కమల్ సినిమాలో రజనీ? | Rajini, Kamal film? | Sakshi
Sakshi News home page

కమల్ సినిమాలో రజనీ?

Published Sun, Mar 23 2014 12:50 AM | Last Updated on Sat, Sep 2 2017 5:01 AM

కమల్ సినిమాలో రజనీ?

కమల్ సినిమాలో రజనీ?

రజనీకాంత్, కమల్‌హాసన్ ఒకప్పుడు కలిసి చాలా సినిమాలు చేసిన విషయం తెలిసిందే. ఇద్దరికీ స్టార్‌డమ్ వచ్చిన తర్వాత కలిసి నటించడం మానేశారు. మానేసారనేకన్నా.. ఇద్దరి ఇమేజ్‌కి తగ్గ కథ కుదరక కలిసి నటించలేదనడం సబబు. అయితే, ఈ ఏడాది ఈ కాంబినేషన్ తెరపై కనిపించే అవకాశం ఉందని సమాచారం.

 

ప్రస్తుతం నటుడు రమేష్ అరవింద్ దర్శకత్వంలో కమల్‌హాసన్ ‘ఉత్తమ విలన్’ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో సీనియర్ దర్శకులు కె. విశ్వనాథ్, కె. బాలచందర్ కీలక పాత్రలు చేస్తున్నారు. కాగా, రజనీకాంత్ కూడా నటించనున్నారన్నది తాజా సమాచారం. తెరపై ఇలా కనిపించి అలా మాయమవుతారట.

 

సినిమాలో ఓ వీడియో కాన్ఫరెన్స్‌కి సంబంధించిన సీన్‌లోనే రజనీ కనిపిస్తారని కోలీవుడ్ టాక్. ఒకవేళ నిజంగానే రజనీ, కమల్ కాంబినేషన్ కనిపిస్తే, కచ్చితంగా ప్రేక్షకులకు కనువిందే అని చెప్పొచ్చు. ఈ ఇద్దరూ కలిసి తెరపై కనిపించి చాలా సంవత్సరాలైంది కాబట్టి, వ్యాపారపరంగా కూడా సినిమాకి చాలా క్రేజ్ వస్తుందని చెప్పొచ్చు. ఈ చిత్రంలో కమల్ సరసన పూజాకుమార్, ఆండ్రియా కథానాయికలుగా నటిస్తుండగా ఓ ముఖ్య పాత్రను పార్వతీ మెల్టన్ చేస్తున్నారని సమాచారం.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement