RRR రీ-రిలీజ్ ప్రకటన.. స్పెషల్‌ ఏంటో తెలుసా..? | Jr NTR And Ram Charan RRR Movie Re Release Date Confirmed, Tweet Goes Viral | Sakshi
Sakshi News home page

RRR Re Release Date: RRR రీ-రిలీజ్ ప్రకటన.. స్పెషల్‌ ఏంటో తెలుసా..?

Published Tue, May 7 2024 8:33 AM | Last Updated on Tue, May 7 2024 9:32 AM

RRR Movie Re Release date Locked

పాన్‌ ఇండియా స్టార్స్‌ ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ పోటీపడి నటించిన సినిమా ఆర్‌ఆర్‌ఆర్‌. అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్‌ కల్పిత కథతో రూపుదిద్దుకున్న 'ఆర్‌ఆర్‌ఆర్‌' 2022 మార్చి 25న విడుదలైంది.  రాజమౌళి  దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా చరణ్‌, కొమురం భీమ్‌గా తారక్‌ నటించి మెప్పించారు.  హాలీవుడ్ దిగ్గజ డైరెక్టర్ స్టీవెన్ స్పీల్‍బర్గ్ కూడా ఈ సినిమాపై ప్రశంసలు కురిపించారు. రూ. 550 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఆర్‌ఆర్‌ఆర్‌.. ప్రపంచవ్యాప్తంగా రూ. 1200 కోట్లకు పైగానే కలెక్షన్స్‌ రాబట్టి రికార్డ్‌ క్రియేట్‌ చేసింది.

తెలుగు, హిందీలో రీ-రిలీజ్ 
తారక్‌- చరణ్‌ ఫ్యాన్స్‌కు పండుగలాంటి సినిమా ఆర్‌ఆర్‌ఆర్‌. సినిమా విడుదల సమయంలో థియేటర్లు అన్నీ నిండిపోయాయి. విడుదలైన అన్ని కేంద్రాల్లోనూ విజయకేతనం ఎగరేసి, రికార్డు స్థాయి వసూళ్లు సాధించింది. సినిమా వచ్చి రెండేళ్లు దాటింది. అయినా కూడా ఈ సినిమాపై క్రేజ్‌ ఏమాత్రం తగ్గలేదు. అందుకే ఇప్పుడు ఈ సినిమాను రీ-రిలీజ్‌ చేస్తున్నారు. మే 10న మరోసారి ఆర్‌ఆర్‌ఆర్‌ విడుదల కానుందని అధికారిక ప్రకటన వచ్చేసింది. అయితే, 2డీ, 3డీ ఫార్మాట్లతో పాటు 4K వర్షన్‌తో స్పెషల్‌గా వస్తుండటంతో అభిమానులు కాస్త ఆసక్తిగా ఉన్నారు. దీంతో ప్రేక్షకులు మరోసారి థియేటర్‌కు వచ్చి ఆ అనుభవాన్ని పంచుకోనున్నారు.

ఆర్‌ఆర్‌ఆర్‌ ఖాతాలో లెక్కలేనన్ని ఆవార్డులు వచ్చి చేరాయి. అన్నింటికంటే ముఖ్యమైనది ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డును కూడా ఆర్ఆర్ఆర్ సొంతం చేసుకుంది. ఇందులోని 'నాటునాటు' పాటకు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ దక్కింది. ఈ అవార్డు దక్కించుకున్న తొలి భారతీయ ఫీచర్ సినిమాగా ఆర్ఆర్ఆర్ రికార్డ్‌ క్రియేట్‌ చేసింది.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement