రాజమౌళి డాక్యుమెంటరీ.. ఆర్ఆర్ఆర్ డిలీటెడ్ సీన్‌ చూశారా? | Ram Charan Fans Thrilled To See Unseen Footage From RRR In Modern Masters, Watch Video Goes Viral | Sakshi
Sakshi News home page

RRR Unseen Clip In Modern Masters: రాజమౌళి 'మోడ్రన్ మాస్టర్స్'.. ఆర్ఆర్ఆర్ డిలీటెడ్ సీన్‌ చూశారా?

Published Sat, Aug 3 2024 7:58 PM | Last Updated on Sun, Aug 4 2024 10:49 AM

Ram Charan fans thrilled to see unseen footage from RRR in Modern Masters

దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన బ్లాక్‌బస్టర్‌ మూవీ ఆర్ఆర్ఆర్. ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్‌  హీరోలుగా నటించారు. ఈ చిత్రంలోని నాటు నాటు సాంగ్‌కు ఆస్కార్ అవార్డ్  సైతం దక్కింది. అయితే తాజాగా రాజమౌళిపై  మోడరన్ మాస్టర్స్‌ పేరుతో నెట్‌ఫ్లిక్స్‌ డాక్యుమెంటరీ రూపొందించింది. ఇందులో మొదటి నుంచి సినీ ఇండస్ట్రీలో ఆయన ప్రయాణాన్ని ఆవిష్కరించారు. 
 
అయితే ఈ నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీలో ఆర్ఆర్ఆర్‌ సినిమాకు సంబంధించిన ఓ సీన్‌ తెగ వైరలవుతోంది. ఇందులో రామ్ చరణ్‌ ఎడ్లబండిపై నిలబడి ఉన్న సన్నివేశం చూసిన ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. అయితే ఈ సీన్‌ ఆర్ఆర్ఆర్‌ సినిమాలో లేదు.. షూటింగ్‌కు సంబంధించిన ఈ క్లిప్‌ను మోడరన్ మాస్టర్స్ డాకుమెంటరీలో చూపించారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

కాగా.. రాజమౌళి త్వరలోనే మహేష్ బాబుతో మూవీ చేయనున్నారు. ఇప్పటికే కథ సిద్ధం కాగా.. ఇంకా టైటిల్ ప్రకటించలేదు. ఈ మూవీని యాక్షన్-అడ్వెంచర్ చిత్రంగా తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు రామ్ చరణ్ గేమ్ ఛేంజర్‌ సినిమాతో బిజీగా ఉన్నారు. శంకర్ దర్శకత్వంలో వస్తోన్న ఈ చిత్రం డిసెంబర్‌లో రిలీజ్ కానుంది. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement