సాక్షి, చెన్నై: సూపర్‌స్టార్ రజనీకాంత్ రాజకీయ ప్రవేశంపై నటుడు కమల్ హాసన్ మరోసారి స్పందించారు. రజనీకాంత్ రాజకీయాల్లో రావాడాన్ని స్వాగతిస్తున్నానట్టు తెలిపారు. నడిగర్ సంఘం స్టార్ నైట్ కార్యక్రమానికి మలేసియా వెళుతూ చెన్నై విమానాశ్రయంలో కమల్ హాసన్ మీడియాతో మాట్లాడారు.
రాజకీయాల్లోకి వస్తున్నానని రజనీ ప్రకటన చేయగానే తాను స్వాగతించానని గుర్తుచేశారు. ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో టీటీవీ దినకరన్ విజయంపై తాను వ్యాఖ్యలు చేయటంపై కూడా కమల్ స్పందించారు. ఈ విషయంలో తనపై ఏ ఫిర్యాదులు, కేసులు వచ్చినా చట్టపరంగా ఎదుర్కొనేందుకు సిద్ధమని అన్నారు.
ఆర్కేనగర్ ఉప ఎన్నికలో ధనప్రభావం కారణంగానే దినకరన్ గెలిచారని, ఈ విజయం భారత ప్రజాస్వామ్యానికి మచ్చ అని కమల్ హాసన్ తీవ్రంగా విరుచుకుపడిన సంగతి తెలిసిందే. కమల్ హాసన్ వ్యాఖ్యలపై దినకరన్ వర్గీయులు తీవ్రంగా మండిపడుతున్నారు. కమల్‌పై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment