సొంత గూటికి ఎమీ | amy jackson back in England movies | Sakshi
Sakshi News home page

సొంత గూటికి ఎమీ

Published Sun, Jul 24 2016 1:37 AM | Last Updated on Mon, Sep 4 2017 5:54 AM

సొంత గూటికి ఎమీ

సొంత గూటికి ఎమీ

నటి ఎమీజాక్సన్ సొంత గూటికి చేరారు. ఈ బ్యూటీ ఇంగ్లాండ్‌కు చెందిన మోడల్ అన్న విషయం తెలిసిందే. మదరాసు పట్టణం చిత్రం ద్వారా కోలీవుడ్‌కు దిగుమతి అయ్యారన్న విషయం విదితమే. ఆ తరువాత తెలుగు, హిందీ అంటూ తన స్థాయిని పెంచుకుంటూ పోయిన ఎమీ అనతి కాలంలోనే సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో జతకట్టే లక్కీచాన్స్‌ను దక్కించుకున్నారు.

 అంతే కాదు స్టార్ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో వరుసగా రెండు చిత్రాల్లో నటించే అవకాశాలను అందుకున్న అరుదైన నటిగా గుర్తింపు పొందారు. విక్రమ్‌తో ఐ చిత్రంలో అందాలు ఆరబోసిన ఎమీ తాజా శంకర్ దర్శకత్వంలో రజనీకాంత్‌తో కలిసి 2.ఓ చిత్రంలో నటిస్తున్నారు. ఆ ఇంగ్లిష్ భామ ఇప్పుడు రెండు ఆంగ్ల చిత్రాల్లో నటిస్తున్నారట. ఇంట గెలిచి బయట గెలవాలన్న సామెతను రివర్స్ చేసిన నటి ఎమీ.

 ఏదేమైనా ఇన్నాళ్లకు సొంత గూటికి చేరారన్న మాట.దీని గురించి ఈ క్రేజీ బ్యూటీ తెలుపుతూ 2.ఓ చిత్రంలో రజనీకాంత్‌కు జంటగా నటించడం మాటల్లో చెప్పలేని అనుభూతిగా పేర్కొన్నారు. ఇందులో తన పాత్ర చాలా కొత్తగా ఉంటుందన్నారు. అందుకు దర్శకుడు శంకర్‌కి థ్యాక్స్ చెప్పుకుంటున్నానన్నారు. ఇక హిందీలో సొహైల్ ఖాన్ దర్శకత్వంలో నటించిన చిత్రం సెప్టెంబర్‌లో తెరపైకి రానుందని తెలిపారు. ప్రస్తుతం రెండు బ్రిటీష్ చిత్రాల్లో నటిస్తున్నానని చెప్పారు. అదే విధంగా తమిళం, తెలుగు, హిందీ చిత్రాల్లో నటించడం సంతోషంగా ఉందన్నారు.

 సినిమా తరువాత శారీరక అందంపై అధిక దృష్టి చూపిస్తానన్నారు. తన శరీరాన్ని చాలా ఫిట్‌గా ఉంచుకోవడానికి ప్రయత్నిస్తానని తెలిపారు. సమయం దొరికినప్పుడు కిక్ బాక్సింగ్, యోగా, గుర్రపు స్వారీ, డాన్స్ వంటివి చేయడానికి ఇష్టపడతానన్నారు. అలాగే కుటుంబ సభ్యులతో, స్నేహితురాళ్లతో గడుపుతానని చెప్పారు. నెలలో సగం రోజులు చెన్నై లేదా ముంబయిలో మరో సగం రోజులు లండన్, అమెరికా, ఐరోపా దేశాల్లో గడుపుతానని ఎమీజాక్సన్ అంటున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement