దర్శకధీరుడు రాజమౌళి హైదరాబాద్‌లోని ప్రసాద్ ఐమ్యాక్స్‌లో సందడి చేశారు. బాహుబలి ది ఎపిక్ ప్రీమియర్ షో సందర్భంగా ఆడియన్స్‌ను ఉద్దేశించి మాట్లాడారు. బాహుబలి రిలీజై పదేళ్లయినా ఏ మాత్రం క్రేజ్ తగ్గలేదన్నారు. ఇదంతా మీవల్లే సాధ్యమైందని కామెంట్స్ చేశారు. మహిస్మతి రాజ్యంలోని ప్రజలంతా బాగున్నారా? అంటూ అభిమానులను పలకరించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
మీ అందరి ప్రేమ వల్లే మరోసారి మీ ముందుకు తీసుకొస్తున్నామని రాజమౌళి అన్నారు. పదేళ్లుగా మీరు ఆదరించినందుకు ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. జై మహిస్మతి అంటూ అభిమానుల్లో ఉత్సాహం నింపారు. కాగా.. బాహుబలి రెండు పార్టులను కలిపి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. బాహుబలి ది ఎపిక్(Baahubali: The Epic) పేరుతో విడుదల చేస్తున్నారు. ఈ మూవీ అక్టోబర్ 31న థియేటర్లలో సందడి చేయనుంది.
THE DIRECTOR addressing the audience at @PrasadsCinemas PCX screen!!
It’s SHOW TIME.. #BaahubaliTheEpic #Baahubali pic.twitter.com/1dY6hj7cYE— Baahubali (@BaahubaliMovie) October 30, 2025


