
కె. విశ్వనాథ్
‘‘ప్రతి దేవాలయంలో అర్చక స్వాములుంటారు. వాళ్లలో ఒకరికే భగవంతుడికి ప్రసాదం వండి వడ్డించే అవకాశం కలుగుతుంది. అలా చూసుకుంటే.. దేవాలయం లాంటి సినిమా కళలో నేను చేసే వంటను ముందుగా ప్రేక్షకులకు అందించే అదృష్టం నాకు కలిగింది’’ అన్నారు కళాతపస్వి కె.విశ్వనాథ్. సువర్ణభూమి డెవలపర్స్ ఆధ్వర్యంలో కె. విశ్వనాథ్ పుట్టినరోజు వేడుకలు సోమవారం జరిగాయి. విశ్వనాథ్ మాట్లాడుతూ– ‘‘సంగీతం, సాహిత్యం మీద అభిమానంతో కాకుండా సినీ పరిశ్రమను ఓ దేవాలయంలా భావించి పనిచేశాను.
నా నిర్మాతలు, సాంకేతిక నిపుణులు ఎంతో సహకరించారు. వాళ్ల సహకారం వల్లే నేను ఈ స్థాయిలో ఉన్నా’’ అన్నారు. ‘మా’ అధ్యక్షుడు శివాజీరాజా మాట్లాడుతూ– ‘‘విశ్వనాథ్‌గారికి సన్మానాలు కొత్తకాదు. కానీ రక్తదానం వంటి సేవా కార్యక్రమాలు చేస్తే ఆయన ఎంతో సంతోషపడతారు. అందుకు తగ్గట్టుగానే ఈరోజు బ్లడ్ డొనేషన్ క్యాంప్ జరగడం ఆనందం. టాప్ 1 నుంచి 10 వరకూ విశ్వనాథ్‌గారి సినిమాలే ఉంటాయి’’ అన్నారు. ‘సువర్ణభూమి’ ఎండీ శ్రీధర్ బొలినేని, మార్కెట్ హెడ్ సిమ్‌సన్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ దీప్తీ బొలినేని, ‘మా’ వైస్ ప్రెసిడెంట్ బెనర్జీ, జాయింట్ సెక్రటరీ ఏడిద శ్రీరామ్, కల్చరల్ కమిటీ చైర్మన్ సురేష్ కొండేటి, కార్యవర్గ సభ్యులు ఉత్తేజ్, జయలక్ష్మి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment