k.viswanath
-
కె.విశ్వనాథ్‌కు అది చాలా సెంటిమెంట్.. కానీ ఆ సినిమాతో!
దిగ్గజ దర్శకులు, నటుడు కె.విశ్వనాథ్ మరణం తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని లోటు. సినీ ప్రేక్షకుల కోసం ఎన్నో అద్భుత కళాఖండాలు అందించిన ఆయన శంకరాభరణం రిలీజైన రోజే శివైక్యమయ్యారు. తన సినిమాలతో వినోదాన్ని పంచడమే కాకుండా అంతర్లీనంగా సందేశాలు కూడా ఇచ్చేవారు. ఆయన తీసిన అద్భుత చిత్రాల్లో స్వర్ణకమలం కూడా ఒకటి. ఈ సినిమా గురించి గతంలో కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నారు విశ్వనాథం. ఓసారి ఆ విశేషాలేంటో గుర్తు చేసుకుందాం.. 'శాస్త్రీయ కళలను నమ్ముకుంటే ఒరిగేదేమీ లేదన్న గట్టి అభిప్రాయంతో ఉన్న పాత్ర మీనాక్షి. దానికితోడు హడావుడి,నిర్లక్ష్యం, అవసరానికి చిన్నాపెద్ద అబద్ధాలాడే క్యారెక్టర్ ఆమెది. సినిమా చూసి ఇంటికొచ్చి హాస్పిటల్.. ఫ్రెండ్ పురుడు అని కట్టుకథలల్లి ‘వాళ్లంతిదిగా అడుగుతుంటే ఎలా నాన్నా కాదనేది?’ అని దీర్ఘాలు తీసుకుంటూ మాట్లాడే స్వీట్లయర్ ఆమె. ఇదిలా ఉండగా ఆమె స్వాతంత్య్రానికి అడుగడుగునా పార్క్ నుంచి మొదలై గజ్జెలు తీసేదాకా వచ్చి, చివరికి హోటల్లో ఇష్టమైన ఉద్యోగం పోయేదాకా ఆమెను విసిగించే క్యారెక్టర్ వెంకటేష్‌ది. ఒకటేమిటి... మిడిల్ క్లాస్ఫ్యామిలీస్లో మనం నిత్యం చూసే స్టేషన్‌మాస్టర్, టీచర్... అలా అందరి క్యారెక్టర్లు వేటికవే నిలిచిపోయాయి. ‘స్వయంకృషి’లో విజయశాంతి ‘అట్టసూడమాకయ్యా’ అన్నట్టు ఈ సినిమాలో కూడా ఏదయినా మెలిక పెడితే బాగుంటుందని అనిపించి అర్థం చేసుకోరూ.. అని డైలాగ్ పెట్టాం'. ‘హారతుల’ ట్రాక్ గురించి మాట్లాడుతూ... దాని జన్మ చాలా గమ్మత్తుగా జరిగింది.ఆ ట్రాక్ ముందే అనుకున్నాం, రాశాం, డిస్కస్చేశాం. అయితే నాకెందుకో అది తృప్తిగా అనిపించలేదు. ఓరోజు మధ్యాహ్నం రెండింటి నుంచి షూటింగ్ అనగా, పదకొండు గంటలకు భగవంతుడు చిన్న ఫ్లాష్ ఇచ్చాడు. వెంటనే అసిస్టెంట్ డైరెక్టర్ని పిలిచి ‘పక్కింటి డాబాలో వాళ్ళని వెళ్ళి అడుగు... మొత్తం గోడలకంతాదేవుళ్ళ పటాలు పెడతాం, పొగ పెట్టినట్టు చేస్తాం, షూటింగ్ అయ్యాక మళ్ళీ బాగుచేసి ఇస్తాం... వాళ్ళకి ఓకేనా’ అని చెప్పాను. వాళ్ళు ఓకే అనగానే వెంటనే సిటీకి పంపించి పటాలు తెప్పించి, సీన్లు, డైలాగ్‌లు అప్పటికప్పుడు మార్చి షూట్చేశాం. అతిభక్తితో అస్తమానం హారతులు ఇచ్చే శ్రీలక్ష్మి క్యారెక్టర్ – కుంపటి కమ్ము వంకాయలా కందిపోయిన సాక్షి రంగారావు క్యారెక్టర్.. అలా పుట్టాయి. తన సెంటిమెంట్ గురించి చెప్తూ.. దాదాపు ప్రతి సినిమాలో శివుడి మీద ఏదో ఒకపాట ఉంటుంది. ఈ సినిమాలో కూడా రెండున్నాయి. అది భగవదేచ్ఛ. నేను కావాలని ప్రయత్నించను. ‘ఉండమ్మా బొట్టుపెడతా’ సినిమాలో మొట్టమొదటి పాటను ‘శ్రీ’తో మొదలుపెట్టమని దేవులపల్లి కృష్ణశాస్త్రి గారిని అడిగాను. (సాధారణంగా ఏ కవిత్వమైనా, కావ్యమైనా శ్రీకారంతో మొదలవుతుందని) దానికాయన ‘శ్రీశైలం మల్లన్న, శిరసొంచెనా, చేనంతా గంగమ్మ వాన’ అని రాశారు. నేను ఆయన్ని ‘శ్రీ’తో రాయమని అడిగానే తప్ప శివుడు మీద రాయమని అడగలేదు! ఇంకా చెప్పాలంటే నాకు‘ఎస్’ సెంటిమెంట్ ఉంది. సినిమా వాళ్ళం పిరికివాళ్ళమండీ! కోట్ల రూపాయలతో వ్యాపారం చేస్తాం కదా...భయాలు, సెంటిమెంట్లు ఎక్కువ! ‘ఎస్’తో పెట్టిన 2–3 సినిమాలు వరుసగా హిట్ కావడంతో అలా పెట్టుకుంటూ వచ్చాను. కానీ ఆపద్బాంధవుడుకు మాత్రం అది కుదరలేదు. క్యారెక్టర్‌కి తగ్గట్టుగా ‘ఆపద్బాంధవుడు’ బాగుంటుందన్నాను. అందరూ సరేనన్నారు. మరి ఎందుకని ఆ రోజు ఆ ‘ఎస్’ సెంటిమెంట్ మైండ్ నుంచి స్లిప్ అయిందో నాకిప్పటికీ అర్థం కావట్లేదు అని తన జ్ఞాపకాలను పంచుకున్నారు విశ్వనాథం. చదవండి: వాణీ జయరాం ముఖంపై తీవ్రగాయాలు, అసలేం జరిగింది -
సినిమా అనే ఓ బస్సు పట్టుకుని.. కళాతపస్వి మాటలు వైరల్
కళాతపస్వి కాశీనాథుని విశ్వనాథ్ కన్నుమూతతో యావత్ సినీ రంగం విషాదంలో కూరుకుపోయింది. 92 ఏళ్ల వయసులో వృద్ధాప్య రిత్యా సమస్యలతో చికిత్స పొందుతూ కన్నుమూశారాయన. తొలినాళ్లలో కుటుంబ కథా చిత్రాలతో అలరించిన ఆయన.. ఆ తర్వాతి కాలంలో కళలను మేళవించి తీసిన ప్రేక్షకలోకాన్ని రంజింప చేశాయి. సినీ ప్రముఖులే కాదు.. ఆయన సినిమాలు చూస్తూ పెరిగిన తరం సైతం సోషల్ మీడియాలో ఆయనకు నివాళులు అర్పిస్తోంది. ‘‘సినిమా అనే ఓ బస్సు పట్టుకుని.. సినిమా చూసే ప్రేక్షకులను భక్తులు అనుకుని.. నేను ఒక బస్సు నడిపే డ్రైవర్ని. నేనేం చేయాలి నేను?’’. ఏం చేయగలరు.. ఆణిముత్యాల్లాంటి చిత్రాలను అందించడం తప్ప! అందుకే ఆ దర్శక దిగ్గజానికి నివాళిగా ఓ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. అంతేకాదు.. దర్శకుడిగా సెట్స్‌లో ప్రత్యేకమైన దుస్తుల్లో కనిపించడమూ చాలామందికి తెలిసే ఉండొచ్చు. దర్శకత్వం.. ఓ బాధ్యత, ఓ విధి, ఓ ఉద్యోగం లాంటిది. అందుకే దాన్ని విధిగా ఆచరించాలనే ఉద్దేశ్యంతోనే ఆయన డైరెక్షన్లో ఉన్నప్పుడు సెట్స్‌లో మిగతా సిబ్బందిలాగే.. ఖాకీ యూనిఫాంలో కనిపించేవారట. ‘‘దర్శకుడ్ని అయిపోగానే తెల్ల ప్యాంటూ, తెల్ల చొక్కా, తెల్ల బూట్లూ, మెళ్లో గొలుసులూ వేసుకుని హడావుడి చేయడం(ఆ టైంలో దర్శకులకు సింబాలిజం అది) నాకిష్టం లేదు. దర్శకుడి కుర్చీ దక్కితే కళ్లు నెత్తికెక్కే ప్రమాదం ఉంటుంది కదా? అందుకే మామూలుగా ఉండాలనుకున్నా!’’ అని పాత ఇంటర్వ్యూలలో ఆయన చెప్పిన మాటలు ఇప్పుడు తెర మీదకు వస్తున్నాయి. Anguished to hear about passing away of legendary director #KVishwanath Garu. His contribution to Indian Cinema will remain a source of inspiration for others. RIP Sir Rest In Peace K. Vishwanath Garu 🙏 Om Shanti 🙏 pic.twitter.com/ufcx5hXkYb — देशी छोरा (@Deshi_Indian01) February 3, 2023 -
కె.విశ్వనాథ్ కన్నుమూతపై ప్రధాని మోదీ ఏమన్నారంటే..
దిగ్గజ దర్శకుడు, కళాతపస్వి కే విశ్వనాథ్ కన్నుమూతపై తెలుగు చలన చిత్ర పరిశ్రమతో పాటు ఆయనకు అనుబంధం ఉన్న ఇతర భాషల ప్రముఖులు సైతం స్పందిస్తున్నారు. ఈ క్రమంలో దేశ ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ ద్వారా సంతాపం ప్రకటించారు. కే విశ్వనాథ్‌గారు మృతి చెందడం బాధాకరం. ఆయన సినీ ప్రపంచంలో ఓ ప్రముఖుడు. తన సృజనాత్మకతతో పాటు బహుముఖ దర్శకుడిగా తనని తాను ప్రత్యేకం చేసుకున్న వ్యక్తి. వివిధ శైలిలో తెరకెక్కిన ఆయన సినిమాలు దశాబ్దాలుగా ప్రేక్షకులను అలరించాయి. ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి. ఓం శాంతి అంటూ ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. Saddened by the passing away of Shri K. Viswanath Garu. He was a stalwart of the cinema world, distinguishing himself as a creative and multifaceted director. His films covered various genres and enthralled audiences for decades. Condolences to his family and admirers. Om Shanti. — Narendra Modi (@narendramodi) February 3, 2023 విశ్వనాథ్ తన చిత్రాలతో అంతర్జాతీయ గుర్తింపు సైతం పొందారు. కమర్షియల్ సినిమాకు.. ఆర్ట్‌ను జోడించడం, తన చిత్రాల్లో సంగీతానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడం ఆయన శైలి. కులవర్ణ లింగ వివక్ష, స్త్రీ ద్వేషం, మద్య వ్యసనం.. ఇలా సామాజిక-ఆర్థిక మేళవింపుగా ఉండేవి ఆయన చిత్రాలు. తెలుగులోనే కాకుండా హిందీ చలన చిత్ర పరిశ్రమలో ఆయన తొమ్మిది చిత్రాలు తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఇక నటుడిగానూ తెలుగుతో పాటు తమిళ, కన్నడ చిత్రాల్లో అలరించారాయన. నటుడిగా ఆయన చివరి చిత్రం(కన్నడ) ఒప్పంద(2022). -
కె.విశ్వనాథ్ చివరి క్షణాల్లో జరిగిందిదే..
తెలుగు సినీ పరిశ్రమకు ఎన్నో ఆణిముత్యాలను అందించిన దర్శక దిగ్గజం, రచయిత, నటుడు, కళా తపస్వి కె.విశ్వనాథ్ శంకరాభరణం రిలీజ్ రోజే శివైక్యం కావడం అందరినీ కలిచివేస్తోంది. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన తన చివరి క్షణాల వరకూ కళామతల్లి సేవలోనే గడిపారు. మరణానికి ముందు ఓ పాట రాయడానికి పూనుకున్నారు. సాంగ్ రాస్తూ.. కాసేపటికి దాన్ని రాయలేక కుమారుడి చేతికందించి పాట పూర్తి చేయమన్నారు. ఆయన పాట రాస్తుండగానే విశ్వనాథ్ కుప్పకూలిపోయారు. వెంటనే కుటుంబ సభ్యులు ఆయనను అపోలో ఆస్పత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. కాగా కె.విశ్వనాథ్.. సాగరసంగమం, స్వాతిముత్యం, సిరిసిరిమువ్వ, శుభసంకల్పం, సిరివెన్నెల, ఆపద్బాంధవుడు, శంకరాభరణం వంటి ఎన్నో అద్భుత దృశ్యకావ్యాలను చిత్రపరిశ్రమకు అందించారు. ఎందరో అగ్రహీరోలకు దర్శకత్వం వహించిన ఆయన ఎన్నో అవార్డులను అందుకున్నారు. సినీరంగంలో ఆయన చేసిన కృషికి గానూ 1992లో పద్మశ్రీ, 2016లో దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు పొందారు. చదవండి: కళా తపస్సు ముగిసింది.. కె. విశ్వనాథ్ ఇక లేరు -
లెజెండరీ దర్శకుడి బర్త్‌డే: అభిమానుల సర్ప్రైజ్
టాలీవుడ్‌కు అమూల్యమైన చిత్ర కళాఖండాలను అందించిన దర్శకుడు కళా తపస్వి కె.విశ్వనాథ్. కమర్షియల్ చిత్రాలే కాకుండా తెలుగు సాహిత్య సంపదను ద్విగుణీకృతం చేసే 'శంకరాభరణం' వంటి సినిమాలను కూడా రూపొందించారాయన. ఫిబ్రవరి 19న విశ్వనాథ్ పుట్టిన రోజు. దీన్ని పురస్కరించుకుని అభిమానులు ఆయనకు సర్ప్రైజ్ ప్లాన్ చేశారు. ఆయన డైరెక్ట్ చేసిన సినిమాల జాబితాను తయారు చేసి, దాన్ని బర్త్‌డే కేక్ లోపల ఉంచారు. దాన్ని నేరుగా ఆయన ముందుకు తీసుకెళ్లి పెళ్లారు. తర్వాత విశ్వనాథ్ చేతితోనే కేకు మధ్యలో నుంచి ఆ సినిమా జాబితాను పైకి లాగేలా చేశారు. తన సినిమాలను మరోసారి కళ్లారా చూసుకున్న ఆయన సంతోషం వ్యక్తం చేశారు. నా కోసం ఇంత కష్టపడ్డారా? అంటూ వారిపై ఆప్యాయతను కనబర్చారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా విశ్వనాథ్ సర్గం, శుభ్ కామ్నా, సంగీత్, సనోజ్, ధన్వాన్ వంటి పలు బాలీవుడ్ సినిమాలకు సైతం దర్శకత్వం వహించారు. దర్శకుడిగానే కాకుండా 1995లో శుభ సంకల్పం సినిమాతో తొలిసారిగా నటుడిగా కనిపించారు. ఆ తర్వాత పలు తెలుగు, తమిళ చిత్రాల్లో నటించారు. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1651344978.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); చదవండి: ‘శంకరాభరణం’కు వచ్చిన జాతీయ అవార్డులు ఎన్ని? విశ్వనాథ గారు గుర్తుండిపోయే సినిమాలు ఇచ్చారు: రాధిక -
కళావెన్నెల
విశ్వాన్ని గెలవాలంటే కళాతపస్వి కావాలి. కళను గెలవాలంటే సాహితీవెన్నెల కావాలి. సరస్వతీ పుత్రులు పద్మాలలో కూర్చుంటేనే కదా.. ఆ పద్మాలు కిరీటాలు అవుతాయి. పాటలు పామరులకు అందాయి. కథలు ప్రేక్షకులకు అందాయి. పద్మాలు ‘కళావెన్నెల’కు అందాయి. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ‘సిరివెన్నెల’ సీతారామ శాస్త్రికి ‘పద్మశ్రీ’ ప్రకటించిన నేపథ్యంలో కళాతపస్వి కె. విశ్వనాథ్ తన స్వగృహంలో సిరివెన్నెలను సత్కరించారు. ఇద్దరూ కలసి ఇంటర్వ్యూ ఇస్తే బాగుంటుందని ‘సాక్షి’ అడిగితే గురుశిష్యులిద్దరూ బోలెడన్ని విశేషాలు పంచుకున్నారు. సాక్షి: ఒకరు దర్శక దిగ్గజం.. ఒకరు గొప్ప ‘కలం’కారుడు. ‘సిరివెన్నెల’తో ప్రారంభమైన మీ ఇరువురి ఈ ప్రయాణంలో ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలని ఉంది. ముందుగా ‘పద్మశ్రీ’ గురించి మీ అనుభూతి.. విశ్వనాథ్: నాకు పద్మశ్రీ అవార్డు వచ్చినప్పుడు అనుకుంటా.. ఆదుర్తి సుబ్బారావు (దర్శక–నిర్మాత)గారు మా ఇంటికి వచ్చి ‘విశ్వానికి దిష్టి తగలకుండా ఆరు నందులు ఉన్నాయి. ఆ నందులే పోట్లాడతాయిలే’ అన్నారు. సిరివెన్నెల: ఆ సమయంలో ప్రతీ ఏడాది బెస్ట్ పిక్చర్, బంగారు నంది.. అన్నీ నాన్నగారి (విశ్వనాథ్)కి వచ్చాయి. ఇప్పుడు నాకు పద్మశ్రీ వచ్చిందనగానే ముందు గురువు (విశ్వనాథ్)గారిని కలవాలనిపించింది. విశ్వనాథ్: నాకు ‘పద్మశ్రీ’ (1992) అవార్డు వచ్చినప్పుడు ఆ విషయం సాయంకాలమే తెలిసింది. హోమ్ మినిస్ట్రీ నుంచి కాల్ వచ్చింది. చెబితే నమ్మవు. నిమ్మకు నీరెత్తినట్టు ఉండిపోయాను. భోజనాల వేళ దాక ఇంట్లో ఎవ్వరితోనూ పంచుకోలేదు. అప్పుడు ఎలక్ట్రానిక్ మీడియా అంతగా లేదు. సిరివెన్నెల: ఆ రోజు మా తండ్రిగారి తిథి. మధ్యాహ్నం భోజనం చేసి పడుకున్నాను. ఓ విచిత్రమైన భావన కలిగింది. అది చాలా బలమైన భావన. ఇవాళ జనవరి 25, పద్మశ్రీ అనౌన్స్ చేస్తారు. ఆ విషయాన్ని సాయి (కుమారుడు యోగేశ్వర శర్మ) నాకు వచ్చి చెబుతాడని అనిపించింది. ఇంతలో ఓ ఫోన్ వచ్చింది.. నేను లిఫ్ట్ చేయలేదు. ఆ తర్వాత మరోటి. సాయి పరిగెత్తుకొచ్చి ఫోన్ తీశాడు. వీడేంటి ఇంత కంగారు పడుతున్నాడు. పద్మశ్రీ వచ్చిందా ఏంటి? అనుకున్నాను. అది నిజమైంది. నాకా విషయాన్ని సాయి చెప్పగానే, ‘మీ నాన్నగారికి చెప్పు అని మా నాన్నగారు’ తనని పంపించారా అనిపించింది. నా జీవితంలో మొదటిసారి ఓ అవార్డుకి సంబంధించి వచ్చిన టెలిగ్రామ్ గుర్తుకు వచ్చింది. ‘ఏ నోబడీ బికేమ్ ఏ స్టేట్ గెస్ట్ వితిన్ నో టైమ్’ అని అప్పుడు నేను అనుకున్నాను. పద్మశ్రీ గురించి చెప్పి, ‘తాతకు ఏం వచ్చింది’ అని నా మనవరాలిని అడిగితే.. తన్నమానం (సన్మానం), తాతకు పద్దమశ్రీ వచ్చింది అంది (నవ్వులు). మేం తన్నమానం ఎందుకొచ్చింది? అంటే తాతకు ఇంగ్లిష్ రాదు కాబట్టి అంది. తన్నమానం అంటే ఏం చేస్తారు? అని మేం అడిగితే.. చేతికి కర్ర ఇచ్చి, టోపీ పెట్టి దుప్పటి కప్పుతారు అని చెప్పింది. భలే ముచ్చటగా అనిపించింది. రచయితలు ఆత్రేయ, ఆరుద్రగార్లకే పద్మశ్రీ రాలేదు? సిరివెన్నెల: ఎవరో అడిగితే చెప్పాను.. వాళ్ల ప్రసాదంలా ఈ పురస్కారాన్ని స్వీకరిస్తాను అని. తెలుగులో లిరిక్ అనే విషయాన్ని ఎందుకో గుర్తించలేదు. విచిత్రమేంటంటే నాన్నగారూ.. ‘మీ కంటే ముందు నారాయణ రెడ్డిగారికి వచ్చింది’ కదా అని నాతో కొందరు అన్నారు. ఆయనకు ‘పద్మభూషణ్ కూడా’ ఉంది. కానీ ఆయనకు ఆ అవార్డ్ వచ్చింది ‘లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్’ విభాగంలో. తమిళంలో వైరముత్తు, బాలీవుడ్లో జావేద్ అక్తర్లకూ అదే విభాగంలో ఇచ్చారు. లిరిక్ అనే విభాగంలో రాలేదు. గతేడాది లిరిక్ అనే విభాగంలో కర్ణాటక సినీ రచయిత దొడ్డ రంగె గౌడకి వచ్చింది. ఈ ఏడాది నాకు వచ్చింది. హాలీవుడ్ వాళ్లు సాంగ్ రైటర్, లిరిసిస్ట్ అని డివైడ్ చేశారు. సాంగ్ రైటర్ అంటే ట్యూన్‌కి మాటలు ఇచ్చేవాడు. లిరిక్ అంటే సాంగ్ విత్ పొయెటిక్ లైన్స్ అని. పొయెటిక్ కంటెంట్ నాన్నగారి సినిమాల్లోనే రావడం మనం గమనించవచ్చు. ఆయన సినిమాతో∙కాకుండా ఇంకో చోట నేను పరిచయమయ్యుంటే ఇండస్ట్రీలో నేనుండేవాడినే కాదేమో. ఇంటర్వ్యూ స్టార్ట్ అయ్యే ముందు సిరివెన్నెలగారు ‘పద్మశ్రీ’ ప్రకటించగానే మీ దగ్గరకు వద్దాం అనుకున్నాను నాన్నగారూ అంటే.. ‘ఇప్పుడైనా ఏముందిలే. ప్రతి క్షణమూ మన క్షణమే’ అన్నారు. సీతారామశాస్త్రి అనే ఈ మాణిక్యాన్ని ఏ క్షణాన గుర్తించారు? విశ్వనాథ్: ఒకసారి శాస్త్రి (సిరివెన్నెల) రావడం రావడమే చిన్న స్క్రిప్ట్‌తో వచ్చాడు. అందులో పాటలు కూడా రాశాడు. ఆ పాటల్లో మంచి భావుకత ఉంది అనిపించింది. అది అలా మనసులో గుర్తుండిపోయింది. సంవత్సరం తర్వాత నాకో కొత్త లిరిసిస్ట్ కావాల్సిన అవసరం వచ్చింది. అప్పుడు చేబోలు సీతారామశాస్త్రి అనే వ్యక్తి గుర్తొచ్చాడు. అయితే తనకు ఎలా కబురు పంపానో నాకు గుర్తులేదు. సిరివెన్నెల: ఆకెళ్ల సాయినాథ్ ద్వారా పంపారు. విశ్వనాథ్: ‘సిరివెన్నెల’ సినిమాకి పిలిపించి రాయించాం. సింగిల్ కార్డ్. ఆ రోజుల్లో అన్ని పాటలూ కొత్త రచయితతో రాయించడం అంటే పెద్ద సాహసమే. ఎందుకంటే ఒక్కో పాట ఒక్కో రచయిత రాస్తున్న సమయం అది. జానపదం అయితే కొసరాజు. మనసు పాట అయితే ఆత్రేయ, క్లబ్ పాట అయితే ఆరుద్ర. మూడు నాలుగు పేర్లు టైటిల్ కార్డ్‌లో పడటం సాధారణం. పౌరాణికాలు అయినప్పుడు సముద్రాల గారు వాళ్లు మాత్రమే సింగిల్ కార్డ్ రాసేవారు. మల్లాది రామకృష్ణ శాస్త్రిగారికి కూడా ఇంకో పేరు జతపడేది. మరేం ధైర్యమో? వంట రుచిగా ఉంటుందో, అన్ని రకాలు వండగలడో కూడా తెలియదు. మనోధైర్యంతో రాయించాను. సిరివెన్నెల: కన్విక్షన్ ఉన్నవాళ్లకు బాగా ఫీడ్ ఇస్తే.. ఎవ్వరికైనా కొత్తగా రాస్తారు. ‘నాకు అర్థం అయినా కాకపోయినా మీరు విజృంభించి రాయండి. మీకిది జైలు కాదు’ అని నాన్నగారు అన్నారు. విశ్వనాథ్: కేవీ మహదేవన్ (సంగీత దర్శకుడు) ముందు పాట రాయించుకుని, ఆ తర్వాత ట్యూన్ కట్టేవారు. ‘సిరివెన్నెల’కి ఆ విధంగానే శాస్త్రిని నానా హింసలు పెట్టి రాయించుకున్నాను. వీళ్లు (ఆకెళ్ల సాయినాథ్, సిరివెన్నెల) నాతో పాటే నందీ హిల్స్‌లో ఉండేవాళ్లు. ఇద్దరూ పగలంతా తిరిగేవారు. ఇంకేం చేసేవారో నాకు తెలియదు కానీ సాయంత్రానికి తిరిగొచ్చేవాళ్లు (నవ్వుతూ). నా షూటింగ్ పూర్తి చేసుకొని ఖాకీ డ్రెస్ తీసేసి కొంచెం రిలాక్స్ అయ్యాక కలిసేవాళ్లం. ఆ రోజు అలా కొండ చివరకు వెళ్లాం. అప్పుడు శాస్త్రి ఓ రెండు వాక్యాలు గమ్మత్తుగా ఉన్నాయి అన్నాడు. ఎవరైనా అలా అంటే వాటిని వినేదాకా నేను తట్టుకోలేను. నాకదో వీక్నెస్. ఏమొచ్చిందయ్యా అన్నాను. ‘ఆది భిక్షువుని ఏమి కోరేది. బూడిదిచ్చేవాడిని ఏమడిగేది’ అన్నాడు శాస్త్రి. అయ్య బాబోయ్.. అనిపించింది. సిరివెన్నెల: ఐదు చరణాలు రాశాను. అంతా గుర్తుంది. మరి ఈ వాక్యాలు పెట్టే సందర్భం కుదురుతుందా? అంటే ‘కథ మన చేతుల్లో ఉంటే, మనం చెప్పినట్టు నడుస్తుంది’ అన్నారు గురువుగారు. విశ్వనాథ్: మా స్నేహం ఎంతలా పెరిగిపోయిందంటే శాస్త్రీ.. నువ్వు రాసినా, రాయకపోయినా ఓసారి వచ్చి కథ విని వెళ్లు. నీతో రాయిస్తానో లేదో నాకు తెలియదని కబురు పంపేవాడిని. అంత కుటుంబ సభ్యుడు అయిపోయాడు. మా ఇంటి వ్యక్తిలా అన్నమాట. మీరు పాట సందర్భం అనుకున్నప్పుడే పల్లవి రాసుకుంటారట. నిజమా? విశ్వనాథ్: నేను కథ రాసేటప్పుడే అబద్ధపు సాహిత్యం (డమ్మీ లైన్స్) పక్కన పెట్టుకుంటాను. ఊరికే నా ఐడియా ఇదీ అని చెబుతాను. ఇలా ఉండాలి అని శాసించను. రాస్తున్న కవి మనసుకు హత్తుకుని, ఛందోబద్ధంగా ఉంటే అది తీసుకుంటారు. తీసుకోవాలని నేను పట్టుబట్టింది లేదు. విశ్వనాథ్‌గారి పల్లవులు యథాతథంగా వాడిన సందర్భాలు ఏమైనా? సిరివెన్నెల: ‘శ్రుతిలయలు’ సినిమాలోని ‘తెలవారదేమో స్వామి.. నీ తలపుల మునకలో..’ పల్లవి ఆయనిచ్చినదే. ‘సిరివెన్నెల’ తీసేటప్పుడు ఇలాంటి సబ్జెక్ట్‌ని ఎందుకు ఎంచుకున్నామా? అని, ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపానని ఓ సందర్భంలో విశ్వనాథ్‌గారు అన్నారు. మరి.. ఆ సినిమాకి పాటలు రాసేటప్పుడు మీకేమైనా? విశ్వనాథ్: శాస్త్రికి బదులుగా నేను చెబుతా. అలాంటి సందర్భాలు తనకు అనేకం పెట్టాను. శాస్త్రిది యంగ్ బ్లడ్ కదా అని (నవ్వుతూ). ‘కష్టపెడుతున్నారు వీళ్లు’ అని ఏ సందర్భంలోనూ తను అనుకోలేదు. పెద్ద అదృష్టం ఏంటంటే మాకు నిర్మాతలు అడ్డు చెప్పలేదు. ఉదయం అని రాస్తే ‘సార్ అర్థం అవ్వదేమో... పొద్దునే, లేచినవేళ’ అని రాయండి అని చెప్పలేదు. సిరివెన్నెల: కవిత్వం రాయడం అనేది కేవలం విశ్వనాథ్‌గారి సినిమాల్లోనే సృష్టించబడింది. అందులో అతిశయోక్తి లేదు. ఎందుకంటే ప్రతి పాట కవిత్వం కానక్కర్లేదు. కవిత్వం అంటే చెప్పినదే కాకుండా చెప్పని భావం కూడా బోలెడంత కనబడాలి. ఆయన నాకు పది చాలెంజ్‌లు విసిరితే వాటిని నేను పన్నెండు చేసుకోవడానికి ఇష్టపడతాను. విశ్వనాథ్: త్యాగరాజు, అన్నమయ్య కీర్తనలు వింటాం. ఆస్వాదిస్తాం. వాటికి ఇదే సందర్భం అనలేం కదా. మా పాట సినిమాలో సందర్భానికి సరిపోవడం ఒక్కటే కాదు... ఎవరు విన్నా కూడా ఎలా అయినా ఆపాదించుకునేలా ఉండాలి. అలాంటి పాటలను పెట్టాం. సిరివెన్నెల: ఎక్కడైతే మాట ఆగిపోతుందో అక్కడ పాట మొదలవుతుంది. విశ్వనాథ్‌గారి సినిమాల్లో సంస్కారం ఉన్న పాత్రలే ఉంటాయి. ఆ మినిమమ్ సంస్కారం ఉన్న మనుషులకు రావాల్సిన సమస్యలే వస్తాయి. రిక్షావాడికి ఓ సంస్కారం ఉంటుంది. కసాయివాడికి ఓ సంస్కారం. ‘జీవన జ్యోతి’లో ఓ సన్నివేశంలో ఓ తాగుబోతు వాణిశ్రీని రేప్ చేస్తాడు అని ప్రేక్షకులు ఊహిస్తారు. కానీ వచ్చి దుప్పటి కప్పి వెళ్లిపోతాడు. అది వాడి సంస్కారం. విశ్వనాథ్: దర్శకుడిగా నేను స్క్రీన్ ప్లే రాసుకునేటప్పుడు ఓ పాటొస్తుంది సుమా అని ప్రేక్షకుడిని భయపెట్టను. ప్రియుడి దగ్గర నుంచి ఉత్తరం వచ్చేసింది. ఇన్ని పూలు పెట్టుకుంది. పాట రాబోతోంది... అలా ఉండదు. నిజంగానే జరిగిన విషయాన్ని పాట రూపంలో ఎలా అలంకారం చేస్తాం అన్నది ముఖ్యం. మరీ ఎక్కువ అలంకారం చేసినా బప్పీలహరి పాటలా ఉంటుంది. అది ఉండకూడదు. హ్యాండ్ ఇన్ గ్లౌ అంటారే అలాగ. సిరివెన్నెల: ఓవర్ డ్రమటైజేషన్ అనేది విశ్వనాథ్‌గారి సినిమాల్లో ఉండదు. సన్నివేశం తీసే ముందు డైలాగ్ పేపర్ని చూస్తూ, నేనైతే ఇంట్లో ఇలా మాట్లాడతానా? అని అనుకుంటారు ఆయన. అలా లేకపోతే దాన్ని పక్కన పెట్టేస్తారు. తొలి సినిమానే విశ్వనాథ్‌గారితో చేయడంవల్ల మీ పాటల్లో కవితాత్మక ధోరణి కనిపిస్తుందా? సిరివెన్నెల: కవిగా నా స్వభావమే అది. ఏ సీన్‌కి అయినా నేను చాలా త్వరగా రియాక్ట్ అయి రాస్తుంటాను. సంఘటన, వ్యక్తులు, ప్రదేశాలకు రాయమంటే నేను రాసేవాణ్ణి కాదు. అవన్నీ కాదు.. ఏదైనా కాన్సెప్ట్ ఉంటే చెప్పండి రాస్తాననేవాణ్ణి. ఫలానా ఆయన్ని పొగిడి రాయమన్నా కూడా తత్వాన్ని పొగుడుతాను. విశ్వనాథ్: మామూలుగా అయితే దీన్ని పొగరుబోతుతనం అనుకుంటారు కానీ వ్యక్తిత్వం అనుకోరు. ఆ రెంటినీ డివైడ్ చేసే లైన్ చాలా కష్టమైంది. ‘వ్యక్తిని పొగడను’ అని సిరివెన్నెలగారు కనబర్చిన వ్యక్తిత్వం గురించి కానీ, ఆయన తాను అనుకున్నదే రాస్తారని కానీ మీకేమైనా కంప్లైంట్స్ వచ్చాయా? విశ్వనాథ్: ఒక ఇరవై ఏళ్ల స్నేహంలో అలాంటి కంప్లైట్స్‌ని నిజమని నమ్మితే అది మూర్ఖత్వం అవుతుంది. ఎవరైనా నా దగ్గరకు వచ్చి ‘ఆయన నాకు చాన్స్ ఇవ్వడమేంటి? నాకు టాలెంట్ ఉంది కాబట్టే ఇచ్చారు’ అని సిరివెన్నెల అంటున్నాడు అని అన్నప్పుడు, దాన్ని నమ్మేసి ఇంట్లోవాళ్లందరితో వాగేసి, శాస్త్రి రేపొస్తే కడిగేస్తాను అనుకుంటే కరెక్ట్ కాదు. అలా చెప్పినవాడిని కొట్టాలి (నవ్వుతూ). ఇలా సరదాగా సంభాషణ సాగుతున్న సమయంలో విశ్వనాథ్‌గారి సతీమణి (జయలక్ష్మి) వచ్చారు. మెల్లిగా నడుస్తూ వచ్చిన జయలక్ష్మిగారు సిరివెన్నెలగారి కుర్చీ పక్కన కూర్చుంటే.. విశ్వనాథ్‌గారి పక్కన కూర్చోమని అడిగిన ‘సాక్షి’తో నడవలేనేమో అన్నప్పుడు ‘ఇంతకాలం నన్ను నడిపించావు కదా’ అని విశ్వనాథ్‌గారు చమత్కరించడంతో అక్కడే ఉన్న ఆయన తనయుడు, కోడలు.. అందరూ హాయిగా నవ్వేశారు. భర్త పక్కన కూర్చున్నాక ‘‘నా బిడ్డ (సిరివెన్నెలను ఉద్దేశించి)ను నేనే మెచ్చుకుంటున్నానేమో కానీ ఎంతో లవ్లీగా అనిపిస్తోంది. నాలుగు రోజుల నుంచి (పద్మశ్రీ వచ్చిన రోజు నుంచి) మా ఆనందం చెప్పలేనిది. మా కన్నబిడ్డకు వచ్చినట్లుగానే అనుకుంటున్నాం’’ అన్నారు జయలక్ష్మి. సిరివెన్నెల: ఈ సందర్భంలో ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే.. నాన్నగారు తీసిన ప్రతీ సినిమా కూడా వేదమే. వేదానికి కొన్ని వందల అర్థాలు ఉన్నాయి. సింపుల్ మీనింగ్ ఏంటంటే మనకు ఏది తెలియాలో అది వేదం. మీ మధ్య వాదించుకోవడాలు ఉండేవా? సిరివెన్నెల: ఆయనకు నచ్చకపోవడం ఉండదు. విశ్వనాథ్: 75 ఏళ్లు కాపురం చేశాం. మా ఆవిడను అడగండి. ఆవిడ ఏం సమాధానం చెబుతుందో. శాస్త్రి, నా మధ్య సఖ్యత కూడా అంతే. నారాయణరెడ్డిగారు ఓ సందర్భంలో మేమిద్దరం ‘జంట కవులం’ అన్నారు. సిరివెన్నెల: ‘స్వర్ణకమలం’ సినిమాకు నంది వచ్చినప్పుడు నాన్నగారి దగ్గరకు వెళ్లాను. ‘మూడు నందులు వరుసగా అందుకున్నాను. అయినా కానీ సంతృప్తిగా లేను’ అన్నాను. ఎందుకు? అని అడిగారు. మీ సినిమాల్లో ఏ క్రాఫ్ట్ వాళ్లకు అవార్డు వచ్చినా అందులో మీ పాత్ర ఉంటుంది. మీకు కాకుండా వేరే వాళ్లకు రాసి, నంది తెచ్చుకుంటే అప్పుడు నందికి అర్హుడిని అన్నాను. ఆ తర్వాత వేరేవాళ్ల సినిమాలకు కూడా చాలా వచ్చాయి. మనం జపనీస్ దర్శకుడు అకీరా కురొసావా గురించి చెప్పుకుంటుంటాం. ఆయన్ను తక్కువ చేయడం కాదు కానీ విశ్వనాథ్‌గారు తెలుగుకు పరిమితమైపోవడం వల్ల ఆయన గురించి అకీరా కురొసావా గురించి చెప్పుకున్నట్లు చెప్పుకోవడంలేదు. విశ్వనాథ్: మన తెలుగు వాళ్లకు ఉన్నదే అది. సిరివెన్నెల: కేన్వాస్ అదే. దాని మీద బూతు బొమ్మ గీసుకోవచ్చు. మామూలు బొమ్మ గీయొచ్చు, ఎక్కాలు రాయొచ్చు. విశ్వనాథ్‌గారు చేసింది చూడటం వల్ల ఆయన్ని పొగడటం అవదు. మీ (ప్రేక్షకులు) జీవితాన్ని మీరు విస్తృతపరచుకోవడం అవుతుంది. అది ఒక ఉనికి. అతిశయోక్తిగా విశ్వనాథ్‌గారిని దేవుడు భూమి మీదకు పంపారు అనడం లేదు. మనకు ఆకలి, డబ్బు సంపాదన ఇలా చాలా ఉంటాయి. ఇవి కాకుండా మన లోపల ఓ ఆర్తి ఉంటుంది. దాని కోసం ఆయన సినిమాలు చూడండి. మన మీద మనకు గౌరవం పెరుగుతుంది. మనం రోజూ చేస్తున్న ఘనతలు ఏమున్నాయి? తినడం, ఉద్యోగం చేయడం. ఇది తప్ప ఇంకేం ఉంది. ఆయన ‘శంకరాభరణం’ చూస్తే.. అంతకు ముందు మంచి సినిమాలు లేవని కాదు. ఆయన మనకు చాలా ఎక్కువ గౌరవం ఇచ్చారు. ప్రేక్షకులు వాళ్ల అర్హతను ఆయన సినిమాను విజయవంతం చేసి మాత్రమే నిరూపించుకోగలరు. నిరూపించుకున్నారు కూడా. ‘సిరివెన్నెల’ మీ ఇంటి పేరుగా మారిపోవడం గురించి? సిరివెన్నెల: ఆ సినిమా వల్ల నాకీ పేరు రాలేదు. ఆ సినిమా టైటిల్ కార్డ్స్‌లోనే ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి అని వేశారు. మన శాస్త్రంలో ఆరు రకాల తండ్రులు ఉంటారు అంటుంటాం. విద్య నేర్పినవాడు, నామకరణం చేసినవాడు, జన్మనిచ్చినవాడు.. ఇలా. మా నాన్నగారు జన్మనిస్తే, నాకు సినీ నామకరణం చేసి, కవి జన్మని ఇచ్చిన తండ్రి విశ్వనాథ్‌గారు. ఆ పేరు పెట్టేప్పుడు మీ అమ్మానాన్న చక్కగా సీతారామశాస్త్రి అని పెట్టారుగా.. మళ్లీ పేర్లెందుకు? స్క్రీన్ కోసమే కావాల్సి వస్తే ‘సిరివెన్నెల’ అని సినిమా పేరే ఉందిగా. దాన్ని ముందు జత చేసుకో అన్నారాయన. సిరివెన్నెలలానే నీ కెరీర్ కూడా ఉంటుంది అన్నారు. వశిష్ట మహర్షి రాముడికి పేరు పెట్టినట్టుగా నాకు పేరు పెట్టారు. విశ్వనాథ్‌గారిని ‘నాన్నగారు’ అని ఎప్పటి నుంచి పిలుస్తున్నారు? సిరివెన్నెల: నాకు ముందు నుంచి పిలవాలని ఉండేది. కానీ బెరుకుగా కూడా ఉండేది. ఐదారేళ్ల క్రితం నుంచి పిలుస్తున్నాను. విశ్వనాథ్: శాస్త్రి నన్ను ఏనాడూ పేరు పెట్టి పిలిచింది లేదు. సిరివెన్నెల: మా అబ్బాయిని కూడా సాయి (అసలు పేరు యోగేశ్వర శర్మ. సిరివెన్నెల తండ్రి పేరు) అంటాను. నాన్న పేరుతో పిలవలేను. ఈయన్ను కూడా అంతే. ఈతరంలో మీకు విశ్వనాథ్గారిలాంటి దర్శకుడు దొరికారా? సిరివెన్నెల: లేరు. ఒకటి విశ్వనాథ్‌గారు కథను చెప్పే విధానం. రెండు.. రచయితని నీ మనసు ఎలా పలుకుతుందో అలా రాయి అనే దర్శకుడు ఆయన. మొట్టమొదటి సినిమాలో మొట్టమొదటి పాట రాస్తున్నప్పుడే నీకు ఏం తోస్తే అది రాయి. నాకు అర్థం కాకపోయినా ఫర్వాలేదు అన్నారు. హిమాలయాలంత మనిషి తన స్థాయిని ఆపాదించుకుని నాకు అర్థం కానిది ఏదీ లేదు అనొచ్చు. నాకు అర్థం కాకపోయినా ఫర్వాలేదు అన్నారు. ‘నాకే అర్థం కాలేదు. జనాలకు ఎలా అర్థం అవుతుంది’ అని కొందరు దర్శకులు అంటారు. జనాలు అని ఎవరైనా సంబోధిస్తే నాకు కోపం వస్తుంది. మనం ఎవరి ముందు కూర్చుని మాట్లాడుకుంటున్నాం అంటే ఒక యుగం ముందర. ఒక శకం ముందర కూర్చొని. ఏనాడూ ఆయన ఆడియన్స్‌ను తక్కువ చేసి మాట్లాడలేదు. మనం కాదా జనం.. జనంలో నుంచి మనం రాలేదా? జనాన్ని తక్కువ చేస్తే మనల్ని మనం తక్కువ చేసుకున్నట్టే అని ఆయన అనుకుంటారు. మీరు సినిమాల్లోకి వచ్చే నాటికే విశ్వనాథ్‌గారు గొప్ప పేరున్న వ్యక్తి. మరి.. ఆయనతో జర్నీ మొదట్లో భయంగా అనిపించేదా? విశ్వనాథ్: నేను సమాధానం చెబుతా. మా గురువుగారు ఆదుర్తిగారు చాలా గొప్ప విషయాలు చెప్పారు. ‘మొదట్లో వచ్చేవాళ్లకు భయం, భక్తీ ఉంటాయి. మనం చనువు చేసి, జాగ్రత్తగా భయం పోగొడితే... అప్పుడు వాళ్లు భయం లేకుండా ఇలా ఇలా ఉంటే బావుంటుంది అని చెప్పగలుగుతారు. ఒకవేళ మనం భయం పోగొట్టకపోతే ఏమీ చేయకుండా బొమ్మల్లా మనల్ని ఫాలో అయిపోతుంటారు’ అని చెప్పారు. అందుకే నేను భయం పోగొట్టేవాణ్ణి. నిజానికి ఎదుటి వ్యక్తి స్థాయిని బట్టి మన ఫీలింగ్స్ ఉంటాయి. నేను అమితాబ్ బచ్చన్ దగ్గరకు వెళ్తే నిలబడతాను. ఆయన స్టేచర్‌కు నేను గౌరవం ఇస్తాను. మా ఊళ్లో నేను గొప్పవాణ్ణి అంటే ఏం లాభం? ఈ లక్షణాలు చివరిదాకా ఉండాలి. ఇవే మా సినిమాల్లో పెడతాం. భయం పోయినా గౌరవం పోకూడదు. సిరివెన్నెల: ఇప్పుడు వేల్యూ సిస్టమ్ అనేది లేదు. అవన్నీ పోయాయి. ‘కొత్త దర్శకులను తండ్రీ కొడుకులిద్దరూ స్నేహితులైతే కలసి కూర్చుని తాగాలా? ఆ సన్నివేశం లేకపోతే నష్టమా?’ అని అడుగుతుంటాను. విశ్వనాథ్: అవన్నీ మీకెందుకు? మీ పాట మీరు రాయండి. (నవ్వుతూ). సిరివెన్నెల: నన్ను అలా అనే సాహసం ఎవ్వరూ చేయలేదు. ఎందుకంటే నేను ఏ స్కూల్ నుంచి వచ్చానో వాళ్లకు తెలుసు (నవ్వులు). ఎంతటి ప్రతిభావంతులకైనా ప్రశంసలు ఆనందాన్నిస్తాయి. మీ సినిమాలను మెచ్చుకున్నప్పుడు మీకెలా అనిపిస్తుంది? విశ్వనాథ్: మనం చేసినదాన్ని ఒకరు మెచ్చుకుని అందులో ఉన్న మెరుపును చెప్పినప్పుడు ‘అమ్మయ్య.. ఇంత ఇదిగా గుర్తించారు’ అని ఆనందం వస్తుంది. అది వీక్నెస్ అనండి ఇంకేదైనా అనండి. ఎంత బావుందో సినిమా అని అనిపించుకోబుద్ధి అవుతుంది (కళ్లల్లో ఆనందంతో). సిరివెన్నెల: ఇక్కడ మమ్మల్ని పొగడక్కర్లేదు. సినిమాలో ఉన్న విషయం అర్థం చేసుకుని ఆనందించడం ముఖ్యం. సినిమా బావుండటం వేరు. ప్రయోజనం వేరు. రెండూ వేరే వేరే విషయాలు. చాలా బావున్నది మనకు దేనికీ పనికి రాకపోవచ్చు. నాన్నగారు తీసిన సినిమాలు చూడటం ఎవరికి వాళ్లు సంస్కారం పెంచుకోవడానికి రుజువు. ఇవాళ పనిగట్టుకుని శాస్త్రి వచ్చి ఆయన్ను పొగడక్కర్లేదు. విశ్వనాథ్: బాక్సాఫీస్ ఈజ్ నాట్ ది క్రైటీరియా. కొన్ని సినిమాలకు ఎందుకని డబ్బు రాలేదో అర్థం కాదు. కొన్నింటికి ‘దాంట్లో ఏమీ లేదు. ఊరికే డబ్బు వచ్చేస్తుంది’ అంటుంటారు. సిరివెన్నెల: కళా తపస్వి అన్నది బిరుదు కాదు. మేం నాన్నగారిని వదిలి వెళ్లేటప్పుడు రాత్రి పది అయ్యేది. కానీ మరుసటి రోజు కొత్త కథ ఉండేది. అంటే ఆ రాత్రంతా ఏం చేస్తున్నట్టు? పొద్దునే ఇది తీస్తారు అని వెళ్తాం. కానీ అక్కడ వేరేది ఉంటుంది. నాకూ అదే అలవాటైంది అనుకుంటా. రాత్రంతా ఒక వెర్షన్ రాసి మరో వెర్షన్ రాసి... ఇలా రాత్రిళ్లు రాస్తుంటాను. విశ్వనాథ్: శాస్త్రి రాత్రిపూట రాస్తాడంటే ఆ నిశ్శబ్దమే తనకు సహాయం చేస్తుంది. నాక్కూడా తెల్లవారుజాము నాలుగు గంటలకు కొత్త కొత్త భావాలు వస్తుంటాయి. వాటినే ఉదయం షూటింగ్ ప్రారంభించాక ఇలా చేయండి అని చెబుతుంటాను. మరి శాస్త్రి అందరి దగ్గర అలా చేస్తాడో లేక మా దగ్గరే అలా చేస్తాడో తెలియదు. వచ్చేటప్పుడు తెల్ల కాగితాలు తెచ్చుకుంటాడు. రీమ్ అంటామే. నాలుగు లైన్స్ ఏవో రాస్తాడు. పక్కన పెడతాడు. పడేయడు. మళ్లీ కాసేపు బయటకు వెళ్లిపోతాడు. అలా ఎప్పుడో రాసినవి ఇప్పటికీ తన దగ్గర ఉంటాయి. సిరివెన్నెల: అవును.. ఇప్పటికీ ‘సిరివెన్నెల’ సినిమాకు రాసిన కాగితాలు ఉన్నాయి. చివరి ప్రశ్న... వేటూరిగారు, ఆరుద్రగారు.. ఇలాంటి గొప్ప రచయితలతో పాటలు రాయించుకున్నారు. ఆ తర్వాత సిరివెన్నెలగారితో రాయించుకున్నారు. ఆయనకు రీప్లేస్‌మెంట్‌గా..? విశ్వనాథ్: అవసరం లేదు. ఆయన పైకి ఎదుగుతున్న స్టేజ్‌లో నేను కిందున్నాను. పదేళ్లుగా ఏ సినిమా చేయడం లేదు నేను. ఒకవేళ చేస్తే రాయను అనడు. కాబట్టి ఇప్పుడప్పుడే వెతుక్కోనవసరం లేదు. సిరివెన్నెల: నేనే ఆయనతో ఓసారి అన్నాను. మీ సినిమాల్లో నేను రాయకుండా వీలే లేదు. ఇప్పుడు నాన్నగారు సినిమా తీసి, ఏ కారణం చేతనైనా ఆయన సినిమాల్లో పాట రాయకపోతే నేను ఇండస్ట్రీలో ఉండనన్నది నా పంతం. – డి.జి.భవాని -
అవకాశమే మహాప్రసాదం!
కళాతపస్వికి జీవితమే ఓ తపస్సు! క్రమశిక్షణ, కార్యదీక్ష ఉచ్ఛ్వాసనిశ్వాసలు! మనకు పూజంటే ధూప దీప నైవేద్యాలే కాని, ఆయనకు కళారాధనే ప్రార్థన. విశాలమైన ఆవరణ, ఏపుగా ఎదిగిన పచ్చని చెట్లు, కొమ్మల చివరన విరిసిన రంగుల పువ్వులు.. ఆ ఆహ్లాద ఆవరణలో కూర్చోవడానికి అనువుగా అరుగులు, వాటికి అందంగా తీర్చిదిద్దిన రంగవల్లికలు.. కళకళలాడుతున్న ఆ లోగిలిని చూస్తూ మెట్లు ఎక్కి పై అంతస్తుకు చేరుకున్నాక ఊయలలో కూర్చొని అభిమానులతో మాట్లాడుతూ కనిపించారు కళాతపస్వి కె.విశ్వనాద్. హైదరాబాద్ ఫిల్మ్‌నగర్‌లోని వారి నివాసంలో కలిసి దైవం గురించి అడిగితే ‘నా జీవితమే దైవ కృప’ అంటూ వివరించారు. 88 ఏళ్ల మీ జీవితం దైవాన్ని ఏ విధంగా చూసింది? తల్లి గర్భంలో బీజంగా చేరి బిడ్డ ఊపిరి పోసుకుంటుంది. ఆ బిడ్డకు రెండు చేతులు ఉండాలి, ఆ చేతులకు పది వేళ్లు ఉండాలనే నిర్ణయం ఎక్కడ జరిగింది. ఈ అవయం ఇక్కడే ఉండాలనే ఏర్పాటు ఎలా జరిగింది. ఆ పువ్వులను చూడండి. వాటికి ఆ రంగే ఉండాలని ఎవరు నిర్దేశించారు. ఈ పండులో ఈ రుచే ఉండాలని ఎవరు చెప్పారు. మనం పీల్చే గాలిలోనూ, చూసే కళలోనూ అంతటా ఆ దైవ శక్తి ఇమిడి ఉంది, నా బంధుమిత్రుల్లో కొందరు నాస్తికులు ఉన్నారు. కానీ, వారిలోనూ దైవత్వం కనిపించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. నాతో పనిచేసిన ప్రతివారిలో మంచిని చూశాను. లైట్ బాయ్ కావచ్చు, నాయకుడే కావచ్చు. స్థాయి బేధాలు లేవు. మంచి చిత్రాన్ని ఇవ్వాలి, మంచి నటన ఇవ్వాలి అనే నా తపనకు ఎందరో చేయూతనిచ్చారు. వారిందరిలో దైవత్వం ఉందని భావించాను. చూసే మనసును బట్టి దైవం కనిపిస్తుంది. మనం ఓ శక్తిని నమ్ముకుంటే అనుక్షణం ఆ శక్తి మనతోనే ఉంటుంది. అది ఏ రూపంగానయినా కావచ్చు. మీ పేరులోనే శివుడున్నాడు. ఈ పేరు వెనుక సంఘటన ఏమైనా ఉందా? నేను మా అమ్మ గర్భంలో ఉండగా మా తాతగారు కాశీలో ఉన్నారట. అప్పుడు ఆయనకు ఈ శుభవార్త తెలిసి ఆ పరమశివుడికి నమస్కరించుకున్నారట. స్వామీ, నీ సన్నిధిలో ఉండగా ఈ వార్త తెలిసింది. పుట్టబోయే వారికి నీ పేరే పెట్టుకుంటాను అనుకున్నారట. ఆ విధంగా నాకు విశ్వనాథ్ అని పెట్టారు. మా ఇంటి పేరుతో కలిసి కాశీనాథుని విశ్వనాథుడు నా పేరులో కలిసిపోయాడు. కళారంగానికి రావాలనుకున్నది మీ అభీష్టమా? దేవుడి నిర్ణయమేనంటారా? ముమ్మాటికి దైవనిర్ణయమే! యాదృశ్చికంగా ఈ రంగంలోకి వచ్చాను. ముందు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ని కావాలనుకున్నాను. ఫైళ్ల మీద సంతకాలు చేస్తూ ఒక ఆఫీసర్ హోదాలో ఉండాలనుకునేవాణ్ణి. కానీ, ఇలా వచ్చాను. అయితే, ఈ రంగంలోకి వచ్చినందుకు ఎక్కడా విచారం లేదు. ఇందులో ఒకటీ రెండు కాదు దైవం ఎన్నో అవకాశాలను ఇచ్చింది. ఇచ్చిన ప్రతీ అవకాశాన్ని శ్రద్ధగా వాడుకున్నాను. ఆ పనితో మమేకం అయ్యాను. అదే నన్ను ఇలా మీ అందరి ముందు నిలిపింది, మీ సినిమాలో దైవానికి సంబంధించిన సన్నివేశాలు తీస్తున్నప్పుడు ఏవైనా ఊహించని ఘటనలు జరిగిన సందర్భాలు ఉన్నాయా? సినిమాలో పలానా సన్నివేశం, ఫలానా నటుడి నటన అద్భుతమని ప్రేక్షకుడికి అనిపించాలి. అలా దర్శకుడిగా, నటుడిగా నా పనికి నేను న్యాయం చేయాలి. ఊహించని సన్నివేశాలతో అద్భుతం అనిపించాలి. అలా శ్రద్ధగా చేశానే తప్ప ఇదో మిరాకిల్ అన్నవి లేవు. ఈ ఫొటో చూడండి (ఆఫీసు గదిలోని తన ఫొటో చూపిస్తూ) బెంగుళూరులోని ఓ కళాకారుడు అద్భుతంగా చిత్రించి, ఫ్రేమ్ కట్టించి ఇచ్చాడు. ఇదిగో ఈ కళారూపం మా అమ్మనాన్నలది. ఓ చెక్కమీద అందంగా చెక్కి కళాకారుడు బహుకరించాడు. కళాకారుyì గా మా పనులకు జీవం పోయడానికే తపన పడుతుంటామే తప్ప అందులో అద్భుతాలను ఆశించం. కష్టాన్ని అధిగమించడానికి దైవాన్ని ఆసరా చేసుకున్న సందర్భాలు.. ఈ జీవితంలో దక్కాలనుకున్నది దక్కుతుందని ఓ నమ్మకం. కర్మ సిద్ధాంతాన్ని నమ్ముకున్నవారికి ఏడుపు ఉండదు. కష్టం అనిపించదు. కష్టం వచ్చినప్పుడు నేనేం పాపం చేశాను అని దేవుణ్ణి నిందించడం సరికాదు. అలాగే కాలం కలిసొచ్చినప్పుడు అంతా తమ ప్రతిభ అనుకోవడం సరికాదు. అలాంటి రెండు సందర్భాలు నాకు లేవు. కష్టానికి కుంగిపోయి, సుఖాలకు పొంగిపోయిన సంఘటనలు అస్సలు గుర్తులేవు. దైవం గురించి బాల్యంలో అమ్మనాన్నలు పరిచయం చేసినదానికి, ఇప్పుడు అర్ధం చేసుకున్నదానికి చాలా తేడా ఉంటుంది... మీరన్నట్టు అనుభూతి అనేది ఒక్కొక్క వయసులో ఒక్కో విధంగా ఉంటుంది. అప్పుడు దేవుడు ఏదో చేశాడు అనుకుంటాం. దేవుడంటే భయంగా ఉంటాం. పెద్దవుతున్న కొద్దీ మన ఆలోచనల్లో మార్పులు చోటు చేసుకుంటాయి. అవగాహన విస్తృతమవుతుంది. మనుషుల రూపంలోనే దేవుడు వస్తాడు సాయం చేయడానికి అని చాలా సందర్భాలలో తెలుస్తుంది. అయితే, దేవుడు దేవుడే! చిన్నప్పుడు నే చూసిన బాలాజీ అలాగే ఉన్నాడు. ఇప్పుడూ అలాగే ఉన్నాడు. అవే పూజలు, అభిషేకాలు. ఎప్పటికీ ఆయన అలాగే కనిపిస్తాడు. తరచూ దేవాలయ సందర్శన చేస్తుంటారా? ఏ దేవాలయం మీకు అమితంగా నచ్చుతుంది? అష్టోత్తర నామాలలో ఏ నామం నచ్చుతుందంటే ఏమని చెబుతాం. ఆలయాలు కూడా అంతే! అయితే, ఫలానా చోటుకి వెళుతూ ఈ దరిద్రం ఏంటి అనుకుంటే స్వర్గమైనా నరకంలాగే ఉంటుంది. అంతా భగవతేశ్చ అనుకుంటూ స్మశానికి వెళ్ళినా ఆ అనుభూతి అలాగే ఉంటుంది. ఒక్క శివుడు అనేకాదు అన్ని దేవతలను ఆరాధిస్తాను. అన్ని దేవాలయాలను సందర్శిస్తాను. అంతేకాదు చర్చి, మసీదులకు వెళ్లిన సందర్భాలూ ఉన్నాయి. ఏ మతమైనా దేవుళ్లంతా ఒక్కటే. మీ మనవళ్లకి, మనవరాళ్లకి దైవారాధనను ఎలా పరిచయం చేస్తుంటారు? మనం చెప్పింది వాళ్లు వినరు. మనం ఆచరించింది వాళ్లు చేస్తారు. మా అమ్మనాన్నలు విధిగా చేసిన కార్యక్రమాలను నేను ఆచరణలోకి తెచ్చుకున్నాను. ఆ ఆచరణ ఎలా ఉంటుందంటే వారి ఆశీర్వచనాలు ఇప్పటికీ నాతోనే ఉంటాయనే భావన కలిగిస్తుంది. మనసును దృఢం చేస్తుంది. అందుకే మన పెద్దలు పూజలను ఒక ఆచారంగా మనకు అందించారు. మనం భవిష్యత్తు తరాలకు అందించాలి. మీ దినచర్యలో ప్రార్థనాసమయం? అమ్మనాన్నలు నేర్పించిన లక్షణాలలో పూజ ఒకటి. సంధ్యావందనం చేయనిదే ఎలాంటి పదార్థమూ తీసుకోను. పూజామందిరంలో దీపం వెలిగిస్తాం. అంతకు మించి పూజలు ఉండవు. మా ఇంటికి దగ్గరలో శివాలయంలో అభిషేకాలకు వెళుతుంటాను. సంగీతం, నృత్యం దైవారాధనకు దగ్గరి దారి అంటారు. మీ సినిమాలో సంగీతం, నృత్యం ప్రధానాంశంగా ఉంటాయి. ఈ కళను ఎలా వంటపట్టించుకున్నారు? ప్రేమ, స్నేహం దగ్గర కావాలనుకున్నప్పుడు మనలో వారి కోసం ఓ తపన ఉంటుంది. ఆ అవసరం, తపన మనల్ని ప్రయత్నించేలా చేస్తుంది. అదృష్టం అంటే ఎక్కణ్ణుంచో రాదు. దేవుడు నీకు అవకాశాలు కల్పిస్తుంటాడు. వాటిని సద్వినియోగం చేసుకుంటూ ఉంటే అదే అదృష్టంగా నిన్ను వరిస్తుంది. మన ఎంచుకున్న వృత్తికి మనం నూటికి నూరు శాతం న్యాయం చేయాలి. అలా అనుకుంటే మనకేం అవసరమో అవే వంటపడతాయి. – నిర్మలారెడ్డి చిల్కమర్రి -
సినీపరిశ్రమ నాకో దేవాలయం – కె. విశ్వనాథ్
‘‘ప్రతి దేవాలయంలో అర్చక స్వాములుంటారు. వాళ్లలో ఒకరికే భగవంతుడికి ప్రసాదం వండి వడ్డించే అవకాశం కలుగుతుంది. అలా చూసుకుంటే.. దేవాలయం లాంటి సినిమా కళలో నేను చేసే వంటను ముందుగా ప్రేక్షకులకు అందించే అదృష్టం నాకు కలిగింది’’ అన్నారు కళాతపస్వి కె.విశ్వనాథ్. సువర్ణభూమి డెవలపర్స్ ఆధ్వర్యంలో కె. విశ్వనాథ్ పుట్టినరోజు వేడుకలు సోమవారం జరిగాయి. విశ్వనాథ్ మాట్లాడుతూ– ‘‘సంగీతం, సాహిత్యం మీద అభిమానంతో కాకుండా సినీ పరిశ్రమను ఓ దేవాలయంలా భావించి పనిచేశాను. నా నిర్మాతలు, సాంకేతిక నిపుణులు ఎంతో సహకరించారు. వాళ్ల సహకారం వల్లే నేను ఈ స్థాయిలో ఉన్నా’’ అన్నారు. ‘మా’ అధ్యక్షుడు శివాజీరాజా మాట్లాడుతూ– ‘‘విశ్వనాథ్‌గారికి సన్మానాలు కొత్తకాదు. కానీ రక్తదానం వంటి సేవా కార్యక్రమాలు చేస్తే ఆయన ఎంతో సంతోషపడతారు. అందుకు తగ్గట్టుగానే ఈరోజు బ్లడ్ డొనేషన్ క్యాంప్ జరగడం ఆనందం. టాప్ 1 నుంచి 10 వరకూ విశ్వనాథ్‌గారి సినిమాలే ఉంటాయి’’ అన్నారు. ‘సువర్ణభూమి’ ఎండీ శ్రీధర్ బొలినేని, మార్కెట్ హెడ్ సిమ్సన్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ దీప్తీ బొలినేని, ‘మా’ వైస్ ప్రెసిడెంట్ బెనర్జీ, జాయింట్ సెక్రటరీ ఏడిద శ్రీరామ్, కల్చరల్ కమిటీ చైర్మన్ సురేష్ కొండేటి, కార్యవర్గ సభ్యులు ఉత్తేజ్, జయలక్ష్మి పాల్గొన్నారు. -
గుండెల్లో గోదారి
మండపేట నియోజకవర్గంలోని రాయవరం మండలం పసలపూడి గ్రామంలో కొన్ని నెలల పాటు ఉండి.. సిరిసిరిమువ్వ సినిమాను కళాత్మకంగా తీసేందుకు దర్శకుడు కె.విశ్వనాథ్ పడిన తపనను.. ఆయన మహోన్నతికి వెన్నంటి ఉండి సహకరించిన జిల్లావాసులపై.. వల్లమాలిన అభిమానాన్ని విశ్వనాథ్ ఉద్వేగంతో చెప్పేసరికి.. ఆహూతులు పులకరించిపోయారు. మాటలకు అందని ఆనందం అందరిలో కలిగింది. మండపేటలో జరిగిన సత్కార సభలో కృతజ్ఞతాపూర్వకంగా.. జిల్లాతో ఉన్న అనుబంధాన్ని, సినీ దర్శకుడు జంధ్యాలతో ఆత్మీయతను నెమరువేసుకున్నారు. అందుకేనేమో.. నడవలేని స్థితిలో ఉన్నా సరే.. గోదావరి గడ్డపై నిర్వహించే కార్యక్రమానికి ఓపిక చేసుకుని కళాతపస్వి విశ్వనాథ్ వచ్చారు. మండపేట: జిల్లాతో తనకు ఆత్మీయ అనుబంధం ఉందని దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత, ప్రముఖ సినీ దర్శకుడు, పద్మశ్రీ, కె.విశ్వనాథ్ అన్నారు. జంధ్యాల లేని ఈ సభ.. ఆలయం లేని ధ్వజస్తంభాన్ని తలపిస్తోందంటూ ఉద్వేగానికి లోనయ్యారు. దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్న సందర్భంగా ఆయనను మండపేట పట్టణ బ్రాహ్మణసేవా సంఘం ఆదివారం ఘనంగా సత్కరించిం ది. స్థానిక సీతారామ కమ్యూనిటీ హాలు వద్ద నిర్వహిం చిన కార్యక్రమానికి విశ్వనాథ్, ప్రముఖ సినీ దర్శకుడు జంధ్యాల సతీమణి అన్నపూర్ణ, కుమార్తెలు హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లాతో తనకు ఉన్న అనుబంధాన్ని కళాతపస్వి నెమరువేసుకున్నారు. సిరిసిరిమువ్వ చిత్రం షూటింగ్ పసలపూడిలో తీస్తున్నప్పుడు జంధ్యాలతో కలిసి ఈ ప్రాంతమంతా పర్యటించానని, జంధ్యాల అత్తవారి గ్రామం నర్సిపూడి వెళ్లేవారమని చెప్పారు. జంధ్యాలతో అనుబంధాన్ని, జంధ్యాల మహోన్నత వ్యక్తిత్వాన్ని గుర్తు చేసుకున్నారు. పసలపూడికి చెందిన సినీ నిర్మాత కర్రి రామారెడ్డి, భాస్కరరెడ్డి తదితరులతో ఆత్మీయ అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. అందరం కలిసి విందు భోజనాలు చేసేవారమన్నారు. ఇక్కడకు రావడం చాలా ఆనందంగా ఉందని, నడవలేకున్నా తనను పట్టుబట్టి తీసుకువచ్చి, జీవితంలో ఓ మధుర జ్ఞాపకాన్ని నింపారంటూ బ్రాహ్మణ సంఘానికి కృతజ్ఞతలు తెలిపారు. విశ్వనాథ్‌ను సత్కరిస్తున్న బ్రాహ్మణ సేవా సంఘ నాయకులు విశ్వనాథ్‌కు ఘన సత్కారం బ్రాహ్మణ సేవా సంఘ అధ్యక్షుడు పిడపర్తి భీమశంకరశాస్త్రి అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ గిడుగు రుద్రరాజు, రామచంద్రపురం మున్సిపల్ కమిషనర్ సీహెచ్ శ్రీరామశర్మ, సంఘ నాయకులు అవసరాల వీర్రాజు, శివకోటి శేష సుబ్రహ్మణ్యం తదితరులు విశ్వనాథ్‌ను ఘనంగా సత్కరించారు. మండపేటలోని ఐఎస్డీ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు యినపకోళ్ల సత్యనారాయణ (ఐఎస్ఎన్), ఆలిండియా ఆర్యవైశ్య మహాసభ జాతీయ అధ్యక్షుడు కాళ్లకూరి నాగబాబు తదితరులు కూడా ఆయనను సత్కరించారు. అనంతరం జంధ్యాల సతీమణి అన్నపూర్ణను ఘనంగా సత్కరించారు. తమ ఆహ్వానాన్ని మన్నించి మండపేట వచ్చిన విశ్వనాథ్‌కు మండపేట పట్టణ బ్రాహ్మణసేవా సంఘం కృతజ్ఞతలు తెలిపింది. అనంతరం సీతారామ మందిరంలో జరిగిన బ్రాహ్మణ కార్తిక వన సమారాధనలో విశ్వనాథ్ పాల్గొన్నారు. రామచంద్రపురం డీఎస్పీ జేవీ సంతోష్, జిల్లా బ్రాహ్మణ సంఘ అధ్యక్షుడు దంతుర్తి సత్యప్రసాద్, సంఘ నాయకులు పేరి కామేశ్వరరావు, రాణి శ్రీనివాసశర్మ, గాడేపల్లి సత్యనారాయణమూర్తి, కందర్ప హనుమాన్, కళ్లేపల్లి ఫణికుమార్, అధిక సంఖ్యలో స్థానికులు పాల్గొన్నారు. -
‘అనంత’ ఆదరణ మరవలేను
– ఇష్టాగోష్టిలో కళాతపస్వి కె.విశ్వనాథ్ – ఆకట్టుకున్న చిన్నారుల నత్యాలు అనంతపురం కల్చరల్ : ‘సినిమాలకు దూరంగా ఉన్నా.. అయినా అనంత వాసులు నన్నెంతో ఆదరించారు. దీనిని మరవలేను. అందరిలోనూ మా అమ్మను చూసుకుంటున్నాను’ అంటూ అనంత ప్రజానీకంపై కళాతపస్వి కె.విశ్వనాథ్ అభిమానాన్ని కురిపించారు. త్యాగరాజ సంగీత సభ 58వ వార్షికోత్సవ వేడుకల ముగింపు వేడుకల సందర్భంగా సభ అధ్యక్షుడు ఏజీ వేణుగోపాలరెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి ప్రఖ్యాత దర్శకులు విశ్వనాథ్ విశిష్ట అతిథిగా విచ్చేసి ప్రసంగించారు. శాస్త్రీయ సంగీతానికి ఇప్పటికీ ఎంతో ఆదరణ ఉందని తానెక్కడకు వెళ్లినా అనిపిస్తుందని అన్నారు. సంప్రదాయ సంగీత సాహిత్యాలను ఈ తరం వారికి దగ్గర చేయాలని సూచించారు. శంకరాభరణం లాంటి సినిమాలే చాలా మంది చూడాలనుకుంటున్నారని చెబుతునప్పుడు మన సంస్కతి ఎంత ప్రభావితమైందో అర్థమవుతోందన్నారు. అనంతరం ఆహూతులతో ఇష్టాగోష్టి కార్యక్రమం జరిగింది. కళాభిమానులు అడిగిన ప్రశ్నలకు విశ్వనాథ్ సందర్భోచితమైన చమత్కారాలతో, పిట్ట కథలతో సమాధానాలు చెప్పిన తీరు అందరినీ అలరించింది. అనంతరం ముఖ్య అతిథులుగా విచ్చేసిన డీఐజీ ప్రభాకరరావు, కార్పొరేషన్ కమిషనర్ చల్లా ఓబులేసు, డీఎస్పీ మల్లికార్జున వర్మ తదితరులతో కలసి ఆయన జిల్లా స్థాయి సంగీత పోటీల విజేతలకు బహుమతులందించారు. వివిధ రకాల నత్యాలతో మంత్ర ముగ్ధులను చేసిన పద్మినీ ప్రకాష్‌ను విశ్వనాథ్ ప్రత్యేకంగా అభినందించారు. చివరలో వివిధ సంస్థల వారు విశ్వనాథ్‌ను ఘనంగా సత్కరించారు. జ్ఞాపికలు, శాలువలతో పాటు బంగారు నగలనూ బహుకరించారు. ఆకట్టుకున్న శాస్త్రీయ నత్యాలు ముగింపు వేడుకలను పురస్కరించుకుని కష్ణమూర్తి రాజు శిష్యబందం చేసిన శాస్త్రీయ నత్యాలు ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా హరిచందన, యామిని, విష్ణుప్రియ, నీలోఫర్, సాత్విక తదితరులు శివస్తుతి, భామాకలాపం, నవరసాభినయం తదితర అంశాలపై అద్భుత ప్రదర్శనతో ప్రేక్షకులను మైమరిపించారు. కార్యక్రమంలో కవి ఏలూరు ఎంగన్న, మేడా సుబ్రమణ్యం, ఫెస్టివల్ కమిటీ చైర్మన్ శైలజ, సభ కార్యదర్శి ప్రభావతి, నాట్యాచార్యులు గీతాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
ఈ గాలి..ఈ నేల..! 10thJan2016
-
ఈ గాలి.ఈ నేల..! 3rd Jan2016
-
ఈగాలి.ఈ నేల..!
-
అల్లూరి ఉద్యమ స్ఫూర్తి చిరస్మరణీయం
కొత్తపేట(గుంటూరు) : అల్లూరి ఉద్యమ స్ఫూర్తి చిరస్మరణీయమని జిల్లా కలెక్టర్ కాంతిలాల్‌దండే అన్నారు. అల్లూరి సీతారామరాజు 118 వ జయంత్యుత్సవాల్లో భాగంగా శనివారం స్ధానిక నాజ్ సెంటర్లో నూతనంగా ఏర్పాటు చేసిన అల్లూరి కాంస్య విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కలెక్టర్ కాంతిలాల్ దండే, సినీ దర్శకుడు కె.విశ్వనాథ్, తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫా, మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు, చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు ఆతుకూరి ఆంజనేయులు పాల్గొన్నారు. విగ్రహావిష్కరణ అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ గిరిజన హక్కులను కాపాడేందుకు తన ప్రాణాలను సైతం పణంగా పెట్టిన మహా మనిషి అల్లూరి సీతారామరాజు అని కొనియడారు. కె.విశ్వనాధ్ మాట్లాడుతూ మన్యం వీరుడి విగ్రహాన్ని రాజధానిలో ఏర్పాటు చేయడం ముదావహమని అన్నారు. తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫా మాట్లాడుతూ బాంధవ్యాలను సైతం విడిచి దేశం కోసం సాయుధ పోరాటంలో అశువులు బాసిన అల్లూరి సంకల్పసిద్ధి అజరామరం అని చెప్పారు. మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ విగ్రహ ఏర్పాటుకు కృషి చేసిన ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలియజేశారు. కార్యక్రమంలో చాంబర్ ఆఫ్ కామర్స్‌అధ్యక్షుడు ఆతుకూరి ఆంజనేయులు, జిల్లా గిరిజన సంక్షేమమాధికారి విజయ్‌కుమార్, గుంటూరు తహశీల్దార్ శివన్నారాయణమూర్తి, విగ్రహ దాత పి.రామచంద్రరాజు, విగ్రహ కమిటీ అధ్యక్షుడు ఎంవీ రమణారావు, వివిధ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. అల్లూరి సీతారామరాజు జీవితం ఆదర్శప్రాయం గుంటూరు వెస్ట్ : గిరిజనుల హక్కులను కాపాడేందుకు తన ప్రాణాలను పణంగా పెట్టిన మన్యంవీరుడు అల్లూరి సీతారామరాజు జీవితం ఆదర్శప్రాయమని జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే కొనియాడారు. అల్లూరి సీతారామరాజు 118వ జయంతి వేడుకలు జిల్లా గిరిజన సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ఎస్సీ కార్పొరేషన్ మందిరంలో శనివారం జరిగాయి. కార్యక్రమానికి గిరిజన సంక్షేమాధికారి జి.విజయ్‌కుమార్ అధ్యక్షత వహించారు. తొలుత అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి కలెక్టర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం గిరిజన బాలికల వసతిగృహంలో చదువుతున్న దేవి అనే బాలిక సీతారామరాజుగా చేసిన ఏకపాత్రాభినయం ఆకట్టుకుంది. 10వ తరగతిలో మంచిమార్కులు సాధించిన విద్యార్థులకు జ్ఞాపికలు, పదనిఘంటువులు అందజేశారు. వివిధ గిరిజన సంఘాల నాయకులు మొగిలి భరత్‌కుమార్, కె.నాగేశ్వరరావు, ఎన్.వెంకటేశ్వర్లు, దారునాయక్ తదితరులను కలెక్టర్ శాలువా, జ్ఞాపికలతో సత్కరించారు. కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖాధికారి టి.సూర్యనారాయణ, జిల్లా సాంఘిక సంక్షేమాధికారి శ్రీనివాస్, డ్వామా పి.డి బాలాజీనాయక్, తహశీల్దార్ శివన్నారాయణ, వివిధ గిరిజన సంఘాల ప్రతినిధులు, విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు. -
వెండితెరపై విశ్వరూపుడు
‘బాలు.. నృత్యమే జీవికగా.. ఆత్మగా భావించి అనుభవించి తరిస్తున్న ఓ కళాజీవి. భారతీయ నృత్యరీతుల్ని కలగలిపి సరికొత్త ఒరవడిని సృష్టించేందుకు కష్టిస్తున్న తపస్వి. అప్పుడే ఓ వెండితెర అవకాశం పలకరించింది. తన ప్రతిభను చాటేందుకు ఇదో గొప్ప అవకాశమని పులకరించిపోయాడు. అద్భుత సాహిత్యంతో సాగే ఆ పాటకు పాదం కదిపాడు.‘కట్’.. మరుక్షణమే నృత్యదర్శకుని నోట బాణంలా దూసుకొచ్చిందీ మాట. మిడిమిడి జ్ఞానంతో మిడిసిపడ్డ అతని ముందు బాలు తర్కం పనిచేయలేదు. అనుకున్న రీతిగా సాగడమా.. అవకాశాన్ని వదలుకోవడమా..! ఇక్కడే సంఘర్షణ మొదలైంది. ఆత్మఘోషను అణచుకుని అడ్డదిడ్డంగా అడుగులేశాడు. అదిరింది అన్నారందరూ.. ఆత్మనైతే అణచుకున్నాడు గానీ గుండెను ఎగదన్నే లావాను ఎలా దాచుకోగలడు.. నృత్యాన్నే సంకరం చేస్తున్న వారి మాటను అయిష్టంగానైనా వినాల్సివచ్చిందనే అపరాధ భావం అతణ్ని దహించి వేసింది. చెప్పుకునే వీల్లేదు.. చెప్పుకునేందుకు దిక్కూ లేదు.. ఏం చేయాలి? అధినాయకుడే గుర్తొచ్చాడు. ఆ విశ్వరూప గణపతి మూర్తికి గాయపడిన మనసును నివేదించాడు. వీరావేశంతో నర్తించాడు. గుండెలు కరిగేలా.. దిక్కులు అదిరేలా..’ ఈ సన్నివేశం ఎక్కడిదో ఈ పాటికే మీ మనసులో మెదలుతోంది కదూ. 1983లో వచ్చిన సాగర సంగమం సినిమాలోనిదే ఈ దృశ్యం. అయితే మీకు తెలియాల్సిందల్లా.. బాలూగా కమల్‌హాసన్ నర్తించింది మన ఖైరతాబాద్ వినాయకుని ముందే అని. ఇంతటి అద్భుత సన్నివేశం ఇలా మలచాలని దర్శకుడు కె.విశ్వనాథ్‌కి ఎలా స్ఫురించింది అని అడిగితే కళాతపస్వి ఏమన్నారో మీరే చదవండి. ‘నేను హోటల్ నుంచి షూటింగ్‌కు వెళ్తున్నప్పుడల్లా... ఈ విగ్రహాన్ని చూస్తుండేవాణ్ని. మద్రాసు నుంచి వచ్చిన మాకు ఈ భారీ విగ్రహం.. తయారీ అంతా కొత్తగా అనిపించేది. ఎలాగైనా సరే దీన్ని సినిమాలో చూపించాలని అప్పుడే మనసులో బీజం పడింది. అప్పుడు సాగరసంగమం షూట్ చేస్తున్నాం. కథానాయకుడు తన ఆత్మసాక్షికి విరుద్ధంగా సినిమా నృత్యదర్శకుడు కోరినట్టుగా నృత్యం చేయాల్సి రావడం.. ఎందుకిలా మంచి సాహిత్యాన్ని పాడు చేస్తున్నారని బాధపడే సన్నివేశాన్ని చిత్రీకరించాలి. అప్పుడు నాకు ఈ ఖైరతాబాద్ వినాయకుడి ఎదుట పశ్చాత్తాప దృశ్యాన్ని షూట్ చేస్తే బావుంటుందనిపించింది. అనుమతులు ఇతర విషయాల్ని యూనిట్వాళ్లకి అప్పగించా. నాకు ఇప్పటికీ బాగా గుర్తు. షూటింగ్ ముందు రోజు సాయంత్రం కమల్‌హాసన్‌ను హోటల్‌కు పిలిచి నా ఆలోచన వివరించాను. ఖైరతాబాద్ వినాయకుని ఎదుట దీన్ని తీశాము. అలా నా మనసులో మెరిసిన ఖైరతాబాద్ వినాయకుణ్ని తెరపై చూపగలిగాను. తెలుగు వారు గర్వించే చరిత్ర సొంతం చేసుకున్న ఈ వినాయకోత్సవ ప్రస్థానానికి 60 ఏళ్లు నిండాయంటే ఆశ్చర్యంగా.. ఆనందంగా ఉంది.’ -ఖైరతాబాద్ -
కమల్ సినిమాలో రజనీ?
రజనీకాంత్, కమల్‌హాసన్ ఒకప్పుడు కలిసి చాలా సినిమాలు చేసిన విషయం తెలిసిందే. ఇద్దరికీ స్టార్డమ్ వచ్చిన తర్వాత కలిసి నటించడం మానేశారు. మానేసారనేకన్నా.. ఇద్దరి ఇమేజ్‌కి తగ్గ కథ కుదరక కలిసి నటించలేదనడం సబబు. అయితే, ఈ ఏడాది ఈ కాంబినేషన్ తెరపై కనిపించే అవకాశం ఉందని సమాచారం. ప్రస్తుతం నటుడు రమేష్ అరవింద్ దర్శకత్వంలో కమల్‌హాసన్ ‘ఉత్తమ విలన్’ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో సీనియర్ దర్శకులు కె. విశ్వనాథ్, కె. బాలచందర్ కీలక పాత్రలు చేస్తున్నారు. కాగా, రజనీకాంత్ కూడా నటించనున్నారన్నది తాజా సమాచారం. తెరపై ఇలా కనిపించి అలా మాయమవుతారట. సినిమాలో ఓ వీడియో కాన్ఫరెన్స్‌కి సంబంధించిన సీన్లోనే రజనీ కనిపిస్తారని కోలీవుడ్ టాక్. ఒకవేళ నిజంగానే రజనీ, కమల్ కాంబినేషన్ కనిపిస్తే, కచ్చితంగా ప్రేక్షకులకు కనువిందే అని చెప్పొచ్చు. ఈ ఇద్దరూ కలిసి తెరపై కనిపించి చాలా సంవత్సరాలైంది కాబట్టి, వ్యాపారపరంగా కూడా సినిమాకి చాలా క్రేజ్ వస్తుందని చెప్పొచ్చు. ఈ చిత్రంలో కమల్ సరసన పూజాకుమార్, ఆండ్రియా కథానాయికలుగా నటిస్తుండగా ఓ ముఖ్య పాత్రను పార్వతీ మెల్టన్ చేస్తున్నారని సమాచారం.