Ajith
-
కోలీవుడ్‌లో గేమ్ చేంజ్
సంక్రాంతి అంటే స్టార్ హీరోల చిత్రాలు కనీసం మూడు నాలుగైనా ఉండాలి. అప్పుడే సినీ లవర్స్‌కి అసలైన పండగ. కానీ ఈ పొంగల్‌కి తమిళ తెరపై ఒకే ఒక్క స్టార్ హీరో కనిపించనున్నారు. అది కూడా తెలుగు స్టార్ రామ్‌చరణ్. ‘గేమ్ చేంజర్’ తమిళంలో డబ్ అయి, విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఇక తమిళంలో అజిత్ ‘విడాముయర్చి’ పొంగల్ రేసు నుంచి తప్పుకుంది. మొత్తంగా తమిళంలో ఆరేడు స్ట్రయిట్ చిత్రాలు పొంగల్‌కి రానున్నాయి. అవి కూడా మీడియమ్ కంటే ఓ మెట్టు ఎక్కువ ఉన్న హీరోలు, ఓ మెట్టు తక్కువ ఉన్న హీరోలవే. హీరోల రేంజ్ పక్కన పెడితే... ఒకవేళ కథాబలం ఉండి, ప్రేక్షకులను ఆకట్టుకుంటే మీడియమ్ రేంజ్ సినిమా పెద్ద రేంజ్ అయిపోతుంది. మరి... పొంగల్పోటీలో వసూళ్లు కొల్లగొట్టే సినిమా ఏది? అనేది తర్వాత డిసైడ్ అవుతుంది. ఇక ఈ పొంగల్‌కి తెరపైకి రానున్న చిత్రాల గురించి తెలుసుకుందాం...తెలుగు సినిమాకి సంక్రాంతి సీజన్ ఎంత ముఖ్యమో తమిళ ఇండస్ట్రీకి పొంగల్ కూడా అంతే ముఖ్యం. వరుస సెలవులను క్యాష్ చేసుకునే వీలు ఉన్న సీజన్ కాబట్టి భారీ చిత్రాల విడుదలను ప్లాన్ చేస్తుంటారు. ఎప్పటిలానే ఈసారి తెలుగులో భారీ చిత్రాలు విడుదలకు సిద్ధం అయ్యాయి. సీనియర్ స్టార్ హీరోలు బాలకృష్ణ ‘డాకు మహారాజ్’, వెంకటేశ్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ సంక్రాంతి సందడికి రెడీ అయ్యాయి. యంగ్ స్టార్ రామ్‌చరణ్ నటించిన ‘గేమ్ చేంజర్’ కూడా ఈ పండగకి రానుంది. అయితే అటు తమిళంలో మాత్రం మీడియమ్ రేంజ్ హీరోల చిత్రాలే విడుదల కానున్నాయి. ఆ మాట కొస్తే... గతేడాది కూడా కోలీవుడ్ పరిస్థితి ఇదే. ధనుష్ ‘కెప్టెన్ మిల్లర్’ మినహా మిగతావన్నీ ఓ మోస్తరు చిత్రాలే.ఈసారి అజిత్ ‘విడాముయర్చి’ రావాల్సింది కానీ సంక్రాంతి రేసు నుంచి ఆ సినిమా తప్పుకోవడంతో ఇక పొంగల్‌కి పెరియ పడమ్ ఇల్లే (సంక్రాంతికి పెద్ద సినిమా లేదు) అన్నట్లు అయింది. సో... ఉన్నదంతా ‘గేమ్ చేంజర్’ మాత్రమే. అనువాద రూపంలో తమిళ తెరపై ‘గేమ్ చేంజర్’ కనిపించనుంది. ‘ఆర్ఆర్ఆర్’తో గ్లోబల్ స్టార్ అనిపించుకున్న రామ్‌చరణ్ హీరోగా నటించిన చిత్రం కావడం, తమిళ దర్శకుడు శంకర్ తెరకెక్కించిన చిత్రం కావడం, సక్సెస్ఫుల్ ప్రోడ్యూసర్ ‘దిల్’ రాజు నిర్మించిన చిత్రం కావడంతో ‘గేమ్ చేంజర్’పై తమిళనాడులోనూ భారీ అంచనాలు ఉన్నాయి. సో... ఒక స్టార్ డైరెక్టర్–స్టార్ హీరో–స్టార్ ప్రోడ్యూసర్ కాంబినేషన్లో రూపొందిన చిత్రం కావడంతో కోలీవుడ్ పొంగల్ బాక్సాఫీస్ దగ్గర ఆట అంతా ‘గేమ్ చేంజర్’దే అని చె΄÷్పచ్చు. వేరే పెద్ద చిత్రాలు లేకపోవడంతో ఈ చిత్రానికే ఎక్కువ థియేటర్లు లభించాయి. ‘గేమ్ చేంజర్’కి ఇదో మంచి అవకాశం.10న 3 సినిమాలు ఈ నెల 10న తెలుగులోనూ, అనువాద రూపంలో తమిళ్, హిందీ భాషల్లోనూ ‘గేమ్ చేంజర్’ విడుదల కానుంది. అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, ‘దిల్’ రాజు ప్రోడక్షన్ బ్యానర్స్‌పై ‘దిల్’ రాజు, శిరీష్ దాదాపు రూ.450 కోట్లతో ఈ చిత్రాన్ని నిర్మించినట్లు సమాచారం. శంకర్ అంటే దాదాపు లార్జ్ స్కేల్ సినిమానే అవుతుందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ‘గేమ్ చేంజర్’తోపాటు 10న తమిళంలో విడుదల కానున్న వాటిలో విలక్షణ నటుడు బాల దర్శకత్వంలో అరుణ్ విజయ్ నటించిన ‘వణంగాన్’, మలయాళ నటుడు షానే నిగమ్ తమిళ తెరకు హీరోగా పరిచయం అవుతున్న ‘మద్రాస్క్కారన్’ చిత్రాలు ఉన్నాయి. నిజానికి ‘వణంగాన్’ని సూర్య హీరోగా ప్లాన్ చేశారు బాల.అయితే కొన్ని కారణాల వల్ల అరుణ్ విజయ్‌తో ఈ చిత్రం చేశారు. ఒకవేళ సూర్యతో చేసి ఉంటే... పొంగల్ రేస్‌లో తమిళంలో ఓ స్టార్ ఉండి ఉండేవారు. ఇక ‘మద్రాస్ క్కారన్’ విషయానికొస్తే... గతేడాది ‘రంగోలి’ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమైన వాలీ మోహన్‌దాస్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. మలయాళ యంగ్ హీరో షానే నిగమ్ నటించారు. 11 ఏళ్ల తర్వాత 12న ఇక పొంగల్ రేస్‌లోని తమిళ చిత్రాల్లో చెప్పుకోదగ్గ మాస్ హీరో అంటే విశాల్. ‘మద గజ రాజా’ చిత్రంతో ఈ 12న రానున్నారు విశాల్. ఈ సినిమా 2013లో విడుదల కావాల్సింది. కొన్ని కారణాల వల్ల కుదరలేదు. చివరికి 11 ఏళ్ల తర్వాత ఈ 12న విడుదల కానుంది. సుందర్.సి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది.పొంగల్ రోజున... పండగ రోజున ఆకాశ్ మురళి అనే నూతన హీరో వెండితెరకు పరిచయం కానున్నారు. ‘ఇదయం’ (హృదయం) ఫేమ్ మురళి రెండో కుమారుడే ఆకాశ్ మురళి. ఆల్రెడీ పెద్ద కుమారుడు అథర్వ హీరోగా (తెలుగులో ‘గద్దలకొండ గణేశ్’లో నటించారు) సినిమాలు చేస్తున్నారు. ఇక తమిళంలో ‘బిల్లా, ఆరంభం’ చిత్రాలతో మంచి మాస్ స్టయిలిష్ దర్శకుడు అనిపించుకున్న విష్ణువర్ధన్ నూతన హీరో ఆకాశ్ మురళితో తీసిన ‘నేసి΄్పాయా’ 14న రిలీజ్ కానుంది. ఈ చిత్రంలో ప్రముఖ దర్శకుడు శంకర్ కుమార్తె అదితీ శంకర్ హీరోయిన్గా నటించారు.ఇక పండగ రోజున సీనియర్ హీరో ‘జయం రవి’ ప్రేమించడానికి సమయం లేదంటూ ప్రేక్షకులు ముందుకొస్తున్నారు. ఆయన హీరోగా నిత్యామీనన్ హీరోయిన్గా నటించిన ‘కాదలిక్క నేరమిల్లై’ (ప్రేమించడానికి సమయం లేదు) చిత్రం ఈ 14న విడుదల కానుంది. ఈ చిత్రానికి కృతికా ఉదయనిధి స్టాలిన్ దర్శకత్వం వహించారు.ఇలా పొంగల్ రేసులో తమిళంలో ఐదు చిత్రాలు నిలవగా, వాటిలో విశాల్, ‘జయం’ రవి పేరున్న హీరోలు కాగా... వీరి తర్వాత అరుణ్ విజయ్ కొంచెం చెప్పుకోదగ్గ హీరో కాగా... మిగతా ఇద్దరిలో యువ హీరోలు ఆకాశ్ మురళి, షానే నిగమ్ ఉన్నారు. ఈ ఐదు చిత్రాలే కాకుండా మరో రెండు మూడు చిన్న సినిమాలు కూడా విడుదల కానున్నాయి. సో... ఎలా చూసుకున్నా పొంగల్‌కి తమిళ ప్రేక్షకుల ముందుకు రానున్న పెద్ద సినిమా ‘గేమ్ చేంజర్’ మాత్రమే. మరి... వసూళ్ల పరంగా ఈ సినిమా ప్రభావం ఇతర చిత్రాలపై ఏ మేరకు ఉంటుంది? పొంగల్పోటీలో బాక్సాఫీస్ హిట్ ఏ సినిమాకి దక్కుతుంది? అనేది మరో వారంలో తెలిసిపోతుంది. గేమ్ చేంజర్‌తో రీ ఎంటర్ కావడం హ్యాపీ ‘సందడే సందడి’తో నిర్మాతగా తెలుగులో ఆదిత్యా రామ్ ప్రయాణం ఆరంభమైంది. ఆ తర్వాత ‘ఖుషీ ఖుషీగా, స్వాగతం, ఏక్ నిరంజన్’ చిత్రాలు నిర్మించారాయన. ‘ఏక్ నిరంజన్’ (2009) తర్వాత మళ్లీ సినిమాలు నిర్మించలేదు. చెన్నైలో రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నారు. కాగా ‘గేమ్ చేంజర్’ని తమిళంలో విడుదల చేస్తున్నారు ఆదిత్యా రామ్. ‘‘చాలా కాలం తర్వాత ఒక గ్రాండ్ స్కేల్ సినిమాతో వస్తున్నందుకు ఆనందంగా ఉంది. తమిళనాడులో దాదాపు నాలుగువందల స్క్రీన్స్‌లో విడుదల చేస్తున్నాం. రామ్‌చరణ్ హీరోగా శంకర్ డైరెక్షన్లో వస్తున్న ‘గేమ్ చేంజర్’ ఈ వీకెండ్‌కి పెద్ద సినిమా అవుతుంది. ‘దిల్’ రాజుగారి సినిమాని విడుదల చేయడం ఆనందంగా ఉంది’’ అని పేర్కొన్నారు ఆదిత్యా రామ్. – డి.జి.భవాని‘విడాముయర్చి’ రాకపోవడం నిరుత్సాహమే ‘‘పొంగల్ చాలా పెద్ద పండగ. పైగా ఇది పెద్ద వీకెండ్. పెద్ద హీరోల సినిమాలు రాకపోతే అస్సలు పండగలానే అనిపించదు. తమిళనాడులోని థియేటర్ ఓనర్స్ అందరూ అజిత్ హీరోగా నటించిన ‘విడాముయర్చి’ కోసం ఎదురు చూశారు. హఠాత్తుగా ఈ సినిమా వాయిదా పడటంతో అందరూ నిరుత్సాహపడ్డారు’’ అంటూ తమిళ చిత్రపరిశ్రమకు చెందిన ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. -
వేసవిలో యాక్షన్
అజిత్ కుమార్ హీరోగా నటించిన స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’. త్రిష హీరో యిన్ . ‘మార్క్ ఆంటోని’ ఫేమ్ అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో మైత్రీమూవీమేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవి శంకర్ నిర్మించారు.ఈ మూవీని వేసవిలో ఏప్రిల్ 10న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించి, కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ‘‘అజిత్‌పాత్రలో డిఫరెంట్ షేడ్స్ ఉంటాయి. ఇండియన్ మూవీ చరిత్రలోనే ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ ఓ మైలురాయిగా నిలుస్తుంది’’ అని యూనిట్ పేర్కొంది. ఈ సినిమాకు జీవీ ప్రకాష్‌కుమార్ సంగీతం అందించారు. కాగా ఈ చిత్రాన్ని తొలుత సంక్రాంతికి రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ, ఏప్రిల్‌లో రిలీజ్ అవుతోంది. -
రామ్ చరణ్ ను టార్గెట్ చేసిన అజిత్!
-
స్టార్ హీరో రెండు సినిమాలూ సంక్రాంతికే విడుదల
సంక్రాంతి లాంటి పండగని స్టార్ హీరోలు వదులుకోవాలని అనుకోరు. ఇద్దరు ముగ్గురు హీరోలైనా సరే తమ సినిమాల్ని రెడీ చేస్తారు. తెలుగులో అయితే రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్', బాలకృష్ణ 'డాకు మహారాజ్', వెంకటేశ్ 'సంక్రాంతికి వస్తున్నాం' చిత్రాలతో రాబోతున్నారు. తమిళంలో ఈసారి కొత్త మూవీస్ ఏమున్నాయా అని చూస్తే ఒకే స్టార్ హీరో రెండు సినిమాల్ని రిలీజ్ చేయబోతున్నట్లు చెప్పి అభిమానుల్ని తికమక పెడుతున్నారు.(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 28 సినిమాలు)తమిళ స్టార్ హీరోల్లో అజిత్ ఒకడు. తెలుగు నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌తో కలిసి 'గుడ్ బ్యాడ్ అగ్లీ' అనే సినిమా చేస్తున్నాడు. దీన్ని సంక్రాంతికే రిలీజ్ చేస్తామని ఈ మధ్య నిర్మాతలు ప్రకటించారు. ఇదిలా ఉండగానే.. అజిత్ మరో మూవీ 'విడాముయార్చి' కూడా సంక్రాంతికే వస్తున్నట్లు చెప్పి షాకిచ్చారు.గురువారం రాత్రి 'విడాముయార్చి' టీజర్ రిలీజ్ చేశారు. యాక్షన్ ఎంటర్టైనర్లా అనిపించింది. అనిరుధ్ మ్యూజిక్ కూడా వెరైటీగా బాగానే ఉంది. కానీ పొంగల్ రిలీజ్ అని చివర్లో చెప్పడం విచిత్రంగా అనిపించింది. ఎందుకంటే అజిత్ నుంచే రెండు సినిమాలు, అది కూడా సంక్రాంతికి రిలీజ్ అని నిర్మాతలు ప్రకటించారు. కానీ ఇద్దరిలో ఎవరో ఒకరు తగ్గుతారా? లేదా పంతానికి పోయి ఇద్దరూ తమ మూవీస్ తీసుకొస్తారా అనేది చూడాలి? ఒకవేళ ఏది రిలీజైనా సరే 'గేమ్ ఛేంజర్' తమిళ వెర్షన్‌కి థియేటర్ల సమస్య మాత్రం గ్యారంటీ.(ఇదీ చదవండి: చైతూ-శోభిత పెళ్లి సందడి.. హల్దీ ఫొటోలు వైరల్) -
భార్య పుట్టినరోజు.. ఖరీదైన కారు గిఫ్ట్ ఇచ్చిన స్టార్ హీరో
తమిళ స్టార్ హీరో అజిత్ ఒకడు. ప్రస్తుతం 'గుడ్ బ్యాడ్ అగ్లీ' సినిమా చేస్తున్నాడు. ఇతడి భార్య షాలిని.. తెలుగు ప్రేక్షకులకు కాస్త పరిచయమే. చిరంజీవి 'జగదేకవీరుడు అతిలోక సుందరి' మూవీలో చైల్డ్ ఆర్టిస్టుగా చేసింది. రీసెంట్గా తన 44వ పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకుంది. షూటింగ్ నిమిత్తం యూకేలో ఉన్న అజిత్.. భార్య పుట్టినరోజుకి రాలేకపోయాడు. అయితేనేం ఖరీదైన లగ్జరీ కారుని బహుమతి ఇచ్చాడు.(ఇదీ చదవండి: టాలీవుడ్ హీరోయిన్గా టీమిండియా క్రికెటర్ భార్య!)నవంబర్ 20న షాలినీ.. తన పుట్టినరోజు నాడే లెక్సెస్ LM 350h మోడల్ కొత్త కారుతో కనిపించింది. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అలా అజిత్.. షాలినికి కారు బహమతిగా ఇవ్వడం బయటకొచ్చింది. మార్కెట్లో కారు ఖరీదు రెండున్నర కోట్ల రూపాయలకు పైనే ఉందని తెలుస్తోంది. అంతకు ఈ ఏడాది మే 1న అజిత్ పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకున్నాడు. అప్పుడు తన భర్తకు ఇష్టమని చెప్పి, డుకాటీ లేటెస్ట్ మోడల్ రేస్ బైక్‌ని షాలినీ గిఫ్ట్ ఇచ్చింది. ఇలా భార్య, భర్తకు బహుమతి ఇవ్వగా.. ఇప్పుడు తిరిగి అతడి భార్యకు కారు గిఫ్ట్ ఇచ్చాడు.ఇదంతా పక్కనబెడితే అజిత్ 'గుడ్ బ్యాడ్ అగ్లీ' మూవీ సంక్రాంతి రేసులో ఉందని అంటున్నారు. అది కూడా 'గేమ్ ఛేంజర్'తో పాటు జనవరి 10నే థియేటర్లలోకి వస్తుందని అంటున్నారు. ఒకవేళ ఇదే జరిగితే మాత్రం తెలుగు రాష్ట్రాల వరకు ఇబ్బంది ఉండకపోవచ్చు గానీ తమిళనాడులో మాత్రం చరణ్ మూవీ కలెక్షన్స్ తగ్గే అవకాశముంది.(ఇదీ చదవండి: నిశ్చితార్థం చేసుకున్న 'బిగ్‌బాస్ 8' సోనియా.. పెళ్లెప్పుడంటే?) -
రేసులో అజిత్.. ఉదయనిధి స్టాలిన్ అభినందన
కోలీవుడ్ సినీ నటుడు అజిత్ కుమార్‌కు తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ అభినందనలు తెలియజేశారు. తమిళనాడు ఖ్యాతిని అంతర్జాతీయ వేదికపై చాటుతుండటాన్ని గుర్తు చేస్తూ కొనియాడారు. సినీ నటుడు అజిత్ కొత్త అవతారం ఎత్తారు. అజిత్‌కుమార్ రేసింగ్ టీం పేరిట టీమ్ లోగోను తాజాగా ఆవిష్కరించారు. సరికొత్త పాత్రలో రేసర్‌గా వస్తున్నట్టు అజిత్ ఆనందంగా ప్రకటించారు. రేసర్‌గా తన ప్రయాణంలో గెలవాలనే సంకల్పంతో ముందుకు సాగనున్నట్టు పేర్కొన్నారు. దుబాయ్‌లో త్వరలో జరగనున్న దుబాయ్ 24 హెచ్ 2025 పోటీలలో తొలిసారిగా అజిత్‌కుమార్ రేసింగ్ టీం పాల్గొనబోతున్నట్లు ప్రకటించారు. ఈ పోటీల ట్రయల్ రన్ ప్రస్తుతం దుబాయ్‌లో జరుగుతోంది. ఇందులో తమిళనాడు స్పోర్ట్స్ విభాగం లోగోను ధరించి ఈ ట్రయల్ రన్లో దూసుకెళ్తున్న వీడియో వైరల్‌గా మారింది. తమిళనాడు స్పోర్ట్స్ అండ్ డెవలప్మెంట్ విభాగం నేతృత్వంలో క్రీడాభ్యున్నతికి జరుగుతున్న తోడ్పాటుకు మరింత బలం చేకూర్చే విధంగా అజిత్ ఆ లోగో ధరించడాన్ని ఉదయనిధి స్టాలిన్ ప్రశంసించారు. అంతర్జాతీయ వేదికగా తమిళనాడు స్పోర్ట్స్‌ను చాటడం గర్వించ దగ్గ విషయం అని, ఇందుకు అభినందనలు తెలియజేశారు. -
సంక్రాంతి బరిలోనే...
అజిత్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ స్పెయిన్‌లోని మ్యాడ్రిడ్‌లో జరుగుతోంది. ఈ లాంగ్ షెడ్యూల్లో ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలతో పాటు యాక్షన్, సాంగ్ చిత్రీకరణలను కూడా ప్లాన్ చేశారు. ఈ చిత్రంలో సునీల్, ప్రసన్న కీలక పాత్రలు పోషిస్తున్నారు. అలాగే ఈ చిత్రంలో త్రిష హీరోయిన్గా నటిస్తున్నారని, హీరోయిన్ శ్రీలీల మరో లీడ్ రోల్లో కనిపిస్తారనే ప్రచారం సాగుతోంది.మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ సంక్రాంతికి విడుదల కానుంది. అయితే ఈ సినిమాకన్నా ముందే అజిత్ హీరోగా కమిటైన ‘విడాముయర్చి’ చిత్రం సంక్రాంతికి విడుదలతుందని, ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ వచ్చే వేసవిలో రిలీజ్ కానుందనే ప్రచారం తెరపైకి వచ్చింది. కానీ తాజాగా ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ సంక్రాంతికే రిలీజ్ అవుతుందని వెల్లడించి, అజిత్ కొత్త లుక్‌ను యూనిట్ రిలీజ్ చేసింది. దీంతో ‘విడాముయర్చి’ చిత్రం వచ్చే వేసవిలో రిలీజ్ అవుతుందని ఊహించవచ్చు. -
మతం, కులం మనల్ని ద్వేషించేలా చేస్తాయి: అజిత్
తమిళ నటుడు అజిత్‌ను తెలుగు ప్రజలు కూడా ఆదరిస్తారు. సినిమాలకు ఆయన ఎంత ప్రాధాన్యత ఇస్తారో.. అంతే స్థాయిలో ట్రావెలింగ్‌ను కూడా ఇష్టపడుతారు. అజిత్‌కు ఏమాత్రం విరామం దొరికినా బైక్, కార్ సాయంతో టూర్స్ వెళ్తుంటారు. ఈ క్రమంలో తాజాగా తన ట్రావెలింగ్ విశేషాలు తెలుపుతూ ఓ వీడియో పంచుకున్నారు. సోషల్‌మీడియాలో ట్రెండ్ అవుతున్న అందులో పలు ఆసక్తికరమైన విషయాలను అజిత్ పంచుకున్నారు. ట్రావెలింగ్ చేయడం వల్ల చాలా విషయాలు తెలుసుకోవడంతో పాటు కొత్త వ్యక్తులతో పరిచయాలు కూడా పెరుగుతాయని పేర్కొన్నారు.ప్రపంచానికి ట్రావెలింగ్‌ను ప్రమోట్‌ను చేయడం చాలా ఇష్టమని అజిత్ తెలిపారు. జీవితంలో ఇలా ప్రయాణించడం వల్ల ఉత్తమ విద్యను అందిస్తుదని నేను నమ్ముతున్నాను. ఇంత కంటే బెస్ట్ ఎడ్యుకేషన్ ఇంకోకటి లేదనేది నా అభిప్రాయం. మతం, కులం అనేవి రెండూ కూడా మనం జీవితంలో ఎప్పుడు కలవనివారిని కూడా ద్వేషించేలా చేస్తాయని ఒక సూక్తి ఉంది. అది నిజం అని నేను నమ్ముతాను. ఎందుకంటే..? ఎదుటి వారితో మనకు పరిచయం లేనప్పటికీ వారు ఎలాంటివారో డిసైడ్ చేసేస్తాం. మనం ట్రావెల్ చేస్తున్న క్రమంలో వివిధ మతాలకు చెందిన వారిని కలుస్తూ ఉంటాం. వారితో మాట్లాడినప్పుడు వాళ్లు ఏంటో మనకు తెలుస్తుంది. మన ఆలోచన ఎంత తప్పో అర్థం అవుతుంది. వివిధ మతాల వారిని కలిసినప్పుడు వారి సంస్కృతి, సంప్రదాయాల గురించి తెలుసుకుంటాం. దీంతో ఇతరులపై సానుభూతి ఏర్పడుతుంది. అప్పుడు మీరు ఉన్నతమైన వ్యక్తిగా ఎదుగుతారు. అందుకే ట్రావెలింగ్ చేసి మనకు తెలియని వ్యక్తులను కలవండి.' అంటూ అజిత్ పేర్కొన్నారు.ప్రస్తుతం అజిత్, త్రిష జంటగా రూపొందుతున్న చిత్రం ‘విడా ముయర్చి’ (పట్టు వదలకుండా ప్రయత్నించడం) షూటింగ్ పనుల్లో బిజీగా ఉన్నారు. లైకా ప్రోడక్షన్స్పై మగిళ్ తిరుమేని దర్శకత్వంలో సుభాస్కరన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మాగిజ్ తిరుమేని దర్శకత్వం వహిస్తున్నారు. మరోవైపు 'గుడ్ బ్యాడ్ అగ్లీ' చిత్రంలోనూ ఆయన నటిస్తున్నారు. 'మార్క్ ఆంటోని' ఫేమ్ అధిక్ రవిచంద్రన్ ఈ మూవీకి డైరెక్టర్. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం 2025 సంక్రాంతికి విడుదల కానుంది. Fueling passion for adventure! 🏍️ #AjithKumar on a thrilling journey with #VenusMotortours. Experience the best of Indian bike tours, where every ride is a story of freedom and speed! 🇮🇳✨@VenusMotoTours @Donechannel1 @Dubai_Autodrome#BikeTours pic.twitter.com/YwqKK7BiNF— Suresh Chandra (@SureshChandraa) October 5, 2024 -
కేజీఎఫ్ 3 లోకి ఎన్టీఆర్, అజిత్.. ?
-
నెల వ్యవధిలో మరో లగ్జరీ కారు కొన్న స్టార్ హీరో
ఒక్కొక్కరికి ఒక్కో విషయంలో విపరీతమైన ఇష్టం ఉంటుంది. అలా తమిళ స్టార్ హీరో అజిత్‌కి కార్లు, బైక్స్ అంటే పిచ్చి. ఓవైపు సినిమాలు చేస్తుంటాడు. ఖాళీ దొరికితే చాలు బైక్ రైడింగ్, రేసింగ్ లాంటివి చేసేస్తుంటాడు. మొన్నీ మధ్య ఆగస్టులో రూ.9 కోట్ల విలువ చేసే ఫెర్రారీ కారు కొనుగోలు చేశాడు. ఇప్పుడు కూడా మరో కాస్ట్ లీ కారు సొంతం చేసుకున్నాడు. ఈ విషయాన్ని అజిత్ భార్య, మాజీ నటి షాలినీ బయటపెట్టింది.అజిత్ లేటెస్ట్గా ఫోర్స్ కంపెనీకి చెందిన జీటీ3 ఆర్ఎస్ (GT3 RS) కారుని కొనుగోలు చేశాడు. మార్కెట్లో దీని ధర మూడన్నర కోట్ల రూపాయలకు పైనే ఉంది. మిగతా ఖర్చులన్నీ కలిపి చూసుకుంటే దీని ధర రూ.4 కోట్లు దాటేస్తుంది. అయితే ఇలా నెలల వ్యవధిలో కోట్లు విలువ చేసే కార్లు సొంతం చేసుకున్న హీరో.. అవంటే తనకు ఎంత ఇష్టమో చెప్పకనే చెప్పేశాడు.(ఇదీ చదవండి: తమిళ స్టార్ హీరోలు.. కార్తీని చూసి కాస్త నేర్చుకోండి!)ఈ కార్లు కాకుండా అజిత్ దగ్గర బీఎండబ్ల్యూ ఎస్ 1000 ఆర్ఆర్, బీఎండబ్ల్యూ కే 1300 ఎస్, ఏప్రిలా కాపోనార్డ్ 1200, కవసాకీ నింజా జెడ్ ఎక్స్ 145 లాంటి స్పోర్ట్స్ బైక్స్ ఉన్నాయి. అలానే ఫెర్రారీ 458 ఇటాలియా, బీఎమ్ వన్ 740 లీ, హోండా ఎకార్డ్ వీ6 కార్లు కూడా ఉన్నాయి.ప్రస్తుతం 'విడా మయూర్చి' అనే సినిమా చేస్తున్న అజిత్.. 'గుడ్ బ్యాడ్ అగ్లీ' అనే మరో మూవీ చేస్తున్నాడు. ఈ రెండు కూడా సంక్రాంతి టైంలో రిలీజ్ అవుతాయని తెలుస్తోంది. (ఇదీ చదవండి: ఒకేరోజు ఓటీటీల్లోకి వచ్చేసిన 20 మూవీస్.. ఇవి డోంట్ మిస్) View this post on Instagram A post shared by Shalini Ajith Kumar (@shaliniajithkumar2022)Exclusive Pics of THALA AJITH With Porsche GT3RS 🏎️💨Man And the Machine.,🚨🚧 #VidaaMuyarchi | #Ajithkumar pic.twitter.com/sydMXebHaD— AJITHKUMAR FANS CLUB (@ThalaAjith_FC) September 13, 2024 -
సంక్రాంతి రేసులో అజిత్
నటుడు అజిత్ కథానాయకుడిగా నటిస్తున్న రెండు చిత్రాలు నిర్మాణంలో ఉన్న విషయం తెలిసిందే. అందులో ఒకటి విడాముయర్చి. నటుడు అర్జున్, త్రిష, ఆరవ్, రెజీనా తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రాన్ని మగిళ్తిరుమేణి దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్ సంస్థ నిర్మిస్తోంది. అనిరుధ్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం దీపావళికి తెరపైకి వస్తుందని ప్రచారం జరిగింది. అయితే నిర్మాణ కార్యక్రమాలు ప్రణాళిక ప్రకారం పూర్తి కాకపోవడంతో ఇప్పుడు ఈ చిత్రాన్ని 2025 పొంగల్‌కు విడుదల చేయడానికి నిర్మాతల వర్గం సన్నాహాలు చేస్తున్నట్లు తాజా సమాచారం. కాగా అజిత్ నటిస్తున్న మరో చిత్రం గుడ్ బ్యాడ్ అగ్లీ. ఆధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తున్న ఇందులోనూ నటి త్రిష నాయకిగా నటిస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రాన్ని ప్రముఖ టాలీవుడ్ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. కాగా ఈ చిత్రాన్ని 2025 పొంగల్‌కు విడుదల చేయనున్నట్లు ముందుగానే ప్రకటించారు. కాగా ఇప్పుడు ఆ తేదీన విడాముయర్చి తెరపైకి రానుండడంతో గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రం విడుదల తేదీ మారే అవకాశం ఉంది. దీన్ని వచ్చే ఏడాది మే 1వ తేదీన విడుదల చేసే అవకాశం ఉందని సమాచారం. కాగా విడాముయర్చి చిత్రం విడుదలనంతరం గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్ర విడుదలపై నిర్ణయం తీసుకోనున్నట్లు మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ భావిస్తున్నట్లు సమాచారం. ఈ రెండు చిత్రాల విడుదలపై పూర్తి క్లారిటీ రావాలంటే మరి కొద్ది రోజులు ఆగాల్సిందే. -
అజిత్‌తో కలిసి కచ్చితంగా నటిస్తా!
అవకాశాలు వచ్చినా, విజయాలు అంత సులభంగా రావు. అందుకు కృషి, శ్రమ అవసరం, అదృష్టం చాలా ముఖ్యం. అలా సినీ కుంటుంబం నుంచి వచ్చిన నటి కీర్తీసురేశ్. తల్లి నటి, తండ్రి నిర్మాత కావడంతో ఈమెకు అవకాశాలు సులభంగానే వచ్చి ఉండవచ్చు. అయితే స్టార్ నటిగా రాణించడానికి ఆమె ప్రతిభనే ముఖ్య కారణం. మలయాళం, తమిళం, తెలుగు భాషల్లో ప్రముఖ కథానాయకిగా రాణిస్తున్న కీర్తీసురేశ్ తాజాగా బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చారు. తొలి రోజుల్లో వచ్చిన అవకాశాలను సది్వనియోగం చేసుకున్నా, ఇప్పుడు కథలు నచ్చితేనే నటించడానికి సమ్మతిస్తున్నారు. తెలుగు చిత్రం మహానటిలో నటించి జాతీయ ఉత్తమ నటి అవార్డును గెలుచుకున్న ఈమెకు ఆ తరువాత పలు ఉమెన్స్ సెంట్రిక్ కథా పాత్రలు వెతుక్కుంటూ వస్తున్నాయి. అలా తాజాగా కీర్తీసురేశ్ నటించిన చిత్రం రఘుతాత. ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్త హోంబలే నిర్మించిన ఈ చిత్రంపై ఇప్పటికే చాలా ఆసక్తి నెలకొంది. కారణం ఇదిబలవంతపు హిందీ భాషను వ్యతిరేకించే కథాంశంతో తెరకెక్కడమే. చిత్రం ఈ నెల 15న తెరపైకి రానుంది. ఈ చిత్ర ప్రమోషన్లో బిజీగా ఉన్న కీర్తీసురేశ్ ఒక భేటీలో నటుడు అజిత్‌తో కలిసి నటించాలనే ఆసక్తిని వ్యక్తం చేశారు. ఈమె తమిళంలో నటుడు విజయ్, విశాల్, ధనుష్ శివకార్తికేయన్, చివరికి రజనీకాంత్‌కు చెల్లెలిగా కూడా నటించారు. కానీ అజిత్‌తో కలిసి నటించలేదు. ఇదే విషయాన్ని ఆమె పేర్కొంటూ ఈ మధ్య హైదరాబాద్‌లో షూటింగ్లో పాల్గొన్నప్పుడు అజిత్ కూడా అక్కడ జరుగుతున్న చిత్ర షూటింగ్లో పాల్గొన్నారని, ఆ సమయంలో తాను ఆయన్ని కలిసి పరిచయం చేసుకున్నానని చెప్పారు. అప్పుడు తన తల్లి, శాలిని కలిసి చాలా చిత్రాల్లో నటించారని ఆయనతో చెప్పానన్నారు. తాను కూడా కచ్చితంగా అజిత్‌తో కలిసి నటిస్తాననే నమ్మకాన్ని నటి కీర్తీసురేశ్ వ్యక్తం చేశారు. -
అజిత్, ప్రశాంత్ నీల్ సినిమాపై మేనేజర్ క్లారిటీ
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్‌తో దర్శకుడు ప్రశాంత్ నీల్ ఒక సినిమా ప్లాన్ చేసినట్లు కొద్దిరోజులుగా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అజిత్ మేనేజర్ క్లారిటీ ఇచ్చారు. 'కె.జి.ఎఫ్' కథకు కనెక్ట్ అయ్యేలా మరో స్టోరీని ప్రశాంత్ రెడీ చేశాడాని, అందులో అజిత్ హీరోగా నటించనున్నారని కోలీవుడ్‌లో వార్తలు వచ్చాయి. అయితే, ఈ విషయం గురించి తాజాగా అజిత్ మేనేజర్ మాట్లాడుతూ.. అదంతా ప్రచారం మాత్రమేనని చెప్పుకొచ్చారు.అజిత్ మేనేజర్ సురేష్ చంద్ర ఈ వాదనలను ఇలా ఖండించారు.. 'ఈ పుకార్లు ఆన్లైన్లో వచ్చాయి. ఇందులో ఎలాంటి నిజం లేదు. అజిత్, ప్రశాంత్ నీల్ కలిశారనేది మాత్రం నిజమే.. కానీ, వారు ఒకరినొకరు మర్యాదపూర్వకంగా మాత్రమే కలుసుకున్నారు. ఒకరినొకరు అత్యున్నత గౌరవం కలిగి ఉంటారు. అయితే, వారు కలిసినప్పుడు ఏ సినిమా గురించి చర్చించలేదు. ప్రశాంత్ డైరెక్షన్లో అజిత్ సినిమా వస్తే చూడటానికి నేనూ ఇష్టపడతాను. కానీ, భవిష్యత్తులో అయినా వీరి కాంబినేషన్లో ఒక ప్రాజెక్ట్ వస్తుందనే నమ్మకం కూడా నాకు లేదు.' అని సురేష్ చంద్ర తెలిపారు.మగిళ్ తిరుమేని దర్శకత్వంలో అజిత్ విడాముయర్చి సినిమాలో నటించారు. కొద్దిరోజుల క్రితమే ఈ ప్రాజెక్ట్ షూటింగ్ పూర్తి అయింది. దీపావళికి ఈ సినిమా విడుదల కానుందని ప్రచారం జరుగుతుంది. అధిక్ రవిచంద్రన్ డైరెక్షన్లో అజిత్ తర్వాతి సినిమా ఉంటుంది. ఇదిలా ఉంటే, ప్రశాంత్ త్వరలో జూనియర్ ఎన్టీఆర్‌తో కలిసి తన కొత్త సినిమా షూటింగ్ ప్రారంభించనున్నారు. -
భారీ బడ్జెట్ సినిమా నుంచి 'త్రిష' ఫస్ట్ లుక్ రిలీజ్
నటుడు అజిత్ కథానాయకుడిగా నటి స్తున్న తాజా చిత్రం 'విడాముయర్చి'. నటి త్రిష నాయకిగా నటిస్తున్న ఈ చిత్రాన్ని మగిళ్ తిరుమేణి దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ సంస్థ భారీ బడ్జెట్లో నిర్మి స్తోంది. తరచూ వార్తల్లో ఉంటున్న చిత్రం నుంచి తాజాగా త్రిష ఫస్ట్ లుక్‌ను మేకర్స్ విడుదల చేశారు.మొదట ఈ చిత్రానికి విఘ్నేశ్‌శివన్ దర్శకత్వం వహించనున్నట్లు ప్రచారం జరిగింది. కానీ, దర్శకుడు మగిళ్ తిరుమే ణి చెప్పిన కథ నచ్చడంతో అజిత్ ఆయన దర్శకత్వంలో నటించడానికి ఓకే చెప్పారు. ఎక్కువ భాగం విదేశాల్లో చిత్రీకరణ జరుపుకుంటున్న విడాముయర్చి చిత్రంపై అంచనాలు మాత్రం భారీ స్థాయిలోనే ఉన్నాయి. తాజాగా విడుదలైన త్రిష ఫస్ట్ లుక్‌లో చాలా బ్యూటీఫుల్‌గా ఉంది. ఓ రెస్టారెంట్లో త్రిషతో పాటు అజిత్ ఉన్న ఫోటోను మేకర్స్ పంచుకున్నారు. ఇందులో అజిత్‌కు సతీమణిగా ఆమె కనిపించనుంది.కాగా చిత్రాన్ని దీపావళికి విడుదల చేయనున్నారు. ఇంతకుముందు దీపావళికి విడుదలైన ఈయన చిత్రాలు ఘన విజయం సాధించాయి. ఇప్పుడు కూడా అదే సెంటిమెంట్‌ను వారు కొనసాగిస్తున్నారు. మరో విశేషం ఏమిటంటే అదిరిపోయే యాక్షన్ ఎంటర్టైనర్ కథా చిత్రంగా తెరకెక్కుతున్న దీని వ్యాపారం హాట్ హాట్‌గా జరుగుతున్నట్లు ప్రచారం. కర్ణాటకలో విడాముయర్చి చిత్రం వ్యాపారం రజనీకాంత్, విజయ్‌ల చిత్రాలను మించి పోయినట్లు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. #VidaaMuyarchi 🌟🧿#EffortsNeverFail pic.twitter.com/mTvEtUHuEN— Trish (@trishtrashers) July 19, 2024 -
Sreeleela: ఆమె అంటే ఎంతో ఇష్టం
పెళ్లి సందడితో టాలీవుడ్లో మహా సందడి చేసిన నటి శ్రీలీల. అలా తొలి చిత్రం తర్వాత చిన్న గ్యాప్ రావడంతో ఇంక అంతేనా అన్నారు సినీ వర్గాలు. అయితే ఢమాకా చిత్రంలో మాస్ డాన్స్‌తో కుమ్మేయడంతో అందరి దృష్టి శ్రీలీలపై పడింది. అంతే అవకాశాలు వరుస పట్టేశాయి. ప్రస్తుతం టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా వెలిగిపోతున్న ఈ కన్నడ బ్యూటీ ఇప్పుడు కోలీవుడ్, బాలీవుడ్‌లోనూ సత్తా చాటడానికి రెడీ అవుతున్నారు. ముఖ్యంగా తమిళంలో నటుడు అజిత్ సరసన గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రం ద్వారా ఎంట్రీ ఇస్తున్న ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయాన్ని నిర్మాతలు ఇంకా అధికారికంగా ధ్రువీకరించలేదన్నది గమనార్హం. ఇకపోతే ఈ అమ్మడు ఇటీవల చైన్నెలో సందడి చేశారు. ఓ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న శ్రీలీలపై మీడియా ప్రశ్నల వర్షం కురిపించింది. ముఖ్యంగా కోలీవుడ్‌లో మీకు నచ్చిన నటి ఎవరన్న ప్రశ్నకు నయనతార అంటే ఎంతో ఇష్టం అని బదులిచ్చారు. అయితే ఒకరనే కాకుండా తమిళ చిత్ర పరిశ్రమలో ప్రతిభావంతులైన నటీనటులు, సాంకేతిక నిపుణుల ఎందరో ఉన్నారని తెలివిగా బదులు ఇచ్చారు. మొత్తం మీద చాలా తక్కువ కాలంలో శ్రీలీల పాన్ ఇండియా నటి స్థాయికి ఎదిగి పోవడం విశేషం. -
శ్రీలీల కాదు ఆ ఛాన్స్ కొట్టేసిన కీర్తి సురేశ్?
తమిళ స్టార్ హీరో అజిత్ ప్రస్తుతం రెండు సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. 'విడాముయర్చి' షూటింగ్ చివరి దశలో ఉంది. త్వరలో రిలీజ్ తేదీపై ప్రకటన ఇవ్వనున్నారు. మరోవైపు తెలుగు బడా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ తీస్తున్న 'గుడ్ బ్యాడ్ అగ్లీ' కూడా చేస్తున్నారు. ఇప్పటికే వచ్చిన ఫస్ట్ లుక్ పోస్టర్ మూవీపై అంచనాలు పెంచేసిందని చెప్పొచ్చు. అయితే హీరోయిన్ విషయంలో మాత్రం ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది.(ఇదీ చదవండి: గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ రివ్యూ)షూటింగ్ ఇటీవలే హైదరాబాద్‌లో ప్రారంభమై, తొలి షెడ్యూల్ కూడా పూర్తి చేసుకుంది. ఇందులో హీరోయిన్గా తొలుత శ్రీలీల పేరు వినిపించింది. కానీ ఇప్పుడు ఆ ప్లేసులో కీర్తి సురేశ్ నటించబోతుందని అంటున్నారు. మరి ఇద్దరు హీరోయిన్లకు చోటుందా? లేదా కీర్తి సురేశ్‌నే తీసుకుంటారా అనేది తెలియాల్సి ఉంది. ఒకవేళ ఇదే నిజమైతే కీర్తీసురేశ్ ఖాతాలో మరో భారీ చిత్రం పడినట్లే.(ఇదీ చదవండి: 'భజే వాయువేగం' సినిమా రివ్యూ) -
అజిత్, షాలినితో ఉన్న బంధాన్ని గుర్తుచేసుకున్న చిరంజీవి
కొంత గ్యాప్ తర్వాత మళ్లీ ‘విశ్వంభర’ సెట్స్‌లో అడుగుపెట్టారు చిరంజీవి. ఈ క్రమంలో కొద్దిరోజుల క్రితమే ఆషికా రంగనాథ్ కూడా ఈ బిగ్ ప్రాజెక్ట్‌లో అడుగుపెట్టేసింది. సోషియో ఫ్యాంటసీ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ‘విశ్వంభర’ చిత్రాన్ని వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల ఈ సినిమాలోని ఇంట్రవెల్ యాక్షన్ సీక్వెన్స్‌ని హైదరాబాద్‌లో చిత్రీకరించారు. అయితే, తాజాగా విశ్వంభర సెట్స్‌లో కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ అడుగుపెట్టారు. ఈ విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు.హైదరాబాద్‌లో జన్మించిన అజిత్సౌత్ ఇండియాలో టాప్ హీరోలలో అజిత్ కూడా ఒకరు. హైదరాబాద్‌లో జన్మించిన అజిత్ పదోతరగతి వరకు మాత్రమే చదివినా, అనేక భాషల్లో అనర్గళంగా మాట్లాడగలడు. తన నట జీవితాన్ని తెలుగు చిత్రమైన 'ప్రేమ పుస్తకం'తో ప్రారంభించాడు. ఈ సినిమాను కూడా ఆప్పట్లో మెగాస్టార్ చిరంజీవినే లాంచ్ చేశారు. ఒకప్పటి టాప్ హీరోయిన్ షాలినిని 2000 సంవత్సరంలో అజిత్ పెళ్లి చేసుకున్నాడు.నా చేతుల మీదుగా లాంచ్ అయ్యాడు: చిరంజీవిఅయితే, అజిత్ విశ్వంభర సెట్స్‌లో అడుగుపెట్టడం పట్ల చిరంజీవి ఇలా చెప్పుకొచ్చారు. 'నిన్న సాయంత్రం 'విశ్వంభర' సెట్స్‌కి స్టార్ గెస్ట్‌గా వచ్చి అజిత్ మా అందరినీ ఆశ్చర్యపరిచారు. అజిత్ సినిమా కూడా షూటింగ్ ఇక్కడే జరుగుతుండటంతో చాలా ఏళ్ల తర్వాత కలిశాం. అజిత్ తొలి సినిమా 'ప్రేమ పుస్తకం' ఆడియో లాంచ్ కార్యక్రమం నా చేతుల మీదుగానే జరిగింది. ఆ సమయాన్ని మరోసారి గుర్తుచేసుకుంటూ గడిపాం. ఇంకా చెప్పాలంటే అజిత్ జీవిత భాగస్వామి షాలిని కూడా 'జగదేకవీరుడు అతిలోక సుందరి' సినిమాలో నటిచింది. ఆ సినిమాలోని చిన్నపిల్లల పాత్రలో ఆమె ఒకరు. అలా అజిత్‌తో గుర్తుంచుకోవాల్సిన జ్ఞాపకాలు చాలా ఉన్నాయి. సినిమా ఇండస్ట్రీలో అజిత్ స్టార్డమ్ శిఖరాలను దాటేసింది. దానిని చూసి నేను చాలా సంతోషించాను.' అని మెగాస్టార్ అన్నారు. View this post on Instagram A post shared by Chiranjeevi Konidela (@chiranjeevikonidela) -
గుడ్ బ్యాడ్ అగ్లీ.. ఆ ఓటీటీ అన్ని కోట్లు పెట్టిందా?
అన్నం ఉడికిందో లేదో తెలియడానికి ఒక్క మెతుకు చూస్తే చాలంటారు. అలాగే కొన్ని చిత్రాల జాతకం ఒక్క పోస్టర్‌తోనే తెలిసిపోతుంది. ఈ విషయాన్ని అజిత్ 'గుడ్ బ్యాడ్ అగ్లీ' చిత్రం నిరూపించింది. అజిత్ ప్రస్తుతం విడాయుయర్చి చిత్రంలో నటిస్తున్నారు. మగిళ్ తిరుమేణి దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తున్న ఇందులో త్రిష హీరోయిన్గా నటిస్తున్నారు. పలు సమస్యలను అధిగమిస్తూ ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. గుడ్ బ్యాడ్ అగ్లీఇకపోతే అజిత్ తన తదుపరి చిత్రానికి సిద్ధం అవుతున్నారు. అదే గుడ్ బ్యాడ్ అగ్లీ. మార్క్ ఆంటోని వంటి సూపర్‌హిట్ చిత్రాన్ని తెరకెక్కించిన అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ప్రముఖ టాలీవుడ్ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఇందులో అజిత్ త్రిపాత్రాభినయం చేస్తున్నట్లు సమాచారం. పోస్టర్‌కు పాజిటివ్ రెస్పాన్స్ఆయనకు జంటగా శ్రీలీల, మీనా, సిమ్రాన్‌లు నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. కాగా చిత్ర షూటింగ్ వచ్చే నెలలో ప్రారంభం అవుతుందని సమాచారం. గుడ్ బ్యాడ్ అగ్లీ అనే టైటిల్‌కు సూపర్ రెస్పాన్స్ రాగా ఫస్ట్‌లుక్ పోస్టర్ కూడా అదిరిపోయింది. అజిత్ మూడు ముఖాలతో కూడిన ఆ పోస్టర్ చిత్రంపై మరింత ఆసక్తిని పెంచేసింది. ఓటీటీ రైట్స్ఇక ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ రూ.95 కోట్లు పెట్టి సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రం ప్రారంభానికి ముందే సంచలనం సృష్టిస్తోందన్నమాట. ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి థియేటర్లలో రానుంది.చదవండి: బిగ్ బాస్ ఓటీటీ సీజన్ 3 అప్డేట్ వచ్చేసింది.. మారనున్న హోస్ట్ -
శ్రీలీల కోలీవుడ్ ఎంట్రీ.. ఆ స్టార్ హీరోతోనే!
తమిళ నటుడు అజిత్ ఇప్పుడు ఒకేసారి రెండు చిత్రాల్లో నటిస్తోన్న సంగతి తెలిసిందే. అందు విడాముయర్చి. లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంలో నటి త్రిష నాయకిగా నటిస్తున్నారు. మగిళ్ తిరుమేణి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. అనివార్య కారణాల వల్ల నిర్మాణ కార్యక్రమాల్లో జాప్యం జరుగుతోంది.ఇదిలా ఉండగా.. అజిత్ కథానాయకుడిగా నటిస్తున్న మరో చిత్రం గుడ్ బ్యాడ్ అగ్లీ. మార్క్ ఆంటోని చిత్రంతో సూపర్‌హిట్ కొట్టిన ఆదిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ భారీ చిత్రాన్ని మైత్రీ మూవీస్ సంస్థ నిర్మిస్తోంది. ఇందులో అజిత్ త్రిపాత్రాభినయం చేస్తున్నట్లు సమాచారం. దీంతో ఆయనకు జంటగా నటి శ్రీలీల, సిమ్రాన్, మీనా నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇదే నిజం అయితే నటి శ్రీలీల కోలీవుడ్ ఎంట్రీ ఖాయంగా కనిపిస్తోంది.కాగా.. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ఇటీవల సైలెంట్‌గా ఎలాంటి హంగామా లేకుండా హైదరాబాద్‌లో ప్రారంభమైంది. అంతేకాదు శుక్రవారంతో తొలి షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంటుందని అజిత్ సన్నిహితుడు తెలిపారు. హైదరాబాద్‌లో కొన్ని యాక్షన్ సన్నివేశాలు, అజిత్ పాల్గొనే ఇంట్రో పాటను చిత్రీకరించినట్లు ఆయన తెలిపారు.కాగా అజిత్ తదపరి విడాముయర్చి చిత్రం షూటింగ్లో పాల్గొననున్నారని.. జూన్ రెండు లేదా మూడో వారంలో ఈ చిత్రం షూటింగ్ ఉంటుందని చెప్పారు. ఇదే ఈ చిత్రం చివరి షెడ్యూల్ అవుతుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఆ తరువాత గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రం షూటింగ్లో పాల్గొంటారని తెలిపారు. ఇకపోతే ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయడానికి నిర్మాతలు ప్లాన్ చేస్తున్నట్లు తాజా సమాచారం. దీనికి ముందు విడాముయర్చి చిత్రం విడుదలయ్యే అవకాశం ఉంది. -
అజిత్ కి షాకిచ్చిన త్రిష.. ఏకంగా చిరు, కమల్ కోసం!
స్టార్ హీరోయిన్ త్రిష.. కెరీర్లో ఎన్నడూ లేనంత బిజీగా ఉన్నారు. 40 ఏళ్ల వయసులోనూ ఈమె నటిస్తున్న సినిమాలన్నీ సూపర్ స్టార్స్‌తోనే కావడం శేషం. అన్ని భాషల్లోనూ ఏక కాలంలో నటించేస్తున్నారు. ప్రస్తుతం అజిత్ 'విడామయూర్చి', కమల్ హాసన్ 'థగ్ లైఫ్', చిరంజీవి 'విశ్వంభర', మోహన్ లాల్ 'రామ్' చిత్రాల్లో త్రిషనే హీరోయిన్.(ఇదీ చదవండి: నేనెవర్నీ విడగొట్టలేదు.. ఆ హీరోయిన్‌కు, నా భర్తకు ఆల్రెడీ బ్రేకప్!)కాగా అజిత్ 'విడా మయూర్చి' షూటింగ్ లేట్ అవుతూ వస్తోంది. దీంతో ఈ సినిమాకు కేటాయించిన డేట్స్‌ని విశ్వంభర, థగ్ లైఫ్ చిత్రాలకు ఉపయోగించేస్తోంది. దీంతో 'విడామయర్చి' చిత్రానికి షాక్ తగిలినట్లయింది. అయితే ఇదంతా దర్శకుడు మణిరత్నం చేసిన పని అనుకోవచ్చు.. ఎందుకంటే 'పొన్నియన్ సెల్వన్'లో కుందవై పాత్ర ఇచ్చి త్రిషకి మళ్లీ లైఫ్ ఇచ్చాడు. దీంతో ఇప్పుడు ఈమె ఊపిరిసలపనంత బిజీగా మారిపోయింది. టైమ్ అంటే ఇదే మరి.(ఇదీ చదవండి: నా మాజీ భర్త గే.. అతడి గదిలో రాత్రి ధనుష్‌కు ఏం పని? సుచిత్ర సంచలన వ్యాఖ్యలు) -
స్టార్ హీరో అజిత్ బర్త్ డే.. అద్భుతమైన గిఫ్ట్‌తో భార్య సర్ప్రైజ్
డై హార్డ్ ఫ్యాన్స్ ఉండే హీరోల్లో తలా అజిత్ ఒకడు. తమిళనాడులో ఇతడికి కోట్లాదిమంది అభిమానులున్నారు. తెలుగులోనూ ఇతడికి ఓ మాదిరి గుర్తింపు ఉంది. అడపాదడపా యాక్షన్ సినిమాలతో ఆకట్టుకునే ఇతడు ప్రస్తుతం ఓ రెండు చిత్రాల్లో హీరోగా నటిస్తూ బిజీగా ఉన్నాడు. బుధవారం ఇతడి 53వ పుట్టినరోజు. ఈ క్రమంలోనే అందరూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇతడి భార్య మాత్రం అదిరిపోయే గిఫ్ట్‌తో సర్ప్రైజ్ చేసింది.(ఇదీ చదవండి: మొటిమలకు సర్జరీ చేయించుకున్నారా? సాయిపల్లవి ఆన్సర్ ఇదే)1990లోనే నటుడిగా కెరీర్ ప్రారంభించిన అజిత్.. 'ప్రేమ పుస్తకం' అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు. ఆ తర్వాత పూర్తిగా తమిళంకే పరిమితమయ్యాడు. ప్రస్తుతం 'విడామయూర్చి' అనే మూవీ చేస్తున్నాడు. దీని తర్వాత 'గుడ్ బ్యాడ్ అగ్లీ' అనే ద్విభాషా చిత్రం చేయబోతున్నాడు. తాజాగా బుధవారం అజిత్ 53వ పుట్టినరోజు వేడుకల్ని నిర్వహించారు.ఈ క్రమంలోనే అజిత్ భార్య షాలిని.. భర్తకు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చింది. బైక్స్ అంటే అజిత్ ఎంత ఇష్టమో బాగా తెలిసిన షాలిని.. ఈ బర్త్ డే కానుకగా డుకాటీ బైక్ బహుమతిగా ఇచ్చింది. మార్కెట్లో దీని ధర రూ.10 లక్షలు పైమాటే. ఏదేమైనా ఇలా బైక్ ఇచ్చి పుట్టినరోజు సర్ప్రైజ్ చేయడం అజిత్ అభిమానులకు తెగ నచ్చేసింది. (ఇదీ చదవండి: పెళ్లెప్పుడు అని ప్రశ్న.. హీరోయిన్ మాళవిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్) Shalini Ajith gifted Ducati bike for Thala #Ajith 🥰#HBDAjithKumar 🎉🎂#VidaaMuyarchi .. #AjithKumar#GoodBadUgly #Ajithkumar𓃵 pic.twitter.com/aWYnXAI5CU— 𒆜Harry Billa𒆜 (@Billa2Harry) May 1, 2024 -
అజిత్‌కి జోడీగా...
కోలీవుడ్‌లో ప్రస్తుతం హాట్ టాపిక్‌గా నిలిచిన వార్తల్లో అజిత్ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ చిత్రానికి సంబంధించిన వార్త ఒకటి. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో తెలుగు నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్గా నటించనున్నారనే వార్త ప్రచారంలో ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా సిమ్రాన్, మీనా పేర్లు వినిపిస్తున్నాయి.ఈ ఇద్దరూ అతిథి పాత్రల్లో కాదు.. అజిత్ సరసన హీరోయిన్లుగా నటిస్తారని టాక్. ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’లో అజిత్ మూడు పాత్రల్లో కనిపిస్తారట. మూడు పాత్రలకు ముగ్గురు హీరోయిన్లు ఉంటారని, శ్రీలీల, సిమ్రాన్, మీనాతో అజిత్ జతకడతారని చెన్నై కోడంబాక్కమ్ అంటోంది. ఈ వార్త నిజమైతే దాదాపు రెండు దశాబ్దాల తర్వాత సిమ్రాన్, మీనా అజిత్‌తో మళ్లీ స్క్రీన్ షేర్ చేసుకున్నట్లు అవుతుంది. ‘అవళ్ వరువాళా (1998), వాలి’ (1999) వంటి విజయవంతమైన చిత్రాల్లో అజిత్ సరసన నటించారు సిమ్రాన్.అలాగే అజిత్‌కి జోడీగా ‘సిటిజెన్ (2001), విలన్’ (2002) వంటి చిత్రాల్లో నటించారు మీనా. ఇప్పుడు మళ్లీ ఈ హీరో సరసన సిమ్రాన్, మీనా నటిస్తే దాదాపు రెండు దశాబ్దాలకు ఈ కాంబినేషన్ కుదిరినట్లు అవుతుంది. మేలో ఈ చిత్రం షూటింగ్‌ని ఆరంభించాలనుకుంటున్నారని సమాచారం. సో... అజిత్ సరసన శ్రీలీల, సిమ్రాన్, మీనా నటించనున్నారా? అనేది త్వరలో తెలిసి΄ోతుంది. మహేశ్‌బాబు సినిమాలో...మహేశ్‌బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందనున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో ఓ కీలక పాత్రకు సిమ్రాన్‌ని ఎంపిక చేశారని సమాచారం. గతంలో ‘యువరాజు’ (2000) చిత్రంలో మహేశ్‌బాబు–సిమ్రాన్ జంటగా నటించిన సంగతి తెలిసిందే. ఇన్నేళ్ల తర్వాత ఈ ఇద్దరూ స్క్రీన్ షేర్ చేసుకోనున్నారనే వార్త ప్రచారంలో ఉంది. అయితే హీరో–హీరోయిన్గా కాదని, సిమ్రాన్‌ది అతిథి పాత్ర అని భోగట్టా. త్వరలో ఈ చిత్రానికి సంబంధించిన విశేషాలను రాజమౌళి ప్రకటించనున్నారట. మరి.. సిమ్రాన్ ఈప్రాజెక్ట్‌లో ఉన్నారా? లేదా అనే ప్రశ్నకు అప్పుడు సమాధానం దొరుకుతుంది. -
లక్కీ చాన్స్ కొట్టేసిన శ్రీలీల!
తమిళసినిమా: నటుడు అజిత్‌తో కలిసి టాలీవుడ్ క్రేజీ నటి నటించనున్నారా? ఈ ప్రశ్నకు కోలీవుడ్ వర్గాల నుంచి అలాంటి అవకాశం ఉందని సమాధానం వస్తోంది. కోలీవుడ్‌లో స్టార్ హీరోల్లో అజిత్ ఒకరు. ఈయన ఇటీవల నటించిన చిత్రం తుణివు. మంచి యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. తాజాగా విడాముయర్చి చిత్రంలో నటిస్తున్నారు. మగిళ్ తిరుమేణి దర్శకత్వంలో లైకా ఫిలింస్ సంస్థ ని ర్మిస్తున్న ఈ చిత్రంలో నటి త్రిష నాయకిగా నటిస్తున్నారు. నటుడు అర్జున్, ఆరవ్, రెజీనా తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. అనిరుధ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే చాలా వరకూ షూటింగ్‌ను పూర్తి చేసుకుంది. తాజాగా అజర్బైజాన్లో షూటింగ్‌ను నిర్వహించారు. తదుపరి సెడ్యూల్ ఎప్పుడు? ఎక్కడ నిర్వహించేది చిత్ర వర్గాలు ఇంకా వెల్లడించలేదు. ఇకపోతే మే నెల 1వ తేదీన నటుడు అజిత్ పుట్టిన రోజు. ఆ సందర్భంగా విడాముయర్చి చిత్రానికి సంబంధించిన ఏదైనా అప్డేట్ వస్తుందనే ఆశాభావంతో అజిత్ అభిమానులు ఎదురు చూస్తున్నారు. అయితే వారిని ఖుషీపరచడానికి అజిత్ నటించిన బిల్లా చిత్రం రీరిలీజ్ కానుంది. ప్రస్తుతం అజిత్ బైక్‌లో విదేశాలు చుట్టొస్తున్న పని లో ఉన్నారు. కాగా విడాముయర్చి చిత్రం అజిత్ నటిస్తున్న 62వ చిత్రం అవుతుంది. దీంతో తన 63వ చిత్రానికీ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. దీంతో తెలు గు ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్ నిర్మించనుంది. ఈ చిత్రానికి ఆధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వచ్చనున్నారు. దీనికి గుడ్ బ్యాడ్ అగ్లీ అనే టైటిల్‌ను నిర్ణయించారు. ఇందులో అజిత్ మూడు గెటప్‌లలో నటిస్తారట. కాగా టాలీవుడ్ క్రేజీ నాయకి శ్రీలీల ఈ చిత్రంలో అజిత్‌కు జంటగా నటించనున్నట్లు తాజాగా సామాజిక మాధ్యమా ల్లో ప్రచారం వైరల్ అవుతోంది. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు. శ్రీలీల తెలుగులో రవితేజ, మహేశ్‌బాబు వంటి స్టార్ నటుల సరసన నటించారు. తాజాగా అజిత్ సరసన నటించడం నిజమైతే ఇదే ఈమె తొలి తమిళ చిత్రం అవుతుంది. ఇక పోతే ఈ చిత్రాన్ని త్వరలో ప్రారంభించి 2025 పొంగల్‌కు విడుదల చేయడానికి నిర్మాతలు ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. -
నటరాజన్ బర్త్‌డే వేడుకలో సడెన్‌గా ఎంట్రీ ఇచ్చిన స్టార్ హీరో
టి నటరాజన్.. భారత క్రికెట్ టీమ్‌లో యార్కర్ కింగ్‌గా గుర్తింపు ఉంది. నేడు (ఏప్రిల్ 4) ఆయన 33వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ నడుస్తుండటంతో తనతో పాటు ఉన్న ఆటగాళ్లతో తన పుట్టినరోజును సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ వేడుకల్లో స్టార్ హీరో అజిత్ సడన్ ఎంట్రీ ఇచ్చి షాకిచ్చాడు. నటరాజన్ పుట్టినరోజు వేడుకలకు అజిత్ ఎంట్రీ ఎలా జరిగిందంటే.. ఏప్రిల్ 5న సన్‌రైజర్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ హైదరాబాద్ వేదికగా జరగనుంది. ఈ క్రమంలో టీమ్ అంతా ఒక స్టార్ హోటల్లో బస చేసింది. నేడు నటరాజన్ పుట్టినరోజు కావడంతో టీమ్ సభ్యులు కలిసి సెలబ్రేట్ చేసుకున్నారు. ఇకపోతే సన్‌రైజర్స్ బస చేసిన హోటల్లోనే హీరో అజిత్ కూడా ఉన్నారు. నటరాజన్ పుట్టినరోజు విషయాన్ని తెలుసుకున్న ఆయన ఆ వేడుకల్లో హఠాత్తుగా ఎంట్రీ ఇచ్చారు. ఆ సమయంలో అజిత్‌ను చూసిన వారందరూ షాక్ అయ్యారు. ఇంతలో అజిత్ కేక్ కట్ చేసి నటరాజన్‌కు తినిపించాడు. తన అభిమాన హీరో అజిత్‌తో ఈ పుట్టినరోజు జరుపుకోవడం తన జీవితంలో మరిచిపోలేనదని నటరాజన్ పేర్కొన్నాడు. అదే సమయంలో క్రికెట్ మాజీ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ కూడా ఉన్నారు. వారందరూ అజిత్‌తో కలిసి ఫోటోలు దిగి ఎంజాయ్ చేశారు. అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. గత కొన్నాళ్లుగా గాయాలతో బాధపడుతున్న నటరాజన్ ఈ ఏడాది ఐపీఎల్లో రీఎంట్రీ ఇచ్చి బాగా ఆడుతున్నాడు. ఐపీఎల్ 2020 సీజన్లో మెరిసిన యువ కిషోరం నటరాజన్. సన్‌రైజర్స్ హైదరాబాద్ తరుపన రాణిస్టూ నట్టూగా పేరు పొందాడు, ఐపీఎల్లో యార్కర్లతో అదరగొట్టి, టీమిండియాలో ఊహించని విధంగా ఎంట్రీ ఇచ్చాడు. నెట్‌బౌలర్ నుంచి టీమ్ఇండియా పేసర్ స్థాయికి ఆయన ఎదిగాడు. నటరాజన్ సేలం సమీపంలోని చిన్నపంబట్టి అనే గ్రామానికి చెందినవాడు. నటరాజన్ కెరియర్ ప్రారంభంలో తన అమ్మగారు అదే గ్రామంలో కూరగాయలు అమ్ముతుండగా.. తండ్రి ఓ కూలీ. బస్సు ఎక్కేందుకు రూ.5 లేని పరిస్థితి నుంచి నేడు తమ కుటుంబాన్ని ఈ స్థాయికి తీసుకొచ్చాడని ఓ సందర్భంలో తన అమ్మగారు సగర్వంగా చెప్పుకొచ్చారు. -
ప్రమాదకరమైన స్టంట్స్.. అజిత్ కారు బోల్తా.. వీడియో వైరల్
కోలీవుడ్ స్టార్ అజిత్‌కు భయమనేదే లేదు. ఎంతటి డేంజరస్ స్టంటయినా సరే డూప్ లేకుండా చేసేస్తాడు. ఈ క్రమంలో పలుమార్లు గాయపడ్డాడు కూడా! ప్రస్తుతం అతడు విడాముయర్చి అనే సినిమా చేస్తున్నాడు. గతేడాది చివర్లో ఈ మూవీ చిత్రీకరణ ప్రారంభమైంది. అక్టోబర్‌లో.. అజర్బైజాన్లో తొలి షెడ్యూల్ నిర్వహించారు. ఈ షూటింగ్లో జరిగిన ప్రమాదానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కారు ప్రమాదం ఇందులో అజిత్ కుమార్ కారును వేగంగా నడుపుకుంటూ వెళ్తున్నాడు. కాసేపటికి ఆ కారును పక్కకు ఆపేందుకు ప్రయత్నించాడు, కానీ అప్పటికే అది అదుపుతప్పి బోర్లా పడింది. అజిత్ పక్కన నటుడు అరవ్ కూడా ఉన్నాడు. అతడి చేతికి బేడీలు వేసి ఉండటంతో పాటు తనను సీటుకు కట్టేసి ఉండటం వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. కారు బోర్లా పడ్డాక అరవ్‌ను నువ్వు బాగానే ఉన్నావ్ కదా, ఏం కాలేదు కదా.. అని అజిత్ అతడి గురించి ఆరా తీశాడు. ఇంతలో సెట్లో ఉన్నవాళ్లు పరుగున వెళ్లి ఆ ఇద్దరిని బయటకు తీశారు. డేరింగ్ స్టంట్స్ ఏమాత్రం బెదురు లేకుండా ఇలాంటి డేరింగ్ స్టంట్స్ చేసిన అజిత్, అరవ్‌ను అభిమానులు కొనియాడుతున్నారు. సినిమా కోసం ప్రాణాలు పణంగా పెట్టే నీకు సెల్యూట్ అని కామెంట్లు చేస్తున్నారు. విడాముయర్చి సినిమాకు మగిళ్ తిరమేని దర్శకత్వం వహిస్తున్నాడు. లైకా ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. ఇందులో త్రిష హీరోయిన్గా నటిస్తుండగా ప్రియ భవానీ శంకర్, సంజయ్ దత్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. Bravery knows no bounds! 💪 Witness Ajith Kumar's fearless dedication as he takes on a daring stunt sequence in #VidaaMuyarchi without any stunt double. 🫡 🔥#AjithKumar pic.twitter.com/62NyEG4cvG — Lyca Productions (@LycaProductions) April 4, 2024 చదవండి: ఆ సీన్ చేయనని ఏడ్చేసిన హీరోయిన్.. విలన్‌గా అది తప్పదన్న నటుడు