breaking news
SS Rajamouli
-
IBOMMA; SS రాజమౌళి స్వీట్ వార్నింగ్
-
మహేశ్ బాబు 'వారణాసి' సినిమా ఈవెంట్ (ఫొటోలు)
-
'వారణాసి' ఈవెంట్‌కి అన్ని కోట్లు ఖర్చయిందా?
మహేశ్ బాబు-రాజమౌళి సినిమాకు 'వారణాసి' టైటిల్ ఫిక్స్ అయింది. నిన్నటివరకు రకరకాల పేర్లు వినిపించాయి గానీ చివరకు దీనికి జక్కన్న కట్టుబడి ఉన్నారు. అయితే శనివారం రాత్రి హైదరాబాద్‌లో 'గ్లోబ్ ట్రాటర్' ఈవెంట్ పేరిట భారీ ఎత్తున ప్లాన్ చేశారు. చిన్న చిన్న ఇబ్బందులు మినహా ఇది గ్రాండ్ సక్సెస్ అయింది. ఇంతకీ ఈ కార్యక్రమం కోసం ఎంత ఖర్చు పెట్టారు? సోషల్ మీడియాలో వినిపిస్తున్న టాక్ ఏంటి?సాధారణంగా రాజమౌళి కొత్త సినిమా తీస్తుంటే మీడియా మీట్ పెట్టి ప్రాజెక్ట్ వివరాలు వెల్లడిస్తుంటారు. ఈసారి మాత్రం ఒక్క విషయం కూడా బయటకు రాకుండా జాగ్రత్తపడ్డారు. ఏడాది క్రితమే టైటిల్, గ్లింప్స్ లాంటివి రివీల్ చేయాలని ప్లాన్ చేసుకున్నారు. తాజాగా జరిగిన గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్లో స్వయంగా రాజమౌళి ఇదంతా చెప్పాడు. అయితే అనివార్య కారణాల వల్ల ఆలస్యమవుతూ ఇన్నాళ్లకు కుదిరిందని అన్నారు.(ఇదీ చదవండి: 'వారణాసి'లో శ్రీరాముడిగా మహేశ్.. రాజమౌళి కామెంట్)టైటిల్ లాంచ్‌ని ఏదో ఆషామాషీగా కాకుండా 100x130 అడుగల ఎల్ఈడీ స్క్రీన్ ఏర్పాటు చేసి, మూవీకి సంబంధించిన స్పెషల్ వీడియోని దీనిపై ప్లే చేశారు. కేవలం ఈ స్క్రీనింగ్ సెటప్ కోసమే రూ.30 లక్షలకు పైగా ఖర్చు చేశారట. మొత్తంగా కార్యక్రమానికి సంబంధించిన అన్ని ఖర్చులు కలిపి రూ.10-15 కోట్ల వరకు అయినట్లు టాక్ వినిపిస్తుంది. ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం ఇండస్ట్రీలో ఇదో రికార్డ్ అవుతుంది.ఎందుకంటే టీజర్ కోసమో, గ్లింప్స్ వీడియో కోసమే ఖర్చు చేయడం లాంటివి విని ఉన్నాం. కానీ మూవీకి సంబంధించిన టైటిల్ లాంచ్ కోసమే ఏకంగా ఈ రేంజులో కోట్లు ఖర్చు పెట్టారంటే.. రాబోయే రోజుల్లో ఇంకే స్థాయిలో ఖర్చు పెడతారో అనిపిస్తుంది. ఇప్పటివరకు పాన్ ఇండియా సినిమాలు తీసిన రాజమౌళి.. ఈసారి ప్రపంచవ్యాప్తం ఆడియెన్స్‌ని ఆకట్టుకోవాలనే ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది. గ్లింప్స్ చూస్తే అది అనిపించింది కూడా.(ఇదీ చదవండి: రాజమౌళిపై హనుమాన్ భక్తులు ఫైర్) -
గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్.. ఆ ఒక్క సంఘటనతో రాజమౌళి ఫ్రస్టేషన్!
తొలిసారి రాజమౌళి- మహేశ్ బాబు కాంబోలో వస్తోన్న చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీ అప్డేట్స్ కోసం ఎన్నో రోజులుగా ఆసక్తిగా ఎదురు చూశారు. దీంతో దర్శకధీరుడు సైతం సర్‌ప్రైజ్‌ల మీద సర్ప్రైజ్లు ఇచ్చాడు. ప్రియాంక చోప్రా లుక్‌తో ఏకంగా సాంగ్ రిలీజ్ చేశారు. అంతే కాకుండా భారీ ఈవెంట్‌తో టైటిల్ గింప్స్ రిలీజ్ చేశారు. హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీ వేదికగా ఈ గ్రాండ్ జరిగింది. ఇంత భారీ ఎత్తున చేసిన ఈవెంట్లో ఓ చిన్న సంఘటన రాజమౌళికి కోపం తెప్పించింది. ఆడియన్స్‌కు అద్భుతమైన ఎక్స్పీరియన్స్ అందించాలనే ఉద్దేశంతో భారీ ఎల్ఈడీ స్క్రీన్స్ ఏర్పాటు చేశారు. ఈ మూవీ గ్లింప్స్‌ను ఐమ్యాక్స్ ఫార్మాట్లో రిలీజ్ చేయాలని భావించాం.. అందుకే టెస్టింగ్ చేయాలనుకున్నామని రాజమౌళి తెలిపారు. కానీ ఈ గ్లింప్స్ టెస్ట్ ప్లే సమయంలో కొందరు డ్రోన్ విజువల్స్‌తో లీక్ చేయడం నిరాశ కలిగించిదన్నారు. ఎందుకంటే ఇది కోట్ల రూపాయల బడ్జెట్, ఎంతో మంది శ్రమతో రూపొందించామని.. ఇలా చేయడంపై దర్శకధీరుడు బాధగా ఉందన్నారు. నెట్‌ఫ్లిక్స్ నుంచి వచ్చినట్లుగా మా కంటెంట్‌ను సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారని అన్నారు. ఈ సంఘటనతో మేం సరిగ్గా పరీక్షించలేకపోయామని వెల్లడించారు.కాగా.. ఈ సినిమాకు వారణాసి అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ చిత్రంలో మహేశ్ బాబు రుద్రగా కనిపించనున్నారు. తాజాగా రిలీజైన టైటిల్ గ్లింప్స్ ప్రిన్స్ ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. 'గ్లోబ్‌ట్రాటర్' పేరుతో ఈ ఈవెంట్‌ను భారీ ఎత్తున నిర్వహించారు. వారణాసి చిత్రంలో ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. -
'వారణాసి'లో పవర్ఫుల్ దేవత.. రాజమౌళి ప్లాన్ అదుర్స్
మహేష్ బాబు, రాజమౌళి సినిమా వారణాసి నుంచి టైటిల్ గ్లింప్స్‌ను తాజాగా విడుదల చేశారు. దీంతో ఈ మూవీ కాన్సెప్ట్ గురించి కాస్త హింట్ వచ్చేసింది. భూత, భవిష్యత్, వర్తమాన కాలాలతో ఈ మూవీ రానుందని అర్థం అవుతుంది. భూమి ఆవిర్భావం మొదలు.. త్రేతా యుగం వరకూ ఆపై ఉల్కాపాతాల ప్రళయం, ఘోర కలి వరకు అన్ని కాలాలతో వారణాసి కథకు లింక్ అయినట్లు తెలుస్తోంది. ఇలా వేర్వేరు కాలాలతో కథ ఉన్నప్పటికీ దానిని కలిసే డాటెడ్ లైన్ మహేష్ అని కనిపిస్తుంది. అయితే, ఇందులో రాక్షస ఘణాన్ని వేటాడే 'ఛిన్నమస్తా దేవి' విజువల్ చాలా ప్రత్యేకంగా ఉంది. ఆమెను ప్రసన్నం చేసుకున్నవారికి అతీంద్రియ శక్తులు అందుతాయి. ఆపై ఎదుటివారు ఎంతటి గొప్పవారైనే సరే చీల్చిచెండాడే శక్తి సొంతమౌతుంది.ఛిన్నమస్తా దేవి దశ మహావిద్యలలో ఒక ముఖ్యమైన దేవత. అమ్మవారు తన తలను తన చేతితోనే నరికి పట్టుకున్నట్లు ఉంటుంది. ఆమె తల నుంచి వచ్చే రక్తాన్ని కుడి, ఎడమ పక్కన ఉన్న డాకిని, వర్ణినిలు తాగుతున్నట్లు ఉంటుంది. ఎంతో భయంకరంగా కనిపించేలా ఆమ్మవారి రూపం ఉంటుంది. ఈమెను శక్తి యొక్క రౌద్ర రూపంగా పూజిస్తారు. చిన్నమస్తా దేవి కథను తెలుసుకుంటే మరణంతో పాటు సృష్టి, వినాశనం అనే వైరుధ్యాలను సూచిస్తుంది. ఆమెను కేవలం తంత్రవిద్యను అభ్యసించే వాళ్లు మాత్రమే పూజిస్తారు.వారణాసితో లింక్ఛిన్నమస్తా దేవి భూత, భవిష్యత్, వర్తమాన కాలాలకు సంబంధించి తెలుసుకునే శక్తిని ప్రసాదిస్తుంది. ఆమెను ప్రసన్నం చేసుకునేందుకే రుద్ర పాత్రలో ఉన్న మహేష్ బాబు కూడా అక్కడ ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తుంది. ఆపై అమ్మవారి ఖడ్గం మీద ప్రియాంక చోప్రా కనిపిస్తుంది. పురాణాల ప్రకారం రాక్షస ఘణాన్ని అంతం చేసినప్పటికీ ఆమెకు రక్త దాహం తీరలేదు. తన వెంట ఉన్న వారికి కూడా తీరకపోవడంతో స్వయంగా శిరచ్ఛేదం చేసుకుని రక్తాన్ని అందిస్తుంది. అంతటి ఉగ్రరూపంతో ఆమె ఉంటుంది. సినిమా ప్రకారం ఉన్న రాక్షస ఘణాన్ని ఎదుర్కునేందుకు కావాల్సిన శక్తిని రుద్ర పాత్రలో ఉన్న మహేష్ ఆమె కటాక్షం పొందవచ్చని తెలుస్తోంది. ఆమె ఆశీస్సులు కేవలం ధైర్యవంతులకు మాత్రమే సొంతం అవుతుంది. ఆమె శత్రు నాశని కూడా అందుకే రాజమౌళి ఆమె పాత్రను వారణాసిలో చూపించనున్నారు. ఆమె పార్వతి దేవి రూపం అని కూడా పూరాణాల్లో ఉంది. ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి సమీపంలోని రామ్‌నగర్‌లో ఆమె ఆలయం ఉంది. పశ్చిమ బెంగాల్‌లోని బిష్ణుపూర్‌లో కూడా ఛిన్నమస్తా అమ్మవారి ఆలయం ఉంది. -
రాజమౌళిపై హనుమాన్ భక్తులు ఫైర్
మహేష్ బాబు, రాజమౌళి సినిమా వారణాసి టైటిల్ గ్లింప్స్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ మూవీకి సంబంధించిన వీడియో క్లిప్‌ను అభిమానులకు చూపించాలని ఆయన చాలా కష్టపడ్డారు. ఈ వేడుకలో టైటిల్ గ్లింప్స్ ప్రదర్శన సాంకేతిక సమస్యల వల్ల కొద్ది సేపు ఆలస్యమైంది. దీంతో ఆయన హనుమంతుడిని నిందిస్తూ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. వారణాసి గ్లింప్స్ కోసం ఇండియాలోనే అతి పెద్ద ఎల్ఈడీ స్క్రీన్ ఏర్పాటు చేశారు. అది పని చేయాలంటే దాదాపు 45 జనరేటర్లు రన్ కావాల్సి వుంటుంది. కానీ, తన ప్లాన్ ప్రకారం అది వర్కౌట్ కాకపోవడంతో రాజమౌళి అసహనం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఆయన చేసిన కామెంట్లపై నెటిజన్లతో పాటు హిందూ సంఘాలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.మొదట కథా రచయిత విజయేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. వారణాసి కోసం మహేష్ చాలా కష్టపడ్డారని చెప్పారు. కొన్ని కొన్ని సినిమాలు మనుషులు చేస్తారు. కొన్ని కొన్ని సినిమాలు దేవతలు చేయించుకుంటారని ఆయన అన్నారు. అనుక్షణం రాజమౌళి గుండెలపై హనుమ ఉన్నాడని విజయేంద్రప్రసాద్ చెప్పారు. అయితే, వారణాసి గ్లింప్స్ రిలీజ్‌కు పదే పదే సాంకేతిక ఆటంకాలు ఎదుదు కావడంతో రాజమౌళి నిరాశ చెంది హనుమంతుడిపై ఇలా అన్నారు. 'నాకు దేవుడిపైన పెద్దగా నమ్మకం లేదు. హనుమంతుడు నా వెనుకాల ఉండి నడిపించారని మా నాన్న చెప్పారు. ఇలా అంటే నాకు వెంటనే కోపం వచ్చింది. ఆయన ఉంటే ఇదేనా నడిపించేది..?' అని అసహనం వ్యక్తం చేశారు. దీంతో రాజమౌళి చేసిన ఈ వ్యాఖ్యలు హనుమంతుడి భక్తులతో పాటు హిందూ మనోభావాలను దెబ్బతీశాయని చర్చ తెరపైకి వచ్చింది. టెక్నికల్ టీమ్ వైఫల్యాన్ని కూడా దేవుడికి ఆపాదించడం ఏంటి అంటూ వారు భగ్గుమంటున్నారు. దేవుడిని నమ్మనంటూనే.. ఆటంకాలు వస్తే ఇలా హనుమంతుడిపై నిందలు మోపడం ఎందుకు అంటూ ఫైర్ అవుతున్నారు. సినిమా విజయం సాధించినప్పుడు ఆ క్రెడిట్ మీ ఖాతాలో వేసుకుని.. విఫలమైతే దేవుడిది తప్పు అంటే ఎలా అని రాజమౌళిపై పోస్టులు పెడుతున్నారు.Shocking 😮 what happened? Why is @ssrajamouli blaming lord Hanuman? 😱😡😡 pic.twitter.com/utezaTYnE6— Tathvam-asi (@ssaratht) November 15, 2025 -
ఈ రోజు నా మాటలను నాన్న వింటుంటారు: మహేశ్ బాబు
‘‘నాన్నగారంటే (సూపర్‌స్టార్ కృష్ణ) నాకు చాలా ఇష్టం. ఆయన చెప్పిన ప్రతి మాటని గౌరవించాను, పాటించాను. కానీ ఒక్కటి మాత్రం చేయలేదు. ఆయన నన్నెప్పుడూ పౌరాణికం సినిమా చేయమని అడిగేవారు. ఆ మాట నేను వినలేదు. ఈ రోజు నా మాటల్ని ఆయన వింటుంటారు (‘వారణాసి’లో మహేశ్ చేసిన రుద్ర పాత్రకు పౌరాణికం టచ్ ఉంది). నాన్న ఆశీస్సులు ఎప్పుడూ మనతో ఉంటాయి. ‘వారణాసి’ నా డ్రీమ్ ప్రాజెక్ట్. దీనికి ఎంత కష్టపడాలో అంతా పడతాను. ఈ సినిమా విడుదలైనప్పుడు దేశమంతా గర్వపడుతుంది’’ అని భావోద్వేగంగా మాట్లాడారు మహేశ్‌బాబు. రాజమౌళి దర్శకత్వంలో మహేశ్‌బాబు హీరోగా కేఎల్ నారాయణ, కార్తికేయ నిర్మిస్తున్న చిత్రానికి ‘వారణాసి’ టైటిల్ ఖరారైంది. శనివారం హైదరాబాద్‌లో ‘గ్లోబ్‌ట్రోటర్’ ఈవెంట్ పేరిట చిత్రయూనిట్ నిర్వహించిన కార్యక్రమంలో ‘వారణాసి’ టైటిల్ గ్లింప్స్ వీడియోను విడుదల చేశారు. çపృథ్వీరాజ్ సుకుమారన్ , ప్రియాంకా చోప్రా ఈ చిత్రంలోని ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. విజయేంద్రప్రసాద్, కంచి కథ అందించారు. ఈ చిత్రం 2027 వేసవిలో విడుదల కానుంది. ఈ వేడుకలో మహేశ్‌బాబు మాట్లాడుతూ– ‘‘ఈ వేదికపైకి సింపుల్‌గా నడిచొస్తానంటే రాజమౌళిగారు కుదరదన్నారు... చూశారుగా ఎంట్రీ ఎలా ప్లాన్ చేశారో (బొమ్మ నందిపైన కూర్చుని వస్తున్నట్లుగా). ఇదంతా మీకోసమే (అభిమానులు). మీరంతా మమ్మల్ని స΄ోర్ట్ చేసినందుకు థ్యాంక్స్. అప్డేట్స్... అప్డేట్స్ అన్నారు. అవి ఎలా ఉన్నాయో మీరే చెప్పాలి. అవి చూస్తుంటే నాకే దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయింది. ముందు ముందు ఎలా ఉంటుందో మీ ఊహకే వదిలేస్తున్నా. మీరంతా ఎంతో కష్టపడి ఇక్కడికి వచ్చినందుకు ధన్యవాదాలు. అభిమానులందరూ క్షేమంగా ఇంటికి చేరుకుంటే మేమంతా చాలా సంతోషంగా ఉంటాం’’ అని తెలిపారు. రాజమౌళి మాట్లాడుతూ– ‘‘నాకు చిన్నప్పుడు కృష్ణగారి గొప్పదనం తెలియదు. చిన్నప్పుడు ఎన్టీఆర్‌గారి అభిమానిని. కానీ ఇండస్ట్రీకి వచ్చాక... సినిమా ఏంటో అర్థమయ్యాక కృష్ణగారి గొప్పదనం తెలిసింది. ఒక కొత్త టెక్నాలజీని ఇంట్రడ్యూస్ చేయాలంటే ఎన్నో దారులను బ్రేక్ చేసుకుంటూ, ఎన్నో దారులు వేసుకుంటూ వెళ్లాలి. ఇక నిన్న (శుక్రవారం) రాత్రి మా సినిమా వీడియోను టెస్ట్ చేయాలనుకున్నాం. లీక్ కాకూడదని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ డ్రోన్స్‌తో వీడియోలు తీసి, నెట్లో పెట్టడం మొదలుపెట్టారు. ఈ వీడియోను ఎంతో దూరం నుంచి వచ్చిన ఆడియన్స్ కోసం ఈ రోజు మేం ప్లే చేద్దామనుకున్నాం. ఇక మహేశ్‌బాబు నుంచి మనందరం నేర్చుకునే ఒక గుణం ఉంది. మనందరికీ సెల్‌ఫోన్ ఎడిక్షన్ ఉంది. ఆఫీసుకు వచ్చినా, షూటింగ్‌కు వచ్చినా సెల్‌ఫోన్ పట్టుకోడు. 8 గంటలైనా, 10 గంటలైనా తన సెల్‌ఫోన్ కారులోనే ఉంటుంది. మళ్లీ కారు ఎక్కితేనే మహేశ్ తన ఫోన్ టచ్ చేస్తాడు. మనందరం ఇది నేర్చుకోవాలి. మహాభారతం, రామాయణం అంటే నాకు చాలా ఇష్టమని చాలాసార్లు చెప్పాను. మహాభారతం నా డ్రీమ్ ప్రాజెక్ట్ అని కూడా చెప్పాను. ఈ సినిమా మొదలు పెట్టినప్పుడు కూడా రామాయణంలోని ఓ ముఖ్యమైన ఘట్టం తీస్తానని అనుకోలేదు. ఫస్ట్ డే మహేశ్‌కి రాముడి వేషం వేసి, ఫొటోషూట్ చేస్తుంటే గూస్ బంప్స్ వచ్చాయి. సినిమాలోని ఆ ఎపిసోడ్‌ను 60 రోజులు షూట్ చేశాం. నా సినిమాల్లో మోస్ట్ మెమొరబుల్ సీక్వెన్స్‌గా అది ఉండబోతోంది. మీరు ఊహించనంత అందంగా, పరాక్రమంగా, కోపంగా, దయార్ద్ర హృదయంతో ఉంటాడు మహేశ్. ఈ ఎసిసోడ్ షూట్ చేసినందుకు నేను చాలా లక్కీ’’ అన్నారు.ప్రియాంకా చోప్రా మాట్లాడుతూ– ‘‘కొంత గ్యాప్ తర్వాత ఇండియన్ సినిమా చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమాలో మందాకిని పాత్రకు నన్ను ఎంపిక చేసుకున్న రాజమౌళిగారికి థ్యాంక్స్. మహేశ్‌బాబుగారు, ఆయన ఫ్యామిలీ... నేను హైదరాబాద్‌ని మరో ఇల్లుగా భావించేలా చేశారు’’ అని అన్నారు.పృథ్వీరాజ్ సుకుమారన్ మాట్లాడుతూ– ‘‘రెండేళ్ల క్రితం రాజమౌళిగారి నుంచి నాకో మెసేజ్ వచ్చింది. ఆయన చెప్పిన ఐదు నిమిషాల నరేషన్ విని మైండ్ బ్లో అయ్యింది. ఇండియన్ సినిమా లిమిట్స్ దాటేలా ఈ చిత్రకథ, రాజమౌళి విజన్ ఉంటాయి’’ అని చెప్పారు.ఎమ్ఎమ్ కీరవాణి మాట్లాడుతూ– ‘‘కీరవాణిగారు మెలోడీ బాగా కొడతారు. కానీ బీట్ కాస్త స్లోగా ఉంటుందన్న పేరు నాకు ఎందుకు వచ్చిందో నాకు తెలియదు. ఈసారి మెలోడీ నాదే. బీటూ నాదే’’ అని చెప్పారు.కథా రచయిత విజయేంద్రప్రసాద్ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాలో ఓ 30 నిమిషాల యాక్షన్ సీక్వెన్స్ ఉంది. మహేశ్‌బాబు విశ్వరూపాన్ని చూస్తూ నేనలా ఉండిపోయాను. డబ్బింగ్ లేదు... సిజీ లేదు... రీ రికార్డింగ్ లేదు... అయినా నన్ను మంత్రముగ్దుడ్ని చేసింది ఆ సీన్... మర్చిపోలేను. మీరు (ఆడియన్స్) కూడా చక్కని అనుభూతి చెందుతారు. కొన్ని కొన్ని సినిమాలు మనుషులు చేస్తారు. కొన్ని కొన్ని సినిమాలు దేవతలు చేయించుకుంటారు. అనుక్షణం రాజమౌళి గుండెలపై హనుమ ఉన్నాడు’’ అని చెప్పారు కార్తికేయ మాట్లాడుతూ– ‘‘నిర్మాతగా గ్లోబల్ ప్లాట్‌ఫామ్‌పై నా తొలి స్పీచ్ ఇది. చాలా గౌరవంగా ఉంది. మన ఇండియా వైపు గ్లోబల్ ఆడియన్స్ చూసేలా, మన ఇండియన్ సినిమా గ్లోబల్ స్థాయికి వెళ్లేలా ప్రయత్నాలు చేస్తున్నాం’’ అని చెప్పారు.కేఎల్ నారాయణ మాట్లాడుతూ– ‘‘పదిహేనేళ్ల క్రితం మహేశ్‌బాబు, రాజమౌళిగార్లతో సినిమా చేయాలనుకుని, వారిని అడిగితే వెంటనే ఒప్పుకున్నారు. కానీ ఇంత టైమ్ పడుతుందని రాజమౌళి గారు, నేనూ ఊహించలేదు. ఇప్పుడు నా కల నిజమైంది’’ అన్నారు.ఈ వేడుకలో నమ్రత, సితార, రమా రాజమౌళి, సుప్రియ, కంచి, దేవ కట్టా, ఫైట్ మాస్టర్ సాల్మన్ లతో ΄పాటు పలువురు సినీ ప్రముఖలు పాల్గొన్నారు. -
‘వారణాసి’ చూసి యావత్ దేశం గర్వపడుతుంది: మహేశ్ బాబు
నాన్నగారు(కృష్ణ) ఎప్పుడూ నన్ను ఒక మాట అడుగుతూ ఉండేవారు. ‘నువ్వు పౌరాణిక పాత్ర చేస్తే చూడాలని ఉంది’ అని చాలా సార్లు అడిగారు. ఈ విషయంలో నేను ఆయన మాట వినలేదు. ఇన్నాళ్లకు వారణాసి(Varanasi)లో అలాంటి పాత్ర చేశా. ఆయన ఎక్కడ ఉన్నా ఆశిస్సులు మనతో ఉంటాయి’ అన్నారు సూపర్ స్టార్ మహేశ్ బాబు(Mahesh Babu). రాజమౌళి దర్శకత్వంలో ఆయన హీరోగా నటించిన చిత్రం ‘వారణాసి’. ఈ యాక్షన్ అడ్వెంచర్ మూవీలో ప్రియాంక చోప్రా హీరోయిన్గా నటించగా, పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ పాత్ర పోషించాడు. గ్లోబ్ ట్రాటర్ పేరుతో హైదరాబాద్‌లో నిర్వహించిన ఈవెంట్లో శనివారం ఈ మూవీ టైటిల్‌తో పాటు స్పెషల్ వీడియోని రిలీజ్ చేశారు.ఈ సందర్భంగా మహేశ్ బాబు మాట్లాడుతూ..‘వారణాసి నా డ్రీమ్ ప్రాజెక్ట్. జీవితంలో ఒక్కసారి మాత్రం ఇలాంటి సినిమా చేసే అవకాశం వస్తుంది. దీని కోసం ఎంత కష్టపడాలో అంత కష్టపడతా. అందరూ గర్వపడేలా చేస్తా. ముఖ్యంగా రాజమౌళి గర్వపడేలా శ్రమిస్తా. ఈ మూవీ విడుదలైన తర్వాత యావత్ దేశం మనల్ని చూసి గర్వపడుతుంది. ఈ ఈవెంట్ కేవలం టైటిల్ ప్రకటన కోసమే. ముమ్ముందు ఎలా ఉంటుందో మీ ఊహకే వదిలేస్తున్నా. మీ(ఫ్యాన్స్) సపోర్ట్ ఎప్పుడూ ఇలానే ఉండాలని కోరుకుంటున్నా. మీరు చూపించే అభిమానానికి థ్యాంక్స్ అనే మాట చాలా చిన్నది. ఈ ఈవెంట్ ఇంత సజావుగా జరిగేలా సహకరించిన పోలీసులకు ధన్యవాదాలు’ అని అన్నారు. ఎంఎం కీరవాణి దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2027 వేసవిలో ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. -
'వారణాసి'లో శ్రీరాముడిగా మహేశ్.. బయటపెట్టిన రాజమౌళి
రాజమౌళి దర్శకత్వంలో మహేశ్ బాబు చేస్తున్న సినిమాకు 'వారణాసి' అనే టైటిల్ నిర్ణయించారు. ఈ మేరకు స్పెషల్ వీడియోని 'గ్లోబ్ ట్రాటర్'లో ప్రసారం చేశారు. విజువల్స్ అన్నీ టాప్ నాచ్ ఉండగా.. అభిమానులు దీన్ని చూసి మైమరిచిపోయారు. ఇదే అనుకుంటే.. ఈ సినిమాలో మహేశ్ బాబు శ్రీరాముడిగా నటించారని చెప్పి రాజమౌళి అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చారు. ఏకంగా 60 రోజుల పాటు రాముడి ఎపిసోడ్ చిత్రీకరించామని చెప్పారు.(ఇదీ చదవండి: మహేశ్ బాబు 'వారణాసి'.. 2027 వేసవిలో రిలీజ్)'తొలిరోజు ఫొటోషూట్‌లో మహేశ్ బాబుని శ్రీరాముడిగా రెడీ చేసి ఫొటోలు తీశాం. అయితే మహేశ్, కృష్ణుడి పాత్రకు బాగా సూట్ అవుతాడని అనుకున్నా. కానీ ఆ రోజు మహేశ్.. నా అంచనా తప్పు అని నిరూపించాడు. దీంతో మహేశ్ రాముడి గెటప్ ఫొటోని నా వాల్ పేపర్‌గా పెట్టుకున్నాను. కానీ ఎవరు చూసేస్తారేమో అనుకుని దాన్ని తీసేశాను. రామాయణంలోని ఓ ముఖ్యమైన ఘట్టాన్ని తీస్తానని నేను అనుకోలేదు. మహేశ్‌ని రాముడి వేషం వేసి తీసుకొచ్చి ఫోటోషూట్ తీస్తుంటే నాకు గూస్ బంప్స్ వచ్చాయి. రాముడి ఎపిసోడ్‌ని 60 రోజుల పాటు తీశాం. రీసెంట్‌గానే అది పూర్తయింది. ఇందులో చాలా సబ్ ఎపిసోడ్స్ కూడా ఉన్నాయి. ఈ ఒక్క ఎపిసోడ్.. నాకు, మహేశ్ కెరీర్లోనే మర్చిపోలేని సీక్వెన్స్' అని రాజమౌళి చెప్పుకొచ్చారు.(ఇదీ చదవండి: 30 నిమిషాల ఫైట్.. మహేశ్ విశ్వరూపం చూశా: విజయేంద్ర ప్రసాద్) -
మహేశ్-రాజమౌళి 'వారణాసి' సినిమా వీడియో రిలీజ్
సూపర్‌స్టార్ మహేశ్ బాబు హీరోగా, రాజమౌళి దర్శకత్వంలో తీస్తున్న సినిమాకు 'వారణాసి' అనే టైటిల్ ఫిక్స్ చేశారు. శనివారం సాయంత్రం హైదరాబాద్ శివారులో 'గ్లోబ్ ట్రాటర్' పేరుతో నిర్వహించిన ఈవెంట్లో స్పెషల్ వీడియోని రిలీజ్ చేశారు. దాదాపు మూడున్నర నిమిషాల పాటు సాగిన ఈ వీడియో అద్భుతమనే రేంజులో ఉంది. ఆ విజువల్స్, గ్రాఫిక్స్ మతిపోగొట్టేలా కనిపించాయి.వారణాసి 512సీఈ నుంచి మొదలుపెట్టి.. ఆస్టరాయిడ్ శంభవి 2027సీఈ.. అంటార్కిటికా ఆఫ్రికా.. ఉగ్రభట్టి గుహ.. లంకా నగరం త్రేతాయుగం.. వారణాసి మణికర్ణిక ఘాట్.. అంటూ చూపించారు. చివర్లో మహేశ్ బాబు ఎద్దుపై స్వారీ చేస్తూ చేతిలో త్రిశూలంతో కనిపించారు. చివరలో 'వారణాసి' అనే టైటిల్ పడింది. 3 నిమిషాల 40 సెకన్ల వీడియోలో ఒక్క డైలాగ్ కూడా లేదు. అయినా సరే విజువల్ వండర్ అనేలా తీర్చిదిద్దారు. -
మహేశ్ బాబు 'వారణాసి'.. 2027లో రిలీజ్
మహేశ్ బాబుతో రాజమౌళి ఓ సినిమా చేస్తున్నారు. చాన్నాళ్ల క్రితమే షూటింగ్ మొదలైనప్పటికీ ఒక్క అప్డేట్ కూడా రిలీజ్ చేయలేదు. మిగతా యాక్టర్స్ నుంచి కూడా ఒక్కటి కూడా బయటకు రానీయకుండా జాగ్రత్తపడ్డారు. అలాంటిది ఇప్పుడు 'గ్లోబ్ ట్రాటర్' పేరుతో భారీ ఎత్తున హైదరాబాద్‌లో ఈవెంట్ నిర్వహించారు. సినిమా గురించి డీటైల్స్ బయటపెట్టారు.ఇదే కార్యక్రమంలో మాట్లాడిన మూవీ టీమ్ అంతా పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఈ చిత్రానికి సంగీతమందించిన కీరవాణి కూడా చాలా మాట్లాడారు. పనిలో పనిగా మూవీ రిలీజ్ ఎప్పుడనేది కూడా చూచాయిగా బయటపెట్టారు.'మహేశ్ బాబు ఫ్యాన్స్.. మీ అందరి హృదయాల్లో పర్మినెంట్‌గా ఉండిపోటానికి ఒక కొత్త ఫ్లాట్ కొన్నా. బిల్డర్ హ్యాండోవర్ చేసేసాడు. ప్రొడ్యూసర్ హ్యాపీ. డైరెక్టర్ హ్యాపీ. టైల్స్ ఏత్తన్నారు. మెలోడీ నాదే బీటు నాదే. సమ్మర్ 2027కి గృహప్రవేశం' అని కీరవాణి చెప్పుకొచ్చారు.కీరవాణి చెప్పడమైతే చెప్పారు గానీ 2027 వేసవిలోనే కచ్చితంగా రిలీజ్ అవుతుందా అంటే సందేహమే. ఎందుకంటే రాజమౌళి తీసే ఏ సినిమా అయినా సరే కచ్చితంగా పలు కారణాల వల్ల ఆలస్యం కావడం, ముందు అనుకున్న విడుదల తేదీ వాయిదా పడటం తెలిసిందే. మరి ఈసారైనా కీరవాణి చెప్పినట్లు 2027 వేసవిలోనే వస్తారా లేదా అనేది చూడాలి? -
30 నిమిషాల ఫైట్ సీక్వెన్స్.. మహేశ్ విశ్వరూపం చూశా: విజయేంద్ర ప్రసాద్
దర్శకుడు రాజమౌళి, మహేశ్ బాబుతో సినిమా చేస్తున్నట్లు మొన్నటివరకు బయటపెట్టలేదు. అలాంటిది ఇప్పుడు 'గ్లోబ్ ట్రాటర్' ఈవెంట్ అనేసరికి అభిమానులు తెగ ఎగ్జైట్ అయిపోయారు. ప్రస్తుతం వేలాదిమంది సమక్షంలో ఈవెంట్ అంగరంగ వైభవంగా జరుగుతోంది. 'వారణాసి' అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ మేరకు ఫొటోలు, వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా మూవీ గురించి, మహేశ్ యాక్టింగ్ గురించి కూడా అద్భుతమైన అప్డేట్ వచ్చేసింది.'వారణాసి' కథని రాసిన రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. 'ఈ సినిమా తాలూకు 30 నిమషాల యాక్షన్ ఎపిసోడ్ చూశాను. అందులో సీజీ లేదు, బీజీఎం లేదు, అయినా కానీ మహేశ్ బాబుని అలా చూస్తూ ఉండిపోయాను. ఎందుకంటే స్క్రీన్ ప్రెజెన్స్ నన్ను మంత్రంతో కట్టి పడేసింది. మీరు కూడా అనుభూతి పొందుతారు. మహేశ్ తాలూకు విశ్వరూపం చూసి షాక్ అవుతారు. కొన్ని కొన్ని సినిమాలు మనుషులు చేస్తారు. కానీ కొన్ని కొన్ని సినిమాలు దేవతలు చేయించుకుంటారు అనుక్షణం రాజమౌళి గుండెలపై హనుమాన్ ఉన్నారు. ఏం చేయాలో చెబుతూ ఉన్నారు' అని విజయేంద్రప్రసాద్ చెప్పారు.30 నిమిషాల పాటు సాగే యాక్షన్ ఎపిసోడ్ అంటే కచ్చితంగా ఇది క్లైమాక్స్ అయి ఉండొచ్చు. విజయేంద్రప్రసాద్ చెప్పిన దానిబట్టి చూస్తే యాక్షన్ ఎపిసోడ్స్ అయితే కొంతమేర తీశారు. కాకపోతే దీనికి సీజీ, గ్రాఫిక్స్, బీజీఎం లాంటివి జోడిస్తే ఏ రేంజులో ఉంటుందోనని అభిమానులు అప్పుడే అంచనాలు పెంచేసుకుంటున్నారు. -
మహేశ్-రాజమౌళి సినిమా టైటిల్ 'వారణాసి'
ప్రస్తుతం ఎక్కడ చూసినా మహేశ్-రాజమౌళి 'గ్లోబ్ ట్రాటర్' ఈవెంట్ హడావుడి గురించే డిస్కషన్. హైదరాబాద్ శివారులో ఈ కార్యక్రమం భారీగానే ప్లాన్ చేశారు. అభిమానులతో పాటు వేలాదిమంది దీన్ని వీక్షిస్తున్నారు. అయితే ఈవెంట్ ప్రారంభంలోనే మూవీ టైటిల్ ఏంటనేది ప్రకటించేశారు. గత కొన్నిరోజుల నుంచి అనుకుంటున్నట్లే 'వారణాసి' అని ఫిక్స్ చేశారు. టైటిల్ గ్లింప్స్ వీడియోని ఈవెంట్ స్క్రీన్ పై ప్రసారం చేశారు.టైటిల్ గ్లింప్స్ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోతోంది. గత కొన్నిరోజుల నుంచి రుద్ర, వారణాసి.. ఇలా పలు టైటిల్స్ వినిపించాయి. వీటిలో ఏది పెడతారా అనే డిస్కషన్ అయితే నడిచింది. ఫైనల్‌గా రాజమౌళి 'వారణాసి' అనే పేరుకే కట్టుబడి ఉన్నట్లు ఇప్పుడీ వీడియోతో క్లారిటీ వచ్చేసింది.ఇందులో మహేశ్ బాబు రుద్ర అనే పాత్రలో కనిపించబోతున్నాడు. ప్రియాంక చోప్రా, మందాకిని పాత్రలో.. పృథ్వీరాజ్ సుకుమారన్, కుంభ అనే విలన్‌గా కనిపిస్తాడు. వీళ్లు ముగ్గురు కాకుండా ఇంకెవరెవరు ఉన్నారనేది వీడియోలో రివీల్ చేస్తారేమో చూడాలి? -
గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్.. ఫ్యాన్స్‌కి తప్పని ఆ ఇబ్బంది!
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా మహేశ్-రాజమౌళి 'గ్లోబ్ ట్రాటర్' ఈవెంట్ గురించే చర్చ నడుస్తోంది. హైదరాబాద్ శివారులో జరుగుతున్న ఈవెంట్‌కి అభిమానులు బాగానే వస్తున్నారు. ఇందుకు సంబంధించిన పలు ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి కూడా. అయితే మిగతా అందరికీ కాదు గానీ అభిమానులకు మాత్రం ఓ విషయంలో ఇబ్బంది తప్పట్లేదు. పలువురు ఈ విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ కోసం పసుపు, ఎరుపు, తెలుపు, ఊదా(వయలెట్) రంగుల్లో పాస్(పాస్పోర్ట్స్)లు జారీ చేశారు. వీటిలో అభిమానులకు పసుపు రంగు పాస్‌లు ఇచ్చారు. వీటిని తీసుకుని అభిమానులు కార్యక్రమానికి వెళ్లారు. అయితే మిగతా అన్ని పాస్‌లు ఉన్నవాళ్లకు ఎలాంటి సమస్య లేదు గానీ పసుపు రంగు పాస్‌లు ఉన్నవాళ్లతో పాటు వాటర్ బాటిల్స్‌ని తీసుకెళ్లేందుకు అనుమతి ఇవ్వట్లేదట. బదులుగా వాటర్ పాకెట్స్ ఇస్తున్నారు గానీ అవి ఏ మేరకు అవసరం ఉన్నవాళ్లకు అందుతాయనేది చూడాలి.ఈవెంట్ జరుగుతున్న ప్రదేశానికి వెళ్లాలంటేనే అభిమానులు.. 3-4 కిలోమీటర్లు నడవాలి అని తెలుస్తోంది. వెళ్లిన తర్వాత కనీసం వాటర్ బాటిల్‌ని కూడా అనుమతించకపోవడం ఏంటని మాట్లాడుకుంటున్నారు. ఇకపోతే ఈ కార్యక్రమం హాట్‌స్టార్ ఓటీటీలో లైవ్ స్ట్రీమింగ్ కానుంది.ఈ కార్యక్రమానికి హీరో మహేశ్ బాబు, దర్శకుడు రాజమౌళితో పాటు ఈ సినిమాలో భాగమైన ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ హాజరు కానున్నాయి. గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్లో మూవీ టైటిల్‌తో పాటు సినిమా ఎలా ఉండబోతుందా అనే విజువల్స్‌తో కూడిన వీడియోని కూడా రిలీజ్ చేయబోతున్నారు. ఈ విషయాన్ని స్వయంగా రాజమౌళి ట్వీట్ చేశారు. -
'గ్లోబ్ ట్రాటర్' ఈవెంట్లో ఆ రెండు రిలీజ్.. రాజమౌళి క్లారిటీ
రాజమౌళి, మహేశ్ బాబు కాంబోలో తీస్తున్న కొత్త సినిమా టైటిల్ ఏంటో మరికొన్ని గంటల్లో క్లారిటీ రానుంది. హైదరాబాద్ వేదికగా ఈరోజు (నవంబరు 15) సాయంత్రం 'గ్లోబ్ ట్రాటర్' పేరుతో భారీ ఈవెంట్ ప్లాన్ చేశారు. 100 అడుగుల ఎత్తున్న ఎల్ఈడీ స్క్రీన్ కూడా ఏర్పాటు చేశారు. ఈ ఈవెంట్లో అసలేం రిలీజ్ చేస్తారా అని అభిమానుల మదిలో బోలెడన్ని సందేహాలు. ఇప్పుడు వాటికి ఎండ్ కార్డ్ వేసిన రాజమౌళి.. ఒక్క ట్వీట్‌తో క్లారిటీ ఇచ్చేశారు.(ఇదీ చదవండి: మహేష్ బాబు కోసం 7వేల కిలోమీటర్లు దాటి వచ్చేశాడు)గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్లో టైటిల్ రివీల్ చేయడంతో పాటు మూవీ థీమ్ ఏంటనేది వీడియో రూపంలో రిలీజ్ చేయబోతున్నట్లు రాజమౌళి చెప్పుకొచ్చారు. ఈవెంట్లో స్క్రీన్ పై ప్రసారమైన తర్వాత యూట్యూబ్‌లోనూ ఆ వీడియోని రిలీజ్ చేస్తామని పేర్కొన్నారు. అయితే ఈ వీడియో దాదాపు మూడు నిమిషాల పాటు ఉండనుందని తెలుస్తోంది. ఇందులో అన్ని పాత్రలకు సంబంధించిన విజువల్స్, మూవీ స్టోరీ ఏంటనేది చూచాయిగా చూపించడం గ్యారంటీ.ఇప్పటికే ఈ మూవీలో నటిస్తున్న పృథ్వీరాజ్ సుకుమారన్ 'కుంభ' లుక్, ప్రియాంక చోప్రా 'మందాకిని' లుక్స్ రిలీజ్ చేశారు. వీటిపై మిశ్రమ స్పందన వచ్చింది. ప్రస్తుతానికి ఫ్యాన్స్ అందరూ కూడా మహేశ్ బాబు లుక్ కోసమే ఎదురుచూస్తున్నారు. మరి లుక్ రిలీజ్ చేస్తారా? నేరుగా వీడియోనే రిలీజ్ చేసి అభిమానులకు జక్కన్న కిక్ ఇస్తారా అనేది చూడాలి? ఇప్పటికే వారణాసి, రుద్ర అనే టైటిల్స్ వినిపిస్తున్నాయి. మరి దేన్ని ఫైనల్ చేశారో మరికొద్ది గంటల్లో తేలనుంది. (ఇదీ చదవండి: ఈరోజు మీగురించే ఎక్కువ ఆలోచిస్తున్నా: మహేశ్‌బాబు)The title of the film will be revealed along with a visual to the world…Once it airs on the big screen at the #GlobeTrotter event, we will make it live online…. 🤗🤗🤗— rajamouli ss (@ssrajamouli) November 15, 2025 -
మహేష్ బాబు కోసం 7వేల కిలోమీటర్లు దాటి వచ్చేశాడు
మహేష్ బాబు , రాజమౌళి (SS Rajamouli) సినిమాకు సంబంధించిన #GlobeTrotter ఈవెంట్ కోసం ప్రపంచదేశాల నుంచి కూడా ఆయన అభిమానులు హైదరాబాద్‌లో వాలిపోతున్నారు. నేడు రామోజీ ఫిల్మ్ సిటీలో ఎంతో ఘనంగా ఈ కార్యక్రమం జరగనుంది. పాస్‌పోర్ట్ మాదిరిగా ఉన్న పాస్‌లను ప్యాన్స్ కోసం జక్కన్న ఇప్పటికే జారీ చేశారు. అయితే, మహేష్ అభిమాని ఒకరు ఈ కార్యక్రమం కోసం ఏకంగా 6817 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చాడు. అందుకు సంబంధించిన ఒక పోస్ట్‌ను రాజమౌళి కుమారుడు కార్తికేయ షేర్ చేశారు.మహేష్ బాబుకు ఇతర దేశాల్లో కూడా భారీగా ఫ్యాన్స్ ఉన్నారు. అయితే, సునీల్ ఆవుల అనే అభిమాని SSMB29 కార్యక్రమం కోసం సింగపూర్ నుంచి హైదరాబాద్‌కు చేరుకున్నాడు. చాలా ఏళ్ల తర్వాత కేవలం మహేష్ కోసం వస్తున్నట్లు పేర్కొన్నాడు. అందుకోసం ఏకంగా 6817 కిలోమీటర్ల దూరం 12 గంటల పాటు ప్రయాణం చేశానన్నారు. తన పంచుకున్న పోస్ట్‌ను కార్తికేయ్ షేర్ చేశారు. ఒక తెలుగోడు మాత్రమే అనుభూతి చెందే బిగ్గెస్ట్ ఎమోషన్ ఇదే అని ఆపై ఆకాశం కూడా హద్దు కాదంటూ పేర్కొన్నారు. ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్ అవుతుంది.OKKA TELUGODU MAAATRAME FEEL AYYE BIGGEST EMOTION….SKY ALSO NOT THE LIMIT…. 🙏🏻🙏🏻🙏🏻🙏🏻 https://t.co/jH4eJniB0U— S S Karthikeya (@ssk1122) November 15, 2025 -
పాస్‌పోర్ట్ లేకుండా కంగారుపడి వచ్చేయకండి: మహేశ్
మరికొన్ని గంటల్లో మహేశ్-రాజమౌళి సినిమాకు సంబంధించిన గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ భారీ లెవల్లో జరగబోతుంది. శనివారం(నవంబరు 15) సాయంత్రం హైదరాబాద్ శివారులో ఈ వేడుక జరగనుంది. గత కొన్నిరోజుల్లో పలు ప్రమాదాలు జరిగిన దృష్ట్యా.. కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించనున్నారు. ఈ క్రమంలోనే డైరెక్టర్ రాజమౌళి ఇప్పటికే వీడియో రిలీజ్ చేసి తగు జాగ్రత్తలు చెప్పారు.ఇప్పుడు హీరో మహేశ్ బాబు వంతు వచ్చింది. పాస్‌పోర్ట్ (ఈవెంట్ పాస్) ఉంటేనే లోపలికి అనుమతి ఉంటుందని, లేదంటే మాత్రం వచ్చేయకండి అని సుతిమెత్తగా చెప్పారు. ఇంకా చాలా ఈవెంట్స్ ఉండనే ఉంటాయని అభిమానులు కంగారుపడొద్దని జాగ్రత్తలు చెప్పారు.'ఈవెంట్ రోజున ఆర్ఎఫ్సీ మెయిన్ గేట్ మూసేసి ఉంటుంది. మీతో పాటు ఉన్న పాస్ స్కాన్ చేస్తే మీరు ఏ గేటు నుంచి రావాలో చూపిస్తుంది. ప్రతి ఒక్కరూ రూల్స్ పాటించండి. పోలీసులకు, సెక్యూరిటీ వాళ్లకు సహకరించండి. పోలీసులు మనకు చెప్పింది ఏంటంటే.. అందరూ ఎంత తక్కువ ట్రాన్స్పోర్టేషన్తో వస్తే అందరికీ అంత ఈజీగా ఉంటుంది. పాస్‌పోర్ట్ లేకుండా కంగారుపడి వచ్చేయకండి. మనకు ఇంకా చాలా ఈవెంట్స్ ఉంటూనే ఉంటాయి. రేపు సాయంత్రం కలుద్దాం' అని మహేశ్ బాబు చెప్పారు.SSMB29 వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమా తీస్తున్నారు. ఇప్పటికే కుంభ పాత్రలో పృథ్వీరాజ్, మందాకిని పాత్రలో ప్రియాంక చోప్రా నటిస్తున్నట్లు ప్రకటించారు. ఆయా పాత్రల ఫస్ట్ లుక్స్ కూడా రిలీజ్ చేశారు. గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్లో మహేశ్ లుక్ రిలీజ్ చేయడంతో పాటు అనౌన్స్మెంట్ వీడియోని కూడా భారీ స్క్రీన్ పై ప్లే చేయనున్నారు. ఈవెంట్ వెళ్లలేకపోతే హాట్‌స్టార్ ఓటీటీలో దీన్ని లైవ్‌గా చూడొచ్చు.Tomorrow it is… 🤗🤗🤗Come safely, enjoy it and go home safely.❤️❤️❤️ #GlobeTrotter pic.twitter.com/5ybhjJ5ZP4— Mahesh Babu (@urstrulyMahesh) November 14, 2025 -
SSMB29 ఈవెంట్ పాస్‌లు.. సరికొత్తగా ప్లాన్ చేసిన రాజమౌళి
మహేష్ బాబు , రాజమౌళి (SS Rajamouli) సినిమా SSMB29 ఈవెంట్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. #GlobeTrotter పేరుతో నవంబర్ 15న రామోజీ ఫిల్మ్ సిటీలో ఒక ఈవెంట్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.. అయితే, కార్యక్రమానికి సంబంధించిన పాస్‌లు ఉన్నవాళ్లు మాత్రమే రావాలని ఒక వీడియోతో రాజమౌళి పంచుకున్నారు. పాస్‌పోర్ట్ మాదిరిగా ఉన్న ఈ పాస్‌లకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్నాయి.హైదరాబాద్ మూవీ లవర్స్‌కి సుదర్శన్ థియేటర్ అంటే పరిచయం అక్కర్లేదు.. ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో ఉన్న ఈ థియేట్ మహేష్ అభిమానులకు ఓ ఎమోషనల్, సెంటిమెంట్ అని చెప్పాలి. ఆయన సినిమా రిలీజ్ అవుతుందంటే చాలు ఇక్కడ భారీ కటౌట్లతో పాటు వందల కొద్ది ఫెక్సీలు కనిపిస్తాయి. ఇప్పుడు ఇదే థియేటర్ వద్ద ఆయన అభిమానులు #GlobeTrotter ఈవెంట్ పాస్‌లను చూపుతూ తమ ఆనందాన్ని పంచుకున్నారు.త్రిశూలం బొమ్మతో ముద్రించిన ఈ పాస్‌లు పాస్‌పోర్ట్ మాదిరిగా ఉండటంతో సరికొత్తగా ఉందంటూ ఫ్యాన్స్ సంతోషిస్తున్నారు. ఫస్ట్ పేజీలో మహేష్ బాబుతో పాటు ప్రియాంక, పృథ్వీరాజ్, రాజమౌళి ఫొటోలను ముద్రించారు. ఆపై కార్యక్రమంలో పాల్గొనేవారు పాటించాల్సిన రూల్స్, మ్యాప్‌తో సహా ఇచ్చారు. పాస్‌లు ఉన్నవారు మాత్రమే వేదిక వద్దకు చేరుకోవాలని ఇప్పటికే రాజమౌళి పేర్కొన్నారు. ఎట్టిపరిస్థితిల్లోనూ చిన్నపిల్లలు, సీనియర్ సిటిజన్లకు అనుమతి లేదని తెలిపారు. ఇంటి వద్దే జియో హాట్‌స్టార్‌లో లైవ్ చూడాలని కోరారు.Here it is #GlobeTrotter event passes overview at our SSMB Fort Please follow the given Instructions in the pass and enjoy the #GlobeTrotter event at RFC 📍Make the event grand success on noveMBer 15th Enjoy the event & Be Safe 🙏#SSMB29 || #MaheshBabu𓃵 pic.twitter.com/vgzLggcQxD— Sudarshan35mm'MB'FC (@sudarshan35mm) November 13, 2025Passport #GlobeTrotter 🔥🔥🔥🔥What an innovative promotion by team 👏🏻@ssrajamouli 🔥 pic.twitter.com/Y7ttggs7tk— Thyview (@Thyview) November 13, 2025 -
రాజమౌళి బిగ్ ఈవెంట్.. హోస్ట్‌గా ప్రముఖ యూట్యూబర్!
మహేష్ బాబు - రాజమౌళి కాంబోలో వస్తోన్న యాక్షన్ అడ్వెంచరస్ మూవీ ఎస్ఎస్ఎంబీ29. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించి బిగ్ సర్ప్రైజ్ ఇచ్చాడు మన దర్శకధీరుడు. ఓ సాంగ్‌ను రిలీజ్ చేయడంతో ప్రియాంక చోప్రా ఫస్ట్ లుక్ రివీల్ చేశారు. అయితే ఈ మూవీ టైటిల్‌పై ఫ్యాన్స్‌లో విపరీతమైన ఆసక్తి నెలకొంది. టైటిల్ ఎప్పుడెప్పుడు రివీల్ చేస్తారా? అని మహేశ్ బాబు ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రాజమౌళి బిగ్ ఈవెంట్ ప్లాన్ చేశారు.హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో బిగ్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. ఈ నెల 15న గ్రాండ్ ఈవెంట్ జరగనుంది. ఈ వేడుకలో భాగంగా మూవీ టైటిల్‌తో పాటు మహేష్ బాబు ఫస్ట్ లుక్‌ను రివీల్ చేయనున్నారు. దీంతో భారీగా ఫ్యాన్స్ రానున్న నేపథ్యంలో దర్శకుడు రాజమౌళి కొన్ని సూచనలు ఇస్తూ ఒక వీడియో విడుదల చేశారు. ఈవెంట్ పాస్‌లు ఉన్నవాళ్లకు మాత్రమే అనుమతి ఉంటుందని ఆయన క్లారిటీ ఇచ్చారు.(ఇది చదవండి: మహేష్ బాబు సినిమా ఈవెంట్.. వాళ్లకు నో ఎంట్రీ: రాజమౌళి)అయితే తాజాగా ఈ ప్రతిష్టాత్మక గ్రాండ్ ఈవెంట్‌కు హోస్ట్ ఎవరన్నది కూడా టాలీవుడ్లో హాట్‌టాపిక్‌గా మారింది. ఇలాంటి పెద్ద పెద్ద ఈవెంట్లకు మన స్టార్ యాంకర్ సుమ ఉండనే ఉంటుంది. సుమతో పాటు ప్రముఖ యూట్యూబర్ ఈ మెగా ఈవెంట్‌కు హోస్ట్‌గా పనిచేయనున్నారు. బాలీవుడ్‌కు చెందిన ఆశిష్ చంచలానీ హోస్ట్‌గా కనిపించనున్నారు. ఈ విషయాన్ని ఓ ఫన్నీ వీడియో ద్వారా మేకర్స్ రివీల్ చేశారు. రాజమౌళితో కలిసి ఈ వీడియోను రూపొందించారు.కాగా.. తొలిసారి రాజమౌళి- మహేశ్ బాబు కాంబోలో వస్తోన్న ఈ భారీ ప్రాజెక్ట్‌కు గ్లోబ్ ట్రాటర్ అనే టైటిల్ ఖరారు చేసినట్లు టాక్ వినిపిస్తోంది. ఈ బిగ్ ఈవెంట్లో ఈ విషయాన్ని రివీల్ చేయనున్నారు. ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్‌కు దాదాపు 50 వేల మందికి పైగా అభిమానులు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని నవంబర్ 15న సాయంత్రం 7 గంటలకు జియోహాట్‌స్టార్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నారు. So here we go…⁰@ashchanchlani will host @thetrilight presents the #GlobeTrotterEvent 🔥November 15th - gear up for an exhilarating day of something spectacular.#GlobeTrotterEvent @ssrajamouli @urstrulyMahesh @priyankachopra @PrithviOfficial @mmkeeravaani @SriDurgaArts… pic.twitter.com/RElWGR9uiJ— Sri Durga Arts (@SriDurgaArts) November 13, 2025 -
మహేష్ బాబు సినిమా ఈవెంట్.. వాళ్లకు నో ఎంట్రీ: రాజమౌళి
మహేష్ బాబు , రాజమౌళి సినిమా SSMB29 ఈవెంట్ రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ నెల 15న జరగనుంది. ఈ వేడుకలో భాగంగా మూవీ టైటిల్‌తో పాటు మహేష్ బాబు ఫస్ట్ లుక్‌ను రివీల్ చేయనున్నారు. దీంతో భారీగా ఫ్యాన్స్ రానున్న నేపథ్యంలో దర్శకుడు రాజమౌళి కొన్ని సూచనలు ఇస్తూ ఒక వీడియో విడుదల చేశారు. ఈవెంట్ పాస్‌లు ఉన్నవాళ్లకు మాత్రమే అనుమతి ఉంటుందని ఆయన క్లారిటీ ఇచ్చారు.'SSMB29 గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ బాగా జరగాలంటే మీ సహకారం చాలా అవసరం. ఈవెంట్ పట్ల క్రేజ్ ఎక్కువ ఉండటంతో పోలీసు వారు ఎక్కువ ఆంక్షలు విధించారు. వాటిని తప్పకుండా మనం పాటించాలి. ఈ కార్యక్రమం బహిరంగంగా జరగడం లేదు. కాబట్టి పాస్‌లు ఉన్నవారికి మాత్రమే అనుమతి ఉంటుంది. పాస్‌లు లేకున్నా సరే అనుమతి ఇస్తారని సోషల్‌మీడియాలో ప్రచారం జరుగుతుంది. వాటిని నమ్మకండి. ఆన్లైన్లో కూడా మేము పాస్‌లు అమ్మడం లేదు. మాకు అనుమతి ఉన్నమేరకు మాత్రమే పాస్‌లు ఇస్తాం. అదే పాస్ మీద క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఎలా రావాలి అనేది అందులోనే క్లియర్‌గా చెప్పబడింది. దానిని మాత్రమే ఫాలో అవుతూ వేదిక వరకు చేరుకుండి. శనివారం మధ్యాహ్నం 2గంటల నుంచి అనుమతి ఉంటుంది. 18 సంవత్సరాల లోపు పిల్లలతో పాటు సీనియర్ సిటిజన్లుకు అనుమతి లేదని పోలీసులు తెలిపారు. కాబట్టి ఈ కార్యక్రమానికి వారెవరూ రావద్దని కోరుతున్నాను. ఇంటి వద్దే ఉండి జియోహాట్‌స్టార్‌లో లైవ్ ప్రసారంలో చూసేయండి. రీసెంట్గా జరిగిన పలు సంఘటనలను పోలీసులు దృష్టిలో పెట్టుకుని ఎక్కువ ఆంక్షలు విధించారు. కార్యక్రమంలో ఏదైనా పొరపాటు జరిగితే వెంటనే రద్దు చేస్తామని కూడా కమిషనర్ చెప్పారు. కాబట్టి వారి సూచనలను మనం తప్పకుండా పాటించాలి.' అని ఆయన అన్నారు. వేదిక వద్దకు ఎలా చేరుకోవాలి వంటి అంశాలను వీడియోలో తెలిపారు. Very excited to see you all at the #Globetrotter event on November 15.The RFC main gate will be closed on the event day. Follow the instructions on your entry pass. Cooperate with police and security to ensure a hassle-free, safe, and happy experience for everyone. pic.twitter.com/bG3Hw5XmD8— rajamouli ss (@ssrajamouli) November 13, 2025 -
ఢిల్లీలో పేలుడు.. SSMB29 ఈవెంట్‌పై పడుతుందా..?
మహేష్ బాబు (Mahesh Babu), రాజమౌళి (Rajamouli) సినిమాకు సంబంధించి రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ నెల 15న SSMB29 ఈవెంట్‌ను నిర్వహించనున్నట్టు చిత్ర యూనిట్ తెలిపింది. అయితే, ఢిల్లీ ఎర్రకోట వద్ద జరిగిన బాంబు పేలుళ్ల ఘటన ఈ కార్యక్రమంపై ప్రభావం చూపనుందా అనే అనుమానాలు వస్తున్నాయి. ఢిల్లీలో పేలుళ్ల ఘటన తర్వాత దేశవ్యాప్తంగా పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ క్రమంలో హైదరాబాద్‌లోని రద్దీ ప్రదేశాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ముఖ్యంగా సిటీ మెట్రో, రైల్వేస్టేషన్లు, బస్టాండ్ వంటి ప్రదేశాల్లో సెక్యూరిటీ పెంచారు. అయితే, SSMB29 ఈవెంట్ నిర్వాహుకులపై ఏమైనా ఆంక్షలు పెడుతారనే ఊహాగానాలు వస్తున్నాయి.ఈ నెల 15న ఈ మూవీ టైటిల్‌తో పాటు మహేష్ బాబు ఫస్ట్ లుక్ లాంచ్ ఈవెంట్‌ను ఘనంగా జరపాలని రాజమౌళి ప్లాన్ చేశారు. ఆమేరకు కొన్ని వారాల ముందే పనులు ప్రారంభించారు.. ఈ కార్యక్రమం కోసం కనీసం లక్షకుపైగానే అభిమానులు రావచ్చని తెలుస్తుంది. అయినప్పటికీ అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇలాంటి సమయంలో ఢిల్లీలో బాంబు పేలుళ్లు జరగడంతో అందోళన కలిగిస్తుంది. ఉగ్రవాదులు మరిన్ని పేలుళ్లకు పాల్పడవచ్చనే అనుమానం రావడంతో దేశవ్యాప్తంగా హై అలెర్ట్ ప్రకటించారు. ఆపై దేశవ్యాప్తంగా పలు ఆంక్షలు విధించారు. ఇలాంటి సమయంలో ఇంత పెద్ద ఈవెంట్‌పై కూడా నీలి నీడలు కమ్ముకునేలా ఉంది. భారీగా తరలివచ్చే జనాన్ని కంట్రోల్ చేసి ఈవెంట్ నిర్వహించడం సాధ్యమేనా అనే అనుమానాలు వస్తున్నాయి. ప్రభుత్వం నుంచి అనుమతి లభిస్తుందా అనే సందేహం కూడా వస్తుంది. ఈ కార్యక్రమంలో మహేష్ బాబు, రాజమౌళి, ప్రియాంక చోప్రా వంటి స్టార్స్‌తో పాటు చాలామంది వీఐపీలు పాల్గొంటారు. కాబట్టి జాగ్రత్తలతో పాటు ఫుల్ సెక్యూరిటీ తప్పనిసరిగా ఉండాల్సిందే. ఆపై పోలీసులను కూడా ఈ కార్యక్రమం కోసం భారీగా మోహరించాల్సి ఉంటుంది. ఒకవేళ ఈవెంట్ జరిగినా పోలీసుల నుంచి ఎక్కువగా ఆంక్షలు రావచ్చని సమాచారం. -
మహేశ్ బాబు- రాజమౌళి కాంబో.. గన్ను గురిపెట్టిన ప్రియాంక చోప్రా
మహేశ్‌బాబు- రాజమౌళి కాంబోలో యాక్షన్ అడ్వెంచరస్ మూవీని తెరకెక్కిస్తున్నారు. తొలిసారి వీరిద్దరి జతకట్టడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ ప్రియాంక చోప్రా హీరోయిన్గా కనిపించనుంది. తాజాగా ఈ మూవీ నుంచి బిగ్ అప్డేట్ వచ్చేసింది. ప్రియాంక చోప్రా ఫస్ట్ లుక్‌ను మేకర్స్ రివీల్ చేశారు. ఈ చిత్రంలో మందాకిని పాత్రలో బాలీవుడ్ ముద్దుగుమ్మ కనిపించనుంది.ఇటీవలే ఈ మూవీ నుంచి సించారీ అంటూ సాగే పాటను రిలీజ్ చేశారు. తాజాగా రిలీజైన ప్రియాంక చోప్రా పోస్టర్ చూస్తే రెండు చేతులతో గన్ పట్టుకుని ఫుల్ అగ్రెసివ్ అండ్ యాక్షన్ మోడ్‌లో కనిపించింది. చీరకట్టులో ప్రియాంక గన్ పట్టుకున్న పోస్టర్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ పోస్టర్ చూస్తుంటే ప్రియాంక చోప్రా రోల్ పవర్‌పుల్‌గా ఉండనున్నట్లు అర్థమవుతోంది. ఇప్పటికే సలార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ రోల్ కుంభగా పరిచయం చేసిన సంగతి తెలిసిందే.మరోవైపు ఈ మూవీకి సంబంధించి బిగ్ ఈవెంట్ ప్లాన్ చేశారు రాజమౌళి. ఈనెల రామోజీ ఫిల్మ్ సిటీలో గ్రాండ్‌గా నిర్వహించన్నారు. ఈ కార్యక్రమాన్ని జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. ఈ గ్రాండ్ ఈవెంట్లో టైటిల్ రివీల్ చేయనున్నట్లు సమాచారం. View this post on Instagram A post shared by Priyanka (@priyankachopra) -
ఓటేసిన డైరెక్టర్ రాజమౌళి
-
సర్ప్రైజ్.. మహేశ్-రాజమౌళి 'గ్లోబ్ ట్రాటర్' సాంగ్ రిలీజ్
ఇన్నిరోజులు అసలు సినిమా తీస్తున్న విషయమే బయటకు రానీయకుండా జాగ్రత్తపడిన రాజమౌళి.. ఇప్పుడు మాత్రం అన్ని సడన్ సర్ప్రైజులు ఇస్తున్నాడు. ఈనెల 15న హైదరాబాద్‌లో మహేశ్ బాబు 'SSMB29' మూవీకి సంబంధించి భారీ ఈవెంట్ జరగనుంది. దీన్ని హాట్‌స్టార్‌లో ప్రసారం చేయనున్నారు. ఈ క్రమంలోనే మహేశ్, ప్రియాంక చోప్రా వీడియో బైస్ట్ ఇప్పటికే రిలీజ్ చేశారు.అలానే కొన్నిరోజుల క్రితం ఇదే సినిమాలో విలన్‌గా నటిస్తున్న పృథ్వీరాజ్ సుకుమారన్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. కుంభ పాత్రలో కనిపించనున్నట్లు పేర్కొన్నారు. అయితే వీల్ ఛైర్లో ఉన్న పృథ్వీరాజ్ లుక్‌పై చాలా ట్రోల్స్ వస్తున్నాయి. ఇప్పుడు ఎలాంటి ప్రకటన లేకుండా 'గ్లోబ్ ట్రాటర్' అనే పాటని రిలీజ్ చేశారు. హీరోయిన్ శ్రుతి హాసన్ దీన్ని పాడటం విశేషం.'సంచారి.. సంచారి' అని సాగే లిరిక్స్.. హీరో గురించి చెప్పకనే చెబుతున్నట్లు ఉన్నాయి. ఈ పాటని సినిమా కోసమే స్వరపరిచారా లేదంటే ఈ వారం జరగబోయే ఈవెంట్ కోసమా అనేది తెలియాల్సి ఉంది. శ్రుతి హాసన్ పాడింది అంటే కచ్చితంగా మూవీలో ఉంటుందనే అనుకోవచ్చేమో? View this post on Instagram A post shared by Shruti Haasan (@shrutzhaasan) -
బాహుబలి: ది ఎటర్నల్ వార్..! బాహుబలి - 3 కి ఇంకా టైముందా..!
-
రాజమౌళి కొత్త సినిమా నుంచి ప్రమోషన్ స్టార్ట్.. మహేష్ బాబు టైటిల్ ఇదేనా?
-
సినిమాల వరదలో పుష్పరాజ్..! రాజమౌళి - బన్నీ కాంబినేషన్ పక్కా అవుతుందా?
-
రాజమౌళి సినిమా.. అదిరిపోయేలా 'పృథ్వీరాజ్' ఫస్ట్‌లుక్
మహేశ్‌బాబు (Mahesh Babu), ఎస్.ఎస్.రాజమౌళి (SS Rajamouli)ల సినిమా #SSMB29 నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చేసింది. ఈ మూవీలో కీలక పాత్రలో నటిస్తున్న పృథ్వీరాజ్ సుకుమారన్ ఫస్ట్ లుక్‌ను తాజాగా విడుదల చేశారు. అదిరిపోయే రేంజ్లో ఉన్న ఈ పోస్టర్‌ను చూస్తుంటే ఆయన మరోసారి ఈ మూవీలో సరికొత్తగా కనిపించనున్నట్లు తెలుస్తోంది.కుంభ పాత్ర గురించి రాజమౌళి కామెంట్#SSMB29 సినిమాలో కుంభ పాత్రలో పృథ్వీరాజ్(Prithviraj Sukumaran) కనిపించన్నున్నారని చిత్ర యూనిట్ ప్రకటించింది. ఒక వీల్‌చైర్‌లో కూర్చోని రోబో సాయంతో ఒక భారీ ఫైట్ సీన్లో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రముఖ శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్‌ను ప్రేరణగా తీసుకుని ఈ పాత్రను డిజైన్ చేశారా అనిపించేలా ఉంది. పృథ్వీరాజ్ పాత్ర గురించి రాజమౌళి ఇలా చెప్పారు. 'పృథ్వీతో మొదటి షాట్ చిత్రీకరించిన తర్వాత, నేను అతని దగ్గరకు వెళ్లి, మీరు నాకు తెలిసిన అత్యుత్తమ నటులలో ఒకరు అని చెప్పాను. ఈ దుష్ట, క్రూరమైన, శక్తివంతమైన విరోధి కుంభకు ప్రాణం పోయడం సృజనాత్మకంగా చాలా సంతృప్తికరంగా ఉంది. పృథ్వీకి ధన్యవాదాలు.' అంటూ ఆయన ఒక పోస్ట్ చేశారు. #GlobeTrotter హ్యాష్‌ట్యాగ్‌తో ఈ మూవీని ప్రపంచవ్యాప్తంగా రాజమౌళి తీసుకెళ్తున్నారు. నవంబర్ 15న ఒక భారీ ఈవెంట్‌తో #SSMB29 సినిమా టైటిల్‌తో పాటు మహేష్ బాబు ఫస్ట్‌లుక్‌ను విడుదల చేయనున్నారు. ఈ క్రమంలోనే సుమారు 2 నిమిషాలకు పైగా ఉండే ఒక వీడియోను కూడా అభిమానులతో పంచుకోనున్నారు. ఈ కార్యక్రమాన్ని లైవ్‌లో జియోహాట్ స్టార్ (JioHotstar)లో చూడొచ్చు. ఈ వేడుక కోసం ఇప్పటికే ప్రియాంకచోప్రా హైదరాబాద్ చేరుకున్నారు. After canning the first shot with Prithvi, I walked up to him and said you are one of the finest actors I’ve ever known.Bringing life to this sinister, ruthless, powerful antagonist KUMBHA was creatively very satisfying.Thank you Prithvi for slipping into his chair…… pic.twitter.com/E6OVBK1QUS— rajamouli ss (@ssrajamouli) November 7, 2025 -
ఓపక్క క్లైమాక్స్ షూటింగ్.. ఫస్ట్ లుక్ రిలీజ్..: రాజమౌళి
సినీ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న సినిమా #SSMB29. దర్శకధీరుడు రాజమౌళి (SS Rajamouli) డైరెక్షన్లో సూపర్‌స్టార్ మహేశ్‌బాబు (Mahesh Babu) కథానాయకుడిగా నటిస్తున్న ఈ మూవీ షూటింగ్ ఎప్పుడో మొదలైంది. గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా కథానాయికగా నటిస్తుండగా పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఈ సినిమా గురించి ఒక్క అప్డేట్ వదిలినా సరే.. సోషల్ మీడియాను షేక్ చేస్తామని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. క్లైమాక్స్ షూటింగ్అలాంటి సమయంలో జక్కన్న కీలక అప్డేట్ ఇచ్చారు. పృథ్వీరాజ్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. 'మూడు ప్రధాన పాత్రలతో క్లైమాక్స్ షూటింగ్ జరుగుతోంది. మరోవైపు #GlobeTrotter ఈవెంట్ కోసం పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మీరు ఇంతకుముందెన్నడూ చూడనివిధంగా ఈ ఈవెంట్‌ని జరపాలనుకుంటున్నాం. నవంబర్ 15న ఈ కార్యక్రమాన్ని మీరంతా ఎంజాయ్ చేస్తారు. అయితే ఈ వారమంతా మీరు హుషారుగా ఉండేందుకు కొన్ని సర్ప్రైజ్లు ఇవ్వబోతున్నాం.. మొదటగా.. ఈరోజు పృథ్వీరాజ్ ఫస్ట్ లుక్ విడుదల చేస్తున్నాం' అని ట్వీట్ చేశారు.ఓటీటీలో లైవ్ఇది చూసిన అభిమానులు మీరు వారమంతా ఇలాంటి సర్ప్రైజ్లు ఇస్తానంటే అంతకన్నా ఇంకేం కావాలని కామెంట్లు చేస్తున్నారు. నవంబర్ 15న జరిగే ఈవెంట్లో సినిమా టైటిల్‌తో పాటు మహేశ్‌బాబు ఫస్ట్ లుక్ కూడా విడుదల చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే ఈ ఈవెంట్‌ను అందరూ చూసేందుకు వీలుగా ఓటీటీ ప్లాట్‌ఫామ్ జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారట! Amidst the climax shoot on set with all three, there’s a lot more prep happening around the #GlobeTrotter event, as we’re trying something far beyond what we’ve done before…Can’t wait for you all to experience it on Nov 15th. Leading up to it, we’re filling your week with a…— rajamouli ss (@ssrajamouli) November 7, 2025 చదవండి: The Girlfriend: రష్మిక ‘ది గర్ల్‌ఫ్రెండ్’ మూవీ రివ్యూ -
SSMB29 టైటిల్ లాక్! బ్లాస్ట్ అవుతున్న సోషల్ మీడియా
-
మరో బాహుబలి వచ్చేస్తోంది.. లేటేస్ట్ టీజర్ చూశారా?
దర్శకధీరుడు రాజమౌళి సృష్టించిన మహిస్మతి సామ్రాజ్యం మరోసారి టాలీవుడ్ ప్రేక్షకులను అలరించనుంది. ఇటీవలే బాహుబలి ది ఎపిక్ పేరుతో మీ ముందుకొచ్చారు. ఈ మూవీ అక్టోబర్ 31న విడుదలై ఆడియన్స్ ఆదరణ దక్కించుకుంది. ఈ నేపథ్యంలో మరో బాహుహలి చిత్రం ముందుకొస్తుంది. తాజాగా ఈ మూవీ టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. తెలుగుతో పాటు హిందీ, తమిళ భాషల్లో టీజర్‌ను విడుదల చేశారు. ఈ బాహుబలి యానిమేషన్ మూవీతో ప్రేక్షకుల సరికొత్త అనుభూతిని అందించనున్నారు మేకర్స్. బాహుబలి ది ఎటర్నల్ వార్ పార్ట్-1 పేరుతో ఈ సినిమాను రూపొందించారు. తాజాగా టీజర్ రిలీజ్ చేయగా.. యానిమేషన్ సీన్స్ ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ యానిమేషన్ చిత్రాలకు ప్రముఖ అవార్డ్ గ్రహీత, డైరెక్టర్ ఇషాన్ శుక్లా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలకు రాజమౌళి సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మాతలుగా ఉన్నారు. Amarendra Baahubali’s death wasn’t his End…it was the beginning of something Eternal. 🔥#BaahubaliTheEternalWar Teaser out now!Telugu: https://t.co/sj4FkCLo5sHindi: https://t.co/waTg71bKIeTamil: https://t.co/6YYjTrc4RD#Baahubali @ssrajamouli #Prabhas @meramyakrishnan… pic.twitter.com/qDdERcMX7e— Baahubali (@BaahubaliMovie) November 4, 2025 -
జక్కన్న ప్లాన్ అదుర్స్.. భారతీయ సినీ చరిత్రలోనే తొలిసారి!
సినిమాను తెరకెక్కించడమే కాదు..దాన్ని జనాలకు రీచ్ అయ్యేలా ప్రచారం చేయడంతో రాజమౌళి(SS Rajamouli) దిట్ట. ఎలా ప్రమోషన్స్ చేస్తే ఒక సినిమా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది? ఎలాంటి ఈవెంట్స్ పెడితే సీనీ ప్రేక్షకులు ఆకర్షితులవుతారు? అనే విషయం జక్కన్నకు బాగా తెలుసు. అంతేకాదు తన ప్రచారాన్ని ఎలా సొమ్ము చేసుకోవాలో కూడా ఆయన తెలిసినట్లుగా మరెవరికీ తెలియదేమో. బాహుబలి, ఆర్ఆర్ఆర్ చిత్రాలకు జక్కన చేసిన ప్రమోషన్స్ చాలా ప్లస్ అయ్యాయి. దేశవ్యాప్తంగా ఆయన నిర్వహించిన ఈవెంట్స్ రిలీజ్‌కు ముందే సినిమాపై హైప్‌ని క్రియేట్ చేశాయి. ఇప్పుడు మహేశ్‌బాబు సినిమా(SSMB29)ను కూడా స్ట్రాటజీని అప్లే చేయబోతున్నారు. ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో ప్రచార కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్లాన్ చేశారట. టైటిల్ అనౌన్స్మెంట్ మొదలు..టీజర్, ట్రైలర్.. ఇలా పలు ఈవెంట్లను ప్రపంచవ్యాప్తంగా నిర్వహించబోతున్నారు. ఈ నెల 15న సినిమా టైటిల్‌ని ప్రకటించబోతున్నారు. ఈ ఈవెంట్‌ని హైదరాబాద్‌లోని రామోజీఫిల్మ్ సిటీలో నిర్వహించబోతున్నారు.భారీ ధరకు ప్రచార రైట్స్జక్కన్న ఏం చేసిన కొత్తగా ఉంటుంది. అలాగే ప్రతీదీ బడ్జెట్‌ని దృష్టిలో పెట్టుకొనే చేస్తాడు. ప్రమోషన్స్‌కి భారీగా ఖర్చు చేస్తున్న జక్కన్న.. ఆ సొమ్ముని కూడా తిరిగి నిర్మాతకు అప్పగిస్తున్నాడు. ఈ మూవీ ప్రమోషన్ రైట్స్‌ని ప్రముఖ ఓటీటీ సంస్థ జియో హాట్‌స్టార్‌కి అమ్మేశారు. భారీ ధరకు జియోస్టార్ ఈ రైట్స్‌ని కొనుగోలు చేసినట్లు సమాచారం. టైటిల్ అనౌన్స్మెంట్ ఈవెంట్ మొదలు.. ఈ సినిమాకు సంబంధించిన అన్ని ఈవెంట్స్‌ని జియోస్టార్‌కు విక్రయించి..ఈ రూపంలోనూ నిర్మాతకు భారీ సొమ్ముని అందించాడట. ఇప్పటివరకు ఏ సినిమా టైటిల్ రివిల్ కార్యక్రమానికి సంబంధించిన హక్కులను ఇలా ఓటీటీ సంస్థలు కొనుగోలు చేయలేదు. కానీ తొలిసారి మహేశ్ బాబు- రాజమౌళి సినిమా విషయంలోనే ఇలా జరగటం విశేషం.(చదవండి: 100 కోడిగుడ్లతో కొట్టించుకున్న స్టార్ హీరో.. ఒక్క మాట అనలేదు!)ఈ నెల 15న జరిగే టైటిల్ రిలీజ్ ఈవెంట్‌కి దాదాపు లక్ష మంది వస్తారని అంచనా వేస్తున్నారు. ఈ గ్లింప్స్ ని ప్రదర్శించడానికి రామోజీ ఫిల్మ్ సిటీలో ఓ భారీ తెర ఏర్పాటు చేస్తున్నారట. భారతీయ సినీ చరిత్రలో ఇంతవరకు జరగని రీతిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారట.టైటిల్ ఇదేనా.. రాజమౌళి ఒక సినిమాను ప్రకటించినప్పుడే వర్కింగ్ టైటిల్‌ని ప్రకటిస్తాడు. అదే టైటిల్‌ని సినిమాకు పెట్టి..అధికారికంగా వెల్లడిస్తాడు. కానీ మహేశ్ బాబు సినిమా టైటిల్ విషయంలో జక్కన్న గోప్యత పాటించాడు. సినిమా పేరు గురించి ఇంతవరకు ఎక్కడ ప్రస్తావించలేదు. కానీ ‘వారణాసి’అనే టైటిల్‌ని పెట్టబోతున్నట్లు ఆ మధ్య నెట్టింట వైరల్ అయింది. అయితే ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసే సినిమాకు అలాంటి సింపుల్ టైటిల్ పెట్టరని చాలా మంది కొట్టిపారేశారు. (చదవండి: 'రాజాసాబ్' వాయిదా రూమర్స్.. క్లారిటీ ఇచ్చిన నిర్మాత)మహేశ్ ఫ్యాన్స్ కూడా పెదవి విరిచారు. కానీ ఈ సినిమాకు ‘వారణాసి’నే టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ నెల 15న ఇదే టైటిల్‌ని ప్రకటిస్తారట. ఇప్పటికే ఈ పేరుని మరో నిర్మాత ఫిలిం చాంబర్లో రిజిస్టర్ చేయించుకొన్నాడు . ఆయన అనుమతి కోసం ప్రయత్నిస్తున్నారట. ఒకవేళ అది కుదరకపోతే..‘వారణాసి’ ముందో లేదా వెనకాలో ఏదో ఒక పదాన్ని యాడ్ చేసి నవంబర్ 15న టైటిల్‌ని ప్రకటిస్తారు. టైటిల్ కోసం మహేశ్ ఫ్యాన్స్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది సినీ ప్రేక్షకులు ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. -
'బాహుబలి' లేకపోతే ఆ సినిమాలు తీసేవాడిని కాదు: మణిరత్నం
పదేళ్ల క్రితం థియేటర్లలోకి వచ్చిన 'బాహుబలి'ని ఇప్పుడు రీరిలీజ్ చేశారు. రెండు భాగాల్ని కలిపి ఒక్కటిగా చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. వీకెండ్ అయ్యేసరికి ఏకంగా రూ.25 కోట్ల కలెక్షన్స్ వచ్చాయని అంటున్నారు. ఇది నిజమైతే మాత్రం రికార్డే. ఎందుకంటే రీ రిలీజ్ మూవీస్‌కి ఈ రేంజు వసూళ్లు ఎప్పుడూ రాలేదు. మరోవైపు ప్రముఖ దర్శకుడు మణిరత్నం.. 'బాహుబలి' లేకపోతే తాను ఆ సినిమాల్ని తీసేవాడిని కాదని చెబుతున్నా ఓ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.(ఇదీ చదవండి: 'వార్ 2' ఫ్లాప్ దెబ్బకు నిర్మాత షాకింగ్ నిర్ణయం)ఏంటి విషయం?'బాహుబలి' సినిమా మన దేశంలో సరికొత్త ట్రెండ్ సృష్టించింది. తెలుగు మూవీకి పాన్ ఇండియా మార్కెట్ క్రియేట్ చేయడంతో పాటు ఓ కథని రెండు భాగాలుగా కూడా చెప్పొచ్చనే దారిని దర్శకులకు చూపించింది. గతంలో అంటే 2022లో ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ పేరుతో ఓ సదస్సు జరిగింది. ఇందులో మాట్లాడిన డైరెక్టర్ మణిరత్నం.. 'బాహుబలి' లేకపోయింటే తాను 'పొన్నియిన్ సెల్వన్' తీసేవాడిని కాదని అన్నారు.''బాహుబలి' లేకపోతే 'పొన్నియిన్ సెల్వన్' లేదు. రాజమౌళి తన సినిమాను రెండు భాగాలుగా తీయకపోతే నేను ఈ చిత్రాన్ని తీసేవాడిని కాదు. ఇదే విషయాన్ని నేను రాజమౌళిని కలిసినప్పుడు చెప్పాను. రాజమౌళి మన సినిమాలకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కేలా చేశారు. ఆయన అలా చేయడం వల్లే మేము కూడా ఒక సినిమాను రెండు భాగాలుగా తీయగలిగాం' అని మణిరత్నం చెప్పారు. పాత వీడియోనే అయినప్పటికీ అది ఇప్పుడు మరోసారి వైరల్ అవుతోంది.(ఇదీ చదవండి: ఇండస్ట్రీ వదిలేస్తా.. రాజేంద్రప్రసాద్ ఇప్పుడేమంటారు?)If Rajamouli hadn’t made #Baahubali, I wouldn’t have made #PonniyinSelvan. He showed that Indian movies can be made on a big scale and still win hearts. Thank you, #Rajamouli, for the inspiration.:– Director Mani Ratnampic.twitter.com/hJ4CKQvtbo— Milagro Movies (@MilagroMovies) November 3, 2025 -
బాహుబలి రాకెట్ సక్సెస్.. గర్వంగా ఉందన్న రాజమౌళి
భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరోసారి తన శక్తిని చాటుకుంది. బాహుబలి రాకెట్ (ఎల్వీఎం3-ఎం5)ను విజయవంతంగా ప్రయోగించింది. నవంబర్ 2న శ్రీహరి కోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఎల్వీఎం3-ఎం5 ద్వారా సీఎంఎస్-03 శాటిలైట్‌ను నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. ఈ కమ్యూనికేషన్ శాటిలైట్ పూర్తిగా భారతదేశంలో తయారుకావడం విశేషం. రాకెట్ సక్సెస్.. రాజమౌళి హర్షంఎల్వీఎం3-ఎం5 రాకెట్ సుమారు 4,410 కేజీలు బరువుంది. ఇది భారత భూభాగంతో సహా సముద్ర ప్రాంతంలోనూ అన్ని వేళల్లో సేవలందిస్తుంది. ఈ ఉపగ్రహం దాదాపు 15 ఏళ్ళు పాటు పనిచేస్తుందని ఇస్రో శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ ప్రయోగం విజయవంతం కావడంపై దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli) హర్షం వ్యక్తం చేశాడు.నిజంగా మాకు గర్వకారణంఅత్యంత బరువైన కమ్యూనికేషన్ శాటిలైట్ CMS-03 విజయవంతమవడం ఆనందకరం. భారతదేశ శక్తిసామర్థ్యాలను అంతరిక్షంలోనూ చాటిచెప్తున్నందుకు గర్వంగా ఉంది. బాహుబలి.. ఈ పేరుకున్న బలం, దమ్ము అలాంటిది! ఇస్రో శాస్త్రవేత్తలు ఈ రాకెట్‌కు బాహుబలి అని పేరు పెట్టడం పట్ల మా బాహుబలి టీమ్ ఎంతో సంతోషంగా ఉన్నాం. ఇది నిజంగా మాకు గర్వకారణం అని రాజమౌళి ట్వీట్ చేశాడు. Congratulations to #ISRO on the successful launch of the heaviest communication satellite CMS-03 today! A proud moment for India showcasing our technological strength and self-reliance in space exploration. Onwards and upwards! 🇮🇳🚀Our entire Baahubali team is elated as @ISRO… pic.twitter.com/Ppcso76Mmu— rajamouli ss (@ssrajamouli) November 2, 2025చదవండి: ఫ్యామిలీలో కొత్త మెంబర్.. బుల్లితెర జంట పోస్ట్ -
మహేశ్ బాబు సినిమా ఈవెంట్.. ఓటీటీలో లైవ్
మహేశ్‌బాబు(Mahesh Babu) అభిమానులు గుంటూరు కారం సినిమా తర్వాత ఆయన్ను వెండితెరపై మళ్లీ చూసేందుకు ఆశ పడుతున్నారు. ఈ క్రమంలో రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న SSMB29 ప్రాజెక్ట్ అప్డేట్ కోసం వారు ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా ఇప్పటికే నాలుగు షెడ్యూల్ పైగానే పూర్తి చేసుకుంది. ఒరిస్సా, కెన్యా, వంటి ప్రదేశాల్లో ఈ చిత్రం షూటింగ్ జరుపుకుంది. నైరోబి, టాంజానియాల్లో కొత్త షెడ్యూల్ కోసం ప్లాన్ చేస్తోంది. అయితే, నవంబర్ 16న సినిమా టైటిల్‌తో పాటు మహేశ్ ఫస్ట్ లుక్ విడుదల చేయనున్నారు. అందుకోసం గ్రాండ్‌గా ఒక కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.SSMB29 ప్రాజెక్ట్ గురించి నవంబర్ 16న హైదరాబాద్‌లో ఒక భారీ ఈవెంట్‌ను ఏర్పాటు చేయాలని రాజమౌళి ఉన్నారట. సినిమా టైటిల్ గ్లింప్స్ వీడియోను ఆవిష్కరించడానికి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయనున్నారని తెలుస్తోంది. అయితే, ఈ కార్యక్రమాన్ని అందరూ చూసేందుకు వీలు ఉండేందుకు ప్రముఖ OTT ప్లాట్‌ఫామ్ జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయనుందట. ఈ అంశం గురించి త్వరలో అధికారికంగా ప్రకటన కూడా రావచ్చని తెలుస్తోంది. ఈ కార్యక్రమంలో మహేష్ బాబుతో పాటు ప్రియాంక చోప్రా , పృథ్వీరాజ్ సుకుమారన్ వంటి స్టార్స్‌తో పాటు మరికొందరు సెలబ్రిటీలు పాల్గొననున్నారని సమాచారం.ఇండియన్ సినిమా చరిత్రలో ఇప్పటివరకు చూడని సరికొత్త ప్రపంచాన్ని రాజమౌళి చూపించబోతున్నారు. శ్రీ దుర్గా ఆర్ట్స్ పతాకంపై కె.ఎల్.నారాయణ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ చిత్రం 2027 ప్రారంభంలో విడుదల చేయాలని చూస్తోంది. -
ఇచ్చిన మాట నిలబెట్టుకోండి.. రాజమౌళితో మహేశ్ బాబు
మహేశ్ బాబు- ఎస్ఎస్ రాజమౌళి సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఎదురుచూస్తున్నారు. నవంబర్‌లో #SSMB29 అప్డేట్ ఇస్తామని గతంలోనే జక్కన్న ఒక పోస్ట్ చేశారు. సినిమా టైటిల్‌తో పాటు మహేశ్ ఫస్ట్ లుక్ విడుదల చేస్తామని చెప్పడంతో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే, నవంబర్ మొదలు కావడంతో సోషల్ మీడియాలో #noveMBerwillbehiSStoRic, #noveMBer వంటి హ్యాష్‌ట్యాగ్స్ వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలోనే మొదట మహేశ్ ఒక ట్వీట్ వేశారు. ఆ తర్వాత రాజమౌళి నుంచి రిప్లై వచ్చింది. అలా ఇద్దరి మధ్య ట్వీట్ వార్ మొదలైంది.#SSMB29 అప్డేట్ కోసం 'ఆల్రెడీ నవంబర్ వచ్చేసింది' అని మహేశ్‌బాబు ట్వీట్ వేశారు.. తాను కూడా ఎదురుచూస్తున్నట్లు కళ్ల ఎమోజీ పెట్టారు. దానికి రాజమౌళి కూడా ఫన్నీగా 'అవును, నవంబర్ వచ్చేసింది. ఈ నెలలో ఏ సినిమాకి రివ్యూ ఇద్దాం అనుకుంటున్నావ్' అంటూ పంచ్ వేశారు. దీంతో మహేశ్ కూడా 'మీరు ఎప్పటి నుంచో తెరకెక్కిస్తున్న మహాభారతం సినిమాకు ఇద్దాం అనుకుంటున్నాను' అంటూ రిటర్న్ పంచ్ ఇచ్చారు.అయితే, మహేశ్ అసలు విషయానికి వద్దాం అంటూ.. 'ముందుగా నవంబర్‌లో మీరు మాకు ఒక హామీ ఇచ్చారు. దయచేసి ఆ మాట నిలబెట్టుకోండి' అని కోరారు. దీంతో జక్కన్న కూడా 'సరే మహేశ్.. నవంబర్ మొదలైంది ఇప్పుడే కదా.. మేము తప్పకుండా ఒక్కొక్కటిగా వెల్లడిస్తాం' అని సమాధానం ఇచ్చారు.ఇంకా ఎంత సమయం కావాలి సార్ అంటూ జక్కన్నకు మరో ట్వీట్ వేశారు మహేశ్.. '2030లో స్టార్ట్ చేద్దామా..? మన దేశీ గర్ల్ ప్రియాంక చోప్రా జనవరి నుంచే హైదరాబాద్‌లోని ప్రతి స్ట్రీట్‌లో తనకు నచ్చిన స్టోరీలను ఇన్‌స్టాలో పోస్ట్ చేస్తోంది' అంటూ ప్రియాంక చోప్రాను ట్యాగ్ చేసి మహేశ్ బాబు సెటైర్లు వేశారు.బ్లైండ్‌గా ఏసేస్తా అంటూ ప్రియాంక ఎంట్రీ'హలో హీరో.. సెట్లో నువ్వు నాతో చెప్పిన కథలన్నీ లీక్ చేయాలనుకుంటున్నావా ఏంటి.. నేను ఒక్కసారి మైండ్‌లో ఫిక్స్ అయితే బ్లైండ్‌గా ఏసేస్తా..' అంటూ మహేశ్ బాబుకు అతని స్టైల్లోనే ప్రియాంక చోప్రా రిప్లై ఇచ్చింది. ఇంతలో జక్కన్న ఎంట్రీ ఇచ్చేసి 'ప్రియాంక చోప్రా ఇందులో నటిస్తుందనే విషయాన్ని ఎందుకు బయటపెట్టేశావ్ మహేశ్.. మంచి సర్ప్రైజ్ని ఇద్దాం అనుకుంటే నువ్వు నాశనం చేశావ్' అంటూ పంచ్ వేశారు. ఇంతలో మహేశ్ కూడా మరో పంచ్‌తో తెరపైకి వచ్చారు. 'మీ ఉద్దేశంలో పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా ఒక సర్ప్రైజ్ అని చెప్పాలనుకుంటున్నావా..' అని మరో లీక్ ఇచ్చేశారు. అప్పుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా ఒక పోస్ట్ ఇలా చేశారు. 'రాజమౌళి సార్.. నేను ఇలాగే తరుచుగా వెకేషన్ కోసం హైదరాబాద్‌కు వస్తూ ఉంటే.. నా కుటుంబం నన్ను అనుమానించడం స్టార్ట్ చేస్తారు' అని ముగిస్తారు. ఇలా సరదాగా ట్వీట్లతోనే ఈ సినిమాలో నటిస్తున్న వారిని తొలిసారి పరిచయం చేశారు.It’s November already @ssrajamouli 👀— Mahesh Babu (@urstrulyMahesh) November 1, 2025 -
కాంట్రాక్టర్ పేరు రాజమౌళి.. 'బాహుబలి'పై ప్రశాంత్ నీల్ రివ్యూ
గత రెండు మూడేళ్ల నుంచి తెలుగు రాష్ట్రాల్లో రీ రిలీజ్ సినిమాల ట్రెండ్ కాస్త ఎక్కువగానే ఉంది. అయితే ఒకరిద్దరు హీరోల మూవీస్ మినహా మిగిలినవి పెద్దగా వర్కౌట్ అయిన దాఖలాలు లేవు. ఇప్పుడు 'బాహుబలి ద ఎపిక్' పేరిట.. దర్శకుడు రాజమౌళి సరికొత్త ట్రెండ్ సృష్టించినట్లే కనిపిస్తున్నాడు. ఎందుకంటే ఇప్పటివరకు రీ రిలీజ్ అంటే ఫ్యాన్స్, సగటు ప్రేక్షకుల హంగామా మాత్రమే ఉండేది. బాహుబలి రీ రిలీజ్‌కి మాత్రం సెలబ్రిటీలు రివ్యూలు ఇస్తున్నారు.ఓవర్సీస్లో 'బాహుబలి ఎపిక్' గురువారం రిలీజ్ కాగా.. మహేశ్ బాబు కొడుకు గౌతమ్ దీన్ని చూసి ఎలాంటి అనుభూతి కలిగిందో చెప్పాడు. ఇప్పుడు డైరెక్టర్ ప్రశాంత్ నీల్.. సోషల్ మీడియాలో తనదైన శైలిలో రివ్యూ ఇచ్చాడు. రాజమౌళికి ఓ రేంజ్ ఎలివేషన్ ఇచ్చాడు. ప్రశాంత్ నీల్‌కి సొంతంగా సోషల్ మీడియా అకౌంట్స్ లేకపోవడంతో ఇతడి భార్య లిఖిత తన ఇన్ స్టా స్టోరీలో రివ్యూని పోస్ట్ చేసింది.(ఇదీ చదవండి: ఓటీటీలో హిట్ వెబ్ సిరీస్.. తెలుగు ట్రైలర్ రిలీజ్)'ఓ రోడ్‌కు మరమ్మత్తులు చేయాల్సి వచ్చింది. ఆ బాధ్యతని ఓ కాంట్రాక్టర్‌కి అప్పగించారు. కానీ మరమ్మత్తులు వేయమని చెప్పిన రోడ్డుని ఏకంగా 16 లైన్ల సూపర్ ఎక్స్‌ప్రెస్ హైవేగా మార్చాడు. ఆ రోడ్ పేరు పాన్ ఇండియా, ఆ కాంట్రాక్టర్ పేరు ఎస్ఎస్ రాజమౌళి. బాహుబలి టీమ్ మొత్తానికి నా అభినందనలు. ఓ తరం కోసం కలలు కన్నందుకు కృతజ్ఞతలు' అని ప్రశాంత్ నీల్ తనదైన రివ్యూ ఇచ్చేశాడు.2015, 2017లో రిలీజైన బాహుబలి రెండు భాగాల్ని ఒక్కటిగా చేసిన 'ద ఎపిక్' పేరిట ఇప్పుడు రీ రిలీజ్ చేశారు. 3 గంటల 45 నిమిషాల నిడివితో దీన్ని థియేటర్లలోకి తీసుకొచ్చారు. చాలావరకు సీన్లని తీసేశారు. అదే టైంలో శివుడు(ప్రభాస్).. బాహుబలి రాజ్యంలో అడుగుపెట్టే సమయంలో నాజర్ పాత్రతో చెప్పించే సీన్లని కొత్తగా జోడించారు. అలానే చివరలో 'బాహుబలి' పేరుతో ఓ యానిమేటెడ్ మూవీ 2027లో రిలీజ్ కానుందని చెప్పుకొచ్చారు.(ఇదీ చదవండి: బాక్సాఫీస్‌కి బాహుబలి ‘జ్వరం'.. ఈసారి ఎన్ని రికార్డులో!) -
బాక్సాఫీస్‌కి బాహుబలి ‘జ్వరం'.. ఈసారి ఎన్ని రికార్డులో!
‘జై మాహిష్మతి’ నినాదాలతో మరోసారి థియేటర్స్ దద్దరిల్లాయి. జక్కన్న చెక్కిన కళాఖండం ‘బాహుబలి’ మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రెండు భాగాలను కలిపి ‘బాహుబలి: ది ఎపిక్’పేరుతో నేడు(అక్టోబర్ 31) ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేశారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర ప్రాంతాలతో కూడా భారీగా టికెట్స్ బుక్ అయ్యాయి. హైదరాబాద్‌లో అయితే అన్ని థియేటర్స్ హౌస్‌ఫుల్ అయ్యాయి. తొలిరోజే రూ. 20-25 కోట్లు కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉందనిట్రేడ్ వర్గాల అంచన వేస్తున్నాయి. కొన్ని భారీ బడ్జెట్ చిత్రాలకు కూడా తొలి రోజు ఈ స్థాయి కలెక్షన్స్ రాలేదు. రీరిలీజ్ చిత్రాల్లో ఇదొక రికార్డు అవుతుందని సీనీ పండితులు చెబుతున్నారు. మున్ముందు ‘బాహుబలి: ది ఎపిక్’ ఎన్ని రికార్డులను బద్దలు కొడుతుందో చూడాలి.‘బాహుబలి’అంటే యుద్ధం కాదు...పదేళ్ల క్రితం తెరపైకి వచ్చిన బాహుబలి సినిమా అప్పట్లోనే చరిత్ర సృష్టించింది.దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి రూపోందించిన రీమాస్టర్ వెర్షన్ తిరిగి వచ్చి మళ్లీ అదే మంత్రం వేసింది. విడుదలైన మొదటి రోజు నుంచే అభిమానులు థియేటర్ల ముందు బ్యానర్లు, ఫ్లెక్సీలు, ఫైర్‌వర్క్స్‌తో పండుగ చేసుకుంటున్నారు.‘బాహుబలి’ కథ కేవలం యుద్ధం కాదు అది భావోద్వేగాల కలయిక. రాజమౌళి విజన్, కీరవాణి సంగీతం, ప్రభాస్-రానా యాక్షన్, అనుష్క-తమన్నా నటన...ఇవన్నీ కలిసినప్పుడు తెరపై మళ్లీ మాయ సృష్టించాయి.బాహుబలి ఓ అద్భుతం..బాహుబలి కథ కేవలం యుద్ధం, ప్రతీకారం కాదు.. అది ధర్మం, త్యాగం, ప్రేమ, బాధ్యతలు నిండిన కుటుంబ గాథ.మాహిష్మతి రాజ్యం, అద్భుతమైన సెట్స్, ప్రభాస్ బాహుబలిగా చూపిన గంభీరత, రానా చేసిన భల్లాలదేవ శక్తి... దేవసేన స్వాభిమానం, శివగామి న్యాయపరమైన తాత్వికత..ఇవన్నీ కలగలసిన ఓ అద్భుతమైన భారతీయ చలనచిత్రం.గూస్బంప్స్ మూమెంట్స్..థియేటర్ల వద్ద అభిమానులు చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ఉత్సాహంగా క్యూలైనలో నిలుస్తున్నారు. ట్విటర్, ఇన్స్టాగ్రామ్ అంతా #BaahubaliTheEpic తో ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు పోస్టులు పెడుతున్నారు. ‘ఇప్పటికీ గూస్బమ్స్ వస్తున్నాయి..’ ‘ఎన్ని సార్లు చూసినా కొత్త అనుభూతినిస్తోంది..’ ‘ఇది కేవలం సినిమా కాదు.. మన తెలుగు సినిమా గర్వం..’అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.ఊహించని మలుపులతో త్రీడీ బాహుబలి:ది ఎపిక్ సినిమా ఇంటర్వెల్లో ‘బాహుబలి:ది ఎటర్నల్ వార్’ అంటు కోత్త త్రీడీ యానిమేషన్ టీజర్‌ను లాంచ్ చేశారు. ఇది బాహుబలి ప్రపంచాన్ని కొనసాగిస్తుంది అంటున్నారు రాజమౌళి. రూ. 120 కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని రూపోందించబోతున్నారు. ఇందులో ఊహించని మలుపులు, కొత్త పాత్రలు సంచలనం సృష్టించబోతున్నాయి. ఈ చిత్రానికి ఈషాన్ శుక్లా దర్శకత్వం వహించబోతున్నారు. -
బాహుబలి ఎపిక్‌లో కొత్త సీన్.. అదిరిపోయిందయ్యా!
రాజమౌళి సృష్టించిన కళాఖండం బాహుబలి (Baahubali Movie) వచ్చి పదేళ్లవుతోంది. ఇప్పటికీ దాని క్రేజ్ అలాగే ఉంది. సినిమా ఇండస్ట్రీ చరిత్రలో సువర్ణాక్షరాలతో తన పేరు లిఖించుకున్న బాహుబలి మరోసారి థియేటర్లలో సందడి చేస్తోంది. బాహుబలి రెండు భాగాలను కలిసి 'బాహుబలి: ది ఎపిక్ మూవీ' (Baahubali The Epic Movie)గా శుక్రవారం (అక్టోబర్ 31) రిలీజ్ చేశారు. ఇందులో కొన్ని సీన్లను, పాటల్ని ఎత్తేస్తే.. రెండు భాగాల్లోనూ చూడని కొన్ని కొత్త సీన్లను యాడ్ చేశారు.చచ్చినవాడు ఎలా వస్తాడు?అందులో మహేంద్ర బాహుబలి.. మాహిష్మతి రాజ్యంలో అడుగుపెట్టే సీన్ అద్భుతంగా ఉంది. అతడు చనిపోయాడంటూ బిజ్జలదేవ (నాజర్) చెప్పే డైలాగ్.. మీ అంతు చూడటానికి మళ్లీ వస్తున్నానంటూ బాహుబలి వచ్చే తీరు అదిరిపోయింది. ఆ సీన్లో ఏముందంటే.. బాహుబలి చేతిలో నుంచి తప్పించుకున్న ఓ సైనికుడు రాజ్యానికి వచ్చి.. బాహుబలి బతికే ఉన్నాడంటూ బిజ్జలదేవకి చెబుతాడు. చచ్చినవాడు ఎలా వస్తాడు? గూస్బంప్స్ తెప్పించే సీన్వాడి రక్తం కారికారి భూమిలోకి ఇంకిపోయింది, వాడి శరీరం మంటల్లో కాలి కాలి బూడిదైపోయింది.. వాడి ప్రాణం ప్రాణహిత నది ప్రవాహంలో కొట్టుకుపోయింది.. కాలిన బూడిద గాలిలో చెల్లాచెదురైపోయింది. వాడి ఆయువు అనంతవిశ్వంలో ఆవిరైపోయింది అంటూ పవర్ఫుల్ డైలాగ్స్ చెప్తాడు. సరిగ్గా అదే సమయంలో బాహుబలి రాజ్యంలో అడుగుపెడతాడు. మాహిష్మతి ఊపిరి పీల్చుకో అని దేవసేన చెప్పే డైలాగ్‌తో ఈ సీన్ నెక్స్ట్ లెవల్‌కు వెళ్తుంది. థియేటర్లో ఈ సీన్ చూసేవారి రోమాలు నిక్కబొడుచుకోవడం ఖాయం! ఇంత మంచి సీన్ ఎలా వదిలేశారంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.సినిమాప్రభాస్ హీరోగా నటించిన బాహుబలి రెండు భాగాలుగా వచ్చింది. మొదటి భాగం 2015లో రిలీజవగా రెండో భాగం 2017లో విడుదలైంది. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్‌ను షేక్ చేశాయి. అనుష్క శెట్టి, రమ్య కృష్ణ, తమన్నా, సత్యరాజ్, నాజర్ కీలక పాత్రలు పోషించారు. కీరవాణి సంగీతం అందించాడు. శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మించారు. ఈ రెండు భాగాల సమ్మేళనమే బాహుబలి: ది ఎపిక్. అయితే ఇందులో కిచ్చా సుదీప్తో పాటు కొన్ని సీన్లను, పాటలను తొలగించారు. అయినప్పటికీ 3.45 గంటల నిడివితో బాహుబలి ఎపిక్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. Best scene asla😭🔥#BaahubaliTheEpic pic.twitter.com/La1K6L2HBk— Satyá (@TheMovieBufffff) October 30, 2025The Best Deleted scene ever now witnessed in theater....🙏#Prabhas#BahubaliTheEpic #SSRajamouli pic.twitter.com/k9RMat2vrW— rakeshMk (@rakeshM53243116) October 30, 2025Interview lo cheppadu rajamouli duration valla theesesam ani Super undi scene 💥💥💥#BahubaliTheEpic #Prabhas pic.twitter.com/VPNC7yTV0t— Adhe_Magiccu (@Ade_magiccu) October 30, 2025 చదవండి: ‘బాహుబలి: ది ఎపిక్’ మూవీ రివ్యూ -
రాజమౌళి మాయాజాలం.. బాహుబలి ది ఎపిక్ దుమ్ములేపాడు..
-
‘బాహుబలి: ది ఎపిక్’ మూవీ రివ్యూ
తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ స్ధాయికి తీసుకెళ్లిన చిత్రం ‘బాహుబలి’. ఈ సినిమా మొదటి భాగం 2015లో రిలీజ్ కాగా..రెండో భాగం 2017లో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఇండియన్ బాక్సాఫీస్‌ని షేక్ చేసింది. పదేళ్ల తర్వాత ఇప్పుడు ఈ రెండు సినిమాలు కలిపి ఓకే చిత్రంగా ‘బాహుబలి: ది ఎపిక్’(Baahubali The Epic Review)పేరుతో నేడు (అక్టోబర్ 31) మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఓవర్సీస్తో పాటు ఇక్కడ కూడా ఈ మూవీ ప్రీమియర్స్ ప్రదర్శించారు. తెలుగు సినిమాను గ్లోబల్ బ్రాండ్‌గా మార్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.కథేంటంటే..బాహుబలి కథ అందరికి తెలిసిందే. థియేటర్స్‌తో పాటు టీవీ, ఓటీటీల్లో ఇప్పటికే చాలా సార్లు చూసే ఉంటారు. మాహిష్మతి సామ్రాజ్యపు రాజమాత శివగామి(రమ్యకృష్ణ) ప్రాణత్యాగం చేసి మహేంద్ర బాహుబలి(ప్రభాస్)ని కాపాడుతుంది. ఓ గూడెంలో పెరిగి పెద్దవాడైన మహేంద్ర బాహుబలి.. అవంతిక(తమన్నా)తో ప్రేమలో పడతాడు. ఆమె ఆశయం నెరవేర్చడం కోసం మాహిష్మతి రాజ్యానికి వెళతాడు. అక్కడ బంధీగా ఉన్న దేవసేన(అనుష్క శెట్టి) తీసుకొచ్చి అవంతికకు అప్పజెప్పాలనుకుంటారు. ఈ క్రమంలో అతనికి కొన్ని నిజాలు తెలుస్తాయి. బంధీగా ఉన్న దేవసేన తన తల్లి అని.. భళ్లాలదేవుడు(రానా) కుట్ర చేసి తన తండ్రి అమరేంద్ర బాహుబలిని చంపిచాడనే విషయం తెలుస్తుంది. కట్టప్ప (సత్యరాజ్) సహాయంతో మహేంద్ర బాహుబలి మాహిష్మతి రాజ్యంపై దండయాత్ర చేసి బళ్లాల దేవుడిని అంతం చేస్తాడు. ఇదే ది ఎపిక్ కథ(Baahubali The Epic Review Telugu).విశ్లేషణముందుగా చెప్పినట్లుగా ఇదంతా అందరికి తెలిసిన, చూసిన కథే. పార్ట్ 1 చూసినప్పుడు బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడో తెలియదు. కాబట్టి అంతా పార్ట్ 2 చూశారు. మరి ‘బహుబలి: దిపిక్’ దేని కోసం చూస్తారు? అల్రేడీ చూసి చూసి ఉన్న చిత్రమే కదా అని అంతా అనుకున్నారు. కానీ ఇక్కడే జక్కన మరోసారి మ్యాజిక్ చేశాడు. బోర్ కొట్టకుండా భారీ యాక్షన్ సన్నివేశాలు, ఎలివేషన్స్‌తో కథను చెప్పుకొచ్చాడు. ఆరున్నర గంటల సినిమాను 3.45 గంటలకు కుదించి ప్రేక్షకులకు సరికొత్త ఎక్స్పీరియన్స్ అందించేలా సన్నివేశాలను పేర్చాడు. తెరపై చూస్తుంటే కొత్త సినిమాను చూసిన ఫీలింగే కలుగుతుంది. ఫస్టాప్‌లో పార్ట్ 1 కథని, సెకండాఫ్‌లో పార్ట్ 2 కథను చూపించాడు. ఈ రెండు భాగాల్లో ప్రేక్షకులకు బాగా నచ్చిన సన్నివేశాలన్నింటిని హైలెట్ చేశాడు. ప్రధాన పాత్రల పరిచయ సన్నివేశాలు.. బళ్లాలదేవుడి పట్టాభిషేకం, కాలకేయులతో యుద్ధం..తల నరికే సీన్..ఇవ్వన్నీ తెరపై చూస్తుంటే గూస్బంప్స్ గ్యారెంటీ. రెండు భాగల్లో ఏదో ఒకటి చూసిన వారికి కూడా ఈ సినిమా అర్థమయ్యేలా సీన్లను పేర్చాడు. అవంతిక లవ్‌స్టోరీ సీన్లను కట్ చేసినా..కొత్తగా చూసిన వారికి అర్థమయ్యేలా రాజమౌళి వాయిస్ ఓవర్ ఇచ్చాడు. సుదీప్ కిచ్చతో పాటు కొన్ని కీలకమైన సీన్లను, పాటలను తొలగించినా.. కథలోని ఆత్మను మిస్ కానివ్వకుండా జక్కన్న జాగ్రత్తపడ్డాడు. కీరవాణి రీరికార్డింగ్ కూడా ఈ సినిమాకు ప్రెష్‌నెస్‌ని తీసుకొచ్చింది. అయితే నిడివి మాత్రం కాస్త ఇబ్బంది అనే చెప్పాలి. కనీసం ఇంకో 20 నిమిషాల నిడివిని అయినా తగ్గిస్తే బాగుండేదేమో. మొత్తానికి బాహుబలి 1& 2 లాగే ది ఎపిక్ చిత్రాన్ని కూడా థియేటర్ విజువల్ వండర్లా తీర్చిదిద్దడంలో జక్కన్న వందశాతం సక్సెస్ అయ్యాడు.నటీనటుల పెర్ఫార్మెన్స్ గురించి కొత్తగా చెప్పడానికి ఏముంది? ప్రభాస్, రానాతో పాటు ఇందులో కీలక పాత్రల్లో నటించిన వారంతా తమ తమ కెరీర్‌తో ది బెస్ట్ ఇచ్చారు. ప్రభాస్-అనుష్క జోడీని మరోసారి అలా తెరపై చూస్తుంటే.. రెండు కళ్లు చాలవు అన్నట్లుగా ఉంటుంది. యాక్షన్ సీన్లలో రానా, ప్రభాస్ పోటీ పడి నటించారు. రమ్యకృష్ణ, సత్యరాజ్, తమన్నా, సుబ్బరాజుతో పాటు ప్రతి ఒక్కరు తమ తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతికంగా సినిమా చాలా అద్భుతంగా ఉంది. పదేళ్ల క్రితమే కీరవాణి అద్భుతమైన నేపథ్య సంగీతం అందించాడు. తనదైన బీజీఎంతో కొన్ని సీన్లకు ప్రాణం పోశాడు. వీఎఫెక్స్ అదిరిపోయాయి. అంతకు డబుల్ బడ్జెట్ పెడుతున్న సినిమాలకు కూడా ఈ స్థాయిలో సన్నివేశాలను తీర్చిదిద్దలేకపోతున్నారు. నిర్మాణ విలువలు అద్భుతంగా ఉన్నాయి. మొత్తంగా రీరిలీజ్‌లలో కూడా ‘బహుబలి’ ఓ మైలురాయిగా నిలిచిపోతుందనే చెప్పాలి. -
'పదేళ్లైనా ఎక్కడా తగ్గలేదు'.. రాజమౌళి స్పీచ్ వైరల్
దర్శకధీరుడు రాజమౌళి హైదరాబాద్‌లోని ప్రసాద్ ఐమ్యాక్స్‌లో సందడి చేశారు. బాహుబలి ది ఎపిక్ ప్రీమియర్ షో సందర్భంగా ఆడియన్స్‌ను ఉద్దేశించి మాట్లాడారు. బాహుబలి రిలీజై పదేళ్లయినా ఏ మాత్రం క్రేజ్ తగ్గలేదన్నారు. ఇదంతా మీవల్లే సాధ్యమైందని కామెంట్స్ చేశారు. మహిస్మతి రాజ్యంలోని ప్రజలంతా బాగున్నారా? అంటూ అభిమానులను పలకరించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.మీ అందరి ప్రేమ వల్లే మరోసారి మీ ముందుకు తీసుకొస్తున్నామని రాజమౌళి అన్నారు. పదేళ్లుగా మీరు ఆదరించినందుకు ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. జై మహిస్మతి అంటూ అభిమానుల్లో ఉత్సాహం నింపారు. కాగా.. బాహుబలి రెండు పార్టులను కలిపి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. బాహుబలి ది ఎపిక్(Baahubali: The Epic) పేరుతో విడుదల చేస్తున్నారు. ఈ మూవీ అక్టోబర్ 31న థియేటర్లలో సందడి చేయనుంది. THE DIRECTOR addressing the audience at @PrasadsCinemas PCX screen!! It’s SHOW TIME.. #BaahubaliTheEpic #Baahubali pic.twitter.com/1dY6hj7cYE— Baahubali (@BaahubaliMovie) October 30, 2025 -
‘బాహుబలి: ది ఎపిక్’ ట్విటర్ రివ్యూ
ఇండియన్ సినిమా హిస్టరీలో ‘బాహుబలి’ ఒక చరిత్ర. ఈ మూవీ తొలిభాగం 2015లో రిలీజై బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలవడమే కాదు.. పాన్ ఇండియా చిత్రాలకు పునాదిని వేసింది. ఇక బాహుబలి 2 సృష్టించిన రికార్డుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు ఈ రెండు చిత్రాలు కలిపి ‘బాహుబలి: ది ఎపిక్’(Baahubali: The Epic ) పేరుతో అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఒక్క రోజు ముందే విదేశాల్లో ఈ చిత్రం సందడి చేస్తోంది. ఓవర్సీస్లో ఈ చిత్రం ఈ రోజే రిలీజైంది. సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నారు.(చదవండి: ‘బాహుబలి’కి డిజాస్టర్ టాక్..నిర్మాత బలి అన్నారు: రాజమౌళి)బాహుబలి ది ఎపిక్' విజువల్ వండర్ అని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. రీరిలీజ్ అయినప్పటికీ..తెరపై చూస్తుంటే ఒక కొత్త చిత్రం చూసినట్లుగానే ఉంటుందని చాలా మంది అంటున్నారు. రాజమౌళి చాలా అద్భుతంగా ఎడిట్ చేశారని..క్వాలిటీ అదిరిపోయిందని కామెంట్స్ పెడుతున్నారు. ఈ సినిమాలో ప్రధానమైన సన్నివేశాలకు సంబంధించిన వీడియో క్లిప్పులను ఎక్స్‌లో షేర్ చేస్తూ ‘మిస్ కాకుండా చూడండి’ అని కామెంట్స్ చేస్తున్నారు. ముఖ్యంగా ప్రభాస్ ఎంట్రీ సీన్.. తల నరికే సన్నివేశాలను బాగా వైరల్ చేస్తున్నారు. సూపర్‌స్టార్ మహేశ్ బాబు తనయుడు గౌతమ్ ఘట్టమనేని సైతం ఈ సినిమాపై ప్రశంసలు కురిపించారు.#MaheshBabu Son #GauthamGhattamaneni About #BaahubaliTheEpic 🔥#Prabhas pic.twitter.com/91tefgPyit— Karri Mohan (@Karrimohan_MB) October 30, 2025కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపేశాడో తెలుసుకోవడం కోసం ఇప్పుడు రెండేళ్లు వేచిచూడాల్సిన అవసరం లేదని... ఎడిట్ చేసిన తర్వాత ఈ చిత్రం మరింత అద్భుతంగా ఉందని గైతమ్ అన్నారు. ‘ప్రతి సెకనుకు గూస్బంప్స్ వస్తున్నాయి. ఆ అనుభూతిని మాటల్లో చెప్పలేను. ‘బాహుబలి: ది ఎపిక్’ని చూడడం ఎప్పటికీ మర్చిపోలేని అనుభవం’ అని ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో గౌతమ్ చెప్పుకొచ్చాడు. Legendary stuff Man. Top tier movie experience. Metreon IMAX was screaming. The editing was so fire especially the entire 2nd half was perfect. Loved the new frames and scenes they added especially the Nassar dialogues in Shivudu entry to Mahishmathi🔥🔥 #BaahubaliTheEpic https://t.co/ukIDkWmT1i pic.twitter.com/3yFzmTtlxh— Telugu Smash (@SmashTelug20458) October 30, 2025Watching this scene gives me goosebumps all over my body @ssrajamouli & BB movie is Your best work till now in your movie career.Now I understand why you became no 1 director in Indian cinema.#Prabhas #SSRajamouli #BaahubaliTheEpic #BahubaliTheEpicpic.twitter.com/iMrcxh0X00— Chaitanya (@CallMeChai__) October 30, 2025👇🏻royal entry is reason enough to watch #BaahubaliTheEpic 🥵🔥I still remember when people first started using the term "Majestic Walk", it belonged only to #Baahubali 💥😎Majestic Walk= Baahubali. Always! 🥳#Prabhas absolutely justified that ✅💥🤩pic.twitter.com/9V4OkBAoTE— Manu (@Little_Heartzzz) October 30, 2025A movie that's going to transcend generations 🤙🏻Trimmed very well to make it extremely racy, surreal experience in IMAX, 10 years ayina adhe oopu, adhe high 🥵Every 10 years ilage rerelease chesthu vellandi, memu chusthu untam ❤️#BaahubaliTheEpic #BaahubaliTheEpicOn31stOct pic.twitter.com/Z5bsO7NGjh— LoneBatman (@SampathGNV) October 30, 2025Extraordinary first half #BaahubaliTheEpic Imax version is 🥰❤️ lovable @BaahubaliMovie @ssrajamouli #bahubali #Prabhas pic.twitter.com/95TGBZ0SCE— mfaisall (@Moviesculturee) October 30, 2025Properly optimized for IMAX, no degradation in image or sound quality, doesn't look like a cheap rerelease cash grab. Thank you @ssrajamouli and team for presenting the world of Baahubali for us and the world, AGAIN 🙌🏻🤙🏻🔥#BaahubaliTheEpic #BaahubaliTheEpicOn31stOct pic.twitter.com/y8OxKtkRmw— LoneBatman (@SampathGNV) October 30, 2025 -
‘బాహుబలి కాదు.. ప్రొడ్యూసర్ బలి’ అన్నారు: రాజమౌళి
టాలీవుడ్ ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టిన చిత్రం ‘బాహుబలి’. రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రం రెండు భాగాలుగా రిలీజై ఇండియన్ బాక్సాఫీస్‌ని షేక్ చేసింది. ఈ చిత్రం తర్వాతే వరుసగా పాన్ ఇండియా చిత్రాలు తెరకెక్కించడం ప్రారంభించారు. అంతటి ఘన విజయం సాధించిన ఈ చిత్రానికి తొలుత డిజాస్టర్ టాక్ వచ్చిన సంగతి తెలిసింది. ‘బాహుబలి: ది బిగినింగ్’ విడుదలైన తొలి రోజు సినిమాకు నెగెటివ్ టాక్ వచ్చింది. ఈవినింగ్ షో నుంచి వరుసగా కలెక్షన్స్ పెరగడం ప్రారంభమైంది. ఆ తర్వాత ఎన్ని రికార్డులను బద్దలు కొటిందో అందరికి తెలిసిందే. ఇప్పుడు ఈ చిత్రం రెండు భాగాలు కలిపి ‘బాహుబలి: ది ఎపిక్’(Baahubali: The Epic)పేరుతో రేపు(అక్టోబర్ 31) రీరిలీజ్ కాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా ప్రభాస్, రానాలతో కలిసి రాజమౌళి( SS Rajamouli ) ఓ ఇంటర్వ్యూ చేశారు. ఇందులో ఆయన బాహుబలి రిలీజ్ సమయంలో జరిగిన ఓ సంఘటన గురించి వివరించాడు. 'బాహుబలి: ది బిగినింగ్'(2015) చిత్రాకి మొదట వచ్చిన టాక్ చూసి తాను షాకయ్యానని చెప్పారు.‘బాహుబలి’ రిలీజ్ రోజు ఉదయం 4 గంటల షోకి డిజాస్టర్ టాక్ వచ్చింది. కానీ నాకు ఎక్కడో చిన్న నమ్మకం ఉంది. మరీ అంత బ్యాడ్ సినిమా తీయలేదు. కొన్ని సీన్స్ సరిగ్గా లేవేమో.. అవి జనాలకు నచ్చలేదేమో.. డైరెక్టర్ గా ఫెయిల్ అయ్యానేమో అనుకున్నాను కానీ.. అంత బ్యాడ్ టాక్ వచ్చే సినిమా తీయలేదు అని నాకు లోపల ఒక చిన్న హోప్ ఉండేది. అయితే అది కేవలం 10 శాతం మాత్రమే ఉంది. అప్పట్లో జర్నలిస్టులు, పీఆర్వోలకు కలిపి ఒక వాట్సాప్ గ్రూప్ ఉండేది. అందులో వదిన శ్రీవల్లీ నెంబర్ కూడా ఉంది. అందులో బాహుబలి సినిమాపై తీవ్రమైన విమర్శలు చేశారు. సినిమాలో ప్రభాస్ శివ లింగాన్ని ఎత్తుకున్న ప్లేస్‌లో జండూబాం పెట్టి పోస్టులు పెట్టారు. అసలు వీళ్లు ఏమనుకుంటున్నారు? పెద్ద పుడింగులు అనుకుంటున్నారా? ఒక్కొక్కరికి ఎంత పొగరు.. వీళ్లే పెద్ద గొప్ప సినిమా తీశారని అనుకుంటున్నారా?. ఈ సినిమాతో అయిపోయారు. ఇది బాహుబలి కాదు.. ప్రొడ్యూసర్ బలి.. డిస్ట్రిబ్యూటర్ బలి.. ఎగ్జిబిటర్ బలి' అని గ్రూప్ లో అందరూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఆమె మాకు ఎవరికీ చెప్పకుండా ఒక్కతే ఆ కామెంట్స్ చూస్తూం ఉండిపోయింది. తర్వాత మాకు ఈ విషయం చెప్పింది. అయితే నిర్మాత సాయి మాత్రం ‘టాక్ గురించి పట్టించుకోకండి..కలెక్షన్స్ ఉధృతంగా ఉన్నాయి. అంత బ్యాడ్ టాక్ ఉంటే ఫస్ట్షోకి వసూళ్లు పెరగవు కదా’ అన్నారు. శుక్రవారం సాయంత్రం నుంచే కలెక్షన్స్ పెరగడం ప్రారంభమైయ్యాయి. శనివారం మంచి రెస్పాన్స్ వచ్చింది..అయినా శ్రీవల్లి నమ్మలేదు. ఆదివారం వరకు చూద్దాంలే అనుకున్నాం. సండే ఈవినింగ్ అందరం కలిసిన తర్వాత ‘హమ్మయ్యా’ అనుకున్నాం’ అని రాజమౌళి అన్నారు. -
‘బాహుబలి: ది ఎపిక్’లో డిలీట్ చేసిన సీన్స్, పాటలు ఇవే : రాజమౌళి
బాహుబలి పార్ట్1, పార్ట్ 2 కలిసి ‘బాహుబలి: ది ఎపిక్’( Baahubali: The Epic)పేరుతో రీరిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే. అక్టోబర్ 31న ఈ చిత్రం థియేటర్స్‌లో సందడి చేయబోతుంది. ఆరున్నర గంటల నిడివిని 3:45 గంటలకు కుదించి ‘బాహుబలి: ది ఎపిక్’ని తీర్చిదిద్దారు. ఇప్పటికే రిలీజైన ట్రైలర్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. సినిమాలోని యాక్షన్స్ సీన్స్ అన్నింటిని కవర్ చేస్తూ ట్రైలర్‌ని కట్ చేశారు. అయితే రెండు సినిమాల్లోని సగం సన్నివేశాలను తీసేస్తేనే రన్‌టైమ్ 3.45 గంటలకు చేరింది. ఓ సినిమాకు ఇంత రన్‌టైమ్ ఉండడం కూడా ఇదే తొలిసారి. కానీ అంతకు మించి సన్నివేశాలను డిలీట్ చేసే అవకాశం లేదని రాజమౌళి అంటున్నారు. అప్పటికే ఈ సినిమాలోని కీలక సన్నివేశాలను లేపేశారట. అంతేకాదు సూపర్ హిట్ సాంగ్స్‌ని కూడా డిలీట్ చేసినట్లు రాజమౌళి చెప్పారు. తాజాగా ఆయన ప్రభాస్(Prabhas), రానా(rana Daggubati)లతో కలిసి ఓ స్పెషల్ ఇంటర్వ్యూ చేశాడు. ఇందులో బాహుబలి చిత్రాల షూటింగ్ జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. అలాగే బాహుబలి ది ఎపిక్ లో కనిపించని సన్నివేశాలు ఏంటో కూడా రాజమౌళి చెప్పారు. ప్రభాస్-తమన్నాల మధ్య వచ్చే ప్రేమ సన్నివేశాలను ‘ది ఎపిక్’లో చూడలేమట. అవంతిక లవ్‌స్టోరీ మొత్తాన్ని డిలీట్ చేసినట్లు రాజమౌళి చెప్పారు. అంతేకాదు పచ్చబొట్టేసిన, ఇరుక్కుపో, కన్నా నిదురించరా పాటలను కూడా తొలగించినట్లు రాజమౌళి పేర్కొన్నారు. యుద్ధానికి సంబంధించిన కొన్ని సన్నివేశాలను కూడా తొలగించామని రాజమౌళి అన్నారు. మొత్తంగా అవంతిక పాత్రకు సంబంధించిన సీన్లే ఎక్కువ డిలీట్ చేసినట్లు తెలుస్తోంది. పార్ట్ 1లో పచ్చబొట్టు పాటతో పాటు దానికి ముందు వచ్చే సీన్లు బాగా ఆకట్టుకున్నాయి. -
యానిమేటెడ్ బాహుబలి
‘బాహుబలి 3’ సినిమా కోసం దర్శకుడు రాజమౌళి సన్నాహాలు మొదలుపెట్టనున్నారనే టాక్ ఫిల్మ్‌నగర్‌లో వినిపిస్తోంది. అయితే ఈ చిత్రం లైవ్ యాక్షన్ ఫిల్మ్ కాదట. యానిమేటెడ్ వెర్షన్ లో ఉండబోతుందని, ఈ సినిమాకు విజయేంద్ర ప్రసాద్ కథ అందిస్తారనే ప్రచారం తెరపైకి వచ్చింది. అలాగే ఈ చిత్రానికి రాజమౌళి దర్శకత్వం వహించరట. కానీ, ఆయన పర్యవేక్షణలోనే ‘బాహుబలి 3’ యానిమేటెడ్ వెర్షన్ వస్తుందని ఫిల్మ్‌నగర్ భోగట్టా. ఈ విషయాలపై పూర్తిస్థాయి అధికారిక సమాచారం అందాల్సి ఉంది.ఇదిలా ఉంటే.. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘బాహుబలి’ రెండు భాగాలు (బాహుబలి:ది బిగినింగ్, బాహుబలి: ది కన్ క్లూజన్ ) కలిపి ఒకే భాగంగా ‘బాహుబలి: ది ఎపిక్’గా ఈ నెల 31న రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. ప్రభాస్ హీరోగా నటించగా రానా, అనుష్కా శెట్టి, తమన్నా, సత్యరాజ్, రమ్యకృష్ణ, నాజర్ ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. రాజమౌళి దర్శకత్వం వహించిన ‘బాహుబలి’ సినిమాని శోభు యార్లగడ్డ, దేవినేని ప్రసాద్ నిర్మించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే విడుదలైన ‘బాహుబలి: ది ఎపిక్’ ట్రైలర్‌కి మంచి స్పందన వస్తోంది. -
బాహుబలితో సీరియస్‌గా తీసుకోవడం మానేశా: తమన్నా
రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి చిత్రాలు తెలుగు ప్రేక్షకులను మాత్రమే కాదు..ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులను అలరించాయి. ఈ సినిమాలతో తెలుగు ఖ్యాతిని విశ్వవాప్తం చేశాడు మన దర్శకధీరుడు. ప్రభాస్, రానా ప్రధాన పాత్రల్లో వచ్చిన బాహుబలి-1, బాహుబలి-2 బాక్సాఫీస్‌ను షేక్ చేశాయి. ఈ చిత్రాల్లో తమన్నా భాటియా హీరోయిన్గా మెప్పించింది. అయితే బాహుబలి మరోసారి ప్రేక్షకులను అలరించనుంది. ఈ రెండు చిత్రాలను కలిపి బాహుబలి ది ఎపిక్ పేరుతో రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా అక్టోబర్ 31న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సందర్భంగా మూవీ ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నారు మేకర్స్. ఈ సినిమా కోసం ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన హీరోయిన్ తమన్నా.. బాహుబలి మూవీకి సంబంధించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. ఈ సినిమా నాలో ఆత్మ విశ్వాసాన్ని మరింత పెంచిందని గుర్తు చేసుకుంది. ఈ ప్రాంచైజీలో నటించడం ద్వారా చాలా విషయాలు నేర్చుకున్నానని తెలిపింది. ఒక సినిమాకు మెరుగులు దిద్దేందుకు వీఎఫ్ఎక్స్ను ఎలా ఉపయోగిస్తారో నేర్చుకున్నానని పేర్కొంది.తమన్నా మాట్లాడుతూ.. 'నా కెరీర్లో ఎక్కువగా నేర్చుకున్న సినిమా బాహుబలి. ఈ మూవీ షూటింగ్లో చాలా విషయాలు ఊహించుకోవాల్సి వచ్చింది. అందువల్ల వీఎఫ్ఎక్స్ను ఎలా ఉపయోగిస్తారో చాలా నేర్చుకున్నా. ఇది నాకు ప్రయోగాత్మకంగా ఉండేందుకు అత్మవిశ్వాసాన్నిచ్చింది. అప్పటి నుంచి ప్రజల అభిప్రాయాలను సీరియస్‌గా తీసుకోవడం మానేశా. నన్ను నేను చాలా ఎక్కువగా విశ్వసించడం ప్రారంభించా. ఇది నాపై నాకున్న నమ్మకాన్ని మరింత పెంచిందని' తెలిపింది. కాగా..తమన్నా ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉంది. ఇటీవల విడుదలైన బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్ చిత్రంలో ప్రత్యేక సాంగ్‌లో మెరిసింది. -
'బాహుబలిని కట్టప్ప ఎప్పుడు చంపాడనేది కాదు.. రాజమౌళి ఆసక్తికర కామెంట్స్'
దర్శకధీరుడు రాజమౌళి మరోసారి తన మ్యాజిక్‌తో మరోసారి ప్రేక్షకుల ముందుకుకొస్తున్నారు. బాహుబలి సినిమాలతో తెలుగు ఇండస్ట్రీని ప్రపంచానికి పరిచయం చేసిన రాజమౌళి.. మరోసారి వెండితెరపై ఆవిష్కరించనున్నారు. ఈ రెండు చిత్రాలను ఓకేసారి వీక్షించేలా బాహుబలి ది ఎపిక్(Baahubali : The Epic) పేరుతో రానున్నారు. ఈ మూవీని అక్టోబర్ 31న థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు.ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ కూడా ప్రారంభించారు. ఈ సందర్భంగా రాజమౌళితో హీరోలు ప్రభాస్, రానా కలిసి సరదాగా ఇంటర్వ్యూకు హాజరయ్యారు. తాజాగా ఈ ముగ్గురితో స్పెషల్ ఇంటర్వ్యూకు సంబంధించిన ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇందులో బాహుబలి చిత్రాల షూటింగ్ అనుభవాలను గుర్తు చేసుకున్నారు.ఈ లేటేస్ట్ ప్రోమోలో ఈ పదేళ్లలో మీ అనుభవం ఏంటి? అని రాజమౌళిని ప్రభాస్ అడిగారు. దీనికి బదులిస్తూ.. బాహుబలిని కట్టప్ప ఎప్పుడు చంపాడనేది కాదు.. అతన్ని చంపేందుకు కట్టప్ప సిద్ధపడటమే నన్ను ఎక్కువగా ప్రభావితం చేసిందన్నాడు. అంతేకాకుండా ఈ సినిమాల్లోని సీన్స్‌ను గుర్తు చేసుకుంటూ చాలా సరదాగా కనిపించారు. ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా చూసేయండి. The reunion we've all been waiting for ❤️https://t.co/SdR0HOUXQc @ssrajamouli, #Prabhas and @RanaDaggubati come together to talk about #BaahubaliTheEpic and much beyond! Out very soon! Stay tuned. 😉#BaahubaliTheEpicOn31stOct pic.twitter.com/57ueklNXJa— Baahubali (@BaahubaliMovie) October 27, 2025 -
రాజమౌళికి 'జక్కన్న' పేరు ఎవరు పెట్టారో తెలుసా? (ఫోటోలు)
-
SSMB 29 బిగ్ అప్డేట్.. మూవీ టైటిల్ ఇదే..!
-
మహేశ్‌బాబు, రాజమౌళి మూవీ 'టైటిల్' ఇదేనా..?
ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు మహేశ్‌బాబు(Mahesh Babu), రాజమౌళి సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. SSMB29 పేరుతో ఈ ప్రాజెక్ట్ ఇప్పటికే మొదలైంది. అయితే, ఈ మూవీ టైటిల్ గురించి ఒక చర్చ సోషల్‌మీడియాలో జరుగుతుంది. చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా ఇప్పటికే నాలుగు షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ఒరిస్సా, కెన్యా, వంటి ప్రదేశాల్లో ఈ చిత్రం షూటింగ్ జరుపుకుంది. నైరోబి, టాంజానియాల్లో కొత్త షెడ్యూల్ కోసం ప్లాన్ చేస్తోంది.SSMB29 ప్రాజెక్ట్ నుంచి మహేశ్ ప్రీలుక్ ఫోటోను దర్శకుడు రాజమౌళి(ss rajamouli) పంచుకున్నారు. అయితే, పూర్తి లుక్‌ను నవంబర్‌లో రివీల్ చేస్తామని ఆయన గతంలోనే చెప్పారు. ఈ క్రమంలోనే తాజాగా ఈ చిత్రం టైటిల్ గురించి సోషల్‌మీడియాలో వైరల్ అవుతుంది. ఈ మూవీకి 'వారణాసి'(Vaaranaasi) అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు ఒక హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అవుతుంది. ప్రపంచాన్ని చుట్టేసే ఓ సాహసికుడిగా ఈ మూవీలో మహేశ్‌బాబు కనిపించనున్నారని సమాచారం. దీంతో ఈ టైటిల్ బాగుంటుందని కొందరు చెబుతన్నప్పటికీ మరికొందరు మాత్రం మరో పేరును ఎంపిక చేస్తే బెటర్ అనే అభిప్రాయంలో ఉన్నారు. అయితే, ఇప్పటికే టైటిల్ ట్యాగ్‌లైన్ #Globetrotter అని జక్కన్న ప్రకటించిన విషయం తెలిసిందే.ఇండియన్ సినిమా చరిత్రలో ఇప్పటివరకూ చూడని సరికొత్త ప్రపంచాన్ని రాజమౌళి చూపించబోతున్నారు. మహేష్ సరసన ప్రియాంక చోప్రా నటిస్తుండగా.. పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో భాగం కానున్నారు. శ్రీ దుర్గా ఆర్ట్స్ పతాకంపై కె.ఎల్.నారాయణ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. -
SSMB29: మహేశ్-ప్రియాంకతో ఫోక్ సాంగ్.. టైటిల్ ఇదే!
దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి(SS Rajamouli), సూపర్ స్టార్ మహేశ్ బాబు(Mahesh Babu) కాంబినేషన్లో ఓ సినిమా(SSMB 29) తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. పాన్ వరల్డ్ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రం టైటిల్‌పై ఇప్పటికే చాలా పుకార్లు వచ్చాయి. టైటిల్ ఇదే అంటూ రకరకాల పేర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. కానీ రాజమౌళి మాత్రం ఎప్పటిమాదిరే టైటిల్‌ని గోప్యంగా ఉంచాడు. అంతేకాదు సినిమా షూటింగ్ అప్డేట్ కూడా బయటకు రానివ్వడం లేదు. అయితే తాజాగా ఈ సినిమా టైటిల్ విషయంలో మరో కొత్త పేరు ప్రచారంలోని వచ్చింది. అదే వారణాసి. గతంలో పలు పేర్లు అనుకున్నా.. చివరకు రాజమౌళి ఈ పేరుకే మొగ్గు చూపినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.డివోషనల్ టచ్..ఆర్ఆర్ఆర్ తర్వాత రాజమౌళి..మహేశ్ బాబుతో ఓ సినిమా తెరకెక్కిస్తున్నట్లు ప్రకటించగానే.. ఇదొక జంగిల్ అడ్వెంచరస్ మూవీ అని ప్రచారం జరిగింది. లీకైన షూటింగ్ క్లింప్స్ కూడా అలానే అనిపించాయి. అయితే జక్కన్న మాత్రం ఈ జంగిల్ అడ్వెంచరస్ కథకి డివోషినల్ టచ్ ఇచ్చాడట. ఆగస్ట్‌లో రాజమౌళి రిలీజ్ చేసిన పోస్టర్ చూస్తే కూడా ఇది నిజమనే తెలుస్తుంది. అందులో మహేశ్ మెడలో నంది, త్రిశూలం-ఢమరుకం లాకెట్ ఉంది. అది చూస్తే.. ఇందులో డివోషనల్ ఎలిమెంట్స్ ఉంటాయనే విషయం స్పష్టంగా తెలుస్తోంది. అంతేకాదు ఇప్పుడు ప్రచారంలోకి వచ్చిన ‘వారణాసి’ టైటిల్ కూడా ఆ పుకారుకి మరింత బలం చేకూర్చింది.నవంబర్‌లో క్లారిటీ!రాజమౌళి చిత్రాల టైటిల్స్ యూనిక్‌గా ఉంటాయి. కథకు తగ్గట్లుగా టైటిల్స్ పెట్టడంలో ఆయన దిట్ట. ఇప్పుడు మహేశ్ సినిమాకు వారణాసి అని పెట్టినట్లు తెలుస్తుంది. ఈ టైటిల్ కూడా అన్ని భాషలకు అర్థమయ్యేలా ఉంది. కానీ జక్కన్న ఈ చిత్రాన్ని పాన్ వరల్డ్ స్థాయిలో తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. మరి ఈ టైటిల్ ఇండియా మినహా మిగతా ప్రపంచానికి అర్థమవుతుందా? అక్కడ వేరే టైటిల్‌తో రిలీజ్ చేస్తాడా? అసలు వారణాసి టైటిల్ ఫైనల్ అయిందా లేదా అనేది తెలియాలంటే.. నవంబర్ వరకు ఆగాల్సిందే. (చదవండి: ప్రతి విషయాన్ని ఆన్లైన్లో పంచుకోలేను..రూమర్స్‌పై స్పందించిన రష్మిక)నవంబర్ 16న సినిమా టైటిల్ అనౌన్స్ చేస్తారంటూ నెట్టింట ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఈ షెడ్యూల్ కోసం హైదరాబాద్ శివార్లలో వారణాసి నగరాన్ని తలపించేలా ఓ భారీ సెట్ వేశారట. అందులోనే మేజర్ సన్నివేశాలన్నీ చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది.ఫోక్ సాంగ్?ఈ సినిమాలో ఓ ఫోక్ సాంగ్ కూడా ఉంటుందట. ఇప్పటికే సంగీత దర్శకుడు కీరవాణీ ఓ జానపద బాణీని రాజమౌళికి ఇచ్చాడట. అది ఆయనకు బాగా నచ్చిందట. ట్రయల్ షూట్ కూడా పూర్తయినట్లు తెలుస్తోంది. మహేశ్-ప్రియాంక చోప్రాల మధ్య ఆ సాంగ్ ఉంటుందట. ఆ ఫోక్ సాంగ్‌కి వీరిద్దరు వేసే ఊరమాస్ స్టెప్పులు అదిరిపోతాయట. మొత్తానికి ‘నాటు నాటు’ ని మించేలా ఆ పాటను తీర్చి దిద్దాలని జక్కన్న ప్లాన్ చేస్తున్నాడట. -
బాహుబలి ప్రభాస్ కోసం కాదు.. ఆ హీరో కోసమే.. నిర్మాత ఏమన్నారంటే?
టాలీవుడ్ ప్రపంచానికి పరిచయం చేసిన దర్శకధీరుడు రాజమౌళి. ఆయన డైరెక్షన్లో వచ్చిన బాహుబలి ది బిగినింగ్, బాహుబలి-2 చిత్రాలు తెలుగు సినిమాను ఓ రేంజ్‌కు తీసుకెళ్లాయి. ఆ తర్వాత ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ సైతం ఆస్కార్ ఘనతను సాధించింది. తెలుగు సినిమాను విశ్వవ్యాప్తం చేసిన రాజమౌళి.. మరోసారి బాహుబలిని అభిమానుల ముందుకు తీసుకొస్తున్నారు. రెండు పార్ట్‌లను కలిసి బాహుబలి ది ఎపిక్ పేరుతో రిలీజ్ చేస్తున్నారు. ఈ మూవీ అక్టోబర్ 31న థియేటర్లలో సందడి చేయనుంది.ఈ నేపథ్యంలో బాహుబలి నిర్మాత శోభు యార్లగడ్డ తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరయ్యారు. ఈ సందర్భంగా చాలా రోజులుగా వైరలవుతోన్న వార్తలపై క్లారిటీ ఇచ్చారు. బాహుబలి చిత్రానికి మొదట అనుకున్నది ప్రభాస్‌ను కాదని.. బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ అని గతంలో చాలాసార్లు రూమర్స్ వచ్చారు. ఈ వార్తలపై నిర్మాత శోభు యార్లగడ్డ స్పందించారు. బాహుబలిలో ప్రభాస్ పాత్ర కోసం మేము హృతిక్‌ను సంప్రదించినట్లు ఆన్లైన్లో వచ్చిన వార్తలు విన్నానని అన్నారు.అయితే అవన్నీ కేవలం ఊహగానాలేనని కొట్టిపారేశారు. ఈ సినిమాను కేవలం ప్రభాస్ కోసమే సిద్ధం చేశామని శోభు వెల్లడించారు. ఈ పాత్ర మొదటి నుంచి ప్రభాస్‌ను దృష్టిలో ఉంచుకుని రాశారని తెలిపారు. ఇతర నటులు ఎవరికీ కూడా ఆడిషన్లు నిర్వహించలేదని అన్నారు. ఆ పాత్రకు హృతిక్ రోషన్ కోసం సంప్రదిచారని చాలా కాలంగా వస్తున్న రూమర్స్‌కు చెక్ పెట్టారు నిర్మాత యార్లగడ్డ.హృతిక్‌పై రాజమౌళి వివాదాస్పద కామెంట్స్..కాగా.. బాహుబలి దర్శకుడు రాజమౌళి హృతిక్ రోషన్ పట్ల 2009లో చేసిన కామెంట్స్ వివాదానికి దారితీసిన సంగతి తెలిసిందే. మెహర్ రమేశ్ తెరకెక్కించిన బిల్లా సినిమాను ప్రమోట్ చేస్తున్న కార్యక్రమంలో రాజమౌళి మాట్లాడారు. ధూమ్ -2 రెండేళ్ల క్రితం విడుదలైనప్పుడు బాలీవుడ్ మాత్రమే ఇలాంటి నాణ్యమైన సినిమాలు ఎందుకు చేయగలదా? అని ఆశ్చర్యపోయానని అన్నారు. మనకు హృతిక్ రోషన్ లాంటి హీరోలు లేరా? బిల్లా పాటలు, పోస్టర్, ట్రైలర్ చూశా.. నేను ఒక్క విషయం మాత్రమే చెప్పగలను.. ప్రభాస్ ముందు హృతిక్ రోషన్ అసలు ఏం కూడా కాదు. తెలుగు సినిమాను హాలీవుడ్ స్థాయికి తీసుకెళ్లినందుకు మెహర్ రమేష్ (దర్శకుడు)కి కృతజ్ఞతలు అంటూ రాజమౌళి మాట్లాడారు. ఈ కామెంట్స్ వివాదానికి దారి తీయడంతో రాజమౌళి క్లారిటీ ఇచ్చారు. ఆ తర్వాత నా ఉద్దేశ్యం అతన్ని ఎప్పుడూ కించపరచడం కాదని.. హృతిక్ రోషన్‌ను చాలా గౌరవిస్తానని అన్నారు. -
బాహుబలి-3 గురించి బిగ్ అప్డేట్ ఇచ్చిన నిర్మాత
ప్రభాస్, రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కిన బాహుబలి మరోసారి అద్భుతాలను క్రియేట్ చేసేందుకు రెడీ అవుతుంది. ఈ మూవీ విడుదలై పదేళ్ల సందర్భంగా ‘బాహుబలి: ది ఎపిక్’ (Baahubali: The Epic) పేరుతో ఒకే భాగంలో తీసుకొచ్చారు. అక్టోబర్ 31న విడుదల కానుంది. ఈ క్రమంలో బాహాబలి-3 గురించి వార్తలు వచ్చాయి. ఈ అంశం గురించి తాజాగా నిర్మాత శోభు యార్లగడ్డ (Shobu Yarlagadda) స్పందించారు. ‘బాహుబలి: ది ఎపిక్’ (Baahubali: The Epic) సినిమా చివరిలో ‘బాహుబలి 3’ ప్రకటిస్తారని అందరూ అనుకుంటున్న నేపథ్యంలో నిర్మాత శోభు యార్లగడ్డ ఇలా అన్నారు. అదంతా కేవలం రూమర్స్ మాత్రమేనని చెప్పారు. పార్ట్-3 కోసం చాలా వర్క్ చేయాల్సి ఉందని తెలిపారు. అయితే, బాహుబలి 3 ఖచ్చితంగా జరుగుతోందని ప్రకటించారు. అనుకున్నంత సమయంలో ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం కాకపోవచ్చునని శోభు స్పష్టం చేశారు. ఫైనల్‌గా బాహుబలి 3 గురించి అప్డేట్ రావడంతో అభిమానులు సంతోషిస్తున్నారు.‘బాహుబలి: ది ఎపిక్’ పేరుతో అక్టోబర్ 31న విడుదల కానున్న ఈ చిత్రం రన్‌టైమ్ ఎంత ఉంటుందనేది క్లారిటీ ఇవ్వలేదు. అయితే, కొన్ని పాటలతో పాటు చలావరకు సీన్లు కూడా తొలగిస్తారని ప్రచారం ఉంది. ఏ సన్నివేశాలను కట్ చేస్తారనే ఆసక్తి నెలకొంది. -
'బాహుబలి'ని తొలగించిన ప్రముఖ ఓటీటీ సంస్థ
వెండితెరపైకి బాహుబలి మళ్లీ తిరిగొస్తున్నాడు.. కానీ, ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ మాత్రం తమ ప్లాట్‌ఫామ్ నుంచి తొలగించేసింది. ప్రభాస్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన బ్లాక్‌బస్టర్ మూవీ ‘బాహుబలి’. అనుష్కా శెట్టి, తమన్నా, రానా, రమ్యకృష్ణ, సత్యరాజ్, నాజర్ ఇతర ప్రధానపాత్రల్లో నటించారు. శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మించిన ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదలైన సంగతి తెలిసిందే. తొలిభాగం ‘బాహుబలి: ది బిగినింగ్’ 2015 జూలై 10న, రెండోభాగం ‘బాహుబలి: ది కన్ క్లూజన్ ’ 2017 ఏప్రిల్ 28న విడుదలయ్యాయి. అయితే, బాహుబలి: ది ఎపిక్ పేరుతో ఈ సినిమాను అక్టోబర్ 31న రీరిలీజ్ చేస్తున్నారు. ఇలాంటి సమయంలో నెట్‌ఫ్లిక్స్ ఈ నిర్ణయం తీసుకోవడంతో సోషల్‌మీడియాలో వైరల్ అవుతుంది.బాహుబలి రెండు భాగాలు నెట్‌ఫ్లిక్స్‌లో హిందీ, ఇంగ్లీష్ వర్షన్లో స్ట్రీమింగ్ అవుతున్నాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని భాషలకు చెందిన వారు ఈ చిత్రాన్ని చేసే ఛాన్స్ దక్కింది. కానీ, సెప్టెంబర్ 30న నెట్‌ఫ్లిక్స్ ఈ చిత్రాన్ని తొలగించేసింది. అయితే, ఈ మూవీని ఎందుకు తొలగించారు..? అనే కన్ఫ్యూజన్ ప్రభాస్ ఫ్యాన్స్‌లో కలిగింది. కానీ, కొన్న కథనాల ప్రకారం నెట్‌ఫ్లిక్స్‌తో స్ట్రీమింగ్ హక్కుల ఒప్పందం కాలపరిమితి ముగిసిందని తెలుస్తోంది. ఈ కారణం వల్లే బాహుబలిని ఓటీటీ నుంచి తొలగించారని చెబుతున్నారు. సోషల్‌మీడియాలో మాత్రం అందుకు భిన్నంగా కామెంట్లు కనిపిస్తున్నారు. బాహుబలి రీ రిలీజ్ సందర్భంగా ఇదొక స్ట్రాటజీలో భాగమని అంటున్నారు.బాహుబలి పార్ట్ 1, పార్ట్ 2 సినిమాలు బాహుబలి ది ఎపిక్ అని టైటిల్‌తో రీరిలీజ్ కానున్నాయి. ఈ సినిమా ఐమ్యాక్స్ , 4DX, EpiQ వంటి భారీ స్క్రీన్ ఫార్మాట్లలో విడుదల కానుంది. ఈ రెండు భాగాల రన్ టైమ్ 5గంటల 27నిమిషాలు ఉంది.కానీ, రీరిలీజ్ కోసం దానిని తగ్గించి మూడున్నర గంటల లోపు ఉండవచ్చని తెలుస్తోంది. -
జక్కన్న - మహేష్ మూవీ రూమర్స్.. అదే గనుక నిజమైతే..!
-
రాజమౌళి కొత్త రికార్డ్.. మహేష్ సినిమాకు 300 కోట్ల రెమ్యునరేషన్
-
'బాహుబలి' యూనివర్స్ నుంచి కొత్త సినిమా!
'బాహుబలి'.. టాలీవుడ్ చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమా. ఎందుకంటే పాన్ ఇండియా అనే సరికొత్త ట్రెండ్‌కి శ్రీకారం చుట్టింది. ఇప్పుడు అందరూ భారీ బడ్జెట్, సీక్వెల్స్ అని ఎగబడుతున్నారంటే దానికి ఓ రకంగా ఈ మూవీనే కారణమని చెప్పొచ్చు. అయితే ఈ చిత్ర రెండు భాగాల్ని ఒక్కటిగా చేసి 'బాహుబలి: ద ఎపిక్' పేరుతో అక్టోబరు 31న రీ రిలీజ్ చేయనున్నారు. దీనికి కూడా ప్రమోషన్స్ చేస్తారనే టాక్ వినిపిస్తుంది. సరే ఇవన్నీ పక్కనబెడితే 'బాహుబలి' యూనివర్స్ నుంచి ఓ కొత్త సినిమా రాబోతుందనే న్యూస్ ఇప్పుడు బయటకొచ్చింది.రాజమౌళి తండ్రి, 'బాహుబలి' కథా రచయిత విజయేంద్ర ప్రసాద్.. ప్రస్తుతం కట్టప్ప పాత్ర బ్యాక్ స్టోరీ స్క్రిప్ట్ రాసే పనిలో ఉన్నారని సమాచారం. అసలు కట్టప్ప ఎవరు? మాహిష్మతి సామ్రాజ్యానికి అతడు కట్టు బానిసగా ఎందుకు మారాల్సి వచ్చింది? అసలు కట్టప్ప వంశం ఏంటి? అనే అంశాల చుట్టూ కథ ఉండబోతుందని తెలుస్తోంది. అయితే ఈ సినిమాకు రాజమౌళి దర్శకత్వం చేస్తారా? లేదంటే వేరే ఎవరైనా వస్తారా అనేది తెలియాల్సి ఉంది.(ఇదీ చదవండి: అల్లు శిరీష్ పెళ్లి చేసుకోబోతున్నాడా?)ప్రస్తుతానికైతే ప్రీ విజువలైజేషన్ వర్క్ మొదలైందని, త్వరలో ఈ ప్రాజెక్ట్ గురించి ప్రకటన రానుందనే టాక్ అయితే వినిపిస్తుంది. అయితే ఇదంతా నిజమేనా? లేదంటే 'బాహుబలి' రీ రిలీజ్లో భాగంగా ఈ రూమర్స్ వస్తున్నాయా అనేది చూడాలి? ఒకవేళ నిజమైతే మాత్రం దాన్ని ఏ మేరకు ఆసక్తికరంగా తెరకెక్కిస్తారా అనేది సస్పెన్స్.రాజమౌళి ప్రస్తుతం మహేశ్ బాబుతో ఓ మూవీ చేస్తున్నారు. అడ్వెంచర్ జానర్లో దీన్ని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్, ఒడిశా అడవుల్లో షూటింగ్ చేశారు. కొన్నాళ్ల క్రితం కెన్యా కూడా వెళ్లొచ్చారు. 'బాహుబలి' రీ రిలీజ్ తర్వాత కొత్త షెడ్యూల్ మొదలు కానుందని అంటున్నారు.(ఇదీ చదవండి: మోహన్ లాల్ 'హృదయపూర్వం' సినిమా రివ్యూ (ఓటీటీ)) -
SSMB29పై జక్కన్న అదిరిపోయే స్కెచ్.. రంగంలోకి వార్నర్ బ్రదర్స్
-
రాజమౌళితో పుష్పరాజ్ మూవీ..! రూ. 2000 కోట్లు పక్కా
-
రాజమౌళి కంటే ధనుష్‌తోనే కష్టం: 'కట్టప్ప' సత్యరాజ్
తమిళ నటుడు సత్యరాజ్ గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. 'బాహుబలి' కట్టప్పగా చాలా ఫేమస్. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మంచి ఫామ్‌లో ఉన్న ఇతడు ధనుష్ 'ఇడ్లీ కడై' మూవీలో కీలక పాత్ర పోషించాడు. అక్టోబరు 01న ఈ చిత్రం తెలుగు, తమిళంలో థియేటర్లలోకి రానుంది. శనివారం సాయంత్రం ట్రైలర్ లాంచ్ జరగ్గా.. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ సత్యరాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.(ఇదీ చదవండి: నా పుట్టినరోజునాడే తను చనిపోయాడు.. హీరోయిన్ రాశి)'రాజమౌళి, ధనుష్ ఇద్దరితో పనిచేయడం పోల్చిచూస్తే.. ధనుష్‌తో పనిచేయడమే కష్టం. ఎందుకంటే దర్శకుడిగా ధనుష్‌కి చాలా క్లారిటీ ఉంది. ఇడ్లీ కడై ఓ ఎమోషనల్ ఫీల్ గుడ్ ఎంటర్ టైన్మెంట్ సినిమా. ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఢమాల్ డుమాల్ అనే యాక్షన్ సినిమాలే ఎక్కువగా వస్తున్నాయి. కానీ ఇది అలాంటి మూవీ కాదు. ఇదో ఫీల్ గుడ్ మూవీ' అని సత్యరాజ్ చెప్పుకొచ్చాడు.రాజమౌళి డైరెక్షన్ అంటే నటీనటులని బాగా కష్టపెడతాడనే పేరుంది. అలాంటిది ఈ డైరెక్టర్ కంటే ధనుష్ డైరెక్షన్లో పనిచేయడం కష్టమని సత్యరాజ్ చెప్పడం ఇంట్రెస్టింగ్గా అనిపించింది. ఇకపోతే ఈ మూవీ 'ఇడ్లీ కొట్టు' పేరుతో తెలుగులో రిలీజ్ కానుంది. మురళి అనే ఓ కుర్రాడు.. చెఫ్‌గా పెద్ద కంపెనీలో జాబ్ చేస్తాడు. కానీ వారసత్వంగా వచ్చిన ఓ ఇడ్లీ కొట్టు నడిపేందుకు తిరిగి సొంతూరికి వచ్చేస్తాడు. తర్వాత ఏమైందనేదే మిగతా స్టోరీలా అనిపిస్తుంది. ట్రైలర్ ఆకట్టుకుంటుంది. మరి మూవీ ఎలాంటి ఫలితం అందుకుంటుందో చూడాలి?(ఇదీ చదవండి: ఒక్క సినిమాతో ఫేమస్.. కనిపించకుండా పోయిన ‘అందాల తార’!) -
ప్రధాని మోదీకి దర్శకధీరుడు విషెస్.. వీడియో రిలీజ్
మనదేశ ప్రధాని నరేంద్రమోదీకి టాలీవుడ్ దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి విషెస్ తెలిపారు. ఇవాళ మోదీ బర్త్ డే కావడంతో ట్విటర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. 75 ఏళ్ల వయసులోనూ మీరు 50 ఏళ్ల వ్యక్తిగా కనిపిస్తున్నారని ప్రశంసించారు. ప్రపంచవ్యాప్తంగా ఇండియాకు ప్రత్యేకమైన గుర్తింపు తీసుకొచ్చారని అన్నారు. వరల్డ్‌వైడ్‌గా బలమైన స్థానంలో నిలబెట్టారని కొనియాడారు. మీరు ఎల్లప్పుడూ మంచి ఆరోగ్యం, శక్తి, ఆనందాన్ని పొందాలని కోరుకుంటున్నానని వీడియోను పోస్ట్ చేశారు.టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు సైతం ప్రధాని నరేంద్ర మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. మీ నిబద్ధత, జీవితం గురించి చూస్తే రాబోయే తరాలకు ఆదర్శమని కొనియాడారు. దేశం కోసం మీరు చేస్తున్న కృషి ప్రతి భారతీయుడని గర్వపడేలా చేసిందన్నారు. మీరు ఎల్లప్పుడూ ఆరోగ్యం, ఆనందంతో ఉండాలని.. మీ నాయకత్వంతో మా అందరికీ స్ఫూర్తినిస్తూ కొనసాగాలని కోరుకుంటున్నాని వీడియో రిలీజ్ చేశారు.కాగా.. మహేశ్ బాబు- రాజమౌళి కాంబోలో ఓ భారీ యాక్షన్ అడ్వెంచరస్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. తొలిసారి వీరిద్దరి కాంబోలో వస్తోన్న మూవీ కావడంతో అందరిలోనూ ఆసక్తిని పెంచుతోంది. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ ప్రియాంక చోప్రా హీరోయిన్గా నటిస్తోంది.Happy Birthday to our honourable Prime Minister Shri @narendramodi Ji. May you always be blessed with good health, happiness and continue inspiring us all with your leadership. 🇮🇳 pic.twitter.com/hBKEnKGtVx— Mahesh Babu (@urstrulyMahesh) September 17, 2025 Wishing our Honourable Prime Minister Shri @narendramodi ji a very Happy Birthday. May you be blessed with good health, energy and happiness always. pic.twitter.com/fMftlzOeka— rajamouli ss (@ssrajamouli) September 17, 2025 -
హిందీ వెబ్ సిరీస్‌లో రాజమౌళి.. ట్రైలర్ రిలీజ్
రాజమౌళి పేరు చెప్పగానే బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాలు గుర్తొస్తాయి. ప్రస్తుతం మహేశ్ బాబుతో ఓ భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేస్తున్నాడు. అదే టైంలో ఈ మధ్య కాలంలో యాడ్స్, ఈవెంట్స్‌లో తరుచుగా కనిపిస్తూనే ఉన్నాడు. ఇప్పుడు ఎవరూ ఊహించని విధంగా ఓ హిందీ వెబ్ సిరీస్‌లోనూ జక్కన్న నటించడం విశేషం. తాజాగా రిలీజైన ట్రైలర్‌తో ఈ విషయం బయటపడింది.(ఇదీ చదవండి: మల్లెపూలు ఎంత పనిచేశాయ్.. నటికి రూ.1.14 లక్షల జరిమానా)షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్.. దర్శకుడిగా మారి తీసిన సిరీస్ 'ద బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్'. హిందీ చిత్రసీమలో తెరవెనక జరిగే సంగతుల్ని ఆధారంగా చేసుకుని కామెడీ ఎంటర్టైనర్గా దీన్ని తీశాడు. సెప్టెంబరు 18 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ క్రమంలోనే తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇందులోనే ఓ సీన్లో ఆమిర్ ఖాన్, రాజమౌళి కనిపించారు. వీళ్లతో పాటు దర్శకనిర్మాత కరణ్ జోహార్, దిశా పటానీ, షారుఖ్ ఖాన్, ర్యాపర్ బాద్ షా కూడా అతిథి పాత్రల్లో కనిపించారు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 17 సినిమాలు.. ఆ మూడు డోంట్ మిస్) -
రాముడిగా..?
మహేశ్‌బాబు వెండితెరపై రాముడిగా కనిపించనున్నారట. రాజమౌళి దర్శకత్వంలో మహేశ్‌బాబు హీరోగా అంతర్జాతీయ స్థాయిలో ఓ భారీ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ ఫారెస్ట్ యాక్షన్ అడ్వెంచరస్ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం కెన్యా దేశంలోని నైరోబీలో జరుగుతోంది. ఇటీవల మొదలైన ఈ లాంగ్ షూటింగ్ షెడ్యూల్ నెల రోజులకు పైనే ఉంటుందట. అయితే చిన్న గ్యాప్ రావడంతో ప్రస్తుతం మహేశ్‌బాబు హైదరాబాద్ చేరుకున్నారని, త్వరలోనే మళ్లీ నైరోబీకి వెళ్తారనే టాక్ వినిపిస్తోంది. కాగా రామాయణం ఇతిహాసం నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుందని, ఈ చిత్రానికి ‘జెన్ 63’ అనే టైటిల్‌ను మేకర్స్ పరిశీలిస్తున్నారనే టాక్ తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా కథనం విభిన్న కాల మానాల్లో జరుగుతుందని, ఇందులో భాగంగా కొన్ని సన్నివేశాల్లో రాముడి పాత్రలో మహేశ్‌బాబు కనిపిస్తారనే ప్రచారం జరుగుతోంది.అయితే ఈ విషయాలపై అధికారిక సమాచారం అందాల్సి ఉంది. ఇక ఈ చిత్రంలో ప్రియాంకా చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో కేఎల్ నారాయణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 120కి పైగా దేశాల్లో ఈ చిత్రం 2027లో విడుదలవుతుందనే ప్రచారం జరుగుతోంది. -
శ్రీదేవికి తక్కువ పారితోషికం.. నిర్మాతలే రాజమౌళికి ఎక్కించి చెప్పారు!
బాహుబలి సినిమా (Bahubali Movie)తోనే పాన్ ఇండియా ట్రెండ్ పాపులర్ అయింది. ఆ తర్వాత సౌత్ నుంచి వచ్చిన ఎన్నో సినిమాలు బాలీవుడ్ బాక్సాఫీస్‌ను ఏలాయి. దక్షిణాది సినిమాల మార్కెట్ విస్తరణకు బాహుబలి తోడ్పడింది. ఈ మూవీలో ప్రభాస్, రానా, అనుష్క, రమ్యకృష్ణ, తమన్నా ప్రధాన పాత్రల్లో నటించారు. నిజానికి ఈ సినిమాలో దివంగత హీరోయిన్ శ్రీదేవి (Sridevi) నటించాల్సిందట!ఇప్పటికీ నా దగ్గరే..శివగామి పాత్ర కోసం తొలుత శ్రీదేవిని అనుకున్నారు. మరి అదెందుకు కార్యరూపం దాల్చలేదన్నదానిపై శ్రీదేవి భర్త, నిర్మాత బోనీ కపూర్ (Boney Kapoor) స్పందించాడు. బోనీ కపూర్ మాట్లాడుతూ.. శ్రీదేవి అభిమానిని అని రాజమౌళి పంపిన మెసేజ్ ఇప్పటికీ నా దగ్గర ఉంది. సినిమా కోసం ఆమె చెప్పిన సూచనలు విన్నాక ఆయనకు శ్రీదేవిపై గౌరవం రెట్టింపైంది. కానీ, నిర్మాతల వల్ల ఆ సినిమా తను చేయలేకపోయింది.చాలా తక్కువ పారితోషికంరాజమౌళి మా ఇంటికి వచ్చి తన సినిమా గురించి మాట్లాడుతూ ఉండేవాడు. ఆయన గది నుంచి బయటకు వెళ్లగానే నిర్మాతలు ఎంటరయ్యేవారు. చాలా తక్కువ రెమ్యునరేషన్ ఆఫర్ చేశారు. ఇంగ్లీష్ వింగ్లీష్ సినిమాకు శ్రీదేవి తీసుకున్నదానికంటే కూడా తక్కువే ఇస్తామన్నారు. ఆమె చిన్న నటి కాదు కదా! తనవల్ల సినిమాకు కూడా ఎంతో కొంత మైలేజ్ వస్తుంది. తమిళం, హిందీలోనూ కొంత పాపులారిటీ వస్తుంది. అలాంటప్పుడు నా భార్యను ఒక మెట్టు దిగి సినిమా చేయమని నేనెందుకు చెప్తాను?రివర్స్‌లో చెప్పారుకానీ నిర్మాతలు మాత్రం రాజమౌళికి అంతా రివర్స్‌లో చెప్పారు. హోటల్లో ఒక ఫ్లోర్ మొత్తం తనే కావాలంటోందని చాడీలు చెప్పారు. మేము అడిగిందొక్కటే.. మా పిల్లలకు హాలీడేస్ ఉన్నప్పుడు పెద్ద షెడ్యూల్ పెట్టుకోమన్నాము. అంతకుమించి పెద్ద డిమాండ్లేమీ చేయలేదు. కానీ నిర్మాతలు రాజమౌళికి వేరేవిధంగా ఎక్కించారు. నిర్మాత శోభు యార్లగడ్డకు డబ్బు ఖర్చు చేయడం ఇష్టం లేకే ఇలాంటి పుకార్లు సృష్టించాడు. తను ప్రొఫెషనల్‌గా ఉండదని కామెంట్ చేశాడు. రూ.10 కోట్ల డిమాండ్?అదే నిజమైతే రాకేశ్ రోషన్, యష్ చోప్రా, రాఘవేందర రావు.. వీళ్లందరూ తనతో ఎలా పని చేశారు? ఆమెను అన్‌ప్రొఫెషనల్ అని ఎలా అంటారు? అని అసహనం వ్యక్తం చేశాడు. కాగా బాహుబలి రిలీజైన సమయంలో శ్రీదేవి డిమాండ్లపై పెద్ద చర్చే జరిగింది. ఈ సినిమాకుగాను రూ.10 కోట్లు, 10 ఫ్లైట్ టికెట్స్, హోటల్లో ఓ అంతస్తు మొత్తం తనకే కావాలని శ్రీదేవి డిమాండ్ చేసిందని రాజమౌళి అప్పట్లో ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. ఆ కామెంట్స్ విని బాధపడ్డ శ్రీదేవి.. 50 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉంటున్నా.. 300కి పైగా సినిమాలు చేశాను. అలాంటి డిమాండ్లు చేసే ఈ స్థాయికి చేరాననుకుంటున్నారా? నిజంగా అలా చేస్తే ఇప్పటికీ ఇండస్ట్రీలో ఉండేదాన్నా? నా గురించి అలా తప్పుగా మాట్లాడుతుంటే బాధగా ఉంది. నిర్మాతలే రాజమౌళికి ఇలా నాగురించి తప్పుగా చెప్పి ఉండొచ్చు! కానీ, ఇలా పబ్లిక్‌గా మాట్లాడకపోయుంటే బాగుండేది అని విచారం వ్యక్తం చేసింది. దీంతో రాజమౌళి సైతం పబ్లిక్‌గా అలాంటి మాటలు మాట్లాడకుండా ఉండాల్సింది అని బాధపడ్డాడు. కాగా శ్రీదేవి 2018లో మరణించింది. బాహుబలి విషయానికి వస్తే మొదటి భాగం 2015లో రెండో భాగం 2017లో విడుదలైంది. ఈ చిత్రాలను శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మించారు.చదవండి: నిన్ను పెళ్లి చేసుకుంటే భార్యను కాదు తల్లినవుతా!: హీరోయిన్ -
రాజమౌళిపై బాలీవుడ్ నిర్మాత అంతమాట అనేశాడేంటి..!
-
'రాజమౌళి సార్ మాస్టర్ అయితే.. మేమంతా విద్యార్థులం'.. నిర్మాత కామెంట్స్!
టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళిపై ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఇండియన్ సినిమాకు ఆయన ఒక బెంచ్ మార్క్ అని అన్నారు. ఆయనతో పోల్చుకోవడం కరెక్ట్ కాదన్నారు. రాజమౌళి అంటే నాకు గౌరవమని కరణ్ జోహార్ వెల్లడించారు. ఒక సినిమాను మరో మూవీతో పోల్చవద్దన్నారు. టాలీవుడ్ మూవీ మిరాయ్ ఈవెంట్‌కు హాజరైన ఆయన.. దర్శకధీరుడిపై ప్రశంసలు కురిపించారు. రాజమౌళి సార్ ఒక మాస్టర్ అయితే.. మేమంతా ఆయన దగ్గర నేర్చుకునే శిష్యులమని కరణ్ జోహార్ అన్నారు.కాగా.. తేజ సజ్జా ప్రధాన పాత్రలో విజువల్ వండర్ మూవీ మిరాయ్. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ కాగా.. అభిమానుల్లో అంచనాలు పెంచేసింది. ఈ మూవీలో టాలీవుడ్ హీరో మంచు మనోజ్ విలన్ పాత్రలో మెప్పించనున్నారు. ఈ మూవీలో రితికా నాయక్ హీరోయిన్గా నటిస్తుండగా.. శ్రియా శరణ్ కీలక పాత్రలో కనిపించనుంది.ఈ మూవీని కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కించారు. టీజీ విశ్వప్రసాద్, కృతీ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 12న విడుదల కానుంది. -
హాలీవుడ్ రేంజ్ లో మహేష్ బాబు - రాజమౌళి సినిమా
-
120 దేశాల్లో ఎస్ఎస్ఎమ్బి29 విడుదల
‘‘సుందరమైన నైవాషా, ఐకానిక్ అంబోసెలి, మసాయి మారా తాలూకు విశాలమైన మైదానం... ఇలా కెన్యాలోని ప్రకృతి అందాలు 120 దేశాల్లో విడుదల కానున్న ప్రతిష్ఠాత్మక చిత్రంలో కనువిందు చేయనున్నందుకు హ్యాపీగా ఉంది. ప్రపంచ వ్యాప్తంగా బిలియన్ (వంద కోట్లు)కి పైగా ప్రేక్షకులకు ఈ చిత్రం చేరువ అవుతుందనే అంచనాలు ఉన్నాయి’’ అంటూ ‘ఎక్స్’ వేదికగా పేర్కొన్నారు కెన్యా విదేశీ వ్యవహారాల మంత్రి ముసాలియా డబ్లు్య ముడవాడి. మహేశ్‌బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో అంతర్జాతీయ స్థాయిలో రూ పొందుతున్న భారీ చిత్రం గురించే ముసాలియా ఈ విధంగా పేర్కొన్నారు. ఈ ఫారెస్ట్ అడ్వెంచరస్ మూవీ షూటింగ్‌ని ఎక్కువ శాతం కెన్యాలో చిత్రీకరించాలని రాజమౌళి అనుకున్నారట. టీమ్‌తో కలిసి అక్కడి లొకేషన్స్‌ని సందర్శించారు. ఈ సందర్భంగా ముసాలియాని కలిశారు రాజమౌళి. ఆ ఫొటోలను ముసాలియా తన ‘ఎక్స్’లో షేర్ చేసి, అభిప్రాయాలను కూడా పంచుకున్నారు. ‘‘ప్రపంచంలోని గొప్ప ఫిల్మ్ మేకర్స్‌లో ఒకరైన రాజమౌళి సినిమా కోసం కెన్యా ఓ వేదిక అయింది. మంచి విజన్ ఉన్న గొప్ప భారతీయ దర్శకుడు ఆయన. చక్కని స్క్రీన్‌ప్లే రైటర్, కథకుడు కూడా. ఆయన కథలు ఖండాంతర ప్రేక్షకుల ఊహలను ఆవిష్కరించాయి. రెండు దశాబ్దాల కెరీర్లో రాజమౌళి శక్తిమంతమైన కథనాలు, దృశ్యాలు, సాంస్కృతికతలను తన కథల్లో చొప్పించారు. 120 మందితో కూడిన ఆయన టీమ్ ఈస్ట్ ఆఫ్రికాలో విస్తృతంగా పర్యటించాక కెన్యాని ఎంచుకుంది. ప్రాథమిక చిత్రీకరణకు గమ్యస్థానంగా మా దేశాన్ని ఎంచుకోవడం ఇక్కడి అందం, ఆతిథ్యం గురించి ప్రపంచ వేదికకు చెప్పినట్లుగా భావిస్తున్నాం. ‘ఎస్ఎస్ఎమ్బి29’ (వర్కింగ్ టైటిల్) సినిమా లెన్స్ ద్వారా మా దేశాన్ని చూపించనుండటం కెన్యాకి గర్వకారణం’’ అని ముసాలియా డబ్లు్య ముడవాడి పేర్కొన్నారు. మహేశ్‌బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో గ్లోబల్ రేంజ్లో కేఎల్ నారాయణ ‘ఎస్ఎస్ఎమ్బి29’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రియాంకా చో్ప్రాఓ లీడ్ రోల్ చేస్తున్నారు. ఇంకా పలువురు భారతీయ నటీనటులతో పాటు హాలీవుడ్ నటీనటులు నటించనున్నారు. అలాగే హాలీవుడ్ సాంకేతిక నిపుణులు ఈ చిత్రానికి పని చేస్తున్నారు. ఇక ఈ చిత్రానికి సంబంధించిన ఓ పెద్ద అప్డేట్ని నవంబరులో ఇవ్వనున్నామని ఇటీవల మహేశ్‌బాబు బర్త్‌డే (ఆగస్ట్ 9) సందర్భంగా రాజమౌళి పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ చిత్రం 2027లో విడుదలయ్యే అవకాశం ఉంది. -
అంతగా అక్కడ ఏం నచ్చింది జక్కన్న?
ఎస్ఎస్ రాజమౌళి.. లార్జర్ దెన్ లైఫ్ సినిమాలకు కేరాఫ్ దర్శకుడు. ఆయన దర్శకత్వంలో వచ్చిన ప్రతీ చిత్రం.. భావోద్వేగ దృశ్యవిచిత్రమే. భారీ స్థాయిలో నిర్మాణం.. అద్భుతమైన హీరోయిజం.. హైస్టాండర్డ్ విజువల్ ఎఫెక్ట్స్‌తో ఆయన చెక్కే చిత్రాలు.. ప్రపంచం మొత్తం భారత చలనచిత్ర పరిశ్రమ వైపు చూసేలా చేశాయి. అయితే పాన్ ఇండియా నుంచి పాన్ వరల్డ్‌పై ఇప్పుడు ఆయన దృష్టి పడింది.జక్కన్న ఇప్పుడు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్‌బాబుతో (SSMB 29) ఓ గ్లోబల్ యాక్షన్ అడ్వెంచర్ సినిమాను రూపొందిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో ఈ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. తూర్పు ఆఫ్రికా దేశం కెన్యాలో షూటింగ్ చేసుకుంటోందీ చిత్రం. ఆ దేశ మంత్రి ముసాలియా ముదావాదిని మూవీ టీమ్ మర్యాదపూర్వకంగా కలిస్తే.. ఆసక్తికర విషయాన్నే ఆయన తెలియజేశారు.Kenya this past fortnight became the stage for one of the world’s greatest filmmakers, @ssrajamouli, the visionary Indian director, screenwriter, and storyteller whose works have captured the imagination of audiences across continents. Rajamouli, with a career spanning over two… pic.twitter.com/T1xCGVXQ64— Musalia W Mudavadi (@MusaliaMudavadi) September 2, 2025రాజమౌళి రెండు దశాబ్దాలుగా చలన చిత్ర పరిశ్రమలో కొనసాగుతున్నారు. చాలా శక్తివంతమైన కథనాలను, దృశ్యాలను, లోతైన సాంస్కృతిని ప్రపంచానికి చాటిచెప్పడంలో ఆయన ఎంతో ప్రసిద్ధి చెందారు. తూర్పు ఆఫ్రికా అంతటా పర్యటించి 120 మందితో కూడిన రాజమౌళి టీమ్ కెన్యాను ఎంచుకుంది. మసాయి మరా మైదానాల నుంచి మొదలు సుందరమైన నైవాషా, ఐకానిక్ అంబోసెలి వంటి ప్రాంతాలు ఆసియాలోనే అతిపెద్ద చలనచిత్రంగా తెరకెక్కుతున్న మూవీలో భాగం కాబోతున్నాయి.సుమారు 120 దేశాల్లో ఈ మూవీని విడుదల చేసేందుకు చిత్రబృందం ప్లాన్ చేస్తోంది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల మందికిపైనే చేరువయ్యే అవకాశం ఉంది. కెన్యాలో షూటింగ్ చేయడం ఒకమైలురాయిగా నిలిచిపోతుంది. ప్రపంచ వేదికపై మా దేశ అందాలను, ఆతిథ్యాన్ని, సుందర దృశ్యాలను చూపడంలో ఈ సినిమా శక్తిమంతంగా పనిచేయనుంది. ఎస్ఎస్ఎంబీ 29 చిత్రంతో కెన్యా తన చరిత్రను ప్రపంచంతో పంచుకోవడానికి సిద్ధంగా ఉంది. ఈ విషయంలో గర్వంగా ఉంది అని ట్వీట్ చేశారాయన. సో.. మహేష్ సినిమాతో సరికొత్త ప్రపంచాన్నే ఆవిష్కరించేందుకు రాజమౌళి సిద్ధమయ్యారన్నమాట. మరి అంతగా ఆయన్ని ఆకర్షించిన విషయాలు అక్కడేం ఉన్నాయి?..కెన్యాలోని మసాయి మరా, లేక్ నైవాషా, అంబోసెలీ నేషనల్ పార్క్.. ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ప్రకృతి, వన్యప్రాణి, సఫారీ గమ్యస్థానాలు. వీటిని ఒక్కొక్కటిగా పరిశీలిస్తే..మసాయి మరా నేషనల్ రిజర్వ్ (Masai Mara National Reserve).. బిగ్ ఫైవ్‌కు ఆవాసం. అంటే.. సింహం, చిరుతపులి, ఏనుగు, గేదె, రైనోలు ఇక్కడ నివసిస్తున్నాయి. ప్రతి సంవత్సరం జూలై-అక్టోబర్ మధ్యలో లక్షలాది వన్యప్రాణులు (విల్డీబీస్ట్, జెబ్రాలు) టాంజానియాలోని సెరెంగెటి నుంచి మసాయి మరాకు వలస వస్తాయి.సుమారు 500కి పైగా పక్షుల జాతులు ఆవాసం ఉన్నట్లు అంచనా. ఉదయం, సాయంత్ర వేళల్లో గేమ్ డ్రైవ్‌లు ద్వారా వన్యప్రాణులను దగ్గరగా చూడొచ్చు.అంబోసెలీ నేషనల్ పార్క్ (Amboseli National Park).. ఆఫ్రికాకు మాత్రమే కాదు.. ప్రపంచంలోనే అత్యున్నత శిఖరంగా పేరున్న కిలిమంజారో పర్వతశ్రేణి నేపథ్యంగా కనిపిస్తుంది ఈ పార్క్. ఆఫ్రికన్ ఏనుగుల గుంపులకు ఇది ఎంతో ప్రసిద్ధి. సింహాలు, చిరుతలు, జిరాఫీలు, జీబ్రాలు అనేక ఇతర జాతులు కనిపిస్తాయి. పొడి ప్రాంతం అయినప్పటికీ ఇక్కడి నీటి వనరులు వన్యప్రాణులకు ఆకర్షణగా నిలుస్తాయి.లేక్ నైవాషా (Lake Naivasha).. అనేక రకాల పక్షులు, నీటిలో నివసించే వన్యప్రాణులతో ఈ సరస్సు జీవవైవిధ్యాన్ని ప్రతిబింబిస్తుంటుంది. ప్రైవేట్ అభయారణ్యం.. క్రెసెంట్ ఐల్యాండ్‌లో జిరాఫీ, జీబ్రాలు, ఇతర మృగాలు స్వేచ్ఛగా సంచరిస్తుంటాయి. దీంతో ఫొటోగ్రాఫర్లు, నేచర్ లవర్స్‌కి ఇదొక స్వర్గధామం. నైవాషా ఐకానిక్ సరస్సులో హిప్పోలు(నీటి ఏనుగులు), పక్షుల రాకపోకలతో కనువిందు చేసే దృశ్యాలను చూడటానికి బోటు ప్రయాణాలు అందుబాటులో ఉన్నాయి.ఈ మూడింటితో పాటు అరుదైన జాతుల వన్యప్రాణుల ఆవాసం సంబురు (Samburu)లోనూ చిత్రీకరణ జరగవచ్చని తెలుస్తోంది. గ్రెవీస్ జెబ్రా (Grevy's Zebra), సోమాలీ ఆస్ట్రిచ్ (Somali Ostrich), రెటిక్యులేటెడ్ జిరాఫీ (Reticulated Giraffe), బేసియా ఒరిక్స్ (Besia Oryx), గెరెనుక్ (Gerenuk) ఈ ఐదు అరుదైన జాతుల వల్ల ఈ ప్రాంతాన్ని ‘సంబురు స్పెషల్ ఫైవ్’ అని పిలుస్తారు. వన్యపప్రాణి పరిశోధకులు, ఫొటోగ్రాఫర్లకు ఇది వరల్డ్ ఫేవరెట్ స్పాట్‌గా పేరుంది.భారతీయ చిత్ర పరిశ్రమ.. కెన్యా అడవులను ప్రధాన లొకేషన్‌గా ఎంచుకోవడం ఇదే మొదటిసారి!!. పైగా మసాయి మరా, అంబోసెలీ, లేక్ నైవాషా అద్భుతమైన ప్రకృతి దృశ్యాలతో, వన్యప్రాణులతో నిండి కెన్యా సఫారీకి ఇవి ఒక కంప్లీట్ ప్యాకేజీగా ఉన్నాయి. దీనికి తోడు చిత్రంలో మహేష్ బాబు పాత్ర ఒక రగ్డ్ ఎక్స్‌ప్లోరర్ రోల్లో కనిపిస్తారని.. అరుదైన ఔషధం కోసం వెతుకుతూ అడవుల్లో ప్రయాణిస్తారనే స్టోరీ లైన్ ఒకటి తెరపైకి వచ్చింది. సో.. ఈ తరహా కథకు పురాతనమైన.. మనిషి నియంత్రణలో లేని అడవులు(అన్టేమ్డ్) అవసరమని రాజమౌళి అనుకుని ఉండొచ్చు. పైగా కెన్యా లాంటి దేశం భారతీయ సినిమాకు కొత్త వేదికగా నిలవడమే కాకుండా పాన్ వరల్డ్ ప్రేక్షకులనూ ఆకట్టుకునే ప్రయత్నం కూడా. మొదట్లోనే చెప్పుకున్నట్లు.. లార్జర్ దెన్ లైఫ్ అనిపించాలంటే విలక్షణమైన కెన్యా దేశపు లొకేషన్లు ఈ విజన్‌కు సరిపోతాయి అని జక్కన్న ఫిక్స్ అయి ఉండొచ్చు. -
120 దేశాలు.. 100 కోట్ల మంది.. కెన్యా మంత్రితో రాజమౌళి
మహేశ్‌బాబు- దర్శకుడు రాజమౌళి కాంబినేషన్లో అంతర్జాతీయ స్థాయిలో SSMB29 ప్రాజెక్ట్ తెరకెక్కుతుంది. అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమారన్, ప్రియాంకా చోప్రా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. అయితే, ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా పలు భాషల్లో విడుదల కానుంది. ప్రస్తుతం ఈ మూవీ టీమ్ కెన్యాలో షూటింగ్ పనుల్లో బిజీగా ఉంది. ఈ క్రమంలోనే ఆ దేశ మంత్రి ముసాలియా ముదావాదిని చిత్ర యూనిట్ కలిసింది. ఇదే విషయాన్ని అక్కడి మంత్రి సోషల్‌మీడియాలో పంచుకున్నారు. కెన్యా మంత్రి ఇలా చెప్పారు. ' ప్రపంచంలోని గొప్ప దర్శకులు రాజమౌళి. ఆయన రెండు దశాబ్దాలుగా సినీ ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. ఆయన సినిమాలు ఖండాంతర ప్రేక్షకులను కూడా ఆకర్షించాయి. అతను దార్శనిక భారతీయ దర్శకుడు. 120 మందితో కూడిన రాజమౌలి టీమ్ తూర్పు ఆఫ్రికా అంతటా పర్యటించి ఫైనల్‌గా తమ సినిమా కోసం కెన్యాను ఎంచుకుంది. దాదాపు 95% ఆఫ్రికన్ దృశ్యాలను చిత్రీకరించే ప్రాథమిక గమ్యస్థానంగా మన దేశాన్ని నిర్ణయించింది. ఇక్కడ ఉండే మసాయి మరా మైదానాల నుంచి సుందరమైన నైవాషా, ఐకానిక్ అంబోసెలి వంటి ప్రాంతాలు అతిపెద్ద చలనచిత్రంలో భాగం కాబోతున్నాయి. 120 దేశాల్లో ఈ మూవీని విడుదల చేయాలని వారు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల మందికిపైనే చేరువయ్యే ఛాన్స్ ఉంది. అప్పుడు ప్రపంచ వేదికలపై మా దేశ అందాలు, ఆతిథ్యం, అందమైన దృశ్యాలు కనిపిస్తాయి. SSMB29 సినిమా ద్వారా కెన్యా తన చరిత్రను ప్రపంచంతో పంచుకునేందుకు రెడీగా ఉంది.' అని అక్కడి మంత్రి ముసాలియా ముదావాది తెలిపారు.మహేశ్‌బాబు ఇప్పటికే ఆఫ్రికాలో ఉన్నారు. సినిమా షూటింగ్ పనులు వేగంగా జరుగుతున్నాయి. భార్య నమ్రత వినాయక చవితి పండగ జరుపుకున్న ఫొటోలను ఇన్‌స్టాలో షేర్ చేసి, మహేశ్‌బాబును మిస్ అవుతున్నట్లుగా పేర్కొన్నారు. ఈ షెడ్యూల్లో మహేశ్‌బాబుపై ఓ భారీ యాక్షన్ అడ్వెంచరస్ సీక్వెన్స్ చిత్రీకరించడానికి ప్లాన్ చేశారట రాజమౌళి. ఇక కేఎల్ నారాయణ నిర్మిస్తున్న ఈ సినిమాకి ఓ హాలీవుడ్ నిర్మాణ సంస్థ కూడా నిర్మాణంలో భాగస్వామి కానుందనే ప్రచారం జరుగుతోంది.Kenya this past fortnight became the stage for one of the world’s greatest filmmakers, @ssrajamouli, the visionary Indian director, screenwriter, and storyteller whose works have captured the imagination of audiences across continents. Rajamouli, with a career spanning over two… pic.twitter.com/T1xCGVXQ64— Musalia W Mudavadi (@MusaliaMudavadi) September 2, 2025 -
ఆఫ్రికాలో అడ్వెంచర్?
హీరో మహేశ్‌బాబు, దర్శకుడు రాజమౌళి కాంబినేషన్లో అంతర్జాతీయ స్థాయిలో ఓ భారీ బడ్జెట్ చిత్రం రూ పొందుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమారన్, ప్రియాంకా చోప్రా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ ఆఫ్రికా లొకేషన్స్‌లోనే జరుగుతోందనే ప్రచారం సాగుతోంది. దానికి కారణం ప్రియాంకా చోప్రా తాజాగా షేర్ చేసిన కొన్ని ఫొటోలు ప్రధానంగా ఫారెస్ట్ లొకేషన్స్‌కు సంబంధించినవి కావడమే.దీంతో ఆమె ప్రస్తుతం ఆఫ్రికాలో ఉన్నారని, ఆమె అక్కడికి వెళ్లింది మహేశ్‌బాబు సినిమా కోసమే అనే టాక్ తెరపైకి వచ్చింది. మరోవైపు మహేశ్‌బాబు భార్య నమ్రత వినాయక చవితి పండగ జరుపుకున్న ఫొటోలను ఇన్‌స్టాలో షేర్ చేసి, మహేశ్‌బాబును మిస్ అవుతున్నట్లుగా పేర్కొన్నారు. సో... మహేశ్‌బాబు కూడా రాజమౌళి సినిమా షూటింగ్ కోసం ఆఫ్రికా వెళ్లారనే ఊహాగానాలు నెలకొన్నాయి. ఇక ఈ షెడ్యూల్లో మహేశ్‌బాబుపై ఓ భారీ యాక్షన్ అడ్వెంచరస్ సీక్వెన్స్ చిత్రీకరించడానికి ప్లాన్ చేశారట రాజమౌళి. ఇక కేఎల్ నారాయణ నిర్మిస్తున్న ఈ సినిమాకి ఓ హాలీవుడ్ నిర్మాణ సంస్థ కూడా నిర్మాణంలో భాగస్వామి కానుందనే ప్రచారం జరుగుతోంది. -
రాజమౌళి సైలెంట్.. హీరోయిన్ మాత్రం తగ్గట్లే
స్టార్ డైరెక్టర్ రాజమౌళి.. ప్రస్తుతం మహేశ్ బాబుతో సినిమా చేస్తున్నాడు. ఈ ప్రాజెక్ట్ ఉందని అందరికీ తెలుసు. కానీ రాజమౌళి ఒక్కటంటే ఒక్క మాట బయటపడకుండా జాగ్రత్త పడుతున్నాడు. అటు మహేశ్ బాబు కూడా పిన్ డ్రాప్ సైలెంట్ అనేలానే ఉన్నాడు. మిగతా టీమ్ అంతా కూడా ఒక్క ఫొటో కూడా పోస్ట్ చేయట్లేదు. కానీ హీరోయిన్ మాత్రం అస్సలు తగ్గట్లేదు. ఫొటోలు పోస్ట్ చేస్తూనే ఉంది. తాజాగా ఇన్ స్టాలో పోస్ట్ పెట్టింది.రాజమౌళి-మహేశ్ బాబు సినిమాకు 'SSMB29' అనే వర్కింగ్ టైటిల్ నిర్ణయించారు. ఇందులో హీరోయిన్గా ప్రియాంక చోప్రా చేస్తోంది. షూటింగ్ జరిగిన ప్రతిసారి ఆ ప్రాంత ఫొటోలని ఈమె పోస్ట్ చేస్తూనే ఉంది. కొన్ని నెలల క్రితం ఒడిశాలో షూటింగ్ జరగ్గా.. అప్పుడు కూడా ఆయా ప్రాంతంలో తీసుకున్న కొన్ని ఫొటోల్ని ప్రియాంక పోస్ట్ చేసింది. ఇప్పుడు టీమ్ అంతా కెన్యాలో చిత్రీకరణ చేస్తోంది. అక్కడ పర్యావరణ అందాల్ని తన కెమెరాలో బంధించిన ఈ బ్యూటీ.. పలు ఫొటోల్ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో మహేశ్ ఫ్యాన్స్‌కి షూటింగ్ అప్డేట్ ఇచ్చినట్లయింది.(ఇదీ చదవండి: హీరో అసభ్య ప్రవర్తన.. నేను ఎంజాయ్ చేయలేదు, ఏడ్చా.. ఇండస్ట్రీకో దండం!) చాలా ఏళ్ల క్రితమే రాజమౌళి.. కెన్యా వెళ్లి వచ్చాడు. అప్పుడు లొకేషన్ల కోసం కాగా ఇప్పుడు షూటింగ్ జరుగుతోంది. అయితే ఆగస్టు 9న మహేశ్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఏదైనా లుక్, పోస్టర్ లాంటిది వస్తుందని అభిమానులు ఆశపడ్డారు. కానీ నవంబర్లోనే అఫీషియల్ పోస్టర్ వస్తుందనే అప్డేట్ లాంటిది ఆ రోజున ప్రకటించారు. ఇప్పుడు కెన్యాలో ఎలాంటి సౌండ్ లేకుండా షూటింగ్ చేసుకుంటున్నారు. గత చిత్రాలతో పోలిస్తే రాజమౌళి ఈసారి భిన్నంగా ప్రవర్తిస్తుండటం విశేషం.ఇకపోతే ఈ మూవీ గ్లోబ్ ట్రాటెర్ కాన్సెప్ట్ అని చాన్నాళ్ల క్రితమే చెప్పారు. అంటే ఈ స్టోరీలో హీరో ప్రపంచమంతా తిరుగుతుంటాడు. అడ్వెంచర్స్ చేస్తుంటాడు. మహేశ్ బాబుకి విలన్‌గా 'సలార్' ఫేమ్ పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్నాడు. ఈ విషయం కూడా చాన్నాళ్ల క్రితం లీకైన ఓ వీడియో వల్ల బయటపడింది.(ఇదీ చదవండి: ఎంగేజ్మెంట్తో మారిపోయా.. ఇకపై అలాంటి సీన్లు చేయను: విశాల్) View this post on Instagram A post shared by Priyanka (@priyankachopra) -
ప్రభాస్ ఫాన్స్ కి రాజమౌళి షాక్
-
రాజమౌళి 'బాహుబలి ది ఎపిక్'.. టీజర్ వచ్చేసింది!
బాహుబలి విడుదలై పదేళ్లు పూర్తయిన సందర్భంగా మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు మన దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి. బాహుబలి ది బిగినింగ్, బాహుబలి-2 రెండు భాగాలను కలిపి బాహుబలి ది ఎపిక్ పేరుతో రిలీజ్ చేస్తున్నారు.తాజాగా ఈ మూవీ టీజర్‌ను విడుదల చేశారు. సోషల్ మీడియా వేదికగా డైరెక్టర్ రాజమౌళి టీజర్ రిలీజ్ చేశారు. ఈ చిత్రం ఈ ఏడాది అక్టోబరు 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. త్వరలోనే ఈ సినిమా ప్రమోషన్స్ ప్రారంభించనున్నారు మేకర్స్. ప్రభాస్, అనుష్క, రానా, రాజమౌళి సైతం ప్రమోషన్లలో పాల్గొననున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ కోసం రెబల్ స్టార్ ఫ్యాన్స్ సైతం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.Here’s the Teaser of @ssrajamouli’s #BaahubaliTheEpic… In cinemas worldwide Oct 31, 2025. https://t.co/KSuKxSwZI9#Prabhas@RanaDaggubati @MsAnushkaShetty @tamannaahspeaks @Shobu_ #PrasadDevineni #Baahubali #Celebrating10YearsOfBaahubali#BaahubaliTheEpicOn31stOct pic.twitter.com/EXQsQGFoZ8— Baahubali (@BaahubaliMovie) August 26, 2025 -
మహేష్ మూవీ విడుదల ముహూర్తం ఖరారు
-
జేమ్స్ కామెరాన్ చేతిలో SSMB29 ప్రమోషన్స్
-
కామెరూన్‌తో ఫస్ట్ లుక్ రిలీజ్?
హీరో మహేశ్‌బాబు–దర్శకుడు రాజమౌళి కాంబినేషన్లో అంతర్జాతీయ స్థాయిలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ప్రియాంకా చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా నెక్ట్స్ షెడ్యూల్‌ను సెప్టెంబరులో నైరోబీ, టాంజానియా, సౌత్ ఆఫ్రికా లొకేషన్స్‌లో ప్లాన్ చేస్తున్నారని తెలిసింది. కాగా ఈ సినిమా అప్డేట్ను నవంబరులో వెల్లడిస్తామని మహేశ్‌బాబు బర్త్ డే సందర్భంగా ఈ ఆగస్టు 9న రాజమౌళి పేర్కొన్నారు. ఈ సినిమాకు ‘జెన్ 63’ అనే టైటిల్‌ను అనుకుంటున్నారనే వార్త ప్రచారంలో ఉంది.ఇక ‘అవతార్: ఫైర్ అండ్ యాష్’ సినిమా ప్రమోషన్స్ కోసం చిత్రదర్శకుడు జేమ్స్ కామెరూన్ ఇండియా వచ్చినప్పుడు ఈ ‘జెన్ 63’ ఫస్ట్ లుక్, ప్రమోషనల్ కంటెంట్‌ను ఆయన చేతుల మీదుగా రిలీజ్ చేస్తే గ్లోబల్ రేంజ్లో రీచ్ ఉంటుందని రాజమౌళి భావిస్తున్నారట. అయితే ఈ విషయంపై అధికారిక సమాచారం అందాల్సి ఉంది.ఇదిలా ఉంటే... 2023లో జరిగిన ఓ అంతర్జాతీయ అవార్డుల వేడుకలో భాగంగా రాజమౌళి, జేమ్స్ కామెరూన్ కలుసుకున్న సంగతి గుర్తుండే ఉంటుంది. ఆ సమయంలో ‘ఆర్ఆర్ఆర్’ చిత్రాన్ని కామెరూన్ ప్రశంసించారు. ఇదిలా ఉంటే... జేమ్స్ కామెరూన్ డైరెక్షన్‌లోని ‘అవతార్: ఫైర్ అండ్ యాష్’ చిత్రం ఈ డిసెంబరు 19న తెలుగులోనూ రిలీజ్ కానుంది. -
మహేశ్‌బాబు బ్యానర్ సినిమా.. 'రావు బహదూర్' టీజర్
మహేశ్‌బాబు, నమ్రాతా శిరోద్కర్ సొంత నిర్మాణ సంస్థ GMB ఎంటైర్టెన్మెంట్స్ సమర్పణలో తెరకెక్కుతున్న ‘రావు బహదూర్’ మూవీ టీజర్ తాజాగా విడుదలైంది. సత్యదేవ్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని దర్శకుడు వెంకటేష్ మహా తెరకెక్కిస్తున్నారు. గతంలో ఆయన డైరెక్ట్ చేసిన 'కేరాఫ్ కంచరపాలెం, ఉమామహేశ్వర ఉగ్రరూపస్య' చిత్రాలు టాలీవుడ్లో మంచి విజయాన్ని అందుకున్నాయి.ఈ చిత్ర టీజర్‌ను అగ్ర దర్శకుడు రాజమౌళి విడుదల చేశారు. సైకలాజికల్ థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో ఈ మూవీ రానుంది. ఈ ప్రాజెక్ట్‌లో సత్యదేవ్ పాత్ర సరికొత్తగా ఉండనుంది. రావు బహదూర్ పాత్ర మేకప్ కోసమే అయిదుగంటల సమయం పట్టేదని ఆయన చెప్పారు. వచ్చే ఏడాది సమ్మర్లో ఈ చిత్రం విడుదల కానుంది. ఈ చిత్రంలో వికాస్ ముప్పాల, దీపా థామస్, బాల పరాసర్, ఆనంద్ భారతి, ప్రణయ్ వాక, కునాల్ కౌశిక్, మాస్టర్ కిరణ్ తదితరులు ఉన్నారు. -
మహేష్ మూవీపై కీలక ప్రకటన
-
సూపర్ స్టార్ బర్త్ డే కు అదిరిపోయిన రాజమౌళి సర్ ప్రైజ్
-
మహేశ్ బాబు సినిమా.. కీలక అప్డేట్ ఇచ్చిన రాజమౌళి
మహేశ్‌బాబు నేడు (ఆగష్టు 9) పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా తను హీరోగా రూపొందుతోన్న తాజా చిత్రం ‘ఎస్ఎస్ఎమ్బీ 29’ (వర్కింగ్ టైటిల్) నుంచి దర్శకుడు రాజమౌళి ఒక అప్డేట్ ఇచ్చారు. చాలా కాలంగా ఈ సినిమా వివరాల కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా కథ ఏంటి? షూటింగ్ ఎంత వరకూ వచ్చింది? వంటి విషయాలపై చిత్ర బృందం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాకపోవడంతో మహేశ్ అభిమానుల్లో నిరాశ ఏదురైంది. అయితే, తాజాగా జక్కన్న చేసిన ప్రకటనతో కాస్త రిలాక్స్ అయ్యారు.మహేశ్‌బాబు సినిమా గురించి ఉద్దేశిస్తూ రాజమౌళి ఇలా పోస్ట్ చేశారు.. 'భారతదేశం, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రియమైన సినిమా ప్రేమికులారా, అలాగే మహేశ్ అభిమానులారా.. మేము షూటింగ్ ప్రారంభించి చాలా కాలం అయింది. ఈ చిత్రం గురించి తెలుసుకోవాలనే మీ ఆసక్తిని మేము అభినందిస్తున్నాము. అయితే, ఈ సినిమా కథ పరిధి చాలా విస్తృతమైనది. కేవలం ప్రెస్‌మీట్ పెట్టి ఆపై కొన్ని పోస్టర్స్ విడుదల చేయడం వల్ల ఈ ప్రాజెక్ట్‌కు పూర్తిస్థాయిలో న్యాయం చేయలేమని నేను భావిస్తున్నాను. ప్రస్తుతం మేము ఒక ప్రపంచాన్ని సృష్టిస్తున్నాం. చాలా లోతైన సబ్జెక్ట్ కోసం కష్టపడుతున్నాం. ఒక అద్భుతాన్ని చూపించేందుకు నిరంతరం శ్రమిస్తూనే ఉన్నాం. అయితే, నవంబర్ 2025లో ఈ సినిమా గురించి ఆవిష్కరిస్తాం. అప్పుడు పూర్తి వివరాలు తెలుస్తాయి. ఎంతో కాలంగా ఓపికతో ఉన్న మీ అందరికీ ధన్యవాదాలు.' అని రాజమౌళి పేర్కొన్నారు.అయితే ఆఫ్రికా అడవుల నేపథ్యంలో సాగే ‘ఇండియానా జోన్స్’ స్టైల్ కథతో ఈ సినిమా రూపొందుతోందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే... ఈ కథలో విలన్ ఎవరు? అనే విషయం సినిమా ముగిసేవరకూ ఊహించలేమట. పతాక సన్నివేశాల వరకు నెగెటివ్ రోల్ తెలియనివ్వకుండా ప్రేక్షకులను సస్పెన్స్ చేయనున్నారట రాజమౌళి. ఈ చిత్రంలో మాధవన్ కీలకపాత్రలో కనిపించనున్నారనే వార్త ప్రచారంలోకి వచ్చింది. దాంతో ఆయన విలన్‌గా కనిపించనున్నారనే ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ సినిమాలో హీరోయిన్ ప్రియాంకా చోప్రా హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ కీలకపాత్రలు చేస్తున్నారు. కేఎల్ నారాయణ నిర్మిస్తున్నారు. For all the admirers of my #GlobeTrotter… pic.twitter.com/c4vNXYKrL9— rajamouli ss (@ssrajamouli) August 9, 2025 -
ENG Vs IND: వాట్ ఏ స్పెల్.. సిరాజ్ మియ్యా.. దర్శకధీరుడు ఫిదా!
టీమిండియా చివరి టెస్ట్‌లో విజయం సాధించడంపై దర్శకధీరుడు రాజమౌళి హర్షం వ్యక్తం చేశారు. వాట్ ఏ స్పెల్ సిరాజ్ మియా అంటూ మహమ్మద్ సిరాజ్‌పై ప్రశంసలు కురిపించారు. అలాగే ప్రసిధ్ కృష్ణను సైతం కొనియాడారు. ఓవల్‌లో టీమిండియా తిరిగి పుంజుకుని అద్భుతంగా పోరాడిందని ప్రశంసలు కురిపించారు. టెస్ట్ క్రికెట్‌కు మరేది సాటిరాదని మరోసారి నిరూపించారని ట్వీట్ చేశారు. ప్రస్తుతం రాజమౌళి చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.కాగా.. ఇంగ్లాండ్‌తో జరిగిన ఐదో టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా సంచలన విజయం సాధించింది. చివరి రోజు వరకు సాగిన ఈ మ్యాచ్‌లో ఆరు పరుగుల తేడాతో మనోళ్లు విజయకేతనం ఎగరేశారు. సిరాజ్ అద్భుతమైన బౌలింగ్‌లో ఇంగ్లాండ్ పతనాన్ని శాసించాడు. ఐదు వికెట్లు తీసి విజయంలో కీలక పాత్ర పోషించాడు. ప్రసిధ్ కృష్ణ సైతం నాలుగు వికెట్లు తీసి ఇంగ్లాండ్‌ను కోలుకోలేని దెబ్బతీశాడు. ఈ విజయంతో ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ 2-2తో డ్రాగా ముగిసింది.ఇక రాజమౌళి సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం మహేశ్ బాబు మూవీతో బిజీగా ఉన్నారు. వీరిద్దరి కాంబోలో యాక్షన్ అడ్వెంచరస్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ ప్రియాంక చోప్రా హీరోయిన్గా నటిస్తోంది. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ మొదటి షెడ్యూల్ కూడా పూర్తి చేసుకుంది. వీరిద్దరి కాంబోలో వస్తోన్న మొదటి చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.SIRAJ MIYAA… 🔥What a spell!!!Prasidh’s double blow!!!India fights back at The Oval!!!Test cricket… nothing comes close. 🥰🥰Team India 🇮🇳🫡— rajamouli ss (@ssrajamouli) August 4, 2025 -
‘బాహుబలి’ సెట్లో ప్రభాస్ అల్లరి..ఎంత పని చేశావ్ దేవసేనా..?: వీడియో
ప్రభాస్ స్నేహానికి ఎంత విలువ ఇస్తాడో అందరికి తెలిసిందే. పాన్ ఇండియా స్టార్ అయినా..ఇప్పటికీ తన చిన్ననాటి స్నేహితులతోనే ఎక్కువ సమయం గడుపుతుంటాడు. సమయం దొరికితే ఫ్రెండ్స్ కలిసి టూర్స్‌ని వెళ్తుంటాడు. బయటకు సైలెంట్‌గానే కనిపిస్తాడు కానీ ప్రభాస్ చాలా అల్లరోడు అని రాజమౌళితో పాటు చాలా మంది స్నేహితులు చెప్పారు.సెట్లో సరదాగా ఉంటాడని ఆయనతో కలిసి పని చేసిన నటీనటులు చెబుతుంటారు. అయితే తెర వెనుక ప్రభాస్ ఎలా ఉంటాడు? ఏ స్థాయిలో అల్లరి చేస్తాడో తాజాగా బహుబలి చిత్రబృందం బయటి ప్రపంచానికి చూపించింది. స్నేహితుల దినోత్సవం సందర్భంగా ప్రభాస్‌కి సంబంధించిన స్పెషల్ వీడియోని చిత్రబృందం సోషల్ మీడియాలో పంచుకుంది. అందులో ప్రభాస్ చాలా సరదాగా ఉన్నాడు. బాహుబలి గెటప్ వేసుకొని అనుష్కతో పాటు రానాపై ఫన్నీ పంచులు విసిరాడు. ‘ఎంత పని చేశావ్ దేవసేన’ అంటూ ‘అమ్మా లేడు నాన్న లేడు.. ’ అనే పాటను పాడుతూ రానాతో ముచ్చటించాడు. మధ్యలో అనుష్క వచ్చి ప్రభాస్‌తో మాట్లాడడంతో అంతా నవ్వారు’. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. Every day on set felt like #FriendshipDay 🤗#Prabhas @RanaDaggubati @MsAnushkaShetty #BaahubaliArchives#Baahubali #BaahubaliTheEpic #Celebrating10YearsOfBaahubali#BaahubaliTheEpicOn31stOct pic.twitter.com/tXDLsbaGxm— Baahubali (@BaahubaliMovie) August 3, 2025 బాహుబలి విషయానికొస్తే.. రాజమౌళి దర్శకత్వంలో శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మించిన బాహుబలి తొలి భాగం ‘బాహుబలి: ది బిగినింగ్’ 2015 జూలై 10న రిలీజ్ కాగా, మలి భాగం ‘బాహుబలి: ది కన్‌క్లూజన్’ 2017 ఏప్రిల్ 28న విడుదలైంది. ఈ సినిమాలోని అమరేంద్ర బాహుబలి, మహేంద్ర బాహుబలి (శివుడు) పాత్రల్లో ప్రభాస్, భల్లాలదేవుడి పాత్రలో రానా, దేవసేనగా అనుష్క, అవంతికగా తమన్నా, శివగామిగా రమ్యకృష్ణ, కట్టప్పగా సత్యరాజ్, బిజ్జలదేవగా నాజర్ కనిపిస్తారు. -
చలో టాంజానియా
మహేశ్‌బాబు టాంజానియా వెళ్లనున్నారు. ఆయన హీరోగా రాజమౌళి దర్శకత్వంలో అంతర్జాతీయ స్థాయిలో ‘ఎస్ఎస్ఎమ్బీ 29’(వర్కింగ్ టైటిల్) సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ప్రియాంకా చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ ఇతరపాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌కు తాత్కాలిక బ్రేక్ పడింది. కాగా ఈ సినిమా ఫారిన్ షెడ్యూల్ చిత్రీకరణను తొలుత కెన్యాలో ప్లాన్ చేశారు మేకర్స్.కానీ, ప్రస్తుతం అక్కడ నెలకొన్న రాజకీయ అనిశ్చితి కారణంగా, సౌతాఫ్రికాలో చిత్రీకరణను ప్లాన్ చేశారు. అయితే ఇప్పుడు ఈస్ట్ ఆఫ్రికాలోని టాంజానియాలో చిత్రీకరణకు ఏర్పాట్లు చేస్తున్నారట రాజమౌళి. ఆగస్టు రెండో వారంలో చిత్రయూనిట్ టాంజానియా వెళ్లనున్నారని ఫిల్మ్‌నగర్ సమాచారం. ఇదిలా ఉంటే... ఈ చిత్ర సంగీత దర్శకుడు కీరవాణితో కలిసి మ్యూజిక్ సిట్టింగ్స్‌పై వర్క్ చేస్తున్నారు రాజమౌళి. ఇందుకోసం రాజమౌళి ఓ ప్రత్యేకమైన స్టూడియోను ఏర్పాటు చేసుకున్నారట. అలాగే టాంజానియాలో చిత్రీకరించబోయే యాక్షన్ సీక్వెన్స్ కోసం రిహార్సల్స్ కూడా జరుగుతున్నాయని ఫిల్మ్‌నగర్ సమాచారం. ఈ చిత్రం 2027లో విడుదలయ్యే అవకాశం ఉంది. -
డేవిడ్ వార్నర్‌కి రాజమౌళి స్పెషల్ గిఫ్ట్
డేవిడ్ వార్నర్ పేరు చెప్పగానే తెలుగు ప్రేక్షకులు ఎగ్జైట్ అయిపోతారు. ఎందుకంటే పేరుకే ఆస్ట్రేలియా క్రికెటర్ గానీ తెలుగు సినిమాలంటే మామూలు ప్రేమ కాదు. ఐపీఎల్లో హైదరాబాద్ జట్టుకు ఆడినప్పటి నుంచి ఈ ప్రేమ మొదలైంది. ఇక లాక్ డౌన్లో అప్పటి టాలీవుడ్ హిట్ సాంగ్స్ అన్నింటికీ రీల్స్, టిక్ టాక్ వీడియోలు చేసి తెగ వైరల్ అయిపోయాడు.(ఇదీ చదవండి: ప్రెగ్నెన్సీతో మెగా కోడలు.. కొత్త సినిమా టీజర్ రిలీజ్)ఇక అసలు విషయానికొస్తే ప్రస్తుతానికి వార్నర్ క్రికెట్ ఆడట్లేదు. కొన్నాళ్ల క్రితమే అంతర్జాతీయ కెరీర్‌కి రిటైర్మెంట్ ప్రకటించేశాడు. ఈ క్రమంలోనే గతంలో తీసుకున్న ఓ ఫొటోని ఇన్ స్టాలో పోస్ట్ చేశాడు. దీనికి రిప్లై ఇచ్చిన ప్రముఖ దర్శకుడు రాజమౌళి.. 'హాయ్ వార్నర్, మహిస్మతి రాజులా మారాల్సిన సమయం ఆసన్నమైంది. రాయల్ హెల్మెట్ నీకు పంపిస్తా' అని చెప్పారు. స్పందించిన వార్నర్.. 'యెస్ ప్లీజ్ సర్' అని రిప్లై ఇచ్చాడు.గతంలో రాజమౌళి-వార్నర్ కలిసి ఓ ప్రమోషనల్ యాడ్‌లో నటించారు. అప్పటినుంచి వీళ్లిద్దరి మధ్య బాండింగ్ కొనసాగుతున్నట్లు ఉంది. ఇప్పుడు వార్నర్‌కి రాజమౌళి గిఫ్ట్ ఇస్తానని మాట ఇవ్వడం లాంటివి చూస్తుంటే రీ రిలీజ్ సందర్భంగా అంతర్జాతీయంగానూ 'బాహుబలి'ని ప్రమోట్ చేసేందుకు వార్నర్‌తో కలిసి పెద్ద ప్లానే వేస్తున్నాడేమో అనిపిస్తుంది. ఈ ఏడాది అక్టోబరులో 'బాహుబలి' రెండు భాగాల్ని కలిపి ఓ పార్ట్‌గా రీ రిలీజ్ చేయబోతున్నారు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 20 సినిమాలు) View this post on Instagram A post shared by David Warner (@davidwarner31) -
మ్యూజిక్ ఆన్
హీరో మహేశ్‌బాబు, దర్శకుడు రాజమౌళి కాంబినేషన్లో అంతర్జాతీయ స్థాయిలో ఓ భారీ బడ్జెట్ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణకు స్మాల్ బ్రేక్ ఇచ్చింది యూనిట్. ఈ గ్యాప్‌లో ఈ సినిమాకు సంబంధించిన మ్యూజిక్ వర్క్స్‌పై ఫోకస్ పెట్టారట రాజమౌళి అండ్ టీమ్. ఈ చిత్రం మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణితో కలిసి ఈ సినిమాలోనిపాటలు, ఆర్ఆర్ ఎలా ఉండాలన్న విషయాలపై చర్చలు జరుపుతున్నారట రాజమౌళి.ఈ చర్చలు ఓ కొలిక్కి వస్తే ఈ సినిమా మ్యూజిక్ వర్క్స్‌ను పూర్తి స్థాయిలో ప్రారంభిస్తారట కీరవాణి. ఈ ఫారెస్ట్ అడ్వెంచరస్ యాక్షన్ మూవీలో ప్రియాంకా చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ ఇతర ప్రధానపాత్రల్లో నటిస్తున్నారు. మాధవన్ మరో కీలకపాత్రలో నటిస్తారని, ఈ సినిమా కథ కథనం, భారతీయ ఇతిహాసం రామాయణం ఆధారంగా ఉంటాయనే టాక్ వినిపిస్తోంది.ఇక ఈ సినిమా నెక్ట్స్ షెడ్యూల్ చిత్రీకరణ వచ్చే నెలలోనే ప్రారంభం అవుతుంది. ఈ సంగతి ఇలా ఉంచితే... ఆగస్టు 9న మహేశ్‌బాబు బర్త్ డే. ఈ సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ ఏదైనా వస్తే బాగుంటుందని మహేశ్‌బాబు ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మరి... మహేశ్‌బాబు ఫ్యాన్స్ ఆశ నెరవేరుతుందా? లెట్స్ వెయిట్ అండ్ సీ. -
చిన్న విరామం
హీరో మహేశ్‌బాబు సినిమా షూటింగ్‌కు చిన్న విరామం ఇచ్చారు. ఆయన హీరోగా రాజమౌళి దర్శకత్వంలో ‘ఎస్ఎస్ఎమ్బీ 29’(వర్కింగ్ టైటిల్) చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ప్రియాంకా చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకి కేఎల్ నారాయణ నిర్మాత. ఈ మూవీ చిత్రీకరణకు స్మాల్ బ్రేక్ పడింది. వెకేషన్లో భాగంగా ఫ్యామిలీతో కలిసి శ్రీలంకకు వెళ్లారు మహేశ్‌బాబు. మరోవైపు బహమాస్ తీరంలో సేద తీరుతున్నారు ప్రియాంకా చోప్రా. ఇంకోవైపు ‘బాహుబలి: ది ఎపిక్’ సినిమా పోస్ట్ ప్రోడక్షన్ పనులపై రాజమౌళి బిజీగా ఉన్నారని సమాచారం. ఇలా ‘ఎస్ఎస్ఎమ్బీ 29’ చిత్రీకరణకు తాత్కాలిక బ్రేక్ పడింది. ఈ సినిమా చిత్రీకరణ తిరిగి ఆగస్టులో ప్రారంభమవుతుందని తెలిసింది.ఈ చిత్రం గత షెడ్యూల్ చిత్రీకరణ హైదరాబాద్‌లో జరిగింది. ఆగస్టులో మొదలుకానున్న కొత్త షెడ్యూల్ విదేశాల్లో మొదలవుతుందా? లేక హైదరాబాద్ శివార్లలో వేసిన వారణాసి సెట్లో ప్రారంభం అవుతుందా? ఈ విషయంపై స్పష్టత రావాలి. -
రాజమౌళి- మహేశ్ మూవీ.. ఊహించని విలన్!
మహేశ్‌బాబు హీరోగా రూపొందుతోన్న తాజా చిత్రం ‘ఎస్ఎస్ఎమ్బీ 29’ (వర్కింగ్ టైటిల్). రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ ప్రియాంకా చోప్రా హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ కీలకపాత్రలు చేస్తున్నారు. కేఎల్ నారాయణ నిర్మిస్తున్నారు. కాగా ఈ సినిమా కథ ఏంటి? షూటింగ్ ఎంత వరకూ వచ్చింది? వంటి విషయాలపై చిత్ర బృందం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.అయితే ఆఫ్రికా అడవుల నేపథ్యంలో సాగే ‘ఇండియానా జోన్స్’ స్టైల్ కథతో ఈ సినిమా రూపొందుతోందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే... ఈ కథలో విలన్ ఎవరు? అనే విషయం సినిమా ముగిసేవరకూ ఊహించలేమట. పతాక సన్నివేశాల వరకు నెగెటివ్ రోల్ తెలియనివ్వకుండా ప్రేక్షకులను సస్పెన్స్ చేయనున్నారట రాజమౌళి. ఈ చిత్రంలో మాధవన్ కీలకపాత్రలో కనిపించనున్నారనే వార్త ప్రచారంలోకి వచ్చింది. దాంతో ఆయన విలన్‌గా కనిపించనున్నారనే ఊహాగానాలు మొదలయ్యాయి. -
బాహుబలి, ఆర్ఆర్ఆర్ కాదు.. రాజమౌళి బెస్ట్ ఫిల్మ్ ఇదేనట!
తెలుగు సినిమాను పాన్ ఇండియా స్థాయికి చేర్చిన దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి(SS Rajamouli). ఆయన కెరీర్లో అపజయం అనేదే తెలియదు. మర్యాద రామన్న అనే చిన్న సినిమా మొదలు.. ఆర్ఆర్ఆర్ అనే భారీ బడ్జెట్ చిత్రం వరకు అన్నీ సూపర్ హిట్లే. బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్లతో పాటు ఆస్కార్ మొదలు ఏన్నో అవార్డులను అందించాడు. ఆయన దర్శకత్వం వహించిన చిత్రాల్లో బెస్ట్ ఏదంటే.. చెప్పడం కష్టమే. ఎందుకంటే అన్నీ సినిమాలు అద్భుతమైనవే.అయితే చాలా మందికి బాహుబలి(bahubali), ఆర్ఆర్ఆర్(RRR)చిత్రాలంటే ఎక్కువ ఇష్టమని చెబుతుంటారు. మరి అదే ప్రశ్నను రాజమౌళిని అడిగితే.. బాహుబలి కాదు ఆర్ఆర్ఆర్ కాదు.. ఈగ తన ఫేవరేట్ ఫిల్మ్ అని చెబుతాడు. తాజాగా జరిగిన జూనియర్ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్లో రాజమౌళి ఈ విషయాన్ని చెప్పాడు.రాజమౌళికి సంబంధించిన వర్కింగ్ స్టిల్స్‌ని తెరపై చూపిస్తూ.. అవి ఏ సినిమాకు సంబంధించినవో గుర్తించాలని యాంకర్ సుమ..జక్కన్నకు టాస్క్ ఇచ్చింది. అలా ఈగ సినిమా స్టిల్స్ రాగానే..జక్కన్న ‘నా ఫేవరేట్ ఫిల్మ్ ఈగ ’అని చెప్పాడు. దీంతో యాంకర్ సుమ.. మీ ఫేవరేట్ ఫిల్మ్ ఈగ అన్నమాట అనగే.. జక్కన్న నవ్వుతూ తల ఊపాడు.ఈగ సినిమాతోనే రాజమౌళికి పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు వచ్చింది. చిన్న ఈగతో ఆయన చేసిన ప్రయోగం భారీ విజయాన్ని అందించింది. టెక్నాలజీని పూర్తి స్థాయిలో వాడుకొని హాలీవుడ్ రేంజ్లో ఈ సినిమాను తీర్చిదిద్దాడు జక్కన్న. నాని, సమంత జంటగా నటించిన ఈ చిత్రం 2012లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. -
ఆ ఇద్దరు ప్రశంసించారంటే.. ఇక ఎవరి సర్టిఫికెట్ అవసరం లేదు: రాజమౌళి
‘‘సాయిగారు ‘జూనియర్’( Junior Movie) మొదలుపెట్టినప్పుడు... మంచి కథతో చిన్న చిత్రం ప్రారంభిస్తున్నారనుకున్నాను. అయితే శ్రీలీల, జెనీలియా, రవిచంద్రన్‌గారు... ఇలా నటీనటుల లిస్ట్ పెరుగుతూనే ఉంది. దేవిశ్రీ సంగీతం, సెంథిల్ సినిమాటోగ్రఫీ, ఫైట్‌మాస్టర్ పీటర్ హెయిన్స్... ఇలా ఒక్కొక్కరు యాడ్ అవుతూ ఉంటే ఓ పెద్ద సినిమాకి ఎలాంటి నటీనటులు, సాంకేతిక నిపుణులను ఎంచుకుంటామో అలా ‘జూనియర్’కి కూడా పెట్టుకుంటూ వెళ్లారు. అలా చిన్న సినిమా అయినా పెద్ద సినిమా చేశారు’’ అని ప్రముఖ దర్శకుడు రాజమౌళి(SS Rajamouli) అన్నారు. ప్రముఖ పారిశ్రామికవేత్త, కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి తనయుడు కిరీటి రెడ్డి హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘జూనియర్’. రాధాకృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శ్రీలీల కథానాయిక. డా. రవిచంద్రన్, జెనీలియా ఇతర పాత్రలు పోషించారు. వారాహి చలన చిత్రం పతాకంపై రజనీ కొర్రపాటి నిర్మించిన ఈ సినిమా రేపు (శుక్రవారం) విడుదలవుతోంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి ముఖ్య అతిథిగా హాజరైన ఎస్ఎస్ రాజమౌళి బిగ్ టికెట్ లాంచ్ చేసిన అనంతరం మాట్లాడుతూ– ‘‘పెద్ద సినిమా అంటే బడ్జెట్ గురించి కాదు... ‘జూనియర్’ సినిమా వెయ్యికి పైగా స్క్రీన్స్‌లలో రిలీజ్ అవుతోందంటే అందుకు ప్రేక్షకుల్లో ఉండే ఆసక్తే కారణం. ఈ చిత్రాన్ని తొలి రోజే, లేకుంటే తొలి వారమే మేము చూడాలని ఆడియన్స్‌కి ఆసక్తి ఉన్నప్పుడే అది ఎగ్జిబిటర్స్ వద్ద నుంచి డిస్ట్రిబ్యూటర్స్ వద్దకు వచ్చి ఆ తర్వాత నిర్మాత వద్దకు వచ్చి వెయ్యి స్క్రీన్లలో విడుదలవుతోంది. చిన్ని సినిమాగా స్టార్ట్ అయిన ఈ సినిమాని ఈ స్థాయికి తీసుకొచ్చిన సాయిగారికి అభినందనలు. నేను కూడా ఈ చిత్రం చూసేందుకు ఆత్రుతగా ఎదురు చూస్తున్నా. తన పాటలతో సినిమాని ఎలివేట్ చేయడం దేవిశ్రీకి బాగా తెలుసు. ‘వైరల్ వయ్యారి...’ పాట ఎంత వైరల్ అయ్యింది, ఎంత క్రేజ్ తీసుకొచ్చిందనే విషయం గురించి నేను చెప్పక్కర్లేదు. సెంథిల్ తను అనుకున్న ఔట్పుట్ వచ్చేవరకు ఎక్కడ కూడా రాజీపడడు. పీటర్ హెయిన్స్ క్రేజీ మ్యాన్... విపరీతంగా కష్టపడతాడు. కిరీటి చాలా బాగా చేశాడని సెంథిల్, పీటర్ వంటి వారు ప్రశంసించారంటే ఇక ఇండస్ట్రీలో నీకు(కిరీటి) ఎవరి సర్టిఫికెట్ అవసరం లేదు. ఎంతో అంకితభావంతో రాధాకృష్ణ ఈ సినిమాని ఈ స్థాయికి తీసుకొచ్చారు. ఈ చిత్రాన్ని అందరూ తప్పకుండా థియేటర్లలో చూడండి. మీ టికెట్ డబ్బులకు కచ్చితంగా పైసా వసూల్ సినిమాలా ఉంటుంది’’ అని చెప్పారు. -
‘జూనియర్’ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
డూప్ లేని యాక్షన్
హీరో మహేశ్‌బాబు–దర్శకుడు రాజమౌళి కాంబినేషన్లో అంతర్జాతీయ స్థాయిలో ఫారెస్ట్ అడ్వెంచరస్ యాక్షన్ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల హైదరాబాద్‌లో ఈ సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాల చిత్రీకరణ జరిగింది. ఈ సినిమా నెక్ట్స్ షెడ్యూల్‌ను కెన్యాలో ప్లాన్ చేశారట రాజమౌళి. కానీ కొన్ని కారణాల వల్ల ఈ చిత్రం నెక్ట్స్ షెడ్యూల్ చిత్రీకరణ సౌతాఫ్రికాలో జరగనుందని సమాచారం.అక్కడ కీలకమైన టాకీపార్ట్, ఓ సాంగ్, ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే యాక్షన్ సీక్వెన్స్‌ను ప్లాన్ చేశారట. ఈ షెడ్యూల్‌కు సంబంధించిన షూటింగ్ రిహార్సల్స్‌తో ప్రస్తుతం యూనిట్ బిజీగా ఉందని తెలిసింది. అంతేకాదు... ఈ సినిమాలోని యాక్షన్ సన్నివేశాలను మహేశ్‌బాబు ఎటువంటి డూప్ లేకుండా చేస్తున్నారని, దీంతో యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ సమయంలో యూనిట్ తగిన జాగ్రత్తలుపాటిస్తోందని ఫిల్మ్‌నగర్ భోగట్టా. కేఎల్ నారాయణ నిర్మిస్తున్న ఈ సినిమాలో ప్రియాంకా చోప్రా, పృథ్వీరాజ్ ఇతర ప్రధానపాత్రల్లో నటిస్తున్నారు. మరో కీలకపాత్రలో మాధవన్ నటిస్తారనే టాక్ తెరపైకి వచ్చింది. -
‘బాహుబలి’ రీరిలీజ్: రన్‌టైమ్‌పై పుకార్లు.. రానా ఏమన్నారంటే..?
తెలుగు సినిమాను పాన్ ఇండియా స్థాయికి చేర్చిన ‘బాహుబలి’ మరోసారి థియేటర్స్‌లో సందడి చేసేందుకు వచ్చేస్తుంది. బాహుబలి సినిమా విడుదలై పదేళ్లు పూర్తయిన సందర్భంగా రెండు భాగాలను కలిపి ‘బాహుబలి ది ఎపిక్’(Baahubali: The Epic) పేరుతో మరోసారి రిలీజ్ చేయబోతున్నారు. అక్టోబర్ 31న ఈ చిత్రం ప్రేక్షకుల రాబోతుందని ప్రకటించినప్పటి నుంచి ఈ సినిమా రన్‌టైన్‌పై పుకార్లు మొదలయ్యాయి. రెండు సినిమాలను కలిపి చూపిస్తారు కాబట్టి.. దాదాపు 5 గంటలపైనే రన్‌టైమ్ ఉంటుందని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. మరికొంతమంది నాలుగు గంటల నిడివి ఉంటుందని చెబుతున్నారు. తాజాగా ఈ పుకార్లపై ఆ సినిమాలో భల్లాల దేవ పాత్ర పోషించిన హీరో రానా(Rana Daggubati) స్పందించారు. ఆయన సమర్పణలో రిలీజ్ కాబోతున్న ‘కొత్తపల్లిలో ఒకప్పుడు’ సినిమా ఈవెంట్లో రానా బాహుబలి రన్‌టైమ్ గురించి మాట్లాడుతూ.. ‘నిడివి ఎంత అనేది నాకు కూడా తెలియదు. ఎంత నిడివి ఉన్నా పర్లేదు..నేను అయితే ఆనందంగా ఉన్నాను. ఈ ఏడాదిలో నేను ఏ సినిమాలో నటించలేదు. కానీ బాహుబలి ది ఎపిక్‌తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకోబోతున్నాను. నిడివి ఎంత అనేది రాజమౌళి కూడా నాకు చెప్పలేదు. నాలుగు గంటలు, ఐదు గంటలు అని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. రాజమౌళి చెప్పే వరకు ఎవరికీ తెలియదు’ అని రానా అన్నారు. బాహుబలి విషయానికొస్తే.. రెండు భాగాలుగా తెరకెక్కిన ఈ చిత్రం తొలి భాగం లిభాగం 2015 జులై 10న విడుదలై భారతీయ సినీ చరిత్రలోనే అనేక రికార్డులు సృష్టించింది. ఆ తర్వాత పార్ట్-2 2017లో రిలీజై తెలుగు సినిమా ఖ్యాతిని మరోస్థాయికి తీసుకెళ్లింది.బాహుబలిగా ప్రభాస్, భళ్లాలదేవగా రానా, దేవసేనగా అనుష్క, శివగామిగా రమ్యకృష్ణ, అవంతికగా తమన్నా, కట్టప్పగా సత్యరాజ్ ఈ చిత్రాల్లో ముఖ్య పాత్రలు పోషించారు. -
ఏంటి బ్రో? కొంచెం కూడా సోయి లేదా?.. రాజమౌళికి కోపం తెప్పించిన అభిమాని!
కొందరికీ ఏ సందర్భంలో ఏం చేయాలో కూడా ఆలోచన ఉండదు. వచ్చిన సందర్భం ఏంటి? మనం చేస్తున్న పనేంటి? అని ఆలోచిస్తే ఈ రోజు అలా జరిగి ఉండేది కాదు. మన దర్శకధీరుడు రాజమౌళికి కోపం వచ్చేది కాదు. ఓ అభిమాని చేసిన పనికి ప్రశాంతంగా ఉండే మన డైరెక్టర్ కోపం తెచ్చుకోవాల్సి వచ్చింది. ఇంతకీ ఏం జరిగిందో తెలుసుకుందాం.ఇవాళ టాలీవుడ్ సినీ పరిశ్రమకు తీరని లోటు. సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు అనారోగ్యంతో తెల్లవారుజామున కన్నుమూశారు. తెలుగు పరిశ్రమకు ఆయన చేసిన సేవలను స్మరించుకుంటూ టాలీవుడ్ ప్రముఖులంతా నివాళులర్పించేందుకు జూబ్లీహిల్స్‌లోని నివాసానికి వచ్చారు. ఈ క్రమంలోనే రాజమౌళి తన సతీమణితో కలిసి కోట శ్రీనివాసరావుకు నివాళులు అర్పించారు.అనంతరం అక్కడి నుంచి తిరిగి వెళ్తుండగా ఓ అభిమాని చేసిన పని రాజమౌళికి కోపం తెప్పించేలా చేసింది. తన కారు వైపు వెళ్తున్న డైరెక్టర్‌ను ఓ అభిమాని సెల్ఫీ కోసం వెంటపడ్డారు. ఫోటో తీసుకునేందుకు ఆయన కారు వరకు వెళ్లాడు. దీంతో అసహనానికి గురైన రాజమౌళి ఏంటిది? అంటూ అతన్ని తోసేశాడు. ఇది చూసిన నెటిజన్స్ అభిమానిపై మండిపడుతున్నారు. వచ్చిన సందర్భం ఏంటో తెలుసుకోకుండా సెల్ఫీ కోసం ఎగబడడం ఏంటని అతనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. View this post on Instagram A post shared by Kamlesh Nand (work) (@artistrybuzz_) -
శ్రీలీల లేటేస్ట్ మూవీ.. ట్రైలర్ రిలీజ్ చేసిన దర్శకధీరుడు రాజమౌళి
కర్ణాటక మాజీ మంత్రి, పారిశ్రామికవేత్త గాలి జనార్ధన్ రెడ్డి తనయుడు కిరీటి రెడ్డి హీరోగా పరిచయమవుతోన్న చిత్రం ‘జూనియర్’. ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్గా నటించింది. ఈ చిత్రంలో సీనియర్ హీరోయిన్ జెనీలియా కీలక పాత్ర పోషించారు. వారాహి చిత్రం బ్యానర్‌పై రజనీ కొర్రపాటి నిర్మించిన ఈ చిత్రం తెలుగు, కన్నడ, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో జూన్ 18న రిలీజ్ కానుంది. ఇప్పటికే విడుదలైన సాంగ్స్‌కు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది.తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. టాలీవుడ్ దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి చేతుల మీదుగా ట్రైలర్ రిలీజ్ చేశారు. తెలుగు వర్షన్ రాజమౌళితో.. కన్నడ వర్షన్ ట్రైలర్‌ను కిచ్చా సుదీప్ చేతుల మీదుగా విడుదల చేశారు. ఇటీవల విడుదలైన వైరల్ వయ్యారి అనే ఐటమ్ సాంగ్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. కాగా.. ఈ సినిమాకు దేవీశ్రీ ప్రసాద్ సంగీతమందించారు.Happy to release the trailer of @KireetiOfficial’s #Junior… Wishing him all the best on his debut and best wishes to the entire team for the release on July 18th!#JuniorTrailer https://t.co/qDwK35QvR2— rajamouli ss (@ssrajamouli) July 11, 2025 -
'బాహుబలి' రీ యూనియన్.. అనుష్క అందుకే కనిపించలేదా?
టాలీవుడ్ రూపురేఖల్ని మార్చిన సినిమా 'బాహుబలి'. సరిగ్గా పదేళ్ల క్రితం థియేటర్లలో తొలి భాగం రిలీజ్ కాగా.. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. పాన్ ఇండియా ట్రెండ్‌కి శ్రీకారం చుట్టింది. అప్పటినుంచి ఏ పెద్ద సినిమా రిలీజైనా సరే 'బాహుబలి' రికార్డ్స్‌ని సదరు చిత్రం దాటిందా లేదా అని మాట్లాడుకుంటూ ఉంటారు. అలాంటి ఈ చిత్రానికి పదేళ్లు పూర్తయిన సందర్భంగా టీమ్ అంతా మరోసారి కలిశారు. ఆ ఫొటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.ఈ మొత్తం ఫొటోల్లో చాలామంది ప్రభాస్ లుక్స్ గురించే మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే డిఫరెంట్ హెయిర్ స్టైల్‌తో స్టైలిష్‌గా కనిపించాడు. డార్లింగ్ అభిమానులైతే తెగ సరదా పడిపోతున్నారు. అంతా బాగానే ఉంది కానీ హీరోయిన్ అనుష్క కనిపించకపోవడం మాత్రం కాస్త వెలితిగా అనిపించింది. ఇంతకీ ఆమె రాకపోవడానికి కారణం ఏంటా అని మాట్లాడుకుంటున్నారు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి 'కుబేర'.. అధికారిక ప్రకటన)అయితే 'బాహుబలి' చేస్తున్న టైంలో 'సైజ్ జీరో' అనే మూవీ చేసిన అనుష్క.. ఈ ప్రాజెక్ట్ కోసం భారీగా బరువు పెరిగింది. కానీ తగ్గే విషయంలో మాత్రం అప్పటినుంచి పలు సమస్యలు ఎదుర్కొంటూనే ఉంది. అందుకే బాహుబలి తర్వాత పలు సినిమాలు చేసినా సరే బయట పెద్దగా కనిపించలేదు. కనీసం ప్రెస్ మీట్స్‌కి కూడా హాజరు కాలేదు. ఇప్పుడు కూడా అందుకే రీ యూనియన్ పార్టీకి హాజరు కాలేదని అంటున్నారు. మరి ఇందులో నిజమేంటి అనేది తెలియాల్సి ఉంది.ఇకపోతే అనుష్క నటించిన 'ఘాటీ' సినిమా లెక్క ప్రకారం జూలై 11న అంటే ఈ రోజు(శుక్రవారం) థియేటర్లలోకి రావాలి. కానీ అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది. కొత్త డేట్ ఎప్పుడనేది టీమ్ చెప్పలేదు. క్రిష్ దర్శకత్వం వహించిన ఈ మూవీ.. చాలా భాగం అడవి బ్యాక్ డ్రాప్లో తీశారు. మరి ఈ మూవీ రిలీజ్ ముందైనా సరే అనుష్క.. బయటకొస్తుందా లేదా అనేది చూడాలి?(ఇదీ చదవండి: విశాఖలో 'అల్లు అర్జున్' మల్టీఫ్లెక్స్ పనులకు శ్రీకారం) View this post on Instagram A post shared by Baahubali (@baahubalimovie) -
పదేళ్ల తర్వాత మళ్లీ కలిసిన 'బాహుబలి' టీమ్ (ఫోటోలు)
-
బాహుబలికి పదేళ్లు.. ఫ్యాన్స్‌కు రాజమౌళి బిగ్ సర్ప్రైజ్!
తెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి పరిచయం చేసిన డైరెక్టర్ ఎవరంటే ఠక్కున ఆయన పేరు చెప్పేస్తారు. ఎందుకంటే ఆ స్థాయిలో చిత్రాలు నిర్మించింది ఆయనే. బాహుబలి నుంచి ఆర్ఆర్ఆర్ దాకా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన చిత్రాలు ప్రపంచస్థాయిలో సత్తాచాటాయి. నేటికి బాహుబలి చిత్రం విడుదలై దశాబ్దం రోజులు పూర్తి చేసుకుంది. తొలిభాగం 2015 జులై 10న విడుదలై భారతీయ సినీ చరిత్రలోనే అనేక రికార్డులు సృష్టించింది. ఆ తర్వాత పార్ట్-2 2017లో రిలీజై తెలుగు సినిమా ఖ్యాతిని మరోస్థాయికి తీసుకెళ్లింది.బాహుబలిగా ప్రభాస్, భళ్లాలదేవగా రానా, దేవసేనగా అనుష్క, శివగామిగా రమ్యకృష్ణ, అవంతికగా తమన్నా, కట్టప్పగా సత్యరాజ్ ఈ చిత్రాల్లో ముఖ్య పాత్రలు పోషించారు. ఈ పాత్రల పేర్లు ఇప్పటికీ ప్రత్యేకంగానే ఉంటాయి. ఎం.ఎం.కీరవాణి సంగీతం ఈ సినిమాని మరోస్థాయికి తీసుకెళ్లింది. విజయేంద్రప్రసాద్ కథ అందించారు. ఆర్క మీడియా వర్క్స్ పతాకంపై ఈ సినిమాను శోభు యార్లగడ్డ, దేవినేని ప్రసాద్ రూ. 180 కోట్లకు పైగా బడ్జెట్‌తో నిర్మించగా బాక్సాఫీస్ వద్ద రూ. 650 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది.అయితే ఈ రెండు భాగాలు కలిపి ఓ సినిమా వస్తే ఎలా ఉంటుంది? బాహుబలి-1, బాహుబలి-2 చిత్రాలను ఓకే మూవీగా చూస్తే ఆ ఫీలింగ్ మాటల్లో చెప్పలేం. మీ అందరి కోసం మరోసారి బాహుబలి థియేటర్లలో సందడి చేయనుంది. ఈ విషయాన్ని దర్శకధీరుడు రాజమౌళి స్వయంగా వెల్లడించారు. బాహుబలి ది ఎపిక్ పేరుతో రెండు భాగాలను కలిపి ఓ సినిమాను రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ చిత్రాన్ని అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు తెలిపారు.రాజమౌళి తన ట్వీట్లో రాస్తూ..'బాహుబలి...అనేక ప్రయాణాలకు నాంది.. లెక్కలేనన్ని జ్ఞాపకాలు.. అంతులేని ప్రేరణ.. అప్పుడే 10 సంవత్సరాలు పూర్తయింది. రెండు భాగాలను కలిపి సంయుక్త చిత్రంగా బాహుబలి ది ఎపిక్ పేరుతో ఈ ప్రత్యేక మైలురాయిని గుర్తుచేసుకుంటున్నా. ఈ సినిమా అక్టోబర్ 31, 2025న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది' అంటూ ఫ్యాన్స్‌కు సర్ప్రైజ్ ఇచ్చారు. ఇక ప్రభాస్ ఫ్యాన్స్‌తో పాటు రానా అభిమానులకు కూడా ఇక పండగే పండగ.Baahubali…The beginning of many journeys.Countless memories.Endless inspiration.It’s been 10 years.Marking this special milestone with #BaahubaliTheEpic, a two-part combined film.In theatres worldwide on October 31, 2025. pic.twitter.com/kaNj0TfZ5g— rajamouli ss (@ssrajamouli) July 10, 2025 -
'బాహుబలి'కి పదేళ్లు.. ఈ కథకు ఆదర్శం ఎవరో తెలుసా..?
తెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి పరిచయం చేసిన చిత్రం బాహుబలి. భారతీయ సినీ చరిత్రలోనే అనేక రికార్డులను ఈ చిత్రం సృష్టించింది. తొలిభాగం 2015 జులై 10న విడుదలైంది. రెండోది 2017లో విడుదలైన సంగతి తెలిసిందే. సరిగ్గా నేటితో పదేళ్లు బాహుబలి పూర్తి చేసుకున్నాడు. బాహుబలిగా ప్రభాస్, భళ్లాలదేవగా రానా, దేవసేనగా అనుష్క, శివగామిగా రమ్యకృష్ణ, అవంతికగా తమన్నా, కట్టప్పగా సత్యరాజ్ ఈ చిత్రాల్లో ముఖ్య పాత్రలు పోషించారు. ఈ పాత్రల పేర్లు ఇప్పటికీ ప్రత్యేకంగానే ఉంటాయి. ఎం.ఎం.కీరవాణి సంగీతం ఈ సినిమాని మరోస్థాయికి తీసుకెళ్లింది. విజయేంద్రప్రసాద్ కథ అందించారు. దర్శక ధీరుడు ఎస్.ఎస్ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన 'బాహుబలి: ది బిగినింగ్' చిత్రం విడుదల తర్వాత తెలుగు పరిశ్రమ పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగింది. ఆర్క మీడియా వర్క్స్ పతాకంపై ఈ సినిమాను శోభు యార్లగడ్డ, దేవినేని ప్రసాద్ రూ. 180 కోట్లకు పైగా బడ్జెట్‌తో నిర్మించగా బాక్సాఫీస్ వద్ద రూ. 650 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది.బాహుబలికి మూలం'అమరేంద్ర బాహుబలి పాత్రను రామాయణం నుంచి తీసుకున్నదేనిని ఒక ఇంటర్వ్యూలో రాజమౌళి చెప్పారు. శ్రీ రాముడిలో ఉండే లక్షణాలు బాహుబలి పాత్రలో కనిపిస్తాయన్నారు. రామాయణం గురించి తెలుసుకుంటే రాముడు పాత్ర చాలా వినయం విధేయంగా ఉంటుంది. ఎప్పుడూ కూడా ఆవేశంగా మాట్లాడరు. ఎప్పుడో ఒకసారి మాట్లాడినా దాని వెనుక పెద్ద ప్రళయమే ఉంటుంది. ఆయన పెద్దలు చెప్పింది వింటూ తన పనులు చేసుకుంటూ వెళ్లిపోతాడు. అంత బలంగా రాముడి చరిత్ర మనకు చెబుతుంది. భారత్‌లో కృష్ణుడికి ఒక గుడి ఉంటే.. 50కి పైగా రాముడి ఆలయాలు ఉంటాయి. పొరపాటున రాముడిని ఏమైనా అంటే భారతీయులు ఎంతమాత్రం సహించరు. ప్రతి ఒక్కరిలో ఆవేశం పొంగుకుని వస్తుంది. అంతలా భక్తితో ఆయన్ను ఆరాధిస్తారు. అంత భక్తిభావన ఎందుకు ఉంది అని ఆలోచించా.. రాముడి గురించి తెలుసుకున్న తర్వాతే బాహుబలి పాత్రను తెరపైకి తీసుకొచ్చాను.' అని రాజమౌళి అన్నారు.'వాల్మీకి రామాయణం రాసినప్పుడు రాముడితో పాటు మరికొన్ని పవర్ఫుల్ పాత్రలు ఉంటాయి. హనుమంతుడు, లక్ష్మణుడు వంటి పాత్రలను కూడా రామాయణంలో చాలా బలంగా రాశారు. అయితే, వారు రాముడి కోసం ప్రాణాలు ఇచ్చేందుకు అయినా రెడీగా ఉంటారు. అలా డైరెక్ట్ హీరోయిజం కాకుండా అప్లయిడ్ హీరోయిజాన్ని రాముడి పట్ల వాల్మీకి చూపించారని నాకు అనిపించింది. అందుకే అమరేంద్ర బాహుబలి పాత్ర రాముడిలా కనిపిస్తుంది. కట్టప్ప, శివగామి, దేవసేన వంటి పాత్రలు బాహుబలిని దేవుడు అంటాయి.' అన్నారు.బాహుబలి విశేషాలుజాతీయ ఉత్తమ చిత్రంగా, ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్ చిత్రంగా రెండు అవార్డులను బాహుబలి -1 అందుకుంది.బాహుబలి-1 మూవీ 14 నంది అవార్డ్స్‌ను దక్కించుకుంది.బాహుబలి -2 సినిమాకు 65వ జాతీయ చలనచిత్ర అవార్డుల వేడుకలో మూడు విభాగాల్లో నేషనల్ అవార్డులు గెలుచుకుంది. (ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్, ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రం, ఉత్తమ యాక్షన్ చిత్రం)బాహుబలి- 2 ప్రపంచవ్యాప్తంగా రూ. 1810 కోట్లు రాబట్టి రెండో స్థానంలో ఉంది.భారతదేశంలో అత్యంత వసూళ్ళు సాధించిన సినిమాలలో ఒకటిగా ఈ సినిమా పేరొందింది.ఈ సినిమా కోసం తమిళ రచయిత మదన్ కార్కి “కిలికిలి” లేదా “కిలికి” అనే పేరుతో ఓ కొత్త భాషను రూపొందించారు.ఈ భాషను 750 పదాలతో, 40 వ్యాకరణ సూత్రాలతో రూపోందించారు2011లో రాజమౌళి తన తదుపరి సినిమాలో ప్రభాస్ కథానాయకుడిగా నటించనున్నాడని ప్రకటించారు2013లో ఈ సినిమా వర్కింగ్ టైటిల్ ని బాహుబలిగా ప్రకటించారు.శివగామి కోసం మొదట శ్రీదేవితో సంప్రదింపులు జరిపారు. శ్రీదేవి అధిక పారితోషికం కోరడంతో ఆ అవకాశాన్ని రమ్యకృష్ణకు ఇవ్వడం జరిగిందిఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు ఏడాది పాటు జరిగాయి. అందుకోసం 15,000 స్టొరీ బోర్డు స్కెచ్చులు రూపొందించారు.ఓ భారతీయ సినిమాకు ఇంతటి ప్రీ ప్రొడక్షన్ పనులు చేయడం ఈ సినిమాకే మొదటిసారి.ఈ సినిమా చిత్రీకరణ జూలై 6, 2013న కర్నూలు జిల్లాలోని ఓర్వకల్లు రాతి ఉద్యానవనంలో మొదలైంది -
సాహోరే బాహుబలి
ఈ తరంలో తెలుగు సినిమా సాహసం... బాహుబలి తెలుగు సినిమా గర్వం... బాహుబలి తెలుగు సినిమా గౌరవం... బాహుబలి తెలుగు సినిమా ధైర్యం... బాహుబలి అవును... ‘‘భళి భళి భళిరా భళి... సాహోరే బాహుబలి’’ అని ప్రేక్షకులు అనేలా చేసింది ‘బాహుబలి’ చిత్రం. ప్రభాస్ హీరోగా, రానా, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ, సత్యరాజ్, నాజర్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘బాహుబలి’. రాజమౌళి దర్శకత్వంలో శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మించిన బాహుబలి తొలి భాగం ‘బాహుబలి: ది బిగినింగ్’ 2015 జూలై 10న రిలీజ్ కాగా, మలి భాగం ‘బాహుబలి: ది కన్‌క్లూజన్’ 2017 ఏప్రిల్ 28న విడుదలైంది. ‘బాహుబలి: ది బిగినింగ్’ విడుదలై నేటితో పదేళ్లు. ఈ సందర్భంగా ఈ సినిమా గురించి కొన్ని ఆసక్తికర విశేషాలు.∙ఈ సినిమాలోని అమరేంద్ర బాహుబలి, మహేంద్ర బాహుబలి (శివుడు) పాత్రల్లో ప్రభాస్, భల్లాలదేవుడి పాత్రలో రానా, దేవసేనగా అనుష్క, అవంతికగా తమన్నా, శివగామిగా రమ్యకృష్ణ, కట్టప్పగా సత్యరాజ్, బిజ్జలదేవగా నాజర్ కనిపిస్తారు. ముందు శివగామి పాత్రకు శ్రీదేవిని, కట్టప్ప పాత్రకు సంజయ్ దత్‌ను, భల్లాలదేవుడి పాత్రకు జేసన్ మమోవా (హాలీవుడ్ మూవీ ‘ఆక్వామేన్’ ఫేమ్)లను అనుకున్నారు కానీ కుదరలేదు. అయితే శివగామిగా రమ్యకృష్ణ, కట్టప్పగా సత్యరాజ్ ఎంత సరిగ్గా సరిపోయారో, బాహుబలికి యాంటీ రోల్ అయిన భల్లాలదేవ పాత్రకు రానా ఎంత ఫిట్ అయ్యారో చూశాం. అమరేంద్ర బాహుబలి, మహేంద్ర బాహుబలిగా ప్రభాస్ తప్ప ఎవరూ సూట్ కాదని ప్రేక్షకులు ప్రశంసించారు. అనుష్క, తమన్నా, నాజర్‌ల నటన సూపర్. ∙ఇంట్రవెల్ బ్యాంగ్‌ను పంచభూతాలు (గాలి, నీరు, నిప్పు, భూమి, ఆకాశం) నేపథ్యంలో డైలాగ్స్ వస్తుంటే... అప్పుడు ప్రభాస్ ఎంట్రీ ఉండేలా ΄్లాన్ చేశారు. కానీ మాహిష్మతిలో భల్లాలదేవ విగ్రహ ప్రతిష్ఠ నేపథ్యంగా ‘బాహుబలి... బాహుబలి..’ అని వచ్చేలా ఆ తర్వాత మార్చారు. → ‘బాహుబలి: ది బిగినింగ్’లో వాటర్ ఫాల్స్ నేపథ్యంలోని సన్నివేశాలు అద్భుతంగా కనిపిస్తాయి. ప్రభాస్ శివలింగాన్ని మోసుకు రావడం, జల పాతంపైకి ఎక్కి వెళ్లడానికి ప్రభాస్ చేసే సాహసాలు ఆడియన్స్‌ని ఆశ్చర్యపరుస్తాయి. అయితే ఇది నిజమైన జలపాతం కాదట. కొంత స్టూడియోలో, కొంత గ్రాఫిక్స్‌లో చేశారు. → ఈ సినిమాలో కాలకేయుడు (ప్రభాకర్) మాట్లాడే కిలికిలి భాష అప్పట్లో ఓ హాట్ టాపిక్. ఇప్పటికీ ఈ భాష గురించి సరదాగా మాట్లాడేవారు ఉన్నారు. ఈ భాషను రచయిత మధన్ కార్కీ సృష్టించారు. ఈ భాషలో దాదాపు 700 పదాలు, 40 వ్యాకరణ నియమాలు ఉన్నాయట. → దాదాపు రూ. 150 కోట్లకు పై బడ్జెట్‌తో రూపొందిన ‘బాహుబలి: ది బిగినింగ్’ ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ. 600 కోట్ల వసూళ్లు సాధించి, 2015లో ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. అలాగే అప్పటికి అత్యధిక వసూళ్ళు సాధించిన రెండో భారతీయ చిత్రంగా రికార్ట్ సాధించింది. ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్ళు రాబట్టిన తొలి పది తెలుగు చిత్రాల్లో ‘బాహుబలి: ది బిగినింగ్’ పేరు ఉంది. అలాగే ఈ చిత్రం పలు రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ అవార్డులు సాధిం చింది. ఇక ఈ చిత్రానికి సంబంధించిన 50 వేల చదరపు అడుగుల పోస్టర్ గిన్నిస్ రికార్డుగా నిలిచిందట. → ‘బాహుబలి’ సినిమాలోని మాహిష్మతి సామ్రాజ్యాన్ని ఇరవై ఎకరాల విస్తీర్ణంలో, సుమారు రూ. 25 కోట్లతో ఏర్పాటు చేశారు. అలాగే ఈ సినిమాలోని గ్రాఫిక్స్ కోసం పదిహేనుకు పైగా స్టూడియోలు, ఐదొందల మందికి పైగా వీఎఫ్ఎక్స్ ఆర్టిస్టులు శ్రమించాల్సి వచ్చిందట. ఇక కేకే సెంథిల్‌కుమార్ సినిమాటోగ్రఫీ, కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్, వి. శ్రీనివాస్‌మోహన్ విజువల్ ఎఫెక్ట్స్, కీరవాణి సంగీతం ఈ సినిమాకు ప్లస్ అయ్యాయి. → ‘బాహుబలి’ రెండో భాగం ‘బాహుబలి: ది కన్‌క్లూజన్’పై ఆసక్తిని పెంచేందుకు తొలి భాగంలో ‘బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు?’ అనే ఆసక్తికరమైన క్లిఫ్ హ్యాంగర్‌ను వదిలారు. ‘వై కట్టప్ప కిల్డ్ బాహుబలి’ అనే హ్యాష్‌ట్యాగ్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అయ్యింది. 2015లో గూగుల్‌లో ట్రెండ్ అయిన మొదటి పది అంశాల్లో ‘వై కట్టప్ప కిల్డ్ బాహుబలి? అనేది ఒకటి. → తెలుగు సినిమా ‘గ్లోబల్ రేంజ్’కి ఎదిగింది ‘బాహుబలి’తోనే. ఒక రకంగా ‘పాన్ ఇండియా’ ట్రెండ్ ఆరంభమైనదే ‘బాహుబలి’తోనే. ఈ సినిమా తర్వాత టాలీవుడ్‌పై వరల్డ్ సినిమా దృష్టి పడింది. ఇలా ‘బాహుబలి’ సినిమా గురించి ఆసక్తికరమైన విశేషాలు చాలానే ఉన్నాయి.అక్టోబరులో బాహుబలి‘బాహుబలి: ది బిగినింగ్, బాహుబలి: ది కన్‌క్లూజన్’లను కలిపి ఒకే చిత్రంగా ఈ ఏడాది అక్టోబరులో రీ–రిలీజ్ చేయాలని అనుకుంటున్నారని సమాచారం. -
ఇండియన్ సినిమా చేయడం హ్యాపీ
‘‘ఇండియాని చాలా మిస్ అయిపోతున్నాను. హిందీ సినిమాలను కూడా మిస్సవుతున్నాను. ఇప్పుడు ఓ ఇండియన్ ప్రాజెక్ట్ చేస్తున్నాను. ఆ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను’’ అంటూ ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రియాంకా చోప్రా చెప్పిన విషయాలు వైరల్‌గా మారాయి. ఈ బ్యూటీ నటించిన హాలీవుడ్ చిత్రం ‘హెడ్స్ ఆఫ్ స్టేట్’ ఇటీవల విడుదలైంది. ఈ చిత్రం ప్రమోషన్లో భాగంగా ఆమె ఇండియన్ సినిమాల గురించి కూడా మాట్లాడారు. ‘‘ఇండియాలో 2002లో నా తొలి సినిమా (తమిళ చిత్రం ‘తమిళన్’)తో కెరీర్ మొదలుపెట్టి, ఎన్నో రకాల సినిమాలు చేశాను.ఎందరో ప్రతిభావంతులతో సినిమాలు చేశాను. అందుకే ఈ సంవత్సరం ఇండియన్ సినిమా (మహేశ్‌బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాని ఉద్దేశించి) చేయడం చాలా ఆసక్తిగా ఉంది. భారతీయ ప్రేక్షకులు నా పై చూపించే ప్రేమ నాకెంతో విలువైనది. నాపై వారి ప్రేమ ఎప్పటికీ అలానే ఉండాలని కోరుకుంటున్నా’’ అని ప్రియాంకా చోప్రా పేర్కొన్నారు.హాలీవుడ్ సింగర్–యాక్టర్–మ్యూజిక్ డైరెక్టర్ నిక్ జోనస్‌ని 2018లో పెళ్లి చేసుకున్న ప్రియాంక ఆ తర్వాత భారతీయ చిత్రాలు ఎక్కువ చేయడంలేదు. ఈ నేపథ్యంలో ఇప్పుడు పూర్తి స్థాయిలో మహేశ్‌బాబు–రాజమౌళి కాంబినేషన్లోని సినిమాలో నటించడం పట్ల ఆమె చాలా ఆనందంగా ఉన్నారు. ఈ చిత్రం 2027 వేసవిలో విడుదలయ్యే అవకాశం ఉంది. -
మహేష్, రాజమౌళి సినిమా ఆ ఓటీటీలోనే...రికార్డ్స్ బద్ధలయ్యాయిగా...
దర్శక దిగ్గజం రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న ఎస్ఎస్ఎమ్బి29(SSMB29) సినిమా ఇప్పుడు మన దేశంలోనే కాదు అంతర్జాతీయ స్థాయిలోనూ సినీ వర్గాలను ఆకర్షిస్తోంది. తాజాగా ఈ సినిమా ఓటీటీ హక్కుల్ని విక్రయించారంటూ వస్తున్న వార్తలు కూడా సంచలనంగా మారాయి. దీనికి కారణం చరిత్రలోనే ఎన్నడూ లేనంత భారీ స్థాయిలో ఈ సినిమా ఓటీటీ హక్కుల ధర పలకడమే.ఇప్పటి దాకా ఓటీటీలో అత్యధిక ధర పలికిన చిత్రంగా రాజమౌళి, రామ్‌చరణ్,ఎన్టీయార్ల సినిమా ఆర్ఆర్ఆర్ నిలుస్తోంది. ఆ తర్వాత సుకుమార్, అల్లు అర్జున్‌ల పుష్ప 2, లోకేష్ కనగరాజ్ హీరో విజయ్‌ల తమిళ చిత్రం లియో, అట్లీ, షారూఖ్ఖాన్ల హిందీ చిత్రం జవాన్, ప్రశాంత్ నీల్, ప్రభాస్‌ల సలార్, ఓంరౌత్, ప్రభాస్‌ల ఆదిపురుష్, సిద్ధార్ధ్ ఆనంద్, షారూఖ్ ల పఠాన్ చిత్రాలు నిలుస్తున్నాయి ఇవన్నీ రూ.100 కోట్ల నుంచి రూ.150 కోట్ల మధ్య చెల్లించి నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్‌లు స్వంతం చేసుకున్నట్టు సమాచారం. వీటిలో ఆదిపురుష్, పఠాన్, పుష్ప2 తప్ప మిగిలినవన్నీ నెట్‌ఫ్లిక్స్ ఖాతాలోనే పడ్డాయి. తద్వారా భారతీయ సినిమాలకు అత్యధిక రేట్లకు కొనుగోలు చేయడంలో ఎవరికీ అందనంత స్థాయిలో నెట్‌ఫ్లిక్స్ దూసుకుపోతోంది.అదే క్రమంలో మరోసారి తన సత్తా చాటిన నెట్‌ఫ్లిక్స్ ఎస్ఎస్ఎమ్బి 29 హక్కుల్ని కూడా దక్కించుకుందని తెలుస్తోంది. ఇటీవలి కాలంలో మరే చిత్రానికి పెట్టనంత ధరను చెల్లించి ఈ చిత్రం పోస్ట్ థియేట్రికల్ ఓటీటీ స్ట్రీమింగ్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ కొనుగోలు చేసిందని తెలుస్తోంది. తద్వారా ఇది భారతీయ సినిమా చరిత్రలో అతిపెద్ద నాన్–థియేట్రికల్ డీల్స్‌గా నిలుస్తోందని సమాచారం.రాజమౌళి మునుపటి చిత్రం ఆర్ఆర్ఆర్ సైతం నెట్‌ఫ్లిక్స్‌లోనే ఆ సినిమాను కూడా భారీ ధరకు కొనుగోలు చేసిన నెట్‌ఫ్లిక్స్ ప్రారంభంలోనే అద్భుతమైన వీక్షక విజయం అందుకుంది, అంతేకాక ఆ సినిమా పాట ఆస్కార్ అందుకోవడంతో నెట్‌ఫ్లిక్స్‌కు మరోసారి కాసుల పంట పండింది. ఆ అవార్డ్ ద్వారా వచ్చిన ప్రపంచవ్యాప్త గుర్తింపుతో ఓటీటీలో ఆ సినిమాకు వీక్షకులు వెల్లువెత్తారు. దాందో ఆర్ఆర్ఆర్కి భారీ ధర చెల్లించినప్పటికీ నెట్‌ఫ్లిక్స్ భారీ లాభాలను ఆర్జించడానికి ఇదో కారణం.ఈ నేపధ్యంలో రాజమౌళి చిత్రాలపై గురి కుదిరిన నెట్‌ఫ్లిక్స్ చాలా ముందస్తుగానే ఓటీటీ హక్కులపై కన్నేసింది. అపజయాలు అంతే తెలియని దర్శకుడు రూపొందిస్తున్న ఎస్ఎస్ఎమ్బి 29 చిత్రంలో ప్రియాంక చోప్రా వంటి ఇంటర్నేషనల్ స్టార్ ఉండడం అంతర్జాతీయ ప్రేక్షకుల్ని కూడా ఆకట్టుకునే అంశమే. అందుకే ఈ చిత్రం అత్యంత భారీ ధర పలికింది అనుకోవచ్చు. వచ్చే 2027లో విడుదల కానున్న ఈ భారీ చిత్రం ఇంకెన్నో సంచలనాలు సృష్టిస్తుందో వేచి చూడాలి. -
జపనీస్ వీడియో గేమ్‌లో రాజమౌళి.. ఇదో క్రేజీ రికార్డ్
స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం మహేశ్‌తో సినిమా చేస్తున్నాడు. ఇప్పటివరకు పాన్ ఇండియా సినిమాలు చేసిన ఈయన.. ఈ చిత్రంతో పాన్ వరల్డ్‌లోనూ తన పనితనం ఏంటో చూపించబోతున్నాడు. సరే ఇవన్నీ పక్కనబెడితే ఎవరూ ఊహించని పనిచేసి జక్కన్న వార్తల్లో నిలిచాడు. ఓ జపనీస్ వీడియో గేమ్‌లో కనిపించి భారతీయ నటీనటులు ఎవరికీ సాధ్యం కాని ఘనత సాధించాడు. ఇంతకీ ఏంటా గేమ్? అసలేం జరిగింది?'ఆర్ఆర్ఆర్' సినిమాని గ్లోబల్ వైడ్ ప్రమోట్ చేసిన రాజమౌళి.. ఆస్కార్ కూడా అందుకున్నాడు. ఈ చిత్రాన్ని జపాన్‌లోనూ రిలీజ్ చేయగా అక్కడ కూడా రెస్పాన్స్ బాగానే వచ్చింది. అయితే జపనీస్ వీడియో గేమ్ సృష్టికర్త హిడియో కోజిమాని అప్పట్లో రాజమౌళి కలవడం చర్చనీయాంశమైంది. మహేశ్ సినిమా కోసం ఈయనతో కలిసి పనిచేయబోతున్నాడా అని అందరూ అనుకున్నారు. కానీ అవన్నీ కాదని ఇప్పుడు తేలిపోయింది.(ఇదీ చదవండి: సడన్‌గా ఓటీటీలోకి వచ్చేసిన కొత్త తెలుగు సినిమా)కోజిమా సృష్టించిన 'డెత్ స్టాండింగ్ 2' వీడియో గేమ్‌లో రాజమౌళితో పాటు ఆయన కొడుకు కార్తికేయ కనిపించారు. ఇది చూసి ఫ్యాన్స్ షాకవుతున్నారు. ఎందుకంటే ఇప్పటివరకు ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్‌లని పాన్ ఇండియా స్టార్స్‌ని చేసిన జక్కన్న.. ఇప్పుడు ఇంటర్నేషనల్ వీడియో గేమ్ కనిపించి తానే పాన్ వరల్డ్ స్టార్ అయిపోయాడు. వీడియో గేమ్‌లో కనిపించిన భారతీయ తొలి సెలబ్రిటీగా రికార్డ్ సృష్టించాడు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.మహేశ్ ప్రాజెక్ట్ విషయానికొస్తే.. ఇదివరకే హైదరాబాద్, ఒడిశాలో షూటింగ్ జరిగింది. కొన్ని సీన్స్ కోసం త్వరలో కెన్యా వెళ్లి రానున్నారని తెలుస్తోంది. అలానే రూ.50 కోట్లు ఖర్చు పెట్టి.. హైదరాబాద్‌లోనే వారణాసి సెట్ వేశారని, ఇది సినీ చరిత్రలోనే అత్యంత ఖరీదైన సెట్ అని మాట్లాడుకుంటున్నారు. అంతా ఓకే గానీ మహేశ్ సినిమా మొదలైన తర్వాత ఇప్పటివరకు రాజమౌళి.. ఒక్కటంటే ఒక్క విషయం కూడా చెప్పట్లేదు. మరి ప్రాజెక్ట్ గురించి ఎప్పుడు చెబుతాడో ఏంట?(ఇదీ చదవండి: హీరోయిన్ సమంతకు కష్టకాలం!)#DeathStranding2 video game featuring SSR! 👍pic.twitter.com/HsdS4wZh0N— idlebrain jeevi (@idlebrainjeevi) June 24, 2025 -
హైదరాబాద్‌లో వారణాసి!
మహేశ్‌బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో ఓ అంతర్జాతీయ స్థాయి సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ప్రియాంకా చో్ప్రా పృథ్వీరాజ్ సుకుమారన్ ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా కొత్త షెడ్యూల్ చిత్రీకరణ ఈ వారంలో హైదరాబాద్‌లో మొదలైందని సమాచారం. ఈ షెడ్యూల్ కోసం మేకర్స్ హైదరాబాద్ శివార్లలో భారీ సెట్స్‌ను క్రియేట్ చేశారని తెలిసిందే.ఇందులో భాగంగా వారణాసి నగరాన్ని తలపించేలా భారీ సెట్స్ వేశారని భోగట్టా. ఈ సెట్స్‌కు రూ. 40 కోట్లకు పైనే అయ్యిందని టాక్. అంతేకాదు... ఈ సినిమాలోని మేజర్ సన్నివేశాల చిత్రీకరణ ఈ సెట్స్‌లోనే జరుగుతుందని, అందుకే ఈ స్థాయిలో ఖర్చుపెట్టారనే టాక్ వినిపిస్తోంది. ఇక ఈ షెడ్యూల్ పూర్తయిన తర్వాత టీమ్ ఫారిన్‌కి వెళుతుందని, అక్కడి ఫారెస్ట్ లొకేషన్స్‌లో యాక్షన్ సీక్వెన్స్‌లను ΄్లాన్ చేశారనే టాక్ వినిపిస్తోంది. -
టాలీవుడ్ టాప్ డైరెక్టర్‌తో సినిమా చేయాలని ఉంది: ది రాజాసాబ్ హీరోయిన్
కోలీవుడ్ భామ మాళివిక మోహనన్ ది రాజాసాబ్ మూవీతో టాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమైంది. ప్రభాస్ హీరోగా నటిస్తోన్న ఈ చిత్రానికి మారుతి దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే టీజర్ విడుదల చేయగా.. అభిమానుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ఈ చిత్రంలో నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సలార్, కల్కి 2898 ఏడీ వంటి వరుస హిట్ సినిమాల తర్వాత ప్రభాస్ నటిస్తున్న సినిమా కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.అయితే తాజాగా మాళవిక మోహనన్ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో చిట్‌చాట్ నిర్వహించింది. ఆస్క్ మాళివికా పేరుతో ట్విటర్ వేదికగా పలువురు నెటిజన్స్ అడిగి ప్రశ్నలకు సమాధానాలిచ్చింది. ఓ నెటిజన్ మీరు నెక్ట్స్ మూవీ ఏ డైరెక్టర్‌తో సినిమా చేయాలనుకుంటున్నారు? ఆ దర్శకుడితోనే ఎందుకు? అని ప్రశ్నించాడు. దీనికి మాళవిక ఊహించని ఆన్సరిచ్చింది. ప్రస్తుతం నా దగ్గర పెద్ద లిస్టే ఉంది.. కానీ నేను రాజమౌళితో సార్‌తో పని చేయడం తనకిష్టమని తెలిపింది. ఇది చూసిన నెటిజన్స్ త్వరలోనే మీ కోరిక నెరవేరుతుందని కామెంట్స్ చేస్తున్నారు.(ఇది చదవండి: 'ది రాజాసాబ్'.. భయపెట్టడమే కాదు... (టీజర్))కాగా.. గతేడాది తంగలాన్ మూవీతో మెప్పించిన మాళవిక కోలీవుడ్‌లో పలు సినిమాలు చేసింది. ప్రస్తుతం ప్రభాస్ సరసన ది రాజాసాబ్‌లో కనిపించనుంది. ఈ మూవీ డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. I have a long list but if I had to pick one maker right now I would love to work with Rajamouli sir! ☺️ https://t.co/Mvovp1TzOd— Malavika Mohanan (@MalavikaM_) June 18, 2025 -
వాట్సాప్ వాడని డైరెక్టర్.. రాజమౌళి ప్రశంసలు!
టాలీవుడ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల ప్రస్తుతం కుబేరా మూవీతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. కోలీవుడ్ స్టార్ ధనుశ్, అక్కినేని నాగార్జున కీలక పాత్రల్లో తెరెకెక్కించిన ఈ సినిమా జూన్ 20న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్‌లో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు మేకర్స్. ఈ కార్యక్రమానికి దర్శకధీరుడు రాజమౌళి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా డైరెక్టర్ శేఖర కమ్ములపై ప్రశంసలు కురిపించారు.తాను నమ్మే సిద్ధాంతాలకు.. చేసే సినిమాలకు ఎలాంటి సంబంధం ఉండదని రాజమౌళి అన్నారు. కానీ శేఖర్ కమ్ముల తాను నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేస్తారని తెలిపారు. శేఖర్ చాలా సాప్ట్‌గా ఉంటారని.. తన సిద్ధాంతాలకు ఏది అడ్డొచ్చినా కొంచెం కూడా ఆయన కాంప్రమైజ్ అవ్వరని వెల్లడించారు. తాను నమ్మినా సిద్ధాంతాలపైనే సినిమాలు తీస్తారని... అందుకే ఆయనంటే ఎంతో గౌరవమని కొనియాడారు. మీరు వాట్సాప్ వాడుతారా అని శేఖర్ కమ్ములను రాజమౌళి అడగ్గా.. తాను ఉపయోగించనని ఆయన సమాధానమిస్తారు.ఈ కార్యక్రమంలో కుబేర ట్రైలర్‌ను కూడా రాజమౌళి విడుదల చేశారు. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్రావు నిర్మించారు. -
మహేష్ బాబు, రాజమౌళి న్యూ మూవీ అప్డేట్..
-
SSMB29: నిధి అన్వేషణ కోసం ఆఫ్రికా అడవుల్లోకి 'మహేశ్'
మహేశ్ బాబు(Mahesh Babu) కథానాయకుడిగా దర్శకుడు రాజమౌళి (SS Rajamouli) తీస్తున్న చిత్రం పనులు స్పీడ్ అందుకున్నాయి. కొద్దిరోజుల క్రితం ఒడిసాలో చిత్రీకరణ జరుపుకున్న ఈ భారీ ప్రాజెక్ట్ అక్కడ కొన్ని కీలక సన్నివేశాలతోపాటు, యాక్షన్ ఘట్టాల్ని తెరకెక్కించారు. మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్నా చిత్ర యూనిట్ ఇప్పుడు ఆఫ్రికాలోని అటవీ ప్రాంతాల్లోకి షిఫ్ట్ అవుతుంది. కథ రీత్యా ఈ సినిమాలోని అత్యంత కీలకమై సీన్స్ ఇక్కడ షూట్ చేయనున్నారని తెలుస్తోంది.SSMB29 టీమ్ జులైలో కెన్యాకు పయనమయ్యేందుకు సిద్ధం అవుతున్నట్లు సమాచారం. అక్కడ మసాయి-పిగ్మీస్ తెగలతో ఇప్పటికే మహేశ్‌బాబు కొద్దిరోజులు గడిపారు. ఆ ప్రాంతపు యుద్ధ విద్యలపై బేసిక్ స్పెషల్ ట్రైనింగ్ కూడా తీసుకున్నట్టు తెలుస్తుంది. అక్కడి షెడ్యూల్ ఎప్పుడో పూర్తి కావాల్సి ఉంది. పలు కారణాల వల్ల ఆలస్యమైంది. ఇప్పుడు అక్కడికి వెళ్లేందుకు కావాల్సిన అన్ని అనుమతులు కూడా తీసుకున్నారట. దాదాపు 30రోజుల పాటు జరగనున్న షూటింగ్ కోసం అన్ని ఏర్పాట్లు చేసేశారట. అక్కడి ప్రఖ్యాత అంబోసెలి నేషనల్ పార్క్‌లో కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నట్లు తెలుస్తోంది.కెన్యాలో జరిగే ఈ షెడ్యూల్లో ప్రియాంక చోప్రా సెట్స్‌లో అడుగుపెట్టనుంది. మహేశ్, పృథ్వీరాజ్ సుకుమార్‌తో పాటు మరికొందరు అక్కడ షూటింగ్లో పాల్గొననున్నారు. ఇక ఈ సినిమాకు ‘మహారాజా’, ‘మహారాజ్’ అనే టైటిల్స్‌ను అనుకుంటున్నారని, 18వ శతాబ్దం నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుందని, ఓ నిధి అన్వేషణతో ఈ సినిమా ఉంటుందనీ వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. దుర్గా ఆర్ట్స్‌పై కె.ఎల్.నారాయణ ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. -
అడవిలో అన్వేషణ!
అడవుల్లో మహేశ్‌బాబు కళ్లు దేని కోసమో వెతుకుతున్నాయి. కొందరు నిధి కోసం అంటున్నారు. మరికొందరు ప్రాణం పోసే సంజీవిని తరహా లాంటి మొక్క కోసం అంటున్నారు. ఈ మాటలు మహేశ్‌బాబు కొత్త సినిమా గురించే. మహేశ్‌బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో అంతర్జాతీయ స్థాయిలో ఓ ఫారెస్ట్ అడ్వెంచరస్ యాక్షన్ డ్రామా రూపొందుతున్న సంగతి తెలిసిందే.ఈ చిత్రంలో మహేశ్‌బాబు క్యారెక్టరైజేషన్, సినిమా కథ గురించి ఎప్పటికప్పుడు కొత్త వార్తలు వస్తుండటం, సినీ ప్రేమికులు వీటిని ఆసక్తికరంగా గమనిస్తుండటం జరుగుతోంది. తాజాగా ఈ సినిమా గురించిన మరో ఆసక్తికరమైన వార్త ప్రచారంలోకి వచ్చింది. అదేంటంటే... ఈ సినిమాకు భారతీయ ఇతిహాసం రామాయణ నేపథ్యం ఉంటుందట.రామాయణంలో సంజీవని మొక్క కోసం వెతికే హనుమంతుడిని పోలిన లక్షణాలు మహేశ్‌బాబు పాత్రలో ఉంటాయని ఫిల్మ్‌నగర్ భోగట్టా. మరి... మహేశ్‌బాబు అడవిలో దేని కోసం అన్వేషిస్తున్నారో తెలియాలంటే మరికొన్ని రోజులు ఎదురుచూడక తప్పదు. ప్రముఖ రచయిత విజయేంద్రప్రసాద్ ఈ సినిమాకు కథ అందించారు. ఆ మధ్య ఈ సినిమా షూటింగ్ నిరవధికంగా జరిగింది. తర్వాత బ్రేక్ తీసుకున్నారు. ఈ వారంలో మళ్లీ చిత్రీకరణ మొదలవుతుందని, కాశీ నగరాన్ని తలపించే సెట్‌ని రెడీ చేయించారని, ఈ సెట్లోనే షెడ్యూల్ ప్రారంభం అవుతుందని తెలిసింది. రెండు వారాలకు పైగా ఇక్కడే చిత్రీకరణ జరుగుతుందట. ఇక ప్రియాంకా చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ సినిమాలో ప్రధాన పాత్రల్లో నటిస్తున్న విషయం తెలిసిందే. కేఎల్ నారాయణ నిర్మిస్తున్న ఈ చిత్రం 2027లో విడుదల కానుంది. -
మహేశ్-రాజమౌళి సినిమా.. నో చెప్పిన స్టార్ హీరో?
ఇప్పుడంతా పాన్ ఇండియా ట్రెండ్ నడుస్తోంది. వివిధ భాషల్లోనూ హీరోలు తెలుగు సినిమాల్లో, మన దర్శకులతో కలిసి పనిచేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే స్టార్ డైరెక్టర్స్ చాలామంది తమిళ, మలయాళ హీరోలని కీలక పాత్రల కోసం తీసుకుంటున్నారు. అయితే రాజమౌళి, మహేశ్ బాబుతో చేస్తున్న ప్రాజెక్ట్ కోసం ఓ స్టార్ హీరోని అడగ్గా నో చెప్పాడట. ఇంతకీ ఎవరతడు? ఏంటి సంగతి?'ఆర్ఆర్ఆర్' తర్వాత కాస్త గ్యాప్ తీసుకుని రాజమౌళి మహేశ్‌తో సినిమా చేస్తున్నాడు. కొన్ని నెలల క్రితం షూటింగ్ మొదలవగా రెండు షెడ్యూల్స్ పూర్తయ్యాయి. ఎస్ఎస్ఎమ్బీ 29 వర్కింగ్ టైటిల్‌తో దీన్ని తెరకెక్కిస్తున్నారు. సాధారణంగా మూవీ మొదలుపెట్టగానే ప్రెస్ మీట్ పెట్టే రాజమౌళి.. ఈసారి మాత్రం ఒక్క మాట చెప్పకుండా సైలెన్స్ మెంటైన్ చేస్తున్నాడు. ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ ఇందులో నటిస్తున్నారనే విషయం లీకైంది. కానీ రాజమౌళి అస్సలు రెస్పాండ్ కాలేదు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 21 సినిమాలు రిలీజ్)ఇప్పుడు కూడా సడన్‌గా తమిళ హీరో విక్రమ్.. రాజమౌళి ఇచ్చిన ఆఫర్ చేశాడంటూ కొన్ని రూమర్స్ వినిపిస్తున్నాయి. సినిమాలో విలన్ పాత్ర కోసం విక్రమ్‌ని సంప్రదించగా, తనకు ప్రతినాయకుడి రోల్స్ చేయడం ఇష్టం లేదని జక్కన్నతో ఇతడు చెప్పాడట. దీంతో మరో ఆప్షన్‌గా పృథ్వీరాజ్ సుకుమారన్‌ని ఎంపిక చేశాడని అంటున్నారు. గతంలో ప్రభాస్ 'సలార్'లో పృథ్వీరాజ్ ప్రతినాయక ఛాయలున్న పాత్ర చేశాడు. ఇప్పుడు మహేశ్ బాబుకి విలనీగా చేస్తున్నాడనమాట.ఇదే సినిమాలో మాధవన్ కూడా కీలక పాత్ర చేయనున్నాడనే టాక్ రెండు మూడు రోజుల క్రితం వినిపించింది. త్వరలో మొదలయ్యే కొత్త షెడ్యూల్లో ఇతడు జాయిన్ అవుతాడని అంటున్నారు. మరి ఇందులో నిజానిజాలు ఏంటనేది తెలియాల్సి ఉంది. ఇకపోతే ఈ మూవీ 2027లో రిలీజ్ టార్గెట్‌గా సిద్ధం చేస్తున్నారని తెలుస్తోంది. అటవీ నేపథ్యంతో ప్రపంచాన్ని చుట్టేసే ఓ సాహసికుడి కథగా ఇది సిద్ధమవుతోంది.(ఇదీ చదవండి: త్రివిక్రమ్ లాంటి దర్శకుడికి ఇలాంటి పరిస్థితా?) -
మహేశ్ సినిమాలో..?
మహేశ్‌బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘ఎస్ఎస్ఎమ్బీ 29’ (వర్కింగ్ టైటిల్). ఈ చిత్రంలో హీరోయిన్ ప్రియాంకా చోప్రా, హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ కీలకపాత్రలుపోషిస్తున్నారు. తాజాగా ఈ టీమ్‌లోకి మాధవన్ కూడా చేరినట్లు ఫిల్మ్‌నగర్ సమాచారం. ఆయన ఓ కీలకపాత్రలో కనిపించనున్నారని టాక్. ఈ మేరకు మాధవన్‌తో చర్చలు పూర్తయ్యాయని, త్వరలోనే ఆయన సెట్స్‌లో అడుగు పెట్టబోతున్నారని భోగట్టా.మరి... ఈ చిత్రంలో మాధవన్ భాగం అవుతారా? లేదా అనే విషయాలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా ఆఫ్రికా అడవుల నేపథ్యంలో సాగే ఇండియానా జోన్స్ స్టైల్ కథతో రూపొందుతున్న ఈ చిత్రం ఇప్పటికే పలు షెడ్యూల్స్ పూర్తి చేసుకుంది. కొత్త షెడ్యూల్‌ని ఈ నెలలోనే మొదలు పెట్టనున్నారట. దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై కేఎల్ నారాయణ ఈ అడ్వెంచరస్ ఫిల్మ్‌ను దాదాపు రూ.1000 కోట్ల బడ్జెట్తోపాన్ వరల్డ్ రేంజ్లో నిర్మిస్తున్నారనే టాక్ నడుస్తోంది. తెలుగులో ఇదే అత్యధిక బడ్జెట్ ఫిల్మ్ అని టాక్. -
ఐపీఎల్ ఫైనల్.. ఎవరు గెలిచినా అది మాత్రం తప్పదు: ఎస్ఎస్ రాజమౌళి ట్వీట్
ఐపీఎల్ క్వాలిఫయర్-2 మ్యాచ్‌పై దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ట్వీట్ చేశారు. ముంబయితో జరిగిన ఈ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ అద్భుతమైన విజయం సాధించడంపై ప్రశంసలు కురిపించారు. అంతేకాకుండా బుమ్రా, బౌల్ట్ యార్కర్లను థర్ట్ మ్యాన్ దిశగా బౌండరీకి తరలించడంపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌ను కొనియాడారు. అతని బ్యాటింగ్ అద్భుతంగా ఉందని ట్వీట్ చేశారు.గతంలో ఢిల్లీ టీమ్‌ను ఫైనల్‌కు తీసుకొచ్చిన శ్రేయస్ అయ్యర్‌ను వదిలేశారని.. ఆ తర్వాత కోల్‌కతాకు ట్రోఫిని అందించినా శ్రేయస్ అయ్యర్‌ను మళ్లీ తీసుకోలేదని రాజమౌళి పోస్ట్ చేశారు. ఈ ఏడాది దాదాపు 11 ఏళ్ల తర్వాత పంజాబ్‌ను ఫైనల్ వరకు తీసుకొచ్చిన శ్రేయస్ అయ్యర్ టైటిల్ కొట్టేందుకు పూర్తిగా అర్హుడని రాజమౌళి అభిప్రాయం వ్యక్తం చేశారు. అదే సమయంలో విరాట్ కోహ్లీ కొన్నేళ్లుగా బెంగళూరు తరపున వేల పరుగులు సాధించాడని.. కానీ టైటిల్ గెలిచేందుకు సమయం ఆసన్నమైందని రాసుకొచ్చాడు. ఈ ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌లో ఫలితం ఏదైనా హార్ట్ బ్రేకింగ్ మాత్రం తప్పదని అంటున్నారు రాజమౌళి.ఎప్పుడు సినిమాలతో బిజీగా ఉండే మన దర్శకధీరుడు క్రికెట్‌పై ట్వీట్ చేయడంతో ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన మహేశ్ బాబుతో ఓ భారీ అడ్వెంచరస్ మూవీని తెరకెక్కిస్తున్నారు. అమెజాన్ అడవుల నేపథ్యంలో ఈ సినిమా ఉండనుంది. ఇటీవలే ఒడిశాలో రాజమౌళి- మహేశ్ బాబు సినిమా షూటింగ్ కూడా జరిగింది. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ ప్రియాంక చోప్రా హీరోయిన్గా నటిస్తోంది. Iyer guiding Bumrah’s and Boult’s yorkers to the third man boundary… Exquisite…This man leads Delhi to a final… and is dropped…Leads Kolkata to a trophy… dropped…Leads a young Punjab to the finals after 11 years.He deserves this year’s trophy too…On the other hand,… pic.twitter.com/ws0anhcZ3l— rajamouli ss (@ssrajamouli) June 2, 2025 -
రాజమౌళి-మహేష్ బాబు సినిమాని రిజెక్ట్ చేసిన బాలీవుడ్ హీరో..!
-
SSMB29: రూ.20 కోట్ల ఆఫర్‌ని రిజెక్ట్ చేసిన బాలీవుడ్ నటుడు!
రాజమౌళి..ఇప్పుడు ఇండియాలోనే నెంబర్ వన్ దర్శకుడు. ఇందులో నో డౌట్. ఆయన నుంచి ఒక సినిమా వస్తుందంటే కచ్చితంగా అది రికార్డులు సృష్టిస్తుంది. అలాంటి దర్శక దిగ్గజం సినిమాలో నటించే అవకాశం వస్తే ఏ నటుడైనా వదులుకుంటాడా? కానీ బాలీవుడ్ సీనియర్ నటుడు నానా పటేకర్ మాత్రం రాజమౌళి ఆఫర్‌ని సున్నితంగా తిరస్కరించాడట. రూ. 20 కోట్ల పారితోషికం ఇస్తానని చెప్పినప్పటికీ ఆయన ఒప్పుకోలేదట. నమ్మశక్యంగా లేనిఈ వార్తను బాలీవుడ్ మీడియా తెగ ప్రచారం చేస్తోంది.న్యూస్ 18 కథనం ప్రకారం.. మహేశ్ బాబుతో రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం(SSMB 29)లో కీలక పాత్ర కోసం నానా పటేకర్‌ని తీసుకుందాం అనుకున్నారట. ఈ మేరకు రాజమౌళి పూణే వెళ్లి నానా పటేకర్‌కు స్క్రిప్ట్ మొత్తం వివరించారట. కథ, పాత్ర బాగున్నప్పటికీ.. దానికి నేను న్యాయం చేయలేనని నానా పటేకర్(Nana Patekar ) భావించారట. ఈ విషయం రాజమౌళి టీమ్‌కి చెప్పి.. సున్నితంగా తప్పుకున్నాడని బాలీవుడ్ మీడియా పేర్కొంది. అంతేకాదు..ఇందులో నటించేందుకు నానా పటేకర్‌ని భారీగా పారితోషికం ఇస్తామని చెప్పారట. కేవలం 15 రోజుల షూటింగ్ కోసం దాదాపు రూ. 20 కోట్ల వరకు ఇస్తామని చెప్పినప్పటికీ, నానా పటేకర్ ఈ ఆఫర్‌ని సున్నితంగా తిరస్కరించినట్టుగా బాలీవుడ్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. పాత్ర నచ్చకపోవడంతోనే నానా పటేకర్ మహేశ్ సినిమాను రిజెక్టర్ చేశారనే వార్తలు కూడా వచ్చాయి. అయితే ఇదంతా బాలీవుడ్ మీడియా చేస్తున్న తప్పుడు ప్రచారం అని, రాజమౌళి అడిగితే నానా పటేకరే కాదు అమితాబ్ లాంటి స్టార్స్ కూడా నటించేందుకు ముందుకు వస్తారని టాలీవుడ్ ఫ్యాన్స్ అంటున్నారు. రాజమౌళి- మహేశ్ సినిమా విషయానికొస్తే.. SSMB 29 వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రియాంకా చోప్రా, మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ఇతర లీడ్ రోల్స్ చేస్తున్నారు. ఆఫ్రికన్ ఫారెస్ట్ నేపథ్యం తెరకెక్కుతున్న ఈ చిత్రం 2027లో విడుదలయ్యే అవకాశం ఉంది. -
అప్పుడు బాహుబలి.. ఇప్పుడు ఆర్ఆర్ఆర్.. రెండు చిత్రాలు మన దర్శకధీరుడివే!
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బ్లాక్‌బస్టర్ మూవీ ఆర్ఆర్ఆర్. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, ఆలియా భట్ ప్రధాన పాత్రల్లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పలు రికార్డులు సృష్టించింది. ఇటీవల ఈ మూవీని లండన్‌లో ప్రముఖ రాయల్ ఆల్బర్ట్ హాల్లో ప్రదర్శించారు. ఈ ప్రత్యేక స్క్రీనింగ్‌కు రాజమౌళితో పాటు రామ్ చరణ్, ఎన్టీఆర్ కూడా కుటుంబంతో కలిసి హాజరయ్యారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరలయ్యాయి.అయితే తాజాగా ఆర్ఆర్ఆర్ అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. బాహుబలి తర్వాత ఆ ఘనతను దక్కించుకున్న చిత్రంగా ఆర్ఆర్ఆర్ నిలిచింది. రాయల్ అల్బర్ట్ హాల్ స్థాపించి ఇప్పటి వరకు దాదాపు 154 ఏళ్లు పూర్తయింది. ఈ హాల్ స్థాపించాక ప్రదర్శించిన సినిమాల్లో ఇప్పటి వరకు కేవలం బాహుబలి మాత్రమే నాన్ ఇంగ్లీష్ చిత్రంగా రికార్డ్ సృష్టించింది. 2019లో బాహుబలి మూవీని ఇదే హాల్లో ప్రదర్శించారు.తాజాగా 2025లో ఆర్ఆర్ఆర్ ఈ ఘనతను సాధించింది. బాహుబలి తర్వాత ఈ రికార్డ్ సాధించిన రెండో నాన్ ఇంగ్లీష్ మూవీగా ఆర్ఆర్ఆర్ నిలిచింది. ఈ విషయాన్ని మూవీ టీమ్ సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. దీంతో టాలీవుడ్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రెడిట్ అంతా దర్శకధీరుడికే దక్కుతుందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.కాగా.. రాజమౌళి ప్రస్తుతం మహేశ్‌బాబుతో ఓ భారీ అడ్వెంచరస్ మూవీని తెరెకెక్కిస్తున్నారు. ఇటీవలే ఒడిశాలో కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ షెడ్యూల్లో బాలీవుడ్ భామ ప్రియాంక చోప్రా కూడా పాల్గొంది. ప్రస్తుతం షూటింగ్‌కు విరామం లభించడంతో రాజమౌళి లండన్ కార్యక్రమానికి హాజరయ్యారు.An SS Rajamouli Film… Does it again!! 🔥🌊 HistorRRRy continues at @RoyalAlbertHall!#RRRMovie is the second non-English film after Baahubali since its inauguration 154 years ago. ✊🏻 https://t.co/AJ9Od2mnD4 pic.twitter.com/FMf5UWHBKM— RRR Movie (@RRRMovie) May 21, 2025 -
ఎన్టీఆర్ బర్త్‌డే స్పెసల్.. థియేటర్స్‌లో ‘యమదొంగ’
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, మోహన్ బాబు, ప్రియమణి, మమత మోహన్‌దాస్ కాంబినేషన్లో వచ్చిన ఐకానిక్ సోషియో ఫాంటసీ చిత్రం ‘యమదొంగ’(Yamadonga) బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ పుట్టినరోజు (మే 20) సందర్భంగా ఈ చిత్రాన్ని మే 18 నుంచి రీ రిలీజ్ చేయనున్నారు.రీ రిలీజ్ కోసం టీం అమితంగా శ్రమించినట్లు తెలుస్తోంది. ‘యమదొంగ’ను 8Kలో స్కాన్ చేసి, 4K నాణ్యతకు కుదించి, అసాధారణమైన దృశ్య అనుభవాన్ని అందించేలా సిద్ధం చేశారు. ఈ అత్యాధునిక టెక్నాలజీతో అభిమానులు సినిమాను మరింత ఉన్నత నాణ్యతలో ఆస్వాదించవచ్చు.సోషల్ మీడియాలో ‘యమదొంగ’ రీ రిలీజ్ సందడి జోరుగా సాగుతోంది. ప్రధాన నటీమణులు ప్రియమణి, మమత మోహన్‌దాస్ షూటింగ్ రోజుల జ్ఞాపకాలను పంచుకుంటూ విడుదల చేసిన వీడియోలు అందరినీ ఆకట్టుకున్నాయి. రాజమౌళి దర్శకత్వ విజన్, ఎంఎం కీరవాణి సంగీతంతో ‘యమదొంగ’ మరోసారి తెరపై సందడి చేయనుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని భారీ ఎత్తున రీ రిలీజ్ చేస్తున్నారు. -
దాదా సాహెబ్ ఫాల్కే గెటప్‌లో ఎన్టీయార్ స్టిల్స్ బయటకు...
దర్శక దిగ్గజం ఎస్.ఎస్. రాజమౌళి అనే పేరు సెన్సేషన్ అనే పదం రెండూ చెట్టాపట్టాలేసుకుని పక్కపక్కనే నడుస్తుంటాయి. ప్రస్తుతం మహేష్‌బాబుతో సినిమాకు సంబంధించి ఒక్క వార్తా బయటకు రాకుండా సినీ అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠ రేకెత్తిస్తున్న ఈ సక్సెస్ ఫుల్ డైరెక్టర్... ఇటీవలే తాను తీయబోయే మహాభారతం సినిమా గురించి ఓ అప్డేట్గా హీరో నాని కి పాత్ర ఇవ్వనున్నట్టు చెప్పి సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అదే క్రమంలో ఇప్పుడు మరోసారి ఆయన అంతకు మించిన సంచలనాన్ని సృష్టించారు. భారతీయ సినిమా పితామహుడు దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్ ను సినిమాగా సమర్పించబోతున్నానని ప్రకటించారు.అంతేకాదు ఆయన చేసిన ప్రకటనను బట్టి చూస్తుంటే ఆ సినిమాలో కధానాయకుడి పాత్రను జూ.ఎన్టీయార్ పోషించబోతున్నారని దాదాపుగా రూఢీ అయింది. నిజానికి ఇది ఆయన రెండేళ్ల నాడే చెప్పిందే అయినప్పటికీ... ముడి సరకు అంతా రెడీ అయిపోయింది... ఇక షూటింగ్ పట్టాలెక్కబోతోంది అని ఆయన ప్రకటనతో తేలిపోయింది.తాజాగా ఆయన చేసిన పోస్ట్ ఇలా ఉంది..‘‘నేను మొదటిసారి కథ విన్నప్పుడు, అది నన్ను మరేదీ లేని విధంగా భావోద్వేగపరంగా కదిలించింది. బయోపిక్‌ను సినిమాగా తీయడం చాలా కష్టం, ఫాదర్ ఆఫ్ ఇండియన్ సినిమా గురించి ఊహించడం మరింత సవాలుతో కూడుకున్నది. అయితే మా అబ్బాయిలు దానికి సిద్ధంగా ఉన్నారు సగర్వంగా, మేడ్ ఇన్ ఇండియాను ప్రజంట్ చేస్తున్నాను’’రాజమౌళి ఈ చిత్రాన్ని ప్రకటించి రెండు సంవత్సరాలు అయింది. అప్పుడే ఈ చిత్రానికి మేడ్ ఇన్ ఇండియా అని పేరు పెట్టారు. ఇలా రాజమౌళి పోస్ట్ చేశారో లేదో... అలా ఈ పాత్రకు ఎన్టీయార్ పోషించబోతున్నారని వార్తలు వ్యాపించాయో లేదో... అంతే... ఆధునిక సాంకేతిక యుగపు నిపుణులు తమ టాలెంట్‌కు పదును పెట్టారు.దాదా సాహెబ్ ఫాల్కే పాత్రలో యంగ్ టైగర్ ఎలా ఉంటాడు అనేదానిపై తమ ఊహలకు రూపాల్ని ఇస్తున్నారు. వారికి అత్యాధునిక ఏఐ వంటి టెక్నాలజీలు తోడయ్యాయి. దాంతో జూనియర్ ఎన్టీఆర్ దాదా గెటప్ చిత్రాలు ఇంటర్నెట్లో తుఫానుగా మారాయి, ఏఐ రూపొందించిన ఈ చిత్రాలలో జూనియర్ ఎన్టీఆర్ దాదాసాహెబ్ ఫాల్కే పాత్రలో ఇమిడిపోయినట్టు కనిపిస్తున్నాడు, ఖాదీ కుర్తా ధరించి, కళ్ళద్దాలు గడ్డం తో ఆకట్టుకుంటున్నాడు. ఈ చిత్రాన్ని వరుణ్ గుప్తా (మాక్స్ స్టూడియోస్) ఎస్ఎస్ కార్తికేయ (షోయింగ్ బిజినెస్) నిర్మిస్తారు. నిర్మాతలు స్క్రిప్ట్ పై పనిలో బిజీగా ఉన్నారు మరియు తుది డ్రాఫ్ట్‌ను పూర్తి చేస్తున్నారు.ఓ రకంగా ఇది భారతీయ సినిమా కధ అని చెప్పొచ్చేమో... ఎందుకంటే.. ఈ సినిమా కథాంశం భారతీయ సినిమా పుట్టుక పెరుగుదలకు అద్దం పట్టనుంది. మరోవైపు మేడ్ ఇన్ ఇండియా సినిమా జూనియర్ ఎన్టీఆర్‌కు యాక్షన్ చిత్రాల నుంచి ఒక్కసారిగా రిఫ్రెషింగ్ బ్రేక్ అవుతుంది అనేది నిర్వివాదం.ఇదిలా ఉంటే.. అటు బాలీవుడ్‌లోనూ ఆమిర్‌ఖాన్ - రాజ్‌కుమార్ హిరాణీ కలయికలో ఈ బయోపిక్ రూపొందుతున్నట్టు జోరుగా ప్రచారం జరిగింది. తాజాగా దీనిపై దాదాసాహెబ్ ఫాల్కే మనవడు చంద్రశేఖర్ శ్రీకృష్ణ స్పందిస్తూ.. రాజమౌళి సమర్పణలో ఈ ప్రాజెక్ట్ వస్తున్నట్లు వార్తలు వచ్చాయి కానీ.. ఆయన టీమ్ ఇంతవరకు నన్ను సంప్రదించలేదు. కానీ ఆమిర్-రాజ్ కుమార్ హిరానీ టీమ్ మూడేళ్లుగా నాతో టచ్‌లో ఉన్నారు’ అని చెప్పారు. మరి రాజమౌళి సినిమా ఉంటుందో లేదో తెలియదు కానీ ఎన్టీఆర్ ఏఐ ఫోటోలు అయితే నెట్టింట వైరల్‌గా మారుతున్నాయి. History meets legacy. Jr. NTR becomes the face of a revolution — portraying the man who gave India its first cinematic heartbeat: Dadasaheb Phalke.”@tarak9999 as Dada Saheb Phalke@ssrajamouli @dpiff_official #historyofcinema #DadasahebPhalke #jrntr #ntrasdadasahebphalke pic.twitter.com/kdyUjoX16t— House Of 24 (@of_2491841) May 15, 2025 -
రాజమౌళి - మహేష్ బాబు సినిమాలో విలన్ గా విక్రమ్..?
-
మహేశ్ - రాజమౌళి సినిమాలో మరో పాన్ ఇండియా హీరో!
సూపర్‌స్టార్ మహేశ్‌బాబు- దర్శకుడు రాజమౌళి కలయికలో మొదలైన సినిమా ఇప్పటికే షూటింగ్ ప్రారంభమైంది. భారీ బడ్జెట్‌తో కె.ఎల్. నారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. అయితే, తాజాగా కోలీవుడ్ నుంచి స్టార్ యాక్టర్ కూడా ఇందులో భాగం కానున్నారని తెలుస్తోంది. త్వరలోనే ఆయన సెట్స్ పైకి కూడా వస్తాడనేది నెట్టింట వైరల్ అవుతుంది.‘ఎస్ఎస్ఎంబీ29’ వర్కింగ్ టైటిల్‌తో ప్రారంభమైన ఈ ప్రాజెక్ట్‌లోకి తమిళ స్టార్ హీరో విక్రమ్ జాయిన్ కాబోతున్నాడని సమాచారం. ఈమేరకు ఆయనతో ఇప్పటికే చర్చలు కూడా పూర్తి అయ్యాయట. గతంలో కూడా పృథ్వీరాజ్ సుకుమారన్ ఎంట్రీ గురించి మొదట రూమర్స్‌తోనే ప్రారంభమయిన విషయం తెలిసిందే. కొంతకాలానికి అదే నిజమైంది. ఇప్పుడు విక్రమ్ విషయంలో కూడా ఇదే జరగబోతుందని ఇండస్ట్రీలో టాక్ మొదలైంది. మే నుంచి జూన్ వరకు ఈ సినిమా షూటింగ్ మళ్లీ ప్రారంభం కానుంది. దీనికోసం హైదరాబాద్‌లో ఓ భారీ సెట్‌ను సిద్ధం చేస్తున్నారని సమాచారం. ప్రముఖ హాలీవుడ్ స్టంట్ డైరెక్టర్స్ నేతృత్వంలో బిగ్ యాక్షన్ ఎపిసోడ్‌ను తెరకెక్కించనున్నారని తెలిసింది. ఈ సీన్ నుంచే విక్రమ్ ఎంట్రీ ఉంటుందని అభిమానులు అంచనా వేస్తున్నారు.‘ఎస్ఎస్ఎంబీ29’లో విక్రమ్ నటించబోతున్నట్లు గతేడాదిలోనే ఈ రూమర్స్ వచ్చాయి. అప్పుడు స్వయంగా విక్రమ్ ఇలా స్పందించాడు. 'రాజమౌళి, నేను రెగ్యూలర్‌గానే టచ్‌లో ఉంటాం. రాజమౌళి దర్శకత్వంలో నా సినిమా తప్పకుండా ఉంటుంది. కానీ, మహేష్ మూవీ గురించి మా మధ్య ప్రస్తుతానికి చర్చలు జరగలేదు' అని ఆయన తెలిపారు. గతంలో పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా తనపై రూమర్స్ వచ్చినప్పుడు ఇలానే రియాక్ట్ అయ్యాడు. కొంత కాలానికి మహేష్ సినిమాలో తాను భాగం కాబోతున్నట్లు ప్రకటించారు. కాబట్టి విక్రమ్ విషయంలో కూడా ఇదే జరుగుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. -
పోటాపోటీగా దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్
భారతీయ సినీ పితామహుడు దాదా సాహెబ్ ఫాల్కే (అసలు పేరు ధుండీరాజ్ గోవింద్ ఫాల్కే) బయోపిక్ ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. దాదా సాహెబ్ ఫాల్కే బయోపిక్ చేసేందుకు ఇటు రాజమౌళి అటు ఆమిర్ ఖాన్ ఎవరి ప్రయత్నాల్లో వారు ఉన్నారు. దీంతో ముందుగా ఎవరు ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్తారనే చర్చ ఇండస్ట్రీలో జోరుగా సాగుతోంది.త్రీ ఇడియట్స్ కాంబినేషన్... భారతీయ తొలి ఫీచర్ ఫిల్మ్ దర్శక–నిర్మాతగా ‘రాజా హరిశ్చంద్ర’తో చరిత్రలో నిలిచిన దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్‌లో టైటిల్ రోల్‌ని ఆమిర్ ఖాన్ పోషించనున్నారు. ఈ చిత్రానికి రాజ్‌కుమార్ హీరాణీ దర్శకత్వం వహించనున్నారు. ‘త్రీ ఇడియట్స్’ (2009), ‘పీకే’ (2014) వంటి బ్లాక్‌బస్టర్ సినిమాల తర్వాత హీరో ఆమిర్ ఖాన్, దర్శకుడు రాజ్‌కుమార్ హీరాణీ ‘దాదాసాహెబ్ ఫాల్కే’ బయోపిక్ సినిమా కోసం వర్క్ చేయనుండటం విశేషం. రాజ్‌కుమార్ హీరాణీ, అభిజిత్ జోషీ, హిందూకుష్ భరద్వాజ్, ఆవిష్కర్ భరద్వాజ్‌లు ఈ బయోపిక్కు నాలుగేళ్లుగా స్క్రిప్ట్ రాసే పనిలో ఉన్నారని సమాచారం. ఈ బయోపిక్ చిత్రీకరణ అక్టోబరులో ఆరంభం అవుతుందట. ఇక ఈ చిత్రానికి దాదాసాహెబ్ మనవడు చంద్రశేఖర్ శ్రీకృష్ణ పుసాల్కర్ తన వంతు సహకారం అందించనున్నారని బాలీవుడ్ టాక్.మేడ్ ఇన్ ఇండియా... ఫాదర్ ఆఫ్ ఇండియన్ సినిమా బయోపిక్ ‘మేడ్ ఇన్ ఇండియా’కు సమర్పకుడిగా వ్యవహరించనున్నట్లుగా 2023 సెప్టెంబరులో దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. వరుణ్ గుప్తా, ఎస్ఎస్ కార్తికేయ ఈ సినిమాను నిర్మించనున్నట్లు, నితిన్ కక్కడ్ (హిందీ చిత్రం ‘నోట్‌బుక్’ ఫేమ్) ఈ బయోపిక్కు దర్శకత్వం వహించనున్నట్లుగా ఆ వీడియోలో ఉంది.ఆ తర్వాత ఈ సినిమా గురించిన అప్డేట్ ఏదీ బయటకు రాలేదు. అయితే ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ దాదాపు పూర్తయిందని, ప్రీ ప్రోడక్షన్ వర్క్స్ తుది దశకు చేరుకున్నాయని సమాచారం. ఈ దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్కు మేకర్స్ ఎన్టీఆర్‌ను సంప్రదించగా, ఈ హీరో ప్రాథమికంగా అంగీకారం తెలిపారనే వార్తలు తాజాగా పెద్ద ఎత్తున తెరపైకి వచ్చాయి. ఈ వార్తలు వచ్చిన 24 గంటల్లోపే దాదా సాహెబ్ ఫాల్కే బయోపిక్‌ను ఆమిర్ ఖాన్ చేస్తున్నట్లుగా గురువారం అధికారిక ప్రకటన వచ్చింది. -
ఆర్ఆర్ఆర్-2 చేస్తారా?.. రాజమౌళి సమాధానమిదే.. వీడియో వైరల్!
ఆర్ఆర్ఆర్ టీమ్ లండన్‌లో సందడి చేస్తోంది. ప్రస్తుతం రామ్ చరణ్‌తో పాటు దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి, యంగ్ టైగర్ ఎన్టీఆర్ సైతం అక్కడే ఉన్నారు. తాజాగా లండన్‌లోని లెజెండరీ రాయల్ ఆల్బర్ట్ హాల్లో ఆర్ఆర్ఆర్ మూవీ ప్రత్యేక స్క్రీనింగ్ ఏర్పాటు చేశారు. అంతేకాకుండా మూవీ ప్రదర్శనతో పాటు ఆర్కెస్ట్రా కూడా ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించిన వీడియోను రామ్ చరణ్ సతీమణి ఉపాసన సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆర్ఆర్ఆర్ ఫరెవర్ అంటూ క్యాప్షన్ కూడా రాసుకొచ్చింది.మే 11న రాయల్ ఆల్బర్ట్ హాల్లో 'ఆర్ఆర్ఆర్' సినిమాను ప్రదర్శించారు. ఈ ప్రత్యేక కార్యక్రమానికి హాజరైన రామ్ చరణ్, ఎన్టీఆర్ ఫుల్ ఖుషీగా కనిపించారు. నాటు నాటు సాంగ్ ప్లే అవుతుండగా ఒకరి చేతిని ఒకరు పట్టుకుని కనిపించారు. ఆ తర్వాత రాజమౌళిని రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ సరదాగా ఆట పట్టించారు. ముగ్గురు కలిసి నవ్వుతూ సందడి చేశారు. ఈ ఈవెంట్లో రామ్ చరణ్ భార్య ఉపాసన కొణిదెల, జూనియర్ ఎన్టీఆర్ భార్య ప్రణతి ఉన్నారు.ఈ సందర్భంగా ఉపాసన ఆర్ఆర్ఆర్-2 చేస్తారా? అంటూ రాజమౌళిని అడిగింది. దీనికి రాజమౌళి అవును అని సమాధానమిచ్చారు. ఉపాసన వెంటనే 'గాడ్ బ్లెస్ యూ' అంటూ వారిని దీవించింది. ఈ సరదా వీడియో నెట్టింట తెగ వైరల్‌గా మారింది. ఈ ఈవెంట్లో ఆస్కార్ స్వరకర్త ఎంఎం కీరవాణి నేతృత్వంలోని రాయల్ ఫిల్హార్మోనిక్ కన్సర్ట్ ఆర్కెస్ట్రా ఆర్ఆర్ఆర్ సంగీతాన్ని ప్రదర్శించారు. దాదాపు మూడేళ్ల తర్వాత రాజమౌళి, రామ్ చరణ్, ఎన్టీఆర్ మొదటిసారి వేదికపై తిరిగి కలిశారు.ఇక సినిమాల విషయానికొస్తే యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ దర్శకుడు ప్రశాంత్ నీల్‌తో జతకట్టారు. ఈ సినిమా జూన్ 25, 2026న విడుదల కానుంది. మరోవైపు రామ్ చరణ్ ప్రస్తుతం 'ఉప్పెన' ఫేమ్ బుచ్చి బాబు సనా దర్శకత్వంలో నటిస్తున్నారు. ఈ మూవీ పెద్ది అనే టైటిల్ ఖరారు చేశారు. దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి.. తొలిసారిగా మహేష్ బాబుతో కలిసి పనిచేయనున్నారు. ఈ చిత్రాన్ని 'ఎస్ఎస్ఎంబీ29' అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కిస్తున్నారు. View this post on Instagram A post shared by Ram Charan (@alwaysramcharan) -
ఆర్ఆర్ఆర్ స్క్రీనింగ్.. జూనియర్ ఎన్టీఆర్‌కు రామ్ చరణ్ సర్ప్రైజ్.. అదేంటంటే?
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బ్లాక్‌బస్టర్ చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ మూవీ రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా మెప్పించారు. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ ఆలియా భట్ హీరోయిన్గా కనిపించింది. తాజాగా ఆర్ఆర్ఆర్ టీమ్ లండన్‌లో సందడి చేసింది. లండన్‌లోని రాయల్ ఆల్బర్ట్ హాల్లో జరిగిన ఆర్ఆర్ఆర్ లైవ్ ఆర్కెస్ట్రా స్క్రీనింగ్‌లో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ఓకే వేదికపై మెరిశారు.ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్‌కు రామ్ చరణ్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఇంకా జూనియర్ బర్త్ డేకు పది రోజుల ముందే చెర్రీ విషెస్ చెప్పారు. ఈ సందర్భంగా ఒకరినొకరు హృదయపూర్వక ఆలింగనం చేసుకున్నారు. ఆ తర్వాత ఎన్టీఆర్ చెంపపై ముద్దు కూడా పెట్టారు. ఇది చూసిన ఫ్యాన్స్ చప్పట్లు కొట్టారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా.. ఆదివారం ఆర్ఆర్ఆర్ మూవీని లండన్‌లోని లెజెండరీ రాయల్ ఆల్బర్ట్ హాల్లో ప్రదర్శించారు. ఈ స్క్రీనింగ్ వేడుకలో దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్‌లతో కలిసి సందడి చేశారు. దాదాపు మూడేళ్ల తర్వాత మొదటిసారి వేదికపైకి కనిపించారు. ఈ కార్యక్రమంలో ఆస్కార్ విజేత స్వరకర్త ఎంఎం కీరవాణి నేతృత్వంలోని రాయల్ ఫిల్హార్మోనిక్ కాన్సర్ట్ ఆర్కెస్ట్రా ఆర్ఆర్ఆర్ సంగీతాన్ని ప్రదర్శించారు. కాగా.. ఆర్ఆర్ఆర్ చిత్రంలో అజయ్ దేవ్గన్, అలియా భట్, శ్రియ శరణ్ కీలక పాత్రల్లో నటించారు. 2023లో 'నాటు నాటు' పాటకు ఉత్తమ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అవార్డును గెలుచుకున్న తొలి భారతీయ చిత్రంగా చరిత్ర సృష్టించింది. -
రాజమౌళి సెంటిమెంట్ కి భయపడుతున్న మహేష్ బాబు
-
మీరు అలా చేస్తే శత్రువుకు సాయం చేసినట్లే: రాజమౌళి
ప్రస్తుతం భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఏం జరుగుతుందో భారత ప్రభుత్వానికి మాత్రమే తెలుసు. కానీ సోషల్ మీడియాలో లెక్కకు మించి ఫేక్ వీడియోలు, ఫొటోలు దర్శనమిస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రముఖ దర్శకుడు రాజమౌళి.. ప్రజలకు తనవంతు బాధ్యతగా ఓ సూచన చేశారు.(ఇదీ చదవండి: బడా నిర్మాత కూతురి పెళ్లి.. ఇండస్ట్రీ మొత్తం అక్కడే) 'పాజిటివ్, అప్రమత్తంగా ఉంటే విజయం మనదే. దేశ రక్షణ కోసం పనిచేస్తున్న సాయుధ దళాలని మెచ్చుకోవాల్సిందే. ఒకవేళ భారత సైనిక చర్యలని మీరు ఫొటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయొద్దు. ఇలా చేయడం వల్ల మీరు శత్రువలకు సాయం చేసినవాళ్లు అవుతారు. అనధికారిక ప్రకటనలు, అసత్య ప్రచారం నమ్మకండి' అని రాజమౌళి చెప్పుకొచ్చారు.మొన్నటివరకు రాజమౌళి.. మహేశ్ బాబుతో సినిమా షూటింగ్ చేశారు. ప్రస్తుతం చిత్రీకరణకు బ్రేక్ ఇచ్చారు. తిరిగి జూన్ లో ప్రారంభించనున్నారు. అప్పటిలోపు పరిస్థితులు సద్దుమణిగితే సరేసరి. లేదంటే సినిమాల షూటింగ్స్ కూడా వాయిదా పడొచ్చేమో? ఇకపోతే రాజమౌళి.. తన ట్విటర్ ప్రొఫైల్ పిక్ గా ఆపరేషన్ సిందూర్ అని రాసి ఉన్న ఫొటోని పెట్టుకున్నారు.(ఇదీ చదవండి: ఒక్క వీకెండ్ ఓటీటీలోకి వచ్చిన 32 మూవీస్) If you see any movement of the Indian Army, don’t take pictures or videos.Don’t share them as you might be helping the enemy. Stop forwarding unverified news or claims. You’ll only create noise, which the enemy wants.Stay calm, alert and positive.Victory is ours. 🇮🇳— rajamouli ss (@ssrajamouli) May 9, 2025Saluting our Brave Indian Armed Forces for their unwavering courage in protecting our nation from terrorism. Let’s stand together as a nation, inspired by their valor, to build a future of peace and unity. Jai Hind! 🇮🇳— rajamouli ss (@ssrajamouli) May 9, 2025 -
భారత్ ఎంటర్టైన్మెంట్ హబ్‌గా మారుతోంది
‘‘కంటెంట్ క్రియేటర్స్ బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. మనుషులను మనం రోబోలుగా మార్చకూడదు. వారిని మరింత సున్నితంగా తీర్చిదిద్దాలి. సంగీతం, నృత్యం, కళల ద్వారా మానవ సున్నితత్వాన్ని పెంపొందించవచ్చు. కంటెంట్ క్రియేటర్లనుప్రోత్సహిస్తాం. భారత్ ఎంటర్టైన్మెంట్ హబ్‌గా మారుతోంది. అలాగే ఆరెంజ్ ఎకానమీకి (సృజనాత్మకత, సాంస్కృతిక అంశాల ఆధారంగా అభివృద్ధి చెందే ఆర్థిక వ్యవస్థ) దేశంలో నాంది పడింది. ఇది దేశ ఆర్థిక వృద్ధికి కీలకం. కంటెంట్, క్రియేటివిటీ, కల్చర్ అనేవి ఆరెంజ్ ఎకానమీకి మూడు స్తంభాలు’’ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో ‘వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ (వేవ్స్)– 2025’ని గురువారం ప్రారంభించారు నరేంద్ర మోదీ. క్రియే టివ్ ఎకానమీ, ఎంటర్టైన్మెంట్, డిజిటల్ మీడియా ఇండస్ట్రీలను ప్రోత్సహించేందుకు ‘ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ టెక్నాలజీ’ (ఐఐసీటీ)ని దాదాపు రూ. 400 కోట్లతో ముంబైలో స్థాపించనున్నట్లు ఈ సందర్భంగా కేంద్ర సమాచార–ప్రసార శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ‘వేవ్స్’లో ఆమిర్ ఖాన్, నాగార్జున, ఫర్హాన్ అక్తర్, నాగ చైతన్య– శోభిత ధూళిపాళ, రాజ్ కుమార్ రావు, కబీర్ బేడీ, అనుపమ్ ఖేర్, అనిల్ కపూర్, శ్రీలీల, పలువురు దక్షిణాది ఫిలిం చాంబర్ ప్రముఖులు పాల్గొన్నారు.‘కనెక్టింగ్ క్రియేటర్స్, కనెక్టింగ్ కంట్రీస్’ అనే థీమ్‌తో నాలుగు రోజుల పాటు జరగనున్న ఈ సదస్సులో 100కి పైగా దేశాల నుంచి 10,000 మంది డెలిగేట్స్, 1,000 మంది క్రియేటర్స్, 300 కంపెనీలు, 350 స్టార్టప్ కంపెనీలు పాల్గొంటున్నాయి. ‘వేవ్స్’ సదస్సు ప్రారంభ సూచికగా ప్రముఖ సంగీతదర్శకుడు కీరవాణి సారథ్యంలో ప్రముఖ గాయనీమణులు చిత్ర, శ్రేయా ఘోషల్, మంగ్లీ, లిప్సిక బృందం పలు భారతీయ భాషల సమాహారమైన ప్రారంభ గీతాన్ని ఆలపించడం ఆహూతులను అలరించింది.ఈ వేదికపై ప్రధాని మోదీ ఇంకా మాట్లాడుతూ– ‘‘సృజనాత్మకతనుప్రోత్సహించాలనే ఉద్దేశంతో త్వరలోనే ‘వేవ్స్’ అవార్డులను కూడా ప్రతిష్ఠాత్మకంగా అందించనున్నాం. ఇప్పుడు క్రియేట్ ఇన్ ఇండియా, క్రియేట్ ఫర్ ది వరల్డ్ సమయం. ప్రపంచం కొత్త కథల కోసం ఎదురుచూస్తున్న నేపథ్యంలో భారత కథలు గ్లోబల్ రీచ్‌ని సాధిస్తున్నాయి. భారత సినిమాలు 100కిపైగా దేశాల్లో నేరుగా విడుదలవుతున్నాయి. భారతీయ సంస్కృతిని ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్లడంలో మన దేశ సినిమా రంగం విజయం సాధించింది. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకి ఆస్కార్ దక్కడమే అందుకు నిదర్శనం. రష్యాలో రాజ్ కపూర్ చిత్రాలు పాపులర్. కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ అంటే సత్యజిత్ రే పేరు, ప్రతిష్ఠలు గుర్తొస్తాయి. ఆస్కార్ అనగానే ఏఆర్ రెహమాన్, రాజమౌళి (‘ఆర్ఆర్ఆర్’ చిత్రాన్ని ప్రస్తావించి) గుర్తొస్తారు. ఇటీవల 50 దేశాల గాయకులు కలిసి ‘వైష్ణవ జనతో’ అనే గీతాన్ని ఆలపించారు. సృజనాత్మకత ఉన్న యువతే దేశానికి అసలైన ఆస్తి’’ అని పేర్కొన్నారు.‘‘బాల్యంలో నేనెక్కువగా డ్యాన్సులు చేసేవాడిని. అలా నటనపై ఆసక్తి మొదలైంది. చెన్నై వెళ్లి ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చేరాను. అప్పటికే ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్‌బాబుగార్లు... ఇలా అరడజనుకు పైగా స్టార్ హీరోలున్నారు. వారికంటే భిన్నంగా ఏం చేయగలనో ఆలోచించి, నాదైన శైలిలో ఫైట్స్, డ్యాన్స్ చేశా. మేకప్ లేకుండా సహజంగా నటించడంలో ‘మృగయా’లోని మిథున్ చక్రవర్తిగారు, స్టంట్స్ విషయంలో ‘షోలే’లో అమితాబ్‌గారు, డ్యాన్స్‌లో కమల్‌హాసన్‌గారు స్ఫూర్తిగా నిలిచారు. నన్ను నేను మల్చుకుంటూ ఈ స్థాయికి చేరుకున్నాను’’. – హీరో చిరంజీవి‘ది జర్నీ: ఫ్రమ్ అవుట్‌సైడర్ టు రూలర్’ అనే అంశంపై జరిగిన చర్చకు బాలీవుడ్ దర్శక–నిర్మాత కరణ్ జోహార్ మోడరేటర్‌గా వ్యవహరించగా, నటుడు షారుక్ ఖాన్, నటి దీపికా పదుకోన్ మాట్లాడారు. ‘‘యువకుడిగా ఉన్నప్పుడు నేను ధైర్యంగా, ఎక్కువ ఆత్మవిశ్వాసంతో ఉండేవాణ్ణి. అయితే కాస్త కూల్‌గా ఉండేవాడిని. యంగ్ షారుక్ అప్పుడు కూల్‌గా ఉన్నాడు కనుకనే ఇంత దూరం రాగలిగాడు’’ అన్నారు షారుక్. ఇంకా మాట్లాడుతూ – ‘‘సినిమా వినోదం ప్రజలకు చౌకగా లభించాలి. చిన్న చిన్న పట్టణాల్లో చిన్న థియేటర్స్ ఉండాలి.అప్పుడు భారతీయ సినిమా దేశ నలుమూలలకు చేరువ అవుతుంది’’ అని చెప్పుకొస్తూ, దర్శక–నిర్మాత కరణ్ జోహార్ స్క్రిప్ట్‌ను తాను రిజెక్ట్ చేసిన సందర్భాన్ని గుర్తు చేసుకున్నారు షారుక్. ఇంకా ఇండస్ట్రీలోకి వచ్చే కొత్త తరం తమ ఒరిజినాలిటీని కోల్పోకుండా ఉండాలని, ఇమేజ్‌ని నమ్మవద్దని సలహా ఇచ్చారు షారుక్. దీపికా పదుకోన్ మాట్లాడుతూ– ‘‘18 ఏళ్ల అమ్మాయి (తనని ఉద్దేశించి) ధైర్యంగా ఓ పెద్ద సిటీకి వచ్చింది. నా జర్నీని ఇప్పుడు నేను తిరిగి చూసుకుంటుంటే... ఫర్లేదు. నేను బాగానే చేశాననిపిస్తోంది’’ అన్నారు.‘వేవ్స్’ తొలి రోజున ఐదుగురు భారతీయ సినిమా దిగ్గజాల స్మారక తపాలా బిళ్లలను మోదీ విడుదల చేశారు. వీరిలో దక్షిణాది ప్రముఖ నటి–దర్శక–నిర్మాత–గాయని భానుమతి ఉండటం విశేషం. ఇంకా దర్శక–నిర్మాత–నటుడు గురుదత్, దర్శకుడు రుత్విక్ ఘటక్, దర్శక–నిర్మాత రాజ్ ఖోస్లా, మ్యూజిక్ డైరెక్టర్ సలీల్ చౌదరిల పోస్టల్ స్టాంపులు కూడా ఉన్నాయి. భానుమతి కుటుంబం పక్షాన ఆమె మనవరాలు పి. మీనాక్షి స్టాంప్‌ను అందుకున్నారు. ‘‘కథ, కథనం అనేవి వేలాది సంవత్సరాలుగా భారతీయ సంస్కృతిలో భాగం. మనకు కొన్ని వందల భాషలు ఉన్నాయి. ప్రతి భాషలో, ప్రతి ప్రాంతంలో తమవైన లక్షల కథలు ఉన్నాయి. అసలు కథాకథనాలు మన నరనరాల్లో భాగం. ఆ విషయంలో మరి ఏ ఇతర దేశమూ మన దగ్గరకు కూడా రాదు. అయినప్పటికీ, అమెరికా, చైనా, జపాన్, సౌత్ కొరియా తదితర దేశాల వినోద రంగానికి మనం దీటుగా లేము. సినిమా, టీవీ, డిజిటల్ మీడియా లాంటి వాటిని అనుసంధానిస్తూ మనకు ఒక లాంచ్ ΄్యాడ్ ఇన్నాళ్లు కరువైంది. ఇప్పుడు సరిగ్గా ఆ లోటును తీర్చే ఆ లాంచ్ ΄్యాడ్ వేవ్స్’’. – దర్శకుడు రాజమౌళి – ముంబై నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి -
మహేశ్ బాబు నయా లుక్.. ఎప్పుడు లేనంతగా
మహేశ్ బాబు ప్రస్తుతం రాజమౌళితో సినిమా చేస్తున్నాడు. ఇదివరకే హైదరాబాద్, ఒడిశాలో షూటింగ్ చేశారు. త్వరలో మరో షెడ్యూల్ కూడా మొదలుపెట్టబోతున్నారు. కానీ SSMB 29 గురించి అధికారికంగా మాత్రం ప్రకటించలేద. మహేశ్ అయితే పూర్తిగా బయట కనిపించడమే మానేశాడు.కొన్నిరోజుల క్రితం షూటింగ్ లో బ్రేక్ దొరకగానే కుటుంబంతో కలిసి మహేశ్.. ఇటలీ వెళ్లాడు. కానీ తన ఫొటో గానీ, లుక్ గానీ బయటపడకుండా చాలా జాగ్రత్త పడ్డాడు. ఎయిర్ పోర్ట్ లోనూ తలపై క్యాప్, కళ్లజోడు ఉండటం వల్ల మహేశ్ లుక్ సరిగా రివీల్ కాలేదు.(ఇదీ చదవండి: అర్థరాత్రి నా హోటల్ రూంలోకి రావాలని చూశాడు: హీరోయిన్) మరి తాజాగా ఎవరితోనూ ఏదో డిస్కషన్ చేస్తున్న టైంలో మహేశ్ బాబు లేటెస్ట్ లుక్ బయటపడింది. గుబురు గడ్డంతో, పొడవైన జుత్తుతో మహేశ్ కనిపించాడు. గతంలో మహేశ్ హెయిర్ పెంచాడు గానీ రాజమౌళితో మూవీ కోసం మాత్రం చాలా డిఫరెంట్ గా కనిపించబోతున్నాడని ఈ లుక్ చూస్తుంటే అర్థమవుతోంది.గతంలో ఒడిశాలో షూటింగ్ చేస్తున్న టైంలో మహేశ్ క్లిప్ ఒకటి లీకైంది. ఇందులో మలయాళ నటుడు పృథ్వీరాజ్ కూడా కనిపించాడు. మరోవైపు ఇదే సినిమాలో ప్రియాంక చోప్రా కూడా కీలక పాత్ర చేస్తోంది. వీళ్ల లుక్స్ కూడా బయటకు రాకుండా జక్కన్న చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఈ మూవీ 2027లో థియేటర్లలోకి రావొచ్చని అంటున్నారు. ఏం జరుగుతుందో చూడాలి?(ఇదీ చదవండి: 'కోర్ట్'ని మించిపోయేలా ఉంటుంది.. ఓటీటీ డేట్ ఫిక్స్) -
బాహుబలి రిటర్న్స్
వెండితెరపైకి బాహుబలి తిరిగొస్తున్నాడు. ప్రభాస్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన బ్లాక్‌బస్టర్ మూవీ ‘బాహుబలి’. అనుష్కా శెట్టి, తమన్నా, రానా, రమ్యకృష్ణ, సత్యరాజ్, నాజర్ ఇతర ప్రధానపాత్రల్లో నటించారు. శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మించిన ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదలైన సంగతి తెలిసిందే. తొలిభాగం ‘బాహుబలి: ది బిగినింగ్’ 2015 జూలై 10న, రెండోభాగం ‘బాహుబలి: ది కన్ క్లూజన్ ’ 2017 ఏప్రిల్ 28న విడుదలయ్యాయి.ఈ రెండు చిత్రాలూ బ్లాక్‌బస్టర్స్‌గా నిలిచాయి. కాగా ఈ ఏడాది అక్టోబరులో ‘బాహుబలి’ సినిమాను రీ–రిలీజ్ చేయనున్నట్లు నిర్మాతల్లో ఒకరైన శోభు యార్లగడ్డ ‘ఎక్స్’ వేదికగా పేర్కొన్నారు. ‘‘ఈ ఏడాది అక్టోబరులో ‘బాహుబలి’ సినిమాను రీ–రిలీజ్ చేయనున్నాం.ఇండియాలోనే కాదు.. ఇంటర్నేషనల్‌గా కూడా ఈ రీ–రిలీజ్ ఉంటుంది. కొన్ని సర్‌ప్రైజ్‌లూ ఉంటాయి. బాహుబలి రిటర్న్స్’’ అంటూ ఆయన పేర్కొన్నారు. ‘బాహుబలి: ది కన్ క్లూజన్ ’ సినిమా విడుదలై ఎనిమిదేళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా రీ రిలీజ్ విషయాన్ని మేకర్స్ వెల్లడించినట్లు తెలుస్తోంది. అయితే రీ–రిలీజ్ విడుదల తేదీపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు మేకర్స్. -
హిట్ 3 నచ్చకపోతే SSMB29 సినిమా చూడొద్దు.. నాని ఇరికించేశాడుగా!
నేచురల్ స్టార్ నాని (Nani) యాక్షన్ అవతార్‌లో కనిపించనున్నాడు. శైలేష్ కొలను దర్శకత్వంలో నాని ప్రధాన పాత్రలో నటించిన హిట్ 3: థర్డ్ కేస్ మూవీ (HIT: The Third Case) మే 1న విడుదల కానుంది. ఆదివారం (ఏప్రిల్ 27) ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దర్శకధీరుడు రాజమౌళి ముఖ్య అతిథిగా విచ్చేశాడు. అలాగే హిట్ 1 హీరో అడివి శేష్, హిట్ 2 హీరో విశ్వక్ సేన్ అతిథులుగా వచ్చారు.ప్రేమగా హగ్ ఇచ్చారంటే..ఈ వేదికపై నాని మాట్లాడుతూ.. నా ప్రతి సినిమా మార్నింగ్ షోకి ప్రసాద్ ఐమ్యాక్స్‌కి వెళతాను. వెళ్లే ముందే రాజమౌళిగారి ఫ్యామిలీ మెంబర్స్ కూడా వస్తున్నారా? అని చెక్ చేసుకుని, థియేటర్లో వాళ్ల రియాక్షన్ చూస్తుండేవాడిని. సినిమా అయిపోయాక వల్లీగారు, రమగారిని టాక్ అడిగేవాడిని. ప్రేమగా హగ్ ఇచ్చి వెళ్లిపోయారంటే నచ్చలేదని అర్థం. కారు ఎక్కిన వెంటనే నీకు మెసేజ్ చేస్తాం అన్నారంటే సినిమా బాగుందని అర్థం. అయితే ఈ మధ్య థియేటర్‌కి వెళ్లకపోవడంతో ఈ అలవాటుకు కాస్త బ్రేక్ పడింది.సొంత సినిమాలా ప్రమోషన్స్..ఈ మే 1న రాజమౌళి (SS Rajamouli) మార్నింగ్ షో చూడాలని కోరుకుంటున్నాను. ఒకవేళ ఆ రోజు ఆయనకు ఏదైనా పనులుంటే తన పాస్‌పోర్ట్ లాగేసుకుంటాను. శ్రీనిధి శెట్టి గురించి చెప్పాలి. మేమిద్దరం ఇచ్చిన ఇంటర్వ్యూలకు సినిమాలో సగం లవ్‌స్టోరీనే ఉంటుందేమో అనుకుంటున్నారు. కానీ, అలాంటిదేం ఉండదు. ప్రమోషన్స్ కూడా ఒక్కటీ మిస్ అవకుండా తన సొంత సినిమాలా చేసింది. సినిమా సక్సెస్ ఈవెంట్లో ఇంకా ఎక్కువ మాట్లాడతాను.హిట్ 3 నచ్చకపోతే..కోర్ట్ సినిమా నచ్చకపోతే హిట్ 3 చూడొద్దని చెప్పాను. ఈసారి ఎవరిని తాకట్టుపెడదాం అని చూస్తున్నాను. హిట్ 3 మీ అంచనాలను అందుకోలేకపోతే వచ్చే ఏడాది రిలీజవుతున్న SSMB29 (సూపర్‌స్టార్ మహేశ్‌బాబు- రాజమౌళి కలయికలో వస్తున్న మూవీ)ని చూడొద్దు.. సరదాగా అంటున్నాను. ఆ సినిమాను తాకట్టు పెట్టినా ఎవరూ పట్టించుకోరు. ఎందుకంటే ఆ సినిమా ప్రపంచమంతా చూసి తీరాల్సిందే! మే 1న ఆడియన్స్ కు ఒక అమేజింగ్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ను ఇస్తానని నేను ప్రామిస్ చేస్తున్నా అని నాని అన్నాడు. ఇక ఇదే స్టేజీపై ఫైట్ మాస్టర్ సతీశ్.. శ్రీనిధి శెట్టికి ఒక ఫైట్ సీన్ కూడా ఉందన్న విషయాన్ని లీక్ చేసేశాడు. దీంతో శ్రీనిధి షాకై నోరెళ్లబెట్టింది. వెంటనే అక్కడున్న సుమ.. కథంతా చెప్పేసేలా ఉన్నారని వారించింది. చదవండి: కోర్ట్ తర్వాత సారంగపాణి జాతకం నాకో వరం: ప్రియదర్శి -
నాని ‘హిట్ 3: థర్డ్ కేస్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
మహాభారతంలో నాని.. కన్ఫార్మ్ చేసిన రాజమౌళి
‘‘నాని ఏ సినిమా చేసినా హిట్ అని తెలిసిపోతుంటుంది. కానీ తన దగ్గర్నుంచి ఇంకా కావాలని ఓ ఫంక్షన్లో అన్నాను. అయితే నా అంచనాలను మించి నాని చాలా ముందుకెళ్లిపోయాడు. కానీ నానీ... మేం ఇంకా కోరుకుంటూనే ఉంటాం. నువ్వు ఇంకా ముందుకు వెళ్లు’’ అని ప్రముఖ దర్శకుడు రాజమౌళి అన్నారు. నాని హీరోగా నటించిన చిత్రం ‘హిట్ 3: థర్డ్ కేస్’. ఈ చిత్రంలో శ్రీనిధీ శెట్టి హీరోయిన్ . శైలేష్ కొలను దర్శకత్వంలో నాని, ప్రశాంతి తిపిర్నేని నిర్మించిన ఈ చిత్రం మే 1న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆదివారం జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా దర్శకుడు రాజమౌళి, అతిథులుగా ‘హిట్ 1’లో హీరోగా నటించిన అడివి శేష్, ‘హిట్ 2’లో హీరోగా నటించిన విశ్వక్ సేన్ హాజరయ్యారు. ఈ వేదికపై దర్శకుడు రాజమౌళి మాట్లాడుతూ – ‘‘అ!, హిట్ 1, హిట్ 2, కోర్ట్’... ఆల్ సక్సెస్. వంద శాతం సక్సెస్ అయిన నిర్మాత ప్రశాంతి. ఇండస్ట్రీలో హిట్ మిషన్ అని పిలుచుకుంటుంటాం. ఇప్పుడు ‘హిట్ 3’ సక్సెస్ అవుతుందని నా గట్టి నమ్మకం. ఓ ఫ్రాంచైజీని స్టార్ట్ చేసినప్పుడు అది ఎంతకాలం ఉంటుందో చెప్పలేం. కానీ ‘హిట్ ఫస్ట్ కేస్, సెకండ్ కేస్... చాలా కేస్లు ఉండొచ్చు. శైలేష్ ఏడు సినిమాలే అనుకుని ఉండొచ్చు. కానీ ఈ ఫ్రాంచైజీ ఎప్పటికీ ఉంటుందని అనుకుంటున్నాను. ‘హిట్ 3’ ప్రమోషనల్ కంటెంట్ చూశాను. సినిమా సూపర్ డూపర్ హిట్ అనే వైబ్‌ని క్రియేట్ చేసింది. మే1 థియేటర్స్‌లో... అబ్ కీ బార్ అర్జున్ సర్కార్. హిట్ ది థర్డ్ కేస్’’ అని రాజమౌళి అన్నారు.కాగా.. ఈ వేదికపై ‘‘మీరు తీయబోతున్నటు వంటి ‘మహాభారతం’ సినిమాలో నానీగారి క్యారెక్టర్ ఫిక్స్ అయిందని విన్నాం... నిజమేనా’’ అని యాంకర్ సుమ అడిగితే ‘‘నాని ఉంటాడన్నది మాత్రం ఫిక్స్’’ అని రాజమౌళి చెప్పారు. నాని మాట్లాడుతూ– ‘‘నా ప్రతి కొత్త సినిమాకు మార్నింగ్ షోకి ప్రసాద్ ఐమ్యాక్స్‌కి వెళతాను. వెళ్లే ముందే రాజమౌళిగారి ఫ్యామిలీ మెంబర్స్ కూడా వస్తున్నారా? అని చెక్ చేసుకుని, థియేటర్లో వాళ్ల రియాక్షన్ చూస్తుండేవాడిని. సినిమా అయిపోయాక వల్లీగారు, రమగారిని టాక్ అడిగేవాడిని. ప్రేమగా హగ్ ఇచ్చి వెళ్లిపోయారంటే నచ్చలేదని అర్థం. ‘చాలా బాగుంది. కారు ఎక్కిన వెంటనే నీకు మెసేజ్ చేస్తాం’ అంటే సినిమా బాగుందని అర్థం. అయితే ఈ మధ్య థియేటర్‌కి వెళ్లకపోవడంతో కాస్త బ్రేక్ వచ్చింది.ఈసారి ‘హిట్ 3’ సినిమా చూసి, ఆయన (రాజమౌళి) నాకు ఆ మార్నింగ్ షో ఎనర్జీ ఇవ్వాలని కోరుకుంటున్నాను. రాజమౌళిగారు ఈ మూవీని ఎంజాయ్ చేస్తారనే నమ్మకం ఉంది. ఒక థ్రిల్లర్, ఒక మాస్ కమర్షియల్ ఫిల్మ్ కలిస్తే అది ‘హిట్ 3’. మే 1న ఆడియన్స్ కు ఒక అమేజింగ్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ను నానిప్రామిస్ చేస్తున్నాడు’’ అన్నారు. ‘హిట్ 3’ సక్సెస్ అవ్వాలనే ఆకాంక్షను అడివి శేష్, విశ్వక్ సేన్ వ్యక్తం చేశారు. శైలేష్ కొలను, శ్రీనిధీ శెట్టి, కోమలీ ప్రసాద్ తదితరులు మాట్లాడారు. -
ఇదెక్కడి అభిమానం రా బాబు.. ఏకంగా పెళ్లి కార్డుపై మహేశ్
తెలుగు ప్రేక్షకుల అభిమానం గురించి ఎంత చెప్పుకొన్నా తక్కువే. చిన్నా పెద్దా అని సంబంధం ఉండదు. మన భాష పరభాష అనేది పట్టించుకోరు. సినిమా నచ్చితే చాలు.. ఆ మూవీని, సదరు హీరోల్ని గుండెల్లో పెట్టేసుకుంటారు. ఇకపోతే తెలుగులోనూ కొందరు స్టార్ హీరోలకు కోట్లాది మంది ఫ్యాన్స్ ఉన్నారు. వీళ్లలో కొందరు అప్పుడప్పుడు చిత్రవిచిత్రమైన పనులు చేస్తుంటారు. కర్నూలుకు చెందిన సాయి చరణ్ అనే కుర్రాడు.. సూపర్ స్టార్ మహేశ్ బాబుకు వీరాభిమానిలా ఉన్నాడు. ఎందుకంటే వచ్చే నెలలో తన పెళ్లి ఉంది. దీనికోసం ఇప్పుడు వెడ్డింగ్ కార్డ్స్ పంచుతున్నాడు. అందరిలా కాకుండా తన పెళ్లి పత్రికపై దేవుళ్ల ఫొటోలతో పాటు తను ఎంతో అభిమానించే మహేశ్ బాబు పిక్ కూడా ప్రింట్ చేశాడు.(ఇదీ చదవండి: ప్రెగ్నెన్సీతో స్టార్ హీరోయిన్.. కోటి రూపాయల గిఫ్ట్!) దీన్ని కొందరు ఫొటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఇది కాస్త ఇప్పుడు వైరల్ అవుతుంది. ఇదెక్కడి అభిమానం రా బాబు అని నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు. ఇదే కాదు గతంలోనూ ఓసారి ఇలానే ఓ అభిమాని.. తన పెళ్లి కార్డుపై మహేశ్ బాబు ఫొటోని ముద్రించాడు. అప్పట్లోనూ దాని గురించి మాట్లాడుకున్నారు.మహేశ్ బాబు సినిమాల విషయాలనికొస్తే.. ప్రస్తుతం రాజమౌళితో సినిమా చేస్తున్నాడు. 2027లో ఇది రిలీజ్ అవ్వొచ్చని అంటున్నారు. కానీ రాజమౌళితో మూవీ అంటే ఎప్పుడొస్తుందో చెప్పలేం. ప్రస్తుతానికైతే రెండు షెడ్యూల్స్ పూర్తయ్యాయి. త్వరలో కొత్త షెడ్యూల్ ప్రారంభం కానుందని తెలుస్తోంది. మే నెలలో ఈ ప్రాజెక్ట్ గురించి అధికారిక ప్రకటన ఉండొచ్చని తెలుస్తోంది.(ఇదీ చదవండి: 70 ఏళ్లకు ప్రేమలో పడితే.. ఓటీటీ సినిమా రివ్యూ) -
ఖైరతాబాద్ ఆర్టీఏ ఆఫీసుకు రాజమౌళి.. మహేశ్ బాబు సినిమా కోసమేనా?
టాలీవుడ్ దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో సందడి చేశారు. ఆయన తన అంతర్జాతీయ డ్రైవింగ్ లైసెన్స్ రెన్యూవల్ చేసుకునేందుకు ఖైరతాబాద్ రవాణా కార్యాలయానికి వచ్చారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.ప్రస్తుతం రాజమౌళి మహేశ్ బాబు సినిమాతో బిజీగా ఉన్నారు. వీరిద్దరి కాంబోలో వస్తోన్న ఎస్ఎస్ఎంబీ మూవీ షూటింగ్ షెడ్యూల్ ఇటీవలే ఒడిశాలో పూర్తి చేసుకున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ ప్రియాంక చోప్రా కీలక పాత్రలో కనిపించనుంది. ప్రస్తుతం ఈ మూవీ షెడ్యూల్ విదేశాల్లో చిత్రీకరించనున్నట్లు తెలుస్తోంది. విదేశాల్లో షూటింగ్ కోసమే తన డ్రైవింగ్ లైసెన్స్ కోసం వచ్చినట్లు సమాచారం. డ్రైవింగ్ లైసెన్స్ కోసం రాజమౌళి సంతకం చేసి, ఫొటో దిగారు. అనంతరం అధికారులు ఆయనకు డ్రైవింగ్ లైసెన్స్‌ను అందజేశారు. -
తారక్ పూనకం వచ్చినట్లే చేశాడు.. నాదేం లేదు: రాజమౌళి
ఆర్ఆర్ఆర్ (RRR Movie)లో రోమాలు నిక్కబొడుచుకునే పాట+ సన్నివేశం అనగానే చాలామందికి మొదట గుర్తొచ్చేది కొమురం భీముడో సాంగ్.. ఈ పాటలో జూనియర్ ఎన్టీఆర్‌ను చిత్రహింసలు పెడుతున్నా.. అతడు ప్రజలను ఒక్కటి చేసేందుకు ప్రయత్నించడం.. ఈ క్రమంలో ఆయన పలికించే భావోద్వేగాలు.. నెక్స్ట్ లెవల్లో ఉంటాయి. ఆ సమయంలో తారక్‌ను చూస్తే ఏదో పూనకం వచ్చినట్లే కనిపించాడంటున్నాడు దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి (S. S. Rajamouli).తారక్ వల్లే ఈజీ..జపాన్‌లో ఆర్ఆర్ఆర్: బిహైండ్ అండ్ బియాండ్ డాక్యుమెంటరీ ప్రమోషన్లలో రాజమౌళి మాట్లాడుతూ.. కొమురం భీముడో పాట (Komuram Bheemudo Song) షూటింగ్ చాలా ఈజీగా అయిపోయింది. ఎందుకంటే తారక్ (Jr NTR) పోషించిన పాత్ర తాలూకు ఆత్మ అతడిలో ప్రవేశించినట్లుగానే యాక్ట్ చేశాడు. అతడు అద్భుతమైన నటుడని మనందరికీ తెలుసు. ఈ పాటలో మాత్రం మరో స్థాయిలో నటించాడు. తనిచ్చే ఒక్కో ఎక్స్ప్రెషన్.. నుదుటిపై కండరాల కదలిక.. అన్నీ పర్ఫెక్ట్గా కుదిరాయి.కొరియోగ్రాఫర్ నైపుణ్యం కూడా..నేను కేవలం కెమెరాను అతడి ముఖం ముందు పెట్టి పాట ప్లే చేశానంతే.. చివరకు ఆ పర్ఫామెన్స్ అద్భుతంగా వచ్చింది. ఈ విషయంలో కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ (Prem Rakshit)కు కూడా క్రెడిట్ ఇవ్వాల్సిందే! అతడిని ఎలా కట్టేయాలి, గాల్లో ఎలా వేలాడదీయాలి.. ఇలా అన్నింటినీ తను చాలా బాగా కొరియోగ్రఫీ చేశాడు అని మెచ్చుకున్నాడు. ఆర్ఆర్ఆర్ విషయానికి వస్తే.. విజయేంద్రప్రసాద్ కథ అందించిన ఈ చిత్రాన్ని ఆయన తనయుడు రాజమౌళి తెరకెక్కించాడు. వెయ్యికోట్లకు పైనే..సాయిమాధవ్ బుర్రా డైలాగ్స్ అందించగా డీవీవీ దానయ్య నిర్మించాడు. రామ్‌చరణ్, జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా నటించారు. అజయ్ దేవ్‌గణ్, ఆలియా భట్, శ్రియా, సముద్రఖని, ఒలీవియా మోరిస్ ముఖ్య పాత్రల్లో నటించారు. ఎమ్ఎమ్ కీరవాణి సంగీతం అందించాడు. 2022 మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా దాదాపు రూ.1300 కోట్లకు పైగా రాబట్టింది. ఆర్ఆర్ఆర్: బిహైండ్ అండ్ బియాండ్ (RRR: Behind and Beyond) డాక్యుమెంటరీ నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది.రాజమౌళి నెక్స్ట్ మూవీ..ప్రస్తుతం రాజమౌళి.. సూపర్ స్టార్ మహేశ్‌బాబుతో కలిసి సినిమా చేస్తున్నాడు. ఇందులో ప్రియాంక చోప్రా కథానాయికగా నటిస్తోంది. పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఈ సినిమా 2027లో విడుదల కానుంది. జూనియర్ ఎన్టీఆర్ విషయానికి వస్తే.. అతడు వార్ 2 చిత్రంతో బాలీవుడ్లో ఎంట్రీ ఇస్తున్నాడు. ఇందులో హృతిక్ రోషన్‌తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాడు. ఈ మూవీ ఆగస్టు 14న విడుదల కానుంది. Everyone Knows Tarak Is Good, Fantastic Actor But In #KomuramBheemudo Sequence He's On Different Level 🔥👏🛐 - @ssrajamouli In Japan ❤️.Goat Actor @tarak9999 🐐❤️🔥.#RRRBehindAndBeyond pic.twitter.com/2yDLhx0Dae— Sai Mohan 'NTR' (@Sai_Mohan_999) April 13, 2025 చదవండి: సమంత 'సిటాడెల్ 2' లేనట్లే.. ప్రకటించిన అమెజాన్ -
రాజమౌళి, మహేష్ బాబు మూవీలో త్రిష
-
ఖరీదైన సినిమా.. సూపర్ స్టార్-ఐకాన్ స్టార్ వార్!
ఈ ఏడాది అత్యంత ఖరీదైన చిత్రాల రూపకల్పనలో భారతీయ చిత్ర పరిశ్రమ కొత్త శిఖరాలను అధిరోహించనుంది. ఈ నేపధ్యంలోనే ఆల్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ సెన్సేషనల్ దర్శకుడు అట్లీ కలయికలో తమ కొత్త చిత్రాన్ని అధికారికంగా ప్రకటించడంతో ఇద్దరు టాలీవుడ్ అగ్రగామి నటుల మధ్య సరికొత్త వార్ మొదలైందనొచ్చు. దేశంలోనే అత్యంత ఖరీదైన సినిమా నాదే అనే కిరీటాన్ని అందుకోవడానికి ఈ ఇద్దరు స్టార్స్ పోటీపడుతున్నారు. వీరిద్దరూ మాత్రమే కాదు నేను కూడా ఉన్నానంటూ బాలీవుడ్ టాప్ స్టార్ కూడా అదే వరుసలో నిలవడంతో.. పోటీ రసకందాయకంగా మారింది.రూ.2 వేల కోట్ల కలెక్షన్స్ నిన్న.. రూ1,000 కోట్ల పెట్టుబడి నేడు.. అన్నట్టుగా ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు రాజమౌళి అత్యంత భారీ చిత్రం రూపొందిస్తున్నారు. ప్రస్తుతం మహేష్‌బాబుతో ఆయన తీస్తున్న చిత్రం ఎస్‌ఎస్‌ఎస్‌బి29 బడ్జెట్ రూ.1000 కోట్ల వరకూ ఉండొచ్చునంటున్నారు. మరోవైపు బాలీవుడ్ అగ్ర కధానాయకుల్లో ఒకరైన రణబీర్ కపూర్‌తో రామాయణం తెరకెక్కుతోంది. ఈ చిత్రం బడ్జెట్ కూడా రూ.900 కోట్లకు దగ్గరగా ఉండొచ్చునని చెబతున్నారు. ఈ రెండు సినిమాల విషయంలో ఇప్పటికే ఒక అవగాహనతో ఉన్నప్పటికీ... భారతీయ చలనచిత్ర పరిశ్రమలో తమ తమ చిత్రాలతో భారీ బ్లాక్బస్టర్లు సాధించిన అల్లు అర్జున్, అట్లీలు సన్ పిక్చర్స్ బ్యానర్ భారీ బడ్జెట్‌తో ఓ సినిమా రూపొందిస్తున్నట్టు వచ్చిన ప్రకటన పలు ఆశ్చర్యకరమైన అంకెల్ని సినీ అభిమానుల కళ్ల ముందుకు తెచ్చింది. ప్రస్తుతం ఏఏ22xఏ6 అని పేర్కొంటున్న ఈ చిత్రం అత్యంత ఖరీదైన భారతీయ చలనచిత్రాలలో ఒకటిగా నిలవనుంది. ఈ సినిమా బడ్జెట్ రూ. 800 కోట్లు కాగా ఇందులో నిర్మాణ వ్యయంగా రూ. 200 కోట్లు, విఎఫ్ఎక్స్ (స్పెషల్ ఎఫెక్ట్స్) కోసం రూ.250 కోట్లు, అల్లు అర్జున్ రెమ్యునరేషన్ రూ. 175 కోట్లు, దర్శకుడు అట్లీ రెమ్యునరేషన్ రూ. 100 కోట్లుగా లెక్కిస్తున్నారు.ఇదే కాకుండా అల్లు అర్జున్‌కూ సినిమా లాభంలో 15 శాతం ఉంటుందని, అలాగే అట్లీకి కూడా బ్యాకెండ్ డీల్ ఉంటుందని సమాచారం. అవతార్, ఐరన్ మ్యాన్ వంటి హాలీవుడ్ చిత్రాలకు పనిచేసిన నిపుణులు ఇందులో భాగం పంచుకుంటున్న నేపధ్యంలో ఈ సినిమా ఇండియన్ స్క్రీన్‌పై విజువల్ ట్రీట్‌గా ఉంటుందని భావిస్తున్నారు. ఈ చిత్రం అద్భుతమైన ప్రకృతి దృశ్యాలతో ఒక ఫాంటసీ ప్రపంచంలోకి తీసుకెళ్లవచ్చునని.. అట్లీ తరచుగా ఆలోచించినట్టే ఆలోచిస్తే అల్లు అర్జున్ ద్విపాత్రాభినయం కూడా ఉండొచ్చు అంటున్నారు. ఈ చిత్రం షూటింగ్ ఆగస్ట్ లో ప్రారంభం కానుంది.ప్రస్తుత బడ్జెట్ల ప్రకారం రాజమౌళి, మహేష్ బాబుల సినిమాయే అత్యంత ఖరీదైన చిత్రం కావడం ఖాయంగా తెలుస్తున్నప్పటికీ..మరెన్నో నెలల పాటు.షూటింగ్ సాగే క్రమంలో బడ్జెట్లో కూడికలు, తీసివేతలు.. మార్పు చేర్పులు అంతిమంగా ఈ విషయాన్ని ఖరారు చేస్తాయని అనుకోవచ్చు. -
వెకేషన్ నుంచి తిరిగొచ్చిన మహేశ్‌బాబు.. వీడియో వైరల్
మహేశ్‌బాబు- రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కుతున్న SSMB29 భారీ ప్రాజెక్ట్ పనులు స్పీడ్‌గానే జరుగుతున్నాయి. ఇప్పటికే ఈ మూవీ నుంచి రెండు షెడ్యూల్స్ కూడా పూర్తి అయ్యాయి. అయితే, షూటింగ్ పనులకు కాస్త గ్యాప్ రావడంతో ఎప్పటి మాదిరిగానే తన ఫ్యామిలీతో ఇటలీ టూర్‌కి మహేశ్ వెళ్లారు. ఇప్పుడు ఆయన అక్కడి నుంచి ఇండియాకు తిరిగొచ్చారు. తాజాగా శంశాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో మహేశ్‌బాబు దిగగానే ఫ్యాన్స్ ఫోటోల కోసం ఎగబడ్డారు. దీంతో విమానాశ్రయంలో అభిమానులతో కలిసి సెల్ఫీలు దిగారు.ఇటలీలోని టస్కనీ ప్రాంతంలో ఉండే హిస్టారికల్ ప్రదేశాలను ఆయన సందర్శించారు. సితార, నమత్ర చిల్ అవుతున్న ఫోటోలను అభిమానులతో పంచుకున్నారు. ఏడాదిలో కనీసం రెండు లేదా మూడు ఫారెన్ ట్రిప్స్ మహేశ్‌బాబు వేస్తారని తెలిసిందే. SSMB29 ప్రాజెక్ట్ ప్రారంభానికి ముందు జక్కన్న లాక్కున్న పాస్‌పోర్ట్‌ను చూపుతూ మహేశ్ వెళ్లిన వీడియోలు నెట్టింట వైరల్ అయ్యాయి. ఇప్పుడు ఆయన ఇటలీ నుంచి హైదరాబాద్ తిరిగి రావడంతో ఫోటోల కోసం ఫ్యాన్స్ ఎగబడటం జరిగింది. అందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.దర్శకుడు రాజమౌళి కూడా కొద్దిరోజుల క్రితం జపాన్ వెళ్లిన విషయం తెలిసిందే.. 'ఆర్ఆర్ఆర్: బిహైండ్ అండ్ బియాండ్' డాక్యుమెంటరీ ప్రచారం కోసం తన కుటుంబంతో పాటు వెళ్లారు. మరో రెండురోజ్లులో ఆయన కూడా ఇండియాకు తిరిగిరావచ్చు. SSMB29 షూటింగ్ పనులు మళ్లీ షురూ కాబోతున్నాయి. View this post on Instagram A post shared by Kamlesh Nand (work) (@artistrybuzz_) -
అంతకంతకు పెరుగుతున్న పాన్ ఇండియా మూవీ బడ్జెట్స్
-
మహేశ్- రాజమౌళి సినిమాకు 'డైలాగ్ రైటర్'గా ప్రముఖ దర్శకుడు
టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్‌బాబు (Mahesh Babu) హీరోగా ఎస్.ఎస్.రాజమౌళి (SS Rajamouli) దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ అడ్వెంచర్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. SSMB29 వర్కింగ్ టైటిల్‌తో ప్రారంభమైన ఈ ప్రాజెక్ట్‌లో ఎవరెవరు భాగం అయ్యారు వంటి అంశాల గురించి పెద్దగా బయటి ప్రపంచానికి తెలియదు. గుట్టుచప్పుడు కాకుండా తనపని తాను చేసుకుంటూ రాజమౌళి వెళ్లిపోతున్నాడు. మహేశ్‌బాబు, ప్రియాంక చోప్రా మినహా ఇందులో నటించే వాళ్ల గురించి ఎలాంటి వివరాలు బయటకు రాకుండా జక్కన్న కేర్ తీసుకుంటున్నారు.రాజమౌళి సినిమాలకు రెగ్యులర్‌గా పనిచేసే టీమ్ చాలా తక్కువగా ఉంటుంది. అయితే, మ్యూజిక్ డైరెక్టర్ ఎమ్ఎమ్ కీరవాణి మాత్రం ఆయన సినిమాలకు తప్పకుండా ఉంటారు. కెమెరామెన్, ఫైట్ మాస్టర్స్, డైలాగ్ రైటర్ వంటి వారిని జక్కన్న మారుస్తూ ఉంటారు. ఇప్పుడు SSMB29 సినిమా డైలాగ్ రైటర్‌గా దర్శకుడు దేవా కట్టా పనిచేస్తున్నారు. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన డైలాగ్ పార్ట్ మొత్తం ఆయన పూర్తి చేశారట. పవర్ ఫుల్ డైలాగులను ఆయన అందించారట. ఆయన దర్శకుడిగా ఆటోనగర్ సూర్య , ప్రస్థానం, రిపబ్లిక్ వంటి చిత్రాలు తెరకెక్కించారు. ఆయనకు లిటరేచర్‌లో మంచి ప్రావీణ్యం ఉండటంతో జక్కన్న ఈ ఛాన్స్ ఇచ్చారని తెలుస్తోంది. బాహుబలి కోసం డైలాగ్ రైటర్స్‌గా విజయ్ కుమార్, అజయ్ కుమార్ అనే ఇద్దరు యువకులతో పాటు దేవా కట్టా కూడా ఓ చేయి అందించారు. అయితే, ఆ తర్వాతి చిత్రం ఆర్ఆర్ఆర్ కోసం బుర్రా సాయి మాధవ్‌ను తీసుకున్నారు. -
అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే డైరెక్టర్లు.. టాప్ 5లో ముగ్గురు మనోళ్లే!
సినిమా రెమ్యునరేషన్ల విషయానికి వస్తే ఎప్పుడూ నటీనటులదే చర్చకు వస్తుంది కానీ దర్శకులు, ఇతర సాంకేతిక నిపుణుల గురించి రాదు. కానీ ఇదంతా గతం... ఇప్పుడు రెమ్యునరేషన్స్ విషయంలో సినిమా దర్శకులు హీరోలతో ఢీ అంటే ఢీ అంటున్నారు. కొందరు దర్శకులైతే టాప్ హీరోలతో సమానంగా రెమ్యునరేషన్లు తీసుకుంటున్నారు. అందుకే ఇప్పుడు దర్శకుల పారితోషికాలు కూడా చర్చనీయాంశంగా మారాయి.నెం.1 ప్లేస్‌లో జక్కన్నప్రస్తుతం ఎన్నో రకాలుగా ఉత్తరాది సినీపరిశ్రమను వెనక్కి నెట్టేసిన దక్షిణాది.. డైరెక్టర్ల రెమ్యునరేషన్ల విషయంలోనూ తానే టాప్ అని నిరూపించుకుంటోంది. ప్రస్తుతం అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న దర్శకుడిగా టాలీవుడ్ మెగా డైరెక్టర్ రాజమౌళి (SS Rajamouli) నెం1 స్థానంలో ఉన్నాడు. బాహుబలి 1, 2లతో పాటు RRRల ద్వారా వందలు, వేల కోట్ల కలెక్షన్లతో చరిత్రను తిరగరాసిన ఈ డైరెక్టర్... దాదాపుగా రూ.200 కోట్ల పారితోషికం అందుకుంటున్నట్టు తెలుస్తోంది. దశాబ్ధానికిపైగా హిట్స్ ఇస్తున్న రాజమౌళి సంగతి అలా ఉంచితే... మిగిలిన టాప్ 5లో కొందరు ఒకటి, రెండు సినిమాలతోనే అగ్రస్థానానికి ఎగబాకడం గమనార్హం.రెండో ప్లేస్ కూడా మనదే..అలా చూస్తే 2వ స్థానంలో కూడా తెలుగుదర్శకుడైన సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) ఉండడం విశేషం. తెలుగు అర్జున్‌రెడ్డి తర్వాత ఒక్కసారిగా బాలీవుడ్‌కి ఎదిగిపోయిన సందీప్... అర్జున్ రెడ్డి హిందీ రీమేక్, ఆ తర్వాత యానిమల్ సినిమాలతో రూ.100 నుంచి రూ.150 కోట్లు డిమాండ్ చేసే స్థాయికి వెళ్లాడు. ఏకంగా నెం. 2 స్థానంలోకి ఎగిరి కూర్చున్నాడు. కేవలం మూడే సినిమాలతో ఆయన ఈ ఘనత సాధించడం చెప్పుకోదగ్గది. అదే రకంగా దేశం అంతా ఇప్పుడు మాట్లాడుకుంటున్న సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ ది సైతం అనూహ్యమైన విజయయాత్రే. 100% సక్సెస్ రేటుఈ తమిళ దర్శకుడు అట్లీ కుమార్ (Atlee Kumar) కేవలం ఆరు చిత్రాలతో 100 శాతం సక్సెస్ రేటుతో 3వ స్థానం దక్కించుకున్నాడు. తమిళ చిత్రాలైన మెర్సల్, బిగిల్‌లతో పాటు షారుఖ్ ఖాన్ నటించిన జవాన్ వంటి బ్లాక్ బస్టర్లతో అట్లీ భారతీయ సినిమాలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. గత 2023లో విడుదలైన జవాన్ ప్రపంచవ్యాప్తంగా రూ.1100 కోట్లకు పైగా వసూలు చేసి ప్రపంచ సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. కొంత విరామం అనంతరం ప్రస్తుతం తాత్కాలిక టైటిల్ ఎఎ22ఎక్స్ఎ6 పేరుతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో అనౌన్స్ చేసిన ప్రాజెక్ట్ అట్లీని అమాంతం 3వస్థానంలోకి చేర్చింది. 233% రెమ్యునరేషన్ పెంచిన డైరెక్టర్జవాన్ కోసం రూ. 30 కోట్లను మాత్రమే అందుకున్న ఈ దర్శకుడు ఇప్పుడు ఒకేసారి రూ. 100 కోట్లకు అంటే.. దాదాపుగా 233% తన పారితోషికం పెంచేశాడు. ఈ డీల్ భారతదేశంలో అత్యధిక పారితోషికం తీసుకునే డైరెక్టర్‌గా అట్లీని మూడవ స్థానంలో నిలిపింది. ఆ తర్వాత రూ.80 కోట్లతో 4వ స్థానంలో బాలీవుడ్ దర్శకుడు రాజ్‌కుమార్ హిరానీ, రూ.75 కోట్లతో 5వస్థానంలో సుకుమార్, రూ. 55–65 కోట్లతో సంజయ్ లీలా భన్సాలీలు ఉన్నారు.చదవండి: ఇంట్లో గొడవలు.. చనిపోదామనుకున్నా.. ఏడ్చేసిన గీతూ రాయల్ -
ఆస్కార్ అవార్డ్స్‌లో కొత్త విభాగం
‘‘సినిమాల్లో మేజిక్ చేసేవాటిలో స్టంట్స్ది కీలక భాగం. ఇప్పుడు ఆస్కార్స్‌లో కూడా భాగం అయ్యాయి. కొత్తగా స్టంట్ విభాగాన్ని చేర్చి, ఇక ప్రతి ఏడాదీ అవార్డు ఇవ్వనున్నాం. 2027లో విడుదలైన సినిమాలకు 2028లో జరిగే నూరవ ఆస్కార్ అవార్డ్స్ వేడుకలో ఈ విభాగంలో అవార్డు అందించనున్నాం’’ అని ఆస్కార్ అవార్డు కమిటీ సోషల్ మీడియా ద్వారా పేర్కొంది. ‘‘సినిమా తొలి నాళ్ల నుంచి స్టంట్ డిజైన్(Stunt Design) అనేది ఫిల్మ్ మేకింగ్‌లో అంతర్భాగంగా ఉంది. సాంకేతిక, సృజనాత్మకత కలిగిన కళాకారుల పనిని గౌరవించడం మాకు గర్వకారణం’’ అని అకాడమీ కమిటీ సీఈవో బిల్ క్రామెర్, అకాడమీ అధ్యక్షురాలు జానెట్ యాంగ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కాగా కొత్తగా చేర్చిన ఈ స్టంట్ విభాగాన్ని ప్రకటించి, ఓ పోస్టర్ని విడుదల చేశారు. ఈ పోస్టర్లో హాలీవుడ్ చిత్రాలు ‘ఎవ్రీథింగ్ ఎవ్రీ వేర్, ఆల్ ఎట్ వన్స్, మిషన్ ఇంపాజిబుల్’ పోస్టర్స్‌తో పాటు తెలుగు చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ పోస్టర్ కూడా ఉండటం భారతీయ సినిమాకి గర్వకారణం అనే చెప్పాలి. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా నటించిన ‘ఆర్ఆర్ఆర్’లోని ‘నాటు పాటు...’ పాటకు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అవార్డు దక్కిన విషయం తెలిసిందే. ఇక ఆస్కార్ అవార్డ్స్‌లో కొత్త విభాగం ‘స్టంట్ డిజైన్’ని చేర్చడం పట్ల రాజమౌళి ‘ఎక్స్’ వేదికగా ఈ విధంగా స్పందించారు. వందేళ్ల నిరీక్షణ ఫలించింది – రాజమౌళి ‘‘వందేళ్ల నిరీక్షణ ఫలించింది. 2027లో విడుదలయ్యే చిత్రాలకు కొత్తగా ఆస్కార్ స్టంట్ డిజైన్ విభాగం చేర్చడం ఆనందంగా ఉంది. ఈ విభాగంలో గుర్తింపును సాధ్యం చేసినందుకు డేవిడ్ లీన్, క్రిస్ ఓ’హారా మరియు స్టంట్ కమ్యూనిటీకి, స్టంట్ వర్క్ శక్తిని గౌరవించనున్నందుకు బిల్ క్రామెర్, జానెట్ యాంగ్‌లకు ధన్యవాదాలు. ఈ కొత్త విభాగం ప్రకటించిన సందర్భంగా విడుదల చేసిన పోస్టర్లో ‘ఆర్ఆర్ఆర్’ మూవీ యాక్షన్ విజువల్ మెరవడం చాలా సంతోషంగా ఉంది’’ అని రాజమౌళి ‘ఎక్స్’ వేదికగా పేర్కొన్నారు. కాగా ప్రస్తుతం మహేశ్‌బాబు హీరోగా అంతర్జాతీయ స్థాయిలో భారీ బడ్జెట్‌తో ఓ చిత్రం తెరకెక్కిస్తున్నారు రాజమౌళి. ఈ చిత్రం 2027 మార్చి 25న రిలీజ్ కానుందనే వార్త ప్రచారంలోకి వచ్చింది. ఈ విషయం పై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. దశాబ్దాల కల నెరవేరెగా... స్టంట్ విభాగంలో ఆస్కార్ అవార్డును ప్రదానం చేయాలనే విషయంపై దశాబ్దాలుగా కొందరు ఆస్కార్ అవార్డు నిర్వాహకులతో సమావేశమయ్యారు కానీ ప్రయోజనం లేకుండాపోయింది. అయితే స్టంట్ మేన్‌గా కెరీర్ ఆరంభించి, స్టంట్ కో–ఆర్డినేటర్‌గానూ చేసి, ఆ తర్వాత ‘జాన్ విక్ (ఓ దర్శకుడిగా), డెడ్ పూల్ 2, బుల్లెట్ ట్రైన్, ది ఫాల్ గై’ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన డేవిడ్ లీచ్ ఈ మధ్య కొందరితో కలిసి ‘స్టంట్ డిజైన్’ విభాగాన్ని చేర్చాలని కోరుతూ, గట్టిగా నినాదాలు చేశారు. దానికి తగ్గ ఫలితం దక్కింది.ఆ విధంగా స్టంట్ విభాగానికి ఆస్కార్ అవార్డ్స్‌లో గుర్తింపుని కోరిన కొందరి దశాబ్దాల కల నెరవేరినట్లు అయింది. ఇక గతంలో స్టంట్ విభాగంలో అవార్డు లేని సమయంలో 1967లో స్టంట్ డైరెక్టర్ యాకిమా కానట్ట్ గౌరవ ఆస్కార్ అవార్డు అందుకున్నారు. ఆ తర్వాత 2013లో స్టంట్ డైరెక్టర్ హాల్ నీధమ్కి కూడా ప్రత్యేక ఆస్కార్ ప్రదానం చేసి, గౌరవించింది ఆస్కార్ అవార్డు కమిటీ. ఇక 2028లో జరగనున్న నూరవ ఆస్కార్ అవార్డుతో ఆరంభించి, ప్రతి ఏటా ‘స్టంట్ డిజైన్’ విభాగంలో అవార్డుని ప్రదానం చేయనున్నారు. -
ఆస్కార్‌లో కొత్త విభాగం.. ఆర్ఆర్ఆర్ విజువల్‌తో అనౌన్స్మెంట్
సినీరంగంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే అకాడమీ అవార్డుల వేదిక (Academy Awards) కీలక నిర్ణయం తీసుకుంది. ఆస్కార్ (Oscar)లో కొత్తగా స్టంట్ డిజైన్ విభాగాన్ని చేర్చుతున్నట్లు ప్రకటించింది. 2028 నుంచి ఈ విభాగంలో ఆస్కార్ పురస్కారాలు ఇవ్వనున్నట్లు వెల్లడించింది. 2027లో విడుదలయ్యే సినిమాలు ఈ విభాగంలో పోటీపడవచ్చని తెలిపింది. ఈ మేరకు అకాడమీ గురువారం ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ పెట్టింది.100వ వేడుకలో..సినిమాలో స్టంట్స్ అనేవి కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఇప్పుడవి ఆస్కార్‌లోనూ భాగమయ్యాయి. స్టంట్ డిజైన్ విభాగంలో ఆస్కార్ పురస్కారాలు ఇవ్వనున్నాం. 2028లో జరగబోయే 100వ ఆస్కార్ వేడుకలో వీటిని ప్రదానం చేయనున్నాం అని ప్రకటించింది. ఈ మేరకు స్టంట్ డిజైన్ ఆస్కార్ అంటూ ఓ పోస్టర్ వదిలింది. ఈ పోస్టర్లో ఆర్ఆర్ఆర్ మూవీ (RRR Movie)లోని సీన్ ఫోటోను ఉపయోగించారు.పోస్టర్లో ఆర్ఆర్ఆర్ విజువల్స్ఇది చూసిన రాజమౌళి సంతోషం వ్యక్తం చేశాడు. వందేళ్ల నిరీక్షణకు ముగింపు.. 2027లో రిలీజయ్యే చిత్రాలకు స్టంట్ డిజైన్ కేటగిరీలో ఆస్కార్ ఇస్తారని ప్రకటించినందుకు సంతోషంగా ఉంది. ఈ నిర్ణయానికి కారకులైన డేవిడ్ లెయిచ్, క్రిస్ ఓ హర, అకాడమీ సీఈవో బిల్ క్రామర్, అధ్యక్షుడు జానెట్ యాంగ్, అలాగే స్టంట్ నిపుణులకు ప్రత్యేక కృతజ్ఞతలు. స్టంట్ డిజైన్ ఆస్కార్ అంటూ మీరు రిలీజ్ చేసిన పోస్టర్లో ఆర్ఆర్ఆర్ విజువల్ చూసి థ్రిల్లయ్యాను అని ట్వీట్ చేశాడు. At last!!After a 100 year wait !!! Ecstatic for the new Oscars stunt design category for the films releasing in 2027! Huge thanks to David Leitch, Chris O’Hara, and the stunt community for making this historic recognition possible, and to @TheAcademy, CEO Bill Kramer, and… https://t.co/QWrUjuYU2I— rajamouli ss (@ssrajamouli) April 11, 2025 చదవండి: సంపూను రోడ్డు మీదకు వదిలేశాడా? సాయి రాజేశ్ ఆన్సరిదే! -
1000 కోట్ల బడ్జెట్ తో మహేష్, రాజమౌళి సినిమా
-
మళ్లీ విదేశాలకు మహేష్ బాబు.. జక్కన్న పర్మిషన్ ఏలా ఇచ్చాడో ?
-
జైలు నుంచి విడుదల, మహేశ్ చేతికి చిక్కిన పాస్‌పోర్ట్.. వీడియో వైరల్
రాజమౌళి (SS Rajamouli)తో సినిమా అంటే ఆషామాషీ కాదు. ప్రతి ఒక్కరిలోని టాలెంట్‌ను పూర్తిగా బయటకు తీస్తాడు. అలాగే ఒక్కో సినిమా ఏళ్ల తరబడి చేస్తుంటాడు. 2022లో ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ హిట్ తన ఖాతాలో వేసుకున్న ఈయన ఈ ఏడాది ఆరంభంలో మహేశ్‌బాబు (Mahesh Babu)తో సినిమా మొదలుపెట్టాడు. జనవరిలో SSMB29 సినిమాను ఘనంగా లాంచ్ చేశారు. అంతేకాదు.. ఒక సింహాన్ని లాక్ చేసి తన పాస్‌పోర్ట్ తీసుకున్నట్లుగా ఓ వీడియో రిలీజ్ చేశారు. మహేశ్‌ను లాక్ చేసిన జక్కన్నఅంటే తను తెరకెక్కించబోయే యాక్షన్ అడ్వెంచర్ సినిమాకు కోసం మహేశ్‌ను లాక్ చేస్తున్నట్లు చెప్పకనే చెప్పారు. దీనిపై ఎన్ని మీమ్స్ వచ్చాయో లెక్కే లేదు. ఇటీవలే ఒడిశాలో SSMB29 ఫస్ట్ షెడ్యూల్ పూర్తయింది. ప్రస్తుతం బ్రేక్ దొరకడంతో మహేశ్ తన కూతురు సితారతో కలిసి హాలీడే ట్రిప్‌కు వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ మేరకు వీరిద్దరూ హైదరాబాద్ విమానాశ్రయంలో ఉన్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఈ వీడియోలో మహేశ్.. జక్కన్న చేతికి చిక్కిన పాస్‌పోర్ట్ తిరిగి తనదగ్గరకు వచ్చేసిందంటూ నవ్వుతూ పాస్‌పోర్ట్ చూపించాడు.కామెడీ టైమింగ్ఇది చూసిన అభిమానులు.. బాబు తన పాస్‌పోర్ట్ చూపించడం హైలైట్, మహేశ్ కామెడీ టైమింగ్ గురించి తెలిసిందేగా.., బిడ్డకు విడుదల అంటూ కామెంట్లు చేస్తున్నారు. SSMB 29 విషయానికి వస్తే.. మహేశ్‌బాబు సరసన ప్రియాంక చోప్రా కథానాయికగా నటిస్తోంది. పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఈ సినిమాను 2027లో రిలీజ్ చేస్తారని ప్రచారం జరుగుతోంది. View this post on Instagram A post shared by Kamlesh Nand (work) (@artistrybuzz_) చదవండి: పిల్లల్ని కంటాం కానీ వారి తలరాత మనం రాయలేం.. మోహన్‌బాబు -
‘SSMB 29’లో నాన్న లుక్ అదిరిపోతుంది: సితార
సూపర్‌స్టార్ మహేశ్‌బాబు(Mahesh babu) గారాల పట్టి సితార (Sitara) కు సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్ గురించి అందరికి తెలిసిందే. సినిమాల్లోకి రాకపోయినా ఓ స్టార్ హీరోయిన్‌కి ఉన్నంత క్రేజ్ ఉంది. ఆమె ఇన్‌స్టాలో ఒక్క పోస్ట్ పెడితే చాలు నిమిషాల్లో వైరల్ అయిపోతుంది. అతి చిన్న వయసులోనే అత్యధిక ఫాలోవర్స్‌ని సంపాదించుకుంది. అయితే ఈ చిన్నారి త్వరలోనే వెండితెరపైకి రావడం ఖాయం. మహేశ్ కూడా పలు సందర్భాల్లో ఇదే విషయాన్ని చెప్పాడు. చదువు పూర్తయిన తర్వాత సినిమాల్లోకి వచ్చే చాన్స్ ఉంది. ఇదిలా ఉంటే.. హీరోయిన్గా మారకముందే పలు సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తూ.. తండ్రిని మించిన తనయ అనిపించుకుంటుంది. తాజాగా సీతూ పాప హైదరాబాద్‌లోని పంజాగుట్టలో పీఎంజే 40వ స్టోర్ ఓపెనింగ్‌కి వెళ్లింది. దీంతో మహేష్ అభిమానులు పెద్ద ఎత్తున అక్కడకు తరలివెళ్లారు. షాపు ఒపెనింగ్ అనంతరం సితార మీడియాతో మాట్లాడుతూ మహేశ్ బాబు, రాజమౌళి సినిమా(SSMB 29) గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది. ‘ఎస్ఎస్ఎంబీ29’ నాన్న లుక్ అదిరిపోతుంది. మీరు ఊహించుకుంటున్నదానికంటే ఎక్కుకే ఈ సినిమా ఉంటుంది. ఇంతకంటే ఈ సినిమా గురించి ఎక్కువగా చెప్పలేను’ అని చెప్పింది. అలాగే తాను బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న పీఎంజే కోసం మరోసారి మహేశ్‌తో కలిసి యాడ్ చేయబోతున్నట్లు సితార వెల్లడించింది. సినిమాల్లోకి రాకముందే సితార ఇలా బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించడం, షాపు ఓపెనింగ్స్ కి వెళ్లడం పట్ల ఘట్టమనేని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. -
రాజమౌళి - మహేష్ బాటలో బడా హీరో కొత్త సినిమా
-
రాజమౌళి ఒక్కరే.. ఆయన స్థానం ఎవరూ పొందలేరు: బాలీవుడ్ నటుడు
నేను అడుగుపెడితే విజయమే తప్ప పరాజయం ఉండదు అని నిరూపిస్తున్నాడు దర్శకధీరుడు రాజమౌళి (SS Rajamouli). ఆయన చేసిన ప్రతి సినిమా బ్లాక్‌బస్టరే! అలాంటి దర్శకుడిని కాపీ కొట్టాలని చూస్తున్నారని.. కానీ ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా ఆయన స్థాయిని అందుకోలేరంటున్నాడు బాలీవుడ్ దర్శకనటుడు అనురాగ్ కశ్యప్ (Anurag Kashyap).రాజమౌళి ఒరిజినల్తాజాగా అనురాగ్ కశ్యప్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. పాన్ ఇండియా హిట్లు తీయగానే రాజమౌళిపి కాపీ కొట్టినవాళ్లు చాలామంది ఉన్నారు. కానీ, వారెప్పటికీ ఆయనలా మారలేరు. ఎందుకంటే రాజమౌళి ఒక్కరే.. ఆయన ఒరిజినల్! ఎన్నటికీ ఆ చీప్ కాపీలు రాజమౌళి కాలేవు. అలాగే కేజీఎఫ్ సినిమా హిట్టవగానే చాలామంది అదే తరహా చిత్రాలు తీశారు. ఏవీ వర్కవుట్ కాలేదు.కాపీ కొట్టడం మానేసి..అయినా పాన్ ఇండియా ట్రెండ్ ఇప్పటిది కాదు. చిరంజీవి (Chiranjeevi) 'ప్రతిబంధ్', నాగార్జున 'శివ', రజనీకాంత్ 'ఫౌలది ముక్క' (పాయం పులి).. ఇవన్నీ పాన్ ఇండియా చిత్రాలే.. నా చిన్నతనంలోనే ఈ పాన్ ఇండియా సినిమాలు చూశాను. నేనేమంటానంటే ఎవరికి వారే ప్రత్యేకం. అవతలివారిని కాపీ కొట్టడానికి బదులు తమలోని నైపుణ్యాన్ని బయటకు తీయాలి అని అనురాగ్ చెప్పుకొచ్చాడు.ఆ సినిమాలెప్పుడు వచ్చాయంటే?చిరంజీవి 'ప్రతిబంధ్' సినిమా 1990లో వచ్చింది. రవిరాజా పినిశెట్టి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో జూహీ చావ్లా కథానాయిక. రజనీకాంత్ హీరోగా నటించిన 'పాయం పులి' సినిమాకు హిందీ డబ్బింగ్ వర్షనే 'ఫౌలది ముక్క'. ఎస్పీ ముత్తుమారన్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం 1983లో రిలీజైంది. నాగార్జున హీరోగా నటించిన 'శివ' 1989లో విడుదలై సెన్సేషన్ సృష్టించింది. దీనికి రామ్ గోపాల్‌వర్మ దర్శకుడిగా వ్యవహరించాడు.చదవండి: ఇక ఆపండి.. మీ తల్లి, చెల్లి, భార్య వీడియోలు చూడండి: నటి ఫైర్ -
వాటాలు పంచుకుందాం..టాలీవుడ్ దర్శకులు ఓకే అంటారా?
ఒకప్పుడు రెమ్యునరేషన్ల విషయానికి వస్తే.. కేవలం హీరోలకు ఇచ్చే భారీ పారితోషికాలే చర్చకు వచ్చేవి. ఇప్పటికీ రెమ్యునరేషన్స్ తీసుకునే విషయంలో హీరోలదే పై చేయి ఉన్నప్పటికీ... హీరోయిన్లు, దర్శకులు కూడా వారితో పోటీ పడే స్థాయికి చేరుకుంటున్నారు. ఈ నేపధ్యంలో ఒకవేళ సినిమాలు ఫ్లాప్ అయితే నిర్మాత, పంపిణీదారులు మాత్రమే నష్టపోతుండగా, భారీ పారితోషికాలు అందుకుంటున్న హీరోలు, దర్శకులు మాత్రం సేఫ్‌గానే ఉంటున్నారు. ఈ నేపధ్యంలో హీరోలు, దర్శకులు కూడా రెమ్యునరేషన్( Remuneration) కు బదులు లాభాల్లో వాటాలు పొందాలనే చర్చ మొదలైంది.తాజాగా గేమ్ ఛేంజర్ ద్వారా భారీ నష్టాల్ని చవిచూసి, సంక్రాంతికి వస్తున్నాం ద్వారా కొంత ఉపశమనం పొందిన ప్రముఖ నిర్మాత దిల్ రాజు హైదరాబాద్‌లో జరిగిన ప్రెస్ మీట్లో ఈ ఆసక్తికర చర్చకు తెర లేపారు. మలయాళ చిత్రం ఎల్2: ఎంపురాన్ (L2: Empuraan)ను తెలుగు రాష్ట్రాలకు తీసుకువస్తున్న దిల్ రాజు(Dil Raju) ఆ ప్రెస్ మీట్లో మాట్లాడుతూ... మోహన్‌లాల్ పృథ్వీరాజ్ సుకుమారన్ ల సెన్సేషనల్ చిత్రం ఎల్2: ఎంపురాన్ కోసం తమ రెమ్యునరేషన్‌ను మాఫీ చేశారని, బదులుగా లాభాన్ని పంచుకునే మోడల్‌ను ఎంచుకున్నారని ఆయన వెల్లడించారు.అలాంటి మోడల్ టాలీవుడ్లో కూడా పనిచేయగలదా అని అడిగిన ప్రశ్నకు, దిల్ రాజు స్పందిస్తూ, ‘‘రాజమౌళి తన చిత్రాలకు ముందస్తుగా పారితోషికం వసూలు చేయరనీ, తన సినిమాలకు లాభాలను పంచుకునే పద్ధతిని అనుసరిస్తాడనీ వెల్లడించారు. అదే విధంగా కెజిఎఫ్, సలార్ల చిత్ర దర్శకుడు ప్రశాంత్ నీల్ కూడా ఇప్పుడు అదే పంధాలో పని చేస్తున్నాడు. ఈ మోడల్ త్వరలో తెలుగు సినిమాలో మరింత పుంజుకుంటుందని, సాధారణమైన విషయంగా మారుతుంది’’ అంటూ ఆయన నమ్మకం వ్యక్తం చేశారు. తాను మొదట గేమ్ ఛేంజర్ సినిమా సందర్భంగా దీన్ని అమలు చేయాలనే ప్రయత్నం చేశానని, అయితే, సినిమా షూటింగ్ ఆలస్యం కావడంతో, శంకర్, రామ్ చరణ్ లు తమ రెమ్యునరేషన్ తీసుకోవాలని నిర్ణయించుకున్నారనీ వివరించారు.అయితే, ఈ విధానం టాలీవుడ్లో ఓ సంప్రదాయంగా మారడంపై పలువురు నిర్మాతలు, సినీ ప్రముఖులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ‘‘మన పెద్ద స్టార్లు, దర్శకులు భారీ చెల్లింపులు అడ్వాన్స్‌లకు అలవాటు పడ్డారు, లాభాల భాగస్వామ్య వ్యవస్థను అమలు చేయడం సినిమా లావాదేవీలను కష్టతరం చేస్తుంది. సూపర్స్టార్లు సినిమాకు75–125 కోట్లు వసూలు చేయడం దర్శకులు రూ.25–50 కోట్లు వసూలు చేయడం వల్ల లాభాలను పంచుకోవడం పనికిరావచ్చు, అయితే నష్టాలు వచ్చినట్లయితే డబ్బును పూర్తిగా వదులుకోవాలనే ఆలోచనను అంగీకరించడం అసంభవం’ అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. రాజమౌళి నమూనా ఆయన వరకూ విజయవంతం అయినప్పటికీ, టాలీవుడ్ అగ్రశ్రేణి దర్శకులు, హీరోలు స్థిరమైన చెల్లింపులను కాదనుకుని విజయంలో భాగస్వామ్య వాటాలకు మారడాన్ని స్వీకరిస్తారా? అనేది సందేహాస్పదమే. -
మన ఆస్కార్ అవార్డ్స్‌ను లాక్కున్నారు.. దీపికా పదుకొణె సంచలన వ్యాఖ్యలు
బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొణె(Deepika Padukone) అస్కార్ అవార్డ్స్-2025 గురించి మాట్లాడారా. ఈ ఏడాదిలో భారత్‌కు అవార్డ్స్ రాకపోవడంతో ఆమె విచారం వ్యక్తం చేశారు. పారిస్‌లో జరుగుతున్న లగ్జరీ ఫ్యాషన్ కంపెనీ లూయిస్ విట్టన్ (Louis Vuitton) షోలో ఆమె పాల్గొంటుండగా ఈ వ్యాఖ్యలు చేశారు. అందుకు సంబంధించిన ఒక వీడియోను తన సోషల్‌మీడియాలో పోస్ట్ చేశారు.ఆస్కార్ అవార్డులు గెలుపొందే అన్ని అర్హతలు ఉన్న అనేక భారతీయ చిత్రాలు ఉన్నాయని దీపికా పదుకొణె చెప్పారు. భారతీయ అభిమానుల హృదయాలను గెలుచుకున్న 'ఆల్ వుయ్ ఇమాజిన్ యాజ్ లైట్, మిస్సింగ్ లేడీస్' చిత్రాలు ప్రపంచవ్యాప్తంగా అనేక వేదికల మీద ప్రశంసలు అందుకున్నాయి. అయినప్పటికీ ఈ రెండు చిత్రాలు ఆస్కార్- 2025 తుది జాబితాలో చోటు దక్కలేదు. ఇలా చాలాసార్లు మనకు రావాల్సిన ఆస్కార్లను లాగేసుకుంటూనే ఉన్నారు. భారతదేశ సినీ చరిత్రలో ఎన్నో గొప్ప కథలు తెరకెక్కాయి. కానీ, ఆ సినిమాలకు, ఆ కథలకు, నటీనటుల ప్రతిభకు గుర్తింపు ఇవ్వడం లేదు. కారణం ఏంటో తెలియదు. కానీ, ఆస్కార్ మాత్రం మన సినిమాలను తిరస్కరిస్తుంది. అయితే, ఈ సంవత్సరం ఆస్కార్ అవార్డులలో ది బ్రూటలిస్ట్ చిత్రానికి గాను నటుడు అడ్రియన్ బ్రాడీకి ఉత్తమ నటుడిగా ఆస్కార్ అవార్డు రావడం నాకు సంతోషాన్ని ఇచ్చింది.RRR అవార్డ్.. ఎంతో భావోద్వేగం చెందాను:దీపికాభారత్ నుంచి ఎన్నో విలువైన చిత్రాలు వచ్చినప్పటికీ అస్కార్ అవార్డ్ దక్కకపోవడం చాలా బాధాకరం అని చెప్పిన దీపికా పదుకొణె.. ఆర్ఆర్ఆర్ గురించి కూడా మాట్లాడారు. '2023 ఆస్కార్ అవార్డ్స్ నేను వ్యాఖ్యతగా ఉన్నాను. కానీ, ఆర్ఆర్ఆర్ చిత్రానికి ఆస్కార్ ప్రకటించిన సమయంలో నేను ప్రేక్షకుల్లో కూర్చొని ఉన్నాను. అప్పుడు చాలా భావోద్వేగానికి గురయ్యాను. అవి నాకు ఎంతగానో ప్రత్యేకమైన క్షణాలు. ఆ సినిమాలో నేను భాగం కాకపోయినప్పటికీ ఒక భారతీయురాలిగా ఆ విజయం నా సొంతం అనిపించింది. ఆ గొప్ప క్షణాలు ఎప్పటికీ మరిచిపోలేను.'అని చెప్పారు. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ చిత్రంలో రామ్‌చరణ్,ఎన్టీఆర్ నటించారు. ఇందులో నాటు నాటు సాంగ్ ఉత్తమ ఒరిజినల్ సాంగ్‌గా ఆస్కార్‌ను దక్కించుకున్న విషయం తెలిసిందే. View this post on Instagram A post shared by दीपिका पादुकोण (@deepikapadukone)


