పుట్టినరోజున అభిమానులకు కానుక | 2 .o movie teaser to superstar rajinikanth birthday | Sakshi
Sakshi News home page

పుట్టినరోజున అభిమానులకు కానుక

Nov 9 2016 4:22 AM | Updated on Sep 4 2017 7:33 PM

పుట్టినరోజున అభిమానులకు కానుక

పుట్టినరోజున అభిమానులకు కానుక

సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన కబాలి ఆయన అభిమానులను విపరీతంగా అలరించింది.

 సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన కబాలి ఆయన అభిమానులను విపరీతంగా అలరించింది. కాగా ప్రస్తుతం రజనీకాంత్ శంకర్ దర్శకత్వంలో 2.ఓ చిత్రంలో నటిస్తున్నారు. శంకర్ మరో అద్భుత సృష్టిగా తెరకెక్కుతున్న ఈ చిత్రం పైనా చిత్ర పరిశ్రమలో ముఖ్యంగా ఆయన అభిమానుల్లో అంచనాలు తారా స్థాయిలో నెలకొన్నాయి. అయితే ఈ చిత్రం ఈ ఏడాదిలో విడుదలైయ్యే అవకాశం లేదు. ఇది రజనీ అభిమానులకు కాస్త నిరాశ పరిచే విషయమే. చిన్న ఆశ ఏమిటంటే 2.ఓ చిత్ర టీజర్ రజనీకాంత్ పుట్టిన రోజు సందర్భంగా విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం.
 
 ఇక ఆయన అభిమానులకు మరో సంతోషాన్నిచ్చే అంశం ఏమిటంటే బాషా చిత్రం పేరు వినగానే అందరి హృదయాల్లోనూ ఆనందపు తరంగాలు వెల్లువెత్తుతారుు. రజనీకాంత్‌కు అంతకు ముందు చిత్రాలను బాషా చిత్రంతో పోల్చలేం. సూపర్‌స్టార్ గ్యాంగ్‌స్టర్‌గా, ఒక సాధారణ ఆటోడ్రైవర్‌గా ఒకదానికొకటి పోలిక లేని రెండు విభిన్న కోణాల్లో సాగే పాత్రను అద్భుత అభినయంతో జీవం పోసిన చిత్రం బాషా. నగ్మా నాయకిగా నటించిన ఈ చిత్రానికి సురేశ్‌కృష్ణ దర్శకుడు. సత్యామూవీస్ సంస్థ నిర్మించిన బాషా చిత్రం 1985లో విడుదలై సంచలన విజయాన్ని సాధించింది. అంతే కాదు ఆ తరువాత మళ్లీ మళ్లీ విడుదలై కలెక్షన్లు రాబట్టుకుంది.
 
  ఈ చిత్రాన్ని రీమేక్ చేయాలని కొందరు భావించిన రజనీకాంత్ అంగీకరించలేదు. వెండితెరపై ఒకే ఒక్క బాషా అని, మరో బాషా సాధ్యం కాదన్నది ఆయన దృఢమైన అభిప్రాయం. కాగా అలాంటి బాషా చిత్రాన్ని డిజిటల్ లాంటి మరిన్ని ఆధునిక హంగులతో సూపర్‌స్టార్ పుట్టిన రోజు సందర్భంగా డిసెంబర్ 12న తెరపైకి తీసుకురావడానికి సత్యామూవీస్ సంస్థ సన్నాహాలు చేస్తున్నట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement