Amy Jackson
-
ఫ్యామిలీతో రామ్ చరణ్ హీరోయిన్ అమీ జాక్సన్ చిల్ (ఫోటోలు)
-
బ్లూ కోట్లో మెరిసిన బొమ్మరిల్లు బ్యూటీ.. గ్రీన్ డ్రెస్‌లో గ్లామర్ బ్యూటీ ఆదితి!
వైట్ డ్రెస్‌లో మరింత గ్లామర్‌గా రాశీ ఖన్నా..క్రిస్మస్ మూడ్‌లో బాలీవుడ్ భామ అమీ జాక్సన్..బ్లూ కోట్లో మెరిసిన బొమ్మరిల్లు బ్యూటీ జెనీలియా..బాలీవుడ్ బ్యూటీ సన్నీ లియోన్ గ్లామర్ ట్రీట్..గ్రీన్ డ్రెస్‌లో గ్లామర్ బ్యూటీ ఆదితిరావు హైదరీ.. View this post on Instagram A post shared by Sunny Leone (@sunnyleone) View this post on Instagram A post shared by Genelia Deshmukh (@geneliad) View this post on Instagram A post shared by Shriya Saran (@shriya_saran1109) View this post on Instagram A post shared by Amy Jackson Westwick (@iamamyjackson) View this post on Instagram A post shared by Raashii Khanna (@raashiikhanna) View this post on Instagram A post shared by Aditi Rao Hydari (@aditiraohydari) -
బర్త్ డే మూడ్‌లో బుల్లితెర బ్యూటీ.. బ్లాక్ డ్రెస్‌లో రామ్ చరణ్ హీరోయిన్!
బర్త్ డే మూడ్‌లో బుల్లితెర బ్యూటీ తేజస్విని గౌడ..బ్లాక్ బ్యూటీలా ఎవడు హీరోయిన్ అమీ జాక్సన్..చిల్ అవుతోన్న హీరోయిన్ హన్సిక.. గ్రీన్ డ్రెస్‌లో విష్ణుప్రియ లేటేస్ట్ లుక్స్ View this post on Instagram A post shared by Ritesh Deshmukh - रितेश विलासराव देशमुख (@riteish) View this post on Instagram A post shared by Vishnu Priya (@vishnupriyaaofficial) View this post on Instagram A post shared by Hansika Motwani (@ihansika) View this post on Instagram A post shared by Amy Jackson Westwick (@iamamyjackson) View this post on Instagram A post shared by Tejaswini Gowda (@_tejaswini_gowda_official) -
ఆగస్టులో పెళ్లి.. ప్రెగ్నెన్సీ ప్రకటించిన టాలీవుడ్ హీరోయిన్
తెలుగులో 'ఎవడు' సినిమాలో హీరోయిన్గా చేసిన అమీ జాక్సన్ మరోసారి ప్రెగ్నెన్సీ ప్రకటించింది. ఇందుకు సంబంధించిన బేబీ బంప్‌తో ఉన్న ఫొటోల్ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ క్రమంలోనే ఈమెకు విషెస్ చెబుతున్నారు.(ఇదీ చదవండి: 'లక్కీ భాస్కర్' సినిమా రివ్యూ)బ్రిటీష్ మోడల్ కమ్ యాక్టర్ అయిన ఈమె.. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో పలు సినిమాలు చేసింది. మన దక్షిణాదిలో ఎవడు, రోబో 2, ఐ తదితర చిత్రాల్లో నటించింది. కాకపోతే అనుకున్నంతగా ఫేమ్ రాకపోవడంతో కొన్నేళ్ల క్రితం జార్జ్ పయనెట్టు అనే వ్యక్తితో డేటింగ్ చేసింది. వీళ్లకు కొడుకు పుట్టాడు. ఆ పిల్లాడికి ఇప్పుడు ఐదేళ్లు. అయితే 2022లో అమీ-జార్జ్ బ్రేకప్ చెప్పేసుకున్నారు.జార్జ్ నుంచి విడిపోయిన తర్వాత అమీ.. హాలీవుడ్ నటుడు ఎడ్ వెస్ట్‌విక్‌తో డేటింగ్ చేసింది. 2022 నుంచి వీళ్లు రిలేషన్షిప్లో ఉన్నారు. ఈ ఏడాది ఆగస్టులో పెళ్లి చేసుకున్నారు. వివాహం జరిగిన రెండు నెలలైన పూర్తి కాలేదు. అప్పుడే ప్రెగ్నెన్సీతో ఉన్నట్లు ప్రకటించారు. బేబీ బంప్ పిక్స్ చూస్తుంటే త్వరలో మరోసారి తల్లి కాబోతున్నట్లు తెలుస్తోంది.(ఇదీ చదవండి: Amaran Review: ‘అమరన్’ మూవీ రివ్యూ) -
హీరోయిన్ అమీ జాక్సన్ రెండో పెళ్లి.. బోట్లో గ్రాండ్ పార్టీ (ఫొటోలు)
-
ప్రియుడిని పెళ్లాడిన హీరోయిన్ అమీ జాక్సన్ (ఫొటోలు)
-
లవ్‌బర్డ్స్ కొత్త ప్రయాణం: సిగ్గులమొగ్గైన కొత్త పెళ్లికూతురు అమీ
నటి, మోడల్ అమీ జాక్సన్ ఎట్టకేలకు తన ప్రియుడిని పెళ్లాడింది. తాజాగా (ఆగస్ట్ 25, 2024న), నటుడు మ్యూజీషియన్ ఎడ్వర్డ్ వెస్ట్ విక్‌ను వివాహం చేసుకుంది. ఈ విషయాన్ని స్వయంగా ఈ లవ్‌బర్డ్స్ స్వయంగా సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. సరికొత్త ప్రయాణం మొదలైంది అంటూ తమ సంతోషాన్ని వెల్లడించారు. ఇటలీలో జరిగిన ఈ వివాహ వేడుకలో ఎడ్ వెస్ట్విక్ అమీని ఎత్తుకొని ముద్దుపెట్టుకోవడంతో అమీ జాక్సన్ సిగ్గుల మొగ్గయింది. ఈ ఫోటోలు ఇంటర్నెట్లో సందడి చేస్తున్నాయి.అంతకుముందు బ్రిటిస్ వ్యాపారవేత్త ఆండ్రియాస్ పనాయోటౌతో కొన్నిరోజులు సహజీవనం చేసింది. ఈ క్రమంలోనే వీరికి ఒక మగబిడ్డకూడా పుట్టాడు.కానీ ఆ తరువాత విభేదాల కారణంగా ఇద్దరూ విడిపోయారు. పనాయోటౌతో తన బంధం ముగిసినట్లు స్వయంగా అమీ జాక్సన్ 2021లో ప్రకటించిన సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Ed Westwick (@edwestwick) -
ప్రియుడిని పెళ్లాడిన రామ్ చరణ్ హీరోయిన్.. ఫోటోలు వైరల్!
హీరోయిన్ అమీ జాక్సన్ వివాహాబంధంలోకి అడుగుపెట్టింది. తన ప్రియుడు ఎడ్ వెస్ట్విక్ను ఆమె పెళ్లాడింది. ఇటలీలోని అమాల్ఫీ తీరంలో వీరి వెడ్డింగ్ వేడుక ఘనంగా జరిగింది. ఈ వేడుకలో ఇరువర్గాల కుటుంబసభ్యులు, స్నేహితులు, అత్యంత సన్నిహితుసు పాల్గొన్నారు. వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలను అమీ జాక్సన్ తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది.కాగా.. 2022లో డేటింగ్ ప్రారంభించిన ఈ జంట ఆగస్టు 25న వివాహాబంధంలోకి అడుగుపెట్టారు. ఈ ఏడాది జనవరిలో స్విట్జర్లాండ్‌లోని జిస్టాడ్‌లో అమీ జాక్సన్, ఎడ్ వెస్టివిక్ తమ ప్రేమబంధాన్ని బయటపెట్టారు. దీనికి సంబంధించిన ఫోటోలు అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇటీవలే ఫ్రెండ్స్‌తో కలిసి ప్రీ-వెడ్డింగ్ పార్టీ చేసుకున్నారు. కొత్త జర్నీ ప్రారంభమైందంటూ పెళ్లి ఫోటోలను షేర్ చేశారు.కాగా.. అమీ జాక్సన్ బాలీవుడ్‌తో పాటు తెలుగు,తమిళ చిత్రాల్లో నటించింది. రజినీకాంత్ రోబో 2.0, రామ్ చరణ్ ఎవడు, విక్రమ్ సరసన ఐ చిత్రాల్లో మెరిసింది. వీటితో పాటు క్రాక్, సింగ్ ఇజ్ బ్లింగ్ చిత్రంలో కనిపించింది. చివరిసారిగా ఈ ఏడాది విడుదలైన మిషన్ చాప్టర్-1 మూవీలో మెరిసింది. View this post on Instagram A post shared by Ed Westwick (@edwestwick) -
ప్రియుడితో ఎంగేజ్మెంట్ పార్టీ.. అమ్మా, నీకింకా పెళ్లికాలేదా?
అమీ జాక్సన్.. తెలుగు ప్రేక్షకులకు ఈమె సుపరిచితురాలే! ఎవడు సినిమాతో టాలీవుడ్లో అడుగుపెట్టిన ఈ బ్యూటీ ఐ మూవీతో మెప్పించింది. అభినేత్రి సినిమాలో చల్ మార్ అనే స్పెషల్ సాంగ్‌లో సందడి చేసింది. తమిళ, హిందీలోనే ఎక్కువ సినిమాలు చేసిన ఈ సుందరాంగి బిజినెస్మెన్ ఆండ్రియాస్ పనయిటో కుమారుడు జార్జ్‌తో లవ్‌లో పడింది. ప్రియుడి ప్రపోజల్ 2015 డిసెంబర్లో వీరు నిశ్చితార్థం చేసుకున్నారు. కానీ పెళ్లి మాత్రం చేసుకోలేదు. 2019లో వీరికి ఓ కుమారుడు జన్మించాడు. తర్వాత పలు కారణాల వల్ల బ్రేకప్ చెప్పుకున్నారు. 2022లో బ్రిటీష్ యాక్టర్ ఎడ్ వెస్ట్‌విక్‌తో మరోసారి ప్రేమలో పడింది అమీ జాక్సన్. అప్పటినుంచి చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్న ఈ లవ్ బర్డ్స్ ఈ ఏడాది జనవరి 29న ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. మంచుకొండల్లో ప్రియుడు ఉంగరం తొడిగి ప్రపోజ్ చేయడంతో సంతోషంతో ఓకే చెప్పింది హీరోయిన్. అదే అతడిలో నచ్చింది తాజాగా కుటుంబసభ్యులు, బంధుమిత్రులందరికీ ఎంగేజ్మెంట్ డిన్నర్ పార్టీ ఇచ్చింది. అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అమీ మాట్లాడుతూ.. 'నా కుమారుడు ఆండ్రియాకు ఎడ్ చాలాకాలం నుంచే తెలుసు. ఈ సెలబ్రేషన్స్ చూసి తను చాలా ఎగ్జయిట్ అవుతున్నాడు. ఎడ్.. నా కొడుకుతో ఎంతో బాగా కలిసిపోతాడు. తనకు, నాకు చాలా సపోర్ట్‌గా ఉంటాడు. ఈ అంశాలే అతడిలో నాకు బాగా నచ్చాయి. తనే ముందుకొచ్చి మాట్లాడతానన్నాడు నా కుమారుడు రెండు నెలల క్రితం నా చేతికి ఉన్న ఉంగరం చూసి అమ్మా.. నీకింకా పెళ్లి కాలేదా? అని అడిగాడు. ఎడీని ఎందుకింకా పెళ్లి చేసుకోలేదని అడిగితే తను వివాహం గురించి ఎప్పుడూ మాట్లాడలేదన్నాను. అది విన్న ఆండ్రియా.. అయితే నేను వెళ్లి చెప్తానుండు అన్నాడు. అంత ఎంకరేంజ్మెంట్ ఎక్కడి నుంచి వచ్చిందో నాకు తెలియదు. మా బంధానికి అతడు ఎప్పుడో గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు' అని చెప్పుకొచ్చింది. View this post on Instagram A post shared by Amy Jackson (@iamamyjackson) View this post on Instagram A post shared by Amy Jackson (@iamamyjackson) చదవండి: 'ఏజెంట్' బాటలో భారీ డిజాస్టర్ సినిమా -
సడన్‌గా ఓటీటీలోకి యాక్షన్ మూవీ.. స్ట్రీమింగ్ అక్కడే!
సంక్రాంతికి రిలీజ్ చేస్తే కనీస వసూళ్లయినా వస్తాయి.. అందుకే చాలామంది సంక్రాంతి బరిలో ఎన్ని సినిమాలున్నా సరే రిలీజ్ చేసేందుకు వెనకడుగు వేయరు. మరికొందరేమో పెద్ద సినిమాలు బరిలో ఉంటే మరో ఆప్షనే లేదన్నట్లు తప్పుకుంటారు. అలా ఈసారి సంక్రాంతికి గుంటూరు కారం, హనుమాన్, సైంధవ్, నా సామిరంగ సినిమాలు రిలీజయ్యాయి. అదే సమయంలో(జనవరి 12న) తమిళంలో మిషన్ చాప్టర్ 1 రిలీజైంది. దీన్ని తెలుగులోనూ విడుదల చేయాలనుకున్నారు. కానీ తర్వాత ఈ ఆలోచన విరమించుకున్నారు. భారీ బడ్జెట్.. ఈ మూవీలో అరుణ్ విజయ్ హీరోగా నటించాడు. అమీ జాక్సన్, నిమీషా సజయన్ హీరోయిన్లుగా యాక్ట్ చేశారు. విజయ్ దర్శకత్వం వహించగా రూ.25 కోట్ల బడ్జెట్‌తో వంశీ, రాజశేఖర్ ఈ సినిమా నిర్మించారు. ఇది హీరో కెరీర్లోనే భారీ బడ్జెట్ సినిమా కావడం విశేషం. యాక్షన్ ఎంటర్ టైనర్‌గా రూపొందిన ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతాన్ని అందించారు. ఇది ఈయనకు మ్యూజిక్ డైరెక్టర్‌గా 100వ సినిమా కావడం విశేషం. రెండు ఓటీటీలలో! యాక్షన్ మూవీ సడన్‌గా ఓటీటీలోకి వచ్చేస్తోంది. సింప్లీ సౌత్ అనే ఓటీటీలో మార్చి 15 నుంచి స్ట్రీమింగ్ కానుంది. అయితే ఇండియా మినహా మిగతా అన్ని చోట్ల అందుబాటులోకి తేనున్నట్లు ప్రకటించడం గమనార్హం. ఇకపోతే ఈ సినిమా మరో డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లోనూ అడుగుపెడుతున్నట్లు తెలుస్తోంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో నేటి అర్ధరాత్రి నుంచి ప్రసారం కానుందట! #MissionChapter1 from tonight! pic.twitter.com/3ltYghmggH — Christopher Kanagaraj (@Chrissuccess) March 14, 2024 #MissionChapter1 | MARCH 15. Streaming worldwide, excluding India. pic.twitter.com/jxF16RmuL3 — Simply South (@SimplySouthApp) March 14, 2024 చదవండి: అంబానీ ప్రీవెడ్డింగ్ పార్టీలో ఇతడే హైలైట్.. తేడా పోజులతోనే ఫేమస్ -
డైరెక్ట్‌గా ఓటీటీలోకి ఆ యాక్షన్ సినిమా.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
స్టార్ హీరో కొత్త సినిమా ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అయిపోయింది. తమిళంలో థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమాని తెలుగులోనూ విడుదల చేయాలనుకున్నారు. కానీ అక్కడ ఫలితం చూసి తెలుగు వెర్షన్ రిలీజ్ ఆలోచన మానుకున్నారు. ఇప్పుడీ చిత్రాన్ని నేరుగా ఓటీటీలోకి తీసుకొచ్చేయబోతున్నారట. తాజాగా స్ట్రీమింగ్ డేట్ కూడా ఫిక్సయినట్లు తెలుస్తోంది. ఇంతకీ ఏంటా మూవీ? ఈ సంక్రాంతికి తెలుగులో గుంటూరు కారం, హనుమాన్, సైంధవ్, నా సామిరంగ చిత్రాలు రిలీజయ్యాయి. వీటిలో బాక్సాఫీస్ విన్నర్‌గా 'హనుమాన్' నిలిచింది. ఇది తప్పితే మిగతా మూడు చిత్రాలు ఓటీటీలోకి వచ్చేశాయి. మరోవైపు తమిళంలోనూ సంక్రాంతికి రిలీజైన 'కెప్టెన్ మిల్లర్', 'అయలాన్' హిట్ టాక్ తెచ్చుకున్నాయి. కొన్నిరోజుల క్రితం ఓటీటీలోకి కూడా వచ్చేశాయి. వీటితో పాటు తమిళంలో ఇదే పండక్కి 'మిషన్ ఛాప్టర్ 1' చిత్రం కూడా రిలీజైంది. (ఇదీ చదవండి: మూడు ఓటీటీల్లో ఒకేసారి హిట్ సినిమా రిలీజ్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?) యాక్షన్ స్టోరీతో తీసిన ఈ సినిమాని తమిళంతో పాటు తెలుగులోనూ రిలీజ్ ప్లాన్ చేశారు. కానీ సొంత భాషలోనే తేడా కొట్టేయడంతో మన దగ్గర థియేటర్లలో విడుదల చేయడం అనే ఆలోచనని పూర్తిగా పక్కనబెట్టేశారు. అలా అందరూ మర్చిపోయిన ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్కి సిద్ధమైందట. మార్చి 1 నుంచి దక్షిణాది భాషల్లో అందుబాటులోకి రానుందని అంటున్నారు. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. మిషన్ ఛాప్టర్-1 కథ విషయానికొస్తే.. ఆస్పత్రిలో ప్రాణాలతో పోరాడుతున్న తన కూతురిని ఎలాగైనా కలుసుకోవాలని.. విదేశీ జైలులో ఖైదీగా ఉండే హీరో అనుకుంటాడు? మరి ఇందుకోసం ఎలాంటి పోరాటం చేశాడు? విదేశీ జైలులో ఖైదీగా మారడానికి కారణమేంటనేదే స్టోరీ. అరుణ్ విజయ్ హీరోగా నటించగా.. అమీజాక్సన్, నిమిషా సజయన్ హీరోయిన్లుగా నటించారు. (ఇదీ చదవండి: ఓటీటీలోకి సూపర్‌స్టార్ రజినీకాంత్ సినిమా.. అనుకున్న టైమ్ కంటే ముందే!) -
పోలీసుల అదుపులో స్టార్ హీరో.. ఫోటో వైరల్
స్క్రీన్‌పై అద్భుతమైన విన్యాసాలు చేయడంలో పేరుగాంచిన నటుడు విద్యుత్ జమ్వాల్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆరు అగ్రశ్రేణి మార్షల్ ఆర్టిస్టులలో ఒకరిగా ఆయన పేరుపొందారు. లూపర్ క్యూరేట్ చేసిన ప్రతిష్టాత్మక జాబితాలో చోటు దక్కించుకున్న ఏకైక భారతీయుడుగా జమ్వాల్ రికార్డ్ క్రియేట్ చేశాడు. తాజాగా రిస్కీ స్టంట్స్ చేసినందుకు గాను విద్యుత్ జమ్వాల్‌ను ముంబైలో రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకున్నారనే వార్త ఒకటి నెట్టింట వైరల్ అవుతుంది. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) బాంద్రా కార్యాలయంలో ఆయన కూర్చోని ఉన్న ఫోటో ఒకటి షోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. కానీ ఆయన ఆరెస్ట్ గురించి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఈ ఫోటో షూటింగ్లో భాగమేనని కొందరు అంటున్నారు. కానీ ఆయన అరెస్ట్ అయ్యాడంటూ వస్తున్న వార్తలపై పోలీసులతో పాటు విద్యుత్ జమ్వాల్ కూడా ఎలాంటి ప్రకటన ఇవ్వలేదు. ఈ విషయంపై అధికారికంగా సమాచారం ఇవ్వాలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. విద్యుత్ జమ్వాల్ తన తదుపరి చిత్రం 'క్రాక్-జీతేగా తో జీగ' (CRAKK-JEETEGAA... TOH JIYEGAA ) విడుదల కోసం ఎదురు చూస్తున్నాడు. సినిమా ప్రమోషన్ ఇప్పటికే జోరుగా సాగుతోంది. ఫిబ్రవరి 9న విడుదలైన ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈ చిత్రంలో అర్జున్ రాంపాల్, నోరా ఫతేహి, అమీ జాక్సన్ ప్రధాన పాత్రలు పోషించారు. ఆదిత్య దత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఫిబ్రవరి 23న థియేటర్లలోకి రానుంది. ఈ సినిమా కోసం ఆయన రియల్‌గానే కొన్ని స్టంట్స్ చేసిన విషయం తెలిసిందే. వాటిలో కొన్ని ట్రైలర్లో చూపించారు. -
మళ్లీ పెళ్లి చేసుకోబోతున్న 'ఎవడు' సినిమా హీరోయిన్
రామ్ చరణ్ 'ఎవడు' సినిమాలో హీరోయిన్గా నటించిన అమీ జాక్సన్ గుర్తుందా? ఇప్పుడు ఆమె రెండో పెళ్లికి సిద్ధమైపోయింది. గతంలో కొన్నాళ్ల ఓ వ్యక్తితో డేటింగ్ చేసిన ఈ ముద్దుగుమ్మకు ఓ కొడుకు పుట్టాడు. ఆ తర్వాత మనస్పర్థలు కారణంగా అతడి నుంచి విడిపోయింది. ఆ తర్వాత బ్రిటీష్ నటుడితో ప్రేమలో పడింది. గత కొన్నాళ్లుగా రిలేషన్లో ఉన్న ఈ జంట ఇప్పుడు ఒక్కటయ్యేందుకు రెడీ అయిపోయారు. (ఇదీ చదవండి: నిశ్చితార్థం జరిగిన నాలుగేళ్లకు పెళ్లి చేసుకున్న స్టార్ హీరోయిన్) విదేశాల్లో పుట్టి పెరిగిన అమీ జాక్సన్ తొలుత మోడలింగ్ చేసింది. ఆ తర్వాత 'మద్రాసు పట్టణం' అనే తమిళ సినిమాతో హీరోయిన్గా కెరీర్ మొదలుపెట్టింది. తమిళంతో పాటు తెలుగులోనూ రామ్ చరణ్ 'ఎవడు' చిత్రంలో ఓ హీరోయిన్గా చేసింది. ఆ తర్వాత 'అభినేత్రి' అనే ద్విభాషా చిత్రంలోనూ నటించింది. ఈ రెండు తప్పితే తమిళ, హిందీలోనే ఎక్కువగా మూవీస్ చేసింది. గతంలో జార్జ్ పనయాట్టు అనే వ్యక్తితో కొన్నాళ్లు డేటింగ్ చేసిన అమీ జాక్సన్.. అతడితో ఓ కొడుక్కి జన్మనిచ్చింది. ఏమైందో ఏమో గానీ అతడి నుంచి విడిపోయింది. ఇది జరిగిన తర్వాత కొన్నాళ్లకు విదేశీ నటుడు ఎడ్ వెస్ట్‌విక్‌తో ప్రేమలో పడింది. ఈ విషయం నేరుగా చెప్పనప్పటికీ కలిసి బయట కనిపించడంతో అందరూ కన్ఫర్మ్ చేసుకున్నారు. తాజాగా స్విట్జర్లాండ్‌లోని మంచు పర్వతాల్లో ఇతడు లవ్ ప్రపోజ్ చేశాడు. అమీ జాక్సన్ దీన్ని అంగీకరించింది. ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. త్వరలో వీళ్ల పెళ్లి ఉండొచ్చు. (ఇదీ చదవండి: సీరియల్ హీరోయిన్ని పెళ్లి చేసుకున్న టాలీవుడ్ విలన్) View this post on Instagram A post shared by Amy Jackson (@iamamyjackson) -
సినిమాకు పాజిటివ్ టాక్.. ఆదియోగి సందర్శనలో హీరోహీరోయిన్
తమిళ హీరో అరుణ్ విజయ్ లేటెస్ట్ మూవీ 'మిషన్ ఛాప్టర్ 1'. అమీ జాక్సన్ హీరోయిన్. ఏఎల్ విజయ్ దర్శకత్వం వహించారు. ఎం.రాజశేఖర్, ఎస్.స్వాతి నిర్మించారు. భారీ యాక్షన్ ఎమోషనల్ కథతో తీసిన ఈ సినిమాలో అరుణ్ విజయ్ జై దుర్గ అనే పాత్రలో.. అమీ జాక్సన్ లండన్‌లోని జైలు అధికారిగా నటించారు. (ఇదీ చదవండి: పెళ్లి చేసుకోబోతున్న హీరోయిన్ సాయిపల్లవి చెల్లి.. కుర్రాడు ఎవరంటే?) తన కుమార్తె వైద్య చికిత్స కోసం లండన్ వెళ్లిన అరుణ్ విజయ్.. అక్కడ జైలు పాలు అవడం, అక్కడ కొందరు పాకిస్తాన్‌కు చెందిన కరుడుగట్టిన నేరగాళ్లు జైలు నుంచి తప్పించుకునే ప్రయత్నం చేయడం, దాన్ని అరుణ్‌విజయ్ అడ్డుకోవడం, దాంతో ఆయన మరో పోరాటానికి సిద్ధం కావలసి రావడం వంటి పలు ఉత్కంఠ భరితమైన సన్నివేశాలతో సాగే కథనే ఈ సినిమా. లైకా ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ సినిమా.. సంక్రాంతి కానుకగా తమిళంలో ఈనెల 12న విడుదలైంది. అయితే చిత్రానికి పాజిటివ్ టాక్ రావడంతో హీరోహీరోయిన్లతో పాటు దర్శకుడు ఏఎల్ విజయ్.. ఆదియోగి విగ్రహ సందర్శనకు వెళ్లారు. ఈశా ఫౌండేషన్‌కు వెళ్లిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. (ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు రొమాంటిక్ సినిమా.. స్ట్రీమింగ్ అందులోనే?) View this post on Instagram A post shared by Arun Vijay (@arunvijayno1) -
'డైరెక్టర్స్ రొమాంటిక్ హీరోయిన్‌గానే చూస్తారు.. కానీ అలా తొలిసారి'
డైరెక్టర్స్ రొమాంటిక్ హీరోయిన్‌గానే చూస్తారుహాలీవుడ్ బ్యూటీ అమీ జాక్సన్ గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. లండన్‌కు చెందిన బోల్డ్ అండ్ బ్యూటీ మోడలింగ్ రంగంలో రాణిస్తూ దర్శకుడు ఎంఎల్ విజయ్ దృష్టిలో పడ్డారు. ఆయన దర్శకత్వం వహించిన మదరాసు పట్టణం చిత్రం ద్వారా హీరోయిన్గా పరిచయం చేశారు. ఆ తరువాత రజినీకాంత్, విజయ్, విక్రమ్, ధనుష్ వంటి స్టార్ హీరోల సరసన నటించి పాపులర్ అయ్యారు. ఆ తర్వాత కొన్ని హిందీ చిత్రాల్లోనూ నటించి భారతీయ సినీ నటిగా గుర్తింపు పొందారు. అలాంటిది ఆ తరువాత అవకాశాలు తగ్గుముఖం పట్టడంతో లండన్‌కు తిరిగి వెళ్లిపోయారు. అక్కడ వెబ్‌సీరీస్‌లో నటించారు. అలాంటి పరిస్థితుల్లో తనను కథానాయకిగా పరిచయం చేసిన దర్శకుడు ఏఎల్ విజయ్ మళ్లీ అమీజాక్సన్‌ను కోలీవుడ్‌కు తీసుకొచ్చారు. ఆమె నటించిన తాజా చిత్రం మిషన్ చాప్టర్–1. అరుణ్‌విజయ్ హీరోగా నటించిన ఈ చిత్రాన్ని లైకా పొడక్షన్ సంస్థ నిర్మించింది. పొంగల్ సందర్భంగా శుక్రవారం విడుదలైంది. ఈ చిత్రంలో అమీజాక్సన్ లండన్‌కు చెందిన పవర్ఫుల్ పోలీసు అధికారిగా నటించడం విశేషం. అయితే అనారోగ్యంతో మూవీ ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొనలేకపోయిన ఆమె మీడియాకు ఓ ప్రకటన విడుదల చేసింది. దర్శకుడు విజయ్ తన చిత్రాల్లో పాత్రలను శక్తివంతంగా రూపొందిస్తారన్నారు. ఎంతగా అంటే.. ఎన్నేళ్లయినా కూడా ఆ పాత్రలు అలా గుర్తుండిపోతాయన్నారు. అలాంటి దర్శకుడి ద్వారా మదరాసు పట్టణం చిత్రంతో తాను హీరోయిన్గా పరిచయం అవడం తన అదృష్టమని అన్నారు. మిషన్ చాప్టర్ –1 చిత్రంలో తాను చాలా ముఖ్యమైన పాత్రను పోషించినట్లు చెప్పారు. చాలా మంది దర్శకులు తనను రొమాంటిక్ హీరోయిన్‌గానే చూస్తారని.. అందువల్ల తనకు యాక్షన్ కథాపాత్రలు వస్తాయని ఊహించలేదన్నారు. అలాంటిది దర్శకుడు తనకు యాక్షన్ హీరోయిన్గా చూపించారని చెప్పారు. ఈ చిత్రం తన సినీ జీవితంలో ఒక మైలురాయిగా నిలిచిపోతుందనే నమ్మకం తనకు ఉందని అమిజాక్సన్ పేర్కొన్నారు. -
పొంగల్ బరిలో మరో చిత్రం.. ఆ స్టార్ హీరోలతో పోటీ!
సంక్రాంతి వచ్చిందంటే చాలు బాక్సాఫీస్ వద్ద పోటీ మామూలుగా ఉండదు. స్టార్ హీరోల సినిమాలు పొంగల్ బరిలో ఉండడం సహజం. అలాగే వచ్చే ఏడాది కూడా కోలీవుడ్ స్టార్స్ రజనీకాంత్, ధనుష్ చిత్రాలు కూడా ఉన్నాయి. స్టార్ హీరోలతో మరో చిత్రం పోటీకి సిద్ధం అవుతోంది. అరుణ్ విజయ్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం మిషన్ చాప్టర్– 1. ఐచ్చంయన్బదు ఇల్లయే. ఈ చిత్రంలో అమీ జాక్సన్ హీరోయిన్గా కనిపించనున్నారు. ఆమెతో పాటు నటిగా మలయాళంలో మంచి పేరు తెచ్చుకున్న నిమీషా సజయన్ నాయకిగా నటిస్తున్నారు. ఈ చిత్రం విడుదల హక్కులను లైకా ప్రొడక్షనన్స్ అధినేత సుభాస్కరన్ పొందారు. తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్‌ను మేకర్స్ ప్రకటించారు. ఈ చిత్రాన్ని పొంగల్ సందర్భంగా విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు. దర్శకుడు విజయ్ తన దర్శక ప్రతిభతో నిర్మాతలకు నచ్చిన దర్శకుడిగా మారారన్నారు. చిత్ర షూటింగ్‌ను చైన్నె, లండన్‌లో 70 రోజల పాటు నిర్వహించి పూర్తి చేసినట్లు చెప్పారు. మంచి యాక్షన్‌తో రూపొందించిన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇటీవల విడుదల చేసిన చిత్ర టీజర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించిందన్నారు. ముఖ్యంగా యాక్షన్‌తో కూడిన ఉద్వేగ భరిత సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయని తెలిపారు. చిత్ర ఆడియో, ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమం త్వరలోనే వివరాలను వెల్లడించనున్నట్లు చెప్పారు. ఈ చిత్రంలో అభిహాసన్, భరత్ బొప్పన్న ముఖ్యపాత్రలు పోషించారు. జీవీ.ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. Mission Chapter 1 Teaser (Tamil) https://t.co/hIpcbHhM8Z GRAND WORLD WIDE RELEASE IN PONGAL #MISSION CHAPTER - 1 teasar Bgm music extraordinary All the best #mission entire team 🎉@arunvijayno1 @iamAmyJackson @NimishaSajayan @gvprakash #Mahadev pic.twitter.com/8L9svtJp2F — Satishtanikella (@SatishC68386813) December 24, 2023 -
'స్కంద' బ్యూటీ వయ్యారాలు.. లుక్ మార్చిన సోనాక్షి
క్యూట్ పోజుల్లో 'అమిగోస్' బ్యూటీ ఆషిక ఒంపుసొంపులతో కవ్విస్తున్న 'స్కంద' హీరోయిన్ జైలర్ పాటకు స్టెప్పులేసిన అషూరెడ్డి రోజురోజుకీ మరింత అందంగా మీనాక్షి చౌదరి డ్రస్‌తో మెరిసిపోతున్న హీరోయిన్ అమీ జాక్సన్ కలర్‌ఫుల్ చిలకలా జిగేలుమంటున్న సోనాక్షి సిన్హా View this post on Instagram A post shared by Ashika Ranganath (@ashika_rangnath) View this post on Instagram A post shared by Ashu Reddy (@ashu_uuu) View this post on Instagram A post shared by Meenaakshi Chaudhary (@meenakshichaudhary006) View this post on Instagram A post shared by Saiee M Manjrekar (@saieemmanjrekar) View this post on Instagram A post shared by Amy Jackson (@iamamyjackson) View this post on Instagram A post shared by Bhumi Pednekar (@bhumipednekar) View this post on Instagram A post shared by Sonakshi Sinha (@aslisona) View this post on Instagram A post shared by Pujita Ponnada (@pujita.ponnada) View this post on Instagram A post shared by Nandita Swetha (@nanditaswethaa) View this post on Instagram A post shared by Mirnaa (@mirnaaofficial) View this post on Instagram A post shared by Priya Mani Raj (@pillumani) -
గుర్తుపట్టలేనంతగా మారిన అమీ..షాక్ లో ఫ్యాన్స్
-
'ఐ' సినిమా హీరోయిన్.. ఇలా అయిపోయిందేంటి?
అమీ జాక్సన్.. విక్రమ్ 'ఐ', రామ్ చరణ్ 'ఎవడు', 'రోబో 2.0' సినిమాలతో తెలుగు వారికి ఎంతో దగ్గరైంది. కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడే బిజినెస్‌మేన్ జార్జ్‌ను ప్రేమించిన ఆమె పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. కానీ ఆ ప్రేమ పెళ్లిదాకా రాకుండానే ముగిసిపోయింది. గతేడాది నుంచి ఎడ్ వెస్ట్విక్ అనే వ్యక్తితో పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతోంది. చాలా గ్యాప్ తర్వాత ఈ బ్యూటీ మిషన్ చాప్టర్ 1: అచ్చమ్ ఎంబతు ఇల్లయే అనే తమిళ సినిమా చేస్తోంది. ఇకపోతే సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటే అమీ జాక్సన్ ఈ మధ్య గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. తాజాగా ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఫోటోలు చూసిన ఫ్యాన్స్.. తను అమీ జాక్సన్‌లానే లేదని కామెంట్లు చేస్తున్నారు. ఇటీవల వచ్చిన హాలీవుడ్ మూవీ ఓపెన్హైమర్లోని నటుడు సిలియన్ మర్ఫీలా ఉందంటున్నారు. అమీ.. ఏదైనా వ్యాధితో బాధపడుతుందా? లేదంటే ఏదైనా సర్జరీ చేయించుకుందా? అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరేమో ఐ సినిమాలో విక్రమ్ తనను మోసం చేసిన అందరి మీదా ప్రతీకారం తీర్చుకున్నాడు, ఇన్నాళ్లకు హీరోయిన్‌పై రివేంజ్ తీర్చుకున్నాడంటూ ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు. ఏదేమైనా అమీ జాక్సన్ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. గతంలోనే తన లుక్ బాగుందని, ఇప్పుడస్సలు బాగోలేదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. View this post on Instagram A post shared by Amy Jackson (@iamamyjackson) View this post on Instagram A post shared by Amy Jackson (@iamamyjackson) చదవండి: డీజే టిల్లు హీరోయిన్‌తో డైరెక్టర్ గొడవ.. మూడు నెలలు మాట్లాడుకోలేదు! -
పెళ్లికి ముందే అమ్మతనం కోసం ఆరాటపడ్డ హీరోయిన్స్ వీళ్లే
అమ్మ.. ఆ పిలుపు కోసం తపించని వారుంటారా? ఆ స్పర్శ కోరుకోని వారుంటారా? అమ్మ అంటే వేయి ఏనుగుల బలం. అమ్మ అంటే కదిలొచ్చే దేవత. అమ్మ అంటే మమతల కోవెల. ఎంత వర్ణించినా అమ్మ గొప్పతనాన్ని మాటల్లో బందీ చేయలేము. అమ్మ కోసం ఆరాటపడేవారు కొందరైతే అమ్మగా మారాలని తపించేవాళ్లు కొందరు! పెళ్లి బంధంలోకి అడుగుపెట్టాకే మాతృత్వపు మమకార మాధుర్యం చూడాలని కోరుకోవడం లేదు కొందరు. అలాంటివారి జాబితాలో చాలామంది సెలబ్రిటీలు ఉన్నారు. ప్రేమించినవాడితో పెళ్లి వాయిదా వేశారే కానీ సంతానాన్ని వద్దనుకోలేదు. ఫలితంగా పెళ్లి కాకముందే గర్భం దాల్చినవాళ్లు ఉన్నారు. ఏడడుగులు వేయడానికి ముందే బుడిబుడి అడుగులు వేసే పాపాయితో పందిట్లోకి అడుగుపెట్టినవాళ్లు ఉన్నారు. మదర్స్ డే సందర్భంగా ఓసారి ఆ తల్లులను గుర్తు చేసుకుందాం.. నీనా గుప్తా నీనా గుప్తా పెళ్లి చేసుకోకుండానే వెస్ట్ ఇండీస్ క్రికెటర్ వివియన్ రిచర్డ్స్‌తో బిడ్డను కన్నది. అయితే అతడు తన మొదటి భార్యకు విడాకులు ఇవ్వడానికి ఒప్పుకోలేదు. దీంతో నీనా సింగిల్ పేరెంట్‌గా మసాబా గుప్తాను పెంచింది. కల్కి కొచ్లిన్ బాలీవుడ్ నటి కల్కి కొచ్లిన్.. డైరెక్టర్ అనురాగ్ కశ్యప్‌తో మూడేళ్లు ప్రేమాయణం సాగించి 2011లో పెళ్లి చేసుకుంది. కానీ వీరి వైవాహిక బంధం సజావుగా సాగలేదు. 2013లో విడిపోగా 2015లో అధికారికంగా విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత హర్ష్‌బెర్గ్‌తో డేటింగ్ చేయగా వీరికి కూతురు పుట్టింది. ఇప్పటికీ వీరు పెళ్లి చేసుకోలేదు. రేణు దేశాయ్.. బద్రి చిత్రంతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చింది రేణు దేశాయ్. ఆ సినిమా సమయంలోనే పవన్ కల్యాణ్‌తో ప్రేమలో పడింది. అతడితో ఏడుగులు వేయడానికే ముందే అకీరా జన్మించాడు. అతడికి ఐదేళ్ల వయసొచ్చాక పెళ్లి చేసుకున్నారు. 12 ఏళ్లు కలిసి మెలిసి ఉన్నా తర్వాత విడిపోయారు. సెలీనా జైట్లీ నటి సెలీనా జైట్లీ దుబాయ్‌కు చెందిన వ్యాపారవేత్త పీటర్ హగ్‌తో సహజీవనం చేసిన ఆమె పెళ్లికి ముందే గర్భం దాల్చింది. దీంతో సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న ఆమె ఇద్దరు కవలలకు జన్మనిచ్చింది. సారిక స్టార్ హీరోయిన్గా కొన్నాళ్లు చక్రం తిప్పిన సారిక స్టార్ నటుడు కమల్ హాసన్‌తో ప్రేమాయణం నడిపింది. కొంతకాలం వీరిద్దరూ సహజీవనం చేశారు. ఆ సమయంలో వీరికి శృతి హాసన్ జన్మించింది. తర్వాత రెండేళ్లకు వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. గాబ్రియెల్లా మోడల్, నటి గాబ్రియెల్లా డెమట్రేడ్స్ నటుడు అర్జున్ రాంపాల్‌తో డేటింగ్లో ఉంది. త్వరలో ఆమె రెండోసారి తల్లి కాబోతోంది. కానీ ఇప్పటివరకు వీరు పెళ్లి చేసుకోలేదు. మహిహ చౌదరి నటి మహిమ చౌదరి పెళ్లి చేసుకునే సమయానికి ఐదు నెలల గర్భవతి అని అప్పట్లో వార్తలు వచ్చాయి. 2006 మార్చిలో ఆమె బాబీ ముఖర్జీని పెళ్లాడింది. అమృత అరోరా అమృత అరోరా.. షేకలా లడక్‌తో ప్రేమలో ఉన్నట్లు ప్రకటించిన కొద్ది రోజులకే గర్భం దాల్చింది. బిడ్డ పుట్టాక ప్రియుడిని పెళ్లాడింది. శ్రీదేవి దివంగత నటి, అతిలోక సుందరి శ్రీదేవి కూడా పెళ్లికి ముందే గర్భం దాల్చింది. జాన్వీ కపూర్ కడుపులోకి వచ్చాకే ఆమె బోనీకపూర్‌ను పెళ్లాడింది. అప్పటికి ఆమె ఏడు నెలల గర్భిణి. కొంకణ్ సేన్ శర్మ నటుడు రణ్వీర్ షోరేతో ఎంతోకాలం రిలేషన్షిప్ కొనసాగించిన ఈ నటి ఎవరికీ తెలియకుండా సీక్రెట్‌గా పెళ్లి చేసుకుంది. కానీ అప్పటికే తను గర్భవతి. పెళ్లైన తర్వాత ఆమె బిడ్డకు జన్మనిచ్చింది. తర్వాత వీరు విడాకులు తీసుకున్నారు. అమీ జాక్సన్ ఐ సినిమాతో దక్షిణాది ప్రేక్షకులకు దగ్గరైన హీరోయిన్ అమీ జాక్సన్. ప్రియుడు జార్జ్‌తో ఎంగేజ్మెంట్ జరిగిన మరుక్షణమే తను ప్రెగ్నెంట్ అన్న విషయాన్ని వెల్లడించింది. తర్వాత పండంటి బిడ్డకు జన్మనిచ్చింది కానీ ఆ ప్రేమ పెళ్లి దాకా రాకుండానే ఆగిపోయింది. నేహా ధూపియా బాలీవుడ్ నటి నేహా ధూపియా కూడా పెళ్లికి ముందే గర్భం దాల్చింది. ఈ విషయాన్ని నేహా ధూపియా ఆమె ప్రియుడు అంగద్ బేడీ ఇంట్లో చెప్పి ఒప్పించాకే పెళ్లి చేసుకున్నారు. నేహాతో అంగద్ షాదీ జరిగే సమయానికి ఆమె మూడు నెలల గర్భిణి. దియా మీర్జా బాలీవుడ్ నటి దియా మీర్జా వ్యాపారవేత్త వైభవ్ రేఖీని పెళ్లాడింది. అతడిని పెళ్లాడే సమయానికే ఆమె గర్భం దాల్చింది. నటి నటాషా స్టాంకోవిచ్ కూడా వివాహ బంధంలోకి అడుగుపెట్టడానికి ముందే గర్భం దాల్చింది. క్రికెటర్ హార్దిక్ పాండ్యాతో కొంతకాలం పాటు రిలేషన్లో ఉన్న ఆమె ప్రెగ్నెన్సీ వచ్చాక పెళ్లి చేసుకుంది. అలియా భట్ అలియా భట్ కూడా పెళ్లికి ముందే గర్భవతి అయిందంటారు. 2022 ఏప్రిల్ 14న రణ్‌బీర్ కపూర్‌ను పెళ్లాడింది. జూన్‌లో ప్రెగ్నెన్సీ విషయాన్ని వెల్లడించారు. నవంబర్‌లో రాహాకు జన్మనిచ్చింది ఆలియా. చదవండి: మదర్స్ డే స్పెషల్...కమ్మనైన ఈ అమ్మ పాటలు విన్నారా? మదర్ సెంటిమెంట్‌తో బ్లాక్‌బస్టర్ కొట్టిన చిత్రాలివే -
భారీ అంచనాలతో వస్తున్న 'మిషన్: చాప్టర్1'
కోలీవుడ్ హీరో అరుణ్ విజయ్, అమీ జాక్సన్ నటిస్తోన్న లేటెస్ట్ భారీ బడ్జెట్ మూవీ ‘మిషన్: చాప్టర్ 1’. ఈ చిత్రానికి ఎం.రాజశేఖర్, ఎస్.స్వాతి నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్ చిత్రాలను రూపొందిస్తూ వరుస సక్సెస్‌లను సొంతం చేసుకుంటున్న లైకా ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. దర్శకుడు విజయ్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. సినీ ఇండస్ట్రీలో 2.0, పొన్నియిన్ సెల్వన్, ఇండియన్ 2 వంటి చిత్రాలు సహా ఎన్నో భారీ చిత్రాలను లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రాన్ని కేవలం 70 రోజుల్లో లండన్, చెన్నై సహా పలు లొకేషన్స్‌లో శరవేగంగా చిత్రీకరించటం గొప్ప విశేషం. తాజాగా ‘మిషన్: చాప్టర్ 1’ సినిమాను విశ్లేషించి ఒక పరిమితమైన హద్దులని లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని లైకా టీమ్ భావిస్తోంది. దీంతో లైకా సంస్థ ‘మిషన్: చాప్టర్ 1’ చిత్రాన్ని నాలుగు భాషల్లో భారీ ఎత్తున విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు . ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్, ఆడియో, థియేట్రికల్ రిలీజ్‌కి సంబంధించిన వివరాలను త్వరలోనే ప్రకటించనున్నారు. చాలా గ్యాప్ తర్వాత.. 2.0లో నటించి అలరించిన ముద్దుగుమ్మ అమీ జాక్సన్ ఈ చిత్రంతో సినిమాల్లో అడుగు పెడుతున్నారు. జైలును సంరక్షించే ఆఫీసర్ పాత్రలో ఆమె కనిపించనున్నారు. మలయాళ చిత్ర పరిశ్రమకు చెందిన విలక్షణ నటి నిమిషా సజయన్ ఈ మూవీలో ఓ కీలక పాత్రను పోషించారు. జీవీ ప్రకాష్ ఈ చిత్రానికి సంగీతమందించారు. ఈ సినిమా కోసం లండన్ జైలును పోలి ఉండేలా చెన్నైలో భారీగా ఖర్చుతో ఓ జైలు సెట్ వేశారు. -
కొత్త బాయ్‌ఫ్రెండ్‌ను పరిచయం చేసిన హీరోయిన్, రొమాంటిక్ పిక్స్ వైరల్
ఐ, ఎవడు, రోబో 2.0 సినిమాలతో హీరోయిన్గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన బ్రిటిష్ బ్యూటీ అమీ జాక్సన్. నటిగా కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్నప్పుడే వ్యాపారవేత్త జార్జ్ పనియోటౌతో ప్రేమలో మునిగి తేలిన అమీ జాక్సన్ పెళ్లికాకుండానే ఆండ్రూ అనే కుమారుడికి జన్మనిచ్చింది. బాబు పుట్టిన తర్వాత పెళ్లి చేసుకుంటామని ప్రకటించిన అమీ నుంచి ఇప్పటివరకు ఏ సమాచారం లేదు. అయితే అమీ జాక్సన్ బ్రిటీష్ నటుడు ఎడ్వెస్ట్విక్తో డేటింగ్లో ఉన్నట్లు గత కొంతకాలంగా వార్తలు చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. కానీ ఈ వార్తలపై ఏనాడు రియాక్ట్ కాలేదు ఆమె. చదవండి: పొలిటికల్ లీడర్‌ను పెళ్లాడిన హీరోయిన్ తాజాగా ఆ పుకార్లనే నిజం చేస్తూ కొత్త ప్రియుడిని పరిచయం చేసింది. ఎడ్వెస్ట్విక్తో ప్రేమలో ఉన్నట్టు వాలంటైన్స్ డే సందర్బంగా అధికారికంగా ప్రకటించింది. ఈ సందర్భంగా ఎడ్వెస్ట్వీక్తో దిగిన పలు రొమాంటిక్ పిక్స్‌ను షేర్ చేస్తూ.. ‘హ్యాపీ వాలంటైన్స్ డే బేబీ, నీ అంతులేని ప్రేమకు కృతజ్ఞతలు’ అంటూ రెడ్ హార్ట్ ఎమోజీని జత చేసింది. దీంతో ఆమె పోస్ట్‌పై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కొందరు క్యూట్ కపుల్ అంటూ హార్ట్ ఎమోజీలతో స్పందిస్తూంటే మరికొందరు ఆమె తీరుపై విమర్శిస్తున్నారు. పెళ్లి కాకుండానే సహజీవనం, బిడ్డకు జన్మనివ్వడం.. ఇప్పుడు మరో నటుడితో ప్రేమయాణం ఏంటని తప్పుబడుతున్నారు. చదవండి: బండ్ల గణేష్ షాకింగ్ ట్వీట్.. ఆ స్టార్ డైరెక్టర్‌ను ఉద్దేశించేనా? View this post on Instagram A post shared by Amy Jackson (@iamamyjackson) -
అరుణ్ విజయ్ ఎమీజాక్సన్ జంటగా.. రూ.3.5 కోట్లతో లండన్ సెట్
నటుడు అరుణ్ విజయ్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రానికి అచ్చమ్ ఎంబదు ఇల్లయే అనే టైటిల్ ఖరారు చేశారు. నటి ఎమీజాక్సన్ కథానాయకిగా, కీలక పాత్రలో నిమీషా విజయన్ నటిస్తున్నారు. విజయ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ షిరిడీ సాయి మూవీస్ పతాకంపై శ్రీ,కావ్య సమర్పణలో ఎం. రాజశేఖర్, ఎస్. స్వాతి నిర్మిస్తున్నారు. చిత్ర వివరాలను దర్శకుడు విజయ్ తెలుపుతూ చిత్ర తొలి షెడ్యూల్ లండన్‌లో నిర్వహించినట్లు తెలిపారు. అక్కడ నటుడు విజయ్‌కు సంబంధించిన కీలక సన్నివేశాలను చిత్రీకరించినట్లు చెప్పారు. అక్కడ షూటింగ్లో విజయ్ తీవ్రంగా గాయపడ్డారు. వైద్యులు విశ్రాంతి తీసుకోవాలని సలహా ఇచ్చిన లెక్క చేయకుండా షూటింగ్‌కు ఇబ్బంది కలుగుతుందనే కారణంతో బాధను భరిస్తూనే నటించారన్నారు. కాగా చిత్ర రెండవ షెడ్యూల్‌ను చెన్నైలోని బిన్నీమిల్స్ సమీపంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అక్కడ ఈ చిత్రం కోసం రెండున్నర ఎకరాల స్థలంలో రూ.3.5 కోట్ల వ్యయంతో లండన్ సెట్ వేసినట్లు చెప్పారు. దీన్ని రామలింగం మేస్త్రి సహాయంతో ఆర్డ్ డైరెక్టర్ శరవణన్ వేలాదిమంది కార్మికులతో రూపొందించారని తెలిపారు. అదేవిధంగా ఈ చిత్రం కోసం 1000 మందికి పైగా విదేశాలకు చెందిన జూనియర్ ఆర్టిస్టులను రప్పించినట్లు చెప్పారు. వాళ్లతో అరుణ్ విజయ్ నటిస్తున్న భారీ పోరాట సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు తెలిపారు. కాగా దర్శకుడు విజయ్ ప్రణాళిక ప్రకారం షూటింగును అనుకున్న దానికంటే ముందుగానే పూర్తి చేస్తున్నారంటూ నిర్మాతలు సంతోషం వ్యక్తం చేశారు. కాగా దీనికి సూర్యవంశీ, ప్రసాద్ గోదా, జీవన్ గోదా సహనిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. జి. ప్రకాష్ కుమార్ సంగీతాన్ని, సందీప్ కె. విజయ్ చాయాగ్రహణం అందిస్తున్నట్లు వెల్లడించారు. -
ఫస్ట్ ఛాన్స్ ఇచ్చిన డైరెక్టర్‌తోనే అమీ జాక్సన్ రీఎంట్రీ..
విక్రమ్ ‘ఐ’, రజనీకాంత్ ‘2.ఓ’, రామ్ చరణ్ ‘ఎవడు’ చిత్రాలతో అమీ జాక్సన్ సుపరిచితురాలే. 2019లో ఇంగ్లీష్ వ్యాపారవేత్త జార్జ్‌ను పెళ్లాడారామె. అమీ ఓ బాబుకు జన్మనిచ్చారు. మూడేళ్ల్ల బ్రేక్ తర్వాత ఆమె తిరిగి నటిగా మేకప్ వేసుకోనున్నారు. ఏఎల్ విజయ్ దర్శకత్వంలో అరుణ్ విజయ్ హీరోగా రూపొంధనున్న ‘అచ్చమ్ ఎన్బదు ఇల్లయే’ అమీ రీ ఎంట్రీ మూవీ కానుంది. ఈ చిత్రంలో ఓ బ్రిటిష్ యువతి పాత్రలో కనిపించనున్నారు అమీ. కాగా అమీ వెండితెరకు ఎంట్రీ ఇచ్చిన తమిళ చిత్రం ‘మద్రాస పట్టినమ్’కు దర్శకుడు అయిన ఏఎల్ విజయ్‌నే ఆమె రీ ఎంట్రీ ఫిల్మ్‌కు దర్శకుడు కావడం విశేషం. అంతేకాదు.. ‘మద్రాస పట్టినమ్’లో బ్రిటిష్ యువతిగా నటించిన అమీ ఇప్పుడు అదే దర్శకుడు తీస్తున్న ‘అచ్చమ్ ఎన్బదు..’లో కూడా సేమ్ బ్రిటిష్ యువతి పాత్రే చేస్తుండటం విశేషం. -
అమలాపాల్ మాజీ భర్త డైరెక్షన్లో.. అమీ జాక్సన్ రీఎంట్రీ
హీరోయిన్ అమీ జాక్సన్ రీ ఎంట్రీ ఇస్తున్నట్లు సమాచారం. ఈత దుస్తులతో కుర్రకారుకు నిద్ర లేకుండా చేసిన లండన్‌కు చెందిన నటి ఈ బ్యటీని మద్రాసు పట్టణం చిత్రంతో దర్శకుడు ఎఎల్ విజయ్ కోలీవుడ్‌కు పరిచయం చేశారు. తొలి చిత్రంలోని బ్రిటీష్ బ్యూటీగా తమిళ సినీ ప్రేక్షకులను అలరించిన ఈ అమ్మడు ఆ తరువాత కొన్ని చిత్రాలలో నటించింది. తెలుగులోనూ రామ్‌చరణ్‌కు జంటగా ఎవడు చిత్రంలో సందడి చేసింది. ఈమె కోలీవుడ్‌లో చివరగా తెరపై కనిపింన చిత్రం 2.0. ఇందులో రజనీకాంత్‌కు జంటగా నటింంది. అయితే అంతకుముందే హిందీలో ఏక్ దివానా థా చిత్రంలో నటించి ఆ చిత్ర కథానాయకుడు ప్రతీక్ ప్రేమలో పడింది. అయితే కొద్ది రోజులకే ఇద్దరూ విడిపోయారు. ఆ తరువాత హాలీవుడ్ టీవీ సీరియల్‌పై దృష్టి సారించిన ఎమీ జాక్సన్ జార్జ్ పనమిట్ అనే వ్యక్తి ప్రేమలో పడింది. పెళ్లికి ముందే సహజీవనం చేసి ఓ బిడ్డకు తల్లి కూడా అయ్యింది. అతనితో వివాహ నిశ్చితార్థం కూడా జరిగింది. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించిన ఎమీ జాక్సన్ తరువాత ఏమైందో గాని అతనికి దూరమైంది. ప్రస్తుతం కొత్త బాయ్‌ఫ్రెండ్‌తో ఎంజాయ్ చేస్తున్న ఈమె త్వరలో కోలీవుడ్ రీ ఎంట్రీకి సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ అమ్మడిని మద్రాసు పట్టణం చిత్రంతో పరిచయం చేసిన దర్శకుడు ఎఎల్ విజయ్, మళ్లీ తన తాజా చిత్రంలో కథానాయికగా నటింపచేస్తున్నట్లు తెలిసింది. ఈయన ప్రస్తుతం నటుడు అరుణ్ విజయ్ హీరోగా చిత్రాన్ని తెరకెక్కించడానికి రెడీ అవుతున్నట్టు తెలిసింది. ఈ అంశంపై ప్రస్తుతం సామాజిక మాద్యమాల్లో ప్రచారం వైరల్ అవుతోంది. కాగా దీనికి సంబంధింన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉందని సమాచారం. -
పెళ్లి కాకుండానే బిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్.. ఇప్పుడు మరో నటుడితో ప్రేమాయణం
Is Amy Jackson Confirms Her Relationship With Ed Westwick: ఐ, ఎవడు, రోబో 2.0 సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే బ్యూటీఫుల్ హీరోయిన్ అమీ జాక్సన్. కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్నప్పుడే వ్యాపారవేత్త జార్జ్ పనియోటౌతో ప్రేమలో మునిగి తేలిన అమీ జాక్సన్ పెళ్లికాకుండానే ఆండ్రూ అనే కుమారుడికి జన్మనిచ్చింది. బాబు పుట్టిన తర్వాత పెళ్లి చేసుకుంటామని ప్రకటించిన అమీ నుంచి ఇప్పటివరకు ఏ సమాచారం లేదు. అయితే అమీ జాక్సన్ బ్రిటీష్ నటుడు ఎడ్వెస్ట్విక్తో డేటింగ్లో ఉన్నట్లు గత కొంతకాలంగా వార్తలు చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. కానీ ఈ వార్తలపై ఏనాడు రియాక్ట్ కాలేదు అమీ. ఇదివరకు లండన్‌లో అతనితో చెట్టాపట్టాలేసుకోని తిరిగిన ఫొటోలు వారు ప్రేమలో ఉన్నారని చెప్పకనే చెప్పినట్లైంది. తాజాగా ఎడ్వెస్ట్విక్తో సాన్నిహిత్యంగా ఉన్న ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ప్రస్తుతం నెట్టింట వైరల్ అయిన ఈ ఫొటోలు చూస్తుంటే వారు ప్రేమలో ఉందన్న వార్తలు దాదాపు కన్ఫమ్ అయినట్లు తెలుస్తోంది. చదవండి: ఆ పాత్ర నాకు నచ్చలేదు.. కానీ ఒప్పుకున్నా: సత్యరాజ్ View this post on Instagram A post shared by Amy Jackson (@iamamyjackson) -
నటుడితో అమీ జాక్సన్ డేటింగ్.. లీకైన ఫోటోలు
వరుడు సినిమాతో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ అమీ జాక్సన్.. 'ఐ', 'రోబో 2.0' సినిమాలతో మరింత పాపులర్ అయింది. కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్నప్పుడే వ్యాపారవేత్త జార్జ్ పనియోటౌతో ప్రేమలో మునిగి తేలిన అమీ జాక్సన్ పెళ్లికాకుండానే ఆండ్రూ అనే కుమారుడికి జన్మనిచ్చింది. ఆ తర్వాత కొన్నాళ్లకు వీరిద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో బ్రేకప్ చెప్పేసుకున్నారు. అయితే ఇటీవలె మరోసారి ప్రేమలో పడిన అమీ జాక్సన్ కొన్నాళ్లుగా బ్రిటీష్ నటుడు ఎడ్వెస్ట్విక్తో ఆమె డేటింగ్లో ఉన్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా వీరిద్దరూ లండన్‌లో చట్టాపట్టాలేసుకొని తిరుగుతున్నారు. ఎడ్ వెస్ట్‌విక్‌తో కలిసి అమీ జాక్సన్ చేతిలో చేయి వేసుకొని లండన్ వీధుల్లో తిరుగుతూ కనిపించింది. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. దీంతో వీరిద్దరి లవ్ ఎఫైర్ మరోసారి చర్చనీయాంశమైంది. View this post on Instagram A post shared by D💋🎀 (@edwestwicks.wife) -
'ఆ హీరోయిన్‌తో బ్రేకప్ తర్వాత కనుమరుగైపోయాను'
Amy Jackson: 'ఏక్ దీవానా తా' సినిమాతో బాలీవుడ్‌కు పరిచయమయ్యాడు ప్రతీక్ బాబర్. ఇందులో 'రోబో'[ బ్యూటీ అమీ జాక్సన్ హీరోయిన్గా నటించింది. ఆన్‌స్క్రీన్ మీద ఈ జంటను చూసి ముచ్చటపడిపోయారు అభిమానులు. ఆఫ్‌స్క్రీన్‌లోనూ వీళ్లిద్దరూ ప్రేమించుకున్నారు, 2012లో డేటింగ్ మొదలుపెట్టారు. కానీ వీరి ప్రేమ ఎక్కువకాలం నిలవలేదు. కొంతకాలానికే ఇద్దరూ బ్రేకప్ చెప్పుకుని ఎవరిదారి వారు చూసుకున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ప్రతీక్ బాబర్ మాట్లాడుతూ.. అమీ జాక్సన్‌తో బ్రేకప్ తర్వాత తన జీవితంలో బ్యాడ్ టైం స్టార్ట్ అయిందని పేర్కొన్నాడు. 25 ఏళ్ల వయసులో లవ్ ఫెయిల్యూర్ కావడంతో డిప్రెషన్లోకి వెళ్లిపోయానన్నాడు. ఆ తర్వాత కనుమరుగైపోయానని తెలిపాడు. కాగా అతడు ఓ ముఖ్యపాత్రలో నటించిన తాజా చిత్రం 'బచ్చన్ పాండే' మార్చి 18న విడుదలవుతోంది. అక్షయ్ కుమార్ హీరోగా నటించిన ఈ సినిమా గురించి ప్రతీక్ మాట్లాడుతూ.. టీనేజీలో ఉన్నప్పుడు అక్షయ్, అర్షద్ వార్సి తన ఫేవరెట్ హీరోలని చెప్పుకొచ్చాడు. చదవండి: జనం పిచ్చోళ్లు కాదు నిన్ను నమ్మడానికి.. హీరోయిన్‌పై ట్రోలింగ్ -
నటుడితో తల్లైన హీరోయిన్ సీక్రెట్ డేటింగ్!
'ఐ', 'రోబో 2.0' సినిమాల్లో అందచందాలతో కట్టిపడేసింది అమీ జాక్సన్. ఈ మధ్య సినిమాల్లో పెద్దగా కనిపించకుండా పోయిన అమీ జాక్సన్ గతంలో వ్యాపాత్వేత్త జార్జ్ పనాయిటోను ప్రేమించింది. వీరిద్దరికీ 2019 మేలో నిశ్చితార్థం కూడా జరిగింది. అయితే కరోనా కారణంగా పెళ్లి వాయిదా పడుతూ రాగా అదే ఏడాది సెప్టెంబర్‌లో మగబిడ్డకు జన్మనిచ్చింది అమీ జాక్సన్. ఇక ఏడడుగులు నడవడమే ఆలస్యం అనుకుంటున్న తరుణంలో సడన్‌గా ప్రియుడితో కలిసి దిగిన ఫొటోలన్నింటినీ సోషల్ మీడియాలో తొలగించి బ్రేకప్ విషయాన్ని చెప్పకనే చెప్పిందీ భామ. తాజాగా ఈ హీరోయిన్ మరో నటుడితో ప్రేమలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. బ్రిటీష్ యాక్టర్, గాసిప్ గర్ల్ హంక్ ఎడ్ వెస్ట్‌విక్‌తో డేటింగ్ చేస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. సౌదీ అరేబియాలోని రెడ్ సీ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లో వీరిద్దరూ తొలిసారిగా ఒకరినొకరు కలుసుకున్నారట! అప్పుడు వీరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారిందని, ఈ క్రమంలో రెండు నెలల నుంచి వీళ్లు సీక్రెట్ డేటింగ్లో ఉన్నారని కథనాలు వెలువడుతున్నాయి. అంతేకాకుండా ఈ ప్రేమజంట వాలంటైన్స్ డేను ప్యారిస్‌లో ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారని టాక్! -
పెళ్లి కాకుండానే తల్లైన స్టార్ హీరోయిన్స్ వీళ్లే..
List Of 10 Popular Actresses Who Got Pregnant Before Marriage: సినిమా ఇండస్ట్రీలో రిలేషన్‌షిప్‌లు కామనే. కొందరు ఈ రిలేషన్‌ను పెళ్లి దాకా కొనసాగిస్తే.. కొన్ని జంటలు మధ్యలోనే బ్రేకప్ చెప్పేసుకొని ఎవరిదారి వారు చూసుకుంటారు. అయితే మరికొంత మంది మాత్రం మాత్రం పెళ్లికి ముందే గర్భం దాల్చి పిల్లలను కన్నారు. ఈ లిస్ట్‌లో ఉన్న టాప్ హీరోయిన్స్ ఎవరో చూసేయండి.. శ్రీదేవి అతిలోక సుందరి శ్రీదేవి పెళ్లి కాకుండానే తల్లైంది. నిర్మాత బోనీ కపూర్‌తో కొన్నాళ్ల పాటు సహజీవనం చేసిన ఆమె కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉండగానే గర్భం దాల్చింది. పెళ్లి జరిగే సమయానికి శ్రీదేవి ఏడు నెలల గర్భవతిగా ఉండటం అప్పట్లో పెద్ద చర్చకే దారి తీసింది. పెళ్లి తర్వాత కొన్నాళ్లుపాటు సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. సారిక బాలీవుడ్ స్టార్ హీరోయిన్గా కొన్నాళ్ల పాటు చక్రం తిప్పన సారిక విలక్షణ నటుడు కమల్‌హాసన్‌తో ప్రేమలో పడింది. ఇద్దరూ కొన్నాళ్ల పాటు లివింగ్ రిలేషన్లో ఉన్నారు. అలా పెళ్లి కాకుండానే వీరికి శ్రుతిహాసన్ జన్మించింది. ఆ తర్వాత రెండేళ్లకు వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. రేణు దేశాయ్ బద్రీ సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన రేణుదేశాయ్ ఆ సినిమా సమయంలోనే పవన్‌కల్యాణ్‌తో ప్రేమలో పడింది. జానీ సినిమా సమయంలో మరింత దగ్గరైన ఈ జంట కొన్నాళ్ల పాటు సహాజీవనం చేశారు. వీరిద్దరికీ 2004 లో అకీరా పుట్టాడు. అకీరా పుట్టిన ఐదేళ్లకు అంటే 2009 లో వీరిద్దరూ పెళ్లి చేసుకుని భార్య భర్తలయ్యారు. దాదాపు 12 ఏళ్ల అనంతరం వీరు విడిపోయారు. అమీ జాక్సన్ ఐ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నటి అమీ జాక్సన్. బాయ్‌ఫ్రెండ్ జార్జ్‌తో ఎంగేజ్మెంట్ అనంతరం తాను ప్రెగ్నెంట్ అని ప్రకటించిన అమీ జాక్సన్ పెళ్లకి ముందే తల్లైంది. అయితే ఇప్పటివరకు ఈ జంట ఇంకా పెళ్లి చేసుకోకపోవడం గమనార్హం. నీనా గుప్తా బాలీవుడ్ నటి నీనా గుప్తా వెస్టిండీస్ క్రికెటర్ వివ్ రిచర్డ్స్‌తో డేటింగ్ చేసింది. ఇక ఆమె గర్భవతిగా ఉన్న సమయంలో అతడి నుంచి విడిపోయింది. రిచర్డ్స్ తన మొదటి భార్యకు విడాకులు ఇచ్చేందుకు ఒప్పుకోకపోవడంతో ఈ జంట విడిపోయారు. సింగిల్ మథర్గానే మసాబాను పెంచింది నానా గుప్తా. కల్కి కొచ్లిన్ బాలీవుడ్ నటి కల్కి కొక్లెయిన్ తొలుత దర్శకుడు అనురాగ్ కశ్యప్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. అయితే.. ఆ తర్వాత అతనితో చెడిపోవడంతో విడాకులు తీసుకుంది. తర్వాత హర్ష్ బెర్గ్ అనే వ్యక్తితో ప్రేమలో పడింది. అతన్ని పెళ్లి చేసుకోకుండానే గర్భవతి అయ్యింది. దియా మీర్జా బాలీవుడ్ భామ దియా మీర్జా వైభవ్ రేఖీ అనే వ్యాపారవేత్తను ప్రేమించి పెళ్లి చేసుకుంది. పెళ్లికి ముందే గర్భం దాల్చింది. అయితే గర్భవతి కాబట్టే పెళ్లి చేసుకుంది అని అప్పట్లో దియా మీర్జాపై నెటిజన్లు ట్రోల్ చేసిన సంగతి తెలిసిందే. నటాషా బాలీవుడ్ నటి నటాషా క్రికెటర్ హార్దిక్ ప్యాండాతో కొన్నాళ్ల పాటు రిలేషన్షిప్లో ఉన్నారు. పెళ్లికి ముందే నటాషా గర్భం దాల్చింది. -
కొడుకు పుట్టిన రెండేళ్లకు ప్రియుడితో హీరోయిన్ బ్రేకప్!
Amy Jackson: హీరోయిన్ అమీ జాక్సన్ తన ప్రియుడితో తెగదెంపులు చేసుకుందట. అతడితో ఏడడుగులు నడవకముందే వారి మధ్య ఉన్న బంధాన్ని తెంచేసుకుందట. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. వివరాల్లోకి వెళితే.. బ్రిటీష్ నటి, మోడల్ అమీ జాక్సన్.. జార్జ్ పనాయిటోను ప్రేమించింది. అతడే సర్వస్వం అనుకున్న ఈ భామ జార్జ్‌ను పెళ్లాడాలనుకుంది. ఈ మేరకు 2019 మేలో వీరి నిశ్చితార్థం కూడా జరిగింది. కానీ కరోనా కారణంగా పెళ్లి వాయిదా పడింది. అయితే వీరి ప్రేమకు ప్రతీకగా అదే ఏడాది సెప్టెంబర్‌లో మగబిడ్డకు జన్మనిచ్చింది అమీ జాక్సన్. పెళ్లి కాకముందే తల్లైన అమీ జాక్సన్ తన కొడుకుతో పాటు కాబోయే భర్తతో కలిసి దిగిన ఫొటోలను తరచూ సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకునేది. అయితే ఏమైందో ఏమో కానీ ఈ హీరోయిన్ సడన్‌గా తన ప్రియుడితో కలిసి దిగిన ఫొటోలన్నింటినీ తొలగించింది. దీంతో అమీ జాక్సన్ పెళ్లికి ముందే కాబోయే భర్తతో తెగదెంపులు చేసుకుందని వార్తలు వెలువడుతున్నాయి. ఉన్నట్లుండి ఇలా పిక్స్ డిలీట్ చేయడం చూస్తుంటే వీరు విడిపోయారని, ఇక వీరి పెళ్లి జరగడం కష్టమేనని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. కాగా 2010లో 'మద్రాసుపట్నం' సినిమాతో హీరోయిన్గా కెరీర్ ఆరంభించిన అమీ జాక్సన్ తెలుగు, తమిళ, హిందీ, కన్నడ భాషల్లోనూ నటించింది. 'ఐ', 'రోబో 2.0' సినిమాలతో ప్రేక్షకులకు మరింత చేరువైంది. -
విశ్వ సుందరి కిరీటం.. నేలపై కూర్చొని భోజనం.. ఐష్ ఓల్డ్ ఫోటో వైరల్
ఐశ్వర్యరాయ్.. అందానికే పర్యాయపదం ఈ పేరు. కుర్రకారు మొదలుకుని సినీ నిర్మాతల వరకూ ఆమె అందానికి ఆకర్షితులే. ప్రతి ఒక్కరు అందాన్ని ఆమెతో పోల్చి చెబుతారు. అలాంటి అందమైన స్త్రీ భూమ్మీద మరొకరు ఉండరని అంటుంటారు. ఈ పిల్లికళ్ల బ్యూటీ 1994లోమిస్ వరల్డ్ కిరీటాన్ని దక్కించుకున్న విషయం తెలిసిందే. మిస్ వరల్డ్ అయిన తర్వాత ఆ కిరీటంతోనే కింద కూర్చొని భోజనం చేసింది ఐశ్యర్య. ఈ అరుదైన ఫొటోను ప్రముఖ నటి అమీజాక్సన్ తన ఇన్‌స్టా స్టోరీస్‌లో షేర్ చెయ్యగా అది వైరల్ అవుతుంది. అందులో మిస్ వరల్డ్ కిరీటంతోనే మెరూన్ కలర్ చీరలో తల్లి బృందాతో కలిసి నేలపై కూర్చుని స్వహస్తాలతోనే భోజనం చేస్తున్నారు. 1994 లో మిస్ ఇండియా పోటీలో ఐశ్వర్య మొదటి రన్నరప్. ఆమె కిరీటాన్ని సుష్మితా సేన్ చేతిలో కోల్పోయింది. తరువాత, ఇద్దరూ వరుసగా మిస్ వరల్డ్ మరియు మిస్ యూనివర్స్ కిరీటాలను గెలుచుకున్నారు. అమీ జాక్సన్ కూడా 2009లో మిస్ టీన్ వరల్డ్‌గా గెలుపొందారు. అంతేకాదు..2010 లో మిస్ ఇంగ్లాండ్ టైటిల్ పోటీల్లో రన్నరప్ కిరీటాన్ని గెలుపొందారు. 6 ఏళ్లకే మోడల్ గా కెరీర్ ప్రారంభించిన అమీ పలు సినిమాల్లో కూడా నటించారు. View this post on Instagram A post shared by Nineties Violet 🔮 (@90s.violet) -
సోషల్ హల్చల్: పాట పాడిన శృతి, దెబ్బలు తిన్న హన్సిక
♦ ఇది ఏ ప్రదేశమో గుర్తుపట్టారా? అంటున్న అనుపమ పరమేశ్వరన్ ♦ తల్లి చేతిలో దెబ్బలు తిన్న హన్సిక ♦ వర్షం పడుతున్నప్పుడు కాఫీ తాగితే ఉంటది అసలైన మజా అంటున్న నభా నటేశ్ ♦ అంతా మంచే జరగాలని ప్రార్థిస్తున్నానంటోన్న అమీషా పటేల్ ♦ పాట పాడిన శృతీ హాసన్ ♦ పాజిటివ్‌గా ఆలోచిస్తే అంతా సంతోషం, బలం అన్నీ వస్తాయంటున్న మోనాల్ గజ్జర్ View this post on Instagram A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96) View this post on Instagram A post shared by Hansika Motwani (@ihansika) View this post on Instagram A post shared by Nabha Natesh (@nabhanatesh) View this post on Instagram A post shared by Shruti Haasan (@shrutzhaasan) View this post on Instagram A post shared by Priya Mani Raj (@pillumani) View this post on Instagram A post shared by Daksha Nagarkar (@dakshanagarkar) View this post on Instagram A post shared by Ameesha Patel (@ameeshapatel9) View this post on Instagram A post shared by Amy Jackson (@iamamyjackson) View this post on Instagram A post shared by Ruhani Sharma (@ruhanisharma94) View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) View this post on Instagram A post shared by M Monal Gajjar (@monal_gajjar) View this post on Instagram A post shared by Adah Sharma (@adah_ki_adah) View this post on Instagram A post shared by Alekhya Harika (@alekhyaharika_) View this post on Instagram A post shared by Anjali (@yours_anjali) View this post on Instagram A post shared by Aishwarya Rajesh (@aishwaryarajessh) -
హీరోయిన్ అమీజాక్సన్ గ్లామర్ ఫోటోలు
-
మురిసిపోతున్న అమీ జాక్సన్
నటి అమీ జాక్సన్ ఇటీవల ఓ బిడ్డకు జన్మినిచ్చిన విషయం తెలిసిందే. ఇక అప్పటి నుంచి అమీ తన కొడుకు ఆండ్రియాస్ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. తెగ మురిసిపోతున్నారు. తన భుజాలపై సేదతీరతున్న ఆండ్రియాస్.. ఫొటోను తాజాగా షేర్ చేశారు. ఇందులో అమీ సోఫాపై కుర్చుని ఆండ్రియాస్‌ను తన భుజాలపై పడుకోబెట్టుకున్న బ్లాక్ అండ్ వైట్ ఫోటోకు ‘నా చంద్రుడు, నక్షత్రాలకు ఇప్పుడు నాలుగు నెలలు నిండాయి’ అనే క్యాప్షన్‌తో షేర్ చేస్తూ.. తన ముద్దుల తనయుడిని ముద్దుగా చంద్రుడితో పోల్చుకున్నారు. అలాగే ‘ఈ రోజుతో నీకు నాలుగు నెలలు నిండి అయిదవ నెలలోకి అడుగుపెడుతున్నావు. నువ్వు నా జీవితంలోకి వచ్చినప్పటి నుంచి రోజులు ఎలా గడుస్తున్నాయో గుర్తుంచుకోవడం కష్టంగా ఉంది. ఈ భూమిపైకి వచ్చిన అద్భుతమైన చిన్న మానవుడి. నీకు అమ్మగా ఉండడాన్ని గొప్ప దీవెనగా భావిస్తున్నాను’ అంటూ ఇన్‌స్టాలో రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో అమీ అభిమానులను, నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. తల్లిగా అమీ మురిసిపోతున్న తీరును చూసి ఆమె అభిమానుల ఫిదా అవుతున్నారు. ‘ ఈ బ్లాక్ అండ్ వైట్ ఫొటోలో యాండ్రి అచ్చం చంద్రుడిలా ఉన్నాడు’ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. అమ్మగా అమీ.. ప్రశంసల జల్లు! View this post on Instagram My moon and all the stars ✨❤️ A post shared by Amy Jackson (@iamamyjackson) on Feb 21, 2020 at 12:26am PST కాగా.. అమీ జాక్సన్ ఇటీవల ఆండ్రితో కలిసి ఓ బీజ్‌లో ఆడుకుంటున్న ఫొటోలను కూడా షేర్ చేశారు. ఇక మోడల్‌గా నటీగా ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న అమీ రోబో 2.0 లో కనిపించారు. ఆ తర్వాత తాను గర్భవతి కావడంతో సినిమాలకు బ్రేక్ ఇచ్చారు. ఈ క్రమంలో గతేడాది సెప్టెంబర్‌లో ఆండ్రికి జన్మనిచ్చారు. -
అమీ.. ఏమాత్రం తగ్గడం లేదుగా!
హాట్ ఫొటోలతో యువత గుండెల్లో గుబులు పుట్టిస్తున్న నటి అమీజాక్సన్. కోలీవుడ్‌లో మదరాసు పట్టణం చిత్రంతో నాయకిగా ఎంట్రీ ఇచ్చిన ఈ బ్రిటీష్ బ్యూటీ ఆ తరువాత ఇక్కడ వరుసగా చిత్రాల్లో నటించింది. ఆర్యకు జంటగా నటనకు శ్రీకారం చుట్టిన అమీజాక్సన్ సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో 2.ఓ చిత్రం వరకూ ఏకధాటిగా సాగింది. ఇక తెలుగు, హిందీ భాషల్లోనూ పరిచయం అయ్యింది. అయితే ఈ రెండు భాషల్లో పెద్దగా రాణించలేదు గానీ, తమిళంలో క్రేజీ హీరోయిన్‌గానే వెలిగింది. అలాంటిది ఇక్కడ రజనీకాంత్‌తో జత కట్టిన 2.ఓ చిత్రమే చివరిదిగా నమోదైంది. కారణం లండన్‌కు చెందిన జార్జ్ ఫెర్నాండ్ అనే వ్యాపారవేత్త ప్రేమలో పడింది. అలా పెళ్లి కాకుండానే తల్లి కూడా అయిపోయింది. గత ఏడాది సెప్టెంబర్ 23న పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఆ పిల్లాడికి ఆండ్రియోస్ అని నామకరణం చేసింది. ఇకపోతే గర్భవతి అయిన తరువాత నటనకు స్వస్తి చెప్పిన అమీజాక్సన్ తన గ్లామరస్ ఫొటోలను మాత్రం మీడియాకు విడుదల చేస్తూ వార్తల్లో ఉంటూనే ఉంది. ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుటి దృశ్యాలను కూడా సామాజిక మాధ్యమాల్లో విడుదల చేసి సంచలనం సృష్టించింది. అంతేకాదు తన పొత్తికడుపుతో ఉన్న బిడ్డను కూడా ప్రపంచానికి పరిచయం చేసేసింది. అంతటితో ఆగలేదు ఇప్పటికీ అదే ధోరణిని కొనసాగిస్తోంది. ఒక బిడ్డకు తల్లినన్న విషయాన్ని కూడా మరిచి తాజాగా ఈత దుస్తులతో వర్షంలో నిలబడ్డ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసి మరోసారి వార్తల్లోకి ఎక్కింది. ఈ ఫొటోలపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. నటనకు గుడ్‌బై చెప్పినా అమీజాక్సన్ గ్లామర్‌ను ప్రదర్శించడంలో అసలు తగ్గడం లేదుగా అని ఒక వర్గం కామెంట్స్ చేస్తుంటే, మరి కొందరు ఏ ఉద్దేశంతో ఇలాంటి ఫొటోలను సోషల్ మీడియాకు విడుదల చేస్తోంది, మళ్లీ నటించాలని కోరుకుంటోందా? అని అంటున్నారు. ఏదేమైనా ఎమీ మాత్రం ఏదో విధంగా వార్తల్లో ఉండే ప్రయత్నాలు మాత్రం చేస్తూనే ఉంది. View this post on Instagram Just to ‘simply’ wake up and see my son lying next to me is a blessing. To be able to walk outside on my own two legs and hear the waves with my own two ears is a blessing. To have the chance to speak to my best friends and family so I can tell them I love them is a blessing. If you opened your eyes today and took another breath - you’re winning!! With everything that’s happening across the world right now... just to LIVE another day is truly a gift!! I’m going into my 28th year on this planet with a whole new perspective and a heart filled with gratitude anddddd I’m gonna start with this little rain dance!! Yes it’s p*ssing down on my birthday and there’s not an ounce of sun to be seen BUT on the plus side, the plants are happy 🙃 A post shared by Amy Jackson (@iamamyjackson) on Jan 31, 2020 at 3:38am PST View this post on Instagram real life VS insta life (and no, I didn’t just chuck AP into the sea 🤽🏼♀️) A post shared by Amy Jackson (@iamamyjackson) on Jan 30, 2020 at 4:57am PST చదవండి: అమ్మగా అమీ.. ప్రశంసల జల్లు! అమలాపాల్-విజయ్ విడిపోడానికి ధనుషే కారణం! -
అమ్మగా అమీ.. ప్రశంసల జల్లు!
అమీ జాక్సన్ అమ్మయింది. ఇందులో విశేషమేమే లేకున్నా.. అమ్మగా అమీ చేసిన వినూత్న ప్రయత్నం పట్ల ప్రశంసల జల్లు కురుస్తోంది. తల్లీపాలు బిడ్డకు ఎంత ముఖ్యమో చెప్పడానికి అమీ జాక్సన్ తన కొడుక్కి పాలిస్తూ దిగిన ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ప్రసవించిన వెంటనే బిడ్డకు పాలిస్తూ.. తల్లీపాల ఆవశ్యకతను చాటుతూ పెట్టిన ఫొటోపై సోషల్ మీడియాలో ప్రశంసల జల్లు కురుస్తోంది. ‘యాండ్రియాస్.. మా ఏంజెల్. ఈ ప్రపంచానికి స్వాగతం’ అని క్యాప్షన్ చేస్తూ పాపతో దిగిన ఫొటోను ఆమె షేర్ చేశారు. జార్జి పనయొట్టుతో అమీ జాక్సన్ కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్నారు. వీరి నిశ్చితార్థం కూడా అయింది. ఇంకా పెళ్లి కాలేదు. ‘ఎవడు, ఐ, 2.0’ సినిమాల్లో అమీ జాక్సన్ హీరోయిన్గా నటించారు. ఇండియాలోని పలు భాషల్లో నటించిన అమీ జాక్సన్ హాలీవుడ్‌లోనూ తనదైన ముద్ర వేశారు. డాన్సర్‌గా, సింగర్‌గా, నటిగా నిరూపించుకున్న జాక్సన్.. సామాజికంగానూ ముందుంటానని చెప్పారు. -
మమ్మీ అమీ
నటి అమీ జాక్సన్ తల్లయ్యారు. సోమవారం ఆడపిల్లకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో షేర్ చేశారు. ‘యాండ్రియాస్ (పాప పేరు).. మా ఏంజెల్. ఈ ప్రపంచానికి స్వాగతం’ అని క్యాప్షన్ చేస్తూ పాపతో దిగిన ఫొటోను షేర్ చేశారు. జార్జి పనయొట్టుతో అమీ జాక్సన్ కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్నారు. వీరి నిశ్చితార్థం కూడా అయింది. ఇంకా పెళ్లి కాలేదు. విశేషం ఏంటంటే ఇటీవలే మాకు బాబు పుడుతున్నాడంటూ ‘జెండర్ రివీలింగ్ పార్టీ’ కూడా ఏర్పాటు చేశారు అమీ. అయితే పాపకు జన్మనిచ్చారు. ‘ఎవడు, ఐ, 2.0’ సినిమాల్లో అమీ జాక్సన్ హీరోయిన్గా నటించిన సంగతి గుర్తుండే ఉంటుంది. -
బేబీ బాయ్‌కి జన్మనివ్వబోతున్నాను
హీరోయిన్ అమీ జాక్సన్ త్వరలో తల్లిగా ప్రమోషన్ పొందనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం గర్భవతిగా తన ప్రయాణాన్ని ఆనందంగా ఆస్వాదిస్తున్నారు అమీ. ఆ ఫొటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవల ఓ వీడియోను పోస్ట్ చేశారామె. ‘‘బేబీ బాయ్‌కి జన్మనివ్వబోతున్నాను’’ అని ఓ పార్టీలో ఆనందంగా అనౌన్స్ చేశారు అమీ. యూకేకి చెందిన జార్జ్ పనయోట్టు అనే వ్యాపారవేత్తతో తాను డేటింగ్లో ఉన్నట్లు అమీ ఈ ఏడాది జనవరిలో వెల్లడించారు. మార్చిలో తాను గర్భవతినని అమీ పేర్కొన్నారు. ఈ ఏడాది మేలో అమీ–జార్జ్ల నిశ్చితార్థం జరిగింది. వచ్చే నెల అమీ డెలివరీ డేట్. బిడ్డ కడుపులో పడ్డాక నిశ్చితార్థం చేసుకున్న అమీ, జార్జ్ తల్లిదండ్రులయ్యాక పెళ్లి చేసుకుంటారు. వచ్చే ఏడాది గ్రీస్‌లో పెళ్లిని ప్లాన్ చేసినట్లు ఆ మధ్య వార్తలు వినిపించాయి. ‘బీచ్ సైడ్ వెడ్డింగ్’ని ప్లాన్ చేశారట. -
నా ఎంగేజ్మెంట్ స్వీట్ మెమొరీస్
నటి అమీ జాక్సన్, జార్జి పనాయొటు ఆదివారం ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. ఈ ఎంగేజ్మెంట్ పార్టీని ఫ్రెండ్స్, ఫ్యామిలీతో కలసి సెలబ్రేట్ చేసుకున్నారు. లండన్‌కు చెందిన బిజినెస్‌మేన్ జార్జి. ‘‘నమ్మశక్యంగా ఉంది. మా ఎంగేజ్మెంట్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఈ ఈవెంట్‌ను ఎంతో స్పెషల్‌గా మార్చిన ఫ్రెండ్స్, ఫ్యామిలీ అందరికీ థ్యాంక్స్’’ అన్నారు అమీ. ‘నా ఎంగేజ్మెంట్ స్వీట్ మెమొరీస్’ అంటూ కొన్ని ఫొటోలను కూడా షేర్ చేశారామె. ప్రస్తుతం అమీ జాక్సన్ ప్రెగ్నెంట్‌గా ఉన్న సంగతి తెలిసిందే. 2020లో వీరి వివాహం జరగనుంది. -
లండన్‌లో అమీ ఎంగేజ్మెంట్
ముంబై : నటి అమీ జాక్సన్ తన బాయ్‌ఫ్రెండ్ జార్జ్ పనయిటుతో ఎంగేజ్మెంట్ జరుపుకున్నారు. లండన్‌లో జరిగిన ఎంగేజ్మెంట్ పార్టీకి వారి సన్నిహిత మిత్రులు, బంధువులు హాజరయ్యారు. ఎంగేజ్మెంట్ పార్టీకి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అంతకుముందు తమ జీవితంలోకి చిన్నారి ప్రవేశిస్తోందని ఇన్‌స్టాగ్రామ్‌లో అమీ జాక్సన్ పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అమీ పలు తెలుగు, తమిళ, హిందీ సినిమాల్లో నటించారు. రామ్‌చరణ్ నటించిన ఎవడు మూవీతో పాటు 2.0లో అమీ జాక్సన్ నటన ఆకట్టుకుంది. -
లండన్‌లో ఎంగేజ్మెంట్ పార్టీ
బాయ్‌ఫ్రెండ్ జార్జి పనాయోట్టుతో ఎంగేజ్మెంట్ చేసుకొని కొత్త సంవత్సరాన్ని స్టార్ట్ చేశారు అమీ జాక్సన్. జోంబియాకు హాలీడేకు వెళ్లిన ఈ జంట తమ నిశ్చితార్థ వేడుకను స్నేహితులు, కుటుంబ సభ్యులు లేకుండానే కానిచ్చేశారు. పెళ్లికి ముహూర్తం పెట్టేలోపే తల్లి కాబోతున్నాను అని ఈ మధ్య షాక్ ఇచ్చారు అమీ. ఆ సంగతలా ఉంచితే మే 5న లండన్‌లో ఎంగేజ్మెంట్ పార్టీ సెలబ్రేట్ చేసుకోనుందట ఈ జంట. క్లోజ్ ఫ్రెండ్స్, ఇండస్ట్రీ ఫ్రెండ్స్‌ను మాత్రమే ఈ వేడుకకు ఆహ్వానిస్తున్నారట. ‘‘మా ఎంగేజ్మెంట్తోపాటు 2019 సమ్మర్‌ను స్టార్ట్ చేసేందుకు ఏర్పాటు చేస్తున్న పార్టీకు మిమ్మల్ని అందర్నీ ఆహ్వానిస్తున్నాం’’ అంటూ పార్టీ ఇన్విటేషన్లో పేర్కొన్నారు అమీ, జార్జి. ప్రెగ్నెన్సీ గురించి అమీ మాట్లాడుతూ– ‘‘అదో సర్ప్రైజ్లా వచ్చింది. మేం ప్లాన్ చేయలేదు. కానీ ప్రెగ్నెన్సీ మా ఇద్దర్నీ దగ్గర చేసింది. ఇదివరకూ మేం దగ్గరగానే ఉన్నాం కానీ ఇదో డిఫరెంట్ క్లోజ్‌నెస్’ అన్నారు. -
పెళ్లి కాలేదు.. తల్లి అయ్యారు
‘‘మేడ ఎక్కి గట్టిగా అరచి చెప్పాలని చాలా రోజులుగా ఎదురుచూస్తున్నాను. మదర్స్‌డే రోజు పంచుకోవడం కంటే ఇంకో మంచి రోజు ఉండదనుకుంటున్నాను’’ అంటూ తల్లి కాబోతున్నారని అనౌన్స్ చేశారు నటి అమీజాక్సన్. ఈ ఏడాది ప్రొఫెషనల్‌గా కంటే పర్సనల్‌గా ఎక్కువ మూమెంట్స్‌ను ఎంజాయ్ చేస్తున్నారామె. న్యూ ఇయర్ రోజు జీవితంలో కొత్త ప్రయాణాని ్న మొదలుపెట్టారు. 6 ఏళ్లుగా డేటింగ్ చేస్తున్న బాయ్‌ఫ్రెండ్ జార్జి పనాయోటుతో ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. ఇప్పుడు తల్లి కాబోతున్నాననీ, అక్టోబర్‌లో డెలివరీ ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టు పేర్కొన్నారు. వివాహం కాకుండానే తల్లి కావడం, ఆ విషయాన్ని ఆనందంగా షేర్ చేసుకోవడం విశేషం. అమీజాక్సన్ తన బేబీ బంప్‌ను చూపిస్తూ బాయ్‌ఫ్రెండ్‌తో దిగిన స్టిల్‌ను షేర్ చేసి ‘‘అప్పుడే ఈ ప్రపంచంలో అందరికంటే నిన్నే ఎక్కువగా ప్రేమిస్తున్నాను. ప్రపంచంలో ఉన్న స్వచ్ఛమైన ప్రేమ. (బిడ్డను ఉద్దేశిస్తూ). పుట్టబోయే బిడ్డ కోసం నేను, జార్జ్ ఎదురుచూస్తున్నాం’’ అని పేర్కొన్నారు. వీరి వివాహం 2020లో జరగనుంది. ఆమె చివరిగా ‘2.0’ చిత్రంలో కనిపించారు. -
ఏడాదికి ముందే రెడీ!
తారల పెళ్లి అంటే ఆ హంగామా, ఆ సందడే వేరప్పా. కొందరు రెండు రోజులు, మరికొందరు వారం రోజులు అంటూ వివాహ వేడుకలను జరుపుకుంటుంటారు. అయితే ఈ హడావుడి నెల ముందు నుంచి మొదలవ్వవచ్చు. లేదా రెండు నెలల ముందు నుంచి ప్రారంభం కావచ్చు. అయితే నటి ఎమీజాక్సన్ రూటే వేరు కదా! ఏకంగా ఏడాదికి ముందు నుంచే పెళ్లి ప్రయత్నాలను చేసుకుంటోంది. మదరాసు పట్టణం చిత్రం ద్వారా కోలీవుడ్‌కు పరిచయమైన ఈ ఇంగ్లిష్ బ్యూటీ ఆ తరువాత ఐ, తెరి, 2.ఓ వరకూ బాగానే అవకాశాలను రాబట్టుకుంది. అదేవిధంగా బాలీవుడ్, టాలీవుడ్, శాండిల్‌వుడ్ చుట్టేసింది. రజనీకాంత్‌తో నటించిన 2.ఓ చిత్రం తనకు మరిన్ని అవకాశాలను తెచ్చిపెడుతుందని ఆశలు పెట్టుకుంది. అయితే అలా జరగలేదు. అందుకు కారణాలేమైనా, ప్రస్తుతం చేతిలో సినిమాలు లేవు. ఒక హాలీవుడ్ వెబ్ సిరీస్‌లో మాత్రం నటిస్తోంది. ఆ మధ్య బాలీవుడ్ యువ నటుడితో ప్రేమ వ్యవహారం బెడిసికొట్టిందనే ప్రచారం జోరుగా సాగిన విషయం తెలిసిందే. అయితే ఆ తరువాత యూకేకు చెందిన బిగ్‌షాట్ జార్జ్ పనయిటోవా అనే వ్యకిని ప్రేమించి, ఆయనతో షికార్లు కొడుతూ వస్తోంది. ఈ విషయం ఇటీవలే బయటకొచ్చింది. ఇటీవల ఆ ప్రేమజంట ఆఫ్రికాకు విహారయాత్ర చేశారు. అప్పుడు పెళ్లి చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చారట. పనిలో పనిగా మంచి తరుణం మించిపోనీకూ అన్న చందాన ఇద్దరూ ఉంగరాలు మార్చుకున్నారు. ఆ తరువాత వివాహ నిశ్చితార్థం జరిగినట్లు సమాచారం. ఈ సంచలన జంట 2020లో పెళ్లి చేసుకోబోతున్నారు. అయితే అందుకు ఎమీ ప్రియుడు ఇప్పటి నుంచే ఆ ఏర్పాట్లు చేస్తున్నారని సమాచారం. ఈ ముద్దుగుమ్మ ప్రియుడ్ని ఒక కోరిక కోరిందట. మన పెళ్లి ఇంతకు ముందు ఎవరూ చేసుకోని విధంగా చాలా స్పెషల్‌గా ఉండాలని, అందుకు ఒక అందమైన సముద్రతీరం వేదిక కావాలని కోరిందట. అంతే ఎమీ ప్రియుడు అలాంటి ప్రాంతం కోసం గాలించి చివరికి గ్రీస్ దేశంలోని ఒక దీవిని సెలక్ట్ చేశాడట. ఆ దీవిలోని ఒక రిసార్ట్ వివాహ వేదికను ఏడాదికి ముందే ఏర్పాటు చేసుకోనున్నారట ఈ జంట. నటి ఎమీ కాబోయే భర్త అత్యంత కోటీశ్వరుడట. ఎమీయా మజాకా! View this post on Instagram Merry 💋mass ❤️ First Christmas in our new home with family and friends like family ✨🙏🏼 Thankyou @penny_toumbas @88ga @hga003 #DREAMTEAM 👩🏻🍳 A post shared by Amy Jackson (@iamamyjackson) on Dec 25, 2018 at 2:16pm PST -
కొత్త సంవత్సరం.. కొత్త ప్రయాణం
జీవితంలో సరికొత్త ప్రయాణాన్ని ప్రారంభించడానికి సంవత్సరంలో మొదటిరోజు ఎంచుకున్నారు అమీ జాక్సన్. తన బాయ్‌ఫ్రెండ్ జార్జ్ పణాయిట్టోతో జనవరి ఫస్ట్ రోజున ఎంగేజ్మెంట్ చేసుకున్నారీ బ్రిటీష్ బ్యూటీ. ఈ విషయాన్ని తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా తెలియజేశారు. జార్జ్, అమీ 2015 నుంచి రిలేషన్షిప్లో ఉన్నారు. కానీ... అలాంటిదేం లేదని చాలాసార్లు తప్పించుకునే ప్రయత్నాలు చేశారు అమీ జాక్సన్. గతేడాది వేలంటేన్స్ డే రోజు జార్జ్‌ను ప్రేమిస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు. అప్పటినుంచి హాలిడే ట్రిప్స్‌లోనూ, పార్టీల్లోనూ తరచుగా కలుస్తూ, ఆ ఫొటోలు పోస్ట్ చేస్తున్నారు. రీసెంట్గా ఫ్యామిలీ ఫ్రెండ్స్ కోసం గ్రాండ్ క్రిస్మస్ పార్టీని కూడా అరేంజ్ చేశారు. న్యూ ఇయర్ హాలీడే సందర్భంగా జాంబియా వెళ్లింది ఈ జంట. అక్కడే ఈ ఇద్దరూ రింగ్స్ మార్చుకున్నారు. ‘‘మా జీవితాల్లో సరికొత్త సాహస యాత్రను మొదలుపెట్టాం. ఐ లవ్ యూ జార్జ్. నన్నీ ప్రపంచంలోనే ఆనందమైన అమ్మాయిని చేసినందుకు థ్యాంక్స్’’ అని ఈ ఫొటోను పోస్ట్ చేశారు. త్వరలోనే గ్రాండ్ వెడ్డింగ్ పార్టీ ఏర్పాటు చేయనున్నారట అమీ, జార్జ్. -
అమీ జాక్సన్ నిశ్చితార్ధం
ముంబై : రజనీకాంత్ 2.ఓలో యంతరలోకపు సుందరిగా అలరించిన అమీ జాక్సన్ త్వరలో వైవాహిక బంధంలో అడుగుపెట్టనున్నారు. నూతన సంవత్సరం తొలిరోజున నిశ్చితార్ధం జరుపుకున్నట్టు వెల్లడించారు. బ్రిటన్‌కు చెందిన వ్యాపారవేత్త జార్జ్ పనయటోతో జాంబియాలో ఎంగేజ్మెంట్ జరిగినట్టు తెలిపారు. ఎంగేజ్మెంట్ రింగ్‌తో బాయ్‌ఫ్రెండ్‌తో కలిసిఉన్న ఫోటోను అభిమానుల కోసం సోషల్ మీడియాలో ఆమె పోస్ట్ చేశారు. ఏడాది తొలిరోజున మన జీవితం ప్రారంభవుతోంది..అత్యంత సంతోషంగా తనను ఉంచుతున్నందుకు ధన్యవాదాలు అంటూ ఆమె తన బాయ్‌ఫ్రెండ్‌ను ఉద్దేశిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొన్నారు. తెలుగులో ఎవడు, అభినేత్రి చిత్రాల్లో మెప్పించిన అమీ జాక్సన్ 2.ఓలో నటనకు గాను పలువురి ప్రశంసలు దక్కించుకున్నారు. -
సంచలనం సృష్టిస్తుందని నమ్ముతున్నాం
రజనీకాంత్, అక్షయ్ కుమార్, అమీ జాక్సన్ ముఖ్య తారలుగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘2.ఓ’. లైకా ప్రొడక్షన్స్ పతాకంపై సుభాస్కరన్ నిర్మించిన ఈ సినిమా గత గురువారం (నవంబర్ 29) ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. తెలుగులో ఈ చిత్రాన్ని ఎన్.వి.ఆర్. సినిమా సంస్థ విడుదల చేసింది. శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిర్మాత ఎన్.వి. ప్రసాద్ మాట్లాడుతూ– ‘‘2.ఓ’ ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజు రూ.110 కోట్లు వసూలు చేసి సంచలనం సృష్టించింది. తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు రూ. 21.5 కోట్లు వసూలు చేసి, దిగ్విజయంగా ప్రదర్శింపబడుతోంది. అన్ని ఏరియాల్లో అన్ని థియేటర్స్ హౌస్‌ఫుల్స్ అవుతున్నాయి. డబ్బింగ్ సినిమా చరిత్రలోనే ‘2.ఓ’ సంచలనం సృష్టిస్తుందని ఆశిస్తున్నాం’’ అన్నారు. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ అధినేత ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘2.ఓ’ చిత్రాన్ని ప్రసాద్‌గారు, మేము, యు.వి.క్రియేషన్స్ కలిసి తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేశాం. ఈ చిత్రాన్ని నేను మూడు సార్లు చూశాను. ఈ మధ్యకాలంలో ఏ సినిమానీ అన్నిసార్లు చూడలేదు. తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు రూ.21.5 కోట్లు వసూలు చేయడం చాలా సంతోషాన్ని కలిగించింది. శంకర్‌గారు ఈ సినిమాని విజువల్‌గా హాలీవుడ్ స్థాయిలో చూపించారు. ఇండియన్ సినిమాలోనే ఇంత భారీ బడ్జెట్ సినిమా ఇంతవరకూ రాలేదు. ‘మహర్షి’ షూటింగ్‌కి వెళ్లినప్పుడు ‘ఏం తీశారండీ శంకర్‌గారు. చాలా బాగుంది.. గౌతమ్ మళ్లీ చూడాలంటున్నాడు’ అని మహేశ్‌బాబుగారు అన్నారు. ఈ మాట వినగానే పిల్లలు ఈ చిత్రాన్ని ఎంతగా ఇష్టపడుతున్నారో అర్థమైంది’’ అన్నారు. -
బాహుబలి అందుకే అంత సక్సెస్ అయింది : రజనీ
‘‘శంకర్‌గారు తెలుగు మాట్లాడటం నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ‘రోబో’ సినిమా ఆడియో ఫంక్షన్లో ‘నాకు తెలుగు తెలీదు’ అని చెప్పి ఆయన ఇంగ్లీష్‌లో మాట్లాడారు. ఇప్పుడొచ్చి ఇంత బాగా తెలుగు మాట్లాడారు. తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ మంచివాళ్లు. మమ్మల్ని చాలా అభిమానిస్తారు. తెలుగు భోజనం లోక ప్రసిద్ధి. తెలుగు మ్యూజిక్ ఆనందమైంది’’ అని రజనీకాంత్ అన్నారు. రజనీకాంత్, అక్షయ్ కుమార్, అమీ జాక్సన్ ముఖ్య తారలుగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘2.ఓ’. లైకా ప్రొడక్షన్స్ పతాకంపై సుభాస్కరన్ నిర్మించిన ఈ చిత్రాన్ని నిర్మాత ఎన్వీప్రసాద్ తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఈనెల 29న ఈ చిత్రం విడు దలవుతోంది. హైదరాబాద్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో రజనీకాంత్ మాట్లాడుతూ– ‘‘రోబో’ సినిమా చేసినప్పుడు ఒక రీల్ త్రీడీలోకి మార్చి, ఆ తర్వాత మొత్తం సినిమా త్రీడీలోకి మార్చాలనుకున్నాం. ఒక రీల్ త్రీడీలోకి కన్వర్ట్ చేశాక శంకర్‌గారు డిసైడ్ చేశారు. త్రీడీలో కచ్చితంగా చేద్దాం. కానీ, త్రీడీ చేయాలని సినిమా చేస్తే బాగుండదు.. దానికి సరైన కథ కుదరాలి. అప్పుడు ఆలోచిస్తా అన్నారు. నాలుగేళ్ల ముందు నన్ను కలిసి త్రీడీ సినిమా చేద్దామన్నారు. మంచి కథ కుదిరిందని నాకు అర్థం అయింది. ఆయనతో నేను సినిమా చేశాను కాబట్టి ఇది సాధ్యమా? అనే అనుమానం నాకు రాలేదు. ఆయనొక మెజీషియన్. ‘బాహుబలి’ సినిమా అంత పెద్ద సక్సెస్‌కి కారణం ఫస్ట్ కథ. దానికి తగ్గుట్టు గ్రాండ్ లుక్. ఆ రెండు బాగా కుదిరాయి కాబట్టి అంతపెద్ద సక్సెస్ అయింది. ‘2.ఓ’ కూడా అంతే. త్రీడీ టెక్నాలజీ.. దానికి తగ్గ కథ. ఈ రెండు చక్కగా కుదిరినందు వల్ల ఈ సినిమా వందశాతం పెద్ద సక్సెస్ అవుతుందని నమ్మకం ఉంది. శంకర్‌కి కావాల్సినవన్నీ ఇచ్చిన సుభాస్కరన్‌గారికి హ్యాట్సాఫ్. ఈ సినిమాకి ప్రమోషన్ అక్కర్లేదు.. ప్రసాద్‌గారు ఊరికే డబ్బు దుబారా చేస్తున్నారు. ఆల్రెడీ ఈ సినిమాపై అంచనాలు ఎక్కడో ఉన్నాయి. సినిమా ఎప్పుడు వస్తుందా అని వేచి చూస్తున్నారు. టికెట్ బుకింగ్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. సినిమా చూసిన తర్వాత ప్రేక్షకులే ఈ చిత్రాన్ని ప్రమోట్ చేస్తారని నేను చెన్నైలోనే చెప్పా. 1975లో నా తొలి సినిమా ‘అపూర్వ రాగంగల్’ చూడాలని ఎంత ఆత్రుతగా ఉన్నానో.. 43ఏళ్ల తర్వాత ఈ ‘2.ఓ’ చూడాలని అంతే ఆత్రుతగా ఉన్నా. ట్రైలర్లో మీరు చూసింది జస్ట్ శాం్యపిల్సే. ఆశ్చర్యపోయే అంశాలన్నీ సినిమాలో ఉన్నాయి. మన ఇండియన్ సినిమా ఇండస్ట్రీకే ‘2.ఓ’ పెద్ద వెలుగు. దానికి శంకర్, ఆయన యూనిట్, నిర్మాత, అక్షయ్‌గారి ఎఫర్ట్.. అన్నీ కలిపి కచ్చితంగా ఈ సినిమా పెద్ద సక్సెస్ అవుతుందని నాకు నమ్మకం ఉంది. శంకర్‌గారు చెప్పినట్టు ఈ సినిమాని త్రీడీలో చూస్తే ఆ అనుభూతి వేరుగా ఉంటుంది. మీలాగా నేను కూడా 29వ తేదీ కోసం వేచి చూస్తున్నా’’ అన్నారు. నిర్మాత ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘2.ఓ’ ని ప్రసాద్‌గారు, మేము, యూవీ క్రియేషన్స్ కలిసి తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేస్తున్నాం. రెండు రోజులకు ముందు విడుదలైన పాట తర్వాత ఈ సినిమాపై అంచనాలు ఎలా ఉన్నాయో ఆన్లైన్లోనే తెలిసిపోతోంది. ‘2.ఓ’ వన్ ఆఫ్ ది ఇండియన్ బెస్ట్ ఫిల్మ్ కాబోతోంది’’ అన్నారు. నిర్మాత ఎన్వీ ప్రసాద్ మాట్లాడుతూ– ‘‘సూపర్‌స్టార్ రజనీకాంత్‌గారు గ్రేట్ ఆర్టిస్ట్. అక్షయ్ కుమార్‌కూడా ఈ మధ్య వరుస హిట్లు అందుకున్నారు. ఇటీవల ఆయన సినిమాలు పబ్లిక్‌లో మంచి అవేర్నెస్ తీసుకొచ్చాయి. ఇండియాగర్వించదగ్గ గ్రేట్ డైరెక్టర్ శంకర్‌గారి గురించి చెప్పక్కర్లేదు. ఆయన నాలుగేళ్లు రాత్రి, పగలు కష్టపడి ‘2.ఓ’ సినిమాని సృష్టించారు. సుభాస్కరన్‌గారు అంత గొప్పగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఓ ఇండియన్ సినిమాని ప్రపంచస్థాయి సినిమాగా మార్చేందుకు వీరు నలుగురూ కృషి చేశారు. ఈ నెల 29నుంచి దీపావళి పండుగ ప్రారంభం అవుతుంది. సంక్రాంతి తర్వాత కూడా ఈ దీపావళి కొనసాగుతుంది. తొలిసారి రియల్ త్రీడీలో ఈ సినిమా అద్భుతంగా తెరకెక్కించారు. యూనిట్ కష్టానికి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు వచ్చి, ఇదొక ప్రపంచస్థాయి సినిమా అవ్వాలని ఆశిస్తున్నా. ఈ సినిమాని మేం గర్వంగా తెలుగులోకి తీసుకొస్తున్నాం. మీరు(శంకర్), రాజమౌళిగారు, రాజు హిర్వాణీగార్ని ప్రపంచ వ్యాప్తంగా గుర్తు పెట్టుకునేటట్లు ఇటువంటి ఎన్నో మంచి చిత్రాలు ఇంకా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా’’ అన్నారు. శంకర్ మాట్లాడుతూ– ‘‘ఇలా నడిస్తే ఎలా ఉంటది? అన్న నా ఊహే ‘2.ఓ’. ఇదొక ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్, థ్రిల్లర్. మంచి భావోద్వేగంతో పాటు, సామాజిక కథ ఉంది. ఇదొక పెద్ద టీమ్ వర్క్. నటీనటులు, వేలమంది టెక్నీషియన్స్ చాలా కష్టపడి ఈ సినిమా చేశారు. ఢిల్లీలో 47డిగ్రీల ఉష్ణోగ్రతలో చిత్రీకరించిన క్లైమాక్స్ కోసం రజనీగారు చాలా కష్టపడ్డారు. రెహమాన్‌గారు ఆరు నెలల కిందే నేపథ్య సంగీతం స్టార్ట్ చేశారు. ఆయన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చూస్తే ‘బ్లాక్ పాంథర్, స్పైడర్ మేన్’ చూసినట్టు ఉంటుంది. ఈ క్రెడిట్ మెయిన్‌గా నిర్మాత సుభాస్కరన్‌గారికి ఇవ్వాలి. ఇక ఇండియన్ ఫిల్మ్‌కి ఇంతపెద్దగా ఎవరూ ఖర్చు పెట్టరు. కానీ, సినిమాపై ఉన్న ప్యాషన్‌తో ఇంత గ్రాండ్‌గా తీసినందుకు థ్యాంక్స్. మా టీమ్‌కి ఎంత ఎగై్జట్‌మెంట్ ఉందో అదే ఎగై్జట్‌మెంట్ ప్రేక్షకులకూ ఉంటుంది. ఇలాంటి సినిమాని మీడియా కూడా సపోర్ట్ చేస్తే మన దేశంలో కూడా ‘2.ఓ’ లాంటి సినిమా చేయొచ్చని ప్రపంచానికి చాటిచెప్పవచ్చు’’ అన్నారు. అక్షయ్ కుమార్ మాట్లాడుతూ– ‘‘2.ఓ’ నాకు ఒక సినిమా కాదు. శంకర్ ప్రిన్సిపల్‌గా ఉన్న స్కూల్‌కి వెళ్లినట్లు ఉంది. ఇండస్ట్రీలో 28 ఏళ్లుగా ఉంటూ నేర్చుకున్నదానికంటే ‘2.ఓ’ చిత్రంతో నేర్చుకున్నదే ఎక్కువ. బిగ్గెస్ట్ సూపర్‌స్టార్ రజనీకాంత్సార్కి విలన్‌గా నటించడం గౌరవంగా ఫీల్ అవుతున్నాను. రజనీకాంత్‌గారు సింపుల్లైన్లో కూడా మ్యాజిక్ చేయగలరు. ఎలానో నాకు తెలీదు. ఆయనతో నటించే అవకాశంతో పాటు ఈ సినిమాలో భాగమయ్యే అవకాశం ఇచ్చిన శంకర్‌కి థ్యాంక్స్. నిర్మాత సుభాస్కరన్ బాగా ఖర్చు పెట్టారు. నేను కూడా ఇంకా సినిమా చూడలేదు. రిలీజ్ కోసం ప్రేక్షకుల్లా నేను కూడా ఎదురుచూస్తున్నాను’’ అన్నారు. హైదరాబాద్‌లో ‘2.ఓ’ సినిమా ప్రమోషన్లో పాల్గొన్న శంకర్ ఇంటర్వ్యూ విశేషాలు... ► నాలుగేళ్ల ‘2.ఓ’ ప్రయాణం ముగిసింది. సినిమా రిలీజవుతోంది. ఈ ఫీలింగ్ ఇప్పుడు ఎలా ఉంది? సినిమాని ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో? ఎంత ఎంజాయ్ చేస్తారో అని ఎదురుచూస్తున్నా. ► ఈ సినిమా టెక్నాలజీ, బడ్జెట్ పెరగడం గురించి..? స్క్రిప్ట్ డిమాండ్ మేరకే త్రీడీ టెక్నాలజీ వాడాం. కొత్తగా డిజైన్ చేయాలనుకున్నాం. అందుకు కొంత ఖర్చు పెట్టక తప్పదు. ట్రైలర్లో కనిపించిన సెల్మెన్, బర్డ్.. అన్నీ సెటప్‌నే. వాటిని డిజైన్ చేయడానికి చాలా టైమ్ పట్టింది. బడ్జెట్ కూడా పెరిగింది. క్రియేట్ చేసిన క్యారెక్టర్స్‌లో ఎమోషన్స్‌ని సిల్వర్‌స్క్రీన్‌పై చూపించడం చాలెంజింగ్‌గా అనిపించింది. ► ‘2.ఓ’ కథాంశం పెద్దగా బయటకు రాలేదు? ఫస్ట్ నన్ను నేను ఒక ఆడియన్‌గా భావించి థియేటర్‌కి వెళతాను. ఓ ప్రేక్షకునిగా సినిమాను నేను ఎలా ఎంజాయ్ చేయాలనుకుంటానో అలాంటి అనుభవాన్నే నా సినిమా చూస్తున్నవారికి ఇవ్వాలన్నది నా ఆలోచన. అందుకే సినిమాలో కోర్ సబ్జెక్ట్‌ను రివీల్ చేయలేదు. చేస్తే ఆడియన్స్ సర్ప్రైజ్ మిస్ అవు తారు. అందుకే ట్రైలర్లో ఎక్కువ కథ చెప్పలేదు. ► మేకింగ్ వీడియోలో అక్షయ్ కష్టం కనిపించింది. ఆయనతో వర్క్ చేయడం ఎలా అనిపించింది? అక్షయ్ కుమార్ కమిట్మెంట్, డెడికేషన్, డిసిప్లేన్ సూపర్. ప్రతిరోజూ 3–4 గంటలు వర్క్ చేయాల్సిందే. కేవలం మేకప్ తీయడానికే గంటన్నర పట్టేది. ప్రోస్థటిక్ మేకప్, టీత్, పెద్ద బరువు ఉన్న డ్రెస్‌లు వేసుకున్నారు. మండు వేసవిలోనూ షూటింగ్లో పాల్గొన్నారు. అందుకే ఆయన్ని విలన్‌గా అనుకోలేదు. ఆయన క్యారెక్టర్లో షేడ్స్ ఉంటాయి. అవి ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. ► రజనీగారితో ‘రోబో’ కి పని చేసారు? ఇప్పుడు ‘2.ఓ’కి.. ఎమైనా డిఫరెంట్‌గా అనిపించిందా? ప్రతి సినిమాకు రజనీగారు కష్టపడతారు. ఆయన ఏం చేసినా ఎట్రాక్టివ్‌గా ఉంటుంది. ఒక స్టైల్, ఫన్, పెర్ఫార్మెన్స్..అన్నీ ఉంటాయి. ► ‘రోబో’ కి సీక్వెల్ ఆలోచన ఎప్పుడొచ్చింది? ‘రోబో’ సినిమాకి సీక్వెల్ ఉంటే బాగుటుందని ఆడియన్స్ అనుకున్నారు. కరెక్ట్ స్టోరీ కుదరాలని నేను అనుకున్నాను. సెకండ్ పార్ట్‌పై అంచనాలతో వచ్చిన ఆడియన్స్ నిరుత్సాహపడకూడదు. 5 సంవత్సరాల క్రితం ఓ స్ట్రీట్‌లో చాలా సెల్‌ఫోన్స్ కనిపించాయి నాకు. అప్పుడే ‘2.ఓ’ ఐడియా వచ్చింది. ► ‘2.ఓ’ లో ఐశ్వర్యారాయ్‌ని ఎందుకు తీసుకోలేదు? ‘రోబో’ లో ట్రయాంగిల్ లవ్‌స్టోరీ ఉంది. కానీ ‘2.ఓ’ డిఫరెంట్ స్టోరీ. సైంటిస్ట్, చిట్టి, రోబో 2.0 క్యారెక్టర్లు ఉన్నాయి. స్టోరీ డిమాండ్ చేయలేదు. కానీ, ఐశ్వర్యారాయ్ క్యారెక్టర్ రిఫరెన్స్ సినిమాలో కనిపిస్తుంది. ► తర్వాతి ప్రాజెక్టులు ఏంటి? కమల్‌హాసన్‌తో ‘ఇండియన్ 2’ సినిమా చేయబోతున్నాను. ఇందులో బాలీవుడ్, సౌత్ స్టార్స్ ఉంటారు. డిసెంబరులో షూటింగ్ స్టార్ట్ చేస్తాం. -
‘యంతర లోకపు సుందరివే’ సాంగ్ కోసం ఎంత ఖర్చు?
20 కోట్ల బడ్జెట్ అంటే ఓ ఆరేడు చిన్న సినిమాలు తీయొచ్చు. కానీ ‘2.ఓ’ సినిమాలో ‘యంతర లోకపు సుందరివే’ సాంగ్ కోసం 20 కోట్లు ఖర్చు చేశారని వార్తలు వస్తున్నాయి. రెండు రోబోల మధ్య సాగే ఈ రొమాంటిక్ పాటకు బాస్కో మార్టిస్ కొరియోగ్రఫీ చేశారు. ఈ సాంగ్ గురించి ఆయన మాట్లాడుతూ– ‘‘2.ఓ’, ‘ఐ’ సినిమాలకంటే ముందు ‘ఎందిరిన్’ (తెలుగులో ‘రోబో’) సినిమాకు నేను శంకర్‌తో కలిసి వర్క్ చేయాల్సింది. కుదర్లేదు. విక్రమ్ హీరోగా వచ్చిన ‘ఐ’ సినిమాకు శంకర్‌తో కలిసి వర్క్ చేశాను. అందులో ‘పూలనే కునుకేయమంట’ అనే సాంగ్‌ను చైనాలో దాదాపు 30 రోజులు షూట్ చేశాం. ఇప్పుడు ‘2.ఓ’ సినిమాలోని ‘యంతర లోకపు...’ సాంగ్‌ను పది రోజులు షూట్ చేశాం. ఈ ఒక్క సాంగ్ కోసమే నాలుగు డిఫరెంట్ సెట్స్‌ను రూపొందించడం జరిగింది. విదేశాల నుంచి డ్యాన్సర్స్‌ను తెప్పించాం’’ అన్నారు. ఇంకా మాట్లాడుతూ– ‘‘ఈ సాంగ్‌ను కొరియోగ్రఫీ చేసే సమయంలో మేజర్‌గా రెండు విషయాల గురించి ఆలోచించాం. ఒకటి.. రోబో జంట మధ్య రొమాంటిక్ ఫ్లేవర్‌ను స్క్రీన్ పైకి అద్భుతంగా తీసుకురావడం, రెండు.. రజనీకాంత్‌గారి ఏజ్ అండ్ వాకింగ్ స్టైల్. కానీ ఒక్కటంటే ఒక్క స్టెప్‌ను కూడా మార్చమని రజనీకాంత్‌సార్ చెప్పలేదు. రిహార్సల్స్‌లో చూపించిన ఎనర్జీనే సెట్లో రిపీట్ చేసి అందర్నీ ఆశ్యర్యపరచారు. అమీ జాక్సన్ కూడా డ్యాన్స్ అదరగొట్టింది. పెట్టిన ఖర్చుకు, వెచ్చించిన సమయానికి తగిన ఫలితం ఈ సాంగ్‌కు దక్కుతాయన్న నమ్మకం ఉంది’’ అని పేర్కొన్నారు. రజనీకాంత్, అక్షయ్ కుమార్, అమీ జాక్సన్ ముఖ్య తారలుగా శంకర్ దర్శకత్వంలో దాదాపు 550 కోట్ల భారీ బడ్జెట్‌తో లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 29న విడుదల కానుంది. -
‘2.ఓ’ మూవీ స్టిల్స్
-
2.ఓ కోసం 3డీ థియేటర్లు!
తమిళనాడు, పెరంబూరు: 2.ఓ చిత్రం కోసం రాష్ట్రంలోని థియేటర్లు 3డీ టెక్నాలజీ హంగులను సంతరించుకుంటున్నాయి. నటుడు రజనీకాంత్ నటిస్తున్న భారీ, బ్రహ్మండ చిత్రం 2.ఓ. శంకర్ దర్శకత్వంలో లైకా సంస్థ దాదాపు రూ.550 కోట్లతో నిర్మిస్తోంది. ఇందులో బాలీవుడ్ నటుడు అక్షయ్‌కుమార్ ప్రతినాయకుడిగా నటించారు. ఎమీజాక్సన్ నాయకిగా నటించిన ఈ చిత్రానికి సంగీత మాంత్రికుడు ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందించారు. భారీ అంచనాలతో.. భారీ అంచనాల మధ్య 2.ఓ చిత్రం ఈ నెల 29న ప్రపంచ వ్యాప్తంగా తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. కాగా ఇది హాలివుడ్ చిత్రాలకు ధీటుగా అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో 3డీ ఫార్మెట్లో తెరకెక్కిన చిత్రం. ఇంతకు ముందు మైడియర్ కుట్టి సాతాన్, రజనీకాంత్ నటించిన కోచ్చడైయాన్ వంటి రెండు మూడు చిత్రాలు 3డీ ఫార్మెట్లో తెరపైకి వచ్చాయి. ఇవి 2డీ నుంచి 3డీకి కన్వర్ట్ చేసిన చిత్రాలు. 2.ఓ చిత్రం ఒరిజినల్‌గా 3డీ ఫార్మెట్లో రూపొందించిన తొలి ఇండియన్ చిత్రం అవుతుంది. చిత్ర దర్శకుడు శంకర్ కోరిక మేరకు తమిళనాడులోని థియేటర్లు అన్నీ 3డీ సాంకేతిక పరిజ్ఞాన వసతులతో ముస్తాబుతున్నాయట. తమిళనాడులో మొత్తం 1,000 థియేటర్ల వరకున్నాయి. వాటిలో 40 శాతం థియేటర్లు మాత్రమే ప్రస్తుతం 3డీ చిత్రాల ప్రదర్శనకు అనుగుణంగా ఉన్నాయి. మిగిలిన 60 శాతం థియేటర్లను 3డీ టెక్నాలజీకి మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అలా ఆధునికరించుకోలేని థియేటర్లను 2.ఓ చిత్ర నిర్మాణ సంస్థే అద్దే విధానంలో రూ.5 లక్షల వరకూ పెట్టుబడి పెట్టి చేయించడానికి సిద్ధం అయ్యిందని సమాచారం. దీని గురించి ప్రముఖ సినీ డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ తిరుపూర్ సుబ్రమణి తెలుపుతూ ఇప్పటి వరకూ తమిళనాడులో కొత్తగా 100 థియేటర్లు 3డీ సాంకేతిక పరిజ్ఞానానికి మారినట్లు తెలిసిందన్నారు. సాధారణంగా చిత్ర ప్రదర్శనకు రెండు నెలలకు రూ.20 వేలు అయితే, 3డీ చిత్రాల ప్రదర్శనకు రూ.60 వేలు అవుతుందన్నారు. ఇందుకు తగ్గట్టుగా 3డీ చిత్రాలు వసూళ్లు సాధించాల్సి ఉంటుందని ఆయన అన్నారు. -
లేట్ అయినా కరెక్ట్‌గా రావాలి.. వస్తే కొట్టాలి
సూపర్ స్టార్ రజనీకాంత్ తనదైన శైలిలో ఎంతో స్టైల్‌గా, కాన్ఫిడెంట్‌గా అన్న మాటలివి. కొట్టాలంటే.. హిట్‌ని ఉద్దేశించి అంటున్నా అని ఆయన సరదాగా అన్నారు. కొన్ని మాటలు మాట్లాడుతున్నప్పుడు ఉద్వేగానికి గురయ్యారు కూడా. ఉదాహరణకు ‘2.0’ చేస్తున్నప్పుడు నాకు ఆరోగ్యం బాగా లేక ‘ఇక నా వల్ల కాదు శంకర్’ అనే మాటలను. ‘నా తల్లీతండ్రి, దైవం అయినా మా అన్నయ్య, అప్పుడప్పుడు నా తప్పులను మన్నించిన మా అన్నయ్య ఈ వేడుకకు రావడం ఆనందంగా ఉంది’ అని మాటలను వేదిక సాక్షిగా అన్నప్పుడు రజనీకాంత్ కళ్లు చెమర్చడం విశేషం. సూపర్‌స్టార్ రజనీకాంత్, గ్రేట్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో దాదాపు 600 కోట్ల భారీ బడ్జెట్‌తో లైకా ప్రొడక్షన్ నిర్మించిన చిత్రం. సుభాస్కరన్ నిర్మించిన ఈ చిత్రాన్ని తెలుగులో ఎన్వీ ప్రసాద్ విడుదల చేస్తున్నారు. పూర్తిగా త్రిడీ ఫార్మాట్లో చిత్రీకరణ జరుపుకున్న తొలి భారతీయ సినిమా ‘2.0’ కావడం విశేషం. ఈ చిత్రానికి 4డి ఫార్మాట్లో సౌండ్ డిజైన్ చేయడం మరో విశేషం. ఈ నెల 29న ‘2.0’ని విడుదల చేస్తున్న సందర్భంగా చెన్నైలో 4డి ట్రైలర్‌ను విడుదల చేశారు. ఆత్మవిశ్వాసం పోయింది ఈ సందర్భంగా రజనీకాంత్ మాట్లాడుతూ – ‘‘సుభాస్కరన్కి, శంకర్‌కి అడ్వా¯Œ్స కంగ్రాట్స్. శంకర్‌ని నమ్మి నిర్మాత 600 కోట్లు పెట్టారు. అంతేగానీ నన్నో, అక్షయ్కుమార్నో నమ్మి కాదు. ఆడియ¯Œ్స ఎక్స్పెక్టేషన్, నిర్మాతల ఎక్స్పెక్టేషన్ని ఎప్పుడూ రీచ్ అవుతూనే ఉన్నారు శంకర్. కొన్నిసార్లు తప్పి ఉండవచ్చు. అయినా అతను మెజీషియన్. ఏదో రూ.600కోట్లు పెట్టినంత మాత్రాన ఈ సినిమా హిట్ అని నేను చెప్పడం లేదు. అందరూ కష్టపడతారు. అయినా అన్నిసార్లు వర్కవుట్లు కావు. కొన్నిసార్లు ఏవో మేజిక్‌లు వర్కవుట్లు అవుతాయి. ఈ సినిమాలో అలాంటి మేజిక్‌లున్నాయి. ఈ సినిమాకు ప్రమోషన్ తక్కువగా ఉందని కొందరు అంటున్నారు. కానీ ఇలాంటి సినిమాలకు ప్రమోషన్ అవసరంలేదు. ఈ సినిమా విడుదలైన తర్వాత ప్రతి ఒక్కరూ ఈ సినిమాను ప్రమోట్ చేస్తారు. మంచికి తోడుగా ఉండే మీడియా తప్పకుండా ఎంకరేజ్ చేస్తారు. పర్యావరణాన్ని, సొసైటీని మోడ్రన్ టెక్నాలజీ ఎలా స్పాయిల్ చేస్తుందో ఇందులో చాలా బాగా చెప్పారు. శంకర్‌గారు ఏమనుకున్నారో దాన్ని తీయగల సత్తా ఆయనకుంది. అందుకే ఆయన కథ చెప్పినప్పుడు ‘ఇదెలా వర్కవుట్ అవుతుంది?’ అని అడగలేదు. ఎవరు నిర్మిస్తున్నారు? అని మాత్రం అడిగాను. ‘శివాజీ’ చేసేటపుడు ఆ సినిమాకు అనుకున్న బడ్జెట్ కన్నా రెట్టింపయింది. కానీ ఆ సినిమాకు అంత కన్నా ఎక్కువ మొత్తం కలెక్షన్లు వచ్చాయి. ‘రోబో’ తీయాలనుకున్నప్పుడు ‘శివాజీ’ ఎంత కలెక్ట్ చేసిందో అంత బడ్జెట్‌తో చేస్తాం..పెట్టింది వస్తే చాలన్నారు సన్ పిక్చర్స్ వాళ్లు.. దానికన్నా 20–30 పర్సెంట్ బడ్జెట్ ఎక్కువయింది. అయినా రెండింతలు వసూలు చేసింది. ‘రోబో’ కలెక్ట్ చేసినంత ఈ సినిమాకు వస్తే చాలు అని ‘2.0’ మొదలుపెట్టాం. అందుకే ముందు రూ. 300కోట్లు అనుకున్నాం. ఇప్పుడు డబుల్ అయింది. తప్పకుండా అంతకు డబుల్ కలెక్ట్ చేస్తుంది. ‘కబాలి’ ఒక షెడ్యూల్ చేసిన తర్వాత నాకు ఆరోగ్యం బాగా లేకుండాపోయింది. ‘2.0’ కోసం 5 రోజులు షూట్ చేశా. 7, 8 రోజులైంది. అప్పటికే నాకు ఆత్మవిశ్వాసం పోయింది. ‘నేను జస్టిఫై చేయలేను. ఖర్చుపెట్టిందంతా ఇచ్చేస్తాను. నేను చేయలేను’ అని శంకర్‌ని పిలిచి చెప్పా. ‘మీరు జస్ట్ అలా రండి. మీరు కన్ను చూపించండి.. మిగిలింది మొత్తం మనం చేద్దాం’ అన్నారు. 12 నుంచి 14 కేజీల బరువు ఉన్న బాడీ సూట్ వేసుకోవాలి. అది వద్దన్నారు. కానీ నేనే.. ఆ బాడీ సూట్ వేసుకుంటా అని అన్నాను. ‘కబాలి’ కోసం మలేసియాకి వెళ్లినప్పుడు ఆరోగ్యం ఇంకా చాలా పాడయింది. అప్పుడు డాక్టర్ నాలుగైదు నెలలు రెస్ట్ కావాలన్నారు. ఆ విషయం నిర్మాత సుభాస్కరణ్‌కు తెలిసి మా ఇంటికి వచ్చి ‘నాలుగు నెలలు కాదు, నాలుగు సంవత్సరాలు వెయిట్ చేస్తా. నాకు డబ్బులు కాదు. మీతో సినిమా ముఖ్యం’ అని అన్నారు. అలాంటి ఒక ఫ్రెండ్ దొరకడం అంటే.. ఓ కోహినూర్ డైమండ్ దొరికినట్టే. ఈ సినిమా చాలా లేట్ అయింది. ఎందుకు లేట్ అయింది అని చాలా మంది అడిగారు. కానీ కాస్త లేట్ అయినా, కరెక్ట్‌గా రావాలి. వస్తే, ష్యూర్‌గా కొట్టాలి. మేం హిట్ కొడుతున్నాం. శంకర్, రాజమౌళి, రాజ్‌కుమార్ హిరానీ లాంటివారు జెమ్స్ ఆఫ్ ఇండస్ట్రీ’’ అన్నారు. టన్నుల కొద్దీ కష్టపడ్డాం శంకర్ మాట్లాడుతూ – ‘‘ఇలా జరిగితే ఎలా ఉంటుంది’ అనే ఊహే ఈ కథ. సినిమా అనేదాన్ని కూడా దాటి... త్రీడీ, 4డీ అనే కొత్త అనుభవం ఉంటుంది. సుభాస్కరన్ లేకపోతే ఈ సినిమా లేదు. ఈ సినిమాకు గొప్ప బలం రజనీకాంత్‌గారు. ఈ సినిమా ప్రారంభించినప్పుడు రజనీసార్‌కి కాస్త అనారోగ్యంగా ఉంది. ఢిల్లీలో యాక్షన్ డైరెక్టర్లు, వీఎఫ్ ఎక్స్ డైరెక్టర్లు, అక్షయ్ కుమార్, చాలా మంది కార్పెంటర్లు, జూనియర్ ఆర్టిస్టులు ఉన్నారు. దాదాపు ఆరు నెలల ముందే ప్లాన్ చేసుకున్న షెడ్యూల్ అది. దాదాపు 500–1000 మంది అక్కడ ఉన్నారు. ఆ సమయంలో రజనీకి అనారోగ్యంగా ఉన్నప్పటికీ 47 డిగ్రీల ఎండ, 12 కిలోల బరువు సూట్ వేసుకుని క్లైమాక్స్ చేశారు. ఒక రోజైతే ఆయనకు దెబ్బ తగిలింది కూడా నాకు తెలియదు. ఎవరో వచ్చి చెప్పారు. ఆయన్ని కూర్చోపెట్టి.. ప్యాంట్ కాస్త పైకి తీసి చూస్తే రెండు ఇంచ్‌లు తెగిన విషయం తెలిసింది. ఇలాంటి డెడికేషన్ వల్లనే ఆయన సూపర్‌స్టార్ అయ్యారు. అక్షయ్‌గారు ఈ సినిమాకు పడ్డంత కష్టం ఏ సినిమాకీ పడి ఉండరు. రెహమా¯Œ మళ్లీ మళ్లీ మ్యూజిక్ చేస్తూనే ఉన్నారు. ఈ సినిమాకు చేసిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అంతా పాటల్లాగానే ఉన్నాయి. వేలమంది టన్నుల కొద్దీ కష్టపడి చేసిన చిత్రమిది. మీడియా సపోర్ట్ చేస్తే, మన ఊరిలోనూ ఇలాంటి సినిమాలను చేయగలం అని ప్రపంచానికి చెప్పగలం. ఈ సినిమా కథను రాసేటప్పుడు ఇది త్రీడీలో తీస్తేనే బావుంటుందని అనుకున్నా. సౌండ్ మాత్రం 4 డీలో ఉండాలని అనుకున్నా. నా ఎన్నో ఏళ్ల కల అది. మామూలుగా మనం సినిమా చూసేటప్పుడు చుట్టుపక్కల నుంచి, పై నుంచి స్పీకర్ల ద్వారా శబ్దాలను వినొచ్చు. కానీ కాళ్ల కింద కూడా స్పీకర్లు ఉంటే... నేల మీద జరిగే అంశాలకు కూడా సౌండ్ కల్పిస్తే బావుంటుందని ఆశించాను. రసూల్ పూకుట్టి కూడా దానికి ఎంతగానో సహకరించారు’’ అని అన్నారు. ‘‘2డీలో సినిమా తీసి త్రీడీకి మారిస్తే అంత నాణ్యత కనిపించదు. అలాగని త్రీడీలో తీయడం కూడా సులభం కాదు. చాలా కష్టతరమైన అంశం’’ అన్నారు కెమెరామేన్ నీరవ్ షా . అక్షయ్ కుమార్ మాట్లాడుతూ – ‘‘రజనీసార్, శంకర్‌సార్, రెహమాన్‌గారితో కలిసి ‘2.0’లో నా పేరు కూడా ఉండటం ఆనందంగా ఉంది. ఈ సినిమాకోసం నన్ను అప్రోచ్ అయిన టీమ్‌కి ధన్యవాదాలు. ఈ సినిమా వల్ల నేను చాలా నేర్చుకున్నా. శంకర్ నా దృష్టిలో సైంటిస్ట్. మూడున్నర గంటలు కూర్చుని మేకప్ చేసుకోవడం, గంటన్నర దాన్ని తీయడానికి కేటాయించడం మరచిపోలేను’’ అని అన్నారు. ఎ.ఆర్.రెహమాన్ మాట్లాడుతూ – ‘‘ఈ సినిమాలో ముందు మేం పాటలు లేవనుకున్నాం. కేవలం బ్యాగ్రౌండ్ స్కోరే అనుకున్నాం. కానీ ఇప్పుడు నాలుగు పాటలున్నాయి. ఇందిరలోకం.. అనే పాటకోసం దాదాపు 12, 13 ట్యూన్ల తర్వాత శంకర్‌గారు ఈ ట్యూన్ సెలక్ట్ చేశారు. ముందు రీ–రికార్డింగ్‌ని కీబోర్డ్, కంప్యూటర్స్‌లో కంపోజ్ చేశాం. నెల రోజుల క్రితం 100 మంది ఆర్కెస్ట్రా లండన్‌లో, ముంబైలో 40 మంది, చెన్నైలో ఇంకొంతమందితో చేశాం. నాకు రజనీకాంత్‌గారు చాలా రకాలుగా స్ఫూర్తినిచ్చారు. చిన్నతనం నుంచి సంగీత రంగంలో ఉండటం వల్ల నేను 40 ఏళ్లప్పుడు రిటైర్ కావాలని అనుకున్నా. అప్పుడే ‘రోబో’ సినిమా చేస్తున్నా. ఆ సెట్‌కి వెళ్లి రజనీకాంత్‌గారిని చూశాక, ఆఫ్ సెట్, ఆన్ సెట్ ఆయన్ని చూశాక నా మనసు మారింది. ఇవాళ నేను సంగీత రంగంలో ఉండటమే గొప్ప కటాక్షంగా భావిస్తున్నా. ‘2.0’కి పనిచేసిన అను భవం 8 సినిమాలు చేసినట్టు అనిపిస్తోంది’’ అని అన్నారు. రసూల్ పూకుట్టి మాట్లాడుతూ – ‘సాఫ్ట్వేర్ డెవలపర్స్ సాయం మర్చిపోలేం. ధ్వని విషయంలో చోటుచేసుకున్న చారిత్రాత్మక విషయానికి ఈ ప్రదేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ ప్రత్యక్ష సాక్షులు. ఇంత గొప్ప అచీవ్మెంట్లో భాగం కావడం ఆనందంగా ఉంది’’ అన్నారు. ఈ సందర్భంగా దర్శకుడు రాజమౌళి, కన్నడ నటులు ఉపేంద్ర, శివరాజ్కుమార్లతో పాటు పలువురు ప్రముఖులు అడిగిన ప్రశ్నలను స్క్రీన్‌పై డిస్ప్లే చేయగా, చిత్రబృందం సమాధానాలిచ్చింది. అలాగే నటుడు కమల్‌హాసన్ వీడియో ద్వారా తన అభినందనలు తెలిపారు. -
పండగ ముందే వస్తోంది
‘రోబో’ సినిమాలో ‘చిట్టి’ రజనీకాంత్ దీపావళి పండగ రాక ముందే ‘హ్యాపీ దీపావళి’ అంటూ తనను పట్టుకోవడానికి వచ్చిన పోలీసులపై బులెట్స్ వర్షం కురిపిస్తాడు. ఈ సీక్వెల్ ద్వారా కూడా అలానే పండగ రాకముందే దీపావళి శుభాకాంక్షలు చెప్పడానికి రెడీ అవుతున్నారట. రజనీకాంత్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ బడ్జెట్ చిత్రం ‘2.ఓ’. బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ విలన్‌గా నటించారు. లైకా ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ చిత్రంలో అమీ జాక్సన్ కథానాయిక. ‘2.ఓ’ లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే ఈ చిత్రం ట్రైలర్‌ను నవంబర్ 3న రిలీజ్ చేయడానికి చిత్రబృందం ప్లాన్ చే స్తోందట. దీపావళి పండక్కి ఐదారు రోజుల ముందే ట్రైలర్ వస్తే రజనీ అభిమానులు ముందే పండగ చేసుకుంటారని చెప్పొచ్చు. ఆల్రెడీ రిలీజ్ చేసిన టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. విజువల్ ఎఫెక్ట్స్ ఆలస్యం కారణంగా పలుమార్లు వాయిదా పడిన ఈ చిత్రం నవంబర్ 29న రిలీజ్ కానుంది. ప్రస్తుతం రజనీకాంత్ ‘పేట్టా’ సినిమా పూర్తి చేశారు. సంక్రాంతికి విడుదల కానుందని టాక్. -
దసరాకు విలన్
రెండున్నరేళ్ల క్రితం ‘ది విలన్’ సినిమా కోసం కొబ్బరికాయ కొట్టారు టీమ్. ఇందులోని యాక్టర్స్ డేట్స్ కుదరకపోవడం, అమీ జాక్సన్ విసా ప్రాబ్లమ్, వర్షం తాకిడికి లొకేషన్లో ఇబ్బంది కలగడం వంటి కారణాల వల్ల సినిమా షూటింగ్ ఆలస్యం అయ్యింది. దీంతో రిలీజ్ డేట్ విషయంలో కూడా మార్పులు వచ్చాయి. ఫైనల్‌గా ఈ సినిమాను దసరాకి రిలీజ్ చేయనున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ప్రేమ్ దర్శకత్వంలో శివరాజ్ కుమార్, సుదీప్, అమీ జాక్సన్‌లు ముఖ్య తారలుగా రూపొందిన మల్టీస్టారర్ మూవీ ‘ది విలన్’. రామ్ ఆర్ రావణ్ అనేది ఉప శీర్షిక. సీఆర్ మనోహర్ నిర్మించారు. శ్రీకాంత్, మిధున్ చక్రవర్తి కీలక పాత్రల్లో కనిపిస్తారు. ఈ సినిమాను అక్టోబర్ 18న రిలీజ్ చేయనున్నట్లు దర్శకుడు ప్రేమ్ పేర్కొన్నారు. ‘‘కన్నడ, తెలుగు, తమిళం భాషల్లో అక్టోబర్ 18న సినిమాను విడుదల చేయబోతున్నాం. సహకరించిన టీమ్‌కి ధన్యవాదాలు’’ అని పేర్కొన్నారు ప్రేమ్. యాక్టర్ కావాలని కలలు కనే ఓ పల్లెటూరి యువకుడి బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా కథనం సాగుతుందని శాండిల్‌వుడ్ టాక్. -
సూపర్ మజా
మా సినిమాలో మ్యాటర్ ఇది. విజువల్‌గా ఇలా ఉండబోతోంది, ఇలాంటి సీన్స్ ఉండబోతాయి అని ఆ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులను టీజర్ ద్వారా టీజ్ చేస్తుంటారు చిత్రబృందం. రోట్లో నూరుతున్న పచ్చడి రుచి ఎలా ఉండబోతోందో అని అమ్మమ్మ చూపించే శాంపిల్‌లా. అయితే ఆ టీజర్ మీద అంచనాలు అధికమైనప్పుడే అసలు తంటాలు ఏర్పడుతుంటాయి. రజనీకాంత్ లేటెస్ట్ భారీ బడ్జెట్ చిత్రం ‘2.ఒ’ కూడా అలాంటి చిరు నిరుత్సాహమే ఏర్పరిచిందని కొందరు అంటున్నారు. రజనీకాంత్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందిన సైన్స్ ఫిక్షన్ చిత్రం ‘2.ఒ’. అమీ జాక్సన్ కథానాయిక. అక్షయ్ కుమార్ విలన్. 2010లో రిలీజ్ అయిన ‘రోబో’ సినిమాకు ఇది సీక్వెల్. ఈ సినిమా రిలీజ్ పలు వాయిదాలు పడుతూ వస్తోంది. కారణం వీఎఫ్ఎక్స్. ఈ చిత్రాన్ని నవంబర్‌లో విడుదల చేయడానికి ప్లాన్ చేశారు. వినాయక చవితి సందర్భంగా టీజర్ రిలీజ్ చేశారు. అంచనాలు భారీగా ఉండటంతో ఇంకా ఏదో ఎదురు చూశారు. త్రీడీ ఫార్మాట్లో ఈ చిత్రాన్ని తీశారు. ట్రైలర్‌ను కూడా ఆ ఫార్మాట్లోనే కొన్ని థియేటర్స్‌లో రిలీజ్ చేశారు. బిగ్ స్క్రీన్ మీద చూసిన కొందరు అద్భుతం అంటుంటే.. యూట్యూబ్‌లో వీక్షించిన వారిలో కొందరు ఆశించినంత లేదంటున్నారు. కానీ 3డీని చిన్న స్క్రీన్స్‌లో (మొబైల్స్, ల్యాప్టాప్స్)లో చూస్తే ఏముంటుంది మజా? 3డీ స్క్రీన్‌లో చూస్తేనే కదా సూపర్ మజా అంటున్నారు రజనీ అభిమానులు. పాయింటే కదా! -
ఎట్టకేలకు రెడీ.. 2.0 రిలీజ్ డేట్ అనౌన్స్ చేసేశారు!
ఎదురుచూపులకు ఎట్టకేలకు తెరపడనుంది. అభిమానులు ఎప్పుడెప్పుడా అని నిరీక్షిస్తున్న 2.0 సినిమా వచ్చే నవంబర్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా విడుదల తేదీని చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఈ ఏడాది నవంబర్ 29న సినిమాను విడుదల చేయబోతున్నట్టు ప్రకటించింది. చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రోడక్షన్స్, చిత్ర దర్శకుడు శంకర్ ఈ మేరకు ట్విటర్లో తెలిపారు. రజనీకాంత్, అక్షయ్‌కుమార్ వంటి భారీ తారాగణంతో ‘రోబో’ సినిమాకు సీక్వెల్‌గా కళ్లు చెదిరే బడ్జెట్‌తో, భారీ సాంకేతిక హంగులతో 2.0 సినిమాను శంకర్ తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఎంతో ప్రతిష్టాత్మక ప్రాజెక్టు అయిన ఈ సినిమా గతంలోనే విడుదల కావాల్సి ఉంది. గతంలో పలు విడుదల తేదీలు ప్రచారంలో ఉన్నా.. వీఎఫ్ఎక్స్ వర్క్ కారణంగా సినిమా అనుకున్న తేదీ విడుదల కాలేదు. భారీ గ్రాఫిక్ వర్క్, వీఎఫ్ఎక్స్ టెక్నాలజీని ఈ సినిమా కోసం వాడటంతో చిత్రం పూర్తికావడానికి చాలా ఎక్కువ సమయమే పట్టింది. ఎట్టకేలకు వీఎఫ్ఎక్స్ కంపెనీ వీఎఫ్ఎక్స్ షాట్స్ డెలివరీ చేస్తామని హామీ ఇచ్చిందని, కాబట్టి నవంబర్ 29న ఈ సినిమాను విడుదల చేయబోతున్నామని శంకర్ ట్విటర్లో తెలిపారు. -
ఇద్దరు రావణుల కథ
అభిమానుల నిరీక్షణ ఎట్టకేలకు ఫలించింది. ఎప్పుడెప్పుడా అని ఆశగా ఎదురుచూస్తున్న భారీ మల్టీస్టారర్ టీజర్ రీలీజ్ వచ్చేసింది. కన్నడ స్టార్ హీరోలు శివరాజ్‌కుమార్, సుదీప్‌లు నటించిన ‘ది విలన్’ టీజర్ గ్రాండ్‌గా విడుదలయ్యింది. ఒక్కటి కాదు.. ఇద్దరు హీరోలకు సంబంధించిన టీజర్లను విడివిడిగా చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ముందుగా ఫ్యాన్స్ కోసం మల్టీఫ్లెక్స్‌లలో(గురువారం) ఎంపిక చేసిన స్క్రీన్లలో పెయిడ్ టీజర్‌ను వదిలిన చిత్ర నిర్మాతలు, తర్వాత నిన్న థియేటర్లలో, సోషల్ మీడియాలో వాటిని విడుదల చేశారు. విజువల్ ఎఫెక్ట్స్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చి టీజర్లను కట్ చేశారు. శివన్న, కిచ్చ సుదీప్‌లు ఇద్దరు ‘రావణ పాత్ర’ గురించి డైలాగ్ చెప్పటం బావుంది. అయితే అసలు విలన్ ఎవరు అన్న విషయంలో సస్పెన్స్ మెయింటెన్ చేశారు. జోగి ఫేమ్ ప్రేమ్(తెలుగులో యోగి) డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రంలో అమీ జాక్సన్ హీరోయిన్గా నటిస్తుండగా, బాలీవుడ్ దిగ్గజం మిథున్ చక్రవర్తి, టాలీవుడ్ సీనియర్ నటుడు శ్రీకాంత్ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. ఫ్యాన్స్ అసంతృప్తి... నిజానికి ఈ ప్రాజెక్టు ప్రకటించి మూడేళ్లపైనే గడుస్తోంది. 2015లో కాళి టైటిల్‌తో తొలుత ఈ ప్రాజెక్టు తెరకెక్కించాలని ప్రేమ్ యత్నించాడు. అయితే ఇద్దరు హీరోలు కథపై అసంతృప్తి వ్యక్తం చేయటంతో డిలే అయ్యింది. చివరకు ఏడాదిన్నర తర్వాత స్క్రిప్ట్ పనులు ఓకే కావటంతో.. ది విలన్ టైటిల్‌తో షూటింగ్ ప్రారంభమైంది. టీజర్, ట్రైలర్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. జీటీ మాల్లో జరిగిన ఈవెంట్లో కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి చేతుల మీదుగా గురువారం సాయంత్రం టీజర్లు లాంఛ్ చేశారు. తొలుత పెయిడ్ టీజర్ అని ప్రకటించగానే ఫ్యాన్స్ నిరుత్సాహానికి గురయి ఆందోళన చేపట్టారు. అయితే డైరెక్షన్ వెల్ఫెర్ ఫండ్ కోసం ఇదంతా అని డైరెక్టర్ ప్రేమ్ ప్రకటించటంతో అంతా శాంతించారు. వచ్చే నెలలో ఆడియోను విడుదల చేసి, ఆగష్టులో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తెచ్చే ఆలోచనలో నిర్మాతలు ఉన్నారు. ఇద్దరు స్టార్ హీరోల మల్టీస్టారర్ కావటంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. -
‘ది విలన్’ టీజర్
-
మరో 100 కోట్లతో ఫినిషింగ్ టచ్‌లు...
ఇనుములో బంగారం మొలిచెనే!రోబో తర్వాత వస్తున్న సీక్వెల్ 2.0.అద్భుతంగా ఉండటానికి శంకర్ చేస్తున్నప్రయత్నం మేలిమి బంగారం.ఎప్పుడో దీపావళికి రావాల్సింది.ఉయ్ ఆర్ ఆల్ వెయిటింగ్ ఫర్ ద బ్లాస్ట్. పండగ ఎప్పుడు వస్తుందా అని లుగులు ఎప్పుడు చిమ్ముతుందా అనిశంకరాభిమానులంతా ఎదురు చూస్తున్నారు. కొందరు డైరెక్టర్లతో చిక్కే.ఉదాహరణకు శంకర్ ‘విజువల్ ఎఫెక్ట్స్ విజువల్ ఎఫెక్ట్స్లా కనిపించకూడదు. అవి కథలో భాగం అయిపోవాలి. ప్రేక్షకుడు కథను ఎంజాయ్ చేయాలి’ అంటారు.చిన్నమాటే.కాని దాని బరువు వందల మంది విజువల్ ఎఫెక్ట్స్ టెక్నీషియన్స్ మీద పడుతుంది.శంకర్ తాజా చిత్రం ‘2.ఓ’ లో ఒక అడవి సన్నివేశం ఉంది. అడవినంతా తెర మీద సృష్టించాలి. అడవి కనిపించిన వెంటనే ప్రేక్షకుడు ‘ఆహా... విజువల్ ఎఫెక్ట్స్ ఎంత బాగున్నాయి’ అని అనుకుంటే సినిమా ఓడిపోయినట్టు. ఆ అడవిలో మమేకమైపోయి ఇప్పుడేం జరుగుతుందా అని ఉత్సుకతతో ఉంటే సినిమా గెలిచినట్టు. అడవిలోని ఆకునూ తీగనూ లతనూ మట్టినీ మానునూ పువ్వునూ చాలా సహజంగా విజువల్ ఎఫెక్ట్స్ కాదు అన్నంత బాగా సృష్టించాల్సిన భారం టీమ్ మీద ఉంటుంది.‘2.ఓ’ ఆలస్యానికి బహుశా కారణం ఇదే అయి ఉండవచ్చు. పర్ఫెక్షనిజమే దాని విడుదలకు అడ్డంకి అవుతుండవచ్చు. ఆలస్యం అమృతం అమృతం అంటారు శంకర్.ఆ అమృతం మరింత మధురంగా మారడానికి మరో వంద కోట్లు ఖర్చు పెట్టడానికి రెడీ అయ్యారని కథనం. మరో వందకోట్లు.ఆల్రెడీ ఈ సినిమా బడ్జెట్ 400 కోట్లు అంటున్నారు. ఈ వంద కోట్లతో కలిపి 500 కోట్లు కావచ్చు. భారతదేశంలో ఇంత ఖరీదైన బడ్జెట్‌తో తయారయ్యే చిత్రం ఇదే. ‘బాహుబలి’ రికార్డును ఇది చెరిపేయవచ్చు. కాని ప్రేక్షకుడు కోరుకునేది అదే కదా. ఒక రికార్డు చెరిపే స్థాయిలో మరో రికార్డు సిద్ధం అవుతుండాలి. ఒక గొప్ప సినిమా వచ్చాక మరింత గొప్ప సినిమా సిద్ధమవుతూ ఉండాలి. ‘2.ఓ’ మరింత గొప్ప సినిమా కాబోతున్నదనే సూచనలు కనిపిస్తున్నాయి. సెట్లో కళ్లద్దాలతో... సెట్లో డైరెక్టర్ కళ్లద్దాలతో ఉండటం మామూలే– సైట్ ఉంటే. శంకర్‌కు సైట్ లేదు. కాని ఆయన ‘2.ఓ’ సెట్లో ఎప్పుడూ చాలా శక్తివంతమైన కళ్లద్దాలను పెట్టుకుని ఉంటాడు. అవేమిటో తెలుసా? త్రీడీ కళ్లద్దాలు. హాలీవుడ్ వాళ్లను మించిపోవాలనుకున్నారు శంకర్. హాలీవుడ్లో సినిమాలు 2డిలో తీసి త్రీడిలో కన్వర్ట్ చేస్తుంటారు. కాని ‘2.ఓ’ను డైరెక్ట్‌గా త్రీడీలో చిత్రీకరిస్తున్నారు. షాట్ అయ్యాక మానిటర్ మీద ఆ షాట్ ఎలా వచ్చిందో చూడాలంటే త్రీడీ కళ్లద్దాలు ఉండాలి. శంకర్ ఆ కళ్లద్దాలు పెట్టుకుని షాట్‌ను గమనించుకుని అది ఓకే అయ్యిందనుకున్నాకే నెక్ట్స్ షాట్‌కు వెళతారు. లేదంటే రీషాటే. ఇంత టెక్నికల్ వ్యవహారం నిమగ్నమై ఉన్నందువల్లే ఇప్పటికే మనకు కనుల విందు చేయాల్సిన సినిమా ఇంకా ఆలస్యమవుతున్నదో ఏమో. స్క్రిప్ట్‌కు తాళం ‘రోబో’ హిట్ అయ్యాక దానికి సీక్వెల్ తీయాలని 2012లోనే అనుకున్నారు శంకర్. దానికి అవసరమైన కథను రూపకల్పన చేయడానికి తమిళంలో సాహిత్యకారునిగా పేరు గడించిన జయమోహన్‌ను ఎంచుకున్నారు. ‘రోబో’కు పని చేసిన డైలాగ్ రైటర్ మదన్ కార్కె (గీత రచయిత వైరముత్తు కుమారుడు) ఇందులోని టెక్నికల్ డైలాగ్స్ విషయంలో జయమోహన్‌కు సాయం పట్టాడు. ‘నా ఇమేజినేషన్‌కు తగినట్టుగా కథ హ్యూజ్‌గా వైల్డ్‌గా ఎదిగిపోయింది’ అంటారు శంకర్. భారీ సినిమాలకు మహా భారీ ప్రొడ్యూసర్ అయితేనే కరెక్ట్. శ్రీలంక మూలాలు కలిగిన తమిళ పారిశ్రామిక వేత్త, ‘లైకా’ మొబైల్స్ ద్వారా 21 దేశాలలో ఐదు వేల కోట్ల వ్యాపార లావాదేవీలకు ఎదిగిన అల్లిరాజా సుబస్కరన్ దీనికి నిర్మాతగా ముందుకు వచ్చాడు. ఈయన లైకా ప్రొడక్షన్స్ ఇంతకు ముందు విజయ్‌తో ‘కత్తి’ (తెలుగులో ఖైదీ నం.150) వంటి సూపర్ హిట్‌ను సాధించి ఉంది. హీరోగా రజనీకాంత్ ముందే సిద్ధం. కాని విలన్‌గా చాలా పేర్లే వినిపించాయి. ఆర్నాల్డ్ ష్వాస్నెగర్ను, ఆమిర్ ఖాన్‌ను, విక్రమ్‌ను వీరందరినీ దాటి ఆ అద్భుతమైన అవకాశం అక్షయ్ కుమార్‌కు చేరింది. హీరోయిన్గా అమీ జాక్సన్‌ను తీసుకున్నారు. అంతా సిద్ధం అయ్యాక స్క్రిప్ట్‌ను ఒకటికి పదిసార్లు చెక్ చేసుకుని లాక్ చేశారు శంకర్. ఆయనలోని సుగుణమో దుర్గుణమో ఒకసారి స్క్రిప్ట్‌కు లాక్ చేశాక ఏది రాసుకున్నారో అదే తీయాలి... ఏమైనా ఎంత ఖర్చయినా. ‘ఐ’ సినిమాలో ‘పూలనే కునుకేయమంటా’ పాటను చైనాలో పూలు వికసించే కాలంలో తీయాలని శంకర్ నిర్ణయించుకుని అందుకోసం ఆరు నెలలు వేచి ఉండి వెళ్లి తీశారు. స్డూడియోలో తీసి ఉంటే ఒక వంతు ఖర్చయ్యే పాటకు చైనాలో తీయడం వల్ల పది వంతులు ఖర్చయ్యింది. ఇలాంటి తాళ రాక్షసుడు కనుకనే అలాంటి ఎన్నో సీన్లు ‘2.ఓ’ లో రాసుకున్నాడు కనుకనే వాటన్నింటినీ అనుకున్నట్టుగా తీయడంలో సినిమా విడుదలకు ఆలస్యమవుతున్నదేమో. మరో వంద కోట్లు సినిమా 2017 దీపావళికి వస్తుందని ఆశించారు. జనవరి 1, 2018కి వస్తుందని ఆశించారు. వేసవి సెలవుల్లో గ్యారంటీ అని కూడా అన్నారు. ఆడియో లాంచ్ అయ్యింది. ట్రైలర్ బయటకు వదలకపోయినా ‘కట్’ చేసినట్టు వార్తలు వచ్చాయి. అయినా విడుదల గురించి హీరో గాని దర్శకుడు కాని ఏమీ మాట్లాడటం లేదు. ఈలోపు రజనీ కాంత్ ‘కబాలి’, ‘కాలా’ తీసుకున్నారు. దర్శకుడు కార్తి సుబ్బరాజ్‌తో మరో సినిమా కూడా చేస్తున్నారు. వీటి ముందు మొదలైన ‘2.ఓ’ మాత్రం విడుదల కాలేదు. ఈ నేపధ్యంలో పోస్ట్ ప్రొడక్షన్ కోసం మరో వంద కోట్లు విడుదల చేస్తున్నారని వార్త. అయితే ఇదంతా ప్రపంచ వ్యాప్తంగా సినిమా విడుదల చేయడానికే అయి ఉంటుందని ట్రేడ్ పండితుల పరిశీలన. ‘2.ఓ’ ను ప్రపంచ వ్యాప్తంగా 13 భాషలలో ఒకేసారి విడుదల చేయాలని అనుకుంటున్నారు. ఈ అన్ని భాషలకు డబ్బింగ్ పనులు జరగాలి. భారీ క్లయిమాక్స్‌కు తగినట్టుగా ఎఫెక్ట్స్ కోసం మరిన్ని నిధులు అవసరమయ్యాయేమో తెలియదు. ఈ విషయం అటుంచితే ఈ సినిమా కోసం తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లలో థియేటర్లు త్రీడీకి అనువుగా అప్డేట్ అవ్వాల్సి ఉంది. ఇవన్నీ ముగిశాకే సినిమాను పకడ్బందీగా విడుదల చేయాలని వేచి ఉన్నారో ఏమో తెలియదు. షోలే అవుతుందా? భారత సినీ చరిత్రలో సంచలనం సృష్టించిన ‘షోలే’ను 1973లో మొదలెట్టి మూడేళ్ల పాటు తీశారు. దీని చిత్రీకరణ సమయంలోనే ఒక్కో హీరో రెండు మూడు సినిమాలు చేశారు. అందరూ ఆ సమయంలో ఇంత ఆలస్యమా అన్నవారే. కాని ఒక మంచి సినిమా అన్ని విధాలా పూర్తవ్వడానికి అంత సమయం తీసుకుంటుంది మరి. ‘2.ఓ’ విషయంలో కూడా ఇదే పునరావృతం అవుతున్నట్టుంది. శంకర్ అభిమానులు, రజనీ అభిమానులు, కమర్షియల్ సినిమా అభిమానులు ‘2.ఓ’ కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. కాసులతో కలెక్షన్లతో ఆ వత్తులను వెలిగించాలనుకుంటున్నారు. భూనభోనాంతరాలు దిమ్మెరపోయే వెలుగు ‘2.ఓ’ విడుదలతో సాక్షాత్కరిస్తుందని ఆశిద్దాం. భారీ చిత్రీకరణ ‘2.ఓ’ చిత్రీకరణ సరిగ్గా 2015 డిసెంబర్లో మొదలైంది. అయితే ఇది స్టూడియోల్లో తీసే సినిమా కాదు. భారీ మైదానాలు కావాలి. అందుకే చెన్నై పూనమలై రోడ్‌లోని 160 ఎకరాల ఇ.వి.పి. థీమ్ పార్క్‌ను లీజుకు తీసుకుని దానినే ప్రధాన స్టూడియోగా మలుచుకున్నారు. ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో కూడా 45 రోజులు షూట్ చేశారు. వంద రోజులు షూట్ చేస్తే సాధారణంగా ఒక సినిమా పూర్తయిపోతుంది. కాని వంద రోజుల చిత్రీకరణ తర్వాత సినిమా సగమైనట్టుగా శంకర్ ప్రకటించారు. నూట యాభై రోజుల చిత్రీకరణ తర్వాత మూడు వంతుల సినిమా పూర్తయినట్టు చెప్పారు. 2017 అక్టోబర్‌కు చిత్రీకరణ అధికారికంగా ముగిసింది. కాని అసలు కథ అప్పుడే మొదలైంది. పోస్ట్ ప్రొడక్షన్ కొన్ని చోట్ల సగం సెట్లు వేసి మిగిలిన భాగాలను స్పెషల్ ఎఫెక్ట్స్ ద్వారా పూర్తి చేశారు. కొన్నిసార్లు అసలు ఏ సెట్ లేకుండా తీసి తెర మీదే సెట్‌ను పూర్తిగా సృష్టించారు. ఉదాహరణకు ఇందులో ఒక పాటను అమి జాక్సన్, రజనీల మీద ఉక్రయిన్‌లో చిత్రీకరించాలని అనుకున్నారు. సినిమాటోగ్రాఫర్ నీరవ్ షా అక్కడకు వెళ్లి లొకేషన్లను చూసుకుని వచ్చారు కూడా. కాని రజనీకాంత్ అనారోగ్యం వల్ల ఆ పని జరగలేదు. కాని శంకర్ ఉక్రయిన్ అని ఫిక్స్ అయ్యారు కదా. పాట మొత్తం ఉక్రయిన్‌లో తీసినట్టుగానే స్పెషల్ ఎఫెక్ట్స్ ద్వారా ఆ ల్యాండ్ స్కేప్స్‌ను సృష్టించారు. దీనికంతా సమయం పడుతుంది. ఈ సమయం వల్లే సినిమా ఆలస్యం అవుతున్నట్టుంది. – వెస్లీ గోపాల్ -
పక్షుల కోసం పాట
పక్షుల అంతరంగం ఎలా ఉంటుంది? వాటిని బాగా ప్రేమించేవాళ్లకు కొంత అర్థం అవుతుంది. అక్షయ్ కుమార్ కూడా పక్షి ప్రేమికుడు. టెక్నాలజీ డెవలప్మెంట్ కొన్ని పక్షుల అంతానికి కారణం అవుతోందని రగిలిపోతాడు. తన కోపాన్ని పాట రూపంలో ప్రతిబింబించాలనే ఆకాంక్షతో ఓ పాట పాడారట. ఆ పాటను కైలాష్ ఖేర్ పాడారు. ఇదంతా ‘2.0’ సినిమా గురించే. రజనీకాంత్, అక్షయ్‌కుమార్, అమీ జాక్సన్ ముఖ్య తారలుగా శంకర్ దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘2.0’. ఈ చిత్రానికి ఏఆర్. రెహమాన్ స్వరకర్త. ఎనిమిదేళ్ల క్రితం వచ్చిన ‘యందిరిన్’ (తెలుగులో ‘రోబో’) సినిమాకు సీక్వెల్ ఇది. ఈ సినిమాలో బర్డ్స్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే సాంగ్‌ను సింగర్ కైలాష్ ఖేర్ పాడారు. ప్రభాస్ నటించిన ‘మిర్చి’లో ‘పండగలా దిగివచ్చాడు’, మహేశ్ నటించిన ‘భరత్ అనే నేను’లో ‘వచ్చాడయ్యో సామీ’ సాంగ్స్‌ను పాడింది కైలాష్‌నే. ‘‘వన్ అండ్ ఓన్లీ రెహమాన్ సారథ్యంలో ‘2.0’ మూవీ కోసం ఓ బ్యూటిఫుల్ బర్డ్ సాంగ్ పాడా’’ అని పేర్కొన్నారు కైలాష్ ఖేర్. ‘2.0’ చిత్రాన్ని వచ్చే ఏడాది రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. ∙కైలాష్‌ఖేర్, ఏఆర్ రెహమాన్ -
డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా మారిన హీరోయిన్
ఇడియట్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది కన్నడ భామ రక్షిత. పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉన్న ఆమె డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. భర్త ప్రేమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘‘విలన్’’ సినిమాలో నటి అమీ జాక్సన్ పాత్రకు డబ్బింగ్ చెబుతున్నారామె. పునీత్‌రాజ్‌కుమార్ హీరోగా 2002లో వచ్చిన ‘‘అప్పు’’ సినిమాతో రక్షిత తెరంగేట్రం చేశారు. 2002లో వచ్చిన ‘‘ఇడియట్’’ తెలుగులో ఆమె మొదటి సినిమా. తెలుగులో అగ్రతారలైన చిరంజీవి, నాగార్జున, మహేశ్‌బాబులతో పలు సినిమాలలో కలిసి నటించిందామె. 2007లో కన్నడ సినిమా దర్శకుడు ప్రేమ్‌తో వివాహం అయిన తర్వాత సినిమాలకు దూరంగా ఉన్నారు. ఈ మధ్యే కొన్ని టీవీ షోలతో బిజీగా ఉన్న ఆమె మరోసారి భర్త సినిమా కోసం తన గొంతును సవరించుకున్నారు. రక్షిత మాట్లాడుతూ.. కేవలం తన పాత్రలకు మాత్రమే డబ్బింగ్ చెప్పుకున్న ఆమె ఇలా ఇతరుల పాత్రకు డబ్బింగ్ చెప్పడం కొత్తగా ఉందన్నారు. ఇలా ఇతరులక డబ్బింగ్ చెప్పడం ఇష్టంగా, చాలా సంతోషంగా ఉందన్నారు. -
స్త్రీలకు చీరే సింగారం
తమిళసినిమా: స్త్రీలకు చీరే సింగారం. ఇలా అన్నది ఎవరో తెలుసా? ఇంగ్లిష్ బ్యూటీ ఎమీజాక్సన్. ఏమిటీ ఆశ్చర్యపోతున్నారా? కొందరి మాటలకు, చేతలకు అసలు సంబంధం ఉండదంటారు. ఈ ఇంగ్లాండ్ భామ అలాంటి వారిలో ముందుంటుందని చెప్పవచ్చు. మదరాసుపట్టణం చిత్రంతో కోలీవుడ్‌కు దిగుమతి అయిన ఈ బ్యూటీ తొలి చిత్రంతోనే తమిళ ప్రేక్షకుల మనసు దోచుకుంది. ఆ తరువాత కొన్ని చిత్రాల్లో నటించినా శంకర్ దర్శకత్వం వహించిన ఐ చిత్రంలో అందాలను విచ్చలవిడిగా ఆరబోసింది. ఆ తరువాత పలు గ్లామరస్ ఫొటోలను ఇంటర్నెట్లో పోస్ట్ చేసి సంచలన నటిగా వార్తల్లోకెక్కింది. అదేమంటే తాను విదేశీ అమ్మాయిని మా కల్చర్ అంతే అంటూ ఎలాంటి తడబాటు లేకుండా బదులిచ్చేసింది. ప్రస్తుతం రజనీకాంత్‌కు జంటగా నటించిన 2.ఓ చిత్రం విడుదల కావలసి ఉండగా ఈ అమ్మడు యూరప్ దేశంలో సెటిల్ అవనున్నట్లు ప్రకటించి షాక్ ఇచ్చింది. తాజాగా ఈ బ్యూటీ చేసిన ట్విట్ ప్రేక్షకులకు మరో షాక్ అవుతోంది. అదేంటో చూద్దాం. స్త్రీలకు చీరలే సింగారం. సంప్రదాయబద్ధమైన ఆ దుస్తులే స్త్రీల్లో అణుకువను ప్రదర్శిస్తాయి.కొన్ని సమయాల్లో లెహన్కా దుస్తులు మహిళల అందాలను మెరుగుపరుస్తాయి. ఇకపోతే ఇండియా అంటే నా మనసులో ఎప్పుడూ ముఖ్యమైన స్థానం ఉంటుంది. ఇది లేటెస్ట్ ఎమీ ట్వీట్. నటి ఎమీ చేసిన ఈ ట్వీట్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తోంది అయితే భారతీయ నారీ సంప్రదాయ చీరకట్టు ఇప్పుడు పాశ్చాత్య దేశాలను ఆకర్షిస్తుందన్నది గమనార్హం. -
2.ఓలో ఐష్ కూడా ఉందా?
తమిళ సినిమా : 2.ఓ చిత్రంలో అందాల భామ ఐష్ కూడా ఉందా? ఈ ప్రశ్నకు తాజాగా అవుననే సమాధానం కోలీవుడ్ వర్గాల నుంచి రావడం విశేషం. ఇంతకు ముందు సూపర్‌స్టార్ రజనీకాంత్, ప్రంపంచ సుందరి ఐశ్వర్యారాయ్ కలిసి నటించిన చిత్రం ఎందిరన్ (తెలుగులో రోబో). శంకర్ దర్శకత్వం వహించిన ఆ చిత్రం సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. సాంకేతిక పరిజ్ఞానంలో హాలీవుడ్‌కు దీటుగా నిలిచిన చిత్రం ఎందిరన్. అలాంటి చిత్రానికి సీక్వెల్‌గా నిర్మాణంలో ఉన్న సినిమా 2.ఓ. అయితే ఇందులో బ్రిటీష్ భామ ఎమీజాక్సన్ రజనీకాంత్‌కు జంటగా నటించే లక్కీచాన్స్‌ను దక్కించుకుంది. ప్రతినాయకుడిగా బాలీవుడ్ స్టార్ అక్షయ్‌కుమార్ నటించారు. ఏఆర్.రెహ్మాన్ సంగీత బాణీలు కడుతున్న ఈ చిత్రాన్ని సుమారు రూ.450 కోట్ల వ్యయంతో లైకా సంస్థ నిర్మిస్తోంది. షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని గ్రాఫిక్స్ వర్క్‌లో ఉన్న 2.ఓ సినిమాకు సంబంధించి అధికారిక సమాచారం పెద్దగా బయటకు రాలేదు. ఈ ఏడాది చివరిలో తెరపైకి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్న ఈ భారీ చిత్రంలో నటి ఐశ్వర్యారాయ్ కూడా నటించారన్న ప్రచారం తాజాగా సోషల్ మీడియాల్లో వైరల్ అవుతుండడం విశేషం. 2.ఓ చిత్రంలో ఐశ్వర్యారాయ్ ఒక కీలక పాత్రలో మెరవబోతున్నట్లు, ఎందిరన్ చిత్రానికి, 2.ఓ చిత్రానికి కమ్యూనికేషన్ కల్పించే విధంగా ఐష్ పాత్ర ఉంటుందని, ఈ విషయాన్ని ఆమె పాత్రకు డబ్బింగ్ చెప్పిన డబ్బింగ్ కళాకారిణి సబిత వెల్లడించినట్లు సోషల్ మీడియాల్లో ప్రచారం హల్చల్ చేస్తోంది. అయితే చిత్రం విడుదల ముందు వరకూ ఏ విషయాన్ని వెల్లడించని దర్శకుడు శంకర్ ఇప్పుడీ సంచల వార్తపై అయినా తమ మౌనం వీడతారా?లేక అదీ చిత్ర ప్రచారంలో ఒక భాగం అవుతుందని సైలెంట్ అవుతారా అన్నది వేచి చూడాలి. -
ఇక సినిమాలకు గుడ్‌బై!
సాక్షి, సినిమా: జీవితం మన చేతుల్లో ఉండదు అనడానికి చాలా ఉదాహరణలే ఉంటాయి. అదే విధంగా ఈ నాగరిక యుగంలో ప్రపంచం ఇప్పుడు చాలా చిన్నదైపోయింది. రేపన్నది ఎక్కడో, ఎలా ఉంటుందో ఎవరూ ఊహించలేరు. ఉత్తరాదికి చెందిన నటి శ్రియ రష్యాకు చెందిన యువకుడిని పెళ్లాడింది. ఇలా ఎవరి జీవితం ఎవరితో ముడిపడుతుందో తెలియదు. నటి ఎమీజాక్సన్ విషయాన్నే తీసుకుంటే ఎక్కడో కెనడాకు చెందిన ఈ అమ్మడు దర్శకుడు విజయ్ దృష్టిలో పడడం, మదరాసుపట్టణం చిత్రంతో కోలీవుడ్‌లో హీరోయిన్ పరిచయం అవడం అన్నది ఆమే ఊహించి ఉండదు. కోలీవుడ్ నుంచి టాలీవుడ్, బాలీవుడ్‌కు వెళ్లిన ఎమీజాక్సన్ తమిళంలోనే ఎక్కువ చిత్రాలను చేసింది. స్టార్ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో నటించే అవకాశాలను రెండుసార్లు దక్కించుకున్న అతి తక్కువ మంది నటీమణుల్లో ఎమీ ఒక్కరు. ఐ చిత్రంలో విక్రమ్ సరసన నటించి అందాల మోత మోగించిన ఎమీ ప్రస్తుతం రజనీకాంత్‌తో జత కట్టిన 2.ఓ చిత్రం విడుదలకు ముస్తాబవుతోంది. ఇందులో రోబోగా అదరగొట్టనుందనే ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రం విడుదలనంతరం తనకు మరిన్ని అవకాశాలు వస్తాయనే ఆశాభావాన్ని వ్యక్తం చేసిన ఈ భామ ఆ చిత్రం విడుదల వాయిదా పడుతూ వస్తుండడం, కొత్త అవకాశాలు రాకపోవడం వంటివి నిరాశప రిచాయ నే చెప్పాలి. అయితే ఆంగ్ల సీరియల్లో నటిస్తున్న ఎమీ తాజాగా తన అభిమానులకు షాక్ ఇచ్చే నిర్ణయాన్నే తీసుకుందనే ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. భారతీయ సినిమాలకు ఇక టాటా అని, తాను ఆఫ్రికన్ దేశంలోని మొరాకోలో సెటిల్ అవ్వబోతున్నానని ఎమీ చెప్పిందన్నదే ఆ ప్రచారం. ఇదే నిజం అయితే ఆమె అభిమానులకు నిరాశకలిగించే విషయమే అవుతుంది. -
అమీ జాక్సన్.. పెళ్లి బాజాలు..!
సాక్షి, హైదరాబాద్ : సౌత్ ఇండియన్ హీరోయిన్ అమీ జాక్సన్ డేటింగ్లో ఉన్నారా?. ఆమె ఇన్‌స్టా ఫొటోలు ఈ విషయాన్నే ధ్రువపరుస్తున్నాయి. బ్రిటిష్ రియల్ ఎస్టేట్ వ్యాపారి జార్జ్ పనయిటోతో అమీ ప్రేమలో ఉన్నట్లు సమాచారం. త్వరలో వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారనే ఊహాగానాలు కూడా సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. జార్జ్‌కు లగ్జరీ హోటల్స్ కూడా ఉన్నాయి. కాగా, రోబో 2.0లో అమీ నటిస్తున్న విషయం తెలిసిందే. The look of sheer joy after making it down the kids slope. G was not impressed 🙃 A post shared by Amy Jackson (@iamamyjackson) on Feb 12, 2018 at 9:51am PST -
ఏం చేసినా స్టైల్గానే ఉంటుంది : అక్షయ్
దేశంలోనే భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న 2.ఓ సినిమాలో నటించటంపై బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ స్పందించారు. జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్య్వూలో రజనీకాంత్‌తో కలిసి నటించటం ఆనందంగా ఉందని తెలిపారు. అంతేకాదు రజనీ స్టైల్ కు సంబంధించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ‘ఒక రోజు సెట్ లో తరువాతి షాట్ కోసం రెడీ అవుతున్నాం. ఆ సమయంలో రజనీ తన ప్యాంట్‌కు అంటుకున్న దుమ్మును దులుపుకుంటున్నారు. ఆయన ఎంత స్టైల్‌గా ఆ పనిచేస్తున్నారంటే.. యూనిట్ అంతా ఆయన్ని అలా చూస్తూ ఉండిపోయాం. ఆయన ఏం చేసినా అంత స్టైల్ గా ఉంటుంది. ఆయన చేతిలో దెబ్బలు తినటాన్ని కూడా ఎంజాయ్ చేస్తా ’ అన్నారు. 2.ఓ సినిమాలోని ఆయన పాత్ర గురించి మాట్లాడిన అక్షయ్ ‘పోస్టర్లోనే చెప్పినట్టుగా సినిమాపై వస్తున్న వార్తలన్ని అబద్ధం. ఎవరికీ ఏమీ తెలియదు. మాకు ఏ విషయం బయటకు చెప్పే అధికారం లేదు. కానీ సినిమా చూసినప్పుడు అందరూ సర్ప్రైజ్ అవుతారు. చాలా మంది ప్రతినాయక పాత్ర ఎందుకు చేశావని అడుగుతున్నారు. ఎందుకు చేయకూడదు..? విలన్ ఉన్నప్పుడే.. హీరో ఉంటాడు. దేశంలోనే భారీ బడ్జెట్ సినిమాలో నటిస్తానని నేనెప్పుడూ ఊహించలేదు. అలాంటి అవకాశం వచ్చిన ఎలా వదులుకుంటా’మని తెలిపారు. -
2.ఓ టీజర్ రిలీజ్‌కు డేట్ ఫిక్స్..!
సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న భారీ చిత్రం 2.ఓ. గతంలో రజనీ, శంకర్ల కాంబినేషన్లో రూపొందింన రోబో సినిమాకు సీక్వల్గా తెరకెక్కుతున్న ఈసినిమాలో బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ప్రతీనాయక పాత్రలో నటిస్తున్నారు. బ్రిటీష్ బ్యూటీ అమీజాక్సన్ హీరోయిన్గా కనిపించనున్నారు. శంకర్ అత్యున్నత సాంకేతిక విలువలతో పూర్తిస్థాయి త్రీడి చిత్రంగా 2.ఓను రూపొందిస్తున్నారు. దాదాపు 450 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈసినిమాను వేసవి కానుకగా ఏప్రిల్ 14న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అంతర్జాతీయ స్థాయిలో రిలీజ్ అవుతున్న ఈ సినిమా ప్రచార కార్యక్రమాలను ప్రారంభించేందుకు రెడీ అవుతోంది చిత్రయూనిట్. అందులో భాగంగా జనవరి 6న చిత్ర టీజర్ ను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఒకేసారి తమిళ, తెలుగు, హిందీ భాషల్లో టీజర్ రిలీజ్ చేయనున్నారన్న ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వార్తలపై చిత్రయూనిట్ ఇంత వరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. -
‘2.ఓ’ మళ్లీ వాయిదా..?
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న భారీచిత్రం 2.ఓ. కోలీవుడ్ గ్రేట్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా గతంలో ఘనవిజయం సాధించిన రోబోకు కొనసాగింపుగా తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని 2018 ఏప్రిల్‌లో రిలీజ్ చేయనున్నట్టుగా ప్రకటించారు చిత్రయూనిట్. అయితే అయితే ఏప్రిల్ 13నే సినిమా రిలీజ్ ఉంటుందన్న టాక్ వినిపించింది. ముందుగా ఈ సినిమాను సంక్రాంతికే రిలీజ్ చేయాలని భావించినా.. నిర్మాణాంతర కార్యక్రమాలు మరింత సమయం పడుతుండటంతో వాయిదా వేశారు. అయితే తాజాగా ఈ సినిమా రిలీజ్ మరింత ఆలస్యమవుతుందన్న ప్రచారం జరుగుతోంది. విశాల్ హీరోగా తెరకెక్కుతోన్న సెండకోళై 2 (తెలుగులో పందెంకోడి సినిమాకు సీక్వల్) రిలీజ్ డేట్‌ను ప్రకటించటంతో 2.ఓ రిలీజ్ పై అనుమానాలు మరింత ఎక్కువయ్యాయి. విశాల్ హీరోగా తెరకెక్కిన ఇరుంబుతురై (అభిమన్యుడు) సినిమా ఆడియో రిలీజ్ వేడుకలో మాట్లాడిన విశాల్ తన తదుపరి చిత్రం సెండకోళై 2ను ఏప్రిల్ 14న రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించాడు. దీంతో ఏప్రిల్ 13న 2.ఓ రిలీజ్ లేదని ఫిక్స్ అవుతున్నారు చిత్రవర్గాలు. అంతేకాదు ఏప్రిల్ 27న 2.ఓ ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. మరి ఏప్రిల్ నెలాఖరునైనా రోబో థియేటర్లలో సందడి చేస్తుందేమో చూడాలి. రజనీకాంత్, అమీజాక్సన్ లు హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ప్రతినాయకుడిగా నటిస్తున్నాడు. -
తలైవా అభిమానుల నిరుత్సాహం
తమిళసినిమా: సూపర్‌స్టార్ రజనీకాంత్ నటిస్తున్న తాజా చిత్రాల్లో 2.ఓ చిత్రం ఒకటి. స్టార్ దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ రూ.400కోట్లకు పైగా బడ్జెట్‌తో నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఇంగ్లీష్ బ్యూటీ ఎమీజాక్సన్ నాయకిగా నటించిన ఇందులో బాలీవుడ్ స్టార్ నటుడు అక్షయ్‌కుమార్ ప్రతినాయకుడిగా నటించారు. సంగీత మాంత్రికుడు ఏఆర్.రెహ్మాన్ సంగీత బాణీలను కట్టిన ఈ చిత్ర ఆడియో ఇటీవల దుబాయిలో బ్రహ్మండంగా నిర్వహించారు. 2.ఓ చిత్రాన్ని శంకర్ 3డీ ఫార్మాట్లో తెరెక్కిస్తున్నారు. రజనీ అభిమానులైతే చిత్రం ఎప్పుడు విడుదలవుతుందా? అని ఆతృతగా ఎదురు చూస్తున్నారు. కాగా 2.ఓ చిత్రాన్ని నిర్మాతలు మొదట దీపావళి సందర్భంగా విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. అయితే చిత్రీకరణ పూర్తి కాకపోవడంతో రజనీ పుట్టిన రోజు సందర్భంగా డిసెంబరు 12న తెరపైకి తీసుకురానున్నట్లు వెల్లడించారు. అప్పుటికీ గ్రాఫిక్స్ వర్క్ మిగిలిపోవడంతో జనవరిలో విడుదల గ్యారెంటీ అని నిర్వాహకుడు రాజు మురుగన్ నొక్కి వక్కాణించారు. ఇలా 2.ఓ విడుదల వాయిదాలతో రజనీ అభిమానులు నిరుత్సాహ పడుతున్నారు. తాజాగా మరోసారి 2.ఓ వాయిదా పడింది. ఎకంగా ఏప్రిల్‌లో విడుదల చేయనున్నట్టు ప్రకటన వెలువడింది. గ్రాఫిక్స్ పనులు పూర్తి కాకపోవడంతో చిత్ర విడుదలను నాలుగోసారి వాయిదా వేయవలసి వచ్చిందని చిత్ర వర్గాలు వెల్లడించాయి. 2.ఓను జనవరిలో విడుదల చేస్తే, కాలా ను నిర్మాత ధనుష్ ఏప్రిల్‌లో విడుదల చేయవచ్చనే భావనతో ఉన్నారనే ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. -
డీ గ్యాంగ్!
అమెరికా నుంచి అమీ జాక్సన్ ఇండియా రావాలి. ఓస్.. అంతేనా? ఫ్లైట్ ఎక్కితే ఇక్కడ ల్యాండ్ అయిపోవచ్చు. అంతా సజావుగా జరిగితే అలానే జరుగుతుంది. కానీ, అమీకి వీసా ప్రాబ్లమ్ వచ్చింది. దాంతో అక్కడే ఆగిపోవాల్సి వచ్చింది. ఇక్కడేమో కన్నడ సినిమా ‘ది విలన్’ షూటింగ్ ఆగింది. అందులో అమీ నటిస్తున్నారు కదా మరి. ఈ బ్యూటీ రాక కోసం ప్రధాన తారాగాణం శివరాజ్ కుమార్, సుదీప్, చిత్రదర్శకుడు కిరణ్ కుమార్ (స్క్రీన్ నేమ్ ప్రేమ్) వెయిటింగ్. ఎట్టకేలకు అమీ వీసా ప్రాబ్లమ్ సాల్వ్ అయింది. కర్ణాటకలోని మైసూర్లో ల్యాండ్ అయిపోయారు. ప్రస్తుతం ఈ సినిమాలోని ఫస్ట్ సాంగ్‌ను మైసూర్లో షూట్ చేస్తున్నారు. సారీ.. ఒక్క క్షణం ఆగండి. మ్యాటర్ చదవడానికి స్మాల్ బ్రేక్ ఇచ్చి, కింద ఉన్న ఫొటోవైపు ఓ లుక్ వేయండి. అక్కడ సుదీప్, ప్రేమ్ నోట్లో బిడీ పెట్టుకుని కనిపిస్తున్నారు కదా! ఫొటో గురించి ప్రేమ్ మాట్లాడుతూ– ‘‘కేడీ గ్యాంగ్ కాదు. బీడీ గ్యాంగ్. ఫన్ టైమ్. షూట్ టైమ్‌లో అమీతో కలసి ఇలా ఫొటోకు పోజిచ్చాం. సాంగ్ షూట్లో భాగంగానే నోట్లో బీడీ పెట్టుకున్నాం. మరోలా అనుకోకండి. ధూమపానం ఆరోగ్యానికి హానికరం’’ అని పేర్కొన్నారు. ‘‘ఇలాంటి క్రేజీ ప్రాజెక్ట్‌లో నటిస్తుండటం చాలా ఆనందంగా ఉంది’’ అన్నారు అమీ. -
అంతేనా.. ఎమీ?
తమిళసినిమా: అంతేనా ఎమీ? కుదిరితే కొన్ని చిత్రాలు, అందులో మరికొన్ని రొమాన్స్ సీన్స్ అందించే అవకాశం ఉండదా? ఇది ఇంగ్లిష్ బ్యూటీ ఎమీజాక్సన్ గురించి ఆమె అభిమానుల అభిప్రాయం. ఇంతకీ ఏమిటీ ఎమీ గోల అనేగా మీ ఆసక్తి. మదరాసుపట్టణం చిత్రంతో కోలీవుడ్‌కు, ఇంకా చెప్పాలంటే భారతీయ వెండి తెరకు పరిచయమైన నటి ఎమీజాక్సన్. ఆ చిత్రం ఒక్కటే ఈ అమ్మడికి సరైన సక్సెస్ ఇచ్చింది. ఆ తరువాత బహుళ ప్రాచుర్యం పొందిన చిత్రం ‘ఐ’. ఆ చిత్రం ప్రేక్షకుల మధ్య మిశ్రమ ఆదరణ అందుకుంది. అయితే ఆ చిత్రంలో హద్దుల అంచుల వరకూ అందాలను ఆరబోసి అభిమానులను ఖుషీ పరిచింది. అందుకే ఎమీ కోలీవుడ్‌లో తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకుంది. అంతే కాదు కోలీవుడ్‌నే నమ్ముకుని ఇక్కడే మకాం పెట్టింది. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు జంటగా నటించిన 2.ఓ చిత్రంలో నటించింది. ఈ చిత్రం కోసం రజనీకాంత్ సహా చిత్ర వర్గాలు, సినీ వర్గాలు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. అయితే ఎమీ కూడా 2.ఓ చిత్రం అందించే విజయం కోసం ఎదురు చూస్తోందని అందరూ అనుకుంటున్నారు. నిజమే ఇంతకు ముందు తనూ అలాంటి స్టేట్‌మెంటొకటి చేసింది. ఈ చిత్రం విజయం ఎమీకి చాలా అవసరం కూడా. ఎందుకంటే ఈ జాణకు చేతిలో ఏ భాషలోనూ ఒక్క చిత్రం కూడా లేదు. అయినా ఇలాంటివేవీ పట్టించుకోకుండా హాలీవుడ్ సూపర్ గర్ల్ సీరీస్‌లో నటించడానికి అమెరికాలోని లాస్ఏంజిల్స్కు పరిగెత్తింది. అంత వరకూ బాగానే ఉంది. అమ్మడు ఇక 2018 వరకూ ఇదే నా ఇల్లు అంటూ ట్విట్టర్లో పోస్ట్ చేసి ఇండియన్ అభిమానులకు పెద్ద షాక్ ఇచ్చింది. దీంతో అంతేనా కుదిరినప్పుడైనా కోలీవుడ్‌లో కొన్ని చిత్రాలు లేదా సింగిల్ సాంగ్స్‌లో రొమాన్స్ చేసే అవకాశం లేదా అంటూ ఎమీ అభిమానులు ట్విట్టర్లో అడుగుతున్నారు. మరి వారి కోసం అయినా ఎమీ మనసు మార్చుకుంటుందో, లేదో చూడాలి. -
కుదిరితే కొన్ని చిత్రాలు.. రొమాన్స్ సీన్స్ !
చెన్నై: అంతేనా ఎమీ? కుదిరితే కొన్ని చిత్రాలు, అందులో మరికొన్ని రొమాన్స్ సీన్స్ అందించే అవకాశం ఉండదా? ఇది ఇంగ్లీష్ బ్యూటీ ఎమీజాక్సన్ గురించి అభిమానుల అభిప్రాయం. ఇంతకీ ఏమిటీ ఎమీ గోల అనేగా మీ ఆసక్తి. మదరాసుపట్టణం చిత్రంతో కోలీవుడ్‌కు పరిచయమైన నటి ఎమీజాక్సన్. ఆ చిత్రం ఒక్కటే ఈ అమ్మడికి సరైన సక్సెస్. ఆ తర్వాత బహుళ ప్రాచుర్యం పొందిన చిత్రం ‘ఐ’.. ఆ చిత్రం ప్రేక్షకుల మధ్య మిశ్రమ ఆదరణే అందుకుంది. అయితే ఆ చిత్రంలో హద్దుల అంచుల వరకూ అందాలను ఆరబోసి అభిమానులను ఖుషీ పరిచింది. అందుకే ఎమీ కోలీవుడ్‌లో తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకుంది. అంతేకాదు కోలీవుడ్‌నే నమ్ముకుని ఇక్కడే మక్కాం పెట్టింది. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు జంటగా 2.ఓ చిత్రంలో నటించింది. ఈ చిత్రం కోసం రజనీ సహా చిత్ర వర్గాలు, సినీ వర్గాలు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. అయితే ఎమీ కూడా 2.ఓ చిత్రం అందించే విజయం కోసం ఎదురు చూస్తోందని అనుకుంటున్నారు. నిజమే ఇదివరకూ ఆమె అలాంటి స్టేట్మెంట్ ఒకటి చేసింది. ఈ చిత్రం విజయం ఎమీకి చాలా అవసరం కూడా. ఎందుకంటే ఈ జాణకు చేతిలో ఏ భాషలోనూ ఒక్క చిత్రం కూడా లేదు. ఇవేవీ పట్టించుకోకుండా హాలీవుడ్ సూపర్ గర్ల్ సిరీస్‌లో నటించడానికి అమెరికాలోని లాస్ఏంజెల్స్కు పరిగెత్తింది. అంత వరకూ బాగానే ఉంది. ఈ అమ్మడు ఇక 2018 వరకూ ఇదే నా ఇల్లు అన్ని ట్విట్టర్లో పోస్టు చేసి ఇండియన్ అభిమానులకు పెద్ద షాక్ ఇచ్చింది. దీంతో అంతేనా కుదిరినప్పుడైనా కోలీవుడ్‌లో కొన్ని చిత్రాలు లేదా సింగిల్ సాంగ్స్‌లో రొమాన్స్ చేసే అవకాశం లేదా అని ఎమీ అభిమానులు ట్విట్టర్లో అడుగుతున్నారు. మరి అభిమానుల కోసం అయినా ఎమీ మనసు మార్చుకుంటుందో.. లేదో చూడాలి. -
డ్రీమ్ బాయ్ సల్మానే!
ఎవరికి? ఇంకెవరికీ? ఫొటోలో అందంగా కనిపిస్తున్న అమీ జాక్సన్‌కే. ఆమె ఫిల్మీ డ్రీమ్ బాయ్ సల్మానే! అదీ ఇప్పట్నుంచి కాదు... ఎప్పట్నుంచో! ఈ మాట సల్మాన్ చెవిలోనూ వేశారట. బట్, బీటౌన్ బాయ్ ఈ బ్రిటన్ బ్యూటీకి ఇంకా చాన్స్ ఇవ్వలేదు. ఈ మాటలు చెబుతున్నది ఎవరో కాదు... అమీనే. తప్పకుండా ఏదొక రోజు చాన్స్ వస్తుందనే నమ్మకం ఆమెలో ఉందట. తమిళ్లో రజనీకాంత్, విజయ్, హిందీలో అక్షయ్‌కుమార్, తెలుగులో రామ్‌చరణ్ వంటి స్టార్ హీరోలతో నటించారీ బ్యూటీ! మీకు ఎవరితోనైనా నటించాలనే డ్రీమ్ ఉందా? అని అమీని అడగ్గా.. ‘‘ఇట్స్ ఎ డ్రీమ్ టు వర్క్ విత్ సల్మాన్. నేనెప్పుడు అతణ్ణి కలసినా ఈ మాటే చెబుతుంటా. మేమిద్దరమూ సిన్మా చేసే అంశమై డిస్కషన్స్ జరుగుతాయి. సల్మాన్ నిర్మించిన సినిమాలో నటించా కానీ, ఆయన సరసన నటించే చాన్స్ కోసం వెయిట్ చేస్తున్నా’’ అని పేర్కొన్నారు. గతేడాది సల్మాన్ నిర్మించిన హిందీ సినిమా ‘ఫ్రీకీ అలీ’లో అమీ నటించారు. అప్పట్లో వీళ్లు ప్రేమలో ఉన్నారనే ప్రచారం జరిగింది. ముంబైలో జరిగిన ‘2.0’ ఫస్ట్ లుక్ లాంచ్‌కి సల్మాన్‌ను పిలవకున్నా... అమీ కోసం వచ్చాడనే గుసగుసలు కూడా విన్పించాయి. హిందీలో చాలా మంది హీరోయిన్ల కెరీర్‌కు బూస్టప్ ఇచ్చినట్టు తన సరసన చాన్స్ ఇచ్చి అమీకీ సల్మాన్ బూస్టప్ ఇస్తాడా? వెయిట్ అండ్ సీ!! ఇప్పుడు అమెరికన్ టీవీ సిరీస్ ‘సూపర్‌గాళ్’లో నటిస్తున్నారీమె. -
క్వీన్ రీమేక్‌లో కొత్త ట్విస్ట్
బాలీవుడ్లో ఘనవిజయం సాదించిన క్వీన్ సినిమాను సౌత్ లో రీమేక్ చేసేందుకు చాలా కాలంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎన్నో మార్పులు చేర్పులు తరువాత తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ భాషల్లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. ఇప్పటికే కన్నడ వర్షన్ షూటింగ్ పూర్తికావస్తుండగా తెలుగు, తమిళ భాషల్లో త్వరలో ప్రారంభం కానుంది. అంతా ఓకే అనుకుంటున్నసమయంలో ఈ టీంకు మరో షాక్ తగిలింది. హిందీలో లిసా హెడెన్ నటించిన పాత్రకు తెలుగు తమిళ భాషల్లో అమీజాక్సన్‌ను తీసుకున్నారు. అయితే ఈ సినిమాల షూటింగ్ సమయంలో అమీకి ఓ ఇంగ్లీష్ వెబ్ సీరీస్ లో ఆఫర్ రావటంతో క్వీన్ రీమేక్ నుంచి తప్పుకుంది. దీంతో చిత్రయూనిట్ ఆ పాత్రకు మరో నటిని ఎంపిక చేసే పనిలో పడ్డారు. ఈ ‘క్వీన్’ పేరుతోనే తెరకెక్కుతున్న తెలుగు రీమేక్‌లో తమన్నా హీరోయిన్గా నటిస్తుండగా ‘పారిస్ పారిస్’ పేరుతో తెరకెక్కుతున్న తమిళ రీమేక్‌లో కాజల్ హీరోయిన్గా నటిస్తోంది. -
2.0... రోబో సీక్వల్ కాదట..!
దక్షిణాదిలో భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సినిమా 2.0. ఈ సినిమాతో బాహుబలి రికార్డులు కూడా చెరిగిపోతాయని భావిస్తున్నారు. శంకర్, రజనీకాంత్, అక్షయ్ కుమార్ ల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా గతంలో రజనీ హీరోగా తెరకెక్కిన రోబో సీక్వల్ అని భావించారు. సినిమాలో రజనీ ఒక పాత్రలో రోబోగా కనిపించనుండటంతో రోబో సీక్వలే అని ఫిక్స్ అయ్యారు ఫ్యాన్స్. అయితే తాజాగా సినిమా కథా కథనాల మీద క్లారిటీ ఇచ్చిన దర్శకుడు శంకర్. రోబో సినిమాకు 2.0 కు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. కేవలం రోబో సినిమాలోని కొన్ని పాత్రలను మాత్రమే ఈ సినిమా కంటిన్యూ చేశామని పూర్తిగా కొత్త కథా కథనాలతో 2.0ను తెరకెక్కించామని తెలిపారు. ప్రస్తుతం ఆఖరి పాట షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను 2018 జనవరిలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. -
రోబోటిక్ పాప్... రజనీ.. అమీ టు రాక్!
రజనీకాంత్ ‘2.0’లో హీరో హీరోయిన్ల మధ్య ఒక్కటంటే ఒక్క పాటే ఉంటుందట. అదీ రోబోటిక్ పాప్ సాంగ్! ఆల్మోస్ట్ ఓ వారం నుంచి ఈ పాట కోసం ఫుల్లుగా ప్రాక్టీస్ చేస్తున్నారు హీరోయిన్ అమీ జాక్సన్. నిన్నటితో ప్రాక్టీస్‌కి ఫుల్స్టాప్ పడింది. ఎందుకంటే... ఈ రోజు నుంచి చెన్నైలో ఈ సాంగ్ షూటింగ్ మొదలవుతోంది. దీని కోసం స్పెషల్‌గా రెండు సెట్స్ వేశారు. అందులో ఓ సెట్ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ కొత్తగా కట్టిన ఫిల్మ్ స్టూడియోలో వేశారని సమాచారం. రెహమాన్ స్టూడియోలో షూటింగ్ జరుపుకోనున్న ఫస్ట్ సినిమా రజనీది కావడం విశేషం. నాలుగు రోజుల్లో ఈ పాటను పూర్తి చేయడానికి ప్లాన్ చేశారట. ఈ సాంగ్‌లో స్పెషాలిటీ ఏంటంటే... చిన్న బిట్‌ను పాప్ కింగ్ మైకేల్ జాక్సన్‌ను మరిపించేలా తీస్తారట! ఈ పాటతో ‘2.0’ చిత్రీకరణ అంతా పూర్తయినట్లే. చిన్న చిన్న ప్యాచ్ వర్క్స్ ఏవైనా ఉంటే తర్వాత షూటింగ్ చేయాలనుకుంటున్నారు. శంకర్ దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ స్వరకర్త. ఈ నెల 27న దుబాయ్‌లో పాటల్ని, వచ్చే ఏడాది జనవరి 25న చిత్రాన్ని విడుదల చేయనున్నారు. -
ఎన్టీఆర్... అంతా ఉత్తిదే!?
అమీని ఎట్రాక్ట్ చేసే ఆఫరే... నిజమయితే!? కానీ, అందులో నిజమెంత? అనేది క్వశ్చన్ మార్క్! ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా ఓకే అయిన సంగతి తెలిసిందే. ఈ సిన్మాకి కథ ఓకే... క్యారెక్టరైజేషనూ (హీరోది) ఓకే... కెమెరాకు క్లాప్ బోర్డు కొట్టే అంశంలోనూ హీరో–దర్శకులు ఓ నిర్ణయానికి (త్వరలో పూజ చేసి, వచ్చే ఏడాది మార్చిలో సెట్స్‌కి వెళ్లాలనుకుంటున్నారట!) వచ్చేశారు. కానీ, ఇంకా కథానాయిక ఓకే కాలేదు. ఆ ఛాన్స్ అమీ జాక్సన్‌కి వచ్చిందని ఫిల్మ్‌నగర్‌లో కొందరి గుసగుస. అసలు మేటర్ ఏంటంటే... ప్రస్తుతం పవన్‌కల్యాణ్ 25వ సినిమా షూటింగులో త్రివిక్రమ్ బిజీ. అందులో ఓ హీరోయిన్గా నటిస్తోన్న అనూ ఇమ్మాన్యుయేల్నే ఎన్టీఆర్ సినిమాకీ ఎంపిక చేశారట! సో, అమీ న్యూస్ ఉత్తిదేనట. అయినా... ఎన్టీఆర్ సిన్మా ఆర్టిస్టుల సెలక్షన్ గురించి పవన్ సినిమా పూర్తయిన తర్వాతే త్రివిక్రమ్ ఆలోచిస్తారని చిత్రనిర్మాణ సంస్థ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సన్నిహిత వర్గాల సమాచారం. -
ఎన్టీఆర్, త్రివిక్రమ్ సినిమాలో క్రేజీ హీరోయిన్
సాక్షి, హైదరాబాద్ : జైలవకుశతో హిట్‌కొట్టిన తారక్ మరో చిత్రానికి సన్నద్దమౌతున్నాడు. బాబీ దర్శకత్వంలో తారక్ త్రిపాత్రాభినయం అటు అభిమానులను, ప్రేక్షకులను కట్టిపడేసింది. దసరా బరిలో నిలిచిన ఈ చిత్రం తాజాగా వందకోట్ల క్లబ్లో చేరింది. దీంతో అభిమానుల ఆనందానికి హద్దులేకుండా పోయింది. ఈ ఉత్సాహంతో తన తదుపరి చిత్రానికి రెడీ అవుతున్నాడు ఈజైలవకుశ. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో భారీ తారాగణంతో ఆ చిత్రం తెరకెక్కనుంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చిత్రంతో బిజీగా ఉన్న త్రివిక్రమ్ ఆ తర్వాతి చిత్రం జూనియర్ ఎన్టీఆర్‌తో తీయనున్నాడు. ఇందుకోసం ఇప్పటికే నటీనటుల ఎంపిక జోరందుకుందని సమాచారం. తాజాగా దీనికి సంబంధించిన వార్త టాలీవుడ్లో హల్చల్ చేస్తోంది. తారక్ హీరోగా తెరకెక్కుతున్న ఈచిత్రంలో క్రేజీ హీరోయిన్ నటించబోతోందని సమాచారం. ఎవడు, ఐ చిత్రాల ద్వారా సుపరిచితమైన అమీజాక్సన్ ఇందులో హీరోయిన్గా చేయబోతున్నట్లు టాలీవుడ్ టాక్. ఫ్యామిలీ చిత్రాలు తెరకెక్కించడంలో సిద్దహస్తుదైన త్రివిక్రమ్, ఎన్టీఆర్‌తో కుటుంబ విలువలు నేపథ్యంలో జరిగే ఓ మాస్ సినిమాను తీయబోతున్నారని తారక్ అభిమానులు ఆనందంలో ఉన్నారు. -
అమీఃఅమెరికన్ టీవీ సూపర్‌గాళ్
‘క్వాంటికో’తో ప్రియాంకా చోప్రా, ఇప్పుడు ‘సూపర్ గాళ్’తో అమీ జాక్సన్... ఈ లిస్టులో చేరబోయే నెక్ట్స్ ఇండియన్ హీరోయిన్ ఎవరో మరి! అమీది బ్రిటన్ అయినా.. ఇండియన్ సినిమాలతోనే హీరోయిన్గా పేరొచ్చింది. ఇండియాలో ఆమెకున్న ఫాలోయింగ్ చూసే అమెరికన్ టీవీ సిరీస్ ‘సూపర్ గాళ్’లో ఇంపార్టెంట్ రోల్ ఇచ్చారట! అందులో అమీ ‘సాటర్న్ గాళ్’ క్యారెక్టర్లో కనిపించనున్నారు. వచ్చే నెల 9వ తేదీ నుంచి సీడబ్ల్యూ ఛానల్లో ‘సూపర్ గాళ్’ టెలికాస్ట్ కానుంది. సినిమాల సంగతికొస్తే... హిందీ హిట్ ‘క్వీన్’ సౌతిండియన్ రీమేక్స్‌తో పాటు కన్నడ ‘విలన్’లో అమీ నటిస్తున్నారు. రజనీకాంత్ పక్కన ఆమె హీరోయిన్గా నటించిన ‘2.0’ వచ్చే ఏడాది జనవరిలో విడుదల కానుంది. -
సూపర్‌స్టార్ అభిమానులకు శుభవార్త
తమిళసినిమా: సూపర్‌స్టార్ రజనీకాంత్ ప్రస్తుతం రెండు భారీ చిత్రాల్లో నటిస్తున్న విషయం తెలిసిందే. అందులో ఒకటి 2.ఓ. సుమారు రూ.400 కోట్ల వ్యయంతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని స్టార్ డైరెక్టర్ శంకర్ అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అణువణువు చెక్కుతున్నారు. ఇంగ్లిష్ భామ ఎమీజాక్సన్ కథానాయకిగా నటించి న ఈ చిత్రం ద్వారా బాలీవుడ్ స్టార్ నటుడు అక్షయ్‌కుమార్ విలన్‌గా మారడం విశేషం. 2.ఓ చిత్రం ఒక్క పాట మినహా చిత్రీకరణ పూర్తి చేసుకుంది. త్వరలోనే ఆ పాటను పూర్తి చేయనున్న శంకర్ ప్రస్తుతం చిత్ర నిర్మాణాంతర కార్యక్రమాల్లో పూర్తిగా నిమగ్నమై ఉన్నారు. కాగా ఈ చిత్రం విడుదల కోసం రజనీకాంత్ అభిమానులు ఎన్నో అంచనాలతో ఎదురుచూస్తున్నారు. వారి కోసం ఒక స్పష్టమైన సమాచారాన్ని అందిస్తున్నాం. 2.ఓ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని అక్టోబర్ నెల 27వ తేదీన దుబాయ్‌లోని బూర్జ్‌పార్క్‌లో భారీ ఎత్తున నిర్వహించనున్నట్లు లైకా సంస్థ నిర్వాహకుడు రాజుమహాలింగం వెల్లడించారు. ఈ వేదికపై చిత్ర సంగీతదర్శకుడు ఏఆర్.రెహ్మాన్ బ్రహ్మండ సంగీత కచ్చేరి ఉంటుందని చెప్పారు. అదే విధంగా చిత్ర టీజర్‌ను నవంబర్‌లో హైదరాబాద్‌లో నిర్వహించనున్నామని తెలిపారు. ఇక రజనీకాంత్ పుట్టినరోజు డిసెంబర్ 12 చెన్నైలో 2.ఓ చిత్ర ట్రైలర్ విడుదల వేడుకను నిర్వహించనున్నట్లు, చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా 2018 జనవరి 25న విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు.