కోలీవుడ్‌లో కాజల్‌ హవా | Kajal Aggarwal to pair up with Vijay for his 61st film | Sakshi
Sakshi News home page

కోలీవుడ్‌లో కాజల్‌ హవా

Published Thu, Mar 16 2017 2:58 AM | Last Updated on Tue, Oct 30 2018 5:58 PM

కోలీవుడ్‌లో కాజల్‌ హవా - Sakshi

కోలీవుడ్‌లో కాజల్‌ హవా

కోలీవుడ్‌లో ఇప్పుడు నటి కాజల్‌ అగర్వాల్‌ హవా సాగుతోందని చెప్పవచ్చు.తెలుగులో చిరంజీవి 150వ చిత్రం ఖైదీ నంబర్‌ 150లో నటించే అవకాశం వచ్చే వరకూ కాజల్‌ క్రేజ్‌ సాధారణంగానే ఉంది. ఒక సమయంలో ఈ భామ పని అయిపోయింది, ఇక మూటా ముల్లె సర్దుకోవలసిందే అనే ప్రచారం జరిగింది. అలాంటిది అనూహ్యంగా కాజల్‌కు కాలం కలిసొచ్చింది.అలా చిరంజీవితో జంటగా నటించడం ఒక ఎత్తైతే, ఖైదీ నంబర్‌–150 విజయం కాజల్‌ డిమాండ్‌ను అమాంతం పెంచేసింది. ఇక కోలీవుడ్‌లో స్టార్‌ హీరోలు అజిత్, విజయ్‌లతో వరుసగా రొమాన్స్‌ చేసే అవకాశాలు వరించడంతో ఈ అమ్మడి హవా అంతా ఇంతా కాదు. అజిత్‌కు జంటగా నటిస్తున్న వివేగం చిత్రం షూటింగ్‌ చివరి దశకు చేరుకుంది.

ప్రస్తుతం విజయ్‌ 61వ చిత్రంలో ఆయనతో నటిస్తున్నారు. దీనితో పాటు మరో తమిళ చిత్రంలో నటించడానికి అంగీకరించారు. తెలుగులో రానా సరసన నేనే రాజు నేనే మంత్రి చిత్రంలోనూ నటిస్తున్నారు. మరిన్ని తెలుగు, తమిళ చిత్రాల అవకాశాలు కాజల్‌ తలుపు తడుతున్నా సారీ నో కాల్‌షీట్స్‌ అంటూ చెప్పేస్తున్నారట. మరో నాలుగైదు నెలల వరకూ కొత్త చిత్రాలను అంగీకరించలేని పరిస్థితి అని, ఆ తరువాత నూతన చిత్రాల గురించి ఆలోచించే అవకాశం ఉందని కాజల్‌ అగర్వాల్‌ సన్నిహిత వర్గాలు చెబుతున్న మాట. మొత్తం మీద కాజల్‌ కాలం నడుస్తోందన్న మాట.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement