
మణిరత్నం చిత్రంలో ధన్సిక
నటి ధన్సికకు కాలం కలిసొచ్చిందని చెప్పవచ్చు. ఇప్పటి వరకూ చిన్న చిన్న చిత్రాలలో వర్ధమాన నటులతో నటిస్తూ వస్తున్న ధన్సిక ఇప్పుడు ఒక్క సారిగా భూమ్‌లోకి వచ్చారు. కారణం సూపర్‌స్టార్ రజనీకాంత్ నటిస్తున్న తాజా చిత్రం కబాలీలో ఆయనకు కూతురుగా నటించే అదృష్టం నటి ధన్సికను వరించింది. ఇదే అనూహ్య అవకాశం అనుకుంటే తాజాగా ప్రఖ్యాత దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో నటించే అరుదైన అవకాశాన్ని ధన్సిక దక్కించుకున్నారని సమాచారం.
మణిరత్నం చిత్ర ప్రచారం మరోసారి తెరపైకొచ్చింది. ఓ కాదల్ కణ్మణి చిత్రం తరువాత మణిరత్నం టాలీవుడ్ ప్రముఖ నటులు నాగార్జున, మహేశ్‌బాబులతో ఒక మల్టీస్టారర్ చిత్రం చేయడానికి కథ సిద్ధం చేసుకున్నారు. అయితే అంతా సిద్ధం అనుకున్న తరువాత పారితోషికం విషయంలో తేడా రావడంతో ఆ టాలీవుడ్ స్టార్స్ నటించడానికి నిరాకరించినట్లు కోలీవుడ్ వర్గాల ప్రచారం. ఆ తరువాత అదే కథతో మణిరత్నం కార్తీ, దుల్కర్‌సల్మాన్, నిత్యామీనన్, కీర్తీసురేశ్‌లతో చిత్రం చేయ సంకల్పించారు.
అయితే ఆ ప్రయత్నానికి దుల్కర్‌సల్మాన్, కీర్తీసురేశ్‌ల రూపంలో గండిపడింది. దీంతో ఈ చిత్ర నిర్మాణమే డ్రాప్ అయ్యిందనే ప్రచారం జరిగింది. అలాంటిది ఇప్పుడు ఆ కథను మణిరత్నం హ్యాండిల్ చేయనున్నట్లు ఇందులో కార్తీ, నాని, నిత్యామీనన్‌లతో కొత్తగా నటి ధ న్సిక వచ్చి చేరినట్లు సమాచారం.
ఈ విషయాన్ని నటి ధన్సిక కబాలీ చిత్రం షూటింగ్‌లో తన సన్నిహితులకు చెప్పి సంతోషపడిపోతున్నారట. రజనీకాంత్ కబాలీ చిత్రంలో నటించడం వల్లే తనకు మణిరత్నం చిత్రంలో నటించే అవకాశం వచ్చిందని సంబరపడిపోతున్నారట ధన్సిక.