Telugu Cinema
-
మరో కాంతార లాంటి సినిమా.. తెలుగు టీజర్ వచ్చేసింది!
కేజీఎఫ్, సలార్ వంటి యాక్షన్ చిత్రాలతో సంగీత దర్శకుడిగా సంచలనం సృష్టించిన రవి బస్రూర్. ఆ తర్వాత వీర చంద్రహాస చిత్రంతో దర్శకుడిగా తన సత్తా చాటారు. కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ కీలక పాత్రలో నటించిన ఈ చిత్రంలో శిథిల్ శెట్టి, నాగశ్రీ జిఎస్, ప్రసన్న శెట్టిగార్, ఉదయ్ కడబాల్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. హోంబలే ఫిల్మ్స్ సమర్పణలో ఓంకార్ మూవీస్ బ్యానర్‌పై ఎన్ఎస్ రాజ్‌కుమార్ నిర్మించిన ఈ చిత్రం, ఏప్రిల్ 18న కన్నడలో విడుదలై సూపర్ హిట్‌గా నిలిచింది.ఈ నేపథ్యంలోనే వీర చంద్రహాస మూవీ తెలుగు టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు. యక్షగానం ఇతివృత్తం ఆధారంగా ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. కాగా.. కన్నడలో సూపర్ హిట్ కావడంతో తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని కంచి కామాక్షి కోల్‌కతా కాళీ క్రియేషన్స్ బ్యానర్‌పై ఎమ్వీ రాధాకృష్ణ విడుదల చేయనున్నారు. గతంలో శివరాజ్ కుమార్ నటించిన ‘వేద’, ప్రజ్వల్ దేవరాజ్ నటించిన రాక్షస చిత్రాలను తెలుగులో విజయవంతంగా రిలీజ్ చేశారు. తాజాగా వీర చంద్రహాస మూవీ రైట్స్‌ను ఆయనే సొంతం చేసుకున్నారు. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్‌ను ప్రకటించనున్నారు. కన్నడలో సూపర్ హిట్ అయినా ఈ మూవీ తెలుగు ప్రేక్షకులను ఎంతవరకు అలరిస్తుందో వేచి చూడాల్సిందే. -
'నా కెరీర్లో మరిచిపోలేని ప్రతిజ్ఞ'.. మోహన్ బాబు పోస్ట్ వైరల్!
తెలుగు వెండితెరపై తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఉన్న నటుడు మోహన్ బాబు. హీరోగా, విలన్‌గా ప్రత్యేక పాత్రలతో తెలుగువారిని మెప్పించారు. అప్పటి స్టార్ హీరోల సినిమాల్లో తన విలనిజంతో సినీ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. కథానాయకుడిగా ఎన్నో చిత్రాల్లో నటించి సూపర్ హిట్స్ అందుకున్నారు. అలా తన కెరీర్లో సూపర్‌హిట్‌గా నిలిచివాటిలో 1982లో వచ్చిన 'ప్రతిజ్ఞ' చిత్రం ఒకటిగా ఎప్పటికీ గుర్తుంటుంది. తాజాగా ఆ సినిమాలోని ఓ క్లిప్‌ను సోషల్ మీడియాలో ద్వారా పంచుకున్నారు మోహన్ బాబు.(ఇది చదవండి: ‘మంచు’ ఫ్యామిలీ వార్.. కీలక విషయాలు బయటపెట్టిన పని మనిషి)మోహన్ బాబు తన ట్వీట్లో రాస్తూ..' ఓ అందమైన గ్రామీణ ప్రాంతం నేపథ్యంలో వచ్చిన ప్రతిజ్ఞ చిత్రం(1982) నా కెరీర్లో ఓ మైలురాయి. బోయని సుబ్బారావు దర్శకత్వం వహించిన ఈ సినిమా సూపర్‌హిట్‌గా నిలిచింది. ఈ మూవీలో నా పాత్రను అస్వాదించా. ఎంతో ఎనర్జిటిక్‌గా చేసిన ఈ పాత్ర నా కెరీర్లో ఓ మరిచిపోలేని కథ. ఈ సినిమాతోనే తొలిసారిగా శ్రీలక్ష్మి ప్రసన్న పిక్చర్స్‌తో నిర్మాతగా అడుగుపెట్టా. అందుకే ఈ చిత్రానికి నా గుండెల్లో ప్రత్యేకస్థానం ఎల్లప్పుడూ ఉంటుంది' అంటూ పోస్ట్ చేశారు. ఈ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మోహన్ బాబు నటనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. A beautiful village-based drama and one of my cherished films 'Pratigna'(1982), directed by Sri. Boyani Subbarao, it became a super hit of its time! I thoroughly enjoyed playing an energetic role in this memorable story. My first film as a producer and launch of 'Sree Lakshmi… pic.twitter.com/xpDaUpWveM— Mohan Babu M (@themohanbabu) December 10, 2024 -
కంప్రమైజ్ అయితేనే అవకాశాలు.. ఈ పరిస్థితి కల్పించిన వారిది తప్పు కదా
-
పవన్ కళ్యాణ్‌తో సినీ నిర్మాతల భేటీ
సాక్షి, అమరావతి: ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌తో తెలుగు సినిమా నిర్మాతలు సోమవారం సమావేశమయ్యారు. విజయవాడలోని పవన్ కళ్యాణ్ క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన ఈ సమావేశంలో సినిమా రంగానికి సంబంధించిన అంశాలపై చర్చించారు. పర్యాటక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి దుర్గేశ్, నిర్మాతలు సి.అశ్వనీదత్, అల్లు అరవింద్, ఏఎం రత్నం, ఎస్.రాధాకృష్ణ, దిల్ రాజు, బోగవల్లి ప్రసాద్, డీవీవీ దానయ్య, సుప్రియ, ఎన్వీ ప్రసాద్, బన్ని వాసు, నవీన్ ఎర్నేని, నాగవంశీ, టీజీ విశ్వ ప్రసాద్, వంశీకృష్ణ తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. అల్లు అరవింద్ మీడియాతో మాట్లాడుతూ.. తెలుగు సినిమా పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలను పవన్ కళ్యాణ్‌కు వివరించామని చెప్పారు. తెలుగు సినీ పరిశ్రమ తరఫున ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రిని అభినందించడానికి అపాయింట్మెంట్ కోరామన్నారు. సినీ రంగ సమస్యలపై పూర్తి స్థాయిలో చర్చించేందుకు మరోసారి సమావేశమవుతామని చెప్పారు. -
సాయి ధరమ్ తేజ్ కొత్త చిత్రం.. డైరెక్టర్ ఎవరంటే?
గతేడాది విరూపాక్ష, బ్రో సినిమాలతో అలరించిన సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్. విరూపాక్ష సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. ఈ చిత్రంలో సంయుక్త మీనన్ అతనికి జంటగా నటించింది. తాజాగా మరో చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. పీరియాడిక్ హై యాక్షన్ మూవీతో అభిమానులను పలకరించేందుకు సిద్ధమయ్యారు. వర్కింగ్ టైటిల్ 'ఎస్డీటీ 18' పేరుతో పోస్టర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్.సాయి ధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిస్తోన్న ఈ చిత్రం ద్వారా రోహిత్ కేపీ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ చిత్రాన్ని ప్రైమ్‌షో ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన అనౌన్స్మెంట్ పోస్టర్‌ను నిర్మాతలు విడుదల చేశారు.ల్యాండ్ మైన్లతో చుట్టుముట్టబడిన ఎడారి భూమిలో పచ్చని చెట్టుతో ఉన్న పోస్టర్ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఈ పోస్టర్ చూస్తుంటే ఓ యూనివర్శల్ కాన్సెప్ట్‌తో ఈ చిత్రం రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ.. 'ఈ చిత్రం భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నాం. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా వస్తున్న ఈ చిత్రంలో సాయి దుర్గ తేజ్ పాత్ర చాలా శక్తివంతంగా వుంటుంది. ప్రస్తుతం ఓ భారీ సెట్లో ఈ చిత్రం తొలిషెడ్యూల్ జరుగుతోంది. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేస్తాం' అన్నారు. కాగా.. ఈ సినిమాను తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేయనున్నారు.MY NEXT #SDT18 ✊This one will be more than special.Need all your love & blessings 🙏🏼All the best to us @rohithkp_dir 🤗 Glad to be associating with @niran_reddy @chaitanyaniran & @Primeshowtweets pic.twitter.com/wFhvFAELZb— Sai Dharam Tej (@IamSaiDharamTej) June 21, 2024 -
స్నేహం... బాలు చేవ్రాలు!
తెలుగు జాతి గర్వించదగిన గాన గంధర్వునిగా, బహుముఖ కళాపారీణునిగా బాలును ఎరగని వాళ్ళుండరు. ఆయన నేపథ్య గాయకునిగా, అద్వితీయునిగా రాణించిన కాలంలో సాటి గాయకుల కెవరికీ అవకాశాలు రాకుండా చేస్తున్నారని కొందరు అసూయాపరులు ఆరోపణలు చేసినా, ‘పాడుతా తీయగా’ కార్యక్రమ వీక్షకులను బాలు వ్యక్తిత్వం, హృదయ సంస్కారం ముగ్ధుల్ని చేశాయి. ఆయన అంతరంగం స్నేహ పారిజాతమని ఆ పరిమళాల్ని శ్వాసించి పరవశించిన ఆత్మీయ మిత్రులకు మాత్రమే తెలుసు. మాంగల్య బంధం కంటే స్నేహబంధం పటిష్టమైనదనీ, అది ఎప్పటికీ ఇగిరిపోని గంధం అనీ బాలు అభిప్రాయపడేవారు. స్నేహం చేసేముందు అవతలి వ్యక్తి గురించి పూర్తిగా తెలుసుకోవాలనీ, స్నేహం కుదిరిన తర్వాత మిత్రునిలో లోపాలు బయటపడినా వాటిని సరిదిద్దాలి కాని ఏకంగా ఆ బంధాన్ని తెంచుకోకూడదనీ బాలు స్నేహ ధర్మానికి భాష్యం చెప్పేవారు. కేవలం మాటలకే పరిమితం కాకుండా నిజ జీవితంలో స్నేహాన్ని ఒక పవిత్రబంధంగా, పారాయణ గ్రంథంగా పాటించిన మనస్వి ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం.బాలు ఎవరికీ అందనంత ఎత్తుకు ఎదిగినా, ఎక్కి వచ్చిన నిచ్చెన మెట్లనూ, చిన్న నాటి నేస్తాలనూ మర్చిపోలేదు. అందుకు ఆయన కృతజ్ఞతా పూర్వకంగా చేయి అందించిన బీవీ మురళి, ఎమ్ విఠల్‌రావు, వై కామేశ్వరరావు, శ్యామ్, డా‘‘ వై.దివాకర్ వంటి సహచరులు ప్రత్యక్ష సాక్షులు. 1964లో మద్రాసు ఆంధ్రా క్లబ్లో జరిగిన లలిత సంగీతం పాటల పోటీలో పాల్గొనడానికి బాలు ఇష్టపడకపోయినా... చెప్పకుండా ప్రవేశ రుసుము చెల్లించి బాలుకి ప్రథమ బహుమతి రావడానికీ, కోదండపాణి వంటి వారి దృష్టిలో పడటానికీ కారకుడు; 1966 డిసెంబరు 15వ తేదీన ‘విజయా గార్డెన్స్’లో తన మొట్టమొదటి సినిమా పాట రికార్డింగ్‌కు సైకిలు మీద తోడుగా వచ్చి ప్రోత్సహించిన తన రూమ్మేట్ బీవీ మురళిని కోదండపాణి ఆడియో లాబ్‌లో ఆడియో అసిస్టెంట్‌గా నియమించడమే కాకుండా ఎన్నో వేదికల మీద అతని సహాయాన్ని గుర్తు చేసుకునేవారు. రంగస్థలం మీద సహ నటులైన శ్యామ్‌ను స్టూడియో మేనేజర్ గానూ, వై. కామేశ్వరరావును ‘పాడతా తీయగా’లో అసిస్టెంట్ గానూ, కొన్ని చిత్రాలలో నటుడి గానూ అవకాశాలు కల్పించి వారి ఉపాధికి తోడ్పడ్డారు. విఠల్‌ను పీఏగా పెట్టుకోవడమే కాకుండా తన ఇంటికి దగ్గర్లో అతనికో ఇల్లు కట్టించడంతో పాటు అనేక విధాలుగా ఆదుకున్నారు. ‘ఈటీవీ’ వారి వార్షికోత్సవ సంగీత కార్యక్రమంలో తను మెచ్చిన రాంప్రసాద్‌ను ‘పాడుతా తీయగా’ కార్యక్రమానికి పరిశోధకునిగా చివరి వరకు కొనసాగించారు. బాలు స్నేహ ప్రీతి బాల్యమిత్రులకే పరిమితం కాలేదు. స్టూడియో నిర్మాణానికి సహకరించిన ప్రాణమిత్రుడు బిల్డర్ రాధాకృష్ణన్ ఆకస్మికంగా జూన్ 1వ తేదీన చనిపోతే ఆనాటి నుంచి బాలు తన పుట్టినరోజును (జూన్ 4వ తేదీ) అట్టహాసంగా జరుపుకోవడం మానేశారు. ఎమ్వీఎల్, వై. కామేశ్వరరావు వంటి ఆప్తమిత్రుల అవసాన దశలలో వారిని బతికించడానికి హాస్పిటల్స్‌కు సంబంధించిన మొత్తం ఖర్చులను భరించారు. ఎమ్వీఎల్ చనిపోయిన తరువాత కూడా అతని స్నేహ బృందాన్నీ, నూజివీడునూ మర్చిపోకుండా అనేక స్మారక కార్యక్రమాలకు హాజరయిన స్నేహశీలి, ఆత్మ బంధువు బాలు. 1990లో మద్రాసు విశ్వవిద్యాలయంలో పరిశోధక విద్యార్థిగా పరిచయమైన ఈ వ్యాసకర్త సిద్ధాంత గ్రంథం ‘తెలుగు సినిమా పాట చరిత్ర’ను అయాచితంగా, ఐచ్ఛికంగా స్పాన్సర్ చేసి ప్రచురించడమే కాకుండా దానికి విస్తృత ప్రాచుర్యాన్ని కలిగించారు బాలు. స్వల్ప పరిచయం స్నేహంగా మారడానికీ, ఈ వ్యాసకర్తకు సినీగేయ సాహిత్య పరిశోధకునిగా గుర్తింపు రావడానికీ బాలు సహృదయతే కారణం. నంది పురస్కారాల నందుకున్న వ్యాసకర్త రెండు సిద్ధాంత గ్రంథాలనూ స్పాన్సర్ చేసిన బాలు స్నేహ వాత్సల్యాన్ని ఈ రచయిత మర్చిపోలేడు. వెన్నెలకంటి ప్రతిభను గుర్తించి అతనిని సినీరంగంలో ప్రోత్సహించడం, డా‘‘ పీఎస్ గోపాలకృష్ణ రచనలు ‘మన ఘంటసాల’, తన జీవిత చరిత్ర ‘జీవన గానాలు’కు బాసటగా నిలవడం బాలు ఉత్తమాభిరుచికి నిదర్శనాలు. 1993 ఫిబ్రవరిలో హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్స్‌లో ఘంటసాల విగ్రహావిష్కరణ సందర్భంగా లక్షలు వెచ్చించి మద్రాసు చిత్ర పరిశ్రమలోని తన మిత్రులందరినీ హైదరాబాద్‌కు తరలించి సత్కరించడం బాలు మైత్రీ యానంలో ఓ మైలురాయి. బాలుది బాలుడి మనస్తత్వం. ఆ విషయాన్ని ఘంటసాల విగ్రహావిష్కరణ సభలో అతని కన్నీళ్లు రుజువు చేశాయి. బాలు సంగీత సత్కార వేదికల మీద ఎన్నో సార్లు తన అంతిమ క్షణాల గురించి ప్రస్తావించేవారు. తనను నూరేళ్ల వరకు మృత్యువు సమీపించదనీ, మళ్లీ తనకు జన్మంటూ ఉంటే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంగానే పుట్టాలనీ, అప్పుడు కూడా తన మిత్రులు, అభిమానులు తనతో ఉండాలని కోరుకుంటున్నాననీ అనేవారు. పసి మనస్సును తలపించే ఆ మహోన్నత మూర్తి పుట్టినరోజున ఆయన ఆత్మకు అంజలి ఘటిద్దాం. అంతటి మహనీయుని సమకాలికులుగా పుట్టినందుకు, ఆయన స్నేహ సంపదను పంచుకున్నందుకు జన్మ ధన్యమైందని గర్విద్దాం. డా‘‘ పైడిపాల వ్యాసకర్త సినీగేయ పరిశోధకులు ‘ 99891 06162(నేడు ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం జయంతి) -
నాకు నేనే సవాల్‌గా మారా: స్టార్ హీరోయిన్
దక్షిణాదిలో టాప్ హీరోయిన్గా ఎదిగి ఆ తరువాత ఉత్తరాదిలో రాణిస్తున్న నటి తాప్సీ. తెలుగు, తమిళం భాషల్లో గ్లామర్‌నే నమ్ముకున్న ఈ ఢిల్లీ బ్యూటీ హిందీలో అభినయానికి ప్రాముఖ్యత కలిగిన చిత్రాల్లో నటిస్తున్నారు. అంతే కాదు అక్కడ హీరోయిన్ ఓరియంటెడ్ కథా చిత్రాల్లో నటించే స్థాయికి చేరుకున్నారు. ఇటీవల ఈమె షారూఖ్‌ఖాన్‌తో జత కట్టిన డంకీ చిత్రం ఆశించిన విజయాన్ని సాధించకపోయినా, తాప్సీ నటనకు మంచి మార్కులే పడ్డాయి.ప్రస్తుతం ఈ భామ పిర్ ఆయి హసీన్ దిల్రూబా, కెల్కెల్ మెయిన్ చిత్రాల్లో నటిస్తున్నారు. దక్షిణాదిలో మంచి అవకాశాలు వస్తే నటించడానికి రెడీ అంటున్న తాప్సీ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికర కామెంట్స్ చేసింది. ప్రస్తుతం తనకు తానే సవాల్‌గా మారినట్లు తెలిపారు. ఛాలెంజింగ్ పాత్రల్లో నటించాలని కోరుకుంటున్నానన్నారు. నటనలో మంచి స్థాయిలో ఉన్నా.. దాని నుంచి బయటకు వచ్చి ఛాలెంజింగ్ పాత్రల్లో నటించాలని ఆశిస్తున్నానన్నారు.తాను నటిస్తున్న పాత్రల స్వభావాలను తన దృష్టితో చూస్తున్నానని.. మాటల్లో మాత్రమే కాకుండా కల్పనల నుంచి పుట్టే ప్రపంచాన్ని చూడాలని కోరుకుంటున్నానన్నారు. కాగా నటిగా తానీ స్థాయికి చేరుకోవడం అంత సులభం కాలేదన్నారు. అందుకు కఠినంగా శ్రమించినట్లు చెప్పారు. నిత్యం ముందడుగు వేస్తూ ఎదుగుతూ వచ్చానన్నారు. అలా ఇది తన శ్రమకు దక్కిన స్థానం అని అన్నారు. అందుకే తాను చాలా సంతోషంగా ఉన్నానని తాప్సీ అన్నారు. -
నెక్స్ట్ 100 కోట్ల స్టార్ హీరో అతడే!
కంటెంట్ ఉంటే హీరో కటౌట్‌తో పనిలేకుండా సెంచరీలు కొట్టేస్తున్న రోజులివి. తాజాగా జరుగుతున్న ఐపీఎల్ క్రికెట్లో కొత్త ఆటగాళ్లు ఎలా దంచికొడుతున్నారో.. సినిమాల్లోకి కొత్తగా వచ్చిన హీరోలు కూడా అలాగే వసూళ్లతో ఇండస్ట్రీని షేక్ చేస్తున్నారు. ఇటీవల రిలీజ్ అయిన టిల్లు స్క్వేర్ చిత్రం విజయం సాధించడంతో సిద్దు జొన్నలగడ్డ 100 కోట్ల క్లబ్లో చేరిన విషయం తెలిసిందే. సిద్దు సెంచరీ కొట్టడంతో టిల్లు క్యూబ్ అంటూ తన తదుపరి చిత్రంపై కూడా మరింత అంచనాలను పెంచగలిగాడు. ఆ రకంగా సిద్దు ఇండస్ట్రీలో తనని తానే సెంచరీ స్టార్‌గా తీర్చిదిద్దుకున్నాడు. టిల్లుతో తనలో ఉన్న రైటింగ్ స్కిల్స్ అతన్ని 100 కోట్ల హీరోగా తీర్చి దిద్దడంలో కీలక పాత్ర పోషించాయి అన్నది వాస్తవం. అయితే ఇతడి కంటే ముందు తేజ సజ్జ హనుమాన్ చిత్రంతో పాన్ ఇండియా స్థాయిలో సంచలనం సృష్టించాడు. అలాగే హీరో నాని దసరా చిత్రంతో 100 కోట్ల క్లబ్లో చేరాడు.గీతగోవిందంతో విజయ్ దేవరకొండ, ఎఫ్-2 తో వరుణ్ తేజ్, 100 కోట్ల క్లబ్లో చేరగా.. కార్తికేయ-2 తో నిఖల్ వంద కోట్లు సాధించడంతో పాటు పాన్ ఇండియా స్థాయిలో పేరు తెచ్చుకున్నాడు. ఇక తన తొలి సినిమా ఉప్పెన చిత్రంతోనే మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ కూడా వందకోట్ల క్లబ్లో చేరిన వాడే. మరి ఈ రేసులో తదుపరి సెంచరీ కొట్టే స్టార్ ఎవరు? అంటే ఆ ఛాన్స్ అడివి శేష్‌కు ఉందని చెప్పొచ్చు. గతంలో శేష్ నటించిన గుఢచారి, హిట్-2, ఎవరు, మేజర్ లాంటి సినిమాలతో అడవి శేష్ పేరు సంచలనమైన సంగతి తెలిసిందే. ఈ చిత్రాలు 50-60 కోట్లకు పైగా వసూళ్లు సాధించాయి. మేజర్ పాన్ ఇండియా స్థాయిలో హిట్‌గా నిలిచి 60 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. ప్రస్తుతం శేష్ గుఢచారి-2 లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాపై ఇండస్ట్రీలో భారీ అంచనాలున్నాయి. ఈ చిత్రాలతో నటనతో పాటు రైటింగ్‌లో కూడా శేష్‌కు అపార అనుభవం ఉంది. తనని స్టార్‌గా మార్చుకోవడంలో రైటింగ్ స్కిల్ అతడికి ఎంతో ఉపయోగపడుతోందని చెప్పాలి. గుఢచారి-2 తో అడివి శేష్ 100 కోట్ల క్లబ్‌లోకి అడుగుపెడతాడు అనే అంచనాలున్నాయి. ట్రేడ్ సైతం ఈ సినిమాతో సాధ్యమని భావిస్తోంది. ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో చిత్రీకరిస్తున్న విషయం తెలిసిందే. -
సినీ నిర్మాత కోసం.. సీసీఎస్ వేట! అసలేం జరిగిందంటే?
సాక్షి, హైదరాబాద్: విజయవాడలో చాక్లెట్ల వ్యాపారంతో మొదలు పెట్టి, హైదరాబాద్‌లో ఫాస్ట్ మూవింగ్ కంజ్యూమర్ గూడ్స్ (ఎఫ్ఎంసీజీ) దందా స్థాపించి, మల్టీ లెవల్ మార్కెటింగ్ (ఎంఎల్ఎం) దందాలోకి దిగి, డిపాజిట్ల పేరుతో వందల మంది నుంచి రూ.540 కోట్లు వసూలు చేసిన కేసులో తెలుగు సినీ నిర్మాత అట్లూరి నారాయణ రావు నిందితుడిగా మారారు. ఈ స్కామ్ సూత్రధారి రాంబాబు విచారణలో వెలుగులోకి వచ్చిన అంశాల ఆధారంగా నారాయణరావును మూడో నిందితుడిగా చేర్చిన సీసీఎస్ పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. బుధవారం ఈ కేసులో అరెస్టు అయిన రాంబాబు, పెనుమత్స కృష్ణం రాజులను తదుపరి విచారణ నిమిత్తం కోర్టు అనుమతితో తమ కస్టడీలోకి తీసుకోవాలని నిర్ణయించారు. దీనికి సంబంధించి గురువారం నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఎఫ్ఎంసీజీ దందా చేసేందుకు రాంబాబు రాధారామ్ ఏజెన్సీస్ పేరుతో ఓ సంస్థను ఏర్పాటు చేశాడు. ఇద్దరు నిందితులు తమ వ్యాపార విస్తరణ కోసమంటూ ప్రజల నుంచి డిపాజిట్లు సేకరించారు. వీరికి 6 నుంచి 13 శాతం వడ్డీతో డబ్బు తిరిగి ఇస్తామని హామీ ఇచ్చారు. ఓ దశలో వ్యాపారంలో వచ్చే లాభాలు పంచడానికి, వడ్డీలు చెల్లించడానికి సరిపోలేదు. దీంతో తమ వద్ద కొత్తగా పెట్టుబడి పెట్టే వారి సొమ్మును పాత ఇన్వెస్టర్లకు చెల్లించడం మొదలెట్టారు. చివరకు చెల్లింపులు చేయలేక డిపాజిటర్లను మోసం చేశారు. తమ కోసం బాధితులు తిరుగుతున్నారని, పోలీసులకు ఫిర్యాదు చేశారనే విషయం తెలియడంతో రాంబాబు తన కంపెనీ చార్టెట్ అకౌంటెంట్ ద్వారా అట్లూరి నారాయణరావును సంప్రదించాడు. సినీ నిర్మాతగా ఉన్న అతను తనకు రాజకీయాలతో పాటు పోలీసు విభాగంలో చాలా పలుకుబడి ఉందని, అది వినియోగించి కేసు లేకుండా చేస్తానని రాంబాబుకు హామీ ఇచ్చాడు. ఇందుకుగాను రూ.20 కోట్లు డిమాండ్ చేశాడు. బేరసాల తర్వాత రూ.2 కోట్లకు అంగీకరించిన నారాయణ రావు అడ్వాన్స్‌గా రూ.10 లక్షలు తీసుకున్నాడు. ఆపై కొన్ని ప్రయత్నాలు చేసినా నిందితులకు కేసు విషయంలో ఎలాంటి సహాయం చేయలేకపోయాడు. దీంతో ఇన్సాల్వెన్సీ పిటిషన్ (ఐపీ) దాఖలు చేసి బయటపడదామని రాంబాబుకు సలహా ఇచ్చాడు. అతడు అంగీకరించడంతో ఎవరికీ ఎలాంటి సమాచారం లేకుండా ఈ కథ నడపాలని నిర్ణయించుకున్నాడు. విజయవాడతో పాటు నగరంలోనే ఈ స్కామ్ మొత్తం జరిగింది. బాధితులు సైతం ఇక్కడి వారే ఉన్నారు. అయితే నారాయణరావు మాత్రం ఖమ్మం కోర్టులో అక్కడి న్యాయవాదితో ఐపీ దాఖలు చేయించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశాడు. ఓపక్క ఈ పనులు చేస్తూనే మరోపక్క రాంబాబు నుంచి వీలైనంత మొత్తం వసూలు చేసుకోవాలని భావించాడు. అతడి నుంచి రూ.కోటి విలువైన బంగారు ఆఖరణాలు తీసుకున్న నారాయణరావు వాటిని పాతబస్తీలో కరిగించి, రూ.90 లక్షలకు అమ్మేసి సొమ్ము చేసుకున్నాడు. నిందితులను అరెస్టు చేసిన సీసీఎస్ పోలీసులు లోతుగా విచారించడంతో అట్లూరి నారాయణ రావు వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీంతో ఈ కేసులో ఇతడిని మూడో నిందితుడిగా చేర్చిన అధికారులు ముమ్మరంగా గాలిస్తున్నారు. ఇందుకుగాను ప్రత్యేక బృందాన్ని రంగంలోకి దింపారు. -
తెలుగు సినీ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ యూనియన్‌కు చెందిన డబ్బు మాయం
హైదరాబాద్: సొంత ఇంటికి యజమానులే కన్నం వేశారు. బ్యాంకు అధికారులతో కలసి ‘తెలుగు సినీ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ యూనియన్’ ఎఫ్డీ అకౌంట్స్‌లో ఉన్న కోట్లాది రూపాయలు గుట్టుచప్పుడు కాకుండా కొట్టేశారు. ఈ విషయాన్ని తెలుసుకున్న కొందరు సభ్యులు ఆ ఇంటి దొంగల్ని ప్రశ్నించగా వారిపై ఎదురుదాడికి దిగారు. దీంతో పక్కా ఆధారాలతో యూనియన్‌లోని సభ్యులు రాందాస్ ధన్‌రాజ్, వెంకటేశ్వరరావులు సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు యూనియన్ అధ్యక్షుడు సత్యనారాయణ దొర, ప్రధాన కార్యదర్శి కాట్రగడ్డ సుధాకర్, ట్రెజరర్ రాజేష్‌లపై హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు 420 రెడ్ విత్ 34 ఐపీసీ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. జూబ్లీహిల్స్‌లోని ‘తెలుగు సినీ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ యూనియన్’ ఎన్నో సంవత్సరాలుగా ఉంది. దీనిలో అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి, ట్రెజరర్, ఉపాధ్యక్షులతో కలపి దాదాపు 700 మంది సభ్యులు ఉన్నారు. వీరికి జూబ్లీహిల్స్‌లో ‘యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా’లో ఖాతా ఉంది. దీనిలో ఎఫ్డీ, ఇతర లావాదేవీలు కలిపి మొత్తం రూ. 7 కోట్లు ఉన్నాయి. యూనియన్ బైలా ప్రకారం యూనియన్‌లో ఉన్న వారందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలనే ప్రతిపాదన ఎంతో కాలం నుంచి ఉంది. అయితే ఈ ఏడాది మే నెలలో ప్రెసిడెంట్ సత్యనారాయణ దొర, ప్రధాన కార్యదర్శి కాట్రగడ్డ సుధాకర్, ట్రెజరర్ రాజేష్‌లు ఇళ్ల స్థలాల కోసం ల్యాండ్ చూశామంటూ రాంపూర్ వద్దకు సభ్యులు రాందాస్ ధన్‌రాజ్, వెంకటేశ్వరరావు తదితరులను తీసుకెళ్లారు. శ్రీనివాస్ అనే వ్యక్తిని పరిచయం చేసి ఓనర్ నుంచి ఇతను అగ్రిమెంట్ చేసుకున్నట్లు చెప్పారు. అడ్వాన్స్ కూడా నాలుగు రోజుల ముందే ఇచ్చినట్లు చెప్పడంతో రాందాస్ ధనరాజ్, వెంకటేశ్వరరావులు అలా ఏకపక్షంగా ఎలా ఇస్తారని ప్రెసిడెంట్, జీఎస్, ట్రెజరర్లను నిలదీశారు. దీంతో వీరు పొంతన లేని సమాధానాలు చెప్పండతో మరిన్ని అనుమానాలు వ్యక్తం అయ్యాయి. ఈ క్రమంలోనే యూనియన్‌లో ఉన్న 60 మంది అనుకూలమైన వ్యక్తులకు ప్రెసిడెంట్, ట్రెజరర్, జీఎస్‌లు కొత్త అకౌంట్లు ఓపెన్ చేయించారు. ఆ అకౌంట్లలో యూనియన్‌కు చెందిన ఎఫ్‌డీలోని రూ.7 కోట్లలో ఒక్కోక్కరికీ రూ.9 లక్షల చొప్పున బదిలీ చేశారు. ఈ 60 మందికి వచ్చిన దాదాపు రూ.5 కోట్ల 40 లక్షలు క్యాష్ రూపంలో డ్రా చేయించి ముగ్గురూ తీసుకున్నారు. మరికొంత కూడా వివిధ కారణాలు చెప్పి డ్రా చేశారు. ఇలా పలు దఫాలుగా రూ. 6 కోట్ల 50 లక్షలు యూనియన్ అనుమతి లేకుండా అనధికారికంగా బ్యాంకు అధికారుల ప్రమేయంతో కాజేశారు. దీనిపై పక్కా ఆధారాలతో రాందాస్ ధనరాజ్, వెంకటేశ్వరరావు, మరికొందరు సీసీఎస్ పోలీసులను ఆశ్రయించారు. వారి ఫిర్యాదు మేరకు ఇన్స్పెక్టర్ చింతపల్లి మల్లికార్జున చౌదరి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
మన సత్తా ఇప్పుడే తెలిసిందా?
తెలుగు సినిమాను చాలాకాలం పాటు కేంద్ర ప్రభుత్వ అవార్డుల కమిటీ సభ్యులు, క్రిటిక్స్ తక్కువ చేసి చూపించడానికి ప్రయత్నించారు. కానీ, ఇప్పుడు తెలుగు సినిమా జూలు విదిలిస్తోంది. 2021కి గాను ప్రకటించిన 69వ జాతీయ చలన చిత్ర అవార్డుల్లో తెలుగు సినిమాకు 11 అవార్డులు దక్కాయి. నేషనల్ ఫిల్మ్ అవార్డుల చరిత్రలో తొలిసారిగా ఒక తెలుగు నటుడికి జాతీయ ఉత్తమ నటుడు అవార్డ్ రావడం అభిమానులనే కాదు – పరిశ్రమనూ ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. తెలుగు వాడికి టాలెంట్ ఎప్పుడూ ఉంది, కానీ ప్రపంచం ఇప్పుడే తెలుగు సినిమా ప్రతిభ తెలుసుకుంటోంది. ఆగస్ట్ 23న చంద్రయాన్–3 ప్రయోగం విజయవంతం కావడంతో భారతదేశం, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారతీయులు అందరూ గర్వపడ్డారు. ఆ మరుసటి రోజునే తెలుగు సినిమా చంద్ర మండలం ఎక్కినంతగా సంబరం చేసుకుంటోంది. కారణం అందరికీ తెలిసిందే! 2021వ సంవత్సరానికి గాను ప్రకటించిన 69వ జాతీయ చలన చిత్ర అవార్డుల్లో తెలుగు సినిమాకు ఏకంగా 11 అవార్డులు దక్కాయి. సంఖ్యా పరంగానే కాకుండా – 69 సంవత్సరాల నేషనల్ ఫిల్మ్ అవార్డుల చరిత్రలో తొలిసారిగా ఒక తెలుగు నటుడికి జాతీయ ఉత్తమ నటుడు అవార్డ్ రావడం తెలుగు సినిమా అభిమానులనే కాదు– తెలుగు సినిమా పరిశ్రమను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఇక్కడ మౌలికంగా ఓ ప్రశ్న తలెత్తుతుంది. తెలుగు సినిమా రంగంలో ఎందరో మహా నటులున్నారు. వారెవరికీ దక్కని గౌరవం, గుర్తింపు– అభిమానుల చేత ‘ఐకాన్ స్టార్’ అని పిలిపించుకునే అల్లు అర్జున్‌కు రావడం సంతోషదాయకం. అలాగని ముందు తరాల నటుల గురించి, ఏ మాత్రం తక్కువగా ఆలోచించినా మహాపరాధం! ఒక నిజం ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా – తెలుగు సినిమాను చాలాకాలం పాటు కేంద్ర ప్రభుత్వ అవార్డుల కమిటీ సభ్యులు, మిగి లిన భాషా చిత్రాల మార్కెట్లు, క్రిటిక్స్ తక్కువ చేసి చూపించడానికి ప్రయత్నించారు. ఎన్.టి. రామారావు గారి ‘పాతాళ భైరవి’, అక్కినేని నాగేశ్వరరావు గారి ‘సువర్ణ సుందరి’ – హిందీలోనూ ఏడాది పైన ఆడిన చరిత్ర ఈ జనరేషన్‌కి తెలియకపోవచ్చు. అలాగే జకార్తా ఇంటర్ నేషనల్ ఫిలిమ్ ఫెస్టివల్లో ‘నర్తన శాల’ సినిమాలో ఎస్.వి. రంగా రావు పోషించిన కీచక పాత్రకు ఉత్తమ నటుడిగా లభించిన గౌరవం కొందరికే గుర్తుండవచ్చు. పైగా పది, పదిహేనేళ్ళ క్రితం వరకూ అవార్డులను... నేచురల్‌గా ఉండే సినిమాలు అనండి, ఆర్ట్ ఫిలిమ్స్ అనండి... వాటికి మాత్రమే ఇవ్వాలనే ఒక ప్రత్యేక ధోరణి ఉండేది. బాక్సాఫీస్ దగ్గర డబ్బులు వసూలు చేసిన సినిమాలకూ, అందులో పని చేసినవాళ్ళకూ ఎక్కువ శాతం అవార్డులు వచ్చేవి కాదు. వచ్చేవి కాదు అనే కన్నా ఇచ్చేవాళ్ళు కాదనడం కరెక్ట్! పక్క భాషల నటులు ఒక్కొక్కరికి 2–3 అవార్డులు వచ్చిన సందర్భాలున్నాయి. అదే సమయంలో మన తెలుగు నటు లను గుర్తించడం లేదేంటని బాధ పడుతుండేవాళ్ళు. అందుకే 30 ఏళ్ళ నుంచి ఉత్తమ వినోదాత్మక చిత్రం అవార్డ్ ప్రవేశపెట్టి, కమర్షియల్ సినిమా కన్నీరు తుడిచే ప్రయత్నం చేశారు. అయిదారేళ్ళ క్రితం వరకూ భారతీయ వినోదాత్మక రంగం నుంచి వచ్చే ఆదాయంలో తెలుగు సినిమా వాటా 18–19 శాతం ఉండేది. బాలీవుడ్ రెవిన్యూ తర్వాత స్థానం తెలుగు సినిమాదే. ఇప్పుడు ఈ వాటా 30 శాతం వరకూ పెరిగిందని విన్నాను. కేవలం ప్రభుత్వానికి ఆదాయం రావడమే కాదు! అన్ని వందల, వేల కోట్ల ఆదాయం ఎన్ని వేల కుటుంబాలకు ఉపాధి కలిగిస్తోందో అన్న విషయం ప్రధానంగా గమనించాలి. ముఖ్యంగా ఇవాళ ఆర్ట్ ఫిలిమ్స్ తీసేవాళ్ళు, ఆదరించేవాళ్ళు తగ్గి పోయారు. అవతల ఆస్కార్ అవార్డుల్లో (మన వాళ్ళందరికీ అదే కొలమానం కాబట్టి) బాక్సాఫీస్ సక్సెస్ అయిన సినిమాలకూ, క్రైమ్ డ్రామాలకూ అవార్డులు ఇస్తున్నప్పుడు కమర్షియల్ సినిమాలు భారత దేశంలో ఏం పాపం చేసుకున్నాయి? జనం బాగా ఆదరించిన సిని మాల్లో కళాత్మక విలువలు ఉండవా? అత్యద్భుతమైన ప్రతిభా పాట వాలు ఉండవా? ఎన్ని పదుల, వందల కోట్ల పారితోషికాలు తీసు కున్నా, ప్రతి కళాకారుడూ కోరుకునేది తన పనిని ఎక్కువ మంది మెచ్చుకోవాలని! మేధావులు, అవార్డుల కమిటీల్లో గొప్పవాళ్ళ నుంచి ప్రశంసలు, సత్కారాలు అందుకోవాలని! ఇందులో తప్పేం ఉంది? అమితాబ్‌కి ఉత్తమ నటుడు అవార్డ్ వచ్చినప్పుడూ, రజనీ కాంత్‌కు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు ప్రదానం చేసినప్పుడు కూడా కొన్ని విమర్శలు వచ్చాయి. వాళ్ళు దేశవ్యాప్తంగా పాపులర్ స్టార్స్ అయినంత మాత్రాన ప్రతిభావంతులు కారా? ఎవరు అవునన్నా, కాదన్నా – రాజమౌళి ‘బాహుబలి’తో ప్రపంచ వ్యాప్తంగా బాక్సాఫీస్ రీ–సౌండ్ తెలుగు సినిమా వినిపించింది. అప్పటి నుంచి తెలుగు సినిమా రంగం గురించి మన దేశంలోనే కాదు... ప్రపంచంలోని సినిమా అభిమానులందరికీ తెలిసింది. ఈ రోజు జాతీయ స్థాయిలో తెలుగు సినిమా పనితనం, ప్రతిభ తెలిసిందంటే... తెలుగు సినిమా తనని తాను పెంచుకున్న స్థాయి. లాబీయింగ్ అంటే ఇదే! తెలుగు సినిమా తన టాలెంట్‌తో భారతదేశంలోని సినిమా అభిమానులు, కమిటీ సభ్యుల దగ్గర లాబీయింగ్ చేసింది! భారీ స్థాయిలో – ఊహకందని విజువల్స్‌తో, మార్కెట్ రిస్క్ చేసి సంపాదించుకున్న రెస్పెక్ట్ ఇది! రాజమౌళి ‘ఆర్.ఆర్.ఆర్.’ ఆస్కార్ స్థాయిలో అందుకున్న అవార్డులకూ, గుర్తింపునకూ ఈ జాతీయ అవార్డులు ఓ కొనసాగింపు! అలాగే శ్రీశ్రీ, వేటూరి, సుద్దాల అశోక్ తేజ సరసన ఇప్పుడు చంద్ర బోస్ జాతీయ ఉత్తమ గీత రచయిత అవార్డును అందుకున్నారు. ప్రేమకథల్లో ఓ షాకింగ్ పాయింట్‌తో వచ్చిన ‘ఉప్పెన’ సినిమా తెలుగులో ఉత్తమ ప్రాంతీయ చిత్రం అవార్డ్ గెలుచుకోవడం అభినందనీయం! ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డును అందుకున్న తొలి తెలుగు నటుడిగా చరిత్రలో నిలిచిపోతున్న అల్లు అర్జున్ గురించి రెండు మాటలు చెప్పాలి. ప్రతి నటుడూ కష్టపడతారు. అల్లు అర్జున్ తనకు అసాధ్యం అనుకున్నది కూడా కసిగా సాధించి తీరుతారు. అల్లు అర్జున్‌తో మూడు సినిమాలకు ఓ రచయితగా పని చేసినప్పుడు ఆయ నలో గమనించిన కొన్ని లక్షణాల గురించి చెప్పుకోవాలి. క్యారెక్టర్ కోసం తన శరీరాన్ని మలుచుకోవడమే కాదు... డిక్షన్, బాడీ లాంగ్వేజ్ కోసం తనకు రానిది కూడా ఆయన కష్టపడి నేర్చుకుంటారు. ‘రుద్రమ దేవి’లో గోన గన్నా రెడ్డి పాత్ర చేసిన సాహసం, ‘దువ్వాడ జగన్నాథం (డి.జె.)’లో పురుష సూక్తం పలకడానికి చేసిన ప్రయత్నం, ఇప్పుడు ‘పుష్ప’లో ఓ పక్కకు భుజం వంచి (గూని లాంటిది) మరీ చేసిన అభినయం, చిత్తూరు జిల్లా యాస నేర్చుకోవడానికి చూపిన పట్టుదల – ఇవన్నీ అవార్డ్ అందుకోవడానికి కారణాలయ్యాయి. చివరగా ఓ మాట! తెలుగు సినిమా పుట్టినప్పటి నుంచి (92 సంవత్సరాల కాలం) తన ప్రతిభను చాటి చెబుతూనే ఉంది. అయితే ఆ వెలుగు, వినోదం తెలుగు నేలకే పరిమితమైంది. ఇప్పుడు మన సినిమా ఎల్లలు దాటింది, రిస్క్ గేమ్ ఆడుతోంది. దానికి తగ్గ ప్రతి ఫలాలూ అందుకుంటోంది. తెలుగు వాడికి టాలెంట్ ఎప్పుడూ ఉంది, కానీ ప్రపంచం ఇప్పుడే తెలుగు సినిమా ప్రతిభ తెలుసుకుంటోంది. అందుకే ఇన్ని వందల కోట్ల వసూళ్ళు, అవార్డులు, సత్కారాలు, మర్యాదలు! తెలుగు సినిమా ఏం చేస్తోందనేది మిగిలిన భాషా చిత్రాలు, మార్కెట్లు ఇప్పుడు గమనిస్తున్నాయి. కానీ, తెలుగు ప్రేక్ష కుల అభిరుచిని ఏనాడో కొందరు గొప్ప దర్శకులు గుర్తించారు. తెలుగు సినిమాకు దగ్గర కావాలని ప్రయత్నించారు. 1970ల చివరలో శ్యామ్ బెనెగల్ ‘అనుగ్రహం’, మృణాల్ సేన్ ‘ఒక ఊరి కథ’, గౌతమ్ ఘోష్ ‘మా భూమి’ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యారు. ఇప్పుడు కమర్షియల్ ప్యాన్– ఇండియా సినిమా కోసం, క్వాలిటీ మేకింగ్ కోసం దేశం తెలుగు సినిమా వైపు తొంగిచూస్తోంది. పాపులర్ సినిమాలకు అన్ని విధాలా పట్టాభిషేకాలు ఇప్పుడిప్పుడే మొదల య్యాయి. తెలుగు సినిమా జైత్రయాత్రకు ఇది శుభారంభం! ప్రసాద్ నాయుడు వ్యాసకర్త ప్రముఖ సినిమా రచయిత, సినీ విశ్లేషకులు PrasaadNaidu5@gmail.com -
ఎంత ప్రయత్నించినా కన్నీళ్లాగడం లేదు.. సదా ఎమోషనల్ వీడియో వైరల్
-
ఉగ్రం మూవీ పబ్లిక్ టాక్ వీడియో
-
రామబాణం మూవీ పబ్లిక్ టాక్ వీడియో
-
రికార్డు బ్రేక్ చేసిన సాయి ధరమ్ తేజ్
-
పుష్ప 2లో ఎన్టీఆర్ !
-
భారీ ప్రాజెక్ట్ తో సుకుమార్ ప్రభాస్ సినిమా
-
హీరో గోపీచంద్ తో సాక్షి స్పెషల్ చిట్ చాట్
-
ఏజెంట్ మూవీ పబ్లిక్ టాక్ వీడియో
-
మెగా డాటర్ సింగిల్ స్టేటస్ మా విడాకులా..?
-
ప్రభాస్ ప్రొడక్షన్ లో చిరంజీవి సినిమా
-
Agent కటౌట్ ఒకే...
-
అఖిల్ ఏజెంట్ కి దెబ్బేస్తున్నారు..100 కోట్ల సినిమా పరిస్థితి ఏంటి ?
-
సింహాద్రి రీ రిలీజ్ పై ఎన్టీఆర్ పోస్ట్..గందరగోళంలో ఫ్యాన్స్
-
సినిమాలో నటించాలని ఊరి నుంచి పారిపోయి వచ్చి బార్ షాపులో పని చేశా..
-
బెల్లంకొండను కాల్చినోడు సైకో కాదా ?
-
iBOMMAలో సినిమా చూసే వాళ్ళ పై ఆలీ సీరియస్ కామెంట్స్
-
ఆ రైటర్స్ లేకుండా హిట్టు కొట్టలేరా? సక్సెస్ ఫార్మాలా మిస్ అవుతుందా?
డైరెక్టర్స్ విజయం వెనుక వారి టాలెంట్ ఎంత వుంటుందో..అంతకు మించి రైటర్స్ సపోర్ట్ వుంటుంది. ఫిల్మ్ ఇండస్ట్రీలో రైటింగ్ తెలిసిన డైరెక్టర్స్ తక్కువ మంది ఉంటారు. అందుకే డైరెక్టర్స్ చాలా మంది.... స్టోరీతో పాటు స్క్రిప్ట్, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ రాయగల మంచి రైటర్స్ ను తమ టీమ్ లో వుండేలా ప్లాన్ చేసుకుంటారు. రైటర్ ప్లస్ డైరెక్టర్ కాంబినేషన్ వర్కౌవుట్ అయితే హిట్ సినిమా గ్యారెంటీ. అలా సక్సెస్ అందుకున్న డైరెక్టర్స్ చాలా మంది వున్నారు. వీరిలో ధమాకా మూవీతో సూపర్ హిట్ అందుకున్న డైరెక్టర్ నక్కిన త్రినాథ్ రావు కూడా ఉన్నాడు. అందుకే ఏ డైరెక్టర్ తనకి సెట్ అయిన రైటర్‌ను మిస్ చేసుకోవాలనుకోడు..రైటర్ మారితే ఆ డైరెక్టర్ తనని తాను మళ్లీ ప్రూవ్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది.సేమ్ స్టిట్యూవేషన్ లో వున్న డైరెక్టర్ నక్కిన త్రినాధ్ రావు ఇప్పుడు సోలోగా సినిమా చేయబోతూ ..తన అదృష్టాన్ని చెక్ చేసుకోబోతున్నాడు. టాలీవుడ్ లో చాలా మంది డైరెక్టర్స్ రైటర్స్‌తో పాటు సక్సెస్ కూడా మిస్ చేసుకున్నారు. ఎందుకంటే టాలీవుడ్లో రైటర్స్ డిమాండ్ పెరిగిపోయింది. ఒకప్పుడు హీరోలందరూ కథల విషయంలో డైరెక్టర్స్ పై ఆధారపడే వారు. ఇప్పుడు హీరోలు రూట్ మార్చారు. రైటర్లకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. గతంలో స్క్రిప్ట్, స్క్రిన్ ప్లే డిస్కషన్స్ లో హీరోల జోక్యం పెద్ద గా వుండేది కాదు. ఇప్పుడు పరిస్థితి అలా లేదు. హీరోలు స్టోరీ తో పాటు స్క్రిప్ట్, స్క్రీన్ ప్లే పై కూడా చాలా ఫోకస్ పెడుతున్నారు. అందుకే రైటర్స్ కి డిమాండ్ పెరిగిపోయింది. స్టోరీ ఫిక్స్ అయిన తర్వాతే హీరోలు డైరెక్టర్ గురించి ఆలోచిస్తున్నారు. బాక్సాఫీస్ దగ్గర హిట్ కొట్టిన దర్శకులు ..ఇప్పుడు సరైన రైటర్స్ లేక ఫెయిల్ అవుతున్నారు. గతంలో డైరెక్టర్ విజయ్ భాస్కర్ వెనుక త్రివిక్రమ్ రైటర్‌గా ఉండేవాడు. త్రివిక్రమ్ రైటర్ నుంచి డైరెక్టర్‌గా టర్న్ తీసుకున్న తర్వాత విజయ్ భాస్కర్ డైరెక్టర్‌గా ఒక హిట్ కూడా అందించలేకపోయాడు. ఇక డైరెక్టర్ శ్రీను వైట్ల..రైటర్స్ కోన వెంకట్, గోపి మోహన్ తో కలిసి ఉన్నంత కాలం హిట్ సినిమాలు తీశాడు. వారితో విడిపోయిన తర్వాత శ్రీనువైట్ల సక్సెస్ రేట్ దారుణంగా పడిపోయింది. అలాగే దేశం గర్వించదగ్గ దర్శకుల్లో శంకర్ ఒకరు. శంకర్ టీమ్ లో సూజాత రంగరాజన్ అనే గొప్ప రైటర్ ఉండేవాడు. ఆయన రోబో సినిమా సమయంలో చనిపోయారు. ఆ తర్వాత శంకర్ సినిమా కథల్లో బలం తగ్గిపోయిందనే మాట వినిపిస్తుంది. అలాగే డైరెక్టర్ త్రినాథరావు నక్కిన, రైటర్ బెజవాడ ప్రసన్న కుమార్ కాంబోలో వచ్చిన సినిమా చూపిస్త మావ, నేను లోకల్, ధమాకా లాంటి సినిమాలు విజయం సాధించాయి. అయితే ఇప్పుడు బెజవాడ ప్రసన్న కుమార్ రైటర్ నుంచి డైరెక్టర్‌గా టర్న్ తీసుకున్నాడు. కింగ్ నాగార్జున ప్రసన్న కుమార్ కి డైరెక్టర్ గా తన మూవీ తెరకెక్కించే ఛాన్స్ ఇచ్చాడు. దీంతో త్రినాధరావు నక్కిన ఇప్పుడు సోలోగా సినిమా చేయాల్సి వస్తోంది. ధమాకా హిట్ తర్వాత ఐరా క్రియేషన్స్‌లో ఓ కొత్త సినిమా చేయబోతున్నాడు. మరి ఇన్నాళ్లు కలిసి వర్క్ చేసిన రైటర్ బెజవాడ ప్రసన్న కుమార్ లేకుండా నక్కిన త్రినాధరావు ఈ సినిమా తో సక్సెస్ అందుకుంటాడో లేదా చూడాలి. -
PAPA Review: 'ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి' రివ్యూ
టైటిల్: 'ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి' నటీనటులు - నాగ శౌర్య, మాళవిక నాయర్, శ్రీనివాస్ అవసరాల, మేఘ చౌదరి, అశోక్ కుమార్, అభిషేక్ మహర్షి, శ్రీ విద్య తదితరులు నిర్మాణ సంస్థలు : పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, దాసరి ప్రొడక్షన్స్ నిర్మాతలు: టీజీ విశ్వ ప్రసాద్, పద్మజ దాసరి దర్శకుడు: శ్రీనివాస్ అవసరాల సంగీతం: కళ్యాణి మాలిక్, వివేక్ సాగర్(కాఫీఫై సాంగ్) సినిమాటోగ్రఫీ: సునీల్ కుమార్ నామ ఎడిటర్ : కిరణ్ గంటి విడుదల తేది: మార్చి 17, 2023 Rating: 2.5/5 Phalana Abbayi Phalana Ammayi Review: 'ఊహలు గుసగుసలాడే', 'జ్యో అచ్యుతానంద' లాంటి బ్లాక్‌బస్టర్స్ తర్వాత నాగశౌర్య, శ్రీనివాస అవరాల కాంబినేష్లో వచ్చిన హ్యాట్రిక్ మూవీ ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’. ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, దాసరి ప్రొడక్షన్స్ తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం నేడు(మార్చి 17) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్‌కు మంచి స్పందన లభించడంతో పాటు సినిమాపై హైప్ క్రియేట్ చేశాయి. మంచి అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. కథేంటంటే.. ఈ సినిమా కథంతా 2000 నుంచి 2010 మధ్యకాలంలో సాగుతుంది. బీటెక్‌లో జాయిన్ అయిన సంజయ్‌ని సీనియర్స్ ర్యాగింగ్ చేస్తుంటే.. అతన్ని సేవ్ చేస్తుంది అనుపమ(మాళవికా నాయర్). అప్పటి నుంచి ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడుతుంది. ఇక ఎంఎస్ కోసం ఇద్దరు కలిసి యూకేకి వెళ్తారు. అక్కడ ఇద్దరు ప్రేమలో పడతారు. సహజీవనం కూడా చేస్తారు. ఎంఎస్ పూర్తవ్వగానే అనుపమకు వేరే సిటీలో ఉద్యోగం వస్తుంది. తనకు చెప్పకుండా ఉద్యోగానికి అప్లై చేసిందని అనుపమపై కోపంగా ఉంటాడు సంజయ్. అదే సమయంలో అతనికి పూజ(మేఘా చౌదరి)దగ్గరవుతుంది. ఆమె కారణంగా సంజయ్, అనుపమల మధ్య దూరం పెరుగుతుంది. ఇద్దరు విడిపోతారు. కొన్నాళ్ల తర్వాత అనుకోకుండా ఇద్దరు కలుస్తారు. ఆ తర్వాత ఏం జరిగింది? పూజ ప్రేమను సంజయ్ అంగీకరించాడా? అనుపమ జీవితంలోకి గిరి(అవసరాల శ్రీనివాస్) ఎలా వచ్చాడు? చివరికి సంజయ్, అనుపమలు కలిశారా? లేదా? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. సినిమా భాషలో కాంబినేషన్ అనే మాటకి విలువెక్కువ. ఓ హీరో, డైరెక్టర్ కలిసి చేసిన సినిమా హిట్ అయితే.. అదే కాంబోలో వస్తున్న కొత్త చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడటం సహజం. కానీ ఆ అంచనాలను దర్శకుడు అవసరాల శ్రీనివాస్ నిలబెట్టుకోలేకపోయాడు. ‘ఉహాలు గుస గుస లాడే , జ్యో అచ్యుతానంద’ బ్లాక్‌బస్టర్స్ తర్వాత నాగశౌర్యతో కలిసి చేసిన హ్యాట్రిక్ మూవీ ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ ఆ స్థాయిలో ఆకట్టుకునేలా తెరకెక్కించడంలో దర్శకుడు విఫలమయ్యాడు. కథలో చెప్పుకోవడానికి పెద్దగా ఏమీ లేదు. ఎలాంటి ట్విస్టులు లేకుండా చాలా రొటీన్‌గా కథనం సాగుతుంది. కొన్ని సీన్లలో శ్రీనివాస అవసరాల మార్క్ కామెడీ కనిపిస్తుంది. కానీ మొత్తంగా ఎక్కడో క్లారిటీ మిస్ అయిందనే ఫీలింగ్ కలుగుతుంది. సినిమాలో మొత్తం ఏడు చాప్టర్లు ఉంటాయి. ఒక్కో చాప్టర్ ఒక్కో థీమ్ తో ఉంటుంది. ప్రేమ, ద్వేషం, హాస్యం ఇలా అన్ని భావోద్వేగాలు ఉంటాయి. కానీ వాటిని ఆకట్టుకునే విధంగా తెరకెక్కించడంతో దర్శకుడు విఫలమయ్యాడు. కాలేజీలో హీరోహీరోయిన్ల స్నేహం.. ప్రేమ.. సహజీవనం తదితర సన్నివేశాలతో ఫస్టాఫ్ ముగుస్తుంది. ఇక సెకండాఫ్ ఇద్దరి మధ్య మనస్పర్థలు.. విడిపోవడం.. ఇలా భావోద్వేగాల చుట్టూ తిరుగుతుంది. అయితే కలిసి జీవించాలనుకున్న ఈ జంట.. విడిపోవడానికి గల కారణాలను బలంగా చూపించలేకపోయారు. పార్ట్ పార్ట్‌లుగా చూస్తే కొన్ని సీన్స్ ఆకట్టుకుంటాయి. కానీ ఓవరాల్‌గా మాత్రం అంతగా మెప్పించదు. ఎవరెలా చేశారంటే... సంజయ్గా నాగశౌర్య మెప్పించాడు. లుక్స్ పరంగా చాలా మార్పులు ఉన్న పాత్ర తనది. ఇలాంటి రొమాంటిక్ ఫీల్ గుడ్ సినిమాలు.. పాత్రలు నాగశౌర్యకు కొత్తేమి కాదు. గత సినిమాల్లో మాదిరే లవర్ బాయ్‌గా సంజయ్ చక్కగా నటించాడు. ఇక అనుపమగా మాళవికా నాయర్ తనదైన నటనతో ఆకట్టుకుంది. సినిమా మొత్తం వీరిద్దరి పాత్రల చుట్టే తిరుగుతుంది. గిరిగా అవసరాల శ్రీనివాస్ ఉన్నంతలో మెప్పించాడు. వాలెంటైన్ గాఅభిషేక్ మహర్షి తనదైన కామెడీతో నవ్వించాడు, కీర్తిగా శ్రీవిద్య, పూజగా మేఘ చౌదరితో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక సాంకేతిక విషయాలకొస్తే.. కళ్యాణి మాలిక్ నేపథ్య సంగీతం బాగుంది. పాటలు కథకి తగ్గట్టుగా ఉన్నాయి. సునీల్ కుమార్ నామ సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నాయి. -అంజి శెట్టి, సాక్షి వెబ్‌డెస్క్ -
బేబీతో ఎంట్రీ
మలయాళంలో గాయనిగా మంచి పేరు తెచ్చుకున్న ఆర్య దయాళ్ ‘బేబీ’ సినిమాతో తెలుగు పరిశ్రమకి పరిచయమవుతున్నారు. ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘బేబీ’. సాయి రాజేశ్ దర్శకత్వంలో ఎస్కేఎన్ నిర్మించిన ఈ సినిమా త్వరలో రిలీజ్ కానుంది. ఈ సినిమాలోని ‘ఓ రెండు ప్రేమ మేఘాలిలా’ పాట పాడారు ఆర్య దయాళ్. ‘‘విజయ్ బుల్గానిన్ సంగీతం అందించిన ఈ పాటకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఆర్య పాడిన తొలి తెలుగు పాట ఇదే కావడం విశేషం’’ అన్నారు ఎస్కేఎన్. ‘ఈ పాట ఇప్పటివరకూ అన్ని డిజిటల్ ΄్లాట్ఫామ్స్లో 2 కోట్ల వ్యూస్ సంపాదించింది’’ అన్నారు సాయి రాజేశ్. -
బిగ్ స్నేక్ రెడీ
చైనాలో ఘన విజయం సాధించిన ‘బిగ్ స్నేక్ కింగ్’ చిత్రం తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తోంది. లిక్వెన్ లుఓ, వాంగ్ జియోలాంగ్, వెంకీ జాఓ, గాఓ షెంగ్వు కీలక పాత్రల్లో గుఓ మింగర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘బిగ్ స్నేక్ కింగ్’. గత ఏడాది మే 11న చైనాలో విడుదలైన ఈ చిత్రం మార్చి 3న ఇండియాలో విడుదల కానుంది. బుద్ధ భగవాన్ పతాకంపై యేలూరు సురేంద్ర రెడ్డి తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ–‘‘బిగ్ స్నేక్ కింగ్’ సిరీస్‌లో చైనా వాళ్లు దాదాపు 10 సినిమాలు చేశారు.. వాటిని కూడా నెలకి ఒకటి చొప్పున తెలుగులో రిలీజ్ చేస్తాను’’ అన్నారు. -
యాక్షన్ థ్రిల్లర్
విన్ను మద్దిపాటి, స్మిరితరాణి బోర జంటగా సాయిశివన్ జంపాన దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘గ్రంథాలయం’. ఎస్.వైష్ణవి శ్రీ నిర్మించిన ఈ సినిమా మార్చి 3న రిలీజ్ అవుతోంది. ఈ చిత్రం ట్రైలర్‌ను దర్శకులు బి.గోపాల్, కాశీ విశ్వనాథ్, నిర్మాత కేఎల్ దామోదర ప్రసాద్ విడుదల చేశారు. ‘‘కమర్షియల్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రమిది. ట్రైలర్ రిలీజయ్యాక సినిమాపై అంచనాలు పెరిగాయి. డిస్ట్రిబ్యూటర్స్ గ్రూప్‌లలో మా ట్రైలర్ వైరల్‌గా మారింది’’ అన్నారు సాయిశివన్ జంపాన, ఎస్.వైష్ణవి శ్రీ. -
క్రైమ్ థ్రిల్లర్
రితికా సింగ్ లీడ్ రోల్లో నటించిన చిత్రం ‘ఇన్ కార్’. హర్ష వర్ధన్ దర్శకత్వంలో అంజుమ్ ఖురేషి, సాజిద్ ఖురేషి నిర్మించిన ఈ సినిమా మార్చి 3న విడుదల కానుంది. రితికా సింగ్ మాట్లాడుతూ–‘‘ఈ మూవీలోని నా పాత్ర కోసం షూటింగ్ పూర్తయ్యే వరకు నేను తల స్నానం చేయలేదు’’ అన్నారు. ‘‘సర్వైవల్ క్రైమ్ థ్రిల్లర్ డ్రామా ‘ఇన్ కార్’’ అన్నారు హర్ష వర్ధన్. ఈ చిత్రానికి కెమెరా: మిథున్ గంగోపాధ్యాయ. -
ప్రేమ.. వినోదం..
‘‘మిస్టర్ కళ్యాణ్’ మూవీ ట్రైలర్ బాగుంది. మేకింగ్, లొకేషన్స్, డైలాగ్స్ అన్నీ బాగున్నాయి. ఈ సినిమా మంచి విజయం సాధించి దర్శకుడు పండు, నిర్మాత ఎన్వీ సుబ్బారెడ్డి మరిన్ని మంచి సినిమాలు చేయాలి’’ అని డైరెక్టర్ నక్కిన త్రినాథరావు అన్నారు. మాన్యం కృష్ణ, అర్చన జంటగా నటించిన చిత్రం ‘మిస్టర్ కళ్యాణ్’. పండు దర్శకత్వంలో ఉషశ్రీ సమర్పణలో ఎన్వీ సుబ్బారెడ్డి నిర్మించారు. ఈ చిత్రం ట్రైలర్‌ని నక్కిన త్రినాథరావు విడుదల చేశారు. ఈ సందర్భంగా పండు, ఎన్వీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ– ‘‘ఫ్యామిలీ, లవ్, యూత్‌ఫుల్ ఎంటర్టైనర్గా రూ΄÷ందిన చిత్రం ‘మిస్టర్ కళ్యాణ్’’ అన్నారు. -
రెండు కాలాలతో...
రెజీనా ప్రధానపాత్రలో కార్తీక్ రాజు దర్శకత్వంలో రాజ్‌శేఖర్ వర్మ నిర్మించిన చిత్రం ‘నేనే నా’. ఈ చిత్రం ప్రపంచవ్యాప్త థియేట్రికల్, నాన్–థియేట్రికల్ రైట్స్‌ని ఎస్పీ సినిమాస్ దక్కించుకుంది. ‘‘1920, ప్రస్తుతం.. ఇలా రెండు విభిన్న కాలాల నేపథ్యంలో రూపొం దించిన ఫ్యాంటసీ అడ్వంచరస్ థ్రిల్లర్ ఇది. ఇందులో రెజీనా పురావస్తు శాస్త్రవేత్తపాత్ర చేశారు’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ వేసవిలో సినిమా విడుదల కానుంది. ఈ చిత్రానికి సంగీతం: సామ్ సీఎస్. -
స్పీకర్ ఆన్ చేసి మాట్లాడాలి
నవీన్ నేని, ప్రణీత పట్నాయక్ ముఖ్య తారలుగా కెఎస్ హేమరాజ్ స్వీయ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘రిచిగాడి పెళ్లి’. త్వరలో ఈ సినిమా విడుదల కానుంది. ఈ సినిమా ట్రైలర్‌ను లాంచ్ చేశారు దర్శకుడు హరీష్ శంకర్. ‘ఏ ఫోన్‌కాల్ వచ్చినా స్పీకర్ ఆన్ చేసి మాట్లాడాలి అంతే..!’, ‘రిచిగాడి పెళ్లి’ జీవితంలో మర్చిపోకూడదు’ అనే డైలాగ్స్ ట్రైలర్లో ఉన్నాయి. ‘‘మానవ సంబంధాలకు అద్దం పట్టే కథతో ‘రిచిగాడి పెళ్లి’ని రూపొందించాం’’ అన్నారు హేమరాజ్. -
పల్లెటూర్లో పరేషాన్
తిరువీర్, పావని కరణం జంటగా రూపక్ రోనాల్డ్సన్ దర్శకత్వంలో సిద్ధార్థ్ రాళ్లపల్లి నిర్మించిన చిత్రం ‘పరేషాన్’. తెలంగాణలోని ఓ పల్లెటూరు నేపథ్యంలో సాగే ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా జరిగిన ఈ సినిమా టీజర్ రిలీజ్ కార్యక్రమంలో తీరువీర్ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా చాలా సహజంగా వుంటుంది’’ అన్నారు. ‘‘అందరం ప్రాణం పెట్టి ఈ సినిమా చేశాం’’ అన్నారు రూపక్ రోనాల్డ్సన్. ఇదొక ప్రత్యేకమైన సినిమా’’ అన్నారు సిద్ధార్థ్. -
మొన్న నేను.. ఈరోజు గీత్!
‘‘కష్ట్టపడితే సక్సెస్ సాధిస్తాం. ఇందుకు ఉదాహరణ మేమే. మొన్న నేను ఇండస్ట్రీకి వచ్చాను.. ఈ రోజు గీత్ ఆనంద్ వచ్చాడు.. రేపు ఎవరో ఒకరు వస్తారు. ‘గేమ్ ఆన్’ని ప్రేక్షకులు హిట్ చేయాలి’’ అని హీరో విశ్వక్ సేన్ అన్నారు. గీత్ ఆనంద్ హీరోగా, నేహా సోలంకి, వాసంతి హీరోయిన్లుగా దయానంద్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘గేమ్ ఆన్’. వెంకటేశ్వరరావు కస్తూరి, సాక్షి రవి సమర్పణలో రవి కస్తూరి నిర్మించారు. ఈ సినిమా టీజర్‌ని విశ్వక్ సేన్ రిలీజ్ చేశారు. ‘‘ఈ సినిమా నిరుత్సాహపరచదు’’ అన్నారు దయానంద్. ‘‘2023లో సౌత్ నుంచి వచ్చిన మంచి సినిమాల్లో ‘గేమ్ ఆన్’ తప్పకుండా ఉంటుంది’’ అన్నారు గీత్ ఆనంద్. ‘‘మా సినిమా కొత్త ట్రెండ్ సెట్ చేస్తుంది’’ అన్నారు రవి కస్తూరి. -
విజిల్స్ వేసే సన్నివేశాలుంటాయి
‘‘ఫ్యామిలీ అండ్ యూత్‌కి కనెక్ట్ అయ్యే సినిమా ‘మిస్టర్ కింగ్’. సెకండ్ హాఫ్‌లో యూత్ విజిల్స్ వేసి చప్పట్లు కొట్టే సన్నివేశాలుంటాయి. క్లైమాక్స్ ఫ్యామిలీ ఆడియన్స్‌ని ఆకట్టుకుంటుంది’’ అని డైరెక్టర్ శశిధర్ చావలి అన్నారు. శరణ్ కుమార్, యశ్విక నిష్కల, ఊర్వీ సింగ్ హీరో హీరోయిన్లుగా రూపొందిన చిత్రం ‘మిస్టర్ కింగ్’. బీఎన్ రావు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 24న విడుదలవుతోంది. ఈ సందర్భంగా దర్శకుడు శశిధర్ చావలి మాట్లాడుతూ– ‘‘నా ఇష్టం’ చిత్రంతో సహాయ దర్శకుడిగా నా ప్రయాణం మొదలుపెట్టాను. ‘బాహుబలి 1’కి ఎడిటింగ్ డిపా ర్ట్‌మెంట్‌లో చేశాను. ఆ తర్వాత విరించితో కలసి ‘మజ్ను’ సినిమాకి పని చేశాను. అనంతరం ‘మిస్టర్ కింగ్’ చాన్స్ వచ్చింది. మంచి క్యారెక్టర్ ఉన్న ఓ కుర్రాడి ప్రయాణమే ఈ చిత్రం. ప్రేమకు సంబంధించిన కథ. సామాన్య ప్రేక్షకుడు తనని తాను హీరోగా చూసుకునేలా హీరోపాత్ర ఉంటుంది. మిస్టర్ కింగ్ పాత్రకి శరణ్ చక్కగా సరిపోయాడు. బీఎన్ రావుగారు ఎక్కడా రాజీపడలేదు. మణిశర్మ గారి నేపథ్య సంగీతం అద్భుతంగా ఉంటుంది’’ అన్నారు. -
వాస్తవాన్ని వెంటాడుతూ గతం చేసిన యుద్ధమే ‘వీరఖడ్గం’
శ్రుతి ఢాంగే ప్రధానపాత్రధారిగా, సత్యప్రకాష్, ఆనంద్ రాజ్ ఇతర ముఖ్య తారాగాణంగా నటించిన చిత్రం ‘వీరఖడ్గం’. ఎంఏ చౌదరి దర్శకత్వంలో కె. కోటేశ్వరరావు నిర్మించిన ఈ రివెంజ్ బ్యాక్‌డ్రాప్ చిత్రం మార్చి మొదటి వారంలో రిలీజ్ కానుంది. ‘‘వాస్తవాన్ని వెంటాడుతూ గతం చేసిన యుద్ధమే ఈ ‘వీరఖడ్గం’ చిత్రం’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. బ్రహ్మానందం, మదన్, తపస్వి, అపూర్వ పృధ్వీరాజ్ కీ రోల్స్ చేసిన ఈ చిత్రానికి సంగీతం: షయాక్పార్వాజ్, మాటలు: ఘటికాచలం, లైన్ ప్రొడ్యూసర్: మారిశెట్టి సునీల్‌కుమార్. -
పొలిమేరలో...
సత్యం రాజేష్, డా. కామాక్షి భాస్కర్ల, గెటప్ శ్రీను, బాలాదిత్య, రవి వర్మ, చిత్రం శ్రీను, అక్షత శ్రీనివాస్ ముఖ్య పాత్రల్లో ఓ చిత్రం రూ΄పొందింది. ‘మా ఊరి పొలిమేర’ చిత్రానికి సీక్వెల్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. డా. అనిల్ విశ్వనాథ్ దర్శకత్వంలో గౌరు గణబాబు సమర్పణలో గౌరికృష్ణ ఈ చిత్రాన్ని నిర్మించారు. పల్లెటూరి నేపథ్యంలో, ఊరి పొలిమేర చుట్టూ సాగే కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందించారు. సినిమా షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ చిత్రానికి సంగీతం: గ్యాని, కెమెరా: ఖుషేందర్ రమేష్ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎ న్ .సి. సతీష్ కుమార్. -
నేను స్టూడెంట్ సార్ రిలీజ్ డేట్ ఫిక్స్
స్టూడెంట్‌గా బెల్లంకొండ గణేష్ థియేటర్స్‌కి వచ్చే సమయం ఖరారైపోయింది. బెల్లంకొండ గణేష్ హీరోగా రాఖీ ఉప్పలపాటి దర్శకత్వంలో ‘నాంది’ ఫేమ్ సతీష్ వర్మ నిర్మించిన చిత్రం ‘నేను స్టూడెంట్ సార్..!’. ఇందులో అవంతిక దస్సాని హీరోయిన్గా నటించారు. ఈ సినిమాను మార్చి 10న థియేటర్స్‌లో రిలీజ్ చేస్తున్నట్లుగా శుక్రవారం ప్రకటించారు మేకర్స్. ‘‘ఇది ఇంటెన్స్ యాక్షన్ మూవీ’’ అని యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: మహతి స్వర సాగర్, కెమెరా: అనిత్ మధాడి. -
మైత్రి మూవీస్ చేతికి కోనసీమ థగ్స్
ప్రముఖ కొరియోగ్రాఫర్ బృందా తెరకెక్కించిన ఇంటెన్స్ యాక్షన్ తమిళ చిత్రం ‘థగ్స్’. హ్రిదు హరూన్ హీరోగా పరిచయం అవుతున్న ఈ చిత్రంలో సింహ, ఆర్కే సురేష్, మునిష్కాంత్, అనస్వర రంజన్ కీ రోల్స్ చేశారు. హెచ్ఆర్ పిక్చర్స్ పతాకంపై జీయో స్టూడియోస్ భాగస్వామ్యంతో రియా షిబు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 24న విడుదల కానుంది. కాగా ‘థగ్స్’ తెలుగు వెర్షన్ ‘కోనసీమ థగ్స్’ను మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఎల్ఎల్పీ పంపిణీ చేయనుంది. -
‘పాన్ కథ’లకే టాలీవుడ్ ఇండస్ట్రీ మొగ్గు.. ఈ ఏడాది దాదాపు డజనుకి పైగా
‘బాహుబలి’తో తెలుగు సినిమాలో మార్పు వచ్చింది. అప్పటివరకూ మన తెలుగు సినిమా తెలుగు ప్రేక్షకులకు నచ్చితే చాలన్నట్లు ఉండేది. అయితే ‘బాహుబలి’ తర్వాత తెలుగు సినిమా పాన్ ఇండియా రేంజ్‌కి ఎదిగింది. అందుకే ప్రస్తుతం ‘పాన్ కథ’లకే ఇండస్ట్రీ మొగ్గు చూపుతోంది. ఈ ఏడాది తెలుగు నుంచి దాదాపు డజనుకి పైగా ‘పాన్ ఇండియా’ చిత్రాలు రానున్నాయి. ఇక ఈ ‘పాన్ కథా చిత్రమ్’ వివరాలు తెలుసుకుందాం. ‘ధమాకా’, ‘వాల్తేరు వీరయ్య’ (రవితేజ కీ రోల్ చేశారు) చిత్రాల సక్సెస్ జోష్‌లో ఉన్న రవితేజ చేస్తున్న తాజా చిత్రాల్లో ‘టైగర్ నాగేశ్వరరావు’ ఒకటి. స్టూవర్టుపురం దొంగగా చెప్పుకునే టైగర్ నాగేశ్వరరావు జీవితం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు దర్శకుడు వంశీ. 1970 బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతున్న ఈ పాన్ ఇండియా చిత్రం ఈ ఏడాదే రిలీజ్ కానుంది. అలాగే రవితేజ హీరోగా నటిస్తున్న మరో చిత్రం ‘రావణాసుర’ కూడా పాన్ ఇండియా రిలీజ్ అని తెలుస్తోంది. సుధీర్ వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ఏప్రిల్ 7న విడుదల కానుంది. మరోవైపు ‘బాహుబలి’ పాన్ ఇండియా సక్సెస్ తర్వాత ప్రభాస్ చేసే ప్రతి సినిమా పాన్ ఇండియా రేంజ్లో ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిం§ó.. ఈ ఏడాది మూడు పాన్ ఇండియా చిత్రాలతో ప్రభాస్ రానున్నారు. ప్రస్తుతం ప్రభాస్ హీరోగా ‘కేజీఎఫ్’ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘సలార్’, దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కించిన మైథలాజికల్ ఫిల్మ్ ‘ఆదిపురుష్’ ఈ ఏడాదే ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. జూన్ 16న ‘ఆదిపురుష్’, సెప్టెంబరు 28న ‘సలార్’ రిలీజ్‌కి రెడీ అవుతున్నాయి. ఈ సినిమాలే కాకుండా ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో ‘రాజా డీలక్స్’ (అధికారిక ప్రకటన రావాల్సి ఉంది) అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం కూడా ఈ ఏడాదే పాన్ ఇండియా రిలీజ్‌గా థియేటర్స్‌లోకి వస్తుందనే టాక్ వినిపిస్తోంది. ఇక హీరో మహేశ్‌బాబు తాజా చిత్రం పాన్ ఇండియా రిలీజ్ కానుంది. ‘అతడు’, ‘ఖలేజా’ చిత్రాల తర్వాత హీరో మహేశ్‌బాబు, దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో రూపొందుతున్న సినిమా ఇది. ఫ్యామిలీ అండ్ ఎమోషనల్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ హైదరాబాబాద్‌లో జరుగుతోంది. ఆగస్టు 11న ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేలా సన్నాహాలు చేస్తున్నారు. ఇక పవన్ కల్యాణ్ నుంచి కూడా ఓ పాన్ ఇండియా చిత్రం రానుంది. క్రిష్ దర్శకత్వంలో పవన్ హీరోగా నటిస్తున్న పీరియాడికల్ ఫిల్మ్ ‘హరిహర వీరమల్లు’. 17వ శతాబ్దం నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రం వేసవిలో రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది. మరోవైపు శంకర్ దర్శకత్వంలో హీరో రామ్‌చరణ్ ఓ పాన్ ఇండియా మూవీ చేస్తున్నారు. రాజకీయాలు, ఐఏఎస్ ఆఫీసర్ల నేపథ్యంతో కూడిన ఈ యాక్షన్ ఫిల్మ్ ఈ ఏడాదే థియేటర్స్‌లోకి రానుంది. ఇంకోవైపు ఆల్రెడీ ‘పుష్ప: ది రైజ్’తో పాన్ ఇండియా సక్సెస్ కొట్టిన అల్లు అర్జున్ ఇదే సినిమాకు కొనసాగింపుగా వస్తున్న ‘పుష్ప: ది రూల్’ సినిమాతో ప్రస్తుతం బిజీగా ఉన్నారు. దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్న ‘పుష్ప: ది రూల్’ చిత్రం ఈ ఏడాది చివర్లో రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది. ఇక శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని హీరోగా నటించిన విలేజ్ బ్యాక్‌డ్రాప్ మాస్ ఫిల్మ్ ‘దసరా’ కూడా పాన్ లిస్ట్‌లో ఉంది. ఈ చిత్రం మార్చి 30న రిలీజ్ కానుంది. ‘శాకుంతలం’తో సమంత కూడా పాన్ ఇండియా జాబితాలో చేరారు. దేవ్ మోహన్ ఓ లీడ్ రోల్ చేసిన ఈ మైథలాజికల్ లవ్‌స్టోరీకి గుణశేఖర్ దర్శకుడు. ఈ చిత్రం ఫిబ్రవరి 17న రిలీజ్ కానుంది. ఇంకోవైపు హీరో రామ్, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్లో పాన్ ఇండియా స్థాయిలో ఓ హై ఓల్టేజ్ యాక్షన్ ఫిల్మ్ రూపొందుతోంది. అలాగే అఖిల్ హీరోగా సురేందర్‌రెడ్డి తెరకెక్కిస్తున్న స్టైలిష్ యాక్షన్ మూవీ ‘ఏజెంట్’ వేసవి రిలీజ్‌కి రెడీ అవుతోంది. శివ నిర్వాణ దర్శకత్వంలో విజయ్‌దేవర కొండ–సమంతల పాన్ ఇండియా ప్రేమకథా చిత్రం ‘ఖుషి’ ఈ ఏడాది వెండితెరపై ప్రేమ కురిపించనుంది. అలాగే రంజిత్ జయకొడి దర్శకత్వంలో సందీప్ కిషన్ హీరోగా చేసిన గ్యాంగ్‌స్టర్ ఫిల్మ్ ‘మైఖేల్’ వచ్చే నెల 3న రిలీజ్ కానుంది. సాయిధరమ్‌తేజ్ హీరోగా కార్తీక్ దండు దర్శకత్వంలో రూపొందిన మిస్టిక్ థ్రిల్లర్ ‘విరూపాక్ష’ ఏప్రిల్ 21న విడుదల కానుంది. వరుణ్ తేజ్ కూడా పాన్ క్లబ్లో చేరారు. తెలుగు, హిందీ భాషల్లో శక్తీకాంత్ దర్శకత్వంలో వరుణ్ ఓ పాన్ మూవీ కమిట్ అయ్యారు. ఇక ‘గూఢచారి’కి సీక్వెల్‌గా అడివి శేష్ చేస్తున్న ‘గూఢచారి 2’ కూడా పాన్ ఇండియా రిలీజే. ఇంకా గ్యారీ బీహెచ్ దర్శకత్వంలో నిఖిల్ చేసిన స్పై థ్రిల్లర్ ‘స్పై’, తేజా సజ్జా హీరోగా దర్శకుడు ప్రశాంత్ వర్మ తీసిన అడ్వెంచరస్ మైథలాజికల్ ఫిల్మ్ ‘హను మాన్’ (మే 12న రిలీజ్) తదితర చిత్రాలు పాన్ ఇండియా రిలీజ్లుగా ఈ ఏడాదే రానున్నాయి. -
రాఘవేంద్ర రావు చేతుల మీదుగా అలా నిన్ను చేరి ఫస్ట్‌లుక్
ఫీల్ గుడ్ ఎంటర్టైనర్ సినిమాలకు మంచి ఆదరణ లభిస్తోంది. ఇలాంటి కథలకు అటు యూత్‌తో పాటు ఇటు ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. అదే బాటలో రాబోతున్న కొత్త సినిమా ‘అలా నిన్ను చేరి’. విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై కొమ్మాలపాటి శ్రీధర్ సమర్పణలో ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాతో మారేష్ శివన్ దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. చిత్రంలో దినేష్ తేజ్, హెబ్బా పటేల్, పాయల్ రాధాకృష్ణ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. కొమ్మాలపాటి సాయి సుధాకర్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఓ వైపు షూటింగ్ చేస్తూనే మరోవైపు ప్రమోషన్స్ చేపడుతున్న చిత్రబృందం.. తాజాగా సంక్రాంతి కానుకగా ఈ మూవీ ఫస్ట్‌లుక్ గ్లింప్స్‌ను విడుదల చేసింది. దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు చేతుల మీదుగా ఈ సినిమా ఫస్ట్‌లుక్ గ్లింప్స్ రిలీజ్ చేశారు. అనంతరం రాఘవేంద్రరావు మాట్లాడుతూ.. ఈ సినిమా మంచి విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ మూవీ టీంకు ఆల్ ది బెస్ట్ చెప్పారు. కాగా ఈ సినిమాలో శివకుమార్ రామచంద్రవరపు, శత్రు, కల్పలత, ‘రంగస్థలం’ మహేష్, ఝాన్సీ, కేదర్ శంకర్ తదితరులు నటిస్తున్నారు. -
జెట్టీలో ఉన్న సీన్లు క్రాక్ మూవీలో చేయాలనుకున్నారు: హీరో
మాన్యం కృష్ణ, నందితా శ్వేత జంటగా నటించిన చిత్రం జెట్టి. శివాజీ రాజా, కన్నడ కిషోర్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. సుబ్రహ్మణ్యం పిచుక దర్శకత్వం వహించగా వర్ధిన్ ప్రోడక్షన్స్ బ్యానర్‌పై వేణు మాధవ్ కే నిర్మించారు. ఈ సినిమా నవంబర్ 4వ తేదీన రిలీజవుతోంది. ఈ నేపథ్యంలో హీరో కృష్ణ మాన్యం పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ► నా పేరు కృష్ణ, స్వస్థలం చిత్తూరు జిల్లా. చిన్నతనంలోనే యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్‌తో డిగ్రీ మానేసి హైదరాబాద్ వచ్చాను. దూరదర్శన్ కోసం ఒక ఎపిసోడ్... ఓ సీరియల్లో మూడు ఎపిసోడ్స్‌లో నటించాను. అయితే తెచ్చుకొన్న డబ్బులు అయిపోవడంతో ఇంటికి తిరిగి వెళ్లాల్సి వచ్చింది. ఆ సమయంలో శిల్పకళా వేదికలో ఓ ఫంక్షన్ కోసం వెళ్లి కోట శ్రీనివాసరావుతో ఫోటో దిగడానికి ప్రయత్నించాను. అప్పుడాయన ఇంటికి పిలిచి.. ముందు డిగ్రీ చదువుకో, ఆ తర్వాత ఇండస్ట్రీలో ఆఫర్ల కోసం ప్రయత్నించమని సలహా ఇచ్చారు. ► డిగ్రీ పూర్తి చేసిన తర్వాత ఐటీ జాబ్స్ చేశాను. కానీ నా మససంతా సినిమాపైనే ఉంది. ఇదిలా ఉంటే నా బావ.. గల్లా జయదేవ్ కుమారుడు గల్లా అశోక్ ఇండస్ట్రీలోకి రావడానికి ప్రయత్నిస్తూ.. చెన్నైలో పాండ్యన్ మాస్టర్ వద్ద శిక్షణ తీసుకొన్నాడు. నేను కూడా గల్లా అశోక్‌తో కలిసి ట్రైనింగ్ తీసుకొన్నాను. అది నా కెరీర్‌కు ఇప్పుడు బాగా ఉపయోగపడుతుంది. ► చెన్నైలో శిక్షణ పూర్తయిన తర్వాత ప్రముఖ ఐటీ కంపెనీలో పనిచేస్తూ.. ఆర్గన్ డొనేషన్, ఇతర సోషల్ వర్క్ చేసేవాడిని. నా సోషల్ వర్క్ చూసి మా బావ గల్లా జయదేవ్ ఇంప్రెస్ అయి మహేశ్‌బాబు సినిమాలో ఆఫర్ ఇస్తాడేమో అనుకొనే వాడిని. అలాంటి పరిస్థితుల్లో ఓ నిర్మాత.. నన్ను చూసి ఓ లవ్ స్టోరి సినిమాలో ఆఫర్ ఇచ్చారు. కానీ నా తొలి సినిమా రిలీజ్ ఆగిపోయింది. ► నా తొలి సినిమా రిలీజ్ ఆలస్యమైన సమయంలో.. నేను టెన్షన్ పడిపోయాను. అలాంటి సమయంలో జెట్టీ మూవీలో ఆఫర్ ఇచ్చారు. కోస్తాంధ్రకు జెట్టిలు ఎందుకు అవసరం? సముద్ర తీర ప్రాంతాన్ని, సముద్రాన్ని కలిపే వంతెనను జెట్టి. ఈ జెట్టి అవసరం ఏమిటనే కోణంలో కథ సాగుతుంది. మేము కఠారిపాలెం ప్రాంతంలో ఉన్న జెట్టి ఏరియాలో సంస్కృతి, సంప్రదాయాల నేపథ్యంగా సాగుతుంటాయి. ► జెట్టీ సినిమా నవంబర్ 4న తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 200 థియేటర్లలో రిలీజ్ అవుతుంది. జెట్టీ సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేయించడానికి ఇటీవల గోపిచంద్ మలినేనిని కలిశాను. మా ట్రైలర్ చూసిన తర్వాత.. క్రాక్ సినిమాలో ఇలాంటి సీన్లు చేయాలని అనుకొన్నాను. కానీ లైటింగ్, సమయం లేకపోవడం వల్ల మీరు తీసిన సీన్లు తీయలేకపోయాం. జెట్టీలో సీన్లు చాలా అద్బుతంగా ఉన్నాయి అని ప్రశంసించారు. దాంతో జెట్టి సినిమాపై మాకు మంచి నమ్మకం కలిగింది. ► ప్రస్తుతం జెట్టితోపాటు నా మొదటి సినిమా రిలీజ్‌కు రెడీగా ఉంది. తమిళంలో ఓ మంచి సినిమా ఆఫర్ వచ్చింది. నేను హీరోగానే కాకుండా ఎలాంటి పాత్రలైనా చేయడానికి సిద్దం. మంచి నటుడిగా గుర్తింపు పొందే పాత్రలను చేయడానికి రెడీగా ఉన్నాను. యాక్టింగ్ విషయంలో రానా, నవీన్ చంద్ర నాకు ఇన్సిపిరేషన్. నేను సొంతంగా 100 పైపర్స్ అనే సినిమా కథను రాసుకొన్నాను. నేటి సమాజంలో ప్రేమలు, బ్రేకప్స్ లాంటి అంశాలతో కథ ఉంటుంది. తమిళ సినిమా తర్వాత నేను నా కథను సెట్స్‌కు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాను. చదవండి: అనసూయ అరిపై నెట్‌ఫ్లిక్స్ గురి బాలాదిత్యపై కక్ష, బిగ్‌బాస్ ముద్దుబిడ్డ ఎలిమినేషన్? -
సండే సినిమా: వెండితెరపై జై జవాన్
సైనికులు అంటే యుద్ధం. దేశభక్తి. ప్రేమ. వియోగం. గెలుపు. మరణం. అందుకే ప్రపంచ సినిమాతో పాటు భారతీయ సినిమాలో తెలుగు సినిమాలో కూడా సైనికుడు కథానాయకుడు అవుతాడు. ‘సీతా రామమ్’లో హీరో సైనికుడు. ప్రేక్షకులు ఆ పాత్రను మెచ్చుకున్నారు. గతంలోనూ ఇలాగే మెచ్చారు. కాని నిజం చెప్పాలంటే తెలుగు సినిమాకు సైనికుడు అంతగా అచ్చి రాలేదు. ‘సండే సినిమా’లో ఈవారం ‘సైనిక సినిమా’. తెలుగు సినిమాల్లో సైనికుణ్ణి ఎక్కువగా తీసుకోరు. సైనికుడు అంటే ప్రేక్షకులు ఒక రకంగా ప్రిపేర్ అవుతారు... ఏ వీరమరణం పొందుతాడోనని. అదీగాక ఉత్తరాది వారితో పోలిస్తే దక్షిణాది వారికి సైనికులతో మానసిక అటాచ్మెంట్ తక్కువ. ఉత్తరాది వారే ఎక్కువగా సైన్యంలో భర్తీ కావడం ఇందుకు కారణం. అయినప్పటికీ మనవాళ్లు సైనిక నేపథ్యం ఉన్న పూర్తి సబ్జెక్ట్‌లను లేదా ఫ్లాష్‌బ్యాక్ కోసం కథ మలుపు కోసం సైనికుల సినిమాలు తీశారు. ‘నా జన్మభూమి ఎంత అందమైన దేశము’ అని ఏ.ఎన్.ఆర్ ‘సిపాయి చిన్నయ్య’ చేశారు. అది ఒక మోస్తరుగా ఆడింది. అదే అక్కినేని ‘జై జవాన్’లో నటిస్తే ప్రేక్షకులు మెచ్చలేదు. ఎన్.టి.ఆర్. ‘రాము’లో మిలట్రీ జవాను. హిట్ అయ్యింది. కాని అదే ఎన్.టి.ఆర్ నటించిన ‘బొబ్బిలిపులి’ సైనిక సినిమాల్లోకెల్లా పెద్ద హిట్‌గా ఇప్పటికీ నిలిచి ఉంది. అందులోని ‘జననీ జన్మభూమిశ్చ’ పాట దేశభక్తి గీతంగా మార్మోగుతూ ఉంది. కృష్ణ ‘ఏది ధర్మం ఏది న్యాయం’లో మిలట్రీ కేరెక్టర్ చేస్తే ఆడలేదు. కృష్ణ మరో సినిమా ‘చీకటి వెలుగులు’ కూడా అంతే. శోభన్ బాబు ‘బంగారు కలలు’ (ఆరాధన రీమేక్)లో ఎయిర్‌ఫోర్స్ ఆఫీసర్‌గా కనిపిస్తాడు. చిరంజీవి సైనికుడిగా నటించిన భారీ చిత్రం ‘యుద్ధభూమి’ సినీ సైనిక సెంటిమెంట్ ప్రకారం ఫ్లాప్ అయ్యింది. దీనికి దర్శకత్వం కె.రాఘవేంద్రరావు. అదే రాఘవేంద్రరావు దర్శకత్వంలో చిరంజీవి ఎయిర్‌ఫోర్స్ కస్టమ్స్ ఆఫీసర్‌గా ‘చాణక్య శపథం’లో నటించినా ఫలితం అదే వచ్చింది. బాలకృష్ణ ‘విజయేంద్ర వర్మ’, ‘పరమవీర చక్ర’ తగిన ఫలితాలు రాబట్టలేదు. కాని ‘మంగమ్మ గారి మనవడు’లో చిన్న సైనిక నేపథ్యం ఉంటుంది. ఆ సినిమా పెద్ద హిట్ అయ్యింది. రాజశేఖర్ నటించిన ‘మగాడు’ పెద్ద హిట్ అయితే ‘అంగరక్షకుడు’, ‘ఆగ్రహం’ విఫలం అయ్యాయి. నాగార్జున ‘నిన్నే ప్రేమిస్తా’లో సైనికుడిగా కనిపిస్తాడు. సుమంత్ ‘యువకుడు’, ‘స్నేహమంటే ఇదేరా’లో సైనిక పాత్రలు చేశాడు. ఈ కాలం సినిమాలలో మహేశ్ బాబు నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ సూపర్‌హిట్ కొట్టింది. సరిహద్దులో రాయలసీమలో మహేశ్ ప్రతాపం చూపగలిగాడు. కామెడీ ట్రాక్ లాభించింది. అడవి శేష్ ‘మేజర్’ తెలుగులో అమర సైనికుల బయోపిక్‌ను నమోదు చేసింది. అల్లు అర్జున్ ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ మిశ్రమ ఫలితాలు సాధించింది. రానా ‘ది ఘాజీ అటాక్’ హిట్. నాగ చైతన్య ‘లాల్‌సింగ్ చడ్డా’లో తెలుగు సైనికుడిగా కనిపిస్తాడు. ఈ సైనిక సెంటిమెంట్ గండాన్ని దాటి ‘సీతా రామమ్’ పెద్ద విజయాన్ని నమోదు చేసింది. ఇందులో రామ్ అనే సైనికుడు నూర్జహాన్ అలియాస్ సీతామహాలక్ష్మి అనే యువరాణితో ప్రేమలో పడటమే కథ. దుల్కర్ సల్మాన్, మృణాల్ పాత్రలు తెర మీద మంచి కెమిస్ట్రీని సాధించాయి. పాటలు మనసును తాకాయి. హిమాలయ సానువులు, మంచు మైదానాలు కూడా ఈ కథలో భాగమయ్యి కంటికి నచ్చాయి. గొప్ప ప్రేమకథలు విషాదాంతం అవుతాయి అన్నట్టుగా ఈ కథ కూడా విషాదాంతం అవుతుంది. అందుకే ప్రేక్షకులకు నచ్చింది. బాంధవ్యాలను, కుటుంబాలను వదిలి దేశం కోసం పహారా కాసే వీరుడు సైనికుడు. అతని చుట్టూ ఎన్నో కథలు. ఆ కథలు సరిగా చెప్తే ఆదరిస్తామని ప్రేక్షకుడు అంటున్నాడు. మున్ముందు ఎలాంటి కథలు వస్తాయో చూద్దాం. -
టాలీవుడ్లో షూటింగులు తిరిగి ప్రారంభం?
టాలీవుడ్లో త్వరలోనే షూటింగులు పునఃప్రారంభం కానున్నాయి. నేడు (గురువారం)ఫిల్మ్ ఛాంబర్ కీలక ప్రెస్‌మీట్ నిర్వహించనుంది. ఈ కార్యక్రమంలో ఇండస్ట్రీలో ప్రస్తుతం నిలిచిపోయిన షూటింగులు తిరిగి ప్రారంభించడంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం టాలీవుడ్లో వరుసగా మూడు సినిమాలు హిట్ కావడం, బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబడుతుండటంతో మళ్లీ షూటింగులు ప్రారంభించాలన్న నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఈనెల 22 నుంచే షూటింగులు ప్రారంభం కానున్నట్లు సమాచారం. కాగా సినిమాలకు అవుతున్న అధిక బడ్జెట్,ఓటీటీ విడుదల సహా ఇండస్ట్రీలో నెలకొన్న సమస్యల కారణంగా ఆగస్ట్1 నుంచి షూటింగ్స్‌ను ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ వాయిదా వేసిన సంగితి తెలిసిందే. -
ఇవాళ్టి నుంచి తెలుగు సినిమా షూటింగ్ లు బంద్
-
రేపటి నుంచి తెలుగు సినిమా షూటింగ్ లు బంద్
-
హిందీ సినిమాలు చేయాల్సిన అవసరం లేదు: మహేశ్ బాబు
సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. పరుశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మహేశ్ సరసన కీర్తి సురేష్ నటిస్తుంది. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న మహేశ్ ఓ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం అందరూ స్టార్ హీరోలు హిందీ సినిమాలు చేస్తున్నారు. మరి మీరెప్పుడు డైరెక్ట్ హిందీ సినిమా చేస్తున్నారు? అని జర్నలిస్ట్ అడగ్గా.. 'బాలీవుడ్ జనాలను మెప్పించాలంటే హిందీలో సినిమా చేయాల్సిన అవసరం లేదు. తెలుగులో సినిమాలు తీసినా చాలు. ఇప్పుడు తెలుగు చిత్రాలను ప్రపంచమంతా చూస్తున్నారు. ప్రస్తుతం జరుగుతోంది అదే. అలాంటప్పుడు నువ్వైనా సరే తెలుగు సినిమాలు చేస్తే చాలనుకుంటావు అంటూ తనదైన పంచ్ డైలాగ్‌తో ఆన్సరిచ్చాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇటీవలె బాలీవుడ్ హీరో జాన్ అబ్రహం రీసెంట్గా తాను తాను హిందీలో తప్ప మరే ఇతర భాషల్లో నటించనంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. ఇలాంటి వాళ్లకు మహేష్ సైలెంట్‌గా కౌంటర్ వేశారంటూ కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. Mahesh Babu Reply To Media About His Bollywood Entry. pic.twitter.com/T8iJlJ1487 — Naveen MB Vizag 🔔 (@NaveenMBVizag) April 6, 2022 -
ఏక్ నిరంజన్
-
తెలుగు సినిమా టార్గెట్ @ ఆల్ ఇండియా
తెలుగు సినిమా టార్గెట్ మారిపోయింది. టార్గెట్ ఆల్ ఇండియా అయిపోయింది. పరభాషలకు హాయ్ చెబుతోంది. అన్ని భాషలకూ సరిపోయే కథలతో సినిమాలు తీస్తోంది. ప్యాన్ ఇండియా లెవల్లో విడుదల చేస్తోంది. ప్రస్తుతం ‘ఆన్ సెట్’ మీద డజనుకి పైగా ప్యాన్ ఇండియా చిత్రాలు ఉన్నాయి. ప్రకటించిన చిత్రాలు అరడజను పైనే ఉన్నాయి. భవిష్యత్తు అంతా ప్యాన్ ఇండియా సినిమాలతో తెలుగు పరిశ్రమ ‘ప్యాన్మయం’ కానుంది. ప్రభాస్ ‘బాహుబలి’కి ప్రేక్షకులు భళా అన్నారు. ప్యాన్ ఇండియా లెవల్లో రిలీజైన ‘బాహుబలి’ బాక్సాఫీస్ రికార్డ్స్ కూడా భళా అనిపించాయి. ఆ తర్వాత కన్నడ స్టార్ యశ్ హీరోగా నటించిన ‘కేజీఎఫ్’ ప్యాన్ ఇండియా స్థాయిలో విడుదలై, బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. కన్నడ ఇండస్ట్రీలో వందకోట్ల వసూళ్లు సాధించిన చిత్రంగా ‘కేజీఎఫ్’ నిలిచింది. ఇటు తెలుగు ‘బాహుబలి’ అటు కన్నడ ‘కేజీఎఫ్’ దేశవ్యాప్తంగా ప్రేక్షకులను అలరించడంతో దర్శక–నిర్మాతలు, హీరోల టార్గెట్ మారింది. సినిమాల ప్లానింగ్ ప్యాన్ ఇండియా స్థాయిలో జరగడం మొదలైంది. తెలుగులో తొలి ప్యాన్ ఇండియన్ స్టార్ అనిపించుకున్న ప్రభాస్ ‘బాహుబలి’ తర్వాత అంగీకరించిన ‘రాధేశ్యామ్, సలార్, ఆదిపురుష్’ అన్నీ ప్యాన్ ఇండియన్ సినిమాలే. భవిష్యత్‌లో కూడా ప్రభాస్ సినిమా అంటే ఇక అది ప్యాన్ ఇండియన్ మూవీయే అన్నట్లుగా సీన్ మారింది. దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ‘రాధేశ్యామ్’ ఈ ఏడాది థియేటర్స్‌లోకి రానుంది. ఇప్పటికే షూటింగ్ మొదలు పెట్టిన ‘సలార్’, ‘ఆదిపురుష్’ చిత్రాలు వచ్చే ఏడాది విడుదల కానున్నాయి. ఇక పవన్ కల్యాణ్ తొలి ప్యాన్ ఇండియా మూవీ ‘హరిహర వీరమల్లు’ చేస్తున్నారు. క్రిష్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. మరోవైపు జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్ ఒకేసారి ప్యాన్ ఇండియన్ మూవీ లైన్లోకి వచ్చారు. జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘రౌద్రం.. రణం.. రుధిరం’ (ఆర్ఆర్ఆర్) చిత్రం దాదాపు పధ్నాలుగు భాషల్లో విడుదల కానుంది. విదేశీ భాషల్లోనూ ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం విడుదల కానుండటం విశేషం. మరో హీరో అల్లు అర్జున్‌కు ఆల్రెడీ మలయాళ పరిశ్రమలో మల్లు అర్జున్ అని పేరు ఉంది. ఇలాంటి క్రేజ్‌నే ఇండియా లెవల్లో సంపాదించుకోవాలని అల్లు అర్జున్ ‘పుష్ప’ అవతారం ఎత్తాడు. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ప్యాన్ ఇండియా లెవల్లో విడుదల కానుంది. అంతేకాదు.. ‘పుష్ప’ చిత్రం రెండు భాగాలుగా రిలీజ్ కానుంది. ఇప్పటికే ఫస్ట్ పార్ట్ షూటింగ్ దాదాపు పూర్తయింది. రెండో భాగం ఆరంభమైంది. తొలి భాగం ఈ ఏడాది చివర్లో విడుదలయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. చిన్న చిన్న క్యారెక్టర్లు చేస్తూ, హీరోగా ఎదిగి ‘అర్జున్‌రెడ్డి’ ‘గీత గోవిందం’ వంటి హిట్స్‌తో విజయ్ దేవరకొండ క్రేజీ స్టార్ అయిపోయారు. యూత్‌లో విజయ్‌కు ఉన్న ఫాలో యింగ్ మరో ప్లస్. ప్యాన్ ఇండియా సినిమాల ఖాతాలో విజయ్ దేరకొండ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న ‘లైగర్’ కూడా ఉంది. మరో హీరో అడివి శేష్ అయితే క్షణం, గూఢచారి, ఎవరు వంటి మీడియమ్ బడ్జెట్ చిత్రాలు చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు శేష్ ప్యాన్ ఇండియా మూవీ ‘మేజర్’లో నటిస్తున్నారు. ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా, కోవిడ్ సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడింది. కెరీర్లో యాభైకి పైగా సినిమాలు చేసిన హీరోయిన్ సమంత నటిస్తున్న తొలి ప్యాన్ ఇండియన్ మూవీ ‘శాకుంతలం’. దుష్యంతుడు–శకుంతల ప్రేమకావ్యంగా గుణశేఖర్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పుడు ఓ పెద్ద హీరో, ఓ పెద్ద డైరెక్టర్ కాంబినేషన్ అంటే ప్యాన్ ఇండియా మూవీ అనే ట్రెండ్ నడుస్తోంది. రానున్న రోజుల్లో బహు భాషా చిత్రాల నిర్మాణం ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఇంకా... మహేశ్‌బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో ప్రకటించిన సినిమా ప్యాన్ ఇండియా లెవల్లోనే తెరకెక్కనుంది. హీరో ప్రభాస్, దర్శకుడు నాగ్ అశ్విన్ కాంబినేషన్లో రాబోయేది కూడా ప్యాన్ ఇండియా మూవీయే. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్ కమిట్ అయినవి కూడా ప్యాన్ ఇండియన్ మూవీసే. దర్శకులు కొరటాల శివ, ప్రశాంత్ నీల్లతో ప్యాన్ ఇండియన్ సినిమాలు చేయనున్నారు జూనియర్ ఎన్టీఆర్. దర్శకుడు శంకర్‌తో ప్యాన్ ఇండియన్ మూవీ కమిటయ్యారు రామ్‌చరణ్. దర్శకుడు శేఖర్ కమ్ములతో ధనుష్, వంశీ పైడిపల్లితో తమిళ హీరో విజయ్ ప్యాన్ ఇండియన్ అప్పీల్‌కు రెడీ అయిన సంగతి తెలిసిందే. రానాతో ప్యాన్ ఇండియన్ సినిమా చేయనున్నట్లు నిర్మాతలు ఆచంట గోపీనాథ్, సీహెచ్ రాంబాబు గతంలో ప్రకటిం చారు. దర్శకులు ప్రశాంత్ నీల్, వేణు శ్రీరామ్‌లతో అల్లు అర్జున్ ప్యాన్ ఇండియా సినిమాలు చేయనున్నారనే ప్రచారం సాగుతోంది. వీటితో పాటు మరికొన్ని ప్యాన్ ఇండియన్ సినిమాల అనౌన్స్మెంట్స్ వచ్చాయి. కొన్ని రానున్నాయి. -
జాతీయ సినీ అవార్డు విజేతలకు సీఎం జగన్ అభినందనలు
సాక్షి, అమరావతి: జాతీయ సినిమా అవార్డు విజేతలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందనలు తెలిపారు. జాతీయ అవార్డులు గెలుచుకున్న తెలుగు సినిమా నిర్మాతలు, నటీనటులు, సాంకేతిక నిపుణులకు ఆయన శుభాకాంక్షలు చెప్పారు. ఈ మేరకు సీఎంవో అధికారులు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. -
ఓపెన్ సెసేమ్...
ఎనిమిదిన్నర నెలల పైగా విరామం... వేలాది సినీ కార్మికుల సుదీర్ఘ నిరీక్షణ... లక్షలాది సినీ ప్రియుల ఆకాంక్ష... ఎట్టకేలకు ఫలిస్తోంది. తెలుగు నేలపై మరో రెండురోజుల్లో... తెలంగాణలో సినిమా హాళ్ళు తెరిచేందుకు మల్టీప్లెక్స్ యజమానులు సిద్ధమవుతున్నారు. క్రిస్టఫర్ నోలన్ రూపొందించిన లేటెస్ట్ హాలీవుడ్ చిత్రం ‘టెనెట్’ లాంటి వాటితో ఈ శుక్రవారం నుంచి మళ్లీ గల్లాపెట్టెలు గలగలలాడాలని ఆశిస్తున్నారు. తెలుగు సినీవ్యాపారంలో సింహభాగమైన నైజామ్ ఏరియాలో, అందులోనూ అతి కీలకమైన హైదరాబాద్‌లో హీరో మహేశ్ బాబు – ఏషియన్ ఫిల్మ్స్ నారంగ్ కుటుంబానికి చెందిన అధునాతన మల్టీప్లెక్స్ ‘ఏ.ఎం.బి. సినిమాస్’ ఈ 4వ తేదీ నుంచి ఇంగ్లీషుతో పాటు తెలుగు, తమిళ, హిందీల్లో వస్తున్న ‘టెనెట్’తో మళ్లీ ఓపెన్ అవుతోంది. కొత్త తెలుగు సినిమాలేవీ లేకపోవడంతో ప్రస్తుతానికి పాత ఇంగ్లీషు, హిందీ, ప్రాంతీయ భాషా చిత్రాలను ప్రదర్శించనుంది. అయితే, లిమిటెడ్ షోలు మాత్రమే వేయనున్నట్లు ‘ఏ.ఎం.బి’ ప్రతినిధులు చెబుతున్నారు. అలాగే, ఐనాక్స్, పి.వి.ఆర్, సినీప్లెక్స్ లాంటి ఇతర మల్టీప్లెక్సులు సైతం పరిమిత షోలతో తమ హాళ్ళు తెరిచేందుకు సన్నాహాలు చేసుకుంటున్నాయి. ఈ ప్రయత్నం సఫలమై, జనం నెమ్మదిగా థియేటర్ల దారి పడితే గనక, మార్చి నెల మధ్య నుంచి తెలుగు నేలపై మూసి ఉన్న సినిమా హాళ్ళు నిదానంగా అయినా కళకళలాడతాయి. ఆల్ రెడీ... ఆంధ్రాలో... నిజానికి ఉత్తరాదిన ముంబయ్ లాంటి ప్రాంతాలలోనూ, కర్ణాటక, తమిళనాడు, అలాగే ఆంధ్రప్రదేశ్‌లో సినిమా హాళ్ళు పరిమితంగానైనా ఇప్పటికే తెరుచుకున్నాయి. కేంద్ర ప్రభుత్వ అన్ లాక్ డౌన్ మార్గదర్శకాలకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్టోబర్ మధ్య నుంచే సినిమా ప్రదర్శనలకు అనుమతించింది. మొదట తటపటాయించినా, ఆపైన ఎగ్జిబిటర్లు దసరా, దీపావళి టైమ్‌కి ధైర్యం చేశారు. పూర్తిస్థాయిలో కాకపోయినా, విజయవాడ, విశాఖపట్నం లాంటి నగరాలతో పాటు గుంటూరు, నరసరావుపేట, చిలకలూరిపేట లాంటి కేంద్రాలలో ఇప్పటికే కొన్ని నాన్ ఏ.సి. హాళ్ళు తెరుచుకున్నాయి. హాళ్ళలో సగం సీటింగ్ కెపాసిటీకే ప్రభుత్వం అనుమతించింది. మరోవైపు పెరిగిన శానిటైజేషన్ ఖర్చులు, కట్టాల్సి వచ్చిన లాక్డౌన్ కరెంట్ బిల్లుల బకాయిలు భయపెడుతున్నాయి. అయినప్పటికీ అలవాటైన వ్యాపారాన్ని వదిలి పోలేక, సొంత థియేటర్ల యజమానులు మాత్రం కష్టం మీదనే హాళ్ళు నడుపుతున్నారు. తెనాలి, చిలకలూరిపేట మొదలు అనేక కేంద్రాలలో కొంతమంది పాతకాలపు రీలు ప్రింట్లతో, కొందరు పెన్ డ్రైవ్‌లతో ‘వేటగాడు’, ‘కొండవీటి సింహం’, ‘మనుషులంతా ఒక్కటే’ లాంటి పాత ఎన్టీఆర్ సూపర్ హిట్లను ప్రదర్శిస్తూ, ఆశాజనకంగా వ్యాపారం సాగిస్తుండడం విశేషం. పబ్లిసిటీ అందుబాటులో ఉన్న అలాంటి ఓల్డ్ హిట్ చిత్రాలు ఈ కష్టకాలంలో ఆపద్బాంధవులయ్యాయి. అలాగే, తెరిచిన కొన్ని మల్టీప్లెక్సులు, సింగిల్ స్క్రీన్ థియేటర్లు కరోనాకు ముందు రిలీజైన లేటెస్ట్ పాత సినిమాలను ప్రదర్శిస్తున్నాయి. ఈ ఏడాది సంక్రాంతికి వచ్చి, కరోనా దెబ్బతో ఈ సంవత్సరం దక్కిన అతి కొద్ది హిట్లు – అల్లు అర్జున్ ‘అల వైకుంఠపురములో’, మహేశ్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’, నితిన్ ‘భీష్మ’, వగైరా. తక్షణమే కొత్త సినిమాలేవీ రిలీజుకు లేక ఈ పాత హిట్లే తాజాగా ఓపెనైన థియేటర్లకూ, ప్రేక్షకులకూ దిక్కయ్యాయి. షో ఖర్చులు రాకపోయినా, ఒకవేళ ఖర్చులు పోనూ రెండు, మూడు వేల లాభమే వస్తున్నా సొంత థియేటర్లున్నవాళ్ళు రిస్కు చేస్తున్నారు. ప్రేక్షకులు భారీయెత్తున రాకపోయినా, అసలంటూ థియేటర్లకు రావడాన్ని మళ్లీ జనానికి అలవాటు చేయడమే లక్ష్యంగా ఈ కొద్ది హాళ్ళు నడుస్తుండడం గమనార్హం. జనాన్ని రప్పించడం కోసం... కాగా, ఇప్పుడు తెలంగాణలోనూ హాళ్ళు తెరిచిన వారం తరువాత ఈ డిసెంబర్ 11న ‘కరోనా వైరస్’ సినిమాతో దర్శక, నిర్మాత రామ్ గోపాల్ వర్మ జనం ముందుకు రానున్నారు. లాక్ డౌన్ మొదలైన తొలి రోజుల్లోనే తక్కువ రోజుల్లో, అతి తక్కువ యూనిట్‌తో, దాదాపు ఒకే ఇంట్లో, తన శిష్యుడి దర్శకత్వంలో వర్మ నిర్మించిన చిత్రం ఇది. వివిధ భాషల్లో డబ్బింగ్ చేస్తూ, అన్ని పనులూ పూర్తయినా, చాలాకాలంగా రిలీజ్ చేయకుండా వర్మ ఆపిన ఈ చిత్రం ఇప్పుడీ అన్ లాక్డౌన్ వేళ ఎన్ని థియేటర్లలో, ఎంత భారీగా రిలీజవుతుందో చెప్పలేం. అయితే, హాళ్ళు తీయగానే రిలీజైన తొలి చిత్రమనే క్రెడిట్ దక్కించుకొనేలా ఉంది. అదే రోజున హిందీ చిత్రం ‘ఇందూ కీ జవానీ’ రిలీజుకు సిద్ధమవుతోంది. ఆ తరువాత సరిగ్గా రెండు వారాలకు డిసెంబర్ 25వ తేదీ, క్రిస్మస్ నాడు సాయిధరమ్ తేజ్, నభా నటేశ్ నటించిన ‘సోలో బ్రతుకే సో బెటర్’ తొలి పెద్ద సినిమాగా థియేటర్లలో రానుంది. అయితే, కరోనా అనంతరం సోషల్ డిస్టెన్స్, మాస్కుల న్యూ నార్మల్ ప్రపంచంలో థియేటర్లకు ఏ మేరకు జనం వస్తారు, ఏ సినిమాలు ఏ మేరకు వసూళ్ళు తెస్తాయన్నది ఇప్పటికీ కోట్ల రూపాయల ప్రశ్నే. ఇంట్లో కూర్చొని టీవీలో ఓటీటీ చూడడానికి కొద్ది నెలలుగా అలవాటుపడిపోయిన జనాన్ని ఇంటి నుంచి హాలుకు తీసుకురావడం ఇప్పుడో పెద్ద సవాలు. పేరున్న పెద్ద స్టార్ల సినిమాలు వస్తే కానీ, జనం హాళ్ళకు క్యూలు కట్టేలా లేరు. అలాంటి సినిమాలు రావడానికి కనీసం సంక్రాంతి సీజన్ దాకా ఆగాల్సిందే. అందుకే, కొత్త సినిమా కంటెంట్ లేని ప్రస్తుత పరిస్థితుల్లో ఇటీవల ఓటీటీల్లో వచ్చి హిట్టయిన సూర్య ‘ఆకాశం నీ హద్దురా’ లాంటి సినిమాలను ఇప్పుడు హాళ్ళలో రిలీజ్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. లేటెస్ట్గా ఓటీటీలో పాజిటివ్ టాక్ సంపాదించుకున్న ‘మిడిల్ క్లాస్ మెలొడీస్’ చిత్రాన్ని కూడా పరిమితంగానైనా హాళ్ళలోకి తీసుకువద్దామంటే, 60 రోజుల గడువు నిబంధన ఉన్నట్టు సమాచారం. ఆటకు సగటున పాతిక టికెట్లే! మరోవైపు ఇప్పటికే అనేక కష్టనష్టాలతో అల్లాడుతున్న సినిమా వ్యాపారానికి, మరీ ముఖ్యంగా ఎగ్జిబిటర్ సెక్టార్ అయిన సినిమా హాళ్ళకు కరోనా గట్టి దెబ్బే కొట్టింది. ఒక్క హైదరాబాద్‌లోనే బిజీ సెంటర్లలో కనీసం 12 నుంచి 15 పేరున్న సినిమా హాళ్ళు ఇప్పుడు శాశ్వతంగా మూతబడ్డాయి. గోడౌన్లుగా, కల్యాణమండపాలుగా మారిపోయాయి. ఆంధ్ర ప్రాంతంలోనూ ఇదే దుఃస్థితి. పెరిగిన ఖర్చులు, తగ్గిన సీటింగ్ కెపాసిటీ, కరోనా కాలంలో క్యాంటీన్ ఫుడ్ పట్ల జనం అనాసక్తి లాంటి అనేక కారణాల మధ్య అన్ని ప్రాంతీయ భాషా సినీసీమల్లోనూ ఇలాంటి పరిస్థితే కనిపిస్తోంది. హాళ్ళు తెరిచినా, జనం పెద్దగా రావడం లేదు. తమిళనాట నవంబర్ 10వ తేదీ నుంచే హాళ్ళు తెరవడం మొదలుపెట్టారు. ఇప్పటికి మూడు వారాలు గడిచినా, అక్కడి ప్రసిద్ధ మల్టీప్లెక్సుల్లో ఆటకు సగటున పాతిక టికెట్లే తెగుతుండడం గమనార్హం. సింగిల్ స్క్రీన్లలో కూడా ప్రభుత్వం అనుమతించిన సగం సీటింగ్ కెపాసిటీలో సైతం 20 నుంచి 25 శాతమే నిండుతున్నాయని చెన్నై సినీ వర్గాలు ‘సాక్షి’కి తెలిపాయి. సంక్రాంతి సీజన్‌కైనా..? జనం రావాలంటే, పెద్ద తారల సినిమాలు రిలీజవ్వాలి. కానీ, పదుల కోట్ల ఖర్చుతో తీసిన భారీ బడ్జెట్ సినిమాలను ఈ సగం సీటింగ్ కెపాసిటీ టైములో హాళ్ళలో రిలీజ్ చేస్తే, నిర్మాతలకూ, బయ్యర్లకూ గిట్టుబాటు కాదు. కాబట్టి, తమిళనాట విజయ్ ‘మాస్టర్’ లాంటి భారీ చిత్రాలను రానున్న సంక్రాంతికి సైతం రిలీజ్ చేయకపోవచ్చని టాక్. తెలుగునాట కూడా ఇదే డైలమా నడుస్తోంది. వచ్చే ఏడాది సంక్రాంతి సీజన్ రిలీజుల రేసులో పవన్ కల్యాణ్ ‘వకీల్ సాబ్’, రామ్ ‘రెడ్’, రానా ‘అరణ్య’, రవితేజ ‘క్రాక్’, ఆ పైన వైష్ణవ్ తేజ్ ‘ఉప్పెన’, నాగ చైతన్య ‘లవ్ స్టోరీ’, అఖిల్ ‘మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్‌లర్’ లాంటి పేర్లు వినిపిస్తున్నాయి. అయితే, కరోనా సెకండ్ వేవ్, ఈ డిసెంబర్లో హాళ్ళు మరిన్ని తెరిచాక ‘సోలో బ్రతుకు సో బెటర్’ లాంటి చిత్రాలకు వచ్చే జనం స్పందనను బట్టి ఈ రిలీజుల్లో మార్పులు చేర్పులు తప్పేలా లేవు. అందుకే, ఇది ఒక రకంగా పెళ్ళి కుదిరితే కానీ పిచ్చి కుదరదు... పిచ్చి కుదిరితే కానీ పెళ్ళి కుదరదు లాంటి పరిస్థితి. జనం రావాలంటే పెద్ద సినిమాలు రావాలి. పెద్ద సినిమాలు రిలీజు కావాలంటే, హాళ్ళలో ఫుల్ కెపాసిటీ జనం కావాలి. మరి, కరోనాకు టీకా వచ్చేలోగానే ఈ పరిస్థితి మారేందుకు సినీ వ్యాపారంలో మధ్యంతర మార్గం మరేదైనా దొరుకుతుందేమో చూడాలి. ఇప్పుడు ఎలాగోలా థియేటర్లు ఓపెన్ కావడం మాత్రం ఆ ప్రయత్నంలో ఓ తొలి అడుగు అనుకోవచ్చు. – రెంటాల జయదేవ -
అక్కినేని నాగార్జున స్పెషల్ ఫోటోలు
-
నా కల నెరవేరింది: పాయల్ రాజ్‌పుత్
సాక్షి, హైదరాబాద్: ఆర్ఎక్స్ 100తో ఒక్కసారిగా స్టార్ అయిపోయిన ముద్దుగుమ్మ పాయల్ రాజ్‌పుత్. తన అందాల ఆరబోతతో యువకులను కట్టిపడేస్తుంటుంది. వెంకటేష్, రవితేజ లాంటి స్టార్ హీరోలతో కూడా జతకట్టింది ఈ భామ. ఇప్పుడు తాజాగా తన కలనెరవేరింది అని మురిసిపోతుంది ఈ భామ. తెలుగులో డబ్బింగ్ చెప్పడం తన కల అని, ప్రస్తుతం తెరకెక్కుతున్న ఒక సినిమాలోని తన పాత్రకు డబ్బింగ్ చెప్పనంటూ సోషల్ మీడియా ఖాతాలో ఫోటోలు షేర్ చేసింది. జయంత్ సి పరాన్జీ డైరెక్షన్లో పాయల్ ‘నరేంద్ర’ అనే సినిమాలో నటిస్తోంది. ఇది ఇండో-పాక్ బోర్డర్ లో జరిగే కథతో రూపొందుతుంది. ఈ సినిమాలో పాయల్ ఒక కీలకమైన పాత్రలో నటిస్తోంది. My first dub in telugu 🎬 pic.twitter.com/zuYFfEVBel — paayal rajput (@starlingpayal) September 11, 2020 చదవండి: డ్రగ్స్ కేసులో రకుల్పప్రీత్, సారా అలీఖాన్ పేర్లు? -
84 ఏళ్ల వయస్సులోనూ అదే ఉత్సాహం
-
‘అందుకే అమ్మను సుత్తి ఆంటీ అని పిలిచేవారు’
‘అసలు మనం ఎవరం’... ‘తండ్రీ కొడుకులం’...‘కాదు భారతీయులం’.. ‘నీ నూనె నీ నూనే నా నూనె నా నూనే’... హైదరాబాద్, ముస్తాబాదు, సికిందరాబాదు’...‘నీ నవరంధ్రాల్లోను మైనం కూరతానురా తలకు మాసిన కుంకా’... ఇటువంటి అనేక హాస్య సంభాషణలతో తెలుగు చలన చిత్ర పరిశ్రమలో చిరస్థాయిగా నిలిచారు సుత్తి వీరభద్రరావు. ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో నాటక విభాగంలో హీరోగా నటించిన వీరభద్రరావు, జంధ్యాల మార్కు సినిమాలతో సుత్తి వీరభద్రరావుగా తెలుగు సినీ ప్రపంచంలో స్థిర పడి పోయారు. వేలుతో కలిసి సుత్తి జంటగా ప్రేక్షకుల గుండెల్లో నేటికీ సుత్తి కొడుతూనే ఉన్నారు. నేడు(జూన్ 30) సుత్తివీరభద్రరావు వర్థంతి. ఈ సందర్భంగా ఆయన కుమారుడు మామిడిపల్లి చక్రవర్తితో ఈ వారం సినీ పరివారం. నాన్నగారికి మేం ఇద్దరు పిల్లలం. నేను, నా తరవాత చెల్లాయి విజయనాగలక్ష్మి. నా కంటె రెండేళ్లు చిన్నది. అమ్మ పేరు శేఖరి. నాన్నగారు 1971లో ఆలిండియా రేడియోలో చేరారు. నేను 1972లో పుట్టాను. నేను పుట్టాక నాన్నకు ప్రమోషన్ వచ్చిందని అందరితోనూ సంతోషంగా అనేవారట. మేం విజయవాడ కృష్ణలంకలో ఉండేవాళ్లం. సినిమాలలో నాన్న మామూలు వీరభద్రరావు నుంచి సుత్తి వీరభద్రరావు అయ్యాక అమ్మను అందరూ ‘సుత్తి ఆంటీ’ అని సరదాగా పిలిచేవారు. నాన్నకి సినిమా అవకాశాలు పెరగటంతో 1982లో ఆకాశవాణి ఉద్యోగం విడిచిపెట్టేసి చెన్నై షిఫ్ట్ అయ్యాం. కాబట్టి ఎనిమిదో క్లాసు నుంచి చెన్నైలోనే నా చదువు కొనసాగింది. పదో తరగతిలో ఫస్ట్ క్లాసు వచ్చినందుకు నాన్న సంబరపడ్డారు. నాన్న చనిపోయేనాటికి నేను ఇంటర్ సెకండియర్ చదువుతున్నాను. అమ్మ చాలా మొండి మనిషి. నాన్న మరణం తాలూకు బాధను దిగమింగి, ధైర్యంగా మమ్మల్ని ముందుకు నడిపించింది. ఇద్దరిని పోగొట్టుకున్నాను ఎమ్సెట్లో 3000 ర్యాంకు వచ్చినా మంచి కాలేజీలో సీటు రాలేదు. నాన్న కంప్యూటర్ సైన్స్ చదవమని చెప్పారు. అందులో సీటు రాకపోవటం తో, ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఉద్యోగం చేస్తూ, నైట్ కాలేజీలో బీఎస్సీ ఫిజిక్స్ చదువుకున్నాను. నేను బీఎస్సీలో చేరినప్పుడు దగ్గరి బంధువులంతా ‘బోడి బీఎస్సీ’ అని వెటకారమాడారు. అటువంటి సంఘటనలు ఎదురైనప్పుడు ‘కొందరికి దూరంగా ఉంటేనే బాగుపడతాం’ అనిపించింది. కొద్దిగా స్థిరత్వం వచ్చాక, పై చదువుల కోసం అమెరికా వెళ్లి, అక్కడ పి.జి. డిప్లమా ఇన్ మేనేజ్మెంట్ చేసి, నిలదొక్కుకున్నాక, ఇండియా వచ్చేశాను. చెల్లి ఎమ్మెస్సీ మాథమేటిక్స్ చేశాక 2002లో వివాహం చేశాను. నా జీవితంలో త్వరగా నాన్నని పోగొట్టుకోవడం ఒక దురదృష్టమైతే, చెల్లిని పోగొట్టుకోవటం మరో బాధాకర సంఘటన. ఆమెకు బ్రెస్ట్ క్యాన్సరు వచ్చి కన్నుమూసింది. చెల్లెలికి ఒక కూతురు. పేరు తనుశ్రీ. పదో తరగతి చదువుతోంది. బాధ్యతలు తీసుకున్నాను నాన్న పోవడం వల్ల ఒక కొడుకు మీద బాధ్యతలన్నీ వచ్చి చేరతాయి. అందుకు నేను కూడా అతీతం కాదు. జీవితంలో ఒక్కో మెట్టు ఎదుగుతున్నప్పుడు నాన్నను మిస్ అయ్యాననే భావన కలుగుతూనే ఉంటుంది. అంతలోనే ఆయన వెంట ఉన్నట్టు భావించుకుంటాను. నా వివాహం జరిగాక, యు.కె వెళ్లి కొంతకాలం తరవాత వెనక్కు వచ్చి, 2008లో సొంత కంపెనీ ప్రారంభించాను. ప్రస్తుతం ‘ప్రొడక్ట్ సర్వీస్ మేనేజ్మెంట్’ చేస్తున్నాం. విజయవాడలో... విజయవాడలో ఉన్న రోజుల్లో నాన్న హనుమంతరాయ గ్రంథాలయంలో వేసే నాటకాలకు వెళ్లేవాడిని. కన్యాశుల్కం నాటకం చూసినట్టు గుర్తు. చెన్నైలో నాన్నతో గడిపిన నాలుగు సంవత్సరాలు నాకు గోల్డెన్ పీరియడ్. ఆ టైమ్‌లో సినిమా షూటింగులు, డబ్బింగులకు నాన్నతో వెళ్లేవాడిని. శబరిమలకి వెళ్లినప్పుడు మా కారుకి ప్రమాదం జరిగింది. దేవుడి దయ వల్ల బయటపడ్డాం. అది నిజంగానే దేవుడి మహిమేనేమో అనిపిస్తుంది. నాన్నతో నాలుగు సార్లు శబరిమలకు వెళ్లడం మరచిపోలేని సంఘటన. అందుకోసమే ఉండిపోయాం నాన్న పోయేనాటికి నాన్నకు కొంతమంది సుమారు నాలుగు లక్షలు బాకీ ఉన్నారు. ఎవరెవరు ఇంతెంత ఇవ్వాలో నాన్న ఒక లిస్టు రాసి పెట్టారు. వాటిని తిరిగి రాబట్టుకోవటం కోసం చెన్నైలోనే ఉండిపోదాం అంది అమ్మ. నాలుగేళ్లు తిరిగితే మూడు లక్షలు తీసుకురాగలిగాను. పొద్దున్నే వెళ్లి నిర్మాతల దగ్గర నిలబడాల్సిందే. కొంతమంది నిర్మాతలు పరవాలేదు మరికొందరు ఇబ్బంది పెట్టారు. ఆ అనుభవమే నా భవిష్యత్తుకు పునాది అనుకుంటాను. ఇదంతా చూసి, జంధ్యాలగారు బాధపడి, నిర్మాతల బదులు ఆయన ఇచ్చిన సందర్భాలూ ఉన్నాయి. అమ్మ స్నేహితులు సపోర్ట్‌గా నిలబడ్డారు. దీపావళి నాన్నతోనే నాన్న షూటింగుల్లో ఎంత బిజీగా ఉన్నా, దీపావళికి మాత్రం మాతోనే గడిపేవారు. ఉదయమంతా షూటింగ్లలో బిజీగా ఉన్నప్పటికీ, చీకటి పడకుండా ఇంటికి వచ్చేసేవారు. నాన్న నటించిన చిత్రాలలో ‘పుత్తడిబొమ్మ’ బాగా ఇష్టం. ఆ సినిమాలో పెళ్లిలో ఒక పద్యం చదువుతారు. చాలా నవ్వొస్తుంది. ఆ చిత్రానికి నాన్నకు అవార్డు కూడా వచ్చింది. ‘రెండు రెళ్లు ఆరు’, ‘బాబాయ్ అబ్బాయి’ చిత్రాలలో నాన్న తన పాత్రను ఇంప్రొవైజ్ చేశారు. ‘పడమటి సంధ్యారాగం’ చిత్రంలో నాన్న డబ్బింగ్ చెప్పిన విధానం బావుంటుంది. కళాకారుడు కష్టాలన్నీ మరచిపోయి, వేదిక మీద ఆనందం పొందుతాడు. ఆ తరవాత ఆ ఆనందం వారి మీద స్వారీ చేస్తుంది. అందువల్లే నాన్న ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేసి ఉంటారు. ఏమైనప్పటికీ నాన్నను తలచుకోవటం నాకు ఆనందంగా ఉంది. మా దగ్గరే ఉన్నారన్న భావన... ఎన్నడూ బాధ్యతల నుంచి పారిపోలేదు. అమ్మ ఆశీర్వాదంతో ఇంటి బాధ్యతలన్నీ సక్రమంగా నెరవేర్చాను. నా భార్య పేరు కిరణ్మయి చావలి. తను ఆయుర్వేదిక్ డాక్టర్. మాకు ఒక అమ్మాయి. పేరు అనన్య. నాన్న సినిమాలు టీవీలో వస్తుంటే మా అమ్మాయికి చూపిస్తుంటాను. మేం ఆ సినిమాలు చూస్తున్నంతసేపు నాన్న మా దగ్గరే ఉన్నారన్న భావన కలుగుతుంది. నా పుట్టినరోజు నాడు నాన్న సినిమా టీవీలో వస్తే నాన్న నన్ను ఆశీర్వదించినట్లు అనుభూతి చెందుతాను. నాకు క్రియేటివ్ ఫీల్డ్ మీద ఇంటరెస్ట్ ఉంది. అది బహుశ నాన్న ప్రభావం కావొచ్చు. కార్టూన్లు, స్కిట్స్ చేశాను. ఇది హాబీ మాత్రమే. ‘బాబాయ్ అబ్బాయ్’ చిత్ర షూటింగ్‌కి Ðð ళ్తున్నప్పుడు మొదటిసారి నాన్నతో విమానం ఎక్కాను. అది నా జీవితంలో మరచిపోలేని రోజు. ఆ చిత్రంలో నాన్న ‘సీతారామ సంగ్రామం’ ఘట్టంలో ఆడవేషం వేసి పాట పాడతారు. ఆ తరవాత నాన్నకి దండ వేయాలి. నన్ను వేయమన్నారు. ఆ దృశ్యం ఎప్పటికీ మరచిపోలేను. – సంభాషణ: వైజయంతి పురాణపండ ఫొటోలు: షేక్ రియాజ్, ఏలూరు -
వెండితెర 2019
-
మొబైల్ మూవీ థియేటర్ వచ్చేసింది
ఒకప్పుడు సినిమాకి వెళ్లాలన్నా... లైబ్రరీకి వెళ్లాలన్నా.. మంచి బిర్యానీ తినాలన్నా బయటకి వెళ్లాల్సి వచ్చేది. ఆ కష్టం లేకుండా మొబైల్ లైబ్రరీ, మొబైల్ కోర్టు, మొబైల్ ఫుడ్ కోర్టులు అందుబాటులోకి వచ్చాయి. మన వీధి చివరనో.. మన కాలనీ పార్కు వద్దనో మనకు కనిపిస్తూనే ఉంటాయి. వీటికి ఆదరణ రోజురోజుకు పెరుగుతూనే ఉంది. అన్నీ వచ్చాయి కాని సినిమా థియేటర్ కూడా వీటి లాగే వచ్చి ఉంటే బాగుండు అని అనుకునే వారికి ఇది శుభవార్తే. సినిమా ప్రేమికుల కోసం మన గల్లీకి దగ్గరలో వినోదాన్ని పంచేందుకు పిక్చర్‌టైమ్ వచ్చేసింది. అదేనండీ, మొబైల్ థియేటర్. పిక్చర్ టైమ్ మనదేశంలో ఓ నూతన ఒరవడికి శ్రీకారం చుట్టింది. మారుమూల ప్రాంతాల వారికి కూడా మల్టీప్లెక్స్ అనుభూతి! దేశంలోని మారుమూల ప్రాంతాలలోని ప్రజలకు వినోదం పంచాలనే ఉద్దేశంతో వ్యాపారవేత్త సుశీల్ చౌదరి ‘పిక్చర్‌టైమ్’ను స్థాపించారు. మన దేశంలో సినిమా, క్రికెట్‌పై ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. అది మాటల్లో చెప్పలేనిది. సినిమాలపై ఉన్న మక్కువను గ్రహించిన ఆయన సినిమాకు దూరంగా ఉన్న ప్రజలకు కూడా వినోదం అందివ్వాలనే తన ఆలోచనలను ఆచరణలో పెట్టారు. అంతే... తక్కువ ఖర్చుతో థియేటర్, మల్టీప్లెక్స్ అనుభూతికి తీసిపోని విధంగా పిక్చర్‌టైమ్ రూపంలో మన ముందుకొచ్చారు. మొట్ట మొదటి షో మన తెలుగు సినిమాదే... పిక్చర్ టైమ్ కార్యకలాపాలను ఢిల్లీ నుంచి మానిటరింగ్ చేస్తున్నారు. ఢిల్లీలో ఏర్పాటు చేసిన ఓ మొబైల్ థియేటర్‌ను ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్ ప్రారంభించారు. దీనిలో మొదటి షోను బాహుబలి చిత్రాన్ని ప్రదర్శించడం విశేషం. 2021 సంవత్సరం కల్లా 3 వేల మొబైల్ థియేటర్లను ఏర్పాటు చేస్తామని పిక్చర్ టైమ్ వ్యవస్థాపకులు సుశీల్ చౌదరి తెలిపారు. దీనికి భారత ప్రభుత్వం గుర్తింపు కూడా ఉండటం విశేషం. సినిమా బ్రేక్ టైమ్‌లో కేంద్ర ప్రభుత్వం పథకాల అడ్వర్టైజ్మెంట్లను ప్రదర్శించి చైతన్యం కల్పిస్తోంది. వందకోట్లకు పైగా జనాభా...2200 మల్టీప్లెక్స్‌లు... వందకోట్లకు పైగా జనాభా ఉన్న మన దేశంలో కేవలం 2200 మల్టీప్లెక్స్‌లు మాత్రమే ఉన్నాయి. అవి కూడా ప్రధాన నగరాలలోనే ఎక్కువ ఉండటం గమనార్హం. వరల్డ్ క్లాస్ సినిమా ఎక్స్‌పీరియన్స్‌ను మారుమూల గ్రామాల ప్రజలకు అందించేందుకు పిక్చర్‌టైమ్ ఈ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అందుకే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మొబైల్ థియేటర్స్‌ను ఏర్పాటు చేసి తక్కువ ధరకే కొత్త సినిమాలను ప్రదర్శిస్తోంది. డిజిటల్ ప్రొజెక్షన్, డాల్బీ సరౌండ్ సౌండ్, ఎయిర్ కండిషనింగ్, కంఫర్టబుల్ సీటింగ్ ప్రత్యేకతలతో మల్టీప్లెక్స్‌కు తీసిపోని సౌకర్యాలను అందిస్తున్నామని సుశీల్ చౌదరి తెలిపారు. 100 నుంచి 120 మంది చూసే వీలుగా... ఒక చిన్న సైజు ట్రక్కులో ఈ డిజిప్లెక్స్ను ఎక్కడికైనా తీసుకెళ్లి సినిమాను చూపించవచ్చు. ఫ్యాబ్రిక్ మెటీరియల్‌తో తయారైన ఒక బెలూన్ లాంటి పెద్ద టెంట్ సహాయంతో దీనిని ఏర్పాటు చేస్తున్నారు. దీనికి వర్షాలు, అగ్నిప్రమాదాలను తట్టుకుని నిలిచే మెటీరియల్‌ను వాడటం విశేషం. 70/30 వైశాల్యంలో ఉండే ఈ తాత్కాలిక థియేటర్లో సుమారు 100 నుంచి 120 మంది సినిమాను వీక్షించవచ్చు. డిమాండ్ ఉన్న ప్రాంతాల్లో దీనిని అప్పటికప్పుడు ఏర్పాటు చేసుకోవచ్చు. సినిమాలకు దూరంగా ఉండే మారుమూల ప్రాంత ప్రజ ల వద్దకు సినిమాను తీసుకెళ్లేందుకు ఉపయోగపడుతుంది. ఒక థియేటర్కుఆరు మంది సిబ్బంది ఢిల్లీలోని ప్రధాన కార్యాలయం నుంచి ఆదేశాలు రాగానే ఆరుమందితో ఉన్న బృందం థియేటర్ సామగ్రి ఉన్న ట్రక్కుతో బయల్దేరుతారు. ఇందులో ప్రధానంగా ఒక సైట్ ఇన్చార్జ్, ప్రొజెక్షనిస్ట్, ఎలక్టీష్రియన్‌తో పాటు ముగ్గురు సిబ్బంది ఉంటారు. థియేటర్ ఏర్పాటు నుంచి దానిని తీసేసే వరకు అన్ని వారే చూసుకుంటారు. మొబైల్ థియేటర్లు విజయవంతంగా నడుస్తున్నాయని సిబ్బంది పేర్కొంటున్నారు. పేరున్న సంస్థలు కాన్ఫరెన్స్‌లు నిర్వహించుకోవడానికి అద్దెకి ఇస్తామని తెలిపారు. సినిమా చూసిన ప్రేక్షకుల అభిప్రాయాలను తీసుకుని మార్చులు చేర్పులు చేస్తున్నామని పేర్కొన్నారు. – సచిందర్ విశ్వకర్మ, సాక్షి సిటీడెస్క్ 14 రాష్ట్రాలలో చిత్ర ప్రదర్శనలు పిక్చర్ టైమ్ దేశంలోని 14 రాష్ట్రాలలో మొబైల్ థియేటర్స్ ద్వారా చిత్రాలను ప్రదర్శిస్తోంది. ఇప్పటి వరకు తమ మొబైల్ థియేటర్లలో 18వేల గంటలపైనే చిత్ర ప్రదర్శనలు జరిగాయని నిర్వాహకులు తెలిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలోని ప్రజలకు వినోదాన్ని అందిస్తోంది. ప్రస్తుతం కాచిగూడ, కామారెడ్డి, నిజామబాద్, మహబూబ్‌నగర్, కర్నూల్‌లలో చిత్రాలు ప్రదర్శితమవుతున్నాయి. త్వరలో బొల్లారంలోనూ మొబైల్ థియేటర్‌ను ఏర్పాటు చేయనున్నారు. రోజూ ఐదు ఆటలు... రిలీజైన కొత్త సినిమాలను అతి తక్కువ టికెట్ ధర (రూ.30–80)కు వినోదాన్ని ఇస్తుండటంతో పిక్చర్ టైమ్‌కి ఆదరణ పెరుగుతోంది. ప్రతిరోజు ఐదు షోలను ప్రదర్శిస్తూ వినోదాన్ని పంచుతోంది. థియేటర్‌తో కంపేర్ చేసుకుంటే దీని రేటు తక్కువగా ఉండటంతో అన్ని వర్గాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ సినిమా చూడటానికి వచ్చే ప్రేక్షకుల వాహనాలను నిలపడానికి ఉచిత పార్కింగ్ సౌకర్యాన్ని కల్పిస్తున్నారు. అదేవిధంగా ఇంటర్వెల్ టైమ్‌లో స్నాక్స్, తదితర వాటిని విక్రయించేందుకు క్యాంటీన్‌ను సైతం ఏర్పాటు చేశారు. వాటిని సాధారణ ధరలకే విక్రయించడం విశేషం. -
వీర నారి!
‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’లాంటి రొమాంటిక్ కామెడీ–డ్రామాలో ఫ్యాషన్ ఎడిక్ట్ శనయగా మెరిసినా, ‘రాజీ’లాంటి స్పై థ్రిల్లర్‌లో క్విక్ లెర్నర్ సెహ్మత్ఖాన్గాఅలరించినా...నటనలో తనదైన ముద్ర ఉండేలా చూసుకుంటుంది బాలీవుడ్ ముద్దుగుమ్మ ఆలియాభట్. ఈ అమ్మడు త్వరలో మన తెలుగు సినిమాలో నటించనుందనే వార్తలు షికారు చేస్తున్నాయి. ‘ప్రతి సినిమా ఏదో ఒక పాఠం నేర్పుతుంది’ అంటున్న ఆలియా అంతరంగ తరంగాలు ఇవి... కొత్త కొత్తగా... నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండాలేగానీ ప్రతి సినిమా, ప్రతి పాత్ర ఏదో కొత్త విషయాన్ని నేర్పుతూనే ఉంటుంది. ‘ఇలాంటి పాత్రలు మాత్రమే చేస్తాను’ అని ఎవరూ అనుకోరు. నేను కూడా అంతే. కొత్త కొత్త పాత్రలు చేయాలనుకుంటున్నాను. బయోపిక్, యాక్షన్, సైన్స్–ఫిక్షన్ సినిమాలు చేయాలని ఉంది. ఇలా కూడా... ప్రతి సినిమాను ‘ఇదే నా మొదటి’ సినిమా అన్నట్లుగా చేస్తాను. అప్పుడే జోష్ వస్తుంది. ఒక క్యారెక్టర్ కోసం ప్రిపరేషన్ అవసరమేగానీ అదీ లేకుండా కూడా బాగానే ఉంటుంది. సహజంగా ఉంటుంది. నా విషయానికి వస్తే షైనింగ్ డైమండ్‌లా తెరపై కనిపించాలనుకోవడం లేదు. పర్సనల్ హ్యాంగోవర్ సినిమాల్లో చేసే క్యారెక్టర్‌ను ఇంటికి తీసుకెళ్లే అలవాటు నాకు లేదు. అయితే కొన్నిసార్లు తప్పకపోవచ్చు. ‘హైవే’ సినిమాలో నేను చేసిన ‘వీర’ పాత్ర అలాంటిదే. అందులో లోతుగా లీనమైపోయాను. ఒక దశలోనైతే...‘కొండ ప్రాంతాల్లోకి వెళ్లాలని ఉంది, అక్కడే నివసించాలని ఉంది’...అంటూ నాన్నతో సీరియస్‌గా ఛాట్ చేసేదాన్ని. అది ఆల్కహాలిక్ హ్యాంగోవర్ కాదు. పర్సనల్ హ్యాంగోవర్. వీర హ్యాంగోవర్. బ్రేక్ ‘బ్రేక్ లేకుండా ఏడాది పొడుగునా పనిచేస్తాను’ అనే మాట వింటుంటాం.కానీ నేను మాత్రం ఈ రకం కాదు. ఏడాదిలో కనీసం రెండు బ్రేక్లైనా ఉండాల్సిందే. బ్రేక్‌లో ప్రయాణాలు చేస్తాను. జీవితాన్ని ఆస్వాదిస్తాను. అందుకే ఈ బ్రేక్‌ను ‘విశ్రాంతి’ అనుకోను. జీవితాన్ని ఆస్వాదించడానికి ఒక అవసరం, అనుభవం అనుకుంటాను. ఆ అనుభవం వృథా పోదు. జీవితంలో లేదా సినిమాల్లో ఉపయోగపడుతుంది. -
తెలుగు సినిమాకి బహూకరిస్తున్నాం
‘‘ఒక వివాహ వేడుకలా అద్భుతంగా జరిగిన ఈ అంకితోత్సవం మమ్మల్ని ఎంతగానో ఆకట్టుకుంది. ఎన్నో అందమైన విషయాలతో కూడిన ‘86 వసంతాల తెలుగు సినిమా’ పుస్తకాన్ని తెలుగు సినిమాకు బహూకరిస్తున్నట్టుగా భావిస్తున్నాం. ఇంత మంచి గ్రంథాన్ని మాకు అంకితం చేసినందుకు రచయిత డా. కె.ధర్మారావుకు అభినందనలు’’ అని ‘తెలుగు సినిమా గ్రంథం’ స్వీకర్తలు కృష్ణ, విజయనిర్మల అన్నారు. సినీ లెజెండ్స్ అక్కినేని నాగేశ్వరరావు, దాసరి నారాయణరావు, రామానాయుడు, డి.వి.ఎస్.రాజు సలహాదారులుగా, ప్రోత్సాహకులుగా ఏర్పడిన ‘ఫిలిం అనలిటికల్ అండ్ అసోసియేషన్’ (ఫాస్), డా. కె.ధర్మారావు రచించిన ‘86 వసంతాల తెలుగు సినిమా’ గ్రంథం ఆవిష్కరణ హైదరాబాద్‌లో జరిగింది. విశిష్ట అతిథి, దర్శకులు రేలంగి నరసింహారావు మాట్లాడుతూ– ‘‘484 పేజీల్లో విషయం, మరో 24 పేజీల రంగుల పుటలతో విశిష్ట సమాచారంతో పాటు చక్కటి ఫొటోలతో తెలుగు సినిమా విశేషాలను ఈ గ్రంథంలో బాగా ఆవిష్కరించారు. ఇది కచ్చితంగా తెలుగు సినిమా పరిశ్రమకు ఒక ఎన్సైక్లోపీడియాగా ఉపయోగపడుతుంది’’ అన్నారు.‘‘తెలుగు సినిమా చరిత్రను ధర్మారావు చక్కగా విశదీకరించి, తెలుగు సినిమా సేవలో మరో అడుగు ముందుకు వేశారు’’ అన్నారు నటుడు నరేశ్. ఈ సమావేశానికి ముందు గాయకులు టి.లలితరావు, డా. టీవీ రావు కలిసి కృష్ణ, విజయనిర్మల నటించిన చిత్రాల్లోని పాటలను పాడి అలరించారు. రచయిత కె.ధర్మారావు, రాధ ప్రశాంతి, వంశీ రామరాజు, డా.కీమల ప్రసాదరావు, ఫాస్ గౌరవాధ్యక్షులు ప్రసాదరావు, కొదాల బసవరావు, రచయిత భార్య ఆదుర్తి సూర్యకుమారి పాల్గొన్నారు. -
డబ్బు మనిషి
ఒక క్లాసిక్ బ్లాక్ అండ్ వైట్ తెలుగు సినిమాలోని కొన్ని సన్నివేశాలివి. ఈ రోజుకీ తెలుగులో బెస్ట్ అనే జాబితాలో ఈ సినిమాకు చోటు ఉంటుంది. ఈ సినిమా పేరేంటో చెప్పుకోండి చూద్దాం.... చంగయ్య ఆ ఊర్లో పెద్ద షావుకారు. పొదుపుగా పైసా పైసా కూడబెట్టుకునే అలవాటున్న మనిషి. అతనికి తన పక్కింట్లోనే ఉండే కోడలు సుబ్బులంటే బాగా ఇష్టం. బస్తీలో ఉండి చదువుకునే తన కొడుకు సత్యానికి సుబ్బులునిచ్చి పెళ్లి చేస్తే ఇంక ఈ జీవితానికి అదే చాలు అన్నట్టుగా ఉంటాడు. ఇతరుల విషయాల్లో ఏమో గానీ, కోడలికి మాత్రం సందర్భం లేకున్నా చంగయ్య నగలు చేయిస్తాడు. కొత్త బట్టలు కుట్టిస్తాడు. సుబ్బులు, సత్యానికి కూడా ఒకరంటే ఒకరికి అంతే ఇష్టం. చాలాకాలంపాటు బస్తీలో పెద్ద చదువులు చదువుకున్న సత్యం తిరిగొచ్చాడు. సుబ్బులు ఆనందానికి అవధుల్లేవు. బావ ఇంట్లోకి అడుగు పెట్టినప్పట్నుంచీ అతణ్ని తనివితీరా చూసుకుంటోంది. ‘‘ఏమంటున్నాడే మీ మావ? నాకోసం సంపాదించినా నీ చేతికే తాళాలిచ్చి పోతాడులే!’’ అన్నాడు సత్యం, సుబ్బులును ఆటపట్టిస్తూ. ‘‘మా సుబ్బులు తాళాలు ఏం చేసుకుంటుంది సత్యం! దానికిస్తే నీకే ఇచ్చేస్తుందిలే.’’ అంది సుబ్బులు వదిన నవ్వుతూ. ‘‘అరే! ఎందుకురా ఈ తగాథా. మీకెవ్వరికీ అక్కరలేకుంటే నాకు పడేద్దువులే తాళాలు..’’ అన్నాడు సుబ్బులు అన్న గట్టిగా నవ్వుతూ. అందరూ మాట్లాడుతున్నారు కానీ, అక్కడ సుబ్బులు, సత్యం మాత్రమే మాట్లాడుకుంటున్నారు. రోజులు గడుస్తున్నాయి. సత్యం తిరిగొచ్చాక సుబ్బులు జీవితమంతా కొత్తగా ఉంది. సత్యాన్ని ఆట పట్టించనిదే ఆమె రోజు గడవడం లేదు.వీరి ఆటలు ఇలా ఉంటే, ఊర్లో చంగయ్య తండ్రి కట్టించిన ఒక ధర్మసత్రం ఎవరికి చెందుతునే గొడవ జరుగుతోంది. ఊరికోసం కట్టించినది అది. చంగయ్య మాత్రం దాని సర్వహక్కులూ తనవేనని చెప్పుకున్నాడు. గొడవ పెద్దదైంది. పోలీసుల వరకూ వెళ్లింది. సుబ్బులు తండ్రి రామయ్యను సాక్ష్యం చెప్పమన్నారు. సొంత బావే కదా తనకు అనుకూలంగానే సాక్ష్యం చెబుతాడనుకున్నాడు చంగయ్య. ‘‘చెప్పు బావా! సందేహిస్తావెందుకు? దీంట్లో నీకు తెలియనిది ఏముంది!’’ అన్నాడు చంగయ్య, పోలీసుల ముందు మౌనంగా నిలబడ్డ రామయ్యను కదిలిస్తూ. ‘‘ఇది ధర్మసత్రమేనండీ. చంగయ్య గారు దీనికి ధర్మకర్త మాత్రమే. దీన్ని విక్రయించడానికి కానీ, అద్దెకు ఇచ్చుకోవడానికి కానీ ఆయనకు ఎట్టి హక్కులూ లేవు.’’ అన్నాడు రామయ్య శూన్యంలోకి చూస్తూ. రామయ్య తనకు వ్యతిరేకంగా సాక్ష్యం చెబుతాడని ఊహించని చంగయ్య, ఇంటికి వెళ్లీ వెళ్లగానే కోపంతో అనాల్సిన మాటలన్నీ అన్నాడు. రెండు కుటుంబాల మధ్య దూరం. కొన్నాళ్లు ఊర్లోనే ఉండాలనుకున్న సత్యం, చంగయ్యతో గొడవ పడి ఇంట్లోంచి బయటికొచ్చాడు. రామయ్యను కలిసి అట్నుంచటే బస్తీకి వెళ్లిపోయాడు. చంగయ్య సుబ్బులుకు ఎంతో ఇష్టంగా ఇచ్చిన నగలన్నీ వెనక్కి వచ్చేశాయి. రోజులు గడుస్తున్నాయి. సత్యం నుంచి ఉత్తరాలు రామయ్య ఇంటికే వస్తున్నాయి తప్ప చంగయ్యకు రావడం లేదు. ‘‘బాబుగారి ఎర్రిగానీ, చినబాబు ఎప్పుడో ఆళ్లల్లో చేరిపోయినాడు.’’ అన్నాడు చంగయ్య ఇంట్లో పని చేసే వ్యక్తి, రామయ్య ఇంటికి ఉత్తరం వచ్చిన వార్తను మోసుకొస్తూ. చంగయ్యకు కోపం పెరిగింది. ‘‘రామయ్య మనకేదో బాకీ ఉన్నట్టున్నాడు. కొంచెం చూసి సర్దమని చెప్పు..’’ అన్నాడు తన మనిషిని పురమాయిస్తూ. ఇంట్లో నగలు తాకట్టు పెట్టినా డబ్బు సరిపడలేదు. పొలం కూడా తాకట్టు పెట్టి చంగయ్యకు తిరిగివ్వాల్సినదంతా ఇచ్చేశాడు రామయ్య. అయినా చంగయ్యకు రామయ్య మీద కోపం ఇంకా తగ్గలేదు. రామయ్య పంటను నాశనం చేస్తే అప్పులు తీర్చలేక చస్తాడనుకున్నాడు. అదీ కుదరకపోతే తానే స్వయంగా దొంగతనం కేసులో రామయ్య కొడుకును జైల్లోకి తోయాలనుకున్నాడు చంగయ్య. అనుకున్నట్టే చేశాడు. రామయ్య కొడుకు నారాయణ ఇప్పుడు జైల్లో ఉన్నాడు. అదే జైలుకు, అనుకోకుండా, కొన్ని విచిత్ర పరిస్థితుల్లో ఒక నేరంలో దోషిగా తేలి వచ్చాడు సత్యం. ‘‘నేను ఆనాడే అనుకున్నా ఏదో కొంప మీదకొస్తుందని. అలాగే జరిగింది.’’ అన్నాడు సత్యం బాధగా. ‘‘పోన్లేరా! జరిగిందేదో జరిగింది. మనం ఊర్లో ఉంటే ఇంత సరదాగా కలుసుకోగలమో లేదో. ఇక్కడైనా ఈ నాలుగు రోజులు హాయిగా కాలక్షేపం చేద్దాం.’’ అన్నాడు నారాయణ, సత్యాన్ని కాస్తంత నెమ్మదిపరుస్తూ. ‘‘అది కాదు నారాయణ! నా మనసు ఎంతగా బాధపడుతుందో నీకు తెలియదు. రేపు మన ఊర్లో తలెత్తుకొని ఎట్లా తిరిగేది?’’ నారాయణ, సత్యం మాట్లాడుకుంటున్నారు. సత్యాన్ని విడిపించడానికి వచ్చాడు చంగయ్య. కొన్ని కాగితాలు చూపించి సంతకం పెట్టమని కోరాడు. ‘‘నారాయణ దొంగతనం చేశాడా?’’ అడిగాడు సత్యం. ‘‘అదెందుకురా ఇప్పుడు! దీనిమీద సంతకం పెట్టు.’’ సత్యం వినలేదు. గట్టిగా అరుస్తూ మళ్లీ అడిగాడు – ‘‘నారాయణ దొంగతనం చేశాడా?’’ ‘‘లేదురా నాయనా! లేదు. వాడేం చెయ్యలేదు. నేనే ఏదో ఉద్రేకంలో ఇదంతా చేశాను. జరిగిపోయిందేదో జరిగిపోయింది. నా మాట విని ఇక్కడ సంతకం పెట్టు.’’ ఏడ్చేస్తూ అన్నాడు చంగయ్య. ‘‘ఇన్నాళ్లూ ఈ కేసు నా మీదకు ఎందుకు వచ్చిందా అనుకున్నాను. మన మేలుకే వచ్చింది. మనం నారాయణకు చేసిన అన్యాయానికి ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నాం.’’ అంటూ తండ్రి తెచ్చిన కాగితాలను పక్కకు తోసి మళ్లీ లోపలికి వెళ్లిపోయాడు సత్యం. సత్యం, నారాయణ జైల్లోనే ఉన్నారు. వీళ్లిద్దరూ జైల్లో ఉన్న విషయం గురించే ఊర్లో అందరూ మాట్లాడుకుంటున్నారు. చంగయ్యకు కొడుకు బెంగ పట్టుకుంది. తన జీవితంలో చాలా రోజులు ఎదురుచూసినట్టే, సుబ్బులు సత్యం కోసం ఎదురుచూస్తూనే ఉంది. -
ఈ సీన్ ఏ సిన్మాదో... చెప్పుకోండి చూద్దాం!
తెలుగులో క్లాసిక్ అనదగ్గ సినిమాల్లో ఎప్పటికీ చోటు దక్కించుకునే ఓ సినిమాలోని కొన్ని సన్నివేశాలివి. ఆ సినిమా పేరేంటో చెప్పుకోండి చూద్దాం... ఊర్లో వందకు పైగానే మగ్గాలున్న నారప్పకు ఒక్కగానొక్క కూతురు మల్లీశ్వరి. నారప్ప ఆ ఊరికే పెద్ద. డబ్బున్న కుటుంబమే. మల్లీశ్వరి నిజానికి అందరిలాంటి అమ్మాయే అయితే ఆమె కథ ఈ మలుపు తీసుకోదు. మల్లీశ్వరి అందరిలో ఒకరు అనిపించుకునే సాధారణ అమ్మాయి కాదు. చురుకైనది. తెలివైనది. అద్భుతంగా నాట్యం చేస్తుంది. అంతే అద్భుతంగా పాడుతుంది కూడా! అయితే పాడమని అడిగితే సిగ్గు పడుతుంది. నాట్యం చేయమని అడిగితే ఏకంగా పారిపోతుంది. బావ నాగరాజు అడిగితే మాత్రం ఆమె సిగ్గుపడదు. అతనడిగితే ఏదైనా చేసేస్తుంది. మల్లీశ్వరికి బావంటే అంతిష్టం. ఒకరోజు మల్లీశ్వరి, నాగరాజు పక్క ఊర్లో సంతకు వెళ్లి తిరిగివస్తోంటే పెద్ద వర్షం కురుస్తోంది. ఒక చిన్న కొండలాంటి ప్రాంతంలో ఉన్న సత్రంలో వర్షంలో తడవకుండా దాక్కున్నారు. మల్లీశ్వరి సరదాగా ఆడి పాడుతోంది. అప్పుడే అటుగా వచ్చిన విజయనగర సామ్రాజ్య పాలకులు శ్రీకృష్ణదేవరాయల వారు, ఆయన ఆస్థానంలో పనిచేసే పెద్దలు మల్లీశ్వరి నాట్యాన్ని చూశారు. మహారాణివారి ఇష్టసఖి మర్యాదలను అందుకోవడానికి అన్ని అర్హతలు ఉన్న యువతిగా మల్లీశ్వరిని రాయలవారి ఆస్థాన కవి కీర్తించారు. రాయలవారు ఆమెకు ఒక పెద్ద హారం బహుమానంగా ఇచ్చారు. వర్షం ఇంకా అలాగే కురుస్తోంది. ఆ సత్రంలో చేరిన వారంతా మల్లీశ్వరితో, నాగరాజుతో సరదాగా కబుర్లు చెప్పుకుంటూ గడిపేస్తున్నారు. ఆ కబుర్ల మధ్యలో అకస్మాత్తుగా అడిగాడు నాగరాజు – ‘‘మల్లి ఆట – పాటను మెచ్చుకున్నారు. మీరొక ఉపకారం చేస్తారా?’’.‘‘ఓ! చెప్పు నాయనా! విజయనగరంలో మీకేది కావాలన్నా మేం మీకు ఏర్పాట్లు చేయగలం.’’ భరోసానిస్తూ చెప్పాడు రాయలవారి ఆస్థాన కవి. ‘‘మరేం లేదులెండి! ఇందాక అదేదో సెలవిచ్చారు కదా. మహారాణివారి ఇష్టసఖి మర్యాదలని. అవేవో కాస్త జరిగేటట్టు చూడండి. మన రాయల వారితో ఇక్కడ మల్లీశ్వరి అని ఒక పిల్ల ఉందని మనవి చేయించి, పల్లకి పంపించేటట్టు మాత్రం చూడండే!’’ నవ్వుతూ అడిగాడు నాగరాజు. బావ ఆటపట్టిస్తూ అలా మాట్లాడుతున్నాడని తెలిసి, మల్లీశ్వరి వెక్కిరిస్తూ, బావను ఉద్దేశించి, అతని మాటల్ని తిప్పి చెప్పుతూ, ‘‘పల్లకి పంపేటట్టు మాత్రం చూడండే!’’, ‘‘.. పంపండి స్వామి! పల్లకి తప్పకుండా పంపండి. మా కోతిబావ పల్లకీ ఎక్కి, పళ్లు ఇకిలిస్తూ ఊరేగుతాడు.’’ అని గట్టిగా నవ్వింది. మల్లీశ్వరి మాటలకు అక్కడున్న వారంతా సరదాగా నవ్వుకున్నారు. అయితే అప్పటికి మల్లీశ్వరికి గానీ, నాగరాజుకు గానీ, వచ్చిన వాళ్లలో శ్రీకృష్ణదేవరాయలవారే ఉన్నారని తెలియదు. ∙∙ మహారాణివారి ఇష్టసఖి అవ్వడమన్న ఆలోచనను అప్పటికే మరచిపోయింది మల్లీశ్వరి. రోజులు గడుస్తున్నాయి. మల్లీశ్వరికి పెళ్లి చేయాలన్న ఆలోచన చేసింది తల్లి. ‘‘ఎవరినో వెతకడం ఏమిటి? మన నాగరాజే ఉన్నాడు కదా!’’ అన్నాడు తండ్రి నారప్ప. మల్లీశ్వరిని ఏ పనీ లేని నాగరాజుకు ఇచ్చి చేయడం తనకు ఇష్టం లేదని చెప్పింది తల్లి. పెద్ద గొడవ కూడా చేసింది. రెండు కుటుంబాలను నిశ్శబ్దం ఆవరించింది. నాగరాజు మల్లీశ్వరిని నొప్పించలేక, ఆమెకు దూరంగా వెళ్లి, డబ్బు సంపాదించాకే తిరిగొస్తానని తల్లికి ఇచ్చిన మాటను కాదనలేక ఊరొదిలి దూరంగా ఒక పట్నంలో పని చేసుకుంటున్నాడు.శిల్పాలు చెక్కడం నేర్చుకొని మంచి శిల్పిగా పేరు తెచ్చుకుంటున్నాడు. మల్లీశ్వరి నాగరాజు తిరిగొచ్చే రోజు కోసం ఎదురుచూస్తూనే ఉంది. అలాంటి ఒకరోజున శ్రీకృష్ణదేవరాయల వారినుంచే ఒక ఉత్తర్వు అందింది, మల్లీశ్వరిని మహారాణివారికి ఇష్టసఖిగా నియమించినట్టు. మల్లీశ్వరి ఆ ఉత్తర్వు విని అక్కడే కూలబడిపోయింది. ఒక్కసారే ఎదురైన అదృష్టాన్ని చూసి కళ్లు తిరిగిందని సర్ది చెప్పుకున్నారంతా. వైభవంగా ఏర్పాట్లు జరిగాయి.మల్లీశ్వరిని రాణివాసానికి తీసుకెళ్లడానికి పెద్ద పల్లకిని కూడా సిద్ధం చేశారు. కొండలు, గుట్టలు దాటి పల్లకి విజయనగరం చేరింది. మల్లీశ్వరి రాణివారికి ఇష్టసఖిగా చేరిపోయింది. మరోపక్క నాగరాజు ఊరికి తిరిగొచ్చాడు. మల్లీశ్వరి లేదని తెలుసుకొని కుమిలిపోయాడు.రోజులకు రోజులు ఏమీ తినకుండా ఒక్కటే ఒక్క శిల్పాన్ని చెక్కుతున్నాడు. మల్లీశ్వరి రూపమది. రాయలవారి ఆస్థానంలోని ఓ వ్యక్తి నాగరాజు చెక్కిన శిల్పాన్ని చూశాడు. రాయలవారి రాచనగరంలో నిర్మిస్తున్న నర్తనశాలకు పనిచేయాల్సిందిగా నాగరాజును ఆ వ్యక్తి కోరాడు. నాగరాజు ముందు ఒప్పుకోకపోతే బతిమిలాడి తనతో పాటు రాచనగరానికి తీసుకెళ్లాడు. నాగరాజు పనిలో పడిపోయాడు. నర్తనశాల కోసం కావాల్సిన శిల్పాలను చెక్కుతూ కాలం వెళ్లదీస్తున్నాడు. మల్లీశ్వరికి రాణివాసంలో ఉండటం కష్టంగా ఉంది. తల్లికి కబురుపంపి తీసుకుపొమ్మని గొడవ కూడా చేసింది. కానీ ఆ ప్రయత్నం కూడా విఫలమైంది. అక్కణ్నుంచి బయటపడే ఏ మార్గమూ లేక, అంతఃపురమంతా కలియదిరుగుతూ నాగరాజును గుర్తు చేసుకుంటోంది మల్లీశ్వరి. సరిగ్గా అప్పుడే కనిపించాడు నాగరాజు ఆమెకు. అతనితో మాట కలిపేలోపే అంతఃపురంలోని చెలికత్తెలు మల్లీశ్వరిని లోపలికి తీసుకెళ్లారు. మల్లీశ్వరి రాణివాసం నుంచి బయటకొచ్చి నాగరాజును కలవలేదు. నాగరాజుకు మల్లీశ్వరిని చేరే అవకాశమే లేదు. కానీ ఇద్దరూ ఒకరిని చూడకుండా ఒకరు ఉండలేని పరిస్థితి. ఒకరు లేకపోతే ఇంకొకరుఉండలేనంత ప్రేమ ఇద్దరిదీ. ఇద్దరూ ఒకరినొకరు చేరే దారి కోసం ఆనాటి నుంచి అన్వేషిస్తూనే ఉన్నారు. -
కిష్టిగాడు
తెలుగు సినిమా చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమాల్లో ఒకటిగా పేరున్న ఓ సినిమాలోని కొన్ని సన్నివేశాలివి. ఈ సినిమాతో పూర్తి స్థాయి హీరోగా పరిచయమైన హీరో, ఆ తర్వాత సూపర్‌స్టార్ స్థాయికి ఎదిగారు. ఈ సినిమా పేరేంటో చెప్పుకోండి చూద్దాం... కృష్ణను అందరూ కిష్టిగాడు అని పిలుస్తారు. అమాయకుడు. లోకమంటే ఏంటో తెలియదు. తన పని తాను చేసుకుంటూ వెళతాడు. అలాంటి కిష్టిగాడు తన జీవితంలో ఇలాంటి రోజు ఒకటి వస్తుందని అస్సలు ఊహించలేదు. ఆరోజు రాత్రి కృష్ణ ఇంకో ఇద్దరితో కలిసి మున్సబుగారి తోటలోకి వెళ్లాడు. అక్కడ కొబ్బరిబోండాలను దొంగతనం చేసి సంచుల్లో సర్దుకుంటున్న పకీరయ్య వాళ్లకు కనిపించాడు. పకీరయ్యను ‘‘ఏం చేస్తున్నావురా ఇక్కడ?’’ అనడిగాడు కృష్ణతో వచ్చిన వారిలో ఒకతను. ‘‘నువ్వెవడివిరా అడగటానికి?’’ అన్నాడు పకీరయ్య కోపంగా. ‘‘నీ పాలిటి యముడ్నిరా’’ అంటూ పకీరయ్య మీదకి కత్తి విసిరాడతను. అది అతన్ని తాకకుండా వెళ్లి చెట్టుకి గుచ్చుకుంది. పకీరయ్య తిరిగి అతని మీదకి తన కత్తి విసిరాడు. అది సరిగ్గా అతని మెడకు గుచ్చుకుంది. ‘కృష్ణ.. కృష్ణ..’ అని అరుస్తూ అతనక్కడే కూలబడిపోయి చనిపోయాడు. కృష్ణతో వచ్చిన మరొకతను అక్కడికి పరిగెత్తుకొని వచ్చాడు. అతని మీదకీ కత్తి విసిరాడు పకీరయ్య. అతనూ అక్కడికక్కడే కూలబడిపోయాడు. ఆ ఇద్దరి కేకలు విని పరిగెత్తుకుంటూ వచ్చిన కృష్ణ ఇద్దరినీ శవాల్లా చూసి భయపడిపోయాడు. ‘అమ్మ బాబోయ్’ అని గట్టిగా అరుస్తూ పరుగులు తీశాడు. కృష్ణను పకీరయ్య, అతడి మనుషులు వెంబడిస్తున్నారు. అర్ధరాత్రి దాటింది. చీకట్లో ఎవరు ఎవరివెంట పరిగెడుతున్నారో అర్థం కానట్లు ఉంది అక్కడి పరిస్థితి. కృష్ణ పరిగెడుతూ పరిగెడుతూ మున్సబుగారి ఇల్లు చేరాడు. ‘‘ఆ పకీరుగాడు మా మామని, ఈరిగాడ్ని చంపేశాడు. నన్ను కూడా చంపేస్తానని నా ఎంట పడ్డాడు. బాబుగారూ నన్ను దాచేయండి. నన్ను దాచేయండి బాబూ.. వాడు చంపేస్తాడు’’ అంటూ మున్సబుగారి కాళ్ల మీద పడ్డాడు. ‘‘వాడు నిన్ను వెతుక్కుంటూ ఇక్కడికే వస్తాడురా! కొంపంతా గాలిస్తాడురా. ఎక్కడ దాచినా పట్టుకుంటాడురా’’ మున్సబుగారు అతన్ని సముదాయించి, ‘‘దాక్కునేందుకు ఒకే ఇల్లు ఉందిరా. అది పకీరు ఇల్లు’’ అని చెప్పాడు. ‘‘పకీరు ఇల్లా?’’ ‘‘వాడి కొంపలో దాక్కుంటావని వాడు కల్లో కూడా అనుకోడు. ఊరు ఊరంతా గాలిస్తాడు. నువ్వు పరిగెత్తుకెళ్లి చుక్క కాళ్లు పట్టుకొని కాసేపు దాక్కో. వాడు ఇక్కణ్నుంచి వెళ్లగానే నేను కబురుచేస్తాను.’’ అన్నాడు మున్సబు. కృష్ణ వెళ్లిపోయాడు. కృష్ణ వెళ్లగానే పకీరయ్య వచ్చి మున్సబు ఇల్లంతా వెతికి వెళ్లాడు. కృష్ణ పకీరయ్య ఇంట్లోనే దాక్కున్నాడు. పకీరయ్య చెల్లెలు చుక్క కృష్ణకు మంచి స్నేహితురాలు. అంతకంటే ఎక్కువే కూడా. ఊరంతా వెతికి ఇంటికి చేరాడు పకీరయ్య. చుక్కకు కొన్ని జాగ్రత్తలు చెప్పి ఎవరైనా అడిగితే తాను ఊర్లో లేడని చెప్పమన్నాడు. కృష్ణ దాక్కున్న చోటే స్పృహ తప్పి గాఢ నిద్రలోకి జారుకున్నాడు. పకీరయ్య వెళ్లిపోగానే చుక్క కృష్ణను లేపి ఏం జరిగిందో చెప్పమని బతిమిలాడింది. కృష్ణ నోరువిప్పే పరిస్థితిలో కూడా లేడు. మున్సబుగారి దగ్గర్నుంచి కబురొచ్చింది. ఈలోపు పోలీసులొచ్చారు. శవాలను స్వాధీన పరచుకున్నారు. పకీరయ్య కోసం గాలింపు మొదలైంది. ఊరు పెద్దలంతా ఒక దగ్గర చేరారు. పకీరయ్యే ఆ ఇద్దరినీ చంపాడనడానికి ఉన్న ఒకే ఒక్క సాక్షి కృష్ణ. కానీ కృష్ణ ధైర్యంగా ఈ విషయం చెప్పగలడా? ‘‘బాబుగారూ బాబుగారూ.. నన్ను కాపాడండి. వాడు నన్ను చంపేస్తాడు.’’ కృష్ణ భయంగా ఏడుస్తూ మున్సబు ముందుకొచ్చి కూర్చున్నాడు. ‘‘నీకెందుకురా భయం? వాడు పారిపోయాడు.’’ ధైర్యమిచ్చే ప్రయత్నం చేశాడు మున్సబు. ‘‘రేపు కోర్టులో ఖూనీ.. ఎక్కడ? ఎలా? ఎవరికోసం జరిగింది ఉన్నది ఉన్నట్టు పూసగుచ్చినట్టు చెప్పేసెయ్యి..’’ మున్సబుకు ఎప్పుడూ అండగా ఉండే రంగారావు కృష్ణకు సలహాలు ఇస్తున్నాడు. ‘‘అమ్మబాబోయ్! పకీరు మీద సాక్చికమా?’’ భోరున ఏడుస్తున్నాడు కృష్ణ. అతను భయపడి ఏడుస్తూనే ఉన్నాడు. కానీ పెద్దలంతా తలా ఒక మాట చెప్పి అతనికి ధైర్యాన్నిచ్చారు. భయంగానే, ‘‘మీదే భారం’’ అని ఒప్పుకున్నాడు కృష్ణ. కోర్టులో అందరూ చెప్పమన్నట్టే సాక్ష్యం చెప్పాడు. పకీరయ్యకు ఉరిశిక్ష పడటం ఖాయం అనుకున్నారంతా. కానీ ఆత్మరక్షణలో భాగంగా ఈ పని చేశానని చెప్పుకున్న పకీరయ్య వాదననుకూడా పరిగణనలోకి తీసుకుని కోర్టు అతనికి ఏడేళ్ల జైలు శిక్ష మాత్రమే వేసింది. పకీరయ్య జైలుకు వెళ్తూ వెళ్తూ, ‘‘వచ్చే పున్నమిలోగా నీ అంతు చూస్తారా కిష్టిగా!’’ అంటూ గట్టిగా అరుస్తూ చెప్పాడు. పకీరయ్య కృష్ణను బెదిరించిన తీరు చూసిన వారంతా అప్పటికప్పుడు కృష్ణకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. ‘మేమున్నాం’ అని చెప్పిన వాళ్లంతా వెనకడుగు వేసేశారు. కృష్ణ ఇప్పుడు ఒంటరి. చావు ఏ రూపంలో, ఎప్పుడైనా రావొచ్చు. మున్సబు కృష్ణను పనినుంచి కూడా తీసేశాడు. మున్సబు కాళ్లమీద పడి వేడుకున్నాడు కృష్ణ. ‘‘ఊరికే కాకి గోల చేయక అవతలికి పో! ఎవడ్రా నిన్ను సాక్ష్యం చెప్పమన్నాడు?’’ అంటూ మున్సబు మాటమార్చి కృష్ణను గెంటేశాడు.కృష్ణకు కనిపించిన దారొక్కటే! చుక్క. ఊరొదిలి పారిపోవాలనుకున్నవాడు, చుక్క ఇచ్చిన ధైర్యంతో ఊర్లోనే ఉండిపోయాడు. కృష్ణ, చుక్కలకు ఒకరిమీద ఒకరికి ప్రేమయింది. పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు. కానీ పకీరయ్య స్నేహితులు ఇందుకు ఒప్పుకోలేదు. గొడవ చేశారు. నర్సిని పెళ్లి చేసుకోవాలని కృష్ణ అత్త అతన్ని పోరు పెట్టింది. ఊర్లో పెద్దలు కూడా కృష్ణ నర్సినే చేసుకోవాలని పట్టుబట్టారు. కానీ నర్సి పకీరయ్యను ప్రేమించింది. అతనికోసమే ఎదురుచూస్తోంది. కృష్ణ పరిస్థితి అయోమయంగా ఉంది. పకీరయ్య జైలునుంచి పారిపోయి ఊరికొచ్చాడు. కృష్ణ కనిపిస్తే అతన్ని చంపాలని తిరుగుతున్నాడు. ‘‘ఎక్కడికైనా పారిపోదాం మామా!’’ అంది చుక్క. ‘‘ఎక్కడికని పారిపోతావు? ఎన్నాళ్లని పారిపోతావు?’’ జీవితంలో మొదటిసారి ధిక్కార స్వరంతో మాట్లాడాడు కృష్ణ. పకీరయ్యను నిలదీస్తానని వెళ్లిన నర్సి, అతని చేతుల్లోనే చనిపోయింది. ఊరంతా తిరుగుతున్నాడు కృష్ణ, పకీరయ్యకు దొరక్కుండా. కృష్ణ కోసం పకీరయ్య ఊరంతా గాలిస్తున్నాడు. అర్ధరాత్రి దాటింతర్వాత ఇద్దరూ ఒకరికొకరు ఎదురుపడ్డారు. ఒకరిమీద ఒకరు కలబడ్డారు. కత్తి తీశాడు పకీరయ్య. అదే కత్తిని తిప్పి పకీరయ్య గుండెల్లోనే పొడిచాడు కృష్ణ. పకీరయ్య అక్కడే కూలబడిపోయి చనిపోయాడు. పకీరయ్య ఊర్లోకి వచ్చాడని తెలుసుకొని దాక్కున్న పెద్దలంతా ఒక్కొక్కరుగా కృష్ణ చుట్టూ పోగయ్యారు. చుక్క గట్టిగా ఏడ్చి కృష్ణను హత్తుకుంది. కృష్ణ అందరికీ దండం పెట్టి, ‘‘వెళ్లొస్తా’’ అంటూ పోలీస్‌స్టేషన్‌కు బయల్దేరాడు, తాను చేసిన హత్యకు సాక్ష్యం ఒకరు చెప్పే అవసరం లేకుండా! -
ఫస్టాఫ్ హిట్టే
మొదటి ఆరు నెలలు బాగా ఆడాయి.సినిమాల్లాగే బ్యాంక్ బ్యాలెన్సులు బాగానే నిండాయి.సినిమాలు ఇలాగే ఆడుతూ పాడుతూ భాగమతులను చేస్తూ, రంగస్థలంలో కదం తొక్కుతూ, భరత్ అనే నేనులా ప్రతిజ్ఞ చేస్తూ, తొలి ప్రేమలో మళ్లీ మళ్లీ పడుతూ, మహానటీనటులను ఆవిష్కరిస్తూ మనందర్నీ సమ్మోహనం చేస్తుండాలి. 6 నెలలు...సుమారు 60కి పైగా సినిమాలు..విజయాలెన్ని? వేళ్ల మీద లెక్కపెట్టగలిగినన్ని.కొన్ని సినిమాలు కనకవర్షం కురిపించాయి. కొన్ని వచ్చినంత వేగంగా వెళ్లిపోయాయి. అయితే ఈ ఏడాది హిట్‌గా నిలిచిన సినిమాలను లెక్కలోకి తీసుకుంటే.. 6 నెలల్లో ముఖ్యంగా 6 జానర్లు హిట్. ‘థ్రిల్, లవ్, రివెంజ్ డ్రామా, పొలిటికల్ డ్రామా, కామెడీ, బయోపిక్’ జానర్స్‌లో వచ్చిన మూవీస్‌లో పెద్ద హిట్టయిన సినిమాలున్నాయి. సిక్స్ మంథ్స్, సిక్స్ జానర్స్.. ఆ విశేషాలు తెలుసుకుందాం. లెక్క తేల్చింది ‘ఎవడు పడితే వాడు రావడానికి ఎప్పుడు పడితే అప్పుడు పోవడానికి ఇదేమన్నా పశువుల దొడ్డా... భాగమతి అడ్డా. లెక్కలు తేలాలి’. గడచిన ఆరు నెలల్లో ఫేమస్ అయిన డైలాగ్స్‌లో ఇదొకటి. నిజంగానే బాక్సాఫీస్ వద్ద ‘భాగమతి’ లెక్కలు భేష్. లేడీ ఓరియంటెడ్ మూవీస్ మంచి వసూళ్లు రాబడతాయనడానికి అప్పటి అనుష్క ‘అరుంధతి’, ఇప్పుడు అదే అనుష్క సినిమా ‘భాగమతి’ మరోసారి నిరూపించాయి. ఈ ఏడాది తొలి నెలలో రిలీజైన తొలి థ్రిల్లర్ ఇది. థ్రిల్లర్ మూవీస్‌కి ట్రెండ్‌తో పని లేదు. స్టోరీ–స్క్రీన్‌ప్లే–లీడ్ క్యారెక్టర్ కుదిరి, డైరెక్టర్ బాగా తీయగలిగితే బొమ్మ హిట్. అశోక్ దర్శకత్వంలో వంశీ, ప్రమోద్ నిర్మించిన ఈ థ్రిల్లర్ బాక్సాఫీస్ లెక్కలు తేల్చింది. థ్రిల్లర్ జానర్లో చిన్న బడ్జెట్‌తో రూపొందిన మరో మూవీ ‘అ!’ ఫిబ్రవరి 16న రిలీజై, మంచి ప్రయోగం అనిపించుకుంది. డిఫరెంట్ స్క్రీన్‌ప్లేతో సాగిన ఈ థ్రిల్లర్ ద్వారా హీరో నాని నిర్మాతగా మారారు. కొత్త దర్శకుడు ప్రశాంత్ వర్మకు మంచి మార్కులు పడ్డాయి. అన్నట్లు జనవరిలో సంక్రాంతికి రిలీజైన పవన్ కల్యాణ్ ‘అజ్ఞాతవాసి’ అంచనాలను అందుకోలేదు. బాలకృష్ణ ‘జై సింహా’ వసూళ్లు రాబట్టిన సినిమా అనిపించుకుంది. రాజ్ తరుణ్ ‘రంగుల రాట్నం’ బాక్సాఫీస్ చక్రాన్ని తిప్పలేకపోయింది. నెల మొదట్లో విడుదలైన అల్లాణి శ్రీధర్ ‘చిలుకూరి బాలాజీ’ మంచి డివోషనల్ మూవీ అనిపించుకుంది. ఇంకా ఈ నెలలో చోటా మోటా సినిమాలు అలా వచ్చి ఇలా వెళ్లిపోయాయి. థ్రిల్లర్ వెంటనే కామెడీ ఓ థ్రిల్లర్ మూవీ చూసిన వారానికి ఓ కామెడీ సినిమా చూసే అవకాశం వస్తే పండగే పండగ. ఒకవైపు ‘భాగమతి’ (జనవరి 26) థ్రిల్‌కి గురి చేస్తూ దూసుకెళుతోంది. అది విడుదలైన వారానికి ‘ఛలో’ (ఫిబ్రవరి 2) వచ్చింది. కామెడీ బ్యాక్‌డ్రాప్‌లో నడిచే లవ్ స్టోరీ. ఈ మధ్య కాలంలో పొట్ట చెక్కలయ్యేలా నవ్వించిన సినిమా అంటే ఇదే. కొత్త దర్శకుడు వెంకీ కుడుముల తీసిన ఈ సినిమాలో నాగశౌర్య హీరో. ఒక్కసారిగా నాగశౌర్య కెరీర్ గ్రాఫ్‌ని పెంచింది. ఐరా క్రియేషన్స్‌లో నాగశౌర్య తల్లిదండ్రులు శంకర్‌ప్రసాద్ మూల్పూరి, ఉషా మూల్పూరి తొలి ప్రయత్నంలోనే తమ బేనర్‌కి గుర్తింపు తెచ్చే సినిమా నిర్మించారు. ‘ఛలో’లా ఈ 6 నెలల్లో ‘కిర్రాక్ పార్టీ’ (ఫిబ్రవరి 16), ‘ఛల్ మోహన్ రంగ’ (ఏప్రిల్ 5) వంటి లవ్ బేస్డ్ కామెడీ మూవీస్ వచ్చినా అవి పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. సో.. కామెడీ జానర్లో ప్రస్తుతానికి ‘ఛలో’నే బాగా కితకితలు పెట్టిందనొచ్చు. తొలి ప్రేమదే తొలి స్థానం కామెడీ బాగుంది ఛలో అంటూ నవ్వుకోవడానికి థియేటర్స్‌కి వెళ్లిన ప్రేక్షకులను ఆ తర్వాతి వారం లవ్ జర్నీ చేయించింది. ఫస్ట్ లవ్ ఓ మధురాను భూతి. ‘తొలి ప్రేమ’ (ఫిబ్రవరి 10) సినిమా కూడా ఆడియన్స్‌ని మెస్మరైజ్ చేసింది. ‘ఫిధా’ వంటి లవ్‌స్టోరీతో హిట్ ట్రాక్‌లో ఉన్న వరుణ్ తేజ్ ‘తొలి ప్రేమ’తో మరో హిట్‌ని తన ఖాతాలో వేసుకున్నారు. వరుణ్, రాశీ ఖన్నా కెమిస్ట్రీ, కొత్త దర్శకుడు వెంకీ అట్లూరి టేకింగ్.. మొత్తంగా ఈ సినిమాకి అన్నీ కుదిరాయి. ఫస్టాఫ్‌లో తెరకొచ్చిన లవ్‌స్టోరీస్‌లో ‘తొలి ప్రేమ’దే తొలి స్థానం. ఆ తర్వాత ప్రేక్షకులను సమ్మోహనపరిచిన మరో లవ్‌స్టోరీ ‘సమ్మోహనం’. ఫస్టాఫ్ ఎండింగ్లో ఈ చిత్రం మంచి ఫీల్‌ని కలగజేసింది. జూన్ 15న విడుదలైన ఈ లవ్‌స్టోరీ యాక్టింగ్‌వైజ్‌గా సుధీర్‌బాబు, అదితీ రావులకు మంచి పేరు తెచ్చింది. దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ, నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్‌ల కాంబినేషన్లో ‘జెంటిల్మన్’ తర్వాత మరో హిట్ నమోదైంది. ఈ ఏడాది లవ్ జానర్లో వచ్చిన మరో మూవీ ‘మెహబూబా’. వార్ బ్యాక్‌డ్రాప్‌లో డిఫరెంట్ స్క్రీన్‌ప్లేతో తనయుడు ఆకాశ్ హీరోగా పూరి జగన్నాథ్ తీశారు. మే 11న విడుదలైన ఈ లవ్‌స్టోరీ భారీ అంచనాల నడుమ విడుదలై, పూరి నుంచి వచ్చిన ఓ ప్రయోగం అనిపించుకుంది. ఇక ఫిబ్రవరిలో విడుదలైన వేరే సినిమాలు రవితేజ ‘టచ్ చేసి చూడు’, మోహన్‌బాబు ‘గాయత్రి’, సాయిధరమ్ తేజ్ ‘ఇంటెలిజెంట్’ వంటి వాటి నుంచి ప్రేక్షకులు ఇంకా ఏదో ఆశించారు. విన్నారా.. 200 కోట్లకు పైనే! మార్చి, ఏప్రిల్ అంటే ఫిల్మ్ ఇండస్ట్రీకి పరీక్షే. పరీక్షలకు ప్రిపేరయ్యే పిల్లలు థియేటర్లకు రారు. తల్లిదండ్రులు కూడా పిల్లలను చదివించడంతో బిజీ అవుతారు. సినిమా ఎంతో బాగుంటే తప్ప రారు. ‘రంగస్థలం’ అలాంటి మూవీ. ఇప్పుడు వెళుతోన్న ట్రెండ్‌కి ఫుల్ డిఫరెంట్. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే రివెంజ్ డ్రామా. గళ్ల లుంగీ, పూల చొక్కా, గడ్డం, కేర్లెస్ బాడీ లాంగ్వేజ్.. ఇవన్నీ ఒక ఎత్తయితే చెవిటివాడిగా రామ్‌చరణ్ కనిపించడం మరో ఎత్తు. అర్బన్ మూవీస్ చేస్తున్న రామ్‌చరణ్‌తో రూరల్ బ్యాక్‌డ్రాప్ ఓ సాహసం. వినిపించని క్యారెక్టర్లో అంటే ఇంకా సాహసం. దర్శకుడు సుకుమార్ ఈ సాహసంలో సక్సెస్ అయ్యారు. నటుడిగా రామ్‌చరణ్ మంచి అంటే సరిపోదు.. అంతకు మించి అనాలి. అంత బాగా చేశారు. మార్చి 30న రిలీజైన ‘రంగస్థలం’ ఫస్ట్ డేనే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. 200 కోట్లకు పైగా వసూలు చేసి, ‘వింటున్నారా.. మా సినిమా కలెక్షన్స్’ అని వినపడనట్లు వ్యవహరించిన వాళ్లకూ గట్టిగా సౌండ్ చేసి మరీ చెప్పింది. ‘శ్రీమంతుడు, జనతా గ్యారేజ్’.. ఇలా వరుస హిట్లతో ఉన్న మైత్రీ మైవీ మేకర్స్ నిర్మాతలు మోహన్ చెరుకూరి, నవీన్ యర్నేని, వై. రవిశంకర్ హ్యాట్రిక్ సాధించారు. మార్చిలో వచ్చిన ఇతర చిత్రాలు ‘దండుపాళ్యం 3’, కల్యాణ్ రామ్ ‘ఎంఎల్ఎ’ ఎక్స్పెక్టేషన్స్ని అందుకోలేకపోయాయి. ఇదే నెలలో వచ్చిన శ్రీవిష్ణు ‘నీదీ నాదీ ఒకే కథ’ బాగుందనిపించుకుంది. ఈ చిత్రంతో దర్శకుడు వేణు ఊడుగుల సీరియస్ ప్రేక్షకుల దృష్టిలో పడ్డారు. సక్సెస్‌కు హామీ మార్చిలో ‘రంగస్థలం’ రూపంలో ఓ బంపర్ హిట్ తగిలితే ఏప్రిల్ మరో బంపర్ హిట్ ఇచ్చింది. ‘భరత్ అనే నేను’ హామీ ఇస్తున్నాను.. అని సినిమాలో మహేశ్‌బాబు అంటారు. ట్రైలర్లో ఈ డైలాగ్ విని, సూపర్ డూపర్ హిట్ ఇస్తామని చిత్రనిర్మాత డీవీవీ దానయ్య, దర్శకుడు కొరటాల శివ హామీ ఇచ్చినట్లుగా ఫ్యాన్స్ అనుకున్నారు. అదే జరిగింది. ఈ స్టైలిష్ పొలిటికల్ డ్రామాలో మేడమ్ స్పీకర్ అంటూ స్టైలిష్ ఇంగ్లిష్తో, సీఎంగా గంభీరమైన బాడీ లాంగ్వేజ్‌తో ఆకట్టుకున్నారు మహేశ్‌బాబు. ఈ పొలిటికల్ జానర్‌ని కొరటాల శివ ఎంతో ఇంటెలిజెంట్‌గా తీసినట్లుగా అనిపిస్తుంది. వసూళ్లు 200 కోట్లు దాటాయి. ఈ సినిమా తర్వాత ఏప్రిల్‌లో మిగతా సినిమాలు విష్ణు ‘ఆచారి అమెరికా యాత్ర’, నాని ‘కృష్ణార్జున యుద్ధం’ వంటివి వచ్చాయి. మంచు విష్ణు–జి. నాగేశ్వరరెడ్డిలది సూపర్ హిట్ కాంబినేషన్. అందుకే ఇంకా ఇంకా ఏదో కావాలని ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేశారు. వరుస విజయాలతో దూసుకెళుతోన్న నాని విషయంలోనూ ఇదే జరిగింది. మహాద్భుతం మే ఆశాజనకంగా మొదలైంది. ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ (మే 4) అంటూ దేశభక్తి సినిమాతో అల్లు అర్జున్ సిల్వర్ స్క్రీన్‌పైకి వచ్చారు. ఇప్పటివరకూ బన్నీ చేయని బ్యాక్‌డ్రాప్. రియల్ సోల్జర్ ఎలా ఉంటారో అలా ఫిజిక్‌ని మార్చుకున్నారు. లుక్ పర్ఫెక్ట్. యాక్టింగ్ సూపర్. రచయిత వక్కంతం వంశీ దర్శకుడిగా మారి తీసిన ఈ సినిమాకి లగడపాటి శ్రీధర్ నిర్మాత. నాగబాబు సమర్పకులు. ‘బన్నీ’ వాసు సహనిర్మాత. ఇందులో ‘సరిహద్దున నువ్వు లేకుంటే ఏ కనుపాప కంటి నిండుగా నిదర పోదురా..’ అనే పాట మనసుకి హత్తుకుంటుంది. సినిమాలో ఆ డెప్త్ లోపించిందన్నది కొందరి వాదన. ఏదైతేనేం దేశభక్తి బ్యాక్‌డ్రాప్‌లో సినిమా చేయడం మెచ్చుకోదగ్గ ప్రయత్నమే. ఇదే నెలలో (మే 9) వచ్చిన ‘మహానటి’ ఓ అద్భుతం. అందాల అభినేత్రి సావిత్రి జీవితం ఆధారంగా నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ చిత్రం సినిమాలు చూడటం మానేసిన ప్రేక్షకులను కూడా థియేటర్‌కి రప్పించింది. సావిత్రి మీద ఉన్న అభిమానం అలాంటిది. అఫ్కోర్స్ సినిమా బాగా లేకపోతే కష్టమే. సావిత్రిగా కీర్తీ సురేష్ అభినయం భేష్. రిలీజయ్యాక జెమినీ గణేశన్ పాత్ర, కొన్ని విషయాలపరంగా విమర్శలు వచ్చినా అవేవీ సినిమా చూడనివ్వకుండా ఆపలేకపోయాయి. బయోపిక్ జానర్లో ఈ ఏడాది వచ్చిన ఈ తొలి సినిమాకి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. నిర్మాతలు ప్రియాంకా దత్, స్వప్నా దత్‌లు తండ్రి అశ్వనీదత్‌లా మంచి నిర్మాతలు అనిపించుకున్నారు. మేలో వచ్చిన రవితేజ ‘నేల టిక్కెట్టు’ అనుకున్నంతగా టిక్కెట్లు తెంచలేకపోయింది. నాగశౌర్య ‘అమ్మమ్మగారిల్లు’ అతని ‘ఛలో’ స్పీడ్‌ని అందుకోలేకపోయింది. సమ్మోహనపరిచింది జూన్ 1 నిరాశగా మొదలైంది. ‘శివ’తో సూపర్ హిట్ కాంబినేషన్ అనిపించుకున్న నాగార్జున–రామ్‌గోపాల్‌వర్మల నుంచి ‘ఆఫీసర్’ వస్తోందంటే ఎంతో ఆశగా ఎదురు చూశారు ఇద్దరి ఫ్యాన్స్. నెల మొదటి రోజున రిలీజైన నాగార్జున ‘ఆఫీసర్’, ఆ తర్వాత కల్యాణ్ రామ్ ‘నా నువ్వే’, రాజ్ తరుణ్ ‘రాజుగాడు’ వంటి పెద్దా చిన్నా సినిమాలు రిలీజయ్యాయి. వచ్చినవి వచ్చినట్లే వెళ్లిపోయాయి. ‘సమ్మోహనం’ ఓ రిలీఫ్. కామెడీ జానర్ ‘జంబలకిడి పంబ’ నాటి ‘జంబ లకిడి పంబ’ అంతగా నవ్వించలేకపోయింది. కమెడియన్ ‘షకలక’ శంకర్ హీరోగా నటించిన ‘శంభో శంకర’ గత శుక్రవారం రిలీజైంది. అదే రోజున ‘ఈ నగరానికి ఏమైంది’ అంటూ దర్శకుడు తరుణ్ భాస్కర్ వచ్చారు. ఆల్మోస్ట్ కొత్తవాళ్లతో తీసిన ఈ సినిమా హిట్ టాక్ తెచ్చుకుంది. ‘పెళ్ళి చూపులు’తో మంచి దర్శకుడని నిరూపించుకున్న తరుణ్ భాస్కర్ ఈ చిత్రంతో ఆ ఇమేజ్‌ని ఇంకా పెంచుకోగలిగారు. ఫస్టాఫ్ క్లోజింగ్ ఈ హిట్‌తో ముగిసిందనాలి. ఇక వచ్చే ఆరు నెలలు ఎలా ఉంటుందో చూద్దాం. గతించిన కాలం కంటే రాబోవు కాలము మేలు అనే సామెతను గుర్తు చేసుకుందాం. – డి.జి. భవాని -
భానుమతి రిప్లై
మెయిన్‌స్ట్రీమ్ తెలుగు సినిమాల్లో హీరోయిన్ పాత్రతోనే ఊహించని పాపులారిటీ తెచ్చుకున్న ఓ సినిమాలోని కొన్ని సన్నివేశాలివి. బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ అనిపించుకున్న ఈ సినిమా ఈ మధ్య కాలంలోనే విడుదలైంది. ఈ సినిమా పేరేంటో చెప్పుకోండి చూద్దాం... రాజు పెళ్లిచూపుల్లో అమ్మాయిని చూశాడు. అమ్మాయి రేణుక బాగా చదువుకుంది. చూడచక్కని అందం. కాదనలేడు. కానీ ‘తమ్ముడు కూడా సరేనంటేనే పెళ్లి’ అన్నాడు. రేణుక ఈ మాటకు కొంత ఆందోళన పడింది. చెల్లి భానుమతికైతే ఈ మాట కోపాన్నే తెచ్చిపెట్టింది. ‘‘సెకండ్ ఒపీనియనా? అసలేమనుకుంటుండు? మనమే వద్దని చెబ్దాం.. మనకేం అవసరం లేదు. దొబ్బెయమను..’’ రాజు వెళ్లిపోవడంతోనే ఇంట్లో వాళ్లముందు తన కోపాన్నంతా బయటపెట్టింది. కానీ నాన్న చెప్పినట్లు చెయ్యాలి కదా! రాజు తమ్ముడిని రైల్వే స్టేషన్ దగ్గర పికప్ చేస్కునే పనితనే తీసుకుంది. రైలు దిగాడు రాజు తమ్ముడు. ‘పెళ్లికొడుకు తమ్ముడు’ అన్న కార్డ్ పట్టుకొని స్టేషన్లో ఎదురుచూస్తోంది భానుమతి. రాజు తమ్ముడు దగ్గరకొచ్చి తనని తాను పరిచయం చేసుకున్నాడు – ‘‘హేయ్! ఐ యామ్వరుణ్ అండీ.. మీరు?’’. భానుమతి అతనితో మాట్లాడటం ఏమాత్రం ఇష్టం లేనిదానిలా, ‘‘పెండ్లికూతురి చెల్లి.’’ అని కోపంగా సమాధానమిచ్చింది. ‘‘మీకు నా మీద కోపమా?’’ అనడిగాడు వరుణ్. ‘‘కోపమా?’’ అంటూ కోపాన్నంతా మాటల్లోకి మార్చి, వరుణ్ భయపడిపోయేలా ఆ మాటలను బయటకు వదిలింది భానుమతి. కథ ఒక రోజు ముందుకు కదిలింది. వరుణ్, రాజు ఈ సంబంధం తమకు ఇష్టమేనని చెప్పేశారు. ఆ ఒక్క రోజులోనే భానుమతి కూడా వాళ్లిద్దరు మంచివాళ్లే అనే నిర్ణయానికొచ్చేసింది. పెళ్లవ్వడానికి మధ్యలో ఇంకే అడ్డంకులూ లేవు. ‘‘కానీ వారం రోజుల్లోనే పెళ్లయిపోవాలి.’’అన్నాడు రాజు. రాజు, వరుణ్ అమెరికా వెళ్లిపోవాలి, ఈ పెళ్లవ్వగానే. ‘‘వారం రోజుల్లో అంటే..’’ అనైతే అన్నాడు కానీ, రేణుక తండ్రి కూడా అంతకుమించి ఇంకేం మాట్లాడలేదు. వారం రోజుల్లో పెళ్లయిపోయింది. ఈ వారం రోజుల్లో వరుణ్, భానుమతికి ఎంత దగ్గరయ్యాడంటే, ఆమె అడిగితే కాఫీ పెట్టిస్తాడు. పరీక్షలకు ప్రిపేర్ చేయిస్తాడు. ఆమెతో కలిసి పాటలు పాడుకుంటాడు. ఆమెను ఆటపట్టిస్తాడు. ఇద్దరికీ ఒకరంటే ఒకరికి ఇష్టం. అది ప్రేమా, కాదా అని కూడా ఆలోచించడం మానేశారు. అదేంటో తెలియకున్నా ఇద్దరికీ బాగుంది. కానీ భానుమతి జీవితం వేరు. వరుణ్‌లాగా అమెరికా వెళ్లి అక్కడే సెటిల్ అయిపోవాలని ఆమెకు లేదు. ఒక్క కారణం.. అతణ్ని తన మైండ్లోంచి తప్పించేసి, తన జీవితం తాను బతకడానికి ఒక్క కారణం కోసం ఎదురుచూస్తోంది. అయితే వరుణ్ విషయంలో ఆమెకు అలాంటి కారణాలేవీ కనబడలేదు. వరుణ్, రాజు, రేణుక అమెరికా వెళ్లిపోయేందుకు రెడీ అయిపోయారు. భానుమతి వరుణ్‌ను ఒక మాట అడగాలనుకుంది. అతను ఎక్కడైనా కనిపిస్తే ఆ మాట చెప్పడానికే తిరుగుతోంది. వరుణ్ తన బ్యాగ్ సర్దుకుంటున్నాడు. అతణ్ని వెతుక్కుంటూ వచ్చి భానుమతి అతనికి ఎదురుగా వచ్చి నిలబడింది. ‘‘మనం ట్రైన్ల కలిసి కూసుందాం. ఏడికీ పోకు. నేను సెకండ్ క్లాస్‌లో ఉంటా. నిన్నొకటి అడగాలె. చానా ఇంపార్టెంట్.’’ చెప్పేసింది భాను. చెప్పాల్సిన మాటైతే ఒకటి ఇంకా అలాగే దాచిపెట్టుకుంది. ‘‘హే భాను.. ఏమైంది?’’ అడిగాడు వరుణ్. ‘ఏం లేదు ఏం లేదు’ అంటూ తల అడ్డంగా ఊపింది భాను. ‘ఏంటో చెప్పు!’ అన్నట్టు చూశాడు వరుణ్. ‘‘మర్చిపోకు. ట్రైన్ల. ఎస్ ఎయిట్.’’ వెళ్లిపోయింది భానుమతి. సాయంత్రమయింది. రైలు హైదరాబాద్ బయలుదేరింది. భానుమతి వరుణ్ కోసం ఆ రాత్రంతా ఎదురుచూస్తూనే కూర్చుంది. ఆమె అతనికి ఒక మాట చెప్పాలి. వారం రోజులుగా తనలో దాచుకున్న మాట. కానీ వరుణ్ రాలేదు. తన మరదలితో వేరే కోచ్‌లో కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ ఉన్నాడు. రాత్రంతా ఎదురుచూసింది భానుమతి. ‘నా ప్రేమ పుట్టకుంటనే సచ్చిపోయింది. ఇంక సాకులెతికె అవసరం లేదు నాకు.’ రైల్లో అందరూ పడుకున్న ఆ రాత్రి ఆమె గట్టిగా ఏడుస్తూ తనకు తాను చెప్పుకుందీ మాట. తెల్లారింది. హైద్రాబాద్ వచ్చేసింది రైలు. వరుణ్ ఆ రోజు భానుతో మాట్లాడాలని ఎంత ప్రయత్నించినా ఆమె అతణ్ని చూడటానికి కూడా ఇష్టపడలేదు. ఫ్లైట్ అమెరికా బయల్దేరింది. భానుమతికి ఎంతో ఇష్టమైన అక్క ఇప్పుడు ఎక్కడికో వెళ్లిపోతోంది. ఆమె ప్రేమించిన వరుణ్ ఆ మాటను ఆమె నోటినుంచి వినకుండా వెళ్లిపోతున్నాడు.అతడికీభాను అంటే పిచ్చి ఇష్టం. ఆ మాట చెప్పాలనుకుంటున్నాడు కానీ, భానుమతి వినిపించుకోవడం లేదు. ఇద్దరూ ఒకరికి ఒకరు చెప్పుకోకుండా దాచుకున్న మాట ఉంది. ఇద్దరిదీ ఒక్కటే మాట! వరుణ్ అమెరికా అయితే వెళ్లిపోయాడు కానీ, అతని ఆలోచనలన్నీ భానుమతి దగ్గరే ఆగిపోయాయి. భానుమతి పరిస్థితి కూడా అంతే ఉంది. భానుమతికైనా వరుణ్‌ను తానెందుకు దూరం పెడుతోందో తెలుసు. వరుణ్‌కు ఆ కారణం తెలీదు. ఆమెతో మాట్లాడటానికి ప్రయత్నిస్తూనే ఉన్నాడు. అవకాశం దొరికినప్పుడల్లా మెసేజ్‌లు పెడుతూనే ఉన్నాడు. అతను ఇంక తనలో దాచుకున్న మాటను చెప్పకుండా ఉండలేకపోయాడు. చాలా ఆలోచించి మెసేజ్ చేశాడు – ‘‘ఐ లవ్ యూ’’. భానుమతి చాలాసేపు ఆ మెసేజ్‌ను మౌనంగా చూస్తూ కూర్చుంది. ఆమెకు వరుణ్‌పైన పిచ్చి కోపం అలాగే ఉంది. ఇష్టం కూడా అంతే ఉంది. కోపాన్నే అప్పటి ఎమోషన్‌గా మార్చేసుకొని వరుణ్‌కు ఒక ఫొటో తీసి పంపింది సమాధానంగా. వరుణ్ ఆ ఫొటోను చూసి బాధగా ముఖం పెట్టాడు. తన జీవితంలో మొదటిసారి అతను ఒక అమ్మాయినిఇలా ప్రేమించి, ఆ విషయాన్ని వ్యక్తపరచడం. దానికి భానుమతి తన చెప్పుని ఫొటో తీసి సమాధానంగా పంపిస్తుందని అతను ఊహించను కూడా లేడు. ఆ తర్వాత వాళ్లిద్దరూ చాలాకాలం పాటు ఒకరినొకరు పలకరించుకోలేదు. -
సినిమాల్లో హద్దులు దాటుతున్నారు
సాక్షి , చెన్నై: మితిమీరిన శృంగారం, హద్దులు దాటిన హింస నేటి సినిమాల్లో పెరిగిపోయిందని ప్రముఖ సినీ నిర్మాత, దర్శకులు తాతినేతి రామారావు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రేక్షకులు ఆశిస్తున్నారు కాబట్టి మేము తీస్తున్నాము అని సినీ ప్రముఖులు వాదించడం సరికాదు, ప్రేక్షకులు అలాంటి హింస, శృంగారాన్ని కోరుకోవడం లేదు, అవి లేకుండానే చిత్రాలను ఆదరించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయని గుర్తు చేశారు. తన 80 ఏళ్ల జీవితంలో 50ఏళ్లపాటూ తెలుగు సినీ ప్రపంచంలో గడిపిన తాతినేని రామారావు నాటితరం ప్రేక్షకులకు చిరపరిచితులే. ఎన్టీఆర్‌తో యమగోల, ఏఎన్ఆర్తో నవరాత్రి, శోభన్‌బాబుతో జీవనతరంగాలు, అమితాబ్‌తో అంధాకానూన్ చిత్రాలను నిర్మించారు. తెలుగులో 40, హిందీలో సుమారు 35 సినిమాలకు దర్శకత్వం వహించారు. శ్రీలక్ష్మీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అనేక చిత్రాలను నిర్మించారు. తమిళంలో 15 సినిమాలకు నిర్మాతగా వ్యహరించారు. ప్రస్తుతం తన కుమారుడు టీ అజయ్‌కుమార్ నిర్మించే చిత్రాలకు సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. 2000లో ‘పూలందీ’ (హిందీ) అయన నిర్మించిన చివరి చిత్రం. ఆ తరువాత నుంచీ పరిశ్రమకు దూరంగా ఉంటూ వచ్చిన తాతినేని, మంగళవారం మీడియా సమావేశం నిర్వహించి తెలుగు సినీరంగంలో తాజా పరిస్థితులు పరిణామాలపై ముచ్చటించారు. ఒకప్పుడు తెలుగు సినీరంగాన్ని బ్రాహ్మణులు శాసించేవారు. చిత్తూరు నాగయ్య అంటే పరిశ్రమలో ఎంతో గౌరవం ఉండేది. క్రమేణా ఇతరులు ఆ స్థానాన్ని అందుకున్నారు. తరువాతి కాలంలో అదే నాగయ్యను ఒక జూనియర్ ఆర్టిస్టులా అగౌరవపరిచారు. పరిశ్రమలో కుల పరమైన విభజన, మంచి, చెడు అనేవి నాడు, నేడూ కూడా మిళితమై ఉన్నాయి. సినిమా ఫెయిలైతే నిర్మాతను ఆదుకునేందుకు నటీనటులు మరో సినిమాకు సిద్ధమయ్యేవారు. మా హయాంలో షెడ్యూలు వేళల ప్రకారం నటీనటులు, సాంకేతిక నిపుణలు స్పాట్‌కు వచ్చేవారు. నేడు సినీ రంగంలో అలాంటి క్రమశిక్షణ లోపించింది. వారసత్వం పెరిగిపోవడం వల్ల హీరో అనే పదానికి అర్థం మారిపోయింది. ఒకప్పుడు హీరో అంటే ఎన్టీఆర్ లా ఉండాలని నిర్మాతలు ఆశించేవారు. నేడు అలాంటి పరిస్థితి లేదు. అందుకే సినిమాలు ఆపేశాను. సినీ పరిశ్రమపై అవగాహన లేనివారంతా రంగ ప్రవేశం చేయడం వల్లనే నష్టాలు, కొందరు నిర్మాతల ఆత్మహత్యలు జరుగుతున్నాయి. హీరో క్రేజును అడ్డుపెట్టుకుని అత్యధిక రేట్లకు సినిమా హక్కులు అమ్మిన నిర్మాతలు అదే సినిమా ఫ్లాప్ అయినపుడు నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్లకు కొంత సొమ్ము చెల్లించడం సరైన విధానమే. సక్సెస్ ఉంటేనే సినీరంగంలో హవా. అయితే అదృష్టవశాత్తూ దక్షిణాది, ఉత్తరాదిలో కూడా నేను అనేక విజయాలు చవిచూశాను. సినీరంగంలోని నేటి పరిస్థితులకు ఇమడలేక నిర్మాణ రంగానికి దూరంగా ఉన్నాను. మంచి సినిమా తీయాలనే ఉంది. ఏమో చూద్దాం. తమిళనాడులోని సొంత వ్యాపారాల రీత్యా అందరితోపాటూ హైదరాబాద్‌కు తరలివెళ్లకుండా చెన్నైలో స్థిరపడ్డాను. సినీ పరిశ్రమలో గౌరవం అనేది అడిగి పుచ్చుకునేది కాదు, ప్రవర్తనను బట్టి వస్తుంది. నాతో పనిచేసిన వారు నేటీకి టచ్‌లో ఉంటూ నా పట్ల అభిమానం చూపుతున్నారు. ఇటీవల ఏపీ ప్రభుత్వం ప్రకటించిన నంది అవార్డులపై నో కామెంట్. విశాల్‌పై తెలుగువాడు అనే ముద్రలేదు. హీరోగా ఆదరిస్తున్నారు కదా. నిర్మాతల మండలి అధ్యక్షులుగా విశాల్ మంచి చేస్తున్నారు, గిట్టనివారు విమర్శిస్తున్నారు. అఖిలభారత దర్శకుల సంఘం సభ్యులుగా నేటికీ కొనసాగుతున్నాను. అయితే ఎందుచేతనో ‘మా’లో సభ్యత్వం తీసుకోలేదు. -
మళ్లీ దక్షిణాదివైపే చూపు
తమిళసినిమా: నటి ఇలియానా కన్ను మళ్లీ దక్షిణాదిపై పడింది. తొలి చిత్రం దేవదాస్ ఈ అమ్మడికి టాలీవుడ్లో అనూహ్య సక్సెస్‌ను అందించింది. అదే విధంగా పోకిరి చిత్రం స్టార్ ఇమేజ్ను తెచ్చి పెట్టింది. అంతే క్రేజీ హీరోయిన్గా మారిపోయింది. అయితే కోలీవుడ్‌లో కేడీ చిత్రం ఇలియానాను నిరాశపరచడంతో ఇక్కడ ఆమెను మొదట్లో ఎవరూ పట్టించుకోలేదు. ఆ తరువాత టాలీవుడ్ క్రేజ్ కోలీవుడ్‌లో విజయ్‌కు జంటగా నన్బన్ చిత్రంలో నటించే అవకాశాన్ని తెచ్చి పెట్టింది. అలా పాపులర్ అయిన ఇలియానాకు బాలీవుడ్‌పై మోహం పుట్టింది. అంతే దక్షిణాదిని దూరం చేసుకుంది. అయితే బాలీవుడ్లో ఒకటీ అరా చిత్రాలు ఇలియానాకు చెప్పుకోదగ్గ చిత్రాలుగా నిలిచాయి. అక్కడిప్పుడు అవకాశాలు పెద్దగా రావడం లేదు, సక్సెస్‌లు లేవు. దీంతో తరచూ వివాదాలతో వార్తల్లో ఉండేలా తాపత్రయ పడుతోంది. ఆ మధ్య దక్షిణాది చిత్రాల్లో నా నడుమును చూపడానికే ఎక్కువ ఆసక్తి చూపేవారని, అక్కడ నటిస్తున్నప్పుడు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నానని మీడియాకు ఇంటర్వ్యూ లు ఇచ్చి కలకలం రేపింది. అదేవిధంగా ఆస్ట్రేలియాకు చెందిన ఫొటోగ్రాఫర్ ఆండ్రూస్‌తో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ వార్తల్లోకెక్కింది. ఇటీవల బాయ్‌ఫ్రెండ్‌ను రహస్యంగా పెళ్లి చేసేసుకుందనే ప్రచారం వైరల్ అవుతోంది. ఈ విషయం గురించి బాలీవుడ్ మీడియా ప్రశ్నించగా స్పష్టమైన సమాధానమివ్వకుండా ఎస్కేప్ అయ్యింది. ఇక హిందీలో నటిస్తున్న తాను మళ్లీ తెలుగు, తమిళ భాషల్లో నటించాలని ఆశ పడుతున్నానని, అయితే గ్లామరస్ పాత్రలను కాకుండా నటనకు అవకాశం ఉన్న పాత్రల్లో నటించాలని కోరుకుంటున్నట్లు, అలాంటి పాత్రల కోసం ఎదురు చూస్తున్నానని ఇలియానా పేర్కొంది. మరి పిల్లి మెడకు ఎవరు గంట కడతారో చూడాలి. -
సినీపరిశ్రమ నాకో దేవాలయం – కె. విశ్వనాథ్
‘‘ప్రతి దేవాలయంలో అర్చక స్వాములుంటారు. వాళ్లలో ఒకరికే భగవంతుడికి ప్రసాదం వండి వడ్డించే అవకాశం కలుగుతుంది. అలా చూసుకుంటే.. దేవాలయం లాంటి సినిమా కళలో నేను చేసే వంటను ముందుగా ప్రేక్షకులకు అందించే అదృష్టం నాకు కలిగింది’’ అన్నారు కళాతపస్వి కె.విశ్వనాథ్. సువర్ణభూమి డెవలపర్స్ ఆధ్వర్యంలో కె. విశ్వనాథ్ పుట్టినరోజు వేడుకలు సోమవారం జరిగాయి. విశ్వనాథ్ మాట్లాడుతూ– ‘‘సంగీతం, సాహిత్యం మీద అభిమానంతో కాకుండా సినీ పరిశ్రమను ఓ దేవాలయంలా భావించి పనిచేశాను. నా నిర్మాతలు, సాంకేతిక నిపుణులు ఎంతో సహకరించారు. వాళ్ల సహకారం వల్లే నేను ఈ స్థాయిలో ఉన్నా’’ అన్నారు. ‘మా’ అధ్యక్షుడు శివాజీరాజా మాట్లాడుతూ– ‘‘విశ్వనాథ్‌గారికి సన్మానాలు కొత్తకాదు. కానీ రక్తదానం వంటి సేవా కార్యక్రమాలు చేస్తే ఆయన ఎంతో సంతోషపడతారు. అందుకు తగ్గట్టుగానే ఈరోజు బ్లడ్ డొనేషన్ క్యాంప్ జరగడం ఆనందం. టాప్ 1 నుంచి 10 వరకూ విశ్వనాథ్‌గారి సినిమాలే ఉంటాయి’’ అన్నారు. ‘సువర్ణభూమి’ ఎండీ శ్రీధర్ బొలినేని, మార్కెట్ హెడ్ సిమ్సన్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ దీప్తీ బొలినేని, ‘మా’ వైస్ ప్రెసిడెంట్ బెనర్జీ, జాయింట్ సెక్రటరీ ఏడిద శ్రీరామ్, కల్చరల్ కమిటీ చైర్మన్ సురేష్ కొండేటి, కార్యవర్గ సభ్యులు ఉత్తేజ్, జయలక్ష్మి పాల్గొన్నారు. -
తట్టుకోలేర్రా!!
తెలుగు సినిమాల్లో ఫ్యామిలీ డ్రామా అన్నది ఎవర్గ్రీన్ జానర్. ఈ జానర్లో వచ్చిన సూపర్‌హిట్ సినిమాలకు లెక్కేలేదు. అలాంటి ఓ సూపర్‌హిట్ సినిమాలోని సన్నివేశాలివి. ఆ సినిమా పేరేంటో చెప్పుకోండి చూద్దాం? ఆ ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. ఎవ్వరూ ఏమీ మాట్లాడట్లేదు. అంత నిశ్శబ్దాన్ని భరించే శక్తి కూడా అప్పటికి ఆ ఇంట్లో ఉన్న ఎవ్వరికీ లేదు. ఆ ఇంటి పెద్దకొడుకు రాఘవేంద్ర అప్పుడే వచ్చి రాత్రి భోజనానికి కూర్చున్నాడు. భార్య వడ్డిస్తూ ఆయనకు ఎదురుగా కూర్చుంది. ఆవిడ కూడా ఒక్క మాటా మాట్లాడట్లేదు. రాఘవేంద్ర అన్నం ముద్ద నోట్లో పెట్టుకుంటుండగా, ఆ ఇంటి చిన్నకొడుకు వంశీ.. చేతిలో ఒక చిన్న బుక్ పట్టుకొని, రాఘవేంద్రకు చూపిస్తూ.. ‘‘ఏంటన్నయ్యా ఇదీ?’’ అనడిగాడు. బ్యాంక్ అకౌంట్ పాస్‌బుక్ అది. ఆ పాస్‌బుక్ బయటపడ్డ రోజునుంచే ఆ ఇంట్లో గొడవలు మొదలయ్యాయి. ఆ గొడవలే ఈ నిశ్శబ్దానికి కారణం. ‘‘ఇప్పుడే చెప్పాలా? భోంచేసి చెప్పొచ్చా?’’ అన్నాడు రాఘవేంద్ర. వంశీ ఏం మాట్లాడకుండా దూరం జరిగాడు. ‘‘ రాఘవేంద్ర గొంతు పెంచి గట్టిగా అడిగాడు – ‘‘ఎవరికి తెలియాలి? ఇంకా ఈ ఇంట్లో ఎవరెవరు తెలుసుకోవాలి?’’. ‘‘ఇక్కడ ఎవరికీ ఏదీ తెలియాల్సిన అవసరం లేదు. ముందు నువ్వు భోంచెయ్యి..’’ అంటూ రాఘవేంద్ర తల్లి అందరినీ కోపంగా చూస్తూ మాట్లాడింది. ‘‘బుద్ధుందిరా నీకు? అన్నం ముందు కూర్చున్న వాడిని అడిగే మాటలా ఇవి?’’ ఆ వెంటనే వంశీని మందలించిందామె. ‘‘దేవుడు ప్రతి మెతుకు మీదా తినేవాళ్ల పేరు రాస్తాడంటారు. కానీ ఈ ఇంట్లో అన్ని మెతుకుల మీదా వాడి పేరే రాసుంటుంది. వాడిపేరు చెప్పుకొని బతికే మనకు.. వాడ్ని ప్రశ్నించే హక్కు లేదు..’’ అంటూ గట్టిగా చెప్పిందామె. ‘‘అవునన్నయ్యా! నువ్వెవ్వరికీ జవాబు చెప్పాల్సిన పన్లేదు.’’ అని కోపంగా అందరి దిక్కూ చూసి, ‘‘నువ్ ముందు భోంచెయ్యి అన్నయ్యా..’’ అన్నాడు విష్ణు. విష్ణు ఆ ఇంటికి రెండో కొడుకు. వాతావరణం కొద్దిసేపు చల్లబడింది. అందరూ ఒక్క మాట మాట్లాడకుండా రాఘవేంద్రను తినమన్నట్టు చూస్తున్నారు. రాఘవేంద్ర మళ్లీ భోజనం చేసేందుకు కూర్చున్నాడు. ఆయనలా కూర్చోవడమే, ‘‘ఎలాగూ విషయం ఇంత దూరం వచ్చిందిగా! అసలు సంగతేంటో అందరికీ చెప్పమనండి..’’ అంటూ గట్టిగా అరుస్తూ, విసురుగా మాట్లాడింది కళ్యాణి. కళ్యాణి విష్ణు భార్య. విష్ణు.. భార్య కళ్యాణిపై కోపంతో చెయ్యి చేసుకోబోయాడు. గొడవ మళ్లీ పెద్దదైంది. ‘‘అవును.. ఇప్పుడు నేనే రాద్దాంతం చేస్తున్నాను. నా ఖర్మ కాకపోతే ఆ పాస్‌బుక్ నా కంట్లోనే పడాలా? ఇంత జరిగినా దానిగురించి ఒక్కళ్లూ మాట్లాడరు?’’ అంది కళ్యాణి అదే కోపంతో, అంతే విసురుగా. రాఘవేంద్రకు ఏం మాట్లాడాలో, తాను ఎప్పట్నుంచో తన గుండెల్లోనే దాచుకున్న నిజాన్ని ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. ఒక్క ముద్దా తినకుండానే పళ్లెంలో అన్నం అలా ఉండగానే చెయ్యి కడిగి, లేచి పక్కకు వెళ్లిపోయాడు. ‘తినే పళ్లెం మీదనుంచి లేవకూడదయ్యా!’ అంటూ ఎవ్వరేం చెప్పినా నిపించుకోలేదు రాఘవేంద్ర. ‘‘రాఘవేంద్ర సూపర్‌మార్కెట్, రాఘవేంద్ర రైస్‌మిల్, రాఘవేంద్ర లారీ ట్రాన్స్పోర్ట్ అని చెవులకున్నవి మెళ్లో ఉన్నవి అన్నీ సుకుపోయారుగా..’’ కోపంతో ఊగిపోయి రాఘవేంద్రపై విరుచుకుపడింది కళ్యాణి. విష్ణు మరోసారి భార్యపైకి చెయ్యెత్తాడు. గొడవ ఇంకా పెద్దదైంది. ‘‘పెద్దబాబు! ఏవిట్రా ఇది.. బొమ్మలా నిలబడ్డావ్? ఆ డబ్బు తీసుకెళ్లి బ్యాంక్‌లో ఎందుకు దాచావో చెప్పరా?’’ ఏడుపు ఆపుకోలేక గట్టిగా రాఘవేంద్రను నిలదీసింది తల్లి.‘‘నోరు తెరిచి చెప్పరా! చెప్పూ..’’రాఘవేంద్ర అందరిదిక్కూ చూస్తూ ఏం మాట్లాడకుండా అలా నిలబడే ఉన్నాడు. ‘‘అందరూ నన్ను నిలదీస్తున్నారు. నలుగురు కొడుకులకు తండ్రివి. నువ్వడగవేం? నువ్వూ ఏదోకటి అడుగు..’’ తండ్రిని చూస్తూ బాధను దాచుకోలేక నోరు విప్పాడు రాఘవేంద్ర. ‘‘తట్టుకోలేర్రా! నిజమేంటో తెలిస్తే తట్టుకోలేరు. ఇన్నాళ్లూ నా గుండెల్లో దాచుకున్న బాధ తెలిస్తే తట్టుకోలేరు..’’ అంటూ కన్నీళ్లు ఆపుకోలేక, గట్టిగా ఏడ్చేస్తూ చెప్పాడు రాఘవేంద్ర. రాఘవేంద్ర మాట్లాడుతూండగానే విష్ణు–కళ్యాణిల పదేళ్ల కూతురు శాంతి హాల్లో నురగలు కక్కుతూ కిందపడిపోయింది. ‘శాంతి.. శాంతి.. శాంతి..’ అంటూ ఇంట్లో అందరూ శాంతిని ఎత్తుకొని హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. శాంతి అకస్మాత్తుగా ఇలా జబ్బు పడడం ఇంట్లో ఎవ్వరికీ అర్థం కాలేదు. అందరూ ఒకరిని పట్టుకొని ఒకరు ఏడుస్తూనే ఉన్నారు. అప్పటికప్పుడు ఆపరేషన్ చెయ్యాలన్నారు డాక్టర్లు. రాఘవేంద్ర అందుకు అన్ని ఏర్పాట్లూ చేసి పెట్టాడు. ఆపరేషన్ విజయవంతంగా పూర్తయి పాపకు నయమైంది. అప్పుడు గానీ ఆ ఇంట్లో గొడవకు కారణమైన బ్యాంక్ అకౌంట్ సంగతి బయటపడలేదు. ఆ అకౌంట్లో రాఘవేంద్ర పది లక్షల రూపాయలు దాచిపెట్టింది పాప ఆపరేషన్ కోసమే! విషయం తెలుసుకోగానే కళ్యాణి రాఘవేంద్రకు దగ్గరగా వెళ్లి, ఆయన కాళ్లపై పడి, ‘‘క్షమించు బావా..’’ అంటూ వేడుకుంది. ‘‘అమ్మా కళ్యాణి! ఏంటమ్మా ఇదీ!!’’ అంటూ కళ్యాణిని పైకి లేపాడు రాఘవేంద్ర.‘జరిగిందేంటో తెలుసుకోకుండా.. మీ మనసును చాలా బాధ పెట్టాను. నేను మిమ్మల్ని అనుమానిస్తే, మీరు నా బిడ్డకు ఆయుష్షు పోశారు..’’ అంటూ పశ్చాత్తాపంతో ఏడుస్తూ రాఘవేంద్రను క్షమించమని వేడుకుంది కళ్యాణి. ‘‘ఊర్కోమ్మా! ఇప్పుడు బానే ఉందిగా!! రండి. పాపను చూద్దాం..’’ అంటూ పాప దగ్గరకు అందరినీ తీసుకెళ్లాడు రాఘవేంద్ర. ఆ ఇంట్లో అప్పటివరకూ ఉన్న నిశ్శబ్దమంతా బద్దలయింది అప్పుడే! మళ్లీ ఆ ఇంట్లో చిన్న చిన్న అలకలే తప్ప, గొడవంటూ జరగలేదు ఏరోజూ. దేవుడు ప్రతి మెతుకు మీదా తినేవాళ్ల పేరు రాస్తాడంటారు. కానీ ఈ ఇంట్లో అన్ని మెతుకుల మీదా వాడి పేరే రాసుంటుంది. వాడిపేరు చెప్పుకొని బతికే మనకు.. వాడ్ని ప్రశ్నించే హక్కు లేదు.. -
మీకు మీరే.. మాకు మేమే!
మెయిన్ స్ట్రీమ్ తెలుగు సినిమాలో అరవై ఏళ్ల కిందట వచ్చిన ఓ క్లాసిక్ సినిమాలోని సన్నివేశాలివి. ఇప్పటికీ తెలుగులో టాప్ సినిమాల్లో ఈ సినిమాకు చోటు ఉంటుంది. ఈ సినిమా పేరేంటో చెప్పుకోండి చూద్దాం?.. ఎమ్.టి.రావు చెప్పిన విషయాన్నే పదే పదే ఆలోచిస్తోంది మేరీ. మేరీకి రావు చెప్పినదానికి మించిన ఆప్షన్ ఇంకోటి కనిపించలేదు. ప్రస్తుతానికి ఇద్దరికీ ఉద్యోగాలు లేవు. అందివచ్చిన అవకాశాన్ని కాదనుకోలేదు.‘‘రాత్రంతా ఆలోచించి చూశాను. మీ ఐడియా బాగానే ఉంది.’’ అంది మేరీ. ఎమ్.టి.రావు చిన్నగా నవ్వాడు.‘‘బాగుండక ఏం చేస్తుంది! ఐడియా లేకపోతే ప్రపంచమే లేదు!’’ అన్నాడు రావు, గట్టిగా నవ్వుతూ.‘‘కానీ.. కానీ..’’ అంటూ తన భయాలు చెప్పబోయింది మేరీ.‘‘గ్రహించాను. మీరింకేం చెప్పక్కర్లేదు.’’ ధైర్యమిచ్చాడు ఎమ్.టి.రావు.అప్లికేషన్ ఫామ్ మీద సంతకాలు చేశారు ఇద్దరు. ‘‘చూడండీ! ఇకనుంచి ఇద్దరం కేవలం స్నేహితుల్లాగానే ఉండాలి..’’ అంది మేరీ.‘‘అలాగే! కలంతో గానీ, నోటితో గానీ, మీ ఉద్యోగం నిలుపుకోవడం కోసం ఎంతవరకు మీకు భర్తగా ఉండాలో..!’’ ఎమ్.టి.రావు చెబుతూంటే, మధ్యలోనే అందుకొని..‘‘ఇక చెప్పకండి! నాకు సిగ్గేస్తోంది..’’ అంటూ నవ్వింది మేరీ. అప్పాపురం రైల్వే స్టేషన్లో ఎమ్.టి.రావు, మేరీల కోసం ఎదురుచూస్తున్నాడు గోపాలం. ఊర్లో బాగా పేరున్న వ్యక్తి గోపాలం. సొంతంగా ఒక స్కూల్ కూడా ఉంది. ఆ స్కూల్లో పనిచేసేందుకే ఎమ్.టి.రావు, మేరీలకు ఉద్యోగాలు ఇచ్చాడాయన. కానీ వాళ్లు కేవలం తనకింద పనిచేసే ఉద్యోగులుగా మాత్రమే ఉండటం ఆయనకు ఇష్టం లేదు. అందుకే తానే స్వయంగా వచ్చి రైల్వే స్టేషన్లో వాళ్ల కోసం నిలబడ్డాడు. రాగానే మెడలో దండలు వేసి ఇద్దరినీ ఆహ్వానించాడు. ఎమ్.టి.రావు, మేరీల జంట ఆయనకు చూడముచ్చటగా కనిపించింది. ఇద్దరినీ తన కారులో ఇంటికి తీసుకెళ్లి, ఇంట్లో అందరికీ పరిచయం చేసి, అతిథి మర్యాదలతో వారిని చూసుకోవాలని ఆదేశించాడు. రావు, మేరీలకు ఇదంతా కొత్తగా ఉంది. మేరీని ఆ ఇంటి బిడ్డగా చూసుకోమని అందరికీ చెప్పాడు గోపాలం. గోపాలం భార్యకు కూడా మేరీ బాగా నచ్చింది. కానీ మేరీనే ఆవిడ కొంత ఇబ్బంది పెట్టింది. ‘‘అదేంటమ్మా! బొట్టు లేకుండా ఉన్నావ్!’’ అన్నప్పుడు మేరీ కొంత ఇబ్బందిగా కదిలింది. అక్కడున్న వారెవ్వరికీ తెలియదు.. మేరీ అసలు పేరు అక్కడున్న వారికి పరిచయం అయినట్టు మహాలక్ష్మి కాదని; రావు, మేరీలు భార్యభర్తలు కారని.తాము భార్యాభర్తలుగా నాటకం ఆడుతున్నది, ఉద్యోగం కోసమే వాళ్లు ఈ అగ్రిమెంట్ చేసుకున్నదీ అక్కడున్న ఎవ్వరికీ తెలిసే అవకాశం రాకుండా.. రావు, మేరీ ఇద్దరూ జాగ్రత్త పడ్డారు. జాగ్రత్త పడుతూనే ఉన్నారు.గోపాలం కూతురు సీతకు సంగీతం పాఠాలు చెప్పేందుకు కూడా మేరీ ఓకే చెప్పింది. ఆ పాఠాలూ అలా కొనసాగుతున్నాయి. రోజులు గడుస్తున్నాయి. రావు, మేరీల వ్యవహారం ఏదో తేడాగా ఉందని రాజు వారిని జాగ్రత్తగా గమనిస్తున్నాడు. రాజును అందరూ డిటెక్టివ్ రాజు అంటారు. గోపాలానికి మేనల్లుడు అతను.రాజు వీరిద్దరూ భార్యాభర్తలు కాదన్న అనుమానానికి వచ్చేశాడు. అందుకు ఆధారాలు సంపాదించేందుకు కష్టపడుతున్నాడు కూడా! గోపాలం కూతురు సీత, రావుకు దగ్గరవుతోంది. ఆయనతో అంత కలివిడిగా మెలగొద్దని మేరీ వారించినా ఆమె తగ్గలేదు. మేరీ దగ్గర సంగీతం నేర్చుకోవడం మానేసి సీత, రావు దగ్గర నేర్చుకోవడం మొదలుపెట్టింది. సీతను ఇష్టంగా ప్రేమించే రాజుకూ ఈ విషయం నచ్చలేదు. ‘‘ఇద్దరం కేవలం ఫ్రెండ్స్‌గానే ఉండాలి’’ అని మాట తీసుకున్న మేరీ, ఆ మాటను తానే బ్రేక్ చేసుకొని రావుకు దగ్గరైపోతోంది.దీంతో రావుతో సీత అంత చనువుగా ఉండటం మేరీకి నచ్చలేదు. ఆ విషయం పరోక్షంగా ప్రకటిస్తూనే వస్తోంది. ఈ నలుగురి మధ్యా ఒకరికి ఒకరు చెప్పుకోని చిన్న చిన్న అసూయలు అలా బయటపడుతూ, బయటపడకుండా ఉంటున్నాయి.అలాంటి ఒకరోజు మేరీతో మాట్లాడటానికి రాజు ఆమె గదికి వచ్చాడు. ‘‘నమస్కారమండీ!’’ అంటూ రాగానే రెండు చేతులూ జోడించి వినమ్రంగా నమస్కరించాడు రాజు.‘‘నమస్కారం! కూర్చోండి’’ అంటూ మేరీ అంతే వినమ్రంగా నమస్కరించింది.ఆ వెంటనే ‘‘వెళ్లి! కాఫీ తీసుకురా!!’’ అంటూ ఇంట్లో పనిమనిషికి చెప్పింది మేరీ.‘‘అబ్బే వద్దండీ.. నేనూ.. మీతో ఓ విషయం మాట్లాడాలని వచ్చాను..’’ అన్నాడు చిన్నగా, కొద్దిగా సిగ్గుపడుతూనే.‘‘చెప్పండీ!’’‘‘మీరంతా చూస్తూనే ఉన్నారుగా..’’ కుర్చీలో కూర్చుంటూ మెల్లిగా అడిగాడు రాజు. ‘‘ఆ! చూస్తూనే ఉన్నాను.’’‘‘చూస్తూనే ఇలా ఊరుకోవడం ఏమీ బాగోలేదు. పరిస్థితి చాలా ముదిరింది.’’‘‘అయితే నన్నేం చెయ్యమంటారు..? మీ అమ్మాయిని మీరు జాగ్రత్తగా చూసుకోండి’’ విసురుగా అంది మేరీ.‘‘హయ్యో! జాగ్రత్త చేసుకోలేకనే కదా ఇదంతా!!’’ అని కాసేపాగి, ‘‘మీరు నాకో సాయం చేయండి..’’ అన్నాడు రాజు. ‘‘చెప్పండి! నాకు చేతనైతే చేస్తాను..’’‘‘మీరు మా సీతకు సంగీతం చెప్పాలి..’’‘‘నా దగ్గర వద్దనే కదా.. ఆయన దగ్గర చెప్పించుకుంటోంది..’’‘‘అవుననుకోండీ.. అట్లా అని ఊరికే ఊరుకుంటామా?’’‘‘పోనీ.. మీరెందుకు చెప్పకూడదూ..?’’‘‘నేనా? నాకు రాదే!!’’‘‘నేను నేర్పిస్తాను. నేర్చుకోండి..’’‘‘నాకెందుకు లెండి..’’‘‘ఫర్వాలేదు. నేర్చుకోండి..’’ అంటూ లేచి హార్మోనియం దగ్గరకెళ్లి కూర్చుంది మేరీ. ‘‘సానిసరిమారీనిసాసా..’’ అంటూ మేరీ రాగం పాడితే.. రాజు ఆమెను అందుకోలేక కూని రాగాలు తీయడం మొదలుపెట్టాడు. మేరీ తనకున్న సంగీత పరిజ్ఞానాన్నంతా చూపెడుతోంది. రాజు భయపడిపోతున్నాడు.దాన్ని అందుకుంటూ కూనీరాగాలు తీస్తోన్న రాజు, ఎమ్.టి.రావును చూడగానే ఆగిపోయాడు. మేరీ పాడుతూనే ఉంది.రావును చూడనట్టుగానే నటిస్తూ, మేరీ మరింత గట్టిగా పాడటం మొదలుపెట్టింది.రావు నవ్వుకుంటూ కుర్చీలో కూర్చున్నాడు.రావును చూస్తూ.. మేరీ పాట అందుకుంది..‘‘మీకు మీరే.. మాకు మేమే!’’ -
క్లాసు మాసు క్యాషు
2017 మూడు ఆటలు ఆడింది. క్లాసుకీ ఆడింది. మాసుకీ ఆడింది. క్యాషుకీ ఆడింది. పెద్ద హీరోలు కొట్టారు. చిన్న హీరోలు చితక్కొట్టారు. పడిన కెరటాల కన్నా, లేచిన కెరటాలే ఎక్కువగా కనబడ్డాయి. పడి లేచిన కెరటాలూ ఒకట్రెండు ఉన్నాయి. హీరోలు అదరగొట్టినా.. కథలే అదుర్స్ అనిపించాయి. 2017లో నిజంగా.. బంగారం లాంటి వెండితెర అనిపించుకుంది తెలుగు సినిమా ఇండస్ట్రీ. మాహిష్మతి సామ్రాజ్యాన్ని మంగుళూరులోని ఒక బుజ్జి మెడికల్ కాలేజీ ఢీ కొట్టింది. గౌతమీపుత్ర శాతకర్ణి కరవాలాన్ని ఓసీడీతో బాధపడే ఒక కుర్రాడు పదేపదే తోమి థళథళ మెరిపించాడు. ఖైదీ నంబర్ 150ని గాఢ సముద్రాల్లో ఉన్న సబ్‌మెరైన్ ఒకటి వెంటాడే ప్రయత్నం చేసింది. ఏ మర్మం లేని నిజామాబాద్ పల్లెటూరుని ఎన్నో మర్మాలు ఉన్న గుంటూరు యురేనియం పల్లెటూరు ఢీ కొట్టాలని చూసింది. 2017 నిండా ఎన్నో వింతలూ. విడ్డూరాలు. ఊపిరి పోసుకున్న ఆశలు. డీలా పడేసిన నిరాశలూ. వర్తమానం వ్యాఖ్యానానికి అందదు. గతించిపోయాకే ఏది మంచో ఎందుకు మంచో మాట్లాడుకునే వీలు ఉంటుంది. 2017 దాదాపు ముగిసింది. ఈ సంవత్సరం తెలుగు ఇండస్ట్రీ ఎటువంటి జ్ఞాపకాలు మిగుల్చుకుంది? 2017లో ప్రపంచ పటాన్ని తెలుగు సినిమా ఉలిక్కిపడేలా చేసింది. బాహుబలి– 2 సంధించిన బాణం జపాన్, చైనా, యూఏఈ, అమెరికా, పాకిస్తాన్, మలేసియా... ఇంకా చాలా దేశాల్లో కలెక్షన్ల పండును రాలగొట్టింది. హాలీవుడ్ స్థాయి మేకింగ్ పెద్ద దోసకాయ్ ఏమీ కాదని నిరూపించింది. భారతదేశం చూసిన అత్యధిక కలెక్షన్ల సినిమా ఇప్పుడు ఇదే. ప్రపంచ వ్యాప్తంగా అత్యధికంగా కలెక్షన్లు సాధించిన భారతీయ సినిమాల్లో రెండో స్థానంలో ఉంది. మొదటి స్థానం ‘దంగల్’ నిలబెట్టుకుంది. ఒకప్పుడు బ్లాక్ బస్టర్స్ అంటే ‘మొఘల్–ఏ–ఆజమ్’, ‘షోలే’, ‘దిల్వాలే దుల్హనియా లేజాయేంగే’ చెప్పుకునేవారు. ఉత్తరాదివారికి ఉన్న ఈ ఘనతను దక్షిణాది నుంచి తెలుగు ఆత్మగౌరవం నిలబెడుతూ ‘బాహుబలి 2’ తుడిచి పారేసింది. ఆ విధంగా 2017 తెలుగు సినిమా ఇండస్ట్రీ క్యాలెండర్లో ఒక గొప్ప సినిమాగా మిగిలిపోనుంది. నిజానికి 2017 అన్నివిధాలా ఇండస్ట్రీకి మంచినే పంచింది. దాని మొదలే సక్సెస్‌తో మొదలైంది. సంక్రాంతికి విడుదలైన ‘ఖైదీ నంబర్ 150’, ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ భారీ ఓపెనింగ్స్‌ని, పెద్ద కలెక్షన్లని సాధించాయి. పదేళ్ల విరామం తర్వాత, రాజకీయ ప్రస్థానం నుంచి విరామం తీసుకుని, చిరంజీవి తన మెగా స్టార్‌డమ్‌ను నిలబెట్టుకుంటూ చేసిన ‘ఖైదీ నంబర్ 150’ ప్రేక్షకులను అలరించడమే కాకుండా మెగా అభిమానులను తలెత్తుకుని తిరిగేలా చేసింది. అరవై ఏళ్ల వయస్సును వెనక్కు నెడుతూ ‘ఛాలెంజ్’, ‘అభిలాష’ సినిమాల్లో ఉన్నట్టుగానే చిరంజీవి నటన, డ్యాన్స్ ప్రదర్శించి ‘బాస్ ఈజ్ బ్యాక్’ అని నిరూపించుకున్నాడు. ఇక ఇలాంటి విశేషమే బాలకృష్ణ కెరీర్లోనూ జరిగింది. ఆయన ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నూరవ సినిమా ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ గొప్ప అభినయం చూపారన్న పేరు తెచ్చి పెద్ద హిట్‌ను నమోదు చేసింది. ఈ రెండు సినిమాలు సంక్రాంతి సీజన్లో కలెక్షన్లను చెరకు రసం వలే పిండాయి. 2017 ఫస్ట్ హాఫ్‌లో బెస్ట్‌గా బయటపడ్డ మరో పెద్ద హీరో వెంకటేశ్. ‘గోపాల గోపాల’, ‘బాబు బంగారం’ సినిమాలకు భిన్నంగా ‘గురు’ ఆయనను సక్సెస్‌కు పూర్తి హక్కుదారును చేసింది. సిల్వర్‌లైన్ గడ్డంతో కనిపించే ధైర్యం చేసి, పాత్రకు కట్టుబడి వెంకటేశ్ సక్సెస్ కొట్టారు. దర్శకురాలు సుధా కొంగర పురుషుల ఆధిపత్యం ఉన్న దర్శకత్వ శాఖలో తన పతాకం ఎగురవేయగలగడం జ్ఞాపకం పెట్టుకోదగ్గ అంశం. అయితే ఇటువంటి హిట్ పంచ్‌ల నుంచి తెలుగు ఇండస్ట్రీ ‘కుటుంబ కథ’ అనే జానర్‌ని ఎప్పుడూ కాపాడుకుంటూనే ఉంది. అందుకే కుటుంబ కథ ఉన్న రెండు సినిమాలు ‘శతమానం భవతి’, ‘రారండోయ్ వేడుక చూద్దాం’ ఈ సంవత్సరం ఫస్ట్‌హాఫ్‌లోనే ఫస్ట్ క్లాస్ హిట్స్‌ను నమోదు చేశాయి. శర్వానంద్, నాగ చైతన్యలకు పెద్ద రిలీఫ్ ఇచ్చిన సక్సెస్‌లు ఇవి. అయితే వీళ్లకు ఒక అడుగు ముందే నాని ‘నేను లోకల్’తో నిలబడ్డాడు. అసలు ఆశ్చర్యం ఏమిటంటే దగ్గుబాటి రానా ఒక సబ్‌మెరైన్‌తో వీరిని చేరుకోవడం. భారతదేశంలో ఇటువంటి కథ ఇదే మొదటిసారి. ‘ఘాజీ’ సినిమా జనానికి విశేషంగా నచ్చింది. అందులో నటించిన రానా కూడా. వార్ మూవీలు మనకు లేవన్న చింతను ఈ సినిమా తీర్చింది. అయితే 2017 ఫస్ట్ హాఫ్ కొన్ని సినిమాలకు ‘ఇంకొంచెం’ ఇవ్వడంలో పొదుపుగానే ఉంది. అల్లు అర్జున్ ‘దువ్వాడ జగన్నాథం’ ఈ ఇంకొంచెం దగ్గర వెలితి పొందింది– కథ విషయంలో, కలెక్షన్ల విషయంలో. అయితే సింగిల్ హ్యాండెడ్‌గా సినిమాను నడిపే సత్తా అల్లు వారి అబ్బాయికి ఉందని ఈ సినిమా మరోసారి రుజువు చేసింది. భారీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్న ‘కాటమరాయుడు’ కూడా ఇంకొంచెం ఉంటే బాగుండు అనే భావనను కలుగచేసింది. దర్శకుడు శ్రీను వైట్ల, హీరో వరుణ్ తేజ్ ఎంతో శ్రమ పడి పని చేసిన ‘మిస్టర్’ లక్ష్యాన్ని మిస్ చేసిందనే చెప్పాలి. శ్రీ వేంకటేశ్వరుని మీద భక్తితో తీసిన ‘ఓం నమో వెంకటేశాయ’ నాగార్జున, కె.రాఘవేంద్రరావుల మేజిక్‌ను దిగువ తిరుపతి వరకే చేర్చింది. విజయ్ దేవరకొండ ‘ద్వారక’, నిఖిల్ ‘కేశవ’, సాయిధరమ్‌తేజ్ ‘విన్నర్’, మంచు మనోజ్ ‘గుంటూరోడు’.. ఇవన్నీ రిజల్ట్ విషయంలో ఇంకొంచెం పొందలేకపోయిన సినిమాలు. అయితే మోహనకృష్ణ ఇంద్రగంటి ‘అమీ తుమీ’ తేల్చుకుని పాసైపోవడం ప్రేక్షకులు చూశారు. 2017 ఫస్ట్ హాఫ్‌లో కొన్ని విలక్షణమైన విషయాలు కూడా ఉన్నాయి. జయసుధ, ఆర్.నారాయణమూర్తి కలిసి నటించిన ‘హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామయ్య’ అలాంటి విలక్షణమైన విషయం– ఫలితం ఏదైనా. పూరి జగన్నాథ్ తీసిన ‘రోగ్’ను ఎందుకనో జనం ‘ఇడియట్’గా చూడలేకపోయారు. హిందీలో హిట్ అయిన ‘హంటర్’ను తెలుగులో ‘బాబు బాగా బిజీ’ అని ‘అవసరాల’ను పెట్టి తీస్తే జనం తమ బిజీ వల్ల చూడలేకపోయారనుకోవాలి. రాజ్‌తరుణ్ రెండు సినిమాలు ‘కిట్టూ ఉన్నాడు జాగ్రత్త’, ‘అందగాడు’ గురించి వీలున్నప్పుడు తప్పక చెప్పాలి. ‘లేడీస్ టైలర్’ను గుర్తు చేస్తూ వంశీ ‘ఫ్యాషన్ డిజైనర్’ తీసినా అందులో ప్యాషన్ లేదన్నారు జనం. ఇక ‘నయీమ్’ భూతం ఇండస్ట్రీని వెంటాడగా ‘ఖయ్యూం భాయ్’ సినిమా వచ్చింది. ఇదీ ఒక ఎన్‌కౌంటరే. 2017 ద్వితీయార్ధాన్ని రెండు ఊళ్లు ఆకర్షించాయి. ఒకటి బాన్సువాడ. రెండు మంగళూరు. బాన్సువాడలోని ఒకమ్మాయి వేగానికి, పరుగుకు, భాషకు, డ్యాన్సుకు, పెద్ద పెద్ద కళ్లకు, పొట్టి పొట్టి ఆకృతికి అమెరికా కుర్రాడేం ఖర్మ రెండు రాష్ట్రాల తెలుగు ప్రేక్షకులు కూడా ‘ఫిదా’ అయ్యారు. తెలంగాణ భాషలో మాట్లాడితే ఆంధ్రాలో ఆడుతుందా అనుకునేవారి అనుమానాలను ఈ సినిమా పటాపంచలు చేసింది. భాష ఏదైనా అది మాట్లాడేది మానవ స్వభావాన్నే కదా. వరుణ్‌తేజ్‌కు ఈ సినిమా ఊపిరిపోసింది. హీరోయిన్ సాయి పల్లవికి కూడా. ఇక చదువుకోరా అని మంగళూరు మెడికల్ కాలేజీకి పంపితే ప్రేమలో పడి, తాగి, నానా హంగామా చేసిన ఒక కుర్రవాణ్ణి కూడా ప్రేక్షకలోకం మెచ్చింది. ‘సమర సింహారెడ్డి’ తర్వాత రెడ్డి టైటిల్‌తో సూపర్ డూపర్ హిట్ కొట్టిన సినిమా ఇది. హీరో విజయ్ దేవరకొండ రాత్రికి రాత్రి సూపర్‌స్టార్ అయ్యాడు. ఈ విధంగా ఈ రెండు సినిమాలు ఈ సంవత్సరంలో ముఖ్యమైనవి. అయితే మరో విశేషంగా ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమాను చెప్పుకోవాలి. ఈ సినిమా రానాను సోలోగా నిలబెట్టడమే కాదు బ్రేక్ కోసం సుదీర్ఘంగా ఎదురు చూస్తున్న దర్శకుడు తేజకు కాలు మీద కాలు వేసుకునేలా చేసింది. ఎన్.టి.ఆర్. మూడు పాత్రలు చేయడం ఈ ద్వితీయార్ధం చూసిన మరో విశేషం. ‘జై లవకుశ’లో కథ ఏదైనా ఎన్.టి.ఆర్ నటనే ఆ సినిమాను విజయం వైపు నడిపించింది. నత్తి ఉన్న ప్రతినాయకుడిగా ఎన్టీఆర్ మెప్పించి మార్కులు కొట్టేశాడు. ఆ స్థాయిలో మాస్ ప్రేక్షకులను ఆకర్షించిన సినిమాలు మరో రెండు ఉన్నాయి. ఒకటి ‘రాజా ది గ్రేట్’. రెండు ‘పిఎస్వి గరుడవేగ’. సాధారణంగా అంధులు హీరోగా ఉంటే అవి విషాద ప్రేమ కథలవుతాయి. కానీ ‘రాజా ది గ్రేట్’లో అంధుడు తానొక అంధుణ్ణి కాదన్నంత ఆత్మవిశ్వాసంతో పరిస్థితులను ఎదుర్కొంటాడు. దర్శకుడు అనిల్ రావిపూడికి ఇది హ్యాట్రిక్. అయితే హాలీవుడ్ స్థాయి కథను ఊహించి దానిని తెలుగువారు ఎగ్జిక్యూట్ చేయగలరని నిరూపించిన సినిమా ఈ సంవత్సరంలో ‘పి.ఎస్.వి గరుడవేగ’నే. యూరేనియం గనుల తవ్వకాలపై నిషేధం ఉండటం వల్ల ఆ తవ్వకాల పనులు జరుగుతున్న సంగతిని బయటపెట్టకుండా ఉపగ్రహాన్ని హ్యాక్ చేసి ఆ సర్వర్ కోసం వెతుకులాడి... బాబోయ్ ఇటువంటి అర్థం కాని కథను కూడా ఎంతో ఉత్కంఠతో దర్శకుడు ప్రవీణ్ సత్తారు చెప్పాడు. ఇక రాజశేఖర్ ఈ సినిమాతో మళ్లీ చేతులు మడిచి ధీమాగా నిలబడగలిగాడు. 2017 ద్వితీయార్థాన్ని దెయ్యాలు ఏలాయి అని కూడా చెప్పవచ్చు. నాగార్జున ‘రాజు గారి గది 2’ ప్రేక్షకులందరికీ బాగా నచ్చింది. కోడలొచ్చిన వేళ అన్నట్టుగా సమంత నాగార్జునకు హిట్ తెచ్చింది. ఇంతవరకూ దెయ్యాల్ని చూసి మనుషులు భయపడేవారు. దీనిని తిరగేసి మనుషుల్ని చూసి దెయ్యాలు భయపడే సినిమా ‘ఆనందో బ్రహ్మ’ను దర్శకుడు మహి వి.రాఘవ్ తీశాడు. చాలారోజుల తర్వాత తాప్సికి హిట్ వచ్చింది. శ్రీనివాసరెడ్డి, షకలక శంకర్, తాగుబోతు రమేష్ వంటి హాస్యనటుల కష్టార్జితం ఈ సినిమా. అన్ని హంగులు ఉన్నా మరికొంత బాగుంటే ఫలితం ఇంకా బాగుండేది అనిపించిన సినిమాలు కొన్ని ఉన్నాయి. గోపిచంద్ ‘గౌతమ్‌నంద’, నితిన్ ‘లై’, బెల్లంకొండ శ్రీనివాస్ ‘జయ జానకీ నాయక’, బాలకృష్ణ ‘పైసా వసూల్’ సినిమాలు మాస్ ప్రేక్షకులకు చేరువయ్యే ప్రయత్నం చేసినా పూర్తి స్థాయిలో కాదు అని చెప్పాల్సి వస్తుంది. ఇక మహేశ్‌బాబు, మురగదాస్ కాంబినేషన్లో వచ్చిన ‘స్పైడర్’ వినూత్నమైన కథను చర్చించినా ప్రేక్షకులు ఆశించినది ఏదో మిస్సైన భావన వచ్చింది. మేకింగ్‌లో ఎంతో క్వాలిటీ చూపిన ఈ సినిమా విలన్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టిందనే టాక్ తెచ్చుకుంది. మరో వైపు థ్రిల్లింగ్ కంటెంట్‌ను సబ్జెక్ట్‌గా తీసుకున్న ‘శమంతకమణి’, ‘వీడెవడు’ ప్రేక్షకుల మెప్పు పొందాయి. రామ్ ‘ఉన్నది ఒకటే జిందగీ’ యావరేజ్ ఫలితాన్ని మించి తెచ్చుకుని ఉంటే బాగుండేది. 2017 ద్వితీయార్థంలో యువ హీరోలు మళ్లీ పంజా విసిరారు. నాని ‘నిన్ను కోరి’, శర్వానంద్ ‘మహానుభావుడు’ హిట్ అయ్యాయి. ‘వైశాఖం’, ‘దర్శకుడు’ లాంటి సినిమాలు కూడా ప్రేక్షకుల దృష్టిలో పడ్డాయి. ‘గల్ఫ్’ను ఒక సబ్జెక్ట్‌గా తీసుకుని దర్శకుడు సునీల్ కుమార్ రెడ్డి భిన్నమైన కథను చెప్పే ప్రయత్నం చేశారు. చిన్న సినిమాల విజయపరంపరకు ముక్తాయింపుగా శ్రీవిష్ణు నటించిన ‘మెంటర్ మదిలో’ బాక్సాఫీస్ దగ్గర బెటర్‌గా పెర్ఫార్మ్ చేస్తోంది. అలాగే 2017 ద్వితీయార్థం కొంతమందిని నిరాశ పరిచింది. అల్లరి నరేశ్ ‘మేడ మీద అబ్బాయి’ సక్సెస్ మెట్లు ఎక్కలేకపోయింది. కథకుడిగా ఎక్కువ హిట్స్ కొట్టిన విజయేంద్ర ప్రసాద్ తీసిన సైంటిఫిక్ థ్రిల్లర్ ‘శ్రీవల్లి’ ప్రేక్షకులకు ఎక్కలేదు. సందీప్ కిషన్ ఎంతో ఆశ పెట్టుకున్న ‘నక్షత్రం’ విఫలం కావడం నిరుత్సాహం కలిగించే సంగతి. జగపతి బాబు నటించిన ‘పటేల్ సార్’ ఇలా వచ్చి అలా పోయింది. ‘ఆక్సిజన్’, ‘జవాన్’ సినిమాలు మెరుగ్గానే ఉన్నట్టుగా గుర్తింపు పొందాయి. ప్రారంభం అద్భుతంగా ఉన్నప్పుడు ముగింపు కూడా అద్భుతంగా ఉండాలి. ఈ సంవత్సరాంతానికి అఖిల్ ‘హలో’ విడుదలవుతోంది. నాని ‘ఎం.సి.ఏ’ విడుదల కానుంది. నాగశౌర్య ‘చలో’, అల్లు శిరీష్ ‘ఒక్క క్షణం’ ఈ సంవత్సరానికి గుడ్ బై చెప్పబోతున్నాయి. వచ్చు కాలము మేలు గత కాలము కంటెన్ అన్నట్టుగా 2018 తెలుగు ఇండస్ట్రీకి మరిన్ని బ్లాక్ బస్టర్స్ ఇచ్చి కళకళలాడేలా చేయాలి. కొత్త రకమైన కథలు, నెరేషన్లు తెలుగువారు సాధిస్తారని ఆశిస్తూ కొత్త సంవత్సరం స్వాగతానికి రెడీ అవుదాం. – తెలుగు సినిమా రౌండప్ 2017 -
తియ్యండ్రా బండ్లు
బండగాళ్ల బెండు తియ్యాలంటే... బండ్లు కావద్దూ!కండలున్న క్రూరులు కంగుతినాలంటే... యాక్సిలరేటర్ తొక్కొద్దూ!సినిమాలో స్పీడు కావాలంటే... డైరెక్టర్ ‘యాక్షన్ యాక్షన్’ అని మొత్తుకోవడం కాదు. మత్తు వదిలించే యాక్షన్ సీక్వెన్స్ కావాలి... కుదిరితే సినిమా అంతా యాక్షన్ ఉండాలి. యాక్షన్‌కి ఇప్పుడు కొత్త డిక్షన్.. వయలెన్స్... తియ్యండ్రా బండ్లు... తొక్కండ్రా యాక్సిలరేటర్లు. సినిమాలు వచ్చిన కొత్తల్లో ఫైటింగులు లేవు. మాటలే మక్కెలిరగదీసేవి. అవి కూడా పెద్దపెద్ద మాటలేం కాదు. ‘మంచీ మర్యాద లేదా?’, ‘మనిషికీ, పశువుకీ తేడా ఏముందీ’.. ఇలాంటివి! ఆ మాత్రానికే క్యారెక్టర్లు హర్ట్ అయ్యేవి! ‘‘అంటే.. వాణ్ణి కొట్టడం నా వల్ల కాదంటావ్?!’’ అంటాడు బ్రహ్మాజీ. తల అడ్డంగా ఊపి, పెదవి విరుస్తాడు తనికెళ్ల భరణి. ఆ ఊపుడుకి, ఆ విరుపుకి అర్థం.. ‘నీ వల్ల కాదు’ అనే. ‘‘పోనీ చంపేయ్నా?’’ అంటాడు బ్రహ్మాజీ. భరణి నమ్మలేనట్లు చూస్తాడు. ఇద్దరూ పొలం మధ్యలో ఉంటారు. చుట్టూ అనుచరులు ఉంటారు. బ్రహ్మాజీ నిలబడి ఉంటాడు. భరణి నవారు మంచం మీద కూర్చొని ఉంటాడు. చొక్కా కాలర్ పైకి లేపి, కాలు వంకరగా నిలబెట్టి, నడుము మీద చెయ్యి వేసుకుని స్కెచ్ ఏమిటో చెప్తాడు బ్రహ్మాజీ.‘‘ఎల్లుండి నూకాలమ్మ జాతర. ఊళ్లో ప్రతివాడూ గుడికి వస్తాడు. వాడూ వస్తాడు. కానీ మళ్లీ ఎల్లడు. వీరమ్మ చెరువు దగ్గర నాలుగు సుమోలు ఉంటాయి. గట్టు దాటుతుంటే వేసేస్తాం. లక్కీగా దాటాడే అనుకో. చుక్కలగుడి దగ్గర ఇంకో మూడు సుమోలు ఉంటాయి. ఒకవేళ అక్కడా మిస్ అయ్యాడనుకో. సర్వితోపు చివర్లో ఈసారి ఐదు సుమోలు పెడతాను’’ అంటాడు.2005లో వచ్చిన ‘అతడు’ సినిమాలోని సీన్ ఇది. ఇందులో బ్రహ్మాజీ స్కెచ్ వేసింది.. మహేశ్ బాబుని చంపడం కోసమని మీకు తెలిసే ఉంటుంది. అరుపులు.. చరుపులు వయలెన్స్‌ని.. అది కూడా.. పెద్ద పెద్ద అరుపులు, కేకలు, పరుగులు, సుమోలు, క్వాలిస్లతో కనువిందు చేస్తూ శ్రవణానందం కలిగించే వయలెన్స్‌ని తెలుగు సినిమాలు యూత్‌కి ఎంటర్టైన్మెంటుగా మార్చాయి! ‘తియ్యండ్రా బండ్లు’ అని అనే డైలాగ్ వినిపిస్తే.. థియేటర్లో ఉన్న మనకు తిక్కరేగిపోతుంది! చొక్కా చింపేసుకుంటాం. ఒక్క అరుపుతో, లేదా ఒక్క చరుపుతో తెరపై భారీ బండ్లు గాల్లోకి లేచి, ఒక్కసారిగా కింద పడితే మన ఫ్రంటు, బ్యాకు, టాపు డాల్బీలో అదిరిపోతుంది. ‘తియ్యండ్రా బండ్లు’ అనే డైలాగ్ అంతకుముందు రెండు మూడు సినిమాల్లో ఉన్నప్పటికీ 2006లో వచ్చిన ‘విక్రమార్కుడు’ చిత్రంతో పాపులర్ అయింది. 2005లో తెలుగులోకి డబ్ అయిన తమిళ చిత్రం ‘గజనీ’లో కనీవినీ ఎరుగనంత వయలెన్స్ ఉందని టాక్ వచ్చింది. అంతకు ఏమాత్రం తగ్గని హింస ‘విక్రమార్కుడు’లో ఉంది. హీరో రవితేజను చంబల్ లోయ విలన్లు కత్తులు కటార్లతో వెంటాడుతుంటారు. రవితేజ భుజంపై ఒక చిన్నారి ఉంటుంది. ఆ చిన్నారి భుజంపై ఆమె స్కూల్ బ్యాగ్ ఉంటుంది. తనను, పాపను కాపాడుకునేందుకు రవితేజ తప్పించుకునే ప్రయత్నంలో జరిగే హింస అత్యంత భయానకమైనది! ఈలోపు డబల్ యాక్షన్‌లో ఇంకో రవితేజ పై నుంచి దిగుతాడు. పాపను, పాపను ఎత్తుకుని ఉన్న రవితేజను తప్పిస్తాడు. ఆ వెంటనే అతడు చెప్పే డైలాగులు హింసలకే హింస! వెర్బల్ వయలెన్స్ అన్నమాట.‘‘చావు అంటే భయపడ్డానికి అల్లాటప్పాగా గల్లీల్లో తిరిగే గూండా నా కొడుకుననుకున్నార్రా. రాథోడ్. విక్రమ్ రాథోడ్. భయం నాక్కాదురా. చావుకి. ఒంటరిగా నన్ను రమ్మనే దమ్ములేక ఆరు నెలలనుంచీ పిచ్చికుక్కలా నా వెనకే తిరుగుతోంది. నన్ను తీసుకెళ్లాలంటే నాతో పాటు చచ్చే పదిమంది తోడు దానికి కావాలి’’ అంటాడు రవితేజ. ‘చిన్నా.. రాడ్లు తియ్’ లాస్ట్ సీన్లో విలన్ వినీత్‌కుమార్... డీఎస్పీ రవితేజ కోసం ఎదురుచూస్తుంటాడు. మీడియా అక్కడే ఉంటుంది. ‘‘సర్.. టైమ్ తొమ్మిది కావస్తోంది. విక్రమ్ రాథోడ్ వచ్చి మీ గోడవున్లన్నీ పగలగొట్టేస్తానంటున్నాడు. ఇప్పుడు మీరేం చేస్తారు’’ అని అడుగుతాడు ఓ టీవీ రిపోర్టర్. తొమ్మిది దాటుతుంది. రవితేజ రాడు. తొమ్మిదిన్నర అవుతుంది. రాడు. పదకొండున్నర అవుతుంది. రాడు. ఫోన్ వస్తుంది. ‘‘ఎక్కడ్రా నీ గోడవున్లు? అడ్రస్ తెలియడం లేదు. అన్నట్టొరేయ్ ఇక్కడ నీ లిక్కర్ ఫ్యాక్టరీ కనిపిస్తే బోర్ కొట్టి పేల్చేశాను’’ అంటాడు. విలన్ అదిరిపడతాడు. ‘‘దమ్ముంటే అక్కడే ఉండు. నేనే నీ దగ్గరకు వచ్చేస్తాను’’ అంటాడు. వెహికిల్స్ అన్నీ రెడీ గా ఉంటాయి. అప్పుడే అంటాడు విలన్.. ‘తియ్యండ్రా బండ్లు’ అని! తర్వాత.. మళ్లీ వయలెన్స్. అలా బండ్లు తియ్యడం అన్నది కాలక్రమంలో వయలెన్స్‌కి సిగ్నేచర్ పంచ్ అయిపోయింది.రామ్‌గోపాల్ వర్మ ‘శివ’ సినిమాలో ఇలాంటి డైలాగే ఉంటుంది. ‘చిన్నా రాడ్లు తియ్’ అని! యూత్‌కి ఆ డైలాగ్ ఇచ్చిన కిక్కు ఒకరోజులో దిగలేదు. యాక్షన్‌లో థ్రిల్ ఉంటుంది. వయలెన్స్ కూడా మిక్స్ అయితే అది ఫుల్ ఎంటర్టైన్మెంట్ అవుతుంది! సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, ఇంద్ర, ఆది, సాంబ, దమ్ము.. ఇలాంటివన్నీ ఈ ఫార్ములాతో ఎంటర్టైన్ చేసిన సినిమాలే. వయలెన్స్లో మళ్లీ రకాలు ఉన్నాయి. ఫాక్షన్ వయలెన్స్, మాఫియా వయలెన్స్, లవ్ వయలెన్స్, భూతప్రేతాల వయలెన్స్, రక్తచరిత్రల వయలెన్స్, దండుపాళ్యంల వయలెన్స్.. అన్నీ కూడా చక్కగా మనల్ని బాల్కనీలో కూర్చోబెట్టి, పాప్‌కార్న్ తినిపిస్తూ ఎంజాయ్‌మెంట్‌ని ఇచ్చేవే! వయలెన్స్లో ఏమిటంత ఎంటర్టైన్మెంట్?! ఎమోషన్ కదలిస్తుంది. కామెడీ కడుపారా నవ్విస్తుంది. యాక్షన్ రక్తాన్ని పరుగులు తీయిస్తుంది. వయలెన్స్ ఒక్కటే.. సర్రున నరాల్లోకి ఎక్కేస్తుంది. మళ్లీ నిజ జీవితంలోని వయలెన్స్‌కు ఇంత గ్లామర్ ఉండదు. అవును గ్లామరే! ‘ఒక్కడు’ సినిమాలో మహేశ్‌బాబు ఒక్క దెబ్బ కొట్టగానే ప్రకాశ్‌రాజ్ ఎగిరెళ్లి ట్రాన్స్ఫార్మర్ మీద పడతాడు. ట్రాన్స్ఫార్మర్ పేలిపోతుంది. ఆ పేలిపోవడంలో గ్లామర్ ఉంది. ‘సరైనోడు’ సినిమాలో బన్నీ ఫస్ట్ సీన్లోనే బలిసిన దున్నపోతుల్లాంటి గూండాలను తుక్కుతుక్కు చేస్తాడు. ఆ సీన్లో బన్నీ బలిష్టమైన గుర్రంలా ఉంటాడు. ఆ ఉండడంలో గ్లామర్ ఉంది. ‘సింహా’ లాస్ట్ సీన్లో హీరో నేల మీది మట్టిని తీసుకుని గుండెలకు రాసుకుని, సేమ్ అదే ప్లేస్‌లో తన ప్రత్యర్థుల చేతుల్లో చనిపోయిన తండ్రిని తలచుకుంటూ ఒక్కొక్కణ్ణీ వట్టి చేతుల్తో ఉట్టి పగలగొట్టినట్టు కొట్టేస్తుంటాడు! చివరికి మెయిన్ విలన్ని గండ్రగొడ్డలితో ఖైమా కొట్టేస్తాడు. ఆ కొట్టడంలో గ్లామర్ ఉంది. చెంపదెబ్బ.. టు.. కసాబిసా ఆడవాళ్లు సున్నిత హృదయులనీ, మగవాళ్లు రఫ్ వెధవలనీ అనుకుంటాం. అది నిజమే. అయితే వయలెన్స్‌ని ఎంజాయ్ చెయ్యడంలో ఆడామగా తేడా ఉండదు. అక్కడ మనం ఒక హ్యూమన్ బీయింగ్ మాత్రమే. సినిమాల్లో ఒక్కొక్కరికీ ఒక్కోటి నచ్చుతుంది. అందరికీ నచ్చేది మాత్రం ఫైటింగ్. మనం చెయ్యవలసిన ఫైటింగ్, మనం చెయ్యలేని ఫైటింగ్ ఎదురుగా ఇంకొకరు చేస్తుంటే భలే సంతోషంగా ఉంటుంది. చిన్న చెంప దెబ్బే అయినా, మనం కొట్టలేనిది ఇంకొకడు కొట్టాడంటే లోపల్లోపల హ్యాపీగా ఫీలవడానికి ఆడేమిటి? మగేమిటి? సినిమాలు వచ్చిన కొత్తల్లో ఫైటింగులు లేవు. మాటలే మక్కెలు ఇరగదీసేవి. అవి కూడా పెద్దపెద్ద మాటలేం కాదు. ‘మంచీ మర్యాద లేదా?’, ‘మనిషికీ, పశువుకీ తేడా ఏముందీ’.. ఇలాంటివి! ఆ మాత్రానికే క్యారెక్టర్లు హర్ట్ అయ్యేవి. క్రమక్రమంగా చెంపదెబ్బలు మొదలయ్యాయి. ‘టప్’మని ఒక చిన్న చప్పుడు. అంతే! తర్వాత ‘డిష్యుం’ అనే సౌండ్ క్రియేట్ అయింది. ‘బాబోయ్ ఎంత పెద్ద దెబ్బో’ అనిపించేలా! ఒకరిని ఒకరే కొట్టడం, మూకుమ్మడిగా ఒకర్నొకరు కొట్టుకోవడం, నలుగురైదుగురు కలిసి ఒకర్ని కొట్టడం, ఒకడే నలుగురైదుగుర్ని కొట్టడం, చివరికి.. ‘‘ఒక్కొక్కణ్ణి కాదు షేర్ ఖాన్.. వందమందిని ఒకేసారి రమ్మను..’ అని మగధీరలో రామ్ చరణ్ సవాల్ విసిరే వరకు వెళ్లింది. వంద మందీ వచ్చేస్తారు. ఒక్కొక్కర్నీ కసాబిసా నరికేస్తాడు చరణ్. అదొక హిస్టారికల్ వయలెన్స్. వయలెన్స్ అంటే కచ్చితంగా రక్తం కారాలనేం లేదు. కమెడియన్ని వట్టి పుణ్యానికే హీరో ఫటక్ ఫటక్మని కొట్టి చంపడం ఒక రకం వయలెన్స్. బావగారు చెల్లెలికి అరిచేతిలో నరకం చూపించడం హోమ్లీ వయలెన్స్. ‘ఖలేజా’లో మహేశ్‌బాబు నోరెత్తితే ‘పంచ్’లు పడడం అదో టైపు వయలెన్స్. హాలీవుడ్ నుంచి, బాలీవుడ్ నుంచి తెచ్చుకున్న వయలెన్స్లు కూడా కొన్ని! ఏ జానర్ వయలెన్స్ అయినా ఆ సీన్ వరకు ఖాయంగా సినిమాను గట్టెక్కిస్తుంది. ఎందుకింత ఇష్టపడతాం? ఈ ప్రశ్నకు సమాధానంగా రకరకాల థియరీలు, థీసిస్‌లు ఉన్నాయి. ఒక థియరీ ప్రకారం.. వ్యవస్థపై కోపాన్ని, అన్యాయాలపై ఆగ్రహాన్ని, దౌర్జన్యాలపై ప్రతీకారాన్ని తీర్చుకోడానికి సినిమా హీరోలకు మాత్రమే సాధ్యమౌతుంది. అది చూసి మనం ఆ కొద్ది సేపు సంతృప్తి చెందుతాం. హింసను ఇష్టపడని ప్రేక్షకులు కూడా ఆ హింసా సన్నివేశాల్లోని థ్రిల్‌ని, సస్పెన్స్‌నీ లైక్ చేస్తారు. అంటే వాళ్లు నికోటిన్‌ని ఇష్టపడతారు కానీ, సిగరెట్‌ని లైక్ చెయ్యరు. అనుకరించేవారి మాటేమిటి? ట్రెండ్ ఏదైనా దానికి ఫాలోయింగ్ ఉంటుంది. ముఖ్యంగా యూత్ కనెక్ట్ అవుతారు. సైకిల్ చెయిన్ తెంపితే తెగదు. కానీ తెంపాలని చూస్తారు. నాగార్జున తెంపాడు కదా! అదే సినిమాలో బుద్ధిగా కాలేజీకి వెళ్లి చదువుకున్నవాళ్లు కూడా ఉన్నారు. అయితే రామ్‌గోపాల్ వర్మ అలాంటి బుద్ధిమంతులను చూపించడు. మామూలు సినిమాలు బుద్ధిమంతుల లాంటివి. ఆదర్శమే కానీ, ఆచరించేలా ఎట్రాక్ట్ చెయ్యవు. అందుకే వయలెన్స్ ఉన్న సినిమాలు జనానికి నచ్చుతుంటాయి. మితిమీరి వయలెన్స్ ఉంటే సెన్సార్ బోర్డు కత్తెరకు చిక్కుతుంటాయి. -
బ్లైండ్ రిలేషన్షిప్
ఇప్పుడున్న టాప్ హీరోల్లో ఒకరైన స్టార్ నటించిన సినిమాలోని సన్నివేశాలివి. ఈ సినిమా దర్శకుడు ఈమధ్య కాలంలో నటుడిగానూ సూపర్ అనిపించుకుంటున్నారు. తెలుగు సినిమా రొమాంటిక్ కామెడీలకు ఒక కొత్త దారిని చూపించిన ఈ సినిమా పేరేంటో చెప్పుకోండి చూద్దాం!? సిద్ధు, మధు.. ఇద్దరిదీ చూడముచ్చటైన జంట. కాలేజీలో ఎక్కడ చూసినా వీరిద్దరూ కలిసే కనిపిస్తారు. ఒకరంటే ఒకరికి పిచ్చి ఇష్టం. సిద్ధు అందరినీ ఫ్రెండ్.. ఫ్రెండ్.. అని పరిచయం చేయగలడు కానీ, మధును మాత్రం కేవలం ఫ్రెండ్ అని పరిచయం చేయలేడు. అతడికి తెలుసు.. మధు ఫ్రెండ్ కంటే ఎక్కువే అని. మధు కూడా అలా పరిచయం చేయడంలో సిద్ధు పడే ఇబ్బందిని గ్రహించి నవ్వుతుంది. ఆమెకూ తెలుసు సిద్ధు తనకు ఫ్రెండ్ కంటే ఎక్కువ అని. ప్రేమా? ఎవ్వరూ ఆ విషయాన్ని ఒప్పుకోలేదు, చెప్పుకోలేదు కూడా. సరిగ్గా కాలేజీలో ఫైనల్ ఎగ్జామ్స్ దగ్గర పడే సమయానికి సిద్ధు, మధులకు ఒక గొడవ జరిగింది. అది చూడ్డానికి సిల్లీగానే అనిపించొచ్చు. సిల్లీ అయితే కాదు. గొడవలో మాటా మాటా పెరిగి, ఇద్దరూ మాట్లాడుకోవద్దని ఒక నిర్ణయానికి వచ్చేశారు. విడిపోయారు. సిద్ధు, మధు ఇప్పుడు ఫ్రెండ్స్ కూడా కాదు.పరీక్షలైపోయాయి. సెలవులు అయిపోయాయి. మళ్లీ కాలేజీ మొదలైంది. సిద్ధు, మధు ఎవరికి వారే అన్నట్టుగానే ఉన్నారు. ఒక విషయం మాత్రం వాళ్లను మళ్లీ మాట్లాడుకునేలా చేసింది. బాబు – శాంతిల ప్రేమ. ఆ ప్రేమ ఇప్పుడు ఇబ్బందుల్లో ఉంది. వాళ్లిద్దరూ కలవాలంటే, వీళ్లిద్దరూ కలవాలి. యూనివర్సిటీలో మధు ఎదురైనా, ఆమెను పట్టించుకోకుండానే ముందుకు కదిలాడు సిద్ధు. అలా వెళ్లిపోతున్న సిద్ధును, ‘‘సిద్ధు..’’ అని పిలిచి ఆపింది మధు. ‘ఏంటి?’ అన్నట్టు చూశాడు సిద్ధు. ‘‘నేన్నీతో రాజీపడటానికి వచ్చానని తప్పుగా అనుకోకు.’’ మధు మాట్లాడటం మొదలుపెట్టింది. ‘‘రాజీ పడటం తప్పని ఎవరన్నారు?’’ సిద్ధు. ‘‘ఇలాచూడూ.. నీతో.. సారీ.. మీతో.. ఆర్గ్యుమెంట్‌కి రాలేదు. ఒక ముఖ్యమైన విషయం మాట్లాడటానికి వచ్చాను. ఈ టు మంత్స్ సమ్మర్ హాలీడేస్‌లో మనం ఊరికెళ్లినప్పుడు ఇక్కడ ఏమేమో జరిగాయి. బాబు శాంతిని చూడటానికి వాళ్లింటికి వెళ్లి శాంతి అనుకొని వాళ్ల నాన్నను లేపి దొరికిపోయాడు. శాంతిని వాళ్ల నాన్న హౌస్ అరెస్ట్ చేశారు. బాబు క్లాస్‌కి వచ్చాడా?’’ చెప్పాలనుకున్నదంతా చెప్పేస్తూ అడిగింది మధు. సిద్ధుపై కోపం ఆమెకు ఏమాత్రం తగ్గలేదు.‘‘రాలేదే?’’ ‘‘మనం పెంచిన లవ్. ఇప్పుడు ప్రాబ్లమ్‌లో ఇరుక్కుపోయింది.’’ సిద్ధు ఆ మాటకు ఎలా రియాక్ట్ అవుతున్నాడో చూస్తోంది మధు. తన మాటను వెంటనే సరిచేస్తూ, ‘‘ఐ మీన్, బాబు – శాంతిల లవ్ గురించి మాట్లాడుతున్నాను’’ అంది. ‘‘శాంతిని చూశావా? సారీ.. చూశారా?’’ సిద్ధు పెద్దగా ఆసక్తి చూపనట్టుగానే అడిగాడు. ‘‘నేనిప్పుడు అక్కణ్నుంచే వస్తున్నాను. శాంతి కుమిలి కుమిలి ఏడుస్తోంది. నిన్ను, బాబును కలిపే బాధ్యత నాదని చెప్పొచ్చాను. ఆ విషయం గురించే మిమ్మల్ని కలవడానికి వచ్చాను. మీరు కూడా మీ ఫ్రెండ్‌కి ప్రామిస్ చేశారు. సో, నేను నా ఫ్రెండ్‌కు చేసిన ప్రామిస్ కోసం.. మీరు మీ ఫ్రెండ్‌కు చేసిన ప్రామిస్ కోసం మనిద్దరం కలిసి..’’ అంటూ సిద్ధును చూస్తూ మాట్లాడ్డం ఆపేసింది మధు.సిద్ధు సిగరెట్ వెలిగిస్తున్నాడు. అంతకు కొన్ని రోజుల ముందరే మధు కోసం సిగరెట్ మానేశాడు సిద్ధు. ఇప్పుడు మళ్లీ వెలిగించడం ఆమెకు చిరాకు తెప్పించింది.మధు అలా చూస్తూ ఉండటం గమనించిన సిద్ధు,‘‘కలసి?’’ పూర్తి చేయమన్నట్టు అడిగాడు.‘‘కలసి.. కలసి వాళ్లిద్దరినీ కలపాలి.’’ కోపాన్ని దాచుకుంటూనే, బాధను బయటపెడుతూనే చెప్పింది మధు.‘‘మనిద్దరం కలసి అన్నాను చూడండీ.. ఆ విషయంలో మనం కొంచెం కరెక్ట్‌గా ఉండాలి.’’ కొంచెం గట్టిగా, కోపాన్నంతా దాచుకుంటూ చెప్పింది మధు.‘‘మనిద్దరం కలసి తిరగబోయే రోజుల్లో మన మధ్య ఉండేది ఎలాంటి సంబంధమో ఇప్పుడే మనం నిర్ణయించుకోవాలి’’ మధు మాట్లాడుతూ పోతుంటే సిద్ధు ఏదీ పట్టనివాడిలా సిగరెట్ పొగను గాల్లోకి వదులుతున్నాడు.‘‘అది స్నేహం కాదు. ప్రేమ కాదు. వేరే ఏ సంబంధమూ కాదు. జస్ట్ ఓ గుడ్డి సంబంధం. ఎ బ్లైండ్ రిలేషన్షిప్. ఎ రిలేషన్షిప్ విచ్ హాజ్ నో మీనింగ్. ఆ సంబంధం కూడా వాళ్లిద్దరూ కలిసేవరకే!’’ సిగరెట్ పొగను గట్టిగా పీల్చి వదిలాడు సిద్ధు. ‘‘నేను చెప్పినట్టు మీరుంటారని ఆశిస్తున్నాను. నడుచుకుంటారని నమ్ముతున్నాను’’ ఆ మాటతో ముగించింది మధు.‘‘నేను ఏదైతే చెప్పాలనుకున్నానో, మీరూ అదే చెప్పారు.’’ మధు మాట్లాడటం ఆపేసిన కొన్ని సెకండ్లకు సిద్ధు నోరు విప్పాడు. కొన్ని నిమిషాల తర్వాత. ఒంటరిగా పార్క్‌లో ఓ బెంచీపై కూర్చున్న బాబును కలిసేందుకు వచ్చారు మధు, సిద్ధు. బాబును చూడ్డమే, ‘‘ఆ గడ్డమేంట్రా?’’ అంటూ గట్టిగా నవ్వాడు సిద్ధు. మధు.. సిద్ధును కోపంగా చూస్తూ నిలబడింది. ‘‘ఆ.. అందుకే.. అందుకే ప్రేమ, దోమాలాంటి తొక్కలో కమిట్మెంట్స్ పెట్టుకోకూడదు. ఇప్పుడు నన్ను చూడు.. ఎంత సంతోషంగా ఉన్నానో, ఎంత ఉల్లాసంగా ఉన్నానో.. ఎందుకంటే నేనెవర్నీ లవ్ చేయలేదూ.. ఏ సమస్యలోనూ ఇరుక్కోలేదు.. నీలాగా..’’ అంటూ మరింత గట్టిగా నవ్వాడు సిద్ధు. ఇంక కోపాన్ని దాచుకోలేకపోయిన మధు, ‘‘సిద్ధు.. మనసులో బాధను ఉంచుకొని పైకి సంతోషంగా ఉన్నట్టు నటించడం, చూడ్డానికి అసహ్యంగా ఉంది’’ అంది కోపాన్ని బయటపెడుతూ. ‘‘ఏంటీ?’’ అన్నాడు సిద్ధు. ‘‘ఐ మీన్.. బాబు కోసం నువ్ లోలోన పడుతున్న బాధను గురించి చెప్తున్నాను.’’ మధు మాటలకు కొన్ని సెకండ్లు ఆగిపోయి మళ్లీ మాట్లాడటం మొదలుపెట్టాడు సిద్ధు. -
స్క్రీన్ ప్లే 20th October 2017
-
తెలుగు సినిమాలను బెంగళూరు ఆదరిస్తుంది
శివాజీనగర (బెంగళూరు): తెలుగు సినిమాలను ఉభయ రాష్ట్రాల తర్వాత బెంగళూరు ప్రజలే ఎక్కువగా ఆదరిస్తారని సినీ హీరో మహేశ్‌బాబు అన్నారు. ఆయన హీరోగా నటించిన ‘స్పైడర్’ సినిమా ప్రచారం కోసం ఆదివారం ఆయన బెంగళూరుకు వచ్చారు. ఈ సందర్భంగా మహేశ్ మీడియాతో మాట్లాడుతూ.. తాను నటించిన ఒక్కడు, అతడు, పోకిరి, శ్రీమంతుడు సినిమాలను బెంగళూరు ప్రేక్షకులు బాగా ఆదరించారని, స్పైడర్‌ను కూడా ఆదరిస్తారని భావిస్తున్నట్లు తెలిపారు. ఈ సినిమా విజయం సాధిస్తుందనే నమ్మకంతో ఉన్నామన్నారు. కార్యక్రమంలో చిత్ర దర్శకుడు ఏఆర్ మురుగదాస్, హీరోయిన్ రకుల్‌ప్రీత్ సింగ్, నిర్మాత ఎన్వీ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
ఆడవారె ఈడవారు
కవర్ స్టోరీ తెలుగుతెర అంతా ‘ఆడ’ పిల్లలే... అదేనండీ పరభాషా నాయికలే అని తరచూ వాపోతూ ఉంటాం. కానీ, ఇవాళ తెలుగు సినిమాలలో పాపులర్ హీరోయిన్లయిన తమిళ, మలయాళ, పంజాబీ, ఢిల్లీ భామల్లో చాలామంది తెలుగుసీమను అక్షరాలా తమ రెండో ఇల్లు చేసుకుంటున్నారు. ఇక్కడే ఫ్లాట్ కొంటున్నారు, జిమ్ పెడుతున్నారు, తెలుగు నేర్చేసు కొని డబ్బింగ్ చెప్పేస్తున్నారు. చిన్న పాత్రకైనా, కురచ దుస్తులకైనా సై అంటున్నారు. అందుకే, ఈ ‘ఆడ’వారు... ఇప్పుడిక ‘ఈడ’ వారు. అనుష్క (34) : తెలుగింటి రుద్రమ బి.సి.ఏ. చదివి, యోగా శిక్షకురాలిగా చేస్తూ, 11 ఏళ్ళ క్రితం హఠాత్తుగా సినిమాల్లోకి వచ్చినప్పుడు ఈ తుళు భామకు నటనలో ఓనమాలు తెలియవు. ఇవాళ తెలుగు, తమిళాల్లో నటిగా ఆమె ఎవరో తెలీనివారు లేరు. ‘బిల్లా’లో బికినీ వేసినా, ‘సైజ్ జీరో’ కోసం లావైనా, ‘వేదం’లో వేశ్యపాత్ర వేసినా అనుష్క గట్స్ వేరు. స్నేహం కోసం స్పెషల్ సాంగ్కైనా (‘స్టాలిన్’, ‘కింగ్’), అతిథి పాత్రలకైనా ఎవర్ రెడీ. అందుకే, ఇండస్ట్రీలో ఆమె గురించి అంతా మంచే చెప్తారు. ‘మనమ్మాయే’ అంటారు. ఫస్ట్ : నాగార్జున - పూరీల ‘సూపర్’ ( 2005) బెస్ట్ : ‘అరుంధతి’, ‘రుద్రమదేవి’, రాజమౌళి ‘బాహుబలి’ స్పెషాల్టీ : మంచితనం, యూనిట్ సభ్యులతో సహకారం, కలుపుగోలుతనం హీరోయిన్లలో స్వీటీని స్పెషల్‌గా నిలబెట్టాయి. పోజులు కొట్టకుండా, సామాన్య వ్యక్తిలా అందరితోనూ కనెక్టయిపోతారు. చక్కటి తెలుగు మాట్లాడతారు. ఉంటే బెంగుళూరు, లేదంటే హైదరాబాదే. నాగ్ కుటుంబానికి సన్నిహితురాలు. లేడీ ఓరియంటెడ్ సినిమాలంటే ఇవాళ దర్శక, నిర్మాతలకు ఫస్ట్ అండ్ లాస్ట్ చాయిస్ అనుష్కే. పారితోషికం : రూ. 1.5 నుంచి 2 కోట్లు తమన్నా (27) : పాల నురగల తళుకు బ్రహ్మాండంగా తెలుగు మాట్లాడుతూ, డబ్బింగ్ కూడా చెప్పే స్థాయికి (నాగార్జున ‘ఊపిరి’) చేరిన ఈ పాల మెరుగుల సుందరి పంజాబీ గుడియా అంటే నమ్మలేం. 15 ఏళ్ళకే హిందీలో ఎంట్రీ ఇచ్చి, ఆపైన దక్షిణాదికి వచ్చి, తెలుగు, తమిళాల్లో దున్నేస్తున్నారు. డైమండ్ వ్యాపారి కూతురైన తమ్మూ దక్షిణాదిలో జ్యువెలరీ ఎండార్సమెంట్స్లో టాప్. గత ఏడాది సొంతంగా ‘వైట్ ఎన్ గోల్డ్’ అనే రిటైల్ జ్యువెలరీ బ్రాండ్ కూడా మొదలెట్టారు. ఫస్ట్ : తెలుగులో ‘శ్రీ’ (2005) బెస్ట్ : ‘హ్యాపీడేస్’, ‘బాహుబలి’, ‘ఊపిరి’ స్పెషాల్టీ : నవతరం హీరోయిన్స్ లో మంచి డ్యాన్సర్. సాక్షాత్తూ చిరంజీవి సైతం నర్తించడానికీ, నటించడానికీ ఇష్టపడుతున్న హీరోయిన్. స్పెషల్ సాంగ్స్ (‘అల్లుడు శీను’), అతిథి పాత్ర (‘రెడీ’)లకూ సై! కొన్ని ఆడకపోయినా, హిందీ వైపు చూడడం మానని నటి. స్టార్ స్టేటస్ తెచ్చిన తెలుగు సీమ అంటే తెగ ఇష్టం. భేషజం లేకుండా నవ్వుతూ మాట్లాడే ఈ మిల్కీ బ్యూటీ అలా మన తెలుగమ్మాయిలా కలిసిపోయారు. పారితోషికం: రూ. 1.5 కోట్ల దాకా సమంత (29) : చిన్న వయసు... పెద్ద మనసు... తెలుగునాట వెన్నెల కాస్తున్న చెన్నై చంద్రమ. కొత్తతరం ప్రేమకు ప్రతినిధిగా పవన్‌కల్యాణ్, చిన్న ఎన్టీఆర్, బన్నీ - ఇలా అందరి సరసనా ఆమే. సిద్ధార్థతో బ్రేకప్ లవ్‌స్టోరీ నుంచి బెల్లంకొండ శ్రీనివాస్‌తో ఐటవ్ు సాంగ్ దాకా ఆమెకు సంబంధించి ప్రతిదీ హాట్ న్యూసే. బ్రాండ్ ఎండార్సమెంట్లు, 3 భాషల్లో సినిమాలతో ఎప్పుడూ యమ బిజీ. ఫస్ట్ : నాగచైతన్య- గౌతమ్ మీనన్‌ల ‘ఏ మాయచేశావె’ (2010) బెస్ట్ : ‘ఏ మాయ చేశావె’, ‘ఈగ’, ‘అత్తారింటికి దారేది’ స్పెషాల్టీ: కళ్ళల్లో చిలిపితనం... సమాజం పట్ల ప్రేమ ధనం... చారిటీకి మూలధనం కలిస్తే - సమంత. ఫ్యాషన్ దుస్తులు, మీడియాలో ట్వీట్లతో రోజూ పేపర్లో ఉంటారు. టాప్ హీరోయినైనా చెన్నై మధ్యతరగతి మనస్తత్వాన్ని వదులుకోని మంచి మనిషి. నవ్వుతూ, చక్కటి తెలుగు గలగలా మాట్లాడతారు. నెలకు ఇరవై రోజులైనా హైదరాబాద్‌లోనే మకాం. ఉంటున్న స్టార్ హోటల్‌నే దాదాపు ఇంటిని చేసుకున్నారు. తెలుగు, తమిళాల్లో హీరోలకు ఇవాళ ఫస్ట్ చాయిస్. త్వరలోనే నిజజీవితంలో అక్షరాలా తెలుగు సినీసీమకు పెద్దింటి కోడలు కానున్నారట. పారితోషికం: రూ. 1.5 కోట్ల దాకా రకుల్ (25) : ఇప్పుడు వీస్తున్న గాలి... అడుగుపెట్టిన ఆరేళ్ళలోనే అందరినీ ఆకర్షించిన పంజాబీ పిల్ల. ప్రస్తుతం చేతిలో 6 సిన్మాలతో నంబర్ వన్ హీరోయిన్ రేసులో గట్టి పోటీదారు. పెదవులపై చిరునవ్వు, ప్రొఫెషనలిజమ్ ఆభరణాలు. ఫస్ట్ : తెలుగులో ‘కెరటం’ (2011) బెస్ట్ : ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’, ‘లౌక్యం’, ‘పండగ చేస్కో’ ,‘సరైనోడు’ స్పెషాల్టీ : గోల్ఫ్ ఆడడంలోనే కాదు... అనుకున్న గోల్ సాధించే ఏకాగ్రతా ఉన్న నవతరం అమ్మాయి. ఇప్పుడు యువ హీరోలు అందరూ కోరి తెచ్చుకుంటున్న కొత్త హీరోయిన్. బాగా తెలుగు మాట్లాడడమే కాదు... చిన్న ఎన్టీఆర్ ‘నాన్నకు ప్రేమతో’లో తెలుగు డబ్బింగ్ కూడా చెప్పిన అమ్మాయి. మూడు నెలల క్రితమే గచ్చిబౌలీలో సొంతంగా జిమ్ (‘ఎఫ్45’) కూడా పెట్టారు. ఇల్లు కొనుక్కొని, అచ్చంగా ‘ఈడ’ పిల్లగా మారిన ‘ఆడ’ పిల్ల. పారితోషికం: రూ. 1 - 1.25 కోట్లు (బోయపాటి శ్రీను దర్శకత్వంలో బెల్లంకొండ శ్రీనివాస్ తాజా సినిమాకు ఏకంగా రూ. 1.5 కోట్లు) శ్రుతీహాసన్ (30) : అందం... అభినయాల సమశ్రుతి ఆళ్వార్‌పేట నుంచి ఆంధ్రదేశం దాకా పరుచుకున్న వెండివెన్నెల వెలుగు - ఈ చెన్నపట్నం చిన్నది. తల్లి (సారిక), తండ్రుల సినిమా జీన్స బాల్యంలోనే తెర మీదకు తెచ్చాయి. కాలక్రమంలో తండ్రి (కమల్‌హాసన్) చాటు బిడ్డలా కాక... సొంత కాళ్ళపై నిలబడిన నవ తరం అమ్మాయి. అందాల ప్రదర్శనకు వెనుకాడని ప్రొఫెషనల్. తెలుగు, తమిళ, హిందీ సిన్మాలు, ఆల్బమ్ లు, పాటలు, ఫ్రెండ్స, పార్టీలు - అన్నింటితో బిజీ బిజీ. ఫస్ట్ : తెలుగులో ‘అనగనగా ఓ ధీరుడు’ (2011) బెస్ట్ : ‘గబ్బర్‌సింగ్’, ‘ఎవడు’, ‘రేసుగుర్రం’, ‘శ్రీమంతుడు’ స్పెషాల్టీ : సాధారణ సినీ సంప్రదాయానికి భిన్నంగా హీరో కుటుంబం నుంచి వచ్చిన హీరోయిన్. మొదట్లో చేసిన సినిమాలేవీ ఆడనప్పుడు ‘ఐరన్‌లెగ్’ అన్న నోళ్ళే ఇప్పుడీ అమ్మడిని ‘గోల్డెన్ లెగ్’ అంటూ ఆకాశానికి ఎత్తేస్తున్నాయి. శ్రుతి ముఖంలో మాత్రం చెరగని నవ్వే. పవన్ కల్యాణ్, మహేశ్, రామ్ చరణ్, బన్నీ - పెద్ద హీరో ఎవరైనా సరే శ్రుతి డేట్స్ ఖాళీ ఉంటే, ఆమెకే ఓటు. తెలుగు బాగా మాట్లాడడం, భలేగా పాడడం శ్రుతీహాసన్‌కు ఉన్న ప్లస్. మనవాళ్ళు మెచ్చే దక్షిణాది సహజ సౌందర్యం ఆమెకున్న ఎడ్వాంటేజ్. పారితోషికం : రూ. 1.25 కోట్లు నిత్యామీనన్ (28) : హుందాతనానికి చిరునామా కర్ణాటకలో పెరిగిన ఈ మలయాళీ అమ్మాయి ఇవాళ తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషలన్నిట్లో క్రేజీ స్టార్. పదేళ్ళ వయసులోనే బాలనటిగా చేసినా, చదివిన డిగ్రీకి తగ్గట్లే జర్నలిస్ట్ అవుదామనుకొన్నారు. తీరా కన్నడ, మలయాళ చిత్రాలతో హీరోయినయ్యారు. తొలి సినిమాతోనే అందరూ ఫ్లాటై పోయారు. నిత్య హుందాతనం, మల్టీ టాలెంట్ పరిశ్రమతో పాటు ప్రేక్షకుల్నీ అబ్బురపరిచాయి. ప్రతి ఒక్కరూ నిత్యను ప్రేమించేలా చేశాయి. ఫస్ట్ : తెలుగులో నందినీరెడ్డి దర్శకత్వంలో ‘అలా మొదలైంది’ (2011) బెస్ట్ : ‘ఇష్క్’, ‘గుండె జారి గల్లంతయ్యిందే’, ‘మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు’, ‘ఓకే బంగారం’ స్పెషాల్టీ : జీవితంలోనైనా, కెరీర్‌లోనైనా కొత్త సవాళ్ళంటే కళ్ళు చక్రాల్లా తిప్పుతూ ఉత్సాహపడిపోతారు. స్క్రిప్ట్, పాత్ర నచ్చితే అతిథి పాత్ర (‘జబర్దస్త్’), చిన్న హీరో అయినా రెడీ. లేదంటే, ఎంత పెద్ద ప్రాజెక్ట్‌కైనా ‘నో’ చెప్పేస్తారు. పుట్టు మలయాళీ అన్న మాటే కానీ, నిత్యకు దక్షిణాది భాషలన్నీ కొట్టినపిండి. అచ్చ తెలుగమ్మాయిల కన్నా అందంగా తెలుగు మాట్లాడతారు. ఎంత బాగా మాట్లాడతారో అంతకన్నా బాగా పాటా పాడతారు. చలాకీతనం, హుందాతనం కలగలిసిన నిత్యను మనమ్మాయే అనేది అందుకే. పారితోషికం : రూ. 40 నుంచి 75 లక్షల మధ్య (సినిమా స్థాయి, పాత్రను బట్టి) రాశీఖన్నా (25) : యువ హీరోలకు రాశి... ఢిల్లీలో చదువుకున్న ఈ పంజాబీ అమ్మాయి ముచ్చటగా మూడేళ్ళలోనే తెలుగునాట జెండా పాతింది. యువ హీరోలకు, మీడియవ్‌ు రేంజ్ సినిమాలకూ బెస్ట్ ఆప్షన్ అయింది. ఉత్తరాది సౌందర్యం, సోషల్‌గా ఫ్రీగా ఉండే ప్రవర్తన బాగానే అవకాశాలు తెస్తోంది. ఫస్ట్ : తెలుగులో ‘ఊహలు గుసగుసలాడె’ (2014) బెస్ట్ : ‘ఊహలు గుసగుసలాడె’, ‘జిల్’, ‘బెంగాల్ టైగర్’, ‘సుప్రీమ్’ స్పెషాల్టీ : హైదరాబాద్ వాతావరణం, సినీ జనం తెగ నచ్చేసిన రాశీఖన్నా ఇప్పుడు హైదరాబాద్‌లోనే మకాం పెట్టేశారు. ఇక్కడే మణికొండలో సొంత ఇల్లు కూడా కొనుక్కున్నారు. గోపీచంద్, రావ్‌ు, సాయిధరవ్ుతేజ్ లాంటి యువ హీరోలకు ఆమె కలిసొచ్చిన చాయిస్. పారితోషికం: రూ. 50 లక్షల పైగా. లావణ్యా త్రిపాఠీ (25) : సొట్టబుగ్గల సుందరి ఉత్తరప్రదేశ్‌లో పుట్టి, ఉత్తరాఖండ్‌లో పెరిగి, ‘మిస్ ఉత్తరాఖండ్’గా నిలిచి, మోడలింగ్ ర్యాంప్ నుంచి టీవీ షోల మీదుగా వెండితెర పైకి నడిచొచ్చిన నటి.హిందీ టీవీ సిరీస్ ‘ష్...కోయీ హై’తో నటిగా పరిచయమయ్యారు. తెలుగుతోనే సినీ రంగప్రవేశం. ఫస్ట్ : ‘అందాలరాక్షసి’ (2012) బెస్ట్ : ‘‘అందాల రాక్షసి’, ‘భలే భలే మగాడివోయ్’, ‘సోగ్గాడే చిన్ని నాయనా’ స్పెషాల్టీ : చేస్తున్న సంస్థ, హీరోను బట్టి అవసరమైతే అతిథి పాత్రలకు కూడా సిద్ధమనే పట్టు విడుపులున్న నవతరం నాయిక ( నాగార్జున ‘మనం’ (2014)లో చేసిన గెస్ట్ రోల్ గుర్తుందిగా). స్నేహశీలత, కెమేరా ముందు బిడియం లేకపోవడం లావణ్యను పరిశ్రమలో నలుగురి ఎదుట స్పెషల్‌గా నిలబెడుతున్నాయి. టావ్ుబాయ్ స్టయిల్, సొట్టబుగ్గల సౌందర్యం ఆమెని సన్నిహితం చేస్తున్నాయి. ‘హైదరాబాద్ నా రెండో ఇల్లు’ అంటున్న లావణ్య ఇప్పుడు కొత్త దర్శక, నిర్మాతలకు మరో చాయిస్. పారితోషికం : రూ. 50 లక్షల పైగా. క్యాథరిన్ (26) : సోగకళ్ళ అమ్మాయి... ఈ మలయాళీ రోమన్ సిరియన్ క్యాథలిక్ అమ్మాయి పుట్టింది దుబాయ్‌లో కానీ, దుమ్ము రేపుతోంది మాత్రం దక్షిణాది అంతా. బెంగుళూరులో పెరిగిన ఈ అమ్మాయికి పాట, ఆట, పియానో - మనసు పెడితే రానిదేదీ లేదు. 14 ఏళ్ళ వయసుకే మోడల్‌గా తొలి అడుగులు వేసి, ప్రసాద్ బిడప్ప లాంటి ప్రసిద్ధుల ఫ్యాషన్ షోలలో పాల్గొన్నారు. బోలెడన్ని యాడ్స చేశారు. కన్నడంలో మొదలుపెట్టి, మలయాళం మీదుగా తెలుగులోకి దూసుకు వస్తున్నారు. ఫస్ట్ : తెలుగులో ‘చమ్మక్ చల్లో’ (2013) బెస్ట్ : ‘ఇద్దరమ్మాయిలతో’, ‘రుద్రమ దేవి’, ‘సరైనోడు’ స్పెషాల్టీ : హీరోయిన్‌గానైనా, స్పెషల్ ఎప్పీయరెన్సకైనా రెడీ అనడం. పారితోషికం: రూ. 25 నుంచి 30 లక్షల దాకా. 'తమిళ కోటలో... తెలుగు బావుటా! కన్నాంబ... సావిత్రి... జమున... శారద... వాణిశ్రీ... జయప్రద... ఇలా ఎందరో నాయికల్ని పరాయిభాషలకు ఎగుమతి చేసిన ఘనత మనది. కానీ, ఇప్పుడు మన తెరపై కనిపిస్తున్నదంతా ఉత్తరాది భామలు! తమిళ పొన్నులు! మలయాళ కుట్టీలు! మనవాళ్ళు లేరా? ఉన్నా, వాళ్ళకు చాన్సుల్లేవా? ఇది పెద్ద చర్చే! అమ్మాయిల్ని హీరోయిన్లుగా ప్రోత్సహించని తల్లితండ్రుల దగ్గర నుంచి నటవారసులుగా కొడుకుల్నే తప్ప కూతుళ్ళను ప్రోత్సహించని టాలీవుడ్ బిగ్ ఫ్యామిలీల దాకా తవ్వితీస్తే - తెలుగు సమాజంలోని ఈ స్నేహరహిత వాతావరణానికి సవాలక్ష కారణాలున్నాయి. ఈ పరిమితుల మధ్యనే అంజలి, స్వాతీ రెడ్డి, వేద, మధుశాలిని లాంటి కొద్దిమంది తెలుగ మ్మాయిలు మాత్రం అడపాదడపా మెరుస్తున్నారు. విచిత్రం ఏమిటంటే, మన తెలుగమ్మాయిల్లో కొందరు హీరోయిన్లుగా తమిళ, మలయాళ సినీ పరిశ్రమల్లో మంచి అవకాశాలు దక్కించుకుం టున్నారు. రచ్చ గెలిచాకనైనా, ఇంట గెలుస్తామనే నమ్మకంతో అక్కడి సినిమాల్లో పాత్రలకు జీవం పోస్తున్నారు. అడపా దడపా తెలుగులో మెరుస్తున్న రాజోలు అమ్మాయి అంజలి ఇప్పుడు దాదాపు అరవ హీరోయినే. ఎక్కువ సిన్మాలు అక్కడే చేస్తున్నారు. ‘అష్టాచమ్మా’, ‘కార్తికేయ’ లాంటి హిట్లున్నా, ఇక్కడ అవకాశాలు తక్కువైన స్వాతీరెడ్డి తమిళ, మలయాళాల్లో మంచి పాత్రలకు కేరాఫ్ అడ్రస్. అక్కడి ప్రేక్షకులకు సుపరిచితం. ఆ భాషల్లోనూ బాగా మాట్లాడేస్తున్నారు. మదనపల్లె అమ్మాయి బిందుమాధవి మొదలెట్టింది తెలుగులో అయినా, స్థిరపడింది తమిళంలోనే! ఈ నేటివ్ బ్యూటీ ప్రతిభను తమిళులే గుర్తించారు. ‘బస్‌స్టాప్’, ‘మల్లెలతీరంలో సిరిమల్లె పువ్వు’ల్లో అభినయంతో ఆకట్టుకున్న ఒకప్పటి బాల నటి శ్రీదివ్య కూడా ఇప్పుడు ఇక్కడి కన్నా తమిళంలోనే ఫేమస్. మూడేళ్ళ క్రితం మొదలుపెట్టి తాజా ‘పెన్సిల్’ దాకా తమిళంలో చాలా ప్రయాణమే చేశారు. భాష, ప్రాంతం హద్దులు చెరిపేసి, రచ్చ గెలిచిన ఈ తెలుగమ్మాయిలకు ఇంట కూడా సముచిత స్థానం ఇవ్వాల్సింది మనమేగా! అప్పుడెప్పుడో ఏయన్నార్ కుటుంబం నుంచి ఆయన మనుమరాలు సుప్రియ, కృష్ణ ఫ్యామిలీ నుంచి ఆయన కూతురు మంజుల కెమేరా ముందుకొచ్చి, వచ్చినంత వేగంగానే వెనక్కీ వెళ్ళిపోయారు. తాజాగా ‘మెగా’ ఫ్యామిలీ నుంచి చిరంజీవి సోదరుడైన నాగబాబు కుమార్తె నీహారిక కొణిదెల నాయికగా వస్తున్నారు. ఒత్తిళ్ళనూ, బంధువుల అభ్యంతరాలనూ పక్కనపెట్టి, ఇంట్లో వాళ్ళను సైతం ఒప్పించి మరీ, హీరోయిన్గా ప్రూవ్ చేసుకొనేందుకు ‘ఒక మనసు’ సినిమాతో తొలి ప్రయత్నం చేస్తున్నారు. -
డిజాస్టర్ అయితే తిరిగి ఇవ్వాల్సిందే!
దాసరి అంటే దర్శకరత్న. అత్యధిక సినిమాల దర్శకుడిగా తెలుగువారికి ప్రపంచవ్యాప్తంగా ఘనత సంపాదించిన సినీ ప్రతిభామూర్తి. ‘తాత మనవడు’, ‘ఓ మనిషి తిరిగి చూడు’, ‘బలిపీఠం’, ‘స్వర్గం- నరకం’ వంటి సినిమాలతో ఆయన దాదాపు తెలుగు వారి సాంఘిక జీవనాన్ని తెర మీద నమోదు చేశారని చెప్పాలి. మరోవైపు ‘కటకటాల రుద్రయ్య’, ‘ప్రేమాభిషేకం’, ‘బొబ్బిలిపులి’ వంటి సినిమాలతో కమర్షియల్ ధోరణిని కొత్త ఆకాశాలకు ఎత్తారు. ‘తాండ్ర పాపారాయుడు’ వంటి చారిత్రక సినిమాలు తీసినా ‘ఒసేయ్ రాములమ్మ’ వంటి ఉద్యమ తరహా సినిమాలు తీసినా అది దాసరికే చెల్లింది. నటుడుగా, నిర్మాతగా, దర్శకుడిగా, అనేక మంది కొత్త నటీ నటులకు జన్మనిచ్చిన ఆ సృష్టికర్త జన్మదినం నేడు. తెలుగు సినిమాతో సుదీర్ఘ ప్రయాణం సాగిస్తున్న ఈ బహుముఖ ప్రజ్ఞాశాలితో ఇంటర్వ్యూ... ♦ గత పుట్టిన రోజుతో పోల్చితే ఆరోగ్యంగా గ్లామర్‌గా కనిపిస్తున్నారు... (నవ్వుతూ). 15 కేజీల బరువు తగ్గా. వేరే రహస్యం ఏమీ లేదు. ♦ పవన్ కల్యాణ్‌తో ప్రకటించిన సినిమా ఏమైంది? సబ్జెక్ట్ ఓకే అయిపోయింది. దర్శకుడు ఎవరనేది ప్రస్తుతానికి సస్పెన్స్. ఇది కాకుండా నా దర్శకత్వంలో కొత్త వాళ్లతో లవ్‌స్టోరీ తీస్తాను. ♦ లవ్స్టోరీల ట్రెండ్ మారింది కదా. మీరు తీయబోయే లవ్‌స్టోరీ ఎలా ఉంటుంది? నేను తీయబోయేది ‘రియల్ లవ్ స్టోరీ.. నాట్ ఎ లస్ట్ స్టోరీ’. నేను తీయబోయేది స్వచ్ఛమైన ప్రేమకథ. ఇప్పుడు తయారు చేసుకున్న కథ కాదు. రామానాయుడు కోసం ఈ కథ తయారు చేసుకున్నా. ఆయనకు బాగా నచ్చింది. ఆరోగ్యం బాగోకపోవడంతో ఆయన నిర్మించలేక పోయారు ♦ మీరు ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారనిపిస్తోంది? ఆ మధ్య ‘పరమవీరచక్ర’, ‘ఎర్రబస్సు’ చిత్రాలను చాలా మంచి కథాంశాలతో తీశాను. అవి కమర్షియల్‌గా వర్కవుట్ కాకపోవడం నిరాశకు గురి చేసింది. అందుకే గ్యాప్ తీసుకున్నాను. ఇప్పుడున్న ట్రెండ్‌ను గమనిస్తున్నా. ఈ రెండేళ్ల కాలంలో మంచి సినిమాలు వచ్చాయి. ‘భలే భలే మగాడివోయ్’ సినిమా చక్కగా నవ్వించింది. ‘సినిమా చూపిస్త మావ’, ‘కల్యాణవైభోగమే’, ‘క్షణం’, ‘ఊపిరి’ సినిమాలు ఓ ట్రెండ్ సెట్టర్స్‌గా నిలిచాయి. ‘క్షణం’ సినిమాను హిందీలో సల్మాన్‌ఖాన్ తీసుంటే కచ్చితంగా వంద కోట్లు కలెక్ట్ చేసేది. ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే నాగ్‌ను ‘ఊపిరి’ సినిమాలో కుర్చీలో కుర్చోపెట్టేయడం దర్శకుని ప్రతిభ. ఇలాంటి సినిమాలు సక్సెస్ కావడం వల్ల ట్రెండ్‌లో చిన్న మార్పు వచ్చింది. ఆరు పాటలు, ఒక హీరో కొడితే వంద మంది గాల్లోకి లేచిపోవడాల్లాంటివి ప్రేక్షకులు రిజెక్ట్ చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు సినిమాలు తీయవచ్చు. ♦ సినిమాలు ఫ్లాప్ అయితే దానికి పని చేసిన దర్శకులు, హీరోలు బాధ్యత వహించాలని పరిశ్రమలో ఓ వాదన నడుస్తోంది. దానిపై మీ అభిప్రాయం. రెమ్యునరేషన్ తిరిగిచ్చేయాలనేది కరెక్ట్ కాదు. సినిమా నష్టపోతే డిస్ట్రిబ్యూటర్లను పిలిచి ‘కథ రెడీ చేసుకోండి. మేం మీకు పని చేస్తాం’ అని చెప్పేవాళ్లు. ఇది 40 ఏళ్ల క్రితం నాటి మాట. ఇప్పుడు బయ్యర్ల వ్యవస్థ వచ్చింది. 20, 30 శాతం నష్టపోతే తిరిగివ్వాల్సిన పని లేదు. కానీ, డిజాస్టర్ అయితే మాత్రం కొంత సర్దుబాటు చేయడానికి తెలుగు పరిశ్రమ ముందుకు వస్తోంది. ఇందులో రజనీకాంత్, అల్లు అరవింద్, పవన్‌కల్యాణ్, శ్రీనువైట్ల, మహేశ్‌బాబు లాంటి వాళ్లు ఉన్నారు. మేము కూడా గతంలో చేశాం. అడగడం, ఇవ్వడం తప్పు కాదు. కానీ రోడ్డుకెక్కడం కరెక్ట్ కాదు. ♦ ఇండస్ట్రీలో ఈ మధ్య కాలంలో ఫ్లాప్స్, హిట్స్ మీద అభిప్రాయం? ఇండస్ట్రీలోకి కొత్త వాళ్లు వస్తున్నారు. వాళ్లకి విషయం ఉంటోంది గానీ అనుభవం ఉండటం లేదు. దాంతో ఒకటి, రెండు సినిమాల తర్వాత కనిపించడం లేదు. సినిమా తీయాలనుకున్నప్పుడు కొంత ప్రాక్టికల్ అనుభవం కావాలి. లైట్‌మ్యాన్, కెమెరామ్యాన్ కావాలంటే కూడా అనుభవం కావాలి. కానీ, డెరైక్టర్ కావాలనుకుంటే మాత్రం వెంటనే అయిపోవచ్చు. అది కరెక్ట్ కాదు. నిర్మాణ రంగం మీద అవగాహన లేని వాళ్లు నిర్మాతలవుతు న్నారు. సినిమాలు తీసి వాళ్లు నష్టపోయి, పరిశ్రమను నాశనం చేస్తున్నారు. దయచేసి అవగాహన పెంచుకుని నిర్మాతలు కావాలని కోరుతున్నా. ♦ సినీ పరిశ్రమలో ఉన్న సమస్యలపై ప్రభుత్వం కమిటీని నియమించింది. దాని గురించి మీతో ఏమైనా చర్చించారా? హైదరాబాద్‌ను తెలుగు సినిమా కోసమే కాకుండా సినీ హబ్‌గా చేయాలి. రెండు వేల ఎకరాలను సినీ హబ్‌కు కేటాయించాలని ప్రభుత్వం ఆలోచన. అందుకోసం సలహాలు అడగడానికి ప్రభుత్వం తనంతట తానే పూనుకుని కమిటీని నియమించడం విశేషం. మా డిమాండ్ ఏంటంటే, థియేటర్లలో రోజూ జరిగే నాలుగు షోలను అయిదు షోలుగా చేసి, కేవలం అందులో నాలుగో ఆటను చిన్న సినిమాకు కే టాయించాలి. ఇది తప్పనిసరి చేయాలి. దీనికి తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ బాగా స్పందించారు. ♦ చిరంజీవి ‘కత్తి’ సినిమా కథ వివాదం మీ దృష్టికి వచ్చిందా? చిరంజీవి ‘కత్తి’ సినిమా మీద ఇది వివాదం కాదు. ఆ వివాదం అంతకు ముందే తమిళ మాతృక మీద ఉంది. అంతేగానీ, ఇది చిరంజీవి 150వ సినిమా వివాదం అనుకోకూడదు. అయినా, అది పరిష్కారమైంది కూడా. ♦ ఫైనల్లీ.. ఇంత కాలం దర్శకునిగా కంటిన్యూ కావడంపై మీ స్పందన? ఎంతమందికి వస్తుంది చెప్పండి ఆ అదృష్టం! -
విన్నింగ్ టీమ్
హిందీ తరువాత అత్యధికులు మాట్లాడే భాష తెలుగు! చిత్ర నిర్మాణ సంఖ్యలో హిందీతో పోటాపోటీకి దిగుతూ దేశంలోనే మొదటి ఒకటి, రెండు స్థానాల్లో నిలిచే సినిమా - తెలుగు సినిమా!! అయినా, తెలుగు సినిమా... అంటే దేశవ్యాప్తంగా నిన్న మొన్నటి వరకు చిన్నచూపు... 6 పాటలు, 3 ఫైట్లు, జిగేల్మనే దుస్తులు, ప్లాస్టిక్ ఎమోషన్స్ అంటూ పెదవి విరుపులు నేషనల్ అవార్డ్స 62 ఏళ్లుగా ఇస్తున్నా, ఒక్కసారీ జాతీయ ఉత్తమచిత్ర అవార్డ్ దక్కలేదు. ఇన్ని నిరాశలు, నిరుత్సాహాల్ని ఇప్పుడు పటాపంచలు చేసిన సినిమా - ‘బాహుబలి... ది బిగినింగ్’. 2015వ సంవత్సరానికి గాను తాజాగా ప్రకటించిన 63వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో ఉత్తమ చలనచిత్రంగా నిలిచిన భారీ ప్రయత్నం. అందుకే, ఇవాళ తెలుగు సినీసీమ గర్విస్తోంది. తెలుగు ప్రేక్షకులు రొమ్ము విరుచుకొంటున్నారు. ఇప్పటికి అనేక మాసాలుగా జాతీయ, అంతర్జాతీయ స్థాయి ప్రేక్షకులందరూ అదేపనిగా చెప్పుకుంటున్న ఈ సినిమాలో ఇంతకీ ఏముంది? పచ్చిగా చెబితే - ‘బాహుబలి-పార్ట్ 1’ పక్కా జానపద కథ. కాలక్షేపం కథ. అన్నదమ్ముల మధ్య పోరాటాన్ని అద్భుతంగా తెరపై చూపిన కథ. ‘ట్రాయ్’, ‘300’, ‘మాస్క్ ఆఫ్ జోర్’ లాంటి అనేక సినిమాల ప్రభావం స్పష్టంగా ఉన్న కథ. యుద్ధ సన్నివేశాలతో కట్టిపడేసిన కథ. ఇలాంటి కథలు బ్లాక్ అండ్ వైట్ శకం నుంచి మనం చూసినవే. కాకపోతే, రంగుల్లో, టెక్నికల్ అడ్వాన్స్‌మెంట్‌తో వచ్చిన విజువల్ గ్రాండియర్ తోడైంది. కళ, ఛాయాగ్రహణం, కూర్పు, రచన - ఇలా అన్ని కళల సమాహార రూపంగా సినిమా తయారైన తీరు తెరపై కనువిందు చేసింది. రాజమౌళి ఊహించిన దృశ్యాలు, వేసిన సెట్లు, తయారు చేసిన ఆయుధాలు, రథాలు (జాతీయ అవార్డు గ్రహీత సాబూ శిరిల్ ప్రొడక్షన్ డిజైనర్), కాస్ట్యూమ్స్ (రమా రాజమౌళి, ప్రశాంతి) ఆ కథాకాలానికి తీసుకువెళతాయి. తెలుగువాడైన జాతీయ అవార్డు విజేత వి. శ్రీనివాస మోహన్ సారథ్యంలో విజువల్ ఎఫెక్ట్స్ కోసం కొన్ని పదుల మంది కృషి చేసిన సినిమా ఇది. మైళ్ళ కొద్దీ ఎత్తున్న జలపాతం, భారీ ప్రాసాదాలు, జంతువులు - ఇలా ప్రతిదీ ఏది విజువల్ ఎఫెక్ట్, ఏది వాస్తవం - అనే తేడా తెలియనివ్వకపోవడంలో ఈ టీమ్ కృషి, రాజమౌళి చెక్కుడు అర్థమవుతుంది. రచయిత వి. విజయేంద్రప్రసాద్ ఊహల్లో పుట్టిన ఒక కల్పిత కథనూ, మహిష్మతీ సామ్రాజ్యమనే కల్పిత ప్రదేశాన్నీ, బాహుబలి, కట్టప్ప, భల్లాలదేవ, శివగామి లాంటి కల్పిత పాత్రలనూ వాస్తవంలో ఒక భాగమన్నంతగా భ్రమింపజేసిందీ సినిమా. కళ్ళెదుట భారీ స్క్రీన్‌లో 4కె రిజల్యూషన్‌లో సినిమా చూస్తూ, దృశ్యం తాలూకు వాతావరణాన్ని ‘డాల్బీ ఎట్మాస్’ సౌండ్‌లో అనుభూతించగలిగామంటే - భారీ నిర్మాణ విలువలు, అపూర్వమైన విజువల్ ఎఫెక్ట్లు మూలస్తంభాలయ్యాయి. పెద్ద బాహుబలిగా, శివుడిగా రెండు పాత్రల్లో ప్రభాస్, భల్లాలదేవుడిగా రానా, దేవసేనగా అనుష్క, కట్టప్పగా సత్యరాజ్, శివగామిగా రమ్యకృష్ణ - అందరూ అందరే! సెంథిల్ కుమార్ ఛాయాగ్రహణం, కీరవాణి సంగీతం, శ్రీనివాసమోహన్ సారథ్యంలో విజువల్ ఎఫెక్ట్స్, సాబూ శిరిల్ కళాదర్శకత్వం - అన్నీ అన్నే! అయితే, ఇన్నీ ఉన్నా, ఇంత చేసినా, ఇంతకీ ఆ పెద్ద బాహుబలి ఎలా చనిపోయాడు? వెన్నంటి ఉండే నమ్మకస్థుడైన యోధుడు కట్టప్ప (సత్యరాజ్) అతణ్ణి ఎందుకు చంపాడు? ఇలా సవాలక్ష ప్రశ్నలకు జవాబులు చెప్పకుండానే ‘బాహుబలి... ది కన్‌క్లూజన్’ అనే రెండో పార్ట్ కోసం ఎదురు చూడాల్సిందేనంటూ ఈ ఫస్ట్‌పార్ట్ ముగిసింది. సెకండ్ పార్ట్ 2017 ఏప్రిల్‌కి కానీ రాదట! ఈ సినిమాకు ప్రశంసలతో పాటు కొన్ని విమర్శలూ తప్పలేదు. రిలీజ్‌కు ముందు దాదాపు రెండేళ్ళుగా నిరంతరం ప్రచారంలో ఉన్న ఈ ‘బాహుబలి పార్ట్1’ సినిమాలో ఉన్నట్టుండి ఆత్మ ఎక్కడో జారిపోయినట్లు అనిపించిందనే విమర్శలూ వచ్చాయి. కథ అటూ ఇటూ కాకుండా, అర్ధంతరంగానే ఆగిపోయిందన్నారు. ఈ కలల లోకవిహారం... ప్లేట్ మీల్సా? ఫుల్ మీల్సా? అని ప్రశ్నించారు. కానీ, ఆ విమర్శలన్నిటికీ అతీతంగా కొన్నేళ్ళుగా థియేటర్ల ముఖం చూడని జనం కూడా ‘బాహుబలి’ జ్వరంతో హాళ్ళకు క్యూలు కట్టారు. పనిలో పనిగా ఏలినవారి అండదండలతో సినిమా టికెట్ రేట్లు అధికారిక, అనధికారిక మార్గాల్లో కొండెక్కి కూర్చున్నాయి. వెరసి, తెలుగు సినిమా వసూళ్ళు వంద కోట్లు దాటాయి. తెలుగు, తమిళ భాషలు రెంటిలోనూ వేర్వేరుగా తయారైన ఈ సినిమా గత ఏడాది ఒక ప్రభంజనమైంది. హిందీ, మలయాళం డబ్బింగ్ వెర్షన్స్‌లోనూ వసూళ్ళ వర్షం కురిపించింది. కరణ్‌జోహార్ - అతని ధర్మా ప్రొడక్షన్స్ జత కలవడంతో ఒక డబ్బింగ్ సినిమా జాతీయ సంచలనమైంది. ఇక, భారీ మలయాళ పోస్టర్ గిన్నిస్ రికార్డుల్లోకి కెక్కింది. తెలుగు మార్కె ట్ను విస్తరించింది. తాజాగా చైనాతో సహా అంతర్జాతీయ మార్కెట్లలోకీ అడుగిడుతోంది. ఒక రకంగా మార్కెటింగ్ టెక్నిక్స్‌లోనూ ‘బాహుబలి’ది కొత్త పంథాయే! ట్విట్టర్, ఫేస్బుక్ లాంటి సోషల్ మీడియాను పూర్తిగా ఉపయోగించుకొన్న తొలి తెలుగు సినిమా ఇదే! సినిమా విడుదల ముందు వరకూ పేపర్లలో, టీవీల్లో వాణిజ్య ప్రకటనలైనా ఇవ్వకుండా అంతకు మించిన ప్రచారం పొందిన ఈ చిత్రం సినీ ప్రచార, మార్కెటింగ్ రంగాల్లో వారికి ఒక విలక్షణ కేస్‌స్టడీ. ‘బాహుబలి’ బొమ్మలు, కామిక్‌బుక్స్, దుస్తులతో మర్చండైజింగ్ చేసే ప్రయత్నాలూ మొదలయ్యాయి. ఇవన్నీ ఒక ప్రాంతీయ భాషలో, మరీ ముఖ్యంగా తెలుగులో మనమెప్పుడూ కనీవినీ ఎరుగనివి. సగం సినిమా అయిన ‘బాహుబలి... ది బిగినింగ్’ ఇన్ని అద్భుతాలు చేస్తే, మరో సగం వచ్చే ఏడాది అద్భుతాలు సృష్టించడానికి సిద్ధమవుతోంది. మొదటి భాగానికే జాతీయ అవార్డు వచ్చిందంటే... రెండో భాగం మరెన్ని అవార్డులు సాధిస్తుందో! అందుకే, కొన్ని విమర్శలున్నా, మరికొన్ని భిన్నస్వరాలు వినిపిస్తున్నా... ఇవాళ తెలుగు సినిమాకు కొత్త ఉత్సాహం తెచ్చిందీ... కొండంత బలం తెచ్చిందీ... అక్షరాలా ‘బాహుబలే’! ఎవరో రచయిత అన్నట్లు... కొన్నిసార్లు అంతే... అనుకోకుండా అద్భుతాలు జరిగిపోతుంటాయి! జరుగుతున్నప్పుడు అది అద్భుతమని తెలీదు... జరిగిపోయాక అది అద్భుతమని మనం ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు... తెలుగు సినిమాల్లో - ఇవాళ ‘బాహుబలి’ అంతే! బాక్సాఫీస్ రికార్డుల్లోఅద్భుతమే! తెలుగులో తొలిసారి నేషనల్ బెస్ట్ ఫిల్మ్ అవార్డ తేవడమూ అద్భుతమే! దీని వెనక ఎందరున్నా, తెలుగు సినిమా ఈ స్థాయికి చేరడానికి పునాదిరాళ్ళు వేసిన ‘మల్లీశ్వరి’ బి.ఎన్. రెడ్డి, ‘మాయాబజార్’ కె.వి. రెడ్డి, ‘నర్తనశాల’ కమలాకర, ‘మూగమనసులు’ ఆదుర్తి, ‘శంకరాభరణం’ కె. విశ్వనాథ్, ‘సీతా కల్యాణం’ బాపు, ‘మేఘసందేశం’ దాసరి, ‘అన్నమయ్య’ కె. రాఘవేంద్రరావు లాంటి ఎందరో ఈ అద్భుతానికి ప్రేరకులు. వారి అనుంగు వారసుడు రాజమౌళి ఈ అద్భుతానికి కారకుడు. జై... మాహిష్మతీ! జై... జై... తెలుగు సినిమా!! - రెంటాల జయదేవ ఇంకా శ్రమిస్తాం! జాతీయ అవార్డుల జ్యూరీ మాకు ఇచ్చిన గౌరవాన్ని ఎప్పటికీ మర్చిపోలేం. మా నిర్మాతలు ‘ది బెస్ట్’ అని వాళ్లను కూడా గుర్తించినందుకు సంతోషంగా ఉంది. ఈ ‘బాహుబలి’ ప్రయాణంలో నా వెన్నంటి నిలిచి, అహర్నిశలూ శ్రమించిన వీఎఫ్ఎక్స్ ఎఫెక్ట్స్ సూపర్వైజర్ శ్రీనివాస్ మోహన్‌కు, ఆయన టీమ్‌కు నా బెస్ట్ విషెస్. మాకు దక్కిన ఈ ప్రోత్సాహంతో ‘బాహుబలి-2’ని ఇంకా ఉన్నంతంగా తీర్చిదిద్దుతాం. - రాజమౌళి నా టీమ్‌కి కంగ్రాట్స్ ఈ ఏడాది జాతీయ ఉత్తమ చిత్రంగా ‘బాహుబలి’ ఎంపిక కావడం చాలా ఆనందంగా ఉంది. మొత్తం ఈ చిత్రం వెనుక ఉండి పనిచేసినా టీమ్ మెంబర్స్‌కు కంగ్రాట్స్. - ప్రభాస్ మా కష్టానికి దక్కిన గౌరవ మిది ‘బాహుబలి’ ఈ ఏడాది జాతీయ ఉత్తమ చిత్రంగా స్వర్ణ కమలం అందుకోనుండటం మా టీమ్ పడ్డ కష్టానికి దక్కిన గౌరవం ఇది. - అనుష్క థ్యాంక్యూ బాహుబలి! ‘బాహుబలి’ కి జాతీయ అవార్డు వచ్చిందని తెలియగానే చాలా థ్రిల్ ఫీలయ్యాను. థ్యాంక్యూ ‘బాహుబలి’. టాలెంటెడ్, డెడికేటెడ్ టీమ్‌తో పనిచేయడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. - రమ్యకృష్ణ రాజమౌళిని నమ్మాం! మా సినిమా బెస్ట్ ఫిల్మ్‌గా ఎంపికవడం చాలా సంతోషంగా, గర్వంగా ఉంది. ఈ స్క్రిప్ట్‌తో సినిమా చేయాలనుకుంటున్నా నని రాజమౌళిగారు చెప్పగానే ఆయనపై నమ్మకంతో 2012లో ఈ చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకెళ్లాం. కేవలం తెలుగులో తీస్తే ఈ బడ్జెట్‌కి వర్కవుట్ కాదు. అందుకే తమిళ, మలయాళ, హిందీ భాషల్లో కూడా విడుదల చేయాలని ప్లాన్ చేశాం. ప్రభాస్ మూడేళ్లు వేరే ఏ సినిమాలూ చేయకుండా ఈ చిత్రం చేయడం అభినందిం చాలి. ‘బాహుబలి’2పై భారీ అంచనాలుంటాయి. అందరం ఇంకా బాగా కష్టపడి పనిచేస్తాం. - నిర్మాతలు శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని -
తెలుగులో నా చివరి సినిమా వంగవీటి: వర్మ
వివాదాస్పద వ్యాఖ్యలతో నిత్యం మీడియాలో ఉండే ప్రముఖ దర్శక నిర్మాత రాంగోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలుగులో తన చివరి సినిమా 'వంగవీటి' అని ఆయన బుధవారం వెల్లడించారు. వంగవీటి కంటే అద్భుతమైన కథ తనకు దొరకదని... శివ నుంచి ప్రారంభమైన తన ప్రస్థానం వంగవీటితో ఆగిపోతుందని వర్మ పేర్కొన్నారు. వంగవీటిలో రంగా, రాధా, రత్నకుమారి, శిరీష్ రాజు, దాసరి నారాయణరావు, ముద్రగడ పద్మనాభం, ఎన్టీఆర్, దేవినేని నెహ్రు పాత్రలు కూడా ఉంటాయని ఆయన తెలిపారు. ఈ మేరకు వర్మ...ఓ ఆడియోను మీడియాకు విడుదల చేశారు. నేను పుట్టి పెరిగింది హైదరాబాద్ లో అయినా , నేను నిజంగా పుట్టి పెరిగింది విజయవాడలో... ఎందుకంటే నాకు అవగాహన,తెలివి, బంధాలు, స్నేహాలు, ప్రేమించుకోవడాలు,చంపుకోవడాలు వీటన్నింటి గురించి తెలిసింది విజయవాడలోనే నేను అనంతపురం ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో తీసిన రక్త చరిత్రకి ఇప్పుడు విజయవాడ రౌడీయిజం బ్యాక్ డ్రాప్ లో తీయబోతున్న “వంగవీటికి” ముఖ్యమైన తేడా పగకి, ఆవేశానికి ఉన్న తేడా. పగతో బుసలు కొట్టే ఫ్యాక్షనిస్ట్,శత్రువే ప్రపంచంగా బతుకుతాడు.. ఆవేశంతో రెచ్చిపోయే రౌడీ,ప్రపంచమే శత్రువుగా బతుకుతాడు. తన చుట్టూ ఉన్న ప్రపంచం తనని ఒక మనిషిగా చూడని పరిస్థితిలోనే ఏ మనిషైనా ఒక రౌడీ అవుతాడు. ఫ్యాక్షనిస్ట్ తను చచ్చైనా శత్రువుని చంపాలనుకుంటాడు ... రౌడీ బతకడానికి మాత్రమే చంపుతాడు. ఈ భూమి మీద మనిషి పుట్టినప్పటినుంచీ ఇప్పటివరకూ సాగుతూ వస్తున్న హింసచరిత్రలో ఫ్యాక్షనిస్ట్ ఒక వారధి అయితే రౌడీ ఒక మలుపు. ఫాక్షనిజం కి బ్యాక్ గ్రౌండ్ వారసత్వం అయితే రౌడీయిజానికి వారసత్వం దమ్ము ఒక దమ్మున్నోడు సింహాసనం మీద కూర్చున్న ఇంకో దమ్మునోడిని పైకి పంపటమే అసలు సిసలైన నిజమైన రౌడీయిజం. అలాంటి రౌడీయిజం రూపాన్ని, దాని ఆంతర్యాన్ని 30 ఏళ్ళ క్రితం నేను విజయవాడ సిద్ధార్ధ ఇంజనీరింగ్ కాలేజ్ లో చదువుతున్నప్పుడు,బాగా దగ్గరగా స్వయంగా నా కళ్ళతో చూశాను ... అందుకనే విజయవాడ రౌడీయిజం గురించి నాకన్నా ఎక్కువ తెలిసిన వాడు, విజయవాడలో కూడా లేడని బల్ల గుద్దే కాకుండా కత్తితో కూడా పొడిచి చెప్పగలను. 'వంగవీటి' చిత్రం తెలుగులో నా ఆఖరి చిత్రం అవుతుంది. 'శివ' తో మొదలైన నా తెలుగు సినిమా ప్రయాణం “వంగవీటి”తో ముగించాలని నేను తీసుకున్న నిర్ణయానికి కారణం 'వంగవీటి'కన్నా అత్యంత నిజమైన మహా గొప్ప కథ మళ్ళీ నాకు జీవితంలో దొరకదని నాకు ఖచ్చితంగా తెలుసు కాబట్టి. వంగవీటి రాధాగారు,చలసాని వెంకటరత్నంగారిని చంపడంతో ఆరంభమైన విజయవాడ రౌడీయిజం, వంగవీటి రంగాగారిని చంపడంతో ఎలా అంతమయ్యిందో చూపించేదే 'వంగవీటి' చిత్రం. కత్తులు, బరిసెలు, అంబాసిడర్ కార్లు, మెటాడోర్ వాన్లు వుండి,సెల్ ఫోన్లు, తుపాకులు లేని 30 ఏళ్ళ క్రితంనాటి ఆ నాటి విజయవాడ వాతావరణాన్ని పున సృష్టించటానికి ఖర్చుకి ఏ మాత్రం వెనకాడద్దని 'వంగవీటి' నిర్మాత దాసరి కిరణ్ కుమార్ గారు ఇచ్చిన ప్రోత్సాహంతో, విజయవాడ గత చరిత్రని ఇప్పటికి, ఎప్పటికి చరిత్రలో నిలిచిపోయేలా చెయ్యటానికి మా'వంగవీటి' యూనిట్ శరవేగంతో సిద్ధమవుతోంది. వంగవీటి చిత్రంలోని ముఖ్య పాత్రదారులు: వంగవీటి రాధా వంగవీటి మోహన రంగా వంగవీటి రత్నకూమారి దేవినేని నెహ్రు దేవినేని గాంధీ దేవినేని మురళి కర్నాటి రామమోహనరావు సిరిస్ రాజు రాజీవ్ గాంధీ దాసరి నారాయణ రావు ముద్రగడ పద్మనాభం నందమూరి తారక రామారావు కాగా వంగవీటి రంగా హత్య, రాజకీయ జీవితం నేపథ్యంతో 'వంగవీటి' చిత్రాన్ని వర్మ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆ సినిమాలో అత్యంత కీలక పాత్ర అయిన వంగవీటి రాధ క్యారెక్టర్లో నటించే నటుడి ఫోటోలను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. అసలు వంగవీటి రాధ, నా వంగవీటి రాధ అంటూ రాంగోపాల్ వర్మ ఈ ఫోటోలను విడుదల చేశారు. -
84 వసంతాలు
సందర్భం: తెలుగు సినిమా పుట్టినరోజు కట్టూబొట్టూ, మాట, పాట, మనిషి తీరూ - ఇలా అన్నిటిపైనా తనదైన ముద్ర వేసిన పాపం, పుణ్యం మన సినిమాలదే. అలాంటి తెలుగు సినిమాకు ఇవాళ పుట్టినరోజు. సినీప్రియులకు పండగ రోజు. తొలి పూర్తి తెలుగు చలనచిత్రం ‘భక్తప్రహ్లాద’ 84 ఏళ్ళ క్రితం సరిగ్గా ఇదే రోజున విడుదలైంది. సినిమా అంటే ఒకప్పుడు భాషతో ప్రమేయం లేని మూగచిత్రాలు (మూకీలు). తొలి భారతీయ టాకీ ‘ఆలమ్ ఆరా’ 1931 మార్చి 14న విడుదల కావడంతో ఆ యా భాషల వారీగా వాక్చిత్రాలు (టాకీలు) రావడం మన దేశంలో మొదలైంది. ‘ఆలమ్ ఆరా’కు దర్శకత్వ శాఖలో పని చేసిన హెచ్.ఎం. రెడ్డే ఆ తరువాత సరిగ్గా ఏడున్నర నెలలకు తొలి దక్షిణ భారతీయ భాషా టాకీ ‘కాళిదాస్’ను రూపొందించారు. అదీ బొంబాయిలో, ‘ఆలమ్ ఆరా’ కోసం వేసిన సెట్స్‌ను ఉపయోగించుకుంటూ! ప్రధానంగా తమిళ మాటలు - పాటలు, కొంత తెలుగు మాటలు, పాటలు, అక్కడక్కడా హిందీ డైలాగులతో తయారైన సినిమా ‘కాళిదాస్’. ఆ చిత్రం 1931 అక్టోబర్ 31న విడుదలైంది. ‘‘తొలి తమిళ - తెలుగు టాకీ’’ అంటూ దర్శక - నిర్మాతలు అప్పట్లో ‘కాళిదాస్’కు ప్రకటనలు జారీ చేశారు. ఆ సినిమా విడుదలై, విజయవంతం కావడంతో, ఈ సారి పూర్తిగా తెలుగులోనే సినిమా తీయాలనే ఆలోచన వచ్చింది. అప్పుడు మళ్ళీ హెచ్.ఎం. రెడ్డి దర్శకత్వంలోనే పూర్తి తెలుగు టాకీగా ‘భక్త ప్రహ్లాద’ రూపొందింది. ఆ చిత్ర నిర్మాణం, సెన్సారింగ్, తొలి విడుదల కూడా బొంబాయిలోనే! నిజానికి, ఈ తొలి పూర్తి తెలుగు టాకీ ‘కాళిదాస్’ కన్నా ముందే, 1931 సెప్టెంబర్ 15న వచ్చిందని కొద్దికాలం ఆధార రహిత ప్రచారం జరిగింది. అయితే, అది వాస్తవం కాదని సీనియర్ జర్నలిస్టు, పరిశోధకుడు డాక్టర్ రెంటాల జయదేవ కొన్నేళ్ళ పరిశ్రమతో, సాక్ష్యాధార సహితంగా నిరూపించారు. ‘భక్త ప్రహ్లాద’ 1932 జనవరి 22న సెన్సార్ పూర్తి చేసుకొని, ఫిబ్రవరి 6న విడుదలైనట్లు అసలు నిజాలు వెల్లడించారు. అలా మూకీ సినిమా కాస్తా పూర్తిగా తెలుగులోనే ప్రారంభించడం మొదలై, ఇవాళ్టితో 84 ఏళ్ళు పూర్తయ్యాయి. మన ఈ తొలి పూర్తి తెలుగు సినిమా కేవలం 18 వేల రూపాయల పెట్టుబడితో, 18 రోజుల్లో నిర్మాణమైంది. మొత్తం 9,762 అడుగుల నిడివిగల 10 రీళ్ళ సినిమా ఇది. ధర్మవరం రామకృష్ణమాచార్యుల నాటకం ఆధారంగా, సురభి నాటక సంస్థ నటీనటులతోనే ఎక్కువ వేషాలు వేయించి ఈ సినిమా తీశారు. హిరణ్యకశిపుడిగా మునిపల్లె సుబ్బయ్య, అతని భార్య లీలావతిగా ‘సురభి’ కమలాబాయి, వారి కుమారుడైన ప్రహ్లాదుడిగా మాస్టర్ కృష్ణారావు ముఖ్యపాత్రలు పోషించారు. తరువాతి కాలంలో తెలుగు సినీ దిగ్గజంగా ఎదిగిన ఎల్.వి. ప్రసాద్ మొద్దబ్బాయిగా నటించారు. అప్పట్లో తెలుగువారు పెద్ద సంఖ్యలో ఉన్న బొంబాయిలోనే, చిత్ర నిర్మాతల సొంత థియేటరైన కృష్ణా సినిమా థియేటర్లో ముందుగా ఈ చిత్రం విడుదలైంది. అక్కడ రెండు వారాలాడాక, తెలుగు నేల మీదకు వచ్చింది. విజయవాడ (శ్రీమారుతి సినిమా హాలు), రాజమండ్రి (శ్రీకృష్ణా సినిమాహాలు)ల్లో ప్రదర్శితమైంది. ఆ తర్వాత మద్రాసులో ఏప్రిల్ 2న విడుదలైంది. అప్పటి దాకా నాటకాలు, మాటా పలుకూ లేని మూగ సినిమాలే అలవాటైన ప్రేక్షకులకు... తెర మీద బొమ్మలు మాట్లాడడం, అదీ మన సొంత తెలుగు భాషలోనే ఆద్యంతం మాట్లాడడం విడ్డూరమైంది. దాంతో, ఈ టాకీ విడుదల హంగామా సృష్టించింది. అలా మొదలైన సినిమా హంగామా ఇవాళ్టికీ తెలుగు నాట అప్రతిహతంగా సాగుతూనే ఉంది. కాకపోతే, మనవాళ్ళ అశ్రద్ధ వల్ల ఇప్పుడు ఆ సినిమాకు సంబంధించి ఒకటి, రెండు స్టిల్స్, పోస్టర్లే తప్ప సినిమా ప్రింటే లేకుండా పోయింది. పోయినవెలాగూ పోగా, ఇప్పటి కైనా మన సినీపెద్దలు, తెలుగు ప్రభుత్వాధి నేతలు కళ్ళు తెరిచి, పుణే ఫిల్మ్ ఆర్కైవ్స్ లాంటి చోట్ల మిగిలిన మన 1930-40ల నాటి కొద్దిపాటి తెలుగు చిత్రాల ప్రింట్లనైనా డిజిటలైజ్ చేయిస్తారా?! తొలి పూర్తి తెలుగు టాకీ: ‘భక్త ప్రహ్లాద’ దర్శకుడు: హెచ్.ఎం. రెడ్డి చిత్ర నిర్మాణం జరిగింది: 18 రోజుల్లో, రూ. 18 వేల పెట్టుబడితో సినిమా నిడివి: 9,762 అడుగులు సెన్సారైంది: 1932 జనవరి 22న, సర్టిఫికెట్ నంబర్: 11032. తొలి రిలీజ్: 1932 ఫిబ్రవరి 6, బొంబాయిలో కృష్ణథియేటర్ ప్రహ్లాదుడిగా మాస్టర్ కృష్ణారావు, తల్లి లీలావతిగా ‘సురభి’ కమలాబాయి, తండ్రి హిరణ్యకశిపునిగా మునిపల్లె సుబ్బయ్య ప్రజల్లోని మార్పులకు ప్రతిబింబం ఇది! - ఎ. రమేశ్ ప్రసాద్, ప్రసాద్స్ సంస్థల అధినేత ‘‘తొలి భారతీయ టాకీ ‘ఆలమ్ ఆరా’, తొలి తమిళ - తెలుగు టాకీ ‘కాళిదాస్’, తొలి పూర్తి తెలుగు టాకీ ‘భక్తప్రహ్లాద’ - మూడింటిలోనూ నటించిన, పనిచేసిన అరుదైన ఘనత మా నాన్నగారు ఎల్వీ ప్రసాద్‌ది. ఆయన, నేను, మా కుటుంబ సభ్యులం ‘ప్రసాద్’ సంస్థ ద్వారా ఫిల్మ్ ప్రింటింగ్, ప్రాసెసింగ్, రికార్డింగ్ వగైరా అన్నిటా ముందుండి, పరిశ్రమ పురోగతికి తోడ్పడ్డాం. ఈ 84 ఏళ్లలో తెలుగు సినిమా ఎంతో మారింది. ఒక్క మాటలో, ప్రజల వైఖరిలో వస్తున్న మార్పుల్ని సినిమాల్లో చూడవచ్చు. విలువలు, కథలు మారాయి.నిర్మాణం, పోటీ పెరిగాయి. ఫిల్మ్ పోయి డిజిటలొచ్చింది. ఎంత టెక్నాలజీ వచ్చినా నాన్న గారన్నట్లు ప్యాషన్, పేషెన్స్ (సహనం), పర్సెవరెన్స్ (నిరంతర శ్రమ), అందరి మంచి కోరే ప్యూరిటీ ఆఫ్ థాట్ - ఈ నాలుగు ‘పి’లుంటే ముందుకెళతాం!’’ డబ్బు సంపాదనే ధ్యేయమైతే ఎలా? - దాసరి నారాయణరావు, దర్శక,నిర్మాత ‘‘దాదాపు 50 ఏళ్ళుగా తెలుగు సినిమాతో కలసి నడిచే అదృష్టం నాకు కలిగింది. మనందరం దృష్టి పెట్టాల్సిన కొన్ని ప్రతి కూల అంశాలు చెబుతా. ఒకప్పుడు సిని మాలు కొద్ది రోజుల్లో, తక్కువ బడ్జెట్లో తయారయ్యేవి. అప్పటితో పోలిస్తే, ఇప్పుడెంతో టెక్నాలజీ వచ్చింది. కానీ, దాన్ని వాడుకొనే నైపుణ్యం ఉందా అని ఎవరికివారు ప్రశ్నించుకోవాలి. కమిట్మెంట్, కళ పట్ల గౌరవం తగ్గి ఇవాళ సినిమా అంటే కేవలం ఎంటర్టైన్మెంట్ అని పొరపడుతున్నాం. నిజానికి, ఎంటర్టైన్మెంట్లో సినిమా భాగమే తప్ప, సినిమానే ఎంటర్టైన్మెంట్ కాదు. అలాగే, ఎంతో శక్తిమంతమైన మీడియా అయిన సినిమా సమాజాన్ని ప్రతిబింబించాలి. డబ్బులు సంపాది స్తూనే, సమాజానికి అద్దం పట్టే సినిమాలు కొన్నేళ్ళ క్రితం దాకా వచ్చేవి. కానీ, ఇవాళ కేవలం డబ్బు సంపాదనే ధ్యేయంగా సినిమా ద్వారా అమ్మాయిల్ని అబ్బాయిలు ఏడిపించడం లాంటివే చూపిస్తు న్నాం. అదేమంటే, ‘ఇదేనండీ ట్రెండ్’ అంటున్నాం. జనానికి మనం ఏది చూపించి, అలవాటు చేస్తే అదే చూస్తారు. కాబట్టి వాళ్ళను తప్పు పట్టకూడదు. గమనిస్తే ఇప్పుడు చాలామంది మంచి టెక్నీషి యన్లు, నటులు వస్తున్నారు. కానీ, వారి ప్రతిభకు సరైన దోవ లేక పక్కదారి పడుతోందేమోనని నా అనుమానం, బాధ.’’ కథ అదే..! టెక్నిక్కే మారుతోంది! - డి. సురేశ్‌బాబు, తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు ‘‘మా నాన్న గారు డి. రామానాయుడు, మా కుటుంబం కలసి 50 ఏళ్ళపైగా సినీరంగం లోనే కృషి చేయడం అదృష్టం. సినిమా అంటే అప్పటికి అందుబాటులో ఉన్న టెక్నిక్ వాడి, వెండితెరపై కథ చెప్పడం! నవ్వు, ఏడుపు లాంటి ప్రాథమిక ఉద్వేగాలు, కథ ఒకటే. వాడే టెక్నిక్, చెప్పే విధానం కాలాన్ని బట్టి మారుతుంది. ఒకప్పుడు జానపదాల్లో మినియేచర్లు వాడితే, ఇప్పుడు ‘బాహుబలి’కి గ్రాఫిక్స్, యానిమేషన్, డిజిటల్ ఎఫెక్ట్స్ వాడుతున్నాం. అప్పట్లో కొన్ని కోవల సిన్మాలే ఉండేవి. ఇప్పుడు రొమాంటిక్ కామెడీ, హార్రర్, క్రైమ్ ఇలా రకరకాల కోవల ఫిల్మ్స్ పెరుగుతున్నాయి. వచ్చేరోజుల్లో సిని మాల్ని చూసే వేదికలు, విధానమూ మారతాయి. హాళ్ళు, టీవీల్లోనే కాక కంప్యూటర్లు, స్మార్ట్ఫోన్లు, ట్యాబ్‌లలో సినిమాలు చూడడం పెరుగుతుంది. రోజులోని సమయాన్ని బట్టి చూసే వేర్వేరు రకాల సినిమాలు వస్తాయి.’’ -
నటుడు, జనసంక్షేమ నేత కోన ప్రభాకరరావు
క్రీడాకారుడుగా, సినీనటుడిగా, రాజకీయనేతగా మూడు విభిన్నరంగాల్లో తనదైన శైలితో రాణించిన కోన ప్రభాకరరావు తాను నిర్వహించిన పదవులకు వన్నెతెచ్చారు. నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా తెలుగు సినిమాలో ప్రతిభను చాటి, రాజకీయాల్లోకి వచ్చిన తొలి నటుడిగా గుర్తింపు పొందారు. కోన ప్రభాకరరావు స్వస్థలం గుంటూరు జిల్లా బాపట్ల. 1910 జూలై 10న జన్మించారు. అప్పటి మద్రాస్ లయోలాలో డిగ్రీ, పుణేలోని ఐఎల్ఎస్ లా కాలేజిలో న్యాయవాద కోర్సు చేశారు. ఆంధ్ర టెన్నిస్ జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. కాంగ్రెస్ పార్టీ సభ్యుడిగా క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు. చిన్నవయసులోనే కళలంటే ఆపేక్ష కలిగిన ప్రభాకరరావు నటుడిగా రాణించాలని తపనపడ్డారు. స్వస్థలంలో 1940 నుంచి న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తూనే నాటక సంఘాలు, నటులతో అనుబంధం పెంచుకున్నారు. దుర్యోధనుడు, శ్రీకృష్ణుడు పాత్రల్లో తన పద్యగానంతో కళాభిమానుల్ని రంజింపజేశారు. 1946లో తాను హీరోగా ‘మంగళసూత్రం’ అనే సినిమాను నిర్మించి, దర్శకత్వం వహించారు. ఎల్వీ ప్రసాద్ నటించిన ‘ద్రోహి’ సినిమాలో బుర్రమీసాలు, బుగ్గన గాటు, పులిపిరితో కనిపించే విలన్‌కు భిన్నంగా సూటూబూటుతో పాలిష్డ్ విలన్‌గా అద్భుతంగా నటించారు. 1951లో ‘సౌదామిని’ సినిమాను స్వీయదర్శకత్వంలో నిర్మించారు. ‘నిరపరాధి’, ‘నిర్దోషి’తో సహా 28 సినిమాల్లో నటించారు. ‘రక్తకన్నీరు’ నాగభూషణంను సినీ రంగానికి పరిచయం చేశారు. కాంగ్రెస్ నేత పీవీ నరసింహారావుతో గల పరిచయంతో ప్రభాకరరావు రాజకీ యాల్లోకి వచ్చారు. 1967లో బాపట్ల నుంచి రాష్ట్ర శాసనసభకు ఎన్నిక య్యారు. 1983 వరకు ఓటమి ఎరుగని నాయకుడిగా రాష్ట్ర రాజకీయాల్లో ప్రముఖ పాత్ర పోషించారు. రాష్ట్ర శాసనసభ స్పీకరు, ఆర్థికమంత్రి సహా పలు మంత్రి పదవులను చేపట్టారు. బాపట్లకు తాగునీరు, సాగునీటి వసతిని కల్పించిన ఘనత ప్రభాకరరావుదే. చివరిభూములకు సాగు నీటికని పంటకాల్వలకు సిమెంట్ లైనింగ్‌ను తొలిసారిగా అమలుచేశారు. 1963లో బాపట్ల ఎడ్యుకేషన్ సొసైటీ స్థాపించి విద్యాసంస్థలను నడిపిస్తూ మార్గదర్శనం చేశారు. 1983లో పాండిచ్చేరి లెఫ్టినెంట్ గవర్నరుగా నియమితులయిన ప్రభాకరరావు, సిక్కిం, మహారాష్ట్ర గవర్నరుగానూ పనిచేశారు. వివిధ నాట్య రీతుల్లో ప్రసిద్ధులైన రంగరాజన్, వెంపటి చిన సత్యం, బ్రిజుమహరాజ్, పాణిగ్రాహి వంటి నాట్యగురువులు, నర్తకీమణులను రప్పించి సికింద్రాబాద్ రైల్ కళారంగ్‌లో ఆ నాలుగు ఫార్మాట్లలోనూ ‘శ్రీకృష్ణపారిజాతం’ నృత్య రూపకాన్ని ప్రదర్శింపజేశారు. 1990 అక్టోబర్ 20న గుండెపోటుతో కన్నుమూశారు. కళా, రాజకీయరంగాల్లో ప్రభాకరరావు వారసత్వం కొనసాగుతోంది. ఆయన కుమా రుల్లో ఒకరైన కోన రఘుపతి బాపట్ల నుంచి రాష్ట్ర శాసనసభకు ప్రాతినిధ్యం వహిస్తు న్నారు. రఘుపతి కుమార్తె కోన నీరజ సినీరంగంలో స్టైలిస్ట్‌గా ఉన్నారు. రఘుపతి సోదరుడి కొడుకు కోన వెంకట్ సినీరంగంలో రచయితగా జైత్రయాత్ర సాగిస్తున్నారు. (నేడు కోన ప్రభాకరరావు వర్ధంతి) - బి.ఎల్.నారాయణ సాక్షి, తెనాలి -
ప్రత్యేక హోదా - బాహుబలి గోదా
చూడబోతే తెలుగు సినిమా ప్రతిష్టను పెంచిన బాహుబలికి తెలుగు వాళ్ల ప్రతిష్టకే కాక ప్రయోజనాలతో ముడిపడ్డ ప్రత్యేక హోదా అంశానికీ సారూప్యాలు కనబడుతున్నాయి. బాహుబలి కథ పూర్తిగా దృశ్యరూపం లో చెప్పడానికి దర్శక నిర్మాతలకు పార్ట్ 2 అవసరం అయింది. అలా అవసరమవడంలో వాళ్ల ఆర్థిక ప్రయోజనాలే ముఖ్యమైనాయంటే కాదని వాదించలేం. అది వేరే సంగతి. రెండేళ్లు సినిమాకోసం ఎదురు చూసిన ప్రేక్షకుడికి క్లైమాక్స్‌లో బాహుబలి చావడం, అదీ తనకు నమ్మకస్తుడైన సేనాని కట్టప్ప చేతిలోనే వెన్నుపోటుకి గురికావటం జీర్ణించుకోలేని విష యమైపోయింది. వాస్తవంగా అయితే కథ సంపూర్ణత కోసం రెండో భాగం వరకు వేచి చూడవలసిన నిస్సహాయ స్థితిలో కూరుకుపోయిన ప్రేక్షకుడే వెన్నుపోటుకు గురయ్యాడు. ఎంత నాజూకైన వెన్నుపోటు! అయినా అది వినోదం. ఆమోదయోగ్యం. అందుకనే సోషల్ మీడి యాలో ఒకటే గోల. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడంటూ ఎన్ని జోకులేసుకున్నా అసలు విషయం తెలుసుకోవడానికి టికెట్ డబ్బులు పట్టుకుని సంవత్సరం ఆగాల్సిందే. ఇక ప్రత్యేక హోదా పరిస్థితి. విభజనలో గాయపడ్డ ఆంధ్రప్రదేశ్‌కి బాధ నివారణకి ప్రత్యేక హోదా పూత పూస్తామని కేంద్రం సినిమా చూపించింది. ఎన్నికలయ్యాక సంవత్సరం దాటాక పార్ట్ వన్ ముగిసి నట్లుంది. బాహుబలితో సేమ్ టు సేమ్. ఇక్కడ కూడా క్లైమాక్స్‌లో నమ్మ కస్తుడైన కట్టప్ప లాంటి (వెంకయ్య అందామా, మోదీ అందామా లేక కేంద్రం అనేద్దామా సింపుల్‌గా) పాత్ర చేతిలో ప్రత్యేక హోదా ఖూనీ. ఒక చేతిలో చట్టం రూల్స్ కత్తి, ఇంకో చేతిలో నీతి ఆయోగ్ బరిసె. అది కూడా సింబాలిక్కే. అయిందో లేదో, అవుతుందో కాదో స్పష్టంగా తేల్చక ఎవరి ఊహను వారికే వదిలేస్తూ. అసలు కథ మాత్రం రెండో భాగం వచ్చే వరకు తేలేదిలా లేదు. మిసెస్ బాహుబలి అనుష్క. తన బాహుబలిని చంపిన కట్టప్పని వదిలేసి, భల్లాల దేవుడిపై పగపట్టి నట్లు, రాష్ట్ర ప్రభుత్వం హోదా అమలుదారుల్ని వదిలేసి చచ్చిన పాము కాంగ్రెస్‌ని పొద్దుగూకులా తిట్టిపోయడం ఎందుకో అర్థం కాదు. ఎనీవే. ఏమీ తేల్చకుండా పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అంటూ నానుస్తూ పోవడానికి ఇది వినోదం పంచే సినీ వ్యవహారం కాదు. విషాదం నిండిన బతుకు వ్యవహారం. ఆర్థిక దుస్థితిలో ఉన్న రాష్ట్రానికి చావు బతుకుల సమస్య. ఒకవైపు దివాలా, మరోవైపు ముంచుకొస్తున్న కరువు నేపథ్యంలో అత్యవసరంగా రాష్ట్రానికి అందాల్సిన చేయూత. తప్పనిసరిగా అమలు కావల్సిన హక్కు. డా. డి.వి.జి. శంకరరావు మాజీ ఎంపి, పార్వతీపురం, విజయనగరం జిల్లా, మొబైల్: 9440836931 -
బాబ్ క్రిస్టో...
ఫైటర్ తెలుగు సినిమాలకు బాబ్ క్రిస్టో అదనపు ఆకర్షణ. ఏదైనా మాస్ ఫైట్ ప్లాన్ చేయాలంటే బొంబాయి నుంచి పిలిపించేవారు. బొబ్బిలిపులిలో ఎన్‌టిఆర్‌తో బాబ్ క్రిస్టో ఫైట్ చాలా రోమాంచితంగా ఉంటుంది. ఆ ఫైట్‌లో ఎన్.టి.ఆర్ బాబ్ను నిజంగానే నిలువరించారని అంటారు. బాబ్ సామాన్యుడు కాడు. జన్మత: ఆస్ట్రేలియన్ అయినా సివిల్ ఇంజనీర్ అయినా తన కండలు, రూపం వల్ల సినిమాల్లో రాణించాడు. అతణ్ణి చూసి ప్రేక్షకులు భయపడేవారు. హీరోయిన్లకు స్క్రీన్ రేప్‌ల భయం ఉండేది. కాని బాబ్ క్రిస్టో స్వతహాగా స్నేహశీలి. నటుడు సంజయ్‌ఖాన్ (‘టిప్పుసుల్తాన్’ ఫేం)కు క్లోజ్‌ఫ్రెండ్. ఒకసారి సంజయ్‌ఖాన్ పక్క బంగ్లాలో మందు పార్టీ జరిగింది. ఆ పార్టీలో సంజయ్‌తో పాటు శతృఘ్నసిన్హా, సుభాష్‌ఘాయ్ కూడా పాల్గొన్నారు. సంజయ్ ఖాన్‌కు, శతృఘ్నసిన్హాకు మాటా మాటా పెరిగింది. అందరూ శతృ వైపు బాబ్ సంజయ్ వైపు నిలబడ్డారు. గొడవ సద్దు మణిగినా ఆ రాత్రి పార్టీ జరిగిన బంగ్లాలో నుంచి సంజయ్ ఖాన్ బంగ్లాలోకి కాల్పులు జరిగాయి. రెండు బుల్లెట్లు దొరికాయి. సుభాష్ ఘాయ్‌ని ఒకరోజు స్టేషన్లో పెట్టారు. దీని వెనుక శతృ ఉన్నాడని పుకారు. దిలీప్ కుమార్, నర్గిస్ ఈ గొడవను తీర్చారని అంటారు. ఈ గొడవ జరిగాకే శతృఘ్నసిన్హాను ‘షాట్‌గన్’ అని పిలవడం మొదలెట్టారు. -
రాజమౌళికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నా: రకుల్
తెలుగు సెల్యూలాయిడ్కు సరికొత్త గ్లామర్ కిక్ రకుల్ ప్రీత్‌సింగ్. కరెంట్ తీగలా కనిపించే ఈ ఢిల్లీ జవ్వని వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌లా దూసుకుపోతూ, అందరు హీరోలకూ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అనిపించుకుంటున్నారు. ఏమాత్రం రఫ్‌నెస్ లేకుండా లౌక్యంగా మాట్లాడే రకుల్ తను ఆదివారం బాహుబలి సినిమా చూసిందట.. ఈ సినిమా చూడటం ఇప్పటికే ఆలస్యం అయిందని కానీ చివరికి చూశానని ట్విట్టర్ ద్వారా తెలిపారు. బాహుబలి సినిమా తెలుగు సినిమాని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిందన్నారు... ప్రభాస్, తమన్నా, రాణా, రమ్య కృష్ణల నటన అద్భుతం అంటూ కితాబిచ్చారు. 'ఇంత గొప్పసినిమా తీయగలిగిన తెలుగు సినిమా ఇండస్ట్రీలో నేనూ ఒక భాగం అయినందుకు గర్వంగా ఉందన్నారు..మహాద్భుతంగా చిత్రాన్ని తీసిన రాజమౌళికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నా' అంటూ పొగడ్తలతో ముంచెత్తారు... #Baahubali has taken Telugu cinema to an international level!Amazing performances by all @tamannaahspeaks #prabhas @RanaDaggubati #ramya mam — Rakul Preet (@Rakulpreet) August 2, 2015 Late but finally saw #Baahuabli !! So proud to b a part of an industry that made such a film. Grand at a diff level.Take a bow @ssrajamouli — Rakul Preet (@Rakulpreet) August 2, 2015 -
బాహుబలి బ్లాక్ టిక్కెట్ల దందా
-
ముద్దుగుమ్మ సీమంతం
చెన్నై: హోమ్లీ హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి స్నేహ సీమంతం గురువారం అట్టహాసంగా జరిగింది. ఈ విషయాన్ని స్నేహ భర్త, నటుడు ప్రసన్న ట్విట్టర్లో తన అభిమానులతో పంచుకున్నారు. దీనికి సినీ పరిశ్రమ పెద్దలు హాజరై ఆమెకు ఆశీస్సులు అందించారు. టాలీవుడ్ హీరోయిన్ కాజల్ కూడా హాజరైన వారిలో ఉన్నారు. కాంజీవరం చీరలో స్నేహ వెలిగిపోయింది. బంగారు నగలతో ఆమె మొహం కాంతులీనింది. 'చాలా తక్కువ సమయంలో ఉండటం వల్ల ఈ ఫంక్షన్‌కు అందర్నీ ఆహ్వానించలేకపోయాను, క్షమించాలి... మీ అందరి ఆశీస్సులు మాకు తప్పకుండా ఉంటాయి. అది నాకు తెలుసు' అంటూ స్నేహ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా కొన్ని ఫోటోలను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తెలుగు , తమిళం భాషల్లో ప్రముఖ హీరోయిన్గా వెలుగొందిన నటి స్నేహ. పక్కింటి అమ్మాయి ఇమేజ్ను సొంతం చేసుకున్న ఈ బ్యూటీ తెలుగులో శ్రీరామదాస్ సినిమాతో ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. స్నేహి తెలుగులో నటించిన చివరి చిత్రం సన్ ఆఫ్ సత్యమూర్తి. కాగా తెలుగు, తమిళ భాషల్లో అగ్ర కథానాయికగా చలామణి అవుతున్న రోజుల్లో తమిళ హీరో ప్రసన్నను ప్రేమించి, పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. 2012 మే 11న వీరి వివాహం జరిగింది. అంటే సంసార జీవితంలోకి అడుగుపెట్టిన మూడేళ్ల తర్వాత ఈ ముద్దుగుమ్మ తొలిసారి అమ్మకాబోతుంది. -
అరువు తెచ్చుకున్న చిరునవ్వు..!
ఆ సీన్ - ఈ సీన్ మనిషిని పోలిన మనిషి.. సినిమాను పోలిన సినిమా. మొదటిది యాదృచ్ఛికం, రెండోది ప్రయత్నపూర్వకం. సప్తసముద్రాలవతల ఎక్కడో తీసిన ఒక సినిమాను మనమూ చూసే అవకాశాన్నిస్తున్నాయి ఈ ప్రయత్నాలు. అయితే ఇంగ్లిష్ సినిమాలు బాగా చూసే వారికి ‘కాపీ రా బాబూ..’ అనిపిస్తుంటాయి! అలాంటి వాటిలో ఇదీ ఒకటి. 1997 నాటి ఇటాలియన్ సినిమా ‘లా విటా ఈ బిల్లా’ (ఇంగ్లిష్‌లో.. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ) విడుదలైనప్పుడు రివ్యూయర్లు ఆ సినిమాకు సరదాగా ఒక ట్యాగ్‌లైన్ ఇచ్చారు. ‘మీరు అమ్మాయిలను పడగొట్టాలనుకొంటుంటే ఈ సినిమాను చూడండి..’ అని. ఆ సినిమాలో హీరోయిన్ను పడేయడానికి హీరో ప్లే చేసే ట్రిక్స్ ఆకట్టుకొనేలా ఉండటంతో ఆ లైన్ యాడ్ అయ్యింది. మరి అబ్బాయిలు ఎవరైనా ఆ ప్రయత్నం చేశారో లేదో కానీ... ఆ సినిమా తెలుగు ప్రేక్షకులను పడగొట్టడానికి మాత్రం బాగా ఉపయోగపడింది! కాపీ అనుకొన్నా, స్ఫూర్తి అనుకొని సమాధానపడినా... ఆ ఇటాలియన్ సినిమా ఆధారంగా ఒక తెలుగు సినిమాను చేసేసి మనకు చూపించేశారు. బాధలోనూ చిరునవ్వును వీడకూడదన్న తత్వాన్ని చాటే ఆ సినిమాను మనోళ్లు అచ్చంగా ‘చిరునవ్వుతో’ పేరుతో దించేశారు. ‘చిరునవ్వుతో’లో వేణు, షహీన్‌లు హీరోహీరోయిన్లుగా రామ్‌ప్రసాద్ దర్శకత్వంలో రూపొంది 2000 సంవత్సరంలో విడుదల అయిన ఆ సినిమా యూట్యూబ్‌లో ఎక్కువ మంది చూసిన తెలుగు సినిమాల్లో ఒకటి. సెన్సిబుల్ సీన్స్‌తో హ్యూమర్ పండించే ఈ సినిమా ఎవరికైనా ఇట్టే నచ్చేస్తుంది. ‘అరే భలే తీశారే..’అనిపిస్తుంది. భలే తీయడం అనే క్రెడిట్ ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ సినిమా దర్శక, రచయితలకే దక్కాలి. ఈ సినిమాకు రెండు పార్శ్వాలున్నాయి. రోబర్ట్ బెనిగ్నీ దర్శకత్వంలో అతడే ముఖ్యపాత్రలో నటించగా రూపొందించిన ఈ సినిమాలో తొలిసగం లవ్‌స్టోరీతో సరదాసరదాగా సాగిపోతుంది. రెండో సగం నాజీల విశృంఖల విహారం, హీరో తన తనయుడి అసలు విషయం అర్థంకాకుండా చేయడానికి అంతా ఒక ఆట అని కప్పిపుచ్చుతూ ఆనందపెడుతూ చేసే హృద్యమైన ప్రయత్నాలతో ఉంటుంది. ఉత్తమ విదేశీ చిత్రంగా ఆస్కార్ అవార్డునుకూడా అందుకొన్న ఈ సినిమాలోని తొలిసగం లోని సీన్లను యథాతథంగా ‘చిరునవ్వుతో’ సినిమాలో వాడేసుకొన్నారు. ఆ సినిమాను చూసిన వారికి కాపీ చేసిన సీన్లను గురించి బాగా అవగాహన ఉంటుంది. ఉదాహరణకు... ఒక సీన్లో హీరోయిన్ థియేటర్లోకి వెళ్లడం చూసి అదే సినిమా టికెట్ కొని లోపలకు వెళతాడు హీరో. ఆమె వెనుకవైపు ఉండటంతో తను స్క్రీన్‌వైపు చూడకుండా వెనక్కి తిరిగి ఆమెవైపు చూస్తుంటాడు. ఇక్కడితో మొదలు పెడితే.. హీరోహీరోయిన్ల మధ్య జరిగే సీన్లన్నింటి కీ మాతృక లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమానే. చిరునవ్వుతో సినిమాలో హీరో వేణు తన క్యాప్‌తో గుండు సుందర్శనంతో ఆడే ఫన్నీ గేమ్ ఒరిజినాలిటీ ఇటాలియన్ సినిమాదే. తన ఫ్రెండ్ క్యాప్ తడిసిపోయిందంటూ కొత్త క్యాప్తెచ్చివ్వవా అంటూ హీరోయిన్ సరదాగా దేవుడిని వేడుకోగానే గుండు సుదర్శనం పాత్ర వచ్చి ఆ క్యాప్లాక్కొని తన క్యాప్‌ను అక్కడ పెట్టి వెళ్లడం దానికి సంబంధించిన బ్యాక్‌గ్రౌండ్ సీన్స్.. ఇలా చెప్పుకొంటూ పోతే చాలా..! రెండో ప్రపంచ యుద్ధ నేపథ్యంలో వచ్చిన సినిమాను తమ సినిమా నేపథ్యానికి అనుగుణంగా చాలా తెలివిగా సీన్లను కాపీ చేశారు ‘చిరునవ్వుతో’ సినిమా వాళ్లు. అలా అని విమర్శించడానికేం లేదు.. ఎందుకంటే ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ సినిమా చూడని, చూసే అవకాశం లేని వారికి ఆ మ్యాజికల్ సీన్లను ‘చిరునవ్వుతో’ చూపించారు కదా! - బి.జీవన్‌రెడ్డి -
తెలుగు సినిమా, ప్రేక్షకులే లైఫ్
నకిరేకల్ : తెలుగు సినిమా, తెలుగు ప్రేక్షకులే తనకు లైఫ్ అని, తనను ఎంతగానో ఆధరిం చి జీవితంలో నిలబెట్టిన అభిమానులను మ రిచిపోలేనని సినీహీరో ఆకాష్ అన్నారు. ఆకాష్ నటించిన దొంగప్రేమ చిత్రం ఫంక్షన్లో పాల్గొనటానికి శనివారం హైదరాబాద్ నుంచి భీమవరం వెళ్తూ మార్గమధ్యంలో నకిరేకల్‌లో కొద్ది సేపు ఆగారు. ఈ సందర్భంగా పట్టణంలోని రవి ఫ్లెక్సీ షాప్‌లో ఆకాష్ విలేకరులతో మాట్లాడారు. తెలుగుతో పాటు హిం దీ, కన్నడం, తమిళ సినిమాల్లో నటించినప్పటికీ తనకు లైఫ్ ఇచ్చింది తెలుగు సినిమా, తెలుగు ప్రేక్షకులేనని పేర్కొన్నారు. ప్రస్తుతం తాను హీరోగా నటించిన దొంగప్రేమ, ఆనం దం మళ్లీ మొదలైంది సినిమాలు విడుదలకు సిద్దంగా ఉన్నాయని చెప్పారు. ఈనెల 27న ఈరెండు సినిమాలను విడుదల చేయబోతున్నామని వివరిం చారు. వీటితో పాటు జన్మజన్మల బంధం, నాలో ఒక్కడు చిత్రాల షూ టిం గ్ జరుగుతుందన్నారు. అంతకుముందు ఆర్యవైశ్య సంఘం జిల్లా నాయకుడు తొనుపూనురి రామకృష్ణ ఆధ్వర్యంలో ఆయనకు స్వాగతం పలికారు. హీరో ఆకాష్ చూసేందుకు ప్రేక్షకులు తరలివచ్చారు. -
సంజయ్ @సినీపీడియా
తెలుగు సినీ చరిత్రకారునిగా, విశ్లేషకునిగా, విమర్శకుడిగా, కాలమిస్ట్‌గా సంజయ్ కిషోర్‌ది దశాబ్దాల అనుభవం. తెలుగు సినిమాపై అభిమానం అతన్ని సినీపీడియాగా మార్చేసింది. సినిమాలకు సంబంధించి ఏ ఫొటో కావాలన్నా, ఏ సమాచారం కావాలన్నా అందరికీ తన పేరే గుర్తొచ్చేంతగా ఎదిగారు సంజయ్ కిషోర్. ఈ సినీ నిధికి రాగరాగిణి ఆర్ట్ అసోసియేషన్ ఆదివారం ‘సినీ పరిజ్ఞాన ప్రవీణ’ బిరుదును ప్రదానం చేసింది. ఈ సందర్భంగా సంజయ్ కిషోర్‌తో సిటీప్లస్ మాటామంతి. నా చిన్నప్పుడు మా కుటుంబం గుంటూరులో ఉండేది. మా అమ్మ ధనలక్ష్మి నాయుడు మహానటి సావిత్రికి ఉత్తరాలు రాసేది. ఆ మహానటి తన ఫొటో జత చేసి ప్రత్యుత్తరాలు పంపేది. అలా పంపిన ఒక ఫొటోను అమ్మ నాకు చూపించింది. అప్పుడు నా మనసులో కలిగిన ఆలోచన ఇప్పటికీ ఒక యజ్ఞంలా సాగుతోంది. తొమ్మిదో తరగతి నుంచి స్టిల్ ఫొటోల కోసం ఎన్నో ఏళ్లు, ఎన్నో ఊళ్లు తిరిగాను. ఎంతో ఖర్చు పెట్టి వాటిని సేకరించాను. నటీనటులు, డిస్ట్రిబ్యూటర్లు, సాంకేతిక నిపుణులు, సినీ అభిమానులు, జర్నలిస్ట్‌లు ఇలా అందరి నుంచి దాదాపు 70 వేలకుపైగా ఫొటోలను సేకరించి భద్రపరిచాను. ఆశ్చర్యం కలిగించే అంశం ఏంటంటే సావిత్రి తొలి స్టిల్ ఫొటో నా ఒక్కని దగ్గరే ఉంది. జీవితమే సినిమా రంగం.. నా జీవితం సినిమాతోనే ముడిపడి ఉంది. పాత్రికేయుడిగా ఎందరో సినీప్రముఖులను ఇంటర్వ్యూ చేశాను. ఎన్నో కాలమ్స్, రివ్యూలు రాశాను. ప్రింట్ మీడియాతో పాటు, ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా సినీ నేపథ్యం ఉన్న కార్యక్రమాలు నిర్వహించాను. నాలుగేళ్లు సెన్సార్ బోర్డులో సభ్యుడిగా, సినిమా నంది అవార్డ్స్ జ్యూరీ మెంబర్‌గా కూడా చేశాను. ‘సంగమం’ సంస్థ ఎన్నో వైవిధ్యభరితమైన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాను. సినిమాలతో ముడిపడి ఉన్న ప్రతి క్షణం నేను ఎప్పటికీ మరచిపోలేను. నా దగ్గర ఉన్న ఫొటోలతో ఓ మ్యూజియం ఏర్పాటు చేయాలని ఉంది. -కోన సుధాకర్‌రెడ్డి -
బ్రేక్‌ఫాస్ట్ షో : 2014 మేటి సినిమాలు - విశ్లేషణ!
-
బహుశా... ఇదే నా చివరి ఇంటర్వ్యూ అవుతుందేమో!
‘ఈ రోజుల్లో’, ‘బస్‌స్టాప్’ వంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకొన్న నటుడు సాయి. అయితే ఆ తర్వాత మాత్రం మితంగానే తెరమీద కనిపిస్తున్నాడు. ఎందుకలా? లెక్కకు మించి అవకాశాలు పలకరిస్తున్నా, సాయి ఎందుకు వాటిని ఒప్పుకోవడం లేదు! ప్రస్తుతం దర్శకుడిగా మారే ప్రయత్నంలో ఉన్న సాయి అంతరంగం ఏమిటి? మీ నేపథ్యం ఏమిటి? సినీరంగం వైపు ఎలా వచ్చారు? మాది తూర్పుగోదావరి జిల్లా తుని. స్కూల్ దశ నుంచే చదువు మీద కన్నా సాంస్కృతిక కార్యక్రమాలు, స్పోర్ట్స్ మీదే ఆసక్తి ఎక్కువ. జనాలు కొట్టే చప్పట్లలో ఏదో కిక్ ఉందనిపించింది. అందుకే క్రికెటరయిపోదామని అనుకొన్నా. అండర్-19 సెలక్షన్స్ కోసం కాకినాడకు వెళ్లడంతో ఆ క్రికెట్ జర్నీకి బ్రేక్ పడింది. సెలక్షన్స్ జరుగుతున్నన్ని రోజులూ అక్కడ ఉండటం కూడా కష్టమైంది. వసతి కోసమని ఇంట్లో వాళ్లు ఖర్చు పెట్టే పరిస్థితి లేదు. అదే సమయంలో చదువుకు కూడా ఫుల్స్టాప్ పడటంతో ఏదో ఒక పని చేయక తప్పలేదు. దీంతో తెలిసిన వారి ద్వారా చెన్నై వెళ్లి అక్కడ సినిమాల సాంకేతిక విభాగంలో ట్రై చేయడం మొదలు పెట్టాను. ఇదంతా పదిహేనేళ్ల కిందటి సంగతి. మరి నటుడిగా ఎలా మారారు? ఉన్న పరిచయాలతో మొదట సీరియళ్లలో అవకాశం వచ్చింది. తమిళ, తెలుగు భాషల కోసం చెన్నైలో రూపొందించే చాలా సీరియళ్లకు దర్శకత్వ విభాగంలో పనిచేశాను. అలా ఒక ఐదేళ్లు గడిచిపోయాయి. కనీసం 30 సీరియళ్లకు పనిచేశాను. అలా చేస్తున్నప్పుడు ‘కుర్రాడు బాగున్నాడు...’ అంటూ దర్శకులు ఏదైనా చిన్న పాత్రను చేయమనేవారు. ఆ సీరియళ్లు తెలుగులో ప్రసారం అయినప్పుడు మా అమ్మ చూసి తెగమురిసిపోయేది. ‘‘అప్పడప్పుడు అలా కనిపించరా’’ అని చెప్పేది. దీంతో నటన మీద కూడా దృష్టిపెట్టాను. తొలి సినిమాతోనే గుర్తింపు లభించినా, తర్వాత ఆ దూకుడు లేదే...! ఈ రోజుల్లో, బస్‌స్టాప్ సినిమాల తర్వాత ముప్పై నలభై సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. వాటిల్లో చాలా వరకూ వెకిలి పాత్రలే! డబుల్ మీనింగ్ డైలాగ్స్ ద్వారా నవ్వించాలని చెప్పే దర్శకులు, నిర్మాతలే కనిపించారు. అయితే అర్థంపర్థం లేకుండా సాగే అలాంటి పాత్రలు చేయడం సరికాదనిపించింది. సెలెక్టివ్‌గా చేయవచ్చు కదా! నాకంత స్థాయి లేదండీ. ఒకసారి సినిమాను ఒప్పుకొన్నాకా అలా చేయను, ఇలా చేయను అంటే కుదరదు. అయితే రాజీపడి అలాంటి పాత్రలను చేయలేను. శారీరకంగా నేను ఒక క మేడియన్లా కనిపిస్తానేమో కానీ నా తాత్వికత వేరు. ‘నటన వేరు, వ్యక్తిగతం వేరు’ అనుకోలేకపోయాను. ‘ఏం విత్తామో, అదే కోస్తాం’ అనే సిద్ధాంతాన్ని నమ్ముతాను. ఈ విషయంలో నాకు నా భార్య సౌందర్యప్రియ కూడా పూర్తిగా మద్దతుగా నిలబడింది. ఇటీవలే మాకు బాబు పుట్టాడు. మరి భవిష్యత్తులో వాడు ఇప్పుడు నేను చేసిన సినిమాలను చూసి ఇబ్బంది పడకూడదు. నాకు సినిమాలే అక్కర్లేదు, ఏదోఒక పనిచేసి బతకగలను, నావాళ్లను పోషించుకోగలను. నేను నమ్మే దైవత్వం కూడా అలాంటి పాత్రలకు సమ్మతించకుండా చేసింది. అందుకే వాటికి దూరంగా జరిగాను. మరి భవిష్యత్ ప్రణాళికలు ఏమిటి? ఒక స్క్రిప్ట్ డిజైన్ చేసుకొంటున్నా. అదొక పీరియాడికల్ మూవీ. వర్క్ అంతా దాదాపుగా పూర్తయ్యింది. అది కార్యరూపం దాల్చి నేను దర్శకుడిగా నిలదొక్కుకొంటే, అందరికీ గుర్తుండిపోతా. లేకపోతే ఇదే నా చివరి ఇంటర్వ్యూ అవుతుందేమో! చెన్నైలో ఉన్న మీకు తెలుగు సినిమా అవకాశాలు ఎలా లభించాయి? ఏడేళ్ల కిందట చెన్నై నుంచి హైదరాబాద్‌కు షిఫ్ట్ అయ్యాను. సీరియళ్లకు పనిచేయడం మానేసి... సొంతంగా రియాలిటీ షో కాన్సెప్ట్‌ను డిజైన్ చేసుకొన్నాను. వాటికి మంచి క్రేజ్ ఉండటంతో నా కాన్సెప్ట్‌ను నిర్మాత బన్నీవాసుకు వినిపించాను. ఆయన ద్వారా మారుతిగారితో పరిచయం కలిగింది. అప్పటికి మారుతి ‘బస్‌స్టాప్’ తీస్తున్నారు. దానికి నేను కూడా అసోసియేట్‌గా జాయిన్ అయ్యాను. అయితే ఆ సినిమా ఆగిపోయింది. ఆ విరామంలో ‘ఈ రోజుల్లో’ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించడం మొదలుపెట్టారు. దానికి కూడా అసోసియేట్‌గా పనిచేసిన నేను మారుతి గారి సూచనమీదే నటుడిగా కూడా మారాను. ఆగిపోయిన బస్‌స్టాప్ మళ్లీ మొదలవ్వడంతో అందులో కూడా పాత్ర లభించింది. - బీదాల జీవన్‌రెడ్డి -
అదే నా లక్ష్యం : రాజేశ్ టచ్‌రివర్
తెలుగు సినిమాలపై అభిమానంతో హైదరాబాద్‌లో స్థిరపడ్డ మలయాళీ... రాజేశ్ టచ్‌రివర్. ఆయన దర్శకత్వంలో వచ్చిన ‘ఇన్ ద నేమ్ ఆఫ్ బుద్ధా’ చిత్రం కేన్స్ ఫిలిం ఫెస్టివల్లో ప్రదర్శితమైంది. రీసెంట్గా ఆయన తీసిన ‘నా బంగారు తల్లి’ చిత్రం మూడు జాతీయ అవార్డులను, అయిదు అంతర్జాతీయ పురస్కారాలను దక్కించుకుంది. తెలుగు సినిమాకు అంతర్జాతీయ ఖ్యాతిని తెచ్చిపెట్టడమే తన ముందున్న లక్ష్యమని చెబుతున్న రాజేశ్ టచ్ రివర్‌తో ‘సాక్షి’ జరిపిన సంభాషణ. ‘నా బంగారు తల్లి’ ఆలోచన ఎవరిది? తూర్పు గోదావరి జిల్లాలో జరిగిన యథార్థ గాథ ఇది. వ్యభిచార వృత్తిలో నలిగిపోతున్న స్త్రీలకు విముక్తిని కల్పించడమే లక్ష్యంగా నా భార్య సునీత కృష్ణన్ స్థాపించిన స్వచ్ఛంద సంస్థ ‘ప్రజ్వల’. ఆ సంస్థ ద్వారా ఇప్పటికి 20 వేల మంది స్త్రీలకు విముక్తిని అందించడం జరిగింది. ఈ 20వేల మందిలో ఒక్కొక్కరిదీ ఒక్కో కథ. ఆ కథల్లో మా ఇద్దరి మనసుల్ని కదిలించింది ఓ కథ. దాన్ని అందరికీ చెప్పాలనిపించింది. నిజానికి ఈ కథను సినిమాగా చేస్తే... కొన్ని అభ్యంతరకర సన్నివేశాలు తీయాలి. కానీ... ఎలాంటి అసభ్యత లేకుండా, అందరూ చూసేలా సినిమా తీయాలని నా భార్య సూచించింది. తను చెప్పినట్లే... ఆ కథను ‘నా బంగారు తల్లి’గా తీశాను. సమాజానికి పెను ప్రమాదంగా సంభవించిన అక్రమ రవాణా అంశాన్ని ఈ సినిమాలో చర్చించాం. సామాజిక సంస్కరణలో మార్పు మన నుంచే మొదలవ్వాలని ఇందులో చెప్పాను. సినీ ప్రముఖులందరూ ఈ సినిమా చూసి అభినందించారు. ప్రేక్షకుల నుంచి కూడా ఈ సినిమాకు విశేష స్పందన లభిస్తోంది. ఇక ముందు కూడా ఇలాంటి సినిమాలే తీస్తారా? అలాంటిదేం లేదు. యువతరం కథతో పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ తీయబోతున్నా. ఇందులో అందరూ కొత్తవారే నటిస్తారు. వచ్చే నెలలో ఆ సినిమా మొదలవుతుంది. దర్శకునిగా నా లక్ష్యం ఒక్కటే. తెలుగు సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లాలి. దాని కోసం అహర్నిశలూ శ్రమిస్తా. ప్రేమ, యాక్షన్.. ఈ రెండిటి చుట్టే తెలుగు సినిమా తిరుగుతుంటే... మీరు అందుకు భిన్నంగా సామాజిక విలువలతో కూడిన సినిమా తీశారు. సాధారణంగా మలయాళంలో ఇలాంటి సినిమాలొస్తుంటాయి. మీరు మలయాళీ కావడం వల్లే ఇలా ఆలోచించారని అనొచ్చా? అలాంటిదేం లేదండీ... ఇది తెలుగు నేలపై జరిగిన కథ. అసలు నేను దర్శకుణ్ణి అయ్యింది తెలుగు సినిమాలు చూసి. చిరంజీవి, కె.రాఘవేంద్రరావుల చిత్రాలు కేరళలో అనువాదమయ్యేవి. అవి చూసే.. సినిమాలపై నాకు ఇష్టం పెరిగింది. లండన్‌లో డెరైక్షన్‌పై పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాను. నాలోని ప్రతిభ గమనించి బ్రిటిష్ గవర్నమెంట్ స్కాలర్ షిప్ కూడా ఇచ్చింది. ఆ తర్వాత 1996లో యానిమేషన్ మేకింగ్ నేర్చుకోవడానికి హైదరాబాద్ వచ్చాను. అప్పట్నుంచి ఇక్కడే ఉంటున్నా. కేరళ నా మాతృభూమి అయితే... తెలుగునేల నా కర్మభూమి. తెలుగు సినిమాతో మీ అనుబంధం? కళా దర్శకుడు అశోక్‌కుమార్‌గారి వద్ద సహాయకునిగా ఇక్కడ నా కెరీర్ మొదలైంది. చిరంజీవిగారి ‘మాస్టర్’కి తొలిసారి అసిస్టెంట్ ఆర్ట్ డెరైక్టర్‌గా చేశా. ఆ తర్వాత బావగారు బాగున్నారా, ఇద్దరు మిత్రులు చిత్రాలకు కూడా పనిచేశాను. ‘స్టూడెంట్ నెం 1’ చిత్రంతో ఆర్ట్ డెరైక్టర్‌గా ప్రమోట్ అయ్యాను. ఆ తర్వాత వచ్చిన ‘మనసంతా నువ్వే’ చిత్రానికి కూడా నేనే ఆర్ట్ డెరైక్టర్ని. చివరి ప్రశ్న... మీ మెడలో ఆ వెరైటీ హారం ఏంటి? ఆ హారం వయసు 460 సంవత్సరాలు. అది నా మెడలో గమ్మత్తుగా చేరింది. కొనేళ్ల క్రితం మధ్యప్రదేశ్‌లో భవానీమాత ఆలయానికి వెళ్లాను. అక్కడ గుంపుగా వెళుతున్న పదిహేనుమంది సాధువులు... నన్ను చూసి ఆగి ‘ఇది అతి పురాతనమైన అమ్మవారి నగ. ధరించు.. నీకు శుభం జరుగుతుంది’ అని నా మెడలో వేసి వెళ్లిపోయారు. ఆ రోజు నుంచి ఇది నా శరీరంలో భాగమైంది. నన్ను కలిసిన చిన్న పరిచయస్తులు కూడా... మొదట అడిగే ప్రశ్న... ‘మీ మెడలో అదేంటండీ?’ అని. ఇప్పటివరకూ ఎంతోమందికి చెప్పినా... మొత్తానికి మీ ద్వారా అది ప్రపంచానికి తెలుస్తున్నందుకు సంతోషం. -
టీజర్‌తోనే.. ఆకట్టుకున్నాడు..!
-
రవితేజ పోలీస్ డ్రెస్సేస్తే.. సినిమా హిట్టే..!
-
100 కోట్ల క్లబ్ : మనకంత సీనుందా ?!
-
నేటి నుంచి షూటింగులు బంద్
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో సోమవారం నుంచి షూటింగ్స్ జరపరాదని తెలుగు ఫిలిం ఫెడరేషన్ నిర్ణయించింది. ఈ మేరకు ఆదివారం నాడు తమ నిర్ణయాన్ని ఓ ప్రకటనలో తెలియజేసింది. సినీ కార్మికుల వేతనాల పెంపు విషయంలో నిర్మాతలకు, ఫెడరేషన్ ప్రతినిథులకు మధ్య కొన్ని రోజులుగా జరుగుతున్న చర్చల్లో ఎలాంటి పురోగతి కనిపించకపోవడంతో ఫిలిం ఫెడరేషన్ ఈ నిర్ణయం తీసుకుందని అధ్యక్షుడు కొమర వెంకటేశ్ పేర్కొన్నారు. నటీనటులెవరూ ఈ బంద్ కాలంలో చలన చిత్రాల షూటింగ్స్‌లో పాల్గొనరాదని, ఆ మేరకు సినీ కార్మికులకు సహకరించాలని కోరారు. బంద్ నిర్ణయాన్ని చిత్రపరిశ్రమకు సంబంధించిన వర్గీయులందరికీ ఫ్యాక్స్ ద్వారా తెలియజేస్తున్నామని చెప్పారు. గడచిన నాలుగు రోజులుగా తెలుగు చలన చిత్రాల షూటింగులు జరగడంలేదు. కేవలం ‘బాహుబలి’, గిన్నిస్ రికార్డ్ కోసం తీస్తున్న ‘సరదాగా ఒక సాయంత్రం’ చిత్రాలు ప్రత్యేక అనుమతితో మాత్రమే షూటింగ్ జరుపుకుంటూ వచ్చాయి. తాజా పరిణామాల వల్ల వీటికి కూడా ఆటంకం కలిగే అవకాశం ఉంది. షూటింగ్ నిలుపు చేయాల్సిందిగా ‘బాహుబలి’ చిత్రబృందానికి కూడా సమాచారం పంపుతున్నామని కొమర వెంకటేశ్ తెలిపారు. -
ఆగడు షాక్ నుండి ఇంకా కోలుకోలేదు(ట)!!
-
గణపతి బప్పా మోరియా మూవీ పోస్టర్స్
-
'మరో రూపంలో మళ్లీ జన్మించి వెలుగునివ్వాలి'
-
'మరో రూపంలో మళ్లీ జన్మించి వెలుగునివ్వాలి'
చెన్నై : బాపూ భౌతికకాయానికి తమిళనాడు గవర్నర్ రోశయ్య మంగళవారం ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రోశయ్య మాట్లాడుతూ తెలుగువారి సత్తా ప్రపంచానికి చాటిన ఘనత బాపూదన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని మనసారా కోరుకున్నట్లు తెలిపారు. తెలుగు సినిమా రంగంలో బాపూ చెరగని ముద్ర వేశారని, ఆయన మరో రూపంలో మళ్లీ జన్మించి తెలుగు జాతికి వెలుగునివ్వాలన్నారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ద ప్రసాద్....బాపూకు అంజలి ఘటించారు. ఈ సందర్భంగా బాపూతో గల అనుబంధాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. తెలుగువారి గుండెల్లో బాపూ గూడు కట్టుకున్నారని, బుడుగు చదవిని వారు ఉండరని ఆయన అన్నారు. బాపూ మృతితో తెలుగువారిలో ఓ అంగం పోయినట్లు ఉందని మండలి బుద్దప్రసాద్ అన్నారు. నటుడు మోహన్ బాబు, గాయకుడు మనో కూడా బాపూకు నివాళులు అర్పించారు. -
భయపెడతానంటున్న శృతి!!
-
మహేశ్ 'ఆగడు' టీజర్
-
'సీతమ్మ వాకిట్లో..' పాట పుట్టిందిలా..
-
మహేశ్ సినీ ప్రయాణం - బర్త్‌డే స్పెషల్
-
గీతాంజలి టీంతో చిట్ చాట్ -2
-
గీతాంజలి టీంతో చిట్ చాట్ -1
-
చిరు చిందేస్తే...
-
రామ్ గోపాల్ వర్మ 'అనుక్షణం' ట్రైలర్
-
రోబో-2తో చిరంజీవి రీఎంట్రీ
-
మళ్లీ కమేడియనవ్వాలని..
-
'కుటుంబ' కథా చిత్రమ్!!
-
అప్పుడే 'పవర్' చూపించేస్తున్నాడు!!
-
పాట వెనక కథ 20th July 2014
-
'ఒక క్రిమినల్ ప్రేమకథ' టీంతో చిట్‌చాట్
-
నవ్వుల ఇంద్రుడు.. రాజేంద్రుడు
-
చార్మిని జనం గుర్తు పట్టలేదు!!
-
ఆగష్ట్ 1కి రానున్న 'రన్ రాజా రన్'
-
ఫ్యాన్స్‌తో ఎప్పుడూ టచ్‌లో ఉంటున్నాడిలా..
-
రవితేజ తన 'పవర్' చూపిస్తాడా?
-
బారిష్టర్ పార్వతీశంపై మనసు పడ్డాడు!
-
పాట వెనక కథ - విశ్వ
-
అమ్మో.. మాస్ సినిమానా ?!
-
నిను వీడని నీడను నేనూ..!
-
ఇద్దరి సినిమాల కథా ఒకేలా ఉందే.. మరెలా..!
-
'దృశ్యం' సినిమా అందుకే చేస్తున్నాడా..?!
-
'బెంగళూర్ డేస్'పై మనసు పడ్డ టాలీవుడ్!
-
పవన్ నాకు మామిడి పళ్లు పంపించలేదు!!
-
'యెల్లో బ్యాగ్' ఎవరి సొంతమవునో!?
-
ఇండస్ట్రీ ఎక్కడికెళ్లినా నా పని నవ్వించడమే!
-
పొగ మీద పగబట్టారు!
స్ఫూర్తి ఆ మధ్య వచ్చిన ఓ తెలుగు సినిమా గుర్తుందా? అందులో మద్యపానం కారణంగా నాశనమైపోతున్న ఓ ఊరిని మార్చడానికి హీరో నానా తంటాలు పడతాడు. త్యాగాలు చేస్తాడు. కానీ గరిపెమా గ్రామాన్ని బాగు చేయడానికి ఏ హీరో రాలేదు. ఆ ఊరిలోని ప్రతి వ్యక్తీ ఓ హీరో అయ్యాడు. అందుకే ఇప్పుడు గరిపెమా పేరు రికార్డులకెక్కింది. నాగాల్యాండ్ రాజధాని కోహిమాకి 49 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది గరిపెమా గ్రామం. ఒకప్పుడు గరి అనే వృక్షాలు ఎక్కువగా ఉండటం వల్ల ఆ ఊరికా పేరు వచ్చింది. మూడొందల కుటుంబాలు, ఓ బడి, ఓ ఆసుపత్రి... ఇంతే ఆ ఊరు. కానీ ఇప్పుడది సాధించిన ఘనత అంతా ఇంతా కాదు. దేశంలోనే తొలి పొగాకు రహిత గ్రామంగా రికార్డు సాధించింది గరిపెమా. మన దేశంలో యేటా 2.200 మంది పొగాకు కారణంగా మరణిస్తున్నారు. క్యాన్సర్‌తో చనిపోతున్న భారతీయుల్లో నలభై శాతం మంది ధూమపానం వల్ల క్యాన్సర్ బారిన పడ్డవారే. 90 శాతం మందికి నోటి క్యాన్సర్ పొగాకు వల్లే వస్తోంది. నాగాల్యాండ్‌లో కూడా ధూమపానం చేసేవారి సంఖ్య అధికమే. కానీ ఇప్పుడు ఆ ఊళ్లో ఒక్కరు కూడా పొగాకు జోలికి పోవడం లేదు. పొగ తాగాలని పరితపించడం లేదు. గ్రామ పెద్దలు, గ్రామంలోని యువసంఘం, విద్యార్థి సంఘాలు కలిసి ఊరిలో పొగాకు అన్నమాటే వినబడకుండా చేశాయి. అది మాత్రమే కాదు... ఎక్కడా మద్యం, గుట్కా కూడా లభించకుండా చేశారు. గ్రామస్తులెవరైనా పొగతాగితే ఐదు వందలు, మద్యం సేవిస్తే వెయ్యి రూపాయలు జరిమానా విధిస్తారు. ఆ ఊరివారే కాదు... సందర్శకులకు, ఊరివారి కోసం వచ్చే బంధుమిత్రులు కూడా వీటిని పాటించాల్సిందే. ఈ నియమాలన్నిటినీ రాసిన ఓ పెద్ద బోర్డు గ్రామంలో అడుగుపెట్టగానే కనిపిస్తుంది. అందరూ అత్యంత కచ్చితంగా నియమాలను అనుసరించడంతో భారతదేశంలోనే తొలి పొగాకు రహిత గ్రామంతో గరిపెమా అవతరించింది. దేశంలోని ఇతర ప్రాంతాలన్నిటికీ ఆదర్శంగా నిలబడింది! -
అలసిపోయినా ఫర్వాలేదు కానీ... ఖాళీగా ఉండలేను!
సినీ నటి కావాలని కలలుగన్న అమ్మాయి... అందుకోసం మోడలింగ్‌లో కృషి చేసిన అమ్మాయి... కన్నడంలో మొదలుపెట్టి, తెలుగులోకి వచ్చి... ఆ పైన తమిళం మీదుగా హిందీ దాకా వెళ్ళిన నటి... అందం, కళ్ళతోనే భావాలు పలికించగల అభినయ నైపుణ్యమున్న ఇరవై మూడేళ్ళ రకుల్ ప్రీత్ సింగ్. ఒక్క ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ హిట్‌తో నాలుగు తెలుగు చిత్రాలతో బిజీగా మారిన నవతరం నాయిక. బిజీ బిజీగా గడుపుతున్న రకుల్‌తో కాసేపు... ఒకేసారి నాలుగైదు సినిమాలతో బిజీగా ఉన్నారు.. హఠాత్తుగా కెరీర్ ఇలా మలుపు తీసుకుంటుందని ఊహించారా? నిజం చెప్పాలంటే అస్సలు ఊహించలేదు. ఎప్పుడో రెండు మూడేళ్ల తర్వాత ఇలా బిజీ అవుతానేమో అనుకున్నా. కానీ, ఎప్పుడో జరుగుతుందనుకున్నది ఇప్పుడే జరిగినందుకు ఆనందంగా ఉంది. మీ తొలి చిత్రం ‘గిల్లి’ (కన్నడ - 2009)కీ, మీ మలి చిత్రం ‘కెరటం’ (తెలుగు -2011)కీ మధ్య గ్యాప్. ఆ తర్వాత కూడా కొంత విరామం తీసుకుని తెలుగులో ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ (2013) చేశారు. కారణం ఏంటి? డిగ్రీ పూర్తి చేయాలనే ఆకాంక్షతో కావాలనే విరామం తీసుకున్నా. వాస్తవానికి ‘కెరటం’ ఒప్పుకున్నప్పుడు సినిమాల్లో కొనసాగాలా, లేదా అని తర్జనభర్జన పడ్డాను. ఎందుకలా.. సినిమాలంటే ఇష్టం లేదా? చిన్నప్పటి నుంచీ నాకు సినిమాలంటే ఇష్టం. హీరోయిన్ కావాలన్నదే నా ఆశయం. అయితే, డిగ్రీ పూర్తి చేయకుండా సినిమాల్లో కొనసాగడం మంచిది కాదనిపించింది. అందుకే విరామం తీసుకున్నా. హీరోయిన్ అవుతానంటే మీ ఇంట్లో ఏమన్నారు? నన్ను హీరోయిన్గా చూడాలని అమ్మ కల. అందుకే, ఎండల్లో తిరగనిచ్చేది కాదు. నూనె వంటకాలు తింటే, బరువు పెరుగుతావని హెచ్చరించేది. నేను ‘మిస్ ఇండియా’ టైటిల్ గెల్చుకున్నప్పుడు అమ్మ ఎంత సంతోషపడిందో ఎప్పటికీ మర్చిపోలేను. అలాగే, నన్ను వెండితెరపై చూసి, ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నంత పని చేసింది. మరి... టైటిల్ గెలుచుకున్నప్పుడు మీకేమనిపించింది? ఆ క్షణాలను మాటల్లో చెప్పలేను. ఎందుకంటే, ‘ఈ దేశానికే ఈమె అందగత్తె... మిస్ ఇండియా’ అని తీర్మానించారు. అందుకే అది చాలా చాలా విలువైన బిరుదు. ఆ టైటిల్ సంపాదించిన తర్వాత హిందీ రంగంలోకి అడుగుపెట్టి, అవకాశాల కోసం ప్రయత్నం చేయాలనుకున్నా. హిందీ సినిమాలే చేయాలని ఎందుకనుకున్నారు? నేను ఢిల్లీ అమ్మాయిని కదా! హిందీ బాగా వచ్చు. దక్షిణాది భాషలు, ఇక్కడి సంప్రదాయం నాకు తెలియదు. అందుకే హిందీ సినిమాల మీద దృష్టి పెట్టా. డిగ్రీ పూర్తి చేశారు కాబట్టి, ఇక దృష్టంతా సినిమాలపైనేనా? అవును. కాకపోతే ‘కెరటం’ చేసినప్పుడు చిత్ర నిర్మాణం గురించి, నటన గురించి నాకేం తెలియదు. అలా వచ్చి.. ఇలా నటించేసి, అలా వెళ్లిపోయేదాన్ని. మొదటి సినిమాతో ఎలాంటి సినిమాలు చేయాలనే విషయంపై అవగాహన వచ్చింది. అందుకే, ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ అవకాశం రాగానే ఒప్పుకున్నాను. నాకు మంచి సినిమా అవుతుందనిపించింది. నా నమ్మకం నిజమైంది. ఆ సినిమా విజయం వల్లే మీరింత బిజీ అయ్యారనొచ్చా? అనుకోవచ్చు. ఒక సినిమా విజయం సాధిస్తే, అందులో నటించిన నటీనటులకు మరింత గుర్తింపు లభిస్తుంది. ఆ విధంగా నాకు ఆ సినిమా లాభించింది. ప్రస్తుతం మీరు చేస్తున్న నాలుగు సినిమాల్లో ‘కరెంటు తీగ’, ‘పండగ చేస్కో’ నిజానికి నటి హన్సిక చేయాల్సినవి. మరి, ఆ అవకాశాలు మీకు వచ్చినప్పుడు ఎలా అనిపించింది? అది కాకతాళీయంగా జరిగింది. ఒక హీరోయిన్ను ముందు అనుకొని, ఆ తర్వాత ఆ స్థానంలో వేరే హీరోయిన్ను తీసుకున్న సందర్భాలు, సినిమాలు చాలా ఉన్నాయి. నాకు ఆ రెండు సినిమాల కథ, నా పాత్రలు నచ్చాయి. అందుకని అంగీకరించా. పగలు ‘కరెంట్ తీగ’, రాత్రి ‘పండగ చేస్కో’ షూటింగ్లలో పాల్గొన్న రోజులున్నాయి. పగలూ రాత్రీ షూటింగ్ చేయడం ఇబ్బందిగా అనిపించలేదా? ఒక్కరోజు నాకు పని లేకపోతే జీవితమే వ్యర్థం అయినట్లుగా ఫీలై పోతా. వరుసగా షూటింగ్స్ చేసి, అలసిపోయినా ఫర్వాలేదు కానీ, ఖాళీగా మాత్రం ఉండలేను. హిందీ చిత్రం ‘యారియాన్’లో లిప్‌లాక్ సీన్లో నటించారు. మరి తెరపై బికినీ కూడా ధరిస్తారా? కథ డిమాండ్ చేస్తే ఓ నటిగా ఏదైనా చేస్తా. అది నా బాధ్యత. ‘యారియాన్’ చూసినవాళ్లు, లిప్‌లాక్ సీన్ అనవసరం అని అనరు. ఆ సినిమాలో ఆ సన్నివేశం లేకపోతే ఏదో లోపించినట్లుగా అనిపిస్తుంది. ఇక, బికినీ విషయానికి వస్తే... ఒకవేళ నేను చేస్తున్నది పల్లెటూరి అమ్మాయి పాత్ర అనుకోండి.. అప్పుడు బికినీ ధరించమంటే అందులో లాజిక్ లేదు. కావాలని ఆ సన్నివేశం పెట్టినట్లు ఉంటుంది. అదే గనక ఆధునిక యువతి పాత్రలో బికినీ ధరిస్తే, సందర్భానికి అతికినట్టు ఉంటుంది. ఏమైనా, కథ, సన్నివేశంలో అవసరముంటే, బికినీ ధరించడానికి సిద్ధం. మొదట్లో హిందీ సినిమాలే చేయాలనుకున్నారు కదా! మరి, ఇప్పుడేమనుకుంటున్నారు? తెలుగు సినిమాలకు ప్రాధాన్యం ఇవ్వాలనుకుంటున్నా. ఎందుకంటే, ఇక్కడ మంచి మంచి పాత్రలు చేసే అవకాశం వస్తోంది. తెలుగు అర్థమవుతోంది. కొంచెం కొంచెం మాట్లాడుతున్నాను కూడా! త్వరగా తెలుగు భాష నేర్చుకోవాలనుకుంటున్నా. అందుకే ఇక్కడ షూటింగ్ లొకేషన్లో నాతో తెలుగులోనే మాట్లాడమని అందరితో చెబుతున్నా. మీకంటూ ఏదైనా డ్రీమ్ రోల్ ఉందా? కొన్ని పాత్రలు ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ఉదాహరణకు ‘బొమ్మరిల్లు’ సినిమాలో జెనీలియా పోషించిన హాసిని పాత్ర. అలా ప్రేక్షకులకు గుర్తుండిపోయే పాత్రలు చేయాలని ఉంది. అలాంటి పాత్ర వస్తే ఎంత కష్టపడడానికైనా నేను సిద్ధం. సినీ తారగా పేరొచ్చింది. ఈ సెలబ్రిటీ లైఫ్ ఎలా ఉంది? వ్యక్తిగా నాలో మార్పు రాలేదు. స్కూల్, కాలేజ్ ఫ్రెండ్స్‌తో టచ్‌లోనే ఉన్నా. వీలు కుదిరినప్పుడు వాళ్లను కలుస్తున్నా. కాకపోతే అంతకు ముందు అందం, శరీరం గురించి పెద్దగా శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరంలేదు. కానీ, ఇప్పుడు తప్పనిసరిగా శరీరాకృతిని కాపాడుకోవాలి. అంటే... నచ్చిన ఆహారానికి దూరంగా ఉంటున్నారన్నమాట? ఐస్‌క్రీమ్‌లు, స్వీట్స్‌కు వీలైనంత దూరంగా ఉంటున్నా. ఒకవేళ ఎప్పుడైనా తిన్నా, అదనంగా వర్కవుట్ చేసేస్తా. మీలాంటి అందమైన అమ్మాయిలకు సహజంగానే బోల్డన్ని ప్రేమలేఖలు వస్తాయి కదా! మరి మీకు? వచ్చాయండి. వాటిని చదువుతా కానీ, జవాబివ్వను. అంటే... మీ జీవితంలో ఇంకా ఎవరూ లేరన్నమాట? లేరు. ప్రస్తుతం సినిమాలే నా జీవితం. - డి.జి. భవాని -
'ఉలవచారు బిర్యాని' ట్రైలర్
-
వెండితెర సమ్మోహన రూపానికి వజ్రోత్సవం
వెండితెరపై కొన్ని పాత్రలకు కొంతమంది నటీనటులదే పేటెంట్. ఎన్నాళ్ళయినా, ఎన్నేళ్ళయినా ఆ పాత్రల పేర్లు చెప్పగానే వారే గుర్తుకొస్తుంటారు. తెలుగు సినిమా ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి చేర్చిన అలాంటి పాత్రలంటే పౌరాణికాలే. ఇక, పాత్రధారి అంటే... పురాణ పాత్రలకు ప్రాణం పోసిన స్వర్గీయ నందమూరి తారక రామారావే స్ఫురిస్తారు. శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, శ్రీమహావిష్ణువు, పరమ శివుడు మొదలు ప్రతినాయకులైన రావణుడు, దుర్యోధనుడు దాకా ఏ పాత్ర పేరు చెప్పినా ఇవాళ్టికీ ఆయనే మదిలో మెదులుతారు. ముగ్ధమోహనరూపంతో, పాత్రోచితమైన ఆహార్యం, వాచికాలతో ఆనాడు వాళ్ళు అచ్చం ఇలాగే ఉన్నారేమో అని అందరూ అనుకొనేలా చేయడం ఆ మహానటుడు చేసిన అసాధారణ విన్యాసం. ఒక తెలుగు నటుడు వింధ్యకు ఇటు వైపునే కాక, అటు వైపునూ తన పాత్రలతో మెప్పించి, అంతర్జాతీయ సినీ చరిత్రకారులను సైతం అబ్బురపరచడం మనకు గర్వకారణమే. బెంగాలీయుల్ని కూడా కదిలించిన ఎన్టీఆర్ పౌరాణిక, జానపద చిత్రాలు, ఎన్టీఆర్‌తో సినిమా చేయాలనుకున్న శాంతారామ్ లాంటి దర్శకులే అందుకు నిదర్శనం. పౌరాణికాలు, చారిత్రకాలు, జానపదాలు, సాంఘికాలు - ఇలా అన్ని తరహా చిత్రాల్లో మెప్పించినా, ముఖ్యంగా శ్రీకృష్ణుడంటే ఇప్పటికీ ఎన్టీఆరే. 1953లో షూటింగ్ మొదలైన ‘ఇద్దరు పెళ్ళాలు’లో మూడుపదుల వయసులో ఓ స్వప్నగీతంలో తెరపై కృష్ణుడిగా తొలిసారిగా కనిపించారాయన. అప్పటి నుంచి యాభై ఆరేళ్ళ వయసులో ‘శ్రీతిరుపతి వెంకటేశ్వర కల్యాణం’ (’79) దాకా ఇరవై ఏడేళ్ళ వ్యవధిలో ఒకే పాత్రను సుమారు 30 చిత్రాల్లో పోషించడం, జనాన్ని మెప్పించడం ఓ చరిత్ర. ప్రపంచ సినీ చరిత్రలో అలా ఒకే పాత్రను అన్నేళ్ళ పాటు చేసిన నటుడు ఇంకొకరు లేరు. ఇక, తెరపై ఓ నిర్దిష్టమైన వయసులోనే కనిపించే కృష్ణ పాత్రను వయసులో వచ్చిన మార్పులకు అతీతంగా మెప్పించడమూ ఆయనకే చెల్లింది. తెలుగునాట ఈ నటరత్నం జన్మించి, ఇవాళ్టితో 91 ఏళ్ళు నిండుతున్నాయి. ఇక, ఆయన తొలిసారిగా తెరపై శ్రీకృష్ణ పాత్రలో కనిపించి, ఈ ఏటితో 60 వసంతాలు పూర్తవుతున్నాయి. ఈ వజ్రోత్సవ పాత్రతో తెరపై ఆయన ఎప్పటికీ చిరంజీవే. -
తెలుగు తెరపై సన్నీ లియోన్!
-
డబ్బింగ్ ఢమాల్!
-
విలక్షణం + వివాదం = ప్రకాష్ రాజ్
-
ము.. ముద్దంటే చేదే..!
-
సినిమా.. పందెపు గుర్రమా?
ఆరు దశాబ్దాలకుపైగా సినీ పత్రికా రచనలో ఉన్న ఎనిమిది పదుల అనుభవ జ్ఞుడు నందగోపాల్. సినిమా ఆవిర్భావం నుంచి ఇప్పటిదాకా పరిణామాలనూ, సినీ సాంకేతిక శాఖల్లో వచ్చిన మార్పులనూ, ప్రత్యేకించి తెలుగు సినీ అనుభవాలనూ ఈ నిత్య విద్యార్థి పుస్తకరూపంలో తెచ్చారు. తాజా జాతీయ అవార్డుల్లో ‘ఉత్తమ గ్రంథం’గా ఎంపికైన ఈ రచన నుంచి కొన్ని ముచ్చట్లు... పరిశ్రమలోని నటీనటులు, సాంకేతిక సిబ్బందికి గొడుగు లాంటి స్డూడియో వ్యవస్థ ఏనాడో కూలిపోయింది. ‘స్టార్’ చుట్టూ కథలు తిరిగాయి. బేరసారాలు జరిగాయి. అప్పటివరకూ నిర్మాత, పంపిణీదారు, ప్రదర్శకుడు - చిత్రనిర్మాణంలో లాభనష్టాలలో పాలుపంచుకునేవారు. డిస్ట్రిబ్యూటర్ స్థానే బయ్యర్లు రంగ ప్రవేశం చేశారు. ఇది తమిళనాడులో ప్రారంభమై మనకు వ్యాపించింది. ‘సినిమా అనేది ఈనాడు (క్షమించండి) వ్యాపారమూ కళా రెండూ కాకుండా పోయింది. సినిమా తీయటం అనేది ‘గుర్రపు పందెం లాంటిది’ అనే భావం జనంలో సర్వత్రా వ్యాపించింది. ఈ దొమ్మీలో, ఈ పందెంలో ఎందరి జేబులో పోతున్నాయి. ఏదో ఒక్క జేబు మాత్రమే నిండుతున్నది’ అన్నారు దుక్కిపాటి మధుసూదనరావు. హాలీవుడ్లో నిర్మాతకు 8 శాతం వడ్డీకే రుణం లభిస్తోంది. అదే ఇక్కడ 18 శాతం. డబ్బు విషయం వస్తే నవతా కృష్ణంరాజు మాట గుర్తుకు వస్తుంది. 1977లో ఓ మాట అన్నారు - ‘‘మా రోజుల్లో మంచి కథ ఎవరు రాస్తారు? ఎక్కడ దొరుకుతుందని వెతికేవాళ్ళం. నేడు కొత్తగా రంగంలోకి దిగుతున్న వారిలో అధిక భాగం ఫైనాన్సియర్ అడ్రసు అడుగుతున్నారు’’ అని! నిర్మాత నవతా కృష్ణంరాజు గదిలో ఆయనకు ఎదురుగా సత్యజిత్ రే, సుందరయ్య చిత్రపటాలుండేవి. అవి ఆయన జీవిత దృక్పథానికి దర్పణాలు. ‘భువన సుందరి కథ’ (1967) షూటింగ్లో ఓ రోజున నిర్మాత తోట సుబ్బారావు, దర్శకుడు సి. పుల్లయ్యతో ‘గురువుగారూ! అందరూ స్పీడ్‌గా తీస్తున్నారు. మనం కూడా స్పీడ్ పెంచుదాం సార్’ అన్నారు. దానికి సి. పుల్లయ్య ‘‘నీ ‘పరమానందయ్య శిష్యుల కథ’ నేనే తీశాను. అది 100 రోజులు ఆడింది. అది ఏ స్పీడ్‌లో తీశామో, అదే స్పీడ్‌లో ఇదీ తీస్తున్నాం. సినిమాకూ, కెమెరాకూ ఓ స్పీడ్ ఉంది. సెకనుకు 24 ఫ్రేములు, ఇక్కడ నేను స్పీడ్ పెంచినా అక్కడ థియేటర్లో ప్రొజెక్టరులో ఫిలిం స్పీడ్‌గా తిరగదు. అదీ సెకనుకు 24 ఫ్రేములే తిరుగుతుంది. సినిమా అంటే పందెపు గుర్రం కాదు. స్పీడ్ కావాలంటే నన్ను మార్చుకో’’ అంటూ పైపంచ భుజాన వేసుకున్నారు. ముప్ఫై ఏళ్ల సినీ జీవితంలో బియన్ తీసింది 11 చిత్రాలే. వాటిలో ఓ మణిపూస ‘బంగారుపాప’ (1954). కరకు కసాయిగా మారిన వ్యక్తిలో ఓ అనాథ పాప మానవతను మేల్కొల్పటం ఇతివృత్తం. చిత్రం ఆర్థికంగా నిరాశ పరచింది. కానీ ‘ఉత్తమ ప్రాంతీయ చిత్రం’గా రజత పతకం అందుకుంది. దేవకీ బోస్, బియన్ ఇద్దరూ ఆత్మీయ మిత్రులు. బియన్ వద్దన్నా వినకుండా దేవకీ బోస్ ‘బంగారు పాప’ను బెంగాలీలో ‘సోనార్ కాఠీ’ పేరుతో తీశారు. అక్కడా చిత్రం ఫ్లాపే. ‘దేవకీబోస్ నుండి రీమేక్ హక్కుల కింద ఒక్క రూపాయి తీసుకున్నా. కానీ నా దురదృష్టం బెంగాల్ దాకా ప్రయాణిస్తుందనుకోలేదు’ అన్నారు బి.యన్ నాతో! తెలుగు సినిమా పత్రికా రంగానికీ ఓ స్వర్ణయుగం ఉంది. ఈ యుగాన్ని ప్రభావితం చేసిన ప్రతిభామూర్తులు కమలాకర కామేశ్వరరావు, కొడవటిగంటి, ముళ్లపూడి వెంకటరమణ, నండూరి రామమోహనరావు. సినిమా సమీక్షకు ఓ నమునా ఏర్పరచారు. కొన్ని ప్రమాణాలు నెలకొల్పారు. 1953 నుండి బొమ్మకంటి ‘ఆంధ్రప్రభ వారపత్రిక’లో పనిచేస్తూ ఉండేవారు. సినిమా విలేకరిగా, విమర్శకునిగా. 1954 లో విజయా వారి ‘చంద్రహారం’ విడుదలైంది. అపుడు ‘ఆంధ్రప్రభ’ ప్రకటనల విభాగం (అడ్వర్టయిజింగ్ సెక్షన్) అధిపతి, బొమ్మకంటితో ‘చంద్రహారం సమీక్షలో చూసీ, చూడనట్లు పొండి. ఘాటు తగ్గించండి, విజయా నుండి బోలెడు ప్రకటనలు రానున్నాయి. దానిని దృష్టిలో పెట్టుకుని రివ్యూ రాయండి’ అన్నాడు. సమీక్షకు బదులు తన ఉద్యోగానికి రాజీనామా పత్రం పంపారు యాజమాన్యానికి - ఆదర్శ కలం జీవి బొమ్మకంటి సుబ్బారావు. సినిమాలో రావలసిన మార్పుకు వైతాళికుడు ఫిల్మ్ క్రిటిక్. -
నేషనల్ అవార్డుల్లోనూ బంగారు తల్లే !
-
సమాజానికి అద్దం... ఈ ‘బంగారు తల్లి’
చిత్ర నిర్మాణ సంఖ్య రీత్యా దేశంలో ద్వితీయ స్థానంలో ఉన్నా, జాతీయ అవార్డుల రీత్యా ఆఖరు స్థానానికే పరిమితమవుతున్న తెలుగు సినిమా బుధవారం నాడు జాతీయ స్థాయిలో తలెత్తుకు నిలబడింది. 2013వ సంవత్సరానికి గాను బుధవారం సాయంత్రం ప్రకటించిన 61వ జాతీయ అవార్డుల్లో రాజేశ్ టచ్‌రివర్ దర్శకత్వంలో రూపొందిన ‘నా బంగారు తల్లి’ మూడు అవార్డులు గెలుచుకుంది. తెలుగులో ఉత్తమ ప్రాంతీయ భాషా చిత్రంగా నిలవడమే కాక, ఉత్తమ నేపథ్య సంగీతానికి (శాంతనూ మొయిత్రా) అవార్డు దక్కించుకుంది. సినిమాలో కీలక పాత్ర పోషించిన అంజలీ పాటిల్‌కు స్పెషల్ జ్యూరీ అవార్డు లభించింది. ‘‘జాలి, దయ లేని సెక్స్ వ్యాపార ప్రపంచం ఎంతగా వేళ్ళూనుకొందో తెరపై అధిక్షేపిస్తూ చూపించిన’’ సినిమాగా ‘నా బంగారు తల్లి’ని జ్యూరీ ప్రశంసించింది. ఆలోచింపజేసే కథ... అంతర్జాతీయ ప్రశంసలు... సెక్స్ అవసరాల నిమిత్తం ఆడపిల్లల అక్రమ రవాణా, అమ్మకమనే అంశం చుట్టూ ఈ చిత్ర కథ నడుస్తుంది. ‘‘నిత్యం మహిళలపై అఘాయిత్యాలు, అత్యాచారాల గురించి పత్రికల్లో చదువుతున్నాం. సమాజాన్ని పీడిస్తున్న ఈ అంశం ఆధారంగా తీసిన సినిమా ఇది. దేశంలోని ఓ మధ్యతరగతి కుటుంబంలో జరిగిన కథగా చిత్రీకరించిన ఈ సినిమా అన్ని ప్రాంతాల వారి మనసులనూ కదిలిస్తుంది’’ అని రాజేశ్ అభిప్రాయపడ్డారు. సామాన్య ప్రేక్షకులకు ‘నా బంగారు తల్లి’ గురించి పెద్దగా తెలియకపోయినా, నిజానికి ఈ చిత్రం ఇప్పటికే పలు అంతర్జాతీయ వేదికలపై ప్రత్యేక గుర్తింపు సంపాదించింది. ఇండొనేసియాలో అవార్డ్ ఆఫ్ ఎక్సలెన్సీ, బెస్ట్ సినిమా ఆఫ్ ఫెస్టివల్, అమెరికాలోని డెట్రాయిట్లో జరిగిన ట్రినిటీ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్-2013లో ఉత్తమ చలనచిత్రం సహా పలు అంతర్జాతీయ అవార్డులు సంపాదించుకుంది. ఇప్పుడు ఉత్తమ తెలుగు చిత్రంగా జాతీయ స్థాయి గౌరవం సాధించుకుంది. ‘‘ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాకు పేరు వచ్చినా, ఇక్కడ సరైన గుర్తింపు రాలేదని వెలితిగా ఉండేది. కానీ, ఈ జాతీయ అవార్డులతో ఆ వెలితి తీరిపోయింది’’ అని దర్శకుడు రాజేశ్ టచ్‌రివర్ తన ఆనందం పంచుకున్నారు. ‘బీజింగ్ ఫిల్మ్ ఫెస్టివల్’లో పాల్గొనేందుకు వెళ్ళి, ప్రస్తుతం అక్కడే ఉన్న ఆయన ఇ-మెయిల్ ద్వారా తన స్పందనను తెలిపారు. వాస్తవిక జీవితం నుంచి వెండి తెరకు... మనుషుల అక్రమ రవాణాకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న స్వచ్ఛంద సేవకురాలు సునీతా కృష్ణన్ ఈ చిత్రానికి సహ నిర్మాతగా వ్యవహరించడమే కాక, ‘కాన్సెప్ట్ ఎడ్వైజర్’గా దర్శకుడికి అండగా నిలిచారు. ఆమె స్వయంగా చూసిన నిజజీవిత అనుభవాలు కూడా ఈ చిత్ర రూపకల్పనకు తోడ్పడ్డాయి. ఇక, జ్యూరీ నుంచి ప్రత్యేక ప్రశంస అందుకున్న ఈ చిత్ర నటి అంజలీ పాటిల్ నిజజీవితంలో ఆడపిల్లల అక్రమ వ్యాపారమనే చేదు అనుభవాన్ని చవిచూసినవారే. ‘‘ధైర్యంగా ముందుకు వచ్చి నిజజీవిత కథను ప్రపంచానికి చెప్పినందుకు’’ గాను ఆమె తెగువను జ్యూరీ ప్రశంసించింది. ఇక, దర్శకుడు రాజేశ్ టచ్‌రివర్ శ్రీలంకలోని అంతర్యుద్ధంపై గతంలో ఆయన ‘ఇన్ ది నేమ్ ఆఫ్ బుద్ధ’ సినిమా తీసి, అనేక అవార్డులు గెలుచుకొన్నారు. ‘‘ఎయిడ్స్, ప్రపంచ శాంతి, అక్రమ రవాణా లాంటి అనేక సమస్యలను ఎత్తిచూపేందుకు దృశ్య మాధ్యమాన్ని వినియోగించుకోవాలని నా భావన’’ అని రాజేశ్ అన్నారు. అందుకు తగ్గట్లే ‘ప్రయోజనాత్మక చిత్ర’ నిర్మాణమే ధ్యేయంగా ఎన్నో ఏళ్ళుగా సినిమాలను నిర్మిస్తున్నారాయన. హైదరాబాద్‌లో స్థిరపడిన ఈ మలయాళీ ఇలా మన తెలుగు సినిమాకు గౌరవం తేవడం విశేషం. -
చాలా హాట్ గురూ
-
సినిమా పచ్చడి
-
ఐటమ్... ప్లీజ్
-
రొమాంటిక్ స్వరాలు..!
ఇళయరాజాకు ట్రెండ్‌తో పనిలేదు. నవతరంతో పోటీ పడుతూ... ఇప్పటికీ మ్యూజికల్ హిట్స్ ఇస్తూనే ఉన్నారాయన. గత ఏడాది ‘గుండెల్లో గోదారి’తో సంగీతాభిమానుల హృదయాల్లో ఆనందాన్ని నింపిన మేస్ట్రో... మళ్లీ ఓ తెలుగు సినిమాకు తన స్వరాలతో సొగబులద్దుతున్నారు. ఆ సినిమానే.. ‘వస్తా నీ వెనుక’. రమేశ్‌వర్మ దర్శకత్వంలో హవీష్, అమలాపాల్, ఇష జంటగా దాసరి కిరణ్‌కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన పాటల రికార్డింగ్ ఇటీవలే పూర్తయింది. దాసరి కిరణ్‌కుమార్ మాట్లాడుతూ -‘‘ప్రేమ, వినోదం సమపాళ్లలో రంగరించిన రొమాంటిక్ ఎంటర్టైనర్ ఇది. దానికి తగ్గట్టే అద్భుతమైన ఆరు పాటలను ఇళయరాజా అందించారు. ఆయన సంగీతం ఈ చిత్రానికి హైలైట్‌గా నిలుస్తుంది. ఏప్రిల్ 4 నుంచి 55 రోజుల పాటు యూరప్‌లో భారీ షెడ్యూల్ చేయనున్నాం. టాకీ పార్ట్‌తో పాటు పాటలను కూడా అక్కడే చిత్రీకరిస్తాం’’ అని తెలిపారు. హవీష్, అమలాపాల్, ఇష పాత్రలు యువతరాన్ని ఆకట్టుకునేలా ఉంటాయని, శ్రోతల్ని అలరించేలా ఇళయరాజా స్వరాలుంటాయని రమేష్‌వర్మ చెప్పారు. ఈ చిత్రానికి రచన: విస్సు, కెమెరా: విజయ్ కె.చక్రవర్తి, కూర్పు: మార్తాండ్ కె.వెంకటేశ్, స్క్రిప్ట్ కో ఆర్డినేటర్: పాత్రికేయ. -
'పవర్' చూపిస్తానంటున్న రవితేజ
-
ప్రొడ్యుసర్గానైనా హిట్ కొడతాడా ?
-
హోలి హేళీ