Superstar Rajinikanth
-
యాంకర్‌గా ప్రయాణం ప్రారంభించి..!
బుల్లితెర అంటే కొందరికి ఇప్పటికీ చిన్న చూపే అని నిస్పందేహంగా చెప్పవచ్చు. అయితే కళాకారులుగా సాధించాలనుకునే వారికి ఆరంభంలోనూ, అంతిమంలోనూ చాలా మందికి జీవితాన్నిచ్చేది బుల్లితెరనే అన్నది వాస్తవం. ఇప్పుడు ప్రముఖ హీరోయిన్లుగా రాణిస్తున్న వారిలో చాలా మంది బుల్లితెర నుంచి వచ్చినవారే కావడం గమనార్హం. ఈ వరుసలో ఇప్పుడు లేడీ సూపర్‌స్టార్‌గా రాణిస్తున్న నయనతార కూడా ఉన్నారన్నది చాలా మందికి తెలియకపోవచ్చు. నయనతార అసలు పేరు డయానా మరియం కురియన్. మధ్యతగతి కుటుంబానికి చెందిన ఈ కేరళాకుట్టికి చిన్నతనం నుంచి సినిమాలంటే చాలా ఆసక్తి అట. దీంతో ఆమె బంధువు ఒకరు సినీ రంగంలో పని చేస్తుండడంతో ఆయన ద్వారా తన పొటోలను కొందరు సినీ దర్శక, నిర్మాతలకు చేరాయి. అయితే నటినవ్వాలనే తన కోరికను నెరవేర్చుకోవడానికి బుల్లితెరను మార్గంగా చేసుకున్నారు. అలా టీవీ యాంకర్‌గా తన పయనాన్ని ప్రారంభించి సినిమా వాళ్ల దృష్టిలో పడ్డారు. అలా 2005లో తమిళంలో అయ్యా అనే చిత్రం ద్వారా కథానాయకిగా పరిచయం అయ్యారు. తొలి చిత్రంలోనే సుప్రీమ్స్టార్ శరత్‌కుమార్‌కు జంటగా నటించి విజయాన్ని అందుకున్న నయనతార రెండో చిత్రంలో సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు జంటగా నటించే లక్కీఛాన్స్‌ను దక్కించుకున్నారు. ఆ తరువాత వరుసగా అవకాశాలు తలపుతట్టడంతో కథానాయకిగా 20 ఏళ్ల పాటు లేడీసూపర్‌స్టార్‌గా వెలిగిపోతున్నారు. ఇటీవల ఒక భేటీలో నయనతార పేర్కొంటూ తన జీవిత చక్రం సినీ రంగప్రవేశం చేసిన తరువాత తలకిందులైందన్నారు. ఏదో ఒక రోజు తాను ఈ రంగంలో ఉన్నత స్థాయికి చేరుకుంటానని కలలో కూడా ఊహించలేదన్నారు. అదే విధంగా తన జీవిత లక్ష్యం గురించి చెబుతూ బీకామ్ పట్టభద్రురాలైన తాను చార్టెడ్ అకౌంటెంట్(సీఏ) అవ్వాలని ఆశ పడ్డానన్నారు. తాను నటి కాకుంటే కచ్చితంగా సీఏ అయ్యి ఉండేదానినని తన బంధువులతో చెబుతుండేదానినని అన్నారు. అయితే నయనతార సీఏ కావాలన్న కోరిక నెరవేరకున్నా ఇప్పుడు లేడీ సూపర్‌స్టార్‌గా రాణిస్తున్నారు. కృషితో నాస్తి దుర్భిక్షం అనడానికి ఇంతకంటే నిదర్శనం ఏముంటుంది. -
హిమాలయాల్లో రజినీకాంత్..
-
రజనీ చాయ్
సూపర్‌స్టార్ రజనీకాంత్ ఒక్కోసారి విసుగుపుట్టి హిమాలయాలకు వెళుతుంటారు. ఈసారి కొచ్చిన్‌లో టీ అమ్ముకుంటున్నారా? అవుననే కొంతమంది కంగారు పడ్డారు. తీరా చూస్తే ‘దక్కేది దక్కకుండా పోదు... దక్కనిది ఎప్పటికీ దక్కదు’ అని డైలాగ్ కొడుతూ తనకు దక్కిన టీ స్టాల్‌ను నడుపుకుంటున్న ఓ వ్యక్తి... ఇంకేముంది... నెట్లో హల్చల్. కొచ్చిన్‌లో ఏదో షూటింగ్ కోసం వెళ్లిన సినిమా యూనిట్ వారు అతణ్ణి చూసి ఆగిపోయారు. రజనీకాంత్! టీ అమ్ముతూ. రజనీకాంత్ సాధారణ జీవితాన్ని ఇష్టపడతాడని అందరికీ తెలుసు. కొంపదీసి టీ అమ్ముతున్నాడా? పరిశీలించి చూశారు. కాదు. రజనీకాంత్లానే ఉన్నాడు. పలకరిస్తే అచ్చు రజనీకాంత్లానే నవ్వుతున్నాడు. పేరు సుధాకర్ ప్రభు. ఫోర్ట్ కొచ్చిన్ పట్టాలం రోడ్డులో ‘వెంకటేశ్వర హోటల్’ అనే ప్యూర్ వెజిటేరియన్ హోటల్ నడుపుతున్నాడు. లెమన్ టీ చేయడంలో దిట్ట. మొన్న మొన్నటి వరకూ ఎవరూ అతణ్ణి రజనీకాంత్‌తో పోల్చలేదు కాని ఈ మధ్య గెడ్డానికి రంగేయడం మాని, కళ్లద్దాలు మార్చేసరికి అచ్చు రజనీ గెటప్‌లోకి వచ్చేశాడు. నాదిర్షా అనే మలయాళం డైరెక్టర్ ఇతణ్ణి ఫేస్బుక్లో పెట్టేసరికి వైరల్ అయ్యాడు. అప్పటినుంచి ఇతని వీడియోలు వైరల్ అవుతున్నాయి. కేరళలో ఇతణ్ణి ఫంక్షన్స్‌కు కూడా ఆహ్వానిస్తున్నారు. ‘మా పిల్లలు పెద్దగా పట్టించుకోరుగాని నేను రజనీ అన్ని సినిమాలు చూస్తుంటా’ అంటాడు. ఈ పాపులారిటీ పెరిగి అతని హోటల్‌కు కస్టమర్లు పెరిగితే అదే పది ప్లేట్లు. -
రజనీ రాజకీయాల్లోకి వచ్చినా వేస్ట్: సోదరుడు సత్యనారాయణ రావు
సూపర్ స్టార్ రజనీకాంత్ ఆ మధ్య రాజకీయ రంగ ప్రవేశం చేస్తానని ప్రకటించి తర్వాత వెనక్కి తగిన విషయం తెలిసిందే. దానికి ఆరోగ్యం సహకరించడం లేదనే కారణాన్ని కూడా ఆయన చెప్పారు. కానీ, అప్పటి నుంచి ఖాళీగా ఇంట్లో కూర్చోవడం లేదు. వరుసగా సినిమాలు చేసుకుంటూ పోతున్నారు. ప్రస్తుతం జైలర్‌తో పాటు తన కూతురు ఐశ్వర్య దర్శకత్వం వహిస్తున్న లాల్ సలాం చిత్రంలో అతిథి పాత్రలోనూ నటిస్తున్నారు. ఇవి గాక మరో రెండు చిత్రాలకూ పచ్చజెండా ఊపేశారు. ఇదిలా ఉంచితే ఇప్పుడు నటుడు రజనీకాంత్ రాజకీయాల్లోకి వచ్చినా ఉపయోగం లేదని స్వయానా ఆయన సోదరుడు సత్యనారాయణ రావు పేర్కొనడం విశేషం. ఇందుకు కారణాన్ని కూడా వివరించారు. రజనీకాంత్ ఇకపై రాజకీయాల్లోకి రావాలని, వచ్చినా ప్రయోజనం ఏమీ లేదనీ వ్యాఖ్యానించారు. కారణం ఆయన వయస్సు ఏడు పదులు దాటడమేనని పేర్కొన్నారు. అదే విధంగా ఆయన ఎవరికీ మద్దతు పలికే అవకాశం లేదని స్పష్టం చేశారు. దేవుని దయ వల్ల ఆయన సుదీర్ఘ కాలం సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని సోదరుడు సత్యనారాయణ ఆకాంక్షించారు. సోమవారం తిరుచెందూర్ కుమారస్వామి ఆలయానికి ఆయన వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రజినీకాంత్ నటిస్తున్న జైలర్, లాల్ సలాం చిత్రాలు త్వరలో విడుదలకు సిద్ధమవుతున్నాయన్నారు. -
రజనీకాంత్‌కు అరుదైన గౌరవం
సాక్షి, న్యూఢిల్లీ : సూపర్‌స్టార్ రజనీకాంత్‌కి అరుదైన గౌరవం దక్కింది. ఐఎఫ్ఎఫ్ఐ 2019 ఉత్సవంలో ఆయనను ఐకాన్ ఆఫ్ గోల్డెన్ జూబ్లీ అవార్డుతో సత్కరించనున్నారు. అలాగే విదేశీ నటి కేటగిరీలో ఫ్రెంచ్ నటి ఇసాబెల్లె హప్పెర్ట్ మరో విశేష అవార్డు దక్కింది. లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఆమెను వరించింది. 50వ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఐఎఫ్ఎఫ్ఐ) 2019 అవార్డ్స్‌లో `ఐకాన్ ఆఫ్ ది గోల్డెన్ జూబ్లీ` అవార్డ్‌తో రజనీకాంత్‌ను సత్కరించనున్నట్లు కేంద్ర సమాచార ప్రసారశాఖ మంత్రి ప్రకాష్ జవదేవకర్ ట్విటర్ ద్వారా శనివారం అధికారికంగా ప్రకటించారు. గత కొన్ని దశాబ్దాలుగా భారతీయ సినిమాకు ఆయన చేసిన విశేష కృషికి గుర్తింపుగా ఈ అవార్డును ప్రకటించడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. అలాగే ఇసాబెల్లెకు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ప్రకటించడం సంతోషంగా ఉందని ట్వీట్ చేశారు. దీనిపై స్పందించిన రజనీకాంత్ ప్రతిష్టాత్మక గౌరవానికి తనను ఎంపిక చేసినందుకు భారత ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ ట్వీట్ చేశారు. నవంబర్ 20 నుండి 28 వరకు గోవాలో గోల్డెన్ జూబ్లీ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా అవార్డుల కార్యక్రమం జరగనుంది. ఈ చలన చిత్రోత్సవంలో మహిళా దర్శకుల చిత్రాలను కూడా ప్రదర్శించనున్నారు. వివిధ దేశాలకు చెందిన 250 సినిమాలను ఈ వేడుకలో ప్రదర్శిస్తారు. వీటిలో 24 చిత్రాలు ఆస్కార్ నామినేషన్ల రేసులో ఉన్నాయి. In recognition of his outstanding contribution to Indian cinema, during the past several decades, I am happy to announce that the award for the ICON OF GOLDEN JUBILEE OF #IFFI2019 is being conferred on cine star Shri S Rajnikant. IFFIGoa50 pic.twitter.com/oqjTGvcrvE — Prakash Javadekar (@PrakashJavdekar) November 2, 2019 Happy to announce that Life Time Achievement Award for a 'Foreign Artiste' will be conferred on French Actress Isabelle Hupert.#IFFI2019 #IFFIGoa50 pic.twitter.com/toOVkr6u5r — Prakash Javadekar (@PrakashJavdekar) November 2, 2019 I thank the government of India for this prestigious honour bestowed upon me on the golden jubilee of the International film festival of India 🙏🏻#IFFI2019 — Rajinikanth (@rajinikanth) November 2, 2019 -
అట్లీకి సూపర్‌చాన్స్?
తమిళసినిమా: సూపర్‌స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా యువ దర్శకుడు అట్లీ చిత్రాన్ని తెరకెక్కించనున్నారా? అలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయనే సమాధానం కోలీవుడ్ వర్గాల నుంచి వస్తోంది. స్టార్ దర్శకుడు శంకర్ శిష్యులలో ఒకరు అట్లీ అన్న విషయం తెలిసిందే. ఈయన రజనీ నటించిన ఎందిరన్ చిత్రానికి సహాయ దర్శకుడిగా పని చేశారు. రాజా రాణి చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయిన అట్లీ, ఆ తరువాత విజయ్ హీరోగా వరుసగా తెరి, మెర్శల్ వంటి హిట్ చిత్రాలను తెరకెక్కించారు. తదుపరి చిత్రాన్ని విజయ్‌తోనే చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అట్లీ ఆ చిత్రానికి ఆళపోరాన్ అనే టైటిల్‌కు కూడా రిజిస్టర్ చేయించారనే టాక్ స్ప్రెడ్ అయ్యింది. ఇలాంటి పరిస్థితుల్లో అట్లీ రజనీకాంత్‌ను కలిసి కథ వినిపించినట్లూ, ఆ కథ రజనీకాంత్‌ను ఇంప్రెస్ చేసినట్లు సమాచారం. ఈ భారీ చిత్రాన్ని శ్రీ తేనాండాళ్ ఫిలింస్ సంస్థ నిర్మించడానికి ఆసక్తి చూపుతున్నట్లు టాక్. రజనీకాంత్ నటించిన కాలా చిత్రం సమ్మర్ స్పెషల్‌గా ఏప్రిల్ 14న విడుదలకు, ఆ తరువాత 2.ఓ చిత్రం తెరపైకి రావడానికి ముస్తాబవుతున్నట్లు ప్రచారంలో ఉంది. రాజకీయరంగ ప్రవేశానికి అస్త్ర శస్త్రాలను కూడగట్టుకుంటున్న రజనీ మంచి రాజకీయ నేపథ్యంతో కూడిన కథ కోసం ఎదురు చూస్తున్నట్లు ఇంతకు ముందే ప్రచారం జరిగింది. కాగా ఆళపోరాన్ టైటిల్ చూస్తుంటేనే ఇది పూర్తిగా పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే కథ అని తెలుస్తోంది. ఆ టైటిల్ ఇప్పుడు రజనీకాంత్‌కు సరిగ్గా సరిపోతుంది. అందుకే అట్లీ దర్శకత్వంలో రజనీకాంత్ నటించే అవకాశం ఉన్నట్లు కోలీవుడ్ వర్గాల భావన. -
కండక్టర్..నటుడు..నాయకుడు
దేవుడు శాసించడంతో సినీ కథానాయకుడు ఆదివారం రాజకీయ నాయకుడిగా అవతరించారు. ఆధ్యాత్మిక ‘రాజకీయ’ నినాదంతో అడుగు వేశారు.బాషాగానో లేదా బాబాగానో ఏమోగానీ ఈ కబాలీ మాత్రం ‘కాలా’ అంటూ రాజకీయ ఎంట్రీ ఇచ్చారు. కొత్త çసంవత్సర సంబరాలు కొన్ని గంటల ముందే వచ్చేశాయా అన్నట్టుగా అభిమానుల్లో ఉత్సాహాన్ని, ఆనందాన్ని నింపారు. ట్రూత్, వర్క్, గ్రోత్ (నిజం, పని, అభివృద్ధి) మూల సూత్రాలుగా రాజకీయఅరంగేట్రం చేసిన సూపర్‌స్టార్‌కు అభిమానలోకం నీరాజనాలు పలుకుతున్నాయి. ఈ నాయకుడి రక్షణ సేన సంబరాల్లో మునిగారు. సాక్షి, చెన్నై: దక్షిణ భారత చలన చిత్ర సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు దేశంలోనే కాదు ప్రపంచంలోనూ అభిమానులు ఎక్కువే. రాష్ట్రంలో అయితే, ఆయనకున్నంత అభిమాన లోకం మరొకరికి లేదని చెప్పవచ్చు. తమ కథనాయకుడు రాజకీయాల్లో రావాలన్న ఆత్రుతతో ఏళ్ల తరబడి అభిమానులు ఎదురుచూస్తున్నారు. రెండు దశాబ్దాలకు పైగా రజనీ రాజకీయ నినాదం తెర మీదకు రావడం కనుమరుగు కావడం జరిగింది. అయితే, ఐదేళ్ల క్రితం నుంచి ‘ తలై‘వా’ అంటూ రాజకీయాల్లోకి ఈ స్టార్‌ను లాగేందుకు అభిమానులు ఆందోళనల బాట పట్టకతప్పలేదు. సొంతంగా పార్టీని, జెండాను ప్రకటించుకునే స్థాయిలో అభిమానుల్లో బయలు దేరిన ఆవేశాన్ని శాంత పరిచే రీతిలో ‘దేవుడు శాసిస్తే...రాజకీయాల్లోకి వస్తా’ అంటూ గతంలో రజనీ మెలిక పెట్టారు. ఈ నేపథ్యంలో అమ్మ జయలలిత మరణంతో ఆమె స్థానాన్ని భర్తీ చేసే దిశలో ‘వా...వా తలైవా’ నినాదం మిన్నంటింది. రెండున్నర దశాబ్దాలకు పైగా దాట వేత, నాన్చుడు ధోరణి అనుసరిస్తూ వచ్చిన రజనీ కాంత్ ఈ సారి ఆరు రోజుల పాటు అభిమానులతో భేటీకి సిద్ధ పడడం రాజకీయ ప్రాధాన్యతకు దారి తీసింది. అదే సమయంలో రజనీ రాజకీయాల్లోకి వస్తారా, రారా అన్న చర్చ ఊపందుకుంది. వస్తారన్న ఆశ అభిమానుల్లో ఉన్నా, ఎక్కడ మెలిక పెడతారోనన్న ఉత్కంఠ తప్పలేదు. అయితే, ఈ సారి అభిమానుల్లో నిరుత్సాహాన్ని నింపేందుకు ఈ 2.ఓ సాహసించ లేదు. ‘కాలా’ తరహాలో ముందుకు అడుగు వేశారు. కబాలీ స్టైల్లో వచ్చేశానని చెప్పు....వచ్చేశా అంటూ రాజకీయ ఎంట్రీ ఇవ్వడం అభిమానుల్లో ఆనందోత్సాహాల్ని నింపింది. దేవుడు శాసించాడు..ఆరో రోజు భేటీలో దక్షిణ భారత చలన చిత్ర సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ ఎంట్రీ గురించి ఎలాంటి ప్రకటన చేస్తారోనన్న ఎదురు చూపులు సర్వత్రా బయలుదేరాయి. ఐదు రోజుల పాటుగా ఎనిమిదిన్నర గంటలకే భేటీ మొదలైనా, చివరి రోజు అరగంట ఆలస్యం కాక తప్పలేదు. సమయం గడిచే కొద్ది అభిమానుల్లో ఉత్కంఠ తప్పలేదు. రజనీ సన్నిహిత మిత్రులు సైతం తరలి రావడంతో ప్రాధాన్యత పెరిగింది. ఐదు రోజులతో పోల్చితే చివరి రోజు అభిమాన సందోహం క్రమంగా రెండింతలు, నాలుగింతలు అన్నట్టుగా పెరిగింది. కోడంబాక్కం రాఘవేంద్ర కల్యాణ మండపం పరిసరాలు ఇసుక వేస్తే రాలనంతంగా కిక్కిరిశాయి. కథానాయకుడు ఎలాంటి ప్రకటన చేస్తారోనన్న ఎదురు చూపులతో టీవీలకు అతుక్కుపోయిన వాళ్లు ఎందరో. అన్ని మీడియా చానళ్లు ప్రత్యేక ప్రసారాలకు ఏర్పాట్లు చేయడంతో తలైవా ప్రకటన కోసం అభిమాన సందోహమే కాదు, ఇతర పార్టీలకు చెందిన వారు ఆసక్తిగా వీక్షించారు. సరిగ్గా తొమ్మిది గంటల సమయంలో కల్యాణ మండపం వేదిక మీదకు వచ్చిన కథానాయకుడు తమిళ్ తాయ్(తమిళ తల్లి) గీతం తదుపరి దేవుడు శాసించాడంటూ రాజకీయ నాయకుడి అవతారం ఎత్తారు. ఈ క్షణం...ఆ వేదిక ముందున్న ప్రతి ఒక్కరూ పైకి లేచి నిలబడి కరతాళ ధ్వనుల్ని మార్మోగిస్తూ రాజకీయ ప్రకటనను ఆహ్వానించారు. అదే సమయంలో కోడంబాక్కం పరిసరాలు బాణసంచాల మోతతో దద్దరిళ్లాయి. ఆహ్వానం – వ్యతిరేకత కథానాయకుడి రాజకీయ అరంగ్రేటాన్ని ఆహ్వానించే వాళ్లు ఏ మేరకు ఉన్నారో వ్యతిరేకించే వాళ్లూ ఉన్నారు. ఇక, రాజకీయ నాయకులు అయితే చెప్పనక్కర్లేదు. కొందరు అభినందించగా, మరికొందరు విమర్శలు ఎక్కుపెట్టే పనిలో పడ్డారు. ఎవరు ఏమన్నారంటే.. ♦ రాజకీయాలకు రజనీ రావడాన్ని ఆహ్వానిస్తూ, సోదరుడికి విశ్వనాయకుడు కమల్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ♦ రజనీ రాకతో అన్నాడీఎంకేకు ఎలాంటి ఢోకా లేదని, ప్రజాస్వామ్య దేశంలో ఎవరైనా రాజకీయాల్లోకి రావచ్చని తమిళనాడు సీఎం పళనిస్వామి, మంత్రులు సెల్లూరు రాజు, జయకుమార్ వ్యాఖ్యానించారు. పూర్తి స్థాయిలో రాజకీయాల్లోకి అడుగు పెట్టినానంతరం ఆయనకు అన్నీ తెలిసి వస్తాయని పేర్కొన్నారు. ♦ రజనీ రాకతో డీఎంకేకు ఢోకా లేదని ఆ పార్టీ కార్య నిర్వాహక అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ స్పష్టం చేశారు. తమ సిద్ధాంతాలు వేరని, గెలుపుబాటలో ఎలా పయనించాలో తమకు తెలుసునని, ఎందరు వచ్చినా తమకు ఢోకా లేదన్నారు. ♦ రాజకీయ ఆహ్వానాన్ని పలికిన నటి, కాంగ్రెస్ అధికార ప్రతినిధి కుష్బు అయితే, ఇక, రజనీ వెనక్కు తగ్గకూడదని వ్యాఖ్యానించారు. ఆయనతో మార్పు అన్నది ఇప్పుడే చెప్పలేమన్నారు. ♦ రజనీ రాకతో రాజకీయ మార్పు తథ్యం అని డీఎంకే బహిష్కృత నేత ఎంకే అళగిరి ధీమా వ్యక్తం చేశారు. ప్రజలకు ఆయన ఎలాంటి సేవల్ని అయినా చేయగలరని, ఆయనకు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ♦ ప్రజల్ని గందరగోళంలో నెట్టేందుకు కొందరు నటులు రాజకీయ ప్రకటనలు చేస్తున్నారని, అందులో తాజా ప్రకటన కూడా ఒకటిగా కూడంకులం అణు వ్యతిరేక ఉద్యమ నేత ఉదయకుమార్ విమర్శించారు. రాజకీయాల్లోకి రావాలనుకున్నప్పుడు ఒకేసారి పార్టీని కూడా ప్రకటించవచ్చుగా, మరి గందరగోళం వ్యాఖ్యలు ఎందుకో అని ప్రశ్నించారు. ♦ తమిళనాడు తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడి ందని, ఇతర రాష్ట్రాల వాళ్లు ఎగతాళి చేస్తున్నారని రజనీ వ్యాఖ్యానించడం ఏ అంశాన్ని ఉద్దేశించిందో అర్థం కావడం లేదని అన్నాడీఎంకే అమ్మ నేత, ఎమ్మెల్యే దినకరన్ వ్యాఖ్యానించారు. ప్రజా స్వామ్య దేశంలో రాజకీయాల్లోకి ఎవరైనా రావచ్చు అని, న్యాయ నిర్ణేతలు ప్రజలు మాత్రమేనని పేర్కొన్నారు. ♦ రజనీ వ్యాఖ్యల్లో కాషాయం కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నదని అన్నాడీఎంకే అమ్మ శిబిరం నేత నాంజిల్ సంపత్ వ్యాఖ్యానించారు. తమిళనాట పుట్టుకొచ్చిన పది పార్టీల్లో పదకొండో పార్టీ ఇది అని ఎద్దేవా చేశారు. రాజకీయాల్లో రావడం పెద్ద విషయం కాదని, ఒడ్డుకు చేరి విజయం సాధించడం సాధరణ విషయం కాదని వ్యాఖ్యానించారు. ♦ తమిళనాడు రక్షణ అని గళం విప్పిన రజనీ, ఇంత వరకు తమిళుల కోసం ఏమి చేశారోనన్నది ప్రకటించాలని నామ్ తమిళర్ కట్చి నేత సీమాన్ డిమాండ్ చేశారు. ఒకే రోజు పార్టీ ప్రకటన, అధికారం సాధ్యపడదని, రజనీని తాము వ్యతిరేకిస్తున్నామని వ్యాఖ్యానించారు. ♦ రాజకీయం సరే, ఆధ్యాతిక బాటలో పార్టీ అని ప్రకటించడం గందరగోళానికి దారి తీసిం దని ద్రవిడ కళగంనేత వీరమణి విమర్శించారు. ♦ ఎంతో ధైర్యంతో రాజకీయాల్లోకి అడుగు పెట్టిన రజనీకాంత్‌ను ఆహ్వానిస్తున్నట్టు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు తమిళిసై సౌందరరాజన్ వ్యాఖ్యానించారు. తమిళనాడురాజకీయ పరిస్థితుల నేపథ్యంలో రజనీకాంత్ రావడం ఆహ్వా నించ దగ్గ విషయంగా పేర్కొన్నారు. ♦ అసెంబ్లీ ఎన్నికలు సమీపించే సమయంలో పార్టీ అని ఆయన వ్యాఖ్యానించి ఉండడం ఆలోచించ దగ్గ విషయంగా> కాంగ్రెస్ సీనియర్ నేత ఈవీకేఎస్ ఇళంగోవన్ వ్యాఖ్యానించారు. కొత్త సంవత్సరంలో విడుదల కాబోతున్న ఆయన చిత్రాలకు పబ్లిసిటీ స్టంట్‌గా ఈ కొత్త ప్రకటన, ప్రయత్నం ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. వీసీకే నేత తిరుమావళవన్ సైతం ఇదే అనుమానం వ్యక్తం చేసినా, రాజకీయాలకు వచ్చిన రజనీని ఆహ్వానించారు. తమిళ మానిల కాంగ్రెస్ నేత జీకే వాసన్ కూడా రజనీకి ఆహ్వానం పలికారు. అదే సమయంలో కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు తిరునావుక్కరసర్ ఒక అడుగు ముందుకు వేసి, అసెంబ్లీ ఎన్నికల్ని తర్వాత చూసుకుందామని, లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చే ప్రకటన చేయండి చూద్దాం అని ఎద్దేవా చేశారు. ♦ సీపీఎం, సీపీఐ నేతలు రామకృష్ణన్, ముత్తరసన్ పేర్కొంటూ, కొత్తగా ఆయన చెప్పిందేమీ లేదని, ఆధ్యాతిక రాజకీయం వ్యాఖ్యల్లో గందరగోళం ఉందన్నారు. ఆధ్యాత్మిక రాజకీయం : రాజకీయ ప్రకటన సమయంలో రజనీకాంత్ ప్రసంగం సరికొత్త బాణీలో సాగింది. ఎవర్నీ విమర్శించకుండా, వేలు ఎత్తి చూపకుండా తమిళనాడును రక్షించుకోవడం లక్ష్యంగా , తమిళ సంక్షేమాన్ని కాంక్షిస్తూ రాజకీయ కదన రంగంలో దిగుతున్నట్టు ప్రకటించడం అభిమానుల్ని ఆనందసాగరంలో ముంచింది. ట్రూత్, వర్క్, గ్రోత్ (నిజం, పని, అభివృద్ధి) సూత్రాలుగా, ప్రజా స్వామ్య వ్యవస్థలో నిజాయితీ, జవాబుదారీ తనం ఉండాలని కాంక్షిస్తూ రజనీ సాగించిన ప్రసంగాన్ని ఆహ్వానించే విధంగా అభిమానుల్లో కరతాళ ధ్వనుల్ని మార్మోగాయి. తమిళనాట బ్రష్టు పట్టిన వ్యవస్థకు చికిత్స చేయడం లక్ష్యంగా, దోపిడీ దారుల నుంచి ప్రజల్ని రక్షించేందుకు ఓ కేడర్‌గా కాకుండా, రక్షకులుగా ముందుకు రావాలని నాయకుడు ఇచ్చిన పిలుపునకు తాము సిద్ధం అని అభిమాన లోకం నినదించడం విశేషం. సంబరాల్లో అభిమాన సేన : కథానాయకుడి రాజకీయ ప్రకటనతో ఒక్కసారిగా కోడంబాక్కం పరిసరాలు మార్పును సంతరించుకునేలా చేశాయి. రజనీకాంత్ ఫొటోలు, స్టిక్కర్లతో దుకాణాలు వెలిశాయి. గతంలో అభిమానులు పరిచయం చేసిన జెండాలు సైతం విక్రయాలకు పెట్టడంతో వాటిని చేత బట్టి అభిమానులు విజయపు నినాదాల్ని మార్మోగించారు. ఇక, రాష్ట్రంలో అయితే, అభిమాన లోకం సంబరాల్లో మునిగింది. రజనీకి అభిమాన సంఘం అంటూ తొలుత ఏర్పాటు చేసిన మదురై నగరం బాణసంచాల మోతతో మార్మోగింది. రోడ్డు మీదకు వచ్చిన అభిమానులు ఆనందోత్సాహాలతో తాండవం చేశారు. ప్రజల్ని రక్షించేందుకు, రజనీకి అండగా నిలబడేందుకు రక్షకులుగా తాము నిలబడతామని నినదిస్తూ కేరింతలు కొట్టారు. రజనీరాకతో ఇక, రాష్ట్రానికి మంచి రోజులేనని నినదించే వాళ్లు మరి కొందరు. కొత్త సంవత్సరం వేళ సరికొత్త కానుకే కాదు, తమిళనాడు మార్పునకు వేదికగా ఈ రాజకీయ ప్రకటన అని ఆశాభావాన్ని వ్యక్తం చేసిన అభిమానులూ ఎక్కువే. రెండున్నర దశాబ్దాల నిరీక్షణ, ఎదురుచూపులు ఫలించాయని, లేటుగా వచ్చినా సరికొత్తగా తమిళనాట మార్పును తమ నాయకుడు తీసుకొచ్చి తీరుతాడని ధీమా వ్యక్తం చేసే వాళ్లు మరీ ఎక్కువే. కండక్టర్..నటుడు..నాయకుడు సాక్షి, చెన్నై: దక్షిణ భారత చలన చిత్ర సూపర్‌స్టార్ రజనీకాంత్ మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చిన వారే. కండక్టర్ నుంచి ప్రపంచం మెచ్చే స్టార్‌గా ఎదిగి, తమిళనాట నాయకుడిగా అవతరించారు. మనిషి ఎంత ఎత్తుకు ఎదిగినా, జీవితంలో సుఖాలు తప్పదు. ఈ రెండింటి కలబోత రజనీ. మహారాష్ట్రలో జన్మించి, బె ంగళూరులో బతుకు జీవన పయనంలో కండక్టరుగా ముందుకు సాగిన ఈ సామాన్యుడు తమిళనాటే కాదు, ప్రపంచ దేశాల్లో అశేషాభిమాన లోకాన్ని కల్గి ఉన్నారు. ఓ మిత్రుడి సాయంతో మద్రాసు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చేరి అపూర్వరాగంగళ్తో సినీ అరంగ్రేటం చేసి కాలా వరకు జనాన్ని తన దైన స్టైల్లో మెప్పించిన ఈ స్టార్ తమిళ ప్రజల సంక్షేమం, తమిళనాడు రక్షణ నినాదంతో రాజకీయాల్లో సత్తా చాటేందుకు అడుగులు వేశారు. ఆయన రాజకీయాల్లోకి రావాలన్నది నిన్న మొన్నటి నినాదం కాదు. ఏకంగా రెండున్నర దశాబ్దాలుగా తెర మీద ఉన్న పిలుపే. ప్రతిసారి ఎన్నికల సమయంలో ఆయన సంకేతం మీద అభిమాన లోకం దృష్టి పెట్టడం జరిగేది. ఆ దిశగా 1996లో జయలలిత మళ్లీ సీఎం అయితే, తమిళనాడును దేవుడు కూడా రక్షించలేరని ఆయన చేసిన వ్యాఖ్య డీఎంకే – తమిళ మానిల కాంగ్రెస్ కూటమికి బలాన్ని ఇచ్చిందని చెప్పవచ్చు. అన్నాడీఎంకే డిపాజిట్లు ఆ సమయంలో గల్లంతు అయింది. మరోమారు లోక్‌సభ ఎన్నికల సమయంలో బీజేపీకి అనుకూలంగా పరోక్ష సంకేతాన్ని ఇచ్చి బోల్తా పడ్డారు. ఫలితం తిరకాసు కావడంతో రాజకీయాలకు దూరంగా ఉంటే మంచిదన్నట్టు పయనాన్ని సాగించారు. 2011 అసెంబ్లీ ఎన్నికల ముందు తలైవా నినాదం మిన్నంటినా దాటవేత, నాన్చుడు ధోరణి అనుసరించారు. ఆ ఎన్నికల సమయంలో రజనీ వ్యాఖ్య సర్వత్రా విస్మయంలోకి నెట్టింది. గతంలో జయలలితకు వ్యతిరేకంగా స్పందించినందుకు చింతిస్తున్నట్టు వ్యాఖ్యలు చేసి, పరోక్షంగా అన్నాడీఎంకే అధికారానికి బాట వేశారు. ప్రస్తుతం అమ్మ జయలలిత మరణంతో నెలకొన్న రాజకీయ పరిస్థితులు ఆయన అరంగ్రేటానికి దారి తీశాయని చెప్పవచ్చు. తొలుత రాజకీయ ప్రవేశం గురించి రజనీ ఆలోచించినట్టున్నారు. నిజానికి రాజకీయాల్లోకి రావడానికి తొలుత మొగ్గు చూపని రజనీ, తమిళనాడు రక్షణ నినాదంతో యుద్ధంలో దిగి గెలుపు లక్ష్యంగా దూసుకెళ్లేందుకు సిద్ధమయ్యారు. -
కమల్ శతకం!
తమిళనాడులో 100 రోజుల్లో ఎన్నికలు వస్తే, రాజకీయాల్లోకి వచ్చి, ఒంటరిగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్టు లోకనాయకుడు కమలహాసన్ తెలిపారు. రాజకీయాల గురించి సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో చర్చిస్తున్నానని వ్యాఖ్యానించారు. ఈ తాజా వ్యాఖ్యలతో కమల్ 100 రోజుల నినాదం నేపథ్యంలో రాజకీయాల్లోకి వస్తారా రారా అన్న చర్చ ఊపందుకుంది. సాక్షి, చెన్నై: తమిళనాట రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో లోకనాయకుడు కమలహాసన్ దూకుడు చర్చకు దారి తీసిన విషయం తెలిసిందే. ప్రభుత్వాన్ని గురి పెట్టి ఆయన తీవ్రంగానే తొలుత విరుచుకు పడుతూ వచ్చారు. తదుపరి ప్రజా సమస్యల మీద ప్రస్తావించడం మొదలెట్టారు. అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమం అంటూ ముందుకు సాగే పనిలో పడ్డారు. అలాగే, కేరళ సీఎం పినరాయ్ విజయన్‌తో భేటీ సాగడం, ఢిల్లీ సీఎం, ఆప్ అధినేత కేజ్రీవాల్‌తో భేటీ చర్చకు దారి తీయడం వంటి పరిస్థితులు చోటు చేసుకున్నాయి. రాజకీయాల్లోకి వస్తానన్నట్టుగా స్పం దించే కమల్, తదుపరి అందుకు ఓ వివరణ ఇవ్వడం, మళ్లీ చర్చకు తెరలేపడం, ఆ చర్చ ఆధారంగా మరికొన్ని కామెంట్లు చేయడాన్ని ఓ బాటగా చేసుకుని ముందుకు సాగుతున్నారని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వంద రోజుల్లో ఎన్నికలు వస్తే రాజకీయాల్లో వచ్చేందుకు సిద్ధం అని ప్రకటించడమే కాదు, ఒంటరిగానే ఎదుర్కొంటానన్న ధీమాను వ్యక్తం చేశారు. అయితే, వందరోజుల్లోపు రాష్ట్రంలో ఎన్నికలు వచ్చేనా, కమల్ రాజకీయాల్లోకి వచ్చేనా, లేదా అన్న చర్చ ఊపందుకోవడం గమనార్హం. వంద రోజుల్లో : తమిళనాడులో సాగుతున్న అన్నాడీఎంకే ప్రభుత్వం ఓ బలవంతపు పెళ్లితో పోల్చుతూ కమల్ స్పందిచారు. ఈ పాలనకు చరమ గీతం పాడేందుకు ప్రజలు సిద్ధం అవుతున్నట్టు వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో వంద రోజుల్లోపు ఎన్నికలు వస్తే, రాజకీయాల్లో వచ్చేందుకు సిద్ధమని, ఒంటరిగానే ఆ ఎన్నికలు ఎదుర్కొంటానన్న ధీమాను వ్యక్తం చేశారు. పార్టీ గురించి, ఎప్పుడు వస్తారు, ప్రకటిస్తారు అన్న ప్రశ్నలకు వంద రోజుల డెడ్‌లైన్‌ను సూచిస్తూ దాటవేత ధోరణి అనుసరించడం గమనార్హం. దక్షిణ భారత చలన చిత్ర సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో తరచూ చర్చిస్తుంటానని, రాజకీయాల గురించి వివాదిస్తుంటానని , అయితే, ఆయన మార్గం వేరు, నా మార్గం వేరు అని ఓ ప్రశ్నకు సమాధానం ఇవ్వడం గమనార్హం. అయితే, కమల్ వ్యాఖ్యలు డొంక తిరుగుడు సమాధానాలతో ఉండడంతో ఇంతకీ రాజకీయాల్లో వస్తారా, రారా తేలుస్తారా, తేల్చరా అన్నట్టుగా మీడియాల్లో , సామాజిక మాధ్యమాల్లో చర్చ జోరందుకోవడం గమనించ దగ్గ విషయం. కమల్ వ్యాఖ్యలపై మంత్రులు జయకుమార్, కేటీ రాజేంద్ర బాలాజీ స్పందిస్తూ... రూ. కోటి ఖర్చుపెట్టి ఓ సినిమా తీసి, అందులో హీరోగా నటిస్తే చాలు.. గంట వ్యవధి సీఎం అయిపోవచ్చని ఎద్దేవా చేశారు. కమల్ పగటి కలలు కనడం మానుకుంటే ఆయనకే మంచిదని హితబోధ చేశారు. రజనీ మద్దతు : ఓవైపు కమల్ తన దైన శైలిలో స్పందిస్తుంటే, మరో వైపు ప్రధాని మోదీకి మద్దతుగా రజనీకాంత్ ట్విట్టర్లో› స్పందించడం గమనార్హం. ప్రధాని నరేంద్ర మోదీ చేపట్టిన స్వచ్ఛతే సేవ కార్యక్రమానికి మద్దతు పలుకుతూ స్పందించారు. -
అలాంటి రోబోలతో కష్టమే!
సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా నటించిన ‘రోబో’ సినిమాలో చిట్టి అన్న రోబో ఎంత విధ్వంసం సృష్టిస్తుందో గుర్తుంది కదా? అలాంటిది నిజంగా కూడా జరిగే రోజులు ఎంతో దూరంలో లేవట! ఇప్పుడు దాదాపుగా అన్ని పెద్ద కంపనీలూ తమ మ్యానుఫాక్చరింగ్ టీమ్‌లో రోబో మెషిన్లను వాడుతూనే వస్తున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సిస్టమ్స్‌గా పలు ప్రోగ్రామింగ్ సంబంధిత కార్యకలాపాలకు కూడా రోబోలను వాడుతున్నారు. కొద్దిరోజుల క్రితం ఫేస్బుక్ కూడా ఏఐ రోబోలను వాడడం మొదలుపెట్టగా, అది కాస్త తేడా కొట్టింది. మనిషి చెప్పినవి వింటూ వాటంతట అవిగా ఈ ఏఐ రోబోలు పనిచేస్తాయి. అయితే సొంతంగా కూడా నిర్ణయం తీసుకునే శక్తి ఉన్న ఈ రోబోలు కొత్తగా వాటికవే ఓ భాష కనిపెట్టేసుకొని, ఆ భాషలో మాట్లాడుకోవడం మొదలుపెట్టేశాయి. ఆ భాష మనిషికి అర్థం కాకుండా, వాటికి మాత్రమే అర్థమయ్యే విధంగా ఉందట. వెంటనే ఇదేదో ప్రమాదంగా కనిపెట్టిన ఫేస్బుక్ టెక్నికల్ టీమ్ వెంటనే ఆ సిస్టమ్స్‌ను షట్ డౌన్ చేసి, ప్రోగ్రామ్‌ను మార్చేసింది. ఇలాంటివి భవిష్యత్‌లో ఇంకెన్నో జరుగుతాయని, ఏఐ రోబోలన్నవి మానవాళికే పెద్ద ప్రమాదమని కొందరు సైంటిస్ట్‌లు చెబుతున్నారు. టెస్లా సీయీవో ఎలన్ మస్క్ మొదట్నుంచీ ఏఐ రోబోలను వ్యతిరేకిస్తూనే వస్తున్నారు. భవిష్యత్ తరానికి వ్యాప్తి చెందనున్న పెద్ద ప్రమాదాల్లో ఇదొకటని ఆయన చెబుతున్నారు. -
రజనీ రావడం ఖాయం
-
రజనీ రావడం ఖాయం
♦ రెండు వారాల్లో కొత్త పార్టీ ప్రకటన ♦ గాంధేయ మక్కల్ ఇయక్కం అధ్యక్షులు తమిళరువి మణియన్ వెల్లడి ♦ రాజకీయవేత్తలతో రజనీ రహస్య మంతనాలు సూపర్‌స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తారా.. రారా.. అనే ప్రశ్న తమిళనాడు ప్రజల మెదళ్లను తొలిచేస్తుండగా మరో రెండు వారాల్లో రజనీ సొంత పార్టీని ప్రకటిస్తారని తమిళరువి మణియన్ వెల్లడించారు. ‘‘ప్రజలకు మేలు చేయాలంటే రాజకీయాల్లోకి రావాలి.. తప్పకుండా వస్తాను’’ అని తలైవా తనతో అన్నట్లుగా ఆయన వివరించారు. సాక్షి ప్రతినిధి, చెన్నై: రజనీకాంత్ రాజకీయాల్లోకి రావడం ఖాయమని గాంధేయ మక్కల్ ఇయక్కం అధ్యక్షులు తమిళరువి మణియన్ తెలిపారు. చెన్నైలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. చెన్నై పోయెస్ గార్డెన్‌లోని ఆయన ఇంటిలో ఇటీవల రెండుసార్లు రజనీని కలుసుకున్నానని, రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులపై సుమారు మూడుగంటలకు పైగా చర్చించినట్లు తెలిపారు. తమిళనాడు ప్రజలపై రజనీ ఎంతో అభిమానం, ప్రేమను చాటుకున్నారని, నాలుగు దశాబ్దాల క్రితం చెన్నై చేరుకున్న తనకు సినీ జీవితాన్ని ప్రసాదించిన ప్రజలకు ఏమైనా చేయాలని భావిస్తున్నారని చెప్పారు. ‘ప్రజలకు మేలు చేయాలంటే రాజకీయాల్లోకి రావాలి, తప్పకుండా వస్తాను’ అని తనతో అన్నట్లుగా తమిళరువి తెలిపారు. ఆస్తుల కోసం ఎంతమాత్రం రాజకీయ ప్రవేశం చేయదలుచుకోలేదని, కామరాజనాడార్, అన్నాదురై ఆదర్శంగా నిస్వార్థ రాజకీయాలు సాగించాలని ఆయన ఆశిస్తున్నారని చెప్పారు. మరో రెండు వారాల్లో పార్టీని, అజెండాను ప్రకటిస్తారని తెలిపారు. పలువురితో రజనీ చర్చలు రాజకీయ ప్రవేశంపై రజనీకాంత్ ఇటీవల కాలంలో పలువురు ప్రముఖులతో చర్చలు జరుపుతూ అభిప్రాయాలు సేకరిస్తున్నట్లు సమాచారం. తమిళరువితోపాటూ తుగ్లక్ పత్రిక సంపాదకులు ఎస్ గురుమూర్తితో అనేకసార్లు సమావేశమయ్యారు. అలాగే మరోసారి అభిమానులతో సమావేశం అయ్యేందుకు రజనీ సన్నాహాలు చేసుకుంటున్నారు. ఈ ఏడాది జూన్‌లో ఐదురోజులపాటూ అభిమానులతో సమావేశమైనపుడు రాజకీయ ప్రవేశంపై సంకేతాలు ఇచ్చారు. అయితే ఆ తరువాత కాలా చిత్ర షూటింగ్లో బిజీ అయిపోయారు. ఇటీవల మరలా రాజకీయాలపై దృష్టి పెట్టి పలువురిని కలుసుకుంటున్నారు. అభిమానులతో రెండో విడత సమావేశాలు ముగిసిన తరువాత భారీ బహిరంగ సభ ఏర్పాటుచేసి పార్టీని ప్రకటిస్తారని అంటున్నారు. -
కవన్ నా కెరీర్‌ను మలుపు తిప్పింది!
నటుడు బోస్‌వెంకట్ పేరు చెబితే ముందుగా గుర్తుకొచ్చేది మెట్టిఒలి సీరియల్. ఆ మెగా సీరియల్లో ఒక ప్రధాన పాత్ర ద్వార బుల్లితెర ప్రేక్షకుల గుండెల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించకున్న బోస్ వెంకట్ ప్రఖ్యాత దర్శకుడు భారతీరాజ్ కంటబడ్డారు. ఆయన దర్శకత్వం వహించిన ఈరనిలం చిత్రం ద్వారా విలన్‌గా వెండితెరకు పరిచయమై మంచి పేరు సంపాదించుకున్నారు. ఆ తరువాత వరుసగా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ 60కి పైగా చిత్రాల్లో నటించారు. వాటిలో సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో నటించిన శివాజీ, సూర్యతో కలిసి నటించిన సింగం వంటి గుర్తింపు తెచ్చిపెట్టిన పలు చిత్రాలు ఉన్నాయి. పాత్రల్లో ఒదిగిపోవడానికి శాయశక్తులా ప్రయత్నించే బోస్వెంకట్కు కో చిత్రంలోనే దర్శకుడు కేవీ. ఆనంద్ మంచి పాత్రను ఇచ్చి ప్రోత్సహించారు. అదే దర్శకుడు తాజాగా బోస్వెంకట్లోని టాలెంట్‌ను గుర్తించి కవన్ చిత్రంలో పూర్తి స్థాయి ప్రతినాయకుడి పాత్రలో నటించే అవకాశం ఇచ్చి పలువురి ప్రశంసలకు కారణం అయ్యారు. విజయ్‌సేతుపతి కథానాయకుడిగా సీనియర్ నటుడు టి.రాజేందర్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రంలో బోస్‌వెంకట్ ప్రతినాయకుడిగా నటించారు.శుక్రవారం తెరపైకి వచ్చిన ఈ చిత్రంలో తన నటనకు అటు అభిమానుల నుంచి, ఇటు చిత్ర ప్రముఖల నుంచి ప్రశంసలు లభిస్తున్నాయని సంతోషంతో చెప్పారు నటుడు బోస్‌వెంకట్. తాను పూర్తిస్థాయి విలన్‌గా నటించిన తొలి చిత్రం ఇదేనని తెలిపారు. నిజానికి ఈ పాత్రను నటుడు ప్రకాశ్‌రాజ్ నటించాల్సి ఉందని, ఆయన నటించలేని పరిస్థితుల్లో ఆ అదృష్టం తనను వరించిందని అన్నారు. ఈ పాత్ర కోసం అరగుండు, పంచెకట్టు లాంటి గెటప్‌లో తనను తాను పూర్తిగా మార్చుకుని దర్శకుడు కేవీ.ఆనంద్ ముందు నిలిచి అవకాశాన్ని పొందానని చెప్పారు.కవన్ చిత్రం తన సినీ జీవితాన్నే మలుపు తిప్పిందన్న ఆనందాన్ని వ్యక్తం చేశారు. ప్రస్తుతం కార్తీ హీరోగా నటిస్తున్న ధీరన్ అధికారం ఒండ్రు చిత్రంలో పోలీస్‌గా విభిన్న పాత్రను పోషిస్తున్నానని, చిత్రం అంతా కనిపించే ఈ పాత్ర తనకు మంచి పేరును తెచ్చిపెడుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.అదే విధంగా మరో చిత్రంలోనూ వైవిధ్య పాత్రను పోషిస్తున్నట్లు బోస్‌వెంకట్ తెలిపారు. -
రజనీ అభినందనలతో అమ్రేశ్ ఫిదా
సూపర్‌స్టార్ రజనీకాంత్ అభినందలు పొందే అవకాశం వస్తే ఎవరైనా ఫిదా అవుతారు.అలాంటిది సంగీత రంగంలో ఎదుగుతున్న వర్ధమాన సంగీతదర్శకుడు,నటుడు అమ్రేశ్కు అలాంటి అనుభవం ఎదురైతే ఆ సంతోషానికి అవదులుంటాయా‘సినీవినీలాకాశంలో నటిగా,దర్శకురాలిగా, నిర్మాతగా తన ప్రతిభను చాటుకున్న సీనియర్ నటి జయచిత్ర వారసుడే ఈ అమ్రేశ్.పులి కడుపున పులిబిడ్డే పుడుతుందంటారు.అది అమ్రేశ్ విషయంలోనూ రుజువైయ్యింది.ఈయన బాల్యదశలోనే నటుడిగా పుదియరాగం అనే చిత్రం ద్వారా బాల నటుడిగా రంగప్రవేశం చేశారు.ఆ తరువాత నానే ఇన్నుళ్ ఇల్లై చిత్రం ద్వారా కథానాయకుడిగా పరిచయం అయ్యారు.ఆ చిత్రాన్ని అమ్రేశ్ తల్లి,నటి జయచిత్ర స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. ఆ చిత్రంలో అమ్రేశ్ హావభావాలు,అభినయం విమర్శకులను సైతం మెప్పించింది.ఆయన సంభాషణల ఉచ్చరణలో పరిపక్వత సినీ వర్గాలను ఆశ్యర్య పరచింది.నానే ఇన్నుళ్ ఇల్లై చిత్రం తరవాత అమ్రేశ్కు బయట చిత్రాల అవకాశాలు వచ్చినా చిన్నతనం నుంచి సంగీతంపై ఆసక్తి ఉండటంతో ఆ రంగంపై దృష్టిసారించారు.అలా ఆయన సంగీతం అందించిన తొలి బయటి నిర్మాతల చిత్రం మొట్టశివ కెట్టశివ.ప్రఖ్యాత నిర్మాత ఆర్బీ.చౌదరి సమర్పణలో వేందర్ మూవీస్ మదన్ నిర్మించిన ఇందులో ప్రముఖ నృత్యదర్శకుడు లారెన్స్ కథానాయకుడిగా నటించారు.ఇందులో పాటలన్నీ మాస్ ప్రేక్షకులకు నచ్చే విధంగా ఫాస్ట్ బీట్స్‌తో అమ్రేశ్ కట్టిన భాణీలకు ధియేటర్లు దద్దరిల్లుతున్నాయి.నిర్మాత ఆర్బీ.చౌదరిని సంతృప్తి పరచడం అంత సులభం కాదు.అలాంటిది ఆయనతో పాటు చిత్ర కథానాయకుడు లారెన్స్‌ను తన సం గీతంలో అమ్రేశ్ మెప్పించారు. చాలా మంచి పాటలను తమ చిత్రానికి అందించారని నటుడు లారెన్స్ విలేకరుల సమావేశంలో అమ్రేశ్‌ను అభినందించారు.కాగా ఇటీవల మొట్టశివ కెట్టశివ చిత్రాన్ని సూపర్‌స్టార్ రజనీకా కోసం పత్యేకంగా చిత్ర వర్గాలు ప్రదర్శించారు.చిత్రం చూసిన రజనీకాంత్ అమ్రేశ్ సమకూర్చిన భాణీలు చాలా బాగున్నాయంటూ ఆయన్ని తన ఇంటికి ఆహ్వానించి ప్రత్యేకంగా ప్రశంసించారు.రజనీకాంత్ ప్రశంసలు తన జీవితంలో మరువలేనంటున్న అమ్రేశ్ తాజాగా మరో ప్రఖ్యాత నృత్యదర్శకుడు, నటుడు, దర్శకుడు ప్రభుదేవా కథానాయకుడిగా నటిస్తున్న యంగ్ మంగ్ జంగ్ చిత్రానికి సం గీతాన్ని అందించే పనిలో బిజీగా నిమగ్నమయ్యారు.ఇలా ఇద్దరు ప్రముఖ నృత్యదర్శకులు కథానాయకులుగా నటించిన చిత్రాలకు వరుసగా సంగీతాన్ని అందించడం వివేషమే అవుతుంది. -
తమిళనాడులో అసాధారణ పరిస్థితి
తమిళసినిమా: జయలలిత మరణం తరువాత తమిళనాడులో ఆసాధారణ పరిస్థితులు నెలకొన్నాయని సూపర్‌స్టార్ రజనీకాంత్ వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యలపై రకరకాల చర్చలు జరుగుతున్నాయి. రజనీకాంత్ రాజకీయాల్లోకి రావాలని ఆయన ఆభిమానులు చాలా కాలంగా కోరుకుంటున్న విషయం తెలిసిందే. ప్రస్తుత పరిస్థితుల్లో రజనీ నాయకత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారని ఇటీవల ఆయన అభిమానులు పెద్దఎత్తున పోస్టర్లు ముద్రించి చర్చకు దారి తీసిన విషయం తెలిసిందే. మరోవైపు రజనీకాంత్ కోసం పలు రాజకీయ పార్టీలు గాలం వేస్తున్నాయి. ఇలాంటి తరుణంలో ప్రస్తుత తమిళనాడు పరిస్థితి గురించి రజనీకాంత్ వ్యాఖ్యలు మేధావులను సైతం ఆలోచనలో పడేశాయి. కాగా ఆదివారం ఒక కార్యక్రమంలో పాల్గొన్న రజనీకాంత్ ఏమన్నారో చూద్దాం. పెద్దగా అందం, తెలివి లేకపోయినా తమిళ ప్రజలు నన్ను ఆదరించారు. జయలలిత మరణానంతరం తమిళనాడులో అసాధారణ పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా జల్లికట్టు తమిళుల సంస్కృతి. ఎవరైనా సంస్కృతి విషయంలో కలుగజేసుకోకూడదు. ఎలాంటి నిబంధనలైనా విధించండి. అయితే జల్లికట్టుపై నిషేధం వద్దు. పెద్దవారు మనకంటూ సంప్రదాయాన్ని ఏర్పరచారు. దాన్ని కాపాడుకోవలసిన బాధ్యత మనపై ఉంది. కాబట్టి జల్లికట్టు కచ్చితంగా జరగాల్సిందే. ఇవీ సూపర్‌స్టార్ వ్యాఖ్యలు. ఆయన వ్యాఖ్యల్లో నిగూడార్ధం ఏమిటి గురువా? అంటూ విశ్లేషించే పనిలో పడ్డారు కొందరు రాజకీయవాదులు. -
సూపర్ స్టార్ @ 66
సినీకళామతల్లికి అత్యంత ప్రియమైన బిడ్డల్లో మన సూపర్‌స్టార్ రజనీకాంత్ ఒకరని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ అమ్మ ఒడికి చేరడానికి ఆదిలో ఎంత కష్టపడ్డారో, ఇప్పుడు అంతగా ఇష్టుడయ్యారు. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి సినీకళామతల్లి ఒడిలో అన్న చందాన, కర్ణాటక రాష్ట్రం, బెంగళూర్‌లో శివాజీరావ్ గైక్వాడ్‌గా పుట్టి, ఇక బస్సు కండక్టర్‌గా పెరిగి రజనీకాంత్‌గా రూపాంతరం చెంది ప్రపంచ సినీ స్టార్‌గా ఎదిగిన ఈయన గురించి రాయడానికి పేజీలు, చెప్పడానికి మాటలు చాలవు. 1975లో అపూర్వరాగంగళ్ చిత్రం ద్వారా నటుడిగా పుట్టిన రజనీకాంత్ నట వయసు 41. అయితే 1950 శివాజీ గైక్వాడ్‌గా జన్మించిన ఆయన 66వ ఏట అడుగుపెట్టారు. సోమవారం సూపర్‌స్టార్ పుట్టిన రోజు. భారతీయ సినీరంగంలో, సుమారు నాలుగు దశాబ్దాలుగా సూపర్‌స్టార్‌గా ఏలుతున్న ఏకై క నటుడు రజనీకాంత్ అని పేర్కొనడంలో ఏ మాత్రం అతిశయోక్తి ఉండదు. ప్రపంచ వ్యాప్తంగా అభిమానగణం కలిగిన రజనీకాంత్‌ను పద్మభూషణ్, పద్మవిభూషణ్ లాంటి భారత ప్రభుత్వ అవార్డులతో పాటు పలు రాష్ట్ర ప్రభుత్వ అవార్డులు, ఫిలింఫేర్ అవార్డులు వరించాయి. ఇటీవలే ఆయన విశేషనట సేవలకుగానూ సెంటనరీ అవార్డు అలంకారమైంది. ఇక కలెక్షన్ల పరంగా రజనీకాంత్ చిత్రాలు ఎన్నో రికార్డులను బద్దలు కొట్టాయి. 2006లోనే శివాజి చిత్రంతో రూ. 26 కోట్ల లాభాలను ఆర్జించి ఆసియాలోనే జాకీచాన్ తరువాత అత్యధిక వసూళ్లను సాధించిన నటుడిగా వాసికెక్కారు. ఇటీవల రజనీకాంత్ నటించిన కబాలి చిత్రం అంతకు ముందున్న బాక్సాఫీస్ రికార్డులను చించేసింది. తాజాగా సూపర్‌స్టార్ నటిస్తున్న 2.ఓ చిత్రం 400 వందల కోట్ల బడ్జెట్‌తో రూపొందుతూ అత్యధిక బడ్జెట్లో తెరకెక్కుతున్న తొలి భారతీయ చిత్రంగా రికార్డుకెక్కనుంది.తీరని కోరిక: నిరాడంబరుడు, నిగర్వి అరుున రజనీకాంత్‌కు తీరని కోరిక అంటూ ఏమీ ఉండదు. అయితే ఆయన అభిమానులకు మాత్రం ఆయన్ని రాజకీయ నాయకుడిగా చూడాలన్నది చిరకాల వాంఛ. మరి వారి కోరికను సూపర్‌స్టార్ నెరవేరుస్తారో? లేదో? వేచి చూడాల్సిందే. పుట్టిన రోజు వేడుకకు దూరం: రజనీకాంత్ ప్రతి పుట్టిన రోజున తన అభిమానులను కలుసుకుని వారి అభిప్రాయాలను స్వీకరించడం ఆనవాయితీగా వస్తోంది. ఇక అభిమానులైతే పూజలు, కటౌట్లకు పాలాభిషేకాలు, అన్నదానం, రక్తదానం కార్యక్రమాలు అంటూ నానా హంగామా చేస్తుంటారు. అలాంటిది ఈ సారి జయలలిత కన్నుమూయడంతో తన పుట్టిన రోజు వేడుకకు దూరంగా ఉండాలని రజనీకాంత్ నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని తన అభిమానులకు కూడా ముందుగానే విజ్ఞప్తి చేశారన్నది గమనార్హం. -
సూపర్‌స్టార్, ఇలయదళపతి కలిసిన వేళ
తమిళసినిమా; స్టార్ నటు లు ఈ మధ్య అభిమానులకు స్వీట్ షాక్ ఇస్తున్నా రు. ఇటీవల తన చిరకాల మిత్రుడు కమలహాసన్‌ను కలవడానికి ఆయన కార్యాలయానికి వెళ్లి అందర్నీ ఆసక్తి గురి చేశారు రజనీ కాంత్. కాగా ఇళయదళపతి విజయ్ తాజాగా సూపర్‌స్టార్ రజనీకాంత్‌ను కలిసి ఇరువురి అభిమానులకు ఆసక్తికరమైన చర్చకు కారణమయ్యారు. సూపర్‌స్టార్ రజనీకాంత్ నటిస్తున్న తాజా చిత్రం 2.ఓ షూటింగ్ స్థానిక ఎంజీఆర్ ఫిలిం ఇన్స్టిట్యూట్ ఆవరణలో జరుగుతోంది. అదే విధంగా విజయ్ నటిస్తున్న తాజా చిత్రం భైరవా చివరి రోజు షూటింగ్ అదే ఇన్స్టిట్యూట్లో జరిగింది. చిత్ర షూటింగ్‌కు గుమ్మడికాయ కొట్టిన తరువాత సమీపంలో షూటింగ్లో ఉన్న సూపర్‌స్టార్‌ను విజయ్ మర్యాదపూర్వకంగా కలిశారు. 10 నిమిషాల సేపు వీరిద్దరూ ముచ్చటించుకున్నారు. అయితే రజనీకాంత్ 2.ఓ చిత్ర గెటప్‌లో ఉండడం వల్ల విజయ్ ఆయనతో ఫొటో దిగలేదని ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి. -
పుట్టినరోజున అభిమానులకు కానుక
సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన కబాలి ఆయన అభిమానులను విపరీతంగా అలరించింది. కాగా ప్రస్తుతం రజనీకాంత్ శంకర్ దర్శకత్వంలో 2.ఓ చిత్రంలో నటిస్తున్నారు. శంకర్ మరో అద్భుత సృష్టిగా తెరకెక్కుతున్న ఈ చిత్రం పైనా చిత్ర పరిశ్రమలో ముఖ్యంగా ఆయన అభిమానుల్లో అంచనాలు తారా స్థాయిలో నెలకొన్నాయి. అయితే ఈ చిత్రం ఈ ఏడాదిలో విడుదలైయ్యే అవకాశం లేదు. ఇది రజనీ అభిమానులకు కాస్త నిరాశ పరిచే విషయమే. చిన్న ఆశ ఏమిటంటే 2.ఓ చిత్ర టీజర్ రజనీకాంత్ పుట్టిన రోజు సందర్భంగా విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇక ఆయన అభిమానులకు మరో సంతోషాన్నిచ్చే అంశం ఏమిటంటే బాషా చిత్రం పేరు వినగానే అందరి హృదయాల్లోనూ ఆనందపు తరంగాలు వెల్లువెత్తుతారుు. రజనీకాంత్‌కు అంతకు ముందు చిత్రాలను బాషా చిత్రంతో పోల్చలేం. సూపర్‌స్టార్ గ్యాంగ్‌స్టర్‌గా, ఒక సాధారణ ఆటోడ్రైవర్‌గా ఒకదానికొకటి పోలిక లేని రెండు విభిన్న కోణాల్లో సాగే పాత్రను అద్భుత అభినయంతో జీవం పోసిన చిత్రం బాషా. నగ్మా నాయకిగా నటించిన ఈ చిత్రానికి సురేశ్‌కృష్ణ దర్శకుడు. సత్యామూవీస్ సంస్థ నిర్మించిన బాషా చిత్రం 1985లో విడుదలై సంచలన విజయాన్ని సాధించింది. అంతే కాదు ఆ తరువాత మళ్లీ మళ్లీ విడుదలై కలెక్షన్లు రాబట్టుకుంది. ఈ చిత్రాన్ని రీమేక్ చేయాలని కొందరు భావించిన రజనీకాంత్ అంగీకరించలేదు. వెండితెరపై ఒకే ఒక్క బాషా అని, మరో బాషా సాధ్యం కాదన్నది ఆయన దృఢమైన అభిప్రాయం. కాగా అలాంటి బాషా చిత్రాన్ని డిజిటల్ లాంటి మరిన్ని ఆధునిక హంగులతో సూపర్‌స్టార్ పుట్టిన రోజు సందర్భంగా డిసెంబర్ 12న తెరపైకి తీసుకురావడానికి సత్యామూవీస్ సంస్థ సన్నాహాలు చేస్తున్నట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది. -
అతనేంటో నాకు తెలుసు
నా భర్త ఎలాంటి వారో నాకు బాగా తెలుసని సూపర్‌స్టార్ రజనీకాంత్ పెద్ద కూతురు, దర్శకురాలు ఐశ్వర్య ధనుష్ పేర్కొన్నారు. 3 చిత్రం ద్వారా దర్శకురాలిగా పరిచయమైన ఈమె ఆ తరువాత వైరాజావై చిత్రం చేశారు. ప్రస్తుతం స్టంట్ కళాకారుల జీవిత ఇతివృత్తంతో సినిమా వీరన్ అనే లఘు చిత్రాన్ని రూపొందిస్తున్నారు. అదే విధంగా తన తండ్రి సూపర్‌స్టార్ జీవిత చరిత్రను రాసి, దాన్ని వెండి తెరపై ఆవిష్కరించే పనిలోనూ ఉన్నట్లు సమాచారం. ఇటీవల ఐశ్వర్య భర్త, ధనుష్ గురించి రకరకాల వదంతులు మీడి యాలో హల్చల్ చేస్తున్నాయి. ధనుష్ ప్లేబాయ్ అని, కొందరు నటీమణులతో చెట్టాపట్టాల్ అంటూ వదంతులు కలకలం పుట్టిస్తున్నాయి. అంతే కాదు ఇలాంటి వదంతుల కారణంగా కుటుంబంలో సమస్యలు తలెత్తినట్లు, చివరకు రజనీకాంత్ కలగజేసుకుని పరిస్థితిని చక్కదిద్దినట్లు కోలీవుడ్ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. ఇలాంటి ప్రచారాన్ని మౌనంగా గమనిస్తూ వస్తున్న ధనుష్ భార్య, దర్శకురాలు ఐశ్వర్య ధనుష్ తన మనోగతాన్ని తేటతెల్లం చేశారు. తన భర్తపై ప్రచారం అవుతున్న వదంతులకు స్పందిస్తూ తాను డాక్టర్నో, లాయర్‌నో అయి ఉంటే ఇలాంటి వదంతులకు ఆగ్రహించుకునేదానినన్నారు. తనది సినిమా కుటుంబం అని, సినిమా గురించి తనకు పూర్తిగా తెలుసనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ముఖ్యంగా తన భర్త ధనుష్ గురించి,ఆయన ఎలాంటి వారో తనకు బాగా తెలసన్నారు. ఇలాంటి పనికిమాలిన, అసత్య ప్రచారాల గురించి పట్టించుకోవలసిన అవసరమో, బాధ పడాల్సిన పనో లేదని ఐశ్వర్య ధనుష్ స్పష్టం చేసినట్లు సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న కథనం. -
సౌందర్య రజనీకాంత్ చిత్రపటాలు దహనం
తమిళసినిమా: సూపర్‌స్టార్ రజనీకాంత్ రెండో కూతురు, సినీ దర్శకురాలు సౌందర్యరజనీకాంత్‌కు వ్యతిరేకంగా ఆందోళన చేస్తూ ఆమె చిత్ర పటాలను దహనం చేయడంతో ఆ ప్రాంతంలో కలకలం చెలరేగింది. వివరాల్లోకెళితే సౌందర్యరజనీకాంత్‌ను భారత దేశం యానిమల్ వెల్ఫేర్ బోర్డు అంబాసిడర్‌గా నియమించిన విషయం తెలిసిందే. సౌందర్యరజనీకాంత్ ఆ బాధ్యతలను చేపట్టడాన్ని వ్యతిరేకిస్తూ తిరుచ్చిలో వీరవిళైయాట్టు మీట్పు కళగం నిర్వాహకులు మంగళవారం ఆందోళనకు దిగారు.సౌందర్యరజనీకాంత్ చిత్ర పటాలను దహనం చేసి ఆమెకు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో ఆ ప్రాంతంలో కలకలం చెలరేగింది. అయితే అక్కడి పోలీసులు సౌందర్య రజనీకాంత్ చిత్ర పటాలు దహనం చేయడాన్ని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా వీరవిళైయాట్టు మీట్పు కళకం నిర్వాహకుడు రాజేశ్ మాట్లాడుతూ సౌందర్య రజనీకాంత్‌ను యానిమల్ వెల్ఫేర్ బోర్డు అంబాసిడర్‌గా నియమించడాన్ని జల్లికట్టును ఆదరించేవాళ్లు, తమిళ ప్రజల మనసులను తీవ్రంగా గాయపరిచిందన్నారు. జల్లికట్టు నిషేధానికి కారణంగా నిలిచిన యానిమల్ వెల్ఫేర్ బోర్డుకు అంబాసిడర్‌గా సౌందర్య రజనీకాంత్‌ను ఎంపిక చేయడం ఖండించతగ్గ విషయంగా పేర్కొన్నారు. అంతే కాకుండా తమిళ చిత్రాల్లో నటించి డబ్బు సంపాదించుకున్న కొందరు నటీనటులు జల్లికట్టుకు వ్యతిరేకంగా మాట్లాడడం గర్హనీయం అన్నారు. నటుడు రజనీకాంత్ మురట్టుకాళై చిత్రంలో జల్లికట్టు అంబోతుతో పోరాడి గెలిచినట్లు నటించి తమిళ ప్రజల మనసులో చోటు సంపాదించుకున్నారన్నారు. రజనీకాంత్ ఈ విషయంలో కలగజేసుకుని యానిమల్ వెల్ఫేర్ బోర్డు అంబాసిడర్‌గా నియమితులైన తన కూతురు సౌందర్యరజనీకాంత్‌ను ఆ బాధ్యతనుంచి వైదొలిగేలా చేయాలని లేని పక్షంలో ఆయనకు వ్యతరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతామని హెచ్చరిస్తున్నట్లు పేర్కొన్నారు. -
ఆంతర్యమేమిటో..
సూపర్‌స్టార్‌తో పొన్రాజ్ మరి కొందరితో భేటీకి కసరత్తు సాక్షి, చెన్నై: మాజీ రాష్ట్రపతి, భారతరత్నం, దివంగత అబ్దుల్ కలాం వెన్నంటి ఉండి, ఆయన పేరిట రాజకీయ పార్టీని ఏర్పాటు చేసి ఉన్న పొన్రాజ్ కొత్త మంతనాలు చర్చకు తెర లేపాయి. తాజాగా, దక్షిణ భారత చలన చిత్ర సూపర్ స్టార్ రజనీకాంత్‌తో మంతనాలు సాగించి, మరి కొందరు వీఐపీలతో భేటీ కసరత్తుల్లో పొన్రాజ్ ఉండడంతో ఆంతర్యాన్ని వెతికే పనిలో సర్వత్రా పడ్డారు. భారత రత్నం, దివంగత అబ్దుల్ కలాం కు సలహాదారుడిగా పొన్రాజ్ వ్యవహరించిన విష యం తెలిసిందే. కలాం మరణానంతరం ఆయన ఆ శయ సాధన లక్ష్యంగా తన ప యనాన్ని కొనసాగించే పని లో పడ్డారు. ఇందులో భాగం గా అసెంబ్లీ ఎన్నికల సమయం లో పొన్రాజ్ కొత్త పార్టీని ప్రకటించారు. మేధావులు, యువత, నిపుణులు, వీఐపీలతో కూడిన ఆ పార్టీకి అబ్దుల్ కలాం విజన్ ఇండియా పార్టీ అని నామకరణం చేశారు. ప్రస్తుతం ఈ పార్టీని బలోపేతం చేయడానికి తగ్గ కసరత్తుల్ని పొన్రాజ్ వేగవంతం చేశారు. యువతలో చైతన్యం తీసుకొచ్చే విధంగా, అన్ని రంగాల్లోని ప్రముఖుల్ని ఈ వేదిక మీదకు తెచ్చే దిశగా తన కసరత్తుల్లో నిమగ్నం అయ్యారు. ఈ పరిస్థితుల్లో రాజకీయాలపై ఆసక్తిని ప్రదర్శించే ప్రముఖుల్ని ఎంపిక చేసుకుని వారిని కలాం ఆశయ సాధన దిశగా నడిపించే ప్రయత్నాల్లో ఉన్నట్టుగా సంకేతాలు వెలువడ్డాయి. ఇందుకు అద్దం పట్టే రీతిలో వీఐపీలతో మంతనాలకు సిద్ధమయ్యారు. ఆ దిశగా రాజకీయాల్లోకి దేవుడు ఆదేశిస్తే...అంటూ దాటవేత దోరణితో ముందుకు సాగుతున్న దక్షిణభారత చలన చిత్ర సూపర్ స్టార్ రజనీకాంత్‌తో పొన్రాజ్ భేటీ సమాచారం చర్చనీయాంశంగా మారింది. చెన్నైలోని పోయెస్ గార్డెన్లో రజనీకాంత్‌తో భేటీలో రాజకీయ అంశాలపై చర్చ సాగినట్టు సంకేతాలు వెలువడడంతో అంతర్యాన్ని వెతికే పనిలో సర్వత్రా పడ్డారు. పొన్ రాజ్‌తో భేటీ సమయంలో దేవుడు ఆదేశిస్తే..అన్న పాత పాటనే సూపర్ స్టార్ పాడినట్టు సమాచారం. రజనీకాంత్‌తో భేటీ తదుపరి, మరి కొందరు సీనీ వీఐపీలతో భేటీకి తగ్గ కసరత్తులతో పొన్రాజ్ ముందుకు సాగుతుండడం ఆలోచించ దగ్గ విషయమే. -
సూపర్ ఛాన్స్!?
తమిళ దర్శకుడు ఏఎల్ విజయ్‌తో విడాకులకు ముందడుగు వేసిన తర్వాత అమలా పాల్‌కు తమిళంలో అవకాశాలు తగ్గాయనే వార్త ప్రచారంలో ఉంది. విజయ్ తండ్రి అళగప్పన్ అవకాశాలు రానివ్వకుండా చక్రం తిప్పుతున్నారని టాక్. కానీ, ఈ బ్యూటీకి సూపర్ ఛాన్స్ వచ్చిందని తాజా సమాచారం. ఏకంగా సూపర్‌స్టార్ రజనీకాంత్ సరసనే ఛాన్స్ వచ్చిందట. పా.రంజిత్ దర్శకత్వంలో రజనీ హీరోగా ఆయన అల్లుడు ధనుష్ నిర్మించనున్న సినిమాలో అమలా పాల్‌ను హీరోయిన్ గా ఎంపిక చేశారట. ధనుష్ హీరోగా నటించి, నిర్మించిన ‘వీఐపీ’లో ఆయన సరసన, ధనుష్ నిర్మించిన ‘అమ్మా కనక్కు’ సినిమాల్లో ఆమె నటించారు. ప్రస్తుతం ధనుష్ హీరోగా నటిస్తూ, నిర్మాణ భాగస్వామిగా వ్యవహ రిస్తున్న ‘వడ చెన్నై’లోనూ అమలాపాలే నాయిక. ధనుష్, అమలాపాల్ మంచి స్నేహితులనీ.. అందుకే, మామగారికి జోడీగా చాన్స్ ఇవ్వాలనుకుంటున్నారనీ కోడంబాక్కమ్ వర్గాల సమాచారం. -
రజనీకాంత్ కన్నా సుదీప్ ఉత్తమం
సాక్షి,బెంగళూరు: దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ కన్నడ స్టార్ నటుడు సుదీప్ నటనను మెచ్చుకునే క్రమంలో చేసిన ట్వీట్ దుమారం రేపింది. దివంగత కన్నడ నటుడు విష్ణువర్ధన్‌తోపాటు సూపర్‌స్టార్ రజనీకాంత్‌పై చేసిన వ్యాఖ్యలు కన్నడిగుల ఆగ్రహానికి కారణమయ్యాయి. ఇటీవల విడుదలైన కిచ్చా సుదీప్ సినిమా ‘కోటిగొబ్బ-2’ని వీక్షించిన వర్మ ట్విటర్లో .. ‘రజనీకాంత్ కేవలం స్టైల్‌తో నెగ్గుకొస్తున్నారు. ఆయన ఎంత యత్నించినా ఈగ సినిమాలో సుదీప్ పాత్రను పోషించలేరు. ‘కోటిగొబ్బ-2’లో సుదీప్ నటనతో పోల్చితే ‘కోటిగొబ్బ-1’లో విష్ణువర్ధన్ సరిగా చేయలేదు’ అన్నారు. వర్మ ట్వీట్‌కు ప్రతిస్పందించిన సుదీప్.. విష్ణు, రజనీ వంటి దిగ్గజాలతో నన్ను పోల్చడం భావ్యం కాదన్నారు. -
కబాలి మొదటి రోజు వసూలెంతో తెలుసా?
తమిళసినిమా: విడుదలకు ముందే కాదు ఆ తరువాత కూడా కబాలి గురించి కథనాలు కదం తొక్కుతున్నాయి.ఆ క్రెడిట్ అంతా సూపర్‌స్టార్ రజనీకాంత్దేనని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.ఆయన నటించిన ఈ చిత్రం ఒక్క భారతదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఒక ప్రభంజనంలా శుక్రవారం తెరపైకి వచ్చింది. ఎప్పుడెప్పుడా అని ఆతృతగా ప్రపంచవ్యాప్త రజనీ అభిమానులు ఎదురు చూశారు.ఇప్పుడు చూస్తూ (మగిల్చి)సంతోషపడుతున్నారు.కబాలి చిత్రం వారిలో పండగ వాతావరణాన్ని సృష్టించిందనే చెప్పాలి.ఉత్సవాలు జరుపుకుంటున్నారు.రజనీకాంత్ చిత్రాన్ని మొదటి రోజు మొదటి షో చూడటం ఘనతగా భావిస్తున్నారు.చూసిన వారిలో ఏదో సాధించాయన్న ఫీలింగ్. థియేటర్ల ముందు ఇసుకేస్తే రాలనంత జనం. 90 శాతం టికెట్లు ముందుగానే రిజర్వేషన్ అయ్యి పోవడంతో టికెట్లు దొరకని వారు మళ్లీ మళ్లీ థియేటర్లకు వచ్చి టికెట్ల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఎంత ధర చెల్లించి అయినా కబాలి చిత్రం చూసి తీరాలనే నిర్ణయంతో తమ ప్రయత్నాలు చేయడం అన్నది ఒక్క కబాలి చిత్రానికే చెల్లుతుంది.ఒక్క భారతరేశంలోనే కాదు,ప్రపంచ వ్యాప్తంగా కబాలి చిత్రంపై అంచనాలు నెలకొన్న నేపథ్యంలో అమెరికా,మలేషియా,సింగపూర్ మొదలగు 50 దేశాలలో ఈ చిత్రం హవా కొనసాగుతోంది.చిత్రం చూసిన రజనీ అభిమానులు ఆనందతాండ వం చేస్తున్నారనే చెప్పవచ్చు. 6,500 థియేటర్లలో కబాలి కబాలి చిత్రం ప్రపంచవ్యాప్తంగా 6500 థియేటర్లకు పైగా విడుదలైంది.ఇందులో 3,500 థియోటర్లకు పైగా హౌస్‌ఫుల్‌గా ప్రదర్శింపబడుతున్నాయి. 2వేల థియేటర్లలో వారానికి పైగా అడ్వాన్స్ బుకింగ్ జరిగిపోయింది.ఇక తమిళనాడు,కేరళ,ఆంధ్రా,తెలంగాణ,కర్ణాటక రాష్ట్రాల్లో కబాలికి అమోఘ ఆదరణ లభిస్తోంది. మొదటి రోజు వసూళ్లు రూ.40 కోట్లు చిత్ర ప్రారంభం నుంచి రికార్డులకు శ్రీకారం చుట్టిన కబాలి విడుదలకు ముందే నిర్మాతకు రూ.200 కోట్లు టేబుల్ ప్రాపర్టీని అందించిందనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో విడుదలైన తరువాత తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా వసూళ్లు రూ.40 కోట్లు అని తెలిసింది.బాలీవుడ్ స్టార్ నటుడు సల్మాన్‌ఖాన్ నటించిన సుల్తాన్ ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే.ఆ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఒక్క రోజు వసూళ్లు 36 కోట్లు. కబాలి విడుదలకు ముందు వరకూ ఇదే రికార్డు. ఇప్పుడా రికార్డును కబాలి బద్దలు కొట్టిందని సమాచారం. కాగా ఒక్క వారానికి రూ.120 కోట్ల వసూళ్లకు దాటుతుందని సినీ వర్గాల అంచనా.కాగా కబాలితో రజనీకాంత్ స్టామినా మరింత పెరిగింది.అమెరికాలో ఉన్న రజననీకాంత్ చిత్రం విడుదల ముందే చెన్నైకి తిరిగి వస్తారని భావించారు.కాగా ఇటీవల ఆయన అమెరికాలో కారులో పయనిస్తుండగా అక్కడి ప్రజల కంటపడ్డారు.అంతే వారంతా ఆనందంతో చేతులు ఊపుతూ పరుగులు తీశారు.దీంతో కారు నిలిపి వారికి ఉత్సాహంగా రజనీకాంత్ షేక్‌హ్యాండ్ ఇచ్చిన వీడియో ఇప్పుడు ఇంటర్నెట్లో హల్చల్ చేస్తోంది.అంతగా కబాలి ఫీవర్ పెల్లుబికిందన్న మాట. -
సొంత గూటికి ఎమీ
నటి ఎమీజాక్సన్ సొంత గూటికి చేరారు. ఈ బ్యూటీ ఇంగ్లాండ్‌కు చెందిన మోడల్ అన్న విషయం తెలిసిందే. మదరాసు పట్టణం చిత్రం ద్వారా కోలీవుడ్‌కు దిగుమతి అయ్యారన్న విషయం విదితమే. ఆ తరువాత తెలుగు, హిందీ అంటూ తన స్థాయిని పెంచుకుంటూ పోయిన ఎమీ అనతి కాలంలోనే సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో జతకట్టే లక్కీచాన్స్‌ను దక్కించుకున్నారు. అంతే కాదు స్టార్ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో వరుసగా రెండు చిత్రాల్లో నటించే అవకాశాలను అందుకున్న అరుదైన నటిగా గుర్తింపు పొందారు. విక్రమ్‌తో ఐ చిత్రంలో అందాలు ఆరబోసిన ఎమీ తాజా శంకర్ దర్శకత్వంలో రజనీకాంత్‌తో కలిసి 2.ఓ చిత్రంలో నటిస్తున్నారు. ఆ ఇంగ్లిష్ భామ ఇప్పుడు రెండు ఆంగ్ల చిత్రాల్లో నటిస్తున్నారట. ఇంట గెలిచి బయట గెలవాలన్న సామెతను రివర్స్ చేసిన నటి ఎమీ. ఏదేమైనా ఇన్నాళ్లకు సొంత గూటికి చేరారన్న మాట.దీని గురించి ఈ క్రేజీ బ్యూటీ తెలుపుతూ 2.ఓ చిత్రంలో రజనీకాంత్‌కు జంటగా నటించడం మాటల్లో చెప్పలేని అనుభూతిగా పేర్కొన్నారు. ఇందులో తన పాత్ర చాలా కొత్తగా ఉంటుందన్నారు. అందుకు దర్శకుడు శంకర్‌కి థ్యాక్స్ చెప్పుకుంటున్నానన్నారు. ఇక హిందీలో సొహైల్ ఖాన్ దర్శకత్వంలో నటించిన చిత్రం సెప్టెంబర్‌లో తెరపైకి రానుందని తెలిపారు. ప్రస్తుతం రెండు బ్రిటీష్ చిత్రాల్లో నటిస్తున్నానని చెప్పారు. అదే విధంగా తమిళం, తెలుగు, హిందీ చిత్రాల్లో నటించడం సంతోషంగా ఉందన్నారు. సినిమా తరువాత శారీరక అందంపై అధిక దృష్టి చూపిస్తానన్నారు. తన శరీరాన్ని చాలా ఫిట్‌గా ఉంచుకోవడానికి ప్రయత్నిస్తానని తెలిపారు. సమయం దొరికినప్పుడు కిక్ బాక్సింగ్, యోగా, గుర్రపు స్వారీ, డాన్స్ వంటివి చేయడానికి ఇష్టపడతానన్నారు. అలాగే కుటుంబ సభ్యులతో, స్నేహితురాళ్లతో గడుపుతానని చెప్పారు. నెలలో సగం రోజులు చెన్నై లేదా ముంబయిలో మరో సగం రోజులు లండన్, అమెరికా, ఐరోపా దేశాల్లో గడుపుతానని ఎమీజాక్సన్ అంటున్నారు. -
250 కబాలి టిక్కెట్లు కొన్న ప్రముఖ నటుడు
కబాలిరా..నిప్పురా. కబాలి వచ్చాడని చెప్పు..తిరిగొచ్చాడని చెప్పు.పాత సినిమాలో బుగ్గ మీద చుక్క పెట్టుకుని ఏయ్ కబాలి అని పిలవగానే వంగి ఎస్ బాస్ అనే కబాలి అనుకున్నార్రా.. కబాలి రా.. ఇలాంటి ప్రేక్షకుల చేత చప్పట్లు కొట్టించే సంభాషణలతో తనదైన స్టైల్లో ప్రచార చిత్రంలోనే దుమ్మురేపిన సూపర్‌స్టార్ రజనీకాంత్ తాజా చిత్రం కబాలి చుమ్మ అదురుదిల్లే అంటూ శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా తెరపైకి రానుంది. తమిళసినిమా: ట్రెండ్ సృష్టంచడం అన్నది మన సూపర్‌స్టార్‌కు కొత్తేమీకాదు.అదే బాణీలో మరోసారి బాక్సాఫీస్‌లను బద్ధలు కొట్టడానికి కబాలిగా వస్తున్నారన్న మాట. కబాలి.. ఇప్పుడు ప్రపంచమంతా మారుమోగుతున్నది ఈ మూడక్షరాలే. ఇప్పటి వరకూ భారతీయ సినీ చరిత్రలోనే కనీవినీ ఎరుగని విధంగా ప్రపంచ సినీ అభిమానులు అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం కబాలి. ఇందుకు ఒకే ఒక్క తారక మంత్రం రజనీకాంత్ అనే ఐదు అక్షరాలే.తమిళం,తెలుగు,హిందీ, మలాయ్ మొదలగు నాలుగు భాషలలో ఏక కాలంలో విడుదలవుతున్న ఏకైక చిత్రం అన్న ఘనతను కబాలి చిత్రం దక్కించుకుంది. ఒక చిత్ర విడుదల రోజున కార్పొరేట్ సంస్థలు సెలవులు ప్రకటించడమా? అంటూ కబాలి చిత్ర క్రేజ్‌ను చూసి ప్రపంచ మీడియానే అచ్చెరువు చెందుతోందంటే ఈ చిత్రం స్థాయి ఏమిటో అర్థం చేనుకోవచ్చు.ఇలా చెప్పుకుంటూ పోతే కబాలి గురించి చాలా విశేషాలు ఉన్నాయి.కబాలి చిత్రం విడుదల కావడంతో తమిళనాడులోనే కాదు,పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రా, కర్ణాటకల్లో కొత్త చిత్రాల విడుదలను వాయిదా వేసుకున్నారు.ప్రపంచ వ్యాప్తంగా 5000 థియోటర్లకు పైగా విడుదలవుతున్న కబాలి చిత్రం ఒక తమిళనాడులోనే 650 థియేటర్లకు పైగా విడుదల కానుంది.ఇప్పటి వరకూ ఏ చిత్రం ఇన్ని థియేటర్లలో విడుదల కాలేదన్నది ప్రత్యేకంగా చెప్పాలా? అవరోధాలను చీల్చుకుంటూ ఈ మధ్య చాలా చిత్రాలు విడుదల సమయాల్లో సమస్యలను ఎదుర్కోవడం పరిపాటిగా మారింది. కబాలి కూడా అలాంటి వాటిని ఎదుర్కోక తప్పలేదు.అయితే అన్ని బంధనాలను తెంచుకుని కబాలి డా అంటూ ఇక ప్రభంజనంలా తెరపైకి రానుంది. 250 టిక్కెట్లు కొన్న శింబు కాగా సాధారణ ప్రజలే కాదు ప్రముఖ నటులు కబాలి చిత్రాన్ని మొదటి రోజున మొదటి షో చూడడానికి ఆసక్తి చూపడం అన్నది ఒక రజనీకాంత్ చిత్రానికే జరుగుతోంది.శుక్రవారం పలువురు నటులు చెన్నైలో టికెట్స్ కొని మరీ కబాలి చిత్రాన్ని చూడబోతున్నారు. నటుడు శింబు ప్రస్తుతం మదురైలో అన్భానవన్ అసరాదవన్ అడంగాదవన్ చిత్ర షూటింగ్లో పాల్గొంటున్నారు.ఆయన రజనీకాంత్ వీరాభిమాని అన్న విషయం తెలిసిందే. శింబు తన చిత్ర యూనిట్ సభ్యులు 250 మందికి టికెట్లు కొని శుక్రవారం వారితో కలిసి మదురైలో కబాలి చిత్రాన్ని చూడనున్నారు. అభిమానుల హంగామా రజనీకాంత్ చిత్రం తెరపైకి వస్తుందంటే ఆయన అభిమానులు సెలైంట్‌గా ఉంటారా?పూజలు,పాలాభిషేకాలు,భారీ కటౌట్లు అంటూ నానా హంగామా చేయరూ*ప్రస్తుతం తమిళనాడు వ్యాప్తంగా రజనీ అభిమానుల్లో అలాంటి కోలాహలమే జరుగుతోంది.చెన్నైలో పలు ప్రాంతాలలో కబాలి చిత్రం విజ యం సాధించాలని కోరుకుంటూ పలు ఆలయాల్లో పూజలు,కటౌట్లకు పాలాభిషేకాలు చూస్తూ అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తూ తమ వీరాభిమాన్ని చాటు కుంటున్నారు. కాగా సూపర్‌స్టార్ రజనీకాంత్ శుక్రవారం అమెరికాలో అక్కడ డిస్ట్రిబ్యూటర్ల మధ్య కబాలి చిత్రాన్ని తిలకించారు.చిత్రంలో ప్రతి సన్నివేశానికి వీక్షకుల నుంచి ఈలల,చప్పట్లు పడడంతో ఆ వాతావరణాన్ని మౌనంగా,మనసులోనే ఆనందపడుతూ బయటకు వచ్చిన వెంట నే దర్శకుడు రంజిత్‌కు ఫోన్ చేసి ప్రశంసల వర్షం కురిపించారట. దటీజ్ సూపర్‌స్టార్ అంటున్నారు సినీవర్గాలు. -
అమెరికాలో రజనీకి స్టాండింగ్ ఒవేషన్!
అమెరికాలో బుధవారం సాయంత్రం రజనీకాంత్ నటించిన ‘కబాలి’ సినిమాను స్పెషల్ స్ర్కీనింగ్ ఏర్పాటుచేశారు. ఈ షోకు హాజరైన అభిమానులు ఊహించని అతిథిని చూసి ఆశ్చర్యపోయారు. ‘కబాలి’ సినిమాకు వచ్చిన అభిమానులకు ఏకంగా రియల్ ‘కబాలి’ రజనీకాంత్ దర్శనమివ్వడంతో సంభ్రమాశ్చర్యంలో మునిగిపోయారు. సాన్ ఫ్రాన్సిస్కోలో ఏర్పాటు చేసిన ఈ షోకు రజనీ ప్రత్యేక అతిథిగా హాజరై.. అభిమానుల్ని అలరించారు. భారత్‌లోనే కాదు అమెరికాలోనూ ‘కబాలి’ సినిమా తొలి మూడు రోజుల టికెట్లు అమ్ముడుపోయిన సంగతి తెలిసిందే. అమెరికా నుంచి ప్రస్తుతం ‘కబాలి’ సినిమా సానుకూల స్పందన వ్యక్తమవుతున్నది. ‘కబాలి’ని చూసిన చాలామంది అమెరికన్ ఇండియన్లు అభిమానులకు ఈ సినిమా పండుగేనని అంటున్నారు. ‘కబాలి తలైవా అభిమానులకు పైసా వసూల్ సినిమా. అభిమానులు మెస్మరైజ్ అయ్యే సీన్లు ఎన్నో ఉన్నాయి. పలుసార్లు థియేటర్ హర్షధ్వానాలతో దద్దరిల్లింది’ అని ఇండస్ట్రి ఇన్సైడర్ రమేశ్ అమెరికాలో వస్తున్న రెస్పాన్స్ మీద స్పందిస్తూ ట్వీట్ చేశారు. #Kabali U.S distributor @CineGalaxyUSA with @superstarrajini after special show pic.twitter.com/gmdjRagp3b — Studio Flicks (@StudioFlicks) July 21, 2016 -
’కబాలి’ రివ్యూ అప్పుడే వచ్చేసింది!
‘కబాలి’ సినిమాపై ఇప్పటికే అంచానాలు ఆకాశాన్నంటేశాయి. మరికొద్ది గంటల్లో విడుదల కానున్న ఈ సినిమా గురించి ఎక్కడ చూసినా హాట్ హాట్ చర్చ కొనసాగుతోంది. ‘కబాలి’ ఫీవర్ అభిమానుల్ని ఊపేస్తోంది. అమెరికాలో ‘కబాలి’ సినిమా ప్రివ్యూ గురువారం ఉదయమే విడుదలైంది. ఈ నేపథ్యంలో అమెరికాకు చెందిన ఓ వ్యక్తి ఫేస్బుక్లో ‘కబాలి’ సినిమాపై తన రివ్యూను ఇచ్చాడు. బాలాజీ శ్రీనివాసన్ పేరిట ఆయన పెట్టిన రివ్యూ కొన్ని గంటల్లోనే వైరల్ గా మారిపోయింది. ఏకంగా 30వేల మంది ఆయన పేరును ఫేస్బుక్లో సెర్చ్ చేశారు. అయితే, కొన్ని గంటలకే ఆయన తన రివ్యూను తొలగించారు. అయినప్పటికీ ఆయన రివ్యూ పలుచోట్ల షేర్ అయింది. ఇంతకూ ఆయన ఏం రాశారంటే.. బే ఏరియా సినీ పరిశ్రమ స్నేహితులకు కృతజ్ఞతలు.. ‘కబాలి’ సినిమా ప్రివ్యూను నేను చూశాను. ఎలాంటి అంచనాలు లేకుండా సినిమాకు వెళ్లాను. మిశ్రమ భావాలతో బయటకు వచ్చాను. రజనీ అభిమానులకు ఇది కచ్చితంగా పైసా వసూల్ సినిమానే. వయస్సు మీదపడిన సూపర్ స్టార్ ప్రదర్శించే దూకుడును చూసి ఇతరులూ ఛలోక్తులతో ఆనందించవచ్చు. కథ విషయానికొస్తే.. మలేషియా నేపథ్యంగా కథ నడుస్తుంది. అక్కడ అరాచకాలు ఎదుర్కొంటున్న తమిళులు తమను ఆదుకునే వాడికోసం ఎదురుచూస్తూ ఉంటారు. జాతి వివక్షను ఎదిరించి కొంతకాలం జైలు శిక్ష అనుభవించిన సూపర్ స్టార్ నెల్సన్ మండేలాలాగా అక్కడికి వస్తాడు. కొంతకాలం (బాషాలో ఆటోడ్రైవర్ లా) సామాన్యుడిలాగే జీవిస్తాడు. కానీ పరిస్థితుల ప్రభావంతో శత్రువుల నుంచి తన కూతురిని కాపాడుకునేందుకు రజనీ గ్యాంగ్‌స్టర్‌గా మారుతాడు. అలా మలేషియాలోని తమిళులు, దళితుల నాయకుడిగా మారి వారి జీవితాల్లో ఎంతో గణనీయమైన మార్పు తీసుకొస్తాడు. రజనీ అభిమానిని ఈ సినిమా మెస్మరైజ్ చేస్తుంది. స్లో మోషన్ వాక్స్, స్టైలిష్ పోజులు, క్రిస్పీ డైలాగులు సినిమా అంతటా ఉండటం అభిమానిని సంతోషపెడుతుంది. రజనీ చాలా పొందిక తన మ్యానరిజమ్స్ ప్రదర్శించిన ప్రతిసారి థియేటర్ హర్షధ్వానాల్లో మునిగితేలుతుంది. సినిమాలో కొన్ని ఫ్లాష్ బ్యాక్ సీన్స్ కూడా ఉన్నాయి. ఇందులో రజనీ యువకుడిగా కనిపించి.. ఒకప్పటి రజనీని గుర్తుకుతెస్తాడు. రజనీకి ఉన్న లార్జర్ దన్ లైఫ్ ఇమేజ్ దృష్టిలో పెట్టుకొని దర్శకుడు పా రంజిత్ సినిమాను డీల్ చేశాడు. ఇంకా చెప్పాలంటే చాలా సినిమాల్లో రజనీ చేసిన అద్భుతాలే మళ్లీ ఇందులో కనిపించినట్టు అనిపిస్తుంది. మామూలు సినీ వీక్షకుడికి మాత్రం ఈ సీన్లు అసహజంగా, బోర్ కొట్టించేవిగా అనిపించవచ్చు. వయస్సు మీద పడిన రజనీ ఫ్లాష్ బ్యాక్ సీన్లలో 30 ఏళ్ల యువకుడిగా కనిపించడం కూడా కొద్దిగా ఎబ్బెట్టుగా తోచవచ్చు. మొత్తానికి సినిమాపరంగా చూస్తే కొంచెం నిడివి పెరిగినట్టు అనిపించినా రజనీ మళ్లీ తనదైన నటన చూపించాడు. మలేషియాలోని తమిళుల అవస్థ పట్ల పా రంజిత్ ఇంతకంటే మంచి సినిమా తీయవచ్చు. రంజిత్ దళిత రాజకీయాలు కూడా సినిమాలో బ్యాక్ సీట్ అయ్యాయి. ఈ సినిమా రజనీకి కమర్షియల్ వెహికిల్ గా మారిందని చెప్పవచ్చు. (ఇది ఫేస్బుక్లో బాలాజీ శ్రీనివాసన్ అనే వ్యక్తి పెట్టిన రివ్యూ మాత్రమే) -
‘కబాలి’ని ఎందుకు చూడాలి??
‘కబాలి’ సినిమా సంబురాలు అప్పుడే మిన్నంటుతున్నాయి. చెన్నైలోని చాలా థియేటర్ల వద్ద రజనీకాంత్ అభిమానుల సందడితో పండుగ వాతావరణం నెలకొంది. ఇటు దేశవ్యాప్తంగా ‘కబాలి’ సినిమా ఎలా ఉండబోతున్నది? అసలు ‘కబాలి’ ఏం చేయబోతున్నాడు? అని ఆసక్తిగా ఎదురుచూస్తోంది. రేపు (శుక్రవారం) ‘కబాలి’ విడుదలవుతున్న తరుణంలో ఈ సినిమాను ఎందుకు చూడాలి? అంటే.. ఇదిగో ఈ ఐదు కారణాలు చెప్పవచ్చు అంటున్నారు సినీ పరిశీలకులు.. 1. రజనీ ఒక ప్రభంజనం రజనీకాంత్ అంటే అభిమానులకు దేవుడు.. రజనీ సినిమాల్లో చేసే కొన్ని అద్భుతాలను పక్కనబెడితే.. సినీ ప్రేమికులూ ఆయన చిత్రాలను ఇష్టపడతారు. రజనీలో మంచి నటుడున్నాడని విమర్శకులు ఒప్పుకుంటారు. కానీ మాస్ ఇమేజ్, మ్యానరిజం చట్రంలో పడిపోయాడని పేర్కొంటారు. మొత్తానికి 1975లో మొదలైన ‘తలైవా’ ఇమేజ్ ఇప్పుడు శిఖరస్థాయిని అందుకుంది. రజనీ గత రెండు సినిమాలు- కొచ్చాడైయన్, లింగా- బాక్సాఫీసు వద్ద చతికిలపడ్డాయి. ఈ నేపథ్యంలో తన సర్వశక్తులొడ్డి.. తనను తాను బాక్సాఫీసు బాషాగా పునర్ ఆవిష్కరించికోవడానికి రజనీ చేసిన ప్రయత్నమే ‘కబాలి’ అని అంటున్నారు. మరీ ముఖ్యంగా ఈ సినిమాలో రజనీ తొలిసారి తన ఒరిజినల్ లుక్‌తో కనిపించనున్నారు. తొలిసారి 50, 60 ఏళ్ల వ్యక్తిగా ఎలాంటి మేకప్ ట్రిక్కులు పెద్దగా లేకుండా, వెంట్రుకలకు రంగు వేసుకోకుండా రజనీ లుక్ ఇప్పటికే అభిమానుల్ని మెస్మరైజ్ చేస్తోంది. 2. కపాలీశ్వర్ కథ! కథ గురించి పెద్దగా తెలియదు. కపాలీశ్వరన్ అనే చెన్నై గ్యాంగ్‌స్టర్ గా రజనీ కనిపించనున్నారు. మలేషియాలో మొదలైన ఆయన జీవితం.. అక్కడ శతాబ్దాలుగా నివసిస్తున్న తమిళులకూ సమాన హక్కుల కోసం ఆయన చేసిన పోరాటం స్థూలంగా ఈ సినిమా కథ అని వినిపిస్తోంది. చరిత్రలోకి తొంగిచూస్తే 11వ శతాబ్దం పల్లవులు, చోళుల కాలం నాటి నుంచి తమిళులు మలేషియాలో ఆవాసం ఏర్పరుచుకొని జీవిస్తున్నారు. బ్రిటీష్ హయాంలోనూ ఎంతోమంది అక్కడికి వలసవెళ్లారు. ఈ నేపథ్యంలో తమిళుల హక్కులు అనే ఎమోషనల్ అంశం చుట్టూ ‘కబాలి’ కథ తిరుగొచ్చని అంటున్నారు. 3. యువ దర్శకుడి మ్యాజిక్ దర్శకుడిగా పా రంజిత్ ఇప్పటివరకు తెరకెక్కించినవి రెండే చిత్రాలు. కానీ ఈ రెండు చిత్రాలతో తనదైన ముద్రను అతను వేసుకున్నాడు. మంచి కథలను ఎంచుకొని.. దానికి లోకల్ ట్విస్టు యాడ్ చేసి.. నిజంగానే జరిగిందా? అన్నంత అద్భుతంగా పా రంజిత్ తన చిత్రాల్లో మ్యాజిక్ చేశాడు. అతడు తెరకెక్కించిన మద్రాస్, అడ్డకత్తి చిత్రాలు విమర్శకుల ప్రశంసలందుకున్నాయి. ఈ నేపథ్యంలో రజనీలాంటి సూపర్ స్టార్‌ను రంజిత్ ఎలా చూపించాడు.. కథను ఎలా హ్యాండిల్ చేశాడు.. తెరపై చూపాడు అన్నది ఆసక్తికరంగా మారింది. 4. సినిమా నిండా కొత్త రక్తం! ‘కబాలి’ సినిమాకు దర్శకుడే కాదు.. చాలావరకు టెక్నిషియన్స్, తారాగణం కూడా కొత్తవారే. రజనీ సినిమాకు సాధారణంగా ఏఆర్ రహమాన్ సంగీతం అందిస్తారు. కానీ ఈ సినిమాకు 33 ఏళ్ల యువ సంగీత దర్శకుడు సంతోష్ నారాయణ్‌కు అవకాశమిచ్చారు. ‘నెరుప్పుడా’ పాటతో అతను తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. అలాగే బాలీవుడ్ భామ రాధికా ఆప్టేకు మంచి నటిగా పేరుంది. ఆమెను రజనీ పక్కన హీరోయిన్గా తీసుకోవడం కూడా కలిసి వచ్చింది. ఇద్దరి మధ్య వయస్సుపరంగా వ్యత్యాసమున్నా.. రజనీ మ్యాజిక్ అది కవర్ చేస్తుందని అంటున్నారు. 5. కొత్త తరహాలో టేకింగ్.. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలు ‘కబాలి’ సినిమా ఎలా ఉండబోతున్నదో కొంతవరకు హింట్ ఇచ్చాయి. అభిమానులు పడిచచ్చే ‘రజనిజం’ మ్యానరిజానికి ఈ సినిమాలో కథానుగుణంగా కనిపిస్తాయని తెలుస్తోంది. ముఖ్యంగా పాత సినిమాల్లో మాదిరిగా రజనీ తన క్రాప్‌ను స్టైలిష్‌గా సరిచేసుకోవడం.. ‘కబాలి, రా’ అంటూ తనదైన స్టైల్లో పేర్కొనడం ఈ సినిమా ఎలా ఉండబోతున్నదో చెప్పకనే చెబుతున్నది. రజనీ మ్యానరిజం, స్టైల్స్ లోపించకుండా దర్శకుడు కథను ఎలా ముందుకు నడిపించాడో తెలుసుకోవాలంటే.. రేపటివరకు ఆగాల్సిందే. -
22న కబాలి
యావత్ సినీ వర్గాలు, ప్రేక్షకులు, ముఖ్యంగా సూపర్‌స్టార్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఆతృతతో ఎదురు చూస్తున్న చిత్రం కబాలి. భారతీయ చిత్ర పరిశ్రమలో ఇప్పటి వరకూ ఏ చిత్రానికి రానంత క్రేజ్‌ను సంపాదించుకున్న చిత్రం కబాలి అనడం అతిశయోక్తి కాదేమో. ఈ చిత్రానికి ప్రసార మాధ్యమాలు కూడా చాలానే ప్రచారం చేశాయని చెప్పక తప్పదు. కారణం ఒక్కటే. ఇందులో కథానాయకుడు సూపర్‌స్టార్ రజనీకాంత్. యువ దర్శకుడు రంజిత్ దర్శకత్వంలో కలైపులి ఎస్.థాను నిర్మించిన భారీ చిత్రం కబాలి. మొట్టమొదటి సారిగా మలయాళం భాషలో అనువాదమై విడుదలవుతున్న భారతీయ చిత్రం కబాలి. తమిళం, తెలుగు, హిందీ, మలయాళం భాషల్లో విడుదలవుతున్న చిత్రం కబాలి. రాధిక ఆప్టే నాయకిగా నటిస్తున్న ఈ చిత్రానికి సంతోష్‌నారాయణ్ సంగీతాన్ని అందించారు. చిత్ర నిర్మాణం పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదల గురించి రకరకాల ప్రచారం జరిగింది. జూలై 22న, 29న, ఆగస్టు 15న విడదల ఇలా ఎవరికి తోచినట్లు వారు ప్రచారం చేశారు. అయితే చిత్ర నిర్మాత మాత్రం కబాలి చిత్ర విడుదల విషయంలో నిర్ధిష్టమైన నిర్ణయంతో ఉన్నారు. చిత్రాన్ని సోమవారం సెన్సార్‌కు పంపారు. అదే రోజు మూడు గంటలకు సెన్సార్ బోర్డు సభ్యుల బృందం చిత్రాన్ని చూశారు. క్లీన్ ‘యు’ సర్టిఫికెట్ అందించారు. వెంటనే నిర్మాత కలైపులి ఎస్.థాను అనుకున్న విధంగా ఈ నెల 22నే కబాలి విడుదల అని తన ట్విట్టర్లో పేర్కొన్నారు. ఇంతకు ముందు కబాలి విడుదల విషయంలో అభిమానుల్లో కాస్త గందరగోళం ఏర్పడగా నిర్మాత స్పష్టతతో వారితో ఆనందాలు వెల్లివిరుస్తున్నాయి. కబాలి చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా 10 వేల థియేటర్లలో విడుదలకు నిర్మాత సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. ఇన్ని థియేటర్లలో విడుదలవుతున్న తొలి భారతీయ చిత్రం కూడా కబాలి కావొచ్చు. ఇలా విడుదలకు ముందే సంచలన రికార్డులు బద్దలు కొడుతున్న మన స్టైల్ కింగ్ చిత్రం విడుదల అనంత రం ఎలాంటి సెన్సేషనల్ క్రియేట్ చేస్తుందో వేచి చూడాల్సిందే. కబాలిడా..నెరుప్పుడా.. -
2ఓ కోసం 40 కిలోల బరువుతో రజనీ
2ఓ చిత్రం కోసం సూపర్‌స్టార్ రజనీకాంత్ శక్తికి మించి శ్రమించినట్లు ప్రచారం చక్కర్లు కొడుతోంది. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది అభిమానులను సొంతం చేసుకున్న ఏకైన భారతీయ నటుడు రజనీకాంత్ అనడంలో ఏమాత్రం అతిశయోక్తి ఉండదు. అలాంటి సూపర్‌స్టార్ తాజాగా ఏక కాలంలో కబాలి, 2ఓ చిత్రాలలో నటిస్తుండడం విశేషం. చాలా కాలం తరువాత దాదాగా నటిస్తున్న కబాలి చిత్రానికి సంబంధించిన అన్ని పనులను రజనీ పూర్తి చేశారు. ఇక ఎందిరన్‌కు సీక్వెల్‌గా స్టార్ డెరైక్టర్ శంకర్ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం 2ఓ. ఈ చిత్రం షూటింగ్ అధిక భాగం విదేశాలలో చిత్రీకరణ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ చి్రత్రానికి సంబంధించిన షూటింగ్‌ను రజనీకాంత్ దాదాపు పూర్తి చేశారని సమాచారం. ఇందులో గ్రాఫిక్స్‌కు అధిక ప్రాధాన్యం ఉంటుంది కాబట్టి ఇంకా రజనీకాంత్ నటించే సన్నివేశాలు తక్కువేనని కోలీవుడ్ వర్గాల టాక్. ఇందులో రజనీకాంత్ అధిక సన్నివేశాలలో విచిత్రమైన కాస్ట్యూమ్స్‌లో కనిపిస్తారట. వీటి బరువు సుమారు 40 కిలోలు ఉంటాయట. ఈ కాస్ట్యూమ్స్ ధరించి వేసవిలో అవుట్ డోర్లో మండే ఎండల్లోనూ ఇండోర్‌లో అతి ఏసీ ఫ్లోర్లోనూ నటించడంలాంటి కష్టమైన సన్నివేశాలలో రజనీకాంత్ నటించారనీ, అందుకే ఆయన అనారోగ్యం పాలయ్యారని మీడియాలో ప్రచారం హల్చల్ చేస్తోంది. అయితే ఈ విషయాల్లో నిజం ఎంతన్నది పక్కన పెడితే రజనీకాంత్ మాత్రం ఇటీవల అనారోగ్యానికి గురైన మాట వాస్తవం. అమెరికాలో చికిత్స పొందిన రజనీ ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ కారణంగానే కబాలి చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని గ్రాండ్‌గా నిర్వహించ తలపెట్టిన చిత్ర యూనిట్ ఆ కార్యక్రమాన్ని విరమించుకుందనే ప్రచారం ఆ మధ్య జరిగింది. అయితే సూపర్‌స్టార్ ప్రస్తుతం పూర్తి ఆరోగ్యంతో ఉన్నారు. -
వైద్య పరీక్షలకు అమెరికా వెళ్లిన రజినీ
తంజావూరు: సూపర్ స్టార్ రజినీకాంత్ అమెరికా వెళ్లారు. వైద్య పరీక్షల కోసం ఆయన అమెరికా వెళ్లారని ఆయన నటించిన చిత్రం కబాలీ త్వరలోనే విడుదల కానున్న నేపథ్యంలో అతి త్వరలోనే వస్తారని కుటుంబ సభ్యులు చెప్పారు. 'ఆయన వైద్య పరీక్షలకోసం అమెరికా వెళ్లారు. జూలై 15న ఆయన నటించిన చిత్రం కబాలీ విడుదలవుతున్నందున అంతకు ముందే వస్తారు' అని రజనీ సోదరుడు సత్యనారాయణ తంజావూరులో విలేకరులతో చెప్పారు. ఇటీవలె తంజావూరులోని యూనెస్కో గుర్తింపు ఉన్న శివాలయంలో రజినీ ప్రత్యేక పూజలు జరిపించారని చెప్పారు. అభిమానుల ప్రేమే తమ సోదరుడు రజనీకి నిజమైన బలం అని ఆయన చెప్పారు. కబాలీ సినిమా చాలా బాగుంటుందని, అందరికీ నచ్చుతుందని తెలిపారు. -
రాణి అవతారమెత్తిన ధన్సిక
నటి ధన్సిక ఇంతకు ముందు పలు చిత్రాల్లో నటించినా కబాలి చిత్రంలో సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో కలిసి నటించిన తరువాత ఆమె రేంజే వేరు అన్నంతగా మారిపోయారు. ఆ చిత్రంలో రజనీకాంత్ కూతురిగా చాలా ప్రాముఖ్యత గల పాత్రను పోషించినట్లు సమాచారం. కబాలి చిత్రాన్ని పూర్తి చేసి ధన్సిక తాజాగా రాణి అవతారమెత్తారు. అవును తను కథానాయకిగా నటిస్తున్న నూతన చిత్రానికి రాణి అనే టైటిల్‌ను నిర్ణయించారు. ఎస్ఎస్.ఫిలింస్ పతాకంపై సి.ముత్తుక్రిష్ణన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి నవ దర్శకుడు ఎస్.బాణి దర్శకత్వం వహిస్తున్నారు.ఈయన దర్శకుడు సముద్రకని వద్ద సహాయదర్శకుడిగా పనిచేశారన్నది గమనార్హం. ఇళయరాజా సంగీతాన్ని, ఏ.కుమరన్ చాయాగ్రహణం అందిస్తున్నారు. ఈ చిత్రం బుధవారం తిరువణ్ణామలైలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. సంగీత దర్శకుడు ఇళయరాజా హాజరై పూజా కార్యక్రమాలను నిర్వహించారు. నాయకి ధన్సిక పాల్గొన్నారు. చిత్రం అధిక భాగం మలేషియాలో చిత్రీకరణ జరుపుకోనుందట. దీంతో చిత్ర యూనిట్ మలేషియాకు బయలు దేరనున్నట్లు చిత్ర వర్గాలు వెల్లడించాయి. -
సూపర్ స్టార్ ఆరోగ్యంగానే ఉన్నారు!
చెన్నై: సూపర్‌స్టార్ రజనీకాంత్ మళ్లీ అనారోగ్యానికి గురయ్యారని వస్తున్న కథనాలలో వాస్తవం లేదని ఆయన సెక్రటరీ తెలిపాడు. అమెరికాలో వైద్య చికిత్స పొందుతున్నారని అందువల్లే బ్రహ్మాండంగా నిర్వహించాల్సిన కబాలి చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం వాయిదా పడిందని మీడియాలో ఈ వార్తలు చక్కర్లు కొట్టాయి. రజనీకాంత్ లేకుండానే కబాలీ ఆడియో లాంచ్ జరగడంతో ఈ వార్తలకు ఊతమిచ్చినట్లు కనిపించింది. రజనీ అమెరికాలో ఆరోగ్యంగా ఉన్నారని ఆయన అభిమానులు దిగులు చెందాల్సిన అవసరం లేదని ఆయన సన్నిహితుడు చెప్పాడు. జూలై మొదటి వారంలో రజనీ సార్ చెన్నైకి తిరిగొస్తారని ఆయన సెక్రటరీ తెలిపాడు. బిజీ బిజీ షూటింగ్ షెడ్యూల్స్ వల్ల ఆయన అలసి పోయారని, కాస్త విరామం అవసరమని డాక్టర్లు ఇచ్చిన సలహా మేరకు రజనీ కాస్త బ్రేక్ తీసుకున్నారని క్లారిటీ ఇచ్చాడు. చెన్నైలో వైద్య పరీక్షలు చేయించుకున్న తర్వాత విశ్రాంతి కోసం అమెరికా ట్రిప్ కు వెళ్లారని, అయితే కాలిఫోర్నియాలో కిడ్నీ సంబంధిత సర్జరీ చేయించుకున్నారని కథనాలు వచ్చాయని పేర్కొన్నాడు. రోబో సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కిస్తున్న 'రోబో 2.0' షూటింగ్ లో జూలై రెండో వారంలో పాల్గొంటారని వివరించారు. -
రజనీ చికిత్స పొందుతున్నారా?
సూపర్‌స్టార్ రజనీకాంత్ మళ్లీ అనారోగ్యానికి గురయ్యారా? అమెరికాలో వైద్య చికిత్స పొందుతున్నారా? అందువల్లే ఈ నెల 12న బ్రహ్మాండంగా నిర్వహించాల్సిన కబాలి చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం వాయిదా పడిందా? ఇలాంటి వార్తలే ప్రస్తుతం మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. రజనీకాంత్ నటించిన భారీ చిత్రం కబాలి నిర్మాణాంతర కార్యక్రమాలు చివరి దశకు చేరుకున్నాయి. యువ దర్శకుడు రంజిత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని కలైపలి ఎస్.థాను భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. ఇప్పటికే టీజర్లో చరిత్రను తిరగరాసిన కబాలి వ్యాపారపరంగా రికార్డులు బద్దలు కొడుతోంది. ఇక చిత్రం విడుదలైతే ఎలాంటి సెన్సేషన్ సృష్టిస్తుందోనన్న ఆసక్తి పరిశ్రమకు చెందిన ప్రతి వ్యక్తిలోనూ కలుగుతోందనడం అతిశయోక్తి కాదు. కబాలి చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాల్ని నభూతోనభవిష్యత్తుగా నిర్వహించనున్నట్లు ప్రచారం హోరెత్తింది. అలాంటిది ఇప్పుడు చాలా సింపుల్‌గా ఆన్లైన్ విడుదల చేయడానికి చిత్ర వర్గాలు సిద్ధం అవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో రజనీకాంత్ గురించి రకరకాల ప్రచారం హల్చల్ చేస్తోంది. సూపర్‌స్టార్ ప్రస్తుతం కుటుంబసభ్యులతో కలిసి అమెరికాలో విహార యాత్రలో ఉన్నారు. పనిలో పనిగా ఆయన నటిస్తున్న మరో బ్రహ్మాండ చిత్రం 2.ఓ చిత్ర కోసం గెటప్ టెస్ట్‌లు నిర్వహిస్తున్నట్లు సమాచారం. రజనీకాంత్ అనారోగ్యం కారణంగా అమెరికాలో వైద్య చికిత్స పొందుతున్నారని, అందువల్లే కబాలి ఆడియో సింపుల్‌గా ఆన్‌లైన్‌తో విడుదల చేయనున్నారని ప్రచారం జరుగుతోంది. అయితే ఇదంతా అసత్య ప్రచారం అనిరజనీకాంత్ ఎలాంటి ఆనారోగ్యానికి గురి కాలేదని,ఆయన లక్షణంగా ఉన్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. -
కబాలి టీషర్ట్స్‌తో అభిమానులు ఖుషీ
కబాలి చిత్రంపై అంచనాలు నానాటికీ అంబరాన్ని తాకుతున్నాయనడం అతిశయోక్తి కాదేమో. కారణం అందరికీ తెలిసిం దే. ఒకే ఒక్క పేరు సూపర్‌స్టార్ రజనీ కాంత్. ఆయన యంగ్, సాల్ట్ అండ్ పెప్పర్ గెటప్ల్లో తన అభిమానుల్నే కాకుండా యావత్ ప్రపంచ సినీ అభిమానుల్ని మెస్మరైజ్ చేయడానికి రెడీ అవుతున్నారు. యువ దర్శకుడు రంజిత్ దర్శకత్వం వహించిన కబాలి చిత్రాన్ని కలైపులి ఎస్.థాను భారీ ఎత్తున నిర్మించారు. ఆ మధ్య విడుదలైన చిత్ర టీజర్ ఇప్పటికే రెండు కోట్ల మందికి పైగా చూసి అదుర్స్ అంటూ ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. సంతోష్నారాయణన్ సంగీతాన్ని అందించిన ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఈ నెల 12న బ్రహ్మాండంగా నిర్వహించడానికి నిర్మాత సన్నాహాలు చేస్తున్నారు. ఇలా ఇప్పటికే ఏనోట విన్నా కబాలి మాటే అన్నట్లుగా పరిస్థితి నెలకొంది. తాజాగా కబాలి టీషర్ట్సుతో మరింత కొత్తరకం ప్రచారాన్ని పొందుతోంది. ఇటీవల హాలీవుడ్ నటుడు జాకీచాన్ కబాలి చిత్రంలోని సూపర్‌స్టార్ రజనీకాంత్ ఫోటోతో కూడిన టీషర్టు ధరించినట్లు స్టిల్ ఇంటర్నెట్లో హల్చల్ చేసింది. కాగా తాజాగా కబాలి ఫొటోలతో కూడిన రకరకాల టీషర్టులు మార్కెట్లో విక్రయం జరుగుతూ అటు వ్యాపార పరంగానూ, ఇటు చిత్రానికి ప్రచారాన్ని పెంచుతున్నాయి. 350 నుంచి 600 రూపాయల వరకూ అమ్ముడుపోతున్న ఈ కబాలి టీషర్ట్సు చెన్నై, బెంగళూర్, హైదరాబాద్ నగరాలలో హల్చల్ చేస్తున్నాయి. ఇక రజనీకాంత్ అభిమానుల గురించి చెప్పనక్కర్లేదు యమ ఖుషీ అవుతున్నారు. -
మరోసారి అందాలారబోతలో..
మరోసారి అందాలారబోతతో అలరించబోతున్నారట నటి ఎమీజాక్సన్. ఈ ఇంగ్లిష్ భామ మదరాసు పట్టణంతో కోలీవుడ్‌లో అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. ఆ చిత్రంలో ఆంగ్లేయ యువతిగా నటించినా అందంగా కనిపించిందిగానీ గ్లామర్‌కు పెద్దగా ఆస్కారం లేదు. అదే విధంగా ఆ తరువాత తమిళంతో పాటు హిందీలోనూ ఒక చిత్రం చేసిన ఎమీజాక్సన్ శంకర్ దృష్టిలో పడింది. అంతే రొట్టే విరిగి నేతిలో పడ్డట్టుగా స్టార్‌డమ్‌ను పొందేసింది. ఐ చిత్రంలో విక్రమ్‌కు జంటగా నటించింది. అందులో మోడల్‌గా నటించడంతో సహజంగానే అందాలను గుమ్మరించింది. శంకర్ ఈ అమ్మడిని చాలా అందంగా తెరపై ఆవిష్కరించారు. అయితే ఆ చిత్రం ఆశించిన టార్గెట్‌ను చేరుకోలేక పోయింది. అయినా శంకర్ తాన తాజా చిత్రం 2.ఓ చిత్రంలో ఎమీజాక్సన్‌నే నాయకిగా ఎంచుకున్నారు. ప్రస్తుతం ఈ బ్యూటీ సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో రొమాన్స్ చేస్తోంది. ఇందులో తనూ ఒక రోబోగా నటిస్తోందనే ప్రచారం జరిగింది. అయితే ఈ ప్రచారాన్ని ఎమీ ఖండించింది. తను సూపర్‌స్టార్‌కు ప్రేయసిగా నటిస్తోందట. అసలు విషయం ఏమిటంటే ఈ చిత్రంలోనూ ఎమీ అందాలను ఆరబోస్తోందట. ఐ చిత్రంలో కంటే 2.ఓ చిత్రంలో ఆ ఇంగ్లిష్ భామను శంకర్ మరింతఅందంగా చూపించబోతున్నారని సమాచారం. ఈ చిత్రానికి ఎమీ అందాలు అదనపు ఆకర్షణగా నిలుస్తాయంటున్నారు కోలీవుడ్ వర్గాలు. ప్రస్తుతం 2.ఓ చిత్రం షూటింగ్ దశలో ఉంది. -
ఆ ఇద్దరూ కలిసి నటించాల్సి వస్తే..
కోలీవుడ్‌లో దిగ్గజాల్లాంటి నటులు విశ్వనటుడు కమలహాసన్, సూపర్‌స్టార్ రజనీకాంత్. అలాంటి వీరిద్దరూ కలిసి నటిస్తే?అందులో రజనీకాంత్‌కు కమలహాసన్ విలన్‌గా మారితే? అంత కంటే సంచలనం ఇంకోటి ఉండదు.అయితే అది సాధ్యమయ్యే పనేనా?అలాంటి దుసాధ్య కార్యాన్ని సాధ్యం చేసే ధిశగా స్టార్ డెరైక్టర్ శంకర్ ఇటీవల అడుగులు వేశారు కానీ సఫలం కాలేదు.రజనీకాంత్,శంకర్ కాంబినేషన్లో తెరకెక్కిన ఎందిరన్ చిత్రం సాధించిన రికార్ట్‌ను నేటికీ మరో చిత్రం బద్దలు కొట్టలేదు. అలాంటి చిత్రానికి తాజాగా 2.ఓ పేరుతో సీక్వెల్ రూపొందుతున్న విషయం తెలిసిందే.ఈ చిత్రాన్ని లైకా సంస్థ అత్యధికంగా 350 కోట్ల బడ్జెట్లో నిర్మిస్తోంది. ఈ చిత్రంలో రజనీకాంత్‌కు ప్రతినాయకుడిగా మొదట హాలీవుడ్ సూపర్‌స్టార్ ఆర్నాల్డ్‌ను నటింపజేసే ప్రయత్నం చేశారు దర్శకుడు శంకర్. ఈ కాంబినేషన్ ఆల్మోస్ట్ రెడీ అన్నంతగా ప్రచారం మారుమోగింది. అయితే అలా జరగలేదు. ఆ తరువాత సూపర్‌స్టార్‌కు విలన్‌గా విశ్వనాయకుడిని నటింపజేసే ప్రయత్నాలు చేశారు. కానీ కమలహాసన్ కూడా రజనీకాంత్‌కు ప్రతినాయకుడిగా మారడానికి అంగీకరించలేదు. ఆ తరువాత బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్‌కుమార్ ఆ పాత్రలో నటించడానికి సంసిద్ధత వ్యక్తం చేశారు. ప్రస్తుతం 2.ఓ చిత్రం షూటింగ్ ముమ్మరంగా జరుగుతోంది. రజనీకాంత్‌కు విలన్‌గా నటించడానికి కారణాన్ని కమలహాసన్ ఇటీవల బహిరంగపరచారు. ఈ అంశం గురించి ఆయన తెలుపుతూ రజనీ తానూ ఇంతకు ముందు చాలా చిత్రాలు కలిసి నటించామన్నారు. ఆ తరువాత విడివిడిగా హీరోలుగా నటిస్తున్నామని అన్నారు. ఒకవేళ మళ్లీ తాము కలిసి నటించాల్సిన పరిస్థితి ఉత్పన్నం అయితే ఆ చిత్రాన్ని తామిద్దరం కలిసి నిర్మించాలని, లేదా తమలో ఎవరైనా ఒకరు నిర్మించాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. అంతే కానీ రజనీకి తాను విలన్‌గా నటించడానికి నిరాకరించాననడంలో వాస్తవం లేదన్నారు. అలా చూస్తే తాను చాలా చిత్రాల్లో విలన్‌గా నటించానని అన్నారు. అయితే ఇప్పుడు 2.ఓ చిత్రంలో పేద్ద నటుడే రజనీకి విలన్‌గా నటిస్తున్నారని కమలహాసన్ పేర్కొన్నారు. -
రజనీకాంత్‌ను కిడ్నాప్ చేయాలనుకున్నాడా?
సూపర్‌స్టార్ రజనీకాంత్‌ను గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ కిడ్నాప్ చేయాలనుకున్నాడా? అవుననే అంటున్నారు సంచలన దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ. ఆయన చిత్రాల మాదిరిగానే ఆయన వ్యాఖ్యలు కలకలం సృష్టిస్తాయన్న విషయాన్ని ప్రత్యేకంగా చెప్పనక్కరేదు. రామ్‌గోపాల్‌వర్మలో ధైర్యం ఎక్కువనే చెప్పాలి. వాక్ స్వాతంత్య్రాన్ని వాడుకోవడంలో ఆయనకు ఆయనే సాటి. కాగా ఆయన ఇటీవల గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ జీవితం ఇతివృత్తంతో కిల్లింగ్ వీరప్పన్ అనే చిత్రాన్ని రూపొందించిన విషయం తెలిసిందే. ఆ చిత్రం ఇప్పుడు హిందీలో రీమేక్ కానుంది. దీన్ని సంతోష్ నిర్మించనున్నారు. ఈ చిత్రం కోసం రామ్‌గోపాల్‌వర్మ చాలా పరిశోధించారు. వీరప్పన్‌ను స్వయంగా ఇంటర్య్వూ చేసిన వారు, పోలీసు అధికారుల నుంచి పలు వాస్తవాలను సేకరించి కథను తయారు చేశారు. వీరప్పన్ కన్నడ సూపర్‌స్టార్ రాజ్‌కుమార్‌ను కిడ్నాప్ చేసిన విషయం తెలిసిందే. అప్పట్లో ఆ సంఘటన అటు కన్నడ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఇటు తమిళనాడు ప్రభుత్వాన్ని తీవ్ర ఒత్తిడికి గురి చేసింది. ముఖ్యంగా పోలీస్ యంత్రాంగానికి పెను సవాల్‌గానే మారింది. అదే భాణీలో మన సూపర్‌స్టార్ రజనీకాంత్‌ను కిడ్నాప్ చేయాలనుకున్నారట. దీని గురించి రామ్‌గోపాల్‌వర్మ తెలుపుతూ కొత్తగా సంచలనానికి తెర లేపారు. వీరప్పన్ జీవితం ఎంత మర్మమాయమో ఆయన ఎన్కౌంటర్ విషయంలోనూ అంతగా నమ్మశక్యం కాని విషయం దాగి ఉందని రామ్‌గోపాల్‌వర్మ పేర్కొన్నట్టు మీడియాలో ప్రచారం అవుతోంది. -
ఓటెత్తిన తారాగణం
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పలువురు సినీతారలు సోమవారం తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. సూపర్ స్టార్ రజనీకాంత్, అన్నాడీఎంకే అధినేత్రి, ముఖ్యమంత్రి జయలలిత స్టెల్లా మెరీ కాలేజీలోని పోలింగ్ బూత్‌లో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. కమల్ హాసన్, అజిత్, షాలినీ, సుందర్.సీ, కుష్బు, విజయ్, విశాల్, శివకార్తికేయన్, ఆర్యతో పాటూ పలువురు సినీ ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. కాగా, చెన్నైలోని గోపాలపురంలో డీఎంకే అధినేత ఎం కరుణానిధి తన ఓటుహక్కును వినియోగించుకున్నారు. తమిళనాడులో ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్.. నేడు సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. -
రజనీ వెనుకే ధనుష్
యువ నటుడు ధనుష్ సూపర్‌స్టార్ రజనీకాంత్ అల్లుడన్నది ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.ఆయన రజనీకి వీరాభిమాని అన్న విషయం తెలిసిందే. ఇక రజనీ వెనుకే ధనుష్ అంటే ప్రస్తుత పరిస్థితుల్లో ఇదేదో రాజకీయ అంశంగా భావించాల్సిన అవసరం లేదు. రజనీకాంత్ నటించిన కబాలి చిత్రం జూన్‌లో తెరపైకి రావడానికి ముస్తాబవుతున్నట్లు ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే.ఈ చిత్ర వేనుకే ఆయన అల్లుడు ధనుష్ చిత్రం కొడి తెరపైకి రావడానికి రెడీ అవుతోందన్నది తాజా సమాచారం. రజనీ చిత్రం కబాలి అంత కాకపోయినా ధనుష్ కొడి చిత్రం పైనా అంచనాలు భారీగానే ఉన్నాయి. కారణం ఇది రాజకీయ నేపథ్యంలో సాగే కథా చిత్రం కావడమే. మరో విషయం ఏమిటంటే ధనుష్ ఇందులో తొలిసారిగా ద్విపాత్రాభినం చేయడం. తన సొంత నిర్మాణ సంస్థ వండర్‌బార్ ఫిలింస్ పతాకంపై నిర్మిస్తున్న కొడి చిత్రంలో ఆయనకు జంటగా త్రిష, ప్రేమమ్ చిత్రం ఫేమ్ అనుపమ పరమేశ్వరన్ నటిస్తున్నారు. ఎదునీశ్చల్, కాక్కీసట్టై వంటి విజయవంతమైన చిత్రాల దర్శకుడు దురెసైంథిల్‌కుమార్ తాజా చిత్రం కొడి. చిత్రం షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. దీనికి సంతోష్నారాయణన్ సంగీతాన్ని అందిస్తున్నారు. త్వరలోనే ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని జరుపుకోనున్న కొడి చిత్రాన్ని రంజాన్ పండగ సందర్భంగా జూలైలో విడుదల చేయడానికి ధనుష్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.విశేషం ఏమిటంటే ఇంతకు ముందు ధనుష్ నటించిన వేలై ఇల్లా పట్టాదారి,మారి చిత్రాలు 2014, 2015 ఏడాదిలో రంజాన్ పండగ సందర్భం గా విడుదలై విజయాన్ని అందుకున్నాయి. అదే సెంటిమెంట్‌ను ధనుష్ తాన తాజా చిత్రం కొడికి వర్తింపజేయడానికి రెడీ అవుతున్నారని భావించవచ్చు. -
ఏ పార్టీకీ మద్దతు లేదు
సినీ హీరో విజయ్ చెన్నై: త్వరలో జరగనున్న శాసనసభ ఎన్నికల్లో ప్రముఖ రాజకీయ పార్టీల మధ్య గట్టి పోటీ ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఓట్లు రాబట్టుకోవడానికి ఎవరికి వారు విశ్వప్రయత్నం చేస్తున్నారు. ఎన్నికల్లో ప్రేక్షక ఆకర్షణ మెండుగా గల సినీ తారలను ఉపయోగించుకోవడంలోనూ ఆయా పార్టీలు తమ చాతుర్యాన్ని ప్రదర్శిస్తున్నాయి. ఇప్పటికే పలువురు తారలు తమకు అనుకూల పార్టీల తరఫున ప్రచారాల్లో ముని గిపోయారు. చెన్నైలో సూపర్‌స్టార్ రజనీకాంత్ తరువాత అంత అభిమానులు కలిగిన హీరో విజయ్. ఆయన ఏ పార్టీకి మద్దతు ఇస్తారన్న విషయం చర్చనీయాంశంగా మారింది. విజయ్ అభిమానులు ఒక పార్టీకి మద్దతు ఇస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో అఖిల భారత ఇళయదళపతి విజయ్ మక్కళ్ కట్చి సోమవారం ఒక ప్రకటన విడుదల చేయడం విశేషం. అందులో విజయ్ మక్కళ్ కట్చి రాను న్న శాసనసభ ఎన్నికల్లో ఏ పార్టీకి మద్దతు తెలపకుండా మధ్యంతరంగా వ్యవహరిస్తుందన్నారు. ఒక పార్టీకి విజయ్ అభిమానులు మద్దతు ఇస్తున్నారన్న ప్రచారంలో నిజం లేదని స్పష్టం చేశారు. ఆయన అభిమానులు ఎవరికి ఇష్టమైన పార్టీకి వారు ఓటు వేసుకోవచ్చుని తెలిపారు. అయితే విజయ్ పేరును గానీ, ఇయక్కమ్ పేరును గానీ వాడరాదన్నారు. అలా వాడుకుంటే ఇయక్కమ్ తీసుకునే చట్టపరమైన చర్యలకు బాధ్యులవుతారని హెచ్చరించారు. ఇక ‘నా దారి రహదారి...బెటర్ డోంట్ కమ్ ఇన్ మై వే’..అంటూ తన డైలాగులతో వెండితెరపై ప్రత్యర్థులను దడదడలాడించే సూపర్‌స్టార్ రజనీకాంత్ కూడా ఇంతవరకూ తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తన దారెటో చెప్పనే లేదు. తమిళనాడులో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా జనాకర్షణ మెండుగా ఉండే సినీతారల మద్దతు కోసం అన్ని పార్టీలూ వెంపర్లాడుతాయి, వెంటపడతాయి. 1996 ఎన్నికల సమయంలో ఈ సినీ మోజు ఆకాశాన్ని అంటింది. తమిళనాడులో అత్యధిక జనాకర్షణ నటుల్లో ఆనాటి ఎంజీ రామచంద్రన్ తరువాత నేటి రజనీకాంత్ అని ఒప్పుకోక తప్పదు. ఇదిలా ఉండగా, ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో రజనీకాంత్ వైఖరి ఏమిటనే చర్చ ఆయన అభిమానుల్లో నలుగుతోంది. 20 ఏళ్ల క్రితం డీఎంకే, తమాకా వలెనే నేడు పీఎంకే తరఫున ప్రయత్నాలు సాగిన సఫలం కాలేదు. రజనీకాంత్ ఆదేశాల మేరకు ఆయన అభిమానులు సైతం పార్టీల ఉచ్చులో పడకుండా జాగ్రత్తపడుతున్నట్లు సమాచారం. -
రజనీ దారెటు?
* ఎన్నికలపై మౌనం * అదే బాటలో అభిమాన సంఘాలు సాక్షి ప్రతినిధి, చెన్నై: ‘నా దారి రహదారి...బెటర్ డోంట్ కమ్ ఇన్ మై వే’..అంటూ తన డైలాగులతో వెండితెరపై ప్రత్యర్థులను దడదడలాడించే సూపర్‌స్టార్ రజనీకాంత్ ఇంతకూ తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తన దారెటో చెప్పనే లేదు. తమిళానాడులో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా జనాకర్షణ మెండుగా ఉండే సినీతారల మద్దతు కోసం అన్ని పార్టీలూ వెంపర్లాడుతాయి, వెంటపడతాయి. 1996 ఎన్నికల సమయంలో ఈ సినీ మోజు ఆకాశాన్ని అంటింది. తమిళనాడులో అత్యధిక జనాకర్షణ నటుల్లో ఆనాటి ఎంజీ రామచంద్రన్ తరువాత నేటి రజనీకాంత్ అని ఒప్పుకోక తప్పదు. ‘తమిళనాడును ఆ దేవుడు కూడా కాపాడలేడు’ అంటూ డీఎంకే, తమిళ మానిల కాంగ్రెస్‌కు మద్దతుగా 1996లో రజనీకాంత్ చేసిన వ్యాఖ్యలు ప్రజలను తీవ్రస్థాయిలో ప్రభావితం చేశాయి. రజనీకాంత్ వ్యాఖ్యలతో ఆనాటి ఎన్నికల్లో అన్నాడీఎంకే ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఆనాటి నుండి నేటి వరకు ఎన్నికల సమయంలో అటువంటి చురుకైన వ్యాఖ్యానాలు రజనీ చేయలేదు. 2001, 2006, 2011లో వచ్చిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో రజనీకాంత్‌ను ప్రసన్నం చేసుకునేందుకు అనేక పార్టీలు ప్రయత్నించాయి. అయితే రజనీకాంత్ తనదైన శైలిలో మౌనం పాటించారు. క్రమేణా డీఎంకే, అన్నాడీఎంకేల మధ్య సమదూరం పాటించడం ప్రారంభించారు. 2014 పార్లమెంటు ఎన్నికల సమయంలో నరేంద్రమోదీ నేరుగా రజనీకాంత్ ఇంటికి వెళ్లి కలిసినా భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా నోరు మెదపలేదు. నేడు కూడా మౌనమేనా? ఇదిలా ఉండగా, ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో రజనీకాంత్ వైఖరి ఏమిటనే చర్చ ఆయన అభిమానుల్లో నలుగుతోంది. 20 ఏళ్ల క్రితం డీఎంకే, తమాకా వలెనే నేడు పీఎంకే తరఫున ప్రయత్నాలు సాగిన సఫలం కాలేదు. రజనీకాంత్ ఆదేశాల మేరకు ఆయన అభిమానులు సైతం పార్టీల ఉచ్చులో పడకుండా జాగ్రత్తపడుతున్నట్లు సమాచారం. రజనీ దారెటు అని ఆయన అభిమాన సంఘం నేత ఒకరిని ప్రశ్నించగా, తమ ఓటు హక్కు వినియోగంపై ఆయన ఎలాంటి నిబంధన విధించలేదు, ఇష్టపడిన పార్టీకి ఓటు వేయండి అనే స్వేచ్ఛను ఇచ్చారని తెలిపాడు. తమ అభిమాన నేత రజనీకాంత్ మాత్రమే కాదు రాష్ట్రంలోని ప్రముఖ నటీనటులు ఎందరో మౌనం పాటిస్తున్నారని చెప్పాడు. -
కబాలి విడుదల ఎప్పుడో?
కబాలి చిత్రం రిలీజ్ ఎప్పుడు? అన్న ప్రశ్న దక్షిణాది చిత్ర పరిశ్రమలోనే కాదు యావత్ సినీ ప్రపంచంలోనూ వ్యక్తం అవుతోంది. కారణం కూడా అందరికీ తెలిసిందే. అదే సూపర్‌స్టార్ రజనీకాంత్. ఆయనకు ఇండియాలోనే కాకుండా జపాన్, కెనడా,మలేషియా, సింగపూర్ అంటూ ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారన్న విషయం తెలిసిందే. వారంతా కబాలి చిత్రం కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఎస్ కబాలి చిత్రంపై అంచనాలు తారా స్థాయికి చేరుకున్నాయి. యువ దర్శకుడు రంజిత్ దర్శకత్వంలో కలైపులి ఎస్.థాను నిర్మిస్తున్న ప్రెస్టేజియస్ చిత్రం కబాలి. రజనీకాంత్ సరసన రాధికాఆప్తే నటిస్తున్న ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతాన్ని అందిస్తున్నారు. చెన్నై, దుబాయ్, మలేషియా దేశాల్లో చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రంలో సూపర్‌స్టార్ దాదాగా రెండు డైమన్షన్లలో కనిపించనున్నారు. అందులో ఒకటి సాల్ట్ పెప్పర్ గెటప్. ఈ గెటప్ ఇప్పటికే రజనీ అభిమానుల్లో ఆనందోత్సాహాలను రేకెత్తిస్తోంది. చిత్రంలో రజనీకాంత్‌కు పంచ్ డైలాగ్స్ లేక పోయినా ఆయన స్టైల్ మాత్రం అదరగొడతాయని దర్శకుడు రంజిత్ తెలియజేశారు. ఇటీవలే రజనీ తన పాత్రకు డబ్బింగ్ చెప్పారు. చిత్ర విడుదల ఎప్పుడన్న విషయాన్ని కూడా ఆయన సమీపకాలంలో వెల్లడిస్తూ మే చివరి వారంలో గానీ, జూన్ తొలి వారంలో గాని ఉంటుందని చెప్పారు. అయితే చిత్ర నిర్మాత కలైపులి ఎస్.థాను మాత్రం విడుదల తేదీని స్పష్టంగా వెల్లడించలేదు. ఇటీవలే విజయ్ హీరోగా నిర్మించిన తెరి చిత్రాన్ని విడుదల చేసి విజయాన్ని సాధించిన థాను ఆ చిత్రానికి సంబంధించి కొందరు డిస్ట్రిబ్యూటర్స్ వ్యవహారంలో తలనొప్పికి గురైయ్యారు. ఆ విషయాన్ని పక్కన పెడితే కబాలి చిత్రం గురించి మాట్లాడుతూ చిత్రానికి రజనీకాంత్ ఇటీవల డబ్బింగ్‌ను పూర్తి చేశారని, త్వరలోనే సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసి విడుదల తేదీని నిర్ణయిస్తామని పేర్కొన్నారు. అయితే మే నెల 16న శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. జూన్ ఒకటో తేదీ నుంచి పాఠశాలు ప్రారంభం కానున్నాయి. విద్యార్థులు, తల్లిదండ్రులు ఆ ఒత్తిడిలో మునిగిపోతారు. మరి ఆ సందర్భంలో కబాలి చిత్రాన్ని విడుదల చేసే సాహసం చేస్తారా? అన్న సందేహం కొలీవుడ్ వర్గాల్లో వ్యక్తం అవుతోంది. అలాంటి సందేహాలు నివృత్తి కావాలంటే మరి కొద్ది రోజులు ఆగాల్సిందే. -
కన్నెర్ర!
* ఇరకాటంలో కెప్టెన్ * వ్యతిరేకంగా రజనీ సేన * 104 చోట్ల అభ్యర్థుల ఓటమి లక్ష్యం సాక్షి, చెన్నై: తమ కథానాయకుడిపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు క్షమాపణ కూడా చెప్పని డీఎండీకే అధినేత విజయకాంత్‌పై రజనీ సేన కన్నెర్ర చేశారు. డీఎండీకే అభ్యర్థులు బరిలో ఉన్న 104 నియోజక వర్గాల్లో వ్యతిరేక ప్రచారానికి సిద్ధమయ్యారు. దక్షిణ భారత చలన చిత్ర సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు ఉన్న అశేషాభిమాన లోకం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తమ తలైవాను రాజకీయాల్లోకి ఆహ్వానించేందుకు తీవ్రంగా కుస్తీలు పడుతూ వస్తున్నారు. ఎక్కడ అభిమానులకు, రాజకీయాలకు చిక్కకుండా ,వివాదాలకు దూరంగా రజనీకాంత్ ముందుకు సాగుతున్నారు. ఈ సమయంలో ఎన్నికల ప్రచారంలో రజనీని ఉద్దేశించి విజయకాంత్ అనుచిత వ్యాఖ్యలు చేయడం వివాదానికి దారి తీశాయి. రజనీ కాంత్ పేరిట అభిమాన సంఘాల్ని ఏర్పాటు చేసుకుని సేవా కార్యక్రమాలతో ముందుకు సాగుతున్న వాళ్లంతా, తమ దృష్టిని విజయకాంత్ మీద మరల్చారు. గత ఆదివారం విజయకాంత్ తీరుకు నిరసనగా రాష్ర్ట వ్యాప్తంగా నిరసనలకు దిగారు. విజయకాంత్ తమ కథానాయకుడికి క్షమాపణ చెప్పాలని పట్టుబట్టారు. క్షమాపణలు చెప్పని పక్షంలో తీవ్రంగా స్పందించాల్సి ఉంటుందని అభిమాన సంఘాలు హెచ్చరించాయి. అయితే, విజయకాంత్ ఏ మాత్రం తగ్గలేదు. తన బాటలోనే ముందుకు సాగుతుండటంతో, ఇక, ఆయన్ను, డీఎండీకేను ఇరకాటంలో పెట్టేందుకు రజనీ సేన సిద్ధం అయింది. రాష్ట్రంలో 104 అసెంబ్లీ నియోజక వర్గాల్లో పోటీ చేస్తున్న డీఎండీకే అభ్యర్థులకు వ్యతిరేకంగా ప్రచారానికి సిద్ధం అయ్యారు. ఆ అభ్యర్థుల ఓటమి లక్ష్యంగా రజనీ అభిమానులు ఏకమై సూపర్ స్టార్ మక్కల్ కళగంగా ఏర్పడి ముందుకు సాగేందుకు నిర్ణయించారు. తిరుప్పూర్ వేదికగా శనివారం నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఇక, తమ అభిమానులందరూ 104 నియోజకవర్గాల్లోనూ డీఎండీకే అభ్యర్థులకు వ్యతిరేకంగా ప్రచారం సాగిస్తారని, వారికి వ్యతిరేకంగా ఇక నిరసనలు ఉధృతం కానున్నట్టుగా ఆ కళగం ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ మురుగన్ పేర్కొన్నారు. మీడియాతో మురుగన్ మాట్లాడుతూ, కనీసం తమ కథానాయకుడికి క్షమాపణలు చెప్పడానికి కూడా విజయకాంత్ముందుకు రాక పోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఆయన తీరుతో ఆ పార్టీ అభ్యర్థులు తీవ్రంగా నష్టాల్ని, కష్టాలను ఇక చవి చూడబోతున్నారని, వారికి వ్యతిరేకంగా తమ ప్రచార పయనం సాగబోతోందన్నారు. -
లేటైనా లేటెస్ట్గా...
సూపర్‌స్టార్ రజనీకాంత్ ‘కబాలి’గా రానున్న సంగతి తెలిసిందే. రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రజనీకాంత్ గ్యాంగ్‌స్టర్‌గా కనిపించనున్నారు. ఆయనకు జోడీగా బాలీవుడ్ కథానాయిక రాధికా ఆప్టే నటించారు. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. వాస్తవానికి ఈ చిత్రాన్ని తమిళ సంవత్సరాదిని పురస్కరించుకుని ఈ నెల 14న విడుదల చేయాలనుకున్నారు. కానీ, విడుదల హడావిడి కనిపించక పోవడంతో వాయిదా పడిందని అందరికీ అర్థమైంది. దాంతో ఎప్పుడు విడుదలవుతుంది? అనే చర్చ మొదలైంది. ఆ విషయం గురించి రజనీకాంత్ క్లారిటీ ఇచ్చేశారు. పద్మ విభూషణ్ అవార్డు అందుకున్నాక ఓ టీవీ చానల్ రజనీని ‘కబాలి’ విడుదల గురించి అడిగింది. అప్పుడాయన ‘‘మే నెలాఖరున లేక జూన్‌లో విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని పేర్కొన్నారు. ‘రెగ్యులర్‌గా మీరు విసిరే పంచ్ డైలాగులు ఇందులోనూ ఉంటాయా?’ అనే ప్రశ్నకు... ‘‘సినిమా చూసి తెలుసుకోవాల్సిందే’’ అని తనదైన శైలిలో నవ్వుతూ సూపర్ స్టార్ అన్నారు. మామూలుగా రజనీ సినిమా అంటే ఆరంభం నుంచీ అంచనాలు ఉంటాయి. ఈ సినిమాకు కూడా అలానే జరిగింది. ముఖ్యంగా ఫస్ట్ లుక్ విడుదలైనప్పటి నుంచీ భారీగా అంచనాలు పెంచుకున్నారు రజనీ అభిమానులు. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఈ అభిమాన జనమంతా ఈ నెలలో సినిమా రాదని ఒకింత నిరుత్సాహానికి గురయ్యారంటే అతిశయోక్తి కాదు. అయినా... మా నాయకుడు ‘లేట్‌గా వచ్చినా లేటెస్ట్గా వస్తా’డు అంటూ, రజనీ ఓ సినిమాలో చెప్పిన డైలాగ్‌ని గుర్తు చేస్తూ, సర్ది చెప్పుకుంటున్నారు. -
ఆయన నటనకు పడిపోయా!
విజయ్ నటనకు ఫ్లాటైపోయానంటోంది ఇంగ్లిష్ బ్యూటీ ఎమీజాక్సన్. ఈ భామ ఇప్పుడు రెండు భారీ క్రేజీ చిత్రాల్లో నటిస్తోంది. అందులో ఒకటి సూపర్‌స్టార్ రజనీకాంత్ చిత్రం 2.ఓ కాగా మరొకటి ఇళయదళపతి విజయ్‌తో రొమాన్స్ చేస్తున్న తెరి చిత్రం. 2.ఓ చిత్రం గురించి చెప్పుకోవడానికి ఇంకా చాలా రోజులు ఉన్నాయి. కాబట్టి తమిళ ఉగాదికి విడదలకు ముస్తాబవుతున్న తెరి గురించి మాట్లాడుకుందాం అంటోంది నటి ఎమీజాక్సన్. ఈ చిత్రంలో విజయ్‌కి జంటగా సమంత, ఎమీజాక్సన్ నటిస్తున్నారు. అట్లీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో చెన్నై చిన్నది సమంతదే ప్రధాన పాత్ర అట. విజయ్‌కు భార్యగా నటిస్తున్న సమంతకు కూతురుగా నటి మీనా కూతురు నటిస్తోంది.ఇది తల్లీ కూతుర్లు అనుబంధం ఇతివృత్తంగా రూపొందుతున్న చిత్రం అని,చిత్ర కథ వీరి చుట్టూనే తిరుగుతుందని సమాచారం. ఎమీ ఇందులో టీచర్‌గా కనిపించనున్నారట. దీని గురించి ఎమీ తెలుపుతూ తాను నటుడు విజయ్ వీరాభిమానిని ఆయన నటన, డాన్స్ చూసి ఎప్పుడో ఫ్లాటైపోయానని చెప్పింది. ఆయనతో నటించే అవకాశం వస్తే చాలని కోరుకున్నానని, అందుకే తెరి చిత్రంలో రెండో కథానాయకి పాత్ర అయినా నటించడానికి అంగీకరించానని అంది. ఇందులో తాను టీచర్‌గా నటించానని తన పాత్రకు మంచి పేరు వస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేసింది. -
మరోసారి తమిళ తెరపైకి జాకీష్రాఫ్
హిందీ స్టార్స్ కోలీవుడ్‌లో నటించడానికి ఏ మాత్రం వెనుకాడడం లేదు. కాకపోతే తమ పాత్రలో కాస్త వైవిధ్యాన్ని ఆశిస్తున్నారంతే. బాలీవుడ్ స్టార్ హీరో జాకీష్రాఫ్ ఇప్పటికే అరణ్యం, సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో కలసి కోచ్చడైయాన్ చిత్రాలతో కోలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరయ్యారు. తాజాగా ముచ్చటగా మూడోసారి తమిళ తెరపై మెరవనున్నారు. పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించిన నిర్మాత సీవీ.కుమార్ ఇప్పుడు ఆ అనుభవంతో మెగాఫోన్ పట్టారు. మాయావన్ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో సందీప్ కిషన్, రెజీనా జంటగా నటిస్తున్నారు. ఇప్పటికే చిత్రం షూటింగ్ జరుపుకుంటున్న ఆ చిత్రంలో ముఖ్యపాత్రకు బాలీవుడ్ నటుడు జాకీష్రాఫ్ అయితే బాగుంటుందని సీవీ.కుమార్ భావించారట. దీంతో గత వారం ముంబై వెళ్లి ఆయనకు కథ వినిపించి నటించాలని కోరగా జాకీష్రాఫ్ మారు మాట మాట్లాడకుండా ఓకే అన్నారట. ఏప్రిల్ నాలుగు నుంచి ఆయన మాయావన్ చిత్ర షూటింగ్లో పాల్గొననున్నట్లు చిత్ర వర్గాలు తెలిపారు. ఇందులో జాకీష్రాఫ్ దాదాగా నటించనున్నారని సమాచారం. ఆయనకు పోరాట దృశ్యాలు కూడా ఉంటాయని తెలిసింది. ఈ చిత్రాన్ని స్టూడియోగ్రీన్ పతాకంపై జ్ఞానవేల్ రాజా నిర్మించడం విశేషం. -
కమలదళంలో సూపర్‌స్టార్?
పార్లమెంటు ఎన్నికల ప్రచార సమయంలోనే దక్షిణాదిపై బలంగా దృష్టిపెట్టిన నరేంద్రమోదీ ఆ తరువాత మరింత ఎక్కువగా దృష్టి సారించారు. ఉత్తరభారతంతో సమానంగా దక్షిణాదిలో బీజేపీనీ బలోపేతం చేయాలని పార్టీ జాతీయ అధ్యక్షులు అమిత్‌షాను ఆదేశించారు. ఈ ఆదేశాల మేరకు అమిత్‌షా అనేకసార్లు చెన్నై రావడం, పార్టీ సభ్యత్వం మొదలుకుని అన్ని విషయాల్లో జోక్యం చేసుకోవడం సాగింది. అంతేగాక పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్గా మురళీధరరావును నియమించి అమిత్‌షా ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తూనే ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల నాటికి అధికారం చేపట్టే స్థాయిలో బలపడాలని బీజేపీ ఆశించింది. పార్లమెంటు ఎన్నికల సమయంలో అత్యుత్సాహంగా సాగిన కూటమి ఏర్పాట్లు అసెంబ్లీ ఎన్నికల వేళ చతికిలపడ్డాయి. డీఎండీకే కోసం కళ్లుకాయలు కాచేలా ఎదురుచూసిన కమలనాథులు చివరకు భంగపడ్డారు. అన్ని ప్రాంతీయ పార్టీలూ కూటములను వెతుక్కుంటూ తలోదిక్కున వె ళ్లిపోగా బీజేపీ ఒంటరిగా మిగిలింది. అధికారం కాదుక దా, గణనీయమైన సంఖ్యలో అసెంబ్లీ స్థానాలు గెలుచుకోవడం అసాధ్యమని బీజేపీ తెలుసుకుంది. రజనీకి కమలనాథుల వల: అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు సాధించాలని భారతీయ జనతా పార్టీ సర్వశక్తులు ఒడ్డుతోంది. ప్రాంతీయ పార్టీల పొత్తులేకుండా అసెంబ్లీ ఎన్నికలను ఢీకొనాలంటే అదనపు బలం అవసరమని వెతుకులాట ప్రారంభించింది. ప్రధాని నరేంద్రమోదీకి వ్యక్తిగతంగా సన్నిహితుడైన సూపర్‌స్టార్ రజనీ కాంత్‌ను ప్రసన్నం చేసుకోవడం మినహా రాష్ట్ర బీజేపీకి ప్రత్యామ్నాయం లేదు. పార్టీ ఎన్నికల ప్రచారాల్లో స్టార్ ఎట్రాక్షన్తోపాటు ప్రజల్లో రజనీకాంత్‌కు ఉన్న పలుకుబడిని ఓట్లుగా మలుచుకునే ప్రయత్నాల్లో పడింది. మోదీ దూతగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పీ మురళీధరరావు స్వయంగా కలుగజేసుకుని రజనీకాంత్‌తో చర్చలు జరిపినట్లు పార్టీ సమాచారం. అసెంబ్లీ ఎన్నికల ప్రచారాల వేదికల్లో ముఖ్యమైన మూడు చోట్ల నుండి రజనీకాంత్ ప్రసంగించేందుకు అంగీకరించారని మురళీధరరావు అనుచవర్గం పార్టీ పేరున బుధవారం ప్రకటన విడుదల చేసింది. అలాగే దేశంలోని వివిధ పీఠాధిపతులు, స్వాములు ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటారని తెలిపింది. అంతేగాక తమిళనాడులోని కర్నాటక సరిహద్దు జిల్లాల్లో అక్కడి బీజేపీ అగ్రనేతలు యడ్యూరప్ప తదితరులను ప్రచారానికి వస్తున్నట్లు తెలిపింది. ఎన్నికలు ముగిసేవరకు మురళీధరరావు తమిళనాడులోనే ఉంటారని స్పష్టం చేసింది. అయితే భారతీయ జనతా పార్టీకి ప్రచారం చేయబోతున్నట్లు రజనీకాంత్ ప్రకటించేవరకు ఈ వార్త నమ్మశక్యంకాని నిజమే. -
2.ఓ చిత్ర యూనిట్‌కు షాక్
2.ఓ చిత్ర యూనిట్ షాక్‌కు గురైంది. సూపర్‌స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం 2.ఓ.స్టార్ దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న మరో అద్భుత సెల్యులాయిడ్ సృష్టిగా దీన్ని భావించవచ్చు. ఎమీజాక్సన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ నటుడు అక్షయ్‌కుమార్ ప్రతినాయకుడిగా నటిస్తున్న విషయం తెలిసిందే. లైకా సంస్థ 350 కోట్ల అత్యంత భారీ వ్యయంతో నిర్మిస్తున్న ఈ చిత్రానికి పలువురు హాలీవుడ్ సాంకేతిక నిపుణులు పని చేస్తున్నారు.ఇటీవల చెన్నైలో పలు కీలక సన్నివేశాలతో పాటు బ్రహ్మాండమైన ఒక ఫైట్ సన్నివేశాన్ని చిత్రీకరించుకున్న ఈ చిత్రం ప్రస్తుతం ఢిల్లీలో షూటింగ్ జరుపుకుంటోంది. తన చిత్రానికి సంబంధించి దర్శకుడు శంకర్ ప్రతి అంశం గురించి తగు జాగ్రత్తలు తీసుకుంటారన్న విషయం తెలిసిందే. ఇక కథ, సన్నివేశాలు, పాత్ర దారుల ధరించే దుస్తుల నుంచి ప్రతి విషయం చిత్రం విడుదలయ్యే వరకు బయటకు తెలియకుండా జాగ్రత్త పడతారు. అందులో భాగంగా చిత్రంలో పని చేసే వారెవరూ షూటింగ్ స్పాట్లో సెల్ఫోన్లు వాడరాదని షరతులను విధిస్తారు. చిత్రానికి సంబంధించిన ఏ ఒక్క స్టిల్ఫొటో కూడా తన అనుమతి లేకుండా మీడియాకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. సెట్లో ఎవరూ ఫొటోలు తీయరాదనే సెల్ఫోన్ల వాడకాన్ని బహిష్కరించడానికి ఒక కారణం. అయితే అన్ని కట్టుదిట్టమైన చర్యలు చేపట్టినా 2.ఓ చిత్రంలో నటిస్తున్న విలన్ అక్షయ్‌కుమార్ గెటప్ తాజాగా సోషల్ మీడియాలో హల్చల్ చేయడం ఆ చిత్రం యూనిట్‌ను షాక్‌కు గురి చేసింది. అక్షయ్‌కుమార్ కాకి రూపాన్ని పోలిన భయంకరమైన డెవిల్లా కనిపించే 2.ఓ చిత్రంలోని ఫొటోలు లీక్ అయ్యాయి.అయితే ఈ స్టిల్స్ చూస్తుంటే 2.ఓ చిత్రంపై అంచనాలు మరింత పెరిగేవిగా ఉన్నాయని చెప్పవచ్చు. -
సూపర్‌స్టార్‌తో నయన నాల్గోసారి..
సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో నేటి క్రేజీ నటి నయనతార మరోసారి జత క ట్టనున్నారా? అలాంటి అవకాశం ఉందనే ప్రచారం కోలీవుడ్‌లో హల్చల్ చేస్తోంది. రజనీకాంత్‌తో ఒక్క చిత్రంలోనైనా నటించాలని చాలా మంది యువ కథానాయకులు కోరుకుంటారని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన చిత్రంలో చిన్న పాత్ర అయినా లభిస్తే చాలని ఆశ పడేవారెందరో. అంత దాకా ఎందుకు నటి త్రిష రజనీకాంత్‌తో నటించే అవకాశం కోసం చాలా కాలంగానే ఎదురు చూస్తున్నారు. ఈ విషయాన్ని ఇటీవల ఆమె స్వయంగా ఒక భేటీలో పేర్కొన్నారు. ఇక అందాల తార హన్సిక కూడా రజనీతో కలిసి నటించడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నట్లు తన మనసులోని మాటను స్పష్టం చేసింది. లక్కీ హీరోయిన్ నయనతారకు సూపర్‌స్టార్‌తో మరోసారి రొమాన్స్ చేసే అవకాశం అతి చేరువలో ఉన్నట్లు కోలీవుడ్ టాక్. ఈ అమ్మడు ఇప్పటికే రజనీకాంత్‌తో చంద్రముఖి, శివాజీ, కుచేలన్ చిత్రాలలో నటించారు. వీటిలో శివాజీ చిత్రంలో సూపర్‌స్టార్‌తో సింగిల్ సాంగ్‌లోనే స్టెప్స్ వేశారన్నది గమనార్హం. రజనీకాంత్ ప్రస్తుతం కబాలి, 2.ఓ చిత్రాల్లో నటిస్తున్నారు. వీటిలో కబాలి చిత్రం షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. మే చివరి వారంలో తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. ఇక శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న 2.ఓ చిత్రం వచ్చే ఏడాదిలో విడుదలయ్యే అవకాశం ఉంది. కాగా రజనీకాంత్ తదుపరి చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు, మలయాళంలో మమ్ముట్టి నయనతార జంటగా నటించిన హిట్ చిత్రం భాస్కర్ ది రాస్కెల్ చిత్ర తమిళ రీమేక్‌లో నటించనున్నట్లు ప్రచారంలో ఉంది. ఇందులో నయనతార హీరోయిన్గా నటించనున్నట్లు సమాచారం. ఇదే గనుక నిజం అయితే ఈ ముద్దుగుమ్మ సూపర్‌స్టార్‌తో నాలుగోసారి రొమాన్స్‌కు సిద్ధం అవుతున్నట్లే. అయితే భాస్కర్ ది రాస్కెల్ చిత్ర రీమేక్‌లో నటించే విషయమై రజనీ వర్గం నుంచి ఎలాంటి స్పందన లేదన్నది గమనార్హం. -
రజనీ చిత్రం రూ.350 కోట్లకు ఇన్సూరెన్స్
సూపర్‌స్టార్ రజనీకాంత్ చిత్రాన్ని రూ.350 కోట్లకు ఇన్సూరెన్స్ చేశారు. ఇలా ఇన్సూరెన్స్ చేసిన తొలి తమిళ చిత్రం బహుశా ఇదే కావొచ్చు. రజనీకాంత్ ప్రస్తుతం రెండు భారీ చిత్రాల్లో నటిస్తున్న విషయం తెలిసిందే.అందులో ఒకటి కబాలి, మరొకటి 2.ఓ.ఇది ఎందిరన్‌కు సీక్వెల్‌గా తెరకెక్కుతున్న చిత్రం అన్నది గమనార్హం. స్టార్ దర్శకుడు శంకర్ మరో అద్భుతానికి పూనుకున్న చిత్రం ఇది. ఎమీజాక్సన్ నాయకిగా నటిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరో విలన్‌గా నటించడం విశేషం. నీరవ్‌షా చాయాగ్రహణం, సంగీత మాంత్రికుడు ఏఆర్.రెహ్మాన్ సంగీతంతో పాటు, హాలీవుడ్ సాంకేతికనిపుణులు పనిచేస్తున్న 2.ఓ చిత్రాన్ని లైకా సంస్థ రూ.350 కోట్లతో బ్రహ్మాండంగా నిర్మిస్తోంది.ఇంత భారీ బడ్జెట్లో తొలి తమిళ చిత్రం ఇదేననీ ఘంటాపథంగా చెప్పవచ్చు. విదేశీ స్టంట్ కళాకారులు, మేకప్ నిపుణులు,అబ్బుర పరచే సెట్స్ అంటూ నిరాటంకంగా చిత్రీకరణ జరుపుకుంటున్న 2.ఓ చిత్రాన్ని లైకా సంస్థ 350 కోట్లకు ఇన్సూరెన్స్ చేసినట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం. -
మేలో కబాలి?
ఏ చిత్రం ఎంత భారీ విజయాన్ని సాధించి రికార్డులు బద్దలు కొట్టినా, సూపర్‌స్టార్ రజనీకాంత్ చిత్రానికి ఉండే క్రే జే వేరు.ఆయన చిత్రాలపై అభిమానుల్లో ఏర్పడే ఆసక్తి,అంచనాలు ప్రత్యేకమే. మూడు దశాబ్దాలకు పైగా తనకే సొంతమైన సూపర్‌స్టార్ స్టార్‌డమ్‌ను నిలబెట్టుకుంటూ వస్తున్న రజనీకాంత్ తాజాగా రెండు చిత్రాల్లో నటిస్తున్నారన్నది తెలిసిన విషయమే.అందులో ఒకటి 2.ఓ(ఎందిరన్-2)కాగా, రెండోది కబాలి. వీటిలో ముందు గా తెరపైకి రావడానికి కబాలి చిత్రం ముస్తాబవుతోంది. గ్యాంగ్‌స్టర్‌గా నటిస్తున్న రజనీకాంత్‌తో నటి రాధికాఆప్తే తొలిసారిగా జత కడుతున్నారు. యువ దర్శకుడు రంజిత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఎస్.పిక్చర్స్ పతాకంపై కలైపులి ఎస్.థాను భారీ ఎత్తున్న నిర్మిస్తున్నారు.షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది. సూపర్‌స్టార్ చిత్రం ఎలా ఉంటుందో అన్న క్యూరియాసిటీ ఆయన ప్రతి అభిమానితో పాటు సగటు సినీ ప్రేక్షకుడికి ఉంటుందని ప్రత్యేకంగా చేప్పనక్కర్లేదు.అలాంటి వారి కోసం కబాలి చిత్రానికి సంబంధించి పది అంశాలను తెలియజేస్తున్నాం. 1.సూపర్‌స్టార్ ఇందులో పెద్ద దాదాగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఆయనకు బృందంలో ఒక సభ్యుడిగా నటుడు దినేశ్ నటిస్తున్నారు.ఈయన రజనీకాంత్ స్టైల్, మ్యానరిజమ్ లాంటివి ఫాలో అవుతూ తదుపరి గ్యాంగ్‌స్టర్ కావాలని కలలు కంటుంటారు. 2.రజనీకాంత్ ఒక పాఠశాలను నడుపుతుంటారు.అందులో నటుడు కలైయరసన్ ఉపాధ్యాయుడిగా నటిస్తున్నారు. 3.రజనీకాంత్‌కు స్నేహితుడిగా అమీర్ అనే పాత్రలో నటుడు జాన్ విజయ్ నటిస్తున్నారు. 4.కబాలి(రజనీకాంత్)కి సలహాదారుడిగా సీనియర్ నటుడు సంగిలి మురుగన్ నటిస్తున్నారు. 5.ఈ చిత్రం కోసం సూపర్‌స్టార్ 75 రోజులు గడ్డంతో నటించడం విశేషం. 6. ఇందులో రజనీకాంత్, రాధికాఆప్తేల రొమాన్స్ సన్నివేశాలను గోవాలో చిత్రీకరించారు. వారి మధ్య స్వచ్ఛమైన ప్రేమకు ఆ సన్నివేశాలు తార్కాణంగా నిలుస్తాయట. 7. నటి ధన్సిక థాయ్‌ల్యాండ్ గ్యాంగ్‌స్టర్‌గా నటించడం విశేషం.ఈ పాత్ర కోసం ఆమె తన పొడవైన కురులను త్యాగం చేసి బాబీకటింగ్లో చిత్రం అంతా కనిపంచనున్నారు. 8. కబాలి చిత్రాన్ని 115 రోజుల్లో చిత్రీకరణ పూర్తి చేశారు. 9. చిత్రం షూటింగ్‌ను చైన్నై, దుబాయ్, థాయ్‌ల్యాండ్, గోవాలలో నిర్వహించారు. 10. రజనీకాంత్ ఆత్మవిశ్వాసంతో కూడిన కోపకారిగా నటించారు.ఇందులో ఆయనకు పంచ్ డైలాగ్స్ ఉం డక పోయినా ప్రతి సంభాషణలోనూ చక్కని సందేశం ఉంటుందట.కబాలి చిత్రంలో ఇవి మచ్చుకు మాత్రమే.రజనీకాంత్ అభిమానుల్ని అలరించే అంశాలు చాలా ఉన్నాయంటున్నారు చిత్ర వర్గాలు. చిత్రాన్ని మేలో విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. -
ఎన్నికల అవగాహన చిత్రంలో రజనీ?
తమిళనాడులో శాసన సభ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది.రాజకీయ వర్గాల్లో వాతావరణం వేడెక్కనుంది.ప్రజలకు తమకు నచ్చిన ముఖ్యంగా మంచి నేతలను ఎన్నుకునేందుకు మరో అవకాశం రాబోతోంది.సక్రమంగా ఓటు హక్కును ఉపయోగించుకుని తమ సంక్షేమంతో పాటు, రాష్ట్రాభివృద్ధికి దోహదపడే విధంగా ప్రజల్లో అవగాహన కలిగించడానికి రాష్ట్ర ఎన్నికల సంస్థ పూనుకుంది. అందులో భాగంగా పలు కార్యక్రమాలతో పాటు సినీస్టార్స్తో ప్రజల్లో అవగాహన కలిగించే విధంగా ప్రచార చిత్రాలను రూపొందించే పనిలో నిమగ్నమైంది. ఇప్పటికే ప్రముఖ నటులు సూర్య, కార్తీ, సిద్ధార్థ్, శ్రుతిహాసన్, దీపికా పదుకునే, క్రికెట్ క్రీడాకారుడు దినేశ్ కార్తీక్, అశ్విన్ ఓటర్ల అవగాహనా ప్రచార చిత్రాల్లో నటించారు. క్రేజీ తార నయనతార నటించిన ప్రచార చిత్రం కూడా త్వరలో ప్రచారానికి సిద్ధం అవుతున్నట్లు ఎన్నికల అధికార ప్రతినిధులు వెల్లడించారు. తాజాగా సూపర్‌స్టార్ రజనీకాంత్‌ను కూడా ఈ తరహా ప్రచార చిత్రంలో నటించి సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి రాజేశ్ లఖానీ సోమవారం విలేకరులతో మాట్లాడుతూ ఎన్నికల అవగాహన చిత్రాల నిర్మాణం కోసం 10 లక్షలు, వాటిని సామాజిక మీడియాల్లో ప్రచారం చేయడానికి 10 లక్షలు, ఎఫ్ఎం.రేడియోలలో ప్రచారానికి 10 లక్షలు కేటాయించినట్లు వెల్లడించారు. సాధారణంగా ఒక అవగాహన ప్రచార చిత్రాన్ని రూపొందించడానికి అతి తక్కువగా 50 వేలు అవుతుందన్నారు.అయితే ఇప్పుడు సినీ స్టార్స్, క్రికెట్ క్రీడాకారులు నటించడంలో నిర్మాణ ఖర్చు అధికం అవుతుందని ఎన్నికల అధికార ప్రతినిధులు పేర్కొన్నారు. -
ఆయన మాటే నా మాట
సూపర్‌స్టార్ రజనీకాంత్ మాటే నా మాట అంటున్నారు నటి రాధిక. ఏమిటీ రాధిక వ్యాఖ్యలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయా? అయితే రండి ఆ సంగతేమిటో చూద్దాం.నటిగా రాధిక సత్తా ఏమిటన్నది ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కథానాయకిగా పలు భాషల్లో వీరవిహారం చేసిన ఈమె ఇప్పుడు వెండితెర, బుల్లితెర అంటూ ప్రధాన భూమికల్లో నటిస్తున్నారు. రాధిక భర్త, నటుడు శరత్‌కుమార్ సమత్తువ మక్కళ్ కచ్చికి అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఒక చిత్ర షూటింగ్ కోసం పళని వెళ్లిన రాధిక అక్కడ కొలువైన సుబ్రమణ్యసామిని దర్శించుకున్నారు. ఆమె విలేకరులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా రాధిక మాట్లాడుతూ పళని సమీపంలో జరుగుతున్న షూటింగ్లో పాల్గొనడానికి వచ్చి ఇక్కడి సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకోవడానికి వచ్చినట్లు తెలిపారు.తాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎప్పుడు వస్తానన్నది తనకే తెలియదని అన్నారు. ఈ ప్రశ్నకు రజనీకాంత్ చెప్పే సమాధానమే తనదీ అని అన్నారు. తాను ఎలా వస్తాను, ఎప్పుడు వస్తాను అన్నది కాలమే నిర్ఱయిస్తుందన్నారు.ఇక సమత్తువ మక్కళ్ పార్టీ శాసనసభ ఎన్నికల కూటమి నిర్ణయాన్ని ఆ పార్టీ అధ్యక్షుడు శరత్‌కుమార్‌నే తీసుకుంటారని ఆ వ్యవహారంలో తాను తలదూర్చనని రాధిక పేర్కొన్నారు. -
కమల్, మౌళి కాంబినేషన్లో మరో చిత్రం
ఇటీవల సూపర్‌స్టార్ రజనీకాంత్ స్పీడ్ పెంచారు. ఒకేసారి కబాలి, 2ఓ చిత్రాల్లో నటిస్తున్నారు. అంతే కాదు తదుపరి చిత్రానికి పచ్చజెండా ఊపినట్లు వార్తలు వెలువడుతున్నాయి. అయితే విశ్వనటుడు కమలహాసన్ అంతకు ముందే తన చిత్రాల వేగాన్ని పెంచారు. ఉత్తమ విలన్, పాపనాశం, తూంగావనం అంటూ వరుసగా చిత్రాలు చేశారు. తాజాగా ఏకకాలంలో రెండు చిత్రాలు చేయడానికి సన్నాహాలు వేగంగా జరుగుతున్నాయన్నది లేటెస్ట్ట్ సమాచారం. ఆయన మలయాళ దర్శకుడు టీకే.రాజీవ్‌కుమార్ దర్శకత్వంలో అప్పా అమ్మా విళయాట్టు చిత్రంలో నటించనున్నారు. ఇందులో ఆయన సరసన నటి రమ్యకృష్ణ నటించనున్నట్లు సమాచారం. ఇదే చిత్రంలో కమలహాసన్‌కు కూతురిగా శ్రుతిహాసన్ నటించనున్నారు. ఈ చిత్రంతో పాటు సీనియర్ దర్శకుడు మౌళి దర్శకత్వంలో నటించడానికి కమల్ రెడీ అవుతున్నట్లు తెలిసింది. దీనికి పరమపథం అనే పేరును నిర్ణయించినట్లు సమాచారం. కమల్, మౌళి కలయికలో చిత్రం అంటే హాస్యానికి కొదవే ఉండదు. ఇంతకు ముందు వీరి కాంబినేషన్లో పమ్మల్ కే.సంబంధం, నలదమయంతి చిత్రాలు వచ్చాయన్నది గమనార్హం. ఈ చిత్రంలో కూడా వినోదానికి పెద్ద పీట వేయనున్నట్లు సమాచారం. అయితే ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. -
మరో చిత్రానికి ఓకే చెప్పిన రజనీ
సూపర్‌స్టార్ రజనీకాంత్ మరో కొత్త చిత్రానికి ఓకే చెప్పారనే ప్రచారం కోలీవుడ్‌లో హల్చల్ చేస్తోంది.ఈ చిత్రం 2018లో తెరపైకి రానుందనే టాక్ కూడా వినిపిస్తోంది.రజనీకాంత్ ప్రస్తుతం రెండు చిత్రాలు చేస్తున్న సంగతి విదితమే.అందులో ఒకటి కబాలి. ఈ చిత్రాన్ని యువ దర్శకుడు రంజిత్ తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ ఇటీవలే పూర్తి అయ్యింది. కబాలి ఈ ఏడాది మే నెల తరువాత తెరపైకి రానున్నట్లు సమాచారం. రజనీకాంత్ ప్రస్తుతం మరో భారీ చిత్రం 2.ఓ చిత్ర చిత్ర షూటింగ్లో పాల్గొంటున్నారు. స్టార్ దర్శకుడు శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఎమీజాక్సన్ నాయకిగా నటిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్‌కుమార్ ప్రతినాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రాన్ని లైకా సంస్థ నిర్మిస్తోంది. 2018లో చిత్రాన్ని విడుదల చేయడానికి సూపర్‌స్టార్ తాజా చిత్రానికి రెడీ అవుతున్నారని తెలిసింది. మలయాళంలో మమ్ముటీ,నయనతార జంటగా నటించిన భాస్కర్ ది రాస్కెల్ రీమేక్‌లో రజనీకాంత్ నటించనున్నారన్నది సమాచారం. దీనికి సిద్ధిక్ దర్శకుడు. పెళ్లి చేసుకుని విడాకులు తీసుకున్న ఇద్దరి మధ్య ప్రేమ వారి పిల్లల క్షేమం ఇతివృత్తంగా రూపొందిన భాస్కర్ ది రాస్కెల్ చిత్రం మలయాళంలో గత ఏడాది విడుదలై విశేష విజయా న్ని సొంతం చేసుకుంది.ఈ చిత్ర రీమేక్‌లో రజనీకాంత్ న టించడానికి అంగీకరించిన ట్లు ఆ చిత్ర దర్శకుడు సిద్ధిక్ ఒక భేటీలో పేర్కొన్నట్లు మ లయాళ పత్రికలు ప్రచారం చేశాయి. ఈ చిత్రం 2017 ద్వితీ యార్థంలో సెట్‌పైకి వెల్లే అవకాశం ఉన్నట్టు సమాచారం. -
ఇరవై కోట్ల భారీ సెట్
సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తయారవుతున్న ‘2.0’ ఇప్పుడు ఓ సంచలనం. ఆరేళ్ల క్రితం వచ్చిన ‘రోబో’(తమిళంలో ‘ఎంతిరన్’)కి సీక్వెల్‌గా శంకర్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి వేసిన ఒక భారీ సెట్ ఇప్పుడు వార్తల్లో నిలిచింది. ఈ సీక్వెల్ కోసం శంకర్ ఏకంగా రూ. 20 కోట్ల ఖర్చుతో చెన్నై శివారుల్లో ఒక భారీ సెట్ వేయించారు. ‘రోబో’లో వచ్చే కీలకమైన పతాక సన్నివేశాల కోసం ఆ రోజుల్లోనే చె న్నై శివార్లలో రూ. 5 కోట్ల వ్యయంతో సెట్ వేసి ఔరా అనిపించారు. ఇప్పుడీ రెండో భాగంలో హీరో రజనీకాంత్, విలన్‌గా నటిస్తున్న హిందీ హీరో అక్షయ్ కుమార్ల మధ్య వచ్చే పోరాట సన్నివేశాల కోసం ఆర్ట్ డెరైక్టర్ ముత్తురాజ్ పర్యవేక్షణలో ఈ కొత్త సెట్‌ను తీర్చిదిద్దారు. ‘శివాజీ’ నుంచి ‘రోబో’ దాకా (‘ఐ’ ను మినహాయిస్తే) చిత్రాల్లోని యాక్షన్ సన్నివేశాలకు పీటర్ హెయిన్ను ఎంచుకున్న శంకర్ ఈ సారి ‘2.0’ కోసం హాలీవుడ్ చిత్రాలు ‘ట్రాన్స్‌ఫా ర్మర్స్’, ‘మిషన్ ఇంపాజిబుల్’కు పనిచేసిన హాలీవుడ్ స్టంట్ మాస్టర్ కెన్నీ బేట్స్‌ను ఆశ్రయించారు. మార్చిలో చిత్రీకరించనున్న ఈ పోరాట సన్నివేశాల కోసం యూనిట్ తలమునకలై ఉంది. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఇందులో హీరోయిన్ అమీజాక్సన్ ఓ హ్యూమనాయిడ్ రోబో అన్న వార్తలు ప్రచారంలో ఉన్నాయి. చెన్నైకి... ‘కబాలి’! ఒక పక్క ‘రోబో’ సీక్వెల్ ‘2.0’కు భారీ సన్నాహాలు సాగుతుంటే, మరో పక్క రంజిత్ దర్శకత్వంలోని ‘కబాలి’లో గ్యాంగ్‌స్టర్ పాత్ర పోషిస్తున్న రజనీకాంత్ మలేసియాలో సుదీర్ఘ షూటింగ్ ముగించుకొని, చెన్నైకి తిరిగొచ్చారు. మలేసియాలోని భారీ షెడ్యూల్లో రజని పోర్షన్ పూర్తయి పోయింది. మిగిలిన చిత్ర యూనిట్ కూడా వచ్చేవారం మొదటికల్లా చెన్నైకు తిరిగివస్తోంది. ఆ వెంటనే ‘కబాలి’ ప్యాచ్‌వర్క్‌ను చెన్నైలో పూర్తి చేయడానికి సన్నాహాలు సాగుతున్నాయి. అంటే, ఇక పూర్తి స్థాయిలో ఈ సూపర్‌స్టార్ ఫోకస్ ‘2.0’ మీదే అన్నమాట! -
రజనీ చిత్రం కోసం 20కోట్లతో సెట్
సూపర్‌స్టార్ రజనీకాంత్ తాజా చిత్రం కోసం చెన్నైలోని ఓ ప్రాంతం అత్యాధునిక నగరంగా మారుతోందన్నది తాజా సమాచారం.రజనీకాంత్ ఇంతకు ముందెప్పుడూ లేనట్టుగా ఏకకాలంలో రెండు భారీ చిత్రాల్లో నటిస్తున్న విషయం పాఠకులకు తెలిసిందే. అందులో ఒకటి 2.ఓ. ఇది ఎందిరన్ చిత్రానికి సీక్వెల్ అన్న విషయాన్ని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బ్రహ్మాండ చిత్రాల దర్శకుడు శంకర్ వెండితెరపై ఆవిష్కరిస్తున్న మరో అద్భుత సృష్టి 2ఓ చిత్రం అని చెప్పవచ్చు.ఇప్పటి వరకూ భారతీయ సినీ చరిత్రలో రూపొందనటువంటి అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా నమోదు కానున్న చిత్రం ఇది.ఈ చిత్రాన్ని లైకా సంస్థ 250 కోట్ల బడ్జెట్లో నిర్మిస్తున్నట్లు సమాచారం. రజనీకాంత్ సరసన ఇంగ్లాండ్ బ్యూటీ ఎమీజాక్సన్ నటిస్తున్న ఈ చిత్రంతో బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్‌కుమార్ విలన్‌గా మారుతున్నారు. చెన్నైలో ప్రారంభమైన 2ఓ చిత్రం షూటింగ్ ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకుంది. హాలీవుడ్ స్టంట్ మాస్టర్ నేతృత్వంలో తాజా షెడ్యూల్ ఈ నెల 18 నుంచి చెన్నైలో ప్రారంభం కానుందన్నది సమాచారం. ఈ చిత్రం కోసం స్థానిక పూందమల్లి సమీపంలో రూ.20 కోట్ల ఖర్చుతో బ్రహ్మాండమైన సెట్‌ను వేస్తున్నారు.ఇది పలు ఏకరాల స్థలంలో ఒక ఆధునిక నగరంగా తయారవుతోందన్నది గమనార్హం.ఈ సెట్లో యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించనున్నట్లు తెలిసింది.ఇందు కోసం హాలీవుడ్ స్టంట్ డెరైక్టర్ కెన్నీ పెట్స్ తన టీమ్‌తో చెన్నైకి చేరుకుని ఆ సెట్లో ఇప్పటికే ఫైట్ సీక్వెన్స్‌ను కంపోజ్ చేస్తున్నారు. ఈ స్టంట్ మాస్టర్ ది రాక్,ట్రైనింగ్ డే సీక్వెల్స్ తదితర హాలీవుడ్ చిత్రాలకు పని చేశారన్నది గమనార్హం. ఈ చిత్రంలో ఫైట్ సన్నివేశాలను చిత్రీకరించడానికి కొన్ని ఆధునిక త్రీడీ కెమెరాలను రప్పించారు. సెల్‌ఫోన్స్ నిషిద్దం షరతులు వర్తిస్తాయి అన్నట్లుగా దర్శకుడు శంకర్ చిత్ర యూనిట్‌కు కొన్ని నిబంధనలను విధించారు. షూటింగ్ స్పాట్‌కు ఎవరూ సెల్ఫోన్లు తీసుకురాకూడదు. చిత్రానికి సంబంధించిన వారు మినహా బయటి వారెవరికి షూటింగ్ స్పాట్‌కు రావడానికి అనుమతి నిషిద్దం లాంటి నిబంధనలు విధించారట. -
గౌతమ్‌తో... ధనుష్ గ్యాంగ్‌వార్
సూపర్‌స్టార్ రజనీకాంత్ అల్లుడైన యువ హీరో ధనుష్‌కు ఇప్పుడు టైమ్ బ్రహ్మాండంగా ఉన్నట్లుంది. ఆయన పట్టిందల్లా బంగారమే! ఆయన ఇటీవలే ఒక హాలీవుడ్ చిత్రంలో నటించనున్నట్లు ప్రకటించారు. ‘కాక్కా ముట్టై’ లాంటి తమిళ చిత్రాల నిర్మాణంతోనూ ఆయన తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. ఆయన నిర్మించగా, వెట్రిమారన్ దర్శకత్వంలో గత వారం విడుదలైన ‘విసారణై’ కమల్‌హాసన్, రజనీకాంత్ సహా పలువురి ప్రశంసలు పొందింది. ప్రయోగశీలత ఉన్న ఇలాంటి నటుడితో చేయడానికి ఏ దర్శకుడికి మాత్రం ఉత్సాహం ఉండదు! తాజాగా దర్శకుడు గౌతమ్ మీనన్ ఆయనతో తమిళంలో ఒక సినిమా చేయనున్నారు. ‘ఎన్మేల్ పాయుమ్ తోట’ అనే ఈ తమిళ చిత్రం మార్చి నుంచి సెట్స్‌పైకి వెళుతుందట! ఇది గ్యాంగ్‌వార్‌ల నేపథ్యంలో జరిగే యాక్షన్ సినిమా అని భోగట్టా. కేవలం రెండే రెండు నెలల్లో ఈ చిత్రాన్ని పూర్తి చేయాలని భావిస్తున్నారు. సినిమాలో తన భాగం పూర్తి చేసి, అటుపైన హాలీవుడ్ ప్రాజెక్ట్‌లో వర్క్ చేయడానికి వెళ్ళాలని ధనుష్ ఆలోచన. ధనుష్ ఇప్పుడు నటిస్తున్న తమిళ రాజకీయ థ్రిల్లర్ ‘కొడి’ షూటింగ్ కూడా ఈ నెలాఖరు కల్లా పూర్తవుతుంది. సో, మార్చి నుంచి ఈ కొత్త ప్రాజెక్ట్ పట్టాలెక్కేస్తుంది. ఇతర తారాగణం ఇంకా ఖరారు చేయాల్సి ఉంది. విశేషమేమి టంటే, నిజానికి ఈ స్క్రిప్ట్‌ను హీరో సూర్యతో తెరకెక్కించాలని గౌతమ్ అనుకున్నారట! కానీ, ఆ ప్రాజెక్ట్ అర్ధంతరంగా అటకెక్కడంతో, ఇప్పుడు అదే స్క్రిప్ట్‌ను, అదే టైటిల్‌తో ధనుష్ హీరోగా తెరకెక్కిస్తున్నారని కోడంబాకమ్ కబురు. -
నో పాలిటిక్స్, రజనీ మంచి వ్యక్తి..
సాక్షి, చెన్నై: దక్షిణ భారత చలన చిత్ర సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు పద్మ విభూషణ్ అవార్డు ప్రదానంలో ఎలాంటి రాజకీయం లేదని కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ స్పష్టం చేశారు. ఆయన మంచి మనిషి అని కితాబు ఇచ్చారు. కోయంబత్తూరులో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన ఏర్పాట్లను గురువారం ఆయన పరిశీలించారు. ప్రధాని నరేంద్ర మోదీ, రజినీకాంత్ మధ్య సాన్నిహిత్యం ఉన్న విషయం తెలిసిందే. దీన్ని ఆసరాగా తీసుకుని దక్షిణ భారత చలన చిత్ర సూపర్‌స్టార్ రజనీకాంత్‌ను తమ వైపు తిప్పుకునేందుకు కమలనాథులు తీవ్ర కుస్తీలు చేస్తూ వస్తున్నారు. అయితే తలైవా ఎక్కడా చిక్కకుండా తన మార్గంలో తాను సాగుతూ ఉన్నారు. ఈ సమయంలో రిపబ్లిక్ డే ను పురస్కరించుకుని ఆయనకు పద్మవిభూషణ్‌ను కేంద్రం ప్రకటించింది. ఈ అవార్డు రజనీకాంత్‌ను తమ వైపు తిప్పుకునేందుకు సాగుతున్న గాలంలో భాగం అన్నట్టుగా తమిళ మీడియాల్లో కథనాలు బయల్దేరాయి. అయితే ఈ కథనాలను ఖండిస్తూ కేంద్రమంత్రి ప్రకాష్ జవదేకర్ తీవ్రంగా స్పందించారు. కోయంబత్తూరులో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన ఏర్పాట్లను పరిశీలించేందుకు గురువారం జవదేకర్ వచ్చారు. ఈ సందర్భంగా విమానాశ్రయంలో ఆయన్ను మీడియా చుట్టుముట్టింది. ఇటీవల తిమింగలాలు ఒడ్డుకు కొట్టుకు వచ్చి మరణించిన వ్యవహారంపై ప్రశ్నల్ని గుప్పించారు. ఇందుకు స్పందిస్తూ పరిశోధనలు సాగుతున్నాయని, ఆ మేరకు తదుపరి చర్యలు ఉంటాయని వ్యాఖ్యానించారు. రజనీకాంత్‌కు పద్మ విభూషణ్ ప్రస్తావన తీసుకు రాగా, ఇందులో ఎలాంటి రాజకీయ జోక్యం లేదు అని స్పష్టం చేశారు. రాజకీయ ఉద్దేశంతోనూ ఈ అవార్డు ఆయనకు ఇవ్వలేదు అని, ఆయనకు ఇవ్వడం ద్వారా ఆ అవార్డుకు మరింత గౌరవాన్ని కల్గించామన్నారు. ఈ విషయాన్ని రాజకీయం చేయవద్దు అని సూచించారు. రజనీకాంత్ గొప్ప నటుడే కాదు అని, మంచి మనిషి కూడా అని కితాబు ఇచ్చారు. ఏ తరం వాళ్లకైనా సరే ఆయన అంటే ఎంతో ఇష్టం అని, ఆయన స్టైల్ రాబోయే తరం వారికి కూడా నచ్చుతుందని వ్యాఖ్యానించారు. అందుకే ఆ అవార్డు ఆయనకు సొంతమైందన్నారు. మోదీ పర్యటన ఏర్పాట్ల పరిశీలన: ప్రధాని నరేంద్ర మోదీ కోయంబత్తూరు ఏర్పాట్లను జవదేకర్ పరిశీలించారు. ఈఎస్ఐ ఆసుపత్రి ఆవరణలో సాగుతున్న ఏర్పాట్లను పరిశీలించి, అధికారులతో సమాలోచించారు. ఒడిస్సియా మైదానంలో జరగనున్న భారీ బహిరంగ సభ ఏర్పాట్లను సైతం పరిశీలించారు. ఆయనతో పాటుగా కేంద్ర సహాయ మంత్రి పొన్‌రాధాకృష్ణన్ కూడా ఈ పరిశీలనలో ఉన్నారు. పది లక్షల మంది జన సమీకరణ లక్ష్యంగా ఈ బహిరంగ సభ ఉంటుందని, అందుకు తగ్గ ఏర్పాట్లు వేగవంతం చేశామని పొన్ రాధాకృష్ణన్ మీడియాతో మాట్లాడుతూ పేర్కొన్నారు. ఒక్క కోయంబత్తూరు నుంచి మాత్రం లక్ష మంది ఈ సభకు రానున్నారని, ఈ సభ రాష్ట్ర రాజకీయ మార్పులకు వేదిక కానున్నదన్నారు. రెండో తేదీ ఇక్కడకు రానున్న మోదీని పలువురు మిత్రులు కలవడం ఖాయమని, ఇందులో అనేక పార్టీల నాయకులు సైతం ఉన్నారని వ్యాఖ్యానించారు. -
సూపర్‌స్టార్‌కు పద్మవిభూషణ్?
సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు పద్మవిభూషణ్ పురస్కారం దక్కనుందా? ఈ ప్రశ్నకు అవుననే ప్రచారం జోరందుకుంది. నిజానికి రజనీకాంత్ ఎలాంటి అవార్డులను ఆశించి చిత్రాలు చేయలేదన్నది నిజం. తన నిర్మాత శ్రేయస్సు, బయ్యర్ల ప్రయోజనాలు, అభిమానుల ఆనందాలకు ప్రాముఖ్యతనిచ్చిన నటుడు రజనీకాంత్. అందుకే అవార్డుకు చిహ్నంగా చెప్పబడే కథా చిత్రాల జోలికి పోకుండా, వాణిజ్య విలువలతో కూడిన జనరంజక కథాచిత్రాలనే చేసుకుంటూ వస్తున్నారు. అయితే వాటిలో దక్షిణాది చిత్రాలే కాకుండా హిందీ, ఇంగ్లీష్ తదితర భాషా చిత్రాలు చోటు చేసుకున్నాయి. ఇంకా చెప్పాలంటే రజనీకాంత్ తమిళ చిత్రాలతోనే జపాన్, కెనడా, మలేషియా, సింగపూర్ మొదలగు దేశాల్లో కూడా అశేష అభిమానులను పొందారు. అలాంటి నటుడిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆయన నటనా సేవకు తగిన గుర్తింపునివ్వలేదనే అపవాదు ఒక వర్గం వ్యక్తం చేస్తోందన్నది వాస్తవం. ఒక సామాన్య బస్సు కండక్టర్ స్థాయి నుంచి భారతీయ చిత్రసీమలో ఒక బలమైన నటుడిగా ఎదిగారాయన. తమిళ సినీ అభిమానుల మధ్య సూపర్‌స్టార్‌గా నేటికీ వెలుగొందుతున్న రజనీకాంత్‌ది నాలుగు పదుల నటజీవితం. ఈ కాలంలో శతాధిక చిత్రాలు చేసిన రజనీకాంత్‌కు భారత ప్రభుత్వం 2000 సంవత్సరంలో పద్మభూషణ్ పురష్కారంతో గౌరవించింది. ఇతర ప్రైవేట్ అవార్డులు పలు వరించినా, ప్రభుత్వపరంగా ఇప్పటికి పద్మభూషణ్ ఒక్కటే అందుకున్నారు. అభిమానుల ఆనందహేలల్నే అన్నిటికీ మించిన అవార్డులు, రివార్డులుగా భావించే మన సూపర్‌స్టార్‌కు తాజాగా భారత ప్రభుత్వ ప్రతిష్టాత్మక అవార్డులలో ద్వితీయ స్థాయి పద్మవిభూషణ్ అవార్డు వరించబోతున్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాల సమాచారం. గణతంత్ర దినోత్సం సందర్భంగా రాష్ట్రపతి వెల్లడించనున్న అవార్డు గ్రహీతల పేర్లలో రజనీకాంత్ పేరు చోటు చేసుకుంటున్నట్లు కోలీవుడ్ వర్గాల టాక్. ప్రస్తుతం రజనీ ఏకధాటిగా కబాలీ, 2.ఓ చిత్రాలలో నటిస్తున్నారు. -
నెంబర్‌వన్ అజిత్
అజితే నెంబర్‌వన్. ఈ ఒక్క మాట చాలు ఆయన అభిమానులు కాలరెగరవేయడానికీ, ఆనందంతో రెచ్చిపోవడానికి. అంతే కాదు తాజా సర్వేలో అజిత్ సూపర్‌స్టార్ రజనీకాంత్‌నే మించిపోయారట. ఇక అజిత్ అభిమానుల ఆనందానికి అవధులేముంటాయి. ఇంతకీ విషయం ఏమిటంటే చెన్నై స్థానిక లయోలా కళాశాల విద్యార్థుల బృందం ఆ కళాశాల ప్రొఫెసర్ రాజనాయగం నేతృత్వంలో కాబోయే ముఖ్యమంత్రి, తదితర అంశాలపై ఈ నెల ఏడో తేదీ నుంచి 19వ తారీఖు వరకూ రాష్ట్ర వ్యాప్తంగా సర్వే నిర్వహించారు. ఆ సర్వేలో నెంబర్ఒన్ నటుడెవరన్న అంశం కూడా చోటు చేసుకుంది. కాగా ఆ సర్వే ప్రకారం నెంబర్ఒన్ పోటీలో నటుడు అజిత్‌కు 16 శాతం, రజనీకాంత్‌కు 15.9 శాతం, విజయ్‌కు 9 శాతం, కమలహాసన్‌కు 5.9 శాతం, సూర్యకు 4.3 శాతం మద్దతు లభించినట్లు తెలిసింది. ప్రజా సర్వేలో అధిక శాతం అజిత్‌నే నెంబర్ఒన్ హీరోగా పేర్కొనడం విశేషం. కాగా రజనీకాంత్‌కు పోటీగా భావించే కమలహాసన్ నాలుగో స్థానంలో ఉండడం, అజిత్‌కు పోటీగా భావించే విజయ్‌కు మూడో స్థానాన్ని తమిళ ప్రజలు కట్టబెట్టడం గమనార్హం. ఇక నటుడు సూర్య 4.3 శాతానికే పరిమితం అయినట్లు ఆ సర్వే పేర్కొంది. అయితే ఈ సర్వేపై ఒక్కొకరు ఒక్కో అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం గమనార్హం. -
కేసుల్లేవని సర్టిఫికెట్ ఇవ్వండి
తమిళ సినిమా: తనపై ఎలాంటి నేరారోపణలు, కేసులు లేవని సర్టిఫికెట్ ఇవ్వాల్సిందిగా సూపర్‌స్టార్ రజనీకాంత్ చెన్నై నగర పోలీస్‌కమిషనర్‌ను కోరారు. రజనీకాంత్ ఏమిటీ కేసు లేమిటీ అని ఆశ్చర్యంగా ఉందా? అయితే రండి చూ ద్దాం...మన సూపర్‌స్టార్ తాజాగా నటిస్తున్న రెండు చిత్రాల్లో 2.ఓ(ఎందిరన్-2) ఒకటి, స్టార్ డెరైక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ అత్యంత భారీ బడ్జెట్ చిత్రాన్ని లైకా సంస్థ నిర్మిస్తోంది. ఎమీజాక్సన్ నాయకిగా నటిస్తున్న ఈ చిత్రంలో విలన్‌గా బాలీవుడ్ ప్రముఖ నటుడు అక్షయ్‌కుమార్ నటిస్తున్నారు. చిత్ర షూటింగ్ ఇటీవలే ప్రారంభం అయ్యింది. అధిక భాగం షూటింగ్‌ను విదేశాల్లో నిర్వహించడానికి చిత్ర యూనిట్ ప్రణాళిక సిద్ధం చేసుకుంది. ఆయా దేశాల్లో ఒకటి బొలిలియా. అక్కడ షూటింగ్ చేయాలంటే కొన్ని విధివిధాలను కచ్చితంగా పాటించి తీరాలట. వృత్తి రీత్యా ఆ దేశానికి వెళ్లే వాళ్లపై ఎలాంటి కేసులు ఉండరాదట. ఎలాంటి నేరారోపణలు లేవని పోలీసుల నుంచి ధ్రువపత్రం పొంది ఆ దేశ అధికారులకు అందించాలట. అందువల్ల ఆ పోలీస్ ధ్రువపత్రం ఉంటేనే రజనీకాంత్, ఇతర చిత్ర యూనిట్ బొలిలియా దేశంలో అడుగుపెట్టగలరు. అందువల్ల 2.ఓ చిత్ర షూటింగ్ కోసం బొలిలియా వెళ్లనున్న రజనీకాంత్‌కు పోలీస్ ధ్రువపత్రం కోరుతూ ఆయన తరపున నగరపోలీస్ కమిషనర్‌కు వినతి పత్రాన్ని అందించారు. ఆయన నుంచి ధ్రువపత్రం వచ్చిన తరువాతనే రజనీకాంత్ బొలిలియా దేశం వెళ్లే షెడ్యూల్‌ను చిత్ర యూనిట్ ఖరారు చేయగలరని సమాచారం. -
నా కాల్షీట్స్ కాస్ట్లీగురూ!
విజయాలు ఎంత పని అయినా చేస్తాయి. ఇక చిత్ర పరిశ్రమ విషయానికి వస్తే సక్సెస్‌లతో పారితోషికాలు పెంచే వరుసలో ముందుగా హీరోహీరోయిన్లే ఉంటారు. ముఖ్యంగా కోలీవుడ్‌లో కథానాయకుల పారితోషికాలు నిర్మాతల కళ్లు బైర్లు కమ్మేలా చేస్తున్నాయి. సూపర్‌స్టార్ రజనీకాంత్, విజయ్,అజిత్ వంటి ప్రముఖ హీరోల పారితోషికాలు ఆశ్చర్యపరుస్తాయి.ఇక నటుడు అజిత్‌కు సంబంధించిన ప్రచారంలో ఉన్న తాజా సమాచారం ఏమిటంటే ఆయన 30 కోట్ల పారితోషికాన్ని డిమాండ్ చేస్తున్నారట. అజిత్ ఇటీవల నటించిన ఆరంభం, వీరం, ఎన్నైఅరిందాల్, వేదాళం చిత్రాలు వరుసగా విజయం సాధించాయి. వీటిలో మూడు చిత్రాలను శ్రీసాయిరామ్ మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత ఏఎం.రత్నం నిర్మించడం విశేషం. అదే విధంగా రెండు చిత్రాలకు శివ దర్శకత్వం వహించారు. అజిత్ తదుపరి చిత్రానికి ఈ దర్శకుడే పనిచేయనున్నారనే ప్రచారం జరుగుతోంది. అజిత్‌తో సత్యజ్యోతి ఫిలింస్ సంస్థ చిత్రం చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. అయితే మరి కొందరు నిర్మాతలు అజిత్ కాల్షీట్స్ కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. వేదాళం చిత్రం 30 రోజుల్లోనే 100 కోట్లు వసూళ్లు సాధించిందనే విషయం ప్రచారంలో ఉంది. వరుస విజయాలతో పుల్‌జోష్‌లో ఉన్న అజిత్ ఇప్పటి వరకు 20 నుంచి 21 కోట్లు పారితోషికం తీసుకుంటున్నారని టాక్. అయితే దాన్ని ఇప్పుడు 30కి పెంచినట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం. మరి ఆ కొత్త నిర్మాతలు అజిత్‌కు 30 కోట్లు పారితోషికంగా ముట్ట చెప్పడానికి సిద్ధం అంటారా? ఇంతకీ ఎవరా నిర్మాతలు?అన్న విషయాలపై ఆరా తీసే పనితో నిమగ్నమయ్యారు కోలీవుడ్ వర్గాలు. అజిత్ తన తాజా చిత్రంలో హీరోయిన్గా నయనతారను కోరుకుంటున్నట్లు తెలియడంతో ఆ నిర్మాతలు ఆమె కాల్షీట్స్ను బ్లాక్ చేసే పనిలో ఉన్నట్లు టాక్. ప్రస్తుతం కాలుకు శస్త్ర చికిత్స చేయించుకుని విదేశాల్లో విశ్రాంతి పొందుతున్న అజిత్ చెన్నైకి తిరిగి వచ్చిన తరువాత గానీ తన తాజా చిత్రం గురించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. -
సూపర్‌స్టార్‌కు విలన్‌గా హాంకాంగ్ స్టార్?
సూపర్‌స్టార్ రజనీకాంత్ చిత్రం అంటేనే ఆటోమెటిక్‌గా ఒక క్రేజ్ వచ్చేస్తుంది. అదీ ఆయన స్టామినా. అంతే కాదు ఆశ్చర్యాలకు, ఆసక్తికీ నిలయం ఆయన చిత్రాలు. ప్రస్తుతం రజనీకాంత్ నటిస్తున్న కబాలీ, 2.ఓ(ఎందిరన్‌కు సీక్వెల్) చిత్రాలపై ఇటు పరిశ్రమలోనూ, అటు అభిమానుల్లోనూ అంచనాలు తారస్థాయికి చేరుకున్నాయి. అలాంటి చిత్రాలకు చెందిన విశేషాలు తెలుసుకోవాలనే ఆతృత ప్రతి ప్రేక్షకుడిలోనూ ఉంటుంది. కాగా 2.ఓ చిత్రం గురించి చెప్పుకోవడానికి ఇంకా చాలా సమయం ఉంది. ఇకపోతే కబాలీ చిత్రం గురించి ఇప్పటికే పలు ఆసక్తికరమైన చిత్రాలు చెప్పుకున్నాం. సూపర్‌స్టార్ చాలా కాలం తరువాత అంటే సంచలన చిత్రం బాషా తరువాత మరోసారి గ్యాంగ్‌స్టర్‌గా కనిపించనున్న చిత్రం కబాలీ. ఇందులో ఆయన రెండు డైమన్షన్స్‌లో అభిమానుల్ని అలరించనున్నారు. అందులో పూర్తిగా నెరిసిన గడ్డం, మీసాలతో ఫుల్ సూట్లో ఉన్న ఆయన గెటప్ ఇప్పటికే అభిమానుల్ని యమ ఖుషీ చేస్తోంది. ఇక మరో యంగ్ గెటప్‌లో సూపర్‌స్టార్ కొత్త కోణంలో కబాలీ చిత్రంలో ఆవిష్కృతం కానున్నారు. చిత్ర కథ అధిక భాగం మలేషియాలో నడుస్తుంది. కాగా సూపర్‌స్టార్‌కు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారన్నది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని కబాలీ చిత్ర దర్శకనిర్మాతలు ఈ చిత్రంలో సూపర్‌స్టార్ రేంజ్‌కు తగ్గట్టుగా విలన్‌ను ఎంపిక చేసే పనిలో నిమగ్నం అయ్యారు. విశేషం ఏమిటంటే ఆ విలన్ ప్రపంచ స్థాయి స్టార్ కానున్నారన్నది తాజా సమాచారం. రజనీకి విలన్‌గా జెట్లీ? కబాలీ చిత్రంలో ఉత్తర ప్రపంచానికి చెందిన స్టార్స్‌లో ఒకరిని ఎంపిక చేయనున్నారని తెలిసింది. ఐపీమ్యాన్ సిరీస్ చిత్రాల ఫేమ్ డోనీయెన్, జాన్ కుయ్, షోగర్ల్ అండ్ ది డార్క్ క్రిస్టల్ చిత్రాల ఫేమ్ విన్స్టన్ చావో,ది క్రాడిల్ ఆఫ్ లైఫ్ చిత్రం ఫేమ్ సిమోన్ యామ్, గాన్ విత్ ది బులెట్స్ చిత్రం ఫేమ్ జయాంగ్ వెన్, పైరేట్స్ ఆఫ్ ది కరేబియన్, ఎట్ వరల్డ్ ఎండ్ చిత్రాల ఫేమ్ చెయాన్ ఫాట్లలో ఒకర్ని సూపర్‌స్టార్‌కు విలన్‌గా చేసే ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. వారందరి కంటే హాంకాంగ్ స్టార్ హీరో జెట్లీ రజనీకాంత్‌కు ప్రతినాయకుడయ్యే అవకాశాలు మెండుగా ఉన్నట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం. నటి రాధిక ఆప్తే రజనీకాంత్‌తో జత కట్టే అవకాశాన్ని దక్కించుకున్న ఈ చిత్రంలో దినేశ్, కలైయరసన్, ధన్సిక, జాన్ విజయ్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. వీ.క్రియేషన్స్ పతాకంపై కలైపులి ఎస్ థాను నిర్మిస్తున్న ఈ భారీ, క్రేజీ చిత్రాన్ని యువ దర్శకుడు రంజిత్ హ్యాండిల్ చేస్తున్నారు. రజనీకాంత్‌తో హాంకాంగ్ స్టార్ ఢీకొనే సన్నివేశాలను 2016 ప్రథమార్ధంలో మలేషియా, హాంకాంగ్‌లో చిత్రీకరించనున్నట్లు తెలిసింది. చిత్రాన్ని సమ్మర్ స్పెషల్‌గా మే నెల ఒకటో తారీఖున విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. -
సూపర్‌స్టార్‌ను అధిగమించిన కాజల్
సూపర్‌స్టార్ రజనీకాంత్‌ను అధిగమించారు నటి కాజల్ అగర్వాల్. ప్రతి ఏడాది అధిక ఆదాయం, ప్రాచుర్యం పొందిన వారి పట్టికను ఒక సర్వే సంస్థ విడుదల చేస్తుంది. అలా ఈ ఏడాది అధిక ఆదాయం, ప్రాచుర్యం పొందిన వారిలో రజనీకాంత్, హిందీ నటుడు అభిషేక్ బచ్చన్, దర్శకుడు రాజమౌళిలను నటి కాజల్ అగర్వాల్ అధిగమించారు. దీని గురించి ఈ ముద్దుగుమ్మ స్పందిస్తూ విజయానికి ఆదాయం, ప్రాచుర్యం కారణం అవుతాయన్నారు.నటిగా తాను కఠినంగా శ్రమిస్తానన్నారు. అందుకు ఫలితమే ఈ స్టార్ అంతస్తు అన్నారు.హీరోయిన్ల కంటే హీరోలకు అధిక పారితోషికం ఉంటుందిగా అని అడుగుతున్నారని, ఇంతకు ముందు అలాంటి పరిస్థితి ఉండేదన్న మాట వాస్తమేనన్నారు. అయితే ఇప్పుడా విధానంలో మార్పు వస్తోందని అన్నారు. ఆదాయం అనేది శ్రమను బట్టి ఉంటుందని పేర్కొన్నారు. ఒక చిత్రానికి ఎన్ని రోజులు పని చేస్తున్నాం, ఎంత శ్రమను దారపోస్తున్నాం అన్నదాని బట్టి పారితోషికం పెంపు ఉంటుందని అన్నారు. ఈ విషయంలో తానెవరినీ విమర్శించనని అన్నారు. ఇకపోతే మనకు లభించే కథా పాత్రలు అదృష్టాన్ని బట్టి అమరుతాయన్నారు.ఇప్పుడు హీరోయిన్లు కఠిన శ్రమకు సిద్ధం అవుతున్నారని పేర్కొన్నారు. ఉదాహరణకు నటి అనుష్కను తీసుకోవచ్చునన్నారు. అరుంధతి, రుద్రమదేవి, ఇంజి ఇడుప్పళగి చిత్రాల కోసం ఆమె ఎంతగా శ్రమించారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదని కాజల్ అగర్వాల్ అన్నారు. -
సూపర్‌స్టార్‌తో నటించడానికి ఎదురు చూస్తున్నా
సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో జత కట్టడానికి చాలా ఎగ్జైట్‌గా ఎదురుచూస్తున్నానని అంటోంది ఇంగ్లీష్ బ్యూటీ ఎమిజాక్సన్. ఈ అమ్మడు నిజంగా లక్కీ నటే అని చెప్పక తప్పదు. ఏదో ఒక చిత్రంలో (మదరాసు పట్టణం) నటించి కనుమరుగవుతుందిలే అని ఊహించుకున్న సినీ వర్గాలను విస్మయ పరిచేలా ఎమిజాక్సన్ తన కెరీర్‌ను కోలీవుడ్‌లో సుస్థిరం చేసుకుంది. ఐ చిత్రంలో అందాలను ఆరబోసి అమితమైన క్రేజ్‌ను సంపాదించుకుంది. ప్రస్తుతం తమిళం, తెలుగు, హిందీ అంటూ బహుభాషా నాయకిగా ఎదుగుతోంది. ఎమిజాక్సన్ ధనుష్‌తో నటించిన తంగమగన్ చిత్రం అనుభవాలను పత్రికల వారితో పంచుకుంటూ నటుడు ధనుష్‌తో నటించడం తీయని అనుభవం అంది. ఆయన చాలా క్వైట్ పర్సన్ అని పేర్కొంది. తంగమగన్ చిత్రంలో తనది చాలా మంచి పాత్ర అని చెప్పింది. 17, 18 ఏళ్ల టీనేజ్ యువతిగా ఈ చిత్రంలో నటించానని చెప్పింది. సహనటి సమంతతో తనకు వేవ్‌లెంగ్త్ బాగా కుదిరిందని అంది. అలాగే పార్టనర్ షిప్ వర్కౌట్ అయ్యిందని చెప్పింది. గ్లామర్ గురించి ప్రశ్నించగా అదిఇప్పుడు సినిమాలో ఒక భాగం అయిపోయిందని అంది. మల్టీ చిత్రాల ట్రెండ్ పెరుగుతోంది, ఆ తరహా చిత్రాలలో నటిస్తారా? అన్న ప్రశ్నకు నటించడానికి ఎలాంటి అభ్యంతరం లేదు. అయితే ఏ చిత్రంలో అయినా తన పాత్ర స్ట్రాంగ్‌గా తాను ఎంజాయ్ చేసేది గాను ఉండాలని అంది. సూపర్‌స్టార్ రజనీకాంత్ సరసన ఎందిరన్-2 చిత్రంలో నటించనుండడం ఎలా ఫీలవుతున్నారన్న ప్రశ్నకు చాలా ఎగ్జైటింగ్‌గా ఆయన సరసన నటించడానికి ఎదురుచూస్తున్నానని పేర్కొంది. మరో విషయం ఏమిటంటే దర్శకుడు శంకర్ దర్శకత్వంలో ఒక్క చిత్రంలో నటించే అవకాశం రావడమే గొప్పగా భావిస్తారని అలాంటిది రెండో సారి ఆయన దర్శకత్వంలో నటించే అవకాశం రావడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పింది. ఈ క్రేజీ నటి నటించిన తంగమగన్ ఈ నెల 18న తెరపైకి రానుండగా ఉదయనిధి స్టాలిన్‌తో నటించిన గెత్తు చిత్రం త్వరలో విడుదలకు సిద్ధం అవుతోంది. తాజాగా ఎందిరన్-2కు రెడీ అవుతున్న ఎమి హిందీలో ఒక చిత్రం చేస్తున్నట్టు వెల్లడించింది. -
పుట్టినరోజు వేడుకలొద్దు
తన పుట్టినరోజు వేడుకలు నిర్వహించొద్దని నటుడు రజనీకాంత్ తన అభిమానులకు విజ్ఞప్తి చేశారు. సూపర్‌స్టార్ రజనీకాంత్ శనివారంతో 63వ ఏటకు వీడుకోలు చెప్పి 64వ సంవత్సరానికి స్వాగతం పలకనున్నారు. డిసెంబర్ 12 ఆయన పుట్టినరోజు. ప్రతి ఏడాది ఆ రోజున రజనీకాంత్ పుట్టినరోజు వేడుకలకు దూరంగా ఉంటున్నా ఆయన అభిమానులు మాత్రం పూజలు, కటౌట్లకు పాలాభిషేకాలు, అన్నదానాలు, వైద్యశిబిరాలు, రక్తదానాలు అంటూ హంగామా కార్యక్రమాల్లో నిమగ్నమవడం ఆనవాయితీగా వస్తోంది. అదే విధంగా ఈ పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహించడానికి రజనీకాంత్ అభిమానగణం తగిన సరంజామాతో సన్నద్ధం అవుతున్నారు. అయితే అలాంటి కార్యక్రమాలకు మన సూపర్‌స్టార్ బ్రేక్ వేశారు. కారణం అందరికీ తెలిసిందే. ఇటీవల వరదలు తమిళ ప్రజల జీవనాన్ని చిన్నాభిన్నం చేశాయి. వరదలతో తమిళనాడే జలమయమైంది. అన్నమో రామచంద్రా అంటూ ప్రజలు ఆపన్నహస్తం కోసం దీనంగా ఎదురు చూస్తున్నారు. వర్షాలు తగ్గినా జనం ఆకలి దప్పులతోనే గడుపుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం తన అభిమానులకు అలాంటి వేడుకలు నిర్వహించొద్దని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. నిజానికి ఈ పుట్టిన రోజున తన నూతన చిత్రం ఎందిరన్-2 చిత్ర పూజా కార్యక్రమాలను నిర్వహించాలని చిత్ర యూనిట్ నిర్ణయించారు. ఆ కార్యక్రమాన్ని కూడా ప్రస్తుతానికి వాయిదా వేసినట్లు తెలిసింది. ప్రస్తుతం రజనీకాంత్ కబాలి చిత్రంలో నటిస్తున్నారు. -
నో సెలబ్రేషన్స్!
ఈ నెల 12 సూపర్‌స్టార్ రజనీకాంత్ అభిమానులకు చాలా ప్రత్యేకమై రోజు. ఏడాది మొత్తం ఈ రోజు కోసం ఎదురు చూస్తుంటారు. వీలైనంత ఘనంగా ఈ రోజుని సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటారు. ఈ సెలబ్రేషన్స్ కోసం నెల రోజులు ముందే సన్నాహాలు మొదలుపెట్టేస్తారు. ఇంతకీ ఈ రోజుకి ప్రత్యేకత ఏంటంటే.. రజనీకాంత్ పుట్టినరోజు. ఆయన 65వ పడిలోకి అడుగుపెడతారు. ఈ బర్త్‌డేని ఘనంగా జరపాలనుకున్నారు అభిమానులు. అయితే, రజనీ సెలబ్రేట్ చేసుకునే మూడ్‌లో లేరు. అసలే రజనీకి సెలబ్రేషన్స్ అంటే ఇష్టం ఉండదు. కుటుంబ సభ్యులు, అభిమానుల కోరికను కాదనలేక నిరాడంబరంగా చేసుకుంటారు. అయితే, ఈసారి అది కూడా వద్దనుకుంటున్నారట. భారీ వర్షాల కారణంగా తమిళనాడు ప్రజల పరిస్థితి దయనీయంగా ఉన్న నేపథ్యంలో పుట్టినరోజు జరుపుకోకూడదని రజనీ నిర్ణయించుకున్నారట. ఇదిలా ఉంటే... ‘రోబో’కి సీక్వెల్‌గా దర్శకుడు శంకర్ ‘రోబో-2’ను ప్లాన్ చేస్తున్న విషయం తెలిసిందే. రజనీకాంత్ హీరోగా అత్యంత భారీ నిర్మాణ వ్యయంతో ఈ చిత్రం రూపొందనుంది. రజనీ పుట్టినరోజు నాడు లాంఛనంగా ఈ చిత్రం పూజా కార్యక్రమాలు జరపాలనుకున్నారట. అయితే, ఈ వేడుకకు కూడా వర్షాలు ఆటంకం అయ్యాయి. ఒకవైపు రాష్ట్ర పరిస్థితి బాగా లేకపోవడంతో కొత్త సినిమా ఏం ప్రారంభిస్తామని అనుకున్నారట. అందుకని ఆ రోజు పూజా కార్యక్రమాలు జరపాలనుకున్న ఆలోచనను విరమించుకున్నారట. అభిమాన నాయకుడి బర్త్‌డే సెలబ్రేషన్స్ చేసుకోలేకపోవడం, ‘రోబో-2’ ఆరంభం వాయిదా పడటం అభిమానులను ఒకింత నిరాశపరిచే విషయమే అయినా, దానికి బలమైన కారణం ఉంది కాబట్టి సర్దిచెప్పుకుంటారని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. -
మణిరత్నం చిత్రంలో ధన్సిక
నటి ధన్సికకు కాలం కలిసొచ్చిందని చెప్పవచ్చు. ఇప్పటి వరకూ చిన్న చిన్న చిత్రాలలో వర్ధమాన నటులతో నటిస్తూ వస్తున్న ధన్సిక ఇప్పుడు ఒక్క సారిగా భూమ్‌లోకి వచ్చారు. కారణం సూపర్‌స్టార్ రజనీకాంత్ నటిస్తున్న తాజా చిత్రం కబాలీలో ఆయనకు కూతురుగా నటించే అదృష్టం నటి ధన్సికను వరించింది. ఇదే అనూహ్య అవకాశం అనుకుంటే తాజాగా ప్రఖ్యాత దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో నటించే అరుదైన అవకాశాన్ని ధన్సిక దక్కించుకున్నారని సమాచారం. మణిరత్నం చిత్ర ప్రచారం మరోసారి తెరపైకొచ్చింది. ఓ కాదల్ కణ్మణి చిత్రం తరువాత మణిరత్నం టాలీవుడ్ ప్రముఖ నటులు నాగార్జున, మహేశ్‌బాబులతో ఒక మల్టీస్టారర్ చిత్రం చేయడానికి కథ సిద్ధం చేసుకున్నారు. అయితే అంతా సిద్ధం అనుకున్న తరువాత పారితోషికం విషయంలో తేడా రావడంతో ఆ టాలీవుడ్ స్టార్స్ నటించడానికి నిరాకరించినట్లు కోలీవుడ్ వర్గాల ప్రచారం. ఆ తరువాత అదే కథతో మణిరత్నం కార్తీ, దుల్కర్సల్మాన్, నిత్యామీనన్, కీర్తీసురేశ్లతో చిత్రం చేయ సంకల్పించారు. అయితే ఆ ప్రయత్నానికి దుల్కర్సల్మాన్, కీర్తీసురేశ్‌ల రూపంలో గండిపడింది. దీంతో ఈ చిత్ర నిర్మాణమే డ్రాప్ అయ్యిందనే ప్రచారం జరిగింది. అలాంటిది ఇప్పుడు ఆ కథను మణిరత్నం హ్యాండిల్ చేయనున్నట్లు ఇందులో కార్తీ, నాని, నిత్యామీనన్‌లతో కొత్తగా నటి ధ న్సిక వచ్చి చేరినట్లు సమాచారం. ఈ విషయాన్ని నటి ధన్సిక కబాలీ చిత్రం షూటింగ్లో తన సన్నిహితులకు చెప్పి సంతోషపడిపోతున్నారట. రజనీకాంత్ కబాలీ చిత్రంలో నటించడం వల్లే తనకు మణిరత్నం చిత్రంలో నటించే అవకాశం వచ్చిందని సంబరపడిపోతున్నారట ధన్సిక. -
సూపర్‌స్టార్‌కు గౌరవ పురస్కారం
సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు మలేషియా ప్రభుత్వం గౌరవ పురష్కారాన్ని అందించనుందనేది తాజా సమాచారం. రజనీకాంత్ కబాలీ చిత్ర షూటింగ్ కోసం ఇటీవలే మలేషయా వెళ్లిన విషయం తెలిసిందే. ఆయన్ని మలేషియా గవర్నర్ మోహమ్మద్ గహాలిల్ యాకోబ్ సాదరంగా ఆహ్వానించారు. కాగా తాజా సమాచారం ఏమిటంటే మలేషియా ప్రభుత్వం రజనీకాంత్‌కు గౌరవ పరస్కారాన్ని అందించనుందని తెలిసింది. రజనీకాంత్ మలేషియాలో జరుగుతున్న కబాలీ చిత్ర షూటింగ్లో పాల్గొంటున్నారు. ఈ చిత్ర షూటింగ్ అక్కడే నెల రోజుల పాటు జరగనుంది. కాగా మలేషియా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా బావించే డత్తో అవార్డును మన సూపర్‌స్టార్‌కు అందించాలని నిర్ణయించిన్నట్లు సమాచారం. ఈ దేశ గవర్నర్ రజనీకాంత్‌కు డత్తో అవార్డును ప్రభుత్వానికి సిఫార్సు చేసినట్లు, అందుకు మలేషియా ప్రభుత్వం సమ్మతించినట్లు తెలిసింది. త్వరలోనే రజనీకాంత్‌కు డత్తో అవార్డు కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా నిర్వహించడానికి సన్నాహాలు చేయనున్నట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం. ఈ బిరుదును ఇంతకు ముందు బాలీవుడ్ బాద్షా షారూఖ్‌ఖాన్ అందుకున్నారు. ఇటీవలే హాలీవుడ్ సూపర్‌స్టార్ జాకీచాన్ ఈ పురస్కారాన్ని అందుకున్నారన్నది గమనార్హం. త్వరలో ఈ కోవలోకి మన సూపర్‌స్టార్ చేరనున్నారన్న మాట. -
రజనీతో ఇద్దరి రొమాన్స్
ప్రముఖ హీరోల సరసన ఒకరికి మించి హీరోయిన్లు నటిం చడం సర్వసాధారణమైపోయింది. కమలహాసన్, విజయ్, సూర్య, అజిత్ ఇలా ప్రముఖ నటులందరూ ఇద్దరు హీరోయిన్లతో అధికంగా నటిస్తున్నారు. అలాంటి సూపర్‌స్టార్ రజనీకాంత్ మాత్రం ఇద్దరు హీరోయిన్లతో రొమాన్స్ చేసి చాలా కాలమే అయింది. అలాంటి ఈ సారి ఇద్దరు ముద్దుగుమ్మలతో సయ్యాటలాడటానికి రెడీ అవుతున్నారన్నది తాజా సమాచారం. రజనీకాంత్ ప్రస్తుతం కబాలీ చిత్రంలో నటిస్తున్నారు. రాధిక ఆప్టే హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రాన్ని వి.క్రియేషన్స్ పతాకంపై కలైపులి ఎస్.థాను భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. మెడ్రాస్ చిత్రం ఫేమ్ రంజిత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం శరవేగంగా చిత్రీకరణను జరుపుకుంటోంది. రజనీకాంత్ తదుపరి చిత్ర ప్రీ ప్రొడక్షన్స్ కార్యక్రమాలు మొదలయ్యాయి. ఈ చిత్రం గురించి గుర్తు చేయాల్సిన అవసరం లేదు. కారణం ఆరంభానికి ముందే చాలా విశేషాలు ఈ చిత్రం గురించి అనధికారికంగా హోరెత్తుతున్నాయి. రజనీకాంత్, శంకర్ల కలయికలో రెండు సంచలన చిత్రాల తరువాత ముచ్చటగా తెరకెక్కనున్న మూడో చిత్రం ఎందిరన్-2. ఎందిరన్ చిత్రం ఎంత వండర్ కలిగించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దానికి సీక్వెల్‌గా రూపొందనున్న క్రేజీ చిత్రమే ఎందిరన్-2. ఇందులో రజనీకాంంత్కు విలన్‌గా విక్రమ్ నటించనున్నారనే ప్రచారం ఇంతకు ముందు జరిగింది. అయితే తాజాగా హాలీవుడ్ సూపర్‌స్టార్ ఆర్నాల్డ్ విలన్‌గా నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్నది కోలీవుడ్ టాక్. ఇందులో హీరోయిన్గా నటించే అదృష్టం ఇంగ్లీష్ బ్యూటీ ఎమీజాక్సన్‌ను వరించిందనే ప్రచారం జరుగుతోంది. ఇందులో మరో ముద్దుగుమ్మ కూడా నటించనున్నారట. ఆమె కోసం శంకర్ బాలీవుడ్, కోలీవుడ్‌లలో జల్లెడేసి వడగడుతున్నారని తెలిసింది. లైకా సంస్థ నిర్మించనున్న ఈ చిత్రం షూటింగ్‌కు డిసెంబర్ 25న ముహూర్తం పెట్టినట్లు తెలిసింది. -
స్వీట్ షాక్‌కు గురయ్యా!
అది ఇండియన్ ఫుట్‌బాల్ సూపర్ లీగ్ ప్రారంభ వేడుక. ఎంతో మంది సినీ ప్రముఖులు ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. అందులో బాలీవుడ్ నటి అలియా భట్ కూడా ఉన్నారు. ఇంతలో సడన్‌గా ఆ టైంకు తన అభిమాన నటుడు కళ్ల ముందు కనబడేసరికి ఒక్కసారిగా స్వీట్షాక్కు గురయ్యారు. అతను ఎవరో కాదు...సూపర్‌స్టార్ రజనీకాంత్. ‘‘ఆయనను ఆ కార్యక్రమ వేదికపై కలిశాను. ఆయన ఓ స్టార్లా లేరు. చాలా సింపుల్‌గా, ఓ కామన్ మ్యాన్‌లా నాతో మాట్లాడారు. ఫస్ట్ నాకసలు నోట మాట రాలేదు. ఆయనతో కలిసి పనిచేయాలని ఉంది. ఆయనకు కూతురిగా ఓ సినిమాలో నటించాలని ఉంది’’ అని తన ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నారు అలియా. -
రజనీ పుట్టిన రోజున ఎందిరన్-2కు ముహూర్తం
సూపర్‌స్టార్ రజనీకాంత్ వరుసగా రెండు చిత్రాలకు పచ్చజెండా ఊపిన విషయం తెలిసిందే.అందులో ఒకటి కబాలి. నటి రాధికా ఆప్తే కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి మెడ్రాస్ చిత్రం ఫేమ్ రంజిత్ దర్శకత్వం వహిస్తున్నారు. వి.క్రియేషన్స్ పతాకంపై కలైపులి ఎస్.థాను భారీ ఎత్తున నిర్మిస్తున్న కబాలి చిత్రం షూటింగ్ ఇప్పటికే ప్రారంభం అయిన విషయం విదితమే. ఇక రజనీ అంగీకరించిన రెండవ చిత్రం ఎందరన్-2.శంకర్ దర్శకత్వంలో ఇంతకు ముందు రజనీకాంత్ నటించిన ఎందిరన్ చిత్రం రికార్డులను తిరగరాసిందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు దానికి సీక్వెల్‌ను తెరకెక్కించడానికి శంకర్ సిద్ధమయ్యారు. ఈ చిత్రం ఎందిరన్ను మించి ఉండే విధంగా ఈయన కృషి చేస్తున్నారు. అందులో భాగంగా ఆయన ఈ కథను చెక్కుతున్నారని చెప్పవచ్చు. గ్రాఫిక్స్ నిపుణుడు శ్రీనివాస్మోహన్ను పిలిపించి ఎందిరన్-2లో గ్రాఫిక్స్ సన్నివేశాల గురించి సుదీర్ఘంగా చర్చించిన శంకర్ చాయాగ్రాహకుడు నిరవ్షాతోను చిత్ర చిత్రీకరణ గురించి సమాలోచనలు జరిపినట్లు తెలిసింది. ఇందులో రజనీకాంత్‌కు విలన్‌గా విక్రమ్ నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అదే విధంగా ప్రముఖ బాలీవుడ్ నటులతోనూ శంకర్ జర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అలాగే చిత్రంలో నటించే కథానాయిక, ఇతర తారాగణం ఎంపిక జరుగుతోంది. ఈ చిత్రాన్ని లైకా సంస్థ అత్యంత భారీ బడ్జెట్లో నిర్మించనుంది. ఎందిరన్-2 చిత్రానికి రజనీకాంత్ పుట్టిన రోజున పూజా కార్యక్రమాలు నిర్వహించడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. రజనీకాంత్ ఈ ఏడాదిలోగా కబాలి చిత్రాన్ని పూర్తి చేసి చిన్న విరామం తీసుకుని ఎందిరన్-2 చిత్ర షూటింగ్లో పాల్గొంటారని టాక్. -
రజనీతో మరోసారి దీపికాపదుకునే
సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో మరోసారి జతకట్టడానికి బాలీవుడ్ క్రేజీ బ్యూటీ దీపికాపదుకునే రెడీ అవుతున్నట్టు తాజా సమాచారం. స్టార్ దర్శకుడు శంకర్ ఇండియన్ సూపర్‌స్టార్ రజనీకాంత్‌ల కలయికలో తెరకెక్కిన ఎందిరన్ చిత్రం ఎంత సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.అందులో ఐశ్వర్వారాయ్ నాయికగా నటించారు. ఈ చిత్రానికి సీక్వెల్ వస్తుందా? రాదా? అన్న చర్చ చాలా కాలంగా జరుగుతోంది. మొన్నటి వరకూ అలాంటి ఆలోచన లేదంటూ దాటేస్తూ వచ్చిన దర్శకుడు శంకర్ ఇప్పటికీ ఎందిరన్-2 గురించి పైకి వెల్లడించకపోయినా గుట్టుచప్పుడు కాకుండా ఆ ప్రయత్నానికి రెడీ అయనట్లు చిత్ర ఫ్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలకు తయారైనట్లు తెలిసింది. ఆ మధ్య ముంబైలో కథా చర్చలు జరిపిన శంకర్ పనిలో పనిగా హీరోయిన్ల ఎంపిక దిశగా దృష్టి సారిస్తున్నారు. ఎందిరన్-2 చిత్రంలో కత్రినా కైఫ్, లేదా దీపికాపడుకునే ఇద్దరిలో ఒకరిని ఎంపిక చేయాలని భావిస్తున్నారు.అయితే ఇందులో కత్రినా కైఫ్ హీరోయిన్గా నటించనుందనే ప్రచారం జరిగింది. తాజాగా ఆ స్థానంలో నటి దీపికాపదుకునే వచ్చి చేరినట్లు సమాచారం. ఇటీవల ముంబైలో నటి దీపికను కలిసిన శంకర్ ఆమెకు కథను వివరించి నటించడానికి సమ్మతం పొందినట్లు తెలిసింది. ఇదే కనక నిజం అయితే నటి దీపికాపదుకునే రజనీకాంత్‌తో రెండవ సారి నటించడానికి సిద్ధం అవుతున్నట్లే. ఇంతకు ముందు ఈ బ్యూటీ యానిమేషన్ 3డీ చిత్రం కోచ్చయడయాన్లో సూపర్‌స్టార్‌తో జతకట్టారన్నది గమనార్హం. కాగా ఎందిరన్-2 చిత్రంలో విలన్‌గా నటుడు విక్రమ్ నటించనున్నట్లు ప్రచారంలో ఉంది. అయితే శంకర్ విలన్ పాత్ర కోసం ఇంకొందరు ప్రముఖ నటుల్లో ఒకరిని నటింపజేయడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఆ పట్టికలో బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్, విశ్వనాయకుడు కమలహాసన్, హాలీవుడ్ సూపర్‌స్టార్ ఆర్నాల్డ్ పేర్లు ఉన్నాయన్నది గమనార్హం. చిత్రం ఈ ఏడాది చివరిలోనే సెట్‌పైకి వెళ్లనున్నట్లు తాజా సమాచారం. ప్రస్తుతం కబాలీ చిత్రానికి సిద్ధం అవుతున్నారు. ఈ చిత్రం ఇదే నెల 17న ప్రారంభం కానుంది. -
సూపర్‌స్టార్‌తో కత్రినా కైఫ్
బ్రహ్మాండాలకే కాదు క్రేజీ కాంబినేషన్లకు కేరాఫ్ స్టార్ దర్శకుడు శంకర్ అన్నంతగా ఆయన చిత్రాలు ఉంటాయి. అలాగా ఆయన చిత్రాల్లో కథానాయకులతో పాటు కథానాయికలకు ప్రాధాన్యత ఉంటుంది. అందుకే శంకర్ చిత్రాల లో నటించడానికి టాప్ హీరోయిన్లు ఎవ్వరూ నో చెప్పే సాహసం చె య్యరు. ఇంకా చెప్పాలం టే ఆయన చిత్రాల్లో నటించే అవకాశం కోసం ఎదురు చూస్తుంటారు. ఇక కారణాలేమోగానీ ఈ అద్భుత చిత్రా ల సృష్టికర్త ఎ క్కువ గా హింది హీరోయిన్ల పైనే దృష్టి పెడతారు. తన తొలి చిత్రం నుంచీ గమనిస్తే ఈ విషయం స్పష్టం గా అర్ధం అవుతుంది. శంకర్ తొలి చిత్రం జెంటిల్మెన్ చి త్రంలో అర్జున్ సరసన బాలీ వుడ్ భామ మధుబాలను ఎంచుకున్నారు. ఆ తరువా త కాదలన్ చిత్రంలో నగ్మా ను, ఇండియన్ చిత్రంలో మనీషాకోయిరాల,ఊర్మిళలను, జీన్స్ చిత్రంలో అప్పటి ప్రపంచ సుందరి ఐశ్వర్యారాయ్‌ను, అన్నియన్ చిత్రంలో సదాను,బాయ్స్ చిత్రంలో జెనీలియాను, ఎందిరన్ చిత్రంలో మరో సారి ఐశ్వర్యారాయ్‌ను, నన్భన్ చిత్రంలో ఇలియానా అంటూ దాదాపు తన చిత్రాల్లో హిందీ కథానాయికలనే ఎంచుకున్నారు.ఒక్క ఐ చిత్రంలో మాత్రం విదేశీ బ్యూటీ(కెనడా)ఎమీజాక్సన్ ను సెలక్ట్ చేసుకున్నారు. ఇప్పటికీ శంకర్ ఈలోచనా ధోరణిలో మార్పులేదు. తన తాజా చిత్రానికి బాలీవుడ్ భామనే ఎంపిక చేసుకున్నట్లు లేటెస్ట్ సమాచారం. శంకర్ ఇప్పుడు ఎందిరన్-2 చిత్ర కథను వండడంలో పూర్తిగా నిమగ్నమైపోయారు. దీని కోసం ఆయనిప్పు డు ఎక్కువ కాలం ముంబయ్‌లోనే మకాం పెడుతున్నా రు. ఈ చిత్రాన్ని సుమారు 300 కోట్ల బడ్జెట్‌తో బ్రహ్మాం డంగా తెర కెక్కించడానికి సన్నాహాలు చేస్తునట్లు కోడంబాక్కం టాక్. ఈ చి త్రాన్ని ఇంతకు ముందు కత్తి వంటి బ్లాక్ బస్టర్ చిత్రాన్ని నిర్మించిన లైకా సంస్థ అధినేతలు నిర్మాణ సారథ్యం చేపట్టనున్నట్లు సమాచారం. ఇందులో రజనీకాంత్‌కు ప్ర తి నాయకుడిగా విక్రమ్ డీకొంటున్నట్లు ప్రచారం జరుగుతోం ది. ఇక ఇందులో నటించే హీరోయిన్ ఎవరన్నది ఇప్పటి వర కూ చాలా సస్పెన్స్ కొనసాగింది. ఇప్పుడు ఆ సొగసైన సుంద రి ఎవరన్నది రివీల్ అయ్యింది. ఆ భామ ఎవరో కాదు మోస్ట్ సెక్సియస్ట్ బాలీవుడ్ నాయకి కత్రినాకైఫ్. ఈ అమ్మడికి కోలీవుడ్‌లో నటించాలనే కోరిక ఎప్పటి నుంచో ఉంది. ఆ విషయాన్ని ధూమ్ 3 చిత్ర విడుదల సమయంలోనే వ్యక్తం చేశారు. సరైన అవకాశం కోసం ఎదురు చూస్తున్న కత్రినా ఆ మధ్య కొందరు దర్శక నిర్మాతలు ప్రయత్నించినా నో చెప్పినట్లు సమాచారం. ఇప్పుడు ఎందిరన్-2 కోసం శంకర్ సంప్రదించగా వెంటనే పచ్చజండా ఊపినట్లు తాజా సమాచారం. కాగా ప్రస్తుతం యువ దర్శకుడు రంజిత్ దర్శకత్వంలో కలైపులి ఎస్ థాను భారీ ఎత్తున నిర్మిస్తున్న కబాలీ చిత్రంలో నటించడానికి సిద్ధం అవుతున్న సూపర్‌స్టార్ ఈ చిత్రాన్ని డిసెంబర్ కల్లా పూర్తి చేసి 2016 జనవరిలో ఎందిరన్-2 చిత్రం షూటింగ్లో పాల్గొననున్నట్లు తాజా సమాచారం. -
నాయికలే దెయ్యాలుగా..
ఇంతకు ముందు అందంగా కనిపించడానికి తాపత్రయపడే నాయికలు ఇప్పుడు అందవికారంగా, భయంకరంగా దెయ్యాలుగా మారడానికి తహతహలాడుతున్నారని చెప్పక తప్పని పరిస్థితి. ప్రస్తుతం హార్రర్ చిత్రాలతో వెండితెర దద్దరిల్లిపోతోంది. ఈ తరహా చిత్రాల్లో ఇంతకు ముందు చిన్నా చితక తారలు నటించేవారు. ఎందుకంటే ఇలాంటి కథా చిత్రాలకు ఇమేజ్‌తో పని ఉండదు కనుక. అయితే దెయ్యం ఇతివృత్తాలతో రూపొందిన చిత్రాలు నిర్మాతలకు కాసుల వర్షం కురిపిస్తుండడంతో హార్రర్ చిత్రాల జోరు పెరిగింది. ప్రముఖ కథానాయకులు ముఖ్యంగా కథానాయికలు ఆత్మ, ప్రేతాత్మలుగా నటించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. చంద్రముఖితో బలంగా బాటలు నిజానికి హార్రర్ చిత్రాల రూపకల్పన అనేది ఆది నుంచి ఉన్నా తమిళంలో సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన చంద్రముఖి తరువాత ఈ తరహా చిత్రాల హోరు పెరిగిందని చెప్పవచ్చు. చంద్రముఖి చిత్రంలో జ్యోతిక దెయ్యం పాత్రలో బీభత్స నటన ఆ చిత్ర విజయానికి చాలా హెల్ప్ అయ్యిందని చెప్పడం అతిశయోక్తి కాదు. చంద్రముఖి చెన్నైలోని శాంతి ధియోటర్లో 804 రోజులు ఆడిందన్నది గమనార్హం.ఆ తరువాత ఈరం, లారెన్స్ నటించిన ముని, కాంచన, విజయ్‌సేతుపతి నటించిన పిజ్జా, యామిరుక్కభయమే వంటి చిన్న చిత్రాలు పెద్ద విజయాలు సాధించడంతో కోలీవుడ్‌లో హార్రర్ చిత్రాల హవా పెరిగింది. అరణ్మణై, కాంచన-2.చిత్రాలు కలెక్షన్లు కొల్లగొట్టాయి. విశేషమేమిటంటే చంద్రముఖి, అరణ్మణై, కాంచన-2 చిత్రాలలో జ్యోతిక, హన్సిక, తాప్సీ, నిత్యామీనన్ వంటి ప్రముఖ హీరోయిన్లు దెయ్యాలుగా నటించి సక్సెస్ అవ్వడంతో ఇప్పుడు ఇతర ప్రముఖ నాయికలు దెయ్యాలుగా మారడానికి ఆసక్తి చూపుతున్నారు. ఇప్పుడు మాయ చిత్రంతో నయనతార,షావుకార్ పేటై చిత్రంలో రాయ్‌లక్ష్మి, అరణ్మణై-2 చిత్రంలో హన్సిక, త్రిష, తాజాగా నాయకి నంటూ మరో సారి త్రిష దెయ్యం అవతారం ఎత్తుతున్నారు. ప్రస్తుతం పదికి పైగా హార్రర్ చిత్రాలు విడుదలకు సిద్ధం అవుతున్నాయంటే ఈ చిత్రాలకు ప్రేక్షకుల మధ్య ఎంత ఆదరణ ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ప్రముఖ నటుడు కమలహాసన్ అంతటి వారే ప్రస్తుతం దెయ్యం చిత్రాల మార్కెట్ న డుస్తోందని అన్నారంటే వాటి ప్రభావం ఎంత ఉందో స్పష్టం అవుతోంది. ఒకప్పుడు అనుబంధాలు, ఆత్మీయతలతో కూడిన కుటుంబ కథా చిత్రాలను ప్రేక్షకులు ఆదరించారు.ఆ తరువాత ప్రేమ కథా చిత్రాలకు బ్రహ్మరథం పట్టారు. ఆపై యాక్షన్‌తో కూడిన కమర్షియల్ చిత్రాలు అలరించాయి. ఇప్పుడు హార్రర్ చిత్రాలు హోరెత్తుతున్నాయి. దీన్నే మనోళ్లు ట్రేండ్ అంటారని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదనుకుంటా. -
కాళిగా రజనీకాంత్?
సూపర్‌స్టార్ రజనీకాంత్ మళ్ళీ మేకప్ వేసుకొంటున్నారు. గత ఏడాది విడుదలైన ‘లింగ’ చిత్రం తరువాత కెమేరా ముందుకు రాని ఆయన మరో వారంలో కొత్త పాత్రలోకి పరకాయ ప్రవేశం చేస్తున్నారు. యువ దర్శకుడు రంజిత్ దర్శకత్వంలోని ఈ సినిమా టైటిల్, ఇందులో రజనీ పాత్ర ఏమై ఉంటాయా అని కొద్దిరోజులుగా చర్చ జరుగుతోంది. ‘కాళి’ అనే పేరు పెడతారని ఇప్పుడు కోడంబాకమ్‌లో వినవస్తోంది. అన్నట్లు, రంజిత్ గత చిత్రమైన సూపర్‌హిట్ ‘మద్రాస్’లో కథానాయకుడు కార్తీ పోషించిన పాత్ర పేరు కూడా కాళీయే! ఆ సినిమాకు మొదట్లో ‘కాళి’ అనే వర్కింగ్ టైటిల్ పెట్టారు. తీరా చివరకు ‘మద్రాస్’ అని తుది టైటిల్ ఖరారు చేశారు. కాగా, 1980లలోనే రజనీకాంత్ ‘కాళి’ అనే సినిమాలో నటించారు. ఇప్పుడు అదే టైటిల్ రజనీ తాజా సినిమాకూ రిపీటయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఇది ఇలా ఉండగా, ఈ చిత్రంలో కథానాయిక ఎవరన్నది మరో సస్పెన్స్‌గా ఉంది. ఈ పాత్రకు విద్యాబాలన్, రాధికా ఆప్టే లాంటి పలువురిని అనుకున్నా, ఇప్పటి దాకా ఎవరూ ఖరారు కాలేదు. రజనీకాంత్‌తో పాటు ప్రకాశ్‌రాజ్, దినేశ్, కలై అరసన్ తదితరులు నటిస్తున్న ఈ సినిమాకు సంబంధించి అధికారిక వివరాల కోసం కొద్దిరోజులు ఆగాల్సిందే! -
రాధిక ఆప్తేకు గోల్డెన్ చాన్స్
అదృష్టం ఎప్పుడు? ఎలా? వరిస్తుందో ఎవరికి తెలియదు.అలాంటి అదృష్టం ఇప్పుడు నటి రాధిక ఆప్తే తలుపు తట్టింది. ఆమె పరిస్థితి రొట్టె విరిగి నేతిలో పడ్డట్టు అయ్యిందంటున్నారు కోలీవుడ్ వర్గాలు. ఇటీవల అశ్లీల దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో ప్రసారమై కలకలం సృష్టించిన నటి రాధిక ఆప్తే. అలాగే అర్ధనగ్న దృశ్యాలతో ఇంటర్నెట్లో హల్చల్ చేసిన ఈ ఉత్తరాది భామను కోలీవుడ్‌కు పరిచయం చేసిన క్రెడిట్ నటుడు ప్రకాష్‌రాజ్‌కి దక్కుతుంది. ఆయన స్వీయ దర్శకత్వంలో నిర్మించి నాయకుడిగా నటించిన ధోనీ చిత్రంలో రాధిక ఆప్తే కీలక పాత్ర పోషించారు.ఆ తరువాత అళగురాజా, వెట్రిసెల్వన్ తదితర చిత్రాల్లో నటించారు. ఈ బ్యూటీకి టాలీవుడ్ గుర్తించింది. అక్కడ ఏకంగా బిగ్ స్టార్ బాలక్రిష్ణతో లెజెండ్ చిత్రంలో రొమాన్స్ చేశారు. అయితే అక్కడ హీరోల ఆధిక్యం అధికం అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి అక్కడి వారి ఆగ్రహానికి గురైంది. అలాంటి నటికి కోలీవుడ్‌లో గోల్డెన్‌చాన్స్ దక్కనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారర . ఇంతకీ అదేమిటో చెప్పలేదు కదూ’సూపర్‌స్టార్ రజనీకాంత్ తాజా చిత్రంలో హీరోయిన్ రాధిక ఆప్తేనేనట. మెడ్రాస్ చిత్రం ఫేమ్ రంజిత్ దర్శకత్వంలో రజినీకాంత్ నటించనున్న విషయం తెలిసిందే. ఇందులో ఆయన అండర్ వరల్డ్ గ్యాంగ్‌స్టర్‌గా నటించనున్నట్లు సమాచారం. ఈ చిత్రం కోసమే రజనీ గడ్డం, మీసం పెంచుతున్నారు. కాగా ఈ చిత్రంలో నటించే హీరోయిన్ కోసం చాలా మంది నటీమణుల పేర్లు పరిశీలనలోకి వచ్చినట్లు తెలిసింది. చివరకు దర్శకుడు రంజిత్‌కు నటి రాధిక ఆప్తే సూటబుల్ అనిపించడంతో ఆమెతో సంప్రదించినట్లు సమాచారం. దర్శకుడు అడిగిన కాల్షీట్స్ రెడీగా ఉండడంతో రాధికఆప్తే కూడా పచ్చజెండా ఊపినట్లు తెలిసింది. కలైపులి ఎస్ థాను నిర్మించనున్న ఈ భారీ చిత్రానికి సంతోష్ నారాయణ్ సంగీత బాణీలు సమకూర్చుతున్నారు. చిత్ర షూటింగ్ ఆగస్ట్‌లో మలేషియాలో ప్రారంభం కానుంది. -
సూపర్‌స్టార్‌తో సై అంటుందా?
సూపర్‌సార్ట్ రజినీకాంత్ స్టార్ డెరైక్టర్ శంకర్ కాంబినేషన్లో శివాజీ, ఎందిరన్ వంటి సూపర్ హిట్ చిత్రాలు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఈ సెన్సేషనల్ కాంబినేషన్లో మరో బ్రహ్మాండ చిత్రం రూపకల్పనకు సన్నాహాలు జరుగుతున్నాయి. కాగా ఈ చిత్ర తారాగణం విషయంలో శంకర్ కుస్తీ పడుతున్నట్లు తెలుస్తోంది. ఈ స్టార్ దర్శకుడెప్పుడూ క్రేజీ కాంబినేషన్‌కు ప్రాధాన్యత నిస్తారన్న విషయం తెలిసిందే. అలాగే ఉత్తరాది బ్యూటీస్‌ని నటింపజేయడానికి ప్రయత్నిస్తారన్న విషయం ఆయన గత చిత్రాలను చూస్తే అర్థమవుతుంది. తొలి చిత్రం జెంటిల్మెన్ నుంచి ఇటీవల రూపొందించిన ఐ చిత్రం వరకూ ఇతర భాషా చిత్రాల భామలే అధికంగా కనిపిస్తారు. తాజా చిత్రానికి కూడా శంకర్ ఉత్తరాది ముద్దుగుమ్మలపైనే కన్నేవారు. ఎందిరన్-2 కోసం మొదట విద్యావాలన్ అనీ ఆ తరువాత దీపికాపడుకోనే అనీ ప్రచారం జరిగింది. తాజాగా మోస్ట్ బ్యూటిపుల్ అమ్మడు కత్రినాకైఫ్ పేరు తెరపై కొచ్చింది. ఈ జాణ ఆ మధ్య తమిళంలో మంచి అవకాశం వస్తే నటించడానికి రెడీ అని ప్రకటించింది. ఇప్పుడు శంకర్ ఎందిరన్-2లో ఆమెను రజినీకాంత్ సరసన నటింపజేయడానికి ప్రయత్నిస్తునట్లు సమాచారం. ఇప్పటికే కత్రినాకైఫ్‌ను కలిసి చర్చించినట్లు కోలీవుడ్ వర్గాల బోగట్టా. అయితే ఆమె ఇంకా పచ్చజెండా ఊపలేదట. కత్రినా సై అంటుందా? లేదా? అన్న ఆసక్తి చిత్రపరిశ్రమలో నెలకొంది. అలాగే రజినీకి విలన్‌గా అమీర్‌ఖాన్, షారూఖ్ఖాన్లతో పాటు హాలీవుడ్ సూపర్‌స్టార్ ఆర్నాల్డ్‌ను కూడా సంప్రదించిన ట్లు ప్రచారంలో ఉంది. చివరికి నటుడు విక్రమ్‌నే రజినీకి విలన్ చేస్తునట్లు సమాచారం.