ఒక్క ఫైట్‌ @ 20 కోట్లు? | Rajinikanth's 2.0 final episodes under progress | Sakshi
Sakshi News home page

ఒక్క ఫైట్‌ @20 కోట్లు?

Published Fri, Feb 17 2017 11:17 PM | Last Updated on Tue, Oct 2 2018 6:46 PM

ఒక్క ఫైట్‌ @ 20 కోట్లు? - Sakshi

ఒక్క ఫైట్‌ @ 20 కోట్లు?

సూపర్‌స్టార్‌ రజనీకాంత్, శంకర్‌ కాంబినేషన్‌లో వచ్చిన ‘రోబో’ ఎంతటి విజయం సాధించిందో, బాక్సాఫీసు దగ్గర ఎన్ని వసూళ్లు రాబట్టిందో తెలిసిందే. ఆ చిత్రానికి సీక్వెల్‌గా అత్యంత ప్రతిష్టాత్మకంగా ‘2.0’ తెరకెక్కుతోంది. ఇప్పటి వరకూ సౌత్‌ ఫిల్మ్‌ ఇండస్ట్రీలో తెరకెక్కని అత్యంత భారీ బడ్జెట్‌తో సుమారు 450కోట్లతో ఈ చిత్రం నిర్మిస్తున్నారట. ఈ చిత్రంలో బాలీవుడ్‌ హీరో అక్షయ్‌ కుమార్‌ విలన్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ ముంబైలో జరుగుతోంది.

రజనీ–అక్షయ్‌ల మధ్య ఏరియల్‌ స్టంట్‌ విధానంలో ఓ ఫైట్‌ చిత్రీకరించేందుకు సుమారు 20 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారని సమాచారం. ఒక్క ఫైట్‌కు 20 కోట్లా? అని కోలీవుడ్‌లో చర్చించుకుంటున్నారు. ఈ ఫైట్‌ బాగా రిచ్‌గా రావడానికి హాలీవుడ్‌కి చెందిన ప్రముఖ స్టంట్‌ మాస్టర్లను ముంబై పిలిపించారట. హాలీవుడ్‌ రేంజ్‌కి ఏ మాత్రం తగ్గకుండా రజనీ– అక్షయ్‌ల మధ్య ఫైట్‌ ఉంటుందని, ఈ సినిమాలో ఈ పోరాటమే హైలెట్‌ అని చిత్ర బృందం చెబుతోంది. ఇందులో రజనీ సరసన ఎమీ జాక్సన్‌ కథానాయికగా నటిస్తున్నారు. ఏఆర్‌ రహమాన్‌ పాటలు స్వరపరుస్తున్నారు. ఈ చిత్రం విడుదల కోసం రజనీ అభిమానులు ఎదురు చూస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement