Rajini kanth
-
రజనీ సినిమాలో రణ్వీర్?
రజనీకాంత్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సన్ పిక్చర్స్ నిర్మించనున్న ఈ సినిమా చిత్రీకరణ వచ్చే ఏడాది వేసవిలోప్రారంభం కానుందనే టాక్ కోలీవుడ్‌లో వినిపిస్తోంది. అయితే ఈ సినిమాలోని ఓ కీలక పాత్ర కోసం దర్శకుడు లోకేష్ కనగరాజ్ బాలీవుడ్ స్టార్స్ షారుక్‌ఖాన్, రణ్వీర్ సింగ్‌లను సంప్రదించారట. అయితే ఇటీవల కాలంలో ఇతర చిత్రాల్లో ఎక్కువగా గెస్ట్ రోల్స్ చేసిన కారణంతో రజనీ సినిమాకు షారుక్ సున్నితంగా నో చెప్పారని, దీంతో రణ్‌వీర్‌సింగ్‌ను లోకేష్ కలిసి కథ వినిపించారని బాలీవుడ్లో ప్రచారం జరుగుతోంది. మరి... రజనీకాంత్ సినిమాలో రణ్‌వీర్‌సింగ్ నటిస్తారా? లెట్స్ వెయిట్ అండ్ సీ. మరోవైపు రజనీకాంత్ ప్రస్తుతం ‘వేట్టయాన్’ సినిమాతో బిజీగా ఉన్నారు. అలాగే రజనీకాంత్ ఓ లీడ్ రోల్ చేసిన ‘లాల్ సలామ్’ చిత్రం సంక్రాంతికి విడుదల కానుంది. -
పదిసార్లు ఫోన్ చేసినా సాయం లేదు.. డబ్బులేక ప్రాణాలు వదిలేసిన సింధు
కోలీవుడ్‌లో కొద్దిరోజుల క్రితం అనారోగ్యంతో నటి సింధు మరణించింది. ఈ ఘటన అక్కడి పరిశ్రమలో పెద్ద చర్చనీయాంశమైంది. గత కొన్నేళ్లుగా బ్రెస్ట్ క్యాన్సర్‌తో చికిత్స పొందుతూ.. వైద్య ఖర్చులకు డబ్బులేక, అంత పెద్ద ఇండస్ట్రీ నుంచి సాయం అందక ధీన స్థితిలో ప్రాణాలు వదిలిసేంది. ఈ వార్త తమిళనాట చాలా మందిని కలిచివేసింది. గతంలో సాయం కోసం ఆమె బహిరంగంగానే చేయి చాచింది. అందుకు సంబంధించిన వీడియోలను పలువురు నెటిజన్లు ఇప్పుడు షేర్ చేస్తున్నారు. 2020లోనే మీడియా ముందు సింధు కన్నీరు పెట్టుకుంటూ ఇలా మాట్లాడింది. ' నా ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింది. చికిత్స చేస్తే జబ్బు నుంచి కోలుకుంటానని వైద్యులు తెలిపారు. కానీ అందుకు అవసరమైన డబ్బు లేదు. ఇప్పటికే నా భర్త మరణంతో కుటుంబం కష్టాల్లో ఉంది. అనారోగ్యంతో నేను కూడా చనిపోతే నా కుమార్తె అనాథ అవుతుంది. ఇండస్ట్రీలోని పెద్దలు ఎవరైన సాయం చేయాలి' అని ఆమె కోరింది. (ఇదీ చదవండి: గూగుల్ మ్యాప్స్కెక్కిన చిరంజీవి.. సినీచరిత్రలోనే తొలిసారి!) గతంలో ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు సింధు మరణం తర్వాత వైరల్ అవుతున్నాయి. సింధు లాంటి మంచి మనసున్న మహిళ ఇన్ని కష్టాలు పడాల్సి వచ్చిందంటూ నటి షకీలా కూడా తెలిపింది. కోవిడ్ వ్యాప్తి సమయంలో చాలామంది జీవితాలు అస్తవ్యస్తమై తినేందుకు అన్నం కూడా లేకుండా పలువురు రోడ్డున పడ్డారు. అలాంటి వారికి ఆహారం అందించడానికి సింధు చొరవ తీసుకుందని షకీలా గుర్తుచేసింది. కోవిడ్ సమయంలో ధాతల నుంచి సేకరించిన వాటితో ఎంతోమందికి సాయం చేసింది. ఇలా ఎన్నో మంచి కార్యక్రమాలు చేసిన సింధు చాలా కష్టాలు పడాల్సి వచ్చిందని, దేవుడు ఉన్నాడా..? అనే అనుమానం కూడా కలుగుతోందని షకీలా చెప్పింది. వాళ్లెవరూ సాయం చేయలేదు: సింధు స్నేహితులు సింధు మరణం తర్వాత తన స్నేహితులు మీడియా ముందు చేసిన వ్యాఖ్యలు అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాయి. తమిళ పరిశ్రమలో ఉన్న సూపర్ స్టార్స్ ఎవరూ సింధుకు సహాయం చేయలేదని ఆమె స్నేహితులు అంటున్నారు. దీనిపై సినీ ఉలకం అనే తమిళ మీడియాలో వార్తలు వచ్చాయి. తనకు సహాయం చేయమని బహిరంగంగానే సింధు అభ్యర్థించింది. కానీ ఆమెకు చాలా తక్కువ మంది స్టార్స్ సాయం చేశారు. (ఇదీ చదవండి: జైలర్ రికార్డు స్థాయి వసూళ్లు, తొలిరోజు ఎన్ని కోట్లు వచ్చాయంటే?) రజనీకాంత్, విజయ్, అజిత్ లాంటి సూపర్ స్టార్లు ఎవరూ సహాయం చేయలేదు. బహుశా వారిలో ఏ ఒక్కరు సాయం చేసినా సింధును కాపాడి ఉండేవాళ్లమని స్నేహితులు ముక్తకంఠంతో చెప్పారు. చాలా రోజుల ముందే తమిళ మీడియాలో సింధు తన బాధలను బయటపెట్టింది. ఏడుస్తూనే సాయం కోసం అందరినీ వేడుకుంది. అయినా ఆమెకు ఎవరూ సాయం చేయకపోవడం బాధాకరమని వారు తెలిపారు. అజిత్ సాయం కోరితే... తనకు కేన్సర్ ఉన్నట్లు నిర్ధారణ కాగానే చికిత్స కోసం డబ్బు సాయం చేయమని చాలా మందిని సింధు వేడుకుంది. అందులో భాగంగానే హీరో అజిత్ మేనేజర్‌కి పదిసార్లు ఫోన్ చేసినప్పటికీ, అతను సింధుతో మాట్లాడలేదని గతంలో ఓ ఇంటర్వ్యూలో ఆమె తెలిపింది. దీంతో డైరెక్ట్‌గానే అజిత్ మేనేజర్ వద్దకు వెళ్లి తన ఆరోగ్య సమస్య గురించి చెప్పి సాయం చేయాలని కోరానని ఆమె చెప్పింది. అప్పుడు అజిత్ వద్ద సాధారణ ఫోన్ మాత్రమే ఉంటుందని మెడికల్ రిపోర్ట్స్ పంపించేందుకు వీలు కాదని ఆయన చెప్పడంతో అక్కడి నుంచి వెనుతిరిగానని సింధు పేర్కొంది. కనీసం ఫోన్లో అయినా తమ గురించి అజిత్‌కు చెప్పమని కోరానని, తన సమస్యను అజిత్ వద్దకు మేనేజర్ తీసుకుపోయాడో లేదో తెలియదు కానీ ఆయన నుంచి ఎలాంటి సాయం అందలేదని కొద్దిరోజుల క్రితమే సింధు ఈ వ్యాఖ్యలు చేసింది. ఆ సమయంలో ఎక్కడ పొరపాటు జరిగిందో తెలియదు కానీ అజిత్ సాయం చేసి ఉంటే సింధు ఖచ్చితంగా బతికి ఉండేదని తన స్నేహితులు తెలుపుతున్నారు. కోలీవుడ్‌లో ఒక చిన్న నటుడు కార్తీక్ మాత్రం సింధుకు రూ.20000 ఇచ్చాడని స్నేహితులు తెలిపారు. పరిశ్రమలో ఉండే గొప్ప కళాకారులకు సామాన్యుల మనస్సాక్షి ఎందుకు ఉండదని గతంలోనే కన్నీటితో సింధు ప్రశ్నించింది. కోలీవుడ్‌లో కూడా బిగ్ హీరోలందరూ కోట్ల పారితోషికం తీసుకుంటాన్నారు. అజిత్, విజయ్ ఒక సినిమాకు దాదాపు 100 కోట్ల పారితోషికం తీసుకుంటారు. వారి నుంచి సహాయం అందితే సింధు బతికి ఉండేదని పలువురు సోషల్ మీడియాలో వ్యాఖ్యానించారు. (ఇదీ చదవండి: Actress Sindhu: దీనస్థితిలో కన్నుమూసిన నటి.. ఆ వ్యాధితో) -
చిరు, రజిని మధ్యలో మహేష్… బాక్సాఫీస్ షేక్ అవ్వాల్సిందే
-
చంద్రబాబు మామూలోడు కాదు.. రజనీకాంత్ తో చేతులు కలిపి ...
-
తలైవా తో కేజీఎఫ్ రాకి భాయ్ అదిరిపోయే కాంబినేషన్
-
80 వయసు లో కూడా స్టార్ హీరోలకు ఝలక్ ఇస్తున్న అమిత బచ్చన్
-
32 ఏళ్ల తర్వాత మిత్రుడితో నటించేందుకు రెడీ అయిన రజినీ?
భారతీయ సినిమా రంగంలో ఇద్దరు దిగ్గజాలు 32 ఏళ్ల తర్వాత మళ్లీ ఒకే ఫ్రేమ్‌లో కనిపించనున్నారని కోలీవుడ్‌లో ప్రచారం జరుగుతుంది. సూపర్ స్టార్ రజినీకాంత్ 170వ చిత్రంలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ నటించనున్నారనేది ఇప్పుడు వైరల్ అవుతుంది. వీటికి ప్రధాన మూలం తన 170వ సినిమాకు 'జై భీమ్' ఫేమ్ టీజే జ్ఞానవేల్ దర్శకత్వం వహించనున్నారని రజనీ ప్రకటించడమే. భారీ బడ్జెట్‌తో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ నిర్మించనున్నట్లు కూడా ఆయన తెలిపాడు. (ఇదీ చదవండి: కాబోయే తోడి కోడలికి ఉపాసన గ్రాండ్ వెల్కమ్!) జైలర్ తర్వాత షూటింగ్ పనులు కూడా ప్రారంభమవుతాయని దర్శకుడు ప్రకటించాడు. దీంతో నటీనటుల ఎంపికపై రోజుకో వార్త వస్తుంది. ఈ స్టార్స్ కలిసి తక్కువ సినిమాల్లో కనిపించినా.. వారి మధ్య మంచి స్నేహం, సత్సంబంధాలు ఉన్నాయి. కాబట్టి ఈ ప్రచారం నిజం కావచ్చనడంలో సందేహం లేదు. మూడు దశాబ్దాల క్రితం హమ్, అంధ కానూన్, వంటి చిత్రాలతో బ్లాక్ బస్టర్ హిట్లను ఈ దిగ్గజ నటులు అందించిన విషయం తెలిసిందే. యదార్థ సంఘటనలే కథకు మూలం రజినీ కాంత్ 170 ఫిల్మ్ యదార్థ సంఘటనల ఆధారంగా రూపొందించబడుతున్నట్లు సమాచారం. ఇందులో పోలీసు ఆఫీసర్‌గా ఆయన నటించనున్నారట. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందించనున్న ఈ సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. 2024 చివరిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. (ఇదీ చదవండి: సమంత నవ్వులు.. మృణాల్ బోల్డ్ క్యాప్షన్) -
ఇండియన్ స్క్రీన్ పై నయా ట్రెండ్
-
ఆరోజు చెప్పిన వినలేదు..
-
దీపావళి ధమాకా!
-
విక్రమ్ వర్సెస్ బాషా?
-
తలైవాను తలపిస్తున్న రాఘవ లారెన్స్.. పిక్స్ వైరల్
రాఘవ లారెన్స్, ప్రియా భవానీ జంటగా నటిస్తున్న చిత్రం 'రుద్రన్'. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాకు కతిరేసన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను తెలుగులో రుద్రుడు పేరుతో రిలీజ్ చేస్తున్నారు. తమిళంలో ఫైవ్ స్టార్ క్రియేషన్స్ ఎల్ఎల్పి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. తాజాగా చిత్రబృందం విడుదల చేసిన లారెన్స్ పిక్ వైరల్‌గా మారింది. అచ్చం తమిళ సూపర్‌స్టార్ రజినీకాంత్‌ను తలపిస్తోంది. తలైవాను మరిపిస్తున్న రాఘవ లుక్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఆ ఫోటోలలో బ్లాక్ డ్రెస్‌తో లారెన్స్ అదరగొడుతున్నారు. మొదట క్రిస్మస్ కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు గతంలో వెల్లడించిన నిర్మాతలు.. తాజాగా ఈనెల 23న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. (చదవండి: కడసారి చూపునకు నోచుకోలేకపోయా: రాఘవ లారెన్స్ ఎమోషనల్) కరోనా ఎఫెక్ట్ తో కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు హీరో రాఘవ లారెన్స్. దాదాపు మూడేళ్లుగా ఆయన స్క్రీన్ మీద కనిపించలేదు. ఇక ఆయన త్వరలో రుద్రుడు అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రంలో శరత్ కుమార్, పూర్ణిమ భాగ్యరాజ్, నాజర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీకి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి ఆర్డీ రాజశేఖర్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. -
దుల్కర్ సల్మాన్ డైరెక్టర్‌తో రజనీ కాంత్ సినిమా?.. ఇదిగో క్లారిటీ!
Desingh Periyasamy Gave Clarity On Working With Rajini Kanth: 'కనులు కనులను దోచాయంటే' (తమిళంలో కన్ను కన్ను కొళ్లైయడిత్తాల్) చిత్రం ద్వారా పరిచయమైన దర్శకుడు దేసింగ్ పెరియసామి. దుల్కర్ సల్మాన్, రీతూవర్మ జంటగా నటించిన ఈ చిత్రం 2020లో విడుదలై అనూహ్య విజయాన్ని అందుకుంది. దీంతో ఈ దర్శకుడు పేరు మారుమ్రోగింది. పలువురు సినీ ప్రముఖులు ప్రసంశించారు. అందులో నటుడు, సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా ఉన్నారు. కాగా రజనీకాంత్‌తో దేసింగ్ పెరియస్వామి చిత్రం ఉంటుందని ప్రచారం జరిగింది. ఈయన చెప్పిన కథ రజనీకాంత్‌కు నచ్చేసిందని అందులో నటించడానికి ఆయన పచ్చ జెండా ఊపినట్లు ప్రచారం జరిగింది. అంతేకాకుండా 'అన్నాత్తే' చిత్రం తరువాత దేసింగ్ పెరియస్వామి దర్శకత్వంలో రజనీకాంత్ నటిస్తారని టాక్ కూడా స్ప్రెడ్ అయ్యింది. అయితే అనూహ్యంగా దర్శకుడు నెల్సన్ తెరపైకి వచ్చారు. విజయ్ హీరోగా బీస్ట్ చిత్రాన్ని తెరకెక్కించిన ఈయన తాజాగా రజనీకాంత్ కథానాయకుడిగా 'జైలర్' చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో దర్శకుడు దేసింగ్ పెరియస్వామి ఒక భేటీలో పేర్కొంటూ.. తన రెండో చిత్రం రజనీకాంత్ హీరోగా తెరకెక్కాల్సి ఉందని, కానీ కొన్ని కారణాలతో అది జరగలేదన్నారు. భవిష్యత్తులో ఖచ్చితంగా రజనీకాంత్‌ను డైరెక్ట్ చేస్తాననే నమ్మకం ఉందన్నారు. కొత్త చిత్రం వివరాలను త్వరలోనే వెల్లడిస్తానని పేర్కొన్నారు. చదవండి: సినిమా రిలీజ్‌ను అడ్డుకునేందుకు ప్రయత్నించారు: అమలా పాల్ ఎక్కువ ఫ్లాప్స్ ఇచ్చిన స్టార్స్ ఎవరని గూగుల్ చేసేవాడిని: నితిన్ సుష్మితా సేన్ లైవ్ వీడియోలో మాజీ బాయ్‌ఫ్రెండ్.. లలిత్ ఎక్కడ? -
జైలర్‌గా రజనీ, ఖైదీగా చిరు.. కేరాఫ్ చెరసాల
జైలర్ డ్యూటీ చేయనున్నారు రజనీకాంత్.. ఖైదీగా జైలుకి వెళ్లారు చిరంజీవి.. కార్తీ కూడా ఖైదీగా జైలులో ఉంటారు... రణ్‌దీప్ హుడా కూడా ఖైదీయే.. ఇవన్నీ సినిమా జైళ్లు. ఈ సినిమాల్లోని కథలు కేరాఫ్ చెరసాల అంటూ జైలు బ్యాక్‌డ్రాప్‌లో ఉంటాయి. ఇక ఈ చిత్రాల విశేషాలు తెలుసుకుందాం. రజనీకాంత్ ఈ మధ్య చేసిన చిత్రాల్లో ‘దర్బార్’ ఒకటి. ఇందులో కమిషనర్ ఆఫ్ పోలీస్‌గా చెలరేగిపోయిన రజనీ తాజాగా జైలర్‌గా మారారు. రజనీ హీరోగా రూపొందనున్న 169 చిత్రానికి ‘జైలర్’ టైటిల్‌ని ఖరారు చేశారు. ఈ చిత్రానికి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకుడు. కాగా.. ఖైదీలుగా ఉన్న గ్యాంగ్స్టర్స్ జైలు నుంచి తప్పించుకోవడానికి వేసిన మాస్టర్ ప్లాన్‌ని జైలర్ ఎలా అడ్డుకున్నాడు? అనేది ఈ చిత్రం ప్రధానాంశమని సమాచారం. జైలర్ పాత్రలో రజనీని ఫుల్ మాస్‌గా చూపించనున్నారట నెల్సన్. ఇక రజనీ జైలర్ అయితే చిరంజీవి ఖైదీగా కనిపించనున్నారు. అయితే కాసేపు మాత్రమే. మోహన్‌లాల్ మలయాళ ‘లూసిఫర్’కి రీమేక్‌గా చిరంజీవి హీరోగా రూపొందుతున్న ‘గాడ్ ఫాదర్’లోనే ఈ జైలు సీన్స్ ఉన్నాయి. ప్రత్యర్థులు వేసిన నిందలతో ఖైదీగా చిరంజీవి జైలుకి వెళతారు. ఆ మధ్య ‘గాడ్ ఫాదర్’ షూటింగ్ లొకేషన్‌కి పవన్ కల్యాణ్ వెళ్లిన ఫొటో ఒకటి బయటికొచ్చింది. అందులో చిరంజీవి వేసుకున్న ఖైదీ దుస్తుల్లో చొక్కా పై 786 అని కనిపిస్తుంది. మోహన్‌రాజా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్ ఓ కీలక పాత్రలో కనిపిస్తారు. అటు కోలీవుడ్వైపు వెళితే... తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్న తమిళ హీరో కార్తీ నటిస్తున్న తాజా చిత్రం ‘సర్దార్’. ఇందులో కార్తీ తండ్రీ కొడుకుగా రెండు పాత్రల్లో కనిపించనున్నారు. తండ్రి పాత్రధారి ఖైదీగా కనిపిస్తారని సమాచారం. కొడుకు పోలీసాఫీసర్. పీఎస్ మిత్రన్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ఇది. కార్తీ నటించిన గత తమిళ చిత్రాలు తెలుగులోనూ విడుదలైనట్లే ‘సర్దార్’ కూడా తెలుగులోనూ విడుదలవుతుంది. ఇక హిందీ పరిశ్రమకు వెళ్తే... ‘స్వతంత్ర వీర్ సావర్కర్’ చిత్రం గురించి చెప్పుకోవాలి. స్వాతంత్య్ర సమర యోధుడు వినాయక్ దామోదర వీర్ సావర్కర్ బయోపిక్‌గా రూపొందుతున్న చిత్రం ఇది. వీర్ సావర్కర్ పాత్రను రణ్‌దీప్ హుడా చేస్తున్నారు. నటుడు మహేష్ మంజ్రేకర్ దర్శకుడు. వీర్ సావర్కర్ అండమాన్ జైలులో 20 ఏళ్లు గడిపారు. ఈ బయోపిక్‌లో జైలు జీవితానికి సంబంధించిన సీన్లు ఉంటాయి. ఇవే కాదు.. జైలు బ్యాక్‌డ్రాప్‌లో మరి కొన్ని చిత్రాలున్నాయి. కథ ఏదైనా ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉంటే కాసుల వర్షం షురూనే. -
67వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవం
-
ఆసుపత్రిని తలపించే అన్నాత్తే లొకేషన్!
సరిగ్గా నాలుగు నెలల క్రితం రజనీకాంత్ ‘అన్నాత్తే’ సెట్లో నలుగురికి కరోనా సోకి, షూటింగ్ నిలిచిపోయింది. రజనీ కూడా హైబీపీతో హాస్పిటల్లో చేరారు. ఆ తర్వాత కొంత గ్యాప్ తీసుకుని ‘అన్నాత్తే’ షూటింగ్‌ని ఆ మధ్య చెన్నైలో ఆరంభించారు. మార్చి 12 నుంచి హైదరాబాద్‌లో మళ్లీ షూటింగ్ చేస్తున్నారు. ఇటీవల కరోనా కారణంగా కొన్ని పెద్ద చిత్రాల షూటింగ్స్‌కి బ్రేక్ పడిన నేపథ్యంలో ‘అన్నాత్తే’ లొకేషన్లో తీసుకుంటున్న జాగ్రత్తలు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి. ఆ విశేషాలు... ► చిత్రబృందంలో ప్రతి ఒక్కరూ పీపీఈ సూట్‌ను ధరించాల్సిందే. సినిమాటోగ్రాఫర్‌కి కూడా మినహాయింపు లేదు. ప్రస్తుతం ‘అన్నాత్తే’ లొకేషన్‌కు ఎవరైనా వెళితే సినిమా షూటింగ్‌కు వెళ్లినట్లుగా ఉండదట. ఏదో ఆసుపత్రికి వెళ్లిన భావన కలుగుతుందట. జాగ్రత్తలు ఆ స్థాయిలో ఉన్నాయని తెలిసింది. ► ఇక హీరో రజనీకాంత్‌ను ప్రత్యేక జాగ్రత్తలతో చూసుకుంటున్నారు దర్శకుడు శివ. చిత్రయూనిట్‌లోని ఎవరైనా సరే రజనీకాంత్‌కు పది అడుగుల దూరం నుంచి మాట్లాడాల్సిందే. ఇక రజనీకాంత్‌తో కాంబినేషన్ సీన్స్ ఉన్న ఆర్టిస్టులు మాత్రమే చిత్రీకరణ అప్పుడు ఆయనకు దగ్గరగా ఉంటారు. ఆ ఆర్టిస్టులు కూడా షాట్ అయిపోయిన వెంటనే వారికి కేటాయించిన గదుల్లోకి వెళ్లిపోవాలి. ► రజనీకాంత్‌కు సన్నివేశాన్ని వివరించేందుకు దర్శకుడు శివ కూడా నాలుగు అడుగుల దూరాన్ని పాటిస్తున్నారట. అలాగే రజనీకాంత్ వంటి స్టార్ హీరో సెట్లో ఉన్నప్పుడు చిత్రబృందంలోని వారు, ఇతర నటీనటుల వ్యక్తిగత సహాయకులు ఆయనతో ఫోటోలు దిగేందుకు ఉత్సాహం చూపిస్తుంటారు. అలాంటి వాటికి పూర్తిగా అడ్డుకట్ట వేశారట శివ. మేకప్ వేసేందుకు రజనీ వ్యక్తిగత సహాయకులు మాత్రమే ఆయనకు అత్యంత దగ్గరగా వెళతారు. అలాగే రజనీకాంత్‌తో కాంబినేషన్ సీన్స్ ఉన్నవారు మినహా ఇతర నటీనటులెవరూ లొకేషన్‌కి రాకూడదనే నిబంధన విధించారట.} ► ప్రçస్తుతం రజనీకాంత్, నయనతార, మీనా కాంబినేషన్లో చిత్రీకరణ జరుగుతోందని సమాచారం. ఈ షెడ్యూల్ మే 10 వరకు జరుగుతుంది. ‘అన్నాత్తే’ చిత్రాన్ని నవంబరు 4న విడుదల చేయాలనుకుంటున్నారు. అందుకే కోవిడ్ సమస్యలను ఎదుర్కొని మరీ షూటింగ్‌ను కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం తమిళనాడులో థియేటర్స్ మూసి ఉన్నప్పటికీ నవంబరుకి పరిస్థితుల్లో మార్పు వస్తుందని ‘అన్నాత్తే’ టీమ్ భావిస్తోందట. అందుకే ఈ కరోనా సెకండ్ వేవ్ ప్రభావం ఎక్కువగా ఉన్నప్పటికీ తన వయసు (70)ని కూడా పక్కనపెట్టి రజనీ షూటింగ్లో పాల్గొంటున్నారు. -
రజనీకాంత్‌కు థ్యాంక్స్ చెప్పిన జగపతి బాబు..
సాక్షి, హైదరాబాద్ : రజనీకాంత్ నటిస్తున్న తాజా చిత్రం ‘అన్నాత్తే’.వచ్చే నెల చివరికల్లా ‘అన్నాత్తే’ సినిమా పూర్తి చేసి, గుమ్మడికాయ కొట్టేయాలని చిత్రబృందం ప్లాన్ అని సమాచారం. రజనీకాంత్ హీరోగా శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. రజనీకాంత్, జగపతిబాబుపై సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. వచ్చే నెల 10 వరకు జరిగే షెడ్యూల్‌తో చిత్రీకరణ దాదాపు పూర్తవుతుందట. ఆ తర్వాత చెన్నైలో ‘అన్నాత్తే’కి ఫైనల్ టచ్ ఇచ్చి, గుమ్మడికాయ కొడతారని తెలిసింది. దీపావళి సందర్భంగా ఈ ఏడాది నవంబరు 4న చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. బసిరెడ్డిని మించి.. ‘అరవింద సమేత వీరరాఘవ’ సినిమాలో బసిరెడ్డి పాత్రలో అదరగొట్టారు జగపతిబాబు. తాజాగా ‘అన్నాత్తే’లోని తన ఈవిల్ లుక్ బాగుంటుందని, ఫైనల్‌గా బసిరెడ్డిని మించిన పాత్ర తనకు ‘అన్నాత్తే’లో దొరికిందని, ఇందుకు రజనీకాంత్సార్కి ధన్యవాదాలు అని సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు జగపతిబాబు. -
ఒక అవార్డు... ఎన్నో ప్రశ్నలు!
రజనీకాంత్‌కు ఫాల్కే అవార్డు ప్రకటన అభిమానుల్లో ఆనందం రేపింది. కానీ, ప్రకటన సమయం, సందర్భం మాత్రం పరిశీలకుల నుంచి పలు విమర్శలకు దారి తీసింది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు మరో వారం ఉండగా తమిళ సూపర్ స్టార్‌కు అవార్డు ప్రకటించడంతో పలువురు కళ్ళెగరేస్తున్నారు. జాతీయ అవార్డులు, పద్మ పురస్కారాల వెనుక రాజకీయాలు, గత వివాదాలపై మళ్ళీ చర్చ రేగింది. రజనీకాంత్‌పై బి.జె.పి. అనుకూలుడనే ఓ ముద్ర ఉంది. నిజానికి, తమిళనాడు ఎన్నికలకు ముందు ఆయన రాజకీయ పార్టీ పెట్టే ఆలోచన బలంగానే చేశారు. కానీ, ఇటీవల ‘అన్నాత్తే’ చిత్ర షూటింగు వేళ హైదరాబాద్ లో అస్వస్థతకు గురై, హాస్పటల్ పాలయ్యారు. ఆ వెంటనే గత డిసెంబర్లో పార్టీ ఆలోచనను విరమించుకున్నారు. రాజకీయాల నుంచి వైదొలగుతున్నట్టు ప్రకటించారు. ద్రవిడ పార్టీలదే హవా అయిన తమిళనాట ఎలాగైనా జెండా ఎగరేయాలని బి.జె.పి భావిస్తోంది. అందుకోసం రజనీకాంత్ పార్టీ ద్వారా పరోక్ష రాజకీయ లబ్ధి పొందాలని బి.జె.పి ప్రయత్నించినట్లు పరిశీలకుల వాదన. తీరా రజనీ పార్టీ పెట్టలేదు. దాంతో, ఆఖరు నిమిషంలో ఈ అవార్డు ప్రకటనతోనైనా ఓటింగులో తమిళ తంబీలను ప్రసన్నం చేసుకోవాలని బి.జె.పి. అనుకుంటున్నట్లు వాదనలు వినిపిస్తున్నాయి. గతంలో... ఎవరెవరికి? పద్ధతి ప్రకారం చూస్తే, ‘‘భారతీయ సినిమా పురోగతికీ, అభివృద్ధికీ అందించిన అత్యున్నతసేవలకు గుర్తింపుగా’’ భారత ప్రభుత్వమిచ్చే అత్యున్నత సినీ అవార్డు – ఈ ఫాల్కే అవార్డు. భారతీయ సినీ పితామహుడైన దాదాసాహెబ్ ఫాల్కే పేరు మీద 1969లో ఈ అవార్డును నెలకొల్పారు. ఫాల్కే అవార్డు దక్కిన 51వ సినీ ప్రముఖుడు రజనీకాంత్. 2019వ సంవత్సరానికి గాను రజనీకి ఈ అవార్డు ప్రకటించారు. గతంలో తమిళంలో హీరో శివాజీ గణేశన్ (1996), దర్శక – నిర్మాత కె. బాలచందర్ (2000)లకు కూడా ఫాల్కే అవార్డు దక్కింది. వారి తర్వాత ఆ అవార్డు సాధించిన మూడో తమిళ సినీ ప్రముఖుడయ్యారు రజనీ. నిజానికి, దక్షిణాది సినీ ప్రముఖులకు ఫాల్కే అవార్డివ్వడం ఇది 13వ సారి. ఇప్పటి దాకా ఏడుగురు తెలుగు వారికి ఫాల్కే అవార్డు దక్కింది. తెలుగువారైన బి.ఎన్. రెడ్డి, పైడి జైరాజ్, ఎల్వీ ప్రసాద్, నాగిరెడ్డి, అక్కినేని, రామానాయుడు, కె. విశ్వనాథ్‌లు ఈ అవార్డు గ్రహీతల్లో ఉన్నారు. ఎదుగుదలకు ఏం చేశారు? రజనీకాంత్ ప్రతిభావంతుడు. దేశం గర్వించదగ్గ గొప్ప నటుడు. దేశ, విదేశాల్లో మంచి మార్కెట్ ఉన్న స్టార్. దానధర్మాలు చేసిన సహృదయుడు. అందులో ఎవరికీ భిన్నాభిప్రాయం లేదు. అయితే, సినీ నిర్మాణం, స్టూడియోల నిర్మాణం, పంపిణీ, ప్రదర్శన లాంటి శాఖలలో మౌలిక వసతుల సదుపాయాల కల్పన, విస్తృతికి ఆయన చేసిందేమిటి? దేశవ్యాప్తంగా సూపర్ స్టార్‌గా తనను ఇంతగా ఎదిగేలా చేసిన భారత సినీ పరిశ్రమ యొక్క ఎదుగుదలలో ఆయన వంతు భాగం ఎంత, ఏమిటి? ఫాల్కే అవార్డు మార్గదర్శ కాలను ప్రస్తావిస్తూ, పలువురు నెటిజెన్లు వేస్తున్న ప్రశ్నలు ఇవే. ఇది పూర్తిగా తమిళనాట ఎన్నికల వేళ కేంద్రంలోని అధికార పార్టీ చేసిన ఎలక్షన్ స్టంట్ అని వారు నొసలు చిట్లిస్తున్నారు. తమిళనాట ఎం.జి.ఆర్. తరువాత మళ్ళీ ఆ స్థాయి మాస్ ఫాలోయింగ్ సంపాదించిన మనిషి రజనీకాంత్. జన సంస్కృతిలో కలిసిపోయిన జానపద పాత్రగా మారిన వ్యక్తి రజనీకాంత్. తమిళంతో పాటు తెలుగు, హిందీ సహా పలు భాషల్లో ఆయన జనరంజకంగా నటించారు. రజనీ పంచ్ డైలాగులు, వాటి మీద జోకులు, ఆయనతో కార్టూన్ పాత్రలు, వీడియోలు రావడం ఆయన పాపులారిటీకి ప్రబల నిదర్శనం. కానీ, సినీరంగ పురోగతికి ఆయన చేసిందేమిటన్నప్పుడే అసలు ఇబ్బంది వచ్చి పడుతుంది.రజనీకాంత్ తన మునుపటి తరం హీరోల లాగా ఎక్కువ సినిమాలు చేయలేదు. ఇంకా చెప్పాలంటే – జనంలోనూ, సినిమాల్లోనూ వీలైనంత ఎక్కువగా కనిపించకుండా ఉంటే, తక్కువ ఎక్స్‌పోజర్‌తో ఎక్కువ కాలం నిలబడవచ్చనే ఫార్ములాను కనిపెట్టారు. తక్కువ సినిమాలు చేయడం ద్వారా, డిమాండ్ అండ్ సప్లయ్ సూత్రంలో తేడా తెచ్చి, ఒక రకమైన బాక్సాఫీస్ బ్లాక్ మార్కెట్‌ను సృష్టించారని తమిళ సినీ వ్యాపార విశ్లేషకుల మాట. ఒకప్పటి ఎన్టీఆర్, ఏయన్నార్. ఎం.జి.ఆర్, శివాజీ గణేశన్ లాగా ఏటా అనేక సినిమాలు చేసే పద్ధతికి విరుద్ధంగా – స్టార్లు తక్కువ సినిమాలు చేసి, ఎక్కువ డబ్బు పొందవచ్చనే పద్ధతి సినీసీమలో విస్తరించడానికి కారణం ఒకరకంగా రజనీయే! తెలుగులో చిరంజీవి మొదలు క్రమంగా తరువాతి స్టార్లంతా అదే బాట పట్టారు. దానివల్ల స్టార్ల పారితోషికం, సినీ వ్యాపారం చుక్కలనంటిదేమో కానీ, ఆ మేరకు సినీరంగంలో మరిన్ని చిత్రాల నిర్మాణం, ఉపాధి, విస్తరణ మాత్రం తగ్గాయి. అప్పట్లోనూ ఇలాగే...అవార్డుల పందేరం! వివాదం!! రజనీకి అవార్డివ్వడంతో అనేక పాత కథలు మళ్ళీ పైకొచ్చాయి. వాస్తవానికి, కొన్ని పార్టీలు – ప్రభుత్వాలు సొంత ప్రయోజనాల కోసం పాపులర్ అవార్డులను వాడుకోవడం ఎప్పుడూ ఉన్నదే! ఒకప్పటి కాంగ్రెస్ నుంచి ఇప్పటి బి.జె.పి దాకా కేంద్రంలో ఎవరు అధికారంలో ఉన్నా, ఇలాంటి సంఘటనలు జరిగాయి. జరుగుతూనే ఉన్నాయి. తమిళనాడు సంగతికే వస్తే, రాజకీయ కారణాల రీత్యానే హీరో ఎం.జి.ఆర్.కు ఒకప్పుడు జాతీయ ఉత్తమ నటుడంటూ ‘భరత’ అవార్డు ఇచ్చారు. బాక్సాఫీస్ హిట్ ‘రిక్షాక్కారన్’ (1971)లోని రిక్షావాలా పాత్ర, నటన మాటెలా ఉన్నా అప్పట్లో తమిళనాట అధికార డి.ఎం.కె. నుంచి బయటకొచ్చే ప్రయత్నాల్లో ఉన్న ఎం.జి.ఆర్.ను ఆకట్టుకొనేందుకు జాతీయ ఉత్తమ నటుడు అవార్డు పంచారు. ఆ రోజుల్లో అది పెను వివాదమే రేపింది. జాతీయ పత్రికలు ‘బ్లిట్జ్’, ‘లింక్’ లాంటివి మొదలు స్థానిక తమిళ పత్రిక ‘దినతంతి’ దాకా అన్నింటా అది చర్చనీయాంశం అయింది. ఒకదశలో ఆ అవార్డును వాపసు ఇచ్చేయాలని ఎం.జి.ఆర్. యోచించే దాకా వెళ్ళింది. అలాగే, ఎం.జి.ఆర్. చనిపోయిన వెంటనే ఆయనకు ‘భారతరత్న’ ప్రకటించారు. అది మరో వివాదం. 1989లో తమిళనాట అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా రాజీవ్ గాంధీ సారథ్యంలోని అప్పటి కేంద్ర ప్రభుత్వం 1988కి ఈ అవార్డు ప్రకటన చేసింది. తమిళనాట రాజకీయ లబ్ధి కోసమే అలా ‘భారతరత్న’ ఇచ్చారంటూ తీవ్ర విమర్శలు వచ్చాయి. అంతకు ముందు 1977లో తమిళ శాసనసభ ఎన్నికలుండగా తమిళ నేత కామరాజ్‌కు కూడా 1976లో ఇలాగే మరణానంతర ‘భారతరత్న’ ప్రకటన చేసింది ఇందిరాగాంధీ ప్రభుత్వం. తాజాగా మళ్ళీ తమిళనాటే ఎన్నికల వేళలోనే రజనీకాంత్ కు ఫాల్కే దక్కడం తాజా వివాదమై కూర్చుంది. ‘తమిళనాడులో ఎన్నికలు ఉన్నాయని రజనీకాంత్ కు ఫాల్కే అవార్డు ఇచ్చారా’ అని విలేఖరుల సమావేశంలో అడిగితే, అవార్డు ప్రకటించిన సాక్షాత్తూ కేంద్ర సమాచార, ప్రసారశాఖ మంత్రివర్యులు ‘మీరు ప్రశ్న సరిగ్గా వేయండి’ అంటూ రుసరుసలాడడం కొసమెరుపు. మొత్తం మీద ఒక రంగంలో అత్యుత్తమ సేవలకు గుర్తింపుగా గౌరవార్థం ఇవ్వాల్సిన అవార్డులు, స్వప్రయోజనాల కోసం అవసరార్థం వేసే బిస్కెట్లుగా మారాయని విమర్శ వస్తోంది. పలు విమర్శలకు ప్రభుత్వ పెద్దలు జవాబు చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అవార్డు కన్నా ఎక్కువ దాన్ని ప్రకటించిన సమయం, సందర్భం ప్రశ్నార్థకమయ్యాయి. ప్రధాన వార్తలయ్యాయి. అదే విషాదం. ఇదీ... మన తెలు‘గోడు’! సినీ రంగ పురోగతికి విశేష సేవలు అందించిన పలువురు తెలుగువారికి ఇప్పటికీ ‘పద్మ’ పురస్కారాల నుంచి ‘ఫాల్కే’ దాకా ఏవీ రాలేదు. అలా గుర్తింపు దక్కనివారిలో ఆనాటి ఎన్టీఆర్, యస్వీఆర్, సావిత్రి మొదలు ఇటీవలి దాసరి దాకా చాలామందే ఉన్నారు. స్టూడియో కట్టి, వివిధ భాషల్లో సినిమాలు నిర్మించి, తెలుగులో అత్యధిక చిత్రాల్లో హీరోగా నటించి, పంపిణీ, ప్రదర్శక శాఖల్లోనూ పాలు పంచుకున్న హీరో కృష్ణకు సైతం ఇప్పటికీ ఫాల్కే పురస్కారం దక్కనే లేదు. ఆ మాటకొస్తే, రాజకీయ కారణాల రీత్యా ఎం.జి.ఆర్.కు మరణానంతరం ‘భారతరత్న’ ఇచ్చిన ప్రభుత్వాలు మన తెలుగురత్నాలు ఎన్టీఆర్, పి.వి. నరసింహారావులను ఇప్పటికీ గుర్తించడమే లేదు. గంధర్వ గాయని ఎం.ఎస్. సుబ్బులక్ష్మికి ఇచ్చిన ‘భారతరత్న’ మన వాగ్గేయకారుడు మంగళంపల్లి బాలమురళీకృష్ణకు రాలేదు. లతా మంగేష్కర్, ఆశా భోంస్లేలకు దక్కినంత జాతీయ గౌరవం మన గాన కోయిలలు సుశీల, జానకిలకు లభించలేదు. ఏ అవార్డులు ప్రకటించినా దాదాపు ప్రతిసారీ తెలుగు వారి విషయంలో ఇదే తంతు. ఉత్తరాది, దక్షిణాది వివక్ష కూడా దీనికి ఒక కారణమని విమర్శ. – రెంటాల జయదేవ -
సూపర్‌స్టార్ సూపర్‌గా ఉన్నారు
‘సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు ఆరోగ్యం బాగాలేదు. తలైవా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు’ అనే వార్త ఆదివారం కోలీవుడ్‌లో హాట్‌టాపిక్ అయింది. ఆయన తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారని, వ్యవసాయ క్షేత్రంలోనే చికిత్స పొందుతున్నారు అన్నది ఆ వార్తల సారాంశం. అయితే రజనీకాంత్ పీఆర్వోను సాక్షి సంప్రదించగా ఆ వార్తల్లో ఎటువంటి నిజం లేదని స్పష్టం చేశారు. ‘‘సూపర్‌స్టార్ సూపర్‌గా ఉన్నారు. ఆయన తన నివాసంలోనే ఆరోగ్యంగా ఉన్నారు. ఇలాంటి అవాస్తవ వార్తలు ఎక్కడి నుంచి వస్తాయో అర్థం కావడం లేదు’’ అని తెలిపారు. ఇక రజనీకాంత్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ‘అన్నాత్తే’ అనే చిత్రం చేస్తున్నారు. డిసెంబర్లో ఈ సినిమా చిత్రీకరణలో జాయిన్ అవుతారట రజనీకాంత్. -
రజనీకి అజిత్ ఫోన్
సినిమా: సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు నటుడు అజిత్ ఫోన్ చేశారు. ఇదే ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న తాజా న్యూస్. రజనీకాంత్‌కు అజిత్ ఎందుకు చేశారు అన్న విషయం హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పుడు రజనీ నటుడిగా 45 ఏళ్ల మైలురాయిని అధిగమించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అజిత్ రజనీకాంత్‌కు ఫోన్ చేసి నటుడిగా 45 ఏళ్ల మైలు రాయిని టచ్ చేసిన సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రజనీకాంత్, అజిత్ అరగంటకుపైగా ముచ్చటించుకున్నట్లు సమాచారం. -
రజనీ కొత్త సినిమా టైటిల్ ఇదే
సూపర్ స్టార్ రజనీకాంత్ కొత్త సినిమా షూటింగ్ ప్రాంరంభమైంది. ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ నిర్మిస్తుండగా శివ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో కీర్తి సురేశ్, మీనా, ఖుష్బూ, ప్రకాశ్‌రాజ్, సూరి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. తలైవార్కి ఇది 168 చిత్రం కావడం విశేషం. ఎంతిరన్, పేట వంటి బ్లాక్‌బస్టర్ హిట్ల తర్వాత సన్ పిక్చర్స్ సంస్థ ఈ సినిమాను తెరకెక్కిస్తోంది. తాజాగా చిత్ర బృందం రజనీ 168 సినిమాకు ‘అన్నాతే’ అనే టైటిల్‌ను విడుదల చేసింది. ఈ మేరకు టైటిల్ వీడియోను సన్ పిక్చర్స్ సంస్థ తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేసింది. అయితే ఈ చిత్రంలో సీనియర్ నటి మీనా ప్రత్యేక పాత్రలో కనిపిస్తున్నారు. ఇక రజనీ- మీనా కాంబినేషన్లో తెరకెక్కిన ‘ముత్తు’ సినిమా హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. #Thalaivar168 is #Annaatthe#அண்ணாத்த@rajinikanth @directorsiva @KeerthyOfficial @immancomposer@prakashraaj @khushsundar @sooriofficial @actorsathish pic.twitter.com/GtaYEoKf6N — Sun Pictures (@sunpictures) February 24, 2020 ప్రముఖ దర్శకుడు మురుగదాస్ దర్శకతంలో రజనీ నటించిన ‘దర్బార్’ సంక్రాంతి బరితో దిగి సందడి చేసిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో నయనతార హీరోయిన్గా నటించారు. నివేదా థామస్, సునీల్ శెట్టి, మోగిబాబు కీలక పాత్రల్లో నటించారు. దర్బార్ లైకా ప్రొడక్షన్ తెరకెక్కించిన విషయం తెలిసిందే. దర్బార్‌లో రజనీ శక్తివంతమైన పోలీసు ఆఫీసర్ పాత్రలో కనిపించిన సంగతి విదితమే. -
నా రూటే సెపరేటు!
-
రజనీకాంత్ అసలు రాజకీయం ఇదీ!
సాక్షి, చెన్నై: పౌరసత్వం (సవరణ) చట్టానికి మద్దతుగా నటుడు రజనీకాంత్ చేసిన ప్రకటనకు వరుస కౌంటర్లు పేలుతున్నాయి. సీఏఏ, ఎన్పీఆర్ గురించి ప్రతిపక్ష పార్టీలు ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నాయన్న రజనీకాంత్ వ్యాఖ్యలను తమిళనాడు ప్రతిపక్ష నాయకులు తీవ్రంగా ఖండించారు. అలాగే కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఆర్థికమంత్రి చిదంబరం రజనీకాంత్‌పై విమర్శలు గుప్పించారు. అధికార బీజేపీ చేతిలో ఆయన కీలు బొమ్మగా మారిపోయాడని తమిళనాడు కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు అళగిరి మండిపడ్డారు. సీఏఏ అమల్లోకి వస్తే 17 కోట్ల మంది ముస్లింలు, మూడు కోట్ల మంది క్రైస్తవులతోపాటు 83 కోట్ల మంది హిందువులు కూడా ప్రభావితమవుతారు. అస్సాంలో 19 లక్షల మంది పౌరులను విదేశీయులుగా ప్రకటించారు. ఈ జాబితాలో ముస్లింలు, హిందువులు ఉన్నారనే సంగతి రజనీకాంత్‌కు తెలుసా అని అళగిరి ఆగ్రహం వ్యక్తం చేశారు. అసోంలో మాదిరిగా దేశవ్యాప్తంగా నిర్బంధ కేంద్రాలు ఏర్పాటు చేయాలను కుంటున్నారా? అని ప్రశ్నించారు. రజనీకాంత్ తమిళనాడులో మతపరమైన ఎజెండాను భుజానకెత్తుకున్నారని స్పష్టమైందనీ, రజనీ అసలు రాజకీయాలు ఇప్పుడు బహిర్గతమ య్యాయని విమర్శించారు. మతం ప్రాతిపదికన పౌరులపై వివక్ష చూపలేమని రాజ్యాంగం చాలా స్పష్టంగా పేర్కొందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి కె బాలకృష్ణన్ వ్యాఖ్యానించారు. బీజేపీకి రజనీకాంత్ మద్దతు ఇవ్వాలనుకుంటే ఇచ్చుకోవచ్చు.. కానీ వాస్తవాలను మరుగుపరచకూడదన్నారు. జనాభా గణన, ఎన్పీఆర్ వేర్వేరు అనే విషయాన్ని ఆయన మొదట అర్థం చేసుకోవాలని హితవు పలికారు. అలాగే కాంగ్రెస్ సీనియర్‌నేత, మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి పీ చిదంబరం రజనీకాంత్ వ్యాఖ్యలపై నిరాశ వ్యక్తం చేశారు. సీఏఏ ఎందుకు వివక్షాపూరితమైందో, రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 ఉల్లంఘన ఎలా అవుతుందో రజనీకాంత్ వివరించేవాడినని ఆయన ట్వీట్ చేశారు. అటు కాంగ్రెస్ నేత, ఎంపీ కార్తీచిదంబరం కూడా రజనీకాంత్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. కొత్త రాజకీయ పార్టీ పెడుతున్నట్లు రజనీ నటించాల్సిన అవసరం లేదని కార్తీ ఎద్దేవా చేశారు. ఆయన బీజేపీలో చేరవచ్చని పేర్కొన్నారు. కాగా పౌరసత్వ సవరణ చట్టానికి సూపర్‌స్టార్ రజనీకాంత్ మద్దతును ప్రకటించిన విషయం తెలిసిందే. సీఏఏపై బుధవారం స్పందించిన రజనీ సీఏఏ వలన ముస్లింలకు ఎలాంటి ముప్పు లేదని, ఒకవేళ అలాంటిది ఏదైనా జరిగితే వారి తరపున పోరాడే మొదటి వ్యక్తిని తానే అవుతానని రజనీ ప్రకటించారు. చదవండి :సీఏఏ, ఎన్పీఆర్పై రజనీకాంత్ కీలక వ్యాఖ్యలు Disappointed with Mr.Rajnikanth’s statement on CAA. If he had asked me, I would’ve explained to him why the CAA is discriminatory and violates Art 14 of the Constitution. — P. Chidambaram (@PChidambaram_IN) February 5, 2020 -
రజనీకి హత్యా బెదిరింపులు
పెరంబూరు : తమిళ సినీ సూపర్‌స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లోకి రాక ముందే ఆయనపై రాజకీయ దాడి జరుగుతోందా? అని అనిపించేది. అయితే ఏ విషయాన్నైనా ఆచి తూచి మాట్లాడే రజనీకాంత్ ఇటీవల జరిగిన ఒక కార్యక్రమంలో డ్రావిడులు అభిమానించే పెరియార్ గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వారి ఆగ్రహానికి గురవుతున్నారు.1971లో పెరియార్ ఆధ్వర్యంలో మూఢ నమ్మకాలకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళన ర్యాలీలో ఆయన హిందూ దేవుళ్ల చిత్ర పటాలను అవమానించేలా ప్రవర్తించారన్న విషయాన్ని నటుడు రజనీకాంత్ ప్రస్థావించారు. అది ఇప్పుడు ఆయనకు పెద్ద తల నొప్పిగా మారింది. (రజనీపై పిటిషన్‌ను తోసిపుచ్చిన హైకోర్టు) ద్రవిడ విడుదలై కళగం, డీఎంకే వంటి పార్టీ నాయకులు రజనీపై మండి పడుతున్నారు. ఆయనపై పలు ప్రాంతాల్లో కేసులు నమోదవుతున్నాయి. క్షమాపణ చెప్పాలన్న డిమాండ్‌కు రజనీకాంత్ తలొగ్గలేదు. పత్రికల్లో చదివిందీ, విన్నదే తాను చెప్పానని, సారీ చెప్పనని రజనీకాంత్ తెగేసి చెప్పారు. ఆయనకు వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా రజనీకాంత్‌పై హాత్యాబెదిరింపులు వస్తున్నాయంటూ సినోరా పీఎస్.అశోక్ అనే వ్యక్తి చెన్నై పోలీస్ కమిషనర్ కార్యాలయంలో శనివారం పిర్యాదు చేశారు. అందులో గత 22వ తేదీన స్థానిక తేనాపంపేట సమీపంలో సెంమొళి పూంగా వద్ద ద్రావిడ విడుదలై కళగంకు చెందిన కొందరు ఉమాపతి ఆధ్వర్యంలో రజనీకాంత్‌కు వ్యతిరేకంగా ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించారన్నారు. రజనీకాంత్‌ను ప్రాణాలతో నవడవనీయమని హెచ్చరించారన్నారు. కాబట్టి ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్నవారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఆయన ఫిర్యాదును నమోదు చేసుకున్న పోలీస్ ఉన్నతాధికారులు విచారణ జరపాల్సిందిగా పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. (పెరియార్‌పై వ్యాఖ్యలు : క్షమాపణకు సూపర్‌స్టార్ నో..) -
రూ. 200 కోట్ల క్లబ్లో ‘దర్బార్’
సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకొచ్చిన రజనీకాంత్ దర్బార్ భారీ కలెక్షన్లను కొల్లగొడుతోంది. దర్బార్ కలెక్షన్ల సునామీతో రూ. 200 కోట్ల క్లబ్లో చేరి మరో రికార్డు సొంతం చేసుకుంది. విడులైన పదకొండు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా దర్బార్ రూ. 200 కోట్లు రాబట్టిందని ప్రముఖ ట్రేడ్ విశ్లేషకుడు త్రినాథ్ వెల్లడించారు. దీంతోపాటు ప్రపంచవ్యాప్తంగా రూ.200 కోట్ల వసూళ్లు రాబట్టిన రజనీకాంత్ ఐదో సినిమా ‘దర్బార్’ కావడం విశేషం. గతంలో రాజనీకాంత్ నటించిన ఎంతిరాన్, కబాలి, రోబో 2.ఓ, పేటా చిత్రాలు కూడా ప్రపంచవ్యాప్తంగా రూ. 200 కోట్ల కలెక్షన్లను సాధించాయి. కాగా ఈ భారీ కలెక్షన్లలో అధికభాగం తమిళనాడు నుంచి సుమారు రూ. 80 కోట్లు వచ్చాయని త్రినాథ్ పేర్కొన్నారు. అదేవిధంగా ‘దర్బార్’ మూవీ కేరళలో రూ. 8 కోట్లు, కర్ణాటకలో రూ.19 కోట్లు వసూలు చేసినట్లు తెలిపారు. చదవండి: దర్బార్: ట్విటర్లో ఏమంటున్నారంటే? రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి సుమారు రూ. 20 కోట్లు, హిందిలో రూ.8 కోట్లు రాబట్టిందని ఆయన పేర్కొన్నారు. అదేవిధంగా విదేశాల్లో సుమారు రూ. 70 కోట్లు వసూలు చేసిందని తెలిపారు. కోలీవుడ్ అగ్ర దర్శకుడు మురుగదాస్ తెరకెక్కించిన ‘దర్బార్’ సంక్రాంతి కానుకగా ఈ నెల 9న విడుదలైన సంగతి తెలిసిందే. అభిమానులకు కావాల్సిన మాస్‌మసాలా అంశాలు, పోరాట సన్నివేశాలు రజనీని సూపర్‌స్టైలిష్‌గా చూపించిన ‘దర్బార్’ సినిమా ప్రేక్షకుల హృదయాలను కొల్లగొడుతోంది. ముంబై పోలీసు కమిషనర్ ఆదిత్య అరుణాచలంగా నటించిన రజనీకాంత్ నటన, స్టైల్ ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తుండటంతో ఈ సినిమా భారీగా వసూళ్లు సాధిస్తోంది. చదవండి: దర్బార్ చిత్రంలో నయనతార పాత్ర దారుణం -
దర్బార్ ప్రీరిలీజ్ ఫంక్షన్
-
షారుక్.. కమల్.. 4 నిమిషాల్లో 51మంది
సాధనమ్మున పనులు సమకూరును ధరణిలోన..ప్రతిభ ఏ ఒక్కరి సొత్తూ కాదు అని కేరళకు చెందిన ఓ యువతి నిరూపిస్తోంది. మిమిక్రీ కళలో అద్భుతమైన ప్రతిభతో పలువురిని అబ్బుర పరుస్తోంది. మిమిక్రీ లేడీ సూపర్‌స్టార్‌గా దూసుకుపోతోంది. ప్రతీ సెకనుకు ఆమె గొంతు అద్భుతంగా వంపులు తిరుగుతుంది. ఆడ, మగ తేడా లేదు. సెలబ్రిటీలనుంచి ప్రముఖ రాజకీయవేత్తల దాకా ప్రముఖుల గొంతులను అనుకరిస్తారు. కేవలం నాలుగు నిమిషాల వ్యవధిలో 51మంది వాయిస్‌లను మిమిక్రీ చేయగల అసాధారణ నైపుణ్యం ఆమె సొంతం. ఇంటర్నెట్లో వైరల్ అవుతున్న ఈ అద్భుతం పేరే అఖిల. న్యూస్ మినిట్ కథనం ప్రకారం తిరువనంతపురం జిల్లా నేదుమంగాడ్ కు చెందిన అఖిలా ఎ.ఎస్ ఆయుర్వేద మెడిసిన్ చివరి సంవత్సరం చదువుతోంది. పాఠశాల స్థాయినుంచే స్వయంగా మిమిక్రీ కళపై ఆసక్తి పెంచుకున్న ఆమె ఇంటర్ స్కూల్ పోటీల్లో తొలిసారి మిమిక్రీ కళను ప్రదర్శించింది. మొదట జంతువులను అనుకరిస్తూ వచ్చింది. ఆ తరువాత స్కూలు వార్షికోత్సవాల్లో టీచర్లను అనుకరించేంది. అలా జానకమ్మ పాట ‘అజకాదల్’ పాడానని అఖిల గుర్తు చేసుకుంటారు. అనేక టీవీ, మిమిక్రీ షోలను చూస్తూ నిరంతర సాధనతోనే పరిణతి సాధించారు. అలా మిమిక్రీ కళలో రాణిస్తున్న తొలి కేరళ యువతిగా అఖిల నిలవడం విశేషం. ప్రముఖ హీరోలు రజనీకాంత్, కమల్‌హాసన్, షారూక్ ఖాన్ సహా అచ్యుతానందన్, ఉమెన్ చాందీ వంటి రాజకీయ నాయకులు స్వరాలు ఆమె గొంతులో అలవోకగా పలికిస్తుంది. దీంతోపాటు మైఖేల్ జాక్సన్ పాటల్లోని బీట్ శబ్దాలు కూడా ప్రత్యేకంగా ఆమె గొంతునుంచి జాలువారతాయి. పూక్కలం వరవాయ్ చిత్రంలో బేబీ షాలినికి కూడా ఆమె డబ్బింగ్ చెప్పారట. అంతేకాదు ధూమపాన వ్యతిరేక ప్రకటనల ద్వారా థియేటర్లలో వినిపించే గోపన్ నాయర్ వాయిస్‌ను అఖిల గొంతులో విని తీరాల్సిందే. ఓ టీవీలో ప్రసారమైన రియాలిటీ షో ద్వారా తనకు మంచి గుర్తింపు లభించిందని ఇంకా చేయాల్సి చాలా వుందంటారు అఖిల ఉత్సాహంగా. -
బాషా బర్త్‌డే స్పెషల్!
నడకలో వేగం, మానరిజంలో మాస్ అప్పీరియన్స్, డైలాగ్ డెలీవరీలో స్టైల్ ఇలా ఆయన ఏం చేసినా సమ్‌థింగ్ డిఫరెంట్‌గానే అనిపిస్తుంది. కండక్టర్ స్థాయి నుంచి సూపర్‌స్టార్ దాకా ఆయన ప్రస్థానం..ఎంతో మందికి ఆదర్శం. నటనలోనే కాదు, మానవతా దృక్పథంలోనూ ఎప్పుడూ ముందుంటారు మన సౌత్ ఇండియన్ సూపర్‌స్టార్. రజనీ కాంత్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి ఈ వీడియో క్లిక్ చేయండి. -
బాషా బర్త్‌డే స్పెషల్!
-
ఇక షురూ!
‘ఇక సెట్స్‌కు వెళ్లడమే మిగిలింది. అంతా రెడీ చేసుకున్నారు’.. ఇదీ రజనీకాంత్ కొత్త సినిమా గురించి కోలీవుడ్‌లో వినిపిస్తున్న మాట. రజనీకాంత్ హీరోగా శివ దర్శకత్వంలో స¯Œ పిక్చర్స్ పతాకంపై ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా చిత్రీకరణ వచ్చే నెల 5న మొదలవుతుందట. కథానాయికగా జ్యోతిక, కీర్తీ సురేష్‌ల పేర్లు వినిపించాయి. టైటిల్ ‘వ్యూహం’ అని టాక్. ఈ సినిమాకు డి. ఇమ్మాన్ సంగీతం అందించనున్నారు. ‘దర్బార్’ పాట రజనీకాంత్ హీరోగా ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘దర్బార్’. ఇందులో నయనతార కథానాయికగా నటించారు. లైకా ప్రొడక్షన్స్ నిర్మించింది. పోలీసాఫీసర్ ఆదిత్య అరుణాచలం పాత్రలో నటించారు రజనీకాంత్. దాదాపు పాతికేళ్ల తర్వాత ఆయన పోలీసాఫీసర్‌గా నటిస్తున్న చిత్రం ఇది. ఈ సినిమాలోని ‘చుమ్మక్కళై’ పాటను ఈ నెల 27న విడుదల చేయనున్నారు. ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం పాడిన ఈ పాటకు వివేక్ లిరిక్స్ అందించారు. ఈ సినిమాకు అనిరు«ద్ రవిచంద్రన్ స్వరకర్త. ‘దర్బార్’ చిత్రం వచ్చే ఏడాది జనవరి 9న విడుదల కానుందని తెలిసింది. -
అభిమానిని మందలించిన రజనీకాంత్
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒక్క తమిళనాడులోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఆయనకు ఎంతో మంది వీరాభిమానులు ఉన్నారు. తలైవా అంటూ ప్రేమగా పిలుచుకుంటారు ఆయన అభిమానులు. రీసెంట్గా ఏ.ఆర్.మురుగదాస్ దర్శకత్వంలో ‘దర్బార్’ సినిమా చేశాడు. ఈ సినిమా షూటింగ్ ముగియడంతో.. రిలాక్స్ కోసం రజనీ హిమాలయ యాత్రకు వెళ్లిన సంగతి తెలిసిందే. అక్కడ నుంచి శుక్రవారం అర్ధరాత్రి చైన్నైకు చేరుకున్నారు. ఈ క్రమంలో చెన్నై విమానాశ్రయంలో రజనీకాంత్‌కు స్వాగతం పలికేందుకు అభిమానులు పెద్ద ఎత్తున పోటెత్తారు. అంతేకాదు ఆయనతో సెల్పీలు దిగడం కోసం ఎగబడ్డారు. అక్కడున్న వారందరికీ రజినీకాంత్ కూల్‌గా సమాధాన మిచ్చి తన కారులో ఇంటికి బయలు దేరారు. ఇంతలో ఓ అభిమాని బైక్ పై రజనీ కారును ఫాలో అయ్యాడు. దీన్ని తీవ్రంగా పరిగణించిన రజనీకాంత్.. ఇంటికి చేరగానే ఆ సెక్యూరిటీ ద్వారా అభిమానిని లోపలికి పిలిపించుకుని ట్వీట్ వార్నింగ్ ఇచ్చాడు. ఇంత రాత్రివేళ బైక్ పై ప్రయాణించడం మంచిది కాదని మందలించాడు. మరోసారి ఇలా ఫాలో కావొద్దని చెప్పడమే కాకుండా ఆ అభిమానితో ఓ ఫొటో కూడా దిగారు. సోషల్ మీడియాలో ఈ విషయాన్ని ఆ అభిమానే స్వయంగా వెల్లడించాడు. Here's the video.... Thalaivaaaaaaaa🔥🔥🔥🔥❤️❤️#WelcomeBackThalaiva pic.twitter.com/qwRoKZsg5G — Viswa (@itsViswaa) October 18, 2019 -
వదంతులకు పుల్‌స్టాప్ పెట్టండి
సాక్షి, చెన్నై : ‘మీరు సినిమాల్లో వరుసగా నటించుకుంటూ పోతే అభ్యంతరం లేదు. అయితే బీజేపీకి మద్దతు అనే వదంతులు జోరుగా షికార్లు చేస్తున్నాయి. అలాంటి వదంతులకు పుల్‌స్టాప్ పెట్టండి’అని నటుడు రజనీకాంత్‌కు ఆయన అభిమానులు విజ్ఞప్తి చేస్తున్నారు. రజనీకాంత్ రాజకీయాల్లోకి రావాలన్నది ఆయన అభిమానులకు పాతికేళ్ల నుంచి ఉన్న కల. వారిని ఊరిస్తూ వస్తున్న రజనీకాంత్ ఎట్టకేలకు గత 2017లో స్పందించాడు. అభిమానులను ఆహ్వానించి స్థానిక కోడంబాక్కంలోని శ్రీరాఘవేంద్ర కల్యాణమంటపంలో వారితో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా రాజకీయ పార్టీని ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. అదే విధంగా తన అభిమాన సంఘాలను రజనీ ప్రజా సంఘాలుగా మార్చి రాష్ట్ర వ్యాప్తంగా నిర్వాహకులను ఏర్పాటు చేసి, సభ్యతం నమోదు భాధ్యతలను అప్పగించడంతో పాటు బూత్ కమిటీలను ఏర్పాటు చేశారు. నిర్వాహకులకు కోటి మంది సభ్యులుగా చేర్పించాలి్సందిగా టార్గెట్‌ను పెట్టారు. పార్లమెంట్ ఎన్నికల్లో నిరాశనే: అలాంటి సమయంలో గత పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేస్తారని భావించిన అభిమానులకు రజనీకాంత్ ఆ ఎన్నికలకు దూరంగా ఉండటం కాస్త నిరాశనే కలిగించింది. అయితే రాష్ట్ర శాసనసభ ఎన్నికలే మన లక్ష్యం. రానున్న శాసనసభ ఎన్నికల్లో 234 స్థానాల్లో పోటీకి సిద్ధం అని రజనీకాంత్ ప్రకటించడం అభిమానుల్లో సంతోషాన్ని నింపింది. వదంతులతో అయోమయం కాగా ఇటీవల రజనీకాంత్ బీజేపీకి అనుకూలంగా మాట్లాడటంతో, ఆ పార్టీకీ రజనీకాంత్ మద్దతునిస్తున్నారనే వదంతులు ప్రచారం అయ్యాయి. అందుకు ఆజ్యం పోసే విధంగా ఇటీవల రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవి ఖాళీ కావడంతో ఆ పదవి రనీకాంత్ను వరించబోతుందనే వదంతులు హల్చల్ చేశాయి. అయితే వీటిలో ఏ ఒక్క దానికి రజనీకాంత్ స్పందించకపోవడంతో రాజకీయ వాదులు, ముఖ్యంగా ఆయన అభిమానులు అయోమయంలో పడ్డారు. పుల్‌స్టాప్ పడేనా? మరో వైపు రజనీకాంత్ వరుసగా చిత్రాలు చేసుకుంటూ పోతున్నాడు. ప్రస్తుతం దర్భార్ చిత్రంలో నటిస్తున్న ఆయన తదుపరి శివ దర్శకత్వంలో నటించబోతున్నట్లు, మళ్లీ ఏఆర్.మురుగదాస్ దర్శకత్వంలో నటించడానికి పచ్చజెండా ఊపినట్లు ప్రచారం జోరుగా సాగుతోంది. దీంతో ఆయన అభిమానులు చాలా అయోమయానికి గురవుతున్నారు. ముఖ్యంగా బీజేపీపై రాష్ట్రంలో తీవ్ర వ్యతిరేకత ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో రజనీకాంత్ ఆ పార్టీకి మద్దతు ఇస్తున్నారనే ప్రచారం వారిని అయోమయంలో పడేసింది. వారిప్పుడు ఈ వదంతులకు తలైవా పుల్‌స్టాప్ పెట్టాలని కోరుకుంటున్నారు. రజనీకాంత్ వరుసగా సినిమాల్లో నటిస్తే తమకు అభ్యంతరం లేదు. అయితే ఒక సమావేశం ఏర్పాటు చేసి ఆయన అభప్రాయాన్ని స్పష్టంగా చెప్పాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. -
తార..తళుకుతార...నయనతార
ఎంత తేడా! ‘చంద్రముఖి’లో ‘నా పేరు దర్గా కాదు దుర్గ’ అని అమాయకంగా పలికిన అమ్మాయే...‘అనామిక’లో ఆవేశం మూర్తీభవించిన దుర్గావతారం ఎత్తింది. ఒకప్పుడు ‘తార తళుకు తార’ గ్లామర్ పాత్రల్లో మెరిసిన నయనతార...ఇప్పుడు తనదైన దారిలో పయనిస్తోంది. ‘లేడీ సూపర్‌స్టార్’ ఇమేజ్ దిశగా దూసుకెళ్తుంది. తాజాగా ‘అంజలి సి.బి.ఐ’గా అలరించిన నయన్ గురించి కొన్ని ముచ్చట్లు... మరింత స్పీడ్‌తో ‘ఇక సెలవా మరి’ అంటూ ఒక దశలో స్వల్ప విరామం తీసుకుంది నయన్. ఆ తరువాత సన్నిహితుల సలహాతో మళ్లీ నటించడం మొదలుపెట్టింది. ‘రెండోసారి ఆదరిస్తారా?’ అనే ప్రశ్న ఉదయించకముందే మరోసారి తన సత్తా చాటుకుంటుంది. ‘‘నాలో ఆత్మవిశ్వాసం పెరిగింది’’ అని రెట్టించిన ఉత్సాహంతో. బ్రాండ్ ఇమేజ్ ఫిల్మ్, ప్రైవేట్ ఫంక్షన్లకు నయనతార హాజరు కాదనే పేరు ఉంది. తన ‘బ్రాండ్ ఇమేజ్’ను మెల్లమెల్లగా పెంచుకోవడంలో భాగంగానే అలాంటి నిర్ణయం తీసుకుంది అంటారు సినీ విశ్లేషకులు. ఇక్కడ రెండు సినిమాలు చేయగానే బాలీవుడ్ బాట పట్టి అక్కడ ఫ్లాప్ ఎదురుకాగానే ‘ఏది ఏమైనా టాలీవుడే బెటర్’ అనే కథానాయికలను చూస్తుంటాం. అయితే నయన్ మాత్రం మొదటి నుంచి ‘సౌత్’నే నమ్ముకుంది. బాలీవుడ్ ప్రస్తావన వచ్చినప్పుడు... ‘‘ఇక్కడ పనిచేయడమంటే సొంత ఇంట్లో పనిచేస్తున్నంత సౌఖ్యంగా ఉంటుంది’’ అని సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ గురించి చెబుతుంటుంది నయన్. ఒక్క హిట్టు చాలు! ఎప్పుడూ టాప్‌లో ఉండటం సాధ్యమేనా? సాధ్యమా అసాధ్యమా అనేది వేరే విషయంగానీ... గెలుపు ఓటములను సమానంగా తీసుకుంటుంది నయన్.‘‘రెండు మూడు ఫ్లాప్‌లు వచ్చినా...ఒక హిట్ వస్తే చాలు ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారు’’ అంటోంది. ఆరోజుల్లోనే! పెర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ క్యారెక్టర్లు ఎంచుకోవాలనే నిర్ణయం నిన్నా మొన్నటిది కాదు...చాలా సంవత్సరాల క్రితమే ఒక ఇంటర్వ్యూలో ‘‘తెర మీద అందంగా కనిపించాలనుకోవడం తప్పేమీ కాదు. అయితే నాలోని నటనకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలనుకుంటున్నాను’’ అని చెప్పింది నయన్. ‘‘నయనతార క్రేజ్ యూత్, ఫ్యామిలీ ఆడియెన్స్‌పై ఎక్కువగా ఉండటం వల్ల ఓపెనింగ్స్ పెద్ద ఎత్తున రావడానికి ఉపయోగపడుతుంది’’ అనేది డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్ల మాట. -
విజయకాంత్, రజనీకాంత్ భేటీపై తీవ్ర చర్చ
సాక్షి, చెన్నై: నటుడు, డీఎండీకే పార్టీ అధ్యక్షుడు విజయకాంత్‌తో సూపర్ స్టార్ రజనీకాంత్ భేటీ అయ్యారు. శుక్రవారం ఉదయం విజయకాంత్ నివాసానికి వచ్చిన రజినీకాంత్ అరగంట సేపు అక్కడ గడిపారు. కేవలం విజయకాంత్‌ను పరామర్శించేందుకే తాను వచ్చినట్టు భేటీ అనంతరం రజనీకాంత్ పేర్కొన్నారు. అలాగే తమ భేటీకి రాజకీయ ప్రాధాన్యత లేదని తెలిపారు. కానీ ప్రస్తుతం తమిళనాడులో నెలకొన్న రాజకీయ నేపథ్యంలో వీరి భేటీ రాజకీయ వర్గాలో తీవ్ర చర్చకు దారితీసింది. లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీతో కలిసి అన్నాడీఎంకే కూటమిగా ఏర్పడితే.. డీఎంకే కాంగ్రెస్‌తో జత కట్టింది. అయితే తొలుత అన్నాడీఎంకే కూటమిలో చేరుతుందని భావించిన డీఎండీకే.. సీట్ల సర్దుబాటు కుదరక కూటమి నుంచి వైదొలుగుతున్నట్టుగా వార్తలు వెలువడ్డాయి. ఈ పరిణామాల మధ్య విజయకాంత్ తమ పార్టీ ఆశవహులు ఒంటరిగా బరిలో నిలువనున్నారనే సంకేతాలు పంపారు. ఈ నేపథ్యంలో గురువారం విజయకాంత్‌తో తమిళనాడు కాంగ్రెస్ కమిటీ తాజా మాజీ అధ్యక్షుడు తిరునావుక్కరసర్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారిద్దరు ప్రస్తుత రాజకీయ పరిణామాలపై చర్చించారు. పరోక్షంగా అన్నాడీఎంకే కూటమికి దూరంగా ఉండాలని ఆయన విజయకాంత్‌ను కోరినట్టుగా సమాచారం. అయితే ఆ మరుసటి రోజే రజినీకాంత్ విజయకాంత్‌తో భేటీ కావడంతో డీఎండీకే ఏ కూటమి వైపు మొగ్గు చూపుతుందనే దానిపై ఉత్కంఠత నెలకొంది. మరోవైపు రాజకీయ ఎంట్రీని స్పష్టం చేసిన రజినీకాంత్.. తాను రానున్న లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం పోటీ చేయనని తెల్చిచెప్పిన సంగతి తెలిసిందే. -
తమిళ్ మున్నేట్ర పడమ్
2018లో సినిమాలు చూశాం.గొప్పగా చెప్పుకున్నాం.2019లోనూ పక్కవాళ్ల సినిమాల కంటే గొప్పగా ఉండాలని కోరుకుందాం.2018లో తమిళులు సినిమాల్లో ముందడుగు ఎలా వేశారో తెలుసుకుందాం.మున్నేట్రమ్ అంటే ముందడుగు.ఇంద(ఈ) తమిళ్ మున్నేట్ర పడమ్ పాక్కలామ్ (చూద్దాం). సంవత్సరం పూర్తి కావస్తోంది. కొత్త ఏడాది మొదలుపెట్టాలంటే ఈ ఏడాది ఎలా గడిచిందో విశ్లేషించుకోవాలి. మన సినిమాలకు సంబంధించిన లెక్కలు మొదలుపెట్టేశాం. ప్లస్సులు, మైనస్సులు, లాభ నష్టాలు అన్నీ లెక్క తేలుతున్నాయి. మనం ఎలా ఉన్నామో తెలియడానికి స్వీయ విశ్లేషణ ఒక్కటే సరిపోదు... మనం ఎక్కడున్నామో తెలియాలంటే పక్క ఇండస్ట్రీ వాళ్లతో పోల్చి చూసుకుంటే తప్పు లేదు. ఈ ఏడాది తమిళంలో వచ్చిన ‘పడమ్’(సినిమా)ల ప్రస్తావన.ఈ ఏడాది మొదటి సినిమా సీజన్‌ను విక్రమ్, సూర్య మొదలెట్టారు. పొంగల్‌కు పోటీగా రిలీజ్ అయిన ‘స్కెచ్’, తానా సేంద కూట్టమ్(గ్యాంగ్)’ చిత్రాలు యావరేజులుగా నిలిచాయి. ‘తానా సేంద కూట్టమ్’ పాటలు మార్కెట్‌ను విపరీతంగా ఊపేసినా ప్రేక్షకులకు ఫుల్ మీల్స్ కాలేదనే చెప్పాలి. తెలుగు ప్రేక్షకులను భయపెట్టిన అనుష్క ‘భాగమతి’ ఏకకాలంలో తమిళంలోనూ విడుదలైంది. అక్కడ కొంత శాతం మాత్రమే ప్రేక్షకులు భయపడడంతో యావరేజ్‌గా నిలిచింది. అలా గ్రాండ్ స్టార్ట్ లేకుండానే 2018లో కొత్త ప్రయాణాన్ని మొదలుపెట్టింది తమిళ పరిశ్రమ. హంగామా లేదు ఫిబ్రవరిలో విజయ్ సేతుపతి ‘ఒరు నల్ల నాళ్ పాత్తు సొల్రేన్ (ఓ మంచి రోజు చూసి చెబుతాను) రిలీజ్ అయింది. ఈ సినిమా ద్వారా నిహారిక కొణిదెల తమిళ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమా పర్వాలేదనిపించుకుంది. జీవా, జై, శివ, కేథరీన్, నిక్కీ గల్రానీలతో దర్శకుడు సుందర్.సి తెరకెక్కించిన ‘కలకలప్పు 2’ అనుకున్నంత ఆడలేదు. ‘యాక్షన్ కింగ్’ అర్జున్ తన కుమార్తెను పరిచయం చేస్తూ తెరకెక్కించిన ‘సొల్లి విడవా’ సరిగ్గా ఆడలేదు. ‘36 వయదినిలే’తో కమ్‌బ్యాక్ ఇచ్చిన జ్యోతిక ఆ తర్వాత బాల దర్శకత్వంలో చేసిన చిత్రం ‘నాచ్చియార్’. ఇందులో పవర్ఫుల్ పోలీస్ అధికారిగా కనిపించారు జ్యోతిక. సినిమా బాగానే ఆడింది. మొదటి నెల లానే రెండో నెల కూడా కలకలప్పు (హంగామా) లేకుండా మామూలుగా గడిచింది. బొమ్మ పడలేదు మధ్యలో ఏర్పడ్డ థియేటర్ల సమస్య కారణంగా రిలీజ్లు పల్చబడ్డాయి. పూర్తిగా బంద్ అయ్యాయి కూడా. దాంతో వెండితెరపై బొమ్మ పడలేదు. బాక్స్‌లన్నీ ల్యాబుల్లోనే ఉండాల్సిన పరిస్థితి. ఆ వివాదం సద్దుమణిగిన తర్వాత ఆగిపోయిన చిత్రాలన్నీ కూడా గేటు వదిలిన నీళ్లలా వారానికి 4,5 చిత్రాలు విడుదలయ్యాయి. విభిన్న కథ– స్క్రీన్‌ప్లేతో సినిమాలు రూపొందిస్తాడనే పేరు పొందిన కార్తీక్ సుబ్బరాజ్ సైలెంట్ థ్రిల్లర్ ‘మెర్కురీ’తో వచ్చాడు. ప్రభుదేవా ముఖ్య పాత్రలో నటించిన ఈ సైలెంట్ సినిమాకు మంచి చప్పట్లే పడ్డాయి. ‘మహానటి’ని ఏకకాలంలో ‘నడిగయర్ తిలగమ్’గా తమిళంలో రిలీజ్ చేశారు. సినిమాకు మంచి ప్రశంసలు వినపడ్డా అక్కడక్కడా జెమినీ గణేశన్ పాత్ర తీర్చిదిద్దిన విధానంపై కొందరు అసంతృప్తి వ్యక్తపరిచారు. మన ఫోన్లో ఉన్న సమాచారంతోనే మనల్ని ఎలా మభ్యపెట్టొచ్చు అనే కాన్సెప్ట్‌తో వచ్చిన ‘ఇరుంబుదురై’ (అభిమన్యుడు) చిత్రం విశాల్‌కు ఈ మధ్య కాలంలో పెద్ద హిట్‌గా నిలిచింది. మంచి వసూళ్లూ రాబట్టింది. కార్తీ రైతుగా కనిపించిన ‘కడైకుట్టి సింగం’ (చినబాబు) దెబ్బకు థియేటర్స్‌ను కన్నీటి పర్యంతం చేసేసింది. ఉద్వేగభరిత కుటుంబ కథా చిత్రంగా వంద రోజులాడేసింది. తమిళంలో మంచి హిట్ సాధించి, తెలుగులో ‘చిన్నబాబు’గా రిలీజ్ అయింది. తమిళ కమర్షియల్ సినిమాల్లో కనిపించే ఫార్ములాని పేరడీ చేసి తెరకెక్కించిన చిత్రం ‘తమిళ పడమ్ 2’. ‘తమిళ పడమ్’కు సీక్వెల్. బాగానే నవ్వుకున్నారు ఆడియన్స్. మన తెలుగు ‘సుడిగాడు’కు ఈ చిత్రమే ప్రేరణ. కామెడీ డాన్‌గా విజయ్ సేతుపతి చేసిన ‘జుంగా’ పెద్ద నష్టాన్నే మిగిల్చింది. యువన్ శంకర్ రాజా నిర్మాతగా మారి తీసిన ‘ప్యార్ ప్రేమ కాదల్’కు పాస్ మార్కులు పడ్డాయి. ఫస్ట్ పార్ట్‌కు ఐదేళ్ల గ్యాప్ తర్వాత వచ్చిన కమల్ హాసన్ ‘విశ్వరూపం 2’ చిత్రానికి తెలుగులో మంచి స్పందన రాకపోయినా తమిళంలో డీసెంట్ హిట్‌గా నిలిచింది. పలు వాయిదాల తర్వాత విడుదలైన నయనతార ‘ఇమైక్క నొడిగళ్’ మంచి హిట్ సాధించింది. ఈ సినిమా ద్వారానే రాశీ ఖన్నా తమిళ ఎంట్రీ ఇచ్చారు. శివకార్తికేయన్ ‘సీమరాజా’ పండగ సినిమాగా మిగిలిపోయింది. సమంత ‘యు టర్న్’ మంచి హిట్‌గా నిలిచింది. సీక్వెల్స్ ‘సామీ స్క్వేర్ (సామి 2), సండైకోళి 2 (పందెం కోడి 2) ఫస్ట్ పార్ట్ మ్యాజిక్‌ని రిపీట్ చేయలేకపోయాయి. విజయ్ దేవరకొండ ‘నోటా’కు మన దగ్గర అనుకున్నన్ని ఓట్లు పడకపోయినా తమిళంలో మంచి మెజారిటీ సాధించింది. ‘జయం’ రవి స్పేస్ సినిమా ‘టిక్ టిక్ టిక్’ కూడా మంచి ప్రయత్నం అనిపించుకుంది. చాలా కాలం తర్వాత మణిరత్నం సినిమా సూపర్ హిట్ టాక్ని తీసుకొచ్చింది. అరవింద స్వామి, శింబు, విజయ్ సేతుపతి ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన ఈ మల్టీస్టారర్ గ్యాంగ్‌స్టర్ డ్రామా ‘చెక్క చివంద వానమ్’(నవాబ్) మంచి సక్సెస్‌గా నిలిచింది. విజయ్ – మురగదాస్ కాంబినే షన్లో వచ్చిన ‘సర్కార్’ సినిమా కలెక్షన్స్‌ల వర్షం కురిపించింది. అందులో రాజకీయ వివాదాల సహాయం కూడా లేకపో లేదు. జ్యోతిక ‘కాట్రిన్ మొళి’ పర్వాలేదనిపించింది.ఈ ఏడాది తమిళ ఇండస్ట్రీ ఎక్కువగా డిస్కస్ చేసుకున్న సైకో థ్రిల్లర్ ‘రాక్షసన్’. విష్ణు విశాల్ హీరోగా నటించి, నిర్మించిన ఈ చిత్రం ఈ ఏడాది అద్భుతమైన రివ్యూలను సంపాదించిపెట్టింది. ప్రస్తుతం ఈ థ్రిల్లర్‌ను తెలుగులో రీమేక్ చేస్తున్నారు నితిన్. ఇలాంటి రివ్యూస్ అందుకున్న మరో సినిమా ‘పరియేరుమ్ పెరుమాళ్’. దళిత సిద్ధాంతాలతో, వాళ్లు ఎదుర్కొంటున్న సమస్యలతో మారి సెల్వరాజ్ రూపొందించిన ఈ చిత్రం కూడా మంచి రివ్యూలను అందుకుంది.దాదాపు 500 కోట్ల భారీ బడ్జెట్‌తో శంకర్ రూపొందించిన గ్రాఫికల్ సృష్టి చిట్టి. ‘2.0’ చూసిన ప్రేక్షకులు ‘హాలీవుడ్ సినిమా చూసినట్టే ఉంది’ అని అభినందించారు. ఆ ఆనందాన్ని కోట్లతో కలెక్షన్ల రూపంలో తెలియజేశారు. గత శుక్రవారం సుమారు నాలుగు సినిమాలు రిలీజ్ అయ్యాయి. ‘మారీ 2, అడంగామారు, కానా, సిలుక్కువారిపట్టి సింగం’ సినిమాలు విడుదలయ్యాయి. మామూలుగా తమిళనాడులో ఒకేసారి ఇన్ని సినిమాలు విడుదల నిషిద్ధం. రూల్ బ్రేక్ చేసి, థియేటర్లకొచ్చిన ఈ ఐదు సినిమాలూ వసూళ్లు పంచుకుంటున్నాయి. అలా ఈ ఏడాది స్టార్ హీరోలు ఫార్ములానే నమ్ముకుంటే.. యంగ్ హీరోలు కొత్త కొత్త కాన్సెప్ట్స్‌తో దూసుకుపోయారు. బాక్సాఫీస్ ఆకలి తీర్చడానికి స్టార్ హీరోల సినిమాలు.. వంక పెట్టడానికి వీల్లేకుండా రివ్యూలు సాధించిన చిన్న సినిమాలూ ఉన్నాయి. మార్కెట్ ఉన్న హీరోలు డబ్బింగ్ సినిమాల ద్వారా మనల్ని పలకరిస్తూనే ఉన్నారు. అలా తమిళ, తెలుగు ఇండస్ట్రీలు ఎప్పటికప్పుడు మంచి సినిమాలు మార్చుకుంటూ, కొత్త కథలను ఇచ్చి పుచ్చుకుంటూ.. బైలింగువల్స్గా కొనసాగాలని కోరుకుందాం. ఇండియన్ సినిమా స్థాయిని ఇంకొంచెం పైకి తీసుకెళ్లడానికి కిందుండి (భౌగోళికంగా) కృషి చేద్దాం. గ్యాంగ్స్ట్టర్ ఇయర్ ఈ ఏడాది ధనుష్ ‘ది ఎక్స్ట్రార్డినరీ జర్నీ ఆఫ్ ది ఫకీర్’ చిత్రం ద్వారా హాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. అలాగే వెట్రిమారన్ దర్శకత్వంలో రూపొందిన గ్యాంగ్‌స్టర్ డ్రామా ‘వడ చెన్నై’ రిలీజ్ అయింది. నార్త్ చెన్నైలోని ఓ గ్యాంగ్ గురించి చర్చించిన ఈ చిత్రం గ్యాంగ్‌స్టర్ చిత్రాల్లో ఓ డిఫరెంట్ అటెంప్ట్ అనిపించింది. అలాగే ‘మారి’ సీక్వెల్‌గా రూపొందిన ‘మారి 2’ను రిలీజ్ చేశారు. మరోవైపు ‘రాక్షసన్, పరియేరుమ్ పెరుమాళ్’ వంటి పేరు సంపాదించిపెట్టిన రెండు చిత్రాల దర్శకులు తమ నెక్ట్స్ సినిమాలను ధనుష్‌తో చేస్తున్నట్టు ప్రకటించేశారు. రజనీ ఎక్స్‌ప్రెస్ స్టార్ హీరోలు ఏడాదికి ఒక్కసారి కనిపించడమే ఎక్కువ అనుకుంటున్న రోజుల్లో సూపర్‌స్టార్ రజనీకాంత్ రెండు సినిమాలను రిలీజ్ చేశారు. మరో సినిమా షూటింగ్ కూడా పూర్తి చేశారు. ‘రోబో’ సీక్వెల్ ‘2.ఓ’ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తయి విడుదలలో జాప్యం అవుతూ వచ్చి ఈ ఏడాది రిలీజ్ అయింది. అలాగే పా. రంజిత్ తెరకెక్కించిన ‘కాలా’ జూలైలో రిలీజ్ అయింది. ‘కబాలీ’ తర్వాత రజనీతో తీసిన ‘కాలా’ సినిమాతో రంజిత్ అన్ని వర్గాల ఆడియన్స్‌ను రంజింపచేయలేకపోయారు. ఇక కార్తీక్ సుబ్బరాజ్‌తో రజనీ చేస్తున్న ‘పేట్టా’ షూటింగ్ కూడా అనుకున్నదానికంటే 15 రోజుల ముందే కంప్లీట్ చేసి ఆశ్చర్యపరిచారు. లేడీ సూపర్ స్టార్ రెండు డిఫరెంట్ జానర్ల సినిమాలతో ఈ ఏడాది స్క్రీన్‌పై కనిపించారు నయనతార. కొంతకాలంగా వాయిదా పడుతూ వస్తున్న క్రైమ్ థ్రిల్లర్ ‘ఇమైక్క నొడిగళ్’, డార్క్ కామెడీ ‘కోకో’ (కోలమావు కోకిల) చిత్రాలు రెండూ సూపర్‌హిట్. స్టార్ హీరోలకు సమానంగా ‘కోకో’కు చెన్నైలో ఉదయం నాలుగు గంటల షోలు ఏర్పాటు చేయడం విశేషం. నయన్ ఫాలోయింగ్ ఎలా ఉందో చెప్పడానికి ఇదో నిదర్శనం. పాంచ్ పటాకా ఈ మధ్య తమిళ సినిమాల గుర్తించి ప్రస్తావించాలంటే కచ్చితంగా డిస్కస్ చేయాల్సిన పేరులా విజయ్ సేతుపతి మారిపోయారు. దానికి కారణం ఆయన స్క్రిప్ట్‌ల ఎంపికే. ఈ ఏడాది ఏడు చిత్రాల్లో కనిపించారు సేతుపతి. (రెండు గెస్ట్ రోల్స్). ‘ఒరు నల్ల నాళ్ పాత్తు సొల్రేన్ (ఓ మంచి రోజు చూసి చెబుతాను) సినిమాతో ఓపెన్ చేసి ‘జుంగా, చెక్క చివంద వానమ్, 96, సీతకాత్తి’, సినిమాల్లో కనిపించారు. ‘జుంగా’లో అల్లరి డాన్‌గా కనిపిస్తే, ‘చెక్క చివంద వానమ్’లో పోలీస్ ఆఫీసర్ రసూల్‌గా కనిపించి, పవర్ కోసం పరిగెడుతున్న అన్నదమ్ములను ఏరిపారేశారు. ఆ తర్వాత టాక్ ఆఫ్ ది సౌత్ ఇండస్ట్రీ అయిన ‘96’లో కనిపించారు. జానకి, రామచంద్రన్ అనే ఇద్దరి ప్రేమకథను టేప్రికార్డర్లో పెట్టి రివైండ్ బటన్ నొక్కి అందర్నీ పాత జ్ఞాపకాల్లో పడేసిన సినిమా ఇది. హీరోగా కెరీర్ స్టార్ట్ చేసిన 8 సంవత్సరాల్లోనే సేతుపతి 25వ సినిమా (సీతకాత్తి) మైలు రాయి అందుకోవడం విశేషం. -
రెండో సీఎంకి నా ఛాయిస్ ఆయనే!
సాక్షి, తమిళసినిమా: స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన సూపర్‌హిట్ సినిమాలకు వరుసగా సీక్వెల్స్ వస్తున్నాయి. ఇప్పటికే రోబో సీక్వెల్ 2.ఓ వచ్చింది. త్వరలో భారతీయుడు సీక్వెల్ కూడా రాబోతోంది. మరి ‘ఒకే ఒక్కడు’ సినిమాకు కూడా సీక్వెల్ వస్తే.. అందులో ముఖ్యమంత్రి పాత్ర ఎవరు పోషిస్తారంటే.. ‘నా ఫస్ట్ ఛాయిస్ విజయ్‌నే’ అంటున్నారు శంకర్. ఆయన తాజా చిత్రం ‘2.ఓ’ ఇటీవల విడుదలై ప్రపంచవ్యాప్తంగా భారీ కలెక్షన్లను కొల్లగొడుతోంది. ఈ విషయాన్ని ఈ సినిమా కథానాయకుడు రజనీకాంత్ ఆదివారం రాత్రి తన తాజా చిత్రం పేట ఆడియో ఆవిష్కరణ సందర్భగా స్వయంగా చెప్పారు. దర్శకుడు శంకర్ ప్రస్తుతం కమల్‌హాసన్ కథానాయకుడిగా ఇండియన్- 2 చిత్రాన్ని తెరకెక్కించడంలో బిజీగా ఉన్నారు. ఈ నెల 14న ఈ చిత్రం ప్రారంభం కానున్నట్లు సమాచారం. కాగా, ఓ చానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన శంకర్.. మీ తదుపరి చిత్రం ఏంటన్న ప్రశ్నకు ముదల్వర్ (ఒకే ఒక్కడు) చిత్రానికి సీక్వెల్ చేసే ఆలోచన ఉందని తెలిపారు. ముదల్వర్ చిత్రాన్ని శంకర్ స్వీయ నిర్మాణంలో తెరకెక్కించారు. ముదల్వర్- 2లో హీరోగా ఎవరిని ఎంపిక చేయనున్నారన్న ప్రశ్నకు రజనీ, కమల్‌లలో ఒకరు నటించడానికి సిద్ధమంటే వారితోనే చేస్తానన్నారు. అయితే, స్క్రిప్ట్ యువ హీరోను డిమాండ్ చేస్తే తన ఫస్ట్ ఛాయిస్ ఇళయదళపతి విజయ్నేనని చెప్పారు. ఇండియన్- 2 చిత్రం పూర్తయిన తరువాతనే ముదల్వర్- 2 గురించి చర్చిస్తానని తెలిపారు. కాగా ఇంతకుముందు శంకర్, విజయ్‌ల కాంబినేషన్లో నన్భన్ (స్నేహితుడు) చిత్రం రూపొందింది. అయితే ఆ చిత్రం ఆశించిన విజయాన్ని అందుకోలేదు. -
రజనీకే ఆదరణ.. లంచగొండులను పట్టిస్తే ఆయనకు పూలమాల!
సాక్షి, పెరంబూరు : సూపర్‌స్టార్ రజనీకాంత్‌కే ప్రస్తుతం ప్రజల్లో అధిక ఆదరణ ఉందని కేంద్రమంత్రి, బీజేపీ నేత పొన్ రాధాకృష్టన్ అభిప్రాయపడ్డారు. లంచగొండులను పట్టిస్తే హీరో విజయ్‌కు పూలమాల వేసి స్వాగతిస్తాననీ చెప్పారు. విజయ్ తాజా చిత్రం ‘సర్కార్’ ఆడియో ఆవిష్కరణ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి. రాష్ట్రంలో అవినీతి, లంచగొండితనం రాజ్యమేలుతున్నాయని ఆయన పేర్కొనడం అన్నాడీఎంకే వర్గాల్లో ప్రకంపనలు రేపుతోంది. మరోవైపు బీజేపీ నేతలు సైతం విజయ్ వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుపడుతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రమంత్రి పొన్ రాధాకృష్ణన్ గురువారం ఉదయం తిరుచ్చి విమానాశ్రయంలో విలేకరులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా విలేకరుల ప్రశ్నలకు ఆయన ఈ విధంగా బదులిచ్చారు. ప్ర: హైడ్రో కార్బన్ పథకానికి వ్యతిరేకంగా డీఎంకే పోరాటం చేయడంపై మీ స్పందన? జ: అది పనికిమాలిన పని.. డీఎంకే, కాంగ్రెస్ పార్టీలకు హైడ్రో కార్బన్ పథకం గురించి మాట్లాడే అర్హత లేదు, ప్ర: బీజేపీకి వ్యతిరేకంగా రెండో స్వాతంత్య్ర పోరాటం చేస్తామంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ చేసిన వ్యాఖ్యల గురించి? జ: వారికి స్వాతంత్య్రం రాదు, ఎప్పుడూ ఊహల్లోనే పోరాటం చేస్తారు. ప్ర: నటుడు విజయ్ తాజాగా తాను సీఎంనైతే నిజాయితీగా ఉంటా. నటించనని అనడం గురించి మీ కామెంట్? జ: అందరూ ఎంజీఆర్, జయలలితలా కాలేరు. ఇప్పుడు ప్రజల మధ్య ఆదరణ ఉన్న నటుడు రజనీకాంత్ మాత్రమే. ప్ర: బీజేపీ రజనీకాంత్‌ను వెనుకేసుకురావడానికి కారణం? జ: ఎవరైనా రాజకీయాల్లోకి రావచ్చు. పలువురు నటులు, పత్రికల వాళ్లు వివిధ పార్టీలో కార్యకర్తలుగా ఉన్నారు. విజయ్ లంచం గురించి మాట్లాడుతున్నాడు. ఏదో ఆరోపణలు చేయాలని కాకుండా.. అలాంటి లండగొండులను పట్టిస్తే నేను ఆయన వద్దకు నేరుగా వెళ్లి పూలమాల వేసి స్వాగతిస్తాను. రజనీకాంత్‌కు మంచి మనిషి అని ప్రజల్లో పేరు ఉంది. ప్ర: రజనీకాంత్ బీజేపీకి మద్దతునిస్తారా? జ: రజనీకాంత్ ఇంకా పార్టీనే స్థాపించలేదు. ఐనా ఆయన బీజేపీకి మద్దతు తెలుపుతారా? లేదా అన్నది తెలియదు. ప్ర: లోక్‌సభ ఎన్నికలకు మరో 6 నెలల సమయం మాత్రమే ఉంది. మీ పార్టీ పరిస్థితి ఎలా ఉంది? జ: గత ఎన్నికల కంటే కూడా అధిక స్థానాలను బీజేపీ గెలుచుకుంటుంది. బీజేపీ 350 స్థానాలను సొంతంగా.. కూటమితో కలిసి 400లకు పైగా స్థానాలను గెలుచుకుని మళ్లీ గద్దెనెక్కుతుంది. -
రజనీకాంత్ పార్టీలోకి అళగిరి?
సాక్షి, చెన్నై : తమిళనాడు మాజీ సీఎం, డీఎంకే అధినేత కరుణానిధి మరణాంతరం ఆ పార్టీలో చోటుచేసుకున్న పరిణామాలు రాజకీయ వర్గాల్లో చర్చీనీయాంశమైంది. నిజమైన డీఎంకే కార్యకర్తలు తన వెంటే ఉన్నారని, డీఎంకేకి తానే అసలైన నాయకుడినని ఇటీవల అళగిరి సంచలన వ్యాఖ్యలకు తెరలేపిన విషయం తెలిసిందే. దీంతో డీఎంకేలో ఎంకే స్టాలిన్, అళగిరి మధ్య వారసత్వం పోరు జరుగుతోందన్న విషయం స్పష్టమైంది. ఈ నేపథ్యంలో తమిళనాడు రాజకీయాల్లో మరో సంచలన వార్త వినిపిస్తోంది. డీఎంకేలో నేతలంతా తనకు వ్యతిరేకంగా ఉన్నారని భావిస్తోన్న అళగిరి.. రజనీకాంత్‌కు చెందిన పార్టీలో చేరబోతున్నారన్న ఊహాగానాలు ఊపందుకున్నాయి. కరుణానిధి మృతి అనంతరం చెన్నైలోని కావేరి ఆసుపత్రికి వచ్చిన రజనీకాంత్.. అళగిరి, స్టాలిన్‌లతో కూడిన రెండు పోటోలను డీఎంకే సోమవారం విడుదల చేసింది. దానిలో రజనీకాంత్ అళగిరితో ఎంతో సన్నిహితంగా మాట్లాడుతుండగా, మరో ఫోటోలో స్టాలిన్‌తో మాట్లాడడం మాత్రం ఎంతో ఇబ్బందికరంగా ఫీలయినట్లు తెలుస్తోంది. కాగా రజనీకాంత్ పార్టీ ప్రారంభించిప్పుడు కరుణానిధిని కలిసి ఆశీస్సులు తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రజనీకాంత్, అళగిరి మధ్య స్నేహం కుదిరిందని, డీఎంకేలో తనకు ప్రాధాన్యత లేనందున రజనీకాంత్‌తో కలిసి వెళ్తారనే వార్తలు తమిళనాట వినిపిస్తున్నాయి. ఇదిలా వుండగా నేడు జరగనున్న డీఎంకే కార్యవర్గ సమావేశంలో పార్టీ భవిష్యత్తుపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుతం డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న స్టాలిన్నే పార్టీ అధ్యక్షుడుగా ఎన్నుకునే అవకాశాలు కనిపిస్తున్నట్లు సమాచారం. ఇదే జరిగితే అళగిరి మరింత దూకుడు పెంచే అవకాశం ఉంది. -
ఎట్టకేలకు రెడీ.. 2.0 రిలీజ్ డేట్ అనౌన్స్ చేసేశారు!
ఎదురుచూపులకు ఎట్టకేలకు తెరపడనుంది. అభిమానులు ఎప్పుడెప్పుడా అని నిరీక్షిస్తున్న 2.0 సినిమా వచ్చే నవంబర్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా విడుదల తేదీని చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఈ ఏడాది నవంబర్ 29న సినిమాను విడుదల చేయబోతున్నట్టు ప్రకటించింది. చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రోడక్షన్స్, చిత్ర దర్శకుడు శంకర్ ఈ మేరకు ట్విటర్లో తెలిపారు. రజనీకాంత్, అక్షయ్‌కుమార్ వంటి భారీ తారాగణంతో ‘రోబో’ సినిమాకు సీక్వెల్‌గా కళ్లు చెదిరే బడ్జెట్‌తో, భారీ సాంకేతిక హంగులతో 2.0 సినిమాను శంకర్ తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఎంతో ప్రతిష్టాత్మక ప్రాజెక్టు అయిన ఈ సినిమా గతంలోనే విడుదల కావాల్సి ఉంది. గతంలో పలు విడుదల తేదీలు ప్రచారంలో ఉన్నా.. వీఎఫ్ఎక్స్ వర్క్ కారణంగా సినిమా అనుకున్న తేదీ విడుదల కాలేదు. భారీ గ్రాఫిక్ వర్క్, వీఎఫ్ఎక్స్ టెక్నాలజీని ఈ సినిమా కోసం వాడటంతో చిత్రం పూర్తికావడానికి చాలా ఎక్కువ సమయమే పట్టింది. ఎట్టకేలకు వీఎఫ్ఎక్స్ కంపెనీ వీఎఫ్ఎక్స్ షాట్స్ డెలివరీ చేస్తామని హామీ ఇచ్చిందని, కాబట్టి నవంబర్ 29న ఈ సినిమాను విడుదల చేయబోతున్నామని శంకర్ ట్విటర్లో తెలిపారు. -
సినీ దర్శక నిర్మాత ఇకలేరు
పెరంబూరు: సీనియర్ దర్శక, నిర్మాత ఆర్.త్యాగరాజన్ ఆదివారం ఉదయం చెన్నైలో గుండెపోటుతో కన్నుమూశారు. ఈయన వయసు 74. తమిళం, తెలుగు, హిందీ అంటూ పలు భాషల్లో అనేక చిత్రాలను నిర్మించిన దివంగత ప్రఖ్యాత నిర్మాత చిన్నప్ప దేవర్‌కు త్యాగరాజన్ అల్లుడు అన్నది గమనార్హం. త్యాగరాజన్ ఎంజీఆర్ నటించిన పలు చిత్రాలను నిర్మించడంతో పాటు దర్శకుడిగా రజనీకాంత్‌తో తాయ్‌వీడు, అన్నై ఒర్ ఆలయం, తాయ్ మీదు సత్యం, అన్బుక్కు నాన్ అడిమై 8 చిత్రాలతో పాటు కమలహాసన్ హీరోగా రామ్‌లక్ష్మణన్, తాయ్ ఇల్లామల్ నాన్ ఇల్లై మూడు చిత్రాలు, విజయ్‌కాంత్‌తో నల్లనాళ్, అన్నైభూమి 3డీ, హిందీలో రజనీకాంత్, రాజేవ్‌ఖన్నాలతో రెండు చిత్రాలు అంటూ మొత్తం 35 చిత్రాలను తెరకెక్కించారు. శివకుమార్, శ్రీప్రియ జంటగా ఆట్టుక్కార అలమేలు, వెళ్లిక్కిళమై వ్రదం చిత్రాలు ఈయన దర్శకత్వంలో రూపొందినవే. ఆట్టుక్కార అలమేలు చిత్రం తెలుగులో పొట్టేలు పున్నమ్మ పేరుతో రీమేక్ అయ్యింది. స్థానిక పోరూర్, భారతీయార్ వీధి, కావేరి గార్డెన్లో కుటుంబ సభ్యులతో కలిసి జీవిస్తున్న త్యాగరాజన్ ఆదివారం ఉదయం గుండెపోటుతో హఠాన్మరణం పొందారు. ఈయనకు భార్య సుబ్బలక్ష్మి, కొడుకు వేల్మురుగన్, కూతురు షణ్ముగవడివు ఉన్నారు. త్యాగరాజన్ మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలియజేశారు. ఆయన భౌతికకాయానికి సోమవారం ఉదయం 10 గంటల ప్రాంతంలో వలసరవాక్కంలోని శ్మశాన వాటికలో అంత్యక్రియలు జరగనున్నాయి. -
నేను కాదు వారు రావాలి
తమిళసినిమా: సినిమా చాలా పవర్ఫుల్ మాధ్యమం. ఇక్కడ నుంచే చాలా మంది రాజకీయ భవిష్యత్తుకు బాటలు వేసుకున్నారు. ఇంకా ఆ పయనం కొనసాగుతూనే ఉంది. రజనీకాంత్, కమలహాసన్ వంటి సినీ ఉద్దండులు రాజకీయరంగంలో పునాదులు వేసుకునే ప్రయత్నంలో ఉన్నారు. ఇకపోతే ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరుడికి భావ స్వేచ్ఛ ఉంటుంది. సమాజంలో జరిగే సంఘటనపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేసే హక్కు ఉంటుంది. కాగా ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న సంఘటనలపై స్పందిస్తున్న నటుల్లో విజయ్‌సేతుపతి ఒకరు. తమిళ సినీ పరిశ్రమలో వరుస విజయాలతో దూసుకుపోతున్న ఈయన సామాజిక అంశాలపైనా దృష్టి సారిస్తున్నారు. ఆయన తూత్తుక్కుడి స్టెర్లైట్ పోరాటంలో గానీ, అంతకు ముందు జల్లికట్టు పోరాటం లాంటి సంఘటనపై తన అభిప్రాయాలను నిక్కచ్చిగా వెల్లడించారు. దీంతో విజయ్‌సేతుపతికి రాజకీయ మోహం ఏర్పడుతోందనే ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. ఇదే విషయాన్ని ఇటీవల విజయ్‌సేతుపతి వద్ద ప్రస్తావిస్తూ మీకు రాజకీయాల్లోకి ప్రవేశించే ఆలోచన ఉందా అని ప్రశ్నించగా తాను రాజకీయాల్లోకి కచ్చితంగా రానని స్పష్టం చేశారు. కారణం తనకు ప్రజల మీద అక్కరే కానీ, రాజకీయాలపై ఆసక్తి లేదన్నారు. ఇంకా చెప్పాలంలే తనకు రాజకీయాలపై సరైన అవగాహన లేదని, రాజకీయ పరిజ్ఞానం లేదని చెప్పారు. రాజకీయ పరిజ్ఞానం లేకుండా ఆ స్థానంలో కూర్చోకూడదన్నది తన అభిప్రాయం అన్నారు. ఈ వ్యవస్థలో జరుగుతున్న సరి అని కొందరూ, తప్పు అని మరి కొందరు అంటున్నారన్నారు. ఆ విధంగా సరైన నిర్ణయాన్ని మనం తీసుకోలేని పరిస్థితుల్లో ఉన్నామని పేర్కొన్నారు. అయితే నేటి యువత అలా కాదని, వారు చాలా వివేకం కలిగి ఉన్నారని అన్నారు. రాజకీయ పరిపక్వతతోనూ ఉన్నారని, వారే రాజకీయాల్లోకి రావాలని నటుడు విజయ్‌సేతుపతి పేర్కొన్నారు. అయితే ఆయన ఈ వ్యాఖ్యలు ఎవరికి చురకలో అన్నది చర్చకు దారి తీస్తోంది. విజయ్‌సేతుపతి నటించిన జుంగా చిత్రం త్వరలో విడుదలకు రెడీ అవుతోంది. ప్రస్తుతం ఆయన మణిరత్నం దర్శకత్వంలో సెక్క సివంద వానం చిత్రంలో నటిస్తున్నారు. త్వరలో రజినీకాంత్‌తో కలిసి కార్తీక్‌సుబ్బరాజ్ చిత్రంలో నటించడానికి రెడీ అవుతున్నారు. -
కాలాలో పోరాట సన్నివేశాలపై రగడ
తమిళసినిమా: కాలా చిత్రంలో 30 నిమిషాల పోరాట సన్నివేశాలు చోటు చేసుకున్నాయి. రజనీకాంత్ నటించిన తాజా చిత్రం కాలా. పా.రంజిత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 7వ తేదీన విడుదల కానుంది. ఇదిలాఉండగా రజనీకాంత్ రాజకీయ రంగప్రవేశానికి సిద్ధం అవుతున్నారు. ఆయన రాజకీయ రంగప్రవేశం అభిమానుల 25 ఏళ్ల ఆకాంక్ష. ఇలాంటి పరిస్థితుల్లో ఇటీవల తూత్తుక్కుడిలో స్టెరిలైట్ పోరాటంలో గాయపడిన వారిని పరామర్శిచడానికి రజనీకాంత్ వెళ్లిన విషయం తెలిసిందే. వారికి ఆర్థిక సాయం అందించిన రజనీకాంత్ అనంతరం విలేకరులతో మాట్లాడుతూ స్టెరిలైట్ పోరాటంలో సంఘ వ్యతిరేక శక్తుల ప్రమేయం ఉందని, అన్నిటికీ పోరాటాలు చేసుకుంటూ పోతే రాష్ట్రం శ్మశానం అవుతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. పోరాటానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిన రజనీ తన కాలా చిత్రంలో 30 నిమిషాల పాటు పోరాట దృశ్యాలు చోటు చేసుకోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
ఆ దిగ్గజాలతో అనిరుద్
తమిళసినిమా: యువ తరంగం అనిరుద్ సంగీతదర్శకుడిగా దూసుకుపోతున్నారు. తొలి చిత్రం 3తోనే వై దిస్ కొలైవెరి డీ.. అంటూ ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ యువ సంగీత దర్శకుడు ఆ తరువాత వెనుదిరిగి చూసుకోలేదు. తమిళంతో పాటు తెలుగులోనూ చిత్రాలు చేస్తూ మంచి పాపులారిటీని తెచ్చుకున్న అనిరుద్ వ్యక్తిగతంగా పలు విమర్శలను ఎదుర్కొన్నారు. అయితే అవేవి ఆయన వృత్తికి ఆటంకాలు కాలేదు. ప్రస్తుతం చేతి నిండా చిత్రాలతో యమ బిజీగా ఉన్నారు. అంతే కాదు అగ్ర నటీనటుల చిత్రాలకు సంగీతబాణీలు కడుతున్నారు. లేడీ సూపర్‌స్టార్ నయనతార నటిస్తున్న తాజా చిత్రం కొలమావు కోకిల చిత్రానికి అనిరుద్ అందించిన సంగీతం చర్చనీయాంశంగా మారింది. సూపర్‌స్టార్ రజినీకాంత్ కుటుంబ బంధువు అయిన ఈయనకిప్పుడు ఆయన చిత్రానికే సంగీతాన్ని అందించే అవకాశం వరించింది. ఎస్. రజనీకాంత్ తాజాగా కార్తీక్‌సుబ్బరాజ్ దర్శకత్వంలో నటించనున్న చిత్రానికి అనిరుద్ సంగీతబాణీలను కడుతున్నారు. ఇది ఒక విశేషం అయితే తాజాగా విశ్వనటుడు కమలహాసన్ తాజా చిత్రానికి ఆ సంచలన సంగీతదర్శకుడికే సంగీతాన్ని అందించే అవకాశం వచ్చిందన్నది తాజా సమాచారం. కమల్ త్వరలో శంకర్ దర్శకత్వంలో ఇండియన్ 2 చిత్రాన్ని తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారు. రజనీకాంత్ నటించిన 2.ఓ చిత్ర నిర్మాణాంతర కార్యక్రమాలను పూర్తి చేస్తూనే మరో పక్క కమలహాసన్ ఇండియన్–2 చిత్ర ఫ్రీ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ఈయన దర్శకత్వం వహించిన తొలి చిత్రం జెంటిల్మెన్ నుంచి ఐ చిత్రం వరకూ ఏఆర్.రెహ్మాన్‌నే సంగీతాన్ని అందించారు. మధ్యలో అనియన్, నన్భన్ చిత్రాలకు మాత్రం హారీష్ జయరాజ్ సంగీతాన్ని అందించారు. తాజాగా ఇండియన్ 2 చిత్రంతో కలిపి మూడో చిత్రానికి ఇతర సంగీత దర్శకుడు పనిచేస్తున్నారన్న మాట. ఇండియన్–2 చిత్రానికి కమిట్ అయిన అనిరుద్‌ను దర్శకుడు శంకర్ ఒకే ఒక్క విషయం చెప్పారట. కొలమావు కోకిల చిత్ర సంగీత చర్చనీయాంశంగా మారిన తరుణంలో తన చిత్రానికి సంగీతాన్ని అందించే విషయంలో చాలా శ్రద్ధగా ఉండాలని సూచించారట. అంటే తన చిత్రానికి ఒరిజనల్ సంగీతం కావాలన్న భావాన్ని వ్యక్తం చేశారట. మరి ఈ రెండు దిగ్గజాల చిత్రాలతో అనిరుద్ తన సత్తాను ఎలా చాటుకుంటారో చూడాలి. ఏదేమైనా అనిరుద్ ఇప్పుడు స్టార్ సంగీతదర్శకుల పట్టికలో చేరిపోయారన్న మాట. -
ఆ రెండు పార్టీలపై కమల్, రజనీ కన్ను
పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఓటు బ్యాంకును కాపాడుకునేందుకు అన్ని పార్టీలూ తంటాలు పడుతున్నాయి. కొత్తగా రాజకీయాల్లో కాలుమోపిన నటులు కమల్‌హాసన్, రజనీకాంత్ డీఎంకే, అన్నాడీఎంకే ఓటర్లతో పాటు పార్టీ సభ్యత్వానికీ కన్నం వేసే ప్రయత్నంలో ఉన్నారని విశ్లేషకులు గుసగుసలాడుతున్నారు. ఆ పార్టీల కార్యకర్తలపై గురిపెట్టి సభ్యత్వ లక్ష్యాన్ని సాధించేందుకు వ్యూహం పన్నుతున్నట్లు సమాచారం. సాక్షి ప్రతినిధి, చెన్నై: అన్నాడీఎంకే, డీఎంకే పార్టీల్లోని అసంతృప్తిని గమనిస్తున్న కమల్, రజనీ ఆ పార్టీ కార్యకర్తలపై కన్నేశారని తెలుస్తోంది. తమ పార్టీల్లో చేర్చుకునేందుకు పావులు కదుపుతున్నట్లు సమాచారం. రాష్ట్ర రాజకీయాల్లో సుదీర్ఘ విరామం తరువాత తమిళ సినీరంగం నుంచి ఇద్దరు అగ్ర నటులు రాజకీయరంగ ప్రవేశం చేశారు. వెండితెరపై ఒకరిది మాస్, మరొకరిది క్లాస్. రాజకీయ తెరపై కూడా రజనీది ఆధ్యాత్మిక పార్టీ, కమల్‌ది ఇందుకు పూర్తిగా నాస్తిక పార్టీగా ప్రాచుర్యంలోకి వచ్చింది. అయితే నేను నాస్తిక వాదిని, నా పార్టీ కాదు అని కమల్ ఇటీవల వివరణ కూడా ఇచ్చుకున్నారు. అయితే ప్రజల మదిలో మాత్రం అన్నాడీఎంకేలా ఆధ్యాత్మిక ధోరణిలో రజనీ, డీఎంకేలా నాస్తికవాదంలో కమల్ రాజ కీయ ప్రయాణం సాగుతోందని, కేవలం ఈ ఒక్క విషయంలో ఆ రెండు పార్టీలకు ఈ రెండు పార్టీలు ప్రత్యామ్నాయాలని వ్యాఖ్యానిస్తున్నారు. కాగా ఎవరు రాజకీయ పార్టీ పెట్టినా ఇప్పటికే ఏదో ఒక పార్టీలో చురుగ్గా ఉండే కార్యకర్తలనే ఆకర్షించక తప్పదు. ఏదో కొద్ది శాతం మినహా రాజకీయాల పట్ల ఆసక్తి ఉన్నవారంతా ఏదో ఒక పార్టీలో సభ్యులుగా కొనసాగుతుంటారు. రాష్ట్రంలో అనేక జాతీయ, ప్రాంతీయ పార్టీలున్నా రాజకీయంగానేగాక, సభ్యత్వపరంగా కూడా డీఎంకే, అన్నాడీఎంకే మాత్రమే బలమైనవిగా భావించవచ్చు. అయితే అమ్మ మరణం, నాయకత్వ లేమితో అన్నాడీఎంకే బాగా బలహీనపడిపోయింది. ఇక పార్టీలోని భిన్న ధ్రువాలుగా ఉన్న నేతలను ఏకతాటిపైకి తేవడం అసాధ్యమని తేలిపోయింది. అన్నాడీఎంకేలో జనాకర్షణ ఉన్న నేత కరువయ్యాడు. ఏటా జరిగే సభ్యత్వ నమోదుకు, పునరుద్ధరణకు వేలాదిగా కార్యకర్తలు ముందుకు వచ్చేవారు. అన్నాడీఎంకే కార్యాలయం కిటకిటలాడి పోయేది. ఈ ఏడాది ఫిబ్రవరిలో సభ్యత్వ నమోదుకు పార్టీ కార్యాలయ తలుపులు తెరుచుకోగా గతంలో లాగా ఎవరూ ఆసక్తి చూపలేదు. ఇక డీఎంకే కార్యకలాపాలను అధ్యక్షుడు కరుణానిధి అస్వస్థకు గురికావడం కొందరిలో నిరాశను కలిగించింది. అమ్మ చనిపోయిన కొద్దిరోజుల్లోనే ఈ ప్రభుత్వాన్ని కూల్చివేసి, తమ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసి ఉండవచ్చు, వచ్చిన అవకాశాలను పార్టీ సద్వినియోగం చేసుకోవడం లేదని కొందరు అని అసంతృప్తితో ఉన్నారు. ఇలా రెండు పార్టీల్లోని అసంతృప్తిని గమనిస్తున్న కమల్, రజనీ ఆ పార్టీల కార్యకర్తలపై కన్నేశారు. తమ పార్టీల సభ్యత్వ నమోదు లక్ష్యాన్ని చేరుకోవాలంటే అన్నాడీఎంకే, డీఎంకే కార్యకర్తలను అక్కున చేర్చుకునేలా పావులు కదుపుతున్నట్లు సమాచారం. పార్టీలో సభ్యులైనపుడే తమ పార్టీకి చెందిన విజిల్ యాప్‌లో ఫిర్యాదులను నమోదు చేసేందుకు అర్హులవుతారని, అలా ఫిర్యాదులు చేసిన వారిని తాము తరచూ సంప్రదిస్తుంటామని కమల్ సంకేతాలు ఇచ్చారు. అలాగే రజనీ సైతం వీధికి కనీసం పది చొప్పున రజనీ మక్కల్ మన్రంలో సభ్యులుగా చేర్చాలని టార్గెట్ పెట్టారు. ఒక్కో వీధికి ఒక దరఖాస్తు ఫారం అందజేస్తున్నారు. ఈ ఒక దరఖాస్తు ద్వారా 30 మందిని సభ్యులుగా చేర్చవచ్చు. 1.50 కోట్ల సభ్యత్వ లక్ష్యాన్ని చేరుకోవాలంటే రెండు పార్టీల కార్యకర్తలను చేరదీయక తప్పదని భావిస్తున్నట్లు తెలుస్తోంది. డీఎంకే మాజీ మంత్రికి సన్నిహితంగా ఉన్న వ్యక్తి రజనీ మక్కల్ మన్రం రాష్ట్ర నిర్వాహకులుగా నియమితులయ్యారు. డీఎంకేతో ఉన్న పరిచయాలను రజనీ పార్టీ సభ్యత్వ నమోదుకు సద్వినియోగం చేసుకుంటున్నారు. -
పది కాలాల పాటు చెప్పుకునేలా..
తమిళసినిమా: దక్షిణాది ప్రేక్షకులు ఏ పాటి అభిమానం కురిపిస్తారోనన్న ఆసక్తితో ఎదురుచూస్తున్న ఉత్తరాది బ్యూటీ హ్యూమాఖురేషి. ఐశ్వర్యారాయ్, దీపికాపదుకొనే, సోనాక్షిసిన్హా వంటి బాలీవుడ్ బ్యూటీల తరువాత సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో జతకట్టే అవకాశాన్ని అందుకున్న నటి హ్యూమాఖురేషీ. రజనీకాంత్ నటించిన కాలా చిత్రంలో నటి ఈశ్వరిరావు ఆయన భార్యగా నటించగా, నటి హ్యూమాఖురేషి ఆయన ప్రియురాలిగా నటించిందని సమాచారం. హిందీ నటుడు నానాపటేకర్ ప్రతినాయకుడిగా నటించిన ఈ చిత్రానికి సంతోష్నారాయణన్ సంగీతాన్ని అందించారు. నటుడు ధనుష్ తన వండర్‌బార్ ఫిలింస్ పతాకంపై భారీ ఎత్తున నిర్మించిన కాలా చిత్రానికి పా.రంజిత్ దర్శకుడన్నది తెలిసిందే. కబాలి తరువాత వెంటనే రజనీకాంత్‌ను డైరెక్ట్ చేసిన అరుదైన దర్శకుల్లో ఆయన చేరతారు. కాలా చిత్ర విడుదలపై పలు ఊహాగానాలు ప్రచారం అయిన నేపథ్యంలో ఎట్టకేలకు అలాంటి ఊహాగానాలకు ఫుల్స్టాప్ పెట్టే విధంగా నిర్మాత ధనుష్ జూన్ 7న కాలా చిత్రం విడుదలను ఖరారు చేశారు. ఆ విధంగా తెరపైకి ఆదివారం ఒక ప్రకటనను విడుదల చేశారు. ఈ చిత్రం తమిళం, తెలుగు, హిందీ భాషల్లో విడుదల కానుంది. ఇందులో నటించిన హ్యూమాఖురేషీ కాలా చిత్రంలో నటించే అవకాశం కల్పించిన దర్శక నిర్మాతలకు, కథానాయకుడు రజనీకాంత్‌కు కృతజ్ఞతలు తెలుపుకుంది. ఇందులో తన 1980 కాలం నాటి రజనీకాంత్ ప్రియురాలిగా 45 ఏళ్ల ప్రౌడగా నటించినట్లు సమాచారం. హ్యూమాఖరేషి తన ట్విట్టర్లో పేర్కొంటూ కాలా చిత్రంలో నటించే అవకాశం కల్పించినందుకు, పది కాలాల పాటు గుర్తుండిపోయే మంచి పాత్రలో నటింపజేసినందుకు దర్శక నిర్మాతలకు, కథానాయకుడు రజనీకాంత్‌కు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అని పేర్కొంది. ముంబయిలోని ధారవి నేపథ్యంలో సాగే కాలా చిత్రంలో రజనీకాంత్ మరోసారి దాదాగా నటించారన్నది తెలిసిన విషయమే. ఇందులో 8 పాటలు చోటుచేసుకుంటాయట. కొన్ని సన్నివేశాలను ముంబయిలోని ధారవి ప్రాంతంలో చిత్రీకరించినా, అధిక భాగాన్ని చెన్నైలోనే ధారవిసెట్ను వేసి చిత్రీకరించారు. రజనీకాంత్ తన తాజా చిత్రాన్ని యువ దర్శకుడు కార్తీక్‌సుబ్బరాజ్ దర్శకత్వంలో నటించనున్నారు. ఈ చిత్రం జూన్ రెండవ వారంలో సెట్‌పైకి వెళ్లనున్నట్లు తాజా సమాచారం. -
7న ‘కాలా విడుదలయ్యేనా?
తమిళసినిమా: జూన్ 7న కాలా చిత్రం తెరపైకి రావడం ఖాయం కాదా? ప్రస్తుతం కోలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారిన అంశం ఇదే. 2.ఓ చిత్రం మాదిరిగానే కాలా చిత్రానికి అడ్డంకులు ఎదురై నిర్మాతలను ఇబ్బందికి గురిచేస్తున్నాయా అన్న చర్చ కూడా జరుగుతోంది. సూపర్‌స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రాలే ఈ రెండూ కావడం విశేషం. స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో లైకా సంస్థ నిర్మిస్తున్న బ్రహ్మాండ భారీ బడ్జెట్ చిత్రం 2.ఓ. ఈ చిత్ర నిర్మాణం మొదలై దాదాపు మూడేళ్లు కావస్తోంది. చిత్రీకరణ పూర్తి చేసుకునే చాలా కాలం అయినా నిర్మాణాంతర కార్యక్రమాల్లో(గ్రాఫిక్స్) జాప్యం కారణంగా ఇప్పటికే రెండుసార్లు విడుదల తేదీని వాయిదా వేయాల్సిన పరిస్థితి. చిత్ర ట్రైలర్‌ను విడుదల చేయడానికి సన్నాహాలు చేసినా, అది కాస్తా ముందుగానే సామాజిక మాధ్యమాల్లో లీక్ అవడంతో శంకర్ ఆ ట్రైలర్‌ను మూట కట్టి అటకెక్కించి కొత్తగా టీజర్‌ను రెడీ చేశారు. దీన్ని ఐపీఎల్ ఫైనల్ వేదికపై విడుదల చేయడానికి సిద్ధం అయినట్లు, అయితే ఇటీవల తూత్తుక్కుడిలో స్టెర్లైట్ కాల్పులు తమిళనాడును అతలాకుతలం చేయడంతో 2.ఓ చిత్ర యూనిట్ తన ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని వాయిదా వేసుకున్నట్లు ప్రచారం సోషల్ మీడియాల్లో వైరల్ అవుతోంది. ఇక రజనీకాంత్ కథానాయకుడిగా నటించిన మరో చిత్రం కాలా. దీన్ని ఆయన అల్లుడు, నటుడు ధనుష్ నిర్మించడం విశేషం కాగా, కబాలి చిత్రం ఫేమ్ పా.రంజిత్ దర్శకత్వం వహించారన్నది గమనార్హం. ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రం కంటే ముందు చిత్రీకరణ పూర్తి చేసుకున్న 2.ఓ చిత్రం గ్రాఫిక్స్ కార్యక్రమాలు పూర్తి కాకపోవడంతో ధనుష్ కాలా చిత్రాన్ని ముందు విడుదల చేయాలన్న నిర్ణయానికి వచ్చారు. గత ఏప్రిల్ 27న కాలా చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు వెల్లడించారు కూడా. అయితే ఆ సమయంలో చిత్ర పరిశ్రమ సమ్మె కాలా విడుదలకు అడ్డుపడింది. దీంతో జూన్ 7వ తేదీకి చిత్ర విడుదలను వాయిదా వేసుకోక తప్పలేదు. ఇక ఈ తేదీ మారే అవకాశం లేదులే అనుకుంటున్న సమయంలో తూత్తుక్కుడిలో స్టెర్లైట్ పరిశ్రమకు వ్యతిరేకంగా జరుగుతున్న ప్రజా పోరాటంలో పోలీసుల కాల్పులు, అమాయక ప్రజలను బలిగొనడం వంటి సంఘటనలతో ఇప్పుడు తమిళనాడు ఆగ్రహ జ్వాలలతో రగులుతోంది. రాజకీయ రంగప్రవేశానికి పునాదులు వేసుకుంటున్న రజనీకాంత్ ఈ సమయంలో కాలా చిత్రాన్ని విడుదల చేయడం శ్రేయస్కరం కాదన్న అభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం. 2.ఓ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఐపీఎల్ ఫైనల్ వేదికపై నిర్వహించాలన్న నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నట్టు గానే కాలా చిత్ర తెలుగు వెర్షన్ ఆడియోను ఈ వారంలో నిర్వహించాలన్న ప్రణాళికలోనూ మార్పులు చేసినట్లు సమాచారం. ఇలాంటి పరిస్థితుల్లో కాలా చిత్ర విడుదల జూన్ 7వ తేదీ ఉంటుందా? అన్న ప్రశ్న సర్వత్రా వ్యక్తం అవుతోంది. విషయం ఏమిటంటే ఈ రెండు చిత్రాల విడుదల రజనీకాంత్ రాజకీయ జీవితానికి ముడి పడిఉన్నాయన్నది. ఆయన రాజకీయ రంగప్రవేశం గురించి గత ఏడాది డిసెంబర్ 31వ తేదీన ప్రకటించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి రజనీకాంత్ నటించిన రెండు చిత్రాల విడుదలకు ఏదో ఒక రూపంలో అవాంతరాలు వస్తున్నాయన్నది గమనార్హం. -
‘కాలా’ ఫస్ట్ సింగిల్ రేపే
సినిమా విజయాలతో సంబంధం లేని తిరుగులేని స్టార్డమ్ సూపర్‌స్టార్ రజనీకాంత్ సొంతం. రజనీ సినిమా వస్తోందంటే చాలు అభిమానుల ఆనందానికి హద్దులు ఉండవు. రజనీపై ఉండే అభిమానం... సినిమా సక్సెస్‌పై ఆధారపడదు. సూపర్‌స్టార్‌కు ఇండియాలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. వరుసగా సినిమాలు నిరాశపరుస్తున్న అభిమానులు మాత్రం తలైవా సినిమా కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తూనే ఉన్నారు. కబాలి ఫేం పా.రంజిత్ డైరెక్షన్లో తెరకెక్కిన రజనీ తాజా చిత్రం ‘కాలా’.. ఈపాటికే సినిమా విడుదలై సంచనాలు సృష్టించాల్సింది. కానీ తమిళ పరిశ్రమలో నెలకొన్న పరిస్థితుల కారణంగా సినిమా ఆలస్యమైంది. లేటుగా వచ్చినా లేటేస్ట్‌గా వస్తా అనే డైలాగ్ ఎలాగూ రజనీకి ఉంది. కాలా సినిమా శాటిలైట్ హక్కులు భారీ రేటును పలికాయని తెలుస్తోంది. తలైవాకు ఉన్న క్రేజ్‌కు ఎంతైనా పెట్టొచ్చు అంటున్నారు అభిమానులు. ప్రముఖ హీరో, రజనీ అల్లుడైన ధనుష్ ఈ చిత్ర నిర్మాత అన్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన తాజా సమాచారాన్ని ధనుష్ ట్వీటర్ ద్వారా తెలియపరిచారు. మే 9న ఆడియో ఫంక్షన్‌ను నిర్వహిస్తున్నట్లు, రేపు (మే 1) సాయంత్రం ఏడు గంటలకు ఫస్ట్ సింగిల్‌ను రిలీజ్ చేయనున్నట్లు ట్వీట్ చేశాడు. ఈ సినిమాలో బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్ ప్రముఖులు నటించారు. ఈ సినిమాకు కబాలి ఫేం సంతోష్ నారాయణ్ సంగీతం సమకూర్చారు. ఈ చిత్రాన్ని జూన్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. A surprise to Superstar fans. #kaala 1st single #semmaweightu will be released tom evening at 7 pm. #rajinism #thalaivar @Music_Santhosh @beemji @vinod_offl @humasqureshi pic.twitter.com/mLDt1oCfm2 — Dhanush (@dhanushkraja) 30 April 2018 Wunderbar films presents, Superstar’s #kaalaa audio will release on #may9th ... get ready to celebrate thalaivars swag with Santosh narayanan’s stylish music. pic.twitter.com/FbrRwFmtng — Dhanush (@dhanushkraja) 28 April 2018 -
రజనీ బీజేపీకి కొమ్ము కాస్తున్నారు
తమిళసినిమా: నటుడు రజనీకాంత్ బీజేపీకి కొమ్ముకాస్తున్నారని సినీ దర్శకులు భారతీరాజా, అమీర్, నామ్ తమిళర్ పార్టీ నేత సీమాన్ విమర్శించారు. కావేరి మేనేజ్మెంట్ బోర్డు ఏర్పాటు, ఐపీఎల్ క్రికెట్ పోటీలను చెన్నైలో రద్దు చేయాలని బుధవారం సినీ ప్రముఖులతో పాటు పలువురు ఆందోళన బాట పట్టిన విషయం తెలిసిందే. ఈ పోరాటంలో ఒక పోలీస్ గాయపడ్డారు. దీంతో నామ్ తమిళర్ పార్టీకి చెందిన 11 మందిని పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. దీనిపై స్పందించిన రజనీకాంత్ హింసకు పరాకాష్ట అని తన ట్విట్టర్లో పేర్కొన్నారు. ఇలాఉండగా రజనీ వ్యాఖ్యలపై దర్శకుడు భారతీరాజా, అమీర్, గౌతమ్, నామ్ తమిళర్ పార్టీ నేత సీమాన్ తదితరులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కావేరి మేనేజ్మెంట్ బోర్డు ఏర్పాటు కోసం చేసిన ఆందోళనలో కొన్ని అనూహ్య సంఘటనలు జరిగాయని, అవేవీ హింసాత్మకం కాదన్నారు. కావేరి సమస్యపై కర్ణాటకలో తమిళ లారీ డ్రైవర్‌పై దాడి జరిగినప్పుడు రజనీకాంత్ ఎందుకు ఖండించలేదని ప్రశ్నించారు. రజనీ వ్యాఖ్యలు ఎవరి డబ్బింగో అని పరిహసించారు. రజనీ వ్యాఖ్యలను బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు తమిళిసై స్వాగతించడం చూస్తుంటే ఆయన బీజేపీకి కొమ్ముకాస్తున్నట్లు అర్థమవుతోందని దుయ్యబట్టారు. కేంద్రమంత్రి పొన్రాధాకష్టన్, తమిళిసై సౌందర్‌రాజన్‌లు తమిళులకు ద్రోహం చేస్తున్నారని, అరెస్ట్ చేసిన నామ్ తమిళర్ పార్టీ నేత సీమాన్‌ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తమది భవిష్యత్తు తరాల కోసం చేసే పోరాటం అని పేర్కొన్నారు. -
కమల్, రజనీకాంత్ సినిమాలను నిషేధించాలి
యశవంతపుర: కావేరి జలా వివాదాలకు సంబంధించి కర్ణాటకకు వ్యతిరేకంగా ప్రకటనలు ఇస్తున్న తమిళ నటులు కమల్ హాసన్, రజనీకాంత్ సినిమాలను నిషేధించాలని కన్నడ సంఘల నాయకులు తీర్మానించారు. బుధవారం కన్నడ చలనచిత్ర వాణిజ్య మండలి అధ్యక్షుడు సా.రా.గోవిందు బెంగళూరులో ప్రకటన విడుదల చేశారు. రాజకీయ పార్టీలను స్థాపించిన కమల్, రజనీలు తమిళనాడుకు మద్దతుగా తీర్మానాలు చేస్తున్నారన్నారు. అయితే కన్నడిగుడైన రజనీకాంత్ కర్ణాటకకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయటం మంచిదికాదన్నారు. ఆ ఇద్దరు నటులు నటించిన సినిమా ప్రదర్శనను నిషేధిస్తున్నట్లు సారా గోవిందు పేర్కొన్నారు. ఇప్పుటికే కన్నడ చళవళి వాటాల్ నాగరాజు వీరిద్దరి సినిమాలను నిషేధించాలని డిమాండ్ చేసిన్నట్లు గోవిందు గుర్తు చేశారు. -
ఒక్క సినిమాతో వంద సినిమాలు పుట్టించిన బాషా
బాషాలో మంచి సీన్ ఉంటుంది.రజనీకాంత్ చెల్లెలికి మెడిసిన్‌లో సీట్ కావాల్సి వస్తుంది. ఫ్రీ సీట్లు అయిపోయి ఉంటాయి. కాలేజీ ఓనరు ‘ఇక మిగిలింది నా చేతిలో ఉన్న ప్రయివేటు సీట్లే’ అంటాడు.‘ఆ సీటు కావాలంటే నువ్వు కాలేజీతో పాటు అప్పుడప్పుడు గెస్ట్‌హౌస్‌కు వచ్చిపోతుండాలి’ అని అంటాడు.ఈ మాటతో హతాశురాలైన రజనీకాంత్ చెల్లెలు క్యాంటీన్లో కూచుని కన్నీరు పెట్టుకుంటూ రజనీకాంత్‌తో అంటుంది– ‘కాలేజీకెళ్లి చదువుకోవచ్చు, హాస్టల్లో ఉండి చదువుకోవచ్చు, కాని గెస్ట్‌హౌస్‌కు వెళ్లి ఎలా చదవమంటావ్ అన్నయ్యా’. రజనీకాంత్ అప్పుడు ఆ అమ్మాయిని తీసుకుని కాలేజీ ఓనర్ దగ్గరకు వెళతాడు.‘ఏరా బెదిరించడానికి వచ్చావా నేనే పెద్ద రౌడీని’ అంటాడు ఓనర్.అప్పుడు రజనీకాంత్ అందరినీ బయటకు పంపించేసి ‘అయ్యా... నా పేరు మాణిక్యం’ అని టేబుల్ మీద చేతులు పెట్టి ముందుకు వొంగుతాడు.‘నాకు ఇంకో పేరు కూడా ఉంది’ అంటాడు.అంతే. ఆర్.ఆర్ మొదలవుతుంది. లోపల ఏం మాట్లాడుతున్నాడో మనకు వినిపించదు.అద్దాల గదిలో కాలేజీ ఓనరు సీట్లో నుంచి లేచి నిలుచోవడం, చెమటలు కక్కడం, రజనీకాంత్ ముందు చేతులు కట్టుకుని వణకడం... ప్రేక్షకులకు చాలా సంతృప్తిని, అహం తృప్తిని కలిగిస్తుంది.‘మా హీరో అంటే ఏమనుకుంటున్నావురా’.. అని వాళ్లు అనుకుంటారు. అతడు ఫ్లాష్‌బ్యాక్‌లో చాలా పెద్ద డాన్. తుపాకులతో, బుల్లెట్లతో ఆడుకున్నవాడు. అలాంటివాడు అజ్ఞాతంలో ఒక ఆటోవాడిలాగా బతుకుతుండొచ్చు. కాని పులి బోనులో ఉన్నంత మాత్రాన పులి కాకుండా పోతుందా?ఘనమైన ఫ్లాష్‌బ్యాక్ ఉండి కూడా అతి సామాన్యంగా బతుకుతున్న హీరో మళ్లీ జమ్మి చెట్టు మీద నుంచి అస్త్రాలు దించే తీరుతాడు అని ఎదురు చూసేలా చేసే ఫార్ములా ఇది.భారతం నుంచి బాషా వరకు ఆ ఫార్ములా సక్సెస్ అవుతూనే ఉంది. బాషాలో రజనీకాంత్ ఒక సరదా అయిన సగటు మనిషిలా మొదట కనిపిస్తాడు. కాని అతడిది అది అసలు రూపం కాదని ప్రేక్షకులకు తెలుస్తూనే ఉంటుంది. ఒక గొప్ప వీరుడు మారువేషంలో అజ్ఞాతంలో ఉన్నాడని దర్శకుడు హింట్స్ ఇస్తూ ఉంటాడు. ఆ పాత్రను ప్రేక్షకులే కాదు సాటి పాత్రలు కూడా తలెత్తి చూసేలా ఒక సన్నివేశం పెడతాడు. రజనీకాంత్ తమ్ముడికి పోలీస్ ఉద్యోగం వచ్చినప్పుడు ఇంటర్వ్యూలో కమిషనర్‌కు డౌట్ వస్తుంది. ‘మీ అన్నను రమ్మను’ అంటాడు. అప్పటికే ముంబై రికార్డ్స్‌లో బాషా మరణించాడని ఉంటుంది. ముంబైలో పని చేసి వచ్చిన ఆ కమిషనర్‌కు బాషా తెలుసు. ఇక్కడ ఉన్నది ఆ బాషాయేనా తెలుసుకోవడానికి రమ్మంటాడు. పెద్ద ఆఫీస్ రూమ్ అది.రజనీకాంత్ ఆటోవాలాలా ఎంట్రీ ఇస్తాడు. ఒక్కసారిగా కమిషనర్ లేచి నిలబడతాడు. పక్క పాత్రలూ ప్రేక్షకులు కూడా. మారువేషంలో ఉన్నది భీముడు అని కీచకుడు కనిపెట్టి అదిరిపడితే ఎలాంటి మజా వస్తుందో ఇక్కడ కూడా అలాంటి మజాయే ప్రేక్షకులకు వస్తుంది. రజనీకాంత్, చరణ్‌రాజ్ ముంబైలో స్నేహితులు. చిన్నప్పటి నుంచి కలిసి పెరిగారు. కాని ఆ ప్రాంతంలో డాన్ అయిన రఘువరన్ మురికివాడను ఖాళీ చేయిస్తుంటే రజనీకాంత్, చరణ్‌రాజ్ అడ్డు పడతారు. చావు ఎదురైనా ఇద్దరం కలిసే ఈ అన్యాయాన్ని ఎదిరిద్దాం అనుకుంటారు. కాని రఘవరన్ చాలా దుర్మార్గుడు. తన దగ్గర పని చేసే మేనేజర్ విజయకుమార్ కొడుకు కాబట్టి రజనీకాంత్‌ని వదిలిపెట్టి చరణ్‌రాజ్‌ను దారుణంగా హత్య చేయిస్తాడు. చరణ్‌రాజ్ పేరు అన్వర్ బాషా. చరణ్ రాజ్ మృతదేహం ఖననం అయ్యేలోపు రజనీకాంత్ అతణ్ణి చంపిన ప్రతి ఒక్కరినీ నరుకుతాడు. బస్తీ వాసులంతా ఈ దుష్ట శిక్షణకు జేజేలు పలుకుతారు. ఆ రోజు నుంచి రజనీకాంత్ తన పేరును మాణిక్ బాషాగా మార్చుకొని ముంబైలో పెద్ద డాన్‌గా మారుతాడు. కాని రఘువరన్‌కు, రజనీకాంత్‌కు మధ్య గొడవలు పెరిగిపోయి ఆ గొడవల్లో తండ్రి ప్రాణమే పోయే పరిస్థితి వచ్చేసరికి తండ్రి చివరి కోరిక మేరకు నేర జీవితం వదిలేసి చెన్నై చేరుకుని మామూలు జీవితం గడుపుతుంటాడు రజనీకాంత్. కాని తిరిగి పాత రూపం చూపించే పరిస్థితి వస్తుంది. ఒక లోకల్ రౌడీ తన కుటుంబాన్ని ఇబ్బంది పెడుతుంటే మాణిక్యం అవతారం చాలించి తిరిగి బాషా అవతారంలోకి వెళతాడు రజనీకాంత్.ఆ సన్నివేశం సినిమాలో ముఖ్యమైనది. అంతకు ముందు సన్నివేశాలలో ఆ రౌడీని చూసి రజనీకాంత్ భయపడినట్టుగా కనిపిస్తాడు. మనకెందుకు గొడవ అన్నట్టు పక్కకు తప్పుకుంటుంటాడు. చివరకు ఆ రౌడీ తనను స్తంభానికి కట్టేసి చితక బాదినా సహిస్తాడు. కాని ఎప్పుడైతే చెల్లెలి మీద ఆ రౌడీ చేయి వేస్తాడో... ఒకే గుద్దు... రౌడీ ఎగిరి కరెంట్ పోల్‌ను ఢీకొని కిందపడతాడు.రజనీకాంత్ మాణిక్యం అవతారాన్ని చాలించి తిరిగి బాషాగా మారాడన్న సంగతి తెలియగానే తల్లి అక్కడి నుంచి అందరినీ తీసుకెళ్లిపోతుంది. ప్రేక్షకుల రోమాలు నిక్క పొడుచుకుంటాయి. కేరెక్టర్ ఇమేజ్ ఆకాశానికి అంటుతుంది. ఇంతకుముందు సినిమాల్లో ఇలాంటి అనుభూతి లేదు.ఇది బాషా ఫార్ములా అనుభూతి. పాండవులు మారువేషంలో బతకడం సామాన్య జనులకు ఎంత అబ్బురమో హీరోలు మారువేషంలో బతకడం కూడా అంతే అబ్బురం. ఇచ్చిన మాటకు, విలువకు కట్టుబడి కుటుంబం కోసం సాధారణ జీవితం గడపడానికి వచ్చిన బాషా తిరిగి పాత రూపంలోకి వెళ్లి శత్రుశేషం ఎలా నిర్మూలించుకున్నాడన్నది క్లయిమాక్స్.సాధారణంగా సినిమాలు ముగిశాక శుభం కార్డు పడుతుంది. కాని బాషా ముగిశాక కూడా శుభం కార్డు పడలేదు. ఆ సినిమా కథ ముగియలేదు. ఇప్పటికీ అనేక కథలను పుట్టిస్తూనే ఉంది. ‘నేను ఒక్కసారి చెప్తే వందసార్లు చెప్పినట్టే’ అనేది ఇందులో పంచ్ డైలాగ్. ఒక్కసారి రిలీజైనా వంద విధాలుగా రీరిలీజ్ అవుతున్నదే– బాషా. ‘హమ్’ నుంచి స్ఫూర్తి పొంది... సురేశ్ కృష్ణ దర్శకత్వంలో 1995లో విడుదలైన ‘బాషా’ చాలా పెద్ద విజయం సాధించింది. ఒక రకంగా రజనీకాంత్ కెరీర్‌ని ఇంకో ఇరవై ఏళ్లు పొడిగించిన సినిమా ఇది. రజనీకాంత్ ఇమేజ్ భారీగా పెరడగానికి ఈ సినిమా ముఖ్యకారణం. దీని తర్వాత రజనీకాంత్ మల్టీ స్టారర్ హిందీ సినిమాలు మానుకొని సంవత్సరంలో రెండు మూడు సినిమాలు చేయడం మానుకొని ఒక్కసారికి ఒక్క సినిమా పద్ధతిలోకి వెళ్లి తన మార్కెట్ బాగా పెంచుకోగలిగాడు. 1991లో వచ్చిన ‘హమ్’ సినిమాలో నటించడం రజనీకాంత్‌కు లాభించింది. ఆ సినిమాలో అమితాబ్ ఇలాగే పెద్ద డాన్‌గా ఉండి అన్నీ మానేసి కుటుంబం కోసం అజ్ఞాతవాసంలోకి వెళ్లిపోతాడు. ఆ పాయింట్‌ను ‘బాషా’ కోసం కొత్తగా డెవలప్ చేసుకున్నాడు రజనీకాంత్. మంచి వయసు, ఆరోగ్యం ఉన్న రోజులలో వచ్చిన సినిమా కాబట్టి ఇందులో రజనీ పూర్తి ఎనర్జిటిక్‌గా కనిపిస్తాడు. ‘ప్రేమికుడు’తో తెర మీదకు వచ్చిన నగ్మా ఈ సినిమాతో రజనీ పక్కన నటించే చాన్స్ కొట్టేసింది. దేవా పాటలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చాలా ప్లస్ అయ్యాయి. ఇక ‘నేను ఒక్కసారి చెప్తే వందసార్లు చెప్పినట్టే’ డైలాగ్ ఎన్ని సినిమాలలో ఎన్ని స్పూఫులుగా వచ్చిందో తెలుసు. ‘బాషా ఫార్ములా’ ధోరణి ‘సమరసింహారెడ్డి’, ‘నరసింహనాయుడు’, ‘ఇంద్ర’ సినిమాల్లో మనం చూస్తాం. బాషా డిజిటల్లీ ఇంప్రూవ్డ్ ప్రింట్‌ను 2017లో విడుదల చేశారు. 20 ఏళ్ల తర్వాత కూడా ఒక సినిమా రీరిలీజ్ అయ్యిందంటే అది బాషాకు మాత్రమే దక్కిన ఘనత. - సురేశ్ కృష్ణ, దర్శకుడు – కె -
బొమ్మలాట
సినిమా అంటే బొమ్మ. బొమ్మ ఎప్పుడు థియేటర్లో పడుతుందా అని ఎదురు చూస్తారు. అయితే ఎదురు చూసే బొమ్మ ఒకటి.. వచ్చే బొమ్మ ఇంకోటి! ఒకరి బొమ్మ వస్తుందని ఇంకొకరు ఈ మధ్య తమ బొమ్మలను వాయిదా వేస్తున్నారు. ఈ బొమ్మలాట కుర్చీలాటలా మారింది. ఒకరు కూర్చునే లోపు ఇంకొకరు... మ్యూజికల్ చైర్లో కుర్చీ కోసం పరిగెడతారు. కుర్చీలో కూర్చునే బొమ్మ ఏదో తెర మీద పడేవరకూ కన్ఫ్యూజనే. ఈ బొమ్మలాట కహానీపై ఓ కన్నేద్దాం. జనవరి 26... దేశ ప్రజలందరూ పండగ చేసుకునే రోజు. ఈసారి సినిమా లవర్స్కీ పండగ రోజే. ఎందుకంటే రిపబ్లిక్ డే సరిగ్గా శుక్రవారం వచ్చింది. సెలవు రోజు. కొత్త బొమ్మ పడుతుంది. థియేటర్ నిండుతుంది. క్యాష్ చేసుకోవడానికి ఇది సరైన టైమ్. అయితే ఇదే రోజు రిలీజ్ కావాల్సిన కొన్ని సినిమాలు వెనక్కి తగ్గాయి. ‘ఆచారి అమెరికా యాత్ర’, ‘మనసుకు నచ్చింది’ సినిమాలు వాయిదా పడ్డాయి. జి. నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో మంచు విష్ణు, ప్రగ్యా జైస్వాల్ జంటగా రూపొందిన చిత్రం ‘ఆచారి ఆమెరికా యాత్ర’. కృష్ణమాచారి (మంచు విష్ణు) తప్పులు, అప్పలాచారి తిప్పలతో సాగే ఈ నవ్వుల యాత్రను జనవరి 26న చూపిద్దామనుకు న్నారు. అయితే యాత్రను పోస్ట్‌పోన్ చేసి, తర్వాత చూపించాలనుకుంటున్నారు. ఇక, ‘మనసుకు నచ్చింది’ విషయానికొస్తే.. సూపర్ స్టార్ కృష్ణ కుమార్తె దర్శకత్వం వహించిన ఫస్ట్ మూవీ ఇది. పెళ్లికూతురో లేదా పెళ్లి కొడుకో పెళ్లి టైమ్‌కి పారిపోవడం వింటుంటాం. అలాంటిది పెళ్లికొడుకే పెళ్లికూతుర్ని లేపుకుపోతే కాస్త డిఫరెంట్ కదా! ఈ కాన్సెప్ట్‌తోనే ప్రేక్షకులను థియేటర్స్‌లో కూర్చొబెట్టాలని డిసైడయ్యారు మంజుల. సందీప్ కిషన్, అమైరా దస్తూర్ జంటగా రూపొందిన ఈ చిత్రాన్ని గత నెల 26న రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ ఫిబ్రవరి 16కి వాయిదా వేశారు. ఈ రెండు సినిమాలూ ఎందుకు వాయిదా పడ్డాయి? అంటే ప్రధానంగా చెబుతున్న కారణం ‘భాగమతి’, హిందీ ‘పద్మావత్’. ఈ రెండు లేడీ ఓరియంటెడ్ మూవీస్ భారీ అంచనాల మధ్య రిలీజ్ అయ్యాయి. మరోవైపు ‘ఆచారి అమెరికా యాత్ర’, ‘మనసుకు నచ్చింది’ కూడా ఆల్రెడీ పోస్టర్లు, టీజర్ల ద్వారా ఇప్పటికే ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అయితే ఒకేసారి నాలుగు సినిమాలు విడుదలైతే కలెక్షన్స్ డివైడ్ అవ్వడంతో పాటు, థియేటర్లు తక్కువగా దొరుకుతాయి. అందుకే ఈ రెండు సినిమాలూ వాయిదా పడ్డాయి. చెన్నై పోలామ్ వాంగ అటు చెన్నై పోలామ్ (వెళదాం) వాంగ (రండి). జనవరి 26న విడుదల కావాల్సిన విశాల్ ‘ఇరంబుదురై’ వరలే (రాలేదు). ఆడ విడుదల కావాల్సిన ‘ఇరుంబుదురై’ ఈడ ‘అభిమన్యుడు’గా రిపబ్లిక్‌డేకి రావాల్సింది. కానీ రాలేదు. మరి.. ఎప్పుడు ఆగుమ్ (అవుతుంది) అనేది ఇంకా చిత్రబృందం ప్రకటించలేదు. ఇంకో సినిమా ‘జయం’ రవి నటించిన ‘టిక్. టిక్. టిక్’. ఇండియన్ స్క్రీన్‌పై ప్రేక్షకులు చూడబోతున్న ఫస్ట్ స్పేస్ మూవీ ఇది. ముందు అనుకున్నట్లుగా విడుదల చేసి ఉంటే జనవరి 26న తమిళ ప్రేక్షకులు చూసేవాళ్లు. అయితే వాయిదా పడింది. రిలీజ్ చేసేద్దామనుకుని ప్రమోషన్ కూడా భారీగా చేశారు. ఇంకో విషయం ఏంటంటే.. ఈ సినిమాని అదే పేరుతో తెలుగులోనూ రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ చేయలేదు. న్యూ రిలీజ్ డేట్‌ను ఇంకా ఎనౌన్స్ చేయలేదు. ఇలాగే మమ్ముట్టీ మలయాళ సినిమా ‘స్ట్రీట్‌లైట్స్’ విషయంలోనూ జరిగింది. జనవరి 26న రిలీజ్ చేయాలనుకున్న ఈ సినిమా వాయిదా పడి, ఈ నెల 2న రిలీజైంది. సీన్ రిపీటైంది! ఒకేరోజు రెండుకి మించి సినిమాలు విడుదలైతే వసూళ్లు డివైడ్ అవుతాయి కాబట్టి, జనవరి 26కి విడుదల కావాల్సిన రెండు మూడు సినిమాలు వెనక్కి తగ్గాయి. సేమ్ సీన్ ఫిబ్రవరి 9న కూడా రిపీట్ అయ్యింది. మోహన్‌బాబు ‘గాయత్రి’, వరుణ్ తేజ్ ‘తొలిప్రేమ’, నిఖిల్ ‘కిరాక్ పార్టీ’, సాయిధరమ్ తేజ్ ‘ఇంటిలిజెంట్’, నాగశౌర్య ‘కణం’ సినిమాల రిలీజ్ డేట్‌ను ముందుగా ఫిబ్రవరి 9న రిలీజ్ చేయాలనుకున్నారు. ఒకే రోజు ఐదు సినిమాల రిలీజ్ అయితే లెక్కల్లో తేడాలు వస్తాయి. కనీసం రెండు సినిమాలన్నా వాయిదా పడతాయనుకున్నారు. అనుకున్నట్లే ‘కణం’ సినిమా ఫిబ్రవరి 23కు వాయిదా పడింది. అనుకున్నట్లుగానే ‘గాయత్రి’, ‘ఇంటిలిజెంట్’ 9కి వస్తున్నాయి. ‘తొలిప్రేమ’ ఒక్క రోజు వాయిదా పడి ఫిబ్రవరి 10న రిలీజ్ కానుంది. ‘కిరాక్ పార్టీ’ చేసుకోవడానికి ఇంకాస్త టైముంది. త్వరలో రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తామని చిత్రనిర్మాతల్లో ఒకరైన అనిల్ సుంకర పేర్కొన్నారు. వార్ వేడి తగ్గేలా లేదు! ఏప్రిల్ వార్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో నాని హీరోగా రూపొందుతున్న సినిమా ‘కృష్ణార్జున యుద్ధం’. ఈ సినిమాతో ఏప్రిల్ వార్కి నాని సై అంటున్నారు. నితిన్ కూడా తన సినిమాను ఏప్రిల్ 5న రిలీజ్ చేయనున్నాడు. ఆల్రెడీ వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాతో నాగార్జున, కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ‘భరత్ అనే నేను’ చిత్రంతో మహేశ్ బాబు, ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ అంటూ అల్లు అర్జున్ ఏప్రిల్ వార్కి కర్చీఫ్ వేశారు. యాక్చువల్లీ సినిమాల రిలీజ్‌కి బెస్ట్ సీజన్స్‌లో ఏప్రిల్ ఒకటి. సెలవులను క్యాష్ చేసుకోవచ్చు. ఎన్ని సినిమాలు విడుదలైనా ఫర్వాలేదు. అయితే ఒకేరోజు ఎక్కువ సినిమాలు రిలీజైతే కలెక్షన్స్ డివైడ్ అవుతాయి. మరి.. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఎవరైనా తమ సినిమాను వాయిదా వేసుకుంటారా? చూడాలి. చిట్టికి ఫ్రీడమ్ ఆ రోజేనా? గతేడాది దీపావళికి రిలీజ్ అన్నారు. థియేటర్లో బొమ్మపడలేదు. మళ్లీ జనవరి 25 అని మనసు మార్చుకున్నారు. ఇదంతా ‘2.0’ సినిమా రిలీజ్ గురించే. శంకర్ దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ నిర్మాణంలో రజనీకాంత్, అక్షయ్‌కుమార్, అమీ జాక్సన్ ముఖ్యతారలుగా రూపొందిన సినిమా ‘2.0’. ఆల్మోస్ట్ 400 కోట్ల రూపాయలతో ఈ సినిమా రూపొందింది. జనవరిలో చిట్టి మిస్సయ్యాడు. ఏప్రిల్‌లో చూపిస్తామని చిత్రబృందం ఎనౌన్స్ చేసింది. ఇప్పుడు సమ్మర్‌కి కూడా రోబో సందడి లేదట. సినిమా వచ్చేది ఆగస్టు 15నే అని ట్రేడ్ విశ్లేషకులు తాజాగా మంగళవారం న్యూ డేట్‌ని తెర మీదకు తీసుకొచ్చారు. అదే నిజమైతే అప్పుడు అక్షయ్‌కుమార్ ‘గోల్డ్’ ఇరుకుల్లో పడ్డట్లే. అక్షయ్ కుమార్ నటించిన ఈ సినిమా ఆగస్ట్ 15కి రావాలి. మరి.. చిట్టికి ఫ్రీడమ్ ఆ రోజేనా? అంటే... థియేటర్లోకి వచ్చేది ఆ రోజేనా? మరి.. చిట్టి అదే రోజున వస్తే.. హిందీలోనూ బొమ్మ పడుతుంది కాబట్టి.. ‘గోల్డ్’ డేట్ మారుతుందా? వెయిట్ అండ్ సీ. సౌత్‌లో థియేటర్స్క్లోజ్! రిలీజ్ కావడానికి ఇన్ని సినిమాలు పోటీ పడుతుంటే మార్చి 1నుంచి థియేటర్స్ మూతపడనున్నాయన్న వార్తలు వస్తున్నాయి. డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్ల ఛార్జీల వైఖరికి తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి అభ్యంతరం తెలిపింది. ముందుగా సూచించిన సమయానికి కల్లా డిజిల్ సర్వీస్ ప్రొవైడర్లు చర్చలకు రాకపోతే మార్చి1 నుంచి రెండు రాష్ట్రాల్లోని థియేటర్స్‌ను మూసివేయాలని తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి అధ్యక్షులు పి.కిరణ్ తెలిపారు. ఇది మాత్రమే కాదు.. తమిళ, మలయాళం, కన్నడ పరిశ్రమల్లో కూడా ఇదే పరిస్థితి. ఒకవేళ ఈ ఇష్యూ ఒక కొలిక్కి రాక.. సౌత్‌లో థియేటర్స్ షట్ డౌన్ అయితే అసలుకే ఎసరు వస్తుందేమో! బాలీవుడ్ సినిమాలూ కుర్చీలాట ఆడుతున్నాయి. వాయిదాల మీద వాయిదాలు పడి ‘పద్మావత్’ తెరకొచ్చింది. ‘బజార్’, ‘సూర్మ’, ‘సోనూ కే టిట్టు కీ స్వీటీ’ వంటి సినిమాలూ వాయిదా పడ్డాయి. పోస్ట్‌పోన్ అయిన మరికొన్ని సినిమాలు.. - ముసిమి శివాంజనేయులు -
కమల్‌కు కుదిరింది.రజనీకే..
తమిళసినిమా: కమలహాసన్, రజ నీకాంత్ సినీదురంధురులే. నటులుగా ఎవరికి వారే నిష్ణాతులు. సీనియర్ అంశానికి వస్తే కొంచెం కమలహాసనే ఎక్కువ. వీరిలో ఒకరిది క్లాస్ ఫాలోయింగ్, మరొకరిది మాస్ ఫాలోయింగ్. కమల్, రజనీ ఇద్దరు మంచి మిత్రులు. కలిసి పలు చిత్రాల్లో నటించారు. ఇది నిజ జీవితం, సినీ జీవితాలకు సంబంధించిన అంశం మాత్రమే. తాజాగా ఈ సినీ దిగ్గజాలిద్దరూ రాజకీయ రణరంగంలోకి దూకుతున్నారు. రణరంగం అని ఎందుకు అనాల్సి వచ్చిం దంటే రాజకీయాల్లో ప్రత్యక్ష యుద్ధాలు లేకపోయినా, మాటల యుద్ధాలు తూటాల్లా పేలుతుంటాయి. అలాం టి యుద్ధంలో ప్రజల మనసులను గెలుచుకోవాల్సి ఉంటుంది. రాజకీయాలకు సినీ గ్లామర్ మాత్రమే చాలదంటారు. అంతకు మించి కావలసి ఉంటుంది. రజనీ, కమల్ మాత్రం తమ తాజా చిత్రాలతో మరింత ప్రేక్షకాదరణ పొంది, దాన్ని ఓట్లుగా మార్చుకోవాలని వ్యూహాలు పన్నుతున్నారు. కమల్ రాజకీయ ప్రవేశంపై వెల్లడించినప్పుడు సినిమాలకు స్వస్తేనా? అనే ప్రచా రానికి శ్రీకారం పడింది. ఆ తరువాత రజనీకాంత్ తానూ రాజకీయ రంగప్రవేశం చేశాను అనగానే కమ ల్కు తలెత్తిన ప్రశ్నే ఆయనకు వర్తించింది. ఆయన ప్రస్తుతం నటిస్తున్న 2.ఓ, కాలా చిత్రాలే చివరి చిత్రాలు అనే ప్రచారం జరిగింది. అలాంటిది రజనీకాంత్ ఒక మంచి రాజకీయ నేపథ్యంలో సాగే చిత్రం చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం హోరెత్తుతోంది. కమల్ కూడా విశ్వరూపం–2, శభాష్‌నాయుడు చిత్రాలను విడుదల చేసి రాజకీయాలపై దృష్టి సారించాలని భావించినా, ఇప్పుడు ఇండియన్–2కు రెడీ అవుతున్నారు. ఇంతకు ముందు శంకర్ దర్శకత్వంలో అవినీతిపై పాశుపతాస్త్రం లాంటి కథా ఇతివృత్తంతో ఓ చిత్రం తెరకెక్కిన విషయం తెలిసిందే. అప్పట్లో ఆయన రాజకీయాల జోలికి పోలేదు కాబట్టి ఒక చిత్రంగానే కమల్ భావించారు,ప్రేక్షకులు ఆదరించారు. ఇండియన్–2 విషయానికి వస్తే, కమల్ ఈ చిత్రాన్ని తన రాజకీయ జీవితానికి వాడుకునే ప్రయత్నం చేస్తారని చెప్పవచ్చు. ఇప్పటికే దర్శకుడు శంకర్ చిత్ర ప్రీప్రొడక్షన్ పనులపై దృష్టి పెట్టారు. చిత్రానికి యువ సంగీతదర్శకుడు అనిరుద్‌ను, సౌండ్ డిజైనర్‌గా 2.ఓ చిత్రానికి పనిచేస్తున్న విశ్వనా«థ్సుందర్ను ఎంపిక చేసినట్లు ప్రచారం. ఇతర నటీనటులు,సాంకేతిక వర్గాన్ని ఎంపిక చేసి త్వరలోనే ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు. లైకా సంస్థ నిర్మించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అలాంటి రాజకీయ నేపథ్యంతో కూడిన కథలో నటించాలని రజనీ కూడా ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. కమల్‌కు ఇండియన్ 2 కుదిరింది. మరి రజనీకి కథ ఎప్పుడు సెట్ అవుతుంది. ముదల్వన్ 2 చేయాలన్న ఆలోచన రజనీకాంత్‌కు ఉన్నట్లు టాక్. అది నెరవేరాలంటే శంకర్ ముందు కమల్‌తో ఇండియన్ 2 పూర్తి చేసిన తరువాతే జరుగుతుంది. చూద్దాం ఏం జరుగుతుందో? ఎవరి యుక్తి ఎలాంటి రిజల్ట్నిస్తుందో. -
రజనీ 2.o నిడివి ఎంతో తెలుసా?
సాక్షి, చెన్నై: దేశం గర్వించదగ్గ దర్శకుడు శంకర్. ఆయన తాజాగా సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో కలిసి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా 2.o... 'రోబో'కు సీక్వెల్‌గా వస్తున్న ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయ్యింది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన కథనం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 2.o సినిమా మొత్తం నిడివి వంద నిమిషాలు మాత్రమేనట. అంటే గంట 40 నిమిషాలు మాత్రమే. ఒకప్పుడు సినిమా నిడివి మూడు గంటలు ఉంటే.. ఇప్పుడు రెండున్నర గంటలకు తగ్గిన సంగతి తెలిసిందే. మామూలుగా కమర్షియల్ సినిమాలు రెండు గంటలకుపైగా ఉండటం సర్వసాధారణం. కానీ ఆ ట్రెండ్‌కు భిన్నంగా గంట 40 నిమిషాల్లో ఈ అత్యంత భారీ సినిమాను శంకర్ ముగించినట్టు చెప్తున్నారు. ఏమాత్రం సాగదీసే సీన్స్ లేకుండా.. చూస్తున్నంతసేపు ఉత్కంఠగా ఉండేలా సినిమాను కుదించబోతున్నారని చెప్తున్నారు. ఇది సినిమాకు ఏమేరకు కలిసివస్తుందో చూడాలి. ఈ సినిమాను తమిళ, తెలుగు, హిందీ, అరబిక్ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్14న విడుదల చేయబోతున్నారు. లైకా ప్రొడక్షన్ నిర్మిస్తున్న ఈ సినిమాలో అక్షయ్‌కుమార్, అమీజాక్సన్ ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. ఏ.ఆర్ రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. -
శత్రువుగా మారనివ్వను..!
సాక్షి, చెన్నై: తమిళ సూపర్స్టార్లు రజనీకాంత్, కమల్ హసన్ రాజకీయాల్లోకి రాబోతున్నారు. ఇప్పటికే రజనీకాంత్ ఓ వెబ్‌సైట్‌ను ఆవిష్కరించి.. తన మద్దతుదారులు, ప్రజలు అందులో నమోదు చేసుకొని.. తనకు మద్దతు పలుకాలని పిలుపునిచ్చారు. మరోవైపు కమల్ కూడా తన మద్దతుదారులను కూడగట్టేందుకు ఓ యాప్‌ను తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. రాజకీయ నాయకులుగా కొత్త అవతారం ఎత్తబోతున్న రజనీ, కమల్ ఎప్పటికీ చేతలు కలిపే అవకాశం లేదని, వారు రాజకీయాల్లో ప్రత్యర్థులుగానే కొనసాగవచ్చునని విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో కమల్ తాజాగా రాసిన ఓ వ్యాసంలో ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. తన రాజకీయ ప్రస్తానంలో స్నేహితులను శత్రువులుగా మార్చుకోబోనని, నిందా రాజకీయాలకు పాల్పడి.. రాజకీయ అందలం కోసం ప్రయత్నించబోనని కమల్ పేర్కొన్నారు. ఆ రకమైన రాజకీయాలు తన మార్గం కాదని, అవి ప్రజలకు కూడా నచ్చవని కమల్ అన్నారు. జనవరిలో యాప్ విడుదల చేస్తానని చెప్పిన కమల్ ఇప్పటివరకు దానిని ఆవిష్కరించకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. దీనిపై స్పందిస్తూ.. చాలా ఆచితూచి ప్రజలకు అనుసంధానమయ్యేలా యాప్‌ను తీసుకొస్తున్నానని, త్వరలోనే యాప్‌ను విడుదల చేస్తామని తెలిపారు. -
రజనీ ఎంట్రీపై మరోసారి కమల్ కామెంట్
సాక్షి, చెన్నై: సూపర్‌స్టార్ రజనీకాంత్ రాజకీయ ప్రవేశంపై నటుడు కమల్ హాసన్ మరోసారి స్పందించారు. రజనీకాంత్ రాజకీయాల్లో రావాడాన్ని స్వాగతిస్తున్నానట్టు తెలిపారు. నడిగర్ సంఘం స్టార్ నైట్ కార్యక్రమానికి మలేసియా వెళుతూ చెన్నై విమానాశ్రయంలో కమల్ హాసన్ మీడియాతో మాట్లాడారు. రాజకీయాల్లోకి వస్తున్నానని రజనీ ప్రకటన చేయగానే తాను స్వాగతించానని గుర్తుచేశారు. ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో టీటీవీ దినకరన్ విజయంపై తాను వ్యాఖ్యలు చేయటంపై కూడా కమల్ స్పందించారు. ఈ విషయంలో తనపై ఏ ఫిర్యాదులు, కేసులు వచ్చినా చట్టపరంగా ఎదుర్కొనేందుకు సిద్ధమని అన్నారు. ఆర్కేనగర్ ఉప ఎన్నికలో ధనప్రభావం కారణంగానే దినకరన్ గెలిచారని, ఈ విజయం భారత ప్రజాస్వామ్యానికి మచ్చ అని కమల్ హాసన్ తీవ్రంగా విరుచుకుపడిన సంగతి తెలిసిందే. కమల్ హాసన్ వ్యాఖ్యలపై దినకరన్ వర్గీయులు తీవ్రంగా మండిపడుతున్నారు. కమల్‌పై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. -
డిశంబర్31న రజనీ కీలక ప్రకటన
-
విశాల్ నాకు షాక్ ఇచ్చారు..
సాక్షి, చెన్నై: నటుడు విశాల్ నాకు షాక్ ఇచ్చాడని నటుడు పొన్వన్నన్ అన్నారు. దక్షిణ భారత నటీనటుల సంఘం కార్యదర్శి, తమిళనిర్మాతల మండలి అధ్యక్షుడు విశాల్ ఇటీవల ఆర్కే.నగర్ ఉప ఎన్నికల్లో పోటీ చేయడానికి నామినేషన్ దాఖలు చేసిన విషయం, అది అనేక నాటకీయ పరిణామాల తరువాత తిరస్కరణకు గురైన విషయం తెలిసిందే. విశాల్ అనూహ్య నామినేషన్ చర్య పరిశ్రమలో ఒక వర్గం దిగ్భ్రాంతికి, మరో వర్గం తీవ్ర వ్యతిరేకతకు గురి చేసింది. ఈ వ్యవహరంలో ఇండస్ట్రీలో పెద్ద రచ్చే జరిగింది. అందులో దక్షిణ భారత నటీనటుల సంఘం ఉపాధ్యక్ష పదవి నుంచి నటుడు పొన్వన్నన్ రాజీనామా నిర్ణయం ఒకటి. ఈ విషయంపై ఆ సంఘంలో పెద్ద చర్చే జరిగింది. చివరికి పొన్వన్నన్ రాజీనామాను అంగీకరించేది లేదని సంఘం అధ్యక్షుడు నాజర్ వెల్లడించారు. దీంతో బుధవారం పొన్వన్నన్ మీడియా ముందుకొచ్చారు. ఆయన మాట్లాడుతూ దక్షిణ భారతనటీనటుల సంఘ నిర్వాహం రాజకీయాలకతీతంగా పని చేయాలన్న సిద్ధాంతంతో ఉందన్నారు. అలాంటిది సంఘం కార్యదర్శి విశాల్ అనూహ్యాంగా ఆర్కే.నగర్ ఉప ఎన్నికల్లో పోటీ చేయడానికి నామినేషన్ దాఖలు చేసి తనకు పెద్ద షాక్ ఇచ్చారన్నారు. సంఘం అధ్యక్షుడు నాజర్‌కు ఫోన్ చేసి సంప్రదించగా ఆయన తనకేమీ తెలియదని చెప్పారన్నారు. సంఘం కోశాధికారి కార్తీని సంప్రదించగా తనకూ ఏమీ తెలియదని,అది విశాల్ వ్యక్తిగత నిర్ణయం అని చెప్పారన్నారు. ఈ వ్యవహారంపై మీడియాతో పాటు పలువురు తనను ప్రశ్నించడంతో బదులు చెప్పలేక తన పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నానన్నారు. తన రాజీనామాను సంఘ నిర్వాకం ఆమోదించక పోవడం, విశాల్ ఈ విషయంలో విచారం వ్యక్తం చేసి, ఇకపై ఇలాంటి సంఘటనలు జరగవని మాట ఇవ్వడంతో తన రాజీనామాను వెనక్కు తీసుకున్నట్లు వెల్లడించారు. అదే విధంగా తన రాజీనామాతో సంఘం బలహీన పడుతుందని, సంఘ భవన నిర్మాణం నిధిని సమకూర్చడం కోసం వచ్చే నెల 6వ తేదీన మలేషియాలో నిర్వహించ తలపెట్టిన స్టార్ క్రికెట్ కార్యక్రమం పనులు చేయాల్సిఉండడం లాంటివి దృష్టిలో పెట్టుకుని రాజీనామా నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నానన్నారు. రజనీ,కమల్ పాల్గొననున్నారు.. జనవరి 6వ తేదీన మలేషియాలో జరగనున్న స్టార్ క్రికెట్ పోటీల్లో కమలహాసన్, రజనీకాంత్‌తో సహా 200 మంది కళాకారులు పాల్గొననున్నారని వెల్లడించారు. నటుడు అజిత్ కూడా పాల్గొనాలని కోరుతున్నామని చెప్పారు. స్టార్ క్రికెట్‌తో పాటు పలు సంప్రదాయ సినీ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. దీన్ని మలేషియా ప్రభుత్వంతో కలిసి నటీనటుల సంఘం నిర్వహించనుందని పొన్వన్నన్ వివరించారు. -
శ్రీ రాఘవేంద్రునిపై రజనీ అమితమైన భక్తి.. భారీ విరాళం
తమిళసినిమా: సూపర్ స్టార్ రజనీకాంత్‌కు మంత్రాలయ శ్రీ రాఘవేంద్రస్వామి అంటే అమిత భక్తి. ఆయన తాజాగా మంత్రాలయంలో రాఘవేంద్రస్వామిని దర్శించుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మంత్రాలయంలో శ్రీ మఠానికి రూ. 20 కోట్లను విరాళంగా అందించారు. రజనీకాంత్ మంగళవారం ఉదయం రాఘవేంద్ర స్వామిని దర్శించుకుని విశేష పూజలు నిర్వహించిన సంగతి తెలిసిందే. శ్రీ మఠానికి వచ్చిన ఆయనకు అర్చకులు సాదర స్వాగతం పలికి సత్కరించారు. అనంతరం రజనీకాంత్ మఠాధిపతి సుబుదేంద్రతీర్థులను కలిసి కొంచెం సేపు చర్చించారు. మఠంలో నిర్మాణాలు శిధిలావస్థకు చేరుకున్నాయని, భక్తులకు వసతుల అవసరం ఉందని తెలుసుకున్నారు. దీంతో మఠం ఆధునీకరణకు రూ.20 కోట్లను విరాళంగా అందించారు. ఆ నిధితో భక్తుల బస కోసం 25 ఏసీ గదులను, మరిన్ని వసతి గదులను నిర్మించనున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. -
రాఘవేంద్రుడి ఆశీస్సులతోనే...
ఆయన చుట్టూ మందీ మార్బలం లేరు.. ఎవరికీ ముందస్తు సమాచారం లేదు... సామాన్య భక్తుల్లో ఒకరిగా, సడన్‌గా మంగళవారం ఉదయం మంత్రాలయంలో ప్రత్యక్షమయ్యారు రజనీకాంత్. ఆయనకు రాఘవేంద్ర స్వామి అంటే ఎంత భక్తి అనేది అందరికీ తెలిసిందే. అప్పుడప్పుడూ కర్నూల్లోని మంత్రాలయంలో గల ఆలయానికి వచ్చి రాఘవేంద్ర స్వామిని దర్శించుకుంటుంటారు రజనీ. మంగళవారం కూడా అలానే వచ్చి, తుంగభద్ర నదిలో పుణ్యస్నానం ఆచరించి గ్రామదేవత మంచాలమ్మను, రాఘవేంద్ర స్వామిని దర్శించుకున్నారు. అనంతరం పీఠాధిపతి సుభుదేంద్ర తీర్థులను కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. ఆయన రజనీకి స్వామివారి జ్ఞాపిక, శేష వస్త్రం, ప్రసాదాలు అంద జేశారు. మఠాధికారులు రజనీని పూర్ణకుంభంతో ఆహ్వానించారు. స్వామివారి కరుణాకటాక్షంతోనే సినిమా రంగంలో ఈ స్థాయికి చేరుకున్నాన ని రజనీ పేర్కొన్నారు. అన్నట్లు... రజనీ ‘శ్రీ రాఘవేంద్రర్’(తెలుగులో ‘శ్రీ మంత్రాలయ రాఘవేంద్ర స్వామి మహత్యం’)లో టైటిల్ రోల్ చేసిన సంగతి తెలిసిందే. -
ఉత్కంఠ రేపుతున్న 2.ఓ చిత్రం !
సాధారణంగా సినిమాను కాలక్షేప మాధ్యంగానే చూడాలి. నిజానికి అదే వాస్తవం కూడా. కానీ కొందరు దర్శకుల చిత్రాలే వినోదంతోపాటు, విజ్ఞానాన్ని, అబ్బురపరచే బ్రహ్మాండాలతో కనువిందు చేస్తాయి. అలాంటి అతి కొద్ది మంది భారతీయ సినీ దర్శకుల్లో శంకర్ ఒకరిని చెప్పవచ్చు. సాంకేతిక పరిజ్ఞానంపై అపార పట్టు ఉన్న ఈ స్టార్ డైరెక్టర్ తన ఇంద్రజాలంతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేయగలరని తన ముదల్వన్ చిత్రం నుంచి నిరూపించుకుంటూ వస్తున్నారు. అది ఎందిరన్ చిత్రానికి వచ్చే సరికి ఉన్నత శిఖరానికి చేరింది. సూపర్‌స్టార్ రజనీకాంత్ గురించి చెప్పాలంటే స్టైల్ కింగ్‌గా పేరు తెచ్చుకున్నారు. అలాంటి రజనీకాంత్, దర్శకుడు శంకర్ల కలయికలో శివాజీ, ఎందిరన్ చిత్రాల తరువాత ముచ్చటగా రూపొందుతున్న మూడో చిత్రం 2.ఓ. రెండు చిత్రాల కంటే మరింత భారీ, బ్రహ్మాండంగా తెరకెక్కుతుంది. ఈ చిత్రం ఎప్పుడెప్పుడు తెరపైకి వస్తుందని భారతీయ సినిమానే కాదు, ప్రపంచ సినిమా కూడా ఆసక్తికరంగా ఎదురుచూస్తోంది. ఎందుకంటే దర్శకుడు శంకర్ 2.ఓ చిత్రాన్ని సిల్వర్ స్క్రీన్‌పై చెక్కుతున్న తీరు అందరినీ అబ్బుర పరుస్తోంది. గ్రాఫిక్స్ థ్రిల్లర్ శంకర్, రజనీ చిత్రం అంటే సాధారణంగా సమ్ థింగ స్పెషల్‌గా ఉంటుంది. శంకర్ కథ, దాన్ని నడిపే తీరు ఆసక్తిగా ఉంటుందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వాటికి ఆయన స్టైల్లో సాంకేతిక పరిజ్ఞానం తోడైతే ఆ చిత్రం అద్భుతమే అవుతుంది. ఈ 2. ఓ చిత్రానికి పలు శాఖల్లో హాలీవుడ్ అత్యున్నత సాంకేతిక నిపుణులతో కలిసి శంకర్ పనిచేస్తున్నారు. ఇండియన్ సినీ చరిత్రలోనే అత్యంత భారీ(రూ.450 కోట్లు) బడ్జెట్‌తో తెరకెక్కుతున్న చిత్రంగా 2.ఓ చిత్రం నమోదు కానుంది. వావ్ మేకింగ్ చిత్ర మేకింగ్ వీడియోను చూసిన వారందరూ వావ్ అంటూ ఆశ్యర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. 2.ఓ చిత్రం కోసం వేసిన భారీ సెట్స్, ఉపయోగిస్తున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వండర్ అనిపిస్తోంది. 2.ఓ చిత్రం కోసం యూనిట్ ఉక్రెయిన్ లాంటి విదేశాలతో పాటు ఢిల్లీ, ముంబై ప్రాంతాలు చుట్టొచ్చారు. ఆయా ప్రాంతాల్లో చిత్రీకరించిన సన్నివేశాలు 2.ఓ చిత్రానికి మరింత ఆకర్షణను చేకూర్చడం ఖాయమని చిత్ర వర్గాలు అంటున్నారు. స్టైలిష్‌గా సూపర్‌స్టార్ ఇటీవల కాలంలో గ్యాంగ్‌స్టర్ చాలా రఫ్‌గా కనిపిస్తున్న రజనీకాంత్ 2.ఓ చిత్రంలో మునుపటి కంటే మరింత గ్లామరస్‌గా, స్టైలిష్‌గా కనిపంచడమ ఆయన అభిమానుల్లో నూతనోత్సహాన్ని కలిగిస్తోంది. ఎందిరన్ చిత్రంలో మాదిరిగానే ఈ చిత్రంలోనూ రోబోగానూ, శాస్త్రవేత్తగాను కనిపించనున్నారు. హీరోయిన్ ఎమీజాక్సన్ అందాలు, బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ రోరింగ యాక్షన్ 2.ఓ చిత్రానికి స్పెషల్ అట్రాక్షన్ అవుతుందని చెప్పాలా? ఇప్పటి వరకూ తీసినటువంటి సన్నివేశాలను చూసి రజనీకాంత్ మార్వ్‌లెస్ అంటూ శంకర్‌ను వాటేసుకుని ప్రశంసల జల్లులో ముంచెత్తారు. ఆస్కార్ నాయకుడి సంగీతం 2.ఓ చిత్రానికి మరో బలానిచ్చే అంశం ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్.రెహ్మన్ సంగీతం. ఇందులో ఆరు పాటలకు మంచి మ్యూజిక్‌ను ఆయన అందించారు. అదే విధంగా మరో ఆస్కార్ అవార్డు గ్రహీత రసూల్ పూకుట్టి సౌండ్ డిజైనింగ్, నీరవ్‌షా ఛాయాగ్రహణం మరింత ప్లస్ అవుతాయి. చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్ దుబాయ్ భారీ ఎత్తున నిర్వహించిన విషయం తెలిసిందే. జనవరిలో ఈ చిత్రాన్ని తమిళం, తెలుగు, హిందీ భాషలో ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో విడుదల చేయడానికి లైకా ప్రొడక్షన్ సన్నాహాలు చేస్తోంది. -
దుబాయ్‌లో దుమ్ము దుమారమే!
తక్కువ కాదు... హాలీవుడ్ ఫిల్మ్స్‌కి రజనీకాంత్ ‘2.0’ ఏమాత్రం తక్కువ కాదు. తగ్గలేదు... బడ్జెట్ పరంగా (రూ. 400 కోట్లు) ‘2.0’ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ ఎక్కడా తగ్గలేదు. ‘2.0’ చిత్రదర్శకుడు శంకర్ అయితే... ఊహాల్లోనూ, విజువలైజేషన్లో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌కి మనమేం తక్కువ అన్నట్టు సినిమా తీశారు! మరి, అటువంటి సినిమా ఆడియో ఫంక్షన్ జరిగితే ఎలా ఉండాలి? అమెరికన్, కొరియన్, జపనీస్, ఎక్ట్స్రా... సిన్మా జనాలు అందరూ రెండు కళ్లతో ‘2.0’ను వెంటనే చూసేయాలనేంత క్యూరియాసిటీ కలగాలి కదా! కరెక్టుగా అలానే ఈ శుక్రవారం దుబాయ్‌లో ‘2.0’ ఆడియో రిలీజ్‌ను ప్లాన్ చేశారు. అదెలా జరుగుతుందంటే... దుమ్ము దుమారమే!! ‘2.0’ ఆడియోలో హైలైట్ కానున్న అంశాలు ►దుబాయ్‌లోని బుర్జ్ పార్క్‌లో ఆడియో వేడుక జరుపుకోనున్న సినిమాగా ‘2.0’ రికార్డులకు ఎక్కనుంది. దుబాయ్ గవర్నమెంట్ ‘2.0’ ఆడియో ఫంక్షన్‌కి పర్మిషన్ ఇచ్చింది. ►దుబాయ్‌లోని హోటల్ నుంచి బుర్జ్–అల్–అరబ్ (టవర్స్ ఆఫ్ ద అరబ్)కి రజనీకాంత్, ‘2.0’లో విలన్‌గా నటించిన హిందీ హీరో అక్షయ్‌కుమార్, దర్శకుడు శంకర్ హెలికాఫ్టర్‌లో చేరుకుంటారు. ఆడియో రిలీజ్‌కి ముందు ఓ ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా ఉంటుందని టాక్. ►చిత్రసంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ ఆడియో వేదికపై 125 మంది సింఫనీ సంగీత కళాకారులతో లైవ్ పర్ఫార్మెన్స్ ఇవ్వనున్నారు. పాటలకు కొరియోగ్రాఫర్ బాస్కో టీమ్ స్టెప్పులతో రెడీ. ►దుబాయ్‌లోని పలు షాపింగ్ మాల్స్‌లో ఆడియో లైవ్ ఇవ్వనున్నారు. అందుకోసం 2 కోట్ల రూపాయలతో చాలా చోట్ల ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. ►ఆల్రెడీ 12 వేలమందికి ఆడియో ఫంక్షన్ పాసులను ఫ్రీగా ఇచ్చారు. 65 వేలకు కొంతమందికి పాసులను అమ్మారట! వాళ్లతో రజనీ, అక్షయ్, అమీ జాక్సన్ అండ్ టీమ్ డిన్నర్ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. ►దుబాయ్ రాజు మహ్మద్ బిన్ రషీద్ అల్ మక్టౌమ్, తమిళ నటుడు కమల్ హాసన్ ఈ వేడుకకు అటెండ్ అయ్యే అవకాశాలున్నాయట! మనుషులకూ... రోబోలకూ... ప్రపంచం మనుషులకు మాత్రమే కాదట! మరి, ఇంకెవరికి అంటే ‘రోబోలకు కూడా’ అట! ‘ద వరల్డ్ ఈజ్ నాట్ ఓన్లీ ఫర్ హ్యూమన్స్’ – ‘2.0’కి శంకర్ ఇచ్చిన క్యాప్షన్. అంటే... దానర్థం ఏంటి? రోబోలకూ అనేగా! ఇందులో హీరోయిన్ అమీ జాక్సన్ రోబోగా నటించారట! ‘రోబో’లో మనుషుల్ని రోబోలు ప్రేమిస్తే? ఎలా ఉంటుందనేది చూపించారు దర్శకుడు శంకర్. ‘2.0’లో రోబో మనుషుల్ని ప్రేమిస్తే? అనే కాన్సెప్టును చూపించబోతున్నారట! ఈ రోబోటిక్ సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్‌లో అక్షయ్ బర్డ్‌మ్యాన్/క్రౌమ్యాన్‌గా నటించిన సంగతి తెలిసిందే. మనిషిగా, రోబోగా రజనీకాంత్ ఐదు గెటప్పుల్లో కనిపించనున్నారట! మరి, మనుషులకూ, రోబోలకూ ప్రేమ మాత్రమేనా? యుద్ధం కూడా ఉంటుందా? వచ్చే జనవరి 25 వరకు వెయిట్ చేయాలి!! -
రజనీ అభిమానులకు శంకర్ అదిరిపోయే న్యూస్
సాక్షి, చెన్నై : దక్షిణాది సూపర్ స్టార్ రజనీ కాంత్ అభిమానులకు పెద్ద పండుగ. ఎన్.శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రోబో 2.0 చిత్రం రిలీజ్ దగ్గర పడుతున్న కొద్దీ మూవీకి సంబంధించిన ఆసక్తికర విషయాలు వెలుగు చూస్తుండగా ఇప్పుడు మరింత ఉత్సాహాన్నిచ్చే విషయం స్వయంగా శంకర్ వెల్లడించారు. ఈ సినిమాను 3డీలో కూడా చిత్రీకరిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. సినిమాలో ఎన్నో యాక్షన్ సీన్స్, విజువల్ ఎఫెక్ట్స్ ఉన్నాయంటూ ఆయన శనివారం తన ట్విటర్ ఖాతాలో అందుకు సంబంధించిన మేకింగ్ స్టిల్స్‌తో కూడిన వీడియోను పోస్ట్ చేశారు. కావాలని తాము 3డీని ఉపయోగించలేదని, స్క్రిప్టు డిమాండ్ చేయడం వల్లే 3డీ టెక్నాలజీ ఉపయోగించినట్లు చెప్పారు. యాక్షన్ మధ్యలో 3డీ వస్తుందని, సాధారణంగా హాలీవుడ్ చిత్రాల్లో సినిమా 2డీలో తీసి తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ అప్పుడు 3డీలోకి కన్వర్ట్ చేసుకుంటారని కానీ తాము మాత్రం లేటెస్ట్ 3డీ కెమెరాతో డైరెక్ట్‌గా నేచురల్‌గా తీశామని, ప్రతిసీన్ను హైటెక్ 3డీ గ్లాస్‌తో మానిటర్‌పై చెక్ చేసుకున్నామని తెలిపారు. ఈ సినిమా తర్వాత చాలా ధియేటర్లు 3డీ కన్వర్షన్ చేసుకుంటాయని తాను భావిస్తున్నానని అన్నారు. ఈ వీడియోలోనే రజనీకాంత్ కూడా మాట్లాడుతూ ఫస్ట్ 3డీ షాట్ తాను పదే పదే చూసుకొని మిస్మరైజ్ అయ్యానని, తాను శంకర్‌ను అభినందించకుండా ఉండలేకపోతున్నానని తెలిపారు. ఏ హాలీవుడ్ మూవీకి తగ్గనట్లు ఈ చిత్రం ఉండబోతుందన్నారు. -
రజనీ అభిమానులకు శంకర్ అదిరిపోయే న్యూస్
-
వారికి సరిరారు మరెవ్వరూ!
తమిళసినిమా: ప్రచారాలకు, భేటీలకు దూరంగా ఉండే నటి అంటే అది నయనతార. నటిగా తన పాత్రకు న్యాయం చేశామా ‘అంతటితో తన బాధ్యత పూర్తి అయ్యిందని భావించే అరుదైన నటి ఈమె. అగ్రకథానాయకిగా రాణిస్తున్న ఈ బ్యూటీ చేతినిండా చిత్రాలతో యమ బిజీగా ఉన్నారు. అలాంటి వాటిలో అరమ్ ఒకటి. ఈ చిత్రం దీపావళి రేస్‌కు సిద్ధం అవుతోంది. లేడీ ఓరియంటెడ్ కథా చిత్రంగా రూపొందిన ఆరమ్ కోసం నయనతార కాస్త ఎక్కువ కేర్ తీసుకుంటున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. కారణం ఈ చిత్రానికి అనధికార నిర్మాత తనే అని టాక్ వినిపిస్తోంది. ఇంటర్వ్యూలకు దూరంగా ఉంటే నయన్ ఇటీవల అరమ్ చిత్ర ప్రమోషన్లో భాగంగా ఒక టీవీ చానల్‌కు భేటీ ఇవ్వడం విశేషం. ఈ భేటీలో ముఖ్యంగా ఇద్దరు స్టార్ నటుల గురించి ప్రస్తావించడం మరింత చర్చనీయాంశంగా మారింది. ఆ ఇంటర్వ్యూలో రజనీకాంత్, అజిత్‌లు స్టార్ హీరోలుగా ఎందుకు రాణిస్తున్నారంటే అంటూ మొదలెట్టి ప్రేక్షకుల్లో ఆసక్తి కలిగించారు. ఈ అగ్రనటి ఆరంభంలోనే సూపర్‌స్టార్ రజనీకి జంటగా చంద్రముఖి వంటి సంచలన చిత్రంలో నటించే అవకాశాన్ని దక్కించుకున్న విషయం తెలిసిందే. ఆ తరువాత కుశేలన్లో నటించారు. ఇక శివాజీ చిత్రంలో సింగల్ సాంగ్‌కు చిందులేశారు. అదే విధంగా అజిత్‌తోనూ మూడు చిత్రాల్లో నటించారు. ఈ సందర్భంగా నయనతార తన మనసులోని మాట చెబుతూ తనకు ఇష్టమైన నటుడు అజిత్ అని, ఆయనతో నటించడం చాలా సౌకర్యంగా ఉంటుందని పేర్కొన్నారు. అజిత్‌తో బిల్లా చిత్రంలో నటించే సమయంలో తానేమంత పెద్ద నటిని కాదన్నారు. అయినా అజిత్ అంత స్టార్‌తో నటిస్తున్నాననే ఫీలింగ్ కలిగించకుండా ఆయన ప్రవర్తించారని తెలిపారు. రజనీకాంత్, అజిత్‌లు సహ నటీనటులను గౌరవిస్తారని అన్నారు. ముఖ్యంగా స్త్రీలను గౌరవించడంలో వారికి వారే సాటి అని పేర్కొన్నారు. అందుకే వారు స్టార్ హీరోలుగా రాణిస్తున్నారని నయనతార అన్నారు. -
కమల్ లక్ష్యంగా రజనీ వ్యంగ్యాస్త్రాలు..
సాక్షి, చెన్నై: త్వరలో రాజకీయాల్లోకి ప్రవేశిస్తామంటూ సంకేతాలు ఇచ్చిన తమిళ సూపర్ స్టార్లు రజనీకాంత్, కమల్ హాసన్ ఒకే వేదికపైకి వస్తే.. ఆ వేదికపై రాజకీయాల గురించి పరోక్షంగా మాట్లాడితే.. అది హాట్ టాపిక్ అవుతుంది. ఆదివారం చెన్నైలో శివాజీ గణేషన్ కాంస్య విగ్రహం ఆవిష్కరణ కార్యక్రమం ఇందుకు వేదిక అయింది. ఈ కార్యక్రమానికి తలైవా రజనీకాంత్, లోకనాయకుడు కమల్ హాసన్‌తోపాటు, తమిళనాడు డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం హాజరయ్యారు. ఈ సందర్భంగా రజనీకాంత్ మాట్లాడుతూ.. కమల్ హాసన్‌పై పరోక్షంగా సెటైర్లు వేయడం చర్చనీయాంశమైంది. రాజకీయాల్లో రాణించాలంటే డబ్బు, స్టార్డమ్, పేరు ప్రఖ్యాతలు సరిపోవని, అంతకుమించి ఇంకేదో కావాలని రజనీ పేర్కొన్నారు. 'నటుడిని రాజకీయ నాయకుడు చేసే గొప్ప మార్పు ఏదో రావాలి. అది ఏమిటో కమల్ హాసన్‌కు తెలిసి ఉండొచ్చు. రెండు నెలలు కిందట నేను అడిగి ఉంటే అతను చెప్పి ఉండేవాడేమో. కానీ ఇప్పుడు అడిగితే.. 'నా వెంట రా.. నేను చెప్తాను' అంటున్నాడు' అని రజనీ ఛలోక్తులు విసిరారు. అప్పటికీ ప్రేక్షకుల నడుమ కూర్చున్న కమల్ సైతం నవ్వులు కురిపించారు. రజనీ మాట్లాడుతూ.. రాజకీయాల్లోకి రావాలంటే సినీ గ్లామర్ మాత్రమే సరిపోదని, ప్రజలతో మమేకమైతేనే రాజకీయాల్లో రాణిస్తామని చెప్పారు. రాజకీయాల్లోకి రావాలని కమల్ తనను ఆహ్వానించారని, పెద్దవాడివి కలిసి వెళదాం అంటూ మిత్రుడిగా ఆయన ఆహ్వానించడం సంతోషానిచ్చిందని చెప్పారు. ఆయనతో వెళితే రాజకీయాలు నేర్పుతాడేమోనని రజనీ చమత్కరించారు. అంతకుముందు కమల్ హాసన్ మాట్లాడుతూ అధికార అన్నాడీఎంకే సర్కారుపై పరోక్ష విమర్శలు గుప్పించారు. శివాజీ గణేషణ్ కాంస్య విగ్రహం ఏర్పాటులో జాప్యాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. 'రాజకీయాలకు అతీతమైన ప్రజాభిమానం శివాజీ సొంతం. ఆయన విగ్రహాన్ని ఏర్పాటుచేయాలని ఎవరినీ మేం యాచించాల్సిన అవసరం లేదు. ఎవరూ వ్యతిరేకించినా నేను ఈ కార్యక్రమానికి హాజరయ్యేవాడిని. ఒకవేళ నేను కార్యక్రమం బయట నిలబడినా.. ఈ కార్యక్రమంలో మాత్రం భాగం అయ్యేవాడిని 'అని కమల్ చెప్పారు. ఈ కార్యక్రమ ప్రారంభంలో కమల్, రజనీ స్నేహపూర్వకంగా మాట్లాడుకోవడం కనిపించింది. ఈ ఇద్దరూ రాజకీయాల్లోకి వస్తున్నామని సంకేతాలు ఇవ్వడంతో.. భవిష్యత్తులో వీరి మధ్య రాజకీయాలు ఎలా ఉంటాయనేది ఆసక్తికరంగా మారింది. -
2.0 ఒరేయ్ ...అక్కు పక్షి...! పోరా...నీ టెక్కు తీస్తా!
1.0 లో వంద పాయింట్లు వచ్చాయి. శంకరన్న వంద పాయింట్లు కొట్టాడు. రజనీ ఇంకో వంద కొట్టారు. అమాంతం 200 పాయింట్లు వచ్చాయి కదా.. ఇప్పుడు 2.0 వస్తోంది. సాఫ్ట్వేర్ అప్‌గ్రేడ్‌లో 2.0 అంటే ఇంప్రూవ్డ్ వెర్షన్ అని. ఆ రోబో అన్నీ చేసేశాడు. ఇంప్రూవ్డ్ వెర్షన్లో ఇంకేం చేస్తాడో! స్క్రీన్లు, డిస్ట్రిబ్యూటర్లు, మార్కెట్.. టెక్నీషియన్లు, క్యాషూ, డ్యాషూ.. ఆటలు, పాటలు, ఫైట్లు, హీరోయిన్... కథ లైట్‌గా చెబుతున్నాం కానీ టూ పాయింట్ జీరో కథాకమామిషు మాత్రం.. ఫుల్ల్ల్ల్గా....! కథేంటి? మర మనిషి (రోబో)కి ఎమోషన్స్ ఉంటాయా? ఆలోచించగలుగు తుందా? ప్రేమలో కూడా పడుతుందా? మనం ‘కీ’ ఇచ్చినట్లు ఆడే రోబో మనకు సంబంధం లేకుండా పైవన్నీ చేస్తే, చూడ్డానికి ఓ థ్రిల్. ‘రోబో’ సినిమా అలాంటి థ్రిల్‌నే ఇచ్చింది. అందులో డాక్టర్ వశీ (రజనీకాంత్) ఎంతో శ్రమపడి ఓ రోబో (చిట్టి)ను తయారు చేస్తాడు. ఆ రోబోను ఇండియన్ ఆర్మీకి ఇవ్వాలన్నది అతని ఆశయం. ఆర్మీకి ఉపయోగపడాలంటే చిట్టిలో హ్యూమన్ ఎమోషన్స్ ఉండాలి. వశీ ఆ పని కూడా చేసేస్తాడు. చివరికి అతని లవర్‌తోనే చిట్టి లవ్‌లో పడుతుంది. మరోవైపు చిట్టి దేశానికి ఉపయోగపడ కూడదని, దాన్ని అంతం చేయాలని విలన్ గ్యాంగ్ ప్లాన్ చేస్తుంది. క్లుప్తంగా ‘రోబో’ కథ ఇది. మరి.. ఈ చిత్రం సీక్వెల్ ఇ‘2.0’ కథేంటి? అంటే ఇప్పటివరకూ టూకీగా కూడా కథ గురించి బయటకు రాలేదు. అయితే చెన్నై కోడంబాక్కమ్‌లో ఓ కథ ప్రచారంలో ఉంది. అదేంటంటే... పక్షులంటే ఓ వ్యక్తి (అక్షయ్‌కుమార్)కి పిచ్చి ప్రేమ. టెక్నాలజీ పెరుగుతోన్న కొద్దీ కొన్ని పక్షులు కనిపించకుండాపోతున్నాయి. ఆ బర్డ్ లవర్ బాధ అంతా అదే. అతనికి సెల్ టవర్లు చూస్తే ఒళ్లు మండిపోతుంది. వాటి నుంచి వచ్చే రేడియేషన్ వల్లే పక్షులు అంతమవుతున్నాయని టెక్నాలజీపై పగ పెంచుకుంటాడు. సైంటిస్టులను అంతం చేయాలని, టెక్నాలజీని నాశనం చేయాలని అనుకుంటాడు. మరోవైపు... అవినీతిని అంతం చేయడానికి ఓ రోబోను కనిపెడతాడో సైంటిస్ట్ (రజనీకాంత్). ఆ సైంటిస్ట్, అతను కనిపెట్టిన రోబో, ఆ పక్షి ప్రేమికుడు... ప్రధానంగా ఈ మూడు పాత్రల చుట్టూ ‘2.0’ కథ ఉంటుందని సమాచారం. ఇది ఆసక్తిరాయుళ్లు అల్లిన కథా లేక నిజమైనదా? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. అయితే ఈ కథలో ఎంతో కొంత నిజం ఉండి ఉంటుందని అక్షయ్ గెటప్‌ని బట్టి ఊహించవచ్చు. ఐదు గెటప్స్‌లో రజనీ! ఈ చిత్రంలో రజనీకాంత్ ఐదు గెటప్స్‌లో కనిపిస్తారని ఓ టాక్. వాటిలో రోబో ఒకటి. దీనికోసం రజనీ ఫేస్ మాస్కులు తయారు చేశారు. అదంత ఈజీ కాదు. ఏవేవో పదార్థాలు రజనీ ఫేస్‌కి అప్లై చేసి, అది ఎండిన తర్వాత తీస్తే, వచ్చేదే మాస్క్. దీనికోసం రజనీ నాలుగైదు గంటలు కేటాయించాల్సి వచ్చింది. ఈ సూపర్ స్టార్ వయసు దాదాపు 65. ఈ ఏజ్‌లో అన్నేసి గంటలు కదలకుండా కూర్చోవడం అంటే చిన్న విషయం కాదు. ‘లార్డ్ ఆఫ్ ద రింగ్స్’, ‘ఐరన్ మాన్’, ‘లైఫ్ ఆఫ్ పై’ తదితర హిట్ సిన్మాలకు పని చేసిన హాలీవుడ్ మేకప్ ఆర్టిస్ట్ వాన్స్ హార్ట్వెల్ రజనీ– అక్షయ్‌ల స్పెషల్ గెటప్స్‌కి మేకప్ చేశారు. రజనీ ఇంత శ్రమపడ్డారు కదా? ఆయన ఎంత పారితోషికం తీసుకుని ఉంటారు.. అనుకుంటు న్నారా? సినిమా సాధించే లాభాల్లో షేర్ ఇస్తారట. ఆ లెక్క రిలీజ్ తర్వాత తెలుస్తుంది. ఈవీపీ వర్డ్‌లో... చెన్నైలోని పూనమల్లిలో ‘ఈవీపీ వరల్డ్’ అనే థీమ్ వర్క్ ఉండేది. 2015లో దాన్ని మూసేశా రట. దాదాపు 150 ఎకరాలు ఉన్న ఆ పార్క్‌ని ‘2.0’ నిర్మాతలు హైర్ చేసుకున్నారు. అందులో భారీ సెట్స్ వేశారు. వాటిలో మొబైల్ ఫోన్ స్టోర్ సెట్ ఒకటి. అక్కడే మిలిటరీ ట్యాంక్స్ తయారు చేయించారట. కేవలం షూటింగ్ కోసమే కాదు.. సినిమాకి సంబంధించిన లావాదేవీలు జరపడానికి, అక్కడే బస చేయ డానికి వీలుగా ఏర్పాట్లు చేసుకున్నారట. వేరే ప్లేస్‌లో తీసిన సీన్స్‌లో ప్యాచ్‌వర్క్ ఉంటే.. ఈవీపీ వరల్డ్‌లో సెట్ వేసి, మ్యాచింగ్ సీన్స్ తీసేవారట. దర్శకుడు శంకర్ ఇంటికి వెళ్ల కుండా ఆల్మోస్ట్ ఈ లొకేషన్లోనే ఉండేవారట. అంత డెడికేషన్, ఎంతో ప్యాషన్ ఉంటే తప్ప ఇలాంటి సినిమాలు తీయలేరు. ఎప్పుడు మొదలు? ఎప్పుడు ముగింపు? డిసెంబర్ 12 రజనీకాంత్ పుట్టినరోజు. 2015లో ఆయన బర్త్‌డే నాడు ‘2.0’ని ప్రారంభించారు. అప్పుడు చెన్నైలో తుఫాను కారణంగా సింపుల్‌గా ఆ వేడకను కానిచ్చేశారు. ఆ తర్వాత అదే నెల 16న రెగ్యులర్ షూటింగ్‌ను మొదలుపెట్టారు. ఈ ఆగస్ట్‌కి మొత్తం షూటింగ్ పూర్తి చేశారు. కంటికి కనిపించేది 20 నెలలు. అంటే.. దాదాపు 600 రోజులు. కానీ, షూటింగ్‌కి పట్టిన రోజులు మాత్రం దాదాపు 300 రోజులు అట. మధ్యలో అనారోగ్యం కారణంగా రజనీకాంత్ కొన్ని రోజులు బ్రేక్ తీసుకోవడం వల్ల, షూటింగ్ డేస్ మినహా కొన్ని రోజులు ప్లానింగ్‌కి కేటాయించడం వల్ల ఆగస్ట్ వరకూ ఎక్స్టెండ్ అయింది. లేకపోతే ఇంకొంచెం ముందే అయ్యుండేదని టాక్. ఫస్ట్ పార్ట్‌కన్నా సెకండ్ పార్ట్ టెక్నాలజీ వైజ్‌గా రెండింతలు ఉండటం యూనిట్‌కి ఓ సవాల్. అందుకే ప్రతిదీ చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకున్నారు. చిత్రీకరణ జరిపిన రోజులుకన్నా ప్రీ–ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌కి ఎక్కువ రోజులు పడుతుంది. అక్షయ్‌కుమార్ గెటప్ వెనక బోల్డంత కహానీ హిందీలో హీరోగా దూసుకెళుతోన్న అక్షయ్‌కుమార్‌కి విలన్‌గా చేయాల్సిన అవసరం ఏంటి? రెమ్యునరేషనా? స్టోరీయా? క్యారెక్టరా? రజనీకాంత్‌తో ఢీ కొనొచ్చనా? శంకర్ డైరెక్టర్ అనా? అని చాలామంది అనుకున్నారు. యస్.. అక్షయ్‌కుమార్ ఈ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడానికి ఇవన్నీ కారణాలు. ‘‘రజనీకాంత్‌తో దెబ్బలు తినడంలో ఓ మజా ఉంది’ అని స్వయంగా అక్షయ్ ఓ సందర్భంలో పేర్కొన్నారు. ఇందులో విచిత్రమైన గెటప్‌లో అక్షయ్ కనిపిస్తోన్న ఫొటోలు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పక్షులు పలు రకాలు కదా. ఈ పక్షి ప్రేమికుడి గెటప్‌ని కూడా పలు రకాల పక్షులను తలపించే రీతిలో ప్లాన్ చేశారట. ఉదాహరణకు కనుబొమలు ఓ పక్షిలా, చేతి గోళ్లు మరో పక్షిలా, జుత్తు ఓ పక్షిని పోలినట్లుగా, మీసాలు మరో పక్షిలా... ఇలా అక్షయ్ గెటప్‌ని మౌల్డ్ చేశారు. అక్షయ్ మేకప్‌కి నాలుగైదు గంటలు పట్టేదట. ఒక్కసారి మేకప్ వేశాక ‘నో సాలిడ్ ఫుడ్’. ‘ఓన్లీ లిక్విడ్స్’. జ్యూసులు, నీళ్లు, పాలు లాంటివి. అందుకే ఎక్కువ గంటలు షూటింగ్ చేసేవారు కాదని సమాచారం. ఇంతకీ అక్షయ్ పారితోషికం ఎంతో తెలుసా? రోజుకి 2 కోట్ల రూపాయలు తీసుకున్నారట. ఈ సినిమాకి ఆయన అక్షరాలా 50 కోట్లకు చెక్కు పుచ్చుకున్నారట. మామూలుగా హిందీలో హీరోగా నటించే సినిమాలకు అక్షయ్ 50 నుంచి 70 కోట్లు తీసుకుంటారని భోగట్టా. తెలుగు రైట్స్ కోసం పోటాపోటీ! రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ చిత్రాన్ని ఏషియన్ ఫిలింస్ సునీల్ నారంగ్ విడుదల చేయనున్నారు. రైట్స్ దక్కించుకోడానికి పెద్ద ఎత్తున పోటీ నెలకొంది. చివరకు హక్కులు చేజిక్కించుకోవడానికి రాజకీయ నాయకుల సహాయం కూడా కొంతమంది తీసుకున్నారట. కానీ, ఈ ప్రెస్టీజియస్ మూవీని సరిగ్గా రిలీజ్ చేసి, నిలబెట్టగల సంస్థకే ఇవ్వాలని లైకా ప్రొడక్షన్స్ అనుకుందట. అందుకే 40 ఏళ్లుగా 500 చిత్రాలకు పైగా ఫైనాన్స్ చేసి, వందకు పైగా సినిమాలను పంపిణీ చేసిన ఏషియన్ ఫిలింస్‌కి ఇచ్చారు. ఫైనల్‌గా రిలయన్స్, సురేశ్ ప్రొడక్షన్స్‌తో కలసి ఏషియన్ ఫిలింస్ ఈ చిత్రం రైట్స్‌ను దాదాపు 80 కోట్లకు దక్కించుకుంది. బడ్జెట్ ఎంత? ఈ చిత్రంలో లెక్కలేనన్ని రోబోలు, టెక్నికల్‌గా క్రియేట్ చేసిన పక్షులు కనిపిస్తాయట. అలాగే, భారీ సెట్స్ కనువిందు చేస్తాయి. బోలెడంత మంది తారాగణం. ఇండియన్ టెక్నీషియన్స్‌తో పాటు హాలీవుడ్ టెక్నీషియన్స్ కూడా పని చేశారు. ఎక్కువమంది హాలీవుడ్ టెక్నీషియన్స్ పని చేసిన మొదటి ఇండియన్ సినిమా ఇదే అవుతుంది. ‘ట్రాన్స్ఫార్మర్స్’, ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్’ వంటి హాలీవుడ్ చిత్రాలకు పని చేసిన సాంకేతిక నిపుణులు ‘2.0’కి చేశారు. కెమెరామేన్ నిరవ్ షా, మ్యూజిక్ డైరెక్టర్ ఎ.ఆర్. రెహమాన్, సౌండ్ డిజైనర్ రసూల్ పూకుట్టి తదితర ఇండియన్ టెక్నీషియన్స్‌తో పాటు స్పెషల్ కాస్ట్యూమ్స్ డిజైన్ చేయడానికి మేరీ ఇ. వోగ్, స్టంట్ కొరియోగ్రాఫర్ బేట్స్, విజువల్ ఎఫెక్ట్స్ స్పెషలిస్ట్ జాన్ హ్యూగెస్, వాల్ట్ జోన్స్ వంటి హాలీవుడ్ టెక్నీషియన్స్ పని చేశారు. అమెరికాకు చెందిన ‘ది లెగసీ ఎఫెక్ట్స్’ యానిమేట్రానిక్స్ వర్క్ చేసింది. టెక్నీషియన్స్, ఆర్టిస్ట్స్ రెమ్యునరేషన్లు, సినిమా సెట్స్, లొకేషన్ ఖర్చు.. ఇలా టోటల్‌గా ఇది భారీ బడ్జెట్ సినిమా అయింది. ముందు 250 నుంచి 300 కోట్ల రూపాయల బడ్జెట్లోనే తీయాలనుకున్నారనే వార్త వచ్చిన విషయం తెలిసిందే. సినిమా ముగిసేసరికి దాదాపు 450 కోట్లు అయింది. భారతీయ సినిమాల్లో భారీ బడ్జెట్‌తో రూపొందిన ఫస్ట్ మూవీ ఇదే అవుతుంది. ఒక్క పాటకు 32 కోట్లు! ఇది చదివినవాళ్లు 10 చిన్న సినిమాలు తీసే బడ్జెట్ ఒక్క పాటకా? అనుకోకుండా ఉండలేరు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఇటీవల చెన్నైలో ఓ పాట తీశారు. ఆ పాటకు అయిన ఖర్చు 32 కోట్లు అట. రజనీకాంత్–అమీజాక్సన్, కొన్ని రోబోల మీద పదీ పదిహేను రోజుల పాటు ఈ పాట తీశారట. 32 కోట్లతో సాంగ్ అంటే.. ఎంత రిచ్‌గా ఉండి ఉంటుందో? సాంగ్స్ విషయంలో శంకర్ స్పెషల్ ఫోకస్ పెడుతుంటారని స్పెషల్‌గా చెప్పక్కర్లేదు. ‘జీన్స్’ సినిమాలో ‘పూవుల్లో దాగున్న..’ పాటను ప్రపంచంలోని ఏడు వింతలైన తాజ్‌మహల్, గ్రేట్ వాల్ ఆఫ్ చైనా, ఈఫిల్ టవర్, ఈజిప్టియన్ పిరమిడ్స్.. తదితర ప్రదేశాల్లో తీసిన విషయం గుర్తుండే ఉంటుంది. ఈ పాట చిత్రీకరణకు 30 రోజులకు పైగా పట్టింది. ‘బాయ్స్’లో ఫ్రీజ్ టెక్నిక్‌తో ‘ఆలే.. ఆలే..’ సాంగ్ తీయడం అప్పట్లో ఓ హాట్ టాపిక్. రోబో’లో ‘కిల్లిమంజారో..’ పాటను పెరూలోని కొండల దగ్గర తీశారు. ఆ లొకేషన్లో షూట్ చేసిన ఫస్ట్ ఇండియన్ మూవీ ఇదే. ‘ఐ’లో ‘పూలనే కులికేయమంటా..’ పాటను చైనాలో తీశారు. పూల బ్యాక్‌డ్రాప్‌లో తీసిన ఆ సాంగ్ ఐ–ఫీస్ట్. ‘ఈ పాటలన్నీ ఒక ఎత్తయితే ‘2.0’ కోసం తీసిన 32 కోట్ల పాట మరో ఎత్తు అవుతుందని చెన్నై టాక్. ప్రమోషన్ అదుర్స్ సినిమా తీస్తే సరిపోదు.. దానికి సరైన పబ్లిసిటీ అవసరం. అది స్టార్ మూవీ అయినా నాన్–స్టార్ మూవీ అయినా. ఈ విషయంలో దర్శకుడు శంకర్, లైకా నిర్మాణ సంస్థకు ఫుల్ క్లారిటీ ఉంది. అందుకే ప్రపంచవ్యాప్తంగా ప్రమోట్ చేయాలనుకుంటున్నారు. ఇప్పటికే హాట్ ఎయిర్ బెలూన్ తయారు చేయించిన విషయం తెలిసిందే. 100 అడుగులు ఎత్తు ఉన్న ఈ బెలూన్ ఇండియాలోనే కాకుండా విదేశాల్లో పలు చోట్ల దర్శనమిస్తుంది. ఇప్పటికే యూఎస్‌లో పెట్టారు. 2 పాటలు! 3 చోట్ల ఆడియోలు! ఆడియో వేడుకను బ్రహ్మాండంగా చేయాలనుకుంటున్నారు. అబుదాబి, హైదరాబాద్, చెన్నైలలో ఆడియో వేడుకను ప్లాన్ చేశారు. ఆ సంగతలా ఉంచితే పరిశ్రమ వర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్రంలో రెండే పాటలు ఉంటాయట. కానీ, ఏ.ఆర్. రహమాన్ ఐదు పాటలు తయారు చేసారట. అవి ఆల్బమ్ వరకే పరిమితమవుతాయని తెలిసింది. స్టోరీ పెద్దది కావడంతో పాటలకు పెద్దగా స్కోప్ లేకపోవడంవల్లే రెండు పాటలనే సినిమాలో పెట్టాలనుకున్నారట. మరి.. ఇది నిజమేనా? వేచి చూద్దాం. తెలుగు ప్రమోషన్‌కు 5 కోట్లు? జనవరి 25న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలనుకుంటు న్నారు. అంతకు నెల ముందు ప్రమోషన్ కార్యక్రమాల జోరు పెంచాలనుకుంటున్నారు. తెలుగు ప్రమోషనల్ కార్యక్రమాలకు 5 కోట్లు ఖర్చుపెట్టాలనుకుంటున్నా రట. ఈ ఖర్చుని లైకా ప్రొడక్షన్సే పెట్టుకుంటుందట. అదిరిపోయే స్టేడియమ్ సీన్! ఈ చిత్రంలో రజనీ– అక్షయ్ కాంబినేషన్లో వచ్చే స్టేడియమ్ సీన్స్ వన్నాఫ్‌ది హైలైట్స్ అని సమాచారం. ఢిల్లీల్లోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియమ్లో కొన్ని రోజులు ఆ సీన్స్ తీసి, ఆ తర్వాత చెన్నైలో ప్యాచ్ వర్క్ తీశారట. లెంగ్త్ తక్కువ ఉన్న ఈ సీన్స్ కోసం 60, 70 రోజులు కేటాయించడం విశేషం. దాన్నిబట్టి కథకు ఎంత కీలకమో ఊహించవచ్చు. 100 కోట్ల పైనే హిందీ హక్కులు! ‘2.0’ హిందీ రైట్స్ బాగానే పలికింది. ఫస్ట్ పార్ట్ సుమారు 20 కోట్లకు అమ్ముడుపోతే సెకండ్ పార్ట్ అందుకు ఐదింతలు పెరగడం విశేషం. దాదాపు 100 కోట్లకు పైనే హిందీ థియేట్రికల్ రైట్స్ అమ్ముడుపోయాయట. 110 కోట్లకు శాటిలైట్ రైట్స్ 450 కోట్లతో ఈ సినిమాని తీస్తే అందులో పావు శాతం సినిమా విడుదలకు ముందే శాటిలైట్ రూపంలో వచ్చేసిందని టాక్. ఈ ప్రెస్టీజియస్ మూవీని దక్కించుకోవడానికి పలు ప్రముఖ ఛానళ్లు పోటీ పడ్డాయట. చివరికి ‘జీ టీవీ’ చేజిక్కించుకుంది. తమిళ, తెలుగు, హిందీ భాషల శాటిలైట్ రైట్స్‌ను 110 కోట్లకు సొంతం చేసుకుందట. – డి.జి. భవాని -
తలైవా తర్వాత ?
-
బిగ్ బీతో రజనీ చర్చలు..?
ప్రస్తుతం రజనీకాంత్ కాలా చిత్రంతో బిజీగా ఉన్నారు. మరోవైపు ఆయన అడుగులు రాజకీయాలపై పడనున్నాయనే ఊహాగానాలు ఉన్నాయి. ఫ్యాన్స్ మీట్ అంటూ అభిమానులను కలవడం, రైతు సంఘాల నాయకులను కలవడం ఈ ఊహలకు ఊతమిస్తున్నాయి. తాజాగా, ఆయన అమితాబ్ బచ్చన్‌ని కలవాలనుకుంటున్నారనే వార్త గుప్పుమంది. రాజకీయ రంగప్రవేశంపై సలహా తీసుకోవడానికే రజనీ బిగ్ బీని కలవనున్నారని టాక్. రానున్న రెండు వారాల్లో ఈ బిగ్ మీటింగ్ జరుగుతుందట. ఇద్దరు స్టార్లు కలుస్తున్నారంటే దాని వెనక అర్థం పరమార్థం ఉంటాయి. మరి.. ఈ మీటింగ్ వెనక ఉన్న కారణం రాజకీయాలేనా? మరేమైనానా? అసలు బిగ్ బి, రజనీ కలుస్తారా? వెయిట్ అండ్ సీ. -
అది మాత్రం టాప్ సీక్రెట్ : హీరోయిన్
గ్రేట్ డైరెక్టర్ శంకర్, సూపర్ స్టార్ రజనీకాంత్‌ల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ప్రస్టీజియస్ మూవీ 2.0. భారతీయ సినీ చరిత్రలోనే భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ విలన్‌గా నటిస్తుండగా బ్రిటీష్ బ్యూటి అమీజాక్సన్ హీరోయిన్గా నటిస్తోంది. ఇప్పటి వరకు సినిమాకు సంబంధించిన ప్రతీ విషయాన్ని సీక్రెట్ ఉంచిన యూనిట్ ఒక్కొట్టిగా రివీల్ చేస్తోంది. తాజాగా ఓ ఇంటర్య్వూలో సినిమా కాస్ట్యూమ్స్‌కు సంబంధించిన విశేషాలను హీరోయిన్ అమీజాక్సన్ వెల్లడించింది. సినిమాలోని లీడ్ క్యారెక్టర్స్ అన్నింటికీ లాస్ ఏంజెల్స్ డిజైనర్స్ కాస్ట్యూమ్స్ డిజైన్ చేశారని వెల్లడించింది. హాలీవుడ్ సినిమాలు హర్రీపొట్టర్, మెన్ ఇన్ బ్లాక్, ద హాబిట్ లాంటి చిత్రాలకు పనిచేసిన డిజైనర్స్ రోబో సీక్వల్కు పనిచేశారు. హీరో రజనీకాంత్, విలన్ అక్షయ్ కుమార్‌తో పాటు తాను కూడా స్వయంగా లాస్ ఏంజెల్స్ వెళ్లి బాడీ మౌల్డ్స్ ఇచ్చామని తెలిపింది. అయితే ఈ సినిమాలో తన గెటప్ ఎలా ఉంటుందన్న విషయం మాత్రం టాప్ సీక్రెట్ అంటూ ఊరిస్తుంది ఈ బ్రిటీష్ భామ. -
రజనీ కూడా వెనకడుగేశాడు..!
ప్రజెంట్ సౌత్ ఇండస్ట్రీలో వాయిదా పర్వం నడుస్తోంది. స్టార్ హీరోలందరూ తమ సినిమాలను వరుసగా వాయిదా వేస్తూ వస్తున్నారు. ఇప్పటికే టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, స్టార్ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో బైలింగ్యువల్ సినిమాగా తెరకెక్కుతున్న స్పైడర్ రిలీజ్ వాయిదా పడింది. అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న డీజే దువ్వాడ జగన్నాథమ్ సినిమాను కూడా వాయిదా వేశారు. సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా అదే బాటలో నడుస్తున్నాడు. రోబో సినిమాకు సీక్వల్ శంకర్, రజనీకాంత్‌ల కాంబినేషన్లో తెరకెక్కుతున్న 2.0 కూడా వాయిదా పడింది. గ్రాఫిక్స్ వర్క్ ఆలస్యమవుతుండటంతో మరింత నాణ్యమైన అవుట్ పుట్ కోసమే సినిమాను వాయిదా వేస్తున్నట్టుగా చిత్ర నిర్మాతలు పలికారు. ముందుగా ఈ సినిమాను దీపావళి కానుకగా రిలీజ్ చేయాలని భావించినా.. ఇప్పుడు మరో నాలుగు నెలలు ఆలస్యంగా 2018 జనవరి 25న రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. Our most ambitious project, Shankar's 2.0,shifts to 25Jan2018.It moves from earlier Diwali release to achieve world class standards in VFX. — Raju Mahalingam (@rajumahalingam) 21 April 2017 -
రజనీకాంత్ 5, అక్షయ్ కుమార్ 12
శంకర్, రజనీకాంత్‌ల కాంబినేషన్లో రూపొందుతున్న రోబో 2కు సంబంధించిన అప్ డేట్స్ ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఇప్పటికే బడ్జెట్, కాస్టింగ్ లాంటి అంశాలతో భారీ హైప్ క్రియేట్ అయ్యింది. ఇప్పుడు ఆ అంచనాలను మరింత పెంచేసే వార్త ఒకటి కోలీవుడ్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. రోబో సినిమా కోసం రజనీని రకరకాల గెటప్స్‌లో చూపించిన దర్శకుడు శంకర్, ఈ సీక్వల్ కోసం కూడా అదే ఫార్ములాను ఫాలో అవుతున్నాడట. 2.0 పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రజనీ కాంత్ కోసం 5 విభిన్న గెటప్స్‌ను సెలెక్ట్ చేశాడు. సైంటిస్ట్ వశీకర్, రోబో చిట్టితో పాటు మరో మూడు గెటప్స్‌లో రజనీ అలరించనున్నాడు. అంతేకాదు ఈ సినిమాలో విలన్‌గా నటిస్తున్న బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్‌ను కూడా కొత్తగా చూపించబోతున్నాడు శంకర్. ఈ సినిమాలో అక్షయ్ 12 డిఫరెంట్ లుక్స్‌లో కనిపించనున్నాడు. 400 కోట్లకు పైగా బడ్జెట్‌తో తెరకెక్కుతున్న 2.0 (రోబో 2) దీపావళి కానుకగా అక్టోబర్‌లో రిలీజ్ కానుంది. -
క్షమాపణ చెప్పిన డైరెక్టర్ శంకర్
-
క్షమాపణ చెప్పిన డైరెక్టర్ శంకర్
రజనీకాంత్, శంకర్ ల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భారీ చిత్రం రోబో 2 మరోసారి వార్తల్లో నిలిచింది. ఇప్పటి వరకు సినిమా భారీతనంలో న్యూస్ లో వినిపించిన రోబో పేరు ఇప్పుడో జర్నలిస్ట్ లపై దాడి చేయటంతో తెర మీదకు వచ్చింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ట్రిప్లికేన్ పరిసర ప్రాంతాల్లో వేసిన సెట్ జరుగుతుండగా.. కవర్ రేజ్ కోసం వెళ్లిన ఇద్దరు జర్నలిస్ట్ లపై యూనిట్ సంబంధించిన బౌన్సర్ లు దాడి చేశారు. ఈ సందర్భంగా చిత్ర సహాయ దర్శకుల్లో ఒకరు జర్నలిస్టుల పట్ల దురుసుగా ప్రవర్తించారు. ఈవిషయం పెద్దదై కేసుల దాక వెల్లటంతో యూనిట్ సభ్యులు వెంటనే నష్టనివారణకు దిగారు. స్వయంగా దర్శకుడు శంకర్ కలుగజేసుకొని జర్నలిస్ట్ లను క్షమాపణ కోరారు. దీంతో వివాదం సద్దుమణిగింది. ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈసినిమా ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలతో పాటు ఫ్యాచ్ వర్క్ షూటింగ్ జరుపుకుంటోంది. రజనీకాంత్ సరసన అమీజాక్సన్ హీరోయిన్ గా నటిస్తుండగా బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ ప్రతినాయక పాత్ర పోషిస్తున్నాడు. ఈ సినిమా దీపావళి కానుకగా అక్టోబర్ లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తోంది చిత్రయూనిట్ -
22 ఏళ్ల తర్వాత క్రేజ్ తగ్గని రజనీ 'భాషా'
ముంబై: తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ బ్లాక్ బస్టర్ మూవీలలో ఒకటైన 'భాషా' రీ రిలీజ్‌ను ఆయన ఫ్యాన్స్ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అయితే ఇది మన దేశంలో కాదండోయ్.. జపాన్, ఫ్రాన్స్ దేశాలోని కొన్ని నగరాలలో భాషా రీ రిలీజ్ అయిన థియేటర్ల వద్ద సందడి వాతావారణం కనిపిస్తోంది. రజనీకాంత్ కటౌట్ కు పాలాభిషేకాలు చేసిన అభిమానులు అనంతరం టపాసులు కాలుస్తూ ఎంజాయ్ చేశారు. జపాన్ లో మాత్రమే ఓ రేంజ్లో ఆధరిస్తారని తెలుసు. కానీ, ఫ్రాన్స్ లాంటి దేశంలోనూ సూపర్ స్టార్ అభిమానులకు కొదవలేదని తెలుస్తోంది. ఇందుకు సంబంధించి సూపర్ స్టార్ ఫ్యాన్స్ జపాన్, ఫ్రాన్స్‌లో రజనీ అభిమానుల సందడిని ఓ పోస్ట్‌లో ట్వీట్ చేశారు. 1995 జనవరి 15న గ్యాంగ్ స్టర్ నేపథ్యంలో విడుదలైన భాషా సినిమా సూపర్ స్టార్ ఇమేజ్ను అత్యున్నత శిఖరాలకు చేర్చింది. ఆ మూవీకి కాస్త సాంకేతిక మెరుగులు దిద్ది గతేడాది చివర్లో రీ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు. ఈ క్రమంలో కొన్ని దేశాలలో భాషాను రీ రిలీజ్ చేయగా విపరీతమైన స్పందన వచ్చింది. శంకర్ దర్శకత్వంలో రోబో సీక్వెల్‌గా '2.0'తో రానున్న రజనీకాంత్‌కు 22ఏళ్ల తర్వాత కూడా భాషా మూవీకి క్రేజ్ తగ్గకపోవడం తలైవాకు కలిసొచ్చే అంశం. This is Not n India Its France #Baasha Celebration#Thalaivar Power@sri50 @rameshlaus @FTPindia @dhanyarajendran #RBSIBaasha @hrishikeshkk pic.twitter.com/TsmVyuSC0p — Rajinikanth Fans (@Rajni_FC) 4 March 2017 Japan #Thalaivar Fans Celebrating #Baasha Digital Release Mass over the World #BaashaRules#RBSIBaasha @hrishikeshkk @rameshlaus @sri50 pic.twitter.com/86BVe8vCLa — Rajinikanth Fans (@Rajni_FC) 5 March 2017 -
ఒక్క ఫైట్ @ 20 కోట్లు?
సూపర్‌స్టార్ రజనీకాంత్, శంకర్ కాంబినేషన్లో వచ్చిన ‘రోబో’ ఎంతటి విజయం సాధించిందో, బాక్సాఫీసు దగ్గర ఎన్ని వసూళ్లు రాబట్టిందో తెలిసిందే. ఆ చిత్రానికి సీక్వెల్‌గా అత్యంత ప్రతిష్టాత్మకంగా ‘2.0’ తెరకెక్కుతోంది. ఇప్పటి వరకూ సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెరకెక్కని అత్యంత భారీ బడ్జెట్‌తో సుమారు 450కోట్లతో ఈ చిత్రం నిర్మిస్తున్నారట. ఈ చిత్రంలో బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ విలన్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ ముంబైలో జరుగుతోంది. రజనీ–అక్షయ్‌ల మధ్య ఏరియల్ స్టంట్ విధానంలో ఓ ఫైట్ చిత్రీకరించేందుకు సుమారు 20 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారని సమాచారం. ఒక్క ఫైట్‌కు 20 కోట్లా? అని కోలీవుడ్‌లో చర్చించుకుంటున్నారు. ఈ ఫైట్ బాగా రిచ్‌గా రావడానికి హాలీవుడ్‌కి చెందిన ప్రముఖ స్టంట్ మాస్టర్లను ముంబై పిలిపించారట. హాలీవుడ్ రేంజ్‌కి ఏ మాత్రం తగ్గకుండా రజనీ– అక్షయ్‌ల మధ్య ఫైట్ ఉంటుందని, ఈ సినిమాలో ఈ పోరాటమే హైలెట్ అని చిత్ర బృందం చెబుతోంది. ఇందులో రజనీ సరసన ఎమీ జాక్సన్ కథానాయికగా నటిస్తున్నారు. ఏఆర్ రహమాన్ పాటలు స్వరపరుస్తున్నారు. ఈ చిత్రం విడుదల కోసం రజనీ అభిమానులు ఎదురు చూస్తున్నారు. -
తమిళ సంవత్సరాదికి 2.0 టీజర్
గ్రేట్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ సినిమా 2.0. గతంలో ఇదే కాంబినేషన్లో తెరకెక్కిన రోబోకు సీక్వల్గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ ప్రతినాయక పాత్రలో నటిస్తుండటంతో ఈ సినిమాపై బాలీవుడ్లో కూడా భారీ హైప్ క్రియేట్ అవుతోంది. ఇటీవల రిలీజ్ అయిన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్లకు మంచి రెస్పాన్స్ రావటంతో అభిమానులతో పాటు సినీ వర్గాలు కూడా టీజర్ కోసం ఎదురుచూస్తున్నారు. ఫైనల్‌గా టీజర్ రిలీజ్‌కు ముహూర్తం ఫిక్స్ చేసింది రోబో టీం. తమిళ సంవత్సారాది సందర్భంగా ఏప్రిల్ 14న 2.0 టీజర్‌ను రిలీజ్ చేసేందుకు నిర్ణయించారు. రజనీకాంత్ సరసన అమీజాక్సన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా లైకా ప్రొడక్షన్స్ సంస్థ భారీ బడ్జెట్ నిర్మిస్తోంది. -
తమిళనాడు రాజకీయల్లో కొత్త శక్తి?
-
బాషాకు దీటుగా..
-
బాషాకు దీటుగా..
బాషా చిత్రం తమిళ సినిమాలో ఒక చరిత్ర. గ్యాంగ్‌స్టర్‌గా సూపర్‌స్టార్ నటనకు పరాకాష్టగా పేర్కొనవచ్చు. అప్పట్లో రికార్డులు తిరగరాసిన బాషా చిత్రాన్ని రీమేక్ చేయాలని ఆ చిత్ర దర్శకుడు సురేశ్‌కృష్ణ ప్రయత్నించినా రజనీకాంత్ నిరాకరించారు. అంతే కాదు బాషా ఒక్కడే అని ఆయన ఏకవాక్యం చేశారు కూడా. మరి బాషాకు దీటుగా మరో చిత్రం వచ్చేనా. వస్తుందంటున్నారు యువ దర్శకుడు పా.రంజిత్. ఈయన గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇటీవల సూపర్‌స్టార్‌తో ఆయన తెరకెక్కించిన కబాలి చిత్రమే చాలా చెప్పేసింది. కాగా కబాలి చిత్ర టేకింగ్‌కు ముగ్ధుడైన సూపర్‌స్టార్ రంజిత్‌తో వెంటనే మరో చిత్రం చేయడానికి రెడీ అయ్యిపోయిన సంగతి తెలిసిందే. దీన్ని ఆయన అట్లుడు, నటుడు ధనుష్ తన సొంత సంస్థ వండర్‌బార్ పతాకంపై నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే కథను తయారు చేసిన రంజిత్ ఇది కబాలి తరహాలో కాకుండా బాషా పంథాలో ఉంటుందంటున్నారు. అయితే బాషా చిత్రాన్ని మించే విధంగా ఉండదుగాని దానికి దీటుగా ఉంటుందని పేర్కొన్నారు. ఇది కూడా గ్యాంగ్‌స్టర్ కథా చిత్రమేనని తెలిసింది. ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్రంలో రజనీని మరో కొత్తకోణంలో ఆవిష్కరిస్తానంటున్నారు దర్శకుడు పా.రంజిత్. ఇందుకోసం లోకేషన్స్ ఎంపిక చేయడానికి రంజిత్ బృందం ప్రస్తుతం ముంబైలో మకాం వేసినట్లు సమాచారం. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో 2.ఓ చిత్రంలో నటిస్తున్న రజనీకాంత్ తదిపరి పా.రంజిత్ దర్శకత్వంలో నటించడానికి రెడీ అవుతున్నట్లు తెలిసింది. -
ఎస్టర్డే.. రజనీ సర్ బర్త్‌డే
ఈ ముక్కేదో నిన్ననే కట్ చేయలి కదా! కట్ చేయడానికిది కేక్ కాదు బాబూ... షేక్! నిన్నంతా సోషల్ మీడియా రజనీ దెబ్బకి షేక్ అయింది! రజనీ సర్.. యువార్ ది స్టార్. రజనీ సర్.. యువార్ ది వార్. రజనీ సర్.. యువార్ ది జార్. రజనీ సర్.. సరిలేరు నీకెవ్వర్. ఇదీ.. వైబ్రేషన్.. సెలబ్రేషన్! రజనీ సర్ ఎంత గ్రేటో అభిమానులు చెబితే వినాల్సిందే. విని తీరాల్సిందే. విన్నాక చెప్పండి. రజనీ సర్ గ్రేటా? కాదా అన్నది తేల్చి చెప్పండి. ⇔ రజనీ సర్ టైమ్ చూసుకోరు. టైమ్ ఎంత అవ్వాలో ఆయనే డిసైడ్ చేస్తారు! ⇔ రజనీ సర్ వైర్లెస్ ఫోన్‌తో కూడా గొంతు బిగించి చంపేయగలరు! ⇔ రజనీ సర్ క్యాలెండర్లో మార్చి 31 తర్వాత ఏప్రిల్ 2 ఉంటుంది. (రజనీ సర్ని ఎవరూ ఫూల్‌ని చెయ్యలేరు). ⇔ ఆపిల్ కంపెనీ లోగోలోని ఆపిల్‌ని కొరికి వదిలిపెట్టింది రజనీయే! ⇔ హాలీవుడ్ మూవీ ‘మిషన్: ఇంపాజిబుల్’ లీడ్ రోల్ రజనీదే. రజనీ సర్కి ఆ టైటిల్ అవమానకరంగా ఉండడంతో ఆయన ప్లేస్‌లోకి టామ్ క్రూజ్‌ని తీసుకున్నారు! ⇔ శాంటాక్లాస్ ప్రతి సంవత్సరం రజనీ సర్ దగ్గరికి గిఫ్ట్ కోసం వస్తాడు! ⇔ గజనీ కూడా రజనీని మర్చిపోలేడు. ⇔ ఫేస్బుక్ రిక్వెస్ట్ పంపితేనేగానీ రజనీ సర్ ఫేస్‌బుక్‌ని తన ఫ్రెండుగా యాడ్ చేసుకోలేదు! ⇔ రజనీ సర్ మెయిల్ ఐడి outlook@rajnikanth.com ⇔ ఓ వన్డే మ్యాచ్‌లో రజనీ సర్ 15 వికెట్లు తీసుకున్నారు! ⇔ ఓసారి రజనీ సర్ ‘కౌన్‌బనేగా...’ హాట్ సీట్లో కూర్చున్నప్పుడు సర్ని క్వొశ్చన్ అడగడానికి కంప్యూటర్ గారు.. హెల్ప్‌లైన్ తీసుకోవలసి వచ్చింది! ⇔ 150 ప్రశ్నలిచ్చి వాటిల్లో 100 ప్రశ్నలకు సమాధానం రాయమని అడిగితే రజనీ సర్ 150 ప్రశ్నలకూ ఆన్సర్లు రాసి, మీకు ఇష్టమైన 100 ఆన్సర్లను చెక్ చేసుకోమని ఆన్షర్ షీట్‌పై నోట్ పెట్టి వచ్చేశారు! ⇔ రజనీ సర్ ట్వీట్ చెయ్యరు. హి ఓన్లీ రోర్స్. ⇔ అలెగ్జాండర్ గ్రాహం బెల్ టెలీఫోన్ కనుక్కోగానే రెండు మిస్డ్ కాల్స్ కనిపించాయి. అవి రెండూ రజనీ సర్వే! ⇔ రజనీ సర్ మాత్రమే ఆకాశంలో ఎన్ని నక్షత్రాలు ఉన్నాయో లెక్కించగలరు! ⇔ ఓసారి ఓ రైతు తన పంట పొలంలో రజనీ సర్ కటౌట్ పెట్టారు. అప్పుడేం జరిగిందో ఊహించండి. దోచుకెళ్లిన ధాన్యం గింజల్ని కూడా పిట్టలు వెనక్కి తెచ్చి పడేశాయి! ⇔ రజనీ సర్ ఆరో తరగతి నోట్సే ఇప్పుడు మనం చూస్తున్న వికీపీడియా! ⇔ సూపర్‌మేన్, బాట్స్‌మేన్ రజనీ సర్ దగ్గరికి ఎందుకు వచ్చారో తెలుసా? ఆ రోజు టీచర్స్ డే. ⇔ ఓసారి రజనీ సర్ మెరుపుతో పోటీ పడ్డారు. అప్పుడు మెరుపు థర్డ్ వచ్చింది. రజనీ నీడ సెకండ్ వచ్చింది!