వ్యాపార రంగంలోకి ఎమీ? | Amy Jackson to sell wigs and lashes | Sakshi
Sakshi News home page

వ్యాపార రంగంలోకి ఎమీ?

Aug 25 2016 1:13 AM | Updated on Sep 4 2017 10:43 AM

వ్యాపార రంగంలోకి ఎమీ?

వ్యాపార రంగంలోకి ఎమీ?

ఎల్లలు లేనిది సినిమా అయితే గ్లామర్ విషయంలో సరిహద్దులు చెరిపేసే నటి ఎమీజాక్సన్ అనవచ్చు.

ఎల్లలు లేనిది సినిమా అయితే గ్లామర్ విషయంలో సరిహద్దులు చెరిపేసే నటి ఎమీజాక్సన్ అనవచ్చు. ఎక్కడో ఇంగ్లాండ్‌లో పుట్టి ద్రావిడ దేశం, తమిళనాడులో నటిగా రాణించడం అన్నది తను కూడా ఊహించి ఉండరు. ఎమీ సోయగాలకు తమిళ సినీ ప్రేక్షకులు ఫ్లాట్ అయిపోయారు. మదరాసుపట్టణం చిత్రంతోనే వారి మదిని దోచిన నటి ఎమీజాక్సన్. ఆ తరువాత ఒకటి రెండు చిత్రాలు ఆశించిన విజయాలు సాధించకపోయినా ఈ ఇంగ్లిష్ బ్యూటీకి అవకాశాలు వస్తూనే ఉన్నాయి. శంకర్ ఐ చిత్రం ఎమీ హైప్ బాగా పెంచేసింది.
 
 ఆ చిత్రం ఒక వర్గాన్ని సంతృప్తి పరచలేకపోయినా ఎమీ ఆరబోసిన అందాలు బాగానే ఖుషీ పరచాయనే చెప్పాలి. ఆ తరువాత కూడా ధనుష్‌తో తంగమగన్,ఉదయనిధి స్టాలిన్‌కు జంటగా గెత్తు,విజయ్‌కు జంటగా తెరి చిత్రాల్లో నటించారు. ఇవన్నీ ఇక ఎత్తు అయితే చాలా తక్కువ కాలంలోనే చాలా మంది టాప్ హీరోయిన్లకు దక్కని సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో జత కట్టే లక్కీ అవకాశాన్ని 2.ఓ చిత్రంలో పొందారు. ప్రస్తుతం ఈ చిత్రంలో పాట దేవీ చిత్రం ఇక హిందీ చిత్రంలోనూ నటిస్తున్నారు. మరో పక్క మాతృ భాష ఆంగ్ల చిత్రంలో నటించే అవకాశం వరించిందట.
 
  ఇలా నాయకిగా పలు భాషల్లో నటిస్తూ రెండు చేతులా గడిస్తున్నా మరో రకంగా కూడా గడించడానికి సిద్ధమయ్యారు. ముందు  చూపో లేక డబ్బు చూపోగానీ కొత్తగా వ్యాపార రంగంలోకి అడుగు పెడుతున్నారు. ఇటీవల ఒక నెల విరామం లభించడంతో మాతృభూమి ఇంగ్లాడ్‌కు వెళ్లిన ఎమీ అక్కడి స్నేహితుడితో కలిసి లండన్‌లో ఒక అధునాతన సౌందర్యసాధనాల షాపును ప్రారంభించాలని నిర్ణయించుకున్నారట.
 
 దీని గురించి ఎమీజాక్సన్ తెలుపుతూ ఆధునిక అలంకార సాధనాలతోకూడిన షాపుతో పాటు, అధునాతన వసతులతో కూడిన సెలూన్ షాపును ప్రారంభించనున్నాననితెలిపారు. ఇక్కడ గడపడానికి తనకు అధిక సమయం ఉంటుందన్నారు. సినిమా తరువాత తన జీవిత లక్ష్యం ఇదేనంటోంది ఈ నారీ నెరజాణ.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement