరస్వతి ఫిలింస్ పతాకంపై భువన్ సాగర్ నిర్మిస్తున్న సోషియో ఫాంటసీ సినిమా ‘ఏంజెల్’. గురువారం వీవీ వినాయక్ టీజర్‌ను విడుదల చేశారు. ‘‘తొమ్మిది నెలలు కథపై వర్క్ చేశాం. నాగ అన్వేష్ లుక్, గెటప్ అన్నీ కొత్తగా ఉంటాయి. హెబ్బా పటేల్ బాగా నటించింది. ప్రతి సీన్ చాలా థ్రిల్లింగ్‌గా ఉంటుంది. క్లైమాక్స్‌లో వచ్చే గ్రాఫిక్స్ సినిమాకు హైలైట్‌గా నిలుస్తాయి’’ అన్నారు ‘సింధూరపువ్వు’ కృష్ణారెడ్డి. ‘‘వినాయక్‌గారు కథ విని బాగా సపోర్ట్ చేశారు. సప్తగిరి కామెడీ, భీమ్స్ మ్యూజిక్ సినిమాకు హైలైట్‌గా నిలుస్తాయి’’ అన్నారు దర్శకుడు పళని. భువన్ సాగర్, నాగ అన్వేష్, హెబ్బా పటేల్, సంగీత దర్శకుడు భీమ్స్, హాస్యనటుడు సప్తగిరి, కథా రచయిత రమేష్ రెడ్డి, మాటల రచయిత శ్రీనివాస్ సంకల్ప్ తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి సమర్పణ: ముప్పా వెంకయ్యచౌదరి. -
అలా నటించడం సవాలే!
‘‘దర్శకుడు శ్రీను వైట్లగారు కథ చెబుతునప్పుడు... ఈ రోజుల్లో మొబైల్స్, కంప్యూటర్స్ గురించి ఏం తెలియని అమ్మాయి ఎలా ఉంటుందోనని ఆలోచించా. ఆ ఆలోచనే చంద్రముఖి పాత్ర అంగీకరించడానికి కారణమైంది. ఏమీ తెలియని అమ్మాయిలా నటించడమంటే సవాలే. ఆ సవాల్‌ను నేను స్వీకరించా’’ అన్నారు లావాణ్యా త్రిపాఠి. వరుణ్‌తేజ్ హీరోగా నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి), ‘ఠాగూర్’ మధు నిర్మించిన సినిమా ‘మిస్టర్’లో లావణ్య ఓ హీరోయిన్గా, హెబ్బా పటేల్ మరో హీరోయిన్గా నటించారు. శుక్రవారం విడుదలైన ఈ సినిమా గురించి లావణ్యా త్రిపాఠి మాట్లాడుతూ – ‘‘ప్రేక్షకులు సినిమా బాగుందని మెచ్చుకుంటుంటే సంతోషంగా ఉంది. వరుణ్‌తేజ్ మంచి నటుడు. ఇప్పటి వరకూ నేను చేయనటువంటి పాత్రను ‘మిస్టర్’లో చేశా. సినిమాలో ఎక్కువగా హాఫ్ శారీస్లో కనిపిస్తా. ఇందులో రాజ వంశానికి చెందిన అమ్మాయిని కాబట్టి... దుస్తులు, నగలు అందుకు తగ్గ సై్టల్లో డిజైన్ చేయించాం. నా దృష్టిలో గ్లామర్ అంటే ఎక్స్పోజింగ్ కాదు. పాత్రకు తగ్గట్టు నటించాలి. మిగతా సినిమాల విషయానికి వస్తే... పక్కా కమర్షియల్ సినిమా ‘రాధా’లో శర్వానంద్‌కి జోడీగా నటించా. నాగచైతన్య సరసన ఓ సినిమా చేస్తున్నా. ‘మాయవన్’ అనే తమిళ సినిమాలో సైక్రియాటిస్ట్‌గా చేశా’’ అన్నారు. -
అమ్మాయి... ఆపద... ప్రేమ!
ఏంజెల్ అంటే... దేవత! అందంలో, మానవత్వంలో సరిగ్గా దేవత లాంటి అమ్మాయే ఎదుట ప్రత్యక్షమైతే... ఏ అబ్బాయి అయినా ప్రేమలో పడతాడుగా! అలాగే, ఓ అబ్బాయి ప్రేమలో పడ్డాడు. దేవత ప్రేమతో పాటు అనుకోని ఆపద ఎదురైనప్పుడు అబ్బాయి ఏం చేశాడనే కథతో రూపొందుతోన్న సినిమా ‘ఏంజెల్’. నాగ అన్వేష్, హెబ్బా పటేల్ జంటగా భువన సాగర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రముఖ నిర్మాత ‘సింధూరపువ్వు’ కృష్ణారెడ్డి పర్యవేక్షణలో రూపొందుతోన్న ఈ సినిమాతో ‘బాహుబలి’ పళని దర్శకునిగా పరిచయమవుతున్నారు. ఇటీవలే ఫస్ట్ లుక్ విడుదల చేశారు. మే రెండోవారంలో చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. సింధూరపువ్వు కృష్ణారెడ్డి మాట్లాడుతూ – ‘‘సోషియో ఫాంటసీ చిత్రమిది. ఫస్ట్ లుక్కు అద్భుతమైన స్పందన లభిస్తోంది. హిందీ రీమేక్‌కి అడుగుతున్నారు. సినిమాలో ప్రేమకథ, విజువల్ ఎఫెక్ట్స్, భీమ్స్ మ్యూజిక్ హైలైట్‌గా నిలుస్తాయి’’ అన్నారు. -
ఇటు మీరా... అటు చంద్రముఖి.. మధ్యలో మిస్టర్!
ప్రేమను వెతుక్కుంటూ చాలా చోట్లకు వెళతాడు చై. కానీ, ప్రేమే ఇతణ్ణి వెతుక్కుంటూ వస్తుంది. ఆ ప్రేమే ఇద్దరమ్మాయిలను దగ్గర చేస్తుంది. అటు మీరా, ఇటు చంద్రముఖి.. ఈ ప్రేమ ప్రయాణంలో చై మనసు ఎవర్ని కోరుకుందనే కథతో రూపొందుతున్న సినిమా ‘మిస్టర్’. వరుణ్‌తేజ్ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి), ‘ఠాగూర్’ మధు నిర్మిస్తున్న ఈ సినిమాలో లావణ్యా త్రిపాఠి, హెబ్బా పటేల్ హీరోయిన్లు. ఏప్రిల్ 1 నుంచి ఇటలీలో తెరకెక్కించే పాటతో సినిమా చిత్రీకరణ పూర్తవుతుంది. అదే నెలలో ప్రీ–రిలీజ్ వేడుక నిర్వహించి, 13న చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నట్టు నిర్మాతలు ప్రకటించారు. ‘‘మనసును హత్తుకునే భావోద్వేగాలు, చక్కటి ప్రేమకథ, వినసొంపైన సంగీతం... ఫ్యామిలీ అంతా కలసి చూసే చిత్రమిది’’ అన్నారు దర్శకుడు. ఈ చిత్రానికి కథ: గోపీమోహన్, మాటలు: శ్రీధర్ సీపాన, కెమేరా: కేవీ గుహన్, స్టైలింగ్: రూపా వైట్ల, సంగీతం: మిక్కి జె. మేయర్, సమర్పణ: బేబీ భవ్య. -
క్లైమాక్స్‌లో కన్నీళ్లు వచ్చాయి
‘‘గురువారం సినిమా చూశా. ట్రెండీగా, ఫ్యామిలీలకు నచ్చే విధంగా దర్శకుడు బాగా తీశారు. క్లైమాక్స్‌లో రావు రమేశ్ నటనకు కన్నీళ్లు వచ్చాయి’’ అన్నారు దర్శకరత్న దాసరి నారాయణరావు. హెబ్బా పటేల్, రావు రమేశ్, తేజస్వి, అశ్విన్, నోయెల్, పార్వతీశం ముఖ్య తారలుగా బండి భాస్కర్ దర్శకత్వంలో బెక్కం వేణుగోపాల్ (గోపీ) నిర్మించిన ‘నాన్న నేను నా బాయ్‌ఫ్రెండ్స్’ ఈ నెల 16న విడుదలైంది. శుక్రవారం చిత్రబృందాన్ని దాసరి అభినందించారు. ఆయన మాట్లాడుతూ – ‘‘ఈ చిత్రాన్ని 40 రోజుల్లో కంఫర్ట్బుల్ బడ్జెట్లో చేశారని తెలిసి ఆశ్చర్యపోయా. షెడ్యూల్ ప్రకారం అనుకున్న బడ్జెట్లో సినిమా తీయడం అరుదుగా జరుగుతుంది. గోపీ ఇలాగే మంచి సినిమాలను తీయాలి. నోట్ల రద్దు లేకపోతే ఇంకా బాగా కలెక్ట్ చేసేది’’ అన్నారు. ‘‘దాసరిగారు నా తొలి చిత్రాన్ని మెచ్చుకోవడం అంటే అంతకు మించిన ప్రశంస లేదు’’ అన్నారు దర్శకుడు. ‘‘దాసరిగారి ఆశీస్సులతో మరిన్ని మంచి చిత్రాలు తీస్తా’’ అన్నారు బెక్కం వేణుగోపాల్. -
నమ్మండి.. బాయ్‌ఫ్రెండ్స్ లేరండి
‘నా తాజా చిత్రం ‘నాన్న.. నేను.. నా బాయ్‌ఫ్రెండ్స్’ త్వరలో విడుదల కానుంది. ఇది అన్ని వర్గాల ప్రేక్షకులనూ అలరిస్తుంది. కానీ నాకు నిజజీవితంలో బాయ్‌ఫ్రెండ్స్ లేరండి’ అని చెప్పింది హీరోయిన్ హెబ్బా పటేల్. ఎస్వీఎం బౌలింగ్ అండ్ గేమింగ్ సెంటర్స్ ఆధ్వర్యంలో బంజారాహిల్స్‌లోని సిటీ సెంటర్లో శనివారం చాలెంజ్ పోటీలు నిర్వహించారు. హెబ్బా పటేల్ ఈ కార్యక్రమంలో పాల్గొని విజేతలకు బహుమతులు అందజేశారు. సినీ నటుడు నోయల్, గేమింగ్ సెంటర్స్ ఎండీ తూళ్ల విజయేందర్‌గౌడ్, పార్వతీశం పాల్గొన్నారు. -
నమ్మండి.. బాయ్‌ఫ్రెండ్స్ లేరండి
‘నా తాజా చిత్రం ‘నేను.. నాన్న.. నా బాయ్‌ఫ్రెండ్స్’ త్వరలో విడుదల కానుంది. ఇది అన్ని వర్గాల ప్రేక్షకులనూ అలరిస్తుంది. కానీ నాకు నిజజీవితంలో బాయ్‌ఫ్రెండ్స్ లేరండి’ అని చెప్పింది హీరోయిన్ హెబ్బా పటేల్. ఎస్వీఎం బౌలింగ్ అండ్ గేమింగ్ సెంటర్స్ ఆధ్వర్యంలో బంజారాహిల్స్‌లోని సిటీ సెంటర్లో శనివారం చాలెంజ్ పోటీలు నిర్వహించారు. హెబ్బా పటేల్ ఈ కార్యక్రమంలో పాల్గొని విజేతలకు బహుమతులు అందజేశారు. సినీ నటుడు నోయల్, గేమింగ్ సెంటర్స్ ఎండీ తూళ్ల విజయేందర్‌గౌడ్, పార్వతీశం పాల్గొన్నారు. – జూబ్లీహిల్స్ -
‘నాన్న... నేను... నా బాయ్‌ఫ్రెండ్స్’ఆడియో లాంచ్
-
అందమైన అనుబంధం - ‘దిల్’ రాజు
‘‘కూతురు ఉన్న ప్రతి తండ్రితో పాటు అమ్మాయిలందరూ ఈ సినిమా చూస్తారు. తండ్రీ కూతుళ్ల మధ్య ఉండే అనుబంధంతో సాగే సినిమా ఇది. ఆ అనుబంధం చాలా అందంగా ఉంటుంది. హెబ్బా పటేల్ కోసం యూత్ ఈ సినిమా చూస్తారు. ఈ నెల 16న విడుదలవుతోన్న ఈ చిత్రాన్ని స్వర్గీయ జయలలితగారికి అంకితం చేస్తున్నాం’’ అని నిర్మాత ‘దిల్’ రాజు అన్నారు. భాస్కర్ బండి దర్శకత్వంలో బెక్కెం వేణుగోపాల్ (గోపి) నిర్మించిన చిత్రం ‘నాన్న... నేను... నా బాయ్‌ఫ్రెండ్స్’. ఈ చిత్రాన్ని ‘దిల్’ రాజు రిలీజ్ చేస్తున్నారు. రావు రమేశ్, హెబ్బా పటేల్, తేజస్వి మదివాడ, అశ్విన్, పార్వతీశం, నోయల్ సేన్ ముఖ్య తారలు. శేఖర్‌చంద్ర స్వరపరచిన పాటలను హీరో నాని విడుదల చేయగా, నిర్మాతలు ‘దిల్’రాజు, శిరీష్, లక్ష్మణ్ సీడీలను అందుకున్నారు. ‘‘ఇది లవ్, ఫ్యామిలీ ఎంటర్టైనర్’’ అని దర్శకుడు అన్నారు. నిర్మాత బెక్కెం వేణు గోపాల్, దర్శక-నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, నిర్మాత డీవీవీ దానయ్య, హీరోలు నాని, సందీప్ కిషన్, నవీన్ చంద్ర తదితరులు పాల్గొన్నారు. -
ముగ్గురు బాయ్‌ఫ్రెండ్స్
చిన్నప్పట్నుంచీ నాన్నే ఆ అమ్మాయి జీవితం. వయసొచ్చిన తర్వాత ముగ్గురు అబ్బాయిలు బాయ్‌ఫ్రెండ్స్ పేరుతో ఆమె జీవితంలోకి వస్తారు. ఎవరా ముగ్గురు? వాళ్లపై ఆమె తండ్రి అభిప్రాయం ఏంటి? అనే కథతో తెరకెక్కిన చిత్రం ‘నాన్న.. నేను.. నా బాయ్‌ఫ్రెండ్స్’. బండి భాస్కర్ దర్శకత్వంలో రావు రమేశ్, హెబ్బా పటేల్, తేజస్వి మదివాడ, పార్వతీశం, అశ్విన్‌బాబు, నోయెల్ ముఖ్యతారలుగా బెక్కం వేణుగోపాల్ నిర్మించిన ఈ చిత్రాన్ని ఈ నెల 16న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ‘‘సినిమా బాగా నచ్చి ‘దిల్’ రాజుగారు విడుదల చేయడానికి ముందుకొచ్చారు. అన్ని వర్గాలవారూ చూడదగ్గ చిత్రం ఇది’’ అని నిర్మాత తెలిపారు. -
ఒకటోసారి రెండోసారి మూడోసారి !
-
ఒకటోసారి రెండోసారి మూడోసారి !
ఏదైనా వేలం పాట నిర్వహిస్తున్నప్పుడు ఒకటోసారి.. రెండోసారి.. మూడోసారి అంటుంటారు. కానీ, ఇక్కడ వేలం పాట కాదు. యంగ్ హీరో రాజ్‌తరుణ్, హెబ్బా పటేల్ ముచ్చటగా మూడోసారి జతకడుతున్నారు. ‘కుమారి 21ఎఫ్’, ‘ఈడోరకం ఆడోరకం’ చిత్రాలతో హిట్ పెయిర్‌గా నిలిచిన వీరు తాజాగా ‘అంధగాడు’ చిత్రంలో కలిసి నటిస్తున్నారు. రచయిత వెలిగొండ శ్రీనివాస్‌ను దర్శకునిగా పరిచయం చేస్తూ ఎ.కె.ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రం ఇటీవల ప్రారంభమైంది. రాజేంద్రప్రసాద్ ముఖ్య పాత్రలో కనిపిస్తారు. నిర్మాత మాట్లాడుతూ- ‘‘వైవిధ్యమైన కథాంశంతో తెరకెక్కుతోన్న చిత్ర మిది. నెక్ట్స్ ఏం జరగబోతోంది? అనే ఆత్రుత ప్రేక్షకుల్లో కలిగేలా కథ ఉంటుంది. కథ వినగానే రాజ్ తరుణ్ ఒప్పుకున్నారు. మంచి టీమ్ కుదిరింది. వచ్చే ఏడాది వేసవిలో విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. ఆశిష్ విద్యార్థి, రాజా రవీంద్ర, షాయాజీ షిండే, సత్య, పరుచూరి వెంకటేశ్వరరావు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: బి.రాజశేఖర్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: కిషోర్ గరికపాటి, సహ నిర్మాత: అజయ్ సుంకర. -
గెట్ రెడీ టు థ్రిల్
‘‘వైవిధ్యమైన కథాంశంతో తెరకెక్కిన చిత్రమిది. టీజర్ చూసినవారు చాలా ఆసక్తిగా ఉందంటున్నారు. సినిమా కూడా అదే స్థాయిలో ఉంటుంది’’ అన్నారు హీరో నిఖిల్. ఆయన హీరోగా, హెబ్బా పటేల్, నందిత శ్వేత కథానాయికలుగా ఐవీ ఆనంద్ దర్శకత్వంలో మేఘన ఆర్ట్స్ పతాకంపై రూపొందిన చిత్రం ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’. శేఖర్‌చంద్ర సంగీతం అందించారు. ఈ చిత్రంలోని ఓ పాటను దర్శకుడు వీవీ వినాయక్ విడుదల చేశారు. నిఖిల్ మాట్లాడుతూ- ‘‘ఆద్యంతం నవ్వులు పంచే చిత్రం ఇది. థ్రిల్లింగ్ అంశాలు కూడా ఉన్నాయి. ‘వెన్నెల’ కిశోర్‌గారు బాగా నవ్విస్తారు. నా గత చిత్రాల్లాగా ఇది కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. గెట్ రెడీ టు థ్రిల్’’ అని చెప్పారు. దర్శకుడు మాట్లాడుతూ- ‘‘మూడేళ్ల కిందట నా స్నేహితుడు చెప్పిన సంఘటన ఆధారంగా ఈ కథ తయారు చేసుకున్నా. మేం అనుకున్నదాని కంటే బాగా వచ్చింది. ఈ నెల 18న సినిమా రిలీజ్‌కు సన్నాహాలు చేస్తున్నాం’’ అని తెలిపారు. తనికెళ్ల భరణి, తాగుబోతు రమేశ్, జోష్ రవి, అపూర్వ శ్రీనివాస్ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: సాయి శ్రీరామ్. -
నాన్న.. హెబ్బా..బాయ్‌ఫ్రెండ్స్!
ప్రముఖ దర్శకుడు వీవీ వినాయక్ శిష్యుడు భాస్కర్ బండిని దర్శకునిగా పరిచయం చేస్తూ లక్కీ మీడియా పతాకంపై బెక్కెం వేణుగోపాల్ నిర్మించిన తాజా చిత్రం ‘నాన్న నేను నా బాయ్‌ఫ్రెండ్స్’. రావు రమేశ్, అశ్విన్‌బాబు, హెబ్బా పటేల్, తేజస్వి మడివాడ, పార్వతీశం ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం డిజిటల్ పోస్టర్, ఓ పాటను హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్మాత వేణుగోపాల్ మాట్లాడుతూ- ‘‘యూత్‌ఫుల్ లవ్, ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన చిత్రమిది. ఈ కథ కోసం ఏడాదిగా కసరత్తు చేశాం. తొలుత ‘దిల్’ రాజుగారికి స్టోరీ వినిపిస్తే, ఆయన కొన్ని మార్పులు చేయమన్నారు. ఫైనల్‌గా ఫస్ట్‌కాపీ చూసిన ఆయన సినిమా బావుందంటూ అభినందించి, మా చిత్రాన్ని విడుదల చేసేందుకు హక్కులు కొనుగోలు చేశారు. గతంలో ‘సినిమా చూపిస్త మావ’ నైజాం హక్కులు ఆయనే సొంతం చేసుకున్నారు. త్వరలో పాటలు, సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం’’ అని చెప్పారు. నోయల్, కృష్ణ భగవాన్, సనా, తోటపల్లి మధు, ధనరాజ్ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: శేఖర్ చంద్ర, కెమెరా: చోటా కె.నాయుడు. -
ఫాంటసీ ప్రేమకథ
‘‘సాధారణంగా నేను మంచి కథలు చేస్తున్నానని అంటారందరూ. ఆనంద్‌గారు చెప్పిన ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ కూడా అటువంటిదే. ఏడు నెలల నుంచి షూటింగ్ జరుగుతోంది. మంచి లవ్‌స్టోరీతో పాటు ఫాంటసీ ఎలిమెంట్స్ ఉంటాయి. డిఫరెంట్ మూవీ చూశామనే అనుభూతి ప్రేక్షకులకు కలుగుతుంది’’ అని హీరో నిఖిల్ అన్నారు. నిఖిల్, హెబ్బా పటేల్, నందితా శ్వేత ముఖ్య పాత్రల్లో ఐవీ ఆనంద్ దర్శకత్వంలో మేఘన ఆర్ట్స్ పతాకంపై పి.వెంకటేశ్వరరావు నిర్మించిన ఈ చిత్రం టీజర్ విడుదలైంది. దర్శకుడు మాట్లాడుతూ- ‘‘మూడేళ్ల కింద నా ఫ్రెండ్ చెప్పిన సంఘటన ఆధారంగా ఈ కథ తయారు చేసుకున్నా. నా మనసుకు నచ్చిన స్క్రిప్ట్ ఇది. కథ వినగానే నిఖిల్ చేయడానికి ఒప్పుకున్నాడు. టీజర్ చూసిన వాళ్లందరూ బాగుందని అంటుంటే హ్యాపీగా ఉంది’’ అన్నారు. ‘‘త్వరలో పాటలను, నవంబర్ 11న చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అని నిర్మాత చెప్పారు. కథానాయిక నందితా శ్వేత పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: సాయి శ్రీరామ్, సంగీతం: శేఖర్ చంద్ర. -
కొత్త ఫోర్మ్యులా
సినిమా హిట్‌కు టాలీవుడ్లో ఇన్నోవేటివ్ కథలకు కొత్త తరహా సినిమాలకు కరువేమో గానీ గ్లామర్‌కు లోటుంటదు. ఎప్పుడూ కొత్త హీరోయిన్లతో కళకళలాడుతుంటుంది ఇండస్ట్రీ. ఈ అందాలే మన సినిమాను రీఫ్రెష్ చేస్తున్నాయి. ఈ మధ్య కాలంలో తెలుగు తెరపైకి అలా దూసుకొచ్చిన తారలు హెబ్బా పటేల్, నివేదా థామస్, సురభి, రష్మీ గౌతమ్. వీళ్లకు ‘ఫ్యూచర్ స్టార్స్’ అయ్యే లక్షణాలే ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇక హిట్ సినిమాకు వీళ్లే కొత్త ఫోర్మ్యులా. కుమారి సూపర్ కొన్ని పాత్రలు ఒప్పుకోవాలంటే సాహసం కావాలి. అయితే మంచి పేరొస్తుంది లేకపోతే అంతే సంగతులు. ‘కుమారి 21 ఎఫ్’లో హెబ్బా పటేల్ చేసిన పాత్ర అలాంటిదే. సుకుమార్‌లాంటి దర్శకుడు తయారు చేసిన కథ కావడంతో హెబ్బా నమ్మకంగా ఈ చిత్రం ఒప్పుకుని ఉంటారు. ఒప్పుకోవడం వరకూ ఓకే.. కానీ, ‘కాంట్రవర్షియల్ క్యారెక్టర్’ అయిన కుమారి పాత్రలో నటించడం అంటే కచ్చితంగా ప్రతిభ ఉండాల్సిందే. మోడ్రన్ యాటిట్యూడ్, ఫ్రీ మూవింగ్, లిబరల్గా ఉండాలనుకునే లక్షణాలతో సుకుమార్ రాసుకున్న ఈ కుమారి క్యారెక్టర్‌ను అక్షరాలా రిఫ్లెక్ట్ చేసి... టైటిల్ రోల్‌ను జస్టిఫై చేశారు హెబ్బా పటేల్. చాలా హాట్‌గా కనిపించడంతో పాటు కొన్ని సన్నివేశాల్లో హార్ట్‌ని టచ్ చేసే విధంగా కూడా నటించడం హెబ్బాకి ప్లస్ అయింది. ‘అలా ఎలా’తో పరిచయమైనప్పటికీ, హెబ్బాకు కెరీర్‌కు హెల్ప్ అయింది మాత్రం ‘కుమారి 21ఎఫ్’ సినిమానే. ఈ చిత్రం తర్వాత చాలామంది హెబ్బాని కుమారి అని పిలవడం మొదలు పెట్టారంటే ఈ పాత్ర ఎంత ఇంపాక్ట్ చూపించిందో ఊహించుకోవచ్చు. ఇక, ‘ఈడోరకం ఆడోరకం’ కూడా కమర్షియల్ హిట్ కావడంతో హెబ్బాకి మరింత క్రేజ్ పెరిగింది. దాంతో అవకాశాలు కూడా పెరిగాయి. ఇప్పుడామె తెలుగు పరిశ్రమలో ఉన్న మోస్ట్ హ్యాపెనింగ్ హీరోయిన్స్‌లో ఒకరు. వాస్తవానికి ఈ ముంబై బ్యూటీ ముందు ‘అధ్యక్ష’ అనే కన్నడ చిత్రం ద్వారా కథానాయిక అయ్యారు. ఆ తర్వాత ‘తిరుమణమ్ ఎనుమ్ నిక్కా’ అనే చిత్రం ద్వారా తమిళ తెరపై మెరిశారు. ఇప్పుడు తెలుగులో బిజీ కావడంతో ఇతర భాషలపై హెబ్బా పెద్దగా దృష్టి పెట్టడంలేదు. ప్రస్తుతం వరుణ్ తేజ్ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వం వహిస్తున్న ‘మిస్టర్’ సినిమాతో పాటు నిఖిల్ కొత్త సినిమా ‘ఎక్కడికి పోతావు చిన్న వాడా’లోనూ ఆమె కథానాయికగా నటిస్తున్నారు. మిల్కీ బ్యూటీ! ‘ఇలాంటి స్కిన్ టోన్ కూడా ఉంటుందా?’ అని తమన్నాను మొదటిసారి చూసినవాళ్లు ఆశ్చర్యపోతారు. ముట్టుకుంటే మాసిపోయే రంగుతో చూడగానే ఆకట్టుకుంటారు కాబట్టే తమన్నాని అందరూ ‘మిల్కీ బ్యూటీ’ అంటారు. తమన్నా తర్వాత సురభిని అందరూ అలా అంటున్నారు. కొంచెం బొద్దుగా ఉన్నా ముద్దుగానే ఉంటారామె. ఢిల్లీలో పుట్టి, పెరిగిన సురభి హీరోయిన్ కావాలని చిన్నప్పట్నుంచీ అనుకున్నారు. అందుకే యాక్టింగ్ నేర్చుకున్నారు. కొన్ని యాడ్స్‌కి మెడల్‌గా కూడా నటించారు. వాటి ద్వారా తమిళ దర్శక-నిర్మాతల దృష్టిలో పడ్డారు. తమిళ చిత్రం ‘ఇవన్ వేరమాదిరి’తో కథానాయికగా పరిచయమయ్యారు. ఆ సినిమా ప్రేక్షకాదరణ పొందడంతో పాటు సురభి అంచదందాలు, అభినయానికి మంచి మార్కులు పడ్డాయి. ఆ తర్వాత అక్కడ చేసిన ‘వేలై ఇల్లాపట్టదారి’ కూడా సురభికి మంచి గుర్తింపే తెచ్చింది. ‘జీవా’లో చేసింది అతిథి పాత్రే అయినా ఆకట్టుకోగలిగారు. ముచ్చటగా మూడు సినిమాలతో తమిళ ప్రేక్షకులను ఆకట్టుకున్న సురభి ‘బీరువా’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమయ్యారు. ఈ సినిమా సక్సెస్ ‘బీరువా’ తెరవకున్నా సురభికి మాత్రం మంచి మార్కులే పడ్డాయి. ఇక, ‘ఎక్స్‌ప్రెస్ రాజా’ విజయంతో ఈ బ్యూటీ కెరీర్ బండి పట్టాలెక్కేసింది.. ‘అటాక్’ తెచ్చుకున్న బ్యాడ్ టాక్ వదిలేస్తే ... కొత్త సినిమా ‘జెంటిల్మన్’ సక్సెస్ సురభిని మళ్లీ రేసులో నిలబెట్టింది. ఉత్తరాది అమ్మాయి అయినప్పటికీ దక్షిణాది అమ్మాయిలానే అగుపించడం సురభికి ఉన్న ప్లస్ పాయింట్స్‌లో ఒకటి. మొత్తం మీద ప్రస్తుతం తెలుగు పరిశ్రమలో ఉన్న ‘మోస్ట్ వాంటెడ్’ యంగ్ హీరోయిన్స్‌లో సురభి పేరు కూడా చేరింది. ప్రస్తుతం ఈ బ్యూటీకి బోల్డన్ని ఆఫర్లు వరిస్తున్నాయి. సో.. భవిష్యత్తులో ఎన్నో బ్యూటిఫుల్ క్యారెక్టర్స్‌లో సురభిని చూడొచ్చు. మరో నిత్యామీనన్! కేరళ కుట్టిలు నటనకు కేరాఫ్ అడ్రస్ అని ఇప్పటికే అసిన్, మీరా జాస్మిన్, కల్యాణి, నిత్యామీనన్, నయనతార, సమంత తదితరులు ప్రూవ్ చేసేశారు. ఈ వరసలో నివేదా థామస్ కూడా చేరారు. ‘జెంటిల్మన్’ చిత్రం ద్వారా తెలుగు తెరకొచ్చిన ఈ మలబార్ బ్యూటీ ఇప్పుడు తెలుగు పరిశ్రమలో హాట్ టాపిక్. ‘ఒక్క సినిమాతోనే టాలెంట్ నిరూపించేసుకుంది’ అని నివేదాకు ప్రశంసలు వస్తున్నాయి. ఈ యువకథానాయికకు ఎప్పుడో చిన్నప్పుడే ‘భేష్’ అనిపించుకున్నారు. ‘ఉత్తర’ అనే మలయాళ చిత్రం ద్వారా బాల నటిగా పరిచయమయ్యారామె. ఆ తర్వాత ‘రిలాక్స్’ చిత్రంలో మెరిశారు. మూడో చిత్రం ‘వెరుతే ఒరు భార్య’లో హీరో జయరామ్ కూతురిగా నటించారు. ఈ చిత్రంలో బుల్లి నివేదా అద్భుతమైన నటన కనబర్చడంతో తిరుగు లేని బాలతార అయింది. ఆ తర్వాత మలయాళ చిత్రాలతో పాటు తమిళంలో కూడా పలు చిత్రాల్లో చిన్ని నివేద నటించింది. ఇటీవల మలయాళ ‘దృశ్యం’ తమిళ రీమేక్ ‘పాపనాశం’లో కమల్ కూతురిగా నటించారు. కథానాయికగా మలయాళంలో నటించింది ఒకే ఒక్క సినిమాలో మాత్రమే. ఆ తర్వాత తెలుగులో ‘జెంటిల్మన్’ చేశారు. విశేషం ఏంటంటే... నాని ఏ సినిమాలో నటించినా నటనపరంగా తనదే డామినేషన్. కానీ, ఈ చిత్రంలో నివేదా కూడా నానీకి గట్టి సవాల్నే ఇచ్చారు. క్యాథరీన్ క్యారెక్టర్లో ఈ బ్యూటీ కనబర్చిన అభినయం అందర్నీ ఆకట్టుకుంది. ముఖ్యంగా తను ప్రేమంచిన అబ్బాయి చనిపోయాడని తెలుసుకున్న సన్నివేశంలో నివేద ఆర్థ్ర పూరిత నటన ప్రేక్షకుల కళ్లు చెమర్చేలా చేసింది. కథానాయకుడి మరణం మిస్టరీని ఛేదించే ప్రయత్నాల్లో చూపించిన నటన కూడా ఆకట్టుకుంటుంది. అందుకే మరో నిత్యామీనన్ అన్న పేరుని నివేద తెచ్చుకోగలిగారు. మొదటి సినిమాకే మంచి క్రేజ్ తెచ్చుకోవడంతో నివేద కొన్నాళ్ల పాటు తెలుగు తెరను ఏలే అవకాశం ఉంది. బ్యాక్ టు బిగ్ స్క్రీన్ మామూలుగా ఎవరైనా చిన్ని తెర నుంచి పెద్ద తెరకు వస్తారు. ఒక్కోసారి ఇది రివర్స్ అవుతుందనుకోండి. పెద్ద తెరకు రావడానికి చిన్ని తెర ఓ వారధిలా ఉపయోగపడతుంది. అయితే, రష్మీకి మాత్రం చిన్ని తెరపైకి రావడానికి పెద్ద తెర వారధి అయింది. ‘హోళీ’ , ‘కరెంట్’ , ‘బిందాస్’ లాంటి సినిమాల్లో నటించిన రష్మీ గౌతమ్‌కు పెద్దగా గుర్తింపు రాలేదు. దాంతో చిన్నితెరకు వచ్చిన అవకాశాన్ని ఒప్పుకోక తప్పలేదు. మరి.. ‘జబర్దస్త్’ ఒప్పుకున్నప్పుడు రష్మీ తన కెరీర్‌కు ఆ షో మంచి బాట అవుతుందని ఊహించారో లేదో కానీ, ఆమె కెరీర్‌కు మాత్రం ఆ షో మంచి హెల్ప్ అయింది. రష్మి మాతృభాష ఒరియా. పుట్టింది వైజాగ్‌లో అయినప్పటికీ తెలుగు భాష తెలియదు. పట్టుదలగా తెలుగు నేర్చుకుని,యాంకర్‌గా తన సత్తా చాటుకున్నారామె. అసలు సిసలు తెలుగమ్మాయేమో అనే ఫీల్ కలిగేలాఈ రష్మి తెలుగు మాట్లాడతారు. బుల్లితెరపై ఆమె చేసిన సందడి పెద్ద తెరవాళ్లనూ ఆకట్టుకుంది. అంతే.. రష్మీకి బిగ్ స్క్రీన్ మరోసారి వెల్కమ్ చెప్పింది. కమ్ బ్యాక్ మూవీగా ‘గుంటూరు టాకీస్’ ఒప్పుకున్నారామె. విడుదలకు ముందే ఈ చిత్రం పోస్టర్ల ద్వారా రష్మి అందర్నీ ఆకట్టుకున్నారు. ఇందులో రష్మి చేసిన సువర్ణ క్యారెక్టర్ యూత్ హార్ట్‌ను గిటార్ వాయించింది. సినిమా కూడా సూపర్ హిట్ కావడంతో రష్మీకి అవకాశాలు పెరిగాయి. ఈ చిత్రం రష్మీకి ఏ స్థాయిలో క్రేజ్ తెచ్చిందంటే.. సినిమా సేలబిల్టీపరంగా రష్మి చిన్న సినిమాలకు పెద్ద ఆప్షన్ అని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. ప్రస్తుతం ఆమె నాలుగైదు సినిమాల్లో నటిస్తున్నారు. వాటిలో ‘తను వచ్చెనంట’, ‘చారుశీల’, ‘అంతం’ తదితర చిత్రాలు ఉన్నాయి. ఇప్పటికే ఒప్పుకున్న చిత్రాలు కాకుండా రష్మి కొత్త సినిమాలు కూడా కమిట్ కానున్నారు. మొత్తం మీద సిల్వర్ స్క్రీన్ రష్మీకి చెప్పిన రెండో వెల్కమ్ ఆమెకు బాగానే కలిసొచ్చిందనే చెప్పాలి. -
స్పెయిన్‌కి మిస్టర్!
వరుణ్ తేజ్, లావణ్యా త్రిపాఠి, హెబ్బా పటేల్ కాంబినేషన్లో రూపొందనున్న ‘మిస్టర్’ ఏప్రిల్‌లో ప్రారంభోత్సవం జరుపుకున్న విషయం తెలిసిందే. శ్రీను వైట్ల దర్శకత్వంలో శ్రీ లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ పతాకంపై నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి), ‘ఠాగూర్’ మధు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఈ నెల 27న స్పెయిన్‌లో మొదలు కానుంది. ఈ విషయాన్ని వరుణ్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. ‘‘ఈ షూటింగ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నా’’ అని ఆయన ట్వీట్ చేశారు. వినోద ప్రధానంగా సాగే యాక్షన్ ఎంటర్టైనర్ ఇది. ఈ చిత్రం కాకుండా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వరుణ్ తేజ్ ఓ చిత్రం అంగీకరించిన విషయం తెలిసిందే. -
’ఇది నాజీవితంలో మర్చిపోలేని సినిమా’