ఫ్రెండ్స్‌కు కమ్మని బిర్యానీ వండిన స్టార్‌ హీరో | Ajith Prepare Biryani For His Biker Friends, Video Goes Viral On Social Media - Sakshi
Sakshi News home page

Ajith Biryani Making Video: రుచికరమైన బిర్యానీ వండిన స్టార్‌ హీరో.. వీడియో వైరల్‌

Published Thu, Mar 21 2024 1:54 PM | Last Updated on Thu, Mar 21 2024 3:37 PM

Ajith Prepare Biryani For His Friends, Video Goes Viral - Sakshi

ఒక్కొక్కరికీ ఒక్కో పిచ్చి.. అలా తమిళ స్టార్‌ హీరో అజిత్‌కు బైక్స్‌ అన్నా.. బైక్‌ మీద విహరించడం అన్నా ఎంతో ఇష్టం. సినిమాల నుంచి కాస్త బ్రేక్‌ దొరికినా చాలు.. బైక్‌ మీద తనకు నచ్చిన ప్రాంతాలు చుట్టేస్తుంటాడు. అంతేకాదు.. చాలాసార్లు ప్రొఫెషనల్‌ రేసింగ్‌లో పాల్గొని అంతర్జాతీయ స్థాయిలోనూ గుర్తింపు తెచ్చుకున్నాడు. తన సినిమాల్లో కూడా బైక్‌పై చేజింగ్‌ సీన్లు, యాక్షన్‌ సీన్లు కనిపిస్తూ ఉంటాయి.

ప్రస్తుతం అజిత్‌ విడాముయర్చి అనే సినిమాలో నటిస్తున్నాడు. ఇటీవల ఈ సినిమా షూటింగ్‌కు బ్రేక్‌ వచ్చింది. ఇంకేముంది తన ఫ్రెండ్స్‌తో కలిసి బైక్‌ రైడ్‌కు వెళ్లాడు. అక్కడ వారికోసం ప్రత్యేకంగా బిర్యానీ కూడా చేశాడు. స్నేహితులతో కలిసి ట్రిప్‌ను ఎంజాయ్‌ చేస్తున్న ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

సినిమాల విషయానికి వస్తే.. అజిత్‌ చేతిలో గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ అని మరో సినిమా కూడా ఉంది. అధిక్‌ రవిచంద్రన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తోంది. ఇది వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్‌ కానుంది.

చదవండి: శృంగార చిత్రంతో ఆస్కార్‌ వరకు.. ఎవరో గుర్తుపట్టారా..?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement