ఫీల్ గుడ్ ఎంటర్‌టైనర్ సినిమాలకు మంచి ఆదరణ లభిస్తోంది. ఇలాంటి కథలకు అటు యూత్‌తో పాటు ఇటు ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. అదే బాటలో రాబోతున్న కొత్త సినిమా ‘అలా నిన్ను చేరి’. విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై కొమ్మాలపాటి శ్రీధర్ సమర్పణలో ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాతో మారేష్ శివన్ దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. చిత్రంలో దినేష్ తేజ్, హెబ్బా పటేల్, పాయల్ రాధాకృష్ణ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. కొమ్మాలపాటి సాయి సుధాకర్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
ఓ వైపు షూటింగ్ చేస్తూనే మరోవైపు ప్రమోషన్స్ చేపడుతున్న చిత్రబృందం.. తాజాగా సంక్రాంతి కానుకగా ఈ మూవీ ఫస్ట్‌లుక్ గ్లింప్స్‌ను విడుదల చేసింది. దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు చేతుల మీదుగా ఈ సినిమా ఫస్ట్‌లుక్ గ్లింప్స్ రిలీజ్ చేశారు. అనంతరం రాఘవేంద్రరావు మాట్లాడుతూ.. ఈ సినిమా మంచి విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ మూవీ టీంకు ఆల్ ది బెస్ట్ చెప్పారు. కాగా ఈ సినిమాలో శివకుమార్ రామచంద్రవరపు, శత్రు, కల్పలత, ‘రంగస్థలం’ మహేష్, ఝాన్సీ, కేదర్ శంకర్ తదితరులు నటిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment