
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బ్లాక్‌బస్టర్ చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ మూవీ రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా మెప్పించారు. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ ఆలియా భట్ హీరోయిన్‌గా కనిపించింది. తాజాగా ఆర్ఆర్ఆర్ టీమ్ లండన్‌లో సందడి చేసింది. లండన్‌లోని రాయల్ ఆల్బర్ట్ హాల్‌లో జరిగిన ఆర్ఆర్ఆర్ లైవ్ ఆర్కెస్ట్రా స్క్రీనింగ్‌లో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ఓకే వేదికపై మెరిశారు.
ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్‌కు రామ్ చరణ్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఇంకా జూనియర్ బర్త్ డేకు పది రోజుల ముందే చెర్రీ విషెస్ చెప్పారు. ఈ సందర్భంగా ఒకరినొకరు హృదయపూర్వక ఆలింగనం చేసుకున్నారు. ఆ తర్వాత ఎన్టీఆర్ చెంపపై ముద్దు కూడా పెట్టారు. ఇది చూసిన ఫ్యాన్స్ చప్పట్లు కొట్టారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
కాగా.. ఆదివారం ఆర్ఆర్‌ఆర్ మూవీని లండన్‌లోని లెజెండరీ రాయల్ ఆల్బర్ట్ హాల్‌లో ప్రదర్శించారు. ఈ స్క్రీనింగ్ వేడుకలో దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్‌లతో కలిసి సందడి చేశారు. దాదాపు మూడేళ్ల తర్వాత మొదటిసారి వేదికపైకి కనిపించారు. ఈ కార్యక్రమంలో ఆస్కార్ విజేత స్వరకర్త ఎంఎం కీరవాణి నేతృత్వంలోని రాయల్ ఫిల్హార్మోనిక్ కాన్సర్ట్ ఆర్కెస్ట్రా ఆర్ఆర్ఆర్ సంగీతాన్ని ప్రదర్శించారు. కాగా.. ఆర్ఆర్ఆర్ చిత్రంలో అజయ్ దేవ్‌గన్, అలియా భట్, శ్రియ శరణ్ కీలక పాత్రల్లో నటించారు. 2023లో 'నాటు నాటు' పాటకు ఉత్తమ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అవార్డును గెలుచుకున్న తొలి భారతీయ చిత్రంగా చరిత్ర సృష్టించింది.