అప్పుడు కబాలి.. ఇప్పుడు 'ఖైదీ నెం 150'..
దాదాపు దశాబ్దకాలం తరువాత మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ సినిమా ఖైదీ నంబర్ 150. తమిళ సూపర్ హిట్ మూవీ కత్తికి రీమేక్ అయిన ఈ మూవీపై అంచనాలు భారీగా ఉన్న విషయం తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లోని మెగా అభిమానులు ఈ మూవీ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. గతేడాది సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన కబాలి మూవీ విడుదల రోజున(జూలై 22న) చెన్నై, బెంగళూరుల్లోని పలు స్టార్టప్‌లతో పాటు సౌదీ అరేబియాలోనూ కొన్ని కంపెనీలు సెలవుదినంగా ప్రకటించగా.. తాజాగా రియాద్ లోని ఓ కన్‌స్ట్రక్షన్ కంపెనీ మెగా మూవీ ఖైదీ నెంబర్ 150 రిలీజు అవుతున్న జనవరి 11ను ఉద్యోగులకు సెలవుదినంగా ప్రకటించింది. ఈ విషయాన్ని ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు. హాలీడే వివరాలను పేర్కొంటూ ఓ నోటిస్ పేపర్‌ను పోస్ట్ చేశాడు. (చదవండి: ఉద్యోగులకు దసరా లాగే.. కబాలి బోనస్!)
గతంలో కబాలి మూవీకి కూడా మస్కట్, ఒమన్, రియాద్‌లోని తమ కన్‌స్ట్రక్షన్ కంపెనీలకు ఇదే విధంగా యాజమాన్యం హాలీడే ఇచ్చింది. ఈ హ్యాపీ న్యూస్‌ను ఓ నెటిజన్ సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నాడు. మూవీ మొఘల్, కింగ్ ఆఫ్ కింగ్స్ ఆఫ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ చిరంజీవి మూవీ ఖైదీ నెంబర్ 150 ని అభిమానులు ఘనంగా సెలబ్రేట్ చేసుకోవాలని ఆశిస్తూ ఈ అవకాశం కల్పించింది. దాదాపు పదేళ్ల తర్వాత పూర్తిస్థాయి సినిమాలో చిరు నటించడం కూడా మూవీ ఫీవర్‌ను పెంచేసింది. వీవీ వినాయక్ దర్శకత్వం వహించిన ఈ మూవీని చిరు తనయుడు రాంచరణ్ నిర్మించిన విషయం తెలిసిందే. చిరుకు జోడీగా కాజల్ అగర్వాల్ నటించగా, దేవీశ్రీ సంగీతాన్ని సమకూర్చాడు.
Holiday declared on Jan11th for Riyadh Construction Company on account of #KhaidiNo150 Release. కబాలి కి ఇలానే... @RGVzoomin @Shekar_News pic.twitter.com/aRRax4azyc
— #AkkuPakshi (@urstrulyRD) 8 January 2017