kabali
-
డ్రగ్స్ కేసులో ఇద్దరు స్టార్ హీరోయిన్లు, డైరెక్టర్?
టాలీవుడ్లో మరోసారి డ్రగ్స్ కలకలం దుమారం రేపుతోంది. తాజాగా ప్రముఖ టాలీవుడ్ నిర్మాత డ్రగ్స్ కేసులో అరెస్ట్ కావడం హాట్ టాపిక్‌గా మారింది. కబాలి నిర్మాత కేపీ చౌదరిని సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసి అతని నుంచి కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. అతని వద్ద ఉన్న నాలుగు సెల్ఫోన్లతో పాటు ల్యాప్‌టాప్‌ను తీసుకున్నారు. విలాసవంతమైన జీవితానికి అలవాటుపడి డ్రగ్స్ దందాలోకి దిగిన కేపీ చౌదరితో పలువురు టాలీవుడ్ ప్రముఖులు టచ్‌లో ఉన్నారని పోలీసులు గుర్తించారు. ఇప్పటికే అరెస్ట్ అయిన రోషన్‌ను కూడా పోలీసులు విచారిస్తున్నారు. (ఇదీ చదండి: సినిమా రంగంలోనే డ్రగ్స్ ఎందుకు?) తాజాగా కేపీ చౌదరి ఏర్పాటు చేసిన పార్టీలకు హాజరైన సినీ ప్రముఖుల లిస్ట్‌ను పోలీసులు రెడీ చేస్తున్నారు. అతని నుంచి ఒక్కొక్కటిగా డ్రగ్స్ లింక్‌లు బయటపడుతున్నాయి. అతను ఎవరెవరితో వాట్సప్‌లలో చాటింగ్ చేశారో విశ్లేషిస్తున్నారు. డ్రగ్ మాఫియా ఖేల్ ఖతం అనుకుంటే.. గోవా టూ హైదరాబాద్ రూట్లో ఈ రాకెట్ మళ్లీ గుప్పుమంది. మరోవైపు డ్రగ్స్ కింగ్ పిన్ గాబ్రియేల్ కోసం గాలిస్తున్నారు. టాలీవుడ్ నుంచి కేపీ చౌదరిని అదుపులోకి తీసుకోవడం ఇదే మొదటిసారి కాదు.. గతంలో హీరోయిన్ ఛార్మీ, రానా, పూరి,రవితేజ,నవదీప్,ముమైత్ ఖాన్,నందు,తరుణ్‌ను డ్రగ్స్ లింక్‌ల గురించి పోలీసులు ప్రశ్నించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ డ్రగ్స్ లింక్‌లో ఇద్దరు ప్రముఖ హీరోయిన్లతో పాటు, నలుగురు మహిళా ఆర్టిస్ట్‌లు ఉన్నారని పోలీసులు గుర్తించినట్లు సమాచారం. ఈ డ్రగ్ మాఫియా వెనుక ఒక ప్రముఖ డైరెక్టర్ కూడా ఉన్నారని తెలుస్తోంది. కేపీ చౌదరి ఫోన్‌ను పూర్తిగా పరిశీలించి.. ఈ డ్రగ్స్ లింక్‌లో ఎవరెవరు ఉన్నారో? వారి పేర్లు బయటపెడుతామని పోలీసులు తెలుపుతున్నారు. (ఇదీ చదండి: తమన్నాతో లవ్.. ఆ సమయం కోసం వెయిట్ చేశా: విజయ్ వర్మ) -
టాలీవుడ్ ప్రముఖ నిర్మాత అరెస్ట్.. భారీస్థాయిలో డ్రగ్స్ స్వాధీనం!
హైదరాబాద్‌లో డ్రగ్స్ ముఠా కలకలం రేపింది. కబాలి చిత్ర నిర్మాత సుంకర కృష్ణ ప్రసాద్ చౌదరి(కేపీ చౌదరి)ని కిస్మత్ పుర్లో పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన వద్ద నుంచి 82 గ్రాముల కొకైన్,, రూ.2,05,000 నగదు, నాలుగు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. 2016లో సినిమా రంగంలోకి వచ్చిన కేపీ చౌదరి కబాలి చిత్రాన్ని నిర్మించారు. తెలుగు, తమిళ చిత్రాలను డిస్ట్రిబ్యూషన్ చేశారు. సర్ధార్ గబ్బర్ సింగ్, అర్జున్ సురవరం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు వంటి సినిమాలను డిస్ట్రిబ్యూషన్ చేశారు. (ఇది చదవండి: ఎంగేజ్మెంట్ తర్వాత తొలిసారి ఫోటో షేర్ చేసిన లావణ్య త్రిపాఠి!) సినీరంగంలో నష్టాలు రావడంతో డ్రగ్స్ సరఫరాను ఎంచుకున్నారు. గోవాలో ఓహచ్ఎం పబ్‌ను ప్రారంభించిన కేపీ చౌదరీ సెలబ్రిటీలకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు. పబ్బులో నష్టాలు రావడంతో హైదరాబాద్ తిరిగొచ్చారు. నిర్మాత సుంకర కృష్ణ ప్రసాద్ చౌదరి స్వస్థలం ఖమ్మం జిల్లా బొనకల్ మండలంగా పోలీసులు తెలిపారు. ఆయన గతంలో పూణె ఏరోనాటికల్‌లో డైరెక్టర్ ఆపరేషన్స్‌గా పనిచేశారు. సినీ ప్రముఖలతో సుంకర కృష్ణ ప్రసాద్ చౌదరికి సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది. గోవాలో నైజీరియన్లతో ఉన్న పరిచయాలతో డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు. ఇవాళ పక్కా సమాచారంతో దాడులు చేసిన పోలీసులు కిస్మత్ పుర్లో కొకైన్ విక్రయిస్తుండగా మాదాపూర్ ఎస్వోటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా.. అయితే గతంలోనూ టాలీవుడ్ డ్రగ్స్ కేసు సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. -
షూటింగ్లో ప్రమాదం.. హీరోయిన్‌కు గాయాలు
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన కబాలి సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించిన నటి ధన్సిక. తొలి సినిమాతోనే టాలీవుడ్లో సైతం అభిమానులను సంపాదించుకున్న ఈ బ్యూటి తెలుగులో వాలు జడ సినిమాతో పాటు తమిళ్లో యోగి డా అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ సందర్భంగా జరిగిన ప్రమాదంలో ధన్సికకు గాయాలయ్యాయి. బార్లో యాక్షన్ సీన్ చిత్రీకరిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కొంత మంది రౌడీలు ధన్సిక పైకి బీర్ బాటిళ్లను విసిరే సన్నివేశం షూట్ చేస్తుండగా పగిలిన గాజు ముక్క ఒకటి ధన్సిక కంటి కింది భాగంలో గుచ్చుకుంది. వెంటనే స్పందించిన యూనిట్ సభ్యులు ఆమె దగ్గరలోని హాస్పిటల్‌కు తరలించారు. ధన్సిక ట్రీట్మెంట్ పూర్తి అయిన వెంటనే గాయంతోనే తిరిగి షూటింగ్లో పాల్గొన్నారు. -
కబాలి కూతురి కర్రసాము
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన కబాలి సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించిన నటి ధన్సిక. తొలి సినిమాతోనే టాలీవుడ్లో సైతం అభిమానులను సంపాదించుకున్న ఈ బ్యూటి ప్రస్తుతం వాలుజడ అనే స్ట్రయిట్ తెలుగు సినిమాలో నటిస్తున్నారు. తాజాగా ఈ భామకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కబాలి సినిమాలో యాక్షన్ సీన్స్‌లో కనిపించిన ధన్సిక తాజాగా కర్రసాము చేస్తూ అలరించారు. ఈ వీడియోను ధన్సిక పర్సనల్ పీఆర్వో ప్రియా అభిమానుల కోసం సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం మూడు సినిమాలతో బిజీగా ఉన్న ధన్సిక.. తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళ సినిమాల్లోనూ నటిస్తున్నారు. -
‘కబాలి’ నిర్మాతతో ‘ఆర్ఎక్స్ 100’ హీరో..!
ఇటీవల సంచలన విజయం సాధించిన చిన్న సినిమా ఆర్ఎక్స్ 100. రామ్ గోపాల్ వర్మ శిష్యుడు అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో కార్తికేయ, పాయల్ రాజ్‌పుత్‌లు హీరోహీరోయిన్లుగా నటించారు. బోల్డ్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ సినిమా యూత్‌ను ఆకట్టుకోవటంతో వసూళ్ల పంట పండింది. అంతేకాదు ఈ సినిమా దర్శకుడు అజయ్ భూపతితో పాటు హీరోగా నటించిన కార్తికేయకు పెద్ద బ్యానర్ల నుంచి ఆఫర్లు అందుతున్నాయి. తాజాగా హీరో కార్తికేయ ఓ తమిళ నిర్మాణ సంస్థ నిర్మించబోయే సినిమాకు ఓకె చెప్పినట్టుగా తెలుస్తోంది. కోలీవుడ్‌లో కబాలి లాంటి భారీ బడ్జెట్ చిత్రాలను అందించిన కలైపులి ఎస్ థాను నిర్మించబోయే సినిమాలో కార్తికేయ హీరోగా నటించనున్నాడట. ఈ సినిమాకు ఎన్ కృష్ణ దర్శకత్వం వహించనున్నారన్న ప్రచారం జరుగుతోంది. అయితే ఈ సినిమా తమిళ్లోనే తెరకెక్కిస్తారా.. లేక బైలింగ్యువల్‌గా తెరకెక్కిస్తారా అన్న విషయం తెలియాల్సి ఉంది. -
అయ్యో పాపం
ఇక్కడి ఫొటోలో ఉన్నది ఎవరో తెలుసుగా! అదేనండీ.. రజనీకాంత్ హీరోగా నటించిన ‘కబాలి’ సినిమాలో యోగి క్యారెక్టర్లో రఫ్పాడించిన సాయి ధన్సికనే. ఇంతకీ ఆమె చేతులు, కాళ్లు ఎందుకు కట్టేశారు? అంటే సినిమా కోసం అన్నమాట. ఇంకోమాట.. ఫొటోలో ధన్సిక కూర్చున్నది స్నూకర్ టేబుల్‌పైన అని అర్థం అవుతోంది కదూ. పాపం.. అలానే రాత్రంతా కూర్చున్నారట. సునీల్ కుమార్ దేశాయ్ దర్శకత్వంలో కన్నడలో రూపొందుతున్న ‘ఉద్ఘర్ష’ సినిమాలో ఆమె నటిస్తున్నారు. ఈ సినిమాలో ఓ సీన్లో ధన్సిక ఇలా కనిపించనున్నారు. తెలుగు సినిమాలు ‘రోగ్, నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా, ఆచారి ఆమెరికా యాత్ర’ సినిమాల్లో విలన్‌గా నటించిన అనూప్ సింగ్ ఠాకూర్ ఈ సినిమాలో ఓ లీడ్ రోల్ చేస్తున్నారు. అన్నట్లు.. తెలుగులో ధన్సిక స్ట్రయిట్ సినిమా ‘వాలుజడ’ చేస్తున్నారు. -
అందుకే సూపర్ స్టార్ అయ్యారు
రజనీకాంత్ హీరోగా ‘కబాలి’ ఫేమ్ పా. రంజిత్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘కాలా’ వండర్‌బార్ ఫిల్మ్స్ పతాకంపై నటుడు, రజనీకాంత్ అల్లుడు ధనుష్ ఈ గ్యాంగ్‌స్టర్ డ్రామాను నిర్మించారు. హ్యూమా ఖురేషీ, అంజలీ పాటిల్ కథానాయికలు. ఈ చిత్రం టీజర్లో చూపించిన రైన్ ఫైట్ షాట్స్ గుర్తుండే ఉంటాయి. ఆ రైన్ ఫైట్ సీక్వెన్స్ ఈ సినిమాకు హైలైట్‌గా నిలువనుందట. ఈ ఫైట్ సీన్స్ చిత్రీకరణ గురించి, రజనీకాంత్ డెడికేషన్ గురించి చిత్రబృందం చెబుతూ – ‘‘ఐదు రోజుల పాటు ఈ రైన్ సీక్వెన్స్‌ను చిత్రీకరించాం. రజనీకాంత్ ఒక షాట్ చేసి వచ్చి అలా తడిబట్టలతోనే కూర్చుని ఏదైనా బుక్ చదువుతూ ఉండేవారు. నెక్ట్స్ షాట్ రెడీ అయ్యేవరకూ కొంచెం డ్రై అవ్వండి అని చెబితే మళ్లీ ఎలాగూ తడవాలి కదా.. ఏం ఫర్లేదు అని నవ్వేసేవారు. రజనీకాంత్‌లో ఉండే బెస్ట్ క్వాలిటీ ఏంటంటే ప్రతీ సినిమాను తన ఫస్ట్ సినిమాలాగా ట్రీట్ చేయడమే. తన కంఫర్ట్ జోన్లో నుంచి బయటకు రావడానికి ట్రై చేస్తూ ఉంటారు. సూపర్ స్టార్ తలుచుకుంటే సీన్ తనకు తగ్గట్టుగా మార్చుకోవచ్చు. కానీ అలా ఒప్పుకోరు. సీన్ డిమాండ్‌కు తగ్గట్టుగానే రజనీకాంత్ తనని అడాప్ట్ చేసుకుంటారు. రజనీసార్ అలా ఉండటం వల్ల టీమ్‌లో ఉన్న అందరికీ బూస్ట్‌లా అనిపించింది’’ అని పేర్కొంది చిత్రబృందం. రజనీకాంత్ సూపర్‌స్టార్‌గా ఇంత స్టార్‌డమ్‌ను సంపాదించగలిగారంటే అది కేవలం నటుడిగా ఆయనకున్న డెడికేషన్ వల్లే అని అర్థం చేసుకోవచ్చు. ఈ సినిమా జూన్ 7న రిలీజ్ కానుంది. -
‘మేళా’తో టాలీవుడ్‌కు..
కబాలి సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా పరిచయం అయిన నటి సాయి ధన్సిక. తాజాగా సాయి ధన్సిక సినమ్ అనే లఘు చిత్రంలో అద్భుతంగా నటించి మెప్పించారు. ఆ చిత్రం కోల్‌కతా అంతర్జాతీయ కల్ట్ చిత్రోత్సవాల్లో ప్రదర్శింపబడి ఉత్తమ లఘు చిత్రం, ఉత్తమ నటి తదితర 8 అవార్డులను గెలుచుకుంది. అదే విధంగా కాలిఫోర్నియాలో జరిగిన అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో పలు అవార్డులను గెలుచుకుంది. ప్రస్తుతం ఈ భామ ఓ స్ట్రయిట్ తెలుగు సినిమాలో నటిస్తోంది. మేళా అనే చిత్రం ద్వారా ఈ బ్యూటీ టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అవుతున్నారు. దీనిపై సాయి ధన్సిక మాట్లాడుతూ తెలుగు చిత్రసీమలో ప్రముఖ రచయిత కిరణ్ తనను కలిసి మిమ్మల్ని దృష్టిలో పెట్టుకునే ఒక కథను తయారు చేసి తానే దర్శకత్వం వహించడానికి సిద్ధం అయ్యానని చెప్పారన్నారు. యథార్థ సంఘటనల ఆధారంగా లేడీ ఓరియంటెడ్ కథగా ఈ సినిమా ఉంటుందన్నారు. ప్రేక్షకులకు ద్విపాత్రాభినంలా అనిపిస్తుందని, తాను ఈ చిత్రంలో రెండు విభిన్న గెటప్‌లలో కనిపిస్తానని, ఒక గెటప్‌లో దెయ్యంగా కనిపిస్తానని తెలిపారు. ఇందులో తనకు జోడీ ఎవరూ ఉండరని, అయితే తెలుగు, తమిళ ప్రముఖ నటీనటులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారని చెప్పారు. తెలుగు నటుడు సూర్యతేజ కథానాయకుడిగా, అలీ, భరత్‌రెడ్డి, మునీష్కాంత్, జాంగిరి మధుమిత నటిస్తున్నారని తెలిపారు. ఈ చిత్రంలో ఫైటింగ్ సన్నివేశాల్లో డూప్ లేకుండా నటించానని అన్నారు. మేళా చిత్రం తెలుగు, తమిళ భాషల్లో ఏక కాలంలో విడుదల కానుందని ఆమె తెలిపారు. -
నాకు స్పెషల్ మూవీ
సూర్యతేజ్, ‘కబాలి’ ఫేమ్ ధన్సిక, సిమ్రాన్, సోని చరిష్టా ప్రధాన పాత్రల్లో రూపొందుతోన్న సస్పెన్స్ థ్రిల్లర్ ‘మేళా’. కిరణ్ శ్రీపురం దర్శకత్వంలో మామిడి వెంకటలక్ష్మి సమర్పణలో సంతోష్ కుమార్ కొంకా నిర్మిస్తున్నారు. కిరణ్ శ్రీపురం మాట్లాడుతూ– ‘‘2006లో ముంబైలో జరిగిన వాస్తవ సంఘటన ఆధారంగా తెరకెక్కిస్తోన్న చిత్రమిది. 50–60 శాతం చిత్రీకరణ పూర్తయింది. కథానుగుణంగా ధన్సిక, సూర్యతేజ, సోని చరిష్టా పాత్రలకు రెండు, మూడు వెర్షన్స్ ఉంటాయి. ప్రస్తుతం క్లైమాక్స్ లీడ్ సాంగ్ చిత్రీకరిస్తున్నాం. త్వరలోనే ట్రైలర్ విడుదల చేస్తున్నాం’’ అన్నారు. ‘‘విభిన్నమైన కథ, కథనంతో కూడిన చిత్రమిది. కిరణ్‌గారు సినిమాను పక్కా ప్లానింగ్‌తో పూర్తి చేస్తున్నారు’’ అన్నారు సంతోష్‌కుమార్. ‘‘నా కెరీర్లో చాలా ముఖ్యమైన సినిమా ఇది. లవ్, కామెడీ, ఎమోషన్స్ వంటి అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. తప్పకుండా ప్రేక్షకులకు నచ్చేలా ఉంటుంది’’ అన్నారు సాయి ధన్సిక. ‘‘వైవిధ్యమైన కథతో రూపొందుతోన్న చిత్రమిది. ఇందులో కీలక పాత్రలో కనిపిస్తా’’ అన్నారు రాజా రవీంద్ర. ఈ సమావేశంలో సోని చరిష్టా కూడా పాల్గొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: సుక్కు, కెమెరా: ఎస్.మురళీమోహన్‌రెడ్డి, సహ నిర్మాత: పంతం అరుణరెడ్డి. -
రజినీ కాంత్‌ను దాటేసిన విజయ్
-
నేనందుకు అంగీకరించలేదు!
సద్దుమణిగిన విషయాన్ని పదే పదే ప్రస్థావిస్తూ తద్వారా ప్రచారం పొందాలని ఆశిస్తున్నట్లుంది నటి రాధిక ఆప్టే. బాలీవుడ్ చిత్రాల్లో అర్ధనగ్నంగా నటిస్తూ, ఆ ఫొటోలను ఇంటర్నెట్లో పోస్ట్ చేసి వార్తల్లోకెక్కే ఈ సంచలన నటి. అదేమని ఎవరైనా విమర్శిస్తే, నా శరీరం, నా ఇష్టం అంటూ డేర్‌గా అనేస్తుంది. ఈ జాణ దక్షిణాదిలో నటించింది చాలా తక్కువ చిత్రాలే. తమిళంలో ధోని, తమిళ్‌సెల్వన్, కబాలి చిత్రాల్లో నటించింది. కబాలిలో రజనీకాంత్‌కు భార్యగా నటించడంతో గుర్తింపు బాగానే వచ్చింది. తెలుగులోనూ బాలకృష్ణ సరసన రెండు సినిమాల్లో నటించింది. అయితే ఆ తరువాతే అవకాశాలు రాలేదు. ప్రస్తుతం బాలీవుడ్‌పై దృష్టిసారించిన రాధిక ఆప్టే దక్షిణాది చిత్రపరిశ్రమపై నిందలు వేస్తూ ఫ్రీ పబ్లిసిటీ పొందేప్రయత్నం చేస్తోంది. అవకాశాల కోసం హీరోయిన్లను అడ్జెస్ట్ అవ్వాలంటారని నటి వరలక్ష్మీశరత్‌కుమార్ లాంటి కొందరు సంచలన వ్యాఖ్య చేశారు. అవి అప్పట్లో ప్రకంపనలు సృష్టించిన మాట నిజమే అయినా, అలాంటి వాతావరణం సద్దుమణిగిన తరువాత నటి రాధిక ఆప్టే మరోసారి అదే వివాదాన్ని తెర మీదకు తెచ్చింది. దక్షిణాదిలో హీరోయిన్లను పడక గదికి రమ్మన్ని ఒత్తిడి చేసే సంప్రదాయం ఉంది అని కామెంట్ చేసింది.తనకు అలాంటి చేదు అనుభవం ఎదురైందని, ఒక నిర్మాత కథా చర్చలకు పిలిచి పడక గదికి రమ్మని ఒత్తిడి చేశాడని, అయితే తానందుకు తలవంచలేదని పేర్కొంది. అందుకేనేమో తనకు దక్షిణాదిలో అవకాశాలు ఎక్కువగా రావడం లేదని చెప్పింది. -
ఎలాంటి పాత్రకైనా రెడీ
తమిళసినిమా: ఎలాంటి పాత్రల్లో నటించడానికైనా తాను సిద్ధం అంటున్నారు నటి సాయి ధన్సిక. పేరాన్మమై చిత్రం ద్వారా దర్శకుడు జననాథన్ పరిచయం చేసిన నటి సాయిధన్సిక. ఆ చిత్రంలో జయంరవితో నలుగురు హీరోయిన్లలో ఒకరిగా నటించి ప్రత్యేకత చాటుకున్న తంజావూర్‌కు చెందిన అచ్చ తమిళమ్మాయి ఆ తరువాత కేరీర్ పరంగా వెనక్కు తిరిగి చూసుకోవలసిన అవసరం లేకపోయ్యిందనే చెప్పాలి. వరుసగా అవకాశాలు తలుపు తట్టడం, అవి నటనకు స్కోప్ ఉన్న పాత్రలు కావడంతో తనదైన స్టైల్లో నటిస్తూ దూసుకుపోతున్నారు సాయి ధన్సిక. కబాలి చిత్రంలో సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు కూతురుగా నటించిన విషయం తెలిసిందే. ఆ చిత్రంలో రజనీకాంత్ తరువాత అంత మంచి పేరు తెచ్చుకున్న నటి సాయి ధన్సికనే అని చెప్పాలి. అందుకు నిదర్శనం ఇటీవల ఉత్తమ సహాయనటిగా ఫిలిం ఫేర్ అవార్డును గెలుచుకోవడమే. ఇక మరో విషయం ఏమిటంటే తను నటించిన ఉరు చిత్రం ఇటీవల విడుదలై మంచి ఆదరణతో ప్రదర్శింపబడుతుండటం ఈ ఆనందాన్ని సాయిధన్సిక సోమవారం పాత్రికేయులతో పంచుకున్నారు. ఆ ముచ్చట్లు చూద్దాం. ప్ర: ఉరు చిత్రంలో అద్దాలు పగలగొట్టుకొని దూసుకొచ్చే యాక్షన్ సన్నివేశాల్లో నటించిన అనుభవం గురించి? జ: ఆ యాక్షన్ సన్నివేశంలో నటించగలవా? అని దర్శకుడు అడిగారు. తానూ ఓకే అన్నాను. నిజంగా అది చాలా రిస్కీ షాటే. కరెక్ట్‌గా నేను అద్దంలోంచి దూకే సమయంలో ఒక వ్యక్తి పక్క నుంచి అద్దాన్ని పగలగొట్టారు. ఆ టైమింగ్ సింక్ అవడంతో ఆ సీన్ చాలా సహజంగా ఉంది. అయితే ఆ సన్నివేశాన్ని కులుమనాలిలో 4 డిగ్రీల చలిలో చిత్రీకరించారు. నేనే కాదు, నటుడు కలైయరసన్ తదితర చిత్ర యూనిట్ అంతా ఎంతో శ్రమించి పనిచేశారు. ఉరు చిత్రంలో నటించడానికి విల్‌పవర్ అవసరమైంది. ప్రశ్న: ఉరు చిత్రంపై మీ స్పందన? జ: దర్శకుడు కొత్తవాడైనా చాలా బాగా తెరకెక్కించారు. ముఖ్యంగా చిత్ర సస్పెన్స్‌ను చాలా ఆసక్తిగా రీవీల్ చేశారు. చిత్రానికి ప్రేక్షకులనుంచి మంచి స్పందన వస్తోంది. చిత్ర వర్గాలు ఆన్లైన్ ప్రచారం బాగానే చేస్తున్నారు. అయితే పోస్టర్లలాంటివి ఇంకా బాగా చేస్తే బాగుంటుంది. అయినా చిత్రం చూసిన వారి స్పందన బాగుంది. ఆ మౌత్ ప్రచారం చిత్రానికి బాగా హెల్ప్ అవుతుంది. ప్ర: అన్నీ యా„ýక్షన్ కథా పాత్రల్లోనే నటిస్తున్నట్లున్నారు. కమర్షియల్ హీరోయిన్ పాత్రల్లో నటించే ఆలోచన లేదా? జ: అలాగని ఏమీ లేదు. వస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుంటున్నాను. నాకు అలాంటి పాత్రలు రావడానికి బహుశ నేను వచ్చిన దర్శకుడు జననాథన్, బాలా లాంటి వారి స్కూల్ ఒక కారణం కావచ్చు. నా వరకూ నటిగా ఎలాంటి పాత్రనైనా చేయడానికి రెడీ. అది కమర్షియల్ కథానాయకి పాత్ర అయినా. అయితే పాత్రలు నాకు నచ్చాలి. ప్ర: ప్రస్తుతం చేస్తున్న చిత్రాలు? జ: తదుపరి కాలకూత్తు చిత్రం విడుదల కానుంది. ఇది మదురైలో చాలా కాలంగా జరుగుతున్న సంఘటనల ఆధారంగా తెరకెక్కిన చిత్రం. ఇందులోనూ నటనకు అవకాశం ఉన్న పాత్రలో నటించాను. ఆ తరువాత ఇళిత్తిరు చిత్రం విడుదల కానుంది. ఇందులో విదార్ధ్, తంబిరామయ్యలతో కలిసి హాస్యం పండించాను. ఇంతకు ముందు మీరు అన్నట్లు కమర్షియల్ కథానాయకి పాత్రను ఈ చిత్రంలో చూడవచ్చు. వాటితో పాటు తమిళం, మలయాళం భాషల్లో సోలో అనే చిత్రాన్ని, తమిళం, తెలుగు భాషల్లో రూపొందుతున్న వాలుజడ చిత్రాల్లో నటిస్తున్నాను. సోలో చిత్రంలో దుల్కర్సల్మాన్ హీరో. తెలుగు చిత్రం వాలుజడ మహిళా ఇతివృత్తంతో తెరకెక్కుతున్న చిత్రం. ప్ర: తమిళంతో పాటు తెలుగు, మలయాళం అంటూ దక్షిణాది భాషలన్నింటిలోనూ నటిస్తున్నారు. బాలీవుడ్కెళ్లే ఆలోచన ఉందా? జ: నిజం చెప్పాలంటే కబాలి చిత్రం తరువాత ఇతర భాషా చిత్రాల్లో నటించే అవకాశాలు వస్తున్నాయి. అలానే హిందీలోనూ వస్తున్నాయి. అయితే తొందర పడదలచుకోలేదు. మంచి పాత్ర అనిపిస్తే హిందీలోనూ నటిస్తా. -
సూపర్ స్టార్ స్పీడు అందుకేనా..?
సూపర్ స్టార్ రజనీకాంత్ ఒక సినిమా పూర్తయితే గాని మరో సినిమాకు అంగకీరించడు. అది కూడా సినిమా పూర్తయిన తరువాత రెండు మూడు నెలలకు పైగా గ్యాప్ తీసుకున్న తరువాతే మరో సినిమాను మొదలు పెడతాడు. చాలా ఏళ్లుగా రజనీ ఇదే సిస్టమ్ ఫాలో అవుతున్నారు. అయితే తన నెక్ట్స్ సినిమా విషయంలో మాత్రం రూట్ మార్చాలని నిర్ణయించుకున్నాడట రజనీ. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో 2.0 సినిమాలో నటిస్తున్న రజనీ ఈ సినిమా షూటింగ్ ఇంకా కొనసాగుతోంది. భారీ బడ్జెట్ తో అదే స్థాయి విజువల్ ఎఫెక్ట్స్ తో తెరకెక్కుతున్న సినిమా కావటంతో ఈ సినిమా షూటింగ్ ఇప్పట్లో పూర్తయ్యే ఛాన్స్ లేదు. కానీ 2.0 సెట్స్ మీద ఉండగానే రజనీ మరో సినిమాను ప్రారంభించాలని నిర్ణయించుకున్నాడు. కబాలీ ఫేం పా రంజిత్ దర్శకత్వంలో మరో సినిమా చేసేందుకు అంగీకరించాడు రజనీ. ఈసినిమాను వచ్చే నెల రెండో వారం ప్రారంభించాలని ఫిక్స్ అయ్యారట. ఒక సినిమా సెట్స్ మీద ఉండగా మరో సినిమా గురించి ఆలోచించని రజనీ తన అల్లుడు నిర్మాతగా తెరకెక్కుతున్న సినిమా కోసం ఈ రూల్ ను మార్చుకున్నారట. పా రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాను ధనుష్ నిర్మిస్తున్నాడు. అందుకే ఈ సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ఫిక్స్ అయ్యాడట. కబాలి సినిమాతో భారీ హైప్ క్రియేట్ చేయటంలో సక్సెస్ అయిన రంజిత్, సినిమాతో మాత్రం నిరాశపరిచాడు. మరి రజనీ ఇచ్చిన ఈసెకండ్ ఛాన్స్ ను ఎంత వరకు సక్సెస్ చేస్తాడో చూడలి. -
అప్పుడు కబాలి.. ఇప్పుడు 'ఖైదీ నెం 150'..
దాదాపు దశాబ్దకాలం తరువాత మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ సినిమా ఖైదీ నంబర్ 150. తమిళ సూపర్ హిట్ మూవీ కత్తికి రీమేక్ అయిన ఈ మూవీపై అంచనాలు భారీగా ఉన్న విషయం తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లోని మెగా అభిమానులు ఈ మూవీ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. గతేడాది సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన కబాలి మూవీ విడుదల రోజున(జూలై 22న) చెన్నై, బెంగళూరుల్లోని పలు స్టార్టప్‌లతో పాటు సౌదీ అరేబియాలోనూ కొన్ని కంపెనీలు సెలవుదినంగా ప్రకటించగా.. తాజాగా రియాద్ లోని ఓ కన్స్ట్రక్షన్ కంపెనీ మెగా మూవీ ఖైదీ నెంబర్ 150 రిలీజు అవుతున్న జనవరి 11ను ఉద్యోగులకు సెలవుదినంగా ప్రకటించింది. ఈ విషయాన్ని ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు. హాలీడే వివరాలను పేర్కొంటూ ఓ నోటిస్ పేపర్‌ను పోస్ట్ చేశాడు. (చదవండి: ఉద్యోగులకు దసరా లాగే.. కబాలి బోనస్!) గతంలో కబాలి మూవీకి కూడా మస్కట్, ఒమన్, రియాద్‌లోని తమ కన్స్ట్రక్షన్ కంపెనీలకు ఇదే విధంగా యాజమాన్యం హాలీడే ఇచ్చింది. ఈ హ్యాపీ న్యూస్‌ను ఓ నెటిజన్ సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నాడు. మూవీ మొఘల్, కింగ్ ఆఫ్ కింగ్స్ ఆఫ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ చిరంజీవి మూవీ ఖైదీ నెంబర్ 150 ని అభిమానులు ఘనంగా సెలబ్రేట్ చేసుకోవాలని ఆశిస్తూ ఈ అవకాశం కల్పించింది. దాదాపు పదేళ్ల తర్వాత పూర్తిస్థాయి సినిమాలో చిరు నటించడం కూడా మూవీ ఫీవర్‌ను పెంచేసింది. వీవీ వినాయక్ దర్శకత్వం వహించిన ఈ మూవీని చిరు తనయుడు రాంచరణ్ నిర్మించిన విషయం తెలిసిందే. చిరుకు జోడీగా కాజల్ అగర్వాల్ నటించగా, దేవీశ్రీ సంగీతాన్ని సమకూర్చాడు. Holiday declared on Jan11th for Riyadh Construction Company on account of #KhaidiNo150 Release. కబాలి కి ఇలానే... @RGVzoomin @Shekar_News pic.twitter.com/aRRax4azyc — #AkkuPakshi (@urstrulyRD) 8 January 2017 -
బుక్ మై షో టాప్–10లో కబాలి
బుక్ మై షో టాప్–10లో నమోదైన చిత్రంగా సూపర్‌స్టార్ నటించిన కబాలి చిత్రం చోటు చేసుకోవడం విశేషం. ఆధునిక టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తరువాత దాన్ని అందిపుచ్చుకోవడానికి అన్ని రంగాల మాదిరిగానే సినీరంగానికి చెందిన వారు, సినిమాలను చూసే ప్రేక్షకుల సంఖ్య నానాటికి అధికం అవుతోందని చెప్పకతప్పదు. ఇక సినిమా టికెట్ల ఆన్ లైన్ బుకింగ్ విధానం అమల్లోకొచ్చి చాలా కాలం అయ్యింది. అలాంటి సోషల్ మాద్యమాల్లో బుక్ మై షో అగ్రగామిగా రాణిస్తోంది. సినిమా టిక్కెట్ల కోసం భారతదేశంలో అత్యధిక ప్రేక్షకులు ఉపయోగిస్తున్న సోషల్ మాద్యమం బుక్ మై షో. ఈ మద్యమం ద్వారా 2016లో అధికంగా ప్రేక్షకులు టికెట్స్ బుక్ చేసుకున్న చిత్రాల టాప్–10లో రజనీకాంత్ నటించిన కబాలి చిత్రం నమోదు కావడం విశేషం. ఇక బాలీవుడ్ బాద్షా నటించిన ఫ్యాన్ చిత్రం 14వ స్థానానికి పరిమితమయ్యింది. అదే విధంగా రీజినల్ భాషా చిత్రాల పట్టికను తీసుకుంటే 2016లో అత్యధిక వసూళ్లు సాధించిన తమిళ చిత్రంగా కబాలి రికార్డు సాధించినట్టు బుక్ మై షో కో–ఫౌండర్, డైరెక్టర్ పరిక్షిత్ దర్ పేర్కొన్నారు. ఇక తెలుగులో చిన్న చిత్రంగా తెరకెక్కి భారీ వసూళ్లను సాధించిన చిత్రంగా అఆ, మలయాళంలో పులిమురుగన్, కన్నడంలో గోది బన్న «సధర్న మై కట్టు చిత్రాలు రికార్డు సాధించినట్లు ఆయన తెలిపారు. కాగా బుక్ మై షో ద్వారా టికెట్లు కొనుగోలు చేసే వారి సంఖ్య 2016లో భారీగా పెరిగిందని, ఇది 2017లో మరింతగా పెరుగుతుందని భావిస్తున్నట్టు తెలిపారు. -
చిత్ర నిర్మాణరంగంలోకి కబాలి దర్శకుడు
దర్శకులు నిర్మాతలుగా మారడం అన్నది కొత్తేమీ కాదు. స్టార్ దర్శకుడు శంకర్ లాంటి వారు చిత్ర నిర్మాణం చేపట్టి విలువలతో కూడిన మంచి కథా చిత్రాలను నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఇదే కోవలో అట్టకత్తి అంటూ దర్శకుడిగా పరిచయం అయిన పా.రంజిత్ తొలి చిత్రంతోనే చిత్రపరిశ్రమ వర్గాల దృష్టిని తనవైపు తిప్పుకున్నారు. ఆ తరువాత మద్రాస్ అంటూ ఉత్తర చెన్నై యువత జీవన విధానాన్ని సహజత్వంతో తెరపై ఆవిష్కరించి మరో మంచి విజయాన్ని అందుకున్నారు. ఇక మూడో చిత్రంతోనే సూపర్‌స్టార్ రజనీకాంత్‌ను గ్యాంగ్‌స్టర్‌గా చూపించి కబాలి చిత్రంతో స్టార్ దర్శకుల పట్టికలో చేరారు. తాజాగా మళ్లీ రజనీకాంత్ హీరోగా చిత్రం చేయడానికి సిద్ధం అయిన పా.రంజిత్ ఆ చిత్ర ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. మరో పక్క నీలం ప్రొడక్షన్స్ పేరుతో సొంత నిర్మాణ సంస్థను ప్రారంభించి నవ దర్శకుడు మారి సెల్వరాజ్‌ను పరిచయం చేస్తూ చిత్రం నిర్మించడానికి రెడీ అయ్యారు. ఈ చిత్రానికి పరియేరుం పెరిమాళ్ అనే పేరును నిర్ణయించారు. క్రిమి చిత్రంతో మంచి పేరు తెచ్చుకున్న కధీర్ హీరోగానూ, నటి ఆనంది హీరోయిన్ గా నటించనున్నారు. ఈ నెల చివర్లో చిత్రం షూటింగ్ ప్రారంభం కానుంది. ఇది తిరునెల్వెలి పరిసర ప్రాంతానికి చెందిన ఒక యువకుడి ఇతివృత్తంగా ఉంటుందట. ప్రేమ, యాక్షన్ అంటూ అన్ని కమర్షియల్ అంశాలతో జనరంజకంగా చిత్రం ఉంటుందట. ఈ విషయాన్ని నూతన సంవత్సరం సందర్భంగా ప్రకటించారు. ఇక మారి సెల్వరాజ్ గురించి చెప్పాలంటే ఈయన దర్శకుడు రామ్ వద్ద కట్రదు తమిళ్, తంగమీన్ గళ్, తరమణి చిత్రాలకు సహాయదర్శకుడిగా పని చేశారు. పరియేరుం పెరుమాళ్ చిత్రానికి కథ, కథనం దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తున్నారు. దీనికి సంతోష్ నారాయణ్ సంగీతం, శ్రీధర్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. -
రజనీ అభిమానులకు న్యూ ఇయర్ గిఫ్ట్
-
రజనీ అభిమానులకు న్యూ ఇయర్ గిఫ్ట్
సౌత్ సూపర్ స్టార్ రజనీ అభిమానుల కోసం కబాలి చిత్ర నిర్మాత కలైపులి ఎస్ థాను ఓ గిఫ్ట్ ఇచ్చాడు. రజనీ కెరీర్ లోనే భారీ హైప్ క్రియేట్ చేసిన కబాలి చిత్రంలోని ఐదు డిలీటెడ్ సీన్స్‌ను తన సోషల్ మీడియా ద్వారా విడుదల చేశాడు. కొన్ని యాక్షన్ సీన్స్‌తో పాటు ఎమోషనల్, రొమాంటిక్ సన్నివేశాలు ఇందులో ఉన్నాయి. పా రంజిత్ దర్శకత్వంలో రజనీ హీరోగా తెరకెక్కిన కబాలి చిత్రంలో రాధికా ఆప్టే హీరోయిన్గా నటించింది. -
కబాలి 2లో మరో కొత్త లుక్‌లో రజనీ
సూపర్ రజనీకాంత్ హీరోగా ఘనవిజయం సాధించిన సినిమా కబాలి. ఎక్కువగా స్టార్ డైరెక్టర్స్ తో మాత్రమే సినిమాలు చేసే రజనీ తొలిసారిగా ఓ కొత్త దర్శకుడితో చేసిన ఈ సినిమా రజనీ మార్కెట్ స్టామినాను మరోసారి ప్రూవ్ చేసింది. అందుకే కబాలి ఫీవర్ నడుస్తుండగానే ఈ సినిమాకు సీక్వల్ ఉంటుందంటూ ప్రకటించారు చిత్రయూనిట్. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా మొదలైనట్టుగా సమాచారం. మరోసారి పా రంజిత్ దర్శకత్వంలో కబాలి సినిమాకు సీక్వల్ చేస్తున్నాడు రజనీ. ఈ సినిమాను రజనీ అల్లుడు ధనుష్ నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 2.0 పనుల్లో బిజీగా ఉన్న రజనీ కబాలి సీక్వల్ పని కూడా మొదలెట్టేశాడు. ఇటీవల రజనీని కలిసిన దర్శకుడు పా రంజిత్, సీక్వల్లో రజనీ లుక్, కాస్ట్యూమ్స్ పై చర్చించాడు. త్వరలోనే కబాలీ 2 సెట్స్ మీదకు వెళ్లనుందన్న టాక్ వినిపిస్తోంది. -
సుల్తాన్ ఫస్ట్.. కబాలీ సెకండ్!
-
సుల్తాన్ ఫస్ట్.. కబాలీ సెకండ్!
న్యూఢిల్లీ: ఎన్నో అంచనాల మధ్య విడుదలైన తమిళనాడు సూపర్ స్టార్ రజనీకాంత్ మూవీ ‘కబాలి’ని వెనక్కి నెట్టి సల్మాన్ ఖాన్ మూవీ సుల్తాన్ గూగుల్ సెర్చ్‌లో అగ్రస్థానంలో నిలిచింది. 2016 ఏడాదికి గానూ గూగుల్ ఇండియా ట్రెండింగ్ మూవీల జాబితాలో కండలవీరుడు సల్మాన్ హవా సాగింది. కబాలి, డ్రగ్స్ మాఫియా నేపథ్యంలో వచ్చిన ఉడ్తా పంజాబ్, పాకిస్తాన్ నటులు ఉన్నారని విడుదలను ఆపేయాలన్న మూవీ ‘ఏ దిల్ హై ముష్కిల్’, రుస్తుమ్, సైరత్, మొహంజోదారో మూవీలకు సంబంధించిన వీడియోలు, వార్తలు గూగుల్ ఇండియాలో టాప్ ట్రెండింగ్‌లో ఉన్నాయి. సుల్తాన్ తర్వాత రెండో స్థానంలో రజనీకాంత్ మూవీ కబాలి నిలిచింది. హీరోల్లో సుశాంత్ రాజ్‌పుత్.. హీరోయిన్లలో దిశా పటానీ ధోనీ జీవిత కథాంశంతో వచ్చిన మూవీలో తెరపై ధోనీ పాత్రలో మెప్పించిన సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మోస్ట్ బాలీవుడ్ ట్రెండింగ్ మేల్ ఆర్టిస్టుగా నిలిచాడు. కబీర్ బేడి, హర్షవర్ధన కపూర్, సల్మాన్ ఖాన్, రణవీర్ సింగ్, సూరజ్ పంచోలీ, అనుపమ్ ఖేర్ టాప్-10 సెర్చింగ్ బాలీవుడ్ నటుల జాబితాలో ఉన్నారు. దిశా పటానీ టాప్ ట్రెండింగ్ హీరోయిన్గా నిలిచింది. పుజా హెగ్డే, ఊర్వశీ రౌతెలా, ఉర్మిలా మండోద్కర్, మందన కరిమి, వాణీ కపూర్, సయామీ ఖేర్, నిమ్రత్ కౌర్ టాప్ 10 ఫీమెల్ ఆర్టిస్టులలో చోటు దక్కించుకున్నారు. -
సూపర్‌స్టార్‌తో రొమాన్స్?
సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో రొమాన్స్ చేయాలన్న చెన్నై చిన్నది త్రిష కోరిక నెరవేరనుందా? అది నెరవేరుతుందో? లేదో గానీ, అలాంటి ప్రయత్నాలు మాత్రం త్రిష ముమ్మరంగా చేస్తున్నట్లు కోడంబాక్కం వర్గాల తాజా సమాచారం. రజనీకాంత్‌తో మినహా త్రిష ఇతర ప్రముఖ కథానాయకులందరితోనూ నటించారని చెప్పవచ్చు. సూపర్‌స్టార్‌తో నటించాలన్నది ఆ అమ్మడి చిరకాల కోరిక. తన సహ నటీమణులైన నయనతార, శ్రీయ, అనుష్క, చివరికి రాధికాఆప్తే, ఆంగ్ల భామ ఎమీజాక్సన్ కూడా రజనీకాంత్‌తో నటించే అవకాశాన్ని అందుకున్నారు. తనకెందుకు అలాంటి అవకాశం రాలేదన్న ప్రశ్నను త్రిష చాలా సార్లు వేసుకున్నారట. కబాలి చిత్రంలో రజినీకాంత్‌తో జత కట్టే అవకాశం తనకు లభిస్తుందని ఈ బ్యూటీ ఆశించిదట. అరుుతే ఆ అవకాశం నటి రాధికాఆప్తేను వరించింది. ఎప్పటికై నా సూపర్‌స్టార్‌తో నటించి తీరతానన్న నమ్మకంతో ఉన్న త్రిష తాజాగా తన కోరికను నెరవేర్చుకొనే ప్రయత్నాలు చేస్తున్నారట. ఇటీవల ధనుష్‌కు జంటగా కొడి చిత్రంలో నటించిన త్రిష తన నటనకు మంచి మార్కులు కొట్టేసిన విషయం తెలిసిందే. కాగా కబాలి చిత్ర కాంబినేషన్ రజనీకాంత్, దర్శకుడు పా.రంజిత్ దర్శకత్వంలో మరో చిత్రం తెరకెక్కడానికి సన్నాహాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ సంచలన చిత్రాన్ని రజనీకాంత్ అల్లుడు, నటుడు ధనుష్ తన వండర్‌బార్ ఫిలింస్ పతాకంపై నిర్మించనున్నారు. దీంతో ఈ చిత్రంలో రజినీకాంత్‌తో రొమాన్స చేసే అవకాశం కోసం త్రిష ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఇందులో కథానాయకిగా అవకాశం లేకపోతే అతిథి పాత్రలోనైనా నటించడానికి రెడీ అంటున్నారట. త్రిష ప్రయత్నాలు ఫలించాలని ఆశిద్దాం. కాగా ప్రస్తుతం హీరోరుున్ ఓరియంటెడ్ కథా చిత్రం మోహినీని పూర్తి చేసే పనిలో ఉన్న త్రిష తాజాగా అరవిందస్వామికి జంటగా చతురంగవేటై్ట-2, విజయ్‌సేతపతి సరసన ఒక చిత్రంలో నటిస్తున్నారు. -
కబాలి తరువాత ఎస్3నే..!
చాలా రోజులుగా తన రేంజ్ సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న సూర్య, 24 సినిమాతో తిరిగి ఫాంలోకి వచ్చాడు. తన మార్క్ ప్రయోగాత్మక చిత్రంతోనే కమర్షియల్ సక్సెస్ కూడా సాధించి సత్తా చాటాడు. ఇప్పుడు తనకు బాగా కలిసొచ్చిన సింగం సీరీస్‌తో మరోసారి తన కలెక్షన్ స్టామినా ఏంటో ప్రూవ్ చేసుకునేందుకు రెడీ అవుతున్నాడు సూర్య. ఈ డిసెంబర్లో రిలీజ్ అవుతున్న ఎస్ 3 సినిమా ఇప్పటికే రికార్డ్ల వేట మొదలు పెట్టింది. ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్ యూట్యూబ్‌లో సరికొత్త రికార్డ్ సృష్టించింది. సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన కబాలి తరువాత అంత వేగంగా మూడు మిలియన్ల వ్యూస్ సాధించిన చిత్రంగా నిలిచింది ఎస్3. ఇప్పటికే 4 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించిన ఎస్ 3 మరిన్ని రికార్డ్ ల దిశగా దూసుకుపోతోంది. సూర్య సరసన అనుష్క, శృతిహాసన్‌లు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు హరీష్ జయరాజ్ సంగీత దర్శకుడు. -
ఫ్యాన్స్‌ను సర్ప్రైజ్ చేసిన రజనీ!
దీపావళి పండుగ సందర్భంగా తన అభిమానులను సూపర్‌స్టార్ రజనీకాంత్ సర్ప్రైజ్ చేశాడు. రజనీ తాజా సినిమా ‘కబాలి’ చెన్నైలోని రోహిణీ థియేటర్లో వందరోజులు ఆడింది. ఈ సినిమా శతదినోత్సవం పూర్తి చేసుకోవడంతో అభిమానులు ఆదివారం థియేటర్ వద్ద సంబరాలు నిర్వహించారు. అనంతరం నేరుగా చెన్నైలోని పోయిస్ గార్డెన్లో ఉన్న రజనీ నివాసానికి వెళ్లారు. రజనీ తన అభిమానుల్ని సాదరంగా ఆహ్వానించడమే కాదు వారితో సరదాగా ముచ్చటించారు కూడా. ఈ సందర్భంగా తన అభిమానులందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఇటీవల అమెరికాకు వెళ్లిన రజనీ తాజాగా చెన్నై తిరిగొచ్చారు. దీపావళి పండుగ సందర్భంగా కూతురు ఐశ్వర్య, అల్లుడు ధనుష్, చిన్న కూతురు సౌందర్య, మనవలతో కలిసి దీపావళీ వేడుక చేసుకున్నారు. అనంతరం తన కోసం వచ్చిన అభిమానులకు ప్రత్యేకంగా సమయం కేటాయించి వారిని ఖుషీ చేశారు. దీంతో ఒకేరోజు డబుల్ పండుగ చేసుకున్నట్టు అభిమానులు సర్ప్రైజ్ అవుతున్నారు. ఇక, దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న ‘రోబో-2’ సినిమా యూనిట్‌తో రజనీ త్వరలో జతకలుస్తున్నట్టు సమాచారం. -
మరోసారి అమెరికా వెళ్లిన రజనీకాంత్..?
సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో రోబో సీక్వల్లో నటిస్తున్న సంగతి తెలిసింది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఇప్పటికే టాకీ పార్ట్ షూటింగ్ పూర్తిచేసుకుంది. అదే జోరుతో సాంగ్స్ షూట్‌కు రెడీ అయిపోతున్నారు. ఈ సమయంలో ఓ షాకింగ్ న్యూస్ అభిమానులను కలవరపెడుతోంది. రజనీకాంత్ మరోసారి మెడికల్ చెకప్స్ కోసం అమెరికా వెళ్లారట. పాటల షూటింగ్ కోసం ఉక్రేయిన్ వెళ్లాల్సి ఉండగా రజనీ సడన్‌గా అమెరికా వెల్లటం పై రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో కబాలి రిలీజ్ సమయంలో కూడా రజనీ చాలా కాలం పాటు అమెరికాలోనే చికిత్స తీసుకున్నారు. కబాలి ప్రమోషన్లో కూడా పాల్గొనకుండా 40 రోజులకు పైగా అమెరికాలో ఉన్నారు. తాజాగా మరోసారి అమెరికా వెళ్లారంటూ వస్తున్న వార్తలపై ఫ్యాన్స్ కలవరపడుతున్నారు. -
రజనీని కలసిన థాయ్ యువరాణి
చెన్నై: తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్‌ను కలవడానికే ప్రత్యేకంగా థాయ్‌లాండ్ యువరాణి మామ్ లూంగ్ రాజదరశ్రీ జయంకుర శుక్రవారం చెన్నైకి వచ్చారు. రజనీని ఆయన సొంతిట్లో కలసి యోగక్షేమాలు తెలుసుకున్నారు. రజని ‘కబాలి’ సినిమా షూటింగ్ కొంతభాగం థాయ్‌లాండ్‌లో జరిగిన విషయం తెలిసిందే. అక్కడి షూటింగ్ సజావుగా సాగేందుకు యువరాణి జయంకుర సాయపడ్డారు. దాదాపుగా అరగంటకు పైగా వీరి ఇరువురి భేటీ జరిగినట్లు సమాచారం. పలు అంశాలను మామ్ లుయాంగ్ రజనీ వద్ద ప్రస్తావించినట్టు తెలిసింది. రజనీకాంత్‌ను కలిసినందుకు ఈ సందర్భంగా జయంకుర సంతోషం వ్యక్తం చేశారు. తమ దేశంలో రజనీకాంత్‌కు పెద్ద ఎత్తున అభిమానులు ఉన్నట్లు తెలిపారు. కాగా ఈ సమావేశంపై రజనీకాంత్ కార్యాలయం ఓ అధికారిక ప్రకటన విడుదల చేసింది. -
కెరీర్‌పై దృష్టి పెట్టిన సూపర్ స్టార్ కూతురు
ఇటీవల విడాకుల వార్తలతో మీడియాలో కనిపించిన సూపర్ స్టార్ రజనీకాంత్ కూతురు ప్రస్తుతం కెరీర్‌పై దృష్టి పెడుతోంది. ఇప్పటికే కొచ్చాడయాన్ లాంటి భారీ గ్రాఫిక్స్ చిత్రానికి దర్శకత్వం వహించిన సౌందర్య, గోవా అనే కామెడీ చిత్రాన్ని నిర్మించింది. మరోసారి అంతా కొత్త వారితో తెరకెక్కనున్న చిత్రానికి దర్శకత్వ బాధ్యతలు తీసుకుంది. రజనీకాంత్ హీరోగా కబాలి లాంటి భారీ బ్లాక్ బస్టర్‌ను అందించిన ప్రముఖ నిర్మాత కలైపులి ఎస్.థాను ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబందించిన ప్రీ ప్రొడక్షన్ పనులతో పాటు, నటీనటుల ఎంపిక కూడా జరుగుతున్నట్టుగా తెలిపారు. త్వరలో సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ సినిమాతో దర్శకురాలిగా సక్సెస్ సాధించాలన్న పట్టుదలతో ఉంది సౌందర్య రజనీకాంత్. -
ఆ సినిమా కబాలి 2 కాదు
రజనీకాంత్ హీరోగా కబాలి సినిమాను తెరకెక్కించిన పా రంజిత్, ఆ సినిమాతో ఆశించిన స్థాయి విజయం సాధించకపోయినా.. క్రేజ్ మాత్రం తగ్గలేదు. ఒక సమయంలో టాప్ స్టార్లు కూడా పా రంజిత్ దర్శకత్వంలో సినిమా చేయడానికి క్యూ కట్టారు. అయితే కబాలి రిలీజ్ తరువాత మాత్రం సీన్ మారిపోయింది. ఆ సినిమా నిర్మాతలకు లాభాలు తీసుకు వచ్చినా.. డిస్ట్రిబ్యూటర్లు చాలా చోట్ల నష్టపోయారు. దీంతో ఇక రంజిత్‌కు స్టార్ హీరోలు ఛాన్స్ ఇవ్వటం కష్టమనే భావించారు అంతా. కానీ అందరికీ షాక్ ఇస్తూ రజనీ హీరోగా పా రంజిత్ మరో సినిమాను తెరకెక్కిస్తున్నాడన్న వార్త హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమాను తానే నిర్మిస్తున్నట్టుగా రజనీ అల్లుడు, తమిళ హీరో ధనుష్ స్వయంగా ప్రకటించారు. దీంతో రజనీ హీరోగా రంజిత్ తెరకెక్కించబోయే సినిమా కబాలి 2 అంటూ ప్రచారం జోరుగా జరిగింది. ఈ విషయంపై స్పందించిన దర్శకుడు పా రంజిత్ క్లారిటీ ఇచ్చాడు. తాను రజనీ హీరోగా మరో సినిమా చేస్తున్న మాట నిజమేనని అయితే ఆ సినిమా కబాలి సీక్వల్ మాత్రం కాదని ప్రకటించాడు. ఓ కొత్త కథను రజనీకి వినిపించానని ఆయనకు కథ నచ్చి స్క్రిప్ట్ రెడీ చేయమన్నారని తెలిపాడు. ప్రస్తుతం రజనీ హీరోగా తెరకెక్కుతున్న రోబో సీక్వల్ పూర్తవ్వగానే పా రంజిత్ దర్శకత్వంలో మరో సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. -
రజనీ మళ్లీ ఆయన్నే ఎందుకు ఎంచుకున్నట్టు?
శంకర్ '2.0' సినిమా షూటింగ్ కొనసాగుతుండగానే.. మరో సినిమాను ఫైనలైజ్ చేసి.. తన అభిమానుల్ని సంతోషంలో ముంచెత్తాడు రజనీకాంత్. 'కబాలి' దర్శకుడు పా రంజిత్‌తో తాను మరో సినిమా చేయబోతున్నట్టు ప్రకటించాడు సూపర్ స్టార్. ఈ సినిమాకు తన అల్లుడు ధనుష్ నిర్మాతగా ఉంటాడని తెలిపాడు. ఈ ప్రకటన సహజంగానే రజనీ అభిమానుల్ని థ్రిల్ చేసింది. సూపర్ హిట్ అయిన 'కబాలి'కి సీక్వెల్‌గా ఈ సినిమా రానున్నట్టు కథనాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో పా రంజిత్ 'టైమ్స్ ఆఫ్ ఇండియా' పత్రికతో ముచ్చటిస్తూ తనకు మరోసారి ఎలా అవకాశం వచ్చిందో వివరించారు. 'కబాలి విడుదలైన కొన్నిరోజులకు సౌందర్య (రజనీ కూతురు) మేడం నాకు కాల్ చేశారు. కబాలి సినిమా పట్ల రజనీ చాలా సంతోషంగా ఉన్నారని చెప్పారు. ఆయన నన్ను కలువాలనుకుంటున్నట్టు చెప్పారు. ఆయన అమెరికా నుంచి వచ్చిన తర్వాత మేం కలిశాం. ఈ సందర్భంగా రజనీ మాట్లాడుతూ 'నీతో పనిచేయడం ఎంతో బాగుంది. నీకు ఓకే అయితే, మనం కలిసి మళ్లీ ఒక సినిమా చేద్దాం' అన్నారు. దీంతో నేను ఎంతో సంతోషించాను. రజనీ సర్ సాధారణంగా దర్శకులకు రెండో అవకాశం ఇవ్వరు. ఇప్పటివరకు చాలా తక్కువమంది ఆయన నుంచి ఈ అవకాశం పొందారు' అని రంజిత్ చెప్పారు. ఈ సినిమాకు ధనుష్ నిర్మాతగా ఉంటారని రజనీయే చెప్పినట్టు వెల్లడించారు. అయితే, ఇది 'కబాలి' సినిమాకు సీక్వెలా? కాదా? అన్నది వెల్లడించడానికి ఆయన నిరాకరించారు. ప్రస్తుతం తాను సినిమా స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్నట్టు చెప్పారు. -
గౌతమ్ మీనన్ దర్శకత్వంలో సూపర్ స్టార్
ఇటీవల కబాలి సినిమాతో అంతర్జాతీయ సినీ అభిమానులకు కూడా తన వైపు తిప్పుకున్న సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్, ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రోబో సీక్వల్లో నటిస్తున్నాడు. భారతీయ సినీ చరిత్రలోనే అత్యధిక బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమా 2017 ద్వితియార్థంలో రిలీజ్ కానుంది. మరి ఇంతటి భారీ చిత్రం తరువాత రజనీ చేయబోయే సినిమా ఏంటి..? తాజాగా ఈ విషయంపై తమిళ నాట ఆసక్తికరమైన వార్త ఒకటి వినిపిస్తోంది. స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ లను తెరకెక్కించే గౌతమ్ మీనన్ దర్శకత్వంలో రజనీ తన నెక్ట్స్ సినిమా చేయనున్నాడన్న టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ధనుష్ హీరోగా సినిమా చేస్తున్న గౌతమ్ షూటింగ్ సయమంలో ధనుష్‌కు రజనీ కోసం తయారు చేసిన కథ వినిపించాడట. ధనుష్‌కు కథ నచ్చటంతో రజనీని కూడా ఒప్పించే పనిలో ఉన్నారట. ప్రస్తుతానికి అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ లేకపోయినా ఈ కాంబినేషన్‌పై మాత్రం మంచి అంచనాలే ఉన్నాయి. -
రజనీని ఆకట్టుకున్న అభిమాని
-
కబాలి డైరెక్టర్‌తో సూర్య సినిమా లేనట్టేనా..?
ఇటీవల కాలంలో భారీ హైప్ క్రియేట్ చేసిన సౌత్ సినిమా కబాలి. రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన ఈ యాక్షన్ డ్రామా ప్రపంచ వ్యాప్తంగా భారీగా రిలీజ్ అయ్యింది. ఈ సినిమాతో దర్శకుడు పా రంజిత్‌కు కూడా అదే స్థాయిలో క్రేజ్ ఏర్పడింది. అందుకే కబాలి రిలీజ్‌కు ముందే స్టార్ హీరోల నుంచి రంజిత్‌కు అవకాశాలు వచ్చాయి. తమిళ స్టార్ హీరో సూర్య అయితే తన నెక్ట్స్ సినిమా రంజిత్‌తోనే అని ప్రకటించేశాడు. అయితే కబాలి రిలీజ్ అయి ఇన్ని రోజులు గడుస్తున్న సూర్య, రంజిత్ల సినిమాపై ఎలాంటి క్లారిటీ లేదు. ముఖ్యంగా కబాలి రిలీజ్ తరువాత సినిమా అనుకున్న స్థాయిలో ఆకట్టుకోలేకపోవటంతో సీన్ రివర్స్ అయ్యింది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన కబాలి, నిర్మాతలకు మంచి లాభాలు తెచ్చిపెట్టినా.. డిస్ట్రీబ్యూటర్లు మాత్రం నష్టపోయారన్న టాక్ వినిపించింది. దీంతో సూర్య కూడా రంజిత్‌తో చేయబోయే సినిమా విషయంలో ఆలోచనలో పడ్డాడట. ప్రస్తుతానికి రంజిత్‌తో చేయాలనుకున్న సినిమాను పక్కకు పెట్టే ఆలోచనలో ఉన్నాడు సూర్య. -
రెడీ ఫర్ యాక్షన్
యస్.. ఐయామ్ రెడీ ఫర్ యాక్షన్ అంటున్నారు రజనీకాంత్. రేపట్నుంచి చెన్నైలో ‘2.0’ తాజా షెడ్యూల్ ప్రారంభం కానుంది. ఈ షెడ్యూల్లోనే రజనీ షూటింగ్‌కి హాజరు కానున్నారు. ‘కబాలి’ షూటింగ్ పూర్తయిన తర్వాత సూపర్‌స్టార్ మళ్లీ మేకప్ వేసుకోవడం ఇదే. అయితే.. ఈ నెలాఖరున లేదా సెప్టెంబర్ మొదటివారంలో రజనీ షూటింగ్లో పాల్గొంటారని సమాచారం. అప్పటివరకూ మిగతా నటీనటులపై కీలక సన్నివేశాలు తెరకెక్కించడానికి దర్శకుడు శంకర్ ప్లాన్ చేశారట. ఈ సినిమాలో ప్రముఖ బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ విలన్‌గా డాక్టర్ రిచర్డ్ పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే లీకైన అక్షయ్ గెటప్ ఆడియన్స్‌లో ఆసక్తి కలిగిస్తోంది. సూపర్ న్యాచురల్ పవర్స్ ఉన్న క్రోమ్యాన్గా అక్షయ్, రోబోగా రజనీకాంత్ చేసే యాక్షన్ సన్నివేశాలు చిత్రానికి హైలైట్‌గా నిలుస్తాయంటు న్నారు. అమీ జాక్సన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. -
వేలానికి కబాలి కోటు, కారు
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ యాక్షన్ డ్రామా కబాలి. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా రిలీజ్ తరువాత డివైడ్ టాక్ వచ్చినా.. కలెక్షన్ల విషయంలో మాత్రం దుమ్మురేపుతోంది. ప్రపంచ వ్యాప్తంగా సరికొత్త రికార్డ్లను నమోదు చేస్తూ రజనీ కలెక్షన్ స్టామినాను మరోసారి ప్రూవ్ చేసింది. అయితే ప్రపంచ వ్యాప్తంగా రజనీకి ఉన్న క్రేజ్‌ను మరింత ఉపయోగించుకోవాలని భావిస్తున్న చిత్రయూనిట్ కొత్త ప్లాన్ చేస్తోంది. కబాలి సినిమాలో సూపర్ స్టార్ రజనీకాంత్ వినియోగించిన కారుతో పాటు ఆయన వేసుకున్న దుస్తులను కూడా వేలానికి ఉంచాలని నిర్ణయించుకుంది. ఇప్పటికే వందల కోట్ల కలెక్షన్లతో సంచలనం సృష్టించిన కబాలి.. వేలం ద్వారా మరింత భారీ మొత్తాన్ని సొంతం చేసుకుంటుందని భావిస్తున్నారు. రజనీకి ఉన్న క్రేజ్ దృష్ట్యా ఇతర దేశాల నుంచి కూడా అభిమానులు వేలంలో పాల్గొంటారని.. అందుకు తగని ఏర్పాట్లు చేసే పనిలో ఉంది చిత్రయూనిట్. -
కబాలితో సమస్యలను ఎదుర్కొంటున్నా
తమిళసినిమా; కబాలి కారణంగా పలు సమస్యలను ఎదుర్కొంటున్నాననీ ఆ చిత్ర దర్శకుడు రంజిత్ పేర్కొన్నారు.తమిళచిత్రపరిశ్రమలో స్క్రీన్‌ప్లే కింగ్‌గా పెరొందిన నట,దర్శక నిర్మాత కే.భాగ్యరాజ్ వారసుడు శాంతను కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం వాయ్‌మై.ముక్తాభాను నాయకిగా నటించిన ఈచిత్రంలో గౌండ్రమణి,కే.భాగ్యరాజ్,పూర్ణిమా భాగ్యరాజ్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.ఏ.సెంధిల్‌కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని శనివారం సాయంత్రం స్ధానిక సాలిగ్రామంలోని ప్రసాద్‌ల్యాబ్‌లో నిర్వహించారు. తమిళ సినీ నిర్మాతల మండలి అధ్యక్షుడు కలైపులి ఎస్.ధాను అతిధిగా పాల్గొని చిత్ర ఆడియోను ఆవిష్కరించగా తొలి ప్రతిని దర్శకుడు రంజిత్ అందుకున్నారు.ఈ సందర్భంగా రంజిత్ మాట్లాడుతూ సమాజిక కట్టుబాటులను ఆవిష్కరించే చిత్రం వాయ్‌మై అని పాటలు,ప్రచార చిత్రాన్ని చూస్తుంటే తెలుస్తోందన్నారు.ప్రస్తుత సమాజంలో ఒక వ్యక్తి నిజాయితీగా జీవించగలడా?అని ప్రశ్నించే ఈ చిత్ర కధను తెరకెక్కించడానికి చాలా ధైర్యం కావాలన్నారు.తొలి చిత్రంతోనే అలాంటి ధైర్యంతో దర్శకుడు ఏ.సెంధిల్‌కుమార్ వాయ్‌మై చిత్రాన్ని తెరకెక్కించారని అన్నారు. ఇంతకు ముందు దర్శక నటుడు కే.భాగ్యరాజ్ ఇదు నమ్మఆళ్లు చిత్రానికి చాలా సమస్యలను ఎదుర్కొన్నారన్నారు.అదీ సామాజంలోని మూఢ ఆచారాలను తూర్పారబట్టిన కథా చిత్రం అని గుర్తు చేశారు.తాను కబాలి చిత్రంతో అలాంటి సమస్యలనే ఎదుర్కొంటున్నట్లు పేర్కొన్నారు.ఒక కళాకారుడిగా ప్రజల కోసం సమాజాన్ని,రాజకీయాలను ప్రశ్నించే చిత్రాలను చేయాలన్నారు.విమర్శించేవారు విమర్శిస్తునే ఉంటారనీ దర్శకుడు రంజిత్ వ్యాఖ్యానించారు. -
'కబాలి' కోసం బలి!
సూపర్ స్టార్ రజనీకాంత్ 'కబాలి' కళ్లు చెదిరే రికార్డు కలెక్షన్లతో దూసుకుపోతోంది. రిలీజ్‌కు ముందే భారీ హైప్‌ను క్రియేట్ చేసిన ఈ సినిమా కథ పరంగా కాస్త నిరాశపరచినా.. కలెక్షన్ల పరంగా కాసుల వర్షం కురిపిస్తుంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ.500 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. దాంతో తలైవా ఫ్యాన్స్ సంబరాలు జరుపుకొంటున్నారు. సూపర్ స్టార్‌ను అభిమానించేవారికన్నా ఆరాధించేవారి సంఖ్యే ఎక్కువన్న విషయం తెలిసిందే. ఆయన సినిమా విడుదలవుతుందంటే చాలు.. రజనీ విగ్రహాలకు పాలాభిషేకాలు, హారతులు కామన్. ఈసారి మరో అడుగు ముందుకేసి జంతు బలికి పూనుకున్నారు రజనీ ఫ్యాన్స్. కబాలి భారీ సక్సెస్ అయ్యి, రికార్డు కలెక్షన్లు రాబడుతున్నందున దిష్టి తగలకుండా ఉండాలనే ఉద్దేశ్యంతో మేకలను దేవుడికి బలి ఇస్తున్నారట ఫ్యాన్స్. ఎలాంటి చెడు చూపు సినిమా కలెక్షన్లపై పడకుండా, ఎటువంటి చెడు జరుగకుండా ఉండాలని కోరుకుంటూ మేకలను బలిచ్చే పనిలో ఉన్నారు సూపర్ స్టార్ వీరాభిమానులు. అయితే మూగజీవాలను ఇలా హింసించడం పట్ల జంతు ప్రేమికుల నుంచి నిరసన వ్యక్తమవుతోంది. ఫ్యాన్స్ అనాలోచిత కార్యక్రమాలను ఆపేందుకు తలైవానే నడుం బిగించాలని పలువురు కోరుకుంటున్నారు. -
కబాలి కలెక్షన్లు 600 కోట్లా..?
రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ సినిమా కబాలికి సంబందించి మరో ఆసక్తికరమైన వార్త మీడియా సర్కిల్స్‌లో వినిపిస్తోంది. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన కబాలి డివైడ్ టాక్‌తో మొదలైనా.. కలెక్షన్ల పరంగా మాత్రం సంచలనాలు నమోదు చేసింది. ప్రీవ్యూ షోస్ తోనే రికార్డ్‌లకు తెర తీసిన కబాలి, తొలి రోజు కలెక్షన్ల విషయంలో బాలీవుడ్‌కు కూడా సాధ్యం కాని భారీ రికార్డ్ సెట్ చేసింది. తాజాగా ఈ సినిమా కలెక్షన్లపై వినిపిస్తున్న వార్త బాలీవుడ్ ఇండస్ట్రీకి కూడా షాక్ ఇస్తోంది. ఇప్పటికీ భారీ సంఖ్యలో థియేరట్లలో కొనసాగుతున్న కబాలి, 600 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించిందన్న వార్త ఇండస్ట్రీ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ కలెక్షన్లపై అఫీషియల్‌గా ఎలాంటి ప్రకటనా లేకపోయినా ఫ్యాన్స్ కబాలి కలెక్షన్లు మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు. -
కబాలి వర్సెస్ సుల్తాన్.. గెలిచిందెవరు?
ఈ సీజన్లో విపరీతంగా క్రేజ్ సంపాదించుకున్న సినిమాలు రెండు. అవి సల్మాన్ ఖాన్ సుల్తాన్.. రజనీకాంత్ కబాలి. 'కబాలి' విడుదలయ్యే వరకు సుల్తాన్ బాక్సాఫీసును దున్నేశాడు. రికార్డు వసూళ్ల ప్రభంజనం సృష్టించాడు. కానీ, కబాలి ఎంట్రీతో సుల్తాన్ సైడ్ అయ్యాడు. కబాలి తన జోరు ఏంటో చూపాడు. రజనీ మానియాలో దేశం ఊగిపోయింది. బాక్సాఫీసు రికార్డులన్నీ బద్దలయ్యాయి. దీంతో సహజంగానే దేశంలో ఎవరు అతిపెద్ద సూపర్ స్టార్ అని చర్చ అభిమానుల్లో మొదలైంది. బాలీవుడ్ ఖాన్ త్రయం సల్మాన్, షారుఖ్ ఖాన్, ఆమిర్ ఖాన్ అందనంత స్థాయిలో రజనీ హల్చల్ చేశాడు. దేశంలో బిగ్గెస్ట్ స్టార్ సల్మానా? రజనీకాంతా? అన్న చర్చ అభిమానుల మొదలైంది... విడుదలకు ముందే కబాలి సినిమా కనీవినీ ఎరుగని క్రేజ్ సంపాదించుకుంది. దేశం మొత్తం రజనీ నామస్మరణలో మునిగిపోయింది. అంచనాలు ఆకాశాన్నంటాయి. దీంతో చెన్నై, బెంగళూరులోని పలు కంపెనీలు విడుదల రోజున సెలవు ప్రకటించాయి. జపాన్ అభిమానులు ఏకంగా విమానంలో చెన్నైకి వచ్చి తొలిరోజు సినిమా చూశారు. విడుదల రోజున ఉదయం 5 గంటల నుంచి అర్ధరాత్రి వరకు షోలు హౌస్‌ఫుల్ నడిచాయి. అభిమానులైతే 'కబాలి' రిలీజ్ నాడు జనజాతర చేశారు. రజనీ కటౌట్లను పాలాభిషేకాలతో ముంచెత్తారు. తొలిరోజు 90శాతం ఆక్యూపెన్సీతో రజనీ తన స్టామినా ఏంటో చూపించాడు. రిలీజ్ మానియా విషయంలో సల్మాన్ ఖాన్ 'సుల్తాన్' తేలిపోయింది. రజనీ సినిమాకు వచ్చిన ప్రీ రిలీజ్ క్రేజ్.. దేశంలో మరే స్టా్ర్ హీరో సినిమాకూ ఇప్పటివరకు రాలేదు. బాక్సాఫీసు వసూళ్ల విషయానికొస్తే కబాలి అన్ని రికార్డులను బద్దలుకొట్టాడు. ఒక్క బాహుబలి సినిమా రికార్డును మాత్రం కబాలి చిత్రం అందుకోలేకపోయింది. తొలిరోజు సుల్తాన్ సినిమా రూ. 36.5 కోట్లు వసూలు చేస్తే.. కబాలి ఏకంగా రూ. 48 కోట్లు కొల్లగొట్టింది. చాలా మల్టిప్లెక్స్ థియేటర్లలో తొలిరోజు సుల్తాన్ సినిమా టికెట్లను రూ. 300-350 వరకు అమ్మారు. అదే కబాలి విషయానికొస్తే మల్టిప్లెక్స్ హాల్స్‌లోనూ టికెట్ ధర రూ. 120కి మించలేదు. అయినా సుల్తాన్ రికార్డును కబాలి దాటాడు. ఓవర్సీస్ వసూళ్లు: అంతర్జాతీయ కలెక్షన్ల విషయంలోనూ కబాలి విజేతగా నిలిచాడు. అమెరికా బాక్సాఫీసు వద్ద భారతీయ సినిమా రికార్డులన్నింటినీ కబాలి కొల్లగొట్టింది. ఓవర్సీస్లోనూ సుల్తాన్ రికార్డులను కబాలి అవలీలగా దాటాడు. ప్రమోషన్స్: 'రేప్' వ్యాఖ్యల వివాదంలో చిక్కుకున్న సల్మాన్ ఖాన్ 'సుల్తాన్' సినిమా ప్రమోషన్లో పెద్దగా పాల్గొనలేదు. ఈ వివాదం వల్ల విలేకరులతోనూ మాట్లాడలేదు. ఇక రజనీకాంత్ తన సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో పెద్దగా పాల్గొన్నారు. 'కబాలి' సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో ఆయన మచ్చుకైనా కనిపించలేదు. సినిమా విడుదలకు నెల ముందే అమెరికాకు వెళ్లిపోయారు. విడుదలయ్యాక వచ్చారు. అయినా రజనీ మానియా దేశాన్ని చుట్టుకుంది. విమానాలపై పోస్టర్ల నుంచి కార్లపై ఫొటోలు, కటౌట్లు, ఆన్లైన్ అమ్మకాలు ఇలా సర్వత్రా రజనీ మ్యాజిక్ అంటే ప్రపంచానికి చూపింది. ఇంతకంటే ప్రూఫ్ కావాలా రజనీ దేశంలో ఎంతపెద్ద స్టారో చెప్పడానికి అంటున్నారు ఫ్యాన్స్.. -
'బాహుబలి' రికార్డు సేఫ్!
చెన్నై: బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించిన రజనీకాంత్ 'కబాలి' మొదటి వారం తర్వాత నెమ్మదించింది. అయితే ఫస్ట్ వీక్ లో మాత్రం రికార్డు వసూళ్లు సాధించింది. మొదటి వారంలో ప్రపంచవ్యాప్తంగా రూ.262 కోట్లు వసూలు చేసిందని ట్రేడ్ ట్రేకర్ బి. రమేశ్ వెల్లడించారు. 'కబాలి' సినిమా ఇండియా రూ.149 కోట్లు నెట్ వసూళ్లు సాధించింది. గ్రాస్ కలెక్షన్ రూ.172 కోట్లుగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా రూ. 90 కోట్లు వసూలు చేసిందని, మొత్తంగా మొదటి వారంలో రూ. 262 కోట్లు కొల్లగొట్టిందని ట్విట్టర్ ద్వారా రమేశ్ తెలిపారు. 'బాహుబలి' రికార్డును తమ సినిమా బ్రేక్ చేస్తుందని కబాలి' నిర్మాత కళైపులి ఎస్. థాను అంతకుముందు ప్రకటించారు. అయితే కలెక్షన్లు తగ్గిపోవడంతో 'బాహుబలి' రికార్డును 'కబాలి' చేరుకోవడం కష్టం అంటున్నారు విశ్లేషకులు. విడుదలైన మొదటి నుంచే భారీ వసూళ్లు రాబట్టిన 'బాహుబలి' రూ.500 కోట్ల మైలురాయిని అందుకుంది. 'కబాలి' కలెక్షన్లు రూ.500 కోట్లు దాటటకపోవచ్చని విశ్లేషకులు అంచనా. నార్త్ ఇండియాలోనూ 'బాహుబలి' తర్వాతే కబాలి నిలిచిందని డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఫాక్స్ స్టార్ వెల్లడించింది. -
'రజనీకాంత్‌ను వృద్ధాశ్రమంలో చేర్చండి'
చెన్నై: సూపర్ స్టార్ రజనీకాంత్ కబాలి చిత్రం విడుదలైనా... ఆ సినిమా గురించి రోజుకో వార్త వెలువడుతోన్న విషయం తెలిసిందే. తాజాగా ఓ యువకుడు తాను మోసపోయానంటూ పోలీసులను ఆశ్రయించాడు. వివరాల్లోకి వెళితే... రజనీకాంత్‌ను తమిళ నిర్మాతల నుంచి కాపాడి వృద్ధాశ్రమంలో చేర్చాలంటూ చెన్నై వడపళినికి చెందిన కందస్వామి అనే వ్యక్తి నగర పోలీస్ కమిషనర్ కు రెండురోజుల క్రితం ఓ వినతిపత్రం సమర్పించాడు. 'రజనీకాంత్ హీరోగా ఇటీవల విడుదలైన కబాలీకి ఎక్కువగా ప్రచారం చేసి వెంటనే చూడాలనే ఆసక్తిని రేకెత్తించారు. దీంతో అశోక్ నగర్ లోని కాశీ థియేటర్లో రూ.1200లకు టికెట్ కొని కబాలి సినిమా చూశాను. అయితే హీరో రజనీకాంత్, దర్శకుడు రంజిత్ ఇద్దరూ మోసం చేశారు. 66 ఏళ్ల సీనియర్ సిటిజన్ అయిన రజనీకాంత్ చేత ఫైట్స్ చేయించి నిర్మాత, దర్శకులు నన్ను చిత్రవధ చేశారు. సీనియర్ సిటిజన్స్‌కు తమిళనాడు ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. తమిళ నిర్మాతల నుంచి రజనీకాంత్ ను కాపాడి వృద్ధాశ్రమంలో చేర్చండి.' అంటూ కందస్వామి వినతిపత్రంలో పేర్కొన్నాడు. -
కబాలి టైటిల్స్ పై వివాదం.. ఫిర్యాదు
సుల్తాన్‌బజార్(హైదరాబాద్): డివైడ్ టాక్ వచ్చినా భారీ కలెక్షన్లతో దూసుకుపోతున్న సూపర్ స్టార్ రజనీకాంత్ చిత్రం 'కబాలి'పై తొలిసారిగా వివాదం చెలరేగింది. సినిమా టైటిట్స్ లో రజనీకాంత్ పేరు ముందు పద్మవిభూషణ్ బిరుదును ఉంచడంపై తెలంగాణ రక్షణ వేదిక(టీఆర్ వి) మండిపడింది. శుక్రవారం హైదర్ గూడలోని న్యూస్ సర్వీస్ సిండికేట్(ఎన్ఎస్ఎస్)లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వేదిక రాష్ట్ర అధ్యక్షుడు మల్లేష్‌యాదవ్ మాట్లాడారు. కబాలిలో హీరో పేరును 'పద్మవిభూషణ్' రజనీకాంత్ గా చూపారని, రాజ్యాంగంలోని ఆర్టికల్ 18(1) ప్రకారం అలా చేయడం చట్టవిరుద్ధమని టీఆర్ వి అధ్యక్షుడు అన్నారు. నటీనటులు తమకు లభించిన పౌరపురస్కారాలను సినిమా టైటిళ్లలో ప్రదర్శించరాదంటూ గతంలో నటులుమోహన్ బాబు, బ్రహ్మానందంల కేసుల్లో కోర్టులు ఇచ్చిన తీర్పులను ఆయన గుర్తుచేశారు. ఈ మేరకు 'కబాలి' సినిమా సంబంధిత వ్యక్తులపై సెన్సార్ బోర్డు రిజినల్ కార్యాలయంలో ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. -
ఉత్తరాదిన కబాలి ప్రభంజనం
న్యూఢిల్లీ: బాక్సాఫీసు వద్ద రికార్డులు బద్దలుకొడుతున్న తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా కబాలి దక్షిణాదిలోనే కాదు ఉత్తరాదినా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఈ నెల 22న విడుదలైన ఈ సినిమా ఇప్పటివరకు హిందీ వర్షెన్‌లో 28 కోట్ల రూపాయలను వసూలు చేసింది. తెలుగు చిత్రం బాహుబలి తర్వాత ఉత్తరాదిన అత్యధిక కలెక్షన్లు సాధించిన రెండో దక్షిణాది సినిమాగా కబాలి నిలిచింది. పా రంజిత్ దర్శకత్వం వహించిన కబాలి సినిమాను తమిళం, తెలుగు, హిందీ ఇతర భాషల్లో విడుదల చేశారు. కబాలి ప్రపంచ వ్యాప్తంగా 320 కోట్ల వసూళ్లు సాధించినట్టు గురువారం ఈ సినిమా నిర్మాత థాను ప్రకటించాడు. ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వచ్చినా భారత్‌తో పాటు విదేశాల్లోనూ రికార్డు కలెక్షన్లు వస్తున్నాయి. మలేసియాలో నివసించే తమిళుల హక్కుల కోసం పోరాడే గ్యాంగ్‌స్టార్ పాత్రలో రజనీ నటించారు. రజనీ సరసన బాలీవుడ్ హీరోయిన్ రాధికా ఆప్టే, కూతురిగా ధన్సిక నటించారు. -
సారీ చెప్పిన కబాలి హీరోయిన్..
బాక్సాఫీసు వద్ద రికార్డులు బద్దలుకొడుతున్న కబాలిలో తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ సరసన నటించి మంచి మార్కులు కొట్టేసిన బాలీవుడ్ హీరోయిన్ రాధికా ఆప్టే ఈ సినిమా విజయాన్ని ఎంజాయ్ చేస్తోంది. కాగా ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొననందుకు విచారం వ్యక్తం చేసింది. ఇందుకు క్షమాపణలు చెప్పింది. కబాలి ప్రమోషన్‌కు దూరమవడం దురదృష్టకరమని, మరో సినిమా షూటింగ్లో పాల్గొనాల్సిరావడమే దీనికి కారణమని చెప్పింది. కబాలి సినిమా విడుదల తేదీని అనుకోకుండా ప్రకటించారని, ఆ సమయంలో తాను వేరే సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్నానని రాధిక తెలిపింది. ఈ సినిమా అన్ని రికార్డులు బద్దలుకొడుతోందని, రజనీకాంత్‌తో నటించే అవకాశం రావడాన్ని గొప్పగా భావిస్తున్నానని చెప్పింది. తాను నటించిన మంచి పాత్రల్లో ఈ సినిమాలోనిది ఒకటంటూ, సినిమా గొప్ప విజయం సాధించినందుకు సంతోషంగా వ్యక్తం చేసింది. కబాలి సినిమాలో రజనీకాంత్ భార్యగా రాధికా, కూతురుగా మరో కీలకపాత్రలో ధన్సిక నటించింది. ఈ సినిమాకు మిశ్రమ స్పందన వచ్చినా భారీ కలెక్షన్లు సాధిస్తోంది. -
300 కోట్లు దాటిన 'కబాలి' కలెక్షన్స్
సూపర్ స్టార్ రజనీకాంత్ కలెక్షన్ స్టామినా ఏంటో మరోసారి ప్రూవ్ అయ్యింది. సూపర్ హిట్ టాక్ రాకపోయినా కేవలం రజనీ ఫాలోయింగ్‌తో కబాలి సరికొత్త రికార్డ్‌లు సృష్టిస్తోంది. రజనీకాంత్, పేదల కోసం పోరాడే మాఫియాడాన్‌గా నటించిన ఈ సినిమా.. భారత్‌తో పాటు ఇతర దేశాల్లో కూడా వసూళ్ల వర్షం కురిపిస్తోంది. తొలి వారం కాస్త తడబడినట్టుగా కనిపించినా ప్రస్తుతం కలెక్షన్లు బాగానే ఉన్నాయంటున్నారు చిత్రయూనిట్. గురువారం సాయంత్రం చెన్నైలో జరిగిన సక్సెస్ మీట్లో కలెక్షన్లపై నిర్మాత థాను క్లారిటీ ఇచ్చారు. పా రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన కబాలి ప్రపంచ వ్యాప్తంగా 320 కోట్ల వసూళ్లు సాధించినట్టుగా ప్రకటించారు. రజనీ మానీయా కారణంగా కేవలం ఆరు రోజుల్లో ఈ కలెక్షన్లు సాధ్యమయ్యాయన్నారు. ఇప్పటికే తొలి రోజు రికార్డ్ల విషయంలో టాప్‌గా నిలిచిన కబాలి, రోబో కలెక్షన్ల రికార్డ్లను చెరిపేస్తుందన్న నమ్మకంతో ఉన్నారు ఫ్యాన్స్. -
కబాలిలో ‘మై ఫాదర్ బాలయ్య’
కబాలి సినిమాలో తెలంగాణ రచయిత పుస్తకం సూపర్‌స్టార్ రజనీకాంత్ చేతిలో దర్శనం ‘మై ఫాదర్ బాలయ్య’ పుస్తకానికి అంతర్జాతీయ గుర్తింపు ఖండాంతరాలు దాటిన వైబీ సత్యనారాయణ ఖ్యాతి ఆ పుస్తకంలో కళ్లకుకట్టినట్టుగా కుల వివక్ష చర్చనీయాంశమైన పుస్తక సారాంశం ‘సాక్షి’తో రచయిత ప్రొఫెసర్ వైబీ మనోగతం తెలంగాణ రచయిత వైబీ సత్యనారాయణకు కబాలి సినిమాతో అంతర్జాతీయ గుర్తింపు లభించింది. కరీంనగర్ జిల్లాకు చెందిన ఈయన తన కుటుంబ నేపథ్యాన్ని వివరిస్తూ రాసిన‘మై ఫాదర్ బాలయ్య’ పుస్తకం తాజాగా కబాలి సినిమాలో సూపర్ స్టార్ రజనీకాంత్ చేతిలో దర్శనమివ్వడం చర్చనీయాంశంగా మారింది. రచయిత పుస్తకం కుల వివక్షపై, కబాలి సినిమాను జాతి వివక్ష ఆధారంగా నిర్మించడంతో ఈ పుస్తకం రజనీ చెంతకు చేరింది. రచయిత ప్రొఫెసర్ వైబీ సత్యనారాయణ మిరుదొడ్డికి వచ్చిన సందర్భంగా ‘సాక్షి’తో తన మనోగతాన్ని పంచుకున్నారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే... – మిరుదొడ్డి కుటుంబ నేపథ్యం.. మాది కరీంనగర్ జిల్లా, కమలాపురం మండలం, వంగపల్లి గ్రామం. మా అయ్య, అవ్వ పేర్లు నర్సమ్మ, బాలయ్య. వారికి మేము ఐదుగురం సంతానం. అందులో నేను ఐదోవాడిని. మా అన్నదమ్ముల్లో ముగ్గురు డాక్టరేట్లు కావడం విశేషం. అప్పటి కాలంలో అంటరాని కులంలో ఇంత పెద్ద చదువు చదవడం చరిత్రగా చెప్పుకునే వారు. మా అయ్య రైల్వేలో చిరు ఉద్యోగిగా ఉంటటం వల్ల మా విద్యాభ్యాసం రైల్వే స్కూళ్లలోనే సాగింది. మా అయ్య ఉద్యోగి కావడంతో అప్పుడప్పుడు బదిలీల పేరిట వలస వెళ్లే వారిమి. వలస వెళ్లిన ప్రదేశాల్లో అంటరాని కులమని వివక్ష చూపించే వారు. పుస్తకం రాయాలన్న ఆలోచన కలిగింది ఇక్కడే... తరతరాలుగా నా కుటుంబం కులపరంగా వివక్ష ఎదుర్కొంటున్న నేపథ్యాన్ని ఒక పుస్తక రూపం ఇవ్వాలని అనిపించింది. మా ముత్తాత, తాత, మా అయ్య, నేను ఎదుర్కొన్న వివక్షకు పుస్తక రూపమిచ్చా. అందులో ఒకే కుటుంబానికి చెందిన నాలుగు తరాల కుటుంబాలు కుల వివక్షకు గురైతే కబాలిలో ఒక దేశ జాతి వివక్షకు గురయ్యే విధానాన్ని వెలుగులోకి తీసుకొచ్చారు. ఇది చెప్పుకోదగిన విషయం. ఆ పుస్తకంలో ఏముందంటే... తెలంగాణలో ఒకే కులం, ఒకే కుటుంబం నాలుగు తరాలుగా ఏ విధంగా వివక్షకు గురైందనేది పుస్తకంలో పొందుపర్చాను. అందులో ముందుగా మా ముత్తాత నర్సయ్య.. మాదిగ కులంలో పుట్టినందుకు ఎన్నో విధాలుగా వివక్షకు గురయ్యాడు. చెప్పులు కుట్టడంలో మంచి నేర్పరి. ఒకానొక సందర్భంలో నిజాం నవాబుకు మంచి చెప్పులు కుట్టి ఇవ్వాలన్న పట్టుదలతో ఓ మంచి లేత ఆవు దూడ తోలుతో సుతి మొత్తని చెప్పులు కుట్టి నవాబు కాళ్లకు తొడిగాడు. చెప్పులు కుట్టడంలో మంచి నేర్పరి తనానికి మెచ్చుకున్న నిజాం నవాబు మా మూత్తాతకు 50 ఎకరాల జమీను (భూమి) ఫరాణ (జీవో) ఇవ్వాలని ఆదేశించారు. మాదిగ కులానికి చెందిన నర్సిగానికి నిజాం నవాబు 50 ఎకరాల భూమి ఇచ్చిన విషయం తెలుసుకున్న పటేలు... నీచపు జాతికి చెందిన నీకు ఎందుకురా 50 ఎకరాలు అంటూ 48 ఎకరాలు పటేలు స్వాధీనం చేసుకున్నాడు. కేవలం రెండు ఎకరాలు మాత్రమే సాగు చేసుకోమ్మని మా ముత్తాతను బెదిరించాడు. అప్పటికి పటేళ్లు చెప్పిందే వేదం. మా ముత్తాతకు వచ్చిన రెండు ఎకరాలు మా ముత్తాత కొడుకు పెద్ద మాదిగ నర్సయ్యకు (ముత్తాత కొడుకు పేరు కూడా నర్సయ్యనే) వారసత్వంగా వచ్చింది. వారసత్వంగా వచ్చిన రెండు ఎకరాల్లో మా తాత నర్సయ్య, మా తాతమ్మ పోచవ్వలు మంచిగా సాగు చేసుకుంటున్న తరుణంలో పటేలు కొడుకు దౌర్జన్యం చేశాడు. రెండకరాల సాగుకు నీరందకుండా అడ్డుపడి ఉన్న ఉపాధి బందు జేయించిండు. మా తాత కొడుకు బాలయ్య (అంటే మా అయ్య) మా ఊర్లె ఆలీ సాబు అనే ముస్లిం తాత మా అయ్యకు చదువు నేర్పించాడు. ఆ చదువుతో మా అయ్య బాలయ్య రైల్వేలో చిన్న ఉద్యోగం సంపాదించుకున్నాడు. ఉద్యోగ రీత్యా బదిలీల రూపంలో వలసలు వెళ్లేవారిమి. అక్కడ కూడా అంటరాని కులమని చాలా చులకనగా చూసేవారు. మా అయ్య బాలయ్య ఎన్ని అడ్డంకులు ఎదురైనా చదువు విషయంలో రాజీపడక పోతుండే. ఆయన ఆశయాన్ని నెరవేర్చడానికి మేము కష్టపడి చదివాం. మాకంటూ ఓ ప్రత్యేకతను ఏర్పర్చుకున్నాం. అందుకే నేను రాసిన పుస్తకానికి ‘మై ఫాదర్ బాలయ్య’ అన్న పేరు పెట్టుకున్నా. మై ఫాదర్ బాలయ్య పుస్తకం దేశంలో ఉన్న కుల వివక్షను ఎత్తి చూపుతుంది. కూలీ నుంచి నాయకత్వ లక్షణాల వరకు బతుకు దెరువు కోసం వలస వెళ్లే వారి కూలీ బతుకుల్లో నాయకత్వ లక్షణాలను అలవర్చుకోవాలని నా పుస్తకం చెబుతుంది. ఒకే కుటుంబంలో నాలుగు తరాలు వివక్షను ఎదుర్కొన్న నేపథ్యాన్ని మై ఫాదర్ బాలయ్య తెలియ జేస్తే, ఒక దేశ జాతి వివక్షను కబాలి సినిమా తెలియజేస్తూనే కూలీ నుంచి నాయకత్వ లక్షణాలు అలవర్చుకోవాలని స్ఫూర్తినిస్తోంది. కరీంనగర్లో సంబరాలు చేసుకున్నారు... కబాలి చిత్రం విడుదలైన మొదటి రోజే కరీంనగర్ ప్రజలు సంబరాలు చేసుకున్నట్టు మిత్రుల ద్వారా తెలుసుకుని చాలా సంతోషించా. కబాలి చిత్ర హీరో రజనీకాంత్ చేతిలో మా కరీంనగర్ వాసి రాసిన మై ఫాదర్ బాలయ్య పుస్తకం ఉండటం చూసి జిల్లా వాసులు ఎంతో సంబరపడిపోయారు. ఒక అంతర్జాతీయ చిత్రంలో తెలంగాణకు చెందిన దళిత రచయిత రాసిన పుస్తకం కనిపించడం సంతోషంగా ఉందని తెలంగాణ ప్రజలు అభినందనలు తెలుపుతుండటం గర్వంగా ఉంది. ఎడ్యుకేషన్ ద స్ట్రాంగెస్ట్ వెపన్ సమాజంలో అసమానతలను రూపుమాపాలంటే చదువు ఒక్కటే మార్గం. ఎడ్యుకేషన్ ద స్ట్రాంగెస్ట్ వెప(విద్య అనేది అత్యం త పదునైన ఆయుధం). ప్రతి వ్యక్తిలో విద్య అనేది ఉంటే దేశంలో పేట్రేగిపోతున్న అసమానతలను చీల్చుకుంటూ ముందుకు సాగవచ్చు. ఒక మనిషిని ఉన్నత స్థానాన్ని చేరుకోవాలంటే బాగా కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహిస్తేనే సమాజంలో తమకంటూ ఓ గుర్తింపు లభిస్తుంది. నా అసలు పేరు... నా అసలు పేరు ఎలుకటి సత్తయ్య. నా సతీమణి గాయత్రి. చదువుతున్న రోజుల్లో నేనే అన్నిట్లో హుషారుగా ఉన్నానని మా హెడ్మాస్టర్.. మా అయ్య పేరు కలిసేటట్టు ఎలుకటి బాలయ్య సత్యనారాయణగా పేరు మార్చారు. కబాలి చేతికి ఆ పుస్తకం ఎలా వెళ్లిందంటే... నేను రాసిన మై ఫాదర్ బాలయ్య పుస్తకం కేవలం ఇంగ్లిష్‌లోనే మార్కెట్లో లభ్యమయ్యేది. ప్రస్తుతం హిందీ, కన్నడ భాషల్లో అనువాదమై జాతీయ స్థాయిలో మంచి పేరు లభించింది. కాగా ఇదే పుస్తకాన్ని తమిళంలో అనువాదం చేయడానికి తమిళనాడుకు చెందిన జీనీ అనే మహిళ ఇంగ్లిష్‌లో ఉన్న మై ఫాదర్ బాలయ్యను తమిళ భాషలోకి అనువదిస్తున్నారు. ఆశ్చర్యమేమిటంటే జీనీ అనే మహిళ కబాలి డైరెక్టర్ పారంజిత్ వద్ద అసిస్టెంటు డైరెక్టర్‌గా పని చేస్తున్నారు. నాలుగు తరాల కుటుంబం వివక్షతను ఎదుర్కొంటున్న నేపథ్యం, ఒక దేశ జాతి నాలుగు తరాలుగా ఎదుర్కొంటున్న వివక్షకు దగ్గరి పోలిక ఉండటంతో మై ఫాదర్ బాలయ్య పుస్తకాన్ని డైరెక్టర్ పారంజిత్ ద్వారా తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ వద్దకు చేరింది. కబాలి చిత్ర కథకు, ఈ పుస్తకానికి ఒకే రకమైన సందేశం ఉండటంలో రజనీకాంత్ ఓకే చెప్పారు. కబాలి చిత్ర కథ ప్రారంభంలోనే హీరో రజనీకాంత్ చేతిలో ఈ పుస్తకం ఉండేలా చిత్రీకరించారు. అప్పటికే జాతీయ స్థాయిలో పేరున్న ఈ పుస్తకం కబాలి చిత్రంలో కన్పించడంతో అంతర్జాతీయంగా గుర్తింపు లభించినట్లయింది. -
కబాలి రికార్డ్ బ్రేక్ చేసిన బాహుబలి
సౌత్ సినిమా రేంజ్ రోజు రోజుకు భారీగా పెరిగిపోతుంది. ఒకప్పుడు బాలీవుడ్ సినిమాకు మాత్రమే సాధ్యం అనుకున్న వందల కోట్ల కలెక్షన్లను ఇప్పుడు సౌత్ సినిమాలు కూడా అవలీలగా సాధించేస్తున్నాయి. టాప్ స్టార్ల సినిమాలు ప్రీ రిలీజ్ బిజినెస్‌లోనే వంద కోట్ల కలెక్షన్లకు చేరువవుతున్నాయి. ఇక ప్రపంచ సినీ అభిమానులను సైతం తన వైపు తిప్పుకున్న కబాలి సౌత్ సినిమా రేంజ్ ఏంటో ప్రూవ్ చేసింది. అయితే ఇంతటి భారీ కలెక్షన్లు సాధించిన కబాలి రికార్డ్‌లు అప్పుడే బ్రేక్ అవుతున్నాయి. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న విజువల్ వండర్ బాహుబలి 2 రికార్డుల వేట మొదలుపెట్టింది. ప్రీ రిలీజ్ బిజినెస్ మొదలు పెట్టిన బాహుబలి యూనిట్, తొలి అడుగులోనే కబాలి రికార్డ్‌ను బద్దలు కొట్టి సత్తా చాటింది. కబాలి సినిమా మళయాల రైట్స్‌ను హీరో మోహన్ లాల్ 7.5 కోట్లకు సొంతం చేసుకున్నారు. ఇప్పుడు ఆ రికార్డ్‌ను బ్రేక్ చేస్తూ బాహుబలి 2 మళయాల రేట్స్ 10.5 కోట్లకు అమ్ముడయ్యాయి. మాలీవుడ్‌లో ప్రముఖ డిస్ట్రీబ్యూషన్ కంపెనీగా పేరున్న గ్లోబల్ యునైటెడ్ మీడియా ఈ భారీ మొత్తాన్ని ఆఫర్ చేసి బాహుబలి రైట్స్ సొంతం చేసుకుంది. బాహుబలి తొలి భాగం రైట్స్‌ను కూడా ఇదే కంపెనీ సొంతం చేసుకోవటం విశేషం. ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో క్లైమాక్స్ చిత్రీకరణలో ఉన్న బాహుబలి 2 సినిమాను 2017 ఏప్రిల్ 14 రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. -
ఐదున్నరకు ఏం జరిగింది?
‘5:35’.. సూర్య నటించనున్న చిత్రం టైటిల్ ఇది. ఈ టైటిల్ వెనక దాగున్న రహస్యం ఏంటి? ఐదు గంటల ముప్పైఐదు నిమిషాలకు ఏం జరిగింది? అనేది చెప్పబోతున్నారా? మరొకటి ఏమైనా ఉందా? ఈ ప్రశ్నకు సమాధానం కొన్ని రోజుల్లో దొరుకుతుంది. రజనీకాంత్‌ని ‘కబాలి’గా చూపించిన దర్శకుడు పా.రంజిత్ ఈ ‘5:35’ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. ఇందులో సూర్య బాక్సర్‌గా కనిపిస్తారట. స్టూడియో గ్రీన్ పతాకంపై కేఈ జ్ఞానవేల్ రాజా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. సెప్టెంబర్‌లో షూటింగ్ మొదలు కానుంది. సూర్య తమ్ముడు కార్తి, పా.రంజిత్ కలయికలో వచ్చిన ‘మద్రాస్’ ఘనవిజయం సాధించింది. ‘కబాలి’ కథను మొదట విన్నది సూర్యనే. నాకంటే రజనీకాంత్ గారికి ఈ కథ బాగుంటుందని రంజిత్‌ను స్వయంగా సూపర్‌స్టార్ వద్దకు తీసుకువెళ్లి, ఆ సినిమా తెరకెక్కడానికి కారణమయ్యారు. రజనీని చాలా స్టైలిష్‌గా చూపించిన రంజిత్ ఇప్పుడీ ‘5:35’లో సూర్యను ఎలా చూపించబోతున్నారో! ప్రస్తుతం సూర్య నటిస్తున్న ‘సింగం 3’ చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. -
రజనీకాంత్‌కు భారతరత్న!
మహారాష్ట్ర ఎమ్మెల్యే ప్రతిపాదన ముంబై: సూపర్ స్టార్ రజనీకాంత్ తాజా చిత్రం ‘కబాలి’.. భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమాతో దేశమొత్తం రజనీ నామస్మరణలో మునిగిపోయింది. సినిమాకు రివ్యూలు ఎలా వచ్చినా కలెక్షన్ల వర్షం భారీగా కురుస్తూ.. తలైవా స్టామినా ఏమిటో చాటుతోంది. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర బీజేపీ ఎమ్మెల్యే అనిల్ గోటే ఓ అరుదైన ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. దేశంలో అత్యున్నత పౌర పురస్కారమైన ‘భారత రత్న’ను రజనీకాంత్‌కు ప్రదానం చేయాలని ఆయన కోరారు. మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించే అత్యున్నత పురస్కారం ‘మహారాష్ట్ర భూషణ్’ను రజనీకాంత్‌కు ఇవ్వాలని ఆయన దేవేంద్ర ఫడ్నవిస్ సర్కారుకు ప్రతిపాదించారు. పనిలో పనిగా రజనీకాంత్‌కు ‘భారత రత్న’ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ మహారాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేయాలని ఆయన కోరారు. రజనీని మహారాష్ట్ర భూమిపుత్రుడిగా అభివర్ణించిన ఎమ్మెల్యే గోటే.. ఆయన అభిమానులకు దేవుడితో సమానమని, తాజా సినిమా సక్సెస్ సినీ పరిశ్రమలో రజనీకున్న స్థానాన్ని చాటుతున్నదని పేర్కొన్నారు. అసాధారణ కలెక్షన్లతో దూసుకుపోతున్న ‘కబాలి’ ఇప్పటికే రూ. 200 కోట్ల క్లబ్బులో ఎంటరైంది. దక్షిణాదిన ఈ సినిమాకు భారీ వసూళ్లు వస్తుండటంతో ‘కబాలి’ కలెక్షన్లు రూ. 300 కోట్లకు చేరవచ్చునని భావిస్తున్నారు. -
సంపూ బాబు, రజనీ మీదే కౌంటరేశాడు..!
యూట్యూబ్ సెన్సేషన్తో వెండితెర మీద అడుగుపెట్టిన బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు, ఎప్పటికప్పుడు తన ఫాలోయింగ్‌ను కాపాడుకునే ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. సోలో హీరోగా సినిమాలు చేస్తూనే కామెడీయన్‌గా కూడా దూసుకుపోతున్న సంపూ, తన ట్విట్టర్ పేజ్‌లో స్టార్ హీరోలను ఉద్దేశించి పెట్టిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. సినిమా మొదట్లో వచ్చే ఈ నగరానికేమయ్యింది యాడ్ స్టైల్లో ఈ ఏడాది స్టార్ హీరోల సినిమాలు ఫ్లాప్ అవ్వడంపై కౌంటరేశాడు సంపూ. సోషల్ మీడియాలో ఎవరో పోస్ట్ చేసిన కామెంట్‌ను షేర్ చేశాడు సంపూ. 'ఈ 2016కి ఏమైంది? ఓ పక్క సర్థార్ గబ్బర్‌సింగ్, మరో పక్క బ్రహ్మోత్సవం. కబాలి కూడా నోరుమెదపలేదు, ఈ నిర్లక్ష్య ధోరణికి కొబ్బరి మట్ట పాడాలి చరమగీతం' అని రాసున్న పోస్ట్‌ను షేర్ చేశాడు. అయితే ఇలాంటి పోస్ట్‌లు షేర్ చేస్తే అభిమానుల నుంచి ఏ స్థాయిలో వ్యతిరేకత వస్తుందో ముందే ఆలోచించిన సంపూర్ణేష్, ఎవరో పంపించారు సరదాకి తీసుకోండి అంటూ స్టార్ హీరోల అభిమానులను కూల్ చేసే ప్రయత్నం అయితే చేశాడు. అదే సమయంలో తన కొబ్బరి మట్ట సినిమాకు మంచి ప్రమోషన్ కూడా చేసుకున్నాడు. Hahaha....evaro pampincharu...saradaki theesukondi pic.twitter.com/I4d9U4C2Bs— Sampoornesh Babu (@sampoornesh) 24 July 2016 -
ఒకేసారి... ఒకటికి... అయిదు!
‘శ్రీమంతుడు’, ‘రుద్రమదేవి’, ‘నాన్నకు ప్రేమతో’, ‘సుప్రీమ్’, ‘కబాలి’ సినిమాలతో పాటు పలు సినిమాలను పంపిణీ చేసిన అభిషేక్ పిక్చర్స్ సంస్థ నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టింది. ఒకేసారి ఐదు చిత్రాలు ప్లాన్ చేశారీ సంస్థ అధినేత అభిషేక్. ఇప్పటికే ఫాంటమ్-రిలయన్స్ సంస్థలతో కలిసి అభిషేక్ పిక్చర్స్ నిర్మిస్తున్న హిందీ ‘హంటర్’ తెలుగు రీమేక్ తొలి షెడ్యూల్ పూర్తి చేసుకుంది. నవీన్ మేడారం దర్శకత్వంలో శ్రీనివాస్ అవసరాల హీరోగా ఈ చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రానికి సునీల్ కశ్యప్ సంగీత దర్శకుడు. కాగా, బోయపాటి శ్రీను దర్శకత్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా ఓ యాక్షన్ ఎంటర్టైనర్ను నిర్మించనున్నామని అభిషేక్ తెలిపారు. ఇందులో రకుల్ ప్రీత్‌సింగ్ కథానాయిక. దేవిశ్రీప్రసాద్ పాటలు స్వరపరుస్తారు. రిషీ పంజాబీ కెమేరామ్యాన్‌గా వ్యవహరించనున్న ఈ చిత్రం షూటింగ్ సెప్టెంబర్‌లో ఆరంభం కానుంది. సుధీర్ వర్మ దర్శకత్వంలో నిఖిల్ హీరోగా రూపొందించనున్న చిత్రం షూటింగ్‌ని కూడా ఇదే నెలలోనే ప్రారంభిస్తామని అభిషేక్ చెప్పారు. అడివి శేష్, అదా శర్మ జంటగా రవికాంత్ పేరేపు దర్శకత్వంలో నిర్మించబోతున్న ‘గూఢచారి’ చిత్రాన్ని ఆగస్టులో ప్రారంభిస్తామని పేర్కొన్నారు. సుధీర్‌బాబు హీరోగా ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు పుల్లెల గోపీచంద్ జీవితం ఆధారంగా తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో రూపొందించనున్న చిత్రానికి సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ వర్క్ పూర్తయిందని చెప్పారు. ఈ ఐదు చిత్రాలకూ ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా కాలి సుధీర్ వ్యవహరిస్తారు. -
కబాలి విమానం సీక్రెట్ ఇదే..
విడుదలకు ముందే సంచలనం సృష్టించిన తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా కబాలికి సంబంధించి ఎన్నో విశేషాలున్నాయి. బాక్సాఫీసు వద్ద రికార్డు కలెక్షన్లు సాధిస్తున్న కబాలిని రిలీజ్‌కు ముందు ప్రమోట్ చేయడానికి, రజనీ క్రేజ్‌ను ఉపయోగించుకోవడానికి కార్పొరేట్ కంపెనీలు పోటీపడ్డ సంగతి తెలిసిందే. రజనీ అభిమానులను ఎక్కువగా ఆకర్షించింది మాత్రం కబాలి విమానం. మలేసియాకు చెందిన ఎయిర్ఏషియా సంస్థ కబాలి పేరుతో ఓ విమానాన్ని నడిపింది. ఆ విమానంపై సూపర్ స్టార్ రజనీ పేరును ఇంగ్లీషులో రాయించడంతో పాటు కబాలి సినిమాలోని రజనీ పోస్టర్లను భారీ సైజులో వేయించింది. గతంలో ఏ భారతీయ హీరోకు కూడా ఇంతటి గౌరవం దక్కలేదు. ఇలా రజనీ ఖ్యాతి ఆకాశమంత ఎత్తుకు ఎదిగింది. ఇంతకీ కబాలి విమానంపై ఎలా పెయింట్ వేశారు, ఇందుకోసం ఎంతమంది పనిచేశారనే విషయాన్ని ఎయిర్ఏషియా వెల్లడించింది. దీనికి సంబంధించి విడుదల చేసిన వీడియో యూ ట్యూబ్‌లో హల్ చల్ చేస్తోంది. కబాలి బ్రాండ్ విమానం కోసం 300కు మందికిపైగా టెక్నిషియన్లు పనిచేశారు. రజనీ ఫొటోలు, పేరుతో రంగుల్లో కబాలి విమానం కనిపించేలా చేయడానికి దాదాపు 200 గంటలు పనిచేశారు. కబాలి విమానం వెనుక ఇంతమంది శ్రమ దాగుంది. -
కబాలి విమానం సీక్రెట్ ఇదే..
-
కబాలి థియేటర్లో మంటలు
-
కబాలి థియేటర్లో మంటలు
గుంటూరు జిల్లా దాచేపల్లి అలంకార్ థియేటర్లో బుధవారం మధ్యాహ్నం అగ్నిప్రమాదం సంభవించింది. షార్ట్‌సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగి సీట్లతో సహా థియేటర్ పూర్తిగా కాలిపోయింది. థియేటర్లో ప్రదర్శితమవుతున్న కబాలి చిత్రాన్ని మ్యాట్నీ షో చూడటానికి వచ్చిన ప్రేక్షకులు మంటలు ఎగిసిపడటంతో.. భయంతో పరుగులు తీశారు. ఏసీ నుంచి మంటలు వచ్చినట్లు కొంతమంది ప్రేక్షకులు తెలిపారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పడానికి యత్నిస్తున్నారు. ఇటివలే రూ. రెండు కోట్లతో థియేటర్ ఆధునీకరించినట్లు మేనేజర్ తెలిపారు. -
సూర్య సినిమా టైటిల్ '5.35'..?
తమిళ్‌తో పాటు తెలుగులో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న దక్షిణాది నటుడు సూర్య. ఇటీవల వరుస ప్రయోగాలతో కాస్త స్లో అయిన సూర్య, 24 సక్సెస్‌తో తిరిగి ఫాంలోకి వచ్చాడు. ప్రస్తుతం మాస్ మాసాలా ఎంటర్టైనర్ సింగం సీరీస్‌లో ఎస్ 3 సినిమా చేస్తున్న ఈ గజిని స్టార్ తరువాత చేయబోయే సినిమా విషయంలో కూడా క్లారిటీ ఇచ్చాడు. ఇటీవల కబాలి సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న పా రంజిత్ దర్శకత్వంలో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు సూర్య. అయితే కబాలి విషయంలో డివైడ్ టాక్ రావటంతో సూర్య సినిమా పట్టాలెక్కుతుందా..? లేదా.? అన్న అనుమానాలు మొదలయ్యాయి. అదే సమయంలో త్వరలోనే సినిమా సెట్స్ మీదకు వెళ్లనుందన్న వార్త ఇప్పుడు కోలీవుడ్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. మరోసారి ప్రయోగానికే రెడీ అయిన సూర్య ఈ సినిమాకు 5.35 అనే డిఫరెంట్ టైటిల్‌ను ఫైనల్ చేశాడట. ఇటీవల 24తో సక్సెస్ కొట్టిన ఈ కోలీవుడ్ స్టార్ పా రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా విషయంలో కూడా అదే సెంటిమెంట్‌ను ఫాలో అవుతున్నాడు. ఇప్పటి వరకు అఫీషియల్ ఎనౌన్స్మెంట్ లేకపోయినా, సెప్టెంబర్‌లోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమవుతుందన్న వార్త కోలీవుడ్‌లో జోరుగా వినిపిస్తోంది. -
రజనీపై నానా పటేకర్ కామెంట్స్
అంతర్జాతీయ స్థాయిలో భారీ హైప్ క్రియేట్ చేసిన కబాలి సినిమా రిలీజ్ అయి ఐదు రోజులు దాటుతున్నా ఇప్పటికీ ఈ సినిమాకు సంబందించిన వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. డివైడ్ టాక్‌తో స్టార్ట్ అయినా.. ఈ సినిమా కలెక్షన్ల రికార్డ్లను బద్దలు కొడుతూ దూసుకుపోతుంది. ఈ సందర్భంగా మాట్లాడిన బాలీవుడ్ వర్సటైల్ యాక్టర్ నానా పటేకర్ రజనీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఓ ప్రైవేట్ ఈవెంట్లో మీడియా ప్రతినిధి కబాలి గురించి అడిగిన ప్రశ్నకు బదులుగా 'ఇండియాలో సినిమానే సూపర్ స్టార్, ప్రత్యేకంగా నటుల్లో సూపర్ స్టార్లు ఎవరూ లేరు. సినిమా కథ బాగుంటే చిన్న సినిమా కూడా భారీ వసూళ్లను సాధిస్తుంది. అదే కథ బాలేకపోతే స్టార్ హీరో సినిమా కూడా మూడు రోజుల్లో థియేటర్ల నుంచి వెళ్లిపోతుంది'. అంటూ కామెంట్ చేశాడు. -
రజనీకాంత్ అసలు రహస్యం చెప్పారు
చెన్నై: తనపై గత కొంతకాలంగా వస్తున్న ఊహగానాలకు ప్రముఖ దక్షిణాది నటుడు సూపర్ స్టార్ రజనీకాంత్ తెరదించారు. ఆయన అమెరికా టూర్ వెనుక రహస్యాన్ని స్వయంగా ఓ లేఖలో వెల్లడించారు. దాదాపు రెండు నెలలపాటు అమెరికాలో ఆయన ఎందుకు ఉన్నారని, ఆయన ఆరోగ్యం నిలకడగా లేదా అసలు ఏం జరుగుతుందని అటు అభిమానులతోపాటు సినీ వర్గాల్లో సైతం తీవ్ర చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఆయన ఓ లేఖలో అందరికీ సమాధానం చెప్పారు. అందులో ఆయన ఏం చెప్పారంటే.. 'నేను శంకర్ దర్శకత్వం వహిస్తున్న 2.0(రోబో 2) చిత్రం, భావోద్వేగాలు, విప్లవాత్మక అంశాలు నిండిన చిత్రం 'కబాలీ' షూటింగ్లలో వరుసగా పాల్గొన్నాను. దీనివల్ల, కొంత మానసికంగా, శారీరకంగా అలసిపోయాను. దాని నుంచి ఉపశమనం పొందేందుకు విశ్రాంతి అవసరం అని అర్థమైంది. అందుకే నా కూతురు ఐశ్వర్య ధనుష్ తో కలిసి రెండు నెలలపాటు అమెరికా టూర్ కు వెళ్లాను. అక్కడే వైద్య పరీక్షలు కూడా పూర్తి చేసుకున్నాను. ఇప్పుడు నా మాతృదేశానికి వచ్చాక మళ్లీ కొత్త బలం వచ్చింది. కబాలీ చిత్రం విజయం గురించి విన్నాక మనసు మరింత ప్రశాంతంగా మారింది. ఈ సందర్భంగా నా చిరకాల మిత్రుడు థనుకు, చిత్ర దర్శకుడు రంజిత్ కు మొత్తం చిత్ర యూనిట్‌కు ధన్యవాదాలు చెబుతున్నాను. అలాగే, నా ప్రియమైన అభిమానులకు, ప్రజలకు, మీడియా మిత్రులకు, థియేటర్ల యజమానులకు, పంపిణీదారులకు కూడా పదేపదే ధన్యవాదాలు చెబుతున్నాను' అంటూ రజినీ స్వయంగా లేఖలో రాశారు. -
‘కబాలి’ ఒరిజినల్ కలెక్షన్లు తెలిస్తే షాక్ తింటారు!
‘కబాలి’ సినిమా కలెక్షన్ల గురించి అనేక వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సినిమా అసలు వసూళ్ల గురించి చిత్ర నిర్మాత కలైపులి ఎస్ థాను ధ్రువీకృత వివరాలను ఓ జాతీయ వెబ్‌సైట్‌కు తెలిపారు. ఇప్పటివరకు సల్మాన్ ఖాన్ ‘సుల్తాన్’, ఆమిర్ ఖాన్ ‘పీకే’ సినిమా కలెక్షన్ల గురించి తెలిసి విస్మయపోయిన ప్రజలు.. ‘కబాలి’ ఒరిజినల్ వసూళ్ల గురించి తెలిస్తే షాక్ తింటారు. భారీ అంచనాలతో, రజనీకాంత్ మేనియాతో విడుదలైన ఈ సినిమా ఇప్పటికే ఏకంగా రూ. 400 కోట్లు రాబట్టింది. ఈ 400 కోట్లలో రూ. 200 కోట్లు తొలి వీకెండ్ కలెక్షన్లు కాగా.. మిగతా 200 కోట్లు మ్యూజిక్ హక్కులు, శాటిలైట్ హక్కులు తదితర వాణిజ్య అమ్మకాల ద్వారా దక్కాయి. నిర్మాత థాను మాట్లాడుతూ.. తొలి వీకెండ్లో ప్రపంచవ్యాప్తంగా రూ. 90 కోట్లను ‘కబాలి’ వసూలు చేసిందని తెలిపారు. ఇందులో ఒక్క అమెరికాలోనే రూ. 28 కోట్లు వసూలయ్యాయని చెప్పారు. అమెరికాలో ప్రజలు చూసిన టాప్ టెన్ సినిమాల్లో ‘కబాలి’ చోటు సంపాదించుకుందని వివరించారు. ఇక భారత్‌లో తొలి మూడు రోజుల్లో దాదాపు రూ. 100 కోట్ల వసూళ్లు వచ్చాయని తెలిపారు. ‘నా జీవితంలో ఈ రోజుల్ని ఎప్పటికీ మరిచిపోలేను. ఈ సినిమా నాకు ఎంతో ఆనందాన్ని మిగిలించింది. గత వందేళ్లలో భారతీయ సినిమాకు చెందిన అన్ని రికార్డులనూ ‘కబాలి’ బద్దలుకొట్టింది’ అని థాను చెప్పారు. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం ‘కబాలి’ సినిమా బడ్జెట్ సుమారు రూ. 75 కోట్లు. ఇందులో 50 నుంచి 60 కోట్లు రజనీ రెమ్యూనరేషన్ ఉంటుందని భావిస్తున్నారు. సినిమా మలేషియా నేపథ్యంగా సాగుతోంది. మలేషియాలో షూటింగ్ తీయడానికే పెద్దమొత్తంలో ఖర్చయిందని భావిస్తున్నారు. సినిమాకు పనిచేసిన టెక్నీషియన్స్ అంతా కొత్తవారు, యువత కావడంతో వారికి పెద్దగా ఖర్చు కాలేదని, సినిమా నిర్మాణానికి చాలా తక్కువమొత్తంలోనే ఖర్చు అయిందని సినీ పండితులు చెప్తున్నారు. ఈ లెక్కన చూసుకుంటే ‘కబాలి’ సినిమా కలెక్షన్ల పరంగా అసాధారణ విజయాన్ని సాధించిందని విశ్లేషిస్తున్నారు. ఈ సినిమాకు మొదట నెగిటివ్ రెస్పాన్స్ ఆడియెన్స్ నుంచి వచ్చినా.. సినిమాను చూసేవారి సంఖ్య మాత్రం తగ్గడం లేదని సినీ పరిశీలకులు చెప్తున్నారు. -
మూడ్రోజుల్లో 'కబాలి' కలెక్షన్ ఎంతో తెలుసా?
‘కబాలి’ సినిమాతో తన స్టామినా ఏంటో మరోసారి రజనీకాంత్ రుజువు చేసుకున్నారు. సల్మాన్ ఖాన్ ‘సుల్తాన్’ సినిమాను తలదన్నేరీతిలో ‘కబాలి’ తొలి మూడురోజుల్లో వసూళ్లు రాబట్టింది. ‘సుల్తాన్’ సినిమా తొలి మూడురోజుల్లో రూ. 100 కోట్లు వసూలు చేయగా.. ‘కబాలి’ కూడా తొలి మూడురోజుల్లోనే రూ. 100 కోట్ల మార్క్ ను దాటింది. ఈ సినిమా తొలి మూడురోజుల వసూళ్లు ఎంత అనేది వివరాలు తెలియకపోయినా.. మొదటి మూడురోజుల్లో ‘కబాలి’ వందకోట్ల మార్క్‌ను క్రాస్ చేసిందని సినీ పండితులు చెప్తున్నారు. భారీ అంచనాలతో, రజనీ మేనియాతో విడుదలైన ‘కబాలి’ సినిమాకు మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. అయినా సినిమా కలెక్షన్ల విషయంలో మాత్రం దూకుడు ప్రదర్శిస్తోంది. మొదటిరోజే రూ. 48 కోట్లు కొల్లగొట్టిన ఈ సినిమా ఫస్ట్ డే కలెక్షన్ల విషయంలో ‘సుల్తాన్’ రికార్డును దాటేసింది. ‘సుల్తాన్’ సినిమా తొలిరోజు రూ. 36.54 కోట్లు వసూలు చేసింది. తొలిరోజు కలెక్షన్ల విషయంలో ‘సుల్తాన్’ రికార్డును అధిగమించినప్పటికీ ‘బాహుబలి’ (రూ.50 కోట్లు) రికార్డును ‘కబాలి’ దాటలేకపోయింది. ఇక, రెండో, మూడోరోజున కూడా ‘కబాలి’ సినిమా భారీగా రికార్డు కొల్లగొట్టిందని, నెగిటివ్ టాక్ ఈ సినిమా ప్రారంభ వసూళ్లపై ఎలాంటి ప్రభావం చూపలేదని సినీ పండితులు చెప్తున్నారు. తమిళనాడు, కర్ణాటక, కేరళలో ఈ సినిమా వసూళ్లు భారీస్థాయిలో ఉన్నారని చెప్పారు. సాధారణంగా దక్షిణ భారతంలోనే రజనీ ఫ్యాన్స్ కు ఎక్కువ. ఉత్తర భారతంలో పెద్దగా ఆయన చిత్రాలు ఆడవు. అయితే, ఈ అపప్రథను తాజాగా ‘కబాలి’ దూరం చేసింది. ఉత్తర భారతంలోనూ ఈ సినిమా మంచి వసూళ్లు రాబడుతున్నదని బాలీవుడ్ ట్రేడ్ అనాలిసిస్ట్ తరణ్ ఆదర్శ్ తెలిపారు. ఉత్తర భారతంలో తొలి రెండు రోజుల్లో ఈ సినిమా రూ. 11.4 కోట్లు వసూలు చేసింది. ఈ సినిమా తొలిరోజున తమిళనాడులో రూ. 21.5 కోట్లు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో రూ. 13.5 కోట్లు వసూలు చేసింది. -
సొంతరాష్ట్రంలో రజనీకి వ్యతిరేకత
చెన్నై: ప్రపంచవ్యాప్తంగా కబాలి మానియా ఊపేస్తుంటే... రజనీ సొంతరాష్ట్రం కర్ణాటకలో మాత్రం ఆ చిత్రానికి వ్యతిరేకత వస్తోంది. అక్కడ కబాలి పోస్టర్లు, రజనీకాంత్ ఫోటోలను దగ్ధం చేసే కార్యక్రమం జరుగుతుండటం గమనార్హం. కర్ణాటకలో సలువరి పార్టీ కార్యకర్తలు, కన్నడ వేదిక నిర్వాహకులు రజనీపై మండిపడుతున్నారు. రజనీకాంత్ కర్ణాకటకు చెందిన వ్యక్తి అయినా తమిళ పక్షపాతి అని వారు దుయ్యబడుతున్నారు. రజనీ కావేరి జల వివాదం వ్యవహారంలో తమిళనాడుకు మద్దతిచ్చారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ ఆగ్రహంతోనే ఆయన నటించిన కబాలి చిత్రాన్ని కర్ణాటకలోని 300 థియేటర్లకు పైగా విడుదల చేయాడాన్ని తప్పుపడుతున్నారు. ఈ కారణంగా కన్నడ చిత్రాలు బాధింపుకు గురవుతున్నాయని కన్నడ వేదిక నిర్వహకుడు పటాళ్ నాగరాజ్ పేర్కొన్నారు. ఇలా ఉండగా రెండు నెలల సుదీర్ఘ విరామం తర్వాత రజనీకాంత్ ఆదివారం అమెరికా నుంచి చెన్నై చేరుకున్నారు. -
కబాలిలో రంజిత్ స్టయిల్
సూపర్‌స్టార్ రజనీకాంత్ సినిమా.. అందులోనూ ఇంట్రడక్షన్ సీన్ అంటే స్పెషల్ ఎఫెక్ట్లు, సూపర్ హీరో స్టైల్ మేకింగ్ ఎక్స్పెక్ట్ చేస్తారు ఫ్యాన్స్. కానీ కబాలి సినిమాలో రజనీ ఇంట్రడక్షన్ చాలా సాదాసీదాగా ఉంటుంది. అభిమానులు ఎంతో కాలంగా ఎదురుచూసిన కబాలి సినిమా తొలి షాట్లో రజనీ ఓ పుస్తకం చదువుతూ కనిపిస్తారు. కెమెరా జైలు ఊచల నుంచి మెల్లగా కదులుతూ వెళ్లి చివరగా రజనీకాంత్ నటించిన కబాలి క్యారెక్టర్‌పై ఫోకస్ అవుతుంది. ఆ సమయంలో రజనీ చేతిలో ఓ పుస్తకం ఉంటుంది. ఆ పుస్తకం పేరు ‘మై ఫాదర్ బాలయ్య’. తెలంగాణకు చెందిన దళిత రచయిత వైబీ సత్యనారాయణ రచించిందే ఈ పుస్తకం. స్వాతంత్య్రానికి ముం దు, ఆ తర్వాత దళితుల జీవన పోరాటం.. చదువు కోసం వారుపడిన పాట్లే ఇతివృత్తంగా ఈ పుస్తక రచన సాగింది. ఈ సీన్ దర్శకుడు పా రంజిత్ అభిమానులను ఏమాత్రం ఆశ్చర్యానికి గురిచేయలేదు. వారంతా ఇదీ రంజిత్ మార్కు షాట్ అని ముక్త కంఠంతో చెపుతున్నారు. కబాలి డెరైక్టర్ రంజిత్ 2014లో రూపొందించిన సినిమా మద్రాస్. తమిళ సినిమాల్లో దళితుల ప్రాతినిథ్యానికి ‘మద్రాస్’ సినిమాను ఓ సాధనంగా వాడుకున్నారని పెద్ద చర్చే నడిచింది. ఇప్పుడు కబాలి విషయంలోనూ అదే పంథా అనుసరించారు రంజిత్. కబాలి చిత్రానికి ప్రొడక్షన్ విభాగంలో పనిచేసిన చాలామంది దళిత సామాజిక వర్గానికి చెందిన వారే. డెరైక్టర్ రంజిత్‌తో మొదలుపెడితే సినిమాటోగ్రాఫర్ జి.మురళి, ఆర్ట్, కాస్ట్యూమ్ డెరైక్టర్ థా రామలింగమ్, పాటల రచయితలు ఉమాదేవి, అరుణ్రాజా కామరాజ్, ఎం.బాలమురుగన్ ఇలా అందరూ దళితులే. వీరిలో కొందరు తమను కులం పేరుతో గుర్తించడాన్ని వ్యతిరేకిస్తున్నారు. సినిమా అనేది ఓ కళ అని, ఇక్కడ కళలో నైపుణ్యం మాత్రమే గుర్తింపును ఇస్తుందని, దీనికి ఇతర గుర్తింపులేమీ అవసరం లేదని చెపుతున్నారు. మరికొందరు గతంలో తాము ఎదుర్కొన్న ఇబ్బందులే ఇప్పుడు తమను ఈ స్థానానికి ఎదిగేలా చేశాయని చెపుతున్నారు. మద్రాస్ సినిమా రిలీజ్ అయిన తర్వాత చాలా ఇంటర్వ్యూల్లో రంజిత్ మాట్లాడుతూ.. తనకు కులం గురించి మాట్లాడటంపై నమ్మకం లేదని చెప్పారు. ‘మద్రాస్’లో కుల వ్యవస్థ గురించి నిర్భయంగా చూపించారు. తమిళ మెయిన్ స్ట్రీమ్ సినిమాల్లో ఇలాంటి బోల్డ్ అటెంప్ట్ చేయడం అదే తొలిసారి. రంజిత్ సినిమాల్లో ప్రధాన పాత్రలు దళిత సాహిత్యం చదువుతూనో.. లేదా అంబేడ్కర్ చెప్పిన మాటలను అండర్లైన్ చేసి చూపిస్తూనో కనిపిస్తుంటాయి. మలేసియాలో అణచివేతకు గురవుతున్న తమిళుల కోసం పోరాటం చేసే ఓ వ్యక్తి ఇతివృత్తంతోనే కబాలిని రూపొందించాడు రంజిత్. -
అక్కడ ‘కబాలి’ క్లైమాక్స్ మారింది!
విడుదలకు ముందు ‘కబాలి’ సినిమా క్లైమాక్స్‌పై అనేక కథనాలు వచ్చాయి. ‘కబాలి’ సినిమాలో నెగిటివ్ ఎండింగ్ ఉంటుందని చెప్పిన సంగతి తెలిసిందే. దీంతో క్లైమాక్స్‌లో ‘కబాలి’ చనిపోతాడా? అని రకరకాల ఊహాగానాలు ప్రచారంలోకి వచ్చాయి. కానీ నిజానికి దర్శకుడు పా రంజిత్ క్లైమాక్స్ విషయంలో సాహసం చేయలేకపోయాడు. చివరి సీన్లో తుపాకీ పేలుడు శబ్దం వినిపించినా.. ఈ తూటాకి ‘కబాలి’ చనిపోయాడా? అన్న విషయాన్ని మాత్రం దర్శకుడు చూపించలేదు. కథ, కథనం విషయంలో తనదైన స్టైల్‌ను ఫాలో అయిన పా రంజిత్ క్లైమాక్స్ విషయంలో మాత్రం సాహసించలేకపోయాడు. రజనీ పాత్ర తెరపై చనిపోయినట్టు చూపించడం అంత ఈజీ కాదు. దీనిని అభిమానులు జీర్ణించుకోలేరు. అందుకే తుపాకీ శబ్దంతో, కొంత సస్పెన్స్‌తో ‘కబాలి’ క్లైమాక్స్‌ను ముగించాడు. దీంతో సినిమా నెటిగివ్ ఎండింగా.. పాజిటివ్ ఎండింగా అనేది ప్రేక్షకుడికి అంతుచిక్కలేదు. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా క్లైమాక్స్ గురించి మరో ట్విస్టు వెలుగుచూసింది. సినిమా అంతా మలేషియా నేపథ్యంగా, అక్కడ జరిగే గ్యాంగ్‌వార్ ప్రధాన కథగా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మలేషియాలో ఈ సినిమా క్లైమాక్స్‌ను మార్చారు. క్లైమాక్స్‌లో ‘కబాలి’ పోలీసులకు లొంగిపోతాడని పేర్కొన్నారు. మలేషియా నేపథ్యంగా సినిమా తెరకెక్కడం, ఎక్కువశాతం షూటింగ్ అక్కడే జరిగిన నేపథ్యంలో స్థానికంగా వ్యతిరేకత రాకుండా.. చట్టాన్ని గౌరవించి ‘కబాలి’ పోలీసులకు లొంగిపోయినట్టు పేర్కొన్నారని భావిస్తున్నారు. -
’కబాలి’ని టొరంటోలో డౌన్లోడ్ చేయబోతే..!
రివ్యూలు సంగతి ఎలా ఉన్నా.. సినిమా అంతగా బాలేదు అన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నా.. రజనీకాంత్ తాజా సినిమా ‘కబాలి’ అసాధారణ కలెక్షన్లతో దూసుకుపోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ‘కబాలి’ సినిమా తొలిరోజే రూ. 250 కోట్ల వరకు వసూళ్లు రాబట్టి ఉంటుందని చిత్రనిర్మాతలు ఓ ప్రకటనలో తెలుపడం సంచలనం రేపుతోంది. ‘కబాలి’ తొలిరోజు ఒక్క తమిళనాడులోనే వందకోట్లు వసూలుచేసిందని, తమిళనాడు బయట దేశమొత్తంగా రూ. 150 కోట్లు వసూలుచేసిందని నిర్మాతలు ప్రకటించారు. ఈ వసూళ్ల ప్రకటన ఇలా వుంటే.. మరోవైపు‘కబాలి’ శాటిలైట్ హక్కుల ద్వారా రూ. 200 కోట్లు సాధించవచ్చునని మరో కథనం చెప్పుకొచ్చింది. ఈ కథనాల్లో నిజానిజాలను పక్కనబెడితే.. ప్రపంచవ్యాప్తంగా 12వేల థియేటర్లలో విడుదలైన ‘కబాలి’ సినిమా గత కలెక్షన్ల రికార్డులన్నింటినీ బద్దలుకొట్టి తొలిరోజు భారీగా వసూళ్లు రాబట్టడం ప్రశంసల జల్లు కురుస్తోంది. ‘కబాలి’ కలెక్షన్లు లెజెండ్ రజనీ సత్తాను మరోసారి ప్రపంచానికి చాటాయని బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్ కితాబిచ్చారు. మరోవైపు రజనీ సినిమాపై ఎప్పటిలాగే జోక్స్, ఛలోక్తులు ఆన్లైన్లో వీరవిహారం చేస్తున్నాయి. ట్విట్టర్‌ను చక్కిలిగింతల్లో ముంచెత్తుతున్న ఆ క్రేజీ జోక్స్ మీకోసం.. ’కబాలి సినిమాను డౌన్లోడ్ చేసేందుకు ప్రయత్నించాను. వెంటనే టోరంటో అన్ఇన్స్టాల్ అయిపోయింది. సిస్టం ఫార్మెట్ అయిపోయింది. వై-ఫై క్రాష్ అయింది. సమీపంలో ఉన్న ఎయిర్టెల్ టవర్ మాయమైంది’ Tried downloading Kabali. µTorrent uninstalled itself. System got formated. Wi-Fi router crashed. Nearby Airtel tower vanished. — चार लोग (@WoCharLog) July 21, 2016 ’మీ అక్రమంగా రజనీకాంత్ చిత్రాన్ని ఆన్లైన్లో డౌన్లోడ్ చేస్తే.. ఓ వైరస్ బయటకొచ్చి మీ చెంపఛెళ్లుమనిపిస్తుంది. మిమ్మల్ని వెంటనే పట్టుకెళ్లి రజనీ సినిమా నడుస్తున్న థియేటర్లో పడేస్తుంది’ ‘అందరి సినిమాలు మొదట విడుదలై తర్వాత టోరంటోలో లీకవ్వుతాయి. కానీ రజనీ సినిమా టోరంటోలో లీకైన తర్వాతే షూటింగ్ మొదలవుతుంది’. -
కబాలి రీమేక్ లో అమితాబ్..?
ప్రపంచ వ్యాప్తంగా భారీ హైప్ క్రియేట్ చేసిన సినిమా కబాలి. రజనీకాంత్ హీరోగా పా రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ భారీ చిత్రం, రిలీజ్ తరువాత ఆ స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. రజనీ అభిమానులు సినిమాను ఎంజాయ్ చేస్తున్నా.. సాధారణ ప్రేక్షకులు మాత్రం నిరాశచెందారు. అయితే కలెక్షన్ల పరంగా మాత్రం రజనీ సరికొత్త రికార్డుల దిశగా దూసుకుపోతున్నాడు. అయితే ఈ సినిమాను బాలీవుడ్లో రీమేక్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయట. నార్త్‌లో ప్రయోగాత్మక పాత్రలతో అలరిస్తున్న బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్‌ను కబాలి రీమేక్‌లో నటింప చేయాలని భావిస్తున్నారు. మరి సౌత్ సినిమాగా అలరించలేకపోయినా కబాలి.. నార్త్ ఇండస్ట్రీలో ఆకట్టుకుంటుందేమో చూడాలి. -
ఇప్పుడు సూర్య ఛాన్స్ ఇస్తాడా..?
కబాలి సినిమా సెట్స్ మీద ఉండగానే ఆ చిత్ర దర్శకుడు పా రంజిత్‌కు ఆఫర్లు వెల్లువెత్తాయి. యంగ్ హీరోలు, స్టార్ హీరోలు అన్న తేడా లేకుండా అందరూ రంజిత్ దర్శకత్వంలో నటించడానికి రెడీ అంటూ ప్రకటించేశారు. అయితే ఇప్పుడు సీన్ మారిపోయింది. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన కబాలి ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. దీంతో రంజిత్ భవిష్యత్తు ప్రమాదంలో పడింది. సాధారణంగా ఫిలిం ఇండస్ట్రీ సక్సెస్ వెంటే పరిగెడుతుంది. హిట్ ఇచ్చిన నటీనటులు, దర్శకులతో కలిసి పనిచేసేందుకు ఇంట్రస్ట్ చూపిస్తారు. అదే ఫ్లాప్ ఇస్తే మాత్రం పట్టించుకోరు. మరి ఇప్పుడు పా రంజిత్ పరిస్థితి ఏంటి అన్న టాక్ వినిపిస్తోంది. గతంలో తన నెక్ట్స్ పా రంజిత్‌తో అంటూ ప్రకటించిన సూర్య, మాట నిలబెట్టుకుంటాడా..? కబాలి తరువాత కూడా రంజిత్ దర్శకత్వంలో సినిమా చేస్తాడా..? చూడాలి. -
కబాలి మొదటి రోజు వసూలెంతో తెలుసా?
తమిళసినిమా: విడుదలకు ముందే కాదు ఆ తరువాత కూడా కబాలి గురించి కథనాలు కదం తొక్కుతున్నాయి.ఆ క్రెడిట్ అంతా సూపర్‌స్టార్ రజనీకాంత్దేనని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.ఆయన నటించిన ఈ చిత్రం ఒక్క భారతదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఒక ప్రభంజనంలా శుక్రవారం తెరపైకి వచ్చింది. ఎప్పుడెప్పుడా అని ఆతృతగా ప్రపంచవ్యాప్త రజనీ అభిమానులు ఎదురు చూశారు.ఇప్పుడు చూస్తూ (మగిల్చి)సంతోషపడుతున్నారు.కబాలి చిత్రం వారిలో పండగ వాతావరణాన్ని సృష్టించిందనే చెప్పాలి.ఉత్సవాలు జరుపుకుంటున్నారు.రజనీకాంత్ చిత్రాన్ని మొదటి రోజు మొదటి షో చూడటం ఘనతగా భావిస్తున్నారు.చూసిన వారిలో ఏదో సాధించాయన్న ఫీలింగ్. థియేటర్ల ముందు ఇసుకేస్తే రాలనంత జనం. 90 శాతం టికెట్లు ముందుగానే రిజర్వేషన్ అయ్యి పోవడంతో టికెట్లు దొరకని వారు మళ్లీ మళ్లీ థియేటర్లకు వచ్చి టికెట్ల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఎంత ధర చెల్లించి అయినా కబాలి చిత్రం చూసి తీరాలనే నిర్ణయంతో తమ ప్రయత్నాలు చేయడం అన్నది ఒక్క కబాలి చిత్రానికే చెల్లుతుంది.ఒక్క భారతరేశంలోనే కాదు,ప్రపంచ వ్యాప్తంగా కబాలి చిత్రంపై అంచనాలు నెలకొన్న నేపథ్యంలో అమెరికా,మలేషియా,సింగపూర్ మొదలగు 50 దేశాలలో ఈ చిత్రం హవా కొనసాగుతోంది.చిత్రం చూసిన రజనీ అభిమానులు ఆనందతాండ వం చేస్తున్నారనే చెప్పవచ్చు. 6,500 థియేటర్లలో కబాలి కబాలి చిత్రం ప్రపంచవ్యాప్తంగా 6500 థియేటర్లకు పైగా విడుదలైంది.ఇందులో 3,500 థియోటర్లకు పైగా హౌస్‌ఫుల్‌గా ప్రదర్శింపబడుతున్నాయి. 2వేల థియేటర్లలో వారానికి పైగా అడ్వాన్స్ బుకింగ్ జరిగిపోయింది.ఇక తమిళనాడు,కేరళ,ఆంధ్రా,తెలంగాణ,కర్ణాటక రాష్ట్రాల్లో కబాలికి అమోఘ ఆదరణ లభిస్తోంది. మొదటి రోజు వసూళ్లు రూ.40 కోట్లు చిత్ర ప్రారంభం నుంచి రికార్డులకు శ్రీకారం చుట్టిన కబాలి విడుదలకు ముందే నిర్మాతకు రూ.200 కోట్లు టేబుల్ ప్రాపర్టీని అందించిందనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో విడుదలైన తరువాత తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా వసూళ్లు రూ.40 కోట్లు అని తెలిసింది.బాలీవుడ్ స్టార్ నటుడు సల్మాన్‌ఖాన్ నటించిన సుల్తాన్ ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే.ఆ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఒక్క రోజు వసూళ్లు 36 కోట్లు. కబాలి విడుదలకు ముందు వరకూ ఇదే రికార్డు. ఇప్పుడా రికార్డును కబాలి బద్దలు కొట్టిందని సమాచారం. కాగా ఒక్క వారానికి రూ.120 కోట్ల వసూళ్లకు దాటుతుందని సినీ వర్గాల అంచనా.కాగా కబాలితో రజనీకాంత్ స్టామినా మరింత పెరిగింది.అమెరికాలో ఉన్న రజననీకాంత్ చిత్రం విడుదల ముందే చెన్నైకి తిరిగి వస్తారని భావించారు.కాగా ఇటీవల ఆయన అమెరికాలో కారులో పయనిస్తుండగా అక్కడి ప్రజల కంటపడ్డారు.అంతే వారంతా ఆనందంతో చేతులు ఊపుతూ పరుగులు తీశారు.దీంతో కారు నిలిపి వారికి ఉత్సాహంగా రజనీకాంత్ షేక్‌హ్యాండ్ ఇచ్చిన వీడియో ఇప్పుడు ఇంటర్నెట్లో హల్చల్ చేస్తోంది.అంతగా కబాలి ఫీవర్ పెల్లుబికిందన్న మాట. -
టికెట్ దొరకలేదని మలేషియా అభిమాని ఆత్మహత్య
సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ మేనియా ఖండాంతరాలను దాటుతోంది. ఇప్పటికే జపాన్ మలేషియా దేశాల్లో రజనీకి అక్కడ స్టార్ హీరోల స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. మలేషియాలో రజనీ మేనియా ఏ స్థాయిలో ఉందో ప్రూవ్ చేసే సంఘటన ఒకటి కబాలి సినిమా రిలీజ్ రోజు జరిగింది. రజనీ హీరోగా తెరకెక్కిన ఈ యాక్షన్ డ్రామా మలేషియాలో అక్కడి ప్రాంతీయ చిత్రం స్థాయిలో మలాయ్ భాష లో రిలీజ్ అయ్యింది. సినిమా టికెట్ల కోసం మలేషియన్ అభిమానులు కూడా భారీగా పోటి పడ్డారు. ఈనేపథ్యంలో టికెట్ దొరకని ఓ అభిమాని పది అంతస్థుల బిల్డింగ్ మీదనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మలేషియాలోని కేన్ సిసి ప్రాంతంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. కబాలి సినిమాలో అత్యధిక శాతం షూటింగ్ మలేషియాలోనే జరగటంతో సినిమాపై అక్కడ భారీ అంచనాలు ఏర్పాడ్డాయి. -
బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోన్న కబాలి
భారీ అంచనాల మధ్య శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన కబాలి బాక్సాఫీస్ రికార్డ్ల దుమ్ముదులుపుతోంది. ఇప్పటికే ప్రీ రిలీజ్ బిజినెస్‌లో సంచలనాలను నమోదు చేసిన తలైవా, రిలీజ్ తరువాత కూడా తన హవా కోనసాగిస్తున్నాడు. ముఖ్యంగా గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ సంఖ్యలో ఈ సినిమాకు థియేటర్లు లభించటంతో కనీవినీ ఎరుగని కలెక్షన్లు సాధ్యమవుతున్నాయి. తమిళనాట 650కి పైగా స్క్రీన్‌లో రిలీజ్ అయ్యింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా అదే స్థాయిలో రిలీజ్ అయిన కబాలి భారీ వసూళ్లను సాధిస్తోంది. ఇప్పటికే తొలి మూడు రోజుల టికెట్లు అడ్వాన్స్ బుకింగ్స్ అయిపోయాయి. ఈ నేపథ్యంలో మూడు రోజుల పాటు కబాలి హవా దక్షిణాదిని ఊపేయనుంది. రజనీకి భారీ క్రేజ్ ఉన్న తెలుగు, తమిళ్లోనే కాదు, కేరళలో కూడా కబాలి భారీగా రిలీజ్ అయ్యింది. దాదాపు 306 థియేటర్లలో రిలీజ్ అయి అక్కడ కూడా రికార్డ్ సృష్టించింది. కబాలి సంచలనాలు దక్షిణాదికే పరిమితమైపోలేదు. ఉత్తరాదిలో కూడా తలైవా హవా చూపిస్తున్నాడు. కేవలం ఈ సినిమా చూడటానికే విదేశీయులు ముంబై చేరుకున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌లలో కలిపి 135 థియేటర్లలో కబాలి సందడి కనిపిస్తుండగా, పంజాబ్‌లో 70 థియేటర్లలో కబాలి రిలీజ్ అయ్యింది. ముంబై, కలకత్తా, ఢిల్లీ లాంటి ప్రధాన నగరాల్లో కబాలి మేనియా బాగా కనిపిస్తోంది. ఇప్పటికే తొలి రోజు కలెక్షన్ల రికార్డులను తిరగరాసిన తలైవా.. ముందు ముందు మరిన్ని రికార్డులు సాధించే దిశగా దూసుకుపోతున్నాడు. అయితే సినిమాకు డివైడ్ టాక్ రావటంతో బాహుబలి, భజరంగీబాయిజాన్ లాంటి భారీ రికార్డ్‌లకు డోకా లేదన్న వాదన వినిపిస్తోంది. -
ఆన్లైన్లో కబాలి డా
చెన్నై : పైరసీని అరికట్టడం కాదు కదా కనీసం నిలువరించడం సాధ్యం కాదని తాజా పరిణామాలతో మరోసారి రుజువైంది. కబాలి చిత్రం తెరపైకి రావడానికి ముందే ఇంటర్నెట్లో హల్చల్ చేయడమే ఇందుకు నిదర్శనం. ఇది ఖండించదగ్గ అంశమే అయినా పైరసీ ఎంతగా వేళూనుకుపోయిందో అర్థం చేసుకోవలసిన సంఘటన ఇది. వివరాల్లోకి వెళ్లితే సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన చిత్రం కబాలి. భారీ అంచనాల మధ్య ఇంకా చెప్పాలంటే ప్రపంచ సినిమానే ఆసక్తిగా ఈ చిత్రం విడుదలకు ఎదురు చూసింది. ఈ చిత్రం విడుదలకు ముందే నిర్మాత ధాను పైరసీని అడ్డుకోవడానికి హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు కూడా పైరసీపై నిషేధాజ్ఞలు జారీ చేసింది. దీంతో చాలా వెబ్సైట్లు మూత పడ్డాయి. హమ్మయ్య ఇక పైరసీ బెడద తప్పింది అనుకున్నారంతా. అయితే అది పైరసీ అనేది ఓ మహమ్మారి కదా... పూర్తిగా అంతం అవుతుందా? కబాలి చిత్రం తెరపైకి రావడానికి ఒక్క రోజు ముందే 10 నిమిషాల ప్రారంభ సినిమా నెట్లో చక్కర్లు కొట్టింది. దానికి గురించి ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. అయితే అది చిన్న శాంపిల్ అని, కబాలి చిత్రం థియేటర్లలోకి రావడానికి కొంత సమయం ముందే తన పని చూపించింది. పూర్తి చిత్రం క్లియర్ కట్‌గా తమిళ్‌గన్ అనే వెబ్సైట్లో హల్చల్ చేయడంతో చిత్ర వర్గం కంగుతింది. విషయం ఏమిటంటే ఇంత వరకూ భారతీయ సినీ పరిశ్రమలో ఏ చిత్రానికి ఇవ్వనంత బూస్టప్‌ను కబాలికి చేశారు. చిత్రాన్ని చూడడానికి కార్పొరేట్ సంస్థలు బల్క్‌లో భారీ మొత్తాలను చెల్లించి టికెట్లను కొనుగోలు చేయడంతో సాధారణ ప్రేక్షకులు కబాలిని చూడలేని పరిస్థితి. ఎలాగైనా చూసి తీరాలనుకున్న కొందరు మాత్రం నగర శివారు ప్రాంతాల్లో చిన్న థియేటర్లలో టికెట్లు కొని చూడడానికి సిద్ధమయ్యారు. నటుడు శివకార్తికేయన్ లాంటి వారు కూడా సదరు ప్రాంతంలోని థియేటర్లలో కబాలి చిత్రాన్ని చూశారని సమాచారం. కబాలి చిత్రం ఇప్పుడు తమిళ్‌గన్ అనే వెబ్సైట్లో అందర్నీ ఎంటర్టెయిన్ చేస్తోంది. ఆ వెబ్‌సైట్‌పై చిత్ర నిర్మాత తరఫున మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారన్నది గమనార్హం. కబాలి కథేందంటే కబాలి చిత్రంలో రజనీకాంత్ పాత చిత్రాలలో మాదిరిగానే వచ్చిన చిత్రం ఇది. దక్షిణాఫ్రికాలో నెల్సన్మండేలా తరహాలో మలేషియాలో తమిళుల హక్కుల కోసం పోరాడిన రజనీకాంత్ 25 ఏళ్లు జైలు జీవితాన్ని గడిపి బయటకు వస్తారు. తన జైలు జీవితకాలంలో బయట జరిగిన సంఘటనలను రజనీకాంత్‌కు అనుచరుడు జాన్‌విజయ్ వివరిస్తాడు. ఆ విధంగా 43 గ్యాంగ్ అనే మాదక ద్రవ్యాల ముఠా అక్కడి యువకులను ఎలా మత్తు మందులకు బానిసలుగా తయారు చేస్తోంది, హత్యలు,అత్యాచారాలు అంటూ ఎలా అరాచకాలు సృష్టిస్తోంది, దీనికంతా కారణం ఎవరు? అన్న విషయాలను కబాలి తెలుసుకుంటాడు. ఆ తరువాత తమిళలు అధికంగా నివసించే ప్రాంతంలో తన పేరుతో మాదక ద్రవ్యాలకు బానిసలైన వారిని ఆ మత్తు నుంచి బయటకు తీసుకొచ్చే ప్రయత్రం చేస్తూ వారికి పునర్జన్మను ప్రసాదించే సేవాకార్యక్రమలు నిర్వహిస్తున్న కలైయరసన్ను కలుసుకుంటాడు. అక్కడ యువకులతో తాను ఎందుకు దాదాగా మారాల్సి వచ్చిందన్నది వివరిస్తాడు. కబాలి జైలుకు వెళ్లే సమయంలో తుపాకీ గుండుకు గురైన నిండు గర్బిణి అయిన తన భార్య గుర్తు కొస్తుంది. ఇప్పుడు భార్య,బిడ్డ ఎక్కడున్నారు? ఏమి చేస్తున్నారన్నది తెలియక అయోమయంలో పడతాడు. మరో పక్క మాదక ద్రవ్యాల ముఠా నాయకుడు కిషోర్‌ను వేటాడి అంతం చేస్తాడు? అయితే చివరికి తన భార్య బిడ్డను కలుసుకున్నాడా? లేదా? అన్నది మాత్రం కబాలి చిత్రం చూడాల్పిందే. -
‘కబాలికి’ పాలాభిషేకం
శామీర్‌పేట్: శామీర్‌పేట్ మండలంలోని అలియాబాద్ శ్రీక్రిష్ణ సినిమా థియేటర్లో శుక్రవారం విడుదలైన కబాలి సినిమాకు ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. రజనీకాంత్ అభిమాన సంఘం ఆధ్వర్యంలో హీరో చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో థియేటర్ యజమాని నాగేశ్వరరావు, సల్లూరి అనంతం, ఎస్.మహేశ్, రాజు, భిక్షపతి, శ్రీనివాస్, సునీల్శంకర్ తదితరులు పాల్గొన్నారు. -
ఇది 'విరాట్ కబాలి'!
ఆంటిగ్వా: భారీ అంచనాలతో విడుదలైన చిత్రం కబాలి. అటు రజనీకాంత్ మేనియా, ఇటు అభిమానుల అమితోత్సాహం ఈ సినిమాపై ముందునుంచే భారీ హైప్ క్రియేట్ చేసింది. శుక్రవారం దేశవ్యాప్తంగా విడుదలైన కబాలి మూవీ రికార్డు కలెక్షన్లపై ఇప్పటికే హాట్ హాట్ చర్చ సాగుతోంది. ఈ సినిమా సరికొత్త రికార్డును నెలకొల్సే అవకాశం ఉందని కొంతమంది సినిమా విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతుండగా, నెటిజన్లు మాత్రం తమదైన శైలిలో కబాలి మూవీ గురించి చర్చించుకుంటున్నారు. రజనీకాంత్ తన అభిమానులకు కబాలి మూవీ చూపిస్తుంటే.. విండీస్ క్రికెట్ జట్టుకు విరాట్ కోహ్లి కబాలి చూపిస్తున్నాడని సరదగా ముచ్చటించుకుంటున్నారు. ప్రస్తుతం వెస్టిండీస్ పర్యటనలో భాగంగా తొలి టెస్టు మ్యాచ్ లో భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి భారీ శతకంతో అజేయంగా నిలిచాడు. తొలి రోజ మొదటి ఇన్నింగ్స్‌లో కోహ్లి 143 పరుగులతో క్రీజ్ లో ఉన్నాడు. దీంతో సినిమా టాపిక్ ను క్రికెట్ కు జత చేశారు. ఇది 'విండీస్ లో విరాట్ కబాలి' అంటూ అభిమానులు పొగడ్తలతో ముంచెత్తున్నారు. కబాలి సినిమా విడుదలైనా.. ఇంకా విండీస్‌ను మాత్రం కోహ్లి విడిచిపెట్టలేదంటూ ఛలోక్తులు విసురుతున్నారు. మన దిగ్గజ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ కూడా కబాలి సినిమా-విరాట్ విధ్వంసాన్ని పోల్చుతూ తనదైన శైలిలో ట్వీట్ చేశాడు. ఈ రోజుల తనను మూడు 'లీ'లు ఆకట్టుకున్నాయి. ఒకటి కోహ్లి ఇన్నింగ్స్ చూడటం, రెండో మూలీ(పరోటా) తినడం, మూడు కబాలి మూవీని ఆస్వాదించడం అంటూ చమత్కరించాడు. -
కబాలి మేనియా
-
కబాలి విషయంలో ఫీలవుతున్న రాజమౌళి
బాహుబలి సినిమాతో ఇండస్ట్రీ రికార్డ్లను తిరగరాసిన టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి, కబాలి విషయంలో ఫీలవుతున్నాడట. సాధారణంగా స్టార్ హీరోల సినిమాలను రిలీజ్ రోజే చూడటం రాజమౌళికి అలవాటు. కుటుంబ సమేతంగా థియేటర్‌కు వెళ్లి, అభిమానులతో కలిసి సినిమాలు చూస్తాడు జక్కన్న. అయితే కబాలి సినిమాను అలా చూడలేకపోయాడు. ప్రస్తుతం బాహుబలి 2 సినిమా క్లైమాక్స్ షూటింగ్లో బిజీగా ఉన్న జక్కన్న టీం, కబాలి సినిమా తొలి రోజు చూసే ఛాన్స్ మిస్ అయ్యింది. ఈ విషయాన్ని స్వయంగా తన ట్విట్టర్లో ప్రకటించాడు రాజమౌళి. 'షూటింగ్ లో ఉన్న కారణంగా కబాలి తొలిరోజు తొలి ఆట మిస్ అయ్యాను. థియేటర్లో ఉండి ఉంటే ఇప్పటికే నేను కూడా తలైవా మేనియాలో మునిగిపోయే వాన్ని' అంటూ ట్వీట్ చేశాడు. Missing kabaali FDFS..Stuck in shooting..How i wish i could be there in the theatre engulfed by thalaiva mania...— rajamouli ss (@ssrajamouli) 22 July 2016 -
కబాలి కోసం..థియేటర్ల దగ్గర బారులు
-
మొదటి షోకే మిలియన్ డాలర్లు
కబాలి మేనియా ప్రపంచాన్నిచుట్టేస్తోంది. రిలీజ్‌కు మూడు రోజుల ముందు నుంచే మొదలైన ఫీవర్.. చివరకు తలైవాను తెరమీద చూసే సరికి పీక్స్‌కు చేరింది. ఇన్నాళ్లు ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలు చూస్తున్న ఫ్యాన్స్. ఇప్పుడు బద్దలవుతున్న రికార్డ్లను లెక్కలేస్తున్నారు. ఇప్పటికే తొలి షో ప్రదర్శనలు, ప్రపంచ దేశాల్లో రిలీజ్ లాంటి అంశాలతో రికార్డ్ సృష్టించిన కబాలి, ఓవర్ సీస్ మార్కెట్లో వసూళ్ల బాద్షాగా అవతరించాడు. స్టార్ హీరోలు కూడా ఓవర్ సీస్లో వన్ మిలియన్ డాలర్ల మార్క్ కోసం మూడు నాలుగు రోజుల పాటు ఎదురుచూస్తుంటే రజనీ మాత్రం కబాలి తొలి షోకే ఆ రికార్డ్‌ను రీచ్ అయ్యాడట. అధికారికంగా ప్రకటించకపోయినా.. అత్యధిక సంఖ్యలో థియేటర్లలో ప్రదర్శించటంతో పాటు.. టికెట్ ధరలు కూడా భారీగా పెరగటంతో ఈ రికార్డ్ సాధ్యమయ్యిందంటున్నారు. మార్నింగ్ షో పూర్తి కాక ముందే రికార్డ్ల వేట మొదలెట్టిన రజనీ.. ముందు ముందు మరిన్ని రికార్డ్‌లు సృష్టిస్తాడంటున్నారు ఫ్యాన్స్. -
'కబాలి' మూవీ రివ్యూ
టైటిల్ : కబాలి జానర్ : ఎమోషనల్ డ్రామా తారాగణం : రజనీకాంత్, రాధికా ఆప్టే, ధన్సిక, విన్స్స్టన్ చావో సంగీతం : సంతోష్ నారాయణ్ దర్శకత్వం : పా రంజిత్ నిర్మాత : కలైపులి ఎస్ థాను భారతీయ సినీ చరిత్రలో ఎన్నడూ లేనంత భారీ హైప్ క్రియేట్ చేసిన సినిమా కబాలి. రజనీ మానియా రేంజ్ ఏంటో చూపిస్తూ ఈ సినిమా ప్రపంచదేశాల సినీ అభిమానులను సైతం ఆకర్షించింది. రెండు భారీ డిజాస్టర్ల తరువాత రజనీ హీరోగా నటించిన సినిమా.. కేవలం రెండు యావరేజ్ సినిమాలను తెరకెక్కించిన దర్శకుడు. ఈ కాంబినేషన్లో వచ్చిన సినిమాకు ఇంత హైప్ ఎలా క్రియేట్ అయ్యిందంటూ ట్రేడ్ పండితులు కూడా అవాక్కవుతున్నారు. అసలు అంతలా కబాలిలో ఏముంది..? నిజంగానే రజనీ కబాలితో మ్యాజిక్ చేశాడా..? అభిమానుల అంచనాలను కబాలి అందుకుందా..? కథ : మలేషియా, కౌలాలంపూర్‌లో జరిగిన గ్యాంగ్ వార్‌లో అరెస్ట్ అయిన మాఫియా డాన్ కబాలి(రజనీ కాంత్). 25 ఏళ్ల పాటు జైలు శిక్ష అనుభవించిన కబాలి విడుదలవుతున్నాడంటూ, ప్రభుత్వం, పోలీస్ శాఖలు అలర్ట్ అవుతాయి. తిరిగి గ్యాంగ్ వార్ మొదలుపెట్టవద్దని కబాలికి చెప్పి విడుదల చేస్తారు. కానీ మలేషియాలో మగ్గిపోతున్న భారతీయుల కోసం పోరాటం చేసే కబాలి బయటకు రాగనే అక్కడి పరిస్థితులను చూసి మరోసారి పోరాటం మొదలు పెడతాడు. డ్రగ్స్ అమ్ముతూ, అమ్మాయిలను ఇబ్బంది పెట్టే 43 గ్యాంగ్‌తో యుద్ధం ప్రకటిస్తాడు. కబాలి రాకకోసం ఎదురుచూస్తున్న 43 గ్యాంగ్ లీడర్ టోని లీ (మలేషియా నటుడు విన్స్స్టన్ చావో) తన అనుచరుడు వీరశంకర్ (కిశోర్) సాయంతో కబాలిని చంపేందుకు ప్రయత్నాలు మొదలు పెడతాడు. ఈ ప్రయత్నాల నుంచి కబాలి ఎలా బయటపడ్డాడు..? అసలు కబాలి డాన్‌గా ఎందుకు మారాడు..? అతని కుటుంబం ఏమైంది..? చివరకు టోని లీ కథను కబాలి ఎలా ముగించాడు..? అన్నదే మిగతా కథ. నటీనటులు : కబాలిగా రజనీకాంత్ మరోసారి తన విశ్వరూపం ప్రదర్శించాడు. ఈ వయసులో కూడా తనలోని స్టైల్, గ్రేస్ ఏమాత్రం తగ్గలేదని మరోసారి ప్రూవ్ చేశాడు తలైవా. భారీ యాక్షన్ సీన్స్, రేసీ స్క్రీన్ ప్లే లేకపోయినా కేవలం రజనీ మానరిజమ్స్‌తో ఆడియన్స్‌ను కట్టిపడేశాడు. ఫైట్స్, హీరోయిజంతో పాటు అద్భుతమైన ఎమోషన్స్‌తో ఆకట్టుకున్నాడు. తెర మీద కనిపించేది కొద్ది సేపే అయినా రాధిక ఆప్టే మంచి నటన కనబరిచింది. ముఖ్యంగా కబాలిని తిరిగి కలుసుకునే సన్నివేశంలో ఆమె నటన ప్రేక్షకులతో కంటతడిపెట్టిస్తుంది. లేడీ డాన్‌గా కనిపించిన ధన్సిక నటనతో పాటు యాక్షన్ సీన్స్‌లోనూ ఆకట్టుకుంది. స్టైలిష్‌గా కనిపిస్తూనే.. మంచి ఎమోషన్స్‌ను పండించింది. విలన్‌గా నటించిన విన్స్స్టన్ చావో డాన్ లుక్‌లో పర్ఫెక్ట్గా సూట్ అయ్యాడు. రాక్షసుడైన గ్యాంగ్ స్టర్‌గా చావో నటన సినిమాకు ప్లస్ అయ్యింది. ముఖ్యంగా రజనీ స్టార్ డమ్ ను ఢీకొనే పర్ఫెక్ట్ విలన్‌గా కనిపించాడు. ఇతర పాత్రలలో కిశోర్, జాన్ విజయ్, నాజర్, దినేష్ రవి లాంటి నటులు తమ పరిధి మేరకు ఆకట్టుకున్నారు. సాంకేతిక నిపుణులు : కబాలి లాంటి కథతో రజనీని ఒప్పించిన దర్శకుడు అప్పుడే సగం విజయం సాధించేశాడు. ఈ కథకు రజనీ అంతటి భారీ స్టార్ డమ్ ఉన్న నటుడు తప్ప మరే హీరో చేసినా.. వర్క్ అవుట్ కాదు. అయితే పూర్తి యాక్షన్ డ్రామాగా సినిమాను ప్రమోట్ చేసిన దర్శకుడు.. సినిమాలో ఆ వేగం చూపించలేకపోయాడు. స్లో నారేషన్ ఇబ్బంది పెట్టినా.. రజనీని కొత్తగా చూపిస్తూ అన్నింటిని కవర్ చేశాడు. ఇక సినిమాకు మరో ఎసెట్ సంతోష్ నారాయణ్ సంగీతం. కబాలి థీం మ్యూజిక్‌తో కట్టిపడేసిన సంతోష్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో సినిమాను నెక్ట్స్ లెవల్‌కు తీసుకెళ్లాడు. సినిమాటోగ్రఫి, ఎడిటింగ్, యాక్షన్ కొరియోగ్రఫి లాంటివి ఆకట్టుకుంటాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి. ప్లస్ పాయింట్స్ : రజనీకాంత్ మెయిన్ స్టోరి లైన్ నేపథ్య సంగీతం మైనస్ పాయింట్స్ : స్లో నారేషన్ ఓవరాల్‌గా కబాలి భారీ అంచనాలతో థియేటర్లకు వెళ్లిన ప్రేక్షకులను కాస్త నిరాశపరిచినా.. రజనీ అభిమానులకు మాత్రం బాషాను గుర్తు చేస్తోంది. - సతీష్ రెడ్డి, ఇంటర్నెట్ డెస్క్. -
కబాలి 'పది' నిజాలు
ముంబై: టీజర్ లోనే కబాలి రా.. అంటూ సినీ ప్రేక్షకులను మంత్ర ముగ్ధుల్ని చేసిన సూపర్ స్టార్ రజనీ కాంత్ తాజా చిత్రం కబాలి ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులముందుకి వచ్చింది. ఇప్పటికే భారీ హైప్ క్రియేట్ అయ్యి, కోట్లలో వ్యాపారాన్ని గడించిన ఈ సూపర్ మూవీపై అంచనాలు అంతకంటే భారీగా నెలకొన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లను పలకరించిన కబాలి ఫీవర్ సృష్టించే రికార్డులపై అత్యంత ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో కబాలి సినిమాకు సంబంధించి ముఖ్యమైన పది సంగతులు సినీ అభిమానుల మధ్య హాట్ టాపిక్ గా మారాయి. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత ఒక కొత్త టీమ్ తో రజనీకాంత్ కలిసి పనిచేయడం రజనీకాంత్ తాజా సినిమాలో గాన గంధర్వుడు బాల సుబ్రహ్మణం పాడిన పాట లేకపోవడం సైన్ ఫిక్షన్ ..సూపర్ నేచురల్ ఫిలిం ఓ డాన్ నిజ జీవిత గాథ అధారంగా రూపొందించిన చిత్రం థ్యాంక్స్ టు సౌందర్య రజనీకాంత్. మూడో సినిమాతోనే సూపర్ స్టార్ రజనీ సినిమాకు దర్మకత్వం వహించాడు పా రంజిత్, అయితే ఆయనను రజనీకాంత్ కూ పరిచయం చేసిన ఘనత కూతురికి సౌందర్యకు దక్కుతుంది. సో. ..కబాలిని ఇంత గొప్పగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన క్రెడిట్ కూడా సౌందర్యదే. మరోవైపు సినిమా మొదలైన పావుగంట తర్వాత హీరో తలైవా తెరమీద ఆవిష్కారం. మామూలు రజనీకాంత్ స్టయిల్ విన్యాసాలు.. పంచ్ డైలాగులు.. ఈ సినిమాలో లేవు. ట్రైయిలర్స్ లేవు. మలేషియన్ ప్రభుత్వం రజనీకాంత్ పట్ల గౌరవ సూచకంగా ఒక స్పెషల్ స్టాంప్ ను విడుదల చేసింది. మలేషియాలో భారీగా రిలీజవున్న తొలి భారతీయ సినిమా కబాలి. సినిమా చిత్రీకరణ ఎక్కువ భాగా మలేషియాలో జరగడంతో అక్కడకూడా విడుదల చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది. కబాలి సృష్టించిన మేనియా ఇంతేనా ఇంకా చాలా ఉంది. గూగుల్ స్పెషల్ యాప్, ఓ ప్రయివేటు విమానయానసంస్థరూపొందించిన స్పెషల్ విమానం, ముత్తూట్ ఫినాన్స్ వారి వెండినాణాలు, దబ్ స్మాష్ వీడియో కాంపిటీషన్, కోయంబత్తరూ లో ఒక కఫే రజనీ కి డెడికేట్ .. ఇలా చాలా ప్రత్యేకతలే వున్నాయి. మరి కలెక్షన్ల వసూళ్లలో ఇంకెన్ని రికార్డులు నెలకొల్పనుందో వేచి చూడాలి. -
'కబాలీ'పై టాలీవుడ్ ఏమంటోంది!
హైదరాబాద్: భాగ్యనగరంలో ఎక్కడ చూసిన 'కబాలీ' ఫీవర్ కనిపిస్తుంది. దక్షిణాది రాష్ట్రాల్లో సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన కబాలీ మూవీ చూసేందుకు ఇన్నాళ్లు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన అభిమానులు థియేటర్ల వద్ద క్యూ కడుతున్నారు. మూవీ చూసేందుకు థియేటర్లకు ప్రేక్షకులు, సెలబ్రిటీలు పరుగులు పెడుతున్నారు. హైదరాబాద్ లో ఐమాక్స్ థియేటర్ వద్ద టాలీవుడ్ ఇండస్ట్రీ సెలబ్రిటీలు డాన్ 'కబాలీ' తమ అభిప్రాయాలను పంచుకున్నారు. 'చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలు చూస్తూనే పెరిగాను. నా రూములో ఆయన పోస్టర్లు ఉన్నాయి. రజనీకాంత్ అంటే పిచ్చి. గతంలో రజనీ ఏ సినిమా చూసేందుకు ఇలా ఎదురు చూడలేదు. డిఫరెంట్ లుక్, మేజరిజమ్, భాషా లాంటి గెటప్ లో కనిపించడంతో ప్రేక్షకులలో ఆసక్తి రెట్టింపయింది. ఆయన స్టైల్ గురించి చెప్పక్కర్లేదు' అని స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కుమారుడు, యంగ్ హీరో పూరి ఆకాశ్ అన్నాడు. 'రజనీకాంత్ ప్రతి సినిమాకు ఇలాంటి వాతావరణం ఉంటుంది. ఎవరికీ అర్థంకాని అదో విచిత్రమైన ఫినామినా. రజనీ తనను ఏమైనా కొత్తగా ఆవిర్కరించుకున్నారా అనే ఆసక్తి ప్రేక్షకులలో ఉంది. పాపులర్ స్టార్ మాత్రమే కాదు ఆయన ఓ అద్భుతమైన నటుడు. అమితాబ్ 60 ఏళ్ల తర్వాత ఎలాంటి సినిమాలు చేస్తున్నారో చూశాం. అంతకంటే ఎక్కువగా రజనీ గారు తన సినిమాల్లో కనిపిస్తారని అందరూ ఉత్సాహంగా ఉన్నారు. ఇప్పటివరకూ ఆయనను 100 శాతం తెరమీద ఆవిష్కరించిన సినిమా రాలేదు' అని డైరెక్టర్ ఇంద్రగంటి మోహనకృష్ణ పేర్కొన్నాడు. 'కథ కోసం రాలేదు. కేవలం ఆయన స్టైల్, మ్యానరిజమ్ కోసం వచ్చాను. దేశం మొత్తం రజనీ ఫివర్ ఉంది. ఈ వయసులోనూ ఆయన సంచలనాలు చేస్తారని , రెండున్నర గంటలు ఆయన ఎంటర్ టైన్ చేస్తానని మూవీ చూసేందుకు వచ్చాను' అని టాలీవుడ్ స్క్రిప్ట్ రైటర్ వక్కంతం వంశీ రజనీపై అభిమానాన్ని చాటుకున్నాడు. 'అంతులేనికథ'లో రజనీకాంత్ చేసిన తాగుబోతు పాత్ర నుంచి ఆయనను అభిమానిస్తున్నాను. ఆయన ఇంకా చాలా సినిమాలు చేయాలని, ఆయన మరింత ఆరోగ్యంతో ఉండాలని ప్రొడ్యూసర్ లగడిపాటి శ్రీదర్ కోరుకున్నాడు. టాలీవుడ్ లోనే కాదు, హాలీవుడ్ లోనూ ఇంత క్రేజ్ ఉన్న హీరో మరోకరు లేరు. రజనీ సార్ కు వీర ఫ్యాన్ ను. చాలా గ్యాప్ తర్వాత ఈ మూవీ వచ్చింది. డిఫరెంట్ లుక్ ముఖ్యంగా గెడ్డంతో కనిపించడం ఆకట్టుకుంటుంది అంటూ సెలబ్రిటీలు 'కబాలీ' గురించి చెబుతున్నారు. -
'కబాలి: బ్రదర్ ఆఫ్ లింగా'
దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన 'కబాలి' సినిమా శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. తమ ఆరాధ్య కథానాయకుడు నటించిన సినిమాను తొలిరోజే చూడాలన్న ఉద్దేశంతో అభిమానులు ధియేటర్లకు పోటెత్తారు. సినిమా చూసినవాళ్లు తమ అభిప్రాయాలను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. సినిమా చాలా బాగుందని రజనీ అభిమానులు అంటుంటే అంత గొప్పగా ఏంలేదని మామూలు ప్రేక్షకులు పెదవి విరుస్తున్నారు. నకిలీ సమీక్షలు రాసేవారు జాగ్రత్తగా ఉండాలని రజనీ అభిమానులు హెచ్చరించడం గమనార్హం. గొప్ప సినిమా విడుదైన రోజే తొలి ఆట చూడడం అద్భుతమైన అనుభవమని, ఇది సంబరాలు చేసుకోవాల్సిన సమయమని టీమిండియా క్రికెటర్ సురేశ్ రైనా ట్వీట్ చేశాడు. 'కబాలి' చాలా బాగుందని మలేసియాలో సినిమా చూసిన యువ అభిమాని ట్వీట్ చేసింది. రజనీకాంత్ కనిపించినప్పుడల్లా విజిల్స్, కేకలు వేయకుండా ఉండలేకపోయానని తెలిపింది. ఫ్రాన్స్ గ్రాండ్ ఫిక్స్ ధియేటర్ లో 'కబాలి' సినిమా ప్రదర్శన సందర్భంగా రజనీకాంత్ తెరపై కనిపించిన సందడి ఫొటోను ట్విట్టర్ లో పెట్టాడు. ధియేటర్ లో 2800 మంది ఉన్నారని వెల్లడించాడు. సమీక్షలతో పనిలేకుండా అందరూ రజనీకాంత్ సినిమా చూడాలని ఓ వీరాభిమాని అన్నాడు. కబాలి' తమను ఎంతో ఆకట్టుకుందని పొంగిపోయాడు. సినిమా నెమ్మదిగా ఉందని, చాలా సన్నివేశాలు విసుగు పుట్టించాయని రాకేశ్ కుమార్ అనే ప్రేక్షకుడు పేర్కొన్నాడు. రజనీకాంత్ తొలిసారిగా కనిపించే సన్నివేశం బాగుందన్నాడు. సినిమా గొప్పగా ఏంలేదన్నాడు. 'కబాలి' తీవ్ర నిరాశకు గురిచేసిందని, డబ్బులు తిరిగిచ్చేయాలని మరో ప్రేక్షకుడు వాపోయాడు. సంగీతం బాలేదని అన్నాడు. ఇలాంటి చెత్త సినిమా తీసిన దర్శకుడు పా రంజిత్ ను క్షమించలేమంటూ ఇంకో ప్రేక్షకుడు అసహనం వ్యక్తం చేశాడు. 'కబాలి'ని 'లింగా' సోదరుడిగా పోల్చాడు. Amazing Movie First Day First Show ! Let the festival begin #thalaivar #kabali #nerrupuda… https://t.co/ATdcPrTb4U — Suresh Raina (@ImRaina) 21 July 2016 #Watched Kabali in Malaysia Woohoooo I shouted & screamed like anything.. @superstarrajini is exceptional.. Perum magizhchi @beemji sir -
'కబాలీ'పై టాలీవుడ్ ఏమంటోంది!
-
కబాలీ ఫుడ్ ఫెస్టివల్
-
250 కబాలి టిక్కెట్లు కొన్న ప్రముఖ నటుడు
కబాలిరా..నిప్పురా. కబాలి వచ్చాడని చెప్పు..తిరిగొచ్చాడని చెప్పు.పాత సినిమాలో బుగ్గ మీద చుక్క పెట్టుకుని ఏయ్ కబాలి అని పిలవగానే వంగి ఎస్ బాస్ అనే కబాలి అనుకున్నార్రా.. కబాలి రా.. ఇలాంటి ప్రేక్షకుల చేత చప్పట్లు కొట్టించే సంభాషణలతో తనదైన స్టైల్లో ప్రచార చిత్రంలోనే దుమ్మురేపిన సూపర్‌స్టార్ రజనీకాంత్ తాజా చిత్రం కబాలి చుమ్మ అదురుదిల్లే అంటూ శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా తెరపైకి రానుంది. తమిళసినిమా: ట్రెండ్ సృష్టంచడం అన్నది మన సూపర్‌స్టార్‌కు కొత్తేమీకాదు.అదే బాణీలో మరోసారి బాక్సాఫీస్‌లను బద్ధలు కొట్టడానికి కబాలిగా వస్తున్నారన్న మాట. కబాలి.. ఇప్పుడు ప్రపంచమంతా మారుమోగుతున్నది ఈ మూడక్షరాలే. ఇప్పటి వరకూ భారతీయ సినీ చరిత్రలోనే కనీవినీ ఎరుగని విధంగా ప్రపంచ సినీ అభిమానులు అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం కబాలి. ఇందుకు ఒకే ఒక్క తారక మంత్రం రజనీకాంత్ అనే ఐదు అక్షరాలే.తమిళం,తెలుగు,హిందీ, మలాయ్ మొదలగు నాలుగు భాషలలో ఏక కాలంలో విడుదలవుతున్న ఏకైక చిత్రం అన్న ఘనతను కబాలి చిత్రం దక్కించుకుంది. ఒక చిత్ర విడుదల రోజున కార్పొరేట్ సంస్థలు సెలవులు ప్రకటించడమా? అంటూ కబాలి చిత్ర క్రేజ్‌ను చూసి ప్రపంచ మీడియానే అచ్చెరువు చెందుతోందంటే ఈ చిత్రం స్థాయి ఏమిటో అర్థం చేనుకోవచ్చు.ఇలా చెప్పుకుంటూ పోతే కబాలి గురించి చాలా విశేషాలు ఉన్నాయి.కబాలి చిత్రం విడుదల కావడంతో తమిళనాడులోనే కాదు,పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రా, కర్ణాటకల్లో కొత్త చిత్రాల విడుదలను వాయిదా వేసుకున్నారు.ప్రపంచ వ్యాప్తంగా 5000 థియోటర్లకు పైగా విడుదలవుతున్న కబాలి చిత్రం ఒక తమిళనాడులోనే 650 థియేటర్లకు పైగా విడుదల కానుంది.ఇప్పటి వరకూ ఏ చిత్రం ఇన్ని థియేటర్లలో విడుదల కాలేదన్నది ప్రత్యేకంగా చెప్పాలా? అవరోధాలను చీల్చుకుంటూ ఈ మధ్య చాలా చిత్రాలు విడుదల సమయాల్లో సమస్యలను ఎదుర్కోవడం పరిపాటిగా మారింది. కబాలి కూడా అలాంటి వాటిని ఎదుర్కోక తప్పలేదు.అయితే అన్ని బంధనాలను తెంచుకుని కబాలి డా అంటూ ఇక ప్రభంజనంలా తెరపైకి రానుంది. 250 టిక్కెట్లు కొన్న శింబు కాగా సాధారణ ప్రజలే కాదు ప్రముఖ నటులు కబాలి చిత్రాన్ని మొదటి రోజున మొదటి షో చూడడానికి ఆసక్తి చూపడం అన్నది ఒక రజనీకాంత్ చిత్రానికే జరుగుతోంది.శుక్రవారం పలువురు నటులు చెన్నైలో టికెట్స్ కొని మరీ కబాలి చిత్రాన్ని చూడబోతున్నారు. నటుడు శింబు ప్రస్తుతం మదురైలో అన్భానవన్ అసరాదవన్ అడంగాదవన్ చిత్ర షూటింగ్లో పాల్గొంటున్నారు.ఆయన రజనీకాంత్ వీరాభిమాని అన్న విషయం తెలిసిందే. శింబు తన చిత్ర యూనిట్ సభ్యులు 250 మందికి టికెట్లు కొని శుక్రవారం వారితో కలిసి మదురైలో కబాలి చిత్రాన్ని చూడనున్నారు. అభిమానుల హంగామా రజనీకాంత్ చిత్రం తెరపైకి వస్తుందంటే ఆయన అభిమానులు సెలైంట్‌గా ఉంటారా?పూజలు,పాలాభిషేకాలు,భారీ కటౌట్లు అంటూ నానా హంగామా చేయరూ*ప్రస్తుతం తమిళనాడు వ్యాప్తంగా రజనీ అభిమానుల్లో అలాంటి కోలాహలమే జరుగుతోంది.చెన్నైలో పలు ప్రాంతాలలో కబాలి చిత్రం విజ యం సాధించాలని కోరుకుంటూ పలు ఆలయాల్లో పూజలు,కటౌట్లకు పాలాభిషేకాలు చూస్తూ అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తూ తమ వీరాభిమాన్ని చాటు కుంటున్నారు. కాగా సూపర్‌స్టార్ రజనీకాంత్ శుక్రవారం అమెరికాలో అక్కడ డిస్ట్రిబ్యూటర్ల మధ్య కబాలి చిత్రాన్ని తిలకించారు.చిత్రంలో ప్రతి సన్నివేశానికి వీక్షకుల నుంచి ఈలల,చప్పట్లు పడడంతో ఆ వాతావరణాన్ని మౌనంగా,మనసులోనే ఆనందపడుతూ బయటకు వచ్చిన వెంట నే దర్శకుడు రంజిత్‌కు ఫోన్ చేసి ప్రశంసల వర్షం కురిపించారట. దటీజ్ సూపర్‌స్టార్ అంటున్నారు సినీవర్గాలు. -
30 దేశాల్లో 12వేల స్రీన్లపై 'కబాలి' విడుదల
చెన్నై: సూపర్‌స్టార్ రజనీకాంత్ సినిమా అంటే ఎంత క్రేజ్ ఉంటుందో కొత్తగా చెప్పాల్సినవసరం లేదు. సింపుల్ పర్సనాలటీతో తనదైన స్టైల్‌ను హావాభావాలను పలికించగల ఏకైక నటుడు రజనీకాంత్. ఈ పేరులో ఉన్న వైబ్రేషన్ అంతాఇంతా కాదు.. అభిమానుల నుంచి మామూలు సినీ వీక్షకుడిని సైతం థియేటర్ల వైపు పరుగుల పెట్టించగల సత్తా మన సూపర్‌స్టార్‌కే చెల్లుతుంది. రజనీకాంత్ సినిమా నటించిన తాజా చిత్రం 'కబాలి' ప్రపంచవ్యాప్తంగా బాక్స్ ఆఫీసు రికార్డులను బద్దలు కొట్టేందుకు సిద్ధమవుతోంది. ఈ సినిమా ఎప్పుడు విడుదల అవుతుందా అని ఎదురుచూస్తున్న అభిమానులు కోరిక కొద్ది గంటల్లోనే తీరనుంది. ఇప్పటివరకూ ఏ భారతీయ సినిమా విడుదల కానీ రీతిలో రజనీ 'కబాలి' సినిమా విడుదలవుతోంది. దర్శకుడు పా రంజిత్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 12 వేల స్రీన్లపై 30 దేశాల్లో ఒకేరోజు విడుదలవుతోంది. 'కబాలీ' సినిమా ఎక్కడెక్కడ విడుదలవుతుంటే... 1. ప్రపంచవ్యాప్తంగా 12 వేల స్రీన్లపై 30 దేశాల్లో ఒకేరోజు విడుదల 2. ఆసియా దేశాల్లో పలు థియేటర్లలో బిగ్ స్రీన్లపై విడుదల 3. చైనాలో 4500 స్రీన్లు, 400 స్రీన్లపై అమెరికాలో, మలేసియా, ఇండోనేషియా, జపాన్ వంటి దేశాల్లో 300 స్రిన్లపై ప్రదర్శింపబడనుంది. 4. ఉత్తర భారతదేశంలో ఏకైక సౌత్ ఇండియన్ సినిమాగా కబాలీ 1000 స్రీన్లపై విడుదల కానుంది. 5. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకూ ఏ బాలీవుడ్ సినిమా కూడా డబుల్ స్రీన్లపై విడుదల కాలేదు. 6. ఇటీవల ఎయిర్ఇండియా విమానాలపై కూడా కబాలీ పోస్టర్లు దర్శనమిచ్చిన విషయం తెలిసిందే. 7. కబాలీ సినిమా ట్రైలర్ వీడియో ఒక వారంలో ఏకంగా 25 మిలియన్లను దాటేసింది 8. చెన్నైలో తొలిసారిగా రాష్ట్ర వ్యాప్తంగా సెలవు ప్రకటించడం కబాలీ సినిమాతోనే కావడం విశేషం. 9 కబాలీ సినిమా కోసం.. ఇప్పటికే చెన్నైలో కొన్ని ఐటీ కంపెనీలు సహా చిన్న కంపెనీలు కూడా సెలవు ప్రకటించేశాయి. 10. ప్రపంచ వ్యాప్తంగా ప్రదర్శించబడే థియేటర్లలో ఎఫ్‌డీఎస్ లో 6500 స్రీన్లు బుక్ అవ్వగా, ఎఫ్డీ 3500 స్రీన్లు బుక్ అయ్యాయి. 11 ప్రపంచంలో ఫ్రాన్స్ అతిపెద్ద థియేటర్ లేగ్రాండ్ రెక్స్‌లో తొలి సౌత్ ఇండియన్ సినిమాగా కబాలీ విడుదల అవుతోంది. 12. విడుదలకు ముందుగానే అమెరికాలో అన్ని షోలు బుకైన ఏకైక సినిమాగా 'కబాలి' రికార్డు. -
కబాలి ఫీవర్
విజయవాడ (గుణదల) : ‘కబాలి’ సినిమా వస్తోంది... టికెట్ బుక్ చేసుకోవాలని ఓ కుర్రాడు ఆశగా ‘బుక్ మై షో’ ఓపెన్ చేశాడు... అదీ మూడు రోజుల ముందే... కానీ ఇంకా సినిమా బుకింగ్ ఓపెన్ చేయలేదు. మళ్లీ తర్వాత... లేదు... ముందు రోజు నో టికెట్స్...షాక్ తిన్నాడు... సిటీలో ఏ గల్లీ థియేటర్లో వెతికినా నో టికెట్స్... మొదటి రోజు చూడాలనుకున్న అభిమాని ఇంకాస్త త్వరపడాల్సింది.. ఎందుకంటే అది ‘కబాలి రా’.. ఈ సినిమాకు క్రేజ్ ఇప్పటిది కాదు.. ఎప్పటినుంచో మొదలైంది... రిలీజ్ డేట్ ప్రకటించనప్పటి నుంచి ఎవరి స్థాయిలో వారు రికమెండేషన్స్ చేయడం స్టార్ట్ చేశారు. ఇప్పుడు బెజవాడ, గుంటూరులో కూడా ‘కబాలి’ హడావుడితో హోరెత్తిపోతోంది. థియేటర్లతో సహా మల్టీప్లెక్సుల్లో కూడా ‘కబాలి’ సినిమాను ప్రదర్శిస్తున్నారు. విజయవాడలోని టిక్కిల్ రోడ్డులోని ఓ హోటల్ తన అతిథుల కోసం ప్రత్యేకంగా స్క్రీన్లు ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన అనుమతుల కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. కబాలి టికెట్స్‌కు ఇప్పుడు పెద్ద ఎత్తున డిమాండ్ ఏర్పడింది. ఈ చిత్రానికి సంబంధించి ఆన్‌లైన్‌ద్వారా, థియేటర్/ స్క్రీన్ల కౌంటర్ల వద్ద ఈ నెల 19 నుంచే బుకింగ్‌లు జరిగాయి. ఆదివారం వరకు ముందుగానే టికెట్లు అమ్ముడయ్యాయి. ఇదే అదనుగా కొందరు టికెట్లను బ్లాక్‌లో రూ.500 నుంచి 1000 వరకు, మల్టీప్లెక్స్ «స్క్రీన్ల టికెట్ అయితే రూ.750 నుంచి రూ.1500 వరకు విక్రయిస్తున్నట్లు సమాచారం. బెంజిసర్కిల్ సమీపంలోని ట్రెండ్‌సెట్ మల్టీప్లెక్స్‌లో రెడ్ ఎఫ్ఎం రేడియో ఛానల్‌తో కలిసి గురువారం సాయంత్రం ‘కబాలి’ ఈవెంట్‌ను నిర్వహించింది. ఈవెంట్లో పలువురు యువకులు పాల్గొని టికెట్లు సాధించారు. రజనీకాంత్ సై్టల్స్, ఫేమస్ డైలాగ్స్, పాటలు, ఆయన నడక అంశాల్లో పోటీలు నిర్వహించి సుమారు 250 మంది యువకులకు టికెట్లు అందించారు. అదీ కబాలి క్రేజ్. -
కబాలి క్రేజ్
జిల్లాలో 32 థియేటర్లలో సినిమా విడుదల వెయ్యి రూపాయలు పలుకుతున్న ఒక్క టికెట్టు నెల్లూరు (సిటీ) : కబాలి ఫీవర్ నెల్లూరు జిల్లాను కూడా ఊపేస్తోంది. శుక్రవారం జిల్లాలోని 32 థియేటర్లో ఈ చిత్రం విడుదలవుతోంది. అభిమానుల క్రేజ్‌ను థియేటర్ల యాజమాన్యాలు సొమ్ము చేసుకుంటున్నాయి. నెల్లూరు నగరంలోని రెండు థియేటర్లలో మాత్రమే కబాలి సినిమా ప్రదర్శితమవుతుంది. ఆన్లైన్లో టికెట్ బుకింగ్ సదుపాయం పెట్టకపోవడంపై అభిమానులు మండిపడుతున్నారు. థియేటర్ యాజమాన్యం బ్లాక్ విక్రయాలను ప్రోత్సహిస్తోందని ఆగ్రహిస్తున్నారు. ఒక్కో టికెట్ రూ.700 నుంచి రూ.1000 వరకు పలుకుతోందని తెలుస్తోంది. అన్ని శాఖల అధికారులకు టిక్కెట్లు నెల్లూరు నగర పాలక సంస్ధ, ఆర్డీఓ, కలెక్టరేట్, పోలీస్, ఫైర్‌స్టేషన్ తదితర శాఖలకు ఒక్కో షోకు పది నుంచి 50 టిక్కెట్ల వరకు థియేటర్ యాజమాన్యం అందచేస్తున్నట్లు సమాచారం. దీంతో సామాన్య ప్రజలకు టిక్కెట్లు అందడమే కష్టతరమవుతుంది. అధికారులు, రాజకీయనాయకుల అండదండలుంటేనే టికెట్లు అందే పరిస్థితి ప్రస్తుతం నెల్లూరులో చోటుచేసుకుంది. దీంతో సామాన్యుడు సినిమాను మొదటి రోజు చూడటం కలగా మారింది. ముఖ్యంగా పోలీస్‌శాఖవారు దాదాపు 100 టిక్కెట్లు వరకు తీసుకెళ్లారని సమాచారం. ఈ విధంగా అధికారులకు టికెట్లు ఇస్తుంటే తాము సామాన్యులకు టికెట్లు ఏ విధంగా అందచేయగలమని థియేటర్ల యజమానులు వాపోతున్నారు. బ్లాక్‌లో టిక్కెట్లను విక్రయించడం లేదని, సీటింగ్ కెపాసిటీ మేరకు అందరికీ టిక్కెట్లు అందించేందుకు కృషి చేస్తున్నామని పేర్కొంటున్నారు. -
అమెరికాలో రజనీకి స్టాండింగ్ ఒవేషన్!
అమెరికాలో బుధవారం సాయంత్రం రజనీకాంత్ నటించిన ‘కబాలి’ సినిమాను స్పెషల్ స్ర్కీనింగ్ ఏర్పాటుచేశారు. ఈ షోకు హాజరైన అభిమానులు ఊహించని అతిథిని చూసి ఆశ్చర్యపోయారు. ‘కబాలి’ సినిమాకు వచ్చిన అభిమానులకు ఏకంగా రియల్ ‘కబాలి’ రజనీకాంత్ దర్శనమివ్వడంతో సంభ్రమాశ్చర్యంలో మునిగిపోయారు. సాన్ ఫ్రాన్సిస్కోలో ఏర్పాటు చేసిన ఈ షోకు రజనీ ప్రత్యేక అతిథిగా హాజరై.. అభిమానుల్ని అలరించారు. భారత్‌లోనే కాదు అమెరికాలోనూ ‘కబాలి’ సినిమా తొలి మూడు రోజుల టికెట్లు అమ్ముడుపోయిన సంగతి తెలిసిందే. అమెరికా నుంచి ప్రస్తుతం ‘కబాలి’ సినిమా సానుకూల స్పందన వ్యక్తమవుతున్నది. ‘కబాలి’ని చూసిన చాలామంది అమెరికన్ ఇండియన్లు అభిమానులకు ఈ సినిమా పండుగేనని అంటున్నారు. ‘కబాలి తలైవా అభిమానులకు పైసా వసూల్ సినిమా. అభిమానులు మెస్మరైజ్ అయ్యే సీన్లు ఎన్నో ఉన్నాయి. పలుసార్లు థియేటర్ హర్షధ్వానాలతో దద్దరిల్లింది’ అని ఇండస్ట్రి ఇన్సైడర్ రమేశ్ అమెరికాలో వస్తున్న రెస్పాన్స్ మీద స్పందిస్తూ ట్వీట్ చేశారు. #Kabali U.S distributor @CineGalaxyUSA with @superstarrajini after special show pic.twitter.com/gmdjRagp3b — Studio Flicks (@StudioFlicks) July 21, 2016 -
’కబాలి’ రివ్యూ అప్పుడే వచ్చేసింది!
‘కబాలి’ సినిమాపై ఇప్పటికే అంచానాలు ఆకాశాన్నంటేశాయి. మరికొద్ది గంటల్లో విడుదల కానున్న ఈ సినిమా గురించి ఎక్కడ చూసినా హాట్ హాట్ చర్చ కొనసాగుతోంది. ‘కబాలి’ ఫీవర్ అభిమానుల్ని ఊపేస్తోంది. అమెరికాలో ‘కబాలి’ సినిమా ప్రివ్యూ గురువారం ఉదయమే విడుదలైంది. ఈ నేపథ్యంలో అమెరికాకు చెందిన ఓ వ్యక్తి ఫేస్బుక్లో ‘కబాలి’ సినిమాపై తన రివ్యూను ఇచ్చాడు. బాలాజీ శ్రీనివాసన్ పేరిట ఆయన పెట్టిన రివ్యూ కొన్ని గంటల్లోనే వైరల్ గా మారిపోయింది. ఏకంగా 30వేల మంది ఆయన పేరును ఫేస్బుక్లో సెర్చ్ చేశారు. అయితే, కొన్ని గంటలకే ఆయన తన రివ్యూను తొలగించారు. అయినప్పటికీ ఆయన రివ్యూ పలుచోట్ల షేర్ అయింది. ఇంతకూ ఆయన ఏం రాశారంటే.. బే ఏరియా సినీ పరిశ్రమ స్నేహితులకు కృతజ్ఞతలు.. ‘కబాలి’ సినిమా ప్రివ్యూను నేను చూశాను. ఎలాంటి అంచనాలు లేకుండా సినిమాకు వెళ్లాను. మిశ్రమ భావాలతో బయటకు వచ్చాను. రజనీ అభిమానులకు ఇది కచ్చితంగా పైసా వసూల్ సినిమానే. వయస్సు మీదపడిన సూపర్ స్టార్ ప్రదర్శించే దూకుడును చూసి ఇతరులూ ఛలోక్తులతో ఆనందించవచ్చు. కథ విషయానికొస్తే.. మలేషియా నేపథ్యంగా కథ నడుస్తుంది. అక్కడ అరాచకాలు ఎదుర్కొంటున్న తమిళులు తమను ఆదుకునే వాడికోసం ఎదురుచూస్తూ ఉంటారు. జాతి వివక్షను ఎదిరించి కొంతకాలం జైలు శిక్ష అనుభవించిన సూపర్ స్టార్ నెల్సన్ మండేలాలాగా అక్కడికి వస్తాడు. కొంతకాలం (బాషాలో ఆటోడ్రైవర్ లా) సామాన్యుడిలాగే జీవిస్తాడు. కానీ పరిస్థితుల ప్రభావంతో శత్రువుల నుంచి తన కూతురిని కాపాడుకునేందుకు రజనీ గ్యాంగ్‌స్టర్‌గా మారుతాడు. అలా మలేషియాలోని తమిళులు, దళితుల నాయకుడిగా మారి వారి జీవితాల్లో ఎంతో గణనీయమైన మార్పు తీసుకొస్తాడు. రజనీ అభిమానిని ఈ సినిమా మెస్మరైజ్ చేస్తుంది. స్లో మోషన్ వాక్స్, స్టైలిష్ పోజులు, క్రిస్పీ డైలాగులు సినిమా అంతటా ఉండటం అభిమానిని సంతోషపెడుతుంది. రజనీ చాలా పొందిక తన మ్యానరిజమ్స్ ప్రదర్శించిన ప్రతిసారి థియేటర్ హర్షధ్వానాల్లో మునిగితేలుతుంది. సినిమాలో కొన్ని ఫ్లాష్ బ్యాక్ సీన్స్ కూడా ఉన్నాయి. ఇందులో రజనీ యువకుడిగా కనిపించి.. ఒకప్పటి రజనీని గుర్తుకుతెస్తాడు. రజనీకి ఉన్న లార్జర్ దన్ లైఫ్ ఇమేజ్ దృష్టిలో పెట్టుకొని దర్శకుడు పా రంజిత్ సినిమాను డీల్ చేశాడు. ఇంకా చెప్పాలంటే చాలా సినిమాల్లో రజనీ చేసిన అద్భుతాలే మళ్లీ ఇందులో కనిపించినట్టు అనిపిస్తుంది. మామూలు సినీ వీక్షకుడికి మాత్రం ఈ సీన్లు అసహజంగా, బోర్ కొట్టించేవిగా అనిపించవచ్చు. వయస్సు మీద పడిన రజనీ ఫ్లాష్ బ్యాక్ సీన్లలో 30 ఏళ్ల యువకుడిగా కనిపించడం కూడా కొద్దిగా ఎబ్బెట్టుగా తోచవచ్చు. మొత్తానికి సినిమాపరంగా చూస్తే కొంచెం నిడివి పెరిగినట్టు అనిపించినా రజనీ మళ్లీ తనదైన నటన చూపించాడు. మలేషియాలోని తమిళుల అవస్థ పట్ల పా రంజిత్ ఇంతకంటే మంచి సినిమా తీయవచ్చు. రంజిత్ దళిత రాజకీయాలు కూడా సినిమాలో బ్యాక్ సీట్ అయ్యాయి. ఈ సినిమా రజనీకి కమర్షియల్ వెహికిల్ గా మారిందని చెప్పవచ్చు. (ఇది ఫేస్బుక్లో బాలాజీ శ్రీనివాసన్ అనే వ్యక్తి పెట్టిన రివ్యూ మాత్రమే) -
‘కబాలి’ని ఎందుకు చూడాలి??
‘కబాలి’ సినిమా సంబురాలు అప్పుడే మిన్నంటుతున్నాయి. చెన్నైలోని చాలా థియేటర్ల వద్ద రజనీకాంత్ అభిమానుల సందడితో పండుగ వాతావరణం నెలకొంది. ఇటు దేశవ్యాప్తంగా ‘కబాలి’ సినిమా ఎలా ఉండబోతున్నది? అసలు ‘కబాలి’ ఏం చేయబోతున్నాడు? అని ఆసక్తిగా ఎదురుచూస్తోంది. రేపు (శుక్రవారం) ‘కబాలి’ విడుదలవుతున్న తరుణంలో ఈ సినిమాను ఎందుకు చూడాలి? అంటే.. ఇదిగో ఈ ఐదు కారణాలు చెప్పవచ్చు అంటున్నారు సినీ పరిశీలకులు.. 1. రజనీ ఒక ప్రభంజనం రజనీకాంత్ అంటే అభిమానులకు దేవుడు.. రజనీ సినిమాల్లో చేసే కొన్ని అద్భుతాలను పక్కనబెడితే.. సినీ ప్రేమికులూ ఆయన చిత్రాలను ఇష్టపడతారు. రజనీలో మంచి నటుడున్నాడని విమర్శకులు ఒప్పుకుంటారు. కానీ మాస్ ఇమేజ్, మ్యానరిజం చట్రంలో పడిపోయాడని పేర్కొంటారు. మొత్తానికి 1975లో మొదలైన ‘తలైవా’ ఇమేజ్ ఇప్పుడు శిఖరస్థాయిని అందుకుంది. రజనీ గత రెండు సినిమాలు- కొచ్చాడైయన్, లింగా- బాక్సాఫీసు వద్ద చతికిలపడ్డాయి. ఈ నేపథ్యంలో తన సర్వశక్తులొడ్డి.. తనను తాను బాక్సాఫీసు బాషాగా పునర్ ఆవిష్కరించికోవడానికి రజనీ చేసిన ప్రయత్నమే ‘కబాలి’ అని అంటున్నారు. మరీ ముఖ్యంగా ఈ సినిమాలో రజనీ తొలిసారి తన ఒరిజినల్ లుక్‌తో కనిపించనున్నారు. తొలిసారి 50, 60 ఏళ్ల వ్యక్తిగా ఎలాంటి మేకప్ ట్రిక్కులు పెద్దగా లేకుండా, వెంట్రుకలకు రంగు వేసుకోకుండా రజనీ లుక్ ఇప్పటికే అభిమానుల్ని మెస్మరైజ్ చేస్తోంది. 2. కపాలీశ్వర్ కథ! కథ గురించి పెద్దగా తెలియదు. కపాలీశ్వరన్ అనే చెన్నై గ్యాంగ్‌స్టర్ గా రజనీ కనిపించనున్నారు. మలేషియాలో మొదలైన ఆయన జీవితం.. అక్కడ శతాబ్దాలుగా నివసిస్తున్న తమిళులకూ సమాన హక్కుల కోసం ఆయన చేసిన పోరాటం స్థూలంగా ఈ సినిమా కథ అని వినిపిస్తోంది. చరిత్రలోకి తొంగిచూస్తే 11వ శతాబ్దం పల్లవులు, చోళుల కాలం నాటి నుంచి తమిళులు మలేషియాలో ఆవాసం ఏర్పరుచుకొని జీవిస్తున్నారు. బ్రిటీష్ హయాంలోనూ ఎంతోమంది అక్కడికి వలసవెళ్లారు. ఈ నేపథ్యంలో తమిళుల హక్కులు అనే ఎమోషనల్ అంశం చుట్టూ ‘కబాలి’ కథ తిరుగొచ్చని అంటున్నారు. 3. యువ దర్శకుడి మ్యాజిక్ దర్శకుడిగా పా రంజిత్ ఇప్పటివరకు తెరకెక్కించినవి రెండే చిత్రాలు. కానీ ఈ రెండు చిత్రాలతో తనదైన ముద్రను అతను వేసుకున్నాడు. మంచి కథలను ఎంచుకొని.. దానికి లోకల్ ట్విస్టు యాడ్ చేసి.. నిజంగానే జరిగిందా? అన్నంత అద్భుతంగా పా రంజిత్ తన చిత్రాల్లో మ్యాజిక్ చేశాడు. అతడు తెరకెక్కించిన మద్రాస్, అడ్డకత్తి చిత్రాలు విమర్శకుల ప్రశంసలందుకున్నాయి. ఈ నేపథ్యంలో రజనీలాంటి సూపర్ స్టార్‌ను రంజిత్ ఎలా చూపించాడు.. కథను ఎలా హ్యాండిల్ చేశాడు.. తెరపై చూపాడు అన్నది ఆసక్తికరంగా మారింది. 4. సినిమా నిండా కొత్త రక్తం! ‘కబాలి’ సినిమాకు దర్శకుడే కాదు.. చాలావరకు టెక్నిషియన్స్, తారాగణం కూడా కొత్తవారే. రజనీ సినిమాకు సాధారణంగా ఏఆర్ రహమాన్ సంగీతం అందిస్తారు. కానీ ఈ సినిమాకు 33 ఏళ్ల యువ సంగీత దర్శకుడు సంతోష్ నారాయణ్‌కు అవకాశమిచ్చారు. ‘నెరుప్పుడా’ పాటతో అతను తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. అలాగే బాలీవుడ్ భామ రాధికా ఆప్టేకు మంచి నటిగా పేరుంది. ఆమెను రజనీ పక్కన హీరోయిన్గా తీసుకోవడం కూడా కలిసి వచ్చింది. ఇద్దరి మధ్య వయస్సుపరంగా వ్యత్యాసమున్నా.. రజనీ మ్యాజిక్ అది కవర్ చేస్తుందని అంటున్నారు. 5. కొత్త తరహాలో టేకింగ్.. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలు ‘కబాలి’ సినిమా ఎలా ఉండబోతున్నదో కొంతవరకు హింట్ ఇచ్చాయి. అభిమానులు పడిచచ్చే ‘రజనిజం’ మ్యానరిజానికి ఈ సినిమాలో కథానుగుణంగా కనిపిస్తాయని తెలుస్తోంది. ముఖ్యంగా పాత సినిమాల్లో మాదిరిగా రజనీ తన క్రాప్‌ను స్టైలిష్‌గా సరిచేసుకోవడం.. ‘కబాలి, రా’ అంటూ తనదైన స్టైల్లో పేర్కొనడం ఈ సినిమా ఎలా ఉండబోతున్నదో చెప్పకనే చెబుతున్నది. రజనీ మ్యానరిజం, స్టైల్స్ లోపించకుండా దర్శకుడు కథను ఎలా ముందుకు నడిపించాడో తెలుసుకోవాలంటే.. రేపటివరకు ఆగాల్సిందే. -
‘కబాలి’ టిక్కెట్ల కోసం మంత్రుల రికమండేషన్
తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన ‘కబాలి’ చిత్రం పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఈ సినిమా చూడడం కోసం ఆయన అభిమానులు ఎంతో ఆతృతగా ఊపిరి బిగబట్టి ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా టిక్కెట్లు కొనుగోలు కూడా పెద్ద సెన్సేషన్ సృష్టించింది. తమిళనాడులో సినిమా టిక్కెట్ల కోసం ఆయన అభిమానులు మంత్రలు, ఎంపీలు, ఎమ్మెల్యేల నుంచి సిఫార్సు లెటర్లు తెచ్చుకుంటున్నారు. భారత దేశంలో శుక్రవారం విడుదల కానున్నది. -
టికెట్ల కోసం రికమండేషన్ లెటర్
కబాలి ఫీవర్ చెన్నై రాజకీయాలను సైతం తాకింది. ఇప్పటికే కబాలి టికెట్ల కోసం భారీ పోటి నెలకొన్న దృష్ట్యా సీన్లోకి పొలిటికల్ లీడర్లు కూడా ఎంటర్ అయ్యారు. తొలి రోజు సినిమా టికెట్ల కోసం రాష్ట్ర మంత్రుల ఆఫీసుల నుంచి రికమండేషన్ లెటర్ వస్తుండటంతో థియేటర్ల యాజమాన్యాలు తలలు పట్టుకుంటున్నారు. తాజాగా తమిళనాడు రాష్ట్రానికి చెందిన ఇన్ఫర్మేషన్, పబ్లిసిటీ మంత్రి.., సీనియర్ పర్సనల్ అసిస్టెంట్ పేరిట.. అభిరామి థియేటర్ మేనేజర్‌కు లెటర్ వచ్చింది. కబాలి సినిమా పది టికెట్లను తిరు, రిజ్వాన్‌లకు ఇవ్వాలంటూ ఈ లెటర్లో సూచించారు. అడ్వాన్స్ బుకింగ్‌లతో పాటు ఫ్యాన్స్ ఒత్తిడితో ఇబ్బంది పడుతున్న థియేటర్ యాజమాన్యాలకు రాజకీయనాయకుల రికమండేషన్ లు మరింత సమస్యగా మారాయి. -
'కబాలి'కి లైన్ క్లియర్
చెన్నై: దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్ తాజా సినిమా 'కబాలి' విడుదలకు అడ్డంకులు తొలగాయి. ఈ సినిమా విడుదల కాకుండా స్టే ఇచ్చేందుకు చెన్నై హైకోర్టు నిరాకరించింది. 'లింగా' సినిమా డిస్ట్రిబ్యూటర్లు పిటిషన్ వేసిన పిటిషన్ పై న్యాయస్థానం ఈ మేరకు స్పందించింది. 'లింగా' సినిమా కారణంగా వచ్చిన నష్టాలను ఇప్పటివరకు రజనీకాంత్ చెల్లించలేదని పిటిషన్ లో పేర్కొన్నారు. తమకు వచ్చిన నష్టాన్ని భర్తీ చేసిన తర్వాతే కబాలి' సినిమా విడుదలకు అనుమతివ్వాలని కోర్టును కోరారు. అయితే ఇందుకు హైకోర్టు నిరాకరించింది. 'కబాలి' సినిమా ప్రపంచవ్యాప్తంగా శుక్రవారం విడుదలకానుంది. రజనీకాంత్ నటించిన లింగా చిత్రం పరాజయం కావడం వివాదానికి దారితీసిన సంగతి తెలిసిందే. భారీ నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్లు పరిహారం డిమాండ్ చేశారు. ఈ విషయంలో నిర్మాత రాక్‌లైన్ వెంకటేశ్, డిస్ట్రిబ్యూటర్ల మధ్య పరిష్కారం కుదరలేదు. దీంతో పరిహారం కోసం రజనీకాంత్ ఇంటి ముందు భిక్షాటన చేసి ఆందోళన కూడా చేశారు. నిరహారదీక్షలు చేపట్టారు. ఫలితం లేకపోవడంతో కోర్టును ఆశ్రయించారు. -
నిజమే... రజనీ ఇంట్రో సీన్ లీక్ అయ్యింది..!
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ కబాలి లీక్ అయ్యింది. చాలా రోజులుగా ఈ ప్రచారం జరుగుతున్న చిత్రయూనిట్ ఖండిస్తూ వచ్చింది. అయితే తాజాగా రజనీ ఇంట్రడక్షన్‌కు సంబంధించిన సన్నివేశాన్ని కర్ణాటకకు చెందిన ప్రజా టీవీ ప్రసారం చేసింది. దీంతో లీక్ అయిన విషయం నిజమే అన్న నమ్మకం కలిగింది. రెండు నిమిషాలకు పైగా ఉన్న పూర్తి సన్నివేశాన్ని ప్రజాటీవీ ప్రసారం చేసింది. ఆ టీవీలో ప్రసారం చేసిన ఈ కథనం యూట్యూబ్‌లో కూడా పెట్టేయటంతో విపరీతంగా సర్క్యులేట్ అవుతోంది. వెంటనే స్పందించిన చిత్రయూనిట్ యూట్యూబ్ నుంచి వీడియోను తొలగించినా.. ఇప్పటికే చాలా మంది వీడియోను డౌన్ లోడ్ చేసుకున్నారు. -
బెంగళూరు హోటళ్లకు షాక్
-
సామాన్యుడిగా సూపర్ స్టార్..!
ఒక సినిమాకు ఇంత స్థాయిలో హైప్ వస్తుందా..? ఓ హీరో బొమ్మతో బంగారు నాణేలు విడుదలవుతాయా..? సినిమా పోస్టర్లను విమానాల మీద ముద్రిస్తారా..? ఒక సినిమా ఒకేసారి వేల థియేటర్లలో రిలీజ్ అవుతుందా..? నమ్మలేని నిజాలనిపించే ఈ విశేషాలను కబాలి సినిమాతో నిజం చేసి చూపించాడు సూపర్ స్టార్ రజనీకాంత్. నిన్నటి వరకు సౌత్ సూపర్ స్టార్ అనిపించుకున్న రజనీ.. ఈసినిమాలో ఇంటర్ నేషనల్ సూపర్ స్టార్ గా అవతరించాడు. బస్ కండక్టర్ నుంచి భారతీయులు గర్వంగా చెప్పుకునే స్థాయికి వచ్చిన రజనీ తెర వెనక ఎలా ఉంటాడు..? ఆయన అలవాట్లేంటి..? బస్ కండక్టర్ శివాజీరావ్ గైక్వాడ్ నుంచి.. సూపర్ స్టార్ రజనీ కాంత్ వరకు..? రజనీ కాంత్ ప్రతి హోలీ పండుగకు త న గురువు బాలచందర్‌కు ఫోన్‌చేసి యోగక్షేమాలు తెలుసుకుంటారు. కానీ ఆ రోజే ఎందుకు ఇలా చేస్తున్నారనే విషయం బాలచందర్‌కూ తెలియదు. కొ న్ని సంవత్సరాల తర్వాత అడిగితే.. 'శివాజీ రావ్ గైక్వాడ్ గా ఉన్న నా పేరును రజనీకాంత్ గా మార్చింది హోలీ రోజునే సార్!'అన్నారట. రజనీకాంత్ ఇంట్లో ఉన్నప్పుడు నిత్యం 'ఓం'కార నాదం వింటూనే ఉంటారు. ఆయన ఇష్ట దైవం వినాయకుడు. రజనీకాంత్ వివాహం తిరుపతిలో జరిగింది. రోడ్డుపక్కనున్న కాకా హోటళ్లలో భోజనం చేయటం రజనీకి చాలా ఇష్టం. పోరూర్ సిగ్నల్‌లోని ఓ రెస్టారెంట్‌కు ఇప్పటికీ వెళ్లొస్తారట. ఏవీఎం స్టూడియోలో షూటింగ్ జరిగితే.. రజనీకాంత్ నెంబర్ 10 మేకప్ రూమ్ లో బస చేస్తారు. అది ఆయనకు సెంటిమెంట్. చెన్నైలో షూటింగ్ అంటే రజనీకే కాకుండా, మరో 25 మంది వరకు భోజనం ఆయన ఇంటి నుంచే వెళ్తుంది. తన ఇంటిలో ఉద్యోగం చేస్తున్న అందరికీ నీలాంగరైలో ఓ ప్లాట్‌ను కొనిచ్చారు. వారిపేరుపై కొంత మొత్తం ఫిక్స్డ్ డిపాజిట్ కూడా చేశారు. మెరీనా బీచ్‌లో అమ్మే వేరుశనగలంటే రజనీకాంత్‌కు చాలా ఇష్టం. 'ఓ వ్యక్తి దేనినైనా దక్కించుకోవాలని బలంగా ప్రయత్నిస్తే.. ప్రపంచంలోని ఏ శక్తి ఆపజాలదు'.. స్వామి వివేకానందుడి ఈ సూక్తే రజనీకాంత్ గుమ్మంపై ఉంటుంది. రజనీకాంత్ మాట్లాడిన తొలి పంచ్ డైలాగ్ 'ఇదు ఎప్పడి ఇరుక్కు'(ఇది ఎలా ఉంది?). రజనీకాంత్ మాంసాహార ప్రియుడు. ముఖ్యంగా మటన్, తలకాయ కూరంటే ఇష్టంగా తింటారు. తన ఏ సినిమా షూటింగ్ పూర్తి చేసినా, ఆ చిత్రానికి పనిచేసి సహాయకులకు కొంత మొత్తాన్ని కానుకగా ఇస్తుంటాడు రజనీ. తమిళంతోపాటు, తెలుగు, కన్నడం, మలయాళం, మరాఠి, ఆంగ్ల భాషల్లో అనర్గళంగా మాట్లాడగలరు. ఆయన కెరీర్ లో అత్యధికంగా ఎస్.పి.ముత్తురామన్ దర్శకత్వంలో 25 చిత్రాల్లో నటించారు. హిమాలయాలనే కాకుండా ఏ ఆధ్యాత్మిక ప్రాంతానికి వెళ్లినా అక్కడి రుద్రాక్షలను సేకరిస్తూ ఉంటారు. అలా సేకరించిన రుద్రాక్షలు రజనీ ఇంటిలో కుప్పలతెప్పలుగా ఉంటాయి. తనకు నచ్చిన పాటకు సంగీత దర్శకుడెవరో తెలుసుకుని ఫోన్ చేసి వారిని అభినందించటం రజనీకి అలవాటు. ఇప్పటికీ తన ఇంటిలోని పెద్ద అద్దం ముందు నిలబడి రిహార్సల్స్ చేస్తుంటారట. తనకు ఎంత ఆప్తులైనా వారికోసం ఎలాంటి సిఫారసు మాత్రం చేయరు. సిగరెట్ తాగటం చాలా ఇష్టం. అయితే ఆరోగ్య సమస్యల కారణంగా ఇప్పుడా అలవాటు మానుకున్నారు. టూవీలర్ నడుపుతూ చెన్నై వీదుల్లో తిరగటం అంటే సరదా.. అప్పుడప్పుడు మారువేశాల్లో అలా బయటికి వస్తుంటారు. రజనీకాంత్‌కు ఎక్కువ చిత్రాలకు సంగీతం అందించిన ఘనత ఇళయరాజాదే. ఆయనతో ఎంతో చనువుగా ఉంటే రజనీ స్వామి అని పిలుస్తారు. రజనీకి ఇప్పటికీ పర్సు, క్రెడిట్ కార్డులు వాడే అలవాటు లేదు. బయకెళ్లినప్పుడు ప్యాకెట్ మనీగా రూ.500 మాత్రమే తీసుకెళ్తారు. అప్పుడప్పుడు స్నేహితుల ఇంటికి అకస్మికంగా వెళ్లి వారితో ఆనందంగా సమయం గడుపుతుంటారు. తనతో ఫొటో దిగేందుకు వచ్చే వారిలో చిన్నారులుంటే వారిని ఎత్తుకుని ఫోజివ్వటం రజనీకాంత్ అలవాటు. పోయస్‌గార్డెన్‌లోని రజనీకాంత్ ఇంటి పేరు 'బృందావన్'. ఇది ఆయనే పెట్టుకున్నారు. ఆ ఇంటిపై 'సత్యమేవజయతే..' అని పెద్దక్షరాలతో రాయించారు. విమాన ప్రయాణాలకన్నా రైలు ప్రయాణాలకే రజనీకాంత్ మొగ్గుచూపుతారు. తలైవా.. మీ పుట్టినరోజునాడు మిమ్మల్ని కలుసుకోవాలని అనుకుంటున్నామ'ని అభిమానులు అడిగితే.. 'అసలు నేనెందుకు పుట్టాననే విషయాన్ని తెలుసుకునేందుకు ఆ రోజంతా ఏకాంతంగా గడుపుతాను. ప్లీజ్ ఆరోజున నన్ను వదిలేయండి'అని అభిమానులకు దూరంగా ఉంటారు. కె.బాలచందర్ గారంటే రజనీకి ఎంతో గౌరవం. ఆయన ఎప్పుడు ఫోన్ చేసినా లేచి నిలబడే మాట్లాడతారు. అదీ ఆయన గురుభక్తి. ఫిలిం ఛాంబర్ ఇనిస్టిట్యూట్‌లో చదువుకుంటున్న సమయంలో చాలా సందర్భాల్లో ఫీజు కూడా కట్టలేకపోయేవారట. ప్రిన్సినల్ రాజారామ్‌దాస్‌సహాయం చేశారట. ఆ విషయాన్ని చాలా సందర్భాల్లో గుర్తు చేసుకుంటుంటారు. తనను కలిసేందుకు ఎవరు వచ్చినా, వయస్సులో చిన్నవారైనా లేచి నిలబడి వారిని ఆహ్వానిస్తారు. వారు కూర్చున్నాకే తాను కూర్చుంటారు.. రజనీకాంత్ ఏ కారులో వస్తారనే విషయాన్ని ఎవరూ ముందే ఊహించలేరు. ఖరీదైన కార్లకు దూరంగా ఉండే సూపర్‌స్టార్ అంబాసిడర్, క్వాలీస్‌లో మాత్రమే ప్రయాణిస్తుంటారు. రజనీకి రోజూ రెండు మూడు సినిమాలు చూడటం అలవాటు.. అందులోనూ తప్పనిసరిగా రోజు ఓ ఇంగ్లీష్ సినిమాను చూస్తారు. ఇరవైసార్లుకు పైగా రక్తదానం చేసిన అభిమానులకు తన సంతకంతో కూడిన ప్రశంసాపత్రం పంపిస్తారు. తొలినాళ్లలో నల్ల దుస్తులను ఇష్టపడే రజనీకాంత్ ప్రస్తుతం ఎక్కువగా తెల్ల రంగు బట్టలను వాడుతున్నారు. రజనీకాంత్ నటించిన ఏకైన ఆంగ్ల చిత్రం 'బ్లాడ్ స్టోన్' 1988 అక్టోబరు 7న విడుదలైంది. ఈ సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో అభిమానులను సొంతం చేసుకున్నారు రజనీ. తన దగ్గర పాతికేళ్ల పాటు పనిచేసి తరువాత మానేసిన ఉద్యోగికి ఇప్పటికీ జీతం ఇస్తూనే ఉన్నారు. విదేశాలకు వెళ్లినప్పుడు సరదాగా అక్కడి బస్సుల్లో నిల్చొనే ప్రయాణిస్తారు. కారణం అడిగితే కండక్టర్ కాలం నాటి అలవాటు అని చెబుతుంటారు. అల్లుడు ధనుష్ ప్రతి పుట్టినరోజుకు ఓ వెండి ప్లేటు, గ్లాస్ కానుకగా ఇస్తారు. 'ముల్లుం మలరుం' చిత్రంలో తన నటనను ప్రశంసిస్తూ కె.బాలచందర్ రాసిన ఉత్తరాన్ని నేటికీ ఆయన భద్రంగా దాచుకున్నారు. ఆభరణాలను రజనీ ఇష్టపడరు. గతంలో రజనీ తన కుడిచేతికి కడియం ధరించేవారు. ఇప్పుడది నెల్త్లెకి చెందిన తన అభిమాని తిరుమారన్ కు బహుమతిగా వెళ్లింది. ఆధ్యాత్మికం కాకుండా ప్రపంచ రాజకీయ నేతల జీవిత చరిత్రల పుస్తకాలను చదవటం రజనీకి చాలా ఇష్టం. రూ.50 కోట్లతో రజనీకాంత్ తిరువళ్లువర్‌గా నటించే చిత్రాన్ని నిర్మించేందుకు ఓ సంస్థ పనులు కూడా ప్రారంభించింది. ఎందుకో అది కార్యరూపం దాల్చలేదు. ఎంజీఆర్, శివాజీలంటే మహా ఇష్టం. ఎంజీఆర్ తమిళ సినిమా మార్గదర్శి, శివాజీ గణేశన్ ఓ నిఘంటువు.. అని అభివర్ణిస్తుంటారు రజనీ. -
నెట్లో రజనీ ఇంట్రడక్షన్ సీన్..?
కొద్ది రోజులుగా కబాలి సినిమా లీక్ అయ్యిందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఎక్కడ సినిమాకు సంబందించిన లింక్స్ కనిపించకపోయినా., సినిమా లీక్ అయ్యిందంటూ పెద్ద హడావిడే జరిగింది. చిత్ర నిర్మాతలు సైతం, పోలీస్ శాఖను సంప్రదించిన పైరసీని అరికట్టాలని కోరారు. 250కి పైగా పైరసీ సైట్లపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. చివరకు సినిమా లీక్ అవ్వలేదంటూ ట్విస్ట్ ఇచ్చి అంతా తూచ్ అనేశారు. తాజాగా మరోసారి కబాలిలో రజనీ ఇంట్రడక్షన్ సీన్ లీక్ అయ్యిందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే విదేశాలకు ప్రింట్స్ చేరుకోవటంతో అక్కడే సినిమా లీక్ అయ్యిందన్న ప్రచారం జరుగుతోంది. లీక్ అయిన సీన్లో అరబిక్ సబ్ టైటిల్స్ ఉండటంతో ఈ సీన్ గల్ఫ్ దేశాల్లో లీక్ అయ్యిందన్న అనుమానం వ్యక్తం అవుతోంది. రజనీ జైలు నుంచి బయటకు వస్తున్న రెండు నిమిషాల సన్నివేశం లీక్ అయ్యిందన్న ప్రచారం జరుగుతోంది. -
హోటల్స్‌లోనూ కబాలి మానియా
-
కబాలి రా!!
-
రజనీకాంత్ కి నోటీసులు
ప్రపంచంలో ఏ చిత్రానికి ఒక రోజును కేటాయించలేదు. ఆ క్రెడిట్ కబాలికే దక్కింది. కబాలి చిత్ర విడుదల రోజు(జూలై 22)ను అభిమానులు ‘కబాలి డే’గా పేర్కొంటున్నారు. ఆ రోజున కొందరు చిత్ర షూటింగ్‌లను రద్దు చేసుకోవడం విశేషం. దర్శకుడు వెంకట్‌ప్రభు తన చిత్ర నిర్మాణ సంస్థ నిర్వాహకులకు కబాలి చిత్రం చూడడానికి జూలై 23న సెలవు ఇచ్చేశారు. కాగా జై, అంజలి జంటగా నటిస్తున్న బెలూన్ చిత్ర షూటింగ్‌ను కబాలి డే రోజున ఆ చిత్ర యూనిట్ రద్దు చేసుకుంది. అదే విధంగా కొన్ని కార్పొరేట్ సంస్థలు ఆ రోజున సెలవు ప్రకటించడంతో పాటు, ఉద్యోగులకు కబాలి టిక్కెట్లను ఇచ్చి నూతన విధానానికి శ్రీకారం చుట్టారు. ఇక చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖుల నుంచి పిల్లల వరకూ కబాలి చిత్రాన్ని విడుదలైన మొదటి ఆటనే చూడాలని కోరుకుంటున్నారంటే ఆ చిత్రం ఎంత సంచలనానికి కారణం అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. ఇక కబాలి చిత్ర థియేటర్లలో టిక్కెట్ల విక్రయాలు చూస్తే కళ్లు బైర్లుకమ్ముతాయి. రూ.500 నుంచి రూ.1500 వరకూ బ్లాక్‌లో అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు. థియేటర్ల యజమానులే రూ.500లకు విక్రయిస్తున్నారని కోర్టులో పిటిషన్ వేసినా ఫలితం లేకపోయింది. ఇలా కబాలిపై కొన్ని కేసులు కొట్టివేతకు గురైనా మరిన్ని కేసులు నమోదవుతూనే ఉన్నాయి. తమిళసినిమా: కబాలి చిత్ర పండుగ ప్రపంచవ్యాప్తంగా రేపటి నుంచి ప్రారంభం కానుంది. ప్రచారాలు అంబరాన్ని తాకడంతో అభిమానుల్లో సంబరాలు మొదలయ్యాయి. యువ దర్శకుడు రంజిత్ దర్శకత్వంలో వీ క్రియేషన్స్ పతాకంపై నిర్మాత కలైపులి ఎస్.ధాను నిర్మించిన భారీ బడ్జెట్ చిత్రం కబాలి. పూజా కార్యక్రమాలు ప్రారంభమైనప్పటి నుంచే ఈ చిత్రంపై హైప్ మొదలైంది. కోట్లు ఖర్చు చేసినా రానంత ప్రచారం కబాలి చిత్రానికి దక్కింది. అందుకు ఏకైక కారణం స్టైల్ కింగ్ రజనీకాంత్ అన్నది చిన్న పిల్లలను అడిగినా చెబుతారు. ఎందిరన్ చిత్రం తరువాత రజనీకాంత్‌కు సరైన విజయాలు లేవన్నది వాస్తవం. అయితే జయాపజయాలకు అతీతుడినని ఆయన నిరూపించుకుంటూనే ఉన్నారు. రజనీ పడిలేచే తరంగం కాదు. ఎప్పుడూ ఎగసిపడే కెరటం లాంటి వారు. అందుకే భారతీయ సినీ నటుల్లో ఎవరికీ లేనంత క్రేజ్ ఆయన సొంతం. దుమ్ము రేపిన టీజర్ కబాలి చిత్ర టీజర్ ప్రపంచ వ్యాప్తంగా దుమ్మురేపింది. ఏ చిత్రానికి రానంత విశేష స్పందనను రాబట్టుకుంది. కబాలిడా అన్న ఒక్క డైలాగ్‌కే ఆయన అభిమానుల్లో ఉల్లాసం పొంగిపొరలింది. కబాలి కోసం అభిమానులతో పాటు యావత్ సినీ ప్రియులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అందుకు మరో రోజే ఆగాల్సిఉంది. వినూత్న ప్రచారం కబాలి చిత్రానికి కనీవిని ఎరుగని రీతిలో ప్రచారం జరిగింది. ఇప్పటి వరకూ గోడల మీద, భారీ కటౌట్‌తోనే పోస్టర్లను చూసిన ప్రజలు కబాలి పోస్టర్లను దేశ, విదేశీ విమానాలపై మెరవడంపై ఆశ్చర్యపోయారు. ఇక పెద్ద పద్ద కార్పొరేట్ సంస్థలు, వాణిజ్య సంస్థలు చిత్ర ప్రచారంలో భాగస్వామ్యం పంచుకోవడం విశేషం. తొలిసారిగా మళాయ్ భాషలో వరుసగా రికార్డులను బ్రేక్ చేస్తూ వస్తున్న కబాలి మరో చరిత్రను నమోదు చేసుకుంది. మళాయ్ భాషలో అనువాదం అయిన తొలి చిత్రంగా రికార్డుకెక్కింది. తమిళ్, తెలుగు, హిందీ లాంటి భారతీయ భాషలతో పాటు మళాయ్ లో డబ్ అవుతున్న తొలి సినిమా కబాలి. వివాదంలో కబాలి పాట కబాలి చిత్రానికి థియేటర్లలో అధిక ధరలకు టిక్కెట్ల అమ్మకాలపై కలుగజేసుకోలేమని చెన్నై హైకోర్టు స్పష్టం చేసిన నేపథ్యంలో మధురై కోర్టులో కబాలి చిత్రంపై మరో పిటీషన్ దాఖలైంది. ఆ ప్రాంతానికి చెందిన మహారాజన్ అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్లో కబాలి చిత్రంలోని ఒక పాటలో ఉలగం ఒరువనుక్కా అనే పదాలను తొలగించాలని పేర్కొన్నారు. ఆ పదాలు బ్యాక్వర్డ్ క్యాస్ట్, జరనల్ కేటగిరికి చెందిన ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయంటూ అందులో పేర్కొన్నారు. రజనీకి నోటీసులు కోవైకి చెందిన శుక్రా ఫిలింస్ భాగస్వామి మహాప్రభు చెన్నై హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు. అందులో ఆయన పేర్కొంటూ రజనీకాంత్ నటించిన లింగా చిత్రం 2014లో విడుదలయ్యిందన్నారు. ఆ చిత్ర కోవై డిస్ట్రిబ్యూషన్ హక్కులను తాము పొందామని తెలిపారు. ఆ చిత్రానికి తమకు భారీ నష్టం ఏర్పడిందన్నారు. అందుకు కబాలి చిత్ర నిర్మాత కలైపులి ఎస్.ధాను,నటుడు రజనీకాంత్ రూ.89 లక్ష లు తమకు తిరిగి చెల్లిస్తామని చెప్పి మాట నిలబెట్లుకోలేదన్నారు. కబాలి చిత్రాన్ని ధాను విడుదల చేస్తున్నారని, తనకు రావలసిన రూ.89లక్షలు తిరిగి చెల్లించేవరకూ కబాలి విడుదలపై నిషేధం విధించాలని కోరారు. ఈ పిటిషన్‌ను బుధవారం విచారించిన న్యాయమూర్తి సుందరేశ్ నిర్మాత, రజనీకాంత్ సహా ఏడుగురికి కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాల్సిందిగా నోటీసులు జారీ చేశారు. -
కబాలి
చిన్న ఫోకస్ లైట్లు వెలుగుతున్నాయి. ఆ చీకటిలో ఎవరో భుజం మీద చెయ్యి వేసి పలకరించారు. చీకట్లోకి చూస్తే- రజనీకాంత్. ఉండబట్టలేక - నేను మీకు కథ చెప్పాను-అన్నాను. ‘‘నాకు తెలుసు సార్! తెలుసు’’ అన్నారు. దశాబ్దాల పాటు కోట్లాది అభిమానుల్ని ఆకట్టుకున్న హీరో-పదిమందిలోకి వచ్చి నప్పుడు-కాస్త షోకు చేసుకో వాలనీ, తెర మీద కనిపించే హీరో అవతారాన్ని గుర్తు చేసేలాగ మురిపించాలనీ నాకనిపిస్తుంది. ఇది వ్యాపార బాధ్యత. కాగా, అవసరం కూడా. అసలు ఆ రంగానికి ఉన్న మొదటి సూత్రమే- ప్రదర్శన. వాస్తవానికి చిన్న ముసుగు. అయితే ఈ ముసుగుని బొత్తిగా చించేసిన నటుడు, బహుశా ప్రపంచంలో మరే నటుడికీ లేనంత ఆవేశపూరిత మయిన అభిమానుల్ని సంపాదించుకున్న నటుడు, రోడ్డు మీద తారసపడితే కలలోనైనా తెర మీద హీరోతో పోల్చడానికయినా అవకాశం ఇవ్వని నటుడు- రజనీ కాంత్. నల్లగా, ఒక పద్ధతిలో లేని బట్టతలా, రెండు పక్కలా అస్తవ్యస్తంగా చెదిరిన జుత్తూ, తెల్లని మాసిన గెడ్డం, నలిగిపోయిన బట్టలూ - బయటకు వచ్చే ముందు ఒక్కసారయినా అద్దంలో తన ముఖం చూసు కున్నాడా అనిపిస్తుంది. మాటల్లో కూడా - ఈ 65 ఏళ్ల హీరో ‘‘మా అమ్మాయి వయస్సులో, ఆమెతో సరదాగా ఉండే చిన్నపిల్లతో పాటలు పాడాను’’ అని ఆయనే చెప్తారు సభల్లో. కొన్ని కోట్ల వ్యాపారానికి పెట్టుబడి అయిన ఈ నటుడు- ఆ వ్యాపారానికి ఏ విధమయిన ఉపకారమూ చెయ్యడేం! అనిపిస్తుంది. అయితే ఆయన చిత్రాలు, వాటి ఆదాయం అద్భుతాలు. నానాటికీ ప్రచార మాధ్యమాల శక్తీ, ఉధృతీ పెరుగుతున్న రోజుల్లో- వ్యాపారానికి ఎల్లలు చెరిగిపోతున్న రోజుల్లో రేపు రిలీజు కాబోతున్న చిత్రం ‘కబాలి’, రిలీజు కాకముందే కొత్త రికార్డులను సృష్టించింది. 100 కోట్లతో నిర్మించిన ఈ చిత్రం రిలీజు కాక ముందే 200 కోట్ల ఆదాయాన్ని తెస్తుందని పండితుల అంచనా. రిలీజయాక మరో వంద కోట్లు. 4 వేల థియేటర్లలో ప్రపంచమంతటా, 400 థియేటర్లలో ఒక్క అమెరికాలో ఈ చిత్రం రేపు రిలీజు కాబోతోంది. తమిళం, హిందీ, తెలుగు, మలయాళ భాషల్లో వస్తున్న ఈ చిత్రం మలేసియా, థాయ్‌లాండ్‌లలో కూడా రిలీజవుతోంది. మొదటి రోజే హాంకాంగ్, చైనాలో రిలీజుకి ప్రయత్నాలు సాగుతున్నాయి. ఎయిర్ ఏషియా సంస్థ ఈ చిత్ర ప్రచారానికి చెయ్యి కలిపి - ఒక విమానానికి రజనీ కాంత్ బొమ్మ వేసింది. కబాలి బనీన్లు, కప్పులు, తాళం చెవులూ - అమెరికా వెర్రికి ఇండియా హీరో బొమ్మ తోడయింది. ఈ చిత్రం టీజర్‌ని కేవలం 24 గంటల్లో 50 లక్షల మంది ఆసియాలో చూశారట! ఇదొక రికార్డు. 28 మే నాటికి 5 కోట్ల మంది చూశారు. చాలామందికి తెలియని విషయం- రజనీకాంత్ అతి నేలబారు మనిషి. ఏ మాత్రం భేషజాలకు పోని మనిషి. విగ్గు పెట్టి కెమెరా ముందు నిలిచినప్పుడు ఆయ నలో కనిపించే దుడుకుతనం, పెళుసుతనం, వేగం, విసురూ, ప్రేక్షకుల్ని కిర్రెక్కించే విన్యాసాలు నిజ జీవితంలో దగ్గరకయినా రానివ్వని మనిషి. నేను ఆయనకి ఓ సినీమా రాశాను. ఆయన ఇంట్లో మా పెద్దబ్బాయితో కూర్చుని కనీసం రెండు గంటలు కథ చెప్పాను. తెలుగు మాట్లాడుతారు. హేమ్నాగ్ సంస్థ- మూడు దక్షిణాది భాషల్లో- తమిళం, కన్నడ, మలయాళంలో ఈ చిత్రాన్ని నిర్మించింది. ఆయా భాషల్లో దిగ్గజాలయిన ముగ్గురు రచయితల్ని కూర్చోబెట్టి కథ చెప్పాను. రాశాను- పంజు అరుణాచలం, ఉదయ్‌శంకర్, శ్రీకుమరన్ తంబి. సినీమా పేరు ‘గర్జనై’. ఇది 35 సంవత్సరాల కిందటి మాట. ఆ మధ్య కమల్‌హాసన్ పుట్టినరోజుకి ఒక హోటల్లో విందుకి వెళ్లాను. దక్షిణాది సినీ పరిశ్రమ అంతా ఉంది. దీపాలు ఆర్పేశారు. చిన్న ఫోకస్ లైట్లు వెలుగుతున్నాయి. ఆ చీకటిలో ఎవరో భుజం మీద చెయ్యి వేసి పలకరించారు. చీకట్లోకి చూస్తే- రజనీ కాంత్. ఉండబట్టలేక - నేను మీకు కథ చెప్పాను- అన్నాను. ‘‘నాకు తెలుసు సార్! తెలుసు’’ అన్నారు. గ్లామర్‌ని తన భుజాల మీద మోస్తూ గాలిలో నడి చే నటుల్ని మనం తరతరాలుగా చూస్తున్నాం. వృద్ధా ప్యంలో కూడా యువకులతో సమంగా గ్లామర్‌ని పెద్ద రికంతో నిలుపుకున్న అమితాబ్ బచ్చన్‌ని తెలుసు. గ్లామర్‌ని రాజకీయాలకు తర్జుమా చేయడానికి ప్రయ త్నించి పిల్లిమొగ్గలు వేసిన చిరంజీవిని తెలుసు. తాగి మనుషుల్ని చంపి గ్లామర్ వెనుక మాయమయే సుల్తా న్లను తెలుసు. తన పరపతి, గ్లామర్‌ని పెట్టుబడిని చేసి రాష్ట్రాలను ఏలిన అపూర్వ నాయకులు- ఎమ్.జి.ఆర్.; ఎన్.టి.ఆర్‌లను తెలుసు. తన పరిమితిని ఎరిగి- హుందాతనం స్థాయిలో నిలిచి జీవించిన నటసమ్రాట్ని తెలుసు. కాని ప్రచార మాధ్యమాలు గ్లామర్‌ని ఆకాశంలో (మాటవరసకి కాదు - అక్షరాలా! ఎయిర్ ఏషియా అందుకు సాక్ష్యం) నిలిపిన కొత్త స్థాయిని ఇప్పుడు చూస్తున్నాం. కాని-కాని- వీటన్నిటినీ భుజాల మీద మోస్తూనే ఎప్పటికప్పుడు తెర మీది హీరో ఇమేజ్‌ని చీల్చి చెండాడుతూ జీవించే అతి సరళమయిన హీరో విశ్వరూపాన్ని - కపాలీశ్వర న్ వెరసి- కబాలిని రేపు ప్రపంచం చూడబోతోంది. - గొల్లపూడి మారుతీరావు -
కబాలి రా!!
♦ నిజం! రజనీ సెలవు తీసుకొచ్చాడు ♦ బెంగళూరు స్టార్టప్‌లకు ఫ్రైడే హాలిడే ♦ ఇప్పటికే కబాలి నాణేలు, బొమ్మలు, సిమ్‌లు ♦ ఫైవ్ స్టార్ హోటళ్లలోనూ రోజుకు 4 షోలు సాక్షి, ప్రత్యేక విభాగం : ‘‘మిగతా హీరోలు సెలవు చూసుకుని వస్తారు. రజనీకాంత్ వస్తే సెలవే వస్తుంది’’ ఇదీ సినిమాలపై సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న జోక్. 22న శుక్రవారం రజనీ కాంత్ ‘కబాలి’ సినిమా విడుదలవుతోంది. తరవాత పరిస్థితి ఏమోగానీ... విడుదలకు ముందు మాత్రం కొత్త రికార్డులు రాస్తోంది. బ్రాండింగ్‌కు ప్రొడ్యూసర్లు కొత్త పుంతలు తొక్కటంతో ఇపుడు ‘కబాలి’ చుట్టూ పెద్ద వ్యాపారమే జరుగుతోంది. ఆ వివరాలే ఈ కథనం... ⇒ చెన్నైలో 3 రోజుల టిక్కెట్లు మొత్తం ముందే బుక్ అయిపోయాయి. ఇదేమీ విశేషం కాకపోయినా... తమకు టికెట్లు దొరకడం లేదని, దొరికినా ఎక్కువ రేట్లు పెట్టాల్సి వస్తోందని ప్రేక్షకులు పోలీస్ కేసులు పెట్టడం గమనార్హం. ఇక దుబాయ్, జపాన్, మలేషియా, లండన్‌ల్లో ఉన్న పలువురు రజినీ అభిమానులు కబాలి తొలి రోజు తొలి ఆట చూడ్డానికి రికార్డ్ స్థాయిలో చెన్నైకి వస్తున్నారు. ⇒ ఫైవ్ స్టార్ హోటళ్లలో స్పెషల్ షోలు వేసే విదేశీ సంస్కృతి కబాలితో ఇండియాకూ వచ్చేసింది. బెంగళూరులోని నాలుగు ఫైవ్‌స్టార్ హోటళ్లు-జేడబ్ల్యూ మారియట్, లలిత్ అశోక్, రాయల్ ఆర్చిడ్, క్రౌన్ ప్లాజాల్లో 3 రోజుల పాటు, రోజుకు 4 ఆటలు చొప్పున కబాలి సినిమా చూపిస్తున్నాయి. టికెట్ ధర రూ.1,300- రూ.1,400 రేంజ్లో ఉంది. ⇒ చెన్నై, బెంగళూరుల్లోని పలు స్టార్టప్‌లు శుక్రవారం సెలవు ప్రకటించాయి. ఫ్రెష్ డెస్క్, గో బంపర్, ద సోషల్పీపుల్ వంటి స్టార్టప్‌లు ఈ జాబితాలో ఉన్నా యి. ఓయేత్రీడాట్కామ్ ఏకంగా 2 ఐనాక్స్ స్క్రీన్లనే బుక్ చేసింది. తమ ఉద్యోగులతో పాటు తమ వెబ్సైట్లో షాపింగ్ చేసిన వారికీ సినిమా చూపిస్తామంటోంది. బెంగళూరు కాంగ్రెస్ ఎమ్మేల్యే మునిరత్న నాయుడు తమ పార్టీ కార్యకర్తల కోసం 4 హాళ్లలో టికెట్లు బుక్ చేశారు. ⇒ కబాలి సినిమాకు అఫీషియల్ ఎయిర్‌లైన్ పార్ట్నర్గా వ్యవహిరిస్తున్న ఎయిర్ ఏసియా... ఒక విమానాన్ని కబాలి పోస్టర్లు, స్టిక్కర్లతో అలంకరించింది. ఈ విమానం వైజాగ్, బెంగళూరు, న్యూఢిల్లీ, గోవా, పుణే, చంఢీగర్, జైపూర్, గౌహతి, ఇంఫాల్, కోచి తదితర రూట్లలో నడుస్తుంది. కబాలి ఫస్ట్ షో చూడాలనుకునే వారికోసం బెంగళూరు నుంచి చెన్నైకు ప్రత్యేక విమానం కూడా నడుపుతోందీ సంస్థ. ⇒ కేరళకు చెందిన ముత్తూట్ ఫైనాన్స్ కంపెనీ... 5, 10, 20 గ్రాముల్లో కబాలి వెండి నాణేలను అందుబాటులోకి తెచ్చింది. రజనీకాంత్ కబాలి మార్క్‌తో ఈ వెండి నాణేలను, ఒక పెండెండ్ను కూడా అందిస్తోంది. ⇒ ధోర్, ఐరన్-మ్యాన్ వంటి సూపర్ హీరోల తరహాలో సింగపూర్‌కు చెందిన కార్బన్ కాపీ కలెక్టిబుల్స్ సంస్థ కబాలి ప్రతిమలను తయారు చేస్తోంది. ఒక్కోటి రూ.1,000 వరకూ ధర ఉండే వీటిని రిటైల్ అవుట్లెట్లు, కంపెనీ వెబ్సైట్, అమెజాన్‌డాట్‌ఇన్‌లో కొనుగోలు చేయొచ్చు. ⇒ ఎయిర్టెల్ కంపెనీ కబాలి పైకవర్తో సిమ్‌లు విక్రయిస్తోంది. క్యాడ్బరీ కంపెనీ ‘సూపర్‌స్టార్ కా 5 స్టార్’ పేరుతో చాక్లెట్లను అమ్ముతోంది. సిమ్ కవర్లు, టీ షర్ట్లు, కీ చెయిన్లు వెల్లువలా మార్కెట్లోకి వచ్చేశాయి. -
దేవుళ్లకే విస్మయం కలిగితే..!
సినిమా ఇంకా రిలీజ్ కాలేదు. సినిమా ఎలా ఉంటుందో కూడా తెలియదు. కానీ 'కబాలి' మానియా మాత్రం ఇప్పుడు దేశాన్ని ఊపేస్తోంది. మరో రెండురోజుల్లో ఈ సినిమా విడుదల అవుతుండటంతో ఈ సినిమాకు సంబంధించి అనేక కథనాలు, సోషల్ మీడియాలో అనేక పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే భారీ అంచనాలున్న ఈ సినిమాకు మరింత ఫ్రీ పబ్లిసిటీని ఇవి తెచ్చిపెడుతున్నాయి. మరోవైపు 'తలైవా' అభిమానులు సోషల్ మీడియాలో తమదైన పంచులు, జోకులతో అభిమానాన్ని చాటుకుంటున్నారు. రజనీ 'కబాలి' వస్తున్న కొన్ని బెస్ట్ జోక్స్ మీకోసం.. మనం ఓ మై గాడ్ అంటాం.. మరీ దేవుళ్లు..! మనకు ఆశ్చర్యం కలిగినా.. విస్మయం కలిగినా.. ఓ మై గాడ్ (ఓఎంజీ) అంటాం. మరీ దేవుళ్లకు విస్మయం కలిగితే వారు ఏమంటారో తెలుసా? ఓ మై రజనీకాంత్ (ఓఎమ్మార్). 'కబాలి' సినిమా చూసిన తర్వాత అందరూ 'ఓఎంజీ'కు బదులుగా 'ఓఎమ్మార్' అనే అంటారు. When Gods get surprised they say Oh My #Rajnikanth. After watching #Kabali, they would definitely go #OMR! — Ravinder Dahiya (@RavinderDahiyaa) July 20, 2016 రజనీ ఇంజెక్షన్ సో పవర్ ఫుల్! ఎయిర్ఏసియాకు సేవలు మెరుగుపడాలంటే.. ఒక్క రజనీకాంత్ ఇంజెక్షన్ ఇస్తే చాలు సేవలు అమాంతం మెరుగుపడుతాయి.- ఓ నెటిజన్ ఆస్కార్ కన్నా రజనీ గొప్ప కబాలి సినిమాకిగాను రజనీకాంత్ అవార్డు ఆస్కార్‌కు ప్రకటించడమైనది. తలైవా తొలిసారి పోజు మార్చారు 'కబాలి' కోసం రజనీకాంత్ తొలిసారి ఎడమకాలిపై కుడికాలు వేసి పోజిచ్చారు.. మీకు సెలవు కావాలా? సల్మాన్ సినిమా ఈద్‌కు వస్తుంది. షారుఖ్ సినిమా దీపావళికి వస్తుంది. ఆమిర్ ఖాన్ సినిమా క్రిస్మస్కు వస్తుంది. మరీ రజనీకాంత్ సినిమా.. మీకు ఎప్పుడు సెలవు కావాలో చెప్పండి.. #SalmanKhan : Eid#SRK: Diwali#Aamirkhan : Christmas#RAJNIKANTH : Bataao... kab chhutti chahiye !! -
'కబాలి'కి సుల్తాన్‌కి అదే తేడా!
'పొద్దున్నే డాబాపైకెక్కి 'హలో హైదరాబాద్' అని అరిచాను.. 'కబాలిడా' అని రీసౌండొచ్చింది.. దానితోపాటే తుఫానులాంటి గాలి.. కింద పడిపోతే పైకిపోతానని గోడపట్టుకున్నానుగానీ పోయినా పర్లేదనిపించింది ఆ క్షణం నాకు..' హైదరాబాద్ నగరంలోని 'కబాలి' క్రేజ్ చెప్పేందుకు ఓ నెటిజన్ ఫేస్బుక్లో పెట్టిన ఈ కామెంటే ఉదాహరణ. మరో రెండురోజుల్లో 'కబాలి' విడుదల అవుతుండటంతో ఇటు ఫేస్బుక్లో, అటు ట్విట్టర్, వాట్సాప్‌లోనూ ఈ సినిమాపై ఎన్నో పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. రజనీ అభిమానులైతే ఇప్పటినుంచే 'కబాలి' పోస్టులతో హోరెత్తిస్తున్నారు. సుల్తాన్-కబాలికి అదే తేడా 'కబాలి' సినిమా విడుదల అవుతున్న శుక్రవారం నాడు చెన్నైకి చెందిన స్టార్టప్ ఫైండ్ అస్ ఇండియా, బెంగళూరుకు చెందిన ఇన్నోవేటివ్ స్ట్రక్చరల్ సోల్యుషన్స్ కంపెనీలు తమ ఉద్యోగులకు సెలవు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఓ స్టార్ హీరో సినిమా విడుదల రోజున ప్రైవేటు కంపెనీలు తమ ఉద్యోగులకు సెలవు ఇవ్వడం అత్యంత అరుదైన విషయం. దీనిపై కూడా జోకులు పేలుతున్నాయి. మామూలుగా ఇతర హీరోల సినిమాలు సెలవు రోజున విడుదల అవుతుంటాయి. కానీ, రజనీ సినిమా ఎప్పుడు రిలీజైతే.. అప్పుడే సెలవు వస్తుంది అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. సెలవు కాబట్టి ఈద్ నాడు 'సుల్తాన్' సినిమాను రిలీజ్ చేసినట్టు సల్మాన్ ఖాన్ చెబితే.. నా సినిమా ఎప్పుడు విడుదలైతే అప్పుడే సెలవు ఉంటుందని రజనీ కౌంటర్ ఇస్తున్నట్టు ఫొటోలు క్రియేట్ చేసి అభిమానులు సర్క్యులేట్ చేస్తున్నారు. 'సుల్తాన్', 'కబాలి' మధ్య అదే తేడాని చెప్తున్నారు. -
అంతా ఉత్తిదే.. కబాలి లీక్ అవ్వలేదు
రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన కబాలి సినిమా లీక్ అయ్యిందంటూ వస్తున్న వార్తలపై చిత్రయూనిట్ క్లారిటీ ఇచ్చారు. కొద్ది రోజులుగా కబాలి సినిమా ఆన్లైన్లో లీక్ అయ్యిందంటూ వార్తలు వస్తుండటంపై స్పందించిన చిత్రయూనిట్, అలాందేమి లేదంటూ తేల్చేసింది. ఇటీవల బాలీవుడ్ సినిమాలు ఉడ్తా పంజాబ్, గ్రేట్ గ్రాండ్ మస్తీలు రిలీజ్‌కు ముందే లీక్ అవ్వటంతో నిర్మాతలు తీవ్రంగా నష్టపోయారు. రజనీ కబాలి విషయంలో ఇప్పటికే భారీగా బిజినెస్ జరగటంతో ఎలాంటి పొరపాట్లు జరగకుండా ఉండేలా అన్నిరకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 250కి పైగా వెబ్సైట్ల మీద నిఘా ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే కొన్ని పైరసీ వెబ్సైట్లపై చర్యలు తీసుకున్న చెన్నై పోలీసులు, పైరసీ విషయంలో కఠినంగా వ్యవహరించాలని భావిస్తున్నారు. అయితే వారం రోజులుగా కబాలి లీక్ పై ప్రచారం జరుగుతున్నా.. చిత్రయూనిట్ ఇంత ఆలస్యంగా స్పందించటంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రమోషన్ కోసం ఇలాంటి రూమర్స్ ను ప్రోత్సహించారన్న వాదన వినిపిస్తోంది. -
భారీ ఎత్తున రిలీజ్ అవుతున్న కబాలి
-
కబాలి క్లైమాక్స్‌పై షాకింగ్ న్యూస్
ప్రస్తుతం ఎక్కడ చూసినా కబాలి గురించే వార్తలు వినిపిస్తున్నాయి. మీడియా, సోషల్ మీడియాలలో కూడా కబాలినే ట్రెండ్ అవుతోంది. అందుకే కబాలి సంబందించిన ఏ చిన్న వార్త అయినా సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో కబాలి సినిమా క్లైమాక్స్‌కు సంబందించిన ఓ వార్త రజనీ అభిమానులకు షాక్ ఇస్తోంది. ముందుగా కబాలి కథను రజనీకాంత్‌కు వినిపించిన దర్శకుడు పా రంజిత్ ఆ సినిమాకు నెగెటివ్ ఎండింగ్ ను సూచించాడట. రజనీకి ఆ పాయింట్ నచ్చినా.., అభిమానులు అంగీకరిస్తోరో.. లేదో అన్న అనుమానం వ్యక్తం చేశాడట. అయితే దర్శకుడు మాత్రం సినిమాకు ఈ క్లైమాక్స్ అయితేనే కరెక్ట్ అని అదే కొనసాగించాడన్న టాక్ వినిపిస్తోంది. నెగెటివ్ క్లైమాక్స్అంటే ఏంటి.. సినిమా చివర్లో రజనీ పాత్ర విలన్ చేతిలో ఓడిపోతుందా..? లేక కబాలి చనిపోతాడా..? నిజంగా రజనీ ఓటమిని అభిమానులు అంగీకరిస్తారా..? ఇదే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. అసలు నిజంగానే పా రంజిత్ సినిమాకు నెగెటివ్ ఎండింగ్ ఇచ్చాడా..? అసలు విషయం తెలియాలంటే మాత్రం రిలీజ్ వరకు వెయిట్ చేయాల్సిందే. -
మరో యూట్యూబ్ రికార్డ్... కబాలి మేకింగ్ వీడియో
ప్రస్తుతం ప్రపంచం అంతా కబాలి వైపే చూస్తుంది. గతంలో ఏ భారతీయ సినిమాకు రానంత భారీ హైప్ కబాలి విషయంలో క్రియేట్ అవుతోంది. సినిమాకు సంబందించిన ప్రతీ అప్డేట్ను ఫ్యాన్స్ చాలా పక్కాగా ఫాలో అవుతున్నారు. ఒక్క పోస్టర్ రిలీజ్ అయినా అది సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. ఇప్పటికే కబాలి టీజర్ అంతర్జాతీయ స్థాయిలో రికార్డ్ వ్యూస్ సాధించి రజనీ స్టామినా ఏంటో ప్రూవ్ చేసింది. సినిమా రిలీజ్‌కు రెండు రోజులు మాత్రమే సమయం ఉండటంతో చిత్రయూనిట్ మేకింగ్ వీడియోను రిలీజ్ చేశారు. యాక్షన్ సీన్స్‌తో పాటు రజనీ స్టైల్స్ కలిపి రూపొందించిన ఈ వీడియోకు బ్యాక్ గ్రౌండ్లో వినిపిస్తున్న నెర్పుడా.. సాంగ్ రింగ్ టోన్స్గా, కాలర్ ట్యూన్స్‌గా మోత మొగిపోతుంది. ఈ వీడియో పోస్ట్ చేసిన నిమిషాల్లోనే లక్షకు పైగా వ్యూస్‌తో సత్తా చాటింది. ప్రస్తుతం కబాలి మేకింగ్ వీడియో ఆన్లైన్లో సృష్టించబోయే సరికొత్త రికార్డ్స్ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. -
మోస్ట్ అవైటెడ్ మూవీగా కబాలి
-
కబాలి కోసం ఐటీ కొత్త ఒరవడి
తమిళసినిమా: ప్రపంచవ్యాప్తంగా కబాలి గాలి హోరెత్తిస్తోంది. విడుదలకు ముందే నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లకు, థియేటర్ల యాజమాన్యానికి కాసుల వర్షం కురిపిస్తోంది. సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన తాజా చిత్రం కబాలి. అంచనాలు తారా స్థాయికి చేరిన ఈ చిత్రం మరో రెండు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా సుమారు 500 థియేటర్లలో విడుదల కానుంది. కాగా ఈ చిత్రాన్ని చూడటానికి సాధారణ ప్రేక్షకుడి నుంచి సంపన్న కుటుంబాలకు వరకూ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇంతకు ముందెప్పుడూ లేని విధంగా కబాలి చిత్రం చూడటానికి కొత్త విధానాలు అమలులోకి తీసుకురావడం విశేషం. ఐటీ సంస్థలు కబాలి చిత్ర టిక్కెట్లను పెద్ద మొత్తంలో కొనుకోలు చేయడంతో అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభమైన కొద్ది గంటల్లోనే టికెట్లు పూర్తిగా విక్రయం జరగ డం విశేషం. తాజాగా ఐటీ రంగంలో పనిచేసేవారు పనికి బంకు కొట్టి కబాలి చిత్రాన్ని చూడటాన్ని ఆపడానికి సంస్థ నిర్వాహకులే ఉద్యోగస్తులు, వారి కుటుంబ సభ్యులకు చిత్రం చూడడానికి షిఫ్ట్‌ల వారీగా టికెట్లను ఇచ్చి నూతన విధానానికి తెరలే పడం విశేషం. ఇందుకోసం ఉద్యోగుల జీతాల్లో రూ. 1000 రూపాయలను తీసుకుంటున్నారు. పలు ప్రైవేట్ రంగ సంస్థలూ కబాలి చిత్ర విడుదల రోజైన22న తమ కార్యాలయాలకు సెలవు ప్రకటించడం గమనార్హం. ఇదిలా ఉండగా స్థానిక రాధాక్రిష్ణన్ రోడ్డులోని ఒక సినీమాల్లో ఓ వ్యక్తి ఒక షోకి మొత్తం టిక్కెట్లను కొనుగోలు చేసి వాటిని బ్లాక్‌లో టికె ట్ను రూ.1000 చొప్పున విక్రయిస్తున్నట్లు సమాచారం. ఇలా కబాలి విడుదలకు ముందే ప్రకంపనలు సృష్టిస్తోందన్న మాట. కబాలిడా..నెరుప్పుడా.. -
కబాలి కేసు కొట్టివేత
తమిళసినిమా: కబాలి చిత్ర విడుదలపై నిషేధం విధించాలని కోరుతూ వేసిన పిటిషన్‌ను మద్రాసు హైకోర్టు కొట్టివేసింది. చెన్నై సెంబియత్కు చెందిన దేవరాజన్ అనే వ్యక్తి ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. పిటీషన్లో నటుడు రజనీకాంత్ నటించిన కబాలి చిత్రం ఈ నెల 22న విడుదల కానున్నదని... ఈ చిత్రానికి ప్రభుత్వం నిర్ణయించిన టికెట్ ధరల కంటే అధికంగా థియేటర్లో అమ్మకాలు జరుపుతున్నారన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన టికెట్ ధరలు రూ,10, రూ.50, రూ120 కాగా కబాలి చిత్రానికి పలు థియేటర్లలో రూ. 500లకు విక్రయిస్తున్నారని పేర్కొన్నారు. దీని వల్ల సాధారణ ప్రేక్షకులు బాధింపుకు గురవుతున్నారని.. ఈ విషయమై ప్రభుత్వానికి ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్య తీసుకోలేదనీ తెలిపారు. కాబట్టి కబాలి చిత్ర విడుదలపై నిషేధం విధించాలని పిటిషన్ ద్వారా కోరారు. ఈ కేసు మంగళవారం న్యాయమూర్తి కృపాకరన్ సమక్షంలో విచారణకు వచ్చింది. పిటిషన్‌దారుడు దేవరాజన్ కోర్టుకు హాజరై ఎక్కువ ధరలతో టికెట్ల విక్ర యాన్ని అడ్డుకోవాలని కోరారు. ఈ విషయంలో అధికారులు మెతక వైఖరిని అవలంభిస్తున్నార ని...ప్రభుత్వం ఇంత వరకూ ఎలాంటి చర్యలు చేపట్టలేదన్నారు తెలిపారు. పిటిషనర్ వాదనలు విన్న న్యాయమూర్తి కబాలి టికెట్ల విక్రయ వ్యవహారంలో ప్రభుత్వానికి ఫిర్యాదు చేసిన వెంటనే కోర్టును ఆశ్రయించాలని సూచించారు. దీంతో ఎలాంటి నిషేధాన్ని విధించడం కుదరదని పేర్కొంటూ కేసును కొట్టివేశారు. -
కబాలి కోసం అంజలి చిత్ర షూటింగ్ రద్దు
పెద్ద హీరోల చిత్రాలు విడుదలవుతున్నాయంటే చిన్న చిత్రాల విడుదలను వాయిదా వేసుకోవడం చూశాం. కానీ ఒక భారీ చిత్రం తెరపైకి వస్తున్న రోజున ఇతర చిత్రాల షూటింగ్‌ను రద్దు చేసుకోవడం అన్నది ఎక్కడా జరగలేదు. అలాంటి సంఘటన ఇప్పుడు జరగబోతోంది. అదేమిటో చూద్దాం. క్రేజీ జంట జై, అంజిలి జంటగా నటిస్తున్న తాజా చిత్రానికి బెలూన్ అనే టైటిల్‌ను నిర్ణయించారు. ఈ మధ్యనే షూటింగ్ మొదలైన ఈ చిత్రాన్ని 70ఎంఎం సంస్థ అధినేతలు టీఎన్.అరుణ్‌బాలాజీ, కందస్వామి నందకుమార్, ఫార్మర్స్ మాస్టర్ ప్లాన్ అధినేత దిలీప్ సుబ్బరాయన్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. దీనికి సినీష్ దర్శకుడు. ఈయన సూపర్‌స్టార్ రజనీకాంత్ వీరాభిమాని అట. కాగా కబాలి చిత్రం ఈ నెల 22న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు రెడీ అవుతున్న విషయం తెలిసిం దే. రజనీకాంత్ అభిమానుల్లో పండగ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో జులై 22ను కబాలి రోజుగా భావిస్తూ తామూ ఆ వేడుకలో భాగం కావాలనుకుంటున్నామని బెలూన్ చిత్ర దర్శకుడు సినీష్ పేర్కొన్నారు. అలా అందరిలానే కబాలి చిత్ర విడుదల కోసం, అది సాధించే సంచలన విజయం కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నామని అన్నారు. ఈ సందర్భంగా తమ కోరికను మన్నించి 22వ తేదీన బెలూన్ చిత్ర షూటింగ్‌ను రద్దు చేయడానికి అంగీకరించిన చిత్ర యూనిట్ తరఫున నిర్మాతలకు ధన్యవాదాలు తెలుపుకుంటునట్లు దర్శకుడు సినీష్ అన్నారు. -
ఈ 'కబాలి' మెరుపులు మీకు తెలుసా?
దేశానికి ఇప్పుడు 'కబాలి' 'ఫీవర్' పట్టుకుంది. శుక్రవారం 'కబాలి' థియేటర్లలో గ్రాండ్‌గా అడుగుపెట్టబోతుండటంతో సౌతిండియా మొత్తం రజనీ నామస్మరణలో మునిగిపోయింది. అటు ఉత్తర భారతంలోనూ 'కబాలి'పై భారీ హైప్ క్రియేట్ అయింది. అమెరికాతోపాటు అనేక దేశాల్లోనూ 'కబాలి' 22న వెండితెరపై దర్శనమివ్వబోతున్నది. సర్వత్రా 'కబాలి' మాయా కమ్ముకున్న వేళ ఈ చిత్ర నిర్మాత థాను ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రజనీ సినిమా రూ. 500 కోట్లకుపైగా వసూలు చేయడం ఖాయమని ప్రకటించి మరింత అంచనాలు రేపారు. మొత్తానికి పెద్దగా ప్రచారం చేయకపోయినా ప్రజల్లోకి భారీ అంచనాలతో వెళుతున్న ఈ సినిమా గురించి ఆసక్తికరమైన విషయాలివి.. 1. 'కబాలి' వందకోట్ల బడ్జెట్‌తో తెరకెక్కింది. దక్షిణాది సినిమాల వరకు ఇది భారీ బడ్జెట్ అనే చెప్పాలి. కానీ, 'కబాలి' మానియాను చూస్తుంటే.. మొదటి రెండు, మూడు రోజుల్లోనే ఈ సినిమా 200 కోట్ల కలెక్షన్లను దాటే అవకాశముందని సినీ పండితులు విశ్లేషిస్తున్నారు. రజనీ కబాలి.. సల్మాన్ సుల్తాన్‌ను అధిగమించడం ఖాయమని వినిపిస్తోంది. 'కబాలి' ట్రైలర్‌ను రెండున్నర కోట్లమంది వీక్షించారు. ఈ రికార్డును 'సుల్తాన్' టీజర్ అందుకోలేకపోయింది. 'కబాలి' వస్తే సుల్తాన్ వసూళ్లు తగ్గిపోయే అవకాశముంది. అమెరికా, ఫ్రాన్స్, చైనా, జపాన్, ఇండోనేషియా, మలేషియా తదితర దేశాల్లో 'కబాలి' విడుదల కానుంది. అమెరికాలో ఏకంగా 400 థియేటర్లలో 'కబాలి' హల్చల్ చేయనున్నాడు. రజనీ రాకతో సుల్తాన్ థియేటర్లు తగ్గిపోనున్నాయి. 2. టికెట్ల అడ్వాన్స్ బుకింగ్స్‌లోనూ 'కబాలి' సంచనాలు సృష్టిస్తున్నాడు. ఈ నెల 15న తమిళనాడులో అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. చెన్నైలోని చాలా థియేటర్లలో ఆదివారం వరకు టికెట్లన్నీ అమ్ముడుపోయాయి. చెన్నైలోని ఎస్పీఐ సినిమా హాల్లోని మొత్తం 27తెరల్లోనూ 'కబాలి' సినిమానే ప్రదర్శించనున్నారు. రోజుకు 96 షోలు వేయనున్నారు. అయినా ఈ హాల్‌కు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్ టికెట్లు ఆదివారం వరకు అమ్ముడుపోవడం గమనార్హం. 3. చెన్నైకి చెందిన స్టార్టప్ కంపెనీ ఫైండ్ అస్ ఇండియా.. 'కబాలి' విడుదల రోజున తన ఉద్యోగులకు సెలవు ప్రకటించింది. అదే దారిలో నడుస్తూ బెంగళూరుకు చెందిన ఇన్నోవేటివ్ స్ట్రక్చరల్ సోల్యుషన్స్ కంపెనీ కూడా తన ఉద్యోగులకు లీవ్ ఇచ్చింది. 'కబాలి' సినిమా చూసేందుకు ఉద్యోగులు ఎక్కడ మూకుమ్మడిగా సిక్ లీవులు పెడతారోనన్న భయంతో ఆ కంపెనీలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. ఈ కంపెనీల నిర్ణయం ట్విట్టర్లో హల్చల్ చేస్తోంది. కబాలి లీవ్లేటర్ ( #KabaliLeaveLetter) హ్యాష్‌ట్యాగ్‌తో ఇది ట్రెండ్ అవుతోంది. With the @superstarrajini! #KabaliBus @radhika_apte @FoxStarIndia @beemji pic.twitter.com/dA2f0iF5MJ — Fox Star Hindi (@foxstarhindi) July 19, 2016 3. తమిళనాడు హోసూరుకు చెందిన ఓ మారుతీ డీలర్ రజనీ అభిమానులను ఆకట్టుకునేందుకు 'కబాలి' కార్లను అమ్ముతోంది. మారుతి స్విఫ్ట్ కార్లను 'కబాలి' పోస్టర్లతో డిజైన్ చేసి అందిస్తోంది. ఇక ఎయిర్ ఆసియా కంపెనీ శుక్రవారం సినిమా విడుదల రోజున 'కబాలి' ఫ్లయిట్‌ను నడుపనుంది. అంతేకాకుండా ఈ విమానంలో ప్రత్యేక కబాలి మీల్స్‌ను అరెంజ్ చేశారు. 5. రజనీ అభిమానుల కోసం శుక్రవారం ఉదయం 5 గంటలకే షో వేస్తున్నారు. ఈ షోలకు సంబంధించిన అన్ని టికెట్లు ఇప్పటికే అమ్ముడుపోయాయి. ఇక అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభించిన రెండుగంటల్లోనే టికెట్లు హాట్ కేకుల్లా ఎగిరిపోయాయి. 6. కబాలి మానియా దేశాన్ని ఇంతగా ఊపేస్తున్నా రజనీ మాత్రం అమెరికాలో ఉన్నారు. తన సహజ ఆధ్యాత్మిక ధోరణిలో యోగవిల్లే సచ్చిదానంద ఆశ్రమాన్ని ఆయన దర్శించుకున్నారు. #Kabali fever already catching up. :) — SG Suryah (@SuryahSG) July 16, 2016 -
కబాలి ప్రీ రిలీజ్ లెక్క తేలింది
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కబాలి ఫీవర్ నడుస్తోంది. రజనీకాంత్ హీరోగా పా రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా కోసం మనదేశంలోని అభిమానులే కాదు.. ఇతర దేశాల్లోని సినీ అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అందుకు తగ్గట్టుగా కబాలి సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ రికార్డ్ల మీద రికార్డ్‌లు తిరగరాస్తోంది. అంచనాలకు మించి కబాలి కోసం డిస్ట్రిబ్యూషన్ రేట్లు చుక్కలు తాకాయి. దాదాపు 223 కోట్ల రూపాయల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందన్న టాక్ వినిపిస్తోంది. తమిళనాడుకు 68 కోట్లు, తెలుగు రాష్ట్రాలకు 32 కోట్లు, కేరళ హక్కులు 7.5 కోట్లు, కర్ణాటక హక్కులు 10 కోట్ల వరకు కబాలికి ప్రీరిలీజ్ బిజినెస్ జరిగింది. ఇక ఓవర్సీస్లో కూడా కబాలి సత్తా చాటింది. అన్ని దేశాలకు కలిపి 25 కోట్లకు కబాలి ఓవర్సీస్ రైట్స్ అమ్ముడయ్యాయి. ఇక శాటిలైట్, మ్యూజిక్ రైట్స్ ద్వారా మరో 40 కోట్లు కబాలి ఖాతాలో చేరాయి. -
సచ్చిదానంద ఆశ్రమంలో రజనీకాంత్
ఒకవైపు దేశం ’కబాలి’ మానియాలో మునిగిపోయి.. అభిమానులు సంబరాలు చేసుకుంటుండగా.. సూపర్ స్టార్ రజనీకాంత్ మాత్రం తన సహజ ఆధ్యాత్మిక ధోరణిలో అమెరికాలోని సచ్చిదానంద ఆశ్రమాన్ని సందర్శించారు. ఆయన వెంట కూతురు సౌందర్యా ధనుష్ కూడా ఉన్నారు. 1980లో వర్జీనియాలో ఏర్పాటైన సచ్చిదానంద ఆశ్రమాన్ని యోగావిల్లే అని కూడా పిలుస్తారు. యోగిరాజ్ శ్రీ స్వామి సచ్చిదానంద ఈ ఆశ్రమాన్ని స్థాపించారు. 1969లో వూడ్‌స్టాక్ ఫెస్టివల్ లో ప్రారంభ ఉపన్యాసం చేసిన సచ్చిదానంద పాశ్చాత్యులకు ఆధ్యాత్మికవేత్తగా సుప్రసిద్ధులు. 65 ఏళ్ల రజనీకాంత్ దాదాపు నెలకిందట అమెరికా వెళ్లిన సంగతి తెలిసిందే. ఆయన అక్కడ కొన్ని వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఈ శుక్రవారం కబాలి సినిమా విడుదల అవుతుండటంతో రజనీ తిరిగి ఇండియా వచ్చారు. అమెరికా పర్యటనలో తన ఆధ్యాత్మిక గురువు సచ్చిదానందకు చెందిన ‘లోటస్ ఆల్ ఫెయిత్స్ టెంపుల్’ను రజనీ సందర్శించారని ఆయన కూతురు సౌందర్య ట్విట్టర్లో తెలిపారు. -
’కబాలి’ అభిమానులారా.. మీకో విజ్ఞప్తి!
అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ’కబాలి’ సినిమా ఈ శుక్రవారం విడుదల కావడం పక్కా కావడంతో అప్పుడే ’కబాలి’ పండుగ మొదలైంది. సూపర్ స్టార్ రజనీకాంగ్ సినిమా ఎప్పుడు విడుదలైనా.. నిలువెత్తు ఆయన కటౌట్లు పాలాభిషేకంతో తళతళలాడాల్సిందే. ఇది ఎన్నో ఏండ్లుగా కొనసాగుతున్న సంప్రదాయం. 1992లో వచ్చిన ’అన్నామలై’ (తెలుగులో వెంకటేశ్ ’కొండపల్లిరాజా’) సినిమాలో రజనీకాంత్ పాలవాడిగా కనిపించాడు. అప్పటినుంచి అభిమానులు ’తలైవా’ కటౌట్ ను తళతళలాడించేందుకు వేలాది లీటర్ల పాలతో అభిషేకాలు చేస్తున్నారు. ఇప్పుడు టన్నులకొద్దీ అంచనాలతో ’కబాలి’ సినిమా విడుదలవుతుండటంతో వేలలీటర్ల పాలు ’తలైవా’ అభిషేకానికి వృథా కావడం ఖాయంగా కనిపిస్తుండటంతో తమిళనాడు పాలవ్యాపారుల సంఘం ప్రతినిధులు ’కబాలి’ అభిమానులకు ఓ విజ్ఞప్తి చేశారు. రజనీ కటౌట్లకు పాలతో అభిషేకాలు చేసే సంప్రదాయాన్ని విడనాడాలని కోరారు. ఇలా వేలాది లీటర్లు వృథా చేసేముందు నిరుపేదలు, ఆకలితో అలమటించేవారికోసం కూడా ఆలోచించాలని సూచించారు. జూలై 22న కబాలి విడుదల రోజు రూ. 20 లక్షలు విలువచేసే 50వేల లీటర్ల పాలు కటౌట్ల అభిషేకాని కోసం వృథా అయ్యే అవకాశముందని పాల వ్యాపారుల సంఘం తెలిపింది. తమిళనాడులో 15శాతం మంది ప్రజలకు ప్రతిరోజూ పాలుకొనేందుకు డబ్బుల్లేవు. ఇలాంటి దుర్భర పరిస్థితుల నడుమ ఇలా వృథా చేయడం సబబా అని మిల్క్ డీలర్స్, ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు పొన్నుస్వామి పేర్కొన్నారు. రజనీ మార్గంలో ఎన్నో సేవా కార్యాక్రమాలు చేసే అభిమానులు.. పాలాభిషేకాల విషయంలోనూ రజనీ సూచనలు పాటించి.. ఈ దురాచారాన్ని మానుకోవాలని ఆయన సూచించారు. -
సుల్తాన్ రికార్డులను కబాలి దాటేస్తుందా?
సల్మాన్ ఖాన్ లేటు వయసులో మల్లయోధుడిగా నటించిన సుల్తాన్ సినిమా బాక్సాఫీసును కొల్లగొట్టింది. దాన్ని తలదన్నే కలెక్షన్లు సాధించే సత్తా ఇంకేదైనా సినిమాకు ఉందా.. అంటే కచ్చితంగా ఉందని, అది కబాలి అని సినీ పండితులు అంటున్నారు. ముఖ్యంగా కబాలి సినిమా మొదటి మూడు రోజుల్లోనే రూ. 200 కోట్ల కలెక్షన్లు సాధించడం ఖాయమని ఈ సినిమా నిర్మాత కలైపులి ఎస్ థాను విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే.. కబాలి సినిమా ప్రపంచవ్యాప్తంగా 12వేల స్క్రీన్లలో విడుదల అవుతోందట. సుల్తాన్ అయితే కేవలం 6000 స్క్రీన్లలోనే విడుదలైంది. అలాగే సుల్తాన్ టీజర్ కంటే కబాలి టీజర్‌కు యూట్యూబ్‌లో ఎక్కువ హిట్లు వచ్చాయి. ఇప్పటికే 2.5 కోట్లను దాటిన ఈ హిట్లు ఇంకా రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. ముంబైలో ఏ థియేటర్‌కైనా వెళ్లి సుల్తాన్ సినిమా టికెట్ కొనాలంటే రూ. 1500 అవుతుందని, అలాగే బెంగళూరులో కబాలి సినిమా టికెట్ కూడా రూ. 1500 చొప్పున ఉంటోందని, అదే తమిళనాడులో మాత్రం రూ. 120కి, 80కి.. ఇంకా మాట్లాడితే 50 రూపాయలకు కూడా కబాలి టికెట్ దొరుకుతుందని నిర్మాత కలైపులి థాను అన్నారు. అయినా ఈ కొద్దిమొత్తం టికెట్లతోనే తాము 200 కోట్లు సాధిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. సుల్తాన్ సినిమాకు పది రెట్ల కలెక్షన్లు వస్తాయని అన్నారు. -
చెన్నైలో తారాస్థాయికి చేరిన కబాలి ఫీవర్
-
'కబాలి' పేరుకాదు.. ఓ బ్రాండ్
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కబాలి మేనియా కనిపిస్తోంది. గతంలో ఏ భారతీయ సినిమాకు జరగని స్థాయి ప్రచారం ఈ సినిమా కోసం జరుగుతోంది. పలు అంతర్జాతీయ స్థాయి సంస్థలు కబాలి సినిమా ప్రమోషన్లో భాగం పంచుకుంటున్నాయి. హాలీవుడ్ స్థాయిలో ఏకంగా విమానాలపై కబాలి పోస్టర్లను ముంద్రించటంతో రజనీ మేనియా ఏ స్థాయిలో ఉందో తెలిస్తోంది. ఇప్పటికే ఎయిర్ ఏసియాతో పాటు ఎయిర్టెల్, ముత్తూట్ లాంటి సంస్థలు ప్రచారంలో తమ వంతు పాత్ర పోషిస్తున్నాయి. వీటికి తోడు కబాలి పోస్టర్లతో తయారు చేసిన కీచైన్లు, టీషర్లు తమిళ నాట హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. వంద కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన కబాలి, ఇప్పటికే 200 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. తొలి వారంలోనే సంచలనాలు నమోదు చేస్తుందని భావిస్తున్న ఈ సినిమా, టోటల్ రన్లో 500 కోట్లకు పైగా కలెక్షన్లు సాధిస్తుందని నమ్ముతున్నారు. తొలిసారిగా మలేషియా అభిమానుల కోసం మలయ్లోనూ ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు. అంతేకాదు ఇప్పటి వరకు ఇండియన్ సినిమా రిలీజ్ కాని చాలా దేశాల్లో కబాలి బోణి చేయడానికి రెడీ అవుతుంది. ఓవర్ సీస్ మార్కెట్ మీద భారీ ఆశలు పెట్టుకున్న చిత్రయూనిట్, ఒక్క అమెరికాలోనే 400 వందల థియేటర్లలో సినిమాను రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు. మొత్తంగా 5000ల స్క్రీన్స్ లో కబాలిని ప్రదర్శించేందుకు ప్లాన్ చేస్తున్నారు. మరి ఇంతటి భారీ అంచనాల మధ్య రిలీజ్ అవుతున్న కబాలి.. అభిమానుల ఆశలు నిజం చేస్తుందో లేదో చూడాలి. -
వరుసగా రిలీజ్ డేట్స్ చెప్పేస్తున్నారు
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న కబాలి సినిమా రిలీజ్‌పై ఎలాంటి క్లారిటీ లేకపోవటంతో చాలా రోజులుగా తెలుగు తమిళ ఇండస్ట్రీలలో సినిమా రిలీజ్‌ల విషయంలో కన్ఫ్యూజన్ ఏర్పడింది. అయితే ఫైనల్‌గా ఈ నెల 22న కబాలి రిలీజ్ అవుతున్నట్టుగా తేలిపోవటంతో మిగతా సినిమాల నిర్మాతలు రిలీజ్ డేట్లు కన్ఫామ్ చేసేసుకుంటున్నారు. ముఖ్యంగా కబాలి దెబ్బకు ఎప్పుడు రిలీజ్ చేయాలో అర్థం కాక తికమక పడ్డ బాబు బంగారం, జనతా గ్యారేజ్ పోస్ట్ పోన్ కావటంతో ఆగస్ట్ 12న ఆడియన్స్ ముందుకు రావాలని ఫిక్స్ అయ్యాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకొని సరైన డేట్ కోసం ఎదురుచూస్తున్న సునీల్ కూడా తన నెక్ట్స్ సినిమా జక్కన్నకు డేట్ ప్రకటించేశాడు. ముందుగా 22న రిలీజ్ చేయాలని భావించిన అదే రోజు కబాలి రిలీజ్ అవుతుండటంతో ఒక వారం ఆలస్యంగా 29న ఇడియన్స్ ముందుకు వస్తున్నాడు. మరో యంగ్ హీరో సాయిధరమ్ తేజ్ కూడా డేట్ ఇచ్చేశాడు. సుప్రీమ్ సినిమా సక్సెస్‌తో సూపర్ ఫాంలో ఉన్న సాయి తిక్క సినిమాను ఆగస్టు 13న రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించాడు. కబాలి హవా తెలుగు నాట వారానికి మించి ఉండదన్న నమ్మకంతో కొంతమంది చిన్న సినిమాల నిర్మాతలు కూడా ఆగస్టు తొలి వారంలో రిలీజ్ కు ప్లాన్ చేసుకుంటున్నారు. -
కబాలి మానియాలో బిగ్ బ్రాండ్స్
విడుదలకు ముందే సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన కబాలి ఫీవర్ ఓ రేంజ్ లో పెరుగుతోంది. ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న కొద్దీ కబాలి క్రేజ్ ను క్యాష్ చేసుకునేందుకు పెద్దపెద్ బ్రాండ్లన్నీ తమదైన శైలిలో పోటీ పడుతున్నాయి. ఓ వైపు కబాలి మానియాలో రజనీ అభిమానులు మునిగి తేలుతోంటే.. మరోవైపు బిగ్ బ్రాండ్స్ కూడా సౌత్ ఇండియా సూపర్ స్టార్ పై అభిమానాన్ని, ఇటు వ్యాపారాన్ని జోరుగా సాగిస్తున్నాయి. ముఖ్యంగా ఎయిర్ టెల్..అమెజాన్, క్యాడ్ బరీ ఫైవ్ స్టార్, ఎయిర్ ఆసియా, ఇమామి,షాప్ సీజె, ముత్తూట్ ఫైనాన్స్ కొన్ని ప్రత్యేక ఆఫర్లతో మార్కెట్ లోకి వస్తున్నాయి. ఇపుడు తాజాగా కబాలి క్రేజ్ ను కేరళకు చెందిన ప్రముఖ ఫైనాన్స్ సంస్థ ముతూట్ ఫిన్ కార్ప్, అమెజాన్ కూడా విరివిగా ఉపయోగించుకుంటున్నాయి.. ముత్తూట్ సంస్థ కబాలి (ఎంబోజ్ చేసిన రజనీ కాంత్ బొమ్మ) వెండి నాణేలు రిలీజ్ చేసింది. 5, 10 ,20 గ్రాములున్న వెండి నాణేలను ఈ సంస్థ మార్కెట్ లో ప్రవేశపెడుతోంది. వీటి ధర రూ.350 , రూ 700, రూ.1400 గా ఉన్నాయి. వీటిని శుక్రవారం నుంచి ఆన్ లైన్ లో బుకింగ్స్ కూడా మొదలయ్యాయి. అయితే సినిమా రిలీజ్ అయ్యాకే తమ అన్ని బ్రాంచెస్ లో వీటి డెలివరీ ఉంటుందని ముతూట్ సంస్థ ప్రకటించింది. అలాగే ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ కబాలి కీ చైన్లు, మైనపు బొమ్మలు, పోస్టర్లు, ఫోటోలను ప్రీమియం ధరల్లో ప్రవేశపెట్టింది. వీటిని రూ. 90 నుంచి రూ. 400 మధ్య అందిస్తోంది. కబాలి రిలీజ్ డే నాడు బెంగళూరు - ముంబై నగరాల నుంచి రజనీ అభిమానులను చెన్నైకు స్పెషల్ ఫ్లైట్స్ లో వచ్చి సినిమాను వీక్షించేందుకు ప్రత్యేక ప్యాకేజీలు రెడీ అయ్యాయి. ఫ్లై లైక్ ఏ సూపర్ స్టార్ అంటున్న ఎయిర్ ఆసియా, ప్రత్యేక కబాలి మెనూను కూడా అందిస్తోంది. ఫ్లైట్స్ మీద సైతం కబాలి పోస్టర్లు దర్శనమివ్వడం చూశాం. అలాగే కబాలి క్రేజ్ ను క్యాష్ చేసుకునేందుకు ప్రముఖ టెలికాం కంపెనీ ఎయిర్ టెల్ ప్రత్యేకంగా సిమ్ ను విడుదల చేయడంతో పాటు రకరకాల ప్యాకేజీలు రూపొందించింది. కబాలి రిచార్జ్ ప్యాక్, సిమ్ ప్యాక్, పాపులర్ డైలాగులు, పాటలతో హలో ట్యూన్స్ ను ఆఫర్ చేస్తోంది. ఈ నేపథ్యంలో మార్కెట్లో కబాలి ఎయిర్టెల్ సిమ్ లు విరివిగా దొరుకుతున్నాయి. వినియోగదారుల ప్రత్యేక ఎస్ఎంఎస్ చానల్ ద్వారా ఇచ్చిన సెలెక్టెడ్ మెసేజ్ లతో కాఫీ టేబుల్ బుక్ తయారు చేసి రజనీకాంత్ అందించనున్నట్టు భారతీ ఎయిర్ టెల్ (తమిళనాడు అండ్ కేరళ)సీఈవో జార్జ్ మాథెన్ ప్రకటించారు. అటు కబాలి చిత్రనిర్మాతలు కూడా ఇదే రేంజ్ లో సినిమాను ప్రచారం చేస్తున్నారు. దీంతోపాటుగా యూత్ ను టార్గట్ గా కబాలి ప్రత్యేక కప్పులు,కీ చెయిన్లు, ఫోన్ కవర్లు, టీ షర్టులు తదితర మార్కెట్లో హల్ చల్ చేస్తున్న సంగతి సరేసరి. కాగా రిలీజ్ కు ముందే ఇంత భారీ హైప్ క్రియేట్ కబాలి...ముందు ముందు ఇంకెంత సంచలనం సృష్టిస్తుందో చూడాలి.. ఈ నెల 22న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. -
అమెరికాలో కబాలి తొలి షో
కబాలి చిత్ర మొదటి షో అమెరికాలో ప్రదర్శనకు సిద్ధం అవుతోంది. సూపర్‌స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం కబాలి. యువ దర్శకుడు రంజిత్ దర్శకత్వంలో నిర్మాత కలైపులి ఎస్.థాను నిర్మించిన భారీ బడ్జెట్ చిత్రం కబాలి. ఈ చిత్రంపై అంచనాలు తారా స్థాయికి చేరుకున్నాయి. చిత్ర టీజర్, పాటలు ఇప్పటికే విశేష ఆదరణను పొందడంతో రజనీకాంత్ అభిమానుల్లో పండగ వాతావరణం నెలకొంది. కాగా చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ఈ నెల 22న విడుదలకు సిద్ధం అవుతోంది. విశేషం ఏమిటంటే ఈ చిత్రం ఇండియాలో కంటే ముందుగానే అట్లాంటిక్ మహాసముద్రాన్ని దాటి అమెరికాలో విడుదల కానుంది. అమెరికాకు ఇండియాకు మధ్య కాల వ్యవధిలో వ్యత్యాసం ఉండడంతో భారత కాలమానం ప్రకారం కబాలి చిత్రం 21న ఉదయం 11 గంటలకు అమెరికాలో తొలి షో ప్రదర్శింపబడనుంది. ఇంతకు ముందు ఏ చిత్రానికి లేని విధంగా దాదాపు 400 థియేటర్లలో కబాలి విడుదల చేస్తున్నారు. మరో విశేషం ఏమిటంటే తెలుగు, హిందీ భాషలతో పాటు మళయాలం భాషలో అనువాదం అయిన కబాలి చిత్రాన్ని ఇండోనేషియా, చైనా, థాయ్‌లాండ్, జపాన్ భాషల్లోనూ అనువదించి సెప్టెంబర్‌లో విడుదలకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోందన్నది తాజా సమాచారం. -
కబాలి ప్రమోషన్‌కు రజనీ రాడా..?
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కబాలి మేనియా నడుస్తోంది. సౌత్ సూపర్ స్టార్ రజనీ కాంత్ హీరోగా తెరకెక్కుతున్న కబాలి రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో చిత్రయూనిట్ ప్రమోషన్లో జోరు చూపిస్తున్నారు. పలు అంతర్జాతీయ ఉత్పత్తులతో కలిసి సినిమాను భారీగా ప్రమోట్ చేస్తున్నారు. ప్రత్యేక విమానాలు, టెలికాం ఆఫర్లు, కబాలి టీషర్ట్లు, కీచైన్లు ఇలా సినీ ప్రచార తీరును కొత్త పుంతలు తొక్కిస్తున్నారు. దేశ వ్యాప్తంగా ఇంత హడావిడి జరుగుతుంటే ఆ చిత్ర హీరో రజనీకాంత్ మాత్రం ఎక్కడా కనిపించటం లేదు. కబాలి షూటింగ్ తరువాత విదేశాలకు వెళ్లిన రజనీ దాదాపు 40 రోజులుగా అక్కడే విశ్రాంతి తీసుకుంటున్నారు. రజనీ ఆరోగ్యం బాగోలేదన్న వార్తలు వినిపిస్తున్నా, ఆయన సన్నిహితులు ఆ వార్తలను ఖండిస్తున్నారు. మరి అంతా బాగానే ఉంటే రజనీ ప్రచార కార్యక్రమాలకు ఎందుకు రావటం లేదు. కబాలి సినిమాపై ఇప్పటికే 200 కోట్లకు పైగా బిజినెస్ జరిగింది. అంటే ఈ సినిమా అంతకు మించి వసూళ్లు సాధిస్తే తప్ప సినిమా హిట్ రేంజ్‌కు చేరదు. మరి రజనీ రాకుండా అంతటి వసూళ్లు సాధ్యమవుతాయా..? ఈ నెల 20న రజనీ చెన్నై వస్తారన్న టాక్ వినిపిస్తోంది. ఆ తరువాత సినిమా రిలీజ్ కు రెండు రోజులు మాత్రమే సమయం ఉంటుంది. ఈ రెండు రోజుల్లో రజనీ చేసే ప్రచారం సినిమాకు సరిపోతుందా..?ఇలాంటి ఎన్నో ప్రశ్నలు ఇప్పటికీ తలైవా అభిమానులను కలవరపెడుతున్నాయి. -
కబాలి కొత్త పోస్టర్ అదిరింది
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన కబాలి రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో చిత్రయూనిట్ ప్రమోషన్ లో వేగం పెంచింది. ఇప్పటికే నిర్మాత అఫీషియల్ గా సినిమా డేట్ ఎనౌన్స్ చేయగా.. సెన్సార్ సభ్యులనుంచి కూడా సినిమా సూపర్ అన్న టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో సినిమా మీద ఏర్పడుతున్న అంచనాలను మరింత పెంచే స్థాయిలో ఓ పోస్టర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. రిలీజ్ డేట్ తో పాటు ఉన్న ఈ పోస్టర్ లో రజనీ గాయలతో కనిపిస్తున్నాడు. సాధారణంగా రజనీ సినిమా అంటే వన్ మేన్ షోలా సాగుతుంది. హీరోయిన్ తో పాటు ఇతర పాత్రధారులెవరికి పెద్దగా గుర్తింపు రాదు కానీ కబాలి విషయంలో మాత్రం హీరోయిన్ పాత్రకు చాలా ప్రాధాన్యం ఇస్తున్నారు. తాజాగా రిలీజ్ అయిన పోస్టర్ లోనూ రజనీ హృదయంలో రాధికా ఆప్టే ఉన్నట్టుగా చూపించారు. మాఫియా బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రజనీ, రాధికల మధ్య అందమైన ప్రేమకథ కూడా ఉంటుందన్న టాక్ వినిపిస్తోంది. వంద కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కిన కబాలి రిలీజ్ కు ముందే 200 కోట్ల బిజినెస్ చేసింది. ఈ నెల 22న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతున్న కబాలి రికార్డ్ స్థాయిలో 3500 థియేటర్లలో ప్రదర్శించేందుకు చిత్రయూనిట్ ఏర్పాట్లు చేస్తోంది. -
రజనీ సినిమాలో మళ్లీ నీలాంబరి
రజనీకాంత్, రమ్యకృష్ణలది సూపర్ హిట్ జోడి. నరసింహ సినిమాలో కలిసి నటించిన ఈ జంట, అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. నరసింహాగా రజనీ, నీలాంబరిగా రమ్యకృష్ణ పోటి పడి నటించారు. అయితే ఇంత భారీ సక్సెస్ అందించిన ఈ కాంబినేషన్ తరువాత రిపీట్ కాలేదు. మళ్లీ ఇన్నేళ్ల తరువాత మరోసారి ఈ ఇద్దరు టాప్ స్టార్స్ తెరను పంచుకోబోతున్నారు. రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన కబాలి రిలీజ్‌కు రెడీ అవుతుండగా, మరో సినిమా రోబో 2 షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. క్రియేటివ్ జీనియస్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ విజువల్ వండర్‌లో రమ్యకృష్ణ కీలక పాత్రలో నటించనుంది. దాదాపు 17 ఏళ్ల తరువాత ఈ కాంబినేషన్ రిపీట్ అవుతుండటంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఇప్పటికే బాహుబలి సినిమాలోని శివగామి పాత్రతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న రమ్యకృష్ణ, ప్రస్తుతం కమల్ హాసన్ స్వయంగా దర్శకత్వం వహిస్తూ నటిస్తున్న శభాష్ నాయుడు సినిమాలో నటిస్తోంది. ఒకే సమయంలో రజనీ, కమల్ లాంటి టాప్ స్టార్స్‌తో సినిమాలు చేస్తూ తన రేంజ్ ఏంటో ప్రూవ్ చేసుకుంటోంది ఈ సీనియర్ హీరోయిన్. -
22న కబాలి
యావత్ సినీ వర్గాలు, ప్రేక్షకులు, ముఖ్యంగా సూపర్‌స్టార్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఆతృతతో ఎదురు చూస్తున్న చిత్రం కబాలి. భారతీయ చిత్ర పరిశ్రమలో ఇప్పటి వరకూ ఏ చిత్రానికి రానంత క్రేజ్‌ను సంపాదించుకున్న చిత్రం కబాలి అనడం అతిశయోక్తి కాదేమో. ఈ చిత్రానికి ప్రసార మాధ్యమాలు కూడా చాలానే ప్రచారం చేశాయని చెప్పక తప్పదు. కారణం ఒక్కటే. ఇందులో కథానాయకుడు సూపర్‌స్టార్ రజనీకాంత్. యువ దర్శకుడు రంజిత్ దర్శకత్వంలో కలైపులి ఎస్.థాను నిర్మించిన భారీ చిత్రం కబాలి. మొట్టమొదటి సారిగా మలయాళం భాషలో అనువాదమై విడుదలవుతున్న భారతీయ చిత్రం కబాలి. తమిళం, తెలుగు, హిందీ, మలయాళం భాషల్లో విడుదలవుతున్న చిత్రం కబాలి. రాధిక ఆప్టే నాయకిగా నటిస్తున్న ఈ చిత్రానికి సంతోష్‌నారాయణ్ సంగీతాన్ని అందించారు. చిత్ర నిర్మాణం పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదల గురించి రకరకాల ప్రచారం జరిగింది. జూలై 22న, 29న, ఆగస్టు 15న విడదల ఇలా ఎవరికి తోచినట్లు వారు ప్రచారం చేశారు. అయితే చిత్ర నిర్మాత మాత్రం కబాలి చిత్ర విడుదల విషయంలో నిర్ధిష్టమైన నిర్ణయంతో ఉన్నారు. చిత్రాన్ని సోమవారం సెన్సార్‌కు పంపారు. అదే రోజు మూడు గంటలకు సెన్సార్ బోర్డు సభ్యుల బృందం చిత్రాన్ని చూశారు. క్లీన్ ‘యు’ సర్టిఫికెట్ అందించారు. వెంటనే నిర్మాత కలైపులి ఎస్.థాను అనుకున్న విధంగా ఈ నెల 22నే కబాలి విడుదల అని తన ట్విట్టర్లో పేర్కొన్నారు. ఇంతకు ముందు కబాలి విడుదల విషయంలో అభిమానుల్లో కాస్త గందరగోళం ఏర్పడగా నిర్మాత స్పష్టతతో వారితో ఆనందాలు వెల్లివిరుస్తున్నాయి. కబాలి చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా 10 వేల థియేటర్లలో విడుదలకు నిర్మాత సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. ఇన్ని థియేటర్లలో విడుదలవుతున్న తొలి భారతీయ చిత్రం కూడా కబాలి కావొచ్చు. ఇలా విడుదలకు ముందే సంచలన రికార్డులు బద్దలు కొడుతున్న మన స్టైల్ కింగ్ చిత్రం విడుదల అనంత రం ఎలాంటి సెన్సేషనల్ క్రియేట్ చేస్తుందో వేచి చూడాల్సిందే. కబాలిడా..నెరుప్పుడా.. -
కబాలి సిమ్ కార్డులు కూడా..!
ప్రస్తుతం ఇండస్ట్రీని షేక్ చేస్తున్న సినిమా రజనీకాంత్ కబాలి. ఇప్పటికే చాలాసార్లు వాయిదా పడిన ఈ సినిమా ఫైనల్‌గా ఈ నెల 22న ప్రేక్షకుల ముందుకు వస్తున్నట్టుగా ప్రకటించారు. ఇప్పటికే భారీ హైప్ క్రియేట్ చేసిన ఈ సినిమా ఇమేజ్ను తమ బ్రాండ్ల ప్రమోషన్‌కు వాడుకోవాలని చాలా కంపెనీలు ప్రయత్నిస్తున్నాయి. అందుకు తగ్గట్టుగా రకరకాల ఆఫర్లతో కస్టమర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఇప్పటికే సినిమాకు అఫీషియల్ బ్రాండ్ పార్ట్నర్గా వ్యవహరిస్తున్న ఎయిర్ ఏషియా కబాలి స్పెషల్ ఫ్లైట్స్‌ను సిద్దం చేసింది. సినిమా రిలీజ్ రోజు చెన్నైకి ప్రధాన నగరాల నుంచి స్పెషల్ ఫ్లైట్స్‌ను నడపనుంది. అదే సమయంలో ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్టెల్ కూడా కబాలి ప్రమోషన్లో భాగం పంచుకుంటోంది. అందుకోసం ప్రత్యేకంగా కబాలి సిమ్‌లను విక్రయించేందుకు రెడీ అవుతోంది. రిలీజ్‌కు మరో పది రోజుల గడువు మాత్రమే ఉండటంతో ఈ గ్యాప్‌ను క్యాష్ చేసుకునేందుకు రెడీ అవుతోంది ఎయిర్టెల్. కబాలి స్పెషల్ సిమ్ తీసుకున్నవారికి వాల్ పేపర్స్, రింగ్ టోన్స్ లాంటివి ఫ్రీగా అందించనుందట. అంతేకాదు ఇప్పటికే ఎయిర్టెల్ సిమ్ వాడుతున్న కస్టమర్స్ కోసం కబాలి స్పెషల్ రీచార్జ్ కూడా అందుబాటులోకి తీసుకొచ్చే ఆలోచన ఉంది. -
కబాలి రిలీజ్ డేట్ వచ్చేసింది
సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన మోస్ట్ అవెయిటెడ్ మూవీ కబాలి విడుదలపై సందిగ్ధత తొలగిపోయింది. సోమవారం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈ నెల 22న ప్రపంచ వ్యాప్తంగా భారీగా రిలీజ్ అవుతోంది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాత కలైపులి ఎస్ థాను స్వయంగా ప్రకటించారు. ఇప్పటికే ప్రీ రిలీజ్ బిజినెస్ లో సంచలనాలు నమోదు చేసిన కబాలి రిలీజ్ తరువాత సరికొత్త రికార్డ్ లు సృష్టించటం కాయం అంటున్నారు ఫ్యాన్స్. మాఫియా బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న ఈ సినిమాకు సెన్సార్ బోర్డ్ ఒక్క కట్ కూడా సూచించకపోవటం విశేషం. పా రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రజనీ సరసన రాధికా ఆప్టే హీరోయిన్ గా నటిస్తోంది. తమిళ్ తో పాటు తెలుగు, మళయాలం, హిందీలలోనూ ఒకేసారి రిలీజ్ అవుతున్న కబాలి మలయ్ లాంటి విదేశీ భాషల్లో కూడా రిలీజ్ అవుతోంది. కొచ్చాడయాన్, లింగా లాంటి భారీ డిజాస్టర్ల తరువాత రజనీ హీరోగా నటించిన ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. #Kabali will be releasing worldwide on 22 July 2016 !! We couldn't be more excited @superstarrajini @beemji :) pic.twitter.com/HOll88EzuU — Kalaippuli S Thanu (@theVcreations) 11 July 2016 -
రజనీ ఫొటోలతో ఏం చేశారో తెలుసా?
చెన్నై: సూపర్ స్టార్ రజనీకాంత్ ‘బ్రాండ్’గా మారిపోయారు. ఆయన నటించిన తాజా చిత్రం ‘కబాలి’ పోస్టర్లు ఎయిర్ ఏషియా విమానాలపై దర్శనమిస్తున్నాయి. సూపర్ స్టార్ పేరుతో ప్రయాణికులకు అందుబాటు ధరలో తమ విమానాల్లో తరలించేందుకు ఎయిర్ ఏషియా ముందుకు వచ్చింది. ఇదిలావుంచితే ఇప్పుడు రజనీకాంత్ ఫొటోలు, డైలాగ్స్ తో అత్యధిక నాణ్యత కలిగిన స్మార్ట్‌ఫోన్ కవర్లు, కాఫీ కప్పులు మార్కెట్ లోకి వచ్చాయి. ’కవరిటప్’ అనే సంస్థ వీటిని తయారు చేసింది. ‘కబాలి’ పోస్టర్లతో కాకుండా తమ సొంత డిజైన్లతో వీటిని రూపొందించామని కవరిటప్ వ్యవస్థాపకుడు రొనాక్ సర్దా తెలిపారు. రజనీ కాంత్ పాపులర్ డైలాగులు, ఫొటోలు, సినిమాల పేర్లతో ట్రెండీగా స్మార్ట్‌ఫోన్ కవర్లు తయారు చేశామని చెప్పారు. తమ వెబ్సైట్ లో వందకుపైగా మొబైల్ కవర్లు అందుబాటులో ఉన్నాయన్నారు. కాఫీ కప్పులు, పోస్టర్లు, టీ-షర్టులు రూపొందించామన్నారు. ఫోన్ కవర్లు రూ. 499 నుంచి ప్రారంభమవుతాయన్నారు. కాఫీ మగ్గులు, పోస్టర్లు రూ.249, రూ.299 ధరల్లో అందుబాటులో ఉన్నాయి. అన్ని వయసులు వారు రజనీ కాంత్ కు అభిమానులుగా ఉన్నారని, వారికి నచ్చితే తమ బిజినెస్ క్లిక్ అయినట్టేనని రొనాన్ సర్దా పేర్కొన్నారు. -
అద్గదీ కబాలి...!
పేరు కొత్తగా ఉంది... ముందు... ‘క’. తరువాత... ‘బా’. ఆ తరువాత ‘లి’. కబాలి అంటే... ఎటకారంగా... బ్రూస్ ‘లీ’ వాళ్ళ ఫాదరా? బాహుబ‘లి’ బ్రదరా? ఊహూ... కాదు... మలేసియాలో డాన్ అట! రబ్బరు లాగా అతుకుతాడట! ఇంతకు ముందు చేసిన పాత్రలన్నీ... రబ్బరు లాగా చెరుపుతాడట! మలేసియాలో రబ్బరు మాఫియాలో చిక్కుకున్న రజనీకాంత్... సారీ... రజనీకాంత్ చిక్కడు... దొరకడు! అదండీ... ‘క’. దాని తరువాత ‘బా’. ఆ తరువాత ‘లి’. అద్గదీ... ‘కబాలి’ దూరంగా... చీకటిలో నడుచుకుంటూ వస్తున్న సూటుబూటు మనిషి... కాలి బూట్ల మీద నుంచి క్లోజప్ షాట్... ఒక స్టయిలైజ్డ్ వాక్... వెనకాల నుంచి జేమ్స్‌బాండ్ సినిమాల ఫక్కీలో ‘ట్యాన్డ్యాన్ డండం..’ అంటూ ఒక చిత్రమైన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్... నల్లటి కళ్ళద్దాల్లో ‘తలైవర్’ (నాయకుడు)! ‘‘నా వందిట్టేన్ సొల్లు... తిరింబి వందిట్టేయని సొల్లు... ఇరువత్తంజు వర్షత్తుక్కు మిన్నాడి ఎపిడి పోనారో, అపిడియే... తిరింబి వందిట్టేనని సొల్లు... కబాలిడా!’’ (నేను వచ్చేశానని చెప్పు! మళ్ళీ వచ్చేశానని చెప్పు! పాతికేళ్ళ క్రితం ఎలా వెళ్ళిపోయాడో, అలానే వచ్చేశానని చెప్పు... కబాలిరా!) హీరో నోట జనం ఈల కొట్టే డైలాగ్!!యస్... సూపర్‌స్టార్... సౌతిండియన్ సూపర్‌స్టార్... ఈజ్ బ్యాక్. రజనీకాంత్ మళ్ళీ తెరపైకి వచ్చేశారు... ఈసారి ‘కబాలి’గా వచ్చేశారు! పాతికేళ్ళ క్రితం నాటి పొగరు, విగరు తెరపై కనపడుతుండగా, ఎందరికో స్ఫూర్తినిచ్చిన తనదైన స్టైల్‌తో ముందుకు వచ్చేశారు! ఇంతకీ ‘కబాలి’ అంటే? ‘‘యార్డా... అంద కబాలీ? వర సొల్లుడా!’’ (ఎవర్రా ఆ కబాలీ? రమ్మనరా!) అని ‘కబాలి’ సినిమాలో విలన్ ఒకడు అంటాడు. అవును ఇంతకీ ఎవరీ కబాలి? ఈ పేరే చిత్రంగా ఉంది కదూ! నిజానికి, కపాలి అనేది పరమ శివుడి అనంత కోటి నామాల్లో ఒకటి. తమిళనాట కపాలీశ్వరుడి పేరిట ఆలయాలెన్నో ఉన్నాయి. చెన్నైలోని మైలాపూర్‌లో అనేక దశాబ్దాల క్రితం వెలసిన మహిమాన్విత కపాలీశ్వరస్వామి కోవెల సుప్రసిద్ధం. అయితే, తమిళంలో ‘ప’ అనే అక్షరం కూడా ‘బ’ లానే పలుకుతారు కనక, ‘కపాలి’ కాస్తా ‘కబాలి’ అయింది. చెన్నైలోని మైలాపూర్ ప్రాంతానికి చెందిన ఒక నిజజీవిత డాన్ కథ ఆధారంగా తీస్తున్నారని ప్రచారంలో ఉన్న ఈ సినిమాలో హీరో పాత్రకు అలా ‘కబాలి’ అనే పేరు పెట్టారు. తమిళం నుంచి తెలుగులోకి సినిమాను దిగుమతి చేస్తుకుంటూ, మనవాళ్ళు చివరకు టైటిల్‌ను కూడా తమిళ ఉచ్చారణతోనే తెలుగులోకీ దింపేశారు! డబ్బింగా... మజాకా! ఆనాటి యంగ్ లుక్ కోసం... ఈ సినిమా కోసం రజనీ మూడు డిఫరెంట్ లుక్స్‌లో కనిపిస్తారు. ఒకటి - 1970ల నాటి ‘రెట్రో’ లుక్‌లో నుదుటి మీదకు పడే పెద్ద క్రాఫ్‌తో యువకుడి లుక్. రంగుల, ప్రింటెడ్ చొక్కాల్లో కనపడతారు. రెండోది - కొద్దిగా నెరిసిన జుట్టుతో మధ్యవయస్కుడైన డాన్ లుక్. తెలుపు, బ్లూ, గ్రేకలర్ దుస్తుల్లో కనిపిస్తారు. మూడోది - పూర్తిగా తెల్ల గడ్డంతో వయసు మీద పడ్డ లుక్. ఇక్కడ కాటన్, లెనైన్స్, వూలు దుస్తుల్లో కనిపిస్తారు. సినిమా కోసం ఫోటో షూట్ కన్నా ముందే లుక్ టెస్ట్ చేశారు. దాని కోసం రజనీ గడ్డం పెంచుతూ వచ్చారు. రజనీ ఆస్థాన స్టైలిస్ట్ భాను, దర్శకుడు రంజిత్ కలసి లుక్స్ ఎలా ఉండాలనే దానిపై శ్రమించారు. 1970ల లుక్ కోసం రజనీతో ఏకంగా కొన్ని పదుల కాస్ట్యూమ్స్ ట్రై చేయించారట. ఆ తర్వాత చివరకు లుక్ ఖరారు చేశారు. తెలుగు మూలాలున్న ప్రముఖ తమిళ దర్శకుడు విష్ణువర్ధన్ భార్య అనూ వర్ధన్ కాస్ట్యూమ్ డిజైనర్‌గా పనిచేశారు. కాస్ట్యూమ్స్ కోసమే రూ. 1.4 కోట్లు ఖర్చు పెట్టారు. ‘కబాలి’ సిన్మా కథ ఏంటి? బ్రిటీషు పాలనాకాలంలో మలేసియాకు కట్టుబానిసలుగా వెళ్ళిన తమిళ ప్రజల నేపథ్యంలో సాగే కథ ఇది. అప్పట్లో భారతదేశం నుంచి చాలామంది మలేసియా, బర్మా తదితర ప్రాంతాలకు వలస వెళ్ళారు. మలేసియాకు వలస వెళ్ళినవారు అక్కడ రబ్బరు తయారీ పరిశ్రమల్లో కార్మికులయ్యారు. సహజంగానే, స్థానికుల నుంచి భారతీయ కార్మికులకు జాతి వివక్ష ఎదురైంది. ఈ వివక్షను ఎదిరించి, యజమానుల అరాచకాల్ని ఎదుర్కొనేందుకు ఆ కార్మికలోకం నుంచి పైకి ఎగసిన కెరటమే - ‘కబాలి’. తనవాళ్ళను కాపాడడం కోసం పరిస్థితుల ప్రభావం వల్ల అతనే డాన్‌గా ఎదుగుతాడు. ⇔కోడంబాకమ్ వర్గాల సమాచారం ప్రకారం ‘కబాలి’ చాలా ఎమోషనల్ ఫిల్మ్. ఒక్కముక్కలో ‘కబాలి’ అనే వ్యక్తి జీవిత ప్రయాణం ఈ కథ. దాదాపు 25 ఏళ్ళ జీవితకాలాన్ని పోగొట్టుకున్న ఆ వ్యక్తి అనుకోని పరిస్థితుల్లో మళ్ళీ తన పాత జీవితానికి తిరిగి వస్తే ఏమవుతుంది? అదే ఈ సిన్మాలో చూపిస్తున్నారట! ⇔దాదాపు పాతికేళ్ళ పాటు జైలులో మగ్గిన హీరో, ఎలాంటి అండా లేకుండానే బయటకొస్తాడు. ఆ విలన్ల గ్యాంగ్‌ల మీద ఒంటరిగానే పోరాటానికి దిగుతాడు. అలా కబాలి ఒంటి చేతితో ఈ గ్యాంగ్లన్నిటినీ ఎలా ఎదుర్కొన్నాడు, చివరకు విలన్ల సామ్రాజ్యాన్ని ఎలా కుప్పకూల్చాడనేది సినిమా. దీన్ని ఆసక్తికరంగా తెరపై చూపారట. ఈ యాక్షన్ డ్రామాలో కావాల్సినంత ఎమోషన్, రొమాన్స్ నిండిన ఘట్టాల్ని పండించారు. రజనీ ఇంట్రడక్షన్ పాట, ఒక లవ్ సాంగ్ కూడా అలరి స్తాయి. రజనీ... రంజిత్... సూర్య ‘అట్ట కత్తి’, ‘మద్రాస్’ చిత్రాలతో అందరి దృష్టీ ఆకర్షించిన యువ దర్శకుడు పా రంజిత్‌కు ఇది మూడో సినిమానే! రంజిత్ ఈ సినిమా కథను హీరో సూర్యకు మొదట వినిపించారు. రజనీకైతే బాగుంటుందని, సూర్య స్వయంగా రంజిత్‌ను రజనీ దగ్గరికి తీసుకువెళ్ళారు. కథ వినగానే రజనీ ఓకే చెప్పారట! చాలా ఏళ్ళుగా కొత్త దర్శకులతో చేయని ఆయన ఈసారి రంజిత్‌కి ఓటేయడం విశేషం. ‘రోబో’ తర్వాత ‘కోచ్చడయాన్’, ‘లింగ’ ఫ్లాపై, బయ్యర్ల ఒత్తిడితో పాటు ఆర్థిక లావాదేవీలూ రజనీ తలకు చుట్టుకున్నాయని టాక్. అందుకే ప్రయోగాల కన్నా ఫార్ములా వైపే మొగ్గి, ఈ డాన్ కథకు ఓకె చెప్పారు. మిత్రుడు, 45 పైగా సినిమాల నిర్మాతైన ‘కలైపులి’ థానుకు ఫోన్ చేసి, ఈ సిన్మా చేద్దామన్నారు. ఇదో డిఫరెంట్ స్టైల్! ⇔రజనీ అంటే ఒక స్టైల్ శిఖరం! అయితే, కేవలం స్టైల్, ఆయన కరిష్మాకే పరిమితం కాకుండా ఆయనలోని నటుణ్ణి కూడా చూపెట్టేలా ఈ స్క్రిప్ట్‌ను సిద్ధం చేసుకున్నారు. ఆ రకంగానే చిత్రీకరించారు కూడా! ⇔జీవితమంటే ఏమిటన్న దానిపై తన భావాల్ని కూడా ఈ ఎమోషనల్ కథలో జొప్పించేలా రజనీ చూశారు. ⇔మునుపటి చిత్రాల మేనరిజమ్లకే పరిమితం కాకుండా, భిన్నంగా కనపడాలని దర్శకుడితో కలసి తీర్మానించారు. ⇔అలాగే సిన్మాలో హీరో తాలూకు జీవితం నుంచి కథనీ, ప్రేక్షకుల్నీ పక్కకు తప్పించరాదని దర్శకుడితో సహా సాంకేతిక నిపుణులంతా ముందుగానే భావించారు. అందుకే, వీలైనంత వరకు చాలా సింపుల్‌గా, స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా, ఎలాంటి గిమ్మిక్కులూ లేకుండా కథను తెరపై చూపించాలనుకున్నారు. అందుకే, సినీ రంగంలో మొదటి నుంచి అనుసరించే పాత మూల సూత్రాలనే తామూ అనుసరించారు. సింపుల్ షాట్స్‌తో హాయిగా, సులభంగా కథ ముందుకు సాగేలా ఎడిటింగ్ చేశారు. కళ్ళు తిరిగే లెక్కలు ⇔దాదాపు రూ. 110 కోట్ల బడ్జెట్‌గా ప్రచారమవుతున్న ‘కబాలి’ సినిమా రిలీజ్‌కు ముందే రూ. 200 కోట్ల దాకా బిజినెస్ చేసిందని సినీలోకం కోడై కూస్తోంది. ⇔తెలుగు రైట్స్ కోసం ఎందరో సీనియర్లు పోటీపడుతున్న టైమ్‌లో పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నుంచి అయిదేళ్ళుగా డిస్ట్రిబ్యూషన్లో ఉన్న ప్రవీణ్‌కుమార్ వర్మ, అలాగే ఆయన మిత్రుడైన ఖమ్మం వాసి కె.పి. చౌదరి అనే ఇద్దరు యువకులు సాహసంతో, ఈ భారీ చిత్రాన్ని కొనుగోలు చేయడం విశేషం. ఇప్పటి వరకు రజనీ చిత్రాల్లో ‘రోబో’ అత్యధికంగా 28 కోట్లకు అమ్ముడైనట్లు ట్రేడ్ కథనం. ఇప్పుడీ ‘కబాలి’ అంతకన్నా ఎక్కువకే అమ్ముడైనట్లు సమాచారం. ⇔తెలుగు వెర్షన్ శాటిలైట్ హక్కుల కోసం కూడా ఒకటికి రెండు టీవీ చానల్స్ పోటీపడుతున్నాయి. అదీ మంచి రేటు పలుకుతుందని భావిస్తున్నారు. తమిళ వెర్షన్ శాటిలైట్ రైట్స్నైతే ‘జయ’ టీవీ మునుపెన్నడూ లేనంత భారీ మొత్తం ఆఫర్ చేసి, కొంటున్నట్లు వినికిడి. ⇔హిందీ రైట్స్ కూడా భారీ రేటుకే అమ్ముడయ్యాయి. ప్రపంచ ప్రసిద్ధ సినీ నిర్మాణ - పంపిణీ సంస్థ ‘ట్వంటీయత్ సెంచరీ ఫాక్స్’, మీడియా కంపెనీ ‘స్టార్’ కలసి ఏర్పాటుచేసిన ‘ఫాక్స్ స్టార్ స్టూడియోస్’ నార్త అంతటా ‘కబాలి’ తమిళ, తెలుగు, హిందీ వెర్షన్ల రైట్స్ సొంతం చేసుకుంది. హిందీ వెర్షన్ 1000కి పైగా స్క్రీన్స్‌లో రిలీజవుతోంది. హిందీ శాటిలైట్ రైట్లే రూ.16.2 కోట్ల పైగా మొత్తానికి అమ్ముడయ్యాయి. ⇔ దేశదేశాల్లో రిలీజ్ హంగామా: 50 దేశాల్లో, 4 వేల పైగా స్క్రీన్స్‌లో రిలీజ్ తెలుగునాట మొత్తం 1800 చిల్లర స్క్రీన్స్‌లో దాదాపు సగంలో జూలై 22న ‘కబాలి’ సందడే! మలేసియా, ఆస్ట్రేలియాల్లో ప్రీమియర్ షోల టికెట్స్ సోల్డ్ ఔట్. రిలీజ్ రోజునే ప్యారిస్‌లో ప్రసిద్ధ రెక్స్ థియేటర్లో షో. 2800 సీట్లున్న భారీ హాల్లో రిలీజ్‌నాడే ఇండియన్ ఫిల్మ్‌షో ఇదే ఫస్ట్! ⇔‘కబాలి’ విమానం: అధికారిక పార్ట్నరైన ‘ఎయిర్ ఏషియా ఇండియా’ ఏకంగా విమానం బయటిభాగాన్ని రజనీ స్టిల్స్‌తో అలంకరించింది. ఇండియాలో ఒక విమానానికి సిన్మా అలంకరణ ఇదే ప్రథమం. ఇదంతా హైదరాబాద్‌లోనే చేశారు. తొలి ఆటను చెన్నైలో చూసేవారికి బెంగళూరు నుంచి స్పెషల్ ఫ్లైట్ ప్యాకేజ్. ⇔కథలో కబుర్లు: ‘కబాలి’ రజనీ 41 ఏళ్ల కెరీర్లో 159వ సినిమా. గతంలో డాన్ పాత్ర చేసింది 22 ఏళ్ళ క్రితం ‘బాషా’లో! రజనీ పక్కన రాధికా ఆప్టే నాయిక. వీరిద్దరి మధ్య ప్రేమకథ ఉంటుంది. యువ రజనీ పోర్షన్ 20 నిమిషాలుంటుందట! రజనీ కుమార్తెగా ధన్సికది కీలకపాత్ర. బాయ్‌కట్ హెయిర్‌స్టైల్‌తో కనిపించే ఆమెకీ, రజనీకీ చిన్న ఘర్షణ ఉంటుంది. తైవాన్ యాక్టర్ ‘విన్స్టన్ చావో’ విలన్. విలన్ల గ్యాంగ్ పేరు ‘43 ఓ’. రజనీ, విలన్ ఇద్దరూ యంగ్, ఓల్డేజ్ గెటప్స్‌లో కనిపిస్తారు. నాజర్‌ది బయటికిచెప్పని కీలకపాత్ర. ⇔‘మలై’లోనూ డబ్బింగ్: చైనా, థాయిలాండ్, మలేసియా యాక్టర్లూ నటించారు. 100కి పైగా థాయ్ ఫైటర్లు పాల్గొన్నారు. అందుకే, తమిళ ‘కబాలి’ని తెలుగు, హిందీల్లోనే కాక, చైనీస్, థాయ్, జపనీస్, మలై భాషల్లోనూ రిలీజ్ సన్నాహాలు. ‘మలై’లో డబ్ అవుతున్న తొలి భారతీయ సినిమా ఇదే! మలేసియాలో తమిళ వెర్షన్ రిలీజ్ జూలై 22న. వారం తర్వాత ‘మలై’ వెర్షన్ రిలీజ్. ⇔రజనీ పాటే ఒక టైటిల్: ‘కబాలి’లోని ‘నెరుప్పు డా’ (నిప్పు రా) పాట పెద్ద సంచలనం. యువ సంగీత దర్శకుడు సంతోష్ నారాయణన్ బాణీలో ఈ పాట, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ మారుమోగిపోతోంది. తమిళనాట సెల్ఫోన్సలో ఈ కాలర్ట్యూన్లే. తమిళంలో ఓ కొత్త సినిమాకు ‘నెరుప్పు డా’ అని టైటిల్ పెడుతున్నారు. హీరో అందులో రజనీ ఫ్యాన్. ఈ టైటిల్‌కి ‘కబాలి’ నిర్మాత థానును పర్మిషన్ అడిగారు. రజనీ మాటైనా, పాటైనా మాటలా! ⇔మార్కెటింగా మజాకా: ‘ఎయిర్ ఏషియా’ విమానంతో పాటు అమెజాన్, క్యాడ్బరీ, ఎయిర్టెల్ తదితర సంస్థలు ‘కబాలి’కి బ్రాండ్ అసోసియేట్లు అయ్యాయి. మరో 100 కంపెనీలు క్యూ కట్టినట్లు వార్త. ‘కబాలి’ బొమ్మలున్న పై కవర్‌తో ‘ఎయిర్టెల్’ సిమ్‌కార్డులు అమ్ముతోంది. ‘అమెజాన్’లో సెల్‌ఫోన్ కవర్లు, పెన్నులు,‘కబాలి’ బొమ్మలు అమ్ముతున్నారు. షాపింగ్ సైట్ ‘షాప్ సిజె’ కూడా బరిలోకి దిగింది. ‘సూపర్‌స్టార్ కా 5 స్టార్’ శీర్షికతో క్యాడ్బరీ ‘5 స్టార్’ చాక్లెట్లను మార్కెట్ చేస్తోంది. టీ షర్ట్లు, కీ చైన్లు సరేసరి. ‘కబాలి’ బంగారం: ‘ముత్తూట్ ఫైనాన్స్’ సంస్థ రజనీ ‘కబాలి’ గెట ప్తో ప్రత్యేకంగా బంగారు, వెండి నాణాల్ని అమ్మకానికి సిద్ధం చేసింది. ‘కబాలి’తో తమ బ్రాండ్‌ను కలిపి, 50 లక్షల విలువైన యాడ్స ఇస్తోంది. రజనీకెలా ఉంది? కబాలి రిలీజ్ ఎందుకని పదే పదే వాయిదాపడింది? రజనీ అమెరికా వెళ్ళారేం? దీని గురించి రూమర్ మిల్స్ రోజుకో పిండి రుబ్బుతూనే ఉన్నాయి. రజనీకి ఆరోగ్యం అస్సలు బాలేదనీ, ‘రోబో-2’ వాళ్ళయితే షూటింగ్‌కి ఆయన కొలతలతో రోబోను సిద్ధం చేసేశారనీ - ఇలా నోటికొచ్చిన మాట. కానీ, రొటీన్ చెకప్ కోసమే అమెరికా వెళ్ళారని రజనీ సోదరుడు సత్యనారాయణరావు స్పష్టం చేశారు. అయితే, జూలై మొదటి వారానికల్లా రావాల్సిన రజనీ నెలాఖరికి కానీ రావట్లేదు. జూలై 22 రిలీజ్ హంగామా అమెరికాలో చూస్తారు! టీజర్‌కి... కోట్లలో వ్యూస్! రిలీజ్ కన్నా ముందే రజనీ చాలా రికార్డ్‌లు సృష్టిస్తున్నారు. ‘కబాలి’ టీజర్ యూ ట్యూబ్‌లో రికార్డ్ స్థాయిలో 2.5 కోట్ల వ్యూస్‌ను చేరింది. ఈ చిత్రానికి ఎడిటర్ ప్రవీణ్ కె.ఎల్. తెలుగబ్బాయి. ఈ టీజర్‌ను ఎడిట్ చేసి, కట్ చేసిందీ ఆయనే. మలేసియాలో చిత్రీకరణ జరుపుకొని వచ్చిన వెంటనే ఆ రషెస్ చూసిన ప్రవీణ్‌కు నటుడు నంబియార్‌ను అనుకరిస్తూ, రజనీ చెప్పే ‘కబాలిడా’ అనే పెద్ద డైలాగ్ బాగా నచ్చింది. దాన్ని టీజర్లో వాడాలని అప్పుడే అనుకున్నార్ట! డేట్స్ మారినా... క్రేజే! గత వినాయకచవితికి ‘కబాలి’ షూటింగ్ మొదలైంది. మలేసియా, బ్యాంకాక్, హాంగ్‌కాంగ్‌ల్లో సాగింది. రజనీ లాంటి భారీ స్టార్ ఉన్నా, చిత్రీకరణ చకచకా పూర్తయింది. మొదట ఏప్రిల్‌లో తమిళ ఉగాదికి రిలీజ్ చేయాలనుకున్నారు. ఆపైన సమ్మర్ స్పెషలంటూ రకరకాల డేట్లు వినిపించాయి. జూలైలోనూ డేట్స్ మారాయి. అధికారిక ప్రకటనైతే చేయలేదు కానీ, ఈ 22న రిలీజ్ పక్కా. సెన్సార్ ముడింజాచ్చి! అర్థం కాలా? తమిళ్లో సెన్సారైపోయిందట! అధికారికంగా ప్రకటించకపోయినా, రంజాన్ మర్నాడు ‘కబాలి’ చెన్నైలో సెన్సార్‌కి వెళ్ళిం దట. సోమవారం సెన్సార్ సర్టిఫికెట్ రాగానే, డేట్ ప్రకటిస్తారు. తుది నిడివి 2 గంటల 32 నిమిషాలట. - రెంటాల జయదేవ -
దటీజ్ కబాలి!
దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్ తాజా చిత్రం 'కబాలి' విడుదలకు ముందే సృష్టిస్తోంది. ఈ సినిమాలోని 'నిరుప్పుడా' తమిళ పాట టీజర్ లక్షల్లో వ్యూస్ కొల్లగొట్టింది. ఇప్పుడు ఇదే పేరుతో ఏకంగా సినిమానే తెరకెక్కిస్తున్నారు. బి. అశోక్ కుమార్ అనే దర్శకుడు తన తొలి సినిమాకే 'నిరుప్పుడా' టైటిల్ పెట్టాడు. ఈ సినిమాలో విక్రమ్ ప్రభు హీరోగా నటించనున్నాడు. కథకు అనుగుణంగానే ఈ పేరు పెట్టినట్టు అశోక్ కుమార్ వెల్లడించారు. 'అగ్నిమాపక దళం సేవలు నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనుంది. రజనీ కాంత్ అంటే పడిచచ్చే ఫైర్ మ్యాన్ గా విక్రమ్ ప్రభు కనిపించనున్నాడు. బాగా ఆలోచించే నిరుప్పుడా టైటిల్ పెట్టాం. ఈ పేరే మా సినిమాకు అన్నివిధాలా సరిపోతుంద'ని అశోక్ కుమార్ తెలిపారు. 'కబాలి' సినిమా నిర్మాత కళైపులి ఎస్ థాను అంగీకారంతోనే 'నిరుప్పుడా' టైటిల్ పెట్టామన్నారు. విక్రమ్ ప్రభు సరసన నిక్కీగల్రాణి నటిస్తోంది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఆగస్టులో ప్రారంభంకానుంది. -
రూట్ మార్చిన సూర్య
కొంత కాలంగా వరుసగా ప్రయోగాత్మక చిత్రాలనే చేస్తూ వస్తున్న తమిళ స్టార్ హీరో సూర్య రూట్ మారుస్తున్నాడు. ఎక్స్పరిమెంటల్ మూవీస్‌తో మంచి పేరు వస్తున్నా.. కమర్షియల్ సక్సెస్‌లు మాత్రం రాకపోవటంతో, మాస్ సినిమాల మీద దృష్టి పెట్టాడు. ఇటీవల విడుదలైన 24తో కూడా మంచి సక్సెస్ సాధించిన సూర్య.. కమర్షియల్‌గా మాత్రం ఇబ్బందులు ఎదుర్కొన్నాడన్న టాక్ వినిపిస్తోంది. అందుకే వరుసగా మాస్ యాక్షన్ సినిమాల మీదే దృష్టి పెడుతున్నాడు. ప్రస్తుతం సింగం సీరీస్‌లో మూడో సినిమాగా తెరకెక్కుతున్న ఎస్3లో నటిస్తున్న సూర్య ఈ సినిమా తరువాత కబాలి ఫేం పా రంజిత్ దర్శకత్వంలో ఓ సినిమా అంగీకరించాడు. ఆ తరువాత కూడా మాస్ జానర్లోనే కొనసాగాలని భావిస్తున్నాడు. అందుకే ఇటీవల విశాల్ హీరోగా రాయుడు లాంటి ఊర మాస్ సినిమాను రూపొందించిన ముత్తయ్య దర్శకత్వంలో సినిమా చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నాడు. సూర్య సెలక్షన్ చూస్తే ఇప్పట్లో ప్రయోగం చేసే ఆలోచన లేనట్టుగా కనిపిస్తోంది. -
ప్రయోగాలను పక్కన పెట్టేసిన సూర్య
కొంత కాలంగా వరుసగా ప్రయోగాత్మక చిత్రాలనే చేస్తూ వస్తున్న తమిళ స్టార్ హీరో సూర్య రూట్ మారుస్తున్నాడు. ఎక్స్పరిమెంటల్ మూవీస్‌తో మంచి పేరు వస్తున్నా.. కమర్షియల్ సక్సెస్‌లు మాత్రం రాకపోవటంతో, మాస్ సినిమాల మీద దృష్టి పెట్టాడు. ఇటీవల విడుదలైన 24తో కూడా మంచి సక్సెస్ సాధించిన సూర్య.. కమర్షియల్‌గా మాత్రం ఇబ్బందులు ఎదుర్కొన్నాడన్న టాక్ వినిపిస్తోంది. అందుకే వరుసగా మాస్ యాక్షన్ సినిమాల మీదే దృష్టి పెడుతున్నాడు. ప్రస్తుతం సింగం సీరీస్‌లో మూడో సినిమాగా తెరకెక్కుతున్న ఎస్3లో నటిస్తున్న సూర్య ఈ సినిమా తరువాత కబాలి ఫేం పా రంజిత్ దర్శకత్వంలో ఓ సినిమా అంగీకరించాడు. ఆ తరువాత కూడా మాస్ జానర్లోనే కొనసాగాలని భావిస్తున్నాడు. అందుకే ఇటీవల విశాల్ హీరోగా రాయుడు లాంటి ఊర మాస్ సినిమాను రూపొందించిన ముత్తయ్య దర్శకత్వంలో సినిమా చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నాడు. సూర్య సెలక్షన్ చూస్తే ఇప్పట్లో ప్రయోగం చేసే ఆలోచన లేనట్టుగా కనిపిస్తోంది. -
నెరుప్పుడా అంటున్న విక్రమ్‌ప్రభు
ఇటీవల ప్రతి సినీ అభిమాని నోట వినిపిస్తున్న మాట నెరుప్పుడా. కారణం సూపర్‌స్టార్ కబాలి చిత్రంలో ఒక పాటలో పదమే నెరుప్పుడా. ఇప్పుడీ పదం యువ నటుడు విక్రమ్‌ప్రభు చిత్రానికి పేరుగా మారింది. ఎస్ఈ కుంకీ చిత్ర హీరో దివంగత మహానటుడు శివాజీగణేశన్ మనవడు, సీనియర్ నటుడు ప్రభు వారసుడు అన్న విషయం తెలిసిందే. అతి కొద్దికాలంలోనే నటుడిగా తన కంటూ ఒక గుర్తింపును సంపాందించుకున్న విక్రమ్‌ప్రభు తాజాగా సొంతంగా ఫస్ట్ ఆర్టిస్ట్ అనే చిత్ర నిర్మాణ సంస్థను నెలకొలిపారు. దీని ఆవిష్కరణ కార్యక్రమం, ఈ బ్యానర్లో నిర్మించనున్న తొలి చిత్రం నెరుప్పుడా చిత్ర ప్రారంభోత్సవ కార్యక్రమం బుధవారం స్థానిక సౌత్ బోగ్ రోడ్డులో గల అన్నై ఇల్లం(శివాజిగణేశన్ గృహం)లో నిర్వహించారు. చిత్ర బ్యానర్‌ను ప్రముఖ నిర్మాత ఏవీఎం. శరవణన్ ఆవిష్కరించగా, చిత్ర టైటిల్‌ను నిర్మాత, తమిళ నిర్మాతల మండలి అధ్యక్షుడు కలైపులి ఎస్.థాను ఆవిష్కరించారు. కబాలి చిత్రంలో పాటలోని నెరుప్పుడా పదాన్ని తమ చిత్రానికి టైటిల్‌గా వాడుకోవడానికి ఆ చిత్ర నిర్మాత కలైపులి ఎస్.థానును అడగ్గా ఎలాంటి అభ్యంతరం చెప్పకుండా వెంటనే అనుమతించారని చిత్ర నిర్మాత, కథానాయకుడు విక్రమ్‌ప్రభు వెల్లడించారు. ఈయన ఈ చిత్రాన్ని చంద్రా ఆర్ట్స్, సినీ ఇన్నోవేషన్స్ సంస్థలతో కలిసి నిర్మించనున్నారు. దీనికి సీనియర్ సినీ పీఆర్ఓ డైమండ్‌బాబు లైన్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. నెరుప్పుడా చిత్రంలో విక్రమ్‌ప్రభు అగ్నిమాపక దళ అధికారిగా, రజనీకాంత్ వీరాభిమానిగా నటించనున్నారట. ఇందులో ఆయనకు జంటగా నిక్కీగల్రాణి నటిస్తున్నారు. ఇతర ప్రధాన పాత్రల్లో పొన్వన్నన్,నాన్‌కడవుల్ రాజేంద్రన్, ఆడుగళం నరేన్, మధుసూదన్‌రావు, నాగినీడు నటిస్తున్నారు. అశోక్‌కుమార్ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రానికి షాన్ రోల్డాన్ సంగీతాన్ని, ఆర్డీ.రాజశేఖర్ చాయాగ్రహణం అందిస్తున్నారు. -
పోటీ నుంచి తప్పుకునే ఆలోచనలో చైతూ
యంగ్ హీరో నాగచైతన్య హీరోగా తెరకెక్కుతున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ ప్రేమమ్. మళయాళంలో ఘనవిజయం సాధించిన ప్రేమమ్ సినిమాను అదే పేరుతో టాలీవుడ్లో రీమేక్ చేస్తున్నారు. కార్తీకేయ ఫేం చందూ మొండేటి దర్శకత్వం వహిస్తుండగా శృతిహాసన్, అనుపమా పరమేశ్వరన్, మడోనా సెబాస్టియన్లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. అయితే ముందుగా ఈ సినిమాను ఆగస్టులోనే రిలీజ్ చేయాలని భావించినా ప్రస్తుతం చిత్రయూనిట్ వాయిదా వేసే ఆలోచనలో ఉన్నారు. చైతూ హీరోగా తెరకెక్కిన సాహసం శ్వాసగా సాగిపో సినిమా ఈ నెలాఖరున రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఇక కబాలి సినిమా రిలీజ్‌పై క్లారిటీ రాలేదు. బాబు బంగారం, జనతా గ్యారేజ్ లాంటి స్టార్ హీరోల సినిమాలు కూడా వరుసగా రిలీజ్‌కు రెడీ అవుతున్నాయి. అందుకే ఇంత భారీ పోటీ మధ్య రిలీజ్ చేసే కన్నా కాస్త టైం తీసుకొని రిలీజ్ చేయటం బెటర్ అని భావిస్తున్నారట. దీంతో ప్రేమమ్ సినిమాను సెప్టెంబర్‌లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. -
ఆ గ్యాప్ వాడేసుకుంటున్నారు
సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన కబాలి సినిమా రిలీజ్ పై ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. అయితే ముందుగా అనుకున్నట్టుగా కబాలి జూలై 15న మాత్రం రిలీజ్ కావటం లేదంటూ ఫిక్స్ అయ్యారు. అభిమానులతో పాటు ఇండస్ట్రీ వర్గాలు కూడా ఇదే ఆలోచనతో తమ సినిమాలను లైన్ లో పెడుతున్నారు. స్టార్ హీరోలు రిస్క్ చేయకపోయినా చిన్న సినిమా నిర్మాతలు మాత్రం గ్యాప్ ను వాడేసుకోవడానికి రెడీ అవుతున్నారు. బిగ్ హిట్ కోసం ఎదురుచూస్తున్న అల్లరి నరేష్ మరోసారి సెల్పీ రాజాగా తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి రెడీ అవుతున్నాడు. ఈ సినిమాను జూలై 15న రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు చిత్రయూనిట్. తెలుగు తమిళ భాషల్లో ఒకేసారి రూపొందుతున్న లేడి ఓరియంటెడ్ మూవీ నాయకీ. తొలిసారిగా గ్లామర్ హీరోయిన్ త్రిష ఓ లేడిఓరియంటెడ్ సినిమాలో నటిస్తుండటంతో ఈ సినిమాపై కూడా మంచి అంచనాలే ఉన్నాయి. ఇన్నాళ్లు రిలీజ్ డేట్ విషయంలో ఆలోచన చేస్తూ వచ్చిన నాయకీ టీం కూడా కబాలి రిలీజ్ వాయిదా పడుతుందన్న ఆలోచనతో జూలై 15నే రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నారు. -
సెప్టెంబర్‌లో ప్రేమమ్
యంగ్ హీరో నాగచైతన్య హీరోగా తెరకెక్కుతున్న రొమాంటిక్ ఎంటర్ టైనర్ ప్రేమమ్. మళయాలంలో ఘనవిజయం సాధించిన ప్రేమమ్ సినిమాను అదే పేరుతో టాలీవుడ్ లో రీమేక్ చేస్తున్నారు. కార్తీకేయ ఫేం చందూ మొండేటి దర్శకత్వం వహిస్తుండగా శృతిహాసన్, అనుపమా పరమేశ్వరన్, మడోనా సెబాస్టియన్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. అయితే ముందుగా ఈ సినిమాను ఆగస్టులోనే రిలీజ్ చేయాలని భావించినా ప్రస్తుతం చిత్రయూనిట్ వాయిదా వేసే ఆలోచనలో ఉన్నారు. చైతూ హీరోగా తెరకెక్కిన సాహసం శ్వాసగా సాగిపో సినిమా ఈ నెలాఖరున రిలీజ్ కు రెడీ అవుతోంది. ఇక కబాలి సినిమా రిలీజ్ పై క్లారిటీ రాలేదు. బాబు బంగారం, జనతా గ్యారేజ్ లాంటి స్టార్ హీరోల సినిమాలు కూడా వరుసగా రిలీజ్ కు రెడీ అవుతున్నాయి. అందుకే ఇంత భారీ పోటి మధ్య రిలీజ్ చేసే కన్నా కాస్త టైం తీసుకొని రిలీజ్ చేయటం బెటర్ అని భావిస్తున్నారట. అందుకే ప్రేమమ్ సినిమాను సెప్టెంబర్ లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. -
'కబాలి' విడుదల తేదీ ఇదే(నా)
తమిళ సూపర్ స్టార్ రజనీ కాంత్ తాజా చిత్రం 'కబాలి' విడుదలపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఈ సినిమా విడుదల తేదీలు రోజుకొకటి తెరపైకి వస్తున్నాయి. వాయిదాలు పడుతూ వస్తున్న 'కబాలి' జూలై 29న ధియేటర్లలో సందడి చేయనున్నాడని తాజా సమాచారం. ఈ నెల 29న విడుదలకానున్నట్టు మలేసియాలో 'కబాలి' పోస్టర్లు దర్శనమిచ్చాయి. వీటిని రజనీకాంత్ పీఆర్వో రియాజ్ ట్వీట్ చేశారు. దీంతో 29న సినిమా విడుదల కావడం ఖాయమని అభిమానులు భావిస్తున్నారు. అయితే నిర్మాతలు అధికారికంగా విడుదల తేదీ ప్రకటించలేదు. 'సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ కోసం నిర్మాతలు ఎదురు చూస్తున్నారు. మలేసియాలో ఏర్పాటు చేసిన పోస్టర్లు డిస్ట్రిబ్యూటర్లు పెట్టినవ'ని చిత్ర యూనిట్ సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. జూన్ లోనే ఈ సినిమాను విడుదల చేస్తారని వార్తలు వచ్చాయి. తర్వాత జూలైకి వాయిదా పడింది. ఈ నెల 15నే విడుదల కానున్నట్లు ప్రచారం జరిగింది. మలాయ్ భాషలో అనువాద కార్యక్రమాలు జరిగినప్పుడు రజనీకాంత్ స్టైల్‌కు తగ్గట్టుగా ఆయన పాత్రకు డబ్బింగ్ చెప్పేవారు లేకపోవడం కారణంగా ఆ భాషానువాద కార్యక్రమాలు ఆలస్యం కావడంతో విడుదలను వాయిదా వేశామని చిత్ర యూనిట్ వెల్లడించింది. అన్ని కార్యక్రమాలు పూర్తయి విడుదలకు సిద్ధంగా ఉన్న 'కబాలి' ప్రపంచవ్యాప్తంగా ఈ నెల 29న విడుదల ఖాయమని అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు. #Thalaivar @superstarrajini n @beemji 's #Kabali promotion's in full swing !! @theVcreations @v4umedia1 pic.twitter.com/T2vG2AoSkz — RIAZ K AHMED (@RIAZtheboss) July 3, 2016 -
కబాలి సెగ ఎన్టీఆర్‌ను తాకనుందా..?
ప్రపంచ వ్యాప్తంగా భారీ క్రేజ్ సొంతం చేసుకున్న కబాలి సినిమా రిలీజ్ డేట్‌పై ఇంకా కన్ఫ్యూజన్ కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే చాలా సార్లు వాయిదా పడిన ఈ సినిమాను ఎట్టి పరిస్థితుల్లో జూలై 15న రిలీజ్ చేయనున్నట్టుగా ప్రకటించారు. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి కూడా కనిపించటం లేదు. మరోసారి సూపర్ స్టార్ సినిమాను వాయిదా వేసే ఆలోచనలో ఉన్నారు చిత్రయూనిట్. ఇప్పటికే రజనీ సినిమా కారణంగా చాలా మంది తమ సినిమాల రిలీజ్ డేట్లపై ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. ఇప్పుడు ఈ ఇబ్బంది ఎన్టీఆర్‌కు కూడా ఎదురైందన్న టాక్ వినిపిస్తోంది. ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు చేయాల్సి ఉండటంతో కబాలిని మరో నెల పాటు వాయిదా వేసి ఆగస్టు 12 రిలీజ్ చేయాలని భావిస్తున్నారట. ఇప్పటికే జనతా గ్యారేజ్‌ను అదే రోజు రిలీజ్ చేయడానికి ముహుర్తం ఫిక్స్ చేసుకున్నాడు ఎన్టీఆర్. కబాలి తమిళ్, తెలుగు, మళయాలం, హిందీతో పాటు పలు విదేశీ భాషల్లో కూడా రిలీజ్ అవుతోంది. జనతా గ్యారేజ్ ను కూడా తెలుగు తో పాటు తమిళ్, మళయాల భాషల్లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. దీంతో ఈ రెండు సినిమాలు ఒకేసారి రిలీజ్ అయితే ఎన్టీఆర్‌కు థియేటర్ల సమస్య ఎదురయ్యే అవకాశం ఉంది. మరి ఇప్పటికైనా కబాలి నిర్మాతలు స్పందించి రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేస్తారేమో చూడాలి. -
కబాలి విడుదలెప్పుడు?
కబాలి ఈ చిత్రం ఇప్పుడు ఒక సంచలనం. ఏ నోట విన్నా కబాలి మాటే. ఒక చోట నలుగురు కలిశారంటే కబాలి చిత్రం విడుదలెప్పుడన్న కుతూహల సంభాషణలే. ఇంతగా పరిశ్రమ వర్గాలను,ప్రేక్షకులను ప్రభావం చూపిన చిత్రం ఇప్పటి వరకూ లేదనే చెప్పాలి. కారణం ఒక్కటే. ఆ చిత్ర కథానాయకుడు సూపర్‌స్టార్ రజనీకాంత్. 65 ఏళ్ల ఈ ఎవర్గ్రీన్ హీరో, స్టైల్‌కింగ్ దాదాగా నటిస్తున్న ఈ చిత్రం ఎలా ఉంటుందన్న ఆసక్తి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానుల్లో ఎంతగానో నెలకొంది. ఇప్పటికే టీజర్ విడుదలై ఆ ఆసక్తిని రెట్టింపు పెంచింది. చిత్రంలో రజనీకాంత్ 80 ప్రాంత గెటప్‌లను టీజర్లో చూపడంతో ఆయన అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండాపోతోంది. కబాలి చిత్రాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అన్న ఆతృత పెరిగిపోతోంది. ఇలాంటి పరిస్థితుల్లో కబాలి చిత్ర విడుదలెప్పుడన్న తాజా వివరాలను చూద్దాం. మెడ్రాస్ చిత్రం ఫేమ్ రంజిత్ దర్శకత్వంలో కలైపులి ఎస్.థాను నిర్మించిన భారీ చిత్రం కబాలి అన్న విషయం తెలిసిందే. నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని ప్రపంచవ్యాప్తంగా విడుదలకు ముస్తాబవుతోంది చిత్రం. మలాయ్ భాషను మాట్లాడుతున్న తొలి తమిళ చిత్రం కబాలినే. ఈ చిత్రం ఈ నెల 15నే విడుదల కానున్నట్లు ప్రచారం జరిగింది. చిత్ర యూనిట్ కూడా ఈ తేదీకే విడుదలకు సిద్ధమైంది. మలాయ్ భాషలో అనువాద కార్యక్రమాలు జరిగినప్పుడు రజనీకాంత్ స్టైల్‌కు తగ్గట్టుగా ఆయన పాత్రకు డబ్బింగ్ చెప్పేవారు లేకపోవడం కారణంగా ఆ భాషానువాద కార్యక్రమాలు ఆలస్యం అయ్యామని యూని ట్ వర్గాల వివరణ. తాజాగా అన్ని కార్యక్రమాలు పూర్తయి విడుదలకు సిద్ధంగా ఉంది. అమెరికాలో ఉన్న సూపర్‌స్టార్ మూడో తేదీన చెన్నైకి తిరిగిరానున్నారని, నాల్గవ తేదీన కబాలి చిత్రాన్ని పూర్తిగా తిలకించనున్నారని సమాచారం. ఇక ఈ నెల ఏడో తేదీన కబాలి చిత్రం సెన్సార్‌కు వెళ్లనుందని, అది పూర్తి కాగానే చిత్రాన్ని ఈ నెల 22న ప్రపంచవ్యాప్తంగా విడుదల ఖాయం అనీ ఈ విషయంలో 90 శాతం మార్పు ఉండదని చిత్ర వర్గాల సమాచారం. -
వెంకటేష్‌ను ఇబ్బంది పెడుతున్న రజనీ
చాలా కాలం తరువాత సోలో హీరోగా కమర్షియల్ స్టామినా చూపించడానికి వస్తున్నాడు సీనియర్ హీరో వెంకటేష్. మారుతి దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా తెరకెక్కిన బాబు బంగారం సినిమా త్వరలో రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఇప్పటికే షూటింగ్‌తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకున్న ఈ సినిమా.., రిలీజ్ విషయంలో మాత్రం ఎటూ తేల్చుకోలేకపోతుంది. ముందుగా జూలై 1న బాబు బంగారాన్ని రిలీజ్ చేయాలని భావించారు. అయితే అదే సమయంలో రజనీ కబాలి రిలీజ్ అవుతుందన్న ప్రకటన రావటంతో వెనక్కు తగ్గారు. అయితే కబాలి రిలీజ్ డేట్ ఇంత వరకు అధికారంగా ప్రకటించకపోవటంతో బాబు బంగారం టీం ఆలోచనలో పడింది. తొందరపడి డేట్ ప్రకటిస్తే తరువాత రజనీకాంత్‌తో పోటి పడాల్సి వస్తుంది, అలా అని ఆలస్యం చేస్తే సినిమా మీద ఆసక్తి తగ్గిపోతుంది. దీంతో ఏం చేయాలో అర్థం కాక తలపట్టుకున్నారు. -
‘కబాలి’ కోసం నెలరోజులు కష్టపడ్డాం!
‘కబాలి’ విమానం కోసం నెల శ్రమించాం దేశమంతా ‘కబాలి’ ఫీవర్ ఊపేస్తోంది. సిల్వర్ స్క్రీన్ పై ‘కబాలి’ని చూసేందుకు రజనీ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సందడిని మరింత పెంచుతూ తాజాగా ఎయిర్ ఆసియా ఇండియా విమానాయాన సంస్థ ఏకంగా ఓ ప్రత్యేక కబాలి విమానాన్ని ముస్తాబు చేసిన సంగతి తెలిసిందే. రజనీ స్టైల్లో స్పెషల్ ‘కబాలి’ లుక్ తో ముస్తాబైన ఈ విమానం శుక్రవారం నుంచి కార్యకలాపాలు ప్రారంభించింది. ఈ విమానం బెంగళూరు, న్యూఢిల్లీ, గోవా, పుణె, చండీగఢ్, జైపూర్, గువాహటి, ఇంఫాల్, వైజాగ్, కొచ్చి మీదుగా ప్రయాణించనుంది. ఓ హీరో గౌరవార్థం విమానాన్ని ప్రత్యేకంగా ముస్తాబుచేయడం ఆసియాలో ఇదే తొలిసారి అని ఎయిర్ ఆసియా ఇండియా సంస్థ తెలిపింది. ‘కబాలి’ సినిమాకు ఈ సంస్థ అధికారిక ఎయిర్ లైన్ భాగస్వామిగా ఉంది. ఎయిర్ ఆసియా ఇండియా విమానంలో కబాలి సన్నివేశాలు కొన్నింటిని చిత్రీకరించారు కూడా.. ఈ నేపథ్యంలో రెగ్యులర్ ప్యాసింజర్ విమానాన్ని ‘కబాలి’ కోసం ప్రత్యేకంగా తీర్చిదిద్దామని, సినిమా విడుదలైన తర్వాత ఈ విమానం కొనసాగుతుందని, రజనీ గౌరవార్థం, అంతర్జాతీయంగా ఉన్న ఆయన ఫ్యాన్స్ కోసం దీనిని కొనసాగిస్తామని ఆ సంస్థ ప్రతినిధి తెలిపారు. ఎయిర్ బస్ ఏ-320 విమానాన్ని ‘కబాలి’ లుక్ తో రీబ్రాండ్ చేయడానికి నెలరోజులు సమయం పట్టిందని, ఓ వ్యక్తి ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని ’కబాలి’ విమానాన్ని అందంగా తీర్చిదిద్దాడని చెప్పారు. -
'ఆ ఫ్లైట్ డిజైనింగ్‌కు నెల రోజులు పట్టింది'
రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ సినిమా కబాలి. ఈ సినిమాకు అఫీషియల్ ఎయిర్‌లైన్ పార్టనర్‌గా వ్యవహరిస్తున్న ఎయిర్ ఏసియా ఇండియా, వినూత్న ప్రచారానికి శ్రీకారం చుట్టింది. ఏసియాలోనే తొలిసారిగా ఓ పాసింజర్ ఎయిర్ క్రాఫ్ట్‌ను సినిమా పోస్టర్లతో డిజైన్ చేయించింది. ఈ శుక్రవారం నుంచి ఈ కబాలి ఫ్లైట్ గగనవీధుల్లో షికారు ప్రారంభిస్తున్న సందర్భంగా.. ఎయిర్ ఏసియా ప్రతినిధి, ఫ్లైట్ డిజైనింగ్ వెనుక కష్టాలను వివరించాడు. ఫ్లైట్‌పై కబాలి పోస్టర్‌ను ఏర్పాటుచేయడానికి దాదాపు నెల రోజుల సమయం పట్టినట్టు వెల్లడించారు. శుక్రవారం నుంచి ఈ ఫ్లైట్ బెంగళూరు, న్యూ డిల్లీ, గోవా, పుణె, జైపూర్, వైజాగ్ లాంటి పలు నగరాలకు సేవలందించనుంది. అంతేకాదు కబాలి సినిమా రిలీజ్ తరువాత కూడా ఈ స్పెషల్ ఫ్లైట్ ఇలాగే కొనసాగుతుందని ప్రకటించారు. పా రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన కబాలి సినిమాలో రజనీకాంత్ సరసన రాధికా ఆప్టే హీరోయిన్గా నటించింది. మలేషియాలో ఆశ్రయం పొందుతున్న శరణార్థుల కథతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రజనీ కాంత్ వయసు మళ్లిన డాన్‌గా కనిపిస్తున్నాడు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న కబాలి సినిమాను ఈ నెల రెండో వారంలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. -
శంషాబాద్ నుంచి బయల్దేరిన కబాలి ఏ 320
సాక్షి,సిటీబ్యూరో: సూపర్‌స్టార్ రజనీకాంత్ తాజా సినిమా కబాలి కోసం అద్భుతమైన రంగులతో,రజనీకాంత్ చిత్రాలతో ముస్తాబు చేసిన ఎయిర్ ఏసియా కబాలి ఏ 320 ఎయిర్‌క్రాప్ట్ గురువారం శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి టేకాఫ్ తీసుకుంది. కబాలి ఏ 320 ని ముస్తాబు చేసేందుకు జీఎమ్మార్ ఏరో టెక్నిక్ లిమిటెడ్ నిపుణులు వారం రోజులు రాత్రింబవళ్లు కష్టపడి చక్కటి రంగులతో, లక్షలాది మంది అభిమాన ప్రేక్షకుల మదిని దోచుకున్న రజనీకాంత్ చిత్రాలతో ఎంతో అందంగా తీర్చిదిద్దారు. జీఎమ్మార్ ఏరో టెక్నిక్ రిపేర్ అండ్ ఓవరాల్ విభాగం ఈ ప్లైట్‌కు ఆధునిక హంగులద్దింది. ఎయిర్ ఏసియా భాగస్వామ్యంతో చేపట్టిన ఈ కార్యక్రమంలో ఏరో టెక్నిక్ లిమిటెడ్ ఇంజనీరింగ్ నిపుణులు తమ ప్రతిభా పాటవాలను ఉన్నతంగా ఆవిష్కరించారు.సినిమాలో ఎంతో గంభీరంగా, హూందాగా కనిపించే రజనీకాంత్ పెయింటింగ్స్‌ను అదేస్థాయిలో ఏ మాత్రం చెక్కుచెదరకుండా తీర్చిదిద్దారు.ఎయిర్ ఏసియా కబాలి 320 ని రూపొందించే అవకాశం తమకు లభించడం పట్ల గర్వంగా భావిస్తున్నట్లు జీఎమ్మార్ ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేసింది. -
కబాలి టీంలోకి మలయాళ సూపర్ స్టార్
సూపర్ స్టార్ రజనీ కాంత్ హీరోగా తెరకెక్కిన కబాలి సినిమాపై రోజుకో వార్త సందడి చేస్తుంది. ఇప్పటికే భారీ బిజినెస్‌తో పాటు యూట్యూబ్ సెన్సేషన్‌గా మారిన ఈ సినిమాకు మరింత హైప్ క్రియేట్ అవుతోంది. దేశవ్యాప్తంగా భారీగా రిలీజ్ అవుతోన్న కబాలి డిస్ట్రిబ్యూషన్ రైట్స్ కోసం భారీ పోటీ నెలకొంది. ఏకంగా టాప్ స్టార్లే కబాలి డిస్ట్రిబ్యూషన్ రైట్స్ కోసం పోటీ పడుతున్నారు. తెలుగు, తమిళ భాషలతో పాటు పలు విదేశీ భాషల్లో కూడా రిలీజ్ అవుతున్న కబాలి సినిమాపై మాలివుడ్లో కూడా భారీ క్రేజ్ ఏర్పడింది. దీంతో ఈ సినిమా కేరళ రైట్స్‌ను భారీ మొత్తం వెచ్చించి సొంతం చేసుకున్నారు మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్. సూపర్ స్టార్ ఇమేజ్ ఉన్న మోహన్ లాల్ రైట్స్ తీసుకోవటంతో సినిమా ప్రమోషన్ విషయంలో కూడా చాలా ప్లస్ అవుతుందని భావిస్తున్నారు కబాలి యూనిట్. రజనీకాంత్ సరసన రాధికా ఆప్టే హీరోయిన్గా నటించిన ఈ సినిమాకు పా రంజిత్ దర్శకుడు. మలేషియాలో స్థిర పడిన శరణార్థుల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రజనీ వయసు మళ్లిన డాన్‌గా కనిపించనున్నాడు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న కబాలి జూలై రెండో వారంలో రిలీజ్‌కు రెడీ అవుతోంది. -
ఇండియాలో తొలి సినిమాగా 'కబాలీ'!
లేటు వయసులోనూ సూపర్ స్టార్ రజినీకాంత్ ఘాటుగా మాయ చేస్తున్నాడు. ఏ ముహుర్తాన కబాలి సినిమా మొదలు పెట్టాడో కాని, రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తున్నాడు. ఇప్పటికే టీజర్, నిరుప్పుడా సాంగ్, ఫస్ట్ పోస్టర్ లతో అభిమానులను ఆకట్టుకోవడంతో పాటు కోట్ల ఆన్ లైన్ వ్యూస్, ప్రీ రిలీజ్ బిజినెస్ ఇలా రకరకాల రికార్డ్లను సూపర్ స్టార్ కొల్లగొట్టిన విషయం తెలిసిందే. తాజాగా మరో రికార్డ్‌కు రెడీ అవుతున్నాడు. చెన్నైలోని భారీ హోర్డింగ్ లతో పాటు బస్సులు, రైళ్లను కూడా కబాలి పోస్టర్లతో నిండిపోతున్నాయి. తాజాగా విమానాలపై సినిమా పోస్టర్లు అంటించి ప్రచారం చేయడంతో 'కబాలీ' మేనియా ఏంటన్నది అర్థం చేసుకోవచ్చు. ఏయిర్ ఏషియా విమానాలపై కబాలీ పోస్టర్లు సంచలనం సృష్టిస్తున్నాయి. రెండు డొమెస్టిక్ ఫ్లైట్స్తో పాటు, మరో రెండు అంతర్జాతీయ విమానాలకు కబాలి పోస్టర్స్ వేశారు. గతంలో దేశంలో ఏ చిత్రానికి లేని తరహాలో ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇలా ప్రచారం చేస్తున్న తొలి ఇండియన్ మూవీగా కబాలీ సెన్సెషన్ గా నిలువనుంది. గతంలో ప్రపంచవ్యాప్తంగా ఒక్క సినిమాకు మాత్రమే ఈ తరహా ఆదరణతో కూడిన ప్రచారం లభించింది. ఎయిర్ న్యూజీలాండ్ విమానసంస్థ వారు 'ద హాబిట్' మూవీకి మాత్రమే విమానాలపై పోస్టర్లు అంటించి ప్రచారం చేశారు. రెండు భారీ ఫ్లాప్‌ల తరువాత రజనీ హీరోగా తెరకెక్కుతున్న సినిమా కావటంతో ఈ సినిమాను ఎలాగైన బ్లాక్ బస్టర్ సక్సెస్ చేయాలన్న ప్రయత్నంలో భాగంగా రజనీ పోస్టర్లతో కబాలీ మూవీపై హైప్ క్రియేట్ చేస్తున్నారు. రంజిత్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రజనీ భార్యగా రాధికా ఆప్టే నటిస్తుండగా.. ఇతర పాత్రలలో కలైరసన్, దినేష్, రిత్విక తదితరులు నటించారు. -
రజనీ ‘కబాలి’ ఫ్యాన్స్‌కు చేదువార్త!
మళ్లీ వాయిదాపడిన సినిమా విడుదల భారీ అంచనాలు, రికార్డుల మీద రికార్డులతో దూసుకుపోతున్న ‘కబాలి’ సినిమా కోసం రజనీకాంత్ అభిమానులు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ఇదిగో అదిగో అంటూ ఊరిస్తున్న ఈ సినిమా విడుదల మరోసారి వాయిదా పడినట్టే కనిపిస్తోంది. వచ్చే నెల 15న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని చిత్ర యూనిట్ సంకల్పించింది. అయితే 15న ఈ సినిమా వచ్చే అవకాశం లేదని తాజా సమాచారం అందుతోంది. ఈ సినిమా విడుదలను వచ్చేనెల 15 నుంచి 22కు వాయిదా వేసినట్టు విశ్వసనీయ సమాచారం. ‘కారణాలు ఏమిటన్నది స్పష్టంగా తెలియకపోయినప్పటీ సినిమా విడుదలను వారంపాటు వాయిదా వేశారు. ఈ సినిమా ఇక జూలై 22న ప్రేక్షకుల ముందుకురానుంది. సెన్సార్ పూర్తికాగానే చిత్ర రూపకర్తలు ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించనున్నారు’ అని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ‘విక్రమసింహా’, ‘లింగ’ వంటి ఫ్లాపుల తర్వాత పా రంజిత్ దర్శకత్వంలో రజనీకాంత్ ‘కబాలి’ సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఇందులో వయస్సు మళ్లిన డాన్‌గా రజనీ కనిపిస్తుండగా.. ఆయనతోపాటు రాధికా ఆప్టే, దినేశ్, రిత్వికా, ధన్సిక తదితరులు నటిస్తున్నారు. -
రజనీ అలా కనిపించేది 20 నిమిషాలే..
ప్రస్తుతం రిలీజ్‌కు రెడీగా ఉన్న సినిమాల్లో భారీ అంచనాలు ఉన్న సినిమా కబాలి. రజనీ కాంత్ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే రికార్డుల మీద రికార్డ్‌లు క్రియేట్ చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అందుకు తగ్గట్టుగానే చిత్రయూనిట్ భారత్‌లోనే కాదు ఇతర దేశాల్లో కూడా ఈ చిత్రాన్ని పెద్ద ఎత్తున రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అయితే కబాలి చిత్రానికి అంత క్రేజ్ రావడానికి ముఖ్య కారణం రజనీ లుక్. వయసైన డాన్ పాత్రలో రజనీ లుక్కు మంచి స్పందన వచ్చింది. భాషా సినిమా తరువాత రజనీ డాన్‌గా నటిస్తుండం కూడా సినిమా మీద హైప్ క్రియేట్ అవ్వటానికి కారణం అయ్యింది. అయితే కోలీవుడ్‌లో వినిపిస్తున్న వార్తలు అభిమానులకు షాక్ ఇస్తున్నాయి. కబాలి సినిమాలో రజనీ కేవలం 20 నిమిషాల పాటు మాత్రమే డాన్ కనిపిస్తాడట. మలేషియాలో ఉంటున్న శరణార్థుల సమస్యల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రజనీ ఎక్కువగా భాగం యంగ్‌గానే కనిపిస్తాడన్న టాక్ వినిపిస్తోంది. క్లైమాక్స్‌లో వచ్చే కీలక సన్నివేశాల్లో మాత్రం రజనీ డాన్ లుక్‌లో కనిపిస్తాడట. మరి రజనీని డాన్ గా చూడాలని ఎదురుచూస్తున్న అభిమానులకు ఇది నిరాశ కలిగించే వార్తే. -
కబాలి లిస్ట్‌లో మరో రికార్డ్
రజనీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న కబాలి సినిమా రికార్డ్ల పరంపర కొనసాగుతూనే ఉంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో చిత్రయూనిట్ ప్రమోషన్లో వేగం పెంచుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా అంతర్జాతీయ స్థాయిలో ఈ సినిమాకు భారీగా ప్రచారం చేస్తున్నారు. అందుకు తగ్గట్టుగా ఓవర్సీస్లో రజనీ సినిమాకు భారీ హైప్ క్రియేట్ అవుతోంది. ఈ నేపథ్యంలో పారిస్‌లోని ఓ ప్రస్టీజియస్ స్క్రీన్ మీద కబాలి సినిమా ప్రదర్శింపబడుతోంది. గతంలో రాజమౌళి తెరకెక్కించిన విజువల్ వండర్ బాహుబలి ప్రదర్శింపబడిన ది లె గ్రాండ్ రెక్స్ హాల్లో కబాలి సినిమాను తొలి రోజే ప్రదర్శిస్తున్నారు. దాదాపు 2800 మంది ఒకేసారి చూసే ఏర్పాటు ఉన్న ఈ థియేటర్లో భారతీయ చిత్రాలు రిలీజ్ కావటం చాలా అరుదు. అలాంటి అరుదైన రికార్డ్ ఇప్పుడు కబాలి సొంతమైంది. -
విమానాలకు కబాలి పోస్టర్స్
రజనీ కాంత్.. ఏ ముహుర్తాన కబాలి సినిమా మొదలు పెట్టాడో కాని, రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేసేస్తున్నాడు. ఆన్ లైన్ వ్యూస్, ప్రీ రిలీజ్ బిజినెస్ ఇలా రకరకాల రికార్డ్లను కొల్లగొట్టిన సూపర్ స్టార్, తాజాగా మరో రికార్డ్‌కు రెడీ అవుతున్నాడు. రెండు భారీ ఫ్లాప్‌ల తరువాత రజనీ హీరోగా తెరకెక్కుతున్న సినిమా కావటంతో ఈ సినిమాను ఎలాగైన బ్లాక్ బస్టర్ సక్సెస్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అందుకు తగ్గట్టుగా ప్రచారం విషయంలోనూ కొత్త ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే చెన్నైలోని భారీ హోర్డింగ్ లతో పాటు బస్సులు, రైళ్లను కూడా కబాలి పోస్టర్లతో అలంకరించేస్తున్నారు. అది కూడా చాలదన్నట్టు ఇప్పుడు ఏకంగా విమానాలకే కబాలి పోస్టర్స్ వేస్తున్నారట. రెండు డొమాస్టిక్ ఫ్లైట్స్తో పాటు, మరో రెండు ఇంటర్ నేషనల్ ఫ్లైట్స్‌కు కబాలి పోస్టర్స్ వేస్తున్నారు. గతంలో హాలీవుడ్ సినిమా హాబిట్ కోసం ఈ తరహా ప్రచారం చేయగా, ఇండియాలో మాత్రం కబాలినే తొలిసారిగా ఈ రికార్డ్ సొంతం చేసుకోనుంది. -
కాసులు తెచ్చే సినిమా కావాలి
తమిళ్‌తో పాటు తెలుగులో కూడా స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న సౌత్ హీరో సూర్య. రొటీన్ కమర్షియల్ సినిమాలకు భిన్నంగా సినిమాలు చేసే సూర్య మాస్ క్యారెక్టర్స్ తోనూ అదరగొడుతున్నాడు. అయితే కొద్ది రోజులుగా వరుసగా ప్రయోగాలు చేస్తున్న ఈ మ్యాన్లీ స్టార్, భారీ కలెక్షన్లు సాధించే సినిమాలను మాత్రం అందించలేకపోతున్నాడు. తన తోటి హీరోలు 50 కోట్లు, 100 కోట్ల కలెక్షన్లతో దూసుకుపోతుంటే భారీ వసూళ్లను సాధించటంలో సూర్య వెనకపడిపోతున్నాడు. ఇటీవల విడుదలైన 24 బిగ్ హిట్ అనిపించుకున్నా, భారీ బడ్జెట్ కారణంగా ఈ సినిమా కాస్ట్ ఫెయిల్యూర్‌గా నిలిచింది. దీంతో పోటీలో నిలబడేందుకు ఓ కమర్షియల్ సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నాడు సూర్య. ప్రస్తుతం తనకు వరుస హిట్స్ అందించిన హరి దర్శకత్వంలో సింగం సినిమాకు రెండో సీక్వెల్‌గా తెరకెక్కుతున్న ఎస్ 3లో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమా తరువాత కబాలి ఫేం పా రంజిత్ దర్శకత్వంలో మరో సినిమాకు రెడీ అవుతున్నాడు. ఈ రెండు సినిమాలను కమర్షియల్ హిట్స్‌గా మలిచేందుకు కష్టపడుతున్నాడు ఈ విలక్షణ నటుడు. -
మళ్లీ మళ్లీ వినేలా..
రజనీకాంత్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ‘కబాలి’. పా.రంజిత్ దర్శకుడు. రాధికా ఆప్టే కథానాయిక. కె.పి.చౌదరి, కె.ప్రవీణ్ కుమార్ నిర్మాతలు. సంతోష్ నారాయణ స్వరపరిచిన ఈ చిత్రం పాటలను ఈ నెల 26న విడుదల చేయనున్నారు. నిర్మాతలు మాట్లాడుతూ - ‘‘ఇందులో రజనీకాంత్ నట విశ్వరూపాన్ని మరోసారి చూస్తారు. దర్శకుడు ఆయనలో మరో కోణాన్ని ఆవిష్కరించారు. సంతోష్ నారాయణ స్వరపరిచిన బాణీలు మళ్లీ మళ్లీ వినేలా ఉంటాయి. మంచి సాహిత్యం కుదిరింది. వచ్చే నెలలో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అని చెప్పారు.